విరాట్ కోహ్లి
ఆక్లాండ్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లిని మరో రికార్డు ఊరిస్తోంది. న్యూజిలాండ్‌తో ఈ నెల 23 నుంచి జరగనున్న ఐదు వన్డే సిరీస్‌లో అతడు సెంచరీ సాధిస్తే మరో ఘనత అతడి సొంతమవుతుంది. వన్డేల్లో కివీస్ గడ్డపై సెంచరీ చేసిన తొలి భారత క్రికెట్ కెప్టెన్‌గా ఈ ‘ఛేజింగ్ స్టార్’ నిలిచిపోతాడు. జట్టులో ఆటగాడిగా న్యూజిలాండ్‌లో కోహ్లి గతంలో శతకం బాదాడు. అతడి ప్రస్తుత ఫామ్‌ను బట్టి చూస్తే కెప్టెన్‌గా కూడా సెంచరీ సాధించే అవకాశాలు మెండుగా ఉన్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లో న్యూజిలాండ్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన భారత్ కెప్టెన్‌గా ఎంఎస్ ధోని కొనసాగుతున్నాడు. 2015లో ఆక్లాండ్‌లో జరిగిన వన్డేలో ధోని 85 పరుగులతో అజేయంగా నిలిచాడు. అయితే ఇప్పుడు అతడు ఆటగాడిగా మాత్రమే జట్టులో కొనసాగుతున్నాడు. ఈ సిరీస్‌లో ధోని తన వ్యక్తిగత స్కోరును మెరుగుపరుచుకుంటాడో, లేదో చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment