ODI Century
-
చరిత్ర సృష్టించిన స్మృతి మంధాన.. ఆల్‌టైమ్ రికార్డు బ్రేక్
భారత స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన చరిత్ర సృష్టించింది. వన్డేల్లో దిగ్గజ కెప్టెన్ మిథాలీ రాజ్ పేరిట ఉన్న ఆల్‌టైమ్ రికార్డును బద్దలు కొట్టింది. కాగా భారత మహిళా జట్టు స్వదేశంలో న్యూజిలాండ్‌తో మూడు వన్డేలు ఆడింది. తొలి మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్ సేన గెలవగా.. రెండో వన్డేలో సోఫీ డివైన్ బృందం ఆతిథ్య జట్టుకు షాకిచ్చింది.భారత బ్యాటింగ్ ఆర్డర్‌ను కకావికలం చేసి.. 76 పరుగుల తేడాతో ఓడించి సిరీస్‌ను 1-1తో సమం చేసింది. ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య అహ్మాబాద్‌లో మంగళవారం సిరీస్ నిర్ణయాత్మక మూడో వన్డే జరిగింది. టాస్ గెలిచిన న్యూజిలాండ్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుని.. 49.5 ఓవర్లలో 232 పరుగులకు ఆలౌట్ అయింది. 86 పరుగులతో బ్రూక్ హాలీడే కివీస్ ఇన్నింగ్స్‌లో టాప్ స్కోరర్‌గా నిలిచింది.వన్డేల్లో ఎనిమిదో సెంచరీఇక లక్ష్య ఛేదనలో భారత ఓపెనర్ స్మృతి మంధాన శతకంతో మెరిసింది. తొలి రెండు వన్డేల్లో(5, 0) నిరాశపరిచిన ఈ లెఫ్టాండర్ బ్యాటర్.. నరేంద్ర మోదీ స్టేడియంలో మాత్రం విశ్వరూపం ప్రదర్శించింది. 122 బంతుల్లో 10 ఫోర్ల సాయంతో సెంచరీ పూర్తి చేసుకుంది. కాగా వన్డేల్లో స్మృతికి ఇది ఎనిమిదో సెంచరీ.ఈ క్రమంలో మిథాలీ రాజ్ రికార్డును స్మృతి బ్రేక్ చేసింది. వన్డేల్లో అత్యధిక శతకాలు బాదిన భారత మహిళా బ్యాటర్‌గా అవతరించింది. కాగా గతంలో మిథాలీ రాజ్ 211 వన్డే ఇన్నింగ్స్ ఆడి ఏడు శతకాలు బాదగా.. స్మృతి తన 88వ మ్యాచ్‌లోనే ఎనిమిదో సెంచరీ చేసింది. ఇక ఈ జాబితాలో భారత జట్టు ప్రస్తుత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ ఆరు శతకాలతో మూడో స్థానంలో ఉంది.2-1తో సిరీస్ కైవసంఇక మ్యాచ్ విషయానికొస్తే.. స్మృతితో పాటు హర్మన్‌ప్రీత్ కౌర్ అద్భుత ఇన్నింగ్స్(59 నాటౌట్) మెరిసింది. ఫలితంగా భారత్ న్యూజిలాండ్ విధించిన లక్ష్యాన్ని 44.2 ఓవర్లలోనే ఛేదించి ఆరు వికెట్ల తేడాతో గెలుపొందింది. సొంతగడ్డపై కివీస్‌తో వన్డే సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకుంది. ఇక మూడో వన్డేలో సెంచరీ బాదిన స్మృతికి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. కాగా ఈ మ్యాచ్‌లో 100 పరుగులు పూర్తి చేసుకున్న తర్వాత.. కివీస్ పేసర్ హన్నా రోవ్ బౌలింగ్‌లో స్మృతి బౌల్డ్ అయింది.వన్డేల్లో అత్యధిక శతకాలు సాధించిన భారత మహిళా క్రికెటర్లుస్మృతి మంధాన- 8*మిథాలీ రాజ్- 7హర్మన్‌ప్రీత్ కౌర్- 6*చదవండి: IPL 2025: అతడికి రూ. 18 కోట్లు.. గుజరాత్ టైటాన్స్ రిటైన్ చేసుకునేది వీరినే!That HUNDRED Feeling 💯🤗Live - https://t.co/pSVaIW4Deg#INDvNZ | @IDFCFIRSTBank | @mandhana_smriti pic.twitter.com/61zSBcOQ2H— BCCI Women (@BCCIWomen) October 29, 2024 -
WC 2023: ఛ.. ఏదో అనుకుంటే ఇంకేదో అయ్యింది! నీకే ఎందుకిలా?
WC 2023- Ind Vs SL- Virat Kohli Again Miss Century: వంద సెంచరీల రికార్డుకు చేరవయ్యే క్రమంలో టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి గురువారం మరో ముందడుగు వేస్తాడనుకుంటే నిరాశే మిగిలింది. కోహ్లి బ్యాట్ నుంచి శతకం కోసం ఎదురుచూసిన ఫ్యాన్స్ ఆశలపై లంక పేసర్ దిల్షాన్ మధుషాంక నీళ్లు చల్లాడు. వన్డే వరల్డ్‌కప్-2023లో భాగంగా భారత్‌తో మ్యాచ్‌లో టాస్ గెలిచిన శ్రీలంక తొలుత బౌలింగ్ ఎంచుకుంది. లంక ఆహ్వానం మేరకు బ్యాటింగ్‌కు దిగిన టీమిండియాకు ఆదిలోనే భారీ షాక్ తగిలింది. ఆరంభంలోనే టీమిండియాకు షాక్ లంక స్పీడ్‌స్టర్ మధుషాంక బౌలింగ్‌లో.. ఇన్నింగ్స్ రెండో బంతికే ఓపెనర్ రోహిత్ శర్మ(4) బౌల్డ్ అయ్యాడు. సొంతమైదానం ముంబైలోని వాంఖడేలో హిట్‌మ్యాన్ ఈ మేరకు పూర్తిగా విఫలమయ్యాడు. ఈ క్రమంలో మరో ఓపెనర్ శుబ్‌మన్ గిల్‌తో కలిసి వన్‌డౌన్ బ్యాటర్ విరాట్ కోహ్లి నిలకడగా ఆడుతూ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. ఓవైపు కోహ్లి.. మరో ఎండ్‌లో గిల్ ఇద్దరూ నిలకడగా.. పోటీపడుతూ ఆడుతూ లంక బౌలర్లకు చుక్కలు చూపించారు. ఆకాశమే హద్దుగా చెలరేగుతూ ఇద్దరూ అర్ధ శతకాలు పూర్తి చేసుకుని శతకాల కోసం పోటీపడ్డారు. View this post on Instagram A post shared by ICC (@icc) సెంచరీ కోసం పోటాపోటీ ఓ దశలో కోహ్లికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా క్రీజులో పాతుకుపోయిన గిల్.. సెంచరీ దిశగా పరుగులు తీశాడు. అయితే, దురదృష్టవశాత్తూ 30వ ఓవర్ ఆఖరి బంతికి అవుటయ్యాడు. మధుషాంక బౌలింగ్‌లో వికెట్ కీపర్ కుశాల్ మెండిస్‌కు సింపుల్ క్యాచ్ ఇచ్చి 92 పరుగుల వద్ద నిష్క్రమించాడు. మధుషాంక మరోసారి దెబ్బకొట్టాడు ఈ క్రమంలో కోహ్లి ఆచితూచి ఆడుతూ వంద పరుగులు పూర్తి చేసుకుంటాడని భావించిన అభిమానులకు గట్టి షాక్ తగిలింది. మధుషాంక బౌలింగ్‌లో బంతిని తప్పుగా అంచనా వేసిన కోహ్లి 32వ ఓవర్ మూడో బంతికి మూడో వికెట్‌గా వెనుదిరిగాడు. View this post on Instagram A post shared by ICC (@icc) ఏదో అనుకుంటే ఇంకేదో అయ్యింది వాంఖడే వేదికగా అంతర్జాతీయ క్రికెట్లో 79వ సెంచరీ నమోదు చేస్తాడని భావిస్తే 88 పరుగులకే అవుటయ్యాడు. దీంతో తీవ్ర నిరాశకు గురైన కింగ్ కోహ్లి ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ‘‘ఏదో అనుకుంటే.. ఇంకేదో అయ్యింది. నీకే ఎందుకిలా కోహ్లి’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇది మూడోసారి కాగా ప్రపంచకప్-2023లో సెంచరీకి చేరువగా వచ్చి కోహ్లి మిస్ కావడం ఇది మూడోసారి. ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో 85, న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో 95 పరుగుల వద్ద పెవిలియన్ చేరిన కోహ్లి.. తాజాగా 88 పరుగులు చేసి నిష్క్రమించాడు. చదవండి: అయ్యో శుబ్‌మన్.. సెంచరీ జస్ట్ మిస్! సారా రియాక్షన్ వైరల్ View this post on Instagram A post shared by ICC (@icc) -
SA Vs Aus: వరుసగా రెండో సెంచరీ! ప్రపంచకప్‌లో చరిత్ర సృష్టించిన డికాక్
ICC WC 2023- Australia vs South Africa- Quinton De Kock: వన్డే వరల్డ్‌కప్-2023లో భాగంగా సౌతాఫ్రికా ఓపెనర్ క్వింటన్ డికాక్ చరిత్ర సృష్టించాడు. ఆస్ట్రేలియాతో మ్యాచ్ సందర్భంగా పలు అరుదైన ఘనతలు సాధించాడు. లక్నో వేదికగా జరుగుతున్న ప్రపంచకప్ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆసీస్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన ప్రొటిస్ జట్టుకు క్వింటన్ డికాక్ సెంచరీతో శుభారంభం అందించాడు. సౌతాఫ్రికా ఇన్నింగ్స్ 29.5వ ఓవర్లో ప్యాట్ కమిన్స్ బౌలింగ్‌లో సిక్సర్ బాది వంద పరుగులు చేసుకున్నాడు. వరుసగా రెండో సెంచరీ ప్రపంచకప్-2023లో వరుసగా రెండోసారి సెంచరీ సాధించి.. అంతర్జాతీయ వన్డేల్లో 19వ శతకం నమోదు చేశాడు. ఈ సందర్భంగా.. వరల్డ్‌కప్ హిస్టరీలో అత్యధిక సెంచరీలు సాధించిన దక్షిణాఫ్రికా క్రికెటర్ల జాబితాలో చోటు సంపాదించాడు. View this post on Instagram A post shared by ICC (@icc) దిగ్గజ బ్యాటర్ ఏబీ డివిలియర్స్(4) తర్వాత ఈ ఘనత సాధించిన హషీం ఆమ్లా(2), ఫాఫ్ డుప్లెసిస్(2), హర్షల్ గిబ్స్(2)లతో సంయుక్తంగా రెండోస్థానంలో నిలిచాడు. రెండో ప్రొటిస్ బ్యాటర్‌గా అదే విధంగా సౌతాఫ్రికా తరఫున వన్డేల్లో అత్యధిక సెంచరీలు సాధించిన రెండో ఓపెనర్‌గా చరిత్రకెక్కాడు. ఈ ఎలైట్ లిస్టులో హషీం ఆమ్లా 27 శతకాలతో అగ్రస్థానంలో ఉండగా.. 19 సెంచరీలతో డికాక్ అతడి తర్వాతి స్థానాన్ని ఆక్రమించాడు. ఈ క్రమంలో హర్షల్ గిబ్స్(18)ను అధిగమించాడు. గిబ్స్ అరుదైన రికార్డు బ్రేక్ అంతేగాక వరల్డ్‌కప్ మ్యాచ్‌లలో ఆస్ట్రేలియా మీద అత్యధిక వ్యక్తిగత స్కోరు(109) సాధించిన తొలి సౌతాఫ్రికా బ్యాటర్‌గా చరిత్ర సృష్టించాడు. ఈ క్రమంలో హర్షల్ గిబ్స్(1999లో- 101 పరుగులు) రికార్డును బ్రేక్ చేశాడు. ఈ జాబితాలో 100 పరుగులతో ఫాఫ్ డుప్లెసిస్(2019) మూడో స్థానంలో ఉన్నాడు. కాగా ఆసీస్ మీద ఓవరాల్‌గా డికాక్‌కు ఇది మూడో శతకం. ఇక సౌతాఫ్రికా ఇన్నింగ్స్‌లో 35వ ఓవర్ ఐదో బంతికి ఆసీస్ ఆల్‌రౌండర్ గ్లెన్ మాక్స్వెల్ డికాక్‌ను బౌల్డ్ చేయడంతో అతడి ఇన్నింగ్స్‌కు తెరపడింది. ఇక ఈ మ్యాచ్‌లో ఎయిడెన్ మార్కరమ్ అర్ధ శతకంతో రాణించగా నిర్ణీత 50 ఓవర్లలో సౌతాఫ్రికా 7 వికెట్ల నష్టానికి 311 పరుగులు సాధించింది. చదవండి: WC 2011లో నేనే కెప్టెన్ అయి ఉంటే అతడిని తప్పక తీసుకునేవాడిని.. కానీ! View this post on Instagram A post shared by ICC (@icc) -
ఐదు వికెట్లు, వీరోచిత శతకం.. వన్డే వరల్డ్‌కప్‌కు నెదర్లాండ్స్ అర్హత
అక్టోబర్‌లో జరగనున్న వన్డే వరల్డ్‌కప్‌కు నెదర్లాండ్స్ అర్హత సాధించింది. స్కాట్లాండ్తో జరిగిన వరల్డ్‌కప్ క్వాలిఫయర్స్ సూపర్ సిక్స్ మ్యాచ్‌లో డచ్ జట్టు నాలుగు వికెట్ల తేడాతో సంచలన విజయం సాధించింది. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో(బౌలింగ్‌లో ఐదు వికెట్లు, బ్యాటింగ్‌లో సెంచరీ) మెరిసిన బాస్ డీ లీడే హైలెట్‌గా నిలిచాడు. దీంతో క్వాలిఫయర్-2 హోదాలో నెదర్లాండ్స్ వరల్డ్‌కప్‌కు పదో జట్టుగా అర్హత సాధించింది. ఇక క్వాలిఫయర్-1గా శ్రీలంక ఇప్పటికే వన్డే వరల్డ్‌కప్‌కు అర్హత సాధించగా.. తాజాగా డచ్ జట్టు క్వాలిఫయర్-2 హోదాలో వన్డే వరల్డ్‌కప్‌కు వెళ్లనుంది. అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19 వరకు ఐసీసీ వన్డే వరల్డ్‌కప్ జరగనుంది. భారత్ గడ్డపై ఈ మెగా సంగ్రామం జరగనుంది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే తొలుత బ్యాటింగ్ చేసిన స్కాట్లాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 277 పరుగులు చేసింది. బ్రాండన్ మెక్ముల్లన్ 110 బంతుల్లో 106 పరుగులు సెంచరీ చేయగా.. కెప్టెన్ రిచీ బెరింగ్టన్ 64, థామస్ మెకింటోష్ 38 పరుగులు చేశారు. నెదర్లాండ్స్ బౌలర్లలో బాస్ డీ లీడే ఐదు వికెట్లు తీయగా.. రెయాన్ క్లీన్ రెండు, వాన్‌బీక్ ఒక వికెట్ పడగొట్టాడు. అనంతరం 278 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన నెదర్లాండ్స్ 42.5 ఓవర్లలోనే ఆరు వికెట్లు కోల్పోయి టార్గెట్‌ను అందుకుంది. నెదర్లాండ్స్ మిడిలార్డర్ బ్యాటర్ బాస్ డీ లీడే(92 బంతుల్లో 123 పరుగులు) సంచలన శతకంతో జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఓపెనర్ విక్రమ్‌జిత్ సింగ్ 40 పరుగులు, ఆఖర్లో సకీబ్ జుల్పికర్ 33 నాటౌట్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. బౌలిగ్లో ఐదు వికెట్లు తీయడంతో పాటు వీరోచిత శతకంతో మెరిసిన బాస్ డీ లీడేను 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు వరించింది. 90 (82) 👉 123 (92) Bas de Leede went berserk in the last 10 balls he faced to seal Netherlands' #CWC23 qualification 💪#SCOvNED pic.twitter.com/gJMrkhm3aU — ICC Cricket World Cup (@cricketworldcup) July 6, 2023 A stunning heist! 😱 Netherlands have booked their #CWC23 tickets 🎫✈#SCOvNED pic.twitter.com/HtdyRvTWo0 — ICC Cricket World Cup (@cricketworldcup) July 6, 2023 చదవండి: #MitchellMarsh: నాలుగేళ్ల తర్వాత రీఎంట్రీ.. వన్డే తరహాలో రెచ్చిపోయి సెంచరీ #MarkWood: యాషెస్ చరిత్రలో రెండో ఫాస్టెస్ట్ బంతి.. ఖవాజాకు మైండ్ బ్లాక్ -
హ్యాట్రిక్ సెంచరీ.. జట్టును వరల్డ్‌కప్‌కు చేర్చడమే ధ్యేయంగా!
జింబాబ్వే సీనియర్ బ్యాటర్ సీన్ విలియమ్స్ తన జట్టును వరల్డ్‌కప్‌కు క్వాలిఫై చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లుగా అనిపిస్తోంది. తన కెరీర్లోనే పీక్ ఫామ్ కనబరుస్తున్న సీన్ విలియమ్స్ మరో సెంచరీతో మెరిశాడు. క్రికెట్ వరల్డ్‌కప్ క్వాలిఫయర్స్‌లో భాగంగా గురువారం సూపర్ సిక్స్‌లో ఒమన్‌తో మ్యాచ్‌లో ఈ ఫీట్ నమోదు చేశాడు. ఈ టోర్నీలో సీన్ విలియమ్స్‌కు ఇది హ్యాట్రిక్ సెంచరీ కావడం విశేషం. గ్రూప్ దశలో అమెరికాతో జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌లో 175 పరుగుల ఇన్నింగ్స్‌తో కెరీర్ బెస్ట్ ఇన్నింగ్స్ ఆడిన విలియమ్సన్ తన జోరును సూపర్ సిక్స్‌లోనూ చూపిస్తున్నాడు. 81 బంతుల్లో సెంచరీ మార్క్ అందుకున్న విలియమ్సన్ ఖాతాలో 13 ఫోర్లు, ఒక సిక్సర్ ఉన్నాయి. విలిమయమ్సన్ ధాటికి జింబాబ్వే మరోసారి భారీ స్కోరు దిశగా పయనిస్తోంది. ప్రస్తుతం జింబాబ్వే 41 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 234 పరుగులు చేసింది. విలియమ్సన్ 119 పరుగులతో అజేయంగా ఆడుతుండగా.. రియాన్ బర్ల్ 2 పరుగులతో సహకరిస్తున్నాడు. కాగా వలర్డ్‌కప్ క్వాలిఫయర్ టోర్నీలో ప్రస్తుతం విలియమ్సన్ టాప్ స్కోరర్‌గా కొనసాగుతున్నాడు. ఇప్పటివరకు టోర్నీలో ఐదు మ్యాచ్‌లు ఆడిన విలియమ్సన్ రెండు అర్థసెంచరీలు, మూడు సెంచరీల సాయంతో 506 పరుగులు సాధించాడు. రెండో స్థానంలో నికోలస్ పూరన్ 296 పరుగులతో ఉన్నాడు. టాప్-2 స్కోరర్స్‌కు చాలా తేడా ఉంది. దీంతో అతని దూకుడు ఎలా కొనసాగుతుందో అర్థం చేసుకోవచ్చు. The third hundred in the tournament 💯 A batting average of over 100 in ODIs in 2023 ✅ Sean Williams is UNSTOPPABLE! 💥#ZIMvOMA | #CWC23 pic.twitter.com/R89inyV9KT — ICC (@ICC) June 29, 2023 చదవండి: సీన్ రివర్స్ అయినట్టుందే!.. ఇంగ్లండ్‌కు దిమ్మతిరిగే షాక్ రూట్ అరుదైన ఘనత.. యాషెస్ చరిత్రలో మూడో ఆటగాడిగా -
కెప్టెన్ వీరోచిత శతకం.. జోరు మీదున్న స్కాట్లాండ్
ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్ క్వాలిఫయర్స్(CWC 2023)లో స్కాట్లాండ్ జట్టు దూకుడు కనబరుస్తోంది. లీగ్‌లో వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. శుక్రవారం యూఏఈతో జరిగిన మ్యాచ్‌లో స్కాట్లాండ్ 111 పరుగుల తేడాతో భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. స్కాట్లాండ్ కెప్టెన్ రిచీ బెరింగ్టన్ (136 బంతుల్లో 127 పరుగులు, 9 ఫోర్లు, 3సిక్సర్లు) వీరోచిత సెంచరీతో మెరిశాడు. అతనికి తోడుగా మైకెల్ లీస్క్ 41, మార్క్ వాట్ 31 బంతుల్లో 44 నాటౌట్ మెరుపు ఇన్నింగ్స్ ఆడారు. దీంతో స్కాట్లాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 282 పరుగులు చేసింది. అనంతరం 283 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన యూఏఈ స్కాట్లాండ్ బౌలర్ల దాటికి 35.3 ఓవర్లలో 171 పరుగులకే ఆలౌట్ అయింది. కెప్టెన్ ముహ్మద్ వసీమ్ 36 పరుగులు మినహా మిగతావారు పెద్దగా రాణించలేదు. స్కాట్లాండ్ బౌలర్లలో షరీఫ్ నాలుగు వికెట్లు తీయగా.. క్రిస్ సోల్ మూడు వికెట్లు పడగొట్టాడు. ఈ విజయంతో స్కాట్లాండ్ సూపర్ సిక్స్‌కు మరింత చేరువ కాగా.. మరోవైపు హ్యాట్రిక్ ఓటమితో యూఏఈ టోర్నీ నుంచి నిష్క్రమించినట్లే. చదవండి: #LionelMessi: 'కేజీఎఫ్' బ్యాక్‌గ్రౌండ్.. రోమాలు నిక్కబొడిచేలా.. -
జింబాబ్వే తరపున ఫాస్టెస్ట్ సెంచరీ.. రెండు రోజుల్లోనే చెరిపేసి
జింబాబ్వే ఆల్‌రౌండర్ సికందర్ రజా చరిత్ర సృష్టించాడు. వన్డే క్రికెట్లో జింబాబ్వే తరపున అత్యంత వేగంగా సెంచరీ చేసిన క్రికెటర్‌గా రికార్డులకెక్కాడు. ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్ క్వాలిఫయింగ్ టోర్నీలో భాగంగా మంగళవారం నెదర్లాండ్స్‌తో జరిగిన లీగ్ మ్యాచ్‌లో సికందర్ రజా 54 బంతుల్లో ఆరు ఫోర్లు, 8 సిక్సర్లతో 102 పరుగులు నాటౌట్ సుడిగాలి శతకంతో మెరిశాడు. కేవలం 54 బంతుల్లోనే భారీ శతకం బాదిన సికందర్ రాజా జింబాబ్వే తరపున వన్డే క్రికెట్లో అత్యంత వేగవంతమైన సెంచరీ రికార్డును కూడా సొంతం చేసుకున్నాడు. ఇంతకు ముందు ఈ రికార్డు సీన్ విలియమ్స్ పేరిట ఉండేది. జూన్ 18న నేపాల్‌పై విలియమ్స్ కేవలం 70 బంతుల్లోనే సెంచరీ సాధించాడు. ఇప్పుడు ఈ రికార్డును సికందర్ రాజా కేవలం రెండు రోజుల్లోనే చెరిపేసి కొత్త చరిత్ర సృష్టించాడు. కాగా 37 ఏళ్ల వయసులో శతకం బాదిన సికందర్ రజా.. వన్డేల్లో ఫాస్టెస్ట్ సెంచరీ బాదిన పెద్ద వయస్కుడిగా క్రెయిగ్ ఎర్విన్‌తో కలిసి సంయుక్తంగా నిలిచాడు. ఇక వన్డే క్రికెట్ చరిత్రలో అత్యంత వేగవంతమైన శతకం దక్షిణాఫ్రికా దిగ్గజం ఏబీ డివిలియర్స్ పేరిట ఉంది. డివిలియర్స్ కేవలం 31 బంతుల్లోనే శతకం మార్క్ అందుకోగా.. ఆ తర్వాతి స్థానంలో న్యూజిలాండ్ బ్యాటర్ కోరె అండర్సన్ (36 బంతుల్లోనే శతకం), షాహిద్ అఫ్రిది 37 బంతుల్లో, జాస్ బట్లర్ 46 బంతుల్లో, సనత్ జయసూర్య 48 బంతుల్లో అందుకున్నారు. ఇక టీమిండియా తరపున విరాట్ కోహ్లి 52 బంతుల్లో సెంచరీ సాధించాడు. చదవండి: చావుదెబ్బ కొట్టిన ఆసీస్.. రికార్డులు బద్దలైన వేళ సికందర్ రజా ఆల్‌రౌండ్ ప్రదర్శన.. ఎదురులేని జింబాబ్వే -
అక్కడ కెప్టెన్ ఇరగదీశాడు.. ఇక్కడ ఎస్ఆర్హెచ్ మాత్రం
ఐపీఎల్లో ఎస్ఆర్హెచ్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న ఐడెన్ మార్క్రమ్ ఇంకా జట్టుతో చేరలేదు. మార్క్రమ్ ఒక్కడే కాదు సౌతాఫ్రికాకు ఆడుతున్న ఏ ఒక్కరు కూడా ఇంకా ఐపీఎల్ ఆడేందుకు రాలేదు. ప్రస్తుతం వారంతా తమ సొంతజట్టు సౌతాఫ్రికాను వన్డే వరల్డ్‌కప్‌కు క్వాలిఫై చేసే పనిలో ఉన్నారు. దీంతో ఐపీఎల్ 16వ సీజన్‌కు మార్క్రమ్ వచ్చేవరకు అతని స్థానంలో భువనేశ్వర్ ఎస్ఆర్హెచ్ను నడిపించనున్నాడు. ఇక నెదర్లాండ్స్‌తో సౌతాఫ్రికా వన్డే సిరీస్ ఆడుతున్న సంగతి తెలిసిందే. ఆదివారం నెదర్లాండ్స్‌తో జరుగుతున్న మూడో వన్డే రీషెడ్యూల్డ్ మ్యాచ్‌లో మార్క్రమ్ సంచలన ఇన్నింగ్స్ ఆడాడు. 126 బంతుల్లో 17 ఫోర్లు, ఏడు సిక్సర్ల సాయంతో 175 పరుగులు చేశాడు. అతనికి డేవిడ్ మిల్లర్(61 బంతుల్లో 91 పరుగులు) సహకరించాడు. దీంతో సౌతాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 370 పరుగులు చేసింది. భారీ టార్గెట్‌తో బరిలోకి దిగిన నెదర్లాండ్స్ 33 ఓవర్లు ముగిసేసరికి ఐదు వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది. ఈ సంగతి పక్కనబెడితే.. ఎస్ఆర్హెచ్ కెప్టెన్ మార్క్రమ్ సంచలన ఇన్నింగ్స్‌తో ఇరగదీస్తే.. ఐపీఎల్లో తన జట్టు ఎస్ఆర్హెచ్ మాత్రం తొలి మ్యాచ్‌లోనే ఘోర ఓటమిని చవిచూసింది. ఆదివారం రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఎస్ఆర్హెచ్ 72 పరుగుల తేడాతో భారీ ఓటమిని చవిచూసింది. 204 పరుగుల భారీ టార్గెట్‌ను చేధించే క్రమంలో ఎస్ఆర్హెచ్ 8 వికెట్ల నష్టానికి 131 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో అభిమానులు ఎస్ఆర్హెచ్పై ట్రోల్స్‌తో విరుచుకుపడ్డారు. ''అక్కడ కెప్టెన్ ఇరగదీస్తే.. ఇక్కడ ఎస్ఆర్హెచ్ మాత్రం అదే ఆటతీరు కనబరిచింది''..'' కెప్టెన్ వస్తే గానీ ఎస్ఆర్హెచ్ రాత మారదేమో'' అంటూ కామెంట్ చేశారు. చదవండి: చరిత్ర సృష్టించిన చహల్.. -
శతకంతో అదరగొట్టిన తెలుగు క్రికెటర్; జింబాబ్వేపై నెదర్లాండ్స్ విజయం
నెదర్లాండ్స్‌కు జట్టుకు ఆడుతున్న తెలుగు కుర్రాడు తేజ నిడమనూరు అదరగొట్టాడు. జింబాబ్వేతో జరిగిన తొలి వన్డేలో ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి అజేయ సెంచరీతో మెరవడమే గాక జట్టుకు అద్భుత విజయాన్ని అందించాడు. విషయంలోకి వెళితే.. మంగళవారం జరిగిన తొలి వన్డేలో నెదర్లాండ్స్ మూడు వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. 250 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన నెదర్లాండ్స్ 49.5 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. 110 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయిన దశలో క్రీజులోకి వచ్చిన తేజ నిడమనూరు (96 బంతుల్లో 110 నాటౌట్, 9 ఫోర్లు, 3 సిక్సర్లు) ఏడోస్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి సెంచరీ మార్క్ సాధించాడు. అతనికి షారిజ్ అహ్మద్ 30 పరుగులతో సహకరించాడు. చివర్లో షారిజ్ రనౌట్ అయినప్పటికి పాల్ వాన్ మెక్రిన్ 21 పరుగులు నాటౌట్ అండతో తేజ జట్టుకు విజయాన్ని అందించాడు. అంతకముందు కొలిన్ అకెర్మన్ 50 పరుగులతో రాణించాడు. అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే 47.3 ఓవర్లలో 249 పరుగులకు ఆలౌట్ అయింది. జింబాబ్వే బ్యాటింగ్‌లో కూడా ఏడో స్థానంలో వచ్చిన క్లైవ్ మదానే 74 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. మసకద్జ 34, నగరవా 35 పరుగులు చేశారు. డచ్ బౌలర్లలో ఫ్రెడ్ క్లాసెన్ మూడు వికెట్లు తీయగా.. వాన్ మెక్రిన్ రెండు, గ్లోవర్, విక్రమ్‌జిత్ సింగ్, షారిజ్ అహ్మద్‌లు తలా ఒక వికెట్ తీశారు. ► కాగా శతకంతో అలరించిన తేజ నిడమనూరు ఒక అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. వన్డేల్లో ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి సెంచరీ సాధించిన ఐదో బ్యాటర్‌గా రికార్డులకెక్కాడు. ఇంతకముందు మైకెల్ బ్రాస్‌వెల్(127 పరుగులు నాటౌట్ వర్సెస్ ఐర్లాండ్), థామస్ ఒడయో(111 పరుగులు నాటౌట్ వర్సెస్ కెనడా), అబ్దుల్ రజాక్( 109 పరుగులు నాటౌట్ వర్సెస్ సౌతాఫ్రికా), గ్లెన్ మ్యాక్స్‌వెల్( 108 పరుగులు వర్సెస్ ఇంగ్లండ్).. తాజాగా తేజ నిడమనూరు(110 పరుగులు నాటౌట్ వర్సెస్ జింబాబ్వే) ఈ జాబితాలో చేరాడు. ► ఇక వన్డేల్లో చేజింగ్‌లో భాగంగా ఏడో వికెట్‌కు అత్యధిక భాగస్వామ్యం నమోదు చేసిన ఐదో జంటగా తేజ నిడమనూరు, షారిజ్ అఫ్రిది నిలిచారు . ఈ జోడి 110 పరుగులు జోడించారు. ఇంతకముందు అఫిఫ్ హొసెన్-మెహదీ హసన్(బంగ్లాదేశ్) జోడి 174 పరుగులు, బసిల్ హమీద్- కాషిఫ్ దౌడ్(యూఏఈ) జోడి 148 పరుగులు, మహేల జయవర్దనే-ఉపుల్ చందన(శ్రీలంక) జోడి 126 పరుగులు, హారిస్ సోహైల్-షాహిద్ అఫ్రిది(పాకిస్తాన్) జోడి 110 పరుగులు వరుసగా నాలుగు స్థానాల్లో ఉన్నారు. తాజాగా తేజ నిడమనూరు- షారిజ్ అహ్మద్(నెదర్లాండ్స్) జోడి 110 పరుగులతో వీరి సరసన చేరింది. Walking in to bat at No.7, Teja Nidamanuru has made a maiden ODI hundred 😮 Watch #ZIMvNED live and FREE on https://t.co/CPDKNxoJ9v 📺 📝 https://t.co/W6FjF8WDYn | #CWCSL pic.twitter.com/opKgtxR8pP — ICC (@ICC) March 21, 2023 చదవండి: క్లాసెన్ విశ్వరూపం; 29 ఓవర్లలోనే టార్గెట్‌ను ఉదేశారు -
క్లాసెన్ విశ్వరూపం; 29 ఓవర్లలోనే టార్గెట్‌ను ఊదేశారు
మంగళవారం వెస్టిండీస్‌తో జరిగిన మూడో వన్డేలో సౌతాఫ్రికా నాలుగు వికెట్ల తేడాతో భారీ విజయాన్ని అందుకుంది. విండీస్ విధించిన 261 పరుగుల టార్గెట్‌ను కేవలం 29.3 ఓవర్లలోనే ఉదేశారు. హెన్రిచ్ క్లాసెన్ (61 బంతుల్లో 119 పరుగులు నాటౌట్, 15 ఫోర్లు, 5 సిక్సర్లు) విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడి సౌతాఫ్రికాకు ఘన విజయాన్ని కట్టబెట్టాడు. అతనికి తోడుగా మార్కో జాన్సెన్ 43, ఐడెన్ మార్క్రమ్ 25 పరుగులు చేశారు. ఒక దశలో 87 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఇక మ్యాచ్ విండీస్ వైపు అనుకున్న తరుణంలో క్లాసెన్ తన విశ్వరూపాన్ని చూపెట్టాడు. 12.1 ఓవర్లలో 87/4గా ఉన్న స్కోరు 29.3 ఓవర్లలో 264/6గా మారింది. అంటే కేవలం 17.1 ఓవర్లలో సౌతాఫ్రికా 177 పరుగులు చేసింది. దీన్నిబట్లే క్లాసెన్ విధ్వంసం ఏ మేరకు సాగిందో అర్థం చేసుకోవచ్చు. క్లాసెన్ దాటికి సౌతాఫ్రికా ఇన్నింగ్స్ ఓవర్‌కు 8.90 రన్‌రేట్‌తో ఇన్నింగ్స్ కొనసాగడం విశేషం. వన్డేల్లో భాగంగా చేజింగ్‌లో రన్‌రేట్ పరంగా సౌతాఫ్రికా ఇదే అత్యుత్తమం. ఇంతకముందు 2006లో ఆస్ట్రేలియాపై వాండరర్స్ వేదికగా జరిగిన వన్డేలో 435 పరుగుల లక్ష్యాన్ని 8.78 రన్‌రేట్‌తో 49.5 ఓవర్లలో చేధించడం ఇప్పటివరకు అత్యుత్తమంగా ఉంది. తాజాగా ఆ రికార్డును సవరించింది. ఈ విజయంతో మూడు వన్డేల సిరీస్‌ను 1-1తో సమం చేసింది. అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 48.2 ఓవర్లలో 260 పరుగులకు ఆలౌటైంది. బ్రాండన్ కింగ్ 72 పరుగులతో టాప్‌స్కోరర్ కాగా.. జాసన్ హోల్డర్ 36, నికోలస్ పూరన్ 39 పరుగులు చేశారు. ప్రొటీస్ బౌలర్లలో గెరాల్డ్ కోర్ట్జే, ఫోర్టున్, మార్కో జాన్సెన్లు తలా రెండు వికెట్లు తీశారు. masss batting display 💥🥵 by klaassen hundred in just 54 balls🔥#SAvsWI#OrangeFireIdhi pic.twitter.com/NuZVmwZlQB — notnot7 (@lostcause4aid) March 21, 2023 చదవండి: అన్నింటా విఫలం.. కెప్టెన్‌గా పనికిరాదా? -
సెంచరీతో మెరిసిన శుబ్‌మన్ గిల్..
సాక్షి, హైదరాబాద్: భాగ్యనగరం వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి వన్డేలో శుబ్‌మన్ గిల్ సెంచరీతో మెరిశాడు. ఆరంభం నుంచి దూకుడుగా ఆడిన గిల్ 87 బంతుల్లో సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. గిల్ ఇన్నింగ్స్‌లో 14 ఫోర్లు, 2 సిక్సర్లు ఉన్నాయి. మధ్యలో చిన్న చిన్న పొరపాట్లు మినహా గిల్ బ్యాటింగ్‌లో ఎక్కడా లోపం కనిపించలేదు. కాగా గిల్‌కు ఇది వరుసగా రెండో సెంచరీ కావడం విశేషం. శ్రీలంకతో జరిగిన ఆఖరి వన్డేలోనూ గిల్ సెంచరీతో అదరగొట్టిన సంగతి తెలిసిందే. ఓవరాల్‌గా వన్డేల్లో గిల్‌కు ఇది మూడో సెంచరీ. వన్డేల్లో వెయ్యి పరుగులు పూర్తి చేసుకున్న గిల్ ఈ క్రమంలోనే వన్డేల్లో గిల్ వెయ్యి పరుగులు పూర్తి చేసుకున్నాడు. గిల్‌కు వన్డేల్లో వెయ్యి పరుగులు పూర్తి చేయడానికి 19 ఇన్నింగ్స్‌లు అవసరమయ్యాయి. ఓవరాల్‌గా వన్డేల్లో అత్యంత వేగంగా వెయ్యి పరుగులు పూర్తి చేసిన బ్యాటర్‌గా.. పాక్ ఆటగాడు ఇమాముల్ హక్‌తో కలిసి గిల్ సంయుక్తంగా రెండో స్థానంలో నిలిచాడు. తొలి స్థానంలో పాకిస్తాన్ బ్యాటర్ ఫఖర్ జమాన్(18 ఇన్నింగ్స్‌లు) ఉన్నాడు. ఇక టీమిండియా ప్రస్తుతం 33 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 204 పరుగులు చేసింది. గిల్ 111, పాండ్యా 12 పరుగులతో క్రీజులో ఉన్నారు. అంతకముందు సూర్యకుమార్ 31 పరుగులు చేసి ఔట్ కాగా.. రోహిత్ 34 పరుగులు చేశాడు. కోహ్లి 4, ఇషాన్ కిషన్ 5 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యారు. Milestone 🚨 - Shubman Gill becomes the fastest Indian to score 1000 ODI runs in terms of innings (19) 👏👏 Live - https://t.co/DXx5mqRguU #INDvNZ @mastercardindia pic.twitter.com/D3ckhBBPxn — BCCI (@BCCI) January 18, 2023 చదవండి: న్యూజిలాండ్‌తో తొలి వన్డే.. సెంచరీతో రికార్డుల్లోకెక్కిన శుభ్‌మన్ గిల్ -
ఓర్వలేనితనం అంటే ఇదే..
టీమిండియా స్టార్ క్రికెటర్.. కింగ్ కోహ్లి ప్రస్తుతం సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. మూడు వారాల వ్యవధిలో మూడు వన్డే సెంచరీలు బాది వింటేజ్ కోహ్లిని తలపిస్తున్నాడు. క్రీజులోకి వస్తే పాతుకుపోవడం లక్ష్యంగా పెట్టుకున్న అతను సెంచరీ సాధించేవరకు ఔట్ అవ్వడానికి ఇష్టపడడం లేదు. అసలు ఏడాది కింద కోహ్లి ఆటతీరు ఎలా ఉండేదో అందరికి తెలిసిందే. 71వ సెంచరీ(మూడు ఫార్మాట్లు కలిపి) అందుకోవడం కోసం దాదాపు వెయ్యి రోజులకు పైగా నిరీక్షించిన కోహ్లి ఎట్టకేలకు ఆసియాకప్‌లో అఫ్గానిస్తాన్‌తో మ్యాచ్ ద్వారా 71వ సెంచరీ అందుకున్నాడు. అప్పటినుంచి ఇప్పటిదాకా కోహ్లి పరుగుల ప్రవాహం ఎక్కడా ఆగడం లేదు. టి20 ప్రపంచకప్‌లో టీమిండియా తరపున టాప్ స్కోరర్‌గా నిలిచిన కోహ్లి.. ఆ మెగాటోర్నీలో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌పై ఆడిన ఇన్నింగ్స్ ఇప్పటికి కళ్ల ముందు కదలాడుతూనే ఉంది. ఆ తర్వాత బంగ్లాదేశ్ పర్యటనలోనూ అదరగొట్టిన కోహ్లి వన్డేల్లో ఒక సెంచరీ బాదాడు. ఆ తర్వాత లంకతో స్వదేశంలో జరిగిన వన్డే సిరీస్‌లోనూ కోహ్లి అదే దూకుడు చూపించాడు. మూడు వన్డేలాడిన కోహ్లి రెండు సెంచరీలతో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా నిలిచాడు. అంతేగాక తన సెంచరీల సంఖ్యను వన్డేల్లో 46కు.. ఓవరాల్‌గా 74కు పెంచుకున్నాడు. ఇక బుధవారం కివీస్‌తో ప్రారంభం కానున్న వన్డే సిరీస్‌లో కోహ్లి అదే జోరును చూపిస్తూ మరిన్ని సెంచరీలు చేస్తాడేమో వేచి చూడాలి. అయితే కోహ్లి ఫామ్‌ను తట్టుకోలేని ఒక పాక్ జర్నలిస్టు తన అక్కసు వెళ్లగక్కాడు. ''ఒత్తిడి తక్కువగా ఉన్న సమయంలోనే కోహ్లి సెంచరీలు సాధిస్తాడు. ప్రెషర్ ఉన్న సమయంలో కోహ్లి బ్యాట్ నుంచి పరుగులు రావు.. ఇదేమంత గొప్ప విషయం కాదు.. ఎలాంటి ఒత్తిడి లేని సమయంలో గొప్పగా బ్యాటింగ్ చేయడం ఏ బ్యాటర్‌కైనా సాధ్యమే. ఆస్ట్రేలియాతో త్వరలో జరగనున్న టెస్టు సిరీస్‌కు కోహ్లిని సిద్దం చేయాలి. బలమైన జట్టుపై ఎలా బ్యాటింగ్ చేస్తాడనేది ఆసక్తికరంగా ఉంటుంది.'' అంటూ తన అక్కసు చూపించాడు. అయితే సదరు పాక్ జర్నలిస్టుపై టీమిండియా ఫ్యాన్స్ మాత్రమే కాదు.. సొంతదేశ అభిమానులే ఆగ్రహం వ్యక్తం చేశారు. పాకిస్తాన్ క్రికెట్ షోయబ్ మక్సూద్ తనదైన శైలిలో పాక్ జర్నలిస్ట్‌కు కౌంటర్ ఇచ్చాడు. ''ఒత్తిడి లేనప్పుడు మాత్రమే కోహ్లి బెస్ట్ అంటున్నావా.. అతని ఆటేంటో ప్రపంచానికి మొత్తం తెలుసు.. కాస్త ఎదుగు భయ్యా'' అంటూ ట్రోల్ చేశాడు. ఇక కొంతమంది అభిమానులు.. ''ఓర్వలేనితనం అంటే ఇదే''.. అంటూ కామెంట్స్ చేశారు. Are you sure he is only best when there is no pressure grow up yar 🙏🏿🙏🏿🙏🏿two wrongs dont make one right 🙏🏿🙏🏿🙏🏿 — Sohaib Maqsood (@sohaibcricketer) January 15, 2023 చదవండి: వన్డే ర్యాంకింగ్స్‌లో అదరగొట్టిన విరాట్ కోహ్లి.. టాప్-5లోకి ఎంట్రీ ఉప్పల్‌లో మ్యాచ్ అంటే కోహ్లికి పూనకాలే! -
పాంటింగ్‌ను దాటేసిన కోహ్లి..
బంగ్లాదేశ్‌తో జరిగిన మూడో వన్డేలో టీమిండియా 227 పరుగుల తేడాతో భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. అయితే తొలి రెండు వన్డేల్లో ఓటమి పాలయిన భారత్ 1-2 తేడాతో ఆతిథ్య జట్టుకు సిరీస్‌ను సమర్పించింది. అయితే మ్యాచ్‌లో టీమిండియా యువ ఆటగాడు ఇషాన్ కిషన్ డబుల్ సెంచరీతో చెలరేగితే.. టీమిండియా రన్‌మెషిన్ విరాట్ కోహ్లి సెంచరీతో మెరిశాడు. 85 బంతుల్లోనే శతకాన్ని అందుకున్న కోహ్లికి వన్డేలలో ఇది 44వ సెంచరీ. 43 నుంచి 44 శతకం చేయడానికి కోహ్లీ ఏకంగా 40 నెలల సమయం తీసుకున్నాడు. ఈ సెంచరీ ద్వారా అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలో అత్యధిక సెంచరీలు సాధించిన ఆటగాళ్లలో కోహ్లీ రికీ పాంటింగ్ (71 సెంచరీలు) ను అధిగమించాడు. ఇక కోహ్లీ ముందున్నది సచిన్ టెండూల్కర్ మాత్రమే.సచిన్.. తన కెరీర్ లో వంద సెంచరీలు చేశాడు. ఇందులో టెస్టులలో 51, వన్డేలలో 49 సెంచరీలు సాధించాడు. అయితే కోహ్లీ మాత్రం వన్డేలలో ఇప్పటికే 44 సెంచరీలు చేశాడు. మరో ఐదు సెంచరీలు చేస్తే కోహ్లీ.. వన్డేలలో సచిన్ అత్యధిక రికార్డులను బద్దలుకొడుతాడు. -
పాక్ మూలాలున్న బ్యాటర్.. అయినా సరే మనసు దోచుకున్నాడు
జింబాబ్వే స్టార్.. సికందర్ రజా ఇప్పుడు నయా సంచలనం. జట్టులో ఎవరు ఆడినా.. ఆడకపోయినా తాను మాత్రం చెలరేగుతూనే ఉన్నాడు. బంగ్లాదేశ్‌తో సిరీస్‌లో వరుస శతకాలతో అలరించిన రజా.. టీమిండియాతో మాత్రం అదే ఫామ్‌ను కొనసాగించడంలో విఫలమయ్యాడని మాట్లాడుకునేలోపే స్టన్నింగ్స్ సెంచరీతో మెరిశాడు. టీమిండియాపై జింబాబ్వే మ్యాచ్ ఓడినా.. సికందర్ రజా మాత్రం అభిమానుల మనసు దోచుకున్నాడు. పాక్ మూలాలున్న బ్యాటర్ అయినప్పటికి సికందర్ రజాపై భారత్ అభిమానులు ట్విటర్లో ప్రేమ వర్షం కురిపించారు. వన్డే సిరీస్ ప్రారంభానికి ముందే సికందర్ రజా తనతో జాగ్రత్తగా ఉండాలని భారత బౌలర్లకు హెచ్చరికలు పంపించాడు. అయితే తొలి రెండు వన్డేల్లో అతన్ని తొందరగా ఔట్ చేసి సఫలమైన టీమిండియా బౌలర్లు.. మూడో వన్డేలో మాత్రం అతని బ్యాటింగ్ పవర్‌ను రుచి చూశారు. పాకిస్తాన్ మూలాలున్న ఆటగాడిగా జింబాబ్వే జట్టులో ఆడుతున్న సికందర్ రజా తనదైన ముద్ర వేస్తున్నాడు. 167 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయి తీవ్ర కష్టాల్లో ఉన్న జట్టును సికందర్ రజా నడిపించిన తీరు అద్భుతమనే చెప్పాలి. ఇన్నింగ్స్ నిర్మించడమే అనుకుంటే ఏకంగా సెంచరీతో చెలరేగి భారత బౌలర్లకు ముచ్చెమటలు పట్టించాడు. ఒక దశలో జింబాబ్వేను విజయం దిశగా నడిపించిన సికిందర్ రజా.. భారత్ క్లీన్‌స్వీప్ చేయకుండా అడ్డుపడేలా కనిపించాడు. అయితే చివర్లో ఒత్తిడిని అధిగమించలేక జింబాబ్వే 13 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. ఇక సికందర్ రజా తన కెరీర్లోనే అత్యుత్తమ ఫామ్ కనబరుస్తున్నాడు. వన్డే క్రికెట్లో తనదైన మార్క్ చూపిస్తున్న రజాకు గత ఆరు వన్డేల్లో ఇది మూడో సెంచరీ కావడం విశేషం. 1986లో పాకిస్తాన్‌లోని సియాల్కోట్లో జన్మించిన సికందర్ రజా.. 2002లో కుటుంబంతో జింబాబ్వేలో స్థిరపడ్డాడు. 2013 సెప్టెంబర్ 3న పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్ ద్వారా టెస్టుల్లో అరంగేట్రం చేసిన సికందర్ రజా.. అంతకముందే అంటే 2013 మేలో అఫ్గనిస్తాన్‌తో మ్యాచ్ ద్వారా వన్డేల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పటివరకు సికందర్ రజా జింబాబ్వే తరపున 17 టెస్టుల్లో 1187 పరుగులు, 115 వన్డేల్లో 3366 పరుగులు, 50 టి20ల్లో 685 పరుగులు సాధించాడు. #3rdODI |EARLIER! @SRazaB24 scored his sixth ODI hundred off 88 deliveries 🙇♂️#ZIMvIND | #KajariaODISeries | #VisitZimbabwe pic.twitter.com/bOxbuzww7D — Zimbabwe Cricket (@ZimCricketv) August 22, 2022 Man has some special class, another brilliant knock. What a century sikandar Raza. What a player, brilliant talent in Zimbabwe Cricket. Hats off 🙌 pic.twitter.com/KMSBsNhkLE — Fatima Masroor (@beingfatyma_) August 22, 2022 Hundred by Sikandar Raza in just 87 balls - what an innings this has been by Raza, unbelievable year for him. One of the finest of Zimbabwe cricket! pic.twitter.com/cVKEynZygE — Mufaddal Vohra (@mufaddal_vohra) August 22, 2022 Such a classic knock by Sikandar Raza 🤌🏻 pic.twitter.com/4sn91eZNrO — Shivani (@meme_ki_diwani) August 22, 2022 Played, Sikandar Raza 👏 — Punjab Kings (@PunjabKingsIPL) August 22, 2022 Century for Raza - Quality innings under pressure 👏💯#OneFamily #ZIMvIND — Mumbai Indians (@mipaltan) August 22, 2022 చదవండి: Babar Azam: చిన్న జట్టంటే అంత చులకన.. ఏ దేశంతో ఆడుతున్నారో తెలియదా! Ind Vs Zim 3rd ODI: సికిందర్ రజా సెంచరీ వృథా.. పోరాడి ఓడిన జింబాబ్వే! -
కెరీర్‌కు టర్నింగ్ పాయింట్.. ఆ ఒక్క సెంచరీ వెనుక విషాద కథ
ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ మార్కస్ స్టోయినిస్ గురించి కొత్తగా పరిచయం అక్కర్లేదు. టి20 క్రికెట్లో విధ్వంసకర ఆటకు పెట్టింది పేరు. ఇటీవలే ఐపీఎల్ 2022 సీజన్లో లక్నో సూపర్‌జెయింట్స్‌కు ఆడిన స్టోయినిస్ 11 మ్యాచ్‌ల్లో 156 పరుగులు మాత్రమే చేసి అంతగా ఆకట్టుకోలేకపోయాడు. అయితే కొన్ని కీలక ఇన్నింగ్స్‌లతో మాత్రం మెరిశాడు. ఇక ఆస్ట్రేలియా తరపున 48 మ్యాచ్‌ల్లో 1200 పరుగులు సాధించాడు. స్టోయినిస్ ఖాతాలో ఆరు హాఫ్ సెంచరీలు.. ఒక సెంచరీ ఉన్నాయి. ఆరోజు మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 286 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా బ్యాటింగ్‌లో పూర్తిగా తడబడింది. 67 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి తీవ్ర కష్టాల్లో పడింది. అప్పుడు మార్కస్ స్టోయినిస్ క్రీజులోకి వచ్చాడు. టాపార్డర్, మిడిలార్డర్ విఫలమైనవేళ లోయర్ ఆర్డర్లో జేమ్స్ ఫాల్కనర్(25), పాట్ కమిన్స్(36)తో కలిసి కీలక భాగస్వామ్యాలు నిర్మించి జట్టును విజయం వైపు నడిపించాడు. ఓవరాల్‌గా 117 బంతుల్లో 9 ఫోర్లు, 11 సిక్సర్లతో 146 పరుగులు నాటౌట్‌గా నిలిచాడు. అతని దాటికి ఆసీస్ విజయానికి చేరువగా వచ్చినప్పటికి ఆరు పరుగుల తేడాతో పరాజయం చవిచూసింది. ఒక రకంగా ఆసీస్ ఓటమి పాలైనప్పటికి స్టోయినిస్‌కు ఆ సెంచరీ ఒక టర్నింగ్ పాయింట్ అని చెప్పొచ్చు. తాజాగా ఆ సెంచరీ వెనుక ఉన్న ఒక విషాద కథను స్టోయినిస్ తాజాగా రివీల్ చేశాడు. స్టోయినిస్ సెంచరీ చేసే సమయానికి అతని తండ్రి ఆసుపత్రి బెడ్‌పై ఉన్నాడు. క్యాన్సర్ మహమ్మారితో పోరాడుతున్న తండ్రి కీమోథెరపీ చికిత్స తీసుకుంటున్నాడు. ''నేను వన్డేల్లో తొలి సెంచరీ సాధించిన రోజున నా తండ్రి ఆసుపత్రిలో కీమో థెరపీ చేయించుకుంటున్నాడు. నేను సెంచరీ చేశానన్న విషయం తెలుసుకున్న నా తండ్రి అక్కడున్న అన్ని టీవీలను ఆన్ చేశాడు. కానీ ఏ ఒక్క దాంట్లోనూ నేను ఆడుతున్న మ్యాచ్ కనిపించలేదట. దీంతో అక్కడున్న నర్సును పిలిచి.. నా కొడుకు ఇవాళ సెంచరీ సాధించాడు.. దానిని నా కళ్లతో చూడాలి అని కోరాడు. వెంటనే ఆసుపత్రి సిబ్బందితో మాట్లాడి నా తండ్రి కోసం సదరు చానెల్‌ను పెట్టారు. ఆ క్షణంలో నా సెంచరీని టీవీలో కళ్లారా చూసిన నాన్న కళ్లను చమర్చడం నర్సు ఆ తర్వాత చెప్పుకొచ్చింది. నా జీవితంలో అది ఎంతో సంతోష క్షణం. ఆ తర్వాత కొన్నాళ్లకే నాన్న క్యాన్సర్ మహమ్మారితో కన్నుమూశారు. నా కెరీర్‌కు టర్నింగ్ పాయింట్ అయిన సెంచరీ ఆ తర్వాత ఒక విషాదాన్ని తీసుకువస్తుందని ఊహించలేదు'' అంటూ చెప్పుకొచ్చాడు. చదవండి: Suved Parkar Ranji Debut: రహానే స్థానంలో అరంగేట్రం.. డబుల్ సెంచరీతో కొత్త చరిత్ర -
కోహ్లి, ఆమ్లా రికార్డును బద్దలు కొట్టిన పాక్ కెప్టెన్
ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వన్డేలో పాకిస్తాన్ అద్భుత విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. పాక్ కెప్టెన్ బాబార్ ఆజం, ఓపెనర్ ఇమాముల్ హక్ వీరోచిత శతకాలతో తమ వన్డే క్రికెట్ చరిత్రలోనే అత్యధిక స్కోరును చేధించింది. మూడు వన్డేల సిరీస్‌ను పాక్ 1-1తో సమం చేసింది. ఈ నేపథ్యంలోనే పాక్ కెప్టెన్ బాబర్ ఆజం వన్డేల్లో ఒక అరుదైన ఫీట్ సాధించాడు. 83 బంతుల్లో 114 పరుగులు చేసిన బాబర్ వన్డేల్లో 15వ సెంచరీ అందుకున్నాడు. 83 ఇన్నింగ్స్‌ల్లోనే బాబర్ 15 సెంచరీలు సాధించాడు. తద్వారా అత్యంత తక్కువ ఇన్నింగ్స్‌ల్లో ఈ ఫీట్ సాధించిన బాబర్ ఆజం దక్షిణాఫ్రికా క్రికెటర్ హషీమ్ ఆమ్లా రికార్డును బద్దలు కొట్టాడు. అంతకముందు ఆమ్లా 86 ఇన్నింగ్స్ ద్వారా 15వ సెంచరీ సాధించాడు. టీమిండియా మెషిన్ గన్ విరాట్ కోహ్లికి 15వ వన్డే సెంచరీ సాధించడానికి 106 ఇన్నింగ్స్‌లు అవసరం అయ్యాయి. ఆ తర్వాతి స్థానాల్లో డేవిడ్ వార్నర్(108 ఇన్నింగ్స్‌లు), శిఖర్ ధావన్(108 ఇన్నింగ్స్‌లు) ఉన్నారు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వన్డేలో పాక్ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ముందుగా ఆసీస్ 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 348 పరుగుల భారీ స్కోరు సాధించింది. బెన్ మెక్‌డెర్మట్ (108 బంతుల్లో 104; 10 ఫోర్లు, 4 సిక్స్‌లు) సెంచరీ సాధించగా...ట్రవిస్ హెడ్ (70 బంతుల్లో 89; 6 ఫోర్లు, 5 సిక్స్‌లు), మార్నస్ లబ్‌షేన్ (49 బంతుల్లో 59; 5 ఫోర్లు) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. షాహిన్ అఫ్రిది 4 వికెట్లు పడగొట్టాడు. అనంతరం పాక్ 49 ఓవర్లలో 4 వికెట్లకు 352 పరుగులు చేసి విజయాన్నందుకుంది. కెప్టెన్ బాబర్ ఆజమ్ (83 బంతుల్లో 114; 11 ఫోర్లు, 1 సిక్స్), ఇమామ్ ఉల్ హఖ్ (97 బంతుల్లో 106; 6 ఫోర్లు, 3 సిక్స్‌లు) శతకాలతో చెలరేగగా, ఫఖర్ జమాన్ (64 బంతుల్లో 67; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధ సెంచరీ చేశాడు. తాజా ఫలితంతో సిరీస్ 1–1తో సమం కాగా, చివరి వన్డే శనివారం జరుగుతుంది. చదవండి: మంచివో.. చెడ్డవో; ఏవైనా సీఎస్కేకే సాధ్యం.. Pak Vs Aus 2nd ODI: ఆసీస్‌పై సంచలన విజయం.. బాబర్ ఆజం బృందం సరికొత్త రికార్డు! -
రికార్డులన్ని కోహ్లి ఖాతాలోకే.. ఎవరు టచ్ చేయలేరు
టీమిండియాలో దిగ్గజ బ్యాట్స్‌మన్ ఎవరు అనగానే ముందుగా గుర్తుచ్చే పేరు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్. బ్యాట్స్‌మన్‌గా లెక్కలేనన్ని రికార్డులు సచిన్ సొంతం. వన్డేల్లో 49 సెంచరీలు, టెస్టుల్లో 51 సెంచరీలు కలిపి వంద సెంచరీల మార్క్‌ను అందుకొని ఎవరికి సాధ్యం కాని ఫీట్ సాధించాడు. 200 టెస్టులు.. 464 వన్డేలు.. ఇన్ని మ్యాచ్‌లు భవిష్యత్తులో మరే క్రికెటర్ ఆడకపోవచ్చు కూడా. ఈ దశలో టీమిండియాలోకి విరాట్ కోహ్లి అడుగుపెట్టాడు. ఆరంభం నుంచి అతని దూకుడైన ఆటతీరు చూసి సచిన్‌కు సరైన వారసుడు వచ్చాడు అన్నారు. అందుకు తగ్గట్లే కోహ్లి వన్డేల్లో మెషిన్గన్గా పేరు తెచ్చుకున్నాడు. ఇప్పటికే 43 సెంచరీలతో ఉన్న కోహ్లి.. మరో ఆరు సెంచరీలు చేస్తే సచిన్ రికార్డును అందుకుంటాడు. కనీసం ఒక్క ఫార్మాట్లోనైనా సచిన్ రికార్డును బ్రేక్ చేసే అవకాశం కోహ్లికి మాత్రమే ఉంది. అయితే గత కొంతకాలంగా మంచి ఇన్నింగ్స్‌లు ఆడుతున్నప్పటికి పాత కోహ్లిని చూపించలేకపోతున్నాడు. కోహ్లి సెంచరీ చేసి దాదాపు మూడేళ్లు కావొస్తుంది. దీంతో కోహ్లి సెంచరీ చేస్తే చూడాలని ఉందంటే పలువురు ఫ్యాన్స్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో వందో టెస్టు ఆడిన విరాట్ కోహ్లిపై టీమిండియా మాజీ క్రికెటర్ అన్షుమన్ గైక్వాడ్ ప్రశంసల వర్షం కురిపించాడు. సచిన్ రికార్డులను అందుకునే దమ్ము కోహ్లికి మాత్రమే ఉంది.. కోహ్లిని ఎవరు టచ్ చేయలేరు అంటూ పేర్కొన్నాడు. '' కోహ్లి వందో టెస్టు ఆడడం మైలురాయి అని చెప్పొచ్చు. సరైన ఫిట్నెస్ లేని ఈ కాలంలో కోహ్లి వంద టెస్టుల మార్క్‌ను అందుకోవడం గొప్ప విషయం. ఈ వంద టెస్టులు అతనికి మంచి అనుభవం నేర్పాయని అనుకుంటున్నా. మరో వంద టెస్టులు ఆడే సామర్థ్యం కోహ్లిలో ఉంది. అతని ఫిట్నెస్ ఇలాగే ఉంటే టచ్ చేయడం కూడా కష్టం. 33 ఏళ్ల కోహ్లి వన్డేల్లో 43 సెంచరీలు సాధించాడు. ఇంకో ఆరు సెంచరీలు బాదితే వన్డేల పరంగా అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా కోహ్లి కొత్త చరిత్ర సృష్టిస్తాడు. మరో మూడు నాలుగేళ్లు ఆడే సత్తా ఉన్న కోహ్లి.. తన ఫిట్నెస్ను కాపాడుకుంటే మాత్రం మరో పదేళ్లు అతన్ని గ్రౌండ్లో చూడొచ్చు. ఒకవేళ అదే నిజమైతే ఎన్ని రికార్డులు బద్దలవుతాయనేది చెప్పడం కష్టమే'' అని తెలిపాడు. చదవండి: Sachin Tendulkar: మన్కడింగ్‌ను రనౌట్‌గా మార్చడం సంతోషం.. కానీ విరాట్ కోహ్లికి పొంచి ఉన్న పెను ప్రమాదం.. మరో 43 పరుగులు చేయకపోతే..? -
అండర్-19 ప్రపంచకప్ చరిత్రలో తొలి క్రికెటర్‌గా..
అండర్-19 ప్రపంచకప్ చరిత్రలో పాకిస్తాన్ కెప్టెన్ ఖాసీమ్ అక్రమ్ అరుదైన ఫీట్ సాధించాడు. ఐదో ప్లేఆఫ్ స్థానం కోసం శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో ఖాసీమ్ అక్రమ్.. తొలుత బ్యాటింగ్‌లో 135 పరుగులు.. ఆ తర్వాత బౌలింగ్‌లో 37 పరుగులిచ్చి ఐదు వికెట్లు తీశాడు. తద్వారా ప్రపంచకప్‌లో ఒక మ్యాచ్‌లో సెంచరీ చేయడంతో పాటు బౌలింగ్‌లో ఐదు వికెట్లు తీసిన తొలి క్రికెటర్‌గా నిలిచాడు. ఈ నేపథ్యంలో ఐసీసీ ఖాసీమ్ అక్రమ్ ఘనతను తనదైన స్టైల్లో ట్వీట్ చేసింది. అండర్-19 ప్రపంచకప్ చరిత్రలో ఒకే మ్యాచ్‌లో సెంచరీతో పాటు ఐదు వికెట్ల ఘనత అందుకున్న తొలి క్రికెటర్‌గా ఖాసీమ్ అక్రమ్ నిలిచాడు. టోర్నమెంట్లో అక్రమ్ తన మార్క్‌ను స్పష్టంగా చూపించాడు.. కంగ్రాట్స్ అని ట్వీట్ చేసింది. చదవండి: Yash Dhull: యశ్ ధుల్ ఒక సంచలనం.. కోహ్లితో ఉన్న పోలికేంటి! ఇక మ్యాచ్ విషయానికి వస్తే పాకిస్తాన్ 238 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ నిర్ణీత 50 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 365 పరుగులు చేసింది. కెప్టెన్ ఖాసీమ్ అక్రమ్(80 బంతుల్లో 135 నాటౌట్, 13 ఫోర్లు, 6 సిక్సర్లు), హసీబుల్లా ఖాన్(151 బంతుల్లో 136, 9 ఫోర్లు, 2 సిక్సర్లు), ముహ్మద్ షెహజాద్ 73 పరుగులతో రాణించారు. అనంతరం బ్యాటింగ్ చేసిన శ్రీలంక 34.2 ఓవర్లలో 127 పరుగులకే కుప్పకూలింది. ఖాసీమ్ అక్రమ్ 37 పరుగులిచ్చి 5 వికెట్లు తీశాడు. ఇక శనివారం టీమిండియా, ఇంగ్లండ్‌ల మధ్య ఫైనల్ పోరు జరగనుంది. చదవండి: ఆకాశ్ చోప్రా అండర్-19 వరల్డ్ బెస్ట్ ఎలెవెన్.. టీమిండియా నుంచి ఒకే ఒక్కడు View this post on Instagram A post shared by ICC (@icc) -
కెరీర్ బెస్ట్ స్కోరు నమోదు.. చేదు అనుభవమే మిగిల్చింది
వెస్టిండీస్ వుమెన్ ప్లేయర్ డియాండ్రా డాటిన్ తన వన్డే కెరీర్లో అత్యధిక స్కోరును సాధించింది. సౌతాఫ్రికాతో జోహన్నెస్‌బర్గ్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఈ ఫీట్‌ను నమోదు చేసింది. అలా తన కెరీర్ బెస్ట్ నమోదు చేసిన డియాండ్రాకు మ్యాచ్‌లో చేదు అనుభవమే ఎదురైంది. అయితే ఆమె సెంచరీ చేసిన మ్యాచ్‌లో జట్టు ఓడిపోయిందనుకుంటే పొరపాటే.. వరుణుడి రూపంలో మ్యాచ్ రద్దు కావడంతో ఫలితం రాలేదు. చదవండి: U19 World Cup 2022: మ్యాచ్ జరుగుతుండగా భూకంపం.. మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ వుమెన్స్ జట్టు 46వ ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 234 పరుగులు చేసింది. అందులో సగానికి పైగా స్కోరు డియాండ్రాదే. 159 బంతుల్లో 18 ఫోర్లు, నాలుగు సిక్సర్లతో 150 పరుగుల కెరీర్ బెస్ట్‌ను నమోదు చేసింది. అంతకముందు పాకిస్తాన్‌పై 132 పరుగులు ఆమెకు వన్డేల్లో అత్యధిక స్కోరుగా ఉండేది. అయితే వెస్టిండీస్ బ్యాటింగ్ సమయంలో ఇన్నింగ్స్ 46 ఓవర్లో ఆటకు వర్షం అంతరాయం కలిగించింది. అనంతరం డక్‌వర్త్ లూయిస్ పద్దతిలో దక్షిణాఫ్రికా లక్ష్యం 29 ఓవర్లలో 204 పరుగుల టార్గెట్‌ను విధించారు. అయితే 18 ఓవర్లలోనే దక్షిణాఫ్రికా 5 వికెట్లు కోల్పోయి 87 పరుగులు చేసి ఓటమి దిశగా పయనిస్తోంది. ఈ దశలో మరోసారి వర్షం కురవడంతో ఆటను నిలిపివేశారు. అయితే వర్షం ఎంతకూ తగ్గకపోవడంతో అంపైర్లు పిచ్‌ను పరిశీలించి ఆట సాధ్యం కాదని తేల్చి మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. అలా వర్షం రూపంలో డియాండ్రాను దురదృష్టం వెంటాడింది. తాను భారీ స్కోరు చేసిన మ్యాచ్ ఇలా వర్షార్పణం అవడం ఊహించలేదని.. చాలా బాధగా ఉందని డియాండ్రా ఇంటర్య్వూలో పేర్కొంది. చదవండి: మోర్నీ మోర్కెల్ వేగవంతమైన బంతి.. దిల్షాన్ భయపడ్డాడు -
ఫామ్‌లో లేడనుకున్నాం.. దుమ్మురేపుతున్నాడు; టార్గెట్ అదేనా?
టీమిండియాతో మూడో వన్డేలో సౌతాఫ్రికా ఓపెనర్ క్వింటన్ డికాక్ సూపర్ సెంచరీతో మెరిశాడు. వన్డే సిరీస్ ప్రారంభానికి ముందు డికాక్ పెద్దగా ఫామ్‌లో కూడా లేడు. అంతకముందు జరిగిన టెస్టు సిరీస్‌లో తొలి టెస్టు మ్యాచ్ ఆడిన డికాక్ పెద్దగా పరుగులు చేయలేకపోయాడు. దీంతో వన్డే, టి20 క్రికెట్‌పై దృష్టి పెట్టేందుకు టెస్టు కెరీర్‌కు గుడ్‌బై చెప్పేశాడు. అయితే టీమిండియాతో వన్డే సిరీస్ మొదలవగానే డికాక్ జూలు విదిల్చాడు. తొలి మ్యాచ్‌లో 27 పరుగులు చేసిన డికాక్.. రెండో వన్డేలో 66 బంతుల్లో 78 పరుగులు చేశాడు. ఇందులో 7 ఫోర్లు.. 3 సిక్సర్లు ఉన్నాయి. ఇక మూడో వన్డేలో టీమిండియాకు తన విశ్వరూపమే చూపెట్టాడు. 130 బంతుల్లో 124 పరుగులు చేసిన డికాక్ ఇన్నింగ్స్‌లో 12 ఫోర్లు.. 2 సిక్సర్లు ఉండడం విశేషం. ఈ నేపథ్యంలో డికాక్ పలు రికార్డులు తన పేరిట లిఖించుకున్నాడు. అవేంటో ఒకసారి పరిశీలిద్దాం.. ►డికాక్‌కు వన్డేల్లో ఇది 17వ సెంచరీ. హషీమ్ ఆమ్లా(23 సెంచరీలు), హర్షలే గిబ్స్(18 సెంచరీలు) తొలి రెండు స్థానాల్లో ఉండగా.. తాజా సెంచరీతో డికాక్ మూడో స్థానంలో నిలిచాడు. ►టీమిండియాపై డికాక్‌కు ఇది ఆరో సెంచరీ కావడం విశేషం. వన్డేల్లో టీమిండియాపై అత్యధిక సెంచరీలు బాదిన విదేశీ ఆటగాడిగా డికాక్ రెండో స్థానంలో ఉన్నాడు. తొలి స్థానంలో శ్రీలంక మాజీ క్రికెటర్ సనత్ జయసూర్య( ఏడు సెంచరీలు) ఉన్నాడు. ►డికాక్ తాను సాధించిన 17వ సెంచరీతో.. వన్డేల్లో అత్యధిక సెంచరీలు బాదిన వికెట్ కీపర్ల జాబితాలో రెండో స్థానానికి ఎగబాకాడు. కుమార సంగక్కర 23 సెంచరీలతో తొలి స్థానంలో ఉన్నాడు. ►టీమిండియాపై అతి తక్కువ ఇన్నింగ్స్‌ల్లో ఆరు సెంచరీలు బాదిన తొలి ఆటగాడిగా డికాక్ నిలిచాడు. ఇంతకముందు సెహ్వాగ్ న్యూజిలాండ్‌పై 23 ఇన్నింగ్స్‌లో ఆరు సెంచరీలు సాధించాడు. ► టీమిండియాపై వన్డేల్లో వెయ్యి పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగా డికాక్ రికార్డులకెక్కాడు. ఐపీఎల్ మెగావేలంపై కన్నేసిన డికాక్.. అసలు ఫామ్‌లో లేని డికాక్ ఇప్పుడు మాత్రం దుమ్మురేపుతున్నాడు. తన ఇన్నింగ్స్‌లతో ఐపీఎల్ మెగా వేలంపై కన్నువేశాడు. ఇంతకముందు సీజన్లో ముంబై ఇండియన్స్‌కు ఆడిన డికాక్... ఇటీవలే తన పేరును రూ.2 కోట్లకు రిజిస్టర్ చేసుకున్నాడు. అతను ఉన్న ఫామ్ దృశ్యా వేలంలో మంచి ధరకే పలికే అవకాశం ఉంది. ఇక బెంగళూరు వేదికగా ఫిబ్రవరి 12, 13 తేదీల్లో ఐపీఎల్ మెగావేలం జరగనుంది. ఇక ఐపీఎల్ 2022 కోసం భారత ఆటగాళ్ల మొదలు అసోసియేట్ టీమ్‌ల క్రికెటర్ల వరకు అందరూ వేలంలో తామూ భాగం అయ్యేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. వేలంలో అవకాశం దక్కించుకునే క్రమంలో తొలి అడుగుగా ఏకంగా 1214 మంది క్రికెటర్లు తమ పేర్లను నమోదు చేసుకోవడం విశేషం. ఇందులో 896 మంది భారత ఆటగాళ్లు కాగా, 318 మంది విదేశీయులు. ఇందులో గరిష్టంగా ఆస్ట్రేలియానుంచి 59 మంది క్రికెటర్లు ఉన్నారు. -
తొలి వన్డే సెంచరీ సాధించడానికి సచిన్ ఎన్ని మ్యాచ్‌లు ఆడాడో తెలుసా?
Sachin Tendulkar Maiden ODI Century: సచిన్ టెండూల్కర్ ఇది పేరు మాత్రమే కాదు.. ప్రపంచ క్రికెట్ చరిత్రలో ఓ బ్రాండ్.. కోట్లాది మంది భారతీయ క్రికెట్ అభిమానుల గుండె చప్పుడు. ఇక క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ మొదటి వన్డే సెంచరీ సాధించి గురువారానికి ఇరవై ఏడేళ్లు పూర్తయ్యాయి. మరి.. అంతర్జాతీయ క్రికెట్లో వంద సెంచరీలు సాధించిన లిటిల్ మాస్టర్‌కు తన మెదటి వన్డే సెంచరీ సాధించడానికి ఎంతకాలం పట్టిందో తెలుసా..? 1989లో అంతర్జాతీయ క్రికెట్లో టెండూల్కర్ అరంగేట్రం చేశాడు. తన మెదటి వన్డే సెంచరీ సాధించడానికి దాదాపు ఐదు సంవత్సరాలు పట్టింది. 1994, సెప్టెంబర్ 9 న సచిన్ ఆస్ట్రేలియాపై తొలి వన్డే సెంచరీ సాధించాడు. ఇందుకోసం అతడు 79 మ్యాచ్‌లు ఆడాల్సి వచ్చింది. సచిన్ 130 బంతుల్లో 110 పరుగులు చేసి భారత్‌కు ఘన విజయం అందించాడు. అంతర్జాతీయ వన్డే మ్యాచ్‌లో తొలి డబుల్ సెంచరీ: 2010 ఫిబ్రవరి 24న దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో సచిన్ 200 పరుగులు సాధించి వన్డేల్లో డబుల్ సెంచరీ సాధించిన తొలి క్రికెటర్‌గా కొత్త రికార్డు సృష్టించాడు. అలాగే 2010 డిసెంబర్ 19 న దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టులో తన 50వ సెంచరి పూర్తి చేసి టెస్టుల్లో మరే మైలురాయిని అధిరోహించాడు. భారత రత్న పొందిన తొలి క్రీడాకారుడు సచిన్.. 16 నవంబర్ 2013 నాడు తన 200వ టెస్ట్ మ్యాచ్ పూర్తి చేసి, అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన సందర్భంలో భారత ప్రభుత్వం అత్యున్నత పౌర పురస్కారమైన భారత రత్న ప్రకటించింది. ఈ విధంగా ఈ అవార్డును పొందిన ప్రథమ క్రీడాకారుడడిగామరో రికార్డు నెలకొల్పాడు సచిన్ టెండూల్కర్. తండ్రి మరణం: 1999 ప్రపంచ కప్ పోటీలో ఉండగా సచిన్ తండ్రి రమేష్ టెండుల్కర్ ఆకస్మాత్తుగా మృతిచెందారు. తండ్రి అంత్యక్రియల కొరకు భారత్ రావడంతో జింబాబ్వేతో ఆడే మ్యాచ్‌కు దూరమయ్యాడు. వెంటనే మళ్ళీ ప్రపంచ కప్ పోటీలకు హాజరై కెన్యాపై బ్రిస్టన్లో జరిగిన మ్యాచ్ లో 101 బంతుల్లోనే 140 పరుగులు చేశాడు. ఈ శతకం తన తండ్రికి అంకితం ఇచ్చాడు. చదవండి: Hardik Pandya: అనుకోకుండా ఆల్‌రౌండర్ అయ్యాను.. అది నా అదృష్టం #OnThisDay in 1994 - Batting great @sachin_rt scored his first ODI hundred. Relive the magic - DD SPORTS#Legend #SRT pic.twitter.com/hgvSm42yKK — BCCI (@BCCI) September 9, 2019 -
సరిగ్గా 25 ఏళ్ల క్రితం
-
సచిన్‌కు ఈరోజు చాలా స్పెషల్!
ముంబై: భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ క్రీడాజీవితంలో ఈరోజు (సెప్టెంబర్ 9) చాలా ప్రత్యేకం. 25 ఏళ్ల క్రితం సరిగ్గా ఇదే రోజున మాస్టర్ బ్లాస్టర్ వన్డేల్లో తన మొట్టమొదటి సెంచరీ సాధించాడు. అయితే తొలి సెంచరీ సాధించడానికి ఐదేళ్లు ఎదురు చూడాల్సి వచ్చింది. 1989లో అంతర్జాతీయ అరంగ్రేటం చేసిన సచిన్ 1994, సెప్టెంబర్ 9న మొదటి సెంచరీ సాధించాడు. 78 మ్యాచ్‌లు ఆడిన తర్వాతే తొలి శతకం అతడి ఖాతాలో పడింది. కొలంబోలో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో మేటి బౌలర్లను ఎదుర్కొని 130 బంతుల్లో 110 పరుగులు చేశాడు. ఇందులో 8 ఫోర్లు, 2 సిక్సర్లు ఉన్నాయి. టెస్టుల్లో మాత్రం అరంగ్రేటం చేసిన రెండేళ్లలోనే మొదటి సెంచరీ సాధించాడు. అప్పటి నుంచి టీమిండియా బ్యాటింగ్‌కు వెన్నుముకలా నిలిచిన సచిన్ టెండూల్కర్ తన కెరీర్లో ఎన్నో రికార్డులు సాధించాడు. వన్డేల్లో 49 సెంచరీలతో సహా వంద అంతర్జాతీయ శతకాలు సాధించి ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచాడు. సచిన్ తొలి వన్డే సెంచరీ సాధించి 25 ఏళ్లు అయిన సందర్భంగా ఆనాటి మధుర ఘట్టాన్ని బీసీసీఐ సోమవారం ట్వీట్ చేసింది. (చదవండి: ‘ఆ బ్యాటింగ్ టెక్నిక్ అతనికే సొంతం’) #OnThisDay in 1994 - Batting great @sachin_rt scored his first ODI hundred. Relive the magic - DD SPORTS#Legend #SRT pic.twitter.com/hgvSm42yKK — BCCI (@BCCI) September 9, 2019 -
కోహ్లిని ఊరిస్తోన్న మరో రికార్డు
ఆక్లాండ్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లిని మరో రికార్డు ఊరిస్తోంది. న్యూజిలాండ్‌తో ఈ నెల 23 నుంచి జరగనున్న ఐదు వన్డే సిరీస్‌లో అతడు సెంచరీ సాధిస్తే మరో ఘనత అతడి సొంతమవుతుంది. వన్డేల్లో కివీస్ గడ్డపై సెంచరీ చేసిన తొలి భారత క్రికెట్ కెప్టెన్‌గా ఈ ‘ఛేజింగ్ స్టార్’ నిలిచిపోతాడు. జట్టులో ఆటగాడిగా న్యూజిలాండ్‌లో కోహ్లి గతంలో శతకం బాదాడు. అతడి ప్రస్తుత ఫామ్‌ను బట్టి చూస్తే కెప్టెన్‌గా కూడా సెంచరీ సాధించే అవకాశాలు మెండుగా ఉన్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పరిమిత ఓవర్ల ఫార్మాట్లో న్యూజిలాండ్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన భారత్ కెప్టెన్‌గా ఎంఎస్ ధోని కొనసాగుతున్నాడు. 2015లో ఆక్లాండ్‌లో జరిగిన వన్డేలో ధోని 85 పరుగులతో అజేయంగా నిలిచాడు. అయితే ఇప్పుడు అతడు ఆటగాడిగా మాత్రమే జట్టులో కొనసాగుతున్నాడు. ఈ సిరీస్‌లో ధోని తన వ్యక్తిగత స్కోరును మెరుగుపరుచుకుంటాడో, లేదో చూడాలి. -
విధ్వంసక క్రికెటర్ అరుదైన ఘనత
బ్రిస్బేన్: ఆస్ట్రేలియా జట్టుపై రెండో వన్డేలోనూ ఇంగ్లండ్ జట్టు ఘన విజయం సాధించింది. దీంతో ఐదు వన్డేల సిరీస్‌లో ఇయాన్ మోర్గాన్ నేతృత్వంలోని ఇంగ్లండ్ జట్టు 2-0తో ఆధిక్యాన్ని సంపాదించుకుంది. అయితే ఆసీస్ జట్టు ఓడిపోయినా విధ్వసంక క్రికెటర్ అరోన్ ఫించ్ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. శుక్రవారం జరిగిన రెండో వన్డేలో ఫించ్ (114 బంతుల్లో 106, 9 ఫోర్లు, 1 సిక్స్) చేసిన శతకం వన్డేల్లో అతడికిది 10వ సెంచరీ. తద్వారా వన్డేల్లో అతి తక్కువ (83) ఇన్నింగ్స్‌ల్లో 10 వన్డే శతకాలు బాదిన ఆస్ట్రేలియా క్రికెటర్‌గా ఫించ్ నిలిచాడు. గతంలో ఈ రికార్డు ఆసీస్ విధ్వంసక ఆటగాడు డేవిడ్ వార్నర్ పేరిట ఉండేది. 10 వన్డే శతకాలు చేయడానికి వార్నర్ 85 ఇన్నింగ్స్‌లు ఆడగా.. అంతకు రెండు తక్కువ ఇన్నింగ్స్‌ల్లోనే ఫించ్ ఈ ఫీట్ నెలకొల్పాడు. ఇతర ఆసీస్ ఆటగాళ్లు మార్క్ వా (125 ఇన్నింగ్స్‌లు), మాథ్యూ హెడెన్ (138 ఇన్నింగ్స్)లు ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నారు. కెరీర్లో ఫించ్ చేసిన వన్డే శతకాల్లో సగం (5) ఇంగ్లండ్ జట్టుపైనే చేయడం విశేషం. కేవలం 18 ఇన్నింగ్స్‌ల్లోనే ఇంగ్లండ్ పై ఫించ్ ఈ శతకాలు చేశాడు. క్వింటన్ డికాక్ ఫాస్టెస్ట్ ఓవరాల్‌గా చూసుకుంటే.. దక్షిణాఫ్రికాకు చెందిన క్వింటన్ డికాక్ అతి తక్కువ ఇన్నింగ్స్ ల్లో 10 వన్డే సెంచరీలు చేసిన క్రికెటర్. డికాక్ 55 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఫీట్ నమోదు చేయగా, హషీం ఆమ్లా (57), శిఖర్ ధావన్ (77), విరాట్ కోహ్లీ 80 ఇన్నింగ్స్‌లతో తర్వాతి స్థానాల్లో ఉన్నారు. టాప్-5లో ఇద్దరు భారత క్రికెటర్లు ఉండటం గమనార్హం.