breaking news
team india
-
ధర్మశాలలో దుమ్మురేపేనా!
ధర్మశాల: సొంతగడ్డపై భారత క్రికెట్ జట్టు మరో పోరుకు సిద్ధమైంది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఆదివారం దక్షిణాఫ్రికాతో టీమిండియా మూడో టి20 ఆడనుంది. గత రెండు మ్యాచ్‌ల్లో ఇరు జట్లు చెరొకటి గెలవడంతో సిరీస్ 1–1తో సమం కాగా... ఇప్పుడు పైచేయి సాధించేందుకు సూర్యకుమార్ బృందం రెడీ అవుతోంది. తొలి మ్యాచ్‌లో ఓ మాదిరి లక్ష్యాన్ని కాపాడుకున్న టీమిండియా... రెండో టి20లో భారీ లక్ష్యఛేదనలో కనీస ప్రతిఘటన చూపకుండానే పరాజయం పాలైంది. వచ్చే ఏడాది ఆరంభంలో ఐసీసీ టి20 ప్రపంచకప్ జరగనుండగా... దానికి ముందు భారత జట్టు మరో 8 మ్యాచ్‌లు మాత్రమే ఆడనుంది. వీటిలో ప్రదర్శన ఆధారంగా వరల్డ్‌కప్‌నకు జట్టును ఎంపిక చేయాలని మేనేజ్మెంట్ భావిస్తోంది. ఈ నేపథ్యంలో జట్టు కూర్పు, బ్యాటింగ్ ఆర్డర్లో మార్పు చేర్పులను పరిశీలించుకునేందుకు ఈ మ్యాచ్ ఉపయోగపడనుంది. ముఖ్యంగా టి20 ఫార్మాట్లో పెద్దగా ఆకట్టుకోలేకపోతున్న శుబ్‌మన్ గిల్‌పై అందరి దృష్టి నిలవనుంది. ఇక కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కూడా స్థాయికి తగ్గ ప్రదర్శన చేయడం లేదు. వీరిద్దరు రాణించాల్సిన అవసరముంది. మరోవైపు గత మ్యాచ్‌లో విజయం సాధించిన దక్షిణాఫ్రికా రెట్టించిన ఆత్మవిశ్వాసంతో ధర్మశాలలో అడుగుపెట్టనుంది. ఇక్కటి చల్లటి వాతావరణం, పేస్, బౌన్స్‌కు అనుకూలించే పిచ్ సఫారీలకు మరింత సహాయపడనుంది. గిల్ రాణించేనా..! టెస్టు, వన్డే ఫార్మాట్లలో భారత జట్టుకు కెప్టెన్ గా వ్యవహరిస్తున్న శుబ్‌మన్ గిల్... టి20ల్లో మాత్రం అదే జోరు కనబర్చలేకపోతున్నాడు. తొలి బంతి నుంచే దూకుడు కనబర్చాల్సిన ఈ ఫార్మాట్లో గిల్ ఆ స్థాయిలో రాణించలేకపోతున్నాడు. ప్రస్తుతం టి20ల్లో వైస్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న గిల్ మిగిలిన మూడు మ్యాచ్‌ల్లోనూ ఇదే తరహా ఆటతీరు కనబరిస్తే... టీమ్ మేనేజ్మెంట్కు వ్యూహం మార్చాల్సి రావచ్చు. గతేడాది జరిగిన టి20 ప్రపంచకప్‌లో రోహిత్, కోహ్లి ఓపెనర్లుగా బరిలోకి దిగగా... ఈ ఇద్దరి రిటైర్మెంట్ అనంతరం అభిషేక్ శర్మ, సంజూ సామ్సన్ ఎక్కువ మ్యాచ్‌ల్లో ఇన్నింగ్స్‌ను ఆరంభించారు. అయితే దీర్ఘకాలిక ప్రణాళికల్లో భాగంగా సామ్సన్ను బెంచ్‌కు పరిమితం చేసిన మేనేజ్మెంట్... గిల్‌కు విరివిగా అవకాశాలు ఇస్తోంది. కానీ వాటిని వినియోగించుకోవడంలో మాత్రం అతడు విఫలమవుతున్నాడు. గత రెండు మ్యాచ్‌ల్లోనూ గిల్ పేలవంగా వికెట్ పారేసుకున్నాడు. ఇక మూడో స్థానంలో అక్షర్ పటేల్ బ్యాటింగ్‌కు దిగడంపై కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అత్యుత్తమ ఆటగాళ్లను డగౌట్లో కూర్చోబెట్టి అక్షర్‌కు బ్యాటింగ్ ఆర్డర్లో ప్రమోషన్ ఇవ్వాల్సిన అవసరం ఏంటో కోచ్ గంభీర్‌కే తెలియాలి. అడపాదడపా షాట్లు ఆడటం తప్ప నిలకడగా ఇన్నింగ్స్‌ను నిర్మించలేకపోతున్న అక్షర్ వల్ల ఇతర ఆటగాళ్లు కూడా ఇబ్బంది పడుతున్నారు. సారథి సూర్యకుమార్ యాదవ్ ఈ ఏడాది ఫామ్‌లేమితో ఇబ్బంది పడుతున్నాడు. అభిషేక్ మెరుపుల మధ్య సూర్య వైఫల్యం బయటకు కనిపించడం లేదు కానీ... అతడు చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడి చాన్నాళ్లైంది. తిలక్ వర్మ నిలకడగా రాణిస్తున్నా... అతడికి సహకారం కరువైంది. హార్దిక్ పాండ్యా, జితేశ్ శర్మ, శివమ్ దూబే ఇలా స్టార్లకు కొదవ లేకపోయినా... వీరంతా సమష్టిగా రాణించాల్సిన అవసరముంది. గత మ్యాచ్‌లో దూబేను ఎనిమిదో స్థానంలో బరిలోకి దింపడంపై కూడా అనేక విమర్శలు వ్యక్తమయ్యాయి. మరి ఈ నేపథ్యంలో బ్యాటింగ్ ఆర్డర్లో మార్పులు చేస్తారా లేక గంభీర్ తన మొండి పట్టుదలను కొనసాగిస్తాడా చూడాలి. స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ప్రభావం చూపలేకపోవడం బౌలింగ్‌లో ప్రధాన సమస్యగా మారింది. గత మ్యాచ్‌లో అనామక బ్యాటర్ సైతం బుమ్రా బౌలింగ్‌లో భారీ సిక్స్‌లు కొట్టడం అభిమానులకు ఇబ్బంది కలిగించింది. మరోవైపు అర్ష్ దీప్ నియంత్రణ కోల్పోతుండటం జట్టుకు మరింత భారం అవుతోంది. వరుణ్ చక్రవర్తి ఫర్వాలేదనిపిస్తుండగా... కుల్దీప్ యాదవ్‌కు తుది జట్టులో చోటు దక్కుతుందా చూడాలి. పటిష్టంగా దక్షిణాఫ్రికా... సుదీర్ఘ పర్యాటనలో భాగంగా టెస్టు సిరీస్ ‘క్లీన్ స్వీప్’ చేసిన దక్షిణాఫ్రికా... ఆ తర్వాత వన్డే సిరీస్‌లో పరాజయం పాలైంది. ఇప్పుడిక చివరగా జరుగుతున్న టి20 సిరీస్‌లో 1–1తో సమంగా ఉంది. ఈ టూర్లో తమ ప్రదర్శనతో ఆకట్టుకున్న సఫారీలు ఈ మ్యాచ్‌లో నెగ్గి సిరీస్‌లో పైచేయి సాధించాలని కృతనిశ్చయంతో ఉన్నారు. గత మ్యాచ్‌లో చక్కటి ఇన్నింగ్స్‌తో డికాక్ తన దమ్మేంటో చూపగా... కెప్టెన్ మార్క్రమ్, హెండ్రిక్స్, బ్రేవిస్, మిల్లర్, ఫెరీరా, లిండె, యాన్సెన్‌తో ఆ జట్టు బ్యాటింగ్ లైనప్ పటిష్టంగా కనిపిస్తోంది. మెరుగైన ఆరంభం లభిస్తే చాలు... క్రీజులోకి వచ్చిన ప్రతి ఒక్కరూ భారీ షాట్లు ఆడగల సమర్థులే కావడం దక్షిణాఫ్రికా జట్టుకు కలిసి రానుంది. ఇక బౌలింగ్‌లో యాన్సెన్ భారత జట్టుకు సింహస్వప్పంలా మారగా... ఎన్గిడి, సిపామ్లా, బార్ట్‌మన్ సమష్టిగా కదంతొక్కుతున్నారు. పిచ్ పేసర్లకు సహకరించే అవకాశం ఉన్న నేపథ్యంలో... సఫారీ బౌలర్లను ఎదుర్కోవడం భారత జట్టుకు కష్టసాధ్యమైన పనే. అభిషేక్ శర్మ ఆరంభంలోనే చెలరేగి వారి లయను దెబ్బతీయకపోతే... ఆ తర్వాత వచ్చే బ్యాటర్లపై దక్షిణాఫ్రికా బౌలర్లు సులువుగా ఒత్తిడి పెంచగలరు.పిచ్, వాతావరణం హిమాలయ పర్వత సానువుల్లో జరగనున్న ఈ మ్యాచ్‌లో చలి తీవ్రత అధికంగా ఉండనుంది. ఇక్కడ జరిగిన ఐదు మ్యాచ్‌ల్లో నాలుగింట చేజింగ్ జట్లు గెలుపొందాయి. మంచు ప్రభావంతో రెండో ఇన్నింగ్స్‌లో బంతిపై బౌలర్లకు పట్టుచిక్కడం కష్టం. పిచ్ పేసర్లకు సహకరించనుంది. తుది జట్లు (అంచనా) భారత్: సూర్యకుమార్ (కెప్టెన్), అభిషేక్, గిల్, తిలక్ వర్మ, జితేశ్ శర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, అర్ష్ దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా. దక్షిణాఫ్రికా: మార్క్రమ్ (కెప్టెన్), డికాక్, స్టబ్స్/హెండ్రిక్స్, బ్రేవిస్, మిల్లర్, డొనొవాన్ ఫెరీరా, యాన్సెన్, లిండె, ఎన్గిడి, బార్ట్‌మన్, నోర్జే/సిపామ్లా. -
భారత్‌కు పదో స్థానం
సాంటియాగో (చిలీ): మహిళల జూనియర్ ప్రపంచకప్ హాకీ టోర్నమెంట్లో భారత జట్టు పదో స్థానంతో ముగించింది. శుక్రవారం జరిగిన వర్గీకరణ మ్యాచ్‌లో జ్యోతి సింగ్ సారథ్యంలోని భారత జట్టు 1–2 గోల్స్ తేడాతో స్పెయిన్ చేతిలో పరాజయం పాలైంది. భారత్ తరఫున కనిక సివాచ్ (41వ నిమిషంలో) ఏకైక గోల్ సాధించగా... స్పెయిన్ తరఫున నటాలియా విలనోవా (16వ నిమిషంలో), ఎస్తెర్ కనాలెస్ (36వ నిమిషంలో) చెరో గోల్ కొట్టారు. మ్యాచ్ తొలి క్వార్టర్లో ఇరు జట్ల ప్లేయర్లు హోరాహోరీగా పోరాడినా... ఒక్క గోల్ కూడా నమోదు కాలేదు. రెండో క్వార్టర్ ఆరంభంలోనే నటాలియా గోల్ చేయడంతో స్పెయిన్ జట్టు ఆధిక్యంలోకి వెళ్లింది. భారత జట్టు నుంచి కొన్ని చక్కటి ప్రయత్నాలు కనిపించినా... ఫినిషింగ్ లోపం కారణంగా అవి గోల్స్‌గా మారలేకపోయాయి. మూడో క్వార్టర్లో సోనమ్ చక్కటి గోల్ సాధించినా... స్పెయిన్ వీడియో రిఫరల్ ద్వారా ఆ గోల్ నిబంధనలకు విరుద్ధమని తేల్చింది. ఈ క్రమంలోనే స్పెయిన్ మరో గోల్‌తో ఆధిక్యాన్ని మరింత పెంచుకోగా... కాసేపటికి కనిక పెనాల్టీ కార్నర్‌ను గోల్‌గా మలిచి భారత్ ఖాతా తెరిచింది. ఇక ఆఖరి క్వార్టర్లో స్పెయిన్ ఆధిక్యాన్ని కాపాడుకోగా... భారత జట్టు మరో గోల్ సాధించలేక ఓటమి వైపు నిలిచింది. -
వాళ్లకు చెడు అలవాట్లు.. నా భర్త ఎలాంటివాడంటే: జడేజా భార్య
టీమిండియా ఆల్ ఫార్మాట్ ఆల్‌రౌండర్‌గా తన కంటూ ప్రత్యేక గుర్తింపు దక్కించుకున్నాడు రవీంద్ర జడేజా. టీ20 ప్రపంచకప్-2024లో భారత్ చాంపియన్‌గా నిలిచిన తర్వాత అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన జడ్డూ.. ప్రస్తుతం వన్డే, టెస్టుల్లో కొనసాగుతున్నాడు.స్వదేశంలో సౌతాఫ్రికాతో టెస్టు, వన్డే సిరీస్ (IND vs SA)లు ముగించుకున్న జడేజా ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఇదిలా ఉంటే.. జడ్డూ భార్య, గుజరాత్ మంత్రి రివాబా సోలంకి (Rivaba) తన భర్తను ప్రశంసించే క్రమంలో టీమిండియాను ఉద్దేశించి ఆమె చేసిన కామెంట్స్ వైరల్‌గా మారాయి.ఇంటికి దూరంగా ఉన్నా క్రికెటర్‌గా ఉన్న తన భర్త విదేశాలకు వెళ్లడం సహజమని.. అయితే, జట్టులోని మిగతా అందరిలా తన భర్త కాదని తెలిపారు. ఎక్కడున్నా నైతిక విలువలు కోల్పోడంటూ రివాబా వ్యాఖ్యానించారు. ఆయనకు ఎలాంటి చెడు అలవాట్లు లేవని.. పన్నెండు ఏళ్లు ఇంటికి దూరంగా ఉన్నా తన వ్యక్తిత్వాన్ని కోల్పోలేదని చెప్పుకొచ్చారు.ద్వారకలోని ఓ కార్యక్రమంలో పాల్గొన్న రివాబా తన భర్త రవీంద్ర జడేజా (Ravindra Jadeja) గురించి ప్రస్తావిస్తూ.. ‘‘నా భర్త.. క్రికెటర్ రవీంద్ర జడేజా.. లండన్, దుబాయ్, ఆస్ట్రేలియా అంటూ ఆట నిమిత్తం వివిధ దేశాలు తిరగాల్సి వస్తుంది. అయినప్పటికీ ఆయన ఎలాంటి చెడు వ్యసనాలకు ఆకర్షితుడు కాలేదు.వాళ్లు ఎన్నో దుర్గుణాలు కలిగి ఉంటారుఆయనకు తన బాధ్యతలు ఏమిటో తెలుసు. కానీ మిగతా జట్టంతా అలా కాదు. వాళ్లు ఎన్నో దుర్గుణాలు కలిగి ఉంటారు. అయినా వారిపై ఎవరూ ఎలాంటి ఆంక్షలు విధించలేరు’’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.అదే విధంగా.. ‘‘నా భర్త పన్నెండు ఏళ్లు ఇంటికి దూరంగా ఉండాల్సి వచ్చింది. కావాలంటే ఆయన ఎలాంటి చెడ్డ పనైనా చేసి ఉండవచ్చు. కానీ నైతిక విలువలు అంటే ఏమిటో ఆయనకు బాగా తెలుసు’’ అంటూ జడ్డూపై రివాబా ప్రశంసలు కురిపించారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌కాగా.. రివాబా వ్యాఖ్యలపై భిన్నాభిప్రాయలు వ్యక్తమవుతున్నాయి.భర్తను మెచ్చుకోవడంలో తప్పు లేదు.. కానీతన భర్తను మెచ్చుకోవడంలో తప్పు లేదని.. అయితే, అందుకోసం మిగతా అందరి ఆటగాళ్ల వ్యక్తిత్వాలను కించపరచడం సరికాదని టీమిండియా అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మంత్రిగా బాధ్యతాయుత పదవిలో ఉన్న వారు ఇలాంటి నిరాధార ఆరోపణలు చేయడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.కాగా సాధారణ కుటుంబం నుంచి వచ్చిన జడేజా క్రికెటర్‌గా అత్యుత్తమ స్థాయికి ఎదగడంలో అతడి తల్లి పాత్ర కీలకం. ఈ విషయాన్ని జడ్డూనే స్వయంగా అనేక సందర్భాల్లో చెప్పాడు. ఇక తన అక్క కూడా తన విజయానికి బాటలు వేసిన వారిలో ఒకరని గతంలో ప్రశంసించాడు.కుటుంబంలో విభేదాలు?ఇదిలా ఉంటే.. జడ్డూ తండ్రి, అక్క కాంగ్రెస్ పార్టీలో ఉండగా.. భార్య రివాబా బీజేపీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య మాటల యుద్ధం జరిగింది. రివాబా వచ్చిన తర్వాత జడ్డూ తమను పూర్తిగా దూరం పెట్టాడని అతడి తండ్రి ఆరోపించగా.. జడ్డూ మాత్రం భార్యకు మద్దతు తెలిపాడు.ఒకవైపు మాటలు మాత్రమే విని ఇంటర్వ్యూ చేయడం సరికాదని.. తన భార్యను తప్పుబట్టే విధంగా వ్యవహరిస్తే ఎవరినీ సహించబోనని మీడియాకు వార్నింగ్ ఇచ్చాడు జడ్డూ. కాగా జడేజా అక్కకు రివాబా స్నేహితురాలు. ఈ క్రమంలోనే జడ్డూ- రివాబాలకు ఏర్పడిన పరిచయం ప్రేమగా మారి పెళ్లికి బాటలు వేసింది. వీరికి కుమార్తె నిధ్యానా ఉంది.చదవండి: దురభిమానం.. నైతిక విలువలు పాతరేస్తున్నారు"मेरे पति (रवींद्र जडेजा , क्रिकेटर)को लंदन , दुबई, ऑस्ट्रेलिया जैसे अनेकों देशों में खेलने के लिए जाना होता है फिर भी आज दिन तक उन्होंने कभी व्यसन नहीं किया क्योंकि वो अपनी जवाबदारी को समझते हैं @Rivaba4BJP जी , शिक्षा मंत्री गुजरात सरकार #Rivabajadeja #ravindrajadeja pic.twitter.com/OyuiPFPvVa— राणसिंह राजपुरोहित (@ransinghBJP) December 10, 2025 -
డికాక్ విధ్వంసం.. రెండో టీ20లో టీమిండియా చిత్తు
ముల్లాన్‌పూర్ వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన రెండో టీ20లో టీమిండియా 51 పరుగుల తేడాతో ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది. తద్వారా ఐదు మ్యాచ్‌ల సిరీస్ 1-1తో సమమైంది. తొలి టీ20లో టీమిండియా గెలిచిన విషయం తెలిసిందే.రెండో టీ20లో తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 213 పరుగులు చేసింది. క్వింటన్ డికాక్ (46 బంతుల్లో 90; 5 ఫోర్లు, 7 సిక్సర్లు) విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. ఆఖర్లో డొనోవన్ ఫెరియెరా (16 బంతుల్లో 30 నాటౌట్; ఫోర్, 3 సిక్సర్లు), డేవిడ్ మిల్లర్ (12 బంతుల్లో 20 నాటౌట్; 2 ఫోర్లు, సిక్స్) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడారు.సౌతాఫ్రికా ఇన్నింగ్స్‌లో రీజా హెండ్రిక్స్ 8, కెప్టెన్ మార్క్రమ్ 29, బ్రెవిస్ 14 పరుగులకు ఔటయ్యారు. భారత బౌలర్లలో వరుణ్ చక్రవర్తి 2, అక్షర్ పటేల్ ఓ వికెట్ తీశారు.అనంతరం భారీ లక్ష్య ఛేదనలో టీమిండియా ఆది నుంచి తడబడింది. సఫారీ బౌలర్లు తలో చేయి వేయడంతో 19.1 ఓవర్లలో 162 పరుగులకే ఆలౌటైంది. ఓట్నీల్ బార్ట్‌మన్ 4, ఎంగిడి, జన్సెన్, సిపాంమ్లా తలో 2 వికెట్లు తీసి టీమిండియాను కుప్పకూల్చారు. భారత ఇన్నింగ్స్‌లో తిలక్ వర్మ (62) ఒంటరిపోరాటం చేశాడు. మిగతా బ్యాటర్లలో జితేశ్ శర్మ 27, అక్షర్ పటేల్ 21, హార్దిక్ 20, అభిషేక్ శర్మ 17, సూర్యకుమార్ 5, అర్షదీప్ 4, దూబే ఒక పరుగు చేశారు. శుభ్‌మన్ గిల్, వరుణ్ చక్రవర్తి డకౌటయ్యారు.ఛేదనలో ఆదిలోనే చేతులెత్తేసిన టీమిండియా 19.1 ఓవర్లలో 162 పరుగులకే ఆలౌటై పరాజయంపాలైంది. సౌతాఫ్రికా తరఫున బ్యాటింగ్‌లో డికాక్ (90), బౌలింగ్‌లో ఓట్నీల్ బార్ట్‌మన్ (4-0-24-4) చెలరేగారు. భారత ఇన్నింగ్స్‌లో తిలక్ వర్మ (62) ఒంటరిపోరాటం చేశాడు. ఈ సిరీస్‌లోని మూడో టీ20 ధర్మశాల వేదికగా డిసెంబర్ 14న జరుగనుంది.చదవండి: చరిత్ర సృష్టించిన క్వింటన్ డికాక్.. తొందరపాటు చర్యతో.. -
15 ఏళ్ల తర్వాత మాట నిలబెట్టుకున్న సచిన్
భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండుల్కర్ ఆసక్తికర విషయం వెల్లడించాడు. అంతర్జాతీయ క్రికెట్లో తన అరంగేట్రానికి దోహదపడిన సహచర ఆటగాడికి ఓ మాట ఇచ్చానని.. పదిహేనేళ్ల తర్వాత ప్రామిస్ నిలబెట్టుకున్నానని తెలిపాడు. ఇంతకీ ఎవరా ఆటగాడు?.. అతడికి సచిన్ ఇచ్చిన మాట ఏంటి?!ఆ మ్యాచ్‌లో ప్రదర్శన ఆధారంగాటీమిండియా తరఫున 1989 నవంబరులో సచిన్ టెండుల్కర్ (Sachin Tendulkar) అరంగేట్రం చేశాడు. పాకిస్తాన్‌తో టెస్టుల సందర్భంగా ఇంటర్నేషనల్ క్రికెట్లో ఎంట్రీ ఇచ్చాడు. అయితే, అంతకంటే కొద్ది రోజుల ముందు ఇరానీ కప్ మ్యాచ్‌లో రెస్టాఫ్ ఇండియా తరఫున సచిన్ సెంచరీ బాదాడు. ఆ మ్యాచ్‌లో ప్రదర్శన ఆధారంగా సెలక్టర్ల దృష్టిని మరోసారి ఆకర్షించి టీమిండియాలో అడుగుపెట్టాడు.అతడి త్యాగంతో సెంచరీఈ విషయాన్ని సచిన్ టెండుల్కర్ ఇటీవలే స్వయంగా వెల్లడించాడు. ఢిల్లీతో మ్యాచ్‌లో రెస్టాఫ్ ఇండియా (Rest Of India) తొమ్మిది వికెట్లు కోల్పోయిన వేళ.. సచిన్ సెంచరీకి చేరువగా ఉన్నాడు. అలాంటి సమయంలో గురుశరణ్ సింగ్ (Gursharan Singh) విరిగిన చేతితోనే బ్యాటింగ్‌కు వచ్చి.. సచిన్‌కు సహకారం అందించాడు. ఫలితంగా సచిన్ శతకం పూర్తి చేసుకోవడం.. తద్వారా టీమిండియా అరంగేట్రానికి బాటలు వేసుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో గురుశరణ్ సింగ్ త్యాగానికి ప్రతిగా.. సచిన్ అతడికి ఓ మాట ఇచ్చాడు. దాదాపు పదిహేనేళ్ల తర్వాత ఆ మాటను నిలబెట్టుకున్నాడు. ఏదో ఒకరోజు నువ్వు కూడా రిటైర్ అవుతావుఈ విషయం గురించి మాట్లాడుతూ.. ‘‘రిటైర్ అయిన క్రికెటర్ల కోసం అప్పట్లో బెన్ఫిట్ మ్యాచ్‌లు నిర్వహించేవారు. ఆరోజు (1990) న్యూజిలాండ్‌లో గురుశరణ్‌కు నేను ఓ మాట ఇచ్చాను.‘గుశీ.. జీవితాంతం ఎవరూ ఆడుతూనే ఉండలేరు కదా! ఏదో ఒకరోజు నువ్వు కూడా రిటైర్ అవుతావు. అలా నువ్వు రిటైర్ అయ్యి బెన్ఫిట్ మ్యాచ్ కోసం ఆటగాళ్లు కావాల్సినపుడు నేను నీకోసం వచ్చి ఆడతాను’ అని చెప్పాను. అన్నట్లుగానే అతడి కోసం బెన్ఫిట్ మ్యాచ్ ఆడాను.పదిహేనేళ్ల తర్వాత‘గుశీ.. న్యూజిలాండ్‌లో నీకు ఓ మాట ఇచ్చాను కదా! పదిహేనేళ్ల తర్వాత (2005) దానిని నిలబెట్టుకుంటున్నా’ అని చెప్పాను. ఈ జ్ఞాపకాలు ఎప్పటికీ మదిలో నిల్చిపోతాయి. ‘ఆరోజు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నా’ అని ఈరోజు సగర్వంగా నేను చెప్పగలను’’ అని సచిన్ టెండుల్కర్ పేర్కొన్నాడు. చదవండి: IPL 2025: ఐపీఎల్ వేలం కౌంట్ డౌన్ షురూ.. అతడికి రూ. 20 కోట్లు పైమాటే! -
దినేశ్ కార్తీక్‌కు మరో కీలక పదవి
టీమిండియా మాజీ వికెట్‌కీపర్ బ్యాటర్ దినేశ్ కార్తీక్‌కు మరో కీలక పదవి దక్కింది. ద హండ్రెడ్ లీగ్ 2026 సీజన్ కోసం పురుషుల లండన్ స్పిరిట్ ఫ్రాంచైజీకి బ్యాటింగ్ కోచ్ మరియు మెంటర్‌గా ఎంపికయ్యాడు. హండ్రెడ్ లీగ్‌లో డీకే ఏ ఫ్రాంచైజీతో అయిన పని చేయడం (కోచ్‌గా) ఇదే మొదటిసారి.డీకే 2025 ఐపీఎల్ సీజన్‌కు ముందు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరులో బ్యాటింగ్ కోచ్ మరియు మెంటర్‌గా చేరి, ఆ జట్టు మొదటి సారి ఐపీఎల్ ఛాంపియన్‌గా నిలవడంలో కీలక పాత్ర పోషించాడు. ఇప్పుడు అదే పోర్ట్‌ఫోలియోతో లండన్ స్పిరిట్‌తోనూ జతకట్టాడు.లండన్ స్పిరిట్ డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ మో బోబాట్ (ఆర్సీబీ డైరెక్టర్ కూడా) డీకేను స్వాగతిస్తూ.. ఈ టీ20 ఫార్మాట్ స్పెషలిస్ట్ లండన్ స్పిరిట్‌లో చేరడం ఆనందకరం. అతని ఆలోచన విధానం ప్రత్యేకం. పొట్టి ఫార్మాట్లో డీకేకు ఉన్న అనుభవం, అతని ఉత్సాహం మా ఆటగాళ్లకు అమూల్యమవుతుందని అన్నారు. లండన్ స్పిరిట్‌తో ఒప్పందం అనంతరం డీకే భావోద్వేగానికి లోనయ్యాడు. లార్డ్స్‌లో ఇంగ్లీష్ సమ్మర్ గడపనుండటం చాలా ఆనందాన్ని కలిగిస్తుంది. ఇదే గ్రౌండ్లో నేను భారత్ తరఫున తొలి మ్యాచ్ ఆడాను. చివరి టెస్ట్ కూడా ఇక్కడే ఆడాను. లండన్ స్పిరిట్‌తో కొత్త ప్రయాణం ప్రారంభించడం చాలా ఉత్సాహాన్ని కలిగిస్తుందని అన్నాడు. 40 ఏళ్ల దినేశ్ కార్తీక్ భారత్ తరఫున మూడు ఫార్మాట్లలో కలిపి 180 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడాడు. అలాగే ఐపీఎల్లో ప్రారంభ సీజన్ (2008) నుంచి 2024 ఎడిషన్ వరకు ఆడాడు. ఈ మధ్యలో అతను వేర్వేరు ఫ్రాంచైజీల తరఫున 257 మ్యాచ్‌లు ఆడాడు. -
కుప్పకూలిన సౌతాఫ్రికా.. కటక్ మ్యాచ్‌లో భారత్ గ్రాండ్ విక్టరీ
కటక్ వేదికగా జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం సాధించింది. భారత్ నిర్దేశించిన 176 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన సౌతాఫ్రికా బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కట్టారు. దీంతో కేవలం 74 పరుగులకే ఆలౌటయ్యారు. ఈ మ్యాచ్‌లో 101 పరుగుల తేడాతో టీమిండియా గ్రాండ్ విక్టరీ కొట్టింది. ఈ విజయంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో టీమిండియా 1-0 అధిక్యంలోకి దూసుకెళ్లింది. ఈ మ్యాచ్‌లో బుమ్రా, అర్షదీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్ తలో 2 వికెట్లు పడగొట్టగా.. హార్దిక్ పాండ్యా, శివ దూబే చెరో వికెట్ తీశారు.అంతకుముందు భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. భారత ఇన్నింగ్స్‌లో అభిషేక్ శర్మ 17, శుభ్‌మన్ గిల్ 4, సూర్యకుమార్ యాదవ్ 12, తిలక్ వర్మ 26, అక్షర్ పటేల్ 23, శివమ్ దూబే 11, జితేశ్ శర్మ 10 (నాటౌట్) పరుగులు చేశారు. సౌతాఫ్రికా బౌలర్లలో ఎంగిడి 3 వికెట్లు తీయగా.. సిపాంమ్లా 2, ఫెరియెరా ఓ వికెట్ పడగొట్టాడు. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో రెండో టీ20 ముల్లాన్‌పూర్ వేదికగా గురువారం జరగనుంది. -
హార్దిక్ విధ్వంసం.. సౌతాఫ్రికా టార్గెట్ ఎంతంటే..?
ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా కటక్‌లోని బారాబతి స్టేడియం వేదికగా సౌతాఫ్రికాతో ఇవాళ (డిసెంబర్ 9) జరుగుతున్న తొలి టీ20లో టీమిండియా ఓ మోస్తరుకు మించి భారీ స్కోర్ చేసింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్.. ఇన్నింగ్స్ మధ్య వరకు తడబడినప్పటికీ హార్దిక్ రాకతో పరిస్థితి ఒక్కసారిగా మారింది.తొలి బంతి నుంచే ఎదురుదాడి మొదలుపెట్టిన హార్దిక్ ఎడాపెడా బౌండరీలు, సిక్సర్లు బాది స్కోర్ వేగాన్ని పెంచాడు. అతనికి మరో ఎండ్ నుంచి సహకారం లేనప్పటికీ ఒంటరి పోరాటం చేశాడు. 28 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో అజేయమైన 59 పరుగులు చేశాడు.ఫలితంగా భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. భారత ఇన్నింగ్స్‌లో అభిషేక్ శర్మ 17, శుభ్‌మన్ గిల్ 4, సూర్యకుమార్ యాదవ్ 12, తిలక్ వర్మ 26, అక్షర్ పటేల్ 23, శివమ్ దూబే 11, జితేశ్ శర్మ 10 (నాటౌట్) పరుగులు చేశారు. సౌతాఫ్రికా బౌలర్లలో ఎంగిడి 3 వికెట్లు తీయగా.. సిపాంమ్లా 2, ఫెరియెరా ఓ వికెట్ పడగొట్టాడు.తుది జట్లు..భారత్: అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, జితేశ్ శర్మ (వికెట్‌కీపర్),అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా.సౌతాఫ్రికా: క్వింటన్ డికాక్ (వికెట్‌కీపర్), ఎయిడెన్ మార్క్రమ్ (కెప్టెన్), డెవాల్డ్ బ్రీవిస్, ట్రిస్టన్ స్టబ్స్, డొనొవన్ ఫెరియెరా, మార్కో జాన్సెన్, కేశవ్ మహరాజ్, లుథో సిపంమ్లా, లుంగి ఎంగిడి, అన్రిచ్ నోర్జే -
ఒక్కో ఫార్మాట్‌కు ఒక్కొక్కరిని బలి తీసుకుంటున్న "పెద్ద తలకాయ"..!
భారత పురుషుల క్రికెట్‌కు సంబంధించిన ఓ పెద్ద తలకాయ ఒక్కో ఫార్మాట్లో ఒక్కో ఆటగాడిని బలి తీసుకుంటున్నాడు. బీసీసీఐ అండదండలు పూర్తిగా ఉన్న ఆ పెద్ద తలకాయ టీమిండియాలో చెప్పిందే వేదం. భారత జట్టులో అతనేమనుకుంటే అది జరిగి తీరాల్సిందే. అతడి అండదండలుంటే ఏ స్థాయి క్రికెట్ ఆడకపోయినా నేరుగా భారత తుది జట్టులోకి వస్తారు. అతడి ఆశీస్సులుంటే సాధారణ ఆటగాడు కూడా కెప్టెన్ అయిపోతాడు. భారత పురుషుల క్రికెట్‌ను శాశించే ఆ శక్తికి మరో పెద్ద తలకాయ మద్దతు కూడా ఉంది. వీరిద్దరూ తలచుకుంటే అనర్హులను అందలమెక్కిస్తారు. అర్హుల కెరీర్లను అర్దంతరంగా ముగిస్తారు. వీరి ఆగడాలకు అడ్డూ అదుపూ లేకుండా పోతుంది. ప్రశ్నించే వారిపై ఎదురుదాడి చేస్తారు. వారు చేసే ప్రతి పనికి వారి వద్ద ఓ సమర్దన స్క్రిప్ట్ ఉంటుంది. వారి జోలికి వెళ్లాలంటే మాజీలు, మాజీ బీసీసీఐ బాస్‌లు కూడా హడలిపోతారు. అంతలా వారు చెలరేగిపోతున్నారు.వీరి ప్రస్తావన మరోసారి ఎందుకు వచ్చిందంటే.. భారత్-సౌతాఫ్రికా మధ్య ఇవాల్టి నుంచి (డిసెంబర్ 9) ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ప్రారంభమైంది. కటక్ వేదికగా జరుగుతున్న తొలి మ్యాచ్‌లో అందరూ ఊహించిన విధంగానే శుభ్‌మన్ గిల్ ఓపెనర్‌గా రీఎంట్రీ ఇచ్చాడు. సౌతాఫ్రికాతోనే టెస్ట్ సిరీస్ సందర్భంగా గాయపడిన గిల్.. గాయం నుంచి కోలుకోగానే నేరుగా తుది జట్టులో చోటు సంపాదించాడు.వాస్తవానికి గిల్ స్థానం సంజూ శాంసన్‌ది. సంజూ గత కొంతకాలంగా ఓపెనర్‌గా అద్భుతంగా రాణిస్తున్నాడు. గత సౌతాఫ్రికా సిరీస్‌లోనూ వరుస సెంచరీలతో విరుచుకుపడ్డాడు. అయితే గిల్ కోసం పైన చెప్పుకున్న పెద్ద తలకాయలు సంజూ కెరీర్‌ను బలి చేస్తున్నారు. నేరుగా మెడపై కత్తి పెట్టకుండా తొలుత స్థానచలనం చేసి గేమ్‌ను మొదలుపెట్టారు. ఆతర్వాత ప్రణాళిక ప్రకారం జట్టులో స్థానాన్నే గల్లంతు చేస్తున్నారు.ఇటీవలి ఆస్ట్రేలియా పర్యటనలో ఈ ప్రక్రియ మొదలైంది. రెండో టీ20 తర్వాత సంజూకు అవకాశమే ఇవ్వలేదు. ప్రస్తుతం సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలి టీ20లోనూ అదే కొనసాగింది. సంజూను శాశ్వతంగా జట్టు నుంచి తప్పించే ప్రయత్నం జరుగుతుందని ఎవరికైనా ఇట్టే అర్దమవుతుంది. ఓ దశలో సదరు పెద్ద తలకాయల్లో మొదటివాడు సంజూ కెరీర్‌కు పూర్తి భరోసా ఇచ్చినట్లు నటించాడు. 21 సార్లు డకౌటైనా తుది జట్టులో ఉంటావని నమ్మించాడు.తీరా చూస్తే.. తన అనూనయుడికి అవకాశం ఇవ్వడం కోసం సంజూ కెరీర్‌నే బలి చేస్తున్నాడు. సదరు పెద్ద తలకాయకు తనకు సరిపోని ఆటగాళ్ల కెరీర్లతో ఆటాడుకోవడం కొత్తేమీ కాదు. దిగ్గజాలైన విరాట్ కోహ్లి, రోహిత్ శర్మలతోనే మైండ్ గేమ్ ఆడాడు. వారంతట వారే టెస్ట్, టీ20 కెరీర్లను అర్దంతరంగా ముగించుకునేలా చేశాడు. టీ20ల్లో గిల్ కోసం సంజూ కెరీర్‌ను పణంగా పెట్టిన ఆ పెద్ద తలకాయ.. మరో అనర్హమైన బౌలర్ కోసం షమీ లాంటి వరల్డ్ క్లాస్ బౌలర్ కెరీర్‌ను అంపశయ్యపై పెట్టాడు. ఇకనైనా ఈ పెద్ద తలకాయ విషయంలో బీసీసీఐ జోక్యం చేసుకోకపోతే అంతర్జాతీయ వేదికపై భారత క్రికెట్ గౌరవం పోతుంది. -
శ్రీలంకతో టీ20 సిరీస్ కోసం భారత జట్టు ప్రకటన
డిసెంబర్ 21 నుంచి స్వదేశంలో శ్రీలంకతో జరుగబోయే ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం భారత మహిళల క్రికెట్ జట్టును ఇవాళ (డిసెంబర్ 9) ప్రకటించారు. కెప్టెన్‌గా హర్మన్‌ప్రీత్ కౌర్, వైస్ కెప్టెన్‌గా స్మృతి మంధన కొనసాగనున్నారు. వన్డే ప్రపంచ ఛాంపియన్‌గా అవతరించిన తర్వాత భారత్ ఆడనున్న తొలి సిరీస్ ఇదే.పలాష్ ముచ్చల్‌తో పెళ్లి పెటాకులైన తర్వాత మంధన ఎదుర్కోనున్న తొలి పరీక్ష కూడా ఇదే. వరల్డ్‌కప్ స్టార్ షఫాలీ వర్మ ఈ జట్టులో ప్రత్యేక ఆకర్శనగా నిలిచింది. అలాగే వరల్డ్‌కప్ సెమీఫైనల్ స్టార్ జెమీమా రోడ్రిగ్స్, వరల్డ్‌కప్ ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ దీప్తి శర్మ, స్నేహ్ రాణా, హర్లీన్ డియోల్, అమన్‌జోత్ కౌర్, అరుంధతి రెడ్డి, క్రాంతి గౌడ్, రేణుకా సింగ్ ఠాకూర్ లాంటి వరల్డ్‌కప్ స్టార్లు కూడా ఈ జట్టులో చోటు దక్కించుకున్నారు. వికెట్కీపర్ల కోటాలో రిచా ఘోష్, జి కమలిని జట్టులో ఉన్నారు. కొత్తగా శ్రీ చరణి, వైష్ణవి శర్మ జట్టులోకి వచ్చారు.షెడ్యూల్..తొలి టీ20- డిసెంబర్ 21, ఆదివారం, విశాఖపట్నంరెండో టీ20- డిసెంబర్ 23, మంగళవారం, విశాఖపట్నం మూడో టీ20- డిసెంబర్ 26, శుక్రవారం, తిరువనంతపురం నాలుగో టీ20- డిసెంబర్ 28, ఆదివారం, తిరువనంతపురం ఐదో టీ20- డిసెంబర్ 30, మంగళవారం, తిరువనంతపురం -
‘అతడి త్యాగం.. నా సెంచరీ.. టీమిండియాకు సెలక్ట్ అయ్యాను’
సచిన్ టెండుల్కర్.. ఈ పేరుకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. అంతర్జాతీయ క్రికెట్లో శతక శతకాలు సాధించిన ధీరుడిగా అతడు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాడు. రెండున్నర దశాబ్దాల కెరీర్లో టీమిండియా తరఫున లెక్కకు మిక్కిలి రికార్డులు సాధించి క్రికెట్ గాడ్‌గా నీరాజనాలు అందుకున్నాడు సచిన్.అయితే, తాను టీమిండియాకు ఎంపికయ్యే క్రమంలో సహచర ఆటగాడు ఒకరు తన కోసం చేసిన త్యాగం గురించి సచిన్ టెండుల్కర్ (Sachin Tendulkar) తాజాగా వెల్లడించాడు. అది 1989- 90 దేశీ క్రికెట్ సీజన్. ముంబైలోని వాంఖడే వేదికగా ఇరానీ కప్ మ్యాచ్‌లో రెస్టాఫ్ ఇండియా- ఢిల్లీ జట్లు తలపడుతున్నాయి.సచిన్ కోసం విరిగిన చేతితోనే బ్యాటింగ్రెస్టాఫ్ ఇండియాకు ఆడుతున్న సచిన్ సెంచరీకి చేరువలో ఉన్నాడు. ఇంతలో తొమ్మిదో వికెట్ పడింది. అప్పటికి బ్యాటింగ్‌కు రావాల్సిన ప్లేయర్ గాయపడ్డాడు. అతడు మరెవరో కాదు.. టీమిండియా మాజీ క్రికెటర్ గురుశరణ్ సింగ్ (Gursharan Singh). అతడు బ్యాటింగ్‌కు వస్తేనే సచిన్ తన శతక మార్కును అందుకోగలడు.సచిన్ కోసం విరిగిన చేతితోనే బ్యాటింగ్ చేసేందుకు గురుశరణ్ సిద్ధమయ్యాడు. అతడి సహకారంతో సచిన్ సెంచరీ (103) పూర్తి చేసుకున్నాడు. ఆ మ్యాచ్ ద్వారా టీమిండియా సెలక్టర్ల దృష్టిని ఆకర్షించి జాతీయ జట్టు తరఫున అరంగేట్రానికి బాటలు వేసుకున్నాడు.అతడి త్యాగం.. నా సెంచరీనాటి ఈ ఘటన గురించి సచిన్ టెండుల్కర్ తాజాగా గుర్తు చేసుకున్నాడు. ‘‘1989లో నేను ఇరానీ ట్రోఫీ ఆడుతున్న సమయం. టీమిండియా సెలక్షన్ కోసం ట్రయల్స్ జరుగుతున్నాయి. ఆ మ్యాచ్‌లో నేను 90 పరుగులు పూర్తి చేసుకుని సెంచరీ దిశగా పయనిస్తున్నా.ఇంతలో తొమ్మిదో వికెట్ పడింది. నేను శతకం పూర్తి చేసుకుని జట్టు పరువు పోకుండా కాపాడాలని అనుకున్నా. కానీ బ్యాటింగ్‌కు రావాల్సిన గురుశరణ్ చెయ్యి విరిగింది. అయినప్పటికీ.. అప్పటి సెలక్షన్ కమిటీ చైర్మన్ రాజ్ సింగ్ దుంగర్పూర్ .. గురుశరణ్‌ను నాకు మద్దతుగా నిలవాల్సిందిగా కోరారు.టీమిండియాకు సెలక్ట్ అయ్యానుఆయన మాట ప్రకారం గురుశరణ్ క్రీజులోకి వచ్చాడు. అతడి సాయంతో నేను సెంచరీ పూర్తి చేసుకుని.. టీమిండియాకు సెలక్ట్ అయ్యాను కూడా!.. ఆ తర్వాత గురుశరణ్ కూడా భారత జట్టుకు ఆడాడు. ఆరోజు గురుశరణ్ చూపిన ధైర్యం, ఔదార్యం మరువలేనివి.డ్రెసింగ్‌రూమ్‌లో నేను గురుశరణ్‌కు అందరి ముందు ధన్యవాదాలు తెలిపాను. విరిగిన చెయ్యితో బ్యాటింగ్ చేయడం అంత తేలికేమీ కాదు. నా సెంచరీ పూర్తైందా? లేదా? అన్నది ముఖ్యం కాదు. ఆ సమయంలో అతడు చూపిన ధైర్యం, జట్టు కోసం పడిన తాపత్రయం నా హృదయాన్ని మెలిపెట్టాయి’’ అని సచిన్ టెండుల్కర్.. గురుశరణ్ పట్ల కృతజ్ఞతాభావం చాటుకున్నాడు.మ్యాచ్ ఓడినా..కాగా నాటి ఇరానీ కప్ మ్యాచ్‌లో ఢిల్లీ విధించిన 554 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో రెస్టాఫ్ ఇండియా బ్యాటింగ్ ఆర్డర్ కుప్పకూలింది. 209 పరుగులకే తొమ్మిది వికెట్లు కోల్పోయి కష్టాల్లో కూరుకుపోయింది. ఈ క్రమంలో గురుశరణ్ సాయంతో ఆఖరి వికెట్‌కు సచిన్ మరో 36 పరుగులు జోడించగలిగాడు. ఇక 245 పరుగులకు రెస్టాఫ్ ఇండియా ఆలౌట్ కాగా.. ఢిల్లీ 309 పరుగుల తేడాతో జయభేరి మోగించింది. అయితే, మ్యాచ్ ఓడినా.. వ్యక్తిగత ప్రదర్శన దృష్ట్యా సచిన్‌కు టీమిండియా నుంచి పిలుపు అందింది.చదవండి: టీమిండియాకు ఆల్‌రౌండర్లు కావలెను! -
టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న సౌతాఫ్రికా.. సంజూకు మొండిచెయ్యి
కటక్‌లోని బారాబతి స్టేడియం వేదికగా ఇవాళ (డిసెంబర్ 9) భారత్-సౌతాఫ్రికా మధ్య తొలి టీ20 జరుగనుంది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా జరిగే ఈ మ్యాచ్‌లో సౌతాఫ్రికా కెప్టెన్ ఎయిడెన్ మార్క్రమ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు.ఈ మ్యాచ్‌లో ముందుగా ఊహించినట్టుగానే శుభ్‌మన్ గిల్ బరిలోకి దిగాడు. దీంతో సంజూ శాంసన్ బెంచ్‌కే పరిమితం కావాల్సి వచ్చింది. వికెట్‌కీపర్ బ్యాటర్ కోటాలో జితేశ్ శర్మ తుది జట్టులో చోటు దక్కించుకున్నాడు. కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్, హర్షిత్ రాణాకు కూడా తుది జట్టులో చోటు దక్కలేదు. సౌతాఫ్రికా తరఫున నోర్జే చాలాకాలం తర్వాత బరిలోకి దిగుతున్నాడు.తుది జట్లు..భారత్: అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, జితేశ్ శర్మ (వికెట్‌కీపర్),అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రాసౌతాఫ్రికా: క్వింటన్ డికాక్ (వికెట్‌కీపర్), ఎయిడెన్ మార్క్రమ్ (కెప్టెన్), డెవాల్డ్ బ్రీవిస్, డేవిడ్ మిల్లర్, ట్రిస్టన్ స్టబ్స్, డొనొవన్ ఫెరియెరా, మార్కో జాన్సెన్, కేశవ్ మహరాజ్, లుథో సిపంమ్లా, లుంగి ఎంగిడి, అన్రిచ్ నోర్జే -
టీమిండియాకు ఆల్‌రౌండర్లు కావలెను!
ముఖ్యమైన ప్రకటన.. టీమిండియాకు ఆల్‌రౌండర్లు కావలెను. అవును మీరు విన్నది నిజమే. ప్రస్తుత భారత క్రికెట్ జట్టులో నాణ్యమైన ఆల్‌రౌండర్ల లోటు కన్పిస్తోంది. స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్లగా రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, సుందర్ వంటి వారు ఉన్నప్పటికి.. పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ల విభాగంలో భారత్ చాలా వెనకబడి ఉంది. ఒక్క హార్ధిక్ పాండ్యా తప్ప చెప్పుకోదగ్గ పేస్ బౌలింగ్ ఆల్ రౌండర్ భారత లేరు. అయితే హార్దిక్ ఫిట్నెస్ సమస్యల వల్ల ఎప్పుడు జట్టులో ఉంటాడో.. ఎప్పుడు బయట ఉంటాడో తనకే తెలియదు. నితీశ్ కుమార్ రెడ్డిని మూడు ఫార్మాట్లలో ఆల్‌రౌండర్‌గా తీర్చిదిద్దాలని ప్రయత్నిస్తున్నప్పటికి.. ఆశించినంతమేర ఫలితాలు మాత్రం రావడం లేదు. మొదటిలో అతడిపై నమ్మకం ఉంచిన గంభీర్ అండ్ కో.. ఇప్పుడు ఎక్కువగా స్పెషలిస్ట్ బ్యాటర్‌గానే పరిగణిస్తోంది. టీ20 సెటాప్‌లో భాగంగా ఉన్న శివమ్ దూబే పరిస్థితి కూడా అంతంతమాత్రమే. SENA దేశాలతో పోలిస్తే మనం చాలా వెనకబడి ఉన్నాము. గతంలో కపిల్ దేవ్, సౌరవ్ గంగూలీ వంటి ఫాస్ట్ బౌలింగ్ ఆల్‌రౌండర్లు ప్రపంచ క్రికెట్‌నే శాసించారు. కచ్చితంగా అటువంటి ఆల్‌రౌండర్లు భారత జట్టుకు అవసరం.ఆల్‌రౌండర్ల ఉపయోగాలు ఏంటి?జట్టు సమతుల్యంగా ఉండాలంటే కచ్చితంగా ఫాస్ట్ బౌలింగ్ ఆల్‌రౌండర్లు కావాలి. సౌతాఫ్రికా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా వంటి సేనా దేశాల విజయాలలో ఆల్‌రౌండర్లదే కీలక పాత్ర. ఒక్క ఆస్ట్రేలియాలోనే మిచెల్ మార్ష్, గ్రీన్, అబాట్, స్టోయినిష్ వంటి అద్బుతమైన పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్లు ఉన్నారు. నిజమైన ఫాస్ట్-బౌలింగ్ ఆల్‌రౌండర్ లేకపోతే, జట్టు కూర్పు ఒక పెద్ద సమస్యగా మారుతుంది. టీమిండియా ఇప్పుడు ఇదే సమస్యను ఎదుర్కొంటుంది. ప్రతీ మ్యాచ్‌కు ప్లేయింగ్ ఎలెవన్ ఎంపిక ఒక సమస్యగా మారింది. అదనపు బ్యాటర్‌ను ఆడిస్తే బౌలింగ్ బలహీనపడుతుంది. ఐదుగురు బౌలర్లతో ఆడితే బ్యాటింగ్ లైనప్ బలహీనంగా మారుతుంది. ఈ అసమతుల్యత కారణంగానే భారత్ విదేశాల్లో కీలక మ్యాచ్‌లు, టెస్ట్ సిరీస్‌లలో ఓడిపోయింది. భారత జట్టులో స్పిన్ ఆల్‌రౌండర్లు ఎక్కువగా ఉండడంతో ఎవరికి అవకాశమివ్వాలో తెలియక టీమ్ మెనెజ్‌మెంట్ తలలు పట్టుకుంటుంది. జడేజా, అక్షర్ వంటి వారు ఉపఖండ పిచ్లోపై రాణిస్తున్నప్పటికి విదేశీ గడ్డపై బంతితో సత్తాచాటలేకపోతున్నారు. దీంతో విదేశీ పర్యటనలో ఫాస్ట్ బౌలింగ్ ఆల్‌రౌండర్ల లోటు స్పష్టంగా కన్పిస్తోంది.శార్ధూల్ రీ ఎంట్రీ ఇస్తాడా?బీసీసీఐ సెలక్టర్లు మరోసారి శార్ధూల్ ఠాకూర్ వంటి వెటరన్ ఆల్రౌండర్లను పరిగణలోకి తీసుకోవాల్సిన అసవరముంది. శార్ధూల్ జాతీయ జట్టుకు దూరంగా ఉంటున్నప్పటికి దేశవాళీ క్రికెట్లో మాత్రం దుమ్ములేపుతున్నాడు. ఫార్మాట్లకు అతీతంగా ఠాకూర్ అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తున్నాడు. అతడిని తిరిగి జట్టులోకి తీసుకోవాలని చాలా మంది మాజీలు సూచిస్తున్నారు. ఈ ఏడాది ఇంగ్లండ్ పర్యటనలో అతడు రీ ఎంట్రీ ఇచ్చినప్పటికి ఓ మోస్తారు ప్రదర్శన చేశాడు. దీంతో అతడిని జట్టు నుంచి తప్పించారు. అయితే లార్డ్ ఠాకూర్ మరోసారి సత్తా చాటుతున్నప్పటికీ.. ఇప్పట్లో తిరిగి పునరాగమనం చేసే సూచనలు కన్పించడం లేదు.అయితే, ఠాకూర్ మాత్రం కూడా వన్డే ప్రపంచకప్-2027లో ఆడాలన్న తన కోరికను వ్యక్తం చేశాడు. అతడితో పాటు రాజ్ అంగద్ బవా, సూర్యాంశ్ షెడ్గే వంటివారిపై కూడా సెలక్టర్లు దృష్టిసారించాల్సి ఉంది. అండర్-19 ప్రపంచకప్‌లో రాజ్ అంగద్ బవా బంతితో పాటు బ్యాట్‌తో కూడా అద్భుతంగా రాణించాడు. సూర్యాంశ్‌కు కూడా సీమ్-బౌలింగ్ ఆల్‌రౌండర్‌గా రాణించే సత్తా ఉంది. చదవండి: IND vs SA: టీమిండియాకు భారీ షాక్..! -
కరుణ్ నాయర్‌కు అక్కడ కూడా చుక్కెదురు
పేలవ ఫామ్ కారణంగా సుదీర్ఘ విరామం తర్వాత వచ్చిన టీమిండియా అవకాశాన్ని చేజార్చుకున్న కరుణ్ నాయర్.. తాజాగా అదే ఫామ్ లేమి కారణంగా దేశవాలీ అవకాశాన్ని కూడా కోల్పోయాడు. ఇటీవలే విదర్భ నుంచి తన సొంత జట్టు కర్ణాటక పంచన చేరిన కరుణ్.. ప్రస్తుతం జరుగుతున్న సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీలో దారుణంగా విఫలమై జట్టులో స్థానం కోల్పోయాడు. ఈ టోర్నీలో తొలి 6 మ్యాచ్‌ల్లో కేవలం 71 పరుగులు మాత్రమే చేసిన కరుణ్.. త్రిపురతో ఇవాళ (డిసెంబర్ 8) జరిగిన మ్యాచ్ నుంచి తప్పించబడ్డాడు.ఫస్ట్ క్లాస్ క్రికెట్ వరకు మంచి ఫామ్‌లో ఉండిన కరుణ్ పొట్టి ఫార్మాట్‌కు వచ్చే సరికి చాలా ఇబ్బంది పడ్డాడు. కరుణ్ గత ఎడిషన్ SMAT ఫామ్ ఇందుకు భిన్నంగా ఉండింది. గత ఎడిషన్‌లో విదర్భకు ఆడిన కరుణ్ 6 ఇన్నింగ్స్‌ల్లో 177.08 స్ట్రయిక్‌రేట్‌తో 42.50 సగటున 255 పరుగులు చేశాడు. కరుణ్‌ను ఐపీఎల్ 2026 కోసం ఢిల్లీ క్యాపిటల్స్ రీటైన్ చేసుకున్న విషయం తెలిసిందే. ఇది జరిగి నెల కూడా కాకముందే కరుణ్ ఇంత చెత్త ప్రదర్శనలు చేయడం ఢిల్లీ యాజమాన్యానికి కంటిమీద కునుకు లేకుండా చేస్తుంది.కరుణ్ గత ఐపీఎల్ సీజన్ మధ్యలో ఢిల్లీ క్యాపిటల్స్‌లో చేరాడు. తొలి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌పై అదరగొట్టి (40 బంతుల్లో 89 పరుగులు), ఆతర్వాత ఆ స్థాయి ప్రదర్శన కొనసాగించలేక ఇబ్బంది పడ్డాడు. అయినా కరుణ్‌పై ఢిల్లీ క్యాపిటల్స్ యాజమాన్యం నమ్మకముంచి రీటైన్ చేసుకోవడం ఆశ్చర్యకరం.ఇదిలా ఉంటే, కరుణ్ లేని మ్యాచ్‌లో కర్ణాటకపై త్రిపుర సంచలన విజయం సాధించింది. సూపర్ ఓవర్లో ఆ జట్టు కర్ణాటకకు షాకిచ్చింది. నిర్ణీత 20 ఓవర్లలో ఇరు జట్లు తలో 197 పరుగులు చేయగా.. సూపర్ ఓవర్లో త్రిపుర ఊహించని విధంగా వికెట్ నష్టపోకుండా 22 పరుగులు చేయగా.. కర్ణాటక వికెట్ కోల్పోయి 18 పరుగులకే పరిమితమైంది. దీంతో త్రిపుర సంచలన విజయం నమోదు చేసింది. -
షమీ చేసిన నేరం ఏంటి.. ఎందుకు రీఎంట్రీ ఇవ్వలేకపోతున్నాడు..?
భారత క్రికెట్లో షమీ ఉదంతం ఇటీవలికాలంలో తరుచూ హాట్ టాపిక్‌గా మారుతుంది. అతను దేశవాలీ క్రికెట్లో రాణిస్తున్నా.. అతని అనుభవం టీమిండియాకు అవసరమైనా, సెలెక్టర్లు ఫిట్నెస్, ఇతరత్రా కారణాలు చెప్పి అవకాశాలు ఇవ్వడం లేదు. షమీని పక్కకు పెట్టడానికి పై కారణాలు కాకుండా చర్చించుకోలేని వేరే కారణముందన్నది చాలా మందికి తెలుసు. అయినా ఎవరూ నోరు విప్పే సాహసం చేయలేరు. ఓ ఆటగాడి కెరీర్‌ను ఆటతో ముడిపెట్టకూడని విషయాల పేర్లు చెప్పి నాశనం చేయడం సమంజసం కాదని కొన్ని గొంతులకు వినిపిస్తున్నా, వాటిని పట్టించుకునే నాథుడు లేడు. ఆటగాడిగా షమీకి అన్యాయం జరుగుతున్న విషయం బహిరంగ రహస్యమే అయినప్పటికీ.. భారత సెలెక్టర్ల వద్ద మాత్రం దాన్ని సమర్దించుకునేందుకు చాలా కారణాలు ఉన్నాయి.సెలెక్టర్లు చెబుతున్న కారణాల్లో ప్రధానమైంది షమీ ఫిట్‌గా లేడని. వాస్తవానికి వారి ఈ సమర్దనలో అర్దమే లేదు. ఒకవేళ షమీ నిజంగా ఫిట్‌గా లేకపోతే దేశవాలీ టోర్నీల్లో ఎలా అనుమతిస్తారు. అనుమతించినా.. నిజంగా ఫిట్‌గా లేకపోతే అతనెలా రాణించలడు. ఈ ఒక్క విషయం చాలు సెలెక్టర్లు వేరే ఏదో కారణం చేత షమీని టీమిండియాను ఎంపిక చేయడం లేదన్న విషయం అర్దం అవడానికి. సౌతాఫ్రికా టీ20 సిరీస్‌కు భారత జట్టు ప్రకటనకు కొద్ది గంటల ముందే షమీ సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీలో అద్బుతమైన ప్రదర్శన చేశాడు. వాస్తవానికి షమీ కాకుండా వేరే ఏ బౌలర్ అయినా అలాంటి ప్రదర్శన చేసుంటే ఖచ్చితంగా టీమిండియాలో చోటు దక్కేది. కానీ అక్కడుంది షమీ కాబట్టి అలా జరగలేదు. అలాంటి ప్రదర్శనలు మరిన్ని పునరావృతం చేసినా షమీకి ఇప్పట్లో టీమిండియాలో చోటు దక్కదు. కారణం బహిరంగ రహస్యమే.షమీని టీమిండియాకు ఎంపిక చేయకపోవడానికి సెలెక్టర్లు చూపిస్తున్న రెండో ప్రధాన కారణం వయసు. ప్రస్తుతం షమీ వయసు 35. అంతర్జాతీయ క్రికెట్లో ఈ వయసు దాటిన తర్వాత కూడా సంచలన ప్రదర్శనలు చేసిన పేసర్లు చాలామంది ఉన్నారు. ఇంగ్లండ్ పేసర్ జిమ్మీ ఆండర్సన్ ఇందుకు ప్రధాన ఉదాహరణ. ఆండర్సన్ 40 ఏళ్ల వయసులోనూ ఏం చేశాడో జగమంతా చూసింది. అలాంటిది షమీకి 35 ఏళ్లకే వయసైపోయిందనడం ఎంత వరకు సమంజసం. వయసైపోయిన వాడికి అంతర్జాతీయ క్రికెట్ అయినా, దేశవాలీ క్రికెట్ అయినా ఒకటే కదా. దేశవాలీ క్రికెట్లో వయసైపోయినా రాణిస్తున్నవాడు, అంతర్జాతీయ క్రికెట్లో రాణించలేడా..? ఏదో కారణం చెప్పాలని ఇలాంటి పొంతనలేని కారణాలు చెబుతున్నారు కానీ, అసలు కారణం వేరన్న విషయం చాలామందికి తెలుసు.షమీని టీమిండియాకు ఎంపిక చేయకపోవడానికి సెలెక్టర్లు చెబుతున్న మరో కారణం యువకులకు అవకాశాలు ఇవ్వడం. వాస్తవానికి యువకులకు అవకాశాలు ఇస్తే ఎవ్వరూ కాదనరు. జట్టులో సీనియర్లు తురుచూ విఫలమవుతున్నప్పుడు ఇలాంటి ప్రయోగాలకు పోవాలి. అయితే ఇక్కడ పరిస్థితి వేరు. కావాలని షమీని పక్కకు పెట్టడానికి అనర్హమైన, టీమిండియాలో పెద్ద తలకాయ అండదండలున్న ఓ పేసర్‌ను యువత పేరుతో ఫ్రేమ్‌లోకి తెచ్చారు. అతని కంటే చిన్నవాడు, అతని కంటే వెయ్యి రెట్లు ఎక్కువ టాలెంట్ ఉన్నా మరో పేసర్‌కు మాత్రం అవకాశాలు ఇవ్వరు. పెద్దల అండదండలున్న పేసర్ ఎన్ని మ్యాచ్‌ల్లో విఫలమైనా, మళ్లీమళ్లీ తుది జట్టులో ప్రత్యక్షమవుతుంటాడు. వాస్తవానికి ఆటగాళ్ల శారీరక కదలికలు, ఫిట్నెస్, ఫామ్‌ను బట్టి వయసు ప్రస్తావన వస్తుంది. ఈ మూడు బాగుంటే వయసుతో పనేముంది. పై మూడు అంశాల్లో షమీ పర్ఫెక్ట్గా ఉన్నా వయసు పేరు చెప్పి టీమిండియాకు ఎంపిక చేయకపోవడం ఎంత వరకు సమంజసం.ఇన్ని కారణాలు చెప్పి షమీని టీమిండియాకు ఎంపిక చేయకున్న సెలెక్టర్లు అంతిమంగా ఒక్క విషయం ఆలోచించాలి. షమీ స్థానంలో అతనిలా రాణిస్తున్న ఎవరినైనా ఎంపిక చేయకపోతే నష్టపోయే భారత జట్టే. అర్హులు జాతీయ జట్టులో లేకపోతే దేశ ప్రయోజనాలు దెబ్బతింటాయి. షమీ లాంటి ఉదంతాలు జరగడం భారత క్రికెట్‌కు మాయని మచ్చగా మిగిలిపోయే ప్రమాదం ఉంది. ఇప్పటికే హర్భజన్ సింగ్, ఛతేశ్వర్ పుజారా లాంటి టీమిండియా మాజీలు షమీకి మద్దతుగా గళం విప్పారు. షమీ చేసిన నేరం ఏంటని బహిరంగంగా ప్రశ్నించారు. భారత సెలెక్టర్లు ఇకనైనా పంతాలు పక్కకు పెడితే భారత క్రికెట్‌కు మరింత మేలు జరిగే అవకాశం ఉంది. -
సౌతాఫ్రికాతో టీ20 సిరీస్‌కు ముందు టీమిండియాకు ఝలక్
సౌతాఫ్రికాతో టీ20 సిరీస్‌కు ముందు ఐసీసీ టీమిండియాకు ఝలక్ ఇచ్చింది. మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా డిసెంబర్ 3న రాయపూర్‌లో జరిగిన రెండో వన్డేలో స్లో ఓవర్‌రేట్ మెయింటైన్ చేసినందుకు గానూ భారత ఆటగాళ్లకు జరిమానా విధించింది. ఆ మ్యాచ్‌లో భారత బౌలర్లు నిర్దేశిత సమయంలోగా 2 ఓవర్లు వెనుకపడ్డారు. దీంతో ఓవర్‌కు 5 శాతం చొప్పున, రెండు ఓవర్లకు 10 శాతం మ్యాచ్ ఫీజ్‌ను టీమిండియాకు జరిమానాగా విధించారు.ఐసీసీ ఎలైట్ ప్యానెల్ మ్యాచ్ రిఫరీ రిచీ రిచర్డ్సన్ ఈ శిక్షను ఖరారు చేశారు. ఐసీసీ కోడ్ ఆఫ్ కాండక్ట్‌లో ఆర్టికల్ 2.22 ప్రకారం, ప్రతి ఓవర్ ఆలస్యానికి ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులో 5 శాతం జరిమానా విధిస్తారు. ఈ జరిమానాను భారత కెప్టెన్ కేఎల్ రాహుల్ స్వీకరించాడు. దీంతో ఫార్మల్ హియరింగ్ అవసరం లేకుండా కేసు ముగిసింది. ఆ మ్యాచ్‌లో భారత్ నిర్దేశించిన 359 పరుగుల లక్ష్యాన్ని దక్షిణాఫ్రికా విజయవంతంగా ఛేదించి, సిరీస్‌ను 1-1తో సమం చేసింది. అనంతరం విశాఖపట్నంలో జరిగిన నిర్ణయాత్మక వన్డేలో భారత్ విజయం సాధించి 2-1 తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఇదిలా ఉంటే, రేపటి నుంచి భారత్, సౌతాఫ్రికా మధ్య ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్ కటక్‌లోని బారాబతి స్టేడియం వేదికగా జరుగనుంది. భారతకాలమానం ప్రకారం ఈ మ్యాచ్ రాత్రి 7 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ సిరీస్‌లోని మిగతా టీ20లు డిసెంబర్ 11, 14, 17, 19 తేదీల్లో ముల్లాన్‌పూర్, ధర్మశాల, లక్నో, అహ్మదాబాద్ వేదికలుగా జరుగనున్నాయి.సౌతాఫ్రికాతో తొలి టీ20 కోసం భారత జట్టు (అంచనా)..శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, జితేశ్ శర్మ (వికెట్‌కీపర్), శివమ్ దూబే, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా, అర్షదీప్ సింగ్ -
గిల్ వచ్చేశాడు.. సంజూ శాంసన్‌కు మళ్లీ నిరాశే..!
డిసెంబర్ 9 నుంచి కటక్ (ఒడిషా) వేదికగా భారత్, సౌతాఫ్రికా మధ్య 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్ కోసం భారత జట్టు మొత్తం ఇప్పటికే భువనేశ్వర్‌కు (ఒడిషా రాజధాని) చేరుకుంది. గాయం కారణంగా టెస్ట్, వన్డే సిరీస్‌కు (సౌతాఫ్రికాతో) దూరమైన శుభ్‌మన్ గిల్ కూడా నిన్న రాత్రి భువనేశ్వర్ చేరుకున్నాడు.గిల్ మెడ్ గాయం నుంచి పూర్తిగా కోలుకోని రీఎంట్రీకి సిద్దంగా ఉన్నాడు. గిల్ రాకతో టీమిండియాకు ఓపెనింగ్ జోడీ సమస్య తిరగబెట్టింది. అభిషేక్‌కు జోడీగా గిల్ బరిలోకి దిగితే సంజూ శాంసన్‌కు మళ్లీ నిరాశ తప్పదు.మిడిలార్డర్లో ఆడించాల్సి వస్తే మేనేజ్మెంట్ జితేశ్ శర్మకు ఓటు వస్తుంది తప్ప సంజూకు అవకాశం ఇవ్వదు. సంజూ ఓపెనర్‌గా అయితేనే సక్సెస్ కాగలడని మేనేజ్మెంట్ భావిస్తుంది. ఇది ఆసీస్ పర్యటనలో తొలి రెండు టీ20ల్లో నిరూపితమైంది. దీన్ని బట్టి చూస్తే సంజూ ఓపెనర్‌గా అవకాశం ఉంటేనే తుది జట్టులో ఉంటాడు. లేకపోతే జట్టులో చోటే ఉండదు.మేనేజ్మెంట్ దగ్గర మిడిలార్డర్ వికెట్ కీపర్ బ్యాటర్ కోసం జితేశ్ శర్మ రూపం మంచి ఆప్షన్ ఉంది. జితేశ్ మంచి ఫినిషర్‌గానూ గుర్తింపు తెచ్చుకున్నాడు. కాబట్టి సౌతాఫ్రికా టీ20 సిరీస్‌లో అతడికే అవకాశాలు ఉంటాయి. ఓపెనర్లలో ఎవరో ఒకరికి గాయమైతే తప్ప సంజూ తుది జట్టులోకి వచ్చే పరిస్థితి లేదు.గిల్ ఆకలితో ఉన్నాడు: గంభీర్‌గిల్ గాయంపై టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ రెండు రోజుల ముందే అప్డేట్ ఇచ్చాడు. దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్ ముగిశాక గంభీర్ మాట్లాడుతూ.. అవును, గిల్ సిద్ధంగా ఉన్నాడు. అందుకే అతన్ని ఎంపిక చేశాం. అతను ఫిట్‌గా, ఫైన్‌గా, ఆడేందుకు ఆకలితో ఉన్నాడని అన్నాడు.కాగా, సౌతాఫ్రికాతో జరిగిన తొలి టెస్ట్‌లో మెడ గాయానికి గురైన గిల్.. గత కొద్ది రోజులుగా బెంగళూరులోని BCCI సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో ఉన్నాడు. అక్కడ పూర్తిగా కోలుకొని, వైద్య బృందం నుంచి ఫిట్నెస్ క్లియరెన్స్ పొందాడు. టెస్ట్, వన్డే ఫార్మాట్లలో టీమిండియా కెప్టెన్‌గా ఉన్న గిల్.. టీ20ల్లో వైస్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. సౌతాఫ్రికాతో తొలి టీ20 కోసం భారత జట్టు (అంచనా)..శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, జితేశ్ శర్మ (వికెట్‌కీపర్), శివమ్ దూబే, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, బుమ్రా, అర్షదీప్ సింగ్ -
కీలక పదవికి ఎంపికైన టీమిండియా మాజీ క్రికెటర్
టీమిండియా మాజీ క్రికెటర్ వెంకటేశ్ ప్రసాద్‌కు (Venkatesh Prasad) కీలక పదవి దక్కింది. కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ (KSCA) ఎన్నికల్లో ఈ మాజీ పేసర్ ఘన విజయం సాధించారు. ఆదివారం (డిసెంబర్ 7) జరిగిన ఎన్నికల్లో ప్రసాద్ నేతృత్వంలోని టీమ్ గేమ్ ఛేంజర్స్ ప్యానెల్ దాదాపు అన్ని పదవులను గెలుచుకుంది. ప్రసాద్ బ్రిజేశ్ పటేల్ మద్దతు పొందిన కేఎన్ శాంత్ కుమార్‌పై 191 ఓట్ల తేడాతో గెలుపొందారు. ప్రసాద్‌కు 749, శాంత్ కుమార్‌కు 558 ఓట్లు వచ్చాయి. మరో భారత మాజీ క్రికెటర్ సుజిత్ సోమసుందర్ ఉపాధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. వినోద్ శివప్పపై ఆయన 719-588 ఓట్ల తేడాతో గెలుపొందారు.కార్యదర్శి హోదాను సంతోష్ మీనన్ తిరిగి దక్కించుకున్నాడు. ఈఎస్ జైరామ్‌పై 675-632 ఓట్ల తేడాతో గెలుపొందాడు. ట్రెజరర్ పోస్ట్‌ను బీఎన్ మధుకర్ దక్కించుకున్నాడు. ఎంఎస్ వినయ్‌పై 736-571 ఓట్ల తేడాతో గెలుపొందాడు. ఇలా దాదాపుగా ప్రతి పదవిని వెంకటేశ్ ప్రసాద్ నేతృత్వంలోని టీమ్ గేమ్ ఛేంజర్స్ ప్యానెలే దక్కించుకుంది.ప్రధాన ఫలితాలు - అధ్యక్షుడు: వెంకటేష్ ప్రసాద్ – 749 ఓట్లు - ఉపాధ్యక్షుడు: సుజిత్ సోమసుందర్ – 719 ఓట్లు - కార్యదర్శి: సంతోష్ మెనన్ – 675 ఓట్లు - జాయింట్ సెక్రటరీ: బీకే రవి – 669 ఓట్లు - ఖజాంచి: బీఎన్ మధుకర్ – 736 ఓట్లు మేనేజింగ్ కమిటీ సభ్యులు - లైఫ్ మెంబర్స్: వీఎం మంజునాథ్, సైలేష్ పోల, అవినాష్ వైద్య - ఇన్స్టిట్యూషన్ మెంబర్స్: కల్పనా వెంకటాచార్, ఆశిష్ అమర్లాల్ జోన్ ప్రతినిధులు - మైసూరు – శ్రీనివాస్ ప్రసాద్ - శివమొగ్గ – డీఎస్ అరుణ్ - తుమకూరు – సీఆర్ హరీష్ - ధార్వాడ – వీరాణ సవిడి - రాయచూర్ – కుశాల్ పటిల్ - మంగళూరు – శేఖర్ శెట్టి ముఖ్యాంశాలు - ప్రసాద్ ప్యానెల్ వారి మేనిఫెస్టోలో చిన్నస్వామి స్టేడియంలో మళ్లీ ప్రధాన క్రికెట్ మ్యాచ్‌లు జరగాలని స్పష్టంగా పేర్కొంది. - రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టైటిల్ వేడుకలో జరిగిన దుర్ఘటన తర్వాత అక్కడ పెద్ద మ్యాచ్‌లు జరగలేదు. - ఈ ఎన్నికల్లో కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కూడా ఓటు వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఐపీఎల్ మ్యాచ్‌లు చిన్నస్వామి స్టేడియం నుంచి తరలిపోవడానికి అనుమతించం. ఇది బెంగళూరు, కర్ణాటక గౌరవానికి సంబంధించిన విషయం. భవిష్యత్తులో కొత్త స్టేడియం కూడా నిర్మిస్తామని అన్నారు. డీకే వెంకటేశ్ ప్రసాద్ ప్యానెల్‌కు తన సంపూర్ణ మద్దతు తెలిపారు. -
ముచ్చల్‌తో వివాహం రద్దైంది.. అధికారిక ప్రకటన విడుదల చేసిన మంధన
భారత మహిళల క్రికెట్ స్టార్ స్మృతి మంధన తన వ్యక్తిగత జీవితంపై గత కొద్ది రోజులుగా వస్తున్న ఊహాగానాలకు ముగింపు పలికారు. సోషల్ మీడియా ద్వారా ఆమె ఒక ప్రకటన విడుదల చేస్తూ.. వివాహం రద్దైందని స్పష్టంగా తెలిపారు. పలాష్ ముచ్చల్ పేరు ప్రస్తావనకు రాకుండా విడుదల చేసిన పోస్ట్‌లో మంధన ఈ విధంగా రాసుకొచ్చారు.వివాహం రద్దుగత కొన్ని వారాలుగా నా వ్యక్తిగత జీవితంపై అనేక ఊహాగానాలు వస్తున్నాయి. నేను చాలా ప్రైవేట్ వ్యక్తిని. కానీ ఇప్పుడు మాట్లాడటం అవసరం. వివాహం రద్దైంది. ఈ విషయాన్ని ఇక్కడితో ముగించాలనుకుంటున్నాను.🚨 A STATEMENT BY SMRITI MANDHANA 🚨 pic.twitter.com/HAoHLlSIHt— Johns. (@CricCrazyJohns) December 7, 2025ప్రైవసీ ఇవ్వండిఇదే పోస్ట్‌లో ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ .. ఇరు కుటుంబాల ప్రైవసీకి గౌరవం ఇవ్వండి. మేము మా స్థాయిలో ఈ విషయాన్ని ఎదుర్కొని ముందుకు సాగాలనుకుంటున్నామని పేర్కొన్నారు.కెరీర్‌పై దృష్టిమంధన కెరీర్‌పై దృష్టి పెట్టబోతున్నట్లు స్పష్టం చేశారు. నన్ను నడిపించే ఉన్నత లక్ష్యం దేశానికి ప్రాతినిధ్యం వహించడం. భారత జట్టుకు విజయాలు అందించడమే నా కర్తవ్యమని పేర్కొన్నారు.అభిమానులకు ధన్యవాదాలు మీ అందరి మద్దతుకు ధన్యవాదాలు. ఇప్పుడు ముందుకు సాగే సమయం వచ్చిందంటూ ప్రకటన ముగించారు.కాగా, స్మృతి మంధన, మ్యూజిక్ డైరెక్టర్ పలాష్ ముచ్చల్ గత కొంతకాలంగా ప్రేమలో ఉన్నారు. ఈ మధ్యే మంధన ముచ్చల్‌తో పెళ్లిని అధికారికంగా ప్రకటించింది. అయితే ఏమైందో ఏమో కానీ, గత కొద్ది రోజులుగా వీరి పెళ్లి వాయిదా పడుతూ వస్తుంది. చివరికి మంధన పెళ్లి రద్దైందంటూ బాంబు పేల్చింది. మంధన ఇటీవల భారత జట్టు వన్డే ప్రపంచకప్ గెలవడంలో కీలకపాత్ర పోషించింది. -
జైస్వాల్ సూపర్ సెంచరీ.. గిల్ టెస్ట్‌లకు మాత్రమే పరిమితం కాక తప్పదా..?
దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో వన్డేలో యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ సూపర్ సెంచరీ చేసి టీమిండియా మేనేజ్మెంట్కు కొత్త తలనొప్పి తెచ్చిపెట్టాడు. రెగ్యులర్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ గాయపడటంతో ఆ స్థానాన్ని తాత్కాలికంగా భర్తీ చేసేందుకు జట్టులోకి వచ్చిన జైస్వాల్ అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని కెప్టెన్‌నే పోటీదారుగా మారాడు. ఇప్పటికే జట్టు కూర్పు విషయంలో తలలు పట్టుకున్న భారత మేనేజ్మెంట్కు జైస్వాల్ మరో సమస్యగా మారాడు.గిల్ వస్తే పరిస్థితి ఏంటన్నది ఎవరికీ అర్దం కావట్లేదు. కెప్టెన్ కోసం జైస్వాల్‌ను తప్పిస్తారా లేక కెప్టెన్‌నే పక్కకు కూర్చోబెడతారా అన్నది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే గిల్ రూపేనా జైస్వాల్‌కు అన్యాయం జరుగుతుందన్న విమర్శలు ఉన్నాయి. విజయవంతమైన రైట్ అండ్ లెఫ్ట్ కాంబినేషన్ ప్రకారం రోహిత్‌తో పాటు జైస్వాల్‌కు అవకామివ్వాలి. అయితే కెప్టెన్ అయిన కారణంగా మేనేజ్మెంట్ గిల్‌వైపే మొగ్గు చూపుతుంది.అలాగనీ గిల్‌ను అత్యుత్తమ వన్డే బ్యాటర్ కాదని అనలేం. గిల్ ఈ ఫార్మాట్లో చాలా అద్భుతంగా ఆడతాడు. అతనితో సమానంగా జైస్వాల్ కూడా ఆడతాడు. సాధారణంగా ఏ జట్టైన రైట్ అండ్ లెఫ్ట్ కాంబినేషన్ కోసం చూస్తుంది. ఈ కోటాలో జైస్వాల్కే అవకాశాలు రావాలి. కానీ కెప్టెన్ కావడంతో జైస్వాల్‌పై వివక్ష తప్పలేదు. పోనీ జైస్వాల్‌ను కానీ గిల్‌ను కానీ మిడిలార్డర్లో ఆడిద్దాదా అంటే, ఆ ఛాన్సే లేదు. మిడిలార్డర్లో బెర్త్‌ల కోసం ఇప్పటికే పదుల సంఖ్యలో పోటీ ఉంది.ఇలాంటి పరిస్థితుల్లో జైస్వాల్ సెంచరీ చేసి మేనేజ్మెంట్ను ఏ నిర్ణయం తీసుకోలేని స్థితిలోకి నెట్టాడు. పక్షపాతాలకు పోకుండా ఉంటే సెంచరీ చేశాడు కాబట్టి జైస్వాల్‌కు మరిన్ని అవకాశాలు ఇవ్వాలి. జైస్వాల్ క్రమంగా రాణిస్తే మాత్రం గిల్ వన్డేల నుంచి బ్రేక్ తీసుకోవాలి. రోహిత్ శర్మ రిటైరయ్యే వరకు ఇదే పరిస్థితి కొనసాగవచ్చు. రోహిత్ చూస్తే 2027 వరకు తగ్గేదేలేదంటున్నాడు. తదుపరి వన్డే సిరీస్ సమయానికి మేనేజ్మెంట్ ఏం చేస్తుందో చూడాలి.వన్డే ఫార్మాట్లో గిల్ ప్రస్తుత పరిస్థితి ఇది. ఈ పంజాబీ కుర్రాడికి టీ20 ఫార్మాట్లోనూ పరిస్థితి అంత మెరుగ్గా లేదు. ఏదో, లాబీయింగ్ జరిగి వైస్ కెప్టెన్ అయ్యాడే కానీ ఈ ఫార్మాట్ జట్టులో స్థానానికి అతడు అర్హుడే కాదు. అతను ఆడితే ఓపెనర్‌గా ఆడాలి. లేదంటే లేదు. ఈ ఫార్మాట్లో గిల్‌కు అవకాశం ఇవ్వడం కోసం మేనేజ్మెంట్ ఇద్దరిని బలిపశువులను చేస్తుంది.ఈ ఫార్మాట్లో రోహిత్ శర్మ రిటైరయ్యాక ఓ ఓపెనింగ్ స్థానాన్ని అభిషేక్ శర్మ భర్తీ చేశాడు. గత కొద్ది కాలంగా మరో ఓపెనింగ్ బెర్త్‌కు సంజూ శాంసన్ న్యాయం చేస్తున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో గిల్‌కు ఆఘమేఘాల మీద వైస్ కెప్టెన్సీ కట్టబెట్టి జట్టులో స్థానం కల్పిస్తున్నారు. దీని వల్ల సంజూ మిడిలార్డర్‌కు వెళ్లాల్సి వస్తుంది. వైస్ కెప్టెన్ కోటాలో గిల్‌కు ఓపెనింగ్ స్థానాన్ని కట్టబెట్టినా ఏమైనా న్యాయం చేయగలుగుతున్నాడా అంటే అదీ లేదు. వరుస అవకాశాలను వృధా చేసుకున్నాడు. ఈ నేపథ్యంలో గిల్‌ను టీ20 జట్టు నుంచి తప్పించాలని మేనేజ్మెంట్పై ఒత్తిడి ఎక్కువైంది. త్వరలో ఈ ఫార్మాట్లో అతను స్థానం కోల్పోయే ప్రమాదం ఉంది.వన్డేలు చూస్తే అలా. టీ20లు చూస్తే ఇలా. ఇక గిల్ స్థానం పదిలంగా ఉండేది టెస్ట్‌ల్లో మాత్రమే. ఈ ఫార్మాట్ నుంచి కూడా రోహిత్ రిటైర్ కావడంతో లెఫ్ట్ అండ్ రైట్ కాంబినేషన్లో గిల్-జైస్వాల్ టెన్షన్ లేకుండా ఆడుకుంటున్నారు. వన్డేల్లో జైస్వాల్.. టీ20ల్లో సంజూ (అవకాశాలు వచ్చి ఓపెనర్‌గా) క్రమంగా రాణిస్తూ ఉంటే గిల్ వన్డేల్లో కెప్టెన్సీ కోల్పోవడంతో పాటు టీ20ల్లో స్థానం గల్లంతై, టెస్ట్‌లకు మాత్రమే పరిమితం కావాల్సి ఉంటుంది. -
సిరీస్ మొత్తంలో గర్వపడిన సందర్భం అదే: కేఎల్ రాహుల్
విశాఖ వేదికగా సౌతాఫ్రికాతో నిన్న (డిసెంబర్ 6) జరిగిన నిర్ణయాత్మక మూడో వన్డేలో టీమిండియా అలవోకగా విజయం సాధించింది. తద్వారా 3 మ్యాచ్‌ల సిరీస్‌ను 2-1 తేడాతో కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో భారత్ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో సత్తా చాటింది. తొలుత బౌలర్లు.. ఆతర్వాత బ్యాటర్లు అద్భుతంగా రాణించి ఏకపక్ష విజయాన్నందించారు.మ్యాచ్ అనంతరం కెప్టెన్ కేఎల్ రాహుల్ స్పందిస్తూ ఇలా అన్నాడు. అతని మాటల్లో.. టాస్ గెలుపు చాలా కీలకం. టాస్ తప్ప ఈ మ్యాచ్ గెలుపులో నా పాత్ర ఏమీ లేదు. ఈ సిరీస్ మొత్తంలో గర్వపడిన సందర్భం టాస్ గెలిచినప్పుడే.తొలి రెండు వన్డేల్లో టాస్ ఓడటం వల్ల సెకెండ్ ఇన్నింగ్స్‌ల్లో బౌలింగ్ చేయవల్సి వచ్చింది. మంచు కురిసే వేళల్లో అది బౌలర్లకు విషమ పరీక్ష. ఈ రోజు టాస్ గెలిచి బౌలర్లను ఇబ్బందులకు గురి కాకుండా కాపాడాను.పిచ్ బ్యాటింగ్‌కు చాలా బాగుంది. అయినా మా బౌలర్లు అద్బుతంగా బౌలింగ్ చేసి వికెట్లు సాధించారు. ప్రసిద్ద్ తొలుత ఇబ్బంది పడినా, ఆతర్వాతి స్పెల్‌లో మ్యాచ్ గతినే మార్చేశాడు. ఆతర్వాత కుల్దీప్ కూడా అద్భుతంగా బౌలింగ్ చేశాడు. వారి తరఫున డికాక్ అద్భుతంగా ఆడాడు. అతడి వికెట్ చాలా కీలకం. సిరీస్ గెలిచినందుకు చాలా ఆనందంగా ఉంది. తొలి రెండు మ్యాచ్‌ల్లో ఒత్తిడిని బాగా హ్యాండిల్ చేశాం. సిరీస్ ఆధ్యాంతం సౌతాఫ్రికా ఆటగాళ్లు అద్బుతంగా బ్యాటింగ్ చేశారు. మా బౌలర్లపై అధికమైన ఒత్తిడి ఉండింది. రెండో వన్డేలో అదృష్టం మా పక్షాన లేదు. అందుకే ఓడాం.కాగా, నిన్నటి వన్డేలో టీమిండియా టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేసింది. ప్రసిద్ద్ కృష్ణ (9.5-0-66-4), కుల్దీప్ యాదవ్ (10-1-41-4) అద్భుతంగా బౌలింగ్ చేసి సౌతాఫ్రికాను 270 పరుగులకే పరిమితం చేశారు. డికాక్ (106) ఒక్కడే సెంచరీతో పోరాటం చేశాడు. బవుమా (48) ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. అనంతరం ఓ మోస్తరు లక్ష్యాన్ని భారత్ సునాయాసంగా ఛేదించింది. యశస్వి జైస్వాల్ (116 నాటౌట్) సూపర్ సెంచరీతో.. రోహిత్ (75), కోహ్లి (65 నాటౌట్) బాధ్యతాయుతమైన అర్ద సెంచరీలతో చెలరేగారు. ఫలితంగా భారత్ 39.5 ఓవర్లలో వికెట్ మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. -
వైజాగ్ వన్డేలో టీమిండియా జయభేరి.. ఫ్యాన్స్ సందడి (ఫొటోలు)
-
విశాఖలో 'విజయ పతాక'
భారత టాపార్డర్ బ్యాటర్లు సిరీస్ గెలిపించారు. యశస్వి జైస్వాల్ అజేయ శతకంతో కదం తొక్కగా, సీనియర్ సూపర్ స్టార్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి ఫిఫ్టీలతో మెరిపించారు. అంతకుముందు పేసర్ ప్రసిధ్ కృష్ణ జోరందుకున్న సఫారీపై నిప్పులు చెరిగాడు. ఇతనికి తోడుగా కుల్దీప్ యాదవ్ తిప్పేశాడు. దీంతో పరుగుల పరంగా ఎటో వెళ్లాల్సిన దక్షిణాఫ్రికా అనూహ్యంగా 48 ఓవర్లయినా పూర్తిగా ఆడలేక ఆలౌటైంది. అలా విశాఖలో టీమిండియా విజయ పతాకాన్ని ఎగురవేసింది.సాక్షి, విశాఖపట్నం: సొంతగడ్డపై టెస్టు సిరీస్‌ను కోల్పోయి దిగాలు పడిన టీమిండియా తెలుగు నేలపై తెగ మురిసే విజయాన్ని సాధించింది. శనివారం జరిగిన చివరి వన్డేలో భారత్ 9 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికాపై జయభేరి మోగించింది. మొదట సఫారీ జట్టు 47.5 ఓవర్లలో 270 పరుగులకు ఆలౌటైంది. క్వింటన్ డికాక్ (89 బంతుల్లో 106; 8 ఫోర్లు, 6 సిక్స్‌లు) ‘శత’క్కొట్టాడు. బవుమా (67 బంతుల్లో 48; 5 ఫోర్లు) రాణించాడు. ప్రసిధ్ కృష్ణ, కుల్దీప్ చెరో 4 వికెట్లు తీశారు. తర్వాత భారత్ 39.5 ఓవర్లలో వికెట్ మాత్రమే కోల్పోయి 271 పరుగులు చేసి గెలిచింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’యశస్వి జైస్వాల్ (121 బంతుల్లో 116 నాటౌట్; 12 ఫోర్లు, 2 సిక్స్‌లు) తొలి వన్డే సెంచరీ సాధించాడు. రోహిత్ (73 బంతుల్లో 75; 7 ఫోర్లు, 3 సిక్స్‌లు), ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’కోహ్లి (45 బంతుల్లో 65 నాటౌట్; 6 ఫోర్లు, 3 సిక్స్‌లు) చెలరేగారు. 9న కటక్‌లో జరిగే తొలి టి20తో ఐదు మ్యాచ్‌ల సిరీస్ మొదలవుతుంది. ఆదుకున్న డికాక్20 ఓవర్లయిపోయాయి. దక్షిణాఫ్రికా జట్టు స్కోరేమో వంద దాటేసింది. ఇంకేం మరో పరుగుల విందు గ్యారంటీ అనిపించింది ఒక దశలో! ఇంతలో 21వ ఓవర్ ఆఖరి బంతికి కెప్టెన్ బవుమాను జడేజా అవుట్ చేశాడు. ఇదొక్కటి సఫారీ జోరును, స్కోరును వారి బ్యాటింగ్ తీరునే మార్చేసింది. అన్ని ఓవర్ల (50)ను ఆడకుండా చేసింది. బ్యాటర్లనంతా ఆలౌట్ చేసింది. ఇదంతా కూడా మరుసటి 27 ఓవర్లలోనే జరిగింది. 300 పైచిలుకు ఖాయమనుకున్న స్కోరు 270 పరుగుల వద్దే ఆగిపోయింది. 21వ ఓవర్ నుంచి 48 ఓవర్ ముగియక ముందే 156 పరుగుల వ్యవధిలో 9 వికెట్లు కూలడంతోనే సఫారీ అధోగతి పాలైంది. అంతకుముందు బ్యాటింగ్‌కు దిగగానే రికెల్టన్ (0) వికెట్‌ను కోల్పోయిన దక్షిణాఫ్రికాను డికాక్, కెప్టెన్ బవుమా నడిపించారు. ఇద్దరు రెండో వికెట్‌కు 113 పరుగులు జోడించారు. బవుమాను అవుట్ చేసిన జడేజా అంతా మార్చేశాడు. తర్వాత వచ్చిన వారెవరూ ప్రసిధ్ పేస్‌ను, కుల్దీప్ స్పిన్‌ను ఎదుర్కోలేకపోయారు.జైస్వాల్ ధమాకాఈ సిరీస్‌లో వరుస రెండు మ్యాచ్‌ల్లోనూ ఇరు జట్లు కలిసి అవలీలగా 600 పైచిలుకు స్కోర్లు చేయడం చూసిన మనకు ఈ స్కోరును చూస్తే ఏమంత కష్టసాధ్యం కాదని ఇట్టే తెలిసిపోతుంది. అందుకు తగ్గట్లే ఓపెనర్లు రోహిత్, జైస్వాల్ సఫారీ బౌలర్లపై ఎదురుదాడికి దిగి పరుగులు రాబట్టారు. 10.1 ఓవర్లో జట్టు స్కోరు 50 దాటింది. 20వ ఓవర్లో వందకు చేరింది. 25వ ఓవర్లోనే 150 పరుగులకు చేరడంతోనే గెలుపు పిలుపు వినిపించింది. ఈ క్రమంలో ముందుగా రోహిత్ 54 బంతుల్లో తర్వాత జైస్వాల్ 75 బంతుల్లో ఫిఫ్టీలు పూర్తి చేసుకున్నారు. తొలివికెట్‌కు 155 పరుగులు జోడించాక రోహిత్ జోరుకు కేశవ్ మహరాజ్ కళ్లెం వేశాడు. సూపర్ ఫామ్‌లో ఉన్న కోహ్లి వచ్చి రావడంతోనే చేదంచేపనిలో పడ్డాడు. చూడచక్కని బౌండరీలు స్ట్రోక్ ప్లేతో జైస్వాల్ 111 బంతుల్లో శతకాన్ని పూర్తి చేసుకోగా... కాసేపటికే కోహ్లి 40 బంతుల్లో ఫిఫ్టీ సాధించాడు. ఇద్దరు అబేధ్యమైన రెండో వికెట్‌కు 116 పరుగులు జోడించారు. మనం టాస్ గెలిచామోచ్!విశాఖలో మ్యాచ్ మొదలయ్యే ముందు ‘టాస్ కా బాస్’.... మ్యాచ్ ముగిశాక ‘సిరీస్ కా బాస్’రెండు టీమిండియానే! కీలకమైన మ్యాచ్‌లో కెప్టెన్ కేఎల్ రాహుల్ టాస్ గెలిచాడు. వరుసగా 20 మ్యాచ్‌ల్లో టాస్‌లు ఓడిన భారత్ ఎట్టకేలకు 21వ మ్యాచ్‌లో టాస్ నెగ్గింది. టీమిండియా ఒక్క మార్పుతో బరిలోకి దిగింది. ఆల్‌రౌండర్ సుందర్‌ను పక్కనబెట్టి హైదరాబాదీ స్టార్ తిలక్ వర్మకు తెలుగు గడ్డపై మ్యాచ్ ఆడే అవకాశం కల్పించారు.20,048‘హిట్‌మ్యాన్’రోహిత్ అంతర్జాతీయ క్రికెట్లో చేసిన పరుగులివి. టెస్టులు, వన్డేలు, టి20 ఈ మూడు ఫార్మాట్లలో కలిపి 20 వేల పైచిలుకు పరుగులు చేశాడు.స్కోరు వివరాలుదక్షిణాఫ్రికా ఇన్నింగ్స్: డికాక్ (బి) ప్రసిధ్ 106; రికెల్టన్ (సి) రాహుల్ (బి) అర్ష్ దీప్ 0; బవుమా (సి) కోహ్లి (బి) జడేజా 48; బ్రీట్‌కి (ఎల్బీడబ్ల్యూ) (బి) ప్రసిధ్ 24; మార్క్రమ్ (సి) కోహ్లి (బి) ప్రసిధ్ 1; బ్రెవిస్ (సి) రోహిత్ (బి) కుల్దీప్ 29; యాన్సెన్ (సి) జడేజా (బి) కుల్దీప్ 17; బాష్ (సి) అండ్ (బి) కుల్దీప్ 9; కేశవ్ నాటౌట్ 20; ఎన్గిడి (ఎల్బీడబ్ల్యూ) (బి) కుల్దీప్ 1; బార్ట్‌మన్ (బి) ప్రసిధ్ 3; ఎక్స్‌ట్రాలు 12; మొత్తం (47.5 ఓవర్లలో ఆలౌట్) 270. వికెట్ల పతనం: 1–1, 2–114, 3–168, 4–170, 5–199, 6–234, 7–235, 8–252, 9–258, 10–270. బౌలింగ్: అర్ష్ దీప్ 8–1–36–1, హర్షిత్ 8–2–44–0, ప్రసిధ్ కృష్ణ 9.5–0–66–4, జడేజా 9–0–50–1, కుల్దీప్ 10–1–41–4, తిలక్ వర్మ 3–0–29–0. భారత్ ఇన్నింగ్స్: జైస్వాల్ నాటౌట్ 116; రోహిత్ (సి) బ్రీట్‌కి (బి) కేశవ్ 75; కోహ్లి నాటౌట్ 65; ఎక్స్‌ట్రాలు 15; మొత్తం (39.5 ఓవర్లలో వికెట్ నష్టానికి) 271. వికెట్ల పతనం: 1–155. బౌలింగ్: యాన్సెన్ 8–1–39–0, ఎన్గిడి 6.5–0–56–0, కేశవ్ 10–0–44–1, బార్ట్‌మన్ 7–0–60–0, బాష్ 6–0–53–0, మార్క్రమ్ 2–0–17–0. -
December 6: టీమిండియాకు చాలా ప్రత్యేకమైన రోజు
భారత క్రికెట్‌కు డిసెంబర్ 6 (December 6) చాలా ప్రత్యేకమైన రోజు. ఇవాళ ముగ్గురు టీమిండియా స్టార్లు పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. దిగ్గజ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా, పేసు గుర్రం జస్ప్రీత్ బుమ్రా, అత్యుత్తమ మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ వేర్వేరు సంవత్సరాల్లో డిసెంబర్ 6న జన్మించారు. ఈ ముగ్గురు ఆటగాళ్లు ప్రస్తుతం టీమిండియాలో కీలక సభ్యులుగా ఉన్నారు.ఈ ముగ్గురిలో సీనియర్ రవీంద్ర జడేజా (Ravindra Jadeja). ఎడమ చేతి స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ అయిన జడేజా 1988లో గుజరాత్‌లోని నవ్‌గామ్‌ఘడ్‌లో జన్మించాడు. 2008 అండర్-19 ప్రపంచకప్ గెలిచిన జట్టులో సభ్యుడైన జడేజా 2009లో టీమిండియా తరఫున అరంగేట్రం చేశాడు.2008-09 రంజీ సీజన్లో అద్భుతమైన ప్రదర్శన (42 వికెట్లు, 739 పరుగులు) కారణంగా జడ్డూకు టీమిండియా ఆఫర్ వచ్చింది. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 3 ట్రిపుల్ సెంచరీలు సాధించిన ఏకైక భారతీయుడు జడేజా.2024 టీ20 ప్రపంచకప్ విజయం తర్వాత జడ్డూ అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్‌కు రిటైర్మెంట్ ప్రకటించి, ప్రస్తుతం భారత టెస్ట్, వన్డే జట్లలో కీలక సభ్యుడిగా కొనసాగుతున్నాడు.పై ముగ్గురిలో జడ్డూ తర్వాత సీనియర్ బుమ్రా (Jasprit Bumrah). ఈ కుడి చేతి వాటం పేసు గుర్రం 1993లో గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జన్మించాడు. విశిష్టమైన బౌలింగ్ శైలి కలిగిన బుమ్రా.. తనకు మాత్రమే సాధ్యమైన స్వింగ్ మరియు పేస్ కలయికతో ప్రపంచ బ్యాటర్లను వణికిస్తున్నాడు.ఐపీఎల్లో సత్తా చాటడం ద్వారా 2016 టీమిండియా తలుపులు తట్టిన బుమ్రా అనతికాలంలో సూపర్ స్టార్ బౌలర్ అయ్యాడు. భారత పేసు గుర్రంగా పేరు తెచ్చుకున్నాడు. బుమ్రా యార్కర్లు వేయడంలో దిట్ట. పరిమిత ఓవర్ల క్రికెట్లో చివరి ఓవర్లలో వికెట్లు తీయగల సామర్థ్యానికి బుమ్రా ప్రసిద్ది చెందాడు.గతేడాది ఐసీసీ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు అందుకున్న బుమ్రా, టీమిండియా తరఫున మూడు ఫార్మాట్లలో కీలక సభ్యుడిగా కొనసాగుతున్నాడు. గతేడాది భారత్ టీ20 ప్రపంచకప్ సాధించడంలో బుమ్రా కీలకపాత్ర పోషించాడు. విదేశీ పిచ్‌లు.. ముఖ్యంగా SENA దేశాల్లో ఫాస్ట్ బౌలింగ్ పిచ్‌లపై బుమ్రాకు ఎవరికీ లేని ట్రాక్ రికార్డు ఉంది.పై ముగ్గురిలో చిన్నవాడు శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer). శ్రేయస్ 1994లో మహారాష్ట్రలోని ముంబైలో జన్మించాడు. కుడి చేతి వాటం మిడిలార్డర్ బ్యాటర్ అయిన శ్రేయస్ 2014 అండర్-19 వరల్డ్‌కప్ ద్వారా వెలుగులోకి వచ్చాడు. ఆతర్వాత దేశవాలీ క్రికెట్లో సత్తా చాటి 2017లో టీమిండియా తలుపులు తట్టాడు. పరిమిత ఓవర్ల క్రికెట్లో శ్రేయస్ మిడిలార్డర్లో అద్భుతమైన ఇన్నింగ్స్‌లు ఆడి టీమిండియాను చాలా మ్యాచ్‌ల్లో గెలిపించాడు. జాతీయ జట్టులో పోలిస్తే శ్రేయస్‌కు ఐపీఎల్లో ఘనమైన ట్రాక్ రికార్డు ఉంది. 2024లో కేకేఆర్‌కు టైటిల్ అందించిన శ్రేయస్ 2025 సీజన్లో పంజాబ్‌ను.. అంతకుముందు ఢిల్లీని ఫైనల్‌కు చేర్చాడు. 2023 వరల్డ్‌కప్‌లో 500పైగా పరుగులు చేసి టీమిండియా విజయాల్లో కీలకపాత్ర పోషించిన శ్రేయస్.. టీమిండియా 2025 ఛాంపియన్స్ ట్రోఫీ గెలవడంలోనూ ప్రధానపాత్ర పోషించాడు. ఇటీవలి ఆస్ట్రేలియా పర్యటన సందర్భంగా తీవ్రంగా గాయపడిన శ్రేయస్.. ప్రస్తుతం కోలుకునే క్రమంలో ఉన్నాడు.పై ముగ్గురితో పాటు డిసెంబర్ 6న ఆర్పీ సింగ్, కరుణ్ నాయర్, అన్షుల్ కంబోజ్, హ్యారీ టెక్టార్, గ్లెన్ ఫిలిప్ లాంటి స్టార్ క్రికెటర్లు పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. -
"బాత్రూంలో కూర్చొని ఏడ్చాను..": రియాన్ పరాగ్
సౌతాఫ్రికాతో టీ20 సిరీస్ కోసం ఎంపిక చేసిన భారత జట్టులో యువ ఆల్‌రౌండర్ రియాన్ పరాగ్‌కు (Riyan Parag) చోటు దక్కని విషయం తెలిసిందే. ఈ అంశంపై రియాన్ తాజాగా స్పందించాడు. భారత జట్టులో స్థానం దక్కనందుకు నిరాశ చెందానని చెప్పుకొచ్చాడు.గతేడాది అక్టోబర్‌లో చివరిగా టీమిండియా తరఫున ఆడిన రియాన్ భుజం గాయం తనను జట్టుకు దూరం చేసిందని వాపోయాడు. ఫిట్‌గా ఉన్నప్పుడు తాను రెండు వైట్ బాల్ ఫార్మాట్లు ఆడగల సమర్దుడినని తెలిపాడు. త్వరలోనే భారత జట్టులో కనిపిస్తానని ధీమా వ్యక్తం చేశాడు.రియాన్ మాటల్లో.. "నాకు నేను టీమిండియాకు ఆడగల అర్హుడినని అనుకుంటాను. ఇది నాపై నాకున్న నమ్మకమనుకోండి లేక ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకోండి. భుజం గాయం వల్ల ప్రస్తుతం నేను టీమిండియాలో లేను. నేను టీమిండియాకు రెండు వైట్‌బాల్ ఫార్మాట్లలో ఆడగలను"ఫామ్ పెద్ద సమస్య కాదుప్రస్తుతం సయ్యద్ ముస్తాక్ అలీ దేశవాలీ టీ20 టోర్నీ ఆడుతున్న రియాన్ ఫామ్ లేమితో సతమతమవుతున్నాడు. ఐదు మ్యాచ్‌ల్లో ఒక్క చెప్పుకోదగ్గ ప్రదర్శన కూడా చేయలేకపోయాడు. ఈ అంశంపై కూడా రియాన్ స్పందించాడు.ఫామ్ అనేది తన దృష్టిలో పెద్ద సమస్య కాదని, పూర్తి ఫిట్నెస్ సాధిస్తే అదంతటదే వస్తుందని విశ్వాసం వ్యక్తం చేశాడు.బాత్రూంలో కూర్చొని ఏడ్చానుఇదే సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో రెండు సీజన్లు 45-50 సగటులో పరుగులు చేశాను. అయితే ఆ వెంటనే జరిగిన ఐపీఎల్ సీజన్లో 14 మ్యాచ్‌ల్లో కలిపి 70 పరుగులు చేయలేకపోయాను. ఆ సమయంలో నేను బాత్రూంలో కూర్చొని ఏడ్చాను. ఎందుకు పరుగులు చేయలేకపోతున్నానని చాలా బాధపడ్డాను.ఈ ఫామ్‌తో ఐపీఎల్‌కు సంబంధం లేదుసయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీ ఫామ్‌తో ఐపీఎల్ ఫామ్‌కు సంబంధం లేదు. ఇక్కడ పరుగులు సాధిస్తే సంతోషమే. పరుగులు చేయలేకపోతే ఐపీఎల్లో పరుగులు చేయలేనని కాదు. ఈ విషయంలో నాకు అనుభవం ఉందని రియాన్ అభిప్రాయపడ్డాడు.కాగా, 24 ఏళ్ల రియాన్ చివరిగా 2024 అక్టోబర్ 12న బంగ్లాదేశ్‌తో జరిగిన T20 సిరీస్‌లో భారత్ తరఫున ఆడాడు. ఆ సిరీస్‌లోని ఐదు మ్యాచ్‌ల్లో దారుణంగా విఫలమయ్యాడు. ఆ సిరీస్ అంతటిలో కేవలం 49 పరుగులే చేశాడు.సంజూ శాంసన్ ట్రేడింగ్ ద్వారా సీఎస్కేకు వెళ్లిపోయిన తర్వాత రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్సీ రేసులో రియాన్ పరాగ్ కూడా ఉన్నాడు. గత సీజన్లో అతను కొన్ని మ్యాచ్‌లకు కెప్టెన్సీ కూడా చేశాడు. టీమిండియా నుంచి ఉద్వాసనకు గురైన తర్వాత కూడా రియాన్ ఐపీఎల్ 2025లో పర్వాలేదనిపించాడు. 32 సగటున 393 పరుగులు చేశాడు. -
సౌతాఫ్రికా సిరీస్‌కు ముందు దుమ్మురేపుతున్న సంజూ శాంసన్
టీమిండియా డాషింగ్ బ్యాటర్ సంజూ శాంసన్ (Sanju Samson) సౌతాఫ్రికా టీ20 సిరీస్‌కు గట్టిగా ప్రిపేర్ అవుతున్నాడు. సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీలో వరుస మెరుపు ఇన్నింగ్స్‌లతో దుమ్మురేపుతున్నాడు. ఈ టోర్నీ తొలి మ్యాచ్‌లో 41 బంతుల్లో అజేయమైన 51 పరుగులు చేసిన అతడు.. ఆతర్వాతి మ్యాచ్‌లో 15 బంతుల్లో 43 పరుగులు బాదాడు. తాజాగా ముంబైతో జరుగుతున్న మ్యాచ్‌లో సంజూ మరోసారి చెలరేగి ఆడాడు. 28 బంతుల్లో 8 ఫోర్లు, సిక్సర్ సాయంతో 46 పరుగులు చేశాడు.ఇదే ఫామ్‌ను సంజూ సౌతాఫ్రికా సిరీస్‌లోనూ కొనసాగిస్తే టీమిండియాకు చాలా ప్లస్ అవుతుంది. ఇప్పటికే భారత బ్యాటింగ్ విభాగం చాలా పటిష్టంగా ఉంది. ఒక్కో స్థానం కోసం ఇద్దరు, ముగ్గురు పోటీపడుతున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్దం చేసుకోవచ్చు. ఓ రకంగా చూస్తే.. ఆఖరి నిమిషం వరకు సంజూ స్థానానికి కూడా గ్యారెంటీ లేదు. జితేశ్ శర్మ రూపంలో అతడిని బలమైన పోటీ ఉంది.కాగా, నిన్ననే సౌతాఫ్రికా టీ20 సిరీస్ కోసం భారత జట్టును ప్రకటించారు. ఈ జట్టులో సంజూ వికెట్‌కీపర్ బ్యాటర్ కోటాలో స్థానం దక్కించుకున్నాడు. గాయపడినా ఈ జట్టుకు ఎంపికైన శుభ్‌మన్ గిల్ సిరీస్ సమయానికి అందుబాటులోకి రాకపోతే సంజూ స్థానానికి ఎలాంటి ఢోకా ఉండదు.సౌతాఫ్రికాతో టీ20 సిరీస్‌కు భారత జట్టు ఇదేసూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), శుబ్‌మన్ గిల్ (వైస్ కెప్టెన్- ఫిట్‌నెస్‌కు లోబడి), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, జితేశ్ శర్మ (వికెట్ కీపర్), సంజు శాంసన్ (వికెట్ కీపర్), జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి, అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, వాషింగ్టన్ సుందర్.భారత్ వర్సెస్ సౌతాఫ్రికా టీ20 సిరీస్ షెడ్యూల్తొలి టీ20: డిసెంబరు 9- కటక్, ఒడిశారెండో టీ20: డిసెంబరు 11- ముల్లన్పూర్, చండీగఢ్మూడో టీ20: డిసెంబరు 14- ధర్మశాల, హిమాచల్ ప్రదేశ్నాలుగో టీ20: డిసెంబరు 17- లక్నో, ఉత్తరప్రదేశ్ఐదో టీ20: డిసెంబరు 19- అహ్మదాబాద్, గుజరాత్.ముంబైని ఓడించిన తొలి మొనగాడుప్రస్తుత సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో ముంబైని ఓడించిన ఏకైక కెప్టెన్ సంజూ శాంసన్ మాత్రమే. ఈ టోర్నీలో కేరళకు సారధిగా వ్యవహరిస్తున్న సంజూ ఇవాళ ముంబైతో జరిగిన మ్యాచ్‌లో బ్యాటర్‌గా, వికెట్‌కీపర్‌గా, కెప్టెన్‌గా రాణించి ముంబైని ఓడించడంలో కీలకపాత్ర పోషించాడు. తొలుత బ్యాట్‌తో మెరుపు ఇన్నింగ్స్ ఆడిన సంజూ, ఆతర్వాత వికెట్‌కీపింగ్‌లోనూ సత్తా చాటి కీలక సమయంలో శివమ్ దూబేను స్టంపౌట్ చేశాడు. ఈ వికెటే మ్యాచ్‌ను మలుపు తిప్పి, కేరళను గెలిచేలా చేసింది.స్కోర్ల వివరాలు..కేరళ-178/5ముంబై-163 ఆలౌట్ -
మరో 20-30 పరుగులు చేసుంటే ఫలితం మారేదా..?
రాయ్‌పూర్ వేదికగా దక్షిణాఫ్రికాతో నిన్న (డిసెంబర్ 3) జరిగిన వన్డే మ్యాచ్‌లో టీమిండియా 4 వికెట్ల తేడాతో పరాజయంపాలైంది. ఈ మ్యాచ్‌లో భారత్ భారీ స్కోర్ చేసినా దాన్ని కాపాడుకోలేకపోయింది. దక్షిణాఫ్రికా బ్యాటర్లు అద్భుతమైన పోరాటపటిమ కనబర్చి వారి జట్టును గెలిపించుకున్నారు. టీమిండియా ఓటమికి గల కారణాలు విశ్లేషించుకుంటే సవాలక్ష కనిపిస్తున్నాయి.టాస్‌తో మొదలుపెడితే.. ఈ మ్యాచ్‌లో టాస్ చాలా కీలకం. గెలిచిన జట్టు తప్పకుండా తొలుత బౌలింగ్ ఎంచుకుంటుంది. ఎందుకంటే మంచు ప్రభావం కారణంగా రెండో ఇన్నింగ్స్‌లో బౌలింగ్ చేయడం చాలా కష్టంగా ఉంటుంది. తడి బంతితో బ్యాటర్లను నియంత్రించడం దాదాపు అసాధ్యం. అందుకే అంతటి భారీ లక్ష్యాన్ని అయినా దక్షిణాఫ్రికా బ్యాటర్లు సునాయాసంగా ఛేదించారు. టీమిండియా కెప్టెన్ రాహుల్ టాస్ కోల్పోయిన వెంటనే సగం మ్యాచ్‌ను కోల్పోయాడు. ఈ విషయాన్ని మ్యాచ్ అనంతరం అతనే స్వయంగా అంగీకరించాడు.లోయర్ ఆర్డర్ వైఫల్యంటాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేయాల్సి వచ్చినా టీమిండియా భారీ స్కోరే చేయగలిగింది. వాస్తవానికి ఇంకాస్త భారీ స్కోర్ రావాల్సి ఉండింది. అయితే డెత్ ఓవర్లలో వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా టీమిండియా పుట్టి ముంచారు. వీరిద్దరు చాలా నిదానంగా ఆడి అదనంగా రావాల్సిన 20-30 పరుగులకు అడ్డుకట్ట వేశారు. సుందర్ అయితే మరీ దారుణంగా ఆడి 8 బంతుల్లో కేవలం ఒకే ఒక పరుగు చేశాడు. జడ్డూ.. తానేమీ తక్కువ కాదన్నట్లు 27 బంతులు ఎదుర్కొని 24 పరుగులు మాత్రమే చేశాడు. వీరిద్దరు కాస్త వేగంగా ఆడుంటే స్కోర్ 380 దాటేది. ఈ స్కోర్ చేసుంటే టీమిండియా డిఫెండ్ చేసుకోగలిగేదేమో.మంచు ప్రభావంముందుగా అనుకున్నట్లుగానే రెండో ఇన్నింగ్స్ సమయంలో మంచు ప్రభావం చాలా తీవ్రంగా ఉండింది. ఆదిలో కాస్త తక్కువగా ఉన్నా చీకటి పడే కొద్ది దాని ప్రభావం అధికమైంది. దీంతో బౌలర్లు బంతిపై నియంత్రణ కోల్పోయారు. పరుగులు బౌండరీలు, సిక్సర్ల రూపంలో సునాయాసంగా వచ్చాయి. ఫీల్డర్ల వైఫల్యాలు దీనికి అదనం. దేశంలోనే అగ్రశ్రేణి ఫీల్డర్లు కూడా మిస్ ఫీల్డ్ చేశారు. సెంచరీ వీరుడు మార్క్రమ్ క్యాచ్‌ను జైస్వాల్ నేలపాలు చేయడం భారత ఓటమిని ప్రభావితం చేసింది.బ్రెవిస్ డ్యామేజ్బ్రెవిస్ ప్రమోషన్ పొంది ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు రావడం కూడా టీమిండియా ఓటమికి ఓ కారణం. ఈ డాషింగ్ బ్యాటర్ వచ్చీరాగానే భారత బౌలర్లపై ఎదురుదాడికి దాగాడు. ఏ బౌలర్‌ను కుదురుకోనివ్వలేదు. విధ్వంసకర బ్యాటింగ్‌తో లక్ష్యాన్ని కరిగించాడు. పైగా అతను క్రీజ్‌లోకి రాగానే కెప్టెన్ కేఎల్ రాహుల్ ఓ తప్పిదం చేశాడు. తొలి వన్డేలో బ్రెవిస్‌ను ఔట్ చేశాడని హర్షిత్ రాణాను బరిలోకి దించాడు. అసలే హర్షిత్‌పై కసితో రగిలిపోతున్న బ్రెవిస్‌కు ఇది బాగా కలిసొచ్చింది. హర్షిత్‌తో పాటు మిగతా బౌలర్లపై కూడా విరుచుకుపడ్డాడు. తొలి వన్డేలో బ్రెవిస్‌ను ఔట్ చేసిన అనంతరం హర్షిత్ అతని పట్ల దురుసుగా ప్రవర్తించిన విషయం తెలిసిందే.మరో 20-30 పరుగులు చేసుంటే ఫలితం మారేదా..?టీమిండియా మరో 20-30 పరుగులు చేసుంటే గెలిచేదని కేఎల్ రాహుల్ సహా చాలా మంది అనుకుంటున్నారు. వాస్తవానికి సఫారీలు ఉన్న ఊపుకు 380 స్కోర్ కూడా చాలేది కాదు. వాళ్లు లక్ష్యాన్ని ఛేదించాలన్న టార్గెట్ పెట్టుకొని బరిలోకి దిగలేదు. మ్యాచ్‌ను చివరి వరకు తీసుకెళ్లాలనే లక్ష్యంతో మాత్రమే బరిలోకి దిగారు. ఒకవేళ భారత్ 380 పరుగులు చేసినా వారి లక్ష్యం మారేది కాదు. లక్ష్యాన్ని అమలు చేయడంలో భాగంగానే వారికి ఈ విజయం దక్కింది. అది 380 అయినా 420 అయినా వాళ్లు ఓటమినైతే ఒప్పుకునే వారు కాదు. వారి పోరాటాలు ఎలా ఉంటాయో జతమంతా చూసింది. -
రుతు, విరాట్ అద్భుతం.. ఆ రెండే కొంపముంచాయి: కేఎల్ రాహుల్
రాయ్‌పూర్ వేదికగా సౌతాఫ్రికాతో నిన్న (డిసెంబర్ 3) జరిగిన వన్డే మ్యాచ్‌లో భారత్ 4 వికెట్ల తేడాతో పరాజయంపాలైంది. రుతురాజ్ గైక్వాడ్, విరాట్ కోహ్లి అద్భుత సెంచరీలతో చెలరేగి భారీ స్కోర్ అందించినా, టీమిండియా దాన్ని కాపాడుకోవడంలో విఫలమైంది. సౌతాఫ్రికా బ్యాటర్లు అసమాన పోరాటపటిమ కనబర్చి 359 పరుగుల అతి భారీ లక్ష్యాన్ని పెద్దగా కష్టపడకుండానే ఛేదించారు. మార్క్రమ్ బాధ్యతాయుతమైన సెంచరీ, బ్రెవిస్ మెరుపులు, భారత బౌలర్లు, ఫీలర్ల తప్పిదాలు సౌతాఫ్రికా గెలుపుకు కారణమయ్యాయి.గెలుస్తామనుకున్న మ్యాచ్‌లో ఓడటంపై టీమిండియా తాత్కాలిక కెప్టెన్ కేఎల్ రాహుల్ (KL Rahul) స్పందిస్తూ ఒకింత భావోద్వేగానికి లోనయ్యాడు. అతడి మాటల్లోనే.."ఇలాంటి ఓటమిని జీర్జించుకోవడం కష్టం. వరుసగా రెండు టాస్‌లు కోల్పోవడం దురదృష్టకరం. ఈ విషయంలో నన్ను నేను నిందించుకుంటా. రెండో ఇన్నింగ్స్‌లో బౌలింగ్ చేయడం ఎంత కష్టమో, తడి బంతితో బౌలర్లకు ఎదురయ్యే ఇబ్బందులు ఎలా ఉంటాయో మరోసారి బయటపడ్డాయి.అంపైర్లు బంతి మార్చినా, డ్యూ ప్రభావం తగ్గలేదు. మరో 20–25 పరుగులు చేసుంటే బౌలర్లకు కాస్త కుషన్ దొరికేది. వారు శక్తి మేరకు పోరాడినా, ఫీల్డింగ్‌లో కొన్ని తప్పిదాలు జరిగాయి. మొత్తంగా టాస్, డ్యూ కొంపముంచాయి. రుతురాజ్ ఆడిన ఇన్నింగ్స్ అందరినీ ఆకట్టుకుంది. అతడు స్పిన్నర్లను అద్భుతంగా ఎదుర్కొన్నాడు. హాఫ్ సెంచరీ తర్వాత టెంపో పెంచి జట్టుకు అదనపు పరుగులు అందించాడు. విరాట్ గురించి కొత్తగా చెప్పాల్సిందేమీ లేదు. 53వ సారి తన పని తాను చేసుకుపోయాడు. లోయరార్డర్ బ్యాటర్లు ఇంకొంచెం ఎక్కువ కాంట్రిబ్యూట్ చేసి, రెండు మూడు బౌండరీలు కొట్టుంటే ఆ 20 పరుగులు కూడా వచ్చేవి. నేను బ్యాటింగ్ ఆర్డర్లో ముందుకు (ఐదో స్థానం) రావడం సందర్భానుసారంగా తీసుకున్న నిర్ణయం. -
హర్షిత్ రాణాకు బిగ్ షాక్
టీమిండియా యువ పేసర్ హర్షిత్ రాణాకు (Harshit Rana) భారీ షాక్ తగిలింది. సౌతాఫ్రికాతో తొలి వన్డే సందర్భంగా డెవాల్డ్ బ్రెవిస్ పట్ల దురుసుగా ప్రవర్తించినందుకు ఐసీసీ ఆగ్రహించింది. ఓ డిమెరిట్ పాయింట్ జోడించి, 24 నెలల్లో మొదటి తప్పిదం కావడంతో మందలింపు వదిలేసింది. ఐసీసీ కోడ్ ఆఫ్ కాండక్ట్ ప్రకారం ఆటగాళ్ల పట్ల దురుసుగా ప్రవర్తించడం ఆర్టికల్ 2.5 ఉల్లంఘన కిందికి వస్తుంది.ఇంతకీ ఏం జరిగిందంటే.. రాంచీ వేదికగా నవంబర్ 30న భారత్-సౌతాఫ్రికా మధ్య తొలి వన్డే జరిగింది. ఆ మ్యాచ్‌లో బ్రెవిస్‌ను ఔట్ చేసిన తర్వాత అత్యుత్సాహానికి లోనైన హర్షిత్ ఆగ్రహపూరితమైన సెండ్ ఆఫ్ గెశ్చర్ (డ్రెస్సింగ్‌రూమ్ వైపు చూపిస్తూ వెళ్లు అన్నట్లు సైగ చేశాడు) ఇచ్చాడు. ఐసీసీ కోడ్ ఆఫ్ కాండక్ట్ ప్రకారం ఇలాంటి దురుసు ప్రవర్తనకు మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. గత 24 నెలల్లో హర్షిత్ చేసిన మొదటి తప్పిదం ఇదే కావడంతో భారీ మూల్యాన్ని తప్పించుకున్నాడు.ఓవరాక్షన్‌కు తప్పదు మూల్యంవాస్తవానికి హర్షిత్‌కు ఇలాంటి ఓవరాక్షన్ కొత్తేమీ కాదు. గతంలో ఐపీఎల్, దేశవాలీ టోర్నీల్లోనూ చాలా సందర్భాల్లో ఇలాగే ప్రవర్తించాడు. ఢిల్లీ ప్రీమియర్ లీగ్‌లో ఆయుశ్ దోసేజా, ఐపీఎల్లో మయాంక్ అగర్వాల్ పట్ల దురుసుగా ప్రవర్తించినప్పుడు క్రికెట్ సమాజం అతనిపై దుమ్మెత్తిపోసింది. అయినా హర్షిత్ తన తీరు మార్చుకోకుండా డెవాల్డ్ బ్రెవిస్ పట్ల దురుసుగా ప్రవర్తించాడు. భవిష్యత్తులోనూ హర్షిత్ ఇలాంటి ప్రవర్తనే కొనసాగిస్తే తీవ్ర మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. అతడి కెరీర్ కూడా ప్రమాదంలో పడే అవకాశం ఉంది. గతంలో చాలామంది క్రికెటర్లు ఇలాగే కెరీర్లను నాశనం చేసుకున్నారు. కాబట్టి హర్షిత్ ఇకనైనా ప్రవర్తన మార్చుకుంటే ఇప్పుడిప్పుడే గాడిలో పడుతున్న కెరీర్‌ను కాపాడుకోగలుగుతాడు. తొలి వన్డేలో పర్వాలేదు ప్రస్తుతం హర్షిత్ సౌతాఫ్రికాతో జరుగుతున్న రెండో వన్డేలోనూ కొనసాగుతున్నాడు. తొలి వన్డేలో హర్షిత్ ఓ మోస్తరు ప్రదర్శనతో (10-1-64-2) పర్వాలేదనిపించాడు. ఇప్పుడిప్పుడే ఈ యువ పేసర్ జట్టులో తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంటున్నాడు.కాగా, రాంచీ వన్డేలో భారత్ సౌతాఫ్రికాపై 17 పరుగుల తేడాతో గెలుపొంది, మూడు మ్యాచ్ సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో కొనసాగుతుంది. ఆ మ్యాచ్‌లో విరాట్ సూపర్ సెంచరీ చేసి భారత విజయంలో ప్రధానపాత్ర పోషించాడు. ఇవాళ రాయపూర్ వేదికగా రెండో వన్డే ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో సౌతాఫ్రికా టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది. తొలి మ్యాచ్‌లో ఆడిన జట్టునే టీమిండియా కొనసాగించింది.దక్షిణాఫ్రికా మాత్రం మూడు మార్పులతో బరిలోకి దిగింది. రెగ్యులర్ కెప్టెన్ టెంబా బవుమాతో పాటు కేశవ్ మహారాజ్, లుంగి ఎంగిడి తుది జట్టులోకి వచ్చారు. -
భారీ మైలురాయిపై కన్నేసిన రోహిత్ శర్మ
భారత్, సౌతాఫ్రికా జట్ల మధ్య మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఇవాళ (డిసెంబర్ 3) రెండో వన్డే జరుగనుంది. రాయ్‌పూర్ వేదికగా జరిగే ఈ మ్యాచ్‌కు ముందు భారత వెటరన్ స్టార్ రోహిత్ శర్మను ఓ భారీ రికార్డు ఊరిస్తుంది. ఈ మ్యాచ్‌లో అతను 41 పరుగులు చేస్తే అంతర్జాతీయ క్రికెట్లో (మూడు ఫార్మాట్లలో) 20000 పరుగులు పూర్తి చేసుకుంటాడు. క్రికెట్ చరిత్రలో ఇప్పటివరకు కేవలం 13 మంది మాత్రమే ఈ ఘనత సాధించారు. వీరిలో భారత్‌కు చెందిన వారే ముగ్గురున్నారు (సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లి, రాహుల్ ద్రవిడ్). వీరిలో సచిన్ అందరి కంటే ఎక్కువగా 34357 పరుగులు చేసి తిరుగులేని ఆధిక్యంలో కొనసాగుతున్నాడు.అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్లు..సచిన్-34357సంగక్కర-28016కోహ్లి-27808పాంటింగ్-27483జయవర్దనే-25957కల్లిస్-25534ద్రవిడ్-24208లారా-22358రూట్-21774జయసూర్య-21032చంద్రపాల్-20988ఇంజమామ్-20580డివిలియర్స్-20014కాగా, టీ20, టెస్ట్‌లకు రిటైర్మెంట్ ప్రకటించి వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్న రోహిత్ శర్మ ప్రస్తుతం సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. ఇటీవలి ఆస్ట్రేలియా పర్యటనలో హాఫ్ సెంచరీ, ఓ సూపర్ సెంచరీతో రెచ్చిపోయిన హిట్‌మ్యాన్.. సౌతాఫ్రికాతో జరుగుతున్న వన్డే సిరీస్ తొలి మ్యాచ్‌లోనూ అదిరిపోయే అర్ద సెంచరీతో అలరించాడు. ప్రస్తుత రోహిత్ ఫామ్‌ను బట్టి చూస్తే.. ఇవాల్టి మ్యాచ్‌లో 20000 పరుగుల మార్కును చేరుకోవడం అంత కష్టమైన పనేమీ కాకపోవచ్చు. -
విరాట్ కోహ్లి అభిమానులకు పిచ్చెక్కించే వార్త
దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లి (Virat Kohli) అభిమానులకు ఇది బంపర్ బొనాంజా లాంటి వార్త. కింగ్ త్వరలో జరుగబోయే దేశవాలీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీ ఆడతానని స్పష్టం చేశాడు. గత కొన్ని రోజులగా ఈ విషయమై సందిగ్దత నెలకొని ఉండింది. కోహ్లి స్వయంగా తాను విజయ్ హజారే ట్రోఫీ ఆడతానని చెప్పడంతో అతడి అభిమానుల ఆనందానికి అవథుల్లేకుండా పోయాయి.టెస్ట్‌లకు, టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించి, ప్రస్తుతం వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్న కోహ్లి.. దేశవాలీ టోర్నీ ఆడనుండటం క్రికెట్ అభిమానులకు నిజంగా పండుగే. కోహ్లి తన సొంత దేశవాలీ జట్టు ఢిల్లీ తరఫున విజయ్ హజారే ట్రోఫీ బరిలోకి దిగుతాడు. ఈ టోర్నీ ఆడేందుకు కోహ్లి సంసిద్దత వ్యక్తం చేసిన విషయాన్ని ఢిల్లీ క్రికెట్ ఆసోసియేషన్ చీఫ్ రోహన్ జైట్లీ ధృవీకరించారు.ఈ విషయాన్ని ఆయన క్రిక్‌బజ్ మాధ్యమంగా వెల్లడిస్తూ.. అవును.. కోహ్లి విజయ్ హజారే ట్రోఫీ ఆడనున్న మాట వాస్తవమే. అయితే అతడెన్ని మ్యాచ్‌లకు అందుబాటులో ఉంటాడన్న విషయం ఇప్పుడే చెప్పలేమని అన్నాడు. విజయ్ హజారే ట్రోఫీ 2025-26 డిసెంబర్ 24 నుంచి వచ్చే ఏడాది జనవరి 18 వరకు జరుగుతుంది.కాగా, జాతీయ జట్టు పరిగణలో ఉండాలంటే దేశవాలీ టోర్నీల్లో తప్పక రాణించాల్సి ఉంటుందని బీసీసీఐ ఇటీవల స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కోహ్లి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. కోహ్లి ఈ నిర్ణయం 2027 ప్రపంచకప్ ఆడాలనుకున్న అతని బలమైన సంకల్పాన్ని సూచిస్తుంది.కోహ్లి చివరిగా 2009-10 విజయ్ హజారే ట్రోఫీ ఆడాడు. ఈ టోర్నీలో అతను 14 మ్యాచ్‌లు ఆడి నాలుగు సెంచరీలు, మూడు అర్ద సెంచరీల సాయంతో 819 పరుగులు చేశాడు. ఈ గణంకాలు చూస్తే చాలు ఈ టోర్నీలోనూ కింగ్ హవా ఎలా కొనసాగిందో చెప్పడానికి.ఇదిలా ఉంటే, తాజాగా సౌతాఫ్రికాతో జరిగిన వన్డేలో కోహ్లి సూపర్ సెంచరీతో చెలరేగిన విషయం తెలిసిందే. చాలాకాలం తర్వాత కోహ్లి అత్యుత్తమ టచ్‌లో ఉన్నట్లు కనిపించాడు. చూడచక్కని డ్రైవ్‌లు, షాట్లు ఆడి అభిమానులకు అలరించాడు. ఈ ఒక్క ఇన్నింగ్స్‌తో కోహ్లి తన కెరీర్ అత్యున్నత స్థితిని గుర్తు చేశాడు. -
ఎవరికీ అందనంత ఎత్తులో రోహిత్ శర్మ
సౌతాఫ్రికాతో నిన్న (నవంబర్ 30) జరిగిన వన్డే మ్యాచ్‌లో టీమిండియా వెటరన్ స్టార్ రోహిత్ శర్మ చరిత్ర సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో 3 సిక్సర్లు బాదిన హిట్‌మ్యాన్.. వన్డేల్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాడిగా (352) పాకిస్తాన్ మాజీ షాహిద్ అఫ్రిది (351) రికార్డును బద్దలు కొట్టాడు. ఈ రికార్డు విభాగంలో రోహిత్, అఫ్రిది తర్వాత 300 సిక్సర్ల మార్కు తాకిన ఏకైక ఆటగాడు విండీస్ వీరుడు క్రిస్ గేల్ (331) మాత్రమే.తాజా ప్రదర్శన అనంతరం అంతర్జాతీయ క్రికెట్లో రోహిత్ సిక్సర్ల సంఖ్య 645కి చేరింది. ఈ విభాగంలో ఇప్పటికే టాప్ ప్లేస్‌లో ఉన్న అతను.. రికార్డును మరింత మెరుగుపర్చుకున్నాడు. ఈ విభాగంలో రోహిత్ కనుచూపు మేరలో కూడా ఎవరూ లేరు. రోహిత్ తర్వాత అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక సిక్సర్ల కొట్టిన ఆటగాడిగా క్రిస్ గేల్ (553) కొనసాగుతున్నాడు. ఆతర్వాతి స్థానాల్లో అఫ్రిది (476), బ్రెండన్ మెల్కల్లమ్ (398), జోస్ బట్లర్ (387) టాప్-5లో ఉన్నారు.ఇక్కడ గమనించదగ్గ ఓ విషయం ఏంటంటే.. ప్రస్తుతం కెరీర్ కొనసాగిస్తున్న ఆటగాళ్లలో రోహిత్ కనుచూపు మేరల్లో కూడా ఎవరూ లేరు. ఈ విభాగంలో ఐదో స్థానంలో ఉన్న జోస్ బట్లర్ హిట్‌మ్యాన్‌కు ఆమడదూరంలో ఉన్నాడు. రోహిత్‌కు బట్లర్‌కు మధ్య ఉన్న సిక్సర్ల వ్యత్యాసం ఏకంగా 258. కెరీర్ చరమాంకంలో ఉన్న బట్లర్ మహా అయితే ఇంకో 100 సిక్సర్లు కొట్టగలడు.ఈ లెక్కన అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక సిక్సర్ల రికార్డు రోహిత్ శర్మ పేరిట చిరకాలం ఉండిపోయే అవకాశం ఉంది. ఎందుకంటే, ఈతరం క్రికెటర్లలో ఎవరికీ మూడు ఫార్మాట్లలో కొనసాగేంత సీన్ లేదు. ఒకటి, రెండు ఫార్మాట్లతో హిట్‌మ్యాన్ రికార్డును బద్దలు కొట్టడం అంత ఈజీ కాదు. కాబట్టి రోహిత్ శర్మ సిక్సర్ల శర్మగా క్రికెట్ అభిమానులకు కలకాలం గుర్తుండిపోతాడు. -
టీమిండియాకు శుభవార్త
టీమిండియాకు శుభవార్త. భారత టెస్ట్, వన్డే జట్టు కెప్టెన్ శుభ్‌మన్ గిల్ గాయం నుంచి కోలుకునే దిశగా కీలక అడుగు వేశాడు. మెడ గాయం కారణంగా గిల్ దక్షిణాఫ్రికాతో ప్రస్తుతం జరుగుతున్న వన్డే సిరీస్‌కి దూరమయ్యాడు. ఈ గాయం కారణగానే అతడు సౌతాఫ్రికాతో రెండో టెస్టు కూడా ఆడలేకపోయాడు. ఇవాళ (డిసెంబర్ 1) బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో గిల్ రిహాబ్ కార్యక్రమం ప్రారంభమైందని తెలుస్తుంది. ముంబైలో విస్తృత ఫిజియోథెరపీ పూర్తి చేసిన గిల్, కుటుంబంతో కొద్ది రోజులు గడిపి, ప్రస్తుతం బీసీసీఐ వైద్య బృందం పర్యవేక్షణలో ఉన్నాడని సమాచారం. వైద్యులు ఆయనకు ప్రత్యేక ఫిట్నెస్ ప్రోగ్రామ్, వర్క్‌లోడ్ మేనేజ్మెంట్ ప్లాన్ సిద్ధం చేసినట్లు తెలుస్తుంది. గాయం తర్వాత బ్యాటింగ్‌కి దూరంగా ఉన్న గిల్, త్వరలోనే తేలికపాటి నెట్ సెషన్స్ ప్రారంభించే అవకాశం ఉంది. ఇటీవల చేసిన పలు విమాన ప్రయాణాల్లో గిల్‌కు ఎలాంటి అసౌకర్యం లేకపోవడం వైద్య బృందాన్ని ఉత్సాహపరుస్తోంది. డిసెంబర్ 9 నుంచి ప్రారంభమయ్యే దక్షిణాఫ్రికా టీ20 సిరీస్‌లో గిల్ ఆడతాడా లేదా అన్నది రిహాబ్ ప్రోగ్రామ్‌లో అతని ప్రతిస్పందనపై ఆధారపడి ఉంటుందని బీసీసీఐ వర్గాలు అంటున్నాయి.ఇదిలా ఉంటే, తాజాగా సౌతాఫ్రికాతో ముగిసిన తొలి వన్డేలో భారత్ ఘన విజయం సాధించింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా జరిగిన ఈ మ్యాచ్‌లో భారత బ్యాటర్లు చెలరేగిపోయారు. విరాట్ కోహ్లి సూపర్ సెంచరీతో, రోహిత్, రాహుల్ అద్భుతమైన అర్ద శతకాలతో భారత్‌కు భారీ స్కోర్ అందించారు. ఆతర్వాత భారీ లక్ష్య ఛేదనలో సౌతాఫ్రికా అద్భుతంగా ప్రతిఘటించినా అంతిమంగా భారత్‌దే పైచేయి అయ్యింది. రెండో వన్డే రాయ్‌పూర్ వేదికగా డిసెంబర్ 3న జరుగనుంది. -
అస్తవ్యస్తంగా ఉన్న భారత మిడిలార్డర్‌కు శాశ్వత పరిష్కారమేది..?
మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా సౌతాఫ్రికాతో జరిగిన తొలి వన్డేలో భారత్ ఘన విజయం సాధించింది. వెటరన్ స్టార్ విరాట్ కోహ్లి అద్భుత శతకంతో (135) చెలరేగి టీమిండియా గెలుపులో కీలకపాత్ర పోషించాడు.మరో వెటరన్ స్టార్ రోహిత్ శర్మ (57), ఈ సిరీస్‌లో భారత కెప్టెన్ అయిన కేఎల్ రాహుల్ (60) కూడా తలో హాఫ్ సెంచరీ చేసి, గెలుపులో తనవంతు పాత్రలు పోషించారు.అనంతరం భారీ లక్ష్య ఛేదనలో సౌతాఫ్రికా ఆదిలో తబడినా, ఆతర్వాత అనూహ్యంగా పుంజుకొని కాసేపు టీమిండియాను భయపెట్టింది. మిడిలార్డర్ బ్యాటర్లు మాథ్యూ బ్రీట్జ్కే (72), జన్సెన్ (70), కార్బిన్ బాష్ (67) ఊహించని రీతిలో ప్రతిఘటించి భారత శిబిరంలో గుబులు పుట్టించారు. అంతిమంగా భారత్‌దే పైచేయి అయినప్పటికీ సఫారీల పోరాటం అందరినీ ఆకట్టుకుంది.సఫారీల ఆట కట్టించడంలో భారత బౌలర్లు కూడా తమవంతు పాత్ర పోషించారు. ఆదిలో అర్షదీప్, హర్షిత్ రాణా.. ఆఖర్లో కుల్దీప్ వికెట్లు తీసి సఫారీలను కట్టడి చేయగలిగారు. ఈ గెలుపుతో భారత్ టెస్ట్ సిరీస్‌లో ఎదురైన ఘోర పరాభవానికి (0-2తో క్లీన్ స్వీప్) గట్టిగానే ప్రతీకారం తీర్చుకుంది.ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది. అయితే, ఈ మ్యాచ్‌లో భారత బ్యాటింగ్ ఆర్డర్లో మాత్రం ఓ లోపం స్పష్టంగా కనిపించింది. మిడిలార్డర్లో భారత్ అవసరం లేని ప్రయోగానికి పోయి ఆశించిన ఫలితం రాబట్టలేకపోయింది.సహజంగా ఓపెనింగ్, తప్పదనుకుంటే వన్‌డౌన్‌లో బ్యాటింగ్ చేసే రుతురాజ్‌ను నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు దించి చేతులు కాల్చుకుంది. వాస్తవానికి రుతురాజ్‌ను ఆ స్థానంలో బ్యాటింగ్‌కు దించే అవసరం లేదు. అప్పటికే భారత్ భారీ స్కోర్ దిశగా సాగుతుండింది. రోహిత్ తర్వాత బరిలోకి దిగిన రుతు 14 బంతులు ఆడి ఒక్క బౌండరీ కూడా సాధించలేక కేవలం 8 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు.రుతురాజ్ స్థానంలో కేఎల్ రాహుల్ బరిలోకి దిగి ఉంటే ఫలితం మరింత మెరుగ్గా ఉండేది. టెక్నికల్‌గా ఆలోచిస్తే, ఈ మ్యాచ్‌లో రుతురాజ్ కంటే తిలక్ వర్మ బెటర్ ఆప్షన్ అయ్యుండేవాడు. లేని పక్షంలో ఇన్ ఫామ్ బ్యాటర్ ధృవ్ జురెల్ కూడా మంచి ఆప్షనే. వీరిద్దరిని కాదని భారత మేనేజ్మెంట్ రుతుకు ఎందుకు ఓటు వేసిందో అర్దం కావడం లేదు.లోతుగా పరిశీలిస్తే.. ఈ మధ్యకాలంలో భారత మిడిలార్డర్ (వన్డేల్లో) అస్వవ్యస్తంగా మారిపోయింది. ఏ మ్యాచ్‌లో ఎవరు, ఏ స్థానంలో బ్యాటింగ్‌కు దిగుతారో ఎవరికీ అర్దం కాదు. శ్రేయస్ గాయపడిన తర్వాత పరిస్థితి మరీ దారుణంగా మారింది. వాషింగ్టన్ సుందర్‌కు ప్రమోషన్ ఇచ్చి ఆడిస్తున్నా, ఆశించిన ఫలితాలు రావడం లేదు. ఆస్ట్రేలియా పర్యటనలో అక్షర్ పటేల్ పర్వాలేదనిపించినా, సౌతాఫ్రికా సిరీస్‌లో అతను లేడు. ఐదో స్థానంలో కేఎల్ రాహుల్‌ను స్థిరంగా ఆడిస్తేనే మరింత మెరుగైన ఫలితాలు రావచ్చు. అయితే సందర్భానుసారం రాహుల్ తన స్థానాన్ని మార్చుకోవాల్సి వస్తుంది. సౌతాఫ్రికాతో తొలి వన్డేలో రాహుల్ ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు దిగి అద్భుతమైన అర్ద సెంచరీతో భారత్‌కు భారీ స్కోర్‌ను అందించాడు.ఇది తాత్కాలిక ఫలితమే కాబట్టి భారత మేనేజ్మెంట్ ఐదు, ఆరు స్థానాల కోసం స్థిరమైన బ్యాటర్లను చూసుకోవాలి. పంత్ సరైన అప్షనే అయినప్పటికీ.. కేఎల్ రాహుల్ వల్ల అది సాధ్యపడకపోచ్చు. ఇటీవలికాలంలో అద్భుతంగా రాణిస్తున్న ధృవ్ జురెల్ బెటర్ ఆప్షన్ కావచ్చు. జురెల్ వికెట్‌కీపింగ్ బ్యాటర్ అయినప్పటికీ, అతన్ని స్పెషలిస్ట్ బ్యాటర్‌గా కొనసాగించినా నష్టం లేదు. పైగా అతను ఇటీవలికాలంలో ఫార్మాట్లకతీతంగా చెలరేగుతున్నాడు. లేదనుకుంటే రియాన్ పరాగ్, రింకూ సింగ్ కూడా మంచి ఆప్షన్సే. వీరిద్దరు కూడా ఈ స్థానాలకు న్యాయం చేసే అవకాశం ఉంది. రింకూతో పోలిస్తే పరాగ్‌కు ఆరో స్థానంలో అద్భుతంగా ఫిట్ అయ్యే అవకాశం ఉంది. అలా అని రింకూని కూడా తీసి పారేయాల్సిన అవసరం లేదు. అతను కూడా చేయి తిప్పగల సమర్థుడే. ఒకవేళ హార్దిక్ పాండ్డా జట్టులోకి వచ్చినా ఈ సమస్యకు కొంత పరిష్కారం లభించే అవకాశం ఉంది. అయితే అతడు తరుచూ గాయాలతో సతమతమవుతుంటాడు. కాబట్టి రియాన్, రింకూలకు సరైన అవకాశాలు కల్పిస్తే దీర్ఘకాలం ఐదు, ఆరు స్థానాల్లో కొనసాగే అవకాశం ఉంది. -
IND Vs SA: చరిత్ర సృష్టించిన సౌతాఫ్రికా
ఇటీవల జరిగిన టెస్ట్ సిరీస్‌లో దక్షిణాఫ్రికా చేతిలో ఎదురైన ఘోర పరాభవానికి (0-2తో క్లీన్ స్వీప్) టీమిండియా గట్టిగానే ప్రతీకారం తీర్చుకుంది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా నిన్న (నవంబర్ 30) జరిగిన తొలి వన్డేలో (India vs South Africa) ఘన విజయం సాధించింది. తద్వారా సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. ఈ మ్యాచ్‌లో భారత జట్టు సఫారీలకు చుక్కలు చూపించింది.విరాట్ కోహ్లి (Virat Kohli) 52వ వన్డే శతకంతో చెలరేగిపోవడంతో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 349 పరుగుల భారీ స్కోర్ చేసింది. రోహిత్ శర్మ (57), కేఎల్ రాహుల్ (60) కూడా అర్ద సెంచరీలతో సత్తా చాటారు. అనంతరం భారీ లక్ష్య ఛేదనలో ఆదిలో తబడిన సౌతాఫ్రికా, ఆతర్వాత అనూహ్యంగా పుంజుకొని కాసేపు టీమిండియాను భయపెట్టింది. మిడిలార్డర్ బ్యాటర్లు మాథ్యూ బ్రీట్జ్కే (72), జన్సెన్ (70), కార్బిన్ బాష్ (67) ఊహించని రీతిలో ప్రతిఘటించి టీమిండియా శిబిరంలో గుబులు పుట్టించారు. అంతింగా భారత్‌దే పైచేయి అయినప్పటికీ సఫారీల పోరాటం అందరినీ ఆకట్టుకుంది. 49.2 ఓవర్లలో ఆ జట్టు 332 పరుగులు చేసి లక్ష్యానికి 18 పరుగుల దూరంలో నిలిచిపోయింది.ఈ మ్యాచ్‌లో ఓడినా సౌతాఫ్రికా (South Africa) ఓ విషయంలో చరిత్ర సృష్టించింది. వన్డే లక్ష్య ఛేదనల్లో 15 పరుగులలోపే 3 వికెట్లు కోల్పోయి అంతిమంగా 300 పరుగులు చేసిన తొలి జట్టుగా రికార్డు నెలకొల్పింది. దీనికి ముందు ఈ రికార్డు పాకిస్తాన్ పేరిట ఉండేది. 2019లో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో పాక్ లక్ష్య ఛేదనలో 6 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి, అంతిమంగా 297 పరుగులు చేసింది. -
నవంబర్ నవ శక్తి
ఇంకో మూడు రోజుల్లో... ‘ఇక సెలవా మరి’ అని నవంబర్ నెల చరిత్రలో కలిసిపోనుంది. అయితేనేం. మహిళల క్రీడా ప్రపంచానికి సంబంధించి ఈ మాసం చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోనుంది. మహిళ వన్డే వరల్డ్‌కప్‌ను టీమ్ ఇండియా గెల్చుకోవడం, తొలి అంధ మహిళల టీ20 వరల్డ్ కప్‌ను మన అమ్మాయిలు సాధించడం, భారత మహిళల కబడ్డీ జట్టు వరల్డ్ కప్‌ను చేజిక్కించుకోవడం... ఒకే నెలలో మూడు చారిత్రక విజయాలు. ఇవి గాలివాటు విజయాలు కాదు. ఎన్నో సంవత్సరాల కష్టానికి దక్కిన అపూర్వ ఫలితాలు. ఈ విజయాల్లో నుంచి సిము దాస్‌లాంటి పేదింటి బిడ్డలు ప్రపంచానికి ఘనంగా పరిచయం అయ్యారు...నవంబర్ 2న నవి ముంబైలోని డివై పాటిల్ స్టేడియంలో భారత మహిళా క్రికెట్ జట్టు తొలిసారిగా ఐసీసీ వరల్డ్‌కప్‌ను గెలుచుకున్న క్షణం దేశాన్ని ఉత్తేజపరిచింది. ఒక విజయం మరో విజయానికి స్ఫూర్తినిస్తుంది అన్నట్లుగా ఆ విజయం బ్లైండ్ ఉమెన్ క్రికెట్ టీమ్‌కు బలమైన స్ఫూర్తిని ఇచ్చింది.తొలిసారే...చారిత్రక విజయం!అంధ మహిళా క్రికెటర్ల కోసం క్రికెట్ అసోసియేషన్ ఫర్ ది బ్లైండ్ ఇండియా(సీఏబీఐ) మొదటిసారిగా టీ 20 వరల్డ్‌కప్‌కు శ్రీకారం చుట్టింది. ఇండియా బ్లైండ్ ఉమెన్ క్రికెట్ టీమ్ తొలి టీ20 వరల్డ్ కప్‌ను గెలుచుకొని చరిత్ర సృష్టించింది. దీపిక సారథ్యంలోని జట్టు ఒక్క మ్యాచ్‌లో కూడా ఓడిపోకుండా విజయం దిశగా దూసుకుపోయింది.ఎంతోమందికి స్ఫూర్తినిచ్చే విజయంభారత జట్టులో చోటు సంపాదించడానికి అనేక సవాళ్లను అధిగమించిన అమ్మాయిలు బ్లైండ్ ఉమెన్ క్రికెట్ టీమ్‌లో ఉన్నారు. వీరిలో చాలామంది గ్రామీణ ప్రాంతాలు, వ్యవసాయ కుటుంబాలు, చిన్న పట్టణాల నుంచి వచ్చారు. చిన్నప్పటి నుంచి ఏళ్లకు ఏళ్లు ప్రాక్టిస్ చేసిన వారు కాదు వారు. గత కొన్ని సంవత్సరాలలో మాత్రమే క్రికెట్ నేర్చుకొని అందులో ప్రావీణ్యం సాధించారు.మన టీమ్ వరల్డ్ కప్‌ను గెల్చుకోవడం దేశవ్యాప్తంగా ఎంతోమంది దివ్యాంగ మహిళలకు క్రీడలపై ఆసక్తిని పెంచేలా, ‘మేము సైతం’ అంటూ ఆటల్లో దూసుకుపోయేలా చేస్తుందనడంలో సందేహం లేదు.‘దివ్యాంగులు క్రికెట్ లేదా ఇతర క్రీడల్లోకి అడుగు పెట్టడానికి ఈ విజయం స్ఫూర్తిని ఇచ్చింది’ అంటున్నారు మన దేశంలోని అంధుల క్రికెట్ అసోసియేషన్ చైర్మన్ మహంతేష్.ధైర్యమే వజ్రాయుధమై...కర్నాటకలోని తుమకూర్‌కు చెందిన దీపిక టీసి చిరునవ్వు లేకుండా మాట్లాడడం అరుదైన దృశ్యం. చిరునవ్వు ఆమె సహజ ఆభరణం. ఆత్మవిశ్వాస సంతకం. ‘నేను బడికి వెళ్లింది క్రికెట్ ఆడడానికి కాదు. అంధత్వంతో కూడా హాయిగా ఎలా జీవించవచ్చో తెలుసుకోవడానికి’ అని గతాన్ని గుర్తు తెచ్చుకుంది కెప్టెన్ దీపిక. రైతు అయిన ఆమె తండ్రి చిక్కతిమప్ప... ‘ఎప్పుడూ ధైర్యంగా ఉండాలి’ అని చెబుతుండేవాడు. ఆటలో అది తనకు ఒక మంత్రంలా, వజ్రాయుధంలా పనిచేసింది. జయాపజయాలను అధిగమించేలా చేసింది. ‘బ్లైండ్ క్రికెట్ అనేది జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో కూడా ఉంటుందనే విషయం నాకు చాలా కాలం వరకు తెలియదు’ అని ఒకప్పుడు చెప్పిన దీపిక టీమ్‌ను విజయపథంలోకి తీసుకువెళ్లి వరల్డ్‌కప్ గెల్చుకోవడంలో కెప్టెన్‌గా కీలక పాత్ర పోషించింది.సంజు...స్టార్ రైడర్రైడర్ స్థానంలో ఉండడమంటే ఆత్మవిశ్వాసంతో ఉండడం, చాలా చురుగ్గా ఉండడం. మెరుపు నిర్ణయాలతో ప్రత్యర్థులను ముప్పు తిప్పలు పెట్టడం. ఈ లక్షణాలన్నీ సంజు దేవిలో ఉన్నాయి. అందుకే ఆమె మహిళల కబడ్డీ జట్టులో స్టార్ రైడర్‌గా దూసుకుపోతోంది.మన టీమ్ మహిళల కబడ్డీ వరల్డ్ కప్‌ను గెల్చుకోవడంలో సంజుదేవి కీలక పాత్ర పోషించింది. ‘కబడ్డీ అమ్మాయిల ఆట కాదు’ అనుకునే ఛత్తీస్‌గఢ్‌లోని కోర్బ ప్రాంతానికి చెందిన సంజు దేవి స్వరాష్ట్రంలోనే కాదు ఎన్నో రాష్ట్రాల్లో ఎంతోమంది అమ్మాయిలకు స్ఫూర్తిగా నిలిచింది. మహిళల కబడ్డీ వరల్డ్‌కప్ కోసం ఛత్తీస్‌గఢ్ నుంచి ఇండియన్ నేషనల్ టీమ్‌కు ఎంపికైన తొలి మహిళగా తన ప్రత్యేకత నిలుపుకుంది సంజుదేవి.చిన్నప్పటి నుంచే కబడ్డీలో అద్భుత ప్రతిభ చూపేది సంజు. 6వ ఏసియన్ ఉమెన్స్ కబడ్డీ చాంపియన్‌షిప్‌లో బంగారు పతకాన్ని గెలుచుకుంది. బిలాస్‌పూర్‌లోని ఉమెన్స్ రెసిడెన్షియల్ కబడ్డీ అకాడమీలో చేరడం సంజుకు టర్నింగ్ పాయింట్‌గా మారింది. దిల్ కుమార్ రాథోడ్లాంటి కోచ్‌ల దగ్గర కబడ్డీలో పాఠాలు నేర్చుకుంది. ఆ పాఠాలే ఆమె విజయానికి మెట్లు అయ్యాయి. పేదింటి బిడ్డకు పెద్ద పేరు వచ్చింది‘మా విజయం ఎంతోమంది అంధ అమ్మాయిలకు స్ఫూర్తిని ఇస్తుంది’ అంటుంది అస్సాంకు చెందిన బ్లైండ్ క్రికెటర్ సిము దాస్. ఈ విజేత ఎన్నో కష్టాల రహదారుల్లో నుంచి నడిచి వచ్చింది. ‘బిడ్డ అంధురాలు’ అని తెలుసుకున్న సిము దాస్ తండ్రి కుటుంబాన్ని విడిచి వెళ్లిపోయాడు. అప్పటి నుంచి సిముకు తల్లే అన్నీ అయింది. కొంతకాలానికి తల్లి మంచం పట్టింది. రోజుకు రెండు పూటలా భోజనం కష్టం అయింది. దివ్యాంగుడైన ఆమె సోదరుడికి నిరంతర సహాయం అవసరం. ఎన్ని కష్టాలు చుట్టుముట్టినప్పటికీ సిము ఒక కలను నిలబెట్టుకుంది. తాను ఉన్న పరిస్థితుల దృష్ట్యా అది అసాధ్యం అనిపించే కల. కాని సిము ఎక్కడా వెనకడుగు వేయలేదు. క్రికెట్ తన పాషన్ మాత్రమే కాదు జీవితం అయిపోయింది. క్రికెట్‌పై ఎంత ఆసక్తి ఉన్నప్పటికీ ఆమెకు సలహాలు ఇచ్చేవారు లేరు. ప్రోత్సాహాన్ని ఇచ్చేవారు లేరు. ఎలా ప్రారంభించాలో, ఎక్కడ ప్రారంభించాలో తెలియదు. ‘బ్యాటిల్ ఫర్ బ్లైండ్నెస్’ సంస్థతో సిముకు అండ దొరికింది. ఉచిత వసతి, పోషకాహారం, పరిశుభ్రమైన వాతావరణం ఆమెకు ఎంతగానో నచ్చింది. ‘నేను క్రికెటర్ కావాలనుకుంటున్నాను’ తన మనసులోని మాటను బలంగా చెప్పింది. ‘మేమున్నాం’ అంటూ సంస్థ ఆమె భుజం తట్టింది. క్రికెట్లో శిక్షణ ఇప్పించింది. అంకితభావం, కష్టంతో భారత జట్టులో స్థానం సాధించింది సిము. క్రికెట్ అసోసియేషన్ ఫర్ ది బ్లైండ్ ఇన్ ఇండియా(సీఏబిఐ) భారతదేశం, నేపాల్‌ల మధ్య నిర్వహించిన మహిళా క్రికెట్ సిరీస్‌లో సిము ‘బెస్ట్ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’గా ఎంపికైంది. -
రెండో టెస్టులో చిత్తుగా ఓడిన భారత్
మ్యాచ్‌ను ‘డ్రా’ చేసుకుంటే చాలు అదే మాకు రెండో టెస్టులో విజయంతో సమానం... నాలుగో రోజు ఆట ముగిసిన తర్వాత భారత ఆటగాడు రవీంద్ర జడేజా చేసిన వ్యాఖ్య ఇది. ‘డ్రా’ చేసుకోవడం కాదు కదా... మన ఆటగాళ్లు కనీస స్థాయి పోరాటం కూడా చేయలేకపోయారు... చివరి రోజు సఫారీ స్పిన్నర్లు పదునైన బంతులతో మన పని పట్టి అలవోకగా మిగిలిన ఎనిమిది వికెట్లు పడగొట్టారు. రికార్డు విజయంతో సిరీస్‌ను గెలుచుకొని వరల్డ్ చాంపియన్‌గా తమ స్థాయిని ప్రదర్శిస్తూ దక్షిణాఫ్రికా సింహనాదం చేసింది. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో మ్యాచ్‌ను శాసించిన యాన్సెన్ చివరి క్యాచ్‌ను అద్భుతంగా అందుకోవడం సరైన ముగింపు కాగా... ఏడాది వ్యవధిలో సొంతగడ్డపై రెండు సిరీస్‌లలో వైట్‌వాష్ కు గురైన భారత బృందం అవమాన భారాన్ని తమ ఖాతాలో వేసుకుంది. గువాహటి: దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టెస్టులో లాంఛనం ముగిసింది. అనూహ్యమేమీ జరగకుండా భారత్ సులువుగా తలవంచింది. ఊహించిన విధంగానే రెండు సెషన్ల లోపే మ్యాచ్ చేజారింది. టీమిండియా మిగిలిన 8 వికెట్లు తీసేందుకు సఫారీ బౌలర్లకు 48 ఓవర్లు సరిపోయాయి. బుధవారం ముగిసిన రెండో టెస్టులో దక్షిణాఫ్రికా 408 పరుగుల తేడాతో భారత్‌ను చిత్తుగా ఓడించింది. ఓవర్‌నైట్ స్కోరు 27/2తో ఆట కొనసాగించిన భారత్ తమ రెండో ఇన్నింగ్స్‌లో 63.5 ఓవర్లలో 140 పరుగులకే కుప్పకూలింది. రవీంద్ర జడేజా (87 బంతుల్లో 54; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధ సెంచరీ సాధించడం మినహా మిగతా బ్యాటర్లంతా పూర్తిగా విఫలమయ్యారు. ఆఫ్ స్పిన్నర్ సైమన్ హార్మర్ (6/37) ఆరు వికెట్లతో భారత్ పని పట్టాడు. కోల్‌కతాలో జరిగిన తొలి టెస్టును కూడా గెలిచిన దక్షిణాఫ్రికా తాజా ఫలితంతో 2–0తో సిరీస్‌ను సొంతం చేసుకుంది. 25 ఏళ్ల తర్వాత ఆ జట్టు భారత్‌లో సిరీస్ గెలవడం విశేషం. 93 పరుగులు చేయడంతో పాటు 7 వికెట్లు తీసిన మార్కో యాన్సెన్ ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలవగా... మొత్తం 17 వికెట్లు తీసిన సైమన్ హార్మర్ ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’గా ఎంపికయ్యాడు. ఇరు జట్ల మధ్య ఆదివారం నుంచి వన్డే సిరీస్ జరుగుతుంది. జడేజా మినహా... ఓటమి నుంచి తప్పించుకునేందుకు చివరి రోజు బరిలోకి దిగిన భారత్‌కు ఆరంభంలో కాస్త అదృష్టం కలిసొచ్చింది. యాన్సెన్ బౌలింగ్‌లో 4 పరుగుల వద్ద సాయి సుదర్శన్ క్యాచ్ ఇవ్వగా అది నోబాల్‌గా తేలింది. ఆ తర్వాత 4 పరుగుల వద్ద కుల్దీప్ యాదవ్ (5) ఇచ్చిన సునాయాస క్యాచ్‌ను మార్క్రమ్ వదిలేశాడు. అయితే ఇది ఎంతోసేపు సాగలేదు. ఒకే ఓవర్లో కుల్దీప్, జురేల్ (2)లను అవుట్ చేసి దెబ్బ కొట్టిన హార్మర్... కొద్ది సేపటికే కెపె్టన్ రిషభ్ పంత్ (13)ను కూడా వెనక్కి పంపాడు. టీ విరామానికి భారత్ స్కోరు 90/5కు చేరింది. అయితే ప్రతీ బంతిని డిఫెన్స్ ఆడుతూ పట్టుదల ప్రదర్శించిన సాయి సుదర్శన్ (139 బంతుల్లో 14; 1 ఫోర్)) ఎట్టకేలకు ముత్తుసామి వేసిన ఒక చక్కటి బంతికి అవుటయ్యాడు. ఆ తర్వాత జడేజా, సుందర్ (16) కొద్దిసేపు పోరాడారు. అయితే కొత్త స్పెల్‌లో మళ్లీ బౌలింగ్‌కు దిగిన హార్మర్ 8 పరుగుల వ్యవధిలో సుందర్, నితీశ్ కుమార్ రెడ్డి (0)లను అవుట్ చేయగా... మహరాజ్ ఒకే ఓవర్లో జడేజా, సిరాజ్ (0)లను వెనక్కి పంపడంతో దక్షిణాఫ్రికా శిబిరంలో వేడుకలు మొదలయ్యాయి. ఐదో స్థానానికి భారత్.. భారీ ఓటమి తర్వాత ఇప్పటికిప్పుడు భారత టెస్టు జట్టు ప్రదర్శనపై ఎలాంటి చర్చా జరిగే అవకాశం లేదు. దక్షిణాఫ్రికాతో వన్డేలు, టి20ల తర్వాత న్యూజిలాండ్‌తో భారత్ స్వదేశంలోనే వన్డే, టి20 సిరీస్‌లు ఆడనుంది. ఆపై టి20 వరల్డ్ కప్, ఐపీఎల్ ఎలాగూ ఉంటుంది. కాబట్టి ఈ పరాజయంపై విశ్లేషణలు, ప్రశ్నలు ఇక్కడితోనే ముగిసిపోవచ్చు! మరోవైపు తాజా ఓటమితో ఐసీసీ వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) పాయింట్ల పట్టికలో భారత్ 48.15 పాయింట్ల శాతంతో ఐదో స్థానానికి పడిపోయింది. అయితే ఈ ఓటమి తర్వాత డబ్ల్యూటీసీ ఫైనల్‌కు వెళ్లాలంటే భారత్ చాలా శ్రమించాల్సి ఉంటుంది. భారత తమ తర్వాతి టెస్టు మ్యాచ్ 2026 ఆగస్టులోనే ఆడనుంది. శ్రీలంకకు వెళ్లి 2 టెస్టులు, ఆపై న్యూజిలాండ్‌లో 2 టెస్టులతో పాటు స్వదేశంలో ఆ్రస్టేలియాతో 5 టెస్టులు ఆడాల్సి ఉంది. డబ్ల్యూటీసీలో భాగంగా ఉన్న ఈ 9 టెస్టుల్లో ప్రదర్శన మన ఫైనల్ ప్రస్థానాన్ని నిర్దేశించనుంది. స్కోరు వివరాలు దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్: 489; భారత్ తొలి ఇన్నింగ్స్: 201; దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్: 260/5 డిక్లేర్డ్; భారత్ రెండో ఇన్నింగ్స్: జైస్వాల్ (సి) వెరీన్ (బి) యాన్సెన్ 13; రాహుల్ (బి) హార్మర్ 6; సుదర్శన్ (సి) మార్క్రమ్ (బి) ముత్తుసామి 14; కుల్దీప్ (బి) హార్మర్ 5; జురేల్ (సి) మార్క్రమ్ (బి) హార్మర్ 2; పంత్ (సి) మార్క్రమ్ (బి) హార్మర్ 13; జడేజా (స్టంప్డ్) వెరీన్ (బి) మహరాజ్ 54; సుందర్ (సి) మార్క్రమ్ (బి) హార్మర్ 16; నితీశ్ రెడ్డి (సి) వెరీన్ (బి) హార్మర్ 0; బుమ్రా (నాటౌట్) 1; సిరాజ్ (సి) యాన్సెన్ (బి) మహరాజ్ 0; ఎక్స్‌ట్రాలు 16; మొత్తం (63.5 ఓవర్లలో ఆలౌట్) 140. వికెట్ల పతనం: 1–17, 2–21, 3–40, 4–42, 5–58, 6–95, 7–130, 8–138, 9–140, 10–140. బౌలింగ్: యాన్సెన్ 15–7–23–1, ముల్డర్ 4–1–6–0, హార్మర్ 23–6–37–6, మహరాజ్ 12.5–1–37–2, మార్క్రమ్ 2–0–2–0, ముత్తుసామి 7–1–21–1. 408 టెస్టుల్లో పరుగులపరంగా భారత్‌కు ఇదే అతి పెద్ద ఓటమి. 2004లో ఆ్రస్టేలియా చేతిలో (నాగ్‌పూర్‌లో) భారత్ 342 పరుగుల తేడాతో ఓడింది.3స్వదేశంలో భారత్ వైట్‌వాష్ కు గురి కావడం ఇది మూడోసారి. 2000లో దక్షిణాఫ్రికా చేతిలో 0–2తో, 2024లో న్యూజిలాండ్ చేతిలో 0–3తో ఓడింది.9 ఈ మ్యాచ్‌లో మార్క్రమ్ పట్టిన క్యాచ్‌ల సంఖ్య. ఒక టెస్టులో అత్యధిక క్యాచ్‌లు పట్టిన ఫీల్డర్‌గా రహానే (8) రికార్డును అతను సవరించాడు. 11 కెప్టెన్‌గా బవుమాకిది 11వ టెస్టు విజయం. ఆడిన 12 టెస్టుల్లో ఒకటి డ్రా కాగా, అతని నాయకత్వంలో జట్టు ఒక్క టెస్టూ ఓడలేదు. చాలా గొప్ప విజయం. అసాధారణ ఘనత ఇది. భారత్‌లో టెస్టు సిరీస్ గెలవడం సాధారణంగా ఊహకు కూడా అందనిది. మా ఆటపై సందేహాలు వ్యక్తం చేసిన వారందరికీ సమాధానమిది. మంచి సన్నద్ధతతో పాటు పరిస్థితులకు తగినట్లుగా మా ఆటను మార్చుకున్నాం. తమ బాధ్యతపై ప్రతీ ఒక్కరికి స్పష్టత ఉండటం మేలు చేసింది. –తెంబా బవుమా, దక్షిణాఫ్రికా కెప్టెన్ -
టీమిండియా కెప్టెన్‌గా రాహుల్..
న్యూఢిల్లీ: దక్షిణాఫ్రికాతో జరుగనున్న వన్డే,సిరీస్‌కు సంబంధించి భారత జట్టున ప్రకటించింది బీసీసీఐ. మూడు వన్డేల సిరీస్‌కు సంబంధించి జట్లను ప్రకటించారు. వన్డే జట్టు కెప్టెన్‌గా కేఎల్ రాహుల్‌ను ఎంపిక చేశారు. నవంబర్ 30 నుంచి దక్షిణాఫ్రికాతో ఆరంభం కానున్న వన్డే సిరీస్‌కు గిల్ స్థానంలో రాహుల్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేశారు. మెడ గాయం కారణంగా ఈ వన్డే సిరీస్‌కు రెగ్యులర్ కెప్టెన్ గిల్ అందుబాటులో లేకపోవడంతో ఆ స్థానంలో కెప్టెన్‌గా రాహుల్‌ను నియమించారు. ఇక విరాట్ కోహ్లి, రోహిత్ శర్మలు తిరిగి జట్టులోకి వచ్చారు. రాహుల్‌కు డిప్యూటీగా రిషభ్ పంత్ వ్యవహరిస్తారు. సఫారీలతో వన్డే సిరీస్‌కు భారత జట్టుకేఎల్ రాహల్(కెప్టెన్), రిషభ్ పంత్(వైస్ కెప్టెన్), రోహిత్ శర్మ, జైశ్వాల్, విరాట్ కోహ్లి, తిలక్ వర్మ, వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా, కల్దీప్ యాదవ్, నితీష్ కుమార్ రెడ్డి, హర్షిత్ రాణా, రుతురాజ్ రాజ్ గైక్వాడ్, ప్రసిద్ధ్ కృష్ణ, అర్షదీప్ సింగ్, ధ్రువ్ జురెల్ -
టీ20 వరల్డ్‌కప్ విజేత భారత్
అంధుల టీ20 వరల్డ్‌కప్‌లో భారత్ విశ్వవిజేతగా నిలిచింది. ఈ రోజు నేపాల్‌తో జరిగిన ఫైనల్లో భారత్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించి వరల్డ్‌కప్‌ను కైవసం చేసుకుంది. నేపాల్‌ను 114 పరుగులకే కట్టడి చేసిన భారత్ జట్టు, ఆపై కేవలం 12 ఓవర్లలో 3 వికెట్లకు 117 పరుగులు చేసి టైటిల్‌ను గెలుచుకుంది. కొలంబోలో జరిగిన తుదిపోరులో భారత మహిళల అంధుల జట్టు ఆద్యంతం ఆకట్టుకుంది. నేపాల్‌ను స్వల్ప స్కోరుకే పరిమితం చేసి భారత జట్టు.. అటు తర్వాత ఇంకా ఎనిమిది ఓవర్లు ఉండగానే లక్ష్యాన్ని ఛేధించింది. భారత వైస్ కెప్టెన్ పూలా సారెన్ 44 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచింది. ఇదిలా ఉంచితే, సెమీస్‌లో ఆసీస్‌ను చిత్తు చేసి పైనల్‌కు చేరిన భారత జట్టు.. ఫైనల్లో కూడా మెరిసింది. ఏమాత్రం తడబాటు లేకుండా ఫైనల్ అడ్డంకిని కూడా అధిగమించి ఔరా అనిపించింది. ఇది భారత మహిళల అంధుల క్రికెట్ జట్టుకు తొలి టీ20 వరల్డ్‌కప్. ఈ వరల్డ్‌కప్‌తో(వన్దేలు, టీ20లు) కలిపి భారత అంధుల జట్లు(పురుషులు, మహిళలు) మొత్తం ఆరు టైటిల్స్ సాధించాయి.వివరాలు 2002 (టీ20, పురుషులు): మొదటి అంధుల టీ20 వరల్డ్‌కప్ విజయం2012 (టీ20, పురుషులు)2014 (వన్డే, పురుషులు)2017 (టీ20, పురుషులు)2018 (వన్డే, పురుషులు)2025 (టీ20, మహిళలు) -
సఫారీలు కుమ్మేశారు..!
గువహటి వేదికగా భారత్‌తో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికా 489 పరుగుల భారీ స్కోరు సాధించింది. 247/6 ఓవర్‌నైట్ స్కోరుతో రెండో రోపు ఆట ప్రారంభించిన సఫారీలు.. నాలుగు వందల మార్కును సునాయాసంగా దాటారు. ఈరోజు(ఆదివారం, నవంబర్ 23వతేదీ) బ్యాటింగ్‌లో సెనురన్ ముత్తుసామి సెంచరీ నమోదు చేశాడు. ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన ముత్తుసామి 206 బంతులు ఎదుర్కొని 10 ఫోర్లు, 2 సిక్స్‌లు సాయంతో 109 పరుగులు సాధించాడు. ఎనిమిది, తొమ్మిదో స్థానాల్లో బ్యాటింగ్‌కు వచ్చిన కైల్ వెర్రెయెన్నె మార్కో జాన్సెన్లు సైతం ఆకట్టుకున్నారు. వెర్రెయెన్నె 45 పరుగులు సాధించగా, జాన్సెన్ 93 పరుగులు చేశాడు. జాన్సెన్ 91 బంతుల్లో 6 ఫోర్లు, 7 సిక్స్‌లతో చెలరేగి ఆడి స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. దక్షిణాఫ్రికా బ్యాటింగ్‌లో ఏడో వికెట్‌కు 88 పరుగుల భాగస్వామ్యం, ఎనిమిదో వికెట్‌కు 97 పరుగుల భాగస్వామ్యం లభించడంతో సఫారీలు భారీ స్కోరు నమోదు చేశారు. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ నాలుగు వికెట్లు సాధించగా,రవీంద్ర జడేజా, బుమ్రా, సిరాజ్‌లు తలో రెండు వికెట్లు దక్కాయి. చివరి వికెట్‌గా పెవిలియన్ చేరిన జాన్సెన్ తృటిలో సెంచరీ కోల్పోయాడు. భానత బౌలర్లలో కుల్దీప్ 115 పరుగులు సమర్పించుకోగా, సిరాజ్ 106 పరుగులు ఇచ్చాడు. 25 ఓవర్లు మించి వేసిన బౌలర్లలో బుమ్రా ఒక్కడే కుదురుగా పరుగులు ఇచ్చాడు. బుమ్రా 32 ఓవర్లు వేసి 75 పరుగులు ఇచ్చాడు. అనంతరం తొలి ఇన్నిం గ్స్ ఆరంభించిన భారత్.. ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 9 పరుగులు చేసింది. జైశ్వాల్(7 బ్యాటింగ్), రాహుల్(2 బ్యాటింగ్)క్రీజ్‌లో ఉన్నారు. -
శ్రేయస్ అయ్యర్‌కు సంబంధించి బిగ్ అప్డేట్
ఇటీవలి ఆస్ట్రేలియా పర్యటనలో తీవ్రంగా గాయపడిన భారత వన్డే జట్టు వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌కు (Shreyas Iyer) సంబంధించి బిగ్ అప్డేట్ అందుతుంది. టీమిండియాలోకి శ్రేయస్ రీఎంట్రీ ఇప్పట్లో కష్టమేనని సమాచారం. ఇండియాటుడే నివేదిక ప్రకారం.. శ్రేయస్‌కు తాజాగా అల్రాసోనోగ్రఫీ (USG) స్కాన్ తీశారు. ఇందులో అతడి గాయం పూర్తిగా నయం కాలేదని తేలింది.ప్రస్తుతం అతను సాధారణ పనులు, తేలికపాటి ఎక్సర్సైజ్లు మాత్రమే చేసుకోవచ్చు. హార్డ్ ట్రైనింగ్ మరో నెల పాటు నిషేధం. రెండు నెలల తర్వాత మరో స్కాన్ ఆధారంగా BCCI CoEలో అతడి రీహాబ్ ప్లాన్ అమలు కానుంది. ఈ సమాచారం నిజమైతే శ్రేయస్ మరో మూడు నెలల పాటు క్రికెట్‌కు దూరంగా ఉంటాడు.ఈ మధ్యలో అతను సౌతాఫ్రికా, న్యూజిలాండ్‌తో జరిగే వన్డే సిరీస్‌లకు దూరమవుతాడు. మార్చిలో జరిగే ఐపీఎల్ 2026లోనే శ్రేయస్ పునఃదర్శనం ఉంటుంది. ఈ వార్త తెలిసి శ్రేయస్ అభిమానులు నిరాశ చెందుతున్నారు. తొలుత శ్రేయస్ వచ్చే ఏడాది న్యూజిలాండ్‌తో జరిగే సిరీస్ సమయానికంతా సిద్దంగా ఉంటాడని అంతా అనుకున్నారు.తాజా అప్డేట్ని బట్టి చూస్తే ఇప్పట్లో శ్రేయస్‌ను టీమిండియా జెర్సీలో చూడటం కష్టమేనని స్పష్టమవుతుంది.కాగా, అక్టోబర్ 25న ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సందర్భంగా అలెక్స్ క్యారీ క్యాచ్ పట్టే ప్రయత్నంలో శ్రేయస్ ప్రమాదకరంగా కిందపడ్డాడు. క్యాచ్ అయితే పట్టగలిగాడు కాని, ప్రాణం మీదికి తెచ్చుకున్నాడు. కిందపడ్డాక నొప్పితో విలవిలలాడిపోయిన శ్రేయస్‌ను హుటాహుటిన సిడ్నీలోని ఆసుపత్రికి తీసుకెళ్లగా వైద్యులు ఐసీయూలో పెట్టి చికిత్సనందించారు. తొలుత గాయం చిన్నదే అని అంతా అనుకున్నారు.అయితే డాక్టర్లు నెమ్మదిగా విషయాన్ని చెప్పారు. శ్రేయస్ స్ప్లీన్‌లో (ప్లీహం) చీలక వచ్చి, అంతర్గత రక్తస్రావమైందని తెలిపారు. ఒకటి, రెండు రోజుల వరకు ఏమీ చెప్పలేమని అన్నారు.అయితే దైవానుగ్రహం, డాక్టర్లు కృషి వల్ల శ్రేయస్ ప్రాణాపాయం నుంచి తప్పించుకుని సాధారణ స్థితికి చేరాడు. ప్రస్తుతం అతను మునుపటిలా యాక్టివ్‌గా ఉన్నప్పటికీ.. క్రికెట్‌కు మాత్రం ఇంకొంతకాలం దూరంగా ఉండాల్సిన పరిస్థితి ఉంది. చదవండి: యాషెస్ సిరీస్‌కు అదిరిపోయే ఆరంభం -
ముచ్చల్‌తో నిశ్చితార్థాన్ని ధ్రువీకరించిన మంధన
భారత మహిళా జట్టు స్టార్ క్రికెటర్, టీమిండియా 'క్వీన్' స్మృతి మంధన (Smriti Mandhana) త్వరలో పెళ్లి పీఠలెక్కబోతుందన్న ప్రచారం నిజమైంది. సంగీత దర్శకుడు, సింగర్ పాలాష్ ముచ్చల్‌తో (Palash Muchhal) నిశ్చితార్థాన్ని మంధన స్వయంగా ధ్రువీకరించింది. ఇన్‌స్టాగ్రామ్‌లో సహచరి జెమిమా రోడ్రిగ్స్ షేర్ చేసిన వీడియోలో మంధన తన చేతి వేలికి ఉన్న డైమండ్ రింగ్‌ను చూపిస్తూ మున్నా భాయ్ MBBS సినిమాలోని "సమ్జో హో హీ గయా" పాటకు డ్యాన్స్ చేసింది. ఆ వీడియోను మంధన స్వయంగా రీపోస్ట్ చేస్తూ, ముచ్చల్‌తో తన నిశ్చితార్థాన్ని అఫీషియల్ చేసింది. మంధన-ముచ్చల్ 2019లో స్నేహితుల ద్వారా కలుసుకున్నారు. సంగీతం, క్రీడలపై ఆసక్తి వారిని దగ్గర చేసింది. ఐదు సంవత్సరాల డేటింగ్ అనంతరం 2024లో వీరు తమ అనుబంధాన్ని బహిర్గతం చేశారు. ముచ్చల్ తరచూ మంధన ఆడే మ్యాచ్‌లలో కనిపిస్తూ ఆమెకు మద్దతు పలుకుతుంటాడు. మంధన-ముచ్చల్ వివాహా తేదీపై ఎలాంటి అధికారిక ప్రకటన లేనప్పటికీ, సోషల్‌మీడియాలో వీరి పెళ్లికి సంబంధించిన ఓ ఆహ్వాన పత్రిక వైరలవుతుంది. దీని ప్రకారం వీరి పెళ్లి మరికొద్ది రోజుల్లో (నవంబర్ 23న) జరగనుంది. ప్రీ వెడ్డింగ్ వేడుకలు మధ్యప్రదేశ్‌లోని ఇండోర్, సాంగ్లీల్లో జరుగనున్నట్లు తెలుస్తుంది. ఇందుకు సన్నాహకాలు కూడా పూర్తయ్యాయని సమాచారం. మంధన ఇటీవలే భారత్‌ను వన్డే ప్రపంచ ఛాంపియన్‌గా నిలబెట్టడంతో కీలకపాత్ర పోషించిన విషయం తెలిసిందే. జగజ్జేతగా నిలిచిన కొద్ది రోజుల్లోనే మంధన జీవితంలో మరో పెద్ద విజయోత్సవం జరగడం ఖాయమైంది. మంధన-ముచ్చల్ వివాహాం క్రికెట్‌తో పాటు సంగీత అభిమానుల్లోనే ఆనందాన్ని నింపనుంది. చదవండి: కెప్టెన్‌గా ఇషాన్ కిషన్ పేరు ప్రకటన -
వన్డే ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల
2026 పురుషుల అండర్ 19 ప్రపంచకప్ (వన్డే) షెడ్యూల్‌ను ఐసీసీ ఇవాళ (నవంబర్ 19) విడదల చేసింది. 16 జట్లు పాల్గొనే ఈ మెగా టోర్నీలోని తొలి మ్యాచ్‌లో గత ఎడిషన్ రన్నరప్ భారత్, యూఎస్ తలపడనున్నాయి. అదే రోజు జింబాబ్వే, స్కాట్లాండ్, టాంజానియా, వెస్టిండీస్ మ్యాచ్‌లు కూడా జరుగనున్నాయి.జింబాబ్వే, నమీబియా సంయుక్తంగా ఆతిథ్యమివ్వనున్న ఈ టోర్నీ వచ్చే ఏడాది (2026) జనవరి 15 నుంచి ఫిబ్రవరి 6 మధ్యలో జరుగనుంది. మూడు వారాల పాటు జరిగే ఈ టోర్నీలో మొత్తం 41 మ్యాచ్‌లు జరుగనున్నాయి. ఫిబ్రవరి 6న హరారేలో జరిగే ఫైనల్‌తో ఈ టోర్నీ ముగుస్తుంది.డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా వారి తొలి మ్యాచ్‌ను జనవరి 16న ఐర్లాండ్‌తో ఆడుతుంది. ఈ టోర్నీలోని మ్యాచ్‌లు రెండు ఆతిథ్య దేశాల్లోని ఐదు మైదానాల్లో జరుగుతాయి. ఈ టోర్నీలో పాల్గొనే 16 జట్లను నాలుగు గ్రూప్‌లుగా విభజించారు. అనంతరం సూపర్-6, సెమీఫైనల్స్, ఫైనల్స్ జరుగుతాయి. ఈ టోర్నీకి సంబంధించిన వార్మప్ మ్యాచ్‌లు జనవరి 9-14 మధ్యలో జరుగుతాయి.గ్రూప్‌లు..గ్రూప్-ఏ- భారత్, బంగ్లాదేశ్, యూఎస్ఏ, న్యూజిలాండ్గ్రూప్-బి- జింబాబ్వే, పాకిస్తాన్, ఇంగ్లండ్, స్కాట్లాండ్గ్రూప్-సి- ఆస్ట్రేలియా, ఐర్లాండ్, జపాన్, శ్రీలంకగ్రూప్-డి- వెస్టిండీస్, టాంజానియా, ఆఫ్ఘనిస్తాన్, సౌతాఫ్రికా View this post on Instagram A post shared by Zimbabwe Cricket (@zimbabwe.cricket)చదవండి: టీమిండియాకు భంగపాటు -
టీమిండియాకు భంగపాటు
రాజ్‌కోట్ వేదికగా సౌతాఫ్రికా-ఏతో ఇవాళ (నవంబర్ 19) జరిగిన మూడో వన్డేలో భారత-ఏ జట్టుకు భంగపాటు ఎదురైంది. ఈ మ్యాచ్‌లో భారత యువ జట్టు బౌలింగ్, బ్యాటింగ్ విభాగాల్లో దారుణంగా విఫలమైంది. ఫలితంగా పర్యాటకుల చేతిలో 73 పరుగుల తేడాతో పరాజయంపాలైంది. ఇది వరకే సిరీస్ కోల్పోయిన సౌతాఫ్రికాకు ఇది కంటితుడుపు విజయం. మూడు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో భారత్ తొలి రెండు వన్డేలు గెలిచి సిరీస్‌ను కైవసం చేసుకుంది.ఓపెనర్ల శతకాలుటాస్ ఓడి భారత్ ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా భారీ స్కోర్ (325/6) చేసింది. ఓపెనర్లు లూహాన్ డ్రి ప్రిటోరియస్ (123), రివాల్లో మూన్సామి (107) అద్బుత శతకాలు సాధించారు. వీరిద్దరు ఔటయ్యాక సౌతాఫ్రికా స్కోర్ నెమ్మదించింది. ఆతర్వాత వచ్చిన రుబిన్ హెర్మన్ (11), క్వెషైల్ (1), కెప్టెన్ ఆకెర్మన్ (16), డియాన్ ఫార్రెస్టర్ (20) తక్కువ స్కోర్లకే ఔటయ్యారు. వీరంతా కూడా రాణించి ఉంటే సౌతాఫ్రికా ఇంకాస్త భారీ స్కోర్ చేసేది. ఆఖర్లో డెలానో పాట్గెటర్ (30 నాటౌట్) సుడిగాలి ఇన్నింగ్స్ ఆడి సౌతాఫ్రికా స్కోర్‌ను 300 మార్కు దాటించాడు. ఈ మ్యాచ్‌లో భారత బౌలర్లు ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. ముఖ్యంగా ఖలీల్ అహ్మద్ 10 ఓవర్లలో 82 పరుగులిచ్చాడు (2 వికెట్లు). హర్షిత్ రాణా (10-1-47-2), ప్రసిద్ద్ కృష్ణ (10-0-52-2) సౌతాఫ్రికా బ్యాటర్లను కాస్త నిలువరించగలిగారు.టాపార్డర్ వైఫల్యం326 పరుగుల భారీ లక్ష్య ఛేదనకు దిగిన భారత్ ఆది నుంచే క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయింది. ఇన్ ఫామ్ బ్యాటర్ రుతురాజ్ గైక్వాడ్ (25) సహా టాపార్డర్ అంతా దారుణంగా విఫలమైంది. విధ్వంసకర బ్యాటర్ అభిషేక్ శర్మ, కెప్టెన్ తిలక్ వర్మ తలో 11, రియాన్ పరాగ్ 17 పరుగులు చేసి ఔటయ్యారు. ఆతర్వాత ఇషాన్ కిషన్ (53), ఆయుశ్ బదోని (66) కాసేపు పోరాడారు. అయితే అప్పటికే భారత ఓటమి ఖరారైపోయింది. నకాబా పీటర్ (10-0-48-4), మొరేకి (9.1-0-58-3), ఫోర్టుయిన్ (10-0-48-2) అద్భుతంగా బౌలింగ్ చేసి భారత్‌ను 252 పరుగులకే కట్టడి చేశారు. చదవండి: 'మరో' చరిత్రకు అడుగు దూరంలో బంగ్లాదేశ్ దిగ్గజం -
భారత్-బంగ్లాదేశ్ సిరీస్ రద్దు..!
భారత్, బంగ్లాదేశ్ (India vs Bangladesh) మహిళా క్రికెట్ జట్ల మధ్య వచ్చే నెలలో (డిసెంబర్) జరగాల్సిన పరిమిత ఓవర్ల సిరీస్ (మూడు వన్డేలు, మూడు టీ20లు) రద్దైనట్లు తెలుస్తుంది. ఇరు దేశాల మధ్య పెరుగుతున్న రాజకీయ ఉద్రిక్తతల కారణంగా ఈ సిరీస్‌కు అనుమతి లభించలేదని బీసీసీఐ వర్గాల సమాచారం. ఐసీసీ ఫ్యూచర్ టూర్ ప్రోగ్రామ్‌లో (FTP) భాగమైన ఈ సిరీస్‌కు సంబంధించి ఖచ్చితమైన తేదీలు, వేదికలు ఖరారు కావాల్సి ఉండింది. ఈ లోపే రద్దు నిర్ణయం వెలువడిందంటూ ఓ ప్రముఖ వార్తా సంస్థ వెల్లడించింది. ఈ సిరీస్ జరగాల్సిన సమయంలో (డిసెంబర్ మూడో వారం) బీసీసీఐ ప్రత్యామ్నాయ హోమ్ సిరీస్‌కు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. జనవరి మొదటి వారంలో ప్రారంభమయ్యే మహిళల ప్రీమియర్ లీగ్ (WPL) దృష్ట్యా ఈ సిరీస్ చిన్నదిగా ఉండే అవకాశం ఉందని సమాచారం. డబ్ల్యూపీఎల్ తర్వాత టీమిండియా ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లాల్సి ఉంది. కాగా, కొద్ది రోజుల కిందట పురుషుల క్రికెట్లో భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య జరగాల్సిన సిరీస్ వాయిదా పడింది. ఆగస్టులో భారత పురుషుల జట్టు పరిమిత ఓవర్ల సిరీస్ కోసం బంగ్లాదేశ్‌లో పర్యటించాల్సి ఉండింది. అయితే బిజీ షెడ్యూల్ కారణంగా ఆ సిరీస్‌ను వచ్చే ఏడాది సెప్టెంబర్‌కు మార్చారు.ఇదిలా ఉంటే, తాజాగా ముగిసిన మహిళల వన్డే ప్రపంచకప్‌లో భారత్ ఛాంపియన్‌గా అవతరించిన విషయం తెలిసిందే. ఆ టోర్నీలో చివరి జట్టుగా సెమీస్‌కు అర్హత సాధించిన టీమిండియా.. సెమీస్‌లో ఆసీస్‌ను, ఫైనల్స్‌లో దక్షిణాఫ్రికాను చిత్తు చేసి విశ్వవిజేతగా అవతరించింది. భారత మహిళల జట్టుకు ఇదే తొలి ప్రపంచకప్. చదవండి: బాబర్ ఆజమ్‌కు భారీ షాక్ -
చరిత్ర సృష్టించిన రుతురాజ్ గైక్వాడ్
టీమిండియా యువ ఆటగాడు రుతురాజ్ గైక్వాడ్ (Ruturaj Gaikwad) సరికొత్త చరిత్ర సృష్టించాడు. లిస్ట్-ఏ క్రికెట్లో (50 ఓవర్ల ఫార్మాట్, అంతర్జాతీయ వన్డేలు సహా) అత్యధిక సగటు కలిగిన భారత ఆటగాడిగా అవతరించాడు. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా సౌతాఫ్రికా-ఏ నిన్న (నవంబర్ 16) జరిగిన మ్యాచ్‌లో ఈ ఘనత సాధించాడు. ఈ మ్యాచ్‌లో అజేయ అర్ద సెంచరీ (83 బంతుల్లో 68 నాటౌట్) సాధించిన తర్వాత రుతురాజ్ లిస్ట్-ఏ సగటు 57.80కి చేరింది. తద్వారా చతేశ్వర్ పుజారాను (57.01) అధిగమించి లిస్ట్-ఏ క్రికెట్లో అత్యధిక సగటు కలిగిన భారత ఆటగాడిగా అవతరించాడు.ఓవరాల్‌గా.. లిస్ట్-ఏ క్రికెట్లో అత్యధిక సగటు కలిగిన ఆటగాళ్ల జాబితాలో రుతురాజ్ కంటే ముందు కేవలం ఒకే ఒక ఆటగాడు ఉన్నాడు. ఆస్ట్రేలియా వైట్ బాల్ దిగ్గజం మైఖేల్ బెవాన్ (57.86) మాత్రమే రుతురాజ్ కంటే ముందున్నాడు.లిస్ట్-ఏ క్రికెట్లో అత్యధిక సగటు కలిగిన టాప్-5 బ్యాటర్లు..మైఖేల్ బెవాన్-57.86 (427 ఇన్నింగ్స్‌లు)రుతురాజ్ గైక్వాడ్-57.80 (85 ఇన్నింగ్స్‌లు)సామ్ హెయిన్-57.76 (64 ఇన్నింగ్స్‌లు)చతేశ్వర్ పుజారా-57.01 (130 ఇన్నింగ్స్‌లు)విరాట్ కోహ్లి-56.66 (339 ఇన్నింగ్స్‌లు)ఇప్పటివరకు కెరీర్లో 85 లిస్ట్-ఏ ఇన్నింగ్స్‌లు ఆడిన రుతురాజ్ 17 శతకాలు, 18 అర్ద శతకాల సాయంతో 4509 పరుగులు చేశాడు. ఈ ఫార్మాట్లో అతని అత్యధిక స్కోర్ 220 నాటౌట్‌గా ఉంది.భీకర ఫామ్ప్రస్తుతం సౌతాఫ్రికా-ఏతో జరుగుతున్న మూడు అనధికారిక వన్డే సిరీస్‌లో రుతురాజ్ భీకర ఫామ్‌లో ఉన్నాడు. రెండో వన్డేలో అజేయ అర్ద శతకంతో భారత్ గెలుపులో కీలకపాత్ర పోషించిన అతను.. అంతకుముందు తొలి వన్డేలో అద్భుత శతకం (129 బంతుల్లో 117) బాదాడు. రెండో వన్డేలో గెలుపుతో భారత్, మరో మ్యాచ్ మిగిలుండగానే 2-0తో సిరీస్‌ను కైవసం చేసుకుంది. నామమాత్రపు మూడో వన్డే నవంబర్ 19న రాజ్‌కోట్‌లో జరుగనుంది. చదవండి: పాక్ ప్లేయర్‌కు దిమ్మతిరిగే కౌంటరిచ్చిన వైభవ్ సూర్యవంశీ -
సొంతగడ్డపై ఘోర పరాభవం
విజయానికి 124 పరుగులు కావాలి...గతంలో సొంతగడ్డపై ఇంత తక్కువ లక్ష్యాన్ని ఛేదించడంలో భారత్ ఎప్పుడూ విఫలం కాలేదు...గిల్ లేకపోయినా బ్యాటింగ్ చేయగల సమర్థులు ఏడుగురు ఉన్నారు... పిచ్ ఎలాంటిదైనా కాస్త పట్టుదల కనబరిస్తే సునాయాసంగా ఛేదించగల స్కోరే... కానీ టీమిండియా ఒక్కసారిగా కుప్పకూలింది...రెండో ఇన్నింగ్స్ ఆరంభంలో పేస్‌కు, ఆ తర్వాత ప్రత్యర్థి స్పిన్ ముందు బ్యాటర్లు తలవంచారు. మనకు అనుకూలిస్తుందనుకున్న స్పిన్ పిచ్ సఫారీలకు అంది వచ్చింది. సరిగ్గా ఏడాది క్రితం న్యూజిలాండ్ చేతిలో చిత్తయిన తీరును గుర్తుకు చేస్తూ భారత్ స్వదేశంలో మరో పరాభవాన్ని మూటగట్టుకోగా, వరల్డ్ టెస్టు చాంపియన్ దక్షిణాఫ్రికా పదిహేనేళ్ల తర్వాత భారత గడ్డపై టెస్టు గెలిచి సంబరాలు చేసుకుంది. పదేళ్ల క్రితం అనామకుడిగా ఇక్కడ అడుగు పెట్టి భారత బ్యాటర్ల చేతిలో చావు దెబ్బ తిన్న ఆఫ్‌స్పిన్నర్ సైమన్ హార్మర్ దశాబ్దం తర్వాత ఒక అరుదైన విజయాన్ని రచించడం విశేషం. కోల్‌కతా: భారత టెస్టు జట్టుకు స్వదేశంలో అనూహ్య షాక్...ఈడెన్ గార్డెన్లో స్పిన్ పిచ్ కోరుకొని నలుగురు స్పిన్నర్లతో బరిలోకి దిగిన జట్టు చివరకు ప్రత్యర్థి స్పిన్ దెబ్బకే తలవంచింది. ఆదివారం మూడో రోజే ముగిసిన తొలి టెస్టులో దక్షిణాఫ్రికా 30 పరుగుల తేడాతో భారత్‌పై విజయం సాధించింది. 124 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ తమ రెండో ఇన్నింగ్స్‌లో 35 ఓవర్లలో 93 పరుగులకే ఆలౌటైంది. వాషింగ్టన్ సుందర్ (92 బంతుల్లో 31; 2 ఫోర్లు)దే అత్యధిక స్కోరు. సఫారీ బౌలర్లలో సైమన్ హార్మర్ 4, కేశవ్ మహరాజ్, మార్కో యాన్సెన్ చెరో 2 వికెట్లు తీశారు. అంతకు ముందు ఓవర్‌నైట్ స్కోరు 93/7తో ఆట కొనసాగించిన దక్షిణాఫ్రికా తమ రెండో ఇన్నింగ్స్‌లో 54 ఓవర్లలో 153 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ తెంబా బవుమా (136 బంతుల్లో 55 నాటౌట్; 4 ఫోర్లు) కీలక అర్ధ సెంచరీతో జట్టును ఆదుకున్నాడు. జడేజాకు 4 వికెట్లు దక్కాయి. మ్యాచ్‌లో మొత్తం 8 వికెట్లు పడగొట్టిన హార్మర్ ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలిచాడు. రెండు మ్యాచ్‌లో సిరీస్‌లో దక్షిణాఫ్రికా 1–0తో ముందంజ వేయగా, నవంబర్ 22 నుంచి గువహటిలో రెండో టెస్టు జరుగుతుంది. రెండో రోజు మెడకు గాయం కావడంతో ఆట నుంచి తప్పుకొని ఆస్పత్రిలో చేరిన భారత కెపె్టన్ శుబ్‌మన్ గిల్ ఆదివారం వైద్యుల పర్యవేక్షణలో ఉండటంతో రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు రాలేకపోయాడు. కోలుకున్న గిల్ ఆదివారం సాయంత్రం ఆస్పత్రినుంచి డిశ్చార్జ్ అయ్యాడు. ఆదుకున్న బవుమా... ఆదివారం మైదానంలోకి వచ్చే సమయానికి భారత్ విజయంపై ధీమాగా ఉంది. మిగిలిన 3 వికెట్లు తీసేందుకు ఎక్కువ సమయం పట్టదనిపించింది. అయితే మన స్పిన్నర్లు ప్రభావం చూపలేకపోగా, పదునైన డిఫెన్స్‌తో పట్టుదలగా నిలిచిన బవుమా సింగిల్స్‌తో పరుగులు జోడిస్తూ పోయాడు. కొద్ది సేపు దూకుడుగా ఆడిన కార్బిన్ బాష్ (37 బంతుల్లో 25; 2 ఫోర్లు, 1 సిక్స్), బవుమా కలిసి ఎనిమిదో వికెట్‌కు 44 పరుగులు జోడించారు. చివరకు బాష్‌ను బుమ్రా బౌల్డ్ చేయగా...సిరాజ్ ఒకే ఓవర్లో చివరి రెండు వికెట్లు పడగొట్టాడు. సుందర్ మినహా... ఇన్నింగ్స్ తొలి ఓవర్లోనే జైస్వాల్ (0)ను అవుట్ చేసిన యాన్సెన్, తన రెండో ఓవర్లో రాహుల్ (1)ను పెవిలియన్‌కు పంపి దెబ్బ కొట్టాడు. ఈ దశలో 32 పరుగులు జత చేసి సుందర్, జురేల్ (13) జట్టును ముందుకు నడిపించారు. అయితే జురేల్, పంత్ (2) చెత్త షాట్లతో వెనుదిరిగారు. ఇలాంటి స్థితిలోనూ సుందర్, రవీంద్ర జడేజా (18) భాగస్వామ్యంతో జట్టు గెలుపుపై ఆశలు చిగురించాయి. కానీ సఫారీ స్పిన్నర్లు మళ్లీ పైచేయి సాధించారు. వీరిద్దరు 8 పరుగుల తేడాతో అవుట్ కాగా, కుల్దీప్ (1) వారిని అనుసరించాడు. గెలుపునకు మరో 47 పరుగులు చేయాల్సిన స్థితిలో అక్షర్ పటేల్ (17 బంతుల్లో 26; 1 ఫోర్, 2 సిక్స్‌లు) కాస్త సాహసం ప్రదర్శించాడు. మహరాజ్ ఓవర్లో తొలి నాలుగు బంతుల్లో ఒక ఫోర్, 2 సిక్స్‌లు బాది 16 పరుగులు రాబట్టాడు. చివరకు మహరాజ్దే పైచేయి అయింది. ఐదో బంతికి మరో భారీ షాట్‌కు ప్రయతి్నంచి అక్షర్ వెనుదిరగ్గా, తర్వాతి బంతికే సిరాజ్ (0) అవుట్ కావడంలో దక్షిణాఫ్రికా శిబిరంలో సంబరాలు మొదలయ్యాయి. స్కోరు వివరాలు దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్ 159; భారత్ తొలి ఇన్నింగ్స్ 189; దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్ 153; భారత్ రెండో ఇన్నింగ్స్: జైస్వాల్ (సి) వెరీన్ (బి) యాన్సెన్ 0; రాహుల్ (సి) వెరీన్ (బి) యాన్సెన్ 1; సుందర్ (సి) హార్మర్ (బి) మార్క్రమ్ 31; జురేల్ (సి) బాష్ (బి) హార్మర్ 13; పంత్ (సి) అండ్ (బి) హార్మర్ 2; జడేజా (ఎల్బీ) (బి) హార్మర్ 18; అక్షర్ (సి) బవుమా (బి) మహరాజ్ 26; కుల్దీప్ (ఎల్బీ) (బి) హార్మర్ 1; బుమ్రా (నాటౌట్) 0; సిరాజ్ (సి) మార్క్రమ్ (బి) మహరాజ్ 0; గిల్ (ఆబ్సెంట్ హర్ట్); ఎక్స్‌ట్రాలు 1; మొత్తం (35 ఓవర్లలో ఆలౌట్) 93. వికెట్ల పతనం: 1–0, 2–1, 3–33, 4–38, 5–64, 6–72, 7–77, 8–93, 9–93. బౌలింగ్: యాన్సెన్ 7–3–15–2, హార్మర్ 14–4–21–4, మహరాజ్ 9–1–37–2, బాష్ 2–0–14–0, మార్క్రమ్ 3–0–5–1. బ్యాటింగ్ చేయలేనంత ఇబ్బందికరంగా పిచ్ ఏమీ లేదు. మేం సరిగ్గా ఇలాంటి పిచ్‌నే కోరుకున్నాం. తొలి రోజు నుంచే స్పిన్నర్లకు అనుకూలిస్తే టాస్ ప్రభావం తగ్గించవచ్చని భావించాం. క్యురేటర్ కూడా అదే ఇచ్చారు. మేం మ్యాచ్ గెలిచి ఉంటే పిచ్‌పై ఇంత చర్చ జరిగేది కాదు. మంచి డిఫెన్స్ ఉంటే పరుగులు సాధించవచ్చు. మీరు మానసికగా ఎంత దృఢంగా ఉన్నారో ఇక్కడ తెలుస్తుంది. బవుమా, అక్షర్, సుందర్ పరుగులు రాబట్టారు కదా’ –గౌతమ్ గంభీర్, భారత కోచ్ -
హడలెత్తించిన బుమ్రా
కోల్‌కతా: పిచ్ ఎలా ఉన్నా... చక్కటి లైన్ అండ్ లెంగ్త్‌తో బంతులు వేస్తే... వికెట్లు రావడం కష్టమేమీ కాదని భారత పేస్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా మరోసారి నిరూపించాడు. పిచ్ స్పిన్నర్లకు అనుకూలిస్తుందని అంచనా వేసిన భారత కెప్టన్ శుబ్‌మన్ గిల్ ఏకంగా నలుగురు స్పిన్నర్లను తుది జట్టులోకి తీసుకున్నాడు. అయితే బుమ్రా నిప్పులు చెరిగే బంతులతో దక్షిణాఫ్రికా బ్యాటర్లను హడలెత్తించాడు. తొలి ఇన్నింగ్స్‌లో భారత స్పిన్నర్లకు పెద్దగా పని లేకుండా చేశాడు. బుమ్రా పేస్‌కు తోడు మరో పేసర్ సిరాజ్ కూడా మెరిపించడం... ఎడంచేతి వాటం స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్ తమ వంతుగా రాణించడం... వెరసి భారత జట్టుతో శుక్రవారం మొదలైన తొలి టెస్టులో తొలి రోజే దక్షిణాఫ్రికాకు కష్టాలు మొదలయ్యాయి. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 55 ఓవర్లలో 159 పరుగులకే ఆలౌటైంది. ఓపెనర్లు మార్క్రమ్ (48 బంతుల్లో 31; 5 ఫోర్లు, 1 సిక్స్), రికెల్టన్ (22 బంతుల్లో 23; 4 ఫోర్లు) తొలి వికెట్‌కు 57 పరుగులు జోడించడంతో దక్షిణాఫ్రికాకు శుభారంభం లభించినట్టే అనిపించింది. అయితే ఒక్కసారి బుమ్రా దెబ్బకు అంతా తారుమారైంది. ఐదు పరుగుల వ్యవధిలో మార్క్రమ్, రికెల్టన్లను బుమ్రా పెవిలియన్‌కు పంపించగా... కెపె్టన్ బవూమా (3)ను కుల్దీప్ అవుట్ చేశాడు. దాంతో 57/0తో పటిష్టంగా కనిపించిన దక్షిణాఫ్రికా 71/3తో కష్టాల్లో పడింది. ఆ తర్వాత ముల్డర్ (51 బంతుల్లో 24; 3 ఫోర్లు), టోనీ జోర్జి (55 బంతుల్లో 24; 1 ఫోర్, 1 సిక్స్) నింపాదిగా ఆడి వికెట్ల పతనాన్ని నిలువరించారు. నాలుగో వికెట్‌కు వీరిద్దరు 43 పరుగులు జోడించారు. దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ గాడిలో పడిందనుకున్న తరుణంలో కుల్దీప్, బుమ్రా మళ్లీ మెరిశారు. ముల్డర్‌ను కుల్దీప్... జోర్జిని బుమ్రా అవుట్ చేశారు. దాంతో దక్షిణాఫ్రికా 120 పరుగులకే సగం వికెట్లు కోల్పోయింది. ట్రిస్టన్ స్టబ్స్ (74 బంతుల్లో 15 నాటౌట్; 1 ఫోర్), వెరీన్ (36 బంతుల్లో 16; 2 ఫోర్లు) నిలదొక్కుకోవడానికి ప్రయత్నించినా... వెరీన్ను సిరాజ్ అవుట్ చేయడంతో దక్షిణాఫ్రికాకు దెబ్బ పడింది. చివరి ఐదు వికెట్లను దక్షిణాఫ్రికా 13 పరుగుల వ్యవధిలో కోల్పోయి చివరకు 159 పరుగులకే పరిమితమైంది. దక్షిణాఫ్రికా జట్టును తక్కువ స్కోరుకే పరిమితం చేసిన భారత్ కూడా బ్యాటింగ్‌కు ఇబ్బంది పడింది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 20 ఓవర్లు ఆడి ఒక వికెట్ కోల్పోయి 37 పరుగులు సాధించింది. స్కోరు వివరాలు దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్: మార్క్రమ్ (సి) పంత్ (బి) బుమ్రా 31; రికెల్టన్ (బి) బుమ్రా 23; ముల్డర్ (ఎల్బీడబ్ల్యూ) (బి) కుల్దీప్ 24; బవుమా (సి) జురేల్ (బి) కుల్దీప్ 3; టోనీ జోర్జి (ఎల్బీడబ్ల్యూ) (బి) బుమ్రా 24; స్టబ్స్ (నాటౌట్) 15; వెరీన్ (ఎల్బీడబ్ల్యూ) (బి) సిరాజ్ 16; మార్కో యాన్సెన్ (బి) సిరాజ్ 0; కార్బిన్ బాష్ (ఎల్బీడబ్ల్యూ) (బి) అక్షర్ పటేల్ 3; హార్మెర్ (బి) బుమ్రా 5; కేశవ్ మహరాజ్ (ఎల్బీడబ్ల్యూ) (బి) బుమ్రా 0; ఎక్స్‌ట్రాలు 15; మొత్తం (55 ఓవర్లలో ఆలౌట్) 159; వికెట్ల పతనం: 1–57, 2–62, 3–71, 4–114, 5–120, 6–146, 7–147, 8–154, 9–159, 10–159. బౌలింగ్: బుమ్రా 14–5–27–5, సిరాజ్ 12–0–47–2, అక్షర్ పటేల్ 6–2–21–1, కుల్దీప్ యాదవ్ 14–1–36–2, రవీంద్ర జడేజా 8–2–13–0, వాషింగ్టన్ సుందర్ 1–0–3–0. భారత్ తొలి ఇన్నింగ్స్: యశస్వి జైస్వాల్ (బి) మార్కో యాన్సెన్ 12; కేఎల్ రాహుల్ (బ్యాటింగ్) 13; వాషింగ్టన్ సుందర్ (బ్యాటింగ్) 6; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (20 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి) 37. వికెట్ల పతనం: 1–18, బౌలింగ్: మార్కో యాన్సెన్ 6–2–11–1, ముల్డర్ 5–1–15–0, కేశవ్ మహరాజ్ 5–1–8–0, కార్బిన్ బాష్ 3–2–1–0, హార్మెర్ 1–1–0–0. 2012భారత జట్టు చివరిసారి 2012లో ఒకే టెస్టులో నలుగురు స్పిన్నర్లను ఆడించింది. నాగ్‌పూర్ వేదికగా 2012 డిసెంబర్ 13 నుంచి 17 వరకు ఇంగ్లండ్‌తో ‘డ్రా’గా ముగిసిన మ్యాచ్‌లో భారత్ తరఫున నలుగురు స్పిన్నర్లు అశి్వన్, రవీంద్ర జడేజా, పీయూష్ చావ్లా, ప్రజ్ఞాన్ ఓజా బరిలోకి దిగారు. ఇదే మ్యాచ్‌తో జడేజా టెస్టుల్లో అరంగేట్రం చేయగా... ప్రస్తుతం టీమిండియా హెడ్ కోచ్‌గా ఉన్న గౌతమ్ గంభీర్ ఆ మ్యాచ్‌లో రెండు ఓవర్లు వేయడం విశేషం. -
నేపాల్ ప్రీమియర్ లీగ్ ఆడనున్న మరో భారత స్టార్ క్రికెటర్
నేపాల్ ప్రీమియర్ లీగ్‌లో (NPL) మరో భారత స్టార్ క్రికెటర్ అడుగు పెట్టబోతున్నాడు. తొలుత ఈ లీగ్‌లో టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ శిఖర్ ధవన్ (Shikhar Dhawan) ఆడాడు. తాజాగా దేశవాలీ స్టార్ ప్రియాంక్ పంచల్ (Priyank Panchal) ఎన్పీఎల్ ఆడేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. త్వరలో ప్రారంభం కానున్న 2025 ఎడిషన్ కోసం పంచల్ కర్నాలి యాక్స్ ఫ్రాంచైజీతో చేతులు కలిపాడు. పంచల్ చేరికతో ఎన్పీఎల్లో విదేశీ క్రికెటర్ల సంఖ్య 5కు (శిఖర్ ధవన్, జేమ్స్ వాట్, జేమ్స్ ఓడౌడ్ (నెదర్లాండ్స్), విలియం బాసిస్టో (ఆస్ట్రేలియా)) చేరింది.గుజరాత్‌కు చెందిన 35 పంచల్‌కు దేశవాలీ సూపర్ స్టార్‌గా పేరుంది. 127 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ల్లో 45.18 సగటు, 23 సెంచరీలతో 8856 పరుగులు సాధించాడు. అయినా అతనికి భారత జట్టుకు ప్రాతినిథ్యం వహించే అవకాశం రాలేదు. భారత సెలెక్టర్ల నుంచి పిలుపు కోసం కళ్లకు ఒత్తులు పెట్టుకొని ఎదురుచూసి, ఇటీవలే రిటైర్మెంట్ ప్రకటించాడు. తాజాగా జరిగిన హాంగ్‌కాంగ్ సిక్సస్ టోర్నీలో పంచల్ భారత జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. రంజీ ట్రోఫీలో పంచల్‌కు 2016-17 సీజన్ డ్రీమ్ సీజన్. ఆ సీజన్లో అతను ట్రిపుల్ సెంచరీ సాయంతో 1310 పరుగులు చేశాడు.కాగా, ప్రస్తుతం పంచల్ ఒప్పందం చేసుకున్న కర్నాలి యాక్స్ ఫ్రాంచైజీకే శిఖర్ ధవన్ గత నేపాల్ ప్రీమియర్ లీగ్ సీజన్లో ఆడాడు. యాక్స్ తరఫున మార్కీ ప్లేయర్‌గా ఎంట్రీ ఇచ్చిన ధవన్ గత సీజన్లో ఓ మెరుపు అర్ద శతకం బాది ఆకట్టుకున్నాడు. ఈ సీజన్‌కు ధవన్ అందుబాటులో ఉంటాడా లేదా అన్నదానిపై స్పష్టత లేదు. చదవండి: రోహిత్ శర్మకు సంబంధించి బిగ్ న్యూస్ -
రోహిత్ శర్మకు సంబంధించి బిగ్ న్యూస్
టీమిండియా వెటరన్ ఓపెనర్ రోహిత్ శర్మకు (Rohit Sharma) సంబంధించిన ఓ వార్త సోషల్‌మీడియాలో వైరలవుతోంది. దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌కు సన్నాహకంగా రోహిత్ దేశవాలీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీ ఆడేందుకు (ముంబై తరఫున) సిద్దంగా ఉన్నాడని ప్రచారం జరుగుతుంది.ఈ టోర్నీలో పాల్గొనే విషయాన్ని రోహిత్ మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్‌కు తెలియజేశాడని, వారు కూడా సంతృప్తి వ్యక్తం చేశారని వార్తలు వస్తున్నాయి. విజయ్ హజారే ట్రోఫీతో పాటు కుదిరితే దేశవాలీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలోనూ రోహిత్ పాల్గొంటాడని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.ఈ విషయంపై తాజాగా మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ సెలెక్టర్ సంజయ్ పాటిల్ స్పందించాడు. ఈ ప్రచారంలో ఎలాంటి నిజం లేదని కొట్టి పారేశాడు. విజయ్ హజారే టోర్నీలో కానీ సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో కానీ ఆడాలనుకున్న విషయాన్ని రోహిత్ తమ దృష్టికి తేలేదని స్పష్టం చేశాడు.ప్రస్తుత పరిస్థితుల్లో రోహిత్ ముంబై తరఫున ఆడితే అది గొప్ప విషయని అన్నాడు. యువ ఆటగాళ్లకు ప్రేరణగా ఉంటుందని తెలిపాడు. ఆటగాళ్లు ఎంతటి వారైనా, జాతీయ జట్టు అవకాశాలు రావాలంటే దేశవాలీ క్రికెట్లో తప్పక ఆడాలని రూల్ పెట్టిన బీసీసీఐ, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగర్కార్, కోచ్ గౌతమ్ గంభీర్‌కు ధన్యవాదాలు తెలిపాడు.కాగా, ఇటీవలికాలంలో టీమిండియా వెటరన్ స్టార్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి భవిష్యత్‌పై చర్చలు ఎక్కువయ్యాయి. ప్రస్తుతం వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్న ఈ ఇద్దరు.. 2027 వన్డే ప్రపంచకప్ వరకు ఆడాలని అనుకుంటున్నారు. ఇది జరగాలంటే రో-కో ఫిట్నెస్తో పాటు ఫామ్‌ను కాపాడుకోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే బీసీసీఐ రో-కోకు దేశవాలీ టోర్నీల్లో ఆడాలని సూచించినట్లు తెలుస్తుంది.ఆస్ట్రేలియా టూర్లో రోహిత్ మెరుపులుభవిష్యత్తుపై గందరగోళం నెలకొన్న తరుణంలో రోహిత్ ఆస్ట్రేలియా టూర్లో సత్తా చాటాడు. 3 వన్డేల్లో సెంచరీ, హాఫ్ సెంచరీతో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు గెలుచుకున్నాడు. ఈ సిరీస్‌లో రోహిత్ మునుపెన్నడూ కనబడని రీతిలో ఫిట్‌గా కనిపించాడు. ఇదే సిరీస్‌లో విరాట్ కోహ్లి తొలుత (తొలి 2 వన్డేల్లో డకౌట్) నిరాశపరిచినా.. ఆతర్వాత పర్వాలేదనిపించాడు (మూడో వన్డేలో హాఫ్ సెంచరీ). చదవండి: Viral Video: ఎంతుంటే ఏంటన్నయ్యా.. గెలిచానా లేదా..? -
హార్దిక్ పాండ్యా కీలక నిర్ణయం
త్వరలో సౌతాఫ్రికాతో జరుగబోయే పరిమిత ఓవర్ల సిరీస్‌లకు (India vs South Africa) ముందు టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా (Hardik Pandya) కీలక నిర్ణయం తీసుకున్నాడు. ఈ సిరీస్‌లకు సన్నాహకంగా నవంబర్ 26 నుంచి ప్రారంభమయ్యే దేశవాలీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ఆడనున్నాడు.ఈ టోర్నీలో హార్దిక్ తన హోం టీమ్ బరోడా తరఫున బరిలోకి దిగుతాడు.హర్దిక్ చివరిగా ఈ ఏడాది సెప్టెంబర్‌లో కాంపిటేటివ్ క్రికెట్ ఆడాడు. ఆసియా కప్‌లో భాగంగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో గాయపడిన అతను.. ఆతర్వాత పాకిస్తాన్‌తో జరిగిన ఫైనల్‌తో పాటు ఆస్ట్రేలియాలో జరిగిన పరిమిత ఓవర్ల సిరీస్‌లకు దూరమయ్యాడు. హార్దిక్ ఇటీవలే గాయం (ఎడమ క్వాడ్రిసెప్స్) నుంచి పూర్తిగా కోలుకొని, బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో ప్రాక్టీస్ మొదలుపెట్టాడు.ఫిట్నెస్ టెస్ట్‌లన్నీ క్లియర్ చేసి అధికారిక అనుమతి కోసం ఎదురుచూస్తున్నాడు. నవంబర్ 26న బెంగాల్‌తో జరిగే మ్యాచ్‌తో రీఎంట్రీకి సిద్దంగా ఉన్నాడు. ముస్తాక్ అలీ టోర్నీలో హార్దిక్ రెండు మ్యాచ్‌లకు (28న జరిగే మ్యాచ్‌కు కూడా) మాత్రమే అందుబాటులో ఉండే అవకాశం ఉంది.ఆ తర్వాత అతను భారత జట్టుతో కలవాల్సి ఉంటుంది. నవంబర్ 30 నుంచి సౌతాఫ్రికాతో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ప్రారంభమవుతుంది. ఈ సిరీస్‌కు హార్దిక్ తప్పక ఎంపికయ్యే అవకాశం ఉంది. రాంచీ వేదికగా తొలి వన్డే జరుగనుంది. డిసెంబర్ 3న రాయ్‌పూర్, డిసెంబర్ 6న విశాఖపట్నంలో మిగిలిన రెండు వన్డేలు జరగనున్నాయి.ఆ తర్వాత సౌతాఫ్రికాతోనే ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కటక్ వేదికగా డిసెంబర్ 9న ప్రారంభవుతుంది. ఈ సిరీస్‌లో కూడా హార్దిక్ బెర్త్ దాదాపుగా ఖరారైనట్టే. హార్దిక్ జట్టులో చేరితే భారత మిడిలార్డర్ మరింత బలోపేతమవుతుంది. హార్దిక్ గైర్హాజరీలో భారత్ ఆసియా కప్ ఫైనల్లో గెలిచి ఛాంపియన్‌గా అవతరించిన విషయం తెలిసిందే.ఆతర్వాత ఆస్ట్రేలియాలో జరిగిన పరిమిత ఓవర్ల సిరీస్‌లలో భారత్‌కు మిశ్రమ ఫలితాలు వచ్చాయి. వన్డే సిరీస్‌ను 1-2 తేడాతో కోల్పోయిన టీమిండియా.. ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 2-1 తేడాతో కైవసం చేసుకుంది.చదవండి: రోహిత్ శర్మ అనుహ్య నిర్ణయం..! ఇక మిగిలింది కోహ్లినే? -
నితీశ్ స్థానంలో జురేల్
కోల్‌కతా: ఫామ్‌లో ఉన్న వికెట్ కీపర్, బ్యాటర్ ధ్రువ్ జురేల్ దక్షిణాఫ్రికాతో జరిగే తొలి టెస్టులో బరిలోకి దిగుతాడని భారత అసిస్టెంట్ కోచ్ రియాన్ టెన్ డస్కటే వెల్లడించారు. ఆంధ్ర ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి స్థానంలో జురేల్‌ను ఆడిస్తామని ఆయన చెప్పారు. 24 ఏళ్ల వికెట్ కీపర్ ఇప్పటివరకు టీమిండియా తరఫున ఏడు టెస్టులు ఆడాడు. దక్షిణాఫ్రికా ‘ఎ’ జరిగిన రెండు అనధికారిక టెస్టులు సహా గత ఐదు ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌ల్లో జురేల్ నాలుగు సెంచరీలు చేశాడు. రెగ్యులర్ వికెట్ కీపర్, స్టార్ బ్యాటర్ రిషభ్ పంత్ గైర్హాజరీలో జురేల్ ఇంగ్లడ్ పర్యటనలో నాలుగో టెస్టు ఆడాడు. అయితే ఇప్పుడు పంత్ పునరాగమనం చేయనుండటంతో జురేల్ స్థానంపై నెలకొన్న సందేహాల్ని సహాయ కోచ్ డక్కటే ఒక్క మాటతో నివృత్తి చేశాడు. ఫామ్‌లో ఉన్న జురేల్, రెగ్యులర్ వికెట్ కీపర్ పంత్ ఇద్దరిని తొలి టెస్టులో ఆడిస్తామని స్పష్టం చేశారు. వ్యూహాలకు అనుగుణంగానే... ‘కాంబినేషన్‌పై పూర్తి స్పష్టతతో ఉన్నాం. ఇద్దరు వికెట్ కీపర్లలో ఏ ఒక్కరిని పక్కనబెట్టే ఉద్దేశం జట్టు మేనేజ్మెంట్కు లేదు’ అని డస్కటే వెల్లడించారు. గత ఆరు నెలలుగా నిలకడైన ఫామ్‌ను కొనసాగిస్తున్న ధ్రువ్ జురేల్ ఈడెన్ గార్డెన్స్‌లో శుక్రవారం మొదలయ్యే తొలి టెస్టులో ఆడతాడని చెప్పారు. నితీశ్‌ను పక్కనబెట్టడంపై స్పందిస్తూ... ‘అతను వెస్టిండీస్‌తో రెండు టెస్టులు ఆడాడు. ప్రతి మ్యాచ్‌లోనూ మెరుగవుతూనే ఉన్నాడు. కాబట్టి అతని భవిష్యత్తుకు ఎలాంటి ముప్పులేదు. అయితే ప్రస్తుత జట్టు వ్యూహాలకు అనుగుణంగానే అతను తుది జట్టుకు దూరం కానున్నాడు. బలమైన ప్రత్యర్థితో మ్యాచ్ గెలవాలంటే అందుబాటులో ఉన్న వనరుల్లో మరింత మెరుగైన బలగంతోనే బరిలోకి దిగుతాం. ఇప్పుడు ఇదే జరుగుతోంది. అంతేకానీ నితీశ్‌ను విస్మరించడం మాత్రం కాదు’ అని డస్కటే వివరించారు. పరుగులు చేసే స్పిన్నర్లు ఇక లోయర్ మిడిలార్డర్లో వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజాల రూపంలో భారత్ బ్యాటింగ్ లైనప్ మరింత పటిష్టంగా ఉందని అసిస్టెంట్ కోచ్ అన్నారు. వాళ్లు స్పిన్నర్లయి ఉండొచ్చు. కానీ బ్యాటింగ్ అవసరాల్ని తీరుస్తారని, కాబట్టి వారిపుడు బ్యాటర్లుగా పరిగణించవచ్చని చెప్పారు. తద్వారా కుల్దీప్ యాదవ్ స్థానంలో అక్షర్ పటేల్ తుది జట్టులో ఉంటాడనే విషయాన్ని డస్కటే చెప్పకనే చెప్పినట్లయ్యింది. దీంతో ఇద్దరు పేసర్లు ముగ్గురు స్పిన్నర్లతో కూడిన బౌలింగ్ దళాన్ని తొలి టెస్టులో దింపేందుకు భారత టీమ్ మేనేజ్మెంట్ సిద్ధమైంది. ముగ్గురు టాపార్డర్, ముగ్గురు మిడిలార్డర్ బ్యాటర్లతో స్పెషలిస్టు బ్యాటింగ్ విభాగానికి ముగ్గురు స్పిన్ ఆల్‌రౌండర్లు జట్టును నడిపించనున్నారు. కసరత్తు చేశాం... సొంతగడ్డపై న్యూజిలాండ్‌తో జరిగిన సిరీస్ నుంచి టీమిండియా పాఠాలు నేర్చుకుందని డస్కటే పేర్కొన్నారు. గతేడాది భారత్ పర్యటనకు వచ్చిన కివీస్ 3–0తో ఆతిథ్య జట్టును వైట్‌వాష్ చేసింది. మన సిŠప్న్ పిచ్‌పై ప్రత్యర్థి స్పిన్నర్లు ఎజాజ్ పటేల్ (15 వికెట్లు), మిచెల్ సాన్‌ట్నర్ (13), ఫిలిప్స్ (8) పండగ చేసుకున్నారు. ఈ ముగ్గురు కలిసి 36 వికెట్లు తీయడమే భారత్ కొంపముంచింది. దీనిపై అసిస్టెంట్ కోచ్ మాట్లాడుతూ ‘స్పిన్నేయడమే కాదు... ప్రత్యర్థి స్పిన్‌ను ఎదుర్కోవడంపై కూడా కసరత్తు చేశాం. ఎందుకంటే సఫారీ జట్టులోనూ నాణ్యమైన స్పిన్నర్లే అందుబాటులో ఉన్నరు. కాబట్టి కివీస్ నేర్పిన గత పాఠాల అనుభవంతో జట్టు సిద్ధమైంది’ అని అన్నారు. -
సౌతాఫ్రికాతో తొలి టెస్ట్‌కు ముందు టీమిండియాలో కీలక మార్పు
కోల్‌కతా వేదికగా నవంబర్ 14 నుంచి సౌతాఫ్రికాతో జరుగబోయే తొలి టెస్ట్‌కు ముందు టీమిండియాలో కీలక మార్పు చోటు చేసుకుంది. యువ ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డిని జట్టు నుంచి విడుదల చేశారు. నవంబర్ 13 నుంచి 19 మధ్యలో సౌతాఫ్రికా-ఏతో జరిగే 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో పాల్గొనాలని ఆదేశించారు. నవంబర్ 22 నుంచి సౌతాఫ్రికాతో జరిగే రెండో టెస్ట్ సమయానికి తిరిగి సీనియర్ జట్టులో చేరతాడని పేర్కొన్నారు.నితీశ్‌ను భవిష్యత్ విదేశీ పర్యటనల కోసం సిద్దం చేస్తున్నామని బీసీసీఐ ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. తాజా నిర్ణయంతో నితీశ్ ఖంగుతిన్నాడు. నితీశ్‌కు ఈ పరిస్థితి రావడానికి సరైన అవకాశాలు రాకపోవడం ఓ కారణమైతే, ధృవ్ జురెల్ ఫామ్ మరో కారణం.పంత్ గైర్హాజరీలో జట్టులోకి వచ్చిన జురెల్ జట్టులో స్థిరపడిపోయాడు. ఇటీవల విండీస్‌పై సెంచరీతో పాటు తాజాగా సౌతాఫ్రికా-ఏపై ఒకే మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌ల్లో సెంచరీలు చేశాడు. మరోపక్క గాయం నుంచి కోలుకున్న పంత్ జట్టులోకి వచ్చాడు. అతను కూడా పూర్వపు ఫామ్‌ను కొనసాగించాడు. దీంతో సౌతాఫ్రికాతో తొలి టెస్ట్‌లో పంత్, జురెల్ ఇద్దరిని ఆడించాల్సిన పరిస్థితి ఏర్పడింది.ఈ పరిస్థితుల్లో ఎవరిపై వేటు వేయాలని ఆలోచిస్తే మేనేజ్మెంట్కు నితీశ్ కుమార్ రెడ్డి మొదటి ఆప్షన్ అయ్యాడు. నితీశ్ తాజాగా విండీస్‌తో జరిగిన సిరీస్‌లో రెండు మ్యాచ్‌ల్లో ఆడినా రెండు విభాగాల్లో (బ్యాటింగ్, బౌలింగ్) సరైన అవకాశాలు రాలేదు.తొలి టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో కేవలం నాలుగు ఓవర్లు బౌలింగ్ చేసిన అతనికి బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. రెండో ఇన్నింగ్స్‌లో నితీశ్‌కు బంతినే ఇవ్వలేదు. రెండో టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ అవకాశం రాగా, దానికి నితీశ్ న్యాయం చేశాడు. అప్పటికే భారత్ భారీ స్కోర్ చేయగా.. నితీశ్ ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి 43 పరుగులు చేశాడు. ఆ మ్యాచ్ రెండు ఇన్నింగ్స్‌ల్లో నితీశ్‌కు బౌలింగ్ చేసే అవకాశం రాలేదు. విండీస్ స్వల్ప లక్ష్యాన్ని నిర్దేశించడంతో నితీశ్‌కు రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. చదవండి: రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా ఎవరూ ఊహించని ఆటగాడు..! -
గౌరవ పదవులు పొందిన భారత స్టార్ క్రికెటర్లు వీరే..!
క్రికెట్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చి, భారత ఖ్యాతిని విశ్వానికి చాటిన పలువురు క్రికెటర్లు క్రికెటేతర గౌరవ పదవులు దక్కించుకున్నారు. ఈ అంశం ప్రస్తావనకు రాగానే ముందుగా గుర్తొచ్చే పేరు ఎంఎస్ ధోని. ఈ టీమిండియా మాజీ కెప్టెన్ భారత్‌కు రెండు ప్రపంచకప్‌లు (2007, 2011) అందించాడు. ఇందుకు గానూ ఇండియన్ టెరిటోరియల్ ఆర్మీ లెఫ్టినెంట్ కర్నల్ హోదా కల్పించింది.1983 భారత్‌కు తొలి ప్రపంచకప్ అందించిన కపిల్ దేవ్‌కు (2008) సైతం భారత ఆర్మీ లెఫ్టినెంట్ కర్నల్ హోదా కల్పించింది.భారత క్రికెట్‌కు విశ్వవ్యాప్త గుర్తింపు తెచ్చిన సచిన్ టెండూల్కర్‌కు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ గ్రూప్ కెప్టెన్ హెదాతో సత్కరించింది. విమానయాన అనుభవం లేకుండా IAF గ్రూప్ కెప్టెన్ గౌరవం దక్కించుకున్న తొలి వ్యక్తి సచిన్ టెండూల్కర్.వీరి తర్వాత పలువురు క్రికెటర్లకు పోలీస్ శాఖలో డీఎస్పీ హోదాలో ఉద్యోగాలు లభించాయి. 2007 టీ20 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టులో సభ్యుడైన జోగిందర్ శర్మకు హర్యానా పోలీస్ శాఖ డీఎస్పీ హోదా కల్పించింది.ఆతర్వాత హర్భజన్ సింగ్ (2011 ప్రపంచకప్ విజేత), మహ్మద్ సిరాజ్‌లకు (2024 టీ20 ప్రపంచకప్ విజేత) పంజాబ్, తెలంగాణ ప్రభుత్వాలు డీఎస్పీ ఉద్యోగాలతో గౌరవించాయి.మహిళల విభాగంలో ప్రస్తుత టీమిండియా సభ్యులు, వన్డే ప్రపంచకప్ ఛాంపియన్లు అయిన హర్మన్‌ప్రీత్ కౌర్ (పంజాబ్), దీప్తి శర్మ (ఉత్తర్‌ప్రదేశ్), తాజాగా రిచా ఘోష్‌కు (పశ్చిమ బెంగాల్) ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు డీఎస్పీ హోదా కల్పించాయి. వీరే కాక మరో ముగ్గురు భారత క్రికెటర్లకు ఇతర ప్రభుత్వ శాఖల్లో కీలక ఉద్యోగాలు లభించాయి. ప్రస్తుత టీమిండియా స్టార్ కేఎల్ రాహుల్‌కు 2018లో స్పోర్ట్స్ కోటాలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగం లభించింది.కొంతకాలం క్రితం భారత క్రికెట్లో ఓ వెలుగు వెలిగిన ఫాస్ట్ బౌలర్ ఉమేశ్ యాదవ్‌కు కూడా RBIలో అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగం లభించింది.టీమిండియా స్పిన్ మాంత్రికుడు యుజ్వేంద్ర చహల్‌కు ఆదాయపు పన్ను శాఖలో అధికారిగా ఉద్యోగం లభించింది. వీరు మాత్రమే కాక చాలామంది భారత క్రికెటర్లకు వేర్వేరు ప్రభుత్వ విభాగాల్లో మంచి ఉద్యోగాలు లభించాయి. చదవండి: విరాట్ కోహ్లి రికార్డు సమం చేసిన బాబర్ ఆజమ్ -
విరాట్ కోహ్లి రికార్డు సమం చేసిన బాబర్ ఆజమ్
అంతర్జాతీయ క్రికెట్లో పాకిస్తాన్ స్టార్ బ్యాటర్ బాబర్ ఆజమ్ (Babar Azam) వైఫల్యాల పరంపర కొనసాగుతోంది. ఇవాళ (నవంబర్ 11) శ్రీలంకతో జరుగుతున్న వన్డేలో బాబర్ 29 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. ఈ ఇన్నింగ్స్ తర్వాత బాబర్ మరో చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.అంతర్జాతీయ క్రికెట్లో బాబర్ సెంచరీ చేసి నేటికి 799 రోజులవుతుంది. ఇన్నింగ్స్‌ల పరంగా (3 ఫార్మాట్లలో) ఇది 83కు పెరిగింది. దీంతో బాబర్ టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి (Virat Kohli) పేరిట ఉన్న ఓ చెత్త రికార్డును సమం చేశాడు.అంతర్జాతీయ క్రికెట్లో విరాట్ కూడా ఓ దశలో సెంచరీ లేక 83 ఇన్నింగ్స్‌లు ఆడాడు. విరాట్ కెరీర్లో మాయని మచ్చగా ఉన్న ఈ అప్రతిష్టను తాజాగా బాబర్ సమం చేశాడు. అంతర్జాతీయ క్రికెట్లో సెంచరీ లేకుండా ఎక్కువ ఇన్నింగ్స్‌లు ఆడిన చెత్త రికార్డు శ్రీలంక బ్యాటింగ్ దిగ్గజం సనత్ జయసూర్య పేరిట ఉంది.జయసూర్య తన కెరీర్లో ఓ దశలో సెంచరీ లేకుండా 88 ఇన్నింగ్స్‌లు ఆడాడు. ఈ జాబితాలో బాబర్, విరాట్ రెండో స్థానంలో ఉన్నారు. విండీస్ దిగ్గజం శివ్‌నరైన్ చంద్రపాల్ (78) మూడో స్థానంలో నిలిచాడు.2023 ఆగస్ట్ నుంచి ఇదే తంతుమూడు, నాలుగేళ్ల కిందట ప్రపంచ క్రికెట్లో అత్యంత స్థిరమైన బ్యాటర్‌గా గుర్తింపు పొందిన బాబర్ ఆజమ్.. 2023 నుంచి పూర్తిగా ఫామ్ కోల్పోయాడు. ఆ ఏడాది ఆగస్ట్‌లో నేపాల్‌పై సెంచరీ చేసిన తర్వాత అతనిప్పటివరకు ఒక్క సెంచరీ కూడా చేయలేదు. ఇటీవలికాలంలో బాబర్ ఫామ్ అదఃపాతాళానికి పడిపోయింది. ఫామ్‌లేమి కారణంగా కెప్టెన్సీ కూడా కోల్పోయాడు.ఇదిలా ఉంటే, బాబర్ విఫలమైనా శ్రీలంకతో జరుగుతున్న వన్డేలో పాక్ ఓ మోస్తరుకు మించి భారీ స్కోర్ చేసేలా ఉంది. 47.1 ఓవర్ల తర్వాత ఆ జట్టు స్కోర్ 261/5గా ఉంది. సల్మాన్ అఘా (95) సెంచరీ దిశగా సాగుతున్నాడు. అతనికి జతగా మహ్మద్ నవాజ్ (10) క్రీజ్‌లో ఉన్నాడు. చదవండి: మయాంక్ అగర్వాల్ సూపర్ సెంచరీ -
శ్రేయస్ గాయం.. షాకింగ్ విషయాలు
భారత వన్డే జట్టు వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer) ఇటీవలి ఆస్ట్రేలియా పర్యటనలో తీవ్రంగా గాయపడి, ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు. శ్రేయస్ పూర్తిగా కోలుకోవడానికి ఇంకా నెల రోజులైనా పడుతుందని డాక్టర్లు అంటున్నారు. ఈ నేపథ్యంలో నవంబర్ 30 నుంచి సౌతాఫ్రికాతో జరుగబోయే వన్డే సిరీస్‌లో శ్రేయస్ ఆడటం కష్టమేనని తెలుస్తుంది. బీసీసీఐ శ్రేయస్ విషయంలో ఎలాంటి తొందరపాటుకు పోకూడదని నిర్ణయించుకున్నట్లు సమాచారం. పూర్తిగా కోలుకొని, ప్రాక్టీస్ మొదలుపెట్టాకే అతనికి కబురు పెట్టే ఉద్దేశంలో ఉన్నట్లు తెలుస్తుంది.ఈ నేపథ్యంలో సౌతాఫ్రికా సిరీస్‌లో శ్రేయస్‌కు ప్రత్యామ్నాయం కోసం సెలెక్టర్లు వేట మొదలుపెట్టారు. గత కొంతకాలంగా శ్రేయస్ నాలుగో స్థానంలో అంచనాలకు మించి రాణిస్తూ, స్థిరపడ్డాడు. ఈ సిరీస్‌కు శ్రేయస్ దూరమైతే టీమిండియా భారీ ఎదురుదెబ్బ తగిలినట్లవతుంది. ఇటీవలికాలంలో ఛేదనల్లో శ్రేయస్ అత్యంత కీలకమైన ఇన్నింగ్స్‌లు ఆడుతూ టీమిండియా విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్నాడు. ఆస్ట్రేలియా పర్యటనలో గాయపడకముందు కూడా రాణించాడు. మొత్తంగా శ్రేయస్ గాయం భారత వన్డే జట్టు కూర్పును గందరగోళంలో పడేసింది.ఇదిలా ఉంటే, శ్రేయస్ గాయానికి సంబంధించి తాజాగా సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. గాయపడిన వెంటనే శ్రేయస్ ఆక్సిజన్ లెవెల్స్ ప్రమాదకర స్థాయికి పడిపోయినట్లు నివేదికలు తెలిపాయి. స్ప్లీన్‌లో (ప్లీహం) చీలక వచ్చి, అంతర్గత రక్తస్రావం కావడంతో శ్రేయస్ అక్సిజన్ లెవెల్స్ 50కి పడిపోయినట్లు పేర్కొన్నాయి. ఆ సమయంలో శ్రేయస్ పది నిమిషాల పాటు నిలబడలేకపోయాడని, అతడి శరీరం పూర్తిగా బ్లాక్ అవుటయ్యిందని తెలిపాయి. ఈ విషయం వింటుంటే శ్రేయస్ చావుకు దగ్గరగా వెళ్లొచ్చాడని స్పష్టమవుతుంది.అక్టోబర్ 25న ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డే సందర్భంగా అలెక్స్ క్యారీ క్యాచ్ పట్టే ప్రయత్నంలో శ్రేయస్ ప్రమాదకరంగా కిందపడ్డాడు. క్యాచ్ అయితే పట్టుకోగలిగాడు కాని, ప్రాణం మీదికి తెచ్చుకున్నాడు. నొప్పితో విలవిలలాడిపోయిన శ్రేయస్‌ను హుటాహుటిన సిడ్నీలోని ఆసుపత్రికి తీసుకెళ్లగా వైద్యులు ఐసీయూలో పెట్టి చికిత్సనందించారు. తొలుత గాయం చిన్నదే అని అంతా అనుకున్నారు.అయితే డాక్టర్లు నెమ్మదిగా విషయాన్ని చెప్పారు. శ్రేయస్ స్ప్లీన్‌లో (ప్లీహం) చీలక వచ్చి, అంతర్గత రక్తస్రావమైందని తెలిపారు. ఒకటి, రెండు రోజుల వరకు ఏమీ చెప్పలేమని అన్నారు. ఈ విషయం తెలిశాక యావత్ క్రికెట్ సమాజం ఆందోళనకు గురైంది. శ్రేయస్‌కు ఏమీ కాకూడదని దేవుళ్లను మొక్కింది. దేవుడి దయ, డాక్టర్ల పనితనం వల్ల శ్రేయస్ మృత్యు కొరల్లో నుంచి బయటపడ్డాడు. కొన్ని రోజుల చికిత్స అనంతరం కోలుకున్నాడు. ప్రస్తుతం క్రికెట్‌కు దూరంగా ఉంటూ ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్నాడు. చదవండి: చరిత్ర సృష్టించిన జమ్మూ అండ్ కశ్మీర్ క్రికెట్ టీమ్ -
ప్రపంచకప్ విజేతకు చారిత్రక గౌరవం
2025 మహిళల వన్డే ప్రపంచకప్ విజేత, ఛాంపియన్ జట్టు టీమిండియాలో కీలక సభ్యురాలైన రిచా ఘోష్‌కు (Richa Ghosh) చారిత్రక గౌరవం దక్కింది. రిచా పేరిట ఆమె సొంత రాష్ట్రం పశ్చిమ బెంగాల్లో క్రికెట్ స్టేడియం నిర్మితం కానుంది. ఈ విషయాన్ని బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్వయంగా ప్రకటించారు.ఇవాళ (నవంబర్ 10) జరిగిన రిచా సన్మాన కార్యక్రమం సందర్భంగా ఈ విషయాన్ని వెల్లడించారు. రిచా జన్మస్థలమైన సిలిగురి పట్టణానికి క్రికెట్ మైదానాన్ని కేటాయిస్తూ.. దానికి రిచా ఘోష్ పేరుతో నామకరణం చేయనున్నట్లు ప్రకటించారు. రిచా సన్మాన కార్యక్రమంలో బెంగాల్ క్రికెట్ దిగ్గజాలు సౌరవ్ గంగూలీ, ఝులన్ గోస్వామి పాల్గొన్నారు. రిచా పశ్చిమ బెంగాల్ నుంచి సీనియర్ ప్రపంచకప్ గెలిచిన తొలి క్రికెటర్‌గా చరిత్ర సృష్టించింది. ఫలితంగా ఆమెకు బెంగాల్ ప్రభుత్వం నుంచి భారీ నజరానాలు అందాయి. ఫైనల్లో సౌతాఫ్రికాపై చేసిన ప్రతి పరుగుకు (34 పరుగులు) రూ. లక్ష చొప్పున రూ. 34 లక్షల చెక్కును రిచాకు అందించారు.అంతకుముందు రోజే ప్రభుత్వం రిచాకు బంగ భూషణ్ బిరుదుతో పాటు రాష్ట్ర పోలీసు శాఖలో డీఎస్పీ ఉద్యోగాన్ని కేటాయించింది. పశ్చిమ బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ కూడా రిచాకు భారీ తాయిలాలు ప్రకటించింది. గోల్డెన్ బ్యాట్, గోల్డెన్ బాల్‌తో పాటు విలువైన బంగారు గొలుసును బహుకరించింది.కాగా, రిచా ప్రపంచకప్ ఫైనల్లో ఆస్ట్రేలియాపై అమూల్యమైన ఇన్నింగ్స్ ఆడింది. కేవలం 24 బంతుల్లో 34 పరుగులు చేసి భారత్ 298 పరుగుల భారీ స్కోర్ చేయడంలో కీలకపాత్ర పోషించింది. అంతకుముందు ఏడు సార్లు ప్రపంచ ఛాంపియన్ అయిన ఆస్ట్రేలియాతో జరిగిన సెమీఫైనల్లోనూ రిచా మెరుపు ఇన్నింగ్స్ ఆడింది. ఛేదనలో కీలక సమయంలో 16 బంతుల్లో 26 పరుగులు చేసి భారత విజయంలో తనవంతు పాత్ర పోషించింది.లీగ్ దశలో సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లోనూ రిచా చెలరేగింది. 77 బంతుల్లోనే 94 పరుగులు చేసింది. ప్రపంచకప్ మొత్తంలో రిచా మెరుపు ఇలాగే కొనసాగాయి. 8 ఇన్నింగ్స్‌ల్లో 133.52 స్ట్రయిక్‌రేట్‌తో 235 పరుగులు చేసింది. కాగా, నవంబర్ 2న జరిగిన ప్రపంచకప్ ఫైనల్లో భారత్ సౌతాఫ్రికాను 52 పరుగుల తేడాతో ఓడించి తొలిసారి ప్రపంచకప్‌ను కైవసం చేసుకుంది. వికెట్ కీపర్-బ్యాటర్ అయిన రిచా ప్రపంచకప్‌లో మొత్తం 12 సిక్సర్లు బాది, టోర్నీ టాప్ టాప్ హిట్టర్‌గా నిలిచింది. -
సంచలనం.. భారీ లక్ష్యాన్ని ఊదేసిన సౌతాఫ్రికా
భారత్-ఏ, సౌతాఫ్రికా-ఏ (India A vs South Africa A) జట్ల మధ్య జరిగిన రెండు మ్యాచ్‌ల అనధికారిక టెస్ట్ సిరీస్ 1-1తో డ్రా అయ్యింది. బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ గ్రౌండ్-1లో జరిగిన మ్యాచ్‌లో సౌతాఫ్రికా 5 వికెట్ల తేడాతో గెలుపొందింది.ఈ మ్యాచ్‌లో సౌతాఫ్రికా 417 పరుగుల భారీ లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదించింది. జోర్డన్ హెర్మన్ (91), లెసెగో సెనోక్వానే (77), జుబేర్ హంజా (77), టెంబా బవుమా (59), వికెట్ కీపర్ కాన్నర్ (52 నాటౌట్) అర్ద సెంచరీలతో రాణించి సౌతాఫ్రికాను గెలిపించారు.ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 255 పరుగులకు ఆలౌటైంది. ధృవ్ జురెల్ (132 నాటౌట్) అజేయ సెంచరీతో గౌరవప్రదమైన స్కోర్ అందించాడు. అనంతరం సౌతాఫ్రికా కూడా తొలి ఇన్నింగ్స్‌లో తడబడింది. టీమిండియా పేసర్ల ధాటికి 221 పరుగులకే ఆలౌటైంది.34 పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ 7 వికెట్ల నష్టానికి 382 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. జురెల్ రెండో ఇన్నింగ్స్‌లోనూ అజేయ సెంచరీతో (127 నాటౌట్) చెలరేగాడు. కెప్టెన్ రిషబ్ పంత్ (65), హర్ష్ దూబే (84) అర్ద సెంచరీలతో రాణించారు.భారీ లక్ష్య ఛేదనలో సౌతాఫ్రికా బ్యాటర్లు సమిష్టిగా రాణించారు. ఐదుగురు అర్ద సెంచరీలు చేసి సౌతాఫ్రికాను విజయతీరాలకు చేర్చారు. భారత బౌలర్లు పోరాడినప్పటికీ.. ఫలితం లేకుండా పోయింది. కాగా, ఈ సిరీస్‌లోని తొలి టెస్ట్‌లో భారత్ విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇరు జట్ల మధ్య మూడు మ్యాచ్‌ల అనధికారిక వన్డే సిరీస్ నవంబర్ 13 నుంచి మొదలవుతుంది.చదవండి: వరుసగా 8 సిక్సర్లు.. క్రికెట్ చరిత్రలో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ -
టీమిండియాకు మరో షాక్
మరో ఐదు రోజుల్లో (నవంబర్ 14 నుంచి) స్వదేశంలో సౌతాఫ్రికాతో జరుగబోయే రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌కు ముందు టీమిండియాకు దెబ్బ మీద దెబ్బలు తగులుతున్నాయి. సౌతాఫ్రికా-ఏతో ప్రస్తుతం జరుగుతున్న రెండో టెస్ట్‌లో భారత ఆటగాళ్లు వరుసగా గాయాల బారిన పడుతున్నారు.తొలుత కెప్టెన్ రిషబ్ పంత్ (Rishabh Pant).. ఆతర్వాత ధృవ్ జురెల్ (Dhruv Jurel), తాజాగా మహ్మద్ సిరాజ్ (Mohammed Siraj) గాయపడ్డ ఆటగాళ్ల జాబితాలో చేరారు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో పంత్ బ్యాటింగ్ చేస్తూ చాలా దెబ్బలు తిన్నాడు. అయినా అతడు రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు దిగి అందరినీ ఆశ్చర్యపరిచాడు.ఆట నాలుగో రోజైన ఇవాళ (నవంబర్ 9) మరో వికెట్ కీపర్ బ్యాటర్, రెండు ఇన్నింగ్స్‌ల్లో సెంచూరియన్ ధృవ్ జురెల్ చేతి వేలి గాయానికి గురయ్యాడు. తాజాగా పేసర్ మహ్మద్ సిరాజ్ కూడా ఫీల్డింగ్ చేస్తూ చేతి వేలికి గాయం చేసుకున్నాడు. నొప్పితో విలవిలలాడిన సిరాజ్ మైదానాన్ని వీడాడు. సిరాజ్ గాయం పెద్దదేమీ కానప్పటికీ.. ముందు జాగ్రత్తగా అతనికి విశ్రాంతి కల్పించారు.ఇదిలా ఉంటే, భారత్-ఏ, సౌతాఫ్రికా-ఏ మ్యాచ్ హోరాహోరీగా సాగుతోంది. ఈ మ్యాచ్‌లో సౌతాఫ్రికా లక్ష్యానికి మరో 70 పరుగుల దూరంలో మాత్రమే ఉంది. ఇవాళ ఆట చివరి రోజు. 4:35 నిమిషాల సమయానికి సౌతాఫ్రికా రెండో ఇన్నింగ్స్‌లో 4 వికెట్ల నష్టానికి 347 పరుగుల వద్ద ఉంది. టెంబా బవుమా (57), కాన్నర్ ఎస్టర్హ్యూజన్ (5) క్రీజ్‌లో ఉన్నారు.ఈ మ్యాచ్‌లో భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 255, రెండో ఇన్నింగ్స్‌లో 382/7 డిక్లేర్ స్కోర్లు చేసింది. రెండు ఇన్నింగ్స్‌ల్లో వికెట్‌కీపర్ బ్యాటర్ ధృవ్ జురెల్ సెంచరీలు చేశాడు. సౌతాఫ్రికా తరఫున కెప్టెన్ అకెర్మన్ తొలి ఇన్నింగ్స్‌ల్లో (134) శతక్కొట్టాడు. రెండో ఇన్నింగ్స్‌లో జోర్డన్ హెర్మన్ (91), సెనోక్వానే (77), జుబేర్ హంజా (77), బవుమా (57 నాటౌట్) అర్ద సెంచరీలతో రాణించారు. రెండు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో భారత్ 1-0 ఆధిక్యంలో ఉంది. చదవండి: లేడీ ధోనికి బంపరాఫర్ -
లేడీ ధోనికి బంపరాఫర్
భారత మహిళా క్రికెట్ జట్టులో లేడీ ధోనిగా పిలువబడే రిచా ఘోష్‌కు (Richa Ghosh) బంపరాఫర్ లభించింది. ప్రపంచకప్ విధ్వంసాల గౌరవార్దం పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం (west Bengal) ఆమెను డీఎస్పీగా (DSP) నియమించింది. భారత్, శ్రీలంక ఇటీవల సంయుక్తంగా ఆతిథ్యమిచ్చిన వన్డే ప్రపంచకప్‌లో (Women' Cricket World Cup 2025_ రిచా వీరవిహారం చేసింది. ఫైనల్, సెమీఫైనల్స్‌లో విధ్వంసకర ఇన్నింగ్స్‌లు ఆడి భారత్ ఛాంపియన్‌గా నిలవడంలో కీలకపాత్ర పోషించింది. ఫలితంగా ఆమెను డీఎస్పీ ఉద్యోగం వరించింది. గతంలో రిచా తరహాలోనే ఇద్దరు భారత క్రికెటర్లను వారివారి సొంత రాష్ట్రాలు డీఎస్పీలుగా నియమించాయి. 2024లో తెలంగాణ ప్రభుత్వం టీమిండియా పేసు గుర్రం మహ్మద్ సిరాజ్‌ను డీఎస్పీగా నియమించింది. ఇటీవలే ప్రపంచకప్ ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ విజేత దీప్తి శర్మను కూడా ఆమె సొంత రాష్ట్రం ఉత్తర్‌ప్రదేశ్‌లో డీఎస్పీగా నియమించారు.ప్రపంచకప్ గెలిచిన తర్వాత తొలిసారి రాష్ట్రానికి విచ్చేసిన రిచాను బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ (CAB) మరియు సిలిగురి మున్సిపల్ కార్పొరేషన్ ఘనంగా సత్కరించాయి. బెంగాల్‌లోని మమతా బెనర్జీ ప్రభుత్వం రిచాకు డీఎస్పీ ఉద్యోగం ఇవ్వడంతో పాటు బంగ భూషణ్ బిరుదుతోనూ సత్కరించింది. రిచా 2025 ప్రపంచకప్ ఫైనల్లో ఆస్ట్రేలియాపై అమూల్యమైన ఇన్నింగ్స్ ఆడింది. కేవలం 24 బంతుల్లో 34 పరుగులు చేసి భారత్ 298 పరుగుల భారీ స్కోర్ చేయడంలో కీలకపాత్ర పోషించింది. అంతకుముందు ఏడు సార్లు ప్రపంచ ఛాంపియన్ అయిన ఆస్ట్రేలియాతో జరిగిన సెమీఫైనల్లోనూ రిచా మెరుపు ఇన్నింగ్స్ ఆడింది. ఛేదనలో కీలక సమయంలో 16 బంతుల్లో 26 పరుగులు చేసి భారత విజయంలో తనవంతు పాత్ర పోషించింది.లీగ్ దశలో సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లోనూ రిచా చెలరేగింది. 77 బంతుల్లోనే 94 పరుగులు చేసింది. ప్రపంచకప్ మొత్తంలో రిచా మెరుపు ఇలాగే కొనసాగాయి. 8 ఇన్నింగ్స్‌ల్లో 133.52 స్ట్రయిక్‌రేట్‌తో 235 పరుగులు చేసింది. కాగా, నవంబర్ 2న జరిగిన ప్రపంచకప్ ఫైనల్లో భారత్ సౌతాఫ్రికాను 52 పరుగుల తేడాతో ఓడించి తొలిసారి ప్రపంచకప్‌ను కైవసం చేసుకుంది. చదవండి: చరిత్ర సృష్టించిన పాకిస్తాన్.. ఆరోసారి ఛాంపియన్ -
చరిత్ర సృష్టించిన పాకిస్తాన్.. ఆరోసారి ఛాంపియన్
పాకిస్తాన్ క్రికెట్ జట్టు (Pakistan) హాంగ్ కాంగ్ సిక్సస్ (Hong Kong Sixes-2025) ట్రోఫీని కైవసం చేసుంది. ఇవాళ (నవంబర్ 9) జరిగిన 2025 ఎడిషన్ ఫైనల్లో కువైట్‌పై 43 పరుగుల తేడాతో గెలుపొంది, ఆరో సారి ఛాంపియన్‌గా నిలిచింది.ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ నిర్ణీత 6 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 135 పరుగుల భారీ స్కోర్ చేసింది. కెప్టెన్ అబ్బాస్ అఫ్రిది (Abbas Afridi) (11 బంతుల్లో 52 రిటైర్డ్ హర్ట్; 2 ఫోర్లు, 7 సిక్సర్లు) కువైట్ బౌలర్లను చీల్చి చెండాడు. ఓపెనర్లు అబ్దుల్ సమద్ (13 బంతుల్లో 42; 2 ఫోర్లు, 5 సిక్సర్లు), ఖ్వాజా నఫే (6 బంతుల్లో 22; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) సైతం చెలరేగిపోయారు. మిగతా బ్యాటర్లలో షాహిద్ అజీజ్ డకౌట్ కాగా, మాజ్ సదాకత్ 10, షెహజాద్ 4 పరుగులతో అజేయంగా నిలిచారు. కువైట్ బౌలర్లలో మీట్ భావ్సర్ 3 వికెట్లు తీశాడు.భారీ లక్ష్య ఛేదనలో కువైట్‌కు మెరుపు ఆరంభం లభించినప్పటికీ.. ఆతర్వాత వరుసగా వికెట్లు కోల్పోవడంతో 5.1 ఓవర్లలో 6 వికెట్లూ కోల్పోయి 92 పరుగులకే పరిమితమైంది. మాజ్ సదాకత్ 3 వికెట్లు తీసి కువైట్ వెన్ను విరిచాడు. ముహమ్మద్ షెహజాద్, అబ్బాస్ అఫ్రిది, అబ్దుల్ సమద్ తలో వికెట్ తీశారు. కువైట్ ఇన్నింగ్స్‌లో ఓపెనర్లు అద్నాన్ ఇద్రీస్ (8 బంతుల్లో 30; 5 సిక్సర్లు), మీట్ భావ్సర్ (12 బంతుల్లో 33; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) చెలరేగినప్పటికీ ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. ఆతర్వాత వచ్చిన బిలాల్ తాహిర్ (6), రవీజా సందరువన్ (1), కెప్టెన్ యాసిన్ పటేల్ (14) తక్కువ స్కోర్లకే ఔటయ్యారు. మొహమ్మద్ షఫీక్ డకౌటయ్యాడు. కాగా, ఈ టోర్నీలో భారత్ నేపాల్, యూఏఈ, కువైట్, శ్రీలంక వంటి పసికూన చేతుల్లో ఓడి క్వార్టర్ ఫైనల్‌కు కూడా చేరకుండానే నిష్క్రమించింది. చదవండి: IND vs SA: టీమిండియాకు ఊహించని షాక్.. -
AP: ఎంఎస్కే ప్రసాద్‌కు ఘోర అవమానం
టీమిండియా మాజీ చీఫ్ సెలెక్టర్, ఆంధ్రప్రదేశ్ మాజీ క్రికెటర్ ఎంఎస్కే ప్రసాద్‌కు ఘోర అవమానం జరిగింది. మహిళల వన్డే ప్రపంచకప్-2025 విన్నర్ నల్లపురెడ్డి శ్రీచరణికి స్వాగతం పలికేందుకు ఎంఎస్కే ఇవాళ గన్నవరం విమానాశ్రయానికి వెళ్లగా.. అక్కడి ప్రోటోకాల్ సిబ్బంది అతన్ని అడ్డుకున్నారు. జాబితాలో పేరు లేదని బయటికి పంపించారు.ఎయిర్‌పోర్ట్‌లో తనకు జరిగిన అవమానాన్ని సీరియస్‌గా తీసుకున్న ఎంఎస్కే సీఎంఓలో ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్‌లోని (ఏసీఏ) కొందరు ముఖ్యులపై బీసీసీఐకి ఫిర్యాదు చేసే ఆలోచనలో ఉన్నారు. భారత సీనియర్ క్రికెట్ జట్టుకు చీఫ్ సెలెక్టర్‌గా వ్యవహరించిన తనకు ప్రోటోకాల్ ఇవ్వకపోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.అనంతరం శ్రీచరణి అభినందన కార్యక్రమానికి కూడా ఎంఎస్కే హాజరు కాలేదు. విమానాశ్రయం నుంచి జరిగిన ర్యాలీ లో కూడా కనిపించలేదు. సీఎం చంద్రబాబు, లోకేష్‌తో శ్రీచరణి భేటికి కూడా వెళ్లలేదు.కాగా, విమానాశ్రయంలోని ఎంట్రీ లాంజ్‌లోకి చాలామంది రాజకీయ నాయకులను అనుమతిచ్చిన ప్రోటోకాల్ సిబ్బంది.. టీమిండియా మాజీ చీఫ్ సెలెక్టర్ అయిన ఎంఎస్కే ప్రసాద్‌ను మాత్రం అనుమతించలేదు. -
చరిత్ర సృష్టించేందుకు అడుగు దూరంలో ఉన్న బుమ్రా
టీమిండియా స్టార్ పేసు గుర్రం జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) చరిత్ర సృష్టించేందుకు అడుగు దూరంలో ఉన్నాడు. ఆస్ట్రేలియాతో రేపు (నవంబర్ 8) జరుగబోయే ఐదో టీ20లో (India vs Australia) ఓ వికెట్ తీస్తే.. టీ20 ఫార్మాట్లో 100 వికెట్లు పూర్తి చేసుకోవడంతో పాటు మూడు ఫార్మాట్లలో 100 వికెట్లు తీసిన తొలి భారత బౌలర్‌గా రికార్డు నెలకొల్పుతాడు. ఇప్పటివరకు ఏ భారత బౌలర్ మూడు ఫార్మాట్లలో 100 వికెట్లు తీయలేదు. టీ20ల్లో అర్షదీప్ సింగ్ మాత్రమే ఇప్పటివరకు 100 వికెట్లు పూర్తి చేశాడు. రేపటి మ్యాచ్‌లో బుమ్రా ఓ వికెట్ తీస్తే.. టీ20ల్లో సెంచరీ కొట్టిన రెండో భారత బౌలర్‌గా నిలుస్తాడు.ప్రస్తుతం బుమ్రా 79 టీ20ల్లో 99 వికెట్లు తీశాడు. అర్షదీప్ 67 మ్యాచ్‌ల్లో 105 వికెట్లు తీశాడు. ఓవరాల్‌గా టీ20ల్లో అత్యధిక వికెట్లు తీసిన రికార్డు ఆఫ్ఘనిస్తాన్ ఆటగాడు రషీద్ ఖాన్ పేరిట ఉంది. రషీద్ 108 టీ20ల్లో 182 వికెట్లు తీసి, ప్రస్తుత తరం బౌలర్లలో ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్నాడు.అరుదైన మైలురాయికి చేరువలో అభిషేక్, తిలక్రేపటి మ్యాచ్‌లో టీమిండియా బ్యాటర్లు అభిషేక్ శర్మ, తిలక్ వర్మ కూడా ఓ అరుదైన మైలురాయిపై కన్నేశారు. అభిషేక్ 11, తిలక్ 4 పరుగులు చేస్తే టీ20ల్లో 1000 పరుగులు పూర్తి చేసుకుంటారు. రేపటి మ్యాచ్‌లో ఇద్దరు ఆసీస్ ఆటగాళ్లు కూడా ఓ మైలురాయిని చేరుకునే అవకాశం ఉంది. స్టోయినిస్, మ్యాక్స్‌వెల్ తలో వికెట్ తీస్తే టీ20ల్లో 50 వికెట్లు పూర్తి చేసుకుంటారు.ఇదిలా ఉంటే, భారత్-ఆసీస్ మధ్య రేపు జరుగబోయే మ్యాచ్ సిరీస్ ఫలితాన్ని తేలుస్తుంది. ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో భారత్ వరుసగా మూడు, నాలుగు మ్యాచ్‌లు గెలిచి 2-1 ఆధిక్యంలో ఉంది. రేపటి మ్యాచ్‌లోనూ గెలిస్తే టీమిండియా హ్యాట్రిక్ విజయాలు సాధించడంతో పాటు సిరీస్ కైవసం చేసుకుంటుంది. తద్వారా ఆస్ట్రేలియాను వారి సొంతగడ్డపై ఓడించిన ఘనతను సొంతం చేసుకుంటుంది. బ్రిస్బేన్ వేదికగా జరుగబోయే రేపటి మ్యాచ్ భారతకాలమానం ప్రకారం మధ్యాహ్నం 1:45 గంటలకు మొదలవుతుంది.తుది జట్లు (అంచనా)..ఆస్ట్రేలియా: మిచెల్ మార్ష్ (సి), మాథ్యూ షార్ట్, టిమ్ డేవిడ్, జోష్ ఇంగ్లిస్ (డబ్ల్యుకె), జోష్ ఫిలిప్, గ్లెన్ మాక్స్వెల్, మార్కస్ స్టోయినిస్, బెన్ ద్వార్షుయిస్, నాథన్ ఎల్లిస్, జేవియర్ బార్ట్లెట్, ఆడమ్ జంపాభారత్: అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్ (సి), జితేష్ శర్మ (WK), తిలక్ వర్మ, వాషింగ్టన్ సుందర్, శివమ్ దూబే, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తిచదవండి: పాక్ బౌలర్ ఓవరాక్షన్.. టీమిండియా ప్లేయర్ల పట్ల అనుచిత ప్రవర్తన -
షమీకి సుప్రీంకోర్టు నోటీసులు
మాజీ భార్య హసీన్ జహాతో (Hasin Jahan) విభేదాల కారణంగా టీమిండియా వెటరన్ పేసర్ మహ్మద్ షమీ (Mohammed Shami) మరోసారి వార్తల్లోకెక్కాడు. తనకు లభిస్తున్న భరణం సరిపోవట్లేదని హసీన్ దేశ సర్వోన్నత న్యాయస్థానాన్ని (Supreme Court) ఆశ్రయించింది. హసీన్ పిటీషన్‌ను విచారించిన సుప్రీంకోర్టు షమీకి నోటీసులు జారీ చేసింది. నాలుగు వారాల్లో స్పందన తెలియజేయాలని ఆదేశించింది.కలకత్తా హైకోర్టు ఆదేశాల మేరకు షమీ హసీన్‌కు రూ. 4 లక్షలు భరణంగా చెల్లిస్తున్నాడు. ఇందులో షమీ కూతురికి రూ. 2.5 లక్షలు, హసీన్‌కు రూ. 1.5 లక్షలు వెళ్తున్నాయి. అయితే ఈ మొత్తం సరిపోవట్లేదని హసీన్ షమీపై మరోసారి కోర్టుకెక్కింది. గతంలోనూ ఇదే విషయంలో ట్రయల్ కోర్టు తీర్పును సవాలు చేస్తూ హసీన్ హైకోర్టును ఆశ్రయించింది. అక్కడ ఆమెకు లభించే భరణాన్ని రూ. 1.3 లక్షల నుంచి రూ. 4 లక్షలకు పెంచారు. తాజాగా ఈ మొత్తం కూడా సరిపోవట్లేదని హసీన్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. హసీన్ తరఫున న్యాయవాదులు శోభా గుప్తా, శ్రీరామ్ పరాకట్ వాదిస్తూ.. షమీ చాలా విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నాడు. నెలకు రూ. 1.08 కోటి ఖర్చు చేస్తున్నాడు. కానీ భార్య, కుమార్తెను పేదరికంలో వదిలేశాడు. షమీ ఆస్తుల నికర విలువ సుమారు రూ. 500 కోట్లు ఉంటుంది. హసీన్‌కు స్వతంత్ర ఆదాయ వనరులేదు. ఉద్యోగం చేసుకునే పరిస్థితిలో కూడా లేదని అన్నారు. షమీ తమ క్లయింట్‌కు ఇంకా రూ. 2.4 కోట్ల బకాయిలు చెల్లించేది ఉందని తెలిపారు. లాయర్ల వాదన విన్న తర్వాత కోర్టు హసీన్‌కు పరోక్షంగా చురకలంటించ్చినట్లు తెలుస్తుంది. నెలకు రూ. 4 లక్షల భరణం చాలా పెద్ద మొత్తం కదా అని ప్రశ్నించినట్లు సమాచారం. కాగా, షమీ-హసీన్‌ల వివాహం 2014లో జరిగింది. నాలుగేళ్లు వీరి కాపురం సజావుగా సాగింది. వీరిద్దరికి ఓ బిడ్డ జన్మించింది.ఆతర్వాత షమీ-జహా మధ్య విభేదాలు తలెత్తాయి. 2018లో హసీన్ షమీపై గృహ హింస, వేధింపుల కేసు నమోదు చేసింది. అప్పటి నుంచి వీరిద్దరూ వేరువేరుగా ఉంటున్నారు. ఈ ఏడాది జులైలో కోల్‌కతా హైకోర్టు రూ. 4 లక్షల భరణం హసీన్‌కు చెల్లించాలని షమీని ఆదేశించింది. చదవండి: నేను మాట్లాడితే కథ వేరేలా మారుతుంది.. సెలక్టర్ జోక్యంతో షమీ యూటర్న్? -
పాకిస్తాన్‌పై భారత్ విజయం.. అక్కడ కూడా భంగపాటే..!
హాంగ్‌కాంగ్ సిక్సస్ టోర్నీలో (Hong Kong Sixes 2025) పాకిస్తాన్‌పై భారత్ డక్‌వర్త్ లూయిస్ పద్దతి ప్రకారం 2 పరుగుల తేడాతో విజయం సాధించింది. మాంగ్ కాక్ వేదికగా ఇవాళ (నవంబర్ 7) జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్ తొలుత బ్యాటింగ్ చేసి నిర్ణీత 6 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 86 పరుగులు చేసింది.ఓపెనర్లు రాబిన్ ఉతప్ప (11 బంతుల్లో 28; 2 ఫోర్లు, 3 సిక్సర్లు), భరత్ చిప్లి (13 బంతుల్లో 24; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) చెలరేగి ఆడారు. ఆఖర్లో కెప్టెన్ దినేశ్ కార్తిక్ (6 బంతుల్లో 17 నాటౌట్; 2 ఫోర్లు, సిక్స్) సైతం బ్యాట్ ఝులిపించాడు. భారత ఇన్నింగ్స్‌లో స్టువర్ట్ బిన్ని 4, మిథున్ 6 పరుగులు చేశారు. పాక్ బౌలర్లలో ముహమ్మద్ షెహజాద్ 2, అబ్దుల్ సమద్ ఓ వికెట్ తీశారు.అనంతరం పాక్ 87 పరుగుల లక్ష్య ఛేదనకు దిగగా వరుణుడు అడ్డు పడ్డాడు. వారి స్కోర్ 41/1 (3 ఓవర్లు) వద్ద ఉండగా వర్షం మొదలైంది. వర్షం ఎంతకీ తగ్గకపోవడంతో డక్‌వర్త్ లూయిస్ పద్దతి ప్రకారం భారత్‌ను విజేతగా ప్రకటించారు.మ్యాచ్ ముగిసే సమయానికి ఖ్వాజా నఫే (18 నాటౌట్), అబ్దుల్ సమద్ (16 నాటౌట్) క్రీజ్‌లో ఉన్నారు. మాజ్ సదాఖత్ (7) ఔటయ్యాడు. సదాఖత్ వికెట్ స్టువర్ట్ బిన్నికి దక్కింది. ఈ టోర్నీలో భారత్ తమ తదుపరి మ్యాచ్‌లో కువైట్‌తో తలపడుతుంది. ఈ మ్యాచ్ నవంబర్ 8న జరుగుతుంది. భారతకాలమానం ప్రకారం ఈ మ్యాచ్ ఉదయం 6:40 గంటలకు మొదలవుతోంది. కాగా, క్రికెట్లో పాకిస్తాన్‌పై భారత్ గెలవడం ఇటీవలికాలంలో ఇది ఐదోసారి. పహల్గాం ఉదంతం తర్వాత భారత సీనియర్ పురుషుల జట్టు పాక్‌ను ఆసియా కప్-2025లో మూడు సార్లు ఓడించింది. అనంతరం భారత సీనియర్ మహిళల జట్టు వన్డే ప్రపంచకప్‌లో పాక్‌ను చిత్తు చేసింది. తాజాగా సూపర్ సిక్సస్ టోర్నీలోనూ పాక్‌కు భారత్ చేతిలో భంగపాటు ఎదురైంది.చదవండి: పాకిస్తాన్ కెప్టెన్‌గా ఎవరూ ఊహించని ప్లేయర్.. -
విశ్వవిజేతలకు టాటా మోటార్స్ అదిరిపోయే గిఫ్ట్!
ఐసీసీ వరల్డ్ కప్ ట్రోఫీ గెలిచిన ఇండియా ఉమెన్స్ టీమ్.. ప్రస్తుతం సంబరాల్లో మునిగిపోయింది. ఈ తరుణంలో టాటా మోటార్స్ వారికి ఒక గుడ్ న్యూస్ చెప్పింది. జట్టులోని సభ్యులకు ఒక్కొక్కరికి.. ఒక్కో సియెర్రా కారును గిఫ్ట్‌గా ఇవ్వనున్నట్లు ప్రకటించింది.టాటా మోటార్స్.. తన సియెర్రా కారును నవంబర్ 25న దేశీయ విఫణిలో లాంచ్ చేయనుంది. ఇప్పటికే ఈ కారు టెస్టింగ్ సమయంలో చాలాసార్లు కనిపించింది. ఇది 5 డోర్స్ మోడల్. కాబట్టి కుటుంబ ప్రయాణాలకు ఇది చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ కారు పనోరమిక్ సన్‌రూఫ్, కనెక్టెడ్ ఎల్ఈడీ టెయిల్‌లైట్స్, సొగసైన డోర్ హ్యాండిల్స్ పొందుతుంది.టాటా సియెర్రా.. మూడు స్క్రీన్ లేఅవుట్‌తో కూడిన డ్యాష్‌బోర్డ్ పొందుతుంది. ఇందులో డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ ప్యానెల్, ఇన్ఫోటైన్మెంట్ కోసం సెంట్రల్ టచ్‌స్క్రీన్, ముందు ప్రయాణీకుడి కోసం అదనపు స్క్రీన్ వంటివి ఉన్నాయి. సరికొత్త స్టీరింగ్ వీల్ కూడా పొందుతుంది. ఈ కారు పసుపు, ఎరుపు రంగుల్లో అమ్మకానికి రానున్నట్లు సమాచారం. ఈ కారు ధరను కంపెనీ అధికారికంగా వెల్లడించలేదు. కానీ దీని ప్రారంభ ధర రూ. 15 లక్షలు (ఎక్స్ షోరూమ్) ఉంటుందని అంచనా.ఇదీ చదవండి: హీరో ఎలక్ట్రిక్ కారు: నానో కంటే చిన్నగా!టాటా సియెర్రా యొక్క పవర్‌ట్రెయిన్ గురించి.. కంపెనీ అధికారికంగా వెల్లడించలేదు. అయితే ఇది పెట్రోల్ & డీజిల్ ఇంజిన్ ఎంపికలతో లభించనుంది. అయితే ప్రస్తుతం హారియర్ & సఫారీ మోడళ్లలోని 2.0-లీటర్ క్రియోటెక్ డీజిల్ ఇంజిన్, 1.5-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ ఎంపికలే.. సియెర్రాలో కూడా ఉంటాయని సమాచారం. ట్రాన్స్మిషన్ ఎంపికలలో మాన్యువల్ & ఆటోమేటిక్ ఉండనున్నాయి. -
గిల్.. ఎందుకిలా?
టీమిండియా టెస్టు, వన్డే కెప్టెన్ శుబ్‌మన్ గిల్ (shubman gill).. రెండు ఫార్మాట్లలోనూ అంచనాలకు మించి రాణిస్తున్నాడు. కానీ పొట్టి ఫార్మాట్ టి20లో స్థాయికి తగిన ఆటతీరు కనబరచడం లేదు. 26 ఏళ్ల వయసులో ఇండియన్ క్రికెట్ ఫేస్‌గా పేరుగాంచిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. పొట్టి ఫార్మాట్లోనూ పుంజుకోవాల్సి ఉంది. ప్రస్తుతం టీమిండియా జట్టుకు సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్‌గా ఉన్నాడు. అతడి తర్వాత టి20 జట్టు పగ్గాలు కూడా గిల్‌కే దక్కే అవకాశాలు కన్పిస్తున్నాయి. దీని కంటే అంతర్జాతీయ టి20ల్లో తన గణాంకాలను అతడు మెరుగుపరుచుకోవాల్సి ఉంది.శుబ్‌మన్ గిల్ ఎలాంటి బ్యాటరో క్రికెట్ అభిమానులకు తెలుసు. వన్డేలు, టెస్టుల్లో తానేంటో నిరూపించుకున్నాడు. సాంకేతికంగా అతడి బ్యాటింగ్ ఎటువంటి వంక పెట్టడానికి లేదు. క్లాసికల్ షాట్లు ఆడటంలోనూ దిట్ట. క్రీజులోకి వచ్చిన తర్వాత నెమ్మదిగా మొదలుపెట్టి తర్వాత జోరు పెంచడం అతడి స్టయిల్.భారీ ఇన్నింగ్స్ బాకీలాంగ్ ఫార్మాట్‌తో పోలిస్తే పొట్టి ఫార్మాట్లో బ్యాటింగ్ భిన్నంగా ఉంటుంది. పవర్ హిట్టింగ్ (Power hitting) చేసే వాళ్లే ఎక్కువగా మ్యాచ్ ఫలితాలను నిర్దేశిస్తూ ఉంటారు. గిల్ కూడా బంతులు ఎక్కువగా వృధా చేయకుండానే పరుగులు చేస్తుంటాడు. అయితే టి20ల్లో అతడి ప్రదర్శన స్థాయికి తగినట్టు లేకపోకడమే ప్రధాన సమస్య. తాజాగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న టి20 సిరీస్‌లోనూ గిల్ పెద్దగా రాణించలేదు. ఇప్పటివరకు జరిగిన రెండు మ్యాచ్‌ల్లో కేవలం 5, 15 పరుగులు మాత్రమే చేశాడు. చివరి రెండు మ్యాచ్ల్లోనా భారీ ఇన్నింగ్స్ ఆడతాడేమో చూడాలి.గట్టి పోటీ ఉన్నప్పటికీ..సూర్యకుమార్ తర్వాత కెప్టెన్ పదవి అప్పగించాలన్న ఉద్దేశంతోనూ టి20 వైస్ కెప్టెన్‌గా గిల్‌ను నియమించింది బీసీసీఐ. దీంతో ఏడాది విరామం తర్వాత టి20 జట్టులోకి వచ్చాడు. సంజూ శామ్సన్, యశస్వీ జైశాల్ (Yashasvi Jaiswal) నుంచి గట్టి పోటీ ఉన్నప్పటికీ భవిష్యత్తు కెప్టెన్ అనే ఉద్దేశంతో గిల్పైపు జట్టు యాజమాన్యం మొగ్గు చూపింది. డాషింగ్ ఓపెనర్ అభిషేక్ శర్మతో పాటు ప్రస్తుతం జట్టులో ఉన్న ఆటగాళ్లు పవర్ హిట్టింగ్తో దుంచుతున్నారు. దీంతో గిల్ కూడా రిథమ్ అందుకోవాలని అభిమానులు భావిస్తున్నారు.ఐపీఎల్లో అదరహోధనాధన్ క్రికెట్ సిరీస్.. ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో గిల్‌కు మంచి రికార్డ్ ఉంది. గత ఐదేళ్లలో ప్రతి సీజన్లోనూ 400 పరుగులు తగ్గకుండా స్కోరు చేస్తున్నాడు. ఇప్పటివరకు 118 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడిన గిల్.. 39.44 సగటుతో 3866 పరుగులు చేశాడు. ఇందులో 4 సెంచరీలు, 26 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. తక్కువ మ్యాచ్‌లే ఆడినప్పటికీ ఇంటర్నేషనల్ టి20ల్లో అతడి బ్యాటింగ్ సగటు స్థాయికి తగ్గట్టు లేదనేది విశ్లేషకుల అభిప్రాయం. ఇప్పటివరకు 31 అంతర్జాతీయ టి20ల్లో 28.22 సగటుతో 762 పరుగులు మాత్రమే సాధించాడు. ఇందుల్లో సెంచరీ, 3 హాఫ్ సెంచరీలున్నాయి.సత్తా చాటాలిప్రస్తుతం అభిషేక్ శర్మతో కలిసి ఓపెనర్‌గా వస్తున్న గిల్.. మున్ముందు మ్యాచ్‌ల్లో అంచనాలకు తగినట్టుగా ఆడాల్సి ఉందని జట్టు మేనేజ్మెంట్ కోరుకుంటోంది. తక్కువ సమయంలోనే టెస్టులు, వన్డేల్లో తనదైన ముద్ర వేసిన ఈ యువ కెప్టెన్.. పొట్టి ఫార్మాట్లోనూ సత్తా చాటాలని టీమిండియా క్రికెట్ ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. చదవండి: టీమిండియాకు ఎంపిక కావాలంటే ఇంకా ఏం చేయాలి? -
టీమిండియాకు ఎంపిక కావాలంటే "ఇంకా ఏం చేయాలి"..?
త్వరలో సౌతాఫ్రికాతో జరుగోయే 2 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం భారత జట్టును నిన్న (నవంబర్ 5) ప్రకటించారు. ఊహించిన విధంగానే అన్ని ఎంపికలు జరిగాయి. కొత్త వారెవ్వరికీ అవకాశాలు దక్కలేదు. ఇంగ్లండ్ సిరీస్ సందర్భంగా గాయపడిన పంత్ రీఎంట్రీ ఇచ్చాడు. అదే సిరీస్‌లో ఆకట్టుకున్న ఆకాశ్‌దీప్ పునరాగమనం చేశాడు. యువ ఆటగాళ్లు సాయి సుదర్శన్, దేవ్‌దత్ పడిక్కల్, ధృవ్ జురెల్, నితీశ్ కుమార్ రెడ్డి తమ స్థానాలు నిలబెట్టుకున్నారు.కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్.. సీనియర్లు యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, బుమ్రా, అక్షర్ పటేల్, మహ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్ కొనసాగారు. ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది.అసలు టీమిండియాకు ఎంపిక కావాలంటే ఏం చేయాలి..?ఈ జట్టు ప్రకటన తర్వాత భారత క్రికెట్ అభిమానుల్లో ఓ విషయంలో గందరగోళం మొదలైంది. అసలు టీమిండియాకు ఎంపిక కావాలంటే ఏం చేయాలి.. దీనికి ప్రామాణికం ఏంటని చాలా మంది చర్చించుకుంటున్నారు.ఈ చర్చ ఉత్పన్నమవడానికి ఇటీవలికాలంలో భారత సెలెక్టర్లు అనుసరిస్తున్న విధానాలే కారణం. గతంలో భారత జట్టుకు ఎంపిక కావాలంటే దేశవాలీ క్రికెట్లో సత్తా చాటాల్సి ఉండేది. అక్కడ అత్యుత్తమంగా రాణిస్తేనే భారత సెలక్టర్ల నుంచి పిలుపు దక్కేది. అయితే ప్రస్తుతం సీన్ మారిపోయింది.పెద్ద తలకాయల అండదండలుంటే చాలా..?భారత క్రికెట్‌కు సంబంధించి పెద్ద తలకాయల అండదండలుంటే ఎలాగైనా జట్టులోకి వచ్చేయవచ్చు. ఇందుకు హర్షిత్ రాణా ఉదంతమే ప్రధాన ఉదాహరణ. హర్షిత్ ఏ అనుభవం లేకుండా, టీమిండియాలో ఓ పెద్ద తలకాయ మద్దతుతో దాదాపు ప్రతి జట్టులో ప్రత్యక్షమవుతుంటాడు. ఇతగాడికి ప్లేయింగ్ ఎలెవెన్‌లో కూడా అవకాశాలు సులువుగా వచ్చేస్తుంటాయి.ఇంత లాబీయింగ్ జరిగి తుది జట్టులోకి వచ్చాక ఏమైనా పొడిచేశాడా అంటే, అదీ లేదు. పైగా అతని ఎంపికను కొందరు సమర్దించుకోవడం హాస్యాస్పదం. ఓ పేరుమోసిన వ్యక్తయితే ఈ విషయంపై ప్రశ్నించిన వారిపై ఎదురుదాడికి దిగడం ఇంకా విడ్డూరం. అంతిమంగా హర్షిత్ విషయంలో వ్యతిరేకత తారాస్థాయికి చేరడంతో సెలెక్టర్లు కాస్త తగ్గారు. సౌతాఫ్రికాతో టెస్ట్ సిరీస్‌కు అతన్ని ఎంపిక చేయలేదు. అయితే సౌతాఫ్రికా-ఏతో వన్డే సిరీస్‌కు మరో అవకాశం ఇచ్చి ఈగోను సంతృప్తివరచుకున్నారు.అర్హులకు అన్యాయంహర్షిత్ లాంటి అనర్హులు జట్టులో రావడం వల్ల చాలామంది అర్హులకు అన్యాయం జరిగింది. ప్రస్తుతం ఆస్ట్రేలియాతో జరుగుతున్న టీ20 సిరీస్‌లో ఇది మరోసారి నిరూపితమైంది. హర్షిత్‌కు అవకాశం ఇవ్వాల్సి రావడంతో మొదటి రెండు టీ20లకు ప్రపంచ నంబర్ వన్ బౌలర్ అర్షదీప్ సింగ్‌కు అవకాశం ఇవ్వలేదు. ఎట్టకేలకు మూడో టీ20లో హర్షిత్‌ను పక్కన పెట్టి అర్షదీప్‌కు అవకాశం ఇవ్వగా, అతడు చెలరేగిపోయాడు. 3 వికెట్లు తీసి టీమిండియాను గెలిపించాడు.హర్షిత్ విషయంలో అలా.. షమీ, కరుణ్ విషయంలో ఇలా..!వరుసగా విఫలమవుతున్న హర్షిత్ లాంటి ఆటగాళ్లకు పదేపదే అవకాశాలు ఇస్తున్న సెలెక్టర్లు.. దేశవాలీ క్రికెట్లో సత్తా చాటుతున్న మహ్మద్ షమీ, కరుణ్ నాయర్ లాంటి ఆటగాళ్లను మాత్రం అస్సలు పట్టించుకోవడం లేదు. ప్రస్తుతం జరుగుతున్న రంజీ ట్రోఫీలో షమీ, కరుణ్ ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నారు. అయినా వీరికి సౌతాఫ్రికాతో టెస్ట్ సిరీస్‌కు అవకాశం దక్కలేదు. కనీసం సౌతాఫ్రికా-ఏతో సిరీస్‌కు కూడా సెలెక్టర్లు పరిగణలోకి తీసుకోలేదు.హర్షిత్ లాంటి ఆటగాళ్ల విషయంలో పక్షపాతంగా వ్యవహరించే బీసీసీఐ పెద్దలు.. ఒకప్పుడు టీమిండియాలో ఓ వెలుగు వెలిగి, ప్రస్తుతం ఉనికి చాటుకునే ప్రయత్నం చేస్తున్న షమీ, కరుణ్ లాంటి వారిని మాత్రం విస్మరిస్తున్నారు. శుభపరిణామం కాదు..!భారత క్రికెట్‌కు ఇలాంటి అనుభవాలు ఏ మాత్రం మంచివి కావు. అర్హులకు అన్యాయాలు జరుగుతూ పోతుంటే, రానున్న తరాల్లో దేశానికి ప్రాతినిథ్యం వహించాలనే ఆశ చచ్చిపోతుంది. క్రికెట్‌కు ఇలాంటి అనుభవాలు ఎంత మాత్రం శుభపరిణామం కాదు. అనర్హమైన వ్యక్తుల కోసం దేశ ప్రయోజనాలు పణంగా పెట్టి, అర్హులను విస్మరించడం మంచి సాంప్రదాయం కాదని విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు.దేశవాలీ క్రికెట్లో సత్తా చాటుతున్న మహ్మద్ షమీ, కరుణ్ నాయర్, పృథ్వీ షా, సర్ఫరాజ్ ఖాన్, అభిమన్యు ఈశ్వరన్ లాంటి చాలామంది ఆటగాళ్ల అవేదన ఇది. చదవండి: పంత్, ఆకాశ్ పునరాగమనం -
ప్రపంచ క్రికెట్‌ను శాసించేందుకు మరో వసంతంలోకి..
క్రికెట్ దిగ్గజం, రికార్డుల రారాజు, ఛేజింగ్ మాస్టర్, ఫిట్నెస్ ఫ్రీక్ అయిన విరాట్ కోహ్లి (Virat Kohli) ప్రపంచ క్రికెట్‌ను శాసించేందుకు మరో వసంతంలోకి అడుగుపెట్టాడు. ఇవాళ (నవంబర్ 5, 2025) కింగ్ కోహ్లి 37వ జన్మదినం. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని యావత్ క్రీడా సమాజం అతడికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతుంది.ఇటీవలే టీ20, టెస్ట్‌లకు రిటైర్మెంట్ ప్రకటించిన కోహ్లి ప్రస్తుతం వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్నాడు. 2027 ప్రపంచకప్ ఆడాలన్నది అతడి కొరిక. అంతవరకు విరాట్ మునుపటి మెరుపులు మెరిస్తూ, మరెన్నో రికార్డులను బద్దలు కొడుతూ అప్రతిహతంగా కెరీర్‌ను కొనసాగించాలని ఆశిద్దాం.కోహ్లి ఇటీవలే ఆస్ట్రేలియాతో జరిగిన మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో ఆడాడు. ఇందులో తొలి రెండు మ్యాచ్‌ల్లో డకౌటైనా, మూడో మ్యాచ్‌లో తిరిగి పుంజుకున్నాడు. రోహిత్ శర్మతో కలిసి అద్భుతమైన భాగస్వామ్యాన్ని నెలకొల్పి టీమిండియాను విజయాన్నందించాడు. సిడ్నీ వేదికగా జరిగిన ఆ మ్యాచ్‌లో రోహిత్ సెంచరీ (121 నాటౌట్) చేయగా.. కోహ్లి (74 నాటౌట్) అర్ద సెంచరీతో రాణించాడు.విరాట్ త్వరలో మరోసారి దర్శనమివ్వబోతున్నాడు. స్వదేశంలో సౌతాఫ్రికాతో జరిగే సిరీస్‌లో కోహ్లి ఆడే అవకాశం ఉంది. 2027 ప్రపంచకప్ వరకు కోహ్లి ఫిట్నెస్ను, ఫామ్‌ను కాపాడుకుంటూ టీమిండియాను గెలిపిస్తూ ఉండాలని భారత క్రికెట్ అభిమానులంతా కోరుకుంటున్నారు. అతడి జన్మదినం సందర్భంగా ప్రతి భారత క్రికెట్ అభిమాని అకాంక్ష ఇదే.ఢిల్లీ వీధుల్లో క్రికెట్ ఆడటం మొదలుపెట్టి, క్రీడలో అత్యున్నత శిఖరాలను అధిరోహించిన కోహ్లి.. ఫామ్‌ను కాపాడుకోగలిగితే సునాయాసంగా మరో రెండు, మూడేళ్లు దేశానికి సేవలందించగలడు. ఫిట్నెస్ విషయంలో అతడికి ఎలాంటి సమస్యలు లేవు. ఉండవు. సాధారణంగా 35 ఏళ్ల వయసొచ్చే సరికే క్రికెటర్లు ఫిట్నెస్ను కోల్పోయి సమస్యలు ఎదుర్కొంటుంటారు.అయితే కోహ్లి మాత్రం అలా కాదు. 25 ఏళ్ల కుర్రాళ్లు కూడా పోటీ పడలేని విధంగా ఫిట్నెస్ను మెయిన్‌టెయిన్ చేస్తున్నాడు. తాజాగా ఆసీస్‌తో జరిగిన సిరీస్‌లో కోహ్లిని చూస్తే ఇది స్పష్టంగా తెలుస్తుంది.కెరీర్‌ను నిదానంగా ప్రారంభించిన కోహ్లి.. అందరిలాగే మధ్యలో కొన్ని ఒడిదుడుకులు ఎదుర్కొన్నాడు. ఓ దశలో ఫామ్ కోల్పోయి చాలా ఇబ్బంది పడ్డాడు. అప్పటివరకు పొగిడిన నోళ్లే అతన్ని దూషించాయి. బ్యాడ్ టైమ్‌ను అధిగమించిన కోహ్లి తిరిగి నిలబడ్డాడు. దూషించిన నోళ్లకు బ్యాట్‌తో సమాధానం చెప్పాడు.ఆటగాడిగానే కాకుండా కెప్టెన్‌గానూ కోహ్లి కెరీర్ విజయవంతంగా సాగింది. టెస్ట్‌ల్లో భారత అత్యుత్తమ కెప్టెన్ కోహ్లినే అని చెప్పవచ్చు. అతడి హయాంలో భారత్ అత్యున్నత శిఖరాలు అధిరోహించింది. కోహ్లి జట్టు ఆటతీరునే మార్చేశాడు. ఆటగాళ్లకు దూకుడు నేర్పాడు. ఫిట్నెస్ మెరుగుపర్చుకునే విషయంలో అందరికీ దిక్సూచిగా నిలిచాడు. కోహ్లి జమానాలో భారత్ చిరస్మరణీయ విజయాలు సాధించింది. చాలాకాలం పాటు ప్రపంచ నంబర్ వన్ జట్టుగా కొనసాగింది.కోహ్లి ఆటగాడిగా, కెప్టెన్‌గా ఎన్నో మైలురాళ్లను అధిగమించాడు. ఇప్పటికే భారత క్రికెట్‌కు చేయాల్సిన దానికంటే ఎక్కువే చేశాడు. అయినా కోహ్లిలో కసి తీరడం లేదు. భారత జట్టుకు ఇంకా ఏదో చేయాలనే తపన ఉంది. 2027 వన్డే ప్రపంచకప్ గెలిచి కెరీర్‌కు ముగింపు పలకాలన్నది కోహ్లి కోరిక. ఈ కోరిక నెరవేరాలని, కోహ్లి ఇలాంటి పుట్టిన రోజులు మరెన్నో జరుపుకోవాలని ఆశిద్దాం. కోహ్లి సాధించిన ఘనతలు..అండర్-19 వరల్డ్‌కప్ (2008)వన్డే వరల్డ్‌కప్ (2011)టీ20 వరల్డ్‌కప్ (2024)ఛాంపియన్స్ ట్రోఫీ (2013, 2025)ఐపీఎల్ (2025)ఆసియా కప్-3టెస్ట్ మేస్-5ఐసీసీ అవార్డ్స్-10చదవండి: డ్రగ్స్‌కు బానిస.. స్టార్ క్రికెటర్‌పై శాశ్వత నిషేధం -
ఛాంపియన్ టీమ్ కెప్టెన్‌కు మొండిచెయ్యి..!
మహిళల క్రికెట్ ప్రపంచకప్ 2025 టీమ్ ఆఫ్ ద టోర్నీని (Women's Cricket World Cup Team of the Tournament) ఐసీసీ ఇవాళ (నవంబర్ 4) ప్రకటించింది. ఈ జట్టులో ఛాంపియన్ జట్టు భారత్ నుంచి ముగ్గురు, రన్నరప్ జట్టు సౌతాఫ్రికా నుంచి ముగ్గురికి అవకాశం దక్కింది. అలాగే ఏడు సార్లు ఛాంపియన్, ఈ ఎడిషన్ సెమీఫైనలిస్ట్ అయిన ఆస్ట్రేలియా నుంచి కూడా ముగ్గురికి చోటు లభించింది. ఈ ఎడిషన్ మరో సెమీ ఫైనలిస్ట్ అయిన ఇంగ్లండ్ నుంచి ఒకరు, లీగ్ దశలో నిష్క్రమించిన పాకిస్తాన్ నుంచి ఒకరికి అవకాశం దక్కింది. ఇంగ్లండ్‌కు చెందిన మరో ప్లేయర్‌కు 12వ సభ్యురాలిగా అవకాశం లభించింది. ఆశ్చర్యకరంగా ఈ జట్టులో ఛాంపియన్ టీమ్ కెప్టెన్‌కు (Harmanpreet Kaur) చోటు దక్కలేదు.బెర్త్‌లు పరిమితిగా ఉండటంతో ఛాంపియన్ టీమ్ కెప్టెన్‌కు చోటు కల్పించలేకపోయామని ఐసీసీ వివరణ ఇచ్చింది. ఈ జట్టుకు కెప్టెన్‌గా రన్నరప్ టీమ్ కెప్టెన్ లారా వోల్వార్డ్ట్ ఎంపిక కాగా.. అదే జట్టు నుంచి పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ మారిజాన్ కాప్, ఆల్‌రౌండర్ నదినే డి క్లెర్క్ చోటు దక్కించుకున్నారు.లారా సెమీస్, ఫైనల్స్‌లో సెంచరీలు సహా టోర్నీ లీడింగ్ రన్ స్కోరర్‌గా నిలువగా.. కాప్ 2 అర్ద సెంచరీలు సహా 208 పరుగులు చేసి 12 వికెట్లు తీసింది. డి క్లెర్క్ 52 సగటున, ఓ హాఫ్ సెంచరీ సాయంతో 208 పరుగులు చేసి, 26.11 సగటున 9 వికెట్లు తీసింది.భారత్ నుంచి టోర్నీ సెకెండ్ లీడింగ్ రన్ స్కోరర్ స్మృతి మంధన, సెమీస్‌లో ఆస్ట్రేలియాపై వీరోచిత శతకం బాదిన జెమీమా రోడ్రిగ్స్, ఫైనల్లో హాఫ్ సెంచరీ సహా 5 వికెట్ల ప్రదర్శన నమోదు చేసిన దీప్తి శర్మకు చోటు దక్కింది.మంధన సెంచరీ, 2 హాఫ్ సెంచరీల సాయంతో 434 పరుగులు చేయగా.. జెమీ సెంచరీ, హాఫ్ సెంచరీ సాయంతో 292 పరుగులు చేసింది. దీప్తి సెంచరీ, 3 హాఫ్ సెంచరీలు సహా 22 వికెట్లు తీసి, టోర్నీ లీడింగ్ వికెట్ టేకర్‌గా నిలిచింది. ఈ ప్రదర్శనలకు గానూ దీప్తి ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగానూ నిలిచింది.ఆస్ట్రేలియా నుంచి ఆష్లే గార్డ్నర్, అన్నాబెల్ సదర్‌ల్యాండ్, అలానా కింగ్ ఐసీసీ టీమ్ ఆఫ్ ద టోర్నీలో చోటు దక్కించుకున్నారు. గార్డ్నర్ రెండు సెంచరీలు, హాఫ్ సెంచరీతో పాటు 7 వికెట్లు తీయగా.. సదర్‌ల్యాండ్ ఓ హాఫ్ సెంచరీ చేసి, 17 వికెట్లు తీసింది. లెగ్ స్పిన్నర్ అలానా కింగ్ 17.38 సగటున 13 వికెట్లు తీసింది.పాకిస్తాన్ నుంచి వికెట్‌కీపర్ సిద్రా నవాజ్, ఇంగ్లండ్ నుంచి సోఫీ ఎక్లెస్టోన్ ఈ జట్టులో చోటు దక్కించుకున్నారు. సిద్రా ఈ ప్రపంచకప్‌లో 8 డిస్మిసల్స్లో భాగంగా కావడంతో పాటు 62 పరుగులు చేయగా.. ఎక్లెస్టోన్ 14.25 సగటున 16 వికెట్లు తీసింది. 12వ ప్లేయర్‌గా ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ నాట్ సీవర్ బ్రంట్ ఎంపికైంది. బ్రంట్ సెంచరీ, ఓ హాఫ్ సెంచరీ సాయంతో 262 పరుగులు చేసి, 9 వికెట్లు తీసింది.చదవండి: స్మృతి మంధనకు భారీ షాక్ -
సచిన్, లక్ష్మణ్, రోహిత్ వచ్చారు.. మీరెక్కడా సార్?
భారత మహిళల క్రికెట్ చిరకాల స్వప్నం నెరవేరింది. మూడోసారి ఫైనల్ చేరిన మన వనితలు కప్‌ను ఒడిసి పట్టుకున్నారు. కోట్ల ప్రజల ఆకాంక్షను నెరవేరుస్తూ ఎట్టకేలకు విశ్వ విజేతగా నిలిచారు. భారత మహిళల క్రికెట్ టీమ్ వరల్డ్ కప్ సాధించడంతో దేశవ్యాప్తంగా ప్రజలు సంబురాలు చేసుకున్నారు. విశ్వవ్యాప్తంగా ఉన్న భారతీయులు మన మహిళలను ప్రశంసలతో ముంచెత్తారు. అదే సమయంలో రన్నరప్‌గా నిలిచిన దక్షిణాఫ్రికా మహిళల టీమ్‌ను సైతం కొనియాడారు.అయితే తమ టీమ్ రన్నరప్‌గా నిలవడంతో ప్రముఖ దక్షిణాఫ్రికా నటి స్పందించింది. సౌత్ఆఫ్రికాకు చెందిన ప్రముఖ నటి, రచయిత్రి తంజా వుర్ విన్నర్‌గా నిలిచిన భారత మహిళల టీమ్‌పై ప్రశంసలు కురిపించింది. అదే సమయంలో సొంత దేశంలోని పురుష క్రికెటర్లతో పాటు ప్రజలపై ఆగ్రహం వ్యక్తం చేసింది. భారతీయులు చూపించిన ప్రేమ, మద్దతు.. మన మహిళా క్రికెట్ జట్టుకు సౌతాఫ్రికన్స్ సపోర్ట్ ఇవ్వకపోవడంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేసింది. ఈ విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో షేర్ చేస్తూ తన ఆవేదన వ్యక్తం చేసింది. భారతీయులు క్రీడల పట్ల చూపిస్తున్న ప్రేమ, మద్దతు మనవాళ్లకు ఎందుకు రాదని ప్రశ్నించింది.వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌లో మాజీ క్రికెట్ దిగ్గజాలైన సచిన్ టెండూల్కర్, రోహిత్ శర్మ, వీవీఎస్ లక్ష్మణ్ మహిళా క్రికెటర్లను ఉత్సాహపరిచేందుకు స్టేడియానికి వచ్చారని కొనియాడింది. మరి దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్స్ ఎక్కడ? అని నిలదీసింది. ఎందుకంటే మీకు ఈ మ్యాచ్ అంత ముఖ్యం కాకపోవచ్చంటూ సౌతాఫ్రికా పురుష క్రికెటర్లను ఉద్దేశించి ఘాటుగా విమర్శించింది. సౌతాఫ్రికా క్రీడా మంత్రి కూడా ఈ కార్యక్రమానికి హాజరు కాకపోవడం.. మహిళల క్రీడల పట్ల తన దేశ వైఖరిని సోషల్ మీడియా వేదికగా ఎండగట్టింది.స్మృతి మంధానతో పాటు భారత మహిళ క్రికెటర్స్ చాలా బాగా ఆడారని తంజా వుర్ ప్రశంసలు కురిపించింది. భారతీయ అభిమానుల నమ్మకాన్ని ఆమె కొనియాడింది. ఇలాంటి మద్దతు టీమ్ ఇండియాకు బాాగా కలిసొచ్చిందని తంజా వుర్ తెలిపింది. ఏది ఏమైనా ఈ రోజు మీరు ఈ ప్రపంచ కప్ విజేతలు.. మీరు దానికి అర్హులు అంటూ టీమిండియాను ప్రశంసంచింది. కాగా.. ఈ ప్రతిష్టాత్మ వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌కు దక్షిణాఫ్రికా మాజీ దిగ్గజ క్రికెటర్స్ జాక్వస్ కల్లిస్, ఏబీ డివిలియర్స్, గ్రేమ్ స్మిత్ లాంటి వాళ్లెవరూ కూడా స్టేడియంలో కనిపించలేదు. దీంతో నటికి తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ వీడియోను రిలీజ్ చేసింది. View this post on Instagram A post shared by Thanja Vuur 🔥 (@cape_town_cricket_queen) -
విశ్వ విజేతల వెనుక త్యాగాల గాథ
2025, నవంబర్ 2. భారత మహిళల క్రికెట్ జట్టు చరిత్ర సృష్టించిన రోజు. ఈ రోజు భారత్ తొలిసారి జగజ్జేతగా అవతరించింది. 2025 ఎడిషన్ వన్డే ప్రపంచకప్ ఫైనల్లో దక్షిణాఫ్రికాను ఓడించి ఛాంపియన్‌గా నిలిచింది. ఈ గెలుపుతో యావత్ భారతావణి ఉప్పొంగి పోయింది. భారత ఆటగాళ్ల ఆనందానికి అవథుల్లేకుండా పోయాయి. తొలిసారి ప్రపంచకప్ గెలిచిన భారత క్రికెటర్లు కోట్లాది హృదయాలను గెలుచుకున్నారు. భారతీయుల ప్రపంచకప్ కలను సాకారం చేసిన టీమిండియా ప్లేయర్ల వెనుక ఎన్నో త్యాగాలు, పోరాటాలు, కన్నీరు, కలలు దాగి ఉన్నాయి. వాటిపై ఓ లుక్కేద్దాం.హర్మన్‌ప్రీత్ కౌర్.. దూషించిన నోళ్లతోనే జేజేలు కొట్టించుకుందిపంజాబ్లోని మోగాలో జన్మించిన హర్మన్‌ప్రీత్, తండ్రి ప్రోత్సాహంతో క్రికెట్లోకి అడుగుపెట్టింది. 1983లో కపిల్ దేవ్ భారత జట్టుకు తొలి ప్రపంచకప్ అందించి, పురుషుల క్రికెట్లో కొత్త శకానికి నాంది పలికితే.. హర్మన్ 2025 ప్రపంచకప్ విక్టరీతో మహిళల క్రికెట్లో కొత్త శకాన్ని ప్రారంభించింది.హర్మన్ క్రీడల్లో అడుపెట్టాలనుకున్న అందరు అమ్మాయిల్లాగే చిన్నతనంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంది. దిగువ మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చిన ఆమె భారత జట్టు కెప్టెన్‌గా ఎదిగి భారతీయుల ప్రపంచకప్ కలను సాకారం చేసింది. చిన్నతనంలో హర్మన్ అబ్బాయిలతో క్రికెట్ ఆడుతూ మెళకువల నేర్చుకుంది. గ్రామీణ నేపథ్యం నుంచి రావడంతో అబ్బాయిలతో క్రికెట్ ఏంటని బంధులందరూ ఆమెను దూషించారు. అయినా పట్టువదలని హర్మన్ అనుకున్నది సాధించి దూషించిన నోళ్లతోనే శభాష్ అనిపించుకుంది.Worked as a carpenter. Got taunted by many when young daughter started playing cricket with boys in the neighborhood. But he stood by her. Made her first bat with his own hands. Got her enrolled in an academy. Travelled far everyday to take her to training and decided to pick and https://t.co/fgmIiEAFtl— TheRandomCricketPhotosGuy (@RandomCricketP1) November 2, 2025అమన్‌జోత్ కౌర్.. కార్పెంటర్ తండ్రి కలను నెరవేర్చిన కూతురుక్రికెటర్గా అమన్‌జోత్ ప్రయాణం తండ్రి చెక్కిన బ్యాట్‌తో మొదలైంది. ఆమె తండ్రి ఓ కార్పెంటర్. బాల్యంలో అమన్‌జోత్ బాలురతో క్రికెట్ ఆడటాన్ని చూసి ఊరంతా విమర్శించేవారు. అయినా తండ్రి ఆమెను వెనకేసుకొచ్చేవాడు. రోజూ 30 కిలోమీటర్ల దూరం ప్రయాణించి అమన్‌జోత్‌ను అకాడమీకి తీసుకెళ్లెవాడు. భారత జట్టు ప్రపంచకప్ గెలిచిన తర్వాత అమన్‌జోత్ తండ్రి ఆనంధానికి అవథుల్లేవు. “నా కూతురు గెలిచింది” అంటూ విజయ గర్వంతో ఊగిపోయాడు.Renuka's father passed away before she turned 3. He was such a cricket tragic that he named his son Vinod after Kambli. Renuka's mother encouraged her to take up the game despite being from a village in HP. Renuka showed her CWG Bronze to all the girls in her village. She will https://t.co/TBUEnQssJb— TheRandomCricketPhotosGuy (@RandomCricketP1) November 2, 2025రేణుకా సింగ్.. తల్లి త్యాగాన్ని, అన్న నమ్మకాన్ని నిలబెట్టిందిహిమాచల్ ప్రదేశ్‌లోని షిమ్లా జిల్లాలో జన్మించిన రేణుకా సింగ్‌కు మూడేళ్ల వయసుండగానే తండ్రి చనిపోయాడు. తల్లి సునీతా సింగే రేణుకా బాగోగులు చూసింది. రేణుకను క్రికెట్ అకాడమీకి పంపేందుకు సునీత ఎన్నో కష్టాలు పడింది. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబం కావడంతో రేణుక కోసం తల్లి సునీత ఎన్నో త్యాగాలు చేసింది. రేణుక కోసం ఆమె అన్న వినోద్ కూడా క్రికెట్‌ను వదిలేశాడు. ఆర్దిక కష్టాలు ఉండటంతో ఇంట్లో ఒక్కరికే ఆకాడమీలో చేరే అవకాశం ఉండేది. రేణుక క్రికెట్లో రాణిస్తుండటంతో వినోద్ తన కలను చంపుకున్నాడు. చివరికి రేణుక ప్రపంచకప్ గెలిచిన జట్టులో కీలక సభ్యురాలిగా నిలిచి తల్లి, అన్నల త్యాగాలకు న్యాయం చేసింది.Comes from Bundelkhand, backwaters of Indian cricket. Played tennis ball cricket with boys in the neighborhood. Toiled hard in domestic cricket for years. Became a net bowler in 2024 for MI before UP Warriorz picked her in the auctions. Soon made her India debut, took a 6 wicket https://t.co/NO7T8nd9L1— TheRandomCricketPhotosGuy (@RandomCricketP1) November 2, 2025క్రాంతి గౌడ్.. పోలీస్ కానిస్టేబుల్ కూతురుమధ్యప్రదేశ్లోని ఛతర్పూర్ జిల్లాలోని ఘువారా అనే చిన్న పట్టణంలో జన్మించిన క్రాంతి గౌడ్ ప్రపంచకప్ గెలిచిన భారత జట్టులో కీలక సభ్యురాలిగా నిలిచింది. క్రాంతి తండ్రి ఓ రిటైర్డ్ పోలీస్ కానిస్టేబుల్. కుటుంబం ఆర్థికంగా వెనుకబడినప్పటికీ, క్రాంతికి క్రికెట్‌పై ఉన్న ఆసక్తిని చూసి తల్లిదండ్రులు ఆమెను ప్రోత్సహించారు. తండ్రి తన పెన్షన్‌తో ఆమెకు క్రికెట్ కిట్ కొనిపెట్టాడు. తల్లి రోజూ ప్రాక్టీస్‌కు తీసుకెళ్లేది.క్రాంతి చిన్నతనంలో అబ్బాయిలతో గల్లీ క్రికెట్ ఆడుతూ పెరిగింది. క్రాంతి క్రికెటర్ అవుతానంటే ఊరిలోని వారంతా నవ్వేవారు. ఇవాళ ఆమె ప్రపంచకప్‌లో భారత పేస్ బౌలింగ్ సెస్సేషన్‌గా నిలిచింది. టీమిండియా వరల్డ్‌కప్ గెలిచాక క్రాంతి సొంత ఊరిలో సంబరాలు అంబరాన్ని అంటాయి. #WATCH | Rohtak, Haryana | Cricketer Shafali Sharma's father says, "... It is all by the grace of god. We are thankful to the almighty... The whole nation was praying for our victory... By the grace of god, she has become the player of the match... The whole team worked hard to… https://t.co/uV2mBjIT6V pic.twitter.com/65nBhFfITq— ANI (@ANI) November 2, 2025షఫాలీ వర్మ.. బాలుడి వేషధారణలో..!షఫాలీ వర్మ హర్యానా రాష్ట్రంలోని రూథక్లో జన్మించింది. చిన్నతనం నుంచే ఆమెకు క్రికెట్‌పై ఆసక్తి పెరిగింది. కానీ స్థానిక అకాడమీలో అమ్మాయిలకు ప్రవేశం లేదు. దీంతో ఆమె బాలుడి వేషధారణలో, అన్న కోసం తయారు చేసిన జెర్సీ వేసుకుని ప్రాక్టీస్‌కి వెళ్లేది. షఫాలీ ఆర్థికంగా వెనుకపడిన కుటుంబం నుంచి వచ్చింది. తండ్రి సంజయ్ వర్మ ఎంతో కష్టపడి ఆమెను అకాడమీలో చేర్పించాడు. ఓ సమయంలో అతని దగ్గర షఫాలీకి కిట్ కొనిచ్చే స్తోమత కూడా లేకుండింది. ఇన్ని కష్టాలు ఎదుర్కొన్న షఫాలీ ఫైనల్లో 87 పరుగులు చేయడంతో పాటు 2 వికెట్లు తీసి, భారత్‌ను విశ్వ విజేతగా నిలపడంలో ప్రధానపాత్ర పోషించింది.#WATCH | Agra, UP | Celebrations erupt at cricketer Dipti Sharma's residence as India win the ICC Women's World Cup by defeating South Africa by 52 runs. pic.twitter.com/zTbGBH82gK— ANI (@ANI) November 2, 2025దీప్తి శర్మ.. రైల్వే ఉద్యోగి తండ్రి కలను నిజం చేసిన బౌలింగ్ సంచలనంఉత్తరప్రదేశ్లోని సాగర్జీ నగర్‌కు చెందిన దీప్తి, తన అన్నతో కలిసి క్రికెట్ ఆడుతూ పెరిగింది. తండ్రి రైల్వే ఉద్యోగి. అందరిలాగే అబ్బాయిలతో క్రికెట్ ఆడుతుండటంతో దీప్తి కూడా విమర్శలు ఎదుర్కొంది. అయినా తండ్రి ప్రోత్సాహంతో ముందడుగు వేసి, టీమిండియా ప్రపంచకప్ కలను సాకారం చేసింది. ఫైనల్లో దీప్తి అర్ద సెంచరీ సహా 5 వికెట్ల ప్రదర్శనను నమోదు చేసింది.జెమిమా రోడ్రిగ్స్.. మల్టీ టాలెంటెడ్ స్టార్సెమీఫైనల్లో ఆస్ట్రేలియాపై వీరోచిత శతకం బాది భారత్‌ను ఫైనల్‌కు చేర్చిన జెమిమా రోడ్రిగ్స్.. ముంబైలోని ఓ మధ్య తరగతి కుటుంబంలో జన్మించింది. జెమిమా తండ్రి స్వయంగా కోచ్‌గా మారి ఆమెను ప్రాక్టీస్‌కు తీసుకెళ్లెవాడు. జెమిమాకు క్రికెట్‌తో పాటు సంగీతంలోనూ ప్రావీణ్యం ఉంది. ఆమె గిటార్ అద్భుతంగా వాయిస్తుంది. చదవండి: CWC25 Team India Prize Money: జగజ్జేత టీమిండియాకు భారీ నజరానా -
చరిత్ర సృష్టించిన సౌతాఫ్రికా కెప్టెన్.. వరల్డ్ రికార్డు బద్దలు
సౌతాఫ్రికా మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ లారా వోల్వార్డ్ట్ (Laura Wolvaardt) చరిత్ర సృష్టించింది. ఓ సింగిల్ వన్డే వరల్డ్‌కప్ (women's CWC) ఎడిషన్‌లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్‌గా సరికొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పింది. 2025 ఎడిషన్‌లో అరివీర భయంకరమైన ఫామ్‌లో ఉండిన లారా.. 9 మ్యాచ్‌ల్లో 2 సెంచరీలు, 3 అర్ద సెంచరీల సాయంతో 571 పరుగులు చేసింది. తద్వారా ఈ ఎడిషన్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా నిలవడంతో పాటు ఓ సింగిల్ ఎడిషన్‌లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్‌గానూ ప్రపంచ రికార్డు సాధించింది. ఈ క్రమంలో లారా ఆస్ట్రేలియా కెప్టెన్ అలైస్సా హీలీ (Alyssa Healy) పేరిట ఉండిన ప్రపంచ రికార్డును బద్దలు కొట్టింది. హీలీ 2022 ఎడిషన్‌లో 509 పరుగులు చేసింది.ఓ సింగిల్ వన్డే వరల్డ్‌కప్ ఎడిషన్‌లో అత్యధిక పరుగులు చేసిన టాప్-5 ప్లేయర్లు..లారా వోల్వార్డ్ట్- 570 (2025)అలైస్సా హీలీ- 509 (2022)రేచల్ హేన్స్- 497 (2022)డెబ్బీ హాక్లీ- 456 (1997)లిండ్సే రీలర్- 448 (1989)సెమీస్, ఫైనల్స్‌లో సెంచరీలుతాజాగా ముగిసిన వన్డే ప్రపంచకప్ ఎడిషన్‌లో లారా అరివీర భయంకరమైన ఫామ్‌లో ఉండింది. ఆస్ట్రేలియాతో జరిగిన సెమీస్, భారత్‌తో జరిగిన ఫైనల్స్‌లో అద్భుతమైన సెంచరీలు చేసింది. అలాగే భారత్, బంగ్లాదేశ్, పాకిస్తాన్‌తో జరిగిన లీగ్ మ్యాచ్‌ల్లో అర్ద సెంచరీలు చేసింది. నిన్న జరిగిన ఫైనల్లో ఓ పక్క సహచరులంతా విఫలమైనా లారా ఒంటరిపోరాటం చేసి తన జట్టును గెలిపించేందుకు విఫలయత్నం చేసింది. ఈ ఇన్నింగ్స్‌తో ఆమె అందరి మన్ననలు అందుకుంది.మూడో ప్రయత్నంలోనూ..గడిచిన రెండేళ్లలో మూడు సార్లు (2023, 2024 టీ20 ప్రపంచకప్, 2025 వన్డే ప్రపంచకప్) వరల్డ్‌కప్ ఫైనల్స్‌కు చేరిన సౌతాఫ్రికా మహిళల జట్టు ఒక్కసారి కూడా ఛాంపియన్‌గా అవతరించలేకపోయింది. తాజాగా భారత్‌తో జరిగిన వన్డే ప్రపంచకప్ ఫైనల్లో ఈ జట్టు 52 పరుగుల తేడాతో పరాజయంపాలై, రన్నరప్‌తో సరిపెట్టుకుంది. ఫైనల్లో ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టిన భారత్ తొలిసారి జగజ్జేతగా అవతరించింది.చెలరేగిన షఫాలీ, దీప్తి.. లారా ఒంటరి పోరాటం వృధాఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. షఫాలీ వర్మ (87), దీప్తి శర్మ (58), స్మృతి మంధన (45) సత్తా చాటి భారీ స్కోర్ (298/7) చేసింది. టార్గెట్‌ను కాపాడుకునే క్రమంలో దీప్తి శర్మ (9.3-0-39-5) చెలరేగడంతో సౌతాఫ్రికా 45.3 ఓవర్లలో 246 పరుగులకే ఆలౌటైంది. కెప్టెన్ లారా వోల్వార్డ్ట్ (101) ఒంటరి పోరాటం చేసినా ఎలాంటి ఫలితం లేకుండా పోయింది. చదవండి: ఓటమి బాధ కలిగిస్తున్నా, గర్వంగా ఉంది: సౌతాఫ్రికా కెప్టెన్ లారా -
ఓటమి బాధ కలిగిస్తున్నా, గర్వంగా ఉంది: సౌతాఫ్రికా కెప్టెన్ లారా
నిన్న (నవంబర్ 2) జరిగిన వన్డే వరల్డ్‌కప్ 2025 (Women's CWC 2025) ఫైనల్లో సౌతాఫ్రికా భారత్ చేతిలో పరాజయంపాలై, రన్నరప్‌తో సరిపెట్టుకుంది. గత రెండేళ్లలో ఈ జట్టుకు ఇది వరుసగా మూడో ఫైనల్స్ పరాభవం. దీనికి ముందు 2023 (ఆస్ట్రేలియా చేతిలో), 2024 (న్యూజిలాండ్ చేతిలో) టీ20 ప్రపంచకప్ ఫైనల్స్‌లో ఓడింది.తాజా ఫైనల్స్ (India vs South Africa) పరాభవం తర్వాత సౌతాఫ్రికా కెప్టెన్ లారా వోల్వార్డ్ట్ (Laura Wolvaardt) తీవ్రమైన భావోద్వేగానికి లోనైంది. ఆమె మాటల్లో..“మా జట్టు పట్ల ఎంత గర్వంగా ఉన్నానో మాటల్లో చెప్పలేను. టోర్నీ ఆధ్యాంతం అద్భుతంగా ఆడాం. ఫైనల్లో భారత్ మా కంటే మెరుగ్గా ఆడింది. ఓటమి బాధ కలిగించినా, ఈ ప్రయాణం మాకు ఎంతో నేర్పింది. మరింత బలంగా తిరిగి వస్తాం.ఇంగ్లండ్, ఆస్ట్రేలియా చేతిలో ఓటములపై స్పందిస్తూ.. "ఓపెనింగ్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ చేతిలో, ఆతర్వాత ఆస్ట్రేలియా చేతిలో ఎదురైన పరాభవాలను సమర్దవంతంగా అధిగమించాం. కొన్ని మ్యాచ్‌లు అద్భుతంగా, కొన్ని బాగా కష్టంగా సాగుతాయి. ఈ టోర్నీలో చాలా మంది ఆటగాళ్లు మెరిశారు. ఫైనల్ వరకూ వచ్చామంటే, మా బలాన్ని చూపించాం”అంత ఈజీ కాదు..“కెప్టెన్సీ, బ్యాటింగ్ రెండింటినీ బ్యాలెన్స్ చేయడం అంత సులభం కాదు. టోర్నమెంట్ ప్రారంభంలో నేను బాగా ఆడలేదు. కానీ చివర్లో ‘ఇది కూడా ఓ క్రికెట్ మ్యాచ్’ అని భావించి నా సహజ ఆటతీరును ప్రదర్శించగలిగాను”సరైన నిర్ణయమే..“టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోవడం సరైన నిర్ణయమే. 300 పరుగుల లక్ష్యం సాధ్యమే అనిపించింది. కానీ వికెట్లు ఎక్కువగా కోల్పోయాం”అద్భుతంగా పుంజుకున్నాం..“టీమిండియా 350 పరుగుల దిశగా వెళ్తోంది అనిపించింది. కానీ చివర్లో మా బౌలర్లు అద్భుతంగా పుంజుకున్నారు. టోర్నమెంట్ మొత్తం మా డెత్ ఓవర్ల బౌలింగ్ బలంగా ఉంది”షఫాలీ, కాప్ గురించి..“షఫాలీ బౌలింగ్‌లోనూ, బ్యాటింగ్‌లోనూ అద్భుతంగా రాణించింది. ఆమె ఆట చాలా అగ్రెసివ్‌గా ఉంటుంది. ఇవాళ అది బాగా వర్కౌట్ అయ్యింది. ఆమె ప్రత్యర్థిని గాయపరచగలదు”“మారిజాన్ కాప్ గురించి చెప్పాలంటే.. ఆమె ఇద్దరు ఆటగాళ్లతో సమానం. గతంలో చాలా వరల్డ్ కప్‌లలో అద్భుతంగా ఆడింది. ఇది ఆమె చివరి టోర్నీ కావడం బాధ కలిగిస్తుంది. ఆమె కోసమైనా ఈసారి ప్రపంచకప్ గెలవాలన్న తపన అందరిలోని ఉండింది”కాగా, నిన్న జరిగిన ఫైనల్లో భారత్ సౌతాఫ్రికాపై 52 పరుగుల తేడాతో విజయం సాధించి, తొలిసారి జగజ్జేతగా అవతరించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. షఫాలీ వర్మ (87), దీప్తి శర్మ (58), స్మృతి మంధన (45) సత్తా చాటి భారీ స్కోర్ (298/7) చేసింది. టార్గెట్‌ను కాపాడుకునే క్రమంలో దీప్తి శర్మ (9.3-0-39-5) చెలరేగడంతో సౌతాఫ్రికా 45.3 ఓవర్లలో 246 పరుగులకే ఆలౌటైంది. కెప్టెన్ లారా వోల్వార్డ్ట్ (101) ఒంటరి పోరాటం చేసినా ఎలాంటి ఫలితం లేకుండా పోయింది. వోల్వార్డ్ట్ ఇంగ్లండ్‌తో జరిగిన సెమీఫైనల్లోనూ సూపర్ సెంచరీతో (169) చెలరేగింది.చదవండి: హ్యాట్సాఫ్ మజుందార్ -
విశ్వవిజేతగా నిలిచేందుకు అన్ని అర్హతలు ఉన్నాయి: టీమిండియా కెప్టెన్
విశ్వవిజేతగా (Women's CWC 2025) నిలిచేందుకు భారత మహిళా క్రికెట్ జట్టుకు (Team India) అన్ని అర్హతలు ఉన్నాయని కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (Harmanpreet Kaur) అభిప్రాయపడింది. 2025 వన్డే ప్రపంచకప్ ఫైనల్లో సౌతాఫ్రికాపై విజయం అనంతరం హర్మన్ మాట్లాడుతూ ఇలా అంది."వరుసగా మూడు ఓటముల తర్వాత కూడా ఏదైనా అద్భుతం చేయగలమని మేం నమ్మాం. పగలు, రాత్రి శ్రమించిన ఈ జట్టుకు విశ్వ విజేతగా నిలిచేందుకు అన్ని అర్హతలూ ఉన్నాయి.బ్యాటింగ్‌లో షఫాలీ చూపించిన ఆత్మవిశ్వాసాన్ని బట్టి ఆమెకు బౌలింగ్‌లో కూడా రాణిస్తుందని భావించా. అదే మలుపుగా మారింది. ఈ రోజు పిచ్ సెమీస్కంటే భిన్నమైంది.ఫైనల్లో ఉండే ఒత్తిడి వల్ల మేం చేసిన స్కోరు సరిపోతుందని తెలుసు. దక్షిణాఫ్రికా బాగానే ఆడినా చివర్లో ఒత్తిడి పెంచుకుంది. దానిని మేం సరైన విధంగా వాడుకున్నాం.ప్రతీ ప్రపంచ కప్ ముగిసిన తర్వాత మేం వచ్చే సారైనా ఎలా గెలవాలి అనే విషయం చర్చించుకునేవాళ్లం. గత రెండేళ్లలో కోచ్ అమోల్ మజుందార్ నేతృత్వంలో మా సన్నాహకాలు చాలా బాగా సాగాయి. తుది జట్టులో మేం పెద్దగా మార్పులు చేయకుండా ప్రతీ మ్యాచ్‌లో వారిపై నమ్మకం ఉంచాం.ఇది ఆరంభం మాత్రమే. మున్ముందు ఇలాంటి విజయాలను అలవాటుగా మార్చుకోవాలనుకుంటున్నాం. రాబోయే రోజుల్లో మరిన్ని పెద్ద టోర్నీలు ఉన్నాయి. అక్కడా ఇదే జోరు కొనసాగాలి.మ్యాచ్ ఆసాంతం మైదానంలో అండగా నిలిచిన అభిమానులకు కృతజ్ఞతలు"కాగా, నిన్న జరిగిన మహిళల వన్డే ప్రపంచకప్ 2025 ఫైనల్లో భారత్ సౌతాఫ్రికాపై 52 పరుగుల తేడాతో గెలుపొంది, తొలిసారి ప్రపంచ ఛాంపియన్‌గా అవతరించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో భారత్ ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టి సౌతాఫ్రికాను చిత్తు చేసింది.తొలుత బ్యాటింగ్‌లో షఫాలీ వర్మ (87), దీప్తి శర్మ (58), స్మృతి మంధన (45) సత్తా చాటి భారత్‌కు భారీ స్కోర్ (298/7) అందించగా.. టార్గెట్‌ను కాపాడుకునే క్రమంలో దీప్తి శర్మ (9.3-0-39-5) చెలరేగిపోయింది. ఫలితంగా సౌతాఫ్రికా 45.3 ఓవర్లలో 246 పరుగులకే ఆలౌటైంది. కెప్టెన్ లారా వోల్వర్డ్ట్ (101) ఒంటరి పోరాటం చేసినా ఎలాంటి ఫలితం లేకుండా పోయింది. చదవండి: జగజ్జేత టీమిండియాకు భారీ నజరానా -
జగజ్జేత టీమిండియాకు భారీ నజరానా
తొలిసారి వన్డే ప్రపంచకప్ (Women's Cricket World Cup 2025 Winner Prize Money) గెలిచిన భారత మహిళా క్రికెట్ జట్టుకు (Team India) భారీ నజరానా (Prize Money) లభించింది. జగజ్జేత భారత్‌కు రికార్డు స్థాయిలో 44 లక్షల 80 వేల డాలర్లు (రూ. 39 కోట్ల 80 లక్షలు) ప్రైజ్‌మనీ అందింది. రన్నరప్‌గా నిలిచిన దక్షిణాఫ్రికా జట్టుకు 22 లక్షల 40 వేల డాలర్లు (రూ. 19 కోట్ల 90 లక్షలు) లభించాయి.సెమీఫైనల్లో ఓడిన ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ జట్ల ఖాతాలో 11 లక్షల 20 వేల డాలర్ల (రూ. 9 కోట్ల 94 లక్షలు) చొప్పున చేరాయి. ఐదు, ఆరు స్థానాల్లో నిలిచిన శ్రీలంక, న్యూజిలాండ్ జట్లకు 7 లక్షల డాలర్ల (రూ. 6 కోట్ల 21 లక్షలు) చొప్పున... ఏడు, ఎనిమిదో స్థానాల్లో నిలిచిన బంగ్లాదేశ్, పాకిస్తాన్ జట్లకు 2 లక్షల 80 వేల డాలర్ల (రూ. 2 కోట్ల 48 లక్షలు) చొప్పున లభించాయి.అంతేకాకుండా ఈ మెగా ఈవెంట్లో ఆడిన ఎనిమిది జట్లకు గ్యారంటీ మనీ కింద 2 లక్షల 50 వేల డాలర్ల (రూ. 2 కోట్ల 22 లక్షలు) చొప్పున దక్కాయి. లీగ్ దశలో సాధించిన ఒక్కో విజయానికి ఆయా జట్లకు 34 వేల 314 డాలర్ల (రూ. 30 లక్షల 47 వేలు) చొప్పున లభించాయి. 300 శాతం పెరిగిన ప్రైజ్మనీవన్డే ప్రపంచకప్ విజేతకు లభించే ప్రైజ్‌మనీ ఈసారి 300 శాతం పెరిగింది. ఐసీసీ అధ్యక్షుడు జై షా ఈ పెంపును అమల్లోకి తెచ్చారు. ఈ విషయాన్ని బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా స్పష్టం చేశారు.బీసీసీఐ భారీ నజరానావరల్డ్కప్ విజేత భారత్‌కు బీసీసీఐ భారీ నజరానా ప్రకటించింది. జగజ్జేత టీమిండియాకు రూ. 51 కోట్లు బహుమతిగా ఇవ్వనున్నట్లు సైకియా తెలిపారు. ఈ బహుమతిని జట్టులోని ఆటగాళ్లు, కోచ్‌లు, సపోర్ట్ స్టాఫ్ పంచుకుంటారని అన్నారు.కాగా, నిన్న జరిగిన ఫైనల్లో భారత్ సౌతాఫ్రికాపై 52 పరుగుల తేడాతో గెలుపొంది, వన్డే ప్రపంచ ఛాంపియన్‌గా అవతరించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో భారత్ ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టి సౌతాఫ్రికాను చిత్తు చేసింది.తొలుత బ్యాటింగ్‌లో షఫాలీ వర్మ (87), దీప్తి శర్మ (58), స్మృతి మంధన (45) సత్తా చాటి భారత్‌కు భారీ స్కోర్ (298/7) అందించగా.. టార్గెట్‌ను కాపాడుకునే క్రమంలో దీప్తి శర్మ (9.3-0-39-5) చెలరేగిపోయింది. ఫలితంగా సౌతాఫ్రికా 45.3 ఓవర్లలో 246 పరుగులకే ఆలౌటైంది. కెప్టెన్ లారా వోల్వర్డ్ట్ (101) ఒంటరి పోరాటం చేసినా ఎలాంటి ఫలితం లేకుండా పోయింది. చదవండి: హ్యాట్సాఫ్ మజుందార్ -
చరిత్ర సృష్టించిన స్మృతి మంధన
టీమిండియా స్టార్ మహిళా బ్యాటర్ స్మృతి మంధన (Smriti Mandhana) సరికొత్త రికార్డు నెలకొల్పింది. ఓ సింగిల్ వరల్డ్ కప్ ఎడిషన్‌లో అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాటర్‌గా చరిత్ర సృష్టించింది. 2025 వన్డే వరల్డ్‌కప్ ఎడిషన్‌లో (Women's CWC 2025) భాగంగా సౌతాఫ్రికాతో ఇవాళ (నవంబర్ 2) జరుగుతున్న ఫైనల్లో (India vs South Africa) మంధన ఈ ఘనత సాధించింది. గతంలో ఈ రికార్డు మిథాలీ రాజ్ పేరిట ఉండేది. మిథాలీ 2017 ఎడిషన్‌లో 409 పరుగులు చేయగా.. తాజా ఎడిషన్‌లో మంధన 412 పరుగులతో ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తుంది.మ్యాచ్ విషయానికొస్తే.. సౌతాఫ్రికా టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకోగా, భారత్‌కు శుభారంభం లభించింది. ఓపెనర్లు స్మృతి మంధన (39), షఫాలీ వర్మ (48) వేగంగా పరుగులు సాధిస్తున్నారు. 17 ఓవర్ల తర్వాత భారత్ స్కోర్ 97/0గా ఉంది.తుది జట్లు..భారత్: షఫాలీ వర్మ, స్మృతి మంధాన, జెమీమా రోడ్రిగ్స్, హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), దీప్తి శర్మ, రిచా ఘోష్ (వికెట్ కీపర్), అమంజోత్ కౌర్, రాధా యాదవ్, క్రాంతి గౌడ్, శ్రీ చరణి, రేణుకా సింగ్ ఠాకూర్దక్షిణాఫ్రికా: లారా వోల్వార్డ్ట్(కెప్టెన్), తజ్మిన్ బ్రిట్స్, అన్నేకే బాష్, సునే లూస్, మారిజానే కాప్, సినాలో జాఫ్తా(వికెట్ కీపర్), అన్నరీ డెర్క్సెన్, క్లో ట్రయాన్, నాడిన్ డి క్లెర్క్, అయాబొంగా ఖాకా, మ్లాబాచదవండి: IND Vs AUS: సుందర్ విధ్వంసం.. ఆసీస్‌పై టీమిండియా గెలుపు -
IND Vs AUS: సుందర్ విధ్వంసం.. ఆసీస్‌పై టీమిండియా గెలుపు
ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భారత్ (Team India) బోణీ కొట్టింది. హోబర్ట్ వేదికగా జరిగిన మూడో మ్యాచ్‌లో (India vs Australia) 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. సిరీస్‌లో తొలి మ్యాచ్ ఆడిన సుందర్ మెరుపు ఇన్నింగ్స్ ఆడి ఒంటిచేత్తో టీమిండియాను గెలిపించాడు. ఈ గెలుపుతో భారత్ సిరీస్‌లో సమంగా (1-1) నిలిచింది. తొలి టీ20 వర్షం కారణంగా రద్దు కాగా.. రెండో మ్యాచ్‌లో ఆసీస్ విజయం సాధించింది.ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ నిర్ణీత 20 ఓవర్లలో6 వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది. టిమ్ డేవిడ్ (74), స్టోయినిస్ (64) విధ్వంసకర ఇన్నింగ్స్‌లతో చెలరేగారు. ఆఖర్లో మాథ్యూ షార్ట్ (26 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. భారత బౌలర్లలో అర్షదీప్ సింగ్ (Arshdeep Singh) 3 వికెట్లు తీయగా.. వరున్ చక్రవర్తి 2, శివమ్ దూబే ఓ వికెట్ పడగొట్టాడు.అనంతరం 187 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్ 18.3 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. వాషింగ్టన్ సుందర్ (Washington Sundar) 23 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 49 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. సుందర్‌కు జితేశ్ శర్మ (13 బంతుల్లో 22 నాటౌట్; 3 ఫోర్లు) సహకరించాడు. భారత ఇన్నింగ్స్‌లో అభిషేక్ శర్మ 25, శుభ్‌మన్ గిల్ 15, సూర్యకుమార్ యాదవ్ 24, తిలక్ వర్మ 29, అక్షర్ పటేల్ 17 పరుగులు చేశారు. ఆసీస్ బౌలర్లలో నాథన్ ఇల్లిస్ 3 వికెట్లు పడగొట్టగా.. బార్ట్లెట్, స్టోయినిస్ తలో వికెట్ తీశారు. నాలుగో టీ20 గోల్డ్ కోస్ట్ వేదికగా నవంబర్ 6న జరుగుతుంది.చదవండి: రంజీ క్రికెటర్ దుర్మరణం -
ఆసీస్‌పై టీమిండియా గెలుపు
హోబర్ట్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టీ20లో భారత్ 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. సిరీస్‌లో తొలి మ్యాచ్ ఆడిన వాషింగ్టన్ సుందర్ మెరుపు ఇన్నింగ్స్ ఆడి ఒంటిచేత్తో టీమిండియాను గెలిపించాడు. తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ నిర్ణీత 20 ఓవర్లలో6 వికెట్ల నష్టానికి 186 పరుగులు చేయగా.. భారత్ 18.3 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఆసీస్ ఇన్నింగ్స్‌లో టిమ్ డేవిడ్ (74), స్టోయినిస్ (64) అర్ద సెంచరీలతో సత్తా చాటగా.. భారత్ తరఫున వాషింగ్టన్ సుందర్ చెలరేగాడు. సుందర్ 23 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 49 పరుగులు చేసి అజేయంగా నిలువగా.. జితేశ్ శర్మ (13 బంతుల్లో 22 నాటౌట్; 3 ఫోర్లు) సుందర్‌కు సహకరించాడు. భారత ఇన్నింగ్స్‌లో అభిషేక్ శర్మ 25, శుభ్‌మన్ గిల్ 15, సూర్యకుమార్ యాదవ్ 24, తిలక్ వర్మ 29, అక్షర్ పటేల్ 17 పరుగులు చేశారు.భారత బౌలర్లలో అర్షదీప్ సింగ్ 3, వరున్ చక్రవర్తి 2, శివమ్ దూబే ఓ వికెట్ పడగొట్టగా... ఆసీస్ బౌలర్లలో నాథన్ ఇల్లిస్ 3, బార్ట్లెట్, స్టోయినిస్ తలో వికెట్ తీశారు. నాలుగో టీ20 గోల్డ్ కోస్ట్ వేదికగా నవంబర్ 6న జరుగుతుంది.ఐదో వికెట్ కోల్పోయిన భారత్14.2వ ఓవర్- 145 పరుగుల వద్ద భారత్ ఐదో వికెట్ కోల్పోయింది. బార్ట్లెట్ బౌలింగ్‌లో తిలక్ వర్మ (29) ఔటయ్యాడు.15 ఓవర్ద తర్వాత భారత్ స్కోర్ 152/5గా ఉంది. సుందర్ (30), జితేశ్ శర్మ (5) క్రీజ్‌లో ఉన్నారు. నాలుగో వికెట్ కోల్పోయిన భారత్11.1 ఓవర్- 111 పరుగుల వద్ద భారత్ నాలుగో వికెట్ కోల్పోయింది. ఇల్లిస్ బౌలింగ్‌లో అక్షర్ పటేల్ (17) ఔటయ్యాడు. 11.4 ఓవర్ల తర్వాత భారత్ స్కోర్ 117/4గా ఉంది. వాషింగ్టన్ సుందర్ (6), తిలక్ వర్మ (24) క్రీజ్‌లో ఉన్నారు. మూడో వికెట్ కోల్పోయిన భారత్7.3వ ఓవర్- 76 పరుగుల వద్ద భారత్ మూడో వికెట్ కోల్పోయింది. స్టోయినిస్ బౌలింగ్‌లో ఇల్లిస్‌కు క్యాచ్ ఇచ్చి సూర్యకుమార్ యాదవ్ (24) ఔటయ్యాడు. 8 ఓవర్ల తర్వాత భారత్ స్కోర్ 82/3గా ఉంది. అక్షర్ పటేల్ (3), తిలక్ వర్మ (12) క్రీజ్‌లో ఉన్నారు. రెండో వికెట్ కోల్పోయిన భారత్5.3వ ఓవర్- 61 పరుగుల వద్ద భారత్ రెండో వికెట్ కోల్పోయింది. నాథన్ ఇల్లిస్ బౌలింగ్‌లో శుభ్‌మన్ గిల్ (15) ఔటయ్యాడు.6 ఓవర్ల తర్వాత భారత్ స్కోర్ 64/2గా ఉంది. తిలక్ వర్మ (2), సూర్యకుమార్ యాదవ్ (19) క్రీజ్‌లో ఉన్నారు. టీమిండియా రెండో వికెట్ డౌన్..శుభ్‌మన్ గిల్ రూపంలో టీమిండియా రెండో వికెట్ కోల్పోయింది. కేవలం 15 పరుగులు మాత్రమే చేసిన శుభ్‌మన్ గిల్.. నాథన్ ఎల్లీస్ బౌలింగ్‌లో వికెట్లు ముందు దొరికిపోయాడు. 6 ఓవర్ల తర్వాత భారత్ స్కోర్ 63/2గా ఉంది. తిలక్ వర్మ (2), సూర్యకుమార్ యాదవ్ (19) క్రీజ్‌లో ఉన్నారు. తొలి వికెట్ కోల్పోయిన భారత్3.3 ఓవర్- 187 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో ధాటిగా ఆడుతున్న అభిషేక్ శర్మ 16 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 25 పరుగులు చేసి నాథన్ ఇల్లిస్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 4 ఓవర్ల తర్వాత భారత్ స్కోర్ 41/1గా ఉంది. శుభ్‌మన్ గిల్ (7), సూర్యకుమార్ యాదవ్ (7) క్రీజ్‌లో ఉన్నారు. దూకుడుగా ఆడుతున్న అభిషేక్187 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ దూకుడుగా ఆడుతోంది. 3 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా వికెట్ నష్టపోకుండా 30 పరుగులు చేసింది. క్రీజులో అభిషేక్ శర్మ(24), శుభ్‌మన్ గిల్(5) ఉన్నారు.భారత్ ముందు భారీ టార్గెట్హోబర్ట్ వేదికగా భారత్‌తో జరుగుతున్న మూడో టీ20లో ఆస్ట్రేలియా బ్యాటర్లు అదరగొట్టారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది. టిమ్ డేవిడ్(38 బంతుల్లో 8 ఫోర్లు, 5 సిక్స్‌లతో 74), మార్కస్ స్టోయినిష్(39 బంతుల్లో 8 ఫోర్లు,2 సిక్స్‌లతో 64) విధ్వసంకర హాఫ్ సెంచరీలతో మెరిశారు. భారత బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్ మూడు వికెట్లు పడగొట్టగా.. వరుణ్ చక్రవర్తి రెండు, శివమ్ దూబే ఒక్క వికెట్ సాధించారు.ఐదో వికెట్ కోల్పోయిన ఆసీస్12.6వ ఓవర్- 118 పరుగుల వద్ద ఆసీస్ ఐదో వికెట్ కోల్పోయింది. ధాటిగా ఆడుతున్న టిమ్ డేవిడ్ (74) శివమ్ దూబే బౌలింగ్‌లో తిలక్ వర్మకు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. 16 ఓవర్ల తర్వాత ఆసీస్ స్కోర్ 143/5గా ఉంది.వరుణ్ మ్యాజిక్.. వరుస బంతుల్లో వికెట్లువరుణ్ చక్రవర్తి తన స్పిన్ మాయాజాలాన్ని ప్రదర్శించాడు. ఇన్నింగ్స్ 9వ ఓవర్లో వరుస బంతుల్లో మిచెల్ మార్ష్ (11), మిచెల్ ఓవెన్‌ను (0) ఔట్ చేశాడు. 9 ఓవర్ల తర్వాత ఆసీస్ స్కోర్ 75/4గా ఉంది. స్టోయినిస్ (1), టిమ్ డేవిడ్ (55) క్రీజ్‌లో ఉన్నారు. ఓ పక్క వికెట్లు పడుతున్నా డేవిడ్ మెరుపు హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. డేవిడ్ 23 బంతుల్లోనే ఈ మార్కును తాకాడు. రెండో వికెట్ కోల్పోయిన ఆసీస్.. 5 ఓవర్ల తర్వాత స్కోర్ ఎంతంటే..?టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బలు తగిలాయి. అర్షదీప్ సింగ్ తొలి ఓవర్లో, మూడో ఓవర్లో వికెట్లు తీశాడు. తొలుత ట్రవిస్ హెడ్ (6), ఆతర్వాత జోస్ ఇంగ్లిస్‌ను (1) పెవిలియన్‌కు పంపాడు. 5 ఓవర్ల తర్వాత ఆసీస్ స్కోర్ 35/2గా ఉంది. టిమ్ డేవిడ్ (20), మిచ్ మార్ష్ (7) క్రీజ్‌లో ఉన్నారు. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్హోబర్ట్ వేదికగా ఇవాళ (నవంబర్ 2) భారత్, ఆస్ట్రేలియా తలపడుతున్నాయి. ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో భారత్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ కోసం భారత్ మూడు మార్పులు చేసింది. జితేశ్ శర్మ, అర్షదీప్ సింగ్, వాషింగ్టన్ సుందర్ తుది జట్టులోకి వచ్చారు. ఆస్ట్రేలియా ఈ మ్యాచ్‌లో ఓ మార్పుతో బరిలోకి దిగింది. హాజిల్‌వుడ్ స్థానంలో సీన్ అబాట్ తుది జట్టులోకి వచ్చాడు.ఆస్ట్రేలియా: మిచెల్ మార్ష్ (కెప్టెన్), ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్ (వికెట్‌కీపర్), టిమ్ డేవిడ్, మిచెల్ ఓవెన్, మార్కస్ స్టోయినిస్, మాథ్యూ షార్ట్, సీన్ అబాట్, జేవియర్ బార్ట్లెట్, నాథన్ ఎల్లిస్, మాథ్యూ కుహ్నెమాన్భారత్: శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), తిలక్ వర్మ, జితేష్ శర్మ (వికెట్‌కీపర్), శివం దుబే, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రాచదవండి: IND vs SA: వారెవ్వా అన్షుల్!.. ఉత్కంఠ పోరులో సౌతాఫ్రికాను చిత్తు చేసిన భారత్ -
భారత్ మహిళా క్రికెట్ జట్టుకు అభినందనలు
తాడేపల్లి: ఐసిసి మహిళల ప్రపంచ క్రికెట్ టోర్నమెంట్ ఫైనల్‌కి చేరిన భారత మహిళా జట్టుకు మాజీ సీఎం వైఎస్ జగన్ శుభాకాంక్షలు తెలిపారు. 339 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించడాన్ని ఆయన అభినందించారు. ఈ సెమీస్ లో అద్భుతమైన ప్రతిభ కనబరిచిన మహిళా జట్టు ఫైనల్ లో కూడా అలాగే రాణించాలని వైఎస్ జగన్ ఆకాంక్షించారు. మహిళా జట్టు చారిత్రాత్మక విజయాన్ని కైవసం చేసుకుందని కితాబునిస్తూ వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. ఫైనల్‌కు వెళ్లిన టీమ్‌కు ఆయన ఆల్‌ది బెస్ట్ చెప్పారు.What a historic win! A fantastic record-breaking chase by the Indian women's team to beat Australia in the World Cup semi-final! On to the final! All the best, team India!#WomensWorldCup2025 pic.twitter.com/7Qyqc6gIaJ— YS Jagan Mohan Reddy (@ysjagan) October 31, 2025 -
చరిత్ర సృష్టించిన సౌతాఫ్రికా బౌలర్
సౌతాఫ్రికా పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ మారిజేన్ కాప్ (Marizanne Kapp) చరిత్ర సృష్టించింది. మహిళల వన్డే ప్రపంచకప్ (Women's Cricket World Cup) చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా టీమిండియా మాజీ బౌలర్ ఝులన్ గోస్వామి (Jhulan Goswami) రికార్డును బద్దలు కొట్టింది. 2025 ఎడిషన్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో నిన్న (అక్టోబర్ 29) తొలి సెమీఫైనల్లో ఈ ఘనత సాధించింది.ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌లోనూ (42) రాణించిన కాప్.. బౌలింగ్‌లో చెలరేగిపోయింది. 320 పరుగుల భారీ లక్ష్యాన్ని డిఫెండ్ చేసుకునే క్రమంలో 5 వికెట్లు తీసి, ప్రత్యర్ది పతనాన్ని శాశించింది.మహిళల వన్డే ప్రపంచకప్‌లో అత్యధిక వికెట్లు తీసిన టాప్-5 బౌలర్లు..మారిజేన్ కాప్-44ఝులన్ గోస్వామి-43లిన్ ఫుల్స్టన్-39మెగాన్ షట్-39క్యారోల్ హాడ్జస్-37మ్యాచ్ విషయానికొస్తే.. గౌహతి వేదికగా జరిగిన తొలి సెమీఫైనల్లో సౌతాఫ్రికా ఇంగ్లండ్‌ను ఓడించి ఫైనల్‌కు చేరింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా.. కెప్టెన్ లారా వోల్వార్డ్ట్ (169) రికార్డు శతకంతో చెలరేగడంతో నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 319 పరుగుల భారీ స్కోర్ చేసింది.అనంతరం లక్ష్య ఛేదనలో మారిజన్ కాప్ (7-3-20-5) నిప్పులు చెరగడంతో ఇంగ్లండ్ 42.3 ఓవర్లలో 194 పరుగులకే ఆలౌటై 125 పరుగుల భారీ తేడాతో పరాజయంపాలైంది. ఇవాళ (అక్టోబర్ 30) జరుగబోయే రెండో సెమీఫైనల్లో భారత్, ఆస్ట్రేలియా ఢీకొంటున్నాయి. నవీ ముంబై వేదికగా ఈ మ్యాచ్ జరుగనుంది.చదవండి: IND VS AUS: అదే జరిగితే టీమిండియా కొంప కొల్లేరే..! -
అదే జరిగితే టీమిండియా కొంప కొల్లేరే..!
మహిళల వన్డే ప్రపంచకప్‌లో (Women's CWC 2025) ఇవాళ (అక్టోబర్ 30) భారత్, ఆస్ట్రేలియా (India vs Australia) జట్ల మధ్య రెండో సెమీఫైనల్ మ్యాచ్ జరుగనుంది. నవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియం వేదికగా జరిగే ఈ నాకౌట్ సమరం మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్‌లో టీమిండియాను వరుణుడు పరీక్షించబోతున్నాడు.ఈ మ్యాచ్‌కు వాతావరణం అడ్డంకిగా మారే అవకాశం ఉంది. AccuWeather నివేదిక ప్రకారం, DY పాటిల్ స్టేడియం పరిసరాల్లో ఇవాళ ఉదయం ఆకాశం 93 శాతం మేఘావృతంగా ఉంటుంది. 25 శాతం వర్షం కురిసే అవకాశం ఉంది.మ్యాచ్ సమయానికి పరిస్థితులు మెరుగవుతాయన్న అంచనా ఉన్నా, నవీ ముంబైలో వాతావరణ పరిస్థితులను నమ్మడానికి వీల్లేదు. ఈనెల 28న ఇక్కడ జరగాల్సిన భారత్, బంగ్లాదేశ్ మ్యాచ్ భారీ వర్షం కారణంగా రద్దైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నేటి మ్యాచ్‌ను కూడా వర్షం ముంచేస్తుందేమోనని భారత క్రికెట్ అభిమానులు ఆందోళన చెందుతున్నారు.మ్యాచ్ పూర్తిగా రద్దైతే..?ఒకవేళ నేటి మ్యాచ్ వర్షం కారణంగా పూర్తిగా రద్దైనా రిజర్వ్ డే (అక్టోబర్ 31) ఉంది. ఇవాళ కొంత మ్యాచ్ జరిగి ఆగిపోయినా, ఇదే స్థితి నుంచి రిజ్వర్ డేలో కొనసాగుతుంది. ఒకవేళ రిజర్వ్ డేలో కూడా మ్యాచ్ సాధ్యపడకపోతే మాత్రం టీమిండియా కొంప కొల్లేరవుతుంది. గ్రూప్ దశలో భారత్ కంటే ఎక్కువ పాయింట్లు ఉండటం చేత ఆస్ట్రేలియా ఫైనల్‌కు చేరుకుంటుంది. గ్రూప్ దశలో ఆసీస్ 7 మ్యాచ్‌ల్లో ఓటమెరుగని జట్టుగా 13 పాయింట్లతో పట్టికలో అగ్రస్థానంలో ఉంది. భారత్ 7 మ్యాచ్‌ల్లో 3 విజయాలతో 7 పాయింట్లు సాధించి నాలుగో స్థానంలో నిలిచింది.ఇదిలా ఉంటే, నిన్న (అక్టోబర్ 29) జరిగిన తొలి సెమీఫైనల్లో సౌతాఫ్రికా ఇంగ్లండ్‌ను ఓడించి ఫైనల్‌కు చేరింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా.. కెప్టెన్ లారా వోల్వార్డ్ట్ (169) రికార్డు శతకంతో చెలరేగడంతో నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 319 పరుగుల భారీ స్కోర్ చేసింది.అనంతరం లక్ష్య ఛేదనలో మారిజన్ కాప్ (7-3-20-5) చెలరేగడంతో ఇంగ్లండ్ 42.3 ఓవర్లలో 194 పరుగులకే ఆలౌటై 125 పరుగుల భారీ తేడాతో పరాజయంపాలైంది.చదవండి: పెను విషాదం.. ఆస్ట్రేలియా యువ క్రికెటర్ మృతి -
పంత్ రీఎంట్రీ.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్
ఇటీవలి ఇంగ్లండ్ పర్యటనలో తీవ్రంగా గాయపడిన (పాదం) టీమిండియా ఆటగాడు రిషబ్ పంత్ (Rishabh Pant) మూడు నెలల విరామం తర్వాత మైదానంలోకి అడుగుపెట్టాడు. సౌతాఫ్రికా-ఏతో (India A vs South Africa A) ఇవాళ (అక్టోబర్ 30) ప్రారంభమైన తొలి అనధికారిక టెస్ట్ మ్యాచ్‌తో రీఎంట్రీ ఇచ్చాడు. ఈ సిరీస్‌లో పంత్ టీమిండియా కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు.బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ గ్రౌండ్-1లో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో పంత్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్ ఎక్కడా ప్రత్యక్ష ప్రసారం కావడం లేదు. ఈ మ్యాచ్‌లో టీమిండియా తరఫున సాయి సుదర్శన్, ఆయుశ్ మాత్రే, దేవదత్ పడిక్కల్, రజత్ పాటిదార్ లాంటి అప్ కమింగ్ బ్యాటర్లు బరిలోకి దిగారు.ఈ పర్యటనలో సౌతాఫ్రికా-ఏ, భారత్-ఏ జట్ల మధ్య 2 అనధికారిక టెస్ట్ మ్యాచ్‌లు, 3 అనధికారిక వన్డేలు జరుగనున్నాయి. రెండో టెస్ట్ కూడా బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ గ్రౌండ్-1లోనే జరుగనుండగా.. మూడు వన్డేలకు రాజ్‌కోట్ ఆతిథ్యమివ్వనుంది. తుది జట్లు.. ఇండియా-A: సాయి సుదర్శన్, ఆయుశ్ మాత్రే, దేవదత్ పడిక్కల్, రజత్ పాటిదార్, రిషబ్ పంత్(w/c), ఆయుష్ బదోని, తనుష్ కోటియన్, అన్షుల్ కాంబోజ్, మానవ్ సుతార్, గుర్నూర్ బ్రార్, ఖలీల్ అహ్మద్దక్షిణాఫ్రికా-A: మార్క్వెస్ అకెర్మాన్ (సి), జోర్డాన్ హెర్మాన్, లెసెగో సెనోక్వానే, జుబేర్ హంజా, రూబిన్ హెర్మాన్, రివాల్డో మూన్సామి (w), టియాన్ వాన్ వురెన్, ప్రేనెలాన్ సుబ్రాయెన్, త్షెపో మోరేకి, లూథో సిపమ్లా, ఒకుహ్లే సెలెచదవండి: మళ్లీ ముంబై ఇండియన్స్‌లోకి పోలార్డ్, పూరన్ -
చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ
ఐసీసీ తాజాగా విడుదల చేసిన వన్డే బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో (ICC ODI Rankings) టీమిండియా వెటరన్ స్టార్ రోహిత్ శర్మ (Rohit Sharma) నంబర్ వన్ స్థానానికి ఎగబాకాడు. ఆసీస్‌తో జరిగిన రెండు, మూడు వన్డేల్లో (73, 121 నాటౌట్) చెలరేగడంతో 36 రేటింగ్ పాయింట్లు మెరుగుపర్చుకొని, తొలిసారి వన్డే ర్యాంకింగ్స్‌లో అగ్రపీఠాన్ని అధిరోహించాడు.ఈ ఘనతను రోహిత్ 38 ఏళ్ల 182 రోజల వయసులో సాధించాడు. తద్వారా అత్యంత లేటు వయసులో నంబర్ వన్ బ్యాటర్‌గా అవతరించిన భారత ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. గత వారం ర్యాంకింగ్స్‌లో మూడో స్థానంలో ఉండిన రోహిత్.. రెండు స్థానాలు మెరుగుపర్చుకొని టాప్ ప్లేస్‌కు చేరాడు.ఈ క్రమంలో అగ్రపీఠంపై తిష్ట వేసిన సహచరుడు, వన్డే జట్టు కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌ను కిందికి దించాడు. సచిన్ టెండూల్కర్, ఎంఎస్ ధోని, విరాట్ కోహ్లి, శుభ్‌మన్ గిల్ తర్వాత నంబర్ వన్ వన్డే బ్యాటర్‌గా అవతరించిన భారత బ్యాటర్‌గానూ రికార్డుల్లోకెక్కాడు.ఆసీస్‌తో తాజాగా జరిగిన 3 మ్యాచ్‌లో సిరీస్‌లో (10, 9, 24) విఫలమైన గిల్ రెండు స్థానాలు కోల్పోయి మూడో స్థానానికి పడిపోయాడు. ఇదే సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌ల్లో డకౌటైన మరో టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి ఓ స్థానం కోల్పోయి ఆరో స్థానానికి పడిపోయాడు. ఇదే సిరీస్‌లోని రెండో వన్డేలో హాఫ్ సెంచరీ సాధించిన శ్రేయస్ అయ్యర్ ఓ స్థానం మెరుగుపర్చుకొని 10 నుంచి తొమ్మిదో స్థానానికి ఎగబాకాడు.బౌలర్ల ర్యాంకింగ్స్ విషయానికొస్తే.. ఆఫ్ఘనిస్తాన్ స్టార్ రషీద్ ఖాన్ టాప్ ప్లేస్‌లో కొనసాగుతున్నాడు. న్యూజిలాండ్ స్పిన్నర్ మిచెల్ సాంట్నర్ 3 స్థానాలు ఎగబాకి నాలుగో ప్లేస్‌కు చేరుకున్నాడు. ఆసీస్ పేసర్ జోష్ హాజిల్‌వుడ్ రెండు స్థానాలు మెరుగుపర్చుకొని ఎనిమిదో స్థానానికి చేరాడు. టాప్-10లో ఏకైక టీమిండియా బౌలర్ కుల్దీప్ యాదవ్ ఓ స్థానం కోల్పోయి ఏడో స్థానానికి పడిపోయాడు. ఆల్‌రౌండర్ల ర్యాంకింగ్స్‌లో అక్షర్ పటేల్ నాలుగు స్థానాలు మెరుగుపర్చుకొని ఎనిమిదో స్థానానికి చేరగా.. ఆఫ్ఘనిస్తాన్ ప్లేయర్ అజ్మతుల్లా ఒమర్జాయ్ టాప్ ప్లేస్‌ను ఎంజాయ్ చేస్తున్నాడు. చదవండి: రాణించిన రచిన్, మిచెల్.. న్యూజిలాండ్‌దే వన్డే సిరీస్ -
ఆసీస్ తొలి టీ20 మ్యాచ్.. టీమిండియాలో భారీ మార్పు
-
ఈ హెడ్‌కోచ్ వద్దని పట్టుబట్టిన ఆటగాళ్లు.. తొలగించిన బీసీసీఐ!
గత దశాబ్ద కాలంగా భారత క్రికెట్ జట్టు- హెడ్‌కోచ్‌ల మధ్య అనుబంధం బాగా బలపడింది. రవిశాస్త్రి, రాహుల్ ద్రవిడ్ (Rahul Dravid)లతో మాజీ కెప్టెన్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ సత్సంబంధాలు కొనసాగించారు. ఇక ద్రవిడ్ మార్గదర్శనంలో.. రోహిత్ సారథ్యంలో టీమిండియా టీ20 ప్రపంచకప్-2024 గెలిచిన విషయం తెలిసిందే.ఆ తర్వాత ద్రవిడ్ హెడ్‌కోచ్ పదవి నుంచి వైదొలగగా.. మరో మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ (Gautam Gambhir) భారత జట్టు ప్రధాన కోచ్‌గా నియమితుడయ్యాడు. తన వ్యూహాలకు అనుగుణంగా యువ ఆటగాళ్లకు వరుస అవకాశాలు వచ్చేలా చేస్తున్న గౌతీ.. ఇటీవలే శుబ్‌మన్ గిల్ టెస్టు, వన్డే పగ్గాలు చేపట్టడంలో కీలక పాత్ర పోషించాడు.ప్రస్తుతానికి కోచ్‌కు- ఆటగాళ్లకు మధ్య చిన్న చిన్న విభేదాలు తప్ప పెద్ద గొడవలేమీ లేనట్లే కనిపిస్తోంది. జట్టుపై పూర్తిగా పట్టు సాధించిన గౌతీ.. అవసరమైన వేళ ఆటగాళ్లకు మద్దతుగా ఉంటూ టీమ్‌ను ముందుకు నడిపిస్తున్నాడు.పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంతలా వివాదంమరి గతంలో ఓ హెడ్‌కోచ్‌కు- ఆటగాళ్లకు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంతలా వివాదం రాజుకుందని తెలుసా?.. మీరు ఊహించినట్లుగా ఇది గ్రెగ్ చాపెల్- సౌరవ్ గంగూలీ ఎపిసోడ్ గురించి కాదు. భారత వరల్డ్‌కప్ విన్నింగ్ హీరోకు- దిగ్గజ ఆటగాళ్లకు మధ్య జరిగిన గొడవ.. ఇంతకీ ఏంటీ విషయం?!కపిల్ దేవ్ కెప్టెన్సీలో వన్డే వరల్డ్‌కప్-1983 నెగ్గిన జట్టులో సభ్యుడైన మదన్ లాల్.. 1996- 97 మధ్య కాలంలో టీమిండియా హెడ్‌కోచ్‌గా పనిచేశాడు. ఈ క్రమంలో భారత జట్టు శ్రీలంక పర్యటనలో ఉండగా.. మదన్ లాల్ (Madan Lal) నాడు టీమ్‌లో ఉన్న కొందరు ఆటగాళ్ల గురించి సంచలన వ్యాఖ్యలు చేశాడు.విఫలం అవుతావని చెప్పాది హిందూకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మదన్ లాల్ మాట్లాడుతూ.. టీమిండియా ఓటములకు సదరు ఆటగాళ్లే కారణం అనేలా విమర్శలు చేశాడు. అజయ్ జడేజా గురించి ప్రస్తావిస్తూ.. ‘‘నువ్వు బౌలర్‌గా లేదంటే బ్యాటర్‌గా ఆడబోతున్నావా? అనేది ముందుగానే నిర్ణయించుకో అని అతడికి చెప్పాను. ఒక్క మ్యాచ్‌లో సరిగ్గా ఆడకపోతే తర్వాత ఐదు మ్యాచ్‌లలోనూ విఫలం అవుతావని చెప్పా’’ అని మదన్ లాల్ పేర్కొన్నాడు.ఆల్‌రౌండర్‌గా రాణించలేడుమరోవైపు రాబిన్ సింగ్‌ను ఉద్దేశించి.. ‘‘చాలానే కష్టపడతాడు కానీ.. అంతర్జాతీయ స్థాయిలో ఆల్‌రౌండర్‌గా రాణించలేడు’’ అని మదన్ లాల్ అన్నాడు. ఇక సబా కరీం గురించి మాట్లాడుతూ.. ‘‘అతడొక సగటు వికెట్ కీపర్ బ్యాటర్ మాత్రమే’’ అని ట్యాగ్ ఇచ్చాడు.కుంబ్లే ‘టర్న్’ కాదు.. దానిమీద దృష్టి పెట్టుఅంతేగాకుండా అప్పట్లో టీమిండియా ప్రధాన స్పిన్ అస్త్రమైన అనిల్ కుంబ్లే గురించి చెబుతూ.. ‘‘అతడి బౌలింగ్‌తో సంతోషంగా లేనని చెప్పా. నువ్వు బంతిని తిప్పడం కంటే లైన్ అండ్ లెంగ్త్ మీదే ఎక్కువగా దృష్టి పెట్టమని చెప్పా’’ అని మదన్ లాల్ పేర్కొన్నాడు. ఓవరాల్‌గా.. ‘‘మేము గెలవలేకపోతున్నాం. కానీ నేనొక్కడినే ఏం చేయగలను?’’ అంటూ ఆటగాళ్లను టార్గెట్ చేశాడు.ఈ ఇంటర్వ్యూ తర్వాత భారత క్రికెట్ శిబిరంలో కల్లోలం చెలరేగింది. అప్పటి మేనేజర్ రత్నాకర్ శెట్టి వెంటనే జర్నలిస్టు విజయ్ను సంప్రదించి.. మదన్ లాల్ నిజంగానే ఈ వ్యాఖ్యలు చేశారని నిర్దారించుకున్నాడు.మాటల్లేవ్.. బాయ్‌కాట్ చేసేశారుఈ నేపథ్యంలో.. మదన్ లాల్ వ్యాఖ్యలతో తీవ్రంగా నొచ్చుకున్న ఆటగాళ్లు అతడితో చాలా రోజుల పాటు మాట్లాడనే లేదు. నాటి సిరీస్‌లో ఓ వన్డేలో అజయ్ జడేజా సెంచరీ చేసిన తర్వాత ఈ విభేదాలు తారస్థాయికి చేరాయి. ఈ మ్యాచ్‌లో మొహమ్మద్ అజారుద్దీన్ కూడా సెంచరీ చేశాడు. వేటు వేసిన బీసీసీఐఆ తర్వాత ఈ హెడ్‌కోచ్ వద్దని ఆటగాళ్లు పట్టుబట్టడంతో భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) మదన్ లాల్‌పై వేటు వేసి అన్షుమాన్ గైక్వాడ్‌తో అతడి స్థానాన్ని భర్తీ చేసింది. అలా టీమిండియా హెడ్‌కోచ్‌గా మదన్ లాల్ పది నెలల పదవీ కాలం వివాదంతో ముగిసిపోయింది. అప్పటి బీసీసీఐ మేనేజర్ రత్నాకర్ శెట్టి తన ఆటోబయోగ్రఫీ.. ‘ఆన్ బోర్డ్- మై ఇయర్స్ ఇన్ బీసీసీఐ’లో ఈ విషయాలను ప్రస్తావించాడు.చదవండి: కాంట్రాక్టర్ నుంచి శ్రేయస్ దాకా.. మైదానంలో తీవ్రంగా గాయపడిన క్రికెటర్లు వీరే..! -
కాంట్రాక్టర్ నుంచి శ్రేయస్ అయ్యర్ దాకా..!
క్రికెటర్లు మైదానంలో గాయపడటం సహజమే. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా, ఏదో ఒక రకంగా దెబ్బలు తగులుతూనే ఉంటాయి. కొన్ని సార్లు చిన్న దెబ్బలతో బయటపడినా, మరికొన్ని సార్లు వాటి తీవ్రత అధికంగా ఉంటుంది. గాయాల వల్ల కొందరి కెరీర్లు అర్దంతరంగా ముగియగా.. దురదృష్టకర ఘటనల్లో పలువురు ప్రాణాలు సైతం కోల్పోయారు.తాజాగా ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే మ్యాచ్‌లో టీమిండియా ఆటగాడు శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer) ఫీల్డింగ్ చేస్తూ తీవ్రంగా గాయపడ్డాడు. స్ప్లీన్‌లో లేసరేషన్ గాయం కావడంతో అతను కొన్ని రోజులు ఐసీయూలో ఉన్నాడు. మొదట్లో శ్రేయస్ గాయం ఆందోళన చెందాల్సింది కాదని అంతా అనుకున్నారు.అయితే రోజుల గడిచే కొద్ది దాని తీవ్రత బయటపడింది. శ్రేయస్‌కు పక్కటెముకల్లో రక్తస్రావం జరిగి, పరిస్థితి సీరియస్‌గా ఉందని డాక్లరు తెలిపారు. దీంతో క్రికెట్ ప్రపంచం ఒక్కసారిగా ఉలిక్కి పడింది. ఎలాంటి చెడు వార్త వినాల్సి వస్తుందోనని భారత్ క్రికెట్ అభిమానులు ఆందోళన పడ్డారు.అయితే అత్యుత్తమ చికిత్స అందడం వల్ల శ్రేయస్ త్వరగానే కోలుకొని సేఫ్ జోన్లో పడ్డాడు. శ్రేయస్ ఉదంతం తర్వాత మైదానంలో తీవ్ర గాయాలపాలైన క్రికెటర్లపై చర్చ మొదలైంది.ఈ ప్రస్తావన రాగానే ముందుగా గుర్తొచ్చే పేరు ఫిలిప్ హ్యూస్. మంచి భవిష్యత్తు ఉండిన ఈ ఆస్ట్రేలియా యువ బ్యాటర్, 2014లో తలకు బౌన్సర్ తగిలి, రెండు రోజుల అనంతరం మృత్యువాత పడ్డాడు.మైదానంలో తగిలిన గాయం కారణంగా ప్రాణాలు కోల్పోయిన మరో క్రికెటర్ రామన్ లాంబా. ఈ టీమిండియా ఆటగాడు 1998లో ఢాకాలో జరిగిన ఓ మ్యాచ్‌లో షార్ట్ లెగ్‌లో ఫీల్డింగ్ చేస్తుండగా, బంతి తలపై బలంగా తాకింది. మెదడులో రక్తం గడ్డ కట్టడంతో లాంబా మూడు రోజులు మృత్యువుతో పోరాడి ప్రాణాలు కోల్పోయాడు. క్రికెట్ చరిత్రలో ఇటీవలికాలంలో జరిగిన రెండు దురదృష్టకర ఘటనల ఇవి. మైదానంలో తీవ్రంగా గాయపడి అర్దంతరంగా కెరీర్లు ముగించిన ఆటగాళ్ల విషయానికొస్తే.. ఈ జాబితా చాలా పెద్దదిగా ఉంది. నారీ కాంట్రాక్టర్ మొదలుకొని శ్రేయస్ అయ్యర్ దాకా ఈ జాబితాలో చాలా మంది స్టార్ క్రికెటర్లు ఉన్నారు.1962లో వెస్టిండీస్ బౌలర్ చార్లీ గ్రిఫిత్ వేసిన బౌన్సర్ తలపై బలంగా తాకడంతో భారత ఆటగాడు నారీ కాంట్రాక్టర్ కెరీర్ అర్దంతరంగా ముగిసింది.2000 సంవత్సరంలో టీమిండియా ఆటగాడు సబా కరీం అనిల్ కుంబ్లే బౌలింగ్‌లో వికెట్‌కీపింగ్ చేస్తూ తీవ్రంగా గాయపడ్డాడు. ఆ ఉదంతంలో కరీం కుడి కంటిని కోల్పోయేవాడు. అదృష్టం కొద్ది చూపు దక్కించుకున్నా, అతని కెరీర్ అక్కడితో ముగిసింది.2012లో సౌతాఫ్రికా వికెట్ కీపర్ మార్క్ బౌచర్ కంటికి తీవ్ర రక్తస్రావ గాయమైంది. దీంతో అతను తక్షణమే ఆటకు వీడ్కోలు పలికాడు. బౌచర్ మరో క్యాచ్ కానీ స్టంపింగ్ కానీ చేసుంటే, ప్రపంచంలో 1000 డిస్మిసల్స్లో భాగమైన తొలి వికెట్ కీపర్‌గా చరిత్రకెక్కేవాడు.2014లో ఇంగ్లండ్ ప్రామిసింగ్ క్రికెటర్ క్రెయిగ్ కీస్వెట్టర్ బ్యాటింగ్ చేస్తుండగా, బంతి గ్రిల్ లోపటి నుంచి దూసుకొచ్చి ముక్కుపై, కంటిపై తీవ్ర గాయాలు చేసింది. ఈ ఉదంతం తర్వాత అతను 27 ఏళ్ల వయసులోనే రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇలాంటి దురదృష్టకర ఘటనలు మైదానంలో చాలానే జరిగాయి. వాటిలో ఇవి కొన్ని మాత్రమే. మైదానం వెలుపల జరిగిన ప్రమాదాల్లో తీవ్రంగా గాయపడిన క్రికెటర్ల విషయానికొస్తే.. ముందుగా గుర్తొచ్చే పేరు రిషబ్ పంత్. 2022లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో పంత్ తీవ్రంగా గాయపడ్డాడు. పంత్ తిరిగి క్రికెట్ ఆడతాడని ఎవరూ ఊహించలేదు. ఈ ప్రమాదంలో అతని కాలు తీసేసినంత పని అయ్యింది. అయినా అతను దృడ సంకల్పంతో గాయాన్ని అధిగమించి తిరిగి జాతీయ జట్టులోకి వచ్చాడు. మునుపటి తరమా ప్రదర్శనలతో సత్తా చాటాడు.ఒంటి కన్నుతో దేశాన్ని నడిపించిన పటౌడీ1961లో ఇంగ్లండ్‌లో జరిగిన కారు ప్రమాదంలో భారత దిగ్గజ క్రికెటర్ మన్సూర్ అలీ ఖాన్ పటౌడి ఓ కంటిని కోల్పోయాడు. ఆతర్వాత అతను ఒంటి కన్నుతో భారత క్రికెట్ జట్టును విజయవంతంగా ముందుండి నడిపించాడు. 21 ఏళ్ల వయసులో భారత జట్టు కెప్టెన్‌గా నియమితుడైన పటౌడీ.. అప్పట్లో టెస్ట్ క్రికెట్లో అత్యంత చిన్న వయసు గత కెప్టెన్‌గా రికార్డు నెలకొల్పాడు.చదవండి: ఆస్ట్రేలియాతో సెమీస్‌కు ముందు టీమిండియాకు బ్యాడ్ న్యూస్ -
టీమిండియాకు బ్యాడ్ న్యూస్
నవీ ముంబై వేదికగా ఆస్ట్రేలియాతో రేపు (అక్టోబర్ 30) జరుగబోయే మహిళల వన్డే ప్రపంచకప్ సెమీఫైనల్‌కు (India vs Australia) ముందు టీమిండియాకు (Team India) బ్యాడ్ న్యూస్ అందింది. గాయం కారణంగా గత రెండు మ్యాచ్‌లకు (ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా) దూరంగా ఉన్న ఆసీస్ స్టార్ ప్లేయర్ అలైస్సా హీలీ (Alyssa Healy) ఈ మ్యాచ్‌కు అందుబాటులోకి రానుంది.ఈ విషయంపై క్రికెట్ ఆస్ట్రేలియా అధికారిక ప్రకటన చేయనప్పటికీ.. హీలీ ఫిట్నెస్ టెస్ట్‌ను క్లియర్ చేసినట్లు తెలుస్తుంది. నెట్స్‌లో బ్యాటింగ్ ప్రాక్టీస్ మొదలుపెట్టిన ఆమె, పునరాగమనం సంకేతాలు ఇచ్చింది. సెమీస్‌లో హీలీ బరిలోకి దిగితే టీమిండియాను కష్టాలు తప్పవు.గాయపడక ముందు ఆమె అరివీర భయంకరమైన ఫామ్‌లో ఉండింది. వరుసగా భారత్, బంగ్లాదేశ్‌పై సెంచరీలు (142, 113 నాటౌట్) చేసింది. ఇదే ఫామ్‌ను హీలీ సెమీస్‌లోనూ కొనసాగిస్తే.. టీమిండియా ప్రపంచకప్ సాధించాలన్న కల తలకిందులయ్యే ప్రమాదం ఉంది.ఈ టోర్నీలో హీలీ 4 మ్యాచ్‌ల్లో 2 సెంచరీల సాయంతో 98 సగటున 298 పరుగులు చేసి లీడింగ్ రన్ స్కోరర్ల జాబితాలో నాలుగో స్థానంలో ఉంది.కాగా, ప్రస్తుత ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా అజేయ జట్టుగా సెమీస్‌కు చేరింది. లీగ్ దశలో న్యూజిలాండ్, పాకిస్తాన్, భారత్, బంగ్లాదేశ్, ఇంగ్లండ్, సౌతాఫ్రికాపై విజయాలు సాధించి, జైత్రయాత్రను కొనసాగిస్తుంది. భారత్ విషయానికొస్తే.. చివరి లీగ్ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై విజయం సాధించి సెమీస్‌కు అర్హత సాధించిన భారత్.. టోర్నీ ప్రారంభంలో వరుసగా శ్రీలంక, పాకిస్తాన్‌లపై విజయాలు సాధించి, ఆతర్వాత సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా ఇంగ్లండ్ చేతుల్లో వరుసగా మూడు మ్యాచ్‌ల్లో ఓడింది. ఈ టోర్నీ నుంచి మరో రెండు సెమీస్ బెర్త్‌లు ఇంగ్లండ్, సౌతాఫ్రికాకు దక్కాయి. ఇరు జట్లు ఇవాళ (అక్టోబర్ 29) జరుగబోయే తొలి సెమీఫైనల్లో అమీతుమీ తేల్చుకోనున్నాయి. చదవండి: పాక్‌ను చిత్తుగా ఓడించిన సౌతాఫ్రికా -
మరోసారి 'మరో ఛాన్స్' అంటున్న కరుణ్ నాయర్..!
డియర్ క్రికెట్ మరో ఛాన్స్ ఇవ్వు అంటూ ఎనిమిదేళ్ల తర్వాత టీమిండియాలోకి రీఎంట్రీ ఇచ్చిన కరుణ్ నాయర్ (Karun Nair).. ఇచ్చిన ఛాన్స్‌ను సద్వినియోగం చేసుకోలేక, ఇలా వచ్చి అలా మాయమయ్యాడు. ఇటీవలి ఇంగ్లండ్ పర్యటనలో భారీ అంచనాల నడుమ బరిలోకి దిగిన నాయర్.. 7 ఇన్నింగ్స్‌ల్లో ఒకే ఒక హాఫ్ సెంచరీ సాయంతో 205 పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచాడు. ఫలితంగా తదుపరి సిరీస్‌కే జట్టులో స్థానం కోల్పోయాడు. ఆతర్వాత అతనికి 'ఏ' జట్టులోనూ స్థానం లభించలేదు. సెలెక్టర్లు కరుణ్ నుంచి చాలా ఆశించామని చెప్పి చేతులు దులుపుకున్నారు. తాజాగా కరుణ్ మరోసారి 'మరో ఛాన్స్' అంటూ ముందుకు వచ్చాడు.ప్రస్తుతం జరుగుతున్న రంజీ ట్రోఫీలో తొలి మ్యాచ్‌లో అర్ద సెంచరీ (73), రెండో మ్యాచ్‌లో భారీ సెంచరీ (174 నాటౌట్) చేసి సెలెక్టర్లకు సవాల్ విసిరాడు. సెంచరీ అనంతరం కరుణ్ విలేకరులతో మాట్లాడుతూ ఇలా అన్నాడు."టీమిండియా నుంచి తప్పించడం బాధ కలిగించింది. ఒక్క సిరీస్ కంటే ఎక్కువ అర్హుడినని నన్ను నేను ఒప్పించుకుంటూ ఉంటాను. గత రెండు సంవత్సరాల నా ప్రదర్శన చూస్తే, ఆ స్థాయికి అర్హుడిననే అనిపిస్తుంది. ప్రస్తుతం నా పని పరుగులు చేయడం ఒక్కటే. దేశం కోసం ఆడాలన్నదే నా లక్ష్యం. అది సాధపడకపోతే, నా జట్టుకు విజయాన్ని అందించడమే తదుపరి లక్ష్యం"కరుణ్ చేసిన ఈ వ్యాఖ్యలు చూస్తుంటే అతనిలో నిరాశతో కూడిన ఆశ కనిపిస్తుంది. క్రికెట్.. మరోసారి మరో ఛాన్స్ ఇవ్వు అంటూ అర్దించినట్లనిపిస్తుంది. దేశం కోసం ఆడాలన్న తాపత్రయం స్పష్టమవుతుంది.33 ఏళ్ల కరుణ్‌కు ఇంగ్లండ్ పర్యటనలో మంచి ఆరంభాలు లభించినా దురదృష్టవశాత్తు వాటిని భారీ స్కోర్లుగా మలచలేకపోయాడు. ఐదో టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో కరుణ్ కష్టమైన పిచ్‌పై అద్భుత ఇన్నింగ్స్ ఆడినా తగిన గుర్తింపు దక్కలేదు. ఆ ఇన్నింగ్స్‌లో ఇరు జట్లలో కరుణే టాప్ స్కోరర్‌గా నిలిచాడు.వాస్తవానికి కరుణ్‌కు అతి భారీ ఇన్నింగ్స్‌లు ఆడగల సామర్థ్యం ఉంది. ఇది చాలాసార్లు నిరూపితమైంది. ఇలాంటి ఆటగాడికి కొన్ని అవకాశాలు మాత్రమే ఇవ్వడం సబబు కాదు. కరుణ్‌కు కనీసం దక్షిణాఫ్రికా 'ఏ' సిరీస్‌తో అయినా భారత ఏ జట్టుకు ఎంపిక చేసి ఉండాల్సింది. అక్కడ ప్రదర్శనను బట్టి అతని భవిష్యత్తును డిసైడ్ చేసి ఉంటే బాగుండేది. ఎందుకో సెలెక్టర్లు కరుణ్ విషయంలో పట్టీపట్టనట్లు వ్యవహరిస్తున్నారనే భావన కలుగుతుంది.చదవండి: చారిత్రక ఘట్టం.. భారత క్రికెట్ ప్రయాణంలో మరిచిపోలేని అధ్యాయం -
జైస్వాల్ కీలక నిర్ణయం
భారత టెస్ట్ జట్టు ఓపెనర్ యశస్వి జైస్వాల్ (Yashasvi Jaiswal) కీలక నిర్ణయం తీసుకున్నాడు. టీమిండియా తరఫున ఎలాంటి కమిట్మెంట్స్ లేకపోవడంతో దేశవాలీ క్రికెట్ ఆడేందుకు నిర్ణయించుకున్నాడు. త్వరలో జరుగనున్న రంజీ ట్రోఫీ 2025/26 (Ranji Trophy) మూడో రౌండ్ మ్యాచ్ ఆడేందుకు సన్నద్దత వ్యక్తం చేస్తూ.. తన హోం టీమ్ మేనేజ్మెంట్కు లేఖ రాశాడు. ఈ విషయాన్ని సోషల్‌మీడియా వేదికగా వెల్లడించాడు.జైస్వాల్ కొద్ది కాలం క్రితం తన హోం టీమ్ ముంబైని కాదని గోవాకు ఆడాలని నిర్ణయించుకున్నాడు. అయితే తదనంత పరిణామాల్లో యూటర్న్ తీసుకున్నాడు. తాజాగా రాజస్తాన్‌తో జరిగబోయే మూడో రౌండ్ మ్యాచ్‌కు ముంబై తరఫున ఆడేందుకు అందుబాటులో ఉన్నట్లు ప్రకటించాడు.ఈ మ్యాచ్ నవంబర్ 1 నుంచి జైపూర్‌లో జరుగుతుంది. ఎలైట్ గ్రూప్ D భాగంగా ఈ మ్యాచ్ జరుగనుంది. ముంబై మేనేజ్మెంట్ తమను కాదని వెళ్లిపోవాలని చూసిన జైస్వాల్‌కు అవకాశం ఇస్తుందా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. ఒక వేళ అవకాశం ఇస్తే అతను ముంబై జట్టులో కీలకమవుతాడు.జైస్వాల్ తాజాగా ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్‌లో పాల్గొన్నాడు. అయితే అక్టోబర్ 29 నుంచి ప్రారంభమయ్యే ఐదు మ్యాచ్‌ల టీ20ల సిరీస్‌కు అతను ఎంపిక కాలేదు. దీంతో దేశీయ క్రికెట్ ఆడాలని నిర్ణయించుకున్నాడు.టీమిండియా తరఫున కమిట్మెంట్స్ లేని సెంట్రల్ కాంట్రాక్ట్ ఆటగాళ్లు దేశీయ క్రికెట్ ఆడాలని బీసీసీఐ కండిషన్ పెట్టిన విషయం తెలిసిందే. ఈ మేరకే జైస్వాల్ కూడా రంజీ ఆడాలని నిర్ణయించుకున్నాడు. మూడో రౌండ్‌కు ముంబై జట్టును త్వరలో ప్రకటిస్తారు.జైస్వాల్ గత సీజన్లో జమ్మూ అండ్ కాశ్మీర్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై తరఫున చివరిసారి ఆడాడు. ఆ మ్యాచ్‌లో రోహిత్ శర్మ కూడా పాల్గొన్నాడు. జైస్వాల్ తన చివరి ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ను ఈ ఏడాది ఆగస్ట్‌లో ఆడాడు. దులీప్ ట్రోఫీ 2025లో వెస్ట్ జోన్ తరఫున బరిలోకి దిగాడు.రంజీ ట్రోఫీలో ఆడటం జైస్వాల్‌కు వ్యక్తిగతంగా కలిసొస్తుంది. నవంబర్ 14 నుంచి దక్షిణాఫ్రికాతో జరుగబోయే హోం సిరీస్‌కు ముందు మంచి ప్రాక్టీస్ అవుతుంది. ఆ సిరీస్‌లో భారత్ రెండు టెస్టులు, ఐదు టీ20లు, మూడు వన్డేలు ఆడనుంది. జైస్వాల్‌కు టెస్ట్ జట్టులో చోటు పక్కా కాగా.. వన్డే, టీ20ల్లో అవకాశం లభిస్తుందో లేదో చూడాలి. సౌతాఫ్రికాతో టెస్ట్ మ్యాచ్‌లు నవంబర్ 14 (కోల్‌కతా), నవంబర్ 22 (గౌహతి) తేదీల్లో జరుగనున్నాయి.చదవండి: వెస్టిండీస్ బోణీ -
పక్కటెముకల్లో రక్తస్రావం.. ఐసీయూలో శ్రేయస్ అయ్యర్
భారత క్రికెట్ అభిమానులకు షాకింగ్ వార్త. తాజాగా ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో గాయపడ్డ టీమిండియా వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer) ఆరోగ్య పరిస్థితి సీరియస్‌గా మారింది. ఆ మ్యాచ్‌లో అలెక్స్ క్యారీ క్యాచ్ అందుకునే క్రమంలో శ్రేయస్ ఎడమ వైపు రిబ్ కేజ్‌పై పడిపోయాడు. మొదట్లో స్వల్ప నొప్పిగా కనిపించినా, డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్లిన తర్వాత పరిస్థితి విషమంగా మారింది. వెంటనే మెడికల్ టీమ్ ఆయనను ఆసుపత్రికి తరలించింది.సిడ్నీలోని ఆసుపత్రిలో స్కానింగ్ చేసిన వైద్యులు, శ్రేయస్‌కు అంతర్గత రక్తస్రావం (internal bleeding) ఉందని గుర్తించారు. వెంటనే ఐసీయూకు తరలించి, రెండు రోజులుగా పర్యవేక్షణలో ఉంచారు. రక్తస్రావం ఆగే వేగం, ఇన్ఫెక్షన్ ప్రమాదం ఆధారంగా శ్రేయస్‌ను మరో రెండు నుంచి ఏడు రోజులు ఐసీయూలో ఉంచే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. శ్రేయస్ ఆరోగ్య పరిస్థితిపై బీసీసీఐ కార్యదర్శి దేవ్జిత్ సైకియా స్పందించారు. శ్రేయస్‌కు స్ప్లీన్‌లో లాసరేషన్ గాయం ఉందని స్పష్టం చేశారు. ప్రస్తుతం శ్రేయస్ అరోగ్యం నిలకడగా ఉందని, వేగంగా కోలుకుంటున్నాడని తెలిపారు. బీసీసీఐ మెడికల్ టీమ్.. సిడ్నీ, భారత్‌లో ఉన్న వైద్యులను సమన్వయం చేసుకుంటూ శ్రేయస్ ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తున్నట్లు పేర్కొన్నారు. భారత డాక్టర్ శ్రేయస్‌తో పాటే ఉండి రోజువారీగా అతని ఆరోగ్యాన్ని పరిశీలిస్తారని తెలిపారు.30 ఏళ్ల శ్రేయస్, ఇటీవలే టెస్ట్ క్రికెట్‌కు విరామం తీసుకుని వన్డేలపై ఫోకస్ పెంచనున్నట్లు ప్రకటించాడు. ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో (11) నిరాశపరిచిన శ్రేయస్.. రెండో వన్డేలో పుంజుకొని 61 పరుగులు చేశాడు. శ్రేయస్ మరో 83 పరుగులు చేస్తే.. వన్డేల్లో 3000 పరుగుల మైలురాయిని తాకుతాడు.తాజాగా గాయం కారణంగా శ్రేయస్ త్వరలో (నవంబర్ 30) స్వదేశంలో సౌతాఫ్రికాతో జరిగే వన్డే సిరీస్‌లో ఆడటం అనుమానంగా మారింది. శ్రేయస్ త్వరగా కోలుకోవాలని భారత క్రికెట్ అభిమానులు దేవుళ్లను ప్రార్దిస్తున్నారు. ఇటీవలికాలంలో శ్రేయస్ టీమిండియాకు ప్రధానాస్త్రంగా ఉన్నాడు. వన్డేల్లో నాలుగో స్థానంలో కీలక ఇన్నింగ్స్‌లు ఆడుతూ తురుపుముక్కగా మారాడు. సౌతాఫ్రికాతో సిరీస్‌కు శ్రేయస్ దూరమైతే టీమిండియా విజయావకాశాలను తప్పక ప్రభావితం చేస్తుంది.చదవండి: భారత్‌తో తొలి టీ20.. ఆస్ట్రేలియా జట్టులో కీలక మార్పు -
పృథ్వీ షా విధ్వంసకర శతకం.. ఫాస్టెస్ట్ సెంచరీ
వివాదాస్పద బ్యాటర్ పృథ్వీ షా (Prithvi Shaw) రంజీ ట్రోఫీలో (Ranji Trophy) మహారాష్ట్ర (Maharashtra) తరఫున తన తొలి సెంచరీ సాధించాడు. 2025-26 ఎడిషన్‌లో భాగంగా చండీఘడ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో (రెండో ఇన్నింగ్స్) కేవలం 72 బంతుల్లోనే (13 ఫోర్ల సాయంతో) శతక్కొట్టాడు. రంజీ ట్రోఫీ చరిత్రలో ఇది ఆరో వేగవంతమైన శతకం. తొలి ఐదు ఫాస్టెస్ట్ సెంచరీలు రిషబ్ పంత్ (48), రాజేశ్ బోరా (56), రియన్ పరాగ్ (56), రూబెన్ పాల్ (60), రజత్ పాటిదార్ (68) పేరిట ఉన్నాయి. రంజీ మహారాష్ట్ర తరఫున ఇదే ఫాస్టెస్ట్ సెంచరీ. షాకు ఫస్ట్ క్లాస్ క్రికెట్లో ఇది 14వ సెంచరీ. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో 8 పరుగులకే ఔటైన షా.. రెండో ఇన్నింగ్స్‌లో అద్భుతంగా పుంజుకుని సెంచరీ సాధించాడు. మహారాష్ట్ర తరఫున రంజీ అరంగేట్రాన్ని (ఈ ఎడిషన్ తొలి మ్యాచ్) డకౌట్‌తో ప్రారంభించిన షా (కేరళపై).. రెండో ఇన్నింగ్స్‌లో 75 పరుగులతో రాణించాడు.ప్రస్తుత రంజీ సీజన్ ప్రారంభానికి ముందే ముంబై నుంచి మహారాష్ట్రకు మారిన షా.. కొత్త జట్టు తరఫున అదరగొడుతున్నాడు. ముంబైతో జరిగిన వార్మప్ మ్యాచ్‌లో 181 పరుగులు.. అంతకుముందు బుచ్చిబాబు టోర్నీలో చత్తీస్‌ఘడ్‌పై 111 పరుగులు చేశాడు. వరుస సెంచరీలతో షా మరోసారి టీమిండియావైపు దూసుకొస్తున్నాడు.మ్యాచ్ విషయానికొస్తే.. తొలి ఇన్నింగ్స్‌లో రుతురాజ్ గైక్వాడ్ (116) సెంచరీతో కదంతొక్కడంతో మహారాష్ట్ర 313 పరుగులు చేసింది. అనంతరం విక్కీ ఓస్త్వాల్ (21-6-40-6) ఆరేయడంతో చంఢీఘడ్ తొలి ఇన్నింగ్స్‌లో 209 పరుగులకు ఆలౌటైంది. రమన్ బిష్ణోయ్ (54), పదో నంబర్ ఆటగాడు నిషంక్ బిర్లా (56 నాటౌట్) చండీఘడ్‌కు గౌరవప్రదమైన స్కోర్ అందించారు.104 పరుగుల కీలక ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన మహారాష్ట్ర, మూడో రోజు తొలి సెషన్ సమయానికి వికెట్ నష్టానికి 164 పరుగులు చేసి, 268 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతుంది. షా 105, సిద్దేశ్ వీర 28 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. చదవండి: IND vs AUS T20 Series: తొలి పంజా మనదే..! -
IND vs AUS T20 Series: తొలి పంజా మనదే..!
టెస్ట్, వన్డే ఫార్మాట్లలో గుత్తాధిపత్యం చలాయించే ఆస్ట్రేలియా జట్టుకు పొట్టి క్రికెట్ బలహీనత ఉంది. ముఖ్యంగా టీమిండియా ఎదురైనప్పుడు ఆ బలహీనత మరింత ఎక్కువవుతుంది. 2007 నుంచి భారత్‌తో ఆడిన 32 మ్యాచ్‌ల్లో (India vs Australia) ఆసీస్ కేవలం 11 మ్యాచ్‌ల్లో మాత్రమే విజయాలు సాధించింది.ద్వైపాక్షిక సిరీస్‌ల్లో అయితే ఆసీస్ ట్రాక్ రికార్డు మరింత చెత్తగా ఉంది. ఇరు జట్ల మధ్య ఇప్పటివరకు 11 సిరీస్‌లు జరగ్గా, ఆసీస్ రెండింట మాత్రమే గెలుపొందింది. త్వరలో జరుగనున్న ఐదు మ్యాచ్‌ల సిరీస్ నేపథ్యంలో భారత్-ఆసీస్ మధ్య జరిగిన ద్వైపాక్షిక సిరీస్‌లపై ఓ లుక్కేద్దాం.తొలి పంజా మనదేభారత్, ఆసీస్ జట్ల మధ్య తొలి అంతర్జాతీయ టీ20 మ్యాచ్ 2007 అక్టోబర్ 20న జరిగింది. వన్ మ్యాచ్ సిరీస్‌లో భాగంగా జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి, ఆసీస్‌పై తొలి పంజా విసిరింది. ముంబైలోని బ్రబోర్న్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్ ఆల్‌రౌండ్ షోతో సత్తా చాటింది. బౌలింగ్‌లో ఇర్ఫాన్ పఠాన్, హర్భజన్ సింగ్.. బ్యాటింగ్‌లో గౌతమ్ గంభీర్ (63), యువరాజ్ సింగ్ (31 నాటౌట్) రాణించారు.అనంతరం 2008 ఫిబ్రవరి 1న మెల్బోర్న్లో జరిగిన వన్ మ్యాచ్ సిరీస్‌లో (డే అండ్ నైట్) ఆస్ట్రేలియా 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 74 పరుగులకే ఆలౌట్ కాగా.. ఆసీస్ మరో 52 బంతులు మిడిలుండగానే లక్ష్యాన్ని ఛేదించింది.గంభీర్ మరోసారి..!2012 ఫిబ్రవరిలో ఇరు జట్ల మధ్య తొలి మల్టీ మ్యాచ్ సిరీస్ జరిగింది. ఆస్ట్రేలియాలో జరిగిన ఈ సిరీస్ 1-1తో డ్రా అయ్యింది. తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియా గెలుపొందగా.. రెండో మ్యాచ్‌లో టీమిండియా విజయం సాధించింది. మెల్బోర్న్ వేదికగా జరిగిన రెండో టీ20లో గంభీర్ (56 నాటౌట్) టీమిండియాను గెలిపించాడు. యువీ విధ్వంసం2013 అక్టోబర్‌లో జరిగిన మరో వన్ మ్యాచ్ సిరీస్‌ను భారత్ కైవసం చేసుకుంది. రాజ్‌కోట్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 6 వికెట్ల తేడాతో ఆసీస్‌ను చిత్తు చేసింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్.. ఆరోన్ ఫించ్ (89) చెలరేగడంతో 201 పరుగుల భారీ స్కోర్ చేసింది. అనంతరం యువరాజ్ సింగ్ (77 నాటౌట్) విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడి టీమిండియాను గెలిపించాడు.చెలరేగిన కోహ్లి.. వైట్వాష్మళ్లీ మూడేళ్ల తర్వాత (2016, జనవరి) భారత్, ఆసీస్ మధ్య ద్వైపాక్షిక సిరీస్ జరిగింది. ఆస్ట్రేలియాలో జరిగిన ఈ మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను టీమిండియా 3-0తో వైట్‌వాష్ చేసింది. ఈ సిరీస్‌లో విరాట్ కోహ్లి చెలరేగిపోయాడు. మూడు మ్యాచ్‌ల్లో హాఫ్ సెంచరీలు (90 నాటౌట్, 59 నాటౌట్, 59) బాది టీమిండియా గెలుపులో ప్రధానపాత్ర పోషించాడు. రోహిత్ శర్మ కూడా రెండు అర్ద సెంచరీలతో రాణించాడు.రాణించిన శిఖర్అనంతరం 2017 అక్టోబర్‌లో జరిగిన 3 మ్యాచ్‌ల సిరీస్ (భారత్), 2018 నవంబర్‌లో జరిగిన 3 మ్యాచ్‌ల సిరీస్‌లు (ఆస్ట్రేలియా) 1-1తో డ్రా అయ్యాయి. ఆస్ట్రేలియాలో జరిగిన సిరీస్‌లో శిఖర్ ధవన్, విరాట్ కోహ్లి సత్తా చాటారు. ఈ సిరీస్‌లోని చివరి మ్యాచ్‌లో కృనాల్ పాండ్యా (4-0-36-4) అదరగొట్టాడు.తొలి పరాభవం2019లో ఆస్ట్రేలియా రెండు మ్యాచ్‌ల సిరీస్ కోసం భారత్‌లో పర్యటించింది. ఈ సిరీస్‌ను భారత్ 0-2 తేడాతో కోల్పోయింది. ఈ సిరీస్‌లో కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లి సత్తా చాటారు.హ్యాట్రిక్ విక్టరీస్ఆతర్వాత భారత్ వరుసగా 2020 (ఆస్ట్రేలియాలో), 2022 (భారత్‌లో), 2023 (భారత్‌లో) సిరీస్‌ల్లో ఆస్ట్రేలియాను చిత్తుగా ఓడించింది. 2020 సిరీస్‌లో రాహుల్, ధవన్, కోహ్లి, నటరాజన్, చహల్ సత్తా చాటడంతో భారత్ 2-1 తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకుంది. 2022 సిరీస్‌లో అక్షర్ పటేల్, సూర్యకుమార్ యాదవ్ చెలరేగడంతో 2-1 తేడాతో గెలుపొందింది.యువ ఆటగాళ్ల హవా.. రుతురాజ్ విధ్వంసకర శతకం2023లో జరిగిన సిరీస్‌లో ఇషాన్ కిషన్, యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్, రవి బిష్ణోయ్, అక్షర్ పటేల్, రింకూ సింగ్ లాంటి యువ ఆటగాళ్లు ఆకాశమే హద్దుగా చెలరేగారు. ఫలితంగా భారత్ 4-1 తేడాతో ఆసీస్‌ను ఖంగుతినిపించింది. ఈ సిరీస్‌లోని మూడో మ్యాచ్‌లో రుతురాజ్ గైక్వాడ్ విధ్వంసకర శతకం బాదాడు.చదవండి: రోహిత్, కోహ్లి మళ్లీ రంగంలోకి దిగేది అప్పుడే..! -
రోహిత్, కోహ్లి మళ్లీ రంగంలోకి దిగేది అప్పుడే..!
టీమిండియా దిగ్గజాలు రోహిత్ శర్మ (Rohit Sharma), విరాట్ కోహ్లి (Virat Kohli) ఏడు నెలల విరామం తర్వాత తాజాగా ముగిసిన ఆస్ట్రేలియా సిరీస్‌తో వన్డేల్లోకి రీఎంట్రీ ఇచ్చారు. టీ20లకు, టెస్ట్‌లకు రిటైర్మెంట్ ప్రకటించిన వీరిద్దరు ప్రస్తుతం వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్నారు. 2027 వన్డే ప్రపంచకప్ ఆడటమే వీరి ఏకైక లక్ష్యం. ఇందులో భాగంగానే వారు ప్రణాళికలు సిద్దం చేసుకున్నారు.రోకో తదుపరి టార్గెట్ స్వదేశంలో సౌతాఫ్రికాతో జరిగే సిరీస్. ఈ సిరీస్‌లో మూడు వన్డేలు జరుగనున్నాయి. నవంబర్ 30, డిసెంబర్ 3, 6 తేదీల్లో రాంచీ, రాయ్‌పూర్, వైజాగ్ వేదికలుగా ఈ వన్డేలు జరుగుతాయి. ఈ సిరీస్‌లో రోహిత్, కోహ్లి చెలరేగే అవకాశం ఉంది. స్వదేశంలో జరిగే వన్డేల్లో ఈ ఇద్దరికి ఘనమైన ట్రాక్ రికార్డు ఉంది. ప్రత్యర్ధి ఎవరైనా స్వదేశంలో రోకోను ఆపడం అసాధ్యం.రో'హిట్టు'తాజాగా ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్‌లో రోహిత్ శర్మ సూపర్ హిట్టయ్యాడు. 3 మ్యాచ్‌ల్లో సెంచరీ, ఓ హాఫ్ సెంచరీ సాయంతో 202 పరుగులు చేశాడు. ఈ సిరీస్‌ను భారత్ 1-2 తేడాతో కోల్పోయినప్పటికీ రోహిత్ ప్రదర్శన మాత్రం అందరినీ ఆకట్టుకుంది. ముఖ్యంగా చివరి వన్డేలో రోహిత్ చేసిన సెంచరీ విమర్శకుల ప్రశంసలను సైతం అందుకుంది.భారీగా బరువు తగ్గి ఫిట్నెస్ మెరుగుపర్చుకున్న రోహిత్ ఆ మ్యాచ్‌లో యధేచ్చగా షాట్లు ఆడాడు. మునుపటి రోహిత్‌ను గుర్తు చేశాడు. రెండో వన్డేలోనూ రోహిత్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. కష్టమైన పిచ్‌పై శైలికి విరుద్దంగా, చాలా ఓపిగ్గా బ్యాటింగ్ చేసి సెంచరీకి చేరువలో ఔటయ్యాడు.ఈ రెండు ఇన్నింగ్స్‌ల తర్వాత రోహిత్ భవితవ్యంపై అనుమానాలు పటాపంచలయ్యాయి. ప్రస్తుతం 38 ఏళ్ల వయసున్న రోహిత్ 2027 ప్రపంచకప్ సమయానికి 40వ పడిలో ఉంటాడు.ఆ వయసులో అతనెలా ఆడగలడని చాలా మంది అనుకున్నారు. అయితే ఈ అనుమానాలకు రోహిత్ తన ప్రదర్శనలతో చెక్ పెట్టేశాడు. ఫిట్నెస్ ఇలాగే కాపాడుకుంటే 40 కాదు మరో ఐదేళ్లైనా ఆడగలనన్న సంకేతాలు పంపాడు. మొత్తంగా ఆస్ట్రేలియా సిరీస్‌లో హిట్టైన రోహిత్ 2027 ప్రపంచకప్‌కు సిద్దమంటూ సంకేతాలు పంపాడు.పరువు కాపాడుకున్న కోహ్లిఆసీస్ సిరీస్‌లో రోహిత్ హిట్టైతే.. అతని సహచరుడు కోహ్లి మాత్రం నాట్ బ్యాడ్ అనిపించాడు. తొలి రెండు వన్డేల్లో డకౌటైనా, మూడో వన్డేలో రోహిత్‌తో పాటు మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ (74 నాటౌట్) ఆడి పరువు కాపాడుకున్నాడు. ఈ ఇన్నింగ్స్‌తో కోహ్లి భవితవ్యంపై కూడా అనుమానాలు తొలగిపోయాయి. కోహ్లి సైతం 2027 ప్రపంచకప్‌కు రెడీ అంటూ సంకేతాలు పంపాడు. ఫిట్నెస్ పరంగా ఎప్పుడూ పర్ఫెక్ట్గా ఉండే కోహ్లి.. ఫామ్‌ను కాపాడుకుంటే ఈజీగా మరో నాలుగైదేళ్లు ఆడగలడు. మొత్తానికి ఈ సిరీస్‌తో రోహిత్, కోహ్లి భవితవ్యంపై అనుమానాలకు తెరపడింది. ప్రపంచకప్ వరకు వారు ఈజీగా కొనసాగగలరు.ఈ మధ్యలో వారు ఆడే అవకాశమున్న మ్యాచ్‌లపై ఓ లుక్కేద్దాం..- స్వదేశంలో సౌతాఫ్రికాతో సిరీస్ అనంతరం వచ్చే ఏడాది స్వదేశంలోనే న్యూజిలాండ్‌తో మూడు మ్యాచ్‌ల సిరీస్ జరుగనుంది. - దీని తర్వాత ఆఫ్ఘనిస్తాన్ భారత్‌లో పర్యటించి వన్డేలు ఆడనుంది. - అనంతరం ఇంగ్లండ్, బంగ్లాదేశ్ పర్యటనల్లో భారత్ వన్డే సిరీస్‌లు ఆడుతుంది. - ఆతర్వాత వెస్టిండీస్ భారత్‌లో పర్యటించి వన్డేలు ఆడనుంది. - అతర్వాత భారత్ న్యూజిలాండ్‌లో పర్యటించి వన్డేలు ఆడుతుంది. - 2027 వన్డే ప్రపంచకప్‌కు కొద్దిముందు భారత్ స్వదేశంలో శ్రీలంకతో వన్డేలు ఆడనుంది. ఈ సిరీస్‌ల్లో రోకో అన్ని ఆడతారని చెప్పలేము కాని, మెజార్జీ శాతం సిరీస్‌ల్లో పాల్గొనే అవకాశం ఉంది. చదవండి: ఆస్ట్రేలియాతో సెమీఫైనల్‌కు ముందు టీమిండియాకు బిగ్ షాక్ -
టీమిండియాకు బిగ్ షాక్
మహిళల వన్డే ప్రపంచకప్‌లో (Women's CWC 2025) భాగంగా అక్టోబర్ 30న ఆస్ట్రేలియాతో జరుగబోయే సెమీఫైనల్ మ్యాచ్‌కు ముందు టీమిండియాకు భారీ షాక్ తగిలింది. నిన్న (అక్టోబర్ 26) బంగ్లాదేశ్‌తో జరిగిన నామమాత్రపు మ్యాచ్ సందర్భంగా ఇన్ ఫామ్ ఓపెనర్ ప్రతిక రావల్ (Pratika Rawal) తీవ్రంగా గాయపడింది. దీంతో సెమీస్ మ్యాచ్‌కు ఆమె అందుబాటులో ఉంటుందా లేదా అన్నది అనుమానంగా మారింది.ప్రస్తుతానికి ప్రతిక గాయంపై ఎలాంటి అప్డేట్ లేనప్పటికీ.. అభిమానుల్లో మాత్రం ఆందోళన నెలకొలింది. ప్రతిక న్యూజిలాండ్‌తో జరిగిన చివరి మ్యాచ్‌లో స్మృతి మంధనతో సహా విధ్వంసకర శతకం బాదిన విషయం తెలిసిందే. ప్రస్తుత ప్రపంచకప్‌లో ప్రతిక మంధనతో కలిసి భారత్‌కు శుభారంభాలు అందిస్తూ జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషిస్తుంది.అలాంటి ప్రతిక ఆసీస్‌తో జరుగబోయే డూ ఆర్ డై సెమీఫైనల్ మ్యాచ్‌కు దూరమైతే, టీమిండియా విజయావకాశాలు తప్పక ప్రభావితమవుతాయి.మ్యాచ్ రద్దునవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో నిన్న జరిగిన భారత్-బంగ్లాదేశ్ మ్యాచ్ వర్షం కారణంగా ఫలితం తేలకుండా ముగిసింది. 27 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ తొలుత బ్యాటింగ్ చేసి 9 వికెట్ల నష్టానికి 119 పరుగుల స్వల్ప స్కోర్‌కు పరిమితమైంది. బంగ్లా ఇన్నింగ్స్ 21వ ఓవర్ రెండో బంతికి మిడ్‌వికెట్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న ప్రతిక తీవ్రంగా గాయపడింది.విలవిలాడిపోయిన ప్రతికమైదానం చిత్తడిగా ఉండటంతో రన్నింగ్ చేసే సమయంలో ప్రతిక కుడి కాలి మడమ మడతపడింది. తీవ్ర నొప్పితో బాధపడుతున్న ఆమెను సిబ్బంది డ్రెస్సింగ్ రూమ్‌కు తీసుకెళ్లారు. ఆతర్వాత ఆమె తిరిగి మైదానంలో అడుగుపెట్టలేదు. ఆమె స్థానంలో అమన్‌జోత్ కౌర్ భారత ఇన్నింగ్స్‌ను ప్రారంభించింది.ఛేదనలో అమన్‌జోత్, మంధన 8.4 ఓవర్లలో 57 పరుగులు జోడించాక వర్షం మళ్లీ మొదలుకావడంతో మ్యాచ్‌ను రద్దు చేశారు.రికార్డుల ప్రతికప్రతిక న్యూజిలాండ్‌తో జరిగిన గత మ్యాచ్‌లో పలు రికార్డులు నెలకొల్పింది. ఈ మ్యాచ్‌లో చేసిన సెంచరీ ఆమెకు ప్రపంచకప్ టోర్నీలో మొదటిది. ఈ మ్యాచ్‌లో ఆమె మహిళల వన్డేల్లో అత్యంత వేగంగా 1000 పరుగులు చేసిన బ్యాటర్లలో ఒకరిగా నిలిచింది. అలాగే మంధన తర్వాత ఓ క్యాలెండర్ ఇయర్లో 1000 పరుగులు చేసిన భారత మహిళా క్రికెటర్‌గా రికార్డుల్లోకెక్కింది.ప్రతిక దూరమైతే..?ప్రతిక ఆస్ట్రేలియాతో జరుగబోయే సెమీఫైనల్ మ్యాచ్‌కు దూరమైతే టీమిండియా తీవ్రమైన కష్టాలు ఎదుర్కోనుంది. ప్రతిక స్థానాన్ని భర్తీ చేసే ఓపెనర్ ఎవరూ జట్టులో లేరు. ఐసీసీ అంగీకారంతో రిజర్వ్‌లలో లేని ప్లేయర్‌ను పిలిపించుకోవాల్సి వస్తుంది. ప్రతిక పూర్తిగా టోర్నీ నుంచి తప్పుకుంటేనే ఇది సాధ్యపడుతుంది.టీమిండియాకు మరో సమస్యప్రతిక గాయానికి ముందే టీమిండియా మరో సమస్య ఉండింది. న్యూజిలాండ్‌తో మ్యాచ్ సందర్భంగా వికెట్‌కీపర్ బ్యాటర్ రిచా ఘోష్ గాయపడింది. దీంతో బంగ్లాదేశ్ మ్యాచ్‌కు ఆమెకు విశ్రాంతినిచ్చారు. సెమీస్ మ్యాచ్‌కు రిచా అందుబాటులో ఉంటుందా లేదా అన్నదానిపై కూడా ప్రస్తుతానికి సమాచారం లేదు. గాయాల నేపథ్యంలో టీమిండియా సెమీస్‌లో పటిష్టమైన ఆసీస్‌ను ఏమేరకు నిలువరించగలదో చూడాలి.కాగా, ప్రస్తుత ప్రపంచకప్‌లో భారత్‌తో పాటు ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, ఇంగ్లండ్ సెమీస్‌కు అర్హత సాధించాయి. అక్టోబర్ 29న జరిగే తొలి సెమీఫైనల్లో ఇంగ్లండ్, సౌతాఫ్రికా (గౌహతి).. 30వ తేదీ జరిగే రెండో సెమీస్‌లో భారత్, ఆస్ట్రేలియా (నవీ ముంబై) తలపడతాయి. ఫైనల్ మ్యాచ్ (నవీ ముంబై) నవంబర్ 2న జరుగుతుంది. చదవండి: ఆస్ట్రేలియా కెప్టెన్‌గా స్టీవ్ స్మిత్ -
టీమిండియా బౌలర్ల విజృంభణ.. స్వల్ప స్కోర్‌కే పరిమితమైన బంగ్లాదేశ్
మహిళల వన్డే ప్రపంచకప్‌లో (Women's CWC 2025) భాగంగా బంగ్లాదేశ్‌తో ఇవాళ (అక్టోబర్ 26) జరుగుతున్న నామమాత్రపు మ్యాచ్‌లో (India vs Bangladesh) టీమిండియా (Team India) బౌలర్లు చెలరేగిపోయారు. వర్షం కారణంగా 27 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేసిన భారత్.. బంగ్లాదేశ్‌ను 119 పరుగులకే (9 వికెట్ల నష్టానికి) కట్టడి చేసింది.బంగ్లా ఇన్నింగ్స్‌లో 36 పరుగులు చేసిన షర్మిన్ అక్తర్ టాప్ స్కోరర్‌గా నిలువగా.. శోభన మోస్తరి (26), రుబ్యా హైదర్ (13), రితూ మోనీ (11) రెండంకెల స్కోర్లు చేశారు. మిగతా వారిలో సుమయ్యా అక్తర్ 2, కెప్టెన్ నిగార్ సుల్తానా 9, షోర్నా అక్తర్ 2, నహీద అక్తర్ 3, రబేయా ఖాన్ 3, నిషిత అక్తర్ 4 (నాటౌట్), మరుఫా అక్తర్ 2 (నాటౌట్) పరుగులు చేశారు.భారత బౌలర్లలో రాధా యాదవ్ 3 వికెట్లు తీయగా.. శ్రీచరణి 2, రేణుకా సింగ్, దీప్తి శర్మ, అమన్‌జోత్ కౌర్ తలో వికెట్ తీశారు.కాగా, ప్రస్తుత ప్రపంచకప్‌లో సెమీస్ బెర్త్‌లు ఇదివరకే ఖరారయ్యాయి. ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, ఇంగ్లండ్, భారత్ ఫైనల్ ఫోర్కు అర్హత సాధించాయి. అక్టోబర్ 29న జరిగే తొలి సెమీఫైనల్లో ఇంగ్లండ్, సౌతాఫ్రికా (గౌహతి).. 30వ తేదీ జరిగే రెండో సెమీస్‌లో భారత్, ఆస్ట్రేలియా (నవీ ముంబై) తలపడతాయి. ఫైనల్ మ్యాచ్ (నవీ ముంబై) నవంబర్ 2న జరుగుతుంది. చదవండి: రంజీ ట్రోఫీ చరిత్రలో అత్యద్భుతం -
రోహిత్ శర్మకు అనుకూలం.. టీమిండియాకు వ్యతిరేకం
ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న టీమిండియాకు (Team India) క్లీన్ స్వీప్ భయం పట్టుకుంది. మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో (India vs Australia) తొలి రెండు మ్యాచ్‌ల్లో ఓడి, ఇదివరకే సిరీస్ కోల్పోయిన భారత జట్టు.. రేపు (అక్టోబర్ 25) సిడ్నీ వేదికగా జరుగబోయే మూడో వన్డేలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనుంది.చెత్త రికార్డుఅయితే ఈ మ్యాచ్‌కు ముందు టీమిండియాను గత రికార్డులు కలవరపెడుతున్నాయి. సిడ్నీలో భారత జట్టుకు చాలా చెత్త రికార్డు ఉంది. ఈ మైదానంలో ఆస్ట్రేలియాతో ఆడిన 19 వన్డేల్లో భారత్ కేవలం రెండింట మాత్రమే గెలిచింది. 16 మ్యాచ్‌ల్లో ఆస్ట్రేలియా గెలవగా.. ఓ మ్యాచ్‌లో ఫలితం రాలేదు.ప్రస్తుతం ఈ రికార్డే భారత క్రికెట్ అభిమానులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. ఒకవేళ సిడ్నీలో చరిత్ర రిపీటై భారత్ 17వ సారి ఓడితే ఆస్ట్రేలియా చేతిలో తొలి వైట్‌వాష్ (వన్డేల్లో) ఎదురవుతుంది.రోహిత్‌కు అనుకూలంసిడ్నీ మైదానంలో టీమిండియాకు వ్యతిరేకంగా ఉన్న ట్రాక్ రికార్డు, స్టార్ ఆటగాడు రోహిత్ శర్మ విషయానికి వచ్చే సరికి అనుకూలంగా ఉంది. హిట్ మ్యాన్ గత నాలుగు వన్డేల్లో ఇక్కడ సెంచరీ, 2 అర్ద సెంచరీలు చేశాడు. చివరిగా (2019) ఆడిన మ్యాచ్‌లో మెరుపు సెంచరీ (133) బాదాడు.సిడ్నీలో గత నాలుగు వన్డే ఇన్నింగ్స్‌ల్లో ఆస్ట్రేలియాపై రోహిత్ స్కోర్లు..133 (129)99 (108)34 (48)66 (87)కాగా, మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ కోసం ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్న భారత జట్టు తొలి రెండు వన్డేల్లో పరాజయాలపాలై మరో మ్యాచ్ మిగిలుండగానే సిరీస్ కోల్పోయింది. సిడ్నీ వేదికగా రేపు జరుగబోయే మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి పరువు కాపాడుకోవాలని భారత జట్టు పట్టుదలగా ఉంది.విరాట్ వైఫల్యాలుఏడు నెలల విరామం తర్వాత (ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత) ఈ సిరీస్‌తోనే రీఎంట్రీ ఇచ్చిన టీమిండియా దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లి అంచనాలను తలకిందులు చేస్తూ దారుణంగా విఫలమయ్యాడు. రెండు వన్డేల్లో డకౌటై అభిమానుల తీవ్ర నిరాశకు గురి చేశాడు. తొలి వన్డేలో 8 బంతులు, రెండో వన్డేలో 4 బంతులు ఆడిన కోహ్లి ఖాతా కూడా తెరవలేకపోయాడు. అతని 17 ఏళ్ల కెరీర్లో వరుసగా రెండు మ్యాచ్‌ల్లో డకౌట్ కావడం ఇదే మొదటిసారి.మరో పక్క కోహ్లితో పాటే ఏడు నెలల విరామం తర్వాత బరిలోకి దిగిన రోహిత్ శర్మ మాత్రం తొలి వన్డేలో (8) విఫలమైనా, రెండో వన్డేలో అత్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. పిచ్ నుంచి ఎలాంటి సహకారం లభించనప్పుడు చాలా బాధ్యతగా ఆడి అర్ద సెంచరీ (73) చేశాడు. రోహిత్ నిలకడగా ఆడటంతోనే తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ గౌరవప్రదమైన స్కోర్ (264) చేయగలిగింది. అయితే బౌలర్లు పెద్దగా ప్రభావం చూపలేకపోవడం, కీలక సమయాల్లో క్యాచ్‌లు నేలపాలు చేయడంతో భారత్ లక్ష్యాన్ని కాపాడుకోలేకపోయింది. చదవండి: భారత్‌తో మూడో వన్డే.. ఆసీస్ అన్క్యాప్డ్ ప్లేయర్‌కు చోటు.. ఎవరీ ఆల్‌రౌండర్? -
చరిత్ర సృష్టించిన స్మృతి మంధన
భారత మహిళా క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ స్మృతి మంధన (Smriti Mandhana) చరిత్ర సృష్టించింది. అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక సెంచరీలు చేసిన ప్లేయర్‌గా ఆసీస్ దిగ్గజం మెగ్ లాన్నింగ్తో (Meg Lanning) వరల్డ్ రికార్డును షేర్ చేసుకుంది. ఈ ఇద్దరూ తలో 17 సెంచరీలు చేశారు. లాన్నింగ్ వన్డేల్లో 15, టీ20ల్లో 2 సెంచరీలు చేయగా.. మంధన వన్డేల్లో 14, టెస్ట్‌ల్లో 2, టీ20ల్లో ఓ సెంచరీ చేసింది.మహిళల వన్డే ప్రపంచకప్‌లో భాగంగా నిన్న (అక్టోబర్ 23) న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో సూపర్ సెంచరీ చేసిన మంధన లాన్నింగ్ పేరిట ఉండిన ప్రపంచ రికార్డును సమం చేసింది. ఇకపై మంధన ఏ ఫార్మాట్లో అయినా సెంచరీ చేస్తే అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక శతకాల రికార్డు ఆమె పేరిటే సోలోగా ఉంటుంది.అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక సెంచరీలు చేసిన టాప్-5 బ్యాటర్లు..స్మృతి మంధన-17 (వన్డేల్లో 14, టెస్ట్‌ల్లో 2, టీ20ల్లో 1)మెగ్ లాన్నింగ్-17 (వన్డేల్లో 15, టీ20ల్లో 2)సూజీ బేట్స్-13 (వన్డేల్లో 13)ట్యామీ బేమౌంట్-12 (వన్డేల్లో 12)నాట్ సీవర్ బ్రంట్-10 (వన్డేల్లో 10)పై జాబితాలో మంధన మినహా మిగతా నలుగురు ఏదైన ఒకటి లేదా రెండు ఫార్మాట్లలో మాత్రమే సెంచరీలు చేశారు. మంధన మాత్రమే మూడు ఫార్మాట్లలో సెంచరీలు చేసి ఆల్ ఫార్మాట్ ప్లేయర్ అనిపించుకుంది.న్యూజిలాండ్‌పై తాజా సెంచరీతో మంధన మరో రికార్డు కూడా సమం చేసింది. ఓ క్యాలెండర్ ఇయర్లో అత్యధిక వన్డే సెంచరీలు చేసిన ప్లేయర్‌గా తజ్మిన్ బ్రిట్స్‌తో (సౌతాఫ్రికా) పాటు ప్రపంచ రికార్డును పంచుకుంది. తజ్మిన్, మంధన ఇద్దరు ఈ ఏడాది తలో 5 సెంచరీలు చేశారు.ఈ సెంచరీతో మంధన వన్డేల్లో అత్యధిక సెంచరీలు (14) చేసిన బ్యాటర్ల జాబితాలో రెండో స్థానానికి ఎగబాకింది. ఈ క్రమంలో సూజీ బేట్స్‌ను (13) దాటి, అగ్రస్థానంలో ఉన్న మెగ్ లాన్నింగ్‌కు (15) మరింత చేరువయ్యింది.న్యూజిలాండ్‌తో నిన్న జరిగిన మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌లో టీమిండియా 53 పరుగుల తేడాతో (డక్‌వర్త్ లూయిస్) గెలుపొంది సెమీస్‌కు అర్హత సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. ఓపెనర్లు ప్రతిక (122), స్మృతి మంధన (109) సెంచరీలతో చెలరేగడంతో 49 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 340 పరుగులు చేసింది. వన్‌డౌన్ బ్యాటర్ జెమీమా రోడ్రిగెజ్ (76 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్ ఆడింది.అనంతరం భారీ లక్ష ఛేదనలో న్యూజిలాండ్ 8 వికెట్ల నష్టానికి 271 పరుగులు మాత్రమే చేయగలిగింది. న్యూజిలాండ్ ఇన్నింగ్స్‌లో బ్రూక్ హాలీడే (81), ఇసబెల్లా (65 నాటౌట్) చెప్పుకోదగ్గ స్కోర్లు చేశారు. కాగా, ప్రస్తుత ప్రపంచకప్‌లో భారత్‌కు ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, ఇంగ్లండ్ జట్లు సెమీస్ బెర్త్ దక్కించుకున్న విషయం తెలిసిందే. -
టీమిండియా ప్లేయర్ ప్రపంచ రికార్డు
భారత మహిళా క్రికెట్ జట్టు ఓపెనర్ ప్రతిక రావల్ (Pratika Rawal) ఖాతాలో ఓ ప్రపంచ రికార్డు చేరింది. వన్డే ప్రపంచకప్‌లో (Women's CWC 2025) భాగంగా నిన్న న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో సూపర్ సెంచరీ చేసిన ఆమె.. వన్డేల్లో 1000 పరుగులు పూర్తి చేసుకుంది. ఈ క్రమంలో అత్యంత వేగంగా ఈ ఘనత సాధించిన ప్లేయర్‌గా ఆస్ట్రేలియాకు చెందిన లిండ్సే రీలర్‌తో ప్రపంచ రికార్డును షేర్ చేసుకుంది. లిండ్సే, ప్రతిక ఇద్దరూ 23 ఇన్నింగ్స్‌ల్లోనే 1000 పరుగులు పూర్తి చేశారు. సాధారణంగా ఆస్ట్రేలియా ప్లేయర్లతో నిండుకుపోయే ఇలాంటి రికార్డులలో ప్రతిక చేరడం గమనార్హం. వన్డేల్లో తొలి 1000 పరుగులను అత్యంత వేగంగా పూర్తి చేసిన టాప్-5 ప్లేయర్ల జాబితాలో ప్రతిక, లిండ్సే తర్వాత ముగ్గురూ ఆస్ట్రేలియన్లే ఉన్నారు. నికోల్ బోల్టన్, మెగ్ లాన్నింగ్ తలో 25 ఇన్నింగ్స్‌ల్లో ఈ మైలురాయిని తాకగా.. బెలిండా క్లార్క్ 27 ఇన్నింగ్స్‌ల్లో చేరుకుంది.25 ఏళ్ల ప్రతిక గతేడాది (2024) డిసెంబర్లో అంతర్జాతీయ అరంగేట్రం చేసింది. స్వల్ప కెరీర్లో తాజా ఇన్నింగ్స్ (న్యూజిలాండ్‌పై) సహా ఎన్నో చిరస్మరణీయ ఇన్నింగ్స్‌లు ఆడింది. ఢిల్లీకి చెందిన ప్రతిక పదేళ్ల నుంచే క్రికెట్ ఆడటం ప్రారంభించింది. పలు దశలను దాటుకుంటూ ప్రస్తుతం టీమిండియాలో కీలక సభ్యురాలిగా కొనసాగుతుంది.ప్రస్తుత ప్రపంచకప్‌లోనూ ప్రతిక అద్భుతమైన టచ్‌లో ఉంది. 6 మ్యాచ్‌ల్లో సెంచరీ, హాఫ్ సెంచరీ సాయంతో 51.33 సగటున 308 పరుగులు చేసి టోర్నీలో సెకెండ్ లీడింగ్ రన్ స్కోరర్‌గా కొనసాగుతుంది. ఓవరాల్ కెరీర్లో 23 వన్డేలు ఆడిన ప్రతిక 2 సెంచరీలు, 7 అర్ద సెంచరీల సాయంతో 50.45 సగటున 1110 పరుగులు చేసింది.నిన్న న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌లో టీమిండియా 53 పరుగుల తేడాతో (డక్‌వర్త్ లూయిస్) గెలుపొంది సెమీస్‌కు అర్హత సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. ఓపెనర్లు ప్రతిక (122), స్మృతి మంధన (109) సెంచరీలతో చెలరేగడంతో 49 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 340 పరుగులు చేసింది. వన్‌డౌన్ బ్యాటర్ జెమీమా రోడ్రిగెజ్ (76 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్ ఆడింది.అనంతరం భారీ లక్ష ఛేదనలో న్యూజిలాండ్ అనూహ్య పోరాటం ప్రదర్శించింది. 44 ఓవర్లలో ఆ జట్టు 8 వికెట్ల నష్టానికి 271 పరుగులు చేయగలిగింది. బ్రూక్ హాలీడే (81), ఇసబెల్లా (65 నాటౌట్) న్యూజిలాండ్‌ను గెలిపించేందుకు విఫలయత్నం చేశారు. కాగా, ప్రస్తుత ప్రపంచకప్‌లో భారత్‌కు ముందు ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, ఇంగ్లండ్ జట్లు సెమీస్ బెర్త్ దక్కించుకున్న విషయం తెలిసిందే.చదవండి: చరిత్ర సృష్టించిన టీమిండియా.. ఆసీస్ వరల్డ్ రికార్డు బ్రేక్ -
ICC WC 2025: సత్తా చాటి సెమీఫైనల్‌కు భారత్
వరల్డ్ కప్‌లో వరుసగా మూడు పరాజయాలతో వెనుకబడి విమర్శలు ఎదుర్కొన్న భారత మహిళల జట్టు అసలు పోరులో చెలరేగింది. తమ స్థాయికి తగ్గ ప్రదర్శనతో సత్తా చాటి దర్జాగా సెమీఫైనల్లోకి అడుగు పెట్టింది. స్మృతి మంధాన, ప్రతీక రావల్ సెంచరీలతో పాటు జెమీమా మెరుపులు తోడవడంతో భారీ స్కోరుతో న్యూజిలాండ్ మహిళలకు సవాల్ విసిరిన టీమిండియా...ఆపై పదునైన బౌలింగ్‌తో ప్రత్యర్థిని కుప్పకూల్చి ఘన విజయాన్ని అందుకుంది. తాజా ఓటమితో మాజీ చాంపియన్ కివీస్ సెమీస్ అవకాశం కోల్పోయింది. ముంబై: స్వదేశంలో జరుగుతున్న వన్డే వరల్డ్ కప్‌లో భారత మహిళల జట్టు సెమీఫైనల్‌కు చేరింది. ఆ్రస్టేలియా, దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్ తర్వాత సెమీస్ చేరిన చివరి జట్టుగా హర్మన్ సేన నిలిచింది. గురువారం డీవై పాటిల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో భారత్ డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో 53 పరుగుల తేడాతో న్యూజిలాండ్‌పై విజయం సాధించింది. భారత బ్యాటింగ్ చివర్లో వాన కారణంగా ఇన్నింగ్స్‌ను 49 ఓవర్లకు కుదించగా, టీమిండియా 3 వికెట్ల నష్టానికి 340 పరుగులు చేసింది. ఓపెనర్లు ప్రతీక రావల్ (134 బంతుల్లో 122; 13 ఫోర్లు, 2 సిక్స్‌లు), ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ స్మృతి మంధాన (95 బంతుల్లో 109; 10 ఫోర్లు, 4 సిక్స్‌లు) శతకాలతో చెలరేగారు. వీరిద్దరు తొలి వికెట్‌కు 33.2 ఓవర్లలో 212 పరుగులు జోడించడం విశేషం. జెమీమా రోడ్రిగ్స్ (55 బంతుల్లో 76 నాటౌట్; 11 ఫోర్లు) కూడా మెరుపు బ్యాటింగ్‌తో జట్టు భారీ స్కోరులో కీలక పాత్ర పోషించింది. అనంతరం వర్షం మళ్లీ అంతరాయం కలిగించడంతో న్యూజిలాండ్ లక్ష్యాన్ని డక్‌వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం 44 ఓవర్లలో 325 పరుగులుగా నిర్ణయించారు. కివీస్ 44 ఓవర్లలో 8 వికెట్లకు 271 పరుగులు చేసింది. బ్రూక్ హ్యాలిడే (84 బంతుల్లో 81; 9 ఫోర్లు, 1 సిక్స్), ఇసబెల్లా గేజ్ (51 బంతుల్లో 65 నాటౌట్; 10 ఫోర్లు) రాణించారు. ఆదివారం జరిగే తమ చివరి లీగ్ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌తో భారత్ తలపడుతుంది. నేడు కొలంబోలో జరిగే నామమాత్రమైన మ్యాచ్‌లో పాకిస్తాన్‌తో శ్రీలంక తలపడుతుంది. రికార్డు భాగస్వామ్యం... ప్రతీక, స్మృతి జాగ్రత్తగా ఇన్నింగ్స్‌ను మొదలుపెట్టడంతో తొలి 2 ఓవర్లు మెయిడిన్‌గా ముగియగా, 10 ఓవర్లు ముగిసేసరికి స్కోరు 40/0కు చేరింది. ఆ తర్వాత బ్యాటర్లు నిలదొక్కుకొని పరుగులు రాబట్టడంతో తర్వాతి 46 బంతుల్లో 60 పరుగులు రాబట్టిన భారత్ 100 పరుగుల మార్క్‌ను అందుకుంది. ఇదే క్రమంలో ముందుగా స్మృతి 49 బంతుల్లో, ప్రతీక 75 బంతుల్లో హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. సగం ఓవర్లు పూర్తయ్యే సరికి భారత్ 147/0 వద్ద నిలిచింది. 77 పరుగుల వద్ద స్మృతికి అదృష్టం కలిసొచ్చింది. అమేలియా బౌలింగ్‌లో షాట్‌కు ప్రయత్నించగా బంతి ప్యాడ్‌కు తగలడంతో బౌలర్ అప్పీల్ చేసింది. వెంటనే అంపైర్ అవుట్‌గా ప్రకటించడంతో స్మృతి రివ్యూ కోరింది. రీప్లేలో ముందుగా బంతి గమనాన్ని చూపించారు. అందులో బంతి స్టంప్స్‌ను తాకుతున్నట్లు అర్థం కావడంతో స్మృతి పెవిలియన్ వైపు సాగిపోయింది. అయితే ఆ తర్వాత అల్ట్రా ఎడ్జ్‌లో బంతి బ్యాట్‌కు తగిలినట్లు రేఖ కనిపించడంతో ఆమె వెనక్కి వచ్చింది. కొద్ది సేపటికి 88 బంతుల్లో స్మృతి శతకం పూర్తి చేసుకుంది. ఎట్టకేలకు 34వ ఓవర్లో తొలి వికెట్ (స్మృతి) తీయడంలో కివీస్ సఫలమైంది. 122 బంతుల్లో ప్రతీక సెంచరీ పూర్తి కాగా, మూడో స్థానంలో వచ్చిన జెమీమా ఆరంభంనుంచే దూకుడును ప్రదర్శించింది. కార్స్ ఓవర్లో మూడు ఫోర్లు బాది 38 బంతుల్లోనే హాఫ్‌సెంచరీ చేసింది. బ్యాటింగ్ వైఫల్యం... భారీ లక్ష్య ఛేదనలో కివీస్ ఆరంభం నుంచే తడబడింది. ఓపెనర్ సుజీ బేట్స్ (1) తన వైఫల్యం కొనసాగించగా...ప్లిమ్మర్ (30; 5 ఫోర్లు, 1 సిక్స్), అమేలియా కెర్ (45; 4 ఫోర్లు) కొద్దిగా ప్రతిఘటించారు. టోర్నీలో జట్టు బెస్ట్ బ్యాటర్, కెప్టెన్ సోఫీ డివైన్ (6)ను రేణుక చక్కటి బంతితో బౌల్డ్ చేయడంతోనే భారత్‌కు పట్టు చిక్కింది.59 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకొని ఒకవైపు నుంచి హ్యాలిడే పోరాడుతున్నా...మరో వైపు వరుసగా వికెట్లు తీసి భారత్ ఒత్తిడి పెంచింది. చివర్లో ఇసబెల్లా కూడా ప్రయత్నించినా, చేయాల్సిన రన్‌రేట్ పెరిగిపోవడంతో కివీస్ ఓటమి దిశగా పయనించింది. 340 వన్డే వరల్డ్‌కప్‌లో భారత్ అత్యధిక స్కోరు. ఇదే టోర్నీలో ఆసీస్‌పై సాధించిన 330 పరుగుల స్కోరును జట్టు అధిగమించింది. 212 స్మృతి, ప్రతీక జోడించిన పరుగులు. వరల్డ్ కప్‌లో ఏ వికెట్‌కైనా భారత్‌కు ఇదే అత్యధిక భాగస్వామ్యం.14 స్మృతి వన్డే కెరీర్లో ఇది 14వ సెంచరీ. అత్యధిక సెంచరీల జాబితాలో మెగ్ లానింగ్ (15) తర్వాత రెండో స్థానంలో నిలిచింది. స్కోరు వివరాలు భారత్ ఇన్నింగ్స్: ప్రతీక (సి) (సబ్) రోవ్ (బి) అమేలియా 122; స్మృతి (సి) (సబ్) రోవ్ (బి) బేట్స్ 109; జెమీమా (నాటౌట్) 76; హర్మన్‌ప్రీత్ (సి) కార్సన్ (బి) రోజ్మేరీ 10; రిచా (నాటౌట్) 4; ఎక్స్‌ట్రాలు 19; మొత్తం (49 ఓవర్లలో 3 వికెట్లకు) 340. వికెట్ల పతనం: 1–212, 2–288, 3–336. బౌలింగ్: రోజ్మేరీ 8–1–52–1, జెస్ కెర్ 8–1–51–0, డివైన్ 6–0–34–0, కార్సన్ 6–0–46–0, తహుహు 4–0–37–0, అమేలియా కెర్ 10–0–69–1, బేట్స్ 7–0–40–1. న్యూజిలాండ్ ఇన్నింగ్స్: బేట్స్ (సి) ప్రతీక (బి) క్రాంతి 1; ప్లిమ్మర్ (బి) రేణుక 30; అమేలియా కెర్ (సి) స్మృతి (బి) స్నేహ్ 45; డివైన్ (బి) రేణుక 6; హ్యాలిడే (సి) స్నేహ్ (బి) చరణి 81; గ్రీన్ (సి) క్రాంతి (బి) ప్రతీక 18; ఇసబెల్లా (నాటౌట్) 65; జెస్ కెర్ (సి) స్మృతి (బి) క్రాంతి 18; రోజ్మేరీ (సి) స్మృతి (బి) దీప్తి 1; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (44 ఓవర్లలో 8 వికెట్లకు) 271. వికెట్ల పతనం: 1–1, 2–51, 3–59, 4–115, 5–154, 6–226, 7–266, 8–271. బౌలింగ్: రేణుక 6–0–25–2, క్రాంతి గౌడ్ 9–0–48–2, స్నేహ్ రాణా 8–0–60–1, శ్రీచరణి 9–0–58–1, దీప్తి శర్మ 8–0–57–1, ప్రతీక 4–0–19–1. -
క్యాచ్‌లే కొంపముంచాయి.. ఓటమిపై శుభ్‌మన్ గిల్ కామెంట్స్
అడిలైడ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వన్డేలో (India vs Australia) టీమిండియా 2 వికెట్ల తేడాతో పరాజయంపాలైంది. తద్వారా మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలుండగానే 0-2 తేడాతో కోల్పోయింది. 17 ఏళ్ల తర్వాత అడిలైడ్‌లో భారత్‌కు ఇదే తొలి ఓటమి (వన్డేల్లో). మ్యాచ్ అనంతరం టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (Shubman Gill) ఓటమిపై స్పందిస్తూ ఇలా అన్నాడు. తొలుత బ్యాటింగ్ చేసి డీసెంట్ స్కోర్ చేశాం. అయితే కొన్ని క్యాచ్‌లు వదిలేయడం వల్ల ఆ స్కోర్‌ను కాపాడుకోలేకపోయాం.ప్రారంభంలో పిచ్ ఊహించిన దానికంటే ఎక్కువగా స్పందించింది. 15–20 ఓవర్ల తర్వాత పరిస్థితి కాస్త అదుపులోకి వచ్చింది. మొదటి మ్యాచ్‌లో టాస్ చాలా కీలకమైంది. వర్షం ప్రభావం ఉన్నందున అది మ్యాచ్ ఫలితంపై ప్రభావం చూపింది. అయితే రెండో మ్యాచ్‌లో టాస్ ప్రభావం పెద్దలా లేదు. ఇరు జట్లు దాదాపు 50 ఓవర్లు బ్యాటింగ్ చేశాయి.రోహిత్ శర్మపై ప్రశంసలుఏడు నెలల గ్యాప్ తర్వాత మునుపటి తరహాలో ఆడటం అంత ఈజీ కాదు. అయినా రోహిత్ ధైర్యంగా ఆడి, అద్భుతమైన ప్రదర్శన చేశాడు. ఈ మ్యాచ్‌లో అతను భారీ స్కోర్ మిస్ అయ్యాడు. ఇన్నింగ్స్ ఆరంభంలో వీరోచితంగా పోరాడాడు. రోహిత్ బ్యాటింగ్ విషయంలో చాలా హ్యాపీగా ఉన్నాను.కాగా, ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్ ఆదిలో కాస్త ఇబ్బంది పడినా.. రోహిత్ (73), శ్రేయస్ (61), అక్షర్ (44) బాధ్యతాయుతంగా ఆడటంతో గౌరవప్రదమైన స్కోర్ (264/9) చేసింది. ఆఖర్లో హర్షిత్ రాణా (24 నాటౌట్), అర్షదీప్ సింగ్ (13) అమూల్యమైన పరుగులు జోడించారు.ఛేదనలో ఆస్ట్రేలియా కూడా తడబడినప్పటికీ.. అంతిమంగా విజయం సాధించింది. మాథ్యూ షార్ట్ (74), కూపర్ కన్నోల్నీ (61 నాటౌట్) రాణించడంతో ఆ జట్టు 46.2 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఈ మ్యాచ్‌లో షార్ట్‌కు రెండు లైఫ్‌లు లభించాయి. కీలక సమయాల్లో అక్షర్ పటేల్, సిరాజ్ ఈజీ క్యాచ్‌లు నేలపాలు చేశారు. ఈ క్యాచ్‌లే మ్యాచ్‌ను ఆస్ట్రేలియాకు అనుకూలంగా మార్చాయి. ఈ సిరీస్‌లో నామమాత్రపు మూడో వన్డే సిడ్నీ వేదికగా అక్టోబర్ 25న జరుగనుంది. చదవండి: ఓపెనర్ల శతకాలు.. తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో టీమిండియా భారీ స్కోర్ -
ఓపెనర్ల శతకాలు.. తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో టీమిండియా భారీ స్కోర్
మహిళల వన్డే ప్రపంచకప్‌లో (Women's CWC 2025) సెమీస్‌కు చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో టీమిండియా (Team India) భారీ స్కోర్ చేసింది. నవీ ముంబై వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఓపెనర్లు స్మృతి మంధన (Smriti Mandhana) (95 బంతుల్లో 109; 10 ఫోర్లు, 4 సిక్సర్లు), ప్రతిక రావల్ (Pratika Rawal) (134 బంతుల్లో 122; 13 ఫోర్లు, 2 సిక్సర్లు) విధ్వంసకర శతకాలతో చెలరేగిపోయారు.వన్‌డౌన్‌లో వచ్చిన జెమీమా రోడ్రిగెజ్ (55 బంతుల్లో 76 నాటౌట్; 11 ఫోర్లు) కూడా సునామీ ఇన్నింగ్స్ ఆడింది. ఫలితంగా వర్షం కారణంగా 49 ఓవర్లకు కుదించిన మ్యాచ్‌లో భారత్ 3 వికెట్ల నష్టానికి 340 పరుగుల భారీ స్కోర్ చేసింది. భారత ఇన్నింగ్స్‌లో హర్మన్‌ప్రీత్ కౌర్ 10, రిచా ఘోష్ 4 (నాటౌట్) పరుగులు చేశారు. న్యూజిలాండ్ బౌలర్లలో రోస్‌మేరీ మైర్, అమేలియా కెర్, సూజీ బేట్స్‌కు తలో వికెట్ దక్కింది. ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ గెలవాలంటే డక్‌వర్త్ లూయిస్ పద్దతి ప్రకారం 44 ఓవర్లలో 325 పరుగులు చేయాలి.కాగా, ప్రస్తుత ప్రపంచకప్‌లో మొదటి మూడు సెమీస్ బెర్త్‌లు ఇదివరకే ఖరారయ్యాయి. ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, ఇంగ్లండ్ పాయింట్ల పట్టికలో తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి. నాలుగో సెమీస్ బెర్త్ కోసం భారత్, న్యూజిలాండ్ పోటీ పడుతున్నాయి. మరోపక్క బంగ్లాదేశ్, పాకిస్తాన్ టోర్నీ నుంచి నిష్క్రమించాయి.చదవండి: గర్జించిన బంగ్లాదేశ్ పులులు.. బిత్తరపోయిన మాజీ ఛాంపియన్లు -
తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో స్మృతి మంధన సూపర్ సెంచరీ
మహిళల వన్డే ప్రపంచకప్‌లో (Women's CWC 2025) సెమీస్‌కు చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో టీమిండియా స్టార్ బ్యాటర్ స్మృతి మంధన (Smriti Mandhana) సూపర్ సెంచరీతో కదంతొక్కింది. నవీ ముంబై వేదికగా న్యూజిలాండ్‌తో ఇవాళ (అక్టోబర్ 23) జరుగుతున్న మ్యాచ్‌లో 88 బంతుల్లోనే సెంచరీని పూర్తి చేసింది. మంధనకు ఈ ఏడాది ఇది ఐదో శతకం. ఓవరాల్‌గా వన్డేల్లో 14వ శతకం. ప్రస్తుత ప్రపంచకప్‌లో తొలి మ్యాచ్‌ల్లో నిరాశపరిచిన మంధన.. గత రెండు మ్యాచ్‌లుగా సత్తా చాటుతూ వస్తుంది. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌తో జరిగిన చివరి రెండు మ్యాచ్‌ల్లో బాధ్యతాయుతమైన అర్ద సెంచరీలతో మెరిసింది. వాస్తవానికి ఆ రెండు అర్ద సెంచరీలు కూడా సెంచరీల్లోకి మారాల్సింది. అయితే అవి తృటిలో చేజారాయి.మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ ఓడి న్యూజిలాండ్ ఆహ్వానం మేరకు బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా.. ఆది నుంచి నిలకడగా ఆడింది. ఓపెనర్లు మంధన, ప్రతీక రావల్ (77) సంయమనంతో బ్యాటింగ్ చేస్తూ ఇన్నింగ్స్‌ను నిర్మించారు. అర్ద సెంచరీ తర్వాత మంధన గేర్ మార్చగా.. ప్రతీక రావల్ అదే టెంపోలో బ్యాటింగ్ చేస్తుంది. 31 ఓవర్ల తర్వాత భారత్ స్కోర్ వికెట్ నష్టపోకుండా 192 పరుగులుగా ఉంది. మంధన 100, ప్రతీక రావల్ 77 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు.కాగా, ప్రస్తుత ప్రపంచకప్‌లో మొదటి మూడు సెమీస్ బెర్త్‌లు ఇదివరకే ఖరారయ్యాయి. ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, ఇంగ్లండ్ పాయింట్ల పట్టికలో తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి. నాలుగో సెమీస్ బెర్త్ కోసం భారత్, న్యూజిలాండ్ పోటీ పడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు సెమీస్‌కు అర్హత సాధిస్తుంది. మరోపక్క బంగ్లాదేశ్, పాకిస్తాన్ టోర్నీ నుంచి నిష్క్రమించాయి. చదవండి: IND vs AUS: టీమిండియాపై ఆసీస్ గెలుపు.. సిరీస్ కైవసం -
Virat Kohli: చెరగని మరక.. 17 ఏళ్ల కెరీర్లో తొలిసారి..!
ప్రస్తుతం ఆస్ట్రేలియాలో జరుగుతున్న మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో (India vs Australia) టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి (Virat Kohli) వరుసగా రెండు మ్యాచ్‌ల్లో డకౌటయ్యాడు. తొలి వన్డేల్లో 8 బంతులు ఆడి ఖాతా తెరవలేకపోయిన కోహ్లి.. ఇవాళ (అక్టోబర్ 23) తనకు అచ్చొచ్చే మైదానమైన అడిలైడ్‌లో 4 బంతుల డకౌట్‌ను నమోదు చేశాడు.కోహ్లి తన 17 ఏళ్ల కెరీర్లో వరుసగా రెండు వన్డేల్లో డకౌట్ కావడం ఇదే మొదటిసారి. ఈ డబుల్ డక్ కోహ్లి కెరీర్లో చెరగని మరకలా మిగిలిపోతుంది. కెరీర్ చరమాంకంలో రికార్డుల రారాజుకు ఇలాంటి అనుభవం ఎదురు కావడం దురదృష్టకరం.టెస్ట్‌లకు, టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించి, ఏడు నెలల విరామం తర్వాత బరిలోకి దిగిన కోహ్లి మునుపటి జోరును ప్రదర్శించలేకపోతున్నాడు. రెండో వన్డేలో ఔటైన తర్వాత అతని ప్రవర్తన ఈ సిరీస్‌తో కెరీర్ ముగింపును సూచించింది. తమ ఆరాధ్య ఆటగాడు కెరీర్ చరమాంకంలో వరుస డకౌట్లు కావడాన్ని కోహ్లి అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.డబుల్ డక్ తర్వాత కోహ్లి వన్డే సగటు కూడా పడిపోయింది. కోహ్లి ఫామ్‌లో ఉన్నప్పుడే రిటైరయ్యుంటే గౌరవంగా ఉండేదని అతని అభిమానులు అనుకుంటున్నారు. మరోపక్క కోహ్లిలాగే కెరీర్ చరమాంకంలో ఉన్న రోహిత్ శర్మ (Rohit Sharma) మాత్రం రెండో వన్డేలో హిట్ అయ్యాడు.రోహిత్ కూడా తొలి వన్డేలో నిరాశపరిచినా రెండో వన్డేలో మాత్రం బాధ్యతాయుతమైన అర్ద సెంచరీతో (73) జట్టును ఆదుకున్నాడు. ఈ ప్రదర్శనతో రోహిత్ అభిమానులు సంబరపడిపోతున్నారు. హిట్‌మ్యాన్ ఈజ్ బ్యాక్ అంటూ సోషల్‌మీడియాలో కామెంట్లు పెడుతున్నారు.మ్యాచ్ విషయానికొస్తే.. రోహిత్‌తో పాటు శ్రేయస్ అయ్యర్ (61), అక్షర్ పటేల్ (44) బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్‌లు ఆడటంతో భారత్ గౌరవప్రదమైన స్కోర్ (264/9) చేసింది. ఆఖర్లో హర్షిత్ రాణా (24 నాటౌట్), అర్షదీప్ సింగ్ (13) అమూల్యమైన పరుగులు జోడించారు.ఛేదనలో ఆస్ట్రేలియా తడబడుతుంది. 54 పరుగులకే ఓపెనర్లు మిచెల్ మార్ష్ (11), ట్రవిస్ హెడ్ (28) వికెట్లు కోల్పోయింది. మాథ్యూ షార్ట్ (32), మ్యాట్ రెన్షా (23) క్రీజ్‌లో ఉన్నారు. 19 ఓవర్ల తర్వాత ఆ జట్టు స్కోర్ 96/2గాఉంది. ఈ మ్యాచ్‌లో గెలవాలంటే ఆసీస్ మరో 169 పరుగులు చేయాలి. కాగా, ఈ సిరీస్‌లోని తొలి వన్డేలో ఆస్ట్రేలియా విజయం సాధించిన విషయం తెలిసిందే.చదవండి: కొత్త బ్యాటర్.. ఆరంభంలోనే అదుర్స్! -
టీమిండియా న్యూ టాలెంట్.. రికార్డులే రికార్డులు
''కూతురు, కొడుకు అనే తేడా నాకు లేదు. ఇద్దరూ సమానమే. నా కుమారుడు ఇంజనీర్, అతనికి క్రికెట్ అంటే ఆసక్తి లేదు. కానీ నా కూతురు భారతదేశం తరపున క్రికెట్ ఆడుతోంది'' అంటున్నారు ప్రదీప్ రావల్. తన పిల్లలు ఎంచుకున్న కెరీర్ పట్ల ఆయన సంతృప్తిగా ఉన్నారు. ప్రస్తుతం జరుగుతున్న మహిళల వన్డే ప్రపంచకప్‌లో ఆడుతున్న భారత జట్టులో ఆయన కుమార్తె ప్రతీక రావల్ (Pratika Rawal) సభ్యురాలు.టీమిండియా (Team India) మహిళల జట్టు ఓపెనర్ అయిన ప్రతీక రావల్ తన ప్రతిభతో టీమ్‌లో కీలకంగా మారింది. 25 ఏళ్ల కుడిచేతి వాటం ఓపెనింగ్ బ్యాట్స్‌మన్.. ఇప్పటికే పలు ఘనతలు సాధించింది. తాజాగా వరల్డ్‌కప్‌లోనూ అంచనాలకు తగినట్టుగా ఆడుతూ జట్టు విజయాల్లో తన వంతు పాత్ర పోషిస్తోంది. ఇదో జోరు కొనసాగిస్తే భవిష్యత్తులో ఆమె స్టార్ ప్లేయర్ల సరసన చేరడం ఖాయమని క్రీడా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.ఇప్పటివరకు 22 అంతర్జాతీయ వన్డేలు ఆడిన ప్రతీక రావల్ 47 బ్యాటింగ్ సగటుతో 988 పరుగులు చేసింది. ఇందుల్లో సెంచరీతో పాటు 7 హాఫ్ సెంచరీలున్నాయి. అత్యధిక వ్యక్తిగత స్కోరు 154. అంతేకాదు అప్పడప్పుడు బౌలింగ్ కూడా చేస్తోంది. 185 బంతులు విసిరి 5 వికెట్లు పడగొట్టింది. అతి తక్కువ అంతర్జాతీయ కెరీర్లోనే పలు రికార్డులు సాధించి దూసుకుపోతోంది.సరికొత్త చరిత్రమహిళల వన్డే క్రికెట్‌తో తొలి 15 మ్యాచ్‌ల్లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్‌గా ప్రతీక సరికొత్త చరిత్ర లిఖించింది. మొదటి 15 వన్డేల్లో 767 పరుగులు సాధించి ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మెగ్ లానింగ్ పేరిట ఉన్న రికార్డ్‌ను తిరగరాసింది. లానింగ్ తన వన్డే కెరీర్లో తొలి 15 మ్యాచ్‌లలో 707 రన్స్ చేసింది. ప్రపంచకప్‌కు ముందు ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్‌లోనూ ప్రతీక సత్తా చాటింది. స్టార్ బ్యాటర్ స్మృతి మంధానతో (Smriti Mandhana) కలిసి మరో రికార్డ్ క్రియోట్ చేసింది. ఓ క్యాలెండర్ ఇయర్లో ఏ వికెట్‌కైనా అత్యధిక పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన జోడీగా రికార్డ్ నెలకొల్పారు.తొలి జంటగా రికార్డ్ఏడాదిగా టీమిండియా ఓపెనర్లుగా వస్తున్న స్మృతి మంధాన- ప్రతీక రావల్ విశేషంగా రాణిస్తున్నారు. మహిళల వన్డే క్రికెట్లో అత్యుత్తమంగా 84.66 సగటుతో వెయ్యి పరుగులు చేసిన తొలి జంటగా వీరు చరిత్రకెక్కారు. భారత మహిళా వన్డే క్రికెట్లో తక్కువ ఇన్నింగ్స్‌లోనే ఎక్కువసార్లు 100 ప్లస్ ఓపెనింగ్ గణాంకాలు నమోదు చేసిన జోడీగానూ ఘనత సాధించారు.మూడేళ్ల వయసులోనే..దేశ రాజధాని ఢిల్లీలో క్రికెట్‌ను ఇష్టపడే కుటుంబంలో జన్మించిన ప్రతీక మూడేళ్ల వయసులోనే బ్యాట్ చేతబట్టింది. యూనివర్సిటీ స్థాయి క్రికెటర్, బీసీసీఐ లెవల్ 2 అంపైర్ అయిన ఆమె తండ్రి ప్రదీప్.. తాను సాధించలేని కలను తన కుమార్తె నెరవేర్చాలని కోరుకున్నాడు. అందుకే తన కూతురికి చిన్నప్పటి నుంచే క్రికెట్ నేర్పించడం మొదలుపెట్టాడు. తనకు సరైన మార్గదర్శకత్వం లేనందున జాతీయస్థాయి క్రికెటర్ కాలేకపోయానని, తన కూతురు విషయంలో అలా జరగకూడదన్న ఉద్దేశంతో చిన్ననాటి నుంచి శిక్షణపై ఫోకస్ పెట్టానని వివరించారు. అదృష్టవశాత్తూ ప్రతీకకు కూడా క్రికెట్‌పై మక్కువ ఉండటంతో తన పని సులువువయిందన్నారు.ట్రైనింగ్.. ఫిట్నెస్ఆమెకు పదేళ్ల వయసు ఉన్నపుడు తన పాఠశాల తరపున కాలేజీ జట్టుతో ఆడిన ప్రతీక తన బ్యాటింగ్‌తో అందరినీ ఆశ్చర్యపరిచిందని ప్రదీప్ గుర్తు చేసుకున్నారు. ఇంత చిన్నపిల్ల 50 కంటే ఎక్కువ పరుగులు చేయడంతో అక్కడున్న వారందరూ చకితులయ్యారని వెల్లడించారు. అక్కడి నుంచి ఒక్కో అడుగు వేసింది. ఈ క్రమంలో టీమిండియా మాజీ క్రీడాకారిణి దీప్తి ధ్యాని (Deepti Dhyani) దృష్టిలో పడింది. ప్రతీక ఆటతీరును నిశితంగా గమనించి ఆమెకు కోచ్‌గా మారింది. ''ప్రతీక కొన్ని డ్రైవ్‌లు ఆడటం చూశాను. ఆమెకు మంచి టాలెంట్ ఉందని గ్రహించాను. చాలా మంది రాష్ట్ర స్థాయి ఆటగాళ్లకు ప్రతిభ ఉంటుంది, దాన్ని ప్రొఫెషనల్ క్రికెట్‌గా మార్చడమే సవాలు. అక్కడే కోచ్‌లుగా మేము అడుగుపెడతాము" అని దీప్తి చెప్పింది. ఆటతో పాటు ఫిట్‌నెస్‌పై ప్రతీక తీవ్రంగా కృషి చేసిందని వెల్లడించింది.స్పెషల్ టాలెంట్ప్రొఫెషనల్ క్రికెటర్‌గా మారినప్పటికీ చదువును నిర్లక్ష్యం చేయలేదు ప్రతీక. సైకాలజీలో గ్రాడ్యుయేషన్ చేసింది. మైదానంలో వ్యూహాలను, భావోద్వేగాలను అర్థం చేసుకోవడానికి చదువు ఆమెకు ఉపయోగపడింది. ఇదే ఆమెను మిగతా క్రికెటర్ల కంటే ప్రత్యేకంగా నిలుపుతుంది. మైదానం వెలుపల కూడా ప్రతీక స్పెషల్ టాలెంట్‌తో ప్రత్యేకత చాటుకుంటోంది. రూబిక్స్ క్యూబ్‌ను సులువుగా పరిష్కరించగలదు. చదవండి: టీమిండియా యంగె(టె)స్ట్ సూపర్‌స్టార్! టర్నింగ్ పాయింట్ఢిల్లీ అండర్-19 టీమ్ తరపున ఆడిన ప్రతీక తర్వాత రైల్వేస్ జట్టుకు మారింది. దేశీయ క్రికెట్లో స్థిరంగా రాణించినప్పటికీ గతేడాది మహిళల ప్రీమియర్ లీగ్ (WPL) వేలంలో తనను విస్మరించడంతో నిరాశకు గురైంది. అదీ కొద్ది వారాలు మాత్రమే. తర్వాత ఆమెకు తొలిసారిగా టీమిండియా కాల్ వచ్చింది. 2024, డిసెంబర్లో వెస్టిండీస్‌పై అరంగేట్రం చేసింది. అప్పటి నుంచి నిలకడగా ఆడుతూ జట్టులో కీలక సభ్యురాలిగా మారింది. తన 6వ మ్యాచ్‌లో ఐర్లాండ్‌పై 154 పరుగులు చేయడం ప్రతీక ఇంటర్నేషనల్ కెరీర్లో టర్నింగ్ పాయింట్‌గా చెప్పవచ్చు.ఏ పాత్రకైనా సిద్ధంప్రస్తుతం జరుగుతున్న వన్డే ప్రపంచకప్‌లోనూ అంచనాల మేరకు ఆడుతూ జట్టు నమ్మకాన్ని చూరగొంటోంది. జట్టులో ఏ పాత్రకైనా తన కూతురు సిద్ధమని ప్రదీప్ రావల్ (Pradeep Rawal) అంటున్నారు. అంతేకాదు ఈసారి టీమిండియా వరల్డ్‌కప్ సాధిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రతీకపైనా కూడా చాలా అంచనాలు ఉన్నాయని ఆయన తెలిపారు. -
సెమీఫైనల్లో స్థానం కోసం...
సొంతగడ్డపై మహిళల వరల్డ్ కప్ టైటిల్ ఫేవరెట్స్‌లో ఒక జట్టుగా బరిలోకి దిగిన భారత్ ఐదు మ్యాచ్‌ల తర్వాత కూడా ఇంకా సెమీస్ స్థానాన్ని ఖాయం చేసుకోలేకపోయింది. వరుసగా మూడు ఓటములతో దెబ్బతిన్న టీమిండియా ముంగిట ఇప్పుడు మరో అవకాశం నిలిచింది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే హర్మన్‌ప్రీత్ బృందానికి అధికారికంగా సెమీఫైనల్లో చోటు ఖాయమవుతుంది. మరోవైపు బలహీన జట్లతో గెలిచే అవకాశం ఉన్న రెండు వరుస మ్యాచ్‌లు వానబారిన పడటంతో వెనుకబడిన న్యూజిలాండ్ కచ్చితంగా గెలవాల్సిన స్థితిలో నిలిచింది. నవీ ముంబై: వన్డే వరల్డ్ కప్‌లో కీలక పోరుకు భారత మహిళల బృందం సిద్ధమైంది. లీగ్ దశలో భాగంగా నేడు జరిగే మ్యాచ్‌లో న్యూజిలాండ్‌తో టీమిండియా తలపడుతుంది. తొలి రెండు మ్యాచ్‌లలో గెలిచి ఉత్సాహంతో కనిపించిన భారత్ ఆ తర్వాత అనూహ్యంగా మూడు ఓటములను ఎదుర్కొంది. మూడు సందర్భాల్లోనూ మెరుగ్గానే ఆడి మ్యాచ్‌ను నియంత్రణలోనే ఉంచుకున్నా... చివరికొచ్చేసరికి చేతులెత్తేసింది. అయితే పరిస్థితి ఇంకా భారత్ చేయిదాటిపోలేదు. కివీస్‌పై గెలిస్తే ఎలాంటి సమీకరణాలతో సంబంధం లేకుండా భారత్ సెమీస్ చేరుతుంది. అయితే పటిష్ట ప్రత్యర్థి, మాజీ చాంపియన్‌తో పోరు అంత సులువు కాదు. ఓడితే సెమీస్ అవకాశాలు కోల్పోనున్న కివీస్ పట్టుదలగా పోరాడుతుందనడంలో సందేహం లేదు. 2022 నుంచి కివీస్‌తో 9 వన్డేలు ఆడిన భారత్ 6 మ్యాచ్‌లలో ఓడింది. మార్పు చేస్తారా! వరుసగా నాలుగు మ్యాచ్‌ల తర్వాత గత పోరులో భారత్ ఒక కీలక మార్పు చేసింది. ఆరో బౌలర్‌తో బౌలింగ్‌ను పటిష్ట పర్చుకోవడంలో భాగంగా రేణుకా సింగ్‌ను తుది జట్టులోకి తీసుకుంది. ఈ క్రమంలో బ్యాటర్ జెమీమా రోడ్రిగ్స్‌పై వేటు పడింది. అయితే ఇంగ్లండ్‌పై అది పెద్దగా ఫలితాన్ని ఇవ్వలేదు. రేణుక ఒక్క వికెట్ కూడా తీయకపోగా, విజయానికి చేరువగా వచి్చన జట్టు చివర్లో బ్యాటింగ్ తడబాటుతో చేజేతులా ఓడింది. స్మృతి కూడా ఈ విషయాన్ని అంగీకరించింది. ఈ నేపథ్యంలో మళ్లీ జెమీమాకు అవకాశం కల్పిస్తారా చూడాలి. గత పోరులో ప్రధాన బ్యాటర్లు స్మృతి, కెప్టెన్ హర్మన్‌లతో పాటు మరో సీనియర్ దీప్తి శర్మ కూడా అర్ధసెంచరీలు చేసినా జట్టును గెలిపించలేకపోయారు. ఇలాంటి తడబాటును అధిగమించి టాప్ ప్లేయర్లు మరింత బాధ్యతగా ఆడాల్సి ఉంది. ఇతర బ్యాటర్లలో ప్రతీక, హర్లీన్ మినహా మరో చెప్పుకోదగ్గ ప్రత్యామ్నాయం కూడా జట్టు వద్ద లేదు. రిచా ఘోష్ తనదైన శైలిలో దూకుడుగా ఆడితే జట్టుకు అదనపు ప్రయోజనం కలుగుతుంది. టోర్నీ ఆరంభంలో ఆకట్టుకున్న పేసర్ క్రాంతి గౌడ్ పదును మ్యాచ్ మ్యాచ్‌కూ తగ్గుతూ వచ్చింది. అమన్‌జోత్ మీడియం పేస్ కూడా అంతగా ప్రభావం చూపడం లేదు. గత మ్యాచ్‌లో ముగ్గురు స్పిన్నర్లూ విఫలమయ్యారు. ఈ మ్యాచ్‌లో మన స్పిన్నర్లు ప్రత్యర్థిని ఎలా కట్టడి చేస్తారో చూడాలి. సోఫీ డివైన్ మినహా... మహిళల క్రికెట్లో పటిష్టమైన జట్లలో ఒకటైన న్యూజిలాండ్ ఈసారి ప్రభావవంతంగా కనిపించడం లేదు. ఆ్రస్టేలియా, దక్షిణాఫ్రికాల చేతిలో ఓడిన కివీస్ ఒక్క బంగ్లాదేశ్‌పై మాత్రమే గెలిచింది. పాక్, శ్రీలంకలతో మ్యాచ్‌లు వర్షం కారణంగా రద్దు కావడంతో పాయింట్లు పంచుకోవాల్సి వచ్చింది. టోరీ్నలో ఒక సెంచరీ, 2 అర్ధ సెంచరీలు సాధించిన కెపె్టన్ సోఫీ డివైన్‌పైనే జట్టు బ్యాటింగ్ ఆధారపడుతోంది. ఓపెనర్లు సుజీ బేట్స్, ప్లిమ్మర్ పూర్తిగా విఫలమయ్యారు. ఆల్‌రౌండర్ అమెలియా కెర్‌తోపాటు స్పిన్నర్ కార్సన్ కూడా ఎలాంటి ప్రభావం చూపించడం లేదు. గత మ్యాచ్ ఆడని ప్రధాన పేసర్ తహుహు ఈ మ్యాచ్‌లో మళ్లీ బరిలోకి దిగుతోంది. మిడిలార్డర్లో హ్యాలిడే, గ్రీన్, ఇసాబెల్లా బ్యాటింగ్‌లో రాణిస్తేనే కివీస్ చెప్పుకోదగ్గ స్కోరు చేసేందుకు అవకాశం ఉంటుంది. పిచ్, వాతావరణం నవీ ముంబైలోని డీవై పాటిల్ మైదానం పిచ్ ప్రధానంగా బ్యాటింగ్‌కు అనుకూలం. భారీ స్కోరుకు అవకాశం ఉంది. భారత జట్టు సభ్యులందరికీ ఇక్కడ ఎక్కువగా ఆడిన అనుభవం ఉండటం సానుకూలాంశం. మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించవచ్చు.సెమీస్ సమీకరణం ఇదీ... → న్యూజిలాండ్‌పై గెలిస్తే భారత్ 6 పాయింట్లతో నేరుగా సెమీస్ చేరుతుంది. → ఒకవేళ భారత్ ఓడితే తర్వాతి మ్యాచ్‌లో ఇంగ్లండ్ చేతిలో న్యూజిలాండ్ ఓడాల్సి ఉంటుంది. అప్పుడు బంగ్లాదేశ్‌పై నెగ్గితే మనకు సెమీస్ స్థానం ఖాయమవుతుంది. → ఇంగ్లండ్‌పై కివీస్ నెగ్గి 6 పాయింట్లతో సమమైనా... అది కివీస్‌కు 2వ విజయం అవుతుంది. ఎక్కువ మ్యాచ్‌లు గెలిచినందుకు భారత్ (3) ముందంజ వేస్తుంది. → కివీస్‌తో మ్యాచ్ రద్దయితే బంగ్లాదేశ్‌ను భారత్ ఓడిస్తే చాలు. ఒకవేళ మనం బంగ్లాదేశ్ చేతిలో పరాజయం పాలైనా...న్యూజిలాండ్, శ్రీలంక తమ తర్వాతి మ్యాచ్‌లు ఓడిపోవాల్సి ఉంటుంది. → భారత్ ఆడాల్సిన రెండు మ్యాచ్‌లూ రద్దయినా... కివీస్‌ను ఇంగ్లండ్ ఓడిస్తే సరిపోతుంది. -
బుమ్రాను భయపెడుతున్న పాకిస్తాన్ బౌలర్
టీమిండియా స్టార్ బౌలర్, పేసు గుర్రం జస్ప్రీత్ బుమ్రాను (Jasprit Bumrah) పాకిస్తాన్ వెటరన్ స్పిన్నర్ నౌమన్ అలీ (Noman Ali) భయపెడుతున్నాడు. తాజాగా విడుదల చేసిన ఐసీసీ టెస్ట్ బౌలర్ల ర్యాంకింగ్స్‌లో నౌమన్ బుమ్రాకు అతి సమీపంగా వచ్చాడు. గత వారం అద్భుత ప్రదర్శన కారణంగా నౌమన్ ఈ వారం ర్యాంకింగ్స్‌లో ఏకంగా నాలుగు స్థానాలు మెరుగుపర్చుకొని, రెండో స్థానానికి ఎగబాకాడు. టాప్ ర్యాంక్‌లో ఉన్న బుమ్రాకు నౌమన్‌కు కేవలం 29 రేటింగ్ పాయింట్ల వ్యత్యాసం మాత్రమే ఉంది.గత వారం సౌతాఫ్రికాతో జరిగిన తొలి టెస్ట్‌లో నౌమన్ తొలి ఇన్నింగ్స్‌లో 6, రెండో ఇన్నింగ్స్‌లో 4 వికెట్లు సహా 10 వికెట్ల ప్రదర్శన నమోదు చేశాడు.39 ఏళ్ల లెఫ్ట్ ఆర్మ్ ఆర్థోడాక్స్ బౌలర్ అయిన నౌమన్ గత కొంతకాలంగా టెస్ట్‌ల్లో విశేషంగా రాణిస్తున్నాడు. చివరి 5 టెస్ట్‌ల్లో 5 ఐదు వికెట్ల ప్రదర్శనలు సహా 3 పది వికెట్ల ప్రదర్శనలు నమోదు చేసి అత్యుత్తమ ఫామ్‌లో ఉన్నాడు. కెరీర్లో 21 టెస్ట్‌లు ఆడిన నౌమన్ 95 వికెట్లు తీశాడు.బుమ్రా విషయానికొస్తే.. ఇతను ఈ నెలలో వెస్టిండీస్‌తో ఆడిన రెండు టెస్ట్‌ల్లో పెద్దగా వికెట్లు తీయలేకపోయాడు. తొలి టెస్ట్‌లో 3, రెండో టెస్ట్‌లో 4 వికెట్లు మాత్రమే తీశాడు.ఈ వారం ర్యాంకింగ్స్‌లో నౌమన్తో పాటు మరో బౌలర్ భారీగా లబ్ది పొందాడు. సౌతాఫ్రికాకు చెందిన సెనూరన్ ముత్తుసామి పాక్‌తో జరిగిన తొలి టెస్ట్‌లో 11 వికెట్ల ప్రదర్శన నమోదు చేసి ఏకంగా 38 స్థానాలు ఎగబాకాడు. ప్రస్తుతం అతను 55 స్థానంలో ఉన్నాడు. ఈ రెండు భారీ మార్పులు మినహా ఈ వారం ర్యాంకింగ్స్‌లో చెప్పుకోదగ్గ మార్పులేమీ లేవు. భారత బౌలర్లు సిరాజ్, కుల్దీప్, జడేజా 12, 14, 18 స్థానాల్లో కొనసాగుతున్నారు.టెస్ట్ బ్యాటర్ల ర్యాంకింగ్స్ విషయానికొస్తే.. రూట్, బ్రూక్, కేన్ టాప్-3లో కొనసాగుతుండగా.. టీమిండియా ఆటగాళ్లు జైస్వాల్, పంత్, గిల్ 5, 8, 12 స్థానాల్లో ఉన్నారు. ఆల్‌రౌండర్ల ర్యాంకింగ్స్‌లో రవీంద్ర జడేజా ఎవరికీ అందనంత ఎత్తులో టాప్ ప్లేస్‌లో కొనసాగుతున్నాడు.చదవండి: చరిత్ర సృష్టించిన పాకిస్తాన్ స్పిన్నర్.. 92 ఏళ్ల ప్రపంచ రికార్డు బద్దలు -
ఆసీస్‌తో రెండో వన్డే.. భారీ రికార్డులపై కన్నేసిన కోహ్లి
మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా భారత్, ఆస్ట్రేలియా (India Vs Australia) మధ్య రేపు (అక్టోబర్ 23) అడిలైడ్ వేదికగా రెండో వన్డే జరుగనుంది. ఈ మ్యాచ్‌కు ముందు టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లిని (Virat Kohli) పలు భారీ రికార్డులు ఊరిస్తున్నాయి.ఈ మ్యాచ్‌లో విరాట్ 54 పరుగులు చేస్తే వన్డే క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో శ్రీలంక దిగ్గజం కుమార సంగక్కరను వెనక్కు నెట్టి రెండో స్థానానికి చేరతాడు. ఈ జాబితాలో సచిన్ టెండూల్కర్ అగ్రస్థానంలో ఉన్నాడు.సచిన్ టెండూల్కర్-18426కుమార సంగక్కర-14234విరాట్ కోహ్లి-14181ఈ మ్యాచ్‌లో విరాట్ 68 పరుగులు చేస్తే పరిమిత ఓవర్ల క్రికెట్లో (వన్డేలు, టీ20లు కలిపి) అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా ప్రపంచ రికార్డు నెలకొల్పుతాడు. ప్రస్తుతం ఈ రికార్డు సచిన్ టెండూల్కర్ పేరిట ఉంది. సచిన్ 463 వన్డేల్లో 18426 పరుగులు, ఒకే ఓక టీ20లో 10 పరుగులు సహా 18436 పరుగులు చేయగా.. విరాట్ 303 వన్డేల్లో 14181 పరుగులు, 125 టీ20ల్లో 4188 పరుగులు 18369 చేశాడు.ఈ మ్యాచ్‌లో విరాట్ సెంచరీ చేస్తే సచిన్ పేరిటే ఉన్న మరో రికార్డును కూడా తన ఖాతాలో వేసుకుంటాడు. ఏదైనా సింగిల్ ఫార్మాట్లో అత్యధిక సెంచరీలు చేసిన రికార్డు ప్రస్తుతం విరాట్, సచిన్‌ల పేరిట సంయుక్తంగా ఉంది. విరాట్ వన్డేల్లో 51 సెంచరీలు చేయగా.. టెస్ట్‌ల్లో సచిన్ పేరిట 51 శతకాలు ఉన్నాయి.కాగా, టెస్ట్‌లకు, టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించి, వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్న విరాట్.. ఆరు నెలల విరామం తర్వాత (ఛాంపియన్స్ ట్రోఫీ) ప్రస్తుత ఆసీస్ సిరీస్‌తోనే రీఎంట్రీ ఇచ్చాడు. తొలి వన్డేలో 8 బంతులు ఆడి డకౌటైన విరాట్ అభిమానులను తీవ్ర నిరాశకు గురి చేశాడు. రేపు జరుగబోయే రెండో వన్డేలో విరాట్ చెలరేగడం ఖాయమని ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు.ఈ మ్యాచ్‌కు వేదిక అయిన అడిలైడ్‌లో విరాట్‌కు మంచి ట్రాక్ రికార్డు ఉంది. ఇక్కడ ఆడిన 4 వన్డేల్లో 2 సెంచరీల సాయంతో 244 పరుగులు చేశాడు. ఈ మైదానంలో మిగతా రెండు ఫార్మాట్లలో కూడా విరాట్‌కు మంచి రికార్డు ఉంది. 5 టెస్ట్‌ల్లో 3 సెంచరీలు, ఓ అర్ద సెంచరీ సాయంతో 527 పరుగులు... 3 టీ20ల్లో 3 అర్ద సెంచరీల సాయంతో 204 పరుగులు చేశాడు.రేపటి మ్యాచ్‌లో విరాట్ 25 పరుగలు చేస్తే అడిలైడ్‌లో 1000 పరుగులు (మూడు ఫార్మాట్లలో) పూర్తి చేసుకుంటాడు. ఇదిలా ఉంటే, పెర్త్ వేదికగా జరిగిన తొలి వన్డేలో భారత్ 7 వికెట్ల తేడాతో పరాజయంపాలైన విషయం తెలిసిందే. వర్షం కారణంగా 26 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 9 వికెట్ల నష్టానికి 136 పరుగులు చేయగా.. ఆస్ట్రేలియా మరో 29 బంతులు మిగిలుండగానే లక్ష్యాన్ని ఛేదించింది. చదవండి: ఓపెనర్‌గానూ రోహిత్ శర్మపై వేటు!?.. గంభీర్, అగార్కర్ చర్య వైరల్ -
పంత్ కారణంగానే సర్ఫరాజ్ ఖాన్‌పై వేటు.. అసలు విషయమేంటి?
ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌లో గాయపడి ఆటకు దూరమైన టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ (Rishabh Pant) తిరిగి మైదానంలోకి అడుగు పెడుతున్నాడు. స్వదేశంలో దక్షిణాఫ్రికా ‘ఎ’ జట్టుతో అక్టోబరు 30 నుంచి నవంబర్ 9 వరకు జరిగే రెండు నాలుగు రోజుల (ఫస్ట్‌క్లాస్) అనధికారిక టెస్టు మ్యాచ్‌లలో తలపడే భారత ‘ఎ’ జట్టుకు పంత్ కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు.బెంగళూరు వేదికగా జరిగే ఈ రెండు మ్యాచ్‌ల కోసం రెండు వేర్వేరు జట్లను మంగళవారం సెలక్టర్లు ప్రకటించారు. అయితే, ఇందులో ముంబై స్టార్ సర్ఫరాజ్ ఖాన్ (Sarfraz Khan)కు చోటు దక్కలేదు. కాగా స్వదేశంలో జరిగే టెస్టు సిరీస్‌లలో ఈ కుడిచేతి వాటం బ్యాటర్‌ను ఆడిస్తామని సెలక్టర్లు నమ్మకంగానే అతడికి చెప్పినట్లు సమాచారం.పదిహేడు కిలోల మేర బరువు తగ్గి..ఈ నేపథ్యంలో టీమిండియా ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న వేళ సర్ఫరాజ్ ఖాన్ ఫిట్‌నెస్‌పై మరింతగా దృష్టి సారించాడు. ఏకంగా పదిహేడు కిలోల మేర బరువు తగ్గి స్లిమ్‌గా మారాడు. అయితే, సెలక్టర్లను మాత్రం ఆకట్టుకోలేకపోయాడు.సొంతగడ్డపై సౌతాఫ్రికాతో టెస్టులకు ముందు జరిగే అనధికారిక టెస్టు సిరీస్‌కు సెలక్టర్లు సర్ఫరాజ్‌ను ఎంపిక చేయలేదు. ఇందుకు ప్రధాన కారణం అతడి బ్యాటింగ్ ఆర్డరే అని తెలుస్తోంది. సాధారణంగా ముంబై జట్టులో సర్ఫరాజ్ ఐదో స్థానంలో బ్యాటింగ్ చేస్తాడు.పంత్ రాకతోఅయితే, భారత- ‘ఎ’ జట్టు కెప్టెన్‌గా తిరిగి వచ్చిన పంత్ కూడా అదే స్థానంలో ఆడతాడన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సర్ఫరాజ్ టాపార్డర్‌కు ప్రమోట్ అవుదామనుకున్నా.. ఓపెనర్లుగా ఆయుశ్ మాత్రే- నారాయణ్ జగదీశన్ వచ్చే అవకాశం ఉండగా.. వన్‌డౌన్‌లో వైస్ కెప్టెన్ సాయి సుదర్శన్ ఉండనే ఉన్నాడు.ఇక ఆ తర్వాతి స్థానం కోసం దేవదత్ పడిక్కల్, రజత్ పాటిదార్ పోటీపడుతున్నారు. ఇక మిడిలార్డర్లో ఐదో నంబర్లో పంత్ ఉన్నాడు. ఆ తర్వాతి స్థానాల్లో సర్ఫరాజ్ బ్యాటింగ్ చేసే అవకాశం లేదు. ఇక టీమిండియాలోనూ ఆరో స్థానం నుంచి ఆల్‌రౌండర్లే ప్రధానంగా బ్యాటింగ్‌కు వస్తున్నారు.బ్యాటింగ్ ఆర్డర్ గురించి చర్చించాలిఇలాంటి సమీకరణల నేపథ్యంలో సర్ఫరాజ్ ఖాన్‌కు ‘ఎ’ జట్టులోనూ చోటు కరువైందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అతడి భవిష్యత్తు కూడా ప్రశ్నార్థకంగా మారిందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ చీఫ్ సెలక్టర్ ఒకరు పీటీఐతో మాట్లాడుతూ..‘‘ముంబై మేనేజ్మెంట్తో సర్ఫరాజ్ ఖాన్ తన బ్యాటింగ్ ఆర్డర్ గురించి చర్చించాలి. లేదంటే.. సీనియర్ ప్లేయర్ అజింక్య రహానేతో మాట్లాడాలి. మూడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి కొత్త బంతిని ఎదుర్కునేలా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి.చాలానే ఆప్షన్లు ఉన్నాయివన్డౌన్లో నిలదొక్కుకుంటే భవిష్యత్తులోనైనా అవకాశాలు వస్తాయి. అలా కాకుండా ఐదు లేదంటే ఆరో స్థానంలో ఆడతానంటే సర్ఫరాజ్ కెరీర్ ప్రశ్నార్థకమే అవుతుంది. ఎందుకంటే.. ఐదో స్థానంలో పంత్‌తో పాటు.. ఆ తర్వాత వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా, నితీశ్ రెడ్డి రూపంలో మేనేజ్మెంట్కు చాలానే ఆప్షన్లు ఉన్నాయి.ఈ ముగ్గురు ఫిట్‌గా ఉండి.. సెలక్షన్‌కు అందుబాటులో ఉంటే సర్ఫరాజ్ ఖాన్‌కు మొండిచేయి తప్పదు. ఒకవేళ పంత్ గాయపడినా ధ్రువ్ జురెల్ ఐదు లేదంటే ఆరో స్థానంలో ఆడతాడు. కాబట్టి సర్ఫరాజ్ మూడో స్థానంలో ఆడటంపై దృష్టి పెడితే బాగుంటుంది’’ అని సదరు సెలక్టర్ అభిప్రాయపడ్డాడు.కాగా ముంబై తరఫున రంజీల్లో పరుగుల వరద పారించిన 28 ఏళ్ల సర్ఫరాజ్ ఖాన్.. గతేడాది అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. ఇప్పటి వరకు ఆరు టెస్టులు ఆడి 371 పరుగులు సాధించాడు. ఇందులో ఓ సెంచరీ, మూడు అర్ధ శతకాలు ఉన్నాయి.చదవండి: సౌతాఫ్రికాతో సిరీస్‌కు భారత జట్టు ప్రకటన.. కెప్టెన్‌గా రిషభ్ పంత్ -
దీపావళి సెలబ్రేషన్స్‌లో టీమిండియా క్రికెటర్లు (ఫోటోలు)
-
సిరాజ్‌ను వెనక్కు నెట్టిన జింబాబ్వే బౌలర్
టెస్ట్ క్రికెట్లో ఈ ఏడాది టీమిండియా బౌలర్ మహ్మద్ సిరాజ్ (Mohammed Siraj) అద్భుతంగా రాణిస్తున్నాడు. ఇప్పటివరకు ఆడిన 8 మ్యాచ్‌ల్లో 26.91 సగటున 37 వికెట్లు తీసి, లీడింగ్ వికెట్ టేకర్‌గా ఉండేవాడు. తాజాగా జింబాబ్వే బౌలర్ బ్లెస్సింగ్ ముజరబానీ (Blessing Muzarabani) సిరాజ్‌ను వెనక్కు నెట్టి, అత్యధిక వికెట్ల వీరుడిగా అవతరించాడు. ఆఫ్ఘనిస్తాన్‌తో ఇవాళ (అక్టోబర్ 20) మొదలైన మ్యాచ్‌లో ఈ ఘనత సాధించాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో 3 వికెట్లు తీసిన ముజరబానీ తన వికెట్ల సంఖ్యను 39కి (10 మ్యాచ్‌ల్లో) పెంచుకున్నాడు. ముజరబానీ, సిరాజ్ తర్వాత ఈ ఏడాది అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో మిచెల్ స్టార్క్ (7 మ్యాచ్‌ల్లో 29 వికెట్లు), నౌమన్ అలీ (26), నాథన్ లియోన్ (24) ఉన్నారు.ఇదిలా ఉంటే, ఆఫ్ఘనిస్తాన్‌తో మ్యాచ్‌లో ముజరబానీతో పాటు (11-1-47-3), బ్రాడ్ ఈవాన్స్ (9.3-2-22-5), తనక చివంగ (6-0-29-1) చెలరేగడంతో జింబాబ్వే ఆఫ్ఘనిస్తాన్‌ను తొలి ఇన్నింగ్స్‌లో 127 పరుగులకే ఆలౌట్ చేసింది. ఆఫ్ఘనిస్తాన్ ఇన్నింగ్స్‌లో 37 పరుగులు చేసిన రహ్మానుల్లా గుర్భాజ్ టాప్ స్కోరర్‌గా నిలిచాడు.ఆఫ్ఘన్ ఇన్నింగ్స్‌లో అబ్దుల్ మాలిక్ (30), ఇబ్రహీం జద్రాన్ (19), బషీర్ షా (12), అహ్మద్జాయ్ (10 నాటౌట్) రెండంకెల స్కోర్లు చేయగా.. మిగతా వారంతా సింగిల్ డిజిట్ స్కోర్‌కే పరిమితమయ్యారు.అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన జింబాబ్వే.. మూడో సెషన్ సమయానికి వికెట్ నష్టానికి 85 పరుగులు చేసింది. బ్రియాన్ బెన్నెట్ (6) ఔట్ కాగా.. బెన్ కర్రన్ (34), నిక్ వెల్చ్ (40) క్రీజ్‌లో ఉన్నారు.కాగా, ఏకైక టెస్ట్ మ్యాచ్, మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం ఆఫ్ఘనిస్తాన్ జట్టు జింబాబ్వేలో పర్యటిస్తుంది. టెస్ట్ మ్యాచ్ అనంతరం హరారే వేదికగా మూడు టీ20లు (అక్టోబర్ 29, 21, నవంబర్ 2) జరుగనున్నాయి.చదవండి: PAK VS SA 2nd Test: బాబర్ విఫలమైనా, ఆదుకున్న కెప్టెన్ -
ఆల్ ఫార్మాట్ రౌండర్
సాక్షి, హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో మెరుపులు మెరిపించి జాతీయ సెలక్టర్ల దృష్టిలో పడ్డ నితీశ్ కుమార్ రెడ్డి... ఏడాది తిరిగేలోపు జాతీయ జట్టు తరఫున మూడు ఫార్మాట్లలో అరంగేట్రం చేశాడు. గతేడాది అక్టోబర్‌లో టీమిండియా తరఫున తొలి అంతర్జాతీయ టి20 మ్యాచ్ ఆడిన నితీశ్ రెడ్డి... ఆ తర్వాత ఆస్ట్రేలియా పర్యటనలో అదరగొట్టాడు. ‘బోర్డర్–గావస్కర్’ సిరీస్‌లో భాగంగా పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్టు ద్వారా సుదీర్ఘ ఫార్మాట్ బరిలోకి దిగిన ఈ ఆంధ్ర ఆల్‌రౌండర్... ఆ సిరీస్‌లో జరిగిన ఐదు మ్యాచ్‌ల్లోనూ ఆడాడు. లోయర్ ఆర్డర్లో బ్యాటింగ్‌కు వచ్చి ధాటిగా షాట్లు ఆడగల సత్తా... ఉపయుక్తమైన మీడియం పేస్ బౌలింగ్ అతడికి వరుసగా అవకాశాలు కల్పించింది. హార్దిక్ పాండ్యా టెస్టు ఫార్మాట్‌కు దూరం కావడంతో... సుదీర్ఘ ఫార్మాట్లో భారత జట్టు చాలా కాలంగా పేస్ ఆల్‌రౌండర్ కోసం నిరీక్షిస్తోంది. అందివచ్చిన అవకాశాలను వినియోగించుకున్న నితీశ్ ఇప్పుడు తాజాగా వన్డే ఫార్మాట్లో సైతం అవకాశం దక్కించుకున్నాడు. పాండ్యా గైర్హాజరీలో పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్‌గా ఆ్రస్టేలియాతో వన్డే సిరీస్‌కు ఎంపికయ్యాడు. పెర్త్ వేదికగా ఆదివారం జరిగిన పోరులో ఆఖర్లో బ్యాటింగ్‌కు వచి్చన ఈ ఆల్‌రౌండర్ 11 బంతులెదుర్కొని 2 సిక్సర్లతో 19 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. వర్షం కారణంగా మ్యాచ్ పూర్తిగా సాగకపోవడంతో అతడికి క్రీజులో ఎక్కువ సమయం గడిపే అవకాశం దక్కలేదు. బౌలింగ్‌లో మాత్రం 2.1 ఓవర్లు వేసిన నితీశ్ 16 పరుగులిచ్చాడు. వికెట్ తీయలేకపోయాడు. టెస్టు అరంగేట్రం చేసిన చోటే... ఆ్రస్టేలియా పర్యటనలో భాగంగా పెర్త్ టెస్టు ద్వారానే తొలి టెస్టు ఆడిన 23 ఏళ్ల నితీశ్ రెడ్డి... మళ్లీ ఇప్పుడు అక్కడే వన్డేల్లోనూ అరంగేట్రం చేశాడు. తొలి ఇన్నింగ్స్‌లో టాపార్డర్ మొత్తం విఫలమైన చోట... ధనాధన్ బ్యాటింగ్‌తో 41 పరుగులు చేసిన నితీశ్... రెండో ఇన్నింగ్స్‌లో అయితే ఏకంగా టి20 మ్యాచ్ ఆడాడు. 27 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో అజేయంగా 38 పరుగులు చేసి భారత జట్టు భారీ స్కోరు చేయడంలో కీలక పాత్ర పోషించాడు. మిచెల్ స్టార్క్, జోష్ హాజల్‌వుడ్, ప్యాట్ కమిన్స్ వంటి ప్రపంచ స్థాయి బౌలర్లను ఎదుర్కొంటూ అతడు చూపిన తెగువ ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంది. దీంతో టీమ్ మేనేజ్మెంట్ సైతం నితీశ్‌కు విరివిగా అవకాశాలు ఇచి్చంది. వాటిని అతడు సద్వినియోగం చేసుకున్నాడు. ప్రతిష్టాత్మక మెల్బోర్న్ మైదానంలో జరిగిన పోరులో నితీశ్ వీరవిహారం చేశాడు. ఎనిమిదో స్థానంలో క్రీజులోకి వచి్చన అతను ఆసీస్ బౌలింగ్‌ను ఓ ఆటాడుకొని సెంచరీతో అదరగొట్టాడు. దీంతో ఒక్కసారిగా అతడి పేరు మార్మోగిపోయింది. ఆ తర్వాత మరో నాలుగు టెస్టులు మాత్రమే ఆడిన అతడు ఆశించిన స్థాయిలో రాణించలేకపోవడంతో పాటు... గాయాల బారిన పడి కాస్త వెనుకబడ్డాడు. అయితే క్లిష్టమైన విదేశీ పర్యటనల్లో సత్తాచాటిన నితీశ్‌పై సెలెక్టర్లు నమ్మకముంచారు. గాయం నుంచి కోలుకొని... ఇంగ్లండ్ పర్యటనలో భాగంగా మాంచెస్టర్‌లో ప్రాక్టీస్ చేస్తూ గాయపడిన నితీశ్ జట్టుకు దూరమయ్యాడు. గాయానికి శస్త్రచికిత్స చేయించుకున్న అనంతరం బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌లో ప్రత్యేక శిక్షణ తీసుకున్నాడు. ఇంగ్లండ్ నుంచి తిరిగొచ్చాక అతడు పూర్తిగా మారిపోయాడు. సమయపాలన, క్రమశిక్షణ మొదటి నుంచే ఉన్న నితీశ్ రెడ్డి... వాటిని మరింత కఠినతరం చేశాడు. సరదాలు, షికార్లు పక్కనపెట్టి పూర్తిగా క్రికెట్‌పై దృష్టి పెట్టాడు. అదే సమయంలో తండ్రికి మోకాలి శస్త్రచికిత్స జరిగినా ఇంటికి వెళ్లకుండా పూర్తిగా సాధనకే పరిమితమయ్యాడు. విశాఖపట్నంలో ఉన్నన్ని రోజులు... జిమ్ లేదంటే మైదానంలోనే గడిపేవాడని అతడి తండ్రి ముత్యాల రెడ్డి పేర్కొన్నారు. అలా గంటల తరబడి శిక్షణ సాగిస్తూ మరింత రాటుదేలాడు. మోకాలి శస్త్రచికిత్స అనంతరం అతడి ఫిట్నెస్ మునుపటికంటే రెట్టింపు అయింది. అది ఇటీవల వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్‌లో ప్రస్ఫుటమైంది. సూపర్ క్యాచ్ వెస్టిండీస్‌తో స్వదేశంలో జరిగిన టెస్టు సిరీస్‌లో నితీశ్ ఫర్వాలేదనిపించాడు. స్పిన్‌కు సహకరించే భారత పిచ్‌లపై పేస్ ఆల్‌రౌండర్‌గా ఎక్కువ ఓవర్లు వేసే అవకాశం దక్కని ఆంధ్ర ప్లేయర్... బ్యాటింగ్‌లో రాణించాడు. వెస్టిండీస్‌తో అహ్మదాబాద్ వేదికగా జరిగిన తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో నితీశ్ పట్టిన క్యాచ్ చూస్తే... అతడి ఫిట్నెస్ స్థాయి ఏంటో అర్థమవుతుంది. స్క్యేర్ లెగ్‌లో విండీస్ బ్యాటర్ ఇచ్చిన క్యాచ్‌ను చిరుతలా దూకుతూ అందుకున్న తీరు చూసి తీరాల్సిందే. ప్రస్తుతం జట్టులో ఉన్న ఫిటెస్ట్ ప్లేయర్లలో అతడు ఒకడు అనడంలో సందేహం లేదు. యో–యో టెస్టు, బ్రంకో టెస్టుల్లో టీమిండియాలో అందరికంటే మెరుగైన స్కోరు నితీశ్ రెడ్డిదే అని సమాచారం. విండీస్‌తో టెస్టు సిరీస్‌లో ఎక్కువ బౌలింగ్ చేసే అవకాశం రాకున్నా... హెడ్ కోచ్ గంభీర్ మాత్రం నితీశ్‌పై నమ్మకముందని అతడికి అండగా ఉంటామని స్పష్టంచేశాడు. ‘నితీశ్ ఎన్ని ఓవర్లు వేశాడనేది ముఖ్యం కాదు. జట్టుతో ఉండటమే ప్రధానం. అది ఎంతో నేర్చుకునే అవకాశం కల్పిస్తుంది. 23 ఏళ్ల కుర్రాడిని కేవలం విదేశీ పిచ్‌లపైనే పరీక్షించాలనే ఆలోచన మాకు లేదు. అవకాశం ఉన్నప్పుడల్లా స్వదేశంలో సైతం అతడికి చాన్స్‌లు ఇస్తాం. ప్రస్తుతం పేస్ ఆల్‌రౌండర్లు చాలా తక్కువ మంది అందుబాటులో ఉన్నారు. అందుకే నితీశ్‌కు అండగా ఉంటాం’ అని గంభీర్ అన్నాడు. వన్డే, టి20 ఫార్మాట్లలో హార్దిక్ పాండ్యా వంటి నిఖార్సైన పేస్ ఆల్‌రౌండర్ అందుబాటులో ఉండగా... టెస్టుల్లో ఆ స్థానాన్ని భర్తీ చేయడంతో పాటు... పరిమిత ఓవర్లలోనూ తనదైన ముద్ర వేయాలని నితీశ్ భావిస్తున్నాడు. -
ఆశలు రేపి... ఆఖర్లో కూల్చారు!
లక్ష్యఛేదనలో 253/4 స్కోరు వద్ద భారత్ 30 బంతుల్లో 36 పరుగుల సమీకరణమపుడు గెలుపే... భారత్‌వైపు తొంగిచూస్తోంది. కానీ తర్వాతి వరుస ఓవర్లలో హిట్టర్ రిచా ఘోష్, ఫిఫ్టీ చేసిన దీప్తిశర్మ అవుటవడంతోనే మహిళల జట్టు గెలుపునకు దూరమైంది. క్రీజులో ఉన్న అమన్‌జోత్, స్నేహ్రాణా సింగిల్స్‌కే పరిమితం కావడం... భారీ షాట్లు ఆడలేకపోవడంతో గెలుపు దారితప్పి ఓటమిబాట పట్టింది.ఇండోర్: ఇక గెలుపు ఖాయమేలే... విజయానికి చేరువయ్యామని అనుకుంటుండగా ఊహించని ఫలితం భారత శిబిరాన్ని ముంచేసింది. విజయం ఆశలు రేపిన మహిళలు ఆఖరికొచ్చేసరికి తమవల్ల కాదంటూ చేతులెత్తేశారు. దీంతో గెలుపుదాకా వచ్చిన భారత్ 4 పరుగుల దూరంలో ఆగిపోయింది. ఇంగ్లండ్ అమ్మాయిల చేతిలో ఓడిపోయింది. ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్‌లో భారత జట్టు వరుసగా మూడో మ్యాచ్‌లోనూ పరాజయం పాలైంది. ఆదివారం జరిగిన ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ మహిళల జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 288 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ హీథర్‌నైట్ (91 బంతుల్లో 109; 15 ఫోర్లు, 1 సిక్స్) సెంచరీ సాధించింది. అమీ జోన్స్ (68 బంతుల్లో 56; 8 ఫోర్లు) అర్ధశతకం చేసింది. దీప్తిశర్మ (4/51) ప్రత్యర్థి బ్యాటింగ్‌కు దెబ్బతీయగా, శ్రీచరణి 2 వికెట్లు పడగొట్టింది. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన భారత మహిళల జట్టు 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 284 పరుగులు చేసి ఓడింది. స్మృతి మంధానా (94 బంతుల్లో 88; 8 ఫోర్లు), కెపె్టన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (70 బంతుల్లో 70; 10 ఫోర్లు), దీప్తిశర్మ (57 బంతుల్లో 50; 5 ఫోర్లు)ల అర్ధశతకాల మోత బూడిదలో పోసిన పన్నీరైంది. ప్రత్యర్థి బౌలర్లలో నాట్ సీవర్ బ్రంట్ 2 వికెట్లు తీసింది. కదంతొక్కిన హీథర్‌నైట్ ఓపెనర్ బ్యూమోంట్ (22) తక్కువ స్కోరుకే అవుటైనా... మరో ఓపెనర్ అమీ జోన్స్ ఫిఫ్టీతో, టాపార్డర్ బ్యాటర్ హీథర్‌నైట్ శతకంతో ఇంగ్లండ్ భారీ స్కోరుకు బాటలు వేశారు. కెపె్టన్ నాట్ సీవర్ బ్రంట్ (38; 4 ఫోర్లు), హీథర్‌నైట్ మూడో వికెట్‌కు 113 పరుగులు జోడించారు. దీప్తి శర్మ వరుస విరామాల్లో వికెట్లు తీసి ప్రత్యర్థి స్కోరు మరింత పెరగకుండా చేసింది. 289 పరుగుల లక్ష్యఛేదనలో ప్రతీక (6) వికెట్‌ను కోల్పోయినప్పటికీ స్మృతి, హర్లీన్ (24), కెపె్టన్ హర్మన్, దీప్తిల రాణింపుతో విజయంవైపు అడుగులు వేసింది. అయితే 234 స్కోరు వద్ద మంధాన అవుటవడం మ్యాచ్ ఫలితాన్నే మార్చింది. రిచా, దీప్తిలు అవుటవడంతో పరాజయం ఖాయమైంది.స్కోరు వివరాలు ఇంగ్లండ్ మహిళల ఇన్నింగ్స్: బ్యూమోంట్ (బి) దీప్తి 22; అమీ జోన్స్ (సి) మంధాన (బి) దీప్తి 56; హీథర్‌నైట్ (రనౌట్) 109; నాట్ సీవర్ (సి) హర్మన్‌ప్రీత్ (బి) శ్రీచరణి 38; సోఫియా (సి) దీప్తి (బి) శ్రీచరణి 15; ఎమా లంబ్ (సి) మంధాన (బి) దీప్తి 11; అలైస్ క్యాప్సీ (సి) హర్లీన్ (బి) దీప్తి 2; చార్లీ (నాటౌట్) 19; సోఫీ ఎకిల్‌స్టోన్ రనౌట్ 3; లిన్సే స్మిత్ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 13; మొత్తం (50 ఓవర్లలో 8 వికెట్లకు) 288. వికెట్ల పతనం: 1–73, 2–98, 3–211, 4–249, 5–254, 6–257, 7–276, 8–280. బౌలింగ్: రేణుక 8–0–37–0, క్రాంతి 8–0–46–0, స్నేహ్ రాణా 10–0–56–0, శ్రీచరణి 10–0–68–2, దీప్తిశర్మ 10–0–51–4, అమన్‌జోత్ 4–0–26–0. భారత మహిళల ఇన్నింగ్స్: ప్రతీక (సి) అమీజోన్స్ (బి) లారెన్ బెల్ 6; స్మృతి (సి) క్యాప్సీ (బి) లిన్సే స్మిత్ 88; హర్లీన్ (ఎల్బీడబ్ల్యూ) (బి) చార్లీ 24; హర్మన్‌ప్రీత్ (సి) ఎమా లంబ్ (బి) నాట్ సీవర్ 70; దీప్తి (సి) సోఫియా (బి) ఎకిల్‌స్టోన్ 50; రిచా (సి) హీథర్‌నైట్ (బి) నాట్ సీవర్ 8; అమన్‌జోత్ (నాటౌట్) 18; స్నేహ్ రాణా (నాటౌట్) 10; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం (50 ఓవర్లలో 6 వికెట్లకు) 284. వికెట్ల పతనం: 1–13, 2–42, 3–167, 4–234, 5–256, 6–262. బౌలింగ్: లారెన్ బెల్ 9–0–52–1, లిన్సే స్మిత్ 10–0–40–1, నాట్ సీవర్ 8–0–47–2, చార్లీ డీన్ 10–0–67–1, సోఫీ ఎకిల్‌స్టోన్ 10–0–58–1, అలైస్ క్యాప్సీ 3–0–20–0. -
ఓడినా సంతృప్తిగా ఉన్నాం.. ఆసీస్ చేతిలో ఓటమి అనంతరం గిల్
ఆస్ట్రేలియా పర్యటనలో టీమిండియాకు తొలి మ్యాచ్‌లోనే ఓటమి ఎదురైంది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా పెర్త్ వేదికగా జరిగిన తొలి మ్యాచ్‌లో (India vs Australia) భారత్ 7 వికెట్ల తేడాతో (డక్‌వర్త్ లూయిస్ పద్దతి ప్రకారం) పరాజయంపాలైంది. వర్షం అంతరాయాల నడుమ 26 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో భారత బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు.కేఎల్ రాహుల్ (38), అక్షర్ పటేల్ (31), ఆఖర్లో అరంగేట్రం ఆటగాడు నితీశ్ కుమార్ రెడ్డి (19 నాటౌట్; 2 సిక్సర్లు) ఓ మోస్తరుగా రాణించి టీమిండియా పరువు కాపాడారు.నాలుగు నెలల విరామం తర్వాత (ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత) రీఎంట్రీ ఇచ్చిన స్టార్ బ్యాటర్లు రోహిత్ శర్మ (8), విరాట్ కోహ్లి (0) ఈ మ్యాచ్‌లో దారుణంగా విఫలమయ్యారు. ఫుల్‌టైమ్ వన్డే కెప్టెన్‌గా గిల్ తొలి మ్యాచ్‌లోనే (10) నిరాశపరిచాడు. ఓవర్ హైప్ మధ్య శ్రేయస్ అయ్యర్ (11) పరుగులు చేసేందుకు చాలా ఇబ్బంది పడ్డాడు. మొత్తంగా భారత్ పవర్‌ప్లేలో మూడు కీలక వికెట్లు కోల్పోయి ఆదిలోనే మ్యాచ్‌పై పట్టు కోల్పోయింది.ఆసీస్ బౌలర్లలో జోష్ హాజిల్‌వుడ్, మిచెల్ ఓవెన్, కుహ్నేమన్ తలో 2 వికెట్లు.. స్టార్క్, ఎల్లిస్ చెరో వికెట్ పడగొట్టడంతో భారత్ 9 వికెట్ల నష్టానికి 136 పరుగులు చేయగలిగింది.అనంతరం డక్‌వర్త్ లూయిస్ పద్దతిన కుదించిన 131 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఆసీస్ 21.1 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. మిచెల్ మార్ష్ (46 నాటౌట్), రెన్షా (21 నాటౌట్) ఆసీస్‌ను విజయతీరాలకు చేర్చారు. ఆసీస్ ఇన్నింగ్స్‌లో ట్రవిస్ హెడ్ (8), మాథ్యూ షార్ట్ (8) విఫలం కాగా.. జోష్ ఫిలిప్ (37) పర్వాలేదనిపించాడు. భారత బౌలర్లలో అర్షదీప్, అక్షర్, సుందర్ తలో వికెట్ తీశారు. ఈ సిరీస్‌లో రెండో వన్డే అడిలైడ్ వేదికగా అక్టోబర్ 23న జరుగనుంది.గిల్ ఆసక్తికర వ్యాఖ్యలుమ్యాచ్ అనంతరం టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (Shubman Gill) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. "పవర్‌ప్లేలో మూడు వికెట్లు కోల్పోయినప్పుడు, ఆట మొత్తం క్యాచ్-అప్ గేమ్‌గా మారుతుంది. ఈ మ్యాచ్ నుంచి చాలా నేర్చుకున్నాం. కొన్ని పాజిటివ్‌లు కూడా ఉన్నాయి. 130 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కాపాడుకుంటూ మ్యాచ్‌ను చివరి వరకు తీసుకెళ్లాం. దానికి సంతృప్తిగా ఉన్నాం" అని అన్నాడు.అభిమానుల మద్దతుపై కూడా గిల్ స్పందించాడు. "అభిమానులు భారీగా వచ్చారు. మేము అదృష్టవంతులం. అడిలైడ్‌లో కూడా మాకు ఇలాగే మద్దతు లభిస్తుందని ఆశిస్తున్నాం" అని అన్నాడు.కాగా, గిల్ తన వన్డే కెప్టెన్సీ కెరీర్‌ను ఓటమితో ప్రారంభించాడు. తద్వారా విరాట్ కోహ్లి తర్వాత మూడు ఫార్మాట్లలో తొలి మ్యాచ్‌లో ఓటమిని ఎదుర్కొన్న భారత కెప్టెన్‌గా నిలిచాడు. ఈ ఓటమితో టీమిండియా జైత్రయాత్రకు కూడా బ్రేక్ పడింది. ఈ ఏడాది ఎనిమిది వరుస విజయాల తర్వాత (వన్డేల్లో) భారత్‌కు ఇది తొలి పరాజయం. చదవండి: చరిత్ర సృష్టించిన దీప్తి శర్మ.. తొలి భారత ప్లేయర్ -
CWC 2025: చరిత్ర సృష్టించిన టీమిండియా ప్లేయర్
భారత మహిళా క్రికెటర్ దీప్తి శర్మ (Deepthi Sharma) వన్డే క్రికెట్లో అరుదైన ఘనత సాధించింది. 2000 పరుగులతో పాటు 150 వికెట్లు తీసిన తొలి భారత ప్లేయర్‌గా చరిత్ర సృష్టించింది. అలాగే ప్రపంచవ్యాప్తంగా ఈ అరుదైన ఫీట్‌ను నమోదు చేసిన నాలుగో క్రికెటర్‌గా రికార్డు నెలకొల్పింది.వన్డే ప్రపంచకప్‌లో (Women's CWC 2025) భాగంగా ఇండోర్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో (India vs England) ఈ గ్రాండ్ డబుల్‌ను సాధించింది. ఈ మ్యాచ్‌లో దీప్తి మొత్తం 4 వికెట్లు తీసి తన వన్డే వికెట్ల సంఖ్యను 153కి పెంచుకుంది. బ్యాటింగ్‌లో దీప్తి 2607 పరుగులు చేసింది.దీప్తికి ముందు స్టెఫనీ టేలర్ (వెస్టిండీస్, 5873 పరుగులు, 155 వికెట్లు), ఎలిస్ పెర్రీ (ఆస్ట్రేలియా , 4414, 166), మారిజన్ కాప్ (దక్షిణాఫ్రికా, 3397, 172) మాత్రమే వన్డేల్లో 2500 పరుగులతో పాటు 150 వికెట్లు తీసిన ఆల్రౌండర్లుగా ఉన్నారు.దీప్తి ప్రభంజనంప్రస్తుత వన్డే ప్రపంచకప్‌లో దీప్తి ప్రభంజనం కొనసాగుతుంది. ఈ మెగా టోర్నీలో ఆమె ఇప్పటివరకు ఆడిన 5 మ్యాచ్‌ల్లో 13 వికెట్లు తీసి లీడింగ్ వికెట్‌టేకర్‌గా కొనసాగుతోంది. టోర్నీ ఓపెనర్‌లో శ్రీలంకపై హాఫ్ సెంచరీ సహా 3 వికెట్లు తీసి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచింది.మ్యాచ్ విషయానికొస్తే.. దీప్తి శర్మ (10-0-51-4) బంతితో రాణించినప్పటికీ ఇంగ్లండ్ భారీ స్కోర్ చేసింది. హీథర్ నైట్ (91 బంతుల్లో 109; 15 ఫోర్లు, సిక్స్) మెరుపు సెంచరీతో చెలరేగడంతో ఆ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 288 పరుగులు చేసింది. నైట్‌తో పాటు ఓపెనర్ యామీ జోన్స్ (56) రాణించింది. కెప్టెన్ నాట్ సీవర్ బ్రంట్ (38) పర్వాలేదనిపించింది.మరో ఓపెనర్ ట్యామీ బేమౌంట్ 22, సోఫీ డంక్లీ 11, అలైస్ క్యాప్సీ 2, సోఫీ ఎక్లెస్టోన్ 3 పరుగులు చేశారు. ఛార్లోట్ డీన్ (19), లిన్సే స్మిత్ (0) నాటౌట్‌గా నిలిచారు. భారత బౌలర్లలో దీప్తి శర్మతో పాటు శ్రీ చరణి (10-0-68-2) మాత్రమే వికెట్లు తీసింది.అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన భారత్ 42 పరుగులకే ప్రతిక రావల్ (6), హర్లీన్ డియోల్ (24) వికెట్లు కోల్పోవడంతో ఆచితూచి ఆడుతుంది. స్మృతి మంధన (34), కెప్టెన్ హర్మన్ (33) మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడుతున్నారు. 19.1 ఓవర్ల తర్వాత జట్టు స్కోర్ 100/2గా ఉంది. చదవండి: టీమిండియా జైత్రయాత్రకు బ్రేక్.. కోహ్లి సరసన గిల్ -
టీమిండియా జైత్రయాత్రకు బ్రేక్.. కోహ్లి సరసన గిల్
వన్డే క్రికెట్లో టీమిండియా (Team India) జైత్రయాత్రకు బ్రేక్ పడింది. ఈ ఏడాది రోహిత్ శర్మ సారథ్యంలో వరుసగా 8 మ్యాచ్‌ల్లో గెలిచిన భారత జట్టు.. శుభ్‌మన్ గిల్ (Shubman Gill) నేతృత్వంలో తొలి పరాజయాన్ని ఎదుర్కొంది.పెర్త్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో (India vs Australia) భారత్ 7 వికెట్ల తేడాతో (డక్‌వర్త్ లూయిస్ పద్దతిలో) ఓటమిపాలైంది. వన్డేల్లో దాదాపుగా రెండేళ్ల తర్వాత భారత్‌కు ఇది తొలి పరాజయం. భారత్ చివరిగా 2023 డిసెంబర్ 19న సౌతాఫ్రికా చేతిలో ఓడింది.లేట్‌గా పలకరించిన పరాజయంఈ ఏడాది వన్డేల్లో భారత్‌ను పరాజయం చాలా లేట్‌గా పలకరించింది. 1991 తర్వాత ఓ ఏడాది అత్యంత లేట్‌గా పలకరించిన పరాజయం ఇది. నాడు భారత్‌కు తొలి వన్డే పరాజయం అక్టోబర్ 23న ఎదురైంది.టీమిండియా జైత్రయాత్రకు బ్రేక్ వేసిన గిల్వన్డేల్టో టీమిండియా జైత్రయాత్రకు శుభ్‌మన్ గిల్ బ్రేక్‌లు వేశాడు. భారత వన్డే జట్టుకు రెగ్యులర్ కెప్టెన్‌గా గిల్ తన ప్రయాణాన్ని ఓటమితో ప్రారంభించాడు.కోహ్లి సరసన గిల్ఈ ఓటమితో గిల్ మరో అప్రతిష్టను కూడా మూటగట్టుకున్నాడు. విరాట్ కోహ్లి తర్వాత మూడు ఫార్మాట్లలో తొలి మ్యాచ్‌లో ఓటమిపాలైన భారత కెప్టెన్‌గా చెత్త రికార్డును సొంతం చేసుకున్నాడు.మ్యాచ్ విషయానికొస్తే.. పెర్త్‌లో కొత్తగా నిర్మించిన ఓపస్ స్టేడియంలో ఆస్ట్రేలియా బోణీ కొట్టింది. వర్షం అంతరాయాల నడుమ 26 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో భారత్ తొలుత బ్యాటింగ్ చేసి 136 పరుగులకే పరిమితమైంది. అనంతరం ఆసీస్ 21.1 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. మిచెల్ మార్ష్ (46 నాటౌట్) ఆసీస్‌ను విజయతీరాలకు చేర్చాడు. భారత్ తరఫున కేఎల్ రాహుల్ (38) టాప్ స్కోరర్‌గా నిలువగా.. ఆఖర్లో అరంగేట్రం ఆటగాడు నితీశ్ కుమార్ రెడ్డి (19 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు.నాలుగు నెలల విరామం తర్వాత (ఛాంపియన్స్ ట్రోఫీ) రీఎంట్రీ ఇచ్చిన రోహిత్ శర్మ (8), విరాట్ కోహ్లి (0) ఈ మ్యాచ్‌లో దారుణంగా విఫలమయ్యారు. ఫుల్‌టైమ్ వన్డే కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్ (10) కూడా తొలి మ్యాచ్‌లో నిరాశపరిచాడు.ఆసీస్ బౌలర్లలో జోష్ హాజిల్‌వుడ్, మిచెల్ ఓవెన్, కుహ్నేమన్ తలో 2 వికెట్లు తీయగా.. స్టార్క్, ఎల్లిస్ చెరో వికెట్ పడగొట్టారు. ఈ సిరీస్‌లో రెండో వన్డే అక్టోబర్ 23న అడిలైడ్ వేదికగా జరుగనుంది. కాగా, భారత జట్టు 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్, 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే.చదవండి: Test Twenty: క్రికెట్లో సరికొత్త ఫార్మాట్.. వచ్చే ఏడాది జనవరిలో ప్రారంభం -
బ్యాటర్ల వైఫల్యం.. ఆసీస్ చేతిలో చిత్తైన టీమిండియా
ఆస్ట్రేలియా పర్యటనను టీమిండియా (Team India) ఓటమితో ప్రారంభించింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా పెర్త్ వేదికగా జరిగిన తొలి వన్డేలో (India vs Australia) 7 వికెట్ల తేడాతో పరాజయంపాలైంది. వరుణుడి ఆటంకాల నడుమ సాగిన ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా (Australia) టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది.వరుణుడి ఆటంకాలు.. 26 ఓవర్ల మ్యాచ్పలు అంతరాయాల తర్వాత మ్యాచ్‌ను 26 ఓవర్లకు కుదించారు. ఆసీస్ ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 9 వికెట్ల నష్టానికి 136 పరుగులు మాత్రమే చేయగలిగింది.ఆదుకున్న రాహుల్, అక్షర్.. నితీశ్ మెరుపులువికెట్కీపర్ కేఎల్ (38), అక్షర్ పటేల్ (31) ఓ మోస్తరు స్కోర్లు చేయడంతో ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది. ఆఖరి ఓవర్లో అరంగేట్రం ఆటగాడు నితీశ్ కుమార్ రెడ్డి (19 నాటౌట్) రెండు సిక్సర్లు బాది గౌరవప్రదమైన స్కోర్ అందించాడు.దారుణంగా విఫలమైన రోహిత్, కోహ్లినాలుగు నెలల విరామం తర్వాత (ఛాంపియన్స్ ట్రోఫీ) రీఎంట్రీ ఇచ్చిన రోహిత్ శర్మ (8), విరాట్ కోహ్లి (0) దారుణంగా విఫలమయ్యారు. ఫుల్‌టైమ్ వన్డే కెప్టెన్‌గా తొలి మ్యాచ్‌లోనే శుభ్‌మన్ గిల్ (10) నిరాశపరిచాడు. శ్రేయస్ అయ్యర్ (11) పరుగులు చేసేందుకు చాలా ఇబ్బంది పడ్డాడు. వాషింగ్టన్ సుందర్ 10, హర్షిత్ రాణా 1, అర్షదీప్ సింగ్ డకౌటయ్యారు. సత్తా చాటిన ఆసీస్ బౌలర్లుఆసీస్ బౌలర్లలో జోష్ హాజిల్‌వుడ్, మిచెల్ ఓవెన్, కుహ్నేమన్ తలో 2 వికెట్లు తీయగా.. స్టార్క్, ఎల్లిస్ చెరో వికెట్ పడగొట్టారు.సునాయాసంగా ఛేదించిన ఆసీస్26 ఓవర్లలో భారత్ 136 పరుగులు చేసినప్పటికీ.. డక్‌వర్త్ లూయిస్ పద్దతి ప్రకారం ఆసీస్ లక్ష్యాన్ని అన్నే ఓవర్లలో 131 పరుగులకు కుదించారు. ఆసీస్ 21.1 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. మిచెల్ మార్ష్ (46 నాటౌట్), రెన్షా (21 నాటౌట్) ఆసీస్‌ను విజయతీరాలకు చేర్చారు. ఆసీస్ ఇన్నింగ్స్‌లో ట్రవిస్ హెడ్ (8), మాథ్యూ షార్ట్ (8) విఫలం కాగా.. జోష్ ఫిలిప్ (37) పర్వాలేదనిపించాడు. భారత బౌలర్లలో అర్షదీప్, అక్షర్, సుందర్ తలో వికెట్ తీశారు.ఈ సిరీస్‌లో రెండో వన్డే అక్టోబర్ 23న అడిలైడ్ వేదికగా జరుగనుంది. కాగా, భారత జట్టు 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్, 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. చదవండి: Test Twenty: క్రికెట్లో సరికొత్త ఫార్మాట్.. వచ్చే ఏడాది జనవరిలో ప్రారంభం -
విరాట్ కోహ్లి డకౌట్.. చరిత్రలో తొలిసారి..!
పెర్త్ వేదికగా ఆస్ట్రేలియాతో ఇవాళ (అక్టోబర్ 19) జరుగుతున్న తొలి వన్డేలో (India Vs Australia) టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి(Virat Kohli) డకౌటయ్యాడు. 8 బంతులు ఆడి ఖాతా తెరవకుండానే పెవిలియన్‌కు చేరాడు. తొలి బంతి నుంచే ఇబ్బంది పడిన కోహ్లి.. మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో కూపర్ కొన్నోలీకి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆస్ట్రేలియా గడ్డపై వన్డేల్లో కోహ్లికి ఇది తొలి డకౌట్.ఇప్పటివరకు ఆస్ట్రేలియాలో 29 మ్యాచ్‌లు ఆడిన కోహ్లి ఐదు సెంచరీలు, 51కు పైగా సగటుతో పరుగులు చేశాడు. కానీ ఒక్కసారి కూడా డకౌట్ కాలేదు. చాలా విరామం తర్వాత భారీ అంచనాల నడుమ బరిలోకి దిగిన కోహ్లి డకౌట్ కావడంతో అతని అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు.ఓవరాల్‌గా కోహ్లికి వన్డేల్లో ఇది 17వ డకౌట్. భారత్ తరఫున వన్డేల్లో అత్యధిక డకౌట్లైన రికార్డు సచిన్ టెండూల్కర్ (20) పేరిట ఉంది. ఓవరాల్‌గా ఈ రికార్డు సనత్ జయసూర్య (34) ఖాతాలో ఉంది.మ్యాచ్ విషయానికొస్తే.. వరుణుడి ఆటంకాల నడుమ 26 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో భారత్ తొలుత బ్యాటింగ్ చేసి 9 వికెట్ల నష్టానికి 136 పరుగులు మాత్రమే చేయగలిగింది. వికెట్‌కీపర్ కేఎల్ (38), అక్షర్ పటేల్ (31) ఓ మోస్తరు స్కోర్లు చేయడంతో ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది. ఆఖరి ఓవర్లో నితీశ్ కుమార్ రెడ్డి (19 నాటౌట్) రెండు సిక్సర్లు బాది గౌరవప్రదమైన స్కోర్ అందించాడు. ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత రీఎంట్రీ ఇచ్చిన రోహిత్ శర్మ (8), విరాట్ కోహ్లి (0) దారుణంగా విఫలమయ్యారు. ఫుల్‌టైమ్ వన్డే కెప్టెన్‌గా తొలి మ్యాచ్‌లోనే శుభ్‌మన్ గిల్ (10) నిరాశపరిచాడు. శ్రేయస్ అయ్యర్ (11) పరుగులు చేసేందుకు చాలా ఇబ్బంది పడ్డాడు. వాషింగ్టన్ సుందర్ 10, హర్షిత్ రాణా 1, అర్షదీప్ సింగ్ డకౌటయ్యారు. ఆసీస్ బౌలర్లలో జోష్ హాజిల్‌వుడ్, మిచెల్ ఓవెన్, కుహ్నేమన్ తలో 2 వికెట్లు తీయగా.. స్టార్క్, ఎల్లిస్ చెరో వికెట్ పడగొట్టారు.కాగా, భారత జట్టు 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్, అనంతరం 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. చదవండి: IND vs AUS: రోహిత్ శర్మ అరుదైన రికార్డు.. సచిన్, ధోని సరసన -
విధ్వంసకర వీరుడికే ప్రతిష్టాత్మక అవార్డు.. సహచరుడు పోటీ పడినా..!
టీమిండియా నయా విధ్వంసకర బ్యాటర్ అభిషేక్ శర్మ (Abhishek Sharma) ప్రతిష్టాత్మక ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డు (ICC Player Of The Month Award) గెలుచుకున్నాడు. సెప్టెంబర్ నెలకు గానూ అభిషేక్ ఈ అవార్డును కైవసం చేసుకున్నాడు. ఈ అవార్డు కోసం అభిషేక్‌తో పాటు మరో టీమిండియా ఆటగాడు కుల్దీప్ యాదవ్, జింబాబ్వే బ్యాటర్ బ్రియాన్ బెన్నెట్ పోటీ పడ్డారు. ఓటింగ్ అనంతరం అభిషేక్ విజేతగా ఆవిర్భవించాడు.అభిషేక్ ఈ అవార్డు గెలుచుకోవడం ఇది మొదటిసారి. భారత్ తరఫున ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డు గెలుచుకున్న 10వ ఆటగాడు అభిషేక్. అభిషేక్‌కు ముందు శుభ్‌మన్ గిల్ (4 సార్లు), బుమ్రా (2), శ్రేయస్ అయ్యర్ (2), పంత్, అశ్విన్, భువనేశ్వర్ కుమార్, విరాట్ కోహ్లి, యశస్వి జైస్వాల్, సిరాజ్ ఈ అవార్డు గెలుచుకున్నారు.అభిషేక్ సెప్టెంబర్ నెలలో విశేషంగా రాణించినందుకు ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డు దక్కింది. టీ20 ఆసియా కప్‌లో అతను 7 మ్యాచ్‌ల్లో 200 స్ట్రైక్ రేట్‌తో, 44.85 సగటున 314 పరుగులు చేశాడు. అభిషేక్ ప్రదర్శనల కారణంగా భారత్ ఆసియా కప్‌ను సునాయాసంగా గెలుచుకుంది.అభిషేక్ ప్రస్తుతం అంతర్జాతీయ టీ20ల్లో నంబర్ వన్ బ్యాటర్‌గా కొనసాగుతున్నాడు. ఆసియా కప్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా నిలిచి, ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ అవార్డు గెలుచుకున్న అభిషేక్.. ఆ ప్రదర్శనల తర్వాత ఐసీసీ టీ20 బ్యాటర్ల ర్యాంకింగ్స్ చరిత్రలో అత్యధిక రేటింగ్ పాయింట్లు సాధించిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు.మహిళల విభాగంలో మంధనమహిళల విభాగంలో సెప్టెంబర్ నెల ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డు టీమిండియాకే చెందిన స్మృతి మంధనకు (Smriti Mandhana) దక్కింది. గత నెలలో ఆసీస్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో (58, 117, 125) విశేషంగా రాణించినందుకు ఆమె ఈ అవార్డును కైవసం చేసుకుంది. ఈ అవార్డు కోసం మంధనతో పాకిస్తాన్‌కు చెందిన సిద్రా అమీన్, సౌతాఫ్రికాకు చెందిన తజ్మిన్ బ్రిట్స్ పోటీ పడ్డారు. తిరుగులేని ప్రదర్శన కారణంగా మంధననే ఈ అవార్డు వరించింది. చదవండి: Chiranjeevi: ఆసియా కప్ హీరోకు మెగా సన్మానం.. కేక్ కట్ చేయించిన చిరు -
చరిత్ర సృష్టించనున్న రోహిత్ శర్మ
టీమిండియా తాజా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) చరిత్ర సృష్టించనున్నాడు. అంతర్జాతీయ క్రికెట్లో (వన్డేలు, టెస్ట్‌లు, టీ20లు) 500 మ్యాచ్‌ల మార్కును తాకనున్న పదో ఆటగాడిగా, నాలుగో భారతీయుడిగా రికార్డు నెలకొల్పనున్నాడు.అక్టోబర్ 19న ఆస్ట్రేలియాతో జరుగబోయే వన్డే మ్యాచ్ (India vs Australia) రోహిత్‌కు అంతర్జాతీయ కెరీర్లో 500వ మ్యాచ్ అవుతుంది. ఇప్పటివరకు 499 మ్యాచ్‌లు ఆడిన హిట్‌మ్యాన్ 42.18 సగటున, 49 సెంచరీల సాయంతో 19700 పరుగులు చేశాడు.అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన రికార్డు దిగ్గజం సచిన్ టెండూల్కర్ పేరిట ఉంది. సచిన్ మూడు ఫార్మాట్లలో 664 మ్యాచ్‌లు ఆడి 100 శతకాల సాయంతో 34357 పరుగులు చేశాడు.సచిన్ తర్వాత భారత్ తరఫున విరాట్ కోహ్లి (550), ఎంఎస్ ధోని (538), రాహుల్ ద్రవిడ్ (509) మాత్రమే 500 అంతర్జాతీయ మ్యాచ్‌ల అరుదైన మైలురాయిని తాకారు.కాగా, రోహిత్ శర్మ గతేడాది (2024) టీ20 ప్రపంచకప్ గెలిచాక పొట్టి ఫార్మాట్‌కు, ఇటీవలి ఇంగ్లండ్ పర్యటనకు ముందు టెస్ట్‌లకు రిటైర్మెంట్ ప్రకటించి, వన్డే ఫార్మాట్లో మాత్రమే కొనసాగుతున్నాడు. రోహిత్ చివరిగా ఈ ఏడాది మార్చిలో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలో పాల్గొన్నాడు. ఆ టోర్నీలో కెప్టెన్‌గా వ్యవహించిన హిట్‌మ్యాన్ టీమిండియాను ఛాంపియన్‌గా నిలిపాడు.రోహిత్ 2027 వన్డే ప్రపంచకప్ వరకు వన్డేలు ఆడాలని ప్రణాళిక సిద్దం చేసుకున్నాడు. ఇందులో భాగంగా భారీగా బరువు తగ్గి, కెరీర్ తొలినాళ్లలో రోహిత్‌ను గుర్తు చేస్తున్నాడు. వన్డేల్లో రోహిత్ భవితవ్యం ఆసీస్ పర్యటనలో ప్రదర్శనపై ఆధారపడి ఉంటుంది. ఈ పర్యటనలో రాణిస్తే హిట్‌మ్యాన్‌ను తిరుగుండదు.ఆస్ట్రేలియా పర్యటనలో భారత్ మూడు వన్డేలు ఆడనుంది. ఆసీస్‌పై హిట్‌మ్యాన్‌ను అద్భుతమైన ట్రాక్ రికార్డు ఉంది. ఈ జట్టుపై అతను 46 ఇన్నింగ్స్‌ల్లో 57.3 సగటున 2407 పరుగులు చేశాడు. ఇందులో 8 సెంచరీలు, 9 అర్ద సెంచరీలు ఉన్నాయి.🚨 ROKO IN NETS AT PERTH 🚨- Virat Kohli & Rohit Sharma in the bathing practice together at Perth ahead of ODI series. 🐐 (RevSportz).pic.twitter.com/1IMvphZIvi— Tanuj (@ImTanujSingh) October 16, 2025అభిమానులు రోహిత్ నుంచి మరోసారి ఇదే ప్రదర్శనను ఆశిస్తున్నారు. ఫ్యాన్స్ కోరికల అనుగుణంగానే హిట్‌మ్యాన్ కూడా కఠోరంగా శ్రమిస్తున్నాడు. నిన్న పెర్త్‌లో ల్యాండ్ అయిన వెంటనే ప్రాక్టీస్ మొదలుపెట్టాడు. విరాట్ కోహ్లితో కలిసి గంటల కొద్ది నెట్స్‌లో చమటోడ్చాడు.చదవండి: హర్భజన్ సింగ్ రీఎంట్రీ -
హర్భజన్ సింగ్ రీఎంట్రీ
టీమిండియా మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ (Harbhajan Singh) కాంపిటేటివ్ క్రికెట్లోకి తిరిగి అడుగు పెట్టబోతున్నాడు. త్వరలో ప్రారంభం కాబోయే అబుదాబీ టీ10 లీగ్‌లో (Abu Dhabi T10 League) అస్పిన్ స్టాల్లియన్స్ (Aspin Stallions) అనే ఫ్రాంచైజీకి ప్రాతినిథ్యం వహించన్నాడు.2021లో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన హర్భజన్.. ఇటీవల వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ టోర్నీలో (World Championship of Legends) ఇండియా ఛాంపియన్స్ తరఫున బరిలోకి దిగాడు. పాకిస్తాన్‌తో రాజకీయ ఉద్రిక్తతల కారణంగా ఆ టోర్నీ సెమీ ఫైనల్లోనే భారత్ వాకౌట్ చేసింది.ఆ మధ్యలోనూ హర్భజన్ పలు ఫ్రాంచైజీ బేస్డ్ టోర్నీలు ఆడాడు. హర్భజన్‌కు అబుదాబీ లీగ్ కొత్తే అయినా, టి10 ఫార్మాట్ మాత్రం పరిచయమే. 2023లో అతను అమెరికాలో జరిగిన యూఎస్ మాస్టర్స్ టీ10 లీగ్‌లో (US Masters T10 League) ఆడాడు. ఆ టోర్నీలో అతను మోరిస్విల్లే యూనిటీ తరఫున బరిలోకి దిగాడు.అబుదాబీ టీ10 లీగ్‌లో హర్భజన్ ప్రాతినిథ్యం వహించబోయే ఫ్రాంచైజీ ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్ మాజీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్, ప్రస్తుతం యూఏఈ ఫెడరల్ నేషనల్ కౌన్సిల్ సభ్యుడు అయిన అహ్మద్ ఖూరీకి (Ahmad Khoori) చెందింది.2017 పురుడు పోసుకున్న అబుదాబీ టీ10 లీగ్‌లో ఈసారి Aspin Stallionsతో పాటు మరికొన్ని కొత్త ఫ్రాంచైజీలు (Vista Riders, Ajman Titans, Royal Champs) పరిచయం కానున్నాయి. ఈ టోర్నీ నవంబర్ 18 నుంచి 30 వరకు అబుదాబిలో జరుగనుంది.Aspin Stallionsలో హర్భజన్‌తో పాటు మరికొంత మంది అంతర్జాతీయ ఆటగాళ్లు ఉన్నారు. ఇంగ్లండ్ వికెట్ కీపర్ బ్యాటర్ సామ్ బిల్లింగ్స్, ఇంగ్లండ్ లెఫ్ట్ ఆర్మ్ పేసర్ టైమల్ మిల్స్, వెస్టిండీస్ పవర్ హిట్టర్ ఆండ్రే ఫ్లెచర్, శ్రీలంక ఆటగాళ్లు అవిష్క ఫెర్నాండో, బినురా ఫెర్నాండో, యూఏఈ ఆటగాడు జోహైర్ ఇక్బాల్ ఈ జట్టు తరఫున బరిలోకి దిగనున్నారు.చదవండి: IND vs AUS: గ్లెన్ మ్యాక్స్‌వెల్ సంచలన నిర్ణయం -
చెలరేగిన షమీ.. భారత సెలెక్టర్లకు దిమ్మతిరిగే కౌంటర్
ఆస్ట్రేలియా పర్యటనకు తనను ఎంపిక చేయని భారత సెలెక్టర్లకు వెటరన్ పేసర్, బెంగాల్ ఆటగాడు మహ్మద్ షమీ (Mohammed Shami) దిమ్మతిరిగే కౌంటరిచ్చాడు. ఇవాళ (అక్టోబర్ 15) ప్రారంభమైన రంజీ ట్రోఫీలో (Ranji Trophy 2025-26) ఉత్తరాఖండ్‌పై 4 బంతుల్లో 3 వికెట్లు తీసి టీమిండియాకు అడేందుకు 100 శాతం అర్హుడినన్న సందేశం పంపాడు.షమీ తీసిన 3 వికెట్లలో రెండు క్లీన్ బౌల్డ్‌లు కాగా.. మరొకటి క్యాచ్ ఔట్. షమీతో పాటు ఇషాన్ పోరెల్ (15-3-40-3), సూరజ్ సింధు జైస్వాల్ (19-4-54-4) చెలరేగడంతో ఉత్తరాఖండ్ 72.5 ఓవర్లలో 213 పరుగులకే చాపచుట్టేసింది. ఉత్తరాఖండ్ ఇన్నింగ్స్‌లో భుపేన్ లాల్వాని (71) ఒక్కడే రాణించాడు. మిగతా ఆటగాళ్లలో కనీసం ఒక్కరూ 30 పరుగుల మార్కును తాకలేకపోయారు.ఇదిలా ఉంటే, గత కొంతకాలంగా షమీని భారత సెలెక్టర్లు ఉద్దేశపూర్వకంగా పక్కకు పెడుతున్నారన్న ప్రచారం జరుగుతుంది. 2023 వన్డే ప్రపంచకప్‌లో ఊహలకందని రీతిలో రాణించిన షమీ.. గాయం కారణంగా ఏడాదికాలం పాటు ఆటకు దూరంగా ఉన్నాడు. సుదీర్ఘ నిరీక్షణ అనంతరం ఈ ఏడాది స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరిగిన పరిమిత ఓవర్ల సిరీస్‌తో రీఎంట్రీ ఇచ్చాడు. ఆతర్వాత ఛాంపియన్స్ ట్రోఫీలో కూడా ఆడిన షమీ.. ఏడు నెలలుగా జట్టుకు దూరంగా ఉన్నాడు. పూర్తి ఫిట్నెస్ సాధించి, దేశవాలీ క్రికెట్లో రాణిస్తున్నా సెలెక్టర్లు షమీని పట్టించుకోవడం లేదు. అతను చివరిగా 2023 జూన్‌లో టెస్ట్ మ్యాచ్ ఆడాడు.ఇటీవలి ఇంగ్లండ్ పర్యటనకు అతన్ని ఎంపిక చేస్తారని అంతా అనుకున్నారు. అయితే అలా జరగలేదు. తాజాగా ఆస్ట్రేలియా పర్యటనకైనా ఎంపిక చేస్తారని షమీ పూర్తి విశ్వాసంతో ఉన్నాడు. సెలెక్టర్లు ఈసారి కూడా పట్టించుకోలేదు. తాజాగా అతను ఆసీస్ పర్యటనకు ఎంపిక కాకపోవడంపై స్పందించాడు.ఫిట్నెస్ సాకుగా చూపిస్తూ నన్ను పక్కకు పెట్టారు. ఫిట్నెస్ లేకపోతే రంజీ ట్రోఫీలో ఎలా ఆడతానన్న అర్దం వచ్చేలా వ్యాఖ్యానించాడు. సెలెక్లరు, కోచ్, కెప్టెన్ అనుకుంటేనే తాను జట్టులో ఉంటానని అన్నాడు. ఈ వాఖ్యలు చేసిన తర్వాత షమీ బంతితోనే సెలెక్టర్లను సమాధానం చెప్పాలని అనుకున్నాడు. అలాగే చేశాడు. మున్ముందైనా సెలెక్టర్లు షమీని పరిగణలోకి తీసుకుంటారో లేదో చూడాలి.చదవండి: శతక్కొట్టిన ఇషాన్ కిషన్ -
టీమిండియాకు దెబ్బ మీద దెబ్బ
మహిళల వన్డే ప్రపంచకప్ 2025లో (Women's CWC 2025) భారత్‌కు (Team India) వరుస ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. టోర్నీ ప్రారంభంలో వరుసగా రెండు మ్యాచ్‌ల్లో (శ్రీలంక, పాకిస్తాన్) గెలిచిన టీమిండియా, ఆతర్వాత వరుసగా సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా చేతుల్లో పరాభవాలు ఎదుర్కొంది. ఈ రెండు మ్యాచ్‌ల్లో భారత్ గెలిచే స్థితిలో ఉండి కూడా అవకాశాలు చేజార్చుకుంది. ముఖ్యంగా ఆసీస్‌తో మ్యాచ్‌లో భారత్ 330 పరుగులు చేసి కూడా మ్యాచ్‌ను కాపాడుకోలేకపోయింది. సౌతాఫ్రికా మ్యాచ్‌లో ఇంత భారీ స్కోర్ చేయకపోయినా బౌలర్ల వైఫల్యం కారణంగా చేతిలోకి వచ్చిన మ్యాచ్ చేజారింది.తాజాగా ఆసీస్ కొట్టిన దెబ్బ నుంచి ఇంకా తేరుకోక ముందే టీమిండియాకు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆ మ్యాచ్‌లో స్లో ఓవర్ రేట్ (Slow Over Rate) కారణంగా భారత ఆటగాళ్ల మ్యాచ్ ఫీజ్‌ల్లో 5 శాతం కోత విధించారు. నిర్దేశిత సమయంలోగా భారత బౌలర్లు ఓ ఓవర్ వెనుకపడి ఉండటంతో ఐసీసీ ఈ జరిమానా విధించింది. ఐసీసీ కోడ్ ఆఫ్ కాండక్ట్‌లో ఆర్టికల్ 2.22 నిబంధన ప్రకారం నిర్దేశిత సమయంలోగా పూర్తి చేయని ప్రతి ఓవర్‌కు ఆటగాళ్ల మ్యాచ్ ఫీజ్‌లో 5 శాతం కొత విధిస్తారు.ఇదిలా ఉంటే, ప్రస్తుత ప్రపంచ కప్‌లో భారత్ తమ తదుపరి మ్యాచ్‌లో ఇంగ్లండ్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్ అక్టోబర్ 19న ఇండోర్‌లో జరుగనుంది. ఈ టోర్నీలో భారత్ నాలుగు మ్యాచ్‌ల్లో రెండు విజయాలతో పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉంది. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, సౌతాఫ్రికా జట్లు తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి. చదవండి: ప్రపంచ ఛాంపియన్లకు షాకిచ్చిన పాకిస్తాన్ -
టీమిండియా ఎన్నో స్థానంలో ఉందంటే..?
స్వదేశంలో వెస్టిండీస్‌తో జరిగిన రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ను భారత్ 2-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసింది. ఇవాళ (అక్టోబర్ 15) ముగిసిన రెండో టెస్ట్‌లో భారత్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. అంతకుముందు తొలి టెస్ట్‌లో ఇన్నింగ్స్ 140 పరుగుల తేడాతో గెలుపొందింది.ఈ సిరీస్ గెలుపుతో టీమిండియా వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ 2025-27కు (WTC) సంబంధించి పాయింట్ల శాతాన్ని భారీగా పెంచుకుంది. ఈ సిరీస్‌కు ముందు భారత డబ్ల్యూటీసీ పాయింట్ల శాతం 43.56 శాతంగా ఉండింది. ఈ సిరీస్ గెలుపుతో భారత్ ఖాతాలో 18.34 పాయింట్ల శాతం చేరి ఈ సంఖ్యను 61.90కి పెంచింది.విండీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన తర్వాత భారత్ పాయింట్ల శాతాన్ని భారీగా పెంచుకున్నా, పట్టికలో మాత్రం మూడో స్థానంలోనే ఉంది. ఈ డబ్ల్యూటీసీ సైకిల్లో భారత్ 7 మ్యాచ్‌ల్లో 4 విజయాలు, 2 పరాజయాలు, ఓ డ్రాతో 52 పాయింట్లు సాధించింది.ఆస్ట్రేలియా, శ్రీలంక టాప్-2లో కొనసాగుతున్నాయి. ఆస్ట్రేలియా 3 మ్యాచ్‌ల్లో 3 విజయాలతో 100 శాతం పాయింట్లు సాధించగా.. శ్రీలంక 2 మ్యాచ్‌ల్లో ఓ విజయం, ఓ డ్రాతో 66.67 పాయింట్ల శాతాన్ని కలిగి ఉంది.ఈ జాబితాలో ఆస్ట్రేలియా, శ్రీలంక, భారత్ తర్వాతి స్థానాల్లో ఇంగ్లండ్ (43.33), బంగ్లాదేశ్ (16.67), వెస్టిండీస్, న్యూజిలాండ్, పాకిస్తాన్, సౌతాఫ్రికా ఉన్నాయి.కాగా, ప్రస్తుత డబ్ల్యూటీసీ సైకిల్లో టీమిండియా తదుపరి టాస్క్ నవంబర్‌లో ఎదుర్కొంటుంది. నవంబర్ 14 నుంచి సౌతాఫ్రికా భారత్‌లో పర్యటిస్తుంది. ఈ పర్యటనలో భాగంగా తొలుత రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ జరుగుతుంది. అనంతరం మూడు వన్డేలు, ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ జరుగుతుంది.చదవండి: సిగ్గుచేటు అంటూ గంభీర్ ఫైర్.. బీసీసీఐ స్పందన ఇదే -
రేపటి నుంచి దేశీయ క్రికెట్ మహా సంగ్రామం ప్రారంభం
రేపటి నుంచి (అక్టోబర్ 15) దేశీయ క్రికెట్ మహా సంగ్రామం రంజీ ట్రోఫీ 2025-26 (Ranji Trophy) ప్రారంభం కానుంది. ఈ టోర్నీకి ఇది 91వ ఎడిషన్. ఇందులో మొత్తం 38 జట్లు పోటీపడనున్నాయి. 28 రాష్ట్రాలకు చెందిన జట్లు (కొన్ని రాష్ట్రాలకు సంబంధించి రెండుకు మించి జట్లు ఉన్నాయి), 4 కేంద్ర పాలిత ప్రాంతాల జట్లు, అలాగే సర్వీసెస్, రైల్వేస్ జట్లు పాల్గొంటున్నాయి.గత సీజన్లో విదర్భ విజేతగా, కేరళ రన్నరప్‌గా నిలిచాయి. తొలి మ్యాచ్‌లో ఉత్తర్‌ప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ జట్లు తలపడనున్నాయి. రేపు మొత్తం 16 మ్యాచ్‌లు ప్రారంభమవుతాయి. ఈ టోర్నీ కోసం దాదాపుగా అన్ని జట్లు తమ ఆటగాళ్లను ప్రకటించాయి. ఈసారి టోర్నీకి చాలామంది టీమిండియా స్టార్లు అందుబాటులో ఉన్నారు.రంజీ ట్రోఫీ 2025-26లో ఆడనున్న కీలక ఆటగాళ్లు..ముంబై- శార్దూల్ ఠాకూర్, అజింక్య రహానే, ఆయుశ్ మాత్రే, శివమ్ దూబే, సర్ఫరాజ్ ఖాన్కేరళ- సంజూ శాంసన్కర్ణాటక- మయాంక్ అగర్వాల్, కరుణ్ నాయర్జార్ఖండ్- ఇషాన్ కిషన్హైదరాబాద్- తిలక్ వర్మబీహార్- వైభవ్ సూర్యవంశీబెంగాల్- మహ్మద్ షమీఉత్తరప్రదేశ్- రింకూ సింగ్అస్సాం- రియాన్ పరాగ్కాగా, రంజీ ట్రోఫీలో అత్యధిక టైటిళ్లు ముంబై గెలుచుకుంది. ఆ జట్టు ఇప్పటివరకు 42 సార్లు ఛాంపియన్‌గా నిలిచింది. ముంబై తర్వాత కర్ణాటక/మైసూర్ అత్యధికంగా 8 టైటిళ్లు సాధించింది. ఆతర్వాతి స్థానాల్లో ఢిల్లీ (7), మధ్యప్రదేశ్/హోల్కర్ (5), బరోడా (5), సౌరాష్ట్ర (2), విదర్భ (2), బెంగాల్ (2), తమిళనాడు/మద్రాస్ (2), రాజస్తాన్ (2) జట్లు ఉన్నాయి.చదవండి: కింగ్ కోహ్లి వచ్చేశాడు..! -
కింగ్ కోహ్లి వచ్చేశాడు..!
భారత క్రికెట్ అభిమానులు చాలాకాలంగా ఎదురుచూస్తున్న క్షణం వచ్చేసింది. టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి (Virat Kohli) భారత్‌లో (ఢిల్లీ) ల్యాండయ్యాడు. విరాట్ గత కొంతకాలంగా కుటుంబంతో కలిసి లండన్‌లో ఉంటున్నాడు. ఐపీఎల్ 2025 తర్వాత కోహ్లి భారత్‌కు రావడం ఇదే మొదటిసారి.THE AURA OF KING KOHLI..!!!! 🐐- The Arrival of Virat Kohli at home in Delhi. 👑pic.twitter.com/fevrsiSB7L— Tanuj (@ImTanujSingh) October 14, 2025ఇవాళ (అక్టోబర్ 14) ఉదయం కోహ్లి న్యూఢిల్లీ విమానాశ్రయం నుంచి బయటికి వస్తున్న దృశ్యాలు సోషల్‌మీడియాలో వైరలవుతున్నాయి.కోహ్లీని చూసేందుకు అభిమానులు ఎగబడ్డారు. సెల్ఫీల కోసం స్వల్ప తోపులాట కూడా జరిగింది. కింగ్ ఈజ్ బ్యాక్ అంటూ ఫ్యాన్స్ చేసిన నినాదాలతో ఎయిర్పోర్ట్ ప్రాంగణg మార్మోగిపోయింది. ప్రస్తుతం ఎక్స్‌లో #ViratReturns అనే హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్ అవుతుంది.త్వరలో ఆస్ట్రేలియాలో జరుగబోయే సిరీస్ కోసం కోహ్లి ఢిల్లీ నుంచి బయల్దేరతాడు. విరాట్‌తో పాటు రోహిత్ శర్మ కూడా వెళ్తాడని సమాచారం. మిగతా సభ్యులు ప్రత్యేక విమానంలో వెళ్లే అవకాశం ఉంది. ఆస్ట్రేలియాలో భారత్ మూడు వన్డేలు, ఐదు టీ20లు ఆడనుంది. వన్డే మ్యాచ్‌లు అక్టోబర్ 19 (పెర్త్), 23 (అడిలైడ్), 25 (సిడ్నీ) తేదీల్లో జరుగనున్నాయి.విరాట్ టీ20, టెస్ట్ ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించి ప్రస్తుతం వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఆసీస్‌తో వన్డే సిరీస్ ద్వారా కోహ్లీ మళ్లీ అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెడుతున్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత కోహ్లికి ఇదే తొలి సిరీస్. ఈ సిరీస్ తర్వాత కోహ్లి భవిష్యత్‌పై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. కొద్ది రోజులుగా కోహ్లి వన్డేలకు కూడా రిటైర్మెంట్ (ఆసీస్ సిరీస్ తర్వాత) ప్రకటిస్తాడని ప్రచారం జరుగుతుంది. ఏం జరుగుతుందో చూడాలి.చదవండి: సిగ్గు చేటు: అశ్విన్, మాజీ చీఫ్ సెలక్టర్‌పై గంభీర్ ఫైర్ కోహ్లితో పాటు రోహిత్ కూడా టీ20, టెస్ట్‌లకు రిటైర్మెంట్ ప్రకటించిన వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్నాడు. రోహిత్ కూడా ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌కు ఎంపికయ్యాడు. కోహ్లి, రోహిత్‌ల ఆట చూసేందుకు అభిమానులు కళ్లకు వత్తులు పెట్టుకొని ఎదురుచూస్తున్నారు. ఆస్ట్రేలియాలో కోహ్లి, రోహిత్‌ల నుంచి భారీ ఇన్నింగ్స్‌లు ఆశిస్తున్నారు. -
IND VS WI: విండీస్ బ్యాటర్ల అనూహ్య ప్రతిఘటన.. ఫలితం చివరి రోజే..!
న్యూఢిల్లీ టెస్ట్‌లో భారత్ గెలుపు కోసం చివరి రోజు వరకు ఆగాల్సి వచ్చింది. చివరి సెషన్లో విండీస్ నిర్దేశించిన 121 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన టీమిండియా.. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టానికి 63 పరుగులు (18 ఓవర్లు) చేసింది. ఈ మ్యాచ్‌లో భారత్ గెలవాలంటే మరో 58 పరుగులు చేయాల్సి ఉంది.స్వల్ప లక్ష్య ఛేదనలో తొలి ఇన్నింగ్స్ సెంచరీ హీరో యశస్వి జైస్వాల్ (8) ఆదిలోనే ఔట్ కాగా.. కేఎల్ రాహుల్ (25 నాటౌట్), సాయి సుదర్శన్ (30 నాటౌట్) భారత్‌ను విజయం దిశగా తీసుకెళ్తున్నారు. జైస్వాల్ వికెట్ వారికన్‌కు దక్కింది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే టీమిండియా 2 మ్యాచ్‌ల సిరీస్‌ను 2-0తో క్లీన్ స్వీప్ చేస్తుంది. అహ్మదాబాద్ వేదికగా జరిగిన తొలి టెస్ట్‌లో భారత్ ఇన్నింగ్స్ 140 పరుగుల తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే.విండీస్ బ్యాటర్ల అనూహ్య పోరాటంఅంతకుముందు విండీస్ ఫాలో ఆడుతూ అనూహ్యమైన పోరాటాన్ని ప్రదర్శించింది. ఆ జట్టు బ్యాటర్లు ఊహించని రీతిలో ప్రతిఘటించి భారత్ ముందు మూడంకెల టార్గెట్‌ను ఉంచారు.క్యాంప్‌బెల్, హోప్ వీరోచిత శతకాలుతొలుత జాన్ క్యాంప్‌బెల్ (115), షాయ్ హోప్ (103) వీరోచిత శతకాలు బాది విండీస్‌కు ఇన్నింగ్స్ పరాజయాన్ని తప్పించారు. ఆఖర్లో జస్టిన్ గ్రీవ్స్ (50 నాటౌట్), జేడన్ సీల్స్ (32) భారత బౌలర్ల సహనాన్ని పరీక్షించి టీమిండియా ముందు 121 పరుగుల లక్ష్యాన్ని ఉంచారు. గ్రీవ్స్, సీల్స్ చివరి వికెట్‌కు 79 పరుగులు జోడించారు. భారత బౌలర్లలో కుల్దీప్, బుమ్రా తలో 3, సిరాజ్ 2, జడేజా, సుందర్ తలో వికెట్ తీశారు.దీనికి ముందు కుల్దీప్ యాదవ్ (5/82), రవీంద్ర జడేజా (3/46) ధాటికి విండీస్ తొలి ఇన్నింగ్స్‌లో 248 పరుగులకే కుప్పకూలింది. ఆ ఇన్నింగ్స్‌లో అలిక్ అథనాజ్ (41) టాప్ స్కోరర్‌గా నిలిచాడు.ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. యశస్వి జైస్వాల్ (175), కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (129 నాటౌట్) సెంచరీలతో చెలరేగడంతో భారీ స్కోర్ (518/5 డిక్లేర్) చేసింది. సాయి సుదర్శన్ (87) సెంచరీని మిస్ చేసుకోగా.. కేఎల్ రాహుల్ 38, నితీశ్ రెడ్డి 43, జురెల్ 44 పరుగులు చేశారు.చదవండి: కొడుకు 6 వారాల్లో 10 కిలోలు తగ్గితే.. తండ్రి ఆర్నెళ్లలో 38 కేజీలు ఉఫ్!.. వీరి సీక్రెట్ ఇదే -
స్వల్ప ఛేదన.. టీమిండియాకు ఆదిలోనే షాక్
121 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనలో టీమిండియాకు ఆదిలోనే షాక్ తగిలింది. తొలి ఇన్నింగ్స్ సెంచరీ హీరో యశస్వి జైస్వాల్ (Yashasvi Jaiswal) (8) తొలి ఓవర్లోనే రెండు బౌండరీలు బాది జోరుమీదున్నట్లు కనిపించినప్పటికీ.. ఆతర్వాతి ఓవర్లోనే ఔటయ్యాడు. వార్రికన్ బౌలింగ్‌లో ఆండర్సన్ ఫిలిప్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. జైస్వాల్ ఔటయ్యాక కేఎల్ రాహుల్ (14), సాయి సుదర్శన్ (17) మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడుతూ టీమిండియాను లక్ష్యం దిశగా తీసుకెళ్తున్నారు.12 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ వికెట్ నష్టానికి 39 పరుగులుగా ఉంది. ఈ మ్యాచ్‌లో భారత్ గెలవాలంటే మరో 82 పరుగులు చేయాల్సి ఉంది.విండీస్ బ్యాటర్ల అనూహ్య పోరాటంఅంతకుముందు విండీస్ ఫాలో ఆడుతూ అనూహ్యమైన పోరాటాన్ని ప్రదర్శించింది. ఆ జట్టు బ్యాటర్లు ఊహించని రీతిలో ప్రతిఘటించి భారత్ ముందు మూడంకెల టార్గెట్‌ను ఉంచారు.తొలుత జాన్ క్యాంప్‌బెల్ (115), షాయ్ హోప్ (103) వీరోచిత శతకాలు బాది ఇన్నింగ్స్ పరాజయాన్ని తప్పించగా.. ఆఖర్లో జస్టిన్ గ్రీవ్స్ (50 నాటౌట్), జేడన్ సీల్స్ (32) భారత బౌలర్ల సహనాన్ని పరీక్షించి టీమిండియా ముందు 121 పరుగుల లక్ష్యాన్ని ఉంచారు. గ్రీవ్స్, సీల్స్ చివరి వికెట్‌కు 79 పరుగులు జోడించారు. భారత బౌలర్లలో కుల్దీప్, బుమ్రా తలో 3, సిరాజ్ 2, జడేజా, సుందర్ తలో వికెట్ తీశారు.అంతకుముందు కుల్దీప్ యాదవ్ (5/82), రవీంద్ర జడేజా (3/46) ధాటికి విండీస్ తొలి ఇన్నింగ్స్‌లో 248 పరుగులకే కుప్పకూలింది. ఆ ఇన్నింగ్స్‌లో అలిక్ అథనాజ్ (41) టాప్ స్కోరర్‌గా నిలిచాడు.ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. యశస్వి జైస్వాల్ (175), కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (129 నాటౌట్) సెంచరీలతో చెలరేగడంతో భారీ స్కోర్ (518/5 డిక్లేర్) చేసింది. సాయి సుదర్శన్ (87) సెంచరీని మిస్ చేసుకోగా.. కేఎల్ రాహుల్ 38, నితీశ్ రెడ్డి 43, జురెల్ 44 పరుగులు చేశారు.కాగా, రెండు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లోని తొలి టెస్ట్‌లో భారత్ ఇన్నింగ్స్ 140 పరుగుల తేడాతో విండీస్‌ను చిత్తుగా ఓడించిన విషయం తెలిసిందే.చదవండి: World Cup 2025: వరుస ఓటములు.. భారత్ సెమీ ఫైనల్ చేరాలంటే... -
విండీస్ బ్యాటర్ల అనూహ్య పోరాటం.. టీమిండియా టార్గెట్ ఎంతంటే..?
న్యూఢిల్లీ టెస్ట్‌లో విండీస్ బ్యాటర్లు అనూహ్యమైన పోరాటాన్ని ప్రదర్శించారు. ఫాలో ఆన్ ఆడుతూ రెండో ఇన్నింగ్స్‌లో ఊహించని రీతిలో ప్రతిఘటించారు. తొలుత జాన్ క్యాంప్‌బెల్ (115), షాయ్ హోప్ (103) వీరోచిత శతకాలు బాది తమ జట్టుకు ఇన్నింగ్స్ పరాజయాన్ని తప్పించగా.. ఆఖర్లో జస్టిన్ గ్రీవ్స్ (50 నాటౌట్), జేడన్ సీల్స్ (32) భారత బౌలర్ల సహనాన్ని పరీక్షించి టీమిండియా ముందు 121 పరుగుల టార్గెట్‌ను ఉంచారు. గ్రీవ్స్, సీల్స్ చివరి వికెట్‌కు 79 పరుగులు జోడించారు. భారత బౌలర్లలో కుల్దీప్, బుమ్రా తలో 3, సిరాజ్ 2, జడేజా, సుందర్ తలో వికెట్ తీశారు.అంతకుముందు కుల్దీప్ యాదవ్ (5/82), రవీంద్ర జడేజా (3/46) ధాటికి విండీస్ తొలి ఇన్నింగ్స్‌లో 248 పరుగులకే కుప్పకూలింది. ఆ ఇన్నింగ్స్‌లో అలిక్ అథనాజ్ (41) టాప్ స్కోరర్‌గా నిలిచాడు.ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. యశస్వి జైస్వాల్ (175), కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (129 నాటౌట్) సెంచరీలతో చెలరేగడంతో భారీ స్కోర్ (518/5 డిక్లేర్) చేసింది. సాయి సుదర్శన్ (87) సెంచరీని మిస్ చేసుకోగా.. కేఎల్ రాహుల్ 38, నితీశ్ రెడ్డి 43, జురెల్ 44 పరుగులు చేశారు.కాగా, రెండు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లోని తొలి టెస్ట్‌లో భారత్ ఇన్నింగ్స్ 140 పరుగుల తేడాతో విండీస్‌ను చిత్తుగా ఓడించిన విషయం తెలిసిందే.చదవండి: IND VS WI 2nd Test: చెలరేగిపోతున్న మియా భాయ్..! -
IND VS WI: చెలరేగిపోతున్న మియా భాయ్..!
టీమిండియా ఆటగాడు, హైదరాబాదీ పేసర్ మొహమ్మద్ సిరాజ్ (Mohammed Siraj) (మియా భాయ్) ఈ ఏడాది టెస్ట్‌ల్లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నాడు. కొద్ది రోజుల కిందట ఇంగ్లండ్‌లో జరిగిన టెస్ట్ సిరీస్‌లో 5 మ్యాచ్‌ల్లో 23 వికెట్లు తీసి లీడింగ్ వికెట్ టేకర్‌గా నిలిచిన సిరాజ్.. ప్రస్తుతం స్వదేశంలో విండీస్‌తో జరుగుతున్న రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లోనూ అదే తరహా ప్రదర్శనలు కొనసాగిస్తున్నాడు.ఈ సిరీస్‌లోని తొలి మ్యాచ్‌లో 7 వికెట్లు తీసిన మియా.. న్యూఢిల్లీ వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్‌లో మూడు వికెట్లు తీశాడు. ఈ మ్యాచ్‌లో తన మూడో వికెట్ (షాయ్ హోప్) తీసిన అనంతరం సిరాజ్ ఓ అద్భుతమైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.ఈ వికెట్‌తో సిరాజ్ ఈ ఏడాది (2025) టెస్ట్‌ల్లో లీడింగ్ వికెట్ టేకర్‌గా అవతరించాడు. ప్రస్తుతం సిరాజ్ ఖాతాలో 37 వికెట్లు ఉన్నాయి. ఈ రికార్డు సాధించే క్రమంలో సిరాజ్ జింబాబ్వే పేసర్ బ్లెస్సింగ్ ముజరబానీని (26) అధిగమించాడు. సిరాజ్, ముజరబానీ తర్వాత ఈ ఏడాది టెస్ట్‌ల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లుగా మిచెల్ స్టార్క్ (29), నాథన్ లియోన్ (24) ఉన్నారు.భారత్-విండీస్ రెండో టెస్ట్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌లో విండీస్ ఫాలో ఆన్ ఆడుతూ అనూహ్యమైన పోరాటాన్ని ప్రదర్శించింది. తొలుత జాన్ క్యాంప్‌బెల్ (115), షాయ్ హోప్ (103) వీరోచిత శతకాలు బాది తమ జట్టుకు ఇన్నింగ్స్ పరాజయాన్ని తప్పించగా.. ఆఖర్లో జస్టిన్ గ్రీవ్స్ (50 నాటౌట్), జేడన్ సీల్స్ (32) భారత బౌలర్ల సహనాన్ని పరీక్షించి టీమిండియా ముందు 121 పరుగుల టార్గెట్‌ను ఉంచారు. గ్రీవ్స్, సీల్స్ చివరి వికెట్‌కు 79 పరుగులు జోడించారు. భారత బౌలర్లలో కుల్దీప్, బుమ్రా తలో 3, సిరాజ్ 2, జడేజా, సుందర్ తలో వికెట్ తీశారు. అంతకుముందు కుల్దీప్ యాదవ్ (5/82), రవీంద్ర జడేజా (3/46) ధాటికి విండీస్ తొలి ఇన్నింగ్స్‌లో 248 పరుగులకే కుప్పకూలింది. ఆ ఇన్నింగ్స్‌లో అలిక్ అథనాజ్ (41) టాప్ స్కోరర్‌గా నిలిచాడు.ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. యశస్వి జైస్వాల్ (175), కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (129 నాటౌట్) సెంచరీలతో చెలరేగడంతో భారీ స్కోర్ (518/5 డిక్లేర్) చేసింది. సాయి సుదర్శన్ (87) సెంచరీని మిస్ చేసుకోగా.. కేఎల్ రాహుల్ 38, నితీశ్ రెడ్డి 43, జురెల్ 44 పరుగులు చేశారు. కాగా, రెండు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లోని తొలి టెస్ట్‌లో భారత్ ఇన్నింగ్స్ 140 పరుగుల తేడాతో విండీస్‌ను చిత్తుగా ఓడించిన విషయం తెలిసిందే.చదవండి: IND VS WI: వీరోచిత శతకాలు.. చరిత్ర తిరగరాసిన విండీస్ బ్యాటర్లు -
వైజాగ్‌లో టీమిండియా ఫ్యాన్స్ సందడి (ఫోటోలు)
-
IND VS AUS: టీమిండియాపై ఆస్ట్రేలియా విజయం
మహిళల వన్డే ప్రపంచకప్ 2025లో (Women's Cricket World Cup 2025) భాగంగా విశాఖ వేదికగా ఆస్ట్రేలియాతో ఇవాళ (అక్టోబర్ 12) జరిగిన మ్యాచ్‌లో (India vs Australia) భారత్‌పై ఆస్ట్రేలియా మహిళలు 3 వికెట్ల తేడాతో గెలిచారు. నిర్ణీత 49 ఓవర్లలో 331 పరుగులు చేసి టీమిండియాపై ఆస్ట్రేలియా విజయం సాధించింది. మహిళల వన్డే ప్రపంచకప్‌లో భారత్‌కు వరుసగా ఇది రెండవ ఓటమి.తొలుత టాస్ ఓడి ఆస్ట్రేలియా ఆహ్వానం మేరకు బ్యాటింగ్ చేసి 330 పరుగులు (48.5 ఓవర్లలో ఆలౌట్) చేసింది. ఓపెనర్లు స్మృతి మంధన (Smriti Mandhana), ప్రతిక రావల్ (Pratika Rawal) అద్భుతంగా ఆడారు. ముఖ్యంగా మంధన తన సహజ శైలిలో చెలరేగిపోయింది. 66 బంతుల్లోనే 9 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 80 పరుగులు చేసింది. మంధనతో పోలిస్తే ప్రతిక రావల్ కాస్త నిదానంగా ఆడింది. 96 బంతుల్లో 10 ఫోర్లు, సిక్సర్ సాయంతో 75 పరుగులు చేసింది.ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌లో అలీస్సా హీలీ: 142 పరుగులు (107 బంతుల్లో) చేసి తన అద్భుత ఇన్నింగ్స్‌తో మ్యాచ్‌ను గెలిపించింది దాంతో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచింది.ఈ మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగింది, అయితే చివరి ఓవర్లలో ఆసీస్ విజయం సాధించింది. భారత్ మంచి స్కోరు చేసినా, హీలీ అద్భుత ప్రదర్శనతో మ్యాచ్‌ను ఆసీస్ చేతుల్లోకి తీసుకెళ్లింది. -
IND VS AUS: అరుదైన మైలురాయిని తాకిన టీమిండియా బ్యాటర్.. ప్రపంచ రికార్డు
మహిళల వన్డే ప్రపంచకప్ 2025లో భాగంగా ఆస్ట్రేలియాతో ఇవాళ (అక్టోబర్ 12) జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా స్టార్ బ్యాటర్ స్మృతి మంధన (Smriti Mandhana) రికార్డుల మీద రికార్డులు కొల్లగొడుతుంది.తొలుత మహిళల వన్డే క్రికెట్ చరిత్రలో ఓ క్యాలెండర్ ఇయర్లో (2025) 1000 పరుగులు పూర్తి చేసిన తొలి ప్లేయర్‌గా చరిత్ర సృష్టించిన ఆమె.. ఆతర్వాత కొద్ది నిమిషాలకే వన్డేల్లో 5000 పరుగుల అరుదైన మైలురాయిని అందుకుంది. 1000 పరుగుల మార్కును సిక్సర్‌తో తాకిన మంధన.. 5000 పరుగుల మైలురాయిని కూడా సిక్సర్‌తోనే అందుకుంది.బంతులు, ఇన్నింగ్స్‌ల పరంగా మంధన ప్రపంచంలోనే అత్యంత వేగంగా 5000 పరుగుల మైలురాయిని తాకిన బ్యాటర్‌గా ప్రపంచ రికార్డు నెలకొల్పింది. ఈ మైలురాయిని తాకేందుకు ఆమెకు కేవలం 112 ఇన్నింగ్స్‌లు, 5569 బంతులు అవసరమయ్యాయి. గతంలో ఈ రికార్డులు స్టెఫానీ టేలర్ (129 ఇన్నింగ్స్‌లు), సూజీ బేట్స్ (6182 బంతులు) పేరిట ఉండేవి.ఈ రికార్డును అత్యంత పిన్న వయసులో (29) సొంతం చేసుకున్న ప్లేయర్‌గానూ మంధన రికార్డు నెలకొల్పింది.వన్డే క్రికెట్లో మంధన సహా కేవలం 5 మంది మాత్రమే 5000 పరుగులు పూర్తి చేశారు. మిథాలీ రాజ్ (7805) తర్వాత భారత్ తరఫున ఈ మైలురాయిని చేరుకున్న రెండో ప్లేయర్ మంధన మాత్రమే.ఈ మ్యాచ్‌లో మంధన 66 బంతుల్లో 9 ఫోర్లు, 3 భారీ సిక్సర్ల సాయంతో 80 పరుగులు చేసి ఔటైంది. ప్రస్తుత ప్రపంచకప్‌లో మంధనకు ఇదే తొలి అర్ద సెంచరీ (4 మ్యాచ్‌ల్లో).వైజాగ్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో భారత్ టాస్ ఓడి ఆసీస్ ఆహ్వానం మేరకు బ్యాటింగ్ చేస్తుంది. 27 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 171/1గా ఉంది. మంధన ఔట్ కాగా.. ప్రతిక రావల్ (68), హర్లీన్ డియోల్ (12) క్రీజ్‌లో ఉన్నారు. మంధన వికెట్ సోఫీ మోలినెక్స్కు దక్కింది.చదవండి: చరిత్ర సృష్టించిన టీమిండియా బ్యాటర్.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్ -
చరిత్ర సృష్టించిన టీమిండియా బ్యాటర్.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్
భారత మహిళల క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ స్మృతి మంధన (Smriti Mandhana) సరికొత్త చరిత్ర సృష్టించింది. మహిళల వన్డే క్రికెట్ చరిత్రలో ఓ క్యాలెండర్ ఇయర్లో 1000 పరుగులు పూర్తి చేసిన తొలి ప్లేయర్‌గా ప్రపంచ రికార్డు నెలకొల్పింది. వన్డే వరల్డ్‌కప్ 2025లో భాగంగా ఆస్ట్రేలియాతో ఇవాళ (అక్టోబర్ 12) జరుగుతున్న మ్యాచ్‌లో ఈ ఘనత సాధించింది. ఎవరూ సాధించని ఈ ఘనతను మంధన భారీ సిక్సర్‌తో చేరుకోవడం మరో విశేషం.వన్డేల్లో ఓ క్యాలెండర్ ఇయర్లో అత్యధిక పరుగులు (2025లో 18 ఇన్నింగ్స్‌ల్లో 1000* పరుగులు) చేసిన బ్యాటర్ల జాబితాలో మంధన తర్వాతి స్థానాల్లో ఆస్ట్రేలియాకు చెందిన బెలిండా క్లార్క్ (1997లో 970 పరుగులు), లారా వోల్వార్డ్ట్ (2022లో 882 పరుగులు), న్యూజిలాండ్‌కు చెందిన డెబ్బీ హాక్లీ (1997లో 880), న్యూజిలాండ్‌కు చెందిన యామీ సాటర్థ్వైట్ (2016లో 853) ఉన్నారు.మ్యాచ్ విషయానికొస్తే.. వైజాగ్ వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో భారత్ టాస్ ఓడి ఆసీస్ ఆహ్వానం మేరకు బ్యాటింగ్ చేస్తుంది. 17 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 90/0గా ఉంది. ఓపెనర్లు మంధన 49, ప్రతిక రావల్ 40 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు.మంధన@18మంధన ఈ ఏడాది వన్డేల్లో 1000 పరుగుల మార్కును 18 పరుగుల వద్ద చేరుకుంది. 1000 పరుగుల మార్కును ఆమె 18వ ఇన్నింగ్స్‌లో చేరుకుంది. మంధన జెర్సీ నంబర్ కూడా 18 కావడం విశేషం.కాగా, ప్రస్తుత ప్రపంచకప్‌లో భారత్ వరుసగా శ్రీలంక, పాకిస్తాన్‌పై విజయాలు సాధించి, మూడో మ్యాచ్‌లో సౌతాఫ్రికా చేతిలో అనూహ్యంగా ఓడింది. వాస్తవానికి ఆ మ్యాచ్‌లోనూ భారత్‌కు గెలిచే అవకాశం ఉండినప్పటికీ.. నదినే డి క్లెర్క్ సంచలన ఇన్నింగ్స్‌తో భారత్ చేతుల్లో నుంచి మ్యాచ్‌ను లాగేసుకుంది. ప్రస్తుతం భారత్ 3 మ్యాచ్‌ల్లో 2 విజయాలతో పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉంది.ఆసీస్ విషయానికొస్తే.. డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో బరిలోకి దిగిన ఈ జట్టు తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై విజయం సాధించింది. ఆ తర్వాతి మ్యాచ్ (శ్రీలంక) వర్షం కారణంగా తుడిచిపెట్టుకుపోయింది (ఓ పాయింట్ లభించింది). మూడో మ్యాచ్‌లో ఆసీస్ పాక్‌పై ఘన విజయం సాధించింది. ప్రస్తుతం ఆసీస్ 3 మ్యాచ్‌ల్లో 2 విజయాలతో 5 పాయింట్లు ఖాతాలో కలిగి ఉండి పట్టికలో రెండో స్థానంలో ఉంది. 3 మ్యాచ్‌ల్లో మూడు విజయాలు సాధించిన ఇంగ్లండ్ టాప్ ప్లేస్‌లో ఉంది.చదవండి: చరిత్ర సృష్టించిన సౌతాఫ్రికా.. 147 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో తొలి జట్టు -
CWC 2025: ఆస్ట్రేలియాతో సమరం.. టీమిండియా బ్యాటింగ్
మహిళల వన్డే ప్రపంచకప్ 2025లో (Women's Cricket World Cup 2025) ఇవాళ (అక్టోబర్ 12) ఆసక్తికర సమరం జరుగుతుంది. భారత్, ఆస్ట్రేలియా (India vs Australia) జట్లు వైజాగ్ వేదికగా అమీతుమీ తేల్చుకుంటాయి. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా (Australia) టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది. భారత మహిళల జట్టు (Team India) వన్డేల్లో టాస్ కోల్పోవడం ఇది వరుసగా ఆరోసారి. తుది జట్లు..ఆస్ట్రేలియా: అలిస్సా హీలీ (కెప్టెన్/వికెట్‌కీపర్), ఫోబ్ లిచ్‌ఫీల్డ్, ఎల్లీస్ పెర్రీ, బెత్ మూనీ, అన్నాబెల్ సదర్లాండ్, ఆష్లీ గార్డనర్, తహ్లియా మెక్‌గ్రాత్, సోఫీ మోలినెక్స్, కిమ్ గార్త్, అలానా కింగ్, మెగాన్ షుట్భారత్: ప్రతికా రావల్, స్మృతి మంధాన, హర్లీన్ డియోల్, హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), జెమిమా రోడ్రిగ్స్, దీప్తి శర్మ, రిచా ఘోష్ (వికెట్‌కీపర్), అమంజోత్ కౌర్, స్నేహ్ రాణా, క్రాంతి గౌడ్, శ్రీ చరణికాగా, ప్రస్తుత ప్రపంచకప్‌లో భారత్ వరుసగా శ్రీలంక, పాకిస్తాన్‌పై విజయాలు సాధించి, మూడో మ్యాచ్‌లో సౌతాఫ్రికా చేతిలో అనూహ్యంగా ఓడింది. వాస్తవానికి ఆ మ్యాచ్‌లోనూ భారత్‌కు గెలిచే అవకాశం ఉండినప్పటికీ.. నదినే డి క్లెర్క్ సంచలన ఇన్నింగ్స్‌తో భారత్ చేతుల్లో నుంచి మ్యాచ్‌ను లాగేసుకుంది. ప్రస్తుతం భారత్ 3 మ్యాచ్‌ల్లో 2 విజయాలతో పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉంది.ఆసీస్ విషయానికొస్తే.. డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో బరిలోకి దిగిన ఈ జట్టు తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై విజయం సాధించింది. ఆ తర్వాతి మ్యాచ్ (శ్రీలంక) వర్షం కారణంగా తుడిచిపెట్టుకుపోయింది (ఓ పాయింట్ లభించింది). మూడో మ్యాచ్‌లో ఆసీస్ పాక్‌పై ఘన విజయం సాధించింది. ప్రస్తుతం ఆసీస్ 3 మ్యాచ్‌ల్లో 2 విజయాలతో 5 పాయింట్లు ఖాతాలో కలిగి ఉండి పట్టికలో రెండో స్థానంలో ఉంది. 3 మ్యాచ్‌ల్లో మూడు విజయాలు సాధించిన ఇంగ్లండ్ టాప్ ప్లేస్‌లో ఉంది. చదవండి: చరిత్ర సృష్టించిన సౌతాఫ్రికా.. 147 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో తొలి జట్టు -
యంగ్(టె)స్ట్ సూపర్‌స్టార్ దొరికాడు!
జీవితంలో ఏదోటి సాధించాలని ప్రతి ఒక్కరు కల (Dream) కంటారు. కానీ కొంతమంది మాత్రమే స్వప్నాలను సాకారం చేసుకుంటారు. అహరహం శ్రమించే వారు.. కష్టాలు, నష్టాలను ఓర్చుకునే వారే మాత్రమే తాము అనుకున్నది సాధిస్తారు. పేదరికం బెదిరించినా, అవరోధాలు అడ్డుగా నిలిచినా అదరక బెదరక లక్ష్యసాధనకై ముందుకుసాగే వారు మాత్రమే విజేతలవుతారు. చరిత్రలో తమకంటూ ఓ పేజీని లిఖించుకుంటారు. మనం చెప్పుకోబోతున్న యువ క్రికెటర్ కూడా అలాంటి వాడే!క్రికెటర్ కావాలన్న తన కలను నిజం చేసుకోవడానికి 10 ఏళ్ల లేత ప్రాయంలో స్వంత ఊరిని వదిలిపెట్టాడు. ఉత్తరప్రదేశ్‌లోని తన స్వస్థలం సూర్యవాన్ను విడిచిపెట్టి బరువైన బ్యాగ్‌తో పాటు అంతకంటే బరువైన కలను తనతో మోసుకుంటూ ముంబై మహా నగరానికి చేరుకున్నాడు. మొదట ఒక పాల దుకాణం పైకప్పుపై నివసించాడు. అక్కడి నుంచి ఒక్కో అడుగు వేస్తూ తానెంతో ప్రేమించే ఆటకు దగ్గరయ్యాడు. దీని కోసం ఏం చేయాల్సి వచ్చినా వెనుకాడలేదు, వెనుదిరగలేదు. ఆజాద్ మైదాన్ (Azad Maidan) సమీపంలో పానీ పూరీ అమ్మాడు. గ్రౌండ్స్‌మెన్‌తో పరిచయం పెంచుకుని వారితో కలిసి ఒకే టెంట్ పంచుకున్నాడు. అవకాశం దొరికినప్పుడల్లా క్రికెట్ ఆడేవాడు.సంకల్ప శుద్ధి, శ్రమకు సరైన సమయంలో గైడెన్స్ దొరికితే సక్సెస్ దానంతట అదే వస్తుంది. యశ్వసి జైస్వాల్ (Yashasvi Jaiswal) విషయంలో అదే జరిగింది. అవును ఇప్పటివరకు మనం చెప్పుకున్నది ఈ యువ స్టార్ క్రికెటర్ గురించే. కోచ్ జ్వాలా సింగ్ రూపంలో అతడికి సరైన సమయంలో చేయూత దొరికింది. యశస్విలో భవిష్యత్ క్రికెటర్‌ను చూసిన ఆయన.. జైస్వాల్‌కు అన్నివిధాలా అండగా నిలిచాడు. శిక్షణ ఇవ్వడమే కాకుండా ఆశ్రయం, ఆహారంతో పాటు నమ్మకాన్ని కల్పించాడు. ఆయన మార్గదర్శకత్వంలో జైస్వాల్ ఆట పదును తేలింది. అక్కడి నుంచి అతడి ఆటే సందేశం అయింది.బ్యాటింగ్ ఆపలేదుయశస్వి జైస్వాల్‌ను ప్రత్యేకంగా నిలబెట్టింది అతడు ఆడే షాట్లు లేదా టైమింగ్ మాత్రమే కాదు.. అనుకున్నది సాధించే వరకు పట్టు వదలని సంకల్పం. వైఫల్యానికి జైస్వాల్ భయపడేవాడని కోచ్ జ్వాలా సింగ్ తరచూ చెబుతుండేవారు. ఫెయిల్యూర్‌కు భయపడి అతడు ఎప్పుడూ బ్యాటింగ్ ఆపలేదు. మ్యాచ్ తర్వాత మ్యాచ్ ఆడుతూ ప్రతి బంతిని ఎదుర్కొన్నాడు. స్కూల్ క్రికెట్, ముంబై అండర్-16, అండర్-19, తర్వాత ఇండియా అండర్-19 తరపున పరుగులు చేస్తూనే ఉన్నాడు. 2018లో అండర్-19 ఆసియా కప్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. 2020 నాటికి అండర్-19 ప్రపంచ కప్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా గుర్తింపు పొందాడు. ఒకప్పుడు పానీ పూరీ (pani puri) అమ్మిన అదే బాలుడు ఇప్పుడు ప్రతి స్కౌట్ సంతకం చేయాలనుకునే పేరుగా మారిపోయాడు.అన్‌స్టాపబుల్ ప్లేయర్దేశీయ క్రికెట్లో ముంబై తరఫున జైస్వాల్.. అన్‌స్టాపబుల్ ప్లేయర్‌గా మారిపోయాడు. సెంచరీలు సంఖ్య పెరగడంతో అతడి ఫస్ట్ క్లాస్ సగటు 60 దాటింది. రన్స్ సాధించడమే చేయడమే కాదు.. బ్యాటింగ్ చేసిన ప్రతిసారీ తన ప్రతిభను నిరూపించుకున్నాడు. దీంతో ఐపీఎల్ ఫ్రాంచైజీల దృష్టిలో పడ్డాడు. 2020 ఐపీఎల్ వేలంలో రాజస్థాన్ రాయల్స్ ఈ యంగ్ ప్లేయర్‌ను ₹2.4 కోట్లకు దక్కించుకుంది. నమంత్రపు సిరి అతడిని ఏమాత్రం మార్చలేదు. ఆకర్షణ కంటే ఆటకే ఎక్కువ విలువనిచ్చాడు. తన స్వప్నం పూర్తిగా సాకారం కాలేదన్న సత్యాన్ని గమనించి టీమిండియా పిలుపు కోసం ఎదురు చూశాడు.తొలి మ్యాచ్‌లోనే భారీ సెంచరీ2023, జూలై 12.. యశస్వి జైస్వాల్ జీవితంలో మరపురాని రోజు. ఈ రోజున వెస్టిండీస్‌తో ప్రారంభమైన మ్యాచ్‌తో టీమిండియా తరపున టెస్టుల్లో అరంగ్రేటం చేశాడు. తొట్ట తొలి మ్యాచ్‌లోనే భారీ సెంచరీ (171)తో క్రీడా ప్రపంచాన్ని ఆకర్షించాడు. అప్పటి నుంచి టెస్ట్ క్రికెట్లో తనదైన ముద్ర వేసి ముందుకు సాగుతున్నాడు. తన తొలినాళ్లలో సచిన్ టెండూల్కర్ (Sachin Tendulkar) లాగానే, జైస్వాల్ ఇప్పటికే దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌లలో ఆడాడు. దక్షిణాఫ్రికా మినహా, అతడు అన్ని చోట్లా అద్భుతమైన ప్రదర్శన ఇచ్చాడు.జైసూ జైత్రయాత్ర2024లో ఇంగ్లాండ్‌తో జరిగిన స్వదేశీ సిరీస్‌లో జైసూ జైత్రయాత్ర చేశాడు. 40 సంవత్సరాల రికార్డును తిరగరాశాడు. ఒకే టెస్ట్ సిరీస్‌లో 700 పరుగులు పైగా సాధించిన తొలి ఆసియా ఓపెనర్‌గా రికార్డుకెక్కాడు. భారత టెస్ట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ పేరిట ఉన్న రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. తాజాగా భారత్‌లో వెస్టిండీస్‌తో జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్‌లో 175 పరుగులు చేసి శభాష్ అనిపించుకున్నాడు. చిన్న వయసులో ఎక్కువ టెస్ట్ సెంచరీలు సాధించిన రెండో భారత బ్యాటర్‌గా నిలిచాడు. గత రెండేళ్లుగా టెస్టుల్లో జైస్వాల్ హవా కొనసాగుతోంది. తన అరంగేట్రం తర్వాత జో రూట్ మినహా ఎవరూ అతడి కంటే ఎక్కువ టెస్ట్ పరుగులు చేయలేదు. జైసూ చేసిన ఏడు సెంచరీల్లో 4 ఆసియా వెలుపల వచ్చాయి. సచిన్ టెండూల్కర్ తర్వాత అతడే యంగెస్ట్ టెస్ట్ సూపర్‌స్టార్ అన్న కామెంట్లు విన్పిస్తున్నాయి. టీమిండియా ప్రస్తుత కెప్టెన్ శుబ్‌మన్ గిల్ (Shubman Gill) కూడా ఫామ్‌లో ఉన్నప్పటికీ.. జైస్వాల్ కంటే వయసులో అతడు మూడేళ్లు పెద్డోడు. టెస్టుల్లో కంటే వన్డేల్లో గిల్ బ్యాటింగ్ యావరేజ్ మెరుగ్గా ఉంది.చదవండి: తలబాదుకున్న జైస్వాల్.. తప్పు నీదే!దిగ్గజాల సరసన చోటు!23 ఏళ్ల ఎడంచేతి బ్యాటర్ లాంగ్ ఫార్మాట్లో నిలకడగా రాణిస్తున్నాడు. పాతిక టెస్టులకే దాదాపు 50 శాతం బ్యాటింగ్ సగటుతో 7 సెంచరీలు, 12 అర్ధసెంచరీలు బాదాడు. ఇదే స్థిరత్వం కొనసాగిస్తే టెస్ట్ క్రికెట్లో దిగ్గజాల సరసన అతడికి చోటు దక్కడం ఖాయం. టీమిండియా టాప్-5 టెస్ట్ బ్యాటర్ల పేర్ల జాబితాలో ఎడమచేతి వాటం ఆటగాళ్లు చాలా అరుదుగా కనిపిస్తారు. అయితే జైస్వాల్ తన కెరీర్‌ను ముగించే సమయానికి ఈ లిస్ట్ కచ్చితంగా మారుతుందని స్పోర్ట్స్ ఎనలిస్టులు అంచనా వేస్తున్నారు. ఆజాద్ మైదాన్ కుర్రాడు ఇప్పటికే చాలా దూరం వచ్చాడు. ఇంకెంత దూరం ప్రయాణిస్తాడో, ఎన్ని మైలురాళ్లు (Milestones) అందుకుంటాడో చూడాలి!Another stellar performance ✨Yashasvi Jaiswal with yet another superb Test innings 😎Scorecard ▶ https://t.co/GYLslRzj4G#TeamIndia | #INDvWI | @IDFCFIRSTBank | @ybj_19 pic.twitter.com/oDGP8iq6Le— BCCI (@BCCI) October 11, 2025 -
విండీస్‌తో రెండో టెస్ట్.. అరుదైన మైలురాయిని తాకిన జైస్వాల్
న్యూఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో వెస్టిండీస్‌తో ఇవాళ (అక్టోబర్ 10) మొదలైన రెండో టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా ఓపెనర్ యశస్వి జైస్వాల్ (Yashasvi Jaiswal) ఓ అరుదైన మైలురాయిని తాకాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో అతను అంతర్జాతీయ క్రికెట్లో (మూడు ఫార్మాట్లలో) 3000 పరుగులు పూర్తి చేసుకున్నాడు. 71 ఇన్నింగ్స్‌ల్లో ఈ అరుదైన మైలురాయిని తాకిన జైస్వాల్ భారత్ తరఫున ఈ ఘనత సాధించిన రెండో ఫాస్టెస్ట్ బ్యాటర్‌గా రికార్డుల్లోకెక్కాడు. బ్యాటింగ్ దిగ్గజం సునీల్ గవాస్కర్ (Sunil Gavaskar) (68 ఇన్నింగ్స్‌లు) జైస్వాల్ కంటే వేగంగా అంతర్జాతీయ క్రికెట్లో 3000 పరుగుల మైలురాయిని తాకాడు.మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేస్తున్న భారత్ 51 ఓవర్లలో తర్వాత వికెట్ నష్టానికి 198 పరుగులు చేసింది. జైస్వాల్ 145 బంతుల్లో 16 ఫోర్ల సాయంతో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అతనికి జతగా సాయి సుదర్శన్ (58) క్రీజ్‌లో ఉన్నాడు.అంతకుముందు కేఎల్ రాహుల్ 54 బంతుల్లో 5 ఫోర్లు, సిక్సర్ సాయంతో 38 పరుగులు చేసి ఔటయ్యాడు. యశస్వి జైస్వాల్ 40, సాయి సుదర్శన్ 16 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. రాహుల్ వికెట్ వార్రికన్‌కు దక్కింది. అతడి బౌలింగ్‌లో రాహుల్ స్టంపౌటయ్యాడు.కాగా, రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం వెస్టిండీస్ జట్టు భారత్‌లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సిరీస్‌లోని తొలి మ్యాచ్‌లో భారత్ ఇన్నింగ్స్ 140 పరుగుల తేడాతో విండీస్‌ను చిత్తు చేసింది. ఆ మ్యాచ్‌లో టీమిండియా ఆటగాళ్లు రాహుల్, జురెల్, జడేజా సెంచరీలు చేశారు. సిరాజ్, జడేజా బంతితో రాణించారు. చదవండి: విండీస్‌తో రెండో టెస్ట్.. చరిత్ర సృష్టించిన బుమ్రా -
విండీస్‌తో రెండో టెస్ట్.. చరిత్ర సృష్టించిన బుమ్రా
వెస్టిండీస్‌తో ఇవాళ (అక్టోబర్ 10) మొదలైన రెండో టెస్ట్‌లో టీమిండియా పేసు గుర్రం జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) రంగంలోకి దిగకుండానే ఓ రికార్డు నెలకొల్పాడు. ఈ మ్యాచ్‌తో టెస్ట్‌ల్లో హాఫ్ సెంచరీ (50 మ్యాచ్‌లు) పూర్తి చేసిన అతను.. భారత్ తరఫున మూడు ఫార్మాట్లలో 50 మ్యాచ్‌లు ఆడిన తొలి ఫాస్ట్ బౌలర్‌గా చరిత్ర సృష్టించాడు. భారత క్రికెట్ చరిత్రలో ఇప్పటివరకు ఏ ఫాస్ట్ బౌలర్ మూడు ఫార్మాట్లలో 50 మ్యాచ్‌లు ఆడలేదు.31 ఏళ్ల బుమ్రా ఇప్పటివరకు భారత్ తరఫున 50 టెస్ట్‌లు, 89 వన్డేలు, 75 టీ20లు ఆడాడు. 2016 జనవరిలో అంతర్జాతీయ అరంగేట్రం చేసి మూడు ఫార్మాట్లలో 467 వికెట్లు తీశాడు.మ్యాచ్ విషయానికొస్తే.. న్యూఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టీమిండియా టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేస్తుంది. టీమిండియా టెస్ట్ జట్టు కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్ తొలిసారి టాస్ గెలిచాడు.లంచ్ సమయానికి భారత్ వికెట్ నష్టానికి 94 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ 54 బంతుల్లో 5 ఫోర్లు, సిక్సర్ సాయంతో 38 పరుగులు చేసి ఔటయ్యాడు. యశస్వి జైస్వాల్ 40, సాయి సుదర్శన్ 16 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. రాహుల్ వికెట్ వార్రికన్‌కు దక్కింది. అతడి బౌలింగ్‌లో రాహుల్ స్టంపౌటయ్యాడు.కాగా, రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం వెస్టిండీస్ జట్టు భారత్‌లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సిరీస్‌లోని తొలి మ్యాచ్‌లో భారత్ ఇన్నింగ్స్ 140 పరుగుల తేడాతో విండీస్‌ను చిత్తు చేసింది. ఆ మ్యాచ్‌లో టీమిండియా ఆటగాళ్లు రాహుల్, జురెల్, జడేజా సెంచరీలు చేశారు. సిరాజ్, జడేజా బంతితో రాణించారు. చదవండి: 'టీమిండియా'పై కేసు.. గట్టిగా అక్షింతలు వేసిన ఢిల్లీ హైకోర్టు -
'టీమిండియా'పై కేసు.. గట్టిగా అక్షింతలు వేసిన ఢిల్లీ హైకోర్టు
భారత క్రికెట్ జట్టును టీమిండియా (Team India) అని పిలవడంపై అభ్యంతరం వ్యక్తమైంది. ఓ ప్రైవేట్ సంస్థ (BCCI) ఎంపిక చేసే జట్టును భారత జట్టు లేదా టీమిండియా అని పిలవకూడదని రీపక్ కన్సాల్ అనే న్యాయవాది ఢిల్లీ హైకోర్టులో ప్రజాహిత పిటిషన్ (PIL) దాఖలు చేశారు.బీసీసీఐ ఎంపిక చేసిన జట్టుకు ఇండియా లేదా భారత్ పేరును వాడుకోకూడదని పిటిషన్లో పేర్కొన్నారు. ఇలా చేసి జాతీయ గుర్తింపు పొందడం రాజ్యాంగ విరుద్ధమని వాదించారు.సమాచార హక్కు చట్టం (RTI) ఆధారంగా బీసీసీఐకి ప్రభుత్వ గుర్తింపు లేదా నిధులు లేవని పేర్కొన్నారు. జాతీయ చిహ్నాలు, జెండా, పేరు వాడకం ద్వారా 1950 చట్టం, 2002 ఫ్లాగ్ కోడ్ ఉల్లంఘన జరుగుతోందని అభిప్రాయపడ్డారు. ప్రసార్ భారతి వంటి జాతీయ ప్రసార సంస్థలు బీసీసీఐ జట్టును ‘టీమిండియా’ పేరుతో ప్రసారం చేయడం సరికాదని పేర్కొన్నారు.ఈ పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు డివిజన్ బెంచ్ తిప్పికొట్టింది. ప్రధాన న్యాయమూర్తి దేవేంద్ర కుమార్ ఉపాధ్యాయ, న్యాయమూర్తి తుషార్ రావ్ గెడెలా ఈ పిటిషన్‌ను కోర్టు సమయాన్ని వృథా చేసే చర్యగా అభివర్ణించారు.ఈ జట్టు విశ్వ వేదికపై భారత్‌కు ప్రాతినిథ్యం వహిస్తుంది. అలాంటప్పుడు టీమిండియా లేదా భారత జట్టని ఎందుకు పిలవకూడదని న్యాయమూర్తి తుషార్ గెడెలా పిటిషనర్‌ను ప్రశ్నించారు.క్రీడా జట్లను ప్రభుత్వ అధికారులు ఎంపిక చేస్తారా..? కామన్వెల్త్, ఒలింపిక్స్‌లో పాల్గొనే జట్లను ప్రభుత్వమే ఎంపిక చేస్తుందా అని ప్రధాన న్యాయమూర్తి ఉపాధ్యాయ ప్రశ్నించారు. మీ ఇంట్లో జాతీయ జెండా ఎగురవేయడం నిషేధమా అని నిలదీశారు. దేశ పేరు, జాతీయ చిహ్నాల వాడకం ప్రభుత్వానికి మాత్రమే పరిమితం కాదని స్పష్టం చేశారు. క్రీడా వ్యవస్థలో ప్రభుత్వ జోక్యం ప్రమాదకరమని హెచ్చరించారు. దేశానికి సంబంధించి ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి. అలాంటి వాటిపై దృష్టి పెట్టాలని అక్షింతలు వేశారు. ఈ పిటిషన్‌ను విచారణకు అర్హం కాదని కొట్టి పారేశారు.ఈ తీర్పుతో టీమిండియా అనే పేరు చట్టబద్ధంగా కొనసాగించవచ్చని, బీసీసీఐ జట్టు దేశానికి ప్రాతినిధ్యం వహిస్తుందని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది.చదవండి: టీమిండియాపై అనూహ్య విజయం.. దక్షిణాఫ్రికా ప్రపంచ రికార్డు -
విండీస్‌తో రెండో టెస్ట్.. ఎట్టకేలకు టాస్ గెలిచిన శుభ్‌మన్ గిల్
ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఇవాల్టి నుంచి (అక్టోబర్ 10) భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య రెండో టెస్ట్ ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. టీమిండియా కెప్టెన్‌గా శుభ్‌మన్‌కు ఇది తొలి టాస్ విజయం. అతను టెస్ట్ కెప్టెన్ అయ్యాక వరుసగా ఆరు మ్యాచ్‌ల్లో టాస్‌లు ఓడాడు.ఈ మ్యాచ్ కోసం భారత్ ఎలాంటి మార్పులు చేయలేదు. తొలి టెస్ట్‌లో ఆడిన జట్టునే యధాతథంగా బరిలోకి దించింది. విండీస్ మాత్రం రెండు మార్పులతో బరిలోకి దిగనుంది. కింగ్, జోహన్ లేన్ స్థానాల్లో టెవిమ్ ఇమ్లాచ్, ఆండర్సన్ ఫిలిప్ జట్టులోకి వచ్చారు. కాగా, రెండు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లోని తొలి మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. తుది జట్లు..వెస్టిండీస్: జాన్ క్యాంప్‌బెల్, తేజ్‌నరైన్ చందర్‌పాల్, అలిక్ అథనాజ్, షాయ్ హోప్, రోస్టన్ చేజ్(కెప్టెన్), టెవిన్ ఇమ్లాచ్(వికెట్‌కీపర్), జస్టిన్ గ్రీవ్స్, జోమెల్ వారికన్, ఖరీ పియర్, అండర్సన్ ఫిలిప్, జేడెన్ సీల్స్భారత్: యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, శుభ్‌మన్ గిల్(కెప్టెన్), ధ్రువ్ జురెల్(వికెట్‌కీపర్), రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, నితీష్ కుమార్ రెడ్డి, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్చదవండి: క్రికెట్ చరిత్రలో తొలిసారి ఇలా..! -
చరిత్ర సృష్టించిన టీమిండియా ప్లేయర్.. 28 ఏళ్ల ప్రపంచ రికార్డు బద్దలు
టీమిండియా స్టార్ బ్యాటర్ స్మృతి మంధన (Smriti Mandhana) 28 ఏళ్ల కిందటి ప్రపంచ రికార్డును బద్దలు కొట్టి, చరిత్ర సృష్టించింది. మహిళల వన్డే క్రికెట్లో ఓ క్యాలెండర్ ఇయర్లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్‌గా సరికొత్త రికార్డు నెలకొల్పింది. మహిళల వన్డే ప్రపంచకప్ 2025లో భాగంగా సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో ఈ ఘనత సాధించింది.ఈ మ్యాచ్‌లో 32 బంతుల్లో 23 పరుగులు చేసిన మంధన ఈ క్యాలెండర్ ఇయర్లో (2025) పరుగుల సంఖ్యను 982కు (17 ఇన్నింగ్స్‌ల్లో) పెంచుకుంది. గతంలో ఈ రికార్డు ఆస్ట్రేలియాకు చెందిన బెలిండా క్లార్క్ (Belinda Clark) పేరిట ఉండేది. క్లార్క్ 1997 క్యాలెండర్ ఇయర్లో 970 పరుగులు చేసింది. ఈ విభాగంలో మంధన, క్లార్క్ తర్వాత సౌతాఫ్రికాకు చెందిన లారా వోల్వార్డ్ట్ (2022లో 882 పరుగులు), న్యూజిలాండ్‌కు చెందిన డెబ్బీ హాక్లీ (1997లో 880), న్యూజిలాండ్‌కు చెందిన యామీ సాటర్థ్వైట్ (2016లో 853) ఉన్నారు. మంధన వన్డేల్లో ఈ ఏడాది సూపర్ ఫామ్‌లో ఉంది. ప్రస్తుతం జరుగుతున్న ప్రపంచ కప్‌లో వరుసగా మూడు మ్యాచ్‌ల్లో విఫలమైనా, అంతకుముందు అద్భుత ప్రతిభ కనబర్చింది. ఈ ఏడాది మంధన ఖాతాలో నాలుగు వన్డే శతకాలు కూడా ఉన్నాయి.మ్యాచ్ విషయానికొస్తే.. వన్డే ప్రపంచకప్‌లో భాగంగా నిన్న (అక్టోబర్ 9) వైజాగ్ వేదికగా భారత్, సౌతాఫ్రికా తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో భారత్ 3 వికెట్ల తేడాతో పరాజయంపాలైంది. తప్పక గెలుస్తుందనుకున్న ఈ మ్యాచ్‌లో భారత్ అనూహ్యంగా ఓటమిపాలైంది. ఎనిమిదో నంబర్ ప్లేయర్ నదినే డి క్లెర్క్ (54 బంతుల్లో 84 నాటౌట్; 8 ఫోర్లు, 5 సిక్సర్లు) సంచలన ఇన్నింగ్స్‌తో భారత్ చేతుల్లో నుంచి మ్యాచ్‌ను లాగేసుకుంది.భారత్ నిర్దేశించిన 252 పరుగుల లక్ష్య ఛేదనలో సౌతాఫ్రికా 81 పరుగులకే 5 కోల్పోయింది. ఈ దశలో క్లెర్క్, క్లో ట్రయాన్ (49) సహకారంతో మ్యాచ్‌ను గెలిపించింది. చివరి 5 ఓవర్లలో 52 పరుగులు చేయాల్సిన దశలో క్లెర్క్ పూనకం వచ్చినట్లు ఊగిపోయింది. ఎడాపెడా బౌండరీలు, సిక్సర్లు బాది మరో 7 బంతులు మిగిలుండగానే మ్యాచ్‌ను ముగించింది. అంతకుముందు కెప్టెన్ లారా వోల్వార్డ్ట్ (70) రాణించింది.ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. రిచా ఘోష్ (77 బంతుల్లో 94; 11 ఫోర్లు, 4 సిక్సర్లు) చారిత్రక ఇన్నింగ్స్ కారణంగా 251 పరుగులు చేసింది. 153 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో ఉన్న దశలో రిచా.. స్నేహ్ రాణా (33) సహకారంతో భారత్‌కు గౌరవప్రదమైన స్కోర్ అందించింది. క్లెర్క్ సంచలన ఇన్నింగ్స్ కారణంగా భారత్ ఈ మ్యాచ్‌ను చేజార్చుకుంది. చదవండి: చరిత్ర సృష్టించిన రిచా ఘోష్.. ప్రపంచంలోనే తొలి బ్యాటర్‌గా -
'విజయం' చేజార్చుకున్నారు...
వన్డే వరల్డ్ కప్ వేటలో విశాఖ తీరాన భారత మహిళల బృందానికి అనూహ్య ఓటమి ఎదురైంది. గెలుపు ఖాయమనుకున్న దశలో దక్షిణాఫ్రికా బ్యాటర్ డి క్లెర్క్ చెలరేగి భారత్‌నుంచి మ్యాచ్‌ను లాక్కుంది. చివరి 5 ఓవర్లలో 52 పరుగులు చేయాల్సి ఉండగా 4 ఫోర్లు, 5 సిక్సర్లు బాదిన డి క్లెర్క్ 7 బంతులు మిగిలి ఉండగానే మ్యాచ్‌ను ముగించింది. అంతకు ముందు భారత్ మళ్లీ బ్యాటింగ్‌లో తడబడింది. అయితే రిచా ఘోష్ అద్భుత ఇన్నింగ్స్‌తో మెరుగైన స్కోరును అందించింది. ఆదివారం ఇదే వైజాగ్ మైదానంలో ఆస్ట్రేలియాతో హర్మన్ సేన తలపడుతుంది. సాక్షి క్రీడా ప్రతినిధి, విశాఖపట్నం: మహిళల ప్రపంచకప్‌లో భారత జట్టుకు తొలి ఓటమి ఎదురైంది. ఏసీఏ–వీడీసీఏ స్టేడియంలో గురువారం జరిగిన మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 3 వికెట్ల తేడాతో భారత్‌పై విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ 49.5 ఓవర్లలో 251 పరుగులకు ఆలౌటైంది.రిచా ఘోష్ (77 బంతుల్లో 94; 11 ఫోర్లు, 4 సిక్స్‌లు) త్రుటిలో సెంచరీ అవకాశం చేజార్చుకుంది. ఒక దశలో భారత్ స్కోరు 153/7 కాగా...రిచా, స్నేహ్ రాణా (24 బంతుల్లో 33; 6 ఫోర్లు) ఎనిమిదో వికెట్‌కు 53 బంతుల్లో 88 పరుగులు జోడించి మెరుగైన స్థితికి చేర్చారు. అనంతరం దక్షిణాఫ్రికా 48.5 ఓవర్లలో 7 వికెట్లకు 252 పరుగులు చేసింది. కెప్టెన్ లారా వోల్వర్ట్ (111 బంతుల్లో 70; 8 ఫోర్లు) కీలక ఇన్నింగ్స్ ఆడింది. అయితే చివర్లో నాడిన్ డి క్లెర్క్ (54 బంతుల్లో 84 నాటౌట్; 8 ఫోర్లు, 5 సిక్స్‌లు) మెరుపు బ్యాటింగ్ దక్షిణాఫ్రికాను గెలిపించింది. వర్షం కారణంగా మ్యాచ్ గంట ఆలస్యంగా మొదలైంది. హర్మన్ మళ్లీ విఫలం...స్మృతి మంధాన (32 బంతుల్లో 23; 1 ఫోర్, 1 సిక్స్) కాస్త జాగ్రత్తగా బ్యాటింగ్ చేసింది. 21వ బంతికి గానీ ఆమె తొలి బౌండరీ కొట్టలేకపోయింది. మరో ఓపెనర్ ప్రతీక రావల్ (56 బంతుల్లో 37; 5 ఫోర్లు) చక్కటి ఆఫ్‌సైడ్ షాట్లతో ఆకట్టుకుంది. అయితే ఆ తర్వాత దక్షిణాఫ్రికా కట్టుదిట్టమైన బౌలింగ్‌తో భారత్ 47 పరుగుల వ్యవధిలో 5 వికెట్లు చేజార్చుకుంది. ఓపెనర్లతో పాటు హర్లీన్ డియోల్ (13) కూడా వెనుదిరగ్గా... కెప్టెన్ హర్మన్‌ప్రీత్ (9) తన వైఫల్యాన్ని కొనసాగించింది. జెమీమా రోడ్రిగ్స్ (0) టోర్నీలో రెండో డకౌట్‌ను తన ఖాతాలో వేసుకుంది. కొద్దిసేపటి తర్వాత దీప్తి (4) పెవిలియన్ చేరింది. ఈ దశలో అమన్‌జోత్ (13)తో రిచా జత కలిసింది. వీరిద్దరు కలిసి జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు. రిచా షో...40వ ఓవర్ చివరి బంతికి అమన్ అవుటైంది. ఆ సమయంలో 153/7 వద్ద స్కోరు 200 దాటడం కూడా కష్టమే అనిపించింది. ఈ స్థితిలో రిచా చెలరేగిపోయింది. క్లెర్క్ బౌలింగ్‌లో సిక్స్, ఫోర్ కొట్టిన ఆమె 53 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకుంది. ఆ తర్వాత ఖాకా వేసిన 47వ ఓవర్లో వరుసగా 4, 4, 6తో పండగ చేసుకుంది. ఇన్నింగ్స్ చివరి ఓవర్ ఆరంభానికి ముందు 84 పరుగుల వద్ద ఉన్న రిచా...వరుసగా 2, 4, 4తో 94కు చేరుకుంది. అయితే తర్వాతి బంతికి అవుటై శతకం కోల్పోయింది. ఆఖరి 10 ఓవర్లలో భారత్ 98 పరుగులు చేయడం విశేషం.టపటపా...ఛేదనలో దక్షిణాఫ్రికా ఆరంభంలో తేలిపోయింది. తక్కువ వ్యవధిలో వరుసగా వికెట్లు కోల్పోయింది. కెప్టెన్ లారా మినహా ప్రధాన బ్యాటర్లంతా కనీస ప్రదర్శన కూడా ఇవ్వలేకపోవడంతో సఫారీలకు ఓటమి తప్పదనిపించింది. అయితే డి క్లెర్క్, క్లో ట్రయాన్ (66 బంతుల్లో 49; 5 ఫోర్లు) అసాధారణ పోరాటం ఆ జట్టును గెలిపించింది.982స్మృతి మంధాన 2025లో వన్డేల్లో చేసిన పరుగులు. ఒకే క్యాలెండర్ ఏడాదిలో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా బెలిండా క్లార్క్ (970 – 1997) రికార్డును ఆమె అధిగమించింది.స్కోరు వివరాలుభారత్ ఇన్నింగ్స్: ప్రతీక (సి) బ్రిట్స్ (బి) సెఖుఖునే 37; స్మృతి (సి) లూస్ (బి) ఎంలాబా 23; హర్లీన్ (బి) ఎంలాబా 13; హర్మన్‌ప్రీత్ (సి) కాప్ (బి) ట్రయాన్ 9; జెమీమా (ఎల్బీ) (బి) ట్రయాన్ 0; దీప్తి (సి) జాఫ్తా (బి) కాప్ 4; అమన్‌జోత్ (సి) లూస్ (బి) ట్రయాన్ 13; రిచా (సి) ట్రయాన్ (బి) డి క్లెర్క్ 94; రాణా (సి) వోల్వార్ట్ (బి) కాప్ 33; క్రాంతి (నాటౌట్) 0; శ్రీచరణి (సి) వోల్వార్ట్ (బి) డి క్లెర్క్ 0; ఎక్స్‌ట్రాలు 25; మొత్తం (49.5 ఓవర్లలో ఆలౌట్) 251. వికెట్ల పతనం: 1–55, 2–83, 3–91, 4–92, 5–100, 6–102, 7–153, 8–241, 9–251, 10–251. బౌలింగ్: మరిజాన్ కాప్ 9–0–45–2, ఖాకా 7–0–47–0, డి క్లెర్క్ 6.5–0–52–2, ఎంలాబా 10–0–46–2, సెఖుఖునే 7–0–29–1, ట్రయాన్ 10–0–32–3. దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్: వోల్వార్ట్ (బి) క్రాంతి 70; బ్రిట్స్ (సి) అండ్ (బి) క్రాంతి 0; లూస్ (సి) రిచా (బి) అమన్‌జోత్ 5; మరిజాన్ కాప్ (బి) స్నేహ్ 20; బాష్ (సి) అండ్ (బి) దీప్తి 1; జాఫ్తా (ఎల్బీ) (బి) శ్రీచరణి 14; ట్రయాన్ (ఎల్బీ) (బి) రాణా 49; డి క్లెర్క్ (నాటౌట్) 84; ఖాకా (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (48.5 ఓవర్లలో 7 వికెట్లకు) 252. వికెట్ల పతనం: 1–6, 2–18, 3–57, 4–58, 5–81, 6–142, 7–211. బౌలింగ్: క్రాంతి గౌడ్ 9–0–59–2, అమన్‌జోత్ 5.5–0–40–1, స్నేహ్ రాణా 10–0–47–2, శ్రీచరణి 10–1–37–1, దీప్తి 10–0–54–1, హర్మన్‌ప్రీత్ 4–0–15–0. -
టీమిండియా స్టార్ క్రికెటర్‌కు అండర్ వరల్డ్ బెదిరింపులు
టీమిండియా యువ క్రికెటర్, పొట్టి క్రికెట్లో మ్యాచ్ ఫినిషర్‌గా పేరు తెచ్చుకున్న రింకూ సింగ్‌కు (Rinku Singh) అండర్ వరల్డ్ (Under World) నుంచి బెదిరింపులు వచ్చాయి. ఈ విషయాన్ని ముంబై క్రైం బ్రాంచ్ పోలీసులు వెల్లడించినట్లు ఓ ప్రముఖ వార్త సంస్థ పేర్కొంది.వారి సమాచారం మేరకు.. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ మధ్యలో రింకూకు దావూద్ గ్యాంగ్ (Dawood Gang) నుంచి మూడు బెదిరింపు కాల్స్ వచ్చాయి. గ్యాంగ్ సభ్యులు రింకూ ప్రమోషన్ టీమ్‌ను రూ. 5 కోట్లు డిమాండ్ చేశారు.ఈ కేసుకు సంబంధించి మొహమ్మద్ దిల్షద్, మొహమ్మద్ నవీద్ అనే ఇద్దరిని పోలీసుల అదుపులో ఉన్నారు. వీరిని ఓ కరీబియన్ దీవి పోలీసులు అరెస్ట్ చేసి, ఆగస్ట్ 1న ముంబై క్రైం బ్రాంచ్ పోలీసులకు అప్పగించారు. పోలీసుల విచారణలో వారు రింకూ సింగ్‌ను బెదిరించినట్లు ఒప్పుకున్నారు.ఇక్కడ మరో విశేషమేమిటంటే.. రింకూ కేసుకు సంబంధించి పోలీసుల అదుపులో ఉన్న ఇద్దరు, ఇటీవల ముంబైలో హత్య చేయబడ్డ ఎన్సీపీ నేత బాబా సిద్దికీ కుమారుడు జీషన్ సిద్దికీని రూ. 10 కోట్ల రూపాయల కోసం బెదిరించిన కేసులో నిందితులు.మరోసారి మ్యాచ్ ఫినిషర్‌గా..!రింకూ సింగ్ మరోసారి మ్యాచ్ ఫినిషర్ పాత్రకు న్యాయం చేశాడు. తాజాగా పాకిస్తాన్‌తో జరిగిన ఆసియా కప్ ఫైనల్లో బౌండరీ బాది మ్యాచ్‌ను ముగించాడు. ఈ టోర్నీలో రింకూ ఆడిన ఏకైక మ్యాచ్ ఇదే. రింకూ బౌండరీతో భారత్ ఆసియా కప్‌లో విజేతగా నిలిచింది. చదవండి: టీమిండియాకు షాక్ ఇవ్వనున్న మ్యాక్స్‌వెల్..! -
విండీస్‌తో రెండో టెస్ట్‌కు భారత తుది జట్టు ఇదే.. యువ ఆటగాడికి వార్నింగ్..!
రేపటి నుంచి (అక్టోబర్ 10) వెస్టిండీస్‌తో ప్రారంభమయ్యే రెండో టెస్ట్‌లో భారత తుది జట్టు ఇదే అంటూ అసిస్టెంట్ కోచ్ టెన్ డస్కటే హింట్ ఇచ్చాడు. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరుగబోయే ఈ మ్యాచ్‌లో భారత్ తరఫున ఎలాంటి మార్పులు ఉండవని సంకేతాలిచ్చాడు. స్టార్ పేసర్ బుమ్రాకు విశ్రాంతి ఇచ్చే ఉద్దేశం లేదని ప్రీ మ్యాచ్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో తెలిపాడు.సుదూర అవసరాల దృష్ట్యా నితీశ్ కుమార్ రెడ్డికి మరిన్ని అవకాశాలుంటాయని చెప్పకనే చెప్పాడు. నితీశ్‌ను నాణ్యమైన పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్‌గా తీర్చిదిద్దడమే లక్ష్యమని తెలిపాడు. తొలి టెస్ట్‌లో విఫలమైనా సాయి సుదర్శన్‌తో ఎలాంటి ఇబ్బంది లేదని అన్నాడు. పరుగులు సాధించలేకపోతే జట్టులో ఎవరి స్థానం సుస్థిరం కాదని గుర్తు చేశాడు. ఈ సందర్భంగా కరుణ్ నాయర్ పేరును ప్రస్తావించాడు.తొలి టెస్ట్‌లో జురెల్ సెంచరీ సాధించడం వల్ల సాయిపై ఒత్తిడి ఉంటుందంటూ పరోక్షంగా వార్నింగ్ ఇచ్చాడు. ఇదే సందర్భంగా జురెల్‌పై ప్రశంసల వర్షం కురిపించాడు. పంత్ గైర్హాజరీలో ఆ స్థానానికి న్యాయం చేశాడని అన్నాడు. జురెల్ మిడిలార్డర్లో సరిగ్గా ఫిట్ అవుతాడని ముందే ఊహించామని తెలిపాడు.డస్కటే ప్రెస్ కాన్ఫరెన్స్‌లో చెప్పిన దాన్ని బట్టి చూస్తే.. రెండో టెస్ట్‌లో కూడా పడిక్కల్, అక్షర్ పటేల్, జగదీసన్, ప్రసిద్ద్ కృష్ణ బెంచ్‌కు పరిమితం కావల్సిందే.కాగా, అహ్మదాబాద్‌లో జరిగిన తొలి టెస్ట్‌లో భారత్ ఎలాంటి ప్రయోగాలకు పోకుండా పూర్తి స్థాయి జట్టుతో బరిలోకి దిగి సత్ఫలితం సాధించింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా ఇన్నింగ్స్ 140 పరుగుల తేడాతో పర్యాటక జట్టును చిత్తు చేసింది. బౌలర్లు, బ్యాటర్లు సమిష్టిగా రాణించి విండీస్‌ను మట్టికరిపించారు. రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి సిరాజ్ 7 వికెట్లు తీయగా.. బుమ్రా 3, కుల్దీప్, జడేజా తలో 4, సుందర్ 2 వికెట్లు పడగొట్టారు. ఒకే ఇన్నింగ్స్‌లో భారత్ బ్యాటింగ్ చేయగా.. కేఎల్ రాహుల్, జురెల్, రవీంద్ర జడేజా శతకాలు బాదారు.విండీస్‌తో రెండో టెస్ట్‌కు భారత తుది జట్టు (అంచనా): యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), ధృవ్ జురెల్ (వికెట్‌కీపర్), రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, నితీష్ కుమార్ రెడ్డి, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్చదవండి: చరిత్ర సృష్టించిన రషీద్ ఖాన్.. తొలి బౌలర్ -
మహ్మద్ షమీ కీలక నిర్ణయం
టీమిండియా సీనియర్ బౌలర్ మహ్మద్ షమీ (Mohammed Shami)కి గడ్డుకాలం నడుస్తోంది. భారత పేస్ దళంలో కీలక ఆటగాడిగా కొనసాగిన ఈ బెంగాల్ క్రికెటర్‌కు ఇప్పుడు జట్టులో చోటే కరువైంది. వన్డే వరల్డ్‌కప్-2023 టోర్నీలో గాయం తాలూకు బాధను దిగమింగి.. జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు షమీ.సొంతగడ్డపై జరిగిన ఈ మెగా టోర్నీలో కేవలం ఆరు మ్యాచ్‌లే ఆడిన షమీ ఏకంగా 23 వికెట్లు కూల్చాడు. తద్వారా ఈ ఐసీసీ ఈవెంట్లో లీడింగ్ వికెట్ టేకర్‌గా నిలిచాడు. అయితే, ఆ తర్వాత నుంచి షమీ చీలమండ గాయం తీవ్రత ఎక్కువ కావడంతో సర్జరీ చేయించుకున్నాడు.చాంపియన్ జట్టులోకోలుకునే క్రమంలో దాదాపు ఏడాదిన్నర పాటు టీమిండియాకు దూరంగా ఉన్న షమీ.. స్వదేశంలో ఈ ఏడాది ఇంగ్లండ్‌తో సిరీస్ సందర్భంగా పునరాగమనం చేశాడు. ఈ క్రమంలో ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 గెలిచిన భారత జట్టులోనూ షమీ భాగమయ్యాడు. అయితే, ఈ వన్డే టోర్నీలో ఐదు మ్యాచ్‌లలో కలిపి తొమ్మిది వికెట్లు తీయగలిగాడు.రెండేళ్ల నుంచీ నిరాశే పరిమిత ఓవర్ల క్రికెట్లో పరిస్థితి ఇలా ఉంటే.. టెస్టుల్లో మాత్రం షమీకి రెండేళ్ల నుంచీ నిరాశే ఎదురవుతోంది. ఫిట్నెస్ సమస్యల దృష్ట్యా అతడిని పక్కనపెట్టినట్లు టీమిండియా మేనేజ్మెంట్ చెబుతోంది. మరోవైపు.. ఇటీవల దులిప్ ట్రోఫీలో బెంగాల్ తరఫున బరిలోకి దిగిన షమీ.. 34 ఓవర్ల బౌలింగ్‌లో కేవలం ఒకే ఒక్క వికెట్ తీయగలిగాడు.షమీ కీలక నిర్ణయంఈ నేపథ్యంలో వెస్టిండీస్‌తో స్వదేశంలో టెస్టులకు కూడా సెలక్టర్లు షమీని ఎంపిక చేయలేదు. అంతేకాదు ఆస్ట్రేలియాతో పరిమిత ఓవర్ల సిరీస్ ఆడే జట్టులోనూ అతడికి చోటి వ్వలేదు. ఈ విషయం గురించి చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ మాట్లాడుతూ.. షమీ గురించి అప్డేట్ లేదని చెప్పడం గమనార్హం. ఈ క్రమంలో షమీ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.తనను తాను నిరూపించుకునేందుకు రంజీ ట్రోఫీ తాజా సీజన్లో ఆడేందుకు షమీ సిద్ధమైనట్లు సమాచారం. ఈ విషయం గురించి బెంగాల్ కోచ్ టెలిగ్రాఫ్‌తో మాట్లాడుతూ.. ‘‘ఆరేడు రోజుల క్రితం షమీతో మాట్లాడాను. అతడు ఆడేందుకు సిద్ధంగా ఉన్నాడు. రంజీ ట్రోఫీలో మా ఓపెనింగ్ మ్యాచ్ నుంచే అతడు అందుబాటులో ఉంటాడని ఆశిస్తున్నాం’’ అని పేర్కొన్నాడు.తలుపులు శాశ్వతంగా మూసుకుపోయినట్లేఇదిలా ఉంటే.. బీసీసీఐ అధికారి ఒకరు షమీ గురించి ప్రస్తావన రాగా.. ‘‘టీమిండియాలోకి షమీ తిరిగి రావడం ప్రస్తుతం కష్టమే. ఇటీవల దులిప్ మ్యాచ్‌లోనూ అతడు రాణించలేకపోయాడు. రోజురోజుకీ వయసు మీద పడుతోంది. యువ ఆటగాళ్లతో అతడు పోటీ పడలేడు.అయితే, ఐపీఎల్లో అవకాశాలు దక్కించుకోవాలంటే.. అతడు ఆడక తప్పని పరిస్థితి’’ అని వ్యాఖ్యానించడం గమనార్హం. తద్వారా షమీకి టీమిండియా తలుపులు శాశ్వతంగా మూసుకుపోయినట్లేననే సంకేతాలు ఇచ్చారు సదరు అధికారి. కాగా ఐపీఎల్-2025లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ప్రాతినిథ్యం వహించిన 35 ఏళ్ల షమీ కేవలం ఆరు వికెట్లు మాత్రమే తీయగలిగాడు.చదవండి: IND vs AUS: 462 వికెట్లు.. స్వింగ్ సుల్తాన్.. కట్ చేస్తే! ఊహించని విధంగా కెరీర్‌కు ఎండ్ కార్డ్? -
వైభవ్ విఫలమైనా, బౌలర్లు గెలిపించారు.. ఆసీస్ గడ్డపై టీమిండియా గర్జన
ఆస్ట్రేలియా గడ్డపై భారత యువ సింహాలు (India U19 Team) గర్జించాయి. వరుసగా వన్డే, టెస్ట్ సిరీస్‌ల్లో ఆతిథ్య జట్టును (Australia U19 Team) క్లీన్ స్వీప్ చేశాయి. మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్, రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ల కోసం ఆస్ట్రేలియాలో పర్యటించిన యువ భారత్.. వన్డే సిరీస్‌ను 3-0తో, టెస్ట్ సిరీస్‌ను 2-0తో ఊడ్చేసింది.మెక్కే వేదికగా ఇవాళ (అక్టోబర్ 8) ముగిసిన రెండో టెస్ట్‌లో భారత్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో భారత బౌలర్లు మూకుమ్మడిగా చెలరేగడంతో ఆస్ట్రేలియా కుర్ర జట్టు బెంబేలెత్తిపోయింది. తొలి ఇన్నింగ్స్‌లో 135 పరుగులకే కుప్పకూలింది. భారత్ సైతం తొలి ఇన్నింగ్స్‌లో 171 పరుగులకే ఆలౌటైనా.. 36 పరుగుల కీలక ఆధిక్యం సాధించింది.అనంతరం భారత బౌలర్లు మరోసారి చెలరేగిపోయారు. ఈసారి ఆసీస్‌ను 116 పరుగులకే (రెండో ఇన్నింగ్స్‌లో) కుప్పకూల్చారు. తద్వారా భారత్ ముందు నామమాత్రపు 81 పరుగుల లక్ష్యం ఉండింది.స్వల్ప ఛేదనలో భారత్ సైతం ఆదిలో తడబడింది. 13 పరుగుల వద్దే కెప్టెన్ ఆయుశ్ మాత్రే (13) వికెట్ కోల్పోయింది. ఆతర్వాత బంతికే స్టార్ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ డకౌటయ్యాడు. ఈ దశలో వేదాంత్ త్రివేది, విహాన్ మల్హోత్రా భారత ఇన్నింగ్స్‌ను నిర్మించే ప్రయత్నం చేశారు. అయితే 52 పరుగుల వద్ద విహాన్ (21) కూడా ఔటయ్యాడు. ఈసారి వేదాంత్ (33 నాటౌట్) మరో ఛాన్స్ తీసుకోకుండా రాహుల్ కుమార్ (13 నాటౌట్) సహకారంతో భారత్‌ను విజయతీరాలకు చేర్చాడు.రెండు ఇన్నింగ్స్‌ల్లో విఫలమైన వైభవ్ఈ మ్యాచ్‌లో టీమిండియా చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీ రెండు ఇన్నింగ్స్‌ల్లో విఫలమయ్యాడు. తొలి ఇన్నింగ్స్‌లో (14 బంతుల్లో 20; 2 ఫోర్లు, సిక్స్) మంచి ఆరంభం లభించినా భారీ స్కోర్‌గా మలచలేకపోయిన ఈ కుర్ర డైనమైట్.. రెండో ఇన్నింగ్స్‌లో ఎదుర్కొన్న తొలి బంతికే ఔటయ్యాడు.చెలరేగిన బౌలర్లుఈ మ్యాచ్‌లో భారత బౌలర్లు రెండు ఇన్నింగ్స్‌ల్లో చెలరేగిపోయారు. కలిసికట్టుగా బౌలింగ్ చేసి ఆసీస్ బ్యాటర్లకు చుక్కలు చూపించారు. వీరి ధాటికి ఆసీస్ బ్యాటర్లు కొద్ది సేపు కూడా క్రీజ్‌లో నిలబడలేకపోయారు. రెండు ఇన్నింగ్స్‌ల్లో ఆసీస్ తరఫున అలెక్స్ లీ యంగ్ (66, 38) ఒక్కడే పర్వాలేదనిపించాడు. ఈ మ్యాచ్‌లో హెనిల్ పటేల్ 6, ఖిలన్ పటేల్, ఉధవ్ మోహన్ తలో 4, నమన్ పుష్పక్ 3, దీపేశ్ దేవేంద్రన్ 2 వికెట్లు తీశారు. చదవండి: CEAT అవార్డుల విజేతలు వీరే.. రోహిత్ శర్మకు ప్రత్యేక పురస్కారం -
రెండో ఇన్నింగ్స్‌లోనూ రెచ్చిపోయిన టీమిండియా బౌలర్లు
ఆస్ట్రేలియా అండర్-19 జట్టుతో జరుగుతున్న రెండో యూత్ టెస్ట్ మ్యాచ్‌లో భారత యువ బౌలర్లు రెండో ఇన్నింగ్స్‌లోనూ చెలరేగిపోయారు. హెనిల్ పటేల్ (8-3-23-3), నమన్ పుష్పక్ (7-1-19-3), ఉధవ్ మోహన్ (8-4-17-2), దీపేశ్ దేవేంద్రన్ (6-2-15-1), ఖిలన్ పటేల్ (11.1-2-36-1) ధాటికి ఆసీస్ 116 పరుగులకు చాపచుట్టేసింది. తద్వారా భారత్ ముందు 81 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఉంచింది.ఆసీస్ ఇన్నింగ్స్‌లో 38 పరుగులు చేసిన అలెక్స్ లీ యంగ్ టాప్ స్కోరర్ కాగా.. మరో ముగ్గురు (కేసీ బార్టోన్ (19), జేడన్ డ్రేపర్ (15), అలెక్స్ టర్నర్ (10)) అతి కష్టం మీద రెండంకెల స్కోర్లు చేశారు. సైమన్ బడ్జ్, జెడ్ హోల్లిక్ డకౌట్లు కాగా.. కెప్టెన్ విల్ మలాజ్చుక్, యశ్ దేశ్‌ముఖ్ తలో 5, ఛార్లెస్ లచ్మండ్ 9, విల్ బైరోమ్ 8 పరుగులు చేశారు.అంతకుముందు ఆసీస్ బౌలర్లు భారత్‌ను 171 పరుగులకే ఆలౌట్ చేశారు. భారత ఇన్నింగ్స్‌లో ఒక్కరు కూడా 30 పరుగుల మార్కును చేరలేదు. 28 పరుగులు చేసిన తొమ్మిదో నంబర్ ఆటగాడు దీపేశ్ దీపేంద్రన్ టాప్ స్కోరర్‌గా నిలువగా.. ఖిలన్ పటేల్, వేదాంత్ త్రివేది, హెనిల్ పటేల్, వైభవ్ సూర్యవంశీ, విహాన్ మల్హోత్రా వరుసగా 26, 25, 22, 20, 11 పరుగులు స్కోర్ చేశారు. కెప్టెన్ ఆయుశ్ మాత్రే వైఫల్యాల పరంపరను కొనసాగిస్తూ 4 పరుగులకే ఔట్ కాగా.. రాహుల్ కుమార్ 9, హర్వంశ్ పంగాలియా 1, నమన్ పుష్పక్ డకౌటయ్యారు. ఈ ఇన్నింగ్స్‌లో ఆసీస్ బౌలర్లు సైతం మూకుమ్మడిగా సత్తా చాటారు. కేసీ బార్టన్ 4, ఛార్లెస్ లిచ్మండ్, విల్ బైరోమ్, జూలియన్ ఓస్బర్న్ తలో 2 వికెట్లు తీశారు. తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 171 పరుగులకే ఆలౌటైనా 36 పరుగుల కీలక ఆధిక్యం లభించింది.ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్.. హెనిల్ పటేల్ (9-3-21-3), ఖిలన్ పటేల్ (12-5-23-3), ఉధవ్ మోహన్ (6-0-23-2), దీపేశ్ దేవేంద్రన్ (7.3-2-22-1) ధాటికి 135 పరుగులకే కుప్పకూలింది. ఆసీస్ ఇన్నింగ్స్‌లో వికెట్ కీపర్ లీ యంగ్ (66) ఒక్కడే అర్ద సెంచరీతో రాణించాడు.కాగా, మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్, రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ల కోసం భారత అండర్ 19 జట్టు ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. తొలుత జరిగిన వన్డే సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన భారత్.. టెస్ట్ సిరీస్‌లోనూ 1-0 ఆధిక్యంలో కొనసాగుతుంది. ప్రస్తుతం జరుగుతున్న రెండో టెస్ట్‌ను కూడా గెలిస్తే భారత్ ఆసీస్‌ను వారి సొంత ఇలాకాలో పూర్తిగా క్వీన్ స్వీప్ చేసినట్లవుతుంది.చదవండి: ఆస్ట్రేలియా జట్టుకు భారీ షాక్.. మళ్లీ కెప్టెన్‌గా స్టీవ్ స్మిత్..? -
స్వల్ప స్కోర్‌కే కుప్పకూలిన టీమిండియా.. సంతోషం ఎంతో సేపు మిగల్లేదు..!
ఆస్ట్రేలియా పర్యటనలో భారత అండర్-19 జట్టు (India U19 vs Australia U19) తొలిసారి బ్యాటింగ్‌లో తడబడింది. మెక్కే వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో 171 పరుగులకే ఆలౌటైంది. భారత ఇన్నింగ్స్‌లో ఒక్కరు కూడా కనీసం 30 పరుగుల మార్కును చేరలేదు. 28 పరుగులు చేసిన తొమ్మిదో నంబర్ ఆటగాడు దీపేశ్ దీపేంద్రన్ టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఖిలన్ పటేల్, వేదాంత్ త్రివేది, హెనిల్ పటేల్, వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi) వరుసగా 26, 25, 22, 20 పరుగులు స్కోర్ చేశారు. ఓపెనర్‌గా ప్రమోషన్ పొందిన విహాన్ మల్హోత్రా 11 పరుగులు చేశాడు.కెప్టెన్ ఆయుశ్ మాత్రే (Ayush Mhatre) వైఫల్యాల పరంపరను కొనసాగిస్తూ 4 పరుగులకే ఔట్ కాగా.. రాహుల్ కుమార్ 9, హర్వంశ్ పంగాలియా 1, నమన్ పుష్పక్ డకౌటయ్యారు. ఈ ఇన్నింగ్స్‌లో ఆసీస్ బౌలర్లు మూకుమ్మడిగా సత్తా చాటారు. కేసీ బార్టన్ 4, ఛార్లెస్ లిచ్మండ్, విల్ బైరోమ్, జూలియన్ ఓస్బర్న్ తలో 2 వికెట్లు తీశారు. తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా స్వల్ప స్కోర్‌కే ఆలౌటైనా 36 పరుగుల కీలక ఆధిక్యం సాధించడం విశేషం.ఆసీస్‌కు సంతోషం ఎంతో సేపు మిగల్చలేదుదీనికి తోడు స్వల్ప లోటుతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆస్ట్రేలియాను భారత పేసర్ హెనిల్ పటేల్ రెండో ఓవర్లోనే కోలుకోలేని దెబ్బకొట్టాడు. హెనిల్ రెండో ఓవర్లో వరుసగా తొలి, రెండో బంతులకు సైమన్ బడ్జ్, జెడ్ హోల్లిక్లను పెవిలియన్‌కు పంపాడు. ఆసీస్ అప్పటికి ఖాతా కూడా తెరవలేదు. 2 ఓవర్ల తర్వాత ఆ జట్టు స్కోర్ 0/2గా ఉంది.అంతకుముందు భారత బౌలర్లు తొలి ఇన్నింగ్స్‌లోనూ చెలరేగడంతో ఆసీస్ 135 పరుగులకే కుప్పకూలింది. హెనిల్ పటేల్ (9-3-21-3), ఖిలన్ పటేల్ (12-5-23-3), ఉధవ్ మోహన్ (6-0-23-2), దీపేశ్ దేవేంద్రన్ (7.3-2-22-1) కలిసికట్టుగా ఆసీస్ ఇన్నింగ్స్‌ను కుప్పకూల్చారు. ఆసీస్ ఇన్నింగ్స్‌లో వికెట్ కీపర్ లీ యంగ్ (66) ఒక్కడే అర్ద సెంచరీతో రాణించాడు.కాగా, మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్, రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ల కోసం భారత అండర్ 19 జట్టు ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. తొలుత జరిగిన వన్డే సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన భారత్.. టెస్ట్ సిరీస్‌లోనూ 1-0 ఆధిక్యంలో కొనసాగుతుంది. ప్రస్తుతం జరుగుతున్న రెండో టెస్ట్‌ను కూడా గెలిస్తే భారత్ ఆసీస్‌ను వారి సొంత ఇలాకాలో పూర్తిగా క్వీన్ స్వీప్ చేసినట్లవుతుంది.చదవండి: సహనం కోల్పోయిన వైభవ్ సూర్యవంశీ.. కారణం ఇదే! -
వైభవ్ సూర్యవంశీ విఫలం.. టీమిండియా తడ'బ్యాటు'
ఆస్ట్రేలియా పర్యటనలో భారత అండర్-19 జట్టు (Team India) తొలిసారి బ్యాటింగ్‌లో తడబాటుకు లోనైంది. మెక్కే వేదికగా ఇవాళ (అక్టోబర్ 7) మొదలైన రెండో టెస్ట్‌లో టాపార్డర్ విఫలం కావడంతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత స్కోర్ 7 వికెట్ల నష్టానికి 144 పరుగులుగా ఉంది.వన్‌డౌన్‌లో వచ్చిన చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi) (14 బంతుల్లో 20; 2 ఫోర్లు, సిక్స్) తన సహజ శైలిలో ధాటిగా ఆడినప్పటికీ, ఎక్కువ సేపు క్రీజ్‌లో నిలబడలేకపోయాడు. ఈ మ్యాచ్‌లో ఓపెనర్‌గా ప్రమోషన్ పొందిన విహాన్ మల్హోత్రా (11) నిరాశపరిచాడు. మరో ఓపెనర్, కెప్టెన్ ఆయుశ్ మాత్రే (4) వైఫల్యాల పరంపర కొనసాగించాడు.వేదాంత్ త్రివేది (25) నిలదొక్కుకునేందుకు ప్రయత్నించి విఫలమయ్యాడు. రాహుల్ కుమార్ (9), వికెట్‌కీపర్ హర్వంశ్ పంగాలియా (1) సింగిల్ డిజిట్ స్కోర్‌కే టపా కట్టేశారు. ఖిలన్ పటేల్ (26) కాసేపు పోరాడినప్పటికీ, ఆట ముగిసే సమయానికి కొద్ది ముందుగా ఔటయ్యాడు. హెనిల్ పటేల్ (22 నాటౌట్), దీపేశ్ దేవేంద్రన్ (6 నాటౌట్) సహకారంతో భారత్‌కు గౌరవప్రదమైన స్కోర్ అందించేందుకు ప్రయత్నిస్తున్నాడు.ఆసీస్ బౌలర్లలో కేసీ బార్టన్, విల్ బైరోమ్ టీమిండియా టాపార్డర్‌ను ఇబ్బంది పెట్టారు. కేసీ 2, బైరోమ్ 2 వికెట్లు పడగొట్టగా.. ఛార్లెస్ లచ్మండ్, జూలియన్‌కు తలో వికెట్ దక్కింది. టాపార్డర్ తడబడినా టీమిండియాకు ఇప్పటికే 9 పరుగుల ఆధిక్యం లభించింది. అంతకుముందు భారత బౌలర్లు చెలరేగడంతో తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో 135 పరుగులకే కుప్పకూలింది. హెనిల్ పటేల్ (9-3-21-3), ఖిలన్ పటేల్ (12-5-23-3), ఉధవ్ మోహన్ (6-0-23-2), దీపేశ్ దేవేంద్రన్ (7.3-2-22-1) కలిసికట్టుగా ఆసీస్ ఇన్నింగ్స్‌ను కుప్పకూల్చారు. ఆసీస్ ఇన్నింగ్స్‌లో వికెట్ కీపర్ లీ యంగ్ (66) ఒక్కడే అర్ద సెంచరీతో రాణించాడు.కాగా, మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్, రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ల కోసం భారత అండర్ 19 జట్టు ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. తొలుత జరిగిన వన్డే సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన భారత్.. టెస్ట్ సిరీస్‌లోనూ 1-0 ఆధిక్యంలో కొనసాగుతుంది. ప్రస్తుతం జరుగుతున్న రెండో టెస్ట్‌ను కూడా గెలిస్తే భారత్ ఆసీస్‌ను వారి సొంత ఇలాకాలో పూర్తిగా క్వీన్ స్వీప్ చేసినట్లవుతుంది.చదవండి: కర్ణాటక కెప్టెన్‌గా రాహుల్ ద్రవిడ్ కొడుకు.. కరుణ్ నాయర్ రీఎంట్రీ -
ఏదో ఒకరోజు ఇంట్లో పట్టనంత డబ్బు సంపాదిస్తా.. కట్‌చేస్తే..
మిగతా వాటితో పోలిస్తే క్రికెట్, సినిమాలను కెరీర్‌గా ఎంచుకుంటే ఎన్నో కష్టనష్టాలకు ఓర్చుకోవాల్సి ఉంటుంది. వీటిలో విజయశాతం తక్కువ. ముఖ్యంగా ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇలాంటి రంగాల్లో నిలదొక్కుకోవడం కత్తిమీద సాము లాంటిదే.నూటికో కోటికో ఒక్కరే అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడంలో సఫలమవుతూ ఉంటారు. ఇక సాధారణ కుటుంబం నుంచి వచ్చిన వారు ఇలాంటి పెద్ద పెద్ద కలలు కంటే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు.అయితే, ఆత్మవిశ్వాసం ఉంటే కఠిన సవాళ్లను సైతం సులువుగానే అధిగమించవచ్చని అంటున్నాడు టీమిండియా స్టార్ క్రికెటర్ మొహమ్మద్ సిరాజ్. హైదరాబాద్ గల్లీల నుంచి.. అంతర్జాతీయ క్రికెట్లో అత్యుత్తమ పేస్ బౌలర్లలలో ఒకడిగా ఎదిగాడు సిరాజ్ మియా.ఏదో ఒకరోజు ఇంట్లో పట్టనంత డబ్బు సంపాదిస్తాపట్టుదల ఉంటే ఆటో డ్రైవర్ కుమారుడైనా అత్యున్నత స్థాయికి చేరుకోవచ్చని నిరూపించాడు. అయితే, చిన్ననాడు అందరిలాగే తానూ తల్లి చేత చివాట్లు తిన్నాడు సిరాజ్. గల్లీల్లో ఆడుతూ ఉంటే.. ‘ఈ ఆట అన్నం పెడుతుందా?’ అంటూ తల్లి ఆవేదన పడుతుంటే.. ఆమెను ఊరడించేందుకు.. ‘‘ఏదో ఒకరోజు ఇంట్లో పట్టనంత డబ్బు సంపాదిస్తా’’ అని చెప్పాడు.అయితే, తర్వాతి రోజుల్లో ఆ మాటనే నిజం చేశాడు సిరాజ్. ఈ విషయాల గురించి తాజాగా మాట్లాడుతూ.. ‘‘ఆరోజు నాకింకా గుర్తుంది. నేను క్రికెట్ ఆడేందుకు వెళ్లాను. మా అమ్మకు నేనలా వెళ్లడం అస్సలు ఇష్టం లేదు.భవిష్యత్తు గురించి నాకు బెంగలేదని తిట్టేది. ఆరోజు కూడా అలాగే తిట్టింది. అప్పుడు నేను.. ‘అమ్మ నన్ను కొట్టడం ఆపేయ్.. ఏదో ఒకరోజు నేను కచ్చితంగా ఈ ఇంట్లో పట్టనంత డబ్బు సంపాదిస్తాను. నువ్వేం బాధపడకు.. నేనది చేసి చూపిస్తా’ అని నమ్మకంగా చెప్పాను.ఆత్మవిశ్వాసం ఉంటేనే..ఆరోజు నేను అన్న మాటలు నిజమయ్యాయి. ఆ దేవుడే వాటిని నిజం చేశాడు. ఆత్మవిశ్వాసం ఉంటేనే మనం అనుకున్న లక్ష్యాన్ని చేరుకోగలం. ఒకవేళ మీపై మీకు నమ్మకం లేకుంటే జీవితంలో ఏమీ సాధించలేరు. మనల్ని మనం నమ్ముకోవాలి.మనకంటూ లక్ష్యాన్ని నిర్దేశించుకుని.. దాని కోసమే నిరంతరమూ పరితపించాలి. అప్పుడే అంతా సవ్యంగా సాగుతుంది. నేను ఈరోజు యార్కర్ వేసి వికెట్ తీస్తానని అనుకుంటే.. కచ్చితంగా అది సాధించగలను. నా ఆత్మవిశ్వాసమే అందుకు కారణం. మన ప్రణాళికలను పక్కాగా అమలు చేసినప్పుడు ఏదీ అసాధ్యం కాదు. కఠినంగా శ్రమిస్తే దక్కనిది ఏదీ ఉండదు’’ అని సిరాజ్ ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌తో పేర్కొన్నాడు.కాగా హైదరాబాద్ తరఫున దేశీ క్రికెట్లో రాణించిన సిరాజ్.. 2017లో ఐపీఎల్లో అడుగుపెట్టాడు. ఆ తర్వాత అతడు వెనుదిరిగి చూసుకోలేదు. టీమిండియా తరఫున మూడు ఫార్మాట్లలోనూ సత్తా చాటిన సిరాజ్.. ఇప్పటి వరకు తన కెరీర్లో 42 టెస్టులు, 44 వన్డేలు, 16 టీ20లు ఆడాడు.విలాసవంతమైన జీవితంటెస్టుల్లో ఇప్పటికి 130, వన్డేల్లో 71, టీ20లలో 14 వికెట్లు తీసిన సిరాజ్.. ప్రస్తుతం సొంతగడ్డపై వెస్టిండీస్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్‌తో బిజీగా ఉన్నాడు. అన్నట్లు పేద కుటుంబంలో జన్మించిన సిరాజ్ నికర ఆస్తుల విలువ ప్రస్తుతం దాదాపు రూ. 60 కోట్లు. చిన్నపుడు ఇరుకు ఇంట్లో నివసించిన సిరాజ్ తల్లిని ఇప్పుడు జూబ్లీహిల్స్‌లోని కోట్ల విలువ గల ఇంట్లో నివసిస్తున్నారు. అంతేకాదు.. చిన్నపుడు తండ్రితో కలిసి ఆటోలో తిరిగిన ఈ హైదరాబాదీ బౌలర్ గ్యారేజీలో ఇప్పుడు విలాసవంతమైన కార్లు ఎన్నో ఉన్నాయి. అయితే, తన సక్సెస్‌ను పూర్తిగా ఆస్వాదించకుండానే తండ్రి మరణించడం సిరాజ్‌కు ఎప్పటికీ తీరని లోటు!చదవండి: ‘మీ నాన్నతో కలిసి ఆటో తోలుకో’;.. ధోని ఆరోజు చెప్పిన మాటతో ఇలా..: సిరాజ్


