Pakistan
-
పాక్ పర్యటనకు ఆస్ట్రేలియా.. షెడ్యూల్ విడుదల
ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు మరోసారి పాకిస్తాన్ పర్యటనకు సిద్ధమైంది. మే-జూన్ నెలల్లో జరిగే ఈ పర్యటనలో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ జరుగనుంది. ఈ సిరీస్‌కు సంబంధించిన షెడ్యూల్ ఇవాళ విడుదలైంది.తొలి వన్డే మే 30న రావల్సిండిలో జరుగనుండగా.. మిగతా వన్డేలు జూన్ 2, 4 తేదీల్లో లాహోర్‌లోని గడాఫీ స్టేడియంలో జరుగనున్నాయి. ఈ సిరీస్ కోసం ఆస్ట్రేలియా మే 23న ఇస్లామాబాద్ చేరుకోనుంది.స్టార్ ఆటగాళ్లపై సందేహాలుపాక్ సిరీస్ ఐపీఎల్ ముగింపు సమయానికి ప్రారంభమవుతుండటంతో ఆసీస్ ఆటగాళ్ల లభ్యతపై సందేహాలు నెలకొన్నాయి. కెప్టెన్ పాట్ కమిన్స్ సహా పలువురు సీనియర్ ఆటగాళ్ల అందుబాటుపై స్పష్టత లేదు.ప్రపంచకప్‌కు ముందు టీ20 సిరీస్ఆస్ట్రేలియా జట్టు ఈ ఏడాది జనవరిలో, టీ20 ప్రపంచకప్‌కు ముందు కూడా పాకిస్తాన్లో పర్యటించింది. ఆ పర్యటనలో 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడింది. ఆ సిరీస్‌ను పాక్ 3-0 తేడాతో క్లీన్ స్వీప్ చేయడం విశేషం.బంగ్లాదేశ్ చేతిలో ఓటమిఇటీవల పాక్ బంగ్లాదేశ్ చేతిలో 2-1 తేడాతో వన్డే సిరీస్ కోల్పోయింది. ఈ సిరీస్ కోసం పాక్ బంగ్లాదేశ్ పర్యటనకు వెళ్లింది.రేపటి నుంచి టెస్ట్ సిరీస్ప్రస్తుతం పాక్ జట్టు రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం బంగ్లాదేశ్‌లో పర్యటిస్తుంది. తొలి టెస్ట్ ఢాకా వేదికగా రేపటి నుండి ప్రారంభం కానుంది. రెండో టెస్ట్ సిల్హెట్ వేదికగా మే 16 నుండి మొదలవుతుంది.తర్వాత బంగ్లాదేశ్ టూర్పాకిస్తాన్ సిరీస్ అనంతరం ఆస్ట్రేలియా జట్టు జూన్ 9 నుంచి బంగ్లాదేశ్ పర్యటనకు వెళ్లనుంది. ఈ పర్యటనలో 3 వన్డేలు, 3 టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లు జరుగనున్నాయి. -
ఓపెనర్ల శతకాలు.. చారిత్రక విజయం సాధించిన పాక్
మహిళల క్రికెట్లో పాకిస్తాన్ అద్భుత విజయం సాధించింది. స్వదేశంలో జరిగిన వన్డేలో పసికూన జింబాబ్వేపై 206 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. పాక్ మహిళల క్రికెట్ చరిత్రలో పరుగుల పరంగా ఇదే అతి భారీ విజయం. ఈ గెలుపుతో పాక్ సిరీస్‌ను కూడా కైవసం చేసుకుంది.జింబాబ్వే తొలిసారి పాక్‌లో పర్యటిస్తున్న చారిత్రక సిరీస్ ఇది. ఈ పర్యటనలో జింబాబ్వే 3 వన్డేలు, 3 టీ20లు ఆడనుంది. వన్డే సిరీస్‌లో భాగంగా జరిగిన రెండో వన్డే ఇది. అంతకుముందు తొలి వన్డేలోనూ పాకిస్తానే విజయం సాధించింది (168 పరుగుల తేడాతో). ఫలితంగా మరో మ్యాచ్ మిగిలుండగానే 2-0తో సిరీస్‌ను కైవసం చేసుకుంది. నామమాత్రపు మూడో వన్డే కరాచీ వేదికగా మే 9న జరుగనుంది. అనంతరం 12, 14, 15 తేదీల్లో ఇదే కరాచీ వేదికగా మూడు టీ20లు జరుగనున్నాయి.ఓపెనర్ల శతకాలుతాజా వన్డేలో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 343 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఓపెనర్లు సదాఫ్ షమాస్ (101), గుల్ ఫెరోజా (100) సెంచరీలతో కదంతొక్కారు. వన్‌డౌన్ బ్యాటర్ సిద్రా అమీన్ (59 నాటౌట్) అర్ద సెంచరీతో రాణించింది. మిగతా బ్యాటర్లలో కెప్టెన్ ఫాతిమా సనా 25, ఆలియా రియాజ్ 27, అయేషా జాఫర్ 18 (నాటౌట్) పరుగులు చేశారు.కుప్పకూలిన జింబాబ్వేభారీ లక్ష్య ఛేదనలో జింబాబ్వే 137 పరుగులకే ఆలౌటైంది. ఫాతిమా సనా (6-0-15-3), మొమినా రియాసత్ (8-0-39-2), రమీన్ షమీమ్ (8-2-20-2), సయ్యదా అరూబ్ షా (6-1-18-2), డయానా బేగ్ (7-1-23-1) జింబాబ్వే పతనాన్ని శాశించారు. ఆ జట్టు తరఫున కెలిస్ (32), బిజా (29), పసిపనోద్యా (33 నాటౌట్), లిండోకుహ్లే (20) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. -
పాకిస్తాన్‌కు అమెరికా ఝలక్.. కీలక ప్రకటన
వాషింగ్టన్: దౌత్య సిబ్బంది భద్రత దృష్ట్యా పెషావర్‌లోని తమ కాన్సులేట్‌ను దశలవారీగా మూసివేస్తున్నట్లు అమెరికా ప్రకటించింది. ఖైబర్ పఖ్తూంఖ్వాలోని దౌత్య సంబంధాల సంబంధిత విషయాలను ఇస్లామాబాద్‌లోని యూఎస్ రాయబార కార్యాలయానికి బదిలీ చేస్తున్నట్లు మంగళవారం యూఎస్ విదేశాంగ శాఖ ప్రకటించింది. దౌత్య సిబ్బంది భద్రత, వనరులను సమర్థవంతంగా నిర్వహించడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటనలో పేర్కొంది.పెషావర్‌లో తమ కార్యాలయంను మార్చినప్పటికీ పాకిస్తాన్ విషయంలో అమెరికా ప్రభుత్వ విధాన ప్రాధాన్యతలు స్థిరంగానే ఉన్నాయని తెలిపింది. ఆర్థిక సంబంధాలను పెంపొందించడానికి, ప్రాంతీయ భద్రతను ప్రోత్సహించడానికి, అమెరికన్ ప్రజల ప్రయోజనాలను ముందుకు తీసుకెళ్లడానికి ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రజలు, అధికారులతో అమెరికా సంప్రదింపులు కొనసాగిస్తుందని స్పష్టం చేసింది. యూఎస్–పాకిస్తాన్ సంబంధాలను ఇస్లామాబాద్, కరాచీ, లాహోర్లలో ఉన్న తమ దౌత్య కార్యాలయాలు, పాకిస్తాన్‌లోని యూఎస్ మిషన్ ద్వారా ముందుకు తీసుకెళ్లడానికి శాఖ కట్టుబడి ఉందని పేర్కొంది.ఆఫ్ఘన్ సరిహద్దుకు సమీపంలో ఉన్న పెషావర్ కాన్సులేట్, ఆఫ్ఘనిస్తాన్‌కు సంబంధించిన అమెరికా కార్యకలాపాలలో ముఖ్య పాత్ర పోషించింది. ఒక కీలకమైన లాజిస్టికల్, దౌత్య కేంద్రంగా పనిచేసింది. ఆఫ్ఘనిస్తాన్‌కు భూమార్గాన్ని సులభతరం చేయడంతో పాటు, ఆ ప్రాంతంలోని అమెరికన్ పౌరులకు, ఆఫ్ఘన్ జాతీయులకు సహాయాన్ని అందించింది. ఈ కాన్సులేట్‌లో ప్రస్తుతం 18 మంది అమెరికన్ సిబ్బంది, 89 మంది స్థానిక సిబ్బంది పనిచేస్తున్నారు. -
భారత్ లేకుండా టోర్నీ.. పాక్ అభ్యర్ధనకు శ్రీలంక అంగీకారం
అంతర్జాతీయ వేదికపై భారత్‌కు వ్యతిరేకంగా శ్రీలంక క్రికెట్ బోర్డు సాహసోపేత నిర్ణయం తీసుకుంది. టీమిండియా లేకుండా పాకిస్తాన్‌తో వన్డే ట్రై సిరీస్ ఆడేందుకు అంగీకారం తెలిపింది. శ్రీలంక తీసుకున్న ఈ నిర్ణయం భారత్‌కు కాస్త కటువగా ఉండనుంది. ఎందుకంటే శ్రీలంక లాంటి మిత్రదేశం పాక్‌తో క్రికెట్ సంబంధాలు కొనసాగించడం బీసీసీఐకి ఇష్టం ఉండదు. పాక్ ఆతిథ్యమివ్వనున్న ఈ టోర్నీలో మూడో జట్టుగా ఇంగ్లండ్ ఉండనుంది. ఈ టోర్నీ అక్టోబర్-నవంబర్‌లో జరిగే అవకాశం ఉంది. ఈ టోర్నీకి వేదికలు ఖరారు కావాల్సి ఉంది. లాహోర్, కరాచీ పేర్లను పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఈ టోర్నీపై త్వరలో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.వచ్చే ఏడాది జరుగబోయే వన్డే ప్రపంచకప్‌కు సన్నాహకంగా ఈ టోర్నీని ప్లాన్ చేసుకున్నట్లు పాక్ క్రికెట్ వర్గాలు అంటున్నాయి. కాగా, 2027 వన్డే ప్రపంచకప్ దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా వేదికలుగా జరుగనున్న విషయం తెలిసిందే.ఇదిలా ఉంటే, పాక్‌లో ట్రై సిరీస్ కంటే ముందే శ్రీలంకతో టీ20 సిరీస్ జరుగనుంది. ట్రై సిరీస్ తర్వాత ఇరు జట్ల మధ్య డబ్ల్యూటీసీ 2025-27లో భాగంగా రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కూడా జరగాల్సి ఉంది. ఈ టెస్ట్ సిరీస్ నవంబర్‌లో జరిగే అవకాశం ఉంది.బంగ్లాదేశ్‌లో పర్యటించనున్న పాక్రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం పాక్ జట్టు బంగ్లాదేశ్‌లో పర్యటిస్తుంది. ఈ సిరీస్‌లోని తొలి టెస్ట్ మే 8 నుంచి ఢాకా వేదికగా జరుగనుంది. అనంతరం రెండో టెస్ట్ మే 16 నుంచి సిల్హెట్ వేదికగా జరుగనుంది.బంగ్లాదేశ్ సిరీస్ కోసం పాకిస్తాన్ జట్టు: షాన్ మసూద్ (సి), అబ్దుల్లా ఫజల్, అమద్ బట్, అజాన్ అవాయిస్, బాబర్ ఆజం, హసన్ అలీ, ఇమామ్-ఉల్-హక్, ఖుర్రం షాజాద్, మహ్మద్ అబ్బాస్, మహ్మద్ రిజ్వాన్ (wk), ముహమ్మద్ ఘాజీ ఘోరీ (wk), ముహమ్మద్ ఘాజీ ఘోరీ (wk), సాజిద్ ఖాన్, నౌమాన్ అలీ, సల్మాన అఘా, సౌద్ షకీల్, షాహీన్ అఫ్రిది -
పాక్‌తో ఆడేది లేదు.. వాళ్లకు మాత్రం మినహాయింపు!
పాకిస్తాన్‌తో ద్వైపాక్షిక సిరీస్‌లకు సంబంధించి భారత ప్రభుత్వం బుధవారం కీలక నిర్ణయం తీసుకుంది. పాకిస్తాన్‌తో ఎలాంటి ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడేది లేదని క్రీడాశాఖ మంత్రి మన్సుక్ మాండవీయ తెలిపారు. అయితే భారత్‌లో జరిగే మల్టీ నేషనల్ స్పోర్ట్స్ ఈవెంట్లో మాత్రం పాకిస్తాన్ అథ్లెట్లు పాల్గొనేందుకు అనుమతి ఇస్తున్నట్లు స్పష్టం చేసింది. ఈ మేరకు జాతీయ క్రీడా సమాఖ్య, ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్) సంయుక్తంగా సర్క్యులర్ విడుదల చేసింది. 2030 కామన్వెల్త్ గేమ్స్‌తో పాటు 2036 ఒలింపిక్స్‌ను నిర్వహణకు భారత్ ప్రయత్నిస్తున్న నేపథ్యంలో ఒలింపిక్ చార్టర్, అంతర్జాతీయ క్రీడా మార్గదర్శకాలను అనుసరించనున్నట్లు తెలిపింది. అయితే పాకిస్తాన్‌తో మాత్రం ఎలాంటి ద్వైపాక్షిక క్రీడా సంబంధాలు ఉండవని, అంతర్జాతీయ నిబంధనల ప్రకారం ఐసీసీ, ఒలింపిక్స్, కామన్వెల్త్, ఆసియా గేమ్స్ వంటి టోర్నీల్లో మాత్రమే భారత్, పాకిస్తాన్‌తో తలపడుతుందని క్రీడాశాఖ పునరుద్ఘాటించింది. తాజాగా విడుదల చేసిన సర్క్యులర్‌తో పాకిస్తాన్‌తో ప్రస్తుతం ఉన్న క్రీడా విధానం యథాతథంగా కొనసాగనుంది. దీంతో సమీప భవిష్యత్తులో అటు భారత్‌లో కానీ, ఇటు పాకిస్తాన్లో కానీ ఇరు దేశాల మధ్య క్రికెట్, హాకీ సహా ఇతర క్రీడా సిరీస్‌లు జరగవు. అయితే పాకిస్తాన్ అథ్లెట్లకు మాత్రం ఇందుకు మినహాయింపు ఉంటుందని, ఎందుకంటే వారి వ్యక్తిగత కెరీర్‌ను దెబ్బతీసే ఉద్దేశం తమకు ఎంతమాత్రం లేదని పేర్కొంది. భారత్‌లో జరిగే అథ్లెటిక్స్ ఈవెంట్లు ఏవైనా పాక్ అథ్లెట్లు పాల్గొనడానకి అవకాశమిస్తామని కేంద్ర క్రీడాశాఖ నొక్కి చెప్పింది. గతేడాది ఏప్రిల్‌లో పహల్గాం ఉగ్రదాడి ఘటనలో 26 మంది అమాయక ప్రాణాలు బలిగొన్న తర్వాత భారత్, పాకిస్తాన్ మధ్య సంబంధాలు మరింత క్షీణించాయి. నిజానికి 2008 ముంబై ఉగ్రదాడుల తర్వాత భారత్, పాకిస్తాన్ మధ్య ద్వైపాక్షిక క్రీడా సిరీస్‌లు పూర్తిగా నిలిచిపోయాయి. కేవలం ఐసీసీ టోర్నీల్లో మాత్రం భారత్, పాకిస్తాన్‌లు తలపడుతున్నాయి. చివరగా 2026 టీ20 ప్రపంచకప్‌లో పాక్‌తో మ్యాచ్ ఆడిన భారత్ ఘన విజయాన్ని సాధించింది.చదవండి: బ్యాటర్ల వెన్నులో వణుకు.. కనుమరుగవుతున్న యార్కర్లు! -
పాక్‌లో ప్రముఖ మతపెద్ద కాల్చివేత
పెషావర్: పాకిస్తాన్‌లోని ఖైబర్ ప్రావిన్స్‌లో మంగళవారం ప్రముఖ మతపెద్దను ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు కాల్చి చంపారు. చార్సద్దా జిల్లా ఉట్మన్జాయ్ ఏరియాలో మోటారు సైకిల్‌పై వచ్చిన దుండగులు షేక్ ఉల్ హదిత్ మౌలానా మహ్మద్ ఇద్రీస్ వాహనాన్ని అడ్డగించి, కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఆయన ఇద్దరు భద్రతా సిబ్బంది గాయపడ్డారు.తీవ్రంగా గాయపడిన ఇద్రీస్ ఆస్పత్రికి తరలిస్తుండగానే కన్నుమూశారు. గాయపడిన భద్రతా సిబ్బందికి ప్రమాదం తప్పిందని పోలీసులు తెలిపారు. దాడికి తమదే బాధ్యతని ఉగ్ర సంస్థ ఇస్లామిక్ స్టేట్ ఇన్ ఖొరాసాన్ ప్రావిన్స్(ఐఎస్కేపీ)ప్రకటించుకుంది. జమియత్ ఉలేమా–ఇ– ఇస్లామ్(ఎఫ్) చర్సద్దా జిల్లా చీఫ్‌గా ఉన్న ఇద్రిస్ ఆ పార్టీ చీఫ్ మౌలానా ఫజలుర్ రహా్మన్కు సన్నిహితుడు. -
చారిత్రక సిరీస్‌లో పసికూనపై పాకిస్తాన్ ప్రతాపం
జింబాబ్వే మహిళల క్రికెట్ జట్టు తొలిసారి పాకిస్తాన్లో పర్యటిస్తుంది. ఈ చారిత్రక పర్యటనలో భాగంగా జరిగిన తొలి మ్యాచ్‌లో పాకిస్తాన్ జట్టు జింబాబ్వేపై ప్రతాపం చూపింది. 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా కరాచీ వేదికగా ఇవాళ (మే 4) జరిగిన మ్యాచ్‌లో పాక్ 168 పరుగుల తేడాతో జింబాబ్వేను ఓడించింది.ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 330 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఓపెనర్ సదాఫ్ షమాస్ (98) తృటిలో సెంచరీ మిస్ కాగా.. మరో ఓపెనర్ గుల్ ఫిరోజా (50), వన్‌డౌన్ బ్యాటర్ సిద్రా అమీన్ (67), మిడిలార్డర్ బ్యాటర్ నజిహా అల్వి (56 నాటౌట్) అర్ద సెంచరీలతో రాణించారు. మిగతా బ్యాటర్లలో అయేషా జాఫర్ 3, ఆలియా రియాజ్ 2, కెప్టెన్ ఫాతిమా సనా 11 (నాటౌట్) పరుగులు చేశారు. జింబాబ్వే బౌలర్లలో ప్రెసియస్ మరంగే 3 వికెట్లతో రాణించగా.. కుద్జాయ్ చిగోరా, కెప్టెన్ నోమ్వెలో సిబండ తలో వికెట్ తీశారు.అనంతరం భారీ లక్ష్య ఛేదనలో పసికూన జింబాబ్వే చేతులెత్తేసింది. బిలవ్డ్ బిజా (53) మినహా ఎవరూ రాణించలేకపోయారు. ఓపెనర్ కెలిస్ (31) ఓ మోస్తరు స్కోర్ చేసింది. మిగతా ప్లేయర్లలో కెల్లీ (11), మెలిండ (10), సిబండ (17) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగలిగారు. పాక్ బౌలర్లలో ఫాతిమా సనా, తస్మియా రుబాబ్, సయ్యదా ఆరూబ్ షా తలో 2 వికెట్లు పడగొట్టగా.. మొమినా రియాసత్, నష్రా సంధు చెరో వికెట్ దక్కించుకున్నారు. ఈ సిరీస్‌లోని రెండో వన్డే ఇదే కరాచీ వేదికగా మే 6న జరుగనుంది. కాగా, వన్డే సిరీస్ అనంతరం ఇరు జట్ల మధ్య మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కూడా జరుగనుంది. -
బాబర్ ఆజమ్ జట్టుదే పాకిస్తాన్ సూపర్ లీగ్ టైటిల్
స్టార్ బ్యాటర్ బాబర్ ఆజమ్ నేతృత్వంలోని పెషావర్ జల్మీ పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 టైటిల్‌ను కైవసం చేసుకుంది. నిన్న (మే 3) జరిగిన ఫైనల్లో కొత్త ఫ్రాంచైజీ హైదరాబాద్ కింగ్స్‌మెన్‌పై 5 వికెట్ల తేడాతో గెలుపొంది, విజేతగా అవతరించింది. 2017 తర్వాత పెషావర్ గెలిచిన తొలి పీఎస్ఎల్ టైటిల్ ఇది. అలాగే కెప్టెన్‌గా బాబర్ ఆజమ్‌కు ఇది తొలి పీఎస్ఎల్ టైటిల్. పీఎస్ఎల్ ట్రోఫీని బాబర్ పీసీబీ అధ్యక్షుడు మొహిసిన్ నఖ్వీ చేతుల మీదుగా అందుకున్నాడు.లాహోర్‌లోని గడాఫీ స్టేడియం వేదికగా జరిగిన ఫైనల్లో టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేసిన పెషావర్, కింగ్స్‌మెన్‌ను 18 ఓవర్లలో 129 పరుగులకే కుప్పకూల్చంది. సైమ్ అయూబ్ (54) ఒంటరిపోరాటం చేయడంతో ఆ జట్టు ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది. పెషావర్ మీడియం పేసర్ ఆరోన్ హార్డీ 4 వికెట్లు తీసి కింగ్స్‌మెన్‌ను దారుణంగా దెబ్బకొట్టాడు. నహిద్ రాణా (4-1-22-2) అతనికి సహకరించాడు.అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనలో పెషావర్ సైతం తడబడింది. 40 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో ఆరోన్ హార్డీ బ్యాట్‌తోనూ నేనున్నానంటూ ముందుకొచ్చాడు. అజేయమైన అర్ద సెంచరీ (56) చేసి పెషావర్‌ను విజయతీరాలకు చేర్చాడు. అతనికి అబ్దుల్ సమద్ (48) సహకరించాడు. కింగ్స్‌మెన్ బౌలర్లలో మొహమ్మద్ అలీ 3 వికెట్లు తీసి పెషావర్‌ను ఇబ్బంది పెట్టాడు. తొలుత బంతితో, ఆతర్వాత బ్యాట్‌తో సత్తా చాటిన హార్డీకి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.కాగా, పెషావర్ టైటిల్ సాధించడంతో బాబర్ ఆజమ్ కెప్టెన్‌గానే కాకుండా ఆటగాడిగానూ కీలకపాత్ర పోషించాడు. ఈ సీజన్‌కు ముందు పేలవ ఫామ్‌లో ఉండిన అతను.. సీజన్ పూర్తయ్యే సరికి లీడింగ్ రన్ స్కోరర్‌గా నిలిచి తన జట్టు ప్రతి విజయంలో కీలక పాత పోషించాడు. ఈ సీజన్లో బాబర్ 11 మ్యాచ్‌ల్లో 2 సెంచరీలు, 3 అర్ద సెంచరీల సాయంతో 588 పరుగులు చేశాడు. పీఎస్ఎల్ చరిత్రలో ఓ ఆటగాడు ఇన్ని పరుగులు చేయడం ఇదే మొదటిసారి. -
పాకిస్తాన్ లో ఉగ్రవాదులు ఖతం.. దురంధర్ పనేనా..?
-
ఇండియాతో పోలిక.. పాకిస్తాన్ పరువు తీసిన కియోసాకి
ఇరాన్ యుద్ధ మేఘాల నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు మండిపోతుంటే, పొరుగు దేశాలైన భారత్, పాకిస్తాన్ల మధ్య ఉన్న ఆర్థిక వ్యత్యాసం స్పష్టంగా కనిపిస్తోంది. ప్రఖ్యాత ఆర్థిక నిపుణుడు, ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ (Rich Dad Poor Dad) పుస్తక రచయిత రాబర్ట్ కియోసాకి (Robert Kiyosaki) తాజాగా పాకిస్తాన్ ఎదుర్కొంటున్న ఇంధన సంక్షోభంపై సోషల్ మీడియా వేదికగా ఆసక్తికర విశ్లేషణ చేశారు. భారత్ తన దూరదృష్టితో సంక్షోభాన్ని తట్టుకుంటుంటే, పాకిస్తాన్ అబద్ధపు ప్రచారాలతో పీకల్లోతు కష్టాల్లో మునిగిపోయిందని ఆయన ఎత్తిచూపారు.పాక్ వద్ద ఒక్క రోజు నిల్వలు కూడా లేవు!పాకిస్తాన్ పెట్రోలియం మంత్రి అలీ పర్వేజ్ మాలిక్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలను కియోసాకి తన ఫేస్బుక్ పోస్ట్‌లో ప్రస్తావించారు. ఇస్లామాబాద్ వద్ద కనీసం ఒక్క రోజుకు సరిపడా ‘వ్యూహాత్మక చమురు నిల్వలు’ కూడా లేవని మాలిక్ అంగీకరించారు.కియోసాకి ఏమన్నారంటే‘న్యూఢిల్లీ తన అత్యవసర నిల్వలను పెంచుకోవడంలో నిమగ్నమైతే, ఇస్లామాబాద్ మాత్రం తమ చమురు సరఫరా సురక్షితంగా ఉందని ప్రపంచాన్ని నమ్మించే పనిలో ఉంది. కానీ వాస్తవం వేరు. భారత్‌లో పెట్రోల్ ధరలు స్థిరంగా ఉంటే, పాకిస్తాన్లో ఇంధన ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి’పాక్‌లో భగ్గుమంటున్న ధరలుఏప్రిల్ ప్రారంభం నుండి పాకిస్తాన్లో ఇంధన ధరలు సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్నాయి. పెట్రోల్ లీటరుకు రూ.321 నుండి ఏకంగా రూ.458కి (43% పెరుగుదల) చేరింది. డీజిల్ లీటరుకు రూ.335 నుండి రూ.520కి (55% పెరుగుదల) పెరిగింది. ఈ అస్థిరత వల్ల దేశంలో సరఫరా గొలుసు విచ్ఛిన్నమై, నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ప్రతిపక్షాలు దీనిని ‘జాతీయ అత్యవసర పరిస్థితి’గా అభివర్ణిస్తున్నాయి.భారత్ విజయం వెనుక రహస్యం..భారత్ ఈ స్థాయి సంక్షోభాన్ని ఎలా తట్టుకోగలుగుతుందో వివరిస్తూ కియోసాకి కీలక విషయాలు వెల్లడించారు. భారత్ నిర్మించున్న వ్యూహాత్మక నిల్వలు 60 నుండి 70 రోజులకు సరిపోతాయి. ప్రభుత్వం కేవలం ‘ఒక సంతకం’తో ఈ అత్యవసర చమురును విడుదల చేసి మార్కెట్‌ను స్థిరీకరించగలదు.భారత్ కేవలం గల్ఫ్ దేశాలపైనే కాకుండా రష్యా, వెనిజులా వంటి దేశాల నుండి చమురు దిగుమతులను పెంచుకుని తన నెట్‌వర్క్‌ను విస్తరించింది. ప్రపంచంలోనే నాల్గవ అతిపెద్ద చమురు శుద్ధి దేశంగా ఉన్న భారత్, ఎగుమతి సుంకాలను సర్దుబాటు చేస్తూ దేశీయ ధరలు పెరగకుండా అడ్డుకోగలిగింది.పాక్ మంత్రి నిస్సహాయతపాకిస్తాన్ పెట్రోలియం మంత్రి అలీ పర్వేజ్ మాలిక్ కూడా భారత్ సన్నద్ధతను ప్రశంసించక తప్పలేదు. "భారత్ వద్ద 600 బిలియన్ డాలర్ల విదేశీ మారక నిల్వలు ఉండటమే కాకుండా, వారు ఐఎంఎఫ్ (IMF) కఠిన నిబంధనల కింద లేరు. అందుకే వారు పన్నులు తగ్గించి ప్రజలకు ఉపశమనం కలిగించగలుగుతున్నారు. కానీ మేము ప్రతి పైసా కోసం ఐఎంఎఫ్ అనుమతి తీసుకోవాల్సి వస్తోంది" అని ఆయన వాపోయారు.యుద్ధం ఈ ఆర్థిక అంతరాన్ని సృష్టించలేదని, కేవలం ఇరు దేశాల మధ్య ఉన్న సన్నద్ధత లోపాన్ని బయటపెట్టిందని కియోసాకి విశ్లేషించారు. హోర్ముజ్ జలసంధి మూతపడితే, దిగుమతులపైనే ఆధారపడ్డ పాకిస్తాన్ మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుందని ఆయన హెచ్చరించారు. -
ఐసీసీ వార్షిక టెస్ట్ ర్యాంకింగ్స్ విడుదల
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ఇవాళ (మే 1) వార్షిక టెస్ట్ ర్యాంకింగ్స్ జాబితాను విడుదల చేసింది. ఇందులో ఆస్ట్రేలియా టాప్ ప్లేస్‌ను నిలబెట్టుకోగా.. భారత్ మూడో స్థానంలో నిలిచింది. పాక్ జట్టు ఓ స్థానం మెరుగుపర్చుకొని, ఆరో స్థానానికి ఎగబాకింది.సౌతాఫ్రికా రెండో స్థానంలో.. ఇంగ్లండ్, న్యూజిలాండ్ నాలుగు, ఐదు స్థానాల్లో నిలువగా.. శ్రీలంక, వెస్టిండీస్, బంగ్లాదేశ్, ఐర్లాండ్, జింబాబ్వే, ఆఫ్ఘనిస్తాన్ జట్లు వరుసగా 7 నుంచి 12 స్థానాల్లో ఉన్నాయి.అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్న ఆస్ట్రేలియాఆస్ట్రేలియా పురుషుల క్రికెట్ జట్టు అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. పాట్ కమిన్స్ సారథ్యంలో ఆసీస్ గతేడాది అద్భుత ప్రదర్శన చేసింది. 12 టెస్టుల్లో 10 విజయాలు సాధించి నంబర్‌వన్‌గా నిలిచింది.సౌతాఫ్రికా జట్టు రెండో స్థానాన్ని దక్కించుకుంది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ విజయంతో ప్రోటీస్ తమ స్థాయిని మరింత పెంచుకుంది.భారత్ మూడో స్థానంగతేడాది నుంచి భారత్ 10 టెస్టులు ఆడి నాలుగు మాత్రమే గెలిచింది. ఐదు మ్యాచ్‌ల్లో ఓడిపోయి, ఒకటి డ్రా చేసుకుంది. అయినప్పటికీ, 104 రేటింగ్ పాయింట్లతో ఇంగ్లండ్‌ను వెనక్కి నెట్టి మూడో స్థానాన్ని కాపాడుకుంది. ఇంగ్లండ్ 102 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉంది.పాకిస్తాన్‌కు లబ్దిషాన్ మసూద్ నేతృత్వంలోని పాకిస్తాన్, ఇటీవల పెద్దగా రాణించకపోయినా పాత ఫలితాల వెయిటేజ్ తగ్గడంతో శ్రీలంకను అధిగమించింది. దీంతో ఆ జట్టు ఐదో స్థానానికి ఎగబాకింది.ఐసీసీ మహిళల వన్డే వార్షిక ర్యాంకింగ్స్‌ను కూడా ఇదే సందర్భంగా విడుదల చేసింది. ఈ విభాగంలోనూ ఆస్ట్రేలియా టాప్ ర్యాంక్‌ను నిలబెట్టుకోగా.. ఇంగ్లండ్, భారత్, సౌతాఫ్రికా, న్యూజిలాండ్, శ్రీలంక, బంగ్లాదేశ్, పాకిస్తాన్, వెస్టిండీస్, ఐర్లాండ్, స్కాట్లాండ్, జింబాబ్వే, పపువా న్యూగినియా, యూఏఈ ఆతర్వాతి స్థానాల్లో ఉన్నాయి. -
ఇకనైనా హింస ఆపాలి
శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లో హింసకు అంతం పలకాలని నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా పాకిస్తాన్‌కు పిలుపునిచ్చారు. ఇప్పటివరకు జరిగిన నష్టం జరిగిందని, ఇకనైనా హింసను ఆపాలని సూచించారు. ‘మేం ఉగ్రవాదాన్ని ఎప్పటికీ ప్రోత్సహించం. భవిష్యత్తులో అలాంటి ఏ యుద్ధంలోనూ భాగం కాబోం. పాకిస్తాన్ ఈ విషయాన్ని గ్రహించిందని ఆశిస్తున్నాను. మేం శాంతిని ప్రేమించే ప్రజలం. శాంతి నెలకొనాలని కోరుకుంటున్నాం. ఇక చాలు... ఈ హింసకు ముగింపు పలకండి’అని ఫరూక్ అబ్దుల్లా విజ్ఞప్తి చేశారు. అప్పుడే రెండు ప్రాంతాల ప్రజలు గౌరవంగా, హుందాగా జీవించడానికి సాధ్యమవుతుందన్నారు. ఇప్పటికే ఉగ్రవాదం చాలా తగ్గినప్పటికీ, జమ్మూకశ్మీర్‌ను భారత్‌లో అంతర్భాగంగా పాక్ అంగీకరించకపోవడమే నానాటికి హింసను పెంచుతోందని మాజీ ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. గతేడాది పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడి ఈ శాంతి పునరుద్ధరణ ప్రయత్నాలకు పెద్ద ఎదురుదెబ్బన్నారు. ఈ బాధను ఆతీ్మయులను కోల్పోయిన కుటుంబాలు మాత్రమే కాదు, జమ్మూకశ్మీర్ ప్రజలు కూడా అనుభవించారని ఫరూక్ అబ్దుల్లా గుర్తు చేశారు. ఈ దాడికి నిరసనగా స్థానిక ప్రజలు స్వచ్ఛందంగా వీధుల్లోకి రావడం జమ్మూకశ్మీర్ ఉగ్రవాదాన్ని తిరస్కరిస్తుందని చెప్పడానికి సంకేతమని, హింసకు అంతం కావాలని పాకిస్తాన్‌కు కశ్మీర్ లోయ ప్రజలు సందేశం పంపారని చెప్పారు. ఇరు దేశాలు హింసను విడిచి పెట్టి, శాంతిమార్గాన్ని అన్వేషించడానికి సమయం ఆసన్నమైందన్నారు.భిన్నత్వంలో ఏకత్వమే మన బలం.. దేశంలో పెరిగిన మతతత్వ ధోరణులపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. రాజకీయ అధికారం కోసం మత ప్రాతిపదికన ప్రజలను విభజించే ధోరణి జమ్మూకశ్మీర్‌కే కాదు, యావత్ దేశ స్థిరత్వానికి కూడా ప్రమాదకరమని ఆయన హెచ్చరించారు. జమ్మూకశ్మీర్ నుంచి తమిళనాడు వరకు ప్రాంతాల మధ్య భాష, సంస్కృతిలో అపారమైన వ్యత్యాసాలు ఉన్నాయని, భిన్నత్వంలో ఏకత్వమే దేశ బలమని ఆయన గుర్తు చేశారు. దేశ ప్రజలు ఐక్యంగా ఉంటేనే విశ్వగురువులం అవుతామని, ఒకరికొకరు సాయం చేసుకోవాలనే సామూహిక సంకల్పమే దేశాన్ని కలిపి ఉంచుతుందని ఫరూక్ అబ్దుల్లా నొక్కి చెప్పారు. యుద్ధాలు సమస్యలకు పరిష్కారం కాదని, అవి సమస్యను మరింత పెంచుతాయని అభిప్రాయపడ్డారు. రష్యా–ఉక్రెయిన్, పశి్చమ ఆసియా యుద్ధం వంటి ప్రపంచ సంఘర్షణలు ద్రవ్యోల్బణాన్ని విపరీతంగా పెంచి, పేదరికాన్ని మరింత తీవ్రతరం చేస్తాయని హెచ్చరించారు. -
‘పాక్‌లో జమ్మూ?’.. నాలిక్కరుచుకుని నేపాల్ క్షమాపణలు!
న్యూఢిల్లీ: భారతదేశంలో అంతర్భాగమైన జమ్మూ కాశ్మీర్‌ను పాకిస్తాన్ మ్యాప్‌లో చూపిస్తూ నేపాల్ ఎయిర్‌లైన్స్ చేసిన ఒక ఘోరమైన తప్పిదం తీవ్ర దుమారాన్ని రేపింది. ఈ వివాదాస్పద ‘నెట్వర్క్ మ్యాప్’ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పాటు నెటిజన్ల నుంచి తీవ్ర ఆగ్రహ జ్వాలలు పెల్లుబికాయి. తప్పు తెలుసుకున్న నేపాల్ ఎయిర్‌లైన్స్ ఎట్టకేలకు దిగివచ్చి, భారత్‌ను క్షమాపణలు కోరింది.సోషల్ మీడియాలో తీవ్ర దుమారంనేపాల్కు చెందిన అధికారిక విమానయాన సంస్థ ‘నేపాల్ ఎయిర్‌లైన్స్’ సోషల్ మీడియా ఖాతాల్లో పంచుకున్న ఒక మ్యాప్ తీవ్ర వివాదానికి దారితీసింది. ఆ నెట్వర్క్ మ్యాప్‌లో జమ్మూకశ్మీర్ ప్రాంతాన్ని పాకిస్తాన్లో ఉన్నట్లుగా చూపించారు. ఈ మ్యాప్‌ను గమనించిన భారతీయులు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఊహించని ఈ పరిణామంతో అప్రమత్తమైన సంస్థ, తీవ్ర వ్యతిరేకత రావడంతో బుధవారం నాడే ఆ వివాదాస్పద పోస్ట్‌ను సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల నుండి ఆఘమేఘాల మీద తొలగించింది.బహిరంగ క్షమాపణలు చెబుతూ..ఈ ఘోర తప్పిదంపై గురువారం నాడు నేపాల్ ఎయిర్‌లైన్స్ అధికారికంగా ‘ఎక్స్’ వేదికగా స్పందించింది. ‘మా సోషల్ మీడియాలో ఇటీవల పంచుకున్న నెట్వర్క్ మ్యాప్‌లో దొర్లిన తప్పుకు మేము హృదయపూర్వకంగా క్షమాపణలు కోరుతున్నాం. అంతర్జాతీయ సరిహద్దులకు సంబంధించి.. మ్యాప్‌లో ఉన్న భౌగోళిక దోషాలు నేపాల్ దేశపు అధికారిక వైఖరిని లేదా నేపాల్ ఎయిర్‌లైన్స్ అభిప్రాయాన్ని ఏమాత్రం ప్రతిబింబించవు’ అని స్పష్టం చేసింది.లోపాలను సరిదిద్దే పనిలో అంతర్గత విచారణతాము వెంటనే ఆ వివాదాస్పద పోస్ట్‌ను తొలగించామని, భవిష్యత్తులో ఇలాంటి పొరపాట్లు జరగకుండా అత్యున్నత ప్రమాణాలు పాటించేలా అంతర్గత విచారణ జరుపుతున్నామని సంస్థ వెల్లడించింది. ‘పొరుగు దేశాలతో, స్నేహితులతో మాకున్న బలమైన సంబంధాలను మేము ఎంతో గౌరవిస్తాం. ఈ పోస్ట్ వల్ల ఎవరి మనోభావాలైనా దెబ్బతిని ఉంటే మేము చింతిస్తున్నాం’ అని నేపాల్ ఎయిర్‌లైన్స్ ఒక ప్రకటనలో వివరించింది.ఇది కూడా చదవండి: ‘ఒరేయ్ సూరీడూ... ఉల్లికి లొంగిపోతావురా’? -
యుద్ధంతో పాక్ ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం: షెహబాజ్
ఇస్లామాబాద్: అమెరికా–ఇరాన్ యుద్ధం పరోక్షంగా పాకిస్తాన్ ఆర్థికవ్యవస్థ ప్రగతికి ప్రతిబంధకంగా నిల్చిందని పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఆవేదన వ్యక్తంచేశారు. ‘‘యుద్ధంకారణంగా విదేశాల నుంచి చమురు దిగుమతుల కోసం పెద్దమొత్తంలో విదేశీమారక ద్రవ్యాన్ని ఖర్చుచేయాల్సి వస్తోంది. గతంలో క్రూడాయిల్ దిగుమతుల కోసం వారంలో 30 కోట్ల డాలర్లు ఖర్చయ్యేది. ఇప్పుడది ఏకంగా 80 కోట్ల డాలర్లకు పెరిగింది. చమురు సంక్షోభాన్ని కట్టడిచేసేందుకు ప్రత్యేక కార్యదళాన్ని ఏర్పాటుచేశాం’’ అని బుధవారం కేబినెట్ సమావేశంలో షెహబాజ్ వెల్లడించారు. చర్చల్లో మధ్యవర్తిగా పాక్ అద్భుతమైన పాత్ర పోషిస్తోందని, కాల్పుల విరమణ గడువు పొడిగించడంలో పాక్ చేసిన కృషి దాగి ఉందని ఆయన అన్నారు. -
యూఏఈ సంచలన నిర్ణయం.. పాకిస్తాన్‌కు బిగ్ షాక్!
ఇరాన్, అమెరికా మధ్య చర్చలు జరుగుతున్న వేళ పశ్చిమాసియాలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. గల్ఫ్ దేశమైన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(UAE) సంచలన నిర్ణయాన్ని ప్రకటించింది. చమురు ఉత్పత్తి చేసే దేశాల కూటమి అయిన ఆర్గనైజేషన్ ఆఫ్ ది పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్-ఒపెక్ (OPEC), ఒపెక్+ (OPEC+) నుంచి బయటకు వచ్చేస్తున్నట్టు తాజాగా ఓ ప్రకటనలో తెలిపింది. అయితే, దీనికి సౌదీ అరేబియా, పాకిస్తానే ప్రధాన కారణమని తెలుస్తోంది. ఇదే సమయంలో పాకిస్తాన్‌కు యూఏఈ ఊహించని షాకిచ్చింది.కాగా, మే 1 నుంచి ఈ నిర్ణయం అమల్లోకి రానుంది. ఒపెక్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా బాధ్యతాయుతంగా వ్యవహరిస్తామని యూఏఈ తెలిపింది. మార్కెట్ డిమాండ్, పరిస్థితులకు అనుగుణంగా చమురు ఉత్పత్తిని క్రమంగా పెంచుతామని యూఏఈ ప్రభుత్వం స్పష్టం చేసింది. దేశీయ ఇంధన ఉత్పత్తిపై పెట్టుబడులను మరింత వేగవంతం చేస్తామని వెల్లడించింది. ఈ నిర్ణయం చమురు ఎగుమతి దేశాల కూటమికి, దానికి నాయకత్వం వహిస్తున్న సౌదీ అరేబియాకు ఇది అతిపెద్ద దెబ్బ అయ్యే అవకాశం ఉంది. ఒపెక్‌కు ఝలక్..1967లో యూఏఈ ఒపెక్ కూటమిలో చేరింది. ఒపెక్‌లో సౌదీ అరేబియా, ఇరాక్ తర్వాత మూడో అతిపెద్ద చమురు ఎగుమతిదారుగా ఉంది. ఒపెక్ నిర్ణయాల్లో కీలకంగా వ్యవహరిస్తూ వస్తోంది. సుదీర్ఘ కాలంపాటు సభ్యదేశంగా కొనసాగిన యూఏఈ.. అనూహ్యంగా ఈ నిర్ణయం తీసుకోవడం ప్రపంచ దేశాలను షాక్‌కు గురి చేసింది. దీనివల్ల భవిష్యత్‌లో ఒపెక్ బలహీనం అవుతుందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఇప్పటికే హార్మూజ్ మూసివేతతో చమురు ఎగుమతిలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఒపెక్ దేశాలకు.. యూఏఈ రూపంలో మరో షాక్ తగిలింది. దేశ ప్రయోజనాల రీత్యా ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలిపినప్పటికీ సౌదీ, పాకిస్తానే ఇందుకు ప్రధాన కారణమని తెలుస్తోంది. ఇటీవల జరిగిన ఇరాన్ దాడులు కూడా ఇందులో మరో కారణంగా విశ్లేషకులు చెబుతున్నారు.ఇరాన్ ఎఫెక్ట్.. ఇరాన్ దాడుల విషయంలో సౌదీ అరేబియా వంటి తన ప్రాంతీయ మిత్రదేశాలు సరైన రీతిలో స్పందించకపోవడం పట్ల యూఏఈ అసంతృప్తితో ఉంది. ఈ నేపథ్యంలో ఒపెక్ నుంచి యూఏఈ బయటకు వచ్చిందనే వాదన కూడా ఉంది. అలాగే, గల్ఫ్ ప్రాంతంలో యూఏఈ, సౌదీ అరేబియా, పాకిస్తాన్ మధ్య సంబంధాలు గత కొన్నేళ్లుగా మారుతూ వచ్చాయి. ఇటీవల ఇరాన్ యుద్ధం దాడుల సందర్భంగా యూఏఈపై ఇరాన్ ఇటీవల 537 బాలిస్టిక్ క్షిపణులు, 26 క్రూయిజ్ మిసైళ్లు, 2,256 డ్రోన్లతో దాడులు చేసింది. ఈ దాడులు యూఏఈ మౌలిక వసతులను తీవ్రంగా దెబ్బతీశాయి. ఈ క్రమంలో అమెరికా మరియు ఇజ్రాయెల్‌తో కలిసి ఇరాన్‌పై చర్యలు చేపట్టింది కానీ ప్రతిగా ఎక్కువ నష్టాన్ని చవిచూసింది. ఇదే సమయంలో పాకిస్తాన్ మధ్యవర్తి వ్యవహారంపై యూఏఈ ఆగ్రహం వ్యక్తం చేసింది.పాకిస్తాన్ పాత్ర..అమెరికా–ఇరాన్ మధ్య మధ్యవర్తిగా పాకిస్తాన్ వ్యవహరించింది.యూఏఈ మాత్రం పాకిస్తాన్ ఇరాన్‌పై కఠిన వైఖరి తీసుకోవాలని కోరింది.పాకిస్తాన్ తటస్థంగా ఉండటంతో యూఏఈ అసంతృప్తి చెందింది.ప్రతిగా యూఏఈ $3.5 బిలియన్ రుణం తక్షణమే తిరిగి చెల్లించమని డిమాండ్ చేసింది.దీంతో, 2026 ఏప్రిల్‌లో పాకిస్తాన్ యూఏఈకి $3.45 బిలియన్ రుణం తిరిగి చెల్లించింది.ఇందులో $1 బిలియన్ అబుదాబి ఫండ్ ఫర్ డెవలప్మెంట్కి చెల్లించబడింది.ఇది పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థకు పెద్ద దెబ్బగా మిగిలింది.యూఏఈలో 1.6 మిలియన్‌కి పైగా పాకిస్తానీలు నివసిస్తున్నారు.వీరి రిమిటెన్సులు పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థకు కీలకం.తాజాగా యూఏఈ, పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో ఇది పాకిస్తానీలకు ఎదురుదెబ్బ కానుంది.సౌదీ-పాకిస్తాన్ బంధం..యూఏఈ డిమాండ్ తర్వాత సౌదీ అరేబియా వెంటనే పాకిస్తాన్‌కు $3 బిలియన్ రుణం ఇచ్చింది.అదనంగా $5 బిలియన్ క్రెడిట్ లైన్ వాగ్దానం చేసింది.అంతకుముందు 2025లో సౌదీ–పాకిస్తాన్ రక్షణ ఒప్పందం కుదిరింది.ఈ ఒప్పందం ప్రకారం పాకిస్తాన్ తన అణు ఆయుధాలు, క్షిపణులు సౌదీ రక్షణ కోసం ఉపయోగించగలదు.దీంతో, పాకిస్తాన్ తనను పక్కన పెట్టినట్లు యూఏఈ భావించింది.యూఏఈ నిర్ణయం ప్రభావం..ఆర్థికంగా: యూఏఈ ఇకపై రోజుకు 3 మిలియన్ బ్యారెల్స్ ఉత్పత్తిని కోటా పరిమితులు లేకుండా పెంచుకోగలదు.రాజకీయంగా: ఇది సౌదీ ఆధిపత్యానికి బహిరంగ సవాలు.ప్రపంచవ్యాప్తంగా: అమెరికా, చైనా, రష్యా తమ వ్యూహాలను మళ్లీ ఆలోచించాల్సి వస్తుంది. పశ్చిమాసియాలో యూఏఈ తన స్వతంత్ర విదేశాంగ విధానాన్ని అనుసరించడానికి ఎక్కువగా ప్రయత్నిస్తోంది. 2015లో ఇరాన్ మద్దతు ఉన్న యెమెన్ హౌతీ తిరుగుబాటుదారులకు వ్యతిరేకంగా పోరాడటానికి యూఏఈ, సౌదీ అరేబియా కలిసి ఒక కూటమిగా ఏర్పడ్డాయి. అయితే, యూఏఈ మద్దతు ఉన్న యెమెన్ వేర్పాటువాదులకు ఆయుధాల రవాణా జరుగుతోందని ఆరోపిస్తూ సౌదీ అరేబియా బాంబు దాడి చేయడంతో కూటమిలో విభేదాలు తలెత్తాయి. కాలక్రమేణా రియాద్ కొన్ని వైఖరులకు విరుద్ధంగా ఉంది. గత కొన్నేళ్లుగా అమెరికా తన చమురు ఉత్పత్తిని పెంచుకోవడంతో వియన్నా కేంద్రంగా పనిచేసే 'ఒపెక్' మార్కెట్ పవర్ క్రమంగా తగ్గుముఖం పట్టింది.ఇదిలా ఉండగా.. యూఏఈకి భారత్‌తో బలమైన సంబంధాలు ఉన్నాయి. అయితే, సౌదీ అరేబియా, పాకిస్తాన్ మరియు టర్కీ ఒక కూటమిగా ఏర్పడుతున్నాయి. వారి మధ్య త్రైపాక్షిక సైనిక ఒప్పందంపై చర్చ జరుగుతోంది.భారత్‌కి అవకాశాలు:తక్కువ ధరలు: యూఏఈ ఉత్పత్తి కోటాల నుండి విముక్తి పొందడంతో రోజుకు 4.8 మిలియన్ బ్యారెల్స్ వరకు ఉత్పత్తి పెంచే అవకాశం ఉంది. ఇది గ్లోబల్ మార్కెట్లో సరఫరా పెంచి ధరలను తగ్గిస్తుంది.దిగుమతి బిల్లు తగ్గింపు: భారత్‌కి క్రూడ్ ఆయిల్ దిగుమతి ఖర్చు తగ్గి, ద్రవ్యోల్బణం నియంత్రణలో ఉండే అవకాశం ఉంది.ఇంధన ధరలు: పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉండే అవకాశం ఉంది, ఇది వినియోగదారులకు నేరుగా లాభం జరుగుతుంది.2022లో భారత్ యూఏఈ నుండి $11 బిలియన్ విలువైన క్రూడ్ దిగుమతి చేసుకోగా, 2026లో ఇది $14 బిలియన్కి పెరిగింది.యూఏఈ వాటా భారత్ క్రూడ్ దిగుమతుల్లో 10.3% నుండి 11.4%కి పెరిగింది.దీర్ఘకాల ఒప్పందాలు: ఒపెక్ కోటాల పరిమితులు లేకుండా భారత్ యూఏఈతో దీర్ఘకాల సరఫరా ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశం ఉంది. యూఏఈతో ఎనర్జీ భాగస్వామ్యం మరింత బలపడుతుంది. LNG, LPG రంగాల్లో కూడా కొత్త ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశం ఉంది. -
పాకిస్తాన్లో కలకలం.. హఫీజ్ సన్నిహితుడు హతం
లాహోర్: పాకిస్తాన్ ఉగ్ర సంస్థ లష్కరే తోయిబా కీలక నేత, ముంబై ఉగ్రదాడుల సూత్రధారి హఫీజ్ సయీద్ సన్నిహితుడు షేక్ యూసఫ్ అఫ్రిది గుర్తు తెలియని వ్యక్తుల కాల్పుల్లో హతమయ్యాడు. ఖైబర్ ప్రావిన్స్‌లోని లాండికొటాల్లో ఆదివారం ఈ ఘటన చోటుచేసుకుంది. తీవ్రంగా గాయపడిన అఫ్రిది అక్కడికక్కడే చనిపోయినట్లు అధికారులు తెలిపారు.ఖైబర్ ప్రావిన్స్‌లో లష్కరే కార్యకలాపాలను సమన్వయం చేయడంతోపాటు కొత్తవారిని చేర్చుకోవడం వంటివి ఇతడే పర్యవేక్షిస్తున్నాడు. ఖైబర్‌లోని జఖాఖెల్ గిరిజన తెగకు చెందిన అఫ్రిది సలాఫి వర్గం ముస్లిం పండితుల్లో ఒకడు. అఫ్రిదిపై కాల్పులకు బాధ్యత ఎవరూ ప్రకటించుకోలేదు. తెహ్రీక్–ఇ– తాలిబన్ పాకిస్తాన్ పనే అయి ఉండొచ్చని అనుమానాలున్నాయి. కాగా, వారం క్రితం లాహోర్‌లో లష్కరే వ్యవస్థాపకుల్లో ఒకడైన అమిర్ హంజాపై కాల్పులు జరగడం తెల్సిందే. షేక్ యూసఫ్ అఫ్రిది హత్య ఘటన ప్రాంతంలో ఆగ్రహాన్ని రేపింది. ఇదిలా ఉండగా.. 2023 నుండి పాకిస్తాన్లో లష్కరే తోయిబా, హిజ్బుల్ ముజాహిదీన్ వంటి గ్రూపులకు చెందిన పలువురు నాయకులు గుర్తు తెలియని వ్యక్తుల చేతిలో హత్యకు గురవుతున్నారు. ఇది మిస్టరీగా మారింది. అఫ్రిది హత్య పాకిస్తాన్లో ఇటీవల పెరుగుతున్న లక్ష్యిత దాడులలో భాగంగా జరిగినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అఫ్రిది మరణం లష్కరే తోయిబా ప్రాంతీయ నిర్మాణానికి పెద్ద దెబ్బగా మారింది. అతడి మృతిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. -
విధ్వంసకర శతకం.. చరిత్ర సృష్టించిన బాబర్ ఆజమ్
ప్రస్తుతం జరుగుతున్న పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026లో ఆ దేశ స్టార్ బ్యాటర్, పెషావర్ జల్మీ కెప్టెన్ బాబర్ ఆజమ్ అరివీర భయంకర ఫామ్‌లో ఉన్నాడు. ఈ టోర్నీలో ఇప్పటికే ఓ సెంచరీ, 3 అర్ద సెంచరీలు చేసిన అతను.. ఇవాళ (ఏప్రిల్ 28) మరో సెంచరీ బాదాడు. ఇస్లామాబాద్ యునైటెడ్‌తో జరుగుతున్న క్వాలిఫయర్ మ్యాచ్‌లో బాబర్ ఉగ్రరూపం దాల్చాడు. 59 బంతుల్లో 12 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 103 పరుగులు చేశాడు. ఫలితంగా అతని జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 221 పరుగుల భారీ స్కోర్ చేసింది. మిగతా పెషావర్ బ్యాటర్లలో మొహమ్మద్ హరీస్ (35), కుసాల్ మెండిస్ (41), ఆరోన్ హార్డీ (20) ఓ మోస్తరు స్కోర్లు చేయగా.. బ్రేస్‌వెల్ (2), అబ్దుల్ సమద్ (0), ఫర్హాన్ (0) నిరాశపరిచారు. ఇస్లామాబాద్ బౌలర్లలో షాదాబ్ ఖాన్ 3 వికెట్లు పడగొట్టగా.. రిచర్డ్ గ్లీసన్ 2, సల్మాన్ మీర్జా, ఫహీమ్ అష్రాఫ్ తలో వికెట్ తీశారు. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్‌కు చేరుకుంటుంది.ఇదిలా ఉంటే, ఈ సెంచరీతో బాబర్ ఓ ఆల్‌టైమ్ పీఎస్ఎల్ రికార్డు నెలకొల్పి చరిత్ర సృష్టించాడు. ఈ లీగ్ చరిత్రలో నాలుగు సీజన్లలో (2021, 2023, 2024, 2026) 500 ప్లస్ పరుగులు చేసిన తొలి బ్యాటర్‌గా రికార్డు నెలకొల్పాడు. ఈ రికార్డుకు సంబంధించి బాబర్ తర్వాతి స్థానంలో మొహమ్మద్ రిజ్వాన్ ఉన్నాడు. రిజ్వాన్ పీఎస్ఎల్లో మూడు సీజన్లలో (2021, 2022, 2023) 500 ప్లస్ పరుగులు సాధించాడు. ఈ సీజన్లో ఇప్పటివరకు 11 మ్యాచ్‌లు ఆడిన బాబర్ 598 పరుగులు చేసి, పీఎస్ఎల్ చరిత్రలో ఓ సింగిల్ సీజన్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగానూ చరిత్ర సృష్టించాడు. ఈ మ్యాచ్‌కు ముందు ఈ రికార్డు లాహోర్ ఖలందర్స్ ప్లేయర్ ఫకర్ జమాన్ పేరిట ఉండేది. జమాన్ 2022 ఎడిషన్‌లో 588 పరుగులు చేశాడు. -
పోరు ఆపితే తెరుస్తాం
కైరో/మాస్కో/దుబాయ్: హార్మూజ్ జలసంధిని దిగ్బంధం నుంచి విముక్తి కల్పించి యుద్ధానికి చరమగీతం పాడితే హార్మూజ్ జలసంధి గుండా విదేశీ వాణిజ్యనౌకల రాకపోకలకు మార్గం సుగమం చేస్తామని ఇరాన్ కొత్త ప్రతిపాదనలను తెరమీదకు తెచ్చింది. ఆదివారం ఒమన్ నుంచి పాకిస్తాన్‌కు చేరుకున్న ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ ఈ మేరకు తమ ప్రతిపాదనలకు హెహబాజ్ షరీఫ్ ప్రభుత్వానికి తెలియజేశారు. వీటిని అమెరికాకు పాక్ అందజేయనుంది. వీటిపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విముఖత చూపొచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పుతిన్‌తో అరాఘ్చీ భేటీ.. ఇరాన్ మంత్రి అరాఘ్చీ సోమవారం రష్యాలోని సెయింట్ పీటర్స్బర్గ్ నగరంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో భేటీ అయ్యారు. తమ సార్వ¿ౌమత్వం కోసం పోరాడుతున్న ఇరానియన్లను ఈ సందర్భంగా పుతిన్ పొగిడారు. తర్వాత పశ్చిమాసియా యుద్ధం, హార్మూజ్ దిగ్బంధం, అమెరికా షరతులు, ఇరాన్ డిమాండ్లు తదితర కీలకాంశాలపై అరాఘ్చీ, పుతిన్ విస్తృతంగా చర్చించుకున్నారని రష్యా అధ్యక్షభవనం క్రిమ్లిన్ తెలిపింది. ‘‘పశ్చిమాసియాలో శాంతిస్థాపన కోసం రష్యా తన శక్తిమేరకు చేసేందుకు సిద్ధంగా ఉంది. ఇరాన్‌తో వ్యూహాత్మక బంధం బలోపేతానికి కృషిచేస్తాం’’అని రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ స్పష్టంచేశారు. భారతీయ ట్యాంకర్‌పై కాల్పులు.. ఒమన్ నుంచి భారత్‌కు వస్తున్న రసాయనాల ట్యాంకర్ ఎంటీ చిరాన్7పై ఇరాన్ గన్బోట్లు హెచ్చరిస్తూ కాల్పులు జరిపాయి. ఏప్రిల్ 25వ తేదీన జరిగిన ఈ కాల్పులఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. హార్మూజ్‌కు వాయవ్యంగా ఒమన్‌కు చెందిన షినాస్ పోర్ట్ సమీప జలాల గుండా నౌక వెళ్తున్నప్పుడు ఈ ఘటన జరిగింది. నౌకలోని 17 మంది భారతీయనావికులకు ఎలాంటి గాయాలుకాలేదని కేంద్ర షిప్పింగ్, పోర్ట్‌లు, వాటర్‌వేస్ శాఖ డైరెక్టర్ మన్దీప్ సింగ్ రంధావా తెలిపారు. -
భారత బౌలర్లపై పాక్ బ్యాటర్ వివాదాస్పద వ్యాఖ్యలు
పాక్ క్రికెటర్లకు భారత ఆటగాళ్లపై అక్కసు వెళ్లగక్కడం పరిపాటిగా మారింది. ఇటీవలి కాలంలో ఈ తంతు మరీ ఎక్కువైంది. కొందరు ప్రస్తుత ఆటగాళ్లు నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతున్నారు.తాజాగా ఆ జట్టు టాపార్డర్ బ్యాటర్ హసన్ నవాజ్ భారత బౌలర్లపై తనకెప్పుడూ ఆగ్రహంగా ఉంటుందని అన్నాడు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరలవుతున్నాయి.ఒక ఇంటర్వ్యూలో హసన్ నవాజ్‌కు ప్రపంచ స్థాయి బౌలర్లను ఎలా ఎదుర్కొంటారన్న ప్రశ్న ఎదురైంది. అందుకు సమాధానంగా, మ్యాచ్ పరిస్థితిని బట్టి ఏ బౌలర్ అయినా లక్ష్యంగా చేసుకుంటామని, అవసరమైతే ఎవరిపైనైనా దాడి చేస్తామని అన్నాడు.భారత్ గురించి అడిగినప్పుడు అతని సమాధానం మరింత వివాదాస్పదంగా మారింది. "భారత్ అనగానే, ప్రతి బౌలర్‌ను తప్పకుండా టార్గెట్ చేయాలనిపిస్తుంది. వారి ప్రతి బౌలర్‌పై మాకు ప్రత్యేక ఉత్సాహం ఉంటుంది. వారిని బలంగా ఎదుర్కోవాలనుకుంటాం" అని అన్నాడు.క్రీడల్లో ప్రత్యర్థిపై గెలవాలనే తపన సహజం. అయితే "ద్వేషం" వంటి పదాల వాడకం అనవసర వివాదాలకు కారణమవుతుంది. ముఖ్యంగా భారత్-పాకిస్థాన్ మ్యాచ్ లాంటి సున్నిత సందర్భాల్లో ఆటగాళ్లు మరింత బాధ్యతగా మాట్లాడాల్సి ఉంటుంది.హసన్ నవాజ్ ఇప్పటివరకు భారత్‌పై ఒక్క అంతర్జాతీయ టీ20 మాత్రమే ఆడాడు. ఆసియా కప్ 2025లో జరిగిన ఆ మ్యాచ్‌లో కేవలం ఐదు పరుగులకే ఔటయ్యాడు. కుల్దీప్ యాదవ్ అతని వికెట్‌ను పడగొట్టాడు.ప్రస్తుతం జరుగుతున్న పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో హసన్ మంచి ఫామ్‌లో కనిపించాడు. క్వెట్టా గ్లాడియేటర్స్ తరఫున పది మ్యాచ్‌ల్లో రెండు అర్ధసెంచరీలతో ఆకట్టుకున్నాడు. అయితే, అతని జట్టు ప్లేఆఫ్స్‌కు చేరుకోలేకపోయింది. -
పాకిస్తాన్‌కు భారీ షాకిచ్చిన ఇరాన్!
టెహ్రాన్: అమెరికా, ఇరాన్ మధ్య చర్చల నేపథ్యంలో దాయాది దేశం పాకిస్తాన్‌కు ఊహించని షాక్ తగిలింది. పాకిస్తాన్‌పై ఇరాన్ ఎంపీ ఇబ్రహీం రెజాయీ సంచలన వ్యాఖ్యలు చేశారు. శాంతి చర్చలకు పాకిస్తాన్ తగిన మధ్యవర్తి కాదంటూ బాంబు పేల్చారు. అమెరికాకు మాత్రమే పాకిస్తాన్ వత్తాసు పలుకుతోందని ఘాటు విమర్శలు గుప్పించారు. దీంతో, చర్చలపై కొత్త ట్విస్ట్ నెలకొంది.అమెరికా, ఇరాన్ మధ్య శాంతి చర్చల సందిగ్ధం నెలకొన్న వేళ ఊహించని పరిణామం చోటుచేసుకుంది. ఇరాన్ జాతీయ భద్రత మరియు విదేశాంగ విధాన కమిషన్ అధికార ప్రతినిధిగా పనిచేస్తున్న ఎంపీ ఇబ్రహీం రెజాయీ.. పాకిస్తాన్ మధ్యవర్తిత్వంపై తీవ్ర సందేహాలు వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా ఇబ్రహీం ఎక్స్ వేదికగా..‘ఇరాన్‌కు పాకిస్తాన్ మంచి మిత్రుడే. కానీ, చర్చలకు సంబంధించి మధ్యవర్తిత్వానికి అవసరమైన విశ్వసనీయత పాకిస్తాన్‌కు లేదు. చర్చలకు పాకిస్తాన్ సరైన మధ్యవర్తి కాదు. ఒక మధ్యవర్తి నిష్పక్షపాతంగా ఉండాలి, ఎప్పుడూ ఒక పక్షానికే మొగ్గు చూపకూడదు. అమెరికా ప్రయోజనాలకు పాకిస్తాన్ అనుకూలంగా వ్యవహరిస్తుంది. ఇస్లామాబాద్ వాషింగ్టన్‌ను బహిరంగంగా విమర్శించకుండా ఉంటోంది అని సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే, ఇరాన్, అమెరికా మధ్య అనిశ్చితి ఉన్నప్పటికీ చర్చలను సజీవంగా ఉంచడానికి ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరఘ్చి దౌత్యపరమైన ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్న తరుణంలో ఆయన ఇలా వ్యాఖ్యలు చేయడం పాకిస్తాన్‌కు ఊహించని షాక్ ఇచ్చినట్టు అయ్యింది. కాగా, అరఘ్చి ఇటీవల మూడు రోజుల్లో రెండోసారి ఇస్లామాబాద్‌లో పర్యటించారు. అక్కడ ఆయన పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్‌తో సంఘర్షణ, భవిష్యత్ కార్యాచరణ మార్గాలపై చర్చలు జరిపారు.ఫోన్లో చర్చలు: ట్రంప్ సూచనఇదిలా ఉండగా.. అమెరికా, ఇరాన్ మధ్య శాంతి చర్చల సందిగ్ధం వేళ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. శాంతి పరిష్కారం కోసం ఫోన్లో మాట్లాడుకోవచ్చని ట్రంప్ ఆదివారం సూచించారు. 17 గంటల విమాన ప్రయాణంలో ప్రతినిధి బృందాన్ని పంపే బదులు తానే ఆ నిర్ణయం తీసుకున్నానని చెప్పారు. ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ మేరకు వ్యాఖ్యానించారు. "అన్ని అవకాశాలు మా చేతిలోనే ఉన్నాయి. వారు మాట్లాడాలనుకుంటే మా వద్దకు రావచ్చు, లేదా మాకు ఫోన్ చేయవచ్చు" అని ట్రంప్ అన్నారు. అయితే, ఆ ఫోన్ కాల్ ఎప్పుడు జరుగుతుందో మాత్రం సూచించలేదు.ట్రంప్ వార్నింగ్రెండో విడత శాంతి చర్చలపై అనిశ్చితిపై ఇరాన్‌కు డొనాల్డ్ ట్రంప్ మరోసారి హెచ్చరించారు. యుద్ధం ముగించటానికి, కాల్పుల విరమణకు అంగీకరించడానికి కేవలం 3 రోజుల సమయం మాత్రమే ఉందన్నారు. లేదంటే వారి చమురు పైపులైన్లు పేలిపోతాయని ట్రంప్ తెలిపారు. ఇరాన్ చమురు ఎగుమతులను కొనసాగించలేకపోతే, యాంత్రికంగా, భూమి సహజశక్తుల కారణంగా పైపులైన్లు విఫలమవుతాయన్నారు. ఇరాన్‌కు భారీ పరిమాణంలో చమురు సరఫరా వ్యవస్థ ఉందని, ఏదైన కారణం చేత అది మూసుకుపోతే అప్పుడు ఇంధనాన్ని కంటైనర్లు లేదా నౌకల్లో నింపడం సాధ్యం కాదన్నారు. ప్రస్తుతం ఇరాన్ అదే పరిస్థితి ఎదుర్కొటోందన్న ట్రంప్.. దిగ్బంధనం కారణంగా వారివద్ద నౌకలు కూడా లేవని తెలిపారు. -
చారిత్రాత్మక సిరీస్‌కు పాక్ వన్డే జట్టు ప్రకటన
జింబాబ్వే మహిళల జట్టు తొలిసారి పాకిస్తాన్లో పర్యటించనుంది. మే 4న మొదలయ్యే ఈ చారిత్రాత్మక సిరీస్ కోసం 15 మంది సభ్యులతో కూడిన పాక్ వన్డే జట్టును అధికారికంగా ప్రకటించారు. ఈ జట్టుకు ఫాతిమా సనా సారథ్యం వహించనుంది. మే 4, 6, 9 తేదీల్లో నేషనల్ బ్యాంక్ స్టేడియం (కరాచీ) వేదికగా మూడు మ్యాచ్ వన్డే సిరీస్ జరుగనుంది. ఈ సిరీస్ ఐసీసీ వుమెన్స్ ఛాంపియన్షిప్ 2025–29లో భాగం కావడంతో ప్రాధాన్యత సంతరించుకుంది.ఈ సిరీస్ కోసం ఎంపిక చేసిన పాక్ జట్టులో యువ స్పిన్నర్ మోమిరనా రియాసత్‌కు తొలిసారి చోటు దక్కింది. దేశీయ క్రికెట్లో అద్భుత ప్రదర్శన చేసిన ఆమె, ఇటీవల జరిగిన నేషనల్ టీ20 టోర్నీలో 16 వికెట్లు పడగొట్టి సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించింది. వన్డే కప్‌లోనూ 19 వికెట్లు సాధించి తన ప్రతిభను నిరూపించుకుంది.ఈ పర్యటన కోసం జింబాబ్వే జట్టు ఏప్రిల్ 29న కరాచీకి చేరుకోనుంది. ఏప్రిల్ 30 నుంచి మే 3 వరకు ఇరు జట్లు ప్రాక్టీస్ సెషన్లలో పాల్గొంటాయి. ప్రస్తుతం ఐసీసీ మహిళల ఛాంపియన్షిప్ పట్టికలో పాకిస్థాన్ ఐదో స్థానంలో ఉండగా, జింబాబ్వే ఎనిమిదో స్థానంలో ఉంది. ఈ నేపథ్యంలో ఇరు జట్లకు ఈ సిరీస్ ఎంతో కీలకంగా మారింది.జింబాబ్వేతో వన్డే సిరీస్ అనంతరం పాకిస్థాన్ మహిళల జట్టు ఐర్లాండ్ టీ20 ట్రై సిరీస్ 2026లో పాల్గొననుంది. ఇందులో ఐర్లాండ్, వెస్టిండీస్ జట్లు కూడా పోటీపడనున్నాయి. జూన్ 12 నుంచి జూలై 5 వరకు ఇంగ్లండ్‌లో జరిగే మహిళల టీ20 ప్రపంచకప్ 2026కు సన్నాహకంగా ఈ సిరీస్ ఉపయోగపడనుంది.టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్ గ్రూప్-1లో ఉంది. ఈ గ్రూప్‌లో భారత్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్, నెదర్లాండ్స్ వంటి బలమైన జట్లు ఉన్నాయి. జింబాబ్వేతో వన్డే సిరీస్ అనంతరం పాక్ జట్టు ఆదే టీమ్‌తో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కూడా ఆడనుంది. ఈ సిరీస్ మే 12, 14, 15 తేదీల్లో నేషనల్ బ్యాంక్ స్టేడియం వేదికగానే జరగనుంది.జింబాబ్వే సిరీస్ కోసం పాక్ వన్డే జట్టు..ఫాతిమా సనా (కెప్టెన్), అలియా రియాజ్, అయేషా జాఫర్, డయానా బేగ్, గుల్ ఫిరోజా, మోమినా రియాసత్, మునీబా అలీ (WK), నజిహా అల్వీ (WK), నష్రా సుంధు, నటాలియా పర్వైజ్, రమీన్ షమీమ్, సదాఫ్ షమాస్, సిద్రా అమీన్, సయ్యదా అరూబ్ షా, తస్మియా రుబాబ్రిజర్వ్ ప్లేయర్లు: ఇరామ్ జావేద్, ఈమాన్ ఫాతిమా, సైరా జబీన్, తుబా హసన్, అంబర్ కైనాట్. -
పాక్ ప్రధానితో ఇరాన్ ఫోన్ కాల్..
ఇస్లామాబాద్: ఇరాన్, అమెరికా మధ్య చర్చల సందర్భంగా హైడ్రామా చోటుచేసుకుంది. చర్చల కోసం పాకిస్థాన్ వెళ్లిన ఇరాన్ విదేశాంగమంత్రి అబ్బాస్ అరాగ్చీ అమెరికా ప్రతినిధులు రాకముందే ఒమన్ బయల్దేరి వెళ్లిపోయారు. దీంతో శాంతి చర్చలకు తన ప్రతినిధులను ఇస్లామాబాద్‌కు పంపించడం లేదని ట్రంప్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో అమెరికాతో శాంతి చర్చలపై అనిశ్చితి నెలకొన్న వేళ ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ కీలక కామెంట్స్ చేశారు.పెజెష్కియాన్ తాజాగా పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌తో పెజెష్కియాన్ ఫోన్లో మాట్లాడారు. ఈ సందర్బంగా ఆయన శాంతి చర్చలపై ఇరాన్ వైఖరిని స్పష్టం చేశారు. ఈ క్రమంలో అమెరికా విధిస్తున్న ఇరాన్ ఓడరేవుల దిగ్బంధనం, బెదిరింపుల నడుమ ఆ దేశంతో చర్చలు అసాధ్యమని తేల్చి చెప్పారు. అలాగే, ఇరాన్ తన సార్వభౌమాధికారాన్ని వదులుకోదని, అలాగే ఒత్తిళ్లకు తలొగ్గి ఒప్పందాలు చేసుకోబోదని స్పష్టం చేశారు. ప్రస్తుత ఉద్రిక్తతలకు అమెరికానే కారణమని పేర్కొన్నారు. అమెరికా అనుసరిస్తున్న చర్యలే చర్చలకు ప్రధాన అడ్డంకి ఆయన కుండబద్దలు కొట్టారు.కాగా, ఏప్రిల్ 13 నుంచి ఇరాన్ ఓడరేవులను అమెరికా నౌకాదళం దిగ్బంధించిన విషయం తెలిసిందే. ఈ పరిణామం వల్ల ఇరాన్ ఆర్థికంగా తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ఇలాంటి దిగ్బంధనాల నడుమ పరస్పర నమ్మకాన్ని పునరుద్ధరించడం అసాధ్యమని పేజెష్కియాన్ వెల్లడించారు. అందుకే ఇరు దేశాల మధ్య చర్చలు జరగాలంటే ముందుగా అమెరికా ఆంక్షలను తొలగించి, చిత్తశుద్ధిని నిరూపించుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.అరాగ్చీ స్పందన..ఇస్లామాబాద్ నుంచి వెళ్లిపోయిన తర్వాత ఇరాన్ విదేశాంగమంత్రి అబ్బాస్ అరాగ్చీ స్పందించారు. ఇప్పటికే తాము ఒక ఫ్రేమ్ వర్క్‌ను పాకిస్తాన్‌కు అందించామని తెలిపారు. యుద్ధాన్ని శాశ్వతంగా ముగించేందుకు ఇది ఒక మంచి మార్గమని ఆయన చెప్పారు. అయితే, శాంతి చర్చలపై అమెరికాకు నిజంగా ఆసక్తి ఉందా? అన్నది అనుమానమేనని ఆయన చెప్పుకొచ్చారు. ప్రస్తుతం అబ్బాస్ అరాగ్చీ ఒమన్ పర్యటనలో ఉన్నారు. అయితే, చర్చల కోసం ఆయన తిరిగి పాకిస్తాన్ వచ్చే అవకాశం ఉందన్న వార్తలు వస్తున్నాయి. -
మళ్లీ మొదటికి!
ఇస్లామాబాద్/వాషింగ్టన్/దుబాయ్: పశ్చిమాసియాలో హార్మూజ్ దిగ్బంధం ఏ స్థాయిలో కొనసాగుతోందో పాకిస్తాన్ వేదికగా రెండో దఫా ప్రత్యక్ష చర్చలపై ప్రతిష్టంభన అదే స్థాయిలో కొనసాగుతోంది. ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ ఒకడుగు ముందుకేసి పాకిస్తాన్‌కు స్వయంగా విచ్చేసి ఆ దేశ ప్రధాని, ఆర్మీ చీఫ్‌లతో చర్చిస్తున్న వేళ సంతోషం వ్యక్తంచేసిన అమెరికా తన బృందాన్ని సైతం పంపేందుకు సంసిద్ధమవుతుండగా అరాఘ్చీ హఠాత్తుగా పాక్‌కు వీడి అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు కోపం తెప్పించారు.దీంతో ఇరాన్ బృందంలేని పాకిస్తాన్లో తాము మాత్రం ఎలా ప్రత్యక్ష చర్చలకు కూర్చోగలమనే అసహనంతో ట్రంప్ వెంటనే తన బృందం ప్రయాణాన్ని రద్దుచేశారు. దీంతో రెండోదఫా ప్రత్యక్ష చర్చలు ఎప్పుడు జరుగుతాయనేది ప్రశ్నార్థకంగా మారింది. అయితే ఈ అంశంలో ఇరాన్ ఒక స్పష్టతనిచ్చింది. అమెరికాతో మరోమారు ప్రత్యక్షచర్చలకు కూర్చోబోమని తెగేసి చెప్పింది. పరోక్ష చర్చలకే తాము సుముఖంగా ఉన్నామని ఇరాన్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఇస్మాయిల్ బఘేల్ శనివారం ప్రకటించారు. పాక్ ప్రధాని, ఫీల్డ్ మార్షల్‌తో మంతనాలు పాక్ నుంచి ఒమన్‌కు వెళ్లిపోయే ముందు ఇరాన్ విదేశాంగ మంత్రి అరాఘ్చీ ఇస్లామాబాద్‌లో పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఆర్మీ చీఫ్, ఫీల్డ్ మార్షల్ ఆసిం మునీర్, పాక్ ఉప ప్రధాని, విదేశాంగ మంత్రి ఇషక్ దార్లతో విస్తృతస్థాయిలో చర్చించారు. శాంతి చర్చలకు సంబంధించిన తమ దేశ డిమాండ్లను అమెరికాకు తెలియజేయాలని సంబంధిత ప్రతిపాదనల చిట్టాను షెహబాజ్‌కు అందజేసినట్లు తెలుస్తోంది. ఇరాన్ తరఫున ఉప విదేశాంగ మంత్రి కజీమ్ ఘరీబ్అబాదీ, విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఇస్మాయిల్ బఘేల్, పాక్ తరఫున పాక్ అంతర్గత మంత్రి మొహ్సిన్ నఖ్వీ సైతం ఈ భేటీలో పాల్గొన్నారు.అయితే చర్చల్లో ప్రస్తావనకు వచ్చిన అంశాల వివరాలను అటు పాక్‌గానీ ఇటు ఇరాన్‌గానీ అధికారికంగా బహిర్గతంచేయలేదు. ప్రాంతీయ అస్థిరత, శాంతి చర్చల అంశాలపై నేతలు చర్చించారని సామాజిక మాధ్యమంలో ఇరాన్ రాయబార కార్యాలయం ఒక పోస్ట్పెట్టింది. ఇరాన్ పెట్టిన షరతులను ఇస్లామాబాద్‌కు విచ్చేసే అమెరికా ప్రతినిధుల ఎదుట పాక్ పెట్టనుందని, వాటికి సమ్మతిస్తేనే ప్రత్యక్ష చర్చలకు ఇరాన్ బృందం పాక్‌కు రానుందని పాక్ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. ఈ వివరాలను తుర్కియేతో పాక్ పంచుకుంది. మీరు వెళ్లాల్సిన అవసరం లేదు.. తమ బృందం రాకముందే ఇరాన్ మంత్రి పాక్ నుంచి వెళ్లిపోయారనే వార్త తెల్సి ట్రంప్ వెంటనే కీలక నిర్ణయం తీసుకున్నారు. తమ ప్రతినిధులనూ పాక్‌కు పంపబోమని తెగేసి చెప్పారు. ఈ మేరకు సొంత సామాజిక మాధ్యమం ‘ట్రూత్ సోషల్’లో ఒక పోస్ట్‌పెట్టారు. ‘‘18 గంటలు ప్రయాణించి ఇస్లామాబాద్‌కు వెళ్లేందుకు నా బృందం సిద్ధమవుతుంటే వెంటనే ఆగిపొమ్మని చెప్పేశా. పాక్‌కు అన్ని గంటలపాటు ప్రయాణంచేయడం వృథా. అనవసర శ్రమ. పాక్‌లో మనతో మాట్లాడ్డానికి ఎవరూ లేనప్పుడు, ఎలాంటి చర్చల్లేనిదానికి అంతదూరం వెళ్లడం దండగ.అసలే ఇరాన్లో ఎవరు తమ నేతనో తేల్చుకోలేక తలలు పట్టుకుంటున్నారు. వాళ్లలో ఇన్చార్జ్ ఎవరో వాళ్లకే తెలీడంలేదు. ఆట మనచేతుల్లోనే ఉంది. వాళ్లకు అంతగా మాట్లాడాలనుకుంటే ఇరాన్ నాయకులు మనకు ఫోన్‌చేసి మాట్లాడతారు. మేం వినేందుకు సిద్ధంగా ఉన్నాం’’అని ట్రంప్ స్పష్టంచేశారు. పశి్చమాసియాలో అమెరికా ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్కాఫ్, ట్రంప్ అల్లుడు జేర్డ్ కుష్నర్‌లను పాక్‌కు కొద్దిసేపట్లో పంపబోతున్నామని శ్వేతసౌధంలో ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ అంతకుముందే ప్రకటించగా కొన్ని నిమిషాలకే ట్రంప్ విరుద్ధమైన ప్రకటన చేశారు.దీంతో అమెరికా ప్రతినిధి బృందం పాక్ పర్యటన చివరినిమిషంలో వాయిదాపడింది. ఈ బృందం ఇక ఎప్పుడు పాక్‌కు వస్తుందనేది చెప్పలేని పరిస్థితి నెలకొంది. అయితే ప్రత్యక్ష చర్చల కోసం తమ ప్రయత్నాలు నిరాటంకంగా కొనసాగుతాయని పాక్ విదేశాంగ మంత్రి ఇషాక్‌దార్ పునరుద్ఘాటించారు. అమెరికా చిత్తశుద్ధిచూద్దాం.. పాక్ నుంచి ఒమన్ రాజధాని మస్కట్‌కు చేరుకున్న ఇరాన్ మంత్రి అరాఘ్చీ ‘ఎక్స్’లో ఒక పోస్ట్‌పెట్టారు. ‘‘పాక్‌లో పర్యటన సత్ఫలితాలనిచ్చింది. యుద్ధం శాశ్వత పరిసమాప్తికి మేం చేసిన ప్రతిపాదనలను పాక్ ముందుంచాం. వాటిని వినేందుకు, యుద్ధాన్ని ఆపేందుకు అమెరికా ఏపాటి చిత్తశుద్ధిచూపుతుందో చూద్దాం’’అని అన్నారు. ఒమన్ తర్వాత రష్యాలో అరాఘ్చీ పర్యటిస్తారు. తిరిగి ఆయన శనివారం లేదా ఆదివారం పాక్‌కు వచ్చే అవకాశముందని తెలుస్తోంది. ఇంధనాన్ని ఆదా చేసుకోవాలి: మసూద్ యుద్ధకాలంలో ఇరాన్ ఇంధన వనరులు, మౌలికవసతులను అమెరికా సేనలు దారుణంగా దెబ్బతీయడంతో వాటిని ఇప్పుడు పొదుపుగా వాడుకోవాలని ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ సూచించారు. ‘‘ఇంట్లో పది లైట్లు ఉంటే అన్ని వెలిగించాల్సిన అవసరమేంటి? ఒక రెండు వెలిగిస్తే సరిపోతుంది’’అని సలహా ఇచ్చారు. కరెంట్ వృథా ఖర్చును భారీగా తగ్గించుకోవాలని ఇరాన్ విద్యుత్ సంస్థ సీఈవో తవానిర్ ఇరానియన్లను కోరారు. -
పాక్ క్రికెటర్ సంచలన నిర్ణయం
31 ఏళ్ల పాకిస్తాన్ క్రికెటర్ జాఫర్ గోహర్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఇప్పటికే బ్రిటిష్ పౌరసత్వం పొందిన అ లెఫ్ట్ హ్యాండ్ స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్, త్వరలో ఇంగ్లండ్ జాతీయ జట్టు తరఫున బరిలోకి దిగాలని భావిస్తున్నాడు.లాహోర్‌లో జన్మించిన గోహర్ 2015లో పాకిస్తాన్ తరఫున అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. అనంతరం 2021లో న్యూజిలాండ్‌తో టెస్ట్ మ్యాచ్ ఆడినా, ఆ తర్వాత మళ్లీ జాతీయ జట్టు అవకాశాలు రాలేదు. దీంతో విరక్తి చెందిన గోహర్ పాక్ నుంచి ఇంగ్లండ్‌కు మాకం మార్చేశాడు. స్వల్ప అంతర్జాతీయ కెరీర్లో 2 వికెట్లు తీసి, 86 పరుగులు చేసిన గోహర్.. దేశవాలీ క్రికెట్లో ఘనమైన ట్రాక్ రికార్డు కలిగి ఉన్నాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 343 వికెట్లు తీసి, 3000కుపైగా పరుగులు సాధించాడు.దేశీయ క్రికెట్లో అద్భుత ప్రదర్శనలు చేసినప్పటికీ పాక్ క్రికెట్ బోర్డు తనను పట్టించుకోలేదని గోహర్ తీవ్ర అసంతృప్తిలో ఉన్నాడు. ముఖ్యంగా మొహ్సిన్ నక్వీ నేతృత్వంలోని బోర్డు, సెలక్షన్ కమిటీ తన ప్రతిభను గుర్తించలేదని బహిరంగ ఆరోపణలు చేశాడు.గోహర్ దేశీయ దేశవాలీ క్రికెట్‌తో పాటు ఇంగ్లండ్ కౌంటీ క్రికెట్లోనూ సత్తా చాటాడు. అయితే పాక్ సెలెక్టర్లు గోహర్ కౌంటీ ప్రదర్శనలను విస్మరించారు. ఓ సెలెక్టర్ ఏకంగా గోహర్ కౌంటీ ప్రదర్శనలను చిత్తు కాగితాలపై లెక్కలుగా అభివర్ణించాడు. దీంతో విసిగిపోయిన అతను ఇంగ్లండ్‌కు మకాం మార్చి, అక్కడ జాతీయ జట్టు అవకాశాల కోసం ఎదురుచూస్తున్నాడు.ఇంగ్లండ్‌లో నాలుగు సీజన్లు గడిపిన గోహర్, ప్రస్తుతం మిడిల్సెక్స్ తరఫున స్థానిక ఆటగాడిగా ఆడుతున్నాడు. కౌంటీ చాంపియన్‌షిప్‌లో బ్యాట్, బాల్‌తో రాణిస్తూ సెలెక్టర్ల దృష్టిని ఆకర్షిస్తున్నాడు.ఇంగ్లండ్ జట్టులో ప్రస్తుతం నాణ్యమైన స్పిన్ బౌలర్ల కొరత ఉంది. షోయబ్ బషీర్, రెహాన్ అహ్మద్, విల్ జాక్స్ వంటి ఆటగాళ్లు ఉన్నప్పటికీ, స్థిరమైన ఎడమచేతి స్పిన్నర్ అవసరం ఉంది. ఈ నేపథ్యంలో గోహర్‌కు అవకాశం లభించే అవకాశాలు మెరుగ్గా కనిపిస్తున్నాయి. జాక్ లీచ్ స్థానాన్ని భర్తీ చేసే దీర్ఘకాలిక ఎంపికగా గోహర్‌ను ఇంగ్లండ్ పరిశీలించే అవకాశం ఉంది. అవకాశం వస్తే సిద్ధంగా ఉంటానని గోహర్ స్పష్టం చేశాడు. -
అమెరికాతో చర్చలు.. ఇరాన్ కొత్త ట్విస్ట్!
ఇస్లామాబాద్: అమెరికా, ఇరాన్ మధ్య రెండో విడత చర్చలకు రంగం సిద్ధమైంది. పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో మరోసారి చర్చలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ కొత్త ట్విస్ట్ ఇచ్చారు. అమెరికాను దురాక్రమణదారుగా అభివర్ణిస్తూ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఇదే సమయంలో అమెరికాతో నేరుగా చర్చలు జరిపే ప్రసక్తే లేదన్నారు. దీంతో, చర్చల విషయమై పాకిస్తాన్‌కు టెన్షన్ నెలకొంది. ఇస్లామాబాద్ వేదికగా మరికొన్ని గంటల్లో అమెరికా, ఇరాన్ మధ్య రెండో విడత చర్చలు జరగనున్నాయి. ఇప్పటికే పాకిస్తాన్‌కు ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ నేతృత్వంలోని ప్రతినిధి బృందం రాగా, అమెరికా నుంచి ప్రత్యేక రాయబారులు వస్తున్నారు. ఈ క్రమంలోనే ఇరాన్ కీలక ప్రకటన చేసింది. అరాగ్చీ బృందం ఎక్స్ వేదికగా స్పందిస్తూ.. అమెరికాతో ఎలాంటి చర్చలు జరగబోవని స్పష్టంచేసింది. ప్రాంతీయ శాంతి ప్రయత్నాల మధ్య ఈ పర్యటన కొనసాగుతున్నప్పటికీ, అమెరికా-ఇరాన్ ప్రత్యక్ష చర్చలకు అవకాశం లేదని తెలిపింది. తమ అభిప్రాయాలను పాకిస్తాన్ అధికారులకు మాత్రమే వివరిస్తామని తెలిపింది. దీంతో, చర్చలపై మరోసారి సందిగ్ధం నెలకొంది.మరోవైపు.. అమెరికా, ఇరాన్ చర్చల నేపథ్యంలో ఇస్లామాబాద్‌లో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. 10వేల మంది భద్రతాసిబ్బంది పహారా కాస్తున్నారు. రెడ్ జోన్‌ను పూర్తిగా మూసివేసి, కార్యాలయ ఉద్యోగులకు 'వర్క్ ఫ్రమ్ హోమ్' సౌకర్యం కల్పించారు. ఏప్రిల్ 11, 12 తేదీల్లో జరిగిన మొదటి రౌండ్ చర్చలు విఫలం కావడంతో ఈ రెండో రౌండ్ అత్యంత కీలకంగా మారింది. కాగా, ఈ చర్చల కోసం అమెరికాకు చెందిన లాజిస్టిక్స్, భద్రతా బృందం ఇప్పటికే పాకిస్తాన్‌కు చేరుకుందని పాక్ ప్రభుత్వ వర్గాలు నిర్ధారించాయి. అమెరికా ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్కాఫ్, ట్రంప్ అల్లుడు జారెడ్ కుష్నర్ ఇరాన్‌తో చర్చల కోసం పాక్‌కు వెళ్లనున్నారు. ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీతో వారు భేటీ కానున్నారు. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ వీరితో కలిసి వెళ్లడం లేదు. చర్చల్లో పురోగతి సాధిస్తే ఆయన పాకిస్తాన్‌కు వెళ్లే అవకాశం ఉన్నట్లు అధికారులు చెప్పారు. -
చర్చలపై కొత్త ఆశలు!
ఇస్లామాబాద్: పశ్చిమాసియాలో హార్మూజ్‌జలసంధి దిగ్బంధంతో రెండో దఫా చర్చలపై ప్రతిష్టంభన నెలకొన్న వేళ ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ పాకిస్తాన్ చేరుకోవడం శాంతి చర్చలపై కొత్త ఆశలను చిగురింపజేస్తోంది. పాకిస్తాన్‌తోపాటు ఒమన్, రష్యాల్లోనూ పర్యటించి శాంతి చర్చల్లో తేల్చుకోవాల్సిన కీలకాంశాలపై ఒక అవగాహనకు రానున్నారని అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ‘‘టెహ్రాన్ నుంచి ఇస్లామాబాద్(పాకిస్తాన్), మస్కట్(ఒమన్), మాస్కో(రష్యా) పర్యటనకు శ్రీకారం చుడుతున్నా. ద్వైపాక్షిక అంశాలపై మా భాగస్వాములతో సహకారం కోసం ఈ మూడు దేశాల్లో పర్యటించబోతున్నా. పొరుగుదేశాలే మాకు ముఖ్యం’’అని అరాఘ్చీ తన సామాజిక మాధ్యమ ‘ఎక్స’ఖాతాలో శుక్రవారం ఒక పోస్ట్‌పెట్టారు. దీంతో రెండోదఫా చర్చలకు సన్నాహకాలు మొదలయ్యాయని తెలుస్తోంది. అరాఘ్చీ తన బృందంతో కలిసి ఇస్లామాబాద్‌కు చేరుకున్నారు. అమెరికా దౌత్యవేత్తలకు సాయపడే బృందాలు, భద్రతా సిబ్బంది ఇప్పటికే ఇస్లామాబాద్‌లో సిద్ధంగా ఉన్నాయి. అమెరికా సాంకేతిక బృందంతో ఇరాన్ మధ్యవర్తులు మాట్లాడి షెడ్యూల్‌ను ఖరారుచేశాక అసలైన అమెరికా ప్రతినిధుల బృందం శనివారం రాత్రికల్లా ఇస్లామాబాద్‌కు చేరుకుంటుందని పాక్ ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. స్టీవ్ విట్కాఫ్, కుష్నర్లు శనివారం పాకిస్తాన్ చేరుకుంటారని అమెరికా కూడా ధ్రువీకరించింది. కొనసాగుతున్న దిగ్బంధం‘‘ట్రంప్ సూచనమేరకు సముద్రమందుపాతరలను పెట్టే పడవలను పేల్చేందుకు కాచుకుని కూర్చున్నాం. దశాబ్దాల్లో తొలిసారిగా పశ్చిమాసియాజలాల్లో ఒకేసారి మూడు అమెరికా యుద్ధవిమానాల వాహక నౌకలు యూఎస్ఎస్ అబ్రహాం లింకన్, యూఎస్ఎస్ గెరాల్డ్ ఆర్.ఫోర్డ్, యూఎస్ఎస్ జార్జ్ హెచ్.డబ్ల్యూ.బుష్ లు చక్కర్లు కొడుతున్నాయి. 200 యుద్ధవిమానాలు, 15,000 మంది నావికాదళసభ్యులు హార్మూజ్‌ను దిగ్బంధించాయి’’అని అమెరికా సెంట్రల్ కమాండ్ శుక్రవారం వెల్లడించింది. మరోవైపు అమెరికాయేతర నౌకలు సైతం అమెరికా నౌకాశ్రయాల్లోకి ముడిచమురు, సహజవాయువులను సరఫరాచేసేందుకు వీలుగా జోన్స్ చట్టం అమలును మరో 90 రోజులపాటు నిలుపుదల చేస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు. మరోవైపు ఇరాన్ స్వాదీనంచేసుకున్న ఎపామినోండాస్ నౌకలోని భారతీయ నావికుడు సురక్షితంగా ఉన్నట్లు కేంద్ర పోర్ట్‌లు, షిప్పింగ్, వాటర్‌వేస్ శాఖ డైరెక్టర్ మన్దీప్ సింగ్ రణ్‌ధావా శుక్రవారం చెప్పారు. -
మలి విడత చర్చలు.. పాక్‌కు అమెరికా ప్రతినిధులు!
పాకిస్తాన్‌లోని ఇస్లామాబాద్ వేదికగా జరగనున్న మలి విడత శాంతి చర్చల కోసం అమెరికా ప్రతినిధులు బయల్దేరి వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో అమెరికా ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్కాఫ్, ట్రంప్ అల్లుడు జారెడ్ కుష్నర్లు పాకిస్తాన్‌కు వెళ్లనున్నారు. అయితే అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ వీరితో కలిసి వెళ్లడం లేదని అమెరికా వర్గాలు తెలిపాయి. ఇరాన్‌తో జరిగే చర్చల్లో పురోగతి కనిపిస్తే వాన్స్ పాకిస్తాన్‌కు వెళ్తారని అధికారులు తెలిపారు. కాగా మలి విడత చర్చల కోసం ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ ఇప్పటికే ఇస్లామాబాద్ చేరుకున్నట్లు సమాచారం. ఆయన పాకిస్తాన్‌కు బయల్దేరి వెళ్లడానికి ముందు పాకిస్తాన్ డిప్యూటీ సీఎం, విదేశాంగ మంత్రి ఇషాక్ దార్, పాక్ ఆర్మీ చీఫ్ మునీర్‌తో ఫోన్లో చర్చించినట్లు తెలుస్తోంది. దీంతో వరుస హెచ్చరికలతో ఒకరిపై ఒకరు కత్తులు దూసుకుంటున్న ఇరాన్, అమెరికాకు చెందిన ప్రతినిధులు పాక్‌కు చేరుకోవడం చూస్తుంటే రెండో విడత శాంతి చర్చలు ఉంటాయనే అంచనాలు బలపడుతున్నాయి. -
భారత్‌కు రాలేము.. కీలక టోర్నీ నుంచి పాకిస్తాన్ అవుట్
భారత్ వేదికగా జరగనున్న సౌత్ ఏషియన్ ఫుట్‌బాల్ ఫెడరేషన్ (SAFF) మహిళల ఛాంపియన్షిప్ నుంచి పాకిస్తాన్ వైదొలిగింది. ఈ విషయాన్ని పాకిస్తాన్ ఫుట్‌బాల్ సమాఖ్య ధ్రువీకరించింది. ఇరు దేశాల మధ్య రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో పీఎఫ్ఎఫ్ ఈ నిర్ణయం తీసుకుంది. పాక్ వైదొలగడంతో ఈ టోర్నమెంట్‌ను ఆరు జట్లతో మాత్రమే నిర్వహించనున్నారు.ఈ ఫుట్‌బాల్ టోర్నీ మే 25 నుండి జూన్ 6 వరకు గోవాలోని మార్గావ్ వేదికగా జరగనుంది. మొత్తం ఆరు జట్లను రెండు గ్రూపులుగా విభిజించారు. గ్రూపు-లో నేపాల్, శ్రీలంక, భూటాన్.. గ్రూపు-బిలో భారత్, బంగ్లాదేశ్, మాల్దీవులు. బంగ్లాదేశ్ డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగనుంది. అయితే సాఎఫ్‌ఫ్ టోర్నీలో భారత్‌కు తిరిగిలేని రికార్డు ఉంది. ఇప్పటివరకు టీమిండియా ఐదు సార్లు (2010, 2012, 2014, 2016, 2019) విజేతగా నిలిచింది.కాగా రాజకీయ ఉద్రిక్తతల కారణంగా భారత్ వేదికగా జరిగే టోర్నీలకు పాక్ దూరంగా ఉండడం ఇదేమి తొలిసారి కాదు. గతేడాది తమిళనాడులో జరిగిన పురుషుల జూనియర్ హాకీ ప్రపంచ కప్ నుండి పాక్ వైదొలిగింది. అంతకుముందు రాజ్‌గిర్‌లో ఆసియా కప్-2025కు కూడా తమ సీనియర్ పురుషుల జట్టును పాక్ పంపలేదు.భారత్ కూడా పాక్ వేదికగా క్రీడా ఈవెంట్లను బాయ్‌కాట్ చేస్తూ వస్తుంది. ఆసియా టీ20 కప్‌తో పాటు, ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్‌లు ఆడేందుకు భారత క్రికెట్ జట్టు పాక్‌కు వెళ్లలేదు. తమ మ్యాచ్‌లో మెన్ ఇన్ బ్లూ శ్రీలంక, దుబాయ్ వేదికలగా ఆడింది.చదవండి: IPL 2026: సీఎస్కే జట్టులోకి యార్కర్ల కింగ్ -
నౌకలపై ఇరాన్ దాడి
వాషింగ్టన్/టెహ్రాన్/ఇస్లామాబాద్/దుబాయ్: పాక్ ప్రాయోజిత శాంతి చర్చల ప్రక్రియకు తూట్లు పొడుస్తూ ఇరాన్ హార్మూజ్ జలసంధిని మరోమారు కాల్పులమోతకు వేదికగా మార్చేసింది. శాంతి చర్చలకు ఫలవంతమైన ప్రతిపాదనలతో ఇరాన్ వచ్చేవరకు కాల్పుల విరమణ గడువును పొడిగిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించిన కొద్దిసేపటికే విదేశీ నౌకలపై ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కోర్(ఐఆర్జీసీ) నేవీ బలగాలు దాడులపర్వానికి తెరలేపాయి. ఇటీవల కొన్ని గంటలపాటు హార్మూజ్‌ను పూర్తిగా తెరుస్తున్నట్లు ఇరాన్ చేసిన ప్రకటనతో పర్షియన్ గల్ఫ్ నుంచి ఆశగా బయల్దేరిన నౌకలు గురువారం హార్మూజ్ జలసంధిని దాటే క్రమంలో వాటిపైకి ఐఆర్జీసీ నేవీ గన్బోట్లు తుపాకులు ఎక్కుపెట్టాయి. దీంతో మూడు నౌకలు స్వల్పంగా దెబ్బతిన్నాయి. మూడింటిలో రెండింటిని ఇరాన్ స్వా«దీనంచేసుకుని తమ తీరానికి తీసుకెళ్తున్నాయి. మరోవైపు ఇరాన్ ప్రతినిధి బృందం ఇస్లామాబాద్‌కు బయల్దేరని కారణంగా అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ సారథ్యంలోని బృందం సైతం పాకిస్తాన్‌కు బయల్దేరలేదు. దీంతో రెండో దఫా చర్చలు సాధ్యపడలేదు. అయితే చర్చలు తాత్కాలికంగా వాయిదాపడ్డాయేగానీ రద్దుకాలేదని అమెరికా వ్యాఖ్యానించింది. శుక్రవారంలోపు రెండోదఫా చర్చలు జరిగే వీలుందని ట్రంప్ చెప్పినట్లు ‘ది న్యూయార్క్ పోస్ట్’తన కథనంలో పేర్కొంది. మరోవైపు బుధవారంతో ముగిసిపోతున్న కాల్పుల విరమణ గడువును ట్రంప్ హఠాత్తుగా పొడిగించడంపై మధ్యవర్తిత్వ దేశం పాకిస్తాన్ హర్షం వ్యక్తంచేసింది. సత్ఫల ప్రతిపాదనలతో ముందుకొచ్చేలా ఇరుపక్షాలను ఒప్పించేందుకు తమకు గడువు, సువర్ణావకాశం దక్కాయని పాకిస్తాన్ వెల్లడించింది. ‘‘మా దాడుల ధాటికి ఇరాన్ నాయకత్వంలో విభేదాలు పొడచూపాయి. పాక్ ఫీల్డ్ మార్షల్ ఆసిం మునీర్, ప్రధాని షెహబాజ్ షరీఫ్‌ల అభ్యర్థన మేరకు ఇరాన్‌పై దాడులకు తాత్కాలిక విరామం ప్రకటిస్తున్నా. ఇరాన్ నుంచి ఆమోదయోగ్య ప్రతిపాదనలు వచ్చేదాకా కాల్పుల విరమణ గడువు పొడిగిస్తున్నా. గడువు పొడిగించినా హార్మూజ్ దిగ్బంధం, ఇరాన్ నౌకాశ్రయాల గుండా నౌకల రాకపోకలపై నిషేధం కొనసాగుతుంది’’అని ట్రంప్ అన్నారు. రెండో దఫా చర్చలు జరిగి శాశ్వత శాంతి ఒప్పందం అమల్లోకి వస్తే హార్మూజ్ తెరచుకుని ముడిచమురు సంక్షోభం సమసిపోయి క్రూడ్ ఆయిల్, పెట్రో ధరలు దిగొచ్చేవి. ఇవేవీ సాకారంకాకపోవడంతో ప్రపంచవ్యాప్తంగా పెట్రో ధరలు పెరిగి పరోక్షంగా నిత్యావసర సరుకుల ధరలు మరింత ప్రియమైన పెనుప్రమాదం అలాగే పొంచి ఉంది. ముంద్రా పోర్ట్‌కు వస్తుంటే మెరుపుదాడిఒమన్కు ఈశాన్యంగా 15 నాటికల్ మైళ్లదూరంలో హార్మూజ్ జలాల్లో ఉన్న లైబీరియా జెండాతో వెళ్తున్న కంటైనర్ నౌక ‘ఎపామినోండాస్’పైకి ఐఆర్జీసీ నేవీ గన్బోట్లు హఠాత్తుగా కాల్పులు జరిపి నౌక ముందుకు వెళ్లకుండా అడ్డుకున్నాయి. వాస్తవానికి ఈ నౌక గుజరాత్‌లోని ముంద్రా పోర్ట్‌కు రావాల్సి ఉందని నౌకల స్థితిగతులపై నిఘా పెట్టే ‘మెరైన్ ట్రాఫిక్’సంస్థ వెల్లడించింది. తర్వాత యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ)కేంద్రంగా పనిచేసే పనామా జెండాతో వెళ్తున్న ‘యుఫోరియా’నౌక మీద ఇరాన్ బలగాలు కాల్పులు జరిపాయి. ఈ కాల్పుల్లో నౌకలోని నావికులకు ఎలాంటి గాయాలు కాలేదు. ఇరాన్ తీరానికి కేవలం 8 నాటికల్ మైళ్లదూరం నుంచి వెళ్తున్నప్పుడు యుఫోరియాపై కాల్పులు జరిపారని వ్యాన్‌గార్డ్, యునైటెడ్ కింగ్డమ్ మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్(యూకేఎంటీఓ) వెల్లడించింది. ఇరాన్ తీరానికి కేవలం ఆరు నాటికల్ మైళ్లదూరం నుంచి వెళ్తున్నప్పుడు పనామా జెండాతో ఉన్న ‘ఎంఎస్సీ ఫ్రాన్సిస్కా’నౌక మీదా బుల్లెట్ల వర్షం కురిపించారు. దీంతో నౌక కిందిభాగం స్వల్పంగా దెబ్బతింది. ఎపామినోండాస్, ఎంఎస్సీ ఫ్రాన్సిస్కా నౌకలను స్వా«దీనంచేసుకుని ఇరాన్తీరాలకు బలగాలు తీసుకెళ్తున్నాయి. ఎలాంటి సరైన ధృవీకరణ పత్రాలు, అనుమతులు లేకుండా, రహస్యంగా ఇవి హార్మూజ్‌ను దాటుతున్నాయని ఇరాన్ నేవీ ఆరోపించింది. ట్రాకింగ్‌ను సైతం ఏమార్చి పారిపోతున్నాయని పేర్కొంది. ఎంఎస్సీ ఫ్రాన్సిస్కా నౌక శ్రీలంకలోని హంబన్»ొటా నౌకాశ్రయానికి, యుఫోరియా నౌక జెడ్డాకు వెళ్లాల్సి ఉందని వాటి ట్రాకింగ్డేటా ప్రకారం తెలుస్తోంది. యుద్ధం మొదలైన ఫిబ్రవరి 28వ తేదీ తర్వాత ఇప్పటిదాకా 30కిపైగా నౌకలపై దాడులు జరిగాయి.గడువు పెంపుపై పెదవి విరిచిన ఇరాన్ గడువు పెంపును అమెరికా వేసిన మరో ఎత్తుగడగా ఇరాన్ అభివర్ణించింది. ‘‘సదభిప్రాయంతోనే సీరియస్‌గా తొలి దఫా చర్చలకు కూర్చున్నాం. కానీ అమెరికా అవిశ్వాసం చూపింది. అసంబద్ధ, అతి డిమాండ్ల చిట్టా విప్పింది. ఈ వారాంతంలోపు అమెరికాతో శాంతి చర్చల్లో పాల్గొనాలా వద్దా అనే దానిపై మేం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు’’అని ఇరాన్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఇస్మాయిల్ బఘేల్ చెప్పారు.క్షిపణుల ప్రదర్శన మరోవైపు తమపై దాడులకు అమెరికా, ఇజ్రాయెల్ జంకుతున్నాయంటూ ఇరాన్ పాలకులు వ్యాఖ్యానించారు. ప్రభుత్వసూచనల మేరకు ఇరాన్ సాయుధబలగాలు బుధవారం టెహ్రాన్ వీధుల్లో భారీ క్షిపణులు, మిస్సైల్ లాంఛర్లను ఊరేగింపుగా ప్రదర్శించారు. తమ వద్ద ఇంకా భారీసంఖ్యలో క్షిపణులు ఉన్నాయని పేర్కొన్నారు. క్షిపణులను చూసేందుకు జనం పెద్దసంఖ్యలో వీధుల్లోకి వచ్చారు. జెండాలను చేతబూని ఇరాన్ పాలకులకు అనుకూలంగా నినాదాలుచేశారు.సముద్ర ఇంటర్నెట్ కేబుళ్లు కత్తిరిస్తాం: ఇరాన్గల్ఫ్ దేశాలకు ఇంటర్నెట్ సేవలు అందించే అత్యంత కీలక సముద్రగర్భ ఇంటర్నెట్ కేబుళ్లను తప్పదనుకుంటే కత్తిరించేస్తామని ఇరాన్ హెచ్చరించింది. ఈ మేరకు ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కోర్(ఐఆర్జీసీ) ఒక హెచ్చరిక జారీచేసింది. ఈ వార్తను ఇరాన్ వార్తాసంస్థ టాస్నిమ్ ప్రచురించింది. ‘‘ఈసారి హార్మూజ్ జలసంధి గుండా వెళ్లే పలు ప్రధాన కేబుళ్లు ఏకకాలంలో ‘ప్రమాదవశాత్తు’ పాడైపోవచ్చు లేదా ఉద్దేశపూర్వకంగా లక్ష్యంగా మారొచ్చు. దీంతో పర్షియన్ గల్ఫ్ దేశాల్లో ఇంటర్నెట్ సేవలు స్తంభించిపోయే ప్రమాదముంది. గల్ఫ్ అరబ్ దేశాల ఇంటర్నెట్ భవితవ్యం ప్రశ్నార్థకమవుతుంది’’ అని టాస్నిమ్ తన కథనంలో పేర్కొంది. హార్మూజ్ గుండా పలుదేశాల ఇంటర్నెట్ కేబుళ్లు వెళ్తున్నాయి. ఎర్రసముద్ర జలాల్లో ఇప్పటికే ఇవి పలుమార్లు కత్తిరింపులకు గురయ్యాయి. తమ పరిధిలోనూ వాటిని కత్తిరిస్తామని ఇరాన్ దన్నుతో పనిచేస్తున్న యెమెన్‌లోని హూతీ తిరుగుబాటుదారులు పలుమార్లు హెచ్చరించారు.ఎలాంటి చెల్లింపులు జరపలేదునగదు, క్రిప్టో కరెన్సీ లావాదేవీల వార్తలను ఖండించిన భారత్ న్యూఢిల్లీ: ఇండియా దిశగా వస్తున్న నౌకలు సురక్షితంగా హార్మూజ్ జలసంధిని దాటేలా ఇరాన్‌కు భారత్ నగదు లేదా క్రిప్టోకరెన్సీ చెల్లింపులు జరిపిందన్న వార్తల్లో ఏమాత్రం నిజంలేదని మోదీ సర్కార్ స్పష్టంచేసింది. హార్మూజ్ జలసంధి దిగ్బంధం తర్వాత ఏ దేశానికి చెందిన నౌకనూ రాకపోకలు సాగించేందుకు ఇరాన్ అనుమతించట్లేదు. అయితే తమ నౌక ఇప్పటికే తమ వద్ద అనుమతి పొందిందని, అనుమతి పొందిన జాబితాలో రెండో నంబర్ తమ నౌకదేనని ‘సన్మార్ హెరాల్డ్’నౌకలోని సిబ్బంది చెబుతున్నట్లుగా ఉన్న ఒక ఆడియో క్లిప్ బయటకురావడంతో భారత్‌పై విమర్శలు వెల్లువెత్తాయి. దీనిపై మోదీ సర్కార్ వివరణ ఇచ్చింది. ఈ మేరకు కేంద్ర పోర్ట్‌లు, షిప్పింగ్, వాటర్‌వేస్ శాఖ అదనపు కార్యదర్శి ముఖేశ్ మాంగళ్ బుధవారం ఢిల్లీలో మీడియా సమావేశంలో మాట్లాడారు. ‘‘హార్మూజ్‌ను దాటేందుకు ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కోర్(ఐఆర్జీసీ) నేవీ అధికారులకు సన్మార్ హెరాల్డ్ నౌక కెప్టెన్ డాలర్ల రూపంలో నగదు చెల్లింపులు జరిపాడని వస్తున్న వార్తలో నిజంలేదు. ఈ విషయాన్ని మేం నౌక యజమానితో మాట్లాడి రూఢీచేసుకున్నాం. ఈ ఉదంతంతో భారత్‌కు, కేంద్ర ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదు’’అని ముఖేశ్ స్పష్టంచేశారు. ఏప్రిల్ 18వ తేదీన రెండు భారత్‌కు వచ్చే నౌకలపై ఆర్‌ఆర్‌జీసీ నేవీ బలగాలు కాల్పులు జరిపాయి. కాల్పులు ఆపేస్తే వెనక్కి వెళ్లిపోతామని సన్మార్ హెరాల్డ్ నౌకలోని సిబ్బంది చెప్పినట్లుగా ఆనాడు మీడియాలో వార్తలొచ్చాయి. -
శుక్రవారం నాటికి ‘శుభవార్త’.. ట్రంప్ కీలక ప్రకటన
వాషింగ్టన్: అమెరికా, ఇరాన్ రెండో దఫా చర్చలపై సందిగ్ధత కొనసాగుతున్న నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. రెండో విడత చర్చలపై శుక్రవారం నాటికి శుభవార్త రావచ్చని.. రాబోయే 36 నుంచి 72 గంటల్లో శాంతి చర్చలు పునఃప్రారంభమయ్యే అవకాశం ఉందని ఆయన ఆశాభావం వ్యక్తం చేసినట్లు 'న్యూయార్క్ పోస్ట్’ పేర్కొంది. ఇరాన్‌తో కాల్పుల విరమణను పొడిగించిన కొద్ది గంటలకే ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలిపింది. మధ్యవర్తిత్వం వహిస్తున్న పాకిస్థాన్ అభ్యర్థన మేరకు.. ఇరాన్‌తో కాల్పుల విరమణను ట్రంప్ పొడిగించిన సంగతి తెలిసిందే. ఏడు వారాలుగా సాగుతున్న యుద్ధాన్ని ముగించేందుకు ఇరాన్ నాయకత్వం ఒక ఏకీకృత ప్రతిపాదనతో రావడానికి సమయం ఇచ్చేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. ఏప్రిల్ 8న ప్రకటించిన రెండు వారాల కాల్పుల విరమణ గడువు ముగియడానికి కొన్ని గంటల ముందే ఈ కీలక ప్రకటన వెలువడింది. దీంతో పాకిస్తాన్‌కు వెళ్లాల్సిన అమెరికా ప్రతినిధి బృందం పర్యటన ప్రస్తుతానికి వాయిదా పడింది.ఉపాధ్యక్షుడు జెడి వాన్స్, ప్రత్యేక ప్రతినిధులు స్టీవ్ విట్కాఫ్, జారెడ్ కుష్నర్లతో కూడిన బృందం మంగళవారం ఇస్లామాబాద్ వెళ్లాల్సి ఉంది. అయితే, హార్మూజ్ జలసంధి దిగ్భంధం, తమ కార్గో నౌకపై దాడి, స్వాధీనం ఘటనలతో ఆగ్రహావేశాలతో రగిలిపోతున్న ఇరాన్ పాకిస్తాన్‌కు శాంతి చర్చల బృందాన్ని పంపేదిలేదని తెగేసి చెప్పింది. ఈ క్రమంలో పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ జనరల్ ఆసిమ్ మునీర్, ప్రధాని షెహబాజ్ షరీఫ్ అభ్యర్థన మేరకు ఇరాన్ ఒక సమగ్ర ప్రతిపాదనతో వచ్చే వరకు దాడులు నిలిపివేయాలని నిర్ణయించినట్లు ట్రంప్ పేర్కొన్నారు. అయితే, చర్చల కోసం ఇరాన్ ఏకీకృత ప్రతిపాదనను తెచ్చే వరకు మాత్రమే అమెరికా దాడులకు దూరంగా ఉంటుందని.. కానీ ఇరాన్ ఓడరేవులపై దిగ్బంధనం కొనసాగుతుందని ట్రంప్ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.అమెరికా చర్యలను ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరాగ్చీ తీవ్రంగా ఖండించారు. ఓడరేవులను దిగ్బంధించడం కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించడమేనని, ఇది ఒక ‘యుద్ధ చర్య’గా ఆయన అభివర్ణించారు. వాణిజ్య నౌకలపై దాడులు చేయడం, సిబ్బందిని బందీలుగా పట్టుకోవడం అన్యాయమని, తమ ప్రయోజనాలను ఎలా కాపాడుకోవాలో ఇరాన్‌కు తెలుసని ఆయన హెచ్చరించారు. మరోవైపు, ఆసియాలో ఇరాన్ ముడి చమురును అక్రమంగా రవాణా చేస్తున్నట్లు ఆరోపణలున్న 'M/T టిఫానీ' అనే చమురు ట్యాంకర్‌ను అమెరికా దళాలు స్వాధీనం చేసుకున్నాయి.ఫిబ్రవరి 28న ఇజ్రాయెల్-అమెరికా.. ఇరాన్‌పై దాడులు చేయడంతో ఈ యుద్ధం మొదలైంది. హార్ముజ్ జలసంధిపై ఇరాన్ పట్టుతో అంతర్జాతీయంగా చమురు ధరలు దాదాపు 30 శాతం పెరిగి, బ్యారెల్ ధర 95 డాలర్లకు చేరుకుంది. ఏప్రిల్ 11-12 తేదీల్లో జరిగిన మొదటి విడత చర్చలు విఫలం కావడంతో, ఇప్పుడు రెండో విడత చర్చలపై ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. -
ఆ రూ.3 వేలు తీసుకోకపోయి ఉంటే.. 26 మంది ప్రాణాలు నిలబడేవి
ఢిల్లీ : పహల్గాం ఉగ్రదాడి జరిగి నేటికి ఏడాది. ఈ సందర్భంగా ఆ మారణహోమానికి సంబంధించిన కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.ఎన్ఐఏ విచారణలో తేలిన వివరాల ప్రకారం పహల్గాం ఉగ్రదాడి ముందు రోజు (ఏప్రిల్ 21, 2025 రాత్రి) ముగ్గురు పాకిస్థాన్ ఉగ్రవాదులకు ఇద్దరు కాశ్మీర్ స్థానికులు ఫర్వేజ్ అహ్మద్, బషీర్ అహ్మద్ ఆశ్రయం కల్పించారు. ఉగ్రవాదుల గురించి పోలీసులకు సమాచారం ఇచ్చే అవకాశమున్నప్పటికీ, వారు చెప్పలేదు. ఇందుకోసం ఉగ్రవాదుల నుంచి రూ.3,000 తీసుకున్నట్లు విచారణలో బయటపడింది.ఆ రాత్రి ఫైజల్ జాట్ అలియాస్ సులేమాన్ షాక్, హబీబ్ తాహీర్ అలియాస్ జిబ్రాన్, హంజ్జా ఆఫ్గానీ అనే ముగ్గురు ఉగ్రవాదులు ఆయుధాలతో ఆ ఇద్దరి ఇళ్లకు వచ్చారు. వారు ఉర్దూ, పంజాబీ భాషల్లో మాట్లాడుతుండగా, పెద్ద దాడి జరగబోతుందనే విషయం స్థానికులకు అర్థమైంది. సుమారు ఐదు గంటల పాటు అక్కడే గడిపి, భోజనం చేసి, అవసరమైన వంట పాత్రలు, బ్లాంకెట్, టార్పాలిన్ షీట్ తీసుకెళ్లారు.ఏప్రిల్ 22న మధ్యాహ్నం 12:30 వరకు ఫర్వేజ్, బషీర్ ఇళ్ల వద్దే ఉన్న ఉగ్రవాదులు ఆ తర్వాత బైసరీన్ వ్యాలీలో దాక్కున్నారు. అదే రోజు మధ్యాహ్నం 1 గంట సమయంలో ఫర్వేజ్, బషీర్ పహల్గాంలో టూరిస్టులను గుర్రాలపై బైసరీన్ వ్యాలీకి తీసుకెళ్లారు. అక్కడే మారణహోమం జరిగింది. దాడి జరుగుతున్నా తమకేం పట్టనట్లుగా అక్కడి నుంచి వెళ్లిపోయారని ఎన్ఐఏ విచారణలో తేలింది. జూన్ 22, 2025న ఎన్ఐఏ ఆ ఇద్దరు స్థానికులను అదుపులోకి తీసుకుని, ఛార్జ్‌షీట్‌లో వారి పేర్లను చేర్చింది.ఫర్వేజ్, బషీర్ తీసుకున్న ఆ మూడు వేల రూపాయలే 26 మంది అమాయకుల ప్రాణాలను బలి తీసుకున్నాయి. ఘటన జరిగి ఏడాది గడిచినా, బాధితుల కళ్ల ముందు ఆ దృశ్యాలు ఇంకా కదలాడుతూనే ఉన్నాయని, వారు కన్నీటి పర్యంతమవుతున్నారని తెలుస్తోంది. -
డ్రగ్స్ టెస్ట్‌లో దొరికిపోయిన పాక్ క్రికెటర్
పాకిస్తాన్ క్రికెట్‌కు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు కీలక ఆల్‌రౌండర్ మొహమ్మద్ నవాజ్ డ్రగ్స్ టెస్ట్‌లో పాజిటివ్‌గా తేలాడు. ఈ వ్యవహారంపై పాక్ క్రికెట్ బోర్డు విచారణ ప్రారంభించింది. నవాజ్ కాంట్రాక్ట్‌ను రద్దు చేసింది. నవాజ్ ఇటీవల ముగిసిన టీ20 ప్రపంచకప్‌లో డ్రగ్స్ వాడినట్లు నిరూపితమైంది. ఆ మెగా టోర్నీలో అతను 7 మ్యాచ్‌ల్లో 7 వికెట్లతో పర్వాలేదనిపించాడు. నవాజ్ రాణించినా, ప్రపంచకప్‌లో పాక్ ఘోరంగా విఫలమై సూపర్-8 దశలోనే ఇంటిముఖం పట్టింది. పీసీబీ విచారణలోనూ నవాజ్ నేరం రుజువైతే కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. శాశ్వత నిషేధం అదనంగా భారీ జరిమానా విధించవచ్చు.కాగా, క్రికెట్లో డ్రగ్స్ వినియోగంపై కఠిన నిబంధనలు అమల్లో ఉన్నాయి. వినోదం కోసం అయినా నిషేధిత పదార్థాలు వాడితే తీవ్ర శిక్షలు తప్పవు. ఈ ఘటన మరోసారి క్రికెట్లో క్రమశిక్షణ, ప్రొఫెషనల్ ప్రవర్తన ఎంత ముఖ్యమో గుర్తు చేసింది. -
ముష్కరులను వేటాడిన 'మహదేవ్'!
సరిగ్గా ఏడాది క్రితం 2025 ఏప్రిల్ 22న పహల్గామ్లోని బైసరన్ లోయ ఎప్పటిలాగే పర్యాటకులతో సందడిగా ఉంది. ఇంతలో హఠాత్తుగా పాకిస్తాన్ ఉగ్రవాదులు మారణకాండ సృష్టించారు. ఒక స్థానికునితో పాటు 26 మంది అమాయకులు బలైపోయారు. దేశం మొత్తం ఈ ఘటనతో దిగ్భ్రాంతికి గురైంది. మొదలైన వేటదాడి చేసిన వారిని గుర్తించడం భద్రతా దళాలకు పెద్ద సవాలుగా మారింది. మొదట్లో వారి గురించి ఎటువంటి సమా చారం లేదు. జమ్మూ కశ్మీర్ పోలీసులు, ఇతర భద్రతా సంస్థలు కలిసి క్షేత్రస్థాయిలో నిఘా పెంచాయి. ఫలితంగా దాడి జరిగిన కొన్ని రోజులకే దక్షిణ కశ్మీర్ ప్రాంతం నుండి కొన్ని సాంకేతిక సంకేతాలు (టెక్నికల్ సిగ్నేచర్స్) అందాయి. దీంతో హాపత్నార్ ఎగువప్రాంతాల్లో భారీ గాలింపు చర్యలు చేపట్టారు. అయితే ఉగ్రవాదులు అక్కడ దొరకలేదు కానీ వారు అక్కడి నుండి తరలిపోతున్నట్లు ఆధారాలు లభించాయి.జూన్ నెల మధ్యనాటికి ఉగ్రవాదులు తమ వ్యూహాన్ని మార్చు కున్నారు. పట్టణ ప్రాంతాల నుండి దూరంగా, దట్టమైన అడవుల్లోకి వెళ్లిపోయారు. ఇది భద్రతా దళాలకు పరీక్షగా నిలిచింది. జనసంచారం ఉన్న చోట సమాచారం సులభంగా లభిస్తుంది, కానీ అడవుల్లో కదలికలను గుర్తించడం కష్టం కదా! అయినా మన దళాలు పట్టు విడవకుండా దాచీగామ్ అడవులు, దక్షిణ కశ్మీర్ అడవులను కలిపే ఎగువ ప్రాంతాల్లో తాత్కాలిక సైనిక స్థావరాలను (టీఓబీలు) ఏర్పాటు చేసుకుని అన్వేషణ కొనసాగించాయి. క్రమంగా అడవు లను తమ అధీనంలోకి తీసుకోసాగాయి. జూలై రెండో వారంలో ఈ కష్టానికి ఫలితం కనిపించింది. దాచీగామ్ బెల్ట్ ప్రాంతంలో ఉగ్ర వాదుల టెక్నికల్ సంకేతాలను మళ్ళీ గుర్తించగలిగారు. అంతే... కేంద్ర నిఘా సంస్థల సమన్వయంతో ఆ ప్రాంతాన్ని మ్యాపింగ్ చేశారు. దట్టమైన అడవి కావడం వల్ల గాలింపు కష్టమని గుర్తించిన అధికారులు... ఆ ప్రాంతాన్ని విభిన్న సెక్టార్లుగా విభజించారు. ప్రతి సెక్టార్‌కు ఒక బృందాన్ని కేటాయించారు. ఈ బృందాలు రోజుల తరబడి అడవుల్లో తిరుగాడాయి.ఆపరేషన్ మహాదేవ్చివరికి జూలై 28న శ్రీనగర్ కొండల్లో సైన్యానికి చెందిన స్పెషల్ ఫోర్స్ యూనిట్‌కు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు జరి గాయి. ఇదే ‘ఆపరేషన్ మహాదేవ్’. ఈ మెరుపు దాడిలో ముగ్గురు పాకిస్తానీ ఉగ్రవాదులు హతమయ్యారు. వీళ్లను ఫైజల్ జట్ అలియాస్ సులేమాన్ షా, హబీబ్ తాహిర్ అలియాస్ జిబ్రాన్, హమ్జా అఫ్గానీ లుగా గుర్తించినట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా పార్లమెంటులో ప్రకటించారు. వీళ్లు ‘లష్కరే తోయిబా’ దాని అనుబంధ సంస్థ ‘ద రెసిస్టెన్స్ ఫ్రంట్’కు చెందిన వాళ్లని తేల్చారు. చనిపోయినవారు పహల్గామ్ దాడికి పాల్పడినవారేనని నిరూపించడానికి భద్రతా దళాల దగ్గర గట్టి ఆధారాలే ఉన్నాయి. పహల్గామ్లో దొరికిన బుల్లెట్ సెల్స్, దాచీగామ్లో ఉగ్రవాదుల నుంచి స్వాధీనం చేసుకున్న ఆయుధాలు ఒకే రకమైనవని బాలిస్టిక్ విశ్లేషణలో తేలింది. దాడి జరిగిన రోజు నమోదైన టెక్నికల్ సిగ్నే చర్స్, ఆపరేషన్ మహాదేవ్ సమయంలో దొరికిన సిగ్నేచర్స్‌తో సరి పోలాయి. ఆ ఉగ్రవాదులకు ఆహారం, ఆశ్రయం కల్పించిన ఒక గుజ్జర్ కుటుంబం కూడా వారిని గుర్తించింది. ఆపరేషన్ సిందూర్పహల్గామ్ దాడి జరిగిన వెంటనే భారత ప్రభుత్వం ఉగ్ర వాదుల కోసం తన భూభాగంలో వేటసాగిస్తూనే... సరిహద్దుల ఆవల ఉన్న ఉగ్రవాద స్థావరాలపై విరుచుకుపడింది. 2025 మే 7న ‘ఆపరేషన్ సిందూర్’ ప్రారంభమైంది. ఈ ఆపరేషన్‌లో పాక్ ఆక్ర మిత కశ్మీర్, పాకిస్తాన్లో ఉన్న తొమ్మిది ప్రధాన ఉగ్రవాద లాంచ్ ప్యాడ్లను భారత సైన్యం ధ్వంసం చేసింది. ఘటన జరిగి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా పహల్ గామ్‌లోని లిడ్డర్ నది ఒడ్డున ఒక స్మారక కట్టడాన్ని నిర్మించారు. నల్లటి చలువరాతి స్మారక ఫలకంపై మరణించిన 26 మంది పేర్లను చెక్కారు. 93 రోజుల పాటు సాగిన ఆపరేషన్ మహాదేవ్ అందించిన స్ఫూర్తి కశ్మీర్లో శాంతి పునరుద్ధరణకు నాంది పలికింది. ఏడాది క్రితం అమాయకుల రోదనలు, గుండెల్ని పిండే వేదనలకు సాక్షీ భూతంగా నిలిచిన లిడ్డర్ నది తన పర్యాటక దేవుళ్ల పాదాలు చల్లగా స్పృశిస్తూ అలా ముందుకు సాగిపోతోంది ఈ నేల బిడ్డల ఆశలను చిగురింపజేస్తూ!-ఎడిటోరియల్ టీమ్ -
పాక్ ధురంధర్ కి పోటీగా సినిమా ట్రోలింగ్ జోరు
-
పాకిస్థాన్‌కు ట్రంప్..? యుద్ధం ముగిసేనా..!
ఇరాన్ అమెరికా మధ్య చర్చల విషయంలో ప్రస్తుతం తీవ్ర ప్రతిష్టంభన నడుస్తోంది. ఇరాన్ చర్చలకు ససేమిరా అనడంలో గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్ నేరుగా రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. ఇస్లామాబాద్‌లో జరిగే రెండో విడత చర్చలకు ట్రంప్ స్వయంగా పాల్గొనే అవకాశం ఉందని రాయిటర్స్ కథనం పేర్కొంది.ఇటీవల పాకిస్థాన్ ఇస్లామాబాద్ వేదికగా అమెరికా-ఇరాన్ మధ్య తొలివిడత చర్చలు జరిగాయి. అయితే ఇరు దేశాల మధ్య ఎటువంటి అంగీకారం కుదరకపోవడంతో ఎటువంటి ఒప్పందం లేకుండానే భేటీ ముగిసింది. అయితే మరో దఫా చర్చల కోసం అమెరికా ప్రయత్నిస్తుండగా ఇరాన్ మాత్రం అంగీకరించట్లేదు. యుఎస్ఏ పెట్టే డిమాండ్లకు ఎట్టిపరిస్థితుల్లో అంగీకరించేది లేదని తేల్చిచెప్పింది.ఈ నేపథ్యంలో అమెరికా కీలక ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సారి జరిగే శాంతి చర్చలకు ట్రంప్ నేరుగా లేదా వర్చువల్‌గా పాల్గొనాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఇరాన్‌తో రాయబారం కోసం ప్రయత్నిస్తున్నట్లు కీలక సమాచారం అందుతుంది. ఇరాన్ సైతం తొలుత చర్చలు జరపమని పట్టుబట్టినప్పటికీ ప్రస్తుతం సానూకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ట్రంప్ నేరుగా హాజరైతే చర్చల అంశం ఆశాజనకంగా ముగిసే అవకాశమున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. చర్చలు విఫలానికి కారణంట్రంప్.. ప్రధానంగా ఇరాన్ ఎట్టిపరిస్థితుల్లో అణ్వాయుధాలు తయారు చేయకూడదని, హర్ముజ్ దిగ్భందనం తొలగించాలని కోరుతున్నారు. అయితే దీనికి ఇరాన్ ఒప్పుకోవడం లేదు. మరోవైపు అమెరికా యుద్ధ పరిహారం చెల్లించాలని, ఇరాన్ మీద ఉన్న ఆంక్షలన్నీ ఎత్తివేయాలని విదేశాల్లో ఫ్రీజ్ చేసిన ఇరాన్ డబ్బులు చెల్లించాలని కోరుతుంది. ఈ డిమాండ్లకు అమెరికా ఒప్పుకోవడం లేదు. దీంతో రెండు దేశాల మధ్య చర్చల విషయంలో ప్రతిష్ఠంభన నెలకొంది.సెక్యూరిటీ నీడలో ఇస్లామాబాద్చర్చల జరిగే ఇస్లామాబాద్ ప్రాంతం ప్రస్తుతం సెక్యూరిటీ నీడలో ఉన్నట్లు తెలుస్తోంది. చర్చల కోసం పాకిస్థాన్ సుమారు 20,000 మంది భద్రతా సిబ్బందిని ఇస్లామాబాద్‌లో మోహరించింది. తొలిదశ చర్చల సమయంలో సైతం ఇరాన్ అమెరికా ప్రతినిధులకు ప్రత్యేక భద్రత ఏర్పాటు చేశారు. -
ఇరాన్ విదేశాంగ మంత్రికి పాక్ ఉప ప్రధాని ఫోన్!
అమెరికా, ఇరాన్ మధ్య రెండో విడత చర్చలపై అనిశ్చితి నెలకొన్న నేపథ్యంలో పాకిస్థాన్ ఉప ప్రధాని ఇషాఖ్ దర్ సోమవారం ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీతో ఫోన్లో మాట్లాడినట్లు తెలుస్తోంది. చర్చల కొనసాగింపుకు సంబంధించి కీలక విషయాలపై చర్చించారు. ఈ నేపథ్యంలో పాక్ విదేశాంగ మంత్రి కూడా అయిన దర్ టెలిఫోన్లో అరాఘ్చీతో మాట్లాడినట్లు పాక్ విదేశాంగ కార్యాలయం ఎక్స్ పోస్టులో తెలిపింది. ప్రాంతీయ శాంతి, సుస్థిరతను పెంపొందించేందుకు అన్ని పెండింగ్ సమస్యలను త్వరితంగా పరిష్కరించుకోవాలని, ఇందుకోసం చర్చలు ఎంతో అవసరమని దర్ పేర్కొన్నట్లు పాక్ తెలిపింది. అమెరికా, ఇరాన్ మధ్య రెండు వారాల కాల్పుల విరమణ బుధవారంతో ముగియనున్న నేపథ్యంలో ఉభయ దేశాల మధ్య రెండో విడత చర్చలపై ఇంకా స్పష్టత రాలేదు. ఈ మంగళవారం ఈ చర్చలు ఇస్లామాబాద్‌లో జరుగుతాయని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇదివరకు ప్రకటించారు. ఇక ఇరాన్ రెండో విడత చర్చలకు నిరాకరించిన సమయంలో, అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ బృందం ఇరాన్‌తో మలి విడత చర్చల కోసం పాక్‌కు వెళ్లలేదన్న సమాచారం చర్చనీయాంశమైంది. -
మలి విడత చర్చలు.. పాక్‌కు వెళ్లని జేడీ వాన్స్!
పశ్చిమాసియా సంక్షోభం మరింత ముదురుతోంది. రెండో విడత చర్చల కోసం పాక్‌కు వచ్చేది లేదని ఇరాన్ మొండికేసి కూర్చుంది. మరోవైపు అమెరికా ప్రతినిధులు మాత్రం ఇరాన్‌తో రెండో విడత చర్చల కోసం పాక్ రాజధాని ఇస్లామాబాద్‌కు చేరుకున్నట్లు వార్తలు వచ్చిన వేళ ఒక కీలక అప్డేట్ వెలుగులోకి వచ్చింది. ఇరాన్‌తో చర్చల నిమిత్తం అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఇస్లామాబాద్‌కు వెళ్లలేదనే రాయిటర్స్ తమ కథనంలో పేర్కొంది. సోమవారం ఉదయం 11 గంటల ప్రాంతంలో ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌కు చెందిన కాన్వాయ్ వైట్‌హౌస్‌కు చేరుకోవడం ఈ విషయానికి మరింత బలం చేకూర్చినట్లయింది. బుధవారంతో ఇరాన్, అమెరికా మధ్య కాల్పుల విరమణ ఒప్పందం ముగియనుంది. ఇరు దేశాల మధ్య చర్చలు జరగాల్సి ఉన్న నేపథ్యంలో ఇప్పుడు జేడీ వాన్స్ అసలు పాక్‌కు వెళ్లలేదని వస్తున్న వార్తలతో మలి విడత చర్చలు జరగడం అనుమానమే. తొలి విడత చర్చలకు అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, వైట్‌హౌస్ ప్రతినిధి స్టీవ్ విట్కాఫ్, ట్రంంప్ అల్లుడు జారెడ్ కుష్నర్లు వెళ్లిన సంగతి తెలిసిందే. కానీ ఆ చర్చలు ఎటూ తేలకుండానే ముగిశాయి. మరోవైపు శాంతి చర్చలకు హాజరయ్యే విషయాన్ని తాము ఇంకా పరిశీలిస్తూనే ఉన్నామని, దీనిపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఇరాన్ అధికారి ఒకరు రాయిటర్స్‌కు పేర్కొన్నారు. -
చర్చల్లేవ్.. ‘కాల్పుల విరమణ‘ ముగుస్తోంది.. నెక్ట్స్ విధ్వంసమే?
టెహ్రాన్: ఇరాన్, అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధానికి చర్చలతో ముగింపు పలకాలని ప్రపంచ దేశాలు మొదటి నుంచి సూచిస్తున్నాయి. ఇప్పటికే పాకిస్థాన్‌లో మొదటి దశ చర్చలు జరిగి, అవి విఫలమయ్యాయి. సోమవారం రెండో దశ చర్చలు జరుగుతాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించినప్పటికీ నేడు చర్చలు జరగలేదు. ఇరాన్ చర్చలకు వెళ్లకపోవడమే ఇందుకు కారణం. మరోవైపు బుధవారం (ఏప్రిల్ 22)తో అమెరికా-ఇరాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం ముగియనుంది. మళ్లీ యుద్ధం మొదలైతే పరిస్థితులు అత్యంత భయానకంగా ఉంటాయి.సోమవారం చర్చలు జరుగుతాయని భావించడంతో ఇస్లామాబాద్‌లో భద్రతా చర్యలు కట్టుదిట్టం చేశారు. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఈ చర్చల్లో తమ ప్రతినిధి బృందానికి నాయకత్వం వహించాల్సి ఉంది. ముందుగా ట్రంప్.. వాన్స్ హాజరు కావడంలేదని చెప్పినప్పటికీ చివరకు తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. వాన్స్ ఇస్లామాబాద్‌లో జరిగిన తొలి చర్చల రౌండ్‌కూ నాయకత్వం వహించిన విషయంతెలిసిందే. ఈ సారి అమెరికా ప్రతినిధి బృందంలో ట్రంప్ అల్లుడు జారెడ్ కుష్నర్, ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్కాఫ్ కూడా ఉన్నారు. అమెరికాతో తదుపరి దశ చర్చల రౌండ్‌పై ఎలాంటి ప్లాన్లూ లేవని ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఇప్పటికే స్పష్టం చేసింది. రెండో దశ చర్చలు జరగాలని అంతర్జాతీయ మధ్యవర్తులు చెప్పినప్పటికీ ఇరాన్ నుంచి ఈ ప్రకటన వచ్చింది.చర్చలు ఎందుకు జరగలేదు? ప్రస్తుత కాల్పుల విరమణ ఏప్రిల్ 22న ముగియనున్న నేపథ్యంలో చర్చలు జరగకపోవడం ఆందోళన కలిగించే అంశం. ప్రస్తుతం నెలకొన్న వాతావరణం చర్చలకు అనుకూలం కాదని ఇరాన్ అధికారులు అంటున్నారు. దేశ ప్రయోజనాలు, భద్రత కోసం ఏం చేయడానికైని సిద్ధంగా ఉన్నామని ఇరాన్ చెబుతోంది. అయితే, అమెరికన్లు తమ బెదిరింపు విధానంతో అధిక డిమాండ్లను సాధించుకునేందుకు చర్చల వేదికలను వాడుకుంటే కుదరదని హెచ్చరిచింది. అమెరికా నావికాదళ నిర్బంధం, అణు డిమాండ్లపై ఇరాన్ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. తమ డిమాండ్లపై అమెరికా వైపు నుంచి సానుకూల సంకేతం వస్తేనే ఇరాన్ దౌత్య బృందం ఇస్లామాబాద్ వెళ్లే అవకాశం ఉందని ఇరాన్ తెలిపింది. హార్మూజ్ జలసంధి, లెబనాన్, అణు కార్యక్రమం, సీజ్ చేసిన ఆస్తులను రిలీజ్ చేయడం వంటి వాటిపై ఇరాన్ డిమాండ్లను పెడుతోంది. తాజాగా ఇరాన్ వాణిజ్య నౌకను అమెరికా సీజ్ చేయడంతో ఇరాన్ రగిలిపోతోంది. దీనిపై ప్రతీకారం తీసుకుంటామని ఇరాన్ తెలిపింది. చర్చల ముందు ఇరాన్ నౌకను అమెరికా సీజ్ చేయడంపై భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి.నెక్ట్స్ ఏం జరుగుతుంది?చర్చలు పునఃప్రారంభం కాకపోతే ఉద్రిక్తతలు పెరిగే అవకాశం ఉంది. ఈ కింది పది ప్రమాదాలు పొంచి ఉంటాయి.కాల్పుల విరమణ గడువు ముగిసిన తర్వాత సైనిక ఉద్రిక్తతలు పెరిగే అవకాశం ఉందిపూర్తి స్థాయి యుద్ధానికి దారితీసే పరిస్థితి ఏర్పడే ప్రమాదం ఉందిహార్మూజ్ జలసంధి వద్ద రవాణా అంతరాయం వల్ల చమురు సరఫరా దెబ్బతినే అవకాశం ఉందిగ్యాస్, ఇంధన కొరత పలు దేశాల్లో ఉత్పన్నమయ్యే అవకాశం ఉందిఅంతర్జాతీయ చమురు ధరలు పెరిగే అవకాశం ఉందిప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందిస్టాక్ మార్కెట్లు కుదేలయ్యే పరిస్థితి రావచ్చుపశ్చిమాసియాలో భద్రతా పరిస్థితి మరింత దిగజారే అవకాశం ఉందిఇతర దేశాలు ఈ ఘర్షణలో చేరే ప్రమాదం ఉందిదౌత్య చర్చలు పూర్తిగా నిలిచిపోయి దీర్ఘకాలిక అస్థిరత నెలకొనే అవకాశం ఉంది -
పాక్‌కు ఇరాన్ సరికొత్త మెలిక
పశ్చిమాసియా సంక్షోభంలో మరో మలుపు చోటు చేసుకుంది. ఇరాన్ వాణిజ్య నౌకను అమెరికా దళాలు సీజ్ చేయడం.. అటుపై కౌంటర్ దాడులతో ఉద్రిక్తతలు నెలకొన్నాయి. శాంతి చర్చలకు తమ ప్రతినిధుల బృందం ఇస్లామాబాద్‌కు వెళ్లదని ఇరాన్ ప్రకటించడంతో.. పరిస్థితి మొదటికి వచ్చింది. అయితే చర్చలకు సిద్ధమని ప్రకటించిన ఇరాన్ కొత్త షరతులతో మధ్యవర్తి పాకిస్తాన్‌ను ఇరకాటంలో పడేసినట్లు తెలుస్తోంది. అమెరికా-ఇరాన్ మధ్య శాంతి చర్చలకు పాకిస్తాన్ మధ్యవర్తిగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ డీల్ కుదర్చడం ద్వారా ట్రంప్‌నకు మరింత దగ్గర కావాలని.. తమ దేశం చివర ‘శాంతిదూత’ అనే ట్యాగ్ తగిలించుకోవాలని విపరీతమైన ప్రయత్నాలు చేస్తోంది. అయితే తొలి దఫా చర్చల కోసం పేలవమైన నిర్వహణ.. డీల్ కుదర్చడంలో విఫలం కావడంతో అంతర్జాతీయ సమాజంలో పాక్ నవ్వులపాలైంది. దీంతో రెండో దఫా చర్చలను ఎలాగైనా సక్సెస్ చేయాలని ఉవ్విళ్లూరుతుంది. అయితే.. ఇరాన్ మాత్రం పాక్‌ను మిత్రదేశంగా కాకుండా.. మధ్యవర్తిగానే చూస్తూ చర్చల విషయంలో మూడు చెరువుల నీళ్లు తాగిస్తోంది. ఇరాన్‌ను ఇబ్బంది పెట్టే ఏ ప్రయత్నాన్ని తాము అంగీకరించబోమని అంటోంది. అమెరికా డిమాండ్లు వాస్తవానికి దూరంగా ఉన్నాయని.. ముఖ్యంగా శుద్ధి చేసిన యురేనియంను అప్పగించే ప్రసక్తే లేదని కుండబద్ధలు కొట్టింది. ఇదే విషయంపై ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్ పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌తో ఫోన్లో ప్రస్తావించారు. ఈ ఫోన్‌కాల్‌లో ఆయన.. అమెరికాతో చర్చలకు తాము సిద్ధంగా లేమని చెప్పారు. అయితే ఆఖర్లో ఇరాన్ భద్రతా ప్రయోజనాలను కాపాడే షరతులపై మాత్రమే చర్చలకు తాము ముందుకు వస్తామని స్పష్టం చేశారు. ‘‘మా అణు కార్యక్రమం శాంతి ప్రయోజనాల కోసం. దాన్ని వదులుకోవడం అసాధ్యం’’ అని పాక్ ప్రధానితో ఇరాన్ అధ్యక్షుడు స్పష్టం చేసినట్లు సమాచారం. అయితే.. ఈ విషయంలో అమెరికా ఓ మెట్టు పైనే ఉంటోంది. ఇరాన్ అణు ప్రోగ్రామ్ తగ్గించాలని, శుద్ధి చేసిన యురేనియంను అంతర్జాతీయ పర్యవేక్షణ కోసం తమకే అప్పగించాలని డిమాండ్ చేస్తోంది. ఈ విషయంలో ఇరాన్‌ను ఒప్పించే పూచీ తమదని ట్రంప్‌నకు తొలి నుంచి పాక్ చెబుతూ వస్తోంది. ఈ హామీ ఆధారంగానే ట్రంప్ బాహాటంగా ఇరాన్ అన్నింటికీ అంగీకరిస్తుందంటూ వరుస స్టేట్మెంట్లు ఇస్తున్నారు. అయితే.. ఇరాన్ మాత్రం ఆ కండిషన్లకు ససేమీరా అంటోంది. వాటిని ‘అసాధ్యమైనవి’గా పేర్కొంటూ అవసరమైతే చర్చలనే బహిష్కరిస్తామని హెచ్చరిస్తోంది. ఈ కఠిన వైఖరి ట్రంప్‌నకు మరింత మంట పుట్టిస్తోంది. అదే టైంలో.. పాక్‌కు కొత్త తలనొప్పి తెచ్చి పెడుతోంది.ప్రస్తుతం పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం కొనసాగుతుండగా.. ఇరాన్–అమెరికా మధ్య చర్చలు జరగడం ప్రాంతీయ శాంతికి కీలకమని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే ఇరాన్ తన అణు హక్కులను వదులుకోదనే స్పష్టమైన సంకేతం ఇస్తూ.. అమెరికాను ఢీ కొట్టి తీరతామనే వైఖరిని ప్రదర్శిస్తోంది. -
ఎట్టకేలకు శతక్కొట్టిన బాబర్ ఆజమ్
పొట్టి క్రికెట్లో పాకిస్తాన్ స్టార్ బ్యాటర్ బాబర్ ఆజమ్ ఎట్టకేలకు సెంచరీ చేశాడు. ఈ ఫార్మాట్లో 67 ఇన్నింగ్స్‌ల్లో అతనికిది మొదటి శతకం. పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026లో భాగంగా నిన్న (ఏప్రిల్ 19) క్వెట్టా గ్లాడియేటర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో బాబర్ శతక్కొట్టాడు. ఈ సెంచరీ అతనికి టీ20 ఫార్మాట్లో 12వది. ఈ సెంచరీతో బాబర్ టీ20ల్లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో తన రెండో స్థానాన్ని మరింత మెరుగుపర్చుకున్నాడు. ఈ జాబితాలో విండీస్ యోధుడు క్రిస్ గేల్ (22) టాప్ ప్లేస్‌లో ఉండగా.. బాబర్ తర్వాత మూడో స్థానంలో డేవిడ్ వార్నర్ (10) ఉన్నాడు. వీరి తర్వాత సాహిబ్జాదా ఫర్హాన్, రిలీ రొస్సో, విరాట్ కోహ్లి, క్వింటన్ డికాక్ తలో 9 సెంచరీలతో నాలుగో స్థానంలో ఉన్నారు.బాబర్ తాజా సెంచరీ విషయానికొస్తే.. ఈ సెంచరీని అతను కేవలం 52 బంతుల్లో పూర్తి చేశాడు. ఈ సెంచరీ కూడా బాబర్‌కు అత్యంత నాటకీయ పరిస్థితుల్లో వచ్చింది. ఇన్నింగ్స్ చివరి బంతి మిగిలుండగా బాబర్ మూడంకెల మార్కును అందుకునేందుకు 2 పరుగులు కావాలి. అయితే ఆ బంతికి బాబర్ ఆడిన షాట్‌కు ఒక్క పరుగు మాత్రమే వచ్చేలా కనిపించింది. అయినప్పటికీ బాబర్ సాహసం చేసి రెండు పరుగులు తీసి సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ సెంచరీ తర్వాత బాబర్ గర్జిస్తూ సంబురాలు చేసుకున్నాడు. చాలాకాలం తర్వాత వచ్చిన సెంచరీ కావడంతో బాబర్ ఆనందానికి అవథుల్లేకుండా పోయాయి.ప్రస్తుత పాక్ సూపర్ లీగ్‌లో బాబర్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ఈ సెంచరీకి ముందు 2 భారీ అర్ద సెంచరీలు చేశాడు. ఈ సీజన్లో బాబర్ సగటు 100కుపైగా ఉంది. స్ట్రయిక్‌రేట్ 143.73గా ఉంది. పీఎస్ఎల్కు ముందు బాబర్ టీ20 భవితవ్యంపై అనేక అనుమానాలు ఉండేవి. అతను టీ20ల నుంచి తప్పుకోవాలని డిమాండ్లు వినిపించాయి. అయితే తాజాగా ప్రదర్శనతో అతను అందరి నోళ్లు మూయించాడు.బాబర్ తాజా సెంచరీ కారణంగా అతని జట్టు పెషావర్ జల్మీ క్వెట్టా గ్లాడియేటర్స్‌పై 118 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన జల్మీ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 255 పరుగులు చేసింది. బాబర్‌తో పాటు కుసాల్ మెండిస్ (83) రాణించాడు.అనంతరం భారీ లక్ష్య ఛేదనలో గ్లాడియేటర్స్ చేతులెత్తేసింది. 18.1 ఓవర్లలో 137 పరుగులకే ఆలౌటైంది. అలీ రజా, బాసిత్ తలో 3, హార్డీ 2, బ్రేస్‌వెల్, ముఖీమ్ చెరో వికెట్ తీసి గ్లాడియేటర్స్‌ను కుప్పకూల్చారు. -
చర్చలకు ఇరాన్ నో
వాషింగ్టన్: రెండో విడత చర్చలకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రతిపాదనను ఇరాన్ తిరస్కరించింది. ఆదివారం ఈ దిశగా నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. మంగళవారం పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో చర్చలు జరుగుతాయని తొలుత ట్రంప్ ప్రకటించారు. తమ ప్రతినిధులు స్టీవ్ విట్కాఫ్, జేర్డ్ కుష్నర్ సోమవారం సాయంత్రంకల్లా ఇస్లామాబాద్ చేరతారన్నారు. వాటిలో ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కూడా పాల్గొంటారని అనంతరం వైట్‌హోస్ పేర్కొంది. అనంతరం ఇరాన్ స్పందిస్తూ, తాము ఈ చర్చల్లో పాల్గొనబోమని స్పష్టం చేసింది. అమెరికా తమ ఓడరేవుల దిగ్బంధాన్ని కొనసాగించినంత కాలం ఎలాంటి చర్చలనూ అంగీకరించబోమని కుండబద్దలు కొట్టింది. ఆ దేశ అధికార వర్తా సంస్థ ఐఆర్ఎన్ఏ ఈ మేరకు వెల్లడించింది. శాంతి ఒప్పందానికి ఇరాన్ ముందుకు రాకపోతే ఆ దేశంలోని వంతెనలు, విద్యుదుత్పత్తి ప్లాంట్లను నామరూపాల్లేకుండా ధ్వంసం చేస్తామని ట్రంప్ హెచ్చరించారు. అమెరికా, ఇరాన్ కాల్పుల విరమణ గడువు ఈ నెల 22తో ముగియనుంది. అమెరికా, ఇరాన్ మధ్య ఇటీవల ఇస్లామాబాద్‌లోనే జరిగిన చర్చలు విఫలం కావడం తెలిసిందే. అణు కార్యక్రమాన్ని శాశ్వతంగా పక్కన పెట్టాలన్న అమెరికా డిమాండ్‌కు ఇరాన్ అంగీకరించలేదు. విరమణకు ఇరాన్ తూట్లు: ట్రంప్ హార్మూజ్ జలసంధి గుండా ప్రయాణిస్తున్న నౌకలపై ఐఆర్జీసీ కాల్పులు జరపడంపై ట్రంప్ ఆగ్రహం వ్యక్తంచేశారు. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఇరాన్ ఉల్లంఘించిందని మండిపడ్డారు. ‘‘మేము న్యాయమైన, సహేతుకమైన ఒప్పందాన్ని ప్రతిపాదిస్తున్నాం. ఇరాన్ అంగీకరిస్తుందని ఆశిస్తున్నా. లేదంటే ఇకపై మేం ఎంతమాత్రం మంచివాళ్లం కాదు.’’ అన్నారు.హార్మూజ్ ఉద్రిక్తంహార్మూజ్లో ఉద్రిక్తత పరిస్థితులు యథాతథంగా కొనసాగుతూనే ఉన్నాయి. వందలాది నౌకలు ఎక్కడివక్కడ నిలిచిపోయాయి. హార్మూజ్‌లో శనివారం భారత్ సహా పలు దేశాల నౌకలపై ఇరాన్ కాల్పులు జరపడంతో పరిస్థితి మరింత సంక్లిష్టంగా మారింది. అసంబద్ధ డిమాండ్ల వల్లే: ఇరాన్ అమెరికా అసంబద్ధ డిమాండ్ల కారణంగానే రెండో విడత చర్చల్లో పాల్గొనవద్దనే నిర్ణయానికి వచ్చినట్టు ఇరాన్ వెల్లడించింది. ‘‘ఆచరణసాధ్యం కాని, మితిమీరిన డిమాండ్లు చేయడం, ఇష్టానికి వైఖరి మార్చుకోవడం వంటి చర్యలు, పరస్పర విరుద్ధ ప్రకటనలు అమెరికాకు, అధ్యక్షుడు ట్రంప్‌కు అలవాటుగా మారాయి. దీన్ని ఇకపై ఎంతమాత్రమూ సహించే ప్రసక్తే లేదు’’ అంటూ కుండబద్దలు కొట్టింది. తమ ఓడరేవుల దిగ్బంధం కాల్పుల విరమణ ఒప్పందానికి పొడవడమేనని ధ్వజమెత్తింది.బయటకు వెళ్లిపో!హార్మూజ్ జలసంధిలో రెండు భారత నౌకలపై ఇరాన్ కాల్పులు జరపడం పట్ల స్పందించాలని కోరిన మహిళా విలేకరిపై ట్రంప్ ఆగ్రహం వ్యక్తంచేశారు. తక్షణమే బయటకు వెళ్లిపోమ్మంటూ మండిపడ్డారు. ట్రంప్ రియాక్షన్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. -
ఇరాన్‌లోని వాటన్నింటినీ ధ్వంసం చేసేస్తాం: ట్రంప్
వాషింగ్టన్: ఇరాన్‌కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి వార్నింగ్ ఇచ్చారు. హార్మూజ్ విషయంలో కొనసాగుతున్న నిర్బంధం, పాకిస్థాన్‌లో ఇరాన్‌తో అమెరికా రెండో దశ చర్చలు వంటి అంశాలపై ఆయన ట్రూత్ సోషల్‌లో ప్రస్తావించారు. ఇరాన్ వ్యవహరిస్తున్న తీరు సరికాదని అన్నారు. హార్మూజ్ విషయంలో ఇరాన్‌పై సెటైర్లు వేశారు. ‘ఇరాన్ నిన్న హార్మూజ్ జలసంధిలో కాల్పులు జరపాలని నిర్ణయించింది. ఇది కాల్పుల విరమణ ఒప్పంద ఉల్లంఘన. చాలావరకు ఫ్రాన్స్ నౌకపై, యునైటెడ్ కింగ్డమ్ నుంచి వచ్చిన సరుకు నౌకను ఇరాన్ లక్ష్యంగా చేసుకుంది. అది మంచిది కాదు, కదా?నా ప్రతినిధులు చర్చల కోసం పాకిస్థాన్‌లోని ఇస్లామాబాద్‌కు వెళ్తున్నారు. వారు రేపు సాయంత్రం అక్కడ ఉంటారు. ఇరాన్ ఇటీవల జలసంధిని మూసేస్తున్నామని ప్రకటించింది.. ఇది విచిత్రం.. ఎందుకంటే మా నిర్బంధం (బ్లాకేడ్) ఇప్పటికే దాన్ని మూసేసింది.వారు తెలియకుండానే మాకు సాయం చేస్తున్నారు, మూసిన మార్గంతో నష్టపోయేది వారే, రోజుకు 500 మిలియన్ డాలర్లు నష్టపోతారు. అమెరికాకు ఏ నష్టమూ లేదు. నిజానికి, చాలా నౌకలు ఇప్పుడే అమెరికాలోని టెక్సాస్, లూసియానా, అలాస్కా వైపు వెళ్తున్నాయి. మేము చాలా న్యాయమైన, సరైన ఒప్పందాన్ని ప్రతిపాదిస్తున్నాం. ఇరాన్ దాన్ని అంగీకరిస్తుందని ఆశిస్తున్నాను. ఎందుకంటే అలా చేయకపోతే, ఇరాన్లో ప్రతి విద్యుత్ కేంద్రం, ప్రతి వంతెనను అమెరికా ధ్వంసం చేస్తుంది. వారు త్వరగా దిగివస్తారు, సులభంగా దిగివస్తారు, వారు ఒప్పందాన్ని అంగీకరించకపోతే చేయాల్సిన పనిని చేయడమే నాకు గౌరవంగా ఉంటుంది. గత 47 సంవత్సరాలుగా ఇతర అధ్యక్షులు చేయలేని పని అదే. ఇరాన్ హత్యాకాండ ఆగాల్సిన సమయం వచ్చింది’ అని డొనాల్డ్ ట్రంప్ అన్నారు. -
మహ్మద్ రిజ్వాన్ సంచలన వ్యాఖ్యలు
పాకిస్తాన్ స్టార్ వికెట్‌కీపర్ బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం జరుగుతున్న పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో పేలవ ఫామ్‌లో ఉన్న అతను.. విలేకరుల నుంచి రిటైర్మెంట్పై ఎదురైన ప్రశ్నలపై స్పందిస్తూ, తానెప్పుడు దానికి రెడీ అంటూ ఆసక్తికర సమాధానం చెప్పాడు.ఈ పీఎస్ఎల్ సీజన్లో కొత్త ఫ్రాంచైజీ రావల్పిండ్జ్కు సారథ్యం వహిస్తున్న రిజ్వాన్.. కెప్టెన్‌గా, వ్యక్తిగతంగా దారుణంగా విఫలమయ్యాడు. భారీ అంచనాల మధ్య పీఎస్ఎల్లోకి అడుగుపెట్టిన రావల్పిండ్జ్ ఈ సీజన్లో ఆడిన ఏడు మ్యాచ్‌ల్లో ఓడి పాయింట్ల పట్టికలో చిట్టచివరి స్థానంలో నిలిచింది. తద్వారా ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించిన తొలి జట్టుగానూ నిలిచింది.రిజ్వాన్ ఈ సీజన్లో ఆడిన 7 మ్యాచ్‌ల్లో కేవలం 107 పరుగులు మాత్రమే చేసి ఘోరంగా విఫలమయ్యాడు. తాజాగా లాహోర్ ఖలందర్స్ చేతిలో ఓటమి అనంతరం విలేకరులు రిజ్వాన్ రిటైర్మెంట్ ప్రస్తావన తెచ్చారు. ఇందుకు ఆయన బదులిస్తూ.. అవును నా ప్రదర్శన బాగా లేదు. ఇందుకు అంగీకరిస్తాను. నేను విమర్శలకు భయపడను. ప్రజలు నేను రిటైరవ్వాలనుకుంటే తప్పక వైదొలుగుతాను. ఈ విషయాన్ని గతంలోనూ చాలా సార్లు చెప్పాను. నేను ప్రశ్నలకు గానీ, మీడియాకు కానీ భయపడను. నా లోపం ఉంటే తప్పక అంగీకరిస్తానని అన్నాడు.కాగా, రిజ్వాన్ పీఎస్ఎల్లోనే కాక అంతర్జాతీయ స్థాయిలో సైతం గత కొంతకాలంగా దారుణంగా విఫలమవుతున్నాడు. ఈ కారణంగా అతను టీ20 జట్టులో చోటును కూడా కోల్పోయాడు. విదేశీ లీగ్‌ల్లో సైతం తేలిపోతున్నాడు. రిజ్వాన్ పీఎస్ఎల్లో కెప్టెన్‌గా గత 17 మ్యాచ్‌ల్లో 16 మ్యాచ్‌లు ఓడిపోయాడు. -
ట్రంప్, మునీర్ దోస్తీ.. అమెరికా నిఘా వర్గాల్లో టెన్షన్
గత కొన్ని రోజులుగా అమెరికా, పాకిస్తాన్ మధ్య ఎప్పుడూ లేనంత స్నేహ బంధం కొనసాగుతోంది. పాక్ నేతలు అమెరికా వెళ్లడం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో భేటీ కావడం, ఈ క్రమంలో పాకిస్తాన్ నేతలపై ట్రంప్ ప్రశంసలు కురిపించడం చూశాం. ప్రత్యేకంగా పాకిస్తాన్ సైన్యాధిపతి మునీర్‌పై ట్రంప్ దోస్తీ చేయడం అమెరికా నిఘా వర్గాలను టెన్షన్‌కు గురి చేస్తోంది. మునీర్‌తో స్నేహమంటే అమెరికాను రెడ్ జోన్‌లోని నెట్టేయడమేనని నిఘా సంస్థలు చెబుతున్నాయి. అయితే, ఇంటెలిజెన్స్‌ను భయపెడుతున్న అంశాలను పరిశీలిస్తే..అమెరికా జాతీయ భద్రతా వ్యవస్థలో పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ ఆసిమ్ మునీర్‌పై కొత్త చర్చలు మొదలయ్యాయి. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆయనతో స్నేహపూర్వక సంబంధాలు కొనసాగిస్తూ ఆయనను ప్రియమైన ఫీల్డ్ మార్షల్ అని పిలిచారు. కానీ అమెరికా గూఢచార సంస్థలు, ప్రాంతీయ విశ్లేషకులు మాత్రం మునీర్‌కి ఇరాన్ సైనిక నాయకత్వంతో ఉన్న పాత పరిచయాలు ఒక రెడ్ అలర్ట్‌గా భావిస్తున్నారు.ఇరాన్‌తో సంబంధాలు..మునీర్ గతంలో ఇరాన్‌కి చెందిన ప్రముఖ సైనిక నాయకులు కుద్స్ ఫోర్స్ కమాండర్ ఖాసీమ్ సోలేమానీ, ఐఆర్జీసీ కమాండర్ హొసేన్ సలామీతో వ్యక్తిగత సంబంధాలు కలిగి ఉన్నారని పాకిస్తాన్ మాజీ జనరల్ అహ్మద్ సయీద్ వెల్లడించారు. అలాగే, ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC)లోని ఉన్నత స్థాయి వ్యక్తులతో కూడా పరిచయాలు ఉన్నాయి. ఈ పరిచయాలు అమెరికా విధాన నిర్ణేతల్లో అనుమానాలు రేకెత్తిస్తున్నాయి.మధ్యవర్తిత్వం అవకాశమా? ప్రమాదమా?మునీర్ ప్రస్తుతం అమెరికా, ఇరాన్ మధ్య చర్చల్లో మధ్యవర్తిగా వ్యవహరిస్తున్నాడు. ఆయన ద్వంద్వ సంబంధాలు ఒకవైపు అమెరికాకు ఉపయోగపడవచ్చు. మరోవైపు వ్యూహాత్మక ప్రమాదాలను కూడా తెచ్చిపెట్టి అవకాశం ఉందని నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నాయి.చారిత్రక అనుమానాలు..అమెరికా విధాన వర్గాల్లో పాకిస్తాన్‌పై అనుమానం కొత్తది కాదు. ఆఫ్ఘనిస్థాన్ యుద్ధ సమయంలో అమెరికా సహాయం పొందుతూ, తాలిబాన్‌కి అనుకూలంగా వ్యవహరించిందని ఆరోపణలు ఉన్నాయి. ఫౌండేషన్ ఫర్ డిఫెన్స్ ఆఫ్ డెమోక్రసీస్ (FDD) విశ్లేషకులు, ముఖ్యంగా బిల్ రోజ్జియో, పాకిస్తాన్ సైన్యం విశ్వసనీయతపై జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.ఇలాంటి పరిస్థితుల్లో ట్రంప్ వ్యక్తిగత అనుబంధాన్ని కొనసాగించాలా, లేక గూఢచార సంస్థల హెచ్చరికలను పరిగణనలోకి తీసుకోవాలా అన్నది ప్రధాన ప్రశ్నగా మారింది. మధ్యప్రాచ్యం, దక్షిణాసియా అంతటా భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో అమెరికా విదేశాంగ విధాన అంచనాలలో మునీర్ ఒక ఉపయోగకరమైన దౌత్య వారధిగా నిలుస్తారా? లేక ఒక సంభావ్య వ్యూహాత్మక భారంగా పరిణమిస్తారా? అనే దానిపై చర్చ కొనసాగుతోంది. ఇక, అమెరికా-పాకిస్తాన్ సంబంధాలు ఎప్పుడూ వ్యూహాత్మక అవసరాల ఆధారంగా మారుతూ రావడం కొసమెరుపు. -
పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో గందరగోళం
పాకిస్తాన్ సూపర్ 2026లో గందరగోళం నెలకొంది. క్వెట్టా గ్లాడియేటర్స్ అనే ఫ్రాంచైజీ ఒకే మ్యాచ్‌లో బెవాన్ జాకబ్స్, అతని ప్రత్యామ్నాయంగా ప్రకటించిన దినేశ్ చండీమల్‌ను బరిలోకి దించి అందరినీ అవాక్కయ్యేలా చేసింది.పూర్తి వివరాల్లోకి వెళితే.. న్యూజిలాండ్‌కు చెందిన బెవాన్ జాకబ్స్ జాతీయ విధుల నిమిత్తం (బంగ్లాదేశ్‌తో సిరీస్) జట్టుకు అందుబాటులో ఉండడని గ్లాడియేటర్స్ యాజమాన్యం ఏప్రిల్ 16న ప్రకటించింది. అదే సమయంలో అతనికి ప్రత్యామ్నాయంగా శ్రీలంకకు చెందిన దినేశ్ చండీమల్ పేరును కూడా వెల్లడించింది.అయితే లాహోర్ ఖలందర్స్‌తో నిన్న (ఏప్రిల్ 17) జరిగిన మ్యాచ్‌లో జాకబ్స్, చండీమల్ ఇద్దరి పేర్లు ప్లేయింగ్ ఎలెవెన్‌లో కనిపించాయి. దీంతో అందరూ అవాక్కయ్యారు. ఒకే మ్యాచ్‌లో జాకబ్స్, అతని రీప్లేస్మెంట్ ఎలా బరిలోకి దిగుతారని చర్చించుకున్నారు.ఈలోపు గ్లాడియేటర్స్ యాజమాన్యం నాలుక కరుచుకుని చండీమల్ జాకబ్స్‌కు ప్రత్యామ్నాయం కాదు, టామ్ కర్రన్‌కు అంటూ ప్రకటన చేసింది. కర్రన్ అనారోగ్యం కారణంగా ఈ మ్యాచ్‌లో ఆడలేకపోయాడు. అతని స్థానంలో చండీమల్ జట్టులోకి వచ్చాడని పేర్కొంది.ఈ గందరగోళం చూసి ఏం జరుగుతుందో అర్దం కాక గ్లాడియేటర్స్ అభిమానులే జుట్టు పీక్కున్నారు. నెటిజన్లు అయితే ఇలాంటి సిత్రాలన్నీ పాకిస్తాన్లో మాత్రమే సాధ్యమంటూ కామెంట్లు చేస్తున్నారు. ఘోర తప్పిదం జరిగిన ఈ మ్యాచ్‌లో ఖలందర్స్‌పై గ్లాడియేటర్స్ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. చండీమల్ (3) విఫలం కాగా.. జాకబ్స్ (14 నాటౌట్) గ్లాడియేటర్స్‌ను విజయతీరాలకు చేర్చాడు. -
మధ్యప్రాచ్యంలో కొత్త ఆశలు.. ఇస్లామాబాద్‌లో శాంతి చర్చలు!
మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలను తగ్గించేందుకు అంతర్జాతీయ స్థాయిలో మళ్లీ దౌత్య ప్రయత్నాలు వేగవంతమవుతున్నాయి. ముఖ్యంగా ఇరాన్ - అమెరికా మధ్య చర్చలను పునఃప్రారంభించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగానే.. ఈ రెండు దేశాల ప్రతినిధులు ఇస్లామాబాద్‌లో సోమవారం సమావేశం కావచ్చని తెలుస్తోంది.ఇస్లామాబాద్‌లో జరగనున్న ఈ చర్చలు ఇరు దేశాల మధ్య శాంతిని నెలకొల్పే అవకాశం ఉంది. గతంలో జరిగిన చర్చలు ఫలితం లేకుండా ముగిసినప్పటికీ, ఈసారి పురోగతి సాధించే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.ఇదే సమయంలో.. షేక్ తమీమ్ బిన్ హమాద్ అల్ థానీ, రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్, షెహబాజ్ షరీఫ్ తో సమావేశమై, ప్రాంతంలో ఉద్రిక్తతలను తగ్గించేందుకు దౌత్య పరిష్కారాలపై చర్చించారు. ఈ సమావేశం అంటాల్యా డిప్లమసీ ఫోరం సందర్భంగా జరిగింది. ఇదే సమయంలో, పాకిస్థాన్ సైన్యాధిపతి అసీమ్ మునీర్, ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బాగర్ ఘలిబాఫ్ ను కలుసుకోవడం కూడా ఈ చర్చలకు ప్రాధాన్యతను పెంచుతోంది.ఇక మరో ముఖ్య పరిణామంగా, డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన 10 రోజుల కాల్పుల విరమణ ఒప్పందం, ఇజ్రాయెల్ - హెజ్బొల్లా మధ్య ఉద్రిక్తతలను తగ్గించే దిశగా ఒక కీలక అడుగుగా భావిస్తున్నారు. ఈ ఒప్పందం ద్వారా భవిష్యత్తులో మరింత విస్తృతమైన శాంతి చర్చలకు మార్గం సుగమం కావచ్చని భావిస్తున్నారు. మొత్తం మీద, ఈ పరిణామాలు మధ్యప్రాచ్యంలో స్థిరత్వాన్ని తీసుకురావడంలో కీలక పాత్ర పోషించే అవకాశముంది. -
బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్యకు హరీష్ రావు వార్నింగ్
సాక్షి,హైదరాబాద్: తెలంగాణ ఏర్పాటును పాకిస్థాన్ విభజనతో పోల్చిన బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పార్లమెంట్ సాక్షిగా నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని అవమానించినందుకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడారు. ‘తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం దశాబ్దాల పోరాటం, వేలాది మంది విద్యార్థులు, యువత, ఉద్యోగులు, ప్రజల త్యాగాల ఫలితం. అలాంటి మహోన్నత ఉద్యమాన్ని విద్వేషపూరిత విభజనతో పోల్చడం చరిత్రను అవమానించడమే. అమరుల త్యాగాలను తక్కువ చేసి చూపించమే. రాజ్యాంగ బద్దంగా ఏర్పాటైన తెలంగాణ రాష్ట్రం దేశానికే రోల్ మోడల్‌గా నిలవడాన్ని బీజేపీ తట్టుకోలేకపోతోందనడానికి తేజస్వి అహంకార పూరిత వ్యాఖ్యలే నిదర్శనం . బీజేపీ అధిష్టానం వెంటనే ఈ వ్యాఖ్యలను ఖండించి, తన పార్టీ వైఖరి ఏమిటో స్పష్టం చేయాలి. లేదంటే ఇది బీజేపీ అధికారిక ధోరణిగానే ప్రజలు భావిస్తారు.ఇండియా పాకిస్థాన్ విభజన లాంటిదే తెలంగాణ ఏర్పాటు అయితే ఆనాడు బీజేపీ విభజన బిల్లుకు ఎందుకు మద్దతు తెలిపింది?. ప్రధాని మోడీ కూడా గతం లో అనేక సార్లు తెలంగాణ ఏర్పాటు ప్రక్రియపై విషం చిమ్మారు. నాడు మోదీ అయినా నేడు తేజస్వి సూర్య అయినా తెలంగాణ ప్రజల మనోభావాలను గాయపరచడమే పనిగా పెట్టుకున్నారు.తేజస్వి సూర్య అనుచిత వ్యాఖ్యలను తెలంగాణ నుంచి గెలిచిన ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు, కాంగ్రెస్ ఎంపీలు ఖండించకుండా గుడ్లప్పగించి చూడడం సిగ్గుచేటు. లోక్ సభలో బీఆర్ఎస్ ఎంపీలు ఉంటే తేల్చేవారు. బీజేపీ ఎంపీలు అయినా కాంగ్రెస్ ఎంపీ లైనా తెలంగాణ పాలిట దిష్టి బొమ్మలుగా మారారు. తెలంగాణ పేరుతో గెలిచి, తెలంగాణ అవమానాన్ని చూసి నిశ్శబ్దంగా కూర్చున్న ఎంపీలు ప్రజలకు సమాధానం చెప్పాలి.ఢిల్లీ పెద్దల ముందు వంగి, తెలంగాణ గౌరవాన్ని తాకట్టు పెట్టే నాయకత్వాన్ని ప్రజలు ఎప్పటికీ క్షమించరు. తెలంగాణను అవమానించే ప్రతి ఒక్కరికి ప్రజాస్వామ్య పద్ధతిలో గట్టి సమాధానం ఇస్తాం. రాష్ట్ర హక్కులు, ఆత్మగౌరవంపై దాడి చేసే శక్తులను తెలంగాణ ప్రజలు ఎన్నడూ అంగీకరించరు. తెలంగాణ అంటే పోరాట గాథ… త్యాగాల చరిత్ర.. స్వాభిమానానికి ప్రతీక. దానిని అగౌరవ పరిస్తే, అవమానిస్తే సహించేది లేదు’అని హెచ్చరించారు. The @BRSparty strongly condemns the highly insensitive and irresponsible remarks made by @Tejasvi_Surya Member of Parliament from the @BJP4India His comparison of the formation of Telangana state with the creation of Pakistan is not only factually incorrect but also deeply…— Harish Rao Thanneeru (@BRSHarish) April 16, 2026 -
చారిత్రక మైలురాయిని తాకిన బాబర్ ఆజమ్
పాకిస్తాన్ స్టార్ బ్యాటర్ బాబర్ ఆజమ్ పొట్టి క్రికెట్లో చారిత్రక మైలురాయిని తాకాడు. ఈ ఫార్మాట్లో 100 అర్ద సెంచరీల (341 ఇన్నింగ్స్‌ల్లో) అత్యంత అరుదైన ఫీట్‌ను సాధించాడు. పొట్టి క్రికెట్ చరిత్రలో ఇప్పటివరకు కేవలం ముగ్గురు మాత్రమే ఈ ఘనత సాధించారు. వీరిలో డేవిడ్ వార్నర్ (117) అగ్రస్థానంలో ఉండగా.. విరాట్ కోహ్లి (107), జోస్ బట్లర్ (100) ఆతర్వాతి స్థానాల్లో ఉన్నారు. తాజాగా బాబర్ వీరి సరసన చేరాడు.పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026లో భాగంగా క్వెట్టా గ్లాడియేటర్స్‌తో నిన్న (ఏప్రిల్ 15) జరిగిన మ్యాచ్‌లో బాబర్ 100 హాఫ్ సెంచరీల ఘనత సాధించాడు. ఈ మ్యాచ్‌లో అతను 51 బంతుల్లో 10 ఫోర్ల సాయంతో అజేయమైన 71 పరుగులు చేసి తన జట్టు (పెషావర్ జల్మీ) విజయంలోనూ ప్రధానపాత్ర పోషించాడు. పాక్ తరఫున సెంచరీ హాఫ్ సెంచరీలు చేసిన మొదటి ప్లేయర్‌గా బాబర్ చరిత్రకెక్కాడు.తన టీ20 కెరీర్లో ఇప్పటివరకు 341 ఇన్నింగ్స్‌లు ఆడిన బాబర్ 100 హాఫ్ సెంచరీలతో పాటు 11 సెంచరీలు కూడా చేశాడు. తద్వారా పొట్టి ఫార్మాట్లో అత్యధిక 50 ప్లస్ స్కోర్లు చేసిన ఆటగాళ్ల జాబితాలో మూడో స్థానానికి ఎగబాకాడు. ఈ జాబితాలో వార్నర్ (126), విరాట్ (116) మాత్రమే బాబర్ (111) కంటే ముందున్నారు.బాబర్ టీ20 గణాంకాలు- 341 ఇన్నింగ్స్‌ల్లో 12,206 పరుగులు - సగటు – 42.38 - స్ట్రైక్ రేట్ – 128.41 - 100 ఫిఫ్టీలు, 11 సెంచరీలుఇటీవలే బాబర్ పీఎస్ఎల్లోనూ ఓ చారిత్రక ఘనత సాధించాడు. ఈ లీగ్‌లో 4000 పరుగులు పూర్తి చేసిన తొలి ప్లేయర్‌గా రికార్డు నెలకొల్పాడు. పీఎస్ఎల్లో 106 మ్యాచ్‌లు ఆడిన బాబర్ 127.86 స్ట్రయిక్‌రేట్‌తో 45.98 సగటున 4093 పరుగులు చేశాడు. పీఎస్ఎల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో బాబర్ తర్వాతి స్థానాల్లో ఫకర్ జమాన్ (3039), మహ్మద్ రిజ్వాన్ (2853), రిలీ రొస్సో (2392), షోయబ్ మాలిక్ (2350) ఉన్నారు. -
‘బుల్లెట్ శకలాలు ఇంకా నా శరీరంలో ఉన్నాయి’
కొలంబో: దాదాపు పదిహేడేళ్ల క్రితం... శ్రీలంక జట్టు పాకిస్తాన్ గడ్డపై టెస్టు సిరీస్ ఆడుతోంది. లాహోర్‌లో జరుగుతున్న రెండో టెస్టులో మూడో రోజు ఆట కోసం లంక జట్టు గడాఫీ స్టేడియం సమీపానికి చేరుకుంది. అయితే ఆ సమయంలో అనూహ్యంగా తీవ్రవాదులు శ్రీలంక ఆటగాళ్లతో కూడిన టీమ్ బస్సుపై కాల్పులు జరిపారు. వెంటనే తేరుకున్న పోలీసులు ఎదురుదాడికి దిగారు. ఈ ఘటనలో ఎనిమిది మంది చనిపోగా, మరో 20 మంది గాయపడ్డారు.నాటి సంఘటనను సంగక్కర ఇటీవల గుర్తు చేసుకున్నాడు. తన జీవితంలో అది ఎలాంటి మార్పు తెచ్చిందో వెల్లడించాడు. ‘మేం స్టేడియానికి బయల్దేరే ముందు మా టీమ్ పేస్ బౌలర్ ఒకరు ఇలాంటి పిచ్‌పై బౌలింగ్ చేస్తే నా వెన్ను విరిగిపోవచ్చు. దానికన్నా ఒక బాంబు దాడి జరిగి ఇంటికి వెళ్లిపోతే బాగుంటుంది అని సరదాగా అన్నాడు. అయితే నిజంగానే అది జరిగింది. మరు నిమిషంలోనే మాపై ఉగ్రవాదులు దాడి చేశారు. మేం అందులో గాయపడ్డాం. నాడు దాడిలో మాపై దూసుకొచ్చిన బుల్లెట్ శకలాలు నా శరీరంలో ఇప్పటికీ ఉన్నాయి. ఆ దాడి నా ఆలోచనా ధోరణిని మార్చింది. ఎందుకంటే అదే సమయంలో మా దేశంలో అంతర్యుద్ధం కూడా జరుగుతూ చివరి దశలో ఉంది. కానీ మాపై రెండు నిమిషాల దాడి పెద్ద వార్తగా మారింది. కొన్నాళ్ల తర్వాత ఒక సైనికుడు ఎలా ఉన్నారంటూ మమ్మల్ని అడిగాడు. నేను బాగున్నానని చెబుతూ మీరు మాత్రం ఎన్నో ఏళ్లుగా ఇలాంటి పరిస్థితుల్లోనూ జీవిస్తున్నారు కదా అన్నాను. క్రికెట్ ఆడుతూ ఎంతో డబ్బు గడిస్తూ కూడా రెండు నిమిషాల దాడితో వార్తల్లో నిలిచామంటే గత 20–26 ఏళ్లుగా దేశం ఎలాంటి పరిస్థితిని ఎదుర్కొంటుందో అర్థమైంది’ అని సంగక్కర గుర్తు చేసుకున్నాడు. -
ఇరాన్లో అడుగుపెట్టిన పాక్ సైన్యాధిపతి మునీర్
టెహ్రాన్: పాకిస్థాన్ సైన్యాధిపతి ఆసిమ్ మునీర్ ఇరాన్ చేరుకున్నారు. ఉన్నత స్థాయి చర్చల్లో ఆయన పాల్గొంటారు. ఇరాన్-అమెరికా మధ్య చర్చల పునఃప్రారంభంపై ఈ ఉన్నత స్థాయి సమావేశం జరగనుంది. అందుకు సంబంధించిన పాక్ ప్రతినిధి బృందంతో మునీర్ ఇరాన్ వెళ్లినట్లు పాకిస్థాన్ సైన్యం బుధవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో తెలిపింది.యుద్ధం వేళ అమెరికాకు పాక్ టీమ్ పలు ప్రతిపాదనలు చేయనుంది. టీమ్‌లో ఆసిమ్ మునీర్‌తో పాటు అంతర్గత వ్యవహారాల మంత్రి మొహ్సిన్ నక్వీ తెహ్రాన్ కూడా ఉన్నారు. అమెరికా ఇచ్చిన ఆఫర్‌ను ఇరాన్‌కు ఆసిమ్ మునీర్ వివరిస్తారు. అమెరికా పంపిన సందేశాన్ని ఇరాన్‌కు ఇచ్చాక రెండో దశ చర్చల అంశాన్ని ప్రస్తావించే అవకాశం ఉంది. అంతకుముందు టెహ్రాన్‌లోని విమానాశ్రయంలో ఆసిమ్ మునీర్ నేతృత్వంలోని పాకిస్థాన్ ప్రతినిధి బృందానికి ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ స్వాగతం పలికారు. కాగా, యూఎస్-ఇరాన్ మధ్య రెండు రోజుల్లో చర్చలు జరగనున్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికే ప్రకటించారు. ఈ చర్చలు కూడా పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్ వేదికగానే ప్రారంభమయ్యే అవకాశం ఉందన్నారు. పాకిస్థాన్ సైన్యాధ్యక్షుడు, ఫీల్డ్ మార్షల్ అసీమ్ మునీర్ ఈ చర్చల విషయంలో అద్భుతంగా పని చేస్తున్నారని ప్రశంసించారు. ఆయనో అద్భుతమైన వ్యక్తి అని, అందుకే తాము మళ్లీ అక్కడికి వెళ్లే అవకాశం ఎక్కువగా ఉందని ట్రంప్ చెప్పుకొచ్చారు. మరోవైపు, కాల్పుల విరమణ విషయంలో లెబనాన్‌ను చేర్చాలని అమెరికాపై ఇరాన్ ఒత్తిడి పెడుతోందని హెజ్బొల్లా ప్రతినిధి తెలిపారు. హార్మూజ్ జలసంధిపై ఆంక్షలను ఒత్తిడి సాధనంగా ఉపయోగించి, కాల్పుల విరమణ ఒప్పందంలో లెబనాన్‌ను చేర్చాలని ఇరాన్ ప్రయత్నించిందని తెలిపారు. “ఇరానీయులు అమెరికాపై అధిక ఒత్తిడి పెడుతున్నారు, అమెరికా కాల్పుల విరమణలో లెబనాన్‌ను చేర్చాలి అనే షరతులు పెట్టారు. అది చేయకపోతే, హార్మూజ్ ఆంక్షలను కొనసాగిస్తారు” అని తెలిపారు. -
ఇమ్రాన్ ఖాన్ హత్యకు ఆసిమ్ మునీర్ కుట్ర
ఇస్లామాబాద్: పీటీఐ వ్యవస్థాపకుడు, పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ జైలులో ఉన్న పరిస్థితులు, అలాగే ఆయన భార్య బుష్రా బీబీపై జరుగుతున్న ఒత్తిడి అంతర్జాతీయంగా చర్చనీయాంశమయ్యాయి. తనను బ్లాక్మెయిల్ చేయడానికి బుష్రా బీబీని జైల్లో ఏకాంతంగా ఉంచి, మానసికంగా కుంగదీసే ప్రయత్నం జరుగుతోందని ఇమ్రాన్ ఖాన్ ఆరోపించారు. ఇమ్రాన్ ఖాన్ కుటుంబ సభ్యులు, జైల్లోనే ఆయనను, ఆయన భార్య బుష్రా బీబీని చంపేందుకు ప్రస్తుత ప్రధాని షెహ్బాజ్ షరీఫ్, ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ కుట్ర చేస్తున్నారని ఆరోపిస్తున్నారు.ఇమ్రాన్ ఖాన్‌పై అవినీతి కేసులు, అక్రమ ఆస్తుల వ్యవహారాలు, హింసాత్మక నిరసనలకు సంబంధించిన ఆరోపణలు నమోదయ్యాయి. ఈ కేసుల ఆధారంగా ఆయనను అరెస్ట్ చేసి, కొన్ని తీర్పులలో జైలు శిక్షలు విధించారు. అదే సమయంలో ఆయన భార్య బుష్రా బీబీ కూడా అవినీతి, అక్రమ ఆస్తుల కేసుల్లో అరెస్ట్ అయ్యారు. ప్రతిపక్షం ఆరోపణల ప్రకారం, ఈ అరెస్టులు రాజకీయంగా దెబ్బతీయడానికి, విపక్షాన్ని అణగదొక్కడానికి ప్రభుత్వం చేపట్టిన చర్యలుగా భావిస్తున్నారు.రావల్పిండి అడియాలా జైలులో ఇమ్రాన్ ఖాన్ ఆరు నెలలుగా ఒంటరి నిర్బంధంలో ఉన్నారని కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఈ సమయంలో ఆయన ఆరోగ్యం దెబ్బతిందని, కుడి కన్నులో దృష్టి దాదాపు కోల్పోయారని సమాచారం. తాజాగా ఆయన భార్య బుష్రా బీబీ కూడా అదే విధంగా ఒంటరిగా ఉంచుతున్నారని,వారానికి ఒకసారి 30 నిమిషాల పాటు మాత్రమే భర్తను కలిసే అవకాశం ఇస్తున్నారని, అది కూడా తరచుగా నిరాకరిస్తున్నారని ఆయన న్యాయవాది సల్మాన్ సఫ్దర్ తెలిపారు.ఇమ్రాన్ సోదరి అలీమా ఖానుం సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు చేస్తూ, ఇస్లామాబాద్ హైకోర్టు చీఫ్ జస్టిస్ బెయిల్ విచారణను ఉద్దేశపూర్వకంగా వాయిదా వేస్తున్నారని ఆరోపించారు. కేసులు బలహీనమైనవని, ఒకసారి విచారణ జరిగితే ఆయనకు బెయిల్ తప్పదని, అందుకే విచారణనే జరగనివ్వడం లేదని అన్నారు. న్యాయవ్యవస్థ ప్రభుత్వానికి సాధనంగా మారిందని, న్యాయం జరగకుండా అడ్డు కుంటుందని ఆమె తీవ్రంగా విమర్శించారు.ఈ పరిణామాలు పాకిస్థాన్‌లో రాజకీయ అస్థిరతను మరింతగా పెంచుతున్నాయి. ఇమ్రాన్ ఖాన్, బుష్రా బీబీపై జరుగుతున్న ఒత్తిడి, అరెస్టులు, ఆరోగ్య సమస్యలు పాకిస్థాన్‌లో చర్చకు దారితీస్తున్నాయి. Imran Khan has been kept in solitary confinement for six months under brutal conditions, while Bushra Bibi is being held the same way. Their freedom is being deliberately blocked by the Chief Justice of the Islamabad High Court, who refuses to fix their bail hearings.Imran Khan…— Aleema Khanum (@Aleema_KhanPK) April 15, 2026 -
మా అప్పు ఇస్తావా.. చస్తావా..! పాక్ చావుకొచ్చిందిగా..!
-
పాక్‌లో క్రికెటర్ల చేతికి తుపాకులు
పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో కొత్తగా చేరిన హైదరాబాద్ కింగ్స్‌మెన్ ఫ్రాంచైజీ తమ విదేశీ ఆటగాళ్ల చేతికి తుపాకులను ఇచ్చింది. పాక్ ఆర్మీతో ఇంటరాక్షన్‌లో భాగంగా ఇది జరిగింది. సింధ్ పోలీస్ అకాడమీలో ఏర్పాటు చేసిన ఓ ప్రత్యేక కార్యక్రమంలో కింగ్స్‌మెన్ కెప్టెన్ మార్నస్ లబూషేన్, రిలే మెరిడిత్ (ఆస్ట్రేలియా), స్థానిక ఆటగాళ్లు ఫఖర్ జమాన్, నసీమ్ షా, మహ్మద్ రిజ్వాన్ తుపాకులతో ఫైరింగ్ చేస్తూ కనిపించారు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. నిపుణుల పర్యవేక్షణలో లాబుషేన్ మెషీన్ గన్‌తో, మెరిడిత్ పిస్టల్‌తో రేంజ్ షూటింగ్ చేశారు. ఈ సందర్భంగా లాబుషేన్ హైదరాబాద్ ఆటగాళ్ల సంతకాలతో ఉన్న ప్రత్యేక బ్యాట్‌ను సింధ్ డీఐజీ డాక్టర్ మక్సూద్ అహ్మద్‌కు అందజేశారు. పాకిస్తాన్లో క్రికెటర్లకు గతంలో కూడా ఆర్మీతో ఫిజికల్, మెంటల్ ట్రైనింగ్ ఇప్పించారు. ఇదిలా ఉంటే, ఈ సీజన్‌తోనే పీఎస్ఎల్ అరంగేట్రం చేసిన హైదరాబాద్ కింగ్స్‌మెన్ ఫ్రాంచైజీ అంచనాలకు తగ్గట్టుగా రాణించడం లేదు. ఇప్పటివరకు ఆడిన 6 మ్యాచ్‌ల్లో కేవలం రెండే విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో కొనసాగుతుంది. ఇన్ని పరాజయాలు ఎదురైనా కింగ్స్మెన్కు ప్లే ఆఫ్స్ అవకాశాలు ఇంకా సజీవంగానే ఉన్నాయి. ఇంకా ఈ జట్టు నాలుగు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. వీటిలో భారీ విజయాలు సాధిస్తే, ప్లే ఆఫ్స్ బెర్త్ ఖరారయ్యే అవకాశాలు ఉన్నాయి.ఈ జట్టులో లబూషేన్, కుసాల్ పెరీరా, మెరిడిత్, తీక్షణ లాంటి విదేశీ ఆటగాళ్లు ఉండగా.. సైమ్ అయూబ్, ఉస్మాన్ ఖాన్ లాంటి స్థానిక స్టార్లు ఉన్నారు. కింగ్స్‌మెన్ ఏప్రిల్ 16న జరిగే తమ తదుపరి మ్యాచ్‌లో రావల్పిండ్జ్తో తలపడనుంది. -
పాకిస్థాన్‌లో 2 రోజుల్లో మళ్లీ..: ట్రంప్ కీలక ప్రకటన
వాషింగ్టన్: అమెరికా-ఇరాన్ మధ్య రెండు రోజుల్లో చర్చలు జరగనున్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మంగళవారం రాత్రి ప్రకటించారు. ఈ చర్చలు కూడా పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్ వేదికగానే ప్రారంభమయ్యే అవకాశం ఉందని తెలిపారు. న్యూయార్క్ పోస్ట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వివరాలు తెలిపారు.“మీడియా అక్కడే ఉండాలి.. ఎందుకంటే వచ్చే 2 రోజుల్లో ఏదో జరిగే అవకాశం ఉంది. మేము అక్కడికి వెళ్లేందుకే ఆసక్తి చూపుతున్నాం” అని ట్రంప్ చెప్పారు. పాకిస్థాన్ సైన్యాధ్యక్షుడు, ఫీల్డ్ మార్షల్ అసీమ్ మునీర్ ఈ చర్చల విషయంలో అద్భుతంగా పని చేస్తున్నారని ట్రంప్ కొనియాడారు. ఆయనో అద్భుతమైన వ్యక్తి అని, అందుకే తాము మళ్లీ అక్కడికి వెళ్లే అవకాశం ఎక్కువగా ఉందని ట్రంప్ వ్యాఖ్యానించారు. కాగా, శాంతి చర్చల కోసం అమెరికా, ఇరాన్ ప్రతినిధులు ఈ వారం చివరలో పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్‌కు మళ్లీ రావచ్చని అంతర్జాతీయ మీడియా ఇవాళ మధ్యాహ్నం పేర్కొంది. ఇటీవల పాక్‌లో జరిగిన చర్చలు విఫలమైన విషయం తెలిసిందే. దీంతో రెండో దశ చర్చలు జరపాలని అమెరికా-ఇరాన్ భావిస్తున్నాయి. తేదీని ఇంకా నిర్ణయించలేదని, కానీ ఈ వారం చివరలోనే అమెరికా-ఇరాన్ తిరిగి ఇస్లామాబాద్ రావచ్చని అంతర్జాతీయ మీడియా పేర్కొంది. ఇరు దేశాల ప్రతినిధి బృందాలు శుక్ర/శని/ఆదివారం చర్చల్లో పాల్గొనవచ్చని ఒక సీనియర్ ఇరాన్ అధికారి అన్నారు.పాకిస్థాన్‌లోని సోర్స్ తెలిపిన వివరాల ప్రకారం.. రెండో దశ చర్చల గురించి అమెరికా-ఇరాన్‌తో పాక్ ప్రతినిధులు మాట్లాడుతున్నారు. “మేము ఇరాన్‌తో మాట్లాడాము. రెండో దశ చర్చలకు వారు సిద్ధంగా ఉన్నారని తెలిపేలా సానుకూల స్పందన వచ్చింది” అని పాకిస్థాన్ ప్రభుత్వ సీనియర్ అధికారి తెలిపారు.పాకిస్థాన్‌లో ఇటీవల జరిగిన చర్చలకు అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ మొహమ్మద్ బాగేర్ ఖలీబాఫ్ తమ తమ బృందాలకు నాయకత్వం వహించారు. హార్మూజ్ జలసంధి, ఇరాన్ అణు కార్యక్రమం, అంతర్జాతీయ ఆంక్షలు వంటి అంశాలు చర్చలకు అడ్డంకిగా మారాయి. -
మరోసారి నవ్వులపాలైన పాకిస్థాన్
ఇస్లామాబాద్: ఏప్రిల్ 10-12 మధ్య ఇరాన్-అమెరికా చర్చలకు పాకిస్తాన్ ఆతిథ్యం ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే, చర్చలకు ఆతిథ్యం ఇచ్చిన హోటల్ బిల్లులను చెల్లించడంలో పాక్ విఫలమైందని.. అంతర్జాతీయంగా తలవంపులు తెచ్చుకుందంటూ ప్రచారం జరుగుతోంది. పరిస్థితి చేయి దాటడంతో.. హోటల్ యజమాని స్వయంగా జోక్యం చేసుకోవాల్సి వచ్చిందంటూ వార్తలు వస్తున్నాయి. హోటల్ బిల్లు కూడా పాక్ కట్టలేకపోవడంతో ఆ దేశ ఆర్థిక పరిస్థితిపై మరోసారి చర్చ జరుగుతోంది.అమెరికా-ఇరాన్ మధ్య రెండో రౌండ్ శాంతి చర్చలు ఈ వారంలోనే పాకిస్థాన్‌లో ప్రారంభం కానున్నాయి. అసలే ఆర్థిక కష్టాల్లో కొట్టుమిట్టాడుతున్న పాక్‌కు రాబోయే చర్చలకు ఆతిథ్యం ఇవ్వడం ఇప్పుడు సవాలుగా మారింది. వాషింగ్టన్- టెహ్రాన్ మధ్య ఉన్న రెండు వారాల కాల్పుల విరమణ ఏప్రిల్ 21తో ముగియనున్న నేపథ్యంలో ఏప్రిల్ 16న ఈ చర్చలు జరిగే అవకాశం ఉందని రాయిటర్స్ పేర్యొంది. అయితే, ఈసారి కూడా గతంలో వచ్చిన స్థాయి ప్రతినిధి బృందాలు వస్తాయా? అనేది ఇంకా తెలియాల్సి ఉంది.ఇరాన్, అమెరికా మధ్య యుద్ధాన్ని ఆపడానికి పాకిస్తాన్ మధ్యవర్తి పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. పశ్చిమాసియాలో యుద్ధానికి ముగింపు పలకడం ద్వారా అంతర్జాతీయస్థాయిలో కీర్తి శిఖరాలను అధిరోహించాలని పాకిస్తాన్ ప్రభుత్వం గట్టిగానే ప్రయత్నిస్తోంది. అమెరికా-ఇరాన్ చర్చలకు ఆతిథ్యం ఇచ్చిన పాక్.. ఇస్లామాబాద్‌లోని హోటల్ సెరెనాలో ఏర్పాట్లు చేసింది. తీరా ఈ చర్చలు విఫలమవ్వడంతో.. చివరకు చెల్లింపులు లేవు, డీల్ లేదన్నట్లుగా పరిస్థితి మారింది. చివరికి హోటల్ బిల్లుల భారం మాత్రం మిగిలింది.మరోవైపు, ఆర్థిక సంక్షోభంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న పాక్‌కు మరో సమస్య వచ్చి పడింది. యూఏఈ ఇచ్చిన $3 బిలియన్ డాలర్లు అప్పు పూర్తిగా తిరిగి చెల్లించాలని కోరడంతో ఎలా చెల్లించేది అనే సతమతమవుతున్నట్లు తెలుస్తోంది. అసలే డబ్బులు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వేళ ఈ అప్పులు ఎలా చెల్లించేదని ఇబ్బందులు పడుతున్నట్లు సమాచారం.మధ్యప్రాచ్యంలో జరుగుతున్న యుద్ధం కారణంగా పెరుగుతున్న ముడిచమురు ధరల వల్ల పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి గందరగోళంగా మారింది. ఇంతకాలంగా యూఏఈకి ఉన్న అప్పును పలు దపాలుగా పాకిస్థాన్ వాయిదా వేస్తో వచ్చింది.. అయితే ప్రస్తుతం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అప్పు చెల్లించాలని కోరడంతో ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషిస్తున్నట్లు తెలుస్తోంది. -
పాక్‌లో అమెరికా-ఇరాన్ మళ్లీ చర్చలు..! ఎప్పుడంటే?
వాషింగ్టన్: పశ్చిమాసియాలో శాంతి గురించి చర్చించడానికి అమెరికా, ఇరాన్ ప్రతినిధులు ఈ వారం చివరలో పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్‌కు మళ్లీ రావచ్చని అంతర్జాతీయ మీడియా పేర్కొంటోంది. ఇటీవల ఇస్లామాబాద్‌లో జరిగిన చర్చలు విఫలమైన విషయం తెలిసిందే. దీంతో రెండో దశ చర్చలు జరపాలని అమెరికా-ఇరాన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. తేదీని ఇంకా నిర్ణయించలేదని, కానీ ఈ వారం చివరలోనే అమెరికా-ఇరాన్ తిరిగి ఇస్లామాబాద్ రావచ్చని అంతర్జాతీయ మీడియా పేర్కొంది. ఇరు దేశాల ప్రతినిధి బృందాలు శుక్ర/శని/ఆదివారం చర్చల్లో పాల్గొనవచ్చని ఒక సీనియర్ ఇరాన్ అధికారి అన్నారు.అమెరికా-ఇరాన్ మధ్య నెలకొన్న ఘర్షణకు పరిష్కారం కోసం చర్చల ప్రతిపాదనలు వస్తున్నాయి. ఇటీవల ఇరు దేశాల అధికారులు సమావేశమయ్యారు. దశాబ్దానికి పైగా కాలంలో అమెరికా, ఇరాన్ అధికారుల మధ్య జరిగిన తొలి ప్రత్యక్ష భేటీ ఇది. అలాగే 1979 ఇస్లామిక్ విప్లవం తర్వాత జరిగిన అత్యున్నత స్థాయి సంప్రదింపులు ఇవే.పాకిస్థాన్‌లోని సోర్స్ తెలిపిన వివరాల ప్రకారం.. తదుపరి దశ చర్చల గురించి అమెరికా-ఇరాన్‌తో పాక్ ప్రతినిధులు మాట్లాడుతున్నారు. “మేము ఇరాన్‌తో మాట్లాడాము. రెండో దశ చర్చలకు వారు సిద్ధంగా ఉన్నారని తెలిపేలా సానుకూల స్పందన వచ్చింది” అని పాకిస్థాన్ ప్రభుత్వ సీనియర్ అధికారి తెలిపారు.పాకిస్థాన్‌లో ఇటీవల జరిగిన చర్చలకు అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ మొహమ్మద్ బాగేర్ ఖలీబాఫ్ తమ తమ బృందాలకు నాయకత్వం వహించారు. హార్మూజ్ జలసంధి, ఇరాన్ అణు కార్యక్రమం, అంతర్జాతీయ ఆంక్షలు వంటి అంశాలు చర్చలకు అడ్డంకిగా మారాయి. -
ఆశా భోంస్లేకి నివాళి.. పాకిస్తాన్ ఛానల్‌కు నోటీసులు!
ప్రముఖ గాయని ఆశా భోంస్లే మరణించారంటూ తప్పుడు వార్తను ప్రసారం చేయడమే కాకుండా, ఆ సందర్భంగా భారతీయ వీడియో క్లిప్పింగులను ప్రదర్శించినందుకు పాకిస్తాన్‌కు చెందిన ప్రముఖ వార్తా సంస్థ 'జియో న్యూస్' చిక్కుల్లో పడింది. ఈ ఘటనపై పాకిస్తాన్ ఎలక్ట్రానిక్ మీడియా రెగ్యులేటరీ అథారిటీ (PEMRA) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ సదరు ఛానల్‌కు నోటీసులు జారీ చేసింది.తప్పుడు వార్తలు ప్రసారంలెజెండరీ సింగర్ ఆశా భోంస్లే ఆదివారం మరణించిన సంగతి తెలిసిందే. శనివారం తీవ్ర ఆస్వస్థతకు గురైన ఆమెను కుటుంబ సభ్యులు ముంబైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చెర్పించారు. చికిత్స పొందుతూ ఆదివారం మరణించారు. సోమవారం ఆమె అంతక్రియలు జరిగాయి. అయితే ఆమె అస్వస్థతతో ఆస్పత్రిలో చేరగానే.. ఆశా భోంస్లే మరణించారంటూ సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. కొన్ని న్యూస్ ఛానెళ్లు కూడా ఆ తప్పుడు వార్తను ప్రసారం చేశాయి. పాకిస్తాన్‌కు చెందిన 'జియో న్యూస్' కూడా ఈ పుకార్లను ఆధారంగా చేసుకుని ఒక కథనాన్ని ప్రసారం చేసింది.పాటలతో పాటు వీడియో క్లిప్పింగులుఆశా భోంస్లే మరణవార్తను కవర్ చేసే క్రమంలో ఆమె పాడిన సూపర్ హిట్ పాటలను ప్లే చేసింది. అలాగే భారతీయ సినిమాలకు సంబంధించిన వీడియో క్లిప్పింగులను కూడా ఛానల్లో ప్రసారం చేశారు. పాకిస్తాన్ మీడియా నిబంధనల ప్రకారం భారతీయ కంటెంట్‌ను ప్రసారం చేయొద్దు. తప్పుడు వార్తను ప్రసారం చేయడమే కాకుండా, నిబంధనలకు విరుద్ధంగా భారతీయ వీడియోలను ప్రదర్శించడంపై పెమ్రా సీరియస్ అవుతూ.. సదరు న్యూస్ ఛానల్‌కు షోకాజ్ నోటీసులు జారీ చేసింది.దీనిపై ఏడు రోజుల్లోగా లిఖితపూర్వక వివరణ ఇవ్వాలని జియో న్యూస్ యాజమాన్యాన్ని పెమ్రా ఆదేశించింది. ఒకవేళ నిర్ణీత సమయంలోగా సంతృప్తికరమైన సమాధానం ఇవ్వకుంటే ఛానల్‌పై భారీ జరిమానా లేదా లైసెన్స్ రద్దు వంటి కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉందని హెచ్చరించింది. తప్పేముంది?పెమ్రా నోటీసులపై జియో న్యూస్ మేనేజింగ్ డైరెక్టర్ అజార్ అబ్బాస్ స్పందిస్తూ.. భారతీయ పాటలను ప్రసారం చేయడాన్ని సమర్థించుకున్నారు. ఒక కళాకారుడి జీవితంపై వార్తలు రాసేటప్పుడు, వారు సాధించిన విజయాలను గుర్తు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ‘ప్రముఖ కళాకారుల గురించి వార్తలు రాసేటప్పుడు, వారి కృషిని పునఃపరిశీలించి, కీర్తించడం ఎప్పటినుంచో ఆనవాయితీగా వస్తోంది. నిజానికి, ఆశా భోస్లే వంటి గొప్ప కళాకారిణికి సంబంధించి, ఆమె కాలాతీతమైన, చిరస్మరణీయమైన పాటలను మనం పంచుకున్న దానికంటే ఇంకా ఎక్కువగా పంచుకోవాల్సింది. అయినప్పటికీ పెమ్రా (PEMRA), దీనిని పరిమితం చేయాలని నిర్ణయించుకుంది’ అని అబ్బాస్ ట్వీట్ చేశారు. భారతీయ కంటెంట్‌ను ప్రసారం చేశారన్న సాకుతో నోటీసులు ఇవ్వడాన్ని పలువురు జర్నలిస్టులు, సామాజిక కార్యకర్తలు తప్పుబడుతున్నారు. కళాకారులకు నివాళులర్పించడాన్ని కూడా నేరంగా చూడటం ఏంటని సోషల్ మీడియాలో నిలదీస్తున్నారు. భారతీయ సంస్కృతి, కంటెంట్ పట్ల పాక్ ఆర్మీకి ఉన్న భయానికి ఇది నిదర్శనమని విమర్శిస్తూ పోస్టులు పెడుతున్నారు. PEMRA has issued a show-cause notice to Geo News for airing content related to the legendary subcontinent singer Asha Bhosle.It has always been customary to revisit and celebrate the work of iconic artists when reporting on them. In fact, for an artist of Asha Bhosle’s stature,… pic.twitter.com/AuhFPyGZCL— Azhar Abbas (@AzharAbbas3) April 13, 2026 -
అప్పులతో పాక్ సతమతం..?
ఇస్లామాబాద్: ఆర్థిక సంక్షోభంతో తల్లడిల్లిపోతున్న పాక్‌కు మరో ఇబ్బంది వచ్చి పడింది. UAE ఇచ్చిన $3 బిలియన్ డాలర్లు అప్పు పూర్తిగా తిరిగి చెల్లించాలని కోరడంతో ఎలా చెల్లించేది అనే సతమతమవుతున్నట్లు తెలుస్తోంది. అసలే డబ్బులు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వేళ ఈ అప్పులు ఎలా చెల్లించేదని ఇబ్బందులు పడుతున్నట్లు సమాచారం.మధ్యప్రాచ్యంలో జరుగుతున్న యుద్ధం కారణంగా పెరుగుతున్న ముడిచమురు ధరల వల్ల పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి గందరగోళంగా మారింది. ఇంతకాలంగా యూఏఈకి ఉన్న అప్పును పలు దపాలుగా పాకిస్థాన్ వాయిదా వేస్తో వచ్చింది అయితే ప్రస్తుతం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అప్పు చెల్లించాలని కోరడంతో ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషిస్తున్నట్లు తెలుస్తోంది.ఈ విషయమై పాక్ ఆర్థిక శాఖ మంత్రి జౌరంగజేబ్ స్పందించారు. మేము సమకూర్చుకోవాల్సిన నిధులను ద్వైపాక్షిక మార్గాలు, రుణాల ద్వారా సమకూర్చుకునే యత్నం చేస్తున్నాం. అప్పు చెల్లించడానికి ఉన్న అన్ని మార్గాలను పరిశీలిస్తున్నాం అన్నారు. ఎట్టిపరిస్థితుల్లో యుఏఈకి ఉన్న అప్పును చెల్లిస్తామని స్పష్టం చేశారు . అయితే అప్పుకోసం చైనా,లేదా సౌదీ అరేబియాలను సంప్రదిస్తున్నారా అని రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు పాక్ మంత్రి సమాధానం దాటవేశారు.కాగా ప్రస్తుతం ప్రస్తుతం పాక్ వద్ద $ 16.4 బిలియన్ల విదేశీ మారక నిల్వలు ఉండగా అవి ఆ దేశ దిగుమతులకు మూడునెలల వరకూ సరిపోతాయని కథనాలు పేర్కొన్నాయి. అయితే పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో ఇంధన ధరలు భారీగా పెరగడంతో ఆదేశంలో లాక్ డౌన్ విధించారు. ఇంధన వినియోగం తగ్గించడం కోసం షాపింగ్ మాల్స్, బజార్లు అన్ని రాత్రి 8 గంటల వరకే క్లోజ్ చేసేలా ఆదేశాలిచ్చారు. -
నోయిడా కార్మికుల నిరసనల్లో బిగ్ ట్విస్ట్..!
లక్నో: వేతనాలు పెంచాలంటూ నిన్న ( సోమవారం) గ్రేటర్ నోయిడా (యూపీ)లో కార్మికులు ఆందోళన చేపట్టిన హింసాత్మకంగా మారింది. అయితే నిరసనలపై యూపీ కార్మిక శాఖ మంత్రి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ఆందోళనల వెనుక పాకిస్థాన్ హస్తం ఉన్నట్లుగా అనుమానం వ్యక్తం చేశారు. ఈ అంశంపై లోతైన విచారణ చేపడుతున్నామని తెలిపారు.గ్రేటర్ నోయిడాలో కార్మికులు చేపట్టిన ఆందోళన తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. ఫేజ్ 2 పారిశ్రామిక ప్రాంతంలో వరుసగా నాలుగో రోజు జరుగుతున్న ఈ నిరసనలు ఒక్కసారిగా హింసాత్మకంగా మారాయి. ఆగ్రహంతో రగిలిపోయిన కార్మికులు పోలీసుల వాహనాలను బోల్తా కొట్టించి, రాళ్ల దాడికి దిగడంతో ఆ ప్రాంతం రణరంగాన్ని తలపించింది. అదుపు తప్పుతున్న పరిస్థితిని చక్కదిద్దేందుకు అధికారులు తీవ్రంగా శ్రమించారు ఆందోళనకారులు పలు కంపెనీల ఆస్తులను ధ్వంసం చేయడంతో పాటు, ఒక వాహనానికి నిప్పు పెట్టారు. ఈ ఘటనపై యూపీ మంత్రి స్పందించారు.ఆయన మాట్లాడుతూ "నోయిడాలో జరిగిన నిరసనలు రాష్ట్ర అభివృద్ధికి, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే ఉద్దేశ్యంతోనే జరిగినట్లు కనిపిస్తోంది. కొద్దిరోజుల క్రితం, మీరట్ నోయిడాలలో నలుగురు అనుమానిత ఉగ్రవాదులను అరెస్టు చేశారు. వీరికి పాకిస్థాన్‌లోని హ్యాండ్లర్లతో సంబంధాలు ఉన్నట్లు తేలింది. ఇలాంటి పరిస్థితుల్లో, రాష్ట్రంలో అస్థిరత సృష్టించేందుకు కుట్ర జరిగిందనే అవకాశాలు బలపడుతున్నాయి. ఏజెన్సీలు ఈ మొత్తం విషయంపై తీవ్రంగా దర్యాప్తు చేస్తున్నాయి," అని రాజ్‌భర్ అన్నారు.కాగా నిన్న జరిగిన నిరసనలపై అక్కడి ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతున్నట్లు తెలుస్తోంది. ఈ నిరసనల్లో హింసను సృష్టించిన దాదాపు 300 మందిని ఇప్పటివరకూ అరెస్టు చేసినట్లు తెలిపింది. మరో వందమందికి పైగా వ్యక్తులను అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. ముజఫర్ నగర్లో ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ కార్యక్రమం ఉన్న నేపథ్యంలో దానికి ఇబ్బందులు కలిగించడానికి ఈ ప్రయత్నాలు చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే ఈ కార్మికులందరూ సంయమనం పాటించాలని ఎలాంటి రెచ్చగొట్టే చర్యలకు ప్రభావితం కాకూడదని విజ్ఞప్తి చేశారు. -
పాక్ నేతలపై ట్రంప్ ప్రశంసలు.. భారత్‌పై మళ్లీ అదే మాట..
వాషింగ్టన్: ఇరాన్, అమెరికా మధ్య ఉద్రిక్తతలు, చర్చల వేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్‌తో చర్చల వ్యవహారంలో పాకిస్తాన్‌ను ప్రశంసిస్తూ.. మధ్యలోకి భారత్ ప్రస్తావనను తీసుకువచ్చారు. ఆపరేషన్ సిందూర్ నాటి పరిస్థితులను మళ్లీ ప్రస్తావించి వార్తల్లో నిలిచారు.కాగా, ఇరాన్, అమెరికా మధ్య పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ వేదికగా చర్చలు జరిగిన విషయం తెలిసిందే. ఈ చర్చలు విఫలమయ్యాయి. అనంతరం, చర్చలపై ట్రంప్ స్పందించారు. ఈ సందర్భంగా పహల్గామ్ ఉగ్రదాడి ఘటన తర్వాత భారత్-పాకిస్తాన్ మధ్య తలెత్తిన ఉద్రిక్తతలను ప్రస్తావించి తనదైన శైలిలో వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ సైన్యాధిపతి ఆసిమ్ మునీర్, ప్రధాని షెహబాజ్ షరీఫ్‌లపై ఆయన ప్రశంసల జల్లు కురిపించారు.ట్రంప్ సోషల్ మీడియా ట్రుత్ వేదికగా.. పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ ఆసిమ్ మునీర్, ప్రధాని షెహబాజ్ షరీఫ్‌లు అత్యంత సమర్థులు, అసాధారణ వ్యక్తులు అని అన్నారు. భారత్-పాకిస్తాన్ మధ్య జరగాల్సిన ఒక భయంకరమైన యుద్ధాన్ని తాను ఆపడం ద్వారా దాదాపు 3 నుంచి 5 కోట్ల మంది ప్రాణాలను కాపాడానని ట్రంప్ పునరుద్ఘాటించారు. నేను చేసిన సహాయానికి వారు (పాక్ నేతలు) నాకు నిరంతరం కృతజ్ఞతలు తెలుపుతూనే ఉన్నారు. వారి మాటలు నాకు ఎంతో ఆనందం కలిగిస్తాయి.. అంటూ మరోసారి ఆపరేషన్ సిందూర్‌ను ప్రస్తావించారు. దీంతో, ట్రంప్ వ్యాఖ్యలు మళ్లీ చర్చనీయాంశంగా మారాయి.అయితే, భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలు తగ్గడానికి అమెరికా మధ్యవర్తిత్వం కారణం కాదని భారత్ ఇప్పటికే పలుమార్లు స్పష్టం చేసింది. అది కేవలం రెండు దేశాల సైన్యాల మధ్య జరిగిన ప్రత్యక్ష చర్చల ఫలితమేనని భారత విదేశాంగ మంత్రి జైశంకర్ కూడా గతంలోనే స్పష్టం చేశారు. ఆపరేషన్ సిందూర్ తర్వాత పాక్ సైన్యమే చర్చలకు చొరవ చూపిందని భారత ప్రభుత్వం తెలిపింది. అయినప్పటికీ ట్రంప్ పదే పదే ఇలాంటి వ్యాఖ్యలు చేయడం గమనార్హం. -
చర్చల వైఫల్యం వెనక... ఐదు కారణాలు!
అమెరికా, ఇరాన్ నడుమ ఎంతో ఆశావహంగా మొదలైన శాంతి చర్చలు విఫలం కావడం అంతర్జాతీయ సమాజాన్ని తీవ్ర నిరాశలో ముంచెత్తింది. ఈ వైఫల్యం వెనక పలు కారణాలున్నట్టు అంతర్జాతీయ నిపుణులు విశ్లేషిస్తున్నారు. వాటిలో ప్రధానమైనవి...1. అటు అమెరికా, ఇటు ఇరాన్ తమ ప్రాధాన్యాలకే కట్టుబడి ఉండాలనే మొండి పట్టుదలతో ఇస్లామాబాద్‌లో అడుగుపెట్టాయి. ఎవరూ తమ డిమాండ్ల నుంచి ఇసుమంతైనా వెనక్కు తగ్గలేదు. అవతలి వారి వాదనలకు ఏ మాత్రమూ విలువ ఇవ్వలేదు. చర్చలు వైఫల్యానికి ఈ వైఖరే ప్రధాన కారణంగా నిలిచింది. యురేనియం శుద్ది కార్యక్రమాన్ని తక్షణం, శాశ్వతంగా ఆపేయాలని అమెరికా డిమాండ్‌కు ఇరాన్ ససేమిరా అంది. విద్యుదుత్పత్తి అవసరాల నిమిత్తం యురేనియం శుద్ధి కార్యక్రమాన్ని కొనసాగించి తీరతామని కరాఖండిగా చెప్పింది.2. చర్చలన్నాక అగ్రరాజ్యాధినేత అయినా నోరు అదుపులో పెట్టుకోవాలి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ దౌత్యధర్మాన్ని పూర్తిగా విస్మరించారు. ఇరాన్ బృందం పాక్‌లో కాలుమోపాక కూడా కాక పెంచేలా రెచ్చగొట్టే వ్యాఖ్యలకు దిగారు. చర్చలు విఫలమైతే ఇరాన్‌పై మునుపెన్నడూ ఉపయోగించని శక్తిమంతమైన ఆయుధాలతో మరింత భీకరంగా విరుచుకుపడతామంటూ ఆయన పెట్టిన పోస్టులు పరిస్థితిని దిగజార్చాయి. ఓవైపు చర్చలకు పిలిచి మరోవైపు ఇలా బెదిరింపులకు పాల్పడటం ఏ రకమైన దౌత్య నీతి అంటూ అమెరికా ప్రతినిధులను ఇరాన్ బృందం నిలదీసినట్లు సమాచారం.3. కాల్పుల విరమణ లెబనాన్‌కూ వర్తిస్తుందని తాము మొదటి నుంచీ చెబుతున్నా చర్చలను బేఖాతరు చేస్తూ ఆ దేశంపై ఇజ్రాయెల్ భీకరంగా దాడులు కొనసాగిస్తుండటం ఇరాన్‌కు సుతరామూ నచ్చలేదు. లెబనాన్‌పై దాడులు చేయకుండా ఇజ్రాయెల్‌ను నిరోధిస్తామని అమెరికా నుంచి ఎలాంటి హామీ రాకపోవడాన్ని ఇరాన్ తీవ్రంగా తప్పుబట్టింది. మధ్యవర్తిగా హుందాగా వ్యవహరించాల్సిన పాక్ కూడా పరిస్థితిని దిగజార్చేలా ప్రవర్తించింది. ఇజ్రాయెల్ జాతి హననానికి పాల్పడుతోందంటూ పాక్ రక్షణ మంత్రి ఆసిఫ్ పోస్టు పెట్టడంతో మండిపడ్డ ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ మరింతగా రెచ్చగొట్టే వ్యాఖ్యలుచేశారు. చర్చలతో తమ దాడులకు సంబంధం లేదంటూ కుండబద్దలు కొట్టారు.4. అంతర్జాతీయ ఇంధన రవాణాకు కీలకమైన హార్మూజ్ జలసంధిని బేషరతుగా తెరవాలని ట్రంప్ డిమాండ్‌చేశారు. షరతుల్లేకుండా దాన్ని తెరవబోమని, చర్చల్లో బేరసారాలకు హార్మూజ్ తమకు కీలక ఆయుధమని ఇరాన్ ప్రతినిధులు వాదించారు. హార్మూజ్‌ను తెరవకపోతే ఇరాన్ నాగరికతనే బూడిద చేస్తామన్న ట్రంప్ బెదిరింపులను తీవ్రంగా తప్పుబట్టారు. హార్మూజ్‌ను తెరవాలంటే ఇరాన్‌పై ఆంక్షలను తొలగించాలని డిమాండ్ చేశారు. ఇందుకు అమెరికా బృందం ఒప్పుకోలేదు. పైగా ఈ విషయంలో ట్రంప్ ధోరణినే గట్టిగా సమరి్థంచింది. హార్మూజ్ గుండా పయనించే నౌకల నుంచి చార్జీలు వసూలుకు ఇరాన్‌తో కలిసి టోల్ వ్యవస్థను ఏర్పాటు చేస్తామన్న ట్రంప్ ప్రతిపాదనలను ఇరాన్ అంగీకరించలేదు. హార్మూజ్‌పై తమతో పాటు ఒమన్ పాక్షిక అధికారాలను గుర్తించాలన్న ఇరాన్ డిమాండ్‌కు అమెరికా ఒప్పుకోలేదు.5. అమెరికా, ఇరాన్ బృందాల మధ్య పరస్పర విశ్వాస లోపం అడుగడుగునా కనిపించింది. హామీలను అవతలి పక్షం పాటిస్తాయా అన్న అనుమానాలు ఇరువైపులా కొట్టొచి్చనట్టు కన్పించాయి. తమ ప్రతిపాదనలు అద్భుతమని అమెరికా చెప్పుకుంటే, అవన్నీ చెత్త షరతులని ఇరాన్ ప్రతినిధులు కుండబద్దలు కొట్టారు.ఇక ఏం జరగనుంది? చర్చల వైఫల్యం తాలూకు తక్షణ ప్రభావం కాల్పుల విరమణపై పడే అవకాశముంది. అమెరికా, ఇజ్రాయెల్ మళ్లీ ఇరాన్‌పై మూకుమ్మడిగా దాడులు ప్రారంభించే ప్రమాదం కన్పిస్తోంది. చర్చలు విఫలమైతే చరిత్ర చూడని స్థాయిలో ఇరాన్‌పై దాడులు తప్పవని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇప్పటికే హెచ్చరించడం తెలిసిందే. అదే జరిగితే ప్రాణ, ఆస్తినష్టం ఏ స్థాయిలో ఉంటుందో ఊహించడం కూడా కష్టమేనని ఆందోళన వ్యక్తమవుతోంది. హార్మూజ్ జలసంధి తెరచుకోని పక్షంలో అంతర్జాతీయంగా చమురు సంక్షోభం ముదిరే ఆస్కారముంది. తమ వద్ద అణుబాంబు లేని కారణంగానే అమెరికా ఇంతగా దాడులకు దిగుతోందన్న అభిప్రాయంతో ఉన్న ఇరాన్, ఇక అణ్వస్త్ర కార్యక్రమాన్ని యుద్ధప్రాతిపదికన కొనసాగించే వీలుంది. భారత్‌లో ఇంధన కష్టాలు మరింత పెరిగే అవకాశముంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
హార్మూజ్‌ను దిగ్బంధించండి
వాషింగ్టన్: శాంతిచర్చలు విఫలమవడంతో పట్టరాని ఆగ్రహంతో ఊగిపోతున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వెనువెంటనే హార్మూజ్ జలసంధిని దిగ్భంధించాలని తమ నావికాదళానికి ఆదేశాలిచ్చారు. ఈ మేరకు సొంత సామాజిక మాధ్యమం ‘ట్రూత్ సోషల్’లో ఆదివారం ఒక పోస్ట్‌పెట్టారు. ‘‘ఇరాన్‌కు అక్రమంగా టోల్ చెల్లించిన ఏ ఒక్క సరకు రవాణా నౌక కూడా జలసంధి గుండా రాకపోకలు సాగించడానికి వీల్లేదు. ఇరాన్‌కు డబ్బులే కావాలి. మరీ ముఖ్యంగా అణ్వాయుధం కావాలి. అందుకే వాళ్ల ప్రయత్నాలను అడ్డుకుంటూ మేం హార్మూజ్‌ను దిగ్భందిస్తాం. ఇరాన్ అమర్చిన సముద్ర మందుపాతరలను ధ్వంసంచేస్తాం’’ అని అన్నారు. జలసంధి దిగ్బంధంలో మరికొన్ని దేశాలు అమెరికాకు సాయపడనున్నట్లు వార్తలొచ్చాయి. ‘‘ఇరాన్‌తో యుద్ధం చేయడం కంటే చర్చల ద్వారా సమస్యకు పరిష్కారం వెతకడం ముఖ్యమని భావించి శాంతిచర్చలకు సిద్ధపడ్దాం. చాలా అంశాల్లో వాళ్లతో మాకు ఏకాభిప్రాయం కుదిరింది. కానీ అణ్వస్త్ర తయారీ కార్యక్రమం నిలుపుదలపై ఇరాన్ మొండికేసింది. అందుకే చర్చలు విఫలమయ్యాయి. సంక్లిష్టమైన, అనూహ్యమైన, ప్రమాదకర ఇరాన్ పాలకుల చేతికి అణ్వాయుధం దక్కకుండా చేస్తా. ఇరాన్ ఏనాటికీ అణ్వస్త్ర సామర్థ్యం సాధించబోదు’’ అని ట్రంప్ వ్యాఖ్యానించారు. చర్చల్లో మధ్యవర్తి పాత్ర పోషించిన పాక్ ప్రస్తావనను ట్రంప్ ప్రత్యేకంగా తీసుకొచ్చారు. ‘‘పాక్ ఫీల్డ్ మార్షల్ ఆసిం మునీర్, పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ నిజంగా అసాధారణ వ్యక్తులు. భారత్‌తో యుద్ధాన్ని నిలువరించి ప్రత్యక్షంగా 3–5 కోట్ల మంది ప్రజల ప్రాణాలు కాపాడిన నన్ను మునీర్, షెహబాజ్ పొగడ్తల్లో ముంచెత్తారు. ఇరాన్‌కు రహస్యంగా ఆయుధాలను తరలిస్తే చైనాపై అదనంగా 50 శాతం టారిఫ్‌లు విధిస్తానని ట్రంప్ హెచ్చరించారు. ఫాక్స్ న్యూస్ ‘సండే మారి్నంగ్ ఫ్యూచర్స్’ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ‘‘భుజంపై నుంచి ప్రయోగించే క్షిపణి విధ్వంసక మిస్సైల్ లాంచర్‌ను ఇరాన్‌కు చైనా రహస్యంగా పంపిస్తోందన్న వార్తలు చదివా. అవి నిజమని అనుకోను. ఇప్పుడు చైనాతో అమెరికా సంబంధాలు బాగానే ఉన్నాయి. కానీ చైనా నిజంగానే ఇరాన్‌కు ఆయుధ సాయం చేస్తే 50 శాతం పన్నుల భారం పడేస్తా’’ అని హెచ్చరించారు. -
చర్చలు విఫలం
ఇస్లామాబాద్: ప్రపంచమంతా అత్యంత ఆశతో ఎదురు చూసిన అమెరికా, ఇరాన్ చర్చలు చివరికి విఫలమయ్యాయి. పశ్చిమాసియాలో భీకర యుద్ధానికి ముగింపు పలికి శాంతి, సుస్థిరతకు బాటలు వేస్తాయని, శాశ్వత కాల్పుల విరమణకు బాటలు పరుస్తాయని, ఆ మేరకు ఇరు దేశాల నడుమ ఒప్పందం కుదురుతుందని ప్రపంచ దేశాలు పెట్టుకున్న ఆశలు వమ్మే అయ్యాయి. పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ సారథ్యంలోని బృందం, పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బఘేర్ ఘాలిబఫ్ సారథ్యంలోని ఇరాన్ బృందం మధ్య జరిగిన శిఖరాగ్ర చర్చలు ఎటూ తేలకుండానే అర్ధాంతరంగా ముగిశాయి. ఏకధాటిగా 21 గంటలపాటు కొనసాగిన చర్చల్లో అమెరికా, ఇరాన్ ప్రతినిధి బృందాలు ఎవరి డిమాండ్లపై వారు మొండిపట్టు పట్టడంతో ఎలాంటి ఒప్పందమూ సాధ్యపడలేదు. దాంతో ఇరు బృందాలూ ఆదివారమే తమ తమ దేశాలకు వెనుదిరిగాయి. అమెరికా వెళ్లేముందు వాన్స్ ఇస్లామాబాద్‌లో మీడియాతో మాట్లాడారు. చర్చలు విఫలమయ్యాయని స్వయంగా ప్రకటించారు. ‘‘అణు కార్యక్రమాలకు స్వస్తి పలకబోనని ఇరాన్ మొండికేసింది. హార్మూజ్పైనా అదే వైఖరి! చర్చల వైఫల్యానికి ఇవి రెండే ప్రధాన కారణాలు. ఇరాన్‌తో 21 గంటలపాటు చర్చలు జరిపాం. కొన్ని అంశాలపై లోతుగా మాట్లాడాం. చర్చలకు సంబంధించి ఇదొక్కటే మంచివార్త. కానీ ఉమ్మడి నిర్ణయానికి మాత్రం రాలేకపోయాం. ఇది అమెరికాకంటే ఇరాన్‌కే అతి పెద్ద దుర్వార్త. అణ్వాయుధం తయారు చేయబోమని ఒక్క నిర్దిష్టమైన, స్పష్టమైన హామీని మాత్రమే కోరాం. అధ్యక్షుడు ట్రంప్ కోరుతున్నది కూడా ఇదే. చర్చల ద్వారా మేం ఇదే సాధించాలనుకున్నాం. చర్చలకు మేం ముందుకు రావడానికి అసలు కారణమూ ఇదే. కానీ మా షరతులకు ఇరాన్ ఒప్పుకోలేదు. చర్చల సందర్భంగా ట్రంప్‌తో నిరంతరం సంప్రదింపులు జరుపుతూ ఆయన వైఖరిని ఇరాన్ బృందానికి ఎప్పటికçప్పుడు తెలియజేస్తూ వచ్చాం’’ అని వాన్స్ చెప్పారు. తమ ప్రతిపాదనలను ఇరాన్ ఇకనైనా ఆమోదిస్తుందో లేదో చూడాలన్నారు. అణ్వస్త్ర తయారీ, హార్మూజ్ జలసంధి ద్వారా సాధారణ రాకపోకలు, విదేశాల్లో దిగ్భందంలో ఉన్న ఇరాన్ స్థిరచరాస్తులను విడిపించడం వంటి ప్రధానాంశాల్లో సయోధ్య వీలవకపోవడమే చర్చల వైఫల్యానికి కారణమని ఇరాన్ అధికారిక మీడియా ప్రకటించింది. అసాధ్యమైన డిమాండ్లు: బఘేర్ చర్చల వైఫల్యంపై ఇరాన్ బృంద సారథి, స్పీకర్ ఘాలిబఫ్ ‘ఎక్స్’లో స్పందించారు. ‘‘ఇరాన్ సర్వతోముఖాభివృద్ధికి కోసం దూరదృష్టితో మేం చేసిన పలు ప్రతిపాదనలకు అమెరికా అంగీకరించలేదు. మా బృంద విశ్వాసాన్ని సంపాదించడంలో విఫలమైంది. దాని ఆధిపత్య తరహా దౌత్యమే ఇందుకు కారణం. మాపై సైనిక చర్య నేపథ్యంలో దేశ రక్షణ కోసం 40 రోజులుగా చేస్తున్న పోరాటంలో రాజీ ఉండబోదని కరాఖండిగా చెప్పేశాం. చర్చల సాఫల్యం అవతలి పక్షం అనుకూల వైఖరి, అంకితభావం మీదనే ఆధారపడి ఉంటుంది. అమెరికా మా ముందు ఆచరణ సాధ్యం కాని, అతి, అక్రమ డిమాండ్లు పెట్టింది. ఇలాంటి చర్యలతో చర్చలు ముందుకు సాగబోవు. పరస్పర అవిశ్వాసం, సంశయాల నడుమ సఫలత అసాధ్యం’’ అన్నారు. ‘‘ఒకే దఫాలో ఉమ్మడి నిర్ణయం ఆశించడం కష్టం. పలుమార్లు చర్చల తర్వాత బహుశా ఇరు పక్షాల వైఖరిలో కాస్త సారూప్యత సాధ్యపడొచ్చు’’ అని ఇరాన్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఇస్మాయెల్ బఖాయీ అభిప్రాయపడ్డారు. మలి దఫా చర్చలపై యోచిస్తున్నట్టు అతిథ్య పాక్ ఉప ప్రధాని ఇషాక్ దార్ ప్రకటించారు. 1979లో ఇస్లామిక్ విప్లవం తర్వాత ఇరాన్‌తో అమెరికా జరిపిన తొలి ప్రత్యక్ష చర్చలు ఇవే కావడం తెలిసిందే. ఇస్లామాబాద్‌లో శనివారం మొదలైన ఈ చర్చల్లో అమెరికా తరఫున వాన్స్‌తో పాటు ట్రంప్ అల్లుడు జేర్డ్ కుష్నర్, పశ్చిమాసియాలో అధ్యక్షుని దూత స్టీవ్ విట్కాఫ్; ఇరాన్ తరఫున బఘేర్, విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ; మధ్యవర్తిత్వ దేశ హోదాలో పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ చర్చల్లో పాల్గొన్నారు. పశ్చిమాసియా నుంచి అమెరికా సేనల నిష్క్రమణ, హార్మూజ్‌పై పట్టు వంటి 10 కీలక డిమాండ్లతో ఇరాన్; అణ్వస్త్ర తయారీకి తక్షణం అడ్డుకట్టే ప్రధాన డిమాండ్‌గా వాన్స్ బృందం పాక్‌లో కాలుమోపాయి.లెబనాన్‌పై ఆగని దాడులు బీరూట్: లెబనాన్‌తో మంగళవారం చర్చలు జరపనున్నా, ఆ దేశంపై దాడులను మాత్రం ఇజ్రాయెల్ ఆపడం లేదు! ఆదివారం దక్షిణ లెబనాన్‌లోని మారౌబ్ గ్రామంపై దాడిలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. లెబనాన్‌పై దాడులను పోప్ లియో–14 తీవ్రంగా ఖండించారు. మరోవైపు 40రోజులపాటు జరిగిన యుద్ధంలో ఇప్పటిదాకా ఇరాన్లో 3,375 మంది ప్రాణాలు కోల్పోయారని ఇరాన్ ఫోరెన్సిక్ మెడిసన్ ఆర్గనైజేషన్ ఆదివారం ప్రకటించింది. మృతుల్లో 500 మంది దాకా మహిళలున్నారు. ఇప్పటిదాకా యుద్ధంలో లెబనాన్‌లో 2,055 మంది, ఇజ్రాయెల్‌లో 23 మంది, గల్ఫ్‌దేశాల్లో డజను మందికిపైగా చనిపోయారు. -
శాంతి చర్చలు విఫలం.. పాక్ ఆందోళన..
-
వీటి వల్లే చర్చలు విఫలం.. ఇకపై ఏం జరుగుతుంది?
పాకిస్థాన్‌లో అమెరికా-ఇరాన్ మధ్య ఏకంగా 21 గంటలు చర్చలు జరిగినప్పటికీ అవి ఫలించలేదు. ఇరాన్ అణ్వాయుధాలను అభివృద్ధి చేసే ప్రయత్నాన్ని ఆపాలని హామీ ఇవ్వలేదని అమెరికా తెలిపింది. చర్చల విఫలం కారణంగా 14 రోజుల కాల్పుల విరమణ అనిశ్చితిలో పడింది. ఎందుకు ఎందుకు విఫలమయ్యాయి? ఒప్పందం కుదరకపోతే.. గతంలో ఎవరూ చూడని విధంగా మరింత పెద్దగా, మెరుగ్గా, శక్తిమంతంగా సైనిక చర్య ఉంటుందని ట్రంప్ చెప్పినట్లే చేస్తారా?డిమాండ్లు విఫలం కావడానికి ప్రధాన కారణంఇరాన్ అణ్వాయుధాలను అభివృద్ధి చేయదన్న హామీ కావాలని అమెరికా డిమాండ్ చేస్తోంది. ఇదే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రధాన లక్ష్యం. చర్చల సమయంలో డొనాల్డ్ ట్రంప్‌తో ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ నిరంతరతరం సంప్రదింపులు జరిపారు. అమెరికా డిమాండ్లను అసంబద్ధం అంటూ ఇరాన్ తిరస్కరించింది. అణు పరిమితులు, ప్రాంతీయ అంశాలపై వాషింగ్టన్ వైఖరి చర్చల పురోగతిని అడ్డుకుందని ఇరాన్ మీడియా తెలిపింది.ఇటీవల కొన్ని వారాల యుద్ధం తర్వాత అమెరికా-ఇరాన్ మధ్య నమ్మకం బాగా తగ్గిపోయింది. ఒకేసారి జరిగిన చర్చల్లోనే పరిష్కారం రావాలని ఆశించడం సరికాదని ఇరాన్ అభిప్రాయపడ్డారు. పలు అంశాలపై ఇరాన్ ఏ మాత్రం తగ్గలేదు. ఇరాన్ “రెడ్ లైన్లు”గా ఆంక్షల ఉపశమనం, యుద్ధ పరిహారం, లెబనాన్‌లో ఇజ్రాయెల్ సైనిక చర్యలపై పరిమితులను ప్రస్తావించింది. హార్మూజ్ జలసంధి అంశం ఇరు దేశాలపై ఒత్తిడి పెంచింది. లెబనాన్‌లో ఇజ్రాయెల్ దాడులు, హిజ్బుల్లాపై ఆపరేషన్లు చర్చలను మరింత క్లిష్టం చేశాయి.యుద్ధం ప్రారంభం నుంచి 2,000 మందికి పైగా మరణించారని లెబనాన్ అధికారులు తెలిపారు. హిజ్బుల్లాతో కాల్పుల విరమణను ఇజ్రాయెల్ తిరస్కరించింది. తాము నిజాయితీతో చర్చించామని అమెరికా, ఇరాన్ రెండు దేశాలూ చెప్పుకుంటున్నాయి. అమెరికా, ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య కుదిరిన 14 రోజుల కాల్పుల విరమణ ఏమవుతుందన్న విషయంపై, తదుపరి చర్యలపై చర్చలు విఫలమయ్యాక వాన్స్ స్పష్టత ఇవ్వలేదు. రెండు పక్షాలు కాల్పుల విరమణ పాటించాలని పాకిస్థాన్ కోరింది.అమెరికా చెప్పినట్లు చేస్తే భారీ విధ్వంసంఒప్పందం కుదరకపోవడంతో ఎన్నో సందేహాలు వ్యక్తమవుతున్నాయి. దౌత్య ప్రయత్నాలు తిరిగి మొదలవుతాయా? కాల్పుల విరమణ ముగుస్తుందా? అన్న ప్రశ్నలు మొదట వస్తున్నాయి. చర్చలు కుదరకపోవడంతో పశ్చిమాసియాలో అస్థిరత పెరిగే ప్రమాదం ఉంది. ప్రస్తుతమైతే కాల్పుల విరమణ కొనసాగుతోంది.తదుపరి చర్యలపై స్పష్టత లేదు. చర్చలు విఫలమైన తర్వాత ఇరాన్‌పై మళ్లీ దాడులు జరిగే ప్రమాదం పెరిగింది. హార్మూజ్ జలసంధి వివాదం పరిష్కారం కాలేదు. చర్చల ద్వారా తిరిగి తెరవడంపై అనిశ్చితి నెలకొంది. గల్ఫ్ ప్రాంతంలో యుద్ధ నౌకల మోహరింపుతో ఇరాన్‌పై సైనిక చర్యకు అమెరికా ఇప్పటికీ సిద్ధంగానే ఉంది. ఒప్పందం కుదరకపోతే భీకర దాడులు చేస్తామని ఇప్పటికే ట్రంప్ ప్రకటించడంతో చెప్పినట్లే చేస్తారా? అన్న ఆందోళన నెలకొంది. అమెరికా తన సైన్యాన్ని ఇరాన్ సరిహద్దులకు సమీపంలోకి తరలించింది. ఒప్పందం కుదిరే వరకు ఈ బలగాలు అక్కడే ఉంటాయని ఇప్పటికే డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. ఇరాన్ భూభాగంలోకి సైన్యం ప్రవేశిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఇటు ఇరాన్ కూడా హెచ్చరించింది. గతంలో అఫ్గానిస్థాన్, ఇరాక్‌లో అమెరికా చేసిన ఆపరేషన్లు గుర్తుకు వస్తున్నాయి. అయితే, అమెరికా భూతలదాడులు చేస్తే కొన్నేళ్లపాటు యుద్ధం జరిగే అవకాశాలు ఉంటాయని విశ్లేషకులు అంటున్నారు. మరోవైపు, మొదట ఇరాన్‌లోని విద్యుత్ ప్లాంట్లు, బ్రిడ్జిలను కుప్పకూల్చుతామని ట్రంప్ ఇప్పటికే ప్రకటించారు. గతంలో ఎవరూ చూడని విధంగా మరింత పెద్దగా, మెరుగ్గా, శక్తిమంతంగా సైనిక చర్య ఉంటుందని, ఈ నిర్ణయాన్ని ముందే తీసుకున్నామని ట్రంప్ చెప్పారు. అమెరికా చెప్పినట్లు చేస్తే భారీ విధ్వంసమే జరుగుతుంది. -
ఇరాన్‌తో చర్చలు విఫలం: జేడీ వాన్స్ సంచలన ప్రకటన
ఇస్లామాబాద్: పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ వేదికగా జరిగిన ఇరాన్, అమెరికా మధ్య చర్చలు విఫలమయ్యాయి. అర్ధాంతరంగా చర్చలు ముగించి జేడీవాన్స్ బృందం వెళ్లిపోయింది. దాదాపు 21 గంటల పాటు జరిగిన చర్చలు విఫలం కావడంతో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కీలక వ్యాఖ్యలు చేశారు.ఇరాన్, అమెరికా చర్చల అనంతరం జేడీ వాన్స్ మీడియాతో మాట్లాడుతూ..‘రెండు దేశాల మధ్య చర్చల్లో ఎలాంటి పురోగతి లేదు. ఇరాన్‌తో చర్చలు విఫలమయ్యాయి. మా డిమాండ్లను ఇరాన్ అంగీకరించలేదు. అందుకే ఇరాన్‌తో డీల్ లేదు. ఇస్లామాబాద్ వేదికగా ఎలాంటి ఒప్పందం కుదరకుండానే వెనుదిరుగుతున్నాం. ఎలాంటి అంగీకారం లేకుండా వెనక్కి వెళ్తున్నాం. మా నిబంధనలు అంగీకరించేందుకు ఇరాన్ సిద్దపడట్లేదు. ఇరాన్ వైపు నుంచి సానుకూల నిబద్ధత కనిపించాలి. కానీ, అలాంటి పరిస్థితి ఏమీ లేదు. ఈ పరిణామం ఇరాన్‌కు కచ్చితంగా బ్యాడ్ న్యూస్’ అంటూ ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. #WATCH | US-Iran peace talks | Islamabad, Pakistan: US Vice President JD Vance says, "...The simple fact is that we need to see an affirmative commitment that they (Iran) will not seek a nuclear weapon and they will not seek the tools that would enable them to quickly achieve a… pic.twitter.com/elS9Q0xPz4— ANI (@ANI) April 12, 2026ఇక, ఈ చర్చలలో పాకిస్తాన్ పాత్రను ఆయన ప్రశంసించారు. ఇరుపక్షాల మధ్య అంతరాన్ని పూడ్చేందుకు ఇస్లామాబాద్ అద్భుతంగా పనిచేసిందన్నారు. చర్చల్లో ఏవైనా లోపాలుంటే పాకిస్తాన్ వల్ల కలిగినవి కావు అంటూ క్లారిటీ ఇచ్చారు. అణ్వాయుధాలకు వ్యతిరేకంగా ఇరాన్ నుండి నిశ్చయాత్మక హామీ రాలేదని జేడీ వాన్స్ అన్నారు. చర్చలు విఫలం కావడం అమెరికా కంటే ఇరాన్‌కే ఎక్కువ నష్టం కలిగిస్తాయి అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అనంతరం, పాకిస్తాన్ నుంచి జేడీ వాన్స్ బృందం.. అమెరికాకు బయలుదేరింది. అయితే, హార్మూజ్ జలసంధిని తెరవాలన్నది అమెరికా డిమాండ్. అలాగే, యురేనియం శుద్ధి కార్యక్రమాన్ని ఆపాలని ఇరాన్‌కు అమెరికా కోరింది. ఇందుకు తమ దేశంపై ఉన్న ఆంక్షలను తొలగించాలని ఇరాన్ డిమాండ్ చేసినట్టు తెలిసింది. విదేశాల్లోని తమ ఆస్తులపై ఉన్న ఫ్రీజ్ను తొలగించాలని ఇరాన్ కోరినట్టు తెలిసింది. ఇదిలా ఉండగా.. అంతకుముందు పశ్చిమాసియా యుద్ధాన్ని ముగించే లక్ష్యంతో ఇస్లామాబాద్‌లో అమెరికా-ఇరాన్ మధ్య శాంతిచర్చలు ముగిశాయి. దాదాపు 14 గంటలపాటు చర్చలు కొనసాగినట్లు ఇరాన్ ప్రభుత్వం ప్రకటించింది. ఇరుదేశాలకు చెందిన సాంకేతిక బృందాలు నిపుణుల నివేదికలను పంచుకున్నట్లు తెలిపింది. కొన్ని అంశాలపై విభేదాలు ఉన్నప్పటికీ చర్చలు కొనసాగుతాయని ఇరాన్ ప్రభుత్వం వెల్లడించింది. ఆదివారం మరో విడత చర్చలు కొనసాగుతాయని పేర్కొంది. ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్ట్ చేసింది. -
సానుకూలంగా చర్చలు షురూ!
ఇస్లామాబాద్/లాహోర్/దుబాయ్: పశ్చిమాసియా లో యుద్ధానికి తెరదించి శాంతిని నెలకొల్పడమే ధ్యేయంగా వైరిపక్షాలైన అమెరికా, ఇరాన్‌ల మధ్య ప్రత్యక్ష చర్చలు శనివారం అధికారికంగా ప్రారంభమయ్యాయి. రెండు వారాల కాల్పుల విరమణ ప్రకటన తర్వాత పాకిస్తాన్ మధ్యవర్తిత్వంతో జరుగుతున్న ఈ మంతనాలకు పాక్ రాజధాని ఇస్లామాబాద్‌లోని ఓ స్టార్ హోటల్ వేదికగా మారింది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలకు శాశ్వత పరిష్కారం కనుగొనే దిశగా చర్చలు ఆరంభమైనట్లు పాక్ ప్రభుత్వం వెల్లడించింది. ప్రపంచ దేశాలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ చరిత్రాత్మక చర్చల కోసం ఇస్లామాబాద్‌కు చేరుకున్న అమెరికా, ఇరాన్ ప్రతినిధి బృందాలతో పాక్ ప్రధానమంత్రి షెహబాజ్ శనివారం ఉదయం వేర్వేరుగా సమావేశమయ్యారు. పశ్చిమాసియా పరిస్థితులు, తాజా పరిణామాలపై చర్చించారు. అనంతరం సాయంత్రం అమెరికా, ఇరాన్ మధ్య ప్రత్యక్ష చర్చలు ప్రారంభమయ్యాయి. రెండు రౌండ్లు చర్చలు జరిగాయి. మరో దఫా చర్చలు జరగాల్సి ఉన్నట్లు సమాచారం. ఇప్పటిదాకా చర్చల్లో సాధించిన పురోగతి ఏమిటన్నది ఇరుపక్షాలు ఇంకా బయటపెట్టలేదు. ఆదివారం కల్లా స్పష్టత రావొచ్చని తెలుస్తోంది. 1979 తర్వాత తొలి ప్రత్యక్ష చర్చలు అమెరికా, ఇరాన్ బృందాలు ఒకే బల్ల వద్ద కూర్చున్నాయని, చారిత్రాత్మక శాంతి చర్చలు ప్రారంభమయ్యాయని, తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరుపక్షాలు ముఖాముఖిగా కలుసుకోవడం ఇదే మొదటిసారి అని పాకిస్తాన్ టీవీ తెలియజేసింది. అమెరికా బృందానికి ఉపాధ్యక్షుడు జె.డి.వాన్స్ నేతృత్వం వహిస్తున్నారు. ఇందులో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అల్లుడు జేర్డ్ కుష్నర్, పశ్చిమాసియాలో అమెరికా ప్రతినిధి స్టీవ్ విట్కాఫ్ ఉన్నారు. ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బాఘేర్ ఘలిబాఫ్ నేతృత్వంలోని ఇరాన్ బృందంలో విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీతోపాటు ఇతర నాయకులు ఉన్నారు. 1979 నాటి ఇస్లామిక్ విప్లవం తర్వాత అమెరికా, ఇరాన్‌ల మధ్య ఇవే తొలి ఉన్నతస్థాయి ప్రత్యక్ష చర్చలు కావడం గమనార్హం. అంతకుముందు ఇస్లామాబాద్‌కు చేరుకున్న అమెరికా, ఇరాన్ బృందాలకు నూర్ ఖాన్ ఎయిర్‌బేస్‌లో ఉప ప్రధాని ఇషాఖ్ దార్, ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్, మంత్రి మొహిసిన్ రజా నఖ్వీ స్వయంగా స్వాగతం పలికారు. ఇరాన్ బృందానికి సైనిక దుస్తులు ధరించి, అమెరికా బృందానికి సూటు బూటు ధరించి అసిమ్ మునీర్ స్వాగతం పలకడం చర్చనీయాంశంగా మారింది. అమెరికా, ఇరాన్ బృందాలతో షరీఫ్ భేటీ పశ్చిమాసియాలో శాశ్వత శాంతి నెలకొనాలని పాక్ ప్రధాని షెహబాజ్ ఆకాంక్షించారు. శాంతి సాధనకు తమ సహకారం ఉంటుందని పునరుద్ఘాటించారు. అమెరికా–ఇరాన్‌ల మధ్య సయోధ్యకు తప్పకుండా సహకరిస్తామని చెప్పారు. అమెరికాతో చర్చల్లో పాల్గొనడానికి ఇస్లామాబాద్‌కు చేరుకున్న అమెరికా, ఇరాన్ ప్రతినిధి బృందాలతో శనివారం షెహబాజ్ వేర్వేరుగా సమావేశమయ్యారు. శాంతి యత్నాలకు సంబంధించిన అంశాలపై చర్చించారు. ఈ సమావేశాల్లో పాక్ ఉప ప్రధానమంత్రి ఇషాఖ్ దార్, చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్, ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్, అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రి మొహిసిన్ రజా నఖ్వీ తదితరులు పాల్గొన్నారు. శాంతి చర్చలకు ముందుకొచి్చన ఇరాన్ బృందాన్ని షెహబాజ్ షరీఫ్ అభినందించారు. ప్రాంతీయ ప్రయోజనాలు, ప్రపంచ శాంతి, సుస్థిరతల కోసం ఈ చర్చల్లో అర్థవంతమైన ఫలితాలను సాధించే దిశగా మధ్యవర్తిగా తమ పాత్రను చిత్తశుద్ధితో పోషిస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు పాక్ ప్రభుత్వం ఒక ప్రకటన విడుదల చేసింది. అలాగైతేనే ఒప్పందం కుదురుతుంది: రెజా అరెఫ్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించిన ‘అమెరికా ఫస్ట్’ సిద్ధాంతానికి అనుగుణంగా అమెరికా అధికారులు స్వదేశ ప్రయోజనాల కోసం కృషి చేస్తే అమెరికా–ఇరాన్ శాంతి చర్చల ద్వారా ఒక ఒప్పందం కుదిరే అవకాశం ఉందని ఇరాన్ ప్రథమ ఉపాధ్యక్షుడు మహమ్మద్ రెజా అరెఫ్ పేర్కొన్నారు. అలా కాకుండా ‘ఇజ్రాయెల్ ఫస్ట్’ సిద్ధాంతానికి మద్దతిచ్చే ప్రతినిధులతో చర్చలు జరిగితే మాత్రం ఎలాంటి ఒప్పందం కుదరదని తేల్చిచెప్పారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఇస్లామాబాద్ చర్చలు విఫలమైతే ఇరాన్‌పై అమెరికా–ఇజ్రాయెల్ మళ్లీ దాడులకు దిగుతాయని, ప్రపంచం భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఇరాన్ డిమాండ్లు → హార్మూజ్ జలసంధిపై సంపూర్ణ ఆధిపత్యం మాకే ఉండాలి. అక్కడ నియంత్రణను వదులుకొనే ప్రసక్తే లేదు. → గల్ఫ్ దేశాల నుంచి అమెరికా సైన్యం వెనక్కి వెళ్లిపోవాలి. ఈ ప్రాంతంలో అమెరికా సైనిక స్థావరాలు ఉండడానికి వీల్లేదు. → ఇరాన్‌పై అమెరికాతోపాటు యూరప్ దేశాలు విధించిన ఆంక్షలను ఎత్తివేయాలి. యురేనియం శుద్ధి సహా అణు కార్యక్రమాలపై ఎలాంటి ఆంక్షలు విధించకూడదు. → స్తంభింపజేసిన మా ఆస్తులను విడుదల చేయాలి. అమెరికా డిమాండ్లు → ఇరాన్ అణ్వాయుధాలు కలిగి ఉండడానికి ఎంతమాత్రం వీల్లేదు. → యురేనియం శుద్ధి ప్రక్రియను ఇరాన్ వెంటనే ఆపాలి. ఇప్పటికే శుద్ధి చేసిన యురేనియం నిల్వలను మాకు అప్పగించాలి. → హార్మూజ్ నుంచి స్వేచ్ఛాయుత నౌకాయానానికి వీలు కల్పించాలి. విదేశీ నౌకల రాకపోకలను అడ్డుకోరాదు. చర్చలు విఫలమైతే కఠినంగా ప్రతిస్పందిస్తాం: ట్రంప్ అమెరికా, ఇరాన్ శాంతి చర్చలు షెడ్యూల్ కంటే ఐదు గంటలు ఆలస్యంగా ఆరంభమయ్యాయి. కొన్ని అంశాలపై ఇరుపక్షాలు పట్టు వీడకపోవడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. ఇస్లామాబాద్ చర్చలు ఎలా సాగుతాయో తనకు ఏమాత్రం అవగాహన లేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. చాలా తక్కువ సమయంలోనే ఇరాన్ చిత్తశుద్ధిని అంచనా వేస్తామని చెప్పారు. హార్మూజ్ జలసంధి త్వరలోనే తిరిగి తెరుచుకుంటుందని పునరుద్ఘాటించారు. ప్రత్యామ్నాయ చమురు రవాణా మార్గాలు కూడా అందుబాటులోకి వస్తాయని సంకేతాలిచ్చారు. ఇరాన్‌ను విఫలమవుతున్న దేశంగా అభివరి్ణంచారు. ఒకవేళ శాంతి చర్చలు ఫలించకపోతే తమ వైఖరిని పునఃసమీక్షించుకుంటామని చెప్పారు. అవసరమైతే మరింత కఠినమైన ప్రతిస్పందనకు సిద్ధంగా ఉన్నట్లు హెచ్చరించారు. -
అమెరికా నష్టపరిహారం చెల్లించాల్సిందే.. మీ ఇష్టం మళ్లీ యుద్ధమే!
-
ఇరాన్-అమెరికా శాంతి చర్చల్లో ఆసిమ్ మునీర్ కొత్త పాచిక
ఇస్లామాబాద్: పశ్చిమాసియా యుద్ధంలో కాల్పుల విరమణ ఒప్పందం వేళ కొనసాగుతున్న చర్చల్లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. శాంతి చర్చల కోసం అమెరికా నుంచి పాకిస్థాన్‌కు వచ్చిన ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ హాజరైన సందర్భంలో.. ఇరాన్–అమెరికా మధ్యవర్తిత్వం వహిస్తున్న పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ ధరించిన వేషధారణ ప్రత్యేక చర్చకు దారి తీసింది. అమెరికా-పాక్ శాంతి చర్చల్లో మధ్యవర్తిత్వం వహిస్తున్న ఆసిమ్ మునీర్ వ్యహరశైలి జాతీయ, అంతర్జాతీయ వేదికలపై చర్చాంశనీయంగా మారింది. ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ ఘాలిబాఫ్, విదేశాంగ మంత్రి అబ్బాస్ అరఘ్చీ నేతృత్వంలోని 71 మంది సభ్యుల ఇరాన్ ప్రతినిధి బృందానికి స్వాగతం పలికే సమయంలో మునీర్ యుద్ధ దుస్తులు (కామోఫ్లేజ్ కాంబాట్ డ్రెస్)లో కనిపించారు. అయితే, కొన్ని గంటల తర్వాత నూర్ ఖాన్ వైమానిక స్థావరానికి అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ చేరుకున్నప్పుడు, మునీర్ పూర్తిస్థాయి సూట్ ధరించి హాజరయ్యారుఆశ్చర్యంగా ఆసిమ్ మునీర్ తీరువిదేశీ నాయకులను కలిసేటప్పుడు సైనికాధికారి ఎల్లప్పుడూ యూనిఫాంలో ఉండాలి. కానీ ఆసిమ్ మునీర్ మాత్రం అమెరికన్లతో తాను దౌత్యవేత్తగా.. ఇరాన్‌తో సైనికుడిగా ఉన్నానని చూపిస్తున్నారని, ఆసిమ్ మునీర్ తీరు సరైంది కాదని సీనియర్ ఆర్మీ జనరల్ ప్రవర్తనకు తగనిది’ అని రిటైర్డ్ మేజర్ జనరల్ సంజయ్ మెస్టన్ తెలిపారు. ఇరాన్‌తో సమావేశంలో యుద్ధ దుస్తులు ధరించడం ద్వారా మునీర్ సైనిక శక్తిని ప్రదర్శించాలనే సంకేతం ఇచ్చారని రక్షణ నిపుణులు విశ్లేషించారు. ఇటీవల ఇరాన్–పాకిస్థాన్ సరిహద్దు ఉద్రిక్తతలు, క్షిపణి దాడుల నేపథ్యం ఈ నిర్ణయానికి కారణమని వారు భావిస్తున్నారు. మరోవైపు, అమెరికా ప్రతినిధులతో సమావేశంలో సూట్ ధరించడం ద్వారా తాను కేవలం సైనికాధికారి మాత్రమే కాకుండా దౌత్యవేత్తగానూ ఉన్నానని చూపించుకోవాలనుకున్నారని విశ్లేషకులు పేర్కొన్నారు. ఇది ఆయన రాజకీయ ఆశయాలను ప్రతిబింబిస్తోందని కూడా వ్యాఖ్యానించారు. గతంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో జరిగిన సమావేశాల్లో కూడా మునీర్ సూట్ ధరించడమే గమనార్హం. ట్రంప్ ఆయనను తన ‘ఫేవరెట్ ఫీల్డ్ మార్షల్’ అని పిలిచిన సందర్భాలు ఉన్నాయి.2024లో ఇరాన్ డ్రోన్లు, క్షిపణులతో పాకిస్థాన్ బలూచిస్తాన్ ప్రావిన్స్‌పై దాడి చేసింది. బలూచ్ వేర్పాటువాద సున్నీ మిలిటెంట్ గ్రూప్ జైష్ అల్–అదల్ లక్ష్యంగా చేసుకుంది. ఇదే గ్రూప్ ఇరాన్‌లోని సిస్తాన్ ప్రావిన్స్ స్వతంత్రత కోసం పోరాడుతోంది. కొన్ని రోజుల్లోనే పాకిస్థాన్ కూడా ప్రతిగా ఇరాన్ సిస్తాన్–బలూచిస్తాన్ ప్రాంతంలో బలూచ్ మిలిటెంట్లపై దాడులు చేసింది. ఈ ఉద్రిక్తతలు చివరికి చైనా జోక్యంతో తగ్గాయి. అయినప్పటికీ, ఇరాన్–పాకిస్థాన్ సంబంధాలు అప్పటి నుంచి స్థిరంగా లేవు. అమెరికా వైపు చూస్తే, ఆసిమ్ మునీర్ సూట్ ధరించడం ద్వారా తాను కేవలం సైనిక నాయకుడే కాకుండా దౌత్యవేత్తగా కూడా ఉన్నానని చూపించుకోవాలనుకున్నాడు. ఇది ఆయన రాజకీయ ఆశయాలను స్పష్టంగా తెలియజేస్తోందని రక్షణ నిపుణుడు సందీప్ ఉన్నితన్ వ్యాఖ్యానించారు.అదే సమయంలో మునీర్ తన శక్తి సామర్ధ్యాలేమిటో ప్రపంచానికి, అలాగే పాకిస్థాన్ ప్రజలకు మరో సందేశం ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. సాధారణంగా ఇరాన్ విదేశాంగ మంత్రి లేదా అమెరికా ఉపాధ్యక్షుడి వంటి ఉన్నతాధికారులను స్వాగతించేది పాకిస్థాన్ అధ్యక్షుడు, ప్రధానమంత్రి లేదా విదేశాంగ మంత్రి కావాలి. కానీ ఈసారి మునీర్ ముందుకు రావడం అందుకు ఊతంగా నిలుస్తోంది. జేడీ వాన్స్‌తో రెడ్ కార్పెట్‌పై నడుస్తూ, నవ్వుతూ, మాట్లాడుతున్న మునీర్ దృశ్యాలు కేవలం ప్రొజెక్షన్ కోసం అని నిపుణులు చెబుతున్నారు. ‘పాకిస్థాన్‌లో సైన్యం ఆధిపత్యం వహిస్తుంది. అసిమ్ మునీర్ దాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాడు. అంతర్జాతీయ వ్యవహారాల్లో ఎక్కడైనా ఆయన కనిపిస్తారు. తానే నిర్ణయాలు తీసుకుంటానని స్వయంగా చెప్పకనే చెబుతున్నారని తెలుస్తోంది. రెండు వారాల కాల్పుల విరమణ ఒప్పందం కోసం పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో అమెరికా నుంచి ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, ఇరాన్ నుంచి విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ, పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బాఘర్ ఘాలిబఫ్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం శాంతి చర్చల్లో పాల్గొంది. -
జేడీవాన్స్ విమానానికి స్పెషల్ ఎస్కార్ట్.. వీడియో వైరల్
ప్రస్తుతం ఇరాన్- అమెరికా మధ్య శాంతి చర్చలు ప్రారంభమయ్యాయి. హైలెవల్ డెలిగేషన్ కావడంతో చర్చలు జరిగే ఇస్లామాబాద్ ప్రాంతం మెుత్తం ఆ దేశ ఆర్మీ కంట్రోల్లోకి వెళ్లింది. ఈ నేపథ్యంలో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌కు కీలక భద్రత కలిపించినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.ఇరాన్- అమెరికా మధ్య పాకిస్థాన్‌లో జరిగే చర్చలపై ప్రపంచ వ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. ఈ సమావేశంలో ఏం జరగనుందా అనే అంశం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇస్లామాబాద్‌లో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. చర్చలలో పాల్గొనడానికి వచ్చే ప్రతినిధులకు సైతం పాక్ ప్రత్యేక భద్రత కల్పించింది.అమెరికా ఉపాధ్యక్షుడు జేడీవాన్స్ ప్రయాణించిన యుఎస్ ఎయిర్ ఫోర్స్ బోయింగ్ సీ-32ఏ విమానం పాకిస్థాన్ గగనతలంలోకి ప్రవేశించగానే ఆ దేశానికి చెందన ఎఫ్-16 ఫైటర్ జెట్స్ ఎస్కార్ట్‌గా ప్రత్యేక భద్రత కల్పించాయి. ఏవైనా అనుకోని ఘటనలు జరగకుండా ఉండే ఉద్దేశంతోనే ఈ రకమైన భద్రత కల్పించినట్లు తెలుస్తోంది. మరోవైపు నిన్న ఇరాన్ ప్రతినిధులకు సైతం పాక్ అత్యంత పటిష్టమైన ఎస్కార్ట్ ఏర్పాటు చేసింది.ఇజ్రాయెల్‌తో ప్రమాదం పొంచి ఉన్న నేపథ్యంలో పాకిస్థాన్ ఫైటర్ జెట్లను ఇరాన్ పంపి ఐరన్ ఎస్కార్ట్ ఏర్పాటు చేసింది.కాగా ప్రస్తుతం పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీప్ ఇరాన్ ప్రతినిధుల బృందంతో భేటీ అయ్యారు. వీరితో సమావేశం ముగిసిన అనంతరం అమెరికా ప్రతినిధులతో భేటీ అవనున్నట్లు సమాచారం. రెండు దేశాలతో పరోక్ష చర్చలు ముగిసిన అనంతరం ప్రధాన చర్చలు ప్రారంభం అవనున్నట్లు తెలుస్తోంది.🇺🇸🇮🇷🇵🇰 Footage of Pakistani fighter jets escorting JD Vance to Islamabad.Iran sent 3 planes when their negotiating team flew in, 2 of which were decoys, in case Netanyahu got any ideas about trying to assassinate them.pic.twitter.com/Sr9oJFLgff https://t.co/bsB5dbcuMU— Mario Nawfal (@MarioNawfal) April 11, 2026 -
పాక్ ప్రధాని ముందు ఇరాన్ డిమాండ్లకు ఒప్పుకున్న US
-
పాక్‌లో చర్చలు.. ప్రధానంగా అడ్డొచ్చే అంశాలివే..
టెహ్రాన్: చర్చల కోసం అమెరికా, ఇరాన్ ప్రతినిధులు పాకిస్థాన్ చేరుకున్నారు. పాకిస్థాన్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్‌ను అమెరికా-ఇరాన్ ప్రతినిధులు మొదట విడివిడిగా కలుస్తున్నారు. ఇరాన్ ప్రతినిధులతో షెహబాజ్ షరీఫ్ సమావేశం ముగిసింది. ఆ తర్వాత షెహబాజ్ షరీఫ్‌ను అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కలిశారు. జేడీ వాన్స్‌తో ప్రత్యేక ప్రతినిధులు స్టీవ్ విట్కాఫ్, జారెడ్ కుష్నర్ కూడా ఉన్నారు. ఈ చర్చలు పశ్చిమాసియాలో దీర్ఘకాల శాంతికి దారి తీస్తాయని షరీఫ్ ఆశాభావం వ్యక్తం చేశారని పాకిస్థాన్ ప్రధాన మంత్రి కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది.పాక్‌లో చర్చలు ఎంతకాలం కొనసాగుతాయి?చర్చలు ఎంతకాలం కొనసాగుతాయన్న విషయంపై స్పష్టత లేదు. ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్‌తో అనుబంధం ఉన్న తస్నీమ్ న్యూస్ ఏజెన్సీ తెలిపిన వివరాల ప్రకారం.. చర్చలు ఒక రోజు మాత్రమే జరగనున్నాయి. శనివారం సాయంత్రం వరకే జరిగే అవకాశం ఉంది.ప్రధానంగా అడ్డొస్తున్న అంశాలివే..అమెరికా-ఇరాన్ మధ్య చర్చల్లో ప్రధానంగా మూడు అంశాలు ఇబ్బంది పెట్టే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. ఇరాన్ సేకరించిన యురేనియం, హార్మూజ్ జలసంధి, లెబనాన్ వంటి అంశాలు అడ్డంకిగా ఉన్నాయి. హార్మూజ్ జలసంధిపై పట్టును నిలపుకోవాలని ఇరాన్ భావిస్తోంది. లెబనాన్‌లో కొనసాగుతున్న దాడులు ఆపాల్సిందేనని మొదటి నుంచి చెబుతోంది. ఇక యురేనియం నిల్వలపై ఇరాన్ వెనక్కి తగ్గుతుందా? అన్న ప్రశ్నలు ఉన్నాయి. చర్చల్లో ఎవరెవరు పాల్గొన్నారు? అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఇవాళ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అల్లుడు, ప్రత్యేక సలహాదారు జారెడ్ కుష్నర్, శాంతి చర్చల ప్రత్యేక ప్రతినిధి స్టీవ్ విట్కాఫ్తో కలిసి పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్‌కు చేరుకున్నారు. ఇదే సమయంలో, ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మహమ్మద్ బాఘర్ ఘాలిబాఫ్, విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ చర్చల కోసం పాక్ చేరుకున్నారు.పాకిస్థాన్ పాత్ర ఏంటి?రెండు పక్షాలను పాకిస్థాన్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్, సైన్యాధిపతి ఆసిమ్ మునీర్ స్వాగతించారు. యుద్ధం వేళ కాల్పుల విరమణకు పాక్ కీలకంగా వ్యవహరించిందని ప్రచారం జరుగుతోంది. రెండు వారాల కాల్పుల విరమణ ఒప్పందం కుదరడంలో పాక్ భాగస్వామ్యం కూడా ఉందని తెలుస్తోంది. ఇప్పుడు మొదట ఇరు పక్షాల డిమాండ్లను షెహబాజ్ షరీఫ్ వింటున్నారు. ఆ తర్వాత ఆయన సమక్షంలో అమెరికా-ఇరాన్ ప్రతినిధులు చర్చించుకుంటారు. -
ఇరాన్‌తో శాంతి చర్చల వేళ అమెరికాకు ఎదురు దెబ్బ?
అంతర్జాతీయ రాజకీయ యవనికపై ఇప్పుడు ఒకే ఒక ప్రశ్న తలెత్తుతోంది... అగ్రరాజ్యం అమెరికా ప్రకటించిన ఈ యుద్ధ విరమణ నిజంగా శాంతి కోసమా? లేక తన దౌత్య వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి వేసుకున్న ముందస్తు వ్యూహమా? అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌తో చర్చలకు సిద్ధమైన తీరు పట్ల ప్రపంచవ్యాప్తంగా మిశ్రమ స్పందనలు వ్యక్తమవుతున్నాయి. ఒకవైపు అమెరికాలోని మేధావి వర్గం ఈ చర్చల ద్వారా ఏదో ఒక అద్భుతం జరుగుతుందని ఆశిస్తుంటే, మరోవైపు క్షేత్రస్థాయి పరిస్థితులు మాత్రం భిన్నమైన సంకేతాలను ఇస్తున్నాయి. యుద్ధం అనేది కేవలం క్షిపణుల మోతతో ముగిసిపోయేది కాదు, అది సృష్టించిన ఆర్థిక, రాజకీయ ప్రకంపనలు దశాబ్దాల పాటు ప్రపంచాన్ని వెంటాడుతూనే ఉంటాయి.ఈ క్లిష్ట సమయంలో అమెరికా మాజీ అధ్యక్షుడు డ్వైట్ డి. ఐసెన్‌హోవర్ చెప్పిన మాటలు గుర్తుకొస్తాయి: "ప్రజలు శాంతిని ఎంతగా కోరుకుంటారంటే, ఏదో ఒక రోజు ప్రభుత్వాలు పక్కకు తప్పుకొని వారికి ఆ శాంతిని అందజేయక తప్పదు” అని. కానీ నేటి పరిస్థితి చూస్తుంటే, ప్రభుత్వాలు శాంతిని ఒక రాజకీయ ఆయుధంగా వాడుకుంటున్నాయే తప్ప, నిబద్ధతతో పనిచేయడం లేదనిపిస్తోంది. ముఖ్యంగా హార్ముజ్ జలసంధి వ్యవహారం ఇప్పుడు చర్చల్లో ప్రధాన అడ్డంకిగా మారనుంది. ప్రపంచ ఇంధన సరఫరాకు గుండెకాయ వంటి ఈ మార్గంపై ఇరాన్ పట్టు సాధించడం అమెరికా దౌత్య నీతికి తగిలిన అతిపెద్ద దెబ్బ. ఇరాన్ ఇక్కడ టోల్ వసూలు చేయాలని చూడటం లేదా నౌకాయానాన్ని నియంత్రించాలని ప్రయత్నించడం అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధమని భావించినా, ఆచరణలో వారిని ఆపే శక్తి ఎవరికి ఉందన్నదే అసలు ప్రశ్న. గతాన్ని పరిశీలిస్తే, జాన్ ఎఫ్. కెన్నెడీ క్యూబన్ మిస్సైల్ సంక్షోభం సమయంలో ప్రదర్శించిన సంయమనం, వ్యూహాత్మక ఓర్పు నేటి నాయకత్వంలో లోపించినట్లు కనిపిస్తోంది.మరోవైపు, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు వైఖరి ఈ చర్చల భవితవ్యాన్ని మరింత క్లిష్టతరం చేస్తోంది. లెబనాన్‌పై దాడులను ఆపే ఉద్దేశం ఇజ్రాయెల్‌కు లేదని స్పష్టమవుతున్న తరుణంలో, అమెరికా చేసే చర్చలు ఎంతవరకు ఫలప్రదమవుతాయి? ఒకవైపు తన మిత్రదేశమైన ఇజ్రాయెల్ ప్రయోజనాలను కాపాడుకుంటూనే, మరోవైపు ఇరాన్‌తో ఒప్పందం కుదుర్చుకోవడం ట్రంప్‌కు కత్తిమీద సాము లాంటిదే. రిచర్డ్ నిక్సన్ చైనా వైపు అడుగులు వేసినప్పుడు ప్రదర్శించిన రియల్‌పాలిటిక్ వ్యూహాన్ని ట్రంప్ ఇప్పుడు అమలు చేయగలరా? లేక కేవలం తన ఇమేజ్ను కాపాడుకోవడానికే ఈ ప్రయత్నం చేస్తున్నారా? ఈ యుద్ధం వల్ల కేవలం ఇరాన్ మాత్రమే దెబ్బతిందని అనుకుంటే పొరపాటే. అమెరికా తన ఖజానా నుండి దాదాపు ఒక ట్రిలియన్ డాలర్లను ఈ యుద్ధం కోసం తగలేసింది. ఈ భారీ సొమ్మును అమెరికా ప్రజల సంక్షేమం కోసం, విద్య, వైద్య రంగాల కోసం ఖర్చు చేసి ఉంటే అగ్రరాజ్యం మరింత శక్తివంతంగా తయారయ్యేది.అణు ఒప్పందం విషయంలో కూడా అమెరికా ఇప్పుడు రక్షణ స్థితిలో పడిపోయింది. బరాక్ ఒబామా హయాంలో కుదిరిన జేసీపోఏ ఒప్పందాన్ని రద్దు చేయడం వల్ల కలిగిన నష్టం ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తోంది. అప్పట్లో ఇరాన్‌ను ఒక క్రమపద్ధతిలో నియంత్రించే అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు ఇరాన్ అణు సామర్థ్యాన్ని గణనీయంగా పెంచుకుంది. ఇప్పుడు వారిని నియంత్రించడం అంటే వారికి కొన్ని భారీ మినహాయింపులు ఇవ్వక తప్పని పరిస్థితి. నమ్మకం అనేది అంతర్జాతీయ సంబంధాల్లో పునాది వంటిది, కానీ ఈ యుద్ధం వల్ల అమెరికా తన విశ్వసనీయతను పూర్తిగా కోల్పోయింది. చర్చల మధ్యలో దాడులు చేయడం వల్ల ఇరాన్ ఇప్పుడు అమెరికాను తీవ్రమైన అనుమానంతోనే చూస్తోంది.చివరగా చెప్పాలంటే, ఈ వారాంతపు చర్చలు కేవలం ఒక రాజకీయ ప్రహసనం కాకూడదు. యుద్ధం వల్ల పెరిగిన చమురు ధరలు, ఎరువుల కొరత వల్ల ఆఫ్రికా వంటి దేశాల్లో పేదరికం, ఆకలి చావులు పెరుగుతున్నాయి. అబ్రహం లింకన్ అన్నట్లుగా, "మన శత్రువును మిత్రుడిగా మార్చుకున్నప్పుడు, ఆ శత్రువును నాశనం చేసినట్లే అవుతుంది” అని. ట్రంప్ ఈ సూత్రాన్ని పాటిస్తారా లేక పాత కక్షలతోనే ముందుకు సాగుతారా? చర్చల పేరుతో కాలయాపన చేయడం వల్ల మధ్యప్రాచ్యంలో మంటలు మరింత చెలరేగే ప్రమాదం ఉంది. కేవలం ఆధిపత్య పోరు పక్కన పెట్టి, మానవతా దృక్పథంతో అడుగులు వేసినప్పుడే ఈ చర్చలకు ఒక అర్థం పరమార్థం ఉంటుంది.::: కంచర్ల యాదగిరిరెడ్డి, మేనేజింగ్ ఎడిటర్, సాక్షి టీవీ -
ఇరాన్ విమానంలో రక్తంతో తడిసిన బ్యాగులు, బూట్లు..
ఇస్లామాబాద్: చర్చలకు పాకిస్తాన్ వచ్చిన ఇరాన్ విమానంలో ఉద్విగ్న వాతావరణం నెలకొంది. రక్తసిక్తమైన స్కూల్ బ్యాగులు, బూట్లు, మృతి చెందిన చిన్నారుల ఫొటోలను తమ వెంట తీసుకువచ్చారు. మినాబ్ స్కూల్ మృతుల కోసం ఒక్కో సీటు కేటాయించారు. అమెరికా-ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలకు ముగింపు పలికే దిశగా పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్ వేదికగా శాంతి చర్చలు ఇవాళ ప్రారంభం కాగా.. ఈ చర్చలకు హాజరైన ఇరాన్ ప్రతినిధి బృందం రక్తసిక్తమైన స్కూల్ బ్యాగులు, బూట్లు, మృతి చెందిన చిన్నారుల ఫొటోలను తమ వెంట తీసుకురావడం ప్రపంచవ్యాప్తంగా సంచలనం కలిగిస్తోంది.మధ్యప్రాచ్యంలో జరుగుతున్న యుద్ధం వల్ల సంభవిస్తున్న మానవ ప్రాణ నష్టానికి ఇవి నిదర్శనంగా నిలిచాయి. సోషల్ మీడియాలో ఒక ఫోటోను పంచుకుంటూ, ఘలీబాఫ్ ఇలా రాశారు: "ఈ విమాన ప్రయాణంలో నా సహచరులు వీరే.. #Minab168" అంటూ ట్వీట్ చేశారు. యుద్ధానికి ముగింపు పలకాలని ఆశిస్తూ, అమెరికాతో చర్చల కోసం ఇస్లామాబాద్ వెళ్తున్న ఈ ప్రతినిధి బృందానికి 'మినాబ్ 168' అని పేరు పెట్టారు. యుద్ధం ప్రారంభమైన మొదటి రోజున అమెరికా-ఇజ్రాయెల్ దాడుల్లో మరణించిన పాఠశాల విద్యార్థుల జ్ఞాపకార్థం ఈ పేరును నిర్ణయించారు. దక్షిణాఫ్రికాలోని ఇరాన్ రాయబార కార్యాలయం కూడా ఈ ఫోటోను రీ-షేర్ చేస్తూ.. "మినాబ్ చిన్నారులను మేము ఎప్పటికీ మర్చిపోము" అని రాసింది.همراهان من در این پرواز#Minab168 pic.twitter.com/xvXmDlSDiF— محمدباقر قالیباف | MB Ghalibaf (@mb_ghalibaf) April 10, 2026మినాబ్‌లో ఏం జరిగింది?ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో 160 మందికి పైగా చిన్నారులు మరణించారు. ఫిబ్రవరి 28న యుద్ధం మొదలైన రోజున దక్షిణ ఇరాన్‌లోని మినాబ్ పట్టణంలో ఉన్న 'షజరే తయ్యిబే' అనే బాలికల ప్రాథమిక పాఠశాలపై ఈ దాడి జరిగింది. ఈ దాడి జరిగిన కొద్ది రోజుల తర్వాత, ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరాగ్చీ ఒక వైమానిక చిత్రాన్ని షేర్ చేశారు. అందులో "అమాయక" బాలికల మృతదేహాలను పూడ్చిపెట్టడానికి సామూహిక సమాధులను తవ్వుతున్న దృశ్యాలు ఉన్నాయి. అదే పోస్ట్‌లో అరాగ్చీ, ట్రంప్‌పై విమర్శలు చేస్తూ దీనిని 'కోల్డ్ బ్లడెడ్ మర్డర్'(క్రూరమైన హత్య) గా అభివర్ణించారు. -
పాక్‌లో చర్చలు షురూ.. ఎంతకాలం కొనసాగుతాయి?
అమెరికా ఇరాన్ శాంతి చర్చలపై ఉత్కంఠ వీడింది. గత అర్ధరాత్రి దాటాక ఇరాన్ ప్రతినిధులు ఇస్లామాబాద్‌కు చేరుకున్నారు. అంతకంటే ముందే అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ అక్కడికి చేరారు. పాకిస్తాన్ మధ్యవర్తిత్వంతో ఈ చర్చలు జరుగుతున్న సంగతి తెలిసిందే. -
చర్చలపై ప్రతిష్టంభన!
ఇస్లామాబాద్: పశ్చిమాసియాలో యుద్ధాన్ని ముగించి, శాంతిని సాధించడమే ధ్యేయంగా శనివారం పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో జరగాల్సిన చర్చలపై ప్రతిష్టంభన నెలకొంది. చర్చల విషయంలో ఇరాన్ ప్రభుత్వంలో అంతర్గతంగా విభేదాలు తలెత్తినట్లు సమాచారం. ఇరాన్ ప్రతినిధులు రెండు వర్గాలుగా విడిపోయారు. తమ వాదన నుంచి వెనక్కి తగ్గడం లేదు. శాంతి చర్చలకు తప్పనిసరిగా హాజరు కావాలని ఒకవర్గం పట్టుబడుతుండగా, మరో వర్గం అందుకు ససేమిరా ఒప్పుకోవడం లేదు. లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులు ఆపితేనే చర్చలంటూ మెలిక పెడుతోంది. మొత్తానికి శాంతి చర్చలకు ఇరాన్ హాజరవుతుందా? లేదా? అనేది అనుమానంగానే మారింది. శుక్రవారం రాత్రి వరకూ ఎటూ తేల్చుకోకపోవడం గమనార్హం. మరోవైపు చర్చలకు అమెరికా సిద్ధమవుతోంది. ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ శుక్రవారం ఇస్లామాబాద్‌కు బయలుదేరారు. చర్చలు సానుకూలంగా, ఫలప్రదంగా జరుగుతాయని ఆశిస్తున్నట్లు ఆయన చెప్పారు. శాంతి చర్చల పట్ల ఇరానియన్లకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే స్నేహహస్తం అందిస్తామని తెలిపారు. ఒకవేళ వారు తమతో ఆడుకోవాలని చూస్తే తదుపరి పరిణామాలు మరోలా ఉంటాయని తమ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించినట్లు పేర్కొన్నారు. చర్చల విషయంలో ట్రంప్ కొన్ని స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేశారని వాన్స్ వెల్లడించారు. రెండు అంశాలు పరిష్కారమైతేనే... ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న శాంతి చర్చల నేపథ్యంలో ఇస్లామాబాద్‌లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. నగరంలో రెడ్ అలర్ట్ ప్రకటించారు. 10 వేల మందికిపైగా భద్రతా సిబ్బంది మోహరించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా బహుళ అంచెల రక్షణ వ్యవస్థలు ఏర్పాటు చేశారు. ఈ చర్చలను పాక్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది. అయితే, ఇరాన్ ప్రతినిధి బృందం రాకపై అధికారిక ప్రకటన ఏదీ వెలువడలేదు. లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులు ఆగకపోతే ఇస్లామాబాద్ చర్చల నుంచి పూర్తిగా వైదొలుగుతామని టెహ్రాన్ హెచ్చరించినట్లు ఇరాన్ అధికారిక తస్నిమ్ వార్తా సంస్థ వెల్లడించింది. పరస్పరం అంగీకరించిన రెండు అంశాలు ఇప్పటికీ అమలు కాలేదని ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బాఘెర్ ఘలిబాఫ్ శుక్రవారం విమర్శించారు. లెబనాన్‌లో కాల్పుల విరమణ పాటించడం లేదని, ఇరాన్‌కు సంబంధించిన కొన్ని ఆస్తులను ఇప్పటికీ విడుదల చేయలేదని తప్పుపట్టారు. శాంతి చర్చలు ప్రారంభం కావాలంటే ఈ రెండు అంశాలు అమల్లోకి రావాల్సిందేనని తేల్చిచెప్పారు. ఈ మేరకు శుక్రవారం ‘ఎక్స్’లో పోస్టుచేశారు. ఇరాన్ నుంచి పది మందితో కూడిన ప్రతినిధి బృందం చర్చలకు రాబోతోందని పాకిస్తాన్‌లోని ఇరాన్ రాయబారి రెజా అమీర్ మొఘదామ్ గురువారం నిర్ధారించారు. కానీ, వాస్తవ పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉండడం గమనార్హం. అయితే, ఇరాన్ ప్రతినిధి బృందం రాకను ఉద్దేశపూర్వకంగానే రహస్యంగా ఉంచారని, వారి కోసం పాక్ ప్రభుత్వం ప్రత్యేకంగా సెక్యూరిటీ కారిడార్‌ను ఏర్పాటు చేసిందని సోషల్ మీడియాలో ప్రచారం సాగుతోంది. దాడులు జరుగుతుండగానే చర్చలా? లెబనాన్‌పై ఇజ్రాయెల్ వైమానిక దాడులు కొనసాగించడం ప్రాథమిక కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించడమే అవుతుందని ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ స్పష్టంచేశారు. ఒకవైపు దాడులు కొనసాగుతుండగానే మరోవైపు చర్చలు జరపడం అర్థంపర్థం లేని పని అంటూ తేల్చేశారు. ఇదిలా ఉండగా, ఇస్లామాబాద్‌లో చర్చలకు ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయి. ఇరుపక్షాలను స్వాగతించడానికి పాక్ సర్కార్ సిద్ధమయ్యింది. చర్చల కోసం వచ్చే ప్రతినిధులకు, విలేకరులకు ‘వీసా ఆన్ అరైవల్’కింద వీసాలు ఇవ్వనున్నట్లు పాక్ ఉప ప్రధానమంత్రి ఇషాఖ్ దార్ శుక్రవారం తెలిపారు. పాక్ మంత్రికి మునీర్ మందలింపు మానవాళికి శాపం ఇజ్రాయెల్, అదొక దయ్యం, క్యాన్సర్ అంటూ దూషించిన పాక్ రక్షణ శాఖ మంత్రి ఖవాజా అసిఫ్‌ను ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ తీవ్రంగా మందలించారు. ఆయనపై పెద్ద ఎత్తున కేకలు వేసినట్లు తెలిసింది. బాధ్యత లేకుండా వ్యవహరించడం ఏమిటని మండిపడినట్లు సమాచారం. ఇజ్రాయె ల్ను దూషిస్తూ సోషల్ మీడియాలో చేసిన పోస్టును ఖవాజా అసిఫ్ తర్వాత తొలగించారు. -
మాతో గేమ్స్ ఆడొద్దు.. ఇరాన్‌కు జేడీవాన్స్ హెచ్చరిక
అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఇరాన్‌కు భారీ హెచ్చరిక చేశారు. చర్చల పేరుతో అమెరికాతో ఆటలాడవద్దన్నారు. తమకు యుద్ధాన్ని ముగించే లక్ష్యం ఉందని దాన్నిసాకుగా చూపి అమెరికాను తక్కువ అంచనా వేయద్దన్నారు. ఇస్లామాబాద్ చర్చలకు బయిలుదేరే ముందు జేడీవాన్స్ ఈ వ్యాఖ్యలు చేశారు.ప్రస్తుతం పశ్చిమాసియా యుద్ధంలో అత్యంత కీలక పరిణామం చోటు చేసుకోబోతుంది. 40 రోజుల పాటు మారణ హోమం సృష్టించిన యుద్ధానికి సంబంధించిన చర్చలు ఇస్లామాబాద్‌లో జరుగబోతున్నాయి. ఈ నేపథ్యంలో చర్చల నిమిత్తం జేడీవాన్స్ పాకిస్థాన్ బయిలు దేరారు. ఈ సందర్భంగా పలు కీలక వ్యాఖ్యలు చేశారు. జేడీవాన్స్ మాట్లాడుతూ "చర్చలు సానుకూలంగా జరుగుతాయని ఆశిస్తున్నాం, ఏం జరుగుతుందో వేచి చూడాలి. ఇరాన్ చిత్తశుద్ధితో చర్చలకు వస్తే తాము యుద్ధాన్ని ముగించడానికి సహకరిస్తాం. కానీ తమను బురిడీ కొట్టించాలని చూస్తే మాత్రం కఠినంగా ఉంటాం" అని అన్నారు. అమెరికాను ఎట్టి పరిస్థితుల్లో తక్కువ అంచనా వేయెుద్దని హెచ్చరించారు.కాగా వ్యక్తిగతంగా కూడా జేడీ వాన్స్‌కు ఈ చర్చలు ఒక అగ్నిపరీక్ష వంటివి 2028 అధ్యక్ష ఎన్నికల్లో వాన్స్ పోటీ చేసే అవకాశం ఉన్నందున, ఈ చర్చల ఫలితం ఆయన రాజకీయ భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపనుంది. ఒకవేళ చర్చలు సఫలమైతే అది ఆయనకు పెద్ద ప్లస్ అవుతుందని, విఫలమైతే విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.కాగా ప్రస్తుతం అమల్లో ఉన్న తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం ప్రమాదంలో పడింది. లెబనాన్‌లో ఇజ్రాయెల్ దాడులను ఆపాలని ఇరాన్ కోరుతుండగా ఆ దాడులకు ఈ ఒప్పందానికి సంబంధం లేదని ట్రంప్ మరియు నెతన్యాహు వాదిస్తున్నారు. మరోవైపు, ఇరాన్ మూసివేసిన హర్ముాజ్ జలసంధిని వెంటనే తెరవాలని అమెరికా డిమాండ్ చేస్తోంది. దీనిపై ట్రంప్ సోషల్ మీడియాలో స్పందిస్తూ, ఆయిల్ ట్యాంకర్లను అనుమతించకపోవడం ఒప్పంద ఉల్లంఘనే అని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో చర్చలలో ఏం జరగనుందా అనే టెన్షన్ సర్వత్రా నెలకొంది. -
ఆకాశంలో హైఅలర్ట్.. ఐరన్ ఎస్కార్ట్‌తో ఇరాన్ ప్రతినిధులు
ప్రస్తుతం ప్రపంచం దృష్టంతా ఇస్లామాబాద్‌పైనే ఉంది. అమెరికా- ఇరాన్ మధ్య చర్చలకు ఆ దేశం అతిథ్యం ఇస్తుండడంతో ఇప్పుడు ఆ ప్రాంతం హై సెన్సిటివ్ జోన్‌గా మారింది. ఈ నేపథ్యంలో పాక్ సైతం ఆ భేటీని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇరాన్ ప్రతినిధులకు ఎటువంటి ప్రమాదం జరగకుండా ఆధునాతన యుద్ధ విమానాలతో "ఐరన్ ఎస్కార్ట్" ఏర్పాటు చేస్తోంది.మధ్యప్రాచ్యంలో గత నలబై రోజులుగా జరిగిన మహా విధ్వంసానికి తాత్కాలిక బ్రేక్ పడింది. రేపు (శనివారం) అమెరికా ప్రతినిధుల బృందానికి ఆ దేశ ఉపాధ్యక్షుడు జేడీవాన్స్ నాయకత్వం వహిస్తుండగా ఇరాన్ తరపున పాల్గొనే వివరాలు మాత్రం ఇంకా ప్రకటించలేదు. అయితే ఇరాన్ ప్రతినిధుల బృంధం కోసం ఇదివరకే పాక్ ఆ దేశానికి అత్యాధునిక భద్రతా విమానాలను పంపినట్లు తెలుస్తోంది.అమెరికాతో చర్చలకు వస్తున్న ఇరాన్ ప్రతినిధులకు ఎటువంటి ప్రమాదం తలెత్తకుండా పాకిస్థాన్ వైమానిక దళానికి చెందిన JF-17 థండర్, F-16 యుద్ధ విమానాలు, IL-78 రీఫ్యూయలింగ్ ట్యాంకర్లు, C-130 రవాణా విమానాలతో పాటు పలు నిఘా విమానాలు గగనతలంలో పహారా కాస్తున్నట్లు కథనాలు పేర్కొన్నాయి. ఈ ఎస్కార్ట్‌ను నిపుణులు "ఐరన్ ఎస్కార్ట్" గా పిలుస్తారు. ఒకవేళ ఈ చర్చలు విజయవంతంగా పూర్తయితే 1979 ఇస్లామిక్ విప్లవం తర్వాత అమెరికా-ఇరాన్ మధ్య జరుగుతున్న అత్యున్నత స్థాయి ముఖాముఖి సమావేశం ఇదే అవుతుంది.ఇరాన్ తరపున పార్లమెంట్ స్పీకర్ మహమ్మద్ గాలిబాఫ్ మరియు విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ పాల్గొనే అవకాశం ఉన్నట్లు సమాచారం.అయితే ఇదివరకే చర్చలు జరిగే ఇస్లామాబాద్ ప్రదేశం ఆ దేశ మిలటరీ ఆదీనంలోకి వెళ్లింది. హైలెవల్ డెలిగేషన్ నేపథ్యంలో కొన్ని ప్రాంతాలను లాక్డౌన్ చేయడమే కాకుండా గగనతలంలో వైమానిక రక్షణ వ్యవస్థలను యాక్టివేట్ చేసింది. అయితే చర్చల నేపథ్యంలో ఇజ్రాయెల్ తీరు ఆందోళన కలుగజేస్తోంది. సీజ్ఫైర్ ఒప్పందంలో లెబనాన్‌పై దాడుల నిలిపివేత కూడా ఉందని పాకిస్థాన్, ఇరాన్ భావిస్తుండగా.. అమెరికా, ఇజ్రాయెల్ దీనిని తిరస్కరించాయి. ఈ నేపథ్యంలో ఉత్కంఠ నెలకొంది. -
చారిత్రక ద్వైపాక్షిక సిరీస్‌ను ప్రకటించిన పాకిస్తాన్
పాకిస్తాన్ క్రికెట్ చరిత్రలో తొలిసారిగా మహిళల ద్వైపాక్షిక సిరీస్ జరగనుంది. జింబాబ్వే మహిళల జట్టు 3 మ్యాచ్‌ల వన్డే, టీ20 సిరీస్‌ల కోసం పాకిస్తాన్లో పర్యటించనుంది. ఈ సిరీస్ మహిళల క్రికెట్ అభివృద్ధిలో కీలక ఘట్టంగా నిలవనుంది. ఈ సిరీస్‌లు మే 3 నుంచి 15 మధ్య తేదీల్లో జరుగనున్నాయి. వన్డే సిరీస్ ఐసీసీ మహిళల ఛాంపియన్షిప్ 2025-29లో భాగంగా జరుగనుండగా.. టీ20 సిరీస్ సాధారణంగా సిరీస్‌గా పరిగణించబడుతుంది. అన్ని (వన్డే, టీ20) మ్యాచ్‌లు కరాచీ నేషనల్ బ్యాంక్ స్టేడియంలో జరగనున్నాయి.షెడ్యూల్.. - మే 3 – తొలి వన్డే - మే 6 – రెండో వన్డే - మే 9 – మూడో వన్డే - మే 12 – తొలి టీ20 - మే 14 – రెండో టీ20 - మే 15 – మూడో టీ20 జింబాబ్వే తొలిసారి ఐసీసీ మహిళల ఛాంపియన్‌షిప్‌లో పాల్గొంటోంది. ఈ సిరీస్ మహిళల ఛాంపియన్‌షిప్‌లో భాగం కావడంతో 2029 వరల్డ్‌కప్ అర్హతపై ప్రభావం చూపుతుంది. మహిళల ఛాంపియన్షిప్ పాయింట్ల పట్టికలో పాకిస్తాన్ 8, జింబాబ్వే 11వ స్థానంలో ఉన్నాయి.పాకిస్తాన్ ఇటీవల దక్షిణాఫ్రికా చేతిలో సిరీస్ కోల్పోయి ఎనిమిదో స్థానానికి పడిపోయింది. జింబాబ్వే ఇటీవల న్యూజిలాండ్ చేతిలో అన్ని మ్యాచ్‌ల్లో ఓటమిపాలై, అట్టడుగు స్థానాన్ని ఆక్రమించుకుంది. ఇరు జట్లు ఈ సిరీస్‌లో పాయింట్లు సాధించి, ర్యాంకింగ్స్ మెరుగుపరచుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. జింబాబ్వే పరిమిత ఓవర్ల సిరీస్‌ల అనంతరం పాకిస్తాన్ ఐర్లాండ్ టీ20 ట్రై సిరీస్‌లో పాల్గొంటుంది. ఈ టోర్నీలో పాక్, ఐర్లాండ్‌తో పాటు వెస్టిండీస్ భాగం కానుంది. ఈ టోర్నీ మే 28 నుంచి ప్రారంభమవుతుంది.ఇదిలా ఉంటే, ప్రస్తుతం ఐసీసీ మహిళల ఛాంపియన్షిప్ 2025-29 పాయింట్ల పట్టికలో న్యూజిలాండ్ అగ్రస్థానంలో కొనసాగుతుంది. ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, భారత్ జట్లు టాప్-5లో ఉన్నాయి. శ్రీలంక, బంగ్లాదేశ్, పాకిస్తాన్, వెస్టిండీస్, ఐర్లాండ్, జింబాబ్వే ఆతర్వాతి స్థానాల్లో ఉన్నాయి. -
భారత్‌లో బ్యాన్ చేస్తే మళ్లీ వైరల్ అవుతున్న ఫోటోలు
గత ఏడాదిలో జరిగిన పుల్వామా దాడి తర్వాత పాకిస్తానీ నటీమణులు హానియా అమీర్, మహిరా ఖాన్ తదితరుల ఇన్స్టాగ్రామ్ ఖాతాలను భారతదేశంలో నిషేధించారు. దీంతో వారి అకౌంట్లు ఇక్కడ కనిపించవు. అయితే, సడెన్‌గా వారి ఇన్‌స్టాలోని పోస్టులతో పాటు ఫోటోలు ప్రత్యక్షమయ్యాయి. దీనిపై నెట్టింట తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. అయితే, కొంత సమయం తర్వాత ఆ ఖాతాలు అందుబాటులో లేవు. అవి మళ్ళీ చూపించలేదని గుర్తించారు.పాక్ సెలబ్రిటీల సోషల్‌మీడియా ఖాతాలు మళ్లీ భారతదేశంలో కనిపించడంతో నిషేధాన్ని ఎత్తివేశారా..? అనే అంశంపై నెటిజన్లు గందరగోళానికి గురయ్యారు. ఇది సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. అయితే, కొంత సమయం తర్వాత ఆ ఖాతాలు మళ్లీ కనిపించకపోవడంతో, ఇది సాంకేతిక లోపం కావచ్చునని కూడా చాలామంది పోస్ట్ చేశారు.పుల్వామా ఉగ్రదాడి తర్వాత భారత్-పాక్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు ఏర్పడ్డాయి. పాకిస్థాన్ కేంద్రంగా కొనసాగుతున్న పలు యూట్యూబ్ ఛానళ్ల ప్రసారాలు భారత్‌లో నిలిపివేస్తూ కేంద్రం గతంలోనే నిర్ణయం తీసుకుంది. ఆ దేశ రక్షణ మంత్రి ఖాతాతో పాటు స్టార్ క్రికెటర్స్ సోషల్‌మీడియా ఖాతాలను కూడా బ్యాన్ చేశారు. -
US-Iran: పాక్ ప్రధానిపై ప్రశంసలు.. ఓవరాక్షన్ అవసరమా?
పాకిస్తాన్ స్టార్ క్రికెటర్ షాహిన్ ఆఫ్రిదిపై విమర్శల వర్షం కురుస్తోంది. ఆటపై దృష్టి పెట్టకుండా.. ఇతర అంశాల్లో దూరడం ఎందుకంటూ సొంత జట్టు అభిమానులే మండిపడుతున్నారు. ఈ సందర్భంగా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) తీరును కూడా ఎండగడుతున్నారు. పాక్ మరో ఆటగాడు నసీం షా విషయంలో వ్యవహరించినట్లే షాహిన్ విషయంలోనూ కఠిన చర్యలు తీసుకుంటారా అని ప్రశ్నిస్తున్నారు.పాక్ చేసిన పని వల్ల గందరగోళంఅసలేం జరిగిందంటే.. ఇరాన్- ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం వల్ల పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు నెలకొన్న విషయం విదితమే. ఇప్పటికే పరస్పర దాడుల వల్ల మూడు దేశాలు ఆర్థికంగా పెద్ద ఎత్తున నష్టపోతున్నాయి. ఇరాన్ అగ్ర నాయత్వాన్ని దాదాపుగా మట్టుబెట్టామని అమెరికా చెబుతోంది.అయితే, ఈ యుద్ధ ప్రభావం ప్రపంచ దేశాలపై పడింది. ముఖ్యంగా హర్మూజ్ జలసంధిని ఇరాన్ మూసివేయడం వల్ల చమురు సంక్షోభం తలెత్తింది. ఇలాంటి తరుణంలో కాల్పుల విరమణ ఒప్పందానికి తాము మధ్యవర్తిత్వం వహిస్తున్నామని పాకిస్తాన్ తెరమీదకు వచ్చింది.కానీ ఇక్కడా పాక్ చేసిన పని వల్ల గందరగోళం నెలకొంది. తమ భూభాగంతోపాట లెబనాన్ మీదా దాడులను ఆపేయాలని ఇరాన్ స్పష్టంగా ప్రతిపాదనలను పంపితే వాటిలోంచి పాకిస్తాన్ ‘లెబనాన్’అనే పేరును తొలగించి.. అమెరికా, ఇజ్రాయెల్‌లకు చేరవేసిందని ఆరోపణలు వస్తున్నాయి.విమర్శల వర్షంలెబనాన్పై అమెరికా దాడులు కొనసాగుతున్న నేపథ్యంలో మధ్యవర్తిగా పాక్ చేసిన తప్పిదమే ఇందుకు కారణమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో.. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ పాక్ ద్వంద్వ వైఖరిపై పరోక్షంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక భారత్‌లోని ఇజ్రాయెల్ రాయబారి రూవెన్ అజార్ అయితే ఏకంగా మధ్యవర్తిత్వం విషయంలో పాక్ ఎంతమాత్రం నమ్మదగిన దేశం కాదని వ్యాఖ్యానించడం గమనార్హం.ప్రపంచ శాంతికి కృషి.. పాకిస్తానీగా గర్విస్తున్నాఇలాంటి తరుణంలో పాకిస్తాన్ పేసర్ షాహిన్ ఆఫ్రిది ఓ ట్వీట్ చేశాడు. ‘‘ప్రపంచ శాంతి కోసం పాకిస్తాన్ నాయకత్వం వహిస్తూ ముందుకు సాగుతున్న తీరు చూస్తుంటే గర్వంగా ఉంది. మా ప్రధాని షాబాజ్ షరీఫ్, ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్లు శాంతి చర్చలకు ఊతమిచ్చారు.సంక్షోభం నుంచి స్థిరత్వం వైపు అడుగులు వేసేలా చేస్తున్నారు. కాల్పుల విరమణ ద్వారా మానవత్వం పరిఢవిల్లుతుంది. ఇందుకు పాకిస్తాన్ గొప్ప ముందడుగు వేసింది. శాంతి కోసం కృషి చేస్తోంది. పాకిస్తానీగా ఉన్నందుకు గర్వపడుతున్నా’’ అంటూ షాహిన్ ఓవరాక్షన్ చేశాడు.ఆటను వదిలి ఇతర అంశాల్లో జోక్యంఓవైపు.. పాకిస్తాన్ మధ్యవర్తిత్వంపై విమర్శలు, ఆరోపణలు వస్తున్న వేళ షాహిన్ ఆఫ్రిది ఇలా సొంతడబ్బా కొట్టుకున్నట్లుగా ట్వీట్ చేయడంతో నెటిజన్లు భగ్గుమంటున్నారు. ఆటను వదిలి ఇతర అంశాల్లో జోక్యం చేసుకోవడం అవసరమా? అని మండిపడుతున్నారు.కాగా ఇటీవల పాక్ పేసర్ నసీం షా.. పాకిస్తాన్ సూపర్ లీగ్ ఆరంభ వేడుకల్లో పంజాబ్ ముఖ్యమంత్రి మరియం నవాజ్‌ను రాణిలా ట్రీట్ చేశారంటూ ట్వీట్ చేశాడు. దీంతో ఇతర అంశాల్లో జోక్యం చేసుకున్నందున పీసీబీ అతడికి రూ. 2 కోట్ల (పాక్ కరెన్సీ) జరిమానా విధించింది. మరి ఇప్పుడు షాహిన్ కూడా పీసీబీ ఇలాగే శిక్షిస్తుందా అనే ప్రశ్నలు వస్తున్నాయి. కాగా ఇటీవల షాహిన్ కెప్టెన్సీలో పాక్ ఘోర పరాజయం చవిచూసింది. బంగ్లాదేశ్ పర్యటనలో దాదాపు పదకొండేళ్ల తర్వాత తొలిసారి ఆతిథ్య జట్టుకు వన్డే సిరీస్ కోల్పోయింది.చదవండి: ‘ఆర్నెళ్లకు మించి బతకడం కష్టం.. గుండెపోటు రావొచ్చు’ -
ఇంత అసహ్యంగా మాట్లాడతారా?.. పాక్ మంత్రికి స్ట్రాంగ్ కౌంటర్
ఇరాన్-అమెరికా శాంతి చర్చల వేళ.. అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. లెబనాన్ అంశం తేల్చే వరకు చర్చలు సజావుగా సాగవంటూ ఓపక్క ఇరాన్ కొత్త పాట పాడుతోంది. మరోపక్క ఈ చర్చలకు మధ్యవర్తిగా ఉన్న పాకిస్తాన్‌పై ఇజ్రాయెల్ అనుమానాలు వ్యక్తం చేస్తోంది. ఈ క్రమంలో బాహాటంగానే ఇరు దేశాలు తీవ్ర విమర్శలు గుప్పించుకోవడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఇస్లామాబాద్‌లో శాంతి చర్చలు జరుగుతున్న సమయంలో.. పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ చేసిన ఓ ట్వీట్ తీవ్ర దుమారం రేపింది. లెబనాన్ దాడుల విషయంలో ఇజ్రాయెల్‌పై అభ్యంతకర వ్యాఖ్యలు చేశారాయన. ఇజ్రాయెల్ అనే దేశం క్యాన్సర్‌లాంటిదని, ప్రపంచానికి పట్టిన శాపమన్న రీతిలో వ్యాఖ్యానించారు. ‘‘ఇస్లామాబాద్‌లో శాంతి చర్చలు జరుగుతున్నప్పటికీ.. అటు లెబనాన్‌లో అమాయకుల్ని ఇజ్రాయెల్ చంపుతోంది. గాజా, ఇరాన్ తర్వాత.. లెబనాన్‌లో రక్తపాతం కొనసాగిస్తోంది. అలాంటి దేశాన్ని పుట్టించినవాళ్లు నరకంలో కాలిపోతూ చిత్రహింసలు అనుభవించాలని కోరుకుంటున్నా’’ అంటూ సోషల్ మీడియాలో ఆసిఫ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అయితే.. ఆసిఫ్ వ్యాఖ్యలకు గట్టి కౌంటరే పడింది. ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు కార్యాలయం స్పందిస్తూ.. ఇజ్రాయెల్ నాశనం కోరుకుంటున్న పాకిస్తాన్ మంత్రి వ్యాఖ్యలు అసహ్యకరంగా ఉన్నాయని అన్నారు. ఏ దేశం ఇలాంటి వ్యాఖ్యలను స్వాగతించబోదని.. పైగా శాంతి చర్చల్లో మధ్యవర్తిగా వ్యవహరిస్తున్న దేశం నుంచి ఇలాంటివి ఊహించలేం అంటూ పేర్కొంది. ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి గిడియోన్ సర్ కూడా పాక్ నాయకత్వాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. ఇజ్రాయెల్‌ను క్యాన్సర్ జబ్బుతో పోల్చడం అంటే.. ఒక దేశ నాశనాన్ని కోరుకోవడమేనని, ఇలాంటి వ్యాఖ్యలు ఏమాత్రం మంచివి కావని అన్నారు. ఇజ్రాయెల్-పాకిస్తాన్ మధ్య ఏనాడూ అధికారిక సంబంధాలు లేవు. అయితే.. ఇరాన్-అమెరికా యుద్ధంలో చైనాతో పాటు పాక్ మధ్యవర్తిత్వం వహించడం ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. కానీ ఈ వ్యవహారంలో పాక్ పాత్ర ఏమీ ఉండకపోవచ్చని.. అసలు ఆ దేశాన్ని నమ్మడానికే వీల్లేదని ఇజ్రాయెల్ అంటోంది. గతంలో గాజా విషయంలో గల్ఫ్ దేశాల సాయం తీసుకున్న ట్రంప్.. ఇప్పుడు పాక్‌ను కూడా వాడుకుంటున్నట్లు కనిపిస్తోందని చెబుతోంది. ఇస్లామాబాద్ వేదికగా శాంతి చర్చలు జరగాల్సిన టైంలో.. పాక్-ఇజ్రాయెల్ మధ్య దౌత్యపరంగా మాటల యుద్ధం ఎటు దారి తీస్తుందో చూడాలి. -
‘కాల్పుల విరమణ’ గందరగోళం పాపం పాక్‌దే!
మధ్యవర్తి అంటే పెద్దమనిషి తరహాలో పెద్దరికంతో, హుందాగా వ్యవహరించాలి. కానీ దశాబ్దాలుగా ఉగ్రమూకలను చంకనెత్తుకు తిరుగుతూ తమ దేశంలో ఉగ్రవాదమే లేదని బొంకే పాకిస్తాన్ అంతర్జాతీయ వేదికలపైనా అదే ధోరణిని ప్రదర్శించి మరోసారి నవ్వులపాలైంది. ఇందుకు పశ్చిమాసియాలో అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య తెరమీదకొచ్చిన కాల్పుల విరమణ ప్రతిపాదనల ఘటనే సాక్ష్యంగా నిలిచింది. తమ భూభాగంతోపాట లెబనాన్ మీదా దాడులను ఆపేయాలని ఇరాన్ స్పష్టంగా పది ప్రతిపాదనలను పంపితే వాటిలోంచి ‘లెబనాన్’అనే పేరును తొలగించి అమెరికా, ఇజ్రాయెల్‌లకు పాకిస్తాన్ ప్రతిపాదనలను చేరవేసిందనేది ఇప్పుడు విన్పిస్తున్న ప్రధాన ఆరోపణ. పాక్ మధ్యవర్తిత్వంలో తమకు అందిన ప్రతిపాదనల్లో ‘లెబనాన్’అనే పదం ఎక్కడా లేదనేది అమెరికా, ఇజ్రాయెల్ వాదన. దీంతో పాకిస్తాన్ చేసిన అసమర్థ, అసంబద్ధ మధ్యవర్తిత్వం కారణంగా తమపై దాడులభారం తప్పట్లేదని ఇప్పుడు లెబనాన్ పాక్‌పై ఆగ్రహంగా ఉంది. పాక్ మాత్రం దీంతో తమకెలాంటి సంబంధంలేదని చేతులు దులిపేసుకునేలా మాట్లాడటం గమనార్హం. ‘‘లెబనాన్‌తో కలుపుకుని ప్రతిచోటా, ఎక్కడా దాడులు జరపబోమని ఇరాన్, అమెరికా, మిత్రదేశాల మధ్య కాల్పుల విరమణ ప్రతిపాదన అమల్లోకి వచ్చింది’’అని తొలుత ప్రధాని షెహబాజ్ షరీఫ్ ‘ఎక్స్’లో ఒక ట్వీట్‌చేశారు. ట్వీట్‌చేసిన కొద్దిసేపటికే లెబనాన్‌పై ఇజ్రాయెల్ భీకరదాడులు చేయడంతో కాల్పులవిరమణ ఒప్పందంలో లెబనాన్ పేరు ఉందా? లేదా? అనే గందరగోళం తలెత్తింది. ఇందుకు పాకిస్తానే కారణమని లెబనాన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. ఇరాన్ పంపిన ప్రతిపాదనలకు పాకిస్తాన్ ఏకపక్షంగా సవరణలుచేసి అమెరికాకు పంపిందని ఆరోపించింది. ఇరాన్ సైతం ఇదే వాదనలు చేసింది. తాము పంపిన వాటిని మార్చేసి అమెరికాకు పంపడంతోపాటు, అమెరికా పంపిన ప్రతిపాదనలనూ కాస్తంత అటూఇటూ మార్చేసి తమకు అందజేసిందని ఇరాన్ ఆరోపిస్తోంది. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ సైతం పాకిస్తాన్ రెండు నాల్కల ధోరణిని పరోక్షంగా ప్రస్తావించారు. ‘‘సీజ్ఫైర్లో లెబనాన్ ఉందని ఇరాన్‌ను మధ్యవర్తిత్వ దేశాలు నమ్మించి ఉండవచ్చు. ఇందులో ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. లెబనాన్‌పై దాడి చేయబోమనే ప్రతిపాదనలకు మేం సమ్మతి తెలపలేదు’’అని అన్నారు. ట్వీట్ సైతం అమెరికా నుంచే.. షెహబాజ్ షరీఫ్ ‘ఎక్స్’ఖాతాలో ప్రత్యక్షమై ట్వీట్ సైతం సొంతంగా టైప్ చేసింది కాదు అని, అమెరికా అధ్యక్షభవనం నుంచి వచ్చిన సందేశాన్నే ఉన్నది ఉన్నట్లుగా షరీఫ్ తన ‘ఎక్స్’ఖాతాలో పోస్ట్‌చేశారని తెలుస్తోంది. ఈ మేరకు న్యూయార్క్ టైమ్స్ ఒక కథనం ప్రచురించింది. సందేశం మీద తొలుత డ్రాఫ్ట్ అనే పదం కన్పించి తర్వాత అది కన్పించకుండా పోయింది. షరీఫ్ ‘ఎక్స్’లో పోస్ట్చేయబోయే వాక్యాలను తొలుత శ్వేతసౌధం ధ్రువీకరించిందని, వైట్‌హౌస్ అనుమతితోనే షరీఫ్ ఆ సందేశాన్ని పోస్ట్‌చేశారని న్యూయార్క్‌టైమ్స్ పేర్కొంది. దీనిపై పాకిస్తాన్ నుంచి ఎలాంటి ఖండన రాకపోవడంతో ఇదే వాస్తవమనే వాదనకు బలం చేకూరింది. ఒక పక్షం వాదనలు, డిమాండ్లను అత్యంత పారదర్శకంగా మరో పక్షానికి అందించడంలో పాకిస్తాన్ విఫలమైందని, అందుకే లెబనాన్ విషయంలో సందిగ్ధత చోటుచేసుకుందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
సందిగ్ధత నడుమ శాంతి
దుబాయ్/ఇస్లామాబాద్/బీరూట్/వాషింగ్టన్: పాకిస్తాన్ అస్తవ్యస్థ మధ్యవర్తిత్వంతో అమల్లోకి వచ్చిన ‘రెండు వారాల కాల్పుల విరమణ’పూర్తి సందిగ్ధవాతావరణంలో కొనసాగుతోంది. ఓవైపు లెబనాన్‌పై దాడులు ఆపేదిలేదని ఇజ్రాయెల్ తెగేసి చెప్పడం, మరోవైపు లెబనాన్‌పై దాడులుచేస్తే హార్మూజ్ పీకనొక్కేసి నౌకల రాకపోకలను శాశ్వతంగా మూసేస్తామన్న ఇరాన్ ప్రకటనతో అసలు కాల్పులవిరమణ అనేది ఏ స్థాయిలో అమలవుతోందనే ప్రశ్న యావత్ ప్రపంచప్రజలను వేధిస్తోంది. కాల్పుల విరమణ మొదలయ్యాక సైతం లెబనాన్‌పై బుధవారం ఇజ్రాయెల్ దాడులు చేయడంతో కన్నెర్రజేసిన ఇరాన్ కొన్ని నిమిషాల్లోనే మళ్లీ హార్మూజ్ జలసంధిని మూసేసింది. దీంతో పర్షియన్ గల్ఫ్ గుండా చమురు, పెట్రో ఉత్పత్తుల నౌకల రాకపై గంపెడాశలు పెట్టుకున్న ప్రపంచదేశాలు వెనువెంటనే నిట్టూర్చాయి. మరోవైపు తమ గగనతలంలోకి గత 24 గంటల్లో ఎలాంటి శత్రు క్షిపణులు, డ్రోన్లు చొరబడలేదని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌదీ అరేబియా, బహ్రెయిన్, కువైట్ గురువారం ప్రకటించాయి. పాకిస్తాన్లో జరగబోయే చర్చల్లో ఎలాంటి ఫలితం వస్తుందో? చర్చలు విఫలమైతే మళ్లీ భీకరదాడులు, ప్రతిదాడులు తప్పవేమోనన్న భయాందోళనల పీడకల ప్రపంచదేశాలను వదిలిపోవట్లేదు. మరోవైపు తమపై ఇజ్రాయెల్ బుధవారం జరిపిన భీకరదాడిలో పెద్దసంఖ్యలో జనం ప్రాణాలుకోల్పోవడంతో ఆ దేశంతో చర్చలకు సిద్ధమని లెబనాన్ అధ్యక్షుడు జోసెఫ్ ఔన్ ప్రకటించారు. దీంతో నేరుగా చర్చలు జరిపేందుకు సిద్ధంగా ఉన్నామని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ ప్రకటించారు. ‘‘నేరుగా చర్చలు జరపాలని కేబినెట్ మంత్రులను ఆదేశించా. లెబనాన్‌లో హెజ్బొల్లా సాయుధులు తమ ఆయుధాలను త్యజించాల్సిందే. అప్పుడే ఇరుదేశాల మధ్య శాంతియుత సంబంధాలపై దృష్టిసారించగలం’’అని నెతన్యాహూ అన్నారు. లెబనాన్‌పై భీకరదాడులు కొనసాగుతాయన్న కొద్దిసేపటికే ఆయన ఇలా భిన్నమైన ప్రకటనచేయడం గమనార్హం. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సూచనమేరకే నెతన్యాహూ లెబనాన్‌తో నేరుగా చర్చలకు అంగీకరించారని తెలుస్తోంది. వాషింగ్టన్లో వచ్చేవారం జరగబోయే ఈ చర్చల్లో అమెరికాలో ఇజ్రాయెల్ రాయబారి యేషెల్ లీటెర్, లెబనాన్‌లో అమెరికా రాయబారి మైఖేల్ పాల్గొంటారని తెలుస్తోంది. మా వేలు ట్రిగ్గర్మీదే ఉంది.. కాల్పుల విరమణ ప్రతిపాదనల్లో లెబనాన్ పేరు చేర్చినా ఇజ్రాయెల్ దాడులు ఆపకపోవడంపై ఇరాన్ మండిపడింది. లెబనాన్‌పై దాడులుచేస్తే మరింతగా రెచ్చిపోతామని ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బఘేర్ ఖలీబాఫ్ హెచ్చరించారు. శనివారం పాకిస్తాన్‌లోని ఇస్లామాబాద్‌లో జరగబోయే చర్చల్లో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌తో బఘేర్ భేటీకానున్న నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. లెబనాన్ విషయంలో వెనక్కి తగ్గకపోతే దారుణ ప్రతిదాడులు తప్పవని, గన్ ట్రిగ్గర్‌పై తమ వేలు అలాగే ఉందని ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ హెచ్చరించారు. మరోవైపు చమురుధరలు పెరుగుతూ పోతున్నాయి. గురువారం అంతర్జాతీయంగా నాణ్యమైన బ్రెంట్ రకం చమురు ధర బ్యారెల్‌కు 98 డాలర్లకు పెరిగింది. యుద్ధం మొదలైన ఫిబ్రవరి 28నాటి ధరతో పోలిస్తే ఇది ఏకంగా 35 శాతం అధికంకావడం గమనార్హం. చర్చల అంశాలపైనా సందిగ్ధత చర్చల్లో ఇరాన్ ఎలాంటి ప్రతిపాదనలు చేస్తుందో? వాటికి అమెరికా, ఇజ్రాయెల్ ఏ రీతిలో స్పందిస్తాయోననే సందిగ్ధత కొనసాగుతోంది. శనివారం పాకిస్తాన్‌లోని ఇస్లామాబాద్‌లో చర్చలు జరగనున్నాయి. ఇన్నాళ్లూ అంతర్జాతీయ సముద్రజలాలుగా ఉన్న హార్మూజ్ జలసంధి జలాలపై ఇకపై తమ గుత్తాధిపత్యం ఉండాలని ఇరాన్ డిమాండ్‌చేసే వీలుంది. ఇరాన్ నవతరం క్షిపణుల తయారీ ప్రాజెక్ట్, అణ్వాయుధ సామర్థ్యాన్ని సముపార్జించడంపై చర్చల్లో అమెరికా, ఇజ్రాయెల్ అడ్డుచెప్పే అవకాశముంది. ఆపత్కాలంలో కలిసిరావాల్సిన నాటో సభ్యదేశాలు మొండిచేయి చూపించాయన్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆరోపణల నడుమ జర్మనీ చాన్స్‌లర్ ఫ్రెడరిక్ మెర్జ్ అగ్రరాజ్యానికి మద్దతుపలికారు. ‘‘అమెరికాతో నాటో కలిసి నడుస్తుంది. ఈ మేరకు బుధవారం ట్రంప్‌తో సంభాషించా. అయితే ఏమేరకు అమెరికాకు సాయపడాలనే అంశంపై జూలైలో తుర్కియేలోని అంకారాలో జరిగే నాటో శిఖరాగ్ర సదస్సులో తేలుస్తాం. అమెరికా, యూరప్‌లను కలుపుతూ నాటో పరిరక్షణకు మేం కట్టుబడి ఉన్నాం’’అని మెర్జ్ అన్నారు. మరోవైపు చర్చలకు పాకిస్తాన్ సన్నాహకాలు చేస్తోంది. ఏర్పాట్లపై పాక్ ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ ఆసిం మునీర్, ప్రధాని షెహబాజ్‌తో సమీక్ష జరిపారు. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, ట్రంప్ అల్లుడు జేర్డ్ కుష్నర్, ట్రంప్ దూత స్టీవ్ విట్కాఫ్లతో కూడిన అమెరికా ప్రతినిధి బృందం శుక్రవారం ఉదయంకల్లా ఇస్లామాబాద్‌కు చేరుకోనుంది. శిథిలాల దిబ్బ... బుధవారం మధ్యాహ్నం 10 నిమిషాల్లో 100కుపైగా ప్రాంతాలపై ఒకేసారి దాడిచేసి లెబనాన్‌లో ఇజ్రాయెల్ వినాశనం సృష్టించిన ఘటనలో మరణాల సంఖ్య గురువారానికి 303కు పెరిగింది. 1,150 మందికిపైగా గాయాలపాలయ్యారు. చాలా మంది ఇంకా ఆస్పత్రుల్లో చికిత్సపొందుతున్నారు. దాడుల్లో హెచ్‌బొల్లా నేత నయీం ఖాసిమ్ సన్నిహితుడు అలీ యూసుఫ్ హర్షీ హతమయ్యాడని ఇజ్రాయెల్ ప్రకటించింది. శిథిలాల గుట్టలుగా మారిన దాడి ప్రాంతాల్లో ఇంకా బాధితుల కోసం అన్వేషణ కొనసాగుతోంది.సముద్ర మందుపాతరలతో జాగ్రత్త సరకు రవాణా నౌకలకు ఇరాన్ సూచన సీమైన్స్ అమర్చిన ప్రాంతం ‘చార్ట్’విడుదలదాడులు, ప్రతిదాడులు, బెదిరింపులు, కవి్వంపులు, హెచ్చరికల దశ దాటి కాల్పులవిరమణ పర్వంలోకి అడుగుపెట్టిన పశ్చిమాసియా యుద్ధంలో ఇరాన్ కాస్తంత మెత్తబడి అంతర్జాతీయ సరుకు రవాణా నౌకలు హార్మూజ్ గుండా వెళ్లేందుకు తాత్కాలికంగా అనుమతి ఇచ్చింది. అయితే యుద్ధంవేళ అనుమతిలేకుండా హార్మూజ్ గుండా వెళ్లే నౌకలను నాశనంచేసేందుకు పర్షియన్ గల్ఫ్ జలాల్లో అమర్చిన సముద్రమందుపాతరల జాడను వెల్లడిస్తూ ఇరాన్ తాజాగా ఒక చిత్రపటాన్ని విడుదలచేసింది. నలుపు, తెలుపురంగుల్లో ఉన్న ఈ చిత్రపటంలో పేర్కొన్న వృత్తాకార ప్రాంతం(డేంజర్ జోన్) నుంచి కాకుండా కాస్తంత దూరంగా జరిగి నౌకలు రాకపోకలు సాగించాలని ఇరాన్ ప్రకటించింది. చార్జ్ ప్రకారం చూస్తే సీమైన్స్‌ను ఇరాన్ తీరంవైపు కాకుండా ఆవలివైపునకు అత్యధికంగా అమర్చినట్లు స్పష్టమవుతోంది. ఇరాన్ తీరం వెంబడి దాడుల నుంచి తప్పించుకునేందుకు తీరానికి దూరంగా నౌకలు వెళ్తాయని ముందే ఊహించి, వాటి రాకపోకలను అడ్డుకునేందుకే ఇరాన్ ఇలాంటి ఎత్తుగడ వేసిందని స్పష్టమవుతోంది. సీమైన్స్ బారిపడకుండా ఈ నౌకలు ఇకపై ఇరాన్‌కు దగ్గరగా లరాక్ ద్వీపానికి సమీపంగా వెళ్లాల్సిన అగత్యం ఏర్పడింది. మేం ఇరాన్ చుట్టూతే ఉంటాం: ట్రంప్కాల్పుల విరమణ అమల్లోకి వచ్చినంత మాత్రాన పశ్చిమాసియాను అమెరికా బలగాలు వీడిపోవని ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్ స్పష్టంచేశారు. ఈ మేరకు సొంత సామాజిక మాధ్యమం ‘ట్రూత్ సోషల్’లో ఆయన గురువారం ఒక పోస్ట్‌పెట్టారు. ‘‘యుద్ధం శాశ్వత ముగింపునకు సంబంధించిన సమగ్ర ఒప్పందం కుదిరే వరకు, అది అమల్లోకి వచ్చే వరకు అమెరికా బలగాల ఎక్కడికీ పోవు. పశ్చిమాసియాలో ఇరాన్ చుట్టూతా మొహరించే ఉంటాయి. ఒకవేళ ఏదైనా కారణంతో ఒప్పందం కుదరకపోతే మళ్లీ బాంబుల దాడి, కాల్పుల మోత మరింతగా మోగుతుంది’’ అని ట్రంప్ అన్నారు. -
నాటో తీరుపై ట్రంప్ మళ్లీ విమర్శలు
నాటో వ్యహరిస్తున్న తీరుపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. మనల్ని నిరాశపరిచే నాటో కూటమితో పాటు మిత్ర దేశాలకు, ఒత్తిడి పెట్టకపోతే సమస్యలేవి అర్థం కావు అని అన్నారు. ఈ మేరకు ట్రూత్ సోషల్ మీడియాలో తాజాగా పోస్ట్ పెట్టారు. ఇరాన్‌తో యుద్ధం చేసే విషయంలో, హర్మూజ్‌ని దక్కించుకునే విషయంలో నాటో కలిసి రానందుకు ఇప్పటికే నాటో దేశాలని ఇప్పటికే ట్రంప్ విమర్శిస్తున్నారు.మరోవైపు మంగళవారం రాత్రికే ఇరాన్ నాగరికతని అంతం చేస్తానని హెచ్చరికలు ఇచ్చిన ట్రంప్.. సరిగ్గా గంటన్నర ముందు కాల్పుల విరమణ ప్రకటించారు. రెండు వారాలు వాయిదా వేస్తున్నట్లు తెలిపారు. పాక్ మధ్యవర్తిత్వం చేయగా.. ఇప్పుడు ఆ దేశంలోని ఇస్లామాబాద్‌లోనే అమెరికా-ఇరాన్ చర్చలకు సిద్ధమయ్యాయి. భారత కాలమానం ప్రకారం గురువారం రాత్రి ఇరు దేశాల ప్రతినిధులు.. ఇస్లామాబాద్ చేరుకునే అవకాశముందని తెలుస్తోంది. ఇందుకోసం పాక్ అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. చర్చల కోసం వచ్చే బృందాలకు పూర్తి సహకారం అందిస్తామని పాక్ ప్రధాని షెబాజ్ షరీఫ్ పేర్కొన్నారు. అయితే సీజ్ ఫైర్ కొనసాగుతుండగానే లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులు చేయడం ఒప్పందాన్ని ఉల్లంఘించడమేనని ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ అన్నారు. -
ఇస్లామాబాద్ వెళ్తున్నామన్న పోస్టును డిలీట్ చేసిన ఇరాన్ ప్రతినిధి
-
ఆక్.. పాక్.. కరివేపాక్
ఇరాన్-అమెరికా&కో మధ్య యుద్ధం ఆగిపోవడానికి తామే కారణమని పాకిస్తాన్ తెగ ప్రచారం చేసుకుంటోంది. అయితే ఇరాన్ మాత్రం అందులో నిజం లేదని క్లారిటీ ఇచ్చింది. ఇటు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మొదట కాస్త క్రెడిట్ ఇచ్చినప్పటికీ.. ఆ తర్వాత చైనా పాత్ర కీలకమని చెప్పి పాక్ గాలి తీసేశారు. ఈలోపు.. ఇటు ఇజ్రాయెల్ ఆ మధ్యవర్తిత్వంపై ఏకంగా అనుమానాలే వ్యక్తం చేస్తోంది. మిడిల్ ఈస్ట్ వార్‌లో పాక్ మధ్యవర్తిత్వంపై ఇజ్రాయెల్ సందేహాలు వ్యక్తం చేస్తోంది. ఆ దేశానికి అంత సీన్ లేదని.. అదసలు నమ్మదగిన విషయమే కాదని అంటోంది. భారత్‌లోని ఇజ్రాయెల్ రాయబారి రూవెన్ అజార్ ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. మధ్యవర్తిత్వం విషయంలో పాక్ పాత్ర ఏం మాత్రం ఉండకపోవచ్చు. అమెరికా కేవలం తమ వ్యూహాత్మక కారణాల వల్లే పాకిస్తాన్‌ను వాడుకుంటుందేమో అని వ్యాఖ్యానించారు.అమెరికా గతంలో ఖతర్, టర్కీ వంటి దేశాలను ముందుంచి గాజా విషయంలో హమాస్‌తో ఒప్పందాలు సాధించింది. అదే విధంగా ఇప్పుడు పాకిస్తాన్‌ను ఉపయోగించుకుని ఉండొచ్చు. కాబట్టి పాక్‌ను విశ్వసనీయ మధ్యవర్తిగా ఏ కోణంలోనూ చూడలేం అని అన్నారాయన. అదే సమయంలో.. అమెరికాతో సమన్వయం కొనసాగించడం ఇజ్రాయెల్‌కు ఎంతో ముఖ్యమని ఆయన వ్యాఖ్యానించారు.విమర్శలు కూడా.. పశ్చిమాసియా యుద్ధంలో పాక్ మధ్యవర్తిత్వంపై ఇప్పుడు విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయి. లెబనాన్ విషయంలో స్పష్టత లేకపోవడంతోనే మరోసారి ఉద్రిక్తతలు తలెత్తడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. లెబనాన్‌కు కూడా కాల్పుల విరమణ వర్తిస్తుందని పాక్ తొలుత ప్రకటించగా.. ఆ మాట చెప్పడానికి పాక్‌కు ఏ అర్హత ఉందంటూ ఇజ్రాయెల్ ఆగ్రహం వ్యక్తం చేసింది. అదే సమయంలో.. ఇటు అమెరికా కూడా లెబనాన్‌కు ఒప్పందం వర్తించబోదని తేల్చేసింది. దీంతో ఈ గందరగోళానికి పాక్ తీరే కారణమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇరాన్, అమెరికా తమను నమ్ముతున్నాయని పాక్ అంటోంది. అయితే ఇరాన్ మాత్రం పాక్ ప్రయత్నాలను ప్రశంసిస్తూనే.. మధ్యవర్తిత్వాన్ని మాత్రం ఒప్పుకోవడం లేదు. పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఇస్లామాబాద్‌లో శుక్రవారం జరగబోయే చర్చలకు అమెరికా–ఇరాన్ ప్రతినిధులను ఆహ్వానించారు. “ఇరాన్, అమెరికా- మిత్రదేశాలు తక్షణ కాల్పుల విరమణకు అంగీకరించాయి. శాంతి చర్చలు విజయవంతమవుతాయని ఆశిస్తున్నాం” అని ఆయన సోషల్ మీడియా వేదికలో ఓ పోస్ట్ చేశారు. సౌదీ, టర్కీ, ఈజిప్ట్ విదేశాంగ మంత్రులకు సైతం ఈ సమావేశానికి ఆహ్వానం వెళ్లినట్లు సమాచారం. అయితే చర్చలు శనివారం(11వ తేదీకి) జరుగుతాయని అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌజ్ ఓ ప్రకటన రిలీజ్ చేసింది.ఇరాన్‌పై భీకర దాడుల హెచ్చరికలు చేసిన ట్రంప్.. చివరి నిమిషంలో యుద్ధానికి బ్రేక్ వేశారు. రెండు వారాల కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిందని.. శాశ్వత శాంతి స్థాపనకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయని చెప్పారు. ఇటు ఇరాన్ కూడా ఆ ప్రకటనను ధృవీకరించింది. కానీ, లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులతో ఘర్షణలు మళ్లీ ఉధృతమయ్యాయి. ఈ పరిణామంపై ఇరాన్ భగ్గుమంటోంది. కీలకమైన హర్ముజ్‌ను తెరిచినట్లే తెరిచి.. మళ్లీ మూసేసింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ లెబనాన్ ఈ కాల్పుల విరమణలో ఏమాత్రం భాగం కాదని, హెజ్బొల్లా ఉనికి కారణంగా ఇది ‘వేరే ఘర్షణ’ అని ప్రకటించారు. అయితే పలు దేశాలు మాత్రం లెబనాన్‌కు సీజ్ఫైర్ వర్తింపజేయాలని డిమాండ్ చేస్తున్నాయి. -
సీజ్ఫైర్ : పాక్ మార్కెట్లు ఫైర్, ట్రేడింగ్ నిలిపివేత!
అమెరికా, ఇరాన్‌ల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం గ్లోబల్ మార్కెట్లను భారీ ఊరట నిచ్చాయి. పెట్టుబడుదారుల సెంటిమెంట్ బలపడటంతో దాదాపు అన్ని మార్కెట్లు లాభాలను ఆర్జించాయి. ముఖ్యంగా ఇటీవలి కాలంలో పేలవంగా ఉన్న పాకిస్తాన్ మార్కెట్లు భారీగా పుంజుకోవడం విశేషం. ఏప్రిల్ 8న ఇంట్రాడే ట్రేడింగ్ సమయంలో పాకిస్తాన్ బెంచ్‌మార్క్ స్టాక్ సూచీ 12,000 పాయింట్లకు పైగా పెరిగి, ఒకే రోజులో అత్యధిక ర్యాలీని నమోదు చేసింది. పశ్చిమ ఆసియాలో పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలతో ముడిపడి ఉన్న పాకిస్తాన్ స్టాక్ ఎక్స్ఛేంజ్లోని అస్థిరత కాలం తర్వాత ఈ భారీ ర్యాలీ చోటు చేసుకుంది. స్థానిక దినపత్రిక డాన్ ప్రకారం, పాకిస్తాన్ స్టాక్ ఎక్స్ఛేంజ్ KSE-100 సూచీ 8.15 శాతం పెరిగి 164,035.83 పాయింట్లకు చేరుకుంది. KSE-100 సూచీ చరిత్రలో ఒకే రోజులో నమోదైన అత్యధిక పెరుగుదల ఇదే. దీంతో ఏరంగా ఎక్స్ఛేంజ్ నిబంధనలకు అనుగుణంగా ట్రేడింగ్‌ను నిలిపివేయడం విశేషం. రెండు వారాల తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం ఖరారైన తర్వాత ఈ లాభాలు నమోదయ్యాయి. ఈ ఒప్పందం ప్రకారం, ప్రపంచంలోని కీలక నౌకా రవాణా మార్గమైన హోర్ముజ్ జలసంధిని టెహ్రాన్ తిరిగి తెరిస్తే, దానికి బదులుగా వాషింగ్టన్ సైనిక చర్యలను నిలిపివేయడానికి అంగీకరించింది. రెండు వారాల పాటు హోర్ముజ్ జలసంధి గుండా సురక్షిత ప్రయాణానికి టెహ్రాన్ అనుమతిస్తుందని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చి ధృవీకరించారు.ఈ కాల్పుల విరమణ తక్షణమే అమల్లోకి వస్తుందని, ఒక "నిర్ణయాత్మక ఒప్పందం" కుదుర్చుకోవడమే ఈ చర్చల లక్ష్యమని పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ తెలిపారు.ఈ చర్చలు ఇస్లామాబాద్‌లో జరగవచ్చని భావిస్తున్నారు.ఇదీ చదవండి: షార్ట్‌కట్ జర్నీ : కుటుంబంలో 9 మంది సజీవ సమాధికాగా ఫిబ్రవరి 28న మొదలైన ఇరన్‌పై యుద్ధం ప్రారంభంలో కూడా ఎక్స్ఛేంజ్ భారీ నష్టాలను చవిచూసింది. ఆ తరువాత ఇరాన్ అప్పటి సుప్రీం లీడర్ అయతోల్లా అలీ ఖమేనీ హత్యకు గురయ్యారనే వార్తల నేపథ్యంలో,మార్చి 2న KSE-100 సూచీ 16,089 పాయింట్లు లేదా 9.57 శాతం మేర పడిపోయి, ఒక్కరోజులో అత్యంత తీవ్రమైన క్షీణతను నమోదు చేసింది.ఇదీ చదవండి: BMWలో అమ్మడికి జాక్‌పాట్... ఎలాగో తెలిస్తే షాకవుతారు! -
పాకిస్తాన్ క్రికెటర్లకు సువర్ణావకాశం
నలుగురు పాకిస్తాన్ క్రికెటర్లు లక్కీ ఛాన్స్ కొట్టారు. త్వరలో ప్రారంభం కానున్న ఇంగ్లండ్ దేశవాలీ సీజన్ కోసం వేర్వేరు జట్లకు ఎంపికయ్యారు. మొహమ్మద్ అబ్బాస్, సుఫియాన్ ముఖీమ్‌ను డెర్బీషైర్.. ఉసామా మిర్‌ను వార్సెస్టర్‌షైర్ జట్లు ఎంపిక చేసుకున్నాయి. మొహమ్మద్ నవాజ్ టీ20 బ్లాస్ట్ (జట్టు ఖరారు కాలేదు) ఆడేందుకు అనుమతి పొందాడు. వీరందరికీ పాకిస్తాన్ క్రికెట్ బోర్డు NOCలు జారీ చేసింది. వీరిలో నవాజ్, ఉసామా మిర్‌కు దీర్ఘకాలిక అనుమతి లభించగా.. సుఫియాన్ ముఖీమ్ జూన్ 7 వరకు మాత్రమే అనుమతి పొందాడు. మరో క్రికెటర్ అబ్బాస్‌కు సీజన్ మొత్తానికి అనుమతి లభించింది.స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ అయిన మొహమ్మద్ నవాజ్, స్పిన్ బౌలర్ సుఫియాన్ ముఖీమ్ T20 బ్లాస్ట్‌లో మాత్రమే ఆడనుండగా.. ఫాస్ట్ బౌలర్ మొహమ్మద్ అబ్బాస్ కౌంటీ ఛాంపియన్‌షిప్‌తో పాటు అన్ని ఫార్మాట్లలో ఆడతాడు. ఉసామా మిర్ విషయానికొస్తే.. ఈ వైవిధ్యభరితమైన స్పిన్ బౌలర్ అన్ని ఫార్మాట్లలో ఆడేందుకు అనుమతి పొందాడు. నవాజ్, ముఖీమ్, ఉసామా మిర్ T20 బ్లాస్ట్‌లో ప్రతిభను చూపి, పాకిస్తాన్ టీ20 జట్టులోకి రీఎంట్రీ ఇవ్వాలని ఉవ్విళ్లూరుతున్నారు. జాతీయ జట్టులోకి తిరిగి వచ్చేందుకు వీరికి ఇది సువర్ణావకాశం. -
కాల్పుల విరమణలో అదిరిపోయే ట్విస్ట్
అమెరికా–ఇరాన్ మధ్య రెండు వారాల కాల్పుల విరమణ కుదిరిన నేపథ్యంలో.. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అనూహ్య ప్రకటన చేశారు. ఈ ఒప్పందం లెబనాన్‌కు వర్తించబోదని.. దాడులు కొనసాగుతాయన్న రీతిలోనే ఆయన మాట్లాడారు. అయితే.. పశ్చిమాసియా సంక్షోభానికి తాత్కాలిక తెర పడడంలో క్రెడిట్ పూర్తిగా తమదేనని భావిస్తున్న పాకిస్తాన్‌కు ఇది ఏమాత్రం మింగుడు పడని విషయంగా మారింది. ఇరాన్‌పై భీకర దాడులు ఉంటాయన్న ట్రంప్.. డెడ్‌లైన్‌కు సరిగ్గా గంటన్నర ముందు శాంతి పావురం ఎగరేశారు. రెండు వారాలపాటు యుద్ధం వాయిదా వేస్తున్నామని, ఈలోపు శాంతి చర్చలు జరుగుతాయని ప్రకటించారు. ఆ వెంటనే కాల్పుల విరమణ అనేది అన్ని ప్రాంతాలకు వర్తిస్తుందని పాకిస్తాన్ ప్రధాని షెహ్బాజ్ షరీఫ్ ప్రకటించారు. అయితే.. కాసేపటికే షరీఫ్ చేసిన వ్యాఖ్యలకు విరుద్ధంగా ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు మరో ప్రకటన చేశారు. బుధవారం వేకువ జామున నెతన్యాహు కార్యాలయం విడుదల చేసిన ప్రకటనలో.. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న నిర్ణయానికి ఇజ్రాయెల్ మద్దతు ఇస్తున్నప్పటికీ లెబనాన్‌ను ఒప్పందంలో చేర్చలేదని పేర్కొన్నారు. అమెరికా, ఇజ్రాయెల్, అలాగే ప్రాంతీయ మిత్రదేశాలు ఇరాన్ అణు, క్షిపణి, ఉగ్రవాద ముప్పును తొలగించేందుకు కట్టుబడి ఉన్నాయని అన్నారు. అమెరికా–ఇరాన్ యుద్ధ విరమణ ఒప్పందం పాకిస్తాన్ మధ్యవర్తిత్వంతో కుదిరిందన్నది ట్రంప్ ప్రకటనతో స్పష్టమైంది. ఇరాన్, యుద్ధం ముగించడానికి 10-పాయింట్ల ప్రణాళికను అమెరికాకు అందజేసింది. అయితే.. లెబనాన్‌కు కాల్పుల విరమణ వర్తిస్తుందా? లేదా? అనే విషయంలో ఇజ్రాయెల్–పాకిస్తాన్ మధ్య విభేదాలు స్పష్టమయ్యాయి. ఇస్లామాబాద్‌లో ఏప్రిల్ 10న శాంతి చర్చలు జరగనున్నాయి. ఆలోపు ఈ అంశం ఓ కొలిక్కి వస్తుందా? లేదంటే వ్యవహారం మరింత ముదురుతుందా? అనేది చూడాలి.ఇదిలా ఉంటే.. మరోపక్క లెబనాన్ పరిస్థితి తీవ్రంగా ఉంది. మార్చి 2న హెజ్బుల్లా సంస్థ ఇజ్రాయెల్ నగరాలపై రాకెట్లు ప్రయోగించగా.. ప్రతిగా ఇజ్రాయెల్ భారీ స్థాయి దాడులు జరిపింది. ఈ దాడుల్లో 1,500 మందికి పైగా మరణించగా, లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు.చైనా చెబితేనే.. పాక్ ప్రధాని, ఆర్మీ చీఫ్‌తో సంప్రదింపుల నేపథ్యంలోనే కాల్పుల విరమణ జరిగిందని ట్రంప్ స్వయంగా ప్రకటించారు. అయితే.. కాసేపటికే సోషల్ మీడియాలో చేసిన ఓ పోస్టులో చైనా కీలక పాత్ర పోషించిందని అన్నారు. మరోవైపు.. ఇరాన్ వాదన కూడా అలాగే ఉంది. ఈ విషయంలో పాక్ ప్రమేయమేదీ లేదనట్లే ఇరాన్ ప్రకటించింది. కేవలం చైనా చెబితేనే తాము ఈ ఒప్పందానికి ముందుకు వచ్చామని అంటోంది.ఇదీ చదవండి: అమెరికాకు ఇరాన్ 10 కండిషన్లు! ఇవిగో.. -
దేశ వ్యాప్తంగా లాక్డౌన్.. రాత్రి 8 గంటల నుంచి అమల్లోకి
ఇస్లామాబాద్: ఇంధన సంక్షోభం తీవ్రతరమవుతున్న నేపథ్యంలో పాకిస్థాన్ కీలక నిర్ణయం తీసుకుంది. నేటి నుంచి రాత్రి 8గంటలకే మార్కెట్లు మూసివేయాలని ప్రధాని షహ్బాజ్ షరీఫ్ ఆదేశాలు జారీ చేశారు. ఇంధన వినియోగాన్ని తగ్గించి, ఆర్థిక భారాన్ని తగ్గించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పాక్ ప్రధాని కార్యాలయం విడుదల చేసిన అధికార ప్రకటనలో పేర్కొంది. పాకిస్థాన్ ప్రభుత్వం తాజా నిర్ణయం ప్రకారం.. పంజాబ్, ఖైబర్ పఖ్తూన్ఖ్వా, బలూచిస్తాన్, ఇస్లామాబాద్, గిల్గిట్-బాల్టిస్థాన్ ప్రాంతాల్లోని షాపింగ్ మాల్స్, బజార్లు రాత్రి 8 గంటలకే మూసివేయాలి. ఈ ఆదేశాలు ఇంధన వినియోగాన్ని తగ్గించి, ఆర్థిక భారాన్ని తగ్గించడమే లక్ష్యంగా తీసుకున్నట్లు ప్రధాని కార్యాలయం ప్రకటించింది.ప్రత్యేక మినహాయింపులు కూడా ఉన్నాయి. బేకరీలు, రెస్టారెంట్లు, హోటల్స్‌తో పాటు కళ్యాణ మండపాలు రాత్రి 10 గంటల వరకు కొనసాగవచ్చు. ఇళ్లలో జరిగే వ్యక్తిగత వేడుకలు కూడా రాత్రి 10 గంటల వరకు మాత్రమే అనుమతి ఇచ్చింది. ఈ నిర్ణయం పాకిస్థాన్‌లో పెరుగుతున్న ఇంధన ధరలు, అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) ఒత్తిడి, ఆర్థిక సంక్షోభం కారణంగా తీసుకున్నదని అధికారులు తెలిపారు. ఇప్పటికే ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రాంతంలో బజార్లు రాత్రి 9 గంటల వరకు మాత్రమే తెరిచి ఉంచే ఆదేశాలు అమల్లో ఉన్నాయి. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఈ ఆదేశాన్ని అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వం ఈ చర్యను జాతీయ అవసరంగా పేర్కొంది. “దేశ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని, ప్రతి ఒక్కరూ తమ కర్తవ్యాన్ని నిర్వర్తించాలి” అని షహ్బాజ్ షరీఫ్ అన్నారు. అయితే వ్యాపార సంఘాలు ఈ నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ, తమ వ్యాపారాలు దెబ్బతింటాయని హెచ్చరిస్తున్నాయి. మొత్తం మీద పాక్ ప్రభుత్వ నిర్ణయం ఆర్థిక భారాన్ని తగ్గించడమే లక్ష్యంగా ఉన్నప్పటికీ, వ్యాపారులు ప్రజలపై దీని ప్రభావం గణనీయంగా ఉండనుంది. -
పాకిస్థాన్ మరిన్ని ముక్కలవ్వడం ఖాయం : రాజ్‌నాథ్ సింగ్
ఢిల్లీ: పాకిస్థాన్‌కు భారత రక్షణశాఖ రాజ్‌నాథ్ సింగ్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఇటీవల పాక్ రక్షణ మంత్రి ఖ్వాజా అసిఫ్ ‘కోల్‌కతాపై దాడి’ వ్యాఖ్యల్ని ఖండించారు. పశ్చిమ బెంగాల్‌పై కన్నేసే ప్రయత్నం చేస్తే పాకిస్థాన్ మరిన్ని ముక్కలవుతుందని హెచ్చరించారు.మంగళవారం ఖ్వాజా అసిఫ్ చేసిన వ్యాఖ్యలపై రాజ్‌నాథ్ సింగ్ స్పందించారు. అసిఫ్ ఇటీవల ఓ కార్యక్రమంలో భారత్‌పై నోరు పారేసుకున్నారు. భవిష్యత్తులో భారత్ తమ దేశాన్ని దోషిగా నిలబెట్టి దాడులు చేస్తే ప్రతిస్పందనగా.. కోల్‌కతాపై దాడులు చేస్తామని అని అన్నారు. దీనిపై రాజ్‌నాథ్ సింగ్ పాక్ చరిత్రను గుర్తుచేశారు. ఈ తరహా వ్యాఖ్యలు చేసే 55 ఏళ్ల క్రితం పాకిస్థాన్‌పై రెండు ముక్కలైంది. ఇప్పుడు బెంగాల్‌పై కన్నేస్తే పాకిస్థాన్ ఎన్నిముక్కలవుతుందో ఆ దేవుడికే తెలియాలి’ అని హెచ్చరించారు.1971లో పాక్ రెండు ముక్కలుగా విడిపోయింది. అందులో బంగ్లాదేశ్ విడిపోయి ప్రత్యేక దేశంగా అవతరించింది. బంగ్లాదేశ్‌కు మద్దతుగా భారత్ సైన్యం అండగా నిలిచింది. నాటి చరిత్రను తాజాగా రాజ్‌నాథ్ సింగ్ గుర్తు చేశారు. మరోసారి అదే తరహా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే పాకిస్థాన్ ముక్కలవుతుందని వ్యాఖ్యానించారు. గతేడాది ఏప్రిల్ 22న పహల్గామ్ దాడికి ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సింధూర్ చేపట్టింది. నాటి నుంచి పాకిస్థాన్.. భారత్‌పై కవ్వింపు చర్యలకు దిగుతూ వస్తోంది. ఈ క్రమంలో ఖవాజా మరోసారి ప్రగల్భాలు పలికారు. ఈ పరిణామాలపై తృణమూల్ కాంగ్రెస్ కూడా స్పందించింది. కోల్‌కతాపై దాడి చేస్తే పాక్‌లోని వారి ఇళ్లలోకి దూరి మరి చంపుతామని అధికార టీఎంసీ నేతలు వ్యాఖ్యానించారు. మొత్తం మీద, ఖవాజా ఆసిఫ్ చేసిన వ్యాఖ్యలు భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలను మరింత పెంచాయి. రాజ్‌నాథ్ సింగ్ చేసిన హెచ్చరికలు మాత్రం భారతదేశం తన భూభాగాన్ని రక్షించేందుకు ఎలాంటి రాజీపడదని స్పష్టంగా తెలియజేస్తున్నాయి. బెంగాల్‌పై కన్నేసే ప్రయత్నం చేస్తే పాకిస్తాన్‌కు మరింత విభజన తప్పదని రాజ్‌నాథ్ సింగ్ హెచ్చరించారు. -
పాకిస్తాన్‌కు వార్నింగ్.. అభిషేక్ బెనర్జీ సంచలన వ్యాఖ్యలు
కోల్కత్తా: బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయం హీటెక్కింది. పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రి ఖవాజా ఆసిఫ్ వ్యాఖ్యలకు తృణమూల్ కాంగ్రెస్ నాయకుడు అభిషేక్ బెనర్జీ స్ట్రాంగ్ కౌంటరిచ్చారు. తామే పాకిస్తాన్‌లోని వారి ఇళ్లలోకి చొరబడి చంపేస్తామని హెచ్చరించారు. దీంతో, బెంగాల్ రాజకీయంలో మరింత చర్చకు దారి తీసింది.తృణముల్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ సోమవారం బెంగాల్‌లోని సిలిగురిలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కోల్‌కతాపై పాకిస్తాన్ ఇటీవల చేసిన హెచ్చరికకు కేంద్రం స్పందించిన తీరుపై విమర్శలు గుప్పించారు. అనంతరం, ఆయన మాట్లాడుతూ.. ‘భారత్-పాకిస్తాన్ మధ్య భవిష్యత్తులో ఘర్షణలు తలెత్తితే కోల్‌కతా లక్ష్యం కావచ్చని పాకిస్తాన్ నాయకుడు ఒకరు మాట్లాడారు. కోల్‌కతాను పేల్చివేస్తామని ఖవాజా ఆసిఫ్ అన్నారు. మన ప్రధానమంత్రి, హోం మంత్రి, రక్షణ మంత్రి.. ఆయన వ్యాఖ్యలకు మౌనంగా ఉండిపోయారు. కానీ, నేను మాత్రం ఊరుకోను. నేను నా జాబితాలో ఖవాజా ఆసిఫ్ పేరు రాసుకున్నాను. మమతా బెనర్జీ, ఇండియా కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన రోజు.. మేము వారి ఇళ్లలోకి చొరబడి వారిని చంపుతాము’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అలాగే, అతను పాకిస్తాన్లో కూర్చుని కోల్‌కతాపై దాడి చేస్తామని బెదిరిస్తున్నాడు. దీనిపై అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్ మౌనంగా ఉన్నారు. బెంగాల్ విషయంలో మాత్రం అమిత్ షా మమ్మల్ని టార్గెట్ చేస్తున్నారు. ఆయన ప్రతీరోజు మమ్మల్ని బంగ్లాదేశీయులు, పాకిస్తానీయులు అని పిలుస్తారు. కానీ, పాకిస్తాన్ కోల్‌కతాను బెదిరించినప్పుడు మాత్రం ఆయన మూగ ప్రేక్షకుడుగా మారిపోతారు. ప్రధాని మోదీ కూడా బెంగాల్లో టీఎంసీని ఓడించాలని ఎన్నికల ప్రచారంలో చెబుతున్నారు. కానీ, పాకిస్తాన్ వ్యాఖ్యలపై ఆయన కూడా స్పందించరు అంటూ ఘాటు విమర్శలు గుప్పించారు. ఆయన వ్యాఖ్యలతో బెంగాల్లో ఎన్నికల వాతావరణం ఒక్కసారిగా చర్చనీయాంశంగా మారింది. ఇక, అంతకుముందు.. భారత్‌ను ఉద్దేశించి పాక్ రక్షణశాఖ మంత్రి ఖవాజా ఆసిఫ్ మరోసారి ప్రేలాపనలు చేశారు. భవిష్యత్తులో భారత్ ఏదైనా దాడులకు పాల్పడితే.. కోల్‌కతానూ లక్ష్యంగా చేసుకుంటామన్నారు. ప్రతిదాడులను ఆ ప్రాంతం వరకూ తీసుకెళ్తామంటూ వ్యాఖ్యానించారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు రాజకీయంగా పెను దుమారం రేపుతున్నాయి. -
మార్కెట్లు, మాల్స్ అన్నీ ప్రతిరోజు రాత్రి 8 గంటలకే క్లోజ్
ఇస్లామాబాద్: పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధం అనేక దేశాలపై తీవ్ర ప్రభావం పడేలా చేస్తోంది. ఇప్పటికే పలు దేశాల్లో ఇంధన సంక్షోభం నెలకొన్న విషయం తెలిసిందే. పాకిస్థాన్‌లో ఇంధన సంక్షోభం తీవ్రం కావడంతో మార్కెట్లు, మాల్స్ అన్నింటినీ నేటి నుంచి (ఏప్రిల్ 7) రాత్రి 8 గంటలకే మూసివేయించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.యుద్ధం వల్ల పెరుగుతున్న ప్రపంచ ఇంధన ఖర్చులకు ప్రతిస్పందనగా పొదుపు చర్యల్లో భాగంగా పాక్ నిర్ణయాలు తీసుకుంటోంది. దేశంలోని అనేక ప్రాంతాల్లో మార్కెట్లు, షాపింగ్ మాల్స్‌కు ఈ నిబంధనలు వర్తిస్తాయని పేర్కొంది.ప్రధానమంత్రి షెహ్బాజ్ షరీఫ్ అధ్యక్షతన పెట్రోలియం ఉత్పత్తులపై జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారని పీఎంవో ప్రకటన విడుదల చేసింది.ప్రభుత్వ ఆదేశాల ప్రకారం.. పంజాబ్, ఖైబర్ పఖ్తుంఖ్వా, బలోచిస్థాన్, ఇస్లామాబాద్, పాకిస్థాన్ ఆక్రమిత గిల్గిట్-బాల్టిస్థాన్, పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే) ప్రాంతాల్లో మార్కెట్లు, షాపింగ్ మాల్స్, డిపార్ట్మెంటల్ స్టోర్లు, నిత్యావసర వస్తువులు అమ్మే దుకాణాలను రాత్రి 8 గంటలకే మూసివేస్తారు. అయితే ఖైబర్ పఖ్తుంఖ్వాలో డివిజనల్ హెడ్‌క్వార్టర్స్ ప్రాంతాల్లో మార్కెట్లు రాత్రి 9 గంటల వరకు తెరిచి ఉంచవచ్చు.అలాగే.. బేకరీలు, రెస్టారెంట్లు, తందూర్ దుకాణాలు, ఆహార కేంద్రాలు, వివాహ మండపాలను రాత్రి 10 గంటలకు మూసివేయాలని ప్రభుత్వం ప్రకటించింది. వ్యక్తిగత నివాసాల్లో జరిగే వివాహ కార్యక్రమాలు కూడా రాత్రి 10 గంటలలోపే ముగించాలి. మెడికల్ స్టోర్లు, ఫార్మసీలకు ఈ నిబంధనల నుంచి మినహాయింపు ఉంది.పశ్చిమాసియా ఘర్షణల వల్ల సరఫరా గొలుసులు దెబ్బతినడంతో పెరుగుతున్న ప్రపంచ చమురు, ఎనర్జీ ధరలను ఎదుర్కొనేందుకు తీసుకుంటున్న ప్రయత్నాల్లో భాగంగా ఈ చర్యలు తీసుకుంటున్నారు. -
కాంగ్రెస్ నోట పాక్ పాట
బార్పేట/హోజాయ్/దిబ్రూగఢ్: ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌పై ప్రధాని మోదీ విమర్శల జడి కురిపించారు. ‘‘పాకిస్తాన్‌కు అనుగుణంగా కాంగ్రెస్ నడుచుకుంటోంది. తాజా ఘటనలే ఇందుకు సాక్ష్యం’’ అన్నారు. సోమవారం అస్సాంలోని బార్పేట, హోజాయ్, దిబ్రూగఢ్‌లలో మోదీ ఎన్నికల సభల్లో ప్రసంగించారు. ‘‘2016 సర్జికల్ దాడులు మొదలు సిందూర్ దాకా మనం చేపట్టిన ప్రతి ఆపరేషన్‌లోనూ కాంగ్రెస్ పాక్‌కే వంతపాడుతోంది. పాక్ ఎజెండాకే విలువిస్తోంది. దశాబ్దాల తరబడి మాజీ సైనికులకు వన్‌ర్యాంక్–వన్ పెన్షన్ విధానం అమలు చేయకుండా కాంగ్రెస్ మాజీ సైనికులకు ద్రోహంచేసింది. మేం వచ్చాక రూ.1.24 లక్షల కోట్లను నేరుగా వాళ్ల బ్యాంక్ ఖాతాలో జమచేశాం. రాహుల్‌గాంధీ ప్రేమ దుకాణాలు తెరిచానని గొప్పగా చెప్పుకుంటారుకానీ వాస్తవానికి ఆయన అబద్ధాల దుకాణాలు, అవమానకర షాప్‌లు తెరిచారు. ప్రజల నుంచి బీజేపీ భూములు లాక్కుందని ఆరోపిస్తారుగానీ నేషనల్ హెరాల్డ్, రాజీవ్‌గాంధీ చారిటబుల్ ట్రస్ట్ తదితరాల గుప్పిట్లో ఎంత భూమి ఉందో చెప్పరు. కాంగ్రెస్ హయాంలో అస్సాంలో గుంతలు పడ్డ రోడ్లపై వాహనాలు కూడా సరిగా నడపలేని దుస్థితి. మేం ఏకంగా యుద్ధ విమానాలు అత్యవసరంగా ల్యాండ్ అయ్యేంత పటిష్టంగా రోడ్లు నిర్మించాం’’అంటూ మొరాన్లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ రహదారిని ఉద్దేశించి మోదీ చెప్పారు.మోదీ మెచ్చిన స్ఫటిక కమలం ఇటీవల కేరళలోని తిరువళ్లలో ప్రచార సభలో మోదీ ప్రసంగం మధ్యలో ఉన్నట్టుండి ఎస్పీజీ కమెండోలను పిలిచారు. ‘‘స్ఫటిక కమలం ఆకృతిలోని పేపర్వెయిట్ను ఈ సభలో చూశా. అలాంటిది ఒకటి కావాలి. కుదిరితే తెప్పించండి’’ అని సూచించారు. వెంటనే రంగంలోకి దిగిన నిర్వాహకులు సభలో క్రిస్టిల్ కమలం ఎవరి వద్ద ఉందా అని ఆరా తీశారు. దాన్ని ఎక్కడ కొన్నారో కనుక్కున్నారు. తిరువళ్ల ప్రైవేట్ బస్టాండ్ సమీపంలోని ఆ దుకాణానికి వెళ్లి రెండింటిని కొని ప్రజాపనుల శాఖ గెస్ట్‌హౌస్ వద్ద ఎస్పీజీ అధికారులకు అందజేశారు. అదే రాత్రి వాటిని ఢిల్లీకి పంపించారు. మోదీ మెచ్చిన ఆ పేపర్ వెయిట్‌ను ప్రాచీన ఫెంగ్ షుయీ విధానంలో తయారు చేశారు. దాంట్లో 16 పూల రేకులు ఒక ఆధారానికి అతికించి ఉన్నాయి. దాన్ని తిప్పితే అందమైన పూల రేకులన్నీ తిరుగుతాయి. -
కోల్‌కతాపై దాడి చేస్తామంటే ప్రధాని ఏం చేస్తున్నారు?: మమతా బెనర్జీ
పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.. ప్రధాని మోదీపై విరుచుకపడ్డారు. కోల్‌కతా దాకా దాడి చేస్తాం అని పాకిస్థాన్ ప్రగల్భాలు పలుకుతుంటే మోదీ ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. ఎన్నికల ప్రచారం సందర్భంగా ( సోమవారం) నైదా జిల్లాలో నిర్వహించిన ర్యాలీలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.ఇటీవల పాకిస్థాన్ రక్షణశాఖ మంత్రి ఖవాజా ఆసిఫ్ భారత్‌పై తీవ్ర విమర్శలు చేశారు. "భారత్ గనుక ఈసారి ఏదైనా 'ఫాల్స్ ఫ్లాగ్ ఆపరేషన్' (కృత్రిమంగా దాడులు సృష్టించడం) చేయడానికి ప్రయత్నిస్తే, దేవుడి దయ వల్ల మేము ఆ యుద్ధాన్ని కోల్‌కతా వరకు తీసుకెళ్తాము" అని హెచ్చరించారు. అంటే, సరిహద్దులకే పరిమితం కాకుండా భారత్ లోపలికి చొచ్చుకెళ్లి కోల్‌కతా (తూర్పు తీరం వరకు) దాడులు చేస్తామని ఆయన పరోక్షంగా బెదిరించారు. అయితే ఈ వ్యాఖ్యలపై స్పందించనందుకు మమతా బెనర్జీ, ప్రధాని మోదీపై ఆగ్రహాం వ్యక్తం చేస్తూ మాట్లాడారు.మమతా బెనర్జీ ప్రధాని మోదీ గురించి మాట్లాడుతూ " ప్రతి ఎన్నికల సభలో బెంగాల్‌ను టార్గెట్ చేసి మాట్లాడే మోదీ కోల్‌కతాపై దాడి చేస్తామని పాక్ మంత్రి హెచ్చరిస్తుంటే ఎందుకు స్పందించలేదు. ఒకవేళ ఈ ప్రాంతంపై దాడి చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎందుకు హెచ్చరించలేదు. దీనికి బాధ్యతగా ప్రధాని మోదీ రాజీనామా చేయాలి " అని ప్రధానిని ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.అదే ఏవరైనా భారత్ అదే విధంగా కోల్‌కతాను టార్గెట్ చేస్తూ హెచ్చరిస్తే ఎట్టిపరిస్థితుల్లో సహించేది లేదని హెచ్చరించారు. కాగా ఈ నెల 23,29 తేదీలలో ఈ రాష్ట్రంలో సాధారణ ఎన్నికలు జరగనున్నాయి. -
యుద్ధం వేళ భారీ ట్విస్ట్.. రంగంలోకి పాక్, తుర్కియే..
పశ్చిమాసియాలో యుద్ధ పరిస్థితులు పీక్ స్టేజ్‌కు చేరుకున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరికల వేళ ఇరాన్ సైతం కౌంటరిచ్చింది. ఇలాంటి పరిస్థితుల్లో కీలక పరిణామం జరిగింది. 45 రోజులపాటు కాల్పుల విరమణకు పాకిస్తాన్, తుర్కియే, ఈజిప్టు వంటి ప్రాంతీయ మధ్యవర్తులు ఇరాన్, అమెరికాతో చర్చలు జరుపుతున్నాయి. ట్రంప్ డెడ్‌లైన్ వేళ ఈ మేరకు ఓ ప్రముఖ అమెరికా పత్రిక తన కథనంలో పేర్కొంది.అమెరికా పత్రిక తన కథనం మేరకు.. ఇరాన్‌కు ట్రంప్ విధించిన 48 గంటల గడువు నేపథ్యంలో యుద్ధం తీవ్రతరం కాకుండా నిరోధించడానికి పలు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగానే పాకిస్తాన్, ఈజిప్ట్, తుర్కియే వంటి మధ్యవర్తిత్వ దేశాలకు చెందిన ప్రతినిధులు, ట్రంప్ దూత స్టీవ్ విట్కాఫ్, ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ మధ్య సాధారణ(Text)మెసేజ్‌ల ద్వారా చర్చలు జరుగుతున్నాయని పేర్కొంది. మధ్యవర్తులు రెండు దశల కాల్పుల విరమణ ఒప్పందం కోసం ప్రయత్నిస్తున్నారని అందులో స్పష్టం చేసింది. మొదటి దశలో 45 రోజుల కాల్పుల విరమణ ఉంటుందని, ఆ సమయంలో యుద్ధానికి శాశ్వత ముగింపు కోసం చర్చలు జరుపుతారని చెప్పింది.అలాగే, రెండో దశలో యుద్ధాన్ని ముగించే ఒప్పందం ఉంటుందని తెలిపింది. ఈ తుది ఒప్పందం సమయంలో హార్మూజ్ జలసంధిని తిరిగి తెరవడం, అలాగే ఇరాన్ వద్ద ఉన్న అత్యంత సుసంపన్నమైన యురేనియంను తొలగించడం వంటివి ఉంటాయని వివరించింది. కేవలం 45 రోజుల కాల్పుల విరమణ కోసం హార్మూజ్‌ను తెరవడం, యురేనియం నిల్వలను పూర్తిగా వదులుకోవడానికి ఇరాన్ అంగీకరించదని పేర్కొంది.మరోవైపు.. ఇరాన్‌కు ట్రంప్ విధించిన డెడ్‌లైన్ సోమవారం సాయంత్రంతో ముగుస్తుంది. ఈ క్రమంలో ఆదివారం మరోసారి ఇరాన్‌కు ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. తమతో ఒప్పందాన్ని కుదుర్చుకోవడానికి గడువును మరో 20 గంటలు (మంగళవారం రాత్రి) వరకు పొడిగించారు. అప్పటికీ ఒప్పందానికి రాకపోతే విధ్వంసకర పరిణామాలు ఎదుర్కొనేందుకు సిద్ధపడాలని ఇరాన్‌కు హెచ్చరించారు. ఈ నేపథ్యంలో కాల్పుల విరామానికి ప్రాంతీయ మధ్యవర్తులు ఇరాన్, అమెరికాతో చర్చలు జరుపుతుండటం గమనార్హం. -
పాక్‌లో ‘ఎంపాక్స్’
కరాచీ: పాకిస్తాన్లో ప్రమాదకరమైన ఎంపాక్స్ వైరస్ వ్యాప్తి కలకలం సృష్టిస్తోంది. తాజాగా ఏడుగురు శిశువులు మరణించగా వారిలో నలుగురికి వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది. సింధ్ ప్రావిన్స్‌లోని ఖైర్పూర్లో ఎంపాక్స్ కేసులు వెలుగులోకి వచ్చాయి. పుండ్లు, ఫ్లూ లక్షణాలు, జ్వరంతో బాధపడుతూ ఖైర్పూర్లో ఆసుపత్రులల్లో చేరిన శిశువులు మరణించారని ఆరోగ్య శాఖ తెలిపింది. ఎంపాక్స్ సోకిన మనుషులు, జంతువులకు దగ్గరగా ఉంటే వైరస్ వ్యాప్తి చెందుతుంది. శిశువుల మృతికి ఎంపాక్స్ ఒక్కటే కారణం కాదని ఆరోగ్య శాఖ పేర్కొంది. వారు నెలలు నిండకముందే జని్మంచారని, తక్కువ బరువు ఉన్నారని, అనారోగ్య సమస్యలు బాధపడుతున్నారని తెలియజేసింది. సింధ్ ప్రావిన్స్‌లో అసాధారణమైన చర్మపు మొటిమలు, పుండ్లతో బాధపడుతున్న 15 మంది పిల్లలను ఆసుపత్రుల్లో చేర్చి చికిత్స అందిస్తున్నారు. ఎంపాక్స్ బాధితుల కోసం ఆసుపత్రుల్లో ఐసోలేషన్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నారు. -
పాక్‌లో ‘పెట్రో’ మంట: ప్రధాని మాస్టర్ ప్లాన్ ఇదే!
ఇస్లామాబాద్: పాకిస్తాన్లో ఇంధన ధరలు ఆకాశాన్నంటాయి. లీటర్ పెట్రోల్ ధర ఏకంగా 459 పాకిస్తానీ రూపాయలకు చేరడంతో సామాన్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ధరల పెంపుతో రావల్పిండి, ఇస్లామాబాద్‌లలో ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. తక్షణమే పెంచిన ధరలను వెనక్కి తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.పెట్రోల్ ధరల పెంపు ప్రభావం స్థానిక మార్కెట్లపై స్పష్టంగా కనిపిస్తోంది. రవాణా భారం పెరగడంతో కూరగాయలు, గోధుమ పిండి, మాంసం వంటి నిత్యావసరాల ధరలు అమాంతం పెరిగాయి. ఆటో, రిక్షా ఛార్జీల మోతతో ప్రయాణికులు బెంబేలెత్తుతున్నారు. స్కూల్ వ్యాన్ నిర్వాహకులు సైతం నెలవారీ ఫీజులను రూ.1,000 మేర పెంచేశారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.రావల్పిండి ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఆర్సీసీఐ) అధ్యక్షుడు ఉస్మాన్ షౌకత్ మాట్లాడుతూ.. రవాణా ఖర్చులు రెట్టింపు అయ్యాయని, దీనివల్ల ఆహార, నిర్మాణ రంగాలపై తీవ్ర ప్రభావం పడుతున్నదన్నారు. అంతర్జాతీయ మార్కెట్‌తో సంబంధం లేకుండా, ప్రభుత్వమే లీటర్‌పై రికార్డు స్థాయిలో రూ.160.61 పన్ను విధిస్తోందని ఆయన విమర్శించారు. ప్రభుత్వం తక్షణమే అనవసర ఖర్చులు తగ్గించుకుని, పన్నుల భారం ప్రజలపై పడకుండా ఐఎంఎఫ్ (ఐఎంఎఫ్)తో చర్చలు జరపాలని ఆయన సూచించారు.మరోవైపు రాజకీయ పక్షాలు సైతం ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా ఖండించాయి. పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ నేతలు సఫ్దార్ అలీ అబ్బాసీ, నహీద్ ఖాన్ ఈ పెంపును ‘ఆర్థిక అణచివేత’గా అభివర్ణించారు. సామాన్య, కార్మిక వర్గాల జీవన ప్రమాణాలను ఇది తీవ్రంగా దెబ్బతీస్తుందని హెచ్చరించారు. ప్రజాగ్రహం కట్టలు తెంచుకుంటున్న నేపథ్యంలో పాక్ అంతర్గత వ్యవహారాల మంత్రి మోసిన్ నఖ్వీ ఒక ప్రకటన చేశారు. ప్రధాని ఆదేశాల మేరకు ఇస్లామాబాద్‌లో 30 రోజుల పాటు ప్రయాణికులందరికీ ఉచిత పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సదుపాయం కల్పిస్తున్నట్లు వెల్లడించారు. ఇది కూడా చదవండి: 345 మంది భారత మత్స్యకారులకు ఊరట -
కోల్‌కతానూ కొట్టగలం
లాహోర్: రెచ్చగొట్టేలా మాట్లాడటమే పనిగా పెట్టుకునే పాకిస్తాన్ మంత్రులు మరోసారి తమ వాచాలత్వాన్ని బయటపెట్టుకున్నారు. పాకిస్తాన్ రక్షణమంత్రి ఖావాజా ఆసిఫ్ శనివారం ఇదే తరహా ప్రేలాపనలు చేశారు. ‘‘తప్పుడు ఆపరేషన్ల పేరిట భారత్ మాపై దాడికి దిగితే ఈసారి మేం దాడుల పరిధికి కోల్‌కతా దాకా విస్తరిస్తాం. కోల్‌కతాపై దాడిచేయగలం’’అని అన్నారు. శనివారం లాహర్ సమీప సొంత పట్టణం సియాల్కోట్లో ఆసిఫ్ మాట్లాడారు. ‘‘భారత ప్రభుత్వం తప్పుడు కథనాలు అల్లుతుంది. ఇందుకోసం సొంత వాళ్లను లేదా అక్కడి నిర్బంధంలో ఉన్న పాకిస్తానీలను వాడుకుంటోంది. కొందరిని నేలపై పడుకోబెట్టి ‘వీళ్లందరూ ఉగ్రవాదులు. అందర్నీ అంతంచేశాం’అంటూ ఏవేవో కథనాలు వెలువరుస్తుంది’’అని ఆసిఫ్ చెప్పుకొచ్చారు. పశ్చిమాసియా ఉద్రికత్తలను సాకుగా చూపి పొరుగుదేశం దాడులకు తెగబడితే తీవ్రస్థాయిలో విరుచుకుపడతామని భారత రక్షణమంత్రి రాజ్‌నాథ్ పాక్‌నుద్దేశించి చేసిన వ్యాఖ్యలకు స్పందనగా ఆసిఫ్ మాట్లాడారు. -
మరి కొద్ది రోజుల్లో మళ్ళీ లాక్ డౌన్!
-
‘మమ్మల్ని చంపేయండి’.. పాక్‌లో అల్లకల్లోలం
ఇస్లామాబాద్: పశ్చిమాసియాలో రగులుతున్న యుద్ధ జ్వాలలు పాకిస్తాన్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఇంధన సంక్షోభం దాయాది దేశాన్ని ఆర్థికంగా కోలుకోలేని దెబ్బ తీసింది. ఆకాశాన్ని తాకిన చమురు ధరలు దేశవ్యాప్తంగా అల్లకల్లోలాన్ని సృష్టించాయి. ప్రభుత్వం ధరలు పెంచడం, ప్రజలు ఆగ్రహంతో రోడ్ల మీదకు రావడం, ఆపై ప్రధాని దిగిరావడం.. వెరసి పాకిస్తాన్ ప్రస్తుతం ఒక అగ్ని గుండంలా మారిపోయింది.యుద్ధం మొదలై నెల రోజులు దాటడంతో ప్రపంచవ్యాప్తంగా చమురు సరఫరాపై ప్రభావం పడింది. 85 శాతం చమురును ‘హోర్ముజ్ జలసంధి’ ద్వారా దిగుమతి చేసుకునే పాకిస్తాన్‌కు ఇది శాపంగా మారింది. శుక్రవారం రాత్రి పాక్ ప్రభుత్వం పెట్రోల్ ధరలను ఏకంగా 42.7 శాతం పెంచుతూ సంచలన నిర్ణయం తీసుకుంది. దీంతో లీటర్ పెట్రోల్ ధర రూ. 485కి చేరుకుంది. ఈ నిర్ణయంతో జనం బెంబేలెత్తిపోయారు. పెట్రోల్ బంకుల వద్ద భారీ క్యూలు దర్శనమిస్తున్నాయి.ప్రజల నుంచి తీవ్ర నిరసనలు వ్యక్తమవడంతో ప్రధాని షెహబాజ్ షరీఫ్ వెనక్కి తగ్గక తప్పలేదు. పెంచిన ధరను అదే రోజు రూ. 378కి తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ‘ఈ తగ్గిన ధర కనీసం నెల రోజుల పాటు అమల్లో ఉంటుంది. మీ జీవితాలు సాధారణ స్థితికి వచ్చే వరకు నేను విశ్రమించను’ అని ప్రధాని జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. పెట్రోల్ ధర తగ్గించినప్పటికీ, డీజిల్ ధర సామాన్యుడిని వణికిస్తోంది. లీటర్ డీజిల్ ధరను రూ. 335.86 నుంచి ఏకంగా రూ. 520.35కి పెంచారు. అయితే, ప్రజలపై భారాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం దానిపై విధించే లెవీని తొలగించింది. మరోవైపు బంగ్లాదేశ్‌లో కూడా ఇదే తరహా పరిస్థితులు కనిపిస్తున్నాయి. అక్కడ ఎల్పీజీ (ఎల్పీజీ), సీఎన్జీ (సీఎన్జీ)ధరలను 29 శాతం మేర పెంచారు.పాక్ ప్రభుత్వం ప్రకటించిన ఊరట చర్యలుపాకిస్తాన్లో ప్రజా నిరసనల సెగను తగ్గించేందుకు ప్రభుత్వం కొన్ని కీలక రాయితీలను ప్రకటించిందిఉచిత ప్రయాణం: ఇస్లామాబాద్, పంజాబ్ రాష్ట్రాల్లో ప్రభుత్వ బస్సుల్లో 30 రోజుల పాటు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించారు.సబ్సిడీలు: సింధ్ ప్రభుత్వం మోటార్ సైకిలిస్టులకు, చిన్న రైతులకు ప్రత్యేక సబ్సిడీలను ప్రకటించింది.రవాణా ఛార్జీలు: పెరిగిన ధరల భారాన్ని ప్రయాణికులపై వేయవద్దని పంజాబ్ ముఖ్యమంత్రి మరియం నవాజ్ షరీఫ్ రవాణాదారులను కోరారు.వీధుల్లోకి జనం: ‘మమ్మల్ని చంపేయండి’లాహోర్ వంటి నగరాల్లో నిరసనలు మిన్నంటాయి. ‘ప్రభుత్వం మాపై పెట్రోల్ బాంబు వేసింది. మమ్మల్ని చంపేయండి. ఈ భారాన్ని మేము భరించలేము’ అని నిరసనకారుడు నవీద్ అహ్మద్ ఆవేదన వ్యక్తం చేశాడు. మరో నిరసనకారుడు హఫీజ్ అబ్దుల్ రవూఫ్ మాట్లాడుతూ.. ఇది కేవలం యుద్ధం వల్ల వచ్చిన ధరల పెరుగుదల కాదని, ఐఎంఎఫ్ (ఐఎంఎఫ్)ఒత్తిడి వల్లే ప్రభుత్వం ఇలా చేస్తోందని విమర్శించారు.ముందున్నది గడ్డు కాలమే..పాకిస్తాన్ జనాభాలో దాదాపు 25 శాతం మంది పేదరికంలో మగ్గుతున్నారు. ఇలాంటి తరుణంలో ఇంధన ధరల పెరుగుదల దేశ ఆర్థిక వ్యవస్థను మరింత కుంగదీసింది. మార్చి 28న ఐఎంఎఫ్ నుంచి 1.2 బిలియన్ డాలర్ల ఆర్థిక సాయానికి ప్రాథమిక ఒప్పందం కుదిరినప్పటికీ, సరఫరా వ్యవస్థలో ఆటంకాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. రాబోయే వారాలు పాకిస్తాన్ ప్రభుత్వానికి అగ్నిపరీక్ష లాంటివే. యుద్ధం సద్దుమణగకపోతే దాయాది దేశ పరిస్థితులు మరింత దిగజారే ప్రమాదం ఉంది.ఇది కూడా చదవండి: స్కూల్లో దెయ్యం?... పిల్లల చందాలతో గుడి కట్టి.. -
పాక్‌కు షాక్.. ఇస్లామాబాద్ వచ్చేది లేదు: ఇరాన్
ఇరాన్ యుద్ధం ముగింపు కోసం పాకిస్థాన్ చేసిన ప్రయత్నం పూర్తిగా బెడిసికొట్టింది. అమెరికా పెట్టిన డిమాండ్స్ ఎట్టి పరిస్థితుల్లో ఆమోదయోగ్యం కాదని ఇరాన్ తేల్చిచెప్పింది. దీంతో ఇస్లామాబాద్‌లో జరిగే చర్చలకు తమ దేశ ప్రతినిధులను పంపేప్రసక్తే లేదని టెహ్రాన్ స్పష్టం చేసింది.పశ్చిమాసియా యుద్దం మెుదలై నెలరోజులు గడుస్తోన్నా పరిస్థితులు ఏ మాత్రం సద్దుమణగడం లేదు కదా మరింత దురుతున్నాయి. ఇంతకాలం పాటు చర్చలు జరుగుతన్నాయని ప్రచారం జరిగినా వాటిపైనా ఎవరికీ పెద్దగా నమ్మకం లేకుండా పోయింది. ఈ నేపథ్యంలోనే అసలు చర్చలకు వెళ్లే ప్రసక్తే లేదంటూ ఇరాన్ మరోసారి స్పష్టం చేసింది.వాషింగ్టన్ పోస్ట్ కథనం ప్రకారం.. యుద్ధ విరమణకు ట్రంప్ పెట్టిన నిబంధనలు ఏ మాత్రం అంగీకారం లేవని ఇరాన్ పేర్కొన్నట్లు తెలిపింది. దీంతో సీజ్ ఫైర్ ఒప్పందం కోసం ఇస్లామాబాద్‌లో నిర్వహిస్తున్న చర్చలకు ఎట్టిపరిస్థితుల్లో తమ దేశ ప్రతినిధులను పంపేది లేదని తెలిపింది. ఈ ప్రకటనతో యుద్ధం మరింత ముదిరే అవకాశం ఉంది.కాగా ఇరాన్ తన ఆధీనంలోని హార్ముాజ్ జలసంధిని తిరిగి తెరిస్తేనే యుద్ధ విరమణకు అంగీకరిస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అన్నారు. .. "హార్ముాజ్ జలసంధిని పూర్తిగా స్వేచ్ఛగా తెరిచే వరకు ఇరాన్‌ను రాతి యుగం నాటి పరిస్థితికి వెళ్లేలా బాంబులతో ధ్వంసం చేస్తూనే ఉంటాం" అని సోషల్ మీడియాలో ఇరాన్‌ని హెచ్చరించారు. ఈ నేపథ్యంలోనే ఇరాన్ సైతం వెనక్కి తగ్గట్లేదుకాగా పాకిస్తాన్ ప్రయత్నాలు విఫలం కావడంతో, ఇప్పుడు టర్కీ మరియు ఈజిప్ట్ దేశాలు ఈ చర్చల కోసం మరో వేదికల్ని పరిశీలిస్తున్నట్లు సమాచారం. -
పాకిస్తాన్ మొత్తం షట్‌డౌన్ కాబోతోందా?
ప్రస్తుతం మళ్ళీ 'లాక్డౌన్' అనే మాట వినిపిస్తోంది. అయితే ఇది గతంలో మనం చూసిన కరోనా లాక్డౌన్ లాంటిది కాదు. ఒక దేశం ఆర్థికంగా, రాజకీయంగా మరియు అంతర్జాతీయ యుద్ధ పరిణామాల వల్ల ఏ స్థాయి సంక్షోభంలోకి వెళ్తుందో చెప్పడానికి ప్రస్తుత పరిస్థితే నిదర్శనం. సోషల్ మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం పాకిస్తాన్ మొత్తం షట్ డౌన్ కాబోతోందా? అసలు ప్రభుత్వం ఆలోచన ఏంటి? లాక్ డౌన్ అనగానే మనలో ప్రతి ఒక్కరికి ముచ్చెమటలు పోస్తాయి. నాటి లాక్ డౌన్ లో పడ్డ కష్టాలు అటువంటివి మరి. అయితే మళ్ళీ మనం లాక్ డౌన్ లోకి వెళ్ళనున్నామా.. పరిస్థితులు చూస్తే అవుననే అనిపిస్తున్నాయి. కాని ఈ సారి ఈ లాక్ డౌన్ ముందుగా మన పొరుగు దేశమైన పాకిస్తాన్లో రానుంది. అసలు అక్కడ లాక్డౌన్ ఆలోచన వెనుక ఉన్న ప్రధాన కారణం 'ఇంధన కొరత'. ప్రస్తుతం మిడిల్ ఈస్ట్ (మధ్య ప్రాచ్యం)లో జరుగుతున్న యుద్ధ పరిణామాల వల్ల అంతర్జాతీయంగా చమురు ధరలు ఆకాశాన్ని తాకాయి. పాకిస్తాన్ వద్ద విదేశీ మారక నిల్వలు (Foreign Exchange Reserves) అత్యంత కనిష్ట స్థాయికి పడిపోయాయి. అంటే, బయట దేశాల నుండి పెట్రోల్, డీజిల్ లేదా గ్యాస్ కొనడానికి వారి దగ్గర తగినంత డబ్బు లేదు. అందుకే, దేశంలో ఉన్న కొద్దిపాటి ఇంధనాన్ని పొదుపు చేయడానికి 'స్మార్ట్ లాక్డౌన్' విధించాలని ప్రభుత్వం భావిస్తోంది.పాకిస్తాన్ ప్రెసిడెంట్ ఆసిఫ్ అలీ జర్దారీ తదితర ఉన్నతాధికారులు ఇటీవలే ఒక కీలక సమావేశం నిర్వహించారు. దేశవ్యాప్తంగా రాత్రిపూట మార్కెట్లను , వ్యాపార సముదాయాలను త్వరగా మూసివేయాలని వారు ప్రతిపాదించారు. అంటే పాకిస్తాన్లో రాత్రి 8 లేదా 9 గంటలకే అన్ని షాపింగ్ మాల్స్, మార్కెట్లు మూసివేసేట్టుగా చూడాలి అని తీర్మానం చేశారు. అలాగే కార్యాలయాలకు వారంలో 5 రోజులు కాకుండా, కేవలం 3 లేదా 4 రోజులు మాత్రమే ఆఫీసులకు రావాలని, మిగిలిన రోజులు 'వర్క్ ఫ్రమ్ హోమ్' చేయాలని సూచించారు. దీనివల్ల రవాణా ఖర్చులు, ఏసీలు అలాగే విద్యుత్ వినియోగం తగ్గుతుందని వారి ప్లాన్.పాకిస్తాన్ లోని కేంద్ర ప్రభుత్వం లాక్డౌన్ దిశగా అడుగులు వేస్తున్నప్పటికీ, పాకిస్తాన్‌లోని ప్రావిన్షియల్ ప్రభుత్వాలు (రాష్ట్రాలు) దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఇప్పటికే ద్రవ్యోల్బణం (Inflation) వల్ల ప్రజలు అల్లాడిపోతున్నారని, ఇప్పుడు మళ్ళీ లాక్డౌన్ విధిస్తే వ్యాపారాలు దెబ్బతిని నిరుద్యోగం మరింత పెరుగుతుందని వారు వాదిస్తున్నారు. ముఖ్యంగా పంజాబ్ , సింధ్ ప్రావిన్సులు పూర్తి స్థాయి లాక్డౌన్ వద్దని, కేవలం కొన్ని నియంత్రణలు మాత్రమే విధిద్దామని స్పష్టం చేశాయి. గత కొద్ది రోజులుగా పాకిస్తాన్లో "కంప్లీట్ వీకెండ్ లాక్డౌన్" విధించారంటూ కొన్ని వార్తలు వైరల్ అయ్యాయి. అయితే పాకిస్తాన్ సమాచార శాఖ దీనిని ఖండించింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎలాంటి అధికారిక లాక్డౌన్ లేదు. కేవలం పొదుపు చర్యలు (Austerity Measures) మాత్రమే అమల్లో ఉన్నాయి. ఫేక్ న్యూస్‌ని నమ్మవద్దని ప్రభుత్వం హెచ్చరిస్తోంది. అయితే ఏ నిమిషమైనా లాక్ డౌన్ వార్తలు వచ్చే అవకాశాన్ని కొట్టిపారేయలేమని ప్రభుత్వ అధికారులు చెబుతున్నారు.ఒక పక్క లాక్డౌన్ భయం, మరోపక్క ఆకాశాన్ని తాకుతున్న ధరలు. పాకిస్తాన్లో సామాన్యుడి పరిస్థితి వర్ణనాతీతంగా ఉంది. గోధుమ పిండి నుండి పప్పుల వరకు ప్రతి వస్తువు ధర రెండింతలు పెరిగింది. విద్యుత్ బిల్లులు కట్టలేక ప్రజలు రోడ్ల మీదకు వచ్చి నిరసనలు తెలుపుతున్నారు. ఇలాంటి సమయంలో లాక్డౌన్ విధిస్తే అది "పుండు మీద కారం చల్లినట్లు" అవుతుందని అక్కడి ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాకిస్తాన్ పరిస్థితి మెరుగుపడాలంటే ఐఎంఎఫ్ (IMF) నుండి మరో విడత రుణం రావడం చాలా ముఖ్యం. కానీ ఐఎంఎఫ్ విధించే కఠినమైన షరతులు సామాన్యుడిపై మరింత భారాన్ని మోపుతున్నాయి. ఒకవేళ మిడిల్ ఈస్ట్ యుద్ధం గనుక మరింత ముదిరితే, చమురు సరఫరా పూర్తిగా నిలిచిపోయే ప్రమాదం ఉంది. అప్పుడు పాకిస్తాన్ తప్పనిసరి పరిస్థితుల్లో దేశం మొత్తాన్ని మూసివేయాల్సి రావచ్చు.మొత్తానికి చూస్తే, పాకిస్తాన్ ప్రస్తుతం ఒక "ఎకనామిక్ లాక్డౌన్"లో ఉంది. అధికారికంగా షాపులు తెరిచి ఉన్నా, కొనే శక్తి ప్రజలకు లేదు. ప్రభుత్వం పెట్రోల్ ఆదా చేయడానికి ప్రయత్నిస్తున్నా, అది ఎంతవరకు సఫలమవుతుందో చూడాలి. పొరుగు దేశంలో నెలకొన్న ఈ అస్థిరత దక్షిణాసియా ప్రాంతంపై ఎలాంటి ప్రభావం చూపుతుందో వేచి చూడాల్సిందే. ఇది ఒక్క పాకిస్తాన్ కే కాదు మనకూ ఓ హెచ్చరికే.అప్పుడెప్పుడో కరోనా వేల కిలోమీటర్ల అవతల ఉంది మనకేం కాదులే అనుకున్న క్షణం పట్టలేదు కరోనా అనే మహమ్మారి మన పై విరుచుకుపడి లాక్ డౌన్ లోకి రోజుల్లో తీసుకువెళ్ళిపోయింది. మరి ఇప్పుడూ కరోనా కన్నా ప్రమాదమైన యుద్ధం క్షణక్షణం ఉత్కంఠతతో ఏ దేశం మీద ఎటువంటి ప్రభావం చూపనుందో అర్ధం కాని పరిస్థితి. లాక్ డౌన్ అనేది మన లోగిలిలోకి రాకూడదని గట్టిగా అనుకుందాం ప్రార్ధిద్దాం. -
లీటర్ పెట్రోల్ రూ. 458.. పాకిస్తానీలు చెప్పినట్లు వినాల్సిందే!
పాకిస్తాన్ మాజీ కెప్టెన్ షాహిద్ ఆఫ్రిదిపై ఆ దేశ ప్రజలు భగ్గుమంటున్నారు. ‘‘మరీ ఇంతకు దిగజారాలా? కాస్తైనా సిగ్గుపడు’’ అంటూ సోషల్ మీడియా వేదికగా చివాట్లు పెడుతున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే..ఇరాన్‌పై అమెరికా- ఇజ్రాయెల్ (USA- Israel)పై దాడులు.. అందుకు ప్రతిగా ఇరాన్ స్పందిస్తున్న తీరుతో పశ్చిమాసియాలో తీవ్ర స్థాయిలో ఉద్రిక్తతలు నెలకొన్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఇరాన్ హర్మూజ్ జలసంధిని మూసి వేయడంతో ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలపై ప్రభావం పడింది.లీటర్ పెట్రోల్ ధర రూ. 458ఈ నేపథ్యంలో పాకిస్తాన్లో పెట్రోల్, డీజిల్ (Petrol- Diesel Price Hike) ధరలు భారీ ఎత్తున పెరిగాయి. తాజాగా మరోసారి పాక్ ప్రభుత్వం ఇంధన ధరలను పెంచింది. దీంతో పాకిస్తాన్లో లీటర్ పెట్రోల్ ధర 458 రూపాయలకు (స్థానిక కరెన్సీ) చేరగా.. లీటర్ డీజిల్ ధర ఏకంగా రూ. 520.35కు చేరింది.అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితుల దృష్ట్యానే ఇంధన ధరలు ఈ స్థాయిలో పెంచక తప్పలేదని పాకిస్తాన్ పెట్రోలియం శాఖా మంత్రి అలీ పర్వేజ్ మాలిక్ ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థించుకున్నాడు. మరోవైపు.. నెలరోజుల వ్యవధిలోనే పెట్రోల్, డీజిల్ ధరలు దాదాపు 50 శాతానికి పైగా పెరగడంతో ప్రజలు ప్రభుత్వ తీరుపై భగ్గుమంటున్నారు.మన పరిస్థితి మెరుగ్గా ఉందిఈ నేపథ్యంలో పాక్ మాజీ క్రికెటర్ షాహిద్ ఆఫ్రిది సోషల్ మీడియాలో ఓ వీడియో విడుదల చేశాడు. ఇందులో పాకిస్తాన్ ప్రభుత్వానికి మద్దతుగా ఆఫ్రిది మాట్లాడటం విమర్శలకు దారితీసింది. ‘‘స్నేహితులకు నమస్కారం. నేను షాహిద్ ఆఫ్రిది. ప్రపంచ వ్యాప్తంగా చమురు సంక్షోభం నెలకొన్న తరుణంలో పాకిస్తాన్‌పై కూడా ప్రభావం పడింది. అయితే, చాలా దేశాల కంటే మన పరిస్థితి మెరుగ్గా ఉంది. ప్రభుత్వం చెప్పినట్లే నడుచుకోవాలిఇలాంటి సమయంలో ప్రభుత్వానికి మనమంతా అండగా ఉండాలి. పాకిస్తానీలంతా ప్రభుత్వం చెప్పినట్లే నడుచుకోవాలి. దేశ అభివృద్ధి కోసం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని మనం గౌరవించాలి’’ అని ఆఫ్రిది పేర్కొన్నాడు. దీంతో.. ‘‘నీలాంటి సోకాల్డ్ సెలబ్రిటీలకు సామాన్య ప్రజల బాధలు పట్టవు. ఇలా మాట్లాడానికి ప్రభుత్వం నుంచి ఎంత తీసుకున్నావు?’’ అంటూ నెటిజన్లు ఆఫ్రిదికి చురకలు అంటిస్తున్నారు.చదవండి: ముంబై ఇండియన్స్‌కు శుభవార్త -
అతడు చెప్పాడనే వాటికి దూరం: జంపాకు ఘోర అవమానం
ఆడమ్ జంపా.. ఆస్ట్రేలియా అత్యుత్తమ స్పిన్నర్లలో ఒకడిగా పేరు గాంచాడు. షేన్ వార్న్ తర్వాత ఆసీస్‌కు దొరికిన అత్యంత విజయవంతమైన లెగ్ స్పిన్నర్‌గా జంపా కొనసాగుతున్నాడు. అయితే పరిమిత ఓవర్ల క్రికెట్లో తిరుగులేని రికార్డు ఉన్న జంపా, ఇప్పటివరకు ఒక్క టెస్ట్ మ్యాచ్ కూడా ఆడలేదు. తాజాగా ఇదే విషయంపై ఓ పాకిస్తానీ క్రికెట్ షోలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు కమ్రాన్ ఆక్మల్, బాసిత్ అలీ కీలక వ్యాఖ్యలు చేశారు."ఆడమ్ జంపా ఒక అద్భుతమైన స్పిన్నర్. లైన్ అండ్ లెంగ్త్, గూగ్లీ, ఫ్లిప్పర్, అన్నీ బౌలింగ్ చేయగలడు. కానీ ఇప్పటివరకు అతడు టెస్టు క్రికెట్ ఆడకపోవడం నాకు ఆశ్చర్యం కలిగిస్తోంది. క్రికెట్ ఆస్ట్రేలియా కూడా అతడిని టెస్టుల కోసం ఎందుకు పరిగణించలేదో" అర్థం కావట్లేదు ఆక్మల్ అన్నాడు.అయితే ఇందుకు బసిత్ అలీ పొంతన లేని సమాధానమిచ్చాడు. ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ మార్కస్ స్టోయినిస్ ఆపడం వల్లే జంపా టెస్ట్ క్రికెట్ ఆడలేదని అలీ పేర్కొన్నాడు.కాగా జంపా, స్టోయినిష్ మధ్య ఉన్న సాన్నిహిత్యాన్ని ఉద్దేశించి బాసిత్ అలీ ఈ వ్యాఖ్యలు చేసినట్లు అన్పిస్తోంది. వారిద్దరూ ఆన్ది ఫీల్డ్, ఆఫ్‌ది ఫీల్డ్ చాలా క్లోజ్‌గా ఉంటారన్న సంగతి తెలిసిందే. గతంలో మార్కస్ స్టాయినిస్ , ఆడమ్ జంపా ‘గే కపుల్స్’ అంటూ రూమర్స్ వినిపించాయి. అయితే రూమర్స్‌కు స్టోయినిస్, జంపా ఎప్పుడో చెక్ పెట్టేశారు. తాము మంచి ఫ్రెండ్స్ అని.. ఎక్కువగా గేమ్ గురించే మాట్లాడుకుంటూ ఉంటామని స్పష్టం చేశారు. 2021లో ఆడమ్ జంపా తన గర్ల్‌ఫ్రెండ్ హాటెల్ని వివాహం చేసుకోగా.. స్టోయినిష్ గతేడాది ఆఖరిలో తన ప్రియురాలు సారా జార్నుచ్ని నిశ్చితార్దం చేసుకున్నాడు. అయితే లైవ్‌షోలో ఇద్దరు స్టార్ క్రికెటర్లను అవమానించిన బసిత్ అలీపై నెటిజన్లు ఫైరవవుతున్నారు.కొంచెం అయినా సిగ్గు ఉందా అంటూ మండిపడుతున్నాడరు. కాగా జంపా ప్రస్తుతం పీఎస్ఎల్ 2026లో కరాచీ కింగ్స్ తరపున ఆడుతుండగా.. స్టోయినిష్ ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు.చదవండి: IPL 2026: ఆర్సీబీ, సన్‌రైజర్స్ కాదు.. ప్లే ఆఫ్స్‌కు చేరే జట్లు ఇవే! -
పాకిస్తానీలకు సర్కార్ ఝలక్.. పెట్రోల్ ధర భారీగా పెంపు
ఇస్లామాబాద్: పశ్చిమాసియాలో యుద్ధం కొనసాగుతున్న వేళ పాకిస్తాన్ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇరాన్ యుద్ధం కారణంగా ప్రపంచ చమురు ధరలు పెరగడంతో పాకిస్తాన్.. డీజిల్, పెట్రోల్ ధరలను భారీగా పెంచింది. కాగా, నెల రోజుల వ్యవధిలో పాకిస్తాన్లో పెట్రోల్ ధరలు పెరగడం ఇది రెండోసారి.తాజాగా పెరిగిన ధరల ప్రకారం పాకిస్తాన్లో లీటర్ పెట్రోల్ ధర 458.40 పాకిస్తానీ రూపాయలకు చేరుకుంది. అలాగే, డీజిల్ ధర లీటరుకు 520.35 పాకిస్తానీ రూపాయలకు వెళ్లింది. ప్రస్తుతం ఉన్న ధరల విషయంలో డీజిల్‌పై 54.9%, పెట్రోల్‌పై 42.7% పెంపు విధించినట్టు అక్కడి అధికారులు తెలిపారు. ఈ సవరించిన ధరలు శుక్రవారం నుంచి అమల్లోకి వచ్చాయి. కాగా, ఈ ధరలు పాకిస్తాన్ చరిత్రలోనే ఎక్కువగా ఉండటం గమనార్హం. ఈ సందర్భంగా పాకిస్తాన్ పెట్రోలియం శాఖ మంత్రి అలీ పర్వేజ్ మాలిక్ స్పందిస్తూ..‘అంతర్జాతీయ ముడి చమురు ధరలు పెరగడం వల్ల ఈ పెంపు అనివార్యమని అన్నారు. అమెరికా-ఇరాన్ యుద్ధం తర్వాత అంతర్జాతీయ మార్కెట్ ధరలు అదుపు తప్పడంతో ధరలు పెంచడం తప్పనిసరి అయ్యింది’ అని చెప్పుకొచ్చారు.అయితే, ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా పెరిగిన చమురు ధరలను కారణంగా చూపుతూ గత నెలలోనే పాకిస్తాన్.. డీజిల్, పెట్రోల్ ధరలను సుమారు 20% పెంచిన సంగతి తెలిసిందే. ఈ తాజా పెంపు ద్రవ్యోల్బణాన్ని మరింత పెంచి, దేశంలోని పేద ప్రజలపై మరింత భారం మోపుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. పాకిస్థాన్ ప్రధానంగా సౌదీ అరేబియా, యూఏఈల నుండి హోర్ముజ్ జలసంధి ద్వారా రవాణా అయ్యే చమురు దిగుమతులపై ఎక్కువగా ఆధారపడి ఉంది. పెరిగిన ధరల కారణంగా పెట్రోల్ బంకుల ముందు వాహనాలు బారులు తీరాయి. దీనిని సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. #BREAKING : WAR CRISIS ARRIVE IN PAKISTAN:Pakistan announces near 50% spike in fuel prices; long queues at pumps.42.7% increase in petrol54.9% increase in dieselPetrol up $0.49Diesel $0.66#IranWar #Iran #Dubai #ısrael #usa #Saudi #iraq #TelAvivBlast #middleeastunrest… pic.twitter.com/Z80zYCFSWd— The Globe & News (@TheGlobeNewt) April 2, 2026 -
పీఎం మోదీ, ఆర్మీ అఫీషియల్స్ మీటింగ్ వెనుక అసలు సీక్రెట్ ఇదే?
దేశం మొత్తం నిద్రలో ఉన్న వేళ, ప్రధానమంత్రి కార్యాలయం (PMO) మాత్రం యుద్ధ ప్రాతిపదికన పనిచేస్తోంది. ప్రధాని మోడీ, హోమ్ మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, విదేశాంగ మంత్రి జైశంకర్, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో పాటు జాతీయ భద్రతా సలహాదారు (NSA) అజిత్ దోవల్‌తో మూడు గంటలపాటు జరిగిన గోప్య సమావేశం దేశ భద్రతా పరిస్థితులపై దృష్టి సారించింది. దోవల్ రూపొందించిన "రెడ్ ఫైల్"లో అమెరికా–పాకిస్థాన్ రహస్య ఒప్పందం, ఇరాన్‌పై దాడుల ప్రణాళిక, భారత్‌ను యుద్ధంలోకి లాగే ప్రయత్నాలపై కీలక సమాచారం ఉన్నట్లు తెలుస్తోంది.ఇక మరోవైపు, భారత త్రివిధ దళాధిపతులు పూరీ జగన్నాథ, అమృత్సర్ స్వర్ణ దేవాలయం, ఉజ్జయిని మహాకాళి ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించడం, సరిహద్దుల్లో NOTAM జారీ చేయడం వంటి పరిణామాలు దేశం ఒక పెద్ద "నేషనల్ సెక్యూరిటీ ఈవెంట్"కు సిద్ధమవుతోందని సంకేతాలు ఇస్తున్నాయి. అమెరికా–పాకిస్థాన్ ఒప్పందం ఇరాన్‌తో ఘర్షణకు దారితీస్తే, పాకిస్థాన్ ఈ పరిస్థితిని భారత్‌పై ఒత్తిడి పెంచడానికి వాడుకోవచ్చనే ఆందోళనలతో ప్రభుత్వం అత్యంత అప్రమత్తంగా ఉంది. దీని గురించి మరింత సమాచారం తెలుసుకోవాలంటే రిటైర్డ్ మేజర్ శ్రీనివాస్ విశ్లేషణ వీడియోను క్లిక్ చేయండి. -
యుద్దానికి సిద్ధమవుతున్న భారత్!..అజిత్ దోవల్ రెడ్ఫైల్లో ఏముంది?
ఢిల్లీలోని సౌత్ బ్లాక్.. రాత్రి సమయం. దేశం మొత్తం నిద్రపోతున్న వేళ, ప్రధానమంత్రి కార్యాలయం (PMO) మాత్రం యుద్ధ ప్రాతిపదికన పనిచేస్తోంది. సాధారణంగా కనిపించే మీటింగ్‌లు కావు ఇవి. అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, ఎస్. జైశంకర్, నిర్మలా సీతారామన్ వంటి అగ్రనేతలతో పాటు, ఒక వ్యక్తి అక్కడ నిశ్శబ్దంగా కూర్చుని ఉన్నారు. ఆయనే భారత జేమ్స్ బాండ్ – అజిత్ దోవల్! అసలు ఏం జరుగుతోంది? భారత్ మరో మహా యుద్ధానికి సిద్ధమవుతోందా? గత వారం రోజులుగా ప్రధాని మోదీ హై లెవెల్ మీటింగ్స్ నిర్వహిస్తున్నారు. NSA అజిత్ దోవల్ అంటే కేవలం ఒక అధికారి కాదు, ఆయన భారత రక్షణ కవచం. రా (RAW) , ఎన్ఐఏ (NIA) ఇచ్చే అత్యంత రహస్య సమాచారాన్ని విశ్లేషించి, ఆయన ఒక 'రిస్క్ అసెస్మెంట్ ఫైల్' రూపొందించారు. దీనినే 'రెడ్ ఫైల్' అని పిలుస్తారు. సాధారణంగా ప్రపంచ నేతలెవరైనా 30 నుండి 40 నిమిషాలకు మించి చర్చలు జరపరు. కానీ మోదీ, దోవల్‌తో ఏకంగా మూడు గంటల పాటు ఏకాంతంగా చర్చించారంటే, అది చమురు ధరల గురించో, ఆర్థిక స్థితిగతుల గురించో కాదని ఇక్కడ స్పష్టమవుతోంది. అమెరికా , పాకిస్థాన్‌లు కలిసి భారత్‌ను ఇబ్బంది పెట్టడానికి వేసిన ఒక మాస్టర్ ప్లాన్ దోవల్ చేతికి చిక్కింది.ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే, ఈ సమావేశాల్లో డిఫెన్స్ మినిస్టర్ తోపాటు నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ (NSA) గంటల తరబడి గడుపుతున్నారు. మరోవైపు, భారత త్రివిధ దళాధిపతులు చేస్తున్న పనులు చూస్తుంటే ఏదో పెద్ద ముప్పు పొంచి ఉందని అర్థమవుతోంది. ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది పూరీ జగన్నాథుని సన్నిధిలో, ఎయిర్ ఫోర్స్ చీఫ్ అమర్ ప్రీత్ సింగ్ స్వర్ణ దేవాలయంలో, నేవీ చీఫ్ దినేష్ త్రిపాఠి ఉజ్జయిని మహాకాళి చెంత ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. దేశ రక్షణలో అత్యున్నత స్థానాల్లో ఉన్న వీరంతా దైవ ప్రార్థనలు చేస్తున్నారంటే, భారత్ ఏదో భారీ "నేషనల్ సెక్యూరిటీ ఈవెంట్"కు సిద్ధమవుతోందని స్పష్టమవుతోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ , పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ మధ్య ఒక రహస్య ఒప్పందం కుదిరినట్లు సమాచారం. ఇరాన్‌పై దాడులు చేయడానికి అమెరికాకు పాకిస్థాన్ తన గాలి సరిహద్దులను (Air Space) అప్పగించబోతోంది. ఒకవేళ పాకిస్థాన్ గడ్డ మీద నుంచి అమెరికా క్షిపణులు ఇరాన్ వైపు దూసుకెళ్తే, ఇరాన్ ఖచ్చితంగా పాకిస్థాన్‌పై యుద్ధం ప్రకటిస్తుంది. సరిగ్గా ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది! పాకిస్థాన్ ఈ పరిస్థితిని అడ్డం పెట్టుకుని భారత్‌ను యుద్ధంలోకి లాగాలని చూస్తోంది. భారత్ ఇప్పటికే గుజరాత్, రాజస్థాన్, పంజాబ్ సరిహద్దుల్లో 'నోటామ్' (NOTAM) జారీ చేసింది. అంటే సరిహద్దుల్లో ఎప్పుడైనా ఏం జరగొచ్చనేదానికి ఇది సంకేతం.మరోవైపు, పీఓకే (PoK) సరిహద్దుల్లో సుమారు 1500 మంది ఉగ్రవాదులు భారత్‌లోకి చొరబడటానికి సిద్ధంగా ఉన్నట్లు ఇంటెలిజెన్స్ నివేదికలు చెబుతున్నాయి. ట్రంప్ ,పాకిస్థాన్ కలిసి భారత్‌ను "టూ ఫ్రంట్ వార్" (రెండు వైపుల నుండి యుద్ధం) లోకి నెట్టాలని ప్లాన్ చేస్తున్నాయి. అందుకే ఈ మీటింగ్‌లో ఫైనాన్స్ మినిస్టర్ కూడా ఉన్నారు. యుద్ధం సంభవిస్తే బ్రహ్మోస్, ఎస్-400, రాఫెల్ వంటి అత్యంత ఖరీదైన ఆయుధాల ప్రయోగానికి అయ్యే ఖర్చును అంచనా వేస్తున్నారు. భారత్ ఇప్పుడు పాకిస్థాన్‌ను ఎలా దెబ్బకొట్టాలి? ఎంత త్వరగా ఈ ముప్పును ముగించాలి? అనే వ్యూహంలో ఉంది. శతృవు సిద్ధంగా ఉన్నాడు, కానీ భారత వార్-రూమ్ అంతకంటే వేగంగా పావులు కదుపుతోంది. ఈ మహా-సంగ్రామంలో భారత్ పైచేయి సాధిస్తుందా? మోదీ, దోవల్ వ్యూహం పాకిస్థాన్‌ను కోలుకోలేని దెబ్బ తీయబోతోందా? అనే చర్చ అంతర్జాతీయ మీడియాలో మొదలైంది. -
పాకిస్థాన్‌కు వీసా నిలిపివేసిన ఖతార్
పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధ పరిస్థితులు వివిధ దేశాల్లోని దౌత్య, రవాణా సంబంధాలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న భీకర పోరు, దానికి అమెరికా మద్దతు ఇస్తున్న నేపథ్యంలో నెలకొన్న అస్థిరతను దృష్టిలో ఉంచుకుని ఖతార్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పాకిస్థాన్ పౌరులకు ఇప్పటివరకు కల్పిస్తున్న ‘వీసా ఆన్ అరైవల్’ సౌకర్యాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది.రాయబార కార్యాలయం ప్రకటనవీసా ఆన్ అరైవల్ అంటే ఒక దేశానికి వెళ్లాలనుకునే ప్రయాణికులు తమ స్వదేశంలోనే ముందస్తుగా వీసా కోసం దరఖాస్తు చేసుకోనవసరం లేదు. నేరుగా ఆ దేశానికి చేరుకున్న తర్వాత అక్కడి విమానాశ్రయంలోనో లేదా సరిహద్దు చెక్-పోస్ట్ వద్దనో వీసా పొందవచ్చు. ఈ తాజా పరిణామంపై దోహాలోని పాకిస్థాన్ రాయబార కార్యాలయం అధికారిక ప్రకటన విడుదల చేసింది. ప్రస్తుత ప్రాంతీయ ఉద్రిక్తతల దృష్ట్యా ఖతార్ ఈ నిర్ణయం తీసుకుందని, పాక్ పౌరులు దీనికి అనుగుణంగా ఏర్పాట్లు చేసుకోవాలని సూచించింది. ‘ప్రస్తుత పరిస్థితుల కారణంగా పాకిస్థాన్ పౌరులకు వీసా ఆన్ అరైవల్ సౌకర్యం అందుబాటులో లేదు. ప్రయాణికులు ఇబ్బందులకు గురికాకుండా ఉండాలంటే ముందస్తుగానే వీసాలు పొందాలి’ అని పాక్ ఎంబసీ స్పష్టం చేసింది.ఎవరిపై ప్రభావం?ఖతార్ తీసుకున్న ఈ ఆకస్మిక నిర్ణయం వల్ల తక్షణం పనుల నిమిత్తం వెళ్లే వ్యాపారులకు ఇది సమస్యగా మారుతంది. స్వల్పకాలిక ప్రాజెక్టుల కోసం వెళ్లే నిపుణులు, వీసా నిబంధనల సరళీకరణతో ఖతార్ వెళ్లాలనుకున్న సందర్శకులకు ఇది అవాంతరంగా మారుతుంది. కేవలం పాకిస్థానే కాకుండా లెబనాన్ పౌరులపై కూడా ఖతార్ ఇవే ఆంక్షలు విధించింది. లెబనాన్ నుంచి వచ్చే వారు ఇప్పుడు అధికారిక ‘Hayya.qa’ ప్లాట్‌ఫారమ్ ద్వారా ముందుగా వీసా పొంది దాని ప్రింటెడ్ కాపీని వెంట ఉంచుకోవడం తప్పనిసరి.ఎందుకీ నిర్ణయంఖతార్ ప్రభుత్వం పాకిస్థాన్, లెబనాన్ పౌరులకు వీసా ఆన్ అరైవల్ సౌకర్యాన్ని నిలిపివేయడం వెనుక ప్రధానంగా భద్రతా, దౌత్యపరమైన కారణాలు ఉన్నాయి. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఖతార్ భౌగోళికంగా ఈ ఉద్రిక్తతలకు కేంద్ర బిందువుగా ఉంది. దేశంలోకి ఎవరు వస్తున్నారు, ఎందుకు వస్తున్నారు అనే అంశంపై పూర్తి నియంత్రణ సాధించాలని ఖతార్ భావిస్తోంది. వీసా ఆన్ అరైవల్ ఇస్తే ప్రయాణికుల పూర్తి నేపథ్యాన్ని వారు దేశానికి రాకముందే పరిశీలించడం కష్టం. అదే ముందస్తు వీసా అయితే, ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా తనిఖీ చేసే అవకాశం ఉంటుంది.దౌత్యపరమైన వ్యూహాలు - పాక్ ప్రతిపాదనమరోవైపు, పశ్చిమాసియాలో ఉద్రిక్తతలను తగ్గించేందుకు అంతర్జాతీయ స్థాయిలో దౌత్య ప్రయత్నాలు ముమ్మరం అవుతున్నాయి. యుద్ధం ఆరో వారంలోకి ప్రవేశించిన నేపథ్యంలో పాకిస్థాన్ కొన్ని ప్రతిపాదనను తెరపైకి తెచ్చింది. ఇరాన్ హార్మూజ్ జలసంధి ద్వారా నౌకాయానాన్ని పునరుద్ధరించాలని, తక్షణమే కాల్పుల విరమణ ప్రకటించాలని పాక్ కోరుతోంది. ఈజిప్ట్ విదేశాంగ మంత్రి బదర్ అబ్దెలాటీ బుధవారం టర్కీ, పాకిస్థాన్, ఖతార్, బహ్రెయిన్ విదేశాంగ మంత్రులతో ఫోన్ ద్వారా చర్చలు జరిపారు. ప్రాంతీయ భద్రతను కాపాడేందుకు సమష్టిగా పనిచేయాలని పిలుపునిచ్చారు.ఇదీ చదవండి: ఆకాశం ఎందుకో ఎరుపెక్కింది! -
‘పాక్‌ను సముద్రంలో కలిపేవాళ్లం’: నేవీ చీఫ్
ముంబై: ‘పాకిస్తాన్‌ను సముద్ర గర్భంలో కలిపివేసేందుకు భారత్ కేవలం ‘కొద్ది నిమిషాల’ దూరంలోనే ఉంది’.. అంటూ ‘ఆపరేషన్ సింధూర్’ సమయంలో భారత నౌకాదళం ఎంతటి దూకుడుగా వ్యవహరించిందో నేవీ చీఫ్ అడ్మిరల్ దినేష్ కె త్రిపాఠి వివరించారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్నాయి.ముంబైలో జరిగిన నావల్ ఇన్వెస్టిచర్ సెర్మనీలో ప్రసంగించిన అడ్మిరల్ త్రిపాఠి ‘ఆపరేషన్ సింధూర్’ వెనుక ఉన్న ఉత్కంఠభరిత వాస్తవాలను బయటపెట్టారు. ‘మేము సముద్రం నుండి పాకిస్తాన్‌పై విరుచుకుపడటానికి కేవలం నిమిషాల దూరంలో ఉన్నాం.. సరిగ్గా అదే సమయంలో భారత్ తమపై దాడులను నిలిపివేయాలని పాక్ అభ్యర్థించింది’ అని ఆయన వెల్లడించారు.‘ఆపరేషన్ సింధూర్’లో..మే 2025లో జమ్ముకశ్మీర్‌లోని పహల్గామ్లో ఉగ్రవాదులు జరిపిన దారుణమైన దాడిలో 26 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ఈ రక్తపాతానికి ప్రతీకారం తీర్చుకునేందుకు పాక్ భూభాగంలోని ఉగ్రవాద మౌలిక సదుపాయాలను తుడిచిపెట్టడమే లక్ష్యంగా మే 7, 2025న భారత్ ‘ఆపరేషన్ సింధూర్’ను ప్రారంభించింది. మూడు రోజుల పాటు (మే 10 వరకు) జరిగిన ఈ భీకర పోరాటంలో 100 మందికి పైగా ఉగ్రవాదులు హతమయ్యారు. నాడు భారత నౌకాదళం చూపిన తెగువకు పాక్ నేవీ వణికిపోయిందని, వారి యుద్ధ నౌకలు కరాచీ రేవులకే పరిమితమయ్యాయని, మక్రాన్ తీరం దాటి బయటకు వచ్చే ధైర్యం కూడా చేయలేకపోయాయని నేవీ చీఫ్ గుర్తుచేశారు.ప్రధాని మోదీ ప్రశంసలుభారత నౌకాదళ సామర్థ్యంపై దేశానికి ఉన్న నమ్మకాన్ని ఈ ఆపరేషన్ మరింత బలపరిచిందని అడ్మిరల్ అన్నారు. వెస్ట్రన్ సీబోర్డ్లో ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా 17 గంటల పాటు నౌకాదళంతో గడిపి, మన నౌకాదళం ఆపరేషనల్ సన్నద్ధతను స్వయంగా వీక్షించారని ఆయన తెలిపారు. అయితే ఈ ఆపరేషన్ ఇంకా ముగియలేదని, దేశ రక్షణ కోసం ఇది నిరంతరం కొనసాగుతూనే ఉంటుందని నేవీ చీఫ్ అన్నారు.ఇది కూడా చదవండి: రాజా రవివర్మ ‘యశోద కృష్ణ’కు రికార్డు ధర -
పాకిస్తాన్ స్టార్ బ్యాటర్‌పై నిషేధం
పాకిస్తాన్ స్టార్ బ్యాటర్ ఫకర్ జమాన్ నిషేధాన్ని ఎదుర్కొన్నాడు. పాకిస్తాన్ సూపర్ లీగ్-2026లో బాల్ టాంపరింగ్ ఆరోపణలు రుజువు కావడంతో లీగ్ యాజమాన్యం ఇతనిపై రెండు మ్యాచ్‌ల నిషేధం విధించింది. పీఎస్ఎల్లో లాహోర్ ఖలందర్స్‌కు ఆడే జమాన్.. మార్చి 29న కరాచీ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో బాల్ టాంపరింగ్‌కు పాల్పడ్డాడని ఆరోపణలు వచ్చాయి. ఈ విషయం టీవీ స్క్రీన్లలోనూ స్పష్టం కనిపించింది.అయితే జమాన్ ఈ ఆరోపణలు ఖండించాడు. తాను ఎలాంటి బాల్ టాంపరింగ్‌కు పాల్పడలేదని అన్నాడు. దీంతో మ్యాచ్ రిఫరి రోషన్ మహానామా రంగంగలోకి దిగి విచారణ చేపట్టారు. ఇందులో జమాన్ దోషిగా తేలడంతో నిషేధాన్ని ఎదుర్కొన్నాడు. బాల్ టాంపరింగ్ అంశం పీఎస్ఎల్ కోడ్ ఆఫ్ కండక్ట్‌లోని లెవల్–3 ఉల్లంఘన కిందకు వస్తుంది. ఇందుకు శిక్ష రెండు మ్యాచ్‌ల నిషేధం.నిషేధం ప్రకటనలో జమాన్ ఏప్రిల్ 3న ముల్తాన్ సుల్తాన్స్‌తో, ఏప్రిల్ 9న ఇస్లామాబాద్ యునైటెడ్‌తో జరుగనున్న మ్యాచ్‌లకు దూరం కానున్నాడు. అసలేం జరిగిందంటే..?కరాచీ కింగ్స్ విజయానికి చివరి ఓవర్లో 14 పరుగులు అవసరమయ్యాయి. ఈ ఓవర్ వేసే బాధ్యతను కెప్టెన్ షాహీన్ అఫ్రిది పేసర్ హరీస్ రవూఫ్‌కు అప్పగించాడు. అయితే ఈ క్రమంలో ఫకర్ జమాన్, అఫ్రిది, రవూఫ్ ముగ్గురూ కలిసి బౌలర్ ఎండ్ వద్ద మాట్లాడుకున్నారు. ఈ సమయంలో బంతికి ఒకరు చేతి నుంచి ఒకరు మార్చుకున్నారు.అయితే బంతిని ఫకర్ తన చేతి వేలితో గీకినట్లు కనిపించింది. దీంతో వెంటనే అంపైర్ బంతిని అతడి చేతి నుంచి తీసుకుని టాంపరింగ్‌కు గురైనట్లు నిర్ధారించారు. ఈ క్రమంలో బంతిని మార్చడంతో పాటు లహోర్‌కు ఐదు పరుగుల పెనాల్టీ విధించారు. దీంతో మ్యాచ్ ఫలితమే తారుమారైంది. జమాన్ జట్టు ఓటమిపాలైంది. -
Pakistan: 4 నుంచి లాక్డౌన్?.. ప్రభుత్వం కీలక ప్రకటన
ఇస్లామాబాద్: పొరుగు దేశం పాకిస్తాన్లో ఇంధన సంక్షోభం దృష్ట్యా లాక్డౌన్ విధించినున్నారన్న వార్తల నడుమ అక్కడి ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఇంధన సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన ‘వీకెండ్ లాక్డౌన్’ ప్లాన్‌కు ప్రావిన్షియల్ (రాష్ట్ర) ప్రభుత్వాలు గట్టిగా నో చెప్పడంతో ప్రస్తుతానికి లాక్డౌన్ నిర్ణయాన్ని ప్రభుత్వం వెనుకకు తీసుకుంది.ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యంలో చమురు ధరలు మండిపోతున్న వేళ, పాక్ ప్రభుత్వం తీవ్రమైన ఆర్థిక పొదుపు చర్యల్లో భాగంగా పలు ఆంక్షలను పరిశీలించింది. అయితే, తాజా పరిణామాలతో దేశవ్యాప్తంగా ఎలాంటి షట్‌డౌన్ ఉండబోదని స్పష్టమైంది. మధ్యప్రాచ్యంలో నెలకొన్న ఉద్రిక్తతల వల్ల ప్రపంచవ్యాప్తంగా చమురు సరఫరాకు అంతరాయం కలిగింది. దీంతో పాకిస్తాన్ తీవ్ర ఇంధన కొరతను ఎదుర్కోబోతోందని, దీనిని నియంత్రించేందుకు ఏప్రిల్ 4 లేదా 5 నుంచి ‘స్మార్ట్ లాక్డౌన్’ అమలు చేస్తారని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది.శని, ఆదివారాల్లో మార్కెట్లు మూసివేయడం, పెళ్లిళ్లు, బహిరంగ సభలపై నిషేధం, రవాణాపై ఆంక్షలు వంటి ప్రతిపాదనలతో ఒక ముసాయిదా కూడా సిద్ధమైంది. ఈ కీలక అంశంపై చర్చించేందుకు అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ అధ్యక్షతన ‘ఐవాన్-ఎ-సదర్’లో ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. ప్రధాని షెహబాజ్ షరీఫ్, కేంద్ర మంత్రులు, అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ భేటీలో పాల్గొన్నారు. లాక్డౌన్ విధిస్తే సామాన్యుల జీవితాలు చిన్నాభిన్నం అవుతాయని, ఆర్థిక వ్యవస్థ మరింత కుదేలవుతుందని రాష్ట్ర ప్రభుత్వాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. రాష్ట్రాల మద్దతు లభించకపోవడంతో కేంద్రం తన ప్రతిపాదనను ఉపసంహరించుకుంది.ప్రస్తుతానికి దేశంలో ఇంధన నిల్వలు సరిపడా ఉన్నాయని, ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదని అధికారులు భరోసా ఇచ్చారు. లాక్డౌన్ల కంటే ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయడం, ప్రజలకు ఆర్థిక ఊరటనిచ్చే చర్యలపైనే తాము దృష్టి సారిస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. పెరిగిన జెట్ ఫ్యూయల్ ధరలు, ఇతర ఇంధన సవాళ్లను ఎదుర్కొనేందుకు ప్రత్యామ్నాయ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు స్పష్టం చేసింది. ఇది కూడా చదవండి: ‘జైషే’కు భారీ దెబ్బ.. తాహిర్ అనుమానాస్పద మృతి -
‘జైషే’కు భారీ దెబ్బ.. తాహిర్ అనుమానాస్పద మృతి
బహావల్పూర్: భారత గడ్డపై నెత్తురు ఏరులు పారించిన జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ సంస్థ చీఫ్, మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ మసూద్ అజహర్ సోదరుడు మొహమ్మద్ తాహిర్ అన్వర్ పాకిస్తాన్లో మృతి చెందాడు. అతని మరణం వెనుక ఉన్న అసలు కారణాలు మాత్రం ఇప్పటికీ మిస్టరీగానే ఉన్నాయి.అనుమానాస్పద స్థితిలో మృతిచాలా కాలంగా జైషే మహమ్మద్ కార్యకలాపాల్లో అత్యంత కీలక పాత్ర పోషిస్తున్న తాహిర్ అన్వర్ పాకిస్తాన్లో అనుమానాస్పద స్థితిలో ప్రాణాలు కోల్పోయాడు. జైషే మహమ్మద్ తన అధికారిక ఛానల్ ద్వారా ఈ మృతిని ధృవీకరించింది. బహావల్పూర్లోని జామియా మసీద్ ఉస్మాన్ వలీలో అతడి అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు ప్రకటించింది. అయితే అతను అనారోగ్యంతో చనిపోయాడా లేక ఏదైనా ప్రమాదానికి గురయ్యాడా అనే విషయంలో సంస్థ మౌనం వహించడం పలు అనుమానాలకు తావిస్తోంది.భారత్‌కు పక్కలో బల్లెంలా జైషే..భారత పార్లమెంటుపై దాడి (2001), పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్ స్ట్రైక్ (2016), యూరి దాడి, 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లను బలిగొన్న పుల్వామా దాడి (2019) తదితర దారుణాల వెనుక మసూద్ అజహర్ నేతృత్వంలోని జైషే మహమ్మద్ హస్తం ఉంది. ఈ సంస్థలో తాహిర్ అన్వర్ ఏళ్ల తరబడి కీలక వ్యూహకర్తగా పనిచేస్తున్నాడు.‘ఆపరేషన్ సింధూర్’తో కోలుకోలేని దెబ్బగత ఏడాది ఏప్రిల్‌లో పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత దళాలు ‘ఆపరేషన్ సింధూర్’ చేపట్టాయి. బహావల్పూర్లోని జైషే ప్రధాన కార్యాలయం లక్ష్యంగా జరిగిన ఈ మెరుపు దాడుల్లో మసూద్ అజహర్ కుటుంబం చిన్నాభిన్నమైంది. ఆ దాడుల్లో అజహర్ సోదరి, మేనల్లుడు సహా సుమారు 10 మంది బంధువులు హతమైనట్లు గత సెప్టెంబర్‌లోనే ఆ సంస్థ పరోక్షంగా అంగీకరించింది. ఇది కూడా చదవండి: న్యూజిలాండ్ డ్రగ్ కింగ్.. ఇందిర హంతకుడి బంధువా? -
పాకిస్థాన్ చర్చలతో మాకు సంబంధం లేదు.. ఇరాన్
పశ్చిమ ఆసియాలో నెలకొన్న ఉద్రిక్తతలను తగ్గించేందుకు అమెరికా-ఇరాన్ మధ్య సయోధ్య కుదిర్చే యత్నం చేస్తున్నామని పాకిస్థాన్ ఇదివరకే ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా ఇరాన్ దీనిపై స్పందించింది. ఇస్లామాబాద్‌లో పాక్ నిర్వహించిన ఏ సమావేశంలోనూ పాల్గొనలేదని భారత్‌లోని ఇరాన్ రాయబారి స్పష్టం చేశారు.పాకిస్థాన్ ఉప ప్రధాని ఇటీవల ఇస్లామాబాద్‌లో సౌదీ అరేబియా, ఈజిప్ట్, టర్కీ విదేశాంగ మంత్రులతో సమావేశమయ్యారు. అమెరికా, ఇరాన్ చర్చలకు ఇస్లామాబాద్ ఆతిథ్యం ఇవ్వడానికి సిద్ధంగా ఉందని ఇరాన్ అధ్యక్షుడితో కూడా తాము మాట్లాడామని ఆయన ప్రకటించారు. అయితే, ఈ ప్రకటనను ఇరాన్ పూర్తిగా ఖండించింది.ఈ మేరకు ముంబైలోని ఇరాన్ కాన్సులేట్ కార్యాలయం సోమవారం ఒక ప్రకటన విడుదల చేసింది. అమెరికాతో తాము నేరుగా ఎటువంటి చర్చలు జరపడం లేదని మధ్యవర్తుల ద్వారా అమెరికా కేవలం అహేతుకమైన మితిమీరిన డిమాండ్లను మాత్రమే పంపుతోందని తెలిపారు.అమెరికా దౌత్య విధానం తరచుగా మారుతూ ఉంటుందని కానీ ఇరాన్ మాత్రం మెుదటి నుంచి ఒకే మాటపై ఉందన్నారు. అదే విధంగా పాకిస్థాన్ వారి సొంతంగా సమావేశం నిర్వహించిందని అందులో తాము పాల్గొనలేదని తెలిపారు. యుద్దం ముగింపుకు వారి ప్రయత్నం అభినందనీయమని అదే సమయంలో యుద్ధం ఎవరు మెుదలుపెట్టారో గుర్తుంచుకోవాలని ఈ సందర్బంగా ఇరాన్ రాయబారి అన్నారు. -
పాక్ కు షాకిచ్చిన ఇరాన్ .
-
పాక్ ఉప ప్రధానికి చేదు అనుభవం.. వీడియో వైరల్
ఇస్లామాబాద్: పాకిస్తాన్ ఉప ప్రధాని, విదేశాంగ మంత్రి ఇషాక్ దార్‌కు చేదు అనుభవం ఎదురైంది. పాకిస్తాన్లో జరిగిన కీలక నాలుగు దేశాల విదేశాంగ మంత్రుల సమావేశం సందర్బంగా ఇషాక్ దార్ కాలు జారి కిందపడిపోయారు. ఈ ఘటనలో ఆయనకు ఎలాంటి గాయం కాలేదు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.వివరాల మేరకు.. తాజాగా పాకిస్తాన్‌లోని ఇస్లామాబాద్‌లో నాలుగు దేశాల విదేశాంగ మంత్రుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఈజిప్ట్, టర్కీ, సౌదీ అరేబియా, పాకిస్తాన్ విదేశాంగ మంత్రులు పాల్గొన్నారు. అమెరికా, ఇరాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలలో మధ్యవర్తిగా తనను తాను నిలబెట్టుకోవడానికి ఇస్లామాబాద్ చేస్తున్న విస్తృత ప్రయత్నంలో భాగంగా ఈ సమావేశం జరిగినట్టు తెలిసింది. ఇందులో భాగంగా పాక్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్.. ఈజిప్ట్ విదేశాంగ మంత్రి బద్ర్ అబ్దెలట్టిని ఆహ్వానించే సమయంలో కాలు జారి కింద పడిపోయారు.#Pakistan के Deputy Prime Minister और Foreign Minister #Ishaq_Dhar ज़मीन पर धड़ाम!इशाक Saudi और Egypt के विदेश मंत्रियों का स्वागत कर रहे थे कि चलते चलते अचानक गिर गए.. pic.twitter.com/0H2aNHdP6i— Ruby Arun रूबी अरुण (@arunruby08) March 29, 2026దీంతో, వెంటనే అక్కడ ఉన్న అధికారులు ఆయనను పైకిలేపేందుకు సహాయం చేశారు. ఈ ఘటనలో ఆయనకు ఎలాంటి గాయాలు కాలేదని అధికారులు ధృవీకరించారు. సమావేశం యథావిధిగా కొనసాగినట్టు సమాచారం. అయితే, ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పలువురు నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. ఇలాంటికి కేవలం పాకిస్తాన్ నేతలకు మాత్రమే సాధ్యమని.. ఎవరూ ఇలా ప్రయత్నించవద్దు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.Ishaq Dar sends his regards and slots to the Foreign Ministers of Iran and Egypt like this.It's a new style of slots of Pakistan military regime 😂Note: None should try this kind of slots it's just Pakistan military regime style 😀 😂 pic.twitter.com/QbaXf36Aea— برهان الدین | Burhan uddin (@burhan_uddin_0) March 29, 2026 -
పరువు పాయే.. కాలు జారిన పాక్ ఉప ప్రధాని..
-
యుద్ద ఉద్రిక్తత.. ఇస్లామిక్ దేశాల కీలక సమావేశం
పశ్చిమాసియా యుద్దం నానాటికీ తీవ్రతరమవుతుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చర్చల రాగం పాడుతున్నా పరిస్థితుల్లో ఏ మాత్రం పరిస్థితులు నానాటికీ దిగజారతున్నాయి. ఈ నేపథ్యంలోనే పాకిస్థాన్ కీలక సమావేశం నిర్వహించింది.సౌదీఅరేబియా, టర్కీ, ఈజిప్టు, పాకిస్తాన్ విదేశాంగ మంత్రులు ఇస్లామాబాద్‌లో నేటినుంచి రెండురోజుల పాటు రౌండ్ టేబుల్ సమావేశం జరపనున్నారు. ప్రస్తుతం యుద్ధం తీవ్రస్థాయికి చేరుకునే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇరాన్, అమెరికా మధ్య సయోధ్య కుదిర్చేలా చర్చలు జరపునున్నట్లు సమాచారం.పాకిస్థాన్‌కు అటు ఇరాన్, ఇటు అమెరికాతో సత్సంబంధాలు ఉండడంతో ఈ రెండు దేశాల మధ్య "కమ్యూనికేషన్ బ్రిడ్జ్" లా వ్యవహరిస్తోందని ఇస్లామిక్ దేశాలు భావిస్తున్నాయి. అయితే పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ ఇదివరకే అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడివాన్స్ తో ఈ విషయమై నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది.ఈ మేరకు ఇస్లామిక్ దేశాల ప్రతిపాదనలను ఇది వరకే వైట్ హౌస్‌కు పంపారు. ఏప్రిల్ 6 లోపు షిప్పింగ్ మార్గాలను తెరవాలని డోనాల్డ్ ట్రంప్ డెడ్ లైన్ విధించిన నేపథ్యంలో ఈ చర్చలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఇదిలా ఉండగా ఇటీవల పాక్‌కు చెందిన చమురు నౌకను ఇరాన్ పేల్చివేసింది. కానీ పాకిస్థాన్ మాత్రం ఇరాన్‌తో సత్సంబంధాలున్నాయని బీరాలు పలుకుతుంది ఈ నేపథ్యంలో ఏం జరుగుతుందో వేచి చూడాలి. -
పాకిస్తాన్‌పై అమెరికా ఏజెన్సీ సర్వే.. రిపోర్టులో ఏముందంటే?
పాకిస్థాన్ వక్రబుద్ధి మరోసారి బట్టబయలైంది. అమెరికా కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్ (CRS) నిర్వహించిన సర్వేలో కీలక విషయాలు వెల్లడయ్యాయి. భారత్‌ను టార్గెట్‌గా చేసుకునే ఉగ్రవాద సంస్థలకు పాకిస్థాన్ తన భూభాగంలో ఆశ్రయం కల్పిస్తోందని నివేదిక తెలిపింది. పాకిస్థాన్ తీరు గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. దశాబ్ధాల కాలంగా ఆదేశం భారత్‌పై విషం చిమ్మూతూనే ఉంది. మనం దేశం పైకి దాడి చేయడానికి పరోక్షంగా ఉగ్రమూకలకు మద్ధతిచ్చి భారత్‌పైకి ఊసిగొల్పడం ఆ దేశానికి సాధారణ విషయమే. తాజాగా అమెరికాకు చెందిన ఓ ఏజెన్సీ సర్వేలోని ఇవే అంశాలు వెల్లడయ్యాయి. 2008 ముంబై దాడులకు కారణమైన లష్కరే ఏ తోయిబా, 2001 భారత పార్లమెంటు దాడికి పాల్పడిన జైషే మహమ్మద్ వంటి సంస్థలు ఇప్పటికీ పాక్ భూభాగం నుండి పనిచేస్తున్నాయని నివేదిక పేర్కొంది. గత పదకొండేళ్లుగా ఆ దేశంలో ఉగ్రవాదం ఎన్నడూ లేనంత అత్యధిక స్థాయికి చేరుకుందని తెలిపింది. 2019లో 365గా ఉన్న మరణాల సంఖ్య, 2025 నాటికి 4,001కి చేరుకుంది. ఇది గత 11 ఏళ్లలో ఇదే అత్యధికమంది.ఆ దేశంలో ఐదు రకాలైన ఉగ్రవాద సంస్థలు పని చేస్తున్నాయని వాటిలో పాకిస్థాన్ ప్రభుత్వానికి అత్యంత ప్రమాదకరమైన సంస్థగా తెహ్రీక్-ఇ-తాలిబన్ పాకిస్థాన్ (TTP) నిలిచిందని పేర్కొంది. వీరు పాక్ ప్రభుత్వాన్ని పడగొట్టి షరియా చట్టాన్ని అమలు చేయాలని చూస్తున్నారని తెలిపింది. ప్రస్తుతం అమెరికా పాక్‌తో అంటగాచుకొని తిరుగుతుంది. ఈ నేపథ్యంలో ఆదేశానికి చెందిన ఏజెన్సీ రిపోర్టు ఇవ్వడం ఇప్పుడు చర్చనీయాంశమైంది.కాగా ఇటీవల టెర్రరిజం గ్లోబల్ ఇండెక్స్ ప్రచురించిన నివేదికలోనూ పాక్ మెుదటి స్థానంలో నిలిచింది. CRS అనేది అమెరికా కాంగ్రెస్ సభ్యులకు సమాచారం అందించే స్వతంత్ర పరిశోధనా విభాగం. దీని నివేదికలను అమెరికా ప్రభుత్వ అధికారిక నిర్ణయాలుగా పరిగణించలేము, కానీ ఇవి విధాన రూపకల్పనలో కీలక పాత్ర పోషిస్తాయి. -
పాక్‌కు షాకిచ్చిన ఇరాన్.. చమురు నౌకపై బాంబుల దాడి
పాకిస్థాన్‌కు ఇరాన్ షాకిచ్చింది. టెహ్రాన్ అనుమతి లేకుండా హర్మూజ్ జలసంధి దాటుతున్న పాక్‌కు చెందిన చమురు షిప్‌ను పేల్చేసింది. యుద్ధానికి మధ్యవర్తిత్వం వహిస్తామంటూ పాక్ బీరాలు పలుకుతున్న వేళ ఇరాన్ దాడి చేయడం ఇప్పుడు చర్చనీయాంశమయ్యింది.పశ్చిమాసియా యుద్ధం ఇంతట్లో శాంతించేలా లేదు. ఇరాన్ చర్చలకు ఎట్టి ససేమిరా అంటూ దాడులకు తెగబడుతుంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చర్చల మంత్రం జపించినా టెహ్రాన్ శాంతించడం లేదు. ఓ వైపు ఇజ్రాయెల్‌పై దాడులు చేస్తుంది. అమెరికా ఆర్మీ సైతం తమ దేశంలో దిగితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించింది.తాజాగా పాకిస్థాన్‌కు చెందిన ఓ చమురు నౌకను ఇరాన్ ధ్వంసం చేసింది. దుబాయ్, అబుదాబీ సముద్ర తీరంలో ఈ అటాక్ జరిగినట్లు తెలుస్తోంది. అయితే రెండురోజుల క్రితం హర్మూజ్‌లో పాకిస్థాన్ నౌకను ఇరాన్ అడ్డుకోవడం తెలిసిందే. అనుమతి లేకుండా నౌక జల సంధి నుంచి వెళ్లేందుకు ప్రయత్నించడంతోదానిని అడ్డుకున్నట్టు ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ ప్రకటించింది. తాజాగా పాక్‌కు చెందిన మరో చమురు నౌకపై దాడి చేసి ధ్వంసం చేసింది. అయితే ఇరాన్‌తో తమకు సత్సంబంధాలున్నాయని యుద్ధానికి మధ్యవర్తిత్వం వహిస్తామని పాకిస్థాన్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఆ దేశానికి చెందిన నౌకపైనే దాడి చేయడం చర్చనీయాంశమైంది. ఈ ఘటనపై పాకిస్థాన్ ఎలా స్పందిస్తోందో తెలియాల్సి ఉంది. మరోవైపు భారత్‌కు చెందిన నౌకలకు ఇరాన్ హర్మూజ్ జలసంధి దాటడానికి అనుమతిస్తోంది.🚨🚨 Just in Breaking 🇵🇰 Iran destroys Pakistan oil tanker that attempted to pass through the Strait of Hormuz without permission.....See more pic.twitter.com/kvYfaniJeJ— INN Iran National News (@INNewx) March 27, 2026 -
ఆదిత్య ధర్‌కు పాకిస్తాన్ ప్రజల వింత డిమాండ్
రణ్వీర్ సింగ్- ఆదిత్యధర్ కాంబినేషన్ సినిమా ‘ధురంధర్2’ హిట్ టాక్‌తో బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతుంది. గతేడాది విడుదలైన ‘ధురంధర్-1’ సీక్వెల్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కించిన విషయం తెలిసిందే. ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ కాసుల వర్షం కురిపిస్తోంది. ఇప్పటికే రూ. 1000 కోట్ల మార్క్‌ను దాటేసింది. అయితే, ఈ కలెక్షన్స్ గురించి పాక్స్తాన్లోని ల్యారీ ప్రాంత ప్రజలు ఏమనుకుంటున్నారనే అంశంపై ఒక వీడియో వైరల్ అవుతుంది.ధురంధర్-2 కలెక్షన్స్‌పై నెటిజన్లకు నవ్వు పుట్టించేలా ఈ వీడియో ఆసక్తిగా ఉంది. ఈ మూవీలో ఎక్కువగా కరాచీలోని ల్యారీ ప్రాంత నివాసుల జీవితం గురించి చూపించారు. ఇప్పుడు ఈ చిత్రం భారీ విజయం సాధించడంతో అక్కడి ప్రజలు సరదాగా మాట్లాడుకుంటూ కనిపిస్తున్నారు. ధురంధర్-2 రూ. 1000 కోట్లు వసూలు చేసింది కాబట్టి, దర్శకుడు ఆదిత్య ధర్ అందులో నుంచి రూ. 500 కోట్లు తిరిగి తమకు ఇచ్చేయాలని, ఆ డబ్బుతో తమ ల్యారీ ప్రాంతంలో మంచి రోడ్లు నిర్మించుకుంటామని వారు కోరడం విశేషం.ఎంతో చమత్కారంగా ఉన్న ఈ వ్యాఖ్యలు నెటిజన్ల మనసులను తాకింది. దీంతో వారు ఈ వీడియోను విస్తృతంగా షేర్ చేస్తున్నారు. ల్యారీ ప్రజల నిజ జీవిత సమస్యలను సినిమాలో చాలా చక్కగా చూపించారని కూడా వారు అంటున్నారు. తమ జీవితాలు ఎలా ఉంటాయో ఈ మూవీ ద్వారా ప్రపంచానికి చూపించారని దర్శకుడిపై వారు ప్రశంసలు కూడా కురిపించడం విశేషం.Pakistani delulu aawam is saying that Aditya Dhar will earn 1000 Crore from #Dhurandhar2TheRevenge , he should return back 500 crore to Lyari because we don't have good roads here 😭😭😭😂😂😂😂 pic.twitter.com/kBdtGYvPla— Chota Don (@choga_don) March 27, 2026 -
పాక్‌పై భారత్‌దే పైచేయి
మాలే (మాల్దీవులు): దక్షిణాసియా ఫుట్‌బాల్ సమాఖ్య (శాఫ్) అండర్–20 పురుషుల ఫుట్‌బాల్ చాంపియన్‌షిప్‌లో భారత జట్టు శుభారంభం చేసింది. పాకిస్తాన్ జట్టుతో గురువారం జరిగిన తొలి లీగ్ మ్యాచ్‌లో భారత జట్టు 3–0 గోల్స్ తేడాతో గెలిచింది. భారత్ తరఫున విశాల్ యాదవ్ (3వ నిమిషంలో) ఒక గోల్ చేయగా... ఒమంగ్ డోడుమ్ (64వ, 88వ నిమిషంలో) రెండు గోల్స్ సాధించాడు. వరుసగా రెండో పరాజయంతో పాకిస్తాన్ ఈ టోర్నీ నుంచి నిష్క్రమించింది. బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో పాకిస్తాన్ 0–2 గోల్స్ తేడాతో ఓడిపోయింది. మూడు జట్లున్న గ్రూప్ ‘బి’లో భారత్, బంగ్లాదేశ్ చెరో విజయం సాధించి సెమీఫైనల్‌కు అర్హత సాధించాయి. శనివారం భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య మ్యాచ్ విజేత గ్రూప్ ‘బి’ టాపర్‌గా నిలుస్తుంది. ఇప్పటి వరకు ఏడుసార్లు ‘శాఫ్’ అండర్–20 చాంపియన్‌షిప్ జరగ్గా... భారత జట్టు నాలుగుసార్లు టైటిల్ సాధించింది. నేపాల్ రెండుసార్లు, బంగ్లాదేశ్ ఒకసారి టైటిల్ సొంతం చేసుకున్నాయి. -
భారత్ X పాకిస్తాన్
మాలె (మాల్దీవులు): దక్షిణాసియా ఫుట్‌బాల్ సమాఖ్య (శాఫ్) అండర్–20 చాంపియన్‌షిప్‌లో భాగంగా గురువారం చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో భారత జట్టు తలపడనుంది. ఈ టోర్నమెంట్లో మొత్తం ఏడు జట్లు పాల్గొంటుండగా... పాకిస్తాన్, బంగ్లాదేశ్‌తో కలిసి భారత్ గ్రూప్ ‘బి’ నుంచి పోటీ పడుతోంది. శనివారం బంగ్లాదేశ్‌తో భారత్ మ్యాచ్ ఆడనుంది. ఈ రెండిట్లో ఒక్క మ్యాచ్‌లో విజయం సాధించినా... మన జట్టు నేరుగా సెమీఫైనల్‌కు చేరే అవకాశం ఉంది. గత మ్యాచ్‌లో బంగ్లాదేశ్ చేతిలో ఓడిన పాకిస్తాన్ జట్టు భారత్‌పై ఏమాత్రం పోరాడుతుందో చూడాలి. -
పాక్‌లా మనం దళారి కాదు
న్యూఢిల్లీ: ప్రతి ఒక్కరినీ కష్టాలకడలిలో ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధానికి ఇకనైనా ముగింపు పలకాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు ప్రధాని మోదీ హితబోధ చేశారని అఖిలపక్ష సమావేశంలో విపక్షాలకు కేంద్ర ప్రభుత్వం స్పష్టంచేసింది. యుద్ధం మరింత విస్తరించకుండా భారత్ తన వంతుగా ఎలాంటి కృషిచేయట్లేదన్న విపక్షాల ఆరోపణలను ఈ సందర్భంగా కేంద్రప్రభుత్వం తోసిపుచ్చింది. పాకిస్తాన్లా భారత్ దళారీగా వ్యవహరించబోదని విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ స్పష్టంచేశారు. ప్రభుత్వ వివరణపై విపక్షపారీ్టలు పెదవి విరిచాయి. ఈ అఖిలపక్ష భేటీకి బుధవారం పార్లమెంట్ కాంప్లెక్స్ వేదికగా నిలిచింది. బుధవారం సాయంత్రం కేంద్ర రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ సారథ్యంలో మొదలైన ఈ అఖిలపక్ష భేటీలో ప్రభుత్వం తరఫున హోం మంత్రి అమిత్‌షా, పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ పురి, విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెణ్ రిజిజు పాల్గొన్నారు. విపక్షాల నుంచి తారిఖ్ అన్వర్, ముకుల్ వాస్నిక్(కాంగ్రెస్), ధరేంద్ర యాదవ్(ఎస్పీ), సస్మిత్ పాత్రా(బీజేడీ), సంజయ్ ఝా(జేడీయూ), శ్రీకాంత్ షిండే(శివసేన), సంజయ్‌సింగ్(ఆప్), జాన్ బ్రిటాస్ (సీపీఎం), సుప్రియా సూలే(ఎన్సీపీ–ఎస్పీ), అరవింద్ సావంత్(శివసేన–యూబీటీ), అసదుద్దీన్ ఒవైసీ(ఏఐఎంఐఎం) తదితర నేతలు పాల్గొని దాదాపు రెండు గంటలపాటు పశ్చిమాసియా అంశంపై చర్చించారు.యుద్ధం ముగింపు కోసం అమెరికా, ఇరాన్ మధ్య మధ్యవర్తిత్వం నెరిపేందుకు తాము సిద్ధంగా ఉన్నామని మనకన్నా చిన్నదేశం పాకిస్తాన్ ముందుకొచ్చిందని, భారత్ కనీసం నోరుమెదపలేదని విపక్షాలు చేసిన ఆరోపణలపై మంత్రి ఎస్.జైశంకర్ స్పందించారు. ‘‘దళారిలాగా మధ్యవర్తిత్వం కోసం అర్రులుచాచడం పాకిస్తాన్‌కు అలవాటే. 1981 నుంచి అమెరికా పాకిస్తాన్‌ను ఇలాగే ఉపయోగించుకుంటోంది. పాకిస్తాన్లా భారత్ దళారీ దేశం కాదు. అంతర్జాతీయ భౌగోళిక రాజకీయాల్లో భారత్ ఎప్పుడూ జోక్యంచేసుకోదు. మధ్యవర్తిత్వం వహించబోదు. యుద్ధం ముగింపు కోసం భారత్ తన వంతు కృషిచేస్తోంది. మౌనంగా కూర్చోలేదు. సందర్భానుసారం మన వైఖరి తెలియజేస్తున్నాం. ఇరాన్ సుప్రీంనేత ఖమేనీ మరణవార్త తెలియగానే మోదీ సర్కార్ స్పందించలేదన్న విపక్షాల వాదనల్లో నిజం లేదు. ఇరాన్ ఎంబసీని తెరచిన వెంటనే విదేశాంగ కార్యదర్శి వెళ్లి సంతాపం తెలిపారు. అక్కడి సంతాపసూచిక పుస్తకంలో సంతకం కూడా చేసి వచ్చారు’’అని అన్నారు. మన వాళ్ల భద్రత, ఇంధన భద్రత ముఖ్యం ‘‘గల్ఫ్ ప్రాంతంలో నివసిస్తున్న భారతీయుల భద్రతే మాకు ముఖ్యం. దీంతోపాటే దేశీయ ఇంధన అవసరాలను సంపూర్ణంగా తీర్చడం పైనా మేం దృష్టిసారించాం. ఈ విషయంలో దౌత్య విజయం సాధించాం. భారత్‌లో పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ, సీఎన్జీ నిల్వలపై ఆందోళన అవసరం లేదు. ఎప్పటికప్పుడు ముడిచమురు, ఇంధన నౌకలు విదేశాల నుంచి వస్తూనే ఉన్నాయి. మరిన్ని నౌకలు మార్గమధ్యంలో ఉన్నాయి. హార్మూజ్ గుండా రావాల్సిన 18 నౌకలు అక్కడే చిక్కుకుపోయిన మాట వాస్తవమే. హార్మూజ్ గుండా సరఫరా తగ్గడంతో ప్రత్యామ్నాయ సముద్ర మార్గాలపై దృష్టిసారించాం. ముడి చమురు, గ్యాస్‌లను వేరే దేశాల నుంచి తెప్పిస్తున్నాం. భారత్ కేవలం గల్ఫ్‌దేశాల నుంచేకాకుండా మొత్తంగా 41 దేశాల నుంచి ఆయిల్, గ్యాస్‌లను కొనుగోలుచేస్తోంది. మనకు అమెరికా అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా, ఇజ్రాయెల్ అతిపెద్ద సాంకేతిక భాగస్వామిగా ఉన్నాయి. మనకు ఇరాన్‌తోనూ సత్సంబంధాలున్నాయి’’అని ప్రభుత్వం విపక్షాలకు తెలియజేసింది. ప్రభుత్వ వివరణపై విపక్షపారీ్టల నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు. పశ్చిమాసియా పరిణామాలపై తక్షణం 193వ నిబంధన కింద లోక్‌సభలో, 176వ నిబంధన కింద రాజ్యసభలో చర్చ జరపాలని విపక్షాలు డిమాండ్‌చేశాయి. మరోవైపు విపక్షనేత రాహుల్‌గాంధీ అఖిలపక్ష భేటీకి రాకుండా అత్యంత బాధ్యతారాహిత్యంగా వ్యవహరించారని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి వ్యాఖ్యానించారు. -
పాకిస్తాన్ మర్యాద తీసి పారేసిన గిల్లెస్పీ
ఆస్ట్రేలియా మాజీ స్పీడ్‌స్టర్ జేసన్ గిల్లెస్పీ పాకిస్తాన్ మర్యాద తీసి పారేశాడు. పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో కొత్తగా ఏర్పడిన హైదరాబాదు కింగ్స్‌మెన్ ఫ్రాంచైజీకి హెడ్ కోచ్‌గా వ్యవహరిస్తున్న అతను.. ఫ్రాంచైజీ తరఫున రూపొందించే వెల్కమ్ వీడియోలో పాల్గొనడానికి నిరాకరించారు. ఈ సంప్రదాయాన్ని ఆయన స్టుపిడ్ అని పిలుస్తూ పాక్ అభిమానులు, ఫ్రాంచైజీ యాజమాన్యం మనోభావాలను దెబ్బ తీశాడు. గిల్లెస్పీ నుంచి ఈ ఊహించని చర్యకు పాక్ క్రికెట్ అభిమానులు తొలుత షాక్ అయ్యారు. ఆతర్వాత ఫైరవవుతన్నారు.వాస్తవానికి గిల్లెస్పీ ఇలా చేయడానికి కారణాలు లేకపోలేదు. గతంలో అతను పాక్ జాతీయ జట్టుకు కోచ్‌గా పని చేసినప్పుడు పీసీబీ వల్ల చాలా చేదు అనుభవాలు ఎదుర్కొన్నాడు. అవి మనసులో పెట్టుకునే అతను ఇలా ప్రవర్తించి ఉంటాడని క్రికెట్ వర్గాలు అనుకుంటున్నాయి.కాగా, కింగ్స్‌మెన్ ఫ్రాంచైజీ నిన్న తమ ఆటగాళ్లు మరియు సపోర్ట్ స్టాఫ్ కోసం సోషల్ మీడియాలో ఓ వీడియోను విడుదల చేసింది. ఇందులో గిల్లెస్పీ కూడా కనిపించినప్పటికీ, హోటల్ లాబీకి రావడానికి ఆయన నిరాకరించారు. నాకు చాలా పని ఉంది. మీరు ఆ మూర్ఖమైన వీడియోలు తీయమని అంటున్నారు. నేను చేయను అని స్పష్టంగా చెప్పారు. ఇదిలా ఉంటే, హైదరాబాద్ కింగ్స్‌మెన్ మార్నస్ లాబుషేన్ నాయకత్వంలో మార్చి 26న లాహోర్ ఖలందర్స్‌తో తమ తొట్ట తొలి పీఎస్ఎల్ మ్యాచ్ ఆడనుంది. ఇంధన సంక్షోభం కారణంగా PCB ఈ టోర్నీని పరిమిత వేదికలలో, ప్రేక్షకులు లేకుండా నిర్వహించనుంది. -
యుద్ధంలోకి పాక్ ఎంట్రీ
-
పాకిస్థాన్‌కు ఇరాన్ బిగ్ షాక్!
టెహ్రాన్: పాకిస్థాన్‌కు ఇరాన్ షాకిచ్చింది. హర్మూజ్ జలసంధిలో పాక్ నౌక్‌ను ఇరాన్ అడ్డుకుంది. అమెరికా-ఇరాన్ మధ్య తామే మధ్యవర్తిత్వం వహిస్తున్నామంటూ పాక్ గొప్పలు చెబుతోంది. ఇరాన్ తాము చెప్పినట్లే వింటోంది అంటూ బీరాలు పలికింది. ఈ క్రమంలో హర్మూజ్ జలసంధిలో పాక్ నౌకలకు అనుమతి లేదంటూ ఇరాన్ వాటిని అడ్డుకుంది. ఇరాన్‌లోని హోర్ముజ్ జలసంధి వద్ద అనుమతి లేకుండా ప్రయాణించడానికి ప్రయత్నించిన కంటైనర్ నౌక సీలెన్ ను ఇరాన్ నావికాదళం వెనక్కి తిప్పింది. ఈ నౌక పాకిస్తాన్‌లోని కరాచీకి వెళ్తుండగా, అవసరమైన అనుమతులు లేకపోవడంతో ఇరాన్ అధికారుల చర్యలు అంతర్జాతీయ వాణిజ్యంపై దృష్టిని ఆకర్షించాయి.ఇరాన్‌లోని కాబూల్ రాయబార కార్యాలయం ప్రకటన ప్రకారం.. సీలెన్ అనే కంటైనర్ నౌకను ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) నేవీ వెనక్కి తిప్పింది. నౌక చట్టపరమైన ప్రోటోకాళ్లను పాటించకపోవడం, హర్మూజ్ జలసంధి గుండా వెళ్లేందుకు అవసరమైన అనుమతి లేకపోవడమే ఇందుకు కారణమని స్పష్టం చేసింది. ‘ఈ జలసంధి గుండా ఏ నౌక అయినా ప్రయాణించాలంటే ఇరాన్ సముద్రాధికారులతో పూర్తి సమన్వయం అవసరం’ఉందని పునరుద్ఘాటించింది. ఈ సంఘటనతో పాకిస్తాన్‌కు వెళ్తున్న వాణిజ్య నౌకలపై ప్రభావం పడే అవకాశం ఉంది. హర్మూజ్ జలసంధి మూసివేత లేదా నియంత్రణ కఠినతరం అయితే, చమురు ధరలు, వాణిజ్య సరఫరా గొలుసుపై గణనీయమైన ప్రభావం చూపవచ్చు. ఇరాన్ తీసుకున్న ఈ చర్య, ప్రాంతీయ భద్రతా పరిస్థితులు ఎంత సున్నితంగా ఉన్నాయో మరోసారి గుర్తు చేసింది.ఇరాన్ తాజా నిర్ణయం ద్వారా రెండు ముఖ్యమైన సందేశాలు ఇచ్చింది. సముద్ర మార్గాలపై తన సార్వభౌమాధికారాన్ని కాపాడుకుంటుందనే సంకేతం ఇచ్చింది. దీంతో పాటు ప్రాంతీయ ఘర్షణల మధ్య తన నియంత్రణను మరింత బలపరుస్తుందనే ఉద్దేశాన్ని వ్యక్తం చేసింది. తద్వారా పాకిస్తాన్, ఇతర వాణిజ్య భాగస్వాములు ఈ సంఘటనను గమనించి, భవిష్యత్తులో ఇలాంటి సమస్యలు తలెత్తకుండా ఇరాన్‌తో సమన్వయం పెంచుకోవాల్సిన అవసరం ఉందని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. -
పాక్ కు ఇరాన్ షాక్.. హర్ముజ్ లో నౌక అడ్డగింత
-
యుద్ధం ముగింపునకు ట్రంప్ బిగ్ ప్లాన్.. ఇరాన్‌కు కష్టమే?
వాషింగ్టన్: పశ్చిమాసియాలో యుద్ధం జరుగుతున్న వేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఇరాన్ యుద్ధం ముగింపునకు 15 పాయింట్ల ప్రణాళికను ట్రంప్ ప్రకటించారు. ఈ ప్రణాళికలో ప్రధానంగా ఇరాన్‌కి అణ్వాయుధాలు ఉండకూడదని, క్షిపణి కార్యక్రమాలను తగ్గించాలని సూచనలు చేశారు. దీంతో, ట్రంప్ ప్రణాళికను ఇరాన్ అంగీకరిస్తుందా? అనే చర్చ నడుస్తోంది.కాగా, ఇరాన్‌తో యుద్ధం నేపథ్యంలో చర్చలకు సిద్దమని అధ్యక్షుడు ట్రంప్ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే యుద్ధం ముగింపునకు 15 పాయింట్ల ప్రణాళికను ట్రంప్ సిద్దం చేసినట్టు ఇజ్రాయెల్ చానెల్ 12 పలు కథనాలను వెల్లడించింది. ఇందులో ముఖ్యంగా ఇరాన్‌కి అణ్వాయుధాలు ఉండకూడదని, క్షిపణి కార్యక్రమాలను తగ్గించాలని, హార్మూజ్ సముద్ర మార్గాన్ని తెరిచి ఉంచాలని, ఒక నెల కాలం కాల్పుల విరమణ జరగాలని సూచించారు. అయితే, ఇరాన్ ఈ చర్చలు జరుగుతున్నాయనే విషయాన్ని ఖండించింది. కాబట్టి ఈ ప్రణాళిక అమలు అవుతుందా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఇక, ఇరాన్‌కి ఉన్న మూడు ప్రధాన శక్తులను (అణు, క్షిపణి, ప్రాంతీయ ప్రభావం) వదులుకోవాలని ట్రంప్ కోరుతున్న నేపథ్యంలో ఇది అమలు కష్టమని విశ్లేషకులు అంటున్నారు.ట్రంప్ 15 పాయింట్ల ప్రణాళికలో ముఖ్యాంశాలు..అణ్వాయుధాలు: ఇరాన్‌కి అణ్వాయుధాలు ఉండకూడదు, అణు కార్యక్రమాన్ని పరిమితం చేయాలి.క్షిపణి కార్యక్రమాలు: బాలిస్టిక్ మిసైల్ ప్రోగ్రామ్‌ను తగ్గించాలి.హార్మూజ్ సముద్ర మార్గం: అంతర్జాతీయ వాణిజ్యానికి కీలకమైన ఈ మార్గాన్ని తెరిచి ఉంచాలి.కాల్పుల విరమణ: ఒక నెలపాటు కాల్పుల విరమణ ప్రకటించి చర్చలు జరపాలి.ప్రాంతీయ ప్రభావం: ఇరాన్ తన ప్రాంతీయ ప్రభావాన్ని తగ్గించాలి.పాకిస్తాన్ మధ్యవర్తిత్వం: ఈ ప్రణాళికను ఇరాన్‌కి పాకిస్తాన్ ద్వారా పంపించారు.సివిల్ న్యూక్లియర్ ఎనర్జీ: బుషెహర్ వద్ద ఇరాన్‌కి శాంతియుత అణు శక్తి అభివృద్ధికి సహాయం అందించవచ్చని సూచన.నతాంజ్, ఇస్ఫహాన్, ఫోర్డోలను నిలిపివేసి ధ్వంసం చేయాలి.ఇరాన్ సరిహద్దులలోని సమస్త సమాచారాన్ని పొందే పూర్తి అధికారం IAEAకు ఉంటుంది.ఇరాన్ ప్రాక్సీ నెట్‌వర్క్‌ను విడిచిపెట్టాలి.క్షిపణుల భవిష్యత్ వినియోగం: కేవలం ఆత్మరక్షణ ప్రయోజనాల కోసం మాత్రమేIsrael's Channel 12 (@yaronavraham) published the Trump Administration's 15-point plan (I counted 14) sent to Iran to end the war:1. All existing nuclear capabilities will be dismantled.2. A commitment that Iran will never strive to obtain nuclear weapons.3. No material will…— Ariel Oseran أريئل أوسيران (@ariel_oseran) March 24, 2026మరోవైపు.. ఇరాన్‌పై ట్రంప్ మాటల దాడి కొనసాగిస్తున్నారు. ఈ యుద్ధంలో ఇరాన్ నౌకాదళం , వైమానిక దళం పూర్తిగా నాశనమయ్యాయని ట్రంప్ పేర్కొన్నారు. యుద్ధంలో ఇరాన్ పూర్తిగా ఓడిపోయిందని, సైన్యంపరంగా వాళ్లు చచ్చిపోయినట్లేనని వ్యాఖ్యానించారు. అలాగే అణ్వాయుధాన్ని ఎప్పటికీ తయారుచేయకుండా ఉండేందుకు ఇరాన్ అంగీకరించిందని తెలిపారు. అంతేకాకుండా.. ఇరాన్ కమ్యూనికేషన్ వ్యవస్థలు కూడా కుప్పకూలాయి. దాదాపుగా వారి వద్ద ఉన్న ప్రతీదీ పోయింది. టెహ్రాన్‌తో పాటు వారి దేశంలోని ఇతర ప్రాంతాలపై అమెరికా విమానాలు చక్కర్లు కొడుతున్నాయి’ అని చెప్పారు. ఇదే సమయంలో అమెరికాకు ఇరాన్ హార్మూజ్ జలసంధికి సంబంధించిన ఒక పెద్ద బహుమతి ఇచ్చిందని ట్రంప్ వెల్లడించారు. అయితే ఆ బహుమతి ఏమిటన్న వివరాలను మాత్రం ట్రంప్ వెల్లడించలేదు. -
అత్యంత కాలుష్య దేశంగా పాక్.. నగరాల్లో మాత్రం?
2025 సంవత్సరాలనికి గానూ ప్రపంచవ్యాప్తంగా కాలుష్య నగరాల జాబితాను ఐక్యూ ఎయిర్ విడుదల చేసింది. ఇందులో అత్యంత కాలుష్య దేశంగా పాకిస్తాన్ నిలిచింది. అదే విధంగా అత్యంత కాలుష్య నగరంగా భారత్‌లోని లోనీ నగరం ఉన్నట్లు నివేదిక తెలిపింది.ప్రపంచంలోని వాయి నాణ్యతపై స్విట్జర్లాండ్‌కు లోని ఐక్యూఎయిర్ సంస్థ నివేదిక విడుదల చేసింది. అందులో అత్యంత కాలుష్యం దేశంగా పాకిస్థాన్ నిలువగా, రెండవ స్థానంలో బంగ్లాదేశ్, మూడవ స్థానంలో కజకిస్థాన్ నిలిచింది. ఈ జాబితాలో భారత్ ఆరో స్థానంలో నిలిచినట్లు నివేదిక పేర్కొంది. మెుత్తంగా 143 దేశాల్లో వాయు నాణ్యత పరీక్షలు నిర్వహించగా వాటిలో 130 దేశాలు WHO వాయు నాణ్యత ప్రమాణాలు చేరుకోలేక పోయాయి.ఈ నేపథ్యంలోనే భారత్‌లోని లోనీ నగరం ప్రపంచంలోని అత్యంత కాలుష్యమైన నగరంగా నిలిచింది. ఘజియాబాద్‌కు సమీపంలో, ఢిల్లీ సరిహద్దులో ఉండే ఈ పట్టణంలో గాలి నాణ్యత అత్యంత ప్రమాదకర స్థాయికి చేరింది. ఇక్కడ పీఎం2.5 కణాల సాంద్రత 112.5 మైక్రోగ్రాములుగా నమోదైంది. ఇది ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) నిర్దేశించిన ప్రమాణాల కంటే 22 రెట్లు ఎక్కువ. అదే విధంగా రెండవ స్థానంలో చైనా హోటన్ ,3. బర్నీహత్ (మేఘాలయ) - 4. న్యూఢిల్లీ (భారత్) నిలిచాయి. మెుత్తంగా ప్రపంచంలోని టాఫ్ 10 కాలుష్య నగరాల్లో ఐదు భారతీయ నగరాలే ఉండడం ఆందోళన కలిగించే విషయం -
పాక్ మునీర్‌తో ట్రంప్ ఫోన్ కాల్.. అంతలోనే షాక్
వాషింగ్టన్: ఇరాన్‌తో అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం కొనసాగుతున్న వేళ మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇరాన్‌తో చర్యలు జరిపేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ట్రంప్ వెల్లడించారు. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ వేదికగా ఇరాన్, అమెరికా మధ్య చర్యలు జరుగుతాయనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే, దీన్ని వైట్‌హౌస్ వర్గాలు ఖండించాయి. చర్యలు గురించి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేసింది.అయితే, ఇరాన్‌తో ట్రంప్ చర్యల నేపథ్యంలో పాకిస్తాన్ సైనాధికారి ఆసిమ్ మునీర్‌తో ట్రంప్ ఫోన్లో మాట్లాడినట్టు వార్తలు బయటకు వచ్చాయి. మధ్యవర్తిత్వానికి ఆయనే ఉండాలని కోరినట్టు కథనాలు పేర్కొన్నాయి. ఇదేసమయంలో అమెరికా-ఇరాన్ చర్చలకు వేదికగా ఇస్లామాబాద్‌ను పాకిస్తాన్ ప్రతిపాదించినట్టు మరో వార్త కూడా బయటకు వచ్చింది. ఇది ఒక ముఖ్యమైన దౌత్యపరమైన ముందడుగు అంటూ పలు కథనాలు వెలువడ్డాయి.Pakistan army chief speaks with US President Trump about the ongoing West Asia conflict as Islamabad positions itself as a mediator: UK media report.#Pakistan #WestAsiaConflict #Iran #Israel #ITVideo | @Sriya_Kundu pic.twitter.com/VCnOzetBio— IndiaToday (@IndiaToday) March 24, 2026ఈ క్రమంలో పాక్‌లో మధ్య వర్తిత్వ చర్చల కథనాలపై వైట్‌హౌస్ స్పందించింది. ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, ప్రత్యేక ప్రతినిధి స్టీవ్ విట్కాఫ్, జారెడ్ కుష్నెర్‌లు ఇరాన్ ప్రతినిధులతో ఇస్లామాబాద్‌లో భేటీ కానున్నట్లు వస్తున్న వార్తలపై స్పందించారు. ఈ కథనాలు ఊహాజనితమని కొట్టేశారు. చర్యలకు వేదికపై ఎలాంటి ప్రకటన చేయలేదన్నారు. ఎలాంటి నిర్ణయం ఏదైనా తీసుకుంటే తామే వెల్లడిస్తామని కుండబద్దలు కొట్టారు. దీంతో, పాక్ అనుకూల కథనాలకు తెరపడినట్టు అయ్యింది. -
అమెరికా-ఇరాన్ చర్చలు ఫిక్స్?.. ఎక్కడో తెలిస్తే షాక్..!
గత కొద్ది వారాలుగా మారణహోమం సృష్టించిన పశ్చిమాసియా యుద్ధానికి తాత్కాలిక బ్రేక్ పడింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఐదు రోజుల పాటు సీజ్ ఫైర్ ప్రకటించారు. కాగా ప్రస్తుతం మరో కీలక పరిణామం చోటు చేసుకోబోతున్నట్లు తెలుస్తుంది. అమెరికా- ఇరాన్ మధ్య చర్చలు జరిగే అవకాశం ఉందని దానికి వేదిక పాకిస్థాన్ కానుందని రాయిటర్స్ కథనం పేర్కొంది. ఇరాన్- అమెరికా యుద్ధం ప్రపంచాన్ని తీవ్ర సంక్షోభంలో నెట్టేసిన సంగతి తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా చమురు, గ్యాస్ సంక్షోభంతో అనేక రంగాలు ప్రభావితమయ్యాయి. సప్లై చైన్ దెబ్బతిని ప్రజలు తీవ్ర అవస్థలు ఎదుర్కొన్నారు. దీంతో ట్రంప్‌కు ప్రపంచవ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. ఈ నేపథ్యంలోనే అమెరికా అధ్యక్షుడు నిన్న (సోమవారం) సీజ్ ఫైర్ ప్రకటించి చర్చలు జరుపతున్నామని ప్రకటించారు. అయితే ఇరాన్, అమెరికా మధ్య చర్చలకు పాకిస్థాన్‌లోని ఇస్లామాబాద్ వేదిక అయ్యే అవకాశం ఉందని రాయిటర్స్ కథనం పేర్కొంది. ఈ రెండు దేశాల మధ్య సయోధ్య కుదిర్చేలా తెరవెనుక పాకిస్థాన్, టర్కీ, ఈజిప్ట్ దేశాలు తీవ్రంగా కృషి చేస్తున్నాయంది. అమెరికా తరపున ప్రతినిధులుగా ఆదేశ ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ వ్యవహారించనున్నారని, ఇరాన్ తరపున ఆ దేశ కీలక అధికారులు పాల్గొననున్నారని పేర్కొంది. మధ్యవర్తులుగా ఇస్లాం దేశాలైన పాకిస్థాన్, టర్కీ, ఈజిప్ట్ పాల్గొననున్నాయని రాయిటర్స్ ప్రచురించింది.కాగా ఇది వరకే పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఇరాన్ అధ్యక్షుడు పెజెస్కియాన్తో ఫోన్లో మాట్లాడి, శాంతి పునరుద్ధరణకు తమ మద్దతు ఉంటుందని హామీ ఇచ్చిన నేపథ్యంలో ఈ విధంగా అడుగులు పడుతున్నట్లు తెలుస్తోంది. కాగా ఇరాన్ స్పీకర్ ప్రస్తుతం చర్చలు ఏమి లేవని తమపై దాడి చేసిన వారిపై ప్రతీకారం తీర్చుకోవాల్సిందేనన్నారు. ఈ నేపథ్యంలో ఏమవుతుందో వేచి చూడాలి. -
చంపేస్తమంటూ వార్నింగ్.. అయినా పాక్‌కు వచ్చిన స్మిత్
ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ స్టీవ్ స్మిత్ పాకిస్తాన్ సూపర్ లీగ్-2026లో ఆడేందుకు లహోర్‌కు చేరుకున్నాడు. ఓ వైపు పాకిస్థాన్ వ్యతిరేక సాయుధ దళం జమాత్ ఉల్ అహ్రార్ నుంచి బెదిరింపులు వచ్చినప్పటికి.. స్మిత్ మాత్రం పాక్ గడ్డపై అడుగుపెట్టాడు. లహోర్ ఎయిర్‌పోర్ట్‌లో స్మిత్‌కు ఘన స్వాగతం లభించింది. కట్టుదిట్టమైన భద్రత మధ్య అతడు ముల్తాన్ సుల్తాన్ టీమ్ బస చేసే హోటల్‌కు చేరుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.చంపేస్తమంటూ వార్నింగ్!కాగా నిషేధిత ఉగ్రవాద సంస్థ ‘తహ్రీక్-ఇ-తాలిబాన్ పాకిస్థాన్’ (TTP)కి చెందిన జమాత్-ఉల్-అహ్రార్ విభాగం విదేశీ ఆటగాళ్లను లక్ష్యంగా చేసుకుని హెచ్చరికలు జారీ చేసింది. డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్, డారిల్ మిచెల్ వంటి ఆటగాళ్లు వెంటనే టోర్నీ నుండి తప్పుకోవాలని, లేదంటే వారి భద్రతకు తాము బాధ్యులం కాదని ఓ ప్రకటనలో జమాత్-ఉల్-అహ్రార్ పేర్కొంది. అయినప్పటికి విదేశీ ఆటగాళ్లు ఒక్కొక్కరుగా పాక్‌కు చేరుకుంటున్నారు.పీసీబీ కీలక నిర్ణయం..ఈ హెచ్చరికల నేపథ్యంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. భద్రత, ఇంధన సంక్షోభం దృష్ట్యా ఈసారి మ్యాచ్‌లను ఖాళీ స్టేడియాల్లో నిర్వహించనున్నారు. అంతేకాకుండా కేవలం రెండు వేదికలలో ఈ మ్యాచ్‌లు జరగనున్నాయి. ఇక పీఎస్ఎల్ 11వ సీజన్ మార్చి 26 నుంచి ప్రారంభం కానుంది.చదవండి: ICC: పాక్ ఆటగాడికి ఐసీసీ ప్రతిష్టాత్మక అవార్డు -
దురంధర్-2 రిలీజ్.. పాకిస్తాన్ వీడియోలు వైరల్..!
రణ్వీర్ సింగ్ హీరోగా వచ్చిన స్పై యాక్షన్ దురంధర్-2 థియేటర్లలో సందడి చేస్తోంది. మార్చి 19న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. కేవలం మూడు రోజుల్లేనే రూ.500 కోట్ల మార్క్ దాటిన ఈ చిత్రం పలు రికార్డులు తిరగరాస్తోంది. ఇప్పటికే నాలుగు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.700 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.దురంధర్‌కు సీక్వెల్‌గా వచ్చిన ఈ సినిమా హిందీతో పాటు దక్షిణాది భాషల్లోనూ రిలీజైంది. పాకిస్తాన్ నేపథ్యంలో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. తాజాగా ఈ మూవీ రిలీజ్ వేళ సోషల్ మీడియాలో పాకిస్తాన్‌కు సంబంధించిన వీడియోలు వైరలవుతున్నాయి. ఇప్పుడు కరాచీలోని లియారి ప్రాంతంలో పోలీసులు స్పై లాంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారేమోననని సోదాలు చేస్తున్నారు. అక్కడి ప్రాంతంలోని లోకల్ ప్రజలంతా కలిసి ఇండియన్ స్పైల కోసం వెతుకుతున్న వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది. అయితే ఈ వీడియో ఇప్పటిదా.. లేదాంటే పాతదా? అనే విషయంలో క్లారిటీ రావాల్సి ఉంది. ధురంధర్ 2 తర్వాత పాకిస్తాన్ అంతటా పానిక్ మొదలైంది!ఇప్పుడు కరాచీలోని లియారి ప్రాంతంలో పోలీసులు, లోకల్ ప్రజలు కలిసి ప్రతి వీధిలో ఇండియన్ స్పైలను వెతుకుతున్నారు.వాళ్ల ఆశ ఏమిటంటే—హమ్జా అలీ మజారిని పట్టుకుంటామని!#Dhurandhar2 #DhurandharTheRevenge #Dhurandhar #Pakistan… pic.twitter.com/7Emn1qkEPc— Tupaki (@tupaki_official) March 23, 2026 -
ఉగ్రదేశంలో ఇంధన సెగ
తీవ్ర ఆర్థిక సంక్షోభం, అడుగంటిపోతున్న విదేశీ మారక ద్రవ్య నిల్వలతో కొట్టుమిట్టాడుతున్న పాకిస్థాన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విలాసవంతమైన వాహనాల్లో ఉపయోగించే హై-ఆక్టేన్ బ్లెండెడ్ ఫ్యూయల్ (హెచ్‌ఓబీసీ) ధరను ఏకంగా లీటరుకు రూ.200 పెంచుతూ ఆ దేశ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఆమోద ముద్ర వేశారు. మధ్యప్రాచ్యంలో నెలకొన్న ఉద్రిక్తతలు, అంతర్జాతీయ చమురు సరఫరాలో కీలకమైన హార్మూజ్ జలసంధి మూసివేత భయాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.ఆర్థిక క్రమబద్ధీకరణప్రధాని షరీఫ్ అధ్యక్షతన జరిగిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో ఈ ధరల పెంపు నిర్ణయం తీసుకున్నారు. దేశ ఆర్థిక పరిస్థితిని గాడిలో పెట్టేందుకు ఈ చర్యలు అనివార్యమని ప్రభుత్వం పేర్కొంది. ఈ పెంపు ద్వారా ప్రభుత్వానికి నెలకు సుమారు 9 బిలియన్ పాకిస్థానీ రూపాయల (పీకేఆర్) ఆదాయం మిగులుతుందని, ఈ మొత్తాన్ని ప్రజలకు ఉపశమనం కలిగించే పథకాలకు మళ్లిస్తామని ప్రధానమంత్రి కార్యాలయం వెల్లడించింది.సాధారణ పెట్రోల్‌తో పోలిస్తే హెచ్‌ఓబీసీ ఫ్యుయెల్లో ఆక్టేన్ రేటింగ్ ఎక్కువగా ఉంటుంది. సాధారణ పెట్రోల్ ఆక్టేన్ సంఖ్య 87 నుంచి 92 మధ్య ఉంటే, హై-ఆక్టేన్ ఇంధనం 95 నుంచి 100 వరకు ఉంటుంది. కేవలం లగ్జరీ కార్లు, ఖరీదైన వాహనాలు వాడే ఉన్నత ఆదాయ వర్గాలపైనే ఈ పెరిగిన ధరల భారం పడుతుంది. తక్కువ, మధ్య ఆదాయ వర్గాలు ఉపయోగించే సాధారణ పెట్రోల్, డీజిల్ ధరలపై ప్రస్తుతం అదనపు భారం వేయలేదు. ఈ నిర్ణయం వల్ల ఆర్టీసీ లేదా విమాన ప్రయాణ ఖర్చులపై తక్షణ ప్రభావం ఉండదని ప్రభుత్వం భరోసా ఇచ్చింది.సాధారణ పెట్రోల్, డీజిల్ ధరల పరిస్థితిఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతల వల్ల అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరగడంతో పాక్ ప్రభుత్వం ఇప్పటికే మార్చి 6న పెట్రోల్, డీజిల్ ధరలను లీటరుకు రూ.55 చొప్పున పెంచిన సంగతి తెలిసిందే. మారిన ధరల ప్రకారం..ఇంధనం రకంపాత ధర (లీటరుకు)ప్రస్తుత ధర (లీటరుకు)పెట్రోల్రూ. 266.17రూ. 321.17డీజిల్రూ. 280.86రూ. 335.86 విమాన ప్రయాణికులకు షాక్ప్రభుత్వం సామాన్యుడిపై భారం పడదని చెబుతున్నప్పటికీ జెట్ ఇంధన ధరల పెరుగుదల ప్రభావం విమానయాన రంగంపై అప్పుడే మొదలైంది. పాకిస్థాన్‌లోని ఏఆర్వై మీడియా కథనం ప్రకారం, మార్చి 10 నుంచి పాకిస్థాన్ ఎయిర్‌లైన్స్ ఛార్జీలను భారీగా పెంచాయి. దేశీయ ప్రయాణం(కరాచీ, లాహోర్, ఇస్లామాబాద్ రూట్లు)పై టికెట్ ధరలు రూ.2,800 నుంచి రూ.5,000 వరకు పెరిగాయి. విదేశీ ప్రయాణాలపై రూ.10,000 నుంచి రూ.28,000 వరకు అదనపు భారం పడింది.ఇదీ చదవండి: మీ డబ్బు మీ కోసం పనిచేస్తుందా? -
రికార్డు సృష్టించిన పాక్.. ఏ విషయంలో తెలుసా?
పాకిస్థాన్‌కు తన చేస్తున్న పనులకు తగిన గౌరవం లభించింది. గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్‌లో మెుదటి స్థానానికి చేరుకొని రికార్డు సృష్టించింది. గత కొన్ని సంవత్సరాలుగా టాఫ్ ప్లేసులో ఉన్న ఈ దేశం ఇప్పుడు ఏకంగా మెుదటి స్థానానికి చేరుకొని అశాంతికి కేరాఫ్ అడ్రస్‌గా నిలిచింది.పాకిస్థాన్ గురించి ప్రపంచానికి తెలియజేయడానికి భారత్ ఇంతకాలం శాయశక్తులా ప్రయత్నిస్తూ వచ్చింది. దాయాది దేశం కపటబుద్దిని ఉగ్రవాదులకు కల్పిస్తున్న అండదండలను అంతర్జాతీయ వేదికలపై ప్రపంచ దేశాలకు తెలియజేసింది. అయినప్పటికీ పాక్ తన వక్రబుద్ధిని మార్చుకోకుండా భారత్‌పై విషం చిమ్ముతూ వచ్చింది. కాగా తాజాగా విడుదలైన గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్ - 2026లో పాకిస్థాన్ మెుదటి స్థానం దక్కించుకుంది. దీంతో ఆదేశంలో ఉగ్రవాదం ఏ స్థాయిలో ఉందో అంతర్జాతీయ సమాజానికి తేటతెల్లమయ్యింది. కాగా గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్‌లో భారత్ 13వ స్థానంలో నిలిచింది. గత ఏడాది కాలంగా దేశంలో ఉగ్రవాద ఘటనలు 44 శాతం తగ్గాయని పేర్కొంది. క్రితంతో పోలిస్తే 2025లో ఉగ్రవాద మరణాలు 28 శాతం తగ్గాయి. ఉగ్రదాడుల సంఖ్య 22శాతం తగ్గి 2,944కు చేరుకుంది. 81 దేశాలలో పరిస్థితి మెరుగుపడగా 19 దేశాలలో పరిస్థితి మరింత దిగజారింది. అదే సమయంలో ప్రాశ్చాత్య దేశాలలో ఉగ్రవాద దాడులు 280 శాతం పెరిగాయి.టెర్రరిజం అరికట్టడానికి ప్రహార్అయితే భారత్ ఉగ్రవాదాన్ని సమూళంగా అణిచివేయడానికి తగిన చర్యలు తీసుకుంటుంది. ఫిబ్రవరి 23న కేంద్ర హోం మంత్రిత్వ శాఖ 'ప్రహార్' పేరుతో మెట్ట మెుదటి జాతీయ ఉగ్రవాద నిరోధక విధానాన్ని విడుదల చేసింది. దేశంలో ఉగ్రవాదాన్ని నిరోధించే విధంగా ఈ విధానం చర్యలు తీసుకోనుంది. ఇండెక్స్ ఏ ఆధారంగా?గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్ నాలుగు ప్రధానాంశాల ఆధారంగా గుర్తిస్తారు. సంవత్సరంలో ఆ దేశంలో జరిగిన ఉగ్రదాడుల సంఖ్య, మరణాలు, గాయపడిన వారి సంఖ్య, బందీలుగా చిక్కుకున్నవారు తదితర అంశాల ఆధారంగా ర్యాంకులు కేటాయిస్తారు. -
అమెరికా మాపై దాడిచేస్తే మేం భారత్‌పై బాంబులేస్తాం
న్యూఢిల్లీ: కరడుగట్టిన ఛాందసవాదం, వితండవాదానికి పాకిస్తాన్ చిరునామా అని ఆ దేశ మాజీ దౌత్యవేత్త అబ్దుల్ బాసిత్ మారోమారు నిరూపించారు. భారత్ మీద తమ అంతులేని విద్వేషాన్ని తన వాచాలత్వం ద్వారా బాసిత్ మరోమారు రుజువుచేసుకున్నారు. పశ్చిమాసియా యుద్ధం దక్షిణాసియాకు విస్తరించి అమెరికాగనక పాకిస్తాన్‌పై దాడి చేస్తే ప్రతిగా అమెరికాపై దాడిచేయాల్సిందిపోయి భారత్‌పై బాంబులేస్తామని బాసిత్ అత్యంత నిర్లక్ష్యంగా మాట్లాడారు. దీంతో పాకిస్తాన్ దౌత్యవర్గాల్లోనూ జిహాదీవాదం ఒంటబట్టించుకున్న వితండవాదులకు కొదవలేదని భారత్ నుంచి తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. సీఎన్ఎన్–న్యూస్18తో జరిగిన ఒక చర్చావేదికలో బాసిత్ మాట్లాడారు. ‘‘యుద్ధంలో ఇరాన్‌పై ఇజ్రాయెల్ పైచేయి సాధిస్తే ఆ తర్వాత సమీపంలో ఉన్న పాకిస్తానే ఇజ్రాయెల్‌కు తదుపరి లక్ష్యంకావొచ్చు. ఇజ్రాయెల్ చెప్పుడుమాటలు వినే అమెరికాకు అప్పుడు పాకిస్తాన్ అణుకార్యక్రమాలు రుచించకపోవచ్చు. అప్పుడు పాకిస్తాన్‌పై అమెరికా దాడులు చేయొచ్చు. ఇలా జరగడానికి అవకాశం లేదు. కానీ ఒకవేళ దాడి చేస్తే ప్రతిదాడి చేసే సత్తా పాకిస్తాన్‌కు ఉంది. అయితే ప్రతిదాడి కోసం అమెరికా ప్రధాన భూభాగం లేదా గల్ఫ్ లేదా ఇజ్రాయెల్‌పై మేం దాడిచేయడం కష్టమవుతుంది. అవన్నీ మాకు సుదూరంగా ఉన్నాయి. సమీప లక్ష్యం మీదే మేం దాడిచేయగలం. అలాంటి సమీప లక్ష్యం ఒక్క భారత్ మాత్రమే. ఏమాత్రం ఆలస్యంచేయకుండా ముంబై, న్యూఢిల్లీలపై దాడులుచేస్తాం. తర్వాత ఏం జరుగుతుందనే దానితో మాకు సంబంధంలేదు. అప్పటి పరిస్థితులకు తగ్గట్లుగా అప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకుంటాం’’అని అన్నారు. ‘‘మాపై దాడులు జరుగుతున్నప్పుడు మాకు కనిపించే ఏకైక మార్గం ఇండియానే. భారత్‌లోని మెట్రోపాలిటన్ నగరాలపై దాడులు చేస్తాం’’అని అన్నారు. దీంతో భవిష్యత్‌లో అమెరికాతో సంబంధాలు చెడిపోతే దాని విపరిణామాలను భారతే ఎదుర్కోవాల్సి ఉంటుంది అన్నట్లు బాసిత్ మాట్లాడటంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. శత్రుదేశం(అమెరికా)పై ఎదురుదాడి చేసే దమ్ములేక పొరుగుదేశంపై బాంబులేసే నిస్సహాయ పాకిస్తాన్ వైఖరి బాసిత్ మాటలతో బహిర్గతమైందని అంతర్జాతీయ రాజకీయవిశ్లేషకులు తప్పుబడుతున్నారు. ‘‘బాసిత్ వ్యాఖ్యలను తేలిగ్గా కొట్టేయడానికి వీల్లేదు. సైన్యం కనుసన్నల్లో నడిచే పాక్ ప్రభుత్వాల కుటిలనీతిలో నిర్లజ్జ నియమాలు ఎలా ఉంటాయో బాసిత్ మాటలు తేటతెల్లం చేస్తున్నాయి. యుద్ధం దక్షిణాసియాకు విస్తరిస్తే పాకిస్తాన్ పట్ల మనం ఇంకెంత అప్రమత్తంగా ఉండాలనే విషయాన్ని బాసిత్ మాటలు హెచ్చరిస్తున్నాయి’’అని భారత నిఘా వర్గాలు సూచించాయి. -
లష్కర్-ఎ-తయిబా కీలక ఉగ్రవాది దారుణ హత్య
పాకిస్తాన్‌లోని లష్కర్-ఎ-తయిబా (LeT) ప్రధాన కార్యాలయం వద్ద దారుణ హత్య జరిగింది. భారత్‌లో అనేక ఉగ్రదాడుల్లో నేరుగా ప్రమేయం ఉన్న LeT మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ మొహమ్మద్ బిలాల్ అరీఫ్ సలఫీని ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు తొలుత కాల్పులు జరిపి, ఆతర్వాత కత్తులతో పొడిచి హతమార్చారు. సలఫీ.. మసీదులో నమాజ్ పూర్తి చేసుకొని బయటికి రాగానే దుండగులు అటాక్ చేశారు.సలఫీ LeTలో కీలక నేత అని, భారత్‌లో అనేక దాడుల రూపకల్పనలో భాగస్వామిగా ఉన్నాడని భారత భద్రతా సంస్థలు గుర్తించాయి. ఈ హత్య LeTలో అంతర్గత విభేదాలను సూచిస్తుంది. కాగా, లష్కర్-ఎ-తయిబా పాకిస్తాన్లో స్థాపించబడిన ఉగ్రవాద సంస్థ. ఈ ఉగ్రమూక భారత్‌లో అనేక దాడులకు పాల్పడింది. 2008 ముంబై దాడులు సహా అనేక రక్తపాతాల్లో LeT పాత్ర నిరూపితమైంది. -
పాకిస్తాన్ 30 విమానాలకు తప్పిన ప్రమాదం..
లాహోర్: పాకిస్తాన్ ఎయిర్పోర్ట్ ట్రాఫిక్ కంట్రోల్ సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించడంతో పెనుప్రమాదం తప్పింది. ఇరాన్ వార్‌జోన్‌లోకి ప్రవేశించకుండా గత రెండు రోజుల్లో 30 విమానాలను సురక్షితంగా దారి మళ్లించినట్లు సంబంధిత అధికారులు శుక్రవారం వెల్లడించారు.కాగా, ఇవన్నీ ప్యాసింజర్ విమానాలే. ఒకవేళ వార్‌జోన్‌లోకి ప్రవేశించి ఉంటే వాటిపై దాడి జరిగే అవకాశం ఉండేదని పేర్కొన్నారు. బుధవారం, గురువారం ప్రతికూల వాతావరణం కారణంగా పాక్‌కు చెందిన 30 ప్యాసింజర్ విమానాలు ఇరాన్ గగనతలంలోకి ప్రశించే పరిస్థితి ఏర్పడింది. లాహోర్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్లు కరాచీలోని ఫ్లైట్ ఇన్ఫర్మేషన్ కేంద్రంతో సమన్వయం చేసుకుంటూ వాటిని దారి మళ్లించారు. డేంజర్ జోన్లోకి వెళ్లకుండా తప్పించారు. ఈ విమానాలు సౌదీ అరేబియా, దుబాయ్‌తోపాటు ఇతర దేశాల నుంచి రాకపోకలు సాగిస్తున్నాయి. -
పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్.. అన్నదమ్ముల్లా కలిసి ఉండండి: ఖమేనీ పిలుపు
అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త దాడుల్లో నలిగిపోతున్న ఇరాన్.. పక్క దేశాల పంచాయితీని చక్కబెడతానని ముందుకొచ్చింది. ఆ దేశ కొత్త సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ 1405వ పర్షియన్ నూతన సంవత్సరం "నౌరూజ్" సందర్భంగా ఇచ్చిన సందేశంలో పొరుగు దేశాలైన పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ కలిసి ఉండాలని పిలుపునిచ్చారు.మా తూర్పు దేశాలు పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మాకు అత్యంత సన్నిహితమైనవి.. ఇరు దేశాలు సోదరుల్లా మెలగండి.. ముస్లింల ఐక్యత కోసం పరస్పర సంబంధాలను మెరుగుపర్చుకోండి.. అవసరమైతే నేను మధ్యవర్తిత్వం వహించేందుకు సిద్ధంగా ఉన్నానని అన్నారు. మొజ్తబా ఖమేనీ ఇరాన్ సుప్రీం లీడర్ అయ్యాక పాక్-ఆఫ్ఘన్ ఘర్షణలపై చేసిన తొలి బహిరంగ వ్యాఖ్యలు ఇవి. ఇటీవలికాలంలో ఇరాన్ విదేశాంగ మంత్రి పలుమార్లు ఇదే అంశాన్ని ప్రస్తావించినా, కాబూల్–ఇస్లామాబాద్‌వైపు నుంచి ఎలాంటి స్పందన లేదు. కాగా, గతకొంతకాలంగా పాకిస్తాన్-ఆఫ్ఘనిస్తాన్ మధ్య అనధికారిక య్దుదం కొనసాగుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్‌లోని ఒమర్ డ్రగ్ రిహాబిలిటేషన్ సెంటర్‌పై పాకిస్తాన్ జరిపిన వైమానిక దాడుల్లో వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. అదే సంఖ్యలో గాయపడ్డారు. ఈ దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన వారంతా వైద్య సాయం పొందుతున్న రోగులని ఆఫ్ఘనిస్తాన్ ప్రకటించింది.అయితే పాక్ మాత్రం ఈ ఆరోపణను తీవ్రంగా ఖండిస్తూ.. తాము కేవలం ఉగ్రవాద మౌలిక వసతులు మరియు సైనిక స్థావరాలను మాత్రమే లక్ష్యంగా చేసుకున్నామని వెల్లడించింది. ఈ ఘటన తర్వాత ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి. అయితే, సౌదీ అరేబియా, ఖతార్, టర్కీ దేశాల విజ్ఞప్తి మేరకు ఇరు దేశాలు ఈద్ అల్-ఫితర్ సందర్భంగా తాత్కాలికంగా యుద్ధ విరమణకు అంగీకరించాయి. -
మాతో పెట్టుకోవద్దు.. పాక్‌కు ఆఫ్ఘన్ ప్లేయర్ వార్నింగ్
-
అమెరికాకు పాకిస్థాన్ పెను సవాల్!
వాషింగ్టన్: ప్రపంచంలోని పలు దేశాలు అమెరికాకు సవాలు విసురుతున్నాయి. ఇరాన్ ఇప్పటికే అణ్వాయుధ కార్యక్రమాన్ని కొనసాగిస్తుందనే అనుమానంతో అమెరికా ఆ దేశంపై ఒత్తిడి పెంచింది. ఇప్పుడు పాకిస్థాన్ కూడా అదే తరహా అణ్వాయుధ కార్యక్రమాన్ని మరింత వేగవంతం చేస్తోందని అమెరికా ఇంటెలిజెన్స్ వర్గాలు వెల్లడించాయి. ఈ అంశంపై అమెరికా ఆందోళన వ్యక్తం చేస్తోందని అంతర్జాతీయ మీడియా కథనాలు చెబుతున్నాయి.ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్థాన్ తన ఆత్మరక్షణ కోసం పెద్ద ఎత్తున క్షిపణులను అభివృద్ధి చేస్తోంది. ఇందుకోసం పలు అగ్రదేశాల నుంచి ఆర్థిక సహాయం పొందుతోందని సమాచారం. తయారీ పూర్తయిన తర్వాత ఆయా దేశాలకు క్షిపణులు, ఇతర అణ్వాయుధాలను అందజేస్తోందని నివేదికలు సూచిస్తున్నాయి.యూఎస్ నిఘా సంస్థల ప్రకారం, పాకిస్థాన్ ఖండాంతర బాలిస్టిక్ క్షిపణుల అభివృద్ధి దిశగా అడుగులు వేస్తోంది. ప్రస్తుతం ఉన్న షాహిన్-3 క్షిపణి 2750 కిలోమీటర్ల దూరంలో లక్ష్యాలను ఛేదించగలదు. అయితే ఇది ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి కాదు. ఖండాంతర క్షిపణులు కనీసం 5000 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను చేరగలగాలి. అణు నిరోధక శక్తిలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయి.పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్థాన్ తన అణు ఆయుధ కార్యక్రమాన్ని మరింత వేగవంతం చేసినట్లు సమాచారం. అమెరికా నుంచి పాకిస్థాన్ దూరం సుమారు 12,000 కిలోమీటర్లు. అంతటి దూరాన్ని ఛేదించే క్షిపణులను పాకిస్థాన్ అభివృద్ధి చేస్తోందనే విషయం అమెరికాకు ఆందోళన కలిగిస్తోంది.యాన్యువల్ థ్రెట్ అసెస్మెంట్ - 2026 నివేదికలో అమెరికా, ప్రపంచంలోని పలు దేశాలు అణ్వాయుధాలను తయారు చేస్తున్నాయని పేర్కొంది. అందులో పాకిస్థాన్, రష్యా, చైనా, ఉత్తర కొరియా, ఇరాన్ వంటి దేశాలను ప్రస్తావించింది. ముఖ్యంగా పాకిస్థాన్ అణ్వాయుధ కార్యక్రమం అంతకంతకూ విస్తరిస్తోందని హైలైట్ చేసింది. -
పాకిస్తాన్ టీవీలో 'ధురంధర్-2'.. వీడియో షేర్ చేసిన జర్నలిస్ట్
‘ధురంధర్-2’ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలై భారీ వసూళ్లతో రికార్డ్ క్రియేట్ చేస్తుంది. ఫస్ట్ డే ఏకంగా రూ. 172 కోట్ల గ్రాస్ రాబట్టినట్లు ప్రముఖ సంస్థలు పేర్కొన్నాయి. మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ విడుదలైంది. కానీ, ఈ చిత్రం పాకిస్తాన్లో విడుదల కాలేదు. పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా ఈ మూవీని తెరకెక్కించడం కొన్ని దేశాలు దీన్ని బ్యాన్ చేసినట్లు బాలీవుడ్ మీడియా గతంలోనే పేర్కొంది. అయినప్పటికీ పాక్ దేశ ప్రజలు రణవీర్ సింగ్ నటించిన ధురంధర్-2 మూవీని చూడటానికి ఉత్సాహంగా ఉన్నారని స్పష్టంగా తెలుస్తోంది. భారీ సంఖ్యలో పాక్ ప్రజలు ఈ సినిమా పైరసీ వెర్షన్‌ను చూస్తున్నారు.పాక్‌లోని లాహోర్‌లో ధురంధర్-2 సినిమా చూస్తున్న దృశ్యాన్ని పాకిస్తానీ జర్నలిస్ట్ షేర్ చేశారు. అదే పోస్ట్‌ను భారత్‌కు చెందిన ఆదిత్య రాజ్ కౌల్ తన సోషల్‌మీడియాలో షేర్ చేశారు. 'ధురందర్' చిత్రానికి రీసెర్చ్ కన్సల్టెంట్‌గా ఆయన ఉన్న విషయం తెలిసిందే. పాక్‌లోని లాహోర్‌లో ధురంధర్-2 సినిమా చూస్తున్న దృశ్యాన్ని ఒక పాకిస్తానీ జర్నలిస్ట్ షేర్ చేసిన ట్వీట్‌ను ఆదిత్య రీషేర్ చేశారు. పాకిస్తానీ ఉగ్రవాదాన్ని అణచివేయడం గురించి ఈ సినిమా ఉన్నా సరే వారు పైరసీ కాపీ కోసం వెతికి మరీ చూస్తున్నారు. పాకిస్తాన్లో భారతీయ చిత్రాలు నిషేధించబడినప్పటికీ, అక్కడి ప్రజలు మన సినిమాల పైరసీ వెర్షన్లను చూసి ఆనందిస్తున్నట్లు స్పష్టమవుతోంది. గతంలో, పొరుగు దేశంలో ధురందర్ పార్ట్ 1 పైరసీ వెర్షన్‌ను కూడా చూశారు. ఆ సమయంలో మూవీ విడుదలైన కేవలం రెండు వారాల్లోనే పాకిస్తాన్లో 1.8 మిలియన్లకు (18 లక్షలు) పైగా ఇల్లీగల్ డౌన్లోడ్ నమోదయ్యాయని అంచనా. ఇప్పుడు ధురందర్ -2 పైరసీ కాపీని టెలిగ్రామ్ గ్రూప్‌లలో షేర్ చేస్తున్నారు. నెట్‌ఫ్లిక్స్‌లో పార్ట్-1 విడుదలైనప్పుడు కూడా పాక్‌లో ట్రెండింగ్‌లో నిలిచింది. -
పాకిస్తాన్‌కు షాకిచ్చిన అమెరికా.. యుద్దం వేళ ట్విస్ట్!
వాషింగ్టన్: దాయాది దేశం పాకిస్తాన్‌పై అమెరికా నిఘా విభాగం చీఫ్ తులసీ గబ్బార్డ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికాకు అత్యంత భారీ అణు ముప్పును కలిగించే దేశాలలో పాకిస్తాన్ కూడా ఒకటి అంటూ బాంబు పేల్చారు. ఇదే సమయంలో రష్యా, చైనా, ఉత్తరకొరియా, ఇరాన్ దేశాలు.. అధునాతన క్షిపణి ప్రయోగ వ్యవస్థలను చురుకుగా అభివృద్ధి చేస్తున్నాయని చెప్పుకొచ్చారు. ఆయా దేశాలతో ప్రపంచానికి ముప్పు పొంచి ఉందని వ్యాఖ్యలు చేశారు. అమెరికా నిఘా విభాగం చీఫ్ తులసీ గబ్బార్డ్ తాజాగా ఓ సమావేశంలో మాట్లాడుతూ.. పెరుగుతున్న ప్రపంచ భద్రతా ముప్పులపై తీవ్ర హెచ్చరిక జారీ చేశారు. ఈ సందర్బంగా తులసీ గబ్బార్డ్..‘చైనా, రష్యా, ఇరాన్, ఉత్తర కొరియా, పాకిస్తాన్ వంటి దేశాలు అణ్వాయుధాలు, సంప్రదాయ పేలోడ్లతో కూడిన అనేక రకాల కొత్త రకాల సాంప్రదాయ క్షిపణి ప్రయోగ వ్యవస్థలపై పరిశోధనలు చేస్తున్నారు. అలాగే, అణ్వాయుధాలను అభివృద్ధి చేస్తున్నాయని నిఘా వర్గాలు అంచనా వేస్తున్నాయి. అమెరికాకు అత్యంత భారీ అణు ముప్పును కలిగించే దేశాలలో ఇరాన్, చైనా, రష్యా, ఉత్తర కొరియాలతో పాటు పాకిస్తాన్ కూడా ఒకటి. ఈ దేశాలు అమెరికాను చేరగలిగే అణు సామర్థ్యం ఉన్న క్షిపణులను అభివృద్ధి చేస్తున్నాయి. అమెరికాను వాటి పరిధిలోకి తీసుకువస్తున్నాయి’ అని సంచలన ఆరోపణలు చేశారు.టార్గెట్ అమెరికా.. అంతేకాదు, మారుతున్న భౌగోళిక రాజకీయ కూటములను హైలైట్ చేస్తూ ఉత్తర కొరియా.. రష్యా, చైనాలతో తన భాగస్వామ్యాలను బలోపేతం చేసుకుంటోందని అన్నారు. ఇది అమెరికా శత్రువుల మధ్య సమన్వయ సైనిక సామర్థ్యాలపై ఆందోళనలను పెంచుతోందని ఆమె పేర్కొన్నారు. ఇదే సమయంలో అమెరికాపై దాడి చేయగల క్షిపణుల సంఖ్యలో గణనీయమైన పెరుగుదల ఉంటుందని అమెరికా నిఘా వర్గాలు భావిస్తున్నాయని అన్నారు. ప్రస్తుత అంచనా ప్రకారం సుమారు 3,000 ఉండగా.. 2035 నాటికి ఈ సంఖ్య 16,000 దాటుతుందని అంచనా వేస్తున్నట్లు తెలిపారు.పాక్ పీఎం షరీఫ్ ఇలా.. అయితే, పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై ప్రశంసలు కురిపిస్తున్న వేళ తులసీ గబ్బార్డ్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సంచలనంగా మారింది. కాగా, 2025లో గాజా పీస్ సమ్మిట్‌లో షరీఫ్ ట్రంప్‌పై ప్రశంసలు కురిపించారు. “మ్యాన్ ఆఫ్ పీస్” అని పిలుస్తూ.. ఆయన భారత్–పాకిస్తాన్ మధ్య అణు యుద్ధాన్ని నివారించారని పేర్కొన్నారు. ఆయన ట్రంప్‌ను నోబెల్ శాంతి బహుమతికి అర్హుడని కూడా అన్నారు.ఇరాన్ యుద్ధంపై..మరోవైపు, ఇరాన్‌తో అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధంపై ఆమె స్పందిస్తూ..‘ఇరాన్‌పై అధ్యక్షుడు ట్రంప్ చర్యలను సమర్థిస్తున్నాను. గత 20 రోజులుగా భీకర దాడులు చేస్తున్నా.. సుప్రీం లీడర్ ఖమేనీ సహా కీలక నాయకులు, అధికారులు మరణించినా ఇరాన్ మాత్రం పోరాటం ఆపలేదు. యుద్ధంలో భారీ నష్టం జరిగినా.. ఇరాన్లో ప్రభుత్వం చెక్కుచెదరలేదు. కానీ, చాలా వరకు ఇరాన్ బలహీనపడిందని అమెరికా నిఘా వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇరాన్ సైనిక శక్తి తగ్గినా ఇంకా ప్రమాదకరమే’ అని ఆమె తెలిపారు. -
పాకిస్థాన్‌లో రిపబ్లిక్‌డే వేడుకలు రద్దు
ఇస్లామాబాద్: పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. మార్చి 23న జరగాల్సిన రిపబ్లిక్ డే వేడుకలను రద్దు చేస్తున్నట్లు ప్రధాని కార్యాలయం అధికారిక ప్రకటన విడుదల చేసింది.ప్రకటన ప్రకారం.. కొనసాగుతున్న గల్ఫ్ చమురు సంక్షోభం, పెరుగుతున్న ప్రపంచ చమురు ధరలు, అలాగే ప్రభుత్వం ప్రకటించిన పొదుపు చర్యల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. సాధారణంగా జరిగే సైనిక కవాతు, 31-గన్ సెల్యూట్, సాంస్కృతిక కార్యక్రమాలు ఈసారి జరగవు. దాని బదులుగా, కేవలం జెండా ఆవిష్కరణ మాత్రమే నిర్వహించబడుతుంది. అన్ని మంత్రిత్వ శాఖలు, విభాగాలు, శాఖలు ఈ సందర్భాన్ని నిరాడంబరంగా, గౌరవప్రదంగా పాటించాలని ఆదేశించారు.ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా తలెత్తిన తీవ్ర ఇంధన సంక్షోభం, ఆర్థిక అస్థిరతను ఎదుర్కోవడానికి ప్రభుత్వం మార్చిలో పొదుపు చర్యలకు దిగిందని, వాటిలో భాగంగానే రిపబ్లిక్ డే వేడుకలను రద్దు చేసినట్లు స్పష్టం చేసింది. -
ఆగస్టు 20న భారత్, పాక్ పోరు
న్యూఢిల్లీ: ఐదు దశాబ్దాల ప్రపంచకప్ ట్రోఫీ నిరీక్షణకు తెర దించాలంటే ఈసారి భారత పురుషుల హాకీ జట్టు విశేషంగా రాణించాల్సి ఉంటుంది. ఈ ఏడాది ఆగస్టులో నెదర్లాండ్స్, బెల్జియం సంయుక్తంగా ఆతిథ్యమివ్వనున్న ప్రపంచకప్ టోర్నీలో వేల్స్ జట్టుతో జరిగే తొలి మ్యాచ్‌తో టీమిండియా టైటిల్ వేటను ఆరంభిస్తుంది. ఆగస్టు 16న నెదర్లాండ్స్‌లోని ఆమ్స్టెల్వీన్లో భారత్ తమ తొలి లీగ్ మ్యాచ్ ఆడుతుంది. పూల్ ‘డి’లో ఉన్న భారత బృందం ఆ తర్వాత ఆగస్టు 18న ఇంగ్లండ్‌తో... ఆగస్టు 20న చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో ‘ఢీ’కొంటుంది. తదుపరి దశకు అర్హత సాధించాలంటే భారత్ పూల్ ‘డి’లోని తొలి రెండు స్థానాల్లో కచి్చతంగా ఉండాలి. మరోవైపు భారత మహిళల జట్టు తమ తొలి మ్యాచ్‌లో ఆగస్టు 16న చైనాతో తలపడుతుంది. పూల్ ‘డి’లో ఉన్న భారత జట్టు రెండో మ్యాచ్‌లో ఆగస్టు 18న దక్షిణాఫ్రికాతో... చివరిదైన మూడో మ్యాచ్‌లో ఆగస్టు 20న ఇంగ్లండ్‌తో ఆడుతుంది. లీగ్ దశ మ్యాచ్‌లు ముగిశాక నాలుగు పూల్స్ నుంచి రెండు జట్ల చొప్పున ఎనిమిది జట్లు రెండో రౌండ్‌కు చేరుకుంటాయి. రెండో రౌండ్లో ఎనిమిది జట్లను రెండు పూల్స్‌గా (ఒక్కో పూల్‌లో నాలుగు జట్లు) విభజిస్తారు. రెండో రౌండ్ ముగిశాక రెండు పూల్స్ నుంచి తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు సెమీఫైనల్‌కు అర్హత సాధిస్తాయి. భారత పురుషుల జట్టు 1975లో ఏకైకసారి ప్రపంచకప్ టైటిల్ నెగ్గగా... భారత మహిళల జట్టు 1974లో అత్యుత్తమంగా నాలుగో స్థానంలో నిలిచింది. -
పాకిస్తాన్-ఆఫ్ఘనిస్తాన్ మధ్య యుద్ధ విరమణ
పాకిస్తాన్, ఆఫ్ఘానిస్తాన్ మధ్య తాత్కాలిక యుద్ధ విరమణ ఒప్పందం జరిగింది. ఈద్ అల్-ఫితర్ సందర్భంగా యుద్ధాన్ని ఐదు రోజుల పాటు నిలిపివేయాలని ఇరు దేశాలు అంగీకరించాయి. పాకిస్తాన్ సమాచార మంత్రి అట్టౌల్లా తరార్ ప్రకటన ప్రకారం.. ఈ విరమణ మార్చి 19వ తేదీ అర్థరాత్రి నుండి మార్చి 24వ తేదీ అర్థరాత్రి వరకు కొనసాగుతుంది. ఈ మధ్యలో ఏదైనా సరిహద్దు దాడి, డ్రోన్ దాడి లేదా ఉగ్రవాద ఘటన జరిగితే ఆపరేషన్లు వెంటనే మరింత తీవ్రతతో పునఃప్రారంభమవుతాయి. ఈ నిర్ణయం సౌదీ అరేబియా, ఖతార్, టర్కీ దేశాల విజ్ఞప్తి మేరకు తీసుకున్నది. కాగా, ఇటీవల ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్‌లోని ఒమర్ డ్రగ్ రిహాబిలిటేషన్ సెంటర్‌పై పాకిస్తాన్ జరిపిన వైమానిక దాడుల్లో వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. అదే సంఖ్యలో గాయపడ్డారు. ఈ దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన వారంతా వైద్య సాయం పొందుతున్న రోగులని ఆఫ్ఘనిస్తాన్ ప్రకటించింది. అయితే పాక్ మాత్రం ఈ ఆరోపణను తీవ్రంగా ఖండిస్తూ.. తాము కేవలం ఉగ్రవాద మౌలిక వసతులు మరియు సైనిక స్థావరాలను మాత్రమే లక్ష్యంగా చేసుకున్నామని వెల్లడించింది. ఈ ఘటన తర్వాత ఇరు దేశాల మధ్య ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. తాలిబాన్లు దురాండ్ లైన్ వెంబడి పాకిస్తాన్ సైన్యంపై ఆపరేషన్ ప్రారంభించారు. -
'అఫ్గాన్ చరిత్ర అందరికి తెలుసు.. రిపీటైతే పాక్‌కు చుక్కలే'
అఫ్గానిస్తాన్ రాజధాని కాబూల్‌లోని ఓ రిహేబిటేషన్ సెంటర్‌పై పాకిస్తాన్ జరిపిన వైమానిక దాడులు తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. ఈ బాంబు దాడుల్లో 400 మంది మరణించగా, మరో 250 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ అమానుష చర్యపై అఫ్గాన్ యువ సంచలనం, ముంబై ఇండియన్స్ అల్లా ఘజన్ఫర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ దారుణ ఘటనను తీవ్రంగా ఖండించాలని అంతర్జాతీయ సమాజాన్ని ఘజన్ఫర్ కోరాడు."అక్కడ చికిత్స పొందుతున్న వారంతా పేదవారే. వారికి ప్రైవేటు అస్పత్రిలో చికిత్స చేయించుకునే స్తోమత లేదు. ఇప్పుడు ఆ ఆసుపత్రిని కూడా లక్ష్యంగా చేసుకుని ప్రజల ప్రాణాలను బలికొన్నారు. ఇది ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదు. వారు ఇటువంటి హేయమైన చర్యలతో ఏమి నిరూపించుకోవాలనుకుంటున్నారో నాకు తెలియదు.సామాన్య ప్రజలను పొట్టనబెట్టుకుని ఏమి సాధించారు. దీనిని మేము ఏమాత్రం అంగీకరించలేము. అఫ్గాన్ చరిత్ర అందరికీ తెలుసు. ఒకవేళ ఆ చరిత్ర మళ్ళీ రిపీట్ అయితే, అది పాక్‌కు చాలా ప్రమాదకరంగా మారుతుందిష అని న్యూస్ 18తో ఘజన్ఫర్ పేర్కొన్నాడు.అదేవిధంగా భారత్-అఫ్గాన్ సంబంధాలపై కూడా అతడు కీలక వ్యాఖ్యలు చేశాడు. "భారత్ మాకు మంచి మిత్ర దేశం. ఇలాంటి దాడులు జరగకుండా ఉండేందుకు భారత్‌తో చర్చలు జరపాలని కోరుకుంటున్నాము. ప్రస్తుతం ప్రపంచం ఇప్పటికే అనేక సవాళ్లను ఎదుర్కొంటోందని, ఇలాంటి యుద్ధ వాతావరణం ఎవరికీ మంచిది కాదని" ఘజన్ఫర్ తెలిపాడు. కాగా ఈ ఘటనపై ఘజన్‌ఫర్‌తో పాటు రషీద్ ఖాన్, నబీ, నవీన్ ఉల్ హక్ వంటి పలువురు అఫ్గాన్ క్రికెటర్లు ఆవేదన వ్యక్తంచేశారు.చదవండి: సన్‌రైజర్స్‌పై విమర్శలు.. అబ్రార్ అహ్మద్ షాకింగ్ రియాక్షన్! -
ఒకే గ్రూప్‌లో భారత్, పాకిస్తాన్
లుసానే (స్విట్జర్లాండ్): హాకీ వరల్డ్ కప్‌లో పాల్గొనే జట్ల గ్రూప్‌ల వివరాలను అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్ఐహెచ్) వెల్లడించింది. రెండు ఒలింపిక్ స్వర్ణాలు, రెండు ప్రపంచకప్ విజయాల్లో భాగంగా ఉన్న డచ్ హాకీ క్రీడాకారిణి నవోమీ వాన్ ఆజ్ సహా పలువురు మాజీ ఆటగాళ్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పురుషుల విభాగంలో, మహిళల విభాగంలో ఒకేసారి ప్రపంచకప్‌లను నిర్వహిస్తుండటం విశేషం. బెల్జియం, నెదర్లాండ్స్‌లలో ఆగస్టు 14 నుంచి 30 వరకు పోటీలు జరుగుతాయి. రెండు మెగా టోరీ్నలకు సంబంధించిన వేర్వేరు మస్కట్లను కూడా ఎఫ్ఐహెచ్ విడుదల చేసింది. వరల్డ్ కప్‌లో మొత్తం 16 జట్ల చొప్పున పాల్గొంటున్నాయి. ఒక్కో పూల్ నుంచి టాప్–2 జట్లు ముందంజ వేస్తాయి. ఎనిమిది టీమ్‌లతో రెండో దశ నిర్వహిస్తారు. ఆ తర్వాత నాకౌట్ మ్యాచ్‌లు ఉంటాయి. పురుషుల విభాగంలో పూల్ ‘డి’లో భారత్ బరిలోకి దిగుతోంది. ఈ పూల్‌లో భారత్‌తో పాటు పాకిస్తాన్, ఇంగ్లండ్, వేల్స్ జట్లు ఉన్నాయి. మహిళల విభాగంలో భారత్ పూల్ ‘డి’లో ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా, చైనాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. టోర్నమెంట్ మ్యాచ్‌ల పూర్తిస్థాయి షెడ్యూల్‌ను నేడు ప్రకటిస్తారు. 2022లో జరిగిన వరల్డ్ కప్‌లో జర్మనీ, నెదర్లాండ్స్ పురుషుల, మహిళల విభాగాల్లో విజేతలుగా నిలిచాయి. పూల్ల వివరాలు పురుషుల విభాగం: పూల్ ‘ఎ’: నెదర్లాండ్స్, అర్జెంటీనా, న్యూజిలాండ్, జపాన్; పూల్ ‘బి’: బెల్జియం, జర్మనీ, ఫ్రాన్స్, మలేసియా; పూల్ ‘సి’: ఆ్రస్టేలియా, స్పెయిన్, ఐర్లాండ్, దక్షిణాఫ్రికా; పూల్ ‘డి’: భారత్, పాకిస్తాన్, ఇంగ్లండ్, వేల్స్. మహిళల విభాగం: పూల్ ‘ఎ’: నెదర్లాండ్స్, ఆ్రస్టేలియా, చిలీ, జపాన్; పూల్ ‘బి’: అర్జెంటీనా, జర్మనీ, అమెరికా, స్కాట్లాండ్; పూల్ ‘సి’: బెల్జియం, స్పెయిన్, న్యూజిలాండ్, ఐర్లాండ్; పూల్ ‘డి’: భారత్, ఇంగ్లండ్, చైనా, దక్షిణాఫ్రికా.


