లండన్: బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ‘మేడిన్ ఇండియా’ హీరో సైకిల్ తొక్కి అందరిని ఆశ్చర్యపరిచారు. కరోనాపై పోరులో భాగాంగా స్థూలకాయానికి (ఒబెసిటీ)కి వ్యతిరేకంగా బ్రిటన్ ప్రభుత్వం చేపట్టిన కొత్త జీబీపీ 2 బిలియన్ సైక్లింగ్, వాకింగ్ డ్రైవ్‌ను ప్రారంభించిన బోరిస్.. దానిలో భాగంగా నాటింగ్‌హామ్‌లోని బీస్టన్ వద్ద ఉన్న హెరిటేజ్ సెంటర్‌లో సైకిల్ తొక్కారు. 56 ఏళ్ళ బోరిస్‌కి సైక్లింగ్ అంటే ఎంతో ఇష్టమట. హెల్త్, ఫిట్‌నెస్ కోసం సైక్లింగ్ చాలా మంచిదని ఆయన అంటున్నారు. బ్రిటన్‌లో కరోనా వైరస్ కారణంగా మృతి చెందుతున్నవారిలో చాలామంది స్థూలకాయులేనని, మితిమీరిన శరీర బరువు వల్ల వారు మృత్యువాత పడుతున్నారని కొందరు నిపుణులు ఇటీవల తేల్చారు.
దాంతో ఊబకాయానికి వ్యతిరేకంగా పోరాటం చేయాలన్న ఉద్దేశంతో బిట్రన్ ప్రభుత్వం ఇప్పటికే ఆహార పదార్థలపై ఇచ్చే వన్ ప్లస్ వన్ ఆఫర్‌ను నిషేధించిన సంగతి తెలిసిందే. తాజాగా బోరిస్ ఈ సైక్లింగ్ డ్రైవ్‌ను ప్రారంభించారు. ప్రధాని తొక్కిన సైకిల్ ఇండియాకు చెందిన హీరో మోటార్స్ కంపెనీది. వికింగ్ ప్రో బైక్ పేరుతో ఆ సైకిల్‌ను మార్కెట్లోకి రిలీజ్ చేశారు. మాంచెస్టర్‌లో సైకిల్‌ను డిజైన్ చేశారు. (ఒకటి కొంటే ఇంకోటి ఫ్రీ ఉండదిక)
సైకిల్ తొక్కడాన్ని ఇష్టపడే బోరిస్.. దేశంలో వేల కిలోమీటర్ల బైక్ లేన్లను ఆవిష్కరించాలనుకుంటున్నట్లు తెలిపారు. కొత్త ఫిట్‌నెస్ స్ట్రాటజీలో భాగంగా ప్రభుత్వం సైకిల్ తొక్కేవారికి ప్రత్యేక లేన్ వేయనున్నట్లు తెలిపింది. అంతేకాక నిత్య జీవితంలో సైక్లింగ్‌ను ప్రొత్సాహించడానికి గాను రవాణా కేంద్రాలు, పట్టణం, నగర కేంద్రాలు, ప్రభుత్వ భవనాల వద్ద మరిన్ని సైకిల్ రాక్‌లు ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఇళ్లలో పార్కింగ్ స్థంల లేని వారి కోసం వీధుల్లో రాక్‌లను ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. సైక్లింగ్ వల్ల ఫిట్‌గా ఉండటమే కాక గాలి నాణ్యత మెరుగుపడటంతో పాటు ట్రాఫిక్ కష్టాలు తీరతాయన్నారు బోరిస్. (ఒక్క క్షణం.. అందరినీ పిచ్చోళ్లను చేశాడు)
Comments
Please login to add a commentAdd a comment