ILT20 2023
-
నరాలు తెగ ఉత్కంఠ.. ఆఖరి బంతికి సిక్స్ కొట్టి! వీడియో వైరల్
ఇంటర్ననేషనల్ టీ20 లీగ్-2024లో దుబాయ్ క్యాపిటల్స్ తమ ప్లే ఆఫ్స్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. ఈ లీగ్‌లో భాగంగా శుక్రవారం డెసర్ట్ వైపర్స్‌తో జరిగిన ఉత్కంఠ పోరులో 5 వికెట్ల తేడాతో దుబాయ్ క్యాపిటల్స్ విజయం సాధించింది. దుబాయ్ స్టార్ ఆల్‌రౌండర్ సికందర్ రజా ఆఖరి బంతికి సిక్స్ కొట్టి తన జట్టుకు అద్భుతమైన విజయాన్ని అంధించాడు. 172 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన దుబాయ్ 19 ఓవర్ ముగిసే సరికి 5 వికెట్లు కోల్పోయి 159 పరుగులు చేసింది. ఈ క్రమంలో ఆ క్రమంలో ఆఖరి ఓవర్లో దుబాయ్ విజయానికి 13 పరుగులు కావాలి. క్రీజులో దుబాయ్ బ్యాటర్లు సికందర్ రజా, స్కాట్ కుగ్గెలీజ్న్ ఉండగా.. డెసర్ట్ కెప్టెన్ మున్రో ఆఖరి ఓవర్ వేసే బాధ్యతను అలీ నీసర్కు అప్పగించాడు. తొలి బంతినే కుగ్గెలీజ్న్ బౌండరీకి తరిలించాడు. రెండో బంతికి డాట్, మూడో బంతికి కుగ్గెలీజ్న్ సింగిల్ తీసి రజాకు స్ట్రైక్ ఇచ్చాడు. నాలుగో బంతికి రజా రెండు పరుగులు తీయగా.. ఐదు బంతికి ఎటువంటి పరుగు లేదు. దీంతో చివరి బంతికి 6 పరుగులు అవసరమయ్యాయి. ఈ క్రమంలో దుబాయ్ డగౌట్లో టెన్షన్ వాతవారణం నెలకొంది. అయితే ఆఖరి బంతిని లాంగ్ ఆఫ్ మీదగా అద్బుతమైన సిక్స్‌గా మలిచిన రజా.. తన జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. ఈ మ్యాచ్‌లో 45 బంతులు ఎదుర్కొన్న రజా.. 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 60 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన వైపర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. వైపర్స్ బ్యాటర్లలో హేల్స్(66) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. దుబాయ్ బౌలర్లలో ఓలీ స్టోన్, వాండర్ మెర్వ్ తలా రెండు వికెట్లు పడగొట్టారు. Dubai Capitals stay alive by the skin of their teeth & they have Raza to thank 🙇🙌 6 needed on the last ball & the 🇿🇼 maestro deposits it over long off 🤯#DVvDC | #KoiKasarNahiChhodenge | #DPWorldILT20onZee pic.twitter.com/iygmkvjHCl — Zee Cricket (@ilt20onzee) February 9, 2024 -
రెచ్చిపోయిన రసెల్.. 17 బంతుల్లో 6 సిక్సర్లు, అయినా ఓడిన నైట్‌రైడర్స్
దుబాయ్ వేదికగా జరుగుతున్న ఇంటర్నేషనల్ టీ20 లీగ్‌లో అబుదాబీ నైట్‌రైడర్స్ ఆటగాడు, విండీస్ విధ్వంసకర వీరుడు ఆండ్రీ రసెల్ శివాలెత్తిపోయాడు. ముంబై ఇండియన్స్ ఎమిరేట్స్‌తో నిన్న జరిగిన మ్యాచ్‌లో కేవలం 17 బంతుల్లోనే ఏకంగా 6 సిక్సర్లు కొట్టి 46 పరుగులతో అజేయంగా నిలిచాడు. రసెల్ విధ్వంసకర ఇన్నింగ్స్‌తో రెచ్చిపోయినా ఈ మ్యాచ్‌లో నైట్‌రైడర్స్ ఓటమిపాలైంది. రసెల్ ధాటికి తొలుత బ్యాటింగ్ చేసిన నైట్‌రైడర్స్ నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. రసెల్‌తో పాటు జో క్లార్క్ (21), మైఖేల్ పెప్పర్ (38), అలీషాన్ షరాఫు (37), సామ్ హెయిన్ (40) ఓ మోస్తరు స్కోర్లతో రాణించారు. ఎమిరేట్స్ బౌలర్లలో ఫజల్ హక్ ఫారూకీ 3 వికెట్లు పడగొట్టగా.. ట్రెంట్ బౌల్ట్, వకార్ సలామ్ తలో వికెట్ పడగొట్టారు. అనంతరం ఎంఐ ఎమిరేట్స్ మరో ఓవర్ మిగిలుండగానే కేవలం 2 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఓపెనర్లు కుశాల్ పెరీరా (27 బంతుల్లో 56; 4 ఫోర్లు, 3 సిక్సర్లు), ముహమ్మద్ వసీం (61 బంతుల్లో 87 నాటౌట్; 8 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపు అర్ధశతకాలతో ఎమిరేట్స్‌ను విజయతీరాలకు చేర్చారు. ఆఖర్లో ఎమిరేట్స్ కెప్టెన్ నికోలస్ పూరన్ సైతం విరుచుకుపడ్డాడు. పూరన్ కేవలం 19 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 33 పరుగులు చేసి ఔటయ్యాడు. ముహమ్మద్ వసీం.. టిమ్ డేవిడ్ (10) సాయంతో ఎమిరేట్స్‌ను గెలిపించాడు. నైట్‌రైడర్స్ బౌలర్లలో డేవిడ్ విల్లే, అలీ ఖాన్లకు తలో వికెట్ దక్కింది. అలెక్స్ హేల్స్ మెరుపు ఇన్నింగ్స్ వృధా.. నిన్ననే జరిగిన మరో మ్యాచ్‌లో డెజర్ట్ వైపర్స్‌పై షార్జా వారియర్స్ 7 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన వారియర్స్.. 7 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేయగా.. ఛేదనలో తడబడిన వైపర్స్ లక్ష్యానికి 8 పరుగుల దూరంలో నిలిచిపోయింది. వారియర్స్ ఇన్నింగ్స్‌లో ఆ జట్టు కెప్టెన్ టామ్ కోహ్లెర్ కాడ్మోర్ (68) టాప్ స్కోరర్‌గా నిలువగా.. వైపర్స్ ఇన్నింగ్స్‌లో అలెక్స్ హేల్స్ (61) అర్దసెంచరీతో రాణించాడు. వారియర్స్ బౌలర్లు క్రిస్ వోక్స్ (2/26), డేనియల్ సామ్స్ (2/29) వైపర్స్ పతనాన్ని శాశించాడు. -
క్రికెట్ కోసమే రాజకీయాలకు దూరం: అంబటి రాయుడు
టీమిండియా మాజీ క్రికెట్ అంబటి తిరుపతి రాయుడు మళ్లీ బ్యాట్ పట్టనున్నట్లు ప్రకటించాడు. వృత్తిపరమైన క్రీడను ఆడుతున్నందున రాజకీయాలకు దూరంగా ఉండాల్సిన అవసరం ఉందంటూ ఎక్స్‌లో ట్వీట్ చేసిన అంబటి రాయుడు.. త్వరలో దుబాయ్‌లో జరుగనున్న ఇంటర్నేషనల్ టీ20 లీగ్‌లో ఆడనున్నట్లు వెల్లడించారు. ప్రొఫెషన్ క్రికెట్ లీగ్‌లో ఆడాలంటే ఏ రాజకీయ పార్టీతో అనుబంధం ఉండకూడదు. అందుకే వైసీపీ రాజీనామా చేసినట్లు రాయుడు చెప్పుకొచ్చాడు. ఇంటర్నేషనల్ లీగ్‌లో రాయుడు ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీతో జతకట్టనున్నాడు. రాయుడు గతంలో ఐసీఎల్‌లోనూ ముంబై ఇండియన్స్‌కు ఆడాడు. ఇంటర్నేషనల్ టీ20 లీగ్ జనవరి 20 నుంచి ప్రారంభంకానుంది. I Ambati Rayudu will be representing the Mumbai Indians in the upcoming ILt20 from jan 20th in Dubai. Which requires me to be politically non affiliated whilst playing professional sport. — ATR (@RayuduAmbati) January 7, 2024 -
ఆఫ్ఘనిస్తాన్ ఆటగాడు నవీన్ ఉల్ హక్‌పై నిషేధం
ఆఫ్ఘనిస్తాన్ ఫాస్ట్ బౌలర్ నవీన్ ఉల్ హక్‌పై దుబాయ్ వేదికగా జరిగే ఇంటర్నేషనల్ టీ20 లీగ్ (ILT20) నిషేధం విధించింది. లీగ్‌లో భాగమైన షార్జా వారియర్స్ ఫ్రాంచైజీతో ఒప్పందాన్ని ఉల్లంఘించినందుకు నవీన్‌పై 20 నెలల నిషేధం విధిస్తున్నట్లు లీగ్ మేనేజ్మెంట్ ప్రకటించింది. నవీన్‌కు వారియర్స్ యాజమాన్యం మరో సంవత్సరం కాంట్రాక్ట్ పొడిగించినప్పటికీ.. అతను రిటెన్షన్ నోటీసుపై (సీజన్ 2 కోసం) సంతకం చేయడానికి నిరాకరించాడు. దీంతో ILT20 నవీన్‌పై నిషేధం విధించింది. నవీన్ ఈ ఏడాది ఆరంభంలో (2023, జనవరి) జరిగిన ILT20 సీజన్-1లో షార్జా వారియర్స్ తరపున ఆడాడు. ముందస్తు అగ్రిమెంట్లో భాగంగా ఫ్రాంచైజీ యాజమాన్యం నవీన్‌కు రిటెన్షన్ నోటీసులు పంపింది. అయితే నవీన్ సదరు నోటీసులపై సంతకాలు చేసేందుకు నిరాకరించడంతో లీగ్ మేనేజ్మెంట్ తప్పనిసరి పరిస్థితుల్లో నవీన్‌పై 20 నెలల నిషేధం విధించింది. నవీన్.. 2023 సీజన్లో వారియర్స్ తరఫున మొత్తం తొమ్మిది మ్యాచ్‌లు ఆడి, 24.36 సగటుతో 11 వికెట్లు పడగొట్టాడు. ఇందులో ఓ ఐదు వికెట్ల ప్రదర్శన కూడా ఉంది. మొత్తం ఆరు జట్లు పాల్గొన్న ఈ లీగ్‌లో నవీన్ ప్రాతినిథ్యం వహించిన షార్జా వారియర్స్ ఐదో స్థానంతో గత సీజన్‌ను ముగించింది. ఈ సీజన్లో వారు ఆడిన 10 మ్యాచ్‌ల్లో కేవలం మూడు విజయాలు మాత్రమే సాధించారు. -
ILT20 2024: దుబాయ్ క్యాపిటల్స్ కెప్టెన్‌గా డేవిడ్ వార్నర్
యూఏఈ వేదికగా జరిగే ఇంటర్నేషనల్ లీగ్ టీ20 టోర్నీ (DP World ILT20) రెండో ఎడిషన్ వచ్చే ఏడాది జనవరి 19-ఫిబ్రవరి 17 మధ్యలో జరుగనుంది. ఈ లీగ్ కోసం దుబాయ్ క్యాపిటల్స్ తమ నూతన కెప్టెన్‌గా ఆసీస్ వెటరన్ డేవిడ్ వార్నర్‌ను నియమించింది. దుబాయ్ క్యాపిటల్స్.. ఐపీఎల్ ఫ్రాంచైజీ ఢిల్లీ క్యాపిటల్స్ యాజమాన్యం ఆధ్వర్యంలో నడుస్తుంది. రిషబ్ పంత్ గైర్హాజరీలో వార్నర్ గత ఐపీఎల్ సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్‌గా వ్యవహరించిన విషయం తెలిసిందే. వార్నర్‌తో అనుబంధాన్ని కొనసాగించడంలో భాగంగా అతనికి దుబాయ్ క్యాపిటల్స్ సారథ్య బాధ్యతలు అప్పజెప్పినట్లు తెలుస్తుంది. అయితే వార్నర్ ఇంటర్నేషనల్ లీగ్ మొత్తానికి అందుబాటులో ఉంటాడా లేదా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఈ లీగ్ మొదలయ్యే సమయానికి వార్నర్ బిగ్‌బాష్ లీగ్‌లో ఆడాల్సి ఉంది. వార్నర్ స్వదేశీ లీగ్‌కు మధ్యలోనే హ్యాండ్ ఇచ్చి దుబాయ్ క్యాపిటల్స్‌కు ఆడే అవకాశం ఉండదని తెలుస్తుంది. మరి ఈ రెండు లీగ్‌ల మధ్యలో వార్నర్ ఏ లీగ్‌కు ప్రాధాన్యత ఇస్తాడో వేచి చూడాలి. కాగా, ఇంటర్నేషనల్ లీగ్ టీ20 టోర్నీ ఇనాగురల్ ఎడిషన్‌లో (2023) దుబాయ్ క్యాపిటల్స్ కెప్టెన్‌గా రోవ్‌మన్ పావెల్ వ్యవహరించాడు. పావెల్ సారథ్యంలో క్యాపిటల్స్ గత ఎడిషన్ సెమీస్ వరకు చేరింది. ఐఎల్టీ20 2023 ఎడిషన్ ఛాంపియన్‌గా గల్ఫ్ జెయింట్స్ నిలిచింది. ఫైనల్లో జెయింట్స్ డెసర్ట్ వైపర్స్‌ను ఓడించి టైటిల్‌ను ఎగరేసుకుపోయింది. దుబాయ్ క్యాపిటల్స్ జట్టులో ప్రస్తుతం రోవ్‌మన్ పావెల్, జో రూట్, సికందర్ రజా, మార్క్ వుడ్, స్టీవ్ స్మిత్ లాంటి స్టార్ క్రికెటర్లు ఉన్నారు. -
దుబాయ్ క్యాపిటల్స్‌లోకి వార్నర్, వుడ్.. అఫ్రిది, షాదాబ్ ఖాన్ మరో జట్టుతో..!
యూఏఈ వేదికగా జరిగే ఇంటర్నేషన్ లీగ్ టీ20 సీజన్-2 (2024) కోసం ఆయా ఫ్రాంచైజీలు కొత్త ఆటగాళ్లను ఎంపిక చేసుకున్నాయి. లీగ్‌లో పాల్గొనే ఆరు జట్లు తమ పాత ఆటగాళ్లను కొందరిని రిటైన్ చేసుకోవడంతో పాటు కొత్తగా 50 మంది ఆటగాళ్లతో డీల్ కుదుర్చుకున్నాయి. అబుదాబీ నైట్‌రైడర్స్ 8, డెజర్ట్ వైపర్స్ 6, దుబాయ్ క్యాపిటల్స్ 11, గల్ఫ్ జెయింట్స్ 5, ఎంఐ ఎమిరేట్స్ 8, షార్జా వారియర్స్ 12 మంది ఆటగాళ్లను తమ పంచన చేర్చుకున్నాయి. కొత్తగా లీగ్‌లోకి ఎంట్రీ ఇచ్చే వాళ్లలో డేవిడ్ వార్నర్ (దుబాయ్ క్యాపిటల్స్), మార్క్ వుడ్, షాదాబ్ ఖాన్ (డెజర్ట్ వైపర్స్), షాహీన్ అఫ్రిది (డెజర్ట్ వైపర్స్), ముజీబ్ ఉర్ రెహ్మాన్ (గల్ఫ్ జెయింట్స్), అంబటి రాయుడు (ఎంఐ ఎమిరేట్స్), కోరె ఆండర్సన్ (ఎంఐ ఎమిరేట్స్), మార్టిన్ గప్తిల్ (షార్జా వారియర్స్) లాంటి స్టార్ ప్లేయర్లు ఉన్నారు. ఆటగాళ్ల ఎంపిక సంబంధించిన మొత్తం తంతును ఆయా ఫ్రాంచైజీలు ఇవాళ (ఆగస్ట్ 21) పూర్తి చేశాయి. ఇంటర్నేషనల్ లీగ్ టీ20 సీజన్-2 వచ్చే ఏడాది జనవరి 13 నుంచి ప్రారంభం కానుంది. DP వరల్డ్ ILT20 సీజన్ 2 కోసం ఆయా ఫ్రాంచైజీ ఆటగాళ్ల పూర్తి జాబితా.. అబుదాబి నైట్ రైడర్స్ కొత్త ఆటగాళ్లు: బ్రాండన్ మెక్‌ముల్లెన్, డేవిడ్ విల్లీ, జేక్ లింటాట్, జోష్ లిటిల్, లారీ ఎవాన్స్, మైఖేల్ పెప్పర్, రవి బొపారా, సామ్ హైన్ రిటెన్షన్స్: అలీ ఖాన్, ఆండ్రీ రసెల్, చరిత్ అసలంక, జో క్లార్క్, సాబిర్ అలీ, సునీల్ నరైన్, మర్చంట్ డి లాంజ్, మతియుల్లా ఖాన్ డెజర్ట్ వైపర్స్ కొత్త ఆటగాళ్లు: ఆడమ్ హోస్, ఆజం ఖాన్, బాస్ డి లీడ్, మైఖేల్ జోన్స్, షాదాబ్ ఖాన్, షాహీన్ ఆఫ్రిది రిటెన్షన్స్: అలెక్స్ హేల్స్, అలీ నసీర్, కొలిన్ మున్రో, దినేష్ చండిమాల్, గుస్ అట్కిన్సన్, ల్యూక్ వుడ్, మతీష పతిరణ, రోహన్ ముస్తఫా, షెల్డన్ కాట్రెల్, షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్, టామ్ కర్రన్, వనిందు హసరంగ దుబాయ్ క్యాపిటల్స్ కొత్త ఆటగాళ్లు: ఆండ్రూ టై, దసున్ షనక, డేవిడ్ వార్నర్, మార్క్ వుడ్, మాక్స్ హోల్డెన్, మొహమ్మద్ మొహ్సిన్, రహ్మానుల్లా గుర్బాజ్, నువాన్ తుషార, రోల్ఫ్ వాన్ డెర్ మెర్వ్, సదీర సమరవిక్రమ, సామ్ బిల్లింగ్స్ రిటెన్షన్స్: దుష్మంత చమీర, జో రూట్, రాజా అకిఫ్, రోవ్‌మన్ పావెల్, సికందర్ రజా గల్ఫ్ జెయింట్స్ కొత్త ఆటగాళ్లు: డొమినిక్ డ్రేక్స్, జోర్డాన్ కాక్స్, కరీం జనత్, ముజీబ్-ఉర్-రెహ్మాన్, సౌరభ్ నేత్రవల్కర్ రిటెన్షన్స్: అయాన్ అఫ్జల్ ఖాన్, కార్లోస్ బ్రాత్‌వైట్, క్రిస్ జోర్డాన్, క్రిస్ లిన్, గెర్హార్డ్ ఎరాస్మస్, జేమ్స్ విన్స్, జేమీ ఓవర్టన్, రెహాన్ అహ్మద్, రిచర్డ్ గ్లీసన్, సంచిత్ శర్మ, షిమ్రాన్ హెట్‌మైర్ ఎంఐ ఎమిరేట్స్ కొత్త ఆటగాళ్లు: అకీల్ హోసేన్, అంబటి రాయుడు, కోరె అండర్సన్, కుశాల్ పెరీరా, నోస్తుష్ కెంజిగే, ఓడియన్ స్మిత్, విజయకాంత్ వియాస్కాంత్, వకార్ సలాంఖైల్ రిటెన్షన్స్: ఆండ్రీ ఫ్లెచర్, డేనియల్ మౌస్లీ, డ్వేన్ బ్రేవో, ఫజల్ హాక్ ఫారూకీ, జోర్డాన్ థాంప్సన్, కీరన్ పొలార్డ్, మెక్కెన్నీ క్లార్క్, ముహమ్మద్ వసీమ్, నికోలస్ పూరన్, ట్రెంట్ బౌల్ట్, విల్ స్మీడ్, జహూర్ ఖాన్ షార్జా వారియర్స్ కొత్త ఆటగాళ్లు: క్రిస్ సోల్, డేనియల్ సామ్స్, దిల్షన్ మధుశంక, జేమ్స్ ఫుల్లర్, జాన్సన్ చార్లెస్, కుశాల్ మెండిస్, లూయిస్ గ్రెగొరీ, మహేశ్ తీక్షణ, మార్క్ వాట్, మార్టిన్ గప్తిల్, సీన్ విలియమ్స్, కైస్ అహ్మద్ రిటెన్షన్స్: క్రిస్ వోక్స్, జో డెన్లీ, జునైద్ సిద్ధిక్, మార్క్ దెయాల్, ముహమ్మద్ జవాదుల్లా, టామ్ కోహ్లర్-కాడ్మోర్ -
మళ్లీ ముంబై ఇండియన్స్ గూటికి అంబటి రాయుడు
టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి తిరుపతి రాయుడు మరోసారి ముంబై ఇండియన్స్ ఫ్యామిలీలో చేరాడు. 2010 నుంచి 2017 వరకు ఐపీఎల్లో ముంబై ఇండియన్స్‌కు ప్రాతినిథ్యం వహించిన రాయుడు.. యూఏఈ వేదికగా జరిగే ఇంటర్నేషనల్ లీగ్ టీ20 సీజన్-2 (2024) కోసం మళ్లీ ముంబై ఇండియన్స్‌తో జతకట్టాడు. ఇంటర్నేషనల్ లీగ్ టీ20లో ఎంఐ ఎమిరేట్స్‌గా బరిలోకి దిగే ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ, వచ్చే సీజన్ కోసం 8 మంది కొత్త ఆటగాళ్లతో డీల్ కుదుర్చుకుంది. వీరిలో రాయుడుతో పాటు కోరె ఆండర్సన్ (న్యూజిలాండ్), ఓడియన్ స్మిత్ (వెస్టిండీస్), అకీల్ హొసేన్ (వెస్టిండీస్), కుశాల్ పెరీరా (శ్రీలంక) లాంటి స్టార్ ఆటగాళ్లు ఉన్నారు. వీరితో పాటు శ్రీలంక యువ ఆటగాడు విజయకాంత్ వియాస్కాంత్, వకార్ సలామ్‌కీల్, నోష్తుష్ కెంజిగే లాంటి కొత్త ఆటగాళ్లు కూడా ఎంఐ ఫ్యామిలీలో చేరారు. పై పేర్కొన్న 8 మంది చేరికతో ఎంఐ ఎమిరేట్స్ జట్టు సంఖ్య 20కి చేరింది. ఇక ఎంఐ ఫ్యామిలీ రిటైన్ చేసుకున్న ఆటగాళ్ల విషయానికొస్తే.. ఎంఐ ఎమిరేట్స్ 12 మంది పాత వారిని తిరిగి తమతో చేర్చుకుంది. విండీస్ ఆటగాళ్లు కీరన్ పోలార్డ్, డ్వేన్ బ్రావో, నికోలస్ పూరన్, ఆండ్రీ ఫ్లెచర్, న్యూజిలాండ్ స్టార్ పేసర్ ట్రెంట్ బౌల్ట్, ఫజల్ హక్ ఫారూఖీ, ముహ్మమద్ వసీం, జహూర్ ఖాన్, జోర్డన్ థాంప్సన్, విలియమ్ స్మీడ్, మెక్కెన్నీ క్లార్క్, డేనియల్ మోస్లీలను ఎంఐ ఎమిరేట్స్ తిరిగి రిటైన్ చేసుకుంది. కాగా, ఇంటర్నేషనల్ లీగ్ టీ20 సీజన్-2 వచ్చే ఏడాది జనవరి 13 నుంచి ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. కరీబియన్ లీగ్ 2023లో రాయుడు.. ఐపీఎల్ సూపర్ స్టార్ అంబటి రాయుడు ఐపీఎల్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన అనంతరం కొద్ది కాలంపాటు గ్యాప్ తీసుకుని, ప్రస్తుతం జరుగుతున్న కరీబియన్ ప్రీమియర్ లీగ్‌లో ఆడుతున్నాడు. ఈ లీగ్‌లో రాయుడు సెయింట్ కిట్స్ నెవిస్ పేట్రియాట్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు.ప్రవీణ్ తాంబే తర్వాత కరీబియన్ ప్రీమియర్ లీగ్ ఆడుతున్న రెండో భారత క్రికెటర్‌గా రాయుడు రికార్డుల్లోకెక్కాడు. 2020 సీజన్లో ప్రవీణ్ తాంబే ట్రిన్‌బాగో నైట్ రైడర్స్ తరఫున సీపీఎల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. -
2024 సీజన్ ప్లేయర్ల రిటెన్షన్.. స్టార్ ఆటగాళ్లందరూ తిరిగి ఆయా జట్లకే..!
దుబాయ్ వేదికగా జరిగే ఇంటర్నేషనల్ టీ20 లీగ్‌లో పాల్గొనే ఆరు ఫ్రాంచైజీలు.. తదుపరి ఎడిషన్ కోసం ఆటగాళ్ల రిటెన్షన్ (తిరిగి దక్కంచుకోవడం) ప్రక్రియను ఇవాళ (జులై 10) పూర్తి చేశాయి. వచ్చే ఏడాది (2024) జనవరి 13 నుంచి ప్రారంభం కాబోయే ILT20 సీజన్లో డిఫెండింగ్ ఛాంపియన్స్ గల్ఫ్ జెయింట్స్ సహా మిగతా అన్ని జట్లు తమ స్టార్ క్రికెటర్లను తిరిగి దక్కించుకున్నాయి. The big names are back for Season 2!🙌 All your favorites from the inaugural edition return to battle it out once again in Season 2 of the #DPWorldILT20. Are you ready for a firecracker of a tournament?💥 For more details, please visit: https://t.co/PXt4HL1vCp pic.twitter.com/dHdUYMN1D4 — International League T20 (@ILT20Official) July 10, 2023 గల్ఫ్ జెయింట్స్.. షిమ్రోన్ హెట్‌మైర్, క్రిస్ జోర్డన్, జేమ్స్ విన్స్, క్రిస్ ఓవర్టన్, క్రిస్ లిన్, అయాన్ ఖాన్, సంచిత్ శర్మ, రిచర్డ్ గ్లీసన్, కార్లోస్ బ్రాత్‌వైట్, రెహాన్ అహ్మద్, గెర్హార్డ్ ఎరాస్మస్‌లను దక్కించుకోగా.. గతేడాది రన్నరప్ డెసర్ట్ వైపర్స్.. హసరంగ, అలెక్స్ హేల్స్, టామ్ కర్రన్, కొలిన్ మన్రో, షెఫానీ రూథర్‌ఫోర్డ్, లూక్ వుడ్, పతిరణ, రోహన్ ముస్తఫా, షెల్డన్ కాట్రెల్, చండీమాల్, అట్కిన్సన్, అలీ నసీర్లను రీటైన్ చేసుకున్నాయి. అబుదాబీ నైట్‌రైడర్స్.. సునీల్ నరైన్, ఆండ్రీ రసెల్, జో క్లార్క్, చరిత్ అసలంక, అలీ ఖాన్, మతీవుల్లా ఖాన్, మర్చంట్ డి లాంజ్, సాబిర్ అలీని తిరిగి దక్కంచుకుంది. మిగతా మూడు జట్లు తిరిగి దక్కించుకున్న ఆటగాళ్ల వివరాలు: దుబాయ్ క్యాపిటల్స్.. జో రూట్, సికందర్ రజా, రోవ్‌మన్ పావెల్, దుష్మంత చమీరా, రజా అకీఫుల్లా ఖాన్ ముంబై ఇండియన్స్ ఎమిరేట్స్.. కీరన్ పోలార్డ్, డ్వేన్ బ్రావో, నికోలస్ పూరన్, ట్రెంట్ బౌల్ట్, విల్ స్మీడ్, మహ్మద్ వసీం, డేవిడ్ మౌస్లీ, జహూర్ ఖాన్, ఫజల్ హక్ ఫారూఖీ, థామ్సన్, మెక్ కెన్నీ క్లార్క్, ఆండ్రీ ఫ్లెచర్ షార్జా వారియర్స్.. క్రిస్ వోక్స్, జునైద్ సిద్ధిఖీ, మార్క్ దెయాల్, జో డెన్లీ, ముహమ్మద్ జవాదుల్లా, టామ్ కొహ్లెర్ క్యాడ్మోర్` -
ముంబై ఎమిరేట్స్ ఔట్.. ఫైనల్‌కు చేరిన గల్ఫ్ జెయింట్స్
ఇంటర్నేషనల్ టీ20 లీగ్-2023 ఫైనల్లో గల్ఫ్ జెయింట్స్ అడుగుపెట్టింది. దుబాయ్ వేదికగా క్వాలిఫియర్-2లో ఎంఐ ఎమిరేట్స్‌ను 4 వికెట్ల తేడాతో చిత్తు చేసి ఫైనల్ బెర్త్‌ను గల్ఫ్ జెయింట్స్ ఖారారు చేసుకుంది. 168 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన జెయింట్స్ 18.1 ఓవర్లలోనే 6 వికెట్లు కోల్పోయి చేధించింది. జెయింట్స్ బ్యాటర్లలో జేమ్స్ విన్స్ 83 పరుగులతో ఆఖరి వరకు అజేయంగా నిలిచి తమ జట్టును ఫైనల్‌కు చేర్చాడు. ఎంఐ ఎమిరేట్స్ బౌలర్లలో ఫజల్హక్ ఫారూఖీ, రషీద్ ఖాన్ తలా రెండు వికెట్లు, బ్రావో, బౌల్ట్ చెరో వికెట్ సాధించారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన ఎంఐ ఎమిరేట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది. ఎమిరేట్స్ బ్యాటర్లలో కెప్టెన్ పొలార్డ్ 57 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అతడితో పాటు ఓపెనర్ మహ్మద్ వసీం 31 పరుగులతో రాణించాడు. ఇక ఫిబ్రవరి 12 దుబాయ్ వేదికగా జరగనున్న ఫైనల్లో డిసార్ట్ వైపర్స్‌తో జెయింట్స్ తలపడనుంది. చదవండి: T20 WC: పాకిస్తాన్‌తో తొలి మ్యాచ్.. టీమిండియాకు ఊహించని షాక్! We have our second finalist! 🙌@GulfGiants beat @MIEmirates by 4 wickets and make a dashing entry into the FINAL of the #DPWorldILT20. Congratulations 👏#DPWorldILT20 #ALeagueApart #GGvMIE pic.twitter.com/7AQTvcJdlo — International League T20 (@ILT20Official) February 10, 2023 -
సిక్సర్ల మోత మోగించిన పూరన్, ఫ్లెచర్.. దద్దరిల్లిన షార్జా స్టేడియం
దుబాయ్ వేదికగా జరుగుతున్న ఇంటర్నేషనల్ లీగ్ టీ20 టోర్నీ చివరి దశకు చేరింది. క్వాలిఫయర్-2 బెర్తులతో (గల్ఫ్ జెయింట్స్, ఎంఐ ఎమిరేట్స్) పాటు ఓ ఫైనల్ బెర్త్ (డెసర్ట్ వైపర్స్) ఖరారయ్యాయి. గల్ఫ్ జెయింట్స్, ఎంఐ ఎమిరేట్స్ జట్ల మధ్య ఇవాళ (ఫిబ్రవరి 10) జరిగే క్వాలిఫయర్-2 మ్యాచ్ విన్నర్ ఫిబ్రవరి 12న జరిగే లీగ్ తుది పోరులో డెసర్ట్ వైపర్స్‌తో తలపడుతుంది. ఇక, దుబాయ్ క్యాపిటల్స్, ఎంఐ ఎమిరేట్స్ మధ్య నిన్న జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌లో ఎంఐ టీమ్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి దుబాయ్ క్యాపిటల్స్‌ను ఇంటికి పంపింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేసిన ఎంఐ టీమ్.. దుబాయ్ క్యాపిటల్స్‌ను 151/5 స్కోర్‌కే పరిమితం చేసింది. ఎంఐ బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్, రషీద్ ఖాన్ తలో 2 వికెట్లు పడగొట్టగా.. డ్వేన్ బ్రావో ఓ వికెట్ దక్కించుకున్నాడు. దుబాయ్ ఇన్నింగ్స్‌లో మున్సే (43 బంతుల్లో 51; 6 ఫోర్లు, సిక్స్) అర్ధసెంచరీతో రాణించగా.. సికందర్ రజా (34 బంతుల్లో 38; 4 ఫోర్లు), రోవ్‌మన్ పావెల్ (22 బంతుల్లో 30; 3 సిక్సర్లు) పర్వాలేదనిపించారు. పేలిన పూరన్, ఫ్లెచర్.. .. దద్దరిల్లిన షార్జా స్టేడియం 152 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఎంఐ టీమ్.. కేవలం 16.4 ఓవర్లలోనే 2 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. ఆండ్రీ ఫ్లెచర్ (45 బంతుల్లో 68 నాటౌట్; 4 ఫోర్లు, 4 సిక్సర్లు), నికోలస్ పూరన్ (36 బంతుల్లో 66 నాటౌట్; 3 ఫోర్లు, 5 సిక్సర్లు) అజేయమైన మెరుపు అర్ధశతకాలతో తమ జట్టును విజయతీరాలకు చేర్చారు. దుబాయ్ బౌలర్లలో జేక్ బాల్, దసున్ శనకలకు తలో వికెట్ దక్కింది. ముహమ్మద్ వసీమ్ (2), లోర్కాన్ టక్కర్ (10) తక్కువ స్కోర్లకే వెనుదిరిగినా ఫ్లెచర్, పూరన్ జోడీ బౌండరీలు, సిక్సర్ల మోత మోగించి, తమ జట్టును క్వాలిఫయర్-2కు చేర్చారు. పూరన్, ఫ్లెచర్ మెరుపు విన్యాసాల ధాటికి షార్జా స్టేడియం దద్దరిల్లింది. -
David Wiese: ఐదేసి ఇరగదీసిన వీస్.. వారియర్స్ ఖేల్ ఖతం
ఇనాగురల్ ఇంటర్నేషనల్ టీ20 లీగ్-2023 (దుబాయ్ లీగ్)లో ప్లే ఆఫ్స్ బెర్తులు ఖరారయ్యాయి. నిన్న (ఫిబ్రవరి 6) జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్‌లో గల్ఫ్ జెయింట్స్ చేతిలో ఓటమిపాలవ్వడంతో షార్జా వారియర్స్ లీగ్ నుంచి నిష్క్రమించింది. జెయింట్స్ పేసర్, వెటరన్ ఆల్‌రౌండర్ డేవిస్ వీస్ ఐదు వికెట్లు (4-0-20-5) తీసి అదరగొట్టడంతో జెయింట్స్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి, టేబుల్ టాపర్‌గా ప్లే ఆఫ్స్‌కు దూసుకెళ్లింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేసిన జెయింట్స్.. వారియర్స్‌ను 18.3 ఓవర్లలో 107 పరుగులకే ఆలౌట్ చేసింది. వారియర్స్ ఇన్నింగ్స్‌లో కోహ్లెర్ కాడ్మోర్ (33), స్టోయినిస్ (18), మహ్మద్ నబీ (21), నూర్ అహ్మద్ (10) మాత్రమే రెండంకెల స్కోర్ చేశారు. వారియర్స్ ఇన్నింగ్స్‌లో కోహ్లెర్ కాడ్మోర్ ఆరంభంలో మెరుపు వేగంతో పరుగులు చేసి జెయింట్స్ బౌలర్లను భయపెట్టాడు. అయితే టామ్ హెల్మ్ కాడ్మోర్కు కళ్లెం వేయడంతో వారియర్స్ ఢీలా పడిపోయి వరుసగా వికెట్లు కోల్పోయింది. జెయింట్స్ బౌలర్లలో వీస్ ఐదేయగా.. కార్లోస్ బ్రాత్‌వైట్ 2, సంచిత్ శర్మ, టామ్ హెల్మ్ తలో వికెట్ పడగొట్టారు. అనంతరం 108 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన జెయింట్స్16.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. టామ్ బాంటన్ (11), కెప్టెన్ జేమ్స్ విన్స్ (27), కొలిన్ డి గ్రాండ్‌హోమ్ (35), అయాన్ అఫ్జల్ ఖాన్ (14 నాటౌట్), గెర్హార్డ్ ఎరాస్మస్ (10 నాటౌట్) రాణించారు. వారియర్స్ బౌలర్లలో జునైద్ సిద్ధిఖీ 2, మార్కస్ స్టోయినిస్ ఓ వికెట పడగొట్టారు. ఈ విజయంతో వారియర్స్ లీగ్ నుంచి నిష్క్రమించగా.. తొలి రెండు స్థానాల్లో నిలిచిన గల్ఫ్ జెయింట్స్, డెసర్ట్ వైపర్స్ క్వాలిఫయర్స్‌కు.. 3, 4 స్థానాల్లో నిలిచిన ముంబై ఎమిరేట్స్, దుబాయ్ క్యాపిటల్స్ ఎలిమినేటర్ మ్యాచ్‌ను అర్హత సాధించాయి. 6 జట్లలో చివరి స్థానంలో నిలిచిన అబుదాబీ నైట్‌రైడర్స్ ఇదివరకే లీగ్ నుంచి నిష్క్రమించింది. ఫిబ్రవరి 8: గల్ఫ్ జెయింట్స్, డెసర్ట్ వైపర్స్ (క్వాలిఫయర్స్ 1) ఫిబ్రవరి 9: ముంబై ఎమిరేట్స్, దుబాయ్ క్యాపిటల్స్ (ఎలిమినేటర్) -
తీవ్రంగా గాయపడ్డ వెస్టిండీస్ క్రికెటర్.. స్ట్రెచర్‌పై మైదానం బయటకు!
ఇంటర్నేషనల్ టీ20 లీగ్‌లో భాగంగా సోమవారం జరిగిన షార్జా వారియర్స్, గల్ఫ్ జెయింట్స్ సందర్భంగా ఓ దురదృష్టకర సంఘటన చోటుచేసుకుంది. ఈ మ్యాచ్‌లో గల్ఫ్ జెయింట్స్ ఆటగాడు, వెస్టిండీస్ ఆల్‌రౌండర్ డొమినిక్ డ్రేక్స్ తీవ్రంగా గాయపడ్డాడు. ఏం జరిగిందంటే? వెస్టిండీస్ ఆల్‌రౌండర్ డొమినిక్ డ్రేక్స్ ఇంటర్నేషనల్ టీ20 లీగ్‌లో గల్ఫ్ జెయింట్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. అయితే ఈ మ్యాచ్‌లో షార్జా వారియర్స్ ఇన్నింగ్స్ ఆరో ఓవర్ వేసిన బ్రాత్‌వైట్ బౌలింగ్‌లో.. మోయిన్ అలీ భారీ షాట్‌కు ప్రయత్నించాడు. అది మిస్టైమ్ అయ్యి గాల్లోకి లేచింది. అయితే బౌండర్ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న డ్రేక్ పరిగెత్తుకుంటూ వచ్చి అద్భుతమైన డైవింగ్ క్యాచ్‌ను అందుకున్నాడు. ఈ క్రమంలో అతడి ముఖం నేలకు బలంగా తాకింది. దీంతో వెంటనే అతడు తీవ్రమైన నొప్పితో విలవిల్లాడు. ఈ క్రమంలో మెడికల్ సిబ్బంది అతడిని స్ట్రెచర్‌పై మైదానం బయటకు తీసుకువెళ్లారు. అయితే అతడిని హూటాహూటిన ఆస్పత్రికి తరిలించారు. ఇక ముఖంకు తీవ్రమైన గాయమైనప్పటికీ అద్భుతమైన క్యాచ్‌ను అందుకున్న అతడిపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. 7 వికెట్ల తేడాతో గల్ఫ్ జెయింట్స్ విజయం ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. షార్జా వారియర్స్ పై గల్ఫ్ జెయింట్స్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన షార్జా 107 పరుగులకే కుప్పకూలింది. గల్ఫ్ జెయింట్స్ బౌలర్లలో డేవిడ్ వైస్ ఐదు వికెట్లతో షార్జా వెన్ను విరచగా.. బ్రాత్‌వైట్ రెండు, సంచిత్ శర్మ,హెల్మ్ తలా వికెట్ సాధించారు. అనంతరం 108 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన జెయింట్స్ మూడు వికెట్లు కోల్పోయి చేధించింది. చదవండి: Nepal Head Coach: నేపాల్ జట్టు హెడ్ కోచ్‌గా భారత మాజీ క్రికెటర్ Brilliance from Drakes! A #Bawaal catch to dismiss Moeen Ali!#SWvGG #CricketOnZee #DPWorldILT20 #HarBallBawaal pic.twitter.com/mtUDVj4xJm — Zee Cricket (@ilt20onzee) February 6, 2023 -
దుబాయ్ క్యాపిటల్స్ కెప్టెన్‌గా యూసుఫ్ పఠాన్..
ఇంటర్నేషనల్ టీ20 లీగ్‌లో దుబాయ్ క్యాపిటల్స్ కీలక నిర్ణయం తీసుకుంది. దుబాయ్ క్యాపిటల్స్ తమ జట్టు కెప్టెన్సీ బాధ్యతలు నుంచి వెస్టిండీస్ స్టార్ ఆటగాడు రోవ్మాన్ పావెల్ తప్పించింది. అతడి స్థానంలో టీమిండియా మాజీ ఆటగాడు యూసుఫ్ పఠాన్‌ను తమ జట్టు కొత్త కెప్టెన్‌గా కెప్టెన్‌గా దుబాయ్ నియమించింది. ఇక ఈ విషయాన్ని దుబాయ్ క్యాపిటల్స్ మెనేజెమెంట్ ట్విటర్ వేదికగా వెల్లడించింది. "ఇంటర్నేషనల్ టీ20 లీగ్‌లో మిగిలిన మ్యాచ్‌లకు దుబాయ్ క్యాపిటల్స్‌కు యూసుఫ్ పఠాన్ సారథ్యం వహించనున్నాడు. దుబాయ్ క్యాపిటల్స్ ఆదివారం తమ చివరి లీగ్‌మ్యాచ్‌లో ముంబై ఎమిరేట్స్‌తో తలపడనుంది. ప్రస్తుతం మా పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో ఉంది" అని దుబాయ్ క్యాపిటల్స్ ఓ ప్రకటనలో పేర్కొంది. కాగా ఈ టోర్నీలో రోవ్మాన్ పావెల్ అద్భుతమైన వ్యక్తిగత ప్రదర్శనలతో పాటు జట్టును కూడా విజయ పథంలో నడిపించాడు. అయినప్పటికీ పావెల్‌ను జట్టు పగ్గాలు నుంచి దుబాయ్ ఎందుకు తప్పించిందో వెల్లడించలేదు. ఇక యూసుఫ్ పఠాన్ విషయానికి వస్తే.. ఈ టోర్నీలో 8 మ్యాచ్‌లు ఆడిన పఠాన్ కేవలం 56 పరుగులు మాత్రమే చేశాడు. చదవండి: Team India: యువ క్రికెటర్ల జోరు.. భారత సీనియర్లకు ఇక కష్టకాలమే -
ILT20: తీరుమారని నైట్ రైడర్స్.. వరుసగా ఏడో ఓటమి
ఇంటర్నేషనల్ టీ20 లీగ్‌లో అబుదాబి నైట్ రైడర్స్ మరో ఓటమి చవిచూసింది. ఈ లీగ్‌లో భాగంగా సోమవారం దుబాయ్ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో అబుదాబి నైట్ రైడర్స్ పరాజాయం పాలైంది. ఈ టోర్నీలో నైట్ రైడర్స్‌కు ఇది 7వ ఓటమి కావడం గమానార్హం. ఇక 150 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన దుబాయ్ క్యాపిటల్స్ కేవలం 3 వికెట్లు మాత్రమే కోల్పోయి చేధించింది. దుబాయ్ బ్యాటర్లలో ఓపెనర్ మున్సీ 57 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. డిక్వెల్లా(37), షనక (28) పరుగులతో రాణించారు. నైట్‌రైడర్స్ బౌలర్లలో కుమార, రస్సెల్, అకేల్ హోసేన్ తలా వికెట్ సాధించారు. ఇక తొలుత బ్యాటింగ్ చేసిన అబుదాబి నైట్ రైడర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 149 పరుగులు చేసింది. నైట్ రైడర్స్ బ్యాటర్లలో జో క్లార్క్ 52 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. దుబాయ్ క్యాపిటల్స్ బ్యాటర్లలో జంపా మూడు వికెట్లు పడగొట్టగా.. హజ్రత్ లుక్మాన్, ఆకీఫ్ రజా తలా రెండు వికెట్లు సాధించారు. చదవండి: IPL 2023: భారీ సిక్సర్లతో విరుచుకుపడ్డ ధోని.. వీడియో వైరల్ -
86 పరుగులకే కుప్పకూలిన వైపర్స్.. 157 పరుగుల తేడాతో ముంబై విజయం
ఇంటర్నేషనల్ లీగ్‌లో భాగంగా ఆదివారం డెసర్ట్ వైపర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఎమిరేట్స్ ఏకంగా 157 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 241 పరుగుల భారీ లక్క్ష్యంతో బరిలోకి దిగిన డెసర్ట్ వైపర్స్.. ముంబై బౌలర్లు చెలరేగడంతో 84 పరుగులకే కుప్పకూలింది. ముంబై పేసర్ ఫజల్హక్ ఫారూఖీ మూడు వికెట్లు పడగొట్టి వైపర్స్ వెన్ను విరచగా.. తహీర్, జహూర్ ఖాన్ చెరో రెండు వికెట్లు, బౌల్ట్, బ్రావో, మౌస్లీ తలా వికెట్ సాధించారు. వైపర్స్ బ్యాటర్లలో టామ్ కుర్రాన్(12), మార్క్ వాట్(12) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచారు. చెలరేగిన వసీం, పొలార్డ్ ఇక టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఎమిరేట్స్ నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 241 పరుగులు చేసింది. ఎమిరేట్స్ బ్యాటర్లలో మహ్మద్ వసీం విధ్వంసం సృష్టించాడు. 44 బంతులు ఎదుర్కొన్న వసీం 11 ఫోర్లు, 4 సిక్స్‌లతో 86 పరుగులు చేశాడు. అతడితో పాటు ఫ్లెచర్(50), పొలార్డ్(50 నాటౌట్) రాణించారు. కాగా పొలార్డ్ తన అర్ధ సెంచరీని కేవలం 19 బంతుల్లోనే సాధించడం గమానార్హం. వైపర్స్ బౌలర్లలో టామ్ కుర్రాన్ రెండు వికెట్లు పడగొట్టాడు. చదవండి: పాండ్యాది చెత్త నిర్ణయం.. నంబర్ 1 బౌలర్ విషయంలో ఎందుకలా? హుడాను మాత్రం.. The moment Waseem decided to cut loose 🙌#MIEmirates #OneFamily #DVvMIEpic.twitter.com/4SJFdGdqrV — MI Emirates (@MIEmirates) January 29, 2023 -
అలెక్స్ హేల్స్ ఊచకోత.. పరుగు తేడాతో సెంచరీ మిస్
ఇంటర్నేషనల్ టీ20 లీగ్ (దుబాయ్) 2023లో ఇంగ్లండ్ విధ్వంసకర బ్యాటర్, డెసర్ట్ వైపర్స్ ఓపెనర్ అలెక్స్ హేల్స్ భీకర ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. లీగ్‌లో ఇప్పటివరకు ఆడిన 4 మ్యాచ్‌ల్లో 3 హాఫ్ సెంచరీలు, సెంచరీ సాయంతో 356 పరుగులు (33 ఫోర్లు, 15 సిక్సర్లు) చేసిన హేల్స్.. ఇవాళ (జనవరి 22) గల్ఫ్ జెయింట్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో 57 బంతుల్లో 10 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 99 పరుగులు చేసి కేవలం పరుగు తేడాతో లీగ్‌లో రెండో సెంచరీ చేసే అవకాశాన్ని కోల్పోయాడు. On 99 tried to hit a six and got out!@AlexHales1 🫡pic.twitter.com/6PDOPghAUl — CricTracker (@Cricketracker) January 22, 2023 హేల్స్ ఊచకోత ధాటికి తొలుత బ్యాటింగ్ చేసిన నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 195 పరుగుల భారీ స్కోర్ చేసింది. రోహన్ ముస్తఫా (16 బంతుల్లో 23; 3 ఫోర్లు, సిక్స్), కెప్టెన్ కొలిన్ మున్రో (23 బంతుల్లో 39; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), షెఫానీ రూథర్‌ఫోర్ట్ (15 బంతుల్లో 27 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) ఓ మోస్తరుగా రాణించారు. గల్ఫ్ జెయింట్స్ బౌలర్లలో రిచర్డ్ గ్లీసన్, లియామ్ డాసన్, డేవిడ్ వీస్, క్రిస్ జోర్డాన్ తలో వికెట్ పడగొట్టారు. Alex Hales at his best in the ILT20! His lowest score in the tournament so far is 64 🤯#AlexHales #England #DesertVipers #DPWorldILT20 #CricTracker pic.twitter.com/dENrWohDt7— CricTracker (@Cricketracker) January 22, 2023 అనంతరం 196 పరుగుల భారీ లక్ష్య ఛేదనకు దిగిన గల్ఫ్ టీమ్.. 3.3 ఓవర్ల తర్వాత 2 వికెట్లు కోల్పోయి 29 పరుగులు చేసి పోరాడుతుంది. ఓపెనర్లు టామ్ బాంటన్ (3), జేమ్స్ విన్స్ (4) విఫలమయ్యారు. క్రిస్ లిన్ (22), రెహాన్ అహ్మద్ క్రీజ్‌లో ఉన్నారు. బాంటన్ వికెట్ టామ్ కర్రన్ పడగొట్టగా.. విన్స్‌ను కాట్రెల్ క్లీన్ బౌల్డ్ చేశాడు. కాగా, తొట్ట తొలి ఇంటర్నేషనల్ టీ20 లీగ్‌లో అలెక్స్ హేల్స్ ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నాడు. లీగ్ తొలి మ్యాచ్‌లో షార్జా వారియర్స్‌పై 52 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 83 నాటౌట్ పరుగులు చేసిన హేల్స్.. ఆతర్వాత అబుదాబీ నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 47 బంతుల్లో 7 ఫోర్లు, సిక్స్ సాయంతో 64 పరుగులు, ఆ వెంటనే అబుదాబీ నైట్‌రైడర్స్‌తో జరిగిన మరో మ్యాచ్‌లో 59 బంతుల్లో 7 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 110 పరుగులు చేశాడు. తాజాగా గల్ఫ్ జెయింట్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లోనూ చెలరేగిన హేల్స్ పరుగు తేడాతో సెంచరీ చేసే అవకాశాన్ని చేజార్చుకున్నాడు. ఈ లీగ్‌లో తొలి సెంచరీ హేల్స్ పేరిటే నమోదై ఉంది. రెండో సెంచరీ ఇంగ్లండ్‌కే చెందిన టామ్ కోహ్లెర్ కాడ్మోర్ (షార్జా వారియర్స్) బాదాడు. దుబాయ్ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో టామ్ (షార్జా వారియర్స్) 47 బంతుల్లో 10 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 106 నాటౌట్ పరుగులు చేశాడు. -
రూట్ మెరుపు ఇన్నింగ్స్ వృధా.. శతక్కొట్టి గెలిపించిన ప్రత్యర్ధి బ్యాటర్
దుబాయ్ వేదికగా జరుగుతున్న ఇంటర్నేషనల్ టీ20 లీగ్‌లో వరుసగా రెండు రోజుల్లో రెండు సెంచరీలు నమోదయ్యాయి. నిన్న (జనవరి 20) అబుదాబీ నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో డెసర్ట్ వైపర్స్ ఓపెనర్ అలెక్స్ హేల్స్ (59 బంతుల్లో 110; 7 ఫోర్లు, 6 సిక్సర్లు) సెంచరీ బాదగా.. ఇవాళ (జనవరి 21) దుబాయ్ క్యాపిటల్స్‌పై షార్జా వారియర్స్ ఓపెనర్ టామ్ కోహ్లెర్ కాడ్మోర్ (47 బంతుల్లో 106 నాటౌట్; 10 ఫోర్లు, 6 సిక్సర్లు) విధ్వంసకర శతకంతో విరుచుకుపడ్డాడు. కాడ్మోర్ సుడిగాలి శతకంతో ఊగిపోవడంతో క్యాపిటల్స్ నిర్ధేశించిన 178 పరుగుల లక్ష్యాన్ని వారియర్స్ కేవలం 14.4 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి ఊదేసింది. ఫలితంగా 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. కాడ్మోర్, జో డెన్లీ (17 బంతుల్లో 29 నాటౌట్; 3 ఫోర్లు, సిక్స్) వారియర్స్‌ను విజయతీరాలకు చేర్చారు. క్యాపిటల్స్ బౌలర్లలో అకీఫ్ రజా 2 వికెట్లు పడగొట్టగా.. చమిక కరుణరత్నేకు ఓ వికెట్ దక్కింది. తొలుత బ్యాటింగ్ చేసిన క్యాపిటల్స్ జో రూట్ (54 బంతుల్లో 80 నాటౌట్; 8 ఫోర్లు, సిక్స్) మెరుపు అర్ధశతకంతో, లారెన్స్ (38 బంతుల్లో 34; 2 ఫోర్లు, సిక్స్), రోవమన్ పావెల్ (27 బంతుల్లో 44; 5 ఫోర్లు, సిక్స్) ఓ మోస్తరుగా రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసింది. వారియర్స్ బౌలర్లలో క్రిస్ వోక్స్, నవీన్ ఉల్ హాక్ తలో 2 వికెట్లు పడగొట్టారు. ఇదిలా ఉంటే, ఇంటర్నేషనల్ టీ20 లీగ్‌లో టామ్ కోహ్లెర్ కాడ్మోర్ బాదిన శతకం రెండోది కాగా, అంతకుముందు మ్యాచ్‌లో అలెక్స్ హేల్స్ చేసినది లీగ్‌లో తొట్టతొలి సెంచరీ కావడం విశేషం. -
భారత్‌లో వరల్డ్‌కప్.. మాకు మంచి ఛాన్స్.. టైటిల్ నిలబెట్టుకుంటాం!
ICC ODI World Cup 2023: ‘‘మా ముందున్న గొప్ప అవకాశం ఇది. వరల్డ్‌కప్ ట్రోఫీని తిరిగి దక్కించుకోవడానికి.. టైటిల్ నిలబెట్టుకోవడానికి మంచి ఛాన్స్ ముందుంది. ఇండియా పిచ్‌లపై అవగాహన, అక్కడ ఆడిన అనుభవం మా జట్టుకు పనికొస్తుంది’’ అని ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ జో రూట్ అన్నాడు. ఇంగ్లండ్ టెస్టు జట్టు సారథ్య బాధ్యతల నుంచి వైదొలిగిన రూట్ ప్రస్తుతం బ్యాటర్‌గా రాణిస్తున్న విషయం తెలిసిందే. కెప్టెన్సీ వదిలేసిన తర్వాత సంప్రదాయ క్రికెట్లో మరింత దూకుడుగా ఆడుతూ రికార్డులు సృష్టిస్తున్న అతడు.. పరిమిత ఓవర్ల క్రికెట్‌పై కూడా ప్రత్యేక దృష్టి సారించాడు. భారత్ వేదికగా ఈ ఏడాది జరుగనున్న వన్డే వరల్డ్‌కప్ జట్టులో చోటే లక్ష్యంగా తీవ్రంగా శ్రమిస్తున్నాడు. ప్రస్తుతం ఇంటర్నేషనల్ లీగ్ ట్వంటీ20లో దుబాయ్ క్యాపిటల్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న ఈ స్టార్ బ్యాటర్.. ప్రపంచకప్ సన్నాహకాలు, తమ జట్టు గెలుపు అవకాశాలపై కీలక వ్యాఖ్యలు చేశాడు. మాకే అవకాశాలు ఎక్కువ.. అయితే.. పీటీఐతో రూట్ మాట్లాడుతూ.. ‘‘ఈ టీ20 లీగ్ ద్వారా సరికొత్త విషయాలు నేర్చుకుంటున్నా. పరిమిత ఓవర్ల క్రికెట్లో నాకు ఇదో కొత్త అనుభూతి. బ్యాటర్‌గా మరింత మెరుగుపడటానికి, రాటుదేలడానికి ఇదెంత వరకు ఉపయోగ పడుతుందో చూడాలి. ఈ ఏడాది చివర్లో ఇండియాలో వరల్డ్‌కప్ ఆడాల్సి ఉంది. ప్రపంచకప్ జట్టులో చోటు దక్కించుకోవాలంటే కఠినంగా శ్రమించకతప్పదు. మా జట్టు టైటిల్‌ను నిలబెట్టుకునే సువర్ణావకాశం ముందుంది. ఇండియాలో చాన్నాళ్లుగా మావాళ్లు ఆడుతున్నారు. అక్కడి పిచ్‌లపై మా జట్టులోని దాదాపు అందరు ఆటగాళ్లకు మంచి అవగాహన ఉంది. అయితే, స్పిన్‌ను ఎంత ప్రభావంతంగా ఎదుర్కోగలమన్న అంశం మీదే మా గెలుపు అవకాశాలు ఆధారపడి ఉంటాయి. అదే విధంగా వరల్డ్‌కప్ నాటికి 50 ఓవర్ల ఫార్మాట్లో ఎంత నిలకడగా ఆడతామనేది కూడా ప్రభావం చూపుతుంది’’ అని చెప్పుకొచ్చాడు. అప్పుడు కేవలం 7 పరుగులే కాగా ఐపీఎల్ కారణంగా ఇంగ్లండ్‌తో పాటు ఇతర విదేశీ ఆటగాళ్లకు కూడా భారత్‌లో ఆడిన అనుభవం ఈ మేజర్ టోర్నీలో ఉపయోగపడనుంది. ఇక సొంతగడ్డపై 2019లో న్యూజిలాండ్‌తో ఫైనల్లో తలపడిన ఇంగ్లండ్ వరల్డ్‌కప్ ట్రోఫీని ముద్దాడిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో ఆల్‌రౌండర్ బెన్‌స్టోక్స్ 84 పరుగులతో ఆఖరి వరకు అజేయంగా నిలిచి జట్టును గెలుపుబాట పట్టించాడు. ఇక ఈ మ్యాచ్‌లో జో రూట్ 30 బంతులు ఎదుర్కొని కేవలం 7 పరుగులు మాత్రమే చేయగలిగాడు. -
వరుస మెరుపు ఇన్నింగ్స్‌లతో రెచ్చిపోతున్న రాబిన్ ఉతప్ప
ఇంటర్నేషనల్ లీగ్ టీ20, 2023 (దుబాయ్) సీజన్లో టీమిండియా మాజీ క్రికెటర్, దుబాయ్ క్యాపిటల్స్ ఓపెనర్ రాబిన్ ఉతప్ప వరుస మెరుపు ఇన్నింగ్స్‌లతో రెచ్చిపోతున్నాడు. అబుదాబీ నైట్‌రైడర్స్‌తో జరిగిన సీజన్ తొలి మ్యాచ్‌లో 33 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 43 పరుగులు చేసిన రాబీ.. ఇవాళ (జనవరి 16) గల్ఫ్ జెయింట్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో 46 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో ఏకంగా 79 పరుగులు చేశాడు. ఫలితంగా అతను ప్రాతినిధ్యం వహిస్తున్న దుబాయ్ క్యాపిటల్స్ టీమ్ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 182 పరుగుల భారీ స్కోర్ చేసింది. A brilliant innings by @robbieuthappa some sensational shots on display pic.twitter.com/E15dDxGVef— International League T20 (@ILT20Official) January 16, 2023 దుబాయ్ ఇన్నింగ్స్‌లో కెప్టెన్ రోవమన్ పావెల్ (25 బంతుల్లో 38; ఫోర్, 3 సిక్సర్లు), సికందర్ రజా (19 బంతుల్లో 30 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) ఓ మోస్తరుగా రాణించగా.. జో రూట్ (6), భానుక రాజపక్స (3), దసున్ షనక (2), రవి బొపారా (2), ఇసురు ఉడాన (2) నిరాశపరిచారు. ఆఖర్లో హజ్రత్ లుక్మాన్ (3 బంతుల్లో 10) వరుస బంతుల్లో ఫోర్, సిక్సర్ బాదడంతో క్యాపిటల్స్ జట్టు 180 పరుగుల మార్కును దాటింది. గల్ప్ జెయింట్స్ బౌలర్లలో రెహాన్ అహ్మద్ 3 వికెట్లు పడగొట్టగా.. రిచర్డ్ గ్లీసన్ 2, సంచిత్ శర్మ, డేవిడ్ వీస్ తలో వికెట్ దక్కించుకున్నారు. కాగా, ఈ సీజన్లో రాబిన్ ఉతప్ప ప్రాతినిధ్యం వహిస్తున్న దుబాయ్ క్యాపిటల్స్ టీమ్ అద్భుతమ ప్రదర్శనతో ముందుకెళ్తుంది. తొలి మ్యాచ్‌లో అబుదాబీ నైట్‌రైడర్స్‌ను 73 పరుగుల భారీ తేడాతో మట్టికరిపించిన ఈ జట్టు.. తాజాగా గల్ఫ్ జెయింట్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లోనూ భారీ స్కోర్ సాధించి, మరో విజయానికి బాటలు వేసుకుంది. -
దుబాయ్ ప్రీమియర్ లీగ్ మొదలైంది.. తొలి మ్యాచ్‌లోనే నైట్ రైడర్స్‌కు షాక్
ఐపీఎల్ (ఇండియన్ ప్రీమియర్ లీగ్), బీబీఎల్ (బిగ్‌బాష్ లీగ్, ఆస్ట్రేలియా), బీపీఎల్ (బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్), పీఎస్ఎల్ (పాకిస్తాన్ సూపర్ లీగ్), ఎస్ఏ 20 (సౌతాఫ్రికా టీ20 లీగ్) తరహాలోనే యూఏఈ వేదికగా మరో టీ20 లీగ్ ప్రారంభమైంది. అంతర్జాతీయ స్టార్లతో నిండిన ఈ లీగ్‌కు ఇంటర్నేషనల్ లీగ్ టీ20 (ఐఎల్ టీ20)గా నామకరణం చేశారు. ప్రస్తుతం జరుగుతున్న సౌతాఫ్రికా టీ20 లీగ్ తరహాలోనే ఈ లీగ్‌లోనూ 6 జట్లు పోటీపడుతున్నాయి. One for the history books 📖@Dubai_Capitals WIN THE FIRST #DPWorldILT20 GAME 👏 #ALeagueApart #DCvADKR pic.twitter.com/l4Z5GXPVxr — International League T20 (@ILT20Official) January 13, 2023 నిన్న (జనవరి 13) జరిగిన లీగ్ ఇనాగురల్ మ్యాచ్‌లో దుబాయ్ క్యాపిటల్స్, అబుదాబీ నైట్ రైడర్స్ జట్లు తలపడగా.. దుబాయ్ క్యాపిటల్స్ 73 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన క్యాపిటల్స్.. రాబిన్ ఉతప్ప (33 బంతుల్లో 43; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), కెప్టెన్ రోవమన్ పావెల్ (29 బంతుల్లో 48; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది. జో రూట్ (21 బంతుల్లో 26; 2 ఫోర్లు, 2 సిక్సర్లు), సికందర్ రజా (17 బంతుల్లో 26; ఫోర్, 2 సిక్సర్లు) పర్వాలేదనిపించగా.. భానుక రాజపక్స (9), యూసప్ పఠాన్ (6) విఫలమయ్యారు. రవి బొపారా (4 బంతుల్లో 12 నాటౌట్; ఫోర్, సిక్స్), ఇసురు ఉడాన (3 బంతుల్లో 11 నాటౌట్; ఫోర్, సిక్స్) ఆఖర్లో మెరుపులు మెరిపించారు. నైట్ రైడర్స్ బౌలర్లలో రవి రాంపాల్, అలీ ఖాన్ తలో 2 వికెట్లు పడగొట్టగా.. ఆండ్రీ రసెల్, సునీల్ నరైన్ చెరో వికెట్ దక్కించుకున్నారు. అనంతరం 189 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన నైట్ రైడర్స్.. రజా అకీఫుల్లా ఖాన్ (2/20), ముజీబ్ ఉర్ రెహ్మాన్ (2/16), రోవమన్ పావెల్ (2/15), ఇసురు ఉడాన (1/14), హజ్రత్ లుక్మా్న్ (1/27), సికందర్ రజా (1/17) ధాటికి నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి కేవలం 114 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఓపెనర్ పాల్ స్టిర్లింగ్ (38 బంతుల్లో 54; 5 ఫోర్లు, 2 సిక్సర్లు), ఆండ్రీ రసెల్ (12 బంతుల్లో 12; ఫోర్) మాత్రమే రెండంకెల స్కోర్ చేయగా.. కొలిన్ ఇంగ్రామ్ (1), బ్రాండన్ కింగ్ (8), జవార్ ఫరీద్ (9), సునీల్ నరైన్ (4), కాన్నర్ (3), అకీల్ హొస్సేన్ (3), ఫహాద్ నవాజ్ (1) దారుణంగా విఫలమయ్యారు. రవి రాంపాల్ (6), అలీ ఖాన్ (6) అజేయంగా నిలిచారు. లీగ్‌లో తదుపరి మ్యాచ్‌లో ఇవాళ (జనవరి 14) ముంబై ఎమిరేట్స్ (ముంబై ఇండియన్స్ యాజమాన్యం), షార్జా వారియర్స్ (క్యాప్రి గ్లోబల్) జట్లు తలపడనున్నాయి. About time you plan your schedule as ours is all set. 34 action packed matches from 13th Jan 2023 💥 Teams are ready to duel for the glorious ILT20 trophy. Catch all the action live with @ilt20onzee Check out the #ILT20 schedule.#ALeagueApart pic.twitter.com/dVINE7FIEu — International League T20 (@ILT20Official) November 29, 2022 ఐఎల్ టీ20 లీగ్‌కు సంబంధించిన పూర్తి వివరాలు.. షెడ్యూల్.. జనవరి 13 నుంచి మొదలయ్యే ఈ లీగ్ ఫిబ్రవరి 12న జరిగే ఫైనల్‌తో ముగుస్తుంది. 6 జట్లు పాల్గొనే ఈ లీగ్‌లో మొత్తం 34 మ్యాచ్‌లు జరుగుతాయి. Ready to conquer! 🏆 The captains and the trophy, a glimpse of the final destination before the tournament begins 🤩 #DPWorldILT20 #ALeagueApart pic.twitter.com/IC88z9Qu59 — International League T20 (@ILT20Official) January 12, 2023 ఎలా చూడాలి.. ఐఎల్ టీ20 లీగ్‌ను జీ నెట్‌వర్క్స్‌లోని 10 ఛానల్లలో ఇంగ్లీష్, హిందీ, తమిళ భాషల్లో వీక్షించవచ్చు. జీ సినిమా (ఎస్డీ, హెచ్డీ), జీ అన్మోల్ సినిమా, జీ తిరాయ్, జీ బంగ్లా సినిమా, జీ జస్ట్ (ఎస్డీ, హెచ్డీ), పిక్చర్స్ హెచ్డీ, ఫ్లిక్స్ (ఎస్డీ, హెచ్డీ) ఛానల్‌లతో పాటు ఇదే సంస్థకు చెందిన ఓటీటీ ఫ్లాట్ ఫామ్ జీ5లో చూడవచ్చు. The BIGGEST movie star in the world meets the BIGGEST T20 League 🤩 2023 will indeed start with a BANG because @iamsrk has joined #ALeagueApart 🔥 Book your tickets now; https://t.co/MXQYHlHN5j#DPWorldILT20 #SRK #ShahRukhKhan pic.twitter.com/fXUP0P6XaV — International League T20 (@ILT20Official) January 7, 2023 టీమ్స్, ఓనర్స్ .. ఎంఐ ఎమిరేట్స్ (ముంబై ఇండియన్స్) అబుదాబి నైట్ రైడర్స్ (కోల్‌కతా నైట్ రైడర్స్) డెసర్ట్ వైపర్స్ (గ్లేజర్ ఫ్యామిలీ) దుబాయ్ క్యాపిటల్స్ (ఢిల్లీ క్యాపిటల్స్) గల్ఫ్ జెయింట్స్ (అదానీ గ్రూప్) షార్జా వారియర్స్ (క్యాప్రి గ్లోబల్) కెప్టెన్లు.. ఎంఐ ఎమిరేట్స్ - కీరన్ పొలార్డ్/ డ్వేన్ బ్రావో అబుదాబి నైట్ రైడర్స్ - సునీల్ నరైన్ డెసర్ట్ వైపర్స్ - కొలిన్ మున్రో దుబాయ్ క్యాపిటల్స్ - రొవమన్ పావెల్ గల్ఫ్ జెయింట్స్ - జేమ్స్ విన్స్ షార్జా వారియర్స్ - మొయిన్ అలీ లీగ్‌లో పాల్గొనే కీలక ఆటగాళ్లు.. సునీల్ నరైన్, కీరన్ పొలార్డ్, డ్వేన్ బ్రావో, రోవమన్ పావెల్, షిమ్రోన్ హెట్మెయర్, ఆండ్రీ రసెల్, పాల్ స్టిర్లింగ్, మొయిన్ అలీ, సికందర్ రజా, రాబిన్ ఉతప్ప, యూసఫ్‌పఠాన్, ముజీబ్ ఉర్ రెహ్మాన్, జో రూట్, క్రిస్ జోర్డాన్, జేమ్స్ విన్స్, దసున్ షనక, వనిందు హసరంగ, ట్రెంట్ బౌల్ట్ తదితరులు