Bangladesh
-
కివీస్‌తో కలిసి సెమీస్‌కు భారత్
బంగ్లాదేశ్ స్పిన్నర్ రిషాద్ ఓవర్లో కవర్స్ దిశగా ఫోర్ కొట్టిన కివీస్ బ్యాటర్ బ్రేస్‌వెల్... ఈ షాట్‌తో చాంపియన్స్ ట్రోఫీ గ్రూప్ ‘ఎ’లో మరో రెండు మ్యాచ్‌లు మిగిలి ఉండగానే సమీకరణం తేలిపోయింది. ఈ బౌండరీతో న్యూజిలాండ్, భారత్ అధికారికంగా సెమీఫైనల్లోకి ప్రవేశించాయి. డిఫెండింగ్ చాంపియన్, ఆతిథ్య జట్టయిన పాకిస్తాన్‌తో పాటు బంగ్లాదేశ్ కథ కూడా లీగ్ దశలోనే ముగిసింది. నిష్క్రమించిన రెండు జట్లు ప్రాధాన్యత లేని పోరులో గురువారం తలపడనుండగా... సెమీస్‌కు ముందు సన్నాహకంగా ఆదివారం కివీస్‌ను భారత్ ఎదుర్కోనుంది.కివీస్ కట్టుదిట్టమైన బౌలింగ్‌ను ఎదుర్కొనడంలో విఫలమైన బంగ్లాదేశ్ తొలి మ్యాచ్ తరహాలోనే పేలవ బ్యాటింగ్‌తో దాదాపు అదే స్కోరు సాధించగా... మరో 23 బంతులు మిగిలి ఉండగానే న్యూజిలాండ్ ఛేదనను అలవోకగా పూర్తి చేసింది. విరామం లేకుండా వరుసగా 10 ఓవర్లు వేసిన ఆఫ్‌స్పిన్నర్ బ్రేస్‌వెల్ నాలుగు కీలక వికెట్లతో ప్రత్యర్థి పని పట్టగా... బ్యాటింగ్‌లో రచిన్ రవీంద్ర సెంచరీ హైలైట్‌గా నిలిచాయి. గత చాంపియన్స్ ట్రోఫీలో తమను ఓడించి సెమీఫైనల్ చేరిన బంగ్లాదేశ్‌ను ఇప్పుడు కివీస్ అదే తరహాలో 5 వికెట్లతో ఓడించి సెమీస్ చేరడం విశేషం. రావల్పిండి: చాంపియన్స్ ట్రోఫీలో వరుసగా రెండో విజయంతో మాజీ విజేత న్యూజిలాండ్ సెమీఫైనల్లోకి అడుగు పెట్టింది. ఇదే గ్రూప్‌లో రెండు విజయాలు సాధించిన భారత్ కూడా కివీస్‌తో పాటు సెమీస్ చేరింది. సోమవారం జరిగిన గ్రూప్ ‘ఎ’ లీగ్ మ్యాచ్‌లో కివీస్ 5 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్‌ను ఓడించింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్ 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 236 పరుగులు చేసింది.కెప్టెన్ నజ్ముల్ హుసేన్ (110 బంతుల్లో 77; 9 ఫోర్లు), జాకీర్ అలీ (55 బంతుల్లో 45; 3 ఫోర్లు, 1 సిక్స్) రాణించగా... ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ బ్రేస్‌వెల్ (4/26) నాలుగు వికెట్లతో బంగ్లాదేశ్‌ను దెబ్బ తీశాడు. అనంతరం న్యూజిలాండ్ 46.1 ఓవర్లలో 5 వికెట్లకు 240 పరుగులు సాధించి గెలిచింది. రచిన్ రవీంద్ర (105 బంతుల్లో 112; 12 ఫోర్లు, 1 సిక్స్) సెంచరీతో సత్తా చాటగా... లాథమ్ (76 బంతుల్లో 55; 3 ఫోర్లు) రాణించాడు. నజ్ముల్ అర్ధసెంచరీ... బంగ్లాదేశ్ ఇన్నింగ్స్‌ను ఓపెనర్లు తన్జీద్ (24; 1 ఫోర్, 2 సిక్స్‌లు), నజ్ముల్ ధాటిగా మొదలు పెట్టారు. తన్జీద్ రెండు సిక్స్‌లు బాదగా, జేమీసన్ ఓవర్లో నజ్ముల్ 3 ఫోర్లు కొట్టాడు. అయితే 9వ ఓవర్లోనే స్పిన్ బౌలింగ్‌ను మొదలు పెట్టిన కివీస్ ఫలితం సాధించింది. బ్రేస్‌వెల్ తొలి ఓవర్లోనే తన్జీద్ వికెట్ తీసి పతనానికి శ్రీకారం చుట్టగా... మిరాజ్ (13) మరోసారి విఫలమయ్యాడు. అయితే ఆ తర్వాత బ్రేస్‌వెల్ మళ్లీ బంగ్లాను దెబ్బ కొట్టాడు.21 పరుగుల వ్యవధిలో బంగ్లా తౌహీద్ (7), ముషి్ఫకర్ (2), మహ్మదుల్లా (4) వికెట్లు కోల్పోయింది. ఈ మూడు వికెట్లూ బ్రేస్‌వెల్ ఖాతాలోకే చేరాయి. ఈ దశలో నజ్ముల్, జాకీర్ కొద్దిసేపు వికెట్ల పతనాన్ని నిలువరించారు. 71 బంతుల్లో నజ్ముల్ అర్ధ సెంచరీ పూర్తయింది. నజ్ముల్‌ను అవుట్ చేసి రూర్కే ఈ జోడీని విడదీయగా... బంగ్లా మిగిలిన వికెట్లు కోల్పోయేందుకు ఎక్కువ సమయం పట్టలేదు. బంగ్లా ఇన్నింగ్స్‌లో డాట్ బాల్స్ ఏకంగా 178 ఉన్నాయి. శతక భాగస్వామ్యం... లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో తొలి ఓవర్లోనే యంగ్ (0) అవుట్ కాగా, కొద్ది సేపటికే కేన్ విలియమ్సన్ (5) కూడా వెనుదిరిగాడు. కాన్వే, రచిన్ కలిసి మూడో వికెట్‌కు 57 పరుగులు జోడించిన తర్వాత కాన్వే పెవిలియన్ చేరాడు. అయితే రచిన్, లాథమ్‌ల భారీ భాగస్వామ్యం జట్టును గెలుపు దిశగా తీసుకెళ్లింది. ఈ ద్వయాన్ని విడదీసేందుకు బంగ్లా బౌలర్లు ఎంత ప్రయత్నించినా లాభం లేకపోయింది. ఈ క్రమంలో 95 బంతుల్లోనే రచిన్ కెరీర్లో నాలుగో సెంచరీని అందుకున్నాడు. లాథమ్ కూడా 71 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించాడు. ఎట్టకేలకు విజయానికి 36 పరుగుల దూరంలో రచిన్‌ను బంగ్లా అవుట్ చేయగా, కొద్ది సేపటికే లాథమ్ కూడా నిష్క్రమించాడు. అయితే ఫిలిప్స్ (21 నాటౌట్), బ్రేస్‌వెల్ (11 నాటౌట్) కలిసి మిగతా పనిని పూర్తి చేశారు. స్కోరు వివరాలు బంగ్లాదేశ్ ఇన్నింగ్స్: తన్జీద్ (సి) విలియమ్సన్ (బి) బ్రేస్‌వెల్ 24; నజ్ముల్ (సి) బ్రేస్‌వెల్ (బి) రూర్కే 77; మిరాజ్ (సి) సాంట్నర్ (బి) రూర్కే 13; తౌహీద్ (సి) విలియమ్సన్ (బి) బ్రేస్‌వెల్ 7; ముషి్ఫకర్ (సి) రచిన్ (బి) బ్రేస్‌వెల్ 2; మహ్ముదుల్లా (సి) రూర్కే (బి) బ్రేస్‌వెల్ 4; జాకీర్ (రనౌట్) 45; రిషాద్ (సి) సాంట్నర్ (బి) హెన్రీ 26; తస్కీన్ (సి) కాన్వే (బి) జేమీసన్ 10; ముస్తఫిజుర్ (నాటౌట్) 3; నాహిద్ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 25; మొత్తం (50 ఓవర్లలో 9 వికెట్లకు) 236.వికెట్ల పతనం: 1–45, 2–64, 3–97, 4–106, 5–118, 6–163, 7–196, 8–231, 9– 236. బౌలింగ్: హెన్రీ 9–0–57–1, జేమీసన్ 9–1– 48–1, బ్రేస్‌వెల్ 10–0–26–4, రూర్కే 10–1– 48– 2, సాంట్నర్ 10–1–44–0, ఫిలిప్స్ 2–0– 10–0. న్యూజిలాండ్ ఇన్నింగ్స్: యంగ్ (బి) తస్కీన్ 0; కాన్వే (బి) ముస్తఫిజుర్ 30; విలియమ్సన్ (సి) ముష్ఫికర్ (బి) నాహిద్ 5; రచిన్ (సి) (సబ్) పర్వేజ్ (బి) రిషాద్ 112; లాథమ్ (రనౌట్) 55; ఫిలిప్స్ (నాటౌట్) 21; బ్రేస్‌వెల్ (నాటౌట్) 11; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (46.1 ఓవర్లలో 5 వికెట్లకు) 240.వికెట్ల పతనం: 1–0, 2–15, 3–72, 4–201, 5–214. బౌలింగ్: తస్కీన్ 7–2–28–1, నాహిద్ 9–0–43–1, మిరాజ్ 10–0–53–0, ముస్తఫిజుర్ 10–0–42–1, రిషాద్ 9.1–0–58–1, నజ్ముల్ 1–0–12–0. చాంపియన్స్ ట్రోఫీలో నేడుఆ్రస్టేలియా x దక్షిణాఫ్రికామధ్యాహ్నం గం. 2:30 నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం -
Mahakumbh: భారత్-బంగ్లా ఉద్రిక్తతలకు ఉపశమనం
ప్రయాగ్‌రాజ్: గత కొంతకాలంగా భారత్- బంగ్లాదేశ్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు మహాకుంభమేళా నేపధ్యంలో తగ్గుముఖం పట్టాయి. 2024 ఆగస్టులో బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా ప్రభుత్వం పడిపోయిన దరిమిలా ఆ దేశంలో అశాంతి చెలరేగింది. ఈ నేపథ్యంలో మైనారిటీ హిందువులను లక్ష్యంగా చేసుకుని పలు దాడులు జరిగాయి. ఈ ఘటనల నేపధ్యంలో భారత్- బంగ్లాల మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. అయితే ప్రస్తుతం యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న కుంభమేళా ఈ ఉద్రిక్తతలకు పరిష్కార మార్గంగా మారింది.బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రధాని ముహమ్మద్ యూనస్ ప్రభుత్వం మహాకుంభ్‌లో ప్రదర్శన ఇచ్చేందుకు బంగ్లాదేశ్ కళాకారుల బృందానికి ఆర్థికసాయం అందించింది. గంగా వేదికపై జరిగిన 10వ ఇండియా ఇంటర్నేషనల్ డ్యాన్స్ అండ్ మ్యూజిక్ ఫెస్టివల్లో బంగ్లాదేశ్‌కు చెందిన ఆరుగురు సభ్యుల నృత్య బృందం ప్రదర్శన ఇచ్చింది. ఈ కార్యక్రమాన్ని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం, ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్ (ఐసీసీఆర్) సంయుక్తంగా నిర్వహించాయి. బంగ్లాదేశ్ కొంతకాలంగా భారతదేశంలో నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాలకు దూరంగా ఉంటూవస్తోంది.అంతర్జాతీయ కోల్‌కతా పుస్తక ప్రదర్శన, 30వ కోల్‌కతా అంతర్జాతీయ చలనచిత్రోత్సవం మొదలైనవాటిలో బంగ్లాదేశ్ భాగస్వామ్యం వహించలేదు. అంతకుముందు ఈ కార్యక్రమాలలో బంగ్లాదేశ్ పాల్గొంటూ వచ్చింది. తాజాగా కుంభమేళాలో ప్రదర్శన నిర్వహించిన బంగ్లాదేశ్ కళాకారుల బృందానికి ఢాకా విశ్వవిద్యాలయ నృత్య విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ రాచెల్ ప్రియాంక పెర్సిస్ నాయకత్వం వహించారు. ఫిబ్రవరి 22,23లలో మహా కుంభ్‌లో రెండు రోజుల పాటు బంగ్లాదేశ్ కళాకారుల బృందం నృత్యప్రదర్శనలు నిర్వహించింది. ఈ నృత్య బృందం త్వరలో గుజరాత్, జమ్ముకశ్మీర్, జార్ఖండ్, బీహార్, అస్సాం, మేఘాలయలలో ప్రదర్శనలు ఇవ్వనుంది. ఈ నెలాఖరులో ఢిల్లీలో బంగ్లాదేశ్ కళాకారులు ప్రదర్శన నిర్వహించనున్నారు.ఇది కూడా చదవండి: Mahakumbh: మహాశివరాత్రికి చివరి పవిత్ర స్నానం.. సన్నాహాలివే.. -
సెమీస్ లక్ష్యంగా...
రావల్పిండి: టోర్నీ ఆరంభ మ్యాచ్‌లో ఆతిథ్య పాకిస్తాన్‌ను ఓడించిన న్యూజిలాండ్ వరుస విజయాలతో సెమీఫైనల్ చేరాలని భావిస్తుంది. నేడు బంగ్లాదేశ్‌తో జరిగే పోరులో గెలిచి నాకౌట్‌కు అర్హత పొందాలనే లక్ష్యంతో బరిలోకి దిగుతోంది. సోమవారం గ్రూప్ ‘ఎ’లో జరిగే ఈ మ్యాచ్ బంగ్లాదేశ్‌కు చావోరేవో కానుంది. భారత్ చేతిలో తొలి మ్యాచ్ ఓడిన నజు్మల్ హుస్సేన్ బృందం నెట్ రన్‌రేట్‌లోనూ మైనస్‌లోకి పడిపోయింది. ఇప్పుడు ఇదీ ఓడితే ఇంటిదారి పట్టడం మినహా ఇంకో దారే ఉండదు. అయితే పటిష్టమైన కివీస్‌ను ఓడించడం అంత సులభం కాదు. చాంపియన్స్ ట్రోఫీకి ముందు పాక్‌లో సన్నాహకంగా జరిగిన ముక్కోణపు వన్డే టోర్నీలో టైటిల్ సాధించిన న్యూజిలాండ్ ఆల్‌రౌండ్ సామర్థ్యంతో పటిష్టంగా ఉంది. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్‌లాంటి జట్టుపై గెలుపొందడం, సెమీఫైనల్‌కు చేరడం కివీస్‌కు కష్టమైతే కాదు. అయితే మ్యాచ్‌పై ఏ బెంగా లేని న్యూజిలాండ్ తుదిజట్టు కసరత్తుపైనే తర్జనభర్జన పడుతోంది. తలకు అయిన స్వల్పగాయం నుంచి రచిన్ రవీంద్ర కోలుకోవడంతో కివీస్‌కు డాషింగ్ ఓపెనర్ అందుబాటులో వచ్చాడు.గత మ్యాచ్‌లో కాన్వే, విల్ యంగ్ ఇన్నింగ్స్ ఆరంభించగా, ఇప్పుడు విల్ యంగ్‌ను తప్పించే అవకాశముంది. ఇదే జరిగితే లెఫ్ట్–రైట్ హ్యాండ్ ఓపెనింగ్ కాంబినేషన్ అటకెక్కుతుంది. ఫామ్‌లో ఉన్న కాన్వేతో రవీంద్ర ఇన్నింగ్స్ ఆరంభిస్తాడు. మరోవైపు తొలి మ్యాచ్‌లో ఓడిన బంగ్లాదేశ్ తీవ్ర ఒత్తిడిలో మరో గట్టి ప్రత్యర్థిని ఎదుర్కొననుండటం పెద్ద సవాల్‌గా మారింది. గత మ్యాచ్‌లో భారత్‌ను బౌలింగ్‌తో ఇబ్బంది పెట్టిన నజు్మల్ బృందం బ్యాటింగ్‌లో పేలవమైన ప్రదర్శన కనబరిచింది. ఇప్పుడు బ్యాటింగ్ లోపాలను సరిదిద్దుకుంటే మ్యాచ్‌లో ప్రత్యరి్థకి గట్టిపోటీ ఇచ్చే అవకాశముంటుంది. లేదంటే ఇంకో మ్యాచ్ (పాక్‌తో) ఉండగానే గ్రూప్ దశలోనే వెనుదిరగడం ఖాయమవుతుంది. -
భారత్‌కు అమెరికా సాయం.. బంగ్లాకు మళ్లిందా?
న్యూఢిల్లీ: అమెరికా 21 మిలియన్ డాలర్ల సాయం వ్యవహారం.. కొత్త మలుపు తిరిగింది. ఆ సాయం భారత సార్వత్రిక ఎన్నికలను ప్రభావితం చేసేందుకేనన్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన వ్యాఖ్యలతో బీజేపీ-కాంగ్రెస్‌లు పరస్పరం విమర్శలు గుప్పించుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ లోపు ఆ సాయాన్ని బంగ్లాదేశ్‌కు మళ్లించారంటూ ఓ జాతీయ మీడియా సంస్థ నుంచి కథనం వెలువడంది. దాని ఆధారంగా బీజేపీ-కాంగ్రెస్‌లు పరస్పర ఆరోపణలతో మండిపడుతున్నాయి.భారత్‌లో ఓటింగ్ శాతం పెంపు కోసం ఇచ్చిన ఆ నిధులను బంగ్లాదేశ్‌లో ఓ ప్రాజెక్టు వినియోగించారన్నది ఆ కథనం సారాంశం. కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్(Jairam Ramesh) దీనిని ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసి.. బీజేపీ, ఆ పార్టీ అనుకూల మీడియాపై విరుచుకుపడ్డారు. దానిని షేర్ చేస్తూ ప్రతిపక్ష కాంగ్రెస్ బీజేపీపై నిప్పులు చెరుగుతోంది. అయితే.. ఆ కథనాన్ని ఫేక్ అంటూ బీజేపీ ఖండించింది. Lies first mouthed in Washington. Lies then amplified by BJP's Jhoot Sena.Lies made to be debated on Godi media.Lies now thoroughly exposed. Will the Liars apologise? pic.twitter.com/nY7iP4jmnN— Jairam Ramesh (@Jairam_Ramesh) February 21, 2025 FAKE NEWS ALERT 🚨‼️The Indian Express story discusses $21 million in funding to Bangladesh in 2022. However, the article misrepresents the reference to a $21 million funding tranche intended to ‘promote’ voter turnout in India.What Indian Express conveniently sidesteps is… pic.twitter.com/niOaWXivm5— Amit Malviya (@amitmalviya) February 21, 2025భారత్‌లో ఎవరినో గెలిపించడానికి గత అధ్యక్షుడు జో బైడెన్ 21 మిలియన్ డాలర్ల(రూ.182 కోట్ల నిధులు) కేటాయించారని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) ఆరోపించిన సంగతి తెలిసిందే. ఓటింగ్‌ను పెంచడంద్వారా భారత ఎన్నికల్లో జోక్యం చేసుకునేందుకు బైడెన్ ప్రయత్నించారని ట్రంప్ విమర్శించారు. అందుకే డోజ్ దానిని రద్దు చేసిందని సమర్థించుకున్నారు. ఈ ట్రంప్ వ్యాఖ్యలపై భారత్‌లో దుమారం రేగింది.విదేశీ సంస్థల చేతుల్లో రాహుల్ గాంధీ(Rahul Gandhi) కీలుబొమ్మలా మారారని బీజేపీ ధ్వజమెత్తగా.. ట్రంప్‌వి అర్థం లేని ఆరోపణలని కాంగ్రెస్ తిప్పికొట్టింది. ట్రంప్ వ్యాఖ్యలతో 2024 ఎన్నికల్లో విదేశీ శక్తులు పని చేస్తున్నాయని అప్పట్లో ప్రధాని మోదీ చేసిన ఆరోపణలు నిజమని తేలిందని బీజేపీ పేర్కొంది. విదేశీ శక్తులతో కలిసి రాహుల్ గాంధీ.. భారత్ వ్యూహాత్మక, భౌగోళిక ప్రయోజనాలను దెబ్బతీయాలని చూశారని బీజేపీ ఐటీ సెల్ హెడ్ అమిత్ మాలవీయ విమర్శించారు. అయితే ట్రంప్ వ్యాఖ్యలు అర్థం లేని ఆరోపణలేనని కాంగ్రెస్ కొట్టిపారేసింది. యూఎస్ ఎయిడ్ ద్వారా దశాబ్దాలుగా భారత్‌లోని ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థలకు అందిన సాయంపై శ్వేత పత్రాన్ని కేంద్రం విడుదల చేయాలని ఆ పార్టీ నేత జైరాం రమేశ్ డిమాండు చేశారు.ఇతర దేశాలకు ఇచ్చే నిధుల్లో కోత విధిస్తూ ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ నేతృత్వంలోని డోజ్ విభాగం ఫిబ్రవరి 16న జాబితా ప్రకటించింది. అందులో భారత్‌లో ఓటర్ల సంఖ్యను పెంచేందుకు ఉద్దేశించిన నిధులను రద్దు చేసినట్లు ప్రకటించింది. డోజ్ నిర్ణయం.. భారత్‌లో రాజకీయ వివాదానికి దారి తీసింది. -
షమీ... శుబ్... ఆరంభం
229 పరుగుల స్వల్ప విజయలక్ష్యం...భారత్‌లాంటి బలమైన జట్టు ఆడుతూపాడుతూ దీనిని ఛేదిస్తుందని ఎవరైనా భావిస్తారు... కానీ పిచ్ ఒక్కసారిగా నెమ్మదించింది... పరుగులు రావడం కష్టంగా మారిపోయింది. ఈ స్థితిలో శుబ్‌మన్ గిల్ పట్టుదలగా నిలబడ్డాడు... కీలక భాగస్వామ్యాలతో జట్టును గెలుపుతీరం చేర్చడంతో పాటు వరుసగా రెండో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అంతకుముందు భారత్ పదునైన బౌలింగ్‌కు ఒకదశలో 35/5 వద్ద కుప్పకూలే స్థితిలో నిలిచిన బంగ్లాదేశ్... తౌహీద్, జాకీర్ ఆటతో 200 పరుగులు దాటగలిగింది. మరో ఐసీసీ మ్యాచ్‌లో ఐదు వికెట్ల ప్రదర్శనతో షమీ తన పునరాగమాన్ని ఘనంగా ప్రదర్శించాడు. శుభారంభం తర్వాత ఆదివారం అసలు పోరులో పాకిస్తాన్‌తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. దుబాయ్: చాంపియన్స్ ట్రోఫీలో భారత్ గెలుపు బోణీ చేసింది. గ్రూప్ ‘ఎ’లో భాగంగా గురువారం జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్ 6 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్‌ను ఓడించింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్ 49.4 ఓవర్లలో 228 పరుగులకు ఆలౌటైంది. తౌహీద్ హృదయ్ (118 బంతుల్లో 100; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) కెరీర్లో తొలి సెంచరీ సాధించగా... జాకీర్ అలీ (114 బంతుల్లో 68; 4 ఫోర్లు) రాణించాడు. వీరిద్దరు ఆరో వికెట్‌కు 34.2 ఓవర్లలో 154 పరుగులు జోడించారు. మొహమ్మద్ షమీ (5/53) ఐదు వికెట్లతో చెలరేగగా... హర్షిత్ రాణా 3, అక్షర్ 2 వికెట్లు తీశారు. అనంతరం భారత్ 46.3 ఓవర్లలో 4 వికెట్లకు 231 పరుగులు చేసి గెలిచింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ శుబ్‌మన్ గిల్ (129 బంతుల్లో 101 నాటౌట్; 9 ఫోర్లు, 2 సిక్స్‌లు) అజేయ శతకం నమోదు చేయగా... కెప్టెన్ రోహిత్ శర్మ (36 బంతుల్లో 41; 7 ఫోర్లు), కేఎల్ రాహుల్ (47 బంతుల్లో 41 నాటౌట్; 1 ఫోర్, 2 సిక్స్‌లు) రాణించారు. భారీ భాగస్వామ్యం... తొలి 5 వికెట్లకు 35 పరుగులు... చివరి 5 వికెట్లకు 39 పరుగులు... మధ్యలో తౌహీద్, జాకీర్ భారీ భాగస్వామ్యం! బంగ్లాదేశ్ ఇన్నింగ్స్ సాగిన తీరిది. షమీ, రాణా దెబ్బకు టపటపా 3 వికెట్లు కోల్పోయిన బంగ్లాను అక్షర్ తన తొలి ఓవర్లోనే దెబ్బ కొట్టాడు. వరుస బంతుల్లో తన్జీద్ (25 బంతుల్లో 25; 4 ఫోర్లు), ముష్ఫికర్ (0)ను అవుట్ చేసిన అతను త్రుటిలో హ్యాట్రిక్ కోల్పోయాడు. 35/5 నుంచి తౌహీద్, జాకీర్ జట్టును ఆదుకున్నారు. భారత ఆటగాళ్ల పేలవ ఫీల్డింగ్ కూడా వారికి కలిసొచ్చింది. సుదీర్ఘ ప్రయత్నం తర్వాత ఎట్టకేలకు 206 బంతుల ఈ భాగస్వామ్యాన్ని షమీ విడగొట్టాడు. ఆ తర్వాత 49వ ఓవర్ తొలి బంతికి సింగిల్‌తో తౌహీద్ 114 బంతుల్లో కెరీర్లో తొలి సెంచరీని పూర్తి చేసుకున్నాడు. రాణించిన రాహుల్... స్వల్ప లక్ష్యమే అయినా భారత్ ఛేదన సులువుగా సాగలేదు. ముస్తఫిజుర్ ఓవర్లో 3 ఫోర్లు సహా కొన్ని చక్కటి షాట్లు ఆడిన రోహిత్ పదో ఓవర్లో వెనుదిరగ్గా, గిల్ తన బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత పిచ్ ఒక్కసారిగా మందగించడంతో పరుగుల రాక గగనమైంది. గిల్, విరాట్ కోహ్లి (38 బంతుల్లో 22; 1 ఫోర్) కలిసి 12.5 ఓవర్లలో 43 పరుగులే జోడించగలిగారు. అనంతరం 11 పరుగుల వ్యవధిలో శ్రేయస్ అయ్యర్ (15), అక్షర్ పటేల్ (8) అవుటయ్యారు. అయితే గిల్‌కు రాహుల్ అండగా నిలిచాడు. బంగ్లా బౌలర్లు మధ్యలో కొద్ది సేపు ఆధిపత్యం ప్రదర్శించినట్లు కనిపించినా... నిలదొక్కుకున్న తర్వాత వీరిద్దరు స్వేచ్ఛగా ఆడారు. గిల్, రాహుల్ 16.2 ఓవర్లలో అభేద్యంగా 87 పరుగులు జోడించి మ్యాచ్‌ను ముగించారు. ఈ క్రమంలో 46వ ఓవర్లో సింగిల్‌తో 125 బంతుల్లో గిల్ వన్డేల్లో ఎనిమిదో సెంచరీని పూర్తి చేసుకున్నాడు. స్కోరు వివరాలు బంగ్లాదేశ్ ఇన్నింగ్స్: తన్జీద్ (సి) రాహుల్ (బి) అక్షర్ 25; సౌమ్య సర్కార్ (సి) రాహుల్ (బి) షమీ 0; నజు్మల్ (సి) కోహ్లి (బి) రాణా 0; మిరాజ్ (సి) గిల్ (బి) షమీ 5; తౌహీద్ (సి) షమీ (బి) రాణా 100; ముష్ఫికర్ (సి) రాహుల్ (బి) అక్షర్ 0; జాకీర్ (సి) కోహ్లి (బి) షమీ 68; రిషాద్ (సి) పాండ్యా (బి) రాణా 18; తన్జీమ్ (బి) షమీ 0; తస్కీన్ (సి) అయ్యర్ (బి) షమీ 3; ముస్తఫిజుర్ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (49.4 ఓవర్లలో ఆలౌట్) 228. వికెట్ల పతనం: 1–1, 2–2, 3–26, 4–35, 5–35, 6–189, 7–214, 8–215, 9–228, 10–228. బౌలింగ్: షమీ 10–0–53–5, హర్షిత్ రాణా 7.4–0–31–3, అక్షర్ 9–1–43–2, పాండ్యా 4–0–20–0, జడేజా 9–0–37–0, కుల్దీప్ 10–0–43–0. భారత్ ఇన్నింగ్స్: రోహిత్ (సి) రిషాద్ (బి) తస్కీన్ 41; గిల్ (నాటౌట్) 101; కోహ్లి (సి) సర్కార్ (బి) రిషాద్ 22; అయ్యర్ (సి) నజ్ముల్ (బి) ముస్తఫిజుర్ 15; అక్షర్ (సి అండ్ బి) రిషాద్ 8; రాహుల్ (నాటౌట్) 41; ఎక్స్‌ట్రాలు 3; మొత్తం (46.3 ఓవర్లలో 4 వికెట్లకు) 231. వికెట్ల పతనం: 1–69, 2–112, 3–133, 4–144. బౌలింగ్: తస్కీన్ 9–0–36–1, ముస్తఫిజుర్ 9–0–62–1, తన్జీమ్ 8.3–0–58–0, మిరాజ్ 10–0–37–0, రిషాద్ 10–0–38–2. అక్షర్ ‘హ్యాట్రిక్’ మిస్ మ్యాచ్‌లో బంగ్లాను తక్కువ స్కోరుకే పరిమితం చేయగలిగినా భారత్ ఫీల్డింగ్ స్థాయికి తగినట్లుగా లేకపోయింది. అక్షర్ తొలి ఓవర్లో వరుసగా రెండు వికెట్ల తర్వాత జాకీర్ (0 వద్ద) ఇచ్చిన అతి సునాయాస క్యాచ్‌ను స్లిప్‌లో రోహిత్ వదిలేశాడు. దాంతో అక్షర్ ‘హ్యాట్రిక్’ అవకాశం చేజారింది. రోహిత్ ఆ క్యాచ్ పట్టి ఉంటే స్కోరు 35/6తో ఇక కోలుకునే అవకాశం లేకపోయేది. ఆ తర్వాత జాకీర్ 24 వద్ద ఉన్నప్పుడు జడేజా బౌలింగ్‌లో స్టంప్ చేసే అవకాశాన్ని రాహుల్ చేజార్చాడు. చివరకు బ్యాటర్ 68 పరుగులు సాధించగలిగాడు. తౌహీద్ స్కోరు 23 వద్ద కుల్దీప్ బౌలింగ్‌లో మిడాఫ్‌లో పాండ్యా సునాయాస క్యాచ్ వదిలేయగా చివరకు అతను సెంచరీ పూర్తి చేసుకోగలిగాడు. ఇన్నింగ్స్ ఆరంభంలో 12 వద్ద తన్జీద్ను రనౌట్ చేసే అవకాశం వచ్చినా...అయ్యర్ త్రో స్టంప్స్‌కు చాలా దూరంగా వెళ్లింది. భారత్ ఇన్నింగ్స్‌లో రాహుల్ 9 వద్ద ఉన్నప్పుడు జాకీర్ సులువైన క్యాచ్ వదిలేసి మేలు చేశాడు.200 వన్డేల్లో షమీ 200 వికెట్ల మైలురాయిని అందుకున్నాడు. బంతుల పరంగా చూస్తే అందరికంటే వేగంగా (5126 బంతుల్లో) ఈ ఘనత సాధించిన బౌలర్‌గా అతను రికార్డు సాధించాడు. ఇందు కోసం మిచెల్ స్టార్క్‌కు (ఆ్రస్టేలియా) 5240 బంతులు పట్టాయి. తక్కువ ఇన్నింగ్స్‌లో ఈ ఘనత సాధించిన భారత బౌలర్‌గానూ షమీ గుర్తింపు పొందాడు. గతంలో అజిత్ అగార్కర్ 133 ఇన్నింగ్స్‌లో ఈ మైలురాయి అందుకోగా... షమీ 103 ఇన్నింగ్స్‌లు తీసుకున్నాడు.60 ఐసీసీ టోర్నీల్లో అత్యధిక (60) వికెట్లు తీసిన భారత బౌలర్‌గా షమీ నిలిచాడు. జహీర్ ఖాన్ (32 ఇన్నింగ్స్‌లలో 59) రికార్డును షమీ (19 ఇన్నింగ్స్‌లలో 60) సవరించాడు.11000 వన్డేల్లో రోహిత్ 11 వేల పరుగులు పూర్తి చేసుకొని ఈ ఘనత సాధించిన 10వ ఆటగాడిగా నిలిచాడు.156 వన్డేల్లో కోహ్లి క్యాచ్‌ల సంఖ్య. భారత్ తరఫున అత్యధిక క్యాచ్‌లు పట్టిన ఫీల్డర్‌గా అజహరుద్దీన్ (156) రికార్డును సమం చేయగా... జయవర్ధనే (218), పాంటింగ్ (160) వీరికంటే ముందున్నారు. చాంపియన్స్ ట్రోఫీలో నేడు దక్షిణాఫ్రికా X అఫ్గానిస్తాన్ వేదిక: కరాచీ మధ్యాహ్నం గం. 2:30 నుంచి స్టార్ స్పోర్ట్స్, స్పోర్ట్స్ 18, జియోహాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం -
Champions Trophy 2025: బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన భారత్
India Vs Bangladesh Match Live Updates And Highlights:భారత్ ఘన విజయం..ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో భారత్ బోణీ కొట్టింది. దుబాయ్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో భారత్ విజయం సాధించింది. 229 పరుగుల లక్ష్యాన్ని భారత్ కేవలం 4 వికెట్లు కోల్పోయి 46.3 ఓవర్లలో అందుకుంది. భారత బ్యాటర్లలో ఓపెనర్ శుబ్‌మన్ గిల్(129 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్స్‌లతో 101 నాటౌట్) సెంచరీతో మెరిశాడు. అతడితో పాటు రోహిత్ శర్మ(41), కేఎల్ రాహుల్(41) పరుగులతో రాణించారు. బంగ్లా బౌలర్లలో రిషాద్ హొస్సేన్ రెండు వికెట్లు పడగొట్టగా.. ముస్తఫిజుర్ రెహ్మన్, టాస్కిన్ ఆహ్మద్ తలా వికెట్ సాధించారు. అంతకముందు బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 49.4 ఓవర్లలో 228 పరుగులకు ఆలౌటైంది. మొహమ్మద్ షమీ ఐదు వికెట్లు తీసి బంగ్లా పతనాన్ని శాశించాడు. హర్షిత్ రాణా 3, అక్షర్ పటేల్ 2 వికెట్లు తీశారు. గిల్ సెంచరీ..శుబ్‌మన్ గిల్ సెంచరీతో మెరిశాడు. 125 బంతుల్లో గిల్ తన సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. భారత్ విజయానికి ఇంకా 7 పరుగులు కావాలి.విజయానికి చేరువలో భారత్..44 ఓవర్లు ముగిసే సరికి భారత్ 4 వికెట్ల నష్టానికి 210 పరుగులు చేసింది. క్రీజులో శుబ్‌మన్ గిల్(88), కేఎల్ రాహుల్(33) పరుగులతో ఉన్నారు. భారత విజయానికి ఇంకా 19 పరుగులు కావాలి.34 ఓవర్లకు భారత్ స్కోర్: 158/434 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా 4 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. క్రీజులో శుబ్‌మన్ గిల్(65), కేఎల్ రాహుల్(5) పరుగులతో ఉన్నారు. భారత విజయానికి ఇంకా 90 పరుగులు కావాలి.భారత్ నాలుగో వికెట్ డౌన్..144 పరుగుల వద్ద టీమిండియా నాలుగో వికెట్ కోల్పోయింది. 8 పరుగులు చేసిన అక్షర్ పటేల్.. రిషాద్ హొస్సేన్ బౌలింగ్‌లో రిటర్న్ క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. క్రీజులోకి కేఎల్ రాహుల్ వచ్చాడు. భారత్ విజయానికి ఇంకా 85 పరుగులు కావాలి.మూడో వికెట్ డౌన్..134 పరుగుల వద్ద టీమిండియా మూడో వికెట్ కోల్పోయింది. 15 పరుగులు చేసిన శ్రేయస్ అయ్యర్.. ముస్తఫిజుర్ రెహ్మాన్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. క్రీజులో శుబ్‌మన్ గిల్(56), అక్షర్ పటేల్(3) పరుగులతో ఉన్నారు. భారత విజయానికి ఇంకా 90 పరుగులు కావాలి.విరాట్ కోహ్లి ఔట్..టీమిండియా విరాట్ కోహ్లి రూపంలో రెండో వికెట్ కోల్పోయింది. 22 పరుగులు చేసిన విరాట్ కోహ్లి.. రిషాద్ హొస్సేన్ బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు. క్రీజులోకి శ్రేయస్ అయ్యర్ వచ్చాడు. 24 ఓవర్లకు భారత్ స్కోర్: 118/2ఆచితూచి ఆడుతున్న గిల్-కోహ్లిరోహిత్ శర్మ ఔటయ్యాక భారత బ్యాటర్లు విరాట్ కోహ్లి(13), శుబ్‌మన్ గిల్(41) ఆచితూచి ఆడుతున్నారు. 19 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా వికెట్ నష్టానికి 97 పరుగులు చేసింది.టీమిండియా తొలి వికెట్ డౌన్..69 పరుగుల వద్ద టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది. 41 పరుగులు చేసిన కెప్టెన్ రోహిత్ శర్మ.. టాస్కిన్ ఆహ్మద్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. క్రీజులోకి విరాట్ కోహ్లి వచ్చాడు. 10 ఓవర్లు ముగిసే సరికి భారత్ స్కోర్: 69/1దూకుడుగా ఆడుతున్న రోహిత్, గిల్..229 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా దూకుడుగా ఆడుతోంది. 7 ఓవర్లు ముగిసే సరికి భారత్ వికెట్ నష్టపోకుండా 45 పరుగులు చేసింది. క్రీజులో రోహిత్ శర్మ(27), శుబ్‌మన్ గిల్(13) ఉన్నారు.ఐదేసిన షమీ.. బంగ్లాదేశ్ 228 ఆలౌట్ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా బౌలర్లు చెలరేగిపోయాడు. భారత బౌలర్ల ధాటికి టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 49.4 ఓవర్లలో 228 పరుగులకు ఆలౌటైంది. మొహమ్మద్ షమీ ఐదు వికెట్లు తీసి బంగ్లా పతనాన్ని శాశించాడు. హర్షిత్ రాణా 3, అక్షర్ పటేల్ 2 వికెట్లు తీశారు. ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ ఈ మాత్రం స్కోరైన సాధించిందంటే అది తౌహిద్ హృదోయ్ (100), జాకిర్ అలీ (68) చలువే. 35 పరుగులకే సగం వికెట్లు కోల్పోయిన బంగ్లాదేశ్‌ను వీరిద్దరూ ఆదుకున్నారు. బంగ్లా ఇన్నింగ్స్‌లో వీరిద్దరూ మినహా ఎవరూ రాణించలేదు. ఈ మ్యాచ్‌లో షమీ 200 వికెట్ల క్లబ్లో చేరాడు. రోహిత్ శర్మ సునాయాసమైన క్యాచ్ వదిలేయడంతో అక్షర్ పటేల్‌కు హ్యాట్రిక్ మిస్ అయ్యింది. తొమ్మిదో వికెట్ కోల్పోయిన బంగ్లాదేశ్.. ఐదు వికెట్లు తీసిన షమీతౌహిద్ హృదోయ్ సూపర్ సెంచరీజట్టు పీకల్లోతు కష్టాల్లో ఉన్నప్పుడు బరిలోకి దిగిన తౌహిద్ హృదోయ్.. అద్భుతమైన పోరాటపటిమ కనబర్చి సూపర్ సెంచరీ చేశాడు. కండరాల సమస్యతో బాధపడుతూనే హృదోయ్ ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తున్నాడు. నాలుగో వికెట్ తీసిన షమీఈ మ్యాచ్‌లో షమీ ఖాతాలో నాలుగో వికెట్ పడింది. షమీ.. తంజిమ్ హసన్ (0)ను క్లీన్ బౌల్డ్ చేశాడు. 47 ఓవర్ల తర్వాత బంగ్లాదేశ్ స్కోర్ 221/8గా ఉంది. తౌహిద్ హృదోయ్ (96) , తస్కిన్ అహ్మద్ (1) క్రీజ్‌లో ఉన్నారు. ఈ మ్యాచ్‌లో సూపర్‌గా బ్యాటింగ్ చేస్తున్న హృదోయ్ కండరాలు పట్టేయడంతో బ్యాటింగ్ చేసేందుకు ఇబ్బంది పడుతున్నాడు.ఏడో వికెట్ కోల్పోయిన బంగ్లాదేశ్214 పరుగుల వద్ద బంగ్లాదేశ్ ఏడో వికెట్ కోల్పోయింది. హర్షిత్ రాణా బౌలింగ్‌లో హార్దిక్ పాండ్యాకు క్యాచ్ ఇచ్చి రిషద్ హొసేన్ (18) ఔటయ్యాడు.ఆరో వికెట్ కోల్పోయిన బంగ్లాదేశ్హృదోయ్, జాకిర్ అలీ మధ్య భాగస్వామ్యానికి ఎట్టకేలకు తెరపడింది. జాకిర్ అలీని (68) షమీ ఔట్ చేశాడు. 189 పరుగుల వద్ద (42.4 ఓవర్లు) బంగ్లాదేశ్ ఆరో వికెట్ కోల్పోయింది. తౌహిద్ హృదోయ్ (84), రిషద్ హొసేన్ క్రీజ్‌లో ఉన్నారు. హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకున్న జాకిర్ అలీ, హృదోయ్బంగ్లా మిడిలార్డర్ బ్యాటర్లు తౌహిద్ హృదోయ్, జాకిర్ అలీ హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకున్నారు.35 పరుగులకే సగం వికెట్లు కోల్పోయిన బంగ్లాదేశ్‌ను వీరిద్దరూ ఆదుకున్నారు. ప్రస్తుతం జాకిర్ అలీ 54, హృదోయ్ 61 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. 37.3 ఓవర్ల తర్వాత బంగ్లాదేశ్ స్కోర్ 150/5గా ఉంది. 31 ఓవర్ల అనంతరం బంగ్లాదేశ్ స్కోర్ 113/5తౌహిద్ హృదోయ్ (37), జాకిర్ అలీ (41) జాగ్రత్తగా ఆడుతూ బంగ్లాదేశ్‌ను గౌరవప్రదమైన స్కోర్ దిశగా తీసుకెళ్తున్నారు. వీరిద్దరు ఆరో వికెట్‌కు అజేయమైన 78 పరుగులు జోడించారు. 31 ఓవర్ల అనంతరం బంగ్లాదేశ్ స్కోర్ 113/5గా ఉంది.25 ఓవర్ల అనంతరం బంగ్లాదేశ్ స్కోర్ 92/535 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయిన బంగ్లాదేశ్ మరో వికెట్ పడకుంగా జాగ్రత్తగా ఆడుతుంది.25 ఓవర్ల అనంతరం ఆ జట్టు స్కోర్ 92/5గా ఉంది. తౌహిద్ హృదోయ్, జాకిర్ అలీ తలో 29 పరుగులు చేసి క్రీజ్‌లో ఉన్నారు. హ్యాట్రిక్ మిస్అక్షర్ పటేల్‌కు హ్యాట్రిక్ మిస్ అయ్యింది. తొమ్మిదో ఓవర్లో వరుసగా 2, 3 బంతులకు వికెట్లు తీసిన అక్షర్.. నాలుగో బంతికి కూడా వికెట్ తీయాల్సింది. జాకిర్ అలీ ఇచ్చిన లడ్డూ లాంటి క్యాచ్‌కు రోహిత్ శర్మ మిస్ కావడంతో అక్షర్ హ్యాట్రిక్ తీసే సువర్ణావకాశాన్ని కోల్పోయాడు. 9 ఓవర్ల తర్వాత బంగ్లాదేశ్ స్కోర్ 36/5గా ఉంది. తౌహిద్ హృదోయ్ (4), జాకిర్ అలీ (1) క్రీజ్‌లో ఉన్నారు.వరుస బంతుల్లో వికెట్లు తీసిన అక్షర్.. పీకల్లోతు కష్టాల్లో బంగ్లాదేశ్ఇన్నింగ్స్ తొమ్మిదో ఓవర్లో అక్షర్ పటేల్ వరుస బంతుల్లో (2, 3) వికెట్లు తీశాడు. తొలుత తంజిద్‌కు పెవిలియన్‌కు పంపిన అక్షర్.. ఆతర్వాతి బంతికే ముష్ఫికర్‌కు ఔట్ చేశాడు.నాలుగో వికెట్ కోల్పోయిన బంగ్లాదేశ్35 పరుగుల వద్ద బంగ్లాదేశ్ నాలుగో వికెట్ కోల్పోయింది. అక్షర్ పటేల్ బౌలింగ్‌లో వికెట్‌కీపర్ కేఎల్ రాహుల్ అద్భుతమైన క్యాచ్ పట్టడంతో తంజిద్ హసన్ (25) పెవిలియన్ బాట పట్టాడు. మళ్లీ వికెట్ తీసిన షమీ.. మూడో వికెట్ కోల్పోయిన బంగ్లాదేశ్బంగ్లాదేశ్ జట్టు 26 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. ఇన్నింగ్స్ ఏడో ఓవర్లో షమీ తన రెండో వికెట్ తీశాడు. స్లిప్స్‌లో శుభ్‌మన్ గిల్ అద్భుతమైన క్యాచ్ పట్టడంతో మెహిది హసన్ మిరాజ్ (5) పెవిలియన్‌కు చేరాడు. 6.2 ఓవర్ల అనంతరం బంగ్లా స్కోర్ 26/3గా ఉంది. తంజిద్ హసన్ (20) ధాటిగా ఆడుతున్నాడు. తౌహిద్ హృదోయ్ కొత్తగా క్రీజ్‌లోకి వచ్చాడు.రెండో ఓవర్లో మరో వికెట్బంగ్లాదేశ్ జట్టు రెండో ఓవర్లో మరో వికెట్ కోల్పోయింది. హర్షిత్ రాణా బౌలింగ్‌లో విరాట్ కోహ్లికి క్యాచ్ ఇచ్చి నజ్ముల్ హసన్ షాంటో డకౌటయ్యాడు. బంగ్లా ఖాతాలో ప్రస్తుతం 2 పరుగులకే ఉన్నాయి. తొలి ఓవర్లోనే వికెట్ తీసిన షమీటాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్ తొలి ఓవర్లోనే వికెట్ కోల్పోయింది. షమీ బౌలింగ్‌లో వికెట్‌కీపర్ కేఎల్ రాహుల్ క్యాచ్ పట్టడంతో సౌమ్య సర్కార్ డకౌటయ్యాడు. ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో భాగంగా ఇవాళ (ఫిబ్రవరి 20) భారత్, బంగ్లాదేశ్ మ్యాచ్ జరుగుతుంది దుబాయ్ వేదికగా జరిగే ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో భారత్ ముగ్గురు స్పిన్నర్లతో (అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్) బరిలోకి దిగుతుంది. అర్షదీప్ స్థానంలో షమీ రీఎంట్రీ ఇస్తున్నాడు. షమీకి జతగా హర్షిత్ రాణా బరిలోకి దిగుతున్నాడు. వికెట్‌కీపర్ బ్యాటర్‌గా కేఎల్ రాహుల్ కొనసాగుతున్నాడు. మిస్టరీ స్నిన్నర్ వరుణ్ చక్రవర్తికి తుది జట్టులో చోటు దక్కలేదు. మరోవైపు బంగ్లాదేశ్ సైతం ఈ మ్యాచ్‌లో ముగ్గురు స్పిన్నర్లతోనే బరిలోకి దిగుతుంది.తుది జట్లు..బంగ్లాదేశ్: తంజిద్ హసన్, సౌమ్య సర్కార్, నజ్ముల్ హొస్సేన్ శాంటో(కెప్టెన్), తౌహిద్ హృదయ్, ముష్ఫికర్ రహీమ్(వికెట్‌కీపర్), మెహిదీ హసన్ మిరాజ్, జాకర్ అలీ, రిషాద్ హొస్సేన్, తంజిమ్ హసన్ సకీబ్, తస్కిన్ అహ్మద్, ముస్తాఫిజుర్ రహ్మన్భారత్: రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్(వికెట్‌కీపర్), హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, హర్షిత్ రాణా, మహమ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్ -
చాంపియన్స్ ట్రోఫీలో నేటి నుంచి భారత్ పోరు మొదలు
-
హసీనాను రప్పించడమే ప్రాథమ్యం
ఢాకా: భారత్‌లో తలదాచుకుంటున్న మాజీ ప్రధాని షేక్ హసీనాను బంగ్లాదేశ్‌కు రప్పించడమే తమ తొలి ప్రాధాన్యత అని ఆ దేశ ప్రభుత్వం ఉద్ఘాటించింది. హసీనాను విచారించేందుకు ప్రయత్నాలను కొనసాగిస్తామని దేశ తాత్కాలిక సారథి మహమ్మద్ యూనస్ ప్రెస్ కార్యదర్శి షఫీకుల్ ఆలం తెలిపారు. ‘‘హసీనా పార్టీ అవామీ లీగ్ భవితవ్యంపై నీడలు కమ్ముకున్నాయి. ఆ పార్టీ దేశ రాజకీయ ముఖచిత్రంలో ఉండాలా, వద్దా అనేది ప్రజలతో పాటు ఇతర పారీ్టలు నిర్ణయిస్తాయి. హత్యలు, అదృశ్యాలు, నేరాలకు పాల్పడిన వారికి శిక్ష పడాల్సిందే’’అని నొక్కి చెప్పారు. హసీనా ప్రభుత్వం మానవాళిపై నేరాలకు పాల్పడుతోందంటూ ఐరాస మానవ హక్కుల హైకమిషనర్ కార్యాలయం ఇచ్చిన నివేదికను ఉదాహరించారు. ఈ నేపథ్యంలో హసీనాను అప్పగించే విషయమై భారత్‌పై ఒత్తిడి పెరిగిందన్నారు. యూనస్‌కు శిక్ష తప్పదు: హసీనా మహమ్మద్ యూనస్ బంగ్లాలో అరాచకాలకు పాల్పడుతున్నారని హసీనా ఆరోపించారు. ‘‘నన్ను అధికారానికి దూరం చేసే కుట్రలో భాగంగానే హత్యలకు పాల్పడ్డారు. అందుకు కారణమైన ‘దుండగుడు’యూనస్‌ను, ఇతరులను బంగ్లా గడ్డపై శిక్షిస్తా’’అని ప్రతినబూనారు. జూలై తిరుగుబాటులో మరణించిన పోలీసుల కుటుంబాలతో ఇటీవల ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె వర్చువల్‌గా పాల్గొన్నారు. మృతుల భార్యలతో ముఖాముఖి మాట్లాడారు. యూనస్ వచ్చాక గతంలో ఎన్నడూ లేనంతగా మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందన్నారు. 2024 తిరుగుబాటు నేపథ్యంలో తన ప్రభుత్వం కుప్పకూలడంతో హసీనా భారత్‌కు పారిపోయి వచ్చి ఆశ్రయం పొందుతుండటం తెలిసిందే. ‘‘విచారణ కమిటీలన్నింటినీ యూనస్ రద్దు చేశారు. ప్రజలను చంపడానికి ఉగ్రవాదులను మధ్యంతర ప్రభుత్వం విడుదల చేసింది. వారు బంగ్లాను నాశనం చేస్తున్నారు. హత్యాయత్నం నుంచి నేను త్రుటిలో తప్పించుకున్నా. ఏదో మంచి చేయడానికే దేవుడు నన్ను బతికించాడని భావిస్తున్నా. నేను బంగ్లా తిరిగొచ్చాక సమస్యలన్నీ పరిష్కరిస్తా’’ఆమె ప్రకటించారు. -
CT 2025 IND Vs BAN: శుభారంభంపై భారత్ గురి
దుబాయ్: చాంపియన్స్ ట్రోఫీలో భారత జట్టు పోరు నేటి నుంచి మొదలవుతోంది. గ్రూప్ ‘ఎ’లో భాగంగా జరిగే తమ తొలి మ్యాచ్‌లో గురువారం బంగ్లాదేశ్‌తో టీమిండియా తలపడుతుంది. బలాబలాలు, ఫామ్ పరంగా చూసుకుంటే రోహిత్ సేన ప్రత్యర్థికంటే ఎంతో బలంగా ఉంది. అయితే ఎప్పటిలాగే బంగ్లాదేశ్ తమ స్థాయికి మించిన ప్రదర్శన కనబర్చి సంచలనాన్ని ఆశిస్తోంది. బ్యాటింగ్‌తో పాటు స్పిన్ ప్రధాన బలంగా భారత్ బరిలోకి దిగుతుండగా... బంగ్లాదేశ్ తమ పేస్ బౌలింగ్‌పై ఆశలు పెట్టుకుంది. సమష్టిగా చెలరేగితే... భారత్ తుది జట్టు కూర్పు విషయంలో ఎలాంటి సందేహాలు లేవు. ఓపెనర్లుగా రోహిత్, గిల్ శుభారంభం అందిస్తే ఆ తర్వాత కోహ్లి దానిని కొనసాగించగలడు. ఇటీవల ఇంగ్లండ్‌తో చివరి వన్డేలో చక్కటి అర్ధసెంచరీ సాధించిన కోహ్లి భారీ ఇన్నింగ్స్ ఆడాలని పట్టుదలగా ఉన్నాడు. ఫామ్‌లో ఉన్న శ్రేయస్ అయ్యర్‌తో పాటు ఐదో స్థానంలో కేఎల్ రాహుల్ కూడా రాణిస్తే తిరుగుండదు. గత సిరీస్‌లో వరుస ప్రయోగాలతో రాహుల్ స్థానం పదే పదే మారింది. అయితే ఈసారి మాత్రం అతనికి అచ్చొచ్చిన ఐదో స్థానంలోనే ఆడించే అవకాశం ఉంది. పాండ్యా, జడేజా, అక్షర్‌ల ఆల్‌రౌండ్ నైపుణ్యం జట్టుకు అదనపు బలం.కుల్దీప్ చాలా కాలంగా చక్కటి ఆటతీరు కనబరుస్తున్నాడు. ముఖ్యంగా మధ్య ఓవర్లలో అతడిని ఎదుర్కోవడం ప్రత్యర్థులకు సవాల్. అనుభవజు్ఞడైన షమీతో పాటు అర్ష్ దీప్ ఆరంభంలో బంగ్లాదేశ్‌ను కట్టిపడేయగల సమర్థులు. బలహీన బ్యాటింగ్... తమ దేశపు స్టార్ ఆటగాడు షకీబ్ లేకుండా 2004 తర్వాత బంగ్లాదేశ్ తొలిసారి ఒక పెద్ద టోర్నీ ఆడుతోంది. లిటన్ దాస్ కూడా ఈ టోర్నీలో లేడు. అయితే ఇతర సీనియర్లు ముషి్ఫకర్, మహ్ముదుల్లా లాంటి ప్లేయర్లు మరోసారి జట్టు భారం మోయాల్సి ఉంది. యువ బ్యాటర్లలో తన్జీద్, తౌహీద్ ఇటీవల పెద్దగా ప్రభావం చూపలేదు.కెప్టెన్ నజు్మల్ చాలా కాలంగా ఫామ్‌లో లేడు. ఇలాంటి స్థితిలో ఈ బ్యాటింగ్ లైనప్ భారత బౌలింగ్‌ను ఏమాత్రం సమర్థంగా ఎదుర్కోగలదనేది సందేహమే. పేసర్లు ముస్తఫిజుర్, నాహిద్ రాణా, తస్కీన్ రాణించాలని జట్టు కోరుకుంటోంది. స్పిన్ ఆల్‌రౌండర్ మెహదీ మిరాజ్ కీలకం కానున్నాడు. తుది జట్లు (అంచనా): భారత్: రోహిత్ (కెప్టెన్), గిల్, కోహ్లి, శ్రేయస్, రాహుల్, పాండ్యా, జడేజా, అక్షర్, కుల్దీప్, షమీ, అర్ష్ దీప్. బంగ్లాదేశ్: నజు్మల్ (కెప్టెన్), తన్జీద్, సౌమ్య సర్కార్, తౌహీద్, ముషి్ఫకర్, మహ్ముదుల్లా, మెహదీ హసన్ మిరాజ్, రిషాద్, తస్కీన్, నాహిద్, ముస్తఫిజుర్.పిచ్, వాతావరణంఈ వేదికపై వన్డేలు అరుదుగా జరుగుతున్నాయి. దాదాపు అన్ని మ్యాచ్‌లలో తక్కువ స్కోర్లే నమోదయ్యాయి. నెమ్మదైన పిచ్‌పై స్పిన్నర్ల ప్రభావం ఖాయం. వర్ష సమస్య లేదు.41 భారత్, బంగ్లాదేశ్ మధ్య మొత్తం 41 వన్డేలు జరిగాయి. భారత్ 32 మ్యాచ్‌ల్లో...బంగ్లాదేశ్ 8 మ్యాచ్‌ల్లో నెగ్గాయి. ఒక మ్యాచ్ రద్దయింది. చాంపియన్స్ ట్రోఫీలో ఒకే ఒక్కసారి 2017 సెమీఫైనల్లో ఇరు జట్లు తలపడ్డాయి. భారత్ 9 వికెట్లతో ఘన విజయం సాధించింది. -
అలా మాట్లాడటం కంటే చావడం మేలు: సీఎం మమత సంచలన వ్యాఖ్యలు
కోల్‌కతా: పశ్చిమబెంగాల్లో మరోసారి రాజకీయం వేడెక్కింది. బెంగాల్ సీఎం మమతా బెనర్జీపై అసెంబ్లీలో ప్రతిపక్ష నేత సువేందు అధికారి తీవ్ర ఆరోపణలు చేశారు. బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా సరిహద్దులు దాటి వచ్చే చొరబాటుదార్లను ఆమె ప్రోత్సహిస్తున్నారని విమర్శించారు. పొరుగుదేశం నుంచి వచ్చిన ఉగ్రవాదులు బెంగాల్లో స్థావరాలను ఏర్పాటు చేసుకున్నారన్నారు. సీఎం తీరుతో రాష్ట్ర జనాభా తీరుతెన్నులు మారనున్నాయని ఆరోపించారు.ఇదే సమయంలో ఆధ్యాత్మికంగా ఎంతో ముఖ్యమైన మహా కుంభ్‌ను ఆమె మృత్యు కుంభ్ అంటూ వర్ణించడం ద్వారా కోట్లాదిమంది హిందువుల మనోభావాలను దెబ్బతీశారని మండిపడ్డారు. మంగళవారం అసెంబ్లీ నుంచి సస్పెండైన అనంతరం అసెంబ్లీ ఆవరణలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్బంగా సువేందు.. ‘అక్రమ చొరబాటుదార్లను అస్సాం ఎస్టీఎఫ్ పట్టుకుంటే మీరు నిద్రపోతున్నారు. కోల్‌కతాలోని కొన్ని ప్రాంతాలు బంగ్లాదేశ్‌లా ఉన్నాయని స్వయంగా మీరే అన్నారు. ఒక మతం జనాభా విపరీతంగా పెరిగిపోతున్నా ఎటువంటి చర్యలు తీసుకోలేదు. రాష్ట్ర జనాభా తీరుతెన్నులు మారితే మీకు సంతోషమా? మీరు అలా చేయడాన్ని మేం ఒప్పుకోం’ అని హెచ్చరించారు.రుజువు చేస్తే రాజీనామా చేస్తా: మమత బంగ్లాదేశ్‌లోని అతివాదులు, ఉగ్రవాదులతో తనకు సంబంధాలున్నాయంటూ బీజేపీ ఎమ్మెల్యేలు ఆరోపించడంపై సీఎం మమత మండిపడ్డారు. చేతనైతే రుజువు చేయాలని వారికి సవాల్ విసిరారు. ఆధారాలు చూపిస్తే పదవికి రాజీనామా చేస్తానన్నారు. తప్పుడు ఆరోపణలు చేయడం కంటే చావడం మేలని వ్యాఖ్యానించారు. బీజేపీ ఎమ్మెల్యేల నిరాధార ఆరోపణల విషయమై ప్రధాని మోదీకి లేఖ రాస్తానన్నారు. బంగ్లా సరిహద్దులోని చచార్లో రాత్రి కర్ఫ్యూసిల్చార్: తీవ్రవాద శక్తులు, స్మగ్లర్ల కదలికలను నివారించే లక్ష్యంతో భారత్–బంగ్లాదేశ్ సరిహద్దుల్లోని అస్సాం రాష్ట్రం చచార్ జిల్లాలో రాత్రి కర్ఫ్యూ అమల్లోకి వచ్చింది. శాంతిభద్రతలను కాపాడేందుకు కఠిన నిబంధనలను అమల్లోకి తెస్తూ చచార్ జిల్లా మేజిస్ట్రేట్ మృదుల్ యాదవ్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. సరిహద్దులకు కిలోమీటర్ పరిధిలో సూర్యాస్తమయం నుంచి సూర్యోదయం వరకు రెండు నెలల పాటు ఇవి అమల్లో ఉంటాయని తెలిపారు. ఈ సమయంలో భారత భూభాగంలోని సుర్మా నది ఒడ్డున ఎవరూ సంచరించరాదని, అనుమతులున్న స్థానిక మత్స్యకారులు మాత్రమే చేపలు పట్టుకోవాలన్నారు. విధి నిర్వహణలో ఉండే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఈ నిబంధనలు వర్తించవని మేజిస్ట్రేట్ స్పష్టం చేశారు. -
ప్రపంచంలో 10 పేద దేశాలు: కనిపించని బంగ్లా, పాక్
ప్రపంచంలోని 10 అత్యంత పేద దేశాల జాబితా విడుదలయ్యింది. ఫోర్బ్స్ అందించిన ఈ సూచీలో టాప్‌లో నిలిచిన దేశాలు ప్రపంచంలో అతి చిన్న దేశాలుగా గుర్తింపుపొందాయి. వీటిలో భారత్‌కు సన్నిహిత దేశమైన మడగాస్కర్ 10వ స్థానంలో ఉంది. పాకిస్తాన్, బంగ్లాదేశ్‌ల పేర్లు ఈ జాబితాలో కనిపించలేదు.1. దక్షిణ సూడాన్దక్షిణ సూడాన్ ప్రపంచంలోనే అత్యంత పేద దేశంగా గుర్తింపు పొందింది. ఈ దేశపు జీడీపీ 29.99 బిలియన్ డాలర్లు. దక్షిణ సూడాన్ జనాభా 1.11 కోట్లు. ఈ దేశంలో యువత అత్యధిక శాతంలో ఉంది. 2011లో ఈ దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించింది. ఈ దేశంలోని అత్యధిక జనాభా వ్యవసాయంపైననే ఆధారపడింది.2. బురుండీమధ్య ఆఫ్రికాలోని బురుండీ ప్రపంచంలో రెండవ అత్యంత పేద దేశం. బురుండీ జీడీపీ 2.15 బిలియన్ డాలర్లు. ఇక్కడి జనాభా 1,34,59,236. రాజకీయ అస్థిరత, అంతర్గత సంఘర్షణలు ఈ దేశపు ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేశాయి. దేశంలోని 80 శాతం జనాభా వ్యవసాయంపైననే ఆధారపడి జీవిస్తోంది.3. సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ ప్రపంచంలో మూడవ పేద దేశం. ఇక్కడి జనాభా 58,49,358. జీడీపీ 3.03 బిలియన్ డాలర్లు. రాజకీయ అస్థిరత, సాయుధ పోరాటం మౌలిక సదుపాయాల కొరతతో ఈ దేశం తీవ్రమైన ఆర్థిక సవాళ్లను ఎదుర్కొంటుంది. ఈ దేశంలో 80 శాతం జనాభా దారిద్య్రరేఖకు దిగువన నివసిస్తున్నారు.4. మలావిమలావి ప్రపంచంలో నాల్గవ పేద దేశం. మలావి జనాభా 2,13,90,465. జీడీపీ 10.78 బిలియన్ డాలర్లు. మలావి గణనీయమైన ఆర్థిక సవాళ్లను ఎదుర్కొంటోంది. వర్షాధార వ్యవసాయంపై ఇక్కడ పంటలు సాగుచేస్తుంటారు. ఇక్కడి ప్రభుత్వం విద్య, ఆరోగ్య సంరక్షణను మెరుగుపరచడానికి,పేదరికాన్ని తగ్గించడానికి కృషి చేస్తోంది.5. మొజాంబిక్మొజాంబిక్ ప్రపంచంలో ఐదవ పేద దేశం. మొజాంబిక్ జనాభా 3,44,97,736. జీడీపీ 24.55 బిలియన్ డాలర్లు. ఉగ్రవాదం, హింస మొజాంబిక్ ముందున్న ప్రధాన సమస్యలు. ప్రకృతి వైపరీత్యాలు, వ్యాధులు, జనాభా పెరుగుదల మొదలైనవి ఈ దేశాన్ని పేదరికంలోకి నెట్టివేశాయి.6. సోమాలియాసోమాలియా ప్రపంచంలో ఆరవ పేద దేశం. సోమాలియా జీడీపీ 13.89 బిలియన్ డాలర్లు. జనాభా 1,90, 09,151. ఇక్కడి అంతర్యుద్ధం దేశ ఆర్థిక వ్యవస్థను విచ్ఛిన్నం చేసింది. దీంతో దేశం పతనమయ్యింది.7. కాంగో డెమొక్రాటిక్ రిపబ్లిక్ కాంగో డెమొక్రాటిక్ రిపబ్లిక్ ప్రపంచంలో ఏడవ పేద దేశం. జీడీపీ 79.24 బిలియన్ డాలర్లు. జనాభా 10,43,54,615. ఈ దేశం తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. రువాండా అనుకూల తిరుగుబాటుదారుల దాడులతో అతలాకుతలమవుతోంది. కాంగోలో దాదాపు 62 శాతం మంది రోజుకు రూ.180 కంటే తక్కువ ఆదాయంతో జీవిస్తున్నారు.8. లైబీరియాలైబీరియా ప్రపంచంలో ఎనిమిదవ పేద దేశం. లైబీరియా జీడీపీ 5.05 బిలియన్ డాలర్లు. జనాభా 54,92,486. ఆఫ్రికన్ దేశమైన లైబీరియాలో అంతర్యుద్ధం కారణంగా శాశ్వత పేదరికం ఏర్పడింది. ప్రపంచ ఆహార కార్యక్రమం వంటి అంతర్జాతీయ సంస్థలు విద్య , ఆరోగ్య సంరక్షణలో లైబీరియాకు సహకారాన్ని అందిస్తున్నాయి.9. యెమెన్ప్రపంచంలోని పేద దేశాలలో యెమెన్ తొమ్మిదవ స్థానంలో ఉంది. యెమెన్ జీడీపీ 16.22 బిలియన్ డాలర్లు. జనాభా 34.4 మిలియన్లు. సంవత్సరాల తరబడి కొనసాగుతున్న అంతర్యుద్ధం, రాజకీయ అస్థిరత యెమెన్‌ను ఆర్థికంగా దెబ్బతీశాయి. ఆహారం, నీరు, మందులు, నిత్యావసర వస్తువుల కొరత ఈ దేశాన్ని నిత్యం వెంటాడుతుంటుంది.10. మడగాస్కర్మడగాస్కర్ ప్రపంచంలోని 10వ పేద దేశం. మడగాస్కర్ జీడీపీ 18.1 బిలియన్ డాలర్లు. జనాభా 30.3 మిలియన్లు. ఈ దేశం భారతదేశానికి సన్నిహిత దేశంగా పేరొందింది. మడగాస్కర్ ఆఫ్రికాకు ఆగ్నేయ తీరంలో ఉన్న ఒక ద్వీప దేశం. మైనింగ్, పర్యాటకం ఈ దేశానికి ప్రధాన ఆదాయ వనరులుగా ఉన్నాయి.ఇది కూడా చదవండి: ఆరు అలవాట్లు.. విజయానికి అడ్డు గోడలు -
అమెరికా టూర్లో మోదీకి ట్రంప్ స్పెషల్ గిఫ్ట్
-
బంగ్లాదేశ్ క్రికెటర్‌పై ఐదేళ్ల నిషేధం
దుబాయ్: ఇన్నాళ్లు పురుష క్రికెటర్లకే పరిమితమైన ‘మ్యాచ్ ఫిక్సింగ్’ (Match Fixing) జాడ్యం ఇప్పుడు మహిళా క్రికెట్‌కు అంటుకున్నట్లుంది. ఫిక్సింగ్‌కు పాల్పడినట్లు తేలడంతో బంగ్లాదేశ్ మాజీ క్రికెటర్ షోహెలీ అక్తర్‌పై (Shohely Akhter) అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) ఐదేళ్ల నిషేధం విధించింది. దీంతో అవినీతి, ఫిక్సింగ్ ఆరోపణలతో నిషేధానికి గురైన తొలి మహిళా క్రికెటర్‌గా 36 ఏళ్ల షోహెలీ నిలిచింది. 2023లో జరిగిన మహిళల టి20 ప్రపంచకప్ సందర్భంగా బంగ్లాదేశ్, ఆ్రస్టేలియాల మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ చేసేందుకు ఆమె ప్రయత్నించింది. నిజానికి 2022లోనే క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన ఆమె ఆ వరల్డ్‌కప్‌లో లేకపోయినా... టోర్నీ ఆడుతున్న బంగ్లాదేశ్ క్రికెటర్‌ను సంప్రదించి ఫిక్స్ చేయాల్సిందిగా కోరింది. తను చెప్పినట్లు ఆ బంగ్లా క్రికెటర్ హిట్ వికెట్ అయితే 2 మిలియన్ల టాకాలు (బంగ్లా కరెన్సీ) ఇస్తానని ఆశచూపింది. సదరు బంగ్లా క్రికెటర్... షోహెలీ ప్రతిపాదనను తిరస్కరించడంతో పాటు వెంటనే ఈ విషయాన్ని ఐసీసీ అవినీతి నిరోధక విభాగం (ఏసీయూ) దృష్టికి తీసుకెళ్లింది. దీనిపై లోతుగా దర్యాప్తు చేపట్టిన ఏసీయూ షోహెలీ మ్యాచ్ ఫిక్సింగ్‌కు ప్రయత్నించినట్లు తేల్చింది. ఐసీసీలోని ఐదు ఆర్టికల్స్‌ను ఆమె అతిక్రమించిందని దీంతో నిషేధాన్ని విధించామని ఐసీసీ ఒక ప్రకటనలో తెలిపింది. -
బంగ్లాదేశ్‌లో ఆపరేషన్ డెవిల్స్ హంట్.. 1300 మంది అరెస్ట్
ఢాకా: బంగ్లాదేశ్‌లో మాజీ ప్రధాని షేక్ హసీనా మద్దతుదారులపై ఆపరేషన్ డెవిల్స్ హంట్ పేరిట దాడులు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా దాదాపు 1300 మందిని ఇప్పటికే అరెస్ట్ చేశారు. కాగా, షేక్ హసీనాకు చెందిన అవామీలీగ్ పార్టీ భవనాలు, ఆస్తులను లక్ష్యంగా చేసుకొని కొందరు దాడులు చేస్తున్నారు. వీటిని అరికట్టేందుకు, ప్రత్యర్థుల ఏరివేతకు మహ్మద్ యూనస్ ప్రభుత్వం ప్లాన్ చేసింది.బంగ్లాదేశ్‌లో యూనస్ సర్కారు ప్రత్యర్థులను వేధించేందుకు సరికొత్త చర్యలు మొదలుపెట్టింది. బంగ్లాదేశ్‌లో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటై ఆరు నెలలు కావొస్తున్న నేపథ్యంలో దేశంలో అస్థిరతను సృష్టించే వారిని సర్కార్ టార్గెట్ చేసింది. ఈ క్రమంలోనే మాజీ ప్రధాని షేక్ హసీనా మద్దతుదారులపై ఆపరేషన్ డెవిల్స్ హంట్ పేరిట దాడులు మొదలుపెట్టింది. ఢాకా శివారులోని గాజీపుర్‌లో విద్యార్థులపై దాడి చేసిన వారిని అదుపులోకి తీసుకునేందుకు ‘ఆపరేషన్ డెవిల్ హంట్’ను ప్రారంభించినట్టు ఇంటీరియర్ మినిస్ట్రీ అధిపతి జహంగీర్ ఆలమ్ చౌద్రీ చెప్పుకొచ్చారు.ప్రజా భద్రతలో భాగంగానే దీనిని అమలు చేస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ‘ఆపరేషన్ డెవిల్ హంట్’లో ఇప్పటికే 1300 అరెస్ట్ చేశారు. మరి కొంత మందిని కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో జహంగీర్ ఆలమ్ మాట్లాడుతూ..‘బంగ్లాదేశ్‌లో విద్యార్థి ఉద్యమం తర్వాత చేపట్టిన దాడులు మరింత పెరిగాయి. వారి ఏరివేతే లక్ష్యంగా ఈ కార్యక్రమం కొనసాగుతుంది. దుష్టశక్తులను అంతం చేసే వరకు ఇది ఆగదు అంటూ కామెంట్స్ చేశారు.ఇదిలా ఉండగా.. ఇటీవల హేక్ హసీనా కుటుంబ భవనాలపై కొందరు దాడులు చేసి ధ్వంసం చేశారు. ఈ క్రమంలో బంగబంధు షేక్ ముజిబుర్ రహ్మన్ స్మారక భవనంపై దాడి చేశారు. ఈ దాడిలో భవనం పూర్తిగా దెబ్బతిని.. మ్యూజియం కూడా ధ్వంసమైంది. ఈ నేపథ్యంలో ప్రజలు సంయమనంతో వ్యవహరించాలని మహమ్మద్ యూనస్ కూడా విజ్ఞప్తి చేశారు. ఇటీవల ఓ మంత్రిపై దాడికి ఈ గ్యాంగ్‌లే కారణమని సమాచారం. -
చొరబాటు ప్రయాణం!
సాక్షి, హైదరాబాద్: మయన్మార్ నుంచి అక్రమ మార్గంలో భారత్‌లోకి చొరబడుతున్న రోహింగ్యాల్లో అనేక మంది నగరంలోనూ ఉంటున్నారా? అనే ప్రశ్నకు ఔననే అంటున్నాయి నిఘా వర్గాలు. వీరిలో అత్యధికులు హైదరాబాద్‌లోని పాతబస్తీతో పాటు శివారు ప్రాంతాల్లో స్థిరపడుతున్నట్లు చెబుతున్నాయి. కోల్‌కతాలోని సాంత్రాగచ్చి రైల్వే స్టేషన్లో అక్కడి రైల్వే పోలీసులు బుధవారం నలుగురు రోహింగ్యాలను పట్టుకున్నారు. వీళ్లు ఏళ్ల క్రితం అక్రమంగా సరిహద్దులు దాటి వచ్చి నగరంలోని పాతబస్తీలో ఉంటున్నారని, తిరిగి బంగ్లాదేశ్ వెళ్లే ప్రయత్నాల్లో అక్కడి పోలీసులకు చిక్కారు. వీరి విచారణలో మయన్మార్ నుంచి భారత్ వరకు సాగుతున్న రోహింగ్యాల ‘ప్రయాణం’ వెలుగులోకి వచ్చింది. అక్కడి అలజడులతో ఇక్కడ దడ... బంగ్లాదేశ్‌తో పాటు మయన్మార్‌లో నెలకొన్న అంతర్గత పరిస్థితులపై ఈ అక్రమ వలసదారుల ప్రభావం ఎక్కువగా ఉంటోంది. ఆయా దేశాల్లో శాంతిభద్రతల సమస్యలు తలెత్తిన ప్రతిసారీ.. అనేక మంది రోహింగ్యాలు వాటిని విడిచిపెడుతున్నారు. వీరిలో అత్యధికులు నేరుగా భారత్‌కు వలస వస్తున్నారు. నగరంలోని పాతబస్తీతో పాటు శివార్లలో స్థిరపడుతున్నారు. తాజాగా మరోసారి బంగ్లాదేశ్‌లో హింసాత్మక ఘటనలు చెలరేగడంతో అక్రమ వలసలు పెరిగే ప్రమాదం ఉందని నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నాయి. మాంగ్డో నుంచి టెక్నాఫ్ నగరానికి.. మయన్మార్‌లోని వివిధ ప్రాంతాలకు చెందిన రోహింగ్యాలు అడవుల వెంట కాలిబాటన నడుస్తూ ఆ దేశంలోని మాంగ్డో అనే ప్రాంతానికి చేరుకుంటున్నారు. రాత్రి వేళల్లో చిన్న చిన్న పడవలపై నఫ్ నదిని దాటుతున్న రోహింగ్యాలను బంగ్లాదేశ్‌లో ఉన్న దళారులు రిసీవ్ చేసుకుని, భద్రత బలగాల కంట పడకుండా టెక్నాఫ్ అనే నగరానికి తీసుకువెళ్తున్నారు. అక్కడి నుంచి బస్సుల్లో ప్రపంచంలోనే అతిపెద్ద రోహింగ్యాల శరణార్థి శిబిరం ఉన్న కాక్స్ బజార్‌కు వీళ్లు వచ్చి చేరుతున్నారు. అక్కడ ఉండగానే అనేక మంది ఐక్యరాజ్య సమితి శరణార్థి కార్డు పొందుతున్నారు. అక్కడ శరణార్థి శిబిరంలో కొన్నాళ్లు తలదాచుకుని బంగ్లాదేశ్ రాజధాని ఢాకా చేరుకుని అక్కడి నుంచి ఇండో–బంగ్లా సరిహద్దుల్లోని భోమ్రా ప్రాంతానికి బస్సుల్లో వస్తున్నారు. భద్రతా బలగాల కళ్లుగప్పి ఇచ్ఛామతి నది దాటి భారత్‌లోకి ప్రవేశిస్తున్నారు. ప్రభుత్వ పథకాలకు లబ్ధిదారులుగా... కాక్స్ టౌన్లో పనులు చేసుకుంటే నెలకు రూ.6 వేల నుంచి రూ.7 వేల వరకే సంపాదన ఉంటుందని, అదే హైదరాబాద్ లాంటి నగరాల్లో రూ.20 వేల నుంచి రూ.30 వేల వరకు సంపాదిస్తున్నామని సాంత్రాగచి్చలో చిక్కిన రోహింగ్యాలు మహ్మద్ ఆలం, రియాసుల్ ఇస్లాం, బేగం దిల్బార్, రబీల్ ఇస్లాం పశి్చమ బెంగాల్ పోలీసుల విచారణలో వెల్లడించినట్లు ఓ ఉన్నతాధికారి ‘సాక్షి’కి తెలిపారు. అందుకే నగరానికి అక్రమ వలసదారుల్లో అనేక మంది జీవనోపాధి కోసమే వస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. పశ్చిమ బెంగాల్ నుంచి అనేక వైపులకు.. ఇలా రెండు దేశాల్లోని నదులు దాటి పశి్చమ బెంగాల్‌లోని బసిర్హట్ ప్రాంతానికి చేరుకున్న ఈ శరణార్థులు అక్కడ నుంచి హౌరాకు వచ్చి దేశంలోని వివిధ ప్రాంతాలకు వెళ్లి స్థిరపడుతున్నారు. ప్రధానంగా హైదరాబాద్‌తో పాటు బిహార్, జమ్మూ కశీ్మర్లకు వెళ్తున్నారని నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. ఏ ప్రాంతానికి వెళ్లినా తాము పశి్చమ బెంగాల్ వాసులమంటూ ఇంటిని అద్దెకు తీసుకుంటున్నారు. అద్దె ఇంటి కరెంట్ బిల్లు ఆధారంగా, వ్యవస్థాగతంగా ఉన్న లోపాలను వాడుకుంటున్న వీళ్లు మీ సేవ కేంద్రాల నిర్వాహకుల సాయంతో ఓటర్ ఐడీలు పొందుతున్నారు. దీని ఆధారంగా ఆధార్, రేషన్ కార్డు, పాస్‌పోర్ట్ ఇలా వరుసగా గుర్తింపు కార్డులు తీసుకుంటున్నారు. -
చొరబాటు ప్రయాణం!
సాక్షి, హైదరాబాద్: మయన్మార్ నుంచి అక్రమ మార్గంలో భారత్‌లోకి చొరబడుతున్న రోహింగ్యాల్లో అనేక మంది నగరంలోనూ ఉంటున్నారా? అనే ప్రశ్నకు ఔననే అంటున్నాయి నిఘా వర్గాలు. వీరిలో అత్యధికులు హైదరాబాద్‌లోని పాతబస్తీతో పాటు శివారు ప్రాంతాల్లో స్థిరపడుతున్నట్లు చెబుతున్నాయి. కోల్‌కతాలోని సాంత్రాగచ్చి రైల్వే స్టేషన్లో అక్కడి రైల్వే పోలీసులు బుధవారం నలుగురు రోహింగ్యాలను పట్టుకున్నారు. వీళ్లు ఏళ్ల క్రితం అక్రమంగా సరిహద్దులు దాటి వచ్చి నగరంలోని పాతబస్తీలో ఉంటున్నారని, తిరిగి బంగ్లాదేశ్ వెళ్లే ప్రయత్నాల్లో అక్కడి పోలీసులకు చిక్కారు. వీరి విచారణలో మయన్మార్ నుంచి భారత్ వరకు సాగుతున్న రోహింగ్యాల ‘ప్రయాణం’ వెలుగులోకి వచ్చింది. అక్కడి అలజడులతో ఇక్కడ దడ... బంగ్లాదేశ్‌తో పాటు మయన్మార్‌లో నెలకొన్న అంతర్గత పరిస్థితులపై ఈ అక్రమ వలసదారుల ప్రభావం ఎక్కువగా ఉంటోంది. ఆయా దేశాల్లో శాంతిభద్రతల సమస్యలు తలెత్తిన ప్రతిసారీ.. అనేక మంది రోహింగ్యాలు వాటిని విడిచిపెడుతున్నారు. వీరిలో అత్యధికులు నేరుగా భారత్‌కు వలస వస్తున్నారు. నగరంలోని పాతబస్తీతో పాటు శివార్లలో స్థిరపడుతున్నారు. తాజాగా మరోసారి బంగ్లాదేశ్‌లో హింసాత్మక ఘటనలు చెలరేగడంతో అక్రమ వలసలు పెరిగే ప్రమాదం ఉందని నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నాయి. మాంగ్డో నుంచి టెక్నాఫ్ నగరానికి.. మయన్మార్‌లోని వివిధ ప్రాంతాలకు చెందిన రోహింగ్యాలు అడవుల వెంట కాలిబాటన నడుస్తూ ఆ దేశంలోని మాంగ్డో అనే ప్రాంతానికి చేరుకుంటున్నారు. రాత్రి వేళల్లో చిన్న చిన్న పడవలపై నఫ్ నదిని దాటుతున్న రోహింగ్యాలను బంగ్లాదేశ్‌లో ఉన్న దళారులు రిసీవ్ చేసుకుని, భద్రత బలగాల కంట పడకుండా టెక్నాఫ్ అనే నగరానికి తీసుకువెళ్తున్నారు. అక్కడి నుంచి బస్సుల్లో ప్రపంచంలోనే అతిపెద్ద రోహింగ్యాల శరణార్థి శిబిరం ఉన్న కాక్స్ బజార్‌కు వీళ్లు వచ్చి చేరుతున్నారు. అక్కడ ఉండగానే అనేక మంది ఐక్యరాజ్య సమితి శరణార్థి కార్డు పొందుతున్నారు. అక్కడ శరణార్థి శిబిరంలో కొన్నాళ్లు తలదాచుకుని బంగ్లాదేశ్ రాజధాని ఢాకా చేరుకుని అక్కడి నుంచి ఇండో–బంగ్లా సరిహద్దుల్లోని భోమ్రా ప్రాంతానికి బస్సుల్లో వస్తున్నారు. భద్రతా బలగాల కళ్లుగప్పి ఇచ్ఛామతి నది దాటి భారత్‌లోకి ప్రవేశిస్తున్నారు. ప్రభుత్వ పథకాలకు లబ్దిదారులుగా... కాక్స్ టౌన్లో పనులు చేసుకుంటే నెలకు రూ.6 వేల నుంచి రూ.7 వేల వరకే సంపాదన ఉంటుందని, అదే హైదరాబాద్ లాంటి నగరాల్లో రూ.20 వేల నుంచి రూ.30 వేల వరకు సంపాదిస్తున్నామని సాంత్రాగచ్చిలో చిక్కిన రోహింగ్యాలు మహ్మద్ ఆలం, రియాసుల్ ఇస్లాం, బేగం దిల్బార్, రబీల్ ఇస్లాం పశ్చిమ బెంగాల్ పోలీసుల విచారణలో వెల్లడించినట్లు ఓ ఉన్నతాధికారి ‘సాక్షి’కి తెలిపారు. అందుకే నగరానికి అక్రమ వలసదారుల్లో అనేక మంది జీవనోపాధి కోసమే వస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. పశ్చిమ బెంగాల్ నుంచి అనేక వైపులకు..ఇలా రెండు దేశాల్లోని నదులు దాటి పశ్చిమ బెంగాల్‌లోని బసిర్హట్ ప్రాంతానికి చేరుకున్న ఈ శరణార్థులు అక్కడ నుంచి హౌరాకు వచ్చి దేశంలోని వివిధ ప్రాంతాలకు వెళ్లి స్థిరపడుతున్నారు. ప్రధానంగా హైదరాబాద్‌తో పాటు బిహార్, జమ్మూ కశ్మీర్లకు వెళ్తున్నారని నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. ఏ ప్రాంతానికి వెళ్లినా తాము పశ్చిమ బెంగాల్ వాసులమంటూ ఇంటిని అద్దెకు తీసుకుంటున్నారు. అద్దె ఇంటి కరెంట్ బిల్లు ఆధారంగా, వ్యవస్థాగతంగా ఉన్న లోపాలను వాడుకుంటున్న వీళ్లు మీ సేవ కేంద్రాల నిర్వాహకుల సాయంతో ఓటర్ ఐడీలు పొందుతున్నారు. దీని ఆధారంగా ఆధార్, రేషన్ కార్డు, పాస్‌పోర్ట్ ఇలా వరుసగా గుర్తింపు కార్డులు తీసుకుంటున్నారు. -
బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్-2025 విజేత ఫార్చూన్ బారిషల్
బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్-2025 ఎడిషన్ విజేతగా ఫార్చూన్ బారిషల్ నిలిచింది. ఇవాళ (ఫిబ్రవరి 7) జరిగిన ఫైనల్లో బారిషల్.. చిట్టగాంగ్ కింగ్స్‌పై 3 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన చిట్టగాంగ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 194 పరుగులు చేసింది. ఓపెనర్లు ఖ్వాజా నఫే (66), పర్వేజ్ హొస్సేన్ ఎమోన్ (78 నాటౌట్) అర్ద సెంచరీలతో రాణించారు. వీరిద్దరు తొలి వికెట్‌కు 121 పరుగులు జోడించారు. ఆతర్వాత వచ్చిన గ్రహం క్లార్క్ (44) కూడా రాణించడంతో కింగ్స్ భారీ స్కోర్ చేసింది. బారిషల్ బౌలర్లలో మొహమ్మద్ అలీ, ఎబాదత్ హొసేన్ తలో వికెట్ పడగొట్టారు.195 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన బారిషల్‌కు కెప్టెన్ తమీమ్ ఇక్బాల్ (54), తౌహిద్ హృదోయ్ (320 శుభారంభాన్ని అందించారు. అనంతరం కైల్ మేయర్స్ (46) మెరుపు ఇన్నింగ్స్ ఆడి బారిషల్ను విజయానికి చేరువ చేశాడు. ఆఖర్లో రిషద్ హొసేన్ (18 నాటౌట్) రెండు సిక్సర్లు బాది బారిషల్‌కు విజయాన్ని ఖరారు చేశాడు. మరో మూడు బంతులు మిగిలుండగానే బారిషల్ విజయతీరాలకు చేరింది. కింగ్స్ బౌలర్లలో షోరిఫుల్ ఇస్లాం 4 వికెట్లు తీసి బారిషల్ను భయపెట్టాడు. నయీమ్ ఇస్లాం 2, బినుర ఫెర్నాండో ఓ వికెట్ పడగొట్టారు. ఫార్చూన్ బారిషల్ టైటిల్ సాధించడం వరుసగా ఇది రెండో సారి కావడం విశేషం. -
బంగ్లాదేశ్ లో మళ్లీ చెలరేగిన హింస
-
బంగ్లాదేశ్‌లో మళ్లీ హింస.. మంటల్లో షేక్ హసీనా తండ్రి ఇల్లు దగ్ధం
ఢాకా: బంగ్లాదేశ్‌లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఢాకాలో నిరసనకారులు మరోసారి రెచ్చిపోయారు. దీంతో, హింస్మాతక పరిస్థితులు నెలకొన్నాయి. తాజాగా మాజీ ప్రధాని షేక్ హసీనా (Sheik haseena) తండ్రి, బంగ్లా వ్యవస్థాపక నాయకుడు షేక్ ముజిబుర్ రెహమాన్ (Sheikh Mujibur Rahman) ఇంటిని ఆందోళన కారులు ముట్టడించి నిప్పటించారు. దీంతో, భారీగా ఆస్తి నష్టం జరిగినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.వివరాల ప్రకారం.. బంగ్లాదేశ్‌లో నిరసనకారులు మరోసారి ఆందోళనలకు దిగారు. బంగ్లాదేశ్‌లో అవామీ లీగ్ పార్టీని దేశం నుంచి బహిష్కరించాలని డిమాండ్ చేస్తూ నిరనసలు చేపట్టారు. ఈ క్రమంలో ఢాకాలో ఉన్న షేక్ ముజిబుర్ రెహమాన్ (Sheikh Mujibur Rahman) ఇంటిని ఆందోళనకారులు ముట్టడించారు. అనంతరం, ఆయన ఇంటిలోకి బలవంతంగా చొచ్చుకెళ్లిన నిరసనకారులు ఇంటిని ధ్వంసం చేశారు. ఈ దాడిలో భారీగా ఆస్తి నష్టం వాటిల్లినట్టు తెలుస్తోంది. ఇంటిని తగులబెట్టినట్టు కూడా స్థానికి మీడియాలో కథనాలు వెల్లడించింది.ఇదే సమయంలో మాజీ ప్రధాని హసీనాపై నమోదైన కేసులు, మైనారిటీలపై దాడులకు నిరసనగా అవామీ లీగ్ పార్టీ (Awami League) గురువారం నిరసనలు తెలపాలని పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలోనే హింస నెలకొనడం ప్రాధాన్యత సంతరించుకుంది. కాగా, రెహమాన్‌కు చెందిన ధన్మొండి 32 నివాసంపై గతంలోనూ దాడి జరిగింది. గతేడాది ఆగస్టు 5న అవామీ లీగ్ ప్రభుత్వ పతనం తరువాత కూడా ఇంటిపై దాడి చేసి అందులోని కొంత సామగ్రిని ధ్వంసం చేశారు.అయితే, షేక్ హసీనా బంగ్లాదేశీయులను ఉద్దేశించి ఆన్లైన్లో ప్రసంగం చేస్తున్న సమయంలోనే నిరసనకారులు రెచ్చిపోయారు. ఈ సందర్బంగా ఆమె స్పందిస్తూ.. ముహమ్మద్ యూనస్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుత పాలనకు వ్యతిరేకంగా ప్రతిఘటనను నిర్వహించాలని దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. బుల్డోజర్తో లక్షలాది మంది అమరవీరుల ప్రాణాలను బలిగొని మనం సంపాదించిన జాతీయ జెండా, రాజ్యాంగం మరియు స్వాతంత్ర్యాన్ని నాశనం చేసే శక్తి వారికి ఇంకా లేదు. వారు ఒక భవనాన్ని కూల్చివేయవచ్చు, కానీ చరిత్రను కాదు. చరిత్ర తన ప్రతీకారం తీర్చుకుంటుందని కూడా వారు గుర్తుంచుకోవాలి అని ఘాటు వ్యాఖ్యలు చేశారు.#WATCH | Bangladesh | A mob vandalised and set on fire Sheikh Mujibur Rahman’s memorial and residence at Dhanmondi 32 in Dhaka, demanding a ban on the Awami League. pic.twitter.com/azMcQCqngM— ANI (@ANI) February 5, 2025ఇదిలా ఉండగా.. భారత్‌లో ఆశ్రయం పొందుతున్న బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాను స్వదేశానికి రప్పించడానికి అన్ని ప్రయత్నాలూ చేస్తున్నామని బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం పేర్కొంది. ఈ విషయాన్ని దేశ హోం శాఖ సలహాదారు, విశ్రాంత లెఫ్టినెంట్ జనరల్ ఎండీ జహంగీర్ ఆలం చౌదరి బుధవారం తెలిపారు. బంగ్లాదేశ్ ప్రభుత్వ వ్యతిరేక నిరసనల్లో పెద్దఎత్తున హింస చెలరేగిన నేపథ్యంలో షేక్ హసీనా దేశాన్ని వీడి.. గతేడాది ఆగస్టు 5 నుంచి భారత్‌లో తల దాచుకుంటున్నారు. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ అంతర్జాతీయ నేరాల ట్రైబ్యునల్ (ఐసీటీ) హసీనాతోపాటు పలువురు మాజీ మంత్రులు, సలహాదారులు, మిలటరీ, సివిల్ అధికారులపై అరెస్ట్ వారెంట్లు జారీ చేసింది. ‘మానవత్వానికి వ్యతిరేకంగా నేరాలకు పాల్పడిన ఆరోపణలపై ఐసీటీలో విచారణలో ఉన్న వారిని స్వదేశానికి తిరిగి తీసుకురావడానికి మేము ప్రయత్నిస్తున్నాం’ అని చౌదరి తెలిపినట్లుగా ప్రభుత్వ ఆధీనంలో ఉన్న బీఎస్ఎస్ వార్తా సంస్థ ప్రకటించింది. ‘దేశంలో ఉంటున్న వారిని అరెస్టు చేస్తున్నాం. హసీనా దేశంలో లేరు.. విదేశాల్లో ఉన్న వారిని ఎలా అరెస్టు చేస్తాం’ అని ఆయన వ్యాఖ్యానించారు. Feb 5, 2025: Ousted #Bangladesh PM Sheikh Hasina today addressed her supporters via social media.But just before her speech, a mob attacked the historic #Dhamnondi residence of the country’s founding father Bangabandhu Sheikh Mujibur Rahman in #DhakaThis is the second time… https://t.co/f3rv7aimYj pic.twitter.com/GXxf5Mh6mx— Indrajit Kundu | ইন্দ্রজিৎ (@iindrojit) February 5, 2025 -
మాట్లాడడం లేదని.. వెంటాడి మరీ!
సాక్షి, బెంగళూరు: పాత స్నేహానికి బ్రేకప్ చెప్పినందుకు కక్ష పెంచుకుని బంగ్లా మహిళను జరిపి హతమార్చిన ఘటన నగరంలో జరిగింది. నిందితుడు ముదుకప్పను రామమూర్తినగర పోలీసులు అరెస్టు చేశారు. వివరాలు.. హతురాలు నజ్మా (28), వాటర్ ట్యాంకర్ డ్రైవర్‌గా పని చేస్తున్న ముదుకప్ప మధ్య పాత స్నేహం ఉండేది. క్రమేణా ఇద్దరి మధ్య చనువు పెరిగి వివాహేతర సంబంధానికి దారి తీసింది. అయితే ఆరు నెలల క్రితం నజ్మా ఉన్న అక్రమ బంగ్లా వలసదారుల గుడిసెలపై పోలీసులు దాడి జరిపారు. తర్వాత నజ్మా, ముదుకప్పల మధ్య స్నేహానికి బ్రేక్ పడింది. నజ్మా పని చేస్తున్న అపార్ట్‌మెంట్‌కు నీరు వదిలేందుకు వెళ్లినప్పుడు అక్కడ నజ్మా కనిపించడంతో ముదుకప్ప మళ్లీ ఆమె వెంటపడ్డాడు. అతనితో మాట్లాడేందుకు నజ్మా నిరాకరించింది. వెంటాడి.. హత్య గత నెల 23న నజ్మా విధులు ముగించుకుని కల్కెరె చెరువు మార్గంలో ఇంటికి వెళుతుండగా ముదుకప్ప ఆమెను అనుసరించాడు. ఆమెతో మాటలు కలిపి లైంగిక క్రియకు ఒత్తిడి చేశాడు. అందుకు నజ్మా వ్యతిరేకించడంతో ఆ సమయంలో అటుగా ఎవరూ రాకపోవడాన్ని గమనించిన ముదుకప్ప ఆమెను బలవంతంగా లాక్కెళ్లాడు. అత్యాచారానికి పాల్పడి ఊపిరాడకుండా చేసిన తర్వాత నజ్మా తలపై బండరాయితో కొట్టి చంపి అక్కడి నుంచి పరారయ్యాడు. రామమూర్తినగర పోలీసులు క్షుణ్ణంగా దర్యాప్తు చేపట్టి అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఎఫ్ఎస్ఎల్ పరీక్షలో హతురాలి వంటిపై లభించిన నిందితుడి రక్తం, వీర్యం సరిపోవడంతో ముదుకప్పను అరెస్టు చేశారు. ∙ -
Bangladesh: సమ్మెకు దిగిన రైల్వే సిబ్బంది.. కదలని రైళ్లు
ఢాకా: బంగ్లాదేశ్‌లో రైల్వే సిబ్బంది సమ్మెతో ఈరోజు (మంగళవారం) రైళ్లు నిలిచిపోయాయి. రైల్వే ఉద్యోగులు ఓవర్ టైం పనికి తగిన ప్రయోజనాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ, దేశవ్యాప్తంగా నిరవధిక సమ్మెకు దిగారు. రైల్వే సిబ్బంది సమ్మె ప్రభావం లక్షలాది మంది ప్రయాణికులపై పడింది.పెన్షన్, గ్రాట్యుటీ ప్రయోజనాలకు సంబంధించిన సమస్యలను పరిష్కరించాలని, ఓవర్ టైం పనికి ప్రయోజనాలు కల్పించాలని కోరూతూ బంగ్లాదేశ్ రైల్వే రన్నింగ్ స్టాఫ్ అండ్ వర్కర్స్ అసోసియేషన్ సమ్మెకు దిగింది. ఈ సమ్మె దాదాపు 400 ప్యాసింజర్ రైళ్ల కార్యకలాపాలను ప్రభావితం చేసింది. బంగ్లాదేశ్ రైల్వే రోజుకు దాదాపు 2,50,000 మంది ప్రయాణికులను వారి గమ్య స్థానాలకు చేరుస్తుంటుంది. బంగ్లాదేశ్‌లో గత కొన్ని నెలలుగా హింస కొనసాగుతోంది. ఇప్పుడు రైల్వే ఉద్యోగులు సమ్మెకు దిగడంతో యూనస్ ప్రభుత్వానికి ఇబ్బందులు మరింతగా పెరిగాయి.ఇది కూడా చదవండి: అడవి మధ్యలో రహస్య గుహ.. లోపల కళ్లు బైర్లు కమ్మే దృశ్యం -
Bangladesh: ఆ 700 మంది ఖైదీలు ఎక్కడ?
ఢాకా: బంగ్లాదేశ్‌లో రాజకీయ గందరగోళం కొనసాగుతోంది. గత ఏడాది(2024) జూలై-ఆగస్టులలో బంగ్లాదేశ్‌లో ఆందోళనలు చెలరేగిన సమయంలో జైళ్ల నుంచి తప్పించుకున్న దాదాపు 700 మంది ఖైదీలు ఇప్పటికీ పరారీలోనే ఉన్నారు. బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం గతంలో వివిధ జైళ్ల నుంచి పరారైన ఖైదీలకు సంబంధించి ఒక ప్రకటన చేసింది. సుమారు 700 మంది ఖైదీలు జైళ్ల నుంచి పరారయ్యారని బంగ్లాదేశ్ హోం వ్యవహారాల సలహాదారు లెఫ్టినెంట్ జనరల్ (రిటైర్డ్) జహంగీర్ ఆలం చౌదరి ఢాకాలో విలేకరులకు తెలిపారు. వారిని వెదికి పట్టుకునేందుకు ముమ్మర ప్రయత్నాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు.దేశంలోని వివిధ జైళ్ల నుంచి తప్పించుకున్న వారి వివరాలను పూర్తిగా వెల్లడించకుండానే.. ఈ తరహా ఖైదీలలో కొందరిని అరెస్ట్ చేశామని, మరికొందరి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని ఆయన చెప్పారు. గత ఏడాది ఆగస్టు ఐదు తర్వాత సాధారణ క్షమాభిక్ష కింద ఏ దోషి కూడా జైలు నుండి విడుదల కాలేదని అన్నారు. అయితే బెయిల్‌పై విడుదలైన వారు ఏదైనా నేర కార్యకలాపాలకు పాల్పడినట్లు తేలితే, వారిని అరెస్టు చేసి చర్యలు తీసుకుంటామన్నారు. కాగా దాదాపు 700 మంది ఖైదీలు, దోషులుగా తేలిన ఇస్లామిక్ ఉగ్రవాదులు, మరణశిక్ష పడిన ఖైదీలు పరారీలో ఉన్నారని గతంలో బంగ్లాదేశ్ జైలు అధికారులు ప్రకటించారు. ఇది కూడా చదవండి: Mahakumbh-2025: 10 ప్రత్యేక ఆకర్షణలు.. సోషల్ మీడియాలో చక్కర్లు -
బంగ్లాదేశ్‌కు ట్రంప్ బిగ్ షాక్
వాషింగ్టన్: బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వానికి అమెరికా కొత్త అధ్యక్షుడు ట్రంప్ షాకిచ్చారు. బంగ్లా ప్రభుత్వానికి అమెరికా సాయాన్ని రద్దు చేస్తూ ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయంతో బంగ్లాదేశ్‌లో ఆహారభద్రత, ఆరోగ్యం, విద్య తదితర కీలక రంగాల్లో చేపట్టిన ప్రాజెక్టులు ఆగిపోనున్నాయి. 90 రోజుల పాటు పలు దేశాలకు అమెరికా సాయాన్ని నిలిపివేసే పాలసీలో భాగంగా బంగ్లాదేశ్‌కు సాయం నిలిపివేశారు. ఈజిప్ట్, ఇజ్రాయెల్‌లకు తప్ప ఇతర అన్ని దేశాలకు 90 రోజులపాటు అమెరికా సాయాన్ని నిలిపివేశారు. ట్రంప్ ఇటీవల అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. వలసదారుల విధానాలు, ఫెడరల్ వర్కర్లు ఆఫీసు నుంచి విధులు నిర్వహించడం, లేకెన్ రిలే చట్టం అమలు, పారిస్ ఒప్పందం నుంచి తప్పుకోవడం వంటి నిర్ణయాలు వీటిలో ఉన్నాయి.వీటికి తోడు అమెరికాలో ప్రభుత్వ నిధులను సద్వినియోగం చేసుకోవడం కోసం ప్రపంచంలోని ఇతర దేశాలకు సాయాన్ని 90 రోజుల పాటు నిలిపివేస్తూ నిర్ణయం తీసుకున్నారు. అధ్యక్ష ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో భాగంగా ట్రంప్ ఈ నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇదీ చదవండి: 90 వేల మంది ఉద్యోగుల తొలగింపు..ట్రంప్ కఠిన నిర్ణయం -
T20 World Cup 2025: బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన భారత్
మహిళల అండర్-19 టీ20 వరల్డ్‌కప్-205లో భారత్ మరో విజయం సాధించింది. గ్రూప్ దశ మ్యాచ్‌ల్లో అజేయంగా నిలిచిన టీమిండియా సూపర్-6లో రెండో విజయం ఖాతాలో వేసుకుంది. బంగ్లాదేశ్‌తో ఇవాళ (జనవరి 26) జరిగిన మ్యాచ్‌లో భారత్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 64 పరుగులు మాత్రమే చేసింది. బంగ్లా ఇన్నింగ్స్‌లో కేవలం ఇద్దరు మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. కెప్టెన్ సుమయ్యా అక్తెర్ 21 నాటౌట్, జన్నతుల్ మౌకా 14 పరుగులు చేశారు. భారత బౌలర్లందరూ చాలా పొదుపుగా బౌల్ చేశారు. వైష్ణవీ శర్మ 3, షబ్నమ్ షకీల్, విజే జోషిత్, గొంగడి త్రిష తలో వికెట్ పడగొట్టారు.స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్ 7.1 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. ఓపెనర్ గొంగడి త్రిష (31 బంతుల్లో 40; 8 సిక్సర్లు) మరోసారి మెరుపు ఇన్నింగ్స్ ఆడి భారత్ గెలుపుకు గట్టి పునాది వేసింది. జి కమలిని 3, సనికా ఛల్కే 11 (నాటౌట్), కెప్టెన్ నికీ ప్రసాద్ 5 (నాటౌట్) పరుగులు చేశారు. బంగ్లాదేశ్ బౌలర్లలో అనిస అక్తెర్ శోభా, హబిబా ఇస్లాం పింకీ తలో వికెట్ పడగొట్టారు. సూపర్ సిక్స్‌లో భారత్ తదుపరి స్కాట్లాండ్తో ఆడుతుంది. ఈ మ్యాచ్ జనవరి 28న జరుగనుంది. కాగా, సూపర్ సిక్స్‌లో భారత్ గ్రూప్ 1లో ఉంది. ఈ గ్రూప్‌లో భారత్ రెండు మ్యాచ్‌లు ఆడి రెండిటిలోనూ విజయాలు సాధించింది. గ్రూప్-1లో భారత్‌తో పాటు ఆస్ట్రేలియా, శ్రీలంక, బంగ్లాదేశ్, స్కాట్లాండ్, వెస్టిండీస్ జట్లు ఉన్నాయి.ఈ గ్రూప్‌లో ఆస్ట్రేలియా అగ్రస్థానంలో కొనసాగుతుంది. గ్రూప్-2లో సౌతాఫ్రికా, ఇంగ్లండ్, నైజీరియా, యూఎస్ఏ, న్యూజిలాండ్, ఐర్లాండ్ జట్లు ఉన్నాయి. ఈ గ్రూప్‌లో సౌతాఫ్రికా టాపర్‌గా కొనసాగుతుంది.ఇదిలా ఉంటే, గ్రూప్-1లో భాగంగా ఇవాళ మరో మ్యాచ్ (శ్రీలంక, స్కాట్లాండ్) జరగాల్సి ఉండింది. అయితే వర్షం కారణంగా ఆ మ్యాచ్ రద్దైంది. -
సైఫ్‌పై దాడి.. విచారణలో మరికొన్ని కీలక విషయాలు
ముంబై : బాలీవుడ్ నటుడు సైఫ్ అలిఖాన్పై దాడి ఘటన కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. సైఫ్‌పై దాడి అనంతరం నిందితుడు మహ్మద్ షరీఫుల్ ఇస్లాం షెహజాద్‌ను ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం, ముంబై కస్టడీలో ఉన్న నిందితుడికి సంబంధించి పలు కీలక విషయాలను పోలీసులు వెల్లడించారు.‘ సైఫ్ దాడి చేసిన వ్యక్తి బంగ్లాదేశీ అని పోలీసులు నిర్ధారించారు. షరీఫుల్ మేఘాలయ మీదుగా భారత్‌లోకి ప్రవేశించాడని పోలీసులు గతంలో చెప్పారు. తాజాగా, షరీఫుల్ బంగ్లాదేశీయుడేనని నిర్ధారించేలా గుర్తింపు కార్డులు లభ్యమయ్యాయని తెలిపారు. మొదటి గుర్తింపు కార్డులో షరీఫుల్ మార్చి 3, 1994న జన్మించాడని మహ్మద్ రూహుల్ ఇస్లాం కుమారుడని తెలిపే ఆధారాలు ఉన్నాయి. రెండవ గుర్తింపు కార్డు.. లెర్నర్స్ డ్రైవింగ్ లైసెన్స్. ఇది షరీఫుల్ దక్షిణ-మధ్య బంగ్లాదేశ్‌లోని బారిసాల్ ప్రాంత నివాసి అని సూచిస్తోంది. లైసెన్స్ నవంబర్ 2019లో జారీ చేయగా.. ఫిబ్రవరి 2020లో గడువు ముగియాల్సి ఉండగా.. డ్రైవింగ్ లైసెన్స్ ప్రాక్టికల్ పరీక్ష కోసం మార్చి 18, 2020కి హాజరయ్యాడు. ఇప్పటికే.. 12వ తరగతి వరకు చదివిన షరీఫుల్ ఏడు నెలల క్రితం మేఘాలయ మీదుగా భారత్‌లోకి ప్రవేశించాడని పోలీసులు వెల్లడించారు. పశ్చిమ బెంగాల్లో కొంతకాలం ఉన్నాడని, అనుమానం రాకుండా నిందితుడు తన పేరును బిజోయ్ దాస్‌గా మార్చుకుని స్థానిక నివాసి ఆధార్ కార్డును ఉపయోగించి మొబైల్ ఫోన్ సిమ్ కార్డును కొనుగోలు చేసినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. -
ట్రంప్ ఆదేశాలు.. బంగ్లాదేశీయులపై ఉక్కుపాదం
వాషింగ్టన్: డొనాల్డ్ ట్రంప్ అమెరికా 47వ అధ్యక్షునిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ నేపధ్యంలో ట్రంప్ ఆదేశాల మేరకు స్థానిక చట్ట అమలు సంస్థలు అక్రమ వలసదారులపై చర్యలు మొదలుపెట్టాయి. తాజాగా యూఎస్ ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ (ఐసీఈ) న్యూయార్క్‌లో అక్రమంగా ఉంటున్న నలుగురు బంగ్లాదేశీయులను అరెస్టు చేసింది.న్యూయార్క్‌లోని బ్రూక్లిన్ బరోలోని ఫుల్టన్ ప్రాంతంలో నలుగురు బంగ్లాదేశీయులను ఐసీఈ అరెస్టు చేసినట్లు బంగ్లాదేశ్‌కు చెందిన ప్రముఖ దినపత్రిక ప్రోథోమ్ అలో తెలిపింది. అధ్యక్షుడు ట్రంప్ వలసలకు సంబంధించిన కార్యనిర్వాహక ఉత్తర్వులను జారీ చేసినప్పటి నుండి అక్రమ వలసదారుల్లో ఆందోళన మొదలయ్యిందని ఆ వార్తాపత్రిక పేర్కొంది.న్యూయార్క్‌లో బంగ్లాదేశీయులు అధికంగా నివసించే ప్రాంతాల్లోని వీధులు, రెస్టారెంట్లు ఇప్పుడు దాదాపు నిర్మానుష్యంగా మారాయని ఆ పత్రిక నివేదించింది. చట్ట అమలు అధికారి ఖాదీజా ముంతాహా రూబా తెలిపిన వివరాల ప్రకారం తగిన ధృవపత్రాలు లేకుండా సంచరిస్తున్న నలుగురు బంగ్లాదేశీయులను అరెస్టు చేశారు. ఇక్కడి బంగ్లాదేశీయులు అప్రమత్తంగా ఉండాలని, ఏదైనా చట్ట అమలు సంస్థ సభ్యులు వారిని ప్రశ్నిస్తే వారు సహకరించాలని ముంతాహా రూబా సూచించారు. కాగా గత కొన్ని దశాబ్దాల్లో అమెరికాకు వస్తున్న బంగ్లాదేశీయుల సంఖ్య మరింతగా పెరిగింది. న్యూయార్క్ నగరంలోని ఆసియా జాతి సమూహాలలో బంగ్లాదేశీయులు పెద్దసంఖ్యలో ఉన్నారని ఇటీవలి నివేదికలు వెల్లడించాయి.ఇది కూడా చదవండి: Los Angeles Fire: మళ్లీ కార్చిచ్చు.. రెండు గంటల్లో 5,000 ఎకరాలు ఆహుతి -
వెస్టిండీస్‌కు షాకిచ్చిన బంగ్లాదేశ్.. ఒకే ఒక విజయం దూరంలో..!
బంగ్లాదేశ్ మహిళల క్రికెట్ జట్టు వెస్టిండీస్‌కు షాకిచ్చింది. ఐసీసీ ఛాంపియన్‌షిప్‌లో భాగంగా జరిగిన వన్డే మ్యాచ్‌లో 60 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఏ ఫార్మాట్లో అయినా బంగ్లాదేశ్‌కు విండీస్‌పై ఇదే తొలి గెలుపు. ఈ గెలుపుతో బంగ్లాదేశ్ వన్డే ప్రపంచ కప్‌కు నేరుగా అర్హత సాధించే అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. ప్రపంచకప్‌కు అర్హత సాధించేందుకు బంగ్లాదేశ్ ఒకే ఒక మ్యాచ్ దూరంలో ఉంది.మ్యాచ్ విషయానికొస్తే.. మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా వెస్టిండీస్, బంగ్లాదేశ్ జట్ల మధ్య నిన్న (జనవరి 21) రెండో వన్డే జరిగింది. ఈ మ్యాచ్‌లో వెస్టిండీస్‌కు ఊహించని పరాభవం ఎదురైంది. తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 48.5 ఓవర్లలో 184 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ నిగార్ సుల్తానా (68) బాధ్యతాయుతంగా ఆడి తమ జట్టుకు గౌరవప్రదమైన స్కోర్ అందించింది. శోభన మోస్తరి (23), షోర్నా అక్తెర్ (21) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. వీరు మినహా బంగ్లా ఇన్నింగ్స్‌లో ఒక్కరు కూడా కనీసం 20 పరుగుల మార్కును దాటలేదు. ఫర్జానా హాక్ 18, ముర్షిదా ఖాతూన్ 12, షిర్మన్ అక్తెర్ 11, ఫహిమా ఖాతూన్ 4, రబేయా ఖాన్ 1, నహీదా అక్తెర్ పరుగులు చేశారు. విండీస్ బౌలర్లలో కరిష్మా రామ్హరాక్ 4 వికెట్లు తీయగా.. ఆలియా అలెన్ 3, డియాండ్రా డొట్టిన్, ఫ్రేసర్, అఫీ ఫ్లెచర్ తలో వికెట్ దక్కించుకున్నారు.అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన వెస్టిండీస్ 35 ఓవర్లలో 124 పరుగులకే చాపచుట్టేసింది. బంగ్లా బౌలర్లు మరుఫా అక్తెర్ (8-0-35-2), నహీదా అక్తెర్ (10-0-31-3), రబేయా ఖాన్ (8-0-19-2), ఫహీమా ఖాతూన్ (5-0-17-2) రెచ్చిపోయి బౌలింగ్ చేశారు. వీరి ధాటికి పటిష్టమైన విండీస్ బ్యాటింగ్ లైనప్ పేకమేడలా కూలింది. విండీస్ ఇన్నింగ్స్‌లో షెర్మైన్ క్యాంప్‌బెల్ (28) టాప్ స్కోరర్‌గా నిలువగా.. కెప్టెన్ హేలీ మాథ్యూస్ (16), ఆలియా అలెన్ (15), చెర్రీ ఫ్రేసర్ (18 నాటౌట్), కరిష్మ రామ్హరాక్ (13) రెండంకెల స్కోర్లు చేశారు. ఈ గెలుపుతో బంగ్లాదేశ్ మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో విండీస్ ఆధిక్యాన్ని తగ్గించింది. ప్రస్తుతం ఇరు జట్లు చెరో విజయంతో సమంగా నిలిచాయి. తొలి వన్డేలో వెస్టిండీస్ 9 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్‌ను మట్టికరిపించింది. సిరీస్‌లో చివరిదైన, నిర్ణయాత్మకమైన మూడో వన్డే జనవరి 24న జరుగనుంది. -
సైఫ్ అలీఖాన్‌పై దాడి.. పారిపోవాలనుకున్నాడు
ముంబై: దొంగతనం కోసం బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ ఇంట్లో చొరబడి పెనుగులాటలో ఆయనను పొడిచి పారిపోయిన బంగ్లాదేశ్‌కు చెందిన నిందితుడు షరీఫుల్ ఇస్లాం షెహ్జాద్ మొహమ్మద్ రోహిల్లా అమీన్ ఫరీక్ దాడి తర్వాత తన స్వదేశానికి వెళ్లిపోవాలని భావించాడు. పోలీసులు విచారణలో ఇలాంటి పలు అంశాలు తాజాగా వెల్లడయ్యాయి. గత గురువారం దాడిలో గాయపడిన సైఫ్ స్వల్ప శస్త్రచికిత్స తర్వాత కోలుకుంటున్న విషయం తెల్సిందే. విదేశీయులు, పాస్‌పోర్ట్ చట్టాల కింద కేసు నమోదు తాను ఏడు నెలల క్రితం బంగ్లాదేశ్ నుంచి వచ్చినట్లు షరీఫుల్ ఒప్పుకున్నాడు. అతని ఒరిజినల్ బర్త్ సర్టిఫికేట్‌నూ పోలీసులు సంపాదించారు. దాంతో అతని బంగ్లాదేశ్‌లోని ఘలోకతి జిల్లావాసిగా రూఢీఅయింది. అక్రమంగా భారత్‌లో చొరబడ్డ నేరానికి అతనిపై విదేశీయుల చట్టం, పాస్‌పోర్ట్ చట్టం కింద సైతం కేసు నమోదుచేశారు. భారతీయ పాస్‌పోర్ట్ సంపాదించేందుకు ప్రయత్నించి విఫలమయ్యాడు. దీంతో ఎలాగైనా డబ్బు బాగా సంపాదించి స్వదేశం వెళ్లిపోవాలని ప్లాన్ వేశాడు. అందుకే ఐదునెలలు ముంబైలో హౌస్‌కీపింగ్ వంటి చిన్నాచితకా పనులు చేసిన అతను వాటిని పక్కనబెట్టి దొంగతనాలకు సిద్ధమయ్యాడు. ఇందులోభాగంగానే సైఫ్ ఇంట్లో చొరబడ్డాడు. అయితే తాను దాడి చేసింది బాలీవుడ్ నటుడిపై అనే విషయం తనకు టీవీల్లో వార్తల్లో చూసేదాకా తెలియదని పోలీసు విచారణలో ఫరీఫుల్ చెప్పాడు. సీసీటీవీ ఫుటేజీలోని తన ఫొటో న్యూస్‌ఛానెళ్లలో ప్రసారం కావడంతో భయపడిపోయాడు. సెలబ్రిటీపై దాడి నేపథ్యంలో పోలీసులు ఎలాగైనా తనను పట్టుకుంటారని భయపడి మళ్లీ బంగ్లాదేశ్‌కు వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నాడు. ఈలోపే పోలీసులు పట్టుకోగలిగారు.ఎలా పట్టుకోగలిగారు? వర్లీలో గతంలో తాను పనిచేసిన పబ్ ప్రాంగణంలో జనవరి 16న నిద్రించిన నిందితుడు ఆరాత్రి హఠాత్తుగా మాయమై నేరుగా సైఫ్ ఇంట్లోకి వచ్చి దాడి చేసి తర్వాత బాంద్రా రైల్వేస్టేషన్‌కు వెళ్లాడు. తర్వాత దాదర్‌కు, ఆ తర్వాత వర్లీకి వెళ్లాడు. చివరకు థానే ప్రాంతంలో ఉన్నప్పుడు పోలీసులకు పట్టుబట్టాడు. సైఫ్ ఇంటి సమీప ప్రాంతాల్లోని అన్ని సీసీటీవీ కెమెరాలను చూసినా ఇతను ఏ దిశగా వెళ్లాడనే బలమైన క్లూ పోలీసులకు దొరకలేదు. దీంతో పాత సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించగా జనవరి 9వ తేదీన అంధేరీ వద్ద బైక్‌పై వెళ్తున్న వీడియోలో ఇతడిని గుర్తించారు. బైక్ యజమానిని ప్రశ్నించగా బైక్‌పై వెళ్లింది తనకు తెల్సిన ఒక నిర్మాణరంగ మేస్త్రీ దగ్గర పనిచేసిన కూలీ అని సమాధానమిచ్చాడు. దీంతో పోలీసులు ఆ మేస్త్రీని విచారించారు. గతంలో చిన్నాచితకా పనుల కోసం వర్లీ ప్రాంతంలోని మేస్త్రీ దగ్గరకు వచ్చి పని ఉంటే చెప్పాలని తన ఫోన్‌నంబర్ ఇచ్చి ఫరీఫుల్ తర్వాత థానె వెళ్లిపోయాడు. ఈ విషయం పోలీసులకు తెల్సి మేస్త్రీని విచారించగా షరీఫుల్ మొబైల్ నంబర్‌ను అందజేశాడు. తాజాగా శనివారం షరీఫుల్ వర్లీ సెంచురీ మిల్ వద్ద బుర్జీపావ్, వాటర్ బాటిల్ కొన్నప్పుడు ఈ నంబర్‌తో చేసిన గూగుల్‌పే లావాదేవీతో ఫోన్ లొకేషన్‌ను పోలీసులు పసిగట్టారు. అయితే అప్పటికే అతను థానెలోని దట్టమైన మడ అడవుల్లోకి పారిపోయాడని తెల్సి వేట మొదలెట్టారు. చిట్టచివరకు ఆదివారం తెల్లవారుజామున హీరానందానీ ఎస్టేట్ దగ్గరి లేబర్క్యాంప్ సమీప అడవిలో పట్టుకోగలిగారు. ఆరోజు ఘటన తర్వాత దొరక్కుండా తప్పించుకునేందుకు షరీఫుల్ వెంటనే దుస్తులు మార్చేశాడు. అయితే వెంట తెచ్చుకున్న బ్యాక్‌ప్యాక్ సైతం ఒకరకంగా ఇతడిని పట్టించింది. ఆ ప్రాంతంలో అదే బ్యాక్‌ప్యాక్ వేసుకున్న, అదే పోలికలున్న వ్యక్తులను విచారించి షరీఫుల్‌ను పోల్చుకోగలిగారు. దాడి రోజున ఏం జరిగిందో తెల్సుకునేందుకు నిందితుడిని సద్గురుశరణ్ బిల్డింగ్‌లోని సైఫ్ ఫ్లాట్‌కు తీసుకెళ్లి పోలీసులు అతనితో సీన్ రీక్రియేషన్ చేయించే వీలుంది. -
అజేయ శతకంతో కదంతొక్కిన కెప్టెన్.. తొలి వన్డేలో బంగ్లాపై విండీస్ ఘన విజయం
ఐసీసీ ఛాంపియన్షిప్ 2025లో భాగంగా బంగ్లాదేశ్ మహిళల క్రికెట్ జట్టు వెస్టిండీస్‌లో పర్యటిస్తుంది. ఈ పర్యటనలో ఇరు జట్లు మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడనున్నాయి. వన్డే సిరీస్‌లో భాగంగా నిన్న (జనవరి 19) సెయింట్ కిట్స్‌లో తొలి మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో ఆతిథ్య వెస్టిండీస్ పర్యాటక బంగ్లాదేశ్‌ను 9 వికెట్ల తేడాతో చిత్తు చేసింది. విండీస్ కెప్టెన్ హేలీ మాథ్యూస్ ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టి తమ విజయంలో ప్రధాన పాత్ర పోషించింది.తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 198 పరుగులు చేసింది. బంగ్లాదేశ్ ఇన్నింగ్స్‌లో షర్మిన్ అక్తర్ (42), ముర్షిదా ఖాతూన్ (40), శోభన మోస్తరీ (35), షోమా అక్తర్ (29) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. ఫర్జానా హక్ (10), కెప్టెన్ నిగర్ సుల్తానా (14), రబెయా ఖాన్ (1), నహిదా అక్తర్ (9), సుల్తానా ఖాతూన్ (2) విఫలమయ్యారు. విండీస్ బౌలర్లలో డియాండ్రా డొట్టిన్ మూడు వికెట్లతో చెలరేగగా.. ఆలియా అలెన్, హేలీ మాథ్యూస్ తలో రెండు, అఫీ ఫ్లెచర్ ఓ వికెట్ దక్కించుకున్నారు.అనంతరం బరిలోకి దిగిన వెస్టిండీస్ 31.4 ఓవర్లలో వికెట్ మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. కెప్టెన్ హేలీ మాథ్యూస్ అజేయ సెంచరీతో (93 బంతుల్లో 104 నాటౌట్; 16 ఫోర్లు) విండీస్‌ను విజయతీరాలకు చేర్చింది. క్యియానా జోసఫ్ (79 బంతుల్లో 70; 6 ఫోర్లు, 4 సిక్సర్లు) రాణించింది. మాథ్యూస్, జోసఫ్ తొలి వికెట్‌కు రికార్డు స్థాయిలో 163 పరుగులు జోడించారు. వన్‌డౌన్‌లో వచ్చిన షెర్మైన్ క్యాంప్‌బెల్ 14 పరుగులతో అజేయంగా నిలిచింది. క్వియానా జోసఫ్ వికెట్ రిబేయా ఖాన్‌కు దక్కింది. ఈ గెలుపుతో విండీస్ మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. ఇరు జట్ల మథ్య రెండో వన్డే జనవరి 21న జరుగనుంది. -
స్టార్ క్రికెటర్‌పై అరెస్టు వారెంట్
ఢాకా: బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు స్టార్ ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్‌పై అరెస్టు వారెంట్ జారీ అయింది. అవామీ లీగ్ ఎంపీగానూ వ్యవహరించిన షకీబ్‌పై చెక్ బౌన్స్‌కు సంబంధించిన కేసులో ఢాకా న్యాయస్థానం చర్యలు తీసుకుంది. ‘అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ జైదుర్ రహమాన్.. షకీబ్ అల్ హసన్‌పై అరెస్టు వారెంట్ జారీ చేశారు. మార్చి 24 నాటి ఘటనపై పూర్తి నివేదిక సమర్పించాలని పోలీసులకు ఆదేశించారు’ అని కోర్టు వర్గాలు వెల్లడించాయి. రాజకీయ అనిశ్చితి కారణంగా గతేడాది బంగ్లాదేశ్‌లో అల్లర్లు చెలరేగగా... ప్రధానమంత్రి షేక్ హసీనా దేశం వీడారు. ఆ సమయంలో జరిగిన గొడవల్లో షకీబ్‌పై ఎఫ్ఐఆర్ నమోదు కాగా... అప్పటి నుంచి షకీబ్ బంగ్లాదేశ్‌కు తిరిగి రాకుండా విదేశాల్లో ఉంటున్నాడు. స్వదేశంలో చివరి టెస్టు ఆడాలని షకీబ్ ఆశించినా... భద్రత ఏర్పాట్ల విషయంలో హామీ లభించకపోవడంతో అతడు వెనక్కి తగ్గాడు. ప్రస్తుతం సందేహాస్పద బౌలింగ్ యాక్షన్ కారణంగా సస్పెన్షన్ ఎదుర్కొంటున్న షకీబ్‌ను బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు చాంపియన్స్ ట్రోఫీకి పరిగణించలేదు. -
కంగనా మూవీకి షాక్.. ఆ దేశంలో బ్యాన్!
బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ తెరకెక్కించిన చిత్రం ఎమర్జన్సీ. చాలాసార్లు వాయిదా పడుతూ వచ్చినా ఈ చిత్రం ఈ వారంలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీ తానే దర్శకత్వం వహించారు. మాజీ ప్రధాని ఇందిరా గాంధీ విధించిన ఎమర్జన్సీ నాటి పరిస్థితుల నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించారు.తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాను బంగ్లాదేశ్‌లో బ్యాన్ చేయాలని అక్కడి ప్రభుత్వం నిర్ణయించినట్లు వార్తలొచ్చాయి. హసీనా ప్రభుత్వం పడిపోయాక.. భారత్- బంగ్లాదేశ్ మధ్య సత్సంబంధాలు దెబ్బతిన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఎమర్జన్సీ మూవీని అక్కడ బ్యాన్ చేయనున్నారని లేటేస్ట్ టాక్.ఈ ఈ చిత్రంలో ఇందిరా గాంధీగా కంగనా రనౌత్ నటించారు. జయప్రకాశ్ నారాయణ్ పాత్రలో అనుపమ్ ఖేర్, అటల్ బిహారీ వాజ్‌పేయీగా శ్రేయాస్ తల్పడే కనిపించనున్నారు. ఈ సినిమా ఈ నెల 17న బాక్సాఫీసు ముందుకు రానుంది.ఎమర్జన్సీ వీక్షించిన కేంద్రమంత్రి..కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ఇటీవల ఎమర్జన్సీ మూవీని వీక్షించారు. ఆయన కోసం కంగనా రనౌత్ స్పెషల్ స్క్రీనింగ్ ఏర్పాటు చేశారు. (ఇది చదవండి: ఆస్కార్ చిత్రాల ఎంపిక.. కంగనా రనౌత్ సంచలన కామెంట్స్!)ఎమర్జెన్సీ కథేంటంటే..కంగనా రనౌత్ లీడ్ రోల్లో నటించిన పొలిటికల్ డ్రామా ఎమర్జెన్సీ. గతంలో ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో విధించిన ఎమర్జెన్సీ ఆధారంగా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ చిత్రంలో అనుపమ్ ఖేర్, శ్రేయాస్ తల్పాడే, విశాక్ నాయర్, మహిమా చౌదరి, మిలింద్ సోమన్, సతీష్ కౌశిక్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. 1975 నుంచి 1977 వరకు 21 నెలల పాటు భారతదేశంలో విధించిన ఎమర్జెన్సీ, ఆ తరువాతి పరిణామాల ఆధారంగా తెరకెక్కించారు. ఈ చిత్రంలో కంగనా మాజీ ప్రధాని ఇందిరా గాంధీ పాత్రను పోషించారు.ఆది నుంచి వివాదాలే..ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ కాగా.. ఈ సినిమాపై మొదటి నుంచి వివాదాలు నడుస్తున్నాయి. సెన్సార్ బోర్డు నిబంధనలకు అనుగుణంగా ఈ మూవీని విడుదల చేసేందుకు మేకర్స్ నిర్ణయించారు. ఇప్పటికే ఎమర్జెన్సీ చిత్రానికి యూఏ సర్టిఫికేట్ జారీ చేసింది. అయితే కొన్ని సీన్స్ మాత్రం మార్పులు చేయాలని సూచించింది. కొందరు తమను టార్గెట్ చేసి చెడుగా చూపిస్తున్నారని ఓ వర్గం ఆరోపిస్తోంది. దీంతో సినిమా విడుదల వాయిదా వేయాల్సి వచ్చింది.సెన్సార్ బోర్డుకు ఫిర్యాదులు..ఈ సినిమా ఓ వర్గం వారిని కించపరిచేలా ఉందంటూ పలువురు సెన్సార్ బోర్డుకు లేఖ రాశారు. దీంతో సెన్సార్ బోర్డు కొన్ని సన్నివేశాల్లో అభ్యంతరం వ్యక్తం చేసింది. అప్పట్లో సెన్సార్ బోర్డు తమ చిత్రానికి సర్టిఫికెట్ ఇవ్వడం లేదంటూ కంగన మండిపడ్డారు. ఇటీవలే సెన్సార్ పూర్తి చేసుకున్న చిత్రం కొత్త ఏడాదిలో థియేటర్లలో సందడి చేయనుంది. -
బంగ్లాదేశ్‌కు భారత్ కౌంటర్..రాయబారికి సమన్లు
న్యూఢిల్లీ:బంగ్లాదేశ్(Bangladesh) నుంచి భారత్(India)లోకి చొరబాట్లను అడ్డుకునేందుకు సరిహద్దులో కంచె నిర్మాణంపై బంగ్లాదేశ్ అభ్యంతరం వ్యక్తం చేసింది.ఈ నేపథ్యంలో భారత హైకమిషనర్ ప్రణయ్ వర్మను బంగ్లాదేశ్ విదేశాంగశాఖ ఆదివారం పిలిచి వివరణ కోరింది.ఈ వ్యవహారంపై భారత్ కూడా ధీటుగా స్పందించింది. ఢిల్లీలోని బంగ్లాదేశ్ డిప్యూటీ హైకమిషనర్ నురల్ ఇస్లామ్‌కు విదేశాంగశాఖ సమన్లు జారీ చేసింది.దీంతో ఆయన సోమవారం(జనవరి13) విదేశాంగశాఖ కార్యాలయానికి చేరుకుని వివరణ ఇచ్చినట్లు తెలుస్తోంది.సరిహద్దులో అయిదుచోట్ల కంచెల ఏర్పాటుకు భారత్ ప్రయత్నిస్తోందని,ఇది రెండు దేశాల మధ్య ఉన్న ద్వైపాక్షిక ఒప్పందాన్ని ఉల్లంఘించడమేనని బంగ్లాదేశ్ ఇప్పటికే ఆరోపణలు చేసింది.ఆరోపణలు చేసిన కొన్ని గంటల్లోనే భారత హైకమిషనర్ ప్రణయ్ వర్మ(Pranay Verma)కు బంగ్లాదేశ్ సమన్లు జారీ చేసింది. బంగ్లాదేశ్‌కు వివరణ ఇచ్చిన అనంతరం వర్మ మీడియాతో మాట్లాడుతూ కంచెల విషయంలో రెండు దేశాల రక్షణ దళాలు బీఎస్ఎఫ్,బీజీబీ (బార్డర్ గార్డ్ బంగ్లాదేశ్)లు ఓ అవగాహనతో ఉన్నాయన్నారు.సరిహద్దు వెంట నేరాల నియంత్రణకు ఈ అవగాహన కొనసాగుతుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. -
అందుకే నాపై వేటు వేశారు.. చాంపియన్స్ ట్రోఫీ జట్టులో నో ప్లేస్!
స్టార్ ఆల్‌రౌండర్, మాజీ కెప్టెన్ షకీబ్ అల్ హసన్‌తో పాటు సీనియర్ బ్యాటర్ లిటన్ దాస్‌కు ఎదురుదెబ్బ తగిలింది. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 కోసం ప్రకటించిన బంగ్లాదేశ్ జట్టులో వీరికి చోటు దక్కలేదు. షకీబ్ విషయానికొస్తే.. సందేహాస్పద బౌలింగ్ యాక్షన్ కారణంగా సస్పెన్షన్‌కు గురైన అతడిని సెలెక్టర్లు ఈ ఐసీసీ టోర్నీకి పరిగణించలేదు. ఇప్పటికే టీ20, టెస్టు ఫార్మాట్లకు వీడ్కోలు పలికిన 37 ఏళ్ల షకీబ్... చాంపియన్స్ ట్రోఫీ తర్వాత వన్డే ఫార్మాట్ నుంచి కూడా తప్పుకొంటానని ఇదివరకే వెల్లడించాడు.అయితే, తాజాగా బంగ్లాదేశ్ సెలక్టర్లు తీసుకున్న నిర్ణయంతో షకీబ్ అంతర్జాతీయ కెరీర్ ఇక ముగిసినట్లే. షకీబ్‌తో పాటు ఫామ్‌లేక తంటాలు పడుతున్న సీనియర్ బ్యాటర్ లిటన్ దాస్‌కు కూడా నిరాశే ఎదురైంది. గత 13 మ్యాచ్‌ల్లో ఒక్క అర్ధశతకం కూడా సాధించని లిటన్ దాస్... గత ఏడు ఇన్నింగ్స్‌ల్లో వరుసగా 6, 1, 0, 0, 2, 4, 0 పరుగులు చేశాడు. దీంతో అతడిని ఈ టోర్నీకి ఎంపిక చేయలేదు.అందుకే నాపై వేటు వేశారుఈ విషయంపై స్పందించిన లిటన్ దాస్ తనపై వేటు పడటానికి గల కారణాన్ని వెల్లడించాడు. ‘‘గతంలో నేను ఎన్నెన్నో గొప్ప ఇన్నింగ్స్ ఆడాను. అయితే, ఇప్పుడు జీరో నుంచి మళ్లీ మొదలుపెట్టాల్సి వచ్చింది. నేను ఇకపై మరింత కఠినంగా శ్రమించాలి. ఆ తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం.అయినా, చాంపియన్స్ ట్రోఫీ జట్టు ఎంపికకు ముందే నాకొక స్పష్టమైన సందేశం వచ్చింది. అయితే, సెలక్టర్ల నుంచి నేరుగా రాలేదు. కానీ.. ఈ జట్టులో చోటు దక్కదని తెలుసు. నేను బాగా ఆడటం లేదు కాబట్లే నన్ను టీమ్ నుంచి తప్పించారు. ఇందులో దాచాల్సింది, సిగ్గుపడాల్సింది ఏమీ లేదు. అందరి విషయంలోనూ సాధారణంగా జరిగేదే ఇది.కొత్త ఇన్నింగ్స్ ఆరంభిస్తాఏదేమైనా నేను నా ఆటను మెరుగుపరచుకోవాల్సి ఉంది. రాత్రికి రాత్రే అద్భుతాలు జరిగిపోవు గానీ.. నేను మాత్రం ఎక్కడా వెనుకడుగు వేయను. అయినా... నేను ఇప్పుడు కొత్తగా నిరూపించుకోవాల్సింది ఏమీ లేదు. నిలకడైనా ఆట తీరుతో కొత్త ఇన్నింగ్స్ ఆరంభిస్తా’’ అని 30 ఏళ్ల లిటన్ దాస్ ఈఎస్పీఎన్క్రిక్ఇన్ఫోతో పేర్కొన్నాడు. కాగా గతనెల(డిసెంబరు 2024)లో వెస్టిండీస్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో లిటన్ దాస్ బంగ్లాదేశ్‌కు చివరగా ఆడాడు.ఫిబ్రవరి 19 నుంచి ప్రారంభంకాగా ఫిబ్రవరి 19 నుంచి ప్రారంభం కానున్న చాంపియన్స్ ట్రోఫీ కోసం బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) శుక్రవారం 15 మందితో కూడిన జట్టును ప్రకటించింది. ఈ టీమ్‌కు నజ్ముల్ హుసేన్ షాంటో సారథ్యం వహిస్తుండగా... ముష్ఫికర్ రహీం, మహ్ముదుల్లా, ముస్తాఫిజుర్ వంటి సీనియర్ ప్లేయర్లు చోటు దక్కించుకున్నారు. కాగా పాకిస్తాన్ వేదికగా చాంపియన్స్ ట్రోఫీ జరుగనుండగా.. టీమిండియా మాత్రం తటస్థ వేదికైన దుబాయ్‌లో తమ మ్యాచ్‌లు ఆడనుంది.ఇక చాంపియన్స్ ట్రోఫీ-2025లో బంగ్లాదేశ్.. ఆస్ట్రేలియా, అఫ్గనిస్తాన్, ఇంగ్లండ్‌లతో కలిసి గ్రూప్-‘బి’లో ఉంది. మరోవైపు.. టీమిండియా, న్యూజిలాండ్, పాకిస్తాన్, సౌతాఫ్రికా గ్రూప్-‘ఎ’ నుంచి పోటీపడుతున్నాయి. ఈ నేపథ్యంలో తమ తొలి మ్యాచ్‌లో బంగ్లాదేశ్ ఫిబ్రవరి 20న దుబాయ్ వేదికగా టీమిండియాతో తలపడనుంది.తదుపరి.. రావల్పిండి వేదికగా ఫిబ్రవరి 24న న్యూజిలాండ్‌తో, ఫిబ్రవరి 27న అదే వేదికపై పాకిస్తాన్‌తోనూ బంగ్లాదేశ్ మ్యాచ్‌లు ఆడనుంది. ఇక ఈ టోర్నీలో మార్చి 4న తొలి సెమీఫైనల్ దుబాయ్‌లో జరుగనుండగా.. మార్చి 5న రెండో సెమీ ఫైనల్‌కు లాహోర్ ఆతిథ్యం ఇవ్వనుంది. మార్చి 9న ఫైనల్ నిర్వహించేందుకు ముహూర్తం ఖరారు కాగా.. మార్చి 10 రిజర్వ్ డేగా ఖరారు చేశారు..బంగ్లాదేశ్ జట్టు: నజ్ముల్ హుసేన్ షాంటో (కెప్టెన్), ముష్ఫికర్ రహీమ్, తౌహిద్ హృదయ్, సౌమ్య సర్కార్, తాంజిద్ హసన్, మహ్ముదుల్లా, జాకీర్ అలీ, మెహదీ హసన్ మిరాజ్, రిషాద్ హుసేన్, తస్కీన్ అహ్మద్, ముస్తఫిజుర్ రహమాన్, పర్వేజ్ హుసేన్, నసుమ్ అహ్మద్, తన్జిమ్ హసన్, నహిద్ రాణా.చదవండి: ఇదెక్కడి ఫామ్ రా సామీ.. 6 ఇన్నింగ్స్‌ల్లో 5 సెంచరీలు.. ఛాంపియన్స్ ట్రోఫీ జట్టులో చోటిస్తారా..? -
సరిహద్దుల్లో ఫెన్సింగ్ నిర్మాణం.. భారత హై కమిషనర్‌కు బంగ్లా సమన్లు
ఢాకా: రెండు దేశాల సరిహద్దుల్లోని ఐదు ప్రాంతాల్లో ఫెన్సింగ్ నిర్మాణం చేపట్టేందుకు ప్రయత్నించిందంటూ బంగ్లాదేశ్ విదేశాంగ శాఖ ఆదివారం ఢాకాలోని భారత హై కమిషనర్ ప్రణయ్ వర్మకు సమన్లు జారీ చేసింది. కంచె నిర్మాణం ద్వైపాక్షిక ఒప్పందాన్ని ఉల్లంఘించడమేనని పేర్కొంది. ప్రణయ్ వర్మ ఆదివారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో బంగ్లాదేశ్ విదేశాంగ శాఖ కార్యాలయానికి వెళ్లి విదేశాంగ శాఖ కార్యదర్శి జషీముద్దీన్‌తో దాదాపు 45 నిమిషాలపాటు చర్చలు జరిపినట్లు ప్రభుత్వ వార్తా సంస్థ బీఎస్ఎస్ తెలిపింది. ఈ పరిణామంపై అక్కడి ఆపద్ధర్మ ప్రభుత్వం నుంచి ఎటువంటి అధికారిక ప్రకటనా వెలువడలేదు. సమావేశం అనంతరం హైకమిషనర్ వర్మ మీడియాతో మాట్లాడారు. ‘రెండు దేశాల సరిహద్దులను బీఎస్ఎఫ్, బీజీబీలు కాపలాకాస్తున్నాయి. ఈ రెండు విభాగాలు ఎప్పటికప్పుడు సంప్రదింపులు కొనసాగిస్తున్నాయి కూడా. సరిహద్దుల వెంట నేరాల కట్టడికి రెండు దేశాల మధ్య ఉన్న అంగీకారానికి అనుగుణంగా సహకారం కొనసాగుతుందని ఆశిస్తున్నాం’అని చెప్పారు. అంతకుముందు, బంగ్లాదేశ్ హోం శాఖ సలహాదారు జహంగీర్ ఆలం చౌదరి మీడియాతో మాట్లాడుతూ..ఒప్పందానికి విరుద్ధంగా సరిహద్దుల్లో భారత్ ఫెన్సింగ్ ఏర్పాటుకు చేసిన ప్రయత్నాలను బంగ్లా జవాన్లు, స్థానికులు అడ్డుకున్నారని చెప్పారు. 1974లో కుదిరిన ఒప్పందాన్ని భారత్ ఉల్లంఘించిందని చెప్పారు. -
ఛాంపియన్స్ ట్రోఫీ కోసం బంగ్లాదేశ్ జట్టు ప్రకటన.. స్టార్ ఆటగాడిపై వేటు
పాకిస్తాన్, యూఏఈ వేదికలుగా వచ్చే నెల (ఫిబ్రవరి) 19 నుంచి జరిగే ఛాంపియన్స్ ట్రోఫీ కోసం 15 మంది సభ్యుల బంగ్లాదేశ్ జట్టును ఇవాళ (జనవరి 12) ప్రకటించారు. ఈ జట్టుకు కెప్టెన్‌గా నజ్ముల్ హొస్సేన్ షాంటో నియమితుడయ్యాడు. షాంటో గాయం కారణంగా ఇటీవల వెస్టిండీస్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌కు దూరమయ్యాడు. షాంటో గైర్హాజరీలో విండీస్ పర్యటనలో మెహిది హసన్ మిరాజ్ బంగ్లా కెప్టెన్‌గా వ్యవహరించాడు. విండీస్‌తో సిరీస్‌ను బంగ్లాదేశ్ 0-3 తేడాతో కోల్పోయింది.షాంటోతో పాటు గాయాల బారిన పడ్డ ముష్ఫికర్ రహీం, తౌహిద్ హృదోయ్, ముస్తాఫిజుర్ రెహ్మాన్ ఛాంపియన్స్ ట్రోఫీతో రీఎంట్రీ ఇవ్వనున్నారు. మెగా టోర్నీ కోసం ఎంపిక చేసిన జట్టులో స్టార్ ఆటగాడు లిటన్ దాస్‌కు చోటు దక్కలేదు. విండీస్ పర్యటనలో చెత్త ప్రదర్శనల (3 మ్యాచ్‌ల్లో 6 పరుగులు) కారణంగా దాస్ జట్టులో చోటు కోల్పోయాడు. దాస్‌పై వేటు వేసినట్లు బంగ్లా చీఫ్ సెలెక్టర్ ఘాజీ అష్రఫ్ హొస్సేన్ తెలిపాడు. లిటన్ దాస్ గైర్హాజరీలో జాకెర్ అలీ బంగ్లా వికెట్ కీపర్‌గా బాధ్యతలు చేపడతాడని అష్రఫ్ అన్నాడు.ఛాంపియన్స్ ట్రోఫీ కోసం ఎంపిక చేసిన జట్టులో లిటన్ దాస్‌తో పాటు షోరీఫుల్ ఇస్లాం, హసన్ మహమూద్, అఫీఫ్ హొస్సేన్‌లకు కూడా చోటు దక్కలేదు. షోరీఫుల్ ఇస్లాం, హసన్ మహమూద్, అఫీఫ్ హొస్సేన్ కూడా విండీస్‌తో జరిగిన మూడు మ్యాచ్‌లో వన్డే సిరీస్‌లో ఘోరంగా విఫలమయ్యారు.బంగ్లా జట్టు పేస్ విభాగం యువకులు, సీనియర్లతో (నహీద్ రాణా, తంజిమ్ హసన్, తస్కిన్ అహ్మద్, ముస్తాఫిజుర్ రెహ్మాన్) సమతూకంగా ఉంది. స్పిన్ విభాగాన్ని లెగ్ స్పిన్నర్ రిషద్ హొస్సేన్ లీడ్ చేస్తాడు. రిషద్‌తో పాటు స్పిన్ విభాగంలో మెహిది హసన్, నసుమ్ అహ్మద్ ఉన్నారు. బ్యాటింగ్ డిపార్ట్మెంట్ విషయానికొస్తే.. నజ్ముల్, ముష్ఫికర్, మహ్మదుల్లా, సౌమ్య సర్కార్ లాంటి సీనియర్లు జట్టులో చోటు దక్కించుకున్నారు.గత వారం జరిగిన బౌలింగ్ అసెస్మెంట్ టెస్ట్‌లో ఫెయిల్ అయిన షకీబ్ అల్ హసన్ చాంపియన్స్ ట్రోఫీ జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు. సీనియర్ బ్యాటర్ తమీమ్ ఇక్బాల్ ఛాంపియన్స్ ట్రోఫీ ఆడతాడని తొలుత ప్రచారం జరిగింది. ఇటీవలే తమీమ్ రిటైర్మెంట్ ప్రకటించడంతో బంగ్లా సెలెక్టర్లు ఇతన్ని కూడా పరిగణలోకి తీసుకోలేదు.కాగా, ఛాంపియన్స్ ట్రోఫీలో బంగ్లాదేశ్.. భారత్, న్యూజిలాండ్, పాకిస్తాన్‌తో కలిసి గ్రూప్-ఏలో ఉంది. బంగ్లా తమ తొలి మ్యాచ్‌ను ఫిబ్రవరి 20న టీమిండియాతో ఆడుతుంది.ఛాంపియన్స్ ట్రోఫీ కోసం బంగ్లాదేశ్ జట్టు..నజ్ముల్ హొస్సేన్ షాంటో (కెప్టెన్), తంజిద్ హసన్ తమీమ్, సౌమ్య సర్కార్, పర్వేజ్ హొస్సేన్ ఎమోన్, ముష్ఫికర్ రహీమ్, తౌహిద్ హృదోయ్, మహ్మదుల్లా, మెహిదీ హసన్, జాకర్ అలీ అనిక్, రిషద్ హుస్సేన్, నసుమ్ అహ్మద్, తంజిమ్ హసన్ సకీబ్, నహిద్ రాణా, తస్కిన్ అహ్మద్, ముస్తాఫిజుర్ రెహ్మాన్ -
హసీనా వీసా గడువు పెంపు
న్యూఢిల్లీ: విద్యార్థుల ఉద్యమం, ఎగసిన అల్లర్లతో స్వదేశం వీడి భారత్‌లో తలదాచుకుంటున్న పదవీచ్యుత బంగ్లాదేశ్ మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనా విషయంలో మోదీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఆమెకు ఇచ్చిన వీసా గడువును పొడిగించింది. గత ఏడాది జూలై–ఆగస్ట్‌లో బంగ్లాదేశ్‌లో దేశ విమోచన పోరాటయోధుల కుటుంబాలు, వారసులకు నియామకాల్లో రిజర్వేషన్లను వ్యతిరేకిస్తూ మొదలైన ఉద్యమాన్ని హసీనా ఉక్కుపాదంతో అణిచేసి దారుణాలకు పాల్పడ్డారని ఆమెను విచారిస్తామని బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం ప్రకటించడం తెల్సిందే. ఆమె పాస్ట్‌పోర్ట్‌ను రద్దుచేస్తున్నట్లు మొహమ్మద్ యూనుస్ సర్కార్ మంగళవారం ప్రకటించిన వేళ ఆమె వీసా గడువను భారత్ తాజాగా పొడిగించడం గమనార్హం. ఆమెతోపాటు 75 మంది పాస్ట్‌పోర్ట్‌లను రద్దుచేస్తున్నట్లు బంగ్లాదేశ్ ప్రకటించింది. -
‘చొరబాట్ల’కు మూడు రూట్లు.. వివిధ రేట్లు.. ఏజెంట్ల మాయాజాలం ఇదే
బంగ్లాదేశ్‌లో నెలకొన్న రాజకీయ సంక్షోభం, మైనారిటీలపై హింసాయుత ఘటనలు చోటుచేసుకున్న దరిమిలా పలువురు బంగ్లాదేశీయులు భారత్‌లోకి అక్రమంగా ప్రవేశించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇందుకు ఏజెంట్ల సాయం తీసుకుంటున్నారు. అయితే ఇలాంటి అక్రమ చొరబాటుదారులపై భారత్ కఠిన చర్యలు చేపడుతోంది.బంగ్లాదేశీయుల చొరబాట్లపై పోలీసులు దృష్టిమహారాష్ట్రలో అక్రమంగా నివసిస్తున్న బంగ్లాదేశీయుల(Bangladeshi)పై పోలీసులు నిరంతరం దృష్టి సారిస్తున్నారు. ఇటీవల ఘట్కోపర్ పోలీసులు అక్రమంగా భారత్‌లో నివసిస్తున్న 13 మంది బంగ్లాదేశీయులను అరెస్టు చేశారు. తాజాగా ముంబై క్రైమ్ బ్రాంచ్ మరో ఏడుగురు బంగ్లాదేశ్ పౌరులను అరెస్టు చేసింది. వారిని విచారిస్తున్న సమయంలో ముంబై పోలీసులు ఒక రేట్ కార్డును కనుగొన్నారు. బంగ్లాదేశీయులు చట్టవిరుద్ధంగా భారత్‌లోకి ప్రవేశించేందుకు ఎంత మొత్తం వెచ్చించారనే వివరాలు ఈ కార్డులో ఉన్నాయి. బంగ్లాదేశీయులను భారత్‌లోకి మూడు రూట్లలో అక్రమంగా తరలిస్తున్నారని, ఒక్కో రూటుకు ఒక్కో రేటు ఉందని పోలీసులు గుర్తించారు.15 ఏళ్లుగా అక్రమ నివాసంముంబైలో మైనారిటీలు అధికంగా ఉన్న గోవండి, శివాజీ నగర్, మన్ఖుర్డ్ డియోనార్, చునాభట్టి, ఘట్కోపర్లలో ఉంటున్న 36 మంది బంగ్లాదేశ్ చొరబాటుదారుల(Bangladeshi infiltrators)ను పోలీసులు అరెస్ట్ చేశారని డీసీపీ నవనాథ్ ధావలే తెలిపారు. ఈ చొరబాటుదారులలో చాలా మంది 15 ఏళ్లుగా ముంబైలో నివసిస్తున్నారని పోలీసుల విచారణలో తేలింది. వారి నుంచి జనన ధృవీకరణ పత్రం, ఆధార్ కార్డు, ఇతర పత్రాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.నకిలీ పత్రాలలో ఆధార్కార్డుఅయితే ఆ డాక్యుమెంట్లన్నీ నకిలీవేనని పోలీసులు గుర్తించారు. ఏజెంట్లు ఐదువేల నుంచి 10 వేల రూపాయలు వసూలు చేసి, వారికి నకిలీ పత్రాలు రూపొందించి, వాటి ఆధారంగా ఆధార్ కార్డు తయారు చేయిస్తున్నారని తేలింది. కాగా వీరంతా ఇటీవల మహారాష్ట్రలో జరిగిన ఎన్నికల్లో ఓటు వేశారా లేక వీరికి ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ముంబైలోని చర్ని రోడ్ స్టేషన్ సమీపంలో ఒక బంగ్లాదేశీయుడిని పోలీసులు అరెస్టు చేశారు. అతను 1994 నుండి ముంబైలో అక్రమంగా నివసిస్తున్నాడు. ఇతనిని అరెస్టు చేసి విచారిస్తున్న సందర్భంలో అతను భారతదేశంలో చొరబడేందుకు ఎంత డబ్బు ఖర్చు చేశాడో తెలియజేసే రేటు కార్డు బయటపడింది.మూడు రూట్లు.. వివిధ రేట్లుమాల్దా, 24 పరగణాలు, ముర్షిదాబాద్, దినేష్పూర్, చప్లీ నవాబాద్గంజ్ తదితర ప్రాంతాల నుంచి పలువులు బంగ్లాదేశీయులు భారత్‌లోకి చొరబడుతున్నారని ముంబై క్రైం బ్రాంచ్ వర్గాలు(Mumbai Crime Branch sources) తెలిపాయి. కొండ ప్రాంతాల మీదుగా బంగ్లాదేశీయులు భారతదేశంలోకి ప్రవేశించడానికి వారు ఏజెంట్లకు 7 వేల నుంచి 8 వేలు చెల్లించవలసి ఉంటుంది. ఈ మార్గాల్లో ప్రమాదం తక్కువగా ఉంటుందనే ఉద్దేశం ఏజెంట్లలో ఉంది. బంగ్లాదేశీయులు నీటి మార్గం ద్వారా భారత్‌లోకి ప్రవేశించాలంటే, ఇందుకోసం రెండు నుంచి నాలుగు వేల రూపాయలు చెల్లించాలి. ఇది అత్యంత కష్టమైన మార్గం కావడంతో దీనికి ఏజెంట్లు రేటు తక్కువ విధించారని పోలీసులు భావిస్తున్నారు. అలాగే ఎటువంటి రిస్క్ లేకుండా భారత్‌లోకి చొరబడాలంటే ఏజెంట్లకు 12 వేల నుంచి 15 వేలు ఏజెంట్లకు చెల్లించాల్సి ఉంటుందని పోలీసులు రేట్ కార్డు ఆధారంగా తెలుసుకున్నారు.బంగ్లాదేశ్ నుండి భారత్‌లోకి చొరబడిన బంగ్లాదేశీయులు ఇక్కడ తగిన ధృవపత్రాలు పొందేందుకు ఏజెంట్లకు తగిన మొత్తం చెల్లించాలి. ఆధార్ కార్డు కోసం రెండు వేల రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ఆధార్ కార్డును పొందిన తర్వాత చొరబాటుదారులు భారతదేశంలోని ఏ ప్రాంతానికైనా వెళ్లి ఉండవచ్చు. ఇలాంటి వారికి ఉద్యోగం కల్పించేందుకు కూడా ఏజెంట్ల ముఠా సహకరిస్తుందని పోలీసులు తమ విచారణలో కనుగొన్నారు. ఇది కూడా చదవండి: కుంభమేళాకు కొత్త వైరస్ ముప్పు.. అధికారులు అప్రమత్తం -
బంగ్లాదేశ్ కెప్టెన్ షాంటో రాజీనామా..
బంగ్లాదేశ్ క్రికెట్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. బంగ్లాదేశ్ టీ20 కెప్టెన్సీకి నజ్ముల్ హొస్సేన్ శాంటో రాజీనామా చేశాడు. ఈ విషయాన్ని బంగ్లాదేశ్ క్రికెట్ అధికారికంగా ధ్రువీకరించింది. కాగా దక్షిణాఫ్రికాతో స్వదేశంలో జరిగిన టెస్టు సిరీస్ తర్వాత అన్ని ఫార్మాట్ల కెప్టెన్సీ నుంచి షాంటో వైదొలగాలని నిర్ణయించుకున్నాడు.కానీ ఆ సమయంలో బీసీబీ అధ్యక్షుడు ఫరూక్ అహ్మద్ విదేశాల్లో ఉండడంతో షాంటో రాజీనామాపై ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. అయితే ఆ తర్వాత ఫరూక్ అహ్మద్‌తో చర్చలు జరిపిన అనంతరం షాంటో తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు. బీసీబీ చీఫ్ సూచన మెరకు కెప్టెన్‌గా కొనసాగేందుకు అతడు ఒప్పుకున్నాడు. ఈ క్రమంలో గత నవంబరలో యూఏఈ వేదికగా అఫ్గానిస్తాన్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో బంగ్లా కెప్టెన్‌గా వ్యవహరించిన షాంటో దురదృష్టవశాత్తూ గాయపడ్డాడు. దీంతో ఆ సిరీస్ మధ్యలోనే వైదొలిగిన నజ్ముల్ హొస్సేన్.. ఆ తర్వాత వెస్టిండీస్ పర్యటనకు దూరమయ్యాడు.షాంటో తన గాయం నుంచి కోలుకుంటున్నాడు. అతడు త్వరలోనే తిరిగి మైదానంలో అడుగుపెట్టనున్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పుడు నజ్ముల్ హొస్సేన్ శాంటో మరోసారి తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు. వర్క్‌లోడ్ కారణంగా టీ20 నుంచి కెప్టెన్సీ నుంచి అతడు వైదొలగాలని ఫిక్స్ అయ్యాడు."నజ్ముల్ హొస్సేన్ శాంటో తన తుది నిర్ణయాన్ని వెల్లడించాడు. బంగ్లా టీ20 కెప్టెన్సీ నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నాడు. అతడి రాజీనామాను మేము అంగీకరించాము. ప్రస్తుతం మా షెడ్యూల్ ఎటువంటి టీ20 సిరీస్‌లు లేవు. ఈ నేపథ్యంలో మా కొత్త కెప్టెన్ కోసం వెతకడం లేదు. షాంటో గాయం నుంచి త్వరగా కోలుకుంటే అతడే వన్డేలు, టెస్టుల్లో మా జట్టుకు నాయకత్వం వహిస్తాడు. ఈ విషయం ఇప్పటికే అతడితో చర్చించాము" అని బీసీబీ అధికారి ఒకరు పేర్కొన్నారు.చదవండి: IND vs AUS 5th Test: రోహిత్ శర్మపై వేటు.. భారత కెప్టెన్‌గా జస్ప్రీత్ బుమ్రా!? -
భారత్‌పై ‘బంగ్లా’ విషం.. ఈ అంశాలతో స్పష్టం
ఒకప్పుడు భారత్‌తో చెలిమిచేసిన బంగ్లాదేశ్ ఇప్పుడు విషం చిమ్ముతోంది. ఆ దేశంలో హిందువులపై తరచూ దాడులు జరగుతున్నా మౌనం వహిస్తోంది. అక్కడి నేతలు అనునిత్యం భారత్‌పై నిరంకుశ ప్రకటనలు చేస్తూనే ఉన్నారు. అయినా బంగ్లాదేశ్ అధ్యక్షుడు మహమ్మద్ యూనస్ ఏమీ మాట్లాడటంలేదు. పైగా బంగ్లాదేశ్ హోమ్ మంత్రి అక్కడి సైన్యాన్ని భారత్ ముందు గట్టిగా నిలబెట్టాలనే ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు యూనస్ ప్రభుత్వం మాజీ ప్రధాని షేక్ హసీనాను భారత్ నుంచి రప్పించే ప్రయత్నాలు ముమ్మరం చేసింది.షేక్ హసీనా అధికారానికి దూరమైన తర్వాత, బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం భారత్‌కు ఏమాత్రం ఇష్టంలేని పలు నిర్ణయాలు తీసుకుంటోంది. అయినప్పటికీ భారత్ ఆ దేశంతో స్నేహపూర్వకంగానే మెలుగుతోంది. బంగ్లాదేశ్‌కు చెందిన పలువురు నేతలు తమ వ్యాఖ్యలతో విషం చిమ్ముతున్నా, భారత్ ఇంకా మాటల యుద్దం ప్రారంభించలేదు. భారత్.. బంగ్లాదేశ్ విషయంలో ఎంతో సంయమనం పాటిస్తోంది.బంగ్లాదేశ్‌లో భారత్‌కు వ్యతిరేకంగా..1. హిందువులపై దాడిబంగ్లాదేశ్లో హిందువులపై తరచూ దాడులు జరుగుతున్నాయి. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నివేదిక ప్రకారం ఈ సంవత్సరంలో ఇప్పటివరకు బంగ్లాదేశ్‌లో హిందువులపై 2,200కి పైగా అఘాయిత్యాలకు సంబంధించిన కేసులు నమోదయ్యాయి. ఇది పాకిస్తాన్లో జరిగినదాని కంటే 10 రెట్లు అధికం.2. పాకిస్తాన్‌తో చెలిమిబంగ్లాదేశ్ నూతన అధ్యక్షుడు మహమ్మద్ యూనస్ తాజాగా పాకిస్తాన్‌తో చెలిమి కోరుకుంటున్నారు. పాక్ నేతలతో సంబంధాలు నెరపుతున్నారు. పాకిస్తాన్ నుండి షిప్ కంటైనర్లు తరచూ చిట్టగాంగ్ నౌకాశ్రయానికి చేరుకుంటున్నాయి. పాక్ సైన్యం బంగ్లాదేశ్ ఆర్మీకి శిక్షణ ఇవ్వబోతోంది.3. సార్క్ పునరుద్ధరణకు యత్నంసౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజినల్ కోఆపరేషన్ (సార్క్)పై దృష్టి సారించడంపై భారత్ సుముఖంగా లేదు. అయతే బంగ్లాదేశ్ ప్రభుత్వం దానిని పునరుద్ధరణకు ప్రయత్నాలు సాగిస్తోంది.4. దౌత్య సంబంధాలను విచ్ఛిన్నంబంగ్లాదేశ్ ప్రభుత్వం భారత్‌తో దౌత్య సంబంధాలను విచ్ఛిన్నం చేయాలనే ఉద్దేశ్యంలో ఉంది. ఈ నేపధ్యంలో బంగ్లాదేశ్ హైకమిషనర్ ప్రణయ్ వర్మను వెనక్కి పిలిపించింది. ఇలాగే మరో ఇద్దరు దౌత్యవేత్తలను కూడా వెనక్కి పిలిపించింది.5. సాధారణ సంబంధాలలోనూ..మన విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ బంగ్లాదేశ్‌ను సందర్శించినప్పుడు, యూనస్ లేదా బంగ్లాదేశ్ విదేశాంగ మంత్రిత్వ శాఖకు చెందిన సోషల్ మీడియా ఖాతాలలో ఇందుకు సంబంధించిన ఫొటో పోస్ట్ చేయలేదు. సాధారణ విధివిధానాలను కూడా బంగ్లాదేశ్ పాటించలేదు. ప్రధాని మోదీ బంగ్లా ప్రధాని యూనస్‌కు ఫోన్ చేసినప్పటికీ ఆయన చర్చల కోసం ఏ ప్రతినిధి బృందాన్నీ భారత్‌కు పంపలేదు. దీనిని చూస్తుంటే భారత్‌తో బంధాన్ని చెడగొట్టుకుంటోందని స్పష్టమవుతోంది.6. షేక్ హసీనా అప్పగింత షేక్ హసీనాను బంగ్లాదేశ్‌కు వెళ్లేందుకు భారత్ అంత తేలిగ్గా అనుమతించదని బంగ్లాదేశ్‌కు తెలుసు. అయినా భారత్ పరువు తీయాలనే ఉద్దేశంతో షేక్ హసీనాను రప్పించేందుకు ప్రయత్నిస్తోంది. భారత్‌తో సంబంధాలు చెడగొట్టేందుకే ఇలాంటి ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.ఇది కూడా కారణమేబంగ్లాదేశ్ ప్రజలు షేక్ హసీనాపై ఆగ్రహంతో ఉన్నారు. ఈ నేపధ్యంలో ఆమెకు ఆశ్రయం ఇచ్చిన భారత్‌పై మండిపడుతున్నారు. షేక్ హసీనాకు భారతదేశం మద్దతు ఇస్తున్నదని, అందుకే ఆమె నియంతగా మారిందని వారు ఆరోపిస్తున్నారు. ఇటువంటి సమయంలో ముహమ్మద్ యూనస్ ప్రభుత్వం అక్కడి ప్రజల కోపాన్ని చల్లార్చడానికి బదులుగా, రెచ్చగొట్టేటట్లు చేస్తున్నదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.బంగ్లాదేశ్ ఈ తీరులో ప్రవర్తిస్తున్నా భారత్.. బంగ్లా మాజీ ప్రధాని షేక్ హసీనాను దౌత్య ఆయుధంగా ఉపయోగించలేదు. ఆమెను అడ్డుపెట్టుకుని బంగ్లాదేశ్‌ను అస్థిరపరిచేందుకు ఎలాంటి ప్రణాళిక చేయలేదు. షేక్ హసీనాను మాజీ ప్రధానిగా గౌరవిస్తున్నామని, అందుకే కొత్త ప్రభుత్వంతో చర్చలు ప్రారంభించామని భారత్ స్పష్టం చేసింది. రాజకీయ నిపుణుల అభిప్రాయం ప్రకారం ముహమ్మద్ యూనస్ బంగ్లాదేశ్‌లో తన అధికారాన్ని కాపాడుకోవాలని అనుకుంటున్నారు. అందుకే బంగ్లాదేశ్ వ్యవహారాల్లో భారత్ జోక్యం చేసుకోకూడదని కోరుకుంటున్నారు.ఇది కూడా చదవండి: World Year Ender 2024: హద్దులు దాటిన విమర్శలు.. వివాదాల్లో రాజకీయ ప్రముఖులు -
అంత డబ్బు నేనెప్పుడూ చూడలేదు: షేక్ హసీనా కుమారుడు
ఢాకా: బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina)పై అక్రమార్జన ఆరోపణలు సంచలనంగా మారాయి. షేక్ హసీనా 5 బిలియన్ డాలర్ల అక్రమార్జనకు పాల్పడ్డారనే ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆరోపణలపై హసీనా కుమారుడు సాజీబ్ వాజెద్ స్పందించారు. తమ కుటుంబంపై బురద జల్లే ప్రయత్నం జరుగుతోందన్నారు.బంగ్లాదేశ్(Bangladesh) షేక్ హసీనాపై వచ్చిన అక్రమార్జనల ఆరోపణలు తాజాగా సాజీబ్ వాజెద్ స్పందించారు. ఈ క్రమంలో వాజెద్(Sajeeb Wazed) మాట్లాడుతూ..‘అంత డబ్బు మేము ఎన్నడూ చూడలేదు. రూప్పూర్ పవర్‌ప్లాంట్ ప్రాజెక్టులో షేక్ హసీనా 5 బిలియన్ డాలర్లు దోచుకున్నారని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. కావాలనే రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు. బోగస్ ఆరోపణలు చేస్తూ మా కుటుంబం బురదజల్లే ప్రయత్నం జరుగుతోంది. ప్రభుత్వ ప్రాజెక్టుల విషయంలో మా కుటుంబం ఎన్నడూ జోక్యం చేసుకోలేదు. ఈ ప్రాజెక్ట్‌లపై డబ్బు తీసుకోలేదు. 10 బిలియన్ డాలర్ల ప్రాజెక్టులో అంత మొత్తం తీసుకోవడం సాధ్యం కాదు. గత 30 ఏళ్లుగా నేను యూఎస్‌లో ఉన్నా.. మా ఆంటీ, ఇతర సోదరులు యూకేలో ఉంటున్నారు. అంత డబ్బు మా అకౌంట్లలో ఎన్నడూ చూడలేదు అంటూ వివరణ ఇచ్చారు.ఇదిలా ఉండగా.. షేక్ హసీనాపై అక్రమార్జన ఆరోపణలు వచ్చాయి. వీటిపై విచారణ చేపట్టాలని మహమ్మద్ యూనస్ నేతృత్వంలోని మధ్యంతర ప్రభుత్వం సంబంధిత శాఖకు ఆదేశాలు జారీ చేసినట్లు బంగ్లాదేశ్ మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి. బంగ్లాదేశ్ రాజధాని ఢాకాకు 160 కిలోమీటర్లు దూరంలో రష్యా ప్రభుత్వం పద్మ నది ఒడ్డున ఈశ్వర్ది జిల్లాలోని రూప్పూర్ వద్ద రూప్పూర్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ (Rooppur Nuclear Power Plant) పేరుతో రెండు అణు విద్యుత్ ప్లాంట్ నిర్మిస్తోంది. వాటిల్లో మొదటి అణు విద్యుత్ ప్లాంట్ కార్యకలాపాలు వచ్చే ఏడాదిలో ప్రారంభం కానున్నాయి. అయితే, ఈ అణు విద్యుత్ ఏర్పాటులో షేక్ హసీనా భారీ మొత్తంలో అవినీతికి పాల్పడ్డారని ప్రస్తుత బంగ్లాదేశ్ ప్రభుత్వ దర్యాప్తు సంస్థలు గుర్తించాయి. అనంతరం షేక్ హసీనాతో పాటు కుమారుడు సజీబ్ వాజెద్ జాయ్, ఆమె మేనకోడలు, యూకే ట్రెజరీ మంత్రి తులిప్ సిద్ధిక్‌లను కూడా ప్రశ్నించేలా బంగ్లా మధ్యంతర ప్రభుత్వం రంగంలోకి దిగినట్లు మీడియా కథనాలు హైలెట్ చేస్తున్నాయి.అయితే రూప్పూర్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ప్రాజెక్ట్ నిధుల్ని హసీనా, జాయ్, తులిప్‌లు మలేషియా బ్యాంకుకు 5 బిలియన్ డాలర్లను బదిలీ చేయడంపై స్థానిక హైకోర్టులో విచారణ కొనసాగుతోంది. తాజా విచారణలో భాగంగా నిధులు దుర్వినియోగం అవుతున్నా అవినీతి నిరోధక కమిషన్ ఎందుకు చూసీ చూడనట్లుగా వ్యవహరిస్తుందని ప్రశ్నించింది. ఈ పరిణామం తర్వాతనే షేక్ హసీనాతో పాటు ఆమె కుటుంబ సభ్యులను విచారణకు మహ్మద్ యూనిస్ ప్రభుత్వం రంగంలోకి దిగింది. -
హసీనా రూ. 41 వేల కోట్ల లంచం తీసుకున్నారు
ఢాకా: బంగ్లాదేశ్‌లోని ఏకైక అణు విద్యుత్ కర్మాగారం నిర్మాణంలో పదవీచ్యుత ప్రధాని షేక్ హసీనా రూ.41.46 వేల కోట్ల మేర లంచం తీసుకున్నారని ఆపద్ధర్మ ప్రభుత్వం ఆరోపించింది. దీనిపై అవినీతి నిరోధక విభాగం తాజాగా విచారణ చేపట్టినట్లు మీడియాలో కథనాలు వస్తున్నాయి. రూప్పూర్ అణు ప్లాంట్ డిజైన్, నిర్మాణ బాధ్యతలను రష్యా ప్రభుత్వ రంగ సంస్థ రోసటోమ్ తీసుకోగా, నిర్మాణ పనులను భారతీయ కంపెనీలు చేపట్టాయి.రూప్పూర్ పవర్ ప్రాజెక్ట్ నుంచి షేక్ హసీనా, ఆమె కుమారుడు జాయ్, బంధువు తులిప్ సిదిఖీలు మలేసియా బ్యాంకుకు చేసిన రూ.41.46 వేల కోట్ల బదిలీని అక్రమంగా ఎందుకు ప్రకటించలేదంటూ రెండు రోజుల క్రితం బంగ్లాదేశ్ హైకోర్టు దేశ యాంటీ కరప్షన్ కమిషన్(ఏసీసీ)ను ప్రశ్నించిన నేపథ్యంలోనే ఈ దర్యాప్తు చేపట్టినట్లు మీడియా తెలిపింది.నేషనల్ డెమోక్రాటిక్ మూవ్మెంట్(ఎన్డీఎం) చైర్మన్ బాబీ హజాజ్ అవినీతి జరిగిందంటూ మొదటిసారిగా ఆరోపించారు. రూప్పూర్ అణు ప్లాంట్ నిర్మాణంలో అవినీతి అంటూ వచి్చన ఆరోపణలను రష్యా ప్రభుత్వ సంస్థ రోసటోమ్ తీవ్రంగా ఖండించింది. షేక్ హసీనా, సోదరి రెహానాతోపాటు ప్రస్తుతం భారత్‌లో ఉండగా, ఆమె కుమారుడు జాయ్ అమెరికాలో ఉంటున్నారు. వీరి బంధువు తులిప్ సిద్దిఖీ బ్రిటన్ ఎంపీగా వ్యవహరిస్తున్నారు.బంగ్లాదేశ్‌లో అల్లర్లు, హింసాత్మక ఘటనలపైనా ఆపద్ధర్మ ప్రభుత్వం హసీనాతోపాటు ఆమె కేబినెట్ సభ్యులు, ఇతర ఉన్నతాధికారులపైనా జన హననం కేసులు నమోదయ్యాయి. ఆమెను అప్పగించాలంటూ రెండు రోజుల క్రితం బంగ్లాదేశ్‌లోని ఆపద్ధర్మ ప్రభుత్వం భారత్‌ను అధికారికంగా కోరడం తెలిసిందే. -
హసీనా అప్పగింత సాధ్యమేనా?
బంగ్లాదేశ్‌లో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడినప్పటినుంచీ మన దేశానికి తలెత్తుతున్న దౌత్య సమస్య లకు తాజాగా మరొకటి వచ్చిచేరింది. గత ఆగస్టు నుంచీ భారత్‌లో ఆశ్రయం పొందుతున్న తమ మాజీ ప్రధాని షేక్ హసీనాను అప్పగించాలని సోమవారం బంగ్లా విదేశాంగ శాఖ దౌత్య సందేశం పంపింది. హసీనా అవినీతి పాలనను వ్యతిరేకిస్తూ విద్యార్థుల నాయకత్వంలో జనాగ్రహం వెల్లువెత్తి ఆమె ఆ దేశం నుంచి నిష్క్రమించారు. నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మహమ్మద్ యూనస్ నాయకత్వంలో తాత్కాలిక ప్రభుత్వం వచ్చినప్పటినుంచీ మైనారిటీలకూ, హసీనా హయాంలో బాధ్యతలు నిర్వర్తించిన నేతలకూ, ఉన్నతాధికారులకూ గడ్డు పరిస్థితులు ఏర్పడ్డాయి. దాడులూ, దౌర్జన్యాలూ, నిర్బంధాలూ తప్పడం లేదు. ఆఖరికి న్యాయమూర్తుల్ని సైతం వెంటాడుతున్నారు. భయోత్పాతంలో ముంచెత్తుతున్నారు. చాలామంది అజ్ఞాతంలోకి పోయారు. దీన్నంతటినీ ఆపాలనీ, మైనారిటీలకు రక్షణ కల్పించాలనీ మన దేశం ఇప్పటికే బంగ్లా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. కానీ కక్షపూరిత చర్యలు ఎక్కడా తగ్గిన దాఖలా లేదు. పైగా భారత మీడియా ఉన్నవీ లేనివీ కల్పించి తప్పుడు ప్రచారం చేస్తున్నదని అక్కడి ప్రభుత్వం ఆరోపిస్తోంది. అంతేకాదు... దానికి సమాంతరంగా అంతా బాగానే ఉన్నట్టు చూపించే ప్రయత్నం చేస్తోంది. ‘న్యూయార్క్ టైమ్స్’లో వచ్చిన కథనమే ఇందుకు ఉదాహరణ. విద్యార్థి బృందాలు దేశాభివృద్ధికి, అవినీతి అంతానికి ప్రణాళికలు వేస్తున్నట్టు ఆ కథనం సారాంశం. మైనారిటీలు సురక్షితంగా ఉన్నట్టు ఆ వర్గాలతోనే చెప్పించారు. నోబెల్ శాంతి బహుమతి పొందిన యూనస్ పాలన తీరుతెన్నులు గమనిస్తే పరిస్థి తులు ఆయన నియంత్రణలో ఉన్నట్టు కనబడదు. మైనారిటీల సంగతలావుంచి అసలు ముస్లిం మహిళలకే ఇబ్బందులు తప్పడం లేదు. మత ఛాందసవాదులు రంగంలోకి దిగి బురఖా ధరించని బాలికలనూ, మహిళలనూ నడిరోడ్లపై పంచాయతీలు పెట్టి హింసిస్తున్న వీడియోలు సామాజిక మాధ్యమాల్లో దర్శనమిచ్చాయి. హసీనా ఏలుబడిలో అవినీతి పెరిగిందనటంలో సందేహం లేదు. పదవి కాపాడుకొనేందుకు ఎన్నికల ప్రక్రియను ఏమార్చారన్న ఆరోపణల్లో కూడా నిజం వుంది. కానీ దానికి విరుగుడు ఈ అరాచకమా?!ప్రభుత్వాలను కూలదోసిన సందర్భాల్లో పాలకులు పరారీ కావటం, వేరేచోట ఆశ్రయం పొందటం అసాధారణమేమీ కాదు. హసీనా ఢిల్లీకి ఆదరా బాదరాగా వచ్చినా ఇక్కడినుంచి లండన్ వెళ్లాలని ప్రయత్నించారు. కానీ బ్రిటన్ ఆమె వినతిని తోసిపుచ్చింది. బంగ్లాలో హఠాత్తుగా బయ ల్దేరిన ఉద్యమానికి అమెరికా ఆశీస్సులున్నాయని ఆరోపణలొచ్చిన నేపథ్యంలో బ్రిటన్ ఆమె వినతిని తిరస్కరించటంలో వింతేమీ లేదు. కానీ ఆమెను అప్పగించాలని కోరిన వెంటనే మన ప్రభుత్వం అందుకు అంగీకరించటం సాధ్యమేనా? చట్టబద్ధ పాలన ఆనవాళ్లు లేవు సరికదా... ఎడాపెడా కక్షపూరిత విధానాలు అమలవుతున్నప్పుడు కోరిన వెంటనే ఒక మాజీ అధినేతను అప్ప గిస్తారని బంగ్లా ఎలా అనుకుంది? ఉగ్రవాదుల ఆటకట్టించేందుకు వీలుగా రెండు దేశాలూ 2013లో నేరస్తుల అప్పగింత ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. తగిన సాక్ష్యాధారాలు అందజేశాకే నేరస్తుల్ని అప్పగించాలని ఉన్న నిబంధనను కాస్తా వారెంటు జారీ అయితే చాలు అప్పగించవచ్చని సవరిస్తూ 2016లో ఆ ఒప్పందాన్ని సరళం చేశారు. కానీ తనపై పెట్టిన కేసులు న్యాయసమ్మతమైనవి కాదని, అందువల్ల అప్పగింత వినతిని తిరస్కరించాలని హసీనా మన ప్రభుత్వాన్ని కోరుకోవచ్చు. రాజ కీయ కారణాలతో అప్పగించాలని కోరితే తిరస్కరించొచ్చని ఒప్పందంలోని నిబంధనలే చెబుతున్నాయి. సంక్లిష్టమైన ఈ ప్రక్రియంతా పూర్తికావటానికి సుదీర్ఘకాలం పడుతుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో హసీనా విషయంలో అక్కడి న్యాయవ్యవస్థ నిష్పక్షపాతంగా, స్వేచ్ఛగా వ్యవహరిస్తుందన్న విశ్వాసం తమకు లేదని మన ప్రభుత్వం చెప్పే అవకాశం కూడా ఉంది. ఒకవేళ మన దేశం అందుకు సంసిద్ధత చూపినా హసీనా మన కోర్టుల్ని ఆశ్రయించి ఉపశమనం పొందుతారు. బ్రిటన్‌తో మనకు నేరస్తుల అప్పగింత ఒప్పందం ఉన్నప్పటికీ రుణాలు తీసుకుని బ్యాంకులను వేలాది కోట్ల రూపాయల మేర మోసగించి పరారైన వ్యాపారవేత్త విజయ్ మాల్యా వంటివారిని రప్పించటం అసాధ్యమవుతున్నది. మన దేశంలో ఉగ్రవాద ఘటనలకు పాల్పడి పరారీలో ఉన్న నేరగాళ్లను పట్టి అప్పగించటానికి కొన్ని యూరప్ దేశాలు నిరాకరిస్తున్నాయి. మన న్యాయవ్యవస్థ, జైళ్లు ప్రామాణికంగా లేవన్న కారణాలు చూపుతున్నాయి. అసలు తన ప్రస్థానం ఏ విధంగా కొనసాగించదల్చుకున్నదో బంగ్లాదేశ్ నిర్ధారించుకోవాలి. ఆ దేశ ఆవిర్భావానికి మూలకారణమైన ‘బెంగాలీ భావన’కు తూట్లు పొడిచే ప్రయత్నం జరుగుతోంది. బంగ్లా విముక్తిని తాము గుర్తించబోమని చెప్పే ఘనులు తయారవుతున్నారు. అడుగడుగునా మత ఛాందసుల ప్రాబల్యం కొట్టొచ్చినట్టు కనబడుతోంది. మన దేశంతో సంబంధాల పునరుద్ధరణకు నిర్మాణాత్మకమైన చర్యలు తీసుకొనేందుకు బంగ్లా ఇంతవరకూ సిద్ధపడలేదు. పైగా పాకిస్తాన్‌తో అంటకాగేందుకు ఉత్సాహపడుతోంది. 53 యేళ్ల క్రితం ఒక దేశంగా ఆవిర్భవించటానికి ముందు పాక్ సైనిక పాలకులు తమను ఎంత దారుణంగా అణచేశారో ఈ తరం మరిచిపోయి ఉండొచ్చు. 30 లక్షలమందికి పైగా ప్రజల బలిదానాలతో ఏర్పడిన దేశం కళ్లముందు కుప్పకూలుతుంటే నిశ్చేష్టులై ఉండిపోవటం విషాదకరం. అత్యంత విషమ పరిస్థితుల్లో కూడా ఎంతో అప్రమత్తతతో, వివేకంతో వ్యవహరించిన శ్రీలంక పౌరులను ఆదర్శంగా తీసుకుంటేనే దేశానికి మెరుగైన భవిష్యత్తు సాధ్యమవుతుందని బంగ్లా ప్రజలు తెలుసుకోవాలి. -
షేక్ హసీనాపై రూ. 500 కోట్ల అవినీతి ఆరోపణలు
ఢాకా : బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా (Sheikh Hasina) 5 బిలియన్ డాలర్ల అక్రమార్జనకు పాల్పడ్డారనే ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. వీటిపై విచారణ చేపట్టాలని మహమ్మద్ యూనస్ నేతృత్వంలోని మధ్యంతర ప్రభుత్వం సంబంధిత శాఖకు ఆదేశాలు జారీ చేసినట్లు బంగ్లాదేశ్ మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి.బంగ్లాదేశ్ రాజధాని ఢాకాకు 160 కిలోమీటర్లు దూరంలో రష్యా ప్రభుత్వం పద్మ నది ఒడ్డున ఈశ్వర్ది జిల్లాలోని రూప్పూర్ వద్ద రూప్పూర్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ (Rooppur Nuclear Power Plant) పేరుతో రెండు అణు విద్యుత్ ప్లాంట్ నిర్మిస్తోంది. వాటిల్లో మొదటి అణు విద్యుత్ ప్లాంట్ కార్యకలాపాలు వచ్చే ఏడాదిలో ప్రారంభం కానున్నాయి. అయితే, ఈ అణు విద్యుత్ ఏర్పాటులో షేక్ హసీనా భారీ మొత్తంలో అవినీతికి పాల్పడ్డారని ప్రస్తుత బంగ్లాదేశ్ ప్రభుత్వ దర్యాప్తు సంస్థలు గుర్తించాయి.అనంతరం షేక్ హసీనాతో పాటు కుమారుడు సజీబ్ వాజెద్ జాయ్, ఆమె మేనకోడలు, యూకే ట్రెజరీ మంత్రి తులిప్ సిద్ధిక్‌లను కూడా ప్రశ్నించేలా బంగ్లా మధ్యంతర ప్రభుత్వం రంగంలోకి దిగినట్లు మీడియా కథనాలు హైలెట్ చేస్తున్నాయి.అయితే రూప్పూర్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ప్రాజెక్ట్ నిధుల్ని హసీనా, జాయ్, తులిప్‌లు మలేషియా బ్యాంకుకు 5 బిలియన్ డాలర్లను బదిలీ చేయడంపై స్థానిక హైకోర్టులో విచారణ కొనసాగుతోంది. తాజా,విచారణలో భాగంగా నిధులు దుర్వినియోగం అవుతున్నా అవినీతి నిరోధక కమిషన్ (anti-corruption commission) ఎందుకు చూసీ చూడనట్లుగా వ్యవహరిస్తుందని ప్రశ్నించింది. ఈ పరిణామం తర్వాతనే షేక్ హసీనాతో పాటు ఆమె కుటుంబ సభ్యులను విచారణకు మహ్మద్ యూనిస్ ప్రభుత్వం రంగంలోకి దిగింది. ఏసీసీ నివేదిక ప్రకారం.. రూప్పూర్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ప్రాజెక్టులో అవినీతి ఆరోపణలను నేషనల్ డెమోక్రటిక్ మూవ్మెంట్ (ఎన్‌డిఎం) చైర్మన్ బాబీ హజ్జాజ్ వెలుగులోకి తెచ్చారు. -
‘షేక్ హసీనాను మాకు అప్పగించండి’
ఢాకా : మాజీ ప్రధాని షేక్ హసీనాను తమకు అప్పగించాలని మహమ్మద్ యూనస్ నేృత్వంలోని బంగ్లాదేశ్ మధ్యంతర ప్రభుత్వం భారత్‌కు లేఖ రాసింది. దీంతో ఇప్పటికే ఉన్న ఒప్పందం ప్రకారం షేక్ హసీనాను కేంద్రం బంగ్లాదేశ్‌కు అప్పగిస్తుందా? లేదా అనేది చర్చాంశనీయంగా మారింది. బంగ్లాదేశ్‌లో రిజర్వేషన్లకు వ్యతిరేకంగా జరిగిన ఆందోళనలు హింసాత్మకంగా షేక్ హసీనా ప్రధాని పీఠం నుంచి దిగిపోవడమే గాక.. దేశాన్ని వీడారు. ఆగస్టు 5 నుండి భారత్‌లోనే నివాసం ఉంటుంన్నారు. ఈ తరుణంలో హసీనాను తమకు అప్పగించాలని మహమ్మద్ యూనస్ నేృత్వంలోని బంగ్లాదేశ్ మధ్యంతర ప్రభుత్వం భారత్‌కు లేఖ రాసింది. Bangladesh's foreign adviser #TouhidHossain says #Dhaka has sent #DiplomaticNote to New Delhi for extradition of deposed PM @SheikhHasinaW. @MEAIndia pic.twitter.com/30mm1EvVra— Upendrra Rai (@UpendrraRai) December 23, 2024 ఆ దేశానికి చెందిన ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రిబ్యునల్ మాజీ ప్రధాని షేక్ హసీనాతో పాటు పలువురు మాజీ కేబినెట్ మంత్రులు, సలహాదారులుపై మారణ హోమం కేసులు నమోదు చేసింది. వారిని అదుపులోకి తీసుకుని విచారణ చేపడుతుంది. తాజాగా, షేక్ హసీనాను విచారించేందుకు సిద్ధమైంది. భారత్‌లో ఉన్న ఆమెను తిరిగి స్వదేశానికి రప్పించే దిశాగా ప్రయత్నాలు ముమ్మరం చేసింది.ఇందులో భాగంగా ‘షేక్ హసీనాను తమకు అప్పగించాలని భారత్‌కు లేఖ రాసినట్లు బంగ్లాదేశ్ విదేశాంగ మంత్రి తౌహిద్ హుస్సేన్ మీడియాతో మాట్లాడారు. తౌహిద్ హుస్సేన్ ప్రకటనకు ముందు.. మద్యంతర ప్రభుత్వ సలహాదారు జహంగీర్ అలం మాట్లాడుతూ.. హసీనాను ఇక్కడికి(బంగ్లాదేశ్) తెచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని, భారత్ విదేశాంగ మంత్రిత్వ శాఖకు తన కార్యాలయం లేఖ పంపిందని అన్నారు. ప్రస్తుతం, ప్రక్రియ కొనసాగుతుందని సూచించారు. అంతేకాదు బంగ్లాదేశ్,భారత్‌ల మధ్య అప్పగింత ఒప్పందం ఇప్పటికే ఉందని, ఆ ఒప్పందం ప్రకారం హసీనాను తిరిగి బంగ్లాదేశ్‌కు తీసుకురావచ్చని ఆలం చెప్పారు. మహ్మద్ యూనిస్ హెచ్చరికలు బంగ్లాదేశ్ ప్రధానమంత్రి పదవికి షేక్ హసీనా రాజీనామా చేసి దేశం వీడడంతో అక్కడ మధ్యంతర ప్రభుత్వం ఏర్పాటైంది. అయితే, ఈ తాత్కాలిక ప్రభుత్వానికి నోబెల్ గ్రహీత మహమ్మద్ యూనస్ నేతృత్వం వహిస్తున్నారు. తన నేతృత్వంలో ఏర్పాటైన మధ్యంతర ప్రభుత్వ పాలన 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా మహ్మద్ యూనిస్.. మాజీ ప్రధాని షేక్ హసీనా గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘జూలై-ఆగస్ట్‌లో జరిగిన ప్రతి హత్యకు మేము న్యాయం చేస్తాము. హత్యకు బాధ్యులైన వారిని విచారిస్తాం. వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. దేశం వీడి భారత్‌కి వెళ్లిన హసీనా తిరిగి ఇక్కడికి రావాల్సిందే. శిక్షను అనుభవించాల్సిందేనని హెచ్చరించారు. -
నేడు అండర్–19 మహిళల ఆసియాకప్ ఫైనల్ – బంగ్లాదేశ్‌తో భారత్ ఢీ
ఆసియాకప్ అండర్–19 మహిళల టి20 క్రికెట్ టోర్నమెంట్ ఫైనల్లో యువ భారత జట్టు బరిలోకి దిగనుంది. ఈ టోర్నీలో అజేయంగా నిలిచిన భారత జట్టు ఆదివారం కౌలాలంపూర్‌లో జరగనున్న తుది పోరులో బంగ్లాదేశ్‌తో అమీతుమీకి సిద్ధమైంది. నిక్కీ ప్రసాద్ సారథ్యంలోని భారత జట్టు ‘సూపర్ ఫోర్’ చివరి మ్యాచ్‌లో శ్రీలంకపై విజయంతో ఫైనల్‌కు అర్హత సాధించగా... మరోవైపు బంగ్లాదేశ్ ఈ టోర్నీ లో ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో నాలుగింట గెలిచి తుది పోరుకు చేరింది. అటు బౌలింగ్, ఇటు బ్యాటింగ్‌లో సమష్టిగా రాణిస్తున్న యువ భారత జట్టు... ఆఖరి సమరంలోనూ అదే జోరు కొనసాగించాలని భావిస్తోంది. ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) తొలిసారి నిర్వహిస్తున్న ఈ టోర్నీ కి మలేసియా ఆతిథ్యమిస్తోంది. జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న తెలంగాణ అమ్మాయి గొంగడి త్రిష ఫుల్ ఫామ్‌లో ఉండగా... కెపె్టన్ నిక్కీ ప్రసాద్, కమలిని, మిథిల, ఐశ్వరి కూడా మంచి టచ్‌లో ఉన్నారు. ఇక బౌలింగ్‌లో ఆయుషి శుక్లా, షబ్నమ్, పరుణిక, ధ్రుతి కీలకం కానున్నారు. -
బంగ్లాదేశ్ సోషల్‌మీడియా పోస్టుపై భారత్ ఆగ్రహం
న్యూఢిల్లీ:ఇటీవల భారత్-బంగ్లాదేశ్ సంబంధాలు చాలా వరకు దెబ్బతిన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేత మహమ్మద్ యూనస్ సన్నిహితుడు మహఫుజ్ ఆలం సోషల్ మీడియా వేదికగా ఇటీవల భారత్‌పై అక్కసు వెళ్లగక్కాడు. దీనిపై భారత ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది.‘బంగ్లాదేశ్ ప్రభుత్వం వద్ద మేం ఈ విషయాన్ని లేవనెత్తాం. ఆలం పోస్టును తర్వాత తొలగించారు. బహిరంగ వ్యాఖ్యలు చేసేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలి. బంగ్లా ప్రజలు, తాత్కాలిక ప్రభుత్వంతో సంబంధాలను పెంపొందించుకునేందుకు భారత్ ఆసక్తితో ఉన్నప్పటికీ ఇలాంటి చర్యలు నిరాశ కలిగిస్తున్నాయి’ అని భారత విదేశాంగశాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మీడియా సమావేశంలో వెల్లడించారు. భారత్‌లోని కొన్ని ప్రాంతాలను స్వాధీనం చేసుకోవాలంటూ ఆలం కొన్ని రోజుల క్రితం ఫేస్బుక్లో పోస్టు పెట్టి కొన్ని రోజుల తర్వాత తొలగించాడు.బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులు..2200 కేసులు కాగా, బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఏడాది అక్కడ హిందువులపై దాడులకు సంబంధించి ఏకంగా 2200 కేసులు నమోదయ్యాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. షేక్‌హసీనా ప్రధాని పదవి నుంచి దిగిపోయిన తర్వాత హిందువులపై దాడులు పెరిగిన విషయం తెలిసిందే. -
మెరిసిన త్రిష... భారత్ ఘనవిజయం
కౌలాలంపూర్: ఆసియా కప్ అండర్–19 మహిళల టి20 క్రికెట్ టోర్నమెంట్ ‘సూపర్ ఫోర్’ దశలో భారత్ శుభారంభం చేసింది. బంగ్లాదేశ్‌తో గురువారం జరిగిన మ్యాచ్‌లో భారత జట్టు ఎనిమిది వికెట్ల తేడాతో గెలిచింది. 81 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టు 12.1 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 86 పరుగులు సాధించి నెగ్గింది. భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న తెలంగాణ అమ్మాయి గొంగడి త్రిష (46 బంతుల్లో 58 నాటౌట్; 10 ఫోర్లు) అజేయ అర్ధసెంచరీతో అదరగొట్టింది. కమలిని (0), సనిక చాల్కె (1) వెంటవెంటనే అవుటైనా కెపె్టన్ నిక్కీ ప్రసాద్ (14 బంతుల్లో 22 నాటౌట్; 1 ఫోర్, 2 సిక్స్‌లు)తో కలిసి ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ త్రిష టీమిండియాను విజయతీరాలకు చేర్చింది. అంతకుముందు బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 80 పరుగులు సాధించింది. భారత బౌలర్లలో ఆయుషి శుక్లా 3 వికెట్లు, సోనమ్ యాదవ్ 2 వికెట్లు పడగొట్టారు. నేడు జరిగే మరో ‘సూపర్ ఫోర్’ మ్యాచ్‌లో శ్రీలంకతో భారత్ తలపడుతుంది -
విండీస్‌ను వారి సొంతగడ్డపై చిత్తు చేసిన బంగ్లాదేశ్
వెస్టిండీస్‌తో జరుగుతున్న మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను బంగ్లాదేశ్ మరో మ్యాచ్ మిగిలుండగానే 2-0 తేడాతో కైవసం చేసుకుంది. భారతకాలమానం ప్రకారం ఇవాళ (డిసెంబర్ 18) ఉదయం జరిగిన రెండో టీ20లో బంగ్లాదేశ్ 27 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 129 పరుగులు చేసింది. బంగ్లా ఇన్నింగ్స్‌లో షమీమ్ హొస్సేన్ (17 బంతుల్లో 35 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. షమీమ్ మెరుపు ఇన్నింగ్స్ ఆడకపోయుంటే బంగ్లాదేశ్ ఈ మాత్రం స్కోరైనా చేయలేకపోయేది. మెహిది హసన్ మిరాజ్ (26), జాకిర్ అలీ (21), మెహిది హసన్ (11), సౌమ్య సర్కార్ (11) రెండంకెల స్కోర్లు చేశారు. విండీస్ బౌలర్లలో మోటీ 2, అకీల్ హొసేన్, రోస్టన్ ఛేజ్, అల్జరీ జోసఫ్, ఓబెద్ మెక్కాయ్ తలో వికెట్ పడగొట్టారు.130 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన వెస్టిండీస్.. బంగ్లా బౌలర్లు మూకుమ్మడిగా రాణించడంతో 18.3 ఓవర్లలో 102 పరుగులకు ఆలౌటైంది. తస్కిన్ అహ్మద్ 3, మెహిది హసన్, తంజిమ్ హసన్ సకీబ్, రిషద్ హొసేన్ తలో 2, హసన్ మహమూద్ ఓ వికెట్ తీసి విండీస్‌ను దెబ్బకొట్టారు. బంగ్లా బౌలర్లు స్వల్ప లక్ష్యాన్ని విజయవంతంగా కాపాడుకుని ఔరా అనిపించారు. విండీస్ ఇన్నింగ్స్‌లో రోస్టన్ ఛేజ్ (32), అకీల్ హొసేన్ (31), జాన్సన్ ఛార్లెస్ (14) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. బంగ్లాదేశ్‌కు వెస్టిండీస్‌పై ఆరేళ్ల తర్వాత తొలి సిరీస్ విజయం ఇది. బంగ్లాదేశ్ చివరిసారి 2018లో వెస్టిండీస్‌పై టీ20 సిరీస్ విక్టరీ సాధించింది. బంగ్లాదేశ్.. వెస్టిండీస్‌ను వారి సొంతగడ్డపై చిత్తు చేయడం విశేషం. ఇరు జట్ల మధ్య నామమాత్రపు మూడో టీ20 డిసెంబర్ 19న జరుగనుంది. -
వికటించిన స్నేహం చిగురించేనా?
అంతర్జాతీయ పరిణామాలెప్పుడూ స్థిరంగా ఉండవు. నిన్న మొన్నటి వరకు భారత్ నుంచి పెద్ద ఎత్తున సహాయ సహకారాలు పొందిన పొరుగుదేశంబంగ్లాదేశ్లో మారిన అంతర్గత రాజకీయ పరిస్థితులు భారత్‌కు ఆందోళనకరంగా మారాయి. అక్కడి హిందువులపై దాడులు జరగడం వికటించిన స్నేహానికి నిదర్శనం. పాకిస్తాన్ నుంచి తమ దేశానికి రావడానికి ఉన్న వీసా నిబంధనను కూడా బంగ్లాదేశ్ సడలించింది. దేశ ద్వారాలను బార్లా తెర వడం వల్ల ఉగ్ర మూకలు స్థిర నివాసం ఏర్పరచుకొనే ప్రమాదం ఉంది.భద్రతాపరంగా ఇది కూడా భారత్‌కు ఆందోళనకరమే. స్వతంత్ర దేశంగాబంగ్లాదేశ్ ఏర్పడటంలో భారత్ పోషించిన పాత్ర చరిత్రాత్మకం. అలాంటి బంధమున్న దేశంతో తగిన విధంగా స్పందించి పరిస్థితులను చక్కబెట్టాలి.బంగ్లాదేశ్‌లో ఆగస్ట్ మాసంలో జరిగిన రాజకీయ విపరిణామాల కారణంగా ఆ దేశ ప్రధాని షేక్ హసీనా కట్టుబట్టలతో దేశం నుంచి పారిపోయి భారత్‌లో తలదాచుకొంటున్నారు. అప్పటినుంచీ భారత్, బంగ్లాదేశ్ మధ్య దాదాపు 5 దశాబ్దాల పాటు కొనసాగుతూ వచ్చిన స్నేహ సంబంధాలు ఒక్కసారిగా దెబ్బతిన్నట్లయ్యింది. 1971లో పాకిస్తాన్‌తో యుద్ధం చేసి, స్థానిక ప్రజల ఆకాంక్షల మేరకు ఓ స్వతంత్ర దేశంగా బంగ్లాదేశ్ ఏర్పడటంలో భారత్ పోషించిన పాత్ర చారిత్రాత్మకం.అందుకు భారత్ ఎంతో త్యాగం చేసింది. ఆ తర్వాత కూడా బంగ్లాదేశ్ పునర్ నిర్మాణంలో అన్ని రకాల సహాయ సహకారాలు అందించింది. తమకు స్వేచ్ఛను కల్పించినందుకు బంగ్లాదేశీయులకు సైతం భారత్ పట్ల గౌరవాభిమానాలు నిన్నమొన్నటి వరకు అవిచ్ఛిన్నంగా కొన సాగాయి.మారిన పరిస్థితులుఇరు దేశాల మధ్య చక్కటి స్నేహ సంబంధాలు కొనసాగుతున్న తరుణంలో... బంగ్లాదేశ్‌లో చోటు చేసుకున్న పరిణామాలతో పరిస్థి తులు తలకిందులయ్యాయి. 17 కోట్ల జనాభా కలిగిన బంగ్లాదేశ్‌లో దాదాపు కోటిన్నరకు పైగా హిందువులు ఉన్నారు. బౌద్ధులు, క్రైస్తవులు కూడా చెప్పుకోదగ్గ సంఖ్యలో ఉన్నారు. గత 4 నెలలుగా బంగ్లా దేశ్‌లోని హిందూ ఆలయాలు, హిందువులను లక్ష్యంగా చేసుకొని దాడులు జరుగుతున్నాయి. ఆర్థిక రంగంలో నోబెల్ బహుమతి గ్రహీత మహమ్మద్ యూనస్ నేతృత్వంలో ఏర్పాటైన మధ్యంతర ప్రభుత్వం ఈ దాడులను నిరోధించకపోవడం తీవ్ర ఆవేదన కలిగిస్తోంది. బంగ్లాదేశ్‌లో చోటు చేసుకొంటున్న పరిణామాలపై విదేశీ (ఇండియా) మీడియా వక్రభాష్యం చెబుతోందంటూ యూనస్ ఈ హింసను సమర్థించుకోవటానికి తాపత్రయపడుతున్నారు. పొరుగునున్న బంగ్లాదేశ్ ఒక్కసారిగా ప్రత్యర్థిగా మారడాన్ని భారత్ నిశితంగానే పరిశీలిస్తోంది. పార్లమెంట్లో అధికార బీజేపీ సభ్యులు ఈ అంశంపై తమ ఆందోళనను వ్యక్తం చేశారు. శ్రీకృష్ణుడి జన్మస్థానమైన మ«థురకు ప్రాతినిధ్యం వహిస్తున్న సినీ నటి హేమ మాలిని హిందువులపై జరుగుతున్న దాడులను ఎత్తిచూపడంతో పాటు, సాధువు చిన్మయి కృష్ణదాస్‌ను అరెస్ట్ చేయడంపై ఆందోళన వ్యక్తం చేశారు.ఆశ్చర్యకరంగా, ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న దాడులతో తమకు సంబంధమే లేనట్టు వ్యవహరిస్తోంది. బంగ్లాదేశ్‌తో 2,216 కిలోమీటర్ల సరిహద్దును పంచుకొంటున్న పశ్చిమ బెంగాల్‌కు ముఖ్యమంత్రిగా ఉన్న మమతా బెనర్జీ సైతం... ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించడం లేదు. ఆ ద్వేషమే భారత్ వ్యతిరేకతకు కారణంప్రధాన ప్రతిపక్షాలన్నీ బహిష్కరించిన జాతీయ ఎన్నికలలో ఈ ఏడాది గెలిచిన షేక్ హసీనా మూడవ పర్యాయం ప్రధానిగా అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత కొన్ని వర్గాల ప్రజల్లో ఆగ్రహావేశాలు కట్టలు తెంచుకొన్నాయి. ప్రజాభిప్రాయాన్ని ప్రతిఫలించని ఆ ఎన్నికలలో హసీనా గెలుపును మెజారిటీ ప్రజలు జీర్ణించుకోలేకపోయారు. అధికారాన్ని అడ్డం పెట్టుకొని హసీనా, ఆమె ప్రాతినిధ్యం వహిస్తున్న అవామీ లీగ్ పార్టీ ప్రముఖులు పెద్ద ఎత్తున అధికార దుర్విని యోగానికీ, అవినీతికీ పాల్పడ్డారన్న క్రోధంతో ప్రజలు ఉన్నారు. పైగా, దేశంలో నిరుద్యోగం పెరుగుతుండగా స్వాతంత్య్ర సమర యోధుల కుటుంబాలకు చెందిన వారికి ఉద్యోగాలలో రిజర్వేషన్లుఅందించాలన్న హసీనా ప్రభుత్వ నిర్ణయంపై ప్రజల కోపం అగ్గి మీద గుగ్గిలం చల్లినట్లయింది. ఒక దశలో దేశాభివృద్ధి రేటులో ఆసియాలోనే అగ్రగామిగా ఉన్న తమ దేశం క్రమంగా హసీనా పరివారం అవినీతి, అసమర్థత కారణంగా పాతాళానికి పడిపోయిందన్న ఆగ్రహమూ ఏర్పడింది. ఈ అంశాలు బంగ్లా ‘యువత’ను వీధుల్లోకొచ్చి ఉద్యమించేందుకు పురిగొల్పాయి. సమస్యల్ని సామరస్యంగా పరిష్కరించకుండా ఉద్యమకారుల్ని అణచివేయడానికి ప్రభుత్వం సిద్ధపడటంతో పరిస్థితి చేయిదాటింది. యువత తిరుగుబాటు చేసి ప్రధాని నివాసాన్ని ముట్టడించి పాల్పడిన విధ్వంసాన్ని యావత్ ప్రపంచం చూసి నివ్వెరపోయింది. సకాలంలో షేక్ హసీనా, ఆమె సోదరి ఇద్దరూ తప్పించుకొని భారత్ చేరుకోవడంతో వారు ప్రాణాలతో బయటపడ్డారు. షేక్ హసీనాకు ఆశ్రయం ఇచ్చిన భారత్‌ను బంగ్లాదేశీయులు తప్పుపడుతున్నారు. భారత్‌పై వారు గుడ్డి వ్యతిరేకత ప్రదర్శించడానికి అదే కారణమని చెప్పాలి. ఆ వ్యతిరేకత కాస్తా హిందువుల పట్ల ద్వేష భావంగా రూపాంతరంచెందింది. దాంతో ఉద్యమకారులు హసీనా నివాసంపై దాడి చేశాక దేశంలోని హిందువులపైన, హిందువుల ప్రార్థనా మందిరాలపైన విరుచుకుపడి విధ్వంసం సృష్టించారు. దేశం విడిచిన షేక్ హసీనాకు అమెరికా, బ్రిటన్, జర్మనీ వంటి దేశాలు ఆశ్రయం ఇవ్వడానికి నిరాకరించగా, భారత్ మాత్రం సాదరంగా ఆహ్వానించి ఆమెకు అన్ని సౌకర్యాలు కల్పిస్తోంది. హసీనా ప్రభుత్వం స్థానంలో మహమ్మద్ యూనస్ నేతృత్వంలో ఏర్పడిన ప్రభుత్వం ఎంతవరకూ వెళ్లిందంటే బంగ్లాదేశ్ జాతి పితగా పిలిచే షేక్ హసీనా తండ్రి ముజీబుర్ రహమాన్ చిహ్నాలను తొలగిస్తోంది. కరెన్సీ నోట్లపై ఆయన బొమ్మ ఉన్నందున, పాత కరెన్సీని తొలగించి దాని స్థానంలో ఆయన బొమ్మ లేకుండా కొత్త కరెన్సీని మరో 6 నెలల్లో చలామణీలోకి తెస్తోంది. కొత్తగా ముద్రించే కరెన్సీ నోట్ల మీద హసీనాపై చేపట్టిన తిరుగుబాటు చిత్రాలను ముద్రించనున్నట్లుబంగ్లా సెంట్రల్ బ్యాంకు ప్రకటించడం సంచలనం కలిగించింది.పాక్‌తో సన్నిహితంగా బంగ్లా పాకిస్తాన్ నుంచి తమ దేశానికి రావడానికి ఉన్న వీసా నిబంధనను బంగ్లాదేశ్ సడలించినట్లుగా వార్తలొచ్చాయి. ఇదొక అనూహ్య పరిణామం. ఒకవిధంగా, బంగ్లాదేశ్ తన కన్నును తానే పొడుచు కొన్నట్లు భావించాలి. పాకిస్తాన్‌తో స్నేహ సంబంధాలను నెరపు కోవడాన్ని ఎవ్వరూ తప్పుపట్టరు. కానీ, తమ దేశ ద్వారాలను బార్లా తెరవడం వల్ల ఉగ్రవాద మూకలు దేశంలోకి ప్రవేశించి స్థిర నివాసం ఏర్పరచుకొనే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలోనే బంగ్లాదేశ్, భారత సరిహద్దుల వెంబడి 3 బెటాలియన్ల రక్షణ దళాలను (బీఎస్ఎఫ్) మన ప్రభుత్వం ఏర్పాటు చేసింది.నిజానికి గత నాలుగైదు నెలలుగా భారత్ దౌత్యపరంగా అనేక దేశాలకు మరింత చేరువైంది. చైనా అండ చూసుకొని తోక జాడించాలనుకొన్న ‘మాల్దీవులు’ మళ్లీ తప్పు సరిదిద్దుకొని భారత్‌కు స్నేహహస్తం చాచింది. ప్రధాని నరేంద్ర మోదీ అక్టోబర్ మాసంలో రష్యా, ఆ తర్వాత నైజీరియా, బ్రెజిల్, గయానా దేశాలలో పర్యటించి ఆ దేశాలతో గల ద్వైపాక్షిక సంబంధాలను మరింత పటిష్ఠం చేశారు. మరోపక్క రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా ఆఫ్రికా దేశాలలో పర్యటించడం వల్ల ఆ దేశాలతో భారత్ వ్యాపార, వాణిజ్య సంబంధాలు విస్తరించాయన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి. నేడు ప్రపంచంలోనే భారత్ ఓ బలీయమైన దేశంగా, రష్యా–ఉక్రెయిన్ యుద్ధం, పాలస్తీనా–ఇజ్రాయెల్ యుద్ధాలను నిలువరించగలిగిన సామర్థ్యం గల దేశంగా పరిగణించబడుతున్న తరుణంలో చిరకాల మిత్రదేశం బంగ్లాదేశ్‌తో వైరం ఏర్పడటం ఆందోళనకరమే. 142 కోట్ల ప్రజల భద్రతకే కాదు, ప్రపంచ వ్యాప్తంగా 200 దేశాల్లో ఉన్న భారతీయుల భద్రతకు పూచీ పడాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదే. బంగ్లాదేశ్‌లో ఉన్న లక్షలాది మంది హిందువుల మనుగడ ప్రశ్నార్థకం కాకముందే భారత ప్రభుత్వం తగు విధంగా స్పందించి వారి పూర్తి రక్షణకు భరోసా కల్పించాల్సిన అవసరం ఉంది.- వ్యాసకర్త కేంద్ర మాజీ మంత్రి, శాసనమండలి సభ్యులు- డా‘‘ ఉమ్మారెడ్డివెంకటేశ్వర్లు -
షకీబ్ అల్ హసన్‌పై నిషేధం
బంగ్లాదేశ్ వెటరన్ ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్‌పై ఆ దేశ క్రికెట్ బోర్డు (బీసీబీ) నిషేధం విధించింది. షకీబ్ దేశవాళీ క్రికెట్‌తో పాటు అంతర్జాతీయ పోటీలలో బౌలింగ్ చేయకూడదని బీసీబీ ప్రకటించింది. షకీబ్ బౌలింగ్ యాక్షన్ సరిగ్గా లేదని ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) నిషేధం విధించిన విషయం తెలిసిందే. ఈసీబీ నిర్ణయాన్ని సమర్ధిస్తూ ఐసీసీ కూడా షకీబ్‌పై బ్యాన్ విధించింది. షకీబ్ బౌలింగ్ శైలిని త్వరలో ఐసీసీ టెస్టింగ్ సెంటర్లో పరిశీలించబోతున్నారు. ఈ పరీక్షలో షకీబ్ పాస్ అయితే అతనిపై నిషేధం ఎత్తి వేస్తారు.కాగా, షకీబ్ ఈ ఏడాది కౌంటీ ఛాంపియన్షిప్ పోటీల్లో సర్రే తరఫున బరిలోకి దిగి సోమర్సెట్ కౌంటీపై 9 వికెట్లు పడగొట్టాడు. ఈ మ్యాచ్ ముగిసిన అనంతరం షకీబ్ బౌలింగ్ శైలిపై అంపైర్లు రిఫరీకి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు నేపథ్యంలో షకీబ్ బౌలింగ్ శైలిపై ఈ నెల ప్రారంభంలో పరీక్ష నిర్వహించారు. ఇందులో షకీబ్ బౌలింగ్ శైలి నిబంధనలకు విరుద్ధంగా ఉందని తేలింది. షకీబ్ తన మోచేతిని 15 డిగ్రీల కంటే ఎక్కువగా వంచుతున్నాడని ఈసీబీ ప్రకటించింది. -
Vijay Diwas: బంగ్లాదేశ్ ఆవిర్భవించిన రోజు.. భారత్‌కు ఎందుకు ప్రత్యేకం?
దేశమంతా ఈరోజు (డిసెంబరు 16) విజయ దినోత్సవాన్ని జరుపుకుంటోంది. 1971లో ఇదే రోజున భారత్ యుద్ధంలో పాక్ సైన్యాన్ని మట్టికరిపించింది. అలాగే తూర్పు పాకిస్తాన్‌ను అణచివేత నుండి విముక్తి చేసింది. ఈ రోజు భారతదేశంతో పాటు బంగ్లాదేశ్‌కు కూడా ఎంతో ప్రత్యేకమైనది. పాక్‌పై యద్ధంలో గెలిచినందుకు గుర్తుగా భారత సాయుధ బలగాల త్యాగాలను ఈరోజు గుర్తుచేసుకుంటారు.నాటి ప్రధాని ఇందిరాగాంధీ చొరవతో..1971లో బంగ్లాదేశ్ స్వాతంత్య్ర యుద్ధంలో బెంగాలీ జాతీయవాద సమూహానికి భారత్ మద్దతుపలికింది. ఈ నేపధ్యంలో తూర్పు పాకిస్తాన్లో భారత్.. పాక్‌తో యుద్ధం చేసింది. అంతిమంగా ఈ యుద్ధంలో పాకిస్తాన్ ఓటమిని చవిచూసింది. 1970-71లలో పాకిస్తాన్ జనరల్ యాహ్యా ఖాన్ తన అణచివేత సైనిక పాలనతో తూర్పు పాకిస్తాన్‌లోని సామాన్యులను ఊచకోతకు గురిచేశారు. ఈ నేపధ్యంలో షేక్ ముజిబుర్ రెహమాన్ సామాన్యులను పోరాటం దిశగా ప్రేరేపించేందుకు ముక్తి బాహినీ సైన్యాన్ని ఏర్పాటు చేశాడు. అలాగే ఈ పోరాటానికి భారత్ నుంచి సహాయం కూడా కోరారు. నాటి భారత ప్రధాని ఇందిరాగాంధీ తూర్పు పాకిస్తాన్ ప్రజలను పాక్ అరాచకాల నుంచి రక్షించేందుకు భారత సైన్యాన్ని పాక్‌తో యుద్ధానికి అనుమతించారు.అతిపెద్ద సైనిక లొంగుబాటుభారత సైన్యం 1971, డిసెంబర్ 4న ఆపరేషన్ ట్రైడెంట్‌ను ప్రారంభించింది. ఈ యుద్ధంలో భారత సైన్యం పాకిస్తాన్ సైన్యానికి తగిన సమాధానం ఇచ్చింది. దీంతో 1971, డిసెంబర్ 16న బంగ్లాదేశ్ కొత్త దేశంగా ఆవిర్భవించింది. ఈ యుద్ధంలో భారత సైన్యం పాకిస్తాన్ ఆర్మీ కమాండర్ జనరల్ అమీర్ అబ్దుల్లా ఖాన్ నియాజీని లొంగిపోయేలా ఒత్తిడి చేయడంతో మరోమార్గంలేక అతను అందుకు తలొగ్గాడు. ఈ యుద్ధకాలంలో 93 వేలమంది పాకిస్తానీ సైనికులు లొంగిపోయారు. దీనిని రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత అతిపెద్ద సైనిక లొంగుబాటుగా చెబుతారు. ఇది కూడా చదవండి: Year Ender 2024: ఎప్పటికీ గుర్తుండే 10 రాజకీయ ఘటనలు -
WI Vs BAN: వెస్టిండీస్‌పై చారిత్రక విజయం సాధించిన బంగ్లాదేశ్
వెస్టిండీస్‌తో జరుగుతున్న మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు బంగ్లాదేశ్ శుభారంభం చేసింది. కింగ్స్టౌన్ వేదికగా ఇవాళ (డిసెంబర్ 16) జరిగిన తొలి టీ20లో బంగ్లాదేశ్ 7 పరుగుల తేడాతో విజయం సాధించింది. విండీస్ గడ్డపై టీ20ల్లో బంగ్లాదేశ్‌కు ఇది తొలి విజయం. తద్వారా ఈ మ్యాచ్‌కు చారిత్రక గుర్తింపు దక్కింది.ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది. సౌమ్య సర్కార్ (43), జాకెర్ అలీ (27), మెహిది హసన్ (26 నాటౌట్), షమీమ్ హొసేన్ (27) రెండంకెల స్కోర్లు చేశారు. విండీస్ బౌలర్లలో అకీల్ హొసేన్, ఓబెద్ మెక్కాయ్ తలో రెండు వికెట్లు తీయగా.. రోస్టన్ ఛేజ్, రొమారియో షెపర్డ్ చెరో వికెట్ పడగొట్టారు.148 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన వెస్టిండీస్ 19.5 ఓవర్లలో 140 పరుగులకు ఆలౌటైంది. మెహిది హసన్ 4 వికెట్లు తీసి విండీస్‌ను దెబ్బకొట్టాడు. హసన్ మహహూద్, తస్కిన్ అహ్మద్ తలో రెండు వికెట్లు పడగొట్టగా.. తంజిమ్ హసన్, రిషద్ హొసేన్ చెరో వికెట్ దక్కించుకున్నారు. రోవ్‌మన్ పావెల్ (60) విండీస్‌ను గెలిపించేందుకు చివరి వరకు ప్రయత్నం చేశాడు. విండీస్ ఇన్నింగ్స్‌లో రోవ్‌మన్ పావెల్‌తో పాటు రొమారియో షెపర్డ్ (22), జాన్సన్ ఛార్లెస్ (20) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. బంగ్లాదేశ్ వికెట్‌కీపర్ లిట్టన్ దాస్ ఐదుగురు విండీస్ బ్యాటర్లను ఔట్ చేయడంలో భాగమయ్యాడు. ఇరు జట్ల మధ్య రెండో టీ20 డిసెంబర్ 17న జరుగనుంది.కాగా, టీ20 సిరీస్‌కు ముందు జరిగిన మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను ఆతిథ్య వెస్టిండీస్ 3-0 తేడాతో క్లీన్‌స్వీప్ చేసింది. అంతకుముందు జరిగిన రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో ఇరు జట్లు చెరో మ్యాచ్ గెలిచాయి. -
షేక్ హసీనాకు బిగుస్తున్న ఉచ్చు.. మరో షాకిచ్చిన బంగ్లా సర్కార్
ఢాకా: బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాను మరో బిగ్ షాక్ తగిలింది. బంగ్లాలోని యూనస్ ప్రభుత్వం హసీనా టార్గెట్‌గా కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఇందులో భాగంగానే హాసీనా హయాంలో జరిగిన కొన్ని ఘటనలపై విచారణ జరుపుతోంది. వీటిపై ఐదుగురు సభ్యుల కమిషన్‌ను సైతం ఏర్పాటు చేసింది. తాజాగా కమిషన్ రిపోర్టులో సంచలన విషయాలు బయటకు వచ్చాయి.బంగ్లాదేశ్‌లో పలువురు అధికారుల అదృశ్యం, కొన్ని హత్యలపై బంగ్లా ప్రభుత్వం కమిషన్ ఏర్పాటు చేసింది. రిటైర్డ్ జస్టిస్ మైనుల్ ఇస్లాం చౌదరి నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల కమిషన్ ‘అన్‌ఫోల్డింగ్ ది ట్రూత్’ అనే నివేదికను యూనస్‌కు అందజేసింది. ఈ కమిషన్ శనివారం మొదటి నివేదికను అందజేసింది. ఇందులో భాగంగా హసీనా హయాంలో మిస్సింగ్ కేసులపై 1,676 ఫిర్యాదులు రాగా.. 3500 మంది అదృశ్యమైనట్టు నివేదికలో పేర్కొంది. వీరిలో పలువురు ప్రభుత్వ అధికారులు కూడా ఉన్నారని తెలిపింది. అక్రమ అరెస్ట్ చేసిన కొందరు కనిపించడంలేదని, హత్యకు గురైనట్టు కూడా తెలిపింది. ఇదే సమయంలో రహస్య నిర్బంధ కేంద్రాల గురించి కూడా వెల్లడించింది. వీటన్నింటిలో హసీనా సహా పలువురు డిఫెన్స్ అధికారులే కారణమని బాంబు పేల్చింది.ఇక, ఈ అంశాలపై కమిషన్ పూర్తి విచారణ ప్రక్రియకు మరో మూడు నుంచి నాలుగు నెలల సమయం పడుతుందని సభ్యులు తెలిపారు. తుది నివేదికను మార్చిలో అందించనున్నట్టు స్పష్టం చేశారు. ఈ సందర్బంగా ప్రధాని యూనస్ మాట్లాడుతూ.. కమిషన్ మొదటి మధ్యంతర నివేదికకు కృతజ్ఞతలు తెలిపారు. విచారణలో భాగంగా కమిషన్ సభ్యులకు ఎలాంటి సహాయం కావాలన్న చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. అలాగే, విచారణలో భాగంగా తాను రహస్య నిర్భంద కేంద్రాలను, జాయింట్ ఇంటరాగేషన్ సెల్స్‌ను సందర్శిస్తానని చెప్పుకొచ్చారు.ఇదిలా ఉండగా.. కొద్ది నెలల క్రితం బంగ్లాదేశ్‌లో పౌరుల తిరుగుబాటు కారణంగా షేక్ హసీనా దేశం నుంచి పారిపోయి వచ్చి.. భారత్‌లో తలదాచుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆమెను బంగ్లాదేశ్‌కు తిరిగి తీసుకువచ్చేందుకు యూనస్ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలోనే ఆమెపై పలు రకాల కేసులను పెడుతోంది. -
ఈ తిరుగుబాట్లు ఎందుకు జరిగాయంటే...
సరిగ్గా నాలుగు నెలల కిందట బంగ్లాదేశ్ ప్రధాని నివాసంలో కనిపించిన దృశ్యాలే ఇవాళ సిరియా అధ్యక్ష భవనంలో కనిపిస్తున్నాయి. ప్రజా ఆగ్రహానికి గురై షేక్ హసీనా దేశాన్ని వీడిన వెంటనే ఆమె ప్రధానమంత్రి అధికారిక నివాసంలో తిరుగు బాటుదారులు దాడిచేసి ఇంటిని లూటి చేసిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇప్పుడు ఇదే సీన్ సిరియా అధ్యక్ష భవనంలో రిపీట్ అయ్యింది. ఆ దేశ నియంత బషీర్ అల్ అసద్ తిరుగుబాటుదారుల దాడికి దేశాన్ని వీడారు. ఆ వెంటనే అధ్యక్ష భవనంలోకి తిరుగుబాటుదారులు జొర బడి కనిపించిన వస్తువులను ఎత్తుకెళ్లటం చూస్తున్నాం. సిరియా అధ్యక్షుడిగా రెండున్నర దశాబ్దాల పాటు ఆ దేశాన్ని ఏలిన బషర్ అల్ అసద్ దేశాన్ని విడిచి పారి పోవాల్సిన పరిస్థితి వచ్చింది.సిరియా దాదాపు 13 ఏళ్లుగా అంతర్యుద్ధంతో సతమతం అవుతూనే ఉంది. దీనిలో ‘తిలాపాపం తలా పిడికిడు’ అన్నట్లు రష్యా, అమెరికా వంటి దేశాల పాత్రను కూడా మరిచిపోకూడదు. అసద్ తండ్రి హఫీజ్ 1970లో తిరుగుబాటు ద్వారా అధికారం చేజిక్కించుకున్నారు. ఆయన మరణానంతరం అసద్ అధికారంలోకి వచ్చారు. అంటే ఏకంగా 54 ఏళ్ళుగా అసద్ కుటుంబ నియంతృత్వ పాలనలోనే సిరియా మగ్గి పోయింది. ఉగ్రవాదాన్ని, అంతర్యుద్ధాన్ని కట్టడి చేయ లేకపోవటం ప్రజాస్వామిక విధానాలను దరిదాపుల్లోకి రానీయకపోయిన ఫలితాన్ని అసద్ ఇవాళ చవిచూస్తున్నారు. దేశాన్ని వదిలి రష్యా నీడన ఆశ్రయం పొందుతున్నారు. తిరుగుబాటుకు నేతృత్వం వహించిన హయాత్ తహరీర్ ఆల్ షామ్ (హెచ్‌టీఎస్) సంస్థను ఐక్యరాజ్య సమితి గతంలోనే ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది. ఈ సంస్థకు నాయకత్వం వహిస్తున్న అబూ మహమ్మద్ అల్–జులానీ ఒకప్పుడు అల్ ఖైదా ఉగ్రవాది. అంటే సిరియా దేశంలో నియంతృత్వం అంతరించే సూచనలు కనుచూపు మేరలో కనిపించకపోగా... ఆ దేశ పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారే అవకాశం ఉందని విశ్లేషణలు వినిపిస్తున్నాయి.సిరియా, బంగ్లాదేశ్ పరిస్థితులను ఒకే గాటన కట్టలేకపోవచ్చు. రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఆందోళనలు రేగి అవి హింసాత్మంగా మారటంతో పరిస్థితి చేయి దాటిపోయింది బంగ్లాదేశ్‌లో. హసీనా ప్రభుత్వం కూడా రిజర్వేషన్లకు వ్యతిరేకంగానే నిర్ణయం తీసు కున్నా... అప్పటికే ఆమె నిరంకుశ వ్యవహారశైలి పట్ల ప్రజల్లో పేరుకుపోయిన వ్యతిరేకత ఒక్కసారిగా ఎగిసిపడింది. ఆమె దేశాన్ని వదిలి పారిపోవాల్సిన పరిస్థితిని తెచ్చింది. ఈ పరిణామాల తర్వాత బంగ్లాదేశ్ మత ఛాందస దిశగా అడుగులు వేయటం ఆందోళనకరమైన అంశం. నోబెల్ బహుమతి గ్రహీత యూనస్ నేతృత్వంలో ఏర్పడిన తాత్కాలిక ప్రభుత్వంలో అక్కడి హిందూ మైనార్టీలపై దాడులు, చిన్మయ్ కృష్ణదాస్ అరెస్ట్, ఇస్లామిక్ రాజ్యంగా ప్రకటించాలన్న డిమాండ్లు వీటికి సంకేతాలు.కాస్త వెనక్కి వెళితే... రెండేళ్లు వెనక్కి వెళితే 2022 జూలైలో అప్పటి శ్రీలంక అధ్యక్షుడు గొటబయ రాజపక్సా కూడా ఇదే విధంగా పెట్టేబేడా సర్దుకుని ఉన్నపళంగా దేశాన్ని వదిలి పారిపోవాల్సి వచ్చింది. ఆ దేశ చరిత్రలోనే ఎప్పుడూ లేనంత ఆర్థిక సంక్షోభ పరిస్థితులు తలెత్తటంతో తిరుగుబాటుదారులు అధ్యక్ష భవనంపై దాడి చేశారు. అదే సమయంలో ప్రధాని రణిల్ విక్రమ సింఘే నివాసానికి కూడా నిప్పు పెట్టారు. ప్రజాగ్రహానికి తలొంచి రణిల్ సైతం ఆ రోజు రాజీనామా చేయక తప్పలేదు. ఇక సిరియా లాంటి తిరుగుబాటును 2021 ఆగష్టులో అఫ్గానిస్తాన్ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ చవిచూశారు. దశాబ్దాలుగా తీవ్ర సంక్షోభం, ఉగ్రవాదం, అంతర్యుద్ధాలకు కేంద్రంగా మారిన అఫ్గానిస్తాన్‌లో అష్రఫ్ ఘనీ నియంతలా పాలన చేశారు. చివరకు తాలిబాన్ల దాడిని ఎదుర్కోలేక దేశం విడిచి పారిపోయారు. ఆ దేశాన్ని హస్తగతం చేసుకున్న తాలిబన్లు ఇస్లాం చట్టాల పేరుతో ఏ విధంగా మానవ హక్కులను కాలరాస్తున్నారో యావత్ ప్రపంచం చూస్తూనే ఉంది.చదవండి: ఆ వ్యతిరేకత మనకు కలిసొచ్చేనా?ఈ నాలుగు దేశాల్లో సంక్షోభాలకు కారణాలు వేర్వేరు కావచ్చు, తీవ్రతల్లో తేడాలు ఉండొచ్చు. కాని ఫలితం మాత్రం ఒకటే. అంతే కాదు, పర్యవసానాల్లోనూ సారూప్యత కనిపిస్తోంది. శ్రీలంక మినహాయిస్తే అఫ్గానిస్తాన్, బంగ్లాదేశ్, సిరియాల్లో మత ఛాందసవాదమే రాజ్యమేలేటట్లు కనిపిస్తోంది. ఈ పరిణామాలు ఆ యా దేశాల ప్రజలకే కాదు ప్రపంచానికి సైతం ప్రమాదకరం.- రెహానా బేగం రాష్ట్ర సమాచార కమిషనర్, ఏపీ -
శత్రువుతో స్నేహం.. ఇండియాకు ద్రోహం.. బంగ్లాదేశ్ ఎందుకిలా?
-
సరైన దిశలో ఒక ప్రయత్నం
ఎట్టకేలకు ఒక అడుగు ముందుకు పడింది. బంగ్లాదేశ్‌లోని పరిస్థితి పట్ల తన మనోభావాలను భారత్ స్పష్టంగా పంచుకోగలిగింది. బంగ్లాదేశ్‌లోని మధ్యంతర సర్కారుకు ప్రధాన సలహాదారైన మహమ్మద్ యూనస్, బంగ్లా విదేశాంగ కార్యదర్శి మహమ్మద్ జషీముద్దీన్ తదితరులతో భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ ఢాకాలో సమావేశమవడం ఆహ్వానించదగ్గ పరిణామం. ఆగస్టులో షేక్ హసీనా ప్రభుత్వం పడిపోయాక రెండు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్న వేళ భారత్ నుంచి తొలిసారిగా ఓ ఉన్నతాధికారి బంగ్లా వెళ్ళడం, దౌత్య భేటీ జరపడం విశేషమే. ఇటు హసీనాకు భారత్ ఆశ్రయం కల్పించడం, అటు బంగ్లాలో అల్పసంఖ్యాక హిందువులపై దాడులతో ద్వైపాక్షిక సంబంధాలపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఈ పరిస్థితుల్లో తాజా భేటీలో ఇరుపక్షాలూ నిర్మొహమాటంగా పరస్పరం అభిప్రాయాలు పంచుకోవడం సరైన దిశలో పడిన అడుగు. హసీనా హయాంతో పోలిస్తే, భారత్ పట్ల పెద్ద సానుకూలత లేని సర్కారు బంగ్లాలో ప్రస్తుతం నెలకొన్నందున తాజా దౌత్యయత్నాలు కీలకం. చారిత్రకంగా మిత్రత్వం, పరస్పర ప్రయోజనాలున్న పొరుగు దేశాలు అపోహలు, అనుమానాలు దూరం చేసుకోవడానికి ఇవి ఏ మేరకు ఉపకరిస్తాయో చూడాలి. బయట ఉద్రిక్త వాతావరణం ఉన్న సమయంలో జరిగిన ఈ చర్చలు మైనారిటీలపైన, హిందూ ఆలయాలపైన దాడులు, రాజద్రోహ నేరంపై హిందూ సాధువు చిన్మయ్ కృష్ణదాస్ అరెస్టు సహా అనేక వివాదాస్పద అంశాలపై దృష్టి సారించాయి. రెండు కోట్ల పైగా హిందువులున్న ముస్లిమ్ మెజారిటీ దేశంలో మైనారిటీల భద్రతపై భారత్ ఆందోళన వ్యక్తం చేస్తే, ఆ ఘటనలు రాజకీయమైన వంటూ బంగ్లా వాదించింది. ప్రజల భావోద్వేగాలు, రాజకీయ ప్రయోజనాలు కలగలిసినప్పుడు పరస్పర భిన్న వాదనల మధ్య రాజీ కుదర్చడం కష్టమే. కానీ, విదేశాంగ శాఖ కార్యదర్శుల భేటీతో చిరు ప్రయత్నమైనా సాగడం విశేషం. బంగ్లాదేశ్ సైతం ఇప్పటికైనా కళ్ళు తెరిచి, జరుగుతున్నదే మిటో గ్రహించి, అసలంటూ సమస్య ఉన్నదని గుర్తించడానికి ఈ భేటీ ప్రేరేపిస్తే మంచిదే. 1971 నాటి బంగ్లాదేశ్ విముక్తి పోరులో భారత్ పాత్ర మరపురానిది. అదే సమయంలో స్వాతంత్య్రం ముందు నుంచి చారిత్రకంగా ఉన్న అనుబంధం రీత్యా సాహిత్య, ఆర్థిక, ఆధ్యాత్మిక, రాజకీయ పరంగా ఆధునిక భారతావని రూపుదిద్దుకోవడంలో బంగాళ ప్రాంతపు భాగ స్వామ్యం అవిస్మరణీయమే. బ్రిటీషు కాలం నుంచి భౌగోళిక రాజకీయాలు, సామాజిక సాంస్కృతిక కారణాలతో ముడిపడిన భారత – బంగ్లా బంధం ఇటీవలి ఉద్రిక్తతల నడుమ నలిగిపోతోంది. ఇరుదేశాల మధ్య 4,096 కి.మీల ఉమ్మడి సరిహద్దుంది. ప్రపంచంలోనే సుదీర్ఘమైన అయిదో సరిహద్దు ఇది. పైగా, చాలా ప్రాంతంలో పూర్తిస్థాయిలో సరిహద్దుల గుర్తింపు జరగనేలేదు. సరిహద్దులో నెలకొన్న పశ్చిమ బెంగాల్‌లోని ఒక్క పెట్రాపోల్ వద్దనే రెండు దేశాల మధ్య భూమార్గ వాణిజ్యంలో 30 శాతం జరుగుతుంది. ఏటా సుమారు 23 లక్షల మంది సరిహద్దులు దాటి, భారత్‌కు వైద్య చికిత్సకు వస్తుంటారు. కాబట్టి, ఇటీవలి ఉద్రిక్తతల్ని దాటి వాణిజ్యం, ఇంధనం, సహకారం, సామర్థ్యాల పెంపు దలను బంగ్లా చూడగలగాలి. ఇరుదేశాలూ చేతులు కలిపి అడుగులు వేస్తేనే అభివృద్ధి సాధ్యం. ఉల్లిపాయలు, బంగాళదుంపలు, వెల్లుల్లి లాంటి నిత్యావసర వస్తువుల విషయంలో ఢిల్లీ పైనే ఢాకా ఆధారపడి ఉంది. కానీ, తాజా పరిస్థితుల నేపథ్యంలో ఆ దేశం దేశీయ ఉత్పత్తిని పెంచుకొని, ఆర్థిక స్వావలంబన దిశగా అడుగులు వేస్తోంది. ఇక, బంగ్లా రోగులకు శస్త్రచికిత్స చేసేది లేదంటూ కొన్ని భారతీయ ఆస్పత్రులు అమానవీయంగా, మూర్ఖంగా వ్యవహరించడం సమర్థనీయం కాదు. ఈ చర్యల వల్ల బంగ్లా దేశీయులు ఇప్పుడు మలేసియాను ఆశ్రయిస్తున్నట్టు వార్త. ఇలాంటివన్నీ దీర్ఘకాలంలో భారత ప్రయోజనాలకే దెబ్బ. అసలు మిగతా ప్రపంచంతో భారత వాణిజ్యంతో పోలిస్తే, సరుకుల్లో భారత – బంగ్లాల ద్వైపాక్షిక వాణిజ్యం వేగంగా వృద్ధి చెందింది. అనేక అంశాలు ముడిపడి ఉన్నందున తెగేదాకా లాగడం ఇరుపక్షాలకూ మంచిది కాదు. కొత్త వాస్తవాలను గుర్తించక ఒకవేళ మనం ఇదే వైఖరితో ముందుకు సాగితే చివరకు నేపాల్, శ్రీలంక, పాకిస్తాన్, మాల్దీవులు, మయన్మార్ వరుసలోనే బంగ్లాదేశ్ సైతం ఢిల్లీకి దూరమవుతుంది. పొరుగున మిత్రులెవరూ లేని దుఃస్థితి భారత్‌కు దాపురిస్తుంది. యూనస్ సారథ్యంలోని ప్రస్తుత బంగ్లా సర్కార్ పాక్‌కు చేరువవుతోంది. ఇటీవల రెండు దేశాల మధ్య వీసాల ఎత్తివేత, రక్షణ ఒప్పందాలు, కరాచీ నుంచి పాకిస్తానీ సరుకుల రవాణా నౌకను చిట్టగాంగ్ వద్ద లంగరేసుకునేందుకు అనుమతించడం లాంటివి చూస్తే అదే అనిపిస్తోంది. దాదాపు 47 ఏళ్ళ తర్వాత రెండు దేశాల మధ్య నేరుగా సముద్ర నౌకాయాన సంబంధాల పునరుద్ధరణకు ఇది ఒక సూచన. వ్యూహాత్మకంగా సుస్థిర దక్షిణాసియాకు కట్టుబడ్డ భారత్ జాగ్రత్తగా అడుగులు వేయాలి. బంగ్లా అంతర్గత రాజకీయాల్లోకి అతిగా జొరబడి, ప్రస్తుత హయాం నమ్మకాన్ని పోగొట్టు కోరాదు. ఈ పరిస్థితుల్లో భారత విదేశాంగ కార్యదర్శి ఢాకా పర్యటన ఇరుగుపొరుగు బాంధవ్యం, భాగస్వామ్యాల ప్రాధాన్యాన్ని గుర్తించినట్టే అనిపిస్తోంది. బంగ్లా సైతం ముందుగా తన అంతర్గత వ్యవహారాలను చక్కదిద్దుకోవాలి. ఆ దేశంలో సాధారణ పరిస్థితులు నెలకొంటే, మైనారిటీలు సురక్షితంగా ఉంటే, పాత బంధం మళ్ళీ మెరుగవుతుంది. వెరసి, భారత్ – బంగ్లాలు ప్రస్తుతం నాలుగురోడ్ల కూడలిలో నిలిచాయి. మనసు విప్పి మాట్లాడుకొని, పరస్పర ప్రయోజనాల్ని కాపాడుకుంటే మేలు. అలాకాక సహకార మార్గం బదులు సంఘర్షణ పథాన్ని ఎంచుకుంటే ఇరువురికీ చిక్కే! -
సంబంధాల్లో సహనం అవసరం
షేక్ హసీనా ప్రభుత్వాన్ని కూల్చివేసినప్పటి నుండీ... హింస, అశాంతితో బంగ్లాదేశ్ అతలాకుతలమవుతోంది. విస్తృత సరిహద్దు రీత్యా, అక్కడి పాలనా విధానాలు మన దేశ భద్రతపై కీలక ప్రభావం చూపుతున్నాయి. బంగ్లాదేశ్ స్వతంత్ర దేశంగా ఆవిర్భవించడంలో భారత్ పాత్ర ఉన్నప్పటికీ, ఇరు దేశాల సంబంధాలు హెచ్చు తగ్గులను చూస్తూ వచ్చాయి. ఇటీవల శ్రీలంక, మాల్దీవులు, నేపాల్ లాంటి పొరుగు దేశాలతో దెబ్బతిన్న సంబంధాలను విజయవంతంగా నిర్వహించిన అనుభవంతో భారత్ పాఠాలు నేర్చుకోవాలి. బంగ్లాదేశ్‌లో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించే ప్రక్రియలో తోడ్పాటు అందించాలి. హసీనాకు ఏకపక్ష మద్దతివ్వడం వల్ల మన ఉద్దేశ్యాలపై అనుమానం ఏర్పడిందనీ, మన విధానాలను దిద్దుకోవాల్సిన అవసరం ఉందనీ అర్థం చేసుకోవాలి.షేక్ హసీనా ప్రభుత్వాన్ని ఒక ప్రజా తిరుగుబాటుతో కూల్చివేసినప్పటి నుండీ, హింస, అశాంతితో బంగ్లాదేశ్ అతలాకుతలమవుతోంది. అక్కడి మైనా రిటీ హిందూ సమాజాన్ని లక్ష్యంగా చేసుకున్నారు. ఈ సంఘటనల పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన భారత ప్రభుత్వం ‘మైనారిటీలతో సహా బంగ్లాదేశ్ పౌరులందరి భద్రతకు, రక్షణకు ప్రాథమిక బాధ్యత బంగ్లాదేశ్ ప్రభుత్వానిదే’ అని స్పష్టం చేసింది.బంగ్లాదేశ్ పరిణామాలను రెండు రకాలుగా చూడవచ్చు. మొదటిది, హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్ ప్రభుత్వ ఉక్కు పాదాన్ని తొలగించిన తర్వాత... ఇస్లామిస్టులు, పాకిస్తాన్ కి చెందిన ఇంటర్–సర్వీసెస్ ఇంటెలిజెన్ ్స (ఐఎస్ఐ) పట్టు సాధించారు. ఈ క్రమంలో హిందూ మైనారిటీలు హింసకు గురవుతున్న సందర్భంగా ఆ దేశం పాక్షిక అరాచక స్థితికి చేరుకుంటోంది. రెండవ పరిణామం ఏమంటే, గత దశాబ్ద కాలంగా నిజమైన ప్రజాస్వామ్యం లేని బంగ్లా దేశ్, తాత్కాలిక ప్రభుత్వ ఆధ్వర్యంలో అడుగులేయడానికి ప్రయ త్నిస్తూ ఒక తాత్కాలిక దశ గుండా పయనిస్తోంది.సరిహద్దుల చుట్టూ?బంగ్లాదేశ్ బహుశా దక్షిణాసియాలో భారతదేశానికి అత్యంత పర్యవసానాలతో కూడిన పొరుగు దేశం. దాని సరిహద్దులను దాదాపు భారత్ పరివేష్టించి ఉంది. 4,367–కిలోమీటర్ల సరిహద్దులో, కేవలం 271 కిలోమీటర్లు మాత్రమే మయన్మార్‌తో ఉండగా, మిగిలిన 4,096 కిలోమీటర్లు భారతదేశంతో ఉంది. త్రిపుర, మిజోరాం, అస్సాం, మేఘాలయ, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలతో ఆ దేశం సరిహద్దులను కలిగి ఉంది. అందుకే ఈశాన్య ప్రాంతపు ఆర్థిక అభివృద్ధి, భద్రతకు ఇది కీలకం. బంగ్లాదేశ్ సరిహద్దు స్వభావాన్ని బట్టి చూస్తే, దానిని పూర్తిగా మూసివేయడం చాలా కష్టం. ఫలితంగా, ఆ దేశంలోని వివిధ ప్రభు త్వాల పాలనా విధానాలు మన దేశ భద్రతపై కీలక ప్రభావం చూపు తున్నాయి. బంగ్లాదేశ్ స్వతంత్ర దేశంగా ఆవిర్భవించడంలో భారత్ పాత్ర ఉన్నప్పటికీ, ఇరు దేశాల సంబంధాలు హెచ్చు తగ్గులను చూస్తూ వచ్చాయి. నియంతలైన జియావుర్ రెహ్మాన్, హెచ్ఎమ్ ఎర్షాద్ తమ నియంత్రణను కొనసాగించే ప్రయత్నంలో దేశంలో ఇస్లా మీకరణను ప్రోత్సహిస్తూ వచ్చారు. దీంతో ద్వైపాక్షిక సంబంధాల విషయంలో ఈ ఎగుడు దిగుళ్లు తప్ప లేదు. పాకిస్తాన్ లాగే, జమాత్–ఎ–ఇస్లామీ కూడా బంగ్లాదేశ్ స్వాతంత్య్ర ఉద్యమానికి వ్యతిరేకంగా పోరాడినప్పటికీ, ఈ ప్రక్రియలో అది గణనీయమైన పాత్ర పోషిస్తూనే పెరిగింది.భారత వ్యతిరేక గ్రూపులుఅయితే, బంగ్లాదేశ్‌లో జరుగుతున్నది కేవలం భారతదేశానికి సంబంధించినది మాత్రమే కాదు... చైనా, మయన్మార్, ఆగ్నేయాసి యాతో సహా విస్తృత ప్రాంతంపై దీని ప్రభావం ఉంటోంది. దాని అతి పెద్ద ముస్లిం జనాభాలో పెరిగిపోతున్న సమూల మార్పువాదం (రాడి కలైజేషన్) విస్తృత ప్రపంచ పరిణామాలను కలిగి ఉంటుంది. జమాత్–ఎ–ఇస్లామీతో పాటు, హర్కత్–ఉల్–జిహాద్–అల్–ఇస్లామీ, జమాత్–ఉల్–ముజాహిదీన్ బంగ్లాదేశ్, అలాగే అల్–ఖైదా, ఇస్లామిక్ స్టేట్ల వంటి ఇతర రాడికల్ గ్రూపులు కూడా ఆ దేశంలో ఉన్నాయి. మదర్సా నాయకుల నెట్వర్క్ అయిన హెఫాజత్–ఎ–ఇస్లాం కూడా దేశంలో షరియా పాలనను కోరుకుంటూ, అక్కడ లౌకిక రాజకీయ స్థాపనను వ్యతిరేకిస్తోంది.బేగం ఖలీదా జియా నేతృత్వంలోని బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ (బీఎన్పీ)తో జమాత్–ఎ–ఇస్లామీ పొత్తు పెద్ద సమస్యగా మారింది. తత్ఫలితంగా, 1991–96లోనూ 2001–06లోనూ ఖలీదా జియా ప్రధానమంత్రిగా ఉన్న పదవీకాలం అనేది... దాదాపుగా ఐఎస్ఐ, ఈశాన్య ప్రాంతంలో భారతదేశానికి వ్యతిరేకంగా క్రియాశీలంగా ఉన్న తిరుగుబాటు గ్రూపుల వర్గానికి విశృంఖల స్వేచ్ఛను ఇచ్చింది. 2009లో హసీనా ప్రభుత్వ స్థాపనతో భారతదేశం, బంగ్లాదేశ్ మధ్య సంబంధం స్థిరపడింది. మరీ ముఖ్యంగా, ఇది ఐఎస్ఐ లేదా వివిధ ఈశాన్య తిరుగుబాటు గ్రూపులు, బంగ్లాదేశ్ భూభాగాన్ని భారత వ్యతిరేక శక్తులకు ఉపయోగించడాన్ని తనిఖీ చేయడంలో సహాయపడింది. రెండు దేశాలను కలిపే భూ మార్గాలను తిరిగి తెరవడానికీ, బంగ్లాదేశ్, భూటాన్, భారతదేశం, నేపాల్ గుండా ప్రాంతీయ ట్రాఫిక్ కదలికను ప్రోత్సహించేందుకు మోటార్ వాహ నాల ఒప్పందంపై సంతకం చేయడానికీ ఈ పరిణామం దారి తీసింది.మయన్మార్‌లోని రఖైన్ రాష్ట్రం పక్కనే బంగాళాఖాతం శిఖర ప్రాంతంలో ఉన్న బంగ్లాదేశ్ స్థానాన్ని ఉపయోగించుకోవడంతో పాటు, భారతదేశాన్ని నియంత్రించడం అనే తన పెద్ద విధానంలో భాగంగా చైనా తొలి నుంచి బంగ్లాదేశ్‌పై గణనీయమైన ఆసక్తిని పెంచుకుంది. ఇక్కడ చైనా ముఖ్యమైన పెట్టుబడులను కలిగి ఉంది. ఇక్కడి నుండి ఒక పైప్‌లైన్ మలక్కా జలసంధిని దాటవేస్తూ చైనాలోని యునాన్‌కు క్యుక్పియు నౌకాశ్రయం నుండి చమురును తీసుకు వెళుతుంది. బంగ్లాదేశ్‌లో వంతెనలు, రోడ్లు, పవర్ ప్లాంట్లను నిర్మించడంలో చైనా ప్రభుత్వం పెద్ద మొత్తంలో డబ్బును పెట్టుబడి పెట్టింది. అంతేకాకుండా దేశానికి అతిపెద్ద సైనిక సరఫరాదారుగా కూడా అవతరించింది.భారత్ చేయాల్సింది!పైన ఉదహరించిన అనేక కారణాల వల్ల, బంగ్లాదేశ్‌లోని వ్యవహా రాలను భారత్ చాలా జాగ్రత్తగా నిర్వహించాలి. పరిస్థితి చాలా అస్థిరంగా ఉంది. అక్కడ పరిస్థితులు అదుపు తప్పవచ్చు కూడా. ఫలితంగా భారతదేశానికి ప్రతికూల పరిణామాలు ఎదురవుతాయి. అక్కడి ప్రజా ఉద్యమంపై భారత వ్యతిరేక కథనాన్ని రుద్దేందుకు ఐఎస్ఐ ఓవర్‌టైమ్ పని చేసే అవకాశం ఉండటంతో పరిస్థితి మరింత జఠిలమైంది.ఇటీవల పొరుగు దేశాలతో దెబ్బతిన్న సంబంధాలను విజయ వంతంగా నిర్వహించడం నుండి భారతదేశం పాఠాలు నేర్చుకోవాలి. ఆర్థిక సంక్షోభం సమయంలో శ్రీలంకకు ఆర్థిక సహాయాన్ని అందించడం ద్వారా, భారత్ గణనీయంగా మంచిపేరు సాధించింది. దీనివల్ల అనూర కుమార దిస్సనాయకే ప్రభుత్వంలో ప్రయోజనాలను పొందు తున్నాం. అదేవిధంగా, మాల్దీవుల అధ్యక్షుడు ముయిజూతో ప్రశాంతంగా వ్యవహరించడం ద్వారా, ఆయన ప్రచారం చేసిన ‘భారత్ వైదొలిగిపో’ వ్యూహాన్ని మట్టుబెట్టింది.నేపాల్లోనూ ఇలాంటి ప్రయోజనాలే కనిపిస్తున్నాయి. చైనాలో అధికార పర్యటనలో ఉన్న భారత వ్యతిరేక ప్రధాని కేపీ శర్మ ఓలీ, బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ కింద బీజింగ్‌తో తమ దేశం ఎలాంటి కొత్త రుణ ఒప్పందంపై సంతకం చేయదని ముందే స్పష్టం చేశారు. నిజానికి, నేపాలీలు తమ దేశంలో బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ పరిధిని తగ్గించే కొత్త ఒప్పందంపై చైనాతో సంతకం చేయాలనుకుంటున్నారు.బంగ్లాదేశ్‌తో కూడా భారతదేశం వ్యూహాత్మక సహన విధానాన్ని అనుసరించాలి. బంగ్లాదేశ్ పరివర్తనలో ఉన్న దేశం. అక్కడ ప్రజా స్వామ్యాన్ని పునరుద్ధరించే ప్రక్రియకు న్యూఢిల్లీ మద్దతు ఇవ్వాలి.హిందువులపై దాడులను అతిగా చూసే ధోరణి నెలకొంది. ప్రారంభంలో కాస్త పెరిగిన తర్వాత, అటువంటి దాడులు ఇప్పుడు తగ్గాయి. మనం హసీనాకు ఏకపక్షంగా మద్దతు ఇవ్వడం వల్ల మన ఉద్దేశ్యాలపై అనుమానం ఏర్పడిందనీ, మన బంగ్లాదేశ్ విధానానికి దిద్దుబాటును అందించాల్సిన అవసరం ఉందని కూడా ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలి.మనోజ్ జోషి వ్యాసకర్త ‘అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్’లో డిస్టింగ్విష్డ్ ఫెలో(‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
మీరు ఆక్రమిస్తుంటే... మేం లాలీపాప్ తింటామా?
కోల్‌కతా: పశ్చిమబెంగాల్‌ను మరికొద్ది రోజుల్లోనే ఆక్రమించుకుంటామంటూ బంగ్లాదేశ్ రాజకీయ నేతలు కొందరు చేస్తున్న అతి వ్యాఖ్యలపై సీఎం మమతా బెనర్జీ దీటైన సమాధానమిచ్చారు. అవన్నీ మతిలేని వ్యాఖ్యలంటూ ఆమె కొట్టిపారేశారు. ‘మీరొచ్చి బెంగాల్, బిహార్, ఒడిశాలను ఆక్రమించుకుంటూ ఉంటే మేం లాలీపాప్ తింటూ కూర్చుంటామనుకుంటున్నారా? అంటూ మండిపడ్డారు. ‘మా భూభాగాన్ని మా నుంచి లాక్కునే సత్తా ఎవ్వరికీ లేదు. అటువంటి ఆలోచన కూడా రానివ్వకండి’అని హెచ్చరించారు. రాష్ట్రంలో ఉద్రిక్తతలను ప్రేరేపించే దురుద్దేశంతోనే ఓ రాజకీయ పార్టీ ఫేక్ వీడియోలను ఇక్కడ వ్యాప్తి చేస్తోందని ఆరోపించారు. ఇటువంటి తప్పుడు సమాచారాన్ని పట్టించుకోవద్దని ప్రజలకు ఆమె విజ్ఞప్తి చేశారు. భారత్‌లో పరిణామాలను రాజకీయం చేయాలని చూడటం బంగ్లాదేశీయులతోపాటు బెంగాల్‌కు, ఇక్కడి ప్రజలకు కూడా క్షేమకరం కాదని మమత హెచ్చరించారు. అనవసరమైన వ్యాఖ్యల కారణంగా బంగ్లాదేశ్‌లో పరిస్థితులు మరింతగా విషమించే ప్రమాదముందని కూడా మమతా బెనర్జీ అభిప్రాయపడ్డారు. బంగ్లాదేశ్‌లో మైనారిటీలపై జరుగుతున్న దౌర్జన్యాలను ఆమె తీవ్రంగా ఖండించారు. -
WI Vs BAN: రూథర్ ఫర్డ్ విధ్వంసం.. బంగ్లాను చిత్తు చేసిన వెస్టిండీస్
బంగ్లాదేశ్‌తో మూడు వన్డేల సిరీస్‌లో వెస్టిండీస్ శుభారంభం చేసింది. సెయింట్ కిట్స్ వేదికగా జరిగిన తొలి వన్డేలో 5 వికెట్ల తేడాతో విండీస్ ఘన విజయం సాధించింది. 295 పరుగుల భారీ లక్ష్యాన్ని వెస్టిండీస్ 5 వికెట్లు కోల్పోయి 47.4 ఓవర్లలో చేధించింది. కరేబియన్ బ్యాటర్లలో షర్ఫెన్ రూథర్‌ఫర్డ్(113) అద్బుతమైన సెంచరీతో చెలరేగగా.. కెప్టెన్ షాయ్ హోప్(86) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. బంగ్లా బౌలర్లలో టాంజిమ్ హసన్, నహిద్ రానా, రిహద్ హోస్సేన్, మెహది హసన్ మిరాజ్, సౌమ్య సర్కార్ తలా వికెట్ సాధించారు.అంతకుముందు బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 294 పరుగులు చేసింది. బంగ్లా బ్యాటర్లలో కెప్టెన్ మెహదీ హసన్ మిరాజ్(74) టాప్ స్కోరర్‌గా నిలవగా.. టాంజిద్ హసన్(60), మహ్మదుల్లా(50), జకీర్ అలీ(48) రాణించారు. విండీస్ బౌలర్లలో షెపర్డ్ మూడు వికెట్లు పడగొట్టగా.. అల్జారీ జోషఫ్ రెండు, సీల్స్ ఒక్క వికెట్ సాధించారు.చదవండి: IND vs AUS: ట్రావిస్ హెడ్, సిరాజ్‌లకు షాక్ ఇవ్వనున్న ఐసీసీ!? -
మెరిసిన ముంతాజ్
మస్కట్ (ఒమన్): జూనియర్ మహిళల ఆసియా కప్ హాకీ టోర్నమెంట్లో డిఫెండింగ్ చాంపియన్ భారత జట్టు భారీ విజయంతో బోణీ కొట్టింది. బంగ్లాదేశ్‌తో ఆదివారం జరిగిన గ్రూప్ ‘ఎ’ తొలి లీగ్ మ్యాచ్‌లో జ్యోతి సింగ్ నాయకత్వంలోని భారత జట్టు 13–1 గోల్స్ తేడాతో ఘనవిజయం సాధించింది. భారత్ తరఫున ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ ముంతాజ్ ఖాన్ (27వ, 32వ, 53వ, 58వ నిమిషాల్లో) అత్యధికంగా నాలుగు గోల్స్ సాధించింది. కనిక (12వ, 51వ, 52వ నిమిషాల్లో), దీపిక (7వ, 20వ, 55వ నిమిషాల్లో) మూడు గోల్స్ చొప్పున చేశారు. బ్యూటీ డుంగ్‌డుంగ్ (33వ నిమిషంలో), మనీషా (10వ నిమిషంలో), వైస్ కెప్టెన్ సాక్షి రాణా (43వ నిమిషంలో) ఒక్కో గోల్ సాధించారు. బంగ్లాదేశ్ జట్టుకు ఒర్పితా పాల్ (12వ నిమిషంలో) ఏకైక గోల్ అందించింది. మ్యాచ్ మొత్తంలో భారత జట్టుకు 12 పెనాల్టీ కార్నర్లు లభించగా... నాలుగింటిని గోల్స్‌గా మలిచింది. ఒక పెనాల్టీ స్ట్రోక్‌ను వృధా చేసింది. అన్ని పెనాల్టీ కార్నర్లను టీమిండియా సది్వనియోగం చేసుకొనిఉంటే విజయం తేడా మరింత భారీగా ఉండేది. నేడు జరిగే తమ రెండో లీగ్ మ్యాచ్‌లో మలేసియాతో భారత్ తలపడుతుంది. -
ఆసియా కప్ ఫైనల్లో భారత్‌ను చిత్తు చేసిన బంగ్లాదేశ్
ఏసీసీ అండర్-19 ఆసియా కప్ 2024 ఫైనల్లో భారత్‌పై బంగ్లాదేశ్ 59 పరుగుల తేడాతో గెలుపొందింది. తద్వారా బంగ్లాదేశ్ ఆసియా ఛాంపియన్‌గా అవతరించింది. ఫైనల్లో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 49.1 ఓవర్లలో 198 పరుగులకు ఆలౌటైంది. భారత బౌలర్లు సమిష్టిగా రాణించి బంగ్లాదేశ్‌ను స్వల్ప స్కోర్‌కే పరిమితం చేశారు. యుద్ధజిత్ గుహా, చేతన్ శర్మ, హార్దిక్ రాజ్ తలో రెండు వికెట్లు పడగొట్టగా.. కిరణ్ చోర్మలే, కేపీ కార్తికేయ, ఆయుశ్ మాత్రే తలో వికెట్ దక్కించుకున్నారు. బంగ్లాదేశ్ ఇన్నింగ్స్‌లో రిజాన్ హొసేన్ (47) టాప్ స్కోరర్‌గా నిలువగా.. మొహమ్మద్ షిహాబ్ జేమ్స్ (40), ఫరీద్ హసన్ ఫైసల్ (39) ఓ మోస్తరు స్కోర్లు చేశారు.అనంతరం 199 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్.. అజీజుల్ హకీమ్ తమీమ్ (3/8), ఇక్బాల్ హొసేన్ ఎమోన్ (3/24), అల్ ఫహద్ (2/34), మరూఫ్ మ్రిద (/36), రిజాన్ హొసేన్ (1/14) దెబ్బకు 35.2 ఓవర్లలో 139 పరుగులకే ఆలౌటైంది. భారత ఓపెనర్లు ఆయుశ్ మాత్రే (1), వైభవ్ సూర్యవంశీ (9) దారుణంగా విఫలమయ్యారు. భారత ఇన్నింగ్స్‌లో కెప్టెన్ మొహమ్మద్ అమాన్ (26), హార్దిక్ రాజ్ (24), కేపీ కార్తికేయ (21), అండ్రే సిద్దార్థ్ (20), చేతన్ శర్మ (10) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగలిగారు. -
చెలరేగిన భారత బౌలర్లు.. 198 పరుగులకు బంగ్లా ఆలౌట్
అండర్-19 ఆసియాకప్‌లో దుబాయ్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న ఫైనల్లో భారత బౌలర్లు అదరగొట్టారు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన బంగ్లా బ్యాటర్లకు టీమిండియా బౌలర్లు చుక్కులు చూపించారు. భారత బౌలర్ల దాటికి బంగ్లాదేశ్ 49.1 ఓవర్లలో కేవలం 198 పరుగులకే ఆలౌటైంది.బంగ్లా బ్యాటర్లలో రిజాన్ హసన్(47) టాప్ స్కోరర్‌గా నిలవగా.. షిహాబ్ (40), ఫరిద్ (39) ఫర్వాలేదనిపించారు. భారత బౌలర్లలో యుధాజిత్ గుహా 2, చేతన్ శర్మ 2, హార్దిక్ రాజ్ 2.. కిరణ్, కేపీ కార్తికేయ, ఆయుష్ మాత్రే తలో వికెట్ తీశారు.తుది జట్లుబంగ్లాదేశ్జవాద్ అబ్రార్, కలాం సిద్ధికి అలీన్, ఎండి అజీజుల్ హకీమ్ తమీమ్ (కెప్టెన్), మహ్మద్ షిహాబ్ జేమ్స్, ఎండి ఫరీద్ హసన్ ఫైసల్ (వికెట్ కీపర్), దేబాసిష్ సర్కార్ దేబా, ఎండి సమియున్ బసిర్ రతుల్, మరుఫ్ మృదా, ఎండి రిజాన్ హోసన్, అల్ ఫహాద్, ఇక్మోన్, ఇక్మోన్భారత్ఆయుష్ మత్రే, వైభవ్ సూర్యవంశీ, ఆండ్రీ సిద్దార్థ్, మహమ్మద్ అమన్ (కెప్టెన్), కెపి కార్తికేయ, నిఖిల్ కుమార్, హర్వాన్ష్ సింగ్ (వికెట్ కీపర్), కిరణ్ చోర్మలే, హార్దిక్ రాజ్, చేతన్ శర్మ, యుధాజిత్ గుహ -
భారత్‌తో కుస్తీ.. పాక్‌తో దోస్తీ.. మారిన బంగ్లాదేశ్ వైఖరి?
న్యూఢిల్లీ: ఒకప్పుడు భారత్‌తో మంచి మిత్రత్వం కలిగిన బంగ్లాదేశ్ ఇప్పుడు భారత్‌కు బద్ధ శత్రువుగా మారడమే కాకుండా పాకిస్తాన్‌తో సాన్నిహిత్యాన్ని పెంచుకుంటోంది. నాడు హిందువులపై ఆదరణచూపిన బంగ్లాదేశ్ ఇప్పుడు హిందువులను, ముఖ్యంగా భారతీయులను ద్వేషించడం మొదలుపెట్టింది.మహ్మద్ యూనస్ అధికారాన్ని చేపట్టాక..బంగ్లాదేశ్‌లో నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మహ్మద్ యూనస్ అధికారాన్ని చేపట్టినప్పటి నుండి ఆ దేశం ఛాందసవాద మార్గంలో ప్రయాణిస్తోంది. అక్కడి ముస్లింలు ఇప్పుడు భారతీయులతో స్నేహ భావాన్ని మరిచిపోయారు. హిందువులపై నిరంతరం దాడులకు పాల్పడుతున్నారు. హిందూ దేవాలయాలను కూల్చివేస్తున్నారు. విగ్రహాలను తగులబెడుతున్నారు. ఇంతేకాదు హిందువులను నరికివేస్తామంటూ కూడా బెదిరిస్తున్నారు.హిందువులకు బెదిరింపులుబంగ్లాదేశ్లో ఇస్కాన్ ఆలయాన్ని, భక్తులను లక్ష్యంగా చేసుకుని దాడులకు తెగబడుతున్నారు. హిందువులను బహిరంగంగా బెదిరిస్తున్నారు. ఇస్కాన్‌ను లక్ష్యంగా చేసుకున్న ఒక ఛాందసవాదికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అతను ఇస్కాన్‌పై నిషేధం విధించాలని ఆ వీడియోలో బహిరంగంగా డిమాండ్ చేశాడు. ప్రభుత్వం అలా చేయని పక్షంలో హింసాత్మక దాడులకు దిగుతామని బెదించాడు. ఈ వీడియోను షేర్ చేసిన ఇస్కాన్ వైస్ ప్రెసిడెంట్ రాధారమణ్ దాస్ మాట్లాడుతూ ఈ ప్రసంగం ఏ ఒక్క ప్రాంతానికో పరిమితం కాలేదని, బంగ్లాదేశ్ అంతటా ఈ తరహా విద్వేషాలే చెలరేగుతున్నాయన్నారు. ఇలాంటివారిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.ఢాకా వీధుల్లో ప్రదర్శనబంగ్లాదేశ్లోని ముస్లింలు తాజాగా ఢాకా వీధుల్లో భారత్‌కు వ్యతిరేకంగా భారీ ప్రదర్శన నిర్వహించారు. పోలీసుల రక్షణలో ఆందోళనకారులు భారత్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాడికల్ ఇస్లామిక్ సంస్థలకు చెందిన మిలిటెంట్లు ఐఎస్ఐఎస్ జెండాలను ప్రదర్శించారు. అక్కడి భారత పౌరులను చంపేస్తామంటూ నినదించారు. ఈ నేపధ్యంలో భారత్, బంగ్లాదేశ్ మధ్య బీటింగ్ రిట్రీట్ను నిలిపివేశారు.పరాకాష్టకు మత అసహనంబంగ్లాదేశ్లోని ఛాందసవాదులు ఇస్కాన్ దేవాలయాలను ఒకదాని తర్వాత ఒకటిగా కూల్చివేసి, విగ్రహాలను దహనం చేస్తున్నారు. తాజాగా ఢాకాలోని ఇస్కాన్ సెంటర్‌కు దుండగులు నిప్పు పెట్టారు. ఈ మత అసహన ఘటనలు అంతర్జాతీయ స్థాయిలో బంగ్లాదేశ్ ప్రతిష్టను ప్రభావితం చేస్తున్నాయి. ఇదిలా ఉండగా శుక్రవారం భారత విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మాట్లాడుతూ భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ డిసెంబరు 9న ఢాకాలో పర్యటిస్తారని తెలిపారు.పాక్‌కు చేరువవుతున్న బంగ్లాదేశ్ ఒకవైపు భారత్- బంగ్లాదేశ్ మధ్య పరస్పరం సంబంధాలు క్షీణిస్తున్న తరుణంలో మహ్మద్ యూనస్ ప్రభుత్వం పాకిస్తాన్‌కు దగ్గరవుతున్నట్లు కనిపిస్తోంది. తాజాగా పాకిస్తాన్- బంగ్లాదేశ్‌లు ఇరు దేశాల పౌరులకు వీసా నిబంధనలలో వివిధ సడలింపులను ఇచ్చాయి. అలాగే బంగ్లాదేశ్ ఏర్పడిన తర్వాత మొదటిసారిగా, కరాచీ నుండి ఒక కార్గో షిప్ గత నెలలో బంగ్లాదేశ్‌లోని చిట్టగాంగ్ నౌకాశ్రయానికి చేరుకుంది. ఇరు దేశాల మధ్య తొలిసారిగా సముద్ర రవాణా సంబంధాల ఏర్పడ్దాయి. వచ్చే ఏడాది నుంచి ఇస్లామాబాద్- ఢాకా మధ్య ఎయిర్ కనెక్టివిటీ కూడా ప్రారంభమవుతుందని బంగ్లాదేశ్‌లోని పాకిస్తాన్ హైకమిషనర్ సయ్యద్ అహ్మద్ మరూఫ్ సమయ్ ఒక ఇంటర్వ్యూలో తెలిపారు.క్షీణించిన భారత్- బంగ్లా సంబంధాలుషేక్ హసీనాను అధికారం నుండి తొలగించి, మొహమ్మద్ యూనస్ అధికారం చేపట్టిన తర్వాత, బంగ్లాదేశ్‌లోని హిందువులతో సహా ఇతర మైనారిటీల భద్రతపై భారత్ పలుమార్లు ఆందోళన వ్యక్తం చేసింది. మరోవైపు భారత్ ఆందోళనలను బంగ్లాదేశ్ తోసిపుచ్చింది. భారత్ తన అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటోందని బంగ్లాదేశ్ ఆరోపిస్తోంది. భారతదేశంతో బంగ్లాదేశ్‌కు సాంస్కృతిక సంబంధాలు కూడా ఉన్నాయి. బంగ్లాదేశ్ విద్యార్థులు పెద్ద సంఖ్యలో ఢిల్లీకి వచ్చి చదువుకుంటుంటారు. గత 15 ఏళ్లుగా బంగ్లాదేశ్ ప్రజలు భారతదేశానికి వచ్చేందుకు సులభంగా వీసా పొందేవారు. అయితే గత ఆగస్టు నుండి బంగ్లాదేశ్‌లో వీసా విషయంలో నిబంధనలు పెరిగాయి.ఇది కూడా చదవండి: రానున్నది తాతల కాలం.. 2050 నాటికి వృద్ధ జనాభా మూడింతలు -
ఇస్కాన్ కేంద్రానికి నిప్పు
కోల్‌కతా: బంగ్లాదేశ్‌లో హిందూ ఆలయాలపై దాడులు కొనసాగుతున్నాయి. రాజధాని ఢాకాలోని ఓ ఇస్కాన్ కేంద్రానికి శనివారం వేకువజామున గుర్తు తెలియని దుండగులు నిప్పుపెట్టారు. ధౌర్ గ్రామంలోని నమ్హట్టా ప్రాంతంలో ఉన్న శ్రీ రాధా కృష్ణ ఆలయం, శ్రీ మహాభాగ్య లక్ష్మీ నారాయణ ఆలయాలపై ఈ దాడి జరిగిందని ఇస్కాన్ కోల్‌కతా ఉపాధ్యక్షుడు రాధారమణ్ దాస్ ‘ఎక్స్’లో వెల్లడించారు. పెట్రోల్ పోసి నిప్పంటించడంతో శ్రీ లక్ష్మీ నారాయణ విగ్రహంతోపాటు అన్ని వస్తువులు పూర్తిగా కాలిపోయాయన్నారు. హిందూమత పెద్ద చిన్మయ్ కృష్ణ దాస్ బెయిలివ్వకుండా జైలులో ఉంచారంటూ...ఆయన భద్రతపై రాధారమణ్ దాస్ ఆందోళన వ్యక్తం చేశారు. దాడులు కొనసాగుతున్న నేపథ్యంలో ఇస్కాన్ అనుయాయులు బయట తిరిగేటప్పుడు ముందు జాగ్రత్తగా నుదుటన తిలకం ధరించవద్దని కోరారు. మైనారిటీలకు భద్రత కల్పిస్తామని యూనస్ సారథ్యంలోని ఆపద్ధర్మ ప్రభుత్వం ఇచ్చిన హామీ ఎక్కడా అమలు కావడం లేదని రాధారమణ్ దాస్ ఆవేదన వ్యక్తం చేశారు. -
భారత్ X బంగ్లాదేశ్
దుబాయ్: అండర్–19 ఆసియా కప్ టోర్నమెంట్ చరిత్రలో యువ భారత్ హాట్ ఫేవరెట్. ఇప్పటివరకు 8 టైటిల్స్ గెలిచింది. గత ఏడాదీ గెలిచే దారిలో బంగ్లాదేశ్ అడ్డుకుంది. దీంతో 2023 టోర్నీలో భారత అండర్–19 టీమ్ సెమీఫైనల్లో నిష్క్రమించింది. ఇప్పుడు ఆ సెమీస్ పరాభవానికి బదులు తీర్చుకునే అవకాశం వచ్చి0ది. డిఫెండింగ్ చాంపియన్ బంగ్లాదేశ్‌ను అమీతుమీలో కంగు తినిపించి తొమ్మిదోసారి విజేతగా నిలిచేందుకు యువ భారత్ తహతహలాడుతోంది. ఆదివారం జరిగే ఫైనల్లో బంగ్లాపై విజయమే లక్ష్యంగా భారత కుర్రాళ్ల జట్టు బరిలోకి దిగుతోంది. టోర్నీలో పాక్‌తో తొలి మ్యాచ్ ఓడాక భారత్ వరుస విజయాలు సాధించింది. పటిష్టమైన బ్యాటింగ్ లైనప్ ఉన్న యువ జట్టు వరుసగా జపాన్‌పై ఏకంగా 211 పరుగుల తేడాతో, యూఏఈపై పది వికెట్ల తేడాతో, సెమీఫైనల్లో లంకపై 7 వికెట్ల తేడాతో ఇలా ప్రతీజట్టుపై భారీ విజయాలనే నమోదు చేసింది. 13 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీ ఓపెనింగ్‌లో అదరగొడుతున్నాడు. ఆయుశ్ మాత్రేతో కలిసి చక్కని శుభారంభాలు ఇస్తున్నాడు. ఈ టోర్నీలో ఆయుశ్ 175 పరుగులు చేయగా, వైభవ్ 167 పరుగులతో నిలకడను ప్రదర్శించారు. నేడు జరిగే తుది పోరులోనూ వీళ్లిద్దరు మరో శుభారంభం ఇస్తే భారత్ ట్రోఫీ గెలిచేందుకు సులువవుతుంది. మరోవైపు బంగ్లాదేశ్ బౌలింగ్ అస్త్రాలతో ప్రత్యర్థుల్ని కట్టిపడేస్తోంది. సెమీఫైనల్లో పాక్‌ను 116 పరుగులకే కుప్పకూల్చింది. బౌలర్లు ఫహాద్, ఇక్బాల్ హసన్ ఎమన్ ఇద్దరు ప్రత్యర్థి బ్యాటర్లను బెంబేలెత్తిస్తున్నారు. ఇద్దరు చెరో 10 వికెట్లతో జోరు మీదున్నారు. బ్యాటింగ్‌లో కెప్టెన్ అజీజుల్ హకీమ్, కలామ్ సిద్ధిఖీ, అబ్రార్ ఫామ్‌లో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం జరిగే టైటిల్ పోరు భారత్ బ్యాటింగ్, బంగ్లా బౌలింగ్ మధ్య రసవత్తరంగా జరగనుంది. -
సరిహద్దుల్లో బంగ్లా డ్రోన్లు
న్యూఢిల్లీ: భారత్‌తో సరిహద్దుల్లో బంగ్లాదేశ్ డ్రోన్లను మోహరించింది. టర్కీలో తయారైన అధునాతన బేరక్తార్ టిబి2 డ్రోన్లను పశ్చిమబెంగాల్లోని సరిహద్దుల్లో బంగ్లాదేశ్ మోహరించింది. దాంతో భారత్ అప్రమత్తమైంది. షేక్ హసీనా ప్రభుత్వ పతనం తర్వాత సరిహద్దుల్లో తీవ్రవాద కార్యకలాపాలు ఉధృతమయ్యాయనే వార్తల నేపథ్యంలో భారత్ నిఘాను మరింత పెంచింది. బేరక్తార్ టిబి2 డ్రోన్ల మోహరింపునకు సంబంధించి భారత ఆర్మీ వాస్తవాలను బేరీజు వేస్తోంది. బంగ్లాదేశ్ ఇంటలిజెన్స్, సర్వైలెన్స్ 67 విభాగం ఈ డ్రోన్లను పర్యవేక్షిస్తోంది. రక్షణ చర్యల్లో భాగంగా ఈ డ్రోన్లను రంగంలోకి దింపామని బంగ్లా చెబుతున్నా పశ్చిమబెంగాల్‌తో వ్యూహాత్మకమైన సరిహద్దు ప్రదేశాల్లో వీటిని మోహరించడంపై భారత్ అప్రమత్తమైంది. హసీనా ప్రభుత్వ పతనం తర్వాత సరిహద్దుల్లో తీవ్రవాద కార్యకలాపాలు ఊపందుకున్నాయని, చొరబాటు ప్రయత్నాలు పెరిగాయనే వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి. -
విండీస్ ఆటగాళ్లకు జరిమానా
బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో టెస్ట్‌లో వెస్టిండీస్ 101 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఈ మ్యాచ్‌లో ఐసీసీ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు గాను వెస్టిండీస్ ఆటగాళ్లు జేడెన్ సీల్స్, కెవిన్ సింక్లెయిర్లకు జరిమానా పడింది. సీల్స్ వికెట్ తీసిన ఆనందంలో బంగ్లా ఆటగాళ్ల పట్ల దూకుడుగా వ్యవహరించినందుకు గాను అతని మ్యాచ్ ఫీజ్‌లో 25 శాతం కోత విధించారు. అలాగే అతనికి ఒక డీమెరిట్ పాయింట్ కూడా లభించింది.ఆల్‌రౌండర్ కెవిన్ సింక్లెయిర్ ప్లేయింగ్ ఎలెవెన్‌లో లేకపోయినా, ప్రత్యామ్నాయ ఫీల్డర్‌గా వచ్చి స్లెడ్జింగ్‌కు పాల్పడ్డాడు. దీంతో అతని మ్యాచ్ ఫీజులో 15 శాతం కోత పడింది. సింక్లెయిర్, సీల్స్ అంపైర్లు ఎన్ని సార్లు హెచ్చరించినా పట్టించుకోకుండా బంగ్లాదేశ్ ఆటగాళ్ల పట్ల దూకుడుగా వ్యవహరించారు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో సీల్స్ అద్భుతమైన ప్రదర్శన కనబర్చాడు. ఈ ఇన్నింగ్స్‌లో అతను 15.5 ఓవర్లు వేసి కేవలం 5 పరుగులు మాత్రమే ఇచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. కాగా, రెండు మ్యాచ్‌ల ఈ టెస్ట్ సిరీస్‌లో వెస్టిండీస్ తొలి టెస్ట్‌లో నెగ్గగా.. బంగ్లాదేశ్ రెండో టెస్ట్‌లో విజయం సాధించింది. ఫలితంగా 1-1తో సిరీస్ సమంగా ముగిసింది. -
బంగ్లాదేశ్‌కు వెళ్లొద్దు: బ్రిటన్ హెచ్చరిక
లండన్:బంగ్లాదేశ్‌కు వెళ్లొద్దని బ్రిటన్ తన పౌరులకు సూచించింది. అక్కడ ఉగ్రవాదులు దాడులకు పాల్పడే అవకాశం ఉందని హెచ్చరించింది.ఉగ్రవాదుల దాడులతో పాటు ఆయుధాలతో బెదిరించి దోపిడీ చేయడం,అత్యాచారం,భౌతిక దాడులు జరిగే అవకాశాలున్నాయని తెలిపింది.బంగ్లాదేశ్‌లో ఉన్న యూకే పౌరులు జాగ్రత్తగా ఉండాలని కోరింది. ఈ మేరకు బ్రిటన్ తాజాగా ఒక అడ్వైజరీ జారీ చేసింది.అక్కడా ఇక్కడా అనే తేడా లేకుండా బంగ్లాదేశ్‌లో రద్దీ ఎక్కువగా ఉండే అన్ని ప్రదేశాల్లో ముఖ్యంగా విదేశీయులు సంచరించే ప్రాంతాల్లో దాడులు జరగొచ్చని తెలిపింది.దేశంలో ఇస్లాం మతానికి చెందని వారిని కొన్ని గ్రూపులు లక్ష్యంగా చేసుకున్నాయని పేర్కొంది.కాగా, బంగ్లాదేశ్‌లో షేక్‌హసీనా ప్రభుత్వం పడిపోయి మధ్యంతర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అక్కడ శాంతిభద్రతలు పూర్తిగా దిగజారిపోయాయి. ముఖ్యంగా మైనారిటీలైన హిందువులపైన దాడులు పెరిగాయి. -
హిందువులపై దాడులు..బంగ్లాదేశ్‌కు అమెరికా కీలక సూచన
వాషింగ్టన్:బంగ్లాదేశ్‌లో జరుగుతున్న ఆందోళకర పరిణామాలపై అగ్రదేశం అమెరికా స్పందించింది. పౌరుల ప్రాథమిక స్వేచ్ఛకు భంగం కలిగించొద్దని బంగ్లాదేశ్ ప్రభుత్వానికి అమెరికా సూచించింది. బంగ్లాదేశ్‌లో మైనారిటీలుగా ఉన్న హిందువులపై దాడులు జరుగుతున్న నేపథ్యంలో దేశంలో మత,ప్రాథమిక,మానవ హక్కులను గౌరవించాలని అక్కడి మధ్యంతర ప్రభుత్వాన్ని అమెరికా కోరింది. ఈ మేరకు అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వేదాంత్ పటేల్ మంగళవారం(డిసెంబర్4) మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వాలన్నీ చట్టాలను గౌరవించాల్సిందేనన్నారు. నిర్బంధంలో ఉన్నవారికి కూడా ప్రాథమిక స్వేచ్ఛనిస్తూ వారి మానవ హక్కులకు భంగం కలగకుండా చూడాలని పటేల్ కోరారు.కాగా, బంగ్లాదేశ్‌లో షేక్‌హసీనా ప్రభుత్వం పడిపోయి మధ్యంతర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అక్కడ మైనారిటీలుగా ఉన్న హిందువులపై దాడులు మొదలైన విషయం తెలిసిందే. ఇటీవల హిందు మతానికి చెందిన చిన్మయ్ కృష్ణదాస్‌ను కూడా అక్కడి ప్రభుత్వం అరెస్టు చేసింది. చిన్మయ్ తరపున కేసు వాదించేందుకు వచ్చిన న్యాయవాదిపైనా దాడి జరగడం బంగ్లాదేశ్‌లో దిగజారిన పరిస్థితులను తెలియజేస్తోంది. -
బంగ్లాదేశ్‌కు శాంతి పరిరక్షక దళం?.. ఏం జరగనుంది?
న్యూఢిల్లీ: బంగ్లాదేశ్‌లో హిందువులపై పెరుగుతున్న దాడులపై భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఇస్కాన్ సన్యాసి చిన్మయ్ కృష్ణ దాస్ అరెస్ట్ తర్వాత బంగ్లాదేశ్‌లో పరిస్థితులు మరింత దిగజారాయి. హిందువులపై ఛాందసవాదుల దాడులు మరింతగా పెరిగాయి. అటువంటి పరిస్థితిలో పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ బంగ్లాదేశ్‌లో ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షక దళాన్ని మోహరించాలని అభ్యర్థించారు. అయితే ఈ దళం బంగ్లాదేశ్‌కు వచ్చి ఏం చేయనుంది? ఈ దళంలోని సభ్యుల కర్తవ్యం ఏమిటి?ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షక దళం అంటే ఏమిటి?ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షక దళం అనేది ప్రపంచంలో శాంతి, భద్రతలను పెంపొందించేందుకు ఏర్పడిన విభాగం. ఇది ఆతిథ్య దేశాలను యుద్ధం నుండి శాంతి వైపునకు మళ్లించేందుకు కృషిచేస్తుంటుంది.ఎప్పుడు ప్రారంభమైంది?ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షక మిషన్ 1948, మే లో స్థాపితమయ్యింది. దీనిని యునైటెడ్ నేషన్స్ ట్రూస్ సూపర్విజన్ ఆర్గనైజేషన్ (యూఎన్టీఎస్ఓ) అంటారు. ఇజ్రాయెల్- అరబ్ పొరుగు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందాన్ని పర్యవేక్షించడం యూఎన్టీఎస్ఓ ఉద్దేశ్యం.శాంతి పునరుద్ధరణకు కృషిశాంతి పరిరక్షక దళం ఐక్యరాజ్యసమితిలో ఒక భాగం. ఇది హింసాత్మక దేశాలలో శాంతిని పునరుద్ధరించేందుకు ఏర్పడింది. దీనిలో సభ్యులుగా ఐక్యరాజ్యసమితి సభ్య దేశాల సైనికులు, పోలీసులు, సాధారణ పౌరులు ఉంటారు. ఏ దేశమైనా లేదా సంస్థ అయినా శాంతిని నెలకొల్పలేని పరిస్థితుల్లో ఐక్యరాజ్య సమితి తన శాంతి పరిరక్షక దళం సభ్యులను ఆయా దేశాలలో మోహరిస్తుంది. ఈ నేపధ్యంలో శాంతి పరిరక్షక దళం సంక్లిష్టమైన అంతర్జాతీయ రాజకీయ సవాళ్లను ఎదుర్కోవలసి వస్తుంది.శాంతి మిషన్‌తో భారత్‌కు సంబంధం ఏమిటి?భారతదేశానికి 1945, అక్టోబర్ 24 నుంచి ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షక మిషన్‌తో అనుబంధం ఏర్పడింది. ఐక్యరాజ్యసమితిలో భారతదేశం సభ్యత్వం పొందింది. 2025-2026 సంవత్సరానికి ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షక కమిషన్ (పీబీసీ) సభ్యదేశంగా భారతదేశం తిరిగి ఎన్నికైంది. ఈ మిషన్‌లో భారతదేశ ప్రస్తుత పదవీకాలం డిసెంబర్ 31తో ముగియనుంది. పీబీసీలో 31 సభ్య దేశాలు ఉన్నాయి. ఇవి ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ, భద్రతా మండలి, ఆర్థిక, సామాజిక మండలి నుండి ఎన్నికయ్యారు.భారతదేశం అందించిన సహకారం ఇదే..ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షక కార్యక్రమాలలో భారతదేశం కీలక భాగస్వామ్యం వహించింది. శాంతి పరిరక్షక కార్యకలాపాలకు భారతదేశం ఇప్పటివరకు సుమారు 2,75,000 మంది సైనికులను అందించింది. భారతదేశం ప్రస్తుతం అబై, సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్, సైప్రస్, డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, లెబనాన్, మిడిల్ ఈస్ట్, సోమాలియా, సౌత్ సూడాన్, పశ్చిమ సహారాలో 6,000 మంది సైనిక, పోలీసు సిబ్బందిని మోహరించింది. శాంతి పరిరక్షక కార్యకలాపాలలో పాల్గొన్న 180 మంది భారతీయ శాంతి పరిరక్షకులు అత్యున్నత త్యాగం చేశారు. ఇది ఇతర దేశంతో పోలిస్తే ఇది అత్యధిక సంఖ్య.శాంతి పరిరక్షక దళం కార్యకలాపాలు..యూఎన్ఓ శాంతి పరిరక్షక దళాలు 1991 నుండి అవిశ్రాంతంగా పని చేస్తున్నాయి. యుద్ధం కారణంగా వివిధ దేశాల్లో తలెత్తే సమస్యలను శాంతి పరిరక్షక దళం పరిష్కరించేందుకు ప్రయత్నిస్తుంది. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి.. శాంతి పరిరక్షక దళాలను ఏ దేశానికి పంపాలనే నిర్ణయాన్ని తీసుకుంటుంది. యూఎన్ఓ సెక్రటేరియట్లో దీనికి సంబంధించిన వ్యూహాన్ని రూపొందిస్తారు. దీనిని అమలు చేసే బాధ్యత ఐక్యరాజ్యసమితి సెక్రటేరియట్‌పై ఉంది.శాంతి పరిరక్షక దళంలో సభ్యదేశాలుఐక్యరాజ్యసమితి సభ్య దేశాలకు చెందినవారు శాంతి పరిరక్షక దళంలో చేరవచ్చు. ఐక్యరాజ్యసమితి నిధి నుంచి దళ సభ్యులకు వేతనాన్ని అందిస్తారు. ఐక్యరాజ్యసమితిలోని శాశ్వత సభ్య దేశాలుగా ఉన్న అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, చైనా, రష్యా తమ ప్రత్యేక సాయుధ బలగాలను శాంతి పరిరక్షక దళానికి పంపుతాయి.శాంతి పరిరక్షక దళం ఎదుర్కొనే సవాళ్లు..రాజకీయ అస్థిరత: సంఘర్షణలు, హింసతో పాటు రాజకీయ అస్థిరత కలిగిన ప్రాంతాల్లో శాంతి పరిరక్షక దళాలు పనిచేయాల్సి ఉంటుంది.వనరుల కొరత: శాంతి పరిరక్షక దళాలు నిధులు, వివిధ పరికరాలు, శిక్షణ పొందిన సిబ్బంది లాంటి వనరుల కొరతను ఎదుర్కొంటాయి.సాంస్కృతిక, భాషాపరమైన అడ్డంకులు: శాంతి పరిరక్షక దళాలు వివిధ సాంస్కృతిక, భాషా నేపథ్యాలు కలిగిన ప్రాంతాల్లో పనిచేయాల్సి ఉంటుంది. ఈ భిన్నత్వం కమ్యూనికేషన్ సహకారానికి అడ్డంకులను సృష్టిస్తుంది.భద్రతా సవాళ్లు: శాంతి భద్రతల సభ్యులు తరచూ హింస, కిడ్నాప్‌లు, దాడులు వంటి భద్రతా సవాళ్లను ఎదుర్కొంటారు.ప్రపంచ శక్తి సమతుల్యతలో మార్పులు: శాంతి పరిరక్షక దళాలు ప్రపంచ శక్తి సమతుల్యతలో మార్పులను ఎదుర్కోవలసి ఉంటుంది. ఉదాహరణకు అమెరికా- చైనా మధ్య పెరుగుతున్న పోటీ శాంతి పరిరక్షక దళం లక్ష్యాలను ప్రభావితం చేసే అవకాశం ఉంది.అంతర్జాతీయ సహకార లేమి: ఐక్యారాజ్య సమితి శాంతి పరిరక్షణకు అంతర్జాతీయ సహకారం 2011 నుండి క్షీణిస్తూ వస్తోంది. భారతదేశం, చైనా లాంటి కొన్ని ప్రభావవంతమైన దేశాలు ఐక్యరాజ్య సమితి శాంతి పరిరక్షక కార్యకలాపాల విషయంలో ఉదాసీనంగా ఉన్నాయనే మాట వినిపిస్తుంటుంది. అలాగే వివిధ పాశ్చాత్య దేశాల నుంచి కూడా శాంతి పరిరక్షక దళానికి పూర్తి సహకారం అందడం లేదనే వాదన ఉంది.ఇది కూడా చదవండి: 2025 నాటికి దేశ ఆరోగ్య రంగం మార్కెట్ -
టీ20 వరల్డ్‌కప్ ఛాంపియన్‌గా పాకిస్తాన్
పాకిస్తాన్ అంధుల క్రికెట్ జట్టు టీ20 ప్రపంచకప్‌ను కైవసం చేసుకుంది. ఇవాళ (డిసెంబర్ 3) జరిగిన ఫైనల్లో పాక్ బంగ్లాదేశ్‌పై 10 వికెట్ల తేడాతో గెలుపొంది, తొలిసారి ఛాంపియన్‌గా అవతరించింది. ముల్తాన్ (పాకిస్తాన్) వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 139 పరుగులు చేసింది. ఆరిఫ్ హుస్సేన్ (54) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. పాక్ బౌలర్లలో బాబర్ అలీ రెండు వికెట్లు పడగొట్టగా.. మొహమ్మద్ సల్మాన్, మతివుల్లా తలో వికెట్ దక్కించుకున్నారు.140 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన పాకిస్తాన్.. కేవలం 11 ఓవర్లలోనే వికెట్ నష్టపోకుండా విజయతీరాలకు చేరింది. ఓపెనర్ నిసార్ అలీ అజేయమై అర్ద సెంచరీతో (72) సత్తా చాటగా.. మరో ఓపెనర్ మొహమ్మద్ సఫ్దార్ అజేయమైన 47 పరుగులు చేసి తన జట్టు గెలుపులో కీలకపాత్ర పోషించాడు. 12 ఏళ్ల ఈ టోర్నీ చరిత్రలో పాక్ టైటిల్ గెలవడం ఇదే మొదటిసారి. ఈ టోర్నీ జరిగిన మూడు ఎడిషన్లలో (2012, 2017, 2022) టీమిండియా విజేతగా నిలిచింది.టోర్నీ తొలి ఎడిషన్ ఫైనల్లో పాకిస్తాన్‌పై 29 పరుగుల తేడాతో గెలుపొందిన భారత్.. రెండో ఎడిషన్ ఫైనల్లోనూ పాక్‌పై 9 వికెట్ల తేడాతో విజయఢంకా మోగించింది. 2022 ఎడిషన్ ఫైనల్లో భారత్ బంగ్లాదేశ్‌ను ఓడించి హ్యాట్రిక్ టైటిళ్లు సొంతం చేసుకుంది. ఎట్టకేలకు పాక్ నాలుగో ప్రయత్నంలో సొంతగడ్డపై టైటిల్ సాధించింది. ఈ ఎడిషన్‌లో భారత్ పాల్గొనలేదు. భద్రతా కారణాల దృష్ట్యా భారత ప్రభుత్వం టీమిండియాను పాక్‌కు పంపలేదు. -
ఐదేసిన రాణా.. ఆధిక్యంలో బంగ్లాదేశ్
జమైకా వేదికగా వెస్టిండీస్-బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ రసవత్తరంగా సాగుతుంది. ఈ మ్యాచ్‌లో తొలుత వెస్టిండీస్ ఆధిక్యం సాధించినట్లు కనిపించింది. అనంతరం బంగ్లా బౌలర్లు రెచ్చిపోవడం.. బ్యాటర్లు ఓ మోస్తరుగా రాణించడంతో మ్యాచ్‌పై వెస్టిండీస్ పట్టు కోల్పోయింది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి బంగ్లాదేశ్ 211 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతుంది. ఆ జట్టు సెకెండ్ ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు కోల్పోయి 193 పరుగులు చేసింది. మహ్మదుల్ హసన్ జాయ్ (0), షద్మాన్ ఇస్లాం (46), షహదత్ హొసేన్ దీపు (28), మెహిది హసన్ మిరాజ్ (42), లిటన్ దాస్ (25) ఔట్ కాగా.. జాకెర్ అలీ (29), తైజుల్ ఇస్లాం (9) క్రీజ్‌లో ఉన్నారు. విండీస్ బౌలర్లలో షమార్ జోసఫ్ 2, అల్జరీ జోసఫ్, జేడన్ సీల్స్, జస్టిన్ గ్రీవ్స్ తలో వికెట్ పడగొట్టారు.అంతకుముందు వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్‌లో 146 పరుగులకే ఆలౌటైంది. నహిద్ రాణా (5/61) దెబ్బకు విండీస్ బ్యాటింగ్ లైనప్ కకావికలమైంది. హసన్ మహమూద్ 2, తస్కిన్ అహ్మద్, తైజుల్ ఇస్లాం, మెహిది హసన్ తలో వికెట్ దక్కించుకున్నారు. విండీస్ ఇన్నింగ్స్‌లో కీసీ కార్తీ (40), క్రెయిగ్ బ్రాత్‌వైట్ (39), మికైల్ లూయిస్ (12) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు.ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 164 పరుగులకు ఆలౌటైంది. జేడన్ సీల్స్ అద్భుతమైన స్పెల్‌తో (15.5-10-5-4) బంగ్లా బ్యాటర్లను కట్టడి చేశాడు. షమార్ జోసఫ్ 3, కీమర్ రోచ్ 2, అల్జరీ జోసఫ్ ఓ వికెట్ పడగొట్టారు. బంగ్లా ఇన్నింగ్స్‌లో షద్మాన్ ఇస్లాం (64) టాప్ స్కోరర్‌గా నిలువగా.. మెహిది హసన్ (36), షహాదత్ హొసేన్ (22), తైజుల్ ఇస్లాం (16) రెండంకెల స్కోర్లు చేశారు. కాగా, రెండు మ్యాచ్‌ల ఈ టెస్ట్ సిరీస్‌లో వెస్టిండీస్ తొలి మ్యాచ్‌లో 201 పరుగుల తేడాతో గెలుపొందింది. -
Bangladesh: జనవరి 2 వరకూ జైల్లోనే చిన్మయ్ దాస్
ఢాకా: బంగ్లాదేశ్‌లోని హిందూ సన్యాసి చిన్మయ్ కృష్ణ దాస్ బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా పడింది. ఈ కేసులో ఆయన తరపున వాదించేందుకు చిట్టగాంగ్ కోర్టులో న్యాయవాది ఎవరూ లేరు. ఈ నేపధ్యంలోనే విచారణ జనవరి 2కు వాయిదా పడింది. బంగ్లాదేశ్‌లోని హిందూ సన్యాసి చిన్మయ్ కృష్ణ దాస్ ప్రభు తరపు న్యాయవాది రమణ్ రాయ్‌పై దాడి జరిగిందని ఇస్కాన్ కోల్‌కతా ప్రతినిధి రాధారమణ్ దాస్ తెలిపారు. ఆయన ఆస్పత్రిలో ప్రాణాలతో పోరాడుతున్నారని, చిన్మయ్ ప్రభు తరపున వాదించడమే ఆయన చేసిన తప్పులా ఉందని దాస్ పేర్కొన్నారు.ఐసీయూలో ఉన్న రాయ్ ఫోటోను ఇస్కాన్ కోల్‌కతా ప్రతినిధి దాస్ ట్విట్టర్లో పోస్ట్ చేశారు. న్యాయవాది రమణ్ రాయ్ కోసం ప్రార్థించాలని ఆయన హిందువులను కోరారు. ఇస్లామిక్ ఛాందసవాదులు అతని ఇంటిని ధ్వంసం చేసి, అతనిపై దాడి చేశారని దాస్ పేర్కొన్నారు. బంగ్లాదేశ్ సమిత సనాతనీ జాగరణ్ జోట్ ప్రతినిధి చిన్మయ్ కృష్ణ దాస్ ప్రభును ఢాకాలోని హజ్రత్ షాజాలాల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అరెస్టు చేశారు. బంగ్లాదేశ్ కోర్టు అతనికి బెయిల్ మంజూరును నిరాకరించి, జైలుకు తరలించింది.ఇది కూడా చదవండి: సీఎం పదవిపై వీడని ఉత్కంఠ.. వేర్వేరు నగరాల్లో ముగ్గురు నేతలు -
బంగ్లాదేశ్‌లో దాడుల సూత్రధారి యూనస్ ప్రభుత్వమే: షేక్ హసీనా
న్యూఢిల్లీ: బంగ్లాదేశ్‌లో నెలకొన్న అనిశ్చిత పరిస్థితులకు కారణం ప్రధాని మహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వానిదేనని ఆరోపించారు ఆ దేశ మాజీ ప్రధాని షేక్ హసీనా. బంగ్లాదేశ్‌లో హిందువులు, ఇతర మైనారిటీలపై లక్ష్యంగా చేసుకొని బెదిరింపులు, దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. న్యూయార్క్‌లో జరిగిన అవామీ లీగ్ కార్యక్రమంలో వర్చువల్‌గా పాల్గొన్న షేక్ హసీనా ప్రసంగిస్తూ.. బంగ్లాలో హిందూ దేవాలయాలు, చర్చీలు, ఇస్కాన్‌పై వరుస దాడుల నేపథ్యంలో యూనస్ ప్రభుత్వంపై మండిపడ్డారు.‘నాపై సామూహిక హత్యల ఆరోపణలు వచ్చాయి. కేసులు కూడా నమోదు చ ఏశారు కానీ వాస్తవానికి విద్యార్ధి సంఘాలతో కలిసి పక్కా ప్రాణాళికతో సామూహిక హత్యలకు పాల్పడింది మహమ్మద యూనస్. వారే సూత్రధారులు.. దేశంలో ఇలాగే మరణాలు కొనసాగితే ప్రభుత్వం మనుగడ సాగదని లండన్‌లో ఉన్న తారిక్ రెహమాన్(బీఎన్పీ నాయకుడు, ఖలీదాజియా కుమారుడు) కూడా చెప్పాడు. దేశంలో మైనారిటీలు, ఉపాధ్యాయులు, పోలీసులు అందరిపై దాడి చేసి చంపేస్తున్నారు. హిందువులు, బౌద్ధులు, క్రైస్తవులు లక్ష్యంగా చేసుకుంటున్నారు. చర్చిలు, అనేక దేవాలయాలపై దాడులు జరుగుతున్నాయి. వీటన్నింటికీ మాస్టర్‌మైండ్ యూనసే. బంగ్లాదేశ్‌లో మైనారిటీలను ఎందుకు టార్గెట్ చేస్తున్నారు’ షేక్ హసీనా ప్రశ్నించారు. ఈసందర్భంగా తాను దేశాన్ని ఎందుకు వీడాల్సివచ్చిందో ఆమె మరోసారి వివరించారు. ‘‘నా తండ్రిలాగే నన్నూ హత్య చేసేందుకు కుట్రలు జరిగాయి. వాటిని ఎదుర్కోవడం నాకు 25-30 నిమిషాలు పట్టదు. నా భద్రతా సిబ్బంది కాల్పులు జరిపి ఉంటే.. ఎంతోమంది ప్రాణాలు కోల్పోయేవారు. కానీ, ఊచకోతను నేను కోరుకోలేదు. నేను అధికారం కోసం అక్కడే ఉంటే మారణహోమం జరిగేది. ప్రజలను విచక్షణారహితంగా చంపేస్తుండటంతోనే దేశం విడిచివెళ్లిపోవాలని నిర్ణయించుకున్నా. అందుకే ఆందోళనకారులపై కాల్పులు జరపొద్దని నా భద్రతా సిబ్బందికి చెప్పా’’ అని తెలిపారు. బంగ్లాదేశ్‌లో మహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. అక్కడ మైనార్టీలుగా ఉన్న హిందువులపై దాడులు అధికమయ్యాయి. దీనిని నిరసిస్తూ హిందువులు శాంతియుత నిరసనలు చేపట్టారు. అయితే ఇటీవల ఇస్కాన్ ప్రతినిధి చిన్మయ్ కృష్ణదాస్ అరెస్ఠ్తో ఈ ఆందోళనలు మరింత తీవ్రతరమయ్యాయి.అక్టోబరు 25న బంగ్లాదేశ్‌లోని ఢాకాలో జరిగిన ఓ ర్యాలీలో పాల్గొన్న కృష్ణదాస్.. ఆ దేశ జెండాను అగౌరవపరిచారన్న ఆరోపణలతో అదే నెల 30న కృష్ణదాస్‌తో పాటు 18 మందిపై కేసు నమోదు చేశారు. ఢాకా అంతర్జాతీయ విమానాశ్రయంలో కృష్ణదాస్‌ను అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలో చెలరేగిన ఘర్షణల్లో ఓ న్యాయవాది ప్రాణాలు కోల్పోయారు. ఆయనతో పాటు ఇస్కాన్‌తో సంబంధమున్న మరో 17మందికి బ్యాంకు ఖాతాల లావాదేవీలను నెల రోజుల పాటు నిలిపివేయాలని బ్యాంకులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలోనే బంగ్లాదేశ్‌లో హిందువులు, మైనారిటీలపై జరుగుతోన్న దాడులకు వ్యతిరేకంగా పలు సంఘాలు నిరసనలు చేపడుతున్నాయి. కాగా బంగ్లాదేశ్ పరధానిగా ఉన్న షేక్ హసీనా గత ఆగస్టులో తిరుగుబాటు, కుట్ర కారణంగా దేశం వీడి భారత్‌లో తలదాచుకుంటున్న విషయం తెలిసిందే. అనంతరం ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని మధ్యంతర ప్రభుత్వం దేశ బాధ్యతలను చేపట్టింది. తిరుగుబాటు సమయంలో జరిగిన మరణాలకు సంబంధించిన నేరాభియోగాలపై విచారణ నిమిత్తం హసీనాను అప్పగించాలని బంగ్లా డిమాండ్ చేస్తోంది. అమె అరెస్టుకు ఇంటర్ పోల్ సాయమూ కోరింది. -
బంగ్లాదేశ్‌కు ఐరాస దళాలు పంపాలి: మమతా డిమాండ్
కోల్‌కతా : పొరుగు దేశం బంగ్లాదేశ్‌లో జరుగుతున్న పరిణామాలపై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆందోళన వ్యక్తం చేశారు. అక్కడి పరిస్థితులను చక్కదిద్దే క్రమంలో తాత్కాలిక ప్రభుత్వంతో సహకరించేందుకు ఐరాస శాంతి పరిరక్షక దళాలను మోహరించాలన్నారు. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం ఐరా సలో ప్రయత్నాలు ప్రారంభించాలని సూచించారు. ప్రధాని మోదీ జోక్యం చేసుకుని విదేశీ గడ్డపై ఇబ్బందులు ఎదుర్కొంటున్న భారతీ యులను స్వదేశానికి తీసుకు రావాలన్నారు. బంగ్లాదేశ్‌లో పరిస్థితులపై మన వైఖరిని ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లో ప్రధాని మోదీ వివరించాలని, లేకుంటే విదేశాంగ శాఖ ఒక ప్రకటన చేయాలని కోరారు. మమతా బెనర్జీ సోమవారం రాష్ట్ర అసెంబ్లీలో మాట్లాడుతూ... ద్వైపాక్షిక అంశాలపై తాను మాట్లాడలేనని చెప్పారు. అయితే, అక్కడ చోటుచేసుకుంటున్న పరిణామాలు, అక్కడి నుంచి వచ్చిన బాధితులు, ఇస్కాన్ ప్రతినిధులు తెలిపిన వివరాల మేరకు అసెంబ్లీలో స్పందించాల్సి చచ్చిందన్నారు. బంగ్లాదేశ్‌లో దాడులకు గురైన భారతీయులకు అవసరమైతే పునరావాసం కల్పిస్తామని చెప్పారు. రాష్ట్రంలో ఆహార పదార్ధాలకు ఎటువంటి కొరత లేదన్నారు.వక్ఫ్ పేరుతో ముస్లింలను లక్ష్యంగా చేసుకుందిబీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన వక్ఫ్ సవరణ బిల్లుపై మమత అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ బిల్లు పేరుతో ముస్లింలను లక్ష్యంగా చేసుకుందని ఆరోపించారు. ముస్లింలను విభజించి ఏకాకులుగా మార్చేం దుకు ప్రయత్నిస్తోందన్నారు. ఈ విషయంలో రాష్ట్రాల ఆందోళనలను కేంద్రం పట్టించు కోవడం లేదన్నారు. హిందూ ఆలయ ట్రస్టులు, చర్చిల విషయంలోనూ బీజేపీ ప్రభుత్వం ఇలాగే జోక్యం చేసుకోగలడా అని ఆమె ప్రశ్నించారు. మూడింట రెండొంతుల మెజారిటీ లేని బీజేపీ పార్లమెంట్ లో ఈ బిల్లును ఆమోదింపజేసుకోగలదా అని ఆమె ప్రశ్నించారు. వక్ఫ్ బిల్లును వ్యతిరేకిస్తూ రాష్ట్ర అసెంబ్లీలో జరిగిన చర్చ సందర్భంగా ఆమె మాట్లాడారు. బిల్లుపై జేపీసీలో జరిగే చర్చల్లో ప్రతిపక్ష సభ్యులను బీజేపీ మాట్లాడనివ్వడం లేదని అందుకే టీఎంసీ ఆ కమిటీ నుంచి వైదొలగిందని వివరించారు. -
కాషాయం కట్టొద్దు.. తులసి మాల దాచేయండి: ఇస్కాన్ సూచన
కోల్‌కతా:‘కాషాయం ధరించడం మానుకోండి.. తిలకం పెట్టకండి.. తులసి జపమాల ఎవరికీ కనపడనీయకండి’.. ఇదీ కోల్‌కతాలోని ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్నెస్ (ఇస్కాన్) బంగ్లాదేశ్‌లోని హిందువులకు, కృష్ణ భక్తులకు ఇచ్చిన సలహా. ఇలా చేసినప్పుడే మతఛాందసవాదుల నుంచి రక్షించుకోగలుగుతారని ఇస్కాన్ అక్కడి హిందువులకు సూచించింది.ఇస్కాన్ కోల్‌కతా వైస్ ప్రెసిడెంట్ రాధారమణ్ దాస్.. బంగ్లాదేశ్‌లోని హిందువులు దేవాలయాలలో లేదా తమ ఇళ్లలో మాత్రమే తమ మతాచారాలను పాటించాలని, బయటకు వెళ్లేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఈ సంక్షోభ సమయంలో తమను తాము రక్షించుకునే దృష్టితో ఉండాలని ఆయన సలహా ఇచ్చారు. కాషాయ వస్త్రాలు ధరించవద్దని, నుదుటిపై తిలకం పెట్టుకోవద్దని రాధారమణ్ దాస్ సూచించారు. తులసిమాలను మెడలో ధరించాలనుకుంటే దానిని బయటకు కనిపించకుండా చూసుకోవాలని రాధారమణ్ దాస్ విజ్ఞప్తి చేసినట్లు ఓ ఆంగ్ల దినపత్రిక కథనం వెలువరించింది.బంగ్లాదేశ్‌లోని హిందువులు బయటకు సాధువులుగా కనిపించకుండా తమను తాము చూసుకోవాలని రాధారమణ్ దాస్ కోరారు. బంగ్లాదేశ్‌లో హిందూ మైనారిటీలు, ఇస్కాన్ సన్యాసులపై హింసాత్మక ఘటనలు పెరుగుతున్నాయి. ఇటీవల బంగ్లాదేశ్‌లో ఒక చట్టపరమైన కేసులో ఆధ్యాత్మికవేత్త చిన్మయ్ కృష్ణ దాస్‌ను అరెస్టు చేశారు. న్యాయవాది రమణ్‌రాయ్‌పై దాడి జరిగింది. అతని పరిస్థితి విషమంగా ఉందని ఆయన పేర్కొన్నారు.ఆధ్యాత్మిక బోధకుడు చిన్మయ్ కృష్ణ దాస్‌ను అక్టోబర్ 25న అరెస్టు చేసినప్పటి నుంచి బంగ్లాదేశ్‌లో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. చిట్టగాంగ్‌లో బంగ్లాదేశ్ జాతీయ జెండాపై కాషాయ జెండాను ఎగురవేసినందుకు ఆయనపై దేశద్రోహం కేసు నమోదైంది. దాస్ అరెస్టు అనంతరం నవంబర్ 27న చిట్టగాంగ్ కోర్ట్ బిల్డింగ్ ప్రాంతంలో పోలీసులకు, ఆధ్యాత్మిక గురువు అనుచరులకు మధ్య జరిగిన ఘర్షణలో ఒక న్యాయవాది మృతిచెందాడు.బంగ్లాదేశ్‌లో పెరుగుతున్న హింసాయుత ఘటనలపై భారతదేశం ఆందోళన వ్యక్తం చేసింది. బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా విశ్వహిందూ పరిషత్ (విహెచ్పీ) ప్రదర్శన నిర్వహించింది. ఈ సందర్భంగా వీహెచ్‌పీ నేతలు బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న దురాగతాలను అరికట్టేందుకు ఐక్యరాజ్యసమితి జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు. బంగ్లాదేశ్‌లోని హిందువులకు భద్రత కల్పించాలంటూ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ప్రదర్శన నిర్వహించారు.ఇది కూడా చదవండి: Bangladesh: చిన్మయ్ కృష్ణ దాస్ తరపు న్యాయవాదిపై దాడి.. పరిస్థితి విషమం -
Bangladesh: చిన్మయ్ కృష్ణ దాస్ తరపు న్యాయవాదిపై దాడి.. పరిస్థితి విషమం
ఢాకా: బంగ్లాదేశ్‌లో దేశద్రోహం ఆరోపణలపై అరెస్టయిన చిన్మయ్ కృష్ణ దాస్ బ్రహ్మచారి తరపు న్యాయవాది రమణ్ రాయ్‌పై దాడి జరిగిందని ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్నెస్(ఇస్కాన్) తెలిపింది.ఇస్కాన్ ప్రతినిధి రాధారమణ్ దాస్ ట్విట్టర్లో ఒక పోస్ట్‌లో ‘దయచేసి అడ్వకేట్ రమణ్ రాయ్ కోసం ప్రార్థించండి. అతను చేసిన ఒకేఒక తప్పు చిన్మయ్ కృష్ణ ప్రభు కోసం కోర్టులో వాదించడం. ఇస్లాంవాదులు అతని ఇంటిని ధ్వంసం చేసి, అతనిపై దాడి చేశారు, ప్రస్తుతం ఆయన ప్రాణాలతో పోరాడుతున్నారు’ అని రాశారు.Please pray for Advocate Ramen Roy. His only 'fault' was defending Chinmoy Krishna Prabhu in court.Islamists ransacked his home and brutally attacked him, leaving him in the ICU, fighting for his life.#SaveBangladeshiHindus #FreeChinmoyKrishnaPrabhu pic.twitter.com/uudpC10bpN— Radharamn Das राधारमण दास (@RadharamnDas) December 2, 2024బంగ్లాదేశ్‌కు చెందిన పలువురు న్యాయవాదులు ఈ ఘటనలను ఖండించారు. కాగా చిన్మయ్ కృష్ణ దాస్ తరపు న్యాయవాది హత్యకు గురయ్యాడంటూ గత నెలలో సోషల్ మీడియాతోపాటు కొన్ని వార్తా కథనాలలో కనిపించింది. అయితే ఈ ప్రస్తావనలో వచ్చిన లాయర్ పేరు సైఫుల్ ఇస్లాం అని విచారణలో తేలింది. ఆయన ప్రభుత్వం తరపు న్యాయవాది అని, అతను చిన్మోయ్ దాస్ కేసులో పోరాడలేదని సమాచారం.బంగ్లాదేశ్‌లోని ఇస్కాన్ టెంపుల్‌కు చెందిన సన్యాసి చిన్మయ్ కృష్ణ దాస్ బ్రహ్మచారి ఇటీవల రంగ్‌పూర్‌లో హిందువులకు మద్దతుగా జరిగిన నిరసనలకు నాయకత్వం వహించారు. ఆ తరువాత గత నెలలో ఢాకాలో పోలీసులు అతనిని అరెస్టు చేశారు. అతనిపై దేశద్రోహం అభియోగం మోపారు. ఈ నేపధ్యంలో ఢాకా కోర్టు అతనికి బెయిల్ నిరాకరించింది.బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా బహిష్కరణకు గురైనప్పటి నుండి, మైనారిటీలపై హింసాయుత ఘటనలు జరుగుతున్నాయి. అలాగే వీటిని నిరసిస్తూ పలు ప్రదర్శనలు కూడా జరుగుతున్నాయి. బంగ్లాదేశ్‌లోని ఛటోగ్రామ్‌లో చిన్మయ్ కృష్ణ దాస్ శిష్యులు ఇద్దరు అదృశ్యమయ్యారని రాధారమణ్ దాస్ గతంలో ఒక పోస్టులో తెలిపారు. కాగా బంగ్లాదేశ్‌లో హిందువుల అరెస్టులను భారత్ ఖండించింది. హిందువులు, ఇతర మైనారిటీలకు భద్రత కల్పించాలని బంగ్లాదేశ్ ప్రభుత్వాన్ని కోరింది.ఇది కూడా చదవండి: దూసుకొచ్చిన మృత్యువు -
విండీస్‌తో వన్డే సిరీస్‌కు బంగ్లా జట్టు ప్రకటన.. కెప్టెన్‌గా మెహిది హసన్
వెస్టిండీస్‌తో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ కోసం బంగ్లాదేశ్ జట్టును ఇవాళ (డిసెంబర్ 2) ప్రకటించారు. రెగ్యులర్ కెప్టెన్ నజ్ముల్ హసన్ షాంటో గాయం నుంచి పూర్తిగా కోలుకోకపోవడంతో ఈ సిరీస్‌కు బంగ్లా కెప్టెన్‌గా మెహిది హసన్ మిరాజ్ వ్యవహరించనున్నాడు. ఈ సిరీస్‌కు ముందు బంగ్లాదేశ్ జట్టును గాయాల సమస్య వేధిస్తుంది.సీనియర్ ఆటగాళ్లు ముష్ఫికర్ రహీం, తౌహిద్ హ్రిదోయ్ గాయాల కారణంగా ఈ సిరీస్‌కు దూరమయ్యారు. ఈ సిరీస్‌కు ముస్తాఫిజుర్ రహ్మాన్, జకీర్ హసన్‌ను ఎంపిక చేయలేదు. ముస్తాఫిజుర్ తన భార్య మొదటి బిడ్డకు జన్మనివ్వనుండటంతో స్వదేశానికి వెళ్లనున్నాడు. ఫామ్ లేమి కారణంగా జకీర్ హసన్‌ను ఈ సిరీస్‌కు ఎంపిక చేయలేదు. ఈ జట్టులో వికెట్‌కీపర్ బ్యాటర్ లిటన్ దాస్, పర్వేజ్ హొసేన్ ఎమోన్, అఫీఫ్ హొసేన్ ధృబో, హసన్ మహమూద్, తంజిమ్ హసన్ సకీబ్ చోటు దక్కించుకున్నారు. సీనియర్ ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్ కూడా ఈ సిరీస్‌కు దూరంగా ఉన్నాడు. విండీస్‌తో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ డిసెంబర్ 8, 10, 12 తేదీల్లో సెయింట్స్ కిట్స్ వేదికగా జరుగనుంది.విండీస్‌తో వన్డే సిరీస్‌కు బంగ్లాదేశ్ జట్టు..మెహిది హసన్ మిరాజ్ (కెప్టెన్), లిటన్ కుమార్ దాస్ (వికెట్‌కీపర్), తంజిద్ హసన్ తమీమ్, సౌమ్య సర్కార్, పర్వేజ్ హుస్సేన్ ఎమోన్, మహముదుల్లా, జాకర్ అలీ అనిక్, అఫీఫ్ హొస్సేన్ ధృబో, రిషద్ హుస్సేన్, నసుమ్ అహ్మద్, తస్కిన్ అహ్మద్, హసన్ మహమూద్, షొరీఫుల్ ఇస్లాం, తంజిమ్ హసన్ సకిబ్, నహిద్ రాణా -
వికెట్ తీసిన ఆనందంలో అతి చేశాడు.. మైదానంలో నుంచి మోసుకెళ్లారు..!
వికెట్ తీసిన ఆనందంలో బౌలర్లు సంబురాలు చేసుకోవడం సహజమే. అయితే ఓ బౌలర్ శృతి మించిన సంబురాలు అతన్ని మైదానంలో నుంచి మోసుకెళ్లేలా చేశాయి. వివరాల్లోకి వెళితే.. అండర్-19 ఆసియా కప్ టోర్నీలో ఆదివారం నేపాల్, బంగ్లాదేశ్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో నేపాల్ బౌలర్ యువరాజ్ ఖాత్రి వికెట్ తీసిన ప్రతిసారి అతి సంబురాలు చేసుకున్నాడు. A twist of fate 🫣When luck smiles and frowns at the same time 🤕 🙆♂️#SonySportsNetwork #AsiaCup #NewHomeOfAsiaCup pic.twitter.com/OmPn5KepPu— Sony Sports Network (@SonySportsNetwk) December 2, 2024ఓసారి సౌతాఫ్రికా బౌలర్ తబ్రేజ్ షంషిలా షూ తీసి చెవి దగ్గర ఫోన్లా పెట్టుకోగా.. మరోసారి తనను అభినందించేందుకు వచ్చిన సహచరులకు దొరకకుండా పరుగులు పెట్టాడు. ఇలా చేసే క్రమంలో యువరాజ్ కాలు మడత పడింది. నడవలేని స్థితిలో ఉన్న యువరాజ్‌ను మైదానంలో నుంచి భుజాలపై మోసుకెళ్లారు. ఈ తంతుకు సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరలవుతుంది.బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో యువరాజ్ 4 వికెట్లతో మెరిసినా నేపాల్ 5 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. తొలుత బ్యాటింగ్ చేసిన నేపాల్ 45.4 ఓవర్లలో 141 పరుగులకు ఆలౌట్ కాగా.. బంగ్లాదేశ్ 28.4 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.ఇదిలా ఉంటే, దుబాయ్ వేదికగా జరుగుతున్న అండర్-19 ఆసియా కప్‌లో భారత్ తమ తొలి మ్యాచ్‌లో పాకిస్తాన్ చేతిలో ఓటమిపాలైంది. టోర్నీలో భాగంగా ఇవాళ భారత్ జపాన్‌తో తలపడుతుంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన యంగ్ ఇండియా.. కెప్టెన్ మొహమ్మద్ అమాన్ సెంచరీ చేయడంతో నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 339 పరుగులు చేసింది. ఛేదనలో పూర్తిగా చేతులెత్తసిన జపాన్ 44 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 109 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఈ మ్యాచ్‌లో జపాన్ గెలవాలంటే 36 బంతుల్లో 231 పరుగులు చేయాల్సి ఉంది. -
టెస్ట్ క్రికెట్లో విండీస్ బౌలర్ అద్భుతం.. గడిచిన 46 ఏళ్లలో..!
టెస్ట్ క్రికెట్లో విండీస్ బౌలర్ జేడన్ సీల్స్ అద్భుతం చేశాడు. బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌లో సీల్స్ 15.5 ఓవర్లలో 10 మెయిడిన్లు వేసి కేవలం 5 పరుగులు మాత్రమే ఇచ్చి 4 వికెట్లు తీశాడు. గడిచిన 46 ఏళ్లలో టెస్ట్ క్రికెట్లో ఇదే అత్యంత పొదుపైన స్పెల్‌గా రికార్డులు చెబుతున్నాయి. JAYDEN SEALES BOWLED THE MOST ECONOMICAL SPELL IN TEST CRICKET IN LAST 46 YEARS:15.5-10-5-4. 🤯pic.twitter.com/CYoA6ljM6Y— Mufaddal Vohra (@mufaddal_vohra) December 2, 2024ఈ ఇన్నింగ్స్‌లో సీల్స్ ఎకానమీ రేట్ 0.31గా ఉంది. టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఇది ఏడో అత్యుత్తమ ఎకానమీ రేట్గా రికార్డుల్లోకెక్కింది. ఈ రికార్డును సాధించే క్రమంలో సీల్స్ దిగ్గజ బౌలర్ జిమ్ లేకర్ రికార్డును అధిగమించాడు. 1957లో సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో లేకర్ ఓవర్‌కు సగటున 0.37 పరగులిచ్చాడు. టెస్ట్ క్రికెట్ చరిత్రలో అత్యుత్తమ బౌలింగ్ సగటు భారత దిగ్గజ బౌలర్ బాపు నాదకర్ణి పేరిట ఉంది. నాదకర్ణి 1964లో ఇంగ్లండ్‌తో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో ఓవర్‌కు సగటున 0.15 పరుగులిచ్చాడు. ఈ ఇన్నింగ్స్‌లో నాదకర్ణి 32 ఓవర్లు వేసి కేవలం 5 పరుగులు మాత్రమే సమర్పించుకున్నాడు. ఇందులో 27 మెయిడిన్లు ఉన్నాయి.ఆల్‌టైమ్ రికార్డుటెస్ట్ క్రికెట్లో సీల్స్ అత్యంత పొదుపైన నాలుగు వికెట్ల (15.5-10-5-4) ఘనత సాధించిన బౌలర్‌గా రికార్డుల్లోకెక్కాడు. గతంలో ఈ రికార్డు పాక్‌కు చెందిన పర్వేజ్ సజ్జద్ పేరిట ఉండేది. 1965లో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో సజ్జద్ 12 ఓవర్లలో 8 మెయిడిన్లు వేసి 5 పరుగులు మాత్రమే ఇచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. ఈ ఇన్నింగ్స్‌లో సజ్జద్ సగటు 0.41 కాగా.. బంగ్లాతో మ్యాచ్‌లో సీల్స్ సగటు 0.31గా ఉంది.ఉమేశ్ యాదవ్ రికార్డు బద్దలు కొట్టిన సీల్స్1978 నుంచి టెస్ట్‌ల్లో అత్యంత పొదుపైన సగటు భారత పేసర్ ఉమేశ్ యాదవ్ పేరిట ఉండేది. 2015లో సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో ఉమేశ్ 0.42 సగటున బౌలింగ్ చేశాడు. ఆ మ్యాచ్‌లో 21 ఓవర్లు వేసిన ఉమేశ్ 9 పరుగులిచ్చి 3 వికెట్లు తీశాడు. ఇందులో 16 మెయిడిన్లు ఉన్నాయి. తాజాగా ఉమేశ్ రికార్డును సీల్స్ బద్దలు కొట్టాడు.కుప్పకూలిన బంగ్లాదేశ్జమైకా వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగతున్న రెండో టెస్ట్‌లో వెస్టిండీస్ పట్టు సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 71.5 ఓవర్లలో 164 పరుగులకు ఆలౌటైంది. జేడన్ సీల్స్ 4, షమార్ జోసఫ్ 3, కీమర్ రోచ్ 2, అల్జరీ జోసఫ్ ఓ వికెట్ తీసి బంగ్లా ఇన్నింగ్స్‌ను కుప్పకూల్చారు. బంగ్లా తరఫున షద్మాన్ ఇస్లాం (64), మెహిది హసన్ మిరాజ్ (36), షహాదత్ హొసేన్ దీపు (22), తైజుల్ ఇస్లాం (16) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన విండీస్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టానికి 70 పరుగులు చేసింది. మికైల్ లూయిస్ 12 పరుగులు చేసి ఔట్ కాగా.. క్రెయిగ్ బ్రాత్‌వైట్ (33), కీసీ కార్తీ (19) క్రీజ్‌లో ఉన్నారు. లూయిస్ వికెట్ నహిద్ రాణాకు దక్కింది. బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు విండీస్ ఇంకా 94 పరుగులు వెనుకపడి ఉంది. కాగా, రెండు మ్యాచ్‌ల ఈ టెస్ట్ సిరీస్‌లో వెస్టిండీస్ తొలి మ్యాచ్‌లో 201 పరుగుల తేడాతో నెగ్గింది.