తంజిద్‌ తొలి శతకం.. బంగ్లా భారీస్కోరు! | Tanzid Hasan Century Bangladesh Set Big Target For Pak 3rd ODI | Sakshi
Sakshi News home page

BAN Vs PAK: తంజిద్‌ తొలి శతకం.. బంగ్లా భారీస్కోరు!

Mar 15 2026 6:09 PM | Updated on Mar 15 2026 6:22 PM

Tanzid Hasan Century Bangladesh Set Big Target For Pak 3rd ODI

పాకిస్థాన్‌తో జరుగుతున్న నిర్ణయాత్మక మూడో వన్డేలో బంగ్లాదేశ్‌ భారీ స్కోరు సాధించింది. ఢాకా వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 290 పరుగులు చేసింది. ఓపెనర్‌ తంజిద్‌ హసన్‌ తమిమ్‌ (107 బంతుల్లో 107; 6 ఫోర్లు, 7 సిక్సర్లు) సెంచరీతో కదం తొక్కాడు. 

చివర్లో తౌహిద్‌ హృదోయ్‌ (44 బంతుల్లో 48 నాటౌట్‌; 4 ఫోర్లు),లిటన్‌ దాస్‌ (51 బంతుల్లో 41) రాణించారు. పాకిస్థాన్‌ బౌలర్లలో హారిస్‌ రవూఫ్‌ 3 వికెట్లతో రాణించాడు. టాస్‌ గెలిచి బౌలింగ్‌కు మొగ్గు చూపిన పాకిస్థాన్‌ బంగ్లాను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది.  బౌలింగ్‌తో బంగ్లాను కట్టడి చేయాలని భావించిన పాకిస్థాన్‌కు ఆది నుంచే హంసపాదు ఎదురయ్యింది. 

ఓపెనర్లు తంజిద్‌, సైఫ్‌ హసన్‌లు తొలి వికెట్‌కు 108 పరుగులు జోడించడంతో ఇన్నింగ్స్‌కు గట్టి పునాది పడింది. 36 పరుగులు చేసిన సైఫ్‌ హసన్‌ షాహిన్‌ అఫ్రిది బౌలింగ్‌లో వెనుదిరిగాడు. ఆ తర్వాత నజ్ముల్‌ హసన్‌ (27)తో కలిసి తంజిద్‌ ఇన్నింగ్స్‌ నడిపించాడు. ఈ దశలో 107 బంతుల్లో తంజిద్‌ తన వన్డే కెరీర్‌లో తొలి శతకాన్ని అందుకున్నాడు. ఆఖర్లో లిటన్‌ దాస్‌, తౌహిద్‌ హృదోయ్‌ ధాటిగా ఆడడంతో బంగ్లా భారీ స్కోరు సాధించింది. ఇప్పటికే చెరో వన్డే మ్యాచ్‌ గెలవడంతో మూడో వన్డే సిరీస్‌ విజేత ఎవరో తేల్చనుంది.

చదవండి: 12 కోట్ల కారుతో తళుక్కుమన్న హార్దిక్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement