Dubai Capitals
-
సికందర్ రజా ఆల్‌రౌండ్ షో.. నైట్‌రైడర్స్ నిష్క్రమణ
దుబాయ్ వేదికగా జరుగుతున్న ఇంటర్నేషనల్ టీ20 లీగ్‌లో అబుదాబీ నైట్‌రైడర్స్ కథ ముగిసింది. వరుసగా రెండో సీజన్లోనూ ఆ జట్టు ఎలిమినేటర్ దశ దాటలేకపోయింది. నిన్న జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో దుబాయ్ క్యాపిటల్స్.. నైట్‌రైడర్స్‌ను 85 పరుగుల తేడాతో చిత్తు చేసి ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించింది. క్యాపిటల్స్ ఆటగాడు సికందర్ రజా (40, 2/27) ఆల్‌రౌండ్ షోతో నైట్‌రైడర్స్‌ను ఓడించడంలో కీలకపాత్ర పోషించాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన క్యాపిటల్స్.. టామ్ బాంటన్ (44), ఏబెల్ (41), సామ్ బిల్లింగ్స్ (46 నాటౌట్), సికందర్ రజా (40) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. నైట్‌రైడర్స్ బౌలర్లలో సాబిర్ అలీ 2, విల్లే, జాషువ లిటిల్, ఫేబియన్ లిటిల్ తలో వికెట్ పడగొట్టారు. అనంతరం 189 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన నైట్‌రైడర్స్.. సికందర్ రజాతో పాటు స్కాట్ కుగ్గెలిన్ (4/17), జహీర్ ఖాన్ (2/25), ఓలీ స్టోన్ (1/18) విజృంభించడంతో 16.5 ఓవర్లలో 103 పరుగులకే కుప్పకూలింది. నైట్‌రైడర్స్ ఇన్నింగ్స్‌లో డేవిడ్ విల్లే (36) టాప్ స్కోరర్‌గా నిలువగా.. సామ్ హెయిన్ (29), జో క్లార్క్ (13) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. కాగా, ఈ సీజన్ క్వాలియర్-1కు ఎంఐ ఎమిరేట్స్, గల్ఫ్ జెయింట్స్ ఇదివరకే అర్హత సాధించగా.. ఈ రెండు జట్ల మధ్య జరిగే మ్యాచ్‌లో ఓడిన జట్టు ఫిబ్రవరి 15న జరిగే క్వాలిఫయర్-2లో దుబాయ్ క్యాపిటల్స్‌తో తలపడుతుంది. ఎమిరేట్స్, గల్ఫ్ జెయింట్స్ మధ్య క్వాలియర్-1 మ్యాచ్ ఇవాళ జరుగనుంది. -
నరాలు తెగ ఉత్కంఠ.. ఆఖరి బంతికి సిక్స్ కొట్టి! వీడియో వైరల్
ఇంటర్ననేషనల్ టీ20 లీగ్-2024లో దుబాయ్ క్యాపిటల్స్ తమ ప్లే ఆఫ్స్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. ఈ లీగ్‌లో భాగంగా శుక్రవారం డెసర్ట్ వైపర్స్‌తో జరిగిన ఉత్కంఠ పోరులో 5 వికెట్ల తేడాతో దుబాయ్ క్యాపిటల్స్ విజయం సాధించింది. దుబాయ్ స్టార్ ఆల్‌రౌండర్ సికందర్ రజా ఆఖరి బంతికి సిక్స్ కొట్టి తన జట్టుకు అద్భుతమైన విజయాన్ని అంధించాడు. 172 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన దుబాయ్ 19 ఓవర్ ముగిసే సరికి 5 వికెట్లు కోల్పోయి 159 పరుగులు చేసింది. ఈ క్రమంలో ఆ క్రమంలో ఆఖరి ఓవర్లో దుబాయ్ విజయానికి 13 పరుగులు కావాలి. క్రీజులో దుబాయ్ బ్యాటర్లు సికందర్ రజా, స్కాట్ కుగ్గెలీజ్న్ ఉండగా.. డెసర్ట్ కెప్టెన్ మున్రో ఆఖరి ఓవర్ వేసే బాధ్యతను అలీ నీసర్కు అప్పగించాడు. తొలి బంతినే కుగ్గెలీజ్న్ బౌండరీకి తరిలించాడు. రెండో బంతికి డాట్, మూడో బంతికి కుగ్గెలీజ్న్ సింగిల్ తీసి రజాకు స్ట్రైక్ ఇచ్చాడు. నాలుగో బంతికి రజా రెండు పరుగులు తీయగా.. ఐదు బంతికి ఎటువంటి పరుగు లేదు. దీంతో చివరి బంతికి 6 పరుగులు అవసరమయ్యాయి. ఈ క్రమంలో దుబాయ్ డగౌట్లో టెన్షన్ వాతవారణం నెలకొంది. అయితే ఆఖరి బంతిని లాంగ్ ఆఫ్ మీదగా అద్బుతమైన సిక్స్‌గా మలిచిన రజా.. తన జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. ఈ మ్యాచ్‌లో 45 బంతులు ఎదుర్కొన్న రజా.. 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 60 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన వైపర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. వైపర్స్ బ్యాటర్లలో హేల్స్(66) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. దుబాయ్ బౌలర్లలో ఓలీ స్టోన్, వాండర్ మెర్వ్ తలా రెండు వికెట్లు పడగొట్టారు. Dubai Capitals stay alive by the skin of their teeth & they have Raza to thank 🙇🙌 6 needed on the last ball & the 🇿🇼 maestro deposits it over long off 🤯#DVvDC | #KoiKasarNahiChhodenge | #DPWorldILT20onZee pic.twitter.com/iygmkvjHCl — Zee Cricket (@ilt20onzee) February 9, 2024 -
ILT20 2024: దుబాయ్ క్యాపిటల్స్ కెప్టెన్‌గా వార్నర్
International League T20: ఆస్ట్రేలియా వెటరన్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ ఇంటర్నేషనల్ లీగ్ టీ20-2024లో భాగం కానున్నాడు. ఐపీఎల్ ఫ్రాంఛైజీ ఢిల్లీ క్యాపిటల్స్ అనుబంధ జట్టు దుబాయ్ క్యాపిటల్స్ కెప్టెన్‌గా అతడు నియమితుడయ్యాడు. ఈ విషయాన్ని క్యాపిటల్స్ యాజమాన్యం సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. కెప్టెన్ మార్వెల్ అంటూ వార్నర్ ఆగమాన్ని తెలియజేస్తూ పోస్టర్ విడుదల చేసింది. కాగా టీమిండియా స్టార్ రిషభ్ పంత్ రోడ్డు ప్రమాదం కారణంగా జట్టుకు దూరమైన నేపథ్యంలో ఐపీఎల్-2023లో వార్నర్ ఢిల్లీ క్యాపిటల్స్ సారథిగా పగ్గాలు చేపట్టిన విషయం తెలిసిందే. గతేడాది సీజన్లో మొత్తంగా 14 మ్యాచ్‌లలో కలిపి 516 పరుగులు సాధించిన వార్నర్.. ఆటగాడిగా సఫలమైనా.. కెప్టెన్‌గా మాత్రం దారుణంగా విఫలమయ్యాడు. అతడి కెప్టెన్సీలో ఢిల్లీ పద్నాలుగింట కేవలం ఐదు గెలిచి పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానంలో నిలిచింది. రోవ్‌మన్ పావెల్ స్థానంలో వార్నర్ అయినప్పటికీ వార్నర్ నాయకత్వ పటిమపై నమ్మకం ఉంచిన క్యాపిటల్స్ మేనేజ్మెంట్ ఈసారి ఐఎల్టీ20 లీగ్‌లో అతడిని తమ సారథిగా ఎంచుకుంది. ఇక దుబాయ్ క్యాపిటల్స్‌కు తొలి ఎడిషన్(2023)లో వెస్టిండీస్ స్టార్ రోవ్‌మన్ పావెల్ కెప్టెన్‌గా వ్యవహరించాడు. పది మ్యాచ్‌లలో నాలుగు గెలిపించి ప్లే ఆఫ్స్‌నకు చేర్చాడు. ప్రస్తుత సీజన్ కోసం 37 ఏళ్ల వార్నర్ అతడి స్థానాన్ని భర్తీ చేశాడు. కాగా జనవరి 13 నుంచి ఐఎల్టీ20 -2024 ఎడిషన్ ఆరంభం కానుంది. కాగా ఐపీఎల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను టైటిల్ విజేతగా నిలిపిన ఘనత కలిగిన వార్నర్‌కు టీ20లలో బ్యాటర్‌గానూ మంచి రికార్డు ఉంది. అంతర్జాతీయ వన్డేలకూ రిటైర్మెంట్ పొట్టి ఫార్మాట్లో ఇప్పటి వరకు మొత్తంగా 356 మ్యాచ్‌లు ఆడిన ఈ లెఫ్టాండర్.. 11695 పరుగులు సాధించాడు. ఇందులో ఎనిమిది సెంచరీలు ఉన్నాయి. ఆస్ట్రేలియాను టీ20 వరల్డ్‌కప్ విజేతగా నిలపడంలో అతడిది కీలక పాత్ర. ఇదిలా ఉంటే.. తన కెరీర్లో ఆఖరి అంతర్జాతీయ టెస్టు సిరీస్ ఆడుతున్న వార్నర్.. తాజాగా వన్డే క్రికెట్ నుంచి కూడా రిటైర్ అవుతున్నట్లు ప్రకటించాడు. దుబాయ్ క్యాపిటల్స్ జట్టు: డేవిడ్ వార్నర్(కెప్టెన్), ఆండ్రూ టై, దసున్ షనక, దుష్మంత చమీర, జో రూట్, మార్క్ వుడ్, మాక్స్ హోల్డెన్, మొహమ్మద్ మొహ్సిన్, నువాన్ తుషార, రహ్మనుల్లా గుర్బాజ్, రజా ఆకిఫ్, రోవ్‌మన్ పావెల్, రోలోఫ్ వాన్‌డెర్ మెర్వే, సదీర సమరవిక్రమ, సామ్ బిల్లింగ్స్, సికిందర్ రజా. చదవండి: 2024 ఏడాదిలో టీమిండియా షెడ్యూల్ ఇదే.. ఈ సారైనా కల నెరవేరేనా? View this post on Instagram A post shared by Dubai Capitals (@dubaicapitals) -
ILT20 2024: దుబాయ్ క్యాపిటల్స్ కెప్టెన్‌గా డేవిడ్ వార్నర్
యూఏఈ వేదికగా జరిగే ఇంటర్నేషనల్ లీగ్ టీ20 టోర్నీ (DP World ILT20) రెండో ఎడిషన్ వచ్చే ఏడాది జనవరి 19-ఫిబ్రవరి 17 మధ్యలో జరుగనుంది. ఈ లీగ్ కోసం దుబాయ్ క్యాపిటల్స్ తమ నూతన కెప్టెన్‌గా ఆసీస్ వెటరన్ డేవిడ్ వార్నర్‌ను నియమించింది. దుబాయ్ క్యాపిటల్స్.. ఐపీఎల్ ఫ్రాంచైజీ ఢిల్లీ క్యాపిటల్స్ యాజమాన్యం ఆధ్వర్యంలో నడుస్తుంది. రిషబ్ పంత్ గైర్హాజరీలో వార్నర్ గత ఐపీఎల్ సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్‌గా వ్యవహరించిన విషయం తెలిసిందే. వార్నర్‌తో అనుబంధాన్ని కొనసాగించడంలో భాగంగా అతనికి దుబాయ్ క్యాపిటల్స్ సారథ్య బాధ్యతలు అప్పజెప్పినట్లు తెలుస్తుంది. అయితే వార్నర్ ఇంటర్నేషనల్ లీగ్ మొత్తానికి అందుబాటులో ఉంటాడా లేదా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఈ లీగ్ మొదలయ్యే సమయానికి వార్నర్ బిగ్‌బాష్ లీగ్‌లో ఆడాల్సి ఉంది. వార్నర్ స్వదేశీ లీగ్‌కు మధ్యలోనే హ్యాండ్ ఇచ్చి దుబాయ్ క్యాపిటల్స్‌కు ఆడే అవకాశం ఉండదని తెలుస్తుంది. మరి ఈ రెండు లీగ్‌ల మధ్యలో వార్నర్ ఏ లీగ్‌కు ప్రాధాన్యత ఇస్తాడో వేచి చూడాలి. కాగా, ఇంటర్నేషనల్ లీగ్ టీ20 టోర్నీ ఇనాగురల్ ఎడిషన్‌లో (2023) దుబాయ్ క్యాపిటల్స్ కెప్టెన్‌గా రోవ్‌మన్ పావెల్ వ్యవహరించాడు. పావెల్ సారథ్యంలో క్యాపిటల్స్ గత ఎడిషన్ సెమీస్ వరకు చేరింది. ఐఎల్టీ20 2023 ఎడిషన్ ఛాంపియన్‌గా గల్ఫ్ జెయింట్స్ నిలిచింది. ఫైనల్లో జెయింట్స్ డెసర్ట్ వైపర్స్‌ను ఓడించి టైటిల్‌ను ఎగరేసుకుపోయింది. దుబాయ్ క్యాపిటల్స్ జట్టులో ప్రస్తుతం రోవ్‌మన్ పావెల్, జో రూట్, సికందర్ రజా, మార్క్ వుడ్, స్టీవ్ స్మిత్ లాంటి స్టార్ క్రికెటర్లు ఉన్నారు. -
దుబాయ్ క్యాపిటల్స్ కెప్టెన్‌గా యూసుఫ్ పఠాన్..
ఇంటర్నేషనల్ టీ20 లీగ్‌లో దుబాయ్ క్యాపిటల్స్ కీలక నిర్ణయం తీసుకుంది. దుబాయ్ క్యాపిటల్స్ తమ జట్టు కెప్టెన్సీ బాధ్యతలు నుంచి వెస్టిండీస్ స్టార్ ఆటగాడు రోవ్మాన్ పావెల్ తప్పించింది. అతడి స్థానంలో టీమిండియా మాజీ ఆటగాడు యూసుఫ్ పఠాన్‌ను తమ జట్టు కొత్త కెప్టెన్‌గా కెప్టెన్‌గా దుబాయ్ నియమించింది. ఇక ఈ విషయాన్ని దుబాయ్ క్యాపిటల్స్ మెనేజెమెంట్ ట్విటర్ వేదికగా వెల్లడించింది. "ఇంటర్నేషనల్ టీ20 లీగ్‌లో మిగిలిన మ్యాచ్‌లకు దుబాయ్ క్యాపిటల్స్‌కు యూసుఫ్ పఠాన్ సారథ్యం వహించనున్నాడు. దుబాయ్ క్యాపిటల్స్ ఆదివారం తమ చివరి లీగ్‌మ్యాచ్‌లో ముంబై ఎమిరేట్స్‌తో తలపడనుంది. ప్రస్తుతం మా పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో ఉంది" అని దుబాయ్ క్యాపిటల్స్ ఓ ప్రకటనలో పేర్కొంది. కాగా ఈ టోర్నీలో రోవ్మాన్ పావెల్ అద్భుతమైన వ్యక్తిగత ప్రదర్శనలతో పాటు జట్టును కూడా విజయ పథంలో నడిపించాడు. అయినప్పటికీ పావెల్‌ను జట్టు పగ్గాలు నుంచి దుబాయ్ ఎందుకు తప్పించిందో వెల్లడించలేదు. ఇక యూసుఫ్ పఠాన్ విషయానికి వస్తే.. ఈ టోర్నీలో 8 మ్యాచ్‌లు ఆడిన పఠాన్ కేవలం 56 పరుగులు మాత్రమే చేశాడు. చదవండి: Team India: యువ క్రికెటర్ల జోరు.. భారత సీనియర్లకు ఇక కష్టకాలమే -
ఐదు బంతుల్లో ఐదు సిక్సర్లు.. పఠాన్‌ను ఉతికారేసిన విండీస్ స్టార్
అబుదాబి వేదికగా ఇంటర్నేషనల్ లీగ్ టి20లో షెర్ఫెన్ రూథర్‌ఫోర్డ్ విధ్వంసం సృష్టించాడు. ఆరు బంతుల్లో ఆరు సిక్సర్ల ఫీట్ మిస్ అయినప్పటికి ఐదు బంతుల్లో ఐదు సిక్సర్లు కొట్టి ఔరా అనిపించాడు. రూథర్‌ఫోర్డ్ దెబ్బకు యూసఫ్ పఠాన్ ఒకే ఓవర్లో 31 పరుగులు సమర్పించుకోవాల్సి వచ్చింది. విషయంలోకి వెళితే.. గురువారం రాత్రి దుబాయ్ క్యాపిటల్స్, డెసర్ట్ వైపర్స్ మధ్య 25వ లీగ్ మ్యాచ్ జరిగింది. ఇన్నింగ్స్ 16 ఓవర్లో యూసఫ్ పఠాన్ బౌలింగ్‌కు వచ్చాడు. తొలి బంతికి సామ్ బిల్లింగ్స్ సింగిల్ తీసి రూథర్‌ఫోర్డ్‌కు స్ట్రైక్ ఇచ్చాడు. ఏమైందో తెలియదు కానీ ఒక్కసారిగా పూనకం వచ్చినట్లుగా చెలరేగిపోయాడు రూథర్‌ఫోర్డ్. రెండో బంతిని లాంగాఫ్ మీదుగా 90 మీటర్లు, మూడో బంతి లాంగాన్ మీదుగా, నాలుగో బంతిని బ్యాక్‌ఫుట్ తీసుకొని కళ్లుచెదిరే స్ట్రెయిట్ సిక్స్ కొట్టి హ్యాట్రిక్ సిక్సర్లు పూర్తి చేశాడు. ఈ విధ్వంసం ఇక్కడితో ఆగలేదు. ఐదో బంతిని స్క్వేర్‌లెగ్‌లో భారీ సిక్సర్ బాదాడు. ఇక ఓవర్ చివరి బంతిని మోకాళ్లపై కూర్చొని స్వీప్ షాట్‌తో సిక్సర్ తరలించాడు. దీంతో ఐదు వరుస బంతుల్లో ఐదు సిక్సర్లు కొట్టిన రూథర్‌ఫోర్డ్ మరుసటి ఓవర్లో ఆరో సిక్సర్ కొట్టే అవకాశం వచ్చినప్పటికి విఫలమయ్యాడు. ఈ దశలో 23 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయితే మరుసటి బంతికే బిల్లింగ్స్‌తో ఏర్పడిన సమన్వయలోపంతో రూథర్‌ఫోర్డ్ రనౌట్‌గా వెనుదిరగడంతో అతని విధ్వంసానికి తెరపడింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన డెసర్ట్ వైపర్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది.రూథర్‌ఫోర్డ్(23 బంతుల్లో 50, ఆరు సిక్సర్లు), సామ్ బిల్లింగ్స్(48 బంతుల్లో 54 పరుగులు), ముస్తఫా 31 పరుగులు చేశారు. అనంతరం బ్యాటింగ్ చేసిన దుబాయ్ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 160 పరుగులు మాత్రమే చేసి 22 పరుగుల తేడాతో ఓటమి పాలయ్యింది. The maestro, Sherfane Rutherford put up a stunning batting display tonight #DVvDC. 5 back to back 6’s 😯 Big contribution to his teams total with a 23-ball 5️⃣0️⃣ 🔥#DPWorldILT20 #ALeagueApart pic.twitter.com/OSW8Av4lnh — International League T20 (@ILT20Official) February 2, 2023 చదవండి: ట్రెండింగ్ పాటకు క్రికెటర్స్ అదిరిపోయే స్టెప్పులు -
ILT20: తీరుమారని నైట్ రైడర్స్.. వరుసగా ఏడో ఓటమి
ఇంటర్నేషనల్ టీ20 లీగ్‌లో అబుదాబి నైట్ రైడర్స్ మరో ఓటమి చవిచూసింది. ఈ లీగ్‌లో భాగంగా సోమవారం దుబాయ్ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో అబుదాబి నైట్ రైడర్స్ పరాజాయం పాలైంది. ఈ టోర్నీలో నైట్ రైడర్స్‌కు ఇది 7వ ఓటమి కావడం గమానార్హం. ఇక 150 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన దుబాయ్ క్యాపిటల్స్ కేవలం 3 వికెట్లు మాత్రమే కోల్పోయి చేధించింది. దుబాయ్ బ్యాటర్లలో ఓపెనర్ మున్సీ 57 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. డిక్వెల్లా(37), షనక (28) పరుగులతో రాణించారు. నైట్‌రైడర్స్ బౌలర్లలో కుమార, రస్సెల్, అకేల్ హోసేన్ తలా వికెట్ సాధించారు. ఇక తొలుత బ్యాటింగ్ చేసిన అబుదాబి నైట్ రైడర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 149 పరుగులు చేసింది. నైట్ రైడర్స్ బ్యాటర్లలో జో క్లార్క్ 52 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. దుబాయ్ క్యాపిటల్స్ బ్యాటర్లలో జంపా మూడు వికెట్లు పడగొట్టగా.. హజ్రత్ లుక్మాన్, ఆకీఫ్ రజా తలా రెండు వికెట్లు సాధించారు. చదవండి: IPL 2023: భారీ సిక్సర్లతో విరుచుకుపడ్డ ధోని.. వీడియో వైరల్ -
మూడు పరుగులతో శతకం మిస్.. చేయాల్సిన విధ్వంసం చేసేశాడు
విండీస్ హార్డ్ హిట్టర్ రోవ్‌మెన్ పావెల్ ఇంటర్నేషనల్ లీగ్ టి20(ILT20) క్రికెట్లో తుఫాన్ ఇన్నింగ్స్‌తో మెరిశాడు. ఆకాశమే హద్దుగా చెలరేగిన పావెల్ సిక్సర్ల వర్షం కురిపించాడు. దుబాయ్ క్యాపిటల్స్, ముంబై ఎమిరేట్స్ మధ్య మ్యాచ్‌లో ఇది చోటుచేసుకుంది. సెంచరీకి మూడు పరుగుల దూరంలో ఔటైనప్పటికి చేయాల్సిన విధ్వంసం అంతా చేసిపారేశాడు. 41 బంతుల్లో 4 ఫోర్లు, 10 సిక్సర్లతో 97 పరుగులు చేసి ఔటయ్యాడు. అతనికి తోడుగా జో రూట్ కూడా 54 బంతుల్లో 82 పరుగులు చేశాడు. ఇక వెస్టిండీస్ తరపున రోవ్‌మెన్ పావెల్ 45 వన్డేల్లో 897 పరుగులు, 55 టి20ల్లో 890 పరుగులు సాధించాడు. మ్యాచ్ విషయానికి వస్తే దుబాయ్ క్యాపిటల్స్ 16 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన దుబాయ్ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్లు నష్టానికి 222 పరుగులు చేసింది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ రోవ్‌మెన్ పావెల్ (41 బంతుల్లో 4 ఫోర్లు, 10 సిక్సర్లతో 97 పరుగులు) విధ్వంసం సృష్టించగా.. జో రూట్ (54 బంతుల్లో 82, 8 ఫోర్లు, మూడు సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. తన శైలికి విరుద్ధంగా ఆడిన రూట్ మ్యాచ్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. అనంతరం బ్యాటింగ్ చేసిన ముంబై ఎమిరేట్స్ కూడా ధీటుగానే బదులిచ్చింది. అయితే చివర్లో ఒత్తిడికి తలొగ్గిన ముంబై ఎమిరేట్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 206 పరుగులు చేసి 16 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. కీరన్ పొలార్డ్(38 బంతుల్లో 86, 8 ఫోర్లు, 6 సిక్సర్లు) మెరుపులు మెరిపించాడు. The captain came out all guns blazing 💥 A 100+ partnership with Root, 10 6️⃣s, 97 runs 🤩 It was indeed a captain's inning from @Ravipowell26. Book your tickets from https://t.co/VekRYhpzz6#DPWorldILT20 #ALeagueApart #MIEvDC pic.twitter.com/YWYuCo8qFl — International League T20 (@ILT20Official) January 22, 2023 చదవండి: విధ్వంసం సృష్టిస్తున్నాడు.. టెస్టు క్రికెటర్ ముద్ర చెరిపేయాల్సిందే -
విధ్వంసం సృష్టిస్తున్నాడు.. టెస్టు క్రికెటర్ ముద్ర చెరిపేయాల్సిందే
ఇంగ్లండ్ ఆటగాడు జోరూట్ అనగానే టెస్టు స్పెషలిస్ట్ అనే ట్యాగ్ గుర్తొస్తుంది. పరిమిత ఓవర్ల క్రికెట్లో చూసుకుంటే వన్డేలు మాత్రమే ఆడే రూట్ టి20లు చాలా తక్కువగా ఆడాడు. ఇక టెస్టుల్లో తన ఆట గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కెప్టెన్‌గా, బ్యాటర్‌గా టెస్టుల్లో ఇంగ్లండ్‌కు ఎన్నో విజయాలు అందించాడు. టెస్టు స్పెషలిస్ట్ అనే ముద్ర ఉండడంతో ఐపీఎల్, బీబీఎల్ లాంటి లీగ్స్‌లో రూట్ పేరు పెద్దగా కనిపించదు. ఒకవేళ వేలంలో పాల్గొన్నా అతన్ని కొనడానికి ఏ ఫ్రాంచైజీ పెద్దగా ఆసక్తి చూపేది కాదు. అయితే రూట్కున్న టెస్టు స్పెషలిస్ట్ అనే ట్యాగ్ చెరిపేయాల్సిన సమయం వచ్చినట్లుంది. అబుదాబి వేదికగా జరుగుతున్న ఇంటర్నేషనల్ లీగ్ టి20లో రూట్ ఆడిన విధ్వంసకర ఇన్నింగ్స్ అందుకు కారణమయింది. ఆదివారం రాత్రి దుబాయ్ క్యాపిటల్స్, ముంబై ఎమిరేట్స్ మధ్య మ్యాచ్ జరిగింది. భారీ స్కోర్లు నమోదైన మ్యాచ్‌లో దుబాయ్ క్యాపిటల్స్ 16 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన దుబాయ్ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్లు నష్టానికి 222 పరుగులు చేసింది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ రోవ్‌మెన్ పావెల్ (41 బంతుల్లో 4 ఫోర్లు, 10 సిక్సర్లతో 97 పరుగులు) విధ్వంసం సృష్టించగా.. జో రూట్ (54 బంతుల్లో 82, 8 ఫోర్లు, మూడు సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. తన శైలికి విరుద్ధంగా ఆడిన రూట్ మ్యాచ్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. అనంతరం బ్యాటింగ్ చేసిన ముంబై ఎమిరేట్స్ కూడా ధీటుగానే బదులిచ్చింది. అయితే చివర్లో ఒత్తిడికి తలొగ్గిన ముంబై ఎమిరేట్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 206 పరుగులు చేసి 16 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. కీరన్ పొలార్డ్(38 బంతుల్లో 86, 8 ఫోర్లు, 6 సిక్సర్లు) మెరుపులు మెరిపించాడు. We saw the reverse sweep yesterday. Here's the conventional sweep with the SAME precision!@root66 is all class!pic.twitter.com/GRo5zKQAyd — International League T20 (@ILT20Official) January 22, 2023 చదవండి: ఫించ్ 'దంచి కొట్టుడు'.. 35 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్సర్లతో..! -
రూట్ మెరుపు ఇన్నింగ్స్ వృధా.. శతక్కొట్టి గెలిపించిన ప్రత్యర్ధి బ్యాటర్
దుబాయ్ వేదికగా జరుగుతున్న ఇంటర్నేషనల్ టీ20 లీగ్‌లో వరుసగా రెండు రోజుల్లో రెండు సెంచరీలు నమోదయ్యాయి. నిన్న (జనవరి 20) అబుదాబీ నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో డెసర్ట్ వైపర్స్ ఓపెనర్ అలెక్స్ హేల్స్ (59 బంతుల్లో 110; 7 ఫోర్లు, 6 సిక్సర్లు) సెంచరీ బాదగా.. ఇవాళ (జనవరి 21) దుబాయ్ క్యాపిటల్స్‌పై షార్జా వారియర్స్ ఓపెనర్ టామ్ కోహ్లెర్ కాడ్మోర్ (47 బంతుల్లో 106 నాటౌట్; 10 ఫోర్లు, 6 సిక్సర్లు) విధ్వంసకర శతకంతో విరుచుకుపడ్డాడు. కాడ్మోర్ సుడిగాలి శతకంతో ఊగిపోవడంతో క్యాపిటల్స్ నిర్ధేశించిన 178 పరుగుల లక్ష్యాన్ని వారియర్స్ కేవలం 14.4 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి ఊదేసింది. ఫలితంగా 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. కాడ్మోర్, జో డెన్లీ (17 బంతుల్లో 29 నాటౌట్; 3 ఫోర్లు, సిక్స్) వారియర్స్‌ను విజయతీరాలకు చేర్చారు. క్యాపిటల్స్ బౌలర్లలో అకీఫ్ రజా 2 వికెట్లు పడగొట్టగా.. చమిక కరుణరత్నేకు ఓ వికెట్ దక్కింది. తొలుత బ్యాటింగ్ చేసిన క్యాపిటల్స్ జో రూట్ (54 బంతుల్లో 80 నాటౌట్; 8 ఫోర్లు, సిక్స్) మెరుపు అర్ధశతకంతో, లారెన్స్ (38 బంతుల్లో 34; 2 ఫోర్లు, సిక్స్), రోవమన్ పావెల్ (27 బంతుల్లో 44; 5 ఫోర్లు, సిక్స్) ఓ మోస్తరుగా రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసింది. వారియర్స్ బౌలర్లలో క్రిస్ వోక్స్, నవీన్ ఉల్ హాక్ తలో 2 వికెట్లు పడగొట్టారు. ఇదిలా ఉంటే, ఇంటర్నేషనల్ టీ20 లీగ్‌లో టామ్ కోహ్లెర్ కాడ్మోర్ బాదిన శతకం రెండోది కాగా, అంతకుముందు మ్యాచ్‌లో అలెక్స్ హేల్స్ చేసినది లీగ్‌లో తొట్టతొలి సెంచరీ కావడం విశేషం. -
వరుస మెరుపు ఇన్నింగ్స్‌లతో రెచ్చిపోతున్న రాబిన్ ఉతప్ప
ఇంటర్నేషనల్ లీగ్ టీ20, 2023 (దుబాయ్) సీజన్లో టీమిండియా మాజీ క్రికెటర్, దుబాయ్ క్యాపిటల్స్ ఓపెనర్ రాబిన్ ఉతప్ప వరుస మెరుపు ఇన్నింగ్స్‌లతో రెచ్చిపోతున్నాడు. అబుదాబీ నైట్‌రైడర్స్‌తో జరిగిన సీజన్ తొలి మ్యాచ్‌లో 33 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 43 పరుగులు చేసిన రాబీ.. ఇవాళ (జనవరి 16) గల్ఫ్ జెయింట్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో 46 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో ఏకంగా 79 పరుగులు చేశాడు. ఫలితంగా అతను ప్రాతినిధ్యం వహిస్తున్న దుబాయ్ క్యాపిటల్స్ టీమ్ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 182 పరుగుల భారీ స్కోర్ చేసింది. A brilliant innings by @robbieuthappa some sensational shots on display pic.twitter.com/E15dDxGVef— International League T20 (@ILT20Official) January 16, 2023 దుబాయ్ ఇన్నింగ్స్‌లో కెప్టెన్ రోవమన్ పావెల్ (25 బంతుల్లో 38; ఫోర్, 3 సిక్సర్లు), సికందర్ రజా (19 బంతుల్లో 30 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) ఓ మోస్తరుగా రాణించగా.. జో రూట్ (6), భానుక రాజపక్స (3), దసున్ షనక (2), రవి బొపారా (2), ఇసురు ఉడాన (2) నిరాశపరిచారు. ఆఖర్లో హజ్రత్ లుక్మాన్ (3 బంతుల్లో 10) వరుస బంతుల్లో ఫోర్, సిక్సర్ బాదడంతో క్యాపిటల్స్ జట్టు 180 పరుగుల మార్కును దాటింది. గల్ప్ జెయింట్స్ బౌలర్లలో రెహాన్ అహ్మద్ 3 వికెట్లు పడగొట్టగా.. రిచర్డ్ గ్లీసన్ 2, సంచిత్ శర్మ, డేవిడ్ వీస్ తలో వికెట్ దక్కించుకున్నారు. కాగా, ఈ సీజన్లో రాబిన్ ఉతప్ప ప్రాతినిధ్యం వహిస్తున్న దుబాయ్ క్యాపిటల్స్ టీమ్ అద్భుతమ ప్రదర్శనతో ముందుకెళ్తుంది. తొలి మ్యాచ్‌లో అబుదాబీ నైట్‌రైడర్స్‌ను 73 పరుగుల భారీ తేడాతో మట్టికరిపించిన ఈ జట్టు.. తాజాగా గల్ఫ్ జెయింట్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లోనూ భారీ స్కోర్ సాధించి, మరో విజయానికి బాటలు వేసుకుంది. -
దుబాయ్ ప్రీమియర్ లీగ్ మొదలైంది.. తొలి మ్యాచ్‌లోనే నైట్ రైడర్స్‌కు షాక్
ఐపీఎల్ (ఇండియన్ ప్రీమియర్ లీగ్), బీబీఎల్ (బిగ్‌బాష్ లీగ్, ఆస్ట్రేలియా), బీపీఎల్ (బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్), పీఎస్ఎల్ (పాకిస్తాన్ సూపర్ లీగ్), ఎస్ఏ 20 (సౌతాఫ్రికా టీ20 లీగ్) తరహాలోనే యూఏఈ వేదికగా మరో టీ20 లీగ్ ప్రారంభమైంది. అంతర్జాతీయ స్టార్లతో నిండిన ఈ లీగ్‌కు ఇంటర్నేషనల్ లీగ్ టీ20 (ఐఎల్ టీ20)గా నామకరణం చేశారు. ప్రస్తుతం జరుగుతున్న సౌతాఫ్రికా టీ20 లీగ్ తరహాలోనే ఈ లీగ్‌లోనూ 6 జట్లు పోటీపడుతున్నాయి. One for the history books 📖@Dubai_Capitals WIN THE FIRST #DPWorldILT20 GAME 👏 #ALeagueApart #DCvADKR pic.twitter.com/l4Z5GXPVxr — International League T20 (@ILT20Official) January 13, 2023 నిన్న (జనవరి 13) జరిగిన లీగ్ ఇనాగురల్ మ్యాచ్‌లో దుబాయ్ క్యాపిటల్స్, అబుదాబీ నైట్ రైడర్స్ జట్లు తలపడగా.. దుబాయ్ క్యాపిటల్స్ 73 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన క్యాపిటల్స్.. రాబిన్ ఉతప్ప (33 బంతుల్లో 43; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), కెప్టెన్ రోవమన్ పావెల్ (29 బంతుల్లో 48; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది. జో రూట్ (21 బంతుల్లో 26; 2 ఫోర్లు, 2 సిక్సర్లు), సికందర్ రజా (17 బంతుల్లో 26; ఫోర్, 2 సిక్సర్లు) పర్వాలేదనిపించగా.. భానుక రాజపక్స (9), యూసప్ పఠాన్ (6) విఫలమయ్యారు. రవి బొపారా (4 బంతుల్లో 12 నాటౌట్; ఫోర్, సిక్స్), ఇసురు ఉడాన (3 బంతుల్లో 11 నాటౌట్; ఫోర్, సిక్స్) ఆఖర్లో మెరుపులు మెరిపించారు. నైట్ రైడర్స్ బౌలర్లలో రవి రాంపాల్, అలీ ఖాన్ తలో 2 వికెట్లు పడగొట్టగా.. ఆండ్రీ రసెల్, సునీల్ నరైన్ చెరో వికెట్ దక్కించుకున్నారు. అనంతరం 189 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన నైట్ రైడర్స్.. రజా అకీఫుల్లా ఖాన్ (2/20), ముజీబ్ ఉర్ రెహ్మాన్ (2/16), రోవమన్ పావెల్ (2/15), ఇసురు ఉడాన (1/14), హజ్రత్ లుక్మా్న్ (1/27), సికందర్ రజా (1/17) ధాటికి నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి కేవలం 114 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఓపెనర్ పాల్ స్టిర్లింగ్ (38 బంతుల్లో 54; 5 ఫోర్లు, 2 సిక్సర్లు), ఆండ్రీ రసెల్ (12 బంతుల్లో 12; ఫోర్) మాత్రమే రెండంకెల స్కోర్ చేయగా.. కొలిన్ ఇంగ్రామ్ (1), బ్రాండన్ కింగ్ (8), జవార్ ఫరీద్ (9), సునీల్ నరైన్ (4), కాన్నర్ (3), అకీల్ హొస్సేన్ (3), ఫహాద్ నవాజ్ (1) దారుణంగా విఫలమయ్యారు. రవి రాంపాల్ (6), అలీ ఖాన్ (6) అజేయంగా నిలిచారు. లీగ్‌లో తదుపరి మ్యాచ్‌లో ఇవాళ (జనవరి 14) ముంబై ఎమిరేట్స్ (ముంబై ఇండియన్స్ యాజమాన్యం), షార్జా వారియర్స్ (క్యాప్రి గ్లోబల్) జట్లు తలపడనున్నాయి. About time you plan your schedule as ours is all set. 34 action packed matches from 13th Jan 2023 💥 Teams are ready to duel for the glorious ILT20 trophy. Catch all the action live with @ilt20onzee Check out the #ILT20 schedule.#ALeagueApart pic.twitter.com/dVINE7FIEu — International League T20 (@ILT20Official) November 29, 2022 ఐఎల్ టీ20 లీగ్‌కు సంబంధించిన పూర్తి వివరాలు.. షెడ్యూల్.. జనవరి 13 నుంచి మొదలయ్యే ఈ లీగ్ ఫిబ్రవరి 12న జరిగే ఫైనల్‌తో ముగుస్తుంది. 6 జట్లు పాల్గొనే ఈ లీగ్‌లో మొత్తం 34 మ్యాచ్‌లు జరుగుతాయి. Ready to conquer! 🏆 The captains and the trophy, a glimpse of the final destination before the tournament begins 🤩 #DPWorldILT20 #ALeagueApart pic.twitter.com/IC88z9Qu59 — International League T20 (@ILT20Official) January 12, 2023 ఎలా చూడాలి.. ఐఎల్ టీ20 లీగ్‌ను జీ నెట్‌వర్క్స్‌లోని 10 ఛానల్లలో ఇంగ్లీష్, హిందీ, తమిళ భాషల్లో వీక్షించవచ్చు. జీ సినిమా (ఎస్డీ, హెచ్డీ), జీ అన్మోల్ సినిమా, జీ తిరాయ్, జీ బంగ్లా సినిమా, జీ జస్ట్ (ఎస్డీ, హెచ్డీ), పిక్చర్స్ హెచ్డీ, ఫ్లిక్స్ (ఎస్డీ, హెచ్డీ) ఛానల్‌లతో పాటు ఇదే సంస్థకు చెందిన ఓటీటీ ఫ్లాట్ ఫామ్ జీ5లో చూడవచ్చు. The BIGGEST movie star in the world meets the BIGGEST T20 League 🤩 2023 will indeed start with a BANG because @iamsrk has joined #ALeagueApart 🔥 Book your tickets now; https://t.co/MXQYHlHN5j#DPWorldILT20 #SRK #ShahRukhKhan pic.twitter.com/fXUP0P6XaV — International League T20 (@ILT20Official) January 7, 2023 టీమ్స్, ఓనర్స్ .. ఎంఐ ఎమిరేట్స్ (ముంబై ఇండియన్స్) అబుదాబి నైట్ రైడర్స్ (కోల్‌కతా నైట్ రైడర్స్) డెసర్ట్ వైపర్స్ (గ్లేజర్ ఫ్యామిలీ) దుబాయ్ క్యాపిటల్స్ (ఢిల్లీ క్యాపిటల్స్) గల్ఫ్ జెయింట్స్ (అదానీ గ్రూప్) షార్జా వారియర్స్ (క్యాప్రి గ్లోబల్) కెప్టెన్లు.. ఎంఐ ఎమిరేట్స్ - కీరన్ పొలార్డ్/ డ్వేన్ బ్రావో అబుదాబి నైట్ రైడర్స్ - సునీల్ నరైన్ డెసర్ట్ వైపర్స్ - కొలిన్ మున్రో దుబాయ్ క్యాపిటల్స్ - రొవమన్ పావెల్ గల్ఫ్ జెయింట్స్ - జేమ్స్ విన్స్ షార్జా వారియర్స్ - మొయిన్ అలీ లీగ్‌లో పాల్గొనే కీలక ఆటగాళ్లు.. సునీల్ నరైన్, కీరన్ పొలార్డ్, డ్వేన్ బ్రావో, రోవమన్ పావెల్, షిమ్రోన్ హెట్మెయర్, ఆండ్రీ రసెల్, పాల్ స్టిర్లింగ్, మొయిన్ అలీ, సికందర్ రజా, రాబిన్ ఉతప్ప, యూసఫ్‌పఠాన్, ముజీబ్ ఉర్ రెహ్మాన్, జో రూట్, క్రిస్ జోర్డాన్, జేమ్స్ విన్స్, దసున్ షనక, వనిందు హసరంగ, ట్రెంట్ బౌల్ట్ తదితరులు