టీ20 ప్రపంచకప్ గెలిచిన టీమిండియా జట్టులో సభ్యుడిగా ఉన్న ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా కొత్త కారుతో దర్శనమిచ్చాడు. 12 కోట్ల విలువ చేసే ఫెరారీ 12 సిలిండ్రీ కారును తన గ్యారేజీలోకి తీసుకొచ్చాడు. నలుపు రంగులో ఉన్న ఫెరారీ కారును తానే సొంతంగా డ్రైవ్ చేసుకుంటూ ఇంటికి వచ్చాడు.
కారులో అతడి పక్కనే తన గర్ల్‌ఫ్రెండ్ మిహికా శర్మ కూడా ఉండడం గమనార్హం. తాజాగా దీనికి సంబంధించిన వీడియోను క్రికెట్ అభిమాని తన సోషల్ మీడియా ఖాతా ‘ఎక్స్’ వేదికగా షేర్ చేయడంతో వైరల్‌గా మారింది. కాగా హార్దిక్ పాండ్యా వద్ద ఇప్పటికే రోల్స్ రాయ్స్ ఫాంటమ్, లంబోర్గిని హురాకాన్ ఈవీవో, లంబోర్గిని యూరస్, మెర్సిడెస్ -ఏజీఎం జీ63, రేంజ్ రోవర్., ఆడీ ఏ6 కార్లు ఉన్నాయి.
తాజాగా వీటి సరసన ఫెరారీ కారు వచ్చి చేరింది. ఇక హార్దిక్ పాండ్యా టీ20 ప్రపంచకప్‌లో ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టాడు. తొమ్మిది మ్యాచ్‌ల్లో 160 స్ట్రైక్‌రేట్ 217 పరుగులు సాధించాడు. ఇందులో రెండు హాఫ్ సెంచరీలున్నాయి. బౌలింగ్‌లోనూ తన ప్రతిభ చూపిన హార్దిక్ 9 వికెట్లు పడగొట్టి తన పాత్రకు న్యాయం చేశాడు.
అయితే టీ20 ప్రపంచకప్ గెలిచిన తర్వాత టీమిండియా విజయోత్సవాలు చేసుకుంటున్న సందర్భంలో హార్దిక్ పాండ్యా జాతీయజెండాను శరీరానికి కప్పుకొని ఉన్న సమయంలోనే అతడి ప్రేయసి మిహికా శర్మ అతని చెంపపై ముద్దులు పెట్టడం వివాదాస్పదంగా మారింది. పాండ్యా జాతీయ జెండాను అవమానించాడని పుణేకు చెందిన వాజిద్ ఖాన్ అనే అడ్వకేట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
చదవండి: తంజిద్ తొలి శతకం.. బంగ్లా భారీస్కోరు!
Hardik Pandya’s new Ferrari 12Cilindri worth 12cr. pic.twitter.com/QovLNVB8kY
— Mufaddal Vohra (@mufaddal_vohra) March 15, 2026


