శారీరక శ్రమ లేకపోవడం, జంక్‌ఫుడ్ వంటి ఆహారపు అలవాట్లు, జీవనశైలి తదితరాలే ఊబకాయం సమస్యకు కారణం అని అంతా చెబుతుంటారు. కానీ ప్రధాన కారణం వంట నూనె అట. సాక్షాత్తు ప్రధాని మోదీనే అన్నారు. ఆయన ఎందుకిలా పిలుపునిచ్చారు..? ఊబకాయం సమస్యకి వంటనూనె కారణమా..? తదితరాల గురించి సవివరంగా చూద్దామా..!.
దయచేసి అందరూ ఇళ్లల్లో వంటనూనె వినియోగాన్ని తగ్గించండి ఇదే ఊబయకాయం రావడానికి ప్రధానం కారణం అంటూ పిలుపునిచ్చారు ప్రధాని మోదీ. న్యూఢిల్లీలో జరిగిన 38వ జాతీయ క్రీడల ప్రారంభోత్సవంలో ఇలా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వంటనూనె అధిక వినియోగమే ఊబకాయం సమస్యకు ప్రధాన కారణం అని అన్నారు.
దేశంలోని అన్ని వయసుల వారు, ముఖ్యంగా యువత ఈ సమస్య బారినపడుతున్నారని అన్నారు. అత్యంత ఆందోళన కలిగించే విషయం ఏంటంటే ఈ ఊబకాయం మధుమేహం, గుండెజబ్బులు వంటి దీర్ఘకాలిక వ్యాధుల బారినపడే ప్రమాదాన్ని పెంచుతోందన్నారు.
రోజువారీగా వ్యాయమం చేయడం, సమతుల్య పోషకాహారంపై దృష్టిపెట్టడం తోపాటు నూనె తీసుకోవడం తగ్గించాలని ప్రజలకు సూచించారు మోదీ. "మన ఇళ్లల్లో నెల ప్రారంభంలో రేషన్ వస్తుంది. ఇప్పటి వరకు ప్రతినెల రెండు లీటర్ల వంట నూనె ఇంటి తీసుకొచ్చినవారు దానిని కనీసం 10%కి తగ్గించండి." అని కోరారు మోదీ. మరి దీనిపై వైద్య నిపుణులు ఏమంటున్నారంటే..
మణిపాల్ ఆస్పత్రిలోని డయాబెటిస్ అండ్ ఎండోక్రినాలజీ కన్సల్టెంట్ డాక్టర్ వినీత్ కుమార్ సైతం వంట నూనెని తగ్గించాలన్నారు. అధిక బరువు పెరగడానికి, ఊబకాయానికి దారితీసే కడుపు నిండిన అనుభూతిని కలిగించకుండా చేసేది వంటలో ఉపయోగించే అదనపు నూనె అని అన్నారు. ప్రతి ఒక్క వ్యక్తి నెలకు 600-700 ఎంఎల్ కంటే ఎక్కువ తినకూడదని చెప్పారు. అంటే రోజుకి సుమారు నాలుగు టీస్పూన్లకు మించి వాడకూడదని అన్నారు.
మరో డాక్టర్ అనూప్ మిశ్రా మాట్లాడుతూ..సాధారణంగా ప్రజలు సిఫార్సు చేసిన నూనెకి మించి అధికంగా నూనెని వాడతారు. కొందరూ ఫ్రై చేసిన నూనెని తిరిగి వినియోగిస్తారు. ఇది అస్సలు మంచిది కాదు. ఆహార పదార్థాలు వేయించడానికి ఉపయోగించిన నూనెని తిరిగి ఉపయోగించడం వల్ల ట్రాన్స్-ఫ్యాట్స్ పెరుగుదలకు దారితీస్తుంది. ఇవి గుండె జబ్బులు, డయాబెటిస్, స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచుతాయి.
ఇక నూట్రిషన్లు నూనె పరిమాణం తోపాటు నూనె నాణ్యత కూడా ముఖ్యమేనని అన్నారు. ముఖ్యంగా ఆవాల నూనె, వేరుశెనగ నూనె వంటకు చాలామంచివని చెప్పారు. అలాగే మిశ్రమ నూనెల కలయిక కూడా చాలామంచిదని చెప్పారు. ఉదాహారణకి వేరుశెనగ, సోయాబీన్ నూనె, పొద్దుతిరుగుడు నూనె, బియ్యం ఊక నూనెల మిశ్రమంగా వాడటం కూడా మంచిదని అన్నారు.
ఇక ఆర్థిక సర్వే 2023-2024 అనారోగ్యకరమైన ఆహారం,ఎక్కువగా కూర్చొనే అలవాట్లు మధుమేహం, గుండె జబ్బులు, కొన్ని రకాల కేన్సర్ వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతాయని పేర్కొంది. అంతేగాదు ఇది దేశ ఆర్థిక సామర్థ్యానికి ముప్పు కలిగిస్తాయని హెచ్చరించింది.
శతాబ్దాలుగా మన భారతీయ సాంప్రదాయ ప్రకృతి, పర్యావరణానికి అనుకూలంగా ఆరోగ్యంగా, సామరస్యంగా ఎలా జీవించాలో చూపించాయి. దానికి అనుగుణంగా భారతీయ వ్యాపారాలు ఉండాలి. ప్రపంచ మార్కెట్‌ని ఉపయోగించుకోవడానికి బదులుగా నడిపించేలా భారతీయ వ్యాపారాలు ఉండాలి. అంటే ఆరోగ్యానికి పెద్దపీటవేసేలా సాగితే.. అన్ని విధాల శ్రేయస్కరం, ప్రగతి పథం కూడా అని అన్నారు ప్రధాని మోదీ.
(చదవండి:
Comments
Please login to add a commentAdd a comment