ఇంటర్నేషనల్ టీ20 లీగ్‌లో దుబాయ్ క్యాపిటల్స్ కీలక నిర్ణయం తీసుకుంది. దుబాయ్ క్యాపిటల్స్ తమ జట్టు కెప్టెన్సీ బాధ్యతలు నుంచి వెస్టిండీస్ స్టార్ ఆటగాడు రోవ్‌మాన్ పావెల్ తప్పించింది. అతడి స్థానంలో టీమిండియా మాజీ ఆటగాడు యూసుఫ్ పఠాన్‌ను తమ జట్టు కొత్త కెప్టెన్‌గా కెప్టెన్‌గా దుబాయ్ నియమించింది. ఇక ఈ విషయాన్ని దుబాయ్ క్యాపిటల్స్ మెనేజెమెంట్ ట్విటర్ వేదికగా వెల్లడించింది.
"ఇంటర్నేషనల్ టీ20 లీగ్‌లో మిగిలిన మ్యాచ్‌లకు దుబాయ్ క్యాపిటల్స్‌కు యూసుఫ్ పఠాన్ సారథ్యం వహించనున్నాడు. దుబాయ్ క్యాపిటల్స్ ఆదివారం తమ చివరి లీగ్‌మ్యాచ్‌లో ముంబై ఎమిరేట్స్‌తో తలపడనుంది. ప్రస్తుతం మా పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో ఉంది" అని దుబాయ్ క్యాపిటల్స్ ఓ ప్రకటనలో పేర్కొంది.
కాగా ఈ టోర్నీలో రోవ్‌మాన్ పావెల్ అద్భుతమైన వ్యక్తిగత ప్రదర్శనలతో పాటు జట్టును కూడా విజయ పథంలో నడిపించాడు. అయినప్పటికీ పావెల్‌ను జట్టు పగ్గాలు నుంచి దుబాయ్ ఎందుకు తప్పించిందో వెల్లడించలేదు. ఇక యూసుఫ్ పఠాన్ విషయానికి వస్తే.. ఈ టోర్నీలో 8 మ్యాచ్‌లు ఆడిన పఠాన్ కేవలం 56 పరుగులు మాత్రమే చేశాడు.
చదవండి: Team India: యువ క్రికెటర్ల జోరు.. భారత సీనియర్లకు ఇక కష్టకాలమే
Comments
Please login to add a commentAdd a comment