obesity
-
అది ఒబెసిటీ కాదట..!15 ఏళ్ల తర్వాత..
ఇన్నాళ్లుగా అనుకున్నట్లుగా ఒబెసిటీ అంటే అది కాదట. దశాబ్దాలు అలానే తప్పుగా భావించమని తేల్చి చెప్పారు వైద్యులు. అసలు ఒబెసిటీ అంటే ఏంటో..అందుకు సంబంధించిన సరికొత్త మార్గదర్శకాలను అందించారు నిపుణులు. మరీ ఒబెసిటీ అంటే ఏంటంటే..దశాబ్దాలుగా వైద్యులు ఊబకాయాన్ని(obesity) కొలవడానికి బాడీ మాస్ ఇండెక్స్(బీఎంఐ)(body mass index (BMI))సాధనంగా ఉపయోగిస్తున్నారు. ఇక్కడ బీఎంఐ అనేది వ్యక్తి బరువును కిలోగ్రాముల్లోనూ, ఎత్తు చదరుపు మీటర్లలో భాగించగా వచ్చిన దాన్ని శరీర కొవ్వు కొలతగా నిర్వచించేవారు. దీంతో బీఎంఐ 30 కంటే ఎక్కువ ఉంటే ఊబకాయంగా పరిగణించారు. అయితే కొందరిలో మాత్రం అధిక శరీర కొవ్వు ఉన్నప్పటికీ ఎల్లప్పుడూ 30 కంటే ఎక్కువ బీఎం ఉండదు. అలాంటప్పుడూ రాబోయే ఆరోగ్య ప్రమాదాలు గుర్తించలేమని వైద్యులు చెబుతున్నారు. అదీగాక ప్రస్తుత జనాభా ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య ఊబకాయం. అలాంటప్పుడు కాలం చెల్లిన బీఎంఐలతో బరువు, ఎత్తు నిష్పత్తిలతో అంచనా వేస్తే సరిపోదని పరిశోధనలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ది లాన్సెట్ డయాబెటిస్ అండ్ ఎండోక్రినాలజీ ఒబెసిటీకి సరికొత్త నిర్వచనాన్ని మార్గదర్శకాలను అందించింది. అవేంటంటే..ఊబకాయం అనే అధిక శరీర కొవ్వు. ఇది అనేక వ్యాధులకు కారణమయ్యే దీర్ఘకాలిక వ్యాధి. అలాగే ఇక్కడ బీఎంఐ అనేది శరీర కొవ్వును అతిగా లేదా తక్కువగా అంచనా వేయవచ్చు. అంతే తప్స స్పష్టమైన అంచనా మాత్రం ఇవ్వదు. అందుకని ఈ ఊబకాయాన్ని దీర్ఘకాలిక వ్యాధికి సరిగ్గా సరిపోయేలా అనారోగ్య స్థితిగా నిర్వచించారు. ఇది అవయవాలు, కణజాలల పనితీరుపై నేరుగా ప్రభావం చూపే అధిక కొవ్వుగా పరిగణించారు. దీన్ని బయో ఎలక్ట్రికల్ ఇంపెడెన్స్ లేదా డీఈఎక్స్ఏ స్కాన్లు వంటి ప్రత్యేక యంత్రాలతో కచ్చితంగా నిర్థారించగలమని అన్నారు. అయితే ఇవి ఖరీదైనవి కావడంతో క్లినిక్‌లలో అందుబాటులో లేవు. ఇక ఊబకాయం ఉన్నవారికి శరీరంలో కొవ్వు ఎక్కడ పేరుకుపోయిందనేది ముఖ్యమట. అంటే బొడ్డు చుట్టూ ఉంటే ఇది అనేక అనారోగ్యాలకు దారితీస్తుంది. ప్రస్తుత మార్గదర్శకాలు బెల్లీఫ్యాట్(Belly Fat)ని తీవ్రమైన ఒబెసిటీ పరిగణించమని చెబుతోంది. అలాగే ఆయా వ్యక్తులకు మధుమేహం, గుండె జబ్బులు, కీళ్ల నొప్పులు వంటి ఆరోగ్య సమస్యలు ఉన్నాయనేది కూడా పరిగణలోనికి తీసుకోవాలట. కొత్త మార్గదర్శకాల్లో ఒబెసిటీని రెండు దశల్లో వర్గీకరించారు. దశ1: అవయవ పనితీరుపై లేదా సాధారణ రోజువారీ కార్యకలాపాలపై స్పష్టమైన ప్రభావాలు లేకుండా పెరిగిన కొవ్వు (BMI > 23 kg/m². ఈ దశ ప్రస్తుతం ఎలాంటి అనారోగ్య సమస్యలు చూపించకపోయినా..భవిష్యత్తులో వచ్చే అవకాశం ఉంటుందట. దశ2: బీఎంఐ 23 కిలోలు/మీ2 కంటే ఎక్కువ ఉండి, పొట్ట చుట్టూ కొవ్వు, అధిక నడుము చుట్టుకొలత ఉంటే దీన్ని ఊబకాయంగా పరిగణిస్తారు. ఇది శారీరక అవయవ విధులను ప్రభావితం చేస్తుంది. టైప్2 డయాబెటిస్ వంటి వ్యాధులకు దారితీస్తుంది. ఈ మార్గదర్శకాలను అక్టోబర్ 2022 నుంచి జూన్ 2023 వరకు ఐదు సర్వేలు నిర్వహించి మరీ అందిచినట్లు నిపుణుల చెబుతున్నారు. దాదాపు 15 ఏళ్ల తర్వాత అందించిన ఈ మార్గదర్శకాలు ఆచరణాత్మకమైనవి, అలాగే ఆరోగ్య సమస్యలను ముందస్తుగా గుర్తించి నివారించడానికి ఉపయోగపడతాయని చెప్పారు.(చదవండి: 32 ఏళ్లు ద్వీపంలో ఒంటరిగా బతికాడు! సడెన్‌గా జనాల్లోకి తీసుకురాగానే..) -
రక్తపోటు.. గుర్తించకపోతే స్ట్రోక్ ముప్పు
రక్తపోటు, మధుమేహం, ఊబకాయం వంటి జీవన శైలి జబ్బులు ప్రజారోగ్యానికి పెనుముప్పుగా మారాయి. ఈ సమస్యలు కిడ్నీ, మెదడు, గుండె సంబంధిత పెద్ద జబ్బులకు ప్రధాన కారణమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కేంద్ర ఆరోగ్య శాఖ గణాంకాల ప్రకారం మన దేశంలో 4.58 కోట్ల మంది అధిక రక్తపోటుతో బాధ పడుతున్నారు. వీరిలో 1.17 కోట్ల మంది రాష్ట్రాల ఆరోగ్య శాఖ ద్వారా వైద్యుల పర్యవేక్షణలో మందులు, చికిత్సలు అందుకుంటున్నారు. రక్తపోటు.. హార్ట్, బ్రెయిన్ స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచుతోందని అమెరికన్ హార్ట్ అసోసియేషన్ అధ్యయనంలో తేలింది. అధ్యయనంలో భాగంగా శాస్త్రవేత్తలు అమెరికాలోని 27,310 మంది పెద్దల ఆరోగ్య రికార్డులను 12 ఏళ్లకు పైగా పరిశీలించారు. అధ్యయనంలో పాల్గొన్న వ్యక్తుల సగటు వయస్సు 65 ఏళ్లుగా ఉంది. – సాక్షి, అమరావతి10 కంటే ఎక్కువైతే 20% ప్రమాదం రక్తపోటు సగటు కంటే ఎక్కువయ్యే కొద్దీ స్ట్రోక్ ప్రమాదం పెరుగుతుందని మిచిగాన్ యూనివర్సిటీ న్యూరాలజీ విభాగం గతంలో ఓ అధ్యయనంలో వెల్లడించింది. రక్తపోటు సగటు కంటే 10 ఎంఎం హెచ్‌జీ ఎక్కువగా ఉన్న వారిలో ఇస్కీమిక్ స్ట్రోక్ వచ్చే ప్రమాదం 20 శాతం, ఇంట్రాసెరెబ్రల్ హెమరేజ్ ప్రమాదం 31 శాతం ఎక్కువగా ఉంటుందని కనుగొన్నారు. 31 నుంచి 67 శాతం ఎక్కువ ప్రమాదం సాధారణ వ్యక్తులతో పోలిస్తే ఐదేళ్లు అధిక రక్తపోటు సమస్యతో బాధపడిన వ్యక్తులు స్ట్రోక్ బారిన పడేందుకు 31 శాతం ఎక్కువ అవకాశాలు ఉంటాయని గుర్తించారు. ఆరు నుంచి 20 ఏళ్ల పాటు రక్తపోటు సమస్య ఉన్న వ్యక్తుల్లో 50 శాతం, రెండు దశాబ్ధాలుపైగానే సమస్యతో బాధపడే వ్యక్తుల్లో 67 శాతం ఎక్కువగా స్ట్రోక్‌కు గురయ్యే ప్రమాదం ఉందని అంచనా వేశారు. ఈ నేపథ్యంలో ప్రజలు రక్తపోటు సంబంధిత లక్షణాలను ముందే గుర్తించి జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఇందుకోసం ఆరోగ్యకరమైన జీవనశైలి, ఆహార అలవాట్లు అలవరుచుకోవాలన్నారు. ముందస్తు జాగ్రత్తలు, చికిత్సల ద్వారా రక్తపోటు నియంత్రణలో ఉంచుకుంటే జీవితకాల వైకల్యం ముప్పు తప్పుతుందన్నారు. ప్రస్తుతం ఎటువంటి లక్షణాలు లేకుండానే కొందరిలో రక్తపోటు చాప కింద నీరులా వృద్ధి చెందుతోంది. ఈ నేపథ్యంలో తరచూ రక్త పోటు పరీక్షలు చేయించుకుంటూ, ఉండాల్సినదాని కంటే ఎక్కువ రికార్డు అయితే వెంటనే అప్రమత్తం అవ్వాలని వైద్యులు సూచిస్తున్నారు. జీవన శైలిలో మార్పు రావాలి ఆహారం, నిద్ర, జీవన శైలిపై ప్రతి ఒక్కరూ ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. వ్యాయామాన్ని రోజువారి దినచర్యలో ఓ భాగం చేసుకోవాలి. రోజుకు 30 నిమిషాలు వాకింగ్, జాగింగ్ తప్పనిసరిగా చేయాలి. ఒత్తిడిని దరి చేరనివ్వకుండా చూసుకోవాలి. ప్రస్తుతం స్కూల్ పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరూ చిన్న చిన్న విషయాలకే తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారు. రక్తపోటు, మధుమేహం ఉన్నవారు క్రమం తప్పకుండా వైద్యులను సంప్రదించాలి. వైద్య పరీక్షలు చేయించుకుంటూ సమస్యలను అదుపులో ఉంచుకోవాలి. – డాక్టర్ బి.విజయ చైతన్య, కార్డియాలజిస్ట్, విజయవాడ -
ఉప్పెనలా ఊబకాయం
సత్యసాయి జిల్లా ధర్మవరానికి చెందిన 3వ తరగతి విద్యార్థి 46 కిలోల బరువు ఉన్నాడు. జంక్‌ఫుడ్ అతిగా తినడంతోనే బరువెక్కినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. మిగతా విద్యార్థులతో సమానంగా క్రీడల్లో పాల్గొనలేకపోతున్నట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఊబకాయం కారణంగా చలాకీతనం కోల్పోయాడని అంటున్నారు.రెండు వారాల క్రితం తొమ్మిదో తరగతి చదివే ఓ విద్యార్థి బస్సులో ప్రయాణిస్తూ.. పుట్టపర్తి దాటిన తర్వాత అస్వస్థతకు గురయ్యాడు. తోటి ప్రయాణికులు సాయం చేసి.. సమీపంలోని ఆస్పత్రికి తీసుకెళ్లారు. షుగర్ లెవెల్స్ పడిపోయినట్లు నిర్ధారించారు. ఊబకాయమే సమస్యకు కారణమని వైద్యులు తేల్చారు. బొద్దుగా ఉంటే ముద్దుగా ఉన్నారంటారు. కానీ అధిక భారం అలాగే కొనసాగితే వారికి వారే భారం కావడం ఖాయం. అంతేకాదు పలు అనారోగ్య సమస్యల బారిన పడే ప్రమాదమూ ఉంది. జీవనశైలిలో మార్పుల కారణంగా భవిష్యత్తులో ఊబకాయుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. సాక్షి, పుట్టపర్తి: ఊబకాయం.. ప్రతి వందలో 20 మందిని తీవ్రంగా ఇబ్బంది పడుతున్న సమస్య. శారీరక వ్యాయామం తగ్గటం, ఆహార నియమాలు పాటించకపోవడం, అనారోగ్యకరమైన జీవనశైలి విధానంతో ఇప్పుడు చిన్న, పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరిని ఊబకాయులుగా మారుస్తోంది. బాల్యంలోనే ఊబకాయం వస్తే చలాకీతనం కోల్పోతారు. చిన్న వయసులోనే అనేక మానసిక సమస్యలు ఎదుర్కొంటారు. శారీరకంగా అనేక ఇబ్బందులు పడుతారు. వయసుకు తగిన బరువు ఉంటే చాలని.. అధిక బరువు అనర్థాలకు దారి తీస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఊబకాయల్లో సమస్యలు ఇవే.. ∙ఊబకాయం ఉన్న పిల్లలు సహచరుల నుంచి తరచూ అవహేళనకు గురవుతారు. ఫలితంగా మానసికంగా డిప్రెషన్‌కు లోనయ్యే ప్రమాదం ఉంది. » ఊబకాయం ఉన్న పిల్లలు చలాకీతనం కోల్పోవడం కారణంగా క్రీడల్లో రాణించలేరు. కనీసం అవకాశాలు రావడం కూడా కష్టమే. » అందరితో పాటు వ్యాయామం చేయాలనుకున్నప్పటికీ.. కాసేపటికే అలసిపోతారు. శ్వాస తీసుకోలేక ఇబ్బంది పడుతారు. » మానసిక ఒత్తిడి కారణంగా చదువులో వెనుకబడే అవకాశం ఉంది. విద్యలో ఉన్నత స్థానాలకు వెళ్లడం కష్టమే. » టీనేజీలోకి వచ్చేసరికి మరింత డిప్రెషన్లోకి వెళ్లే ప్రమాదం ఉంది. ఫలితంగా అందరిలో కలవకుండా ఒక్కరే ఉండేందుకు ఇష్టపడతారు. » ప్రీ డయాబెటిస్, హైపర్‌టెన్షన్ చిన్న వయసులోనే దరి చేరుతాయి. ఫలితంగా జీవితాంతం వైద్యుల పర్యవేక్షణలో ఉండాల్సిన పరిస్థితి. » ఊబకాయం కారణంగా స్కిన్, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కూడా సోకే ప్రమాదం ఉంది. ఊబకాయం ఇలా..» జంక్‌ఫుడ్, బయట ఆహారం ఎక్కువగా తీసుకోవడం, పిజ్జా, బర్గర్, నూడిల్స్ తినడం కారణంగా ఊబకాయం వచ్చే ప్రమాదం ఉంది. » జంక్‌ఫుడ్ టేస్ట్ డిఫరెంట్‌గా ఉండటంతో ఎక్కువ మోతాదులో తీసుకుని బరువు పెరుగుతారని వైద్యులు చెబుతున్నారు. » కదలిక లేని జీవన విధానంతో బరువు పెరుగుతున్నట్లు స్పష్టం అవుతోంది. బిజీ షెడ్యూల్లో చాలామంది నడవడం తగ్గించి వాహనాలను వినియోగిస్తున్నారు. » టీవీ, సెల్‌ఫోన్ చూస్తూ.. మోతాదుకు మించి భోజనం తినేస్తున్నారు. ఫలితంగా మనిషి సాధారణం కంటే బరువు పెరిగే అవకాశం ఉంది. » తల్లిదండ్రులు ఊబకాయులైనా పిల్లలకు వచ్చే అవకాశం ఉంటుందని పలు అధ్యయనాలు తేల్చాయి. జన్యుపరమైన కారణాల రీత్యా కూడా ఊబకాయం రావచ్చని అంటున్నారు.ఇలా చేస్తే మేలు.... » జంక్‌ఫుడ్‌ను వీలైనంత వరకు తగ్గించాలి » టీవీ, సెల్‌ఫోన్ చూసే సమయం తగ్గించాలి » క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి » తల్లిదండ్రులు శ్రద్ధతో పిల్లలతో వాయింగ్ చేయించాలి »ఊబకాయం ఉన్న పిల్లలను రెగ్యులర్‌గా హెల్త్ చెకప్ చేయించాలి వ్యాయామం తప్పనిసరిఊబకాయం ఉన్న వారిలో షుగర్ లెవెల్స్ అదుపులో ఉండవు. అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్ కారణంగా ఇతర అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. వారంలో రెండు , మూడుసార్లు జంక్‌ఫుడ్ తింటే ఊబకాయం వచ్చే అవకాశం ఉంది. బయటి ఆహారం తినడమూ కారణంగా చెప్పవచ్చు. పిల్లల బరువు పెరుగుతున్నట్లు గుర్తిస్తే తల్లిదండ్రులు వారిని క్రమం తప్పకుండా వాకింగ్‌కు తీసుకెళ్లాలి. జంక్ ఫుడ్ బదులు ఆరోగ్యకర ఆహారం తీసుకునేలా చేయాలి. – డాక్టర్ ప్రతాప్, హిందూపురం జీవనశైలి మార్పులతో.. జంక్ ఫుడ్ బదులు ప్రత్యామ్నాయం ఆలోచించాలి. నిత్యం వ్యాయామం చేయలేని వారు ఇతర మార్గాల్లో శారీరక బరువు తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. అవతలి వ్యక్తి అవహేళన చేసినప్పుడు డిప్రెషన్‌కు లోను కాకూడదు. పిల్లల బరువు తగ్గే విషయంలో తల్లిదండ్రుల పాత్ర కూడా కీలకం. జీవన శైలిలో మార్పులతో ఊబకాయం నుంచి బయట పడవచ్చు. – డాక్టర్ రాజశేఖర్, గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ -
హై రిస్క్ ప్రెగ్నెన్సీ?!
నేనిప్పుడు ప్రెగ్నెంట్‌ని. రెండో నెల. తొలి చూలు. బరువు 110 కేజీలు ఉన్నాను. చిన్నప్పటి నుంచి ఊబకాయం ఉంది. డాక్టర్‌ను సంప్రదిస్తే బ్లడ్ క్లాట్స్ రిస్క్ ఎక్కువ, హై రిస్క్ ప్రెగ్నెన్సీ అని చెప్పారు. అలా కాకుండా ఏమి చెయ్యాలి. కొన్ని మందులు రాశారు. అవి వాడొచ్చా? – మనీషా, బెంగళూరుకాళ్లల్లోని డీప్ వీన్స్లో బ్లడ్ క్లాట్స్ ఫామ్ అయ్యే చాన్స్ ప్రెగ్నెన్సీలో చాలా ఎక్కువ. దీనిని డీప్ వీన్ థ్రాంబోసిస్ (డీవీటీ)అంటారు. ఈ క్లాట్ కనుక రక్తనాళాల్లోకి వెళ్తే చాలా ప్రమాదం. ఇవి కొంతమందికి ఊపిరితిత్తులు, గుండెలోకీ మూవ్ అవుతుంటాయి. బ్లడ్ థిక్ కావడం వల్ల ఈ క్లాట్స్ ఫామ్ అయ్యే ప్రమాదం ఉంటుంది. కొంతమందిలో ఇతరత్రా మెడికల్ ప్రాబ్లమ్స్ వల్ల చాలా నెమ్మదిగా రక్తప్రసరణ జరుగుతుంది. బ్లడ్ క్లాటింగ్ ప్రోటీన్స్ ఎక్కువ ఉంటే, రక్తం చిక్కనవుతుంది. జనరల్ సర్జరీ తర్వాత కూడా శరీరంలో ఈ ప్రోటీన్స్ పెరుగుతాయి. వీటన్నిటి దృష్ట్యా.. కొంతమందికి ప్రెగ్నెన్సీ తొలి వారల్లోనే బ్లడ్ థిన్నర్స్ వాడాల్సి వస్తుంది. అలాంటి వారికి రిస్క్ ఎక్కువ ఉంటుంది. అధిక బరువు అంటే, బాడీ మాస్ ఇండెక్స్ 35 లేదా అంతకంటే ఎక్కువ, వయసు 35 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ, వ్యక్తిగతæ లేదా ఫ్యామిలీ హిస్టరీలో బ్లడ్ క్లాట్స్, స్ట్రోక్ ఉన్నవారు, ఏపీఎల్ఏ సిండ్రోమ్ అనే వ్యాధితో బాధపడుతున్నవారు, సివియర్ వెరికోస్ వీన్స్ ఉన్నవారు, బెడ్ రెస్ట్‌లో ఉన్నవారికి ఈ రిస్క్ ఎన్నో రెట్లు పెరుగుతుంది. బ్లడ్ క్లాట్ ఉన్నప్పుడు కాలులో నొప్పి , వాపు ఉంటాయి. ఊపిరితిత్తుల్లో బ్లడ్ క్లాట్ ఉంటే ఆయాసం, దగ్గు, ఛాతీ నొప్పి వంటివి ఉంటాయి. ప్రెగ్నెన్సీలో ఇలాంటి లక్షణాలు ఎప్పుడు కనిపించినా వెంటనే ఎమర్జెన్సీ డాక్టర్ని కలవాలి. లంగ్ స్కాన్, లోయర్ లింబ్ డాప్లర్ స్కాన్ ద్వారా క్లాట్స్ని కనిపెడ్తారు. అయితే కొన్ని జాగ్రత్తలు పాటించి.. కాళ్లల్లో క్లాట్స్ రాకుండా చూసుకోవచ్చు. ఇంట్లో, ఆఫీసులో ఒకే చోట కూర్చోకుండా, గంటకు ఒకసారి అయిదు నిమిషాలు వాకింగ్ చేయాలి. మంచం మీద పడుకున్నప్పుడు కూడా మోకాళ్లు, కాళ్లు కదుపుతూ ఉండాలి. తగినన్ని నీళ్లు తాగుతూ డీహైడ్రేషన్ రాకుండా చూసుకోవాలి. రిస్క్ జోన్లోఉన్నవారికి వీటితో పాటు రిస్క్ అసెస్మెంట్ చేసి, మందులు కూడా ఇవ్వడం జరుగుతుంది. కంప్రెషన్ స్టాకింగ్స్ లాంటివి కూడా బాగా ఉపయోగపడతాయి. బ్లడ్ థిన్ కావడానికి ఏ్ఛp్చటజీn జీn్జ్ఛఛ్టిజీౌnటఅనేవి ఉంటాయి. డాక్టర్ పర్యవేక్షణలో ఇస్తారు. డైలీ తీసుకోవాలి. వీటిని ఎప్పుడు, ఎలా తీసుకోవాలి, ఎప్పుడు ఆపాలి అనేది డాక్టర్ డిసైడ్ చేస్తారు. వీటి వలన బ్లడ్ క్లాట్ రిస్క్ బాగా తగ్గుతుంది. ఇవి గర్భస్థ శిశువుకేమీ ప్రమాదం కలిగించవు. -
ఊబకాయంతో గుండెకు ముప్పు
ఆధునిక జీవన శైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి... అన్ని వయసుల వారిపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి. వెరసి కొన్ని అనారోగ్య, దీర్ఘకాలిక సమస్యలు చుట్టుముడుతున్నాయి. ఇందులో ఊబకాయం కూడా ఆ కోవకు చెందినదే. వివిధ జబ్బులకు కారణమవుతున్న ఈ సమస్య మరణాల ముప్పును కూడా పెంచుతోంది. ఊబకాయుల్లో గుండె జబ్బుల మరణాలు గడచిన రెండు దశాబ్దాల్లో గణనీయంగా పెరిగినట్టు అమెరికన్ హార్ట్ అసోసియేషన్ అధ్యయనంలో వెల్లడైంది. 1999 నుంచి 2020 నాటికి ఊబకాయంతో ముడిపడి ఉన్న గుండె జబ్బుల మరణాల రేటు సుమారు 180 శాతం పెరిగినట్టు నిర్ధారించారు. పురుషుల మరణాల రేటులో పెరుగుదల అధ్యయనంలో భాగంగా ఊబకాయ సంబంధిత ఇస్కిమిక్ గుండె జబ్బుతో ముడిపడిన 2.26 లక్షల మరణాలపై పరిశోధన నిర్వహించారు. 1999లో ప్రతి లక్ష మంది పురుషుల్లో 2.1గా మరణాలు రేటు ఉన్నట్టు గుర్తించారు. ఇది 2020నాటికి 243 శాతం పెరిగి 7.2కు చేరుకున్నట్టు వెల్లడించారు. అదేవిధంగా మహిళల్లో 1999లో ప్రతి లక్ష మందికి 1.6గా ఉన్న మరణాల రేటు... 131 శాతం పెరిగి 2020 నాటికి 3.7కు చేరుకుంది. అధ్యయనంలో గుర్తించిన అంశాల ఆధారంగా ఇస్కిమిక్ హార్ట్ స్ట్రోక్‌కు ఊబకాయం తీవ్రమైన ప్రమాదకారిగా నిర్ధారించారు. బరువు పెరుగుతున్న కొద్దీ గుండె జబ్బుల ప్రమాదం వృద్ధి చెందుతోందని అధ్యయనంలో పాల్గొన్న డాక్టర్ అలీనా మోహ్సిన్ తెలిపారు. ఏమిటీ ఇస్కిమిక్ హార్ట్ డిసీజ్ గుండెకు రక్తం సరఫరాలో ఏర్పడే ఇబ్బందిని ‘ఇస్కిమిక్ హార్ట్ డిసీజ్’ అంటారు. దీనికి పొగతాగడం, బీపీ, షుగర్, రక్తంలో కొలె్రస్టాల్, ఊబకాయం ప్రధాన కారణం. గుండెకు రక్తం సరఫరా అయ్యే నాళాల్లో అడ్డంకులు ఏర్పడినప్పుడు కొన్ని రోజులకు గుండె కండరం క్రమేణా క్షీణిస్తూ... దెబ్బతింటుంది. ఈ డ్యామేజ్ శాశ్వతంగా అవ్వకముందే గుర్తించి వైద్యం చేస్తే ప్రాణాపాయ పరిస్థితులను అరికట్టవచ్చు. యాంజియోగ్రామ్ పరీక్ష ద్వారా రక్తనాళాల్లో అడ్డంకులను వైద్యులు గుర్తిస్తారు. అడ్డంకులు ఉన్నట్లయితే అవసరమైన మేరకు చికిత్స చేయడం, స్టెంట్ వేయడం ద్వారా సమస్యను పరిష్కరించవచ్చు. ]ప్రతి ముగ్గురు ఊబకాయుల్లో ఇద్దరి మృతికి గుండె జబ్బే కారణంప్రపంచవ్యాప్తంగా గడిచిన నాలుగు దశాబ్దాల్లో ఊబకాయుల సంఖ్య రెట్టింపు అయ్యింది. దీంతో ప్రతి ముగ్గురు ఊబకాయుల్లో ఇద్దరి మరణాలకు గుండె జబ్బులే ప్రధాన కారణమని ఇటీవల ఓ అధ్యయనం వెల్లడించింది. ఊబకాయుల్లో గుండె వైఫల్యం, ఆకస్మిక గుండెపోటు, ధమనుల గోడల్లో కొవ్వు పేరుకుపోవడం, రక్తం గడ్డ కట్టడం, గుండె కొట్టుకోవడంలో అసమతుల్యత ప్రమాదాలు ఉన్నట్టు ఆ సర్వేలో గుర్తించారు. సాధారణ బరువున్న వారితో పోలిస్తే ఊబకాయుల్లో టైప్–2 డయాబెటీస్ బారినపడే ప్రమాదం మూడు రెట్లు అధికమని పేర్కొన్నారు. 20–49 ఏళ్ల వయసున్న పురుషుల్లో 78 శాతం, మహిళల్లో 65 శాతం అధిక రక్తపోటుకు బాడీమాస్ ఇండెక్స్(బీఎంఐ) ఎక్కువగా ఉండటమే కారణమని గుర్తించారు. -
ఎత్తుకు తగ్గా బరువు ఉంటున్నారా..?
ఉండాల్సినదాని కంటే ఎక్కువ బరువు ఉండటం ఆరోగ్యానికి మేలు చేయదని అనేక మార్లు రుజువైంది. ఇటీవల ఇరవై వేర్వేరు అధ్యయనాల్లో దాదాపు పదివేలమంది స్థూలకాయం ఉన్నవారితో పాటు సాధారణ బరువున్న మరో మూడు లక్షలమందిపై నిర్వహించిన అధ్యయనాల్లో ఇది మరో మారు వాస్తవమని తేలింది. మామూలు బరువున్నవారితో పోలిస్తే స్థూలకాయులలో మరణాల రేటు 2.5 రెట్లు అధికమని ‘లాస్’ అనే మెడికల్ జర్నల్ పేర్కొంటోంది. బరువు పెరుగుతున్న కొద్దీ గుండెజబ్బులు, కేన్సర్లు, పక్షవాతం, డయాబెటిస్, కిడ్నీ జబ్బులు, కాలేయ సమస్యలు వచ్చి అవి మృత్యువుకు దారితీయవచ్చని పరిశోధకులు పేర్కొంటున్నారు. అందుకే ఎవరి ఎత్తుకు తగినట్టు బరువును అదుపులో పెట్టుకోవడం చాలా అవసరం. (చదవండి: డ్యూటీకి.. టిక్.. టిక్..కానీ బాడీ క్లాక్ బీట్ వినండి ప్లీజ్..!) -
బరువు తగ్గాలనుకుంటున్నారా? బనానా స్టెమ్ జ్యూస్ ట్రై చేశారా?
మనిషి ఆరోగ్యానికి మేలు చేసే ఔషధ గుణాలకు మూలం ప్రకృతి. కానీ చాలావరకు ప్రకృతి సహజంగా లభించే మూలికల గురించి మొక్కల గురించి నేటి తరానికి అవగాహన కరువుతోంది. ఈ నేపథ్యంలో అలాంటి వాటి గురించి తెలుసు కోవడం, అవగాహన పెంచుకోవడం, ఆచరించడం చాలా ముఖ్యం.అలాంటి వాటిల్లో ఒకటి అరటి పండు. అరటిపండులో అద్భుత గుణాలు ఉన్నాయి. ఇందులోని పోషక గుణాలు పిల్లలకీ, పెద్దలకీ చాలా మేలు చేస్తాయి. ఒకవిధంగా అరటి చెట్టులో ప్రతీ భాగమూ విలువైనదే. అరటి ఆకులను భోజనం చేసేందుకు వాడతారు. దీన్ని ఎంతో పవిత్రంగా భావిస్తారు. కార్తీక మాసంలో కార్తీక దీపాలను పెట్టేందుకు అరటి దొప్ప ఆధ్యాత్మికంగా చాలా విలువైంది. ఇక అరటి పువ్వుతో పలు రకాల వంటకాలు తయారు చేస్తారు. కానీ అరటి కాండంలోని ఔషధ గుణాల గురించి చాలామంది తెలియదు. వాటి గురించి తెలుసుకుందాం.అరటిపండులో పొటాషియం, విటమిన్ బి6, మెగ్నీషియం, విటమిన్ సి, కాపర్, ఐరన్, మాంగనీస్, కార్బోహైడ్రేట్స్, ఫైబర్స్, ఇతర ఖనిజాలు, సూక్ష్మ పోషకాలు పుష్కలంగా ఉన్నాయి.అధిక స్థాయి చెడు కొలెస్ట్రాల్‌కు చెక్ చెప్పవచ్చు.ఇందులో కేలరీలు తక్కువ. ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. దీని వాడటం వల్ల దీర్ఘకాలంలో మలబద్ధకం , కపుడు అల్సర్లను నివారించడంలో ఉపయోపడుతుంది.ఈ జ్యూస్‌లో విటమిన్ బి6 పుష్కలంగా ఉండటం వల్ల హిమోగ్లోబిన్ కౌంట్ పెరుగుతుంది. ఇందులో పొటాషియం కూడా లభిస్తుంది.కిడ్నీలో రాళ్లతో బాధపడుతున్నవారికి ఇది సంజీవని లాంటిదని చెప్పవచ్చు. ఇందులోని పొటాషియం , మెగ్నీషియం రాళ్లను నివారిస్తుంది.కిడ్నీల పనితీరును మెరుగుపరుస్తుంది.కొలెస్ట్రాల్, అధిక రక్తపోటుకు కూడా మంచిది. గుండె జబ్బులను కూడా అడ్డుకుంటుంది. శరీరంలోని మలినాలు బయటికి పంపింస్తుంది. అధిక బరువు సమస్యకు కూడా చెక్‌పెడుతుంది.బరువు తగ్గడానికి ప్రతిరోజూ 25 గ్రా నుండి 40 గ్రా అరటి కాండం జ్యూస్‌ను తీసుకోవచ్చు.అరటి కాండం రసం శరీరంలోని ఇన్సులిన్ స్థాయిలను నియంత్రించడంలో పనిచేస్తుంది కాలేయాన్ని శుభ్రపరుస్తుంది. జీర్ణ వ్యవస్థ నుంచి అసిడిటీ వరకూ చాలా సమస్యలు దూరమవుతాయి..యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్కు కూడా పనిచేస్తుంది. శరీరంలోని ట్యాక్సిన్‌ని బయటికి పంపి మూత్ర నాళాన్ని శుభ్రపరచడానికి సాయపడుతుంది.అరటి కాండం ఆకుపచ్చ పొరను తీసివేసి, లోపల కనిపించే తెల్లటి కాండాన్ని చిన్న ముక్కలుగా కట్ చేసి, 15 నిమిషాలు ఉడకబెట్టి, రోజుకు రెండుసార్లు సేవించ వచ్చని నిపుణులు చెబుతున్నారు. కొన్ని చోట్ల తొట్టెల్లో అరటి కాండాన్ని ఊరబెట్టి, ఆ నీటిని వడపోసి ఔషధంగా వాడతారు. శుభ్రం చేసి కట్ చేస్తే మజ్జిగలో నానబెట్టి ఫ్రిజ్ లో నిల్వ ఉంచుకోవచ్చు.దక్షిణ థాయ్‌లాండ్‌లో, తీపి , పుల్లని కూరగాయల సూప్ లేదా కూరలో సన్నగా తరిగిన అరటి కాడను కలుపుతారు. సైడ్ ఎఫెక్ట్స్ పెద్దగా దుష్ప్రభావాలను కలిగి లేనప్పటికీ, అలెర్జీ, కడుపు నొప్పి, వాంతులు, అలర్జీ రావొచ్చు. ఒక్కోసారి లే కాలేయం, మూత్రపిండాలకు హాని కలిగించే అవకాశంఉంది. అయితే, వ్యక్తి వైద్య చరిత్ర , అరటి కాండం పరిస్థితి మీద ఆధారపడి ఉంటుంది. ఏదైనా రూపంలో తినేటప్పుడు లేదా త్రాగేటప్పుడు మితంగా ఉండాలి. నోట్: అవగాహనకోసం అందించిన సమాచారం మాత్రమే .వైద్య నిపుణుడు, పోషకాహార నిపుణుడు లేదా డైటీషియన్‌ను సంప్రదించడం చాలా ముఖ్యం. -
టెక్కీ.. వెయిటెక్కీ
ఎక్కువ పనివేళలు టెకీలను ఊబకాయులుగా మారుస్తున్నాయా?! అనే సందేహానికి ‘అవును’ అనే సమాధానం సాఫ్ట్వేర్ రంగం నుంచి వస్తోంది. ఈ విషయంపైన ‘చైనీస్ ఇన్స్టాగ్రామ్ జియాహోంగ్షులో వా΄ోతున్న యువతుల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంద’ని సౌత్ చైనా మార్నింగ్ ΄ోస్ట్ వెల్లడి చేసింది. టెకీ ఉద్యోగçస్తులు ఎదుర్కొంటున్న సమస్యలు అన్ని దేశాల్లోనూ ఒకేలా ఉంటున్నాయి. ఈ సమస్యను అధిగమించడానికి నిపుణులు చెబుతున్న సూచన లు ΄ాటిద్దాం..చైనాలోని ఓయాంగ్ వెన్జింగ్ అనే 24 ఏళ్ల యువతి ఉద్యోగంలో ఒత్తిడి కారణంగా గత ఏడాది కాలంలో 20 కేజీల బరువు పెరిగిందని సౌత్ చైనా మార్నింగ్ ΄ోస్ట్ వెల్లడించింది. ‘నా శారీరక, మానసిక ఆరోగ్యానికి సాఫ్ట్వేర్ ఉద్యోగం ఒక విపత్తుగా మారింది. ఎక్కువ పని గంటలు, మారుతూ ఉండే షిప్ట్ వేళల కారణంగా ఆహారం తీసుకోవడంలో అపసవ్యత చోటు చేసుకునేది. దీంతో ఏడాది కాలంలో 60 కేజీల నుంచి 80 కేజీల బరువు పెరిగాను. ఇలా అయితే నా ఆరోగ్య పరిస్థితి ఏమవుతుందో అని జూన్‌లో ఉద్యోగం మానేశాను. అప్పటి నుంచి నా ఆరోగ్యంలో మెరుగైన మార్పులు వచ్చాయి’ అని ఇన్‌స్టాలో ΄ోస్ట్ చేసింది ఓయాంగ్. ఆమె ఇప్పుడు ఫ్రీలాన్స్ వెయిట్‌లాస్ ఇన్ఫ్లుయెన్సర్గా మారింది. తన ఆహారంలో కూరగాయలు, ధాన్యాలు, ్ర΄ోటీన్లను చేర్చుతూ 6 కిలోల బరువు తగ్గానని తెలిపింది. ఓయాంగ్ అనుభవం చెప్పడంతో ఆమెలాంటి వ్యక్తులు తమ పని కష్టాలను పంచుకోవడానికి ముందుకు వచ్చారు. చైనాలోనే కాదు ఏ దేశంలోనైనా సాఫ్ట్వేర్ ప్రపంచంలో పనిచేసే టెకీలందరికీ ఇది వర్తిస్తుంది. మానసికమైన అలసట ‘పని ఒత్తిడి కారణంగా డిజర్ట్‌లను అతిగా తినడం వల్ల నెల రోజుల్లోనే 3 కిలోల బరువు పెరిగాను’ అని తన అనుభవాన్ని ఇన్‌స్టా ద్వారా పంచుకుంది మరో టెక్ ఉద్యోగిని 33 ఏళ్ల షాంఘై.. అతిగా ఆకలిఎక్కువ గంటలు పనిచేయడం అనేది పని సంబంధిత ఒత్తిడికి ప్రధాన కారణాలలో ఒకటి. ఈ పరిస్థితి సందడిగా ఉండే నగరాల్లో ఆందోళనకరమైన ధోరణిగా మారుతోంది. వర్క్ షిప్ట్ వల్ల సరైన నిద్ర వేళలు ఉండవు. దీంతో కార్టిజోల్ హార్మోన్ పెరుగుతుంది. ఆరోగ్యానికి మేలు చేసే మెలటోనిన్ తగ్గి΄ోతుంది. లేట్‌నైట్స్ మేల్కొని ఉండటం వల్ల ఆకలి పెరగడంతో ఫుడ్ తెప్పించుకుని తింటారు. దీంతో కదలికలు ఉండవు. ఇక వర్క్‌ఫ్రమ్ హోమ్ వచ్చాక పడుకొని వర్క్ చేసే వారున్నారు. దీంతో వారి శరీరంలో ఏ ఆర్గాన్ అయితే బలహీనంగా ఉంటుందో దానిపైన త్వరగా ప్రభావం పడుతుంది. తినే వేళలు సరి చేసుకోవాలిచైనాలో పని సంస్కృతి ముఖ్యంగా టెక్ పరిశ్రమలో వారానికి ఆరు రోజుల ΄ాటు ఉదయం 9 నుండి రాత్రి 9 గంటల వరకు ఉంటుంది. న్యూట్రిషన్ విభాగానికి చెందిన డాక్టర్ జువో జియోక్సియా హెల్త్ టైమ్స్‌తో మాట్లాడుతూ ‘ఆలస్యంగా భోజనం చేయడం, అతిగా తినడం, నిద్రలేమి, ‘అధిక పని ఊబకాయానికి దారితీస్తుందని చె΄్పారు. ఈ సమస్యను అధిగమించాలంటే ఎక్కువ కూరగాయలు, తక్కువ మాంసాహారం తీసుకోవాలి. అంతేకాదు, తినే వేళలను సక్రమంగా ΄ాటించాలి. ఆరోగ్యంగా ఉండటానికి జీవనశైలిలో వ్యాయామాన్ని తప్పనిసరిగా చేర్చుకోవాలి’ అని సూచిస్తోంది. ఈ సమాచారం టెకీలందరికీ వర్తిస్తుంది.అరకేజీ ఫ్రూట్ –వెజ్ సలాడ్వయసులో ఉన్నప్పుడు పని, జీతం అన్నీ బాగానే అనిపిస్తాయి. అయితే, సరైన జీవన శైలి ΄ాటించక΄ోతే నలభై దాటిన దగ్గర నుంచి ప్రతి ఐదేళ్లకు ఆరోగ్యం దెబ్బతింటూ ఉంటుంది. సాఫ్ట్వేర్ ఉద్యోగుల్లో జుట్టు రాలే సమస్య ఎక్కువ చూస్తుంటాం. లుక్ కోసం అవసరం లేని కాస్మటిక్ ట్రీట్మెంట్లు చేయించుకుంటారు. లుక్ కాదు ఆరోగ్యమే ప్రధానమని గుర్తించాలి. పని ఒత్తిడిని అధిగమించడానికి మెడిటేషన్ ఔషధంలా పనిచేస్తుంది. ∙నిద్ర వేళలు సరిగ్గా చూసుకోవాలి. 6–8 గంటలు నిద్రకు కేటాయించుకోవాలి. ∙వ్యాయామం తప్పనిసరిగా ఉండాలి. ∙టైమ్‌కి ఆహారం తీసుకోవాలి. దీంతో΄ాటు ఫ్రూట్ సలాడ్, వెజ్ సలాడ్ రోజు వారీ ఆహారంలో చేర్చుకోవాలి. దీనివల్ల కొవ్వు పెరగదు. అతిగా ఆకలి అవడం ఉండదు. – డాక్టర్ జానకి, ΄ోషకాహార నిపుణులు -
బెల్లీ ఫ్యాట్‌తో ఇబ్బంది పడుతున్నారా? ఈ తప్పులు అస్సలు చేయకండి!
ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే దాకా ఉరుగుల పరుగుల జీవితం. ఏం తింటున్నామో, ఎలా తింటున్నామో కూడా పట్టించుకోని పరిస్థితి. ఫలితంగా ఒత్తిడి, ఆందోళనకు తోడు, పొట్ట, పిరుదుల్లో బాగా కొవ్వు చేరడం, ఊబకాయం వెరసి అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. అన్నింటికంటే బెల్లీ ఫ్యాట్ అనేది తీవ్ర సమస్యగా పరిణమిస్తోంది. అధిక బరువు లేదా పొట్ట పెరగడానికి గల కారణాలను తెలుసుకుందాం!పౌష్టికాహారం లోపించడం, సమయానికి భోజనం చేయకపోవడం, ఒకేచోట గంటలతరబడి కూర్చోడం, ఆఫీసులో ఎక్కువసేపు కూర్చోని పని చేయడం వంటి అలవాట్లు ఈ సమస్యను మరింత తీవ్రం చేస్తాయి. హార్మోన్లు, ఆహారం, వివిధ కారకాలు పొత్తికడుపు కొవ్వును ప్రభావితం చేస్తాయి. ప్రొటీన్, ఫైబర్ ఎక్కువగా లభించే ఆహారాలు కాకుండా కొవ్వు, సుగర్ ఎక్కువగా పదార్థాలను తీసుకోవడం. వీటన్నింటితోపాటు జీవనశైలి విషయంలో కొన్ని తప్పులు కూడా బరువు పెరిగేందుకు కారణం అవుతున్నాయి.రోజులో అతి కీలకమైన అల్పాహారం మానేయడం ఒక కారణం. అల్పాహారం తీసుకోకపోవడం వల్ల మీ జీవక్రియ దెబ్బతింటుంది. మీ బరువు తగ్గాలంటే అల్పాహారం తప్పకుండా తీసుకోవాలని సూచిస్తున్నారు. అల్పాహారం రాజులా , మధ్యాహ్న భోజనం యువరాజులా , రాత్రి భోజనం పేదలా తినాలి అనేది పెద్దల మాట.సమయానికి తినకపోవడం పెద్ద తప్పు అయితే, ఇష్టం వచ్చినట్టు ఉపవాసాలు ఉండటం మరో తప్పు. సమయం ప్రకారం తినడంతోపాటు ప్రొటీన్, ఫైబర్‌తో నిండిన ఆహారంపై శ్రద్ధ పెట్టాలి. భోజనానికి, భోజనానికి మధ్యలో పండ్లు తీసుకోవాలి. ముఖ్యంగా రాత్రి భోజనంలో ఎక్కువ కొవ్వు పదార్థాలు కాకుండా, ఫైబర్ ఉండే ఆహారం తీసుకోవాలి. దీంతో జీర్ణక్రియ సులభమవుతుంది. బరువు కూడా అదుపులో ఉంటుంది. రాత్రి భోజనం చేసిన నిద్రకు ఉపక్రమించడం కూడా పొత్తికడుపు కొవ్వు పెరగడానికి కారణమవుతుంది. రాత్రి భోజనం తరువాత కనీసం 10-20 నిమిషాల నడక అటు జీర్ణక్రియకు, ఇటు బరువు నియంత్రణకు సాయపడుతుంది.వీటన్నింటి కంటే ప్రధానమైంది. తగినంత నిద్ర పోవడం ఆరోగ్యానికి కీలకం. మనిషి రోజుకు 6-7 గంటల నిద్ర అవసరం. తగినంత నిద్ర పోనివారు రోజువారీ ఎక్కువ కేలరీలు తీసుకుంటారని అధ్యయనాల ద్వారా తెలుస్తోంది. సరిపడినన్ని నీళ్లు తాగడం కూడా చాలా కీలకం. అలాగే ధూమపానం, మద్యపానం లాంటి దురలవాట్లకు దూరంగా ఉండాలి. వాకింగ్, జాకింగ్, యోగా లాంటి వ్యాయామాలను క్రమం తప్పకుండా చేస్తూ ఉంటే బెల్లీ ఫ్యాట్‌కు దూరంగా ఉండటమేకాకుండా, మంచి ఆరోగ్యం కూడా మన సొంతమవుతుంది.నోట్: ఇవి కేవలం అవగాహన కోసం అందించిన సమాచారం మాత్రమే. వేరే ఇతర అనారోగ్య కారణాలతో కూడా పొట్ట పెరిగే అవకాశం ఉంది. ఈ తేడాను గమనించి సరైన వైద్య పరీక్షలు చేయించుకొని, చికిత్స తీసుకోవడం ఉత్తమం. -
ఆ ఒక్కటీ తప్ప.. ఉల్లితో చాలా ప్రయోజనాలు
ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా భారతీయ వంటకాల్లో కనిపించే వాటిల్లో చాలా ముఖ్యమైంది ఉల్లిపాయ. పసుపు, తెలుపు , ఎరుపు రంగుల్లో ప్రత్యేకమైన ఘాటైన రుచి, వాసనతో లభిస్తుంది. దాదాపు అన్ని కూరల్లో దీన్ని విరివిగా వాడతాం. అయితే పచ్చిగా తీసుకోవడం వల్ల కూడా ఉల్లితో చాలా ఔషధ ప్రయోజనాలున్నాయి. ‘ఉల్లి చేసిన మేలు తల్లి అయినా చేయదు’ అన్నట్టు దీంతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు దాగున్నాయి. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా, గుండె జబ్బులు, కొలెస్ట్రాల్ సమస్య , షుగర్ తదితర సమస్యలకు చక్కటి పరిష్కారం ఉల్లి.ఇందులో క్రోమియం షుగర్ స్థాయిలనుఅదుపులో ఉంచేందుకు ఉపయోగపడుతుంది. ఉల్లిపాయను 7 రోజుల పాటు క్రమం తప్పకుండా తింటే అద్భుతమైన ఫలితాలు పొందవచ్చని వైద్య నిపుణులు వెల్లడిస్తున్నారు.రోగనిరోధక శక్తిని పెంచుతుందిపచ్చి ఉల్లిపాయల్లో విటమిన్ సీ అధికంగా లభిస్తుంది. ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. ఇంకా డిప్రెషన్ నుంచి బయట పడవచ్చు. దగ్గు, జలుబు, ఫ్లూ లాంటి వాటికి సహజసిద్ధమైన ఔషధంగా పనిచేస్తుంది. ఇందులోని యాంటీ బయోటిక్ గుణాలతో సీజనల్ వ్యాధుల నుంచి రక్షణ లభిస్తుంది. గుండె ఆరోగ్యానికి మంచిదిఉల్లిపాయలలో క్వెర్సెటిన్ వంటి యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది. రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. తద్వారా అధిక రక్తపోటు ముప్పు కూడా తగ్గుతుంది.జీర్ణక్రియలో పచ్చి ఉల్లిపాయలలో డైటరీ ఫైబర్ జీర్ణక్రియకు ఊతమిస్తుంది. శరీరం నుండి వ్యర్థాలను తొలగిస్తుంది. ఫైబర్ పోషకాల శోషణను పెంచుతుంది మలబద్ధకం, ప్రకోప ప్రేగు సిండ్రోమ్ , హేమోరాయిడ్స్ వంటి వివిధ వ్యాధులను నివారిస్తుంది.వాపును తగ్గిస్తుందిక్వెర్సెటిన్ అధికంగా ఉండే పచ్చి ఉల్లిపాయల్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి, ఇవి శరీరంలో మంట స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి. ఇది ఆర్థరైటిస్, ఆస్తమా, బ్రాంకైటిస్ వ్యాధులకు ఉపశమనానికి అందిస్తుంది.ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందిఉల్లిపాయలు ఎముకల ఆరోగ్యాన్ని పెంపొందించడానికి దోహదపడే సల్ఫర్-రిచ్ కాంపౌండ్స్ పుష్కలంగా లభిస్తాయి. ఇవి కాల్షియం శోషణను ప్రోత్సహించి, బోలు ఎముకల వ్యాధి ప్రమాదాన్ని నివారిస్తుంది.మెదడు పనితీరును పెంచుతుందిపచ్చి ఉల్లిపాయలు సల్ఫర్ సమ్మేళనాలు మెదడులో న్యూరోట్రాన్స్మిటర్ల ఉత్పత్తిని పెంచుతాయి. ఇది మెరుగైన జ్ఞాపకశక్తి, శ్రద్ధ , ఏకాగ్రత పెరగడానికి దోహదపడతాయి.కేన్సర్ నివారణలోపచ్చి ఉల్లిపాయలో సల్ఫర్ , యాంటీఆక్సిడెంట్లు కేన్సర్ నివారణలో సాయపడతాయి. క్వెర్సెటిన్, ఫ్లేవనాయిడ్స్ ,అల్లిసిన్ వంటి సల్ఫర్ సమ్మేళనాలు శరీరంలో కేన్సర్ కణాల పెరుగుదలను అడ్డుకునే యాంటీ-కార్సినోజెనిక్ లక్షణాలను కలిగి ఉంటాయి.చర్మ ఆరోగ్యానికి కూడా పచ్చి ఉల్లిపాయల్లోని అధికంగా లభించే యాంటీఆక్సిడెంట్లు ,విటమిన్ సీ చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు దోహదం చేస్తాయి. ముడతలు, వయసు మచ్చలు , పిగ్మెంటేషన్ స్థాయిలను తగ్గించి, ఆరోగ్యకరమైన , మెరిసే చర్మాన్ని అందిస్తుంది.రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుందిపచ్చి ఉల్లిపాయల్లో రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో కీలకమైన క్రోమియం అనే ఖనిజం ఉంటుంది. క్రోమియం ఇన్సులిన్ సామర్థ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది.ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి దారితీస్తుంది, తద్వారా మధుమేహం ప్రమాదాన్ని తగ్గిస్తుంది.బరువు తగ్గడంలో తక్కువ కేలరీలు , అధిక ఫైబర్ కంటెంట్ ఎక్కువ. అతిగా తినే అవకాశాలను తగ్గిస్తుంది. బరువు తగ్గడానికి దోహదపడుతుంది.నోట్: ఏదైనా మితంగా తీసుకోవడం ఉత్తమం. అధిక వినియోగం జీర్ణక్రియ సమస్యలకు దారితీస్తుంది. ప్రధానంగా పచ్చి ఉల్లిపాయ తింటే నోటి దుర్వాసన వస్తుందనిది గమనించాలి. -
అమ్మాయిల్లో తొలి పీరియడ్స్ : అదే పెద్ద ముప్పు అంటున్నతాజా అధ్యయనం
సాధారణంగా ఆడపిల్లలు 12 నుంచి 14 సంవత్సరాల వయసులో రజస్వల అయ్యేవారు. మారుతున్న జీవన శైలి, ఆహార అలవాట్లు, జన్యుపరమైన కారణాలు, తదితర కారణాల రీత్యా ఈ మధ్య కాలంలోనే చాలా చిన్న వయసులోనే పీరియడ్స్ మొదలై పోతున్నాయి. అంటే దాదాపు 8-10 ఏళ్ల మధ్యే మెచ్యూర్ అవుతుండటాన్ని చూస్తున్నాం. అయితే తొలి ఋతుస్రావం, చిన్నతనంలోని స్థూలకాయంతో ముడిపడి ఉందని తాజా అధ్యయనంలో వెల్లడైంది.హార్వర్డ్ యూనివర్శిటీ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ నేతృత్వంలోని అధ్యయనం ప్రకారం, మొదటి పీరియడ్స్ వచ్చే సగటు వయస్సు 1950-1969 నుండి 2000-2005 వరకు జన్మించిన మహిళల్లో 12.5 సంవత్సరాల నుండి 11.9 సంవత్సరాలకు పడిపోయింది. అమెరికాలోని 70వేల మందికి పైగా యువతులపై ఈ పరిశోధన జరిగింది. అంతేకాదు చిన్నతనంలో రజస్వల కావడం హృదయ సంబంధ వ్యాధులు , కేన్సర్ వంటి ప్రతికూల ఆరోగ్య ప్రమాదం ఎక్కువగా ఉందని ఈ అధ్యయనం కనుగొంది. ది జర్నల్ ఆఫ్ ది అమెరికన్ మెడికల్ అసోసియేషన్ (JAMA) నెట్వర్క్ ఓపెన్‌లో ప్రచురితమైన ఈ అధ్యయనం, జాతులు , సామాజిక వర్గాలలో మహిళల్లో రుతుక్రమ పోకడలను గుర్తించిన తొలి అధ్యయంనంగా పరిశోధకులు పేర్కొన్నారు.ఋతు చక్రాలు సక్రమంగా ఉండేందుకు సమయం పడుతుందని అధ్యయనం వెల్లడించింది. 1950- 1969 మధ్య జన్మించిన వారిలో 76 శాతంమందిలో తొలి పీరియడ్స్ తర్వాత రెండు సంవత్సరాలలోపు రెగ్యులర్ పీరియడ్స్కనిపించగా, 2000- 2005 మధ్య జన్మించిన 56 శాతం మహిళళ్లో మాత్రమే పీరియడ్స్ రెగ్యులర్‌గా వచ్చాయి. ప్రారంభ నెలసరి, దాని కారణాలను పరిశోధనలు కొనసాగించడం చాలా కీలకమని హార్వర్డ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్‌లో పోస్ట్‌డాక్టోరల్ రీసెర్చ్ ఫెలో , సంబంధిత రచయిత జిఫాన్ వాంగ్ తెలిపారు. -
ఒబెసిటీ ఇంత ప్రమాదకరమైనదా? పాపం ఆ వ్యక్తి..!
ఇటీవల కాలంలో చాలామందిని వేధిస్తున్న సమస్య ఒబెసిటీ. ప్రస్తుతం ఉన్న అస్తవ్యస్తమైన జీవన విధానం, కల్తీ ఫుడ్ల కారణంగా టీనేజీ యువత ఈ సమస్యను ఎక్కువగా ఫేస్ చేస్తోంది. కనీసం పెళ్లీడు రాకమునుపే పెద్దవాళ్లలా కనిపించేంత భారీకాయంతో సతమతమవ్వుతున్నారు. అచ్చం అలాంటి సమస్యతోనే అత్యంత లావుగా ఉండే వ్యక్తి మరణించాడు. జస్ట్ 33 ఏళ్లకే కానరాని లోకాలకు వెళ్లిపోయాడు. ఒబెసిటీ ఇంత ప్రమాకమైనదే? లావుగా ఉంటే అంతే సంగతులా..!లావుగా ఉంటే లైఫ్ లాసే అని ఈ వ్యక్తిని చూస్తే అనిపిస్తుంది. ఈ దిగ్బ్రాంతికర ఘటన యూకేలో చోటు చేసుకుంది. బ్రిటన్ నివాసి జాసన్ హోల్డన్ యూకేలోనే అత్యంత లావుగా ఉండే వ్యక్తి. అతడి బరువు ఏకంగా 317 కిలోలు. అతన్ని ఆస్పత్రికి తీసుకువెళ్లడానికి అగ్నిమాపక సిబ్బంది సహాయం తీసుకోవాలట. ఇక అతడు పడుకోవాలన్నా.. ప్రత్యేకంగా రూపొందించిన ఫర్నిచర్‌పై బెడ్‌పై నిద్రిస్తాడు. అతడికి అతిగా తినే అలవాటు చిన్నప్పటి నుంచి ఉంది. అది ఎంతలా ఉందంటే రోజువారీగా ఏకంగా పదివేలకు పైగా కేలరీలు తీసుకునేంత స్థాయిలో ఉంది. అతడి బ్రేక్‌ఫాస్ట్‌లో డోనార్ కబాబ్‌లు తీసుకుంటాడంటే..అతడు ఎంతలా తింటాడో చెప్పాల్సిన పనిలేదు. దీని కారణంగానే ఆరోగ్యం క్షీణించటం మొదలయ్యింది. దీంతో అతను కొన్నాళ్లుగా గదికే పరితం కాగా, క్రమేణ మంచానికే పరిమతమయ్యాడు. ఆ తర్వాత చలనశీలత దెబ్బతింది. మొదట అతడి శరీరంలో కిడ్నీ పనిచేయడం మానేసింది. అలా నెమ్మదిగా మిగతా అవయవాలు వైఫల్యం చెందడం ప్రారంభించడంతో 34వ ఏటాలోకి అడుగుపెట్టడానికి కొన్ని రోజుల ముందే కానరాని లోకాలకు వెళ్లిపోయాడు. అతడు గతేడాది ఒక ఇంటర్వ్యూలో తన సమయం అయిపోయిందని, తాను ఎన్నాళ్లో బతకనని చెప్పేశాడు కూడా. పైగా అలా కాకుండా ఏదైనా చెయ్యాలని ప్రయత్నిస్తున్నట్లు చెప్పుకొచ్చాడు. ఒకసారి 2020లో ప్రమాదవశాత్తు హోల్టన్ మూడవ అంతస్తు నుంచి పడిపోయాడు. పాపం అతడిని రక్షించటానికి ఏకంగా 30 మందికి పైగా అగ్నిమాపక సిబ్బంది, క్రేన్ రంగంలోకి దిగి కాపాడారు. ఆ ఘటనను తలచుకుంటూ అది తన జీవితంలో అత్యంత బాధకరమైన ఘటనగా పేర్కొన్నాడు హోల్డన్. ఆ టైంలో తనను చూసేందుకు పెద్ద సంఖ్యలో వచ్చిన జనాన్ని చూసి చాలా బాధపడడ్డానని అన్నాడు. హోల్డన్ మానసిక స్థితి ఎంతలా మారిపోయిందంటే.. లావుగా ఉండే వ్యక్తులను ఆధారం చేసుకుని తీసిన సినిమాలు సైతం అతడికి భయానక చిత్రాలుగా అనిపించాయి. కనీసం తన అమ్మను కూడా చూడొద్దని కన్నీటి పర్యంతమయ్యాడు. దీన్ని బట్టి చూస్తే.. ఈ అధిక బరువు కారణంగా ఎంతగా ఇబ్బంది పడ్డానేది నేరుగానే తెలుస్తోంది. అతను తరుచుగా ఈ బ్రిటన్ దేశంలో తానే అత్యంత లావుగా ఉన్నవ్యక్తిని అని బాధపడేవాడు. అతడి పోస్ట్‌మార్టం రిపోర్టులో కూడా అధిక బరువు కారణంగా అవయవాల వైఫల్యం చెంది మరణించినట్లు ఉంది. హోల్టన్ ఈ అధిక బరువు కారణంగా స్ట్రోక్‌లు, రక్త గడ్డకట్టడం వంటి పలు రకాల ఆరోగ్య సమస్యలను ఎదుర్కొన్నాడు. అధిక బరువు అనేది ప్రాణాంతకమైన సమస్యే. నిర్లక్ష్యం వహించకుండా ఆరోగ్యకరమైన పద్ధతిలో తగ్గించుకునే యత్నం చేయకపోతే అంతే సంగతులని ఈ ఉదంతమే చెబుతోంది. అందువల్ల కొద్దిపాటి శారీరక శ్రమ, క్యాలరీల తక్కువ ఉన్న ప్రత్యామ్నాయ ఆహారంతో బరువుని అదుపులో ఉంచుకునే యత్నం చేయండి. సుదీర్ఘకాలం ఆరోగ్యంగా జీవించండి.(చదవండి: సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?) -
పొట్ట తగ్గాలంటే.. జిమ్‌కే వెళ్లాలా? ఏంటి?
నేటి ఆధునిక శారీరక శ్రమ బాగా తగ్గిపోయింది. దీనికితోడు జీవనశైలిలో మార్పులు, తీవ్రమైన ఒత్తిడి కారణంగా చాలా మంది ఊబకాయంతో బాధపడుతున్నారు. దీన్ని తగ్గించుకోవడానికి ఉపవాసాలున్నా, జిమ్ చేస్తున్నా ఫలితం కనిపించడం లేదని వాపోతున్న వారిని చూస్తూ ఉంటాం. అలాగే ఏం తిన్నా ఇక్కడికే.. అంటూ హీరోయిన్ సమంతా తరహాలో అద్దముందు నిలబడి డైలాగులుకొట్టే అమ్మాయిలు కూడా చాలామందే ఉన్నారు. ఈ నేపథ్యంలో జిమ్‌కెళ్లకుండానే, ఇంట్లోనే సింపుల్ చిట్కాలతో, ఊబకాయం, బెల్లీ ఫ్యాట్, ఫ్యాటీ బటక్స్ సమస్యకు చెప్పవచ్చు.గంటల తరబడి ఒకే చోట కూర్చుంటే గండమే!గంటల తరబడి టీవీలకు అతుక్కు పోకూడదు. పనిలో పడి అలాగే 8 నుంచి 10 గంటల పాటు కూర్చుని పని చేయకూడదు. ఎక్కువ సేపు ఒకే భంగిమలో కూర్చోవడం వల్ల కొవ్వు పేరుకుపోతోంది. అలాగే కడుపు ఉబ్బరం వస్తుంది. కాబట్టి ప్రతి గంటకు 5 నిమిషాలు విరామం తీసుకోవాలి. మెట్లు ఎక్కడం, గుంజీలు తీయడం లాంటివి చేయాలి. దీంతో అవయవాలకు రక్త ప్రసరణ సవ్యంగా జరుగుతుంది. బరువు అదుపులో ఉంటుంది క్రమం తప్పకుండా వ్యాయామంఉదయం, సాయంత్రం లేదా మీకు వీలైన సమయంలో వేగంగా నడవడం, జాగింగ్, యోగా, సైక్లింగ్, స్విమ్మింగ్ తప్పకుండా చేయాలి. స్నేహితులతో కలిసి మీకు నచ్చిన గేమ్స్ (క్రికెట్, టెన్నిస్, కబడ్డీ,ఇ తర) అవయవాలు పూర్తిగా కదిలేలా ఆడండి. శరీరమంతా చెమట పట్టేదాకా శ్రమిస్తే బాడీలో టాక్సిన్స్ అన్నీ బయటికి పోతాయి.ఎముకలు, కండరాలు బలతంతా తయారవుతాయి. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అతి ముఖ్యమైన డీ విటమిన్ పుష్కలంగా లభిస్తుంది.తగినన్ని నీళ్లు, కంటినిండా నిద్ర: వ్యాయామం చేసేటప్పుడు వీలైనంత ఎక్కువ నీరు త్రాగాలి. ఇది ఆకలిని తగ్గిస్తుంది , బరువును తగ్గించడంలో సహాయపడుతుంది. రోజుకు కనీసం 8 గ్లాసుల నీరు త్రాగాలని ఆరోగ్య నిపుణులు చెబుతారు. నీటిని తాగడం వల్ల పొట్ట, పొత్తికడుపు కొవ్వు తగ్గుతుంది. చక్కటి నిద్ర కూడా మన బరువును ప్రభావితం చేస్తుంది. రోజుకు ఎనిమిది గంటల నిద్ర అవసరం.ఫైబర్ రిచ్ ఫుడ్స్: శరీర బరువు నియంత్రణలో ఉండాలంటే మనం తీసుకునే ఆహారం చాలా ముఖ్యపాత్ర పోషిస్తుంది. బరువు పెరగడం గురించి ఆందోళన మానేసి పౌష్టికాహారాన్ని తీసుకోవాలి.తాజా ఆకుకూరలు, పండ్లు తీసుకోవాలి. రోజువారీ ఆహారంలో ఫైబర్ అధికంగా ఉండే ఆహారాన్ని చేర్చుకోండి, ఈ రకమైన ఆహారాన్ని తినడం వల్ల మీ కడుపు చాలా సేపు నిండుగా ఉంటుంది. అలాగే రాత్రి 7 గంటల లోపు డిన్నర్ కంప్లీట్ చేయాలి. బరువు క్రమంగా తగ్గడం ప్రారంభమవుతుంది.ఇంకా: ఒకేసారి కడుపు నిండా.. ఇక చాలురా బాబూ అనేంతగా తినవద్దు. అలాగే మైదాతో తయారుచేసిన పదార్థాలు, కూల్ డ్రింక్స్, జంక్ ఫుడ్‌కు దూరంగా ఉండాలి. మద్యం, ధూమమానం లాంటి దురలవాట్లకు దూరంగా ఉండాలి. పొట్ట, పిరుదులు, పిక్కలు, భుజాలు లాంటి ప్రదేశాల్లో కొవ్వును కరిగించుకునేందుకు నిపుణుల సలహా మేరకు కొన్ని స్పాట్ రిడక్షన్ ఎక్స్‌ర్‌సైజ్‌లు చేస్తే మంచి ఫలితం ఉంటుంది. యోగాలో కూడా ఇందుకోసం మంచి ఆసనాలు ఉన్నాయి. వాటినా ప్రాక్టీస్ చేయవచ్చు. నిజంగా వీటిని చిత్తశుద్ధిగా ఆచరిస్తే వారంలో బరువు తగ్గడం ఖాయం.నోట్: ఈ సమాచారం అవగాహన కోసం మాత్రమే అని గమనించగలరు. ఏదైనా అనారోగ్య సమస్యలున్న వారు వైద్యులను సంప్రదించడం ఉత్తమం. -
దాల్చిన చెక్కతో ఊబకాయం, బెల్లీ ఫ్యాట్ నిజంగా తగ్గుతుందా?
సకల రోగాలకు మూలం ఒబెసిటీ. ఉండాల్సిన దానికంటే ఎక్కువ బరువుంటే అనేక అనారోగ్య సమస్యలు చుట్టుముడతాయి. అందుకే అధిక బరువును తగ్గించుకునేందుకు చాలామంది నానా కష్టాలు పడుతూ ఉంటారు. జీవనశైలి మార్పులు, ఆహారఅలవాట్లుమార్చుకోవడంతోపాటు, కొన్ని ప్రత్యేక పదార్థాలను కూడా ప్రయత్నిస్తూ ఉంటారు. అలాంటి వాటిల్లో బాగా వినిపిస్తున్నది దాల్చిన చెక్క. శరీరంలో కొవ్వును కరిగించడానికి దాల్చిన చెక్క నీరు, కషాయం, టీ బాగా ఎఫెక్టీవ్‌గా పని చేస్తుందని నమ్ముతారు. దాల్చిన చెక్క ఆకలిని నియంత్రిస్తుంది. జీవక్రియను పెంచడంలో సహాయపడుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడే హార్మోన్ ఇన్సులిన్కుసరిగ్గా పనిచేసేలా చేస్తుంది. కొన్ని అధ్యయనాలు దాల్చినచెక్కను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గించవచ్చని కూడా సూచిస్తున్నాయి.దాల్చిన చెక్క నీటిని తాగడం వల్ల ఈజీగా వెయిట్ లాస్ అవ్వొచ్చు. ముఖ్యంగా దీంట్లో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు, యాంటీ ఆక్సిడెంట్లు శరీంలోని మలినాలను బయటకు పంపుతాయి. దాల్చిన నీరు తాగడం వల్ల శరీరం మెటబాలిజం పెరుగుతుంది. దీంతో వెయిట్ లాస్ అయ్యేందుకు చక్కగా పని చేస్తుంది. ప్రతి రోజూ ఉదయం దాల్చిన చెక్క నీళ్లు తాగడం వల్ల బరువు తగ్గొచ్చు.శరీరంలో చెడు కొలెస్ట్రాల్ త్వరగా కరుతుంది. ఫలితంగా స్థూలకాయం, అధిక బరువును తగ్గించుకోవచ్చు. ఈ వాటర్ తాగడం వల్ల ఇతర ఆరోగ్య ప్రయోజనాలు కూడా చాలా ఉన్నాయి.దాల్చిన చెక్కలో అనేక యాంటీ ఇన్ఫ్లమేటరీ సమ్మేళనాలు వాపు తగ్గించడం ఆర్థరైటిస్ వంటి దీర్ఘకాలిక వ్యాధులకు సహాయపడుతుంది. మెదడు ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తుంది. సాధారణ జలుబు, ఫ్లూ, వార్మ్ ఇన్ఫెక్షన్లు, ఫంగల్ ఇన్ఫెక్షన్లు, ఫుడ్ పాయిజనింగ్ వంటి ఇన్ఫెక్షన్లను నిర్వహించడంలోసహాయపడుతుంది. గవద జ్వరం వంటి అలర్జీ సమస్యల నివారణలో దాల్చిన చెక్క ఉపయోగ పడుతుంది. పురుషులలో అంగస్తంభన సమస్యతోపాటు, స్పెర్మ్ కౌంట్ పెంచుతుంది. మహిళల్లో ఇర్రెగ్యులర్ పీరియడ్స్ సమస్యకు పని చేస్తుంది. నోట్: అందరికీ ఈ చిట్కా మనచేస్తుందని చెప్పలేం. కానీ కచ్చితంగా కొన్ని ప్రయోజనాలు న్నాయి. అయితే ఆరోగ్యకరమైన జీవన శైలి, క్రమం తప్పని, వ్యాయామం బరువు తగ్గడంలో కీలక పాత్ర పోషిస్తాయిని మాత్రం మర్చిపోకూడదు. -
కొలెస్ట్రాల్ నియంత్రణలోకి రావడం లేదా? ఇలా ట్రై చేయండి!
ఊబకాయం, లేదా ఒబెసిటీ అనేక రోగాలకు మూలం. శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగితే ఆరోగ్య సమస్యలు కూడా తలెత్తు తాయి. అందుకే వయసు, ఎత్తుకు తగ్గట్టు బరువును, కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడం చాలా అవసరం. అయితే వెయిట్ లాజ్ జర్నీ అనుకున్నంత ఈజీకాదు. దీనికి పట్టుదల, జీవన శైలి మార్పులు, తగిన వ్యాయామం తప్పనిసరి. ఈ క్రమంలో చెడు కొలెస్ట్రాల్‌కి చెక్ చెప్పే కొన్ని సహజమైన జ్యూసెస్ గురించి తెలుసుకుందాం. కరివేపాకు: ప్రతి వంటలోనూ కరివేపాకును ఉపయోగించడం మనకు బాగా అలవాటు. శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో కరివేపాకు చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మంచి కొలెస్ట్రాల్పెరగడానికి దోహదపడతాయి. ప్రతిరోజూ కరివేపాకు రాసం తాగడం వల్లన కొలెస్ట్రాల్ నియంత్రణకు బాగా ఉపయోగపడుతుంది. అయితే ఈ రసం తయారుచేసుకునే ముందు, ఆకులను శుభ్రంగా కడగాలి. చీడపీడలు లేని ఆకులను తీసుకోవాలి. కొత్తిమీర: వంటలకు మంచి రుచిని, సువాసనను అందించడంలో కొత్తిమీర తరువాతే ఏదైనా. ఆహారం రుచిని మెరుగుపరచడంతో పాటు ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కూడా ఎంతో మేలు చేస్తుంది. దీన్ని క్రమం తప్పకుండా తీసుకోవడం ద్వారా అధిక కొలెస్ట్రాల్ సమస్యను నయం చేసుకోవచ్చు. కొత్తిమీర ఆకులను సలాడ్‌లో చేర్చుకోవచ్చు. కొత్తిమీర రసం రక్త వృద్ధికి బాగా పనిచేస్తుంది. నేరేడు ఆకులు : మధుమేహాన్ని అదుపులో ఉంచడంలో నేరేడు పళ్లు, గింజలు బాగా పనిచేస్తాయని ఆయుర్వేదం చెబుతోంది. అయితే కొలెస్ట్రాల్‌ను అదుపులో ఉంచడంలో కూడా ఇది బేషుగ్గా పనిచేస్తుంది. యాంటీఆక్సిడెంట్ ఆంథోసైనిన్ వంటి లక్షణాలు వీటిల్లో మెండుగా ఉన్నాయి. ఇదిసిరల్లోపేరుకుపోయిన కొవ్వును తగ్గించడానికి పని చేస్తుంది. జామున్ ఆకులను శుభ్రంగా ఎండ బెట్టి పొడి రూపంలో తీసుకోవచ్చు. లేదా టీ లేదా డికాషన్ తయారు చేసి రోజుకు 1-2 సార్లు త్రాగవచ్చు. మెంతి ఆకులు: మెంతి కూరలో చాలా ఔషధ గుణాలున్నాయి. ట్రైగ్లిజరైడ్స్, చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రిస్తుంది. అధిక కొలెస్ట్రాల్‌ను తగ్గించడానికి మెంతి ఆకులను తినవచ్చు. జ్యూస్ రూపంలో తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్, ఊబకాయం లాంటి సమస్యలకు చక్కటి పరిష్కారం లభిస్తుంది. తులసి ఆకులు : తులసి పవిత్రమైందిగా భావిస్తాం. దీని ఆకులు, జలుబు, గొంతు నొప్పినివారణలో బాగా పనిచేస్తుంది. అలాఏగ కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడంలో తులసి ఆకులు చాలా ప్రయోజనకరం. జీవక్రియ ఒత్తిడిని తగ్గిస్తుంది. ప్రతి ఉదయం ఖాళీ కడుపుతో తులసి ఆకులను శుభ్రంగా కడిగి తింటే నోటికి, ఒంటికి కూడా చాలా మంచిది. అలోవెరా: కలబందప్రయోజనాల గురించి ఎంత చెప్పినా తక్కువే. సౌందర్యపోషణలో, ఆరోగ్య రక్షణలోనూ ఇది చక్కటి ఔషధం. ఉదయాన్నే ఖాళీ కడుపుతో అలోవెరా గుజ్జును తీసుకుంటే కొలెస్ట్రాల్ మాయమైపోతుంది. శరీరంలోని ఇతర అనారోగ్యాలకు కూడా ఇది దివ్యౌషధం. పైన పేర్కొన్న వాటి అన్నింటిలో కావాలంటే కొత్తిగా తేనెను యాడ్ చేసుకోవచ్చు. నోట్: ఈ సూచనలు అన్నీ అవగాహన కోసం మాత్రమే. వైద్యులు, ఆయుర్వేద నిపుణుల పర్యవేక్షణలో చికిత్స తీసుకోవడం ఉత్తమం. -
లావొక్కింత మితిమీరె!
ప్రపంచం లావెక్కిపోతోంది. అన్ని దేశాల్లోనూ కలిపి స్థూలకాయుల సంఖ్య ఇప్పటికే అక్షరాలా 100 కోట్లు దాటేసింది! 1990 నుంచే వీరి సంఖ్యలో ఏకంగా నాలుగు రెట్ల పెరుగుదల నమోదైంది. మూడు దశాబ్దాల క్రితం దాకా పెద్దల్లోనే ఎక్కువగా కని్పంచిన ఊబకాయ సమస్య ఇప్పుడు చిన్నారుల్లో కూడా పెరిగిపోతుండటం ఆందోళన కలిగిస్తోంది. మారుతున్న జీవన శైలి, ఆహారపు అలవాట్లు, ఆధునిక జీవితపు ఒత్తిళ్లతో పాటు పౌష్టికాహార లోపం కూడా దీనికి ప్రధాన కారణమేనని తాజా అధ్యయనంలో తేలింది. మొత్తమ్మీద ప్రపంచవ్యాప్తంగా 2022 నాటికే వయోజనుల్లో ఊబకాయుల సంఖ్య 88 కోట్లు దాటింది. అలాగే టీనేజీ లోపు వయసు వారిలోనూ 16 కోట్ల పై చిలుకు ఊబకాయంతో బాధపడుతున్నారు. టోంగా, నౌరు, సమోవా తదితర దేశాల్లో మూడొంతులకు పైగా జనం ఊబకాయులేనట! 1990 నుంచి 2022 మధ్య పలు గణాంకాలు తదితరాల ఆధారంగా అధ్యయనం సాగింది. ఈ జాబితాలో అమెరికా కూడా పురుషుల్లో పదో స్థానంలో, మహిళల్లో 36వ స్థానంలో నిలిచింది. ఈ దేశాల్లో అనారోగ్యకరమైన ఆహారపుటలవాట్లే సమస్యకు ప్రధాన కారణమని తేలినట్టు అధ్యయన బృంద సభ్యుడు ప్రొఫెసర్ మజీద్ ఎజాటి వెల్లడించారు. మరోవైపు తక్కువ బరువుతో బాధపడుతున్న వారి సంఖ్యలో 50 శాతం తగ్గదల నమోదైంది. కాకపోతే నిరుపేద దేశాలు, సమాజాల్లో ఇది ఇంకా ప్రబల సమస్యగానే ఉందని అధ్యయనం పేర్కొంది. భారత్‌లోనూ ఊబకాయుల సంఖ్య 8 కోట్లు దాటినట్టు వెల్లడించింది. తక్షణం మేల్కొనాలి... ఒకప్పుడు ప్రధానంగా పెద్దవాళ్లలోనే కన్పించిన స్థూలకాయ సమస్య ఇప్పుడు స్కూలు వయసు చిన్నారుల్లోనూ ప్రబలమవుతుండటం చాలా ఆందోళనకరమని ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ గేబ్రయేసస్ అన్నారు. చిన్న వయసులోనే గుర్తించి అరికట్టాల్సిన అవసరాన్ని తాజా సర్వే మరోసారి నొక్కిచెప్పిందని చెప్పారు. ఇందుకోసం ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు కూడా పెద్ద ఎత్తున ముందుకు రావాల్సి ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఆరోగ్యకరమైన ఆహారం, నియమిత వ్యాయామాలు తదితరాలను జీవన శైలిలో భాగంగా మార్చుకోవడం తప్పనిసరన్నారు. పలు దేశాల్లో ప్రధానంగా పౌష్టికాహార లోపమే స్థూలకాయానికి దారి తీస్తోందని అధ్యయనంలో పాలుపంచుకున్న మద్రాస్ డయాబెటిస్ రీసెర్చ్ ఫౌండేషన్‌కు చెందిన డాక్టర్ గుహా ప్రదీప అభిప్రాయపడ్డారు. వాతావరణ మార్పులు, కొవిడ్ కల్లోలం, ఉక్రెయిన్ యుద్ధం వంటివన్నీ సమస్యను మరింత జటిలం చేస్తున్నాయని వివరించారు. ‘‘ఇవి ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఖరీదైన వ్యవహారంగా మార్చేస్తున్నాయి. ఫలితంగా చాలా దేశాల్లో ప్రజలకు చాలీచాలని, నాసిరకం ఆహారం అందుతోంది’’ అని ఆవేదన వెలిబుచ్చారు. ఇలా చేశారు... ► అధ్యయనంలో 1,500 మందికి పైగా రీసెర్చర్లు పాలుపంచుకున్నారు. ► ఎన్సీడీ రిస్క్ ఫ్యాక్టర్ కొలాబరేషన్ పేరిట వీరంతా ప్రపంచ ఆరోగ్య సంస్థతో పని చేశారు. ► ప్రపంచవ్యాప్తంగా 190కి పైగా దేశాల నుంచి ఐదేళ్ల పైబడ్డ 22 కోట్ల మందికి పైగా ప్రజల ఎత్తు, బరువు తదితర శారీరక కొలతలను సేకరించారు. ► ఊబకాయాన్ని నిర్ధారించేందుకు బాడీ మాస్ ఇండెక్స్‌ను ఆధారంగా తీసుకున్నారు. గణాంకాలివీ... ► ప్రపంచవ్యాప్తంగా వయోజనుల్లో 88 కోట్లు, టీనేజీ, ఆ లోపు వారిలో దాదాపు 16 కోట్ల మంది ఊబకాయులున్నారు. ► వయోజన ఊబకాయుల్లో 50 కోట్లకు పైగా పురుషులు కాగా 38 కోట్ల మంది స్త్రీలు. ► 1990లో వయోజనుల్లో ఊబకాయుల సంఖ్య 20 కోట్ల లోపే ఉండేది. ► వారిలో స్త్రీలు 13 కోట్లు కాగా 7 కోట్ల మందికి పైగా పురుషులుండేవారు. భారత్‌లోనూ... భారత్ కూడా ఊబకాయ సమస్యతో బాధపడుతోంది. ముఖ్యంగా మహిళల్లో ఈ సమస్య బాగా పెరుగుతుందటం ఆందోళన కలిగిస్తోంది. వయోజన మహిళల్లో ఊబకాయులు 1990లో కేవలం 1.2 శాతముండగా 2022 నాటికి ఏకంగా 9.8 శాతానికి పెరిగారు. పురుష జనాభాలో ఊబకాయుల సంఖ్య 0.5 శాతం నుంచి 5.4 శాతానికి పెరిగింది. మొత్తమ్మీద 2022 నాటికి దేశవ్యాప్తంగా 4.4 కోట్ల మహిళలు, 2.6 కోట్ల మంది పురుషులు ఊబకాయంతో బాధపడుతున్నారు. ఇక దేశవ్యాప్తంగా 5–19 ఏళ్ల మధ్య వయసు్కన్న పిల్లల్లో దాదాపు 1.25 కోట్ల మంది ఊబకాయులేనని అధ్యయనంలో తేలింది. 75 లక్షలతో వీరిలో అబ్బాయిల సంఖ్యే ఎక్కువ. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఊబకాయానికి విరుగుడీ మాత్ర!
స్లిమ్‌గా, ఫిట్‌గా ఉండాలని ఎవరు కోరుకోరు? కానీ తినే తిండిపై సరైన కంట్రోల్ లేకపోతే ఈజీగా బరువు పెరుగుతారు. ఈరోజుల్లో వయసుతో సంబంధం లేకుండా చాలామంది ఒబెసిటీతో బాధపడుతున్నారు. ఎంత నోరు కట్టేసుకుందామనుకున్నా కళ్లముందు టేస్టీ వంటలు కనిపిస్తే తినకుండా ఉండటం కష్టమే. అందుకే ఏమీ తినకపోయినా తిన్న ఫీలింగ్ కలిగించే ట్యాబ్లెట్స్ను సైంటస్టులు తయారుచేశారు. ఇది ఆకలిని తగ్గించడమే కాకుండా, బరువును అదుపులో ఉంచుతుందట. ఏంటీ ట్యాబ్లెట్? ఎప్పుడు వేసుకోవాలి? అన్న ఇంట్రెస్టింగ్ విశేషాలు మీ కోసం.. సాధారణంగా మనం కడుపునిండా భోజనం చేశాక ఇక చాలు.. అనేలా మెదడుకు సంకేతాలు వెళ్తాయి. ఇవి ఇన్సులిన్, సి-పెప్టైడ్, పైయ్, జిఎల్పి-1 వంటి హార్మోన్లను విడుదల చేస్తాయి. దీంతో కడుపునిండిన ఫీలింగ్ కలిగి తినడం మానేస్తాం. అయితే ఇదే పద్దతిని కృత్రిమంగా చేసి ఆకలిని తగ్గించొచ్చు అంటున్నారు MIT సైంటిస్టులు. అదెలా అంటే.. తిన్న తర్వాత మామూలుగానే పొట్ట కాస్త ముందుకు సాగుతుంది. దీన్ని కృత్రిమంగా అనుభూతి పొందేలా వైబ్రేటింగ్ ఇన్జెస్టిబుల్ బయోఎలక్ట్రానిక్ స్టిమ్యులేటర్ (VIBES)అనే పిల్‌ను సైంటిస్టులు రూపొందించారు. తినడానికి ముందే ఈ ట్యాబ్లెట్ వేసుకోవడం ద్వారా కడుపునిండట్లుగా వైబ్రేషన్ కలుగుతుంది. ఇది ఆర్టిఫిషియల్‌గా మెదడుకు హార్మోన్లను పంపిస్తుంది. ఈ ప్రయోగాన్ని తొలుత పందుల్లో ప్రయోగించారు. ఆహారం తినడానికి 20 నిమిషాల ముందు వాటికి పిల్స్ ఇవ్వగా సాధారణం కంటే 40% తక్కువగా తిన్నాయని, బరువు కూడా నియంత్రణలో ఉన్నట్లు కనుగొన్నారు. ఇది ఒబెసిటీకి బెస్ట్ ట్రీట్మెంట్లా పనిచేస్తోందని సీనియర్ సైంటస్ట్ గియోవన్నీ ట్రావెర్సో అభిప్రాయపడ్డారు. పిల్లో రూపొందించిన చిన్న సిల్వర్ ఆక్సైడ్ బ్యాటరీతో నడిచే వైబ్రేటింగ్ సిస్టమ్ ద్వారా భోజనానికి ముందు, ఆ తర్వాత ఆన్, ఆఫ్ చేసుకునే వెసలుబాటు కూడా ఉందని వివరించారు. -
2023లో జనం సెర్చ్‌చేసిన వ్యాధులు.. వంటింటి చిట్కాలు ఇవే!
2023వ సంవత్సరం కొద్దిరోజుల్లో ముగియబోతోంది. ఇటువంటి సందర్భంలో గడచిన కాలాన్ని ఒకసారి నెమరువేసుకోవడం సహజం. ఈ ఏడాది గూగుల్‌లో కొన్ని వ్యాధులకు సంబంధించిన వివరాల కోసం కొందరు వెదికారు. అలాగే ఈ వ్యాధుల నివారణకు ఇంటి చిట్కాల కోసం కూడా శోధించారు. వీటిలో కొన్ని ఎఫెక్టివ్ హోం రెమెడీలపై నమ్మకాన్ని వ్యక్తం చేశారు. 2023లో చాలామంది గూగుల్‌లో సెర్చ్ చేసిన టాప్-5 వ్యాధులు లేమిటో వాటి నివారణకు ఉపయుక్తమయ్యే సులభ ఉపాయాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 1. అధిక కొలెస్ట్రాల్ ఈ సంవత్సరం చాలామంది అధిక కొలెస్ట్రాల్ నివారణకు ఇంటి చిట్కాల కోసం చాలా శోధించారు. నిజానికి, కొలెస్ట్రాల్ పెరగడం అనేది సాధారణ సమస్యగా మారుతోంది. ఈ కారణంగానే గుండె జబ్బులు పెరిగే అవకాశం ఉంది. అయితే కొన్ని గృహచిట్కాలు ధమనులలో పేరుకుపోయిన వ్యార్థాలను క్లియర్ చేసేందుకు దోహదపడతాయి. కొత్తిమీర నీరు, సెలెరీ టీ, ఫైబర్ అధికంగా ఉండే కొన్ని ఆహారాలు అధిక కొలెస్ట్రాల్‌ను నివారించడంలో ఉపయుక్తమవుతాయి. 2. మధుమేహం మధుమేహం అనేది జీవనశైలి వ్యాధి. దీనితో చాలామంది సతమతమవుతున్నారు. ఈ వ్యాధి నివారణకు చక్కెరను తీసుకోకూడదు. మధుమేహం నివారణకు కొన్ని ఇంటి చిట్కాలు దోహదపడతాయి. ఓట్స్ తీసుకోవడం లాంటివి మధుమేహాన్ని నియంత్రించేందుకు ఉపకరిస్తాయి. అలాగే ఉసిరి రసం, మెంతులు తీసుకోవడం కూడా మధుమేహం నియంత్రణకు సహాయపడుతుంది. 3. అధిక యూరిక్ యాసిడ్ అధిక యూరిక్ యాసిడ్ సమస్య నివారణకు ఆనపకాయ రసం లేదా బార్లీ నీటిని తాగడం ఉత్తమం. నీరు, పీచు సమృద్ధిగా ఉన్న ఆహారపదార్థాలను తీసుకోవడం యూరిక్ యాసిడ్ సమస్యను తగ్గించడంలో సహాయపడుతుంది. 4. హై బీపీకి హోం రెమెడీ అధిక బీపీ నివారణకు చాలామంది గృహ వైద్యం కోసం గూగుల్‌లో శోధించారు. హైబీపీని అదుపులో ఉంచేందుకు తగినంత నీటిని తాగడం ఉత్తమం. అలాగే నిమ్మరసం, ఫెన్నెల్ టీ కూడా చక్కగా పనిచేస్తుంది. హైబీపీ నివారణకు ఈ ఎఫెక్టివ్ విధానాలను ప్రయత్నించవచ్చు. 5. ఊబకాయం ఊబకాయాన్ని తగ్గించడంలో కొన్ని హోం రెమెడీస్ ప్రభావవంతంగా పనిచేస్తాయి. బొప్పాయి తినడం వల్ల ఊబకాయం తగ్గుతుంది. గోరువెచ్చని నీటిలో తేనె కలిపి తాగడం వల్ల ఊబకాయం తగ్గుతుంది. అంతే కాకుండా పసుపు కలిపిన నీరు తాగడం వల్ల కూడా ఊబకాయం అదుపులో ఉంటుంది. ఇది కూడా చదవండి: 2023లో కశ్మీర్‌ను ఎంతమంది సందర్శించారు? -
లైఫ్ స్టయిల్ మారుద్దాం..!
ఈ రోజుల్లో...ఏం తింటున్నాం, ఎలా ఉంటున్నాం!? పిల్లలు ఎలా ఎదుగుతున్నారు? ఉరుకుల పరుగుల జీవనంలో ఇవన్నీ సహజమే అని వదిలేస్తే ..‘భవిష్యత్తు తరాలు ఎదుర్కొనే సమస్యలు అన్నీ ఇన్నీ కావు’ అంటున్నారు లీ హెల్త్ డొమైన్ డైరెక్టర్ లీలారాణి. ఆరోగ్య విభాగంలో న్యూట్రాస్యు టికల్, ఫుడ్ సప్లిమెంట్ ఉత్పత్తుల పరిశోధన, అభివృద్ధిపై దృష్టిపెట్టే ఈ సంస్థ ద్వారా మన జీవనవిధానం వల్ల ఎదుర్కొనే సమస్యలకు మూలకారణాలేంటి అనే విషయంపై డేటా సేకరించడంతో పాటు, అవగాహనకు కృషి చేస్తున్నారు. హెల్త్ అండ్ వెల్నెస్, సీఐఐ ఇండియన్ ఉమెన్ నెట్వర్క్ ఏపీ చాంబర్స్, విశాఖపట్నం జోన్ చెయిర్ పర్సన్‌గానూ ఉన్న లీలారాణి మహిళలు, పిల్లల ఆరోగ్య సమస్యలపై డేటా వర్క్, బేసిక్ టెస్ట్‌లు చేస్తూ తెలుసుకుంటున్న కీలక విషయాలను ఇలా మన ముందుంచారు.. ‘‘ప్రస్తుత జీవన విధానం, తీసుకునే ఆహారం వల్ల పిల్లలకు ఎలాంటి దీర్ఘకాలిక జబ్బులు వస్తున్నాయి అనే అంశం ప్రస్తావనకు వచ్చినప్పుడు స్కూళ్లవైపుగా డేటా సేకరించాలనుకున్నాం. ముందు 8–10 ఏళ్ల పిల్లలకు స్కూళ్లలో ఇటీవలప్రారంభించాం. ఊర్జాప్రాజెక్టులో భాగంగా బేసిక్ న్యూట్రిషన్ ఫోకస్డ్ ఫిజికల్ ఎగ్జామినేషన్స్ చేస్తున్నాం. ఈ టెస్ట్ ద్వారా పిల్లల్లో .. ఆహారానికి సంబంధించిన సమస్యలు ఏమన్నాయి, తల్లిదండ్రులు– కుటుంబ సభ్యులతో, స్నేహితులతో ఎంత సమయం గడుపుతున్నారు, శారీర చురుకుదనం, డిజిటల్ ఎక్స్పోజర్ ఎలా ఉంది, నిద్ర సమస్యలు ఏంటి.. ఇలా కొన్నింటితో ఒక ప్రశ్నాపత్రం రూపొందించాం. పిల్లల దగ్గర సమాధానాలు తీసుకొని, వాటిలో ప్రధాన సమస్యలపై ఫోకస్ పెట్టాం. ఆంధ్రా, తెలంగాణలోని స్కూళ్లలో పెద్ద స్థాయిలో డేటా తీసుకోవాలని ప్రారంభించాం. ఇప్పుడైతే 200 మంది పిల్లలతో విశాఖపట్నంలో ఈ డేటా మొదలుపెట్టాం. 8–15 ఏళ్ల వయసులో .. పిల్లలతో కలిసి రోజువారి జీవనవిధానం గురించి చర్చించినప్పుడు ‘మా పేరెంట్స్ బిజీగా ఉంటారు. వాళ్లు డిజిటల్ మీడియాను చూస్తారు, మేమూ చూస్తాం.’ అని చెబుతున్నారు. ఈ వయసు పిల్లలు సోషల్ మీడియాలో అకౌంట్స్ ఉండటమే కాకుండా, చురుకుగా ఉంటున్నారు. కారణం అడిగితే – ‘అమ్మనాన్నలను ఏదైనా విషయం గురించి అడిగితే చెప్పరు. అందుకని డిజిటల్లో షేర్ చేసుకొని తెలుసుకుంటాం’ అంటున్నారు. తెలియని వ్యక్తులతో పరిచయాలు ఈ విధంగా పెంచుకుంటూ సమస్యలు తెచ్చుకుంటున్నారు. ఫిజికల్ యాక్టివిటీకి సంబంధించి స్కూళ్లలో ఎలాంటి గేమ్స్ ఉన్నాయి, ఇంటి బయట ఎలా ఉంటున్నారు,.. అనేది కూడా ఒక డేటా తీసుకుంటున్నాం. 8–15 ఏళ్ల లోపు పిల్లల్లో ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువ లేకపోవడం వల్ల వారు యంగేజ్కు వచ్చేసరికి సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని గుర్తించాం. ఊబకాయమూ సమస్యే ఎగువ మధ్యతరగతి పిల్లల్లో ఊబకాయం అనేది ప్రధాన సమస్యగా ఉంది. డబ్యూహెచ్ఓ సూచించిన టెస్ట్‌లు చేసినప్పుడు ఈ విషయాలు గుర్తించాం. వాటిలో శారీరక చురుకుదనం లోపించడమే ప్రధానంగా కారణంగా తెలుసుకున్నాం. బయట జంక్ ఫుడ్ నెలలో ఎన్ని సార్లు తీసుకుంటున్నారు అనేదానిపైన రిపోర్ట్ తయారుచేశాం. పిల్లల నుంచి సేకరించిన రిపోర్ట్‌ను ఆ స్కూళ్లకు ప్రజెంట్ చేస్తున్నాం. ఆ రిపోర్ట్‌లో ‘మీ స్కూల్ కరిక్యులమ్‌లో చేర్చదగిన అంశాలు అని ఓ లిస్ట్ ఇస్తున్నాం. వాటిలో, చురుకుదనం పెంచే గేమ్స్‌తో పాటు న్యూట్రిషన్ కిచెన్, గార్డెనింగ్.. వంటివి ఒకప్రాక్టీస్గా చేయించాలని సూచిస్తున్నాం. ముందుగా 40 ఏళ్ల పైబడినవారితో.. రెండేళ్ల క్రితం ఒక కార్పోరేట్ సెక్టార్లో దాదాపు పది వేల మందికి (40 ఏళ్లు పైబడినవారికి) ఎన్జీవోలతో కలిసి బిఎమ్డి టెస్ట్ చేశాం. వీరిలో బోన్డెన్సిటీ తక్కువగా ఉండటమే కాకుండా, మానసిక ప్రవర్తనలు, నెగిటివ్ ఆలోచనలు, స్ట్రెస్ ఇండెక్స్, బ్లడ్ ప్రెజర్, కొలెస్ట్రాల్.. వంటివి దేని వల్ల వస్తున్నాయి అనేది తెలుసుకున్నాం. నిజానికి 60 ఏళ్ల పైబడి న వారి బోన్ డెన్సిటీ బాగుంది. కారణం, ఆ రోజుల్లో వారు చేసే శారీరక శ్రమయే కారణం. ఇప్పుడది తగ్గిపోయింది. పరిష్కారాలూ సూచిస్తున్నాం.. ఎక్కడైతే టెస్ట్‌లు చేశామో, వారి జీనవవిధానికి తగిన సూచనలూ చేస్తున్నాం. ఆరోగ్య సమస్యలు ఏవి అధికంగా వస్తున్నాయో తెలుసుకుని, వాటిని పరిష్కరించుకునే విధానాలను సూచిస్తున్నాం. చాలావరకు ఈ వయసు వారిలోనూ ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం వల్లే సమస్యలు. ముఖ్యంగా కార్పొరేట్ సెక్టార్ నుంచి ఈ సమస్య అధికంగా ఉంది. పని ప్రదేశంలో శరీర కదలికలు లేకపోడం, అక్కడి వాతావరణం, స్క్రీన్ నుంచి వచ్చే సమస్యలు, డిజిటల్ ఎక్స్పోజర్.. వీటన్నింటినీ ఒక్కొక్కరి నుంచి తీసుకొని వారికి తగిన సూచనలు ఇస్తూ వచ్చాం. సమస్యలు ఎక్కువ ఉన్నవారి బాల్య దశ గురించి అడిగితే మరికొన్ని ఆసక్తికర విషయాలు తెలిశాయి. బాల్య దశ కీలకం పెద్దవాళ్లలో సమస్యలు గమనించినప్పుడు వారి బాల్య దశ కీలకమైందని గుర్తించాం. దీంతో పిల్లల్లోనే ముందుగా సమస్యను పరిష్కరిస్తే మంచిదని, పిల్లల్లో పరీక్షలు చేసినప్పుడు వారిలో బోన్డెన్సిటీ సమస్య కనిపించింది. దీని గురించి డాక్టర్లతో చర్చించినప్పుడు మూల కారణం ఏంటో తెలిసింది. ఒకప్పుడు గ్రామాల్లో పిల్లలు పరిగెత్తడం, గెంతడం, దుమకడం.. వంటివి చాలా సహజసిద్ధంగా జరిగిపోయేవి. వారి ఆటపాటల్లో శారీరక వ్యాయామం చాలా బాగుండేది. అది ఈ రోజుల్లో లేదు. క్రీడలు కూడా వృత్తిపరంగా ఉన్నవే తప్ప ఆనందించడానికి లేవు. ఒక స్ట్రెస్ నుంచి రిలీవ్ అయ్యే ఫిజికల్ యాక్టివిటీ రోజులో ఇన్ని గంటలు అవసరం అనేది గుర్తించి, చెప్పాలనుకున్నాం. భవిష్యత్తులో రాబోయే ఆరోగ్యసమస్యలను భరించడం కన్నా ముందే జాగ్రత్తపడటం మంచిది. మధ్య తరగతే కీలకం మధ్యతరగతి, దానికి ఎగువన ఉన్న పిల్లల్లో శారీరక చురుకుదనం లోపం ఎక్కువ కనిపించింది. వారి ఎముక సామర్థ్యం బలంగా లేకపోతే భవిష్యత్తులో ఎన్నో ఆరోగ్యసమస్యలను ఎదుర్కోక తప్పదు. పిల్లలు ఎదిగే దశలో వారి ఆహారం, అలవాట్లు బాగుండేలా చూసుకోవాలి. ఈ విషయంలో కార్పొరేట్ కన్నా ప్రభుత్వ స్కూళ్లలో పిల్లలు బాగానే ఉన్నారు. ఈ అన్ని విషయాలపై ఇంకా చాలా డేటా సేకరించాల్సి ఉంది. ముందు మానసిక సమస్యలు అనుకోలేదు. కానీ, సైకలాజికల్ సమస్యలు చాలా ఎక్కువ ఉన్నాయి. కుటుంబంలో ఉన్నవారితో సరైన ఇంటరాక్షన్స్ తగ్గిపోయినట్టుగా తెలుస్తోంది. ఎక్కువ డిజిటల్ మీడియాలో ఉండటం వల్ల కంటి సమస్యలు, కుటుంబంతో గ్యాప్ ఏర్పడం వంటివి జరుగుతున్నాయి. ఈ విషయాలను అవగాహన చేసుకొని, మన జీవన విధానంలో మార్పులు చేసుకోవాల్సిన అవసరం చాలా ఉంది’ అని తెలియజేశారు. లీలారాణి. – నిర్మలారెడ్డి -
అమెరికాలో అలా .. ఆసియాలో ఇలా?
సాక్షి, హైదరాబాద్: మధుమేహంతో పాటు గుండెజబ్బులు, మానసిక ఆరోగ్య సమస్యలు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లోనూ పెరుగుతున్నాయి. మరి ముఖ్యంగా భారత్ ఇతర ఆసియా దేశాల్లో ఇది మరీ ఎక్కువగా ఉంది. కానీ వ్యాధి సోకడం, లక్షణాల వంటివి ప్రాంతాన్ని బట్టి మారిపోతున్నాయి. మధుమేహాన్ని తీసుకుంటే టైప్ 2 మధుమేహం అమెరికా లాంటి దేశాల్లో ఊబకాయం ఉన్నవారిలో కన్పిస్తుంది. కానీ భారత్‌లాంటి కొన్ని దేశాల్లో బక్కపలుచగా ఉన్నప్పటికీ దీనిబారిన పడుతున్నారు. అందరిలోనూ జన్యువులు ఒకే రకంగా ఉన్నప్పటికీ జన్యువుల పైభాగంలో వాతావరణం, సూక్ష్మ పోషకాల లోపం వల్ల చోటు చేసుకుంటున్న కొన్ని మార్పుల కారణంగా ఈ తేడాలు చోటు చేసుకుంటున్నట్లు తేలింది. మరోవైపు వీటి కోసం తయారు చేసిన ఔషధాలు ఒక ప్రాంతంలో పనిచేస్తే మరొక ప్రాంతంలో పని చేయడం లేదు. మధుమేహంతో పాటు గుండె జబ్బులు, మానసిక సమస్యలకు పైన పేర్కొన్న తేడాలు కారణమవుతున్నాయి. ఈ పరిస్థితిని అధిగమించేందుకు, అందరికీ సమర్ధంగా ఉపయోగపడే మందులు కనిపెట్టేలా, మానవజాతి ఆరోగ్యాన్ని పరిరక్షించేలా ఓ మహా ప్రయత్నం మొదలైంది. భారత్ సహా నాలుగు దేశాల్లోని 13 వేల మంది నుంచి సేకరించిన సమాచారాన్ని విశ్లేషించడం ద్వారా వ్యాధి ముప్పును తగ్గించే ప్రాజెక్టుకు శాస్త్రవేత్తలు శ్రీకారం చుట్టారు. డైవర్స్ ఎపిజెనిటిక్, ఎపిడిమియాలజీ పార్ట్ నర్షిప్ (డీప్) అని పిలుస్తున్న ఈ అంతర్జాతీయ ప్రాజెక్టులో ఇరవై పరిశోధక బృందాలు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇరవై సంస్థలు భాగస్వాములు కానున్నాయి. ఇప్పటివరకు ‘యూరప్’ సమాచారమే ఆధారం ప్రజారోగ్యం విషయంలో ఇప్పటివరకూ జరిగిన పరిశోధనలకు అత్యధికంగా యూరోపియన్ మూలాలున్న మానవుల నుంచి సేకరించిన సమాచారమే ఆధారం. అంటే ఆరోగ్య సమస్యల పరిశోధనల్లో ఇతర ప్రాంతాల వారి భాగస్వామ్యం చాలా తక్కువన్నమాట. అంతేకాకుండా జన్యుపరమైన, వాతావరణ సంబంధిత వైవిధ్యతను కూడా ఇప్పటివరకూ పెద్దగా పరిగణనలోకి తీసుకోలేదు. కొంచెం వివరంగా చెప్పాలంటే మన జన్యువులు, మనం ఉన్న వాతావరణం ప్రభావం.. మనకొచ్చే వ్యాధులపై ఎలాంటి ప్రభావం చూపుతుందో ఇప్పటివరకూ స్పష్టంగా తెలియదన్నమాట. కాగా ‘డీప్’ప్రాజెక్టు ఈ లోటును భర్తీ చేస్తుందని అంచనా వేస్తున్నారు. దాదాపు రూ.25 కోట్ల ఖర్చుతో ఐదేళ్ల పాటు ఈ ప్రాజెక్టు కొనసాగనుంది. సీసీఎంబీ నేతృత్వంలో యూకేలోని బ్రిస్టల్ యూనివర్సిటీ, లండన్ స్కూల్ ఆఫ్ హైజీన్ అండ్ ట్రాపికల్ మెడిసిన్,, ఎంఆర్సీ యూనిట్, ద గాంబియాలు ఇందులో పాల్గొననున్నాయి. అధ్యయనంలో భాగంగా కొన్ని వ్యాధులు కొన్ని ప్రాంతాల వారికి లేదా సమూహాలకు మాత్రమే ఎందుకు వస్తాయన్న విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. దీనిద్వారా ఒక ప్రాంత ప్రజల కోసం తయారు చేసిన మందులు ఇతర ప్రాంతాల వారికీ సమర్థంగా ఉపయోగపడతాయా? లేదా? అన్నది స్పష్టమవుతుందని ఈ అధ్యయనానికి నేతృత్వం వహిస్తున్న శాస్త్రవేత్త ఆర్.గిరిరాజ్ ఛాందక్ తెలిపారు. సీసీఎంబీ ఎప్పుడో చెప్పింది... హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ) చాలాకాలంగా భారతీయుల జన్యు నిర్మాణంలోని తేడాలు.. టైప్–1, టైప్–2 మధుమేహం, క్లోమగ్రంథి వ్యాధులపై వాటి ప్రభావం గురించి పరిశోధనలు చేస్తోంది. విటమిన్ బీ–12, ఫొలేట్ తదితర సూక్ష్మ పోషకాలు, పర్యావరణాలు.. వ్యాధులు సోకేందుకు ఉన్న అవకాశాలపై ప్రభావం చూపుతున్నట్లు కూడా సీసీఎంబీ నిరూపించింది. పర్యావరణం నుంచి అందే సంకేతాల ఆధారంగా డీఎన్ఏలో వచ్చే కొన్ని రకాల మార్పులు మనిషి ఆరోగ్యం, వ్యాధులకు కారణమవుతున్నట్టుగా కూడా సీసీఎంబీ ప్రయోగాత్మకంగా రుజువు చేసింది. అంటే ఇప్పటివరకూ జరిగిన పరిశోధనలన్నీ యూరోపియన్లపై ఆధారపడి జరిగినవి కావడంతో వారికి పనిచేసే మందులు, చికిత్స పద్ధతులు కచ్చితంగా మనకూ పనిచేస్తాయన్న గ్యారెంటీ లేదన్నమాట. అలాగే మనకు పనిచేసే మందులు బ్రిటిష్ వారికి లేదా అమెరికన్లను అక్కరకు వస్తాయా? అన్నది కూడా ప్రశ్నార్థకమే అన్నమాట. భారతీయులకూ భాగస్వామ్యం జన్యువులు – జన్యువులకు మధ్య, జన్యువులకు పర్యావరణానికి మధ్య జరుగుతున్న కార్యకలాపాలు అర్థం చేసుకునేందుకు మధుమేహం, గుండెజబ్బుల వంటి అసాంక్రమిక వ్యాధులకూ వీటికి ఉన్న సంబంధాలను అర్థం చేసుకునేందుకు ఈ ప్రాజెక్టు ఉపయోగపడుతుంది. ఈ ప్రాజెక్టులో భారతీయులను కూడా చేర్చుకోవడం ఎంతో ఆసక్తికరమైన అంశం. – డాక్టర్ ఆర్.గిరిరాజ్ ఛాందక్, ‘డీప్’ప్రాజెక్ట్ హెడ్ -
జిమ్ చేస్తున్నా బరువు తగ్గడం లేదు.. సర్జరీ చేయించుకోవచ్చా?
కొందరు ఎంత తిన్నా శరీరానికి కొవ్వు పట్టదు. జీరో సైజ్‌లోనే కనిపిస్తుంటారు. మరికొందరికేమో కొంచెం తిన్నా లావెక్కిపోతారు. ఈ రోజుల్లో బరువు పెరగడం అనేది అన్ని వయసుల వారికి పెద్ద సమస్యలా మారింది. బరువు అదుపులో ఉంచుకునేందుకు గంటల తరబడి జిమ్‌లో వర్కవుట్స్ చేసినా, డైట్ కంట్రోల్ చేసినా ఏ మాత్రం రిజల్ట్ ఉండటం లేదు. ''నాకు 24 ఏళ్లు. నా హైట్ 5.2. బరువు 92 కిలోలు ఉన్నాను. యోగా, రెగ్యులర్‌గా జిమ్‌కి వెళుతున్నా, డైటింగ్ కూడా చేస్తున్నా. అయినా బరువు తగ్గడం లేదు. బేరియాట్రిక్ సర్జరీ చేయించుకోవచ్చా? భవిష్యత్‌లో ప్రెగ్నెన్సీ మీద ఏమైనా ప్రభావం ఉంటుందా?'' మీ వయసు 24 కాబట్టి డైటింగ్, ఎక్సర్సైజెస్ కొంతవరకు బరువు తగ్గడానికి దోహద పడతాయి. మీరు చెప్పిన మీ ఎత్తు, బరువు వివరాలను బట్టి మీ బీఎమ్ఐ (బాడీ మాస్ ఇండెక్స్) 40 పైనే వస్తుంది. అంటే అధిక బరువు ఉన్నారని అర్థం. మార్బిడ్ ఒబేసిటీ అంటాం. బేరియాట్రిక్ సర్జరీ అనేది ఫస్ట్ ఆప్షన్‌గా తీసుకోకండి. ప్రొఫెషనల్ జిమ్ ఇన్స్ట్రక్టర్, డైట్ కౌన్సెలర్‌ని కలవండి. ఒకసారి హార్మోన్స్, థైరాయిడ్, సుగర్ టెస్ట్‌లు చేసుకోండి. జీవన శైలిని మార్చుకోవడం ద్వారా బరువు తగ్గించుకునే వీలు ఉంటుంది. బీఎమ్ఐ 40 దాటిన వారికి బేరియాట్రిక్ సర్జరీని సూచిస్తాం. బీఎమ్ఐ 35 లేదా అంతకంటే ఎక్కువ ఉంటే ప్రెగ్నెన్సీకి సంబంధించిన సమస్యలు ఎక్కువగా ఉంటాయి. అయినా స్పెషలిస్ట్‌ని సంప్రదించిన తరువాతే మీకు ఏది సరిపోతుందో అంచనా వేస్తాను. మామూలుగా బేరియాట్రిక్ సర్జరీ అయిన 12– 18 నెలల తరువాత మాత్రమే ప్రెగ్నెన్సీ ప్లానింగ్ స్టార్ట్ చెయ్యాలి. ఎందుకంటే బరువు తగ్గే క్రమంలో మొదట్లో పోషకాల లోపం తలెత్తుతుంది. వాటిని మల్టీ విటమిన్స్‌తో కవర్ చేసి అప్పుడు ప్రెగ్నెన్సీ ప్లాన్ చెయ్యాలి. ప్రెగ్నెన్సీ సమయంలో చాలా జాగ్రత్తగా డైట్‌ని సూచించాల్సి ఉంటుంది. బీపీ, సుగర్ సమస్యలు తలెత్తకుండా టెస్ట్ చెయ్యాలి. బేరియాట్రిక్ సర్జరీ తరువాత ప్రెగ్నెన్సీలో చాలా వరకు ఏ సమస్యలూ ఉండకపోవచ్చు. కానీ కొన్ని కేసెస్‌లో తక్కువ బరువుతో బిడ్డ పుట్టడం, నెలలు నిండకుండానే ప్రసవమవడం వంటి సమస్యలు తలెత్తుతాయి. అయితే ఒబేసిటీతో ఉన్నప్పటి రిస్క్ కంటే ఈ రిస్క్ చాన్సెస్ చాలా తక్కువ. కాబట్టి మంచి స్పెషలిస్ట్‌ని కలిసిన తరువాత అన్ని విషయాలు అసెస్ చేసుకుని అప్పుడు బేరియాట్రిక్ సర్జన్‌ని కలిస్తే మంచిది. -డా. భావన కాసు, గైనకాలజిస్ట్ – ఆబ్స్టెట్రీషియన్ హైదరాబాద్ -
విలయం.. యువ హృదయం!
విజయవాడ క్రీస్తురాజుపురానికి చెందిన 40 ఏళ్ల యువకుడు వ్యాపారం చేస్తుంటారు. ఇటీవల ఓ రోజు ఉదయం ఛాతిలో నొప్పి అని చెప్పి కుప్పకూలాడు. ఆస్పత్రికి తీసుకెళ్లేసరికే ప్రాణాలు విడిచాడు. తీవ్రమైన గుండెనొప్పి కారణంగా ప్రాణాలు కోల్పోయాడని వైద్యులు తేల్చారు. విజయవాడ వన్‌టౌన్ ప్రాంతానికి చెందిన 31 ఏళ్ల యువకుడు ప్రైవేటు కంపెనీలో ఉద్యోగి. ఇటీవల ఓ రోజు అర్ధరాత్రి ఛాతిలో నొప్పి అని కుటుంబ సభ్యులకు చెప్పాడు. వారు ఆస్పత్రికి తీసుకెళ్లేలోగా ప్రాణాలు కోల్పోయాడు. లబ్బీపేట(విజయవాడతూర్పు): ఇటీవల కాలంలో యువతలో గుండె పోటు మరణాలు ఎక్కువగా సంభవించడం వైద్యులను సైతం ఆందోళనకు గురిచేస్తోంది. మరీముఖ్యంగా 30 నుంచి 45 ఏళ్ల మధ్య వయస్సు వారికి గుండెపోటు మరణాలు పెరిగిపోయాయి. మారుతున్న జీవన శైలి, దైనందిన జీవితంలో ఎదుర్కొంటున్న తీవ్రౖమెన ఒత్తిడి, ఆహారపు అలవాట్లు, పెరిగిపోతున్న కాలుష్యం కారణంగానే చిన్న వయస్సులో గుండె జబ్బుల మరణాలు సంభవిస్తున్నాయని వైద్యులు చెబుతున్నారు. వీటిని ని యంత్రించేందుకు ప్రజల్లో విస్తృత అవగాహన కలిగించాల్సిన అవసరముందంటున్నారు. అడ్వాన్స్డ్ పరికరాలను ఉపయోగించుకుని గుండె సమస్యలను ముందుగానే గుర్తించవచ్చని వైద్యులు చెబుతున్నారు. అందుకే ఆకస్మిక మరణాలు గుండె ఆగిపోవడం వల్ల సంభవిస్తున్న మరణా లకు వైద్యులు పలు కారణాలు చెబుతున్నారు. మధుమేహం, రక్తపోటు. ధూమపానం, మద్యపానం,ఊబకాయం, వ్యాయామం లేకపోవడం పోస్టు కోవిడ్ గుండె రక్తనాళాల్లో పూడికలు, గుండె కండరాలు ఉబ్బడం(మయోకార్డిటైస్) పల్మనరీ ఎంబోలిజం(గుండె నుంచి ఊపిరి తిత్తులకు వచ్చే రక్తనాళాల్లో పూడికలు) ముందు జాగ్రత్తే మందు గుండెను ఆరోగ్యంగా ఉంచుకునేందుకు ప్రతి ఒక్కరూ పలు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. శ్రమతో కూడిన జీవన విధానాన్ని అలవర్చుకోవడం స్వచ్ఛమైన ఆహారాన్ని తీసుకోవడం క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం ఒత్తిళ్లకు దూరంగా ఉండటం నీరు ఎక్కువగా తీసుకోవడం యువతలో అధికమవుతున్నాయ్.. గుండెపోటుకు గురవుతున్న యువతను ఇటీవల ఎక్కువగా చూస్తున్నాం. ఇలాంటి వారిలో 80 శాతం మందికి గుండెపోటు రావడానికి పొగతాగడం, మద్యం తీసుకోవడం, ఒత్తిడే కారణాలు. రక్తనాళాల్లో బ్లాక్స్ ఏర్పడిన వారిని గుర్తించి స్టెంట్స్ వేస్తున్నాం. పోస్టు కోవిడ్ వారిలో కూడా గుండె సమస్యలు తలెత్తుతున్నాయి. రక్తపోటు, మధుమేహం ఉన్న వారు ముందుగా గుండె పరీక్షలు చేయించుకోవాలి. ఆరోగ్యకర జీవనశైలిని అలవర్చుకోవాలి. నిత్యం వ్యాయామం చేయాలి. ఒత్తిళ్లను అధిగమించేందుకు యోగా, మెడిటేషన్‌ను అలవర్చుకోవాలి. – డాక్టర్ బొర్రా విజయ్‌చైతన్య, కార్డియాలజిస్ట్ -
'ఒబెసిటీ'కి సరికొత్త పేరు..ఇక అలా పిలవొద్దని సూచన!
అధిక బరువు ఉంటే ఒబిసిటీ అని పిలిచేవారు కదా. ఇక నుంచి అలా పిలవకూడదట. ఎందకంటే ఆ పదమే పేషెంట్ సమస్యకు మరింత కారణమవుతుందని, అందువల్ల దానికి పేరు మార్చాలని ఆరోగ్య నిపుణులు నిర్ణయించారు. అధిక బరువు ఉన్నవాళ్లని సమాజం ఎలా చూస్తుందో అందరికీ తెలిసిందే. పలువురుతో జరిపిన విస్తృత చర్చల అనంతరం అధికం బరువు సమస్యకు కొత్త పేరు పెట్టాలనే వాదన వినిపించింది. లావుగా ఉన్నవారికి వారు అలా ఉన్నదాని కంటే ఆ పేరే వారిని ఇబ్బందుల పాలు చేసిందని అన్నారు. ఈ నేపథ్యంలోనే అధిక బరువు సమస్యను మరోక పేరు పెట్టాని నిపుణలు భావించారు. పేరు మార్చాల్సినంత నీడ్.. 1950లలో స్వలింగ సంపర్కాన్ని సామాజిక వ్యక్తిత్వ భంగంగా భావించారు. ఆ తర్వాత అనేక నిరసనలు, వ్యతిరేకతలు గట్టిగా రావడంతో దాన్ని అపకీర్తిగా భావించడం మానేశారు. అదోక మానసిక రుగ్మతకు సంబంధించినదని అంగీకరించారు. అలానే ఫ్యాటీ లివర్ వ్యాధి విషయంలో కూడా ఇదే సమస్య ఎదురైంది. నిజాని నాన్ ఆల్కహాలిక్లకు కూడా ఈ ఫ్యాటీ లివర్ అని పేరు మార్చాలనే వాదన తెరపైకి వచ్చింది. దీంతో ఆ తర్వాత ఆ వ్యాధికి మెటబాలిక్ డిస్ఫంక్షన్-అసోసియేటెడ్ స్టీటోటిక్ లివర్ డిసీజ్" అని పేరు పెట్టారు.ఈ నేపథ్యంలోనే ఒబెసిటీ అనే పదం మార్చడం తప్పనిసరైంది. అదీగాక ఆయా పేషంట్లు ఆ పేరు కారణంగానే సమాజంలోనూ, కుటుంబ పరంగాను వివక్షకు గురవ్వుతున్నారు. కొత్తపేరు బీఎంఐకి మించి ఉండాలి అధిక బరువును బీఎంఐల ద్వారా నిర్ణయిస్తారు. బీఎంఐ అంటే బాడీ మాస్ ఇండెక్స్. ఒక వ్యక్తి ఆరోగ్యాన్ని అంచనా వేసేందుకు ఇది కూడా సరిపోదు. ఇది కండర ద్రవ్యరాశిని లెక్కించదు, శరీర బరువు లేదా కొవ్వు కణజాలం (శరీర కొవ్వు) గురించి సరైన సమాచారం ఇవ్వదు. నిపుణులు సూచించిన కొత్తపేరు ఈ ఒబెసిటీని “అడిపోసిటీ ఆధారిత దీర్ఘకాలిక వ్యాధి” అని పిలవాలని సూచించారు ఆరోగ్య నిపుణులు. దీని పేరులోనే ఆ వ్యాధి ఏంటో అవగతమవుతుంది. జీవక్రియలు పనిచేయకపోవడమే ఈ వ్యాధి లక్షణం అని తెలుస్తుంది. ఈ పేరు కారణంగా సమాజ దృక్పథం మారి చులకనగా చూసే అవకాశం తగ్గుతుంది. అధిక బరవు సమస్య అనేది వ్యాధేనా.. అధిక బరవు అనేది శారీరక లేదా మానసిక వ్యవస్థలు సరిగా పనిచేయక పోవడం వల్ల ఎదురయ్యే సమస్య దీన్నిబట్టి ఆ సమస్యను వ్యాధిగా పరిగణించలేం. మొదట్లో అధిక బరువు హానికరం కాకపోవచ్చు. కొందరూ లావుగా ఉన్నా.. వారికి ఎలాంటి హెల్త్ సమస్యలు ఉత్పన్నం కావు. కొందరికి క్రమేణ అధిక బరువు వివిధ శారీరక సమస్యలకు దారితీస్తుంది. ఈ పేరు మార్పు కారణంగా ప్రజలకు ఆయా వ్యకుల పట్ల చులకన భావం, హేయభావం తగ్గి వారి సమస్యను అర్థం చేసుకునే యత్నం చేయగలుగుతారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. (చదవండి: కార్యాలయాల్లో ఓన్లీ 'వై' బ్రైక్!ఏంటంటే ఇది!) -
ఒబెసిటీ, హైబీపీ ఎక్కువే.. పన్నీర్, జంక్ ఫుడ్, నాన్ వెజ్ వల్ల..
సాక్షి, హైదరాబాద్: దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే జీవనశైలి వ్యాధుల సూచికల్లో తెలంగాణ పరిస్థితి అత్యంత పేలవంగా ఉందని తాజా అధ్యయనం తేల్చింది. అలాగే స్థూలకాయం, రక్తపోటు కేసుల సంఖ్య సైతం రాష్ట్రంలోనే ఎక్కువగా నమోదవుతున్నాయని వెల్లడించింది. ‘మెటబాలిక్ నాన్ కమ్యూనికబుల్ డిసీజ్ హెల్త్ రిపోర్ట్ ఆఫ్ ఇండియా: ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్–ఇండియా డయాబెటిస్ (ఐసీఎంఆర్ ఐఎన్‌డీఐఏబీ) పేరిట లాన్సెట్ రూపొందించిన నివేదిక ప్రకారం రాష్ట్రంలో 25 శాతం మంది సెంట్రల్ ఒబేసిటీ, హైపర్‌టెన్షన్‌తో బాధపడుతున్నారు. దేశవ్యాప్తంగా 2008 అక్టోబర్ 18 నుంచి 2020 డిసెంబర్ 17 మధ్య మొత్తం 1,13,043 మంది (గ్రామీణ ప్రాంతాల నుంచి 79,506 పట్టణ ప్రాంతాల నుంచి 33,537 మంది)పై నిర్వహించిన అధ్యయన ఫలితాలను లాన్సెట్ ఇటీవల ప్రచురించింది. ఊబకాయం కేసులలో తెలంగాణ రాష్ట్రం.. ఆంధ్రప్రదేశ్, ఒడిశా, మహారాష్ట్ర, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి, మణిపూర్, మిజోరం, హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, చండీగఢ్, హరియాణా, ఢిల్లీల సరసన నిలుస్తోంది. దీనికి కారణం ఉదర ఊబకాయం, ట్రైగ్లిజరైడ్స్‌కు మధ్య దగ్గరి సంబంధం ఉండటమేనని వైద్య నిపుణులు అంటున్నారు. శారీరక శ్రమ లేకపోవడం.. ప్రాసెస్డ్ ఫుడ్ తినడం.. లాన్సెట్ నివేదిక ప్రకారం తెలంగాణ ప్రజల్లో ఊబకాయం, రక్తపోటు, ట్రైగ్లిజరిడెమియా సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. ‘ఇది తక్కువస్థాయి శారీరక శ్రమతోపాటు ప్రాసెస్ చేసిన ఆహారాన్ని తినడం వల్ల పెరుగుతున్న సమస్య. ట్రైగ్లిజరైడ్స్, యూరిక్ యాసిడ్ స్థాయిలు ఎక్కువగా ఉన్న రోగులను ఇప్పుడు తరచుగా చూస్తున్నాం. ఇవి మెటబాలిక్ సిండ్రోమ్ సంకేతాలు. చికిత్స తీసుకోకుంటే గుండె, మూత్రపిండాలపై దీర్ఘకాలిక ప్రభావం చూపుతాయి’’ అని నిజామాబాద్ మెడికల్ కాలేజీకి చెందిన అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ కిరణ్ మాదల వివరించారు. హైపర్ టెన్షన్... స్లీప్ అప్నియాలకూ దోహదం.. ‘పన్నీర్, జంక్ ఫుడ్, మాంసాహారాన్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల అధికస్థాయి కొలస్ట్రాల్ సమస్యలు వస్తున్నాయి. దీనికితోడు డెస్క్ జాబ్‌లు సెంట్రల్ ఒబేసిటీకి దారితీస్తున్నాయి. ఊబకాయంతో గుండె జబ్బులు, మధుమేహమే కాకుండా హైబీపీ, స్లీప్ యాప్నియా వంటి ఇతర జబ్బులు కూడా ఎక్కువగా వస్తున్నాయి. రాష్ట్రంలో ఈ సమస్యలకు అధిక మద్యపానం కూడా ఒక ప్రధాన కారణం’ అని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రతినిధులు అభిప్రాయపడ్డారు. అలవాట్లను కట్టడి చేస్తేనే.. పొత్తికడుపు ప్రాంతంలో కొవ్వు అధికంగా చేరడాన్నే సెంట్రల్ ఒబేసిటీగా పేర్కొంటారు. పెరిగిన విసరల్ ఫ్యాట్ పోర్టల్ బ్లడ్ సిస్టమ్ ద్వారా సరఫరా అవుతుంది కాబట్టి ఈ ప్రాంతంలోని అదనపు కొవ్వు రక్తప్రవాహంలోకి కొవ్వు నిల్వలను విడుదల చేస్తుందన... ఇది అనారోగ్య సమస్యలను కలిగిస్తుందని వైద్యులు అంటున్నారు. ఈ నేపధ్యంలో వ్యాయామం, శారీరక శ్రమను జీవనశైలిలో భాగం చేసుకోవడంతోపాటు ఆహారపు అలవాట్లను నియంత్రించుకోవడం తప్పనిసరని వారు సూచిస్తున్నారు. -
ఎవరెస్ట్ బేస్‌క్యాంప్ @ 68
పేదరికాన్ని ఓల్డ్‌సిటీ చూపించింది. దాతృత్వాన్ని నాన్న వైద్యం నేర్పించింది. ఆరోగ్య భద్రతా లేమిని ఆదివాసీ జీవనం తెలిపింది. అందంగా జీవించడాన్ని బాల్య స్నేహం చెప్పింది. కొండంత సాహసాన్ని తనకు తానే చేసింది. డాక్టర్ శోభాదేవి రాసుకున్న రికార్డుల జాబితా ఇది. ‘‘నేను జర్నలిస్ట్‌ని కావాలనుకున్నాను. మా నాన్న నన్ను డాక్టర్ని చేయాలనుకున్నారు. ఆయన మాటే నెగ్గింది. కానీ నా అచీవ్మెంట్స్తో తరచూ జర్నల్స్‌లో కనిపిస్తూ ఉండటం ద్వారా నేను సంతోషిస్తున్నాను’’ అన్నారు డాక్టర్ శోభాదేవి. హైదరాబాద్, హిమాయత్ నగర్లో పుట్టి పెరిగి, వెస్ట్ మారేడ్‌పల్లిలో స్థిరపడిన శోభాదేవి ఒక గ్లోబల్ పర్సనాలిటీ. డయాబెటిస్ అండ్ ఒబేసిటీ స్పెషలిస్ట్‌గా ఆమె పదికి పైగా దేశాల్లో సెమినార్లలో పాల్గొని అధ్యయనాల పేపర్లు సమర్పించారు. కోవిడ్ సమయంలో రోజుకు పద్దెనిమిది గంటల సేపు ఆన్లైన్లో అందుబాటులో ఉంటూ సేవలందించిన ఈ డాక్టర్ తన పేషెంట్లను హాస్పిటల్ గడప తొక్కనివ్వకుండా ఆరోగ్యవంతులను చేశారు. అందుకు ప్రతిగా ఆమె డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలామ్ అవార్డు అందుకున్నారు. ఈ అవార్డుకు ముందు ఆ తర్వాత దేశవిదేశాల్లో ఆమె అందుకున్న పురస్కారాల సంఖ్య వందకు పైగానే. వెస్ట్ మారేడ్‌పల్లిలోని ఆమె ఇంట్లో రెండు గదులు మెమెంటోలతో నిండిపోయి ఉన్నాయి. ఈ ఏడాది మే నెలలో ఎవరెస్ట్ బేస్ క్యాంపు 8కె చేరుకుని మరో రికార్డు సృష్టించుకున్నారు. అది బేస్ క్యాంపుకు చేరిన రికార్డు మాత్రమే కాదు. 68వ ఏట ఎవరెస్ట్ బేస్ క్యాంపును అధిరోహించడం, మిసెస్ ఇండియా విజేత, అందాల పోటీ కిరీటధారి ఎవరెస్ట్‌ను అధిరోహించడం కూడా రికార్డులే. ప్రతి రోజునూ స్ఫూర్తిదాయకంగా మలుచుకోవడం ఒక కళ. ఆ కళ ఆమె చేతిలో ఉంది. ఇలాంటి సాహసాలు, సరదాలతోపాటు నల్లమల, భద్రాచలం, ఆసిఫాబాద్ జిల్లాల్లో నివసించే ఆదివాసీలకు ఆరోగ్య చైతన్యం కలిగించడం ఆమెలో మరో కోణం. ‘ఒక డాక్టర్‌గా తన వంతు సామాజిక బాధ్యతను నిర్వర్వించడానికి ఎప్పుడూ ముందుంను. అది తండ్రి నేర్పిన విలువల నుంచి గ్రహించిన జీవితసారం’ అన్నారామె. వైవిధ్యభరితమైన తన జీవితప్రస్థానాన్ని సాక్షితో పంచుకున్నారు డాక్టర్ శోభాదేవి. నాన్న నేర్పిన విలువలు ‘‘మా నాన్న అగ్రికల్చరల్ డిపార్ట్మెంట్లో జాయింట్ డైరెక్టర్‌గా పని చేశారు. అమ్మ రోజరీ కాన్వెంట్ స్కూలో టీచర్. అలా నేను అదే స్కూల్లో చదివాను. నాన్న ఆసక్తి కొద్దీ హోమియోవైద్యం కోర్సు చేసి ఉచితంగా వైద్యం చేసేవారు. నన్ను మెడిసిన్ చదివించడం కూడా నాన్న ఇష్టమే. ఎంబీబీఎస్ ఎంట్రన్స్‌లో నాకు బాలికల కేటగిరీలో రెండవ ర్యాంకు, జనరల్ కేటగిరీలో ఎనిమిదవ ర్యాంకు వచ్చింది. ఉస్మానియాలో ఎంబీబీఎస్ తర్వాత అన్నామలై యూనివర్సిటీ నుంచి డయీబెటిస్లో పీజీ, యూకేలో ఒబేసిటీలో కోర్సు చేసి అక్కడ దాదాపు ఇరవై ఏళ్లు పని చేశాను. నాన్న కోసం తిరిగి ఇండియా వచ్చేసి హైదరాబాద్‌లో గవర్నమెంట్ ఉద్యోగంలో చేరాను. ఓల్డ్‌సిటీలో అడిగి మరీ పోస్టింగ్ వేయించుకున్నాను. పేదరికం ఎంత దారుణంగా ఉంటుందో కళ్లారా చూశాను. పేషెంట్లకు చాయ్, బన్నుకు డబ్బిచ్చి తినేసి రండి మందులు రాసిస్తానని పంపేదాన్ని. ‘భగవంతుడు మనల్ని చాలామంది కంటే మెరుగైన స్థానంలో ఉంచాడు. భగవంతుడిచ్చింది అంతా మన కోసమే కాదు, ఆకలితో ఉన్న వాళ్ల కోసం పని చేయాల్సిన బాధ్యతను కూడా ఇచ్చి ఈ భూమ్మీదకు పంపాడు. సమాజానికి తిరిగి మన వంతు బాధ్యతను నిర్వర్తించాలి’ అని నాన్న ఎప్పుడూ చెప్పే మాట తరచూ గుర్తు వచ్చేది. ఆ ప్రభావంతోనే అనాథ శరణాలయాలు, వృద్ధాశ్రమాలకు వెళ్లి వాళ్లకు సహాయం చేయడం చిన్నప్పుడే అలవాటైంది. ఆదివాసీల జీవనశైలి గురించి నాకు తెలిసింది బాగా పెద్దయిన తర్వాత మాత్రమే. అడవిలో నివసిస్తూ అక్కడ దొరికే ఆహారం తింటూ కడుపు నింపుకోవడమే వాళ్లకు తెలిసింది. సమతుల ఆహారం అంటే ఏమిటో తెలియదు. సీజన్లో వచ్చే జ్వరాల గురించి అవగాహన కూడా తక్కువే. వాళ్లకు ఆహారం గురించి ఆరోగ్యం చైతన్యవంతం చేయడంతోపాటు ఎసెన్షియల్ ఫుడ్ పౌడర్లు, వంటపాత్రలు, దుప్పట్లు ఇవ్వడం మొదలు పెట్టాం. అన్ని రకాల కాయగూరలను పండించుకోవడంలో శిక్షణ ఇచ్చాం. మనిషి జీవితంలో ఆహారం, ఆరోగ్యం ప్రధాన భూమిక పోషిస్తాయనే అవగాహన కల్పించగలిగాను. బాల్య స్నేహితురాలి చొరవ బ్యూటీ పాజంట్ అవతారం ఎత్తడానికి కారణం నా స్కూల్ ఫ్రెండ్ రేణుక. మా అబ్బాయిలిద్దరూ యూఎస్‌లో సెటిలయ్యారు. మా వారు 2015లో మాకు దూరమయ్యారు. ఇంత ఇంట్లో నేనొక్కర్తినే, ఎప్పుడూ ఏదో ఒక పనిలో నన్ను నేను నిమగ్నం చేసుకుంటూ నిబ్బరంగా జీవించడానికి ప్రయత్నిస్తున్నప్పుడు రేణుక ఆల్బమ్ చేయిస్తానని నా ఫొటోలు తీసుకుని వెళ్లి ‘2019 మిసెస్ తెలంగాణ’ పోటీలకు పంపించేసింది. ఆ తర్వాత నాకు అన్ని ఈవెంట్లలో పాల్గొనక తప్పలేదు. ఫైనల్స్ సమయంలో స్కాట్లాండ్లో ఒబేసిటీ మీద ఇంటర్నేషనల్ సెమినార్‌కి వెళ్లాను. ఇక్కడి నుంచి ఫోన్ చేసి ఒకటే తిట్లు. చివరి నిమిషంలో వచ్చి ఫైనల్ రౌండ్ పూర్తి చేశాను. మిసెస్ ఇండియా పోటీలకు ఇలా ఒకదానితో ఒకటి ఓవర్లాప్ కాకుండా జాగ్రత్త పడ్డాను. మిసెస్ ఇండియా విజేత అయినప్పుడు 63 పూర్తయి 64లో ఉన్నాను. సక్సెస్ ఇచ్చే కిక్‌ని బాగా ఎంజాయ్ చేశాననే చెప్పాలి. నేనే ఉదాహరణ అప్పటి వరకు నేనందుకున్న పురస్కారాల సమయంలో స్ఫూర్తిదాయకమైన మహిళగా ప్రశంసిస్తుంటే నా అర్హతలకు మించిన గౌరవం ఇస్తున్నారేమో అనిపించేది. ఈ వయసులో నేను సాధించిన ఈ లక్ష్యం నన్ను సంతోషంలో ముంచెత్తుతోంది. ప్రాణం పోయినా ఫర్లేదనే సంసిద్ధతతో మొదలు పెడతాం, అవాంతరాలెదురవుతాయి, కానీ సాధించి తీరాలనే సంకల్ప శక్తితో ముందుకెళతాం. లక్ష్యాన్ని చేరిన తర్వాత కలిగే ఆత్మవిశ్వాసంతో కూడిన అతిశయం చాలా గొప్ప భావన. చైతన్యవంతంగా ముందడుగు వేయాలనుకునే మహిళలకు నేనొక ప్రత్యక్ష నిదర్శనం’’ అన్నారు డాక్టర్ శోభాదేవి. పర్వతం పెద్ద చాలెంజ్ ఎవరెస్ట్ బేస్‌క్యాంప్ ఆరోహణ ఆలోచన మెడిసిన్ క్లాస్‌మేట్స్‌తో న్యూజిలాండ్ టూర్లో వచ్చింది. అక్కడ గ్లేసియర్లు, ట్రెకింగ్ జోన్లు చూసినప్పుడు ఇదేపని మన దగ్గర ఎందుకు చేయకూడదు అనుకున్నాం. కానీ మన దగ్గర పర్వతారోహణ శిక్షణ కేంద్రాలుండవు. జిమ్, కేబీఆర్ పార్క్, సిటీలో క్రాస్ ఓవర్ బ్రిడ్జిలు, కర్నాటకలో నందిహిల్స్ నా శిక్షణ కేంద్రాలయ్యాయి. ఎవరెస్ట్ కోసం సిద్ధమవుతున్న సమయంలో ప్రపంచాన్ని కోవిడ్ కుదిపేసింది. డాక్టర్‌గా నా వృత్తికి నూటికి నూరుశాతం సేవలందించాల్సిన సమయం అది. నా పేషెంట్ల నంబర్ రాసుకోలేదు కానీ పేషెంట్లకు మందులు, ఇతర జాగ్రత్తలు, ధైర్యం చెబుతూ కౌన్సెలింగ్‌లో రోజూ తెల్లవారు జామున రెండు– మూడు గంటల వరకు ఆన్లైన్లో టచ్‌లో ఉండేదాన్ని. ఆ తర్వాత నాకూ కోవిడ్ వచ్చింది, తగ్గింది. కానీ వెన్ను పట్టేయడం, ఫ్రోజన్ షోల్డర్ వంటి పోస్ట్ కోవిడ్ లక్షణాలు బాధించాయి. వాటన్నింటినీ చాలెంజ్‌గా తీసుకుని బయటపడి పర్వతారోహణ చేశాను. మేనెల ఆరవ తేదీ హైదరాబాద్ నుంచి బయలేరి ఖాట్మండూకు వెళ్లాను. ఎనిమిదో తేదీన ‘లుక్లా’ నుంచి నడక మొదలు పెట్టి 15వ తేదీకి బేస్ క్యాంపులో ఎత్తైన శిఖరం ‘8కె’కి చేరాను. ఈ ట్రిప్‌లో నేను పర్వతారోహకులకు మార్గాన్ని సుగమం చేసే షెర్పాల దయనీయమైన జీవితాన్ని దగ్గరగా చూశాను. ప్రాణాలను పణంగా పెట్టి ఈ పనులు చేస్తుంటారు వాళ్లు. – వాకా మంజులారెడ్డి