ఇంటర్నేషనల్ లీగ్ టీ20, 2023 (దుబాయ్) సీజన్‌లో టీమిండియా మాజీ క్రికెటర్, దుబాయ్ క్యాపిటల్స్ ఓపెనర్ రాబిన్ ఉతప్ప వరుస మెరుపు ఇన్నింగ్స్‌లతో రెచ్చిపోతున్నాడు. అబుదాబీ నైట్‌రైడర్స్‌తో జరిగిన సీజన్ తొలి మ్యాచ్‌లో 33 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 43 పరుగులు చేసిన రాబీ.. ఇవాళ (జనవరి 16) గల్ఫ్ జెయింట్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో 46 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో ఏకంగా 79 పరుగులు చేశాడు. ఫలితంగా అతను ప్రాతినిధ్యం వహిస్తున్న దుబాయ్ క్యాపిటల్స్ టీమ్ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 182 పరుగుల భారీ స్కోర్ చేసింది.
A brilliant innings by @robbieuthappa some sensational shots on display pic.twitter.com/E15dDxGVef
— International League T20 (@ILT20Official) January 16, 2023
దుబాయ్ ఇన్నింగ్స్‌లో కెప్టెన్ రోవమన్ పావెల్ (25 బంతుల్లో 38; ఫోర్, 3 సిక్సర్లు), సికందర్ రజా (19 బంతుల్లో 30 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) ఓ మోస్తరుగా రాణించగా.. జో రూట్ (6), భానుక రాజపక్స (3), దసున్ షనక (2), రవి బొపారా (2), ఇసురు ఉడాన (2) నిరాశపరిచారు. ఆఖర్లో హజ్రత్ లుక్మాన్ (3 బంతుల్లో 10) వరుస బంతుల్లో ఫోర్, సిక్సర్ బాదడంతో క్యాపిటల్స్ జట్టు 180 పరుగుల మార్కును దాటింది. గల్ప్ జెయింట్స్ బౌలర్లలో రెహాన్ అహ్మద్ 3 వికెట్లు పడగొట్టగా.. రిచర్డ్ గ్లీసన్ 2, సంచిత్ శర్మ, డేవిడ్ వీస్ తలో వికెట్ దక్కించుకున్నారు.
కాగా, ఈ సీజన్‌లో రాబిన్ ఉతప్ప ప్రాతినిధ్యం వహిస్తున్న దుబాయ్ క్యాపిటల్స్ టీమ్ అద్భుతమ ప్రదర్శనతో ముందుకెళ్తుంది. తొలి మ్యాచ్‌లో అబుదాబీ నైట్‌రైడర్స్‌ను 73 పరుగుల భారీ తేడాతో మట్టికరిపించిన ఈ జట్టు.. తాజాగా గల్ఫ్ జెయింట్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లోనూ భారీ స్కోర్ సాధించి, మరో విజయానికి బాటలు వేసుకుంది.
Comments
Please login to add a commentAdd a comment