ఇంటర్నేషనల్ లీగ్ టీ20లో (ILT20-2025) డెసర్ట్ వైపర్స్‌కు తొలి పరాజయం ఎదురైంది. నిన్న (జనవరి 20) జరిగిన మ్యాచ్‌లో వైపర్స్ దుబాయ్ క్యాపిటల్స్ చేతిలో 6 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. క్యాపిటల్స్‌ను గుల్బదిన్ నైబ్ ఆల్‌రౌండ్ షోతో గెలిపించాడు.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన వైపర్స్ 19.5 ఓవర్లలో 139 పరుగులకే ఆలౌటైంది. వైపర్స్ ఇన్నింగ్స్‌లో అలెక్స్ హేల్స్ (34) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్ (27), డాన్ లారెన్స్ (24) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. ఫకర్ జమాన్ (14), సామ్ కర్రన్ (3), ఆజమ్ ఖాన్ (10), హసరంగ (13), తనిశ్ సూరి (0), అలీ నసీర్ (2), లకీ ఫెర్గూసన్ (7) నిరాశపరిచారు. క్యాపిటల్స్ బౌలర్లలో చమీరా, జహీర్ ఖాన్ తలో మూడు వికెట్లు పడగొట్టగా.. హైదర్ అలీ, మెక్‌కాయ్, గుల్బదిన్, సికందర్ రజా తలో వికెట్ తీశారు.
అనంతరం 140 పరుగులు స్వల్ప లక్ష్యాన్ని క్యాపిటల్స్ ఆడుతూపాడుతూ ఛేదించింది. ఆ జట్టు 17.4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. బౌలింగ్‌లో ఓ వికెట్ తీసి, ఫీల్డింగ్‌లో ఓ క్యాచ్ పట్టిన గుల్బదిన్ నైబ్.. బ్యాటింగ్‌లోనూ సత్తా చాటి రెచ్చిపోయాడు. 51 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 78 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.
నైబ్‌కు జతగా సికందర్ రజా (24), నజీబుల్లా జద్రాన్ (10 నాటౌట్) నిలబడి క్యాపిటల్స్‌ను విజయతీరాలకు చేర్చారు. క్యాపిటల్స్ ఇన్నింగ్స్‌లో బెన్ డంక్ 13, షాయ్ హోప్ 8, ఖలద్ షా 4 పరుగులు చేశారు. వైపర్స్ బౌలర్లలో ఫెర్గూసన్ 2, మొహమ్మద్ అమిర్ ఓ వికెట్ పడగొట్టారు. ఈ గెలుపు క్యాపిటల్స్‌కు ప్రస్తుత ఎడిషన్‌లో రెండోది. ప్రస్తుతం ఆ జట్టు 4 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉంది. క్యాపిటల్స్ చేతిలో ఓడినా వైపర్స్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలోనే ఉంది.
Comments
Please login to add a commentAdd a comment