breaking news
Narendra Modi
-
నీట్ సెగలు: ధర్మేంద్ర ప్రదాన్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటో తెలుసా?
నీట్ పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా రాజకీయ వేడిని పెంచుతోంది. విద్యార్థులు.. కాక్రోచ్ పార్టీ తరఫున ఆందోళనలు, ప్రతిపక్షాల విమర్శలు, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ రాజీనామా డిమాండ్లతో ఢిల్లీ రాజకీయాలు హీటెక్కాయి. ఈ వివాదం మధ్యలో నిలిచిన ధర్మేంద్ర ప్రదాన్ రాజకీయ నేపథ్యం ఏమిటి? బీజేపీలో ఆయనకు ఉన్న ప్రాధాన్యత ఎంత? అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.నీట్ పరీక్ష నిర్వహణలో లోపాలకు నైతిక బాధ్యత వహిస్తూ ధర్మేంద్ర ప్రదాన్ పదవి నుంచి తప్పుకోవాలని కాక్రోచ్ జనతా పార్టీ (CJP) సహా ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. అయితే ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఆయన్ని తప్పించే సంకేతాలు కనిపించడం లేదు. ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఎన్టీయే పార్లమెంటరీ పార్టీ సమావేశంలో నీట్ లీక్ వ్యవహారంపై స్పందిస్తూ.. పరీక్షా పత్రాల లీకేజీని ‘ఘోర పాపం’గా అభివర్ణించారు. తప్పు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం వివాదంలో ఉన్న ధర్మేంద్ర ప్రదాన్ నేపథ్యం మరోసారి చర్చకు వచ్చింది.తండ్రి కేంద్ర మంత్రిధర్మేంద్ర ప్రదాన్ 1969 జూన్ 26న ఒడిశాలోని తాల్చేర్‌లో జన్మించారు. ఆయన తండ్రి దేవేంద్ర ప్రదాన్ కూడా బీజేపీ సీనియర్ నాయకుడు. అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రధానిగా ఉన్న సమయంలో కేంద్ర మంత్రిగా పనిచేశారు. తండ్రి రాజకీయ వారసత్వం ఉన్నప్పటికీ.. ధర్మేంద్ర ప్రదాన్ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. విద్యార్థి దశలోనే రాజకీయాలపై ఆసక్తి పెంచుకున్న ఆయన.. ఆర్ఎస్ఎస్ అనుబంధ విద్యార్థి సంస్థ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ABVP)లో చురుకుగా పనిచేశారు. అక్కడి నుంచి ప్రారంభమైన ఆయన రాజకీయ ప్రయాణం బీజేపీ యువమోర్చా, పార్టీ సంస్థాగత బాధ్యతల వరకు సాగింది.వ్యూహకర్తగా.. బీజేపీలో క్రమంగా ఎదిగిన ధర్మేంద్ర ప్రదాన్ 2004లో తొలిసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతూ జాతీయ రాజకీయాల్లో తన స్థానం బలపర్చుకున్నారు. ఎన్నికల నిర్వహణ, పార్టీ విస్తరణ వ్యూహాల్లో ఆయనకు మంచి అనుభవం ఉంది. పలు రాష్ట్రాల్లో బీజేపీ ఎన్నికల బాధ్యతలు నిర్వహించిన ఆయన.. పార్టీ అధిష్ఠానం దృష్టిలో నమ్మకమైన నాయకుడిగా ఎదిగారు.మోదీ ప్రభుత్వంలో కీలక మంత్రిగా..2014లో కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ధర్మేంద్ర ప్రదాన్‌కు కీలక బాధ్యతలు దక్కాయి. పెట్రోలియం, సహజ వాయువు శాఖ మంత్రిగా పనిచేసిన ఆయనకు జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది. ఇంధన రంగంలో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన పలు కార్యక్రమాల్లో ఆయన కీలక పాత్ర పోషించారు. ముఖ్యంగా ఉజ్వల యోజన అమలును కేంద్రం ఆయన శాఖకు చెందిన ముఖ్య విజయాల్లో ఒకటిగా పేర్కొంది. ఆ తర్వాత 2021లో ఆయనకు కేంద్ర విద్యాశాఖ బాధ్యతలు అప్పగించారు. జాతీయ విద్యా విధానం (NEP) అమలు, విద్యా రంగంలో సంస్కరణలపై ఆయన దృష్టి పెట్టారు.నీట్ వివాదమే ఇప్పుడు అతిపెద్ద పరీక్షవిద్యాశాఖ మంత్రిగా ఉన్న సమయంలోనే నీట్ పరీక్షలో పేపర్ లీక్ ఆరోపణలు తెరపైకి రావడం ధర్మేంద్ర ప్రదాన్‌కు అతిపెద్ద రాజకీయ సవాల్‌గా మారింది. పరీక్ష నిర్వహణలో లోపాలకు బాధ్యత వహిస్తూ ఆయన రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. మరోవైపు కేంద్రం మాత్రం ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకుందని చెబుతోంది. లీక్ వ్యవహారంలో నిందితులను అరెస్టు చేశామని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా పరీక్షా వ్యవస్థను మరింత పటిష్ఠం చేస్తామని స్పష్టం చేస్తోంది. కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు వెల్లడించిన వివరాల ప్రకారం.. నీట్ లీక్‌లో నిందితులపై చర్యలు తీసుకున్నామని, విద్యార్థుల భవిష్యత్‌కు నష్టం కలగకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టిందని ప్రధాని పేర్కొన్నారు.Birthday wishes to Union Minister Shri Dharmendra Pradhan Ji. He is making commendable efforts towards the implementation of the National Education Policy, which seeks to make India a hub for knowledge, learning and innovation. Praying for his long and healthy life.@dpradhanbjp— Narendra Modi (@narendramodi) June 26, 2026బీజేపీలో ఎందుకు కీలకం?ధర్మేంద్ర ప్రదాన్‌ను బీజేపీలో కీలక వ్యూహకర్తల్లో ఒకరిగా భావిస్తారు. పార్టీ సంస్థాగత వ్యవహారాలు, ఎన్నికల నిర్వహణలో ఆయనకు ఉన్న అనుభవం అధిష్ఠానం దృష్టిలో ప్రత్యేక స్థానం కల్పించింది. ఒడిశాకు చెందినప్పటికీ.. ఆయన రాజకీయ ప్రస్థానం రాష్ట్ర స్థాయిని దాటి జాతీయ స్థాయికి చేరింది. మోదీ-షా నాయకత్వానికి సన్నిహితంగా ఉండే నేతల్లో ఆయన పేరు తరచూ వినిపిస్తుంది. అందుకే ప్రస్తుత నీట్ వివాదం నేపథ్యంలో ప్రతిపక్షాల నుంచి ఒత్తిడి పెరుగుతున్నా.. ఇప్పటివరకు బీజేపీ నాయకత్వం ఆయనకు మద్దతుగా నిలుస్తున్నట్లు రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.ముందున్న అసలు సవాల్ఒకవైపు విద్యార్థుల ఆందోళనలు.. మరోవైపు ప్రతిపక్షాల రాజకీయ ఒత్తిడి.. ఇంకోవైపు దేశవ్యాప్తంగా పరీక్షా వ్యవస్థపై తగ్గిన నమ్మకాన్ని తిరిగి తీసుకురావాల్సిన బాధ్యత.. ఇవన్నీ ఇప్పుడు ధర్మేంద్ర ప్రదాన్ ముందున్న సవాళ్లు. మంత్రి పదవి కొనసాగుతుందా? లేదా?? అన్నది రాజకీయ నిర్ణయంపై ఆధారపడి ఉన్నప్పటికీ.. కోట్లాది విద్యార్థులు నమ్మే పరీక్షా వ్యవస్థను తిరిగి బలోపేతం చేయడం ఆయన ముందున్న అసలు పరీక్షగా మారింది.కుటుంబ నేపథ్యం.. వ్యక్తిగత జీవితంధర్మేంద్ర ప్రదాన్ భార్య పేరు మృదులా ప్రదాన్. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. రాజకీయ కుటుంబం నుంచి వచ్చినప్పటికీ.. కుటుంబాన్ని రాజకీయ కార్యకలాపాలకు దూరంగా ఉంచుతూ, ఎక్కువ సమయం పార్టీ మరియు ప్రభుత్వ బాధ్యతలకే కేటాయించే నేతగా ఆయనకు గుర్తింపు ఉంది. ఎన్నికల సమయంలో సమర్పించిన అఫిడవిట్ల ప్రకారం ధర్మేంద్ర ప్రదాన్‌కు చర, స్థిరాస్తులు ఉన్నాయి. బ్యాంకు డిపాజిట్లు, పెట్టుబడులు, ఆస్తుల వివరాలను ఆయన ఎన్నికల సంఘానికి సమర్పించే అఫిడవిట్లలో క్లియర్‌గా వెల్లడించారు. -
నీట్ వివాదంపై మోదీ కీలక వ్యాఖ్యలు
సాక్షి, న్యూఢిల్లీ: నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై ప్రధాని నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. పరీక్షా పత్రాలను లీక్ చేయడం ‘ఘోర పాపం’ అని అభివర్ణించిన ఆయన.. విద్యార్థుల భవిష్యత్‌తో ఆడుకునే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోమని స్పష్టం చేశారు. పార్లమెంట్ సమీపంలో కాక్రోచ్ జనతా పార్టీ (CJP) నిరసనలు కొనసాగుతున్న వేళ.. ఎన్టీయే (NDA) పార్లమెంటరీ పార్టీ సమావేశంలో నీట్ అంశాన్ని ప్రధాని ప్రస్తావించారు. ఈ సమావేశం అనంతరం కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు మీడియాకు వివరాలు వెల్లడించారు.‘తప్పు చేసిన వారిని వదిలిపెట్టం’నీట్ పేపర్ లీక్ వ్యవహారం వెలుగులోకి వచ్చిన వెంటనే ప్రభుత్వం చర్యలు ప్రారంభించిందని ప్రధాని పేర్కొన్నట్లు కిరణ్ రిజిజు తెలిపారు. లీక్‌కు పాల్పడిన వారిని గుర్తించి అరెస్టు చేశామని.. ఇప్పటివరకు 13 మంది నిందితులు జైలులో ఉన్నారని వెల్లడించారు. విద్యార్థుల భవిష్యత్‌కు నష్టం కలిగించే ఇలాంటి చర్యలను తీవ్రంగా పరిగణిస్తున్నామని ప్రధాని స్పష్టం చేసినట్లు తెలిపారు. నిందితులపై అత్యంత కఠిన చర్యలు తీసుకోవాలని ప్రధాని ఆదేశించారని.. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా ఉండేందుకు గట్టి చర్యలు అవసరమని పేర్కొన్నట్లు చెప్పారు.విద్యార్థుల ప్రయోజనాలే ప్రాధాన్యంనీట్ వంటి ప్రతిష్ఠాత్మక పరీక్షల్లో విద్యార్థుల విశ్వాసాన్ని కాపాడటం ప్రభుత్వ ప్రధాన బాధ్యత అని ప్రధాని పేర్కొన్నారు. విద్యార్థులకు ఎలాంటి అన్యాయం జరగకుండా చర్యలు తీసుకున్నామని.. పరీక్ష నిర్వహణలో పారదర్శకత, భద్రత మరింత పెంచాల్సిన అవసరం ఉందని చెప్పినట్లు రిజిజు వెల్లడించారు. లీక్ కారణంగా రద్దైన నీట్-యూజీ పరీక్షకు ప్రభుత్వం రీ-ఎగ్జామ్ నిర్వహించిందని.. పరీక్షను విజయవంతంగా పూర్తి చేసి ఫలితాలను కూడా నిర్ణీత సమయంలో ప్రకటించామని తెలిపారు.పరీక్షా వ్యవస్థలో మార్పులపై దృష్టిపరీక్షా పత్రాల లీకేజీ వంటి ఘటనలు దేశ విద్యా వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతాయని ప్రధాని అభిప్రాయపడ్డారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పరీక్షల నిర్వహణ విధానంలో మరింత పటిష్ఠమైన మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉందని సూచించారు. పరీక్షల భద్రత, పారదర్శకతపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నట్లు తెలిపారు.ఎన్టీయే భేటీలో పలు అంశాలపై చర్చఎన్టీయే పార్లమెంటరీ పార్టీ సమావేశంలో నీట్ వివాదంతో పాటు పార్లమెంట్ సమావేశాలు, ప్రభుత్వ ప్రాధాన్యత అంశాలపై కూడా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. సమావేశం అనంతరం మంత్రి కిరణ్ రిజిజు మీడియాతో మాట్లాడుతూ.. ప్రధాని మోదీ విద్యార్థుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించారని తెలిపారు.నీట్ పేపర్ లీక్ వ్యవహారం నేపథ్యంలో కాక్రోచ్ జనతా పార్టీ (CJP) పార్లమెంట్ ముట్టడికి ప్రయత్నిస్తోంది. ఈ వ్యవహారానికి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తోంది. మంత్రి తప్పుకోవడం లేదా కేంద్రం ఆయనను తప్పించడం జరిగే వరకు ఆందోళనలు కొనసాగిస్తామని సీజేపీ స్పష్టం చేసింది. విద్యా వ్యవస్థలో తక్షణ సంస్కరణలు అవసరమని పేర్కొంటూ.. తమ డిమాండ్లను కేంద్ర మంత్రి జేపీ నడ్డాకు కూడా అందజేసింది. ఆ డిమాండ్లపై కేంద్రం నుంచి ఇంకా స్పష్టమైన ప్రకటన వెలువడలేదు. ఇదే సమయంలో కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ కూడా సీజేపీ నిరసనలపై స్పందించారు. యువత సమస్యలను ప్రభుత్వం వినాలని, నీట్ వ్యవహారంలో బాధ్యత వహించాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. -
రాహుల్, ప్రియాంక గాంధీ విడుదల
కాక్రోచ్ జనతా పార్టీ తగ్గేదే లే అంటోంది. నీట్ పేపర్ లీక్ వ్యవహారానికి బాధ్యత వహిస్తూ ధర్మేంద్ర ప్రధాన్ కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేయాలనే డిమాండ్‌పై పట్టు బట్టి కూర్చుంది. ఈ క్రమంలో రెండో రోజు ఇవాళ పార్లమెంట్ మార్చ్ నిర్వహించబోతోంది. దీంతో ఢిల్లీలో మరోసారి హైఅలర్ట్ నెలకొంది. -
వర్షాలు బాగుండాలి వర్షాకాల సమావేశాలూ బాగుండాలి
సాక్షి, న్యూఢిల్లీ: ఈ సంవత్సరం వర్షాలు సమృద్ధిగా కురవాలని, అదేమాదిరి వర్షాకాల సమావేశాలు ఫలప్రదంగా సాగాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం సందర్భంగా సోమవారం ఆయన పార్లమెంట్ ప్రాంగణంలో మీడియాతో మాట్లాడారు. ‘‘రెండూ బాగుంటేనే దేశం సుభిక్షంగా ఉంటుంది. అప్పుడు అందరి జీవితాల్లో వెలుగులు నిండుతాయి. ఇదే ఆశతో ఈసారి వర్షాలు సమృద్ధిగా కురవాలని కోరుకుందాం. అదే విధంగా ఈసారి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు సైతం ఫలప్రదంగా సాగాలనీ కోరుకుందాం. సభలో నిర్మాణాత్మక చర్చల ద్వారా దేశ ప్రగతికి, ప్రజా సంక్షేమానికి దోహదపడాలి. రాజకీయాలకు అతీతంగా అనుభవజ్ఞులైన ఎంపీల విజ్ఞానం దేశాభివృద్ధి కోసం ఉపయోగపడాలి. బలమైన వాదనలు ఉన్నప్పుడు ప్రశాంతంగా మాట్లాడినా మన గళాన్ని సమర్థవంతంగా వినిపించవచ్చు’’అని మోదీ చెప్పారు. అంతరిక్ష రంగంలో యువత అద్భుతాలు... ‘‘దేశ పురోగతిలో యువత పాత్ర అత్యంత కీలకం. వారి సామర్థ్యాలు, ఆకాంక్షలు అంతరిక్షమంత విశాలమైనవి. గడిచిన నెల రోజుల్లో జాతీయ, అంతర్జాతీయ, అంతరిక్ష రంగాల్లో అసాధారణ మైలురాళ్లను భారత్ అధిగమించింది. భారతీయ వ్యోమగామి గత ఏడాది వర్షాకాల సమావేశాల ముందు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లారు. ఈసారి వర్షాకాల సమావేశాలకు ముందు భారతీయ అంకుర సంస్థ స్కైరూట్ ప్రయోగించిన విక్రమ్–1 రాకెట్ విజయవంతంగా గగనతలంలోకి వెళ్లింది. భారతీయ యువత ఆశలు, ఆశయాలకు నింగిలాగా ఎలాంటి హద్దుల్లేవనడానికి ఈ విజయమే నిదర్శనం’’అని మోదీ కొనియాడారు. 7.7 శాతం వృద్ధిరేటు... ‘‘పశి్చమాసియాలో యుద్ధ పరిస్థితుల వల్ల అంతర్జాతీయంగా పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ, ఎరువులు, రసాయనాల దిగుమతులపై తీవ్ర ప్రభావం పడినప్పటికీ భారతదేశం 7.7 శాతం వృద్ధిరేటును నమోదుచేసింది. ప్రపంచంలోనే వేగంగా వృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా భారత్ నిలవడం దేశానికున్న అపారమైన శక్తికి నిదర్శనం’’అని మోదీ అన్నారు.56 ఏళ్ల యువకుని గురించి మాట్లాడట్లేదు రాహుల్‌కు మోదీ చురక స్కైరూట్ సంస్థ విజయం గురించి మాట్లాడుతూ రాహుల్ గాందీనుద్దేశిస్తూ మోదీ పరో క్షంగా వ్యంగ్య వ్యాఖ్యలుచేశారు. యువకులు ఎంతో సాధిస్తున్నారని, రాహుల్ 56 ఏళ్లు వచ్చినా పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో విఫలమయ్యారనే అర్థం ధ్వనించేలా మోదీ పరోక్షంగా చురకలంటించారు. ‘‘అంతరిక్షంలో అద్భుతం సృష్టించిన స్కైరూట్ అంకురసంస్థలోని బృంద సభ్యుల సగటు వయస్సు కేవలం 28 ఏళ్లు మాత్రమే. యువత అద్భుతాలు చేస్తోంది. నేనిక్కడ 56 ఏళ్ల యువకుడి(రాహుల్) గురించి మాట్లాడటం లేదు. 28 ఏళ్ల వయస్సున్న దేశీయ యువతే అంతరిక్షంలో భారత జెండాను ఎగరేసింది’’అని మోదీ వ్యాఖ్యానించారు. ప్రైవేట్ రంగానికి కల్పించిన సంస్కరణల వల్లే సాహసోపేతమైన విజ యాలను యువత సాధిస్తోందని మోదీ అన్నారు. -
నెల రోజులుగా ఎన్నో జరిగాయి: ప్రధాని మోదీ
సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విపక్షాలకు కీలక విజ్ఞప్తి చేశారు. సభ సజావుగా సాగేందుకు అన్ని పార్టీలు సహకరించాలని కోరారు. దేశానికి సంబంధించిన ముఖ్యమైన అంశాలపై అర్థవంతమైన, ఫలవంతమైన చర్చలు జరగాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.సోమవారం సంసద్ భవన్(పార్లమెంట్) ఆవరణలో మీడియా ద్వారా మాట్లాడిన ఆయన.. ‘‘గత నెల రోజులుగా దేశంలో ఎన్నో పరిణామాలు జరిగాయి. వాటిపై సభలో చర్చలు జరగాలి. ప్రజా సమస్యలపై చర్చించేందుకు పార్లమెంట్ వేదిక కావాలి’’ అని అన్నారు. ఈ సందర్భంలో తాజా స్కైరూట్ విక్రమ్ ప్రయోగంపై ప్రశంసలు గుప్పించారు. భారత అంతరిక్ష రంగంలో ప్రైవేట్ సంస్థ స్కైరూట్ సాధించిన విజయాన్ని ప్రధాని ప్రత్యేకంగా ప్రస్తావించారు. అంతరిక్షంలో నవశకం మొదలైందని.. స్కైరూట్ సంస్థ విక్రమ్ రాకెట్‌ను విజయవంతంగా అంతరిక్షంలోకి పంపడం దేశానికే గర్వకారణమని అన్నారు. ‘‘కేవలం 28 ఏళ్ల యువకులు ఈ ఘనత సాధించారు. ఇది భారత యువశక్తికి, కొత్త ఆలోచనలకు నిదర్శనం’’ అని మోదీ పేర్కొన్నారు.56 ఏళ్ల యువకుడ్ని కాదు!అయితే ఈ సందర్భంగా మోదీ చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపాయి. స్కైరూట్ బృందం సక్సెస్‌ను ప్రస్తావిస్తూ.. ‘‘నేను 56 ఏళ్ల యువకుడి గురించి మాట్లాడటం లేదు’’ అంటూ వ్యాఖ్యానించారాయన. రాహుల్ గాంధీ వయసు 56 ఏళ్లు కావడంతో.. మోదీ వ్యాఖ్యలు కాంగ్రెస్ నేతపై పరోక్ష సెటైర్‌గా భావిస్తున్నారు.సభ సజావుగా సాగాలి..పార్లమెంట్ సమావేశాలు రాజకీయ విభేదాలకు మాత్రమే పరిమితం కాకుండా.. దేశ ప్రయోజనాల కోసం ఉపయోగపడాలని ప్రధాని ఆకాంక్షించారు. ఎంపీలందరూ సహకరించి నిర్మాణాత్మక చర్చలకు అవకాశం కల్పించాలని కోరారు. ప్రజాస్వామ్యంలో చర్చలు, వాదనలు సహజమని.. అయితే సభా సమయం వృథా కాకుండా ప్రజలకు ఉపయోగపడే నిర్ణయాలపై దృష్టి పెట్టాలని సూచించారు.పశ్చిమాసియా యుద్ధం వల్ల ఇంధన సంక్షోభం ఏర్పడింది. అన్ని దేశాలు నష్టపోతున్నాయి అని ఆవేదన వ్యక్తం చేశారాయన. చమురు ధరలు అమాంతం పెరుగుతున్నాయి. అయినా ఆ సంక్షోభాన్ని సమర్థవంతంగా ఎదుర్కొంటున్నాం అని అన్నారాయన. ఈ క్రమంలోనే హైడ్రోజన్‌తో నడిచే రైలును పరుగులు పెట్టించినట్లు మోదీ చెప్పారు. ప్రతిపక్షాలకు మోదీ విజ్ఞప్తివర్షాకాల సమావేశాల్లో పలు కీలక అంశాలపై చర్చకు అవకాశం ఉండటంతో.. అధికార, ప్రతిపక్ష సభ్యులు సమన్వయంతో వ్యవహరించాలని ప్రధాని కోరారు.Speaking at the start of the Monsoon Session of Parliament. May this session witness productive discussions that strengthen India's development journey. https://t.co/v25Vg62apy— Narendra Modi (@narendramodi) July 20, 2026 -
రాకెట్ సక్సెస్ కాల్లో బయటపడ్డ మోదీ ఫోన్ సీక్రెట్ ట్యూన్!
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫోన్‌కు ‘వందేమాతర కాలింగ్ ట్యూన్’ ఉందంటూ సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. స్కైరూట్ ఏరోస్పెస్ శాస్త్రవేత్తలు ప్రైవేట్ రాకెట్ ప్రయోగ విజయానంతరం ప్రధానికి కాల్ చేసినప్పుడు ఈ ట్యూన్ వినిపించింది. అయితే ఇది ప్రధాని వ్యక్తిగత ట్యూన్ కాదని, అత్యున్నత అధికారిక నంబర్ల కోసం కేటాయించిన ప్రత్యేక రింగ్ బ్యాక్ ట్యూన్ అని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. Skyroot Aerospace की टीम के साथ फोनकॉल के दौरान पता चला पीएम मोदी की कॉलर ट्यून क्या है… जिसने भी सुना, उसके चेहरे पर मुस्कान और गर्व, दोनों आ गए।आखिर ऐसी क्या खास बात है इस धुन में?सुनिए... ⬇️ pic.twitter.com/N9wngZa2V3— BJP (@BJP4India) July 19, 2026భద్రతా కారణాలరీత్యా వీఐపీల అధికారిక నంబర్లపై సాధారణంగా ఎలాంటి పాటలు ఉండవు. ప్రభుత్వ టెలికాం నెట్‌వర్క్‌ల నిబంధనల ప్రకారం జాతీయ భావనను చాటే ఇలాంటి ట్యూన్లను ప్రత్యేక ప్రొటోకాల్ కింద సెట్ చేస్తుంటారు. సామాన్య ప్రజలు కూడా తమ ఫోన్లలో ఈ ట్యూన్‌ను సెట్ చేసుకోవచ్చు. జియో సావన్, వింక్ మ్యూజిక్ లేదా వీఐ యాప్‌లను ఓపెన్ చేసి, కాలర్ ట్యూన్స్ సెక్షన్లో ‘వందేమాతరం ఇన్స్ట్రుమెంటల్’ లేదా ‘ఫ్లూట్’ వెర్షన్‌ను వెతికి సులభంగా యాక్టివేట్ చేసుకోవచ్చు.ఇది కూడా చదవండి: అధికార పక్షాన్ని ఇరుకున పెట్టేలా.. ప్రశాంత్ కిషోర్ సవాల్! -
అయోధ్య విరాళాల్లో అక్రమాలు: ప్రధాని మోదీకి రాహుల్, ఖర్గే లేఖ!
న్యూఢిల్లీ: అయోధ్య రామమందిర నిర్మాణానికి సేకరించిన విరాళాల్లో చోటుచేసుకున్న అవకతవకలపై సమగ్ర విచారణ జరిపించాలని కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఆర్థిక లావాదేవీలను బహిరంగపరచాలని వారు డిమాండ్ చేశారు.భక్తులు ఎంతో భక్తితో సమర్పించుకున్న విరాళాలు అపహరణకు గురికావడం అందరినీ తీవ్ర నిరాశకు గురిచేసిందని, ఈ విషయంపై ప్రధాని మౌనం వీడాలని లేఖలో పేర్కొన్నారు. నగదు, బంగారం, వెండి కానుకల స్వీకరణలో జరిగిన అవకతవకలపై స్వతంత్ర దర్యాప్తు జరిపి, నివేదికను ప్రజల ముందు ఉంచాలని వారు కోరారు. జూన్ ప్రారంభంలో ఈ విరాళాల అపహరణ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.ఇప్పటివరకు ఈ కేసులో ఎనిమిది మందిని అరెస్టు చేయగా, ట్రస్ట్‌కు చెందిన ఇద్దరు కీలక బాధ్యులు తమ పదవులకు రాజీనామా చేశారు. ట్రస్ట్ ఫిర్యాదు మేరకు జూన్ 25న ఎఫ్ఐఆర్ నమోదైంది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఏర్పాటైన ఈ ట్రస్ట్‌లో కేంద్రం నియమించిన సభ్యులే ఉన్నారని, తప్పు చేసిన వారు ఎంతటి వారైనా కఠిన చర్యలు తీసుకోవాలని రాహుల్, ఖర్గే డిమాండ్ చేశారు.ఇది కూడా చదవండి: జమ్ముకశ్మీర్‌లో కుండపోత: జలమయమైన రాజౌరి -
అఖిలపక్షానికి టీఎంసీ రెబెల్స్
న్యూఢిల్లీ: తృణమూల్ కాంగ్రెస్ పార్టీని చీలుస్తూ వేరుకుంపటి పెట్టుకున్న వర్గాన్ని మోదీ సర్కార్ ఆదివారం జరగబోయే అఖిలపక్ష సమావేశానికి ఆహ్వానం పలకడం వివాదాస్పదమైంది. మమతా బెనర్జీ సారథ్యంలోని టీఎంసీ నుంచి వేరుబడిన 19 మంది ఎంపీలు తాము నేషనల్ సిటిజెన్స్ పార్టీ ఆఫ్ ఇండియా(ఎన్సీపీఐ)లో విలీనమయ్యామని, తమను ప్రత్యేక వర్గంగా గుర్తించాలంటూ లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు చేసిన అభ్యర్థన ఇంకా పెండింగ్‌లో ఉండగానే చీలికవర్గానికి ఏకంగా అఖిలపక్షభేటీకి ప్రభుత్వం ఆహ్వానించడం చర్చనీయాంశమైంది. తమకు పోటీగా చీలిక వర్గానికీ ఆహ్వానం అందడంపై మమత సారథ్యంలోని టీఎంసీ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. ప్రజాస్వామ్యాన్ని ఎన్డీఏ కూటమి అపహాస్యంచేస్తోందని టీఎంసీ సీనియర్ రాజ్యసభ సభ్యుడు డిరెక్ ఓబ్రియాన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశారు. టీఎంసీ చీలిక వర్గం నేత సుదీప్ బందోపాధ్యాయ్‌ను అఖిలపక్షభేటీకి ఆహ్వానిస్తూ పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెణ్ రిజిజు శనివారం ఒక లేఖ రాశారు. ‘‘బందోపాధ్యాయ్తోపాటు 19 మంది ఎంపీలు ఎన్సీపీఐలో ఇప్పటికే చేరారు. అందుకే తిరుగుబాటు ఎంపీల నాయకుడినీ ఆహ్వానించాం. ఎన్సీపీఐ నామినేటెడ్ చీఫ్ విప్ హోదాలో చీలిక వర్గం నాయకురాలు డాక్టర్ కకోలీ ఘోష్ దస్తిదార్కూ ఆహ్వానం పలికాం’’అని రిజిజు చెప్పుకొచ్చారు. ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబడుతూ డిరెక్ ఓబ్రియాన్ ‘ఎక్స్’లో ఒక పోస్ట్‌పెట్టారు. ‘‘ఇదంతా మోసం. ప్రజాస్వామ్యాన్ని ఎగతాళి చేయడమే. చీలికవర్గం టీఎంసీ ఎంపీల అంశం తనవద్దే ఉందని ఓవైపు స్పీకర్ చెబుతారు. మరోవైపు వీళ్లను ఎన్సీపీఐ ఎంపీలుగా పేర్కొంటూ రిజిజు అఖిలపక్ష భేటీకి సాదర ఆహ్వానం పలుకుతారు. టీఎంసీ ద్రోహులను అనర్హులుగా ప్రకటించాలి’’అని అన్నారు. ప్రధానిని కలిసిన సుదీప్ బంధోపాధ్యాయ్... అంతకుముందు సుదీప్ బంధోపాధ్యాయ్ శనివారం ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. పార్లమెంట్లో టీఎంసీ తిరుగుబాటు ఎంపీలకు ప్రత్యేక సీటింగ్‌కు స్పీకర్ బిర్లా అనుమతించిన కొద్దిసేపటికే సుదీప్ ప్రధానితో భేటీ కావడం గమనార్హం. అయితే మోదీతో సుదీప్ ఏం మాట్లాడారనే వివరాలు తెలియరాలేదు. -
హరిత రవాణా దిశగా ముందడుగు
జింద్/జలంధర్: దేశంలో హైడ్రోజన్ ఆధారిత రైలును ప్రారంభించుకోవడం హరిత రవాణా దిశగా కీలకమైన ముందడుగు, ‘మేక్ ఇన్ ఇండియా’కు ఒక విజయవంతమైన ఉదాహరణగా ప్రధాని నరేంద్ర మోదీ అభివర్ణించారు. భారత్‌లో మొట్టమొదటి హైడ్రోజన్ పవర్డ్ రైలును ఆయన శుక్రవారం హరియాణాలోని జింద్ స్టేషన్లో జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు. జింద్–సోనిపట్ మార్గంలో ఈ రైలు ప్రయాణిస్తుంది. ప్రపంచంలో హైడ్రోజన్ ఇంధన రైళ్లను నడుపుతున్న అతికొద్ది దేశాల జాబితాలో భారత్ కూడా చేరింది. మోదీ హరియాణాలో రూ.14,700 కోట్ల విలువైన పలు ప్రాజెక్టును ప్రారంభించి జాతికి అంకితం ఇచ్చారు. మరికొన్నింటికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ప్రసంగించారు. హైడ్రోజన్ రైలు ఆత్మనిర్భర్ భారత్, ఆధునిక రవాణా వ్యవస్థ పట్ల మన నిబద్ధతకు నిదర్శనమని అన్నారు. గతంలోని కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వంపై పరోక్షంగా విమర్శలు గుప్పించారు. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల వల్ల తలెత్తిన పరిస్థితులు ఒకవేళ 2014కు ముందే ఏర్పడి ఉంటే భారతీయ రైల్వేల కార్యకలాపాలు స్తంభించిపోయేవని పేర్కొన్నారు. ఎందుకంటే అప్పట్లో దేశంలోని చాలా ప్రాంతాల్లో రైళ్లు ప్రధానంగా డీజిల్‌తో నడిచేవని గుర్తుచేశారు. అప్పట్లో డీజిల్ సరఫరాకు అంతరాయం కలిగి ఉంటే డీజిల్ ఆధారిత రైళ్లు ఆగిపోయేవని పేర్కొన్నారు. దేశం భారీ సంక్షోభాన్ని ఎదుర్కొనేదని చెప్పారు. కానీ, ఇది 2014 నాటి పరిస్థితి కాదన్నారు. ‘‘సమస్యలకు పరిష్కారాలను ముందుగానే ఆలోచించి, వాటిని క్షేత్రస్థాయిలో వాస్తవ రూపంలోకి తీసుకువచ్చే వ్యక్తి మోదీ. పశి్చమాసియా నేడు రణరంగంగా మారింది. హార్మూజ్ జలసంధి పరిసర ప్రాంతాల్లో యుద్ధం కొనసాగుతోంది. యుద్ధం, చమురు సంక్షోభం ఉన్నప్పటికీ భారత రైల్వేలు, దేశ అభివృద్ధి పరుగు మాత్రం ఆగిపోలేదు’’అని వ్యాఖ్యానించారు. అత్యంత పొడవైన రైలు ‘‘హైడ్రోజన్ ఆధారిత రైళ్లను నడిపే సామర్థ్యం కేవలం మూడు లేదా నాలుగు దేశాలకు మాత్రమే ఉంది. 21వ శతాబ్దపు ఈ సాంకేతికత విషయంలో భారతీయ రైల్వే ఒక పెద్ద ముందడుగు వేసింది. ఈ రైలు 3,200 హార్స్పవర్ సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఇది అత్యంత శక్తివంతమైనదే కాకుండా అత్యంత పొడవైనది(10 కోచ్‌లు) కూడా. ప్రపంచంలోని ఇతర ప్రాంతాల్లో హైడ్రోజన్ రైలుకు కేవలం మూడు లేదా నాలుగు కోచ్‌లు మాత్రమే ఉంటాయి. కానీ, మన దేశంలో ఈ రైలుకు 10 కోచ్‌లు ఉన్నాయి. ఈ భారీ హైడ్రోజన్ రైలును నడపడం ద్వారా భారత్ ప్రపంచ వేదికపై తనదైన ముద్ర వేసింది. భవిష్యత్తులో హైడ్రోజన్ రైలుకు సంబంధించిన మరిన్ని మౌలిక సదుపాయాలు రాబోతున్నాయి. కురుక్షేత్రలో సిక్కు మ్యూజియం జింద్ పట్టణంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమం విజయవంతం కావడం హర్షణీయం. స్వచ్ఛతను ప్రజలు తమ జీవన విధానంలో, దైనందిన జీవితంలో ఒక అంతర్భాగంగా మార్చుకోవాలి. జింద్ ప్రాంతానికి ఘనమైన చరిత్ర ఉంది. ఇది మహారాజా రంజిత్ సింగ్ కీర్తితోనూ, పాండవులకు సంబంధించిన విశ్వాసంతోనూ ముడిపడి ఉన్న ప్రాంతం. ఈ వారసత్వాన్ని కాపాడుకోవడమే కాకుండా, దానిని గర్వంగా భావి తరాలకు అందించడానికి భారత్ కట్టుబడి ఉంది. ఇదే స్ఫూర్తితో కురుక్షేత్రలో ఈ రోజు ఒక సిక్కు మ్యూజియంకు శంకుస్థాపన చేశాం. ఈ కొత్త మ్యూజియం హరియాణా సాంస్కృతిక వైభవాన్ని మరింత ఇనుమడింపజేస్తుంది’’అని మోదీ ఉద్ఘాటించారు. అభివృద్ధి ప్రాజెక్టులు ప్రారంభం ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం వేర్వేరు రాష్ట్రాల్లో అభివృద్ధి ప్రాజెక్టులను వర్చువల్‌గా ప్రారంభించారు. కేరళలో అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద పునరాభివృద్ధి చేసిన ఆరు రైల్వే స్టేషన్లను ప్రారంభించారు. అలాగే మధ్యప్రదేశ్‌లో 13 రైల్వే స్టేషన్లను జాతికి అంకితం ఇచ్చారు. ఛత్తీస్‌గఢ్‌లో రూ.4,700 కోట్ల విలువైన ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు. ‘వికసిత్ భారత్’దిశగా సాగే ప్రయాణంలో భవిష్యత్తుకు సంబంధించిన సాంకేతికతలు, ఆరోగ్య సంరక్షణ సేవలపై దృష్టి సారించాలని ఈ సందర్భంగా సూచించారు. ప్రస్తుత తరానికే కాకుండా, రాబోయే తరాలకు కూడా మేలు చేకూర్చే నిర్ణయాలను తీసుకోవాలని చెప్పారు. మోదీ శుక్రవారం పంజాబ్‌లో పర్యటించారు. రూ.5,470 కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రారంభించారు.పంజాబ్‌లో అరాచక పాలన పంజాబ్‌లో ఆమ్ ఆద్మీ పారీ్ట(ఆప్) ప్రభుత్వంపై ప్రధాని మోదీ విరుచుకుపడ్డారు. ఆ ప్రభుత్వానికి స్వచ్ఛమైన ఉద్దేశాలు గానీ, నిజాయితీ గానీ లేవని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా కుప్పకూలాయని, కనీసం పోలీస్ స్టేషన్లు కూడా సురక్షితంగా లేవని ఆరోపించారు. ఇది ‘ఖట్టర్ బీమాన్ సర్కార్’అని విమర్శించారు. పంజాబ్‌లో శాంతిభద్రతల పరిస్థితి అస్తవ్యస్తంగా ఉందన్నారు. ఎప్పుడు, ఎక్కడ ముఠా పోరు చెలరేగుతుందో, ఏ దిశ నుంచి తూటాలు దూసుకొస్తాయో ఎవరూ ఊహించలేరని ఆందోళన వ్యక్తంచేశారు. జలంధర్‌లో జరిగిన సభలో మోదీ మాట్లాడారు. రాష్ట్రంలో బహిరంగంగానే బలవంతపు వసూళ్లు సాగిస్తున్నారని మండిపడ్డారు. ఇక్కడ ఎవరికీ రక్షణ లేదన్నారు. పంజాబ్‌లో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. నిజమైన మార్పును తీసుకురావడంతోపాటు అభివృద్ధి చెందిన, సంపన్నమైన పంజాబ్‌ను నిర్మించే సత్తా బీజేపీకి మాత్రమే ఉందని మోదీ తేల్చిచెప్పారు. -
75 రైల్వే స్టేషన్లను ప్రారంభించిన ప్రధాని మోదీ
జలంధర్: ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ (శుక్రవారం) జలంధర్ నుండి రూ. 5,470 కోట్ల విలువైన రైల్వే, రహదారి మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను ప్రారంభించడంతో పాటు అమృత్ భారత్ స్కీమ్‌లో భాగంగా ఆధునీకరించిన 75 రైల్వే స్టేషన్లను వర్చువల్‌గా ప్రారంభించి జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా జలంధర్ స్టేషన్లో రైలు ప్రయాణికులతో ప్రధాని మోదీ మాట్లాడారు. తెలుగు రాష్ట్రాల్లోని రాయనపాడు, మంగళగిరి, హైటెక్ సిటీ రైల్వే స్టేషన్లను వర్చువల్‌గా ప్రారంభించారు.అమృత్ భారత్ పథకంలో రూ.35 కోట్లతో రాయనపాడు స్టేషన్ ఆధునికీకరించారు. విజయవాడ రైల్వే స్టేషన్‌కు ప్రత్యామ్నాయంగా రాయనపాడు రైల్వే స్టేషన్ అభివృద్ధి చేస్తున్నారు. చండీగఢ్‌లో పలు ప్రాజెక్టులను ప్రారంభించిన అనంతరం, హర్యానాలోని జింద్‌లో దేశంలోనే మొట్టమొదటి హైడ్రోజన్ రైలును మోదీ ప్రారంభించారు. అనంతరం జలంధర్ చేరుకున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో డేరా సచ్‌ఖండ్ బల్లాన్‌ను సందర్శించిన తర్వాత ప్రధాని మోదీ జలంధర్‌లో పర్యటించడం ఇది రెండోసారి. -
ఇక ఎన్డీఏ వేదిక 'మంగళ్ మిలన్’!
న్యూఢిల్లీ: ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ సమావేశానికి కొత్తగా మంగళ్ మిలన్ అని పేరు మార్చారు. పార్లమెంట్ సమావేశాల సమయంలో సాధారణంగా మంగళవారాల్లో జరిగే ఈ ఎన్డీఏ కూటమి ఎంపీల వ్యూహాత్మక భేటీని ఇకపై మంగళ్ మిలన్గా పిలవాలని నిర్ణయించారు. ఈ మేరకు పేరు మార్పు నిర్ణయాన్ని నేడు(శుక్రవారం, జూలై 17వ తేదీ) అధికారికంగా ప్రకటించారు. రాబోయే సమావేశం: పార్లమెంట్ వర్షాకాల సమావేశాల నేపథ్యంలో జూలై 21, ఉదయం 9:30 గంటలకు పార్లమెంట్ హౌస్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఈ "మంగళ్ మిలన్" మొదటి సమావేశం జరగనుంది.కాగా, పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జులై 20 నుంచి ప్రారంభం కానున్నాయి. దీనిలో భాగంగా బీజేపీ తన 'మిషన్ 360' ప్రయత్నాలను వేగవంతం చేసింది. నరేంద్ర మోదీ సర్కార్ మహిళలకు రిజర్వేషన్, లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించిన రాజ్యాంగ (131వ సవరణ) బిల్లును మళ్లీ ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతోంది. ఈ రెండు అంశాలను ఒకదానితో ఒకటి అనుసంధానించాలనే ఆలోచనలో ఉంది. ఏప్రిల్‌లో జరిగిన 3 రోజుల ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల్లో ఈ బిల్లుకు అవసరమైన రెండు వంతుల మెజారిటీ లభించలేదు. దీంతో మరోసారి ప్రయత్నించే ముందు మద్దతు పెంచుకునే చర్యలను ఎన్డీఏ ముమ్మరం చేసింది.ప్రస్తుతం మారుతున్న రాజకీయ పరిస్థితులు ఈ సారి సర్కార్‌కు అనుకూలంగా ఉండొచ్చని బీజేపీ భావిస్తోంది. పార్లమెంట్లో తన బలాన్ని పెంచుకునే లక్ష్యంతో అధికార పార్టీ విస్తృత స్థాయిలో సంప్రదింపులు చేపట్టింది. మరోవైపు కాంగ్రెస్‌తో పాటు ప్రతిపక్ష పార్టీలు కూడా సమావేశాలకు ముందు చర్చలు వేగవంతం చేశాయి. -
తొలి హైడ్రోజన్ రైలు : దీని ప్రత్యేకతలివే!
భారతీయ రైల్వే సరికొత్త మైలురాయిని తాకింది. పర్యావరణహితంగా, స్వదేశీసాంకేతికతతో రూపొందించిన మొట్టమొదటి హైడ్రోజన్ ఆధారిత రైలును ప్రవేశపెట్టింది. దేశంలోనే మొట్టమొదటి హైడ్రోజన్ రైలును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జెండా ఊపి ప్రారంభించారు. ఈ శూన్య ఉద్గారాల (Zero-emission) రైలుహర్యానాలోని 89 కిలోమీటర్ల జింద్-సోనిపత్ మార్గంలో నార్తర్న్ రైల్వే ఆధ్వర్యంలో నడుస్తుంది. ఇలాంటి రైళ్లు కలిగిన అతికొద్ది దేశాల సమూహం లోకి భారతదేశం చేరింది. రైల్వే రంగంలో భారతదేశం స్వచ్ఛమైన సాంకేతికతను అవలంబించేలా చూడటంలో ఇది ఎంతగానో దోహదపడుతుందన్నారు ప్రధాని మోదీ. దేశంలో తొలిసారిగా హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ టెక్నాలజీని ఉపయోగించనున్నారు. ఆత్మనిర్భర్ భారత్ విజన్‌కు ప్రతిరూపంగా రీసెర్చ్, డిజైన్స్ & స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్' (RDSO) ద్వారా ఈ రైలు పూర్తిగా భారతదేశంలోనే తయారైంది. ఈ టెక్నాలజీ, హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్స్‌ను ఉపయోగించి విద్యుత్తును ఉత్పత్తి చేస్తుంది. ప్రపంచంలోనే ఇది అతి పెద్ద, శక్తివంతమైన హైడ్రోజన్ పవర్ ప్యాసింజర్ రైలు. 1200 కిలోవాట్ల హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ ప్రొపల్షన్ సిస్టమ్‌తో నడుస్తుంది. ఇదీ చదవండి: హెర్నియా ఆపరేషన్‌కి రూ. 11 లక్షలా? నెటిజన్లు గగ్గోలు Prime Minister @narendramodi flags off India's first Hydrogen train between Jind and Sonipat at Jind railway station#HydrogenTrain #भारत_की_पहली_हाइड्रोजन_ट्रेन @RailMinIndia Watch: ⬇️ pic.twitter.com/j1lJCliqRs— PIB India (@PIB_India) July 17, 2026 ; గరిష్టంగా గంటకు 75 కిలోమీటర్ల వేగంతో నడపడానికి ఆమోదం పొందింది, కానీ దీని డిజైన్ వేగం గంటకు 110 కిలోమీటర్లు. ఇందులో మొత్తం 10 కోచ్‌లు ఉంటాయి. ఇది 2600 ప్రయాణీకులనువారి వారి గమ్య స్థానాలకు చేరుస్తుంది.నిజానికి ప్రపంచంలో ఇప్పటికే నడుస్తున్న ఈ హైడ్రోజన్ ట్రైన్లకు కేవలం రెండు, నాలుగు కోచ్‌లు మాత్రమే ఉన్నాయి. అదీడా అత్యంత తక్కువ దూరం ప్రయాణిస్తాయి.ఇది జింద్ జంక్షన్, గోహానా జంక్షన్ ,సోనిపత్‌లను కలుపుతూ, జింద్ సిటీ, పాండు పిండారా జంక్షన్, లలిత్ ఖేరా హాల్ట్, భంభేవా, ఇసాపూర్ ఖేరి హాల్ట్, బుటానె హాల్ట్, ఖండ్రాయ్ హాల్ట్, రాబ్రా హాల్ట్, లాత్ హాల్ట్, మోహనా, బర్వాస్ని హాల్ట్ , సోనిపత్ న్యూ స్టేషన్లలో ఆగుతుంది.పైలట్ ప్రాజెక్ట్‌గా అభివృద్ధి చేసినన ఈ రైలు, హైడ్రోజన్ టెక్నాలజీని పరీక్షించడంలో, భారతదేశంలో పర్యావరణ అనుకూల రైలు ప్రయాణం కోసం భవిష్యత్ ప్రణాళికలకు మద్దతు నిస్తుంది.హైడ్రోజన్ ఆధారిత రైళ్లు ఉన్న ఇతర దేశాలు ఏవి?హైడ్రోజన్ ఆధారిత రైలును నడుపుతున్నదేశాల్లో అమెరికా జర్మనీ, జపాన్, చైనా ఉన్నాయి. ప్రపంచంలోనే మొట్టమొదటి హైడ్రోజన్ ఆధారిత ప్యాసింజర్ రైలు అయిన ఆల్స్టామ్ కొరాడియా ఐలింట్ (Alstom Coradia iLint) ను ప్రవేశపెట్టడంలో జర్మనీ ముందంజలో ఉంది.ఇదీ చదవండి: మూడో పెళ్లి : ఫత్వా, లవ్ జిహాద్ ఆరోపణలపై స్పందించిన ఆమీర్ -
హర్ముజ్ యుద్ధ క్షేత్రంగా మారింది.. మోదీ
చండీగఢ్: హర్ముజ్ జలసంధి ప్రస్తుతం యుద్ధ క్షేత్రంగా మారిందని ప్రధాని మోదీ అన్నారు. హర్ముజ్ వద్ద ఉద్రిక్త పరిస్థితులున్నాయన్నారు. ఈ రోజు శుక్రవారం పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన హైడ్రోజన్ రైలును ప్రధాని మోదీ హర్యానా లోని జింద్ రైల్వేస్టేషన్లో జెండా ఊపి ప్రారంభించారు. ఈ రైలు జింద్, సోనిపట్ స్టేషన్ల మధ్య 89 కిలోమీటర్లు ఈ రైలు ప్రయాణించనుంది.2014కంటే ముందు ఇంధన కొరతతో రైళ్లు ఆగిపోయేవి.. భవిష్యత్తులో ఇంధనం లేకుంటే రైళ్లు ఎలా నడుస్తాయని ప్రశ్నించారు. ప్రపంచంలో ఏ సంక్షోభం ఎదురైనా దానికి సమాధానం భారత్ వద్ద ఉంటుందని మోదీ ఈ సందర్భంగా భారత సత్తాని కొనియాడారు. రైలు ప్రారంభానికి ముందు ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా స్పందిస్తూ "ఇలాంటి అధునాతన రైళ్లు కలిగిన ప్రపంచంలోని కొన్ని ఎంపిక చేసిన దేశాల జాబితాలో భారతదేశం కూడా చేరింది. రైల్వే రంగంలో స్వచ్ఛమైన సాంకేతికతను అవలంబించడంలో ఇది భారతదేశానికి ఎంతగానో దోహదపడుతుంది" అని పేర్కొన్నారు.భారతదేశంలో ఇలాంటి పర్యావరణ అనుకూల హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ సాంకేతికతను ఉపయోగించడం ఇదే తొలిసారి. ఈ రైళ్లు హైడ్రోజన్ ఇంధన కణాల ద్వారా సొంతంగా విద్యుత్‌ను ఉత్పత్తి చేసుకుని నడుస్తాయి. ఇది డీజిల్ రైళ్లకు అత్యంత స్వచ్ఛమైన, పర్యావరణ రహిత ప్రత్యామ్నాయంగా నిలుస్తుంది. ఈ ప్రాజెక్టులో భాగంగా హైడ్రోజన్ నిల్వ , రీఫ్యూయలింగ్ సదుపాయాలను కూడా ఏర్పాటు చేశారు. హైడ్రోజన్ రైలు ప్రత్యేకతలు హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ ఆధారంగా నడిచే 10 కోచ్‌ల రైలుఈ రైలు గరిష్టంగా గంటకు 75 కిలోమీటర్ల ఆపరేషనల్ స్పీడ్‌తో నడపడానికి అనుమతి లభించింది. కాగా దీని డిజైన్ స్పీడ్ గంటకు 110 కిలోమీటర్లు.ప్రయాణికుల సామర్థ్యం: ఈ రైలులో దాదాపు 2,600 మంది ప్రయాణికులు ఒకేసారి ప్రయాణించవచ్చు.డిజైన్ దశ నుండి ప్రోటోటైప్ తయారీ వరకు ఈ రైలును పూర్తిగా భారతదేశంలోనే (Make in India) రూపొందించారు.హైడ్రోజన్ రైలు భారత్‌లో రావడంతో జర్మనీ,జపాన్, చైనా,అమెరికా దేశాల సరసన భారత్ చేరింది. -
భారత రైల్వే చరిత్రలో గ్రీన్ సంచలనం
సాక్షి, న్యూఢిల్లీ: భారతీయ రైల్వే చరిత్రలో మరో సువర్ణ అధ్యాయం లిఖితం కాబోతోంది. పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా, కాలుష్య రహిత ప్రయాణమే లక్ష్యంగా రూపొందించిన దేశంలోనే మొట్టమొదటి హైడ్రోజన్ రైలు శుక్రవారం పట్టాలెక్కనుంది. హరియాణా వేదికగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ స్వదేశీ అద్భుతాన్ని పచ్చ జెండా ఊపి ప్రారంభించనున్నారు. ఒకప్పుడు బొగ్గు ఇంజన్లతో పరుగులు తీసిన భారత రైల్వే.. ఆ తర్వాత డీజిల్, విద్యుత్ శకాలను దాటుకుని, ఇప్పుడు అత్యంత స్వచ్ఛమైన ఇంధనం ’హైడ్రోజన్’వైపు అడుగులు వేసింది. బ్రాడ్‌గేజ్ మార్గాల్లో ఇప్పటికే 99 శాతానికి పైగా విద్యుద్దీకరణ పూర్తి చేసుకున్న రైల్వే ఇప్పుడు ఈ సరికొత్త హైడ్రోజన్ రైలుతో సరికొత్త రికార్డు సృష్టించబోతోంది. ప్రమాదాలకు తావులేదు.. భద్రత అమోఘం! హైడ్రోజన్ అత్యంత వేగంగా మండే స్వభావం గల వాయువు కాబట్టి ప్రయాణికులలో భయాలు సహజం. అందుకే రైల్వే శాఖ భద్రత విషయంలో అంతర్జాతీయ ప్రమాణాలను పాటించింది. గ్యాస్ లీకేజీలు, వేడి, మంటలు, పొగను క్షణాల్లో గుర్తించే అత్యాధునిక సెన్సార్లను అమర్చారు. ఏ చిన్న తేడా వచ్చినా గ్యాస్ సరఫరా ఆటోమేటిక్‌గా నిలిచిపోతుంది. పొరపాటున హైడ్రోజన్ లీకైనా, అది ఒకచోట చేరకుండా గాల్లో కలిసిపోయేలా నిరంతర వెంటిలేషన్ వ్యవస్థ ఉంది. జింద్ వద్ద అతిపెద్ద హైడ్రోజన్ ప్లాంట్! హరియాణాలోని జింద్ వద్ద దేశంలోనే అతిపెద్ద హైడ్రోజన్ రీఫ్యూయలింగ్ కేంద్రాన్ని రైల్వే శాఖ ఏర్పాటు చేసింది. ఇక్కడ నీటి నుంచి విద్యుది్వశ్లేషణ (ఎలక్ట్రోలిసిస్) ద్వారా స్వచ్ఛమైన హైడ్రోజన్ వాయువును తయారు చేస్తారు. దీనిని 500 బార్ ప్రెజర్ వద్ద నిల్వ చేసి, రైళ్లకు 350 బార్ ప్రెజర్ వద్ద నింపుతారు. ఇక్కడ ఏకకాలంలో రెండు పవర్ కార్లలో గ్యాస్ నింపే సదుపాయం ఉంది. ఈ రైలును ‘మేక్ ఇన్ ఇండియా’కింద భారత్‌లోనే రూపొందించారు. రైలు ప్రత్యేకతలు.. ప్రపంచవ్యాప్తంగా నడిచే హైడ్రోజన్ రైళ్లు కేవలం 2 లేదా 3 కోచ్‌లతో మాత్రమే నడుస్తుండగా, భారత్‌లో ఏకంగా 10 కోచ్‌ల భారీ రైలును సిద్ధం చేశారు. ప్రపంచంలోనే అతిపెద్ద హైడ్రోజన్ రైలుగా ఇది రికార్డ్నెలకొల్పే ఆస్కారముంది. ఈ రైలులో ఒకేసారి గరిష్టంగా 2,600 మంది ప్రయాణికులు ప్రయాణించవచ్చు. హరియాణాలోని నార్తర్న్ రైల్వే పరిధిలోని జింద్ నుంచి సోనిపట్ వరకు 89 కిలోమీటర్ల మార్గంలో ఈ రైలును నడపునున్నారు. జింద్ జంక్షన్, గోహనా జంక్షన్, సోనిపట్ సహా మధ్యలోని దాదాపు 12 స్టేషన్లలో ఈ రైలు ఆగుతుంది. గంటకు గరిష్టంగా 110 కి.మీ వేగంతో ప్రయాణించేలా దీనిని డిజైన్ చేశారు. ప్రస్తుతం ఈ మార్గంలో 75 కి.మీ వేగంతో నడపనున్నారు. రైలుకు ఇరువైపులా రెండు హైడ్రోజన్ డ్రైవింగ్ పవర్ కార్లు (డీపీసీ)లు ఉంటాయి. ఇవి చెరో 1,200 కిలోవాట్ల (1600 హెచ్‌పీ) శక్తిని ఉత్పత్తి చేస్తాయి. ఇందులో బ్యాకప్ కోసం లిథియం ఐరన్ ఫాస్ఫేట్ (ఎల్ఎఫ్పీ) బ్యాటరీలను జతచేశారు.నిప్పులు చిమ్మని హరిత రథంమారనున్న భారతీయ రైల్వే ముఖచిత్రం బొగ్గుతో నడిచే రైళ్లు మొదలు విద్యుత్‌తో నడిచే రైళ్లదాకా కొనసాగిన భారత రైల్వే ప్రస్థానంలో సరికొత్త హరిత అతిథి నేడు వచ్చిచేరుతోంది. వాతావరణంలోని కర్భన ఉద్గారాలను అస్సలు వెదజల్లని వాతావరణహిత హరిత రైలు రాకతో భారత రైల్వే ముఖచిత్రం మారబోతోందని రైల్వే రంగ నిపుణులు ఆశాభావం వ్యక్తంచేశారు. ఈ నేపథ్యంలో హైడ్రోజన్ రైలు పనితీరుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఎలా పనిచేస్తుంది? సంప్రదాయక రైలు మాదిరి ఈ రైలు నుంచి కాలుష్యకారక ఎలాంటి కర్భన ఉద్గారాలు వెలువడవు. హరిత శకటం నుంచి కేవలం నీటి ఆవిరి బయటకు వస్తుంది. ఈ రైలు ముందుభాగంలో లేదా పైభాగంలో లేదా ప్రత్యేక కంపార్ట్మెంట్లో భారీ స్థాయిలో హైడ్రోజన్ వాయువును నిల్వచేసే ట్యాంకర్ ఉంటుంది. దీనికి సమీపంలో ఫ్యూయల్సెల్ వ్యవస్థ ఉంటుంది. ట్యాంక్‌లోని హైడ్రోజన్‌ను ప్రత్యేక పైపుల ద్వారా ఫ్యూయల్‌సెల్‌లోకి పంపిస్తారు. అయితే అది ఫ్యూయల్ సెల్‌లోకి వచ్చే క్రమంలోనే ప్రోట్రాన్లు, ఎల్రక్టాన్లుగా విడిపోతుంది. ఎల్రక్టాన్లు ఫ్యూయల్ సెల్‌లోకి వెళ్లవు. ప్రత్యేక సర్క్యూ ద్వారా ప్రవహిస్తాయి. ఇదే రైలు ముందుకు కదలడానికి సాయపడుతుంది. ఫ్యూయల్‌సెల్‌లోకి వచ్చే ప్రోటాన్లు అనేవి బయటి గాలి నుంచి వచ్చే ఆక్సీజన్‌తో ఎల్రక్టానిక్ రసాయన చర్య జరిపి విద్యుత్‌ను, నీటి ఆవిరిని ఉత్పత్తిచేస్తాయి. ఈ నీటి ఆవిరి ఎప్పటికప్పుడు బయటకు వెళ్లిపోతుంది. విద్యుత్ మాత్రం అక్కడే ట్రాక్షన్ మోటార్లకు చేరి రైలు చక్రాలను ముందుకు కదిలేలా చేస్తాయి. రైలు ఒకవేళ నెమ్మదిగా వెళితే ఆ సమయంలో ఫ్యూయల్ సెల్ వ్యవస్థ ద్వారా జనించిన విద్యుత్ అనేది రైలులో అమర్చిన భారీ బ్యాటరీల్లో నిక్షిప్తమవుతుంది. ఇది అవసరమైన వేళల్లో హఠాత్తుగా రైలు వేగం పెరిగేందుకు సాయపడుతుంది. హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ ప్రొపల్షన్ వ్యవస్థతో ఈ రైలు పనిచేస్తుందని శివనాడార్ యూనివర్సిటీలోని ఇంజనీరింగ్ విభాగ ప్రొఫెసర్ హర్‌ప్రీత్ సింగ్ అరోరా చెప్పారు. ఓవర్‌హెడ్ హైటెన్షన్ విద్యుత్ తీగల నుంచి వచ్చే విద్యుత్‌తో విద్యుత్ ఆధారిత రైలు పనిచేస్తాయి. కానీ హైడ్రోజన్ రైళ్లలో అత్యధిక పీడనంతో నింపిన హైడ్రోజన్ ఈ ప్రోటాన్ ఎక్సే్ఛంజ్ మెంబ్రేన్ ఫ్యూయల్ సెల్ విధానంలో ఆక్సీజన్‌తో చర్య జరిపి అటు విద్యుత్‌ను, ఇటు నీటి ఆవిరిని, పరిమిత స్థాయిలో వేడిమిని అందిస్తుందని సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరోన్మెంట్ మేథోసంస్థలో ఎలక్ట్రిక్ మొబిలిటీ విభాగ సీనియర్ ప్రోగ్రామ్ మేనేజర్ మౌష్మీ మొహంతీ తెలిపారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
రైల్వేలో కొత్త శకం.. భారత్ తొలి హైడ్రోజన్ రైలు.. ఫుల్ డీటెయిల్స్..
హైడ్రోజన్ శక్తితో నడిచే ప్యాసింజర్ రైళ్లను నడిపే దేశాల జాబితాలో భారత్ చేరుతోంది.. హరియాణాలోని జింద్-సోనిపట్ మార్గంలో దేశంలోని తొలి హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ రైలు సేవలను శుక్రవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభిస్తున్నారు. 10 బోగీలతో రూపొందించిన ఈ రైలుకు దాదాపు 2,600 మంది ప్రయాణికులను తీసుకెళ్లే సామర్థ్యం కలిగి ఉంది. ప్రపంచంలో అభివృద్ధి చేసిన అతిపెద్ద హైడ్రోజన్ శక్తితో నడిచే ప్రయాణికుల రైళ్లలో ఇది ఒకటి. సాధారణ విద్యుత్ రైళ్ల మాదిరిగా పైభాగంలో ఉండే విద్యుత్ తీగలు, డీజిల్ ఇంజిన్‌పై ఇది ఆధారపడదు. హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ల సాయంతో రైలులోనే విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. నేరుగా వెలువడే ఉద్గారాలుగా నీటి ఆవిరి, వేడి మాత్రమే విడుదలవుతాయని పత్రికా సమాచార శాఖ తెలిపింది. బ్రాడ్ గేజ్ రైల్వే నెట్‌వర్క్‌లో 99 శాతానికి పైగా విద్యుద్దీకరణ పూర్తి చేసి డీజిల్ వినియోగాన్ని భారీగా తగ్గిస్తోంది. భారతీయ రైల్వే చేపట్టిన స్వచ్ఛ ఇంధన ప్రయాణంలో ఇది మరో కీలక మైలురాయి.మార్గం వివరాలుహైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ రైలు తొలుత ఉత్తర రైల్వే పరిధిలోని జింద్-సోనిపట్ మార్గంలో నడుస్తుంది. ఈ రైలు జింద్ జంక్షన్, గోహానా జంక్షన్, సోనిపట్ మధ్య ప్రయాణిస్తుంది. మధ్యలో జింద్ సిటీ, పాండు పిండారా జంక్షన్, లలిత్ ఖేరా హాల్ట్, భంభేవా, ఈసాపూర్ ఖేరి హాల్ట్, బుటానా హాల్ట్, ఖండ్రాయ్ హాల్ట్, రబ్రా హాల్ట్, లాత్ హాల్ట్, మొహానా, బర్వాస్ని హాల్ట్, సోనిపట్ న్యూ స్టేషన్లలో ఆగుతుంది. ప్రతిపాదిత హాల్ట్లలో కూడా సేవలు అందిస్తుంది.సాధారణ పరిస్థితుల్లో హైడ్రోజన్ శక్తితో నడిచే ప్రయాణికుల రైలు సేవలు ఎంత సమర్థంగా, ఎంత భద్రంగా, ఎంత విశ్వసనీయంగా పనిచేస్తాయో నిరూపించేందుకు ఈ మార్గాన్ని ఎంపిక చేశారు.హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్లతో పరుగులుఈ రైలు ప్రోటాన్ ఎక్స్చేంజ్ మెంబ్రేన్ (పీఈఎం) ఫ్యూయల్ సెల్ వ్యవస్థతో పనిచేస్తుంది. అధిక పీడన సిలిండర్లలో నిల్వ చేసిన హైడ్రోజన్, వాతావరణంలో ఉండే ఆక్సిజన్‌తో ప్రతిచర్య జరిపి విద్యుత్ ఉత్పత్తి చేస్తుంది. ఆ విద్యుత్ ట్రాక్షన్ మోటార్లను నడుపుతుంది.ఈ రైలులో రెండు చివరల వద్ద రెండు హైడ్రోజన్ డ్రైవింగ్ పవర్ కార్లు, మధ్యలో 8 ప్రయాణికుల బోగీలు ఉన్నాయి. ప్రతి పవర్ కారు 1,200 కిలోవాట్ల శక్తి, అంటే దాదాపు 1,600 హార్స్పవర్ ఉత్పత్తి చేస్తుంది. ఈ రైలు గంటకు 110 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించేలా రూపకల్పన చేశారు. అయితే పైలట్ దశలో ఉత్తర రైల్వే పరిధిలోని 89 కిలోమీటర్ల జింద్-సోనిపట్ మార్గంలో గరిష్ఠంగా గంటకు 75 కిలోమీటర్ల వేగంతో నడుస్తుంది. ఈ సేవల నిర్వహణకు అవసరంగా హరియాణాలోని జింద్‌లో దేశంలోనే అతిపెద్ద రైల్వే హైడ్రోజన్ రీఫ్యూయలింగ్ కేంద్రాన్ని భారతీయ రైల్వే నిర్మించింది.ఈ కేంద్రంలో విద్యుద్విశ్లేషణ ద్వారా హైడ్రోజన్ ఉత్పత్తి చేస్తారు. దానిని 500 బార్ పీడనానికి కుదించి, 350 బార్ పీడనంతో రైలుకు నింపుతారు. దీనివల్ల రెండు పవర్ కార్లలో ఒకేసారి హైడ్రోజన్ నింపే అవకాశం ఉంటుంది. ఈ కేంద్రంలో దాదాపు 3,000 కిలోల హైడ్రోజన్ నిల్వ చేసే సామర్థ్యం ఉంది. ఇది సాధారణ రైలు సేవలు కొనసాగించేందుకు సరిపోతుంది.అధికారుల సమాచారం ప్రకారం, హైడ్రోజన్ ఉత్పత్తి, నిల్వ, కుదింపు, నింపడం, రైలు నిర్వహణ వంటి అన్ని దశలను కలిపిన దేశంలోని తొలి సమగ్ర రైల్వే హైడ్రోజన్ వ్యవస్థ ఈ ప్రాజెక్టుతో ఏర్పడింది.విదేశాల్లో నడుస్తున్న హైడ్రోజన్ రైళ్ల కంటే పెద్దదిహైడ్రోజన్ శక్తితో నడిచే రైళ్లు ఇప్పటికే జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ, చైనా, జపాన్ దేశాల్లో సేవలు అందిస్తున్నాయి. కొన్ని దేశాల్లో ప్రయోగాత్మకంగా నడుస్తున్నాయి. అయితే వాటిలో ఎక్కువ రైళ్లలో 2 నుంచి 4 బోగీలు మాత్రమే ఉంటాయి. ప్రధానంగా ప్రాంతీయ మార్గాల్లోనే అవి నడుస్తున్నాయి.10 బోగీలతో రూపొందించిన భారతీయ రైల్వే హైడ్రోజన్ రైలు ప్రపంచంలోనే అతిపెద్ద హైడ్రోజన్ శక్తితో నడిచే ప్రయాణికుల రైళ్లలో ఒకటిగా నిలుస్తుందని భారతీయ రైల్వే తెలిపింది. అధిక సామర్థ్యం ఉన్న ప్రయాణికుల రైలు సేవలకు హైడ్రోజన్ సాంకేతికతను ఉపయోగించవచ్చని ఇది నిరూపిస్తోందని తెలిపింది.భారత్‌లోనే తయారీభారతీయ రైల్వే ఆధ్వర్యంలో స్వదేశీ సాంకేతికతతో ఈ హైడ్రోజన్ రైలును అభివృద్ధి చేశారు. పరిశోధన, నమూనాల రూపకల్పన, ప్రమాణాల సంస్థ (ఆర్డీఎస్ఓ) సాంకేతిక రూపకల్పన, ఆమోద ప్రక్రియకు నాయకత్వం వహించింది. మేధా సర్వో డ్రైవ్స్ రైలు వ్యవస్థను సమీకరించింది. ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (ఐసీఎఫ్) రైలు బాహ్య రూపాన్ని రూపొందించింది.జింద్-సోనిపట్ రైలు సేవలు తొలుత పైలట్ ప్రాజెక్టుగా నడుస్తాయి. జాతీయ హరిత హైడ్రోజన్ మిషన్‌లో భాగంగా, దీర్ఘకాలిక నెట్ జీరో లక్ష్యాల దిశగా కల్కా-షిమ్లా రైల్వే వంటి వారసత్వ మార్గాల్లో కూడా హైడ్రోజన్ శక్తితో నడిచే రైళ్లను ప్రవేశపెట్టే అవకాశాలను భారతీయ రైల్వే పరిశీలిస్తోంది.Are you excited for Bharat's first Hydrogen Train?#HydrogenTrain#भारत_की_पहली_हाइड्रोजन_ट्रेन pic.twitter.com/6uhyLaGC4n— Ministry of Railways (@RailMinIndia) July 16, 2026 -
బీజేపీ మిషన్ 360.. మోదీ మాస్టర్ ప్లాన్‌కు కౌంట్‌డౌన్
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జులై 20 నుంచి ప్రారంభం కానున్నాయి. అంతకుముందు బీజేపీ తన 'మిషన్ 360' ప్రయత్నాలను వేగవంతం చేసింది. నరేంద్ర మోదీ సర్కార్ మహిళలకు రిజర్వేషన్, లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించిన రాజ్యాంగ (131వ సవరణ) బిల్లును మళ్లీ ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతోంది. ఈ రెండు అంశాలను ఒకదానితో ఒకటి అనుసంధానించాలనే ఆలోచనలో ఉంది. ఏప్రిల్‌లో జరిగిన 3 రోజుల ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల్లో ఈ బిల్లుకు అవసరమైన రెండు వంతుల మెజారిటీ లభించలేదు. దీంతో మరోసారి ప్రయత్నించే ముందు మద్దతు పెంచుకునే చర్యలను ఎన్డీఏ ముమ్మరం చేసింది.రాజకీయ వర్గాల సమాచారం ప్రకారం.. ప్రస్తుతం మారుతున్న రాజకీయ పరిస్థితులు ఈ సారి సర్కార్‌కు అనుకూలంగా ఉండొచ్చని బీజేపీ భావిస్తోంది. పార్లమెంట్లో తన బలాన్ని పెంచుకునే లక్ష్యంతో అధికార పార్టీ విస్తృత స్థాయిలో సంప్రదింపులు చేపట్టింది. మరోవైపు కాంగ్రెస్‌తో పాటు ప్రతిపక్ష పార్టీలు కూడా సమావేశాలకు ముందు చర్చలు వేగవంతం చేశాయి.తృణమూల్ కాంగ్రెస్, శివసేన (యూబీటీ), శరద్ పవార్ వర్గంలో ఇటీవల ఊహించని విధంగా రాజకీయ పరిణామాలు చోటుచేసుకున్నా, రాజ్యాంగ సవరణ ఆమోదానికి అవసరమైన రెండు వంతుల మెజారిటీకి బీజేపీ నేతృత్వంలోని జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్డీఏ) ఇంకా దాదాపు ఆరుగురు ఎంపీల మద్దతును సంపాదింకోవాల్సి ఉంటుందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ప్రతిపాదిత బిల్లుకు విస్తృత మద్దతు కూడగట్టే ప్రయత్నం సర్కార్ చేస్తుందా అన్న అంశంపై రాజకీయ పరిశీలకులు దృష్టి పెట్టారు. ఈ నేపథ్యంలో జులై 19న బీజేపీ అఖిలపక్ష సమావేశం నిర్వహించనుంది.బీజేపీ వ్యూహాలువర్షాకాల సమావేశాలకు ముందు బీజేపీ అంతర్గత చర్చలను వేగవంతం చేసింది. గత వారం రోజులుగా పార్టీ అగ్రనేతలు పలు కీలక సమావేశాలు నిర్వహించారు. వాటిలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నివాసంలో కూడా సమావేశం జరిగింది. ఈ సమావేశానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి (సంస్థాగత వ్యవహారాలు) బి.ఎల్. సంతోష్ హాజరయ్యారు.వర్షాకాల సమావేశాల్లో సర్కార్ అనుసరించాల్సిన పార్లమెంటరీ వ్యూహంపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చ జరిగింది. అదే సమయంలో బి.ఎల్. సంతోష్ హాజరు కావడంతో నితిన్ నబీన్ నాయకత్వంలో కొత్త జాతీయ బృందాన్ని బీజేపీ త్వరలో ప్రకటించే అవకాశం ఉందన్న ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. సంస్థాగత స్థాయిలో విస్తృత సంప్రదింపులు కొనసాగుతున్నాయి. వివిధ రాష్ట్రాల నుంచి పదవులకు తగిన నాయకుల పేర్లను కోరారు. వచ్చిన సిఫార్సుల ఆధారంగా కొత్త బృందాన్ని ఖరారు చేసే అవకాశం ఉంది.రాజకీయ వర్గాల సమాచారం ప్రకారం, ప్రధానమంత్రి నివాసంలో జరిగిన సమావేశం సంస్థాగత అంశాలకే పరిమితం కాలేదు. సర్కార్ శాసన కార్యక్రమం, ప్రతిపక్షాల వ్యూహం, సమావేశాల్లో ప్రవేశపెట్టే అవకాశమున్న బిల్లులపై కూడా చర్చ జరిగింది. వాటిలో నియోజకవర్గాల పునర్విభజన, మహిళలకు రిజర్వేషన్‌కు సంబంధించిన ప్రతిపాదనలపైనే ఎక్కువ చర్చ సాగింది.ప్రస్తుత రాజకీయ పరిస్థితులు అనుకూలమే!ప్రస్తుత రాజకీయ పరిస్థితులు గతంతో పోలిస్తే మరింత అనుకూలంగా ఉన్నాయని సర్కార్ భావిస్తోంది. అధికార కూటమి బలమైన స్థితిలో ఉండగా, ప్రతిపక్షం తక్కువ బలంతో కనిపిస్తోందని అంచనా వేస్తోంది. పలు ప్రాంతీయ పార్టీల వైఖరి కీలకంగా మారే అవకాశం ఉంది. 22 మంది ఎంపీలు ఉన్న డీఎంకే కొన్ని అంశాల్లో సర్కార్‌కు మద్దతు ఇవ్వొచ్చన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి.ఓ సీనియర్ బీజేపీ నేత తెలిపిన వివరాల ప్రకారం.. కీలక అంశాల్లో డీఎంకే వైఖరి కాంగ్రెస్ వైఖరితో భిన్నంగా ఉండొచ్చు. ఈ ఏడాది ప్రారంభంలో నియోజకవర్గాల పునర్విభజన ప్రతిపాదనను డీఎంకే తీవ్రంగా వ్యతిరేకించింది. అయితే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాజకీయ పరిస్థితులు మారాయి. పార్లమెంట్లో కాంగ్రెస్‌కు దూరంగా ఉండాలని, సభలో విడిగా కూర్చోవాలని డీఎంకే నిర్ణయించినట్టు సమాచారం. దీనితో అంశాల వారీగా డీఎంకే మద్దతు లభిస్తుందన్న ఆశలను బీజేపీ పెంచుకుంది.ప్రస్తుతం ఉన్న 3 ఖాళీల కారణంగా లోక్‌సభ సభ్యుల సంఖ్య 540గా ఉంది. రాజ్యాంగ సవరణ ఆమోదం పొందాలంటే కనీసం 360 మంది ఎంపీల మద్దతు అవసరం.రాజకీయ వర్గాల సమాచారం ప్రకారం, ప్రస్తుతం ఎన్డీఏకు దాదాపు 293 మంది ఎంపీల మద్దతు ఉంది. తృణమూల్ కాంగ్రెస్ నుంచి విడిపోయిన ఎన్సీపీఐకి చెందిన 20 మంది ఎంపీలు, డీఎంకేకు చెందిన 22 మంది ఎంపీల మద్దతు లభిస్తే ఆ సంఖ్య దాదాపు 335కు చేరొచ్చు. మరికొన్ని పార్టీల నుంచి మరో 5 కలుపుకుని మద్దతు దాదాపు 340కు చేరుతుందని అంచనా.మహారాష్ట్రలో ఇటీవల చోటుచేసుకున్న రాజకీయ పరిణామాలను కూడా బీజేపీ పరిగణనలోకి తీసుకుంటోంది. ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన (యూబీటీ) నుంచి ఆరుగురు ఎంపీలు ఏక్నాథ్ షిండే వర్గంలో చేరినట్టు వస్తున్న సమాచారంతో ఎన్డీఏ బలం దాదాపు 346కు చేరే అవకాశం ఉంది. 8 మంది ఎంపీలు ఉన్న శరద్ పవార్ పార్టీ కూడా నియోజకవర్గాల పునర్విభజన బిల్లు వంటి రాజ్యాంగ సవరణకు మద్దతు ఇస్తే, కూటమి సంఖ్య దాదాపు 354కు చేరుతుంది. అయినా రెండు వంతుల మెజారిటీకి ఇంకా ఆరుగురు ఎంపీలు తక్కువగానే ఉంటారు.చివరి ఆరుగురు ఎంపీల మద్దతు ఎలా సాధిస్తుంది?రెండు వంతుల మెజారిటీ దాటాలంటే ఎన్డీఏకు ఇంకా ఆరుగురు ఎంపీల మద్దతు అవసరం. ఈ పరిస్థితుల్లో హోంమంత్రి అమిత్ షా వరుస రాజకీయ సమావేశాలు నిర్వహించారు. రాజకీయ వర్గాల సమాచారం ప్రకారం, వర్షాకాల సమావేశాలకు ముందు బీజేపీ తన సంఖ్యాబలాన్ని పెంచే ప్రయత్నాల్లో భాగంగానే బీజేపీ పలు పార్టీలతో సమావేశాలు నిర్వహిస్తోంది.మహిళల రిజర్వేషన్, నియోజకవర్గాల పునర్విభజన బిల్లులకు షరతులతో మద్దతు ఇస్తామని సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ సంకేతాలు ఇచ్చారు. అయితే ఆయన పార్టీ పెట్టిన షరతులను సర్కార్ అంగీకరించే అవకాశం తక్కువని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. -
పూరీ రథయాత్ర: రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ శుభాకాంక్షలు
పూరీ: ఒడిశాలోని పూరీలో జగన్నాథ రథయాత్ర అత్యంత వైభవంగా ప్రారంభం కానుంది. ఈ పవిత్ర సందర్భాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. రథయాత్ర భారతీయ ఆధ్యాత్మిక, సాంస్కృతిక వారసత్వానికి ప్రతీక అని ఆయన కొనియాడారు. రథయాత్రలోని సంప్రదాయాలు వినయం, సమిష్టి భాగస్వామ్యం, నిస్వార్థ సేవలను ప్రతిబింబిస్తాయని, ఇవి తరతరాలుగా భారతీయులకు స్ఫూర్తినిస్తున్నాయని అన్నారు. ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆరోగ్యంతో ఉండాలని, సమాజంలో ఐక్యతా స్ఫూర్తి పెంపొందాలని మహాప్రభు జగన్నాథుడిని ఆయన ప్రార్థించారు. ବିଶ୍ଵପ୍ରସିଦ୍ଧ ରଥଯାତ୍ରା ଉପଲକ୍ଷେ ଦେଶବିଦେଶରେ ରହୁଥିବା ଶ୍ରୀଜଗନ୍ନାଥଙ୍କ ଭକ୍ତଗଣଙ୍କୁ ମୁଁ ହାର୍ଦ୍ଦିକ ଶୁଭେଚ୍ଛା ଜ୍ଞାପନ କରୁଅଛି । ଏହି ମହାପର୍ବରେ ମହାପ୍ରଭୁ ଶ୍ରୀଜଗନ୍ନାଥ ବଡ଼ଭାଇ ବଳଭଦ୍ର, ଭଗିନୀ ସୁଭଦ୍ରା ଓ ଚକ୍ରରାଜ ସୁଦର୍ଶନଙ୍କ ସହିତ ରଥାରୂଢ଼ ହୋଇ ଭକ୍ତମାନଙ୍କ ସହିତ ମିଳିତ ହୁଅନ୍ତି । ଭକ୍ତ ଓ ଭଗବାନଙ୍କ ମିଳନର ଏହି ପର୍ବ…— President of India (@rashtrapatibhvn) July 16, 2026రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము కూడా భక్తులకు శుభాకాంక్షలు తెలియజేశారు. భక్తజన సమూహానికి, దైవానికి మధ్య జరిగే ఈ కలయిక అద్వితీయమని ఆమె అభివర్ణించారు. శ్రీ జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రా దేవి రథాలపై ఊరేగింపుగా వచ్చి భక్తులకు దర్శనమివ్వడం అత్యంత పవిత్రమైన ఘట్టమని పేర్కొన్నారు.మరోవైపు రథయాత్ర నేపథ్యంలో పూరీ నగరం భారీ భద్రతా వలయంలోకి వెళ్లింది. సింహద్వారం వద్ద నందిఘోష, దర్పదలన, తాళధ్వజ రథాలు సిద్ధంగా ఉన్నాయి. సుమారు 13 వేల మంది పోలీసు బలగాలు, కేంద్ర సాయుధ దళాలు, ఎన్ఎస్జీ కమాండోలు, తీర రక్షణ దళాలు రంగంలోకి దిగాయి. డ్రోన్లు, యాంటీ-డ్రోన్ వ్యవస్థలతో నిఘాను ముమ్మరం చేశారు. భక్తుల సౌకర్యార్థం రైల్వే శాఖ 300 ప్రత్యేక రైళ్లను, రవాణా శాఖ 800 బస్సులను అందుబాటులోకి తెచ్చింది.ఇది కూడా చదవండి: రథయాత్రకు 300 రైళ్లు, 800 బస్సులు -
కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయాలు
ఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో బుధవారం సమావేశమైన కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. యూరియా నేషనల్ ఇన్వెస్ట్మెంట్ పాలసీకి క్యాబినెట్ ఆమోదం తెలిపింది. సెమీకాన్ 2.0 కోసం 1,27,500 కోట్ల రూపాయల కేటాయింపులకు క్యాబినెట్ ఆమోదముద్ర వేసింది. వరుణ నది వెంట 6/4 లైన్ల ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి 10,998 కోట్ల రూపాయలు కేటాయింపుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గంగానది వెంట ఆరులేన్ల ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి 14,448 కోట్ల రూపాయలు కేటాయించింది. మొబైల్ ఫోన్ తయారీ పథకం కోసం 62,500 కోట్ల రూపాయలు కేటాయింపునకు పచ్చజెండా ఊపింది. పారాదీప్-హరిదాస్పూర్ రైల్వే లైన్ డబ్బింగ్ కోసం 2,542 కోట్ల రూపాయలు కేటాయింపు చేసింది. దంగోపోసి- రాజ్ కర్ సావన్ మధ్య నాలుగవ రైల్వే లైన్ నిర్మాణానికి 1,365 కోట్ల రూపాయలు కేటాయింపునకు ఆమోదం తెలిపింది. -
మీకు ఈ20 పెట్రోల్ ఇబ్బందిని వివరిస్తా
న్యూఢిల్లీ: ఇంధన ప్రమాణాలకు అనుగుణంగా లేని వాహనాల్లో ఇథనాల్ కలిపిన ఈ20 పెట్రోల్ వాడాలనడంపై వాహనదారుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందని ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. పెట్రోల్ పంపుల్లో స్వచ్ఛమైన పెట్రోల్, ఈ20 పెట్రోల్‌ను ఎంపిక చేసుకునే అవకాశం వాహన యజమానులకు అందుబాటులో ఉండాలన్నారు. తక్కువ మైలేజీ ఇస్తుందన్న ఆందోళన నేపథ్యంలో ఈ20 పెట్రోల్ ధరను తగ్గించాలని కేజ్రీవాల్ కోరారు. వినియోగదారుల గళం వినిపించేందుకు తనకు అపాయింట్మెంట్ ఇవ్వాలని ప్రధాని మోదీని కోరారు.ఈ మేరకు కేజ్రీవాల్ మంగళవారం ఒక లేఖ రాశారు. వివిధ వర్గాల ప్రజలను కలిసినప్పుడు వ్యక్తమైన అభిప్రాయాలు, ఇందులో ఎదురయ్యే సాంకేతిక ఇబ్బందులను ప్రధాని మోదీకి వివరిస్తానన్నారు. ‘2023కు ముందు తయారైన 30 కోట్ల రిజిస్టర్డ్ ద్విచక్ర వాహనాలు, నాలుగు చక్రాల వాహనాలు ఈ20 ఇంధన ప్రమాణాలకు అనుకూలంగా లేవు.ఈ వాహనాల ఓనర్ మాన్యువల్స్‌లో సాధారణంగా స్వచ్ఛమైన పెట్రోల్, కొన్ని సందర్భాల్లో ఈ10 పెట్రోల్‌ను మాత్రమే ఉపయోగించాలని సూచించారని, ఈ20 పెట్రోల్‌ను కాదు’ అని కేజ్రీవాల్ పేర్కొన్నారు. ఈ అంశంపై తమ పార్టీ ఆన్లైన్లో సంతకాల సేకరణ ఉద్యమాన్ని చేపట్టిందని చెప్పారు. ప్రధాని మోదీ అపాయింట్మెంట్ లభిస్తే వీటిని కూడా ఆయనకు చూపెడతానని చెప్పారు. -
పుతిన్‌ని, మోదీ ఆపకుంటే.. పోలండ్ మంత్రి సంచలన వ్యాఖ్యలు
ఢిల్లీ: పోలండ్ మంత్రి భారత ప్రధానిని ప్రశంసిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం తీవ్రరూపం దాల్చిన సమయంలో ప్రపంచాన్ని ఒక పెద్ద ముప్పు నుంచి భారత ప్రధాని నరేంద్ర మోదీ కాపాడన్నారు. 2022 చివర్లో రష్యా వ్యూహాత్మక అణు ఆయుధాలను ఉపయోగించకుండా రష్యా అధ్యక్షుడు పుతిన్‌ను ఒప్పించడంలో పీఎం మోదీ కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు. ఢిల్లీలో ఈ రోజు మంగళవారం మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న పోలాండ్ విదేశాంగ మంత్రి వ్లాడిస్లావ్ థియోఫిల్ బార్టోస్జెవ్స్కీ ANIతో మాట్లాడుతూ, "ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రపంచంలో సుప్రసిద్ధ, అత్యంత గౌరవనీయుడైన రాజనీతిజ్ఞుడు. అలీన దేశంగా భారతదేశానికి రష్యన్ ఫెడరేషన్తో, అంతకుముందు సోవియట్ యూనియన్‌తో చాలాకాలంగా సంబంధాలు ఉన్నాయి. అధ్యక్షుడు పుతిన్ ప్రధానమంత్రి మోదీ చెప్పే విషయాలను శ్రద్ధగా వింటారు. 2022 చివరిలో ఉక్రెయిన్‌లో వ్యూహాత్మక అణ్వాయుధాలను ఉపయోగించకుండా పుతిన్‌ను ఆపడంలో ప్రధానమంత్రి మోదీ పోషించిన పాత్ర గురించి నేను ప్రస్తావించాను. కానీ ఇది నిజం, అధ్యక్షుడు పుతిన్‌పై కొంత ఒత్తిడిని, ప్రభావాన్ని చూపగల కొద్దిమంది వ్యక్తులలో ప్రధానమంత్రి మోదీ ఒకరు." అని అన్నారు.రష్యా తనను శత్రువుగా భావించని దేశాల నుండి వచ్చే శాంతి విజ్ఞప్తులకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుందని పోలండ్ మంత్రి తెలిపారు. యుద్ధం మరింత పెరగకుండా చూడటంలో భారత్‌తో పాటు చైనా (షీ జిన్‌పింగ్) పాత్ర కూడా ముఖ్యమైనదని, అయితే ఈ సంక్షోభాన్ని ముగించడంలో భారత్ పాత్ర అత్యంత కీలకంగా మారిందని ఆయన అన్నారు. రష్యా ఆయిల్ కొనుగోళ్లపై మారిన పోలండ్ వైఖరిభారత్ రష్యా నుండి రాయితీపై ముడి చమురు కొనుగోలు చేయడంపై గతంలో పోలండ్ చేసిన విమర్శలపైనా మంత్రి క్లారిటీ ఇచ్చారు.రష్యా నుండి చౌకగా లభించే చమురును కొనుగోలు చేయడం ద్వారా భారత్ రష్యా యుద్ధ ఆర్థిక వ్యవస్థకు పరోక్షంగా మద్దతు ఇస్తోందని తాము గతంలో భావించామని, అయితే మార్కెట్ ధర కంటే 40% తక్కువకు చమురు లభిస్తున్నందున ఆర్థిక ప్రయోజనాల దృష్ట్యా భారత్ తీసుకున్న నిర్ణయాన్ని ఇప్పుడు తాము అర్థం చేసుకున్నామని చెప్పారు. ప్రస్తుతానికి ఈ అంశం రెండు దేశాల మధ్య ఎలాంటి విభేదాలకు కారణం కాదని ఆయన స్పష్టం చేశారు.#WATCH | Delhi: On the Russia-Ukraine conflict, Secretary of State of the Polish Minister of Foreign Affairs, Władysław Teofil Bartoszewski, says, "Prime Minister Narendra Modi is a very well-known world statesman, who is very respected, and India has a long-standing relationship… pic.twitter.com/R38wQurE9u— ANI (@ANI) July 14, 2026 -
ఎస్సెల్ గ్రూపు అధినేత తండ్రి మృతి : పీఎం మోదీ సంతాపం
ఎస్సెల్ గ్రూప్ (Essel Group) వ్యవస్థాపకుడు, మాజీ రాజ్యసభ ఎంపీ డాక్టర్ సుభాష్ చంద్ర పితృవియోగంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. ప్రముఖ సామాజికవేత్త నంద్ కిషోర్ గోయెంకా (Nand Kishore goenka ) మృతి సమాజానికి తీరని లోటని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు.నందర్ కిషోర్ మరణంపై ప్రధాని మోదీ సంతాపం ప్రకటించారు. ఆయన జీవితం సమాజ సేవకు, వినయానికి, అంకితభావానికి ఒక గొప్ప నిదర్శనమని ప్రశంసించారు. సామాజిక శ్రేయస్సుకు ఆయన చేసిన సేవలు, చూపిన విలువలు రాబోయే తరాలకు స్ఫూర్తిగా నిస్తాయంటూ మోదీ నివాళు లర్పించారు. ఆర్ఎస్ఎస్ స్వయంసేవక్‌గా సమాజానికి దేశానికి చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. సుభాష్ చంద్ర తండ్రి, ప్రముఖ దాత, సామాజిక కార్యకర్త నంద్ కిషోర్ గోయెంకా (96) సోమవారం (జులై 13, 2026) కన్నుమూశారు. ముంబైలోని ఆయన నివాసంలో పార్థివ దేహాన్ని ప్రజల సందర్శనార్థం ఉంచిన అనంతరం, నంద్ కిషోర్ గోయెంకా అంత్యక్రియలను ఆయన స్వగ్రామమైన హర్యానాలోని హిసార్ జిల్లా, అగ్రోహా (Agroha) లోని 'గోయెంకా ఉద్యాన్' లో జులై 15 న నిర్వహించనున్నారు.ఇదీ చదవండి: ఆ సమయంలో ఒంటెలకు ఆహారంగా పాములు..ఎందుకు?తన తండ్రి మరణాన్ని సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు కుమారుడు సుభాష్ చంద్ర. ఈ సందర్భంగా ఆయన తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. తామంతా తీవ్ర విషాదంలో ఉన్నప్పటికీ, సమాజ సేవ, గోసేవ, దేశ సేవలతో నిండిన ఆయన 96 ఏళ్ల సార్థక జీవితాన్ని ఒక పండుగలా గౌరవించాలనుకుంటున్నామంటూ ట్వీట్ చేశారు. ఇదీ చదవండి: రూ. 2 కోట్ల బంగారం పేస్ట్ : తమిళనాడు జంట అరెస్ట్గోయెంకా మరణం పట్ల హర్యానా ముఖ్యమంత్రి నాయబ్ సింగ్ సైనీ, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, ఎన్సీపీ (ఎస్పీ) ఎంపీ సుప్రియా సూలే సహా పలు పార్టీల రాజకీయ నాయకులు, సామాజిక ప్రముఖులు తమ సంతాపాన్ని ప్రకటించారు. దేశవ్యాప్తంగా ఉన్న ఎసెల్ గ్రూప్ శ్రేణులు, హితైషులు గోయెంకా కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు. ఆర్ఎస్ఎస్ స్వయంసేవక్‌గా క్రియాశీలకంగా వ్యవహరించారునంద కిషోర్ గోయెంకా. ఎస్సెల్ గ్రూప్ విజయాల వెనుక ఆయనొక నిశ్శబ్ద మార్గదర్శకుడిగా నిలిచారు. ఇదీ చదవండి: ‘ఫున్సుఖ్ వాంగ్డూ’ చనిపోవడం ఇష్టం లేదు : 3 ఇడియట్స్ నటుడి భావోద్వేగం -
‘ మోదీ జీ.. నా తనయుడి కేసును కాగితంగానే మిగిలిపోనివ్వకండి’
పూణే: మహారాష్ట్రలోని పూణేలో రియల్టర్ కేతన్ అగర్వాల్ హత్య కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. తాజాగా బాధితుడి తల్లి రాఖీ అగర్వాల్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఓ భావోద్వేగ లేఖ రాశారు. తన కుమారుడి హత్యకు కారణమైన వారికి కఠిన శిక్ష పడేలా చూసి, తమ కుటుంబానికి న్యాయం చేయాలని ఆమె ప్రధానిని వేడుకున్నారు.గత జూన్ 18న కేతన్‌తో వివాహం జరగాల్సిన సియా గోయల్ తన ప్రియుడు చేతన్ చౌదరితో కలసి కేతన్‌ను హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించి, వారిని అరెస్ట్ చేశారు. కేతన్ మృతిచెందిన 20 రోజులకే, ఆ బాధను తట్టుకోలేక అతని తాత కన్నుమూశారు. దీనిపై రాఖీ అగర్వాల్ ఆవేదన వ్యక్తం చేస్తూ, కొద్దిరోజుల వ్యవధిలోనే తమ కుటుంబం రెండు తరాలను కోల్పోయిందని ఆ లేఖలో పేర్కొన్నారు. ప్రతిరోజూ తమ ఇల్లు కేతన్ జ్ఞాపకాలతో ప్రతిధ్వనిస్తోందని ఆమె కన్నీరుమున్నీరయ్యారు.తాము ఎటువంటి ప్రత్యేక సదుపాయాలు ఆశించడం లేదని, కేవలం సత్వర న్యాయం మాత్రమే కావాలని ఆమె ఆ లేఖలో కోరారు. కాగా ఇప్పటికే కేతన్ తండ్రి విశాల్ అగర్వాల్ కూడా ఈ కేసును ఫాస్ట్ ట్రాక్ కోర్టుకు బదిలీ చేయాలని కోరుతూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు లేఖ రాశారు. దోషులకు చట్ట ప్రకారం కఠినమైన శిక్ష పడేలా ప్రధాని వ్యక్తిగతంగా చొరవ చూపాలని బాధితుని తల్లి విజ్ఞప్తి చేశారు. కేతన్ హత్య కేసును కేవలం కాగితంగానే మిగిలిపోనివ్వకండి’ అని లేఖలో విన్నవించారు.ఇది కూడా చదవండి: ‘భోజశాల’పై సుప్రీం తీర్పు.. నమాజ్‌కు నిరాకరణ -
రాహుల్, ఖర్గేకు ఓపెన్ లెటర్.. క్షమాపణ చెప్పాల్సిందే!
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవల ఆస్ట్రేలియాలో నిర్వహించిన 'మెల్బోర్న్ మీట్స్ మోదీ' కార్యక్రమం రాజకీయ దుమారం రేపుతోంది. ఆ సభకు వచ్చినవారిని 'పెయిడ్ క్రౌడ్'(డబ్బులిస్తే వచ్చారు) అంటూ కాంగ్రెస్ నేతలు చేసిన వ్యాఖ్యలపై ఆ కార్యక్రమం నిర్వాహకులు తీవ్రంగా స్పందించారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ఆ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు బహిరంగ లేఖ ద్వారా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. జూలై 9న మెల్బోర్న్లోని మార్వెల్ స్టేడియంలో జరిగిన ఈ కార్యక్రమానికి సుమారు 30 వేల మంది హాజరయ్యారు. సభకు హాజరైన వారిని డబ్బులు ఇచ్చి తీసుకొచ్చారంటూ కాంగ్రెస్ నేత పవన్ ఖేరా ఆరోపించారు. విదేశీ మీడియా కథనాలను ప్రస్తావిస్తూ చార్టర్డ్ విమానాల ద్వారా ప్రజలను తరలించారని, ఇందుకోసం నిధులు వినియోగించారని విమర్శించారు. అయితే ఈ ఆరోపణలను నిర్వాహకులు పూర్తిగా ఖండించారు. 'మోదీ ఎయిర్వేస్' పేరుతో సిడ్నీ నుంచి మెల్బోర్న్కు ప్రత్యేక చార్టర్ విమానాన్ని సమన్వయం చేసిన కమ్యూనిటీ ప్రతినిధులు.. సభకు వచ్చిన వారంతా స్వచ్ఛందంగానే వచ్చారని స్పష్టం చేశారు. ప్రయాణం, వసతి, ఇతర ఖర్చులను ఎక్కువ మంది స్వయంగా భరించారని, మరికొందరికి స్థానిక భారతీయ సంఘాలు మాత్రమే సహకరించాయని పేర్కొన్నారు.నిర్వాహకుల్లో ఒకరైన అమిత్ కరంత్ మాట్లాడుతూ.. "ఆస్ట్రేలియాలోని సిడ్నీ, అడిలైడ్, బ్రిస్బేన్, పెర్త్ తదితర ప్రాంతాల నుంచి వచ్చిన వారిలో ఒక్కరికీ కూడా బీజేపీ, భారత ప్రభుత్వం, ఆస్ట్రేలియా ప్రభుత్వం డబ్బులు ఇవ్వలేదు. వారంతా స్వచ్ఛందంగా వచ్చారు. 'పెయిడ్ క్రౌడ్' అనడం వేలాది మంది భారతీయ-ఆస్ట్రేలియన్లను అవమానించడమే అని అన్నారు.బహిరంగ లేఖలో నిర్వాహకులు మూడు ప్రధాన డిమాండ్లు చేశారు. చార్టర్ విమానానికి బీజేపీ, భారత ప్రభుత్వం నిధులు సమకూర్చిందనే ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు లేవని కాంగ్రెస్ అంగీకరించాలి. సభకు వచ్చినవారిని 'పెయిడ్ క్రౌడ్'గా అభివర్ణించిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి. నిర్వాహకులు, వాలంటీర్లు, ప్రయాణికులు, భారతీయ-ఆస్ట్రేలియన్ సమాజానికి బహిరంగ క్షమాపణ చెప్పాలి అని కోరారు.అలాగే భారతీయ-ఆస్ట్రేలియన్ సమాజం ఏ ఒక్క రాజకీయ పార్టీకి చెందినది కాదని కూడా వారు స్పష్టం చేశారు. కొందరు కాంగ్రెస్‌కు, మరికొందరు బీజేపీకి, ఇంకొందరు ఇతర పార్టీలకు మద్దతు ఇస్తారని, చాలా మందికి ఎలాంటి రాజకీయ అనుబంధం కూడా ఉండదని పేర్కొన్నారు. అందువల్ల దేశీయ రాజకీయాల కోసం ప్రవాస భారతీయులను లక్ష్యంగా చేసుకుని విమర్శించడం తగదని సూచించారు.కాగా, మెల్బోర్న్లో జరిగిన 'మెల్బోర్న్ మీట్స్ మోదీ' కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్, విక్టోరియా రాష్ట్ర ప్రీమియర్ జసింటా అలన్ కూడా పాల్గొన్నారు. భారత్-ఆస్ట్రేలియా సంబంధాలు, ప్రవాస భారతీయుల సేవలను ఈ కార్యక్రమంలో ప్రస్తావించారు. -
అంతా ప్రపంచం మంచికే!
జూలై నెల ఇంకా సగం కూడా గడవ లేదు. ఇంకా చెప్పాలంటే ఈ నెలలో 31 రోజులు అయినందున మూడవ వంతే అయినట్లు లెక్క. ఈ కొద్ది కాలంలోనే జపాన్ ప్రధాని భారత రాజధానికి వచ్చి వెళ్లగా, భారత ప్రధాని మూడు ముఖ్య మైన దేశాలు ఇండోనేషియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లలో పర్యటించి స్వదేశానికి చేరుకున్నారు. ఏ కొలమానం ప్రకారం చూసినా ఇది అసాధారణమైనది. ఈ నాలుగింటిలో ఏదీ అపుడపుడు జరుగుతుండే సౌహార్ద్రపూరితమైన సందర్శన కాదు. అన్నింటికి అన్నీ వ్యూహాత్మకమైన కోణాలు గలవి. ఎందుకట్లా?కొత్త అస్థిరతలుఆ చర్చలోకి వెళ్లే ముందు కొన్ని విషయాలు అర్థం చేసుకోవటం అవసరం. లేనట్లయితే ఇన్నిన్ని పర్యటనలు, ఒప్పందాలు ఎందుకు, ఇంత వేగంగా ఎందుకు అన్నది తెలుసుకోలేము. ఈ నెల పర్యటనలకు గత ఆరుమాసాల ప్రయాణాలను కూడా జోడించి చూసిన ప్పుడు విషయం ఇంకా బాగా అర్థమవుతుంది. మొదటిది, ఒకటి రెండేళ్ల క్రితంతో పోల్చితే ప్రపంచ పరిస్థితులు వేగంగా మారుతుండటం. రెండవది, మార్పులన్నవి రాజకీయం, ఆర్థికం, సైనికం, వేర్వేరు కూటములు, శాస్త్ర సాంకేతిక రంగాలు, ఉద్యోగ ఉపాధుల కోసం ఇతర దేశాలకు తరలిపోవటం, పెరుగుతున్న జాతివాదాలు, వీటితో పాటు తీవ్ర రూపం తీసుకుంటున్న వాతావరణ పరిస్థితుల న్నిటా కనిపిస్తున్నాయి. పర్యవసానంగా ప్రపంచమంతటా కొత్త అస్థిరతలు ఏర్పడుతున్నాయి. ఇటువంటి స్థితి ఎప్పుడూ లేదు.ఇటువంటి పరిణామాల మధ్య ఆసియాతోపాటు మధ్య ఆసియా, పశ్చిమాసియా, ఆఫ్రికా, దక్షిణ అమెరికా, యూరప్‌లే గాక, ఉత్తర అమెరికాలో భాగమైన కెనడా వరకు కూడా కొత్త ఒత్తిడులు ఏర్పడుతూ, కొత్త ఆలోచనలు కనిపిస్తున్నాయి. సముద్రాలలో ఎక్కడో విసిరివేసినట్లుండే డజన్లకొద్దీ దేశాల పరిస్థితి కూడా ఇదే విధంగా ఉంది. వాటి సమస్యలు మరింత ప్రమాదకర మైనవి. పెద్ద దేశాలు తమ అభివృద్ధి పేరిట పర్యావరణాన్ని లెక్క చేయనందువల్ల సముద్ర మట్టాలు పెరుగుతూ, ఆ ద్వీప దేశాలు మునిగి పోగల వేగం కూడా పెరుగుతున్నది. అందుకే అటువంటి వారంతా గత నెల మొదటిసారిగా పెద్ద దేశాలు వేటినీ ఆహ్వానించకుండా, ఐక్యరాజ్యసమితితో సైతం నిమిత్తం లేకుండా, కొలంబియాలో సమావేశమయ్యారు. అన్ని ఖండాలలోని అన్ని దేశాలకూ ఆర్థికం, రక్షణలన్నవి అనిశ్చయమవుతున్నాయన్నది గమనార్హం.బహుళ ధ్రువ ప్రపంచంభారత దేశానికిగానీ, మరే దేశానికిగానీ ఆర్థికాభివృద్ధి, దేశ రక్షణ, ఇతర ప్రయోజనాల పరిరక్షణ, నిరాటంకమైన రీతిలో పురోగతి అనే నాలుగు ఆలోచనలు ఎప్పుడూ ఉండేవే. లోగడ కూడా ఇవి సజావుగా ఏమీ సాగలేదు. కానీ సమస్యలు ఇటీవల మరింత పెరుగుతున్నాయి. అందరికీ పెరగటమన్నది ఒక సామాన్య లక్షణంగా మారింది. అందువల్లనే ఇండియా వలెనే అన్ని దేశాలూ ఈ స్థితి నుంచి బయటపడేందుకు ముమ్మరమైన ప్రయత్నాలు చేస్తున్నాయి. దక్షిణ అమెరికా మొదలు కెనడా, యూరప్, ఆఫ్రికాలపైగా తూర్పు ఆసియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ల వరకు ఆర్థిక, రక్షణ ఒప్పందాల కోసం భారత ప్రధాని పర్యటనలు చేయటమే కాదు, ఒప్పందాల అవసరాన్ని గుర్తించి వారు కూడా ఇటు వస్తున్నారు.ఇండియాను అట్లుంచి వారిలో వారు కూడా పరస్పర ప్రయాణాలు, ఒప్పందాలు చేసుకుంటున్నారు. వేర్వేరు దేశాధినేతల ఆకాశయా నాలు ఇంతగా బహుశా లోగడ ఎప్పుడూ జరిగి ఉండవు. ఆర్థిక, రక్షణ విషయాలతో ముడిపడిన ఇటువంటి మార్పులు రెండవ ప్రపంచ యుద్ధానంతర ప్రపంచంలోగానీ, ఏకధ్రువ ప్రపంచావ తరణ జరిగిన తర్వాతగానీ, ప్రపంచ చరిత్రలో ఒక కొత్త అధ్యాయ మంటే అతిశయోక్తి కాకపోవచ్చు.ఏ దేశమైనా అభివృద్ధి చెందాలనీ, భద్రంగా ఉండాలనీ కోరుకుంటుంది. రెండవ ప్రపంచ యుద్ధం, ఆ తర్వాత ఆర్థిక సంస్క రణల కాలం నుంచి ఒకవైపు వస్తూత్పత్తి, వినియోగాలు చరిత్రలో ఎన్నడూ లేనట్లు పెరుగుతుండగా, మరొకవైపు అన్ని దేశాలలో ప్రజల అవసరాలు, ఆకాంక్షలు అదే స్థాయిలో పెరగసాగాయి. ఈ రెండింటికి తగిన విధంగా అభివృద్ధిని సాధించి, దేశ భద్రతా ఏర్పాట్లను కూడా పెంచవలసిన బాధ్యత సహజంగానే ప్రభుత్వాలపై పడింది. ఆ బాధ్యతలను నెరవేర్చలేని ప్రభుత్వాలు ఓటింగ్ ద్వారానో, తిరుగుబాట్ల వల్లనో కూలిపోవటాన్ని చూస్తు న్నాము. ఈ విధమైన పరిణామాలు అంతర్గతమైన ఒత్తిడులు కాగా, అదే విధమైన ఒత్తిడులు వేరే రూపాలలో, బయటి పరిణామాల వల్ల ఏర్పడటం ఇటీవలి కాలంలో పెరగటం మొదలైంది. అందుకు నాంది ఆర్థిక సంస్కరణలు వర్ధమాన దేశాలకు, మరీ ముఖ్యంగా సాధారణ సామాజిక వర్గాలకు ప్రతికూలమై అసమానతలను పెంచటంతో పడింది. ఇటీవలికి వచ్చేసరికి, పాశ్చాత్య దేశాలు తాము సృష్టించి ఇతరులపై రుద్దిన పలు అంతర్జాతీయ నియమ నిబంధనలు తాము కోరుకున్న ఫలితాలనివ్వటం తగ్గటంతో వాటిని భంగపరచటం మొదలైంది. వారు కొత్త వ్యవస్థలనూ సృష్టించలేక పోతున్నారు. ఈ పరిణామాలన్నింటి ఫలితంగా బహుళ ధ్రువ ప్రపంచ భావనలు బలపడటం, ఇండియాతో పాటు కొన్ని ప్రముఖ దేశాలు ‘బ్రిక్స్’ వంటి ప్రత్యామ్నాయ సంస్థలను ఏర్పరచటం జరిగింది. బయటకు స్పష్టంగా ప్రకటించకున్నా అమెరికన్ డాలర్‌కు సమాంతర కరెన్సీల వినియోగం క్రమంగా విస్తరిస్తున్నది. పులి మీద పుట్ర వలె ట్యారిఫ్‌లు, బలవంతపు వాణిజ్య ఒప్పందాలు, అక్కర లేని యుద్ధాలు, అందరినీ ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి.బద్దలవుతున్న చట్రంవీటన్నింటివల్ల వీరువారని గాక అందరికీ ఎదురవుతున్న సమస్యలు ఏమిటో ఏకరువు పెట్టనక్కరలేదు. ఆ సమస్యలలో ఆర్థిక మైనవి, రక్షణపరమైనవి, ఇతరాలు కూడా ఉన్నాయి. ఈ రెండు రంగాలకు సంబంధించి అమెరికాకు సన్నిహిత దేశాలైన యూరప్, కెనడా, జపాన్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఫిలిప్పీన్స్, మెక్సికో, గల్ఫ్ రాజ్యాల వంటివి సైతం తమలో తామే గాక ఇండియా, బ్రెజిల్, దక్షిణ అమెరికా, దక్షిణాఫ్రికా వంటి ఇతర దేశాలతోనూ ఇటీవలి ఆరు మాసాలలో చేసుకుంటూ వస్తున్న ఆర్థిక ఒప్పందాలు ఈ పరిస్థితికి అద్దం పడుతున్నాయి. కెనడా, యూరప్‌ల వంటివి అమెరికా వద్దన్నా... చైనాతో ఒప్పందాలను ఆర్థిక భద్రత కోసం చేసుకుంటున్నాయి. ఈ మార్పులు, మలుపులు ప్రపంచాన్ని అను కోని రీతిలో పాత చట్రం నుంచి బయటకు తెస్తున్నాయి. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత బ్రెట్టన్‌వుడ్స్ సంస్థల నుంచి ఆర్థిక సంస్కరణల వరకుండిన ఒక చట్రం, అప్పటి నుంచి ఉండిన రెండవ చట్రం ఇప్పుడు భగ్నమవుతున్న దృశ్యాన్ని మనమిపుడు చూస్తున్నాము. మన జూలై ఒప్పందాలు కూడా విస్తృతార్థంలో అదే పరిధి లోకి వస్తాయి. అంతటా అందరూ క్రమంగా స్వతంత్ర నిర్ణయా లతో, పరస్పర ఒప్పందాలతో, స్వతంత్రంగా ఎదిగేందుకు,భద్రంగా జీవించేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నారు.టంకశాల అశోక్‌వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు -
ఇక వ్యూహాత్మక భాగస్వామ్యం
అక్లాండ్: భారత్–న్యూజిలాండ్ స్నేహం మరింత బలపడింది. ఇరుదేశాలు తమ సంబంధాలను వ్యూహాత్మక భాగస్వామ్యంగా మార్చుకున్నాయి. వార్షిక ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 2030 నాటికి రూ.35,000 కోట్లకు చేర్చాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నాయి. సముద్ర భద్రత విషయంలో పరస్పర సహకారాన్ని పెంపొందించుకోవాలని నిర్ణయించాయి. న్యూజిలాండ్‌లోని అక్లాండ్లో శనివారం భారత ప్రధాని మోదీ, న్యూజిలాండ్ ప్రధాని క్రిస్టోఫర్ లక్సన్ సమావేశమయ్యారు. రెండుదేశాల సంబంధాలపై విస్తృతంగా చర్చించారు. శాంతియుత ఇండో–పసిఫిక్ దిశగా ఉమ్మడిగా కృషి చేయాలని తీర్మానించారు. ఇరువురు నేతల భేటీ సందర్భంగా భారత్, న్యూజిలాండ్ మధ్య 10 కీలక ఒప్పందాలు కుదిరాయి. మొత్తంగా 18 అంశాలపై అంగీకారానికి వచ్చారు. ద్వైపాక్షిక సంబంధాలను విస్తరించడానికి నాలుగేళ్ల రోడ్‌మ్యాప్, హైడ్రోగ్రాఫిక్ డేటా షేరింగ్‌ను ప్రోత్సహించడం, పరస్పర నావికాదళ లాజిస్టిక్స్‌ను సులభతరం చేయడం, ఇండో–పసిఫిక్‌లో మెరుగైన సముద్ర సంబంధాలను రూపొందించడం వంటివి ఇందులో ఉన్నాయి. రాబోయే 15 ఏళ్లలో భారత్‌లో న్యూజిలాండ్ 20 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టే అంశంపై చర్చ జరిగింది. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని(ఎఫ్‌టీఏ) త్వరగా అమలు చేయడం ద్వారా ద్వైపాక్షిక వాణిజ్యాన్ని విస్తరింపజేసుకోవాలని నిర్ణయానికి వచ్చారు. చర్చల కోసం గవర్నమెంట్ హౌస్‌కు చేరుకున్న మోదీకి సంప్రదాయ స్వాగతం లభించింది. ఉగ్రవాదాన్ని అరికట్టడానికి సంయుక్త కార్యవర్గం స్వేచ్ఛాయుత, బహిరంగ, సుసంపన్నమైన ఇండో–పసిఫిక్ పట్ల ఉమ్మడి నిబద్ధతను మోదీ, లక్సన్ పునరుద్ఘాటించారని ఇరుదేశాలు ఒక సంయుక్త ప్రకటనలో వెల్లడించాయి. సార్వ¿ౌమాధికారం, ప్రాదేశిక సమగ్రత, నియమాల ఆధారిత అంతర్జాతీయ వ్యవస్థను పరిరక్షించాల్సిన ప్రాముఖ్యతను వారు ప్రస్తావించారని తెలిపాయి. ఇండో–పసిఫిక్‌లో చైనా ప్రాబల్యం పెరుగుతుండడంపై ప్రపంచదేశాలు ఆందోళన వ్యక్తంచేస్తున్నాయి. అందుకే శాంతియుత ఇండో–పసిఫిక్ కోసం కలిసి పనిచేయాలని భారత్, న్యూజిలాండ్ సంకల్పించాయి. ఈ ప్రాంతంలో సహకారాన్ని పెంచుకోవడంతోపాటు ఉగ్రవాదాన్ని అరికట్టడానికి సంయుక్త కార్యవర్గం, సముద్ర భద్రత కోసం చర్యలు చేపట్టడానికి ఇరుపక్షాలు అంగీకరించాయి. క్రీడలపై భారత్–న్యూజిలాండ్ సంయుక్త కార్యాచరణ ప్రణాళికను ఖరారు చేశారు. హార్మూజ్‌లో నౌకలపై ఆంక్షలు వద్దు పశ్చిమాసియా ఉద్రిక్తతలు మళ్లీ పెరగడంపై ఆందోళన వ్యక్తం చేశారు. అన్ని పక్షాలు సంయమనం పాటించాలని, ఉద్రిక్తతలను తగ్గించాలని, పౌరులకు రక్షణ కల్పించాలని సూచించారు. హార్మూజ్ జలసంధిలో నౌకల రాకపోకలపై ఆంక్షలు విధించకూడదని ఇరు నేతలు కోరారు.మాతో భాగస్వాములుగా మారండి న్యూజిలాండ్ పెట్టుబడిదారులకు మోదీ పిలుపు చరిత్రాత్మక భారత్–న్యూజిలాండ్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ఇరుదేశాల ద్వైపాక్షిక ఆర్థిక సంబంధాలకు నూతన ఉత్సాహాన్ని ఇస్తుందని మోదీ అన్నారు. ఆయన శనివారం న్యూజిలాండ్ కంపెనీల సీఈఓలు, వ్యాపారవేత్తలు, పెట్టుబడిదారులతో ఆయన సమావేశమయ్యారు. రెండు దేశాల ఉమ్మడి ప్రజాస్వామ్య విలువలు, వైవిధ్యం, సుస్థిర అభివృద్ధి పట్ల నిబద్ధత అనేవి దూరదృష్టితో కూడిన ఆర్థిక భాగస్వామ్యానికి పటిష్టమైన పునాదిగా నిలుస్తాయని తెలిపారు. భారత్, న్యూజిలాండ్‌ల బలమైన ఆర్థిక భాగస్వామ్యం వ్యాపారవేత్తలు, ఆవిష్కర్తలు, యువతకు కొత్త అవకాశాలను సృష్టిస్తుందని వివరించారు. భారత్‌లో పెట్టుబడులకు ఎన్నో అవకాశాలు ఉన్నాయని, వీటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. భారత్‌లో మౌలిక సదుపాయాల అభివృద్ధి, పౌర విమానయానం, లాజిస్టిక్స్, స్వచ్ఛ ఇంధనం, పట్టణ రవాణా, నీటి నిర్వహణ, వ్యర్థాల నిర్వహణ, డిజిటల్ ఆర్థిక వ్యవస్థ రంగాల్లో భాగస్వాములుగా చేరాలని న్యూజిలాండ్ పెట్టుబడిదారులను, వ్యాపార సంస్థలను మోదీ ఆహ్వానించారు. భారత అభివృద్ధి వేగం అపూర్వం: ‘కియా ఓరా మోదీ’లో ప్రధానిఅక్లాండ్: అంతర్జాతీయంగా పలు సవాళ్లు ఉన్నప్పటికీ భారతదేశ అభివృద్ధి వేగం అపూర్వమైనదని ప్రధాని మోదీ అన్నారు. మన దేశం ప్రపంచానికి కొత్త అభివృద్ధి నమూనాలను అందిస్తోందని చెప్పారు. ఆయన శనివారం అక్లాండ్లో న్యూజిలాండ్ ప్రధాని లక్సన్తో కలిసి ‘కియా ఓరా మోదీ’ కార్యక్రమంలో పాల్గొన్నారు. న్యూజిలాండ్‌లోని ప్రవాస భారతీయులను ఉద్దేశించిన ప్రసంగించారు. భారత్, న్యూజిలాండ్ సంబంధం మధురమైన జ్ఞాపకాలు, శాశ్వత స్నేహం, ఉమ్మడి విలువలు, పరస్పర నిబద్ధతపై నిర్మితమైందని వివరించారు. ఎన్ని సవాళ్లు ఉన్నప్పటికీ అభివృద్ధి పథంలో భారత్ వేగంగా పరుగులు తీస్తోందని గుర్తుచేశారు. ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా గుర్తింపు పొందిందని వెల్లడించారు. ఉమ్మడి ప్రయాణానికి ‘వాకా’: ‘కియా ఓరా మోదీ’లో ప్రధాని మోదీ ఓ మఫ్లర్‌ను ప్రజలకు చూపించారు. దాదాపు 30 ఏళ్ల క్రితం న్యూజిలాండ్‌లో పర్యటించినప్పుడు ఇది తనకు బహుమతిగా లభించిందని తెలిపారు. దీంతోపాటు ఒక టోపీ కూడా గిఫ్ట్‌గా వచ్చిందని చెప్పారు. అప్పటి తాను ప్రజా జీవితంలోకి ప్రవేశించలేదని వెల్లడించారు. న్యూజిలాండ్ సంస్కృతికి చెందిన ‘వాకా’అనే పదం గురించి మోదీ ప్రస్తావించారు. ఈ అందమైన పదం భారత్, న్యూజిలాండ్ సంబంధాల సారాంశాన్ని తెలియజేస్తుందని అన్నారు. శతాబ్దాలుగా ఈ పదం ప్రజలను ఏకం చేయడానికి ప్రతీకగా నిలుస్తోందని వివరించారు. వాకా కేవలం ఒక పడవ కాదని, ఉమ్మడి ప్రయాణానికి అదొక చిహ్నమని తెలిపారు. ఈ రోజు భారత్–న్యూజిలాండ్ వాకా కలిసి ఒక కొత్త ప్రయాణాన్ని ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నట్లు వ్యాఖ్యానించారు.బైబై న్యూజిలాండ్ ప్రధాని మోదీ న్యూజిలాండ్‌లో రెండు రోజుల పర్యటన ముగించుకొని శనివారం స్వదేశానికి బయలుదేరారు. న్యూజిలాండ్ ప్రధాని క్రిస్టోఫర్ లక్సన్ ఎయిర్‌పోర్టులో మోదీకి వీడ్కోలు పలికారు. -
భారత్ మార్కెట్ మాత్రమే కాదు.. లాంచ్ ప్యాడ్: ప్రధాని మోదీ
ఆక్లాండ్: భారత్ మార్కెట్ మాత్రమే కాదు.. లాంచ్ ప్యాడ్.. అంతర్జాతీయ వృద్ధికి భారత్ ప్రయోగాల వేదిక అంటూ ఆక్లాండ్‌లో జరిగిన ప్రవాస భారతీయుల కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. భారత్-న్యూజిలాండ్' సరికొత్త ప్రయాణానికి సిద్ధంగా ఉందన్న మోదీ.. ఇరు దేశాల ముందు ‘అపారమైన అవకాశాల సముద్రం’ ఉందని పేర్కొన్నారు. ఇరు దేశాల ఉమ్మడి ప్రయాణ విజయానికి అసలైన దిశానిర్దేశకులు ఈ ప్రవాస భారతీయులేనంటూ పేర్కొన్నారు. ఈ దేశం నలుమూలలా భారతీయులు ఉన్నారని.. ఈ ప్రయాణం విజయవంతమవుతుందనే నమ్మకం ఉందన్నారు.న్యూజిలాండ్ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ.. ఇరు దేశాల సంబంధాల బలోపేతానికి ఇరుదేశాల ప్రధానుల చర్చించారు. వాణిజ్యం, పెట్టుబడులు, టెక్ సహా పలు అంశాల్లో మరిన్ని అవకాశాలపై భారత్ ఫోకస్ పెట్టింది. ఇరుదేశాల స్ట్రాటజిక్ పార్టనర్ షిప్ రోడ్ మ్యాప్-2030 ఆవిష్కరించారు. భారత్, న్యూజిలాండ్ దేశాలు శనివారం (జూలై 11, 2026) తమ ద్వైపాక్షిక సంబంధాలను వ్యూహాత్మక భాగస్వామ్య స్థాయికి పెంపొందించుకున్నాయి. భారత ప్రధాని నరేంద్ర మోదీ, న్యూజిలాండ్ ప్రధాని క్రిస్టోఫర్ లక్సన్‌ల మధ్య జరిగిన చర్చల అనంతరం, 2030 నాటికి ఇరు దేశాల మధ్య వార్షిక ద్వైపాక్షిక వస్తు, సేవల వాణిజ్యాన్ని రెట్టింపు చేసి రూ.35,000 కోట్లకు చేర్చాలని ఐదేళ్ల లక్ష్యంగా నిర్దేశించుకున్నాయి.ఈ సమావేశం ద్వారా 10 ఒప్పందాలతో కలిపి మొత్తం 18 నిర్దిష్ట ఫలితాలు వచ్చాయి. వాటిలో ప్రధానంగా రాబోయే నాలుగేళ్లలో సంబంధాలను విస్తరించుకోవడానికి ఒక రోడ్‌మ్యాప్, ఇండో-పసిఫిక్ ప్రాంతంలో సముద్ర తీర సహకారాన్ని పెంపొందించుకోవడానికి కార్యాచరణ, భారత నౌకాదళం, న్యూజిలాండ్ రక్షణ దళాల మధ్య పరస్పర లాజిస్టిక్స్ మద్దతు ఒప్పందాలు జరిగాయి.ఇండో-పసిఫిక్ ప్రాంతంలో చైనా పెరుగుతున్న దూకుడు నేపథ్యంలో.. ఆ ప్రాంతంలో సహకారాన్ని విస్తరించడమే ప్రధాన లక్ష్యంగా సాగిన మోదీ మూడు దేశాల పర్యటనలో ఆక్లాండ్ చివరి విడత. నిన్న రాత్రి ఆయన ఇక్కడికి చేరుకున్నారు. ఇటీవల భారత్-న్యూజిలాండ్ మధ్య కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (FTA) తర్వాత ఈ పర్యటన జరగడం విశేషం. కాగా, హాకాతో ప్రధాని మోదీకి సంప్రదాయ స్వాగతం పలికారు. మావోరి సంప్రదాయ నృత్యం హాకాతో మోదీ గౌరవ వందనం స్వీకరించారు. హాకా కళాకారులను ప్రధాని మోదీ అభినందించారు. -
చెన్నైలో బిగ్ బాష్
మెల్బోర్న్: శిక్షణ, క్రీడా విజ్ఞానం, సాంకేతికత, క్రీడా పరిశ్రమ రంగాల్లో పరస్పర సహకారాన్ని మరింత పెంపొందించుకోవాలని భారత్, ఆ్రస్టేలియా నిర్ణయించుకున్నాయి. ఇందుకోసం శుక్రవారం క్రీడా సహకార రోడ్‌మ్యాప్‌ను ఆవిష్కరించాయి. ఇందులో భాగంగా తమిళనాడు రాజధాని చెన్నైలో బిగ్ బాష్ లీగ్ (టీ–20) ఆరంభ మ్యాచ్ నిర్వహించనున్నారు. ఈ ఏడాది డిసెంబర్లో చెన్నైలోని ఎం.ఎ.చిదంబరం స్టేడియం (చేపాక్) వేదికగా జరగనున్న ఆ్రస్టేలియన్ మెన్స్ బిగ్ బాష్ లీగ్(బీబీఎల్) ప్రారంభ మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ పెర్త్ స్కార్చర్స్ జట్టుతో మెల్బోర్న్ రెనెగేడ్స్ తలపడనుంది. తద్వారా భారతదేశంలో ఒక విదేశీ క్రికెట్ లీగ్ మ్యాచ్ నిర్వహిస్తుండడం ఇదే మొదటిసారి కానుంది. మొదటి మ్యాచ్ చెన్నైలో, మిగిలిన మ్యాచ్‌లు ఆ్రస్టేలియాలో జరుగుతాయి. ఎనిమిది జట్లు పాల్గొనే బీబీఎల్.. ఐపీఎల్ తర్వాత ప్రపంచంలోనే అత్యధిక ఆదరణ పొందిన దేశీయ క్రికెట్ టీ–20 లీగ్‌లలో ఒకటి కావడం విశేషం. ఇది సాధారణంగా డిసెంబర్ నుంచి ఫిబ్రవరి మధ్య కాలంలో జరుగుతుంది. భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఆస్ట్రేలియా ప్రధానమంత్రి ఆంథోనీ అల్బనీస్ శుక్రవారం ప్రతిష్టాత్మక మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇద్దరు నేతలు స్టేడియం అంతటా కలియతిరుగుతూ సందడి చేశారు. ఫోన్లో సెల్ఫీలు దిగారు. ఫొటోలకు పోజులిచ్చారు. ప్రజలకు అభివాదంచేస్తూ ఉత్సాహపర్చారు. పరస్పరం ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు. ‘చెన్నైలో బిగ్ బాష్ లీగ్ మ్యాచ్ నిర్వహిస్తుండడం నాకు సంతోషంగా ఉంది. భారతదేశంలో మ్యాచ్‌లు నిర్వహించే ఏ క్రీడా లీగ్ అయినా భారీగా ప్రేక్షకులను ఆకర్శించడం ఖాయం’’అని మోదీ పేర్కొన్నారు. భారత్–ఆస్ట్రేలియా క్రీడా సహకార రోడ్‌మ్యాప్‌ను మోదీ, అల్బనీస్ సంయుక్తంగా విడుదల చేశారు. క్రీడా శిక్షణ, క్రీడా విజ్ఞానం, సాంకేతికత, క్రీడా పరిశ్రమ, పెట్టుబడుల రంగాల్లో భాగస్వామ్యాలను ప్రోత్సహించాలన్నదే ఈ రోడ్‌మ్యాప్ ఉద్దేశం. రోడ్‌మ్యాప్‌లో భాగంగా యువ క్రీడాకారుల మధ్య పరస్పర సహకారాన్ని ప్రోత్సహించడానికి, క్రీడా సంబంధాలను బలోపేతం చేయడానికి ఇరు దేశాలు యూత్ స్పోర్ట్స్ ఫెస్టివల్‌ను కూడా నిర్వహించబోతున్నాయి. ప్రజలను ఏకం చేసే శక్తి క్రీడలకు ఉందని, ఈ రోడ్‌మ్యాప్ భారత్, ఆ్రస్టేలియా మధ్య క్రీడా భాగస్వామ్యాన్ని బలోపేతం చేసుకోవడానికి తోడ్పడుతుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. మహిళల క్రికెట్ ప్రపంచ కప్ గెలిచినందుకు ఆ్రస్టేలియాను అభినందించారు. భారత్, ఆస్ట్రేలియాలు అంతర్జాతీయ క్రీడల్లో ఒక ముఖ్యమైన దశాబ్దంలోకి అడుగుపెడుతున్నాయని పేర్కొ న్నారు. క్రీడల పట్ల ఉన్న ప్రేమ, అభిరుచి ఆ్రస్టేలియా, భారత్‌ను ఐక్యం చేశాయని ప్రధానమంత్రి ఆంథోనీ అల్బనీస్ వ్యాఖ్యానించారు. విపక్ష నేతతో మోదీ భేటీ ఆ్రస్టేలియా ప్రతిపక్ష నాయకుడు యాంగస్ టేలర్‌తో ప్రధాని మోదీ శుక్రవారం సమావేశమయ్యారు. భారత్–ఆ్రస్టేలియా ద్వైపాక్షిక సంబంధాలపై వారిద్దరూ చర్చించుకున్నారు. ఇరుదేశాల సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యంపై అభిప్రాయాలు పంచుకున్నారు. మోదీ మూడు రోజుల ఆ్రస్టేలియా పర్యటన శుక్రవారం ముగిసింది -
అనిశ్చితిలో వెలుగురేఖ
‘బలవంతుడ నాకేమని...’ అనుకుంటే దశాబ్దాల తరబడి అమెరికా నిర్మించుకుంటూ వస్తున్న పునాదులు కదిలిపోతాయని ఆ దేశాధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు ఇంకా జ్ఞానో దయం కాలేదు. నాటో శిఖరాగ్ర సదస్సుకు పోయి ఈసారి కాస్తంత స్నేహపూర్వకంగా మాట్లాడినా అటువైపునుంచి మునుపటి సాన్నిహిత్యం లేదని తుర్కియేలో ముగిసిన ఆ సదస్సు తీరుతెన్నులు చెబుతున్నాయి. అమెరికాతో ఇప్పటికీ సన్నిహిత సంబంధాలే ఉన్న మన దేశం సైతం ఆయన తరచు చేసే ప్రకటనల కారణంగా ఇబ్బంది పడుతోంది. హఠాత్తుగా ‘ఇండో–పసిఫిక్’ పేరు మారాక లోలోన అసంతృప్తి సరేసరి. ఈ నేపథ్యంలో ఇండో–పసిఫిక్ విషయంలో మన వైఖరిని తేటతెల్లం చేసేలా, మన చొరవను మరింత పెంచేలా ప్రధాని నరేంద్ర మోదీ ఇండొనేసియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లో ఆరు రోజుల పర్యటన ఈ నెల 6న మొదలైంది. ఇప్పటికే ఇండొనేసియా, ఆస్ట్రేలియా పర్యటనలు పూర్తి చేసుకున్న మోదీ శుక్రవారం న్యూజిలాండ్ చేరుకున్నారు. అమెరికా, చైనాలతో... వాటి వైఖరులతో సంబంధం లేకుండా భద్రత, వాణిజ్యం తదితర రంగాల్లో భిన్న దేశాల సహకారం అవసరమని మన దేశం భావించబట్టే ఈ పర్యటన ఖరారైంది. ఈ మూడూ సాగరప్రాంత దేశాలు. ఎప్పుడో 1992లోనే రూపుదిద్దుకున్న ‘లుక్ ఈస్ట్’ విధానానికి కొనసాగింపుగా మన దేశం ‘మహాసాగర్’ దార్శనికతను ప్రతిపాదించింది. పరస్పర సంపూర్ణ అభివృద్ధికి ప్రాంతాలవారీ భద్రత, సమగ్రవృద్ధి అవసరమన్నదిదాని సారాంశం. సాధారణ ఆర్థిక సంబంధాలు మొదలుకొని భారీ రక్షణ, ఇంధన భాగస్వామ్యం వరకూ అనేకం దీని పరిధిలోకొస్తాయి. ఆస్ట్రేలియాతో గురువారం కుదిరిన పౌర అణుశక్తి ఒప్పందం చరిత్రాత్మకమైనది. ఇదిగాక ఆధునిక సాంకేతికతలూ, రక్షణ, భద్రత సహకారం, సరఫరా గొలుసు మెరుగు పరచటం తదితరాలకు సంబంధించి మరో 18 ఒప్పందాలు కుదిరాయి. పారిస్ఒప్పందం కింద స్వచ్ఛ ఇంధన లక్ష్యం సాధనకు మన అణు రియాక్టర్లకు నిరంతరాయంగా యురేనియం అవసరమవుతుంది. ప్రస్తుతం ఉన్న 7.7 గిగావాట్ల అణు విద్యుత్‌ను 2047కల్లా 100 గిగావాట్లకు పెంచాలని భారత్ నిర్దేశించుకుంది. ఇందుకోసం ప్రపంచ యురేనియం నిక్షేపాల్లో 28 శాతంగల ఆస్ట్రేలియాతో ఒప్పందం కుదరటం కీలక పరిణామం. ప్రపంచ పరిణామాల కారణంగా హఠాత్తుగా నిలిచిపోతున్న ఇంధన సరఫరా తీరును సరిదిద్దటానికి ఎల్ఎన్జీ, బొగ్గు, డీజిల్వంటి సంప్రదాయ ఇంధన వనరుల విషయంలో పరస్పరం సహకరించుకుంటూ ఇంధన భద్రతను బలోపేతం చేసుకోవాలని రెండు దేశాలూ నిర్ణయించుకున్నాయి. ఏనాటి నుంచో సాన్నిహిత్యంగల ఇండొనేసియాతో మరిన్ని రంగాల్లో సహకారానికి ఈ నెల 6నుంచి 8వరకూ వరసగా మూడురోజులపాటు కొనసాగిన పర్యటనలో ఒప్పందాలు కుదిరాయి. మన బ్రహ్మోస్, అస్త్ర క్షిపణుల్ని కొనుగోలు చేయటానికి ఇండొనేసియా ఒప్పందం కుదుర్చుకుంది. ఇరు దేశాలూ కలిసి ఇండొనేసియాలోని ఆచే, అండమాన్, నికోబార్ దీవుల్లో నౌకాశ్రయాలను నిర్మించటానికి కూడా అధినేతలిద్దరూ అంగీకరించారు. అలాగే హిందూసముద్రం మొదలుకొని పసిఫిక్ మహాసముద్రంవరకూ పరస్పర సహకారంతో సముద్రజలాల్లో భద్రతను పెంచటానికి ఒప్పందం కుదిరింది. ఇప్పటికే జపాన్, దక్షిణ కొరియాలతో ఉన్న సహకారానికి ఇండొనేసియా కూడా తోడుకావటం వల్ల ఇండో–పసిఫిక్‌లో పటిష్టమైన సమన్వయం ఏర్పడుతుంది. చైనాతో అంటకాగటానికిట్రంప్ ప్రయత్నిస్తున్న దశలో ఇది కీలక పరిణామం. నిరుడు మన దేశంలో న్యూజిలాండ్ ప్రధాని క్రిస్టోఫర్ లక్సన్ పర్యటించినప్పుడు ద్వైపాక్షిక రక్షణ సహకార ఒప్పందం కుదిరింది. దాంతోపాటు మొన్న ఏప్రిల్‌లో రెండు దేశాలూ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం(ఎఫ్‌టీఏ) కుదుర్చుకున్నాయి. దీన్ని మున్ముందు మరింత విస్తృతపర్చుకోవటానికి ఇప్పటికే ఇరు దేశాలూ నిర్ణయించుకున్నాయి. కూటముల్లో చేరే విషయంలో న్యూజిలాండ్‌కు పెద్దగా ఆసక్తి లేదు. అయితే ప్రాంతీయ భద్రతను పెంపొందించుకోవటానికి భారత్, ఆస్ట్రేలియాలతో కలిసి పనిచేయాలని ఇప్పటికే నిర్ణయించుకుంది. మొత్తానికి మోదీ మూడు దేశాల పర్యటన ఇండో–పసిఫిక్‌లో భారత్ పలుకుబడిని మరింత పెంచుతుంది. -
ఆక్లాండ్ చేరుకున్న ప్రధాని మోదీ
-
ఆక్లాండ్ చేరుకున్న ప్రధాని మోదీ
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తన మూడు దేశాల పర్యటనలో భాగంగా చివరిగా ఇవాళ ఆక్లాండ్ చేరుకున్నారు. ఎయిర్‌పోర్ట్‌లో న్యూజిలాండ్ ప్రధాని క్రిస్టఫర్ లక్సాన్ స్వాగతం పలికారు. ఇరు దేశాల ప్రధానులు ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. నాలుగు దశాబ్దాల తర్వాత న్యూజిలాండ్‌లో భారత ప్రధాని పర్యటించారు. వాణిజ్యం, రక్షణ, పరస్పర సహకారం తదితర అంశాలపై దృష్టిపెట్టారు.భారత ప్రధాని న్యూజిలాండ్‌లో పర్యటించడం గత 40 ఏళ్లలో ఇదే మొదటిసారి. 1968లో ఇందిరా గాంధీ, ఆ తర్వాత 1986లో ఆమె కుమారుడు రాజీవ్ గాంధీ పర్యటించిన అనంతరం.. భారత ప్రధాని ఇక్కడికి రావడం ఇది మూడోసారి మాత్రమే. ఈ పర్యటనను భారత్-న్యూజిలాండ్ సంబంధాలలో ఒక సరికొత్త అధ్యాయానికి ఆరంభంగా భావిస్తున్నారు.భారత ప్రధాని శనివారం లక్సాన్‌తో ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. ఇరు దేశాల మధ్య వాణిజ్యం-పెట్టుబడులు, సముద్ర భద్రత, విద్య, పర్యాటకం, క్రీడలపై ఈ చర్చలు సాగనున్నాయి. వ్యాపారవేత్తలు, క్రీడాకారులతోనూ సమావేశం కానున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ 27న భారత్, న్యూజిలాండ్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని ఖరారు చేసుకున్నాయి. శనివారం సాయంత్రం 'స్పార్క్ అరేనా'లో జరిగే ఒక భారీ కమ్యూనిటీ ఈవెంట్లో 10,000 మందికి పైగా ప్రవాస భారతీయులను ఉద్దేశించి మోదీ ప్రసంగించనున్నారు.స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టీఏ) కింద తమ దేశం నుంచి భారత్‌కు ఎగుమతి జరిగే ఉత్పత్తుల్లో 57 శాతం ఉత్పత్తులపై సుంకాలు సున్నాకు చేరుకుంటాయని న్యూజిలాండ్ ప్రధాని క్రిస్టోఫర్ లక్సాన్ తెలిపారు. ఈ మేరకు గురువారం ఎక్స్‌లో పోస్టు చేశారు. ఇరుదేశాల మధ్య ఎఫ్‌టీఏ అమల్లోకి వచ్చిన తొలిరోజు నుంచే సున్నా శాతం సుంకాలు అమల్లోకి వస్తాయన్నారు. ఈ ఒప్పందం తో న్యూజిలాండ్ వ్యాపారాలు భారీగా వృద్ధి చెందనున్నాయని తెలిపారు. భారత మార్కెట్లో న్యూజిలాండ్ ఉత్పత్తులకు విస్తృత ప్రవేశం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. -
ఆస్ట్రేలియా తరహా చట్టాలు భారత్‌లోనూ?
పిల్లలను రక్షణను దృష్టిలో ఉంచుకుని.. ఆస్ట్రేలియా తీసుకున్న నిర్ణయాలను భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసించారు. 16 ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లను ఉపయోగించకుండా ఆంక్షలు విధించే ఆస్ట్రేలియా చట్టాలు డిజిటల్ ప్రపంచాన్ని సురక్షితంగా మార్చేందుకు ఉపయోగపడతాయని ఆయన అన్నారు. ఈ విధానాల నుంచి భారత్‌తో పాటు.. ప్రపంచ దేశాలు కూడా ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చని మోదీ పేర్కొన్నారు.మెల్బోర్న్లో జరిగిన ఆస్ట్రేలియా-భారత్ వార్షిక నేతల సదస్సులో.. ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ ఆల్బనీస్‌తో కలిసి పాల్గొన్న మోదీ, సమాచార సాంకేతికత (IT), సోషల్ మీడియా నియంత్రణ, ఆన్లైన్ భద్రత విషయంలో ఆస్ట్రేలియా తీసుకుంటున్న చర్యలను అభినందించారు. ముఖ్యంగా చిన్నారులను, సోషల్ మీడియా వల్ల కలిగే హానికర ప్రభావాల నుంచి రక్షించేందుకు చేస్తున్న ప్రయత్నాలు ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తాయని తెలిపారు.పిల్లలకు సోషల్ మీడియా నిషేధం!ఆస్ట్రేలియా కొత్త నిబంధనల ప్రకారం.. 16 ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియా ఖాతాలు సృష్టించకుండా ప్రముఖ ప్లాట్‌ఫామ్‌లు చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్ వేధింపులు, మానసిక ఆరోగ్యంపై సోషల్ మీడియా ప్రభావం వంటి సమస్యలను తగ్గించడమే ఈ చట్టం ప్రధాన లక్ష్యం.భారత్‌లో నిషేధంపై మోదీ హింట్ ఇచ్చారా?భారత్‌లో కూడా చిన్నారుల సోషల్ మీడియా వినియోగంపై నియంత్రణలు తీసుకురావాలనే చర్చలు పెరుగుతున్న వేళ మోదీ వ్యాఖ్యలు అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నాయి. బహుశా ఈ నియమాలు మనదేశంలో కూడా అమలవుతాయా?, మోదీ హింట్ ఇచ్చారా?, అని పలువురు అభిప్రాయపడుతున్నారు.కాగా.. ఇటీవల కర్ణాటక ప్రభుత్వం 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా వినియోగంపై పరిమితులు విధించే దిశగా అడుగులు వేసింది. ఇతర రాష్ట్రాలు కూడా ఇలాంటి చర్యలను పరిశీలిస్తున్నట్లు సమాచారం. దీన్నిబట్టి చూస్తే మన దేశంలో కూడా సోషల్ మీడియా వినియోగాన్ని కఠినతరం చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.ఇదీ చదవండి: ఓపెన్ఏఐలో కీలక పరిణామం.. ఏజీఐ సీఈఓ రాజీనామా! -
చట్టాల పేరుతో కొత్త సవాళ్లు.. ప్రజాస్వామ్యంపై పెరుగుతున్న ప్రశ్నలు!
భారతదేశం ఎటు వైపు పయనిస్తోంది? ఒకప్పుడు ఇందిరాగాంధీ ప్రధానమంత్రి హోదాలో అత్యయిక పరిస్థితి(ఎమర్జెన్సీ) విధించి పౌర హక్కులను కాలరాశారు. ప్రస్తుతం ఎమర్జెన్సీ కాకపోయినా, దాదాపు అదే రీతిలో వివిధ రాష్ట్రాలలో బీజేపీ, దాని మిత్రపక్షాలు భయానక వాతావరణం సృష్టించడానికి ప్రయత్నిస్తున్నాయా అన్న భావనను పలువురు మేధావులు వ్యక్తం చేస్తున్నారు. ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా జూన్ 25న ఒక ప్రత్యేక కార్యక్రమం నిర్వహించి కాంగ్రెస్‌ను ఎండగట్టే బీజేపీ పెద్దలు, తాము ఏమి చేస్తున్నామో కూడా ఆత్మపరీశీలన చేసుకోవడం అవసరం అనిపిస్తుంది.పశ్చిమబెంగాల్లో తీసుకువచ్చిన ఒక చట్టం అందరిని భయపెట్టేలా ఉంది. పేరుకు సంఘ వ్యతిరేక శక్తులను కట్టడి చేయడానికి ఈ చట్టం తీసుకు వస్తున్నామని, దీనిని దుర్వినియోగం చేయబోమని ముఖ్యమంత్రి సువేందు అధికారి ప్రకటించినా, ఆచరణలో ఎన్ని ఘోరాలు జరుగుతాయో అన్న ఆందోళనను వివిధ రాజకీయ పక్షాలు వ్యక్తం చేస్తున్నాయి. దీనిలో అతి ముఖ్యమైన క్లాజ్ ఏమిటంటే ఎవరైనా ఈ చట్టం కింద అరెస్టు అయితే ఏడాదిపాటు జైలులోనే ఉంచుతారట. లాయర్ కలుసుకోవడానికి కూడా అవకాశం ఉండదట. దీనిని రాజకీయంగా వాడుకోబోమని చెబుతున్నా గ్యారంటీ ఏమి ఉంటుందన్న ప్రశ్న వస్తుంది.ఒకవైపు ఉత్తరప్రదేశ్‌లో హాఫ్ ఎన్కౌంటర్ల పేరిట పోలీసులు సాగిస్తున్న ఘాతుకాలపై ఆయా జాతీయ ఆంగ్ల పత్రికలలో వస్తున్న వ్యాసాలు చదువుతుంటే భయం వేస్తుంది. యూపీలో మరీ ఇంత ఘోరంగా పరిస్థితి ఉందా అన్న భావన కలుగుతుంది. ఇక పశ్చిమబెంగాల్ వంతు వచ్చిందేమో అన్న అనుమానాన్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు. వెస్ట్ బెంగాల్ పబ్లిక్ సేఫ్టి అండ్ కంట్రోల్ ఆఫ్ యాంటి సోషల్ యాక్టివిటీస్ బిల్లును ఆమోదించారు. ఇది కేవలం జైళ్లకు పంపడం కాదు.. సమాజాన్ని రక్షించడం అని ముఖ్యమంత్రి చెబుతున్నారు. కాని ఒక ఏడాది వరకు ఎలాంటి విచారణ లేకుండా, కోర్టులతో సంబంధం లేకుండా చట్టాన్ని అమలు చేస్తే ఎలాంటి పరిణామాలు ఉంటాయో ఊహించుకోవడం కష్టం కాదు. ఈ బిల్లు దెబ్బకి, ఆ రాష్ట్రంలో విపక్షాలకు చెందిన కార్యకర్తలు బీజేపీలో చేరవలసిన అనివార్య పరిస్థితులు వచ్చినా ఆశ్చర్యం లేదు. తద్వారా కేసుల బారీ నుంచి తప్పించుకోవచ్చు.గతంలో టీఎంసీలో మంత్రిగా ఉన్న సువేందు అధికారిపై స్వయంగా ప్రధాని మోదీ పలు అవినీతి ఆరోపణలు చేసిన వీడియోలు సోషల్ మీడియాలో కనిపిస్తాయి. అదే సువేందు బీజేపీలో చేరడం, ముఖ్యమంత్రి అవడం కూడా జరిగిపోయింది. అలాగే ఆయా పార్టీల ఎంపీలు తమపై ఈడీ, సీబీఐ దాడులు జరగకుండా బీజేపీ లేదా దాని మిత్రపక్షాలలో చేరిన ఘటనలు అనేకం ఉన్నాయి. ఈ నేపథ్యంలో బెంగాల్ ప్రభుత్వం తీసుకువచ్చిన ఈ చట్టం ప్రజాస్వామ్యానికి మరింత చేటు చేసే అవకాశం ఉంది. ఈ చట్టం న్యాయ సమీక్షలో నిలబడదని తృణమూల్ కాంగ్రెస్ వాదిస్తోంది. ఈ చట్టం యూపీ మోడల్లో వచ్చిన బిల్లు అని కొందరు అభివర్ణిస్తున్నారు.ఉత్తరప్రదేశ్‌లో యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం రౌడీ శక్తులను అణచివేయడానికి ఎన్కౌంటర్లు, హాఫ్ ఎన్కౌంటర్ల పద్దతిని అనధికారికంగా ప్రవేశపెట్టిందని చెబుతున్నారు. టైమ్స్ ఆఫ్ ఇండియా జూన్ 30 నాటి సంచికలో సందీప్ రాయి, కృష్ణ చౌదరి అనే ఇద్దరు వ్యాసకర్తలు రాసిన ఆర్టికిల్ చదివితే యూపీలో భయానక పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో అర్థం అవుతుంది.2017లో యోగి ముఖ్యమంత్రి అయిన కొత్తలో ఈ ఎన్కౌంటర్లను కొన్ని సందర్భాలలో ప్రజలు కూడా స్వాగతించి ఉండవచ్చు. శాంతిభద్రత పరిరక్షణలో భాగంగా ఆయా కేసులలో నిందితుల ఇళ్లను కూల్చివేసేవారు. అలాంటి వాటిని సుప్రింకోర్టు కూడా తప్పు పట్టింది. ఇటీవలికాలంలో నిందితులుగా భావించేవారి ప్రాణం పోకుండా కాళ్లపైనో, ఇతర శరీర భాగాలపైన పోలీసులు తుపాకితో కాల్చుతున్నారట. దాంతో వారు ఏళ్ల తరబడి కదలలేని స్థితిలో పడిపోతున్నారు. వీటిని హాఫ్ ఎన్‌కౌంటర్లని పిలుస్తున్నారు. ఇలా గాయపడ్డవారిలో ఎందరు నిజంగా నేరం చేశారో, ఎందరు అమాయకులో ఎవరికి తెలియదు. ఈ వ్యాసంలో పలు ఉదాహరణలను కూడా వారు వివరించారు.యోగి అధికారంలోకి వచ్చిన తర్వాత 289 మందిని ఎన్కౌంటర్లలో మరణించారట. క్రిమినల్స్‌గా పరిగణించిన 34వేలమందిలో సుమారు మూడోవంతు 11834 మంది హాఫ్ ఎన్కౌంటర్లలో తీవ్రంగా గాయపడ్డారట. వీరిలో పలువురు కదలలేని స్థితిలో ఉన్నారు. వారికి జీవనోపాధి కూడా లేకుండా పోయిందట. నిజంగానే ఈ ఎన్కౌంటర్లు ఫలితాన్ని ఇస్తున్నాయా అంటే అదీ గ్యారంటీ లేదు. 2024లో 2823 మంది తీవ్రంగా గాయపడితే, 2025లో హాఫ్ ఎన్కౌంటర్లలో గాయపడ్డవారి సంఖ్య 3153 గా ఉందట. ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ విధానం ఫలిస్తే ఇలాంటివి తగ్గాలి కాని, ఎలా పెరుగుతాయన్న ప్రశ్నకు బదులు దొరకదు. రాజకీయ వైరాలకు కూడా ప్రభుత్వం తన అధికారాన్ని దుర్వినియోగం చేస్తోందన్న విమర్శలు సహజంగానే వస్తాయి. ఈ క్రమంలో పోలీసులలో విచ్చలవిడితనం పెరిగి, వారి ఇష్టారాజ్యంగా ఎవరిపైన అయినా ఇలా దారుణంగా వ్యవహరించే అవకాశం లేదని చెప్పలేం.బీహారులో ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తున్న ఒక వ్యక్తిని పోలీసులు బహిరంగంగా కాల్చి చంపడం పెద్ద వివాదం అయింది. అక్కడ కూడా బీజేపీ ప్రభుత్వమే ఉంది. ఇక బీజేపీ మిత్ర పక్షమైన తెలుగుదేశం ఏలుబడిలో ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో రెడ్ బుక్ పేరుతో ఎన్ని అరాచకాలు జరుగుతున్నాయో అందరికి తెలిసిన సంగతే. తమ అధికారాన్ని అడ్డు పెట్టుకుని విపక్షాన్ని అణచివేయడానికి, ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపేవారిపై కక్ష తీర్చుకోవడానికి పోలీసులను వాడుకోవడం సర్వసాధారణం అయిపోయిందన్న విమర్శ ఉంది.కృష్ణలంక పోలీస్ స్టేషన్లో ఒక సీఐ చేసిన ఘాతుకం వెలుగులోకి వచ్చింది. అధికార పార్టీవారు దాడులు చేసినా, అరాచకాలు చేసినా వారిపై తూతూమంత్రంగా కేసులు పెడుతున్నారు. వైఎస్సార్సీపీ మాజీ మంత్రులు అంబటి రాంబాబు, జోగి రమేష్‌ల ఇళ్లపై గంటల తరబడి పోలీసుల సమక్షంలోనే టీడీపీ గూండాలు దాడులు చేసినా వారిపై సరైన కేసులే పెట్టలేదు. పైగా బాధితులపైనే కేసులు పెట్టడం ట్రెండ్‌గా చేసుకున్నారు.తాజాగా అమరావతి గ్రామాలలో కొందరు రైతుల కోరిక మేరకు వారి సమస్యలను చూడడానికి వెళ్లబోయిన వైఎస్సార్సీపీ బృందంపై టీడీపీ గూండాలు దాడి చేశారు. అయినా పోలీసులు వైఎస్సార్సీపీవారిపై కేసులు పెట్టారు. ఇలా బీజేపీ, మిత్రపక్షాల పాలనలో ఉన్న రాష్ట్రాలలో అధికార దుర్వినియోగం, ఎన్కౌంటర్లు, హాఫ్ ఎన్కౌంటర్లు, లాకప్ డెత్‌లు సాగుతున్న తీరు ఆందోళన కలిగిస్తుంది. ఇది ప్రజాస్వామ్యానికి తీవ్ర విఘాతం కలిగిస్తుంది. ఈ తరుణంలో పశ్చిమబెంగాల్లో ఏడాదిపాటు నిర్భందించే చట్టం వస్తే ఇంకెంత భయానకంగా ఉంటుందో ఊహించుకోవచ్చు. న్యాయ వ్యవస్థతో సంబంధం లేకుండా పోలీసులు ఇలా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే ప్రజలను కాపాడేదెవరు?- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
భారత్‌లో తొలి మ్యాచ్.. ప్రకటించిన ప్రధాని మోదీ
క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) చరిత్రాత్మక ముందడుగు వేసింది. మొట్టమొదటిసారిగా భారత్‌లో బిగ్ బాష్ లీగ్ (బీబీఎల్) మ్యాచ్‌ను నిర్వహించనుంది. ఈ విషయాన్ని భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోని ఆల్బనీస్ సంయుక్తంగా ప్రకటించారు.దీంతో బీబీఎల్ 2026-2027 సీజన్లో తొలి మ్యాచ్‌కు భారత్ ఆతిథ్యం ఇవ్వడం ఖరారైంది. చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియం (చెపాక్) వేదికగా డిసెంబరు 12న ఆరంభ మ్యాచ్‌లో పెర్త్ స్కార్చర్స్, మెల్బోర్న్ రెనెగేడ్స్ తలపడనున్నాయి.క్రీడా సంబంధాల బలోపేతంకాగా విదేశీ టీ20 లీగ్‌కు భారత్ ఆతిథ్యం ఇవ్వడం క్రికెట్ చరిత్రలో ఇదే తొలిసారి. క్రీడా సంబంధాలను మరింత బలోపేతం చేసుకునే ప్రణాళికలో భాగంగా ఇరుదేశాలు ఇందుకు అంగీకరించాయి. ఇందులో భాగంగా వచ్చే ఏడాది ఐపీఎల్ ఆరంభ మ్యాచ్‌ను ఆస్ట్రేలియాలో నిర్వహించే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నట్లు ఆసీస్ మీడియా ‘ది ఏజ్’ వెల్లడించింది.మమ్మల్నీ ఆదరించండిఇక భారత్‌లో బీబీఎల్ మ్యాచ్ నిర్వహణ గురించి సీఏ ఎగ్జిక్యూటివ్ జనరల్ మేనేజర్ అలిస్టర్ డాబ్సన్ మాట్లాడుతూ.. ‘‘ఇండియాలో క్రికెట్‌కు ఉన్న అభిమానుల గురించి మాకు తెలుసు. ముఖ్యంగా చెన్నైలో అయితే ఆటకు మరింత ఆదరణ ఉంది. కచ్చితంగా బీబీఎల్ మ్యాచ్ కోసం ప్రేక్షకులు పెద్ద ఎత్తున తరలివస్తారని ఆశిస్తున్నాం.ఇప్పటికే ఇండియాలో చాలా మందికి బీబీఎల్ గురించి తెలుసు. చాలా మంది బీబీఎల్ మ్యాచ్‌లను కూడా చూస్తారు. అందుకే ఈసారి నేరుగా వారి దేశంలోనే బీబీఎల్ మ్యాచ్ చూసే అవకాశం కల్పిస్తున్నాము. ఐపీఎల్ మాదిరే మా పట్ల కూడా ఆదరణ చూపుతారని నమ్ముతున్నాము’’ అని పేర్కొన్నాడు. చదవండి: ఆఖరి బంతికి సింగిల్.. భారత్‌కు షాకిచ్చిన శ్రీలంక -
భారత్ కలలు ఆశయాలకు ప్రజలే పునాది
మెల్బోర్న్: ‘ఎక్కువగా కష్టపడడం, మరింత ఎక్కువగా సాధించడం’అనే దార్శనికతతో అభివృద్ధి చెందిన దేశంగా మారే లక్ష్యం దిశగా భారత్ పయనిస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. భారతదేశం గొప్ప కలలు, ఉన్నత ఆశయాలకు ప్రజలే పునాది అని స్పష్టంచేశారు. గురువారం ఆ్రస్టేలియాలో ‘మెల్బోర్న్ మీట్స్ మోదీ’కార్యక్రమంలో ప్రవాస భారతీయులను ఉద్దేశించి మాట్లాడారు. విద్య, నైపుణ్యాలు, ఆవిష్కరణల రంగాల్లో భారత్, ఆ్రస్టేలియా మధ్య భాగస్వామ్యం మరింత బలోపేతం అవుతుండడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. 21వ శతాబ్దంలో సంపూర్ణంగా అభివృద్ధి చెందిన దేశంగా మారే లక్ష్యం దిశగా భారత్ కృషి చేస్తోందన్నారు. నాగరిక్ దేవోభవ(పౌరుడే దైవం) అనే మంత్రం తమ పాలనకు మార్గదర్శక సూత్రంగా మారిందని ప్రకటించారు. తమ ప్రభుత్వ విధానాలు పౌరుల సంక్షేమమే కేంద్రంగానే ఉంటాయన్నారు. భారత్ నేడు చిప్స్ నుంచి షిప్‌ల వరకు ఒక నూతన తయారీ వ్యవస్థను అభివృద్ధి చేస్తోందని చెప్పారు. ఆపరేషన్ సిందూర్ గురించి మోదీ ప్రస్తావించారు. ఈ ఆపరేషన్ సమయంలో భారత రక్షణ వ్యవస్థ సామర్థ్యాన్ని, విశ్వసనీయతను ప్రపంచం చూసిందన్నారు. ముష్కర మూకల స్థావరాల వద్ద పేలుళ్లు జరిగితే వాటి ప్రతిధ్వని ప్రపంచవ్యాప్తంగా మార్మోగిందని వ్యాఖ్యానించారు. మిత్రులు, భాగస్వాములతో కలిసి.. భారత్‌లో స్టార్టప్‌ల సంఖ్య వేగంగా పెరుగుతోందని మోదీ వెల్లడించారు. దేశంలో 2 లక్షలకుపైగా నమోదిత స్టార్టప్‌లు ఉన్నాయని, ప్రతినెలా 4 వేలకుపైగా కొత్త స్టార్టప్‌లు నమోదవుతున్నాయని చెప్పారు. రక్షణ, అంతరిక్షం వంటి రంగాల్లో వందలాది స్టార్టప్‌లు పనిచేస్తున్నాయని పేర్కొన్నారు. భారతదేశపు మొట్టమొదటి ప్రైవేట్ అంతరిక్ష స్టార్టప్ తన సొంత రాకెట్ ద్వారా ఉపగ్రహాన్ని ప్రయోగించడానికి సిద్ధంగా ఉందన్నారు. ఇండియా విధానం కేవలం సొంత పురోగతిపై దృష్టి సారించడం మాత్రమే కాదని.. మిత్రులు, భాగస్వాములతో కలిసి అడుగులు వేయడమని నొక్కిచెప్పారు. ప్రవాస భారతీయులే ‘జీవన వారధి’ వెనెజువెలాలో ఇటీవల భూకంపాలు సంభవిస్తే భారత్ వెంటనే స్పందించి, సహాయక చర్యలు చేపట్టిందని, త్వరగా తోడ్పాటు అందించిందని ప్రధానమంత్రి చెప్పారు. వెనెజువెలా బాధను భారత్ తన సొంత బాధగా భావించిందని అన్నారు. సహాయం చేసేటప్పుడు పాస్‌పోర్ట్‌లను గానీ, వాటి రంగును గానీ భారత్ చూడదని ఉద్ఘాటించారు. అందుకే ప్రపంచం భారత్‌పై అపారమైన నమ్మకాన్ని పెట్టుకుందని చెప్పారు. భారత్–ఆ్రస్టేలియా సంబంధాలు బలపడడం వెనుక ప్రవాస భారతీయులదే కీలక పాత్ర అని మోదీ ప్రశంసించారు. వారిని రెండు దేశాల మధ్య ‘జీవన వారధి’గా అభివరి్ణంచారు. ఇంట్లో ఉపయోగించే పాలు ఆస్ట్రేలియన్ కావొచ్చు గానీ తయారుచేసే టీ మాత్రం భారతీయమైనదని చెప్పారు. పప్పులు, కూరగాయలు ఆ్రస్టేలియాలవే అయినా వాటికి అసలైన భారతీయ మసాలాలతో తాలింపు పెడతారని వెల్లడించారు. మెల్బోర్న్ సిటీని మినీ ఇండియాగా అభివరి్ణంచారు. టీ20 మ్యాచ్‌లా.. టెస్ట్ మ్యాచ్‌లా రెండు దేశాల మధ్య భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి క్రీడల రంగం కూడా ఉందని మోదీ అన్నారు. ప్రపంచ క్రీడా రాజధాని అయిన మెల్బోర్న్లో ఉంటూ క్రీడల గురించి మాట్లాడకపోవడం అనేది టాస్ వేసిన తర్వాత క్రికెట్ మ్యాచ్‌ను ప్రారంభించకపోవడంతో సమానమని సరదాగా వ్యాఖ్యానించారు. మన నిర్ణయాలు టీ20 మ్యాచ్‌లా వేగంగా, భాగస్వామ్యం మాత్రం టెస్ట్ మ్యాచ్‌లా సుదీర్ఘంగా, లోతుగా ఉండాలని అన్నారు. భారత్–ఆస్ట్రేలియా దేశాల అజెండా ఒక వన్డే మ్యాచ్‌లా లక్ష్యంపైనే దృష్టి సారిస్తుందని ప్రధానమంత్రి తేల్చిచెప్పారు. -
57 శాతం ఉత్పత్తులపై సున్నా సుంకాలు!
వెల్లింగ్టన్: స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం(ఎఫ్‌టీఏ) కింద తమ దేశం నుంచి భారత్‌కు ఎగుమతి జరిగే ఉత్పత్తుల్లో 57 శాతం ఉత్పత్తులపై సుంకాలు సున్నాకు చేరుకుంటాయని న్యూజిలాండ్ ప్రధాని క్రిస్టోఫర్ లక్సన్ తెలిపారు. ఈ మేరకు గురువారం ఎక్స్‌లో పోస్టుచేశారు. ఇరుదేశాల మధ్య ఎఫ్‌టీఏ అమల్లోకి వచ్చిన తొలిరోజు నుంచే సున్నా శాతం సుంకాలు అమల్లోకి వస్తాయన్నారు. ఈ ఒప్పందంతో న్యూజిలాండ్ వ్యాపారాలు భారీగా వృద్ధి చెందనున్నాయని తెలిపారు. భారత మార్కెట్లో న్యూజిలాండ్ ఉత్పత్తులకు విస్తృత ప్రవేశం లభిస్తుందని ఆశాభావం వ్యక్తంచేశారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 10, 11న న్యూజిలాండ్‌లో పర్యటించనున్నారు. భారత ప్రధాని న్యూజిలాండ్‌కు వెళ్తుండడం గత 40 ఏళ్లలో ఇదే తొలిసారి. న్యూజిలాండ్‌తో వాణిజ్యం, రక్షణ, పరస్పర సహకారం తదితర అంశాలపై ప్రధాని మోదీ దృష్టిపెట్టనున్నారు. అంతేకాకుండా వ్యాపారవేత్తలు, క్రీడాకారులతోనూ సమావేశం కానున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ 27న భారత్, న్యూజిలాండ్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని ఖరారు చేసుకున్నాయి. -
బలపడిన అణు బంధం
మెల్బోర్న్: భారత్, ఆస్ట్రేలియా మధ్య ‘అణు’బంధం మరింత బలపడింది. భారత అణు విద్యుత్ ప్రాజెక్టులకు యురేనియం సరఫరా చేసేందుకు ఆస్ట్రేలియా ముందుకొచ్చింది. ఈ మేరకు ఇరుదేశాల మధ్య అత్యంత కీలకమైన పౌర అణుశక్తి ఒప్పందం కుదిరింది. సివిల్ న్యూక్లియర్ ఎనర్జీ సహా సముద్ర భద్రత, అరుదైన ఖనిజాల రంగాలకు సంబంధించి పలు చరిత్రాత్మక ఒప్పందాలపై రెండు దేశాలు సంతకాలు చేశాయి. భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఆ్రస్టేలియా ప్రధాని ఆంథోనీ అల్బానీస్ గురువారం మెల్బోర్న్లో సమావేశమయ్యారు. ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై విస్తృతంగా చర్చించారు. కీలక రంగాల్లో పరస్పరం సహకారాన్ని మరింత పెంపొందించుకోవాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా ఆధునిక సాంకేతికతలు, సప్లై చైన్లు, రక్షణ, భద్రతా సహకారం, సముద్ర భద్రతా సహకార రోడ్‌మ్యాప్, ఇంధన భద్రత తదితర అంశాల్లో మొత్తం 18 ఒప్పందాలపై సంతకాలు జరగడం విశేషం. వీటిలో భారత తీర రక్షక దళం(ఐసీజీ), ఆ్రస్టేలియాకు చెందిన మారిటైమ్ బోర్డర్ కమాండ్(ఎంబీసీ) మధ్య జరిగిన ఒప్పందం కూడా ఉంది. ఇది సముద్ర చట్టాల అమలు, సముద్ర ప్రాంతాలపై అవగాహన, సముద్ర సరిహద్దుల రక్షణ వంటి అంశాలలో పరస్పర సహకారానికి దోహదపడుతుంది. ఇంధన భద్రతను బలోపేతం చేసుకుందాం ప్రతిపాదిత సమగ్ర ఆర్థిక సహకార ఒప్పందం, ద్వైపాక్షిక పెట్టుబడి రక్షణ విధానాన్ని ఖరారు చేసే దిశగా కార్యాచరణను వేగవంతం చేయాలని భారత్, ఆ్రస్టేలియా నిర్ణయించాయి. ఓడల నిర్మాణం, మరమ్మతులు, నిర్వహణలో కలిసికట్టుగా పనిచేయడానికి ఇరుపక్షాలు అంగీకారం తెలిపాయి. భారత్, ఆ్రస్టేలియాలు చారిత్రాత్మక పౌర అణు సహకార ఒప్పందంపై సంతకాలు చేసిన 12 ఏళ్ల తర్వాత పౌర అణుశక్తి ఒప్పందం కుదిరింది. ఇంధన భద్రతా ఫ్రేమ్‌వర్క్ నిబంధనల ప్రకారం.. బొగ్గు, డీజిల్, ఇతర ద్రవ ఇంధనాలు, సహజ వాయువుల స్థిరమైన, సురక్షితమైన, విశ్వసనీయమైన సరఫరాను కొనసాగించడం ద్వారా ఇంధన భద్రతను బలోపేతం చేసుకోవాలని ప్రతిజ్ఞ చేశాయి. 2028–29 సంవత్సరానికి గాను ఆ్రస్టేలియన్ డిఫెన్స్ కాలేజీలో భారతీయ సైనిక శిక్షకుడిని నియమించాలని నిర్ణయించారు. మరోవైపు భారత్‌లోని గురుగ్రామ్‌లో విక్టోరియా విశ్వవిద్యాలయం తన క్యాంపస్‌ను నిర్వహించుకోవడానికి ఆ్రస్టేలియా పక్షానికి ఆమోద పత్రం అందజేశారు. బెంగళూరులో ఫ్లిండర్స్ యూనివర్సిటీ తన క్యాంపస్‌ను ఏర్పాటు చేయడానికి అంగీకారం కుదిరింది. భేటీ అనంతరం మోదీ, అల్బానీస్ ప్రకటన విడుదల చేశారు. భారత స్వచ్ఛ ఇంధన లక్ష్యాలకు నూతన శక్తి ఆస్ట్రేలియా ప్రధానమంత్రి అల్బానీస్‌తో అద్భుతమైన చర్చలు జరిగాయని నరేంద్ర మోదీ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. చర్చల ఫలితాలను ‘అసాధారణమైనవి’గా అభివర్ణించారు. ముఖ్యంగా పునరుత్పాదక ఇంధనం, వాతావరణ చర్యలు, అణు శక్తి, కీలక ఖనిజాలు, సాంకేతికత, విద్య వంటి రంగాలపై చర్చించామని తెలిపారు. ఈరోజు అణు శక్తి రంగంలో ఒక కీలక ఒప్పందంపై సంతకం జరిగాయని అన్నారు. ఇది ఆ్రస్టేలియా నుంచి భారత్‌కు యురేనియం సరఫరాకు మార్గం సుగమం చేయడంతోపాటు భారత స్వచ్ఛ ఇంధన లక్ష్యాలకు నూతన శక్తిని ఇస్తుందని ఉద్ఘాటించారు. రెండు దేశాల మధ్య బలమైన భాగస్వామ్యం ఉగ్రవాదం అనేది కేవలం ఏదో ఒక దేశానికే కాకుండా మొత్తం మానవాళికి తీవ్రమైన సవాలుగా పరిణమించిందని భారత్, ఆస్ట్రేలియాలు గుర్తించినట్లు ప్రధాని మోదీ పేర్కొన్నారు. అందుకే ఉగ్రవాదంపై ఉమ్మడి పోరాటం సాగిస్తామన్నారు. తమ సంకల్పం అచంచలమైనదని, సహకారం మరింత బలపడుతూనే ఉందని వెల్లడించారు. ఇండియాతో ఆ్రస్టేలియాకు ఉన్న సంబంధం నేడు ఉన్నంత కీలకమైనదిగా గతంలో ఎప్పుడూ లేదని ప్రధాని ఆంథోనీ అల్బానీస్ పేర్కొన్నారు. పౌర అణుశక్తికి సంబంధించిన ఒప్పందం శాంతియుత ప్రయోజనాల కోసం ఆ్రస్టేలియా నుంచి భారత్‌కు యురేనియం ఎగుమతులను సులభతరం చేస్తుందని వివరించారు. శిలాజ రహిత ఇంధన విద్యుత్ సామర్థ్యం వాటాను పెంచడానికి భారత్‌కు యురేనియం సరఫరా చేయబోతున్నట్లు తెలిపారు. అలాగే ఆ్రస్టేలియన్ వనరుల రంగానికి అదనపు మార్కెట్ అందుబాటులోకి వస్తుందన్నారు. తమ భాగస్వామ్యం ఎన్నడూ లేనంత బలంగా ఉందని తేల్చిచెప్పారు. రక్షణ, భద్రతా సహకారంపై ఉమ్మడి ప్రకటన ‘ఆచరణాత్మక భాగస్వామ్యాన్ని’మరింత బలోపేతం చేయడానికి దోహదపడుతుందన్నారు. భారతదేశాన్ని ఒక అగ్రశ్రేణి భద్రతా భాగస్వామిగా పరిగణిస్తున్నట్లు అల్బానీస్ ప్రకటించారు. భారత్‌లో అవకాశాలను సద్వినియోగం చేసుకోండి ప్రతిపాదిత భారత్–ఆ్రస్టేలియా సమగ్ర ఆర్థిక సహకార ఒప్పందాన్ని త్వరగా ఖరారు చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఇది ద్వైపాక్షిక ఆర్థిక సంబంధాలను కొత్త స్థాయికి తీసుకెళ్తుతుందని పేర్కొన్నారు. గురువారం ఆ్రస్టేలియా–ఇండియా సీఈఓల ఫోరమ్, ఎకనామిక్ రోడ్‌మ్యాప్ బిజినెస్ సమావేశాల్లో ఆయన ప్రసంగించారు. భారత్‌లో విమానయానం, ఆర్థిక సేవలు, కీలక ఖనిజాలు, సాంకేతికత, ఆహార శుద్ధి వంటి రంగాల్లో వృద్ధికి అద్భుతమైన అవకాశాలు ఉన్నాయని చెప్పారు. ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవడానికి విస్తృతంగా పెట్టుబడులు పెట్టాలని ఆ్రస్టేలియా పారిశ్రామికవేత్తలకు, కంపెనీలకు పిలుపునిచ్చారు. ఇండియాలో 500 మిలియన్ ఆస్ట్రేలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టనున్నట్లు ‘ఆ్రస్టేలియన్ సూపర్’కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ పాల్ ష్రోడర్ చేసిన ప్రకటనను మోదీ స్వాగతించారు. -
తరలిరానున్న భద్రకాళి, కార్తికేయుడు, నంది!
భారతీయ సంస్కృతీ వైభవం స్వదేశానికి తిరిగి వస్తోంది. దశాబ్ద కాలంలో అమెరికా, యూకే, కెనెడా సహా అనేక దేశాల్లో దశాబ్దాలుగా మగ్గిన 300కుపైగా అరుదైన, అపురూప కళాఖండాలు ఇప్పటికే భారత్‌కు తిరిగి రాగా తాజాగా ఆస్ట్రేలియా చోళుల కాలం నాటి మూడింటిని అప్పగించింది. దొంగల చేత చిక్కి సముద్రాలు దాటిన ఈ కళాఖండాలు ఘనమైన భారత చారిత్రక వారసత్వానికి ప్రతీకలు! భారత ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన సందర్భంగా ఆ్రస్టేలియా ప్రభుత్వం ఆరు తలల కార్తికేయ విగ్రహం, నంది విగ్రహం, భద్రకాళి త్రిశూలాలను అప్పగించింది. ఇవన్నీ తమిళనాడు నుంచి అక్రమ మార్గాల్లో ఆ్రస్టేలియాలోని నేషనల్ గ్యాలరీ కలెక్షన్‌లోకి చేరాయి. ఇవి చోరీకి గురైనవని తమిళనాడు సీఐడీలోని ప్రత్యేక విభాగం స్పష్టమైన ఆధారాలతో నిరూపించడంతో మ్యూచువల్ లీగల్ అసిస్టెన్స్ ఒప్పందానికి అనుగుణంగా తమకు అప్పగించాలని భారత్ కోరింది. ఇందుకు ఆస్ట్రేలియ అంగీకరించడంతో త్వరలో స్వదేశానికి తిరిగి రానున్నాయి.షణ్ముఖ/కార్తికేయ విగ్రహంతమిళుల ఇష్టదైవం, తమ రక్షకుడిగా భావించే కార్తికేయుడిని సుబ్రమణ్యుడు, స్కంద, మురుగన్ అని కూడా పిలుస్తారు. ఆ్రస్టేలియా అప్పగిస్తున్న ఆరుతలల రాతి విగ్రహం 12వ శతాబ్ధానికి చెందినది. తమిళనాడులో కుంభకోణం సమీపంలోని మనంబాడి గ్రామంలోని నాగనాథస్వామి దేవాలయం నుంచి చోరీకి గురైంది. సుమారు 130 సెం.మీ ఎత్తు ఉంటుంది. చోళుల శిల్పకళా శైలికి ప్రతిబింబంగా సౌష్టవాకారం, లెక్కకట్టినంత సైజులో ఉండే ఆభరణాలతో కూడి ఉంది. ఆరుతలలను కొందరు ఆరు దిశలుగా, మరికొందరు జ్ఞానం, బలం, కీర్తి, ఐశ్వర్యం, వైరాగ్యం, విజ్ఞానం ఆరు గుణాలుగా, ఇంకొందరు కృతికా నక్షత్ర మండలంలోని దేవతలుగా నమ్ముతారు.మీటర్ పొడవైన నంది 13–16వ శతాబ్దాల మధ్యకాలం నాటి నంది విగ్రహం తంజావూరు ప్రాంతంలోని తిరువారూర్ జిల్లా కడువంకుడి గ్రామంలోని కైలాసనాథర్ ఆలయానికి చెందినది. ఏకశిల విగ్రహం. మీటరు పొడవుతో శిల్పకళ నైపుణ్యానికి అద్దం పడుతుంది. తమిళనాడు సీఐడీలోని విగ్రాహాల విభాగం అంచనాల ప్రకారం దీని విలువ రూ.నాలుగు కోట్లు. భద్రకాళి త్రిశూలంసాధారణంగా త్రిశూలం అనగానే శివుడు గుర్తు వస్తాడు కానీ దక్షిణాది ఆలయాల్లో అమ్మవారు కూడా త్రిశూలంతో దర్శనమిస్తూంటుంది. ఆ్రస్టేలియా అప్పగిస్తున్న మూడో కళాఖండం చోళుల అనంతర కాలపు అరుదైన లోహ త్రిశూలం. శ్రీ కాశీ విశ్వనాథస్వామి ఆలయానికి చెందినది. సుమారు 46 సెం.మీ ఎత్తు, మీటర్‌కి పైగా వెడల్పు ఉంటుంది. పైభాగంలో భద్రకాళి దేవి ప్రతిమ కనిపిస్తూంటుంది. ఊరేగింపులు, జాతరల్లో శక్తి, రక్షణలకు చిహ్నంగా వాడేవారని అంచనా. 2016లో తమిళనాడు సీఐడీలోని విగ్రహ విభాగం ఈ విగ్రహాల చోరీపై ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఆ తరువాత ఆలయ రికార్డులు, పాత ఫోటోలు, ప్రభుత్వ దస్తావేజులు, మ్యూజియం క్యాటలాగులన్నీ జల్లెడ పట్టారు. ఇవి ఎక్కడి నుంచి ఎప్పుడు గల్లంతయ్యాయో ఎలా విదేశాలకు చేరాయో నిరూపించారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ప్రపంచ దేశాలకు మోదీ స్ఫూర్తి.. ఆస్ట్రేలియా ప్రధాని ప్రశంస
మెల్బోర్న్ తనకు అద్భుతమైన స్వాగతం పలికిందని ప్రధాని మోదీ అన్నారు. ఆస్ట్రేలియా ప్రధాని భారత్‌కు మంచి మిత్రుడని కొనియాడారు. ఈ రోజు గురువారం మెల్బోర్న్ మీట్ కార్యక్రమంలో మోదీతో కలిసి ఆస్ట్రేలియా ప్రధాని పాల్గొన్నారు. మోదీ ఆస్ట్రేలియా పర్యటన సందర్భంగా 30 వేల మంది ప్రవాస భారతీయులతో కలసి మెల్బోర్న్ మీట్ కార్యక్రమం నిర్వహించారు.ఆల్బనీస్ భారతీయుల హృదయాలను గెలుచుకున్నాడని మెల్బోర్న్ వాసులతో గడపాడనికే ఆస్ట్రేలియా వచ్చానని ప్రధాని అన్నారు. 2014లో తొలిసారి 2023లో రెండోసారి ప్రస్తుతం మూడోసారి ఆస్ట్రేలియా వచ్చానని తెలిపారు. అహ్మాదాబాద్ క్రికెట్ స్టేడియం ప్రపంచంలోనే అతిపెద్దదని అదే విధంగా మెల్బోర్న్ స్టేడియం క్రికెట్‌కు ఐకానిక్‌గా ప్రసిద్ధి చెందిందని పేర్కొన్నారు. మెల్బోర్న్ను మినీ ఇండియాగా పిలుస్తారని భారతీయుల పండుగలను ఈ ప్రాంతంలో ఎంతో ఘనంగా జరుపుకుంటారని తెలిపారు.ఒక కల పూర్తవగానే మరో కల నిర్ధేశించుకోవాలని ఆస్ట్రేలియాతో పాటు భారత అభివృద్ధితో సైతం భాగస్వామ్యం కావాలని అక్కడి ప్రవాస భారతీయులను ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించారుఅంతకు ముందు ఆస్ట్రేలియా ప్రధాని ఆల్బనీస్ మాట్లాడుతూ.. "ప్రపంచ దేశాలకు భారత ప్రధాని నరేంద్ర మోదీ ఓ స్పూర్తి మోదీ నాయకత్వంలో భారత్ ఒక బలమైన ఆర్థిక వ్యవస్థగా మారింది" అని భారత ప్రధానిని ప్రశంసిస్తూ మాట్లాడారు. కాగా ప్రధాని మూడు దేశాల పర్యటనలో భాగంగా జూలై 8 నుంచి 10 వరకు ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్నారు.ఇందులో భాగంగా మెల్బోర్న్లో ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్‌తో కలిసి ఇరుదేశాల వార్షిక సదస్సులో పాల్గొన్నారు. రక్షణ, ఇంధన భద్రత, వాణిజ్యం వంటి కీలక రంగాలలో దాదాపు 18 ముఖ్యమైన ఒప్పందాలపై ఇరు దేశాలు సంతకాలు చేశాయి. -
మోదీ ఆస్ట్రేలియా మిషన్.. వ్యూహాత్మక భాగస్వామ్యమే గురి!
మెల్బోర్న్: మూడు దేశాల పర్యటనలో భాగంగా ఆస్ట్రేలియాకు చేరుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి మెల్బోర్న్లో ఘన స్వాగతం లభించింది. గురువారం ఆయనకు అధికారిక గౌరవ వందనం (గార్డ్ ఆఫ్ ఆనర్) నిర్వహించారు. అనంతరం ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్‌తో కలిసి భారత్-ఆస్ట్రేలియా వార్షిక సదస్సులో పాల్గొన్నారు.మోదీ పర్యటనలో భాగంగా ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడంపై ప్రధానంగా చర్చలు జరిగాయి. రక్షణ, వాణిజ్యం, విద్య, కీలక ఖనిజాలు, ఇంధనం, నైపుణ్యాభివృద్ధి, ప్రజల మధ్య సంబంధాలు వంటి అంశాలు చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది.వ్యాపార దిగ్గజాలతో మోదీ భేటీమెల్బోర్న్లో జరిగిన భారత్-ఆస్ట్రేలియా సీఈఓ ఫోరం, ఎకనామిక్ రోడ్‌మ్యాప్ బిజినెస్ రిసెప్షన్లో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ఇరు దేశాల మధ్య పెట్టుబడులు, వాణిజ్య అవకాశాలను మరింత విస్తరించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. భారత్-ఆస్ట్రేలియా భాగస్వామ్యం కేవలం రెండు రాజధానులకే పరిమితం కాకుండా.. రాష్ట్రాలు, నగరాలు, విశ్వవిద్యాలయాలు, పరిశ్రమల స్థాయిలోనూ విస్తరించాలని మోదీ సూచించారు. రాష్ట్రాల మధ్య, రంగాల మధ్య ప్రత్యేక భాగస్వామ్యాలను గుర్తించి కొత్త అవకాశాలను సృష్టించాలని పిలుపునిచ్చారు.ఆస్ట్రేలియా పెట్టుబడులకు ఆహ్వానంఆస్ట్రేలియా పెన్షన్ ఫండ్స్‌ను భారత్‌లో పెట్టుబడులు పెట్టాలని ప్రధాని మోదీ ఆహ్వానించారు. ఆ దేశ పెన్షన్ ఫండ్స్ నిర్వహిస్తున్న భారీ నిధులు సురక్షితమైన, స్థిరమైన దీర్ఘకాలిక వృద్ధికి భారత్‌లో అవకాశాలను పొందగలవని చెప్పారు. భారత్‌లో మౌలిక వసతులు, రహదారులు, రైల్వేలు, పోర్టులు, విమానాశ్రయాలు, పట్టణాభివృద్ధి రంగాల్లో పెట్టుబడులకు విస్తృత అవకాశాలు ఉన్నాయని వివరించారు.గ్రీన్ ఎనర్జీపై దృష్టిభారత్ స్వచ్ఛ ఇంధన రంగంలో వేగంగా ముందుకు సాగుతోందని మోదీ తెలిపారు. హరిత హైడ్రోజన్, సౌర విద్యుత్, వాయు విద్యుత్, జల విద్యుత్ రంగాల్లో భారీ అవకాశాలు ఉన్నాయని చెప్పారు. 2030 నాటికి పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని భారీగా పెంచే లక్ష్యంతో భారత్ పనిచేస్తోందని, ఈ ప్రయాణంలో ఆస్ట్రేలియా సాంకేతికత, పెట్టుబడులు కీలక పాత్ర పోషించగలవని పేర్కొన్నారు.అల్బనీస్‌తో కీలక భేటీ.. సెల్ఫీ వైరల్ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్‌తో మోదీ భేటీ అయ్యారు. ఇరు దేశాల మధ్య సంబంధాలపై చర్చించారు. అనంతరం ఇద్దరు నేతలు కలిసి దిగిన సెల్ఫీ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అలాగే మాజీ ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్‌తోనూ మోదీ సమావేశమయ్యారు.భారత ప్రవాసులతో..మెల్బోర్న్లో భారతీయ ప్రవాసులతో మోదీ సమావేశం కానున్నారు. ఆస్ట్రేలియాలో నివసిస్తున్న భారతీయులతో సంబంధాలను మరింత బలోపేతం చేయడంలో ఈ సమావేశం కీలకంగా మారనుంది.మొత్తంగా.. మోదీ ఆస్ట్రేలియా పర్యటన భారత్-ఆస్ట్రేలియా మధ్య పెరుగుతున్న వ్యూహాత్మక, ఆర్థిక భాగస్వామ్యానికి మరింత ఊతమిస్తుందని విదేశాంగ నిపుణులు భావిస్తున్నారు. రక్షణ నుంచి వాణిజ్యం వరకు పలు రంగాల్లో సహకారాన్ని విస్తరించడమే ఈ పర్యటన ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది. -
ఆ్రస్టేలియాలో మోదీకి ఘన స్వాగతం
మెల్బోర్న్: మూడు దేశాల పర్యటనలో భాగంగా ఇండోనేషియా పర్యటన పూర్తిచేసుకున్న ప్రధాని మోదీ బుధవారం ఆ్రస్టేలియాకు చేరుకున్నారు. ఇప్పుడే ఆస్ట్రేలియాలో అడుగుపెట్టానని పేర్కొంటూ ఆయన ‘ఎక్స్’లో పోస్టుచేశారు. ఈ పర్యటన భారత్–ఆ్రస్టేలియా సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యానికి మరింత ఉత్తేజాన్ని చేకూరుస్తుందని పేర్కొన్నారు. ఆ్రస్టేలియా నేతలతో జరపబోయే చర్చల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు తెలిపారు. మెల్బోర్న్ ఎయిర్‌పోర్టులో మోదీకి ఆ్రస్టేలియా ప్రభుత్వ ఉన్నతాధికారులు ఘన స్వాగతం పలికారు. సైనికులు గౌరవ వందనం సమర్పించారు. ఆస్ట్రేలియా ప్రధానమంత్రి ఆంథోనీ అల్బానీస్‌తో మోదీ సమావేశం కాబోతున్నారు. ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాలపై వారు చర్చిస్తారు. అలాగే ప్రవాస భారతీయులను సైతం మోదీ కలుసుకుంటారు. అల్బానీస్‌తో కలిసి 3వ వార్షిక శిఖరాగ్ర సమావేశానికి హాజరవుతారు. కీలకర రంగాల్లో భారత్–ఆ్రస్టేలియా సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి సంప్రదింపులు జరుపుతారు. మెల్బోర్న్లోని హోటల్‌కు చేరుకున్న ప్రధాని మోదీకి ప్రవాస భారతీయులు స్వాగతం పలికారు. వందేమాతరం, మోదీ–మోదీ అని నినదించారు. ఈ సందర్భంగా కళాకారులు తమ ప్రదర్శనతో ఆలరించారు. మెల్బోర్న్లో వాతావరణం చల్లగా ఉన్నప్పటికీ భారతీయుల ఆతీ్మయ స్వాగతం మాత్రం నిజంగా చిరస్మరణీయమని మోదీ ఈ సందర్భంగా పేర్కొన్నారు. వారి అనురాగం, భారతదేశంతో వారికి ఉన్న దృఢమైన అనుబంధం ఎప్పటికీ ఎంతో ఆనందాన్ని, గర్వాన్ని కలిగిస్తూనే ఉంటాయని స్పష్టంచేశారు. -
ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా భారత సాంస్కృతిక వారసత్వం
యోగ్యకార్తా: ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా భారతదేశ సాంస్కృతిక వారసత్వం కనిపిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టంచేశారు. ఇండోనేసియాలోని యోగ్యకార్తాలో శతాబ్దాల చరిత్ర కలిగిన ప్రఖ్యాత ప్రంబనన్ ఆలయ సముదాయాన్ని ఆయన బుధవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మోదీ వెంట ఇండోనేసియా అధ్యక్షుడు ప్రబోవో సుబియంతో కూడా ఉన్నారు. యునెస్కో ప్రపంచ వారసత్వ కట్టడమైన ఈ ఆలయాన్ని ఉమ్మడిగా పరిరక్షించే ప్రాజెక్టును ఇరువురు నేతలు లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని భారత్, ఇండోనేసియాల మధ్య చిరకాల నాగరికతా బంధాలకు ఒక అద్భుతమైన నిదర్శనంగా మోదీ అభివర్ణించారు. శతాబ్దాలుగా ఇరుదేశాల ప్రజలను అనుసంధానిస్తున్న ఉమ్మడి వారసత్వానికి ఇదొక గొప్ప ప్రతీక అని పేర్కొన్నారు. భారత్ సహాయంతో ఆలయ సముదాయ పరిరక్షణ, పునరుద్ధరణ ప్రాజెక్టును ప్రారంభించేందుకు ఇరు దేశాలు మంగళవారం ఒక అంగీకారానికి వచ్చిన సంగతి తెలిసిందే. భారత్ తరపున ఆర్కియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా(ఏఎస్ఐ) కీలకంగా వ్యవహరించే ఈ ఉమ్మడి సంరక్షణ ప్రాజెక్టు.. అలాగే ప్రంబనన్ ఆలయ సముదాయాన్ని మోదీ, సుబియంతో కలిసి సందర్శించడం వంటి పరిణామాలు భారత్–ఇండోనేసియా బంధానికి తిరుగులేని ఉదాహరణ అని నిపుణులు పేర్కొంటున్నారు. ఆలయ ప్రదేశంలో ఏఎస్ఐ పరిరక్షణ, పునరుద్ధరణ ప్రాజెక్ట్ ప్రారంభానికి గుర్తుగా ఒక ఫలకాన్ని వారిద్దరూ ఆవిష్కరించారు. ఇది దైవత్వ భావనతో నిండిన క్షణం తొలుత ప్రంబనన్ ఆలయానికి చేరుకున్న మోదీకి సంప్రదాయ స్వాగతం లభించింది. ఆలయ ప్రాంగణంలో కలియతిరుగుతూ ఇక్కడి విశేషాలను ఆసక్తిగా అడిగి తెలుసుకున్నారు. అధికారులు ఆయనకు ఆలయ చరిత్రను వివరించారు. మోదీ, సుబియంతో పరస్పరం కరచాలనం చేసుకుని ఫొటోలకు పోజులిచ్చారు. ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు. ఈ సందర్భంగా మోదీ ప్రసంగించారు. ఆలయ సముదాయానికి సంబంధించిన ఉమ్మడి పరిరక్షణ ప్రాజెక్టు ప్రారంభోత్సవంలో భాగం కావడం తనకు దక్కిన గౌరవమని మోదీ పేర్కొన్నారు. మిత్రుడు, అధ్యక్షుడు సుబియంతోతో కలిసి ఈ ప్రదేశాన్ని సందర్శించడం వల్ల ఈ సందర్భం తనకు మరింత ప్రత్యేకంగా మారిందన్నారు. ఇండోనేసియా ప్రజలు ఈ గొప్ప వారసత్వాన్ని భక్తిభావంతో సంరక్షిస్తూ వస్తున్నారని ప్రశంసించారు. అందుకే ఇండోనేసియా ప్రజలకు, ఇప్పటివరకు ఈ దేశాన్ని పాలించిన పాలకులందరికీ హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నానని వెల్లడించారు. ఆ ఆలయాన్ని సందర్శించిన క్షణం దైవత్వ భావనతో నిండిన క్షణం అని వ్యాఖ్యానించారు. భారత్–ఇండోనేసియా స్నేహాన్ని బలోపేతం చేయడం, ఉభయ దేశాల ప్రజల సంక్షేమం, శీఘ్ర అభివృద్ధి కోసం భగవంతుడిని ప్రార్థించానని మోదీ తెలిపారు. ప్రంబనన్ ఆలయ సముదాయంలో సంరక్షణ, పునరుద్ధరణ పనులు ప్రారంభిస్తున్న తరుణంలో, భారతీయ పర్యాటకులు కచ్చితంగా ఈ ప్రదేశాన్ని సందర్శిస్తారని విశ్వాసం ఉందన్నారు. ‘‘ప్రపంచంలోని సుదూర ప్రాంతాల్లో మనం ఎక్కడికి వెళ్లినా భారతదేశపు సాంస్కృతిక వారసత్వాన్ని చూడవచ్చు. ఆగ్నేయాసియాలో భారత వారసత్వానికి సంబంధించిన అతిపెద్ద గుర్తింపుల్లో ఆ ఆలయం కూడా ఒకటి. ఇక్కడ శివుడు, దుర్గాదేవి, గణేశుడి విగ్రహాలు ఉన్నాయి. శతాబ్దాలుగా ప్రజలు పూజలు చేస్తున్నారు. నేడు ప్రంబనన్ ఆలయాన్ని సందర్శించి, ప్రార్థనలు చేసే అదృష్టం నాకు దక్కడం సంతోషంగా ఉంది’’అని మోదీ వివరించారు. కాలాతీత చిహ్నం ఇండోనేసియా అధ్యక్షుడితో కలిసి ఈ ప్రాజెక్టును ప్రారంభించడం చాలా ఆనందంగా ఉందంటూ మోదీ ‘ఎక్స్’లో పోస్టుచేశారు. ‘‘అద్భుతమైన ప్రంబనన్ దేవాలయం మన సాంస్కృతిక, ఆధ్యాతి్మక అనుబంధాలకు కాలాతీత చిహ్నంగా నిలుస్తుంది. ఇటువంటి వారసత్వాన్ని పరిరక్షించడం అంటే తరతరాలకు స్ఫూర్తినిచ్చే సంప్రదాయాలను కాపాడుకోవడమే. ఈ ప్రయత్నంలో ఇండోనేసియాతో భాగస్వామి కావడం భారత్‌కు దక్కిన అదృష్టం. గాఢమైన సాంస్కృతిక సంబంధాలున్న దేశాలుగా భారత్, ఇండోనేయాలు ఉమ్మడి గతాన్ని స్మరించుకుంటూ, మరింత బలమైన భవిష్యత్తును నిర్మించుకోవడానికి కలిసికట్టుగా పనిచేయడం కొనసాగిస్తాయి’’అని మోదీ పేర్కొన్నారు. ప్రంబనన్ గుడి యోగ్యకార్తా నగరానికి ఈశాన్యంగా సుమారు 17 కిలోమీటర్ల దూరంలో ఉంది. దీన్ని ఇండోనేసియాలో అతిపెద్ద హిందూ ఆలయంగా పరిగణిస్తారు. 9వ శతాబ్దంలో నిర్మించారు. త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరులకు అంకితం చేశారు. ఈ ఆలయ సముదాయం భారతదేశం, ఇండోనేసియాల మధ్య ఉన్న ఉమ్మడి నాగరికత, సాంస్కృతిక వారసత్వానికి శాశ్వత చిహ్నంగా నిలుస్తుందని భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ స్పష్టంచేసింది. -
‘ఇదే.. ప్రంబనన్ ఆలయ వైభవం’ : ప్రధాని మోదీ
జోగ్జకర్తా (ఇండోనేషియా): ఇండోనేషియా పర్యటనలో ఉన్న భారత ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం నాడిక్కడ దాదాపు వెయ్యి ఏళ్ల నాటి చారిత్రక ప్రంబనన్ హిందూ దేవాలయాల సముదాయానికి సంబంధించిన అద్భుతమైన వైమానిక దృశ్యాలను (ఏరియల్ వ్యూ) షేర్ చేశారు. ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటోతో కలిసి హెలికాప్టర్లో ప్రయాణిస్తున్నప్పుడు ఈ యునెస్కో ప్రపంచ వారసత్వ కట్టడాన్ని చూసి, ‘అద్భుతమైన ప్రంబనన్ ఆలయం!’ అంటూ ప్రధాని మోదీ ‘ఎక్స్’ వేదికగా ప్రశంసించారు.భారతదేశ ఆర్థిక, సాంస్కృతిక సహాయంతో ఈ ఆలయ ప్రాంగణంలో చేపట్టనున్న పరిరక్షణ, పునరుద్ధరణ ప్రాజెక్టు అధికారిక ప్రారంభోత్సవానికి ముందు ఈ వైమానిక ప్రయాణం సాగింది. భారత్ అనుసరిస్తున్న ‘యాక్ట్ ఈస్ట్’ విధానంలో భాగంగా ఇరు దేశాల సాంస్కృతిక దౌత్యంలో ఇదొక కీలక మైలురాయిగా నిలిచింది. మంగళవారం ప్రధాని మోదీ, అధ్యక్షుడు ప్రబోవోల మధ్య జరిగిన ద్వైపాక్షిక చర్చల అనంతరం ఈ ప్రాజెక్టుకు సంబంధించిన లెటర్ ఆఫ్ ఇంటెంట్‌ను పరస్పరం మార్చుకున్నారు. The majestic Prambanan Temple! pic.twitter.com/pRS2S9X5gm— Narendra Modi (@narendramodi) July 8, 2026జావా ద్వీపంలో ఉన్న ప్రంబనన్ ఆలయ సముదాయం ఇండోనేషియాలోనే అతిపెద్ద హిందూ దేవాలయం. ఆగ్నేయాసియాలో కంబోడియాలోని అంగ్ కోర్ వాట్ తర్వాత ఇది రెండో స్థానంలో ఉంది. 9వ శతాబ్దంలో హిందూ మాతారామ్ రాజవంశానికి చెందిన రాజు రాకై పికాతన్ దీని నిర్మాణాన్ని ప్రారంభించగా, ఆయన వారసుడు లోకపాల పూర్తి చేశారు. ఇక్కడి శివ, విష్ణు, బ్రహ్మ ఆలయాలలో 47 మీటర్ల ఎత్తున్న ప్రధాన శివాలయం అత్యంత విశిష్టమైనది. ఈ ఆలయ గోడలపై చెక్కిన రామాయణ గాథ శిల్పాలు భారత్-ఇండోనేషియాల ప్రాచీన నాగరికత బంధానికి సజీవ సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. -
ఇండోనేసియా చేతికి బ్రహ్మోస్!
జకార్తా: భారత అమ్ముల పొదిలోని అత్యంత శక్తివంతమైన సూపర్సోనిక్ క్రూజ్ క్షిపణి బ్రహ్మోస్ ఇకపై మిత్రదేశం ఇండోనేసియా సైనిక పాటవాన్ని సైతం ద్విగుణీకృతంచేయనుంది. ఇరుదేశాల రక్షణ బంధాన్ని బలోపేతం చేయడమే లక్ష్యంగా బ్రహ్మోస్ క్షిపణులను ఇండోనేసియాకు సరఫరాచేసేందుకు భారత్ మంగళవారం సమ్మతి తెలుపుతూ ఒప్పందం కుదుర్చుకుంది. గగనతలం నుంచి ప్రయోగించి గగనతల లక్ష్యాలను ఛేదించే అస్త్ర క్షిపణిని సైతం ఇండోనేసియాకు సరఫరాచేయనున్నారు.ఇండోనేసియా పర్యటనలో ఉన్న భారత ప్రధాని మోదీ మంగళవారం ఆ దేశ అధ్యక్షుడు ప్రబోవో సుబియంతోతో విస్తృతస్థాయిలో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఉక్కు సరఫరా మొదలు, సముద్రప్రాంత భద్రత, ఔషధాలు, విద్య, అంతరిక్ష పరిశోధన, ఆవిష్కరణలు, టెలీకమ్యూనికేషన్స్, ఆహార భద్రత, అత్యంత అరుదైన లోహాలు, భూఅయస్కాంతాల వంటి ప్రధాన రంగాల్లో 14 కీలక ఒప్పందాలను కుదుర్చుకున్నారు. ద్వైపాక్షిక చర్చల తర్వాత సంయుక్త ప్రకటనలో మోదీ మాట్లాడారు. ఇకపై ఇరుదేశాల బంధంలో సువర్ణాధ్యాయం ఆరంభంకానుందని వ్యాఖ్యానించారు.బ్రహ్మోస్, అస్త్ర ఇలా రెండు రక్షణ రంగ కీలక ఉత్పత్తుల ఎగుమతికి సంబంధించి దాదాపు రూ.5,694 కోట్ల విలువైన ఒప్పందాలు ప్రధాని మోదీ సమక్షంలో కుదరడం ఇదే తొలిసారి కావడం విశేషం. పాక్ సైన్యాన్ని బెంబేలెత్తించిన బ్రహ్మోస్, అస్త్ర క్షిపణుల సత్తా చూశాక వీటి కొనుగోలుకు ఇండోనేసియా ఆసక్తి చూపడంతో వీటిని సరఫరాచేసేందుకు భారత్ తన సమ్మతి తెలిపింది. దక్షిణ చైనా సముద్రంపై చైనా తన భల్లూకం పట్టుబిగిస్తున్న నేపథ్యంలో ఆగ్నేయాసియాలో చైనా ఆధిపత్యానికి గండికొట్టేందుకు దాని సమీప దేశాల సైనికసామర్థ్యాలను భారత్ ఇనుమడింపజేయాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. అందుకే ఇండోనేసియాకు భారత్ తన బ్రహ్మోస్ వంటి కీలక ఆయుధాల సరఫరాకు ముందుకొచ్చింది.‘‘ఇండో–పసిఫిక్‌లో భద్రతకు మా సమష్టి శక్తియుక్తులు ఎంతో అవసరం. ఆసియా దేశాలకు భారత్ సదా సముచిత స్థానం, గౌరవం ఇస్తుంది. హిందూసముద్రప్రాంతంలోని భారత ఇంటిగ్రేటెడ్ ఫ్యూజన్ సెంటర్లోకి ఇండోనేసియా లియేసన్ ఆఫీసర్‌ను ఇకపై పంపవచ్చు. ఇరుదేశాల మధ్య పరస్పర విశ్వాసం అనేది రక్షణ, భద్రత, సముద్రయానంలో సహకారాన్ని బలోపేతంచేస్తోంది. ఇకపై విపత్తు నిర్వహణ, పారిశ్రామికసహకారం సహా ఎన్నో రంగాల్లో మరింతగా సహకరించుకోబోతున్నాం. మలక్కా జలసంధి ప్రాంతంలో వ్యూహాత్మకంగా కీలకమైన సబాంగ్ నౌకాశ్రయాన్ని ఇరుదేశాలు సంయుక్తంగా అభివృద్ధి చేయనున్నాయి’’అని మోదీ ప్రకటించారు. ఈ పోర్ట్ భారత గ్రేట్ నికోబార్ పోర్ట్ ప్రాజెక్ట్‌కు కేవలం 100 మైళ్లదూరంలో ఉండటం గమనార్హం. భారీస్థాయిలో పెట్టుబడులు... ‘‘ఉక్కు, నికెల్, అరుదైన భూ అయస్కాంతాల ఉత్పత్తికి సంబంధించిన ఇండోనేసియా పరిశ్రమల్లో భారత్ పెట్టుబడుల వరద పారిస్తాం. నేటి ప్రపంచంలో ఉత్పత్తుల సరఫరా గొలుసు పటిష్టంగా ఉండటమనేది కీలకంగా తయారైంది. అందుకే ఇండోనేసియాలో అరుదైన మూలకాలు, స్టీల్ సరఫరా గొలుసు బలోపేతానికి కృషిచేస్తాం. దీనికితోడు ఇండోనేసియా చెల్లింపుల వ్యవస్థతో భారత్‌కు చెందిన యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్(యూపీఐ) అనుసంధానమై అక్కడి పౌరులకు సేవలు అందిస్తాం. 2018లో సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యంగా ఉన్నతిపొందిన ఇరుదేశాల బంధం ఇప్పుడు సరికొత్త శిఖరాలను అధిరోహిస్తోంది.సహకార రంగంతోపాటు అభివృద్ధి, భద్రత, సాంకేతిక, సాంస్కృతిక, విద్యరంగాల్లోనూ సువర్ణాధ్యాయం మొదలుకాబోతోంది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్(ఐఐఎం)బెంగళూరు శాఖను ఇండోనేసియాలోని ఈస్ట్ జావా ప్రావిన్స్‌లోని సింఘసారీ స్పెషల్ ఎకనమిక్ జోన్లో ఆరంభించబోతున్నాం’’అని మోదీ తెలిపారు. 140 కోట్ల జనాభా ఉన్న దేశంలో ఎన్నికల నిర్వహణలో భారత్ సాధించిన అపార అనుభవం ఇండోనేసియాకు అక్కరకురానుంది. ఎన్నికల నిర్వహణతోపాటు ఈవీఎంల ఎగుమతికి సంబంధించి ఇరుదేశాల మధ్య అవగాహనఒప్పందం కుదిరింది. మోదీకి ఇండోనేసియా అత్యున్నత పురస్కారంఇరుదేశాల మధ్య సత్సంబంధాల బలోపేతానికి మోదీ చేస్తున్న కృషికిగాను ఇండోనేసియా తమ దేశ అత్యున్నత పౌర పురస్కారం ‘బింటాంగ్ ఆదిపూర్ణ ఆఫ్ ది రిపబ్లిక్ ఆఫ్ ఇండోనేసియా’తో సత్కరించింది. సుబియంతో స్వయంగా దీనిని మోదీకి ప్రదానంచేశారు. ఈ సందర్భంగా మోదీ ‘ఎక్స్’లో ఒక పోస్ట్‌చేశారు. ‘‘అవార్డ్ పొందటం ఎంతో గర్వంగా ఉంది. పురస్కారం గౌరవం కోట్లాదిమంది భారతీయులకు దక్కుతుంది’’అని అన్నారు.నేడు ప్రాంభనన్ ఆలయ సందర్శనమంగళవారం మోదీ యోగ్యకర్త నగరంలోని అతిపెద్ద శివాలయం ప్రాంభనన్ను దర్శించుకోనున్నారు. ప్రపంచ వారసత్వ సంపద జాబితాలో నిలిచిన వెయ్యేళ్ల చరిత్ర గల ఈ ఆలయ కాంప్లెక్స్ పరిరక్షణ, పునరుద్ధరణ ప్రాజెక్ట్‌లో భారత్ సైతం పాలుపంచుకోనుంది. ఈ ప్రాజెక్ట్ ఆరంభించేందుకు ఆసక్తి పత్రాలను ఇరుదేశాల ఉన్నతాధికారులు ఇచ్చిపుచ్చుకున్నారు. ఈ ఆలయాన్ని పదో శతాబ్దంలో నిర్మించారు.సంస్కరణలు, పనితీరు, పెనుమార్పు⇒ ఇదే మంత్రంతో భారత్ దూసుకెళ్తోంది⇒ ఇండోనేసియాలో భారతీయులనుద్దేశించి మోదీ ప్రసంగంజకార్తా: సంస్కరణలు, పనితీరు, పెనుమార్పు మంత్రం జపిస్తూ భారత్ ముందుకు దూసుకెళ్తోందని ప్రధాని మోదీ అన్నారు. ఇండోనేసియాలోని జకార్తా నగరంలో పర్యటిస్తున్న మోదీ మంగళవారం అక్కడి భారతీయ సంతతి ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. ‘‘భారత్ జపిస్తున్న స్వావలంభన మంత్రం ఒక్క ఇండోనేసియాకేకాదు యావత్ ఆసియాన్ దేశాలు ఆచరించాలి. భారత్ ఒక్కో సంస్కరణను అమలుచేస్తూ వస్తోంది. ఇప్పుడు భారత్ పెనుమార్పులకు నిలయంగా మారింది. భారత ప్రగతి వేగాన్ని ఒక్క వాక్యంలో చెప్పాలంటే 140 కోట్ల స్ఫూర్తికణికలు ప్రజ్వరిల్లుతున్నాయి’’ అని మోదీ వ్యాఖ్యానించారు. భారత్ ప్రపంచంలో వేగంగా అభివృద్ధిచెందుతున్న ఆర్థికవ్యవస్థ మాత్రమేకాదు ఇది వంద కోట్ల కలల పయనం. ఇంధనం, అనుసంధానం, చిప్‌ల తయారీ ఇలా ప్రతి రంగంలోనూ భారత్ ముందడుగేస్తోంది. భారత్ సొంత కలలనేకాదు సోదర దేశాల కలలనూ తీర్చేందుకు తహతహలాడుతోంది. సబ్కా సాథ్, సబ్కా వికాస్ మంత్రాన్నీ మేం పఠిస్తాం. భారత్ తన నౌకాశ్రయాలను ఆధునీకరిస్తోంది. నూతన సముద్రమార్గాలను అన్వేíÙస్తోంది. ఈ పయనంలో ఇండోనేసియా మాకు మంచి మిత్రునిగా వెంట నడుస్తోంది’’ అని అన్నారు. నాలో ఇండియా డీఎన్ఏ: సుబియంతో మోదీ ప్రసంగం వేళ అక్కడే ఉన్న ఇండోనేసియా అధ్యక్షుడు సుబియంతో మాట్లాడారు. ‘‘అధికార పగ్గాలు చేపట్టిన 3 నెలలకే భారత్ ఆహా్వనించింది. గత ఏడాది భారత గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నా. ముఖ్య అతిథిగా ఆహ్వానించిన భారత్‌కు నా కృతజ్ఞతలు. 1950లో భారత తొలి గణతంత్ర వేడుకలకు ఇండోనేసియా తొలి అధ్యక్షుడు సుకర్ణో హాజరయ్యారు. ఇలా 2 దేశాలు దశాబ్దాలుగా మిత్రులుగా మెలుగుతున్నాయి. గత ఏడాది భారతపర్యటన ముగించుకుని తిరిగిరాగానే జన్యక్రమ విశ్లేషణ పరీక్ష చేయించుకున్నా. డీఎన్ఏ టెస్ట్ పూర్తయింది. నాలో భారతీయ డీఎన్ఏ ఉన్నట్లు నిర్ధారణ అయింది. అందుకే అనుకుంటా.. ఎప్పుడు భారతీయ సంగీతం విన్నాసరే నా శరీరం ఉత్సాహంతో ఉరకలెత్తుతుంది. నా కేబినెట్ మంత్రులు, ఆర్మీ జనరల్స్ కూడా డాన్స్ ఇష్టపడతారు. పాడటమూ ఇష్టమే. ఒకవేళ వాళ్లలోనూ చాలా మందిలో భారత డీఎన్ఏ ఉందేమో’’ అని సుబియంతో అనగానే అక్కడి వాళ్లంతా ఫక్కున నవ్వారు. మోదీ పథకాలు కాపీ కొట్టా.. మోదీ గౌరవార్థం ఇచ్చిన విందులో సుబియంతో మాట్లాడారు. మోదీనుద్దేశిస్తూ.. ‘‘భారత్‌లో మీరు చేపట్టే అభివృద్ధి, సంక్షేమ పథకాలు, కార్యక్రమాలను నేను అచ్చుగుద్దినట్లు ఇండోనేసియాలో అమలుచేసేందుకు ప్రయత్నిస్తుంటా. ఎన్నో పథకాలను కాపీ చేశా. ఇది బహిరంగంగా చెప్పడానికి ఏమాత్రం సంకోచించను’’ అని అన్నారు.విస్తరణవాదానికి దూరంగా ప్రగతిపథానికి దగ్గరగా ఇదే భారత్ పంథా: మోదీ జకార్తా: భారత్ ఎల్లవేళలా అభివృద్ధి పథంలోనే పయనిస్తోందని, ఏనాడూ విస్తరణవాదం వైపు మొగ్గుచూపలేదని ప్రధాని మోదీ స్పష్టంచేశారు. ఇండోనేసియా పార్లమెంట్లో అక్కడి చట్టసభ సభ్యులనుద్దేశించి మోదీ ప్రసంగించారు. ‘‘ఇరుదేశాల మైత్రి మరింతగా విస్తరించాలి. 140 ఏళ్ల భారతీయులు, 29 కోట్ల ఇండోనేసియన్ల ఉమ్మడి శ్రేయస్సు కోసం ముందడుగువేద్దాం. స్వేచ్ఛాయుత, పారదర్శకమైన, సమ్మిళిత ఇండో–పసిఫిక్ కోసం భారత్ ఎల్లప్పుడూ కృషిచేస్తుంది. ఇండో–పసిఫిక్‌లో స్వేచ్ఛావాణిజ్యాన్ని భారత్ కోరుకుంటోంది. భారత్ ఏనాడైనా అభివృద్ధి బాటనే అనుసరిస్తుంది. రాజ్య విస్తరణవాదం వైపు అస్సలు నడవదు’’అంటూ దక్షిణచైనా సముద్రంలో చైనా ఆధిపత్యం, ఆగ్నేయాసియా దేశాల్లో ఉద్రిక్త పరిస్థితులను మోదీ పరోక్షంగా ప్రస్తావించారు. -
మోదీ ఖాతాలో మరో పురస్కారం.. "భారతీయులకు దక్కిన గౌరవం"
జకార్తా: భారత ప్రధాని నరేంద్ర మోదీకి అరుదైన గౌరవం దక్కింది.ఇండోనేషియా అత్యున్నత పురస్కారం 'బింతాంగ్ ఆదిపూర్ణ'ను ఆదేశ అధ్యక్షుడు ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో చేతుల మీదుగా (మంగళవారం) పీఎం మోదీ అందుకున్నారు. ఈ అవార్డు కోట్లాదిమంది భారతీయులకు దక్కిన గౌరవమని మోదీ పేర్కొన్నారు.భారత్-ఇండోనేషియా రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషించినందుకు గాను ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఇండోనేషియా అత్యున్నత పురస్కారమైన 'బింతాంగ్ ఆదిపూర్ణ' ఇండోనేషియా ప్రభుత్వం ప్రకటించింది. ఈ సందర్భంగా ప్రధానమంత్రిఎక్స్ (ట్విట్టర్) వేదికగా స్పందిస్తూ..."ఈ ఉదయం నాకు ఇండోనేషియా అత్యున్నత పురస్కారాన్ని ఎంతో ఆప్యాయతతో అందించారు. ఈ గౌరవం కోట్లాది మంది భారతీయులకు దక్కినది... ఇది ఇండోనేషియా ప్రజల సెంటిమెంట్‌కు, భారత్-ఇండోనేషియాల మధ్య ఉన్న చారిత్రాత్మక, సన్నిహిత సంబంధాలకు ప్రతీక. ఈ సందర్భంగా అధ్యక్షుడు ప్రబోవో జీకి, ఇండోనేషియా ప్రభుత్వానికి ఇక్కడి ప్రజలకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నాను" అని పీఎం మోదీ పేర్కొన్నారు.విదేశాంగ శాఖ స్పందనవిదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఈ అవార్డును "భారత్-ఇండోనేషియా స్నేహానికి దక్కిన నివాళి" గా అభివర్ణించారు. మన సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత లోతుగా చేయడంతో పాటు, భారత్ - ఆసియాన్ సంబంధాలను బలోపేతం చేయడానికి పీఎం మోదీ చేసిన నిరంతర కృషికి ఈ పురస్కారమే నిదర్శనమని విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ ఎక్స్‌లో రాసుకొచ్చారు.'బింతాంగ్ ఆదిపూర్ణ' పురస్కార చరిత్రఈ అవార్డును 1959 లో ఇండోనేషియా ప్రభుత్వం ప్రారంభించింది. ఇది రిపబ్లిక్ ఆఫ్ ఇండోనేషియాలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన, అత్యున్నతమైన పురస్కారం. ఇండోనేషియా రిపబ్లిక్ యొక్క ఐక్యత, నిరంతర వృద్ధి, శ్రేయస్సు కోసం అసాధారణమైన సేవలు అందించిన వ్యక్తులకు ఈ అత్యున్నత గౌరవాన్ని అందజేస్తారు. -
తెలంగాణపై బీజేపీ ఆపరేషన్ 2028.. అసలు గేమ్ మొదలైందా?
తెలంగాణ రాష్ట్రంలో అధికారాన్ని కైవసం చేసుకోవడానికి భారతీయ జనతా పార్టీ ప్రయత్నాలు ఆరంభించింది. ప్రధాని మోదీనే ఇందుకు శ్రీకారం చుట్టారు. బీజేపీ అధ్యక్షుడు నితిన్ నబీన్ కొద్ది రోజుల క్రితం తెలంగాణలో పర్యటించి వివిధ సభలలో పాల్గొన్నారు. ఆయన చేసిన ప్రసంగాలు గమనిస్తే.. 2028 శాసనసభ ఎన్నికలలో ఎలాగైనా తెలంగాణపై కాషాయ జెండా ఎగురవేయాలన్న సంకల్పం కనిపిస్తుంది. ఆయన కొత్తగా అధ్యక్షుడు అయినందున భవిష్యత్తులో వచ్చే ఎన్నికలన్నీ ఆయన సామర్థ్యానికి పరీక్షలు అవుతాయి. జయాపజయాలపై పూర్తిగా ఆయనదే బాధ్యత కాకపోవచ్చు. కాని సహజంగానే ఆయనపై అందరి దృష్టి ఉంటుంది.నితిన్ చేసిన ప్రసంగాలలో కొన్ని కీలక అంశాలు కనిపిస్తాయి. పశ్చిమబెంగాల్లో మాదిరే విజయం సాధించాలని, అందుకోసం ప్రజా సమస్యలపై పోరాటాలు చేయాలని ఆయన పార్టీ శ్రేణులకు పిలుపు ఇచ్చారు. తెలంగాణలో గెలుపుపై ధీమాను కూడా ఆయన వ్యక్తం చేశారు. ప్రజాసమస్యలపై పోరాటాలు చేస్తే తప్పుకాదు. కాని మతపరమైన అంశాలతో ప్రజలను రెచ్చగొట్టడం, ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణలో లక్షల ఓట్ల తొలగింపు వంటివి జరుగుతాయా అన్న సందేహం వస్తుంది.బెంగాల్లో టీఎంసీ అధినేత్రి మమత బెనర్జీ ఆధ్వర్యంలోని ప్రభుత్వంపై వ్యతిరేకత ఉండవచ్చు. కాని దానికి మించి బీజేపీ కేంద్రంలో తనకు ఉన్న అధికారాన్ని ఉపయోగించి మమతను ఉక్కిరిబిక్కిరి చేయడానికి యత్నించింది. తన చేతిలో ఉండే సీబీఐ, ఈడి వంటి సంస్థలను విచ్చలవిడిగా టీఎంసీనేతలపై ప్రయోగించిందన్న విమర్శలు వచ్చాయి. తెలంగాణలో కూడా ఇలాంటి వ్యూహాలను అమలు చేసే అవకాశం ఉందా? అంటే లేదని చెప్పడం కష్టమే.గత పార్లమెంట్ ఎన్నికలలో తెలంగాణలో ఎనిమిది సీట్లను సాధించి బీజేపీ సంచలనం సృష్టించింది. ఆ ఎన్నికలలో బీఆర్ఎస్ బాగా బలహీనపడినట్లు కనిపించినా, తర్వాత యధా ప్రకారం ఆ పార్టీ అగ్రనేతలు బాగా యాక్టివ్ అయి టూర్లు చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు సాగిస్తున్నారు. అందువల్లే కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఒక ప్రకటన చేశారు. మాచ్ పిక్సింగ్ చేసుకుంటే తప్ప బీజేపీ అధికారంలోకి రాలేదని వ్యాఖ్యానించారు. ఆ సంగతి ఎలా ఉన్నా, తెలంగాణలో వాతావరణం బీజేపీకి అనుకూలంగా ఉందని చెప్పే పరిస్థితి కనిపించడం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వంపై కొంత వ్యతిరేకత ఉన్నా అది బీజేపీకి ప్లస్ అవుతుందన్న నమ్మకం ఇంకా రా లేదు.జనంలో ఉన్న ఒక అభిప్రాయం ప్రకారం కాంగ్రెస్, బీఆర్ఎస్ల మధ్యే ప్రధాన పోటీ ఉండవచ్చనిపిస్తుంది. అందుకే ఒక నెల రోజులలో తెలంగాణలో బీజేపీకి అనుకూల పరిస్థితులు తయారు కావాలని నితిన్ నబీన్ పార్టీ నేతలను ఆదేశించారు. హైదరాబాద్‌లోని కార్పొరేషన్లకు జరిగే ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని విజయాలు సాధించాలని ఆయన నిర్దేశించారు. ఇందుకోసం రాష్ట్ర బీజేపీ నేతలు కలిసికట్టుగా ఎంత దూకుడుగా వెళతారు? కేంద్రంలో తమకు ఉన్న అధికారాన్ని ఇక్కడ కూడా ఏ మేరకు ప్రయోగిస్తారు? రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌తో పాటు ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ను ఎదగనీయకుండా చేయడానికి ప్రత్యేక ప్రణాళికను ఏమైనా అమలు చేస్తారా? అన్నది చర్చనీయాంశం అవుతుంది.ఈ క్రమంలో బీజేపీ ఒంటరి పోరుకే సిద్ధపడవచ్చని ఆ పార్టీ నేతలు సంకేతాలు ఇస్తున్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా కొద్దికాలం క్రితం ఇదే మాట ఓపెన్‌గా చెప్పారు. ఇతర రాష్ట్రాలలో ఇప్పటికే ఉన్న పొత్తులు కొనసాగిస్తారా? లేక అక్కడ కూడా ఒంటరిగా ఎదగడానికి యత్నిస్తారా? అన్నదానిపై క్లారిటీ లేదు. తెలుగు రాష్ట్రాలలో ఉన్న ప్రత్యేక పరిస్థితుల రీత్యా బీజేపీ ఇక్కడ ఒంటరిగా పోటీచేస్తే ఏపీలో దాని మిత్రపక్షాలుగా ఉన్న టీడీపీ, జనసేన పార్టీలు ఎవరికి మద్దతు ఇస్తాయి అన్న చర్చ వస్తుంది. పెద్దగా బలం లేకపోయినా, ఆ పార్టీలకు ఎంతో కొంతమంది అభిమానులు ఉంటారు. టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలంగాణలో కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సన్నిహితంగా ఉంటారు. ఇద్దరు గురుశిష్యులుగా పేరొందారు.కొద్ది రోజుల క్రితం జరిగిన ఒక సభలో కర్నాటక ముఖ్యమంత్రి డీ.కే శివకుమార్‌తో కలిసి చంద్రబాబు, రేవంత్‌లు పాల్గొన్నారు. డీ.కే మాట్లాడుతూ తాము ముగ్గురం కలిసి చరిత్ర సృష్టించబోతున్నామని వ్యాఖ్యానించారు. రేవంత్‌ను చంద్రబాబు పొగిడారు. తెలంగాణ అభివృద్ది కోసం రేవంత్ బాగా కష్టపడుతున్నారని, తెలంగాణ ప్రాజెక్టుల కోసం రేవంత్ రాజీ పడరని ప్రశంసించారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావాలని అనుకుంటున్న సమయంలో బీజేపీ మిత్రుడైన చంద్రబాబు ఇలా కాంగ్రెస్ నేతను మెచ్చుకోవడం ఆసక్తికరమైన అంశమే. దీనిపై ఏమి మాట్లాడాలో బీజేపీ తెలంగాణ నేతలకు అర్థం కావడం లేదు. అందుకే ఏపీకే తమ మితృత్వం పరిమితమని, ఇక్కడ టీడీపీ తన సొంత వ్యూహం అమలు చేయవచ్చని వారు చెబుతున్నారు.మరో వైపు రేవంత్ రెడ్డి తనకు టీడీపీతో ఉన్న సంబంధాలను వాడుకుంటూ ఆ పార్టీకి కాస్తో, కూస్తో ఉన్న క్యాడర్‌ను, అభిమానులను కాంగ్రెస్ వైపు ఆకర్షించడానికి యత్నిస్తున్నారు. టీడీపీతో పాటు ఒక సామాజికవర్గం ఓట్లను దృష్టిలో ఉంచుకుని ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ చేశారు. టీడీపీ వారు కూడా కాంగ్రెస్‌కే మద్దతు ఇచ్చేలా వ్యవహరిస్తున్నారు. దీనిని కాంగ్రెస్ అధికార ప్రతినిదులు బహిరంగంగానే అకనాలెడ్జ్ చేస్తూ, టీడీపీ తమకే మద్దతు ఇస్తుందని టీవీ చర్చలలో చెబుతున్నారు. ఈ నేపథ్యంలో వచ్చే నగరపాలక సంస్థల ఎన్నికలు పలు రాజకీయ పరిణామాలకు కీలకంగా ఉండవచ్చు. ఈ ఫలితాల ప్రభావం భవిష్యత్తులో తెలంగాణ శాసనసభ ఎన్నికలపై పడే అవకాశం ఉంది.చంద్రబాబు వ్యూహాత్మకంగా రేవంత్ ద్వారా కాంగ్రెస్ అధిష్టానంతో పరోక్ష స్నేహం కొనసాగిస్తున్నారని, అలాగే చంద్రబాబు ద్వారా రేవంత్ బీజేపీ అగ్ర నాయకత్వంతో సంబంధాలు పెట్టుకోగలిగారన్న ప్రచారం రాజకీయ వర్గాలలో ఉంది. అయితే దీనికి ఇప్పటికిప్పుడు ఆధారాలు కనిపించకపోవచ్చు. కాకపోతే ప్రధాని మోదీ తన సభలో రేవంత్‌ను ఉద్దేశించి తమతో కలిసి పనిచేయాలని అంటూ చేసిన వ్యాఖ్యలను కొందరు ఉదహరిస్తుంటారు. అంతేకాక రేవంత్‌కు మోదీ అప్పాయింట్మెంట్ ఇచ్చే విధానాన్ని కూడా కొందరు ప్రస్తావిస్తుంటారు.కాగా ఇటీవల మెట్రో రైల్ వివాదంలో రేవంత్ కోరిక మేరకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చొరవ తీసుకుని సంబంధిత కేంద్ర మంత్రులతో చర్చలు జరిగేలా చూశారు. అయినా మెట్రో రుణం విషయం కాని, రెండో దశ గురించి కాని స్పష్టత రాలేదు. రేవంత్‌కు సహకరిస్తున్నట్లు కనిపిస్తూనే బహుశా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడానికి బీజేపీ ఈ వ్యూహం అమలు చేస్తోందా అన్న అభిప్రాయం కలుగుతుంది. కాంగ్రెస్‌తో పాటు ప్రాంతీయ పార్టీ అవకాశవాద రాజకీయాలు చేస్తున్నాయని నితిన్ మండిపడ్డారట. ఒకవైపు అలాంటి ప్రాంతీయ పార్టీలతో జతకడుతూ, మరోవైపు ఇలా ఉపన్యాసాలు ఇస్తే వినే జనం ఆశ్చర్యపోవల్సిందే.వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకం అని వీరు చెబుతారు. కాని అదే వారసత్వ రాజకీయాలు చేసే పార్టీలతో మితృత్వం చేస్తుంటారు. అవకాశవాద రాజకీయాలకు బీజేపీ అతీతం కాదని చెప్పడానికి ఇవన్ని ఉదాహరణలే అవుతాయి. ఏది ఏమైనా తన అధికారాన్ని అడ్డు పెట్టి ప్రత్యర్థి రాజకీయ పార్టీలపై వేదింపులు, అక్రమ కేసులు, సీబీఐ, ఈడి సంస్థల దాడులు వంటివి చేయకుండా ఫెయిర్ రాజకీయం చేసి తెలంగాణలో కాషాయ జెండా ఎగురవేస్తే ఎవరికి అభ్యంతరం ఉండదు. కాని ప్రస్తుత బీజేపీ నాయకత్వం అలాంటి నిబద్దత కలిగిన రాజకీయం చేస్తోందా అన్నదే ప్రశ్న.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
భారత్-ఇండోనేషియా మధ్య కీలక ఒప్పందాలు
జకార్తా: భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇండోనేషియా పర్యటనలో భాగంగా ఆ దేశ అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటోతో భేటీ అయ్యారు. జకార్తాలోని అధ్యక్ష భవనం ‘ఇస్తానా మెర్డెకా’ వద్ద ప్రధానికి సైనిక వందనంతో ఘన సాంప్రదాయ స్వాగతం లభించింది. ఇరు దేశాల సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేసే దిశగా ఈ పర్యటన ఒక కీలక అడుగు అని విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ పేర్కొన్నారు. ఈ పర్యటన పరస్పర నమ్మకాన్ని, స్నేహాన్ని మరింత పటిష్టం చేస్తుందన్నారు.రెండు దేశాల మధ్య రక్షణ, సాంకేతిక రంగాల్లో కీలక ఒప్పందాలు జరిగాయి. భారతదేశ ఎన్నికల విధానానికి లభించిన గుర్తింపుగా, ఇండోనేషియా కోసం ప్రత్యేకంగా ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లను రూపకల్పన చేయడానికి భారత్ సహకరించనుంది. అలాగే, ‘ఆపరేషన్ సిందూర్’ సమయంలో విజయవంతంగా నిరూపితమైన భారత ఎయిర్-టు-ఎయిర్ మిస్సైల్ సాంకేతికతను చూసి, భారత్ నుండి ‘అస్త్రా’ క్షిపణులను కొనుగోలు చేయడానికి ఇండోనేషియా ఆసక్తి చూపింది. కీలక ఖనిజాల సరఫరాను మెరుగుపరిచేందుకు ఇండోనేషియాలో ఉక్కు, నికెల్, అరుదైన భూ అయస్కాంతాల తయారీకి భారత్ ప్రణాళికలు సిద్ధం చేసింది. బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణుల నిల్వలను పెంచుకునేందుకు ఇండోనేషియాకు భారత్ మరిన్ని మిస్సైల్ బ్యాటరీలను సరఫరా చేయనుంది. వ్యూహాత్మక మలక్కా జలసంధికి సమీపంలో, భారత్ కు చెందిన గ్రేట్ నికోబార్ పోర్టు ప్రాజెక్టుకు కేవలం 100 మైళ్ల దూరంలో ఉన్న 'సబాంగ్' రేవు అభివృద్ధిపై ఇరు దేశాలు ముందడుగు వేశాయి.ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం, వ్యూహాత్మక సహకారాన్ని పెంపొందించుకోవడమే లక్ష్యంగా ప్రధాని మోదీ మూడు దేశాల అధికారిక పర్యటన చేపట్టారు. దీనిలో భాగంగా ఇండోనేషియా చేరుకున్న భారత ప్రధాని మోదీకి సైనిక, సంప్రదాయ స్వాగతం లభించింది. 2018లో ఉభయ దేశాల మధ్య సంబంధాలను ‘సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం’గా మార్చిన తర్వాత ప్రధాని మోదీ ఇండోనేషియాలో పర్యటించడం ఇదే తొలిసారి. భారత ప్రధాని విమానం ఇండోనేషియా గగనతలంలోకి ప్రవేశించగానే అక్కడి వాయుసేన యుద్ధ విమానాలు ఆయనకు రక్షణగా ఎస్కార్ట్ ఇచ్చాయి. అనంతరం విమానాశ్రయంలో అధ్యక్షుడు ప్రబోవో స్వయంగా ఆయనకు స్వాగతం పలికారు.రక్షణ, సముద్ర తీర భద్రతతో పాటు ఇండోనేషియా బ్రహ్మోస్ క్షిపణుల కొనుగోలు వంటి కీలక అంశాలు ఇరు దేశాల చర్చల ఎజెండాలో ఉన్నాయి. ‘మహాసాగర్’విధానం ద్వారా ఇండో-పసిఫిక్ ప్రాంతంలో భద్రత, స్థిరత్వాన్ని పెంపొందించడమే ఈ పర్యటన ముఖ్య ఉద్దేశమని మోదీ పేర్కొన్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన ప్రముఖ యునెస్కో వారసత్వ కట్టడమైన ప్రాంబనన్ ఆలయాన్ని సందర్శించనున్నారు. ఈ పర్యటన ముగిసిన అనంతరం ప్రధాని ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లో పర్యటించనున్నారు.Addressing the joint press meet with President Prabowo Subianto of Indonesia.@prabowo https://t.co/LrvzAuUjzi— Narendra Modi (@narendramodi) July 7, 2026 ఇండోనేషియా అత్యున్నత పౌర పురస్కారంప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఇండోనేషియా అత్యున్నత పౌర పురస్కారం ‘బింటాంగ్ ఆదిపూర్ణ’ లభించింది. మంగళవారం జకార్తాలోని ఇస్తానా మెర్డెకా ప్రెసిడెన్షియల్ ప్యాలెస్‌లో ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో ఈ ప్రతిష్టాత్మక పతకాన్ని పీఎం మోదీకి బహూకరించి గౌరవించారు. ఇండోనేషియా దేశ ఐక్యత, నిరంతర అభివృద్ధి, శ్రేయస్సు కోసం విశేష సేవలు అందించిన వ్యక్తులకు 1959 నుంచి ఈ అత్యున్నత పురస్కారాన్ని అందజేస్తున్నారు.#WATCH | Jakarta, Indonesia: Prime Minister Narendra Modi recieves a ceremonial welcome in Jakarta. PM Modi will hold bilateral discussions with President Prabowo today. (Source: ANI/DD) pic.twitter.com/I4vccGkNRt— ANI (@ANI) July 7, 2026 -
యుద్ధవిమానాలు తోడ్కొని రాగా..
జకార్తా: భారత ప్రధాని నరేంద్ర మోదీకి ఇండోనేసియా ప్రభుత్వం అరుదైన గౌరవం కల్పించింది. మిత్రదేశ సారథికి సాదర స్వాగతం పలికేందుకు అత్యంత అధునాతన యుద్ధవిమానాలను ఎదుర్కోలుకు పంపింది. సోమవారం ఢిల్లీ నుంచి బయల్దేరిన మోదీ విమానం ఇండోనేసియా గగనతలంలోకి రాగానే ఆ దేశానికి చెందిన ఎఫ్–16, సుఖోయ్–30 యుద్దవిమానాలు ఎదురొచ్చి మరీ సాదరంగా జకార్తా అంతర్జాతీయ విమానాశ్రయానికి దారిచూపించాయి. ఫైటర్జెట్లు ఎస్కార్ట్‌గా వెంట రావడంపై ప్రధాని మోదీ సంతోషం వ్యక్తంచేస్తూ ‘ఎక్స్’లో ఒక పోస్ట్‌పెట్టారు.గగనతలం మొదలు ఎయిర్పోర్ట్ దాకా ఇండోనేసియా ప్రభుత్వం చేసిన సాదర స్వాగత కార్యక్రమం తన మనసును హత్తుకుందని మోదీ వ్యాఖ్యానించారు. ఎయిర్‌పోర్ట్‌లో దిగగానే ప్రధాని మోదీకి ఇండోనేసియా అధ్యక్షుడు ప్రబోబో సుబియంతో సాదరస్వాగతం పలికారు. నలుగురు మంత్రులతో కలిసి వచి్చమరీ ఆయన ప్రధానిని ఆప్యాయంగా హత్తుకుని కుశల ప్రశ్నలువేశారు. మంగళవారం సుబియంతో, మోదీ సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం పటిష్టతే లక్ష్యంగా కీలక రంగాల్లో సహకారం, వాణిజ్యంపై ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు.ఇరుదేశాల బంధాన్ని 2018లో సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం స్థాయికి ఉన్నతీకరించాక మోదీ ఇక్కడకు రావడం ఇదే తొలిసారి. ‘‘మంగళవారం సుబియంతోతో కలిసి యోగ్యకర్త నగరంలోని దేశంలోనే అతిపెద్ద హిందూ దేవాలయం ప్రభానన్ను దర్శించుకుంటా. ఇది ఇరుదేశాల సాంస్కృతిక సంబంధాలను ప్రతిబింబించనుంది. భారతీయులతోనూ మాట్లాడబోతున్నా. విదేశంలో భారతీయులు స్వాగతం పలకడం ఎంతో ఆనందంగా ఉంది. విదేశంలో ఉంటూ భారత ప్రగతికి వీళ్లంతా కృషిచేయడం ఎంతో స్ఫూర్తిదాయకం. భారతీయ సంగతి తమ ఘన విజయాల ద్వారా భారత బంధాన్ని ప్రపంచ దేశాలతో బలపరుస్తున్నారు’’అని మోదీ ‘ఎక్స్’లో పేర్కొన్నారు. నృత్య ప్రదర్శన, తోలు బొమ్మలాట.. ఎయిర్పోర్ట్ నుంచి తాను బసచేయబోయే హోటల్‌కు చేరుకోగానే అక్కడే వేచి ఉన్న భారతీయులు మోదీకి స్వాగతం పలికారు. వాళ్లతో మోదీ కొద్దిసేపు మాట్లాడి షేక్‌హ్యాండ్ ఇచ్చి సెల్ఫీలు దిగారు. ఈ సందర్భంగా రామయణ గాథను కళాత్మకంగా వివరిస్తూ కళాకారులు ప్రదర్శించిన ఇండోనేసియా సంప్రదాయక తోలుబొమ్మలాట ‘వయాన్గ్ కులిత్’ను మోదీ తిలకించారు. సమన్వయ గ్రూప్ చేసిన భరతనాట్యం నృత్య ప్రదర్శననూ ప్రధాని ఆసక్తిగా చూశారు.బౌద్ధమతంలోని త్రిరత్న(బుద్ధ, ధామ, సంఘ)ను వివరిస్తూ విహార ధర్మరత్న బృందంచేసిన ప్రదర్శన తననెంతో ఆకట్టుకుందని మోదీ ఆ కళాకారులను పొగిడారు. భారత్ యాక్ట్ ఈస్ట్ ఆసియా, మహాసాగర్ విజన్‌లో భాగంగా మోదీ సోమవారం మూడు దేశాల పర్యటన మొదలెట్టారు. ఇండోనేసియా పర్యటన తర్వాత అటునుంచి మోదీ ఆస్ట్రేలియాకు వెళ్లనున్నారు. ఆ దేశ ప్రధాని ఆంటోనీ అల్బనిస్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. తర్వాత న్యూజిలాండ్‌కు వెళ్లి ఆ దేశ ప్రధాని క్రిస్టోఫర్ లక్సన్‌తోనూ చర్చలు జరపనున్నారు. -
జపాన్‌తో కాలానుగుణ ఒప్పందాలు
జపాన్ ప్రధాని సనాయే తకాయిచీ భారత పర్యటన రెండు ప్రత్యేక నేపథ్యాల మధ్య జరిగింది. ఒకటి ఆర్థికమైనది, మరొకటి రక్షణ పరమైనది. ఈ రెండు నేపథ్యాలు ఇరు దేశాలకూ వర్తించేవే. అదే సమయంలో ఒకటి గుర్తించాలి. ఆర్థికమైన వర్తింపు ఉభయులకూ సమానమే కాగా, రక్షణ కోణంలో కొన్ని సామ్యాలతో పాటు కొన్ని తేడాలున్నాయి. ప్రధాని మోదీ, తకాయిచీ మధ్య ఢిల్లీలో ఈ నెల 2న జరిగిన చర్చలు, ఒప్పందాలు కూడా ఈ పరిస్థితులన్నింటిని ప్రతిఫలించాయి. వేర్వేరు దేశాల మధ్య ఆర్థిక సంబంధాలు, వాటి అభివృద్ధి ప్రయత్నాలు ఎప్పుడూ ఉండేవే. ఆర్థిక వ్యవస్థల రీత్యా ప్రముఖమైనవి అయిన ఇండియా, జపాన్ వంటి దేశాల మధ్య ఇవి ఇంకా బహు ముఖంగా ఉంటాయి. ఆ మేరకు వేర్వేరు రంగాలలో వాణిజ్యం, పెట్టుబడులు, కొత్త ఒప్పందాలు ఎల్లప్పుడూ ఉన్నవే. అటువంటి స్థితిలో కొత్తగా ఏర్పడిందంటున్న ప్రత్యేక నేపథ్యం ఏమిటి?ప్రత్యేక నేపథ్యంఈ ప్రశ్నకు సమాధానం చర్చల అనంతరం ఇరువురు ప్రధానులు విడుదల చేసిన ఉమ్మడి ప్రకటనలో ఉంది. అది, ‘‘నేటి అనిశ్చిత పరిస్థితుల మధ్య ఆర్థిక, ఇంధన భద్రతల ప్రాముఖ్యతను రెండు దేశాలు పూర్తిగా అర్థం చేసుకోవటం. దానిని దృష్టిలో ఉంచు కుని ఆర్థిక భద్రత కోసం ఒక ఉమ్మడి రోడ్ మ్యాప్‌ను రూపొందించటం’’. నేటి అనిశ్చిత పరిస్థితులన్నవి కేవలం ఇరాన్ యుద్ధం వల్ల తలెత్తినవి కావు. భారత్, జపాన్‌లతో పాటు ప్రపంచానికంతా అటువంటి ఒడిదుడుకులు ఉక్రెయిన్ యుద్ధంతో నాలుగేళ్ల క్రితం మొదలై, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సుంకాలు, కొత్త వాణిజ్య ఒప్పందాల కోసం ఒత్తిడుల మీదుగా ఇరాన్ యుద్ధం వరకు సాగివస్తున్నాయి. ఇవి స్థూలంగా పైకి కనిపించేవి. కొంత లోతుకు వెళితే,ప్రపంచ ఆర్థిక రంగానికి అనిశ్చితిని సృష్టిస్తున్న పరిణామాలు మరికొన్ని ఉన్నాయి. అవి, రెండవ ప్రపంచ యుద్థం తర్వాత బ్రెట్టన్‌వుడ్స్ వ్యవస్థలతో మొదలై ప్రపంచ స్వేచ్ఛా వాణిజ్యాలను, ఆర్థిక సంస్కరణలను సులభతరం చేసిన నియమ నిబంధనలు ఇటీవల కొద్ది సంవత్సరాలుగా భంగపడుతుండటం. ఆ వ్యవస్థలను, నిబంధనలు సృష్టించిన దేశాలే వాటిని బలహీన పరుస్తుండటం. వాటి ప్రతికూల ప్రభావాలు మధ్యమ స్థాయి దేశాలపై అట్లుంచి, మొదటి 10 స్థానాలలో గల భారత, జపాన్ వంటి ఆర్థిక వ్యవస్థలకు సైతం అనిశ్చితిని కల్పిస్తున్నది. ఇది ఇరాన్ యుద్ధంతో మరింత తీవ్రమైంది. ఇండియా, జపాన్ గత అక్టోబర్‌లో తకాయిచీ అధికారానికి రాక ముందు కూడా పలు ఒప్పందాలు చేసుకున్నాయి. మోదీ ప్రభుత్వంపై ఇతరత్రా ఎన్ని విమర్శలైనా ఉండవచ్చు గాక. కానీ, వేర్వేరు దేశాలతో, ప్రాంతీయ ఆర్థిక కూటములతో వీలైనన్ని ఆర్థిక ఒప్పందాల కోసం నిరంతర ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఒకవైపు అనిశ్చితులు ఉండగా, మరొకవైపు ఈ పోటీ ప్రపంచం, దేశంలో అంతర్గతంగా ఎదురవుతున్న ఆర్థిక ఒడిదుడుకులు ఈ విధా నాల వెనుక ముప్పేటగా పనిచేస్తున్నాయని చెప్పాలి. అసమ వాణిజ్యంజపాన్ పరిస్థితి భారత్ కన్న కొంత మెరుగైనప్పటికీ పైన పేర్కొన్న పరిణామాల మధ్య సమస్యలు తప్పటం లేదు. వాటికి ఇటీవల మరొకటి తోడవుతున్నది. అది, చైనాతో పెరుగుతున్న వివాదాలు. తైవాన్ విషయమై తకాయిచీ వైఖరికి ఆగ్రహించిన చైనా, పలు విధాలైన చర్యలతో జపాన్ ఆర్థిక రంగాన్ని వీలైనంత కుంటుపరచటం మొదలు పెట్టింది. మరొకవైపు ఇండో–పసిఫిక్ రక్షణ బాధ్యతల నుంచి అమెరికా కనీసం పాక్షికంగా ఉపసంహరించుకుంటూ ఆ బరువును ఆ ప్రాంతంలోని జపాన్ తదితర మిత్ర దేశాలపై మోపుతుండటంతో జపాన్ సైనిక వ్యయాలు గణనీయంగా పెరుగుతున్నాయి. ఈ ఆర్థిక భారాలన్నీ మోసేందుకు తకాయిచీ ప్రభుత్వం ఆసియా నుంచి యూరప్ వరకు వేర్వేరు దేశాలతో శరవేగంగా ఆర్థిక ఒప్పందాలు చేసుకుంటున్నది. ఈ విధంగా ఆర్థిక అనిశ్చితులు, వాటిని తట్టుకునే చర్యలన్నవి భారత్, జపాన్‌లకు ఒకే విధంగా ఉన్నట్లు గమనించవచ్చు. కనుక, ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో 2వ తేదీన జరిగిన ఆర్థిక ఒప్పందాలన్నీ హర్షించవలసినవే. ఒప్పంద వివరాలు వెంటనే తెలియరాలేదు గానీ తకాయిచీ వెంట సుమారు 100 జపనీస్ కంపెనీల ఎగ్జిక్యూటివ్‌లు రావటాన్ని బట్టి చర్చలు ఏ స్థాయిలో జరిగి ఉంటాయో ఊహించవచ్చు. ప్రధాని మోదీ ఈ సందర్భంగా స్వయంగా చెప్పిన దానిని బట్టి, రెండు దేశాల మధ్య గత సంవత్సర కాలంలో 100కు పైగా వాణిజ్య ఒప్పందాలు జరిగాయి. వాటివల్ల జపాన్ 10 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టనుంది. ఇది గాక వచ్చే పదేళ్లలో రెట్టింపు జపనీస్ కంపెనీలను, 10 ట్రిలియన్ల జపనీస్ యెన్ పెట్టుబడులను (మారకం విలువ 1 రూపాయికి 1.69 యెన్లు) ఆకర్షించటం లక్ష్యమన్నారు. ఇండియాలో ఇప్పటికే 1,400కు పైగా జపాన్ కంపెనీలు, 5,000కు పైగా వ్యాపార సంస్థలు ఉన్నాయి. ఈ సంఖ్యలు రెట్టింపు కావటం ఎట్లున్నా, ఇరువురు ప్రధానులు ఆందోళన వ్యక్తం చేస్తున్న ప్రస్తుత అనిశ్చిత పరిస్థితులలో ఎంత విస్తరిస్తే అంత మేలు కలుగుతుంది. అదే సమయంలో భారత ప్రభుత్వంపై కొన్ని పెద్ద బాధ్యతలు కూడా ఉంటాయి. ప్రస్తుతం రెండు దేశాల మధ్య సాలీనా ఎగుమతి దిగుమతుల విలువ 27 బిలియన్ డాలర్ల మేర ఉంది. అది సంతృప్తి కరమైనదే. కానీ, ఇండియా ఎగుమతులు కేవలం 6 బిలియన్లు, దిగుమతులు 21 బిలియన్లు (మూడున్నర రెట్లు) అంటే ఆ వివరాలు ఎంత అసంతృప్తికరమైనవో వేరుగా చెప్పనక్కరలేదు. ఇంకా చెప్పుకోవాలంటే, భారతదేశపు ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలో 6వ ర్యాంకుకు చేరినప్పటికీ, సాలీనా వాణిజ్య లోటు 10 బిలియన్ డాలర్లకు మించి ఉంది. జరగాల్సిన కృషిఆర్థిక రంగానికి సంబంధించి జపాన్ ప్రధానితో జరిగిన చర్చలలో చమురు తదితర ఇంధన భద్రతలు, ప్రత్యామ్నాయ ఇంధ నాలు, అరుదైన లోహాలు, ఖనిజాల ప్రస్తావనలు అనివార్యంగా వచ్చాయి. వాటికి అనుబంధంగా ఇండో–పసిఫిక్ సముద్ర మార్గాల ద్వారా స్వేచ్ఛాయుత రవాణాకు అవకాశాలను కల్పించుకోవటం. ఈ నిర్దిష్టమైన అంశాలన్నీ ఇండియా, జపాన్‌లతో పాటు అన్ని దేశాలలో చర్చలు జరుగుతున్నవే. అయితే ఇవి ఎంత కీలకమైనవో అంత క్లిష్టమైనవి కూడా. వీటి గురించి ఎవరికి వారు అంతర్గత కృషి చేయటం, ఇతరుల సహకారంతో సామరస్య పరిష్కారాలు కనుగొనటం రెండూ అవసరం. ఈ కొత్త పరిస్థితులలో ఆ ప్రయత్నాలు లోగడ కన్నా ఎక్కువగా జరగక తప్పదు. చర్చలలో ప్రస్తావనకు వచ్చిన మరొక కీలకాంశం రక్షణ. ఇందుకు రెండు కోణాలున్నాయి. ఒకటి, ఇండో–పసిఫిక్ ద్వారా సముద్రయానాలు. ఇది రెండు దేశాలకు సంబంధించినది. రెండు, ఈ మార్గాలలో, అంతకన్నా ఎక్కువగా పసిఫిక్‌లో చైనాను కట్టడి చేసే విషయం. ఈ విధమైన కట్టడి అవసరం ఇండియాకు పరిమిత స్థాయిలో ఉండగా, జపాన్‌కు, దానిని తమ సమగ్ర వ్యూహంలో భాగంగా చేసుకున్న అమెరికాకు అపరిమిత స్థాయిలో ఉంది. అమెరికా ఇటీవల ‘క్వాడ్’ ప్రత్యక్ష బాధ్యతల నుంచి నెమ్మదిగా తగ్గుతూ జపాన్, ఆస్ట్రేలియాల బాధ్యతను పెంచుతుండటంతో కొత్త పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఆ బాధ్యతను తలకెత్తుకున్న తకాయిచీ రక్షణ వ్యయాన్ని పెంచుతూ, పలుదేశాలతో రక్షణ ఒప్పందాలు చేసుకుంటున్నారు. ఈ రక్షణ విషయాలైతే ఢిల్లీలో ‘చర్చకు’ వచ్చాయి గానీ, ‘ఒప్పందాలు’ లేకపోవటం ఇండియా విధానాలకు అనుగుణమైనదేనని చెప్పాలి. టంకశాల అశోక్‌వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు -
మూడు దేశాల పర్యటనకు బయల్దేరిన ప్రధాని మోదీ
ఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ మూడు దేశాల పర్యటనకు బయలుదేరారు. ఈ నెల 11 వరకు ఇండోనేషియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లో మోదీ పర్యటించనున్నారు. జులై 6 నుంచి 8 వరకు ఇండోనేషియాలో పర్యటించనున్న ప్రధాని.. బ్రహ్మోస్ క్షిపణి కొనుగోలు ఒప్పందంపై చర్చలు జరపనున్నారు. ఇండో - పసిఫిక్ రీజియన్‌లో వ్యూహాత్మక సమన్వయంపై ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు.ప్రధాని మోదీ.. తొలుత సోమవారం ఇండోనేసియాకు చేరుకుంటారు. 2016 తర్వాత మోదీ ఆ దేశానికి వెళ్తుండడం ఇదే మొదటిసారి. ఇండో–పసిఫిక్ ప్రాంతంలో భారత్, ఇండోనేసియా మరింత సన్నిహితంగా కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఈ ప్రాంతంలో మారుతున్న భౌగోళిక రాజకీయ పరిస్థితులు, సముద్ర భద్రతపై పెరుగుతున్న ఆందోళనల నేపథ్యంలో మోదీ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది.ఇండోనేసియా అధ్యక్షుడు సుబియాంటోతో మోదీ సమావేశమవుతారు. ఇరుదేశాల సంబంధాలు, ద్వైపాక్షిక అంశాలపై చర్చిస్తారు. ఇండో–పసిఫిక్‌లో సము ద్ర సహకారాన్ని, సరఫరా గొలుసులను పటిష్టం చేయడం, ఆర్థిక మరియు వ్యూహాత్మక సంబంధాలు, కీలక ఖనిజాలు, స్వచ్ఛ ఇంధనం, తయారీ రంగంలో సహకారం, వాణిజ్యాన్ని ప్రోత్సహించడం, డిజిటల్ ప్రజా మౌలిక సదుపాయాలపై చర్చించే అవకాశం ఉంది.ఇరు దేశాల మధ్య సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని వారు సమీక్షిస్తారు. రాజధాని జకార్తాలో ప్రవాస భారతీయులతోనూ మోదీ భేటీ అవుతారు. వారిని ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఇండోనేసియాలోని ప్రఖ్యాత ప్రాంబనన్ ఆలయాన్ని మోదీ దర్శించుకుంటారు. మోదీ ఇండోనేసియా పర్యటన ముగించుకున్న తర్వాత వెంటనే ఆ్రస్టేలియా, న్యూజిలాండ్‌లో పర్యటించబోతున్నారు. ఇండోనేసియా ప్రస్తుత అధ్యక్షుడు సుబియాంటో గత సంవత్సరం భారత్‌లో పర్యటించారు. ఢిల్లీలో గణతంత్ర దినోత్సవాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. -
నేటి నుంచి మోదీ విదేశీ పర్యటన
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారం నుంచి మూడు రోజులపాటు ఇండోనేసియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లో పర్యటించబోతున్నారు. ఆయన తొలుత సోమవారం ఇండోనేసియాకు చేరుకుంటారు. 2016 తర్వాత మోదీ ఆ దేశానికి వెళ్తుండడం ఇదే మొదటిసారి. ఇండో–పసిఫిక్ ప్రాంతంలో భారత్, ఇండోనేసియా మరింత సన్నిహితంగా కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని నిపుణులు చెబుతున్నారు.ఈ ప్రాంతంలో మారుతున్న భౌగోళిక రాజకీయ పరిస్థితులు, సముద్ర భద్రతపై పెరుగుతున్న ఆందోళనల నేపథ్యంలో మోదీ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. ఇండోనేసియా అధ్యక్షుడు సుబియాంటోతో మోదీ సమావేశమవుతారు. ఇరుదేశాల సంబంధాలు, ద్వైపాక్షిక అంశాలపై చర్చిస్తారు. ఇండో–పసిఫిక్‌లో సము ద్ర సహకారాన్ని, సరఫరా గొలుసులను పటిష్టం చేయడం, ఆర్థిక మరియు వ్యూహాత్మక సంబంధాలు, కీలక ఖనిజాలు, స్వచ్ఛ ఇంధనం, తయారీ రంగంలో సహకారం, వాణిజ్యాన్ని ప్రోత్సహించడం, డిజిటల్ ప్రజా మౌలిక సదుపాయాలపై చర్చించే అవకాశం ఉంది.ఇరు దేశాల మధ్య సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని వారు సమీక్షిస్తారు. రాజధాని జకార్తాలో ప్రవాస భారతీయులతోనూ మోదీ భేటీ అవుతారు. వారిని ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఇండోనేసియాలోని ప్రఖ్యాత ప్రాంబనన్ ఆలయాన్ని మోదీ దర్శించుకుంటారు. మోదీ ఇండోనేసియా పర్యటన ముగించుకున్న తర్వాత వెంటనే ఆ్రస్టేలియా, న్యూజిలాండ్‌లో పర్యటించబోతున్నారు. ఇండోనేసియా ప్రస్తుత అధ్యక్షుడు సుబియాంటో గత సంవత్సరం భారత్‌లో పర్యటించారు. ఢిల్లీలో గణతంత్ర దినోత్సవాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. -
దేశ ఐక్యత–ప్రగతికి అంకితమైన జీవితం
ఇవాళ తేదీ జూలై 6... జాతీయవాదం, నిస్వార్థ సేవ వంటి ఆదర్శాలకు ప్రాణమిచ్చే అసంఖ్యాక ప్రజానీకానికి ఇదొక ప్రత్యేక దినం. అంతులేని సాహసానికి, భరతమాతపై అత్యంత ఆరాధన భావనకు కాలాతీత నిదర్శనంగా నిలిచిన డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ 125వ జయంతి ఈ రోజే. ఆధునిక భారతంలో మేధస్సు, ప్రజాసేవ, నైతిక విశ్వాసమనే లక్షణాల అద్భుత సమ్మేళనం ఇంతగా మూర్తీభవించిన ఆయన వంటి నాయకులు దేశంలో చాలా అరుదు. ఆయన సంపన్న కుటుంబంలో పుట్టినప్పటికీ సకల సౌఖ్యాలనూ వదులుకుని త్యాగం, జాతి సేవ దిశగా ఆయన అంతరాత్మ నడిపించింది. వలసవాదం, మతతత్వం, మానవతా సమస్యలు వంటివి కమ్ముకున్న నాటి కల్లోల కాలంలో ఒక మూగ ప్రేక్షకునిగా మిగిలిపోవడం తగదని ఆయన దృఢంగా విశ్వసించారు. ఈ ప్రస్థానంలో ఆయన తొలుత పసికందుగా ఉన్న బిడ్డను, ఆ తర్వాత భార్యను కోల్పోయారు. ఆత్మార్పణడా‘‘ ముఖర్జీ ప్రజా జీవనాన్ని అన్నింటికన్నా ఎక్కువగా నిర్వచించిన ఆదర్శం ఏదైనా ఉందంటే– అవిభాజ్య భారత్ దిశగా ఆయన దీక్ష. దేశ విభజన సంక్షోభ సమయాన పశ్చిమ బెంగాల్ భారత్‌లో అంతర్భాగంగా ఉండాలని ఆయన ప్రగాఢంగా ఆకాంక్షించారు. ఆనాడు దృఢంగా నిలబడిన ఆయన విశ్వాసమే కొన్నేళ్ల తర్వాత ఆయనను జమ్మూకాశ్మీర్ వైపు నడిపింది. ఆ క్రమంలో జైలుపాలైనా ఆ జీవితం ఆయన ఉత్సాహాన్ని నీరుగార్చలేక పోయింది. కారాగార ఏకాంతం ఆయనను ఎంతమాత్రం కుంగదీయలేదు. ఏ ప్రజల ఆశయాన్ని తనదిగా చేసుకున్నారో వారికి అత్యంత దూరంగా, నిర్బంధంలోనే ఆయన జీవితం హఠాత్తుగా ముగిసింది. ఆచార్య వినోబా భావే చెప్పినట్లు– తాను విశ్వసించిన ఆదర్శం కోసం డా‘‘ ముఖర్జీ ఆత్మార్పణకు వెనుదీయలేదు. అటుపైన ఎన్నో ఏళ్ల తర్వాత 2019లో ఆర్టికల్ 370, 35 (ఎ)ల రద్దు ఆయన అమరత్వానికి అత్యంత సముచిత నివాళి అనడంలో సందేహం లేదు.భారతీయతకు పెద్దపీటఆయన ఎప్పుడూ దేశానికే ప్రథమ స్థానమిచ్చారు. భారతీయ విలువలకే పెద్ద పీట వేశారు. తదనుగుణమైన సంస్థలకు రూపమివ్వడం ద్వారా ఆయన ఈ లక్ష్యం సాధించారు. అత్యంత పిన్న వయసులోనే కలకత్తా విశ్వవిద్యాలయానికి ఉప కులపతి అయ్యారు. తనదైన శైలిలో, దేశభక్తి, భవిష్యత్ దృక్పథంతో కూడిన అనేక సానుకూల మార్పులు తెచ్చారు. ఓ సారి విద్యావేత్తల సదస్సులో ప్రసంగించిన సందర్భంగా– ‘భవిష్యత్ గుమాస్తాలను, తక్కువ జీతాలు పొందే సిబ్బందిని ఉత్పత్తి చేసే కర్మాగారాలుగా విద్యా సంస్థలను చిన్న చూపు చూడటం తగదు. స్థానిక సంస్థలు, పురపాలక, రాష్ట్ర, కేంద్ర చట్టసభలను నడిపించగల ఉద్దండులుగా విద్యార్థులను మనం తీర్చిదిద్దాలి. అదే తరహాలో ఆర్థిక, వాణిజ్య, పారిశ్రామిక తదితర జనజీవన ప్రాధాన్య రంగాల వ్యవహారాలను నడిపించగల సమర్థులుగా తయారు చేయాలి’ అని కుండబద్దలు కొట్టారు. అప్పట్లో ‘భారతీయ జనసంఘ్’ను రపుదిద్దాలని డా‘‘ ముఖర్జీ నిర్ణయించుకున్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రాభవం ఉచ్ఛస్థాయిలో ఉన్న సమĶæన మనవైన సాంస్కృతిక మూలాలకు కట్టుబడుతూనే దేశ ప్రగతి కోసం గళం విప్పే ప్రత్యామ్నాయ స్వరం ఒకటి అవసరమని ఆయన భావించారు. అది ఓ చిన్న దివ్వెలాంటిదైనా పరవాలేదని భావించారేమో అన్నట్లుగా దాని చిహ్నంగా ‘మట్టి దీపం’ గుర్తును ఆయన ఎంచుకోవడం గమనార్హం. పారిశ్రామిక విధానానికి పునాది ఆయనకు దేశ ప్రగతిపై గల అవగాహన ఎంతటిదో భారత తొలి పరిశ్రమలు–పౌర సరఫరాల శాఖ మంత్రిగా ఆయన పదవీకాలం వెల్లడిస్తుంది. ఒక రాజనీతిజ్ఞుడిగా, నిజాయితీ, మానవతా దృక్పథం కలగలసిన నాయకుడుగా ఆయన సామర్థ్యం స్పష్టమవుతుంది. దామోదర్ వ్యాలీ కార్పొరేషన్, సింధ్రీ ఫెర్టిలైజర్ ప్లాంట్, పటిష్ట పారిశ్రామిక విధానం వంటి మార్గదర్శక కార్యక్రమాల ద్వారా ఆధునిక పారిశ్రామిక భారతానికి పునాదులు వేశారు. అదే సమయంలో భారత సంప్రదాయ బలాలు నిర్లక్ష్యానికి గురికాకుండా చూసుకున్నారు. చేనేత, కుటీర పరిశ్రమలు, కళారంగం వంటి వాటికీ ఆయన మద్దత్తు ఇచ్చారు. ఈ సందర్భంగా నేనొక వ్యక్తిగత అనుభవాన్ని పంచుకోవాలని భావిస్తున్నాను. స్వావలంబనపై విస్పష్ట దార్శనికతతో డా‘‘ ముఖర్జీ స్థాపించిన సింధ్రీ కర్మాగారాన్ని అనేక దశాబ్దాల పాటు దేశాన్నేలిన పాలకులు నిర్లక్ష్యం చేశారు. ఈ నేపథ్యంలో దాని పునరుద్ధరణలో తోడ్పడే అవకాశం మా ప్రభుత్వానికి లభించడం నాకు దక్కిన గౌరవంగా నేను భావిస్తున్నాను. ఆ కార్యక్రమంలో పాల్గొనడం నా జీవితంలోని అత్యంత ప్రత్యేక క్షణాలలో ఒకటిగా నిలిపోయిందంటే అతిశయోక్తి కాబోదు. ప్రజాస్వామ్య స్ఫూర్తికి డా‘‘ ముఖర్జీ ప్రతిరూపంగా నిలిచారు. తొలిదశలో దేశ పురోగమన బాధ్యత రాజకీయ విభేదాలకు అతీతమనే సత్యాన్ని విశ్వసించి పండిట్ నెహ్ర మంత్రిమండలిలో చేరారు. ఆ పదవిలో ఉన్నంత కాలం చిత్తశుద్ధితో, నిర్మాణాత్మక స్ఫూర్తితో సేవలందించారు. కానీ, జాతీయ ప్రాధాన్యంగల అంశాల్లో భిన్న మార్గం సముచితమని భావించిన వేళ గౌరవప్రదంగా పదవిని త్యజించారు. దేశానికి ఏది అవసరమో దానికి సంబంధించిన రాజకీయ కార్యకలాపాలకు పూర్తి నిబద్ధతతో అంకితమయ్యారు. పండిట్ నెహ్రూ 75 ఏళ్ల కిందటే భావ ప్రకటనా స్వేచ్ఛపై ప్రత్యక్ష దాడితో సమానమైన తొలి రాజ్యాంగ సవరణను తెచ్చారు. దాన్ని డా‘‘ ముఖర్జీ నిర్ద్వంద్వంగా వ్యతిరేకించారు. కాంగ్రెస్ మనోభావన ఏమిటో ఆయన పూర్తిగా అవగతం చేసుకున్నారు. అదే పూర్తిగా సరైనదని కూడా నిరూపితమైంది. అలనాడు... 75 ఏళ్ల కిందట తొలి సవరణ తెచ్చిన వారే 1975లో ఎమర్జన్సీకి కూడా కారకులయ్యారు. సేవామూర్తిమానవతా వాదాన్ని సమున్నతంగా నిలపడంలోనూ ఆయన ప్రత్యేక గుర్తింపు పొందారు. బెంగాల్లో 1943నాటి అత్యంత ఘోరమైన కరవు విజృంభించినపుడు ఆయన బాధితుల సేవలో పూర్తిగా నిమగ్నమయ్యారు. ప్రజలకు ఆహారం సమకూర్చడం కోసం అనేక స్వచ్ఛంద వంటశాలలు, సహాయ శిబిరాలు ఏర్పాటు చేసేలా అవిరళ కృషి చేశారు. ప్రజల దుఃస్థితి చూసి నిలువెల్లా చలించిపోయిన ఆయన, వలస పాలకుల నిర్దాక్షిణ్య వైఖరిని తీవ్రంగా నిరసించారు. ‘పంచషేర్ మన్వంతర్’ పేరిట తాను రాసిన పుస్తకంలో తన ఆవేదనను వ్యక్తం చేశారు. అంతకుముందు 1942లో మేదినీపూర్‌ను ఒక మహా తుఫాను వణికించినపుడు పరిస్థితుల పునరుద్ధరణ దిశగా ఆయన కృషికి విస్తృత ప్రశంసలు లభించాయి.ఆ రోజుల్లో కలకత్తాలోని ఓ కళాశాలలో నిర్వహించిన కార్యక్రమంలో యువతను ఉద్దేశించి మాట్లాడుతూ– ‘మీరు ఏ పని చేపట్టినా శ్రద్ధగా, క్షుణ్ణంగా, అర్థవంతంగా చేయండి. ఏ పనినీ అర్ధాంతరంగా వదిలేయకండి. అరకొర ఫలితంతో సంతృప్తి చెందకండి. మీ అత్యుత్తమ కృషితో సత్ఫలితం సిద్ధించే దాకా పట్టువీడకండి’ అని ఆయన పిలుపునిచ్చారు. దేశం ఇవాళ వికసిత భారత్ స్వప్న సాకారం దిశగా పురోగమిస్తున్న తరుణాన... ఆయన ప్రగాఢంగా విశ్వసించిన శక్తియుత, సమైక్య, ఆత్మవిశ్వాసపూరిత, కరుణార్ద్ర దేశ నిర్మాణానికి నిత్యం కృషి చేయడమే ఆయనకు మనం అర్పించగల అత్యుత్తమ నివాళి. ఈ నేపథ్యంలో యువత నేటి సందర్భానికి తగినట్లు డా‘‘ ముఖర్జీ ఆశయాలకు న్యాయం చేసేందుకు అహరహం శ్రమిస్తారని నేను ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను. నరేంద్ర మోదీభారత ప్రధాని -
ఇంధన సంక్షోభాన్ని విజయవంతంగా అధిగమించాం. పౌరులపై ఆర్థిక భారాన్ని చాలావరకు తగ్గించాం. ప్రధాని మోదీ వెల్లడి
-
ఇంధన సంక్షోభాన్ని అధిగమించాం
పాచ్పద్రా/జోధ్‌పూర్: ఈ శతాబ్దంలో అతిపెద్ద ప్రపంచ ఇంధన సంక్షోభాల్లో ఒకదానిని మనం విజయవంతంగా అధిగమించామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. చురుకైన ప్రభుత్వ విధానాలు, వైవిధ్యమైన ఇంధన వనరులు, బలమైన దౌత్య సంబంధాల ద్వారా పౌరులపై ఆర్థిక భారాన్ని చాలావరకు తగ్గించామని తెలిపారు. ఇంధన సంక్షోభం కారణంగా ప్రధాన దేశాలు ఇబ్బందులు ఎదుర్కొన్నాయని వెల్లడించారు. ఇంధనం విషయంలో కొన్ని శక్తులు ప్రజల్లో భయాన్ని వ్యాప్తి చేయడంలో నిమగ్నమయ్యాయని విమర్శించారు. రాజకీయ క్రీడలు సాగాయని అన్నారు. కానీ, ప్రజలకు ఉపశమనం కల్పించడానికి ప్రభుత్వం చేపట్టిన చర్యలతో ఆ శక్తుల పథకం పారలేదని, తీవ్ర నిరాశలో కూరుకుపోయాయని ఎద్దేవా చేశారు. సంక్షోభాన్ని మనం అధిగమించిన తీరు చరిత్రలో ఒక అపూర్వమైన అధ్యాయంగా గుర్తుండిపోతుందని వ్యాఖ్యానించారు. ప్రధాని మోదీ శనివారం రాజస్తాన్‌లో పర్యటించారు. బలోత్రాలో దేశంలోనే మొట్టమొదటి గ్రీన్‌ఫీల్డ్ ఇంటిగ్రేటెడ్ రిఫైనరీ–పెట్రోకెమికల్ కాంప్లెక్స్‌ను జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో మాట్లాడారు. పశ్చిమాసియాలో జరిగిన యుద్ధం 21వ శతాబ్దంలోనే అతిపెద్ద ఇంధన సంక్షోభాన్ని సృష్టించిందని గుర్తుచేశారు. అనేక శక్తివంతమైన దేశాలు ఇంధన కొరతతో సతమతమయ్యాయని అన్నారు. సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోవడం, పరిస్థితిని సరిగ్గా అంచనా వేయడం, మన వనరులను సమతుల్యంగా ఉపయోగించడం, దౌత్య బలాన్ని సానుకూలంగా వినియోగించుకోవడం ద్వారా ఈ సవాలును సమర్థంగా ఎదుర్కొన్నామని స్పష్టంచేశారు. గ్రీన్‌ఫీల్డ్ ఇంటిగ్రేటెడ్ రిఫైనరీని ఏప్రిల్ 21న మోదీ చేతుల మీదుగా ప్రారంభించాల్సి ఉండగా, 20న జరిగిన అగి్నప్రమాదం వల్ల వాయిదా పడిన సంగతి తెలిసిందే. రెండు నెలల్లోనే మరమ్మతులు పూర్తి చేసినందుకు అధికారులను మోదీ అభినందించారు. చమురు సామర్థ్యంలో నాలుగో స్థానం అనేక అభివృద్ధి చెందిన దేశాలు చమురు శుద్ధి సామర్థ్యాన్ని పెంచుకోవడంలో విఫలమైనప్పటికీ.. భారతదేశం మాత్రం ఆ సామర్థ్యాన్ని గణనీయంగా విస్తరింపజేసుకుంది. గత 50 ఏళ్లలో అమెరికా కొత్తగా చమురు శుద్ధి కర్మాగారాన్ని నిర్మించలేదు. ఐరోపా శుద్ధి సామర్థ్యం నానాటికీ తగ్గుతూ వస్తోంది. ప్రస్తుతం అయిల్ రిఫైనరీ సామర్థ్యం పరంగా భారత్ ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద దేశంగా అవతరించింది. ఈ సామర్థ్యం ఇంకా పెరుగుతూనే ఉంటుంది. అంతర్జాతీయంగా చమురు ధరలు పెరగడం వల్ల ఏప్రిల్ నుంచి జూన్ మధ్య మన దేశ చమురు కంపెనీలు రూ.75,000 కోట్లకు పైగా నష్టాలను చవిచూశాయి.అయితే, ఆ భారాన్ని ప్రభుత్వమే భరించింది. ప్రపంచవ్యాప్తంగా చాలాదేశాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు 40 నుంచి 50 శాతం వరకు పెరిగాయి. ఇంధనాన్ని కోటా పద్ధతిలో పంపిణీ చేశారు. మన దేశంలో ఒక్కరోజు కూడా అలాంటి పరిస్థితి తలెత్తలేదు. కొందరు మాత్రం చమురు విషయంలో వదంతులు వ్యాప్తి చేశారు. ప్రజలను భయపెట్టారు, రాజకీయ క్రీడలు ఆడారు. కానీ, వారు సఫలం కాలేకపోయారు. సంక్షోభ సమయంలో మనం తీసుకున్న ప్రతి కీలక నిర్ణయం చరిత్రలో భాగం అవుతుంది. భారత్ విఫలం కావాలని కోరుకున్నవారికి చివరకు పరాభవమే మిగిలింది. ‘ఉడాన్’తదుపరి దశ ప్రారంభం ప్రభుత్వ ప్రతిష్టాత్మక ప్రాంతీయ అనుసంధాన పథకం ‘ఉడాన్’తదుపరి దశను ప్రధాని మోదీ శనివారం ప్రారంభించారు. అలాగే జోధ్‌పూర్ విమానాశ్రయంలో రూ.480 కోట్ల వ్యయంతో నిర్మించిన కొత్త టెరి్మనల్ భవనాన్ని ప్రారంభించారు. సవరించిన ఉడాన్ పథకాన్ని ఈ ఏడాది ప్రారంభంలో కేంద్ర మంత్రివర్గం ఆమోదించిన సంగతి తెలిసిందే. ఈ పథకం అమలుకు రాబోయే పదేళ్లలో దాదాపు రూ.29,000 కోట్లు ఖర్చు చేయబోతున్నారు. రూ. 2,000 సిలిండర్ రూ. 950కే లభిస్తోంది మన ఎల్పీజీ అవసరాల్లో దాదాపు 70 శాతం దిగుమతుల ద్వారానే తీరుతోంది. ఆ సరఫరాలలో సుమారు 90 శాతం ఎల్పీజీ హార్మూజ్ జలసంధి గుండా గల్ఫ్ దేశాల నుంచి వస్తోంది. హార్మూజ్‌లో ఆటంకాలు మొదలైన తర్వాత దేశీయంగా ఎల్పీజీ ఉత్పత్తి సామర్థ్యాన్ని గరిష్టంగా పెంచాలని ప్రభుత్వం తక్షణమే నిర్ణయించింది. పారిశ్రామిక గ్యాస్ ఉత్పత్తి స్థానంలో ఎల్పీజీ ఉత్పత్తికి ప్రాధాన్యం ఇచ్చాం. ఏడు రోజుల్లోనే రిఫైనరీల నుంచి ఎల్పీజీ ఉత్పత్తి గణనీయంగా పెరిగింది. సంక్షోభ సమయంలో ఎల్పీజీ ఉత్పత్తి 54,000 మెట్రిక్ టన్నులు పెరిగింది.ఎల్పీజీకి దేశీయ డిమాండ్ అదుపులో ఉండేలా పీఎన్జీ కనెక్షన్లు వేగంగా విస్తరించేలా ప్రభుత్వం ఏకకాలంలో చర్యలు తీసుకుంది. చాలా తక్కువ సమయంలోనే 11 లక్షలకు పైగా గృహాలకు పీఎన్జీ కనెక్షన్లు ఇచ్చాం. పెరుగుతున్న ధరల భారం నుంచి గృహ వినియోగదారులకు రక్షణ కల్పించాం. ఒక గృహ వినియోగ ఎల్పీజీ సిలిండర్ ధర రూ.2,000 వరకు ఉంటుంది. కానీ, నేడు అది రూ.950కే లభిస్తోంది. హార్మూజ్‌లో ముడి చమురు మార్గాలకు అంతరాయం కలగడంతో ముడి చమురు ధరలు బ్యారెల్‌కు 70 డాలర్ల నుంచి 120 డాలర్లకు పెరిగాయి.ఆ సమయంలో ఇతర దేశాల నుంచి ఇంధన దిగుమతులను గణనీయంగా పెంచాం. 40కిపైగా దేశాల నుంచి దిగుమతులు చేసుకున్నాం. ఈ మార్పునకు భారత్ అనుసరించిన దౌత్యమే కారణం. లీటర్‌కు రూ.10 ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించి, పౌరులపై భారం పెరగకుండా చర్యలు చేపట్టాం. ప్రపంచవ్యాప్తంగా సంఘర్షణలు, ముఖ్యంగా ఉక్రెయిన్ యుద్ధం తర్వాత ఎరువుల సరఫరాపై ప్రభావం పడింది. ఆ ప్రతికూల పరిస్థితిని సమర్థవంతంగా ఎదుర్కొన్నాం. వ్యక్తి లేదా దేశం స్వయం సమృద్ధిని సాధించినప్పుడే వారి ఆత్మగౌరవం ఉన్నత స్థాయిలో ఉంటుంది’’అని ప్రధాని మోదీ తేల్చిచెప్పారు. సెమీకండక్టర్, ఏఐ రంగాల్లో అవకాశాలు వదులుకోవద్దు సంపూర్ణ సెమీకండక్టర్ వ్యవస్థను నిర్మించడమే లక్ష్యం: మోదీఅహ్మదాబాద్: ఉత్పత్తులు, విడిభాగాల నుంచి సెమీకండక్టర్ల వరకు మొత్తం విలువైన ఎల్రక్టానిక్స్ వ్యవస్థను భారత్ నిర్మిస్తోందని, ఇదే ‘వికసిత్ భారత్’కు రోడ్‌మ్యాప్ అని ప్రధాని మోదీ అన్నారు. శనివారం గుజరాత్‌లోని సనంద్‌లో సీజీ సెమీ ఔట్సోర్స్డ్ సెమీకండక్టర్ అసెంబ్లీ, టెస్ట్(ఓఎస్ఏటీ) కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. సెమీకండక్టర్, కృత్రిమ మేధ(ఏఐ) రంగాలు లెక్కలేనన్ని ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పిస్తాయని, దీన్ని భారతీయ యువత వదులుకోవద్దని కోరారు.మనం కేవలం చిప్‌లను తయారు చేయడమే కాకుండా ఏఐ, రోబోటిక్స్, తదుపరి తరం సాంకేతిక విప్లవాన్ని వేగవంతం చేయబోతున్నామని చెప్పారు. మన యువత ‘మేడ్ ఇన్ ఇండియా’చిప్‌లను ఉపయోగించబోతున్నారని తెలిపారు. యువత సామర్థ్యం, ప్రతిభపై తమకు అచంచలమైన విశ్వాసం ఉందని వ్యాఖ్యానించారు. ప్రపంచవ్యాప్తంగా ఎప్పుడు కొత్త పారిశ్రామిక విప్లవం సంభవించినా, అది యువతకు అత్యధిక సంఖ్యలో అవకాశాలను కల్పిస్తుందని గుర్తుచేశారు.మనదేశంలో సెమీకండక్టర్ పరిశ్రమ విస్తరణ రాత్రికి రాత్రే జరగలేదని, గత దశాబ్ద కాలంగా చోటుచేసుకున్న ఎల్రక్టానిక్స్ విప్లవంలో ఇది తదుపరి దశ అని వివరించారు. దేశంలో చిప్ డిజైన్ నుంచి తయారీ, ప్యాకేజింగ్ వరకు సంపూర్ణ సెమీకండక్టర్ వ్యవస్థను నిర్మించడమే ప్రభుత్వ లక్ష్యమని ప్రకటించారు.ఆ్రస్టేలియా పర్యటన వేళ దాడి చేస్తామని మోదీకి బెదిరింపు దర్యాప్తు ముమ్మరం చేసిన ఆస్ట్రేలియా పోలీసులుమెల్బోర్న్: ఆస్ట్రేలియాలో పర్యటించనున్న భా రత ప్రధాని మోదీకి తాజాగా ఒక ఆన్లైన్ బెదిరింపు వచి్చంది. మెల్బోర్న్ నగరంలోని ప్రఖ్యా త మార్వెల్ స్టేడియంలో జరగబోయే సభలో ప్రధాని మోదీ ప్రసంగించనున్న నేపథ్యంలో అక్కడ దాడి చేస్తామంటూ సామాజిక మాధ్యమంలో ఒక పోస్ట్ ప్రత్యక్షమైంది. దీంతో ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న ఆస్ట్రేలియన్ ఫెడరల్ పోలీసులు వెంటనే ముమ్మర దర్యాప్తు ఆరంభించారు.ఈ పోస్ట్‌తో సంబంధం ఉన్న అబూ ముస్తాఫా ఐడీతో ఉన్న ఐపీ అడ్రస్‌ను కనుగొన్నామని వెల్లడించారు. ఈనెల 9వ తేదీన ‘మెల్బోర్న్ మీట్స్ మోదీ’కార్యక్రమం ఆ స్టేడియంలో జరగనుంది. అయితే ఈ స్టేడియంనుద్దేశిస్తూ అబూ ముస్తాఫా యూజర్‌నేమ్ నుంచి ఈ పోస్ట్ చేశారు. ‘‘స్టేడియం పైకప్పును మూసేస్తే ఉత్తమం అనుకుంటున్నా. లేదంటే ఆయన తన మృత్యుదేవతను చూసేందుకే ఇక్కడికి వచ్చినట్లు అవుతుంది’’అని ఆ పోస్ట్‌లో హెచ్చరించారు. ఇది కేవలం బెదిరింపు సందేశమా లేదంటే గతంలో ఈ ఐపీ అడ్రస్‌తో సంబంధం ఉన్న వ్యక్తులకు నేర చరిత్ర ఉందా? అనే కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నారు. -
మోడీ వల్లే బంగారం రేట్లు పడిపోతున్నాయా ?
-
ప్రధాని నరేంద్ర మోదీకి బెదిరింపులు
ఆస్ట్రేలియా పర్యటన వేళ.. ప్రధాని నరేంద్ర మోదీకి బెదిరింపులు కలకలం రేపుతున్నాయి.. ఆసీస్ పర్యటనకు ముందు మోదీకి ఆన్లైన్లో బెదిరింపులు వచ్చాయి. ఈ నెల 9న ఆ దేశ పర్యటనకు ప్రధాని మోదీ వెళ్లనున్న క్రమంలో.. ఆస్ట్రేలియా వస్తే చంపేస్తామంటూ వచ్చిన వార్నింగ్‌పై ఆ దేశ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.జులై 9న మార్వెల్ స్టేడియంలో జరగాల్సిన ‘మెల్బోర్న్ మీట్స్ మోదీ (Melbourne Meets Modi) కమ్యూనిటీ ఈవెంట్‌ను ప్రకటిస్తూ ఫేస్బుక్లో పెట్టిన ఒక పోస్ట్ కింద ఈ బెదిరింపు కామెంట్ ప్రత్యక్షమైంది. అబు ముస్తఫా అనే పేరుతో ఉన్న ఖాతా నుండి వచ్చిన ఆ కామెంట్లో ‘ఈ కార్యక్రమం జరిగే సమయంలో స్టేడియం రూఫ్ టాప్‌లను (పైకప్పును) మూసివేయడం మంచిది. లేదంటే ఆయన తన మరణం కోసమే ఆస్ట్రేలియాకు వస్తున్నట్లు లెక్క’’ అంటూ బెదిరింపులకు దిగారు. ఈ బెదిరింపులపై ఆస్ట్రేలియా ఫెడరల్ పోలీస్ (AFP)కి ఫిర్యాదు అందినట్లు ది ఆస్ట్రేలియా టుడే తెలిపింది.ఈ పోస్ట్‌కు సంబంధించిన ఐపీ (IP) అడ్రస్‌ను ర్యాప్తు అధికారులు గుర్తించినట్లు సమాచారం. ఈ బెదిరింపులపై పలు కోణాల్లో అధికారులు దర్యాప్తు చేపట్టారు. కాగా, ఈ పర్యటనలో ప్రధాని మోదీ ద్వైపాక్షిక చర్చల్లో పాల్గొనడంతో పాటు.. మెల్బోర్న్ సమావేశంతో సహా పలు కమ్యూనిటీ ఈవెంట్లలో కూడా పాల్గొననున్నారు. పర్యటనకు వచ్చే ఇతర దేశాల ప్రభుత్వాధినేతలకు వచ్చే బెదిరింపులను ఆస్ట్రేలియా చట్టం అత్యంత తీవ్రంగా పరిగణిస్తుంది. హై-ప్రొఫైల్ అంతర్జాతీయ పర్యటనల భద్రతా ప్రణాళికలో ఆస్ట్రేలియా ఫెడరల్ పోలీస్, స్టేట్ పోలీస్, స్పెషలిస్ట్ ప్రొటెక్టివ్ సెక్యూరిటీ యూనిట్లతో సహా పలు సంస్థలు భాగస్వామ్యమవుతాయి. -
ఆ సంక్షోభంపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు
బాలోత్రా: రాజస్థాన్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రధాని నరేంద్ర మోదీ శనివారం ప్రారంభించారు. దేశ ఇంధన, పెట్రోకెమికల్ రంగంలో ఒక మైలురాయిని అధిగమిస్తూ.. బాలోత్రా జిల్లా పచ్‌పద్ర వద్ద ఏర్పాటు చేసిన మొట్టమొదటి గ్రీన్‌ఫీల్డ్ ఇంటిగ్రేటెడ్ రిఫైనరీ-కమ్-పెట్రోకెమికల్ కాంప్లెక్స్‌ను మోదీ ప్రారంభించారు. హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (HPCL), రాజస్థాన్ ప్రభుత్వం సంయుక్త భాగస్వామ్యంతో సుమారు రూ. 79,450 కోట్లకు పైగా పెట్టుబడితో గ్రీన్‌ఫీల్డ్ రిఫైనరీ-కమ్-పెట్రోకెమికల్ కాంప్లెక్స్‌ను అభివృద్ధి చేశారు.సుమారు రూ. 1.06 లక్షల కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను దేశానికి అంకితం చేయడంతో పాటు, ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. అంతకుముందు రాజస్థాన్ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ.. జోధ్‌పూర్ విమానాశ్రయం కొత్త టెర్మినల్ భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ.. సవాలు ఎంత పెద్దదైనా.. ఊహించనిదైనా సరే.. భారత్ తన సంకల్పం నుంచి వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేశారు.పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఇంధన సంక్షోభం గురించి ఆయన ప్రస్తావిస్తూ.. ప్రభుత్వ విధానాలతో పాటు బలమైన ద్వైపాక్షిక సంబంధాలు కారణంగా సంక్షోభం నుంచి భారత్ తక్కువ భారంతో బయటపడిందని చెప్పుకొచ్చారు. చిన్న చిన్న ఇబ్బందులు తప్ప.. గ్రామీణ ప్రాంతాల్లోనూ ఇంధన సరఫరాలో పెద్దగా సవాళ్లు ఎదురు కాలేదన్న మోదీ.. ప్రజలపై ఎటువంటి అదనపు భారం పడకుండా చూశామన్నారు. జోధ్‌పూర్ విమానాశ్రయంలో కొత్త టెర్మినల్ ప్రారంభం దేశ అభివృద్ధి ప్రయాణంలో మరో ముఖ్యమైన అడుగు అని.. ఇది మార్వార్ ప్రాంతంలో పర్యాటకం, వాణిజ్యం, ఉపాధి అవకాశాలకు పెద్ద పీట వేస్తుందని ప్రధాని అన్నారు. -
దేశంలో తొలి గ్రీన్‌ఫీల్డ్ రిఫైనరీ ప్రారంభం!
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాజస్థాన్‌లోని.. బలోత్రా జిల్లాలోని పచ్‌పద్ర ప్రాంతంలో దేశంలోని తొలి గ్రీన్‌ఫీల్డ్ ఇంటిగ్రేటెడ్ రిఫైనరీ-పెట్రోకెమికల్ సముదాయాన్ని ప్రారంభించారు. ఇది దేశ ఇంధన, పెట్రోకెమికల్ రంగంలో కొత్త అధ్యాయంగా నిలిచింది. ఈ సముదాయం భారతదేశ ఇంధన భద్రతను బలోపేతం చేయడంతో పాటు దేశీయ పారిశ్రామికాభివృద్ధికి కీలకంగా మారనుంది.ఈ రిఫైనరీని హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (HPCL), రాజస్థాన్ ప్రభుత్వం సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. ఈ గ్రీన్‌ఫీల్డ్ రిఫైనరీ కమ్ పెట్రోకెమికల్ కాంప్లెక్స్‌ను రూ. 79,450 కోట్ల కంటే ఎక్కువ పెట్టుబడితో ఏర్పాటు చేశారు. దీని సామర్థ్యం సంవత్సరానికి 9 మిలియన్ మెట్రిక్ టన్నులు. అదనంగా ఏడాదికి 2.4 మిలియన్ మెట్రిక్ టన్నుల పెట్రోకెమికల్ ఉత్పత్తులను తయారు చేసే సామర్థ్యాన్ని కూడా కలిగి ఉంది.ఈ ప్రాజెక్టు ద్వారా భారతదేశం దిగుమతులపై ఆధారపడే అవసరం తగ్గి, దేశీయంగా పెట్రోకెమికల్ ఉత్పత్తుల తయారీ పెరుగుతుంది. దీనివల్ల దేశ ఇంధన భద్రత మరింత బలోపేతం అవుతుంది. అంతే కాకుండా.. ఈ రిఫైనరీ ఆధారంగా ఇక్కడ పెట్రోకెమికల్, ప్లాస్టిక్ పార్క్ అభివృద్ధి చెందనుంది. దీనివల్ల చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, అనుబంధ పరిశ్రమలు ఏర్పడి స్థానిక ఆర్థికాభివృద్ధికి తోడ్పడతాయి. ఈ ప్రాజెక్టు వేలాది మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలను కల్పిస్తుంది. దీంతో రాజస్థాన్ రాష్ట్రం ఆర్థికంగా మరింత అభివృద్ధి చెందనుంది.#WATCH | Balotra, Rajasthan | Prime Minister Narendra Modi flags off refinery production tankers from the Greenfield Refinery-cum-Petrochemical Complex, developed as a joint venture between Hindustan Petroleum Corporation Limited (HPCL) and the Rajasthan Government, which PM Modi… pic.twitter.com/YHAZSdihQE— ANI (@ANI) July 4, 2026 -
జపాన్‌తో ‘మిత్రలాభం’
శిఖరాగ్ర సమావేశాలకు దౌత్యంలో ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. రెండు దేశాల మధ్య ఆ స్థాయి సమావేశం జరిగిందంటే ఆ దేశాల అధినేతలు నేరుగా మాట్లాడుకుని, సంక్లిష్ట సమస్యల పరిష్కార సాధనకు కృషి చేస్తున్నారనీ, ఈ క్రమంలో ఎంతో జాప్యం చోటు చేసుకునే అధికారస్వామ్య ప్రమేయాన్ని అధిగమించదల్చుకున్నారనీ అర్థం. జపాన్ ప్రధాని సనే తకాయిచి మన దేశంలో మూడు రోజులు పర్యటించి శుక్రవారం వెళ్లారు. ప్రధాని నరేంద్ర మోదీతో శిఖరాగ్ర సమావేశం జరిపారు. ఈ పర్యటనలో కృత్రిమ మేధ(ఏఐ), ఇంధనం, రక్షణరంగం, ఖనిజాల వెలికితీత తదితర రంగాల్లో 17 ఒప్పందాలు కుదిరాయి. ఇందులో రక్షణ సాంకేతికతల్లో అత్యంతాధునికమైన ‘యూనికార్న్’ ప్రాజెక్టు ఒప్పందం అన్నివిధాలా ప్రత్యేకమైనది. యుద్ధ నౌకలపై వేర్వేరు అవసరాల కోసం వినియోగించే ఉపగ్రహ కమ్యూనికేషన్, రాడార్, నావిగేషన్, రేడియో కమ్యూని కేషన్ వంటి పనుల కోసం విడివిడిగా యాంటెన్నాలుంటాయి. యుద్ధసమయాల్లో ఇవి చిక్కులు తెస్తాయి. శత్రువుల రాడార్లకు సులభంగా దొరికిపోతాయి. యూనికార్న్ సాంకే తికతలో ఈ యాంటెన్నాలన్నీ ఒకే ఒకదాన్లో ఒదిగిపోతాయి. శత్రు నౌకలకు చిక్కకుండా, వాటి ఆనుపానుల్ని తెలుసుకోవటంలో దీని పని తీరు అద్భుతం. వచ్చిపడే క్షిపణుల్ని చాలా ముందే పసిగట్టడం, ఎదురుదాడికి అవకాశం ఇవ్వటం దీని ప్రత్యేకత. ఈ యూనికార్న్ మాస్ట్‌లను భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బెల్) ద్వారా దేశీయంగా తయారు చేసేందుకు జపాన్ సంసిద్ధత తెలిపింది. రెండో ప్రపంచ యుద్ధానంతరం రక్షణ ఎగుమతుల జోలికి పోవద్దని జపాన్ తీసుకున్న నిర్ణయాన్ని ఇటీవలే తకాయిచీ సడలించారు.అమెరికా విధిస్తున్న అడ్డగోలు సుంకాలు, పశ్చిమాసియాలో ఏర్పడిన అనిశ్చితిరెండు దేశాలనూ సమంగా పీడిస్తున్నాయి. ఈ దశలో పరస్పర సహకారం మరింతగా పెరిగితే ఈ పరిస్థితిని అధిగమించవచ్చునన్న అభిప్రాయం రెండు దేశాలకూ ఉంది. జపాన్‌తో మన సంబంధాలు విలక్షణమైనవి. రెండు దేశాల సంబంధాలను అభివర్ణించ టానికి దౌత్యంలో కొన్ని విశేషణాలుంటాయి. సహజమైన, ప్రత్యేకమైన, విశ్వసనీయ మైన, అనివార్యమైన... వంటివి అందులో కొన్ని. జపాన్‌తో మన సంబంధాల స్థాయిని తెలియజేయటానికి చాలామంది దౌత్యనిపుణులు వీటిని ఉపయోగిస్తారు.కానీ వాస్తవ పరిస్థితి అందుకు భిన్నం. ఎంత మెరుగైన సంబంధాలున్నా అవి ‘ఎక్కడ వేసిన గొంగడి అక్కడే’ అన్న చందాన ఉన్నాయి. ఇరుదేశాలమధ్యా సుహృద్భావం ఉంది. వేరే దేశాలతో ఏర్పర్చుకునే సంబంధాలకుండే రాజకీయ పరిమితులు కూడా ఇక్కడ లేవు. చైనాతో ఇరు దేశాలకూ ఉండే సమస్యలవల్ల వాటి మధ్య సాన్నిహిత్యానికి అవకాశాలెక్కువ. కానీ ఆసంబంధాలు తగినంతగా ఎదగలేదు. ఇరు దేశాలమధ్యా వ్యూహాత్మక భాగస్వామ్యం ఏర్పడి చాన్నాళ్లవుతున్నా వ్యాపార సంబంధాలు అంతంతమాత్రం. ద్వైపాక్షిక వాణిజ్యం 2,748 కోట్ల డాలర్లున్నా అందులో మన ఎగుమతుల విలువ కేవలం 600 కోట్ల డాలర్లు. మిగిలిందంతా జపాన్ నుంచి మనకొచ్చే దిగుమతుల వాటాయే. మన దేశానికి 1991 వరకూ జపాన్ అధికారిక అభివృద్ధి సాయం(ఓడీఏ) కింద ఆర్థిక సాయం అందించేది. ఢిల్లీ మెట్రో, ఈశాన్య రాష్ట్రాల సరుకు రవాణా కారిడార్ వంటి మౌలిక సదుపాయాల్లో జపాన్ ముద్ర ఉంది. కానీ పెట్టుబడులు పెట్టడంలో, వాణిజ్య విస్తరణ అంతంతమాత్రం. మన దేశంలో జపాన్ పెట్టుబడులు 4,000 కోట్ల డాలర్లు. కానీ తరచు లడాయివుండే చైనాలో దాని పెట్టుబడులు 13,000 కోట్ల డాలర్ల పైమాటే. చిన్న దేశం వియత్నాంలో కూడా జపాన్ 8,000 కోట్ల డాలర్ల మదుపు పెట్టింది. మన దేశంలో పనిచేస్తున్న జపాన్ సంస్థలు 1,400 మించవు. ఇందుకుభిన్నంగా థాయ్‌లాండ్‌లో జపాన్ సంస్థల సంఖ్య 6,000. మన మొత్తం వ్యాపార కార్యకలాపాల్లో జపాన్ కంపెనీల వాటా ఒక శాతం. అందులో కూడా ఆటోమొబైల్ వాటాయే అధికం. మన జనరిక్ మందులపై జపాన్‌లో అనేక రకాల ఆంక్షలున్నాయి. ప్రపంచవ్యాప్తంగా మన ఫార్మా రంగం ఎన్నో విజయాలు సాధిస్తున్నా అక్కడ సమస్యలు తప్పడం లేదు. ఇలాంటి అవరోధాలు అధిగమించగలిగితే ఇరు దేశాల సంబంధాలూ మరింత మెరుగైన స్థాయికి చేర తాయి. తకాయిచీ పర్యటన ఆ దిశగా మంచి ముందడు గని చెప్పుకోవచ్చు. -
అమర్నాథ్ యాత్ర ప్రారంభం.. మోదీ ఐదు సంకల్పాలు ఇవే..
పవిత్రమైన అమర్నాథ్ యాత్ర 2026 అధికారికంగా ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ యాత్రికులకు ప్రత్యేక లేఖ రాశారు. ఈ యాత్రను గొప్ప అదృష్టంగా అభివర్ణించారు. భక్తి, ఆధ్యాత్మికతతో పాటు సామాజిక బాధ్యతను కూడా పాటించాలని భక్తులకు ఆయన సూచించారు. ఈ మేరకు ఐదు సంకల్పాలను మోదీ సూచించారు.ప్రధాని మోదీ లేఖలో ప్రధాన సందేశంయాత్రికులకు రాసిన లేఖలో ప్రధాని మోదీ.. అమర్నాథ్ యాత్రను భారతదేశ ఆధ్యాత్మిక సంప్రదాయంలో అత్యంత పవిత్రమైన యాత్రలలో ఒకటిగా పేర్కొన్నారు. ఆయన ఈ యాత్రను భక్తి, ఏకత్వం మరియు శ్రద్ధకు ప్రతీకగా అభివర్ణించారు. ఈ సమయంలో యాత్రికులు పాటించాల్సిన ముఖ్యమైన అంశాలుగా ఆయన ఐదు సంకల్పాలుగా సూచించారు.The first batch of Amarnath pilgrims departs from the Baltal base camp for the holy cave shrine.@waseem_andrabi pic.twitter.com/pXIzwgKKmj— Waseem Andrabi وسیم (@waseem_andrabi) July 3, 2026ఐదు సంకల్పాలు ఇవే..యాత్ర మార్గాల్లో పరిశుభ్రతను కాపాడటంభద్రతా నియమాలు, ట్రాఫిక్ నియమాలను పాటించడంస్థానిక ఉత్పత్తులను ప్రోత్సహించడం (“Vocal for Local”)యాత్ర అనంతరం ఒక మొక్క నాటడం (“Ek Ped Maa Ke Naam”)దేశాభివృద్ధికి బాధ్యతగా వ్యవహరించడం (“Nation First” భావన)ఇక, ఈ ఏడాది యాత్ర జూలై 3 నుంచి ఆగస్టు 28 వరకు 57 రోజుల పాటు కొనసాగనుంది. హిమాలయాల్లో 12,000 అడుగుల ఎత్తులో ఉన్న అమర్నాథ్ గుహకు ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు ఈ యాత్రలో పాల్గొంటారు. యాత్ర ప్రారంభానికి ముందు జమ్మూ నుంచి మొదటి భక్తుల బృందాన్ని లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా జెండా ఊపి పంపించారు. ఈ సందర్భంగా భక్తులు “హర్ హర్ మహాదేవ్”, “బమ్ బమ్ భోలే” అంటూ భక్తి నినాదాలు చేశారు. భద్రతా కారణాల దృష్ట్యా కేంద్ర బలగాలు, జమ్మూ, కాశ్మీర్ పోలీసులు కలిసి బలమైన మల్టీ-లేయర్ సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. డ్రోన్లు, సీసీటీవీలు, ఆధునిక మానిటరింగ్ వ్యవస్థలు ఉపయోగించి యాత్ర మార్గాన్ని పర్యవేక్షిస్తున్నారు. -
ఇక సుదృఢ ఆర్థిక బంధం
న్యూఢిల్లీ: ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసుకొనే దిశగా భారత్, జపాన్ కీలకమైన కార్యక్రమాలు, ఒప్పందాలను ప్రకటించాయి. ఆర్థిక భాగస్వామ్య చట్రం, సైనిక పరికరాలను సంయుక్తంగా అభివృద్ధి చేసేందుకు రక్షణ ఒప్పందం సహా చమురు సంక్షోభాలను ఎదుర్కోవడానికి ఇంధన సంబంధాలను పెంపొందించే చర్యలు చేపట్టాలని నిర్ణయానికి వచ్చాయి. భారత ప్రధాని నరేంద్ర మోదీ, జపాన్ ప్రధానమంత్రి సనే తకాయిచీ గురువారం ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో సమావేశమయ్యారు. వాణిజ్యం, పెట్టుబడులు, ఆర్థిక భద్రత, ఇంధనం, అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలు, రక్షణ, ప్రజల మధ్య సంబంధాల వంటి అంశాల్లో భారత్–జపాన్ సంబంధాలపై సమగ్ర సమీక్ష జరిపారు.ఇరుదేశాల భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు చేపట్టాల్సిన చర్యలపై విస్తృతంగా చర్చించారు. ఆర్థిక భద్రత, కృత్రిమ మేధ(ఏఐ) రంగంలో సహకారం, ఇంధన సరఫరా వ్యవస్థలో భాగస్వామ్యాన్ని బలోపేతం చేసుకోవాలని తీర్మానించారు. ఇండో–పసిఫిక్ పరిస్థితులపై అభిప్రాయాలు పంచుకున్నారు. అక్కడ చైనా సైనిక ప్రాబల్యం పెరుగుతుండడంపై చర్చించారు. నౌకా నిర్మాణం, విమానయానం, సరుకు రవాణా(లాజిస్టిక్స్) రంగాల్లో సహకారాన్ని సులభతరం చేయడానికి భారత్, జపాన్ ఒక మొబిలిటీ ఫ్రేమ్‌వర్క్‌ను ఖరారు చేశాయి. ఆర్థిక భద్రత, క్లీన్ ఎనర్జీ, కీలక సాంకేతికతలు, పరిశోధన–అభివృద్ధిపై ఇరుదేశాల మధ్య పలు ఒప్పందాలపై ఈ సందర్భంగా సంతకాలు జరిగాయి. భేటీ అనంతరం మోదీ, తకాయిచీ ఒక ఉమ్మడి ప్రకటన విడుదల చేశారు. ఇండో–పసిఫిక్‌లో శాంతి, పురోగతికి మార్గం నేటి అనిశ్చిత పరిస్థితుల్లో ఆర్థిక, ఇంధన భద్రతల ప్రాముఖ్యతను భారత్, జపాన్ పూర్తిగా అర్థం చేసుకున్నాయని ప్రధాని మోదీ పేర్కొన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకొని ఆర్థిక భద్రత కోసం ఒక ఉమ్మడి రోడ్‌మ్యాప్ రూపొందించామని తెలిపారు. దీనిద్వారా సెమీకండక్టర్లు, క్వాంటమ్ టెక్నాలజీ, అడ్వాన్స్డ్ మెటీరియల్స్ వంటి వ్యూహాత్మక రంగాల్లో సప్లై చైన్లను పటిష్టం చేయబోతున్నామని వివరించారు.స్వేచ్ఛాయుతమైన, సుసంపన్నమైన, నియమ–ఆధారిత ఇండో–పసిఫిక్ ప్రాంతం తమ ఉమ్మడి ప్రాధాన్యత అని ఉద్ఘాటించారు. ఈ ప్రాంతంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య, మార్కెట్ ఆర్థిక వ్యవస్థలుగా ఈ రోజు అనేక కీలకమైన కార్యక్రమాలను ప్రారంభించామని వివరించారు. వీటి ద్వారా ఈ ప్రాంతంలో శాంతి, స్థిరత్వం, పురోగతికి మార్గం సుగమం చేస్తామన్నారు. ఇంధన భద్రత రంగంలో కూడా ఇరుదేశాలు అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నాయని మోదీ పేర్కొన్నారు. భారత్, జపాన్ సంబంధాల పునాది.. రెండు దేశాల మధ్య గత ఏడాది కాలంలో 100కు పైగా కొత్త వాణిజ్య ఒప్పందాలు కుదిరాయని, వీటి ద్వారా భారత్‌కు జపాన్ నుంచి 10 బిలియన్ డాలర్లకు పైగా పెట్టుబడులు రానున్నాయని ప్రధాని మోదీ స్పష్టంచేశారు. రాబోయే పదేళ్లలో జపాన్ నుంచి భారత్‌కు 10 ట్రిలియన్ల జపాన్ యేన్ల పెట్టుబడులను ఆకర్శించడం, భారత్‌లో జపనీస్ కంపెనీల సంఖ్యను రెట్టింపు చేయడమే తమ లక్ష్యమని తేలి్చచెప్పారు. 17 వ్యూహాత్మక రంగాల్లో పెట్టుబడులు పెట్టుబడులు, ఆవిష్కరణల రంగంలో సహకారం ద్వారా ఆర్థిక వృద్ధిని సాధించడంపై భారత్, జపాన్ ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నాయని సనే తకాయిచీ వివరించారు. 17 వ్యూహాత్మక రంగాల్లో పెట్టుబడుల ద్వారా బలమైన ఆర్థిక వ్యవస్థను రూపొందించడం, జపాన్ సప్లై చైన్లు, సాంకేతిక సామర్థ్యాలను మెరుగుపరచడం తన ధ్యేయమని ప్రకటించారు. భవిష్యత్తులో పరస్పర సహకారం, పెట్టుబడుల ద్వారా మన దేశాలను బలోపేతం చేసుకుందామని పిలుపునిచ్చారు. భారత్, జపాన్ సంబంధాలకు 2027లో 75 ఏళ్లు పూర్తికాబోతున్నాయి. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని ఇరుదేశాలు నిర్ణయానికొచ్చాయి. తకాయిచీ నా చిట్టి చెల్లెలు జపాన్ ప్రధాని తకాయిచీని నరేంద్ర మోదీ తన చిట్టి చెల్లెలుగా అభివర్ణించారు. ఆమె గొప్ప దార్శనిక, ప్రజాదరణ కలిగిన నాయకురాలు అంటూ ప్రశంసల వర్షం కురిపించారు. ద్వైపాక్షిక చర్చల అనంతరం మోదీ, తకాయిచీ మీడియాతో మాట్లాడారు. భారత్–జపాన్ వార్షిక శిఖరాగ్ర సమావేశం కోసం భారత్‌కు తొలిసారిగా విచ్చేసిన తకాయిచీకి స్వాగతం పలకడం తనకు ఎంతో సంతోషాన్నిస్తోందని వివరించారు. ఆమె జపాన్‌లోని నారా ప్రాంతానికి చెందినవారని, ఈ ప్రాంతం భారత్, జపాన్ల ఉమ్మడి బౌద్ధ వారసత్వానికి అత్యంత ముఖ్యమైన కేంద్రంగా నిలుస్తోందని తెలిపారు.మోదీ తనను చెల్లెలుగా భావిస్తూ సంబోధించడం పట్ల తకాయిచీ ఆనందం వ్యక్తంచేశారు. అన్నాచెల్లెళ్లుగా పనిచేస్తూ భారత్, జపాన్ భాగస్వామ్యాన్ని బలోపేతం చేస్తామన్నారు. నిర్దేశించుకున్న ఉమ్మడి లక్ష్యాలను సాధించుకోవాలని, రెండు దేశాల మధ్య వ్యూహాత్మక సహకారాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని అంగీకారానికి వచ్చినట్లు స్పష్టంచేశారు. భారత్‌లో తనకు అద్భుతమైన ఆతిథ్యం లభిస్తోందన్నారు. మోదీకి, భారత ప్రజలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని వెల్లడించారు. -
జపాన్ ప్రధాని నా అందమైన చెల్లెలు: మోదీ
జపాన్ ప్రధాని సనాయె తకాయిచీని తన అందమైన సోదరిగా ప్రధాని మోదీ పేర్కొన్నారు. ప్రధాని మోదీ చూపిన ఆప్యాయతకు చిరునవ్వుతో స్పందించిన జపాన్ ప్రధాని.. తనను అందమైన చెల్లెలు అని పిలిచినందుకు ఆమె ధన్యవాదాలు తెలిపారు. ఇవాళ (గురువారం) ఢిల్లీలో ప్రధాని మోదీతో జపాన్ ప్రధాని భేటీ అయ్యారు. భారత్-జపాన్ మధ్య కీలక ఒప్పందాలు జరిగాయి.వచ్చే పదేళ్లలో రూ.6 లక్షల కోట్ల పెట్టుబడులు లక్ష్యంగా.. ఫార్మా, ఢిఫెన్స్, ఏఐ టెక్నాలజీ రంగాల్లో ఒప్పందాలు జరిగాయి. భారత్-జపాన్ వార్షిక శిఖరాగ్ర సమావేశం కోసం మొదటిసారి భారతదేశాన్ని సందర్శిస్తున్న నా చెల్లెలు, జపాన్ ప్రధాని తకాయిచీకి నేను ఘన స్వాగతం పలుకుతున్నాను. ఆమె జపాన్‌కు మొదటి మహిళా ప్రధాన మంత్రి, అలాగే దూరదృష్టి గల నాయకురాలిగా ప్రజాదరణ పొందారంటూ ప్రధాని మోదీ ప్రశంసించారు.జపాన్ ప్రధాని మూడు రోజుల పర్యటన నిమిత్తం బుధవారం భారత్‌కు చేరుకున్నారు. భారత్‌లో ఇదే ఆమె మొట్టమొదటి అధికారిక పర్యటన. ప్రధాని నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు పర్యటనకు వచ్చారు. ఇవాళ ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో మోదీతో ఆమె సమావేశమయ్యారు. వ్యాపారం, వాణిజ్యం, రక్షణ, పెట్టుబడులు తదితర కీలక రంగాల్లో పరస్పర సహకారంపై చర్చించారు. అలాగే 16వ ఇండియా–జపాన్ వార్షిక సదస్సులో పాల్గొన్నారు.భారత్‌లో అడుగుపెట్టిన ఫొటోను తకాయిచీ ‘ఎక్స్’లో షేర్ చేశారు. దీనిపై ప్రధాని మోదీ స్పందించారు. భారతదేశంలో తొలి పర్యటన సందర్భంగా తకాయిచీకి ఆతిథ్యం ఇవ్వడం తమకు ఎంతో సంతోషాన్నిస్తోందని పేర్కొన్నారు. భారత్–జపాన్ ప్రత్యేక వ్యూహాత్మక, ప్రపంచ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేలా గురువారం జరగబోయే సమగ్ర చర్చల కోసం తాను ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని వెల్లడించారు. మన ఉమ్మడి కృషి ద్వారా ఇండో–పసిఫిక్ ప్రాంతంలో శాంతి, స్థిరత్వం, సమృద్ధిని పెంపొందించడాన్ని కొనసాగిద్దామని పిలుపునిచ్చారు. -
ప్చ్.. మూడు నెలలైనా గడవకముందే!
న్యూఢిల్లీ: ఐదేళ్ల పాటు శ్రమించి నిర్మించారు. రూ.12 వేల కోట్ల వ్యయంతో రూపొందించిన ఈ ప్రతిష్ఠాత్మక ఎక్స్‌ప్రెస్‌వేను స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ ఘనంగా ప్రారంభించారు. అయితే ప్రారంభమై మూడు నెలలు కూడా పూర్తికాకముందే రోడ్డుపై భారీ గుంతలు ఏర్పడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో నిర్మాణ నాణ్యతపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.212 కిలోమీటర్ల పొడవైన ఢిల్లీ–డెహ్రాడూన్ ఆరు లేన్ల ఎక్స్‌ప్రెస్‌వేను ప్రధాని మోదీ ఈ ఏడాది ఏప్రిల్ 14న ప్రారంభించారు. ఢిల్లీ నుంచి డెహ్రాడూన్ ప్రయాణ సమయాన్ని ఆరు గంటల నుంచి కేవలం రెండు గంటలకు తగ్గించడమే ఈ ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశం. ఐదేళ్ల పాటు నిర్మాణం సాగిన ఈ ప్రాజెక్టు ప్రారంభమైన కేవలం 79 రోజుల్లోనే రోడ్డుపై భారీ గుంతలు కనిపించడం తీవ్ర విమర్శలకు దారితీసింది.👋Hello @narendramodi Ji,This is the Delhi–Dehradun Expressway, inaugurated by you just a couple of months ago.It took around 5 years to build, yet it hasn't even seen its first monsoon. Look at the pathetic condition. People are forced to stand in the middle of the… pic.twitter.com/4GZF84Hgia— Manu🇮🇳🇮🇳 (@mshahi0024) July 2, 2026వైరల్ వీడియోలో ఎక్స్‌ప్రెస్‌వేపై రెండు పెద్ద గుంతలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. వాటి కారణంగా తన కళ్ల ముందే నాలుగైదు వాహనాలు అదుపు తప్పాయని, కనీసం రెండు కార్ల అల్లాయ్ వీల్స్ దెబ్బతిన్నాయని వీడియో తీసిన వాహనదారుడు పేర్కొన్నాడు. అనంతరం దెబ్బతిన్న చక్రాలను కూడా వీడియోలో చూపించాడు. ఈ ఘటనపై సోషల్ మీడియాలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఇటు.. ప్రతిపక్ష కాంగ్రెస్ అవినీతి ఆరోపణలు చేస్తూ కేంద్ర ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుంది.This is the video..😰 pic.twitter.com/rbTwggZLbC— bindasspahadi (@bindasspahadi) July 2, 2026ఐదేళ్లపాటు నిర్మించి, తొలి వర్షాకాలం కూడా పూర్తికాకముందే రోడ్డు పరిస్థితి ఇలా మారడం ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. టోల్ రూపంలో రూ.650 వసూలు చేస్తూ, ప్రయాణికుల భద్రతకు హామీ ఇవ్వలేకపోతున్నారని నెటిజన్లు విమర్శిస్తున్నారు.ఇక ప్రతిపక్ష కాంగ్రెస్ ఈ అంశాన్ని రాజకీయంగా ఎత్తుకుంది. ఇంత భారీ వ్యయంతో నిర్మించిన ప్రాజెక్టులో మూడు నెలల్లోనే గుంతలు పడటం నిర్మాణ నాణ్యతలో లోపాలకు, నిధుల దుర్వినియోగానికి నిదర్శనమని ఆరోపించింది. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. -
నితీష్ కుమార్‌కు డిప్యూటీ పీఎం పదవి?
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర మంత్రిమండలి విస్తరణ త్వరలో జరగనుందనే వార్తల మధ్య, బీహార్ మాజీ ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌ను దేశ ఉప ప్రధాన మంత్రి (డిప్యూటీ పీఎం)గా నియమించాలనే డిమాండ్ ఊపందుకుంది. ఈ ప్రతిపాదనకు అధికార జనతాదళ్ (యునైటెడ్)తో పాటు ప్రతిపక్ష రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) కూడా మద్దతు ప్రకటించింది. జేడీయూ శాసనసభ్యుడు పంకజ్ మిశ్రా, ఆర్జేడీ సీనియర్ నేత ముఖేష్ రోషన్ ఇద్దరూ నితీష్ కుమార్‌కు కేంద్రంలో తగిన గౌరవం దక్కాలని, ఆయనకున్న సుదీర్ఘ రాజకీయ, పరిపాలనా అనుభవానికి డిప్యూటీ పీఎం పదవి సరైనదని అంటున్నారు.దాదాపు రెండు దశాబ్దాల పాటు బీహార్ ముఖ్యమంత్రిగా సేవలు అందించడమే కాకుండా, గతంలో కేంద్ర మంత్రిగా కూడా పనిచేసిన నితీష్ కుమార్‌కు జాతీయ స్థాయిలో కీలక పాత్ర పోషించే అన్ని అర్హతలు ఉన్నాయని జేడీయూ పేర్కొంది. ఆర్జేడీ నేత ముఖేష్ రోషన్ ఒకడుగు ముందుకు వేసి, ఆయనకు ఉప ప్రధాని పదవితో పాటు వ్యవసాయం లేదా రైల్వే వంటి కీలక శాఖల బాధ్యతలను కూడా అప్పగించాలని కేంద్రాన్ని కోరారు. ఈ డిమాండ్లపై అటు బీజేపీ కానీ, ఇటు కేంద్ర ప్రభుత్వం కానీ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.రాజకీయ సమీకరణాల విషయానికొస్తే, నితీష్ కుమార్ 2026, ఏప్రిల్ 10న రాజ్యసభకు ఎన్నికైన తర్వాత, ఏప్రిల్ 14న బీహార్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. అనంతరం ఏప్రిల్ 15న బీజేపీకి చెందిన సామ్రాట్ చౌదరి బీహార్ నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రస్తుతం జేడీయూ జాతీయ అధ్యక్షునిగా, రాజ్యసభ సభ్యునిగా ఉన్న నితీష్ కుమార్‌ను కేంద్ర క్యాబినెట్లోకి తీసుకోవాలా లేదా అనే తుది నిర్ణయం ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ అగ్రనాయకత్వంపైనే ఆధారపడి ఉంది.ఇది కూడా చదవండి: అమర్నాథ్ యాత్ర షురూ.. రిజిస్ట్రేషన్ వివరాలివే.. -
డిజిటల్ ఇండియాతో భారత్‌కు కొత్త గుర్తింపు
న్యూఢిల్లీ: డిజిటల్ ఇండియా కార్యక్రమం భారతదేశానికి అంతర్జాతీయంగా కొత్త గుర్తింపు తీసుకొచ్చిందని ప్రధాని నరేంద్ర మోదీ కొనియాడారు. పరిపాలనకు కొత్త నిర్వచనాన్నిచ్చిన ఈ కార్యక్రమం పౌరుల సాధికారతకు ఉపయోగపడిందని, జీవితపు ప్రతి పార్శా్వన్నీ తాకుతూ సమగ్రాభివృద్ధిని వేగవంతం చేసిందని అన్నారు. డిజిటల్ ఇండియా కార్యక్రమానికి 11 ఏళ్లు పూర్తయిన సందర్భంగా బుధవారం ప్రధాని ఎక్స్‌లో ఒక పోస్టు చేస్తూ... డిజిటల్ చెల్లింపులు మొదలుకొని ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల ఖాతాల్లోకి నగదు జమ వరకూ అంతకంతకూ విస్తరిస్తున్న డిజిటల్ మౌలిక సదుపాయాలతో పౌరుల జీవితం మరింత సుఖమయమైందని అన్నారు.‘‘డిజిటల్ ఇండియా ఆవిష్కరణలు భారత్‌లోని అన్ని ప్రాంతాలకు, ముఖ్యంగా ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలకూ విస్తరించింది’’అని ఆయన అన్నారు. యవ పారిశ్రామిక వేత్తలు, స్టార్టప్ కంపెనీలు ఇన్నొవేటర్లు డిజిటల్ మౌలిక సదుపాయాల సాయంతో ప్రపంచ సమస్యలకు వినూత్న పరిష్కారాలు ఆవిష్కరిస్తున్నారని చెప్పారు. డిజిటల్ ఇండియా కార్యక్రమం విద్య, ఆరోగ్యం, వ్యవసాయం, వాణిజ్యం, ప్రజాసేవలను బలోపేతం చేసిందని, పాలనను మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా మార్చిందని వివరించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యల ఫలితంగా ఏఐ, సెమీకండక్టర్లు, క్వాంటమ్ కంప్యూటింగ్ రంగాల్లోనూ దేశం వేగంగా పురోగమిస్తోందన్నారు.‘‘డిజిటల్ ఇండియా కూడా వృద్ధి, అవకాశాలకు కొత్త మార్గాలను తెరుస్తుంది. ప్రతి పౌరుడిని శక్తిమంతులను చేసే, సుస్థిరాభివృద్ధికి ప్రోత్సాహమిచ్చే మానవాళి సేవకు సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగపడేలా చేసే భవిష్యత్తును సృష్టించేందుకు మా ప్రయత్నాలు కొనసాగుతాయి’’అని అన్నారు. అభివృద్ధి చెందిన, స్వయం సమృద్ధ భారత్‌కు డిజిటల్ ఇండియా బలమైన పునాది అని, పేదలు, వెనుకబడిన వర్గాలను శక్తివంతం చేయడంలో, పౌరుల జీవితాలను సులభతరం చేయడంలో కీలక పాత్ర పోషించిందని మోదీ చెప్పారు.‘‘ఆప్టికల్ ఫైబర్ నెట్‌వర్క్‌ల విస్తరణ నుంచి డిజిటల్ లావాదేవీల వరకు, ఈ కార్యక్రమం సాధించిన అపూర్వ విజయాలు ప్రపంచ దృష్టిని భారత్‌పై నిలిపాయి’’అని ఆయన అన్నారు. ‘‘వందకోట్లకు పైబడ్డ ప్రజలు సాంకేతిక పరిజ్ఞానాన్ని స్వీకరిస్తే, దాని ప్రభావం విప్లవాత్మకమైన మార్పులకు నాందీగా ఉంటుంది’’అని వ్యాఖ్యానించారు. -
భారత గడ్డపై అడుగుపెట్టిన జపాన్ ప్రధాని
జపాన్ ప్రధానమంత్రి సనాయే తకైచి మూడు రోజుల అధికారిక పర్యటన నిమిత్తం బుధవారం రాత్రి ఢిల్లీకి చేరుకున్నారు. విమానాశ్రయంలో కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ఆమెకు ఘన స్వాగతం పలికారు. ఈ పర్యటన జూలై ఒకటి నుంచి 3 వరకు కొనసాగనుండగా.. ఇందులో భారత్-జపాన్ 16వ వార్షిక శిఖరాగ్ర సమావేశం ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆహ్వానం మేరకు భారత్‌కు వచ్చిన సనాయే తకైచి.. ప్రధాని మోడీతో ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. ఈ సమావేశంలో వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణ సహకారం, సెమీకండక్టర్లు, కృత్రిమ మేధస్సు, కీలక ఖనిజాలు, స్వేచ్ఛాయుత ఇండో-పసిఫిక్ వ్యూహం తదితర అంశాలపై ఇరు దేశాలు చర్చించనున్నాయి. అలాగే ప్రాంతీయ, అంతర్జాతీయ పరిణామాలపై కూడా అభిప్రాయాలు పంచుకోనున్నట్లు విదేశాంగ శాఖ తెలిపింది. ప్రధానమంత్రి పదవి చేపట్టిన తర్వాత సనాయే తకైచి భారత్‌కు రావడం ఇదే తొలిసారి. ఈ పర్యటనతో భారత్-జపాన్ ప్రత్యేక వ్యూహాత్మక, గ్లోబల్ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయాలని ఇరు దేశాలు లక్ష్యంగా పెట్టుకున్నాయి.#WATCH | Japanese Prime Minister Sanae Takaichi arrives in Delhi on her Official Visit to India. Union Minister Dr Jitendra Singh receives her at the airport. pic.twitter.com/RNz9gnSIT4— ANI (@ANI) July 1, 2026 -
సెషెల్స్ ద్వితీయ మహిళకు ప్రధాని మోదీ గిఫ్ట్‌గా కాంచీపురం చీర..! స్పెషాల్టీ ఇదే
ద్వీపదేశమైన సెషల్స్‌లో ప్రధాని మోదీ పర్యటించిన సంగతి తెలిసిందే. ఆ పర్యటనలో ఆయన ఆ దేశ స్వర్ణోత్సవ జాతీయ దినోత్సవ వేడుకలకు గౌరవ అతిథిగా హాజరయ్యారు. అక్కడ మోదీకి ఆ దేశ అధ్యక్షుడు డాక్టర్ పాట్రిక్ హెర్మిని ఘన స్వాగతం పలికారు. ఆ సందర్శన నేపథ్యంలో ఆ దేశ ద్వితీయ మహిళ లీనా పిళ్లైకి కాంచీపురం పట్టు చీరను బహుమతిగా అందించారు. ఇది తమిళనాడులో ఉన్న చారిత్రాత్మక దేవాలయ పట్టణమైన కాంచీపురంకి చెందిన ప్రత్యేక చేనేత వస్త్రం. ఇది బౌగోలిక సూచిక(GI) ట్యాగ్‌ను కూడా పొందింది. ఈ సందర్భంగా ఈ పట్టు వస్త్రం ప్రత్యేకత?..ఆ పేరుతో పిలవడానికి రీజన్ ఏంటి? తదితరాల గురించి సవివరంగా తెలుసుకుందామా.కాంచీపురం పట్టు వస్త్రం భారతదేశంలోని అత్యుత్తమ చేనేత చీరల్లో ఒకటి. ఇది విలాసవంతమైన ఆకృతి, అసాధారణమై పనితనం, ప్రకాశవంతమైన రంగులకు పేరుగాంచింది. ఈ వస్త్ర చరిత్ర చాలా గొప్పది. దీనిని తమిళనాడులోని కాంచీపురం పట్టణంలో నేస్తారు. అత్యంత నాణ్యమైన మల్బరీ పట్టును ఉపయోగించి ఈ పట్టు వస్త్రాన్ని తయారు చేస్తారు. ఈ చేనేత వస్త్రం చూడటానికి అందంగానే కాకుండా మన్నికకు కూడా ప్రసిద్ధి చెందింది. వాటిపై ఉండే జరీ నమునా, విభిన్న రంగులు దాని ఖరీదును, ప్రత్యేకతను నిర్దేశిస్తాయి. ఈ చీరల తయారీలో ఎక్కువగా దేవాలయ వాస్తుశిల్పం, పువ్వులు, నెమళ్లు, ఆకులు వంటి జ్యామితీయ నమునాలు ఉంటాయి. ఈ చీరలో ఉన్న ప్రత్యేకత దానికి సమకాలీనంగా ఉండే బ్లౌజు. ఇది ఆ చీరను మరింత అందంగా కనిపించేలా చేస్తుంది. భారీగా ఎంబ్రాయిడీ చేసిన బ్లౌజుకి బదులుగా సాంప్రదాయ కాంచీపురం హాల్టర్ నెక్ బ్లౌజ్ లేదా ఫుల్‌స్లీవ్ సిల్హౌట్‌లు ఈ చీర లుక్‌ని మరింత పెంచేస్తుంది. ప్రస్తుతం ఫ్యాషన్ డిజైనర్లు చీరగానే కాకుండా రకరకాలు డిజైనర్వేరల్లోకి తీసుకొస్తుండటం విశేషం. అంతేగాదు వెస్ట్‌కోట్‌లు, షర్టులు, కో-ఆర్డ్ సెట్లు లేదా న్యూట్రల్ బేసిక్స్‌తో జత చేసి సరికొత్త ట్రెండ్‌ని సృష్టిస్తున్నారు కూడా. ఈ కాంచీపురం పట్టుని ఆధునిక శైలిలో ధరించినా లేదా సాంప్రదాయ స్ఫూర్తిని గౌరవించినా..దాని వారసత్వం, చరిత్ర, సంస్కృతిని ఇనుమడింప చేసేలా ఆకర్షణీయంగా కనిపించడం దీని ప్రత్యేకత. ఇక్కడ మోదీ సెషెల్స్ ద్వితీయ మహిళకు ఈ కాంచీపురం వస్త్రాన్ని గిఫ్ట్‌గా ఇవ్వడానికి కారణం కూడా ఇదే. కొన్ని వస్త్రాలు ఎప్పటికీ ఫ్యాషన్ నుంచి తప్పుకోవని, వాటిని ధరించడానికి రకరకాల మార్గాలు దొరుకుతాయని నొక్కి చెప్పేందుకే. View this post on Instagram A post shared by New India Junction (@nijunction) వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి(చదవండి: స్లిమ్‌గా ఉపాసన కొణిదెల..! ట్విన్స్ తర్వాత బరువు తగ్గాలంటే..) -
సులభతర జీవనం.. వాణిజ్యం
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో సులభతర వాణిజ్యం, ప్రజల సౌకర్యవంతమైన జీవనానికి బాటలు పరిచేలా నిబంధనల సడలింపుతోపాటు ఆ మేరకు సంస్కరణలు తీసుకురావాలని ప్రధాని మోదీ ఉపదేశించారు. సెషెల్స్ దేశ పర్యటన ముగించుకుని వచ్చిన మరుసటి రోజే మోదీ అన్ని కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు, విభాగాల కార్యదర్శులతో ఢిల్లీలోని ప్రధాని కార్యాలయమైన ‘సేవా తీర్ధు’లో సమావేశమయ్యారు. సులభతర జీవనం, వాణిజ్యంతోపాటు ఆత్మనిర్భరతను ప్రోత్సహించడమే లక్ష్యంగా ఆయా మంత్రిత్వశాఖలు చేపట్టిన కార్యక్రమాలు, ఆయా పథకాల పురోగతిపై కార్యదర్శులు మోదీకి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.మంత్రివర్గాన్ని మోదీ పునర్వ్యవస్థీకరించనున్నారని వార్తలు వెలువడుతున్న వేళ ఈ సమీక్ష సమావేశం జరగడంతో దీనికి ఎనలేని ప్రాధాన్యత ఏర్పడింది. ప్రధాని దార్శనికత, ఆమేరకు సఫలీకృతమైన విధాన నిర్ణయాలు, ఈ దిశలో కీలక రంగాల వారీగా ఎదురవుతున్న సవాళ్లు, వాటి పరిష్కారానికి ఆచరణలో పెట్టిన వ్యూహాల పైనా ఈ సమీక్షా సమావేశంలో చర్చ జరిగినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. లక్ష్యాలను వేగంగా సాధించడంలో సమీకృత ప్రణాళిక, సమన్వయం అవసరమని ఆయా మంత్రిత్వశాఖల కార్యదర్శులకు మోదీ సూచించారు. శాఖల మధ్య అంతర్గత సమన్వయంతోపాటు విధానపర నిర్ణయాలు వేగంగా తీసుకునేలా పీఎం ‘గతిశక్తి’వేదికను సమర్థవంతంగా ఉపయోగించుకోవాలని మోదీ ఆదేశించారు.సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలుచేయడంపై దృష్టిపెట్టాలని ప్రధాని సూచించారు. పరిపాలనా సంస్కరణలు, అభివృద్ధి లక్ష్యాలు, ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యాన్ని ప్రోత్సహించడంలో సాధించిన పురోగతిపై సమీక్ష కోసమే ఈ భేటీ నిర్వహించినప్పటికీ మంత్రిత్వ శాఖల పనితీరుపై మోదీ ఈ భేటీలో ఆయా శాఖల కార్యదర్శులను ఆరా తీసినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.ప్రధాని కార్యాలయం సహా కేబినెట్ మంత్రుల పనితీరుపై కూడా ఆయా ఉన్నతాధికారులు.. సహాయ మంత్రులపై ఫీడ్‌బ్యాక్ ఇచ్చినట్లు సమాచారం. ఇటీవల ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా రాష్ట్రపతి ద్రౌపది ముర్మును విడివిడిగా కలిసిన నేపథ్యంలో, ఇప్పుడీ కార్యదర్శుల సమావేశం ముగిసిన వెంటనే త్వరలోనే మంత్రివర్గంలో భారీ మార్పులు ఉండవచ్చనే అంచనాలు బలంగా ఉన్నాయి. అవీ పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభానికి ముందే ఉంటాయనే ఊహాగానాలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో గట్టిగా వినిపిస్తున్న నేపథ్యంలో ఈ మేధోమథన సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది. కీలకంగా మారిన క్షేత్రస్థాయి నివేదిక.. మంత్రిత్వ శాఖల పనితీరును సమీక్షించడం, రాబోయే నెలల్లో ప్రభుత్వం చేపట్టాల్సిన సంస్కరణలపై అప్రమత్తం చేయడంతో పాటు మంత్రివర్గం, ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశ వివరాలను ఆయా మంత్రిత్వ శాఖలకు కేంద్ర కేబినెట్ సెక్రటేరియట్ ఎప్పటికప్పుడు ఒక నోట్స్ రూపంలో పంపిస్తోంది. మంత్రివర్గం, ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ నిర్ణయాలకు అనుగుణంగా పనిచేయడంలోనూ, పనితీరు మెరుగుపరుచుకోవడంలోనూ లోపాలు, ఆలస్యం అవుతున్నాయని ఈనెల 17న పంపిన మెమోరాండంలో స్పష్టం చేసింది.ఈ నేపథ్యంలో వికసిత్ భారత్–2047 లక్ష్యంగా ఏయే శాఖలో ఏయే కార్యక్రమాలు ఏవిధంగా జరుగుతున్నాయి, ఫైళ్లు నిర్దిష్ట కాలంలో పరిష్కారమవుతున్నాయా లేదా అనే తదితర అంశాలపై మంగళవారం నాటి సమావేశంలో మోదీ సమీక్ష జరిపినట్లు తెలుస్తోంది. ఇలాంటి అంతర్గత సమావేశాలలో వచ్చిన ఫీడ్‌బ్యాక్, అధికారుల నివేదిక ఆధారంగా ఏ మంత్రిత్వ శాఖ ఆశించిన స్థాయిలో పనితీరు కనబర్చలేదో గుర్తించి, ఆ తర్వాత జరిగే మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో ఆయా మంత్రుల పోర్ట్‌ఫోలియోలను మార్చడమో లేదా కొత్తవారికి అవకాశం ఇవ్వడం మోదీ శైలి అని ఢిల్లీ రాజకీయ వర్గాలలో వాదనలు వినిపిస్తున్నాయి.మోదీ తన గత రెండు విడతల ప్రభుత్వాలలో ముఖ్యంగా 2017, 2021 మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలకు ముందు సైతం కేంద్ర మంత్రులతోనే గాకుండా, ప్రభుత్వ శాఖల ‘గ్రౌండ్ రిపోర్ట్’కోసం ఉన్నతాధికారులతో అంతర్గత సమీక్షలు నిర్వహించడాన్ని రాజకీయ విశ్లేషకులు ప్రస్తావిస్తున్నారు. -
మోదీ సరిగా నిద్రపోరు.. ఆయన నా టైపే!
భారత్–అమెరికా సంబంధాల్లో ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యక్తిగత అనుబంధం ఎప్పుడూ చర్చనీయాంశమే. తాజాగా ఆ ఇద్దరి స్నేహానికి సంబంధించిన ఓ ఆసక్తికర సంఘటనను భారత్‌లో అమెరికా రాయబారి సెర్గియో గోర్ వెల్లడించారు.భారత్-అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్య వేదిక (USISPF) లీడర్షిప్ సమ్మిట్‌లో మాట్లాడిన అమెరికా రాయబారి సెర్గియో గోర్.. ట్రంప్-మోదీ స్నేహంపై ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. కొన్ని నెలల క్రితం మియామిలో జరిగిన యూఎఫ్‌సీ ఈవెంట్ సందర్భంగా ట్రంప్‌తో కలిసి బ్యాక్‌స్టేజ్‌లో ఉన్నప్పుడు.. ఒక్కసారిగా "ప్రధాని మోదీకి ఫోన్ చేద్దాం" అని ట్రంప్ చెప్పారన్నారు. అయితే.. అప్పటికే భారత్‌లో ఉదయం 6 గంటలు అవుతుందని.. బాగా వేకువజామున అని తాను చెప్పగా, ట్రంప్ వెంటనే..‘‘ఆయన(మోదీ) ఈపాటికే లేచి ఉంటారు. ఆయన నాలాగే. నిద్ర తక్కువే (He's like me). సరిగా నిద్రపోరు’’ అని నవ్వుతూ సమాధానం ఇచ్చినట్లు గోర్ వివరించారు. అయితే ఆ రోజు కాల్ చేయకపోయినా.. మరుసటి రోజు ఇద్దరూ మాట్లాడుకున్నారని తెలిపారు. అయితే ఈ సంఘటనలో ప్రధాన విషయం ఫోన్ కాల్ కాదని.. ఇద్దరు నాయకుల మధ్య ఉన్న వ్యక్తిగత స్నేహబంధమేనని గోర్ వ్యాఖ్యానించారు."ఎవరైనా నిజమైన స్నేహితులైతే ప్రతి విషయం ముందుగానే షెడ్యూల్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. ట్రంప్ నిజంగానే ప్రధాని మోదీని తన స్నేహితుడిగా భావిస్తారు" అని ఆయన అన్నారు.భారత్‌తో బంధానికి ట్రంప్ ప్రాధాన్యంభారత్తో సంబంధాలను మరింత బలోపేతం చేయాలనే సంకల్పంతో ట్రంప్ ఉన్నారని సెర్గియో గోర్ స్పష్టం చేశారు. ఇటీవల వాషింగ్టన్లో ట్రంప్‌తో దాదాపు రెండు గంటలపాటు సమావేశమైన సందర్భంగా కూడా ఆయన భారత్ గురించి ఎంతో అభిమానంతో మాట్లాడారని చెప్పారు. ట్రంప్‌కు తన గత భారత పర్యటన ఇప్పటికీ గుర్తుండిపోయే అనుభవమని, భారత్‌పై ఆయనకు ప్రత్యేక అభిమానం ఉందని గోర్ తెలిపారు. రెండోసారి అధ్యక్షుడిగా ఉన్న కాలంలో కూడా ట్రంప్ భారత్‌ను సందర్శిస్తారని తాను ఆశిస్తున్నట్లు చెప్పారు. ఇదిలా ఉంటే.. వచ్చే ఏడాది ట్రంప్ భారత్‌లో పర్యటించబోతున్న సంగతి తెలిసిందే.మొదటి టర్మ్‌లోనే బలపడిన స్నేహంట్రంప్ తొలి అధ్యక్ష పదవీకాలంలోనే మోదీతో ఆయనకు సన్నిహిత సంబంధాలు ఏర్పడ్డాయి. అమెరికాలో జరిగిన 'హౌడీ మోదీ' కార్యక్రమం, భారత్‌లో నిర్వహించిన 'నమస్తే ట్రంప్' సభలు ఆ ఇద్దరి స్నేహానికి ప్రతీకగా నిలిచాయి. అప్పటి నుంచి రక్షణ, వాణిజ్యం, సాంకేతికత, ఇండో-పసిఫిక్ వ్యూహం వంటి కీలక రంగాల్లో రెండు దేశాల సహకారం మరింత బలపడిందని అధికారులు చెబుతున్నారు.భవిష్యత్తుపై ఆశలువచ్చే రెండేళ్లు భారత్-అమెరికా సంబంధాలకు అత్యంత కీలకమని సెర్గియో గోర్ అభిప్రాయపడ్డారు. వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణ, సాంకేతిక రంగాల్లో మరింత స్పష్టమైన ఫలితాలు సాధించడంపై ఇరు దేశాలు దృష్టి పెట్టాయని చెప్పారు. ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు రాబోయే దశాబ్దాల పాటు ద్వైపాక్షిక సంబంధాలకు బలమైన పునాది వేస్తాయని ఆయన పేర్కొన్నారు. -
అన్ని రాష్ట్రాల్లో 50% సీట్లు పెంపు
న్యూఢిల్లీ: జనాభా ప్రాతిపదికన లోక్‌సభ సీట్ల పెంపు విషయంలో నిర్ణయం తీసుకుంటే తమకు అన్యాయం జరుగుతుందని దక్షిణాది రాష్ట్రాల నుంచి ఆగ్రహావేశాలు ఎక్కువవుతున్నట్లు వార్తలొచ్చాయి. దీంతో జనాభా సిద్ధాంతాన్ని తాత్కాలికంగా పక్కనబెట్టి అన్ని రాష్ట్రాలకు సమన్యాయం దక్కేలా ఏక రీతిగా 50 శాతం సీట్లను పెంచాలని మోదీ సర్కార్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. మహిళా రిజర్వేషన్ చట్టం అమలుకు సంబంధించి రాజ్యాంగ సవరణ బిల్లు కోసం తాజాగా ముసాయిదా బిల్లును తయారుచేసే పనిలో పడ్డ ఎన్డీఏ సర్కార్ అన్ని రాష్ట్రాల్లో 50 శాతం సీట్ల పెంపు మీద సైతం కసరత్తు చేస్తోందని విశ్వసనీయ వర్గాలు సోమవారం వెల్లడించాయి. అయితే గతంలో తీసుకొచ్చిన ముసాయిదా బిల్లు ఏప్రిల్ 17వ తేదీన మూడింట రెండొంతుల మెజారిటీ లేకపోవడంతో వీగిపోవడం తెల్సిందే. మునుపటి బిల్లును ఆధారంగా చేసుకుని కొత్తగా మోదీ ప్రభుత్వం తయారుచేసిన ముసాయిదా బిల్లులో 1971 నాటి జనాభా లెక్కలను ప్రామాణికంగా తీసుకుని ప్రస్తుతం ఉన్న రాష్ట్రాల మధ్య లోక్‌సభ సీట్ల నిష్పత్తిని యథాతథంగా కొనసాగించాలని ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. మరోవైపు తాజా జనాభా లెక్కలు పూర్తయ్యాక 2011 జనాభాలెక్కలను పక్కనపెట్టి లోక్‌సభ, అసెంబ్లీలో సీట్ల కేటాయింపులు జరగనున్నాయని గతంలో ప్రకటించడం తెల్సిందే. ఏప్రిల్‌లో పార్లమెంట్లో పరాభవం ఎదురైన నేపథ్యంలో ఈసారి మెజారిటీ సంఖ్యాబలం ఉన్న తర్వాతనే బిల్లుకు తుది రూపునిచ్చి సభలో ప్రవేశపెట్టాలని ప్రభుత్వం యోచిస్తోంది. ప్రస్తుతం లోక్‌సభలో ఎన్డీఏకు 300 మంది ఎంపీల బలముంది. మూడు ఖాళీలున్నాయి. ప్రస్తుతమున్న మొత్తం సంఖ్యను పరిగణనలోకి తీసుకుంటే కొత్త బిల్లు నెగ్గాలంటే ప్రభుత్వానికి మూడింట రెండొంతులు అంటే కనీసం 360 మంది ఎంపీల మద్దతు ఉండాల్సిందే. ప్రస్తుత మహిళా రిజర్వేషన్ చట్టం ప్రకారం మహిళలకు రిజర్వేషన్ కల్పించడం అనేది 2034 ఏడాదికి ముందు అమలుచేయడం కుదరదు. 2027 జనాభా లెక్కలు పూర్తయ్యాకే ఈ రిజర్వేషన్ అమలుచేయాలని గతంలో మెలిక పెట్టారు. 2029 లోక్‌సభ ఎన్నికల నుంచి చట్టంలోని నిబంధనలు అమల్లోకి వస్తాయి. -
సెషెల్స్‌తో మరింత బంధం
కేవలం 115 చిన్న చిన్న దీవుల సమాహారం. అందులో నివసించటానికి పనికొచ్చేవి నాలుగంటే నాలుగే. జనాభా చూస్తే లక్షా 30 వేలు. దేశ భూభాగం కేవలం 455 చదరపు కిలోమీటర్లు మాత్రమే. ఇంత చిన్న దేశం సెషెల్స్లో ప్రధాని నరేంద్ర మోదీ మూడు రోజులు పర్యటించారు. హిందూ మహాసముద్ర ప్రాంతంలో అత్యంత కీలకస్థానంలో ఉన్న ఈ ద్వీపకల్పం ఆఫ్రికా తూర్పు తీరానికి సమీపంలో, హిందూమహా సముద్రంలోని అంతర్జాతీయ నౌకా రవాణా మార్గాలకు సమీపంలో ఉంది. ఇది ఆసియా–ఆఫ్రికా సముద్ర మార్గాల కూడలి కనుక ఆఫ్రికా, యూరప్, పశ్చిమాసియా దేశాలకు వెళ్లే నౌక లన్నీ ఈ ప్రాంతంనుంచే పోవాలి. ఆ నౌకలు నిత్యం ముడిచమురు, సహజవాయు నిక్షేపాలు, ఆహారపదార్థాలు, ముడి సరుకులు మోసుకుపోతుంటాయి. ఆ దేశాధ్యక్షుడు ప్యాట్రిక్ హెర్మినీ ఈ ఏడాది మొదట్లో మన దేశం వచ్చారు. అటు తర్వాత మన దేశం అక్కడికి 250 టన్నుల ఆహార పదార్థాలు, భవన నిర్మాణాలకు అవసరమయ్యే సిమెంట్, ఇతరమైనవి పంపింది. దానికి కొనసాగింపుగా మోదీ జరిపిన ప్రస్తుత పర్యటనలో ఇరు దేశాలమధ్యా 19 అంశాల్లో అంగీకారం కుదిరింది. తమవంటి ద్వీపకల్ప దేశాల ఆకాంక్షలను ప్రపంచ వేదికలపై ఎలుగెత్తిచాటుతూ, పర్యావరణ పరిరక్షణ కోసం కృషి చేస్తున్న భారత్‌పై ఆ దేశంలో ఆదరాభిమానాలున్నాయి. 1986లో అప్పటి దేశాధ్యక్షుడైన ఫ్రాన్స్ ఆల్బర్ట్ రెనే సోవియెట్ యూనియన్ పర్యటనకెళ్లినప్పుడు సెషెల్స్లో తిరుగుబాటుకు కుట్ర పన్నిన వైనంపై ముందస్తు సమా చారం అందుకున్న నాటి ప్రధాని రాజీవ్ గాంధీ హుటాహుటీన నావికా దళాన్ని పంపి దాన్ని అణిచేశారు. సెషెల్స్ నిడివి చిన్నదైనా సాగరజలాల్లో దాని ప్రత్యేక ఆర్థిక మండలి (ఈఎస్‌జెడ్) ఏకంగా 13.7 లక్షల చదరపు కిలోమీటర్లు. అంటే భూభాగంకన్నా దాని సముద్ర వ్యాప్తి దాదాపు 3,000 రెట్లు అధికం. హిందూ మహాసముద్రంలో చైనా క్రమేపీ తన ప్రాబల్యాన్ని విస్తరించుకోవటానికి ముత్యాల తీగ (స్ట్రింగ్ ఆఫ్ పెరెల్స్) పేరిట పాగా వేయాలని చూస్తోంది. ఆఫ్రికా తీరమైన జిబూటిలో ఇప్పటికే సైనిక స్థావరం ఏర్పాటులో బిజీగా ఉంది. కనుక ఈ ప్రాంతంలో తన పట్టు నిలుపుకొనాలంటే సెషెల్స్‌తో భారత్‌కు బలమైన బంధం ఉండితీరాలి. కోస్తా రాడార్ నెట్ వర్క్ పేరిట మన దేశం ఏర్పాటుచేసిన వ్యవస్థ ఆ ప్రాంతంలో ప్రయాణించే ప్రతి నౌక కదలికనూ ఎప్పటికప్పుడు తెలుసుకుంటోంది. అక్కడ సముద్ర దొంగల బెడద కూడా ఎక్కువే. దాంతోపాటు మాదకద్రవ్యాల స్మగ్లింగ్, అక్రమ చేపలవేట ఉంటాయి. ఇలాంటి సమస్యలను ఎదుర్కొనటానికి రాడార్ నెట్ వర్క్ ఎంతగానో తోడ్పడుతున్నది. దీంతోపాటు మన దేశం డోర్నియర్ నిఘా విమానాలనూ, గస్తీ నౌకలనూ బహుమతిగా ఇచ్చింది. వాటిపై సెషెల్స్ రక్షణ సిబ్బందికి శిక్షణనిచ్చింది. 2020లో ఆ దేశ సుప్రీంకోర్టు భవనాన్ని ఉచితంగా నిర్మించి ఇచ్చింది.ప్రసిద్ధ నావికుడు వాస్కోడిగామా 1502లో తొలిసారి ఈ ద్వీపకల్పాన్ని సందర్శించి నప్పుడు ఇక్కడ మానవ సంచారం లేదని చెబుతారు. అటుతర్వాత 1756లో ఫ్రాన్స్ దీన్ని తమ అధీనంలోకి తెచ్చుకుంది. అప్పటి ఫ్రాన్స్ ఆర్థికమంత్రి జీన్ మోరో సెషెల్స్ పేరిట ఈ ద్వీపకల్పానికి సెషెల్స్గా నామకరణం చేశారు. 1770లో ఇక్కడ వ్యవసాయ పనులకు ఫ్రాన్స్ ఆఫ్రికానుంచి భారీయెత్తున కార్మికులను తరలించింది. అప్పుడు మన దేశం నుంచి కూడా వెళ్లారు. నెపోలియన్ యుద్ధాల్లో ఒకదానిలో ఫ్రాన్స్ ఓడిపోవటంతో 1814లో ఇది బ్రిటన్ అధీనంలోకి వచ్చింది. చివరకు 1976లో దీనికి స్వాతంత్య్రం వచ్చింది. ప్రస్తుత సెషెల్స్ జనాభాలో 12 శాతంమంది మన దేశంనుంచి వలసవెళ్లిన గుజరాత్, తమిళనాడులకు చెందినవారే. హిందూ మహాసముద్ర ప్రాంత ప్రాముఖ్యత రోజురోజుకూ పెరుగుతోంది. అవకాశం దొరికితే కాలూనడానికి చైనాతోపాటు చాలా దేశాలు ప్రయత్నిస్తున్నాయి. ఈ ప్రాంతం శాంతియుత మండలంగా ఉండాలని మన దేశం మొదటినుంచీ కోరుకుంటోంది. ఇరు దేశాల సంబంధాలూ భద్రతకే పరిమితం కాకుండా పర్యావరణ పునరు ద్ధరణ, పరిశ్రమలు, పునరుత్పాదక ఇంధన వనరులు, డిజిటల్ రంగ సదుపాయాలు వగైరాలకు సైతం విస్తరించాయి. ఇరు దేశాల బాంధవ్యం మున్ముందు మరింతగా ఎదుగు తుందని మోదీ పర్యటన నిరూపించింది. -
వరంగల్ మేయర్ గెలిచి.. మోదీకి గిప్ట్: బండి సంజయ్
సాక్షి, వరంగల్: 10 ఏళ్ల బీఆర్ఎస్, రెండున్నరేళ్ల కాంగ్రెస్ పాలనలో ఓరుగల్లుకు నయా పైసా దక్కలేదని కేంద్రమంత్రి బండి సంజయ్ మండిపడ్డారు. వరంగల్‌లో ఈ రోజు జరిగిన సభలో ఆయన మాట్లాడారు. వరంగల్ కు మోదీ పెద్ద ఎత్తున నిధులిస్తే బీఆర్ఎస్ దుర్వినియోగం చేసిందని హైదరాబాద్ తరువాత అత్యధిక నిధులు కేటాయించేందని అన్నారు.అయినప్పటికీ కేవలం చిన్న తేలికపాటి వర్షానికే నగరం మునిగిపోతుండటం చాలా బాధాకరమని తెలిపారు. అందుకే రాబోయే మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల్లో వరంగల్ కార్పొరేషన్ ను బీజేపీని గెలిపించాలని అప్పుడు అభివృద్ధి అంటే ఏమిటో చుపిస్తామన్నారు. అనంతరం వరంగల్ పోలింగ్ బూత్ అధ్యక్షుల సమావేశంలో మాట్లాడుతూ... స్థానిక సమస్యలపై పోరుబాట పట్టాలని బీజేపీ కార్యకర్తలకు సూచించారు. లాఠీ దెబ్బలకు వెరవకుండా పోరాడాలని ఒక్కో కార్యకర్త ప్రతి ఇంటికి 6 సార్లు వెళ్లాలని సూచించారు. వరంగల్ కార్పొరేషన్ కు పూర్తి సమయమిస్తామని వరంగల్ మేయర్ పీఠాన్ని గెలిచి మోదీ, నబిన్ కు గిఫ్ట్ ఇద్దామని బండిసంజయ్ అన్నారు. -
ప్రజా భాగస్వామ్యంతోనే ప్రగతి
సాక్షి, న్యూఢిల్లీ: దేశ భద్రత, స్వావలంబన దిశగా భారత్ సరికొత్త మైలురాళ్లను చేరుకుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. సముద్రాల నుంచి గగనతలం దాకా మన దేశం మరింత సురక్షితంగా, స్వయం సమృద్ధిగా మారుతోందని హర్షం వ్యక్తం చేశారు. ఆదివారం ‘మన్ కీ బాత్’ 135వ ఎపిసోడ్లో దేశ ప్రజలను ఉద్దేశించి మోదీ ప్రసంగించారు. రక్షణ రంగంలో విజయాలు, కేంద్ర ప్రభుత్వ బీమా పథకాలు, పర్యావరణ పరిరక్షణ, మూఢనమ్మకాల నిర్మూలన తదితర అంశాలను ప్రస్తావించారు. ప్రధానమంత్రి ఏం చెప్పారంటే.. రక్షణ, విమానయాన రంగాల్లో స్వదేశీ ముద్ర ‘‘కోల్‌కతాలో జరిగిన నావికాదళ కార్యక్రమంలో ఐఎన్ఎస్ దుణగిరి, ఐఎన్ఎస్ సంశోధక్, ఐఎన్ఎస్ అగ్రయ్ యుద్ధనౌకలు భారత నౌకాదళంలో చేరాయి. వీటి డిజైన్ నుంచి తయారీ వరకు అంతా స్వదేశీ పరిజ్ఞానమే. విమానయాన రంగంలోనూ భారత్ మరో ఘనత సాధించింది. మొట్టమొదటి ‘మేడ్ ఇన్ ఇండియా’సి–295 సైనిక రవాణా విమానం తొలి ప్రయాణాన్ని విజయవంతంగా పూర్తి చేసింది. ఇలాంటి 40 విమానాలు మన దేశంలోనే తయారవుతున్నాయి’’ అని అన్నారు.సామాన్యులకు బీమా భద్రత ‘‘బీమా పథకాలు సామాన్యుల జీవితాలకు భద్రత కల్పిస్తున్నాయి. మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా బహదూర్‌పురాకు చెందిన పెత్కర్ కుటుంబం వివాహ వేడుక సందర్భంగా 3,500 మంది గ్రామస్థులకు రూ.లక్ష చొప్పున ప్రమాద బీమా సదుపాయం కల్పించడం హర్షణీయం. అందుకు వారిని అభినందిస్తున్నా. కేంద్ర ప్రభుత్వం సైతం కోట్లాది మందికి బీమా రక్షణ కల్పిస్తోంది. ప్రధానమంత్రి సురక్షా బీమా యోజన కింద కేవలం రూ.20 వార్షిక ప్రీమియంతో రూ.2 లక్షల ప్రమాద బీమా లభిస్తోంది. ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన కింద ఏడాదికి రూ.436 ప్రీమియంతో రూ.2 లక్షల జీవిత బీమా అందుతోంది’’ అని అన్నారు.మూఢ నమ్మకాలపై అస్సాం మహిళల పోరు ‘‘మూఢ నమ్మకాలను సైన్స్, తర్కంతో పారదోలవచ్చని అస్సాం మహిళలు నిరూపించారు. పరిసరాలను శుభ్రపర్చి పర్యావరణానికి మేలు చేసే హర్గిలా అనే అరుదైన పక్షిని అపశకునంగా భావించి చెట్లను నరికివేస్తూ వాటిని తరిమేసేవారు. అయితే, జీవ శాస్త్రవేత్త పూర్ణిమా దేవి బర్మన్ చొరవతో అస్సాం మహిళలు ‘హర్గిలా ఆర్మీ’గా ఏర్పడి ఆ పక్షులను సంరక్షిస్తున్నారు. హర్గిలా పక్షులు అపశకునం కాదని రుజువు చేస్తున్నారు. ఆ పక్షులు నేడు అస్సాం గ్రామాలకు గొప్ప గుర్తింపుగా మారాయి ’’ అని అన్నారు.మేఘాలయా వేర్ల వంతెనలు.. ‘‘మేఘాలయాలో దశాబ్దాల పాటు రబ్బరు చెట్ల వేర్లను పరస్పరం అనుసంధానించి సహజసిద్ధంగా నిర్మించిన వేర్ల వంతెనలు నిజంగా అద్భుతం. ఈ వంతెనల సంరక్షణకు 50 ఏళ్లుగా కృషి చేస్తున్న హాలీవార్కు ఈ ఏడాది పద్మ పురస్కారం లభించింది. మధ్యప్రదేశ్‌లోని రాజ్‌గఢ్ జిల్లా బియోరాలో ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించి ‘ఎకో–బ్రిక్స్’గా మార్చి బహిరంగ ప్రదేశాలను సుందరంగా తీర్చిదిద్దడానికి స్థానిక మహిళలు కృషి చేస్తుండడం ఎంతైనా ప్రశంసనీయం’’ అని అన్నారు.వోకల్ ఫర్ లోకల్ స్ఫూర్తిని చాటిచెప్పాలి ‘‘గణేశ్ చతుర్థి ఉత్సవాలకు సంబంధించిన అంశంపై మాట్లాడాలని కోరుతూ చాలామంది నాకు లేఖలు రాశారు. ప్రతి ఒక్కరూ ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలను పూజించడం మానుకోవాలి. పర్యావరణాన్ని కాపాడేందుకు దేశీయ మట్టితో చేసిన విగ్రహాలనే పూజించాలి. వోకల్ ఫర్ లోకల్ స్ఫూర్తిని చాటిచెప్పాలి’’అని మోదీ పిలుపునిచ్చారు. నా వినతిని ప్రజలు అర్థం చేసుకున్నారు నా విజ్ఞప్తిని మన్నించినందుకు దేశ ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. పశ్చిమాసియా పరిస్థితుల దృష్ట్యా కొంతకాలం పాటు బంగారం కొనుగోలు చేయొద్దని, విదేశీ విహార యాత్రలు వాయిదా వేసుకోవాలని, చమురును ఆదా చేయడానికి కార్‌పూలింగ్ పద్ధతిని పాటించాలని కోరాను. ప్రజలు నా వినతిని అర్థం చేసుకున్నందుకు సంతోషంగా ఉంది. -
మోదీ అంటే రేవంత్‌కు భయం: కేటీఆర్
వికారాబాద్/మొయినాబాద్: స్పీకర్.. సీఎం..ఇక్కడి ఎమ్మెల్యేలు ప్రాజెక్టుల పేరిట రైతుల భూములు కొల్లగొడుతున్నారని, బాధిత రైతులకు అండగా బీఆర్ఎస్ ఉంటుందని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఆదివారం వికారాబాద్ పట్టణంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు మెతుకు ఆనంద్ అధ్యక్షతన సర్, పార్టీ డిజిటల్ సభ్యత్వ నమోదు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కేటీఆర్ మాట్లాడుతూ ‘స్పీకర్ పోలీసులను అడ్డం పెట్టుకుని బీఆర్ఎస్ కార్యకర్తలను వేధిస్తున్నారు... పోలీసులారా ఖబడ్దార్.. వచ్చేది మేమే.. మా ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్, మేము మిమ్మల్ని గుర్తు బెట్టుకుంటం.. అధికారంలోకి వచ్చాక వడ్డీతో సహా చెల్లిస్తాం’అన్నారు. సీఎంను ప్రశ్నిస్తే ‘ఎంత మొగోడైనా మూడు నెలల్లో పిల్లలు పుట్టిస్తరా అంటడు.. మూడు నెలల్లో పుట్టరు.. ముప్పై నెలలు అయినా పుట్టకపోతే ఏమనాలో మీరే చెప్పాలి’అని కేటీఆర్ ఎద్దేవా చేశారు. సీఎం రేవంత్‌రెడ్డికి మోదీ అంటే భయమని, బడేభాయ్ ఏది చెప్తే.. చోటా భాయ్ జీ హుజూర్ అంటారని, అందుకే బడేబాయ్ అడగ్గానే దామగుండం అడవిలో 2,700 ఎకరాలు నేవీకి రాసిచ్చిండని, నాడు తమకు ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా అడవి జోలికి రాకుండా మోదీని అడ్డుకున్నామన్నారు. ప్రతి ఒక్కరు బూత్ స్థాయినుంచి గట్టిగా పనిచేయాలని, రేవంత్ పోవాలి.. కేసీఆర్ రావాలనే నినాదంతో ముందుకు వెళితే అధికారంలోకి వచ్చేది మనమే అన్నారు. లోక్‌సభకు ఎన్నికకు నామినేట్ చేసిన మీనాక్షినటరాజన్ అభ్యర్థిత్వాన్ని నాశనం చేసింది ముమ్మాటికి సీఎం రేవంత్‌రెడ్డే అని, బీజేపీ కాంగ్రెస్‌ది అక్రమ పొత్తులని అందరికి అర్థం అవుతోందన్నారు. ఓట్లు తొలగించి పశ్చింబెంగాల్లో మమతను బీజేపీ ఓడించిందని, ఏపీలోనూ చంద్రబాబు ఇదే చేయించి వైసీపీని ఓడించారన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి సబితారెడ్డి, బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్.ప్రవీణ్‌కుమార్ మాజీ ఎమ్మెల్యేలు మహేశ్‌రెడ్డి, నరేందర్‌రెడ్డి, నాగేందర్‌గౌడ్, బీసీ కమిషన్ మాజీ సభ్యుడు శుభప్రద్‌పటేల్, జెడ్పీ మాజీ వైస్ చైర్మన్ విజయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. కాగా, రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మున్సిపల్ పరిధిలోని పెద్దమంగళారంలో తెలంగాణ అమరవీరుడు మందడి యాదిరెడ్డి కుటుంబ సభ్యులు, ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించిన ఎనికేపల్లికి చెందిన బీఆర్ఎస్ కార్యకర్త డప్పు కరంచంద్ కుటుంబాలను ఆదివారం ఆయన పరామర్శించారు. పార్టీ పరంగా ఆదుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. -
మారిషస్ ప్రధానితో భేటీ
విక్టోరియా: ప్రధాని మోదీ ఆదివారం మారిషస్ ప్రధానమంత్రి నవీన్‌చంద్ర రామ్గూలమ్తోనూ సమావేశమయ్యారు. భారత్, మారిషస్ ద్వైపాక్షిక సంబంధాలపై వారిద్దరూ చర్చించుకున్నారు. పరస్పర సహకారం, సముద్ర భద్రత, వాణిజ్యం సహా పలు అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. ఉమ్మడి ప్రయోజనాలకు సంబంధించిన ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై అభిప్రాయాలను పంచుకున్నారు. ఇరువురు నేతలు భారత్– మారిషస్ వ్యూహాత్మక భాగస్వామ్యంలో పురోగతిని సమీక్షించారు. -
హిందూ మహాసముద్రం అవకాశాల సంద్రం
విక్టోరియా: భాగస్వామ్యం అనేది దేశ పరిమాణంపై కాకుండా పరస్పర గౌరవం, విశ్వాసంపై ఆధారపడి ఉండాలని భారత ప్రధాని మోదీ తేల్చిచెప్పారు. ఆర్థిక శ్రేయస్సుతో పాటు సముద్ర భద్రత కూడిన సుసంపన్న హిందూ మహాసముద్రాన్ని భారతదేశం ఆకాంక్షిస్తోందని అన్నారు. భారత్, సీషెల్స్ దేశాల రక్షణ, భద్రతలు ఒకదానికొకటి విడదీయరానివని స్పష్టంచేశారు. హిందూ మహాసముద్రాన్ని అవకాశాల సముద్రంగా మార్చడమే తమ ధ్యేయమని ఉద్ఘాటించారు. ప్రధాని మోదీ ఆదివారం సీషెల్స్‌లోని విక్టోరియా నగరంలో సీషెల్స్ అధ్యక్షుడు ప్యాట్రిక్ హెర్మినీతో సమావేశమయ్యారు. ప్రతినిధుల స్థాయి చర్చలు జరిపారు. ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సహకారంపై విస్తృతంగా చర్చించారు. ఉమ్మడి ప్రయోజనాలతో ముడిపడి ఉన్న ప్రాంతీయ, అంతర్జాతీయ పరిణామాలపై అభిప్రాయాలు పంచుకున్నారు. హెర్మినీతో భేటీ అనంతరం మోదీ మాట్లాడారు. హిందూ మహాసముద్రం మన ఉమ్మడి ఇల్లు అని విశ్వసిస్తున్నట్లు చెప్పారు. సముద్ర భద్రత, సుస్థిరత, శ్రేయస్సు మన ఉమ్మడి బాధ్యత అని పేర్కొన్నారు. భారతదేశపు మహాసాగర్ (ప్రాంతాలవ్యాప్తంగా భద్రత, వృద్ధి కోసం పరస్పర మరియు సంపూర్ణ పురోగతి) దార్శనికతకు ఇదే మూలమని తెలిపారు. వృద్ధి కోసం నూతన అవకాశాల అన్వేషణ భారత్, సీషెల్స్ మధ్య ద్వైపాక్షిక ఆర్థిక సహకారాన్ని మరింత పటిష్టంగా తీర్చిదిద్దడంపై చర్చించినట్లు ప్రధానమంత్రి వెల్లడించారు. పరిశ్రమలు, అనుసంధానం, టెక్నాలజీ, డిజిటల్ మౌలిక సదుపాయాలు సహా ఇతర రంగాల్లో వృద్ధి కోసం రెండు దేశాలు నూతన అవకాశాలను అన్వేషిస్తాయని చెప్పారు. వాతావరణ మార్పులపై పోరాడుదాం తర్వాత సీషెల్స్ నేషనల్ అసెంబ్లీలో మోదీ మాట్లాడారు. వాతావరణ మార్పుల వల్ల గ్లోబల్ సౌత్ దేశాలు.. ముఖ్యంగా ద్వీప దేశాలు ఎక్కువగా ప్రభావితమవుతున్నాయని ప్రధాని మోదీ ఆందోళన వ్యక్తంచేశారు. వాతావరణ మార్పుల ప్రభావాలు ఇప్పటికే తీరప్రాంతాలు, సముద్ర జీవావరణ వ్యవస్థలు, వాతావరణ సరళి, సమాజాలపై కనిపిస్తున్నాయని చెప్పారు. ఆయన ఆదివారం సీషెల్స్ జాతీయ అసెంబ్లీలో ప్రసంగించారు. వాతావరణ మార్పులకు అతి తక్కువగా కారణమైవారు దాని పర్యవసానాల అత్యధిక భారాన్ని మోయకూడదని స్పష్టంచేశారు. వాతావరణ మార్పుల నియంత్రణకు ప్రపంచ దేశాలు కలిసికట్టుగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. మరింత సమ్మిళిత ప్రపంచం, సమకాలీన వాస్తవాలను ప్రతిబింబించే అంతర్జాతీయ సంస్థల పట్ల భారత్, సీషెల్స్ ఒకే దృక్పథాన్ని పంచుకుంటున్నాయని గుర్తుచేశారు. గ్లోబల్ సౌత్ ప్రయోజనాలను ముందుకు తీసుకెళ్లడానికి నిబద్ధతను చాటుతున్నాయని పేర్కొన్నారు.19 కీలక అంశాలపై నిర్ణయం రక్షణ, సముద్ర భద్రత, డిజిటల్ చెల్లింపులు, అంతరిక్షం, ఆరోగ్య సంరక్షణ, వ్యవసాయం, విద్య వంటి పలు రంగాల్లో పరస్పర సహకారాన్ని మరింత పటిష్టం చేసుకోవాలని భారత్, సీషెల్స్ తీర్మానించుకున్నాయి. భారత ప్రధాని మోదీ, సీషెల్స్ అధ్యక్షుడు హెర్మినీ మధ్య ఆదివారం జరిగిన చర్చల్లో 19 అంశాలపై నిర్ణయానికి వచ్చారు. ఇందులో నేరస్తుల అప్పగింత ఒప్పందం, బాహ్య అంతరిక్షాన్ని శాంతియుత ప్రయోజనాల కోసం ఉపయోగించుకోవడంలో సహకార ఒప్పందం, సీషెల్స్‌లో యూపీఐ ఆధారిత డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించే ఒప్పందం, ఎక్స్పోర్ట్–ఇంపోర్ట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో సమగ్ర రుణ ఒప్పందం, నూతన సీషెల్స్ జాతీయ ఆసుపత్రికి సహకార ఒప్పందం ఉన్నాయి. సీషెల్స్‌కు ఒక వేగవంతమైన గస్తీ నౌకను బహుమతిగా ఇవ్వడం, రక్షణ దళానికి 10 యుటిలిటీ వాహనాలు, ఐదు లేజర్ రేడియల్ తరగతి పడవలను అప్పగించడం, తీర రక్షక దళం బలోపేతానికి సహకరించడం, గ్లాస్ కాక్‌పిట్‌తో ఒక డోర్నియర్ విమానాన్ని ఉన్నతీకరించడం వంటి అంశాలను ఇరు పక్షాలు ప్రకటించాయి. దౌత్య శిక్షణ కోసం సుష్మా స్వరాజ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ సరీ్వస్, సీషెల్స్ విదేశీ వ్యవహారాల శాఖ మధ్య ఒప్పందం కుదిరింది. మోదీకి సీషెల్స్ గౌరవ పురస్కారం ప్రదానం ప్రధాని మోదీకి సీషెల్స్ ప్రభుత్వం ‘గార్డియన్ ఆఫ్ ది బ్లూ హొరైజన్’అనే గౌరవ పురస్కారాన్ని ప్రదానం చేసింది. సీషెల్స్ అధ్యక్షుడు హెర్మినీ ఆయనను ఈ పురస్కారంతో సత్కరించారు. పర్యావరణ పరిరక్షణ పట్ల మోదీ చూపుతున్న నిబద్ధత, చిన్న ద్వీప దేశాల ఆకాంక్షలను ముందుకు తీసుకెళ్లడంలో ఆయన చేస్తున్న కృషికి ఈ గౌరవాన్ని అందించారు. వాతావరణ మార్పులు విసురుతున్న సవాళ్లతో పోరాడుతున్న దేశాలకు, పర్యావరణ పరిరక్షణను భవిష్యత్ తరాల పట్ల తమ బాధ్యతగా భావిస్తున్న దేశాలకు అవార్డ్‌ను అంకితం చేస్తున్నట్లు మోదీ ప్రకటించారు. -
మోదీ మాట.. రూ.13 వేలు తగ్గిన గోల్డ్ రేటు!
భారతదేశంలో ఇటీవల బంగారం, వెండి ధరలు గణనీయంగా తగ్గాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. పౌరులను ఒక సంవత్సరం పాటు బంగారం కొనుగోళ్లను వాయిదా వేయాలని చేసిన సూచన తర్వాత ఈ మార్పు చోటుచేసుకుందని నిపుణులు చెబుతున్నారు.మే 10న ప్రధానమంత్రి బంగారం కొనుగోలును ఒక ఏడాది వాయిదా వేయాలని చెప్పినప్పుడు, 24 క్యారెట్ బంగారం ధర 10 గ్రాములకు సుమారు రూ.1,53,140గా ఉండగా, వెండి ధర కేజీ సుమారు రూ.2,62,350గా ఉంది. అయితే నేటికి (జూన్ 28) ఆ ధర బంగారం ధర రూ.1,39,873కి తగ్గగా, వెండి ధర రూ.2,16,541కి పడిపోయింది. అంటే.. మోదీ ప్రకటన తరువాత గోల్డ్ రేటు సుమారు రూ.13,267 తగ్గగా, వెండి దాదాపు రూ.45,809 తగ్గింది.భారత్‌లో బంగారం దిగుమతులు ఎక్కువగా ఉండటం వల్ల విదేశీ మారక ద్రవ్యంపై భారీ ఒత్తిడి పడుతోంది. ఈ పరిస్థితుల్లో విదేశీ మారక నిల్వలను కాపాడుకోవడానికి ప్రధాని మోదీ ప్రజలను ఉద్దేశించి అవసరం ఉంటే తప్పా.. బంగారం కొనుగోళ్లు, విదేశీ ప్రయాణాలను వాయిదా వేయాలని కోరారు.ప్రధాని విజ్ఞప్తి తరువాత ప్రభుత్వం బంగారం, వెండి దిగుమతి సుంకాన్ని 6 శాతం నుంచి 15 శాతానికి పెంచింది. దీని ద్వారా దిగుమతులను తగ్గించడంతో పాటు.. దేశీయ మార్కెట్‌పై నియంత్రణ సాధించాలని భావించారు. అనుకున్న విధంగానే.. ఈ నిర్ణయం వినియోగదారులపై తక్షణ ప్రభావం చూపించిందని తెలుస్తోంది. -
ప్రధాని మోదీకి మరో అంతర్జాతీయ గౌరవం
విక్టోరియా: సముద్ర పర్యావరణ పరిరక్షణ, సుస్థిర అభివృద్ధి రంగాలలో ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైన నాయకత్వాన్ని ప్రదర్శిస్తున్న ప్రధాని మోదీకి మరో అంతర్జాతీయ గౌరవం దక్కింది. వాతావరణ మార్పుల నియంత్రణ, పర్యావరణ అనుకూల వృద్ధి (గ్రీన్ గ్రోత్), సముద్ర వనరుల బాధ్యతాయుత నిర్వహణలో ఆయన చేసిన విశేష కృషిని గుర్తిస్తూ సెషెల్స్ ప్రభుత్వం తమ దేశ అత్యున్నత పురస్కారమైన ‘గార్డియన్ ఆఫ్ ది బ్లూ హరైజన్’ అవార్డును ప్రధానికి ప్రదానం చేసింది.ఈ సందర్భంగా విడుదల చేసిన ప్రెసిడెన్షియల్ సైటేషన్లో ప్రధాని మోదీ సుస్థిర ఆర్థిక వృద్ధి, బ్లూ ఎకానమీ (సముద్ర ఆధారిత ఆర్థిక వ్యవస్థ) పట్ల చూపిన నిబద్ధతను సెషెల్స్ ప్రభుత్వం కొనియాడింది. ముఖ్యంగా చిన్న ద్వీప దేశాలకు భారత్ అందిస్తున్న మద్దతును, వాతావరణ ప్రతిఘటన శక్తిని పెంపొందించడంలో, అంతర్జాతీయ సహకారాన్ని విస్తరించడంలో మోదీ పోషించిన పాత్రను ప్రత్యేకంగా ప్రస్తావించింది.ఈ పురస్కారం భారత్-సెషెల్స్ దేశాల మధ్య ఉన్న వ్యూహాత్మక, ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేస్తుందని సెషెల్స్ ప్రభుత్వం స్పష్టం చేసింది. తనకు లభించిన ఈ ప్రతిష్టాత్మక గౌరవంపై ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా స్పందించారు. సెషెల్స్ ప్రభుత్వ అత్యున్నత పురస్కారాన్ని అందుకోవడంపై గౌరవంగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుత వాతావరణ మార్పుల సవాళ్లను ఎదుర్కొంటూ, పర్యావరణ పరిరక్షణను తమ భవిష్యత్ తరాల పట్ల బాధ్యతగా భావిస్తున్న ప్రపంచంలోని అన్ని దేశాలకు దీనిని అంకితం చేస్తున్నాను’అని ప్రధాని మోదీ పేర్కొన్నారు.పర్యావరణం, వ్యవసాయ రంగాలలో ప్రధాని మోదీ అంతర్జాతీయంగా అందుకున్న అవార్డుల పరంపరలో ఇది తాజా చేరింది. కాగా, ఈ ఏడాది మేలో ప్రపంచ ఆహార, వ్యవసాయ సంస్థ ప్రధానికి ‘అగ్రికోలా మెడల్’ అందజేసింది. దేశంలో ఆహార భద్రతను బలోపేతం చేయడం, ఆధునిక వ్యవసాయ మార్పులు తీసుకురావడం, సుస్థిర వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించినందుకు గాను ఆయనకు ఈ పురస్కారం లభించింది. -
టీవీ రాముడికి ‘పట్టాభిషేకం’?... అయోధ్య డ్యామేజ్ కంట్రోల్ షురూ!
న్యూఢిల్లీ: కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం త్వరలోనే భారీ స్థాయిలో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణకు సిద్ధమవుతోంది. మోదీ 3.0 ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత జరుగుతున్న మొదటి మార్పు ఇదే కావడం విశేషం. అయితే, అయోధ్య రామాలయంలో విరాళాల చోరీ వివాదం దేశవ్యాప్తంగా దుమారం రేపుతున్న తరుణంలో, ‘రామాయణం’ సీరియల్ ఫేమ్, మీరట్ ఎంపీ అరుణ్ గోవిల్‌ను క్యాబినెట్లోకి తీసుకుంటున్నారనే వార్తలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి.డ్యామేజ్ కంట్రోల్ కోసమేనా?ఉత్తరప్రదేశ్ రామాలయంలో విరాళాలు, నగలు చోరీకి గురైన ఘటన ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ వివాదం సృష్టించిన నష్టాన్ని పూడ్చేందుకు (డ్యామేజ్ కంట్రోల్) అరుణ్ గోవిల్ స్వచ్ఛమైన ఇమేజ్, ‘శ్రీరాముడి’గా ఆయనకున్న ప్రజాదరణను వాడుకోవాలని మోదీ ప్రభుత్వం భావిస్తున్నట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. వచ్చే ఏడాది ఉత్తరప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో, ఆయనను ఒక ఫైర్ బ్రాండ్ నాయకుడిగా రంగంలోకి దించేందుకు వ్యూహాలు సిద్ధమవుతున్నాయి.రేసులో మరికొందరు ప్రముఖులుఈ మంత్రివర్గ విస్తరణలో అరుణ్ గోవిల్‌తో పాటు మాజీ ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్‌కు కీలకమైన ఆర్థిక శాఖ బాధ్యతలు అప్పగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే, శివసేన (యుబిటి) ఎంపీలను ఎన్డీయే వైపు తిప్పుకునే వ్యూహంలో భాగంగా శ్రీకాంత్ షిండేకు, అలాగే బిహార్ మాజీ సీఎం నితీష్ కుమార్‌కు కూడా క్యాబినెట్లో చోటు దక్కవచ్చని సమాచారం. మరోవైపు అనురాగ్ ఠాకూర్ మళ్లీ మంత్రివర్గంలోకి వచ్చే అవకాశం ఉండగా, ధర్మేంద్ర ప్రధాన్, హర్దీప్ సింగ్ పూరి సహా దాదాపు అర డజను మంది సహాయ మంత్రులకు స్థాన చలనం తప్పకపోవచ్చు.రామాలయ చోరీ కేసులో సంచలనాలురామమందిరంలో నగదు, నగలు దొంగిలించిన కేసులో పోలీసులు ఇప్పటికే ఎనిమిది మంది నిందితులను కోర్టులో ప్రవేశపెట్టారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితులపై బలమైన ఆధారాలు లభించాయని, ఇప్పటివరకు రూ. 79.84 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నామని అధికారులు వెల్లడించారు. ఈ కేసులో కీలక సూత్రధారిగా భావిస్తున్న టిన్నూ అనే వ్యక్తి క్యాష్ కౌంటర్, నోట్ల లెక్కింపు హాల్ తాళాలు తన వద్దే ఉంచుకుని అవకతవకలకు పాల్పడినట్లు తేలింది. నిందితులు సిఫార్సులపై విధుల్లో చేరడం, విధి నిర్వహణ తర్వాత వారిని తనిఖీ చేయకపోవడం వంటి తీవ్ర లోపాలు ఈ దర్యాప్తులో వెలుగుచూశాయి. -
గాజాలో మారణహోమంపై మౌనమెందుకు?
సాక్షి, న్యూఢిల్లీ: పాలస్తీనాపై ఇజ్రాయెల్ సాగిస్తున్న మారణకాండను యావత్ ప్రపంచం ముక్తకంఠంతో ఖండిస్తుండగా, నరేంద్ర మోదీ ప్రభుత్వం ఏమాత్రం స్పందించకుండా మౌనం దాల్చడం దారుణమని కాంగ్రెస్ పార్లమెంటరీ పారీ్ట(సీపీపీ) చైర్పర్సన్ సోనియా గాంధీ విమర్శించారు. ఇజ్రాయెల్ దాడుల్లో పాలస్తీనా చిన్నారులు బలవుతున్నా భారత్ నోరుమెదపకపోవడం జాతీయ స్ఫూర్తికే విరుద్ధమని పేర్కొన్నారు. మోదీ ప్రభుత్వ విదేశాంగ విధానం, ఇజ్రాయెల్ దాడుల తీరును ఎండగడుతూ సోనియా గాంధీ తాజాగా ఓ ఆంగ్ల పత్రికలో వ్యాసం రాశారు. జాతీయ ప్రయోజనాలు, నైతికతను పణంగా పెట్టి ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో మైత్రికి నరేంద్ర మోదీ పెద్దపీట వేశారని ధ్వజమెత్తారు. గాజాలో పాలస్తీనా పౌరులపై ఇజ్రాయెల్ ఉద్దేశపూర్వకంగా మారణహోమానికి పాల్పడుతోందని జస్టిస్ ఎస్.మురళీధర్ నేతృత్వంలోని ఐక్యరాజ్యసమితి కమిషన్ జూన్ నెలలో విడుదల చేసిన 94 పేజీల నివేదిక కుండబద్దలు కొట్టిందని సోనియా గాంధీ గుర్తుచేశారు. -
సెషెల్స్ భద్రతకు భరోసా
విక్టోరియా: ద్వీప దేశమైన సెషెల్స్ సముద్ర భద్రతా సామర్థ్యాలను బలోపేతం చేయడానికి భారత్ సహకరిస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. మూడు రోజుల అధికారిక పర్యటన నిమిత్తం ఆయన శనివారం సెషెల్స్ దేశానికి చేరుకున్నారు. ‘మేడ్ ఇన్ ఇండియా’నిఘా నౌకను సీషెల్స్ కోస్ట్‌గార్డుకు లాంఛనంగా అందజేశారు. రక్షణ, సముద్ర భద్రత రంగాల్లో భారత్–సెషెల్స్ మధ్య భాగస్వామ్యం మరింత బలోపేతం అవుతోందని చెప్పడానికి ఇదే నిదర్శనమని మోదీ పేర్కొన్నారు. భారత్‌లో తయారైన నిఘా నౌకను సెషెల్స్‌కు అందజేయడం ఇరుదేశాల మధ్య సంబంధాల్లోమరో ముఖ్యమైన మైలురాయిని సూచిస్తోందని ‘ఎక్స్’లో పోస్టుచేశారు. అలాగే ఆరు అంబులెన్స్‌లు, పది యుటిలిటీ వాహనాలు, ఐదు లేజర్ రేడియల్ బోట్లను కూడా సెషెల్స్‌కు అందజేశారు. అంతకుముందు భారత్ నుంచి సెషెల్స్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న మోదీకి దేశాధ్యక్షుడు ప్యాట్రిక్ హెర్మనీ ఘన స్వాగతం పలికారు. మోదీకి సైనికులు గౌరవ వందనం సమర్పించారు. కళాకారులు నాట్య ప్రదర్శనలతో మోదీని స్వాగతించారు. మోదీ కోసం సెషెల్స్‌లోని భారతీయులు తరలివచ్చారు. వారితో మోదీ కొద్దిసేపు ముచ్చటించారు. భారతదేశం పట్ల వారికున్న ప్రగాఢమైన అభిమానం, సెషెల్స్ పురోగతికి వారు అందిస్తున్న నిరంతర సహకారం నిజంగా ప్రశంసనీయమని పేర్కొ న్నారు. భారతీయ ప్రవాసులు చాలాకాలంగా మన రెండు దేశాల మధ్య ఒక శక్తివంతమైన వారధిగా పనిచేస్తూ, ప్రజల మధ్య సంబంధాలను బలోపేతం చేస్తూ, మన ఉమ్మడి ప్రయాణాన్ని సుసంపన్నం చేస్తున్నారని కొనియాడారు. ఈ పర్యటనలో భాగంగా ప్యాట్రిక్ హెర్మినీతో మోదీ సమావేశం కాబోతున్నారు. ద్వైపాక్షిక అంశాలపై వారిద్దరూ చర్చిస్తారు. సెషెల్స్ నేషనల్ డే స్వర్ణోత్సవాలకు గౌరవ అతిథిగా హాజరవుతారు. నేషనల్ అసెంబ్లీలో ప్రసంగిస్తారు. హిందూ మహాసముద్రంలో సెషెల్స్ ఒక విలువైన సముద్ర భాగస్వామి, సన్నిహిత మిత్రదేశమని మోదీ వివరించారు. రెండు దేశాల ప్రజలకు లబ్ధి చేకూరేలా సహకారాన్ని బలోపేతం చేసుకోవడానికి తాను ఎదురు చూస్తున్నట్లు తెలిపారు. కూర్మ రాజును సందర్శించిన మోదీ ప్రధాని మోదీ శనివారం అధ్యక్షుడు పాట్రిక్ హెర్మినీతో కలిసి సెషెల్స్ నేషనల్ బొటానికల్ గార్డెన్‌లోని భారీ తాబేళ్ల ఆవరణను సందర్శించారు. ఇక్కడ అల్డాబ్రా వృద్ధ తాబేలుకు ఆహారం తినిపించారు. సీషెల్స్‌కు చెందిన అల్దాబ్రా భారీ తాబేళ్లు భూమిపై అత్యంత పెద్దవి, అత్యధిక కాలం జీవించే జీవజాతుల్లో ఒకటి. వీటిలో కొన్ని తాబేళ్లు రెండు శతాబ్దాలకు పైగా చరిత్రకు సాక్షిగా నిలిచాయి. ‘‘అల్డాబ్రా తాబేళ్లకు భారత్, సీషెల్స్ మధ్యనున్న ప్రత్యేక స్నేహంతో అనుబంధం ఉంది. 2014లో రెండు తాబేళ్లను కోల్‌కతాలోని అలీపూర్ జంతు పదర్శన శాలకు బహుమతిగా ఇచ్చారు. ఆ తర్వాత కొన్నేళ్లకు సెషెల్స్ మరికొన్ని తాబేళ్లను హైదరాబాద్ జూకు బహుమతిగా అందించింది’’అని మోదీ ‘ఎక్స్’లో పోస్టుచేశారు. జీవ వైవిధ్యం, పర్యావరణ పరిరక్షణ పట్ల రెండు దేశాలకు ఉన్న ఉమ్మడి నిబద్ధతను చాటిచెబుతూ మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్నారు. సెషెల్స్‌కు మాత్రమే ప్రత్యేకమైన ‘కోకో డి మెర్’అనే మొక్కను మోదీ నాటారు. కోకో డి మెర్కు సీషెల్స్‌లో విస్తృతమైన గౌరవం ఉందని, అది ఆ దేశ జాతీయ చిహ్నంపై కూడా ఉంటుందని మోదీ వివరించారు. అత్యంత పెద్ద విత్తనాలు, అత్యంత బరువైన పండ్లను ఉత్పత్తి చేయడంలో ఈ జాతి ప్రసిద్ధి చెందిందని తెలిపారు. -
ఎలివేషన్ కావాలా?.. కొత్త ఫార్ములా ఇదే!
ప్రపంచ రాజకీయాల్లో సాఫ్ట్ పవర్ అనే పదం కొత్తది కాదు. కానీ సోషల్ మీడియా యుగం దానికి కొత్త రూపాన్ని తీసుకొచ్చింది. ఇప్పుడు నాయకులు ప్రజలకు తమ సందేశం చేరవేయడానికి కేవలం ప్రసంగాలపై ఆధారపడడం లేదు. ప్రజలు ఏం చూస్తున్నారు? ఏ పాట వినిపిస్తే వెంటనే కనెక్ట్ అవుతున్నారు? ఏ డైలాగ్ ట్రెండ్ అవుతోంది? అనే అంశాలపైనే వ్యూహాలు సిద్ధమవుతున్నాయి.ఒకప్పుడు రాజకీయాల్లో సిద్ధాంతాలు మాట్లాడేవారు. దేశాధినేతల భేటీల్లో అధికారిక ప్రకటనలే హైలైట్‌గా నిలిచేవి. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. అంతర్జాతీయ వేదికలైనా, ఎన్నికల ప్రచారాలైనా, సోషల్ మీడియా పోస్టులైనా.. ఎక్కడ చూసినా సినిమా పాటలు, డైలాగులు, పాప్ కల్చర్ రిఫరెన్స్‌లే కనిపిస్తున్నాయి. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ నుంచి భారత ప్రధాని నరేంద్ర మోదీ వరకు.. అమెరికా అధ్యక్ష ఎన్నికల అభ్యర్థుల నుంచి ప్రాంతీయ పార్టీల నేతల వరకు.. అందరూ ఇప్పుడు ఒకే ఫార్ములాను అనుసరిస్తున్నట్లు కనిపిస్తోంది. కారణం ఒక్కటే.. వైరల్ కావాలి.. ప్రజలకు మరింత దగ్గర కావాలి!తాజాగా ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్, ప్రధాని మోదీ ఫ్రాన్స్ పర్యటనకు సంబంధించిన వీడియోకు బాలీవుడ్ చిత్రం ధురంధర్ పాటను ఉపయోగించడం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అంతకుముందు భారత్-యూరోపియన్ యూనియన్ కార్యక్రమాలకు సంబంధించిన ప్రచార కంటెంట్‌లో ప్రధాని మోదీ మన తెలుగు సినిమా గేమ్ ఛేంజర్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌ను తన ఇన్స్టాగ్రామ్ పోస్ట్ కోసం వినియోగించడం ఆకట్టుకుంది.🇮🇳🇫🇷 pic.twitter.com/MD1gMC04dp— Emmanuel Macron (@EmmanuelMacron) June 14, 2026అయితే ఈ ట్రెండ్‌కు అసలు బలం ఇచ్చింది.. సినిమాలే అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ముఖ్యంగా పుష్ప సినిమా విడుదలైన తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. "తగ్గేదేలే" అనే ఒక్క డైలాగ్ రాజకీయాల నుంచి క్రీడల వరకు, ఎన్నికల ప్రచారాల నుంచి అంతర్జాతీయ వేదికల వరకు వినిపించింది. ఎన్నికల సమయంలో అనేక మంది నాయకులు ప్రత్యర్థులకు సమాధానం ఇస్తూ ఇదే డైలాగ్‌ను ఉపయోగించారు. సోషల్ మీడియాలో అయితే "తగ్గేదేలే" ఒక రాజకీయ నినాదంగా మారిపోయింది.అలాగే ఆర్ఆర్ఆర్ సినిమాలోని "నాటు నాటు" పాట ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆస్కార్ అవార్డు గెలుచుకున్న తర్వాత ఈ పాట కేవలం సినిమా పాటగా కాకుండా భారత సాంస్కృతిక ప్రభావానికి ప్రతీకగా మారింది. విదేశీ రాయబార కార్యాలయాలు, అంతర్జాతీయ సంస్థలు, విదేశీ నాయకులు సైతం ఈ పాటను తమ కార్యక్రమాల్లో ప్రస్తావించడం విశేషం. View this post on Instagram A post shared by Narendra Modi (@narendramodi)ఇక రాజకీయ ప్రచారాల్లో బాహుబలి ప్రభావం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిందే. "కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు?" అనే ప్రశ్న దేశవ్యాప్తంగా ఒక సామూహిక చర్చగా మారినప్పుడు, అనేక రాజకీయ పార్టీలు తమ ప్రచారాల్లో అదే శైలిని అనుకరించాయి. "ఎవరు ఎవరిని మోసం చేశారు?" అనే ప్రచారాల నుంచి "అసలు బాహుబలి ఎవరు?" అనే పోలికల వరకు బాహుబలి రిఫరెన్స్‌లు విస్తృతంగా వినిపించాయి.అంతేకాదు, కేజీఎఫ్, జైలర్లోని "హుకుం" పాట బీజీఎంలతో వీడియోలు.. కొన్ని సినిమాల్లో యాక్షన్ రిఫరెన్స్‌లు, కాంతారలోని సంప్రదాయ చిహ్నాలు, విక్రమ్ సినిమాలో కమల్ హాసన్ చెప్పిన "వన్స్ అపాన్ ఎ టైమ్" స్టైల్ నేరేషన్.. ఇవన్నీ రాజకీయ సోషల్ మీడియా ప్రచారాల్లో కనిపించాయి. ఇటీవల కొన్ని పార్టీల ప్రచార వీడియోలు చూస్తే అవి రాజకీయ ప్రకటనలా.. సినిమా టీజర్లా అన్న సందేహం కలగడం సహజమే.నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఇందుకు ప్రధాన కారణం ప్రజల మీడియా వినియోగ పద్ధతుల్లో వచ్చిన మార్పు. ముఖ్యంగా యువత పెద్ద పెద్ద ప్రసంగాల కంటే 30 సెకన్ల వీడియోలను ఎక్కువగా చూస్తున్నారు. అలాంటి పరిస్థితుల్లో ఒక ప్రజాదరణ పొందిన పాట లేదా డైలాగ్‌ను ఉపయోగిస్తే సందేశం వేగంగా వ్యాప్తి చెందుతుంది. అంతేకాదు, అలాంటి కంటెంట్ మీమ్స్, రీల్స్ రూపంలో మరింత వైరల్ అవుతుంది.అయితే ఈ ట్రెండ్‌పై విమర్శలు కూడా ఉన్నాయి. రాజకీయాల వంటి కీలక అంశాలను వినోదాత్మకంగా మార్చడం వల్ల అసలు సమస్యలు చర్చకు రాకపోవచ్చని కొందరు విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. సిద్ధాంతాల కంటే వైరాలిటీకి అధిక ప్రాధాన్యం ఇస్తే ప్రజాస్వామ్య చర్చలు బలహీనపడే ప్రమాదం ఉందని వారు అంటున్నారు.అయినా ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. డిజిటల్ యుగంలో రాజకీయాల భాష మారిపోయింది. ఇప్పుడు ప్రజలను ఆకర్షించాలంటే కేవలం ప్రసంగాలు సరిపోవు. ఒక వైరల్ పాట, ఒక హిట్ డైలాగ్, ఒక సినీ రిఫరెన్స్.. ఇవే నాయకులను ప్రజలకు మరింత చేరువ చేస్తున్నాయి. అందుకే నేటి రాజకీయాల్లో కొత్త సూత్రం ఒక్కటే.. "వైరల్ కావాలంటే.. సినిమా టచ్ తప్పనిసరి!".. -
‘బ్రాండ్ మోదీ’పై మాజీ రాష్ట్రపతి కుమార్తె సంచలన వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: నాటి 2014 లోక్‌సభ ఎన్నికల్లో చరిత్రాత్మక విజయం సాధించిన తర్వాత, దేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టే ముందు నరేంద్ర మోదీ అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలిశారు. ఆ సమయంలో వీరిద్దరి మధ్య జరిగిన ఒక ఆసక్తికరమైన సంభాషణను ప్రణబ్ ముఖర్జీ కుమార్తె షర్మిష్ఠ ముఖర్జీ ఇటీవల ఒక వ్యాసంలో పంచుకున్నారు. రాజకీయ సిద్ధాంతాలు వేరైనప్పటికీ, ఒకరిపట్ల ఒకరు చూపించుకున్న గౌరవం నిజమైన ప్రజాస్వామ్యానికి నిదర్శనమని ఆమె పేర్కొన్నారు.ప్రణబ్ ముఖర్జీ సంధించిన ఆ ఒక్క ప్రశ్న‘ప్రణబ్, మై ఫాదర్: ఎ డాటర్ రిమెంబర్స్’ పుస్తక రచయిత్రి అయిన షర్మిష్ఠ ముఖర్జీ కథనం ప్రకారం.. 2014 ఫలితాల అనంతరం మోదీ రాష్ట్రపతి భవన్‌కు వెళ్లినప్పుడు, ప్రణబ్ ముఖర్జీ తనదైన ప్రొఫెసర్ శైలిలో, ‘ఈ ఎన్నికల ఫలితాలపై మీ విశ్లేషణ ఏంటి?’ అని మోదీని ప్రశ్నించారు. దానికి మోదీ స్పందిస్తూ, మూడు దశాబ్దాల తర్వాత దేశంలో ఒకే పార్టీకి పూర్తి మెజారిటీ లభించిందని చెప్పారు. అయితే ప్రణబ్ అంతటితో ఆగకుండా, ‘ఇంకేముంది విశేషం?" అని అడిగారు. మోదీ మౌనంగా ఉండటంతో, భారత లోక్‌సభ ఎన్నికల చరిత్రలోనే అధికారికంగా ఒక కొత్త ముఖాన్ని ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించి గెలిచిన తొలి ఎన్నికలు ఇవేనని ప్రణబ్ ముఖర్జీ గుర్తుచేశారు.‘బ్రాండ్ మోదీ’ ప్రత్యేకతఆ ఎన్నికల్లో లభించిన భారీ మెజారిటీ కేవలం బీజేపీ పార్టీకి వచ్చింది మాత్రమే కాదని, అది నేరుగా నరేంద్ర మోదీకి ప్రజలు ఇచ్చిన స్పష్టమైన తీర్పు (డైరెక్ట్ మాండేట్) అని షర్మిష్ఠ అభిప్రాయపడ్డారు. సాధారణంగా ఎన్నికల తర్వాత ఎంపీలు ప్రధానిని ఎన్నుకోవడం లేదా కూటమి సమీకరణలను అనుసరించి నిర్ణయించడం జరుగుతుంది, కానీ 2014 లో పరిస్థితి భిన్నంగా ఉందన్నారు. అంతకుముందు గుజరాత్ ముఖ్యమంత్రిగా జాతీయ రాజకీయాలకు కొత్త అయినప్పటికీ, మోదీ తనదైన శైలిలో ప్రజల్లో ఒక ప్రత్యేక ప్రభావాన్ని (ఆరా) సృష్టించుకున్నారని, 2019, 2024 ఎన్నికల్లోనూ అదే నిరూపితమైందని, ఎవరైనా మోదీని ఇష్టపడవచ్చు లేదా వ్యతిరేకించవచ్చు కానీ ‘బ్రాండ్ మోదీ’ని విస్మరించలేరని పేర్కొన్నారు.పార్లమెంట్ మెట్లపై ఆ అపూర్వ క్షణంమొదటిసారి ఎంపీగా గెలిచి, ఏకంగా ప్రధానమంత్రిగా పార్లమెంట్ భవనంలోకి అడుగుపెడుతున్న సమయంలో మోదీ భావోద్వేగానికి లోనై, పార్లమెంట్ మెట్లకు నమస్కరించిన అపూర్వ క్షణాన్ని కూడా ఆమె గుర్తుచేసుకున్నారు. ఆ చర్య దేశంలోని కోట్లాది మంది ప్రజల హృదయాలను తాకిందని పేర్కొన్నారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత దేశం చూసిన అత్యంత శక్తివంతమైన, అత్యంత సుదీర్ఘకాలం పనిచేసిన ప్రధానులలో నరేంద్ర మోదీ ఒకరని కొనియాడారు. లోపాలను త్వరగా గుర్తించి, తగిన మార్పులు చేసుకోవడం వల్లే బీజేపీ ఈ స్థాయి విజయాన్ని అందుకోగలిగిందని ఆమె విశ్లేషించారు.ఇది కూడా చదవండి: వచ్చే ఏడాది భారత్‌కు ట్రంప్ -
వచ్చే ఏడాది భారత్‌కు ట్రంప్
వాషింగ్టన్: భారత్, అమెరికా బంధంలో మరో సరికొత్త అధ్యాయం మొదలుకాబోతోంది. వచ్చే ఏడాది (2027) ప్రారంభంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతదేశంలో పర్యటించనున్నట్లు యూఎస్ విదేశాంగ మంత్రి మార్కో రూబియో అధికారికంగా ప్రకటించారు. ప్రధాని నరేంద్ర మోదీ, ప్రెసిడెంట్ ట్రంప్ మధ్య ఉన్న వ్యక్తిగత సాన్నిహిత్యం అత్యంత అద్భుతమైనదని కొనియాడిన రూబియో.. ఇరు దేశాల దౌత్య సంబంధాలు ‘ఫెంటాస్టిక్’ అంటూ అభివర్ణించారు. వాషింగ్టన్ డీసీలో ఐఏఎన్ఎస్ వార్తా సంస్థతో మాట్లాడిన ఆయన, ఈ మెగా పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు తాను ఈ ఏడాది చివరికల్లా భారత్‌లో పర్యటించనున్నట్లు వెల్లడించారు.ఫైనల్ స్టేజ్‌లో ట్రేడ్ డీల్ట్రంప్ పర్యటన కేవలం ఒక విజిట్ మాత్రమే కాదు, దీని వెనుక భారీ వాణిజ్య వ్యూహం దాగి ఉంది. గత 16 నెలల్లో మొదటిసారిగా ఫ్రాన్స్‌లోని ఎవియాన్‌లో జరిగిన జీ7 (G7) సమ్మిట్ వేదికగా మోదీ, ట్రంప్ ఇరుపక్షాల మధ్య చర్చలు జరిపారు. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం చివరి దశకు చేరుకుందని రూబియో పేర్కొన్నారు. ‘మేం ట్రేడ్ డీల్‌ను పూర్తి చేసేందుకు కేవలం అంగుళాల దూరంలో ఉన్నాం, ఇది చాలా సానుకూల పరిణామం’ అని ఆయన వ్యాఖ్యానించారు. ఈ ఒప్పందం పూర్తయితే రెండు దేశాల ఆర్థిక వ్యవస్థల్లో పెను మార్పులు రానున్నాయి.మోదీపై రూబియో ప్రశంసలుఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వాన్ని మార్కో రూబియో ఆకాశానికెత్తారు. తాను మోదీకి పెద్ద ‘ఫ్యాన్’ అని చెబుతూ, అంతర్జాతీయ వేదికపై భారతదేశ ప్రతిష్టను మోదీ సరికొత్త శిఖరాలకు తీసుకెళ్లారని కొనియాడారు. ‘మోదీ భారతదేశాన్ని ఒక గ్లోబల్ పవర్‌గా (ప్రపంచ శక్తిగా) మార్చారు’ అని రూబియో వ్యాఖ్యానించారు. అలాగే, ఇండో-పసిఫిక్ ప్రాంతంలో అత్యంత కీలకమైన ‘క్వాడ్’ (Quad) కూటమి తదుపరి సమావేశం కోసం ఇరు దేశాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.ఎనర్జీ సెక్టార్లో మెగా పార్ట్నర్షిప్ఇక ఇంధన రంగం పరంగా భారత్ ప్రాధాన్యతను అమెరికా ప్రత్యేకంగా గుర్తించింది. ఇంధన సరఫరాను మరింత పెంచేందుకు ఇరు దేశాలు కలిసి పనిచేస్తున్నాయని రూబియో తెలిపారు. ప్రపంచంలోనే అత్యంత భారీ క్రూడ్ ఆయిల్ (Heavy Crude)ను శుద్ధి చేసే అరుదైన సాంకేతిక సామర్థ్యం కలిగిన కొన్ని దేశాల్లో భారతదేశం ఒకటని ఆయన ప్రశంసించారు. ఒకవేళ వచ్చే ఏడాది ట్రంప్ భారత్‌కు వస్తే, 2020 ఫిబ్రవరి తర్వాత ఆయనకు ఇదే మొదటి భారత పర్యటన అవుతుంది. అలాగే రెండోసారి వైట్ హౌస్ బాధ్యతలు చేపట్టాక ఇదే తొలి విజిట్ కానుంది. -
కేంద్ర కేబినెట్లో భారీ మార్పులు.. లిస్టులో ఆర్బీఐ మాజీ గవర్నర్?
సాక్షి, ఢిల్లీ: కేంద్ర మంత్రివర్గంలో త్వరలోనే భారీ పునర్వ్యవస్థీకరణ జరిగే అవకాశాలపై ఢిల్లీ రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. జూన్ 28 (ఆదివారం) లేదా జూన్ 29 (సోమవారం) మంత్రివర్గ విస్తరణ, శాఖల పునర్విభజన జరిగే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై కేంద్ర ప్రభుత్వం లేదా రాష్ట్రపతి భవన్ నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.వివరాల ప్రకారం.. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇటీవల రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసి మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణకు సంబంధించిన తేదీలపై చర్చించినట్లు రాజకీయ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ సమాచారం అధికారికంగా ధృవీకరించబడలేదు. కాగా, ఈసారి యువత, ముఖ్యంగా జెన్-జీ (Gen Z) ఆశయాలకు అనుగుణంగా కొత్త నాయకత్వానికి అవకాశం కల్పించాలనే ఆలోచనలో బీజేపీ అధిష్ఠానం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. పనితీరు ఆధారంగా కొంతమంది సీనియర్ మంత్రులను తప్పించి, కొత్త ముఖాలకు అవకాశం కల్పించే అవకాశం ఉందని తెలుస్తోంది.మాజీ ఆర్బీఐ గవర్నర్ చాన్స్.. ఆర్బీఐ మాజీ గవర్నర్ శక్తికాంత్ దాస్‌కు కేంద్ర కేబినెట్లో కీలక బాధ్యతలు అప్పగించే అవకాశాలు ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. అలాగే ప్రస్తుతం ఆర్థిక శాఖను నిర్వహిస్తున్న నిర్మలా సీతారామన్‌ను విద్యాశాఖకు మార్చి, ఆర్థిక శాఖకు కొత్త నాయకత్వాన్ని తీసుకురావచ్చని కూడా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ప్రస్తుతం విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ పురిలను మంత్రివర్గం నుంచి తప్పించే అవకాశముందని వార్తలు వస్తున్నాయి. అలాగే, గతంలో కేంద్ర మంత్రిగా పనిచేసిన అనురాగ్ ఠాకూర్‌కు మళ్లీ కేబినెట్లో చోటు దక్కే అవకాశం ఉందని ప్రచారం కొనసాగుతోంది.ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలకు కూడా ప్రాధాన్యం పెంచే దిశగా కసరత్తు జరుగుతోందని సమాచారం. ముఖ్యంగా శివసేన (షిండే వర్గం) నుంచి ఎంపీ శ్రీకాంత్ షిండేకు కేబినెట్ మంత్రి పదవి దక్కే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. అలాగే అరుణ్ గోవిల్, విష్ణుదత్ శర్మ, జనార్ధన్ సింగ్ సిగ్రీవాల్ పేర్లు కూడా కొత్త మంత్రుల జాబితాలో బలంగా వినిపిస్తున్నాయి. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని కేంద్ర సహాయ మంత్రి పంకజ్ చౌదరిని తప్పించే అవకాశం ఉందని, పంజాబ్‌లో రవ్నీత్ సింగ్ బిట్టూ స్థానంలో బీజేపీ నేత తరుణ్ చుగ్‌కు అవకాశం ఇవ్వవచ్చని ప్రచారం జరుగుతోంది.నితీశ్‌కు అవకాశం.. ఇదే సమయంలో బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌కు కేంద్ర మంత్రివర్గంలో ప్రత్యేక స్థానం కల్పించే అంశంపైనా చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. అయితే దీనిపై కూడా అధికారిక స్పష్టత లేదు. ఇక కేంద్ర సహాయ మంత్రి ప్రతాప్రావు జాదవ్ వద్ద ఉన్న ఆరోగ్య శాఖ సహాయ మంత్రి బాధ్యతలను మార్చి, ఆయుష్ శాఖను మాత్రమే కొనసాగించే అవకాశం ఉందని, కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ వద్ద ఉన్న విద్యుత్ శాఖను మరో మంత్రికి అప్పగించే అవకాశాలు ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. అంతేకాకుండా, పనితీరు సరిగా లేదనే అభిప్రాయంతో అరడజను మంది కేంద్ర సహాయ మంత్రులను (MoS) మంత్రివర్గం నుంచి తప్పించే అవకాశాలు కూడా ఉన్నాయని ఢిల్లీ రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి. -
రక్షణ వలయాలు రహస్య వ్యూహాలు
దేశాధినేతల భద్రత వెనుక ఉండే అత్యంత రహస్య వ్యూహాలు, కఠినమైన నిబంధనల గురించి మాజీ ఐబీ అధికారి యశోవర్ధన్ ఆజాద్ ఈ ఎపిసోడ్లో మాట్లాడారు. ఒబామా పర్యటన, మోదీ కాన్వాయ్ ఉల్లంఘన; రాజీవ్ గాంధీ, ఇందిరా గాంధీ హత్యల వంటి కీలక ఘటనలు భారత భద్రతా వ్యవస్థల పని తీరును ఎలా మార్చిందీ వివరించారు.ముంబైలో ఒబామా పర్యటన‘‘అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ముంబైని సంద ర్శించినప్పుడు, ఒక అగ్రరాజ్యంతో కలిసి భద్రతా ఏర్పా ట్లను సమన్వయం చేసుకోవడం ఎంత పెద్ద సవాలో మాకు తొలిసారి అవగాహనకు వచ్చింది. అమెరికా భద్రతా విభాగమైన ‘యూఎస్ సీక్రెట్ సర్వీస్’ పనిచేసే విధానం పూర్తిగా వేరే స్థాయిలో ఉంటుంది. వారు తమ సొంత భారీ రక్షణ కవచం ఉన్న వాహనం ‘ద బీస్ట్’ను ముంబైకి తీసుకొచ్చారు. ఒబామా అడుగుపెట్టే ప్రతి ప్రాంతంలో వ్యూహాత్మక నియంత్రణను తామే చూసు కుంటామని పట్టుబట్టారు. ఒక ఉన్నతస్థాయి భారతీయ ఇంటెలిజెన్స్ అధికారిగా ఆ సమయంలో నాకున్న పెద్ద సవాలు ఏంటంటే... వారి కఠినమైన, వెనక్కి తగ్గని భద్రతా డిమాండ్లను నెరవేరుస్తూనే, మన దేశ సార్వభౌ మాధికారాన్ని గట్టిగా చాటడం! వారి ‘బీస్ట్’ వాహనం మన రోడ్లపై సులువుగా ప్రయాణించేలా చూస్తూనే, మన సొంత గడ్డపై భారతీయ బలగాలే ప్రధాన రక్షణ కవచంగా ఉండేలా మేము భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించాం.పంజాబ్ ఫ్లైఓవర్‌పై మోదీ‘‘ఒక పరిపూర్ణమైన ప్రణాళిక ఎలా విఫలమవుతుందో మీరు అర్థం చేసుకోవాలనుకుంటే, పంజాబ్‌లో ప్రధాని నరేంద్ర మోదీ కాన్వాయ్ ఒక ఫ్లైఓవర్ మీద నిలిచి పోయినప్పుడు ఏం జరిగిందో చూడాలి. అది నిఘా విభాగం వైఫల్యం కాదు. స్థానిక నిర్వహణ లోపానికి నిలువెత్తు నిదర్శనం. మేము ఒక వి.వి.ఐ.పి. రూట్‌ను ప్లాన్ చేసినప్పుడు, స్థానిక రాష్ట్ర పోలీసులు కచ్చితంగా ‘క్లియరెన్స్ సిగ్నల్’ ఇవ్వడంతో పాటు, ఒక ప్రత్యా మ్నాయ బ్యాకప్ రూట్‌ను కూడా సురక్షితంగా సిద్ధం చేయాల్సి ఉంటుంది. కానీ ఆ సమయంలో, నిబంధనలు పూర్తిగా ఉల్లంఘనకు గురయ్యాయి. నిరసనకారులు దారిని అడ్డుకోవడానికి వీలు కలిగింది. దానివల్ల ప్రధాని ఒక వంతెనపై, కదలకుండా ఆగిపోయిన వాహనంలో 15 నుండి 20 నిమిషాల పాటు ఎలాంటి రక్షణ లేకుండా ఉండిపోవాల్సి వచ్చింది. భద్రత అనేది కేవలం కాగితంపై బాగుంటే సరిపోదని స్థానిక నిర్వహణ కూడా లోపరహి తంగా ఉండాలని ఆ ఘటన స్పష్టంగా నిరూపించింది.రాజీవ్ హత్య నేర్పిన పాఠం‘‘మన ఆధునిక భద్రతను మరింత పట్టిష్టం చేయటానికి మేము తరచూ గతంలో జరిగిన విషాదాలను పరిశీ లిస్తుంటాం. అందులో భాగంగానే మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య ఉదంతాన్ని మేము మైక్రోస్కోప్ కింద పెట్టి మరీ విశ్లేషించాం. ఆ నిర్దిష్ట సమయంలో ఆయన కేవలం ఒక అభ్యర్థి మాత్రమేనని, అందువల్ల ఎస్పీజీ రక్షణ వలయం ఆయనకు మునుపటిలా అందుబా టులో లేదనే విషయాన్ని ప్రజలు మర్చిపోతుంటారు. అక్కడ జరిగిన వైఫల్యం మానవ రక్షణ వలయానికి సంబంధించినది. ఆ ఒక్క ఘటనే ఆ తర్వాత నుంచీ మానవ సంబంధాలు, శారీరక సామీప్యత, ప్రవేశ నియం త్రణను నిర్వహించే విధానాన్ని పూర్తిగా మార్చేలా చేసింది. వీవీఐపీకీ, ప్రజలకూ మధ్య కఠినమైన భౌతిక అడ్డంకులను అమలు చేస్తూ, మేము అందరి దృష్టిలో ‘చెడ్డవాళ్లుగా’ మారడానికి కారణం ఆ దుర్ఘటనే.ఇందిర హత్య తర్వాతే ‘ఎస్పీజీ’‘‘1984లో ప్రధాని ఇందిరా గాంధీ తన అంగరక్షకుల చేతిలోనే దారుణ హత్యకు గురైనప్పుడు, అది మన నిఘా, భద్రతా వ్యవస్థలను మూలాల నుండి కుదిపేసింది. ఆ విషాదానికి ముందు, దేశంలో వీవీఐపీల ‘అత్యంత సమీప’ రక్షణ వలయం కోసం ప్రత్యేకంగా శిక్షణ పొందిన దళం అంటూ ఏదీ లేదు. ఆ వ్యవస్థాగత వైఫల్యం కేవలం భౌతిక భద్రతలో జరిగిన లోపం మాత్రమే కాదు, అది ప్రధాని అంగరక్షకుల ఎంపిక పరిశీలనలో జరిగిన నిఘా లోపం కూడా. ఈ హత్య తర్వాత, దేశాధినేతను అంతర్గత ముప్పుల నుండి రక్షించడానికి కేవలం సాధారణ పోలీసు పద్ధతులు సరి పోవని గ్రహించాం. ఆ గ్రహింపే బీర్బల్ నాథ్ కమిటీ ఏర్పాటుకు, 1985లో ‘స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్’ స్థాపనకు తక్షణ ఉత్ప్రేరకంగా మారింది. -
అమెజాన్ పెట్టుబడుల బూస్ట్
న్యూఢిల్లీ: భారత్‌లో దీర్ఘకాలిక విస్తరణ వ్యూహంలో భాగంగా టెక్ దిగ్గజం అమెజాన్ కృత్రిమ మేధ (ఏఐ), క్లౌడ్ సదుపాయాలను మరింత పటిష్టం చేసుకోవడంపై దృష్టి పెడుతోంది. ఇందుకోసం తాజాగా 13 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 1.23 లక్షల కోట్లు) ఇన్వెస్ట్ చేయనున్నట్లు ప్రకటించింది. దీనితో 2026–30 మధ్య కాలంలో భారత్‌లో అమెజాన్ పెట్టుబడులు 48 బిలియన్ డాలర్లకు చేరనున్నాయి. గురువారం ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశం అనంతరం కంపెనీ సీఈవో ఆండీ జస్సీ ఈ విషయాలు వెల్లడించారు. వ్యాపార వృద్ధికి సంబంధించి భారత్ తమకు కీలక మార్కెట్లలో ఒకటిగా ఉంటోందని ఆయన చెప్పారు. దేశీయంగా ఈ–కామర్స్, అమెజాన్ వెబ్ సర్వీసెస్ (ఏడబ్ల్యూఎస్) విభాగాలవ్యాప్తంగా కస్టమర్ల నుంచి డిమాండ్ పటిష్టంగా ఉంటోందని జస్సీ వివరించారు. డిజిటల్ వినియోగం, క్లౌడ్–ఏఐ సర్వీసులకు డిమాండ్ పెరుగుతుండటంతో భారత్‌లో పలు గ్లోబల్ టెక్నాలజీ దిగ్గజాలు ఇన్వెస్ట్ చేస్తున్న నేపథ్యంలో అమెజాన్ నిర్ణయం ప్రాధాన్యం సంతరించుకుంది. ‘భారత్‌లో అమెజాన్ రికార్డు స్థాయిలో 48 బిలియన్ డాలర్ల పెట్టుబడులను స్వాగతిస్తున్నాను. యువతకు దీనితో కొత్త అవకాశాలు లభిస్తాయి‘ అని ఎక్స్‌లో ప్రధాని మోదీ పోస్ట్ చేశారు. ‘వికసిత్, ఆత్మనిర్భర్ భారత్ సాకారంపై ప్రధాని మోదీ విజన్ మాకు స్ఫూర్తిదాయకం. భారత వృద్ధి గాథలో మేము దీర్ఘకాలిక భాగస్వామిగా ఉండాలని కోరుకుంటున్నాం’ అని జస్సీ పేర్కొన్నారు. 20 ఏళ్లలో 88 బిలియన్ డాలర్లు.. తాజా ఇన్వెస్ట్మెంట్స్ కూడా కలిపి 2010–2030 మధ్య కాలంలో భారత్‌లో 88 బిలియన్ డాలర్ల పైగా పెట్టుబడులు పెట్టినట్లవుతుందని అమెజాన్ తెలిపింది. ఈ ఏడాది కొత్తగా 20 ఫుల్ఫిల్మెంట్ సెంటర్లు, 100 లాస్ట్–మైల్ డెలివరీ స్టేషన్లను ఏర్పాటు చేయనున్నట్లు వివరించింది. ప్రధానంగా టియర్ 3, టియర్ 4 నగరాల్లో ఇవి రానున్నట్లు తెలిపింది. అలాగే, తమ ఈ–కామర్స్, క్విక్ కామర్స్ నెట్వర్క్కి దన్నుగా ఉంటున్న వేల మంది డెలివరీ ఏజెంట్ల సంక్షేమం కోసం ’సమ్మాన్’ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు అమెజాన్ తెలిపింది. భారత్‌లో కార్యకలాపాలు ప్రారంభించినప్పటి నుంచి 1.2 కోట్ల చిన్న వ్యాపారాలను డిజిటైజ్ చేసినట్లు, 20 బిలియన్ డాలర్లకు పైగా ఈ–కామర్స్ ఎగుమతులు, 28 లక్షల ఉద్యోగాలకు తోడ్పాటు అందించినట్లు అమెజాన్ వివరించింది. అలాగే కోటి మంది భారతీయులకు క్లౌడ్ నైపుణ్యాల్లో శిక్షణ కల్పించినట్లు పేర్కొంది. నిమిషాల్లో డెలివరీ సేవల నెట్‌వర్క్‌ను భారీగా విస్తరించే దిశగా 300 పైగా నగరాల్లో అమెజాన్ నౌ సర్వీసులను అందుబాటులోకి తేనున్నట్లు వివరించింది.హైదరాబాద్, ముంబై డేటా సెంటర్ల విస్తరణ.. తాజా పెట్టుబడులతో హైదరాబాద్, ముంబైలోని ఏడబ్ల్యూఎస్ డేటా సెంటర్ల సామర్థ్యాన్ని పెంచుకోనున్నట్లు అమెజాన్ ఒక ప్రకటనలో తెలిపింది. అంకుర సంస్థలు, ఎంటర్‌ప్రైజ్‌లు .. ఆవిష్కరణలను వేగవంతం చేసేందుకు, భారీగా కార్యకలాపాలను విస్తరించేందుకు, అంతర్జాతీయంగా కస్టమర్లకు సేవలందించేందుకు ఉపయోగపడే ఏఐ చిప్‌లు, మేనేజ్డ్ ఏఐ సర్వీసులు, సురక్షితమైన క్లౌడ్ టెక్నాలజీలు, డెవలపర్ టూల్స్‌ను మరింత అందుబాటులోకి తేనున్నట్లు వివరించింది. 2030 నాటికి 38 లక్షల కొలువుల కల్పనకు, 80 బిలియన్ డాలర్ల ఈ–కామర్స్ ఎగుమతులకు ఈ పెట్టుబడులు తోడ్పడనున్నట్లు తెలిపింది. 1.5 కోట్ల చిన్న వ్యాపారాలకు, నలభై లక్షల మంది ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఏఐ ప్రయోజనాలు అందుబాటులోకి రాగలవని వివరించింది. నేషనల్ హెల్త్ అథారిటీ, గవర్నమెంట్ ఈ–మార్కెట్‌ప్లేస్, అపోలో టైర్స్, డెల్హివెరీ, యాక్సిస్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఫిజిక్స్‌వాలా మొదలైనవి తమ ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ కంప్యూటింగ్ సర్వీసులను ఉపయోగించుకుంటున్నట్లు అమెజాన్ పేర్కొంది. -
27 నుంచి ప్రధాని మోదీ సెషెల్స్ పర్యటన
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 27–29వ తేదీల్లో సెషెల్స్లో పర్యటించనున్నారు. ఆ దేశ 50 ఏళ్ల జాతీయ దినోత్సవాల్లో ఆయన గౌరవ అతిథిగా పాల్గొంటారు. పర్యటనలో భాగంగా అధ్యక్షుడు పాట్రిక్ హెర్మీనీతో చర్చలు జరుపుతారు. 50 ఏళ్లలో ద్వైపాక్షిక సంబంధాల్లో సాధించిన పురోగతిని సమీక్షిస్తారని గురువారం విదేశాంగ శాఖ తెలిపింది. సంబంధాల బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలను చర్చిస్తారని వివరించింది. అక్కడి భారత సంతతి ప్రజలతో ప్రధాని మోదీ ముచ్చటిస్తారంది. భారత నేవీలోని రెండు నౌకలు, భారత సైనికులు సెషెల్స్ జాతీయ దినోత్సవాల్లో పాలుపంచుకుంటారు. సెషెల్స్ అధ్యక్షుడి ఆహ్వానం మేరకు ప్రధాని మోదీ ఈ పర్యటన చేపడుతున్నారని విదేశాంగ శాఖ వివరించింది. చివరిసారిగా మోదీ ఆ దేశాన్ని 2015లో సందర్శించారు. -
మోదీని కలిసిన అమెజాన్ సీఈఓ: కీలక ప్రకటన!
ప్రపంచంలో అత్యంత వేగంగా ఎదుగుతున్న డిజిటల్ ఆర్థిక వ్యవస్థల్లో ఇండియా ఒకటి. అందుకే.. దిగ్గజ సంస్థలు భారత మార్కెట్‌పై ప్రత్యేక దృష్టి సారిస్తున్నాయి. తాజాగా అమెజాన్ కూడా అదే బాటలో మరో అడుగేసింది.అమెజాన్ సీఈఓ ఆండీ జాస్సీ తన భారత పర్యటన సందర్భంగా.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిశారు. ఈ సందర్భంగా.. 2030 నాటికి భారతదేశంలో ఏఐ, క్లౌడ్ మౌలిక సదుపాయాల విస్తరణ కోసం అదనంగా 13 బిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే అమెజాన్ 2025 డిసెంబర్లో 35 బిలియన్ డాలర్ల పెట్టుబడిని ప్రకటించింది.కొత్త పెట్టుబడులను ప్రకటించిన నేపథ్యంలో ఆండీ జాస్సీ మాట్లాడుతూ.. "మేము దశాబ్దానికి పైగా కాలంగా భారతదేశంలో పనిచేస్తున్నాం. ఈ కామర్స్, క్లౌడ్, ఏఐ రంగాల్లో అద్భుతమైన వృద్ధిని చూశాం. అందుకే భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని మరింత పెట్టుబడి పెడుతున్నాం" అని చెప్పారు.అమెజాన్ లక్ష్యం.. కేవలం వ్యాపారం పెంచుకోవడం మాత్రమే కాదు. భారతదేశంలో చిన్న వ్యాపారాలను డిజిటల్ ప్రపంచంలోకి తీసుకురావడం, ఉద్యోగాలను సృష్టించడం, ఎగుమతులను పెంచడం, ఏఐ సాంకేతికతను అందరికీ అందుబాటులోకి తీసుకురావడం కూడా.అమెజాన్ పెట్టుబడులతో 2030 నాటికి భారతదేశంలో.. 38 లక్షలకు పైగా ఉద్యోగాలకు మద్దతు లభించనున్నాయి. 80 బిలియన్ డాలర్ల ఈ-కామర్స్ ఎగుమతులకు సహకారం, 1.5 కోట్ల చిన్న వ్యాపారాలు ఏఐ ప్రయోజనాలు పొందనున్నారు. పైగా 40 లక్షల ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఏఐ ప్రయోజనాలను అందించనుంది.ఇదీ చదవండి: భారీగా తగ్గిన మస్క్ సంపద: కారణం ఇదే!అమెజాన్ కంపెనీ తన పెట్టుబడిలో భారీ మొత్తాన్ని ఏఐ, క్లౌడ్ రంగానికే కేటాయించనుంది. ఇందులో భాగంగా.. హైదరాబాద్, ముంబైలలో ఉన్న ఏడబ్ల్యుఎస్ డేటా సెంటర్లను మరింత విస్తరించనుంది. దీని వల్ల భారతీయ కంపెనీలు తమ డేటాను దేశంలోనే భద్రంగా నిల్వ చేసుకోవడంతో పాటు అత్యాధునిక ఏఐ టెక్నాలజీలను ఉపయోగించుకోగలుగుతాయి.ఇప్పటికే అనేక భారతీయ సంస్థలు ఏడబ్ల్యుఎస్ సేవలను ఉపయోగిస్తున్నాయి. ఇందులో బ్యాంకులు, స్టార్టప్‌లు, ప్రభుత్వ సంస్థలు, విద్యా సంస్థలు కూడా ఉన్నాయి. మొత్తం మీద అమెజాన్ తాజా ప్రకటన.. భారత ఆర్థిక వ్యవస్థకు, ఉద్యోగ అవకాశాలకు, సాంకేతిక అభివృద్ధికి కొత్త ఊపునిచ్చే అవకాశం ఉంది. ఇది ''డిజిటల్ ఇండియా'' లక్ష్యాలను మరింత వేగంగా ముందుకు తీసుకెళ్లే మరో కీలక అడుగుగా చెప్పవచ్చు.Really enjoyed my meeting with Prime Minister @narendramodi about what’s ahead for Amazon in India.We’ve been serving customers, sellers, developers, startups, and enterprises in India for more than a decade and just getting started. Shared that we’re investing $48 billion… pic.twitter.com/CSiwPTiEBh— Andy Jassy (@ajassy) June 25, 2026 -
నీట్ నిర్వహణ భేష్.. ప్రధాని ప్రశంస
ఢిల్లీ: నీట్ పునఃపరీక్ష విజయవంతంగా నిర్వహించారని ప్రధాని మోదీ విద్యాశాఖను కొనియాడారు. బుధవారం నిర్వహించిన కేబినేట్ సమావేశంలో వారికి అభినందనలు తెలిపారు. నీట్ ప్రక్రియ 'హోల్-గవర్నమెంట్' విధానాన్ని ప్రదర్శించిందని, మంత్రులు మరియు అధికారుల సమిష్టి కృషిని ఆయన ప్రశంసించారు.కేబినేట్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ "పరీక్ష సజావుగా, చిత్తశుద్ధితో" నిర్వహించబడింది. ప్రణాళిక అమలులో తమ మంత్రులు తమ బాధ్యతలు నిర్వహించారు. భవిష్యత్తులో సైతం ఇదే విధంగా సమన్వయ విధానాన్ని అనుసరించాలి". అని ఆయన అన్నారు. అంతా కలిసి పనిచేస్తే ఏలాంటి సమస్యనైనా అధిగమించవచ్చని నీట్ మరోసారి రుజువుచేసిందన్నారు.ప్రధాని అధ్యక్షత జరిగిన ఈ సమావేశంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, నీట్ పునఃపరీక్ష నిర్వహించిన విధానాన్ని వివరించారు. పలు మంత్రిత్వ శాఖలు, రాష్ట్ర ప్రభుత్వాలు,విభాగాలు సమన్వయంతో తీసుకున్న నిర్ణయాలను వెల్లడించారు.కాగా నీట్ పునఃపరీక్ష జూన్ 21న దేశవ్యాప్తంగా 5,440 కేంద్రాలలో,విదేశాల్లోని 14 కేంద్రాలలో నిర్వహించారు. ఈ పరీక్షకు 20 లక్షలకు పైగా అభ్యర్థుల హాజరయ్యారు.కాగా గత నెల మే 3న నిర్వహించిన నీట్ యూజీ (NEET UG) పరీక్ష క్వశ్చన్ పేపర్ లీక్ నేపథ్యంలో కేంద్రం రద్దు చేసింది. "గెస్ పేపర్" పేరుతో లక్షల రూపాయలకు ప్రశ్నపత్రాలు అమ్ముడయ్యాయని, లీకేజీ నెట్వర్క్ సోషల్ మీడియా ద్వారా విస్తరించిందని దర్యాప్తులో తేలడంతో కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. -
ఖమేనీ అంత్యక్రియలకు ప్రధాని మోదీకి ఆహ్వానం
ఢిల్లీ: వచ్చే నెల(జులై)లో జరగనున్న అయాతొల్లా ఖమేనీ అంత్యక్రియలకు ప్రధాని నరేంద్ర మోదీని ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ ఆహ్వానించారు. ఇవాళ (మంగళవారం) న్యూఢిల్లీలోని ఇరాన్ రాయబార కార్యాలయం ఈ అధికారిక ఆహ్వానాన్ని విదేశాంగ మంత్రిత్వ శాఖకు (MEA) పంపింది.ఫిబ్రవరి 28న అమెరికా-ఇజ్రాయెల్ దాడుల్లో 86 ఏళ్ల ఇరాన్ సుప్రీం లీడర్ అయాతొల్లా ఖమేనీ మరణించిన సంగతి తెలిసిందే. వచ్చే నెలలో మషాద్‌లో ఖమేనీ అంత్యక్రియలు జరగనున్నాయి. ఈ కార్యక్రమానికి రావాలని మోదీని ఇరాన్ అధ్యక్షుడు ఆహ్వానించారు. జులై 9న ఖమేనీ అంత్యక్రియలు జరగనున్నాయి. 4వ తేదీ నుంచి కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయి. అంత్యక్రియల కార్యక్రమాలు జూలై 4న టెహ్రాన్‌లో ప్రారంభమై.. జూలై 9న ఖమేనీ స్వగ్రామమైన మషాద్‌లో ఆయన ఖననంతో ముగుస్తాయి.అధ్యక్షుడు పెజెష్కియాన్ తరపున అధికారిక ఆహ్వానాలు అందుకున్న ప్రపంచ నాయకులలో పీఎం మోదీతో పాటు చైనా, రష్యా, ఖతార్, ఫ్రాన్స్ , పాకిస్తాన్ దేశాల నేతలు ఉన్నారు. పాకిస్తాన్ ప్రతినిధి బృందం ఖమేనీ అంత్యక్రియలకు హాజరవుతుందని పాక్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ శుక్రవారం ప్రకటించారు.న్యూఢిల్లీలోని వర్గాల సమాచారం ప్రకారం.. ఈ అధికారిక అంత్యక్రియల కార్యక్రమానికి భారతదేశం తరపున ఎవరు ప్రాతినిధ్యం వహించాలనే దానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. భారత్.. మార్చి 5న ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపింది. విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రి న్యూఢిల్లీలోని ఇరాన్ రాయబార కార్యాలయాన్ని సందర్శించి అధికారిక సంతాప పుస్తకంలో సంతకం చేశారు.ప్రధాని మోదీ చివరిసారిగా మే 2016లో ఇరాన్లో అధికారిక ద్వైపాక్షిక పర్యటన చేశారు. ఆ సమయంలో చాబహార్ రేవు అభివృద్ధికి త్రైపాక్షిక ఒప్పందంపై సంతకం చేయడానికి ఆయన ఖమేనీ, అప్పటి అధ్యక్షుడు హసన్ రౌహానీలతో సమావేశమయ్యారు. రెండేళ్ల తర్వాత, ఫిబ్రవరి 2018లో పీఎం మోదీ ఆహ్వానం మేరకు అధ్యక్షుడు రౌహానీ భారత్‌లో న్యూఢిల్లీ, హైదరాబాద్‌లను సందర్శించారు. మోదీ, పెజెష్కియాన్ చివరిసారిగా అక్టోబర్ 2024లో రష్యాలోని కజాన్‌లో జరిగిన బ్రిక్స్ సదస్సు సందర్భంగా సమావేశమయ్యారు. ఆ సమయంలో పీఎం మోదీ, పెజెష్కియాన్‌ను భారత్‌ను సందర్శించాల్సిందిగా ఆహ్వానించారు. -
ప్రధాని అలా అనడం సంతోషంగా ఉంది: మెగాస్టార్
రామ్ చరణ్ హీరోగా వచ్చిన రూరల్ స్పోర్ట్స్ డ్రామా పెద్ది. ఈనెల 4న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఈ మూవీ ఏకంగా రూ.400 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. బుచ్చిబాబు డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమాలో బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ హీరోయిన్గా మెప్పించింది. తాజాగా ఈ మూవీ సక్సెస్ మీట్ హైదరాబాద్‌లో నిర్వహించారు.ఈ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవి హాజరయ్యారు. ఈ సందర్భంగా తనయుడు రామ్ చరణ్ నటనపై ప్రశంసలు కురిపించారు. ఈ సినిమా చరణ్ నటించలేదని.. జీవించాడని కొనయాడారు. అంతేకాదు అవార్డుల కంటే చరణ్ నటనపై ప్రశంసలే నాకు ఎక్కువ అని అన్నారు. ఈ సినిమాలో జాతీయ అవార్డ్ ఫర్మామెన్స్ ఇచ్చాడంటూ ఆకాశానికెత్తేశారు.తాజాగా ప్రధాని మోదీ చరణ్‌పై ప్రశంసించడంపై మెగాస్టార్ ట్వీట్ చేశారు. చరణ్‌ను న్యూ ఏజ్ మెగాస్టార్ అని సంభోధించడంపై ఆనందం వ్యక్తం చేశారు. ఇలాంటి ప్రతిష్ఠాత్మక వేదికలపై చరణ్‌కు లభిస్తున్న గుర్తింపు, గౌరవం చూస్తుంటే ఒక తండ్రిగా గర్వంగా ఉందన్నారు. తన కృషి, అంకితభావం, నటనతో ప్రేక్షకుల అభిమానాన్ని మాత్రమే కాదు, దేశవ్యాప్తంగా విశేషమైన గుర్తింపును కూడా సంపాదించుకోవడం నిజంగా సంతోషకరమన్నారు.రామ్ చరణ్ ఇంకా మరెన్నో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తూ తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా మరింత విస్తరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానంటూ పోస్ట్ చేశారు. 'పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినపుడే పుట్టదు, జనులా పుత్రుని గనుగొని పొగడగా, పుత్రోత్సాహంబు నాడు పొందుర సుమతీ!” అంటూ సంతోషం వ్యక్తం చేశారు. కాగా.. రిపబ్లిక్ టీవీ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు రామ్ చరణ్ కూడా పాల్గొన్నారు. “పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినపుడే పుట్టదు, జనులా పుత్రుని గనుగొని పొగడగా, పుత్రోత్సాహంబు నాడు పొందుర సుమతీ!”నిన్న ప్రధానమంత్రి నరేంద్ర మోది గారు పాల్గొన్న రిపబ్లిక్ టీవీ కార్యక్రమంలో రామ్ చరణ్‌ను “𝙉𝙚𝙬 𝘼𝙜𝙚 𝙈𝙚𝙜𝙖𝙎𝙩𝙖𝙧” అని సంబోధించడం నాకు ఎంతో ఆనందాన్ని… pic.twitter.com/sbddqa3m61— Chiranjeevi Konidela (@KChiruTweets) June 24, 2026 -
‘తొలగించడంపై కారణం చెప్పండి.. లేదంటే ఊరుకోను’
ఆసియా క్రీడల్లో పాల్గొనే జట్టు నుంచి తనను తీసేయడంపై భారత టేబుల్ టెన్నిస్ స్టార్ ప్లేయర్ మనికా బాత్రా అసహనం వ్యక్తం చేసింది. తనను జట్టు నుంచి తొలగించడంపై సరైన కారణం చెప్పాలని, లేదంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటానని టేబుల్ టెన్నిస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (టీటీఎఫ్ఐ)ని హెచ్చరించింది. ఈ విషయంలో ప్రధాని నరేంద్ర మోదీతో పాటు క్రీడాశాఖ మంత్రి మన్సుక్ మాండవీయ జోక్యం చేసుకోవాలని మనికా బాత్రా మరోసారి కోరింది. తనను జట్టు నుంచి ఎందుకు తీసేశారనేది అడగడం లేదని, ఎంపిక ప్రక్రియలో తనకు పారదర్శకత, జవాబుదారీతనం కావాలని మనికా నొక్కి చెప్పారు.‘నన్ను ఎంపిక చేయమని నేను అడగడం లేదు. ఎంపిక చేయకపోవడంపై తీసుకున్న నిర్ణయాన్ని మార్చమని కూడా అడగడం లేదు. నన్ను ఏ ప్రాతిపదికన జట్టులో నుంచి తీసేశారో నాకు లిఖిత పూర్వక సమాధానం ఇవ్వాలని మాత్రమే కోరుతున్నాను. నన్ను సెలక్ట్ చేయకపోవడానికి గల కారణాలను ఫెడరేషన్ తెలియజేయలేదు. ప్రస్తుత ప్రపంచ ర్యాంకింగ్స్ జాబితాలో నేను 51వ స్థానంలో ఉన్నాను. ర్యాంకింగ్స్ ప్రతి వారం మారుతుంటాయి. ఎంపిక సమయంలో ఏ కాలవ్యవధిని పరిగణనలోకి తీసుకున్నారు? టాప్-50లో ఉన్న ప్లేయర్ ఒకటి లేదా రెండు వారాల్లో 50 నుంచి 51వ స్థానానికి పడిపోతే.. ఆసియా క్రీడలకు అర్హత కోల్పోయినట్టేనా? వీటిపై ఫెడరేషన్ నాకు సమాధానం ఇచ్చి తీరాలి. అయితే నిర్ణయానికి గల కారణాలపై సంతృప్తికర సమాధానాలు రాకపోతే మాత్రం న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాను. పరిష్కార మార్గాలను అన్వేషించడం తప్ప నాకు మరో మార్గం లేదు ’ అని మనికా ఆగ్రహం వ్యక్తం చేసింది.ఎంపికకు ఆధారాలెక్కడ?‘గత ఆసియా క్రీడల్లో మహిళల డబుల్స్ విభాగంలో భారత్‌కు చారిత్రాత్మక పతకం అందించిన ఐకా ముఖర్జీకి కూడా ఈసారి చోటు దక్కలేదు. ఇలాంటి విజయాలు సాధించిన ప్లేయర్లను జట్టులోకి తీసుకోకపోతే ఎంపిక ప్రమాణాలపై సహజంగానే ప్రశ్నలు తలెత్తుతాయి. టీటీఎఫ్ఐలో ప్లేయర్ల ఎంపిక నిర్ణయాలు తీసుకునేది ఎవరు? వారిలో ఎంతమంది అంతర్జాతీయ స్థాయిలో భారత్‌కు ప్రాతినిధ్యం వహించారు? ఒలింపిక్స్, కామన్వెల్త్ గేమ్స్, ఆసియా గేమ్స్ల్లో ఎంతమంది పాల్గొన్నారు? నా ఎంపికపై కూడా ఓటింగ్ జరిగి ఉంటే అవి ప్రదర్శన ఆధారంగానే చేశారా? లేదా వ్యక్తిగత అభిప్రాయాల మేరకు నన్ను తప్పించారా?’ అని ఫెడరేషన్‌ను ప్రశ్నించింది. కాగా జపాన్ వేదికగా సెప్టెంబర్ 19 నుంచి అక్టోబర్ 4 వరకు ఆసియా గేమ్స్ జరగనున్నాయి.Read: స్టేడియం వద్ద తొక్కిసలాట.. మదిలోకి చిన్నస్వామి భయానక ఘటన! -
మోదీ కేబినెట్లో భారీ మార్పులు?
న్యూఢిల్లీ: కేంద్ర మంత్రివర్గంలో త్వరలోనే భారీ పునర్వ్యవస్థీకరణ జరగనున్నట్లు జాతీయ రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర కేబినెట్లో మార్పులు, చేర్పులపై బీజేపీ అధిష్ఠానం అంతర్గతంగా విస్తృత కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ఇటీవల కేంద్ర సహాయ మంత్రి జార్జ్ కురియన్ రాజీనామా చేయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. దీంతో మరికొందరు మంత్రులను కూడా రాజీనామా చేయాలని పార్టీ నాయకత్వం కోరే అవకాశముందన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి.సమాచారం మేరకు.. కేంద్ర మంత్రివర్గంలో దాదాపు 38 మంది మంత్రుల బాధ్యతల్లో మార్పులు ఉండే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. పనితీరు ఆశించిన స్థాయిలో లేని మంత్రులకు ఉద్వాసన పలుకుతూ, ఎన్నికల దృష్ట్యా కీలక రాష్ట్రాలకు చెందిన ఎంపీలకు మంత్రి పదవులు కట్టబెట్టే వ్యూహాన్ని బీజేపీ అమలు చేయవచ్చని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ ఏడాది చివర్లో పంజాబ్, యూపీ, ఉత్తరాఖండ్, హిమాచల్‌ప్రదేశ్, మణిపూర్, గోవా రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆయా రాష్ట్రాలకు ప్రాతినిధ్యం పెంచే దిశగా నిర్ణయాలు ఉండొచ్చని తెలుస్తోంది. అలాగే మోదీ కేబినెట్లో చాలా కాలంగా కొనసాగుతున్న కొందరు సీనియర్ మంత్రులను తప్పించి, యువతకు, ముఖ్యంగా జెన్-జీ తరం నాయకులకు ప్రాధాన్యత ఇవ్వాలనే ఆలోచనలో పార్టీ అధిష్ఠానం ఉన్నట్లు సమాచారం. యువ ఓటర్లను ఆకర్షించే లక్ష్యంతో కొత్త తరానికి చెందిన నాయకులను మంత్రివర్గంలోకి తీసుకురావాలని భావిస్తున్నట్లు రాజకీయ వర్గాలు చెబుతున్నాయి.మంత్రి పదవుల రేసులో పలు పేర్లు వినిపిస్తున్నాయి. శ్రీకాంత్ షిండే, ఈటల రాజేందర్, డీకే అరుణ, కకోలీ ఘోష్, తదితర నేతలకు అవకాశాలు ఇవ్వనున్నట్టు ప్రచారం జరుగుతోంది. తెలంగాణ నుంచి కూడా పలు కీలక మార్పులు ఉండొచ్చని సమాచారం. ఇక ఇతర పార్టీల నుంచి బీజేపీలో చేరిన ఎంపీలకు(రాఘవ్ చద్దా, టీఎంసీ నుంచి పలువురు, మహారాష్ట్ర నుంచి కొందరు) కూడా మంత్రివర్గంలో స్థానం కల్పించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల నుంచి వచ్చిన నేతలకు ప్రాధాన్యత ఇచ్చే దిశగా చర్చలు జరుగుతున్నట్లు రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి.గతంలో మోదీ 2.0 ప్రభుత్వ హయాంలో జరిగిన మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో 12 మంది మంత్రులు రాజీనామా చేయగా, పలువురికి పదోన్నతులు లభించాయి. దాదాపు 30 మంది కొత్త వారికి మంత్రివర్గంలో చోటు దక్కింది. అదే తరహాలో ఈసారి కూడా భారీ మార్పులు చోటుచేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే, కేంద్ర ప్రభుత్వం లేదా బీజేపీ అధిష్ఠానం నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. దీంతో ప్రస్తుతం జరుగుతున్న ప్రచారాలపై ఆసక్తి నెలకొంది. రాజకీయంగా కీలకమైన రాష్ట్ర ఎన్నికల ముందు జరిగే ఈ పునర్వ్యవస్థీకరణ దేశ రాజకీయాల్లో పెద్ద చర్చకు దారితీయనుంది. -
భారతీయులు ఖర్చు పెట్టరు.. వాన్స్ ప్రతిపాదనపై ట్రంప్ వ్యాఖ్య
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించేందుకు చేసిన ప్రయత్నాలు మధ్యలో ఆగిపోయిన సంగతి తెలిసిందే. పుతిన్-జెలెన్స్కీల మొండిపట్టుతో ఆ చర్చలు ముందుకు సాగడం లేదు. అయితే.. ఈ వ్యవహారానికి సంబంధించి వైట్‌హౌజ్‌లో జరిగిన ఓ ఆసక్తికర చర్చ ఇప్పుడు బయటకు వచ్చింది. యుద్ధ విరమణ ఒప్పందాన్ని పర్యవేక్షించేందుకు నాటో దేశాల బలగాల బదులుగా భారత సైన్యాన్ని వినియోగించవచ్చనే ప్రతిపాదన వచ్చిందట. దానికి ట్రంప్ షాకింగ్ రియాక్షన్ ఇచ్చినట్లు ఇప్పుడు బయటకు వచ్చింది. జూన్ 23న విడుదలైన రిజిమ్ చేంజ్ (Regime Change) పుస్తకాన్ని జర్నలిస్టులు మ్యాగీ హాబర్‌మన్, జోనాథన్ స్వాన్ రచించారు. ఇందులో 2025 జనవరి 30న ఓవల్ ఆఫీస్‌లో జరిగిన సమావేశం గురించి వివరించారు. ట్రంప్ రెండోసారి అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేసిన కేవలం పది రోజుల తర్వాత ఈ సమావేశం జరిగినట్లు పేర్కొన్నారు.ఆ సమావేశంలో.. రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించేందుకు ప్రత్యేక దూతగా నియమితులైన రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ కీత్ కెలాగ్ శాంతి ప్రణాళికను వివరించారు. ఆ ప్రణాళికలో యుద్ధ విరమణ అమలును పర్యవేక్షించేందుకు ఫ్రాన్స్, బ్రిటన్, నెదర్లాండ్స్ వంటి యూరోపియన్ దేశాల బలగాలను ఉక్రెయిన్‌లో మోహరించే ప్రతిపాదన చేశారు.అయితే నాటో సభ్య దేశాల సైన్యం ఉక్రెయిన్‌లో ఉంటే రష్యా దానిని రెచ్చగొట్టే చర్యగా పరిగణించే అవకాశం ఉందని ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ అభ్యంతరం వ్యక్తం చేశారట. అలా చేస్తే ఉద్రిక్తతలు మరింత పెరిగి యుద్ధం విస్తరించే ప్రమాదం ఉందని ఆయన భావించారట. దీంతో నాటోకు చెందని దేశాల బలగాలను ఉపయోగించవచ్చా? అని వాన్స్ ప్రశ్నించగా.. అప్పటి జాతీయ భద్రతా సలహాదారు మైకేల్ వాల్ట్జ్ కూడా ఆ ఆలోచనకు సానుకూలంగా స్పందించారు. అనంతరం భారత్, సౌదీ అరేబియా వంటి దేశాల బలగాలను పరిగణనలోకి తీసుకోవచ్చని వాన్స్ సూచించారట.అయితే ట్రంప్ వెంటనే ఆ ప్రతిపాదనను తోసిపుచ్చినట్లు బిగ్గరగా నవ్వినట్లు.. రిజిమ్ చేంజ్ రచయితలు పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీతో తనకు మంచి సంబంధాలు ఉన్నాయని, మోదీ తనను ఇష్టపడతారని చెప్పినప్పటికీ, "భారతీయులు అలాంటి వాటికి ఖర్చు పెట్టరు. వారు దీనికి డబ్బులు వెచ్చించరు" అంటూ నవ్వుతూ వ్యాఖ్యానించినట్లు పుస్తకంలో వెల్లడించారు.అమెరికాకు ఆర్థిక బాధ్యతలు పెరగకూడదనే అంశంపైనే ట్రంప్ ప్రధానంగా దృష్టి పెట్టినట్లు పుస్తకం చెబుతోంది. బ్రిటన్ లేదంటే ఫ్రాన్స్ తమ సొంత నిర్ణయంతో బలగాలను పంపితే తనకు అభ్యంతరం లేదని, కానీ అమెరికా నేరుగా ఇందులో భాగస్వామి కాకూడదని ఆయన భావించినట్లు వివరించింది. అదే సమావేశంలో ట్రంప్ ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీపై కూడా తీవ్ర విమర్శలు చేసినట్లు పుస్తక రచయితలు పేర్కొన్నారు. జెలెన్స్కీని తట్టిపోయడమే కాకుండా.. ఉక్రెయిన్ను ప్రపంచంలోనే అత్యంత అవినీతిపరమైన దేశాల్లో ఒకటిగా వ్యాఖ్యానించినట్లు వెల్లడించారు.అయితే ఇవన్నీ కొత్తగా విడుదలైన పుస్తకంలోని వాదనలు మాత్రమే. వైట్‌హౌస్ లేదంటే సంబంధిత వర్గాలు ఈ వివరాలపై అధికారికంగా స్పందించాల్సి ఉంది. అయినప్పటికీ, ఉక్రెయిన్ యుద్ధం, అమెరికా విదేశాంగ విధానం, భారత్‌తో ట్రంప్ సంబంధాలపై ఈ పుస్తకం కొత్త చర్చకు తెరలేపింది. -
నాగరిక దేవో భవ!
న్యూఢిల్లీ: అధికార విధుల్లో ఉండగా తమ వద్దకు వచ్చే ప్రతి ఫైలునూ అసంఖ్యాక పౌరుల జీవితాలకు, వారి ఆకాంక్షలకు ప్రతినిధిగా భావించాలని యువ ఐఏఎస్ అధికారులకు ప్రధాని మోదీ ఉద్బోధించారు. అలాగే, ప్రభుత్వ పాలన ఎల్లప్పుడూ సానుభూతితో స్పందిస్తూ, అందరినీ కలుపుకుపోతుండాలని ఆయన కోరారు. మంగళవారం తన వద్దకు వచ్చిన 183 మంది 2024 ఐఏఎస్ బ్యాచ్ ట్రెయినీ అధికారులతో ఆయన మాట్లాడారు. వీరంతా వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాల్లో సహాయ కార్యదర్శులుగా అటాచ్ అయ్యారు.‘అభివృద్ధి పరంగా ఎదురయ్యే ప్రధాన సవాళ్లను ఎవరికివారుగా పరిష్కరించడం సాధ్యం కాదు. అర్ధవంతమైన, శాశ్వతమైన ఫలితాలను సాధించాలంటే వివిధ ప్రభుత్వ శాఖల మధ్య సమర్థవంతమైన సమన్వయం అత్యంత కీలకం’అని మోదీ తెలిపారు. యువ అధికారులు బలమైన లక్ష్య శుద్ధి, ఆవిష్కరణలు, ప్రజా కేంద్రిత పాలనా విధానంతో దేశ నిర్మాణానికి అంకితం కావాలని ఆయన పిలుపునిచ్చారు. అలాగే, ప్రతి పరిపాలనా ఫైలు వెనుక ఒక సామాన్యుడి జీవితంపై పడే ప్రభావాన్ని ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలని వారిని కోరారు.పౌరుడికే ప్రథమ ప్రాథామ్యంనాగరిక్ దేవో భవ అనే మంత్రాన్ని ఎల్లవేళలా గుర్తుంచుకుని తీసుకునే ప్రతి నిర్ణయంలోనూ పౌరులకే ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. దేశ నిర్మాణంలో తమ వంతు పాత్రను నిరంతరం సమీక్షించుకుంటూ ఉండాలని, నిర్వహించే బాధ్యతలను బట్టి కాకుండా సాధించిన స్పష్టమైన ఫలితాల ద్వారా సంతృప్తిని పొందాలని సూచించారు. ‘రెండేళ్ల పాటు క్షేత్రస్థాయి పరిశీలన, పరిపాలనాపరమైన అనుభవం తర్వాత ఇప్పుడు మీరు ఒక కీలకమైన దశలో ఉన్నారు. ఇక్కడ తీసుకునే నిర్ణయాలు కేవలం మీ కెరీర్‌ను మాత్రమే కాదు, కోట్లాది పౌరుల భవిష్యత్తును సైతం మారుస్తాయి’అని మోదీ వారితో అన్నారు. నిజాయితీ, సున్నితత్వం, నిబద్ధతతో నిజజీవిత పరిస్థితులను ఎదుర్కొన్నప్పుడే ప్రజా సేవలో అసలైన పరీక్ష మొదలవుతుందని పేర్కొన్నారు.అభివృద్ధి చెందిన భారత్ లక్ష్యంవికసిత్ భారత్ 2047 దార్శనికతను ప్రస్తావించిన మోదీ.. ‘రాబోయే దశాబ్దాలలో తీసుకునే ప్రతి విధానం, పరిపాలనాపరమైన నిర్ణయం కూడా అభివృద్ధి చెందిన భారత్‌ను నిర్మించే దిశగానే సాగాలి. ప్రభుత్వంలోని అన్ని విభాగాలు కలిసికట్టుగా పనిచేయాలి. ప్రస్తుతం దేశ ప్రాధాన్యతలలో ’ఆత్మనిర్భర్ భారత్’, ’మేక్ ఇన్ ఇండియా’, ఉత్పాదక రంగ వృద్ధి, ఇంధన భద్రత, యువతకు అవకాశాలను సృష్టించడం వంటివి ఉన్నాయి’అని యు ఐఏఎస్‌లకు ఆయన వివరించారు. ప్రస్తుత బ్యాచ్‌లోని ఐఏఎస్ అధికారులలో 40 శాతానికి పైగా మహిళలే ఉన్నారు.వారి శక్తి, ప్రతిభ, అంకితభావం దేశ అభివృద్ధి ప్రయాణాన్ని సరికొత్త ఎత్తులకు తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. ఈ సందర్భంగా అధికారులు తమకు కేటాయించిన విభాగాల్లో ఎదురైన సొంత అనుభవాలను ప్రధానికి వివరించారు. కార్యక్రమంలో కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్, ప్రధాని ప్రధాన కార్యదర్శులు పి.కె.మిశ్రా, శక్తికాంత దాస్, క్యాబినెట్ సెక్రటరీ టీవీ సోమనాథన్, లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ శ్రీరామ్ తరణికాంతి తదితరులు పాల్గొన్నారు. -
అగ్నిప్రమాదంపై ప్రధాని విచారం.. ఎక్స్‌గ్రేషియా ప్రకటన
యూపీ: లక్నోలోని కోచింగ్ సెంటర్లో జరిగిన ఘోర అగ్నిప్రమాదంపై ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ విషయమై ఎక్స్ వేదికగా ఆయన స్పందించారు. " లక్నోలో జరిగిన అగ్నిప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నాను. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాను. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి అధికారులు సాధ్యమైన అన్ని సహాయ సహకారాలు అందిస్తున్నారు". అని ప్రధాని విచారం వ్యక్తం చేశారు.మృతుల కుటుంబాలకు పీఎంఎన్ఆర్ఎఫ్ నుండి రూ. 2 లక్షలు, గాయపడిన వారికి రూ. 50,000 పరిహారం అందజేస్తున్నట్లు మోదీ పేర్కొన్నారు. కాగా ఈ రోజు (సోమవారం) మధ్యాహ్నం లక్నోలోని ఓ కోచింగ్ సెంటర్లో జరిగిన అగ్నిప్రమాదంలో 14 మంది ప్రాణాలు కోల్పోయారు. మరికొంత మంది గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తో్ంది.ప్రమాదం ఎలా జరిగింది?ఈరోజు (సోమవారం) మధ్యాహ్నం 3 గంటల సమయంలో అలీగంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఉషా మెహతా మార్గ్‌లో ఉన్న మూడంతస్తుల వాణిజ్య భవనంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. గ్రౌండ్ ఫ్లోర్‌లోని ఒక దుకాణంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు ప్రారంభమయ్యాయని ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. మంటలు క్షణాల్లోనే పై అంతస్తులకు విస్తరించాయి. ఆ సమయంలో రెండో, మూడో అంతస్తుల్లో కంప్యూటర్ కోచింగ్ సెంటర్, లైబ్రరీలో పెద్ద సంఖ్యలో విద్యార్థులు ఉన్నారు. భవనం మొత్తం పొగలు, మంటలు అలుముకోవడంతో విద్యార్థులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అయితే అగ్నిమాపక దళం వెంటనే స్పందించినప్పటికీ అయితే మంటలు భారీగా ఉండటంతో లోపలికి వెళ్లడం అగ్నిమాపక సిబ్బందికి కష్టతరమైంది. నిచ్చెనల సహాయంతో కిటికీలను పగలగొట్టి లోపల చిక్కుకున్న వారిని రక్షించే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ భారీగా విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంపై యూపీ సీఎం యోగి ఆదిత్య నాథ్ స్పందించారు. గాయపడిన బాధితులకు సమీప ఆసుపత్రుల్లో మెరుగైన ఉచిత వైద్య చికిత్స అందించాలని ఆయన అధికారులను ఆదేశించారు.Anguished by the loss of lives in a fire mishap in Lucknow, Uttar Pradesh. My condolences to the bereaved families. May the injured recover at the earliest. Rescue operations are underway and authorities are providing all possible assistance. An ex-gratia of Rs. 2 lakh from…— PMO India (@PMOIndia) June 22, 2026 -
మీరు గొప్పనేత ఎప్పుడౌతారో ఏమో!
మీరు గొప్పనేత ఎప్పుడౌతారో ఏమో! -
అజేయంగా మన సముద్ర శక్తి
కోల్‌కతా: ఒక దేశం ఆర్థిక, వ్యూహాత్మక ప్రభావానికి బలమైన నౌకాదళ సామర్థ్యమే నిర్ణయాత్మక అంశమని ప్రధాని మోదీ చెప్పారు. అందుకు అనుగుణంగానే భారత్ సన్నద్ధమవుతోందని వివరించారు. దేశీయ పరిజ్ఞానంతో నిర్మించిన మూడు కీలక యుద్ధనౌకలు ఐఎన్ఎస్ దుణగిరి, ఐఎన్ఎస్ సంశోధక్, ఐఎన్ఎస్ అగ్రయ్ని మోదీ ఆదివారం జాతికి అంకితం చేశారు. పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలోని శ్యామప్రసాద్ ముఖర్జీ పోర్టులో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. సముద్రయాన సామర్థ్యాలు కలిగిన దేశం శక్తివంతమైనదిగా, అధిక ఆర్థిక, వ్యూహాత్మక ప్రభావాన్ని కలిగి ఉంటుందని గుర్తుచేశారు. అజేయమైన సముద్ర శక్తిగా భారత్ వేగంగా ఎదుగుతోందని తెలిపారు. ఐన్ఎస్ దుణగిరి, ఐన్ఎస్ అగ్రయ్, ఐఎన్ఎస్ సంశోధక్ నౌకలు సముద్ర పోరాటం, హైడ్రోగ్రాఫిక్ సర్వేయింగ్, జలాంతర్గామి వ్యతిరేక యుద్ధంలో కీలక పాత్ర పోషిస్తాయని ప్రధాని మోదీ తెలిపారు. 2022లో ‘ఐఎన్ఎస్ విక్రాంత్’విమాన వాహక నౌకను ప్రారంభించడం ద్వారా భారత్ తన సముద్ర సామర్థ్యాలను ప్రపంచానికి చాటిచెప్పిందని అన్నారు. కొత్త నౌకలను మనదేశంలోనే డిజైన్ చేసి, నిర్మించామని, దేశ ప్రతిభకు నిదర్శనంగా నిలుస్తున్నాయని హర్షం వ్యక్తంచేశారు. ఉపాధి ఇంజిన్‌గా ‘మారిటైమ్’లక్షలాది ఉద్యోగాలను సృష్టించే సామర్థ్యం మారిటైమ్ రంగానికి ఉందని, ‘అభివృద్ధి చెందిన భారత్’కు ఇది ఉపాధి ఇంజిన్‌గా పనిచేస్తుందని పేర్కొన్నారు. ఆధునిక నౌక నిర్మాణానికి వేల టన్నుల ఉక్కు, ఎలక్ట్రానిక్స్, యంత్ర పరికరాలు, విడిభాగాలు అవసరమవుతాయని, వీటి తయారీకి అనేక కంపెనీలు పనిచేస్తున్నాయని, తద్వారా వేలాది మంది యువతకు ఉపాధి లభిస్తోందని ప్రధానమంత్రి తెలియజేశారు.కొత్త నౌకల విశేషాలు.. ఐఎన్ఎస్ దుణగిరి: ఇది అత్యాధునిక స్టెల్త్ యుద్ధ నౌక. బ్రహ్మోస్ క్షిపణులు, మధ్యశ్రేణి గగనతల క్షిపణి వ్యవస్థ, ఆయుధాలు, సెన్సర్లు ఇందులో అమర్చారు. దీని పొడవు 149 మీటర్లు. 2022 జూలై 15న జలప్రవేశం చేసింది. ఐఎన్ఎస్ సంశోధక్: ఇది భారీ సర్వే నౌక. భారత తీర ప్రాంతాలు, లోతైన సముద్ర జలాల్లో హైడ్రోగ్రాఫిక్ సర్వేలు నిర్వహించడానికి ఈ నౌక సాయపడుతుంది. రక్షణ, పౌర అవసరాల కోసం సముద్ర గర్భ డేటాను సేకరించడానికి ఇది తోడ్పడుతుంది. దీని పొడవు 110 మీటర్లు. 2023 జూన్ 13వ తేదీన తొలిసారిగా జలప్రవేశం చేసింది. విపత్కర పరిస్థితుల్లో సహాయ చర్యలకు, మానవీయ సాయం పంపిణీ, రక్షణ చర్యలు చేపట్టేందుకు వీలుగా సంశోధక్‌ను నిర్మించారు.ఐఎన్ఎస్ అగ్రయ్:ఇది అర్నాల తరగతికి చెందిన జలాంతర్గామి విధ్వంసక నౌక. తీరప్రాంత జలాల్లో శత్రు దేశాల జలాంతర్గాములను గుర్తించి, నాశనం చేయగలదు. తేలికపాటి టార్పెడోలు, స్వదేశీ రాకెట్ లాంచర్లు, అత్యాధునిక సోనార్ వ్యవస్థలు ఇందులో ఉన్నాయి. 77.6 మీటర్ల పొడవు ఉంటుంది. -
యోగాతో ప్రపంచ శాంతి
కోల్‌కతా: వ్యక్తిగత ఆరోగ్యాన్ని పెంపొందించడమే కాకుండా, ప్రపంచ శాంతికి బాటలు వేయడంలో యోగా ఒక గొప్ప ఉత్ప్రేరకంగా పని చేయగలదని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. సమాజంలో సామూహిక శాంతి, ప్రజల మధ్య సామరస్యాన్ని పెంపొందించే లక్షణం యోగాలో ఉందని వివరించారు. పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలోని రెడ్ రోడ్లో ఆదివారం నిర్వహించిన 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. సమతుల్య వ్యక్తిగత జీవనశైలికి యోగా అవసరమని అన్నారు. అన్ని వయసుల వారు ఈ సంప్రదాయాన్ని ఆచరించవచ్చని సూచించారు. పని, పోషణ, నిద్రలతో కూడిన సమతుల్య జీవనశైలే దుఃఖాన్ని నిర్మూలించడానికి కీలకమని, ఇందుకు యోగా తోడ్పడుతుందని వెల్లడించారు. చాలామంది తమ ఆధునిక జీవనశైలిలో సమతుల్యతను కాపాడుకోవడానికి ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. సమతుల్యమైన రీతిలో జీవించే విధానాన్ని యోగా మనకు నేర్పుతుందని, ఏం చేయాలి, ఏం చేయకూడదు అనే విషయాలను కూడా బోధిస్తుందని పేర్కొన్నారు. మన శరీరాన్ని సరైన స్థితిలో ఉంచుకోవడం నేర్చుకున్నప్పుడు, ఆరోగ్యం ఒక అలవాటుగా మారుతుందని వెల్లడించారు. ప్రపంచంలోనే అతిపెద్ద సామూహిక వేడుక యోగా అనేది మానసిక ఆరోగ్యం ద్వారా శారీరక దృఢత్వాన్ని సాధించడానికి మార్గం చూపుతుందని అన్నారు. యోగా అనేది వ్యక్తిగత జీవనశైలికే కాకుండా, ఈ ప్రపంచం మెరుగైన భవిష్యత్తుకు ఎంతో అవసరమని స్పష్టంచేశారు. సమతుల్యత, ఆత్మజ్ఞానం, అంతర్గత స్థిరత్వాన్ని యోగా పెంపొందిస్తుందని.. ఈ విలువలు సమాజంలో విభజనలు, సంఘర్షణను అంతం చేస్తాయని వ్యాఖ్యానించారు. యోగాను కేవలం ఒక నిర్దిష్ట రోజుకు లేదా ఒక కార్యక్రమానికి మాత్రమే పరిమితం చేయకూడదని ప్రతిజ్ఞ చేద్దామని ప్రజలకు పిలుపునిచ్చారు. యోగాను మన జీవితాల్లో, భావి తరాల జీవితాల్లోనూ ఒక భాగంగా చేసుకోవాలని తేల్చిచెప్పారు. వివిధ దేశాలు, సంస్కృతులకు చెందిన ప్రజలను ఏకం చేస్తూ, యోగా నేడు ప్రపంచంలోనే అతిపెద్ద సామూహిక వేడుకగా మారిందని మోదీ హర్షం వ్యక్తంచేశారు. భూమిపై అత్యంత సుదీర్ఘమైన రోజుగా నిలిచే జూన్ 21వ తేదీ ఇప్పుడు యోగా కారణంగా అతిపెద్ద సామూహిక వేడుకల దినంగా మారిందని పేర్కొన్నారు. వేలాది మందితో కలిసి యోగాసనాలు కోల్‌కతాలో 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ప్రధాని మోదీ వేలాది మందితో కలిసి యోగాసనాలు వేశారు. తెల్ల రంగు టీ–షర్టు, ప్యాంట్ ధరించిన మోదీ ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అలాగే అభ్యాసకుల యోగాసనాలను నిశితంగా గమనించారు. కొన్ని సూచనలు జారీ చేశారు. ఈ వేడుకల్లో వృద్ధులు, చిన్నారులు సహా అన్ని వయసుల వారు పాల్గొన్నారు.టోక్యో నుంచి న్యూయార్క్ దాకా.. వాషింగ్టన్: అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రపంచవ్యాప్తంగా ఆదివారం నిర్వహించిన కార్యక్రమాల్లో ఔత్సాహికులు పెద్ద సంఖ్యలో పాల్గొని, యోగాసనాలు వేశారు. ఆరోగ్యం, సమతుల్యత, శ్రేయస్సుకు యోగా ఒక చక్కని మార్గమని వీరంతా చాటారు. జపాన్ రాజధాని టోక్యోలోని చారిత్రక ఆలయాల దగ్గర్నుంచి న్యూయార్క్‌లోని ప్రఖ్యాత టైమ్స్ స్క్వేర్ వరకు ఇందుకు వేదికలుగా మారాయి. ఈ ఏడాది ఆరోగ్యకరమైన వృద్ధాప్యం ఇతివృతంతో కార్యక్రమాలు జరుగుతున్నాయి. చైనాలోని షాంఘై నగరంలో భారత కాన్సులేట్ జనరల్ కార్యాలయం చేపట్టిన కార్యక్రమానికి 400 మంది హాజరయ్యారు. ఆ్రస్టేలియాలోని కాన్బెర్రాలోగల ఓల్డ్ పార్లమెంట్ హౌస్ భారత హైకమిషన్ చేపట్టిన కార్యక్రమం యోగా ఆ్రస్టేలియా సీఈవో జోష్ ప్రియోర్ నేతృత్వం వహించారు. అమెరికాలోని న్యూయార్క్లోగల టైమ్స్ స్క్వేర్‌లో పెద్ద ఎత్తున జరిగిన యోగా ఉత్సవాలకు భారత కాన్సులేట్ జనరల్ నాయకత్వం వహించారు. ఇంకా, బంగ్లాదేశ్ రాజధాని ఢాకా, న్యూజిలాండ్ లోని వెల్లింగ్టన్, ఫిన్లాండ్ రాజధాని హెల్సింకి, జర్మనీ రాజధాని బెర్లిన్, యూకే రాజధాని లండన్, మలేసియా రాజధాని కౌలాలంపూర్, తుర్కియేలోని అంకారా, సౌదీ అరేబియాలోని రియద్, స్పెయిన్‌లోని బార్సిలోనా, కెనడాలోని టొరంటోతోపాటు అనేక దేశాల్లోనూ కార్యక్రమాలు జరిగాయి. అమెరికాలోని వాషింగ్టన్లోగల లింకన్ మెమోరియల్‌లో భారత ఎంబసీ నిర్వహించిన జరిగిన కార్యక్రమానికి వందలాదిగా హాజరయ్యారు. -
45 నిమిషాల పాటు ఎయిర్‌పోర్టులోనే ప్రధాని మోదీ
ఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీ విమానాశ్రయంలోనే 45 నిమిషాల పాటు ఉండిపోయారు. నీట్-యూజీ (NEET-UG) రీ-ఎగ్జామ్ హాజరయ్యే విద్యార్థులు తమ పరీక్షా కేంద్రాలకు వెళ్లేటప్పుడు ఎలాంటి ఇబ్బందులు పడకుండా.. ట్రాఫిక్ సాఫీగా సాగేలా చూడటం కోసం ప్రధాని.. ఢిల్లీ విమానాశ్రయంలోనే కాసేపు వేచి ఉన్నారు.పరీక్షా కేంద్రాలకు వెళ్లే విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యం కలగకూడదనే ఉద్దేశంతో ప్రధాని మోదీ తన తిరుగు ప్రయాణాన్ని కాస్త ఆలస్యం చేసుకున్నారు. అధికారిక సమాచారం ప్రకారం.. ప్రధాని మధ్యాహ్నం 1:15 గంటల ప్రాంతంలో ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకున్నారు.నీట్ (NEET) పరీక్ష మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభం కావాల్సి ఉండటంతో ఆయన విమానాశ్రయం నుండి వెంటనే తన నివాసానికి బయలుదేరడానికి బదులుగా.. అక్కడే వేచి ఉండాలని నిర్ణయించుకున్నారు. విమానాశ్రయం నుండి ప్రధాని కాన్వాయ్ వెళ్లే సమయంలో ట్రాఫిక్ నిలిపివేస్తారు. దీంతో రోడ్లపై ట్రాఫిక్ జామ్‌తో విద్యార్థులు పరీక్షకు ఆలస్యం కాకూడదని.. పరీక్షా ప్రారంభమైన తర్వాత ప్రధాని మోదీ ఎయిర్ పోర్టు నుంచి బయటకు వెళ్లారు.దేశంలో వైద్యవిద్య ప్రవేశాల భవిష్యత్‌ను నిర్ణయించే నీట్–యూజీ 2026 రీ ఎగ్జామ్ ఇవాళ (ఆదివారం) ప్రారంభమైంది. గత నెల 3వ తేదీన నిర్వహించిన పరీక్ష.. పేపర్ లీక్, అక్రమాల ఆరోపణల నేపథ్యంలో రద్దు కావడంతో దాదాపు 23 లక్షల మంది విద్యార్థులు మరోసారి పరీక్ష రాయాల్సిన పరిస్థితి ఏర్పడింది.కేంద్ర ప్రభుత్వం ఆమోదంతో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) నేడు నీట్ రీఎగ్జామ్ నిర్వహిస్తోంది. తెలంగాణలో సుమారు 73 వేల మంది అభ్యర్థులు పరీక్షకు హాజరుకానున్నారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5.15 గంటల వరకు పెన్–పేపర్ విధానంలో పరీక్ష నిర్వహించనున్నారు. దేశంలోని 551 నగరాల్లోని 5,440 కేంద్రాలతోపాటు విదేశాల్లోని 14 నగరాల్లో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. -
ప్రపంచాన్ని యోగా ఏకం చేసింది.. మోదీ
కోల్‌కతా: ప్రపంచం మెుత్తాన్ని యోగా ఏకం చేసిందని ప్రధాని మోదీ ఉద్ఘాటించారు. ఈరోజు (ఆదివారం) 12 వ యోగా దినోత్సవం సందర్భంగా కోల్‌కతాలో నిర్వహించిన ప్రత్యేక యోగా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. బెంగాల్లో రామకృష్ణ పరమహాంస లాంటి మహానీయులు జన్మించారన్నారు. కాగా కోల్‌కతాలోని రెడ్‌రోడ్‌లో నిర్వహించిన కార్యక్రమంలో 35 వేల మంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా కోల్‌కతాలో నిర్వహించిన బహిరంగ సభలో మోదీ మాట్లాడుతూ "యోగా దినోత్సవ కార్యక్రమాల్లో ప్రపంచవ్యాప్తంగా ప్రజలు చొరవ చూపిస్తున్నారు. ఈ రోజు భౌగోళిక సరిహద్దులను దాటి ఒక భారీ సామూహిక ఉద్యమంగా ఎదిగింది. యోగా దినోత్సవం ప్రపంచంలోనే అతిపెద్ద పండుగగా మారింది, ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నుండి ఇందుకు సంబంధించిన అద్భుతమైన దృశ్యాలు వస్తున్నాయి" అని అన్నారు.ప్రపంచంలోని పలు ప్రాంతాల్లో జూన్ 21వ తేదీకి ఒక ప్రత్యేక విశిష్టత ఉందని, ఎందుకంటే ఇది సంవత్సరంలోనే అత్యంత సుదీర్ఘమైన పగలు (Longest Day) కలిగిన రోజు అని ప్రధాని గుర్తు చేశారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం కారణంగా ఈ తేదీకి ఇప్పుడు అదనంగా మరొక ప్రపంచ గుర్తింపు లభించిందని ఆయన అన్నారు. కాగా ఈ రోజు అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. ఢిల్లీలో 40 ప్రాంతాలతో పాటు దేశవ్యాప్తంగా 100 ప్రముఖ ప్రదేశాల్లో యోగా డే వేడుకలు నిర్వహించారు. -
టూవీలర్లకు ‘ఎల్‌నినో’ బ్రేక్ ..!
న్యూఢిల్లీ: దేశీయ ద్విచక్ర వాహన రంగం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (ఎఫ్వై 2027) లో 3–5 శాతం పరిమిత హోల్‌సేల్ వృద్ధిని నమోదు చేయవచ్చని రేటింగ్స్ సంస్థ ‘ఇక్రా’ తన తాజా నివేదికలో వెల్లడించింది. ఎల్‌నినో కారణంగా రుతుపవనాలు బలహీనపడే సూచనలు, ద్రవ్యోల్బణంతో వాహనాల ధరలు పెరగడం, గత ఆర్థిక సంవత్సరాల్లో నమోదైన అత్యధిక విక్రయాల ప్రభావం (హై బేస్ ఎఫెక్ట్) వంటి అంశాలు ఈ రంగానికి సవాళ్లుగా మారొచ్చని రేటింగ్ సంస్థ అభిప్రాయపడింది. సానుకూలతలున్నా.. అంతర్జాతీయ సవాళ్లు పెరుగుతున్న దేశీయ డిమాండ్, మెరుగైన రిటైల్ విక్రయాల జోరు, నిలకడైన ఎగుమతుల మద్దతుతో ద్విచక్ర వాహన రంగం తన నిలకడైన ప్రదర్శనను చాటుకుంటోందని ఇక్రా పేర్కొంది. ‘జీఎస్టీ 2.0’ సంస్కరణలతో వాహనాలు అందుబాటు ధరల్లోకి రావడం, పాత వాహనాల స్థానంలో కొత్తవి కొనుగోలు చేసే ధోరణి మార్కెట్ వృద్ధికి సానుకూలంగా మారనున్నాయి. అయితే, పశ్చిమాసియాలో నెలకొన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు సప్లై చైన్‌ను దెబ్బతీసే అవకాశం ఉన్నందున, ఆ పరిణామాలను క్షుణ్ణంగా గమనించాల్సి ఉంటుందని తెలిపింది. మేలో విక్రయాల జోరు దేశీయ హోల్‌సేల్ విక్రయాలు 2026 మే నెలలో వార్షిక ప్రాతిపదికన 15.7 శాతం బలమైన వృద్ధితో 19 లక్షల యూనిట్లకు చేరాయని ఇక్రా నివేదిక తెలిపింది. జీఎస్టీ 2.0 సంస్కరణలు, వాహన తయారీ కంపెనీలు ధరలు పెంచుతారనే ముందస్తు అంచనాలతో వినియోగదారులు కొనుగోళ్లకు మొగ్గు చూపడం ఇందుకు కారణమైంది. ఇక రిటైల్ విక్రయాలు కూడా మే నెలలో ఏడాది ప్రాతిపదికన 7.5 శాతం వృద్ధిని నమోదు చేశాయి. పెళ్లిళ్ల సీజన్, ఎంట్రీ–లెవెల్ నుంచి ప్రీమియం శ్రేణి వరకు విభిన్న మోడళ్లు అందుబాటులో ఉండటం మార్కెట్‌కు కలిసొచ్చింది. అయితే, దేశంలో నమోదైన విపరీతమైన ఎండల కారణంగా షోరూమ్‌లకు కస్టమర్ల రాక తగ్గడం, కొన్ని మోడళ్ల సరఫరాలో అంతరాయాలు వృద్ధి వేగాన్ని కొంతమేర నియంత్రించాయి. ఈ–టూ వీలర్స్ దూకుడు ఇక్రా నివేదికలో ఎలక్ట్రిక్ వాహన విభాగ ప్రదర్శన ఆకట్టుకుంది. 2026 మే నెలలో రిటైల్ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల విక్రయాలు ఏకంగా 71.7 శాతం వార్షిక వృద్ధితో 1,72,148 యూనిట్లకు చేరాయి. మొత్తం ద్విచక్ర వాహన మార్కెట్లో ఈవీల వాటా ప్రస్తుతం 8.9 శాతానికి చేరింది. ఎలక్ట్రిక్ వాహనాలకు వినియోగదారుల నుంచి లభిస్తున్న ఆదరణకు, మారుతున్న పర్యావరణ వ్యవస్థకు ఇది నిదర్శనమని ఇక్రా స్పష్టం చేసింది. -
బెంగాల్‌కు పునర్వైభవం
తారకేశ్వర్: పశ్చిమ బెంగాల్ రాష్ట్రం అరాచక పాలన సంకెళ్లను ఛేదించుకొని బీజేపీ ప్రభుత్వ పాలనలో అభివృద్ధి దిశగా కొత్త ప్రయాణానికి శ్రీకారం చుట్టిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. ఆయన శనివారం బెంగాల్లో పర్యటించారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మోదీ ఇక్కడ అడుగుపెట్టడం ఇదే మొదటిసారి. హూగ్లీ జిల్లాలోని తారకేశ్వర్‌లో ‘పశ్చిమ్‌బంగ దివస్’వేడుకలకు హాజరై ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. అంతకుముందు పలు అభివృద్ధి ప్రాజెక్టులు ప్రారంభించి జాతికి అంకితం చేశారు. మరికొన్నింటికి శంకుస్థాపన చేశారు. బెంగాల్ గాలిలో ఇప్పుడు ఒక తాజాదనం కనిపిస్తోందని అన్నారు. బెంగాల్ వైభవం తిరిగి మొదలైనట్లు అనిపిస్తోందని వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రజల ముఖాల్లో ఒక కొత్త కాంతి దర్శనమిస్తోందని, గ్రామాల్లో ఆనందం, నమ్మకం అనే భావన వ్యక్తమవుతోందని చెప్పారు. ప్రజల ఒక్క ఓటు ఎలాంటి మార్పును తీసుకురాగలదో ఇక్కడ స్పష్టంగా కనిపిస్తోందని వెల్లడించారు. ప్రజాస్వామ్యానికి ఉన్న శక్తిని బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల తీర్పు నిరూపించిందని ఉద్ఘాటించారు. గత ప్రభుత్వాల వల్ల జరిగిన నష్టాన్ని సరిదిద్దడానికి డబుల్ ఇంజిన్ ప్రభుత్వం సూపర్‌ఫాస్ట్ స్పీడ్‌తో పని పనిచేస్తోందని మోదీ తేల్చిచెప్పారు. ఇప్పుడు మధ్యవర్తులు లేరు, అడ్డంకులు లేవు ‘‘రైల్వేలు, వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి, మత్స్య పరిశ్రమ, అనుసంధాన రంగాల్లో పలు ప్రాజెక్టులు ప్రారంభించాం. ఇవి బెంగాల్ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసి, కొత్త అవకాశాలను సృష్టిస్తాయి. బెంగాల్ తన నూతన భవిష్యత్తును నిర్మించుకుంటోంది. ఈ ప్రాజెక్టులు బెంగాల్ అభివృద్ధికి కొత్త ఊపునిస్తాయి, ఇక్కడి గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తాయి. రాజకీయ వైరం కారణంగా ఇక్కడ ఏళ్ల తరబడి అనేక సంక్షేమ పథకాలు నిలిచిపోయాయి, కొన్ని ఆలస్యమయ్యాయి. నేడు ఆ అడ్డంకులన్నింటినీ అధిగమించి, ప్రతి ప్రభుత్వ పథకం ప్రయోజనాలను నేరుగా ప్రజలకు చేరవేస్తున్నాం. ఇప్పుడు మధ్యవర్తులు లేరు, అడ్డంకులు లేవు. భారత్–బంగ్లాదేశ్ సరిహద్దుల్లో కంచె నిర్మాణానికి గత ప్రభుత్వం అడ్డంకులు సృష్టించింది. ఇప్పుడు అవన్నీ తొలగిపోయాయి. కంచె నిర్మాణానికి చర్యలు మొదలయ్యాయి’’ అని మోదీ ఉద్ఘాటించారు. అభివృద్ధికి గేటు వే తూర్పు భారత్ రాయ్‌రంగ్‌పూర్: కాంగ్రెస్ ప్రభుత్వాల పాలనలో నిర్లక్ష్యానికి గురైన తూర్పు భారతదేశం ఇప్పుడు అభివృద్ధికి ఒక ముఖద్వారంగా ఎదుగుతోందని ప్రధాని మోదీ అన్నారు. ఆయన శనివారం ఒడిశాలోని మయూర్భంజ్ జిల్లాలో పర్యటించారు. రాయ్రంగ్పూర్లో రూ.47,600 కోట్ల విలువైన ప్రాజెక్టులు ప్రారంభించారు. అనంతరం బహిరంగ సభలో మాట్లాడారు. అభివృద్ధి పథంలో ఒడిశా వేగంగా ముందుకు సాగుతోందని హర్షం వ్యక్తంచేశారు. తూర్పు భారతదేశ అభివృద్ధి ద్వారా దేశాన్ని అభివృద్ధి చేయడమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని వివరించారు. ‘పూర్వోదయ’విధానంపై ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. ఒడిశాలోని బీజేపీ ప్రభుత్వం రాష్ట్ర వనరులను అవకాశాలుగా మారుస్తోందని చెప్పారు. ఇప్పటివరకు రూ.20 లక్షల కోట్ల విలువైన పెట్టుబడి ప్రతిపాదనలు వచ్చాయని తెలిపారు. ముర్ము అత్తగారి గ్రామానికి మోదీ రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము 68వ జన్మదినాన్ని పురస్కరించుకొని మయూర్భంజ్ జిల్లాలోని ఆమె అత్తగారి గ్రామమైన పహద్పూర్ను మోదీ సందర్శించారు. ఈ గ్రామాన్ని ‘సోలార్ విలేజ్’గా అభివృద్ధి చేస్తామని ప్రకటించారు. పహద్‌పూర్ ఒక ఆదర్శవంతమైన సౌరశక్తి ఆధారిత గ్రామంగా ఎదుగుతుందని చెప్పారు. రాష్ట్రపతికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. మయూర్భంజ్ నేల నుంచి దేశ అత్యున్నత రాజ్యాంగ పదవికి ఆమె ఎదిగిన తీరు ఒడిశాకు, దేశానికి ఎంతో గర్వకారణమని పేర్కొన్నారు. సంతాలీ భాషకు ‘ఓల్ చికి’లిపిని సృష్టించిన పండిట్ రఘునాథ్ ముర్ముకు మోదీ నివాళులరి్పంచారు.కిసాన్ సమ్మాన్ నిధి విడుదల ప్రధాని మోదీ బెంగాల్ పర్యటనలో పీఎం–కిసాన్ సమ్మాన్ నిధి 23వ విడత సొమ్మును విడుదల చేశారు. దేశవ్యాప్తంగా 9.44 కోట్ల మంది రైతుల ఖాతాల్లోకి రూ.18,880 కోట్లను నేరుగా బదిలీ చేశారు. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన, అగ్రి స్టాక్, నేషనల్ మిషన్ ఆన్ నేచురల్ ఫారి్మంగ్, ప్రధానమంత్రి ధన్–ధాన్య కృషి యోజన వంటి పథకాలను మోదీ ప్రారంభించారు. -
మోదీ మొండిఘటం
వాషింగ్టన్: ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూ ముందుకు సాగే మొండిఘటం మోదీ అంటూ ప్రధానిపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రశంసల వర్షం కురిపించారు. ఫ్రాన్స్‌లో జీ7 శిఖరాగ్ర సదస్సు వేళ ప్రధాని మోదీని పొగిడిన మూడ్రోజులకే మరోసారి మోదీని ట్రంప్ పొగడటం విశేషం. శనివారం యాక్సియస్ వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మోదీ ప్రస్తావన వచ్చినప్పుడు ఆయనను ట్రంప్ కొనియాడారు. ‘‘ మోదీ ఎంతో మంచి వ్యక్తి. అది నిజం. ఎన్నో అంశాల్లో మోదీ మెరుగ్గా ఉన్నారు. యుద్ధాలను దూరంగా ఉన్నారు. అది నిజంగా తెలివైన నిర్ణయం. ఆయనకు ఏకంగా 150 కోట్ల మంది జనం అండగా ఉన్నారు. ఇన్ని కోట్ల మంది మద్దతుతో బడానేతగా ఎదిగారు. వాస్తవానికి భారత్ అతిపెద్దది. మోదీ గొప్ప నాయకుడు. భారత్‌తో మేం పెద్ద మొత్తంతో వాణిజ్యకార్యకలాపాలు కొనసాగిస్తున్నాం. గతంలో భారత్ మాతో తక్కువ వ్యాపారం చేసేది. ఇప్పుడు మరింతగా, అత్యంత పారదర్శకంగా వాణిజ్యం జరుపుతున్నాం’’ అని అన్నారు. అధికారం, మధ్యవర్తిత్వం, దౌత్యం నెరిపే ఒడుపు, సత్ఫలితాలను సాధించే సత్తా ఉన్న ఇద్దరు గొప్ప నేతల పేర్లు చెప్పండి అని యాక్సియస్ సంస్థ ప్రతినిధి అడగ్గా.. ‘‘అధికారం, అవతలి దేశాన్ని ప్రభావితంచేసే శక్తియుక్తులు, తాము అనుకున్నది రాబట్టే సత్తా విషయంలో నాకు మోదీ, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ నచ్చు తారు. వీళ్ల ఇద్దరి ఘనతను చాటేలా ఒక సినిమా తీయాలంటే మాత్రం అచ్చం వీళ్లలా వేషభాషలు, హావభావాలు పలికించే అద్భు త నటుడు హాలీవుడ్లో లేనేలేడు’’ అని ట్రంప్ వ్యాఖ్యానించారు. ‘‘మోదీ అంటే నాకెంతో గౌరవం. పైకి ఎంతో సౌమ్యంగా మాట్లాడే మోదీ నిజానికి ఎంతో ఘటికుడు. అనుకున్న ది సాధించేదిదాకా వదలరు. గతంలో ఆయ న గురించి నాకు అంతగా తెలియదు. తర్వా త తెల్సుకున్నా’’ అని అన్నారు. ‘‘భారత్‌ను దశాబ్దాలుగా గమనిస్తున్నా. అప్పట్లో భారత్ లో ప్రభుత్వాలు వెనువెంటనే మారిపోయేవి. ఆరు నెలలు, ఏడాదికే ప్రధాని మారిన సందర్భాలున్నాయి. ఇదంతా ఒక్కసారిగా మారిపోయింది. ఈ మార్పులు మోదీ చరమగీతం పాడారు. ఆయన వచ్చాక 12 ఏళ్లుగా ఆయనే పరిపాలిస్తున్నా. స్థిరమైన పాలన చూపించారు. చూడ్డానికి ఎంతో శాంతంగా కన్పిస్తారు. కానీ ఆయన దృఢమైన వ్యక్తి’’ అని ట్రంప్ వ్యాఖ్యానించారు. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిం మునీర్, పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ అంటే కూడా తనకు ఇష్టమని ట్రంప్ తెలిపారు. -
రూపాయిని ఎంతకాలం నిలబెడతారు?
‘దేశం లోపల’ మోదీకి ఇప్పుడు చాలా ‘ప్రతిష్ఠ’ ఉంది. బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం తర్వాత అది మరింతగా పెరిగింది. ఇప్పుడు అలాంటి ప్రతిష్ఠ ‘దేశం వెలుపల’ కూడా ఆయనకు కావాలి. అది రావాలి అంటే పడిపోతున్న రూపాయిని అంతకన్నా పడిపోకుండా పట్టుకోవడం, విదేశీ మారక ద్రవ్యాన్ని పెంచుకోవడం మార్గాలు. మోదీ పన్నెండేళ్ల పాలనలో రూపాయి విలువ పడిలేస్తూనే ఉంది. ఆయన మొదటిసారి ప్రధాన మంత్రి అయినప్పుడు (2014 మే నాటికి) అమెరికన్ డాలర్ 58.3 రూపాయలుగా ఉండేది. ఇప్పుడది 94.5 రూపాయల వద్ద ఉంది. రూపా యితో పోల్చుకుంటే డాలర్ 62 శాతం పెరిగింది. డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి 38 శాతం పడిపోయింది. అది ఇంకా ఇంకా పడిపోకుండా ఉండాలంటే, ‘విదేశీ మారక ద్రవ్యం’ పెరగాలి. ఆ పనిలో ఇప్పుడు భారత ప్రభుత్వమూ, రిజర్వ్ బ్యాంకూ తలమునకలై ఉన్నాయి. దానికోసం ‘ఫుల్లీ యాక్సెస్బుల్ రూట్’ అనే విధానాన్ని ప్రభుత్వం విస్తృతం చేయబోతోంది. అంటే– 15, 30, 40 ఏళ్ల ప్రభుత్వ బాండ్లను విడుదల చేయడం, విదేశీ పోర్ట్‌ఫోలియో పెట్టు బడిదారులకు ఇప్పటికి ఉన్న పరిమితులను తొలగించడం, దీర్ఘకాలిక మూలధన లాభాలపై 12.5% పన్ను మినహాయింపు ఇవ్వడం, ప్రభుత్వ బాండ్ల విక్ర యంపైన 20% పన్ను నిలిపివేయడం – ఇంకా ఇలాంటి కొన్ని సడలింపుల్ని చేయబోతోంది. ఇవన్నీ చేస్తే, అప్పుడు – ఎగుమతులు పెరగడం, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు రావడం, విదేశీ పోర్ట్‌ఫోలియో పెట్టుబడులు రావడం, ప్రవాస భారతీయుల నుంచి డబ్బు రాక పెరగడం, విదేశీ రుణాలు లేదా డిపాజిట్లు పెరగడం, దిగుమతులపై ఖర్చు తగ్గడం లాంటివి సంభవిస్తాయి. దాని ఫలితంగా ఫారెక్స్ పెరిగి, కనీసంగా 30–40 బిలియన్ డాలర్లు వస్తే, అప్పుడు రూపాయి తనకాళ్ల మీద తాను నిలబడు తుందని ప్రభుత్వ అభిప్రాయం. ఈ నెలలో, మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం చెప్పింది కూడా ఇదే. కొన్ని చోట్ల మోదీని ముద్దుగా విమర్శించినప్పటికీ ఈయన కూడా ఆ ‘తాను’లో ముక్కే. ఆయన ఆర్థిక మంత్రిగా ఉన్న 2013లో ‘టేపర్ టాంట్రం’ ఆర్థిక సంక్షోభం వచ్చినప్పుడు (అమెరికా కేంద్ర బ్యాంక్ వడ్డీ రేట్లు తగ్గించగానే, పెట్టుబడులన్నీ భారత్ వంటి దేశాలకు వచ్చి, వడ్డీ రేట్లు కొంచం పెంచగానే తిరిగి అమెరికాకు చేరినప్పుడు) రూపాయి విలువ డాలర్ ముందు 68కి పడిపోయింది. అప్పుడు తనకి ఆర్థిక సలహా దారు అయిన రఘురామ్ రాజన్ ఎలాంటి సలహాలు ఇచ్చారో, ఇప్పుడు మోదీకి కూడా అనంత నాగేశ్వరన్ అలాంటి సలహాలే ఇస్తున్నారు. ఆ సలహా పేరే ‘ఫుల్లీ యాక్సెసబుల్ రూట్.’ ఆర్థిక పరిభాషలో దీన్ని ‘హాట్ మనీ ఫ్లో’ అంటారు. అంటే – ‘స్వల్పకాలిక విదేశీ మూలధన ప్రవాహం’. విదేశీ పెట్టుబడిదారులు తమ తమ లాభాల కోసం ఒక దేశంలోకి వేగంగా తీసుకువచ్చే డబ్బు ఇది. 1950–60ల నుంచే ‘అంతర్జాతీయ ఆర్థిక రంగం’లో ఈ మాట విస్తృతంగా వాడుకలో వచ్చింది. ఇదొక ‘ప్రమాదకరమైన ఆర్థిక ధోరణి’. స్థానిక చర్యలూ తప్పనిసరి! ఇలాంటి ధోరణి వల్లనే 1997లో ఆసియాలో ఒకసారి ‘ఆర్థిక సంక్షోభం’ వచ్చింది. దీని వలన థాయ్‌లాండ్‌లో ‘తాయ్ బాత్’ విలువ కుప్పకూలింది. విదేశీ పెట్టుబడిదారులు భారీగా డబ్బు వెనక్కి తీసుకోవడం ప్రారంభించారు. ఆ ప్రభావం ఇండోనేషియా, దక్షిణ కొరియా, మలేషియా, ఫిలిప్పీన్స్ వంటి దేశాలకూ వ్యాపించింది. పెట్టుబడి దారులు లాభాలు కనిపించినంత వరకు డబ్బు పెట్టారు. ప్రమాదం ఉందని అనిపించగానే ఒకేసారి వెనక్కి తీసుకున్నారు. దీంతో స్థానిక కరెన్సీల విలు వలు ఒక్కసారిగా, 30%–80% వరకు పడి పోయాయి. అనేక కంపెనీలు, బ్యాంకులు దివాలా తీశాయి. నిరుద్యోగం, పేదరికం పెరిగాయి. ‘హాట్ మనీ త్వరగా వస్తుంది, కానీ భయం కలిగితే అంతే త్వరగా పారిపోతుంది. కాబట్టి దానిపై ఎక్కువగా ఆధారపడకూడదు’ అని, టర్కీ ఆర్థికవేత్త డానీ రాడ్రిక్ అంటారు.అంతర్జాతీయ మార్కెట్లో రూపాయి విలువ వేగంగా పడిపోకుండా ఉండాలంటే, హాట్ మనీ ఒక్క దాన్నే మార్గంగా పెట్టుకోకుండా, తయారీ రంగంలో పెట్టుబడుల్ని పెడుతూ ఎగుమతుల్ని బాగా పెంచుకోవాలనీ, ప్రజల్లో కొనుగోలు శక్తిని పెంచాలనీ, ప్రభుత్వ వ్యయం పెంచి ఉద్యోగాలు సృష్టించాలనీ, గ్రామీణాభివృద్ధి, ఉపాధి హామీ వంటి పథకాలకు ఎక్కువ నిధులు కేటాయించాలనీ ఆర్థికవేత్తలు చెబుతారు. ప్రస్తుతం మనం ‘పెట్టుబడిదారీ ప్రపంచం’లో ఉన్నాం. ‘మార్కెట్ ఎకనామీ’లో ఉన్నాం. ఇక్కడ రూపాయి పడిపోవడం, లేవడం సర్వసాధారణం. వాటిని పూర్తిగా నియంత్రించే ఆర్థిక వాతావరణం ఉండదు. రూపాయిని నిలబెట్టడానికి విదేశీ మారక ద్రవ్యాన్ని పెంచడంపైనే దృష్టి కేంద్రీకరిస్తే సరి పోదు. స్థానికంగానూ కొన్ని చర్యలు తీసుకోవాలి: ద్రవ్యోల్బణ నియంత్రణ, ప్రభుత్వ ఆర్థిక క్రమ శిక్షణ, దేశీయ పొదుపుల పెంపు, పారిశ్రామికీకరణ, ఉత్పాదకత పెంపు, దిగుమతులను తగ్గించడం, ఇంధన స్వావలంబన, అలాగే అన్నింటికన్నా, ప్రజల్లో ‘కొనుగోలు శక్తిని’ పెంచే దిశగా ప్రయాణించడం! – నన్నూరి వేణుగోపాల్ ‘ విశ్లేషకుడు -
‘హాలీవుడ్లో కూడా..’.. మోదీపై ట్రంప్ షాకింగ్ కామెంట్స్!
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అంతర్జాతీయ వేదికపై భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌లపై ప్రశంసల వర్షం కురిపించారు. 'ది యాక్సియోస్ షో' ఇంటర్వ్యూలో తాను ఎంతగానో అభిమానించే ఇద్దరు ప్రపంచ నాయకుల పేర్లను అడుగుగా, ఆయన ఏమాత్రం తడుముకోకుండా మోదీ, జిన్‌పింగ్ పేర్లను వెల్లడించారు. ఈ ఇద్దరు నేతల రాజకీయ వ్యూహాలు, వారికున్న అంతర్జాతీయ పలుకుబడిని ట్రంప్ కొనియాడారు. హాలీవుడ్ సినిమాలు తీసినా వీరిలాంటి వ్యక్తులు దొరకరంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తున్నాయి.హాలీవుడ్ సినిమాల్లో కూడా దొరకరుప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ల నాయకత్వ పటిమపై ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘పీఎం మోదీ అద్భుతమైన నాయకుడు. ప్రెసిడెంట్ షీ కూడా అంతే గొప్ప లీడర్. వీరంతా క్లాసిక్ లీడర్స్. ఒకవేళ వీరిద్దరి జీవితాలపై హాలీవుడ్లో సినిమా తీయాలనుకున్నా, వీరిలాంటి పాత్రలు పోషించే వ్యక్తులు అక్కడ కూడా దొరకరు’ అని ట్రంప్ వ్యాఖ్యానించారు. మోదీ చాలా తెలివైన వారని, అనవసరమైన యుద్ధాలకు దూరంగా ఉంటూ 150 కోట్ల జనాభా ఉన్న దేశాన్ని సమర్థవంతంగా నడిపిస్తున్నారని ప్రశంసించారు. భారత్‌తో ప్రస్తుతం అమెరికా ఎలాంటి ఇబ్బందులు లేకుండా సత్సంబంధాలతో వ్యాపారం చేస్తోందని ఆయన అన్నారు.స్థిరమైన నాయకత్వం.. 12 ఏళ్ల పాలనభారతదేశంలో గతంలో ఉన్న రాజకీయ అనిశ్చితిని, ప్రస్తుత స్థిరత్వాన్ని ట్రంప్ పోల్చి చూశారు. ‘నేను నా జీవితకాలంలో భారతదేశాన్ని గమనిస్తూనే ఉన్నాను. అక్కడ గతంలో ప్రభుత్వాలు నిరంతరం మారుతూనే ఉండేవి. ఎవరో ఒకరు రావడం, ఆరు నెలలు లేదా ఏడాదిలోనే మారిపోవడం జరిగేది. కానీ, ప్రధాని మోదీ వచ్చిన తర్వాత అంతా మారిపోయింది. ఆయన గత 12 ఏళ్లకు పైగా అత్యంత స్థిరంగా దేశాన్ని పాలిస్తున్నారు. ఎంతో ప్రశాంతంగా, నిశ్చలంగా ఉంటూనే ఆయన దేశాన్ని ముందుకు నడిపిస్తున్నారు’ అని ట్రంప్ పేర్కొన్నారు.దేవదూతలా కనిపిస్తారు కానీ చాలా కఠినంఇటీవల ఫ్రాన్స్‌లో జరిగిన జీ7 (G7) సదస్సు సందర్భంగా ప్రధాని మోదీతో జరిగిన భేటీని ట్రంప్ గుర్తు చేసుకున్నారు. మోదీ చర్చలు జరిపే విధానంపై ప్రశంసలు కురిపిస్తూ.. ‘మోదీ చాలా సీరియస్‌గా చర్చలు జరుపుతారు. ఆయనను చూస్తే చాలా ప్రశాంతంగా, ఒక దేవదూతలా కనిపిస్తారు. కానీ నిర్ణయాలు తీసుకోవడంలో, దేశ ప్రయోజనాల విషయంలో ఆయన అంతకంటే కఠినంగా వ్యవహరిస్తారు. చూడ్డానికి చాలా సౌమ్యంగా ఉంటారు. అందుకే ఆయన వ్యూహాలు ప్రత్యర్థులను ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురిచేస్తాయి’ అని ట్రంప్ అభివర్ణించారు.ఇది కూడా చదవండి: తేజ్ ప్రతాప్ యాదవ్ హత్యకు కుట్ర? -
పీఎం–వీబీఆర్‌వై కింద 70 లక్షల ఉద్యోగాలు
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్‌గార్ యోజన(పీఎం–వీబీఆర్‌వై) కింద దేశవ్యాప్తంగా ఇప్పటిదాకా 70 లక్షలకుపైగా ఉద్యోగాలను సృష్టించినట్లు ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. ఆయన శుక్రవారం 15 లక్షల మంది ఉద్యోగులు, యాజమాన్యాలకు రూ.2,400 కోట్ల విలువైన ప్రోత్సాహకాలను బదిలీ చేశారు. ప్రభుత్వం, యువత, పరిశ్రమలు కలిసి పనిచేస్తే ఉద్యోగాల కల్పన అనేక రెట్లు పెరుగుతుందని ఈ సందర్భంగా చెప్పారు. పీఎం–వీబీఆర్‌వై పథకం కింద లబి్ధదారులకు సామాజిక భద్రత లభించిందని అన్నారు. కొత్త ఉద్యోగాలను సృష్టించే సంస్థలను లేదా యజమానులను ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని తెలిపారు. ఈ పథకం తొలిసారి ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న యువతకు, పరిశ్రమలకు మధ్య వారధిగా నిలుస్తుందని వెల్లడించారు. దేశమంతటా ఉపాధి కల్పనకు మద్దతు ఇస్తున్నామని, యువతకు సాధికారత కల్పిస్తున్నామని పేర్కొన్నారు. భవిష్యత్తు కోసం మరింత బలమైన శ్రామిక శక్తిని నిర్మిస్తున్నామని ఉద్ఘాటించారు. మన యువత ఆకాంక్షలు, నైపుణ్యాలు, సామర్థ్యాలే ‘వికసిత్ భారత్’కు బాటలు వేస్తాయని వ్యాఖ్యానించారు. రాబోయే రోజుల్లో ప్రపంచ వృద్ధి, ఆవిష్కరణలను ముందుకు నడిపించడంలో భారత యువతదే కీలక పాత్ర అని అన్నారు. 21వ శతాబ్దంలో నైపుణ్యం, ఆవిష్కరణలను ప్రోత్సహించి, అత్యున్నత నాణ్యతా ప్రమాణాలను నెలకొల్పే దేశాలకే అవకాశాలు దక్కుతాయని ప్రధానమంత్రి స్పష్టంచేశారు. ఈ మూడు రంగాల్లో భారతదేశానికి తిరుగులేదన్నారు. పీఎం–వీబీఆర్‌వై పథకానికి ప్రభుత్వం రూ.99,446 కోట్లు కేటాయించింది. రెండేళ్లలో 3.5 కోట్ల ఉద్యోగాలను సృష్టించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ పథకం కింద తొలిసారిగా ఉద్యోగంలో చేరే ఉద్యోగులకు రూ.15,000 వరకు అందిస్తారు. ప్రతి కొత్త ఉద్యోగికి గాను యాజమాన్యానికి నెలకు రూ.3,000 వరకు అందజేస్తారు. కొత్త ఉద్యోగాలను సృష్టించేలా యాజమాన్యాలను ప్రోత్సహించాలన్నదే ఈ పథకం ఉద్దేశం. -
నేవీకి నూతన శక్తి
కోల్‌కతా: స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించిన మూడు కీలక నౌకలను ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం భారత నౌకా దళంలోకి లాంఛనంగా ప్రవేశపెట్టనున్నారని అధికార వర్గాలు తెలియజేశాయి. పశ్చిమ బెంగాల్‌లోని శ్యామప్రసాద్ ముఖర్జీ ఓడరేవులో ఈ కార్యక్రమం జరుగుతుందని శుక్రవారం ఒక ప్రకటనలో వెల్లడించాయి. సముద్ర పోరాటం, హైడ్రోగ్రాఫిక్ సర్వే, జలాంతర్గామి వ్యతిరేక యుద్ధం వంటి కార్యాచరణల కోసం ఈ నౌకలను నిర్మించినట్లు తెలిపాయి. ఈ మూడు నౌకలకు దునగిరి, సంశోధక్, అగ్రయ్ అని పేరుపెట్టారు. భారత నావికాదళానికి చెందిన వార్íÙప్ డిజైన్ బ్యూరో వీటిని డిజైన్ చేసింది. కోల్‌కతాలోని రక్షణ రంగ సంస్థ గార్డెన్ రీచ్ షిప్‌బిల్డర్స్, ఇంజనీర్స్(జీఆర్ఎస్ఈ) లిమిటెడ్ నిర్మించింది. దునగిరి నౌకలో అత్యాధునిక ఆయుధాలు, సెన్సార్లు అమర్చారు. ఇందులో బ్రిహ్మోస్ క్షిపణులు కూడా ఉన్నాయి. ఈ నౌకతో భారత నౌకాదళం పోరాట సామర్థ్యం గణనీయంగా పెరుగుతుందని అంటున్నారు. సంశోధక్ అనే సర్వే నౌకను తీరప్రాంత, లోతైన నీటి హైడ్రోగ్రాఫిక్ సర్వేల కోసం, సముద్ర శాస్త్ర, భూ¿ౌతిక డేటాను సేకరించడానికి రూపొందించారు. ఇక అగ్రయ్ అనేది అర్నాల తరగతికి చెందిన ఒక జలాంతర్గామి వ్యతిరేక యుద్ధ నౌక. తీరప్రాంత జలాల్లో నీటి అడుగున ఉన్న ముప్పును గుర్తించి, ఎదుర్కోవడానికి తేలికపాటి టార్పెడోలు, స్వదేశీ రాకెట్ లాంచర్లు, జల సోనార్ వ్యవస్థలు అమర్చారు. ఈ మూడు నౌకల్లో 75 శాతానికి పైగా స్వదేశీ కంటెంట్ ఉందని, వీటి నిర్మాణంలో 200కు పైగా ఎంఎస్ఎంఈలు పాలుపంచుకున్నాయని అధికార వర్గాలు చెప్పాయి. నేడు, రేపు ఒడిశా, బెంగాల్లో మోదీ పర్యటన న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ శనివారం, ఆదివారం ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో పర్యటించబోతున్నారు. పలు అభివృద్ధి ప్రాజెక్టులను ఆయన ప్రారంభిస్తారు. మరికొన్నింటికి శంకుస్థాపన చేస్తారు. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద రైతుల ఖాతాల్లో 23వ విడత నిధులు జమచేస్తారు. దేశవ్యాప్తంగా 9.44 కోట్లమంది బ్యాంకు ఖాతాల్లోకి 18,800 కోట్లు బదిలీ చేయబోతున్నారు. శనివారం ఒడిశా రాష్ట్రంలో మయూర్భంజ్లోని పవిత్ర క్షేత్రాలైన సంథాలి జహెరా, హో జహెరాలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో కలిసి ప్రార్థనల్లో పాల్గొంటారు. అలాగే బెంగాల్‌లోని హూగ్లీ జిల్లాలో ‘పశ్చిమ బంగ దివస్’వేడుకలకు హాజరవుతారు. ఆదివారం ఉదయం కోల్‌కతాలో 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గొంటారు. ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. అనంతరం పలు వ్యవసాయ రంగానికి సంబంధించి ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన, నేషనల్ మిషన్ ఆన్ నేచురల్ ఫామింగ్, ప్రధానమంత్రి ధన్–ధాన్య కృషి యోజనను ప్రారంభిస్తారు. -
అమెరికా అమిత్ర వైఖరి
ఒకసారంటూ పొరపొచ్చాలు వచ్చాక ఎంత సన్నిహిత మిత్రుల మధ్యనైనా తిరిగి సాధారణ సంబంధాలు ఏర్పడటం అంత సులభం కాదు. ఫ్రాన్స్‌లో జరిగిన జీ–7 దేశాల శిఖరాగ్ర సదస్సు సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మధ్య బుధవారం జరిగిన ద్వైపాక్షిక సమావేశం తీరుతెన్నులు గమనిస్తే ఈ సంగతి సులభంగా అర్థమవుతుంది. ట్రంప్ గత 16 నెలలుగా అనుసరిస్తున్న అమిత్ర వైఖరి ఇందుకు కారణం. మిత్ర దేశాలని లేదు, ప్రత్యర్థి దేశాలని లేదు – అందరినీ ఒకే గాటన కడుతూ, ఒక దేశాధినేతకు ఉండాల్సిన కనీస ఔచిత్యాన్ని మరిచి ఇష్టానుసారం మాట్లా డటం ఆయనకు అలవాటుగా మారింది. అంతేకాదు – ఎడాపెడా అధిక సుంకాలు విధించటం, తమ సరుకుపై సుంకాలు తగ్గించాలని కోరడం వంటివి మన దేశాన్ని చీకాకు పరి చాయి. ఇలాంటì చేదు అనుభవాలు ఎన్ని ఎదురైనా మన దేశం సంయమనం పాటించింది. నిజానికి మొన్న భారత నావికులు ముగ్గుర్ని హార్మూజ్ జలసంధి వద్ద హత్య చేసిన ఉదంతంతోసహా ఈ 16 నెలల పొడవునా మన దేశం పరుషంగా మాట్లాడింది ఎప్పుడూ లేదు. నోబెల్ శాంతి బహుమతి యావలో భారత్–పాక్ యుద్ధాన్ని తానే ఆపాననీ, ఇద్ద రినీ తీవ్రంగా బెదిరించాననీ మాట్లాడినప్పుడు అందులో ఏమాత్రం నిజం లేదని మన దేశం చెప్పింది. ఆయన ఇలా డప్పుకొట్టుకుంటున్నప్పుడల్లా మొదట్లో ఖండిస్తూనేవచ్చింది. కానీ దీన్ని ఆయన ఒక అలవాటుగా మార్చుకున్నారని తేలాక మిన్నకుండి పోయింది. అయినా ట్రంప్‌లో ఆగ్రహావేశాలు తగ్గలేదని తాజా సమావేశం రుజువు చేసింది. మాటలకేం... ట్రంప్ చాలా మాట్లాడారు. 55 నిమిషాలపాటు సాగిన ఈ సమావేశం అనంతరం ‘మోదీ మంచిగా కనబడతారు. బాగుంటారు. దేవదూత. కానీ ‘కిల్లర్’. వాణిజ్య, వ్యాపార చర్చల్లో చాలా కఠినంగా, నిక్కచ్చిగా ఉంటారు’ అంటూ ప్రశంసలతో ముంచెత్తారు. మోదీ ప్రధానిగా ఉన్నంతకాలం ఎవరైనా భారత్‌వైపు కన్నెత్తి చూస్తే వాళ్ల అంతు చూస్తామని కూడా చెప్పారు. వాణిజ్య ఒప్పందం విషయంలో చాలా దగ్గరగా వచ్చేశామని కూడా అన్నారు. కానీ చేతలు చూస్తే అందుకు అనుగుణంగా లేవు. తన ఆధ్వర్యంలోని కమాండ్లలో ఒకటైన ఇండో–పసిఫిక్ కమాండ్‌కు ఆ పేరు పెట్టింది ఆయన ఏలుబడిలోని అమెరికాయే. తిరిగి ఆయనే ఎనిమిదేళ్లనాటి ఆ పేరులో భారత్నుసూచించే ‘ఇండో’ తొలగించి ఇప్పుడు యూఎస్–పసిఫిక్ కమాండ్‌గా మార్చటం, అది కూడా ఈ సమావేశానికి కొంచెం ముందుగా చేయటం యాదృచ్ఛికమేమీ కాదు. ఇటీవల యూఎస్–పసిఫిక్ కమాండ్‌లో పాక్ ఆక్రమిత కశ్మీర్(పీఓకే)ను పాకిస్తాన్లో అంతర్భాగంగా చూపటంలోనూ అమెరికా దురుద్దేశం స్పష్టమే. పాకిస్తాన్ పాలకులతో ట్రంప్‌కి ఏర్పడిన కొత్త చుట్టరికం అందరికీ తెలుసు. తూర్పు, దక్షిణ చైనా సముద్ర ప్రాంతాల్లో చైనా దూకుడునూ, ఆధిపత్య ధోరణుల్నీ ఎదుర్కొనటానికి ఆ దేశంతో సమస్యలున్న భారత్‌ను కలుపుకోవాలని నిర్ణయించి 2007లో క్వాడ్‌కు అంకురార్పణ చేసింది అమెరికాయే. హిందూ మహా సముద్రప్రాంతంలో చైనా విస్తరణవాద వైఖరిని ఎదుర్కొనటానికి క్వాడ్, దాంతోపాటు ఇండో– పసిఫిక్ కమాండ్ తోడ్పడతాయని కూడా అప్పట్లో తెలిపింది. కానీ స్వప్రయోజనాలే తప్ప మరేమీ పట్టని అమెరికాను నమ్ముకుని ముందడుగు వేయొద్దని అనేకమంది నిపుణులు అప్పట్లోనే మన దేశాన్ని హెచ్చరించారు. ఇవాళ చైనాతో అంటకాగటానికి రెడీ అయి, ఆ కమాండ్ పేరే మార్చిన అమెరికా కీలక సమయాల్లో ఎలా ఉండగలదో సులభంగానే ఊహించుకోవచ్చు. ట్రంప్ రెండోసారి అధ్యక్ష పీఠం ఎక్కిన వెంటనే అందరికన్నా ముందు ఆయనతో వాణిజ్య ఒప్పందంపై చర్చించింది మనమే అయినా... మన తర్వాత వచ్చిన దేశాలు ఇప్పటికే ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. మనం కూడా బ్రిటన్, యూరోపియన్ యూని యన్ (ఈయూ), కెనడాలతో వాణిజ్య ఒప్పందాలు ఖరారు చేసుకోగలిగాం. వీటిపైలాంఛనంగా సంతకాలు చేయటమే మిగిలివుంది. మనకి నచ్చని అంశాలున్నప్పుడూ, అన్యాయమైన షరతులు పెడుతున్నప్పుడూ వ్యతిరేకించటం, కొంత జాప్యం జరిగినా ఈ విషయంలో మన ప్రయోజనాల పరిరక్షణకే ప్రాముఖ్యతనివ్వటం సరైన వైఖరి. ఉత్త మాటలతో ఎవరినీ నమ్మించలేమని ట్రంప్ గ్రహించేలా చేయటం అవసరం. -
యుద్ధం మొదలవుతుంది..!చైనా వాడు పాకిస్థాన్ ను కుక్కలా పెంచుకుంటున్నాడు..!
-
NEET రూ. కోటి ఇవ్వండి : ప్రధానికి సీజేపీ అభిజీత్ బహిరంగ లేఖ
నీట్ (NEET) పేపర్ లీక్ వివాదంలో కాక్రోచ్ జనతా పార్టీ (CJP) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఒక బహిరంగ లేఖ రాశారు. ఆత్మహత్యలకు పాల్పడిన నీట్ బాధితుల కుటుంబాలకు కోటి రూపాయలు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. నీట్ అవకతవకలకు బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్‌తో శాంతియుత ఉద్యమాన్ని సాగిస్తున్న అభిజీత్ తన తాజా డిమాండ్‌తో ఒక లేఖను ఎక్స్‌లో పోస్ట్ చేశారు. నీట్ (NEET) 2026 పరీక్షా పేపర్ లీక్ వివాదం, పరీక్ష రద్దు మరియు రీ-టెస్ట్ నిర్ణయాల వల్ల కలిగిన తీవ్ర మానసిక ఒత్తిడి, నిరాశ కారణంగా దేశవ్యాప్తంగా పదుల సంఖ్యలో విద్యార్థులు ఆత్మహత్య చేసుకుని మరణించారు. ఈ నేపథ్యంలో గత కొన్ని వారాలుగా 11 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారని, అందులో ఐదు మరణాలు గత 48 గంటల్లోనే సంభవించాయని దీప్కే లేఖలో పేర్కొన్నారు. వరుసగా జరుగుతున్న పేపర్ లీకేజీ సంఘటనలు, రీ-టెస్ట్ ఒత్తిడికి తట్టుకోలేక తీవ్ర మనస్తాపంతో ఉసురు తీసుకుంటున్నవిద్యార్థల కుటుంబాలలో తీవ్ర మానసిక ఆందోళనను రేకెత్తిస్తోందని వాదించారు. ఈ ఒత్తిడి యువతపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ ఘోరమైన ధోరణి తగ్గకపోగా, మరింత తీవ్రమవుతోంది. గత రెండు నెలల్లో, ఆత్మహత్యలకు పాల్పడిన పలువురు విద్యార్థుల శోకతప్త కుటుంబాలను తాను వ్యక్తిగతంగా కలుసుకున్నానంటూ అభిజీత్ దీప్కే ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంలో ప్రధాని తక్షణమే జోక్యం చేసుకోవాలని కోరారు. విద్యార్థుల మానసిక ఆరోగ్యం, భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. విద్యాపరమైన నిరాశ కారణంగా ఇకపై ఏ యువ విద్యార్థి బలికాకుండా ఉండేందుకు అవసరమైన నిర్మాణాత్మక సంస్కరణలను తీసుకు రావాలని ప్రధానికి సూచించారు.ఇదీ చదవండి: షాకింగ్ : కట్టేసి, జుట్టు కత్తిరించి, పైశాచికంగా.. వీడియో వైరల్పిల్లలను కోల్పోయిన భరించలేని మానసిక వేదనతో పాటు, ఈ కుటుంబాలు ఇప్పుడు ఆర్థికంగా కూడా భారీగా నష్టపోయాయని పేర్కొన్నారు. పిల్లల మంచి భవిష్యత్తు కోసం చాలా కుటుంబాలు పెద్ద మొత్తంలో విద్యా రుణాలు తీసుకున్నాయని, అయితే విద్యావ్యవస్థలోని లోపాలతో వారి ఆశలు ఆడియాలయ్యాయని చెప్పారు.ఇదీ చదవండి: అచ్చం ఖడ్గం సినిమాలోలా : విద్యావ్యవస్థపై వ్యాపారవేత్త సెటైర్లుOpen Letter to PM:We urge PM @narendramodi to provide ₹1 crore in compensation to the families of students who died by suicide due to the paper leak crisis. pic.twitter.com/p6gOuNRvsT— Abhijeet Dipke (@abhijeet_dipke) June 19, 2026అభిజీత్ దీప్కే డిమాండ్స్తమ జీవితకాల పొదుపు మొత్తాన్ని పెట్టుబడిగా పెట్టి, విద్యా రుణాలు తీసుకున్న బాధిత కుటుంబాలకు రూ. 1 కోటి చొప్పున ఆర్థిక సహాయం అందించాలి.పరీక్షల నిర్వహణలో వైఫల్యాలకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకుని జవాబుదారీలను చేయాలి.విద్యావ్యవస్థలో జరుగుతున్న వరుస లోపాలు, పేపర్ లీకేజీల వల్ల ప్రజల్లో నమ్మకం పోయిందని పేర్కొంటూ, విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి. జంతర్ మంతర్ వద్ద జూన్ 21 నిరసనమరో వైపు తమ డిమాండ్లను నెరవేర్చాలని , పోటీ పరీక్షలపై మళ్లీ నమ్మకాన్ని పునరుద్ధరించేలా సంస్కరణలు తీసుకురావాలని కోరుతూ ఇప్పటికే ఢిల్లీలోని జంతర్‌మంతర్ సహా, దేశంలో అనేక ప్రధాన నగరాల్లో ఉద్యమాన్ని చేపట్టింది సీజేపీ ఆధ్వర్యంలో మరింత ఒత్తిడి తెచ్చేందుకు జూన్ 20 నుండి దేశవ్యాప్తంగా ఉన్న విద్యార్థులు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద గుమిగూడనున్నట్లు దీప్కే ప్రకటించారు. కాగా, నీట్ యూజీ (NEET UG 2026) రీ-ఎగ్జామినేషన్ జూన్ 21న దేశవ్యాప్తంగా కేటాయించిన పరీక్షా కేంద్రాలలో జరగాల్సి ఉంది.ఇదీ చదవండి: 60 ఏళ్లకి లవ్, 75 రోజులకే పెళ్లి : నటి లవ్ స్టోరీ -
రేవంత్‌కు డబుల్ ట్రబుల్?
తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీలు రాజకీయ క్రీడలో పోటీ పడుతున్నాయి. రాజకీయాలు ప్రజలకు ఉపయోగపడేలా ఉంటే ఫర్వాలేదు కాని, అవి నష్టం చేసేలా ఉంటే మాత్రం చాలా ప్రమాదకర క్రీడ అవుతుంది. ప్రస్తుతం తెలంగాణలో అలాంటి అపాయం సంభవిస్తుందేమో అన్న అనుమానం వస్తోంది. హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టు కొత్త సంక్షోభంలోకి వెళుతున్న తీరు ఆందోళన కలిగిస్తుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపిస్తున్నట్లు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సంకట పరిస్థితిని సృష్టిస్తున్నదా? లేక ఆయన అనుభవరాహిత్యం కారణమా? అన్న చర్చ ఇప్పుడు సాగుతోంది.మెట్రో రైలు ప్రాజెక్టును ఎల్ అండ్ టీ నుంచి స్వాధీనం చేసుకున్నట్లు కొంతకాలం క్రితం తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. అందుకు గాను ఆ కంపెనీకి సుమారు 1400 కోట్లు ముట్టచెప్పడానికి, 13600 కోట్ల రుణాన్ని భరించడానికి ఒప్పందం అయినట్లు కూడా వెల్లడించారు. అంతా సజావుగా జరిగితే ప్రభుత్వానికి కొంత భారం అయినా, రేవంత్ సర్కార్‌కు ప్రతిష్ట వచ్చేది. ప్రభుత్వం కోరినట్లు 13600 కోట్ల మొత్తాన్ని రుణంగా ఇచ్చేందుకు భారత రైల్వే ఆర్థిక సంస్థ(ఐఆర్ఎఫ్సీ) అంగీకరించింది. దీంతో అంతా హాపీస్ అనుకుంటున్న వేళ ఆ సంస్థ వెనక్కి తగ్గడం రేవంత్ ప్రభుత్వానికి పెద్ద గండంగా మారింది. మెట్రో రెండోదశ నిర్మాణానికి సుమారు నలభై వేల కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేస్తూ డీపీఆర్‌ను కేంద్రానికి రాష్ట్రం పంపించింది. దీనికి కూడా ఆమోద ముద్ర పడలేదన్నది రేవంత్ ఆరోపణ.రుణం మంజూరు ఆగిపోవడం కాని, రెండో దశ నిలిచిపోవడానికి బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కారణమని, ఆయన వెనుక బీఆర్ఎస్ నేత కేటీఆర్ ఉన్నారని రేవంత్ ఆరోపించారు. దీనిని కిషన్ రెడ్డి తోసిపుచ్చినా, సహజంగానే కేంద్రంపైన సందేహాలు వస్తాయి. అందులోనూ కేంద్రంలోని మోదీ ప్రభుత్వం విపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల ప్రభుత్వాలను ఇబ్బందులకు గురి చేయడానికి వెనుకాడటం లేదన్న విమర్శ ఉంది. నిజంగానే రేవంత్ చెప్పినట్లు కేంద్రం కనుక మెట్రో రైల్ ప్రాజెక్టు విషయంలో ఇలాగే వ్యవహరించి ఉంటే వచ్చే ఎన్నికలలో బీజేపీకి చేటు అవుతుంది. అయితే రేవంత్‌వి తప్పుడు ఆరోపణలు అని బీజేపీ తిప్పికొడుతోంది. కాని నిర్దిష్టమైన సమాధానాలు ఇచ్చినట్లు కనిపించలేదు.బీజేపీ రాజకీయం ఇలా ఉంటుందని రేవంత్ సర్కార్ ఆలోచించలేక పోయిందా? ఇక్కడే ఆయన అనుభవ రాహిత్యం కనిపిస్తోందా? సాధారణంగా కేంద్రంలో అధికారంలో ఉన్న రాజకీయ పార్టీలు ఇలాంటి గేమ్ ఆడుతూనే ఉంటాయి. అలాగే ప్రతిదానికి కేంద్రంపై నెపం నెట్టి రాష్ట్రంలోని అధికార పార్టీ తనవంతు రాజకీయం తాను ఆడుతుంది. ఈ గేమ్ ప్రమాదకరంగా మారనంతవరకు ఫర్వాలేదు. కాని ఇప్పుడు మెట్రో రైల్ ప్రాజెక్టు భవిష్యత్తు సంకటస్థితిలో పడుతోంది. ఆ ప్రాజెక్టుకు ఏడాదికి 400 కోట్ల నుంచి 500 కోట్ల వరకు నష్టం వస్తోంది. ఈ ప్రాజెక్టుకు సుమారు 30వేల కోట్ల వరకు ఆస్తులు ఉన్నాయని ప్రభుత్వం చెబుతోంది. అది కరెక్టు అయితే ఎల్ అండ్ టీ ఎందుకు 15వేల కోట్లకే అంగీకరించిందన్న ప్రశ్నను బీఆర్ఎస్ నేతలు వేస్తున్నారు. అంటే ఈ కంపెనీకి ఉన్న ఆస్తులపై రేవంత్ టీమ్ కన్నేసిందని ఆ నేతలు ఆరోపిస్తున్నారు.ఐఆర్టీసీ నుంచి తక్కువ వడ్డీకి రుణం వస్తుందని, అందువల్ల మెట్రోని లాభాల పట్టించవచ్చన్న ఆశ రాష్ట్రానికి ఉన్నా, ఇప్పుడు పరిస్థితి ఎదురు తిరిగింది. కేంద్ర మంత్రులు మనోహర్ లాల్ ఖట్టర్, అశ్వని వైభవ్, కిషన్ రెడ్డిలు కూడబలుక్కుని రుణం ఆపారా? లేక ఆదాయంలో రుణ వాయిదా చెల్లించాలన్న కండిషన్ కారణంతో రుణం ఆగిందా అన్నది చర్చగా ఉంది. ఆర్బీఐ కూడా ఈ రుణం మంజూరుకు ఓకే చేసిన తర్వాత కేంద్రం అడ్డు పడడం కుదురుతుందా? అలా ఆగిపోవడానికి కేంద్రం నుంచి లేఖ ఏదైనా వెళ్లిందా? లేక మౌఖికంగా ఆదేశాలు ఇచ్చారా అన్నదానిపై ఎవరికి వారు తోచిన విధంగా మాట్లాడుకుంటున్నారు. ఈ డీల్ పూర్తి అయితే కాంగ్రెస్‌కు, రేవంత్‌కు పేరు వస్తుందని, దానివల్ల బీజేపీకి ఏమి లాభమన్న ఆలోచన జరిగిందన్నది మరో ఆరోపణ. కాగా కేసీఆర్ టైమ్‌లో ప్లాన్ చేసిన రెండో దశను రేవంత్ రద్దు చేసి, జనం లేని ఫ్యూచర్ సిటీ నుంచి ఎయిర్ పోర్టుకు ప్లాన్ చేయడం కూడా నష్టం చేసిందా అన్నది మరో పాయింట్‌గా ఉంది.ఈ మధ్యకాలంలో ప్రధాని మోదీతో రేవంత్ మంచి సంబంధాలే కొనసాగిస్తున్నారన్న భావన ఉంది. కొద్ది రోజుల క్రితం నీతి అయోగ్ సమావేశానికి వెళ్లినప్పుడు కూడా ఆయనతో ముఖాముఖీ మాట్లాడారు. అప్పుడు ఈ మెట్రో గురించి చర్చించారా? లేదా? చర్చించినా ఈ ప్రాజెక్టుకు ఈ సమస్య ఎదురైందంటే ఏమని అర్థం అవుతుంది. రాజకీయాలలో వీటన్నిటిని ముందుగా ఊహించుకుని ఒక వ్యూహంతో వెళ్లాలి. లేకుంటే సహజంగానే ప్రజాస్వామ్య రాజకీయాలలో ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. ఉదాహరణకు ఉమ్మడి ఏపీలో కేంద్రం తమకు సహకరించడం లేదని, అనేక ప్రాజెక్టులను పెండింగులో పెడుతోందని టీడీపీ వ్యవస్థాపకుడు, అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్న ఎన్టీరామారావు విమర్శించేవారు. కేంద్రం ఒక మిధ్య అని కూడా సీరియస్ వ్యాఖ్య చేశారు. తెలంగాణకు ఆర్థికంగా రావల్సిన మొత్తాలు రావడం లేదని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పలుమార్లు విమర్శలు చేశారు. కేంద్రం తెలంగాణకు అన్యాయం చేయడం లేదని కిషన్ రెడ్డి తదితరులు వాదిస్తుంటారు.ఏపీలో జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు కేంద్రం ద్వారా ఇబ్బంది పెట్టడానికి కొందరు బీజేపీ నేతలు ప్రయత్నించేవారు. జగన్ ప్రభుత్వం 14 లక్షల కోట్ల అప్పు చేసిందంటూ గతంలో బీజేపీ అధ్యక్షురాలిగా ఉన్న పురందేశ్వరి ఒక తప్పుడు ఆరోపణతో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్‌కు అప్పట్లో వినతిపత్రం అందచేశారు. తద్వారా విపక్ష టీడీపీకి మేలు చేయడానికి ఆమె యత్నించేవారు. అంతెందుకు! ఎన్నికల సమయంలో ఏపీలో జగన్ ప్రభుత్వానికి సంబంధం లేకుండా పలువురు ఐపీఎస్, ఐఏఎస్ లను కూటమి ప్రయోజనం కోసం బీజేపీ నేతలు పోస్టు చేయించుకున్నారు. అంతేకాక ఏకంగా ఏభై లక్షల మాయ ఓట్లు అదనంగా అర్ధరాత్రి వేళ పోల్ అవడం వెనుక ఎవరు ఉన్నది అర్థం చేసుకోలేరా? దీనిపై పరకాల ప్రభాకర్ ఎన్ని విమర్శలు చేసినా నోరు తెరవడం లేదంటేనే పరిస్థితి అర్ధం చేసకోవచ్చు.ఇవన్ని ఎందుకు చెప్పవలసి వస్తున్నదంటే కేంద్రంలో ఉన్న ప్రభుత్వం తన అధికారాన్ని ప్రదర్శించడం మొదలు పెడితే రాష్ట్రాలను చాలా రకాలుగా ఇబ్బందులు పాలు చేస్తుంది. దీనికి తగినట్లు రాష్ట్రాలలోని విపక్ష ప్రభుత్వాలు జాగ్రత్తగా ఉండాలి. సోనియాగాంధీ నాయకత్వంలోని యూపీఏ ప్రభుత్వం కూడా ఇలాంటివెన్నో చేసిందన్నది సర్వవిధితమే. ఆమె తెలివి తక్కువగా సొంత పార్టీ నేతలను కూడా కష్టాల పాలు చేసి జైళ్లలో పెట్టి, చివరికి తన అధికారాన్ని పోగొట్టుకుంది. ఇప్పుడు ప్రధాని మోదీ ఆధ్వర్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం మరింత అధికంగా ఇలాంటి రాజకీయాలు చేస్తోందన్న భావన ఉంది. వీటన్నిటిని దృష్టిలో ఉంచుకుని రేవంత్ మెట్రో వ్యవహారంలో ఆచితూచి అడుగు వేయకుండా లేచిందే లేడికి పరుగు అన్నట్లు వ్యవహరించి ఇబ్బంది పడుతున్నారనిపిస్తుంది.ఏడాదికి మహా అయితే 500 కోట్ల నష్టం రావచ్చు. దానిని భరించే శక్తి ప్రభుత్వానికి ఉంటుంది. అలాకాకుండా ఏదేదో చేయాలని భావించి ఊబిలో చిక్కుకున్న తీరు ఆందోళన కలిగిస్తుంది. ఇప్పటికైనా రేవంత్ సర్కార్ కళ్లు తెరచి కొత్త ఆలోచన చేయకపోతే అది రాష్ట్రానికి నష్టం చేస్తుందని చెప్పవలసి ఉంటుంది. కాగా మరో అంశం కూడా చూడాలి. కాంగ్రెస్ ఇన్చార్జీ మీనాక్షి నటరాజన్ మధ్యప్రదేశ్‌లో రాజ్యసభకు పోటీచేస్తే ఆమెపై ఏదో కేసు ఉన్నట్లు కాంగ్రెస్ నేతలే బీజేపీవారికి ఉప్పందించినట్లు వచ్చిన సమాచారం ఆ పార్టీకి తీరని చేటు అవుతుంది. దీని వెనుక రేవంత్ హస్తం ఉందని బీఆర్ఎస్ నేత కేటీఆర్ ఆరోపించారు. అయితే ఈ విషయంలో రేవంత్.. బీజేపీపై ఘాటైన విమర్శలే చేశారు. ఓట్ చోరీతో పాటు సీట్ చోరికి బీజేపీ పాల్పడిందని ఆయన ఆరోపించారు. కాగా ఓటుకు నోటు కేసులో ఉన్నది రేవంతేనని బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు ఎద్దేవా చేశారు. మధ్యప్రదేశ్ రిటర్నింగ్ అధికారి వ్యవహరించిన తీరు కూడా ప్రజాస్వామ్యయుతంగా లేదన్నది నిజమే. మొత్తం మీద ఇలాంటి ఘటనలు చూసినప్పుడు కాంగ్రెస్‌లో అంతా సజావుగా లేదన్న సంగతి అర్థం అవుతుంది. అటు ప్రభుత్వపరంగా, ఇటు పార్టీపరంగా డిఫెన్స్‌లో పడితే అది కాంగ్రెస్‌తో పాటు రేవంత్ భవిష్యత్తు రాజకీయానికి ఇక్కట్లు తేవచ్చు.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
పెట్టుబడులతో ముందుకు రావాలి
పారిస్: భారత్‌లో వ్యాపార అభివృద్ధికి, విస్తరణకు అద్భుతమైన అవకాశాలు ఉన్నాయని, పెట్టుబడులతో రావాలని ఫ్రాన్స్ పారిశ్రామికవేత్తలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఆయన గురువారం ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో పలు అగ్రశ్రేణి కంపెనీల ముఖ్య కార్యనిర్వహణాధికారులతో(సీఈఓలు) సమావేశమయ్యారు. పెట్టుబడి అవకాశాలు, విస్తరణ ప్రణాళికలపై చర్చించారు. నౌకాయానం, సరుకు రవాణా, రైల్వేలు, నిర్మాణం, కృత్రిమ మేధ(ఏఐ) సహా పలు కీలక రంగాల్లో సహకారాన్ని బలోపేతం చేసుకోవడంపై సంప్రదింపులు జరిపారు.భారతదేశంలో ఉన్న అవకాశాలపై చర్చలు జరిపామని సీఎంఏ సంస్థ సీఓఓ రొడాల్ప్ సాదే పేర్కొన్నారు. ఓడల నిర్మాణం, ఓడల రీసైక్లింగ్, లోతైన సముద్ర ఓడరేవులు, అలాగే కంటైనర్ల నిర్మాణం గురించి కూడా మోదీతో చర్చించామని తెలిపారు. ఫ్రాన్స్, భారత్‌లు పరస్పర సహకారాన్ని కొనసాగించడంలోనూ, కొత్త భాగస్వామ్యాలను ఏర్పరచుకోవడంలోనూ గొప్ప అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నట్లు చెప్పారు. సెయింట్ గోబైన్ సంస్థ సీఈఓ బెనాయిట్ బెజిన్, అల్‌స్టామ్ సీఈఓ మార్టిన్ సియోన్, మిస్ట్రాల్ ఏఐ సహ వ్యవస్థాపకుడు, సీఈఓ ఆర్థర్ మెన్స్‌ను సైతం మోదీ కలుసుకున్నారు. అందరికీ అందుబాటులో టెక్నాలజీ సాంకేతిక పరిజ్ఞానాన్ని అందరికీ అందుబాటులోకి తీసుకురావాలని ప్రధాని మోదీ తేల్చిచెప్పారు. భారతదేశం దృష్టిలో ఏఐ అంటే ‘అందరినీ కలుపుకొని పోయేది’అని తెలిపారు. అమెరికా ఇటీవల కొన్ని కృత్రిమ మేధ(ఏఐ) నమూనాల వినియోగంపై ఆంక్షలు విధించింది. ఈ నేపథ్యంలో టెక్నాలజీ అందరికీ అందుబాటులో ఉండాలని మోదీ చెప్పడం ప్రాధాన్యం సంతరించుకుంది. గురువారం పారిస్‌లో వివాటెక్–2026 టెక్నాలజీ సదస్సులో ఆయన మాట్లాడారు. భారతదేశ సాంకేతిక సామర్థ్యాన్ని ప్రస్తావించారు. ప్రపంచవ్యాప్తంగా జరిగే డిజిటల్ లావాదేవీల్లో సగం తమ దేశంలోనే జరుగుతున్నాయని గుర్తుచేశారు. ఆర్థిక సమ్మిళితం, విద్య, టెలిమెడిసిన్, వ్యవసాయం, ఇతర రంగాల్లో సాంకేతికతను భారీ స్థాయిలో వినియోగిస్తున్నామని తెలిపారు.సాంకేతికత, నూతన ఆవిష్కరణలు అందరికీ అందుబాటు ఉండడం చాలా ముఖ్యమని ఉద్ఘాటించారు. సాంకేతికత ప్రజాస్వామీకరణతోనే పురోగతి సాధ్యపడుతుందని వివరించారు. ఈ విప్లవాత్మక మార్పుల యుగంలో టెక్నాలజీ అందరికీ ప్రయోజనం చేకూర్చాలని భారత్ విశ్వసిస్తోందని అన్నారు. ఏఐ అనేది ప్రజల జీవితాలను మెరుగుపరచాలని వ్యాఖ్యానించారు. ‘‘మా విధానం స్పష్టంగా ఉంది. మా ప్రభుత్వం సహకరిస్తుంది. పరిశ్రమలు ఆవిష్కరణలు చేస్తాయి. స్టార్టప్‌లు విప్లవాత్మక మార్పులు తీసుకువస్తాయి. ప్రపంచ భాగస్వాములు మాతో కలిసి అభివృద్ధి చెందుతారు. మనమందరం కలిసి మునుపెన్నడూ లేనంత వేగంగా ముందుకు సాగుదాం’’అని పారిశ్రామికవేత్తలకు సూచించారు. తమతో కలిసి పని చేయాలని, అందరికీ ఫలితాలను అందించాలని కోరారు. పారిస్‌లో మోదీకి ఘన స్వాగతం ఫ్రాన్స్‌లోని ఎవియన్–లెస్–బెయిన్స్‌లో జీ7 శిఖరాగ్ర సమావేశంలో పాల్గొన్న ప్రధాని మోదీ స్థానిక కాలమానం ప్రకారం బుధవారం రాజధాని పారిస్‌కు చేరుకున్నారు. పారిస్‌లోని ప్రవాస భారతీయులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ప్రపంచ పురోగతికి భారత్–ఫ్రాన్స్ భాగస్వామ్యం అత్యంత కీలకమని మోదీ ఈ సందర్భంగా చెప్పారు. భారతదేశాన్ని, ఫ్రాన్స్‌ను మరింత సన్నిహితంగా మార్చడానికి ప్రవాస భారతీయులు చేస్తున్న కృషిని చూసి తాను గర్వపడుతున్నానని స్పష్టంచేశారు. -
రేపు పీఎం–కిసాన్ నిధుల విడుదల
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 20వ తేదీన 26వ విడత పీఎం–కిసాన్ నిధులను విడుదల చేయనున్నారు. పశ్చిమ బెంగాల్‌లోని హూగ్లీ జిల్లా తారకేశ్వర్‌లో పర్యటన సందర్భంగా దేశవ్యాప్తంగా ఉన్న 9.44 కోట్ల మంది రైతుల ఖాతాల్లోకి రూ.18,880 కోట్లను జమ చేయనున్నారు. పీఎం–కిసాన్ ద్వారా పశ్చిమబెంగాల్లోని 45.35 లక్షల మంది రైతులు రూ.907 కోట్ల మేర అందుకోనున్నారని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ చెప్పారు.2019లో ఈ పథకం మొదలు కాగా ఇప్పటివరకు మొత్తం రూ.4.46 లక్షల కోట్లను రైతులకు సాగు సాయంగా విడుదల చేసినట్లు ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. పశ్చిమబెంగాల్లో పర్యటన సందర్భంగా ప్రధాని మోదీ ఫసల్ బీయో యోజన (పీఎంఎఫ్‌బీవై)ని, రాష్ట్రంలో పునర్వ్యవస్థీకరించిన వాతావరణ ఆధారిత పంటల బీమా పథకాన్ని కూడా ప్రారంభిస్తారని మంత్రి వివరించారు. -
మోదీ 'AI' మంత్రం
ఫ్రాన్స్‌లో జరుగుతున్న వివాటెక్ 2026 వేదికపై ప్రధాని నరేంద్ర మోదీ భారత్ కృత్రిమ మేధ (AI) భవిష్యత్‌పై తన విజన్‌ను వివరించారు. సాంకేతికత కొద్ది మందికే కాకుండా సమాజంలోని ప్రతి వర్గానికీ ఉపయోగపడాలన్నదే భారత లక్ష్యమని ఆయన అన్నారు.భారత్ పెవిలియన్‌లో ప్రదర్శించిన 3డీ ప్రింటెడ్ రాకెట్ ఇంజిన్, AI ఆధారిత ఆరోగ్య సేవల పరిష్కారాలు వంటి ఆవిష్కరణలను సందర్శకులు తప్పక చూడాలని సూచించారు. ముఖ్యంగా Amul రూపొందించిన ‘సార్లాబెన్’ అనే AI అసిస్టెంట్‌ను ప్రస్తావిస్తూ, ఇది మహిళా పాల ఉత్పత్తిదారులకు రోజువారీ పనుల్లో సహాయపడుతోందని చెప్పారు.భారత్‌లోని స్టార్టప్ ఎకోసిస్టమ్‌తో ప్రపంచ టెక్ సంస్థలు భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చిన మోదీ, దేశ డిజిటల్ విజయాలను గుర్తు చేశారు. DigiLocker ద్వారా 70 కోట్ల మందికి పైగా సేవలు పొందుతున్నారని, UPI ప్రపంచంలోనే అతిపెద్ద డిజిటల్ చెల్లింపుల వేదికల్లో ఒకటిగా ఎదిగిందని పేర్కొన్నారు. అలాగే భారత అంతరిక్ష విజయాలు, ప్రత్యేకించి చంద్రయాన్ మిషన్ పేరును ప్రస్తావించారు. -
భారత్ జోలికొస్తే ఖబర్దార్.. ట్రంప్ బిగ్ వార్నింగ్
వాషింగ్టన్: ఫ్రాన్స్‌లో జరిగిన జీ-7 సదస్సు సందర్భంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. భారత ప్రధాని నరేంద్ర మోదీపై ప్రశంసలు కురిపిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. తన మిత్రుడు నరేంద్ర మోదీ ప్రధానమంత్రిగా ఉండగా ఎవరైనా భారత్‌పై దాడి చేయడానికి సాహసిస్తే తాము వెంటనే రంగలోకి దిగి వారి అంతు చూస్తామని ట్రంప్ హెచ్చరించారు. భారత్‌కు అండగా ఉంటామని కీలక హామీ ప్రకటించారు. మోదీ పదవిలో ఉండగా భారత్ వైపు కన్నెత్తి చూడొద్దని ముష్కరులను హెచ్చరించారు. భారత్‌తో తమకు అధికారికంగా రక్షణ ఒప్పందం లేకపోయినప్పటికీ సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటామన్నారు.ఈ సందర్బంగా ట్రంప్ మాట్లాడుతూ.. ‘భారత్, అమెరికాల మధ్య అద్భుతమైన స్నేహ సంబంధాలు ఉన్నాయి. మోదీ నాకు గొప్ప మిత్రుడు. మా మధ్య ఇంతకంటే సన్నిహిత సంబంధం ఉండడం అసాధ్యం. మోదీ ఉన్నంతకాలం భారత్‌కు నా మద్దతు ఉంటుంది. మోదీ స్థానంలో ఎవరైనా కొత్త నాయకుడు వస్తే ఆప్పుడు ఏం జరుగుతుందో నాకు తెలియదు. మోదీ నాయకత్వంలో భారతదేశం మరింతగా అభివృద్ధి చెందుతూనే ఉంటుంది. ఆయన నాయకుడిగా ఉన్నంత కాలం భారత్ అద్భుతంగా రాణిస్తుంది’ అని స్పష్టంచేశారు. ఈ వ్యాఖ్యలు భారత్-అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్యానికి బలమైన సంకేతంగా భావిస్తున్నప్పటికీ, ట్రంప్ వ్యాఖ్యల్లో మోదీ వ్యక్తిగత నాయకత్వంపై ప్రత్యేక ప్రశంసలు కనిపించడం విశేషంగా మారింది.ఇక, అంతకుముందు.. భారత ప్రధాని మోదీతో అద్భుతమైన సమావేశం జరిగిందని డొనాల్డ్ ట్రంప్ ఉద్ఘాటించారు. మోదీపై ప్రశంసల జల్లు కురిపించారు. సమీప భవిష్యత్తులో భారత్‌లో పర్యటిస్తానని చెప్పారు. ‘‘మోదీ చాలా మంచి మనిషి, సౌమ్యుడు, నెమ్మదస్తుడు అని అంటుంటారు. మోదీ అత్యంత అందమైన వ్యక్తి. చూడ్డానికి చాలా బాగుంటారు. మోదీని చూసి అందరూ ఆశ్చర్యపోతుంటారు. కానీ, నిజానికి నా దృష్టిలో ఆయన చాలా కఠినమైన వ్యక్తి, ఒక కిల్లర్. వ్యాపారం, వాణిజ్య చర్చల్లో మోదీ చాలా కఠినంగా, నిక్కచ్చిగా వ్యవహరిస్తారు. ఆయనకు భారతీయ ప్రజలంటే ఇష్టం, అలాగే అమెరికా అంటే కూడా ఇష్టమే’ అని వ్యాఖ్యానించారు. భారతదేశాన్ని ఒక ప్రధాన ప్రపంచ శక్తిగా అభివర్ణించారు. భారత్ ఒక పెద్ద పాత్రను పోషించబోతోంది’ అని అన్నారు. -
భారత నావికుల భద్రతే ముఖ్యం
ప్రపంచవ్యాప్తంగా సముద్ర వాణిజ్య మార్గాల్లో లక్షలాది మంది భారతీయ నావికులు పనిచేస్తున్నారు. అమెరికా, ఇరాన్ ఒప్పందంతో వారి భద్రతకు కచ్చితమైన హామీ లభిస్తుందని ఆశిస్తున్నా. – మోదీనా దృష్టిలో మోదీ చాలా కఠినమైన వ్యక్తి, ఒక కిల్లర్. నా మిత్రుడు మోదీ ప్రధానిగా ఉండగా ఎవరైనా భారత్‌పై దాడి చేయడానికి సాహసిస్తే వెంటనే వారి అంతు చూస్తాం. – ట్రంప్ఎవియన్–లెస్–బెయిన్స్: హార్మూజ్ జలసంధి సహా అంతర్జాతీయ సముద్ర రవాణా మార్గాల్లో భారత నావికుల భద్రతకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టంచేశారు. బుధవారం ఫ్రాన్స్‌లో జీ7 శిఖరాగ్ర సమావేశం సందర్భంగా మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా నావికుల భద్రత అంశాన్ని మోదీ ప్రస్తావించారు. పశ్చిమాసియా సంక్షోభం వల్ల ఆ ప్రాంతంలో భారత నావికులకు ఎదురవుతున్న ఇబ్బందులను ట్రంప్ దృష్టికి తీసుకెళ్లారు.వారికి భద్రత కల్పించే అంశాన్ని ఇరాన్‌తో ప్రతిపాదించిన శాంతి ఒప్పందంలో చేర్చాలని కోరారు. ఇటీవల ఒమన్ తీరంలో వాణిజ్య నౌకలపై అమెరికా సైన్యం వైమానిక దాడులకు పాల్పడడంతో ముగ్గురు భారతీయులు మరణించిన సంగతి తెలిసిందే. దీనిపై దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. అమెరికా దుశ్చర్యను ప్రజలు ముక్తకంఠంతో ఖండించారు.అమెరికా దాడుల్లో ముగ్గురు భారతీయులు మృతి చెందితే మోదీ ప్రభుత్వం సరిగ్గా స్పందించలేదన్న ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే భారత నావికుల భద్రత గురించి ట్రంప్‌తో భేటీలో మోదీ ప్రధానంగా ప్రస్తావించినట్లు తెలుస్తోంది. వారిద్దరూ భారత్, అమెరికా సంబంధాలు, ద్వైపాక్షిక అంశాలపై చర్చించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. హార్మూజ్ జలసంధిని తెరవాల్సిందే పశ్చిమాసియా సంఘర్షణను ముగించడానికి డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న కృషిని ప్రధాని మోదీ అభినందించారు. అమెరికా, ఇరాన్ మధ్య కుదిరే శాంతి ఒప్పందంలో భారత నావికుల భద్రతకు సంబంధించిన నిబంధనలు ఉంటాయని ఆశిస్తున్నట్లు చెప్పారు. హార్మూజ్ జలసంధిని తెరిచి ఉంచడం ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు అత్యంత కీలకమని స్పష్టంచేశారు. అక్కడ ఎల్లప్పుడూ స్వేచ్ఛాయుత నౌకాయానికి అనుకూల పరిస్థితులు ఉండాలని చెప్పారు.ప్రపంచవ్యాప్తంగా సముద్ర వాణిజ్య మార్గాల్లో లక్షలాది మంది భారతీయ నావికులు పనిచేస్తున్నారని, వారి భద్రత తమ అత్యంత కీలకమని వివరించారు. అమెరికా, ఇరాన్ ఒప్పందంతో వారి భద్రతకు కచ్చితమైన హామీ లభిస్తుందని ఆశిస్తున్నట్లు మోదీ తెలిపారు. వాణిజ్యం, ఇంధనం, రక్షణ, సాంకేతికత, ప్రజల మధ్య సంబంధాల వంటి అంశాల్లో ద్వైపాక్షిక సహకారం విషయంలో సాధించిన పురోగతిని తాము సమీక్షించామని వెల్లడించారు. మోదీ చాలా కఠినమైన వ్యక్తి, కిల్లర్ భారత ప్రధాని మోదీతో అద్భుతమైన సమావేశం జరిగిందని డొనాల్డ్ ట్రంప్ ఉద్ఘాటించారు. మోదీపై ప్రశంసల జల్లు కురిపించారు. సమీప భవిష్యత్తులో భారత్‌లో పర్యటిస్తానని చెప్పారు. ‘‘మోదీ చాలా మంచి మనిíÙ, సౌమ్యుడు, నెమ్మదస్తుడు అని అంటుంటారు. మోదీ అత్యంత అందమైన వ్యక్తి. చూడ్డానికి చాలా బాగుంటారు. అచ్చం దేవదూతలా కనిపిస్తారు. మోదీని చూసి అందరూ ఆశ్చర్యపోతుంటారు. కానీ, నిజానికి నా దృష్టిలో ఆయన చాలా కఠినమైన వ్యక్తి, ఒక కిల్లర్. వ్యాపారం, వాణిజ్య చర్చల్లో మోదీ చాలా కఠినంగా, నిక్కచ్చిగా వ్యవహరిస్తారు.ఆయనకు భారతీయ ప్రజలంటే ఇష్టం, అలాగే అమెరికా అంటే కూడా ఇష్టమే’’అని ట్రంప్ వ్యాఖ్యానించారు. భారతదేశాన్ని ఒక ప్రధాన ప్రపంచ శక్తిగా అభివరి్ణంచారు. ‘‘మోదీ ప్రధానమంత్రిగా ఉన్నంత కాలం ప్రతి విషయంలోనూ భారత్ కీలక పాత్ర పోషిస్తుందని నేను భావిస్తున్నా. భారత్ ఒక పెద్ద పాత్రను పోషించబోతోంది. నేను వైట్‌హౌస్‌లో ఉన్నంత కాలం అమెరికాలో భారత్‌కు ఒక మంచి మిత్రుడు(ట్రంప్) ఉంటారు. ఒమన్ తీరంలో జరిగిన దాడుల్లో ముగ్గురు భారత నావికులు మరణించిన విషయం నాకు తెలిసింది. వారికి నా సంతాపం తెలియజేస్తున్నా.అది చాలా కఠినమైన వృత్తి, అందులో ఎలాంటి సందేహం లేదు. భారత్‌తో మేము కలిసి పనిచేస్తాం. ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం విషయంలో మేము చాలా సమీపంలోకి వచ్చేశాం. ఉద్యోగాలు, ఉపాధి విషయంలోనూ రెండు దేశాలు చక్కగా సహకరించుకుంటున్నాయి’’అని ట్రంప్ వివరించారు. 2020లో భారత్‌లోని అహ్మదాబాద్‌లో తనకు లభించిన గౌరవాన్ని ఆయన గుర్తుచేసుకున్నారు. తనను చూసేందుకు భారీగా జనం తరలివచ్చారని, అది తనకు ‘గొప్ప సమయం’అని చెప్పారు.వచ్చే నెల అమల్లోకి ట్రేడ్ డీల్ మోదీ, స్టార్మర్ ప్రకటన ఎవియన్–లెస్–బెయిన్స్: భారత్, యునైటెడ్ కింగ్డమ్ (యూకే) మధ్య కుదిరిన సమగ్ర ఆర్థిక, వాణిజ్య ఒప్పందం జూలై 15వ తేదీ నుంచి అమల్లోకి వస్తుందని భారత ప్రధాని నరేంద్ర మోదీ, బ్రిటిష్ ప్రధానమంత్రి కీర్ స్టార్మర్ బుధవారం ప్రకటించారు. వారు ఫ్రాన్స్‌లో జీ7 భేటీ సందర్భంగా సమావేశమయ్యారు. రెండు దేశాల మధ్య సంబంధాలతోపాటు ఒప్పందం అమలుపై చర్చించారు. ఈ ట్రేడ్ డీల్ భారత్–యూకే సంబంధాల్లో ఒక చారిత్రాత్మక మైలురాయి అని మోదీ అభివరి్ణంచారు. ఇది వచ్చే నెల 15న అమల్లోకి రానుండటం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఈమేరకు ‘ఎక్స్’లో పోస్టుచేశారు. ఫ్రెడరిక్ మెర్జ్‌తో భేటీ ప్రధాని మోదీ జర్మన్ చాన్స్‌లర్ ఫ్రెడరిక్ మెర్జ్‌తో సమావేశమయ్యారు. వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణ రంగాల్లో ద్వైపాక్షిక సహకారాన్ని బలోపేతం చేయడంపై చర్చలు జరిపారు. పశ్చిమాసియాలోని పరిస్థితులు, రష్యా–ఉక్రెయిన్ సంఘర్షణపై కూడా ఇద్దరు నాయకులు అభిప్రాయాలను పంచుకున్నారు. భారత్, జర్మనీలు కేవలం వాణిజ్య రంగంలోనే కాకుండా, భవిష్యత్తుకు సంబంధించిన వివిధ అత్యాధునిక సాంకేతిక రంగాల్లో కూడా సన్నిహితంగా సహకరించుకుంటున్నాయని మోదీ వివరించారు. ఈ ఏడాది ఆఖరు నాటికి ఎఫ్‌టీఏపై సంతకాలు యూరోపియన్ యూనియన్ అగ్రనేత ఉర్సులా వాన్ డెర్ లేయెన్, ప్రధాని మోదీ కూడా సమావేశమయ్యారు. రక్షణ, సాంకేతిక రంగాల్లో సహకారాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని ఇరువురు నాయకులు నిర్ణయించుకున్నారు. ఈ ఏడాది ఆఖరి నాటికి భారత్, యూరోపియన్ యూనియన్లు ప్రతిష్టాత్మక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం(ఎఫ్‌టీఏ)పై సంతకం చేయనున్నాయని లేయెన్ తెలిపారు. ఎల్లప్పుడూ శాంతి పక్షాన భారత్ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో మోదీ భేటీ అయ్యారు. మానవతా విలువలకు భారత్ ప్రా ధాన్యం ఇస్తోందని మోదీ చెప్పారు. తాము శాంతి పక్షాన నిలుస్తామని స్పష్టం చేశారు. రెండు దేశాల మధ్య సహకారానికి సంబంధించిన అంశాలను తాము సమీక్షించామని పేర్కొన్నారు. -
నరేంద్ర మోదీ, డొనాల్డ్ ట్రంప్ భేటీ
పారిస్: భారత ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరు దేశాల సంబంధాలపై చర్చించారు. రక్షణ, వాణిజ్యం, పశ్చిమ ఆసియాలోని ఘర్షణపై ఇద్దరు నేతలు చర్చించినట్లు తెలుస్తోంది. సుంకాలు, వాణిజ్యం, ఇరాన్‌తో కొనసాగుతున్న ఘర్షణ కారణంగా భారత్-అమెరికా సంబంధాల్లో నెలకొన్న ఆందోళనల మధ్య ఈ భేటీ జరుగుతోంది. జీ7 సదస్సు-2026 ఫ్రాన్స్‌లోని ఎవియన్ స్పా పట్టణంలో జరుగుతోంది. ఇందులో భాగంగా మోదీ, ట్రంప్ సమావేశయ్యారు. నౌకా సిబ్బంది భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలి..ప్రపంచ సముద్ర మార్గాల్లో నౌకాయాన స్వేచ్ఛ కొనసాగడం, నౌకా సిబ్బంది భద్రతకు భరోసా ఉండడం అత్యంత ముఖ్యమని ట్రంప్‌తో ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో లక్షలాది మంది భారతీయ నౌకా సిబ్బంది సముద్ర వాణిజ్యంలో పనిచేస్తూ, అంతర్జాతీయ వాణిజ్య వ్యవస్థ నిరంతరంగా సాగేందుకు కీలక పాత్ర పోషిస్తున్నారని చెప్పారు. వారి భద్రతకు ప్రాధాన్యం ఇస్తూ, ప్రస్తుత భౌగోళిక రాజకీయ పరిణామాల మధ్య నౌకా సిబ్బంది సంక్షేమం, భద్రతకు అత్యున్నత ప్రాధాన్యం ఉండాలని మోదీ అన్నారు. ఇరాన్‌కు సంబంధించిన ప్రతిపాదిత ఒప్పందంపై ఆశాభావం వ్యక్తం చేసిన మోదీ.. నౌకా కార్మికుల భద్రతతో పాటు ప్రపంచ నౌకాయాన మార్గాల నిర్వహణకు తగిన రక్షణ లభిస్తుందనే విశ్వాసం వ్యక్తం చేశారు. మోదీ నాయకత్వం అద్భుతం“నరేంద్ర మోదీ నాయకత్వం కొనసాగినంత కాలం భారత్ ఎంతో బాగా పురోగమిస్తుంది” అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ద్వైపాక్షిక సమావేశంలో అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీని “దేవదూత”గా ట్రంప్ అభివర్ణించారు. ‘‘ప్రధాని మోదీ నాకు చిరకాల మిత్రుడు. త్వరలో భారత్-అమెరికా మధ్య ట్రేడ్ డీల్ కుదురుతుంది. బేరసారాల్లో మోదీన నిక్కచ్చిగా ఉంటారు. భారత్‌లో భారీగా పెట్టుబడులు పెడుతున్నాం. అమెరికా భారత పెట్టుబడులకు మోదీ సహకరిస్తున్నారు. భారత్‌కు ఎల్లప్పుడూ అండగా ఉంటాం’’ అని తెలిపారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ముగియాలని తాను కోరుకుంటున్నానని ట్రంప్ చెప్పారు. తాను 8 యుద్ధాలకు ఆపానంటూ మరోసారి చెప్పారు. ఇరాన్ 48 ఏళ్లుగా ప్రపంచాన్ని ఉపయోగించుకుందని ట్రంప్ వ్యాఖ్యానించారు. కాగా, జీ7 సదస్సులో యూకే, అమెరికా, ఇటలీ, జపాన్, జర్మనీ, కెనడా, ఫ్రాన్స్ దేశాల నాయకులు పాల్గొని ఉక్రెయిన్ యుద్ధం, మధ్యప్రాచ్య ఘర్షణ, ఇతర కీలక అంశాలపై చర్చించారు. జీ7 దేశాలతో పాటు భారత్, బ్రెజిల్, కెన్యా, దక్షిణ కొరియా ప్రతినిధులకు కూడా ఈ కీలక సదస్సుకు ఆహ్వానం అందింది. అమెరికా-ఇరాన్ శాంతి ఒప్పంద ప్రకటనను జీ7 దేశాలు స్వాగతించాయి. ఉత్తర కొరియా అణు కార్యక్రమంపై కూడా ఆందోళన వ్యక్తం చేశారు. -
లేట్ గా వచ్చిన లేటెస్ట్గా.. నేనే బాస్.. G7లో ట్రంప్
పారిస్ : ఫ్రాన్స్‌లో జరిగిన 52వ జీ7 శిఖరాగ్ర సమావేశంలో బుధవారం ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సమావేశానికి ఆలస్యంగా హాజరయ్యారు. ఆయన ప్రవేశిస్తుండగా సభికులు లేచి నిలబడి చప్పట్లతో ఆయనకు ఘనస్వాగతం పలికారు. దీంతో నేనే ఇక్కడ బాస్ అంటూ ఆయన సరదాగా మాట్లాడారు.అనంతరం ఆయన జీ7 ప్రత్యేక సమావేశంలో ప్రసంగించారు."మనం నిజంగా అంతర్జాతీయ ఐక్యతను బలోపేతం చేయాలనుకుంటే, ఈ సంక్షోభాల భారాన్ని అత్యంత బలహీన దేశాలు ఒంటరిగా మోయకూడదు. నేడు అనేక సమాజాలు వృద్ధాప్యం వైపు పయనిస్తుండగా, భారతదేశం మరియు గ్లోబల్ సౌత్‌లోని ఇతర దేశాలు యువ ప్రతిభ, నైపుణ్యాలతో ఉప్పొంగుతున్నాయి.అని భారత్‌ను ప్రశంసిస్తూ మాట్లాడారు.అంతకుముందు సమావేశంలో మాట్లాడిన భారత ప్రధాని 'పశ్చిమ ఆసియా సంక్షోభం కారణంగా ఇంధనం, ఎరువులు, ఆహార సరఫరా గొలుసులలో ఏర్పడిన అంతరాయాలు గ్లోబల్ సౌత్‌పై దీర్ఘకాలిక ప్రభావాన్ని చూపుతాయని మోదీ అన్నారు. కాగా జీ 7 దేశాలలో భారత్ సభ్య దేశంగా లేదు. అయినప్పటికీ ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ప్రత్యేక ఆహ్వానం మేరకు సదస్సులో పాల్గొనడానికి మోదీ ఫ్రాన్స్ వెళ్లారు.కాగా ఈ రోజు సాయంత్రం ట్రంప్‌తో, మోదీ భేటి జరగనుంది. వాణిజ్య ఒప్పందంతో సహా పలు అంశాలపై ఈ ఇద్దరు నాయకులు చర్చించే అవకాశం ఉంది. వీరు చివరిసారిగా 16 నెలల క్రితం, 2025 ఫిబ్రవరిలో వాషింగ్టన్లో సమావేశమయ్యారు. -
రీ-నీట్ రగడలో మరో రాజకీయ తుపాన్.. రాహుల్ పోరాట పిలుపు
న్యూఢిల్లీ: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ జూన్ 21న జరగనున్న నేపథ్యంలో దీనిపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించారు. కేంద్ర ప్రభుత్వం మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్‌పై జూన్ 22 వరకు తాత్కాలిక నిషేధం విధించడంపై ఆయన అభ్యంతరాలు తెలిపారు. ‘టెలిగ్రామ్ బ్యాన్’ అనేది ప్రశ్నపత్రాల లీకేజీలను ఆపేందుకు ప్రధాని మోదీ ప్రభుత్వ కొత్త ఎత్తుగడ. అంటే, దొంగను పట్టుకోవడానికి బదులు, బాధితుడి ఇంటి తలుపునకు తాళం వేయడం. లక్షలాది మంది విద్యార్థులు ఎన్నో ఏళ్లుగా టెలిగ్రామ్‌లో చదువుతున్నారు. నోట్స్, పరీక్షల సిరీస్‌లు, చర్చలు, సన్నద్ధత టెలిగ్రామ్ ద్వారానే జరుగుతోంది. ఆ సౌకర్యాన్ని లాక్కోవడం ప్రశ్నపత్రాల లీకేజీలకు ఎలా పరిష్కారం అవుతుంది?ఇది పూర్తి భద్రత ఇచ్చే మార్గం కాదు. దేశంలోని ప్రతి విద్యార్థికీ ఇది తెలుసు, ప్రశ్నపత్రాల లీకేజీ మాఫియాకూ తెలుసు. మరి తర్వాతి నిషేధం ఎవరిపై ఉంటుంది? వాట్సాప్పైనా? పరీక్ష రోజు విద్యార్థులను తనిఖీ చేస్తారు. జేబులను కత్తెరలతో కత్తిరిస్తారు. ప్రశ్నపత్రాలను వైమానిక దళం ద్వారా పంపిస్తారు. హడావుడికి మాత్రం కొదవ ఉండదు. కానీ సమస్య మూలాలపై ఒక్క చర్య కూడా ఉండదు. ఎందుకంటే ప్రశ్నపత్రాల లీకేజీ మాఫియా ఇదే ప్రభుత్వ పర్యవేక్షణలో కొనసాగుతోంది. యువతను రక్తకన్నీరు పెట్టిస్తోంది. మోదీజీ ఈ హడావుడి ఆపండి. విద్యార్థులపై కాదు, మాఫియాపై దెబ్బ కొట్టండి. ‘విద్యార్థుల ప్రతిధ్వని’ వినండి. లేకపోతే దేశ యువతకు తమ హక్కులు ఎలా సాధించుకోవాలో తెలుసు’’ అని తెలిపారు.పోరాటాన్ని ప్రారంభించబోతున్నాం..నీట్ ఒత్తిడిని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న ఉమేశ్, రియా గురించి రాహుల్ గాంధీ మరో ట్వీట్లో స్పందించారు. ‘‘నేను కోటాకు బయలుదేరాను. కానీ, నా మనసులో రెండు పేర్లు మార్మోగుతున్నాయి.. ఉమేశ్, రియా. నిన్న, సీకర్‌లో ఉమేశ్, డెహ్రాడూన్‌లో రియా.. ఇద్దరూ రీ-నీట్ ఒత్తిడిని తట్టుకోలేక తమ జీవితాలను ముగించుకున్నారు. 22, 23 ఏళ్ల వాళ్లే.. కలల ఆకాశంలో ఎగరాల్సిన వారు.. ఈ అన్యాయ వ్యవస్థ ముందు ఓడిపోయారు.ఈ మరణాలు అవినీతితో నిండిన వ్యవస్థ ఫలితం. దీనికి బాధ్యులు మోదీ ప్రభుత్వం, విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్. విద్యార్థులను కాపాడాల్సిన చోట, ప్రశ్నపత్రాల లీకేజీలు, పరీక్షల నిర్వహణలో లోపాలు, యువత భవిష్యత్తుతో వ్యాపారం చేసే వారికి పదేపదే అండగా నిలిచారని ఆరోపణలు ఉన్నాయి.ఈ రోజు కోటా నుంచి మేము ఒక పోరాటాన్ని ప్రారంభించబోతున్నాం. ఒక్కటే లక్ష్యం.. ఏ చిన్నారి కలలు ఇలా ఛిన్నాభిన్నం కాకూడదు, ఏ తల్లిదండ్రులూ తమ బిడ్డను ఇలాంటి పరిస్థితుల్లో కోల్పోకూడదు. ప్రతి కుటుంబం అనుభవిస్తున్న ఈ వేదన ఇప్పుడు ‘విద్యార్థుల ప్రతిధ్వని’గా మారి దేశమంతా మార్మోగుతుంది’’ అని తెలిపారు. कोटा के लिए निकल चुका हूँ पर दिल में दो नाम गूंज रहे हैं: उमेश और रिया।कल, सीकर में उमेश और देहरादून में रिया - दोनों ने Re-NEET के दबाव में अपनी ज़िंदगी ख़त्म कर ली।22 और 23 साल के बच्चे - जिन्हें सपनों के खुले आसमान में उड़ना था वो इस अन्यायी व्यवस्था से हार गए।ये मौतें…— Rahul Gandhi (@RahulGandhi) June 17, 2026 -
ఇన్‌స్టాగ్రామ్‌లో ‘మనదే’ అంతా!
ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, యుద్ధాలు, భద్రతా సవాళ్లు వంటి కీలక అంశాలపై చర్చించేందుకు ప్రపంచ నేతలు జీ7 సదస్సులో సమావేశమయ్యారు. అయితే అధికారిక సమావేశాల కంటే.. ఓ చిన్న సరదా సంభాషణే ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్‌టాపిక్‌గా మారింది. భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ మరోసారి తమ ప్రత్యేక కెమిస్ట్రీతో వార్తల్లో నిలిచారు.ఫ్రాన్స్‌లోని ఎవియాన్‌లో జరిగిన జీ7 సదస్సు సందర్భంగా ప్రపంచ నేతలంతా గ్రూప్ ఫొటో కోసం ఒకచోట చేరారు. ఈ సమయంలో మోదీ, మెలోనీ ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకున్నారు. "మిమ్మల్ని మళ్లీ కలవడం ఆనందంగా ఉంది" అని మెలోనీ చెబుతూ.. ఆ వెంటనే సరదాగా "ఇన్‌స్టాగ్రామ్‌లో మనమే అత్యంత ప్రసిద్ధ జంట" అంటూ చమత్కరించారు. దీనికి మోదీ చిరునవ్వుతో స్పందించగా.. ఆ వీడియో క్షణాల్లోనే వైరల్‌గా మారింది.Modiji and meloni 😍 pic.twitter.com/6iWmtkCIUN— Jash (@jeetcasm) June 16, 2026మీమ్ నుంచి గ్లోబల్ క్రేజ్ దాకా.. మోదీ, మెలోనీ పేర్లను కలిపి నెటిజన్లు సృష్టించిన ‘‘మెలోడీ’’ హ్యాష్‌ట్యాగ్ గత మూడేళ్లుగా సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. 2023లో దుబాయ్‌లో జరిగిన సీఓపీ-28 సదస్సులో మెలోనీ మోదీతో కలిసి తీసుకున్న సెల్ఫీని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ #Melodi అని క్యాప్షన్ ఇచ్చారు. అప్పటి నుంచి ఆ హ్యాష్‌ట్యాగ్ మీమ్స్, ఫ్యాన్ ఎడిట్స్, సరదా పోస్టులతో ప్రపంచవ్యాప్తంగా ట్రెండ్ అవుతోంది.ఇద్దరు నేతలు ఏ అంతర్జాతీయ వేదికపై కలిసినా.. మెలోడీ మళ్లీ సోషల్ మీడియాలో ప్రత్యక్షమవుతోంది. జీ7 సదస్సు కూడా అందుకు మినహాయింపు కాలేదు.మెలోనీకి టాఫీలు!ఈ మెలోడీ ఫినామినన్ను మోదీ కూడా సరదాగా గుర్తించిన సందర్భం ఇటీవలే చోటుచేసుకుంది. గత నెల రోమ్ పర్యటన సందర్భంగా మోదీ.. మెలోనీకి మెలోడీ టాఫీల ప్యాకెట్‌ను బహుమతిగా అందించారు. ఆ బహుమతిని చూసిన మెలోనీ నవ్వుతూ.. ప్రధాని మోదీ మాకు ఒక గిఫ్ట్ తీసుకొచ్చారు.. చాలా మంచి టాఫీ అంటూ వ్యాఖ్యానించారు. ఆ వీడియో సోషల్ మీడియాలో రికార్డు స్థాయిలో వైరల్ అయింది. గంటల వ్యవధిలోనే కోట్లాది వ్యూస్ సాధించి, లక్షలాది మంది నెటిజన్లను ఆకట్టుకుంది.వైరల్ కెమిస్ట్రీఅంతర్జాతీయ దౌత్య వేదికలపై సాధారణంగా గంభీర చర్చలే ఎక్కువగా కనిపిస్తాయి. కానీ మోదీ-మెలోనీ మధ్య కనిపించే ఈ సరదా సంభాషణలు మాత్రం సోషల్ మీడియా యుగంలో రాజకీయ నాయకుల ఇమేజ్ను కొత్త కోణంలో చూపిస్తున్నాయి. జీ7 వేదికగా మెలోనీ చేసిన "ఇన్‌స్టాగ్రామ్‌లో మనమే ఫేమస్ కపుల్" వ్యాఖ్యతో.. నెట్టింట వైరల్ అయ్యింది. -
‘‘భారతీయులూ బలయ్యారు’’.. ట్రంప్ ఎదుటే మోదీ ఆవేదన
పశ్చిమాసియాలో నెలలుగా కొనసాగుతున్న ఉద్రిక్తతల ప్రభావం కేవలం ఆ ప్రాంతానికే పరిమితం కాలేదని, భారతీయులు కూడా దాని మూల్యం చెల్లించాల్సి వచ్చిందని ప్రధాని నరేంద్ర మోదీ ఆవేదన వ్యక్తం చేశారు. సముద్ర వాణిజ్య మార్గాల భద్రతపై భారత్ తరఫున ఆందోళన వ్యక్తం చేసిన ఆయన.. హర్ముజ్ జలసంధి ఉద్రిక్తతల కారణంగా భారతీయ నావికులు ప్రాణాలు కోల్పోయిన విషయాన్ని జీ7 సదస్సు వేదికగా ప్రపంచ నేతల దృష్టికి తీసుకెళ్లారు.ఫ్రాన్స్‌లోని ఎవియన్‌లో జరిగిన జీ7 సదస్సులో భారత ప్రధాని మోదీ మాట్లాడుతూ.. “కొత్త భాగస్వామ్యాలు – అంతర్జాతీయ ఐక్యత పునర్నిర్మాణం” అంశంపై మాట్లాడిన మోదీ, పశ్చిమాసియాలో శాంతి ప్రయత్నాలు ముందుకు సాగడం స్వాగతార్హమని అన్నారు. అయితే ఆ ఘర్షణల వల్ల మిత్రదేశాల్లో ప్రాణ, ఆస్తి నష్టం జరిగిందని, హోర్ముజ్ జలసంధిలో వాణిజ్య రవాణా అంతరాయంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ దెబ్బతిందని పేర్కొన్నారు.“భారతీయ పౌరులు కూడా ప్రాణాలు కోల్పోయారు. దేశాలను అనుసంధానించే సముద్ర వాణిజ్యంలో కీలక పాత్ర పోషించే నావికుల భద్రతను నిర్ధారించడం మనందరి బాధ్యత. సముద్ర మార్గాలు సురక్షితంగా ఉండేలా చర్యలు తీసుకోవాలి” అని మోదీ అన్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సమక్షంలోనే ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు అంతర్జాతీయంగా చర్చనీయాంశమయ్యాయి.మోదీ వ్యాఖ్యల వెనుక కారణం ఇదేకొద్ది రోజుల క్రితం గల్ఫ్ ఆఫ్ ఒమాన్‌లో ప్రయాణిస్తున్న సెట్టెబెల్లో అనే చమురు ట్యాంకర్‌పై అమెరికా బలగాలు దాడి చేశాయి. ఈ ఘటనలో ముగ్గురు భారతీయ నావికులు మరణించారు. మొత్తం 28 మంది సిబ్బందిలో 24 మంది భారతీయులే ఉన్నారు. అమెరికా ఆంక్షలను ఉల్లంఘిస్తూ ఇరాన్ చమురును తరలిస్తున్నారనే అనుమానంతో ఆ నౌకపై చర్యలు తీసుకున్నట్లు అమెరికా తెలిపింది.ఇది ఒక్కటే కాదు. మారివెక్స్, జల్వీర్ అనే మరో రెండు నౌకలపైనా అమెరికా సైన్యం చర్యలు చేపట్టింది. ఈ మూడు నౌకల్లోనూ భారతీయ సిబ్బంది ఉండటం భారత్ ఆందోళనకు కారణమైంది.అమెరికా చర్యలపై భారత్ తీవ్ర అభ్యంతరంఈ ఘటనలపై భారత విదేశాంగ శాఖ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. అమెరికా తాత్కాలిక రాయబారి జేసన్ మీక్స్‌ను విదేశాంగ మంత్రిత్వ శాఖ పిలిపించి అధికారిక నిరసన (డిమార్ష్) అందజేసింది. భారతీయ నావికుల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తామని, ఇటువంటి దాడులు వెంటనే ఆగాలని స్పష్టం చేసింది. విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మాట్లాడుతూ, “సెట్టెబెల్లోపై దాడి జరిగిన వెంటనే అమెరికా ప్రభుత్వానికి బలమైన నిరసన తెలియజేశాం. భారతీయ నావికుల ప్రాణ భద్రతపై మా ఆందోళనను స్పష్టంగా వ్యక్తం చేశాం” అని వెల్లడించారు.ప్రపంచానికి భారత్ సందేశంజీ7 వేదికగా మోదీ చేసిన వ్యాఖ్యలు కేవలం భారతీయుల ప్రాణనష్టంపై ఆవేదన మాత్రమే కాదు. హర్ముజ్ జలసంధి వంటి కీలక సముద్ర మార్గాల్లో ఉద్రిక్తతలు పెరిగితే ప్రపంచ వాణిజ్యం, ఇంధన సరఫరా, ఆర్థిక వ్యవస్థలపై తీవ్రమైన ప్రభావం పడుతుందని ఆయన హెచ్చరించినట్టుగా విశ్లేషకులు భావిస్తున్నారు. ట్రంప్ సమక్షంలోనే ఈ అంశాన్ని ప్రస్తావించడం ద్వారా భారతీయుల భద్రత విషయంలో రాజీ ఉండదనే సంకేతాన్ని కూడా మోదీ ఇచ్చినట్లు రాజకీయ వర్గాలు చెబుతున్నాయి.17 నెలల తర్వాత.. ఫ్రాన్స్ వేదికగా జీ7 సదస్సులో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో భారత ప్రధాని మోదీ కరచాలనం చేశారు. ఈ ఇద్దరూ పక్కపక్కనే కూర్చున్నారు. గతేడాది ఫిబ్రవరి తర్వాత వీరిద్దరూ ప్రత్యక్షంగా పలకరించుకోవడం ఇదే మొదటిసారి. ఈ మధ్యకాలంలో టారిఫ్ వార్, ఆపరేషన్ సిందూర్ పరిణామాల నడుమ.. కీలక సదస్సులోనూ ఈ ఇద్దరూ ఒక్కచోట కనిపించలేదు. ఈ వ్యవహారం అంతర్జాతీయంగానూ ఆసక్తికర చర్చకు దారి తీసింది. అయితే ఫోన్‌తో పాటు సోషల్ మీడియాలో ట్వీట్లతో సంభాషించుకున్నారు. జీ7 సదస్సులో భాగంగా.. బుధవారం ఇరు దేశాధినేతలు ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. -
నావికులకు భద్రత కల్పించాలి!
ఎవియన్–లెస్–బెయిన్స్: సముద్ర రవాణా మార్గాలు సురక్షితంగా ఉండేలా, నావికులు నిర్భయంగా తమ విధులను నిర్వర్తించేలా తగిన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత అన్ని దేశాలపైనా ఉందని భారత ప్రధాని నరేంద్ర మోదీ తేల్చిచెప్పారు. సముద్ర వాణిజ్యం ద్వారా అన్ని దేశాలను అనుసంధానించే నావికులకు తగిన భద్రత కచ్చితంగా కల్పించాలన్నారు. మంగళవారం ఫ్రాన్స్‌లో జీ7 దేశాల శిఖరాగ్ర సదస్సులో ఆయన పాల్గొన్నారు. నౌకల్లో విధులు నిర్వర్తించే నావికుల భద్రత గురించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సమక్షంలో ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఇటీవల ఒమన్ తీరంపై వాణిజ్య నౌకలపై అమెరికా సైన్యం దాడులు చేయడంతో ముగ్గురు భారతీయులు మరణించిన సంగతి తెలిసిందే. అమెరికా దుశ్చర్యను భారత్ ఇప్పటికే తీవ్రంగా ఖండించింది. హార్మూజ్ జలసంధిలో సముద్ర వాణిజ్యానికి కలిగిన అంతరాయాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు హాని కలిగించాయని మోదీ తెలిపారు. పశ్చిమాసియా సంఘర్షణలో పలువురు భారతీయ పౌరులు ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తంచేశారు. సంఘర్షణలకు శాశ్వత పరిష్కార మార్గాలను చర్చలు, దౌత్యం, అంతర్జాతీయ సహకారం ద్వారా మాత్రమే కనుగొనాలని చెప్పారు. ప్రపంచం ‘దాత–గ్రహీత’ అనే విధానం నుంచి సంఘీభావం, సమానత్వంపై ఆధారపడిన భాగస్వామ్యాల వైపు పయనించాలని మోదీ చెప్పారు. పరస్పర అనుసంధానం వేగంగా పెరుగుతున్న నేటి ప్రపంచంలో అంతర్జాతీయ భాగస్వామ్యాలను పెంపొందించడంలో ‘విశ్వాసం’అత్యంత కీలకమని స్పష్టంచేశారు. ‘ఒకరు దాత, మరొకరు గ్రహీత’ అనే విధానాన్ని వదులుకోవాలని, మనమంతా సమాన భాగస్వాములుగా పనిచేయాలని వ్యాఖ్యానించారు. మనం కేవలం ఒకరి పక్కన ఒకరు నడవడమే కాకుండా.. కలిసి నడవాలన్నారు. భాగస్వామ్యాలు గౌరవంతో ముడిపడి ఉండాలి తప్ప పరా«దీనతతో కాదని తేల్చిచెప్పారు. రష్యా–ఉక్రెయిన్ యుద్ధంపై దృష్టి: ట్రంప్ మూడున్నర నెలలుగా కొనసాగుతున్న పశ్చిమాసియా యుద్ధానికి ముగింపు పలికే శాంతి ఒప్పందం కుదిరిన నేపథ్యంలో ఇకపై రష్యా–ఉక్రెయిన్ యుద్ధానికి తెరదించడంపై దృష్టి పెడతానని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంకేతాలిచ్చారు. ఇటీవలి కాలంలో ఉక్రెయిన్ అంశం కంటే ఇరాన్ వివాదమే ఎక్కువగా చర్చనీయాంశమైంది. ఇరాన్ వ్యవహారం ఇక వెనక్కి వెళ్లిపోయినట్లేనని ట్రంప్ అన్నారు. రష్యా–ఉక్రెయిన్ సంఘర్షణను ముగించడానికి తాను చేయల్సిందంతా చేస్తానని వెల్లడించారు. జీ7 సదస్సులో ట్రంప్‌తోపాటు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ సైతం పాల్గొన్నారు. ఉదయం వర్కింగ్ సెషన్ 75 నిమిషాల్లోనే ముగిసింది. రష్యా చమురు, సహజ వాయువు రంగాలను లక్ష్యంగా చేసుకుని ఆంక్షల ద్వారా ఆ దేశంపై ఒత్తిడిని పెంచడానికి ట్రంప్‌తో సహా జీ7 దేశాల నాయకులు అంగీకరించినట్లు సమాచారం. ఈ సదస్సులో ఉక్రెయిన్ అంశంపై చాలా ఫలవంతమైన సంభాషణ జరిగిందని ఓ దౌత్యవేత్త చెప్పారు. అదనపు వైమానిక రక్షణ సామర్థ్యాలు, ఇతర రక్షణలు సమకూర్చడం ద్వారా ఉక్రెయిన్‌కు మద్దతు ఇవ్వడంపైనా నాయకులు అంగీకారానికి వచ్చారని తెలిపారు. కెనడా ప్రధానితో మోదీ భేటీ ప్రధాని మోదీ మంగళవారం కెనడా ప్రధానమంత్రి మార్క్ కార్నీతో సమావేశమయ్యారు. వాణిజ్యం, ఇంధనం, ఆవిష్కరణలు, విద్య, ఇరుదేశాల ప్రజల మధ్య సంబంధాల ద్వారా బలమైన భాగస్వామ్యాన్ని పెంపొందించే మార్గాలపై చర్చించారు. ఫ్రాన్స్‌లో జీ7 సదస్సు సందర్భంగా ఈ భేటీ జరిగింది. భారత్, కెనడా మధ్య ద్వైపాక్షిక సంబంధాల్లో సాధించిన పురోగతిని సమీక్షించారు. హలో మై ఫ్రెండ్ జీ7 సదస్సు వేదిక వద్ద మోదీ, ట్రంప్ ఆత్మీయ సంభాషణ 16 నెలల తర్వాత ముఖాముఖి నేడు పూర్తిస్థాయి ద్వైపాక్షిక సమావేశం ఎవియన్–లెస్–బెయిన్స్: భారత ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 16 నెలల తర్వాత ముఖాముఖి కలుసుకున్నారు. ఫ్రాన్స్‌లోని ఎవియన్–లెస్–బెయిన్స్‌లో జీ7 శిఖరాగ్ర సదస్సు సందర్భంగా మంగళవారం వారిద్దరూ ఆప్యాయంగా కరచాలనం చేసుకుని, ఆ తర్వాత కాసేపు సంభాషించారు. క్లుప్తంగా చర్చించుకున్నారు. వారు సంభాషణకు సంబంధించిన వివరాలు తెలియరాలేదు. ఇరువురు నేతల మధ్య పూర్తిస్థాయి ద్వైపాక్షిక చర్చలు బుధవారం జరుగుతాయి. పశ్చిమాసియా సంక్షోభం, రష్యా–ఉక్రెయిన్ సంఘర్షణ, భారత్–అమెరికా సంబంధాలు సహా ప్రాంతీయ, అంతర్జాతీయ పరిణామాలపై వారు తమ అభిప్రాయాలను పంచుకొనే అవకాశం ఉంది. మోదీ గత ఏడాది ఫిబ్రవరిలో అమెరికా రాజధాని వాషింగ్టన్లో పర్యటించారు. అప్పట్లో ట్రంప్‌తో సమావేశమయ్యారు. ఆ తర్వాత ఇద్దరు నాయకులు ఫోన్లో పలుమార్లు మాట్లాడుకున్నప్పటికీ ముఖాముఖి కలుసుకొని చర్చించుకోవడం ఇదే మొదటిసారి. ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత భారత్, అమెరికా మధ్య సంబంధాలు కొంత బలహీనపడ్డాయి. ఇరుదేశాల మధ్య కొన్నాళ్లు టారిఫ్‌ల యుద్ధం సాగింది. చమురు కొనుగోలు విషయంలోనూ భారత్‌పై ఆంక్షలు విధించేందుకు ట్రంప్ ప్రయత్నించారు. భారత్, అమెరికా మధ్య యుద్ధాన్ని తానే ఆపేశానని ట్రంప్ ప్రకటించడం భారత్‌కు ఇబ్బందికరంగా మారింది. ఆపరేషన్ సింధూర్ను నిలిపివేయడం వెనుక ట్రంప్ ప్రమేయం లేదని భారత్ పలుమార్లు వివరణ ఇవ్వాల్సి వచ్చింది. అలాగే ట్రంప్ తీసుకొచ్చిన నూతన వలస విధానం, హెచ్–1బీ వీసా రుసుమును పెంచడం వంటి నిర్ణయాలు భారత్–అమెరికా సంబంధాలపై ఒత్తిడి పెంచాయి. -
జీ 7 సదస్సులో మోదీ, ట్రంప్ షేక్‌హ్యాండ్.. ఇద్దరి భేటీకి డేట్ ఫిక్స్
పారిస్: ఫ్రాన్స్‌లోని ఎవియన్‌లో జరుగుతున్న జీ 7 సదస్సులో భారత ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పరస్పరం కరచాలనం చేసుకున్నారు. గత 16 నెలల తర్వాత ఇద్దరూ బహిరంగంగా కలుసుకున్న తొలి సందర్భం ఇదే.ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ ఆతిథ్యం ఇచ్చిన ఈ శిఖరాగ్ర సమావేశానికి ప్రపంచ నాయకులు హాజరయ్యారు. కీలక అంతర్జాతీయ అంశాలపై చర్చలు ప్రారంభం కావడానికి ముందు మాక్రోన్ సమావేశ వేదిక వద్ద ప్రధాని మోదీకి స్వాగతం పలికారు. కాగా, బుధవారం (జూన్ 17)న మోదీ, ట్రంప్ భేటీ కానున్నారు. జీ7 సదస్సుకు ప్రపంచ దేశాల నాయకులు హాజరయ్యారు. అమెరికా కుదుర్చుకున్న ఇరాన్ ఒప్పందంపై నేతల మధ్య బహిరంగంగా, స్పష్టమైన చర్చలు జరిగినట్లు సోర్సెస్ తెలిపాయి. ట్రంప్, ముగ్గురు అరబ్ దేశాల నాయకులతో పాటు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీతో కూడా సమావేశం కానున్నారు.ఇరాన్‌తో కుదిరిన ఒప్పందం పూర్తి వివరాలను మరో 2 రోజుల్లో బహిరంగంగా విడుదల చేస్తానని ట్రంప్ తెలిపారు. అవసరమైతే ఆ పత్రాన్ని కెమెరాల ముందే చదివి వినిపిస్తానని కూడా వ్యాఖ్యానించారు. అలాగే ఆ ఒప్పందాన్ని పరిశీలన కోసం అమెరికా కాంగ్రెస్‌కు పంపుతానని చెప్పారు. ఇరాన్ అణు కార్యక్రమానికి సంబంధించిన క్లిష్టమైన అంశాల పరిష్కారానికి జరగనున్న తదుపరి దశ చర్చలు మరింత సులభంగా ఉంటాయని ట్రంప్ గతంలో పేర్కొన్నారు. #WATCH | Prime Minister Narendra Modi and other G7 world leaders stand together for a group photo at the G7 Summit, in Evian, France.(Video: DD News) pic.twitter.com/MI5YiAys44— ANI (@ANI) June 16, 2026 -
భాగస్వామ్యం సమున్నతంగా
బ్రటిస్లావా: జీ7 శిఖరాగ్ర సదస్సులో భాగంగా యూరప్‌లో పర్యటిస్తున్న ప్రధాని మోదీ సోమవారం స్లోవేకియాలో దేశ రాజధాని బ్రటిస్లావాలో ఆ దేశ ప్రధాని రాబర్ట్ ఫీకోతో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఇరుదేశాల మధ్య సత్సంబంధాలను ‘సమగ్ర భాగస్వామ్యం’స్థాయికి ఉన్నతీకరిస్తున్నట్లు చర్చల సందర్భంగా ప్రధాని మోదీ ప్రకటించారు. ఈ సందర్భంగా కీలక రంగాల్లో పరస్పర సహకారం, వాణిజ్యం బలోపేతమే లక్ష్యంగా 11 కీలక ఒప్పందాలను ఇరుదేశాల అగ్రనేతలు కుదుర్చుకున్నారు. వలసలు, డిజిటల్ సాంకేతికత, రక్షణ, ఉన్నత విద్య, క్వాంటం కమ్యూనికేషన్స్ మొదలు పలు రంగాలపై చర్చలు జరిపారు. ద్వైపాక్షిక ఆర్థిక బంధం పటిష్టతే లక్ష్యంగా వీలైనంత త్వరగా ఇండియా–యూరప్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం అమలుకు కృషిచేయాలని ఇరు నేతలు అంగీకారానికి వచ్చారు. ద్వైపాక్షిక, బహుముఖ సహకారం మరింత పెరగాలి. అందుకే బంధాన్ని సమగ్ర భాగస్వామ్యం స్థాయికి పెంచుతున్నాం. సమగ్ర భాగస్వామ్యం అనేది మన రెండు దేశాల ఉమ్మడి విశ్వాసాలు, ప్రాధమ్యాలు, ఉమ్మడి భవిష్యత్‌కు ప్రతీక. తాజా చర్చలు రెండు దేశాల బంధాన్ని మరింత సమున్నత శిఖరాలకు చేర్చాయి. అణు శక్తి, జియోథర్మల్ విద్యుత్ వంటి ఇంధన వనరుల ద్వారా ఇంధన భద్రత, సుస్థిరత, స్వావలంభన సాధిద్దాం. మన ఉమ్మడి సామర్థ్యం అమోఘం. మన సంకల్పాలు అత్యున్నతం. ఆటోమొబైల్స్, రైల్వేలు, అధునాతన తయారీకేంద్రాలు, హరిత సాంకేతికతలకు అధిక ప్రాధాన్యతనిద్దాం. పరస్పర విశ్వాసం, వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని పెంపొందించే దిశగా కలిసి ముందడుగువేద్దాం. భారత్–ఐరోపా సమాఖ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందానికి స్లోవేకియా సమ్మతి తెలిపింది. ఒప్పందం అమల్లోకి వస్తే ఇరుదేశాల్లోని పరిశ్రమలు, అంకుర సంస్థలు, వాణిజ్యం మునుపెన్నడూలేనంతగా ప్రయోజనం పొందటం ఖాయం’’అని మీడియా సంయుక్త ప్రకటనలో ప్రధాని మోదీ అన్నారు. రక్షణరంగంలో సహకారంపై ఆసక్తి వ్యక్తీకరణ(ఎల్ఓఐ)పై నిర్ణయం తీసుకున్నారు. ఐక్యరాజ్యసమితిలోని భద్రతా మండలి వంటి ఉమ్మడి వేదికలపై పరస్పరం సహకరించుకోవాలని ఇరుదేశాలు అంగీకారానికొచ్చాయి. ఇరుదేశాల మధ్య కారి్మకులు, వలసదారుల తరలింపుపైనా ఒప్పందం కుదిరింది. కారి్మకుల సంక్షేమ భద్రతా ఒప్పందాన్ని రెండు దేశాలు కుదుర్చుకున్నాయి. స్లోవేకియాలో పర్యటిస్తున్న మొట్టమొదటి భారత ప్రధాని మోదీయే కావడంతో ఆదివారం రాత్రి దేశ రాజధానిలో ఆయనకు ఘన స్వాగతం పలికారు. హోటల్ వద్ద విదేశాంగ మంత్రి జురాజ్ బ్లానర్ సాదరంగా ఆహ్వానించారు. -
చారిత్రక ప్రాంతాల్లో యోగా డే
న్యూఢిల్లీ: హరిద్వార్‌లోని గంగానది తీరం నుంచి హంపి శిథిలాలు, ఢిల్లీలోని ఎర్రకోట వరకు.. దేశవ్యాప్తంగా గల 12 చారిత్రాత్మక వేదికలు ఈ ఏడాది ’అంతర్జాతీయ యోగా దినోత్సవం’ వేడుకలకు వేదికలు కానున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలో 21న కోల్‌కతాలో ప్రధాన వేడుకలు జరగనున్నాయి. అదేసమయంలో, 12 ప్రాంతాలలో జాతీయ స్థాయి యోగా కార్యక్రమాలను నిర్వహిస్తారు. దేశ సాంస్కృతిక వారసత్వాన్ని, యోగా విశిష్టతను చాటేందుకు కేంద్ర ఆయుష్ శాఖ యోగా డే నిర్వహణను ప్రతిష్టాత్మక నిర్ణయం తీసుకుందని కేంద్ర మంత్రి ప్రతాప్‌రావ్ జాదవ్ తెలిపారు. ఈ ఏడాది యోగా దినోత్సవాన్ని ‘ఆరోగ్యకరమైన వృద్ధాప్యం కోసం యోగా’అనే ఇతివృత్తంతో నిర్వహిస్తున్నారు. శతాబ్దాలుగా చెక్కుచెదరని ఈ చారిత్రక కట్టడాల తరహాలోనే, యోగా కూడా మానసిక, శారీరక దృఢత్వాన్ని కలుగజేస్తూ ఎన్నో తరాలుగా సమాజానికి తోడ్పడుతోందని మంత్రి పేర్కొన్నారు. ఎంపిక చేసిన 12 ప్రాంతాలివే.. ఢిల్లీలోని ఎర్రకోట, ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్ హర్ కీ పౌరీ, ఒడిశాలో కోణార్క్ సూర్య దేవాలయం, కర్ణాటకలో హంపి కట్టడాలు, లద్దాఖ్‌లో లేహ్ ప్యాలెస్, తమిళనాడులో మహాబలిపురం తీర ఆలయం, ఉత్తరప్రదేశ్‌లో సార్నాథ్, అసోంలో కంచరి కోట, హైదరాబాద్‌లో చార్మినార్, ముంబైలో గేట్‌వే ఆఫ్ ఇండియా, బిహార్‌లో నలంద మహావిహార, అహ్మదాబాద్‌లో సబర్మతీ తీరం. ప్రతీ ప్రాంతం దేశ సాంస్కృతిక ప్రయాణంలో ఒక ప్రత్యేకమైన అధ్యాయాన్ని ప్రతిబింబిస్తుందని మంత్రి చెప్పారు. సార్నాథ్, నలంద దేశ జ్ఞాన సముపార్జన, ధ్యాన సంప్రదాయాలను గుర్తుకు తెచ్చేవి కాగా, కోణార్క్ సూర్య దేవాలయం, మహాబలిపురం తీర దేవాలయం కళాత్మకత, అద్భుత నిర్మాణ కౌశలానికి శాశ్వత చిహ్నాలుగా నిలిచాయన్నారు. హరిద్వార్‌లోని హర్ కీ పౌరీ, అహ్మదాబాద్‌లోని సబర్మతి ఆధ్యాత్మికతకు ప్రతీకలు కాగా, ఎర్రకోట, చార్మినార్, గేట్‌వే ఆఫ్ ఇండియా, లేహ్ ప్యాలెస్‌లు దేశ చారిత్రక ప్రస్థానంలో కీలకమైన మైలురాళ్లను ప్రతిబింబిస్తాయని పేర్కొన్నారు. సరిహద్దులతో ప్రమేయం లేకుండా అందరినీ ఏకం చేయగల ప్రత్యేక సామర్థ్యం యోగాకు ఉందని చెప్పడమే కార్యక్రమ లక్ష్యమని మంత్రి చెప్పారు. లద్వాఖ్లోని హిమాలయ పర్వత సానువులు, హరిద్వార్‌లోని గంగానతీ తీరం, హంపి శిథిలాలు, ఢిల్లీ, ముంబై, హైదరాబాద్ వంటి మహానగరాలు..ఇలా ఏప్రాంతమైనా తరాలను దాటి ప్రజలను అనుసంధానించే ఒక ఏకీకృత శక్తిగా యోగా నిలుస్తుందని జాదవ్ అన్నారు. భౌగోళికంగా, భాషాపరంగా వేరైనప్పటికీ ఈ చారిత్రక ప్రదేశాలన్నీ యోగా ద్వారా ఆరోగ్యం, సామరస్యం అనే ఒకే లక్ష్యంతో ఏకం కానున్నాయని ఆయన వివరించారు. -
అమెరికా–ఇరాన్ ఒప్పందంపై స్పందించిన మోదీ
పశ్చిమాసియాలో నెలల తరబడి కొనసాగిన ఉద్రిక్తతలకు ముగింపు పలికే దిశగా అమెరికా–ఇరాన్ మధ్య అవగాహన కుదిరింది. ఇరు దేశాలు కాల్పుల విరమణ పాటిస్తూ.. శాంతి ఒప్పందం చేసుకోవాలని నిర్ణయించాయి. ఈ పరిణామాన్ని భారత ప్రధాని నరేంద్ర మోదీ స్వాగతించారు. ఈ మేరకు ఎక్స్ ఖాతాలో ఆయన ఓ పోస్ట్ చేశారు. ఇంకా ఆయన ఏమన్నారంటే.. పశ్చిమాసియాలో జరిగిన ఈ సంక్షోభం ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థలపై ప్రభావం చూపిందని, అనేక దేశాల్లో ప్రాణనష్టం కూడా జరిగిందని పేర్కొన్నారు. ఈ ఒప్పందం అమలైతే ప్రాంతంలో శాంతి, స్థిరత్వం పునరుద్ధరించడమే కాకుండా ప్రపంచ వాణిజ్య మార్గాలకు ఊరట లభిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. “పశ్చిమాసియాలో జరిగిన ఘర్షణను ముగించేందుకు అమెరికా–ఇరాన్ మధ్య కుదిరిన అవగాహనను నేను స్వాగతిస్తున్నాను. ఇది ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అంతరాయాలను కలిగించింది, అనేక దేశాల్లో ప్రాణనష్టానికి కారణమైంది. ఈ ఒప్పందం అమలైతే ప్రాంతంలో శాంతి, స్థిరత్వం పునరుద్ధరించబడుతుంది. కీలక సముద్ర మార్గాల ద్వారా వాణిజ్యం సజావుగా కొనసాగుతుంది. ఈ అవగాహన అమలు పశ్చిమాసియాలో శాంతి, స్థిరత్వాన్ని తీసుకురావడమే కాకుండా వాణిజ్య నౌకా మార్గాల్లో స్వేచ్ఛాయుత రవాణాను నిర్ధారిస్తుందని మేము ఆశిస్తున్నాం అని ప్రధాని మోదీ తెలిపారు. మిగిలిన అంశాలపై.. అమెరికా–ఇరాన్ మధ్య జరిగే చర్చలు స్థిరమైన, దీర్ఘకాలిక ఒప్పందానికి దారితీయాలని కూడా మోదీ ఆకాంక్షించారు.I welcome the understanding reached between the United States and Iran on ending the conflict in West Asia, which has caused serious economic disruption across the world and led to loss of life in many countries. India hopes that the implementation of this understanding will…— Narendra Modi (@narendramodi) June 15, 2026ప్రస్తుతం మోదీ స్లోవేకియా పర్యటనలో ఉన్నారు. 1993 తర్వాత ఆ దేశంలో పర్యటిస్తున్న భారత ప్రధాని ఆయనే కావడం గమనార్హం. ఫ్రాన్స్ నుంచి అక్కడికి వెళ్లిన ఆయనకు.. వందేమాతరంతో ఘన స్వాగతం లభించింది.ఇక.. ఇరాన్-అమెరికా డీల్‌కు సంబంధించి కొన్ని మీడియా సంస్థల నివేదికల ప్రకారం.. ఈ ఫ్రేమ్‌వర్క్‌లో కొన్ని కీలక అంశాలు ఉన్నాయి. హర్ముజ్ జలసంధి ద్వారా నౌకా రవాణా పునరుద్ధరణ, ఇరాన్ అణు కార్యక్రమంపై చర్చలు తిరిగి ప్రారంభం, తాత్కాలిక ఆంక్షల సడలింపు, అలాగే ఇరాన్‌కు నిలిచిపోయిన ఆస్తుల విడుదల వంటి అంశాలు ఇందులో భాగమని తెలుస్తోంది. హర్ముజ్ జలసంధి ప్రపంచ చమురు రవాణాలో కీలక మార్గం కావడంతో.. ఈ ఒప్పందం భారత్ వంటి దేశాలకు ప్రత్యేక ప్రాధాన్యం సంతరించుకుంది. చమురు దిగుమతులపై అధికంగా ఆధారపడే భారత్‌కు, ఈ మార్గంలో ఉద్రిక్తతలు తగ్గితే ఇంధన ధరల ఒత్తిడి తగ్గే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. -
మోదీ ఫ్రాన్స్ పర్యటనలో నైస్ ట్విస్ట్!
ఫ్రాన్స్ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ.. ఆ దేశ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌తో భేటీ అయిన అనంతరం చేసిన ఓ పోస్టు ఇప్పుడు అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. ముఖ్యంగా ఆ ట్వీట్లో మోదీ రెండుసార్లు వాడిన ‘నైస్’ అనే పదం వెనుక ఉన్న అర్థం ఏమిటన్న చర్చ నెటిజన్లలో మొదలైంది. అలాగే అంతకు ముందు.. మాక్రాన్ కూడా అదే పదం వాడడం ఆసక్తిని రేకెత్తించింది.ఫ్రాన్స్‌లో మాక్రాన్‌తో కలిసి దిగిన సెల్ఫీని సోషల్ మీడియాలో పంచుకున్న మోదీ.. Nice to have met you in Nice అంటూ పోస్టు చేశారు. తొలి దశ సమావేశాలు ఫలవంతంగా సాగాయని, భారత్-ఫ్రాన్స్ వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత ఉన్నత శిఖరాలకు చేరుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. త్వరలో ఎవియన్, పారిస్‌లలో మళ్లీ కలుసుకుందామని కూడా పేర్కొన్నారు.ఆసక్తికర విషయం ఏమిటంటే.. మోదీ పోస్టుకు ముందు మాక్రాన్ కూడా అదే సెల్ఫీని షేర్ చేస్తూ కేవలం “Nice” అనే ఒక్క పదంతోనే స్పందించారు. దీంతో ఇద్దరు నేతల పోస్టుల్లో పదేపదే కనిపించిన ‘నైస్’ అనే పదం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. అసలు ఈ ‘నైస్’ ట్విస్ట్ వెనుక ఒక ఆసక్తికరమైన పదాల చమత్కారం దాగి ఉంది. ఇంగ్లిష్‌లో Nice అంటే బాగుంది, ఆనందంగా ఉంది అనే అర్థం వస్తుంది. అదే సమయంలో అది ఫ్రాన్స్‌లోని ప్రముఖ నగరం పేరు కూడా. అందుకే మోదీ అలా డబుల్ ట్విస్ట్ ఇచ్చారన్నమాట. ఒకటి.. “మిమ్మల్ని కలవడం ఆనందంగా ఉంది” అనే భావం. రెండోది.. “నైస్ నగరంలో మిమ్మల్ని కలవడం ఆనందంగా ఉంది” అనే సందర్భోచిత సందేశం.Nice to have met you in Nice. A productive first leg indeed. The India-France partnership will keep scaling new heights. See you in Evian and Paris…@EmmanuelMacron https://t.co/N84iSN7aDQ— Narendra Modi (@narendramodi) June 14, 2026మాక్రాన్ చేసిన నైస్ పోస్టు కూడా ఇదే తరహా ద్వంద్వార్థాన్ని ప్రతిబింబిస్తోంది. దీంతో ఇరు దేశాధినేతల మధ్య జరిగిన ఈ సరదా పదాల చమత్కారం నెటిజన్లను ఆకట్టుకుంటోంది. అధికారిక దౌత్య సమావేశాల మధ్యలోనూ ఇలాంటి హాస్యభరిత సంభాషణ చోటుచేసుకోవడం విశేషమని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.నైస్ ప్రత్యేకత ఏంటంటే..నైస్(Nice City) ఫ్రాన్స్‌కు ఆగ్నేయ తీరంలో మధ్యధరా సముద్రం ఒడ్డున ఉన్న అత్యంత ప్రసిద్ధ నగరాల్లో ఒకటి. ఫ్రెంచ్ రివేరా ప్రాంతానికి ప్రధాన కేంద్రంగా గుర్తింపు పొందిన ఈ నగరం పర్యాటకులకు స్వర్గధామంగా భావిస్తారు. అందమైన బీచ్‌లు, సముద్రతీర విహార మార్గాలు, చారిత్రక నిర్మాణాలు, అంతర్జాతీయ సదస్సులకు ఇది ప్రసిద్ధి. ప్రతి ఏడాది లక్షలాది మంది పర్యాటకులు ఈ నగరాన్ని సందర్శిస్తుంటారు. ఫ్రాన్స్‌లో పారిస్ తర్వాత అత్యధికంగా విదేశీ పర్యాటకులను ఆకర్షించే నగరాల్లో నైస్ కూడా ఒకటి.ధురంధర్ ట్విస్ట్ ఇచ్చిన మాక్రాన్మోదీ పర్యటనకు బాలీవుడ్ టచ్ ఇస్తూ ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ మరో ఆసక్తికర వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఫ్రాన్స్‌లోని నైస్ నగరంలో మోదీ పర్యటనకు సంబంధించిన ముఖ్య ఘట్టాలను ధురంధర్ సినిమాలోని ‘ఆరి ఆరి’ పాటతో జతచేసి వీడియోను రూపొందించారు. మోదీ-మాక్రాన్ భేటీ, భారత్ ఇన్నోవేట్స్-2026 సదస్సు ప్రారంభోత్సవం, ఇరు దేశాల మధ్య సాంకేతికత, ఆవిష్కరణలపై జరిగిన చర్చలను ఇందులో చూపించారు. ఈ వీడియోకు స్పందించిన ప్రధాని మోదీ.. భారత్, ఫ్రాన్స్‌లు సాంకేతికత, ఆవిష్కరణలు, అభివృద్ధి చెందుతున్న పరిశ్రమల రంగాల్లో కలిసి ముందుకు సాగుతాయని పేర్కొన్నారు.🇮🇳🇫🇷 pic.twitter.com/MD1gMC04dp— Emmanuel Macron (@EmmanuelMacron) June 14, 2026ఇదిలా ఉండగా, ఫ్రాన్స్, స్లోవేకియా పర్యటనల్లో భాగంగా ప్రధాని మోదీ తన విదేశీ పర్యటనను కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలోనే అధికారిక చర్చల కంటే ముందే మోదీ-మాక్రాన్ల సెల్ఫీ, దానికిచ్చిన ‘నైస్’ ట్విస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. -
బీజేపీ బిగ్ ప్లాన్.. వారిద్దరికీ కేంద్ర కేబినెట్ బెర్త్‌లు?
సాక్షి, న్యూఢిల్లీ: ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారైనట్లు తెలుస్తోంది. ఈసారి విస్తరణలో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కీలక రాష్ట్రాల వ్యవహారాల ఇన్చార్జి తరుణ్ చుగ్‌కు కేంద్ర కేబినెట్లో చోటు దక్కడం దాదాపు ఖాయమైనట్లు ఢిల్లీ వర్గాల్లో గట్టిగా వినిపిస్తోంది. ఒకట్రెండు రోజుల్లోనే దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.వచ్చే ఏడాది పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అక్కడ పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసేందుకు బీజేపీ అధిష్టానం ఇప్పటి నుంచే వ్యూహాలు రచిస్తోంది. పంజాబ్‌కు చెందిన సీనియర్ నేత అయిన తరుణ్ చుగ్‌కు కేంద్ర మంత్రివర్గంలో చోటు కల్పించడం ద్వారా సిక్కులు, స్థానిక వర్గాలను ఆకట్టుకోవచ్చని మోదీ–షా ద్వయం భావిస్తున్నట్లు సమాచారం. అలాగే ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి ఇటీవల బీజేపీలో చేరిన ఎంపీ రాఘవ్ చద్దాకు సైతం మోదీ కేబినెట్లో బెర్త్ ఖరారైనట్లు తెలుస్తోంది.హైకమాండ్‌కు నమ్మకస్తుడిగా పేరొందిన చుగ్.. పార్టీ తెలంగాణ ఇన్చార్జిగా 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ఏకంగా 8 సీట్లు కైవసం చేసుకోవడంలో కీలకపాత్ర పోషించినట్లు ఆ పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. అలాగే 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు బ్యాంకును పెంచడం, దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో విజయాలు, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 48 స్థానాలు గెలుచుకోవడంలోనూ ఆయన ప్రమేయం ఉందని చెబుతున్నాయి. -
ద్వైపాక్షిక వాణిజ్యం ఐదేళ్లలో రెట్టింపు
పారిస్: వార్షిక ద్వైపాక్షిక వాణిజ్యాన్ని రాబోయే ఐదేళ్లలో రెట్టింపు చేసుకోవాలని భారత్, ఫ్రాన్స్ నిశ్చయించుకున్నాయి. ప్రస్తుతం ఇరుపక్షాల మధ్య వార్షిక ద్వైపాక్షిక వాణిజ్యం 16 మిలియన్ డాలర్లుగా ఉంది. కృత్రిమ మేధ(ఏఐ), స్టార్టప్‌లు, వాణిజ్యం, మౌలిక సదుపాయాలు, రవాణా, ఆరోగ్యం సహా కీలక రంగాలో పరస్పర సహకారాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ నిర్ణయానికి వచ్చారు.ఆదివారం వారిద్దరూ ఫ్రాన్స్‌లోని నైస్ నగరంలో సమావేశమయ్యారు. ద్వైపాక్షిక అంశాలపై విస్తృతంగా చర్చించారు. ప్రాంతీయ, అంతర్జాతీయ పరిణామాలపై అభిప్రాయాలు పంచుకున్నారు. భారత్–ఫ్రాన్స్ ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యంలో పురోగతిని సమీక్షించారు. ఆవిష్కరణలు, వాణిజ్యం, పెట్టుబడులు, సుస్థిరత, భద్రత, సంస్కృతి, ప్రజల మధ్య సంబంధాల వంటి అంశాలపై చర్చించారు. కాన్పూర్‌లో ‘నేషనల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్’ సాంకేతికత, ఆవిష్కరణ రంగాల్లో సంబంధాలను పటిష్టం చేసుకోవడంపై ఇరువురు మోదీ, మేక్రాన్ ప్రధానంగా దృష్టి పెట్టారు. అలాగే సైన్స్, అంతరిక్షం, స్టార్టప్‌లు, ఫిన్‌టెక్, పౌర అణుశక్తి, మౌలిక సదుపాయాల రంగాలపైనా చర్చ జరిగింది. మొత్తం 13 అంశాలపై అంగీకారం కుదిరింది. ఆవిష్కరణల(ఇన్నోవేషన్) కోసం ఉమ్మడిగా రోడ్‌మ్యాప్ ఏర్పాటు చేసుకోవాలని, రాబోయే ఐదేళ్లలో వార్షిక ద్వైపాక్షిక వాణిజ్యాన్ని రెట్టింపు చేయడానికి ఒక యంత్రాంగాన్ని నెలకొల్పాలని, ఉమ్మడి ఏఐ ఫ్రేమ్‌వర్క్ ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయించారు.అలాగే హైస్పీడ్ రైల్వే రంగంలో సహకారం కోసం డిక్లరేషన్, వర్గీకృత డేటాను పరిరక్షించే భద్రతా ఒప్పందాన్ని కూడా ఇరుపక్షాలు ఖరారు చేశాయి. ఇండియాకు చెందిన యూపీఐ చెల్లింపుల సేవలను ఫ్రాన్స్‌కు సైతం విస్తరింపజేయనున్నారు. ఫ్రెంచ్ రక్షణ రంగ దిగ్గజం దసాల్ట్ ఏవియేషన్ సంస్థ నుంచి 114 రఫేల్ యుద్ధ విమానాలను కొనుగోలు చేయాలన్న భారతదేశ ప్రణాళిక కూడా ఈ భేటీలో ప్రస్తావనకు వచ్చింది.మోదీ–మేక్రాన్ భేటీ అనంతరం.. ఏరోనాటిక్స్, అనుబంధ రంగాల్లో నైపుణ్యాభివృద్ధి కోసం కాన్పూర్‌లో ‘నేషనల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్’ను ఏర్పాటు చేయనున్నట్లు ఇరు పక్షాలు ప్రకటించాయి. భారతదేశంలో క్యాంపస్‌లను ఏర్పాటు చేయాల్సిందిగా ఫ్రాన్స్ విశ్వవిద్యాలయాలను ప్రధానమంత్రి మోదీ ఆహ్వానించారు. -
సవాళ్లకు పరిష్కారాల భారత్
పారిస్: భారత్ ఇకపై ప్రపంచ దేశాల పరిష్కారాలను వినియోగించుకునే దేశం మాత్రమే కాదని.. సవాళ్లకు పరిష్కార మార్గాలు సూచించే దేశంగా మారుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. మానవ కేంద్రీకృత ఆవిష్కరణలు, సాంకేతికతలను అభివృద్ధి చేయడంపై భారత్ దృష్టిపెట్టినట్లు వెల్లడించారు. మోదీ ఆదివారం ఫ్రాన్స్‌లోని నైస్ సిటీలో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్‌తో కలిసి ‘భారత్ ఇన్నోవేట్స్’కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇండియా, ఫ్రాన్స్ సహా వివిధ దేశాల స్టార్టప్ కంపెనీలు పాల్గొన్నాయి.నూతన ఆవిష్కరణలు, సమ్మిళితత్వం వేర్వేరు కాదని... అవి పరస్పర ఆధారితమని తాము నిరూపించిట్లు మోదీ ఈ సందర్భంగా తెలిపారు. ఏ ఆవిష్కరణ గొప్పతనమైనా కేవలం దాని విలువలో కాకుండా, మానవ జీవితాలపై అది చూపే ప్రభావంపై ఆధారపడి ఉంటుందని ఉద్ఘాటించారు.దశాబ్దం క్రితం వరకు ప్రపంచం భారతదేశాన్ని సాంకేతికతను స్వీకరించే దేశంగా చూసేదని, నేడు దేశం సాంకేతికతను అందించే దేశంగా ఎదుగుతోందని హర్షం వ్యక్తంచేశారు. అంతేకాకుండా తమ దేశం సృష్టించే ఆవిష్కరణలు, అందించే పరిష్కార మార్గాలు మానవాళికి ప్రయోజనం చేకూరుస్తాయని వెల్లడించారు. ‘భారత్ ఇన్నోవేట్స్’లక్ష్యం ఇదేనని అన్నారు. సమ్మిళిత, మానవ–కేంద్రీకృత సాంకేతికత, నూ తన ఆవిష్కరణల ప్రాముఖ్యతను ప్రస్తావించారు. సాంకేతిక విప్లవంతో కొత్త అవకాశాలు అత్యాధునిక సాంకేతికత, అణు శక్తి, రక్షణ, ఆవిష్కరణలతో సహా పలు కీలక రంగాల్లో తన ప్రభుత్వం సంస్కరణలు చేపట్టినట్లు ప్రధాని మోదీ గుర్తుచేశారు. ఈ సంస్కరణల పరంపర ఇక్కడితో ఆగదని, ఇది కొనసాగుతూనే ఉంటుందని తేల్చిచెప్పారు. ఇండియా నుంచి వెలువడే స్టార్టప్‌ల సంఖ్య అనేక రెట్లు పెరుగుతూనే ఉంటుందన్నారు. వివిధ దేశాల మధ్య సంఘర్షణలు, తీవ్రతరమవుతున్న వాతావరణ మార్పుల వల్ల ప్రపంచం సంక్షోభ పరిస్థితులను ఎదుర్కొంటోందని మోదీ గుర్తుచేశారు. అనేక సవాళ్లు ఎదురవుతున్నప్పటికీ అవకాశాలు సైతం విస్తృతంగా అందుబాటులోకి వస్తున్నాయని చెప్పారు.కృత్రిమ మేధ(ఏఐ), క్వాంటమ్ కంప్యూటింగ్, బయోటెక్నాలజీ, అంతరిక్ష సాంకేతికతలు, అడ్వాన్స్డ్ మెటీరియల్స్ మానవాళి భవిష్యత్తును తీర్చిదిద్దుతాయని వెల్లడించారు. ఇవి మానవ నాగరికతలో తదుపరి అధ్యాయానికి ప్రాతినిధ్యం వహిస్తాయని అన్నారు. ప్రతి సాంకేతిక విప్లవం మానవాళికి ఒక కొత్త అవకాశాన్ని కల్పిస్తుందని వివరించారు.ప్రపంచం కోసం, సుస్థిర భవిష్యత్తు కోసం భారత్ అనేక ఆవిష్కరణలు చేస్తోందని పేర్కొన్నారు. నూతన ఆవిష్కరణ అనేది దేశం డీఎన్ఏలోనే ఉందని స్పష్టంచేశారు. భారత్, ఫ్రాన్స్ దేశాల మధ్య ఒక ప్రత్యేక భాగస్వామ్యం ఉందని వెల్లడించారు. ఇందులో అనుబంధం, దృఢ విశ్వాసం, ఆవిష్కరణ, స్ఫూర్తి, ఉమ్మడి దార్శనికత ఉన్నాయని వ్యాఖ్యానించారు. ఈ పునాది ఆధారంగానే గత కొన్నేళ్లుగా ఉమ్మడిగా కొత్త కార్యక్రమాలను ప్రారంభించామని మోదీ చెప్పారు. ఆవిష్కరణల దేశం భారత్: మేక్రాన్ కృత్రిమ మేధ, వాతావరణ మార్పుల నియంత్రణ వంటి కీలక రంగాల్లో భారత్, ఫ్రాన్స్ మధ్య నిజమైన భాగస్వామ్యం ఉందని ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ చెప్పారు. భారత్ ఒక ఆవిష్కరణల దేశమని ప్రశంసించారు. ‘భారత్ ఇన్నోవేట్స్’ప్రోగ్రామ్‌లో ఆయన మాట్లాడారు. ‘మేక్–ఇన్–ఇండియా’ను గౌరవిస్తున్నామని తెలిపారు. ఇందులో వివిధ రంగాల్లో ఫ్రాన్స్ ఇందులో భాగస్వామిగా ఉందని వివరించారు. చిన్న మాడ్యులర్ రియాక్టర్ల రంగంతో సహా పౌర అణు ఇంధన రంగంలో ఇరుదేశాల ద్వైపాక్షిక సహకారాన్ని బలోపేతం చేసుకొనేందుకు అవకాశం ఉందని పేర్కొన్నారు.‘భారత్ ఇన్నోవేట్స్’లో స్టార్టప్‌ల ఎగ్జిబిషన్‌ను మోదీ, మేక్రాన్ తిలకించారు. నూతన ఆవిష్కర్తలు, పరిశోధకులు, వ్యాపారవేత్తలు, స్టార్టప్ కంపెనీల ప్రతినిధులతో మాట్లాడారు. క్వాంటమ్ కంప్యూటింగ్, సెమీకండక్టర్లు, బయోటెక్నాలజీ, రక్షణ, అంతరిక్షం, ఆరోగ్య సంరక్షణ, మెడ్‌టెక్, క్లీన్ ఎనర్జీ తదితర రంగాలకు చెందిన స్టార్టప్‌లు ఇందులో పాల్గొన్నాయి. గతంలో ఇండియాలోని జైపూర్‌లో జరిగిన ఆర్ట్ రెసిడెన్సీకి హాజరై, భారతీయ సంస్కృతి, కళల నుంచి స్ఫూర్తి పొందిన ఇద్దరు ఫ్రెంచ్ కళాకారులు తయారు చేసిన కళాకృతులను ‘భారత్ ఇన్నోవేట్స్’లో ప్రదర్శించగా మోదీ, మేక్రాన్ తిలకించారు. -
ఈ ఎక్స్‌ప్రెస్ ఆగేదేలేదు: ఫ్రాన్స్‌లో మోదీ
పారిస్: ఫ్రాన్స్‌లో జరిగిన ‘భారత్ ఇన్నోవేట్స్’ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ భారత్-ఫ్రాన్స్ భాగస్వామ్యాన్ని ప్రశంసించారు. రెండు దేశాలు ఉమ్మడి విలువలు, ఉమ్మడి ప్రయోజనాలతో సత్సంబంధాలు కొనసాగిస్తున్నాయని చెప్పారు.భారత్-ఫ్రాన్స్ భాగస్వామ్యం భద్రత నుంచి స్థిరమైన అభివృద్ధి వరకు విస్తరించిందని ప్రధాని మోదీ అన్నారు. “ప్రస్తుతం ప్రపంచంలోనే మూడో అతిపెద్ద స్టార్టప్ వ్యవస్థ భారత్‌దే. ఈ ‘రిఫార్మ్ ఎక్స్‌ప్రెస్’ ఆగదు. ఇది కొనసాగుతూనే ఉంటుంది. స్టార్టప్‌ల సంఖ్య కూడా పెరుగుతూనే ఉంటుంది. భారత్‌తో కలిసి పనిచేయండి. ప్రపంచం కోసం సాంకేతికను అభివృద్ధి చేయండి. భారత్ వేగంగా, విస్తృత స్థాయిలో ఆవిష్కరణలు చేస్తోంది. స్థిరమైన భవిష్యత్తు కోసం ఆవిష్కరణలు చేస్తోంది. ప్రపంచం మొత్తానికి ఉపయోగపడే ఆవిష్కరణలు చేస్తోంది.సాంకేతికత, ఆవిష్కరణలు, విధానాలు అన్నీ మనుషుల అవసరాలు, సంక్షేమం, జీవన నాణ్యతను మెరుగుపరచడాన్ని ప్రధాన లక్ష్యంగా పెట్టుకుని చేస్తున్నాం. ఆవిష్కరణ భారత్ డీఎన్ఏలో ఉంది. గత 12 ఏళ్లలో భారత్ బలమైన ఆవిష్కరణ వ్యవస్థను నిర్మించింది.భారత్-ఫ్రాన్స్ మధ్య ప్రత్యేక భాగస్వామ్యం ఉంది. ఇందులో నమ్మకం, ఆవిష్కరణ, స్ఫూర్తి, ఉమ్మడి దార్శనికత ఉన్నాయి. భారత్ యువ ఆవిష్కర్తలు మానవాళి మొత్తానికి ఉపయోగపడే వాటిని కనుగొంటున్నారు” అని ప్రధాని మోదీ చెప్పారు.భారత్‌పై మెక్రాన్ ప్రశంసల జల్లుఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్ భారత్ ఆవిష్కరణ వ్యవస్థను ప్రశంసించారు. భారత్ తమ దేశంలో నిర్వహించిన తొలి ‘భారత్ ఇన్నోవేట్స్’ కార్యక్రమానికి ఆతిథ్యం ఇవ్వడాన్ని గౌరవంగా భావిస్తున్నామని చెప్పారు. స్వాతంత్య్రం తర్వాత అత్యధిక కాలం ప్రధానిగా కొనసాగిన నాయకుడిగా నిలిచిన ప్రధాని మోదీకి అభినందనలు తెలిపారు.“భారత్ ఆవిష్కరణలు చేస్తోందా లేదా అన్నది ప్రశ్న కాదు. భారత్‌తో కలిసి ఎవరు ఆవిష్కరణలు చేస్తారు అన్నదే అసలు ప్రశ్న” అని మాక్రాన్ అన్నారు. భారత్‌కు చెందిన ప్రముఖ స్టార్టప్‌లు, ఆవిష్కర్తలకు ఆతిథ్యం ఇవ్వడం ఫ్రాన్స్‌కు గర్వకారణమని చెప్పారు.భారత్ సాంకేతిక విజయాలను ప్రస్తావిస్తూ చంద్రయాన్ - 3 ల్యాండింగ్ విజయాన్ని ఉదాహరణగా చూపించారు. ఆ మిషన్ భారత్ ఆవిష్కరణ శక్తి, అమలు సామర్థ్యం, పారిశ్రామిక నైపుణ్యాన్ని ప్రపంచానికి చాటిందని అన్నారు. “పరిశోధన, ఆవిష్కరణ, అత్యాధునిక సాంకేతిక రంగాల్లో భారత్ వేగంగా ముందుకెళ్తోంది. ప్రపంచ ఆవిష్కరణ నాయక దేశంగా అవతరిస్తోంది” అని మాక్రాన్ చెప్పారు.కృత్రిమ మేధస్సు, వాతావరణ మార్పు వంటి కీలక రంగాల్లో భారత్-ఫ్రాన్స్ మధ్య నిజమైన భాగస్వామ్యం ఉందని ఆయన పేర్కొన్నారు. పౌర అణుశక్తి రంగంలో, ముఖ్యంగా చిన్న మాడ్యులర్ అణు రియాక్టర్ల విషయంలో సహకారాన్ని మరింత విస్తరించే అవకాశం ఉందని చెప్పారు. -
17న ట్రంప్, మోదీ భేటీ
వాషింగ్టన్/న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 17న ఫ్రాన్స్‌లో జీ7 సదస్సు సందర్భంగా ప్రత్యేకంగా సమావేశం కాబోతున్నారు. వారిద్దరూ ద్వైపాక్షిక అంశాలపై చర్చిస్తారని వైట్‌హౌస్ శనివారం వెల్లడించింది. భారత్, అమెరికా మధ్య కీలక వాణిజ్య ఒప్పందంపై కొనసాగుతున్న చర్చల పట్ల వారు అభిప్రాయాలు పంచుకొనే అవకాశం ఉంది. గత ఏడాది ఫిబ్రవరి తర్వాత ఇరువురు నేతలు ముఖాముఖి భేటీ కాబోతుండడం ఇదే మొదటిసారి. అప్పట్లో మోదీ వాషింగ్టన్లో పర్యటించారు. తర్వాత వారు పలుమార్లు ఫోన్లో మాట్లాడుకున్నారు.టారిఫ్‌ల యుద్ధంతో భారత్, అమెరికా మధ్య సంబంధాలు కొంత బలహీనపడ్డాయి. భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధాన్ని తానే ఆపేశానని ట్రంప్ పదేపదే ప్రకటించగా, భారత్ కొట్టిపారేసింది. అలాగే ఇటీవల ఒమన్ తీరంలో వాణిజ్య నౌకలపై అమెరికా దాడులు చేయడంతో ముగ్గురు భారతీయులు మరణించారు. అమెరికా చర్యను భారత్ ఖండించింది. ఈ నేపథ్యంలో ట్రంప్, మోదీ సమావేశం కాబోతుండడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఫ్రాన్స్ చేరుకున్న ప్రధాని మోదీ జీ7 శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు ఢిల్లీ నుంచి బయల్దేరిన భారత ప్రధాని మోదీ శనివారం ఫ్రాన్స్ చేరుకున్నారు. నైస్ నగర ఎయిర్‌పోర్ట్‌కు చేరకున్న మోదీని ఫ్రాన్స్ విద్యా మంత్రి ఎడోగార్డ్ గిఫ్రే, పరిశోధనా మంత్రి ఫిలిఫే బాప్టిస్టే, భారత్‌లో ఫ్రాన్స్ రాయబారి థియెరీ మాథ్యూ తదితరులు ఘన స్వాగతం పలికారు. ఆదివారం ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మేక్రాన్‌తో మోదీ ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. నైస్తోపాటు ఎవియాన్, పారిస్‌లోనూ మోదీ పర్యటించనున్నారు. మేక్రాన్‌తో కలిసి భారత్ ఇన్నోవేట్స్ను ప్రారంభించనున్నారు.ఈ కార్యక్రమంలో ఇరుదేశాలతోపాటు ఇతర దేశాలకు చెందిన అత్యుత్తమ నవ్య అంకుర సంస్థలు, పెట్టుబడుల సంస్థలు పాల్గొననున్నాయి. ఫ్రాన్స్ నుంచి మోదీ తర్వాత స్లోవేకియాకు వెళ్లనున్నారు. 14–15 తేదీల్లో అక్కడ బ్రాటిస్లావాలో అధ్యక్షుడు పీటర్ పెల్లెగ్రిని, ప్రధాన మంత్రి రాబర్ట్ ఫికో, వ్యాపారరంగ ప్రముఖులతో ప్రత్యేకంగా సమావేశంకానున్నారు. తిరిగి ఫ్రాన్స్ చేరుకుని 16, 17 తేదీల్లో జరిగే జీ7 శిఖరాగ్ర సదస్సులో పాల్గొంటారు. ఈ సదస్సులో గ్లోబల్ సౌత్ గళం వినిపిస్తానని మోదీ ‘ఎక్స్’లో తెలిపారు. -
14న మాక్రాన్‌తో ప్రధాని మోదీ భేటీ
న్యూఢిల్లీ: శనివారం నుంచి ప్రధాని మోదీ ఫ్రాన్స్, స్లొవేకియాల్లో వారం రోజులపాటు పర్యటించనున్నారు. పారిస్‌లో జరిగే జీ–7 శిఖరాగ్రంలో పాల్గొంటారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మానుయేల్ మాక్రాన్‌తో విస్తృత చర్చలు జరపునున్నారు. నీస్ నగరంలో 14న మేక్రాన్‌తో ప్రధాని మోదీ ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. ఫ్రాన్స్ కంపెనీలతో మల్టీ రోల్ ఫైటర్ ఎయిర్‌క్రాఫ్ట్ ప్రాజెక్టుపై ఒప్పందం కుదిరే అవకాశముంది. అదేవిధంగా, ఫ్రెంచి కంపెనీలు భారత్‌లో అణు విద్యుత్ కేంద్రాల ఏర్పాటుపై అవగాహన కుదుర్చుకునే వీలుందని సమాచారం. ఫ్రాన్స్‌తో కనీసం 12 ఒప్పందాలు కుదిరేందుకు ఛాన్సుందని చెబుతున్నారు. అనంతరం ప్రధాని జీ 7 దేశాల నేతలతో ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. శిఖరాగ్రానికి హాజరయ్యే అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తోనూ ప్రధాని భేటీ అవుతారని భావిస్తున్నారు. అయితే, ఇప్పటి వరకు షెడ్యూల్ ఖరారు కాలేదు. -
ఏఐపై పట్టుసాధించండి
న్యూఢిల్లీ: నీతి ఆయోగ్ 11వ పాలకవర్గ సమాశంలో రాష్ట్రాలకు దేశం ఎదుర్కొంటున్న పలు సవాళ్లు, రాబోయే సువర్ణావకాశాలపై ప్రధాని మోదీ దిశానిర్దేశంచేశారు. 28 రాష్ట్రాలు, ఐదు కేంద్ర పాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులతో గంటల తరబడి సుదీర్ఘంగా మోదీ సమావేశమై పలు అంశాలపై విస్తృతస్థాయిలో చర్చించి ఫిర్యాదులు, అభిప్రాయాలను స్వీకరించి తగు సూచనలు, సలహాలు ఇచ్చారు. వార్షిక సమావేశంలో 28 రాష్ట్రాల ముఖ్యమంత్రులంతా పాల్గొనడం ఇదే తొలిసారి. ఈ సందర్భంగా సీఎంలనుద్దేశించి ఆయా రాష్ట్రాల్లో చేపట్టాల్సిన చర్యలు, అనుసరించాల్సిన విధానాలపై మోదీ ప్రసంగించారు. ‘‘గోప్యత, పారదర్శకత, సామాజిక విలువలను పాటిస్తూనే కృత్రిమ మేధను విరివిగా ఉపయోగించండి. ఏఐతో అందివచ్చే అవకాశాలను ఒడిసిపట్టండి. అత్యంత తీవ్రమైన ఎల్ నినో వాతావరణ ఉపద్రవాన్ని తట్టుకునేలా విధానపర నిర్ణయాలు తీసుకోండి. నీటి సంరక్షణ చర్యలు చేపట్టండి. అంతర్జాతీయ ప్రమాణాలను పాటిస్తూనే పలు రంగాల్లో దేశం ఆత్మనిర్భరత సాధించేందుకు కృషిచేయండి. ముఖ్యంగా పునరుత్పాదక ఇంధన రంగంలో స్వావలంబనకు బాటలువేయండి. పలు దేశాలతో భారత్ కొత్త వాణిజ్య ఒడంబడికలు చేసుకుంది. ఈ మేరకు యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేలా సూక్ష్మ,చిన్న,మధ్యతరహా పరిశ్రమల పునరుజ్జీవనానికి పాటుపడండి. తద్వారా ఆయా రంగాల భాగస్వామ్యంతో విదేశీ పెట్టుబడులను ఆకర్షించండి. సమాఖ్య స్ఫూర్తిని మరోసారి చాటండి. కేంద్ర, రాష్ట్రాల మధ్య సమన్వయానికి పాటుపడండి. అప్పుడే రాష్ట్రాలన్నీ అభివృద్ధి చెంది అభివృద్ధి చెందిన దేశంగా సాకారమవుతుంది. ‘వికసిత్ భారత్’ఆవిర్భావం కోసం అన్ని రాష్ట్రాలు, జిల్లాలు, బ్లాక్‌లు, గ్రామాల సంకల్పం తీసుకోవాలి. పౌర అవగాహన, సుపరిపాలన ద్వారా మాదకద్రవ్యాల వినియోగం, సైబర్ నేరాలు వంటి వాటిని కట్టడిచేయండి. చక్కటి పరిపాలన, పారదర్శకత, మౌలిక వసతుల కల్పనతో పెట్టుబడులను ఆకర్షించవచ్చు. స్థానిక వస్తూత్పత్తుల బ్రాండింగ్‌పై దృష్టిపెట్టండి. సులభతర వాణిజ్యానికి తగ్గట్లు విధానపర నిర్ణయాలు తీసుకోండి. డేటా సెంటర్లు, కృత్రిమ మేధ వంటి రంగాల్లో కొత్త అవకాశాలను ఒడిసిపట్టండి. నవతరం ఉత్పత్తుల తయారీకి ప్రాధాన్యతనివ్వండి. భవిష్యత్ ఆర్థికవ్యవస్థకు నిపుణ మానవవనరుల అవసరం అత్యావశ్యకం. ఏఐను ఆ కోణంలో అవకాశాల గనిగా భావించండి. మన 70 కోట్ల యువత మనకు అతిపెద్ద ఆస్తి. ఇంతపెద్ద ఆస్తిని దేశాభివృద్ధి ఫలాలిచ్చే ఆదాయ వృక్షాలుగా మార్చండి. దేశంలో రక్షణరంగ ఉపకరణాల తయారీ రంగం వేగంగా విస్తరిస్తోంది. తగు మౌలికవసతుల్ని కల్పించి ఈ రంగంలో ప్రైవేట్ భాగస్వామ్యాన్ని పెంచండి. జిల్లాకో విభిన్న ఉత్పత్తి తరహాలో ఎగుమతులే లక్ష్యంగా వ్యూహాలు రచించండి’’అని రాష్ట్రాలకు మోదీ సూచించారు. సమ్మిళిత మానవాభివృద్ధి ఇతివృత్తంతో సమావేశం జరిగిందని తర్వాత నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు అశోక్ లాహిరి తెలిపారు. ‘‘ప్రాథమిక మానవ వనరులు, నవ్యనూతన నైపుణ్యాలు, ఫలవంతమైన ఉపాధి, పరిశ్రమలను స్థాపించే సత్తా, వికేంద్రీకరణ అభివృద్ధి, ఆరోగ్యం, పోషణ, సమానత్వం, అందరికీ గౌరవమర్యాదలు లక్ష్యసాధనగా ఈ సమావేశం జరిగిందని లాహిరి తెలిపారు. ఉత్తర ప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ, జమ్మూకశీ్మర్ ముఖ్యమంత్రులతో మోదీ విడివిడిగా భేటీ అయ్యారు. ఆయా రాష్ట్రాల సమస్యలపై ఆయా రాష్ట్రాల సీఎంలు చెప్పిన విషయాలను మోదీ విన్నారు. -
అండగా నిలవండి
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ సమగ్ర అభివృద్ధి, మౌలిక వసతుల కల్పనతోపాటు రాష్ట్రంలో చేపట్టనున్న కీలక ప్రాజెక్టులకు పూర్తిస్థాయిలో అండగా నిలవాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రధాని నరేంద్ర మోదీని కోరారు. గురువారం ఢిల్లీలో ప్రధానితో సమావేశమైన సీఎం రేవంత్.. రాష్ట్రానికి సంబంధించిన ప్రాజెక్టులు, నిధుల కేటాయింపులపై సమగ్రమైన వినతిపత్రాన్ని సమర్పించారు. వికసిత్ భారత్–2047 లక్ష్య సాధనలో తెలంగాణ కీలకపాత్ర పోషిస్తుందని ఆయన స్పష్టం చేశారు. ‘ఎం–6’ నిధికి రూ. 6 లక్షల కోట్లు తెలంగాణ రైజింగ్ దార్శనికతను ప్రధానికి వివరించిన రేవంత్‌రెడ్డి.. 2034 నాటికి వన్ ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తెలంగాణను మార్చే లక్ష్యంతో పనిచేస్తున్నామని తెలిపారు. నీతి ఆయోగ్ 11వ పాలక మండలి సమావేశంలో తాను చేసిన ఎం–6 టాస్‌్కఫోర్స్ ప్రతిపాదనను ఈ సందర్భంగా సీఎం ప్రస్తావించారు. దేశంలో ఆర్థిక వృద్ధికి ఇంజిన్లలా పనిచేస్తున్న ఆరు ప్రధాన నగరాలైన ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, చెన్నై, హైదరాబాద్, బెంగళూరుల అభివృద్ధికి ప్రధాని నేతృత్వంలో ఈ టాస్‌్కఫోర్స్‌ను ఏర్పాటు చేయాలని సూచించారు. ఒక్కో నగరానికి రూ. లక్ష కోట్ల చొప్పున మొత్తం రూ. 6 లక్షల కోట్లతో ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయాలని సీఎం విజ్ఞప్తి చేశారు. మెట్రో రెండో దశకు చేయూతనివ్వండి రూ. 38,595 కోట్ల అంచనా వ్యయంతో 122.9 కిలోమీటర్ల మేర 7 కారిడార్లలో చేపట్టనున్న హైదరాబాద్ మెట్రో రైల్ రెండో దశకు కేంద్రం ఆమోదం తెలపాలని సీఎం రేవంత్‌రెడ్డి ప్రధానిని కోరారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల జాయింట్ వెంచర్ (జేవీ) ప్రాజెక్టుగా దీన్ని చేపట్టనున్నట్లు తెలిపారు. ప్రతిష్టాత్మక మూసీ నది పునరుజ్జీవ ప్రాజెక్టుతోపాటు సస్టెయినబుల్ అర్బన్ హబ్‌గా నిర్మిస్తున్న భారత్ ఫ్యూచర్ సిటీ అభివృద్ధికి మద్దతు ఇవ్వాలని కోరారు. రోడ్లు, రైల్వేల విస్తరణకు ఊతం హైదరాబాద్ రీజనల్ రింగ్‌రోడ్డు (ఉత్తర, దక్షిణ కారిడార్లు), ప్రతిపాదిత హైదరాబాద్–అమరావతి–బందరు పోర్టు ఎక్స్‌ప్రెస్ వే, మన్ననూర్–శ్రీశైలం (ఎన్‌హెచ్–765) మధ్య నాలుగు వరుసల ఎలివేటెడ్ కారిడార్ ప్రాజెక్టులకు త్వరితగతిన ఆమోదం తెలిపి అమలు చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేశారు. అలాగే రీజనల్ రింగ్‌రైల్ ప్రాజెక్టుకు ఆమోదం తెలపడంతోపాటు శంషాబాద్‌లో సెంట్రల్ హైస్పీడ్ రైల్ హబ్ ఏర్పాటు చేయాలన్నారు. హైదరాబాద్‌ను చెన్నై, బెంగళూరు, పుణే నగరాలతో అనుసంధానిస్తూ హైస్పీడ్ రైల్ కనెక్టివిటీని అభివద్ధి చేయాలని కోరారు. అలాగే హైదరాబాద్‌లో ఐఐఎం ఏర్పాటుకు కేంద్రం సహకరించాలని.. ఇందుకోసం హైదరాబాద్ పరిధిలో 200 ఎకరాల వివాదరహిత భూమిని ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. టెక్నాలజీ, సాగునీటి ప్రాజెక్టులకు దన్నుగా నిలవండి టెక్నాలజీ, మాన్యుఫ్యాక్చరింగ్ రంగాల్లో గమ్యస్థానంగా తెలంగాణ దూసుకుపోతోందని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. ఇండియా సెమీకండక్టర్ మిషన్ 2.0 కింద రాష్ట్రానికి ప్రాజెక్టులు కేటాయించాలని ప్రధానిని కోరారు. ఫ్యూచర్ సిటీలో ఎల్రక్టానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ (ఈఎంసీ 2.0) ఏర్పాటుకు గ్రాంట్–ఇన్–ఎయిడ్ కింద కేంద్రం మద్దతివ్వాలని కోరారు. సాగునీటి రంగంలో పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి ఆమోదం తెలపాలని విజ్ఞప్తి చేశారు. ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టులో కీలకమైన తుమ్మిడిహట్టి బ్యారేజీ నిర్మాణానికి సంబంధించి మహారాష్ట్రతో నెలకొన్న అడ్డంకులను తొలగించేందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరిపేలా ప్రధాని చొరవ తీసుకోవాలని ప్రధానిని సీఎం కోరారు. విద్య, వైద్యమే పునాదిగా.. రాష్ట్రంలో చేపట్టిన సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కులగణన సర్వే అంశాలను సీఎం రేవంత్‌రెడ్డి ఈ భేటీలో ప్రధాని మోదీ దృష్టికి తీసుకెళ్లారు. దేశాభివృద్ధి వ్యూహంలో నాణ్యమైన విద్య, వైద్యం పునాదిగా ఉండాలని సీఎం నొక్కిచెప్పారు. యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్, స్కిల్స్ యూనివర్సిటీ, టాటా టెక్నాలజీస్ భాగస్వామ్యంతో ఐటీఐల ఆధునీకరణ వంటి రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాలను మోదీకి వివరించారు. మెట్రో రెండో దశకు సత్వరమే అనుమతులివ్వండి కేంద్ర మంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్‌తో భేటీలో సీఎం విజ్ఞప్తి హైదరాబాద్ మెట్రో ఫేజ్–2 ప్రాజెక్టుకు సత్వరమే అనుమతులు మంజూరు చేయాలని కేంద్ర పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌ను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కోరారు. గురువారం ఢిల్లీలో ఖట్టర్‌తో సీఎం సమావేశమయ్యారు. మెట్రో ఫేజ్–2 ఆవశ్యకతను ఆయన కేంద్ర మంత్రికి వివరించారు. మెట్రో ఫేజ్–2 డీపీఆర్‌లో కేంద్ర పట్టణ వ్యవహారాల శాఖ గతంలో చేసిన సూచనల మేరకు మార్పులు చేసి ఇప్పటికే సమర్పించామని ముఖ్యమంత్రి గుర్తుచేశారు. ఈ ప్రాజెక్టు ఆవశ్యకతను దృష్టిలో ఉంచుకొని ఇతర శాఖల నుంచి కూడా త్వరితగతిన అనుమతులు ఇప్పించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో సీఎస్ రామకృష్ణారావు, సీఎంవో కార్యదర్శి మాణిక్‌రాజ్, ఆర్థిక, ప్రణాళిక శాఖ కార్యదర్శి గౌరవ్ ఉప్పల్, హెచ్ఎంఆర్ఎల్ ఎండీ సర్ఫరాజ్ అహ్మద్, ప్రత్యేక కార్యదర్శి (సమన్వయం) అద్వైత్‌కుమార్ సింగ్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రధాని మోదీతో సీఎం రేవంత్‌రెడ్డి భేటీ
ఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి భేటీ అయ్యారు. తెలంగాణ ప్రాజెక్టులకు కేంద్ర సహకారం కావాలని కోరారు. గోదావరి జలాల సమర్థవంతమైన వినియోగం కోసం మహారాష్ట్రతో చర్చలకు కేంద్రం సహాయం చేయాలని.. హైదరాబాద్ మెట్రో ఫేజ్-2: 123 కి.మీ. విస్తరణకు రూ.38,595 కోట్లు.. వెంటనే అమోదించాలని విజ్ఞప్తి చేశారు. రీజినల్ రింగ్ రోడ్ ఉత్తర భాగం భూ సేకరణ 90 శాతం పూర్తి అయ్యిందని వెంటనే అనుమతి ఇవ్వాలని కోరారు.ఆర్ఆర్ఆర్ దక్షిణ భాగం (చౌటుప్పల్-సంగారెడ్డి) కూడా ఏకకాలంలో ఆమోదించాలి. హైదరాబాద్-అమరావతి-బందర్ 12 లేన్ ఎక్స్‌ప్రెస్‌వేకు కేంద్ర అనుమతి ఇవ్వండి. తెలంగాణకు పోర్ట్ కనెక్టివిటీ.. ఎగుమతులకు గేమ్ ఛేంజర్. వరంగల్ ఎయిర్పోర్ట్ పనులు త్వరగా ప్రారంభించాలి. హైదరాబాద్‌లో ఐఐఎం ఏర్పాటుకు 200 ఎకరాలు సిద్ధంగా ఉందని.. అనుమతి ఇవ్వాలంటూ ప్రధాని మోదీని సీఎం రేవంత్‌రెడ్డి కోరారు. -
మోదీ పాలనలో డిజిటల్ విప్లవం
న్యూఢిల్లీ: గడిచిన పన్నెండేళ్లలో మోదీ ప్రభుత్వ కాలంలో దేశంలో డిజిటల్ రంగం ఊహించని వేగంతో దూసుకుపోయిందని అధికారిక నివేదిక వెల్లడించింది. ముఖ్యంగా ఇంటర్నెట్ డేటా ధరలు భారీగా తగ్గడం, గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్నెట్ వాడకం పెరగడం దేశ ఆర్థిక వ్యవస్థకు కొత్త ఊపునిచ్చాయని బుధవారం విడుదల చేసిన ‘మోదీ ప్రభుత్వ 12 ఏళ్ల పాలన’ నివేదిక పేర్కొంది. నివేదికలో ప్రధాన అంశాలు: → డేటా ధరల భారీగా దిగివచ్చాయి. 2014లో ఒక జీబీ డేటా ధర రూ. 269 గా ఉండగా, ప్రస్తుతం అది ఏకంగా 97 శాతం తగ్గి రూ. 8 నుంచి రూ.10 కి పడిపోయింది. → ఇంటర్నెట్ వినియోగదారులు భారీ పెరిగారు. 2014లో దేశంలో వినియోగదారుల సంఖ్య కేవలం 25 కోట్లుగా ఉంటే, 2025 డిసెంబర్ నాటికి అది నాలుగు రెట్లు పెరిగి 103 కోట్లకు చేరింది. → బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్లు సైతం 12 ఏళ్లలో 17 రెట్లు పెరిగి, ఆరు కోట్ల నుంచి 100 కోట్లకు దూసుకెళ్లాయి. నగరాల కంటే గ్రామీణ ప్రాంతాల్లోనే ఇంటర్నెట్ వాడకం వేగంగా విస్తరించింది. → ఇంటర్నెట్ అందుబాటులోకి రావడం వల్ల ఈ–కామర్స్, ఆన్లైన్ సేవలు పుంజుకున్నాయని, ఇది ఉపాధి కల్పనకు, దేశ జీడీపీ వృద్ధికి కారణమైందని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ తెలిపింది. → 2022–23 ఆర్థిక సంవత్సరంలో భారత డిజిటల్ ఆర్థిక వ్యవస్థ విలువ రూ. 31.64 లక్షల కోట్లుగా నమోదైంది. ఇది దేశ జాతీయ ఆదాయంలో 11.74 శాతానికి సమానం. → సాధారణ ఆర్థిక వ్యవస్థ కంటే డిజిటల్ రంగం రెట్టింపు వేగంతో వృద్ధి చెందుతోందని, 2030 నాటికి జాతీయ ఆదాయంలో ఇది అయిదో వంతు (దాదాపు 20%) వాటాను ఆక్రమిస్తుందని నివేదిక అంచనా వేసింది. → ఒకప్పుడు మొబైల్ ఫోన్లను దిగుమతి చేసుకునే భారత్, ఇప్పుడు ప్రపంచంలోనే అగ్రగామి ఎగుమతిదారుగా అవతరించింది. మొబైల్ ఎగుమతుల విలువ రూ. 0.016 లక్షల కోట్ల నుంచి ఏకంగా రూ. 2.6 లక్షల కోట్లకు పెరిగింది. 2014లో దేశంలో కేవలం రెండు మొబైల్ తయారీ యూనిట్లు మాత్రమే ఉండగా, ప్రస్తుతం ఆ సంఖ్య 300 దాటింది. → 2014లో దేశంలో ఒక్క సెమీకండక్టర్ (చిప్) ప్లాంట్ కూడా లేదు. కానీ ప్రస్తుతం మోదీ ప్రభుత్వం 12 ప్లాంట్లకు అనుమతులు మంజూరు చేసింది. స్వదేశీ సాంకేతికతతో 5జీ టెలికాం పరికరాల తయారీలో భారత్ ముందడుగు వేసింది. → గడిచిన దశాబ్ద కాలంలో ప్రభుత్వ ఆధార్ గుర్తింపు కార్డుల జారీ సైతం ఊపందుకుంది. 2014లో 61.01 కోట్లుగా ఉన్న కార్డుల సంఖ్య ఇప్పుడు 144 కోట్ల మార్కును దాటిందని నివేదిక స్పష్టం చేసింది. డిజిటల్ విప్లవం ద్వారా దేశంలో సమాచారం, వనరులు, సరికొత్త అవకాశాలు ప్రజలకు ఉచితంగా లభిస్తున్నాయని కేంద్రం పేర్కొంది. సమ్మిళిత ఆర్థికాభివృద్ధి కార్పొరేట్ల స్పందనన్యూఢిల్లీ: ప్రధానిగా సరికొత్త రికార్డు నెలకొల్పిన నరేంద్ర మోడీ చేపట్టిన సంస్కరణలతో దేశ ఆర్థిక వ్యవస్థ సమ్మిళిత వృద్ధిని సాధించినట్లు కార్పొరేట్ వర్గాలు పేర్కొన్నాయి. పరివర్తనకు బాటలు వేయడం ద్వారా ప్రపంచస్థాయిలో ప్రభావం చూపగల దేశంగా భారత్ అవతరించినట్లు తెలియజేశాయి. సరళతర వ్యాపార నిర్వహణకు ప్రాధాన్యం ఇవ్వడంతో ఇన్వెస్టర్లలో విశ్వాసం బలపడినట్లు పరిశ్రమల సమాఖ్యలు పేర్కొన్నాయి. 2047 వికసిత్ భారత్ ప్రణాళికతో దేశీ కార్పొరేట్ రంగానికి ప్రోత్సాహం లభించినట్లు తెలియజేశాయి. సామర్థ్యాల పెంపు.. దేశ సామర్థ్యాలపట్ల పెరుగుతున్న నమ్మకాన్ని నిలకడ, లక్ష్యం, నిరంతర పురోభివృద్ధి ప్రతిబింబిస్తున్నట్లు సీఐఐ ప్రెసిడెంట్ ఆర్.ముకుందన్ పేర్కొన్నారు. దీంతో గ్లోబల్ ఎకనమిక్ పవర్‌హౌస్‌గా భారత్ ఎదుగుతున్నట్లు తెలియజేశారు. దేశం 2047 వికసిత్ భారత్‌వైపు ప్రయాణిస్తున్న నేపథ్యంలో పరిశ్రమల రంగం ప్రభుత్వంతో కలసి నడుస్తున్నట్లు తెలియజేశారు. పెట్టుబడుల పెంపు, బలపడుతున్న పోటీతత్వం, నైపుణ్య ఉద్యోగులతో పరిశ్రమలు ఇందుకు మద్దతిస్తున్నట్లు వివరించారు. రికార్డ్ పెట్టుబడులు.. దేశ ప్రజాస్వామ్య ప్రయాణంలో మైలురాయిని అందుకున్న ప్రధాని మోడీకి శుభాకాంక్షలు చెబుతూ.. దేశ ఆర్థిక మూలాలు గత 12ఏళ్లలో స్థిరంగా ఏకీకృతమైనట్లు ఫిక్కీ ప్రెసిడెంట్ అనంత్ గోయెంకా పేర్కొన్నారు. పటిష్ట సంస్కరణలు, బిజినెస్‌ల నిర్వహణ సులభతరం చేయడం, మౌలిక సదుపాయాలపై రికార్డ్ పెట్టుబడులు, వాణిజ్య భాగస్వామ్యాల విస్తరణ, సమ్మిళిత ఆర్థికాభివృద్ధి, ప్రపంచస్థాయి తయారీ వ్యవస్థ దేశ ఆర్థిక నడకను మార్చివేసినట్లు వివరించారు. కాంతులీనుతోంది.. ప్రధాని మోడీ అధ్యక్షతన ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్ కాంతులీనుతున్నట్లు అసోచామ్ ప్రెసిడెంట్ నిర్మల్ కె.మిండా పేర్కొన్నారు. ఇతర ఏ ప్రపంచ ప్రధాన వ్యవస్థలలో చూసినా దేశ ఆర్థిక వ్యవస్థ పటిష్ట పురోభివృద్ధిని సాధిస్తున్నట్లు తెలియజేశారు. 2013–14లో నమోదైన 1.9 ట్రిలియన్ డాలర్లతో పోలిస్తే జీడీపీ రెట్టింపునకుపైగా ఎగసి గతేడాది(2025–26)కల్లా 4.1 ట్రిలియన్ డాలర్లను తాకినట్లు వెల్లడించారు. ఇందుకు తయారీ, సర్వీసుల రంగాలు సహకరించినట్లు పేర్కొన్నారు. -
ఆయన దేశానికి గుదిబండ
న్యూఢిల్లీ: సుదీర్ఘ కాలం కొనసాగిన ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ సాధించిన ఘనతపై బీజేపీ గొప్పలు చెప్పుకుంటోందని కాంగ్రెస్ మండిపడింది. ప్రధాని మోదీ సాధించింది మైలురాయి కాదని, ఆయన ఈ దేశం మెడకు చుట్టుకున్న గుదిబండ అంటూ విరుచుకుపడింది. ‘సుదీర్ఘకాల ప్రధాని అంటూ ఒక్కరే ఉంటారు. ఎన్నికల ద్వారా, ఎన్నికలు కాకుండా అంటూ రెండు రకాల నిర్వచనాలు ఉండవు. కానీ స్వీయ ప్రకటిత, కొత్తగా సృష్టించిన ‘సుదీర్ఘకాలం పాలించిన ప్రధాని’ అనే మైలురాయిని మోదీ మెడకు తగిలించుకున్నారు. అది మైలురాయికాదు దేశం మెడకు చుట్టుకున్న మోయలేని గుదిబండ’’ అని కాంగ్రెస్ ఎద్దేవాచేసింది. ఈ మేరకు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి(కమ్యూనికేషన్స్) జై రామ్ రమేశ్ ‘ఎక్స్’ వేదికగా ఒక పోస్ట్చేశాశారు. ‘‘1947 ఆగస్ట్ 15న స్వతంత్రభారతంలోని దిగ్గజ నేతల సమ్మతితో, నాడు కొలువుదీరిన కేబినెట్‌కు సారథ్యం వహిస్తూ జవహర్లాల్ నెహ్రూ 1947 ఆగస్టు 15న ప్రధానిగా సేవలు ఆరంభించారు. 1947 నుంచి 1952 దాకా ప్రధానిగా నెహ్రూ హయాంలో భారత్ ఎన్నో ఘనతలు సాధించింది. అంతటికీలక సమయం లెక్కలోకి రాదన్నట్లు నేడు మోదీ వ్యవహరిస్తూ చరిత్రను కించపరిచేలా వ్యవహరిస్తున్నారు. 1952 తర్వాత పాలనే నెహ్రూ ప్రధానిగా లెక్కలోకి వస్తుందని మోదీ కొత్త భాష్యం చెబుతున్నారు. ఇది ఆయన సంకుచిత ఆలోచనకు ప్రబల నిదర్శనం’’ అని జైరాం రమేశ్ వ్యాఖ్యానించారు. మోదీ హయాంలో స్వతంత్రంగా ఉండాల్సిన ఎన్నికల కమిషన్ వంటి రాజ్యాంగబద్ధ సంస్థల ప్రతిష్ట మసకబారింది’’ అని జైరాం ఆరోపించారు.నెహ్రూతో మోదీని పోల్చలేం: పవార్ మోదీకి సరితూగగల నేత ఎవరూ లేరు అని బీజేపీ చెప్పుకోవడాన్ని ఎన్సీపీ(ఎస్పీ) పార్టీ చీఫ్ శరద్ పవార్ తప్పుబట్టారు. దేశ ప్రథమ ప్రధాని జవహర్లాల్ నెహ్రూతో మోదీని పోల్చడం సరికాదని ఆయన తెలిపారు. నెహ్రూ దేశానికి అందించిన అద్వితీయమైన సేవలను ఎన్నటికీ మర్చిపోజాలమని పేర్కొన్నారు. ‘నెహ్రూను మరెవరితోనూ పోల్చలేం. మహాత్మా గాంధీ నాయకత్వంలో జరిగిన స్వాతంత్య్ర పోరాటంలో నెహ్రూ ఎన్నో ఏళ్లపాటు జైలు జీవితం గడిపారు’అని పేర్కొన్నారు. -
మోదీ పాలన ప్రశంసనీయం
న్యూఢిల్లీ: స్వతంత్ర భారతదేశంలో ఎన్నికల ద్వారా ఎన్నికై సుదీర్ఘకాలం నిరాటంకంగా ప్రధానమంత్రిగా పనిచేసిన నాయకుడిగా జవహర్లాల్ నెహ్రూ పేరిట ఉన్న రికార్డును ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం అధిగమించారు. బుధవారం నాటికి ప్రధానిగా మోదీ 4,399 రోజుల పాలన పూర్తి చేసుకున్నారు. సరికొత్త మైలురాయికి చేరుకున్న మోదీకి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్, పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రపంచాధినేతలు, ప్రముఖుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. ప్రధాని మోదీ పాలన పుష్కరకాలాన్ని పూర్తిచేసుకున్న సందర్భంగా బుధవారం ఢిల్లీలో కేంద్ర కేబినెట్ సమావేశమైంది. మోదీకి అభినందనలు తెలియజేస్తూ ఏకగీవ్రంగా తీర్మానాన్ని ఆమోదించారు. దేశ ప్రజలకు ప్రధానమంత్రి అందించిన సేవలను ప్రశంసిస్తూ మంత్రులందరూ కరతాళ ధ్వనులతో స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు. సమ్మిళిత వృద్ధి, సామాజిక న్యాయం దిశగా మోదీ చేస్తున్న కృషిని ప్రశంసించారు. భారత ప్రజాస్వామ్య ప్రయాణంలో దీనిని ఒక చరిత్రాత్మక మైలురాయిగా మంత్రివర్గం అభివర్ణించింది. మోదీని కొనియాడుతూ రాష్ట్రపతి ముర్ము మోదీకి లేఖ రాశారు. ప్రధానిగా మోదీ సుదీర్ఘకాలం కొనసాగడం ప్రజల ఆదరాభిమానాలకు నిదర్శమని, దేశ చరిత్రలో ఇది కనీవినీ ఎరుగని ఘట్టమని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కొనియాడారు. అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ, బిహార్ సీఎం సమ్రాట్ చౌదరీ, గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్, ఒడిశా సీఎం మోహన్‌చరణ్ మాఝీ, హరియాణా సీఎం నాయబ్ సైనీ తదితరులు మోదీకి అభినందనలు తెలియజేశారు. ప్రధానమంత్రి కార్యాలయం సైతం మోదీకి శుభాకాంక్షలు తెలిపింది. ఇటలీ మహిళా ప్రధాని జార్జియా మెలోని, మాల్దీవుల అధ్యక్షుడు మోహమ్మద్ మెయిజ్జూ, దక్షిణ కొరియా అధ్యక్షుడు లీ జే మ్యుంగ్, మలేషియా ప్రధానమంత్రి అన్వర్ ఇబ్రహీమ్, భూటాన్ ప్రధాని త్సారింగ్ టోబ్గే, యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్‌డెర్ తదితరులు శుభాకాంక్షలు తెలిపారు. మోదీ హయాంలో సర్వతోముఖాభివృద్ధి ఎన్డీఏ భేటీలో ప్రధానిని ప్రశంసించిన కూటమి పార్టీల అగ్రనేతలు బుధవారం ఢిల్లీలోని భారత్ మండపంలో ఎన్డీయే కూటమి సమావేశమైంది. 22 ఎన్డీయే పాలిత రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు సైతం ఈ కీలక ఎన్డీఏ భేటీకి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎన్డీయే కూటమి పార్టీల అగ్రనేతలు మోదీపై ప్రశంసల వర్షం కురిపించారు. ఆయన నాయకత్వంలో దేశం సర్వతోముఖాభివృద్ధి సాధిస్తోందని ఉద్ఘాటించారు. మోదీ సేవలను కొనియాడుతూ ఒక తీర్మానం ఆమోదించారు. ఎన్డీయే పక్షాల సదస్సులో బెంగాలీ ప్రముఖ అల్పాహారమైన ఝాల్మురీని ప్రధాని∙మోదీ రుచి చూశారు. -
కాంగ్రెస్ వైఫల్యాలకు హిందువులపై నిందలు
న్యూఢిల్లీ: దశాబ్దాల కాంగ్రెస్ పాలనలో దేశం అధోగతి పాలైందని ప్రధాని నరేంద్ర మోదీ మండిపడ్డారు. విధానపరమైన, పాలనాపరమైన వైఫల్యాలతో కాంగ్రెస్ ప్రభుత్వాలు దేశాన్ని నిస్సహాయతలోకి నెట్టేశాయని ఆరోపించారు. కాంగ్రెస్ హయాంలో భారతదేశం తక్కువ వృద్ధి రేటు నమోదు చేసిన కాలాన్ని ‘హిందూ వృద్ధి రేటు’గా తప్పుగా అభివర్ణిచారని ఆక్షేపించారు. వాస్తవానికి దానిని ‘కాంగ్రెస్ వృద్ధి రేటు’గా అని పిలవాలని అన్నారు. దేశంలో అభివృద్ధి నెమ్మదిగా జరుగుతుందని, ఇక్కడ వేగవంతమైన ప్రగతి సాధ్యం కాదని ప్రజలు భావించేలా చేశారని మండిపడ్డారు. విధానపరమైన వైఫల్యాల నిందలను హిందువులపై అన్యాయంగా మోపారని, కాంగ్రెస్‌ను కాపాడే ప్రయత్నం చేశారని విమర్శించారు. ఆ పార్టీ రూ.వేల కోట్ల కుంభకోణాలకు పాల్పడిందని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ హయాంలో అన్ని వ్యవస్థలూ కుప్పకూలాయని చిప్పులు చెరిగారు. కాంగ్రెస్ వారసత్వ పాలన నుంచి దేశానికి విముక్తి కల్పించడం ఎన్డీయే ప్రభుత్వ అతిపెద్ద విజయాలలో ఒకటి అని తేల్చిచెప్పారు. కాంగ్రెస్ ఇనుప సంకెళ్ల నుంచి దేశాన్ని రక్షించామని వ్యాఖ్యానించారు. బుధవారం ఢిల్లీలో ఎన్డీయే పక్షాల సదస్సులో ప్రధాని మోదీ ప్రసంగించారు. రాజకీయ స్థిరత్వం, స్పష్టమైన సంకల్పంతో భారీ స్థాయిలో అభివృద్ధిని సాధించవచ్చని ఎన్డీయే ప్రభుత్వం నిరూపించిందని అన్నారు. 2014లో తమ ప్రభుత్వం వచి్చనప్పుడు సామాన్య పౌరుడికి ఒక కొత్త ఆశ చిగురించిందని చెప్పానని గుర్తుచేశారు. కాంగ్రెస్ ద్రోహం తర్వాత దేశ ప్రజలు తమపై సంపూర్ణ విశ్వాసం వ్యక్తంచేశారని తెలిపారు. 12 ఏళ్లలో తమ కూటమి ఆ విశ్వాసాన్ని మరింత బలపరిచిందని వ్యాఖ్యానించారు. మోదీ ఇంకా ఏం మాట్లాడారంటే.. ప్రజలే నాకు దేవుళ్లు ‘‘అవినీతికి తావులేని పాలన అందిస్తున్నాం. ప్రధానమంత్రిగా సుదీర్ఘకాలం ప్రజలకు సేవ చేసే అవకాశం దక్కడం నా అదృష్టంగా భావిస్తున్నా. ఇది నిజంగా నా దృష్టిలో అద్భుతమైన క్షణం. ప్రజలే నాకు దేవుళ్లు. అధికారాన్ని సేవగానే ఎల్లప్పుడూ భావించాం. 140 కోట్ల మంది భారతీయుల ఆకాంక్షలను నెరవేర్చేందుకు కృషి చేస్తున్నాం. గతంలో దశాబ్దాలపాటు జరిగే అభివృద్ధి మేము అధికారంలోకి వచ్చాక కేవలం నెలల వ్యవధిలోనే జరుగుతోంది. స్థిరమైన పాలనతో అభివృద్ధి వేగం పుంజుకుంది. 2014కి ముందు దేశంలో అస్థిరత ఉండేది. 2014 తర్వాత దేశ రూపురేఖల్లో అనేక మార్పులు తీసుకొచ్చాం. మా పథకాలు, కార్యక్రమాలను ప్రజలు ఆదరించడం సంతోషంగా ఉంది. వికసిత్ భారత్ లక్ష్య సాధనలో ప్రజలందరూ భాగస్వాములే. మా పాలనలో 25 కోట్ల మంది పేదరికం నుంచి విముక్తి చెందారు. ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్య 25 కోట్ల నుంచి 100 కోట్లకు చేరింది. ప్రభుత్వ విధానాలు సరైన దిశలో సాగుతున్నాయనడానికి చెప్పడానికి ఇదొక తార్కాణం. స్థిరమైన ప్రభుత్వం ఉంటేనే అభివృద్ధి సాధ్యమవుతుంది’’ అని అన్నారు.ఉగ్ర దాడులపై దేశం మౌనంగా ఉండదు సామాన్యులపై భారం తగ్గించాలన్నదే మా సంకల్పం. పన్ను మినహాయింపులు, పాలనాపరమైన సంస్కరణలతో సహా మధ్యతరగతి వర్గానికి ఉపశమనం కల్పించాం. ఏడాదికి రూ.12 లక్షల వరకు ఆదాయంపై పన్ను మినహాయింపు ఇచ్చాం. నేడు దేశం సరళమైన పన్ను విధానంతో ప్రయోజనం పొందుతోంది. దేశమే ప్రథమం(నేషన్ ఫస్ట్) అనే నినాదంతో పనిచేస్తున్నాం. దేశంలో మావోయిస్టుల సమస్యను అంతం చేశాం. ఈశాన్య రాష్ట్రాల్లో శాంతి భద్రతలు, స్థిరత్వాన్ని నెలకొల్పాం. ఇలాంటి నిర్ణయాలను తీసుకొనే సాహసాన్ని గత ప్రభుత్వాలు చేయలేకపోయాయి. ఉగ్రవాదులకు గట్టిగా బుద్ధి చెప్తున్నాం. సర్జికల్ దాడులు, ఆపరేషన్ సిందూర్ వంటి చర్యలతో మన సంకల్పాన్ని, బలాన్ని ప్రదర్శించాం’’ అని అన్నారు.విదేశాలపై ఆధార పడొద్దు నా దృష్టిలో పార్టీ కంటే దేశ ప్రజలే ముఖ్యం. దేశంలో డిజిటల్ చెల్లింపుల విప్లవం వచ్చింది. నేడు ప్రపంచమంతా భారత్ వైపు చూస్తోంది. ‘2047 నాటికి వికసిత్ భారత్’ మన లక్ష్యం. అందుకోసం మరింత వేగంగా, క్రియాశీలకంగా పని చేయాలి. ‘మేడ్ ఇన్ ఇండియా’ సంకల్పం సాకారమవుతుండడం ఆనందంగా ఉంది. మన అవసరాల కోసం విదేశాలపై ఆధారపడడాన్ని తగ్గించుకోవాల్సిందే. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో నౌకలు తయారు చేస్తున్నాం. సెమీకండక్టర్లు, అరుదైన ఖనిజాలు, కృత్రిమ మేధ(ఏఐ), క్వాంటం కంప్యూటింగ్ వంటి రంగాల్లో భారతదేశం స్వావలంబన సాధిస్తోంది. అదే సమయంలో జాతీయ భద్రత, ఆర్థిక సంస్కరణలపై కూడా నిర్ణయాత్మకంగా వ్యవహరిస్తోంది. మన ఆర్థిక, వ్యూహాత్మక భద్రతతో ముడిపడి ఉన్న అంశాల్లో విదేశాలపై ఆధారపడకూడదు. 2014లో ఉదయించిన ఆశాకిరణం నేడు నూతన ఆత్మవిశ్వాసపు కాంతిరేఖగా మారింది’’ అని ప్రధాని మోదీ స్పష్టంచేశారు. తనను సత్కరించినందుకు ఎన్డీయే మిత్రపక్షాలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ విజయం వ్యక్తిగతంగా తనది మాత్రమే కాదని, మొత్తం కూటమికి, బీజేపీ కార్యకర్తలందరికీ చెందుతుందని వివరించారు. ఇది తన వ్యక్తిగత విజయంగా కాకుండా.. తమ సమిష్టి కృషికి నిదర్శనంగా భావిస్తున్నానని చెప్పారు. ఈ సుదీర్ఘ పదవీకాలాన్ని ఒక గొప్ప గౌరవంగా అభివర్ణిచారు. దేశ సేవ ఎల్లప్పుడూ ఒక ఆధ్యాత్మిక సాధన వంటిదని అన్నారు. -
నేను భావోద్వేగానికి లోనయ్యాను: ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: దేశ ప్రధానిగా సుదీర్ఘకాలం పని చేయడం అదృష్టంగా భావిస్తున్నానని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. మోదీ అధ్యక్షతన భారత మండపంలో బుధవారం ఎన్డీఏ నేతలు సమావేశమయ్యారు. నరేంద్ర మోదీ ప్రభుత్వానికి 12 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ సమావేశం జరిపారు.ఇందులో మోదీ మాట్లాడుతూ... ‘‘నా జీవితంలో ఎన్నో ఎత్తు పల్లాలు చూశాను. దేశ ప్రధానిగా సుదీర్ఘకాలం పని చేయడం అదృష్టంగా భావిస్తున్నాను. ఎన్డీఏ ప్రభుత్వంపై ప్రజల్లో నమ్మకం పెరిగింది. నా జీవితంలో ఇదో అద్భుతమైన క్షణం. ఈ రోజు ఈ ప్రయాణంలో భాగమైన సహచరులందరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా ఎన్డీఏ కుటుంబ సభ్యులు ఒక తీర్మానాన్ని కూడా ప్రవేశపెట్టారు. ఇది మీ ఆప్యాయతను, ఉదారతను ప్రతిబింబిస్తోంది. ఎందుకంటే ఈ ప్రయాణాన్ని నేను వ్యక్తిగత విజయంగా చూడను. ప్రతి విధంగానూ ఇది మనందరి విజయం, ఎన్డీఏలోని ప్రతి భాగస్వామ్య పార్టీ సాధించిన ఉమ్మడి విజయం. అందువల్ల ఈ తీర్మానాన్ని మీ అందరికీ, మన ఎన్డీఏ కుటుంబంలోని ప్రతి కార్యకర్తకు అంకితం చేస్తున్నాను. భారతమాతకు ఇంత సుదీర్ఘ కాలం సేవ చేసే అవకాశం లభించడం, ఆమెకు సేవ చేసే భాగ్యం దక్కడం దేవుని ప్రత్యేక కృప వల్లే సాధ్యం. నా దృష్టిలో ప్రజలే దైవ స్వరూపం. అందుకే ఈ సేవను నేను ఎప్పుడూ ఒక ఆధ్యాత్మిక సాధనగా చూశాను. ఈ ఆధ్యాత్మిక సాధన ఎప్పుడూ ఒంటరిది కాదు. ఇది ఒక సామూహిక యజ్ఞం. ఇందులో మీరందరూ, ఇంకా ఎంతోమంది సహచరులు కర్తవ్య భావనతో తమ సేవలు అందించారు. మీ అందరూ ఈ రోజును నాకు నిజంగా చిరస్మరణీయంగా మార్చారు. నేను భావోద్వేగానికి లోనయ్యాను. మీ అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు. 'చరైవేతి, చరైవేతి' అనే మంత్రాన్ని జపిస్తూ, ఈ రాజకీయ ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులు చూస్తూ వచ్చిన నేను, ఈ మైలురాయిని ఒక రోజు చేరుకుంటానని ఎప్పుడూ ఊహించలేదు. నిరంతరంగా ఎన్నికైన ప్రధానిగా అత్యంత సుదీర్ఘ కాలం సేవ చేసే అవకాశం దక్కడం నా అత్యున్నత భాగ్యంగా భావిస్తున్నాను" అని తెలిపారు. చరైవేతి, చరైవేతి అంటే నిరంతరం ముందుకు సాగాలని చెప్పే ప్రాచీన సంస్కృత మంత్రం.దేశ అవసరాలే మా విధానాలకు పునాది ఎన్నో పథకాలను అమలు చేస్తున్నామని మోదీ తెలిపారు. "2014లో భారతదేశానికి అవసరమైన మొబైల్ ఫోన్లలో అధిక భాగం దిగుమతుల ద్వారానే వచ్చేవి. ఈ రోజు భారతదేశం దేశీయంగా 330 మిలియన్లకు పైగా మొబైల్ హ్యాండ్సెట్లను తయారు చేస్తోంది. 2014లో సౌర విద్యుత్ సామర్థ్యం కేవలం 2.5 గిగావాట్లు మాత్రమే ఉండేది. ఈ రోజు అది 150 గిగావాట్లను దాటింది. 2014లో ఇథనాల్ మిశ్రమం కేవలం 1.5% మాత్రమే ఉండేది. ఈ రోజు అది 20%కు చేరుకుంది. 2014లో దేశంలో ఒక్క సెమీకండక్టర్ యూనిట్ కూడా లేదు. ఈ రోజు నిర్మాణంలో ఉన్న 10కుపైగా సెమీకండక్టర్ యూనిట్లు భారతదేశాన్ని ఆధునికత వైపు నడిపిస్తున్నాయి.దేశ అవసరాలనే మా విధానాలకు, నిర్ణయాలకు పునాదిగా చేసుకున్నాం. కొత్త కార్యక్రమాలు చేపట్టేందుకు కొత్త ఆలోచనా విధానాన్ని స్వీకరించాం. యువత కోసం నైపుణ్యాభివృద్ధి మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేశాం. సహకార రంగాన్ని బలోపేతం చేసేందుకు ప్రత్యేక సహకార మంత్రిత్వ శాఖను సృష్టించాం. మత్స్యకారుల కోసం ప్రత్యేక మత్స్యశాఖ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేశాం. దివ్యాంగుల కోసం చట్టాన్ని తీసుకొచ్చాం. గిరిజన సమాజాల కోసం 'జనమన్' వంటి పథకాలను ప్రారంభించాం. ఇంతకుముందు పశుపోషకులు, మత్స్యకారులకు కిసాన్ క్రెడిట్ కార్డు ప్రయోజనం అందేది కాదు. ఆ సౌకర్యాన్ని వారికి కూడా విస్తరించాం. అంతేకాకుండా, వీధి వ్యాపారులకు మా ప్రభుత్వం 'స్వనిధి' రుణ కార్డు సౌకర్యాన్ని అందించింది..." అని మోదీ తెలిపారు. -
మోదీ అధ్యక్షతన ఎన్డీఏ నేతల కీలక భేటీ
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన భారత మండపంలో ఎన్డీఏ నేతలు సమావేశమయ్యారు. నరేంద్ర మోదీ ప్రభుత్వానికి 12 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ సమావేశం జరుపుతున్నారు. అత్యధిక కాలం ప్రధానిగా పనిచేసిన రికార్డును సొంతం చేసుకున్న మోదీని ఎన్డీఏ నేతలు సత్కరించారు. మోదీని అభినందిస్తూ ఎన్డీఏ తీర్మానం చేసింది. ఈ సమావేశంలో పలువురు కేంద్ర మంత్రులు పాల్గొన్నారు.ఎన్డీఏలోని కీలక నేతలు భారత్ మండపానికి చేరుకుని సమావేశంలో పాల్గొన్నారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ, త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్ సాహా, గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ హాజరయ్యారు.అలాగే, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి, బిహార్ ముఖ్యమంత్రి సమ్రాట్ చౌధరి కూడా సమావేశంలో పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం 12 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా కూటమి భవిష్యత్ వ్యూహం, రాజకీయ అజెండాపై ఈ సమావేశంలో చర్చ జరిగే అవకాశం ఉంది.కాగా, 2014 మే 26న తొలిసారి పదవీ బాధ్యతలు చేపట్టిన ప్రధాని మోదీ, ఇప్పుడు ప్రభుత్వ అధినేతగా వరుసగా 4,399 రోజులు పూర్తి చేశారు. ఎన్నికైన ప్రభుత్వ అధినేతగా జవహర్లాల్ నెహ్రూ పదవీకాలాన్ని అధిగమించారు. అయితే నెహ్రూ 1947 నుంచి 1964లో మరణించే వరకు ప్రధానిగా కొనసాగారు. కానీ ఈ పోలిక ప్రత్యేకంగా తొలి లోక్‌సభ ఎన్నికల తర్వాతి కాలానికి మాత్రమే సంబంధించింది. -
బిగ్ అనౌన్స్మెంట్..!
భారత్-ఆస్ట్రేలియా క్రికెట్ సంబంధాల్లో కొత్త మలుపు తీసుకురావచ్చని భావిస్తున్న ఓ ప్రతిపాదన ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఆస్ట్రేలియాలోని ప్రముఖ ఫ్రాంచైజీ టి20 లీగ్ అయిన బిగ్‌బాష్ లీగ్ మ్యాచ్‌లను తొలిసారిగా భారత్‌లో నిర్వహించే దిశగా ప్రాథమిక చర్చలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఈ ప్రతిపాదన నిజమైతే, ప్రపంచ క్రికెట్ చరిత్రలో ఇది ఓ కీలక పరిణామంగా మారే అవకాశం ఉంది.ఈ ప్రణాళికలో భాగంగా చెన్నై నగరం ప్రధాన వేదికగా పరిశీలనలో ఉన్నట్లు పలు రిపోర్టులు చెబుతున్నాయి. ఐకానిక్ క్రికెట్ స్టేడియంగా పేరుగాంచిన చిదంబరం స్టేడియంను ఓ ప్రత్యేక బీబీఎల్ రెగ్యులర్ మ్యాచ్‌కు ఆతిథ్యమివ్వడానికి అనుకూలమైన వేదికగా గుర్తించినట్టు తెలుస్తోంది. ఈ విషయమై గత కొన్ని నెలలుగా క్రికెట్ ఆస్ట్రేలియా , బీసీసీఐ మరియు తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ మధ్య అనధికారిక చర్చలు కొనసాగుతున్నాయని సమాచారం.తాజాగా ఈ అంశానికి అధిక ప్రాధాన్యత లభించడానికి కారణం, భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ త్వరలో ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనున్నారని వస్తున్న వార్తలు. ఆ పర్యటనలో మోదీ బిగ్‌బాష్ లీగ్ భారత ఎంట్రీపై "గ్రౌండ్ బ్రేకింగ్" ప్రకటన చేస్తారని అంతర్జాతీయ నివేదికలు పేర్కొంటున్నాయి. అలాగే భారత్-ఆస్ట్రేలియా క్రికెట్ సంబంధాలపై పలు సానుకూల ప్రకటనలు చేస్తారని సమాచారం.ఒకవేళ బిగ్‌బాష్ లీగ్ భారత ఎంట్రీ ప్రాజెక్ట్ సాకారమైతే, అంతర్జాతీయ టీ20 లీగ్‌లు పరస్పర దేశాల్లో మ్యాచ్‌లు నిర్వహించే కొత్త ట్రెండ్ ప్రారంభమవుతుంది. అయితే ఈ ప్రతిపాదనకు కొన్ని సవాళ్లు కూడా ఉన్నాయి. ముఖ్యంగా భారత ఆటగాళ్లు విదేశీ లీగ్‌లలో పాల్గొనడంపై ఉన్న పరిమితులు, ఐపీఎల్ షెడ్యూల్‌తో సర్దుబాటు, ప్రసార హక్కుల పంపకం, లాజిస్టిక్స్ వంటి అంశాలు పరిష్కరించుకోవాల్సి ఉంటుంది. -
రికార్డుపై స్పందించిన మోదీ.. వారికే ఇది దక్కుతుంది
ఢిల్లీ: ప్రధాని మోదీ ఈ రోజుతో సరికొత్త రికార్డు నెలకొల్పారు. ప్రజాస్వామ్య భారత్‌లో అత్యధిక కాలం ప్రధానిగా పనిచేసిన వ్యక్తిగా సరికొత్త చరిత్ర సృష్టించారు.. నేపథ్యంలో ఈ రికార్డుపై ప్రధాని మోదీ తొలిసారిగా పెదవివిప్పారు. వినయంతో అంకితభావంతో, కర్తవ్యభావంతో అవిశ్రాంతంగా వ్యక్తి మాత్రమే ప్రజల నమ్మకాన్ని గెలుచుకుంటాడు. అని అన్నారు.2014 మే 26న తొలిసారిగా ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నరేంద్ర మోదీ.. 2019, 2024 లోక్‌సభ ఎన్నికల్లోనూ వరుస విజయాలు సాధించి అధికారంలో కొనసాగుతున్నారు. ఈ క్రమంలో ఇవాళ్టితో ఆయన ప్రధానమంత్రి పదవిలో 4,399 రోజులు పూర్తి చేసుకున్నారు. దీంతో ఎన్నికల ద్వారా అధికారంలోకి వచ్చి నిరవధికంగా అత్యధిక కాలం ప్రధానిగా కొనసాగిన నాయకుడిగా నిలిచారు. ఇదివరకూ ఈ రికార్డు దివంగత నేత మాజీ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ పేరిట ఉండేది.ఈ అరుదైన ఘనతపై ఎక్స్ వేదికగా స్పందించిన మోదీ "ప్రజా సేవయే సుపరిపాలనకు గొప్ప కొలమానం. వినయంతో, అంకితభావంతో, కర్తవ్య భావంతో అవిశ్రాంతంగా పనిచేసే వ్యక్తి మాత్రమే ప్రజల నమ్మకాన్ని గెలుచుకుంటాడు. స్వభావరీత్యా భక్తిపరుడై, ఎల్లప్పుడూ తన ప్రజల సంక్షేమం గురించే ఆలోచించేవాడే అత్యున్నత కీర్తిని పొందుతాడు. వినయశీలి అయిన రాజు నిజంగానే అత్యున్నత కీర్తిని పొందుతాడు." అని అన్నారు. ఈ మేరకు ఒక వీడియోని ఎక్స్ వేదికగా షేర్ చేశారు.జవహార్ లాల్ రికార్డును అధిగమించిజవహార్ లాల్ నెహ్రూ మెుదటగా 1947 నుండి 1952 వరకు ప్రధానిగా ఉన్నారు. అయితే అప్పుడు ప్రజలు నేరుగా ఓటువేసి ఎన్నుకోలేదు. 1950 జనవరి 26న రాజ్యాంగం అమలులోకి రావడంతో "సార్వత్రిక వయోజన ఓటుహక్కు" హక్కు కల్పించారు. ఆ తర్వాత జరిగిన సాధారణఎన్నికలను పరిగణలోకి తీసుకుంటే (1952 మే నుండి 1964 మే లో ఆయన మరణించే వరకు) నెహ్రూ ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికైన ప్రధానిగా నిరంతరాయంగా 4,398 రోజులు పదవిలో ఉన్నారు. జూన్ 2026 నాటికి నరేంద్ర మోదీ ప్రధానిగా నిరంతరాయంగా 4,399 రోజులు పూర్తి చేసుకుని, నెహ్రూ రికార్డును అధిగమించారు. जनसेवा ही सुशासन की सबसे बड़ी कसौटी है। विनम्रता, समर्पण और कर्तव्यनिष्ठा के साथ निरंतर कार्य करने वाला व्यक्ति ही जनविश्वास अर्जित करता है।सदानुरक्तप्रकृतिः प्रजापालनतत्परः। विनीतात्मा हि नृपतिर्भूयसी श्रियमश्नुते॥ pic.twitter.com/mn0Ax0F8hs— Narendra Modi (@narendramodi) June 10, 2026 -
నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ
సాక్షి, న్యూఢిల్లీ: భారత రాజకీయ చరిత్రలో కీలక ఘట్టం నమోదైంది. వరుసగా మూడు సాధారణ ఎన్నికల్లో విజయం సాధించి అధికారంలో కొనసాగుతున్న నరేంద్ర మోదీ.. అత్యధిక కాలం ప్రధానమంత్రి పదవిలో కొనసాగిన నేతగా కొత్త రికార్డు సృష్టించారు. ఇప్పటివరకు జవహర్లాల్ నెహ్రూ పేరిట ఉన్న 4,398 రోజుల రికార్డును ఇవాళ్టితో అధిగమిస్తూ మోదీ చరిత్రలో తన పేరును లిఖించుకున్నారు.2014 మే 26న తొలిసారిగా ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నరేంద్ర మోదీ.. 2019, 2024 లోక్‌సభ ఎన్నికల్లోనూ వరుస విజయాలు సాధించి అధికారంలో కొనసాగుతున్నారు. ఈ క్రమంలో ఇవాళ్టితో ఆయన ప్రధానమంత్రి పదవిలో 4,399 రోజులు పూర్తి చేసుకున్నారు. దీంతో ఎన్నికల ద్వారా అధికారంలోకి వచ్చి నిరవధికంగా అత్యధిక కాలం ప్రధానిగా కొనసాగిన నాయకుడిగా నిలిచారు.ఇప్పటివరకు ఈ ఘనత స్వతంత్ర భారత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ పేరిట ఉంది. తొలి సాధారణ ఎన్నికల అనంతరం 1952లో ప్రజల తీర్పుతో అధికారంలోకి వచ్చిన నెహ్రూ.. 1964 మే 27న మరణించే వరకు 4,398 రోజుల పాటు ప్రధానిగా కొనసాగారు. ఇప్పుడు ఆ రికార్డును మోదీ అధిగమించారు. ప్రధానమంత్రుల పదవీకాలాల జాబితాలో ఇందిరా గాంధీ 4,077 రోజులతో మూడో స్థానంలో ఉన్నారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ 3,652 రోజులు, అటల్ బిహారీ వాజ్‌పేయి 2,272 రోజులు, పి.వి. నరసింహారావు 1,827 రోజులు ప్రధానమంత్రులుగా కొనసాగారు.ఇదిలా ఉండగా, మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 12 ఏళ్లు పూర్తి చేసుకుని 13వ సంవత్సరంలోకి అడుగుపెట్టింది. అదే సమయంలో ఆయన సుదీర్ఘకాలం దేశ ప్రధానిగా సేవలందించిన వ్యక్తిగా నిలిచారు. ఈ క్రమంలో ఆయనకు సన్మానం చేయాలని ఎన్డీయే పక్షాలు భావిస్తున్నాయి. శుభాకాంక్షల వెల్లువనరేంద్ర మోదీ రికార్డు నేపథ్యంలో ప్రపంచ దేశాల నేతలు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. శ్రీలంక అధ్యక్షుడు అనుర కుమార దిసానాయక ఈ ఘట్టాన్ని ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం తన నాయకత్వంపై ఉంచిన విశ్వాసానికి నిదర్శనంగా అభివర్ణించగా, పాపువా న్యూ గినియా ప్రధాని జేమ్స్ మారాపే మోదీని ఆదర్శ నాయకుడిగా కొనియాడారు. ట్రినిడాడ్ అండ్ టొబాగో ప్రధాని కమ్లా ప్రసాద్-బిసెస్సర్ సైతం మోదీ హయాంలో భారత్ ప్రపంచ వ్యవహారాల్లో ప్రభావవంతమైన స్వరంగా ఎదిగిందని పేర్కొన్నారు. గత దశాబ్దంలో భారత్‌ను ప్రపంచంలో ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలబెట్టడం, గ్లోబల్ సౌత్‌కు ప్రధాన ప్రతినిధిగా ఎదగడం, అంతర్జాతీయ దౌత్య వేదికలపై కీలక శక్తిగా మారడం వంటి పరిణామాలు మోదీ నాయకత్వంలో సాధ్యమయ్యాయని పలువురు నేతలు అభిప్రాయపడ్డారు. దీంతో మోదీ సాధించిన ఈ మైలురాయి కేవలం దేశీయ రాజకీయ ఘట్టమే కాకుండా.. ప్రపంచ వేదికపై భారత్ పెరుగుతున్న ప్రాధాన్యానికి ప్రతీకగా నిలిచిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. -
హామీలు తప్ప అమలేదీ?
న్యూఢిల్లీ: కేంద్రంలో మోదీ ప్రభుత్వం 12 ఏళ్లు విజయవంతంగా పూర్తిచేసుకుంది. మోదీ సర్కార్ 3.0కు రెండేళ్లు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ‘హామీ వర్సెస్ వాస్తవం’ పేరిట మంగళవారం ఒక డాక్యుమెంట్ విడుదల చేసింది. మోదీ ప్రభుత్వం నుంచి గత 12 ఏళ్లుగా అనేక హామీలు, భారీ ప్రకటనలు, గొప్ప మాటలు, వార్తా శీర్షికలు వెలువడినప్పటికీ వాస్తవానికి ప్రజల జీవితాల్లో అర్థవంతమైన మార్పు తెచ్చేలా వాటిలో ఒక్కటీ ఆచరణలోకి రాలేదని విమర్శించింది. ఏఐసీసీ రీసెర్చ్ డిపార్టుమెంట్ రూపొందించిన ఈ 75 పేజీల పత్రాన్ని కాంగ్రెస్ నేతలు రాజీవ్ గౌడ, అమితాబ్ దూబే విడుదల చేశారు. ఆర్థిక వ్యవస్థ, ఉద్యోగాలు, విదేశాంగ విధానం, ఇంధనం, పర్యావరణం, వాతావరణ మార్పు, వ్యవసాయం, ఎంఎస్ఎంఈలు, మౌలిక సదుపాయాలు, పట్టణాభివృద్ధి, సామాజిక రంగం, పౌర స్వేచ్ఛ, మైనారిటీల హక్కులు, చట్టాల అమలు వంటి అంశాలపై ప్రభుత్వం చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదని తేల్చిచెప్పారు. ఉజ్వల పథకం లబ్ధిదారులకు ఏడాదికి 12 రాయితీ గ్యాస్ సిలిండర్లు ఇస్తామని హామీ ఇచ్చి వాటిని 4 సిలిండర్లకు కుదించారని మండిపడ్డారు. మహిళలను, వారి కుటుంబాలను దగా చేశారని ఆరోపించారు. భారత్‌ను ప్రపంచ ఉపాధి కల్పన కేంద్రంగా మారుస్తామంటూ వాగ్దానం చేశారని తెలిపారు. వాస్తవానికి ప్రతి పది మంది గ్రాడ్యుయేట్లలో నలుగురు నిరుద్యోగులుగానే మిగిలిపోతున్నారని చెప్పారు. పట్టణ ప్రాంత యువతలో నిరుద్యోగిత రేటు 18.4 శాతంగా ఉందన్నారు. నిరుద్యోగులైన గ్రాడ్యుయేట్లలో 7 శాతం మంది మాత్రమే ఏడాదిలోపు శాశ్వత వేతన ఉద్యోగాన్ని పొందుతున్నారని చెప్పారు. -
నవ భారతంలో నరేంద్ర శకం
నరేంద్ర మోదీ అనుకోకుండా రాబర్ట్ ఫ్రాస్ట్ సిద్ధాంతాన్ని నమ్మినట్టున్నారు: అందరూ వెళ్లే దారిని కాకుండా అతి తక్కువ మంది పయనించే మార్గాన్నిఎంచుకున్నారు. బహుశా అదే నేటి మార్పులకు దారితీసి ఉంటుంది.జవహర్లాల్ నెహ్రూ, నరేంద్ర మోదీ ద్వారా భారత ప్రధానమంత్రిత్వం రెండు విభిన్న శకాలను ఆవిష్కరించింది. ప్రతి శకానికీ తనదైన పరిమితులు, అవకాశాలు, ఆశయాలున్నాయి. నెహ్రూ ఒక దుర్బల, సరికొత్త సార్వభౌమాధికార సముపార్జిత దేశానికి నాయకత్వం వహించారు. మోదీ వంతు వచ్చేసరికి ప్రపంచ సంక్షోభాలను ఎదుర్కొంటూ, సువిశాల, డిజిటల్ నెట్వర్క్ అను సంధానిత, అత్యంత పోటీతత్వ ప్రజాస్వామ్యానికి నేతృత్వం వహించాల్సి వచ్చింది. దిగువ నుంచి ఎగువకు!నెహ్రూ పాలనా విధానానికి ఎగువ నుంచి దిగువకు సంస్థల రూపకల్పన, ప్రభుత్వ నిర్దేశిత ఆర్థిక వ్యవస్థ కేంద్రస్థానంలో ఉన్నాయి. దేశ విభజన తర్వాత చెల్లాచెదురైన దేశాన్ని కూడదీసుకునే క్రమంలో ఇది సముచిత విధానమే అయినప్పటికీ, ఇది కేంద్రీకృత నియంత్రణకు దారితీసింది. తద్వారా పౌరులను దేశ ప్రగతిలో భాగ స్వాములుగా కాకుండా, లబ్ధిదారులుగా మాత్రమే పరిగణించింది.మోదీ విధానం ఆ తర్కాన్ని ఆమూలాగ్రం మారుస్తూ– ఆత్మ గౌరవం, అవిశ్రాంత పనితీరు మేళవింపుతో పాలనను ప్రజా ఉద్య మంగా రూపుదిద్దింది. ‘సబ్ కా సాథ్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్, సబ్ కా ప్రయాస్’ సూత్రాన్ని అనుసరించింది. ఆ మేరకు బ్యాంకు ఖాతాలు, ప్రత్యక్ష లబ్ధి బదిలీ (డీబీటీ), గ్యాస్ కనెక్షన్లు,గృహ నిర్మాణం, మరుగుదొడ్లు, ‘ఎక్స్‌ప్రెస్‌వే’ల నిర్మాణం, సంక్షేమ పథకాల డిజిటలీకరణ వంటి ‘దిగువ నుంచి ఎగువకు’ పద్ధతిలో సత్ఫలితాల సాధనతోపాటు విశ్వాసాన్ని కూడా పెంచుకుంది.ఈ రెండు శకాల నడుమ గల పరిమాణమే ఇక్కడ ప్రధాన వ్యత్యాసం. దేశ జనాభా దాదాపు 34 కోట్లుగా ఉండి, రాజకీయ పార్టీల మధ్య నామమాత్రపు పోటీ ఉన్న తరుణంలో నెహ్రూ పదవీ బాధ్యతలు చేపట్టారు. జనాభా 131 కోట్లు దాటి, వేలాది నమోదిత పార్టీల మనుగడతోపాటు సార్వత్రిక ఎన్నికల బ్యాలెట్ పత్రాల్లోవందలాది పార్టీలు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చిన రాజకీయ వ్యవస్థలో మోదీ ప్రధాని అయ్యారు. భారత తొలి సార్వత్రిక ఎన్నిక లలో ఓటర్ల సంఖ్య సుమారు 17 కోట్లు మాత్రమే కాగా, 2014 నాటికి 83 కోట్లు దాటి, 2024కల్లా మరింత పెరిగింది.పునాది–విస్తరణనెహ్రూ నమూనా ప్రాథమిక పరిశ్రమలను, శాస్త్రవిజ్ఞాన సంస్థ లను ఆర్థికంగా పెంచిపోషించింది. అయితే, ‘హిందూ వృద్ధి రేటు’గా ప్రాచుర్యంలోకి వచ్చిన 3–4 శాతం స్థాయికే అది పరి మితమైంది. కానీ మోదీ నేతృత్వంలోని భారత దేశం కోవిడ్–19, ద్రవ్యోల్బణ ఉధృతి, సరఫరా వ్యవస్థల్లో ఒడిదుడుకులు, భౌగో ళిక–రాజకీయ సంఘర్షణల పీడిత దశాబ్దంలోనూ 6.5–7 శాతం సగటు వృద్ధితో ప్రపంచ ప్రగతికి చోదకశక్తిగా రూపొందింది. 2014–24 మధ్య జాతీయ రహదారులు 54,000 కిలోమీటర్లకు పైగా విస్తరించాయి. దీంతో రవాణా వ్యవస్థ ఒక సమస్య స్థాయి నుంచి పోటీతత్వ సాధనంగా మారింది. మౌలిక సదుపాయాల విస్తరణ, డిజిటల్ మార్గాలైన యూపీఐ చెల్లింపులు, ఆధార్ ఆధారిత సేవా ప్రదానం వంటివి విధాన ప్రకటనకూ–పౌరులపై దాని ప్రభావానికీ మధ్య అంతరాన్ని తగ్గించాయి.ఐఐటీలు, ఎయిమ్స్ వంటి సంస్థాగత మూల స్తంభాలతో నెహ్రూ ఒక బలమైన పునాది వేశారు. ఇవి దేశ విజ్ఞానార్థిక వ్యవస్థకు బీజావాపనం వేశాయి. మోదీ పాలన సామూహిక విస్తరణకు ప్రాధాన్యమిస్తూ ఐఐటీల సంఖ్యను 23కు, ఐఐఎంలను 21కి, ఎయి మ్స్లను 23కు పెంచింది. ప్రతిష్ఠాపనతో విస్తరణను ముడిపెట్టే ఈ ద్వంద్వ విధానం, ఆకాంక్షలనే విధానోపకరణంగా పరిగణించే రాజ కీయ దృక్కోణానికి ప్రతీకగా నిలిచింది.మోదీ హయాంలో మంత్రిమండలి కూర్పు ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాల ప్రాతినిధ్యాన్ని అసాధారణ స్థాయికి చేరుస్తూ సామాజికంగా ఆ వర్గాలను ముందుకు తెచ్చింది. మహిళా ప్రాతినిధ్యం 1950ల నాటి ఏకాంక స్థాయి నుంచి ‘నారీ శక్తి వందన్ అధినియమ్’ ద్వారా మూడింట ఒక వంతు రిజర్వేషన్‌కు శాసనబద్ధ మార్గాన్ని ఏర్పరచింది. అంటే, నామమాత్రపు సార్వజనీనత నుంచి నిర్మాణాత్మక హామీల దిశగా మార్పును ఇది సూచిస్తుంది.నెహ్రూ అనుసరించిన అలీన విధానం సూత్రబద్ధమైనదే అయినా, రెండు ధ్రువాల ప్రపంచంలో తరచూ ఒంటరిగా ఉండి పోయింది. ఇది భౌతిక ప్రతిష్ఠకన్నా నైతిక నేతృత్వంపైనే ఎక్కువగా ఆధారపడింది. కాగా, మోదీ విధానం బహుళ అనుసంధాన లావా దేవీల స్వభావంతో కూడినది. అమెరికా, రష్యా, యూరప్, గల్ఫ్ సహా వర్ధమాన దేశాలతోనూ ఏకకాలంలో సంబంధాలు నెరపుతూ భారత విపణి, సాంకేతిక పరిజ్ఞాన డిమాండ్ సహా ప్రవాస భారతీయుల ప్రభావాన్ని కూడా ఇది బేరసారాల ఉపకరణంగా మారుస్తుంది.తొలిసారి భారత్, పాకిస్తాన్ యుద్ధం నుంచి 1962లో చైనాతో యుద్ధం దాకా ‘శాంతియుతమైనది’గా గుర్తుచేసుకునే నెహ్రూ పాలన అనేక సంఘర్షణలకు సాక్షిగా నిలిచింది. మోడీ సిద్ధాంతాన్ని పరికిస్తే – అనిశ్చిత పొరుగు ప్రాంతాల్లో భారత్ తన పూర్తిస్థాయిసంప్రదాయ యుద్ధ నివారణ, నిరోధక శక్తిసామర్థ్యాలను వ్యూహా త్మక ప్రతిస్పందన, సునిశిత సరిహద్దు నిర్వహణలతో జోడించింది. ఇక్కడ ప్రమాదమే లేదని కాదు, దేశీయంగా ఆధునికీకరణ కొనసాగు తున్న తరుణంలో భద్రతా వాతావరణ స్థిరత్వాన్ని ఇది సూచిస్తుంది.కాలానికి తగిన నాయకుడుస్వాతంత్య్రం వచ్చిన తొలినాళ్లలో పీఎల్–480 పథకం కింద ‘ఓడ నుంచి విస్తరిలోకి’ అనే దిగుమతి పరాధీనత ఉండేది. ఇప్పు డది సమసిపోయి, దాదాపు 80 కోట్ల మంది పేదలకు ఉచిత ధాన్యం సరఫరా చేసే ‘పీఎం గరీబ్ కల్యాణ్ అన్న యోజన’ అమలు స్థాయికి భారత్ దూసుకెళ్లింది. మరోవైపు జాతీయంగా ఒక ప్రధాన వ్యవ సాయ ఉత్పత్తిదారుగానూ, అంతర్జాతీయంగా ఎగుమతిదారుగానూ ఎదుగుతోంది. పదవీ కాలాన్ని కొలబద్దగా పరిగణించినా, మోదీ హయాం ఓ కీలక మలుపు. ఇది ఇందిరాగాంధీ సుదీర్ఘ నిరంతరాయ పదవీ కాలాన్ని అధిగమించి, నెహ్రూ అనుసరించిన నిరంతర సేవా ప్రమా ణానికి చేరువవుతూ వచ్చింది. రాష్ట్ర, జాతీయ స్థాయి పదవులకు ఎన్నికైన ప్రభుత్వాధినేతగా దేశంలోనే అత్యంత సుదీర్ఘ సంచిత పదవీ కాలపు రికార్డును మోదీ పాలన ఇప్పటికే బద్దలు కొట్టింది. అయితే, ఈ ప్రాధాన్యం రోజుల సంఖ్యకు అతీతంగా దాని సంచిత ప్రభావంలో కనిపిస్తుంది.వేర్వేరు కాలాల్లో విభిన్న నాయకత్వ అవసరం ఏర్పడింది. తదనుగుణంగా తొలినాళ్ల నాయకత్వం చట్రాన్ని రూపొందిస్తే, మలినాళ్ల నేతృత్వం దాని ఆధారంగా ఉపరితల నిర్మాణానికి ఉపక్రమించి రహదారులను విస్తరించి, దేశాన్ని డిజిటలీకరణతో అనుసంధానించి, ఆ ప్రగతి ప్రకాశాన్ని ప్రపంచం నలుమూలలా ప్రసరించేలా చేసింది. సార్వజనీనత, సేవా ప్రదానం, మౌలిక సదుపాయాల కల్పన, బేరసారాల సామర్థ్యం తదితర ప్రమాణాల ప్రాతిపదికన చూస్తే – మోదీ నిస్సందేహంగా అత్యంత ప్రభావశీల ప్రధానమంత్రిగా నిలుస్తారు. కోట్లాది భారతీయుల దృక్కోణంలో మోదీ ఈ దేశానికి అత్యంతావశ్యక సమర్థ నేతగా నిలిచారు. - సుహేల్ సేథ్వ్యాపారవేత్త, కాలమిస్ట్; ‘కౌన్సెలేజ్ ఇండియా’ కన్సల్టెన్సీ వ్యవస్థాపకుడు–మేనేజింగ్ పార్ట్నర్ -
చరిత్ర సృష్టించిన నరేంద్ర మోదీ
భారత రాజకీయ చరిత్రలో అత్యంత అరుదైన రికార్డు నరేంద్ర మోదీ ఖాతాలో జమ కానుంది. అత్యధిక కాలం ప్రధానమంత్రి పదవిలో కొనసాగిన నేతగా ఆయన చరిత్ర సృష్టించబోతున్నారు. తద్వారా.. స్వతంత్ర భారత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ పేరిట ఉన్న రికార్డును ఇన్నేళ్ల తర్వాత మోదీ చెరిపేయబోతున్నారు. మోదీ ఇవాళ్టితో.. ప్రధానిగా నెహ్రూ పదవి కాలాన్ని సమం చేయబోతున్నారు. రేపటితో(జూన్ 10) 4,399 రోజులతో అత్యధిక కాలం నిరవధిక ప్రధానమంత్రి పదవీకాలాన్ని పూర్తి చేసుకుంటారు. నెహ్రూ తరహాలోనే.. వరుస ఎన్నికల్లో ఎన్నికై మోదీ ఈ రికార్డును నెలకొల్పడం గమనార్హం. 2014 మే 26న తొలిసారిగా ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నరేంద్ర మోదీ.. 2019, 2024 ఎన్నికల్లోనూ వరుస విజయాలు సాధించి అధికారంలో కొనసాగుతున్నారు. దీంతో ఎన్నికల ద్వారా అధికారంలోకి వచ్చి అత్యధిక కాలం నిరవధికంగా ప్రధానమంత్రి పదవిలో కొనసాగిన నాయకుడిగా నిలిచారు.ఇప్పటివరకు ఈ రికార్డు జవహర్లాల్ నెహ్రూ పేరిట ఉంది. 1952లో జరిగిన తొలి సాధారణ ఎన్నికల తర్వాత నెహ్రూ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టి 1964 మే 27న మరణించే వరకు 4,398 రోజుల పాటు పదవిలో కొనసాగారు. ఇక మాజీ ప్రధాని ఇందిరా గాంధీ 1966 జనవరి నుంచి 1977 మార్చి వరకు 4,077 రోజుల పాటు ప్రధానమంత్రి పదవిలో కొనసాగి.. ఈ జాబితాలో మూడో స్థానంలో ఉన్నారు.భారత ప్రధానమంత్రుల పదవీకాలం – టాప్ లిస్ట్జవహర్లాల్ నెహ్రూ – 4,398 రోజులు (ఎన్నికల తర్వాత నిరవధిక పదవీకాలం)నరేంద్ర మోదీ – 4,399+ రోజులు (ప్రస్తుత ప్రధానమంత్రి)ఇందిరా గాంధీ – 4,077 రోజులుమన్మోహన్ సింగ్ – 3,652 రోజులు (2004–2014)అటల్ బిహారీ వాజ్‌పేయి – 2,272 రోజులు (మూడు విడతలు కలిపి)పి.వి. నరసింహారావు – 1,827 రోజులురాజీవ్ గాంధీ – 1,826 రోజులుమొరార్జీ దేశాయ్ – 857 రోజులులాల్ బహదూర్ శాస్త్రి – 576 రోజులుఅయితే ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం ఉంది. జవహర్లాల్ నెహ్రూ 1947 ఆగస్టు 15న స్వతంత్ర భారత తొలి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అలా.. 1964 మే 27న మరణించే వరకు మొత్తం 6,131 రోజులు పదవిలో కొనసాగారు. అయితే 1952లో జరిగిన తొలి సాధారణ ఎన్నికల తర్వాత ఎన్నికైన ప్రధానమంత్రిగా ఆయన కొనసాగిన కాలాన్ని మాత్రమే అధికారిక రికార్డుగా పరిగణిస్తారు. అందుకే ప్రస్తుతం నరేంద్ర మోదీ అధిగమిస్తున్నది నెహ్రూ మొత్తం పదవీకాల రికార్డు కాదు.. ఎన్నికల ద్వారా అధికారంలోకి వచ్చి నిరవధికంగా కొనసాగిన ప్రధానమంత్రి రికార్డు మాత్రమే. అంటే.. ఆ రికార్డు ఇంకా నెహ్రూ పేరిటే పదిలంగా ఉందన్నమాట. మోదీ ప్రధానిగా ఇంకో 1,732 రోజులు.. అంటే దాదాపు 4 సంవత్సరాలు 9 నెలలు పూర్తి చేసుకుంటే ఆ రికార్డు కూడా బద్ధలు కానుంది. మరోవైపు మోదీ సర్కార్ అధికారంలోకి వచ్చి 12 ఏళ్లు పూర్తి చేసుకుని 13వ సంవత్సరంలోకి అడుగుపెడుతోంది. ఈ సందర్భంగా ప్రధాని మోదీ సోషల్ మీడియాలో స్పందించారు. గత 12 ఏళ్లలో దేశంలో అనేక మార్పులు చోటుచేసుకున్నాయని, ఆ మార్పుల కేంద్రబిందువు పేదలు, అట్టడుగు వర్గాల సంక్షేమమేనని పేర్కొన్నారు. జన్‌ధన్ ఖాతాలు, ప్రత్యక్ష నగదు బదిలీ పథకాలు, స్వచ్ఛ భారత్, ప్రధాన్‌మంత్రి ఆవాస్ యోజన, జల్ జీవన్ మిషన్, ఆయుష్మాన్ భారత్ వంటి కార్యక్రమాల ద్వారా కోట్లాది మందికి ప్రయోజనం చేకూర్చామని మోదీ తెలిపారు. అభివృద్ధి ఫలాలు అందని వర్గాలకు చేరేలా పనిచేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు.అయితే మూడోసారి అధికారంలోకి వచ్చిన మోదీ ప్రభుత్వానికి పలు సవాళ్లు కూడా ఎదురవుతున్నాయి. నీట్, సీబీఎస్ఈ పరీక్షల వ్యవహారాలు, నిరుద్యోగం, ద్రవ్యోల్బణం వంటి అంశాలు ప్రతిపక్షాల నుంచి విమర్శలకు దారితీస్తున్నాయి. అదే సమయంలో మహిళా రిజర్వేషన్, ఒకే దేశం-ఒకే ఎన్నిక, నియోజకవర్గాల పునర్విభజన వంటి కీలక అంశాలను ముందుకు తీసుకెళ్లాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది.మొత్తానికి, ఎన్నికల ద్వారా అధికారంలోకి వచ్చి నిరవధికంగా అత్యధిక కాలం ప్రధానమంత్రి పదవిలో కొనసాగిన నేతగా నరేంద్ర మోదీ కొత్త చరిత్ర సృష్టించడం భారత రాజకీయాల్లో మరో ముఖ్య ఘట్టంగా నిలవనుంది. -
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదంపై మోదీ దిగ్భ్రాంతి
విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌లో జరిగిన ప్రమాద ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారు. ఆత్మీయులను కోల్పోయిన కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. బాధితులకు స్థానిక అధికారులు సాధ్యమైనంత సహాయం అందిస్తున్నారని పేర్కొన్నారు.మృతుల కుటుంబాలకు ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి (పీఎంఎన్ఆర్ఎఫ్) నుంచి 2 లక్షల రూపాయల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. గాయపడిన వారికి 50,000 రూపాయలు అందజేస్తామని ప్రధానమంత్రి తెలిపారు.కాగా, ప్రమాదంలో మృతుల సంఖ్య 9కి చేరింది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. గుర్తుపట్టలేని విధంగా మృతదేహాలు కాలిపోయాయి. బాధితులకు న్యాయం చయాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. చనిపోయిన ఒక్కొక్కరికి కోటి రూపాయల పరిహారం ఇవ్వాలని అంటున్నారు. అలాగే, కుటుంబంలో అర్హులైన వారికి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.మరోవైపు, క్షతగాత్రుల్లో ఆరుగురిని గుర్తించారు. వారి పేర్లు రావూరి మల్లికార్జున రావు, పల్లెల శ్రీనివాసరావు, అప్పారావు, సత్యానంద్ బొల్లా, హరిబాబు, రాజు.మృతుల వివరాలుఉద్యోగులుగొంతిన భాను కుమార్ (టెక్నీషియన్)జి.వి. అప్పారావుఎం. కృష్ణ నాగుకె. ప్రభాకర్ (జనరల్ ఫోర్‌మ్యాన్)గోల్డ్ కుమార్ (మేనేజర్, మెకానిక్-2 ఇన్చార్జ్)కాంట్రాక్ట్ కార్మికులురమణత్రినాథ్ఎన్. అప్పల రాజు


