Boris Johnson
-
దాంట్లో ఇన్ఫోసిస్ నారాయణమూర్తి హస్తం ఉంది: యూకే మాజీ ప్రధాని..
రిషి సునక్ (Rishi Sunak) యూకే ప్రధాన మంత్రి కావడంలో భారతీయ బిలియనీర్, ఇన్ఫోసిస్ ఫౌండర్ నారాయణమూర్తి (Narayana Murthy) పాత్ర ఉందని ఆ దేశ మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ (Boris Johnson) నమ్ముతున్నారని ఇటీవల విడుదలైన ఓ పుస్తకంలో పేర్కొన్నారు. 'ది రైట్ టు రూల్' అనే ఈ పుస్తకాన్ని ది టెలిగ్రాఫ్ వార్తాపత్రికకి పొలిటికల్ ఎడిటర్ అయిన బెన్ రిలే-స్మిత్ రచించారు. మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్‌కు సంబంధించిన పలు విషయాలను ఇందులో ప్రస్తావించారు. పార్టీగేట్ కుంభకోణం గురించి స్యూ గ్రే ప్రాథమిక దర్యాప్తు ఫలితాలు ప్రధాని జాన్సన్ తన అధికారిక నివాసంలో పార్టీలకు ఆతిథ్యం ఇవ్వడానికి కోవిడ్ ఆంక్షలను ఉల్లంఘించినట్లు ఆరోపించినప్పుడు 2023 ఫిబ్రవరి కంటే ముందే రిషి సునక్ తన ప్రధాని పదవి కోసం రంగం సిద్ధం చేయడం ప్రారంభించాడని రచయిత పుస్తకంలో పేర్కొన్నారు. (Unemployment Fraud: వామ్మో రూ. 11 లక్షల కోట్లా..? అత్యంత భారీ నిరుద్యోగ మోసమిది!) బోరిస్ జాన్సన్ రాజకీయ కుట్రలను నమ్మేవారని 'ది రైట్ టు రూల్' పుస్తకం పేర్కొంది. బోరిస్ ప్రధానిగా ఉన్నప్పుడు ఆయనకు ముఖ్య సలహాదారుగా పనిచేసిన బ్రిటిష్ రాజకీయ వ్యూహకర్తను ప్రస్తావిస్తూ, "సునక్ మామ, భారతీయ బిలియనీర్ నారాయణ మూర్తి.. డొమినిక్ కమ్మింగ్స్ను తన పక్కన పెట్టుకున్నట్లు పుకారును బోరిస్ వినిపించేవారని పుస్తకంలో రాశారు. పార్టీగేట్ తిరుగుబాటు కాలంలో కమ్మింగ్స్ డౌనింగ్ స్ట్రీట్‌లో ఎలాంటి అధికారిక పాత్రను పోషించలేదు. 2020 నవంబర్లోనే ఆయన రాజీనామా చేశారు. జాన్సన్ తన మాజీ రాజకీయ సహాయకుడు, అతనితో విభేదాలు ఉన్నందున, ఇప్పుడు సునక్ రాజకీయ అదృష్టాన్ని పెంచడానికి కృషి చేస్తున్నాడని నమ్మినట్లుగా పుస్తకంలో రాసుకొచ్చారు. -
రిషి సునాక్ ప్రభుత్వానికి షాక్.. ఉప ఎన్నికల్లో ఎదురుదెబ్బ..
లండన్: బ్రిటన్ లో ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో అధికార కన్జర్వేటివ్ పార్టీ త్రుటిలో చావు దెబ్బ తప్పించుకుంది. మొత్తం మూడు స్థానాలకు ఎన్నికలు జరగ్గా ఒక్క సీటు గెలుచుకుని మిగిలిన రెండు చోట్ల ఓటమిపాలైంది. అసలే సార్వత్రిక ఎన్నికల్లో సమీపిస్తున్న నేపథ్యంలో ఈ ఉప ఎన్నికల ఫలితాలు చాలా కీలకంగా నిలిచాయి. మొత్తం మూడు స్థానాలకుగాను జరిగిన ఉప ఎన్నికల్లో రెండు స్థానాల్లో రిషి సునాక్ నేతృత్వంలోని కన్జర్వేటివ్ పార్టీ ఓటమిపాలైంది. ఇంగ్లాండ్ మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ స్థానాన్ని మాత్రం స్వల్ప మెజారిటీతో తిరిగి దక్కించుకుంది. ఒకవేళ ఆ స్థానాన్ని కూడా కోల్పోయి ఉంటే ఒకే రోజు మూడు సీట్లు కోల్పోయిన ప్రధానిగా రిషి సునాక్ చరిత్రలో నిలిచిపోయేవారు. అదృష్టవశాత్తు ఉక్స్ రిడ్జ్, సౌత్ రూస్లిప్ పరిధిలోని వెస్ట్ లండన్ లో గెలిచి ఆయన ఈ ఘోర అవమానం నుండి తప్పించుకున్నారు. మిగిలిన రెండు స్థానాల్లో సోమర్టన్, ఫ్రోమ్ సీట్ లో 19 వేలు, సెల్బీ.ఎయిన్స్టీ నియోజకవర్గంలో 20 వేలు మెజార్టీతో లేబర్ పార్టీ చేతిలో ఓడిపోయింది కన్జర్వేటివ్ పార్టీ. సెల్బీ, ఎయిన్స్టీలో గెలిచిన అభ్యర్థి కెయిర్ మాథెర్(25) మాట్లాడుతూ.. ప్రభుత్వం యొక్క నిర్లక్ష్య వైఖరికి ఇక్కడివారు అసంతృప్తితో ఇచ్చిన తీర్పు ఇదని అన్నారు. సోమర్టన్, ఫ్రోమ్ లో గెలిచిన లేబర్ పార్టీ అభ్యర్థి సారా డైక్ మాట్లాడుతూ.. ఇది చారిత్రిక విజయం. ఈ ప్రభుత్వం చేతకానితనంతో సర్కస్ చేస్తోందని ప్రజలకు అర్ధమైపోయిందన్నారు. అసలే సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఈ ఉపఎన్నికల ఫలితాలు రిషి సునాక్ ప్రభుత్వానికి డేంజర్ బెల్స్ గా మారాయి. గతేడాది మార్చ్ నుంచి జరిగిన ఉప ఎన్నికల్లో ఆరు స్థానాలను లేబర్ పార్టీ గెలుచుకోవడం ఆందోళనకరమని చెబుతున్నాయి కన్జర్వేటివ్ పార్టీ వర్గాలు. గడిచిన 15 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా వడ్డీ రేట్లు పెరగడంతో ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అందుకే జనం ప్రభుత్వ విధానాలపై కొంత అసంతృప్తితో ఉన్నారని చెబుతున్నారు స్థానికులు. ఇది కూడా చదవండి: 40 ఏళ్లుగా ప్రధాని.. మళ్ళీ ఆయనే.. -
బోరిస్ పతనావస్థకు అసలు కారణాలివే!
‘అదృష్టం అందలం ఎక్కిస్తే బుద్ధి బురదలోకి లాగింద’ని నానుడి. బ్రిటన్ మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్‌కు ఇది అక్షరాలా సరిపోతుంది. ఒక సాధారణ స్థాయి నుంచి రాజకీయాల్లోకొచ్చి ప్రధాని పీఠం వరకూ వెళ్లిన జాన్సన్ నిరుడు జూలైలో ఆ పదవి పోగొట్టుకోవటమే కాదు... గతవారం ఎంపీ పదవికి కూడా రాజీనామా చేయక తప్పలేదు. తాజాగా సభాహక్కుల సంఘంతో అబద్ధాల కోరుగా ముద్రేయించుకున్నారు. ఎంపీగా తప్పుకున్నారు గనుక సరిపోయిందిగానీ, లేకుంటే ఆయన మూణ్ణెల్లపాటు దిగువ సభ నుంచి సస్పెండయ్యేవారు. ప్రజాస్వామ్యంలో బాధ్యతాయుత స్థానాల్లో ఉండేవారు నిజాయితీతో మెలగకపోతే, విశ్వసనీయతను ప్రాణప్రదంగా భావించకపోతే ఏ గతి పడుతుందో చెప్పడానికి జాన్సన్ ప్రస్థానం ఒక ఉదాహరణ. మనకు జాన్సన్ చేసింది పెద్ద తప్పు అనిపించకపోవచ్చు. కానీ బ్రిటన్‌లో అది చెల్లుబాటు కాదు. కరోనా మహమ్మారి తీవ్రంగా విజృంభిస్తున్న కాలంలో జాన్సన్ తన మిత్ర బృందాలతో విందుల్లో మునిగారన్నది ప్రధాన ఆరోపణ. ఆ కాలంలో దేశమంతా లాక్ డౌన్ అమల్లో వుంది. ప్రధానిగా 2020 మార్చి 23న లాక్డౌన్ విధించింది ఆయనే. మరో నాలుగు రోజులకు కరోనా వాతపడ్డారు కూడా. లాక్డౌన్ వల్ల దిగజారిన ఆర్థిక పరిస్థి తులతో, కరోనా తీవ్రతతో జనం అల్లాడుతుంటే ఆ సమయంలో ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నదన్న ఆరోపణలు చెలరేగాయి. కనీసం అప్పుడైనా ఆయన మేల్కొనివుంటే వేరేగా ఉండేది. కానీ విందులు జరగడం అబద్ధమని ఒకసారి, జరిగినా నిబంధనలు ఉల్లంఘించలేదని మరోసారి బొంకారు. పైగా పార్టీలోని తన వ్యతిరేకులనూ, దర్యాప్తు చేస్తున్న సభా హక్కుల సంఘాన్నీ భ్రష్టుపట్టించే ప్రయత్నం చేశారు. లండన్ మేయర్‌గా ఉన్నకాలంలో జాన్సన్ ఓసారి అమెరికా వెళ్లారు. ఆయన్ను చూసిన ఒక పౌరుడు జాన్సన్‌ను దేశాధ్యక్ష పదవికి రిపబ్లికన్ అభ్యర్థిత్వాన్ని ఆశిస్తూ దూకుడుగా ప్రచారం చేసుకుంటున్న ట్రంప్‌గా పొరబడ్డారట. ఇలా పొరబడిన పౌరుడెవరోగానీ ఇద్దరిలోనూ పోలికలు న్నాయన్నది వాస్తవం. భౌతికమైన పోలికల మాట అటుంచి తమకొచ్చిన అవకాశాన్ని దుర్వినియో గపర్చటంలో ఇద్దరూ ఇద్దరే. తోచినట్టు మాట్లాడటం, ఇష్టానుసారం వ్యవహరించటం ఇద్దరిలోనూ ఉంది. అమెరికాలో ట్రంప్‌ను దించటానికి ఎన్నికల వరకూ జనం వేచిచూడాల్సి వచ్చింది. కానీ పార్టీ గేటు వ్యవహారం గుప్పుమన్నాక జాన్సన్‌ను సొంత పార్టీయే దించేసింది. నిజానికి పార్టీ గేటు వ్యవహారం ప్రధానిగా జాన్సన్ వరసబెట్టి చేసిన నిర్వాకాలకు పరాకాష్ట. ఒక చట్ట ఉల్లంఘనలో పోలీసులు తనకు జరిమానా విధించారని నిరుడు ఏప్రిల్‌లో ఆయనే స్వయంగా ప్రకటించారు. ప్రధాని స్థాయి నేత జరిమానా చెల్లించవలసి రావటం దేశ చరిత్రలో అదే తొలిసారి. అయినా అందుకుగల కారణమేమిటో ఆయన చెప్పలేదు. ఈలోగా తన అధికారిక నివాసాన్ని విలాసవంతంగా మార్చడానికి చట్టవిరుద్ధంగా భారీ మొత్తం ఖర్చు చేశారన్న ఆరోపణలొచ్చాయి. ఇది చాల దన్నట్టు అత్యాచార ఆరోపణల్లో జాన్సన్‌కు సన్నిహితుడిగా ఉండే ఎంపీ అరెస్టయ్యాడు. ఆయన మిత్రబృందంలోని మరో మాజీ ఎంపీకి బాలుడిపై లైంగిక దాడి చేశారన్న ఆరోపణ రుజువై శిక్షపడింది. ఆ తర్వాత ‘పార్టీ గేట్’ గుప్పుమంది. పర్యవసానంగా వరస సర్వేల్లో జాన్సన్ రేటు పడిపోయింది. ఆయనపై జనం ఆగ్రహావేశాలతో ఉన్నట్టు వెల్లడైంది. దాంతో 40 శాతం మంది పార్టీ ఎంపీలు జాన్సన్‌ను పదవి నుంచి తప్పించాలని నిశ్చయించుకున్నారు. అయినా పార్టీలో అవిశ్వాసం నుంచి గట్టెక్కారు. కానీ మాజీ ఎంపీపై ఉన్న కేసు గురించి తెలిసినా ఆయన్ను నెత్తినబెట్టుకున్నారన్న నిజాన్ని పార్టీ సభ్యులు సహించలేకపోయారు. అది తప్పేనని జాన్సన్ అంగీకరించినా లాభం లేక పోయింది. అంతవరకూ మద్దతుదార్లుగా ఉన్న అప్పటి ఆర్థికమంత్రి, ప్రస్తుత ప్రధాని రిషి సునాక్, ఆరోగ్యమంత్రి సాజిద్ జావేద్ వంటివారు నిరుడు జూలైలో తమ పదవులకు రాజీనామా చేశారు. పలువురు మంత్రులు సైతం వారి బాట పట్టడంతో జాన్సన్ రాజీనామా చేయాల్సి వచ్చింది. తాజాగా సభాసంఘం అభిశంసన కన్సర్వేటివ్ పార్టీలో ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందన్నది వేచిచూడాలి. వచ్చే సోమవారం ఆ నివేదికపై జరిగే చర్చ సందర్భంగా పార్టీలో లుకలుకలు బయటపడక తప్పదు. నివేదికకు వ్యతిరేకంగా ఓటేయొద్దని పార్టీ ఎంపీలను బోరిస్ జాన్సన్ కోరు తున్నా, తన తప్పులకు మాత్రం పశ్చాత్తాపం ప్రకటించడం లేదు. సరిగదా ఇదంతా ప్రతీకార రాజకీ యాల పర్యవసానమని చెప్పుకొస్తున్నారు. కనీసం ఈ క్షణంలోనైనా పశ్చాత్తాప పడని నేతను ఎవ రైనా క్షమించగలరా? కన్సర్వేటివ్ పార్టీలో జాన్సన్ ఎదిగిన క్రమం అసాధారణమైనది. పాత్రికే యుడిగా ఉంటూ పార్టీలోకొచ్చిన జాన్సన్ 2008 నుంచి 2016 వరకూ రెండుసార్లు లండన్ మేయర్‌గా ఉన్నారు. పరిస్థితులు కలిసొచ్చి థెరిస్సా మే ప్రధాని పదవి నుంచి తప్పుకున్నాక 2019లో ఆ పదవి చేజిక్కించుకున్నారు. అదే సంవత్సరం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పార్టీకి అఖండ విజయాన్నందించారు. 1987 తర్వాత అంత పెద్ద మెజారిటీతో కన్సర్వేటివ్‌లు నెగ్గటం అదే తొలిసారి. ఒంటరి తల్లుల సమస్య మొదలుకొని స్వలింగ సంపర్కం, బ్రిటన్ వలసవాదం, బ్రెగ్జిట్ వరకూ సమయానుకూలంగా అభిప్రాయాలు మార్చుకుంటూ వచ్చిన జాన్సన్ వంటివారిని కన్స ర్వేటివ్ పార్టీ నెత్తినపెట్టుకోవటం మొదటినుంచీ విశ్లేషకుల్ని ఆశ్చర్యపరుస్తూనే ఉంది. పోతూ పోతూ జాన్సన్ అంటించిన బురద నుంచి ఆ పార్టీ ఏనాటికైనా బయటపడగలదా అన్నది సందేహమే. -
బోరిస్ కావాలనే తప్పుదోవ పట్టించారు
లండన్: బ్రిటన్ మాజీ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ పార్లమెంట్‌ను ఉద్దేశపూర్వకంగా పదేపదే తప్పుదోవ పట్టించారని పార్లమెంటరీ కమిటీ ఆరోపించింది. ప్రధానిగా ఉండగా కోవిడ్ నిబంధనలను ఉల్లంఘిస్తూ డౌనింగ్ స్ట్రీట్‌లోని అధికార నివాసంలో జరిగిన విందుల గురించి తనకు తెలియదనడంపై ఈ వ్యాఖ్యలు చేసింది. కోవిడ్ సమయంలో జరిగిన విందులనే పార్టీ గేట్ కుంభకోణంగా పేర్కొంటున్నారు. ‘సభను ఉద్దేశపూర్వకంగా తప్పుదారి పట్టించిన జాన్సన్ తీవ్రమైన ధిక్కారానికి పాల్పడ్డారని భావిస్తున్నాం. ఈ ధిక్కారం మరింత తీవ్రమైంది’అని పార్లమెంట్ హక్కుల కమిటీ పేర్కొంది. పార్లమెంటరీ కమిటీ సభ్యులు తనను లక్ష్యంగా చేసుకున్నారని ఆరోపిస్తూ జాన్సన్ ఇటీవల ఎంపీ పదవికి రాజీనామా చేశారు. ఆ సమయంలో జాన్సన్ చేసిన వ్యాఖ్యలపైనా కమిటీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇందుకు ఆయన్ను 90 రోజుల పాటు బహిష్కరించాలని సూచించింది. రాజీనామా చేసినందున..మాజీ సభ్యులకిచ్చే పాస్‌ను జాన్సన్‌కు ఇవ్వొద్దని పేర్కొంది. -
ఎంపీ పదవికి సైతం బోరిస్ జాన్సన్ రాజీనామా
లండన్: లాక్ డౌన్ సమయంలో నింబంధనలను ఉల్లంఘించిన కేసులో విచారణకు సంబంధించి బ్రిటన్ ప్రివిలేజెస్ కమిటీ నివేదికను సిద్ధం చేసిన నేపథ్యంలో బ్రిటన్ మాజీ ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్ తన ఎంపీ పదవికి రాజీనామా చేశారు. అనంతరం మీడియా సమావేశాన్ని నిర్వహించి పార్లమెంటును విడిచి వెళ్లడం చాలా బాధాకరంగా ఉందని అన్నారు. కరోనా సమయంలో బ్రిటన్ ప్రధానిగా ఉండి కూడా నిబంధనలను ఉల్లంఘించినందుకు అభియోగాలను ఎదుర్కొంటున్న బోరిస్ జాన్సన్ 2022లోనే ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేశారు. కానీ ఎంపీగా మాత్రం కొనసాగుతూ ఉన్నారు. మరికొద్ది రోజుల్లో ప్రివిలేజెస్ కమిటీ నివేదికను సమర్పించనున్న నేపథ్యంలో నివేదిక రాకముందే బోరిస్ జాన్సన్ తన ఎంపీ పదవికి రాజీనామా చేయడం చర్చనీయాంశమైంది. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. పార్లమెంటును విడిచి వెళ్లడం చాలా బాధగా ఉంది. నాపై నిరాధారమైన ఆరోపణలు చేస్తూ కొంతమంది నన్ను ఎలాగైనా ఈ హౌస్ నుంచి పంపించేయాలని ప్రయత్నం చేస్తున్నారు. కమిటీ నివేదిక రాకముందే వారు ఆలా చేయడం దురదృష్టకరమని అన్నారు. సుదీర్ఘకాలం పాటు సాగిన విచారణలో ప్రివిలేజెస్ కమిటీ అనేక విషయాలను పరిగణనలోకి తీసుకుంది. బోరిస్ జాన్సన్ తాను నివాసముంటున్న 10 డౌనింగ్ స్ట్రీట్ లో లాక్ డౌన్ నింబంధనలకు వ్యతిరేకంగా మద్యం పార్టీ చేసుకుని నిబంధనలను ఉల్లంఘించి, అనంతరం తప్పుడు నివేదికలతో పార్లమెంటును కూడా తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారన్నవి ఆయనపై ఉన్న ప్రధాన అభియోగాలు. ఇది కూడా చదవండి: భారత విద్యార్థులకు భరోసానిచ్చిన కెనడా ప్రధాని -
ఆనందంలో బోరిస్ జాన్సన్, తండ్రిగా మరోసారి ప్రమోషన్.. ఎనిమిదోసారి
లండన్: బ్రిటన్ మాజీ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ మరోసారి తండ్రి కాబోతున్నారు. ఇప్పటికే ఏడుగురు పిల్లల తండ్రయిన ఆయన మరోసారి తండ్రి అవుతున్న ఆనందంలో ఉన్నారు. ఈ విషయాన్ని ఆయన భార్య కేరీ ఇన్స్టాగ్రాం వేదికగా పంచుకున్నారు. మరి కొద్ది రోజుల్లో ఈ లోకంలోకి రానున్న బుజ్జాయి కోసం ఎదురుచూస్తున్నామని చెప్పారు. జాన్సన్ మూడో భార్య కేరీ. మొదటి భార్యతో ఆయనకి పిల్లలు లేరు. రెండో భార్య వీలర్‌తో నలుగురు పిల్లలు ఉన్నారు. 2021లో కేరిని పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరికీ ఇప్పటికే ఇద్దరు పిల్లలు ఉన్నారు. గతంలో మరో మహిళతోనూ జాన్సన్ అఫైర్ కొనసాగించడంతో ఆమె ఓ బిడ్డకు జన్మనిచ్చింది. దీంతో ఇప్పటిదాకా జాన్సన్‌కు ఏడుగురు సంతానం ఉన్నారు. -
అదానీకి మరో షాక్, జో జాన్సన్ గుడ్‌బై, ఎవరీ జాన్సన్?
న్యూఢిల్లీ: అదానీ గ్రూప్ హిండెన్ బర్గ్ సాగా కొనసాగుతోంది. అదానీ గ్రూప్‌పై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో యూకే ప్రధాని బోరిస్ జాన్సన్ సోదరుడు జో జాన్సన్ అదానీ సామ్రాజ్యంనుంచి తప్పుకున్నారు. లండన్‌కు చెందిన అదానీలతో సంబంధం ఉన్న ఎలారా క్యాపిటల్ డైరెక్టర్ పదవికి జో జాన్సన్ రాజీనామా చేశారు. (ట్రేడర్లకు అలర్ట్: అదానీ షేర్ల పతనం, ఎన్ఎస్ఈ కీలక నిర్ణయం) అదానీ ఎంటర్ప్రైజెస్ ఫాలో-ఆన్ పబ్లిక్ ఆఫర్ (ఎఫ్‌పీవీ)తో ముడిపడి ఉన్న యూకే ఆధారిత పెట్టుబడి సంస్థ నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌షిప్‌కు ఆయన గుడ్ బై చెప్పారు. ఫిబ్రవరి 1న జో జాన్సన్ డైరెక్టర్ పదవి ఉంచి తప్పుకున్నట్టు ఫైనాన్షియల్ టైమ్స్ ధృవీకరించింది. "యూకే- ఇండియా వాణిజ్యం, పెట్టుబడి సంబంధాలకు" సహకరించడానికి ఎలారాలో చేరాననీ, అప్పటికి కంపెనీ మంచి పరిస్థితిలో ఉందని తనకు హామీ ఇచ్చారనీ తెలిపారు. అలాగే ఎలారా క్యాపిటల్ చట్టపరమైన బాధ్యతలకు కట్టుబడి ఉందని అయితే ఆర్థిక నియంత్రణకు సంబంధించిన ప్రత్యేక రంగాలలో ఎక్కువ డొమైన్ నైపుణ్యం అవసరమని భావించి బోర్డుకు రాజీనామా చేసానని జో జాన్సన్ వెల్లడించారు. (అదానీ షేర్ల బ్లడ్ బాత్: ఆరు రోజుల నష్టం, ఆ దేశాల జీడీపీతో సమానం!) ఎలారా క్యాపిటల్‌కి.. అదానీ గ్రూప్‌కి లింక్ ఏంటి? భారతీయ కార్పొరేట్ల కోసం నిధులను సమీకరించే క్యాపిటల్ సంస్థ ఎలారా క్యాపిటల్. అదానీ ఎంటర్ప్రైజెస్ ఎఫ్‌పీవోలోని 10 బుక్‌రన్నర్‌లలో ఎలారా క్యాపిటల్ కూడా ఒకటి. లార్డ్ జాన్సన్ గత ఏడాది జూన్‌లో లండన్‌కు చెందిన ఎలారా క్యాపిటల్ పిఎల్సికి డైరెక్టర్‌గా నియమితులయ్యారు. ఎలారా క్యాపిటల్‌ను 2002లో రాజ్ భట్ క్యాపిటల్ మార్కెట్ వ్యాపారంగా స్థాపించారు, GDR (గ్లోబల్ డిపాజిటరీ రసీదు), FCCB (ఫారిన్ కరెన్సీ కన్వర్టిబుల్ బాండ్), లండన్ AIM మార్కర్ ద్వారా భారతీయ కార్పొరేట్లకు నిధులను సమకూరుస్తుంది. ఇది న్యూయార్క్, సింగపూర్, ముంబై, అహ్మదాబాద్ లండన్లలో పూర్తి లైసెన్స్ పొందిన కార్యాలయాలను కలిగి ఉంది. ఎలారా క్యాపిటల్ అసెట్ మేనేజ్మెంట్ విభాగం 2021 వేసవి నాటికి 5.1 శాతం వాటాతో అదానీ ఎంటర్‌ప్రైజెస్‌లో మూడవ అతిపెద్ద వాటాదారుగా ఉంది. కాగా అప్పటి ప్రధాని బోరిస్ జాన్సన్ 2022 ఏప్రిల్‌లో బోరిస్ రెండు రోజుల భారత పర్యటనలో అదానీ చైర్మన్ గౌతమ్ అదానీని అహ్మదాబాద్‌లో కలిశారు. మరోవైపు తాజా నివేదికల ఆధారంగా అదానీ వివాదంపై కాంగ్రెస్ ప్రభుత్వంపై తన విమర్శలను మరోసారి ఎక్కు పెట్టింది. బోరిస్ జాన్సన్ 25 ఏళ్ల కుమారుడికి అహ్మదాబాద్‌లోని అదానీలతో కొంత సంబంధం ఉందని కాంగ్రెస్ నాయకురాలు సుప్రియా ష్రినేట్ ట్వీట్ చేశారు. అదానీ గ్రూప్‌పై వచ్చిన ఆరోపణలపై కోర్టు పర్యవేక్షణలో విచారణ జరపాలని లేదా జేపీసీని ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ గురువారం డిమాండ్ చేసింది. -
ఒక్క నిమిషం పట్టదు.. పుతిన్‌పై సంచలన ఆరోపణలు
లండన్: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌పై బ్రిటన్ మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ సంచలన ఆరోపణలు చేశారు. ఉక్రెయిన్ దురాక్రమణకు కొన్నిరోజుల ముందు ఫోన్ చేసి మరీ తనపై వ్యక్తిగత దాడికి పాల్పడతానని బెదిరించాడని జాన్సన్ పేర్కొన్నారు. ఫిబ్రవరి 24 ఉక్రెయిన్ ఆక్రమణకు కొన్నిరోజుల ముందు నా కార్యాలయానికి ఓ ఫోన్ కాల్ వచ్చిందని, వ్యక్తిగతంగా తనపై మిస్సైల్ దాడికి పాల్పడతానని పుతిన్ తనను బెదిరించాడని బోరిస్ జాన్సన్ తాజాగా ఆరోపించారు. ఈ మేరకు బోరిస్ వ్యాఖ్యలతో కూడిన ఓ డాక్యుమెంటరీని బీబీసీ తాజాగా ప్రసారం చేసింది. ‘‘బోరిస్.. మిమ్మల్ని గాయపర్చడం నా ఉద్దేశం కాదు. కానీ, మీపై మిస్సైల్ దాడి తప్పదు. అందుకు ఒక్క నిమిషం చాలు. అలా అంతా అయిపోతుంది’’ అని పుతిన్ ఆ ఫోన్‌కాల్‌లో బెదిరించినట్లు జాన్సన్ పేర్కొన్నారు. అంతేకాదు.. ఆ ఫోన్‌కాల్‌లోనే ఉక్రెయిన్ నాటో చేరిక వ్యవహారం గురించి హాట్ హాట్‌గా పుతిన్ కామెంట్లు చేశాడని బోరిస్ తెలిపారు. ఆ సమయంలో తాను చాలా సహనంగా వ్యవహరించానని బోరిస్ గుర్తు చేసుకున్నారు. ఇదిలా ఉంటే.. ఉక్రెయిన్ ఆక్రమణను ఖండించిన పాశ్చాత్య దేశాల నేతల్లో బోరిస్ జాన్సన్ కూడా ఉన్నారు. యుద్ధం మొదలైన కొన్నాళ్లకు.. హఠాత్తుగా ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లో ప్రత్యక్షమై ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచారు బోరిస్. -
పుతిన్ ఓడిపోతాడు...చైనా బలపడుతుంది: బ్రిటన్ ప్రధాని షాకింగ్ వ్యాఖ్యలు
ఉక్రెయిన్‌పై యుద్ధానికి దిగిన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఓడిపోతాడంటూ బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. త్వరలో పుతిన్ ఓడిపోతాడని, రష్యా సైనిక ఆయుధాల ఎగుమతి దెబ్బతింటుందని అన్నారు జాన్సన్. దీంతో చైనా బలపడుతుందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫిబ్రవరిలో మొదలైన ఉక్రెయిన్ రష్యాల యుద్ధం ఇప్పట్లో ఆగిపోయే సూచనలు కనపడటం లేదన్నారు. మనమంతా ప్రమాదకరమైన పరిస్థితుల్లో జీవిస్తున్నాం కాబట్టి అందరం కలిసికట్టుగా సహకారంతో కొనసాగాల్సిందే అన్నారు. ఇలాంటి విపత్కర తరుణంలో చైనాతో కలసి పనిచేసే మార్గాలను అన్వేషించాలి. ఈ మేరకు యూకే భారత్‌ల మధ్య ఉన్న స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం గురించి కూడా ప్రస్తావించారు జాన్సన్. ఆర్థిక ప్రయోజనాల దృష్ట్యా బ్రిటన్, భారత్ ఒకదానిపై ఒకటి ఆధార పడకపోయినప్పటికీ కొంతమంది బాధ్యత రాహిత్యం వల్ల తాము కలిసికట్టుగా కొన సాగుతున్నామంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్లు తమ మాతృదేశం పట్ల ఉన్న వీరత్వంతో కూడిన ప్రేమతో రష్యాపై పోరాడి విజయం సాధిస్తారనని ధీమాగా చెప్పారు. ఈ విషయంలో ఉక్రెయిన్‌కి బ్రిటన్ సైనిక పరంగా మద్దతిస్తునే ఉంటుందని నమ్మకంగా చెప్పారు. ఈ యుద్ధం కారణంగా ప్రపంచమంతటా సరఫరా అవుతున్న రష్యా సైనిక ఆయుధాలపై కచ్చితంగా ప్రభావం ఏర్పడతుందని అంచనావేశారు. ఇప్పటికే 60 శాతం పైగా రష్యా క్షిపణులు నాశనమయ్యాయని అంచనా వేశారు. అదీగాక రష్యా గత దశాబ్దంలో భారత్‌కి సుమారు రూ.18 లక్షల కోట్లు ఆయుధాలను ఎగుమతి చేసిందన్నారు. అత్యున్నత సైనిక బలగాలు ఉన్నప్పటికీ ఉక్రెయిన్‌ని నియంత్రించటంలో రష్యా విఫలమైందన్నారు. పుతిన్ చేసిన ఘోర తప్పిదం రష్యాను త్రీవ్రంగా బలహీనపరుస్తుందన్నారు. అలాగే మరోవైపు చైనా తైవాన్‌ల మధ్య ఉన్న ఉద్రిక్తతలను దృష్టిలో ఉంచుకుని బ్రిటన్ భారత్‌లు కలిసి పనిచేయం అత్యంత ముఖ్యమని నొక్కి చెప్పారు. చైనా కరోనా మహామ్మారీ విషయంలోప్రవర్తించిన తీరును సైతం తప్పుబడుతూ విమర్శలు గుప్పించారు. మహమ్మారీ సమయంలో ఇరుదేశాలు ప్రపంచమంతటా బిలియన్ల కొద్ది వ్యాక్సిన్లను పంపిణీ చేశాయన్నారు. రానున్న రోజుల్లో ముప్పు మరింతంగా ఉంటుందని, అందువల్ల ఇరు దేశాలు(భారత్, బ్రిటన్ దేశాలు) పరస్పర సహకారాన్ని మరింతగా కొనసాగించాలని ఆకాంక్షించారు బోరిస్ జాన్సన్ (చదవండి: అన్నంత పనిచేస్తున్న పుతిన్... చిన్నారులకు సైతం సైనిక శిక్షణ) -
పోటీ నుంచి తప్పుకున్న బోరిస్.. బ్రిటన్ కొత్త ప్రధానిగా రిషి సునాక్!
లండన్: భారత సంతతికి చెందిన రిషి సునాక్.. బ్రిటన్ కొత్త ప్రధాని కావడం దాదాపు ఖాయంగా కన్పిస్తోంది. పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ ప్రకటించడంతో ఆయనకు తిరుగులేకుండా పోయింది. ఇక రేసులో మిగిలి ఉన్న పెన్నీ మోర్డాంట్‌కు కేవలం 29 మంది ఎంపీల మద్దతే ఉన్నట్లు తెలుస్తోంది. కనీసం 100 మంది ఎంపీల సపోర్ట్ లేకుండా ఆమె పోటీ చేయడం అసాధ్యం. సోమవారం మధ్యాహ్నం 2 గంటల్లోగా ఆమె 100 మంది సభ్యుల మద్దతు ఉందని నిరూపించుకోలేకపోతే.. 142 మంది సభ్యుల మద్దతున్న రిషి సునాక్ ఆటోమేటిక్‌గా ప్రధాని అవుతారు. ఫలితంగా బ్రిటన్ ప్రధాని బాధ్యతలు చేపట్టే తొలి భారత సంతతి వ్యక్తిగా సరికొత్త చరిత్ర సృష్టిస్తారు. పోటీ చేస్తానని తప్పుకున్న బోరిస్.. లిజ్ ట్రాస్ రాజీనామా చేయగానే.. ప్రధాని పదవి కోసం బోరిస్ మరోసారి పోటీ చేస్తారని జోరుగా ప్రచారం జరిగింది. ఆయన కూడా వేగంగా పావులు కదిపారు. దాదాపు 100 మంది కన్జర్వేటివ్ పార్టీ ఎంపీలు ఆయనకు మద్దతు తెలిపినట్లు సన్నిహితవర్గాలు పేర్కొన్నాయి. దీంతో పోటీ లేకుండా ప్రధాని అయ్యేందుకు ఆయన రిషి సునాక్, పెన్నీ మోర్డాంట్తో చర్చలు జరపగా వారు రేసు నుంచి తప్పుకునేందుకు నిరాకరించారు. మరోవైపు రిషికి 142 మంది ఎంపీలు అండగా ఉన్నారు. దీంతో రిషితో పోటీపడి గెలవలేనని భావించిన బోరిస్.. ప్రధాని రేసు నుంచి తప్పుకుంటున్నట్లు అధికారికంగా ప్రకటించారు. కన్జర్వేటివ్ పార్టీని తాను ఏకం చేయలేనని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. అయినా తాను ఎప్పుడూ ప్రజాక్షేత్రంలోనే ఉంటూ దేశానికి అవసరమైన సహాయ సహకారాలు అందిస్తానని పేర్కొన్నారు. బోరిస్ నిర్ణయం అనంతరం రిషి సునాక్ ఆయనను ప్రశంసలతో ముంచెత్తారు. బ్రెగ్జిట్, కరోనా వ్యాక్సిన్ల పంపణీ, ఉక్రెయిన్ యుద్ధం సమయంలో మాజీ ప్రధాని దేశాన్ని ముందుకు నడిపిన తీరు అద్భుతమని కొనియాడారు. రిషి సునాక్.. భారత ఐటీ దిగ్గజ సంస్థ ఇన్ఫోసిస్ సహవ్యవస్థాపకుడు నారయణ మూర్తి అల్లుడనే విషయం అందరికీ తెలిసిందే. ఆయన కూతురు అక్షతా మూర్తినే రిషి వివాహమాడారు. వీరికి ఇద్దరు పిల్లలున్నారు. చదవండి: బ్రిటన్ ప్రధాని పోటీలో ఉన్నా.. అధికారికంగా ప్రకటించిన రిషి సునాక్.. -
బ్రిటన్ ప్రధాని పోటీలో ఉన్నా.. అధికారికంగా ప్రకటించిన రిషి సునాక్..
లండన్: భారత సంతతికి చెందిన రిషి సునాక్ తాను మరోసారి బ్రిటన్ ప్రధాని పదవికి పోటీ పడుతున్నట్లు ఆదివారం అధికారికంగా ప్రకటించారు. అత్యంత గొప్ప దేశమైన బ్రిటన్.. ప్రస్తుతం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుందని పేర్కొన్నారు. తాను ప్రధాని అయి పరిస్థితిని చక్కదిద్దుతానని, పార్టీని ఏకం చేసి అందరి మద్దతుతో దేశాన్ని ముందుకు నడిపిస్తానని చెప్పారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. గతంలో తాను ఆర్థిక మంత్రిగా పని చేసిన విషయాన్ని రిషి సునాక్ గుర్తు చేశారు. ప్రస్తుత పరిస్థితిని చక్కదిద్దేందుకు ఆ అనుభవం ఉపయోగపడుతుందన్నారు. అయితే అందరూ అనుకున్న దానికంటే కఠిన సవాళ్లను అధిగమించాల్సి ఉందన్నారు. అందుకే ఇప్పుడు కన్జర్వేటివ్ పార్టీ సభ్యులు తీసుకునే నిర్ణయం భవిష్యత్ తరాలకు మనకంటే ఎక్కువ అవకాశాలు తెచ్చిపెట్టేలా ఉండాలన్నారు. తాను పార్టీ నాయకుడిగా, ప్రధానిగా బాధ్యతలు చేపట్టి సమస్యలను పరిష్కరిస్తానని చెప్పారు. The United Kingdom is a great country but we face a profound economic crisis. That’s why I am standing to be Leader of the Conservative Party and your next Prime Minister. I want to fix our economy, unite our Party and deliver for our country. pic.twitter.com/BppG9CytAK — Rishi Sunak (@RishiSunak) October 23, 2022 రిషి సునాక్ ప్రధాని పదవికి పోటీ చేసి రెండు నెలలు కూడా గడవలేదు. లిజ్ ట్రస్‌తో పోటీ పడిన ఆయనకు సొంత ఎంపీల మద్దతు లభించినా.. పార్టీ సభ్యుల నుంచి మాత్రం ఓట్లు రాలేదు. దీంతో ఓటమి పాలయ్యారు. అయితే ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన ట్రస్ ఘోరంగా విఫలం కావడంతో 45 రోజులకే ఆమె పదవికి రాజీనామా చేశారు. దీంతో రెండు నెలల వ్యవధిలోనే మరోసారి కొత్త ప్రధాని ఎంపిక అనివార్యమైంది. అయితే ఈసారి మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ కూడా పోటీలో ఉండనున్నట్లు తెలుస్తోంది. ఆయనకు కూడా 100మందికిపైగా కన్జర్వేటివ్ పార్టీ ఎంపీల మద్దతు ఉన్నట్లు సన్నిహితులు చెబుతున్నారు. అయితే బోరిస్ తన అభ్యర్థిత్వాన్ని ఇంకా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. మరి ఈసారైనా రిషి ప్రధాని అవుతారో లేదో చూడాలి. చదవండి: రిషి, బోరిస్ నువ్వా, నేనా? -
UK political crisis: రిషి, బోరిస్ నువ్వా, నేనా?
లండన్: బ్రిటన్ ప్రధాని రేసు ఆసక్తికరంగా మారుతోంది. భారతీయ సంతతికి చెందిన మాజీ ఆర్థిక మంత్రి రిషి సునాక్ (42) ముందున్నట్టు ఆయన మద్దతుదారులు చెబుతున్నారు. కన్జర్వేటివ్ పార్టీ నేతగా, తద్వారా ప్రధానిగా పగ్గాలు చేపట్టేందుకు నామినేషన్ కోసం అవసరమైన 100 మంది పార్టీ ఎంపీల మద్దతు ఆయనకు ఇప్పటికే సమకూరిందని వారు వెల్లడించారు. ఈ నేపథ్యంలో కుటుంబంతో కరేబియన్ దీవులకు విహారయాత్రకు వెళ్లిన మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ హుటాహుటిన లండన్ తిరిగొచ్చారు. ఆయనకు కూడా 100 మంది ఎంపీల మద్దతు సమకూరిందని ఆయన వర్గీయులు చెప్పుకొచ్చారు. రిషి, జాన్సన్ ఇప్పటిదాకా తాము రేసులో ఉన్నట్టు వెల్లడించలేదు. ఎంపీల మద్దతుపై కూడా ఏమీ మాట్లాడలేదు. పెన్నీ మోర్డంట్ మాత్రమే పోటీలో ఉన్నట్టు ప్రకటించారు. సోమవారం మధ్యాహ్నానికల్లా 100 మంది ఎంపీల మద్దతు సాధించిన వారి మధ్య తదుపరి పోటీ ఉంటుంది. రిషికి పెరుగుతున్న మద్దతు రిషిని సమర్థిస్తున్న మంత్రులు, పార్టీ ఎంపీల సంఖ్య వేగంగా పెరుగుతోంది. ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడంతో పాటు దేశ పౌరులకు విశ్వాసం కల్పించగల నేత ప్రస్తుతం రిషి మాత్రమేనని మాజీ ఉప ప్రధాని డొమినిక్ రాబ్ అభిప్రాయపడ్డారు. మళ్లీ వెనకటి రోజులకు వెళ్లేమని బోరిస్నుద్దేశించి అన్నారు. అయితే మళ్లీ ప్రధాని కావాలని తహతహలాడుతున్న బోరిస్ పోటీ లేకుండా నెగ్గేలా వ్యూహాలు పన్నుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. అందులో భాగంగా రిషిని తప్పుకోవాలని కోరినట్టు ప్రచారం జరుగుతోంది. -
‘ప్రధానిగా ఆయనే సరైన వ్యక్తి’.. బోరిస్‌కు పెరుగుతున్న మద్దతు!
లండన్: కొత్త ప్రధానమంత్రిని ఎన్నుకునేందుకు బ్రిటన్‌లో అధికార కన్జర్వేటివ్ పార్టీ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఈ క్రమంలో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. ప్రధాని రేసులో ఆర్థిక శాఖ మాజీ మంత్రి రిషీ సునాక్ పేరు బలంగా వినిపిస్తోంది. ఆయనకు 100 మందికిపైగా ఎంపీలు మద్దతిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు.. మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ పోటీకి సిద్ధమయ్యారు. విహారయాత్రను అర్ధాంతరంగా ముగించుకుని బ్రిటన్ చేరుకున్నారు. ఈ క్రమంలో భారత సంతతి వ్యక్తి, బోరిస్ కేబినెట్లో హోంశాఖ మంత్రిగా పని చేసిన ప్రీతి పటేల్ కీలక వ్యాఖ్యలు చేశారు. లిజ్ ట్రస్ స్థానంలో ప్రధాని పదవి చేపట్టేందుకు బోరిస్ జాన్సన్ సరైన వ్యక్తి అని పేర్కొన్నారు. ఓవైపు.. రిషీ సునాక్‌కు ఎంపీల మద్దతు పెరుగుతున్న క్రమంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేయటం ప్రాధాన్యం సంతరించుకుంది. బోరిస్ జాన్సన్‌కు మద్దతు తెలుపుతూ ట్విటర్ వేదికగా వెల్లడించారు ప్రీతి పటేల్.‘ ప్రస్తుత సమయంలో పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకోగల సత్తా మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్‌కు ఉందనటంలో ఆయనకు సరైన ట్రాక్ రికార్డ్ ఉంది. మన మేనిఫెస్టోను అమలు చేయగలరు. ఈ నాయకత్వ పోటీలో నేను ఆయనకు మద్దతు ఇస్తున్నాను.’అనిపేర్కొన్నారు ప్రీతి పటేల్. ప్రధాని రేసులో నిలవాలని భావిస్తున్న బోరిస్ జాన్సన్ హుటాహుటిన బ్రిటన్ తిరిగి వచ్చిన క్రమంలో ప్రీతి పటేల్ ట్వీట్ చేయటం గమనార్హం. బోరిస్ జాన్సన్ ఆరు వారాల క్రితమే ప్రధాని పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసింది. తన కేబినెట్లోని అసమ్మతి నేతలు రాజీనామాలు చేయటం వల్ల ఆయన పదవి నుంచి దిగిపోక తప్పలేదు. అయితే, ఇప్పటికీ ఆయనకు పార్టీలో ఆదరణ తగ్గలేదని స్పష్టమవుతోంది. ఇప్పటికే ముగ్గురు కేబినెట్ మంత్రులు బోరిస్‌కు మద్దతు ప్రకటించారు. వాణిజ్య శాఖ మంత్రి జాకబ్ రీస్ మోగ్, రక్షణ మంత్రి బెన్ వల్లాస్, సిమోన్ క్లెర్క్‌లు బోరిస్‌కు అండగా నిలిచారు. ప్రస్తుతం బోరిస్ జాన్సన్‌కు 46 మంది ఎంపీల మద్దతు ఉండగా.. రిషీ సునాక్‌కు 100 మంది ఉన్నట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. సోమవారం మధ్యాహ్నం నాటికి ఎవరు పోటీలో ఉండనున్నారని తెలనుంది. అయితే, ఒక్కరే పోటీలో ఉన్నట్లు తెలితే వచ్చే వారమే కొత్త ప్రధాని బాధ్యతలు చేపట్టనున్నారు. కానీ, ఒకవేళ ఇద్దరు బరిలో ఉంటే 1,70,000 మంది పార్టీ సభ్యులు వచ్చే శుక్రవారం ఆన్లైన్ ఓటింగ్‌లో పాల్గొని తమ నాయకుడిని ఎన్నుకుంటారు. I'm backing @BorisJohnson to return as our Prime Minister, to bring together a united team to deliver our manifesto and lead Britain to a stronger and more prosperous future. pic.twitter.com/6wyGmASLda — Priti Patel MP (@pritipatel) October 22, 2022 ఇదీ చదవండి: రాజకీయ పావులు కదుపుతున్న బోరిస్.. ఇప్పటికిప్పుడు ప్రధాని పదవి వద్దంటూ రిషి సునాక్‌కు ఆఫర్ -
‘రిషి సునాక్.. ప్రధాని ఛాన్స్ నాకివ్వు!’
దాదాపుగా వంద మంది అధికార కన్జర్వేటివ్ పార్టీ ఎంపీల మద్దతుతో ప్రధాని పదవి పోటీకి సిద్ధమయ్యారు రిషి సునాక్. లిజ్ ట్రస్ రాజీనామాతో సెకండ్ ఛాయిస్‌గా మాజీ ఆర్థిక మంత్రి రిషి సునాక్‌కే పగ్గాలు దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే.. ఈ రేసులోకి మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ సైతం వచ్చి చేరారు. సెలవులపై కరేబియన్ దీవులకు(డొమినికన్ రిపబ్లిక్) వెళ్లిన బోరిస్ జాన్సన్.. తాజా రాజకీయ పరిణామాలతో హడావిడిగా లండన్‌కు బయలుదేరారు. అయితే.. ఈలోపే ఆయన రిషి సునాక్‌తో సంప్రదింపులు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. తదుపరి ప్రధాని అయ్యే అవకాశం తనకు ఇవ్వాలని బోరిస్.. రిషి సునాక్‌కు కోరినట్లు లండన్‌కు చెందిన ది టెలిగ్రాఫ్ ఓ కథనం ప్రచురించింది. ఒకవైపు రూలింగ్ పార్టీ ప్రాబల్యం, జనాదరణ కోల్పోయినందున.. ఎన్నికలు నిర్వహించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ రాజకీయ సంక్షోభం నుంచి బయటపడేందుకు ప్రధాని అవకాశం తనకు ఇవ్వాలని.. తద్వారా 2024 డిసెంబర్లో జరగబోయే ఎన్నికల్లో ఓటమి నుంచి కన్జర్వేటివ్ పార్టీని గట్టెక్కించగలనని రిషి సునాక్‌తో బోరిస్ జాన్సన్ చెప్పినట్లు ఆ కథనం తెలిపింది. ప్రస్తుతానికి డిప్యూటీ పీఎం పదవిని ఆఫర్ చేసిన బోరిస్.. 2024 ఎన్నికల నాటికి కన్జర్వేటివ్ పార్టీ తరపున ప్రధాని అభ్యర్థిగా నిలబడవచ్చని రిషి సునాక్‌ను ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. ఈ కష్టకాలంలో పార్టీకి అండగా నిలబడాల్సిన అవసరం ఉందని.. కాబట్టి ప్రధాని అవకాశం తనకు ఇవ్వాలని రిషి సునాక్‌ను బోరిస్ జాన్సన్ కోరినట్లు టెలిగ్రాఫ్ కథనం పేర్కొంది. అయితే.. బోరిస్ ఆఫర్లను రిషి సునాక్ తిరస్కరించే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయంటూ మరో కథనం ప్రచురించింది టెలిగ్రాఫ్. ఇదీ చదవండి: తర్వాతి వైరస్ పుట్టుక అక్కడి నుంచేనా? Rishi Sunak is expected to reject any offer by Boris Johnson to drop his leadership bid in return for a Cabinet job as two Tory big beasts mull over whether to strike a deal. https://t.co/WyjB4zi7RG — The Telegraph (@Telegraph) October 22, 2022 Rishi Sunak became the first Tory leadership candidate to secure the backing of 100 MPs on Friday night as Boris Johnson’s supporters began warning of a stitch-up. 🔓 This front page story is currently free to read https://t.co/sBwlD3ysls — The Telegraph (@Telegraph) October 22, 2022 ఎక్స్ ఛాన్స్లర్ రిషి సునాక్‌కు 93 మంది సభ్యులు మద్దతు ప్రకటించగా.. టోబియాస్ ఎల్వుడ్ తాను వందవ మద్దతుదారుడినని ప్రకటించడం విశేషం. తద్వారా రిషి సునాక్‌కు పోటీలో నిలబడడానికి అవసరమైన 100 మంది ఎంపీల మద్దతు లభించినట్లయ్యింది. ఇక.. మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్‌కు 44 మంది మద్దతు ఉండగా.. మూడో స్థానంలో పెన్నీ మోర్డాంట్ 21 మంది మద్దతుతో ఉన్నారు. బ్రిటిష్ కాలమానం ప్రకారం.. సోమవారం మధ్యాహ్నాం 2గం. వరకు నామినేషన్లకు గడువు ఉంది. అదే రోజు కన్జర్వేటివ్ పార్టీ నేత కోసం ఎన్నిక సైతం జరిగే అవకాశం ఉంది. -
మ్యాగజైన్ స్టోరీ : యూకే నాట్ ఓకే
-
రిషి సునాక్ తొలి అడుగు
లండన్: లిజ్ ట్రస్ ఆకస్మిక రాజీనామాతో ఖాళీ అయిన బ్రిటన్ ప్రధాని కోసం అభ్యర్థుల ఎంపికలో కీలక పరిణామం చోటు చేసుకుంది. మరోవారం పాటు ఆపద్ధర్మ ప్రధానిగా ట్రస్ కొనసాగనున్న తరుణంలో.. ఈ మధ్యలోనే కన్జర్వేటివ్ పార్టీ ప్రధాని అభ్యర్థిని ఎన్నుకోవాల్సి ఉంది. ఈ క్రమంలో ఇప్పుడు ఆ పార్టీ ఎంపీల మద్దతే కీలకంగా మారింది. అభ్యర్థిగా బరిలో దిగాలంటే కనీసం 100 మంది ఎంపీల మద్దతు అవసరం. అయితే.. బ్రిటన్ మాజీ ఆర్థిక మంత్రి, భారత సంతతికి చెందిన రిషి సునాక్ ఇప్పటికే వంద మంది టోరీ సభ్యుల మద్దతు కూడగట్టుకున్నట్లు తెలుస్తోంది. శుక్రవారం సాయంత్రం నాటికే ఆయన ఆ మద్దతును దాటేశారని, తద్వారా ప్రధాని అభ్యర్థిత్వానికి పోటీ పడుతున్న మొదటి వ్యక్తిగా నిలిచారని స్థానిక మీడియా ప్రకటించింది. ఇక మాజీ ఆరోగ్య మంత్రి మ్యాట్ హ్యాంకాక్ సైతం రిషి సునాక్‌కు తన మద్దతు ప్రకటించారు. మరో టోరీ ఎంపీ నైగెల్ మిల్స్.. గతంలో ట్రస్‌ను ఎన్నుకుని తప్పు చేశానని, ఈసారి ఆ తప్పు మరోసారి చేయదల్చుకోలేదంటూ రిషి సునాక్‌కు మద్దతు ప్రకటించారు. ట్రస్ పన్ను రాయితీలు దేశాన్ని ఆర్థిక సంక్షోభంలోకి నెడతాయని మొదట్నుంచి హెచ్చరిస్తూ వచ్చిన 42 ఏళ్ల సునాక్‌కు ఈసారి ఎక్కువగా కలిసొచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఘోరంగా దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టగలడన్న నమ్మకం.. ఈసారి సభ్యుల్లో కలిగితే గనుక సునాక్ గెలుపు నల్లేరు మీద నడకే కానుంది. బరిలో సునాక్‌తో పాటు పెన్నీ మోర్డంట్, మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ సైతం నిలబడచ్చని అంచనా. నామినేషన్ల గడువు 24(సోమవారం) ముగియనుంది. ఇద్దరి కంటే ఎక్కువ మంది 100 ఎంపీ మద్దతు సాధిస్తే.. వాళ్ల నుంచి ఇద్దరిని కన్జర్వేటివ్ పార్టీ ఎంపీల ఓటింగ్ ద్వారా ఫిల్టర్ చేస్తారు. ఆ ఇద్దరిలో మళ్లీ ఒకరిని ఓటింగ్ ద్వారా తమ నాయకుడిగా ఎన్నుకుంటారు. ఓటింగ్ ఫలితాలను అక్టోబర్ 28న ప్రకటిస్తారు. ఆ గెలిచిన వ్యక్తిని బ్రిటన్ రాజు ఛార్లెస్-3.. బ్రిటన్ ప్రధానిగా ప్రకటిస్తారు. ఇవేం లేకుండా గడువులోగా ఒక్కరికే వంద మంది ఎంపీల మద్దతు గనుక లభిస్తే.. ఏకగ్రీవంగా ప్రధాని అవుతారు. ఒక ప్రధాని రాజీనామా చేసి మరొకరు పదవి చేపట్టే సమయంలో ఎన్నిక ప్రక్రియ సర్వసాధారణంగా టోరీ సభ్యుల వరకు వెళ్లదు. ఇద్దరు సభ్యులు చివర్లో మిగిలితే తక్కువ మంది ఎంపీల మద్దతున్న వారు తప్పుకుంటారు. 2016లో థెరిసా మే ప్రధాని అయినప్పుడు ప్రత్యర్థి అండ్రూ లీడ్సమ్ ఇలాగే బరి నుంచి తప్పుకున్నారు. ఇదీ చదవండి: మాజీ ప్రధాని ట్రస్‌కు ఎంత జీతమంటే.. -
UK Political Crisis: ఎంపీలే కీలకం
బ్రిటన్ ప్రధాని లిజ్ ట్రస్ రాజీనామాతో ఆమె వారసుడెవరన్న దానిపై అంతటా ఆసక్తి నెలకొంది. భారత సంతతికి చెందిన మాజీ ఆర్థిక మంత్రి రిషి సునాక్, మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ సహా పలువురు రేసులో ఉన్నారు. ఈసారి ఎన్నికల ప్రక్రియలో కన్జర్వేటివ్ పార్టీ సభ్యుల కంటే ఎంపీల మద్దతే కీలకంగా మారింది. అభ్యర్థిగా బరిలో దిగాలంటే కనీసం 100 మంది ఎంపీల మద్దతు అవసరం. గతంలో 20గా ఉండేది. ఎన్నిక ప్రక్రియ ఇలా... ఈసారి ఎన్నిక ప్రక్రియ కూడా గతంలో కంటే భిన్నంగా ఉంటుంది. 1922 కమిటీ నిబంధనల మేరకు 100 మంది ఎంపీల మద్దతున్నవారికే పోటీకి చాన్సుంటుంది. పార్లమెంటులో 357 మంది ఎంపీలున్నందున అత్యధికంగా ముగ్గురు బరిలో దిగొచ్చు. ► నామినేషన్‌కు ఈ నెల 24తో గడువు ముగుస్తుంది. అప్పటికల్లా ఇద్దరి కంటే ఎక్కువ మంది 100 ఎంపీల మద్దతు సాధిస్తే వారి నుంచి ఇద్దరిని ఎంపీలే అప్పటికప్పుడు ఎన్నుకుంటారు. అంటే అత్యధిక ఓట్లు పొందిన ఇద్దరు బరిలో మిగులుతారు. ► ఆ ఇద్దరిలో ఒకరిని టోరీ సభ్యులు ఆన్లైన్లో తమ నాయకుడిగా ఎన్నుకుంటారు. అక్టోబర్ 28న ఫలితాలు ప్రకటిస్తారు. ఆ తర్వాత కింగ్ చార్లెస్ –3 లాంఛనంగా కొత్త ప్రధానిని నియమిస్తారు. ► ఒకవేళ గడువులోగా 100 మంది ఎంపీల మద్దతు ఒక్కరికే లభిస్తే తదుపరి ప్రక్రియతో పని లేకుండా వారే నేరుగా ప్రధాని అవుతారు. ► ఒక ప్రధాని రాజీనామా చేసి మరొకరు పదవి చేపట్టే సమయంలో ఎన్నిక ప్రక్రియ సర్వసాధారణంగా టోరీ సభ్యుల వరకు వెళ్లదు. ఇద్దరు సభ్యులు చివర్లో మిగిలితే తక్కువ మంది ఎంపీల మద్దతున్న వారు తప్పుకుంటారు. 2016లో థెరిసా మే ప్రధాని అయినప్పుడు ప్రత్యర్థి అండ్రూ లీడ్సమ్ ఇలాగే బరి నుంచి తప్పుకున్నారు. ► అందుకే ఈ సారి ఎన్నికలో టోరీ సభ్యులు కంటే ఎంపీలే కీలకంగా ఉన్నారు. రేసులో వీరే... రిషి సునాక్: భారత సంతతికి చెందిన రిషి ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి అల్లుడు. గత ఎన్నికలో ట్రస్‌కు గట్టి పోటీ ఇచ్చారు. అత్యధిక ఎంపీల మద్దతు ఆయనకే ఉన్నా ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టగలనని సభ్యుల్లో విశ్వాసం కలిగించలేక 21 వేల ఓట్లతో ఓటమి పాలయ్యారు. ట్రస్ పన్ను రాయితీలు దేశాన్ని ఆర్థిక సంక్షోభంలోకి నెడతాయని మొదట్నుంచి హెచ్చరిస్తూ వచ్చిన సునాక్‌కు ఈసారి ఎంపీల మద్దతు లభించే అవకాశముంది. బోరిస్ జాన్సన్: తాను ప్రధాని పదవి నుంచి తప్పుకోవాల్సి రావడానికి రిషియే కారణమన్న ఆగ్రహంతో ఉన్న జాన్సన్ మరోసారి పీఠమెక్కేందుకు ప్రయత్నిస్తున్నారు. సొంత పార్టీ ఎంపీలు, మంత్రుల తిరుగుబాటు కారణంగా మరో దారి లేక ప్రధానిగా రాజీనామా చేసినా, జాన్సన్‌కు ఇప్పటికీ పార్టీపై పట్టుంది. ట్రస్ చేతిలో రిషి ఓటమికి జాన్సన్ తెర వెనుక మంత్రాంగమే ప్రధాన కారణమన్న ఆరోపణలున్నాయి. కరోనా సమయంలో పార్టీలు చేసుకున్న వ్యక్తిగా అప్రతిష్ట మూటగట్టుకున్న ఆయనకు ఈసారి కూడా ఎంపీలు మద్దతుగా నిలవకపోయినా సునాక్‌ని ఓడించడానికైతే ప్రయత్నిస్తారన్న వార్తలు విన్పిస్తున్నాయి. పెన్నీ మోర్డంట్: బ్రిటన్ తొలి మహిళా రక్షణ మంత్రి. గత ఎన్నికల్లో ఎంపీల మద్దతు బాగా సంపాదించినా తుది ఇద్దరు అభ్యర్థుల్లో స్థానం దక్కించుకోలేకపోయారు. మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ట్రస్‌కు మద్దతుగా నిలిచి ఆమె ప్రధాని అయ్యాక హౌస్ ఆఫ్ కామన్స్ అండ్ లార్డ్ ప్రెసిడెంట్ ఆఫ్ ది ప్రైవీ కౌన్సిల్‌కి నాయకురాలయ్యారు. ట్రస్‌పై ఎంపీల్లో వ్యతిరేకత ఉండడంతో ఆమె సన్నిహితురాలైన పెన్నీకి ఎంతవరకు మద్దతునిస్తారన్న అనుమానాలున్నాయి. వీరే కాకుండా మంత్రులుగా అనుభవమున్న కెమీ బాదెనోచ్, సుయెల్లా బ్రేవర్మన్ పేర్లు కూడా వినిపిస్తున్నాయి. అయితే ఆర్థిక మంత్రిగా గొప్ప పనితీరుతో ఆకట్టుకున్న రిషి, బోరిస్ మధ్యే ప్రధాన పోటీ ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
చేజేతులా... చిక్కుల్లో!
బోరిస్ జాన్సన్ స్థానంలో పగ్గాలు చేపట్టి నిండా నలభై రోజులు కాకుండానే బ్రిటన్ ప్రధాని లిజ్ ట్రస్ పదవి చిక్కుల్లో పడింది. దేశం ఆర్థిక సంక్షోభంలో ఉంటే, అధిక ఆదాయం ఉన్నవారికి పన్నులు తగ్గిస్తూ తీసుకున్న నిర్ణయాల పర్యవసానం ఇది. కన్జర్వేటివ్ పార్టీలోనూ, ఆర్థిక విపణుల్లోనూ ఆమె కష్టాల కడలి నుంచి గట్టెక్కడం సులభం కాదనే పరిస్థితి వచ్చింది. చెలరేగిన విమర్శలతో లిజ్ గత శుక్రవారం తన ఆర్థిక మంత్రి క్వాసీ క్వార్తెంగ్ను పదవీచ్యుతుణ్ణి చేశారు. ఆయన ప్రవేశపెట్టిన ‘మినీ బడ్జెట్’లోని ఆర్థిక ప్యాకేజీ అంశాలను కొత్త ఆర్థికమంత్రి ఉపసంహరించుకోవాల్సి వచ్చింది. ఇది సంచలనమే! పన్నుల్లో కోతలపై లిజ్ వెనక్కితగ్గడం తాత్కాలిక ప్రశాంతతను తేవచ్చు. కానీ, పార్టీలో అసంతృప్తిని ఎదుర్కోవడానికీ, దేశాన్ని ఆర్థిక పురోగతి పథంలో నడిపించడానికీ ఇది సరిపోతుందా? సెప్టెంబర్ 23న లిజ్, అప్పటి ఆమె సహచర ఆర్థిక మంత్రి చేపట్టిన మితవాద పక్ష ప్రణాళిక ఎదురుతన్నింది. 1980లలో అమెరికా అధ్యక్షుడు రొనాల్డ్ రీగన్ స్ఫూర్తితో 4500 కోట్ల పౌండ్ల (5 వేల కోట్ల డాలర్లు) మేర పన్నుల్లో కోతలు విధించారు. దానికి స్పందనగా విపణులు కుప్పకూలాయి. లక్షలాది బ్రిటన్ పౌరులకు అప్పుల ఖర్చు పెరిగింది. వచ్చే ఎన్నికల్లో కన్జర్వేటివ్ పార్టీ విజయావకాశాలు పడిపోయాయి. లిజ్ పగ్గాలు చేపట్టి కొద్దివారాలైనా గడవక ముందే సొంత పార్టీలో బాహాటంగా అసంతృప్తి అగ్గి రాజుకుంది. చిత్రమేమిటంటే, లిజ్ ఆర్థిక అజెండాను సాక్షాత్తూ ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు బైడెన్ సైతం విమర్శించడం! నాటకీయ పరిస్థితుల్లో సొంత స్నేహితుడిని ఆర్థిక మంత్రిగా తప్పించాల్సి రావడం బాధాకరమేనని లిజ్ సైతం అంగీకరిస్తున్నారు. నిజానికి, విమర్శలతో వెనక్కి తీసుకున్న ఆ ఆర్థిక ప్యాకేజీ రూపకర్తల్లో లిజ్కూ సమాన భాగం ఉంది. కాకపోతే ఆర్థికమంత్రి బలిపశువయ్యారు. కొత్తగా ఆ శాఖ చేపట్టిన జెరెమీ హంట్ పని కత్తి మీద సామే. బ్రిటన్ దేశస్థులను వేధిస్తున్న జీవన వ్యయానికి పరిష్కారం చూపడం పెద్ద పనే. ఈ అక్టోబర్ 31న కొత్త బడ్జెట్ ప్లాన్‌ను దేశానికి ఆయన అందించాల్సి ఉంటుంది. దేశంలో మరింత ఆర్థిక కష్టాలు తప్పవన్న విశ్లేషణల నేపథ్యంలో, గడ్డు పరిస్థితులను ప్రజలతో నిజాయతీగా పంచుకొని, కఠినమైన కార్యాచరణకు దిగక తప్పదు. గతంలో కార్పొరేషన్ ట్యాక్స్‌ను 19 శాతం వద్దే స్తంభింప జేస్తామన్న లిజ్ వచ్చే ఏడాది దాన్ని 25 శాతానికి పెంచుతున్నట్టు ప్రకటించాల్సి వచ్చింది. మరోపక్క ఇప్పటికే లిజ్ సొంత పార్టీ నుంచే కనీసం నలుగురు ఎంపీలు ఆమెను ప్రధాని పీఠం నుంచి దిగిపోవాల్సిందిగా బాహాటంగా అన్నారు. ఆరు వారాలకే ఆమె పదవీకాలం దాదాపు ముగింపునకు వచ్చిందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఒకవేళ ఆమె తప్పుకొంటే వారసుడు నిర్ణయమయ్యే దాకా పదవిలో కొనసాగుతారు. అదే జరిగితే, రెండు నెలల లోపలే రెండోసారి కన్జర్వేటివ్ పార్టీ సారథికి ఎన్నిక తప్పదు. అయితే, ఈసారి సుదీర్ఘ పోటీ లేకుండా ఒకరి వెంటే పార్టీ నిలిచి, పట్టాభిషేకం చేయవచ్చు. బ్రెగ్జిట్ రిఫరెండమ్ పర్యవసానాల తర్వాత 2016లో డేవిడ్ కామెరాన్ స్థానంలో థెరెసా మే అలానే వచ్చారు. కానీ, అప్పటితో పోలిస్తే ఇప్పుడు అనేక వర్గాలుగా చీలి, అంతర్గత విభేదాలున్న పార్టీలో అది సాధ్యమా అన్నది చూడాలి. పరిస్థితి చూస్తుంటే, ప్రధాని పదవికి లిజ్‌తో పోటీపడి, తగిన మద్దతు కూడగట్టుకోలేకపోయిన సొంత పార్టీ నేత రిషీ సునాక్‌కు ఉన్నట్టుండి దశ తిరిగేలా కనిపిస్తోంది. లిజ్ స్థానంలోకి రేపో, మాపో ఆయన వస్తారనే అంచనాలూ సాగుతున్నాయి. ప్రస్తుతానికి రిషి పెదవి విప్పడం లేదు. అంచనాలెలా ఉన్నా లిజ్ అంత తేలిగ్గా రాజీనామా చేయకపోవచ్చు. ప్రస్తుతానికి ఆమె దృష్టి సవాళ్ళను సమర్థంగా ఎదుర్కోవడం మీదే ఉన్నట్టుంది. ఒకవేళ లిజ్‌ను బలవంతాన సారథ్యం నుంచి తప్పించాలంటే, అవిశ్వాస తీర్మానం పెట్టాలి. కానీ, 12 నెలల కాలంలో ఒకసారే పోటీ జరగాలనే కన్జర్వేటివ్ పార్టీ నియమావళి ప్రకారం కొత్తగా ఎన్నికైన నేతపై సహచరులు అవిశ్వాస తీర్మానం పెట్టలేరు. వాస్తవ పరిస్థితులు గ్రహించకుండా, తొందరపాటు మినీ బడ్జెట్ ప్రతిపాదనలతో విశ్వసనీయత దెబ్బతిన్న లిజ్ ప్రస్తుత గండం నుంచి గట్టెక్కితే ఆశ్చర్యమే. కాకపోతే ఆ ఆర్థిక ప్రతిపాదనల ఉప సంహరణతో ఆర్థిక మార్కెట్లు కొంత తెరిపినపడ్డాయి. కొద్దిపాటి ఆర్థిక స్థిరత్వంతో ఊపిరి పీల్చుకొనే ఖాళీ దొరికింది గనక ఇప్పుడామె ఏవైనా అద్భుతాలు చేయాలి. సోమవారం రాత్రి క్యాబినెట్కిస్తున్న విందులో పార్టీలోని అసంతృప్త వర్గాలను కలిసి ఆమె చల్లబరిచే ప్రయత్నం చేస్తారు. మరో ఛాన్స్ ఏమిటంటే, 2025 జనవరిలో జరగాల్సిన బ్రిటన్ సార్వత్రిక ఎన్నికలను ముందే జరపడం. ఎన్నికల సర్వేలలో కొన్ని దశాబ్దాలుగా ఎన్నడూ లేనంతగా ప్రధాన ప్రతిపక్షం లేబర్ పార్టీకి సానుకూల పవనాలు వీస్తున్నవేళ అధికార పార్టీ ఎంపీలు ఆ సాహసానికి దిగుతారనుకోలేం. తప్పుడు రాజకీయ నిర్ణయాలు దేశాన్ని ఆర్థిక సంక్షోభంలోకి నెడతాయనడానికి బ్రిటన్ తాజా ఉదాహరణ. కోవిడ్ టీకాలు, కరోనా వేళ విందులతో పార్టీ ప్రతిష్ఠనూ, వచ్చే ఎన్నికల్లో విజయావకా శాలనూ జాన్సన్ దిగజారిస్తే, ఆశాకిరణమనుకున్న లిజ్ తప్పుడు విధానాలతో అసలే ఆర్థిక సంక్షో భంలో ఉన్న దేశాన్ని ఇంకా కిందకు నెట్టారు. ద్రవ్యోల్బణాన్నీ, యుద్ధంతో పైపైకి ఎగబాకుతున్న చమురు ధరల్ని అడ్డుకొనే చర్యలకు బదులు పన్నుల కోతకు దిగారు. తీరా చివరికి కోతల్ని ఉపసంహ రించుకొని, ఎన్నడూ లేని ‘యూ’ టర్న్ తీసుకోవాల్సి వచ్చింది. లిజ్ పుణ్యమా అని పాత అప్రతిష్ఠకు తోడు అసమర్థ ప్రభుత్వమనే ముద్ర పడింది. కథలో కొత్త మలుపు ఏమిటన్నది ఆసక్తిగా మారింది. -
Rishi Sunak: రిషి ఓటమి వెనుక కారణాలివే..
రెడీ ఫర్ రిషి అంటూ బ్రిటన్ ప్రధాని అభ్యర్థి ఎన్నికలో మొదట్లో దూకుడు చూపించిన రిషి సునాక్ ఎందుకు ఓటమి పాలయ్యారు? ఎంపీల మద్దతు పుష్కలంగా ఉన్నా టోరీ సభ్యుల అండదండలు ఎందుకు లభించలేదు? భారత్‌ను వలసరాజ్యంగా మార్చిన బ్రిటిష్ సామ్రాజ్యాన్ని ఒక భారతీయుడు పాలించే రోజు వస్తుందన్న ఆశలు ఎందుకు అడియాసలయ్యాయి? దీనిపై బ్రిటిష్ మీడియాలో పలు కథనాలు వస్తున్నాయి... ► కోవిడ్–19 పార్టీ గేట్ కుంభకోణంలో ఇరుక్కొన్న ప్రధాని బోరిస్ జాన్సన్‌కు రిషి వెన్నుపోటు పొడిచారన్న అభిప్రాయం కన్జర్వేటివ్ పార్టీలో బలంగా ఏర్పడింది. రాజకీయ గురువని కూడా చూడకుండా జాన్సన్‌కు వ్యతిరేకంగా పని చేసి ఆయన రాజీనామా చేయాల్సిన పరిస్థితి కల్పించారని టోరీ సభ్యులు విశ్వసించారు. ఆర్థిక మంత్రి పదవికి రిషి రాజీనామా చేయడంతో ఇతర మంత్రులూ అదే బాట పట్టారు. వారికి మద్దతుగా 50 మంది ఎంపీలు కూడా రాజీనామా చేయడంతో ఒత్తిడి పెరిగి జాన్సన్ గద్దె దిగాల్సి వచ్చింది. దీన్ని నమ్మకద్రోహంగానే టోరి సభ్యులు చూశారు. ఆ వెంటనే రెడీ ఫర్ రిషి అంటూ పోటీకి దిగి దూకుడుగా ప్రచారానికి తెర తీయడంతో ప్రధాని పదవి కోసమే అంతా చేస్తున్నారన్న ప్రచారం జరిగింది. బోరిస్ కూడా రిషికి వ్యతిరేకంగా పని చేశారు. ► ప్రతి మగవాడి విజయం వెనకా ఒక మహిళ ఉంటుందంటారు. కానీ రిషి పరాజయం వెనుక దురదృష్టవశాత్తూ ఆయన భార్య, ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి కుమార్తె అక్షత ఉన్నారు. ఆమె ఎలిజెబెత్ రాణి కంటే సంపన్నురాలన్న ప్రచారముంది. అలాంటి వ్యక్తి పన్నులు ఎగ్గొట్టడానికి నాన్ డొమిసైల్ హోదాను అడ్డం పెట్టుకున్నారన్న ఆరోపణలు కూడా రిషికి ప్రతికూలంగా మారాయి. ► తన ప్రత్యర్థి లిజ్ ట్రస్ ప్రకటించిన పన్ను రాయితీలను వ్యతిరేకించడం కూడా రిషి కొంప ముంచింది. వాటివల్ల ద్రవ్యోల్బణం పెచ్చరిల్లుతుందన్న రిషి వాదనకు కాకలు తీరిన ఆర్థికవేత్తలు మద్దతిచ్చినా టోరీ సభ్యులు మాత్రం ట్రస్ తక్షణం ఉపశమన చర్యలకే జై కొట్టారు. ► రిషీ అమెరికా గ్రీన్ కార్డు వివాదం కూడా ఆయనకు వ్యతిరేకంగా మారింది. బ్రిటన్‌కు మకాం మార్చాక కూడా గ్రీన్ కార్డును ఆయన అట్టిపెట్టుకున్నారని, ఎప్పటికైనా అమెరికాకు వెళ్లిపోవడానికే ఈ పని చేశారని సోషల్ మిడియాలో బాగా ప్రచారమైంది. ఆర్థిక మంత్రి కాగానే గ్రీన్‌కార్డును వదులుకున్నానని రిషి వివ రణ ఇచ్చినా అప్పటికే నష్టం జరిగిపోయింది. ► రిషి విలాసవంతమైన జీవితం కూడా ఆయనకు కాస్త చేటు చేసింది. ఆయన ఖరీదైన సూటు, బూటు, ఆర్థిక మంత్రిగా బడ్జెట్ ఫొటో సెషన్లో ఖరీదైన మగ్గుతో ఫోటోలు దిగడం వంటివి పత్రికల్లో పతాక శీర్షికలయ్యాయి. కరువు గుప్పిట్లో చిక్కిన బ్రిటన్‌లో గుక్కెడు నీళ్ల కోసం జనం విలవిల్లాడుతుంటే రిషీ యార్క్‌షైర్‌లోని తన కొత్తింట్లో 4 లక్షల పౌండ్లతో స్విమ్మింగ్ పూల్ నిర్మించడం వివాదాస్పదమైంది. ‘నా ఫ్రెండ్స్ అంతా ధనవంతులే. నా స్నేహితుల్లో సామాన్యులెవరూ లేరు’ అంటూ ఎప్పుడో ఆయన మాట్లాడిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరలైంది. దీంతో రిషి అందరివాడు కాదన్న ప్రచారానికి బలం చేకూరింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
పగ్గాలు చేపట్టిన లిజ్
లండన్: హోరాహోరి పోరులో నెగ్గి కన్జర్వేటివ్ పార్టీ నేతగా ఎన్నికైన లిజ్ ట్రస్ (47)ను బ్రిటన్ ప్రధానిగా రాణి ఎలిజబెత్2 లాంఛనంగా నియమించారు. ట్రస్ మంగళవారం స్కాట్లండ్ వెళ్లి అక్కడి బాల్మోరల్ క్యాజిల్‌లో వేసవి విడిదిలో సేదదీరుతున్న 96 ఏళ్ల రాణితో భేటీ అయ్యారు. కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా ఈ సందర్భంగా రాణి ఆమెను ఆహ్వానించారు. అంతకుముందు తాత్కాలిక ప్రధాని బోరిస్ జాన్సన్ (58) రాణికి తన రాజీనామా సమర్పించారు. కొత్త ప్రధానిని ప్రభుత్వ ఏర్పాటుకు రాణి ఆహ్వానించే ప్రక్రియ లండన్‌లోని బకింగ్‌హం ప్యాలెస్‌లో జరగడం ఆనవాయితీ. కానీ వృద్ధాప్యంతో రాణి ప్రయాణాలు బాగా తగ్గించుకున్నారు. దాంతో తొలిసారిగా వేదిక బాల్మోరల్ క్యాజిల్‌కు మారింది. ఎలిజబెత్2 హయాంలో ట్రస్ 15వ ప్రధాని కావడం విశేషం! 1952లో విన్స్టన్ చర్చిల్ తొలిసారి ఆమె ద్వారా ప్రధానిగా నియమితుడయ్యారు. ప్రభుత్వ ఏర్పాటు ఆహ్వానం అందుకున్న అనంతరం ట్రస్ లండన్ తిరిగి వచ్చారు. ప్రధానిగా తొలి ప్రసంగం అనంతరం తన కేబినెట్‌ను ఆమె ప్రకటించనున్నారు. భారత సంతతికి చెందిన అటార్నీ జనరల్ సుయెల్లా బెవర్మన్‌ను హోం మంత్రిగా ట్రస్ ఎంచుకున్నారు. ప్రధాని పీఠం కోసం ట్రస్‌తో చివరిదాకా హోరాహోరీ పోరాడిన భారత సంతతికి చెందిన రిషి సునాక్ మాత్రం ఆమె కేబినెట్లో చేరబోనని దాదాపుగా స్పష్టం చేశారు. రాజీనామాకు ముందు జాన్సన్ వీడ్కోలు ప్రసంగం చేశారు. ‘ఆట మధ్యలో నిబంధనలు మర్చేయడం ద్వారా’ సహచర పార్టీ నేతలే తనను బలవంతంగా సాగనంపారంటూ ఆక్రోశించారు. తనను తాను అప్పగించిన పని విజయవంతంగా పూర్తి చేసిన బూస్టర్ రాకెట్‌గా అభివర్ణించుకున్నారు. మున్ముందు కూడా అవసరాన్ని బట్టి తళుక్కుమని మెరుస్తుంటానని చమత్కరించారు. ట్రస్‌కు పూర్తి మద్దతు ప్రకటించారు. -
లిజ్ ట్రస్‌కు ఇది ముళ్ళకిరీటమే!
బ్రిటన్‌లో తొలి మహిళా లార్డ్ ఛాన్సలర్ ఆమే. రెండో మహిళా విదేశాంగ మంత్రీ ఆవిడే. ఇప్పుడు థాచర్, థెరెసా మే తర్వాత ఆ దేశానికి ముచ్చటగా మూడో మహిళా ప్రధానీ ఆమే. అధికార కన్జర్వేటివ్ పార్టీ నాయకత్వ మార్పులో భాగంగా బోరిస్ జాన్సన్‌కు వారసురాలిగా సోమవారం ఎన్నికైన 47 ఏళ్ళ లిజ్ ట్రస్‌కు ఇలాంటి ఘనతలు చాలానే ఉన్నాయి. క్వీన్ ఎలిజబెత్2ను లాంఛనంగా కలసి, 96 ఏళ్ళ రాణిగారి సాంప్రదాయిక నియామకంతో బ్రిటన్ కొత్త ప్రధానిగా మంగళవారం బాధ్యతలు చేపట్టిన లిజ్ ఇప్పుడు ఆ ఘనతలు నిలబెట్టుకోవడానికి శ్రమించక తప్పదు. వరుస వివాదాలతో రెండు నెలల క్రితం జాన్సన్ బ్రిటీష్ ప్రధానిగా రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించినప్పటి నుంచి లిజ్ ప్రయాణం మలుపు తిరిగింది. జాన్సన్ హయాంలో విదేశాంగ మంత్రిగా పనిచేసిన ఆమె మాజీ ఆర్థిక మంత్రి రిషీ సునాక్‌ను అధిగమించి, పీఠం దక్కించుకున్నారు. కొత్త నేతగా పీఠమెక్కడానికి కన్జర్వేటివ్ పార్టీలో ఆరుగురు ఉత్సాహపడితే, ఆఖరికి బరిలో మిగిలింది – లిజ్, భారతీయ మూలాలున్న రిషీ సునాక్. ‘ఇన్ఫోసిస్’ సుధ – నారాయణమూర్తి దంపతుల అల్లుడైన రిషి సోమవారం ఓటమి పాలయ్యారు. అయితేనేం, లక్షా 70 వేల పైగా కన్జర్వేటివ్ పార్టీ సభ్యులు ఎన్నుకొనే పదవికి చివరి దాకా పోటీపడి, 60 వేలకు పైగా ఓట్లు సంపాదించడం విశేషమే. నిలబెట్టుకోలేని వాగ్దానాలు ఇవ్వలేనన్న రిషికి భిన్నంగా లిజ్ వ్యవహ రించడం గమనార్హం. బ్రిటీష్ ప్రజాస్వామ్య వ్యవస్థలోని రాజకీయ పార్టీల అంతర్గత ప్రజాస్వామ్యా నికి ప్రతీకగా నిలిచిన ఎన్నికల ప్రక్రియ ముగిసింది. పరిష్కారాల మాట దేవుడెరుగు, కనీసం దేశం ఆర్థికంగా క్లిష్టపరిస్థితుల్లో ఉన్నట్టు తన ప్రచారంలో ప్రస్తావించకుండా వాస్తవాన్ని చూడ నిరాక రించిన లిజ్ ఇప్పుడు కళ్ళెదుటి సంక్షోభం నుంచి దేశాన్ని ఎలా గట్టెక్కిస్తారన్నది ఆసక్తికరం. వామపక్ష భావజాల కుటుంబంలో పుట్టి, తల్లితండ్రుల రాజకీయ పొత్తిళ్ళ నుంచి బయటపడి, ఆక్స్‌ఫర్డ్‌లో చదువుకొనే రోజుల్లో ఉదారవాద ప్రజాస్వామ్య రాజకీయాల వైపు మొగ్గి, యువ ఉద్యోగినిగా కన్జర్వేటివ్ పార్టీలో చేరిన గమ్మల్తైన ప్రయాణం లిజ్ది. ముగ్గురు కన్జర్వేటివ్ పార్టీ ప్రధానమంత్రుల వద్ద ఆరు మంత్రి పదవులు నిర్వహించిన ఆమె ఇప్పుడు సరాసరి లండన్‌లోని 10 డౌనింగ్ స్ట్రీట్ నివాసి అయ్యారు. ఈ ప్రధానమంత్రి పీఠంపై ఆమెకు మొదటి రోజు నుంచీ అనేక సవాళ్ళు ఎదురుకానున్నాయి. అంతకంతకూ పెరుగుతున్న ఇంధన ధరలు, కరెంట్ కోతల ముప్పు, గత నాలుగు దశాబ్దాల్లో ఎన్నడూ లేనంతగా రెండంకెల ద్రవ్యోల్బణం, పొంచి ఉన్న దీర్ఘకాలిక ఆర్థిక మాంద్యం, పెరుగుతున్న తనఖా రేట్లు... వెరసి అలవి కాని జీవన వ్యయం – ఇలా సమస్యలెన్నో. దేశంలో వివిధ ఉద్యోగ సంఘాలు ఇప్పటికే సమ్మె సైరన్ మోగించాయి. ఉక్రెయిన్‌లో యుద్ధం, బ్రెగ్జిట్ పర్యవసానాల లాంటి విదేశాంగ విధానపు తలనొప్పులు సరేసరి. పదవికి పోటీలో లిజ్ చేసిన వాగ్దానాలూ చిన్నవేమీ కావు. పన్నులను తగ్గిస్తాననీ, ప్రజా వ్యయాన్ని పెంచుతాననీ బాస చేశారు. దేశం ఇప్పుడున్న ఇక్కట్లలో ఇచ్చిన హామీలు నెరవేర్చా లంటే, ఆమె ఇంట్లో కల్పవృక్షమో, కామధేనువో ఉంటే కానీ సాధ్యం కాదని ఓ జోక్. బ్రిటన్ తాజా మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ లానే లిజ్కూ మాటల్లో ఘనత చాటుకొనే లక్షణం ఉంది. కానీ, ఆయనకున్న జనాకర్షణ, అవతలివారి అంగీకారం పొందే నేర్పు ఆమెకు లేవని విమర్శకుల మాట. ఒకప్పటి మార్గరెట్ థాచర్‌ను లిజ్లో ఆశించలేమని వారి విశ్లేషణ. అయితే ఎదగాలనే ఆకాంక్ష బలంగా ఉన్న ఈ దృఢచిత్తురాలికి స్వతఃసిద్ధ పోరాటగుణమే పెట్టనికోట. సమయానికి తగ్గట్టు అభిప్రాయాలు మార్చుకొనే దృక్పథం కలిసొచ్చే అంశం. 2016లో బ్రెగ్జిట్ విధానానికి తీవ్ర వ్యతిరేకిగా ఉన్న లిజ్, ఆపై బ్రెగ్జిట్‌కు పూర్తి అనుకూలంగా మారడం, 2019 నాటికి జాన్సన్ హయాంలో బ్రెగ్జిట్ అనంతరకాల వాణిజ్య మంత్రిగా వ్యవహరించడమే అందుకు ఉదాహరణ. మాటల గారడీ జాన్సన్ హయాంలో వెనుకబడ్డ బ్రిటన్‌కు ఇప్పుడు చిత్తశుద్ధితో కూడిన స్థిర మైన, బలమైన నాయకత్వం అవసరం. రిషిని వెన్నుపోటుదారుగా భావిస్తూ, అతనికి తప్ప ఎవరి కైనా ఓటేయమన్న జాన్సన్ మాటలతో ఆయన అనుకూలుర మద్దతు లిజ్‌ను గెలిపించింది. అలా జాన్సన్ వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న లిజ్ పాత ప్రభుత్వ తప్పుడు విధానాల నుంచి ఎంత త్వరగా బయటకొస్తే, బ్రిటన్‌కు అంత మంచిది. ఇక, ఆప్తురాలైన లిజ్ ఎన్నిక భారత్‌కు శుభవార్తే. విదేశాంగ మంత్రిగా చైనాతో కయ్యానికి కాలుదువ్వుతూ, రష్యాపై కఠినవైఖరిని అనుసరించిన ఆమె ఇప్పటికి 3 సార్లు క్యాబినెట్ మంత్రిగా భారత్‌లో పర్యటించారు. ఇరుదేశాల పాత అనుబంధంతో మెతకగానే ఉన్నారు. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల చర్చలూ అక్టోబర్‌లో కొలిక్కిరానున్నాయి. ఏప్రిల్‌లో కుదుర్చుకున్న రక్షణ సహకార ఒప్పందం సహా అన్నీ సజావుగా సాగుతాయని అంచనా. అయితే, బ్రిటన్ సమస్యల సుడిగుండంలోకి ప్రయాణిస్తోందన్న ఆలోచననే ఇన్నాళ్ళూ ‘క్షీణ వాద ప్రసంగం’గా కొట్టిపారేస్తూ వచ్చిన లిజ్ వాస్తవంలోకి రాక తప్పదు. సమస్యల పరిష్కారంలో జయాపజయాలను బట్టే చరిత్రలో ప్రధానిగా ఆమె అధ్యాయం లిఖితమవుతుంది. మరోపక్క దీర్ఘ కాలంగా అధికారంలో ఉన్న కన్జర్వేటివ్ పార్టీ అంతర్గత సమస్యలు, పరస్పర విరుద్ధ ఆలోచనల వర్గా లతో సతమతమవుతోంది. ఆ పార్టీ, దాని సారథిగా ఈ ఇద్దరు టీనేజ్ కుమార్తెల తల్లి కొద్దిగా తడ బడినా, కొన్నేళ్ళుగా అధికారానికి దూరమైన ప్రతిపక్ష లేబర్పార్టీకి 2024 ఎన్నికల్లో సందు చిక్కినట్టే! ఇదీ చదవండి: Indian Economy: త్వరపడితేనే... నిలబడతాం! -
ఊహించని ట్విస్ట్.. ప్రీతి పటేల్ రాజీనామా
లండన్: బ్రిటన్ ప్రధానిగా లిజ్ ట్రస్ ఎన్నికైన వేళ.. అక్కడి రాజకీయాల్లో ఊహించని మలుపులు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా.. బ్రిటన్ హోం మంత్రి(సెక్రటరీ) పదవికి ప్రీతి పటేల్(50) తన పదవికి రాజీనామా చేశారు. బోరిస్ జాన్సన్ నమ్మినబంటు అయిన ప్రీతి పటేల్.. లిజ్ ట్రస్ హయాంలోనూ బ్రిటన్ హోం సెక్రటరీగా కొనసాగుతారని భావించారంతా. అయితే.. పదవికి రాజీనామానే చేయాలని నిర్ణయించుకుని ఆమె కన్జర్వేటివ్ పార్టీలో చర్చనీయాంశంగా మారారు. అంతేకాదు.. లిజ్ ట్రస్ నేతృత్వంలోని కేబినెట్లో తాను పని చేయబోనంటూ పరోక్షంగా ఆమె ప్రకటించారు కూడా. ఈ మేరకు ప్రధాని పీఠం నుంచి దిగిపోతున్న బోరిస్ జాన్సన్‌కు ఆమె ఓ లేఖ రాశారు. దేశ ప్రజలకు సేవ చేయాలనేది నా ఛాయిస్. లిజ్ ట్రస్ అధికారికంగా ప్రధాని పదవి చేపట్టగానే.. కొత్త హోం సెక్రటరీ నియమితులవుతారంటూ లేఖ రాసి ఆసక్తికర చర్చకు దారి తీశారామె. కన్జర్వేటివ్ పార్టీలో లిజ్ ట్రస్, ప్రీతి పటేల్‌కు పోసగదనే విషయం అందరికీ తెలుసు. అయినప్పటికీ సోమవారం సాయంత్రం లిజ్ ట్రస్ బ్రిటన్ అధ్యక ఎన్నికల్లో గెలిచారన్న ప్రకటన తర్వాత.. ప్రీతీ పటేల్, ట్రస్‌కు శుభాకాంక్షలు తెలియజేస్తూ కొత్త ప్రధానికి అన్ని విధాల సహకారం అందిస్తామని ప్రకటించారు. అంతేకాదు.. మూడేళ్లుగా హోం సెక్రటరీ బాధ్యతలు నిర్వహించడాన్ని గర్వంగా భావిస్తున్నట్లు తెలిపారామె. దీంతో.. తర్వాతి హోం సెక్రటరీగా కూడా ఆమె కొనసాగుతారని అంతా భావించారు. అయితే లిజ్ ట్రస్ హయాంలో పని చేయడం ఇష్టం లేకనే ఆమె రాజీనామా చేసినట్లు.. ఆమె అనుచర వర్గం అంటోంది. భారత సంతతికి చెందిన ప్రీతి పటేల్.. సుదీర్ఘకాలం బ్రిటన్ రాజకీయాల్లో కొనసాగారు. 1991లో పటేల్ కన్జర్వేటివ్ పార్టీలో చేరారు. 2010లో ఆమె తొలిసారి పార్లమెంట్‌కు ఎన్నికయ్యారు. ప్రస్తుతం కన్జర్వేటివ్ పార్టీలో ఆమె సీనియర్ సభ్యురాలిగా ఉన్నారు. 2019 నుంచి యూకేకు హోం సెక్రటరీగా పని చేశారు. బోరిస్ జాన్సన్ రాజీనామా సమయంలో ప్రధాని అభ్యర్థిత్వం రేసులో ఈమె పేరు కూడా బలంగా వినిపించింది. బోరిస్ నమ్మినబంటుగా, బ్రెగ్జిట్ క్యాంపెయిన్‌లోనూ పటేల్ క్రియాశీలకంగా వ్యవహరించారు. అయితే.. ప్రధాని అభ్యర్థి రేసు నుంచి ఆమె అనూహ్యంగా తప్పుకుని అందరినీ ఆశ్చర్యపరిచారు. మరోవైపు లిజ్ ట్రస్ చేతిలో ఓడిన మాజీ ఆర్థిక మంత్రి రిషి సునాక్‌కు.. కేబినెట్ బెర్త్ దక్కడం అనుమానంగానే మారింది. అయితే రిషి సునాక్ మద్దతుదారులకు మాత్రం కేబినెట్లో ఛాన్స్ దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదీ చదవండి: పుతిన్- కిమ్ జోంగ్ ఉన్ చేతులు కలిపిన వేళ.. -
Rishi Sunak: వెన్నుపోటు ఫలితమే.. ఈ ఓటమి!
బ్రిటన్ ప్రధాని పీఠాన్ని అధిరోహించాలనుకున్న రిషి సునాక్ కల చెదిరింది. ప్రధాని రేసులో లిజ్ ట్రస్ చేతిలో 21వేలకు పైగా ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారాయన. అయితే.. ఈ ఎన్నిక ప్రక్రియ మొదలైన వెంటనే ముందుగా ప్రచారం ప్రారంభించింది రిషి సునాక్. పైగా ఆయన దూకుడు చూసి చాలామంది ఆయనే నెగ్గుతారని భావించారు కూడా. దీనికి తోడు.. విదేశాంగ మంత్రి అయిన ట్రస్‌కు.. టోరీ(కన్జర్వేటివ్) ఎంపీల సపోర్ట్ కూడా మొదట్లో తక్కువే ఉండేది. ఇది ఆయనకు కలిసొస్తుందని భావించారు రాజకీయ విశ్లేషకులు. కానీ, ఆన్లైన్, పోస్టల్ బ్యాలెట్ ద్వారా పోలింగ్ మొదలైనప్పటి నుంచి ఎన్నికల సీన్ రివర్స్ అయ్యింది. ట్రస్‌కు క్రమక్రమంగా ఆధిక్యం పెరగుతూ వచ్చింది. మరోవైపు సర్వే ఫలితాలు కూడా ట్రస్‌కే మద్దతుగా వచ్చాయి. అయినప్పటికీ రిషి సునాక్ ధైర్యం వీడలేదు.. ప్రచారంలో ఎక్కడా తగ్గలేదు. అధికారంలోకి రాగానే.. పన్నుల భారాన్ని తగ్గిస్తానని ట్రస్ చెప్పగా, సునాక్ మాత్రం ఆమెది తప్పుడు నిర్ణయమని.. తాను మాత్రం ద్రవ్యోల్బణం కట్టడి మీదే ప్రధానంగా దృష్టిసారిస్తానని చెప్పడం చాలామందిని ఆకట్టుకుంది. అయితే పోటాపోటీగా ప్రచారం కార్యక్రమాలు సాగినా.. గ్రాండ్ ప్రచారంతో ఆకట్టుకున్నా.. రిషి సునాక్‌కు ‘ప్చ్’ ఓటమి మాత్రం తప్పలేదు. మరి ఈ మధ్యలో ఏం జరిగింది?.. రిషి సునాక్ ఓటమికి కారణాలను విశ్లేషిస్తే.. నాయకత్వ పోటీలో తనను తాను ‘చిత్తశుద్ధి’ ఉన్న అభ్యర్థిగా నిలబెట్టుకోవాలని సునాక్ శతవిధాల ప్రయత్నించారు. కానీ, వెన్నుపోటుదారుడనే ముద్ర ఆయన్ని ముందుకు పోనివ్వలేదు. టోరీ సభ్యుల్లో ఎక్కువ మంది బోరిస్ జాన్సన్ విధేయులు కావడం.. పైగా ఛాన్సలర్‌గా రాజీనామా చేస్తూ రిషి సునాక్ తీసుకున్న నిర్ణయాన్ని ప్రశ్నించడంతో అసలు కథ మొదలైంది. రాజకీయ గురువు సమానుడు.. సీనియర్ రాజకీయ నాయకుడిగా ఎదిగేందుకు కారణమైన వ్యక్తిని(బోరిస్ జాన్సన్)కు వెన్నుపోటు పొడిచాడంటూ టోరీ సభ్యులు రిషి సునాక్‌పై ఆరోపణలు గుప్పించారు. అయితే.. దేశ ఆర్థిక విధానంపై తనకు, జాన్సన్‌కు మధ్య పెద్ద అభిప్రాయ భేదం ఉందని స్పష్టమైన తర్వాతే తనకు వేరే మార్గం లేకుండా పోయిందని రాజీనామాపై సునాక్ ప్రతిస్పందించారు. కానీ, ఆ సమయంలోనే దాదాపు రిషి సునాక్ ఓటమి ఖాయమైంది. బోరిస్ సింపథీ వర్కవుట్ రిషి సునాక్ మంచి సేల్స్‌మ్యాన్.. వెన్నుపోటుదారుడు.. మోసగాడు.. ఈ విమర్శలు చేసింది టోరీ సభ్యులే. తన రాజీనామా ప్రకటన తర్వాత తాత్కాలిక ప్రధానిగా ప్రకటించుకున్న బోరిస్ జాన్సన్.. ‘‘ప్రధాని ఎన్నికల్లో ఎవరికైనా ఓటేయండి.. సునాక్‌కు తప్ప’’ అంటూ ఇచ్చిన పిలుపు టోరీ సభ్యుల్లోకి బలంగా దూసుకెళ్లింది. ఒక్కసారి వెనక్కి వెళ్తే.. జులై నెలలో బ్రిటన్‌లో రాజకీయ సంక్షోభ తలెత్తింది. ఆ సమయంలో విపక్షం నుంచే కాకుండా సొంత పార్టీ కన్జర్వేటివ్ నుంచి కూడా తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొన్నారు బోరిస్. సాజిద్ జావిద్, రిషి సునాక్లాంటి వాళ్ల రాజీనామా తర్వాతే.. చాలామంది ఆ బాటలో పయనించారు. సుమారు 50 మంది రాజీనామాలు చేయడంతో.. ఒత్తిడికి తలొగ్గి రాజీనామా చేశారు బోరిస్ జాన్సన్. ఈ తరుణంలో.. లక్ష్యం కాదు.. విశ్వాస ఘాతుకం బ్రెగ్జిట్ సమయంలో, కరోనాను కంట్రోల్ చేయడం, ఉక్రెయిన్-రష్యా యుద్ధంలో కీలక పాత్ర పోషించడం లాంటి చర్యలతో బోరిస్‌పై సింపథీ క్రియేట్ అయ్యింది. అదే ఎన్నికల ప్రచారంలో రిషి సునాక్‌కు మైనస్ అయ్యింది. ప్రధాని పదవి రేసులోకి ఎంటర్ అయిన వెంటనే ఆలస్యం చేయకుండా.. ‘రెడీ ఫర్ రిషి’ నినాదంతో 10 డౌనింగ్ స్ట్రీట్(బ్రిటన్ ప్రధాని అధికారిక నివాసం) వైపు ఉరుకులు మొదలుపెట్టాడు. ఇది చూసి చాలామంది.. ‘‘తన లక్ష్యం(ప్రధాని కావాలనే..) కోసమే జాన్సన్‌ను రాజీనామా వైపు నెట్టేశాడని చర్చించారు టోరీలు. ఇది ద్రోహమని ఫిక్స్ అయిపోయారు. ఈ అభిప్రాయం వల్ల.. నలుగురు మాజీ చీఫ్ విప్‌లు ప్రచారం చేసినా రిషి సునాక్‌కు ప్రయోజనం లేకుండా చేసింది. అదే టైంలో.. ట్రస్ తనను తాను ‘నిజాయితీ పరురాల’నే ప్రచారం చేసుకుంది. బోరిస్ జాన్సన్‌కు నమ్మినబంటునని, తానే ప్రధానినైతే 2019 మేనిఫెస్టో అమలు చేస్తానని ఇచ్చిన హామీలు ట్రస్‌కు బాగా కలిసొచ్చాయి. వివాదాలు.. బ్రిటన్ ప్రధాన మంత్రి పదవి అనే టాప్ జాబ్ రేసులోకి ఎంటర్ కాకముందే నుంచే.. సునాక్ చుట్టూ కొన్ని వివాదాలు నెలకొన్నాయి. ► ఆర్థిక మంత్రిగా ఉన్న టైంలో(ప్రత్యేకించి కరోనా సమయంలో..) ఆయన తీసుకున్న నిర్ణయాలు విమర్శలు దారి తీశాయి. ఎంతలా అంటే.. సొంత పార్టీ నేతలే ఆ నిర్ణయాలను తప్పుబట్టేంతగా. ► భార్య అక్షత మూర్తి ఆస్తులు, వ్యాపార లావాదేవీలు, పన్నుల చెల్లింపుల విషయంలో కూడా ప్రతిపక్ష లేబర్ పార్టీ విమర్శలు గుప్పిస్తూ వచ్చేది. ఇది సొంతపార్టీ కన్జర్వేటివ్‌కు విసుగు తెప్పించింది. ► కరోనా టైంలో శాస్త్రవేత్తలపై నోరు పారేసుకున్నారు రిషి సునాక్. వ్యాక్సిన్ తయారీ వంకతో సైంటిస్టులు ఎక్కువ అధికారం చెలాయిస్తున్నారంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు సైంటిస్టు కమ్యూనిటీల నుంచి తీవ్ర వ్యతిరేకతను కట్టబెట్టింది. ► నార్త్ యార్క్‌షైర్‌లో ఉన్న తన మాన్షన్‌లో భారీగా ఖర్చు చేపట్టి రిషి సునాక్ స్విమ్మింగ్ పూల్ నిర్మాణం చేపట్టడంపై దుమారం రేగింది. నీటి కొరత ఉన్న సమయంలో.. పైగా ఆ ప్రాంతంలో స్విమ్మింగ్‌పూల్స్‌ను మూసేసిన టైంలో సునాక్ చేసిన పని వివాదాస్పదంగా మారింది. ఇక ఓటమిపాలైతే.. ప్రభుత్వానికి మద్దతు కొనసాగిస్తానని, ఉత్తర యార్క్‌షైర్‌లోని రిచ్మండ్కు ప్రాతినిధ్యం వహిస్తూ పార్లమెంట్ సభ్యుడిగా కొనసాగుతానని, నియోజకవర్గం కోసం పని చేస్తానని ఆయన వ్యాఖ్యానించడం తెలిసిందే. తాజాగా ఓటమి తర్వాత.. తనకు ఓటేసిన వాళ్లకు కృతజ్ఞతలు తెలియజేశాడు. కన్జర్వేటివ్ అంతా ఒక కుటుంబం అని, లిజ్ ట్రస్ కింద పని చేస్తానంటూ చెప్పుకొచ్చాడు. -
UK PM results 2022: జాన్సన్ వారసులెవరో తేలేది నేడే
లండన్: యూకే తదుపరి ప్రధాని ఎవరో మరికొద్ది గంటల్లోనే తేలిపోనుంది. భారత సంతతికి చెందిన మాజీ ఆర్థిక మంత్రి రిషి సునాక్(42), మంత్రి లిజ్ ట్రస్(47) ఎన్నికల బరిలో నిలిచిన విషయం తెలిసిందే. కన్జర్వేటివ్ పార్టీలో ఎక్కువ మంది లిజ్ ట్రస్ వైపే మొగ్గుచూపుతున్నట్లు పలు సర్వేల్లో ఇప్పటికే వెల్లడైంది. లిజ్ ట్రస్ ఎన్నికైతే బ్రిటన్ ప్రధానిగా మార్గరెట్ థాచర్, థెరిసా మే తర్వాత మూడో మహిళ కానున్నారు. ఆన్లైన్, పోస్టల్ బ్యాలెట్ ద్వారా సుమారు 1.60 లక్షల మంది కన్జర్వేటివ్ పార్టీ సభ్యులు ఓటు వేసి పార్టీ నేతను ఎన్నుకుంటారు. స్థానిక కాలమానం ప్రకారం సోమవారం మధ్యాహ్నం 12.30 గంటలకు ఫలితాలను రిటర్నింగ్ అధికారిగా వ్యవహరిస్తున్న సర్ గ్రాహం బ్రాడీ వెల్లడిస్తారు. ఎన్నికైన నేత డౌనింగ్ స్ట్రీట్‌కు సమీపంలోనే ఉన్న రాణి ఎలిజబెత్–2 కాన్ఫరెన్స్ సెంటర్ నుంచి సంక్షిప్త ప్రసంగం చేస్తారు. మంగళవారం డౌనింగ్ స్ట్రీట్ కార్యాలయం నుంచి ఆపద్ధర్మ ప్రధాని బోరిస్ జాన్సన్ వీడ్కోలు ప్రసంగం చేస్తారు. అనంతరం స్కాట్లాండ్లో ఉన్న రాణి ఎలిజబెత్‌కు తన రాజీనామాను అందజేస్తారు. ఆపైన, పార్టీ నేతగా ఎన్నికైన వారు స్కాట్లాండ్కు వెళ్లి రాణి నుంచి నియామక పత్రం అందుకుంటారు. ఇంగ్లండ్‌కు, బకింగ్‌హామ్ ప్యాలెస్‌కు బదులుగా మరోచోట నుంచి ప్రధాని పేరును రాణి ప్రతిపాదించడం బ్రిటన్ చరిత్రలో ఇదే మొదటిసారి. 96 ఏళ్ల రాణి వయస్సు రీత్యా ప్రయాణాలను గణనీయంగా తగ్గించుకున్నారు. ప్రస్తుతం ఆమె అబెర్దీన్‌షైర్ బాల్మోరల్ కోటలో గడుపుతున్నారు. మంగళవారం మధ్యాహ్నం కొత్తగా నియమితులైన ప్రధానమంత్రి డౌనింగ్ స్ట్రీట్ కార్యాలయం నుంచి మొదటి ప్రసంగం చేయడానికి ముందే కీలకమైన కేబినెట్ పదవులను ఖరారు చేస్తారు. సీనియర్ అధికారులు నూతన ప్రధానికి భద్రతకు సంబంధించిన కీలక వివరాలను, అణ్వాయుధాల రహస్య కోడ్లను అందజేస్తారు. బుధవారం మధ్యాహ్నం అధికార కన్జర్వేటివ్ పార్టీ కొత్త నేత హౌస్ ఆఫ్ కామన్స్‌లో ప్రతిపక్ష నేత ప్రశ్నలకు సమాధానాలిస్తారు. కోవిడ్ నిబంధనలన ఉల్లంఘిస్తూ పార్టీలు జరుపుకోవడం, పార్టీ సీనియర్ నేత ఒకరు కుంభకోణంలో ఇరుక్కోవడం వంటి పరిణామాలతో బోరిస్ జాన్సన్ కేబినెట్లోని సుమారు 60 మంది సీనియర్ నేతలు రాజీనామాలు చేశారు. దీంతో అధికార పార్టీ కొత్త నేతను ఎన్నుకునే సుదీర్ఘ ప్రక్రియను చేపట్టిన విషయం తెలిసిందే. ఇంధన భారం తగ్గిస్తాం ఇంధన సంక్షోభాన్ని పరిష్కరిస్తామని, గృహ వినియోగదారులకు విద్యుత్ బిల్లుల భారం తగ్గిస్తామని యూకే ప్రధాని రేసులో భారత సంతతికి చెందిన రిషి సునాక్, లిజ్ ట్రస్ తెలిపారు. బ్రిటన్ ప్రధాని పదవికి జరిగే ఎన్నికలో అధికార కన్జర్వేటివ్ పార్టీకి చెందిన ఈ ఇద్దరు నేతలు బరిలో ఉన్న విషయం తెలిసిందే. మరికొద్ది గంటల్లోనే పోలింగ్ జరగనున్న సమయంలో ఆదివారం వీరు బీబీసీ ఇంటర్వ్యూలో పలు విషయాలపై మాట్లాడారు. రష్యా– ఉక్రెయిన్ సంక్షోభం కారణంగా యూకేలో ఇంధన ధరలు ఒక్కసారిగా పెరిగాయి. దీంతో, ఇదే ప్రధాన అంశంగా మారింది. కొత్త ప్రభుత్వానికి తన సంపూర్ణ మద్దతు ఉంటుందని కూడా రిషి సునాక్ పేర్కొన్నారు. పార్లమెంట్ సభ్యునిగా కొనసాగుతానని, తన సొంత రిచ్మండ్, యార్క్‌షైర్ ప్రజల కోసం పనిచేస్తానని చెప్పారు. ఈ ఎన్నికల్లో ఓటమి పాలైతే ఏం చేస్తారన్న ప్రశ్నలకు ఆయన పైవిధంగా సమాధానమిచ్చారు. మళ్లీ ఎన్నికలు జరిగితే ప్రధాని పదవి రేసులో ఉంటారా అన్న ప్రశ్నకు ఆయన నేరుగా సమాధానమివ్వలేదు. -
రిషి సునాక్, లిజ్ ట్రస్ వద్దు.. మాకు బోరిస్ కావాలి!
లండన్: బ్రిటన్ ప్రధాని రేసు దగ్గర పడుతున్న వేళ.. కన్జర్వేటివ్ పార్టీలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మొదట్లో దూసుకుపోయిన ప్రధాని అభ్యర్థి రిషి సునాక్.. ఆ తర్వాత అనూహ్యంగా వెనుక పడిపోయారు. ఇప్పటికే లిజ్ ట్రస్ స్పష్టమైన ఆధిక్యంతో దూసుకుపోతున్నారు. ఈ తరుణంలో.. ప్రధాని రేసులో తెరపైకి మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ పేరు వచ్చింది. జాన్సన్‌ను PM రేసు నుండి తొలగించబడకూడదంటూ స్వింగ్ ఓటర్లు పట్టుబడుతున్నారు. అంతేకాదు.. బరిలో ఉన్న ఇద్దరు అభ్యర్థులు లిజ్ ట్రస్, రిషి సునాక్‌లపై తక్కువ నమ్మకాన్ని ఓటర్లు ప్రదర్శించారు. టోరీ సపోర్టర్స్(కన్జర్వేటివ్ పార్టీ సభ్యులు)లో 49 శాతం మంది ఇప్పటికీ మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్‌పైనే విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. ఆయన్ని ప్రధాని రేసు నుంచి తప్పించొద్దని, లిజ్ ట్రస్, రిషి సునాక్‌ల కంటే ఆయన మీదే తమకు నమ్మకం ఉన్నట్లు వెల్లడించారు. జాన్సన్‌ను తొలగించడం ద్వారా పార్టీ, ఎంపీల ప్రతిష్ట దెబ్బతిందని తాము నమ్ముతున్నామని పలు ఇంటర్వ్యూలలో అట్టడుగు నియోజకవర్గాల ఓటర్లు చెప్తుండడం విశేషం. ‘‘ఆయనలా(బోరిస్) ఇతరులు వ్యవహరిస్తారనే నమ్మకం మాకు లేదు. ఎందుకంటే.. బ్రెగ్జిట్ సమయంలో, కరోనా వైరస్ కట్టడి సమయంలో, చివరకు ఉక్రెయిన్ యుద్ధ సమయంలోనూ తలెత్తిన పరిస్థితులను ఆయన చాలా బాగా హ్యాండిల్ చేశారు. చిన్న చిన్న కారణాలతోనే ఆయన ప్రధాని పదవి నుంచి తప్పించారు. ఆయనలా వీళ్లు పాలిస్తారని అనుకోవడం లేదు. ఆయనకు మరో అవకాశం ఇవ్వడం మంచిది’’ అని చాలామంది ఓటర్లు తమ అభిప్రాయం వెల్లడించారు. లిజ్ ట్రస్ మరియు రిషి సునక్‌ల మద్దతు కంటే మిస్టర్ జాన్సన్ ప్రధానమంత్రిగా కొనసాగాలని 49 శాతం మంది టోరీ మద్దతుదారులు భావించారని yougov చేసిన ప్రత్యేక జాతీయ పోలింగ్ ద్వారా వెల్లడైంది. పైగా 2024 ఎన్నికల సమయంలో ప్రధానిగా బోరిస్ జాన్సన్ ఉంటేనే.. కన్జర్వేటివ్ పార్టీకి బాగా కలిసొస్తుందని వాళ్లు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఈ సర్వేను కన్జర్వేటివ్ పార్టీ పరిగణనలోకి తీసుకుంటాదా? అనేది కచ్చితంగా చెప్పలేం. మరోవైపు బ్రిటన్ ప్రధాని రేసులో తుది జాబితాలో ఉన్న రిషి సునాక్, విదేశాంగ కార్యదర్శి లిజ్ టస్లు.. తమ తమ గెలుపు కోసం శాయశక్తులా కృషి చేస్తున్నారు. ఇదీ చదవండి: బ్రిటన్ ప్రధాని రేసు.. రిషి సునాక్ వినూత్న ప్రచారం! -
ఫైటర్ జెట్‌తో ప్రధాని విన్యాసాలు.. సెల్ఫీ వీడియో.. నెటిజన్ల ఫైర్!
లండన్: బ్రిటన్ ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్ పైలట్ యూనిఫామ్ ధరించి టైఫూన్ ఫైటర్ జెట్‌లో చక్కర్లు కొట్టారు. ఫైటర్ జెట్‌లో గగన విహారం చేస్తూ సెల్ఫీ వీడియో తీసుకున్నారు. ఆ దృశ్యాలు సోమవారం విడుదల చేసింది డౌనింగ్ స్ట్రీట్. తన మాస్క్ ధరించి ఫైటర్ జెట్‌ను నడుపుతూ.. తనను అనుసరిస్తూ మరో రెండు విమానాలకు థంబ్స్ అప్ ఇవ్వడం వీడియోలో కనిపించింది. 'ప్రధాని బోరిస్ జాన్సన్ లింకన్షైర్లోని ఆర్ఏఎఫ్ కానింగ్స్బై నుంచి టైఫూన్ ఫైటర్ జెట్ కాక్‌పిట్‌లో ఎగురుతున్నారు.' అంటూ వీడియో క్యాప్షన్ ఇచ్చారు. ఐటీవీ ప్రకారం.. గత వారం లింకన్షైర్లోని రాయల్ ఎయిర్ ఫోర్స్(ఆర్ఏఎఫ్) బేస్‌లో టైఫూన్ పైటర్స్ జెట్స్ ప్రదర్శన సందర్భంగా ఈ వీడియో తీశారు. ఈ సందర్భంగా ఆ ఫైటర్ జెట్‌లో ప్రయాణించిన బోరిస్.. కొన్ని విన్యాసాలు చేసేందుకు విమానాన్ని నియంత్రించానంటూ పేర్కొన్నారు. ఫైటర్ జెట్‌లో ప్రయాణంపై వింగ్ కమాండర్ అడిగిన పలు ప్రశ్నలకు తనదైన శైలీలో సమాధానమిచ్చారు బోరిస్. మరోవైపు.. ఫైటర్ జెట్‌లో బోరిస్ ప్రయాణించటంపై సామాజిక మాధ్యమాల్లో మిశ్రమ స్పందనలు వచ్చాయి. టాప్ గన్ సినిమాలో టామ్ క్రూజ్ ఫీట్లు చేసేందుకు ప్రయత్నించారని పలువురు నెటిజన్లు పేర్కొన్నారు. ప్రధాని ఈ జాయ్‌రైడ్‌లో జాలీగా వెళ్లడానికి, టామ్ క్రూజ్‌లా విన్యాసాలు చేయడానికి పన్ను చెల్లింపుదారులకు ఎంత ఖర్చయిందంటూ ఓ నెటిజన్ పేర్కొన్నారు. ఈ రైడ్ వెనుక ముఖ్య ఉద్దేశం ఏమిటని మరొకరు ప్రశ్నించారు. విశ్వాస పరీక్షలో విజయం.. మరోవైపు.. ఇటీవలే ప్రధాని పదవికి రాజీనామా చేసి తాత్కాలిక బాధ్యతల్లో కొనసాగుతున్నారు బోరిస్ జాన్సన్. కొత్త ప్రధానిని ఎన్నుకునే ప్రక్రియ కొనసాగుతోంది. భారత సంతతి వ్యక్తి, ఆ దేశా మాజీ మంత్రి రిషి సునాక్ ముందంజలో ఉన్నారు. ఈ క్రమంలో సోమవారం నిర్వహించిన విశ్వాస పరీక్షలో అధికార కన్జర్వేటివ్ పార్టీ విజయం సాధించింది. ఇదీ చదవండి: Rishi Sunak.. పావులు కదుపుతున్న బోరిస్ జాన్సన్.. రిషి సునాక్ ఓటమికి స్కెచ్! -
అడ్వాంటేజ్ ఇండియా?
బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ వారసుని ఎంపిక కార్యక్రమం ప్రారంభమైంది. స్వయంకృతాపరాధాల ఫలితంగా అవమానకరమైన రీతిలో ప్రధాని పదవి నుంచి ఆయన తప్పుకోవలసి వచ్చింది. తొలిదశలో ఎనిమిదిమంది పోటీపడ్డారు. వీరిలో ఇద్దరిని కన్సర్వేటివ్ పార్టీ ఎంపీలు ఎంపిక చేయవలసి ఉంటుంది. రెండు రౌండ్లు ముగిసిన తర్వాత పోటీ నుంచి ముగ్గురు నిష్క్రమించారు. టాప్ టూలో మొదటి స్థానంలో రిషీ సునాక్, రెండో స్థానంలో పెన్నీ మోర్డంట్ ఉన్నారు. పార్లమెంట్ సభ్యుల ఎంపికలో తుదివరకూ ఈ ఇద్దరే నిలబడవచ్చని అంచనా వేస్తున్నారు. కన్సర్వేటివ్ పార్టీలో సభ్యులుగా ఉన్న రెండు లక్షలమంది ఈ ఇద్దరిలో ఒకరిని ప్రధాని పదవికి ఎన్నుకుంటారు. ఇప్పటివరకు ముందంజలో ఉన్న రిషి సునాక్‌కు భారతీయ మూలాలు ఉండడమే మనకు సంబంధించినంతవరకు ఈ వారం వార్తా విశేషం. గండభేరుండ రాజ‘పక్షులు’ ఎగిరిపోవడంతో శ్రీలంక కథ ఈ వారమే క్లైమాక్స్‌కు చేరుకున్నది. ప్రజాస్వామ్యం పేరుతో అధికార పీఠాన్ని ఎక్కి కుటుంబ పాలనతో నిరంకుశాధికారాలను చలాయించి శ్రీలంకను దివాళా అంచుకు నెట్టడం తాజావార్త కాదు. లంక వీధుల్లో జనస్వామ్యం ప్రజ్వరిల్లడమే వేడివేడి వార్త. నిరంకుశ ప్రభువులను తరిమి తరిమి కొట్టడమే గరమ్‌గరమ్ వార్త. వారి మెడలు వంచి రాజీనామాలిప్పించడమే ఈ వారపు తుదివార్త. తదుపరి కార్యక్రమాన్ని శ్రీలంక పార్లమెంట్ వచ్చేవారం చేపట్టబోతున్నది. ఈ రెండు పరిణామాలు ఆయా దేశాల ఆంతరంగిక వ్యవహారాలే కావచ్చు. కానీ, ఆర్థిక – సాంకేతిక రంగాల గ్లోబలైజేషన్ తర్వాత దేశాల ఏకాకితనం దూరమైంది. ఎక్కడ తీగ లాగినా డొంకంతా కదులుతున్నది. ఈ సందర్భంలో ఇతర దేశాల డొంకల కంటే భారత్ డొంక ఇంకొంచెం ఎక్కువ కదులుతున్నది. భారత ఉపఖండంలో భాగమైన దేశం శ్రీలంక. నిజానికి మనదేశానికి ఉపగ్రహం లాంటి దేశం. అలాంటి దేశంతో అచ్చిక బుచ్చికలాడి చైనా వాళ్లు మచ్చిక చేసుకున్నారు. అప్పులిచ్చి ప్రలోభపెట్టి, షరతులు పెట్టి దివాళా తీయించి దానితో ఆటలాడుకున్నారు. ఇటువంటి సమయంలో తలెత్తిన ఈ పరిణామాలు మిగిలిన ప్రపంచం కంటే భారత్‌కే ఎక్కువ ఆసక్తికరం. అవసరం కూడా! బ్రిటన్ పరిణామాలు భావోద్వేగపరమైనవి. రెండొందల ఏళ్లపాటు ఈ దేశాన్ని పీల్చి పిప్పిచేసిన బ్రిటీష్ సామ్రాజ్యవాద దేశానికి ఒక భారతీయ మూలాలున్న వ్యక్తి ప్రధానమంత్రి కాగలడా అని ఎదురు చూసే అవకాశం రావడం... అదీ ఆజాదీ అమృతోత్సవ సంవత్సరం కావడం... ఒక ఉద్వేగభరితమైన, ఉత్తేజకరమైన సన్నివేశం! తూర్పు ఆఫ్రికా దేశాల నుంచి బ్రిటన్‌కు వలస వచ్చిన కుటుంబాల్లో మూడోతరం వాడు రిషీ సునాక్. అంతకంటే ఎన్ని తరాల ముందు ఇండియా నుంచి ఆఫ్రికా వెళ్లారనే వివరాలు అందుబాటులో లేవు. పూర్వీకులది పంజాబ్. రిషి తండ్రిపేరు యశ్వీర్. తల్లి పేరు ఉష. రిషి పితామహుడు కెన్యా నుంచి, మాతామహుడు టాంజానియా నుంచి వచ్చి బ్రిటన్‌లో స్థిరపడ్డారు. తమ కుటుంబం ఇప్పటికీ భారతీయ ఆచార సంప్రదాయాలనే పాటిస్తున్నదని రిషి బహిరంగంగానే ప్రకటించారు. తనను తాను బ్రిటీష్ ఇండియన్‌గా ప్రకటించుకున్నారు. తన అభ్యర్థిత్వాన్ని ప్రకటించే ముందు తాను హిందువునని కూడా ఆయన చెప్పుకున్నారు. మతాన్నీ, రాజకీయాలనూ మిళితం చేయకపోవడం, వేరువేరుగా పరిగణించడం బ్రిటన్ ప్రజల్లో ఉన్న ఒక గొప్ప సుగుణం. అందువల్లనే రిషి తనను తాను హిందువుగా పరిచయం చేసుకోగలిగారు. ‘ఇన్ఫోసిస్’ నారాయణమూర్తి, సుధామూర్తి దంపతుల కుమార్తె ఆకాంక్షను ఆయన పెళ్లి చేసుకున్నారు. రిషి అనేది భారతీయ పదమే. మరి సునాక్? ఇంటి పేరా? భారతీయ రుషి పరంపరలో శునకుడనే రిషి కూడా ఉన్నాడు. మహాభారత కథలో సుప్రసిద్ధుడైన శౌనక మహర్షి తండ్రిగా శునక మహర్షి ప్రస్తావన ఉంటుంది. ఒకవేళ రిషికి పెట్టాలనుకుంటే ప్రసిద్ధుడైన శౌనక రుషి పేరే పెడతారు కానీ అంతగా పేరు లేని శునక రుషి పేరెందుకు పెడతారు? పైగా శునకమంటే గ్రామసింహం. కాకపోతే రుషులకు పక్షుల పేర్లు, జంతువుల పేర్లు ఉండటం కూడా రివాజే! రామాయణంలో పిడకల వేట అనేది మన సంప్రదాయంలో ఒక భాగం కనుకనే ఈ పేరు గురించిన చర్చ. ఒకవేళ టోరీలు రిషిని ప్రధానిగా ఎంపిక చేస్తే ఆయన పుట్టుపూర్వోత్తరాలన్నీ సవివరంగా బయటకొస్తాయి. ఎంపీల మద్దతు లభించినప్పటికీ పార్టీ సభ్యుల్లో మెజారిటీ కూడగట్టడం కష్టమే అనే అభిప్రాయం ఉన్నది. ఇప్పటికే బోరిస్ జాన్సన్ రిషికి వ్యతిరేకంగా ప్రచారాన్ని ప్రారంభించాడు. తాను ప్రజాదరణ కోల్పోవడానికి రిషీయే కారణమన్న అభిప్రాయం ఆయనకు ఉన్నది. పరిశీలకుల అభిప్రాయం ప్రకారం పెన్నీ మోర్డంట్కే తదుపరి ప్రధానిగా ఎంపికయ్యే అవకాశాలు ఎక్కువున్నాయి. బ్రిటీష్ ప్రధానమంత్రి రేసులో భారతీయ మూలాలున్న వ్యక్తి సెమీఫైనల్ దాకా దూసుకొనిరావడం కూడా గొప్ప విషయమే. ఇప్పటికే యూరప్‌లో ఒక ప్రధానమంత్రి భారతీయ సంతతికి చెందిన వ్యక్తి. పోర్చుగల్ ప్రధాని ఆంటోనియో కోస్టా పూర్వీకులది భారత్‌లోని గోవా రాష్ట్రం. అక్కడి నుంచి ఆఫ్రికాలోని మొజాంబిక్ దేశానికి వలస వెళ్లి ఆ తర్వాత పోర్చుగల్‌లో స్థిరపడ్డారు. మారిషస్ అధ్యక్ష, ప్రధానులుగా ఎప్పటినుంచో భారతీయ సంతతి వారుంటున్నారు. ప్రస్తుత అధ్యక్షుడు, ప్రధానమంత్రి ఇద్దరూ కూడా భారతీయ మూలాలున్నవారే. సింగపూర్, సురినామ్, గయానా, సీషెల్స్ ప్రస్తుత అధ్యక్షులు భారతీయ సంతతివారే! పాతికేళ్లపాటు మలేషియాకు నాయకత్వం వహించిన మహతీర్ మొహమ్మద్ కూడా ఈ జాబితాలో ఉన్నారు. అగ్రరాజ్యమైన అమెరికా అధ్యక్ష పదవికి కమలా హ్యారిస్ కేవలం ఒక మెట్టు దూరంలోనే ఉన్నారు. అయితే అత్యున్నత పదవిని చేపట్టడానికి ఆమె రెండు పెద్ద ఆటంకాలను దాటవలసి ఉన్నది. ఒకటి – డెమోక్రాటిక్ పార్టీ అభ్యర్థిగా ఎంపిక కావడం. రెండవది – ట్రంప్ లాంటి ప్రత్యర్థిని ఎదిరించి గెలవడం. కష్టమైన పనే! కానీ, రానున్న రోజుల్లో అమెరికా, బ్రిటన్, కెనడా దేశాధినేతలుగా భారతీయ సంతతివారు ఎన్నికయ్యే అవకాశాలు మాత్రం మెరుగవుతున్నాయి. భారతీయ మూలాలున్నవారు ఇతర దేశాల అధినేతలుగా ఉన్నంత మాత్రాన భారత్‌కు కలిగే ప్రయోజనమేమిటి? అదొక గర్వకారణం. ఒక తెలుగు సినిమాలో గురుశిష్యులైన పురోహితులుంటారు. గురువంటాడు శిష్యునితో – ‘అయితే అమితాబ్ బచ్చన్ కూడా మనవాళ్లేనేంట్రా?’ అని! ‘ఔను గురువుగారూ! వారు అలహాబాద్ బ్రాహ్మలు, మనం హైదరాబాద్ బ్రాహ్మలం. అంతే తేడా’ అని బదులిస్తాడు శిష్యుడు. ‘కిక్కురా కిక్కు’ అని పరవశించిపోతాడు గురువు. అలాంటి పరవశమేదో మనవాళ్లకు కలగవచ్చు. అది భావోద్వేగపరమైన ప్రయోజనం. ఎన్నో తరాలకు ముందే బతుకుతెరువు కోసం వెళ్లి అక్కడి సంస్కృతిలో, ఆచారాల్లో పుట్టి పెరిగినవారు కనుక మానసికంగా వారు ఆయా దేశాల పౌరులుగానే తయారవుతారు. తాతలనాటి దేశం కనుక భారత్‌పై వారికి అమ్మమ్మగారి ఊరి మీద ఉండేంత ప్రేమ ఉంటే ఉండవచ్చు. అంతకంటే ఎక్కువ ఆశించలేము. ఆయా దేశాల ప్రభుత్వ విధానాలకు అనుగుణంగానే భారతీయ సంతతి వారైనా సరే వ్యవహరిస్తారు. కాకపోతే తటస్థ వేదికలపై కశ్మీర్ లాంటి అంశాలపై, సొంత దేశానికి ఇబ్బంది కలగని ఇతర విషయాల్లో భారత్‌కు అనుకూలంగా మెలగవచ్చు. అంతమాత్రమైనా దేశానికి ప్రయోజనకరమే! ‘గాడ్‌ఫాదర్’ నవల్లోని (సినిమా కూడా) మాఫియా డాన్ కాలీయోనీ కుటుంబంలోని పాత్రల వంటివే రాజపక్సే కుటుంబ పాత్రలని లంక ప్రతిపక్షాల అభిప్రాయం. నలుగురు అన్నదమ్ముల్లో మహింద రాజపక్సే ప్రముఖుడు. 2005 నుంచి 2015 వరకు ప్రధానిగా, అధ్యక్షునిగా లంకలో చక్రం తిప్పినవాడు. 2009 మిలిటరీ ఆపరేషన్‌తో ప్రత్యేక తమిళ ఉద్యమాన్ని నామరూపాల్లేకుండా చేసి సింహళ జాతీయవాద బౌద్ధులకు ప్రీతిపాత్రుడయ్యాడు. ఈయన హయాంలోనే భారత్‌ను కాదని చైనాకు లంక దగ్గరయింది. తమిళుల ఊచకోతకు అవసరమైన ఆయుధాలను చైనా సరఫరా చేసింది. మానవ హక్కుల హననాన్ని భారత్‌తోపాటు మిగిలిన ప్రపంచం ఖండించినా, చైనా మాత్రం స్పందించలేదు. తన అంతర్జాతీయ వ్యూహంలో భాగంగా లంక పాలకుడిని చైనా మచ్చిక చేసుకున్నది. అడిగిందే తడవుగా అప్పులు సమకూర్చింది. చైనా అప్పుల్లో రాజపక్సే కుటుంబానికి ఒక సౌలభ్యం కనిపించింది. తీసుకున్న రుణంలో సొంతానికి ఎంత కైంకర్యం చేసినా చైనా పట్టించుకోదు. మిగిలిన రుణదాతలైతే ఇచ్చిన రుణాన్ని దేనికెంత ఖర్చు పెడుతున్నారో లెక్క చెప్పమని అడుగుతారు. రుణగ్రస్థ దేశం ఆ రుణాన్ని సద్వినియోగపరిస్తేనే తిరిగి చెల్లించగలిగే స్థితిలో ఉంటుంది కనుక అటువంటి పర్యవేక్షణ ఉంటుంది. రుణగ్రస్థ దేశాన్ని అప్పుల ఊబిలో ముంచి మెడలు వంచడమే చైనా లక్ష్యం కనుక లెక్కలడగదు. కానీ మిగిలిన వారికంటే ఎక్కువ వడ్డీని ముక్కు పిండి వసూలు చేస్తుంది. అప్పుల ఊబిలో ముంచే హంబన్‌తోట ఓడరేవును చైనా 99 ఏళ్లపాటు లీజుకు రాయించుకుంది. అయినా చైనా అప్పుల కోసమే రాజపక్సేలు ఎగబడ్డారు. ఆ పదేళ్ల కాలంలో సుమారు లక్షన్నర కోట్ల రూపాయలు (భారతీయ కరెన్సీలో) మహింద సొంతానికి పోగేసుకున్నాడనే ఆరోపణలున్నాయి. మొన్న అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన గొటబయకు ఫైర్‌బ్రాండ్ ఇమేజ్ ఉన్నది. సొంత కుటుంబీకులు ఈయనను ‘టెర్మినేటర్’ అనే ముద్దు పేరుతో పిలుచుకుంటారు. తమిళ ఈలం ఉద్యమాన్ని నెత్తుటేరుల్లో ముంచిన ఘనత ఈయనదే. అప్పట్లో రక్షణమంత్రిగా ఉండేవాడు. మరో సోదరుడు చమల్ రాజపక్సే మొన్నటిదాకా నీటిపారుదల శాఖ మంత్రి. మహింద అధ్యక్షునిగా ఉన్నప్పుడు స్పీకర్‌గా ఉండేవాడు. సిరిమావో బండారు నాయకే ప్రధానిగా ఉన్నరోజుల్లో ఆమెకు అంగరక్షకుడిగా పనిచేశారు. అందువల్ల ‘బాడీగార్డ్’ అనే పేరు స్థిరపడిపోయింది. అన్నదమ్ముల్లో ఆఖరివాడు బాసిల్ రాజపక్సే. ఆర్థికమంత్రిగా అవకతవక విధానాలతో దేశాన్ని సంక్షోభంలోకి నెట్టిన ఘనత ఈయనదే. కాంట్రాక్ట్ ఏదైనా సరే ఈయనకు ముందుగా పదిశాతం ముట్టజెప్పాలి. అందుకే ‘మిస్టర్ టెన్ పర్సెంట్’ అనే పేరుతో ఈయన్ను పిలుచుకుంటారు. మహింద కుమారుడు నమల్ రాజపక్సే క్రీడలు – యువజన వ్యవహారాల మంత్రి. తండ్రి అధ్యక్షుడిగా ఉన్న రోజుల నుంచే పెత్తనానికి అలవాటుపడ్డాడు. మరో అరడజన్ మంది రాజపక్సేలు, ఇంకొన్ని డజన్ల మంది వారి బంధువులు, హితులు రాజ్యాధికార చక్రం తిప్పి శ్రీలంక సంక్షోభానికి మరింత ఆజ్యం పోశారు. తీసుకున్న రుణంలో కొంతభాగాన్ని సొంతానికి వాడుకోవడానికి అలవాటుపడ్డ కారణంగా రాజపక్సేలు ఇబ్బడిముబ్బడిగా అప్పులు చేశారు. జీడీపీతో సమానంగా అప్పులు పెరిగాయి. 2015 ఎన్నికల్లో రాజపక్సేలు ఓడిపోవడానికి చైనా అప్పులు కూడా ఒక ప్రధాన కారణం. 2019లో జరిగిన ఎన్నికల్లో గెలవడానికి గొటబయ అలవికాని హామీలిచ్చాడు. వ్యాట్‌ను 15 శాతం నుంచి 8 శాతానికి తగ్గిస్తాననీ, సంపన్నులక్కూడా ఆదాయపు పన్ను తగ్గిస్తాననీ వాగ్దానం చేశాడు. అధికారంలోకి రాగానే వాటిని అమలుచేశాడు. ప్రభుత్వ ఆదాయం దారుణంగా పడిపోయింది. విదేశీ రుణాలు చెల్లించలేక చేతులెత్తేశాడు. ప్రధాన ఆదాయ వనరైన టూరిజం కరోనా కారణంగా పూర్తిగా దెబ్బతిన్నది. కెమికల్ వ్యవసాయాన్ని మానివేసి ఎకాయెకిన అందరూ సేంద్రియ వ్యవసాయం చేపట్టాలని శాసనం చేశాడు. రైతాంగాన్ని అందుకు సన్నద్ధం చేయకుండా రాత్రికి రాత్రే చేసిన ఈ మార్పు వల్ల దిగుబడులు సగానికి సగం పడిపోయాయి. విదేశీ మారకాన్ని ఆర్జించిపెట్టే తేయాకు దిగుబడి కుదేలైంది. విదేశీ మారకం అడుగంటడంతో చెల్లింపులు చేయలేక నిత్యావసరాల దిగుమతులు ఆగిపోయాయి. నో పెట్రోల్, నో డీజిల్, నో గ్యాస్. ఆహార ధాన్యాలకూ, కూరగాయలకూ కొరతే! ద్రవ్యోల్బణం విశ్వరూపం దాల్చింది. జనం రోడ్డున పడ్డారు. ప్రభంజనమై ఒక్క ఉదుటన కదిలారు. ఆధ్యక్ష ప్రధానమంత్రుల భవనాలను ముట్టడించారు. రాజపక్షులు పలాయనం చిత్తగించాయి. గడిచిన వారం రోజులుగా బీదాబిక్కీ బక్కజనం, మధ్యతరగతి యువజనం నగర వీధుల్లోనూ, అధ్యక్ష భవనంలోనూ చేసిన సందడి, చూపిన తెగువ ప్రజాస్వామ్య ప్రియులకు కనువిందు చేసింది. అధ్యక్ష కార్యాలయంలో అతని కుర్చీ మీద ఓ పేద యువకుడు ఠీవిగా కూర్చొని ఫైలు మీద సంతకం చేస్తున్నట్టు నటిస్తుంటాడు. మిగిలిన యువకులంతా హర్షధ్వానాలు చేస్తుంటారు. ఎంత మనోహరమైన దృశ్యం! ఎక్కడ ఆ ప్రజా కంటక పాలకుడు? అంతిమ విజేతలు ఎప్పుడైనా ప్రజలే కదా అనే సందేశాన్ని ఇచ్చినట్టు కనిపించిందీ సన్నివేశం. ఈ సంపూర్ణ ప్రజాస్వామ్యం ఆయుష్షు బహుశా ఇంకో మూడు నాలుగు రోజులుండవచ్చు. తదుపరి అధ్యక్షుడిని ఎన్నుకోవడానికి త్వరలో పార్లమెంట్ సమావేశం కాబోతున్నది. అధ్యక్షుడికి అపరిమిత అధికారాలు కట్టబెట్టిన నిబంధనల్ని ఎత్తివేస్తూ రాజ్యాంగ సవరణ చేయడం కొత్త ప్రభుత్వం మొదటి కార్యక్రమం కావచ్చు. తర్వాత ఏర్పడబోతున్న ప్రభుత్వం చైనా ప్రభావం నుంచి కొంతదూరం జరగవచ్చు. ఎందుకంటే దేశాన్ని అప్పుల ఊబిలోకి నెట్టడంలో ప్రధాన భూమిక పోషించిన చైనాపై ప్రజల్లో ఆగ్రహం కనబడుతున్నది. ఇండో – పసిఫిక్ మహాసముద్ర తీరాల్లో ఆధిపత్యం కోసం చైనా చేస్తున్న ప్రయత్నాలకు ఏ రకంగా ఎక్కడ బ్రేక్‌పడినా ఆ మేరకు భారత్‌కు ప్రయోజనమే! వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
పావులు కదుపుతున్న బోరిస్ జాన్సన్.. రిషి సునాక్ ఓటమికి స్కెచ్!
Rishi Sunak.. బ్రిటన్ ప్రధాని రేసులో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. బ్రిటన్ మాజీ ఆర్థిక మంత్రి, భారత సంతతికి చెందిన రిషి సునాక్ ప్రధాని రేసులో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ఇక, బ్రిటన్ ప్రధాని పదవి కోసం రిషి సునాక్, పెన్నీ మార్డౌట్‌తో సహా మరో ఐదుగురి మధ్య పోటీ సాగుతున్నది. ఈ నేపథ్యంలో బ్రిటన్ ఆపద్ధర్మ ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్ షాకింగ్.. రిషి సునాక్ ఓటమి కోసం శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. పరోక్షంగా తాను రిషి సునాక్‌ను వ్యతిరేకిస్తున్న చెప్పకనే చెప్పారు. బోరిస్ జాన్సన్ శుక్రవారం ఓ సమావేశంలో ఎవరినైనా ఎన్నుకోండి.. రిషి సునాక్ తప్ప అని తన మద్దతు దారులకు సూచించినట్టు తెలుస్తోంది. ఈ మేరకు మీడియాలో కథనాలు ప్రచురితమయ్యాయి. కాగా, బోరిస్ జాన్సన్ బహిరంగంగా ఏ ఒక్కరి అభ్యర్థిత్వానికి మద్దతు ఇవ్వడం గానీ, బహిరంగంగా పోటీలో జోక్యం చేసుకోవడం లేదు. పోటీ నుంచి ఉద్వాసనకు గురైన అభ్యర్థులతో మాట్లాడుతూ తనకు మద్దతు ఇవ్వాలని, రిషి సునాక్‌ను బ్రిటన్ ప్రధానిని కానివ్వవద్దని చెబుతున్నట్లు తెలిసింది. ఇదిలా ఉండగా.. బోరిస్ జాన్సన్, ఆయన టీం మాత్రం రిషి సునాక్ తప్ప ఎవరైనా సరే స్లోగన్‌తో ఎన్నికల రహస్య క్యాంపెయిన్ చేపట్టినట్లు సమాచారం. విదేశాంగ మంత్రి లిజ్ ట్రస్, వాణిజ్యశాఖ సహాయ మంత్రి పెన్నీ మొర్డాంట్ అభ్యర్థిత్వాల పట్ల బోరిస్ జాన్సన్ చాలా ఆసక్తిగా ఉన్నారని ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. ఆర్థిక మంత్రిగా రిషి సునాక్ రాజీనామా తర్వాతే.. ప్రధానిగా తాను(బోరిస్ జాన్సన్) వైదొలగాల్సి వచ్చినందునే సునాక్‌పై బోరిస్ ఇలా గుర్రుగా ఉన్నట్టు తెలుస్తోంది. Boris Johnson takes revenge on Rishi Sunak: The Times#UKPM #BorisJohnson #RishiSunak https://t.co/IA1m4aHAMv — We For News (@WeForNews) July 16, 2022 ఇది కూడా చదవండి: రష్యాతో కలిసి పని చేస్తాం: నాసా సంచలనం.. ముందుగానే కౌంటర్ ఇచ్చిన పుతిన్ -
బ్రిటన్ ప్రధాని పీఠం: తొలి రౌండ్ రిషిదే.. గట్టి పోటీ ఇస్తున్న పెన్నీ
లండన్: బ్రిటన్ ప్రధాని పీఠమెక్కబోయే కీలకమైన కన్జర్వేటివ్ పార్టీ నేత ఎన్నిక రేసులో భారత సంతతికి చెందిన మాజీ ఆర్థిక మంత్రి, ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి అల్లుడు రిషి సునాక్ (42) దూసుకెళ్తున్నారు. బుధవారం తొలి రౌండ్ ముగిసే సరికి ఆయన అత్యధికంగా 88 మంది పార్టీ ఎంపీల ఓట్లను సాధించారు. ప్రధాన పోటీదారు పెన్నీ మోర్డంట్ 67 ఓట్లతో గట్టి పోటీ ఇస్తున్నారు. లిజ్ ట్రస్ (50 ఓట్లు), కేమీ బదెనోక్ (40)తో పాటు భారత సంతతికి చెందిన అటార్నీ జనరల్ సుయెల్లా బ్రేవర్మన్ (32) కూడా తొలి రౌండ్‌ను గట్టెక్కారు. కనీసం 30 మంది ఎంపీల మద్దతు కూడగట్టడంలో విఫలమై నదీం జహావీ, జెరెమీ హంట్ రేసు నుంచి వైదొలిగారు. దీంతో ఆరుగురు అభ్యర్థులు పోటీలో మిగిలారు. ఎంపీల మద్దతులో రిషి దూసుకుపోతుండగా విజేతను తేల్చడంలో కీలకమైన కన్జర్వేటివ్ పార్టీ సభ్యుల్లో పెన్నీకి మద్దతు గణనీయంగా పెరుగుతున్నట్టు వస్తున్న వార్తలు పోటీని ఆసక్తికరంగా మారుస్తున్నాయి. గురువారం కన్జర్వేటివ్ ఎంపీలు తమ ఫేవరెట్ అభ్యర్థులను ఎన్నుకోనున్నారు. జూలై 21కల్లా ఇద్దరు అభ్యర్థులు బరిలో మిగలాల్సి ఉంటుంది. అది రిషి, పెన్నీయే అవుతారని భావిస్తున్నారు. తర్వాత 2 లక్షల మంది కన్జర్వేటివ్ పార్టీ సభ్యుల్లో అత్యధికుల మద్దతు కూడగట్టుకునే వారే పార్టీ నేతగా ఎన్నికై సెప్టెంబర్ 5న ప్రధాని పీఠమెక్కుతారు. -
బ్రిటన్ కొత్త ప్రధాని ఎంపిక రేసులో 11 మంది.. ముహూర్తం ఫిక్స్!
లండన్: బ్రిటన్ కొత్త ప్రధాని ఎంపికకు ముహూర్తం ఖరారు చేసింది అధికార కన్జర్వేటివ్ పార్టీ. సెప్టెంబర్ 5న పార్టీ నాయకుల సమక్షంలో కొత్త ప్రధాని పేరును అధికారికంగా ప్రకటించనుంది. ప్రధాని పదవికి పోటీ పడేందుకు 11 మంది నేతలు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. రేసులో ఉండాలనుకునేవారు నామినేషన్లు సమర్పించేందుకు మంగళవారం ఒక్కరోజే గడువుంది. వేసవి విరామం అనంతరం బ్రిటన్ పార్లమెంట్ సెప్టెంబర్‌లోనే తిరిగి ప్రారంభమవుతుంది. అప్పుడే కొత్త ప్రధాని ప్రకటన ఉండనుంది. రౌండ్ల వారీగా ఓటింగ్.. ప్రధాని పదవికి పోటీ పడాలనుకునే వారికి కనీసం 20 మంది ఎంపీల మద్దతు ఉండాలి. పోటీలో ఉన్నవారిని పార్టీ నేతలు బ్యాలెట్ ఓటింగ్ ద్వారా ఎన్నుకుంటారు. రౌండ్ల వారీగా ఓటింగ్ నిర్వహించి తక్కువ ఓట్లు వచ్చిన వారిని ఎలిమినేట్ చేస్తూ ఉంటారు. చివరకు మిగిలిన ఇద్దరిలో ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తే వారే కన్జర్వేటివ్ పార్టీ నూతన సారథిగా, ప్రధానిగా బాధ్యతలు చేపడుతారు. ఈ ప్రక్రియ బుధవారం నుంచే ప్రారంభమవుతుంది. కొత్త ప్రధాని రేసులో భారత సంతతికి చెందిన రిషి సునక్ ఉన్నారు. మొన్నటివరకు ఆర్థిక మంత్రిగా సేవలందించిన ఈయన బోరిస్ జాన్సన్ కేబినెట్ నుంచి మొదటగా తప్పుకున్నారు. ఆ తర్వాత సొంత ప్రభుత్వంలో మంత్రులతో పాటు మొత్తం 58 మంది రాజీనామా చేశారు. దీంతో పదవి నుంచి తప్పుకుంటున్నట్లు బోరిస్ ప్రకటించారు. కొత్త ప్రధాని ఎంపిక జరిగేవరకు తాత్కాలిక ప్రధానిగా కొనసాగుతానన్నారు. చదవండి: Who Is Rishi Sunak: బ్రిటన్ తదుపరి ప్రధానిగా భారత సంతతి వ్యక్తి! అదే నిజమైతే చరిత్రే.. -
మేడమ్ టుస్సాడ్స్ నుంచి రోడ్డుపైకి బోరిస్ మైనపు విగ్రహం
లండన్: నిండా వివాదాల్లో మునిగి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న బోరిస్ జాన్సన్ ప్రధాని పదవికి గురువారం రాజీనామా చేశారు. కన్జర్వేటివ్ పార్టీ పక్ష నేత పదవి నుంచి సైతం తప్పుకున్నారు. ఈ క్రమంలోనే ఆయనకు మరో అవమానం ఎదురైంది. బ్లాక్‌పూల్‌లోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో ఏర్పాటు చేసిన ఆయన మైనపు విగ్రహాన్నిప్రభుత్వ కార్యాలయం జాబ్ సెంటర్ ముందుకు తరలించారు. జాబ్ సెంటర్ ముందు రోడ్డుపై విగ్రహం ఉన్న ఫొటోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. Blackpool Madame Tussauds have put Boris Johnson’s waxwork outside of the job centre and I can’t stop laughing pic.twitter.com/U6VToQSjo9 — Charlotte (@charlotteclaber) July 7, 2022 నీలిరంగు టైతో కూడిన సూట్లో నడుముపై చేతులు ఉంచి నవ్వుతున్న జాన్సన్ విగ్రహాన్ని రూపొందించింది మేడమ్ టుస్సాడ్స్. ప్రస్తుతం ఆ విగ్రహాన్ని తరలించటం చర్చనీయాంశంగా మారింది. జాబ్‌సెంటర్ ముందు రోడ్డుపై కనిపిస్తున్న జాన్సన్ విగ్రహం కొద్ది సమయంలోనే వైరల్‌గా మారింది. ఈ అంశంపై కొందరు వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కొందరు స్థానికులు విగ్రహం వద్ద ఫోటోలకు పోజులిచ్చారు. మేడమ్ టుస్సాడ్స్ ఈ ఫోటోలను ట్విట్టర్లో షేర్ చేసింది. 'బోరిస్ ఎక్స్ బ్లాక్పూల్' అంటూ నోట్ రాసుకొచ్చింది. బోరిస్ జాన్సన్ మైనపు విగ్రహాన్ని ఈ ఏడాది మార్చిలోనే ఆవిష్కరించారు. లాన్స్ లైవ్ నివేదిక ప్రకారం.. విగ్రహం తయారు చేసేందుకు ఎనిమిది నెలల సమయం పట్టింది. సుమారు 20 మంది కళాకారులు కొన్ని వందల గంటలు శ్రమించి విగ్రహానికి రూపునిచ్చారు. -
ప్రధాని పదవికి గుడ్‌బై చెప్పే ముందు.. బోరిస్ భారీ ప్లాన్.. చెకర్స్‌లో..
లండన్: ప్రధాని పదవికి రాజీనామా చేస్తానని గురువారం అధికారికంగా ప్రకటించారు బోరిస్ జాన్సన్. కన్జర్వేటివ్ పార్టీ నాయకత్వ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. అయితే తాను ప్రధాని హోదాలో ఉండగానే చివరగా గ్రాండ్ పార్టీకి ఆయన్ ప్లాన్ చేసినట్లు బోరిస్ సన్నిహిత వర్గాలు చెప్పాయని బ్రిటన్ మీడియా తెలిపింది. చాలాకాలంగా సహజీవనం చేస్తున్న కేరీని గతేడాది పెళ్లి చేసుకున్నారు ఆయన. అయితే కరోనా కారణాల వల్ల ఈ వేడుక అతికొద్ది మంది సమక్షంలో నిరాడంబరంగా జరిగింది. అందుకే ఇప్పుడు అందరినీ పిలిచి గ్రాండ్ వెడ్డింగ్ పార్టీ ఇవ్వాలని బోరిస్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ప్రధాని అధికారిక నివాసం 'చెకర్స్'లో ఈ పార్టీ ఉండనుంది. బ్రిటన్ ప్రధాని కార్యాలయం 10 డౌన్ స్ట్రీట్‌లో ఉంటుంది. చెకర్స్ ప్రధాని అధికారిక నివాసం. 600 హెక్టార్ల విస్తీర్ణంతో ఎంతో విశాలంగా ఉండే ఈ భవన సముదాయంలో ప్రపంచనేతలతో సమావేశాలు, విందు కార్యక్రమాలు, పార్టీలకు బ్రిటన్ ప్రధానులు ఉపయోగిస్తుంటారు. 1920 నుంచి ఇది వాడుకలో ఉంది. చెకర్స్‌లో జులై 30న బోరిస్ పార్టీ ఇవ్వనున్నట్లు బ్రిటన్ మీడియా పేర్కొంది. ఇది ఎంతో గ్రాండ్‌గా, గ్లామరస్‌గా ఉండేలా ప్లాన్ చేసినట్లు తెలిపింది. బోరిస్ స్నేహితులు, కుటుంబసభ్యులకు ఇప్పటికే ఆహ్వానం అందిందని మీడియా వెల్లడించింది. -
అప్రతిష్ఠతో... ఇంటి దారి!
కూర్చున్న కుర్చీని వదిలిపెట్టడం ఉన్నత స్థానంలో ఉన్న ఎవరికైనా కష్టమే! ఏకంగా రవి అస్తమించని సామ్రాజ్యంగా వెలిగిన బ్రిటన్‌కు ప్రధానమంత్రిగా ముచ్చటగా మూడేళ్ళయినా పూర్తి చేసుకోని వ్యక్తికి మరీ కష్టం. కానీ విమర్శలు, సొంత పార్టీలో – క్యాబినెట్లోనే విపక్షం, రెండురోజుల్లో 59 మంది మంత్రులు, అధికారుల రాజీనామాలు వరదలా ఉక్కిరిబిక్కిరి చేశాక బోరిస్ జాన్సన్ (బోజో) తలొగ్గక తప్పలేదు. కొద్దిరోజులుగా చూరుపట్టుకు వేలాడిన ఆయన ప్రభుత్వంలో సంక్షోభ తీవ్రతతో గురువారం కన్జర్వేటివ్ పార్టీ సారథ్యానికి రాజీనామా చేశారు. అయితే, వారసుడొచ్చే దాకా తాత్కాలిక ప్రధానిగా పాలిస్తానంటూ ఆఖరిక్షణంలోనూ అధికారంపై మమకారమే చూపారు. ప్రపంచంలోని అత్యుత్తమ హోదాను వదులుకుంటున్నందుకు బాధగా ఉందని జాన్సన్ తన మనసులో మాట చెప్పేశారు. అయితే, ఆ బాధకు కారణం – ఆయన స్వయంకృతాపరాధాలే! 2019 ఎన్నికల్లో కన్జర్వేటివ్ పార్టీ పక్షాన ప్రచారార్భాటానికి జాన్సన్ బాగా పనికొచ్చారు. 1987 తర్వాత ఎన్నడూ లేనంత భారీ విజయాన్నీ, 1979 తర్వాత అత్యధిక వోటు శాతాన్నీ పార్టీ సంపాదించింది. కానీ, అధికారంలోకి వచ్చాక జరిగింది వేరు. మాటల మనిషి జాన్సన్ పాలనలో పదును చూపించ లేకపోయారు. ద్రవ్యోల్బణం 40 ఏళ్ళ గరిష్ఠానికి చేరింది. యూరోపియన్ యూనియన్ (ఈయూ) నుంచి బ్రిటన్ నిష్క్రమణను ఆయన బలంగా సమర్థించడంతో దేశానికి ఆర్థిక కష్టాలు పెరిగాయి. బ్రెగ్జిట్ లాంటి నిర్ణయాలూ ఘోర తప్పిదాలే. ఫలితంగా అతి పెద్ద వాణిజ్య భాగస్వామి అయిన ఈయూతో బ్రిటన్ వర్తకం సంక్లిష్టంగా తయారైంది. ప్రజల దృష్టి మళ్ళించేందుకు ఉక్రెయిన్ యుద్ధంలో రష్యాకు తీవ్ర ప్రతికూల వైఖరి తీసుకున్నారు జాన్సన్. ఆర్థిక ఆంక్షలతో రష్యాను దోవకు తేవాలన్న పాశ్చాత్య ప్రపంచ ప్రయత్నంలో పెత్తనం పైన వేసుకొని, ఉక్రెయిన్ సేనలకు ఆధునిక ఆయుధాలు సరఫరా చేశారు. కానీ, అవేవీ ఉపకరించకపోగా, జీవనవ్యయం పెరిగింది. ఇక, కరోనా కాలంలో ప్రభుత్వ ఆవాసాల్లో 16 సార్లు విచ్చలవిడి విందు వినోదాల (పార్టీ గేట్ వివాదం) నుంచి అనుచిత లైంగిక ప్రవర్తన ఆరోపణలున్న పార్టీ ఎంపీ క్రిస్ పించర్‌ను డిప్యూటీ ఛీఫ్ విప్‌గా నియమిం చడం (పించర్ గేట్ వివాదం) దాకా అనేక బలహీనతలు జాన్సన్ చాటుకున్నారు. వాటిని నిజా యతీగా ఒప్పుకోకపోగా మొదట బొంకడం, ఆనక మాట మార్చడం అలవాటుగా చేసుకున్నారు. కొన్ని నెలలుగా దాదాపు ప్రతి వారం ఏదో ఒక ఆరోపణ, కళంకం బ్రిటన్ ప్రభుత్వంపై బయట కొస్తూనే ఉన్నాయి. కానీ, బోజో ఇచ్చకాలు చెబుతూ వచ్చారు. ఒక్కమాటలో పరిపాలనను ఒక రియాలిటీ షో లాగా మార్చేశారని ఆయనపై ప్రత్యర్థుల విమర్శ. కన్నార్పకుండా ఎదుటివారి కళ్ళలోకి చూస్తూనే అసత్యాలు చెప్పడంలో సిద్ధహస్తుడనే అపఖ్యాతినీ మూటగట్టుకున్నారు. ఇతర దేశాల నేతలు సైతం ఆంతరంగిక సమావేశాల్లో ఆయనను ‘అబద్ధాలకోరు’గా అభివర్ణించేవారంటే అర్థం చేసుకోవచ్చు. దిగజారిన ప్రతిష్ఠతో పార్టీ, ప్రజలు కొత్త నాయకుణ్ణి కోరుకోసాగారు. ఈలోగా పార్టీకి నష్టం జరిగిపోయింది. దశాబ్దాలుగా పార్టీకి పట్టున్న ప్రాంతాల్లోనూ అనేక స్థానిక ఎన్నికల్లో కన్జర్వేటివ్స్ ఓడిపోయారు. జాతీయ సర్వేలలో విపక్ష లేబర్ పార్టీ ముందుకు దూసుకుపోయింది. రెండు రోజుల క్రితమే పదవి చేపట్టిన కీలక మంత్రులిద్దరూ గురువారం రాజీనామాకు సిద్ధమవడం, డిసెంబర్లో పార్టీ అవిశ్వాస పరీక్షలో 59 శాతం ఓట్లతో నెగ్గిన జాన్సన్‌పై మరోసారి అవిశ్వాస తీర్మానం పెడతామంటూ స్వపక్షీయుల హెచ్చరిక– అన్నీ కలసి జాన్సన్‌కు ఆఖరి దెబ్బ కొట్టాయి. ప్రభుత్వం మీద నమ్మకం పోవడం వేరు... పాలకుడి విశ్వసనీయతతో పాటు ఏకంగా గౌరవమే పోవడం వేరు. ఇదీ జాన్సన్ చేతులారా చేసుకున్నదే. ఇంట్లో ఈగల మోత ఇలా ఉన్నా, ఉక్రెయిన్ పర్యటన, అంతర్జాతీయ వేదికలపై ఉపన్యాసాలు, భారత్ సహా అనేక దేశాలకు ఉచిత సలహాల ఊకదంపుడు ఉపన్యాసాలతో బయట పల్లకీల మోత మోగించాలని ఆయన విఫలయత్నం చేశారు. 1987లో మార్గరెట్ థాచర్ భారీ విజయం తర్వాత మళ్ళీ ఆ స్థాయిలో మూడేళ్ళ క్రితం పార్టీని విజయపథంలో నడిపిన జాన్సన్ ఇంత త్వరగా, అదీ ఇలా నిష్క్రమించాల్సి రావడం రాజకీయ వైచిత్రి. 1990లో థాచర్, 2018లో థెరెసా మే అసమ్మతి పెట్టిన అవిశ్వాసంలో నెగ్గినా అచిర కాలంలోనే పదవి నుంచి వైదొలగారు. చరిత్ర పునరావృతమై, జాన్సన్‌కూ అదే జరిగింది. ఇప్పుడిక కన్జర్వేటివ్ పార్టీ కొత్త నేత ఎన్నిక జరగనుంది. అక్టోబర్ ప్రథమార్ధంలో పార్టీ వార్షిక సదస్సులో జాన్సన్ స్థానాన్ని సదరు కొత్త నేత భర్తీ చేస్తారు. రియాల్టీ షోలతో పేరొందిన మహిళ పెన్నీ మోర్డాన్ట్ నుంచి ఈ వారమే మంత్రి పదవికి రాజీనామా చేసిన మన ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి అల్లుడు రుషీ సనక్ దాకా చాలామంది పేర్లే ఆ పదవికి వినిపిస్తున్నాయి. వారసుడెవరైనా సహకరిస్తానంటున్న జాన్సన్, ప్రధానిగా పనిచేయడం ఎన్నో పాఠాలు నేర్పిందని చెప్పుకొచ్చారు. ఆయన హయాంలోని వ్యవహారాలు బ్రిటన్‌కూ, కన్జర్వేటివ్ పార్టీకే కాదు... ప్రపంచానికీ పాఠాలు నేర్పింది. పరిపాలనంటే టీవీల్లో మైకుల ముందు, సభల్లో జనం ముందు హావభావ విన్యాసం, రోజువారీ రియాల్టీ షో కాదు. మాటల గారడీ కన్నా చేతలే మిన్నని మరోసారి నెమరు వేయించింది.ప్రచారదిట్టలు పరిపాలనలో సమర్థులవుతారన్న హామీ లేదనీ, ఇతరేతర కారణాలతో పైకి వెళితే, శిఖరాగ్రాన నిలదొక్కుకోవడం ఎంత కష్టమో చెప్పడానికి జాన్సన్ పయనం మచ్చుతునక. అప్రతిష్ఠ తెచ్చుకొని ఇంటిదారి పట్టడంతో బోజో మార్కు పాపులిస్ట్, నేషనలిస్ట్ బ్రాండ్ శకానికి తెరపడ్డట్టే! -
నా విజయాల పట్ల గర్వపడుతున్నా: బోరిస్ జాన్సన్
లండన్: బ్రిటన్ ప్రధాని పదవికి బోరిస్ జాన్సన్ రాజీనామా ప్రకటించారు. భారత కాలమానం ప్రకారం.. గురువారం సాయంత్రం ఆయన స్వయంగా విషయాన్ని వెల్లడించారు. 2019లో ప్రజలు అందించిన అఖండ విజయం పట్ల బోరిస్ కృతజ్ఞతలు తెలియజేశారు. నా హయాంలో సాధించిన విజయాల పట్ల గర్వపడుతున్నా. బ్రెగ్జిట్‌ను పూర్తి చేయడం గర్వంగా ఉంది. కొత్త నేత వచ్చే దాకా ఆ స్థానంలో నేనే కొనసాగుతా, కన్జర్వేటివ్ పార్టీ త్వరలో కొత్త నేతను ఎన్నుకుంటుంది అని ప్రకటించారాయన. సహచర మంత్రుల ఒత్తిళ్ల మేరకు తలొగ్గి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారాయన. కరోనా టైంలో బ్రిటన్ సంఘటితంగా ఉండి.. మహమ్మారిని ఎదుర్కోవడాన్ని ప్రస్తావించారాయన. రాజకీయాల్లో ఎవరూ అనివార్యం కాదు అంటూ ఆసక్తికర వ్యాఖ్యలే చేశారాయన. ఇక బోరిస్ రాజీనామాపై ప్రతిపక్ష లేబర్ పార్టీ సంతోషం వ్యక్తం చేసింది. గుడ్ న్యూస్ అంటూ సోషల్ మీడియాలో సంబురాలు మొదలుపెట్టింది. -
బ్రిటన్ కొత్త ప్రధాని రేసులో రిషి సునక్..ఆయన గురించి ఐదు కీలక విషయాలు
లండన్: బ్రిటన్ ప్రధానిగా బోరిస్ జాన్సన్ వైదొలగడం ఖాయమని వార్తలు వస్తున్న తరుణంలో కొత్త ప్రధాని ఎవరు? అనే విషయంపై జోరుగా చర్చ మొదలైంది. అయితే పలువురి పేర్లు తెరపైకి వచ్చినప్పటికీ భారత సంతతికి చెందిన రిషి సునక్ ఈ రేసులో ముందు వరుసలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. మొన్నటివరకు ప్రధాని బోరిస్ జాన్సన్ కేబినెట్లో ఆర్థిక శాఖ మంత్రిగా సేవలందించారు రిషి. అయితే బోరిస్‌పై అసంతృప్తితో అందరికంటే ముందుగా మంత్రి పదవికి మంగళవారం రాజీనామా చేశారు. ఆ తర్వాత చాలా మంది ఆయన బాటలోనే నడిచారు. మొత్తం 54 మంది మంత్రులు తమ పదులకు రాజీనామా చేశారు. దీంతో గత్యంతరం లేక ప్రధానిగా తప్పుకునేందుకు బోరిస్ అంగీకరించినట్లు బ్రిటన్ మీడియా తెలిపింది. అయితే భారత మూలాలున్న రిషి గతంలో చాలా సార్లు వార్తల్లో నిలిచారు. ఆయనకు సంబంధించి ఐదు కీలక విషయాలు ఇప్పుడు చూద్దాం. ►రిషి సునక్ వయసు 42 ఏళ్లే. 2020లో బోరిస్ ప్రధాని బాధ్యతలు చేపట్టాక తన తొలి కేబినెట్లో రిషిని ఆర్థిక మంత్రిగా నియమించారు. ►కరోనా సంక్షోభ సమయంలో వ్యాపారులు, కార్మికుల కోసం వందల కోట్ల పౌండ్ల ప్యాకేజీ తీసుకొచ్చి రిషి మంచి గుర్తింపు పొందారు. నూతన ప్రధాని రేసులో రక్షణశాఖ మాజీ మంత్రి పెన్నీ మోర్డాంట్తో పాటు రిషి సునక్ తమ ఫేవరేట్ అని బెట్టింగ్ రాయుళ్లు చెబుతున్నారు. ►అయితే రిషిపై కొన్ని వివాదాలు కూడా ఉండటం ఆయనకు కాస్త మైనస్‌గా మారే అవకాశం ఉంది. తన భార్య ట్యాక్స్ వివాదం, అమెరికా గ్రీన్ కార్డు, బ్రిటన్ జీవన వ్యయం సంక్షోభం సమయంలో ఆయన కాస్త నెమ్మదిగా స్పందించారనే ఆరోపణలు ఉన్నాయి. ►డౌన్స్ట్రీట్లో సమావేశానికి హాజరై కోడివ్ నిబంధనలు ఉల్లంఘించిన కారణంగా రిషికి జరిమానా విధించారు. ►రిషి గ్రాండ్ పేరెంట్స్ పంజాబ్‌కు చెందినారు. ఇన్ఫోసిస్ వ్యవస్థాపకులు నారాయణమూర్తి కూతురు అక్షత మూర్తిని రిషి పెళ్లి చేసుకున్నారు. ఈ దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఒకవేళ రిషి బ్రిటన్ కొత్త ప్రధానిగా ఎంపికైతే చరిత్ర సృష్టిస్తారు. బ్రిటన్ ప్రధాని బాధ్యతలు చేపట్టే తొలి భారత సంతతి వ్యక్తిగా నిలుస్తారు. ప్రస్తుత ప్రధాని బోరిస్ జాన్సన్ కన్జర్వేటిప్ పార్టీ నాయకుడిగా ఈరోజే రాజీనామా చేస్తారని బ్రిటన్ మీడియా తెలిపింది. తదుపరి ప్రధాని ఎంపిక జరిగే వరకు ప్రధాని పదవిలో ఆయనే కొనసాగుతారని తెలిపింది. ఈ ప్రక్రియ అక్టోబర్‌లో పూర్తయ్యే అవకాశముంది. -
జాన్సన్ గుడ్‌బై...
లండన్: అనుకున్నట్టే అయింది. నిండా వివాదాల్లో మునిగి ఇంటా బయటా తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ (58) ఎట్టకేలకు తప్పుకున్నారు. కన్జర్వేటివ్ పార్టీ నేత పదవికి గురువారం రాజీనామా చేశారు. పార్టీ ఎన్నుకునే కొత్త నాయకునికి ప్రధాని పగ్గాలు కూడా అప్పగించి తప్పకుంటానని ప్రకటించారు. అందుకు ఒకట్రెండు నెలలకు పైగా పట్టేలా కన్పిస్తోంది. అప్పటిదాకా ఆపద్ధర్మ ప్రధానిగా కొనసాగుతానని బోరిస్ స్పష్టం చేశారు. అంతేగాక రాజీనామా చేసిన మంత్రుల స్థానంలో కొత్తవారి నియామకాలను కూడా ప్రకటించారు! దీనిపైనా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నైతిక విలువలకు పాతరేసిన బోరిస్ ఆపద్ధర్మంగా కూడా పదవిలో కొనసాగేందుకు అనర్హుడని విపక్షాలతో పాటు పలువురు సొంత పార్టీ నేతలు కూడా ఆక్షేపిస్తున్నారు. సొంతవాళ్లే వెంటపడ్డారు ప్రధాని అధికార నివాసం 10, డౌనింగ్ స్ట్రీట్ బయటి నుంచి బోరిస్ వీడ్కోలు ప్రసంగం చేశారు. సొంత పార్టీ నేతలే మూక మనస్తత్వంతో దిగిపోవాలంటూ మూకుమ్మడిగా తన వెంటపడ్డారంటూ వాపోయారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వాన్ని, నాయకత్వాన్ని మార్చడం సరికాదని వారికి సర్దిచెప్పేందుకు ఎంత ప్రయత్నించినా లాభం లేకపోయిందని చెప్పుకొచ్చారు. దాంతో ప్రపంచంలోనే అత్యుత్తమ పదవీ బాధ్యతలకు గుడ్‌బై చెప్పాల్సి రావడం ఎంతగానో బాధిస్తోందన్నారు. 2019లో ప్రజలు తనకు భారీ మెజారిటీ కట్టబెట్టారని గుర్తు చేసుకున్నారు. సాధించిన విజయాలను నెమరేసుకున్నారు. కానీ తన రాజీనామాకు దారి తీసిన పార్టీ గేట్, పించర్‌గేట్ తదితర వివాదాలను మాత్రం ప్రస్తావించలేదు. తన వారసునిగా దేశాన్ని కష్టకాలంలో సరైన దారిలో ముందుకు తీసుకెళ్లే సమర్థుడైన నాయకుడు తెరపైకి వస్తారని ఆశాభావం వెలిబుచ్చారు. అంతకుముందు బోరిస్ రాజీనామా చేయాలంటూ సొంత పార్టీ నుంచి వెల్లువెత్తిన డిమాండ్లు తారస్థాయికి చేరాయి. ఇన్ఫోసిస్ నారాయణమూర్తి అల్లుడు రిషి సునక్, పాక్ మూలాలున్న సాజిద్ జావిద్ రెండు రోజుల క్రితం మంత్రి పదవులకు రాజీనామా చేయడంతో ‘గో బోరిస్’ డిమాండ్ ఒక్కసారిగా ఊపందుకోవడం తెలిసిందే. రాజీనామా చేసిన మంత్రులు తదితరుల సంఖ్య గురువారానికి 50 దాటింది. రిషి స్థానంలో ఆర్థిక మంత్రిగా బోరిస్ ఏరికోరి నియమించిన నదీమ్ జవాహీ కూడా ఆయన తప్పుకోవాల్సిందేనంటూ కుండబద్దలు కొట్టి షాకిచ్చారు. నాయకుని ఎంపిక.. పెద్ద ప్రక్రియే కన్జర్వేటివ్ పార్టీ కొత్త నాయకుని ఎన్నికకు కొద్ది వారాలు మొదలుకుని ఒకట్రెండు నెలల దాకా పట్టవచ్చు. ఎందుకంటే ఒకరి కంటే ఎక్కువ మంది పోటీ పడితే పలు అంచెల్లో జరిగే సీక్రెట్ ఓటింగ్ ద్వారా విజేతను నిర్ణయిస్తారు. ఎన్నిక ప్రక్రియకు పార్టీలోని 1922 కమిటీ త్వరలో శ్రీకారం చుట్టనుంది. పార్టీ నేత పదవికి పోటీ పడుతున్నట్టు భారత మూలాలున్న యూకే అటార్నీ జనరల్ సుయెలా బ్రావర్మన్ (42) ఇప్పటికే ప్రకటించారు. ఆమె తండ్రి పూర్వీకులు గోవాకు చెందినవారు. జవాహీ, రిషి, జావిద్, భారత మూలాలున్న హోం మంత్రి ప్రీతీ పటేల్, పలువురి పేర్లు కూడా గట్టిగా విన్పిస్తున్నాయి. జవాహీ, రిషి త్వరలో రేసులోకి వస్తారని భావిస్తున్నారు. వివాదాలమయం బ్రిటన్ ప్రధానిగా బోరిస్ మూడేళ్ల పదవీకాలం వివాదాలతో పెనవేసుకుని సాగింది. కరోనా కల్లోలాన్ని సరిగా నియంత్రించలేదన్న చెడ్డ పేరు తెచ్చుకున్నారు. పార్టీగేట్ మొదలుకుని పించర్‌గేట్ దాకా నైతికతకు సంబంధించిన ఆరోపణలు ఎదుర్కోవడం పరిపాటిగా మార్చుకున్నారు. లండన్ మేయర్‌గా 2012 ఒలింపిక్స్‌ను విజయవంతంగా నిర్వహించడంతో బోరిస్ పేరు మార్మోగిపోయింది. 2018 దాకా రెండేళ్లు థెరెసా మే ప్రభుత్వంలో విదేశాంగ మంత్రిగా పని చేశారు. తర్వాత మే రాజీనామాతో ప్రధాని పదవి చేపట్టారు. బ్రెగ్జిట్ నిర్ణయాన్ని ముందుకు తీసుకెళ్లడంతో అడ్డుపడుతోందంటూ పార్లమెంటును సస్పెండ్ చేసి సుప్రీంకోర్టుతో తలంటించుకున్నారు. యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ను తప్పిస్తానన్న బోరిస్ హామీకి 2019 డిసెంబర్లో జరిగిన సాధారణ ఎన్నికల్లో జనం బ్రహ్మరథం పట్టారు. కన్జర్వేటివ్ పార్టీకి ఏకంగా 80 సీట్ల మెజారిటీ దక్కింది. థాచర్ తర్వాత అత్యంత విజయవంతమైన పార్టీ నేతగా పేరొందారు. కరోనా నిబంధనలను ఉల్లంఘించి ప్రభుత్వ కార్యాలయాల్లో, ప్రధాని అధికార నివాసంలో మందు పార్టీలు జరిగిన వైనం 2021 నవంబర్‌లో బయటపడటంతో బోరిస్ అప్రతిష్టపాలయ్యారు. వాటిని తొలుత ఖండించినా పార్టీలు చేసుకున్నది నిజమేనని అంగీకరించి క్షమాపణలు చెప్పారు. కానీ నిజాయతీ లేని వ్యక్తి ప్రధానిగా తగడంటూ అప్పటి నుంచే ఆయనపై ఇంటా బయటా వ్యతిరేకత పెరుగుతూ వచ్చింది. జూన్‌లో పార్టీపరమైన విశ్వాసపరీక్షలో గట్టెక్కినా 41 శాతం మంది ఆయన్ను వ్యతిరేకించారు. లైంగిక ఆరోపణలున్న క్రిస్ పించర్‌కు డిప్యూటీ చీఫ్ విప్ పదవి ఇచ్చి బోరిస్ వివాదాన్ని కొనితెచ్చుకున్నారు. ఆరోపణల విషయం తనకు తెలియదంటూ బుకాయించి, తర్వాత తెలుసని ఒప్పుకుని మరోసారి నవ్వులపాలయ్యారు. British media say UK Prime Minister Boris Johnson has agreed to resign: The Associated Press pic.twitter.com/tzISv6CSso — ANI (@ANI) July 7, 2022 -
UK political crisis: మెడపై కత్తి
సోమిరెడ్డి రాజమహేంద్రారెడ్డి బ్రిటన్‌లో రాజకీయ సంక్షోభం ముదురుపాకాన పడుతోంది. ప్రధాని బోరిస్ జాన్సన్ ప్రతిష్ఠ రోజురోజుకూ మసకబారుతోంది. అనేక ఆరోపణలతో పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయిన ఆయన తక్షణం రాజీనామా చేయాలంటూ స్వపక్షం నుంచే తీవ్ర ఒత్తిడి ఎదురవుతోంది. మంగళవారం ఇద్దరు సీనియర్ మంత్రుల రాజీనామాతో రాజకీయంగా కలకలం రేగింది. వారి స్థానంలో వెంటనే కొత్తవారిని నియమించి ఎంపీలంతా తన వెంటే ఉన్నారని చెప్పుకునేందుకు జాన్సన్ ప్రయత్నించినా పోతూ పోతూ బోరిస్‌పై మంత్రులు చేసిన విమర్శలు అంతటా చర్చనీయంగా మారాయి. పైగా ఆ కలకలం సద్దుమణగకముందే బుధవారం ఏకంగా మరో డజను మంది మంత్రులు ప్రధానిపై నమ్మకం పోయిందంటూ గుడ్‌బై చెప్పారు! దీంతో బోరిస్ ఎలా నిలదొక్కుకోవాలో తెలియని అయోమయంలో పడ్డారు. కేబినెట్లోని ఇతర మంత్రులు ఇంకా తనతోనే ఉన్నదీ లేనిదీ ఆరా తీయాల్సిన పరిస్థితి దాపురించింది. జాతి శ్రేయస్సును దృష్టిలో పెట్టుకోకుండా జాన్సన్ ఇష్టమొచ్చినట్టుగా పరిపాలిస్తుండటమే గాక పలు అంశాలపై నోటికొచ్చినట్టు అబద్ధాలాడి విశ్వసనీయత కోల్పోయారన్నవి ఆయనపై ప్రధాన విమర్శలు. గత నెల జరిగిన ఉప ఎన్నికల్లో టివర్టన్, హోనిటన్, వేక్ఫీల్డ్ స్థానాలను కన్జర్వేటివ్ పార్టీ కోల్పోవడం, పార్టీ చైర్మన్ ఒలివర్ డోడెన్ రాజీనామా వంటివి జాన్సన్ పనితీరుపై తాజాగా ప్రశ్నలు రేకెత్తించిన పరిణామాలు. అప్పటికే పార్టీ గేట్ వివాదం ఆయన్ను వెంటాడుతుండగా, తాజాగా మొదలైన రాజీనామాల పర్వంతో ప్రధానిగా ఆయన పరిస్థితి మరింత దిగజారింది. అసమర్థతను అంగీకరించి తక్షణం రాజీనామా చేయాల్సిందేనని, లేదంటే పార్టీయే ఉద్వాసన పలకాల్సి వస్తుందని కన్జర్వేటివ్ ఎంపీ ఆండ్రూ బ్రిడ్జెన్ బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు. సరైన నిర్ణయాలు తీసుకోలేక ఊగిసలాట ధోరణితో దేశాన్ని బోరిస్ఇబ్బందుల్లోకి నెడుతున్న తీరును పార్టీ ఎగ్జిక్యూటివ్ కమిటీ (1922) క్షుణ్నంగా పరిశీలించి నిర్ణయం తీసుకుంటుందని ఆయన వివరించారు. ఇదే అదనుగా ప్రతిపక్ష లేబర్ పార్టీ నేత సర్ కెయిర్ కూడా గొంతు సవరించుకున్నారు. ఉన్నపళంగా ఎన్నికలకు వెల్లడమే శ్రేయస్కరమని, దేశం సరికొత్త నాయకత్వాన్ని కోరుకుంటోందని చెప్పుకొచ్చారు. ఆరోపణలు, వివాదాలు, అసమర్థత కలగలిసి బోరిస్‌ను అశక్తున్ని చేశాయన్నారు. ప్రభుత్వం ఏ క్షణంలోనైనా కుప్పకూలడం ఖాయమని వ్యాఖ్యానించారు. కన్జర్వేటివ్ ఎంపీలు వెంటనే బోరిస్‌కు ఉద్వాసన పలికి దేశభక్తి చాటుకోవాలంటూ విపక్ష ఎంపీలు పిలునివ్వడం విశేషం! బ్రిటన్‌లో వచ్చే ఏడాది ఎన్నికలు జరగాల్సి ఉంది. ప్రధాని తన అధికారాన్ని ఉపయోగించి ముందస్తు ఎన్నికలకు ఆదేశించవచ్చు. మద్దతుకూ కొదవ లేదు స్వపక్షం నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న బోరిస్‌కు మద్దతు కూడా అదే స్థాయిలో ఉంది. పార్టీ నాయకునిగా, ప్రధానిగా ఆయన కొనసాగాలనే అధిక సంఖ్యాకులు కోరుకుంటున్నారు. కానీ పాలనా దక్షతపై సందేహాల నేపథ్యంలో పదవి నిలబెట్టుకోవాలంటే బోరిస్గట్టి సవాళ్లను అధిగమించాల్సి ఉంటుందని పరిశీలకుల అభిప్రాయం. ఇటీవల జరిగిన పార్టీపరమైన విశ్వాస పరీక్షలో 359 మంది కన్జర్వేటివ్ ఎంపీల్లో 211 మంది బోరిస్‌కు మద్దతుగా ఓటేశారు. అంటే 148 మంది ఆయనపై అవిశ్వాసం వెలిబుచ్చినట్టు. గత ప్రధాని థెరెసా మే కూడా 2018లో బ్రిగ్జిట్ పాలసీపై ఇలాగే పార్టీపరమైన విశ్వాస పరీక్షలో 83 ఓట్లతో గట్టెక్కారు. అయినా ఆర్నెల్లకే రాజీనామా చేశారు. 2003లో డంకన్ స్మిత్ విశ్వాస పరీక్షలో కొద్ది తేడాతో ఓడి తప్పుకున్నారు. 1990లో మార్గరెట్ థాచర్ విశ్వాస పరీక్షలో 204–152 ఓట్లతో నెగ్గినా కేబినెట్ నిర్ణయానికి తలొగ్గి ప్రధాని పదవికి రాజీనామా చేశారు. తప్పుకోక తప్పదా! జాన్సన్ పార్టీ విశ్వాస పరీక్షలో నెగ్గినా ప్రధాని పదవిని ఎంతోకాలం నిలబెట్టుకోవడం అనుమానమే. ఉప ఎన్నికల ఓటమి, పార్టీ గేట్, మంత్రుల రాజీనామాల వంటివి ఆయన పదవికి ఎసరు తెచ్చే అవకాశాలే ఎక్కువ. ఏడాది దాకా మళ్లీ విశ్వాస పరీక్షకు అనుమతించని కన్జర్వేటివ్ పార్టీ నిబంధనలను మారిస్తే అది అంతిమంగా బోరిస్ ఉద్వాసనకు దారి తీయొచ్చన్నది పరిశీలకుల అభిప్రాయం. ఇవీ వివాదాలు పార్టీ గేట్ కరోనా విజృంభణ తీవ్రంగా ఉన్న సమయంలో దాని కట్టడికి అమల్లో ఉన్న నిషేధాలు, నియమాలను ఉల్లంఘిస్తూ ప్రధాని జాన్సన్ అధికార నివాసం 10 డౌనింగ్ స్ట్రీట్‌లో, పలు ఇతర ప్రభుత్వ ఆవాసాల్లో విచ్చలవిడిగా పార్టీలు జరిగాయి. 16కు పైగా పార్టీలు జరిగినట్టు ఇప్పటిదాకా తేలింది. వీటిలో పలు పార్టీల్లో జాన్సన్ స్వయంగా పాల్గొన్నారు. మొదట్లో బుకాయించినా ఆ తర్వాత ఈ విషయాన్ని ఆయన అంగీకరించారు. అందుకు క్షమాపణలు కూడా చెప్పారు. ప్రధానే అడ్డంగా నిబంధనల్ని ఉల్లంఘిస్తారా అంటూ ఇంటా బయటా ఆయనపై దుమ్మెత్తిపోశారు. రాజీనామా డిమాండ్లు కూడా అప్పటినుంచీ ఊపందుకున్నాయి. పించర్ గేట్ కన్జర్వేటివ్ పార్టీకి చెందిన వివాదాస్పద ఎంపీ క్రిస్ పించర్‌పై వచ్చిన లైంగిక ఆరోపణల పరంపరను పించర్ గేట్గా పిలుస్తున్నారు. ఆయనపై ఈ ఆరోపణలు కొత్తవేమీ కాదు. కొన్నేళ్లుగా ఉన్నవే. తాజాగా గత జూన్ 29న ఓ ప్రైవేట్ పార్టీలో ఇద్దరు పురుషులను పించర్ అభ్యంతరకరంగా తాకారన్న ఆరోపణలపై వారం క్రితం పార్టీ ఆయనను సస్పెండ్ చేసింది. గతంలోనూ సొంత పార్టీకి చెందిన ఇద్దరు ఎంపీలతోనూ పించర్ ఇలాగే వ్యవహరించారని ఆరోపణలున్నాయి. పించర్‌ను డిప్యూటీ చీఫ్ విప్‌గా నియమిస్తూ 2019లో జాన్సన్ తీసుకున్న నిర్ణయం ఇప్పుడాయన మెడకు చుట్టుకుంది. ఆయనపై లైంగిక ఆరోపణల విషయం తనకు తెలియదని జాన్సన్ చెబుతూ వచ్చారు. కానీ అదాయనకు ముందునుంచీ తెలుసని బయట పెడటంతో తీవ్ర దుమారం రేగింది. లైంగిక ఆరోపణలున్న ఎంపీకి కీలక పదవి కట్టబెట్టడమే గాక అడ్డంగా అబద్ధాలాడిన వ్యక్తి నాయకత్వంలో పని చేయలేమంటూ కీలక మంత్రులు రిషి సునక్, జావిద్ రాజీనామా చేయడం రాజకీయ సంక్షోభానికి దారి తీసింది. ఏం జరగవచ్చు? 1. విశ్వాస పరీక్షను ఏడాదికి ఒక్కసారికి మించి జరపరాదన్న కన్జర్వేటివ్ పార్టీ నిబంధనను ఎత్తేస్తే బోరిస్‌ను దించేందుకు మరోసారి ప్రయత్నం జరుగుతుంది. ఆయనకు ఉద్వాసన పలకాలంటే 54 మంది కంటే ఎక్కువ ఎంపీలు ఆ మేరకు ‘1922 కమిటీ’ చైర్మన్‌కు లిఖితపూర్వకంగా నివేదించాల్సి ఉంటుంది. అప్పుడు రహస్య ఓటింగ్ ద్వారా విశ్వాస పరీక్ష జరుగుతుంది. గెలిస్తే బోరిస్ కొనసాగుతారు. లేదంటే పార్టీకి కొత్త నాయకున్ని ఎన్నుకుంటారు. ఆయనే ప్రధాని కూడా అవుతారు. 2. పార్లమెంటులో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టి, అందులో బోరిస్ ఓడితే రాజీనామా చేయాల్సి వస్తుంది. ముందస్తు ఎన్నికలు జరుగుతాయి. 3. ఇంటాబయటా వస్తున్న తీవ్ర ఒత్తిళ్లకు తలొగ్గి మార్గరెట్ థాచర్ మాదిరిగానే బోరిస్ తనంత తానే తప్పుకోవచ్చు. -
మరో డజను మంత్రులు...
లండన్: బ్రిటన్‌లో రాజకీయ అనిశ్చితి తీవ్రతరమైంది. మంగళవారం భారత సంతతికి చెందిన ఆర్థిక మంత్రి రిషి సునక్, ఆరోగ్య మంత్రి సాజిద్ జావిద్‌లతో మొదలైన రాజీనామాల పర్వం బుధవారం మరింత ఊపందుకుంది. సునక్, జావిద్ మాదిరిగానే తమకూ ప్రధాని బోరిస్ జాన్సన్ (58) నాయకత్వంపై నమ్మకం పోయిందంటూ బుధవారం ఏకంగా 12 మంది మంత్రులు తప్పుకున్నారు! ముందుగా జాన్ గ్లెన్, విక్టోరియా అట్కిన్స్, జో చర్చిల్, స్టూవర్ట్ ఆండ్రూ, విల్ క్విన్స్ (విద్యా శాఖ), రాబిన్ వాకర్ (స్కూళ్లు) రాజీనామా చేశారు. ఆ తర్వాత మరో ఐదుగురు మంత్రులు కేమీ బదెనోచ్ జూలియా లొపెజ్, లీ రౌలీ, నీల్ ఓబ్రియాన్, అలెక్స్ బర్హార్ట్ సంయుక్తంగా రాజీనామా లేఖ సంధించారు. వెనువెంటనే ఉపాధి కల్పన మంత్రి మిమ్స్ డేవిస్ కూడా తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. వీరితో పాటు పలువురు మంత్రుల సహాయకులు, రాయబారులు కూడా భారీగా రాజీనామా బాట పడుతున్నారు. అధికార కన్జర్వేటివ్ పార్టీ ఎంపీ లారా ట్రాట్ తదితరులు ప్రభుత్వపరమైన పదవుల నుంచి తప్పుకున్నారు. మొత్తమ్మీద ఒక్క బుధవారమే 34 రాజీనామాలు చోటుచేసుకున్నాయి! ఈ పరిణామాలు జాన్సన్‌కు ఊపిరాడనివ్వడం లేదు. ఆయన రాజీనామాకు కూడా సొంత పార్టీ ఎంపీల నుంచే ఒత్తిడి పెరుగుతోంది. జాన్సన్ తక్షణం తప్పుకోవాల్సిందేనని ఆయనకు గట్టి సమర్థకులుగా పేరున్న మంత్రులు ప్రీతీ పటేల్, మైఖేల్ గోవ్ కూడా డిమాండ్ చేశారు. సునక్, జావిద్ కూడా జాన్సన్ నాయకత్వంపైనే పదునైన విమర్శలు చేయడం తెలిసిందే. ప్రధానిని తప్పించేందుకు వీలుగా 1922 కమిటీ నిబంధనలను మార్చాలని డిమాండ్ చేస్తున్న కన్జర్వేటివ్ పార్టీ ఎంపీల సంఖ్య చూస్తుండగానే పెరిగిపోతోంది. 1922 కమిటీ ఎగ్జిక్యూటివ్ సెక్రెటరీ తదితరులు కూడా తప్పుకోవాలని జాన్సన్‌కు నేరుగానే సూచిస్తున్నారు. తన తప్పిదాలకు ఇతరులను నిందించడం ప్రధానికి అలవాటుగా మారిందంటూ దుయ్యబడుతున్నారు. జాన్సన్‌ను తక్షణం పదవి నుంచి తొలగించండంటూ మంత్రులకు జావిద్ బుధవారం పిలుపునిచ్చారు. కానీ జాన్సన్ మాత్రం ఎవరేం చెప్పినా తనంత తానుగా తప్పుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ‘‘2019 ఎన్నికల్లో ప్రజలు నాకు భారీ మెజారిటీ కట్టబెట్టింది ఇలా అర్ధాంతరంగా తప్పుకునేందుకు కాదు. సమస్యలను అధిగమించి పరిస్థితిని చక్కదిద్దుతా. అందుకోసం ఎంతటి పోరాటానికైనా సిద్ధమే’’ అని ప్రకటించారు. సునక్ స్థానంలో ఇరాక్ మూలాలున్న నదీమ్ జవాహీ, సాజిద్ స్థానంలో స్టీవ్ బార్‌క్లేలను నియమిస్తూ ఆయన నిర్ణయం తీసుకున్నారు. జాన్సన్‌కు అండగా నిలబడాలని కేబినెట్ సహచరులకు జవాహీ పిలుపునిచ్చారు. కానీ జాన్సన్‌కు పదవీగండం తప్పకపోవచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. త్వరలో జరగబోయే హౌస్ ఆఫ్ కామర్స్ సమావేశాల్లో విపక్షాలతో పాటు సొంత పార్టీలోని వ్యతిరేకుల నుంచి జాన్సన్‌కు ఇబ్బందికరమైన ప్రశ్నలు తప్పవని చెబుతున్నారు. FIVE ministers resign in one fell swoop: Kemi Badenoch, Neil O'Brien, Alex Burghart, Lee Rowley and Julia Lopez pic.twitter.com/WAYannhrvR — Dominic Penna (@DominicPenna) July 6, 2022 ఇది కూడా చదవండి: క్వీన్ ఎలిజబెత్ రాయల్ డ్యూటీస్ కుదింపు.. కారణం అదేనా? -
Johnson Government: సంక్షోభంలో జాన్సన్ సర్కారు
లండన్: బ్రిటన్‌లో రాజకీయ సంక్షోభం తలెత్తింది. ఇప్పటికే పలు సమస్యలతో సతమతమవుతున్న బోరిస్ జాన్సన్ సర్కారుకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆయన ప్రభుత్వంలోని ఇద్దరు సీనియర్ మంత్రులు మంగళవారం రాజీనామా చేశారు. భారత మూలాలున్న ఆర్థిక మంత్రి రిషి సునక్ (42)తో పాటు పాక్ మూలాలున్న ఆరోగ్య శాఖ మంత్రి సాజిద్ జావిద్ తీసుకున్న ఈ ఆకస్మిక నిర్ణయం కలకలం రేపుతోంది. పార్టీ గేట్ మొదలుకుని పలు ఆరోపణలు, సమస్యలతో అల్లాడుతున్న జాన్సన్ ప్రభుత్వం తాజా పరిణామాలతో కుప్పకూలే ప్రమాదాన్ని ఎదుర్కొంటోంది. ప్రధాని నాయకత్వంపై నమ్మకం కోల్పోయామంటూ ఆయనకు రాసిన రాజీనామా లేఖల్లో మంత్రులిద్దరూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వాటిని ట్విట్టర్లో పెట్టారు. కొంతకాలంగా జాన్సన్ పనితీరు దారుణమంటూ లేఖలో సునక్ దుయ్యబట్టారు. ‘‘ప్రభుత్వం సజావుగా, సమర్థంగా, సీరియస్‌గా పని చేయాలని ప్రజలు ఆశిస్తారు. ఆ ప్రమాణాలు లోపించాయి గనుకనే తప్పుకుంటున్నా’’ అంటూ కుండబద్దలు కొట్టారు. ‘‘చాలా సందర్భాల్లో మీ వైఖరిని వ్యక్తిగతంగా ప్రశ్నించినా ప్రజాప్రయోజనాల దృష్ట్యా అందరి ముందూ మాత్రం సమర్థించాను. కానీ మౌలికంగా మనిద్దరివీ వేర్వేరు దారులు. ఇలా కలిసి కొనసాగలేమన్న నిర్ధారణకు వచ్చా’’ అని చెప్పుకొచ్చారు. ఇలాంటి ప్రధాని నాయకత్వంలో పని చేసేందుకు తన అంతరాత్మ అంగీకరించడం లేదని సాజిద్ కూడా లేఖలో పేర్కొన్నారు. తానిక మళ్లీ మంత్రి చేపట్టకపోవచ్చని సునక్ చెప్పగా, జాతీయ ప్రయోజనాలను కన్జర్వేటివ్ పార్టీ సమర్థంగా కాపాడుతుందన్న ప్రజల విశ్వాసాన్ని పూర్తిగా కోల్పోయామంటూ సాజిద్ తన లేఖలో పదునైన విమర్శలు చేశారు. జాన్సన్ నేతృత్వంలో పరిస్థితులు మెరుగు పడే అవకాశాలు ఏ మాత్రమూ లేవని తేల్చేశారు. వారి రాజీనామాకు ముందు మంగళవారం రోజంతా భారీ పొలిటికల్ డ్రామా నడిచింది. లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న సొంత పార్టీ ఎంపీ క్రిస్ పించర్‌ను డిప్యూటీ చీఫ్ విప్‌గా కీలక పదవిలో నియమించడం పొరపాటేనంటూ జాన్సన్ ప్రకటన చేశారు. అందుకు తీవ్రంగా చింతిస్తున్నట్టు చెప్పారు. ఆ వెంటనే జాన్సన్ తీరుపై తీవ్ర వ్యాఖ్యలతో మంత్రుల రాజీనామా ప్రకటనలు వెలువడ్డాయి. కరోనా ఉధృతంగా ఉన్న రోజుల్లో అధికార నివాసంలో మందు పార్టీ చేసుకున్నారన్న ఆరోపణలపై జాన్సన్ ఇప్పటికే పలుమార్లు ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కోవాల్సి రావడం, క్షమాపణలు చెప్పడం తెలిసిందే. ఈ నేపథ్యంలో పార్టీలో కూడా ఆయనకు మద్దతు నానాటికీ తగ్గిపోతూ వస్తోంది. ఇటీవలి బలపరీక్షలో జాన్సన్ బొటాబొటిగా బయటపడ్డారు. -
పుతిన్ ఆ పుట్టుక పుట్టి ఉంటేనా..!
ఉక్రెయిన్ యుద్ధంతో వేలమంది అమాయకుల ప్రాణాలు బలిగొంటున్నాడు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్. పాశ్చాత్య దేశాల ఆంక్షలను లెక్కచేయకుండా రష్యన్ బలగాలతో నరమేధం కొనసాగిస్తున్నాడు. ఈ నేపథ్యంలో.. బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్, పుతిన్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పుతిన్ ఒక వేళ అమ్మాయిగా పుట్టి ఉంటే.. యుద్ధం ఊసు ఉండేదే కాదని బోరిస్ పేర్కొన్నారు. ‘‘పుతిన్ ఒకవేళ అమ్మాయిగా పుట్టి ఉంటే.. యుద్దం ఉండేది కాదు. ఇంత మారణహోమం జరిగేది కాదు. కేవలం అభివృద్ధి..శాంతి గురించి ఆలోచన ఉండేది. విష పురుషత్వం అనేది ఆయనలో పూర్తిగా నిండిపోయిందనడానికి ఉక్రెయిన్ యుద్ధమే ఓ నిదర్శనం. కేవలం మగవాడనే అహంకారం.. తన మాచోయిజం చూపించుకోవడానికే ఆయన యుద్ధానికి దిగినట్లు కనిపిస్తోంది. కానీ, ఏం చేస్తాం ఆయనకు అమ్మాయిగా పుట్టే అవకాశమే లేకుండా పోయింద’’ని బోరిస్ వ్యాఖ్యలు చేశాడు. అమ్మాయిలకు విద్య ఎంత అవసరమో చెబుతూ.. ప్రపంచ దేశాల్లో అధికారంలో మరింత మంది మహిళలు ఉండాలని తాను కోరుకుంటున్నట్లు, అప్పుడే శాంతి విరజిల్లుతుందని, అభివృద్ధి పథంలో దేశాలు నడుచుకుంటాయని ప్రకటించాడాయన. ఇక ఉక్రెయిన్ యుద్ధానికి ఎప్పుడు ముగింపు పడుతుందో తెలియదని, పుతిన్ ఎలాంటి శాంతి ఒప్పందాలకు ఆసక్తి చూపించడం లేదంటూ బోరిస్ కీలక వ్యాఖ్యలే చేశారు. -
‘యూకే ప్రధాని’ని ఛేజ్ చేస్తున్నపోలీసులు!: వీడియో వైరల్
UK PM Boris Johnson Gets Chased By Police: యూకే ప్రధాని బోరిస్ జాన్సన్ వలే దుస్తులు ధరించిన వ్యక్తి క్రికెట్ స్టేడియంలోకి పరుగులు పెడుతూ.. వచ్చాడు. దీంతో స్టేడియంలోని ప్రేక్షకులంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఆ తర్వాత కొద్దిసేపటికే పోలీసులు వచ్చి అతన్ని పట్టుకునేందుకు వెంబండించారు. అతను తెల్లటి విగ్, నీలిరంగు టై, తెల్లచి చోక్కా ధరించి అచ్చం బోరిస్ జాన్సన్ వలే ఉన్నాడు. పైగా అతని చొక్కా వెనకాల 'బోరిస్ 4 నంబర్ 10' అని రాసి ఉంది. ఈ ఘటన ఇటీవలే యూకే ప్రధాని తన సొంత పార్టీ సభ్యుల నుంచే అవిశ్వాస తీర్మానం ఎదుర్కొవాల్సి వచ్చిన సంగతిని గుర్తు చేస్తోంది. అంతేగాక ఆయన పై పార్టీ గేట్ వ్యవహారం నుంచి కోవిడ్ నిబంధనలు ఉల్లంఘన వంటి రకరకాల ఆరోపణలు వచ్చిన నేపథ్యంలోనే ఆయన అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కొన్నారు. ఏది ఏమైనప్పటికీ ఆయన ఈ అవిశ్వాస తీర్మానం గెలిచి హమ్మయ్యా అని రిలాక్స్ అయ్యారు. ఐతే ఇప్పుడూ ఈ అపరిచిత వ్యక్తి జాన్సన్‌లా దుస్తులు ధరించి సోషల్ మీడియా దృష్టిని ఆకర్షించాడు. ఈ మేరకు ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఆన్లైన్లో వైరల్ అవుతోంది. Boris Johnson being chased by a group of policemen 😂😂😂 📹 @turpinmodernist #ENGvNZ pic.twitter.com/9R7lW2TUu9 — England’s Barmy Army (@TheBarmyArmy) June 25, 2022 (చదవండి: ఘనంగా పెంపుడు కుక్క బర్త్ డే వేడుక...ఏకంగా 4 వేలమందికి...) -
ఈయూలోకి ఉక్రెయిన్!
కీవ్: యూరోపియన్ యూనియన్‌లో ఉక్రెయిన్‌కు సభ్యత్వం కల్పించాలని ఈయూ కమిషన్ శుక్రవారం సిఫార్సు చేసింది. జర్మనీ, ఇటలీ, రొమేనియా, ఫ్రాన్స్ అధినేతలు గురువారం ఉక్రెయిన్‌లో పర్యటించి, ఈయూలో సభ్యత్వం విషయంలో పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇదే అంశంపై ఈయూ కమిషన్ సానుకూలంగా స్పందించి, సిఫార్సు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఉక్రెయిన్ తన సుదీర్ఘ ఆకాంక్షను నెరవేర్చుకొనే క్రమంలో ఇది మొదటి అడుగు అని చెప్పొచ్చు. ఈయూ కమిషన్ సిఫార్సుపై వచ్చే వారం బ్రస్సెల్స్‌లో 27 సభ్యదేశాల నాయకులు సమావేశమై, చర్చించనున్నారు. అన్ని దేశాల నుంచి అంగీకరించే ఉక్రెయిన్‌కు ఈయూ సభ్యత్వం ఖరారైనట్లే. అయితే ఇది వెంటనే సాధ్యం కాదని, కార్యరూపం దాల్చడానికి మరికొన్ని సంవత్సరాల సమయం పడుతుందని నిపుణులు చెబుతున్నారు. యూరప్ దేశాలకు గ్యాస్ సరఫరాలో కోత రష్యా మరోసారి యూరప్ దేశాలకు సహజ వాయువు సరఫరాలో కోత విధించింది. ఇటలీ, స్లొవేకియాకు సగం, ఫ్రాన్స్‌కు పూర్తిగా కోత విధించింది. దాంతో జర్మనీ, ఆస్ట్రియా ఇప్పటికే ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. యూరప్‌లో ఇంధనం ధరలు, తద్వారా ద్రవ్యోల్బణం పెరిగిపోతోంది. యూరప్ దేశాల్లో విద్యుత్ ఉత్పత్తికి రష్యా నుంచి సరఫరా అయ్యే గ్యాస్ చాలా కీలకం. ఉక్రెయిన్‌లో బ్రిటిష్ ప్రధాని బ్రిటిష్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ శుక్రవారం ఉక్రెయిన్ పర్యటన ప్రారంభించారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో కలిసి ఉన్న ఫొటోను ట్విట్టర్లో షేర్ చేశారు. కీవ్‌కు మరోసారి రావడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఉక్రెయిన్‌పై రష్యా దాడులు మొదలైన తర్వాత బోరిస్ జాన్సన్ ఇక్కడికి రావడం ఇది రెండోసారి. ఉక్రెయిన్‌పై రష్యా దాడులను జాన్సన్ మొదటినుంచీ గట్టిగా వ్యతిరేకిస్తున్నారు. ఉక్రెయిన్‌కు అండగా ఉంటామని చెబుతున్నారు. బ్రిటిన్ ఇప్పటికే కోట్లాది పౌండ్ల సాయాన్ని ఉక్రెయిన్‌కు అందజేసింది. -
Sakshi Cartoon: ...అవిశ్వాసం నెగ్గిన శుభ సందర్భంలో పార్టీ అంటే..
...అవిశ్వాసం నెగ్గిన శుభ సందర్భంలో పార్టీ అంటే బావుండదేమో సార్! -
హమ్మయ్య.. ఊపిరి పీల్చుకున్న బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్
బ్రిటన్ ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్ ఊపిరి పీల్చుకున్నారు. అనూహ్యంగా సొంత పార్టీ సభ్యుల నుంచే విశ్వాస తీర్మానం ఎదుర్కొన్న బోరిస్ జాన్సన్.. మంగళవారం జరిగిన ఓటింగ్‌లో విజయం సాధించారు. వివరాల ప్రకారం... కొద్ది నెలల క్రితం బ్రిటన్‌లో కోవిడ్ లాక్డౌన్ సమయంలో డౌనింగ్ స్ట్రీట్‌లో జోరుగా పార్టీలు జరిగాయి. కాగా, బ్రిటన్‌లో కోవిడ్ నిబంధనలను ఉల్లంఘించి ఆ పార్టీలకు ప్రధాని బోరిస్ హాజరైనట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో విపక్ష ఎంపీలు బోరిస్‌పై అవిశ్వాస తీర్మానాన్ని ప్రకటించాయి. దీనికి.. బోరిస్ సొంత పార్టీ నేతలు కూడా మద్దతు పలికారు. ఇక, పార్టీ గేట్ వ్యవహారంలో జాన్సన్ విమర్శలు ఎదుర్కొన్నారు. ఈరోజు జరిగిన అవిశ్వాస తీర్మానంలో భాగంగా బోరిస్‌కు మద్దతుగా కన్జర్వేటివ్ పార్టీకి చెందిన 211 సభ్యులు ఓటు వేశారు. అవిశ్వాస తీర్మానానికి మద్దతుగా 148 మంది సభ్యులు ఓటు వేశారు. ఈ సందర్భంగా ప్రధాని బోరిస్ జాన్సన్ మాట్లాడుతూ.. ఈ విజయం తనకు శుభ పరిణామం అని పేర్కొన్నారు. 59 శాతం మంది సభ్యులు తనకు మద్దతుగా నిలవడం సంతోషంగా ఉందన్నారు. ఇది నిర్ణయాత్మకమైన ఫలితం అని తాను భావిస్తున్నట్లు జాన్సన్ తెలిపారు. ఇక, 2019లో బోరిస్ జాన్సన్ భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. We need to come together as a party and focus on what this government is doing to help people with the cost of living, to clear the COVID backlogs and to make our streets safer. We will continue to unite, level up and strengthen our economy. pic.twitter.com/vIWK81dDJC — Boris Johnson (@BorisJohnson) June 6, 2022 -
కోవిడ్ సృష్టించిన నష్టాన్ని మరిచిపోయేందుకే తాగారంట!
కోవిడ్ సృష్టించిన నష్టాన్ని, దుఃఖాన్ని మర్చిపోయేందుకే తాగారంట సార్! -
వర్క్ ఫ్రమ్ హోం వల్ల వచ్చే ఇబ్బందులేంటో చెప్పిన బ్రిటన్ ప్రధాని
కరోనా అవతరించినప్పటి నుంచి ఐటీ కంపెనీల ఉద్యోగులతోపాటు చిన్న సంస్థల ఉద్యోగులు కూడా వర్క్ ఫ్రం హోం చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం కరోనా వ్యాప్తి కాస్తా తగ్గుముఖం పట్టినప్పటికీ ఇంకా కొన్ని కంపెనీలు తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోంనే సదుపాయాన్నే కొనసాగిస్తున్నారు. అయితే పలు కంపెనీలు తమ ఉద్యోగులను కార్యాలయాలకు వచ్చి పనిచేయాలని కోరుతున్నా..వర్క్ ఫ్రమ్ హోంకు అలవాటు పడిన అధికశాతం మంది ఉద్యోగులు ఆఫీస్‌లకు వచ్చి పనిచేసేందుకు విముఖత వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా కరోనా సమయంలో మొదలైన వర్క్ ఫ్రం హోం సంస్కృతిపై బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సస్ కీలక వ్యాఖ్యలు చేశారు. వర్క్ ఫ్రం హోం వల్ల ఉద్యోగుల అటెన్షన్ మారిపోతుందని అన్నారు. తనకూ ఇలాంటి అనుభవమే ఎదురైందని చెప్పుకొచ్చారు. ఇంటి దగ్గర ల్యాప్‌టాప్‌లో పనిచేసేటప్పుడు.. మధ్య మధ్యలో కాఫీ కోసమనో, టిఫిన్ కోసమనో లేచి వెళ్తుంటామని, తిరిగి ల్యాప్‌టాప్ వద్దకు వచ్చేసరికి చేస్తున్న పనేమిటో గుర్తుకు రాదని అన్నారు. మళ్లీ కార్యాలయాలకు వచ్చి విధులు నిర్వహించాల్సిన అవసరం ఉందని బోరిస్ జాన్సన్ తెలిపారు. చుట్టూ మనతోటి ఉద్యోగులు ఉండటం వల్ల ఉత్పాదకత ఎక్కువ వస్తుందని, మరింత ఉత్సాహంతో పాటు కొత్త కొత్త ఐడియాలతో పనిచేసే అవకాశం ఉంటుందని బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ అన్నారు. చదవండి: ప్రపంచంలోనే అత్యధికం.. రెండున్నరేళ్లలో 10 లక్షల మరణాలు -
వర్క్ ఫ్రమ్ హోమ్ శుద్ధ దండగ..ఆఫీస్‌లో పనిచేయండి!
కరోనా కారణంగా వర్క్ ఫ్రమ్ హోమ్ కల్చర్ తెరపైకి వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు కరోనా తగ్గడంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సంస్థలు ఉద్యోగస్తుల్ని కార్యాలయాలకు రావాలని పిలుపునిస్తున్నాయి. ఉద్యోగులు మాత్రం తమకు వర్క్ ఫ్రమ్ హోమ్ కావాలని, లేదంటే జాబ్స్‌కు రిజైన్ చేస్తామని బాస్‌లకు మెయిల్స్ పెడుతున్నారు. ఈ నేపథ్యంలో వర్క్ ఫ్రమ్ హోమ్ పై యూకే ప్రధాని బోరిస్ జాన్సన్ ఆసక్తికర వ్యాఖ్యాలు చేశారు. వర్క్ ఫ్రమ్ హోమ్‌తో మీకు సౌకర్యంగా ఉన్నా.. అదంత మంచిదేమీ కాదు. ఎందుకంటే ఇంట్లో ఉండి చేస్తున్న పనికంటే ఇతర వ్యాపకాలపై మనదృష్టి మరులుతుంది. కాఫీలు, ఛీజ్‌లు తినడంలో సగం సమయం గడిచిపోతుంది. కాబట్టి ఉద్యోగులు ఆఫీసుల్లో పనిచేయడమే ఉత్తమం.అలా చేస్తే ప్రొడక్టివిటీతో పాటు ఎనర్జీ, కొత్త కొత్త ఐడియాలు పుట్టుకొస్తాయని బోరిస్ జాన్సన్ ఓ ఇంటర్వ్యూలో తెలిపినట్లు దిగార్డియన్ తన కథనంలో ప్రస్తావించింది. అంతేకాదు వర్క్ ఫ్రమ్ హోమ్‌లో ఉండే ఉద్యోగులు కప్పు కాఫీ తాగేందుకు చాలా సమయం పడుతుంది. కాఫీ చేసేందుకు సిస్టం ముందు లేచి ఫ్రిజ్ దగ్గరికి వెళ్లడం,ఆ పక్కనే ఉన్న చీజ్ ముక్కల్ని కట్ చేయండం'లాంటి పనుల్ని చేయాల్సి వస్తుంది. ఆ పని పూర్తి చేసుకొని సిస్టం దగ్గర కూర్చుంటే మీరు ఏం పనిచేస్తున్నారో మరిచి పోతారు. ఇలాంటి సమస్యలు లేకుండా ఉండాలంటే ఆఫీస్‌లో పనిచేయడం ఉత్తమం అంటూ యూకే ప్రధాని ఓ ఇంటర్వ్యూలో తన అభిప్రాయం వ్యక్తం చేశారు. -
యూకేలో టెక్ మహీంద్రా 1000 కొలువులు
న్యూఢిల్లీ: సాఫ్ట్వేర్ సేవల దేశీ దిగ్గజం టెక్ మహీంద్రా యూకేలో కొత్తగా 1,000 మందికి ఉద్యోగాలిచ్చే ప్రణాళికల్లో ఉన్నట్లు వెల్లడించింది. యూకేలోని అత్యున్నత అకాడమీ, రీసెర్చ్ సంస్థతో సాంకేతిక సహకార ఒప్పందాన్ని కుదుర్చుకోనున్నట్లు పేర్కొంది. మిల్టన్ కీన్స్‌లో కంపెనీకిగల మేకర్స్ ల్యాబ్‌లో కోఇన్నోవేట్ ఒప్పందాన్ని అమలు చేయనున్నట్లు తెలియజేసింది. తద్వారా రూ. 1,000 మందివరకూ ఉపాధి కల్పించే వీలున్నట్లు తెలియజేసింది. కాగా.. బ్రిటిష్ ప్రధాని బోరిస్ జాన్సన్ రెండు రోజుల పర్యటనలో భాగంగా భారత్‌కు విచ్చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) విషయంలో రెండు దేశాలూ పరస్పరం సహకరించుకునేందుకు వీలైన కొత్త ఒప్పందాన్ని ప్రకటించారు. -
నా భుజానికున్నది భారతీయ టీకానే!: బోరిస్ జాన్సన్
న్యూఢిల్లీ: తనతో సహా వందకోట్లమందికి పైగా ప్రజలకు భారత్ కోవిడ్ టీకా అందించిందని బోరిస్ ప్రశంసించారు. ‘ నా భుజానికున్నది ఇండియన్ టీకా, అది నాకు ఎంతో మేలు చేసింది. భారత్‌కు కృతజ్ఞతలు’ అని వ్యాఖ్యానించారు. మోదీ ఆశించినట్లు ప్రపంచానికి ఔషధ కేంద్రంగా భారత్ మారిందని కొనియాడారు. ఆస్ట్రాజెనెకా, సీరమ్ సహకారంతో కోవిడ్ టీకా రూపొందించడాన్ని ప్రస్తావించారు. సచిన్, అమితాబ్‌లా ఫీలవుతున్నా: జాన్సన్ భారత్‌లో తనకు అత్యంత ఆదరణపూర్వక స్వాగతం లభించిందని బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ సంతోషం వ్యక్తం చేశా రు. ప్రధాని నరేంద్ర మోదీని తన ఖాస్ దోస్త్ (బెస్ట్ ఫ్రెండ్)గా అభివర్ణించారు. పలుమార్లు నరేంద్ర అని ప్రస్తావిస్తూ తమ సాన్నిహిత్యాన్ని తెలియజేశారు. బ్రిటీష్ ఇండియన్లలో దాదాపు సగంమందికి పుట్టిల్లైన గుజరాత్ రావడం ఆనందంగా ఉందన్నారు. ఇక్కడ తనకు లభించిన ఆదరణ చూస్తే సచిన్ టెండూల్కర్‌లాగా ఫీలవుతున్నానని, ఎక్కడచూసినా అమితాబ్ బచ్చన్ లాగా తన పోస్టర్లే కనిపిస్తున్నా యని సరదాగా వ్యాఖ్యానించారు. ప్రపంచంలోని పురాతన ప్రజాస్వామ్యం, అతిపెద్ద ప్రజాస్వామ్యాల మధ్య బంధం ఎంతో కీలకమన్నారు. అంతకుముందు రాష్ట్రపతి భవన్ వద్ద జాన్సన్‌కు ఘనంగా గార్డ్ ఆఫ్ ఆనర్ స్వాగతం లభించింది. చదవండి: (భారత్‌కు నమ్మదగ్గ.. నేస్తం మేమే: అమెరికా) -
ఆర్థిక నేరగాళ్లను అప్పగించాలి
న్యూఢిల్లీ: తీవ్ర ఆర్థిక నేరాలకు పాల్పడి విదేశాలకు పారిపోయిన నేరస్థులను రప్పించి చట్టం ముందు నిలబెట్టడం తమకు అత్యంత ప్రాధాన్యాంశమని ఇంగ్లండ్‌కు భారత్ స్పష్టం చేసింది. దీన్ని తాను అర్థం చేసుకున్నానని భారత పర్యటనలో ఉన్న ఆ దేశ ప్రధాని బోరిస్ జాన్సన్ చెప్పారు. భారత చట్టాలను తప్పించుకునేందుకు తమ న్యాయవ్యవస్థను వాడుకోవాలనుకునే నేరగాళ్లను ఎన్నటికీ స్వాగతించబోమని స్పష్టం చేశారు. ఆర్థిక నేరాలకు పాల్పడి ఇంగ్లండ్‌లో తలదాచుకుంటున్న విజయ్‌మాల్యా, నీరవ్ మోదీలను అప్పగించాలని చాలారోజులుగా భారత్ ఒత్తిడి తెస్తోంది. శుక్రవారం ప్రధాని మోదీతో చర్చల అనంతరం ఉమ్మడి మీడియా సమావేశంలో జాన్సన్ మాట్లాడారు. ఆర్థిక నేరగాళ్లను భారత్‌కు అప్పగించేందుకు బ్రిటన్ ప్రభుత్వం ఆదేశాలిచ్చిందని చెప్పారు. న్యాయపరమైన కారణాల వల్ల ఈ ప్రక్రియ క్లిష్టంగా మారిందని వివరించారు. మోదీ, జాన్సన్ చర్చల్లో ఆర్థిక నేరగాళ్ల అప్పగింత అంశం ప్రస్తావనకు వచ్చిందని విదేశాంగ కార్యదర్శి హర్షవర్ధన్ ష్రింగ్లా చెప్పారు. ఈ విషయంలో భారత్ వైఖరిని జాన్సన్‌కు మోదీ వివరించారని చెప్పారు. దీనిపై జాన్సన్ సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. ఉగ్ర మూకలను సహించం ఇంగ్లండ్ వేదికగా ఇతర దేశాలను లక్ష్యంగా చేసుకునే ఉగ్ర మూకలను సహించబోమని బోరిస్ హెచ్చరించారు. బ్రిటన్‌లో ఖలిస్తాన్ మద్దతుదారులు ఇండియా వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న విషయం ప్రధానుల చర్చల్లో ప్రస్తావనకు వచ్చిందని ష్రింగ్లా చెప్పారు. దీనిపై భారత్ ఆందోళనను బోరిస్ అర్ధం చేసుకున్నారని తెలిపారు. ఇలాంటి గ్రూపులను ఎదుర్కొనేందుకు సంయుక్త ంగా ఒక టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేసేందుకు ఇరు దేశాలు అంగీకరించాయి. ఉక్రెయిన్ సంక్షోభంపై నేతలు చర్చించారన్నారు. అక్కడ సత్వరమే శాంతి నెలకొనాలని మోదీ ఆకాంక్షించారని చెప్పారు. రష్యాపై ఆంక్షల విషయంలో భారత్‌పై యూకే ఎలాంటి ఒత్తిడి తీసుకురాలేదన్నారు. కీవ్‌లో వచ్చేవారం తమ రాయబార కార్యాలయాన్ని పునఃప్రారంభిస్తామని బోరిస్ వెల్లడించారు. అఫ్గాన్‌లో శాంతి స్థాపన జరగాలని ఇరువురు నేతలు ఏకాభిప్రాయం వ్యక్తం చేశారు. భారత్–ఇంగ్లండ్ బంధం.. అత్యంత పటిష్టం భారత్, ఇంగ్లండ్ మధ్య అన్ని విషయాల్లోనూ బంధం ముందెన్నడూ లేనంత బలోపేతంగా మారిందని ఆ దేశ ప్రధాని బోరిస్ జాన్సన్ అన్నారు. రెండు రోజుల భారత పర్యటనలో భాగంగా ప్రధాని మోదీతో శుక్రవారం ఆయన సుదీర్ఘంగా చర్చలు జరిపారు. రక్షణ భాగస్వామ్యాన్ని మరింత విస్తరించేందుకు అంగీకరించారు. దీపావళి నాటికి రెండుదేశాల మధ్య స్వేచ్ఛావాణిజ్య ఒప్పందాన్ని ఖరారు చేయాలని నిర్ణయించారు. 2030 నాటికి ఇరుదేశాల మధ్య వాణిజ్యం రెట్టింపవుతుందని, వినిమయ వస్తువుల ధరలు తగ్గుముఖం పడతాయని చెప్పారు. ఎఫ్‌టీఏలోని 26 అంశాల్లో నాలుగింటిపై గతంలో జరిగిన చర్చల్లో అంగీకారం కుదిరిందని, మిగతా వాటిపై పురోగతి కనిపించిందని అధికారులు తెలిపారు. ఇండియాకు ఒజీఈఎల్ (ఓపెన్ జనరల్ ఎక్స్పోర్ట్ లైసెన్స్) ఇస్తామని, దాంతో రక్షణ రంగ వాణిజ్యానికి అడ్డంకులు తొలగుతాయని జాన్సన్ చెప్పారు. భూ, జల, వాయు, సైబర్ మార్గాల్లో సవాళ్లను ఉమ్మడిగా ఎదుర్కోవాలని నిర్ణయించామన్నారు. నూతన ఫైటర్ జెట్ టెక్నాలజీని భారత్‌తో పంచుకుంటామన్నారు. చర్చల్లో మంచి పురోగతి కనిపించిందని మోదీ చెప్పారు. రక్షణ రంగంలో స్వయంసమృద్ధికి యూకే సాయం చేస్తుందన్నారు. ఇండో పసిఫిక్ ప్రాంతంలో స్వేచ్ఛపై యూకే ఆరంభించిన ఐపీఓఐని స్వాగతించారు. విద్య, వైద్యం, పునర్వినియోగ ఇంధనం తదితర అంశాలపై కీలక ఒప్పందాలు కుదిరాయి. సచిన్, అమితాబ్‌లా ఫీలవుతున్నా: జాన్సన్ భారత్‌లో తనకు అత్యంత ఆదరణపూర్వక స్వాగతం లభించిందని బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ సంతోషం వ్యక్తం చేశా రు. ప్రధాని నరేంద్ర మోదీని తన ఖాస్ దోస్త్ (బెస్ట్ ఫ్రెండ్)గా అభివర్ణించారు. పలుమార్లు నరేంద్ర అని ప్రస్తావిస్తూ తమ సాన్నిహిత్యాన్ని తెలియజేశారు. బ్రిటీష్ ఇండియన్లలో దాదాపు సగంమందికి పుట్టిల్లైన గుజరాత్ రావడం ఆనందంగా ఉందన్నారు. ఇక్కడ తనకు లభించిన ఆదరణ చూస్తే సచిన్ టెండూల్కర్‌లాగా ఫీలవుతున్నానని, ఎక్కడచూసినా అమితాబ్ బచ్చన్ లాగా తన పోస్టర్లే కనిపిస్తున్నా యని సరదాగా వ్యాఖ్యానించారు. ప్రపంచంలోని పురాతన ప్రజాస్వామ్యం, అతిపెద్ద ప్రజాస్వామ్యాల మధ్య బంధం ఎంతో కీలకమన్నారు. అంతకుముందు రాష్ట్రపతి భవన్ వద్ద జాన్సన్‌కు ఘనంగా గార్డ్ ఆఫ్ ఆనర్ స్వాగతం లభించింది. నా భుజానికున్నది భారతీయ టీకానే! తనతో సహా వందకోట్లమందికి పైగా ప్రజలకు భారత్ కోవిడ్ టీకా అందించిందని బోరిస్ ప్రశంసించారు. ‘ నా భుజానికున్నది ఇండియన్ టీకా, అది నాకు ఎంతో మేలు చేసింది. భారత్‌కు కృతజ్ఞతలు’ అని వ్యాఖ్యానించారు. మోదీ ఆశించినట్లు ప్రపంచానికి ఔషధ కేంద్రంగా భారత్ మారిందని కొనియాడారు. ఆస్ట్రాజెనెకా, సీరమ్ సహకారంతో కోవిడ్ టీకా రూపొందించడాన్ని ప్రస్తావించారు. -
కష్టకాలంలో జాన్సన్ పర్యటన
పార్టీ గేట్ వ్యవహారంలో ఇంట్లో ఈగల మోత మోగుతున్న వేళ బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ రెండు రోజుల పర్యటన కోసం గురువారం భారత్‌లో అడుగుపెట్టారు. తనకు లభించిన స్వాగత సత్కారాల సంరంభం చూసి పరమానందభరితుడయ్యారని ఆయన వ్యాఖ్యానాలే చెబుతున్నాయి. ‘ప్రపంచంలో మరెక్కడా ఈ స్థాయి అతిథి మర్యాదలు లభించే అవకాశం లేద’న్నది ఆయన అభిప్రాయం. 2019లో ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన దగ్గర్నుంచి ఆయన భారత్ రావడానికి ప్రయత్నిస్తూనే ఉన్నారు. కానీ కరోనా కారణంగా రెండుసార్లు వాయిదా పడక తప్పలేదు. నిరుడు రిపబ్లిక్ డే వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొనాల్సి ఉండగా చివరి నిమిషంలో రద్దయింది. ఆ తర్వాత నిరుడు ఏప్రిల్‌లో అనుకున్నారు. అప్పుడు రెండో దశ కరోనా విజృంభణ మొదలైంది. ఉక్రెయిన్‌పై రష్యా దురాక్రమణ యుద్ధం మొదలైన దగ్గరనుంచి రష్యాతో వ్యాపార, వాణిజ్య లావాదేవీలు విరమించుకోవాలని అమెరికా మనపై ఒత్తిడి తెస్తోంది. బ్రిటన్ అభిప్రాయమూ అదే అయినా, దాని వైఖరి భిన్నం. ఈ నెల మొదట్లో మన దేశం వచ్చిన బ్రిటన్ విదేశాంగ మంత్రి లిజ్ ట్రస్ స్వరమే అందుకు సాక్ష్యం. సంక్షోభ కాలాల్లో ఎలా వ్యవహరించాలో భారత్‌కు ఉపన్యాసం ఇవ్వదల్చుకోలేదని ఆమె చెప్పారు. ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోదీతో ద్వైపాక్షిక చర్చలు ముగిశాక జరిగిన విలేకరుల సమావేశంలో కూడా జాన్సన్ ఆ బాణీలోనే మాట్లాడారు. ఉక్రెయిన్ అంశంలో ఇప్పటికే పలుమార్లు మోదీ పుతిన్‌తో మాట్లాడారనీ, రష్యా విధానాలు సరికాదని చెప్పారనీ జాన్సన్ ప్రశంసించారు. బ్రిటన్ ఎంత ఆచితూచి వ్యవహరిస్తున్నదో చెప్పడానికి ఇది చాలు. కారణాలు మనకు తెలియనివేమీ కాదు. యూరోపియన్ యూనియన్(ఈయూ) నుంచి వెలుపలికొచ్చాక బ్రిటన్ ఆర్థికంగా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. ప్రపంచ దేశాలన్నిటితో, మరీ ముఖ్యంగా భారత్ వంటి అతి పెద్ద మార్కెట్ ఉన్న దేశంతో వ్యాపార ఒప్పందాలు కుదుర్చుకోవాలని తహతహలాడుతోంది. కారణాలు ఏమైనా గత దశాబ్దంగా ఇరు దేశాల వాణిజ్యంలో స్తబ్దత ఏర్పడింది. రెండు దేశాల వాణిజ్యం 2020లో మొత్తంగా 2,400 కోట్ల డాలర్లుంది. ఇదే కాలంలో మనకంటే చిన్న దేశమైన బెల్జియంతో బ్రిటన్ వాణిజ్యం ఇంతకన్నా రెట్టింపుంది. ఈ నేపథ్యంలో మనతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం(ఎఫ్‌టీఏ) ఖరారుకు సంబంధించిన చర్చలు నిరుడు జనవరిలో మొదలయ్యాయి. ఇప్పటికి రెండు దఫాలు పూర్తయ్యాయి. ఈ వారం ఆఖరులో మూడో రౌండ్ చర్చలు పూర్తయితే ఎఫ్‌టీఏ ఒక కొలిక్కి వస్తుంది. జాన్సన్ ఆశిస్తున్నట్టు దీపావళి నాటికి ఇరు దేశాల మధ్యా ఆ ఒప్పందం ఖరారైతే 2035 కల్లా బ్రిటన్ నుంచి మన దేశానికి ఏటా 2,145 కోట్ల డాలర్ల మేర ఎగుమతులు పెరుగుతాయని అంచనా. వాణిజ్య వివాదాల పరిష్కారానికి అనుసరించాల్సిన విధివిధానాలపై ఇంకా ఏకాభిప్రాయం కుదరని పరిస్థితుల్లో జాన్సన్ పర్యటన ప్రస్తుతం ఉపాధి అవకాశాలు, వీసాల మంజూరు తదితర అంశాలపైనే దృష్టి కేంద్రీకరించింది. అదనపు వీసాలు మంజూరు చేస్తేనే వాణిజ్య ప్రతిబంధకాలను సడలిస్తామని మన దేశం చెబుతోంది. స్థానికులను కాదని వెలుపలివారికి అవకాశాలివ్వడమేమిటన్నది జాన్సన్‌కు చెందిన కన్సర్వేటివ్ పార్టీ ఎప్పటినుంచో వాదిస్తోంది. ఇప్పుడు అందుకు భిన్నంగా నిర్ణయం తీసుకుంటే రాజకీయంగా సమస్యలెదురవుతాయని ఆయన భయం. రష్యా రక్షణ ఉత్పత్తులపై ప్రధానంగా ఆధారపడిన భారత్‌ను ఇప్పటికిప్పుడు ఆ దేశంతో తెగతెంపులు చేసుకోమని ఒత్తిడి చేయడం సరికాదని బ్రిటన్ భావిస్తున్నది. తన రక్షణ ఉత్పత్తుల ఎగుమతిని క్రమేపీ పెంచుతూ రష్యాపై ఆధారపడే స్థితిని తప్పించాలనుకుంటోంది. వాస్తవానికి ఒకప్పుడు బ్రిటన్ మన రక్షణ అవసరాలకు ప్రధాన వనరుగా ఉండేది. కానీ కాలం గడిచేకొద్దీ అది క్షీణించి, ప్రస్తుతం మన రక్షణ దిగుమతుల్లో ఆ దేశం వాటా 3 శాతానికి పరిమితమైంది. ద్వైపాక్షిక సంబంధాలు ఉన్నత స్థాయికి చేరితే పూర్వవైభవం ఖాయమని బ్రిటన్ ఆలోచన. కానీ అందుకు ప్రతిబంధకాలున్నాయి. బ్రిటన్ పార్లమెంటులో కశ్మీర్‌పై చర్చ జరగడం, అక్కడ ఖలిస్తాన్ అనుకూల ఉద్యమాలు పెరగడం మన దేశానికి నచ్చలేదు. అలాగే మైనారిటీలపై దాడులు, అసమ్మతిని అణిచేయడం వంటి అంశాలు ఆ దేశంలో ప్రధానంగా చర్చకు రావడం సైతం అయిష్టంగానే ఉంది. భారత్ వచ్చేవారికి ఈ–వీసాల మంజూరు నిబంధనలు సరళం చేయాలని బ్రిటన్ కోరుతోంది. అదే సమయంలో భారత్‌నుంచి వచ్చేవారిపై బ్రిటన్ అమలు చేస్తున్న నిబంధలపై మన దేశం తీవ్ర అసంతృప్తితో ఉంది. ఇండో–పసిఫిక్ ప్రాంత దేశాల కూటమిలో మనతోపాటు బ్రిటన్ కూడా భాగస్వామి గనుక భారత్‌లో తనకు పుష్కలంగా అవకాశాలుంటాయని ఆ దేశం విశ్వసిస్తోంది. నిరుడు మే నెలలో జరిగిన ఆన్లైన్ శిఖరాగ్ర సదస్సులో ఆరోగ్యం, వాతావరణ మార్పులు, రక్షణ, భద్రత వగైరా అంశాలు చర్చకొచ్చాయి. లాక్డౌన్ కాలంలో నిబంధనలు బేఖాతరు చేసి మిత్రులు, పార్టీ నేతలతో మూడుసార్లు విందులు వినోదాల్లో మునిగి తేలారన్నది జాన్సన్‌పై అభియోగం. అది నిజం కాదని అబద్ధమాడి పార్లమెంటును పక్కదోవ పట్టించారన్న ఆరోపణపై గురువారం హౌస్ కమిటీ ఏర్పాటయింది. ఆ కమిటీ జాన్సన్‌ను దోషిగా నిర్ధారిస్తే నిబంధనల ప్రకారం ఆయన పదవి నుంచి తప్పుకోవాలి. ఈలోగా భారత్‌తో చరిత్రాత్మకమైన ఎఫ్‌టీఏ సాకారం కావాలనీ, తన పేరు చిరస్థాయిగా నిలవాలనీ జాన్సన్ కోరుకుంటున్నారు. అదెంతవరకూ సాధ్యమో చూడాలి. -
సచిన్, అమితాబ్‌లా ఫీల్ అయ్యా: బ్రిటన్ ప్రధాని
సాక్షి, న్యూఢిల్లీ: బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ భారత పర్యటనలో ఉన్నారు. రెండు రోజుల భారత పర్యటనలో భాగంగా ఆయన ఇండియాకు చేరుకున్నారు. మొదటిరోజు భారత ప్రధాన నరేంద్ర మోదీ స్వరాష్ట్రం గుజరాత్లో బోరిస్ జాన్సన్ పర్యటించారు. రెండో రోజు ఢిల్లీలో ప్రధాని మోదీతో బోరిస్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పలు కీలక అంశాలపై చర్చించారు. ఇదిలా ఉండగా.. గురువారం గుజరాత్లో పర్యటనను బోరిస్ జాన్సన్ గుర్తు చేసుకొని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భారత్‌లో తనకు ఇంత ఘనంగా స్వాగతం పలికినందుకు భారత ప్రజలకు, ప్రధాని మోదీకి ఆయన ధన్యవాదాలు తెలిపారు. గుజరాత్లో తన స్వాగత హోర్డింగ్స్ చూసి.. ఆయన ఓ సచిన్ టెండూల్కర్, బిగ్‌బీ అమిత్ బచ్చన్‌లా ఫీలయ్యానని అన్నారు. ఇలాంటి స్వాగతాన్ని తాను మరెక్కడా చూడలేనమోనని కామెంట్స్ చేశారు. ఈ క్రమంలోనే ప్రధాని మోదీ తనకు మంచి స్నేహితుడని బోరిస్ ప్రకటించారు. మరోవైపు.. బోరిస్ జాన్సన్ భారత పర్యటన సందర్భంగా ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో భారత్ ఆజాదీకా అమృత్ మహోత్సవ్ వేడుకలు జరుపుకుంటున్న సమయంలో బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ పర్యటించడం ఆనందంగా ఉందన్నారు. ఇది ఓ చారిత్రక సందర్భం అంటూ మోదీ వ్యాఖ్యానించారు. ఇది చదవండి: భారత్.. ఏ దేశానికీ ముప్పు కాదు -
బ్రిటన్ ప్రధానితో మోదీ భేటీ, పలు అంశాలపై చర్చలు
TIME 01:30PM ప్రధాని మోదీ, బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ సమక్షంలో భారత్-యూకే మధ్య వివిధ ఒప్పందాలు జరిగాయి. 'ఆజాదీ కా అమృత్ మహోత్సవ్' సందర్భంగా ప్రధాని బోరిస్ జాన్సన్ భారత్ పర్యటన చారిత్రాత్మకమని ప్రధాని మోదీ కొనియాడారు. ఇరు దేశాలు స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై(ఎఫ్‌టీఏ) పని చేస్తున్నాయన్నారు. ఈ ఏడాది చివరి నాటికి ఎఫ్‌టీఏను ముగించేందుకు కృషి చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్‌తో రక్షణ రంగం, వాణిజ్యం, వాతావరణం, ఇంధన భద్రతపై చర్చలు జరిగాయని నరేంద్ర మోదీ తెలిపారు. అదే విధంగా ఇండో-ఫసిఫిక్ ప్రాంతంలో భద్రత పరంగా సహకారాన్ని అందించుకోవడంపై కూడా చర్చించినట్లు పేర్కొన్నారు. కాగా గతేడాది భారత్-యూకే మధ్య సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ప్రారంభించామని తెలిపిన ప్రధాని మోదీ ఎఫ్టీఏకు సంబంధించిన పనులు కొనసాగుతున్నాయని వెల్లడించారు. TIME 01:00PM ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో ప్రధాని నరేంద్ర మోదీ, బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్‌తో చర్చలు జరిపారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. బోరిస్ జాన్సన్ భారత్‌ను తమ స్నేహితుడిగా అర్థం చేసుకున్నాడని అన్నారు. #WATCH Prime Minister Narendra Modi and British PM Boris Johnson hold talks at Delhi's Hyderabad House (Source: DD) pic.twitter.com/AlMBrLLB1f — ANI (@ANI) April 22, 2022 TIME 12:00PM ఇండో-ఫసిఫిక్ ప్రాంతంలో భద్రత పరంగా సహకారాన్ని అందించుకోవడం, ఇరు దేశాల మధ్య దౌత్య ఆర్థిక భాగస్వామ్యం వంటి అంశాలపై రెండు దేశాల ప్రధానులు చర్చించుకోనున్నారు. అలాగే బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్‌తో విదేశాంగ మంత్రి జైశంకర్ సమావేశమయ్యారు. External Affairs Minister Dr S Jaishankar calls on British PM Boris Johnson in Delhi Discussed our expanding partnership and implementing the India-UK Roadmap 2030, EAM says. pic.twitter.com/Y1b5zGky33 — ANI (@ANI) April 22, 2022 TIME 11:00AM బ్రిటన్ ప్రధానికి కలుసుకోవడం సంతోషంగా ఉందని ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. సుధీర్ఘకాలంగా ఎదురుచుస్తున్న నా స్నేహితుడు @ బోరిస్ జాన్సన్‌కు ఇండియాలో చూడటం చాలా అద్భుతంగా ఉంది. చర్చలు కోసం ఎదురుచూస్తున్నాను’ అని ట్వీట్ చేశారు. మోదీని కలవక ముందు.. నా స్నేహితుడితో సమావేశమయ్యేందుకు ఎదురు చూస్తున్నానని బోరిస్ ట్వీట్ చేశారు. నిరంకుశ రాజ్యాల నుంచి పెరుగుతోన్న బెదిరింపు వేళ.. వాతావారణ మార్పులు, ఇంధన భద్రత, రక్షణ వంటి అంశాల్లో మన ప్రజాస్వామ్య దేశాల భాగస్వామ్యం ముఖ్యమంటూ పేర్కొన్నారు. Wonderful to see you, my friend PM @BorisJohnson in India on a long-awaited visit. Look forward to our discussions today. https://t.co/6gUxR1PwPH pic.twitter.com/z6Ufv8zgAb — Narendra Modi (@narendramodi) April 22, 2022 TIME 10:00AM ►బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ రాష్ట్రపతి భవన్లో గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా తనకు అద్భుత స్వాగతం పలికినందుకు మోదీకి బ్రిటన్ ప్రధాని ధన్యవాదాలు తెలిపారు.. ‘భారత్- యూకే మధ్య పరిస్థితులు ఇంతకముందు కంటే ఇప్పుడు మరింత బలంగా, మంచిగా ఆన్నాయి’ అని బోరిస్ జాన్సన్ అన్నారు. #WATCH | "Thank you for the fantastic welcome...I don't think the things have ever been as strong or as good between us (India-UK) as they are now," UK PM Boris Johnson said in Delhi pic.twitter.com/f7tuRbFGKj — ANI (@ANI) April 22, 2022 న్యూఢిల్లీ: బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ రెండు రోజుల భారత్ పర్యటనలో భాగంగా శుక్రవారం ఢిల్లీకి చేరుకున్నారు. రాష్ట్రపతి భవన్ వద్ద బోరిస్‌కు ప్రధాని మోదీ ఘన స్వాగతం పలికారు. ఇద్దరు కలిసి రాజ్‌ఘట్ చేరుకున్నారు. వాస్తవానికి గత ఏడాదిన్నర కాలంలోనే బ్రిటన్ ప్రధాని బోరిస్ జూన్సన్ భారత పర్యటనకు రావాల్సి ఉండగా.. కరోనా, రష్యా ఉక్రెయిన్ యుద్ధం వంటి సంక్షోభాల నేపథ్యంలో పర్యటన వాయిదాపడుతూ వచ్చింది. #WATCH | Prime Minister Narendra Modi receives UK PM Boris Johnson at Rashtrapati Bhavan pic.twitter.com/IpbQMKAWPb — ANI (@ANI) April 22, 2022 -
గుజరాత్లో జేసీబీ ఎక్కిన బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్
న్యూఢిల్లీ: నిర్మాణ రంగ పరికరాల తయారీ దిగ్గజం జేసీబీ తాజాగా గుజరాత్‌లోని వదోదరలో కొత్త ప్లాంటు ఆవిష్కరించింది. దాదాపు 100 మిలియన్ పౌండ్లతో (సుమారు రూ. 995 కోట్లు) నిర్మించిన ఈ ఫ్యాక్టరీని బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ గురువారం ప్రారంభించారు. అంతర్జాతీయంగా తమ ఉత్పత్తులకు అవసరమైన భాగాలను ఈ ప్లాంటులో తయారు చేయనున్నట్లు జేసీబీ చైర్మన్ లార్డ్ బామ్ఫోర్డ్ తెలిపారు. ఇది ఏటా 85,000 టన్నుల ఉక్కును ప్రాసెస్ చేయగలదని వివరించారు. 1979లో భారత్‌లో తయారీ కార్యకలాపాలు ప్రారంభించిన జేసీబీకి ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఆరు ఫ్యాక్టరీలు ఉన్నాయి. చదవండి: తులసిభాయ్.. ఆ ప్రముఖుడికి కొత్త పేరు పెట్టిన ప్రధాని మోదీ -
బుల్డోజర్ ఎక్కిన బ్రిటన్ ప్రధాని
అహ్మదాబాద్: జేసీబీ బుల్డోజర్.. ప్రస్తుతం భారత్‌లో ట్రెండింగ్‌లో ఉన్న టాపిక్. శ్రీరామ నవమి, హానుమాన్ శోభాయాత్రల సందర్భంగా చెలరేగిన మత ఘర్షణల అనంతరం.. ఈ ట్రెండ్ మరింత ఊపందుకుంది. అల్లర్లకు కారణమైన వాళ్లకు చెందిన ఇళ్లను, దుకాణాలను, ఇతర కట్టడాలను.. అక్రమ కట్టాలుగా నిర్ధారించుకుని ప్రభుత్వాలు జేసీబీ బుల్డోజర్లతోనే కూల్చేస్తున్నాయి. ఈ క్రమంలో.. రెండు రోజుల భారత్ పర్యటనకు వచ్చిన బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్.. బుల్డోజర్ ట్రెండ్‌లోకి వచ్చేశారు. ఎలాగంటారా?.. గుజరాత్ వడోదరా హలోల్ పారిశ్రామిక ప్రాంతంలోని ఓ జేసీబీ ఫ్యాక్టరీని ఆయన సందర్శించాడు. #WATCH UK PM Boris Johnson along with Gujarat CM Bhupendra Patel visits JCB factory at Halol GIDC, Panchmahal in Gujarat (Source: UK Pool) pic.twitter.com/Wki9PKAsDA — ANI (@ANI) April 21, 2022 జేసీబీ ఫ్యాక్టరీని ప్రారంభించిన బోరిస్.. హుషారుగా జేసీబీ బుల్డోజర్ ఎక్కి పరిశీలించి కాసేపు సందడి చేశారు. ఆ సమయంలో ఆయన వెంట.. గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ కూడా ఉన్నారు. ఇంకేం.. యాధృచ్ఛికంగా జరిగినప్పటికీ ఈ పని సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 1947 నుంచి 2022 వరకు బోరిస్ కవర్ చేశారంటూ కామెంట్లు పెడుతున్నారు కొందరు. ఎందుకంటే.. అంతకు ముందు సబర్మతి ఆశ్రమాన్ని సందర్శించి.. చరఖా తిప్పారు. From Gandhi's Charkha to Modi's JCB - Boris Johnson covered the history of India from 1947 to 2022, in a day. pic.twitter.com/1N0Fcku3iT — PuNsTeR™ (@Pun_Starr) April 21, 2022 #WATCH | Prime Minister of the United Kingdom Boris Johnson visits Sabarmati Ashram, tries his hands on 'charkha' pic.twitter.com/6RTCpyce3k — ANI (@ANI) April 21, 2022 మహాత్ముడి రచనల్లో ఒకటైన, ప్రచురణకాని గైడ్ టు లండన్‌ను బోరిస్ కానుకగా అందుకున్నారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా ఇవాళ గుజరాత్లో పర్యటించిన బ్రిటన్ ప్రధాని బోరిస్.. రేపు(శుక్రవారం) ఢిల్లీకి వెళ్తారు. आज जेसीबी तेरा भाई चलाएगा 😎 pic.twitter.com/DIacyWBEy4 — Desi Boy 🇮🇳⚙️ (@Desi_b_o_y) April 21, 2022 #JCBKIKHUDAI .. Boris Johnson pic.twitter.com/Qu31P72iQg — Er R K DAHARWAL आर के डहरवालرکدہاروال (@DaharwalK) April 21, 2022 JCB share price pic.twitter.com/RXrJ6AsRbw — Armoured_assault (@Vivek_707) April 21, 2022 -
భారత్ కు బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్
-
భారత్‌లో ఉండటం చాలా అద్భుతంగా ఉంది: బ్రిటన్ ప్రధాని
TIME: 02.30PM గుజరాత్‌ను సందర్శించిన మొదటి బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్‌కు అదానీ హెడ్‌క్వార్టర్స్‌లో ఆతిథ్యం ఇవ్వడం గౌరవంగా భావిస్తున్నట్లు పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ పేర్కొన్నారు. ఈ మేరకు ట్వీట్ చేశారు. Honoured to host @BorisJohnson, the first UK PM to visit Gujarat, at Adani HQ. Delighted to support climate & sustainability agenda with focus on renewables, green H2 & new energy. Will also work with UK companies to co-create defence & aerospace technologies. #AtmanirbharBharat pic.twitter.com/IzoRpIV6ns — Gautam Adani (@gautam_adani) April 21, 2022 TIME: 02.00PM భారత పర్యటన సందర్భంగా బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ భారీ పెట్టబడుల ప్రణాళికను ప్రకటించారు. భారత్-యూకే మధ్య 1 బిలియన్ పౌండ్ల విలువైన కొత్త వాణిజ్య ఒప్పందాలను కుదుర్చుకోనున్నట్లు బోరిస్ తెలిపారు. వాణిజ్యం, పెట్టుబడులు, సాంకేతిక భాగస్వామ్యంలో నూతన ఒరవడికి నాంది పలుకుతామని అన్నారు. ఇ 5జీ టెలికాం నుంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, వైద్యారోగ్య రంగంలో పరిశోధనల వరకూ పలు రంగాల్లో ఇరు దేశాలు కలిసి పనిచేస్తూ పురోగతి సాధిస్తాయని అన్నారు. TIME: 12.50PM ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీతో బోరిస్ జాన్సన్ గంటపాటు సమావేశమయ్యారు. అనంతరం శాంతిగ్రామ్ నుంచి బ్రిటన్ ప్రధాని బయలుదేరారు TIME: 12.00PM న్యూ ఇండియా వ్యాపార,పెట్టుబడుల ఒప్పందాల ద్వారా కొత్తగా 11 వేల యూకే ఉద్యోగాలు లభిస్తాయని బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ తెలిపారు. కే- భారత్ భాగస్వామ్యం తమ ప్రజలకు ఉద్యోగాలు, వృద్ధి, అవకాశాలు అందిస్తోందన్నారు. ఈ మేరకు బోరిస్ జాన్సన్ కార్యాలయం ట్వీట్ చేసింది. NEW: More than 11,000 new UK jobs will be created through new India trade and investment deals. The UK-India partnership is delivering jobs, growth and opportunity for our people. — UK Prime Minister (@10DowningStreet) April 21, 2022 ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్‌లో ఉండటం చాలా అద్భుతంగా ఉందని యూకే పీఎం బోరిస్ జాన్సన్ అన్నారు. మన గొప్ప రెండు దేశాలు కలిసి సాధించే ఎన్నో విస్తృత అవకాశాలను చూస్తున్నానని పేర్కొన్నారు. మన పవర్ఫుల్ భాగస్వామ్యం ఉద్యోగాలు, వృద్ధి, అవకాశాలను అందిస్తుందని. ఈ భాగస్వామ్యాన్ని రాబోయే రోజుల్లో బలోపేతం చేయడానికి ఎదురు చూస్తున్నట్లు తెలిపారు. It’s fantastic to be in India, the world’s largest democracy. I see vast possibilities for what our great nations can achieve together. Our powerhouse partnership is delivering jobs, growth and opportunity. I look forward to strengthening this partnership in the coming days. pic.twitter.com/bx0iXHDYov — Boris Johnson (@BorisJohnson) April 21, 2022 TIME: 11.00AM ►యూకే పీఎం బోరిస్ జాన్సన్ గాంధీ సబర్మతి ఆశ్రమానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా సబర్మతి ఆశ్రమంలో ఆయన చరఖా తిప్పారు. సందర్శకుల పుస్తకంలో సంతకం చేశారు. సత్యం, అహింస వంటి మార్గాలతో ప్రపంచాన్ని కదిలించిన మహనేత గాంధీ అని కొనియాడారు. సబర్మతి ఆశ్రమాన్ని సందర్శించడం ఆనందంగా ఉందన్నారు. భారత స్వాతంత్ర్య పోరాట సమయంలో మహత్మా గాంధీ శిష్యురాలిగా మారిన బ్రిటీష్ అడ్మిరల్ కూతురు మడేలిన్ స్లేడ్(మీరాబెన్) ఆత్మకథ పుస్తకాన్ని ప్రధానికి సబర్మతి ఆశ్రమం వారు బహుమతిగా అందజేయనున్నారు. #WATCH | Prime Minister of the United Kingdom Boris Johnson visits Sabarmati Ashram, tries his hands on 'charkha' pic.twitter.com/6RTCpyce3k — ANI (@ANI) April 21, 2022 న్యూఢిల్లీ: బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ రెండు రోజుల పర్యటన నిమిత్తం గురువారం భారత్‌కు చేరుకున్నారు. బ్రిటన్ నుంచి గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఆయన ల్యాండ్ అయ్యారు. బ్రిటన్ ప్రధానికి అహ్మదాబాద్ విమనాశ్రయంలో గుజరాత్ ముఖ్యమంత్రి, గవర్నర్ ఆచార్య దేవవ్రత్, తదితరులు ఘన స్వాగతం పలికారు. అక్కడ పారిశ్రామిక, వ్యాపారవేత్తలతో సమావేశం కానున్నారు. గుజరాత్ పరిశ్రమల్లో పెట్టుబడులు పెట్టాలని భావిస్తోన్న జాన్సన్.. ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీతో కాసేపట్లో భేటీ కానున్నాను. అనంతరం ఇంటర్నేషనల్ ఫైనాన్స్ టెక్ సిటీని సందర్శించనున్నారు. అలాగే గాంధీనగర్‌లోని అక్షరధామ్ ఆలయాన్ని సందర్శించనున్నాను. శుక్రవారం ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్రమోదీతో భేటీ అవుతారు. వీరు రక్షణ, దౌత్య, ఆర్థిక రంగాల్లో వ్యూహాత్మక బంధాలపై ప్రధానంగా చర్చిస్తారని సమాచారం. అలాగే ఇండో-పసిఫిక్ప్రాంత పరిస్థితులు, ఇంధన భద్రత, రక్షణ విషయాల్లో భాగస్వామ్యం వంటి అంశాలు చర్చకు రానున్నాయి. સુસ્વાગતમ્.. ગુજરાતના પ્રવાસે પધારેલા યુનાઇટેડ કિંગડમ્ ઓફ ગ્રેટ બ્રિટનના પ્રધાનમંત્રી શ્રીમાન @BorisJohnson જી નું અમદાવાદ હવાઈમથક ખાતે ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. pic.twitter.com/SRAUbV6Saw — Bhupendra Patel (@Bhupendrapbjp) April 21, 2022 కాగా ఇప్పటి వరకు బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ భారత్‌కు రాలేదు. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం తీవ్రతరమై అంతర్జాతీయంగా సంక్షోభం నెలకొన్న వేళ... బ్యాంకులను వేల కోట్లకు మోసగించిన విజయ్ మాల్యా వంటివారు బ్రిటన్‌లో తలదాచుకున్న నేపథ్యంలో... బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ తొలిసారిగా భారత్ పర్యటనకు వస్తుండటం ఆసక్తి రేపుతోంది. అంతేకాక ప్రధానమంత్రి నరేంద్రమోదీ సైతం బోరిస్ ప్రధానిగా ఎన్నికైనప్పటి నుంచి బ్రిటన్‌కు వెళ్లలేదు. అహ్మదాబాదే ఎందుకు ? బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ నేరుగా అహ్మదాబాద్ ఎందుకు వస్తున్నారన్నది చర్చనీయంగా మారింది. బ్రిటన్‌లో నివసించే ఆంగ్లో ఇండియన్ జనాభాలో సగం మందికి పైగా అహ్మదాబాద్‌కు చెందిన వారే. అయినా ఇప్పటిదాకా ఏ బ్రిటన్ ప్రధానీ గుజరాత్లో అడుగు పెట్టలేదు. ఆంగ్లో ఇండియన్ ఓటు బ్యాంకుని దృష్టిలో ఉంచుకొనే జాన్సన్ తొలుత అహ్మదాబాద్ వెళ్తున్నట్టు బ్రిటన్ రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. మరోవైపు, ఈ ఏడాది చివర్లో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలున్న నేపథ్యంలో జాన్సన్ పర్యటన ద్వారా ఎన్నికల్లో లబ్ధికి మోదీ ప్రయత్నిస్తున్నారన్న వాదనా ఉంది. గుజరాత్ పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన రాష్ట్రం గనుక పరస్పరం పెట్టుబడులు ఆకర్షించాలన్నదే కారణమని కూడా చెప్తున్నారు. -
ప్రాధాన్యం సంతరించుకున్న బోరిస్ జాన్సన్ భారత్ పర్యటన
న్యూఢిల్లీ: ఇంగ్లండ్ ప్రధాని బోరిస్ జాన్సన్ రెండు రోజుల పర్యటన కోసం గురువారం భారత్‌కు వస్తున్నారు. ఇంగ్లండ్ నుంచి ప్రత్యేక విమానంలో ఆయన నేరుగా గుజరాత్‌లోని అహ్మదాబాద్ చేరుకుంటారు. పారిశ్రామికవేత్తలతో సమావేశమై పెట్టుబడులు, వాణిజ్యంపై చర్చిస్తారు. శుక్రవారం ఉదయం సబర్మతి ఆశ్రమాన్ని సందర్శించి జాతిపిత మహాత్మాగాంధీకి నివాళులర్పిస్తారు. తర్వాత ఢిల్లీ వెళ్లి ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అవుతారు. రక్షణ, వాణిజ్య, ఆర్థిక, దౌత్యపరమైన అంశాల బలపేతం దిశగా చర్చిస్తారు. మధ్యాహ్నం విదేశాంగ మంత్రి జై శంకర్‌తో కూడా జాన్సన్ చర్చిస్తారు. తర్వాత సంయుక్త ప్రకటన విడుదల చేస్తారు. ఉక్రెయిన్‌పై రష్యా దాడి తీవ్రతరమైన నేపథ్యంలో జాన్సన్ భారత్ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. చదవండి: (భారత్‌కు బ్రిటన్ ప్రధాని.. అహ్మదాబాదే ఎందుకు ?) -
భారత్‌కు బ్రిటన్ ప్రధాని.. అహ్మదాబాదే ఎందుకు ?
ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం తీవ్రతరమై అంతర్జాతీయంగా సంక్షోభం నెలకొన్న వేళ... బ్యాంకులను వేల కోట్లకు మోసగించిన విజయ్ మాల్యా వంటివారు బ్రిటన్‌లో తలదాచుకున్న నేపథ్యంలో... బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ తొలిసారిగా భారత్ పర్యటనకు వస్తుండటం ఆసక్తి రేపుతోంది. ఆయన బ్రిటన్ నుంచి నేరుగా ఢిల్లీకి కాకుండా గుజరాత్‌లోని అహ్మదాబాద్‌కు ఎందుకు వస్తున్నారు? ఇరు దేశాలు ప్రధానంగా ఏయే అంశాలపై దృష్టి సారించనున్నాయి? ఉక్రెయిన్‌పై రష్యా అణుదాడికి దిగుతుందన్న అనుమానాల నేపథ్యంలో బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ భారత పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. బ్రిటన్‌తో పాటు అమెరికా, పశ్చిమ దేశాలన్నీ రష్యా తీరును తీవ్రంగా నిరసిస్తుంటే భారత్ తటస్థ వైఖరి అవలంబించడం అంతర్జాతీయ సమాజానికి మింగుడు పడటం లేదు. ఈ నేపథ్యంలో జాన్సన్, ప్రధాని మోదీ, ముఖాముఖిపై ఆసక్తి నెలకొంది. జాన్సన్ గురువారం బ్రిటన్ నుంచి గుజరాత్‌లోని అహ్మదాబాద్ చేరుకుని పారిశ్రామికవేత్తలతో సమావేశమవుతారు. శుక్రవారం ఢిల్లీలో మోదీతో భేటీ అవుతారు. యుద్ధంపై చర్చ ప్రధానుల చర్చల్లో యుద్ధం ప్రధానంగా చర్చకు రానుంది. భారత తటస్థ వైఖరిని, రష్యా నుంచి భారత్ ఆయుధాలు, చమురు కొనుగోలు చేస్తుండటాన్ని జాన్సన్ ప్రస్తావించవచ్చంటున్నారు. ఉక్రెయిన్‌కు భారత్ ఆశించినంతగా మద్దతివ్వడం లేదంటూ బ్రిటన్ వాణిజ్య మంత్రి అన్నె మారియా ఇప్పటికే అసంతృప్తి వ్యక్తం చేశారు. ద్వైపాక్షిక వాణిజ్యం బ్రిటన్ యూరోపియన్ యూనియన్ నుంచి బయటకు వచ్చాక ఈయూపై ఆధారపడటం తగ్గించుకొని ఇతర దేశాలతో వ్యూహాత్మకంగా బంధాలను పెంచుకుంటోంది. ఇందులో భాగంగానే భారత్‌తో స్వేచ్ఛాయుత వాణిజ్య ఒప్పందంపై ఇప్పటికే పలు చర్చలు జరిపింది. ఇది కుదిరితే 2035 నాటికి భారత్‌తో బ్రిటన్ వాణిజ్యం ఏడాదికి 2,800 కోట్ల పౌండ్లు పెరుగుతుందని అంచనా. భారత్ వైపు నుంచి మేకిన్ ఇండియా ప్రాజెక్టులో భాగంగా రెండు వేల కంపెనీలు బ్రిటన్‌లో పెట్టుబడులు పెట్టాయి. లక్ష ఉద్యోగాల కల్పన జరిగింది. చదవండి: (లీటర్ పెట్రోల్ రూ.338.. బస్సు ఛార్జీలు ఏకంగా 35 శాతం పెరిగి..) 2030కి రోడ్‌మ్యాప్ 2030 నాటికి భారత్, బ్రిటన్ మధ్య బంధం బలోపేతమయ్యేలా గతేడాది జరిగిన వర్చువల్ సదస్సులో ప్రణాళిక రూపొందించారు. వస్తు సేవల్లో వాణిజ్యాన్ని 2030 నాటికి 10 వేల కోట్ల డాలర్లకు పెంచుకోవడం లక్ష్యంగా నిర్ణయించారు. పలు రంగాల్లో పలు ఒప్పందాలు కుదిరే అవకాశముంది. ఆర్థిక నేరగాళ్ల అప్పగింత భారత్‌లో బ్యాంకులకు వేల కోట్ల రూపాయలకు కుచ్చుటోపీ వేసి బ్రిటన్‌కు పరారైన విజయ్ మాల్యా, నీరవ్ మోదీల అప్పగింత ప్రక్రియను వేగవంతం చేయాలని జాన్సన్‌ను భారత్ కోరనుంది. ఆర్థిక నేరగాళ్లను వీలైనంత త్వరగా అప్పగించాలని గతేడాది వీడియో కాన్ఫరెన్స్ సదస్సులో మోదీ డిమాండ్ చేశారు. అందుకు చర్యలు తీసుకుంటామని బ్రిటన్ హామీ ఇచ్చింది. ఈ నేపథ్యంలో పర్యటనలో మాల్యా, నీరవ్ అప్పగింతలో తాజాగా ముందడుగు పడుతుందని భారత్ భావిస్తోంది. – సాక్షి, నేషనల్ డెస్క్ అహ్మదాబాదే ఎందుకు ? బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ నేరుగా అహ్మదాబాద్ ఎందుకు వస్తున్నారన్నది చర్చనీయంగా మారింది. బ్రిటన్‌లో నివసించే ఆంగ్లో ఇండియన్ జనాభాలో సగం మందికి పైగా అహ్మదాబాద్‌కు చెందిన వారే. అయినా ఇప్పటిదాకా ఏ బ్రిటన్ ప్రధానీ గుజరాత్లో అడుగు పెట్టలేదు. ఆంగ్లో ఇండియన్ ఓటు బ్యాంకుని దృష్టిలో ఉంచుకొనే జాన్సన్ తొలుత అహ్మదాబాద్ వెళ్తున్నట్టు బ్రిటన్ రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. మరోవైపు, ఈ ఏడాది చివర్లో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలున్న నేపథ్యంలో జాన్సన్ పర్యటన ద్వారా ఎన్నికల్లో లబ్ధికి మోదీ ప్రయత్నిస్తున్నారన్న వాదనా ఉంది. గుజరాత్ పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన రాష్ట్రం గనుక పరస్పరం పెట్టుబడులు ఆకర్షించాలన్నదే కారణమని కూడా చెప్తున్నారు. చదవండి: (కమలా హారిస్ రక్షణ సలహాదారుగా శాంతి సేథి) -
భారత్‌కు బ్రిటన్ ప్రధాని.. నేరుగా మోదీ సొంత రాష్ట్రంలోనే
లండన్: ఇంగ్లండ్ ప్రధాని బోరిస్ జాన్సన్ భారత పర్యటన ఖరారైంది. ఈ నెల 21, 22తేదీల్లో ఆయన దేశంలో పర్యటిస్తారు. 21న లండన్ నుంచి నేరుగా ప్రధాని మోదీ సొంత రాష్ట్రం గుజరాత్‌లోని అహ్మదాబాద్ చేరుకుంటారు. పారిశ్రామికవేత్తలతో సమావేశమై పెట్టుబడులు, వాణిజ్య సంబంధాలపై చర్చిస్తారు. 22న ఢిల్లీలో మోదీతో సమావేశమవుతారు. రక్షణ, దౌత్య, ఆర్థిక రంగాల్లో వ్యూహాత్మక బంధాలపై ప్రధానంగా చర్చిస్తారని సమాచారం. ఇ రుపక్షాల మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం, ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధంపైనా చర్చ జరగనుంది. ప్రపంచంలో బలమైన ఆర్థిక శక్తిగా భారత్ ఎదుగుతోందంటూ ఈ సందర్భంగా జాన్సన్ ప్రశంసలు కురిపించారు. ‘అరాచక దేశాల వల్ల భారత్, ఇంగ్లాండుల్లో శాంతికి ముప్పుంది. ఇలాంటి దుర్భర పరిస్థితుల్లో భారత్ మాకు వ్యూహాత్మక భాగస్వామ్య దేశం’ అన్నారు. తనది ఉభయతారక పర్యటన కాగలదని ఆకాంక్షించారు. చదవండి: త్వరలో ఉద్యోగులకు సీఎం స్టాలిన్ శుభవార్త? -
Russia War: యుద్ధం వేళ పుతిన్ సంచలన నిర్ణయం
మాస్కో: ఉక్రెయిన్‌లో రష్యా బలగాలు దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. యుద్ధం వేళ రష్యా మరో సంచలన నిర్ణయం తీసుకుంది. బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్‌పై రష్యా నిషేధం విధించింది. బోరిస్ జాన్సన్ రష్యాలోకి రాకుండా ఉండేలా చర్యలు తీసుకున్నది. అయితే, ఉక్రెయిన్‌లో యుద్దం జరుగుతున్న సమయంలో బ్రిటన్ ప్రధాని బోరిస్.. యుద్ద ప్రభావిత ఉక్రెయిన్‌లో పర్యటించారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీతో కలిసి అక్కడి పరిస్థితులను ప్రత్యక్షంగా తిలకించారు. ఆ తర్వాత రష్యా దాడులను తీవ్రం ఖండించారు. ఇక, అంతకు ముందే యూరోపియన్ యూనియన్, యూకే.. రష్యాపై భారీ ఆంక్షలు విధించాయి. రష్యాకు చెందిన 350 మంది వ్యక్తులు, సంస్థలపై ఆంక్షలు విధించాయి. అంతేకాకుండా రష్యాకు లగ్జరీ వస్తువుల ఎగుమతిని నిషేధించాయి. దీంతో రష్యా.. బ్రిటన్‌పై ఆంక్షలు విధిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ సందర్భంగా రష్యా విదేశాంగ మంత్రి లిజ్ ట్రాస్ స్పందిస్తూ.. బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్‌తో పాటుగా మాజీ ప్రధాని థెరిసా మే, స్కాట్లాండ్ మినిస్టర్ నికోలా స్టర్జియన్‌తో పాటు మరో 13 మంది బ్రిటీష్ ప్రభుత్వాధికారులపై నిషేధాన్ని విధిస్తున్నట్లు తెలిపారు. రష్యా సీనియర్ అధికారులపై బ్రిటన్ చర్యలు తీసుకున్న నేపథ్యంలో రష్యా కూడా ఆంక్షలను విధించినట్టు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. ఉక్రెయిన్‌తో పోరులో రష్యాకు వ్యతిరేకంగా ఉన్నారని పుతిన్ ఇప్పటికే అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, న్యూజిలాండ్ ప్రధాని, ఆస్ట్రేలియా ప్రధానితో సహా ఆయా దేశాలకు చెందిన ప్రముఖులపై నిషేధం విధించిన విషయం తెలిసిందే. మరోవైపు.. ఉక్రెయిన్‌లో రష్యా బలగాలు దాడులను తీవ్రతరం చేశాయి. ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లో ఉన్న మిలిటరీ ఫ్యాక్టరీపై రష్యా సైన్యం దాడి చేసింది. హై ప్రిసిషన్ మిస్సైళ్లతో 16 శత్రు టార్గెట్లను ధ్వంసం చేసినట్లు రష్యా తెలిపింది. కీవ్‌తో పాటు మైకోలైవ్‌లో ఉన్న మిలిటరీ సామాగ్రిని రిపేర్ షాపును క్షిపణతో ధ్వంసం చేసినట్టు రష్యా అధికారులు వెల్లడించారు. #Russia has banned #British Prime Minister Boris Johnson and a number of politicians and parliamentarians from the United Kingdom from entering the country. pic.twitter.com/VvbrJChdIg — NEXTA (@nexta_tv) April 16, 2022 -
చైనా ఎందుకలా చేస్తోంది.. ఇప్పటికైనా మేల్కొంటే బెటర్!
లండన్: రష్యా, ఉక్రెయిన్ సంక్షోభంలో సరైన పక్షంవైపు నిలవాల్సిందిగా చైనాకు ఇంగ్లండ్ ప్రధాని బోరిస్ జాన్సన్ సూచించారు. నియంతృత్వ ప్రపంచ స్థాపనకు కలలుగంటున్న రష్యా అధ్యక్షుడు పుతిన్ యుద్ధ పిపాసను చైనా ఇప్పటికీ ఖండించడం లేదంటూ తప్పుబట్టారు. చైనా మదిలో మరేదో ఆలోచన ఉందని జాన్సన్ అనుమానం వ్యక్తం చేశారు. సండే టైమ్స్ వార్త సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్ ప్రతిఘటన పుతిన్‌తో పాటు చైనాను కూడా షాక్‌కు గురి చేసిందని అభిప్రాయపడ్డారు. ఇప్పటికైనా చైనా మేల్కోవాలని తప్పుడు వైఖరితో ఇబ్బందుల్లో పడొద్దని సూచించారు. యుద్ధం అనేది దురదృష్టకర ఘటన అని.. అయితే, ఎవరిది తప్పు, ఎవరిది ఒప్పు అని తర్కించలేనని అన్నారు. ఏదేమైనా తమ మద్దతు మాత్రం ఉక్రెయిన్కేనని ఆయన స్పష్టం చేశారు. చాలా దేశాలు పుతిన్ దూకుడుచూసి భయపడుతున్నాయని, అయితే ఉక్రెయిన్ త్వరగా కోలుకుంటుందని జాన్సన్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఇదిలాఉండగా.. పుతిన్‌తో చర్చలకు సిద్ధమని జెలెన్స్కీ మరోసారి చెప్పారు. సమస్యలను చర్చలతో పరిష్కరించుకుందామని రెండేళ్లుగా చెప్తూ వస్తున్నానన్నారు. చర్చలు తప్ప యుద్ధాన్ని ఆపడానికి మరో మార్గం లేదన్నారు. చర్చల ప్రయత్నాలు విఫలమైతే మూడో ప్రపంచ యుద్ధ అనివార్యమని ఆయన హెచ్చరించారు. (చదవండి: బడిపై రష్యా బాంబుల వర్షం.. 150 మంది సేఫ్.. మిగతావారి పరిస్థితి!) -
జూమ్ కాల్లో 800 మంది ఉద్యోగుల తొలగింపు! మరి ఇంత దుర్మార్గమా..ప్రధాని ఆగ్రహం!
మీకు బెటర్ డాట్ కామ్ సీఈఓ విశాల్ గార్గ్ చేసిన నిర్వాకం తెలిసే ఉంటుంది. భారత సంతతికి చెందిన విశాల్ గార్గ్ 2016నుంచి 'బెటర్ డాట్ కామ్' అనే సంస్థ ద్వారా మోర్టగేజ్ లెండింగ్ కార్యకాలాపాల్ని నిర్వహిస్తున్నాడు. గతేడాది డిసెంబర్ నెలలో జూమ్ మీటింగ్‌లో కేవలం మూడే నిమిషాల్లో 900 మందికి ఉద్యోగాల నుంచి తీసేస్తున్నట్లు ప్రకటించి తీవ్ర విమర్శల పాలయ్యారు. తాజాగా మరో కంపెనీ సీఈఓ 3నిమిషాల జూమ్ కాల్లో 800మంది ఉద్యోగాల నుంచి తొలగించాడు. ప్రస్తుతం ఈ అంశం యూకే వ్యాప్తంగా హాట్ టాపిగ్గా మారింది. ఆ దేశ ప్రధాని బోరిస్ జాన్సన్ సైతం ఉద్యోగుల పట్ల సంస్థ వ్యవహరిస్తున్న తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పీ&ఓ ఫెర్రీస్ అనే బ్రిటీష్ షిప్పింగ్ కంపెనీ యూకే, ఐర్లాండ్, యూరప్ దేశాల్లో వ్యాపార కార్యకలాపాల్ని నిర్వహిస్తుంది. ఈ నేపథ్యంలో సంస్థలో పనిచేస్తున్న 800 మందిని జూమ్ కాల్లో విధుల నుంచి తొలగిస్తున్నట్లు ఆ సంస్థ సీఈఓ జానెట్ బెల్ ప్రకటించారు. P&O ferries doing mass sacking by zoom call https://t.co/lhvkGTiP7g — David Dryburgh (@DavyDryburgh) March 17, 2022 నిధుల దుర్వినియోగం కరోనా కారణంగా విధించిన లాక్ డౌన్లో 1100 మంది ఉద్యోగులకు జీతాలిచ్చేందుకు పీ&ఓ యాజమాన్యం యూకే ప్రభుత్వం నుంచి 10 మిలియన్లను అప్పుగా తీసుకుంది. అయితే కోవిడ్ దెబ్బతో గత రెండేళ్లలో కంపెనీ 200 మిలియన్ డాలర్ల నష్టాల్ని చవిచూసింది. అదే సమయంలో యూకే ప్రభుత్వం ఇచ్చిన నిధుల్ని దుర్వినియోగం చేయడం, తీసుకున్న మొత్తాన్ని తిరిగి చెల్లించకపోవడం వంటి అంశాలు తెరపైకి వచ్చాయి. అందుకే నష్టాల్ని కారణంగా చూపిస్తూ జానెట్ బెల్ జూమ్ కాల్ మీటింగ్ లో విధుల నుంచి ఉద్యోగుల్ని తొలగిస్తున్నట్లు చెప్పారు. ప్రధాని ఆగ్రహం ఉద్యోగుల పట్ల పీ&ఓ ఫెర్రీస్ సంస్థ వ్యవహరిస్తున్న తీరుపై యూకే ప్రధాని బోరిస్ జాన్సన్ స్పందించారు. ఉద్యోగం నుంచి తీసివేస్తున్నామని ఇలా ప్రకటించడం సరైన పద్దతి కాదు. సంవత్సరాలుగా కష్టపడి పనిచేస్తూ, సంస్థను అలాగే అంటి పెట్టుకొని, కరోనా కష్టకాలంలో సంస్థకు వెన్నంటే ఉన్నారు. అలాంటి ఉద్యోగుల పట్ల మర్యాదగా మెలగాలి. ఇలా దుర్మార్గంగా వ్యవహరించకూడదు అంటూ యూకే ప్రధాని కార్యాలయం స్పోక్ పర్సన్ తెలిపారు. అంతేకాదు ఉద్యోగుల వ్యవహారంలో కంపెనీ తీసుకున్న నిర్ణయం వెనక్కి తీసుకోవాలని, లేదంటే యూకే ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందంటూ హెచ్చరించారు. చదవండి: విశాల్ గార్గ్ ఎంత దుర్మార్గంగా ఆలోచించాడంటే.. -
ఉక్రెయిన్ పిల్లలే మిమ్మల్ని రక్షిస్తున్నారు!’
లండన్: పుతిన్ యుద్ధోన్మాదం నుంచి తమను కాపాడేందుకు పాశ్చాత్య దేశాలు ఎందుకు ముందుకు రావడం లేదని డారియా కాల్నిక్ అనే ఉక్రెయిన్ మహిళా జర్నలిస్టు ఆవేదనతో ప్రశ్నించారు. పోలాండ్ ఒక భేటీలో పాల్గొన్న బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్‌ను ఈ మేరకు నిలదీశారు. ఉక్రెయిన్ ప్రజలను రక్షించేందుకు ఆయన భయపడుతున్నారరు. ఉక్రెయిన్ను నో ఫ్లై జోన్‌గా నాటో ప్రకటించకపోవడంతో తమ పిల్లలు, మహిళలు వైమానిక దాడులకు బలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ‘ఒకరకంగా మా పిల్లలు బలై మిమ్మల్ని కాపాడుతున్నారు. వారి చాటున నాటో దాక్కుంటున్నట్టే లెక్క’ అని దుయ్యబట్టారు. అయితే జాన్సన్, చేయగలిగిందంతా చేస్తానని, నేరుగా సైన్యాన్ని పంపలేనని ఆమెకు సమాధానం ఇచ్చారు. Ukrainian journalist makes emotional plea to Boris Johnson. Pleas for NATO cover on the border to allow refugees cross safely, asks why Abramovich and Putin’s children she claims are in London and the EU are not sanctioned while people in Ukraine dying pic.twitter.com/KGxL0VwzVY — Lisa O'Carroll 🇺🇦 (@lisaocarroll) March 1, 2022 -
ఉక్రెయిన్ బంధువులకు యూకే వీసాలు
లండన్: వలసబాట పట్టిన ఉక్రెనియన్లు తమ దేశానికి రావచ్చంటూ బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ప్రకటించారు. యూకేలో సమీప బంధువులుంటే వారికి వీసాలను అందజేస్తామని తెలిపారు. ఉక్రెయిన్‌కు బ్రిటన్ 40 మిలియన్ పౌండ్లు విలువైన వైద్య పరికరాలు, మందులు వంటి కనీస అవసరాలను అందజేస్తామని ప్రకటించింది. దీంతో ఉక్రెయిన్‌కు అందజేసే సాయం మొత్తం 140 మిలియన్ పౌండ్లకు చేరుకుంది. -
రష్యా బలగాలు విఫలం?..అందుకే బెలారస్ దిగనుందా?
Belarus may join Ukraine war: ఐక్యరాజ్యసమితిలో రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి సంబంధించిన పలు వాదనలు వినిపించాయి. గత వారం రష్యా దాడి ప్రారంభమైనప్పటి నుంచి సుమారు 3 వేల మంది రష్యన్ సైనికులు మరణించారని, దాదాపు 200 మంది సైనికులను యుద్ధ ఖైదీలుగా పట్టుకున్నామని ఉక్రెయిన్ పేర్కొంది . అయితే వాటిని క్రెమ్లిన్ తిరస్కరించింది. ముందస్తు షరతులు లేకుండా చర్చలు జరపడానికి ఇరు దేశాలు అంగీకరించాయని ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోదిమిర్ జెలెన్స్కీ చెప్పారు. అయితే ఇప్పటి వరకు మాస్కో ఉక్రెయిన్ పై జరిపిన దాడిలో 14 మంది చిన్నారులతో సహా 352 మంది మరణించగా, 116 మంది చిన్నారులతో సహా వెయ్యి మంది గాయపడ్డారని తెలిపారు. మరోవైపు బెలారస్ కూడా రష్యాతో జత కట్టి ఉక్రెయిన్‌కి ఊహించని ఝలక్ ఇచ్చింది. మాస్కో దాడితో ఉక్రెయిన్‌లోని రష్యా బలగాలు క్షీణించడంతో వారికి సాయంచేసేందుకు బెలారస్ తన దళాలలను పంపనుందని సమాచారం. ముఖ్యాంశాలు: ఉక్రెయిన్ పై యుద్ధం చేస్తున వేళ రష్యా అధ్యక్షుడు మరో కీలక ప్రకటన చేశారు. దేశంలో అణ్వాయుద దళాలు అప్రమత్తంగా ఉండాలని రక్షణ శాఖ మంత్రి తోపాటు సాయుధ దళాల జనరల్ చీఫ్ స్టాఫ్‌ని రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్ ఆదేశిశించారు. మరోవైపు ఉక్రెయిన్ పై రష్య చేస్తున్న దాడిని వ్యతిరేకిస్తూ ప్రపంచదేశాల గత కొన్నిరోజులుగా రష్యా పై పలు ఆంక్షల విధించాయి. దేశంలో అతి పెద్ద బ్యాంకు అయిన స్విఫ్ట్ నుంచి రష్యాకి సంబంధించిన కీలక బ్యాంకులను తొలగిస్తానంటూ ఊహించని షాక్ ఇచ్చింది. యూకే ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్‌తో ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోదిమిర్ జెలెన్స్కీ జరిపిన చర్చల్లో రాబోయే 24 గంటలు ఉక్రెయిన్‌కి కీలకం' అని చెప్పారు. ఉక్రెయిన్‌కి కావల్సిన రక్షణ సాయాన్ని యూకే దాని మిత్ర దేశాలు తప్పక చేస్తాయని జాన్సన్ హామీ ఇచ్చారు. రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ ప్రతినిధి మేజర్ జనరల్ ఇగోర్ కోనాషెంకోవ్ తమ సహచరుల్లో కూడా చనిపోయిన వారు ఉన్నారని కానీ ఉక్రెయిన్ దళాలతో పోలిస్తే రష్యా చాలా తక్కువ మందిని మాత్రమే నష్టపోయిందని నొక్కిచెప్పారు. యూరోపియన్ యూనియన్ చీఫ్ ఉర్సులా వాన్ డెర్ లేయన్, 27-దేశాల కూటమి రష్యన్ యాజమాన్యం ఆధ్వర్యంలోనివి లేదా నియంత్రణలో ఉన్న విమానాల కోసం గగనతలాన్ని మూసివేస్తుందని చెప్పారు. అంతేకాదు ఒలిగార్చ్‌ల ప్రైవేట్ జెట్లతో సహా కెనడా కూడా రష్యన్ ఎయిర్‌లైన్స్ కోసం తన గగనతలాన్ని మూసివేసిందని తెలిపారు. (చదవండి: బ్యాంక్ దిగ్బంధనం... ఏటీఎంకి క్యూ కట్టిన రష్యన్ వాసులు) -
హోంక్వారంటైన్‌కు బ్రిటన్ గుడ్‌బై
లండన్: కరోనాతో సహజీవనం అనే ప్రణాళికకు బ్రిటన్ ప్రభుత్వం కసరత్తు ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా కోవిడ్–19 సోకితే 10 రోజులు హోంక్వారంటైన్ ఉండాలన్న నిబంధనలను ఎత్తివేసింది. దీనిపై సోమవారం అధికారిక ప్రకటన వెలువడనుంది. బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ గత కొద్ది రోజులుగా కరోనాతో సహజీవనం అనే ప్రణాళికపైనే దృష్టిసారించారు. కొద్ది రోజుల క్రితం మాస్కులు తప్పనిసరి కాదని చెప్పిన ఆయన ఇప్పుడు సెల్ఫ్ ఐసొలేషన్ నిబంధనల్ని కూడా ఎత్తేశారు. బోరిస్ జాన్సన్ ఆదివారం ఒక వార్తా సంస్థతో మాట్లాడుతూ కోవిడ్‌పై వ్యాక్సినే బ్రహ్మాస్త్రమని, గత రెండేళ్లలో టీకాలు తీసుకుంటూ కరోనా వైరస్‌ను ఎదుర్కొనే రోగనిరోధకతను సాధించామన్నారు. ప్రజ లందరిలోనూ వైరస్ పట్ల శాస్త్రీయపరమైన అవగాహన రావడంతో ఇకపై కోవిడ్‌తో సహజీవనం చేసే విధంగా ప్రణాళికలను రూపొందించాల్సిన అవసరం ఉందన్నారు. ‘‘కోవిడ్ హఠాత్తుగా అదృశ్యమైపోదు. ఈ వైరస్‌తో కలిసి బతుకుతూ దాని నుంచి అనుక్షణం మనల్ని మనం కాపాడుకునే ప్రయత్నాలు చేయాలి. మన స్వేచ్ఛకు అడ్డంకిగా మారిన ఆంక్షల్ని సడలించాలి’’ అని జాన్సన్ పేర్కొన్నారు. దేశ జనాభాలో 12 ఏళ్లకు పైబడిన వారిలో 91 శాతం మందికి మొదటి డోసు పూర్తయితే, 85 శాతం మంది రెండు డోసులు తీసుకున్నారు. నిబంధనలు ఎత్తివేయడంపై ఆరోగ్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తుంటే, ప్రతిపక్ష లేబర్ పార్టీ యుద్ధం ముగిసే ముందు జాన్సన్ విజయాన్ని ప్రకటించుకున్నట్టుగా వ్యవహరిస్తున్నారని విమర్శిస్తోంది. క్వీన్ ఎలిజబెత్‌కు కరోనా బ్రిటన్ రాణి క్వీన్ ఎలిజబెత్‌కు కోవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణైంది. ఆమెకి లక్షణాలు స్వల్పంగా ఉన్నాయని బకింగ్హమ్ ప్యాలెస్ వెల్లడించింది. రాణి ఆరోగ్యాన్ని వైద్యులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారని తెలిపింది. ఆమె రెండు డోసులతో పాటు బూస్టర్ డోసు కూడా తీసుకున్నారు. -
వివాదంలో బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్.. పదవికి ఎసరు?
లండన్ : బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ వివాదంలో ఇరుకున్నారు. దేశంలో లాక్డౌన్ అమలులో ఉన్న సమయంలో ప్రధాని నివాసం ఉన్న డౌనింగ్ స్ట్రీట్‌లో జరిగిన ఓ పార్టీ వ్యవహారానికి సంబంధించిన కేసులో పోలీసులు ఆయనకు పలు ప్రశ్నలతో కూడిన లేఖను పంపించారు. ప్రశ్నలకు సమాధానం ఇచ్చేందుకు గాను ఆయనకు వారం రోజుల గడువు విధించారు. ఈ విషయాన్ని ప్రధాని కార్యాలయం ధ్రువీకరించింది. అయితే, కోవిడ్ వ్యాప్తి కారణంగా బ్రిటన్‌లో లాక్డౌన్ విధించిన విషయం తెలిసిందే. కాగా, లాక్డౌన్ అమలులో ఉన్న సమయంలో డౌనింగ్ స్ట్రీట్ నంబర్ 10లో మందు పార్టీలు జరిగినట్టు పోలీసులు నిర్ధారించారు. ఈ పార్టీలకు అధికార పార్టీకి చెందినవారు వెళ్లినట్టు పోలీసులు గుర్తించారు. దీంతో ప్రధాని దంపతులతోపాటు దాదాపు 50 మందికి పోలీసులు పలు ప్రశ్నలను సంధిస్తూ లేఖలు పంపారు. ఇదిలా ఉండగా ఈ విషయంపై పలువురు మాజీ నేతలు జాన్సన్‌పై విమర్శలు చేస్తున్నారు. కోవిడ్ నిబంధనలను ప్రధాని ఉల్లంఘిస్తే ఆయన జరిమానాను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో కన్జర్వేటివ్ పార్టీ మాజీ నేత ఐయాన్డంకన్ స్మిత్ మాట్లాడుతూ.. ప్రధాని బోరిస్ జాన్సన్ కోవిడ్ నింబంధనలు ఉల్లంఘించినట్లు రుజువైతే ఆయన పదవిలో కొనసాగడం కష్టమేనని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. -
బోరిస్ జాన్సన్ సన్నిహితుల రాజీనామా
లండన్: పార్టీగేట్ కుంభకోణం బ్రిటిన్ను కుదిపేస్తోంది. ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్‌కు సన్నిహితులైన నలుగురు ఉన్నతాధికారులు తమ పదవులకు రాజీనామా చేశారు. ఆరోపణల నుంచి బయటపడేందుకు బోరిస్ జాన్సన్ వారితో రాజీనామా చేయించినట్లు తెలుస్తోంది. ప్రధానమంత్రి పాలసీ చీఫ్ మునిరా మీర్జా, చీఫ్ ఆఫ్ స్టాఫ్ డాన్ రోసెన్ఫీల్డ్, ప్రిన్సిపల్ ప్రైవేట్ సెక్రెటరీ మార్టిన్ రేనాల్డ్, కమ్యూనికేషన్ డైరెక్టర్ జాక్ డోయెల్ తాజాగా తమ పదవుల నుంచి తప్పుకున్నారు. కోవిడ్–19 మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో యునైటెడ్ కింగ్డమ్(యూకే) అంతటా కఠినమైన ఆంక్షలు అమలవుతున్న సమయంలో ప్రధానమంత్రి అధికార నివాసమైన డౌనింగ్ స్ట్రీట్‌లో విచ్చలవిడిగా విందులు చేసుకున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. -
మాస్కు ఆంక్షలను ఎత్తేసిన ఇంగ్లండ్
లండన్: మాస్కులు తప్పనిసరి సహా పలు కోవిడ్ ఆంక్షలను ఇంగ్లండ్ గురువారం ఎత్తేసింది. బూస్టర్ డోస్ టీకా తీవ్రమైన అనారోగ్యంతోపాటు ఆస్పత్రుల్లో చేరడాన్ని తగ్గించిందని బ్రిటన్ ప్రభుత్వం ప్రకటించిన అనంతరం ఇంగ్లండ్ ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో గురువారం నుంచి ఇంగ్లండ్‌లో ఎవ్వరూ మాస్కులు ధరించాల్సిన అవసరం లేదు. ఇక నైట్ క్లబ్బులు, ఇతర వేదికలకు కోవిడ్ పాసులు కూడా అవసరం లేదని తెలిపింది. ఇక ఇంటినుంచే పని, స్కూళ్లలో ఫేస్ మాస్కుల నిబంధనను గత వారమే ప్రభుత్వం ఎత్తివేసింది. ఓమిక్రాన్ వేరియంట్ వేగవంతమైన వ్యాప్తిని అడ్డుకోవడానికి, బూస్టర్ డోస్ వేసుకోవడానికి సమయమిస్తూ డిసెంబర్ మొదటివారం నుంచే ‘ప్లాన్ బి’ చర్యలు ప్రారంభించింది. అందరికీ బూస్టర్ డోసు టీకాలు వేయడంతోపాటు, నిర్ధారణ పరీక్షలు, యాంటీ వైరల్ చికిత్సలను అందించడంలో యూరప్ బలంగా పనిచేసిందని ఆరోగ్య కార్యదర్శి సాజిద్ జావీద్ తెలిపారు. వైరస్ పూర్తిగా నిర్మూలనయ్యే అవకాశం లేదని, వైరస్‌తో సహజీవనం నేర్చుకున్నామని ఆయన తెలిపారు. దేశంలో ఒమిక్రాన్ తగ్గుముఖం పడుతున్నా.. పిల్లలు, వృద్ధుల్లో ఎక్కువగా ఉందని పేర్కొన్నారు. 12 ఏళ్లు పైబడినవారందరికీ వ్యాక్సినేషన్ 84 శాతం పూర్తయ్యిందని, అర్హత ఉన్నవాళ్లంతా రెండో డోసు తీసుకున్నారని, 81 శాతం మంది బూస్టర్ డోసు కూడా తీసుకున్నారని వెల్లడించారు. ఆస్పత్రుల్లో చేరిక, ఐసీయూ చికిత్సలో ఉన్నవారి సంఖ్య స్థిరంగా కొనసాగుతోందని, కొత్త సంవత్సరం సమయంలో రోజుకు రెండులక్షలున్నా ఇప్పుడు లక్షకు పడిపోయాయని తెలిపారు. మరోవైపు గురువారం యూకేలో 96,871 కొత్త కేసులు నమోదయ్యాయి. 338 మరణాలు సంభవించాయి. గతవారమే ప్రకటన ఒమిక్రాన్ బారిన పడినవారి సంఖ్య గరిష్ట స్థాయికి చేరుకుందని ప్రధాని బోరిస్ జాన్సన్ గత వారమే ప్రకటించారు. అయితే... తమ వినియోగదారులను ఫేస్ మాస్కులు ధరించమని కోరతామని కొన్ని దుకాణదారులు, రవాణా సంస్థలు ప్రకటించిన నేపథ్యంలో ప్రభుత్వం చట్టపరమైన చర్యల నుంచి తప్పుకొంది. ఇక అయితే రాజధానిలోని బస్సులు, సబ్ వే రైళ్లలో ఇప్పటికీ మాస్కులు వసరమని లండన్ మేయర్ సాధిక్ ఖాన్ తెలిపారు. ఇక ఒమిక్రాన్ సోకి వారికి ఐదురోజుల ఐసోలేషన్ సరిపోతుందన్నారు. కోవిడ్ 19ను ఫ్లూలాగా పరిగణించి దీర్ఘకాలిక ప్రణాళిక తయారు చేస్తున్నట్లు అక్కడి ఆరోగ్యాధికారులు తెలిపారు. స్కాట్లాండ్, వేల్స్, ఉత్తర ఐర్లాండ్‌లు సొంత ప్రజారోగ్య నియమాలను రూపొందించుకున్నాయి. అదేవిధంగా వారి వైరస్ నిబంధనలను కొంత సడలించాయి. -
పార్టీ గేట్ వివాదం; బ్రిటన్ ప్రధానికి షాక్
లండన్ : బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ చుట్టూ బిగుసుకున్న పార్టీ గేట్ వివాదం మరింత ముదురుతోంది. కరోనా మహమ్మారి కోరలు చాచిన వేళ తన అధికారిక నివాసం 10 డౌనింగ్ స్ట్రీట్‌లో విందులు వినోదాలు చేసుకున్నారన్న వివాదంపై విచారణ కొనసాగుతున్న విషయం తెలిసిందే. 2020 జూన్ 19న జాన్సన్ 59వ పుట్టిన రోజునాడు కేక్ పార్టీ జరిగినట్టు తమకు సమాచారం అందిందని మెట్రోపాలిటన్ పోలీసులు వెల్లడించారు. ఇప్పటికే పార్టీ గేట్ వివాదంపై ఇంటర్నల్ కేబినెట్ ఆఫీసు ఎంక్వయిరీ జరుగుతోంది. ఈ వారంలో దాని నివేదిక వచ్చే అవకాశం ఉంది. ఆ విచారణ సందర్భంగానే జాన్సన్ బర్త్ డే రోజు కూడా పార్టీ జరిగిందని వెల్లడైంది. గత రెండేళ్లలో డౌనింగ్ స్ట్రీట్, వైట్ హాలులో లెక్కలేనన్ని పార్టీలు జరిగాయని వాటిపై మెట్రోపాలిటన్ పోలీసుల బృందం విచారణ జరుపుతుందని కమిషనర్ డేమ్ క్రెస్సిడా డిక్ చెప్పారు. మరోవైపు 10 డౌనింగ్ స్ట్రీట్ ప్రతినిధులు మాత్రం జాన్సన్ తన పుట్టినరోజు నాడు సి బ్బంది శుభాకాంక్షలు చెప్పడానికి వస్తే కేవలం 10 నిముషాలే ఉన్నారని వాదిస్తున్నారు. (చదవండి: ఉరిమి ఉరిమి.. యూఏఈ నెత్తిన! ఎందుకిలా జరుగుతోంది?) -
గరిష్టానికి ఒమిక్రాన్ కేసులు.. అక్కడ ఇక మాస్కు తప్పనిసరి కాదు!
లండన్: దేశంలో కరోనా కట్టడికి అమలు చేస్తున్న నిబంధనల్లో చాలావాటిని బ్రిటీష్ ప్రభుత్వం తొలగించింది. దేశంలో ఒమిక్రాన్ కేసులు గరిష్టానికి చేరినందున (అంటే అంతకుమించి ఇక పెరగవని అర్థం) ఈ నిబంధనలు తొలగిస్తున్నామని బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ఇటీవల ప్రకటించారు. దీంతో ఇకపై ఎక్కడైన తప్పనిసరిగా మాస్కు ధరించాలన్న నిబంధన వచ్చే గురువారం నుంచి రద్దు కానుంది. అలాగే పెద్ద పెద్ద కార్యక్రమాలకు హాజరయ్యేవారు టీకా సర్టిఫికెట్ తప్పక తీసుకరావాలన్న నిబంధన కూడా కనుమరుగుకానుంది. గురువారం నుంచి పాఠశాల గదుల్లో మాస్కులు తప్పనిసరి నిబంధన కూడా తొలగించనున్నట్లు ప్రధాని చెప్పా రు. ప్రజలు వర్క్ ఫ్రం హోం చేయాల్సిన అవసరం లేదని, ఉద్యోగులు భౌతిక హాజరుపై తమ సంస్థలతో చర్చించాలని సూచించారు. అయితే కరోనా వ్యాప్తి నివారణకు తప్పనిసరి మాస్కుధారణ నిబం ధన కొనసాగిస్తామని స్కాట్లాండ్ డిప్యూటీ ఫస్ట్ మినిస్టర్ జాన్ స్విన్నీ చెప్పారు. బ్రిటన్‌లో లాగా తాము నిబంధనలు ఎత్తివేయడం లేదన్నారు. పార్లమెంట్ సూచన మేరకు నిబంధనలు కొనసాగిస్తామని, పార్లమెంట్ సూచిస్తే నిబంధనలు మారుస్తామని చెప్పా రు. పబ్లిక్ స్థలాల్లో మాస్కు ధారణ తప్పదన్నారు. ప్లాన్ బీ టు ఏ ఓఎన్ఎస్ (ఆఫీస్ ఆఫ్ నేషనల్ స్టాటిస్టిక్స్) అంచనా ప్రకారం దేశమంతా ఒమిక్రాన్ గరిష్టానికి చేరిందని హౌస్ ఆఫ్ కామన్స్‌కు ప్రధాని తెలిపారు. ఓఎన్ఎస్ డేటా ప్రకారం కొన్ని ప్రాంతాలు మినహా ఇంగ్లండ్‌లో ఇన్ఫెక్షన్ స్థాయిలు పడిపోతున్నాయని వెల్లడించారు. ప్లాన్ బీ (తీవ్ర నిబంధనలు) నుంచి ప్లాన్ ఏ (స్వల్ప నిబంధనలు)కు మరలేందుకు కేబినెట్ అంగీకరించిందని చెప్పారు.దేశంలో ఆస్పత్రిలో చేరికలు క్రమంగా తగ్గిపోతున్నాయని, ఐసీయూ అడ్మిషన్లు కూడా పడిపోయాయని వివరించారు. సెల్ఫ్ ఐసోలేషన్ లాంటి కొన్ని నిబంధనలు మాత్రం కొనసాగుతాయన్నారు. బ్రిటన్‌లో ఈ సెల్ఫ్ ఐసోలేషన్ సమయాన్ని 7 నుంచి 5 రోజులకు గత సోమవారం నుంచి తగ్గించారు. మార్చి నాటికి సెల్ఫ్ ఐసోలేషన్ నిబంధన కూడా ఎత్తివేస్తామని బోరిస్ అంచనా వేశారు. కోవిడ్ దాదాపు ఎండమిక్ దశకు చేరుతోందని, అయినా ప్రజలు అప్రమత్తంగా ఉండడం మంచిదని సూచించారు. -
బ్రిటన్ ప్రభుత్వం సంచలన నిర్ణయం
-
విజృంభిస్తున్న ఒమిక్రాన్..క్రిస్మస్ తర్వాత రెండు వారాల లాక్డౌన్!
UK Omicron Lockdown:: వేగంగా వ్యాపిస్తున్న ఒమిక్రాన్ వేరియెంట్ విస్తృతిని అడ్డుకోవడానికి కిస్మస్ తర్వాత రెండు వారాల లాక్డౌన్ విధించే ప్రణాళిక యునైటెడ్ కింగ్డమ్ (యూకే) ప్రభుత్వం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. కోవిడ్–19 కట్టడికి శాస్త్రవేత్తల సలహా బృందం (సేజ్) ప్రధాని బోరిస్ జాన్సన్ ముందు ఉంచిన పలు ప్రతిపాదనల్లో రెండు వారాల లాక్డౌన్ సిఫారసు కూడా ఉంది. యూకేలో గురువారం 88,376, శుక్రవారం 93,045 కేసులు వచ్చాయి. లండన్‌లో శుక్రవారం ఒక్కరోజే 26 వేలకు పైగా కేసులు నమోదు కావడంతో నగర మేయర్ సాదిక్ ఖాన్ హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించారు. ఒకవైపు ఆసుపత్రుల్లో చేరే వారే సంఖ్య పెరుగుతుండగా... మరోవైపు సిబ్బంది గైర్హాజరు పెరుగుతోంది. దాని కి తోడు లండన్, స్కాట్లాండ్లలో ఒమిక్రాన్ కేసులు ఎక్కవగా నమోదవుతున్నాయి. సాధారణ పరిస్థితుల్లో ప్రభుత్వాసుత్రుల్లో అందేస్థాయి సేవలు అందకపోవచ్చనే సంకేతాలను మేయర్ ఇచ్చారు. ► నెదర్లాండ్‌లో ఆదివారం నుంచి కఠిన లాక్‌డౌన్‌ను అమలు చేయనున్నట్లు అపద్ధర్మ ప్రధాని మార్క్ రుట్టే ప్రకటించారు. ఒమిక్రాన్‌తో ఐదోవేవ్ విరుచుకుపడుతున్నందువల్ల తప్పట్లేదన్నారు. ► ఫ్రాన్స్ నూతన సంవత్సర వేడుకలపై నిషేధం విధించింది. ‘జనవరి ఆరంభానికల్లా ఒమిక్రాన్ ప్రధాన వేరియెంట్‌గా అవతరించే అవకాశాలున్నాయి. ఐదోవేవ్ వచ్చేసింది, పూర్తిస్థాయిలో విరుచుపడుతోంది’ అని ఫ్రాన్స్ ప్రధాని జీన్ కాస్తక్స్ ప్రకటించారు. క్రిస్మస్కు పెద్ద సంఖ్యలో గుమిగూడొద్దని, వేడుకల్లో పాల్గొనే కుటుంబసభ్యుల సంఖ్యను కూడా పరిమితం చేయాలని కోరారు. ► డెన్మార్క్ థియేటర్లను, సంగీత కచేరి నిర్వహించే హాళ్లను, మ్యూజియంలు, అమ్యూజ్మెంట్ పార్కులను మూసివేసింది. డెల్టా కంటే ఒమిక్రాన్ వేగమెక్కువ: డబ్లు్యహెచ్‌ఓ జెనీవా: కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్‌ను 89 దేశాల్లో గుర్తించారని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్లు్యహెచ్‌ఓ) తెలిపింది. డెల్టా కన్నా ఇది చాలా వేగంగా వ్యాపిస్తోందని, దీని వ్యాప్తి అధికంగా ఉన్న ప్రాంతాల్లో 1.5–3 రోజుల్లోనే ఇది రెట్టింపవుతోందని హెచ్చరించింది. అందుబాటులో ఉన్న గణాంకాల ఆధారంగా శుక్రవారం ఒమిక్రాన్‌పై సంస్థ ఒక నివేదికను విడుదల చేసింది. సమూహ వ్యాప్తి జరుగుతున్న చోట డెల్టాను ఈ వేరియంట్ మించిపోగలదని తెలిపింది. -
పండంటి పాపాయికి జన్మనిచ్చిన బ్రిటన్ ప్రధాని భార్య
సాక్షి, న్యూఢిల్లీ: బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ (57) మరోసారి తండ్రయ్యారు. ఆయన భార్య క్యారీ సైమండ్స్ గురువారం తెల్లవారు జామున లండన్ ఆసుపత్రిలో పండంటి పాపకు జన్మనిచ్చారు. తల్లీ బిడ్డ ఇద్దరూ క్షేమంగానే ఉన్నారని అధికార ప్రతినిధి తెలిపారు. ఈ సంవత్సరం మేలో వివాహం చేసుకున్న ఈ జంటకు 2020 ఏప్రిల్‌లో విల్ఫ్రెడ్ అనే కుమారుడు జన్మించాడు. విదేశాంగ కార్యదర్శిగా జాన్సన్ అధికార కన్జర్వేటివ్ పార్టీ కమ్యూనికేషన్స్ హెడ్ గా పనిచేసిన క్యారీ సైమండ్స్ తో 2018 నుండి సహజీవనం చేశారు. 2019లో ప్రధానిగా బాధ్యతలు స్వీకరించినప్పుడు డౌనింగ్ స్ట్రీట్‌లోకి మారారు. 2019 చివర్లో నిశ్చితార్థం, ఆ తరువాత ఈ ఏడాది మే 29న వెస్ట్‌మినిస్టర్ కేథడ్రల్‌లో ముప్పై మంది అతిథులతో రహస్య వేడుకలో వివాహం చేసుకున్నారు. 1993లో బ్రిటన్ ప్రధాని జాన్సన్ మొదటి భార్య అలెగ్రా మెస్టిన్ నుంచి విడిపోయిన మెరీనా వీలర్‌తో వివాహం, విడాకులు తెలిసిన సంగతి తెలిసిందే. -
యూకే లివర్‌పూల్ నగరంలో కారు బ్లాస్ట్...ఒకరు మృతి
లండన్: లివర్‌పూల్ నగరంలోని మహిళా ఆసుపత్రి వెలుపల జరిగాన కారు పేలుడులో ఒకరు మృతి చెందారని, పైగా ముగ్గురు వ్యక్తలను అదుపులోకి తీసుకునిన విచారిస్తున్నామని ఉగ్రవాద నిరోధక అధికారులు వెల్లడించారు. అంతేకాదు కారులోని ఒక ప్రయాణికుడు సంఘటన స్థలంలోనే మరణించాడని, డ్రైవర్ గాయపడినట్లు పేర్కొన్నారు. ఈ మేరకు తాము ఆ ముగ్గురు వ్యక్తులను నగరంలోని కెన్సింగ్టన్ ప్రాంతంలో అదుపులోకి తీసుకుని తీవ్రవాద చట్టం కింద అరెస్టు చేసినట్లు ఉగ్రవాద నిరోధ పోలీసులు తెలిపారు. (చదవండి: జైల్లో ఘర్షణ.. 68 మంది ఖైదీలు మృతి ఈ క్రమంలో చీఫ్ కానిస్టేబుల్ సెరెనా కెన్నెడీ మాట్టాడుతూ...తాము సమీపంలోని లివర్‌పూల్ కేథడ్రల్‌లో రిమెంబరెన్స్ డే సర్వీస్ సందర్భంగా యుద్ధంలో చనిపోయిన వారిని స్మరించుకుంటున్న సమయంలోనే ఈ సమాచారం అందడంతో వెంటనే తాము స్థానిక పోలీసులకు తెలియజేసినట్లు తెలిపారు.అంతేకాదు తాము స్థానిక పోలీసుల మద్ధతుతో కేసు దర్యాప్తు చేస్తున్నామని, ఏం జరిగిందనే విషయంపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేసి వాస్తవాన్ని తెలయజేస్తామంటూ ఉగ్రవాద నిరోధక అధికారులు వెల్లడించారు. అయితే బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ఈ ఘటన పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేయటమే కాక ఎప్పటికప్పుడు ఆ ఘటనకు సంబంధించిన ప్రతి విషయాన్ని స్వయంగా సమీక్షిస్తున్నారని అంతర్గత వ్యవహారాల మంత్రి ప్రీతి పటేల్ తెలిపారు. అయితే ఈ పేలుడును పోలీసులు ఉగ్రవాద ఘటనగా ప్రకటించకపోవడం గమనార్హం. (చదవండి: మెక్‌డొనాల్డ్స్ ‘టాయిలెట్’ వివాదం) -
వినీషా పవర్ ఫుల్ స్పీచ్ : మీ తీరు చూస్తోంటే.. కోపం వస్తోంది!
గ్లాస్గో: వాతావరణ మార్పులపై గ్లాస్గోలోని కాప్–26 సదస్సులో భారత్‌కు చెందిన 14 ఏళ్ల వయసున్న టీనేజ్ బాలిక వినీశా ఉమాశంకర్ చేసిన ప్రసంగం ప్రపంచ దేశాధినేతల్ని ఫిదా చేసింది. ఎకో ఆస్కార్ అవార్డులుగా భావించే ఎర్త్ షాట్ ప్రైజ్ ఫైనలిస్ట్ అయిన వినీశ కాప్ ఇతర పర్యావరణ పరిరక్షకులతో కలిసి ప్రిన్స్ విలియమ్ విజ్ఞప్తి మేరకు సదస్సులో మాట్లాడింది. ‘‘మీ అందరికీ చేతులెత్తి నమస్కరించి చెబుతున్నాను. ఇక మీరు మాటలు ఆపాలి. చేతలు మొదలు పెట్టాలి. భూమి ఉష్ణోగ్రతల్ని తగ్గించడానికి ఇక కొత్త ఆలోచనలు చేయాలి. మీరు ఏమీ చేయకపోతే ఎర్త్‌షాట్ ప్రైజ్ విజేతలు, ఫైనలిస్టులు చర్యలు తీసుకుంటారు. మా దగ్గర ఎన్నో వినూత్న ప్రాజెక్టులు , పరిష్కార మార్గాలు ఉన్నాయి’ అని చెప్పింది. ప్రధాని మోదీ, బ్రిటన్ ప్రధాని జాన్సన్, అమెరికా అధ్యక్షుడు బైడెన్ల సమక్షంలో తమిళనాడుకి చెందిన వినీశ ధైర్యంగా మాట్లాడింది. ’‘మీరు ఇచ్చిన శుష్క వాగ్దానాలతో మా తరం విసిగిపోయింది. మీ అందరిపైనా ఆగ్రహం కట్టలు తెచ్చుకుంటోంది. అయినా అవన్నీ ప్రదర్శించడానికి మాకు టైమ్ లేదు. మేము పని చెయ్యాలి. నేను కేవలం భారత్‌కు చెందిన అమ్మాయిని మాత్రమే కాదు. ఈ పుడమి పుత్రికని. అలా చెప్పుకోవడానికే గర్విస్తాను. భూమిని కాపాడుకోవడానికి పాత పద్ధతుల్ని ఇక విడిచిపెట్టండి. సృజనాత్మక ఆలోచనలు చేసే మాకు మద్దతుగా నిలవండి. మీ సమయాన్ని, డబ్బుల్ని మాపై వెచ్చించండి. మా భవిష్యత్‌ని మేమే నిర్మంచుకోవడానికి మద్దతునివ్వండి’’’ అని వినీశ చేసిన ప్రసంగానికి సభ కరతాళ ధ్వనులతో మారుమోగిపోయింది. So incredibly proud of @Vinisha27738476, from Tiruvannamalai, Tamil Nadu. A girl “not just from India, but from Earth”, talking to the world @COP26. She gives us hope!pic.twitter.com/QC05oThLW9 — Oliver Ballhatchet MBE (@oballhatchet) November 3, 2021 -
భూగోళానికి పెనుముప్పు
గ్లాస్గో: వాతావరణ మార్పుల కారణంగా భూగోళానికి పెనుముప్పు పొంచి ఉందని, ప్రపంచ దేశాలు తక్షణమే మేలుకొని, దిద్దుబాటు చర్యలు ప్రారంభించకపోతే పరిస్థితి చెయ్యి దాటిపోతుందని బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ హెచ్చరించారు. స్కాట్లాండ్లో గ్లాస్గో నగరంలోని స్కాటిష్ ఈవెంట్ క్యాంపస్‌లో ఆయన సోమవారం భాగస్వామ్య పక్షాల 26వ శిఖరాగ్ర సదస్సులో (కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్–కాప్) భాగంగా రెండు రోజులపాటు జరిగే ప్రపంచ దేశాల అధినేతల సదస్సును లాంఛనంగా ప్రారంభించారు. బ్రిటన్ ఆతిథ్యం ఇస్తున్న కాప్–26 నవంబర్ 12 దాకా కొనసాగనుంది. సోమవారం భారత ప్రధాని మోదీ సహా దాదాపు 120 దేశాల అధినేతలు, ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సమావేశం ప్రపంచం అంతం కాకుండా పోరాడే జేమ్స్‌బాండ్ ఆగమనం లాంటిదేనని బోరిస్ జాన్సన్ అభివర్ణించారు. అర్ధరాత్రి కావడానికి మరొక్క నిమిషం మాత్రమే ఉందని, మనం ఇప్పుడే ముందడుగు వేయాలని ఉద్బోధించారు. మాట తప్పితే ప్రజలు క్షమించరు 2015లో పారిస్‌లో జరిగిన కాప్ సదస్సులో నిర్దేశించుకున్న లక్ష్యాల సాధనకు ఏకాభిప్రాయం సాధించడంతోపాటు కర్బన ఉద్గారాలకు కత్తెర వేసే దిశగా కొత్త లక్ష్యాలను ఏర్పరచుకోవడానికి గ్లాస్గోలో కాప్–26 నిర్వహిస్తున్నారు. వాతావరణ మార్పుల ఉద్యమకారిణి గ్రేటా థన్‌బర్గ్ ఇటీవల చేసిన వ్యాఖ్యలను జాన్సన్ గుర్తుచేశారు. పాలకులు ఇస్తున్న హామీలన్నీ నీటి మూటలవుతున్నాయని థన్‌బర్గ్ ఆరోపించారని అన్నారు. మాట తప్పితే ప్రజలు మనల్ని క్షమించబోరని చెప్పారు. ‘ఇండియా గ్రీన్ గ్యారంటీ’ భారత్‌లో హరిత ప్రాజెక్టుల కోసం అదనంగా 750 మిలియన్ పౌండ్లు విడుదల చేయడానికి ప్రపంచ బ్యాంక్‌కు ‘ఇండియా గ్రీన్ గ్యారంటీ’ ఇస్తామని బ్రిటన్ ప్రకటించింది. క్లీన్ ఎనర్జీ, రవాణా, పట్టణాభివృద్ధి తదితర రంగాల్లో మౌలిక సదుపాయాల కోసం ఈ నిధులను ఖర్చు చేయనున్నారు. భారత్‌లో ఎలక్ట్రిక్ వాహనాల తయారీతోపాటు అభివృద్ధి చెందుతున్న దేశాల్లో గ్రీన్ ప్రాజెక్టులకు ప్రైవేట్ ఇన్ఫ్రా డెవలప్మెంట్ గ్రూప్ నుంచి 210 మిలియన్ పౌండ్ల రుణ సాయం అందిస్తామని యూకే ప్రకటించింది. తక్షణమే కార్యాచరణ ప్రారంభించాలి: బైడెన్ గ్లోబల్ వార్మింగ్ విసురుతున్న సవాళ్లను ఎదుర్కొనేందుకు ప్రపంచ దేశాలు చేతులు కలపాలని అమెరికా అధ్యక్షుడు జో బైడైన్ పిలుపునిచ్చారు. ఈ విషయంలో మీనమేషాలు లెక్కిస్తూ కూర్చోవడానికి సమయం లేదని, తక్షణమే కార్యాచరణకు శ్రీకారం చుట్టాలని చెప్పారు. ఆయన కాప్–26లో మాట్లాడారు. వాతావరణ మార్పుల వల్ల తలెత్తుతున్న దుష్పరిణామాలను నివారించడానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. సంక్షోభంలోనూ అవకాశాలు వెతుక్కోవాలని తెలిపారు. పర్యావరణాన్ని కాపాడుకునే విషయంలో ప్రపంచ దేశాలకు మరింత సాయం చేయాలని తాను కోరుకుంటున్నట్లు చెప్పారు. 2050 నాటికి అమెరికాను క్లీన్ ఎనర్జీ దేశంగా మారుస్తామంటూ జో బైడెన్ ప్రభుత్వ యంత్రాంగం తన ప్రణాళికను విడుదల చేసింది. పారిస్ ఒప్పందం నుంచి అమెరికా తప్పుకోవడం పట్ల జో బైడెన్ విచారం వ్యక్తం చేశారు. మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయంపై ఆయన కాప్ సదస్సుకు క్షమాపణ చెప్పారు. -
బొగ్గు వినియోగం తగ్గించాలని బ్రిటన్ ప్రధాని బోరిస్ పిలుపు
-
ఆ క్రికెట్ సిరీస్ కోసం ఇద్దరు ప్రధానుల మధ్య చర్చ..
లండన్: ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ జట్ల మధ్య జరిగే ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్ కోసం ఏకంగా రెండు దేశాల ప్రధానులే చర్చలకు దిగారు. ఈ ఏడాది యాషెస్ సిరీస్‌కు వేదికైన ఆస్ట్రేలియాలో కఠినమైన కోవిడ్ నిబంధనలు అమల్లో ఉన్న నేపథ్యంలో పర్యాటక జట్టుకు కొన్ని వెసులుబాటులు కల్పించాలని బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ఆసీస్ ప్రధాని స్కాట్ మోరిసన్‌ని కోరారు. తమ దేశ క్రికెటర్లు కుటుంబాలతో కలిసి ఆస్ట్రేలియాలో పర్యటించే వీలు కల్పించాలని, అందుకు తగిన సడలింపులు ఇవ్వాలని బ్రిటన్ ప్రధాని అభ్యర్ధించారు. ప్రతిష్టాత్మక సిరీస్‌కు ఉన్న అడ్డంకులు తొలగించడానికి బ్రిటన్ ప్రధానే ప్రత్యేక చొరవ తీసుకొని ఆతిధ్య దేశ ప్రధానితో చర్చించడం గమనార్హం. కాగా, ఆస్ట్రేలియా-ఇంగ్లండ్ జట్ల మధ్య ఈ ఏడాది డిసెంబర్ 8 నుంచి ఐదు టెస్ట్‌ల యాషెస్ సిరీస్ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. చదవండి: పారాలింపిక్స్ కాంస్య పతక విజేతకు ఛాతీ నొప్పి -
జీ7 పన్నుల ఒప్పందం అమలుతో పురోగతి సాధించగలం: బోరిస్ జాన్సన్
లండన్: బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ అమెజాన్ స్థాపకుడు జెఫ్ బెజోస్‌ని కలిసి పన్నుల సమస్య పై చర్చించారని న్యూయార్క్ డౌనింగ్ స్ట్రీట్ ప్రతినిధి ఒకరు పేర్కొన్నారు. ఈ మేరకు జీ7 పన్నుల ఒప్పందం పూర్తి స్థాయిలో అమలైతే పురోగతి సాధించగలమని జాన్సన్ విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ తరుణంలో బెజోస్ వాతావరణ పురోగతి, పరిరక్షణలకై దృష్టి సారించటం కోసం $1 బిలియన్ డాలర్లు అందజేస్తానని వాగ్దానం చేశారు. (చదవండి: స్పెయిన్‌లో అగ్నిపర్వతం విస్పోటనం) ఈ మేరకు గతంలో వాతావరణ మార్పులపై పోరాటం చేస్తున్న సైంటిస్టులు, శాస్త్రవేత్తలు, లాభప్రేక్షలేని సంస్థల కోసం $10 బిలియన్ల ఎర్త్ ఫండ్‌ని ఫ్రారంభించిన సంగతి తెలిసిందే.దీంతో బ్రిటన్ ప్రధాని జాన్సన్ పర్యావరణ పరిరక్షణ పట్ల బెజోస్ కనబరుస్తున్న నిబద్ధతను స్వాగతిస్తున్నాని అన్నారు. కాప్ 26 కోసం బ్రిటన్ ప్రధానితో కలిసి పనిచేయడానికి బెజోస్ అంగీకరించినట్లు న్యూయార్క్ డౌనింగ్ స్ట్రీట్ ప్రతినిధి ఒకరు తెలిపారు. (చదవండి: స్పేస్ఎక్స్ టూరిజంలా త్వరలో మూన్ టూరిజం) -
బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ సంచలన ప్రకటన
లండన్: బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ సంచలన ప్రకటన చేశారు. అఫ్గానిస్తాన్‌ను హస్తగతం చేసుకున్న తాలిబన్లతో కలిసి పనిచేయటానికి సంసిద్ధతను వ్యక్తం చేశారు. తాలిబన్లతో కలసి పనిచేసే అవకాశం ఉందని బ్రిటన్ ప్రధాని ప్రకటించారు. ప్రస్తుతం అఫ్గాన్ సంక్షోభం పరిష్కారంకోసం దౌత్య ప్రయత్నాలు చేస్తున్నామని, పరిస్థితులను చక్కబెట్టటానికి తాము సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. ఈ నేపథ్యంలో తాలిబన్లతో కలిసి చేసేందుకు సంసిద్ధతను వ్యక్తం చేశారు. తద్వారా అఫ్గాన్ పౌరులకు భరోసా ఇచ్చేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు.కొన్ని సమస్యల వల్లే బ్రిటన్ పౌరులను స్వదేశానికి తీసుకొచ్చామని చెప్పారు. కాగా తాలిబన్లతో కలిసి పని చేయటానికి తమకు అభ్యంతరం లేదని తొలుత చైనా ప్రకటించింది. ఆ తరువాత ఇదే బాటలో పాకిస్తాన్, రష్యా దేశాలు తాలిబన్లకు మద్ధతు పలికిన సంగతి తెలిసిందే. చదవండి : తాలిబన్ల చెరలో అఫ్గన్: హృదయ విదారక దృశ్యాలు.. వైరల్ Afghanistan: తొలి ఫత్వా జారీ చేసిన తాలిబన్లు.. అనుకున్నదే అయింది! -
Afghanistan: అది తొందరపాటు చర్యే : బ్రిటన్ ప్రధాని
Judge Taliban on Actions Not Words: ‘‘ఉగ్రవాదం, నార్కొటిక్స్, నేరాల పట్ల తాలిబన్ల విధానం.. మానవత్వం, మహిళా విద్య- హక్కులకై వారు చేపట్టే చర్యలు... కేవలం మాటలకే పరిమితం కాకుండా.. ఆచరణలోకి వచ్చిన రోజే తాలిబన్ల పాలనను జడ్జ్ చేయాలి. అంతేగానీ వారి మాటలు నమ్మి ముందే ఒక నిశ్చిత అభిప్రాయానికి రావడం తొందరపాటు చర్యే అవుతుంది’’ అని బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ అన్నారు. అఫ్గనిస్తాన్‌ను తాలిబన్లు ఆధీనంలోకి తీసుకున్న నేపథ్యంలో పార్లమెంటులో ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. కాగా రాజధాని కాబూల్ సహా ప్రధాన పట్టణాలన్నింటినీ ఆక్రమించిన తాలిబన్లు అఫ్గన్నిస్తాన్ను తమ గుప్పిట్లోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇరాన్, సౌదీ అరేబియా, ఇతర ఇస్లామిక్ దేశాలు వ్యూహాత్మక సమదూరం పాటిస్తుండగా.. చైనా, పాకిస్తాన్ తాలిబన్లతో సత్సంబంధాలు ఏర్పరచుకునేందుకు సిద్ధమని ప్రకటించాయి. అయితే, జర్మనీ వంటి యూరోపియన్ దేశాలు మాత్రం అఫ్గనిస్తాన్ అభివృద్ధి కోసం అందిస్తున్న సాయాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తూ తాలిబన్లకు షాకిచ్చాయి. ఈ క్రమంలో బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ బుధవారం పార్లమెంటులో మాట్లాడుతూ... ‘‘ అఫ్గనిస్తాన్ మెరుగైన భవిష్యత్తుకై కలిసి పనిచేయాలనుకుంటున్న దేశాలు తొలుత కొత్త పాలన ఎలా ఉండబోతుందో ఒక అంచనాకు వచ్చిన తర్వాతే వారి అధికారాన్ని గుర్తించే ప్రయత్నం చేయాలి. మారిపోయామని వారు చెబుతున్న మాటలు.. ఆచరణలో ఏవిధంగా ఉంటాయో గమనించి అప్పుడే వారి పాలనను జడ్జ్ చేయాలి. అలా కాకుండా.. ముందే ద్వైపాక్షిక బంధాలు ఏర్పరచుకోవడం నిజంగా తొందరపాటు చర్యే అవుతుంది ’’ అని పేర్కొన్నారు. అదే విధంగా ఇటీవలి కాలంలో సుమారు 2 వేల మంది అఫ్గన్లు దేశం విడిచి వెళ్లేందుకు బ్రిటన్ సాయం చేసిందన్న బోరిస్.. రిసెటిల్మెంట్ ప్రోగ్రాం ద్వారా ఇప్పటి వరకు 306 మంది బ్రిటీష్ పౌరులు, 2052 మంది అఫ్గన్ పౌరులను సురక్షితంగా తీసుకువచ్చామని తెలిపారు. బ్రిటన్‌లో ఆశ్రయం కోరుతున్న మరో 2 వేల మంది అఫ్గన్ల దరఖాస్తుల ప్రాసెసింగ్ పూర్తైందని, మరికొంత మందికి కూడా ఈ వెసలుబాటు కల్పించనున్నామని పార్లమెంటుకు తెలిపారు. చదవండి: Afghanistan: తొలి మహిళా గవర్నర్‌ను బంధించిన తాలిబన్లు! Afghanistan: తాలిబన్లకు మరో షాక్! సాయం నిలిపివేత -
ప్రధాని సిబ్బందికి కరోనా.. క్వారెంటైన్ అవసరం లేదంటూ ప్రకటన
లండన్: చట్టం ముందు అందరూ సమానులే, నిబంధనలు అందరికీ ఒకేలా వర్తిస్తాయంటారు. కానీ ఇవి మాటలకే గానీ ఆచరణలకు కాదనేలా నిరూపిస్తోంది ఈ ఘటన. తాజాగా బ్రిటన్‌లో ప్రజలకు ఒకలా, ప్రధానికి మరోలా నిబంధనలను అమలుచేస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ సిబ్బందిలో ఒకరికి కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది. గత వారాల్లో ప్రధాని చేసిన పర్యటనల్లో, ఆయన వెంట వెళ్లిన సిబ్బందిలో ఈ వ్యక్తి కూడా ఉన్నాడు. ఇందులో ఆశ్చర్యకర విషయం ఏమిటంటే జాన్సన్‌కు క్వారెంటైన్లో ఉండాల్సిన అవసరం లేదని బ్రిటన్ ప్రధాని అధికారిక కార్యాలయం డౌన్ స్ట్రీట్ స్పష్టం చేసింది. జాన్సన్ బుధవారం ఫైఫ్‌లోని పోలీసు కళాశాలను, అలానే గురువారం అబెర్డీన్షైర్లోని విండ్‌ఫార్మ్‌ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయనతో కలిసి తిరిగిన సిబ్బందిలో ఒకరికి కరోనా సోకింది. ఆతనికి స్కాట్లాండ్ ప్రయాణంలో నిబంధనల ప్రకారం జరిపిన కరోనా నిర్ధారణ పరీక్షల్లో పాజిటివ్ గా తేలింది. ఈ ఫలితాల అనంతరం ప్రధానికి ఐసోలేషన్ అక్కర్లేదని డౌన్ స్ట్రీట్ పేర్కొంటూ, అందుకు వివరణగా.. ఇటీవల జాన్స్‌న్ యూకే అంతటా క్రమం తప్పకుండా సందర్శిస్తున్నారని, అదే క్రమంలో కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా ఈ ప్రయాణాలు జరుగుతున్నాయని తెలిపింది. "పరీక్షలో పాజిటివ్‌గా నిర్థారణ అయిన ఎవరితోనూ ప్రధాని కాంటెక్ట్ కాలేదు, కనుక ఆయన క్వారెంటైన్లో ఉండాల్సిన అవసరం లేదని డౌన్ స్ట్రీట్ వెల్లడించింది. అయితే దీనిపై ప్రతిపక్ష లేబర్ పార్టీ విమర్శలు గుప్పిస్తున్నాయి. అధికార పార్టీ నేతలు ప్రజలను ఫూల్స్‌ను చేస్తున్నారని ధ్వజమెత్తారు. అధికార పార్టీ నేతలు తమకు ఓ రూల్, దేశ ప్రజలందరీకి ఒక రూల్‌ను అమలు చేస్తున్నారంటూ విమర్శిస్తున్నారు. -
‘ఎంత ధైర్యం నీకు.. దేశ ప్రధానినే సతాయిస్తావా’
లండన్: మనం ఎంత శక్తివంతులమైనా.. బలవంతులం, గొప్పవారం, ధనవంతులమైనా సరే.. లేచిన వేళా విశేషం బాగాలేకపోతే.. ఏం చేయలేం. ఆ రోజు మన కోసం ఎదురు చూస్తున్న అన్ని సంఘటనలను ఎదుర్కొవాల్సిందే. అవి మంచివే కానీ చెడ్డవే కానీ తప్పదు. సామాన్యుల విషయంలో ఏం జరిగినా ప్రపంచం పెద్దగా పట్టించుకోదు.. అదే సెలబ్రిటీలకు సంబంధించిన చిన్న వార్త, సంఘటనను సైతం పెద్దగా ప్రచారం చేస్తుంది. వారికి ఎదురైన అనుభవాలను సోషల మీడియా వేదికగా బహిర్గతం చేస్తుంది. ఇప్పుడు ఇదంతా ఎందుకంటే.. తాజాగా బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ కాస్త ఇబ్బందికర సంఘటనను ఎదుర్కొన్నారు. అతడి ఇబ్బందికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైలరవుతోంది. ఆ వివరాలు.. కొన్ని రోజుల క్రితం బోరిస్ జాన్సన్ విధులు నిర్వహిస్తూ.. మరణించిన పోలీసు అధికారుల కోసం ఏర్పాటు చేసిన స్మారక సేవ కార్యక్రమానికి హాజరయ్యారు. వర్షం పడుతుండటంతో దానికి వచ్చినవారిలో కొందరు గొడుగులతో హాజరయ్యారు. బోరిస్ జాన్సన్ కూడా గొడుగుతో హాజరయ్యారు. అయితే ఆ గొడుగు జన్సాన్ని తెగ సతాయించింది. మొదటి అది తెరుచుకోలేదు. ఎలాగోలా ప్రయత్నించి.. దాన్ని తెరిస్తే.. ఆ తర్వాత అది గాలికి తట్టుకోలేక రివర్స్ అయ్యింది. ఈ కార్యక్రమానికి ప్రిన్స్ చార్లెస్ కూడా హాజరయ్యారు. గొడుగుతో కుస్తీ పడుతున్న జాన్సన్‌ని చూసి చార్లెస్‌తో సహా అక్కడున్న అధికారులంతా ముసి ముసి నవ్వులు నవ్వుతారు. తన పరిస్థితిని తలుచుకుని జాన్సన్ కూడా చిరు నవ్వులు చిందిస్తాడు. ఇందుకు సంబంధించిన వీడియోని స్కై న్యూస్ ట్విట్టర్లో షేర్ చేయడంతో ప్రస్తుతం ఇది తెగ వైరలవుతోంది. దీనిపై నెటిజనులు రకరకాలుగా స్పందిస్తున్నారు. ....up, up and nearly away ☂️ PM Boris Johnson struggles with his umbrella whilst seated next to Prince Charles at a memorial recognising the sacrifice of police officers who have died on duty. Read more here: https://t.co/ia9HUvj5LD pic.twitter.com/dCcMiVcwyn — Sky News (@SkyNews) July 28, 2021 ‘‘రెండు రోజులు గడిచిందేమో.. ఈ సారి గొడుగు విషయంలో చిక్కుకున్నారు. తనకు కొత్త గొడుగు కొనివ్వాల్సిందిగా ప్రభుత్వాన్ని అడుగుతాడేమో.. లేక మీడియా దీన్ని మరో నెలరోజుల పాటు వాల్‌పేపర్ స్టోరీగా ప్రచురిస్తుంది’’ అని కామెంట్ చేయగా.. మరికొందరు ‘‘నాకు ప్రతిసారి ఇదే అనుభవం ఎదురవుతుంది’’.. నీకు ఎంత ధైర్యం దేశ ప్రధానినే ఇలా ఇబ్బందిపెడుతూ సతాయిస్తావా.. హమ్మా’’ అంటూ కామెంట్ చేయసాగారు. -
‘రాసలీలల’ కెమెరా తొలగింపు.. విచారణకు ఆదేశం
బ్రిటన్ మాజీ మంత్రి రాసలీలల వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. సీసీ కెమెరాను తొలగించిన ప్రభుత్వం.. అది అధికారిక కెమెరా కాదని ప్రకటించడం విశేషం. వ్యక్తిగత కార్యదర్శితో మాట్ హాంకాక్ ముద్దుల రసక్రీడ కొనసాగిస్తూ సీసీ కెమెరా కంటికి చిక్కడం.. ఆ ఫొటోలు టాబ్లాయిడ్లో ప్రముఖంగా ప్రచురితం కావడంతో ఆరోగ్య మంత్రి(కార్యదర్శి కూడా)గా రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఇక ఇందుకు కారణమైన సీసీ కెమెరా అక్కడికి ఎలా వచ్చిందనే దానిపై దర్యాప్తునకు ఆదేశించినట్లు కొత్త ఆరోగ్య కార్యదర్శి సాజిద్ జావిద్ వెల్లడించారు. లండన్: బ్రిటన్ ఆరోగ్య కార్యదర్శి కార్యాలయంలో దొరికిన సీసీ టీవీ కెమెరా.. రెగ్యులర్ ఆఫీస్ కెమెరా కాదని కొత్త ఆరోగ్య మంత్రి(కార్యదర్శి) సాజిద్ జావిద్ వెల్లడించాడు. అంతేకాదు ఈ ఘటన తర్వాత మిగతా ఎంపీల ఆఫీసుల్లోనూ సోదాలు నిర్వహించామని, ఇలాంటి కెమెరాలేవీ బయటపడలేదని తెలిపాడు. కాబట్టి, ఉద్దేశపూర్వకంగా మాట్ హాంకాక్ ఆఫీస్‌లో కెమెరాలు ఉంచినట్లు అనుమానం వ్యక్తం చేశాడాయన. ఇక ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగిస్తామని వెల్లడించిన ఆయన.. హాంకాక్ యవ్వారంపై మాట్లాడేందుకు మాత్రం నిరాకరించాడు. బోరిస్‌పై ప్రశ్నల వర్షం ఇక హాంకాక్ పట్ల ప్రధాని బోరిస్ జాన్సన్ ప్రదర్శించిన ఉదాసీనతపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిజానికి గురువారం ఈ ఫొటోలు పేపర్ ద్వారా బయటికి రాగా.. శుక్రవారం ఘటనకు సంబంధించి హాంకాక్ క్షమాపణలు చెప్పాడు. అయితే అతనిపై వేటు వేయకుండా కేవలం ఆ సారీతో సరిపెట్టుకుని.. ‘మ్యాటర్ క్లోజ్డ్’ అని ప్రకటించాడు బోరిస్. ఇది మరింత విమర్శలకు దారితీసింది. ఈ పరిణామాల నేపథ్యంలోనే హాంకాక్ బలవంతపు రాజీనామా, బోరిస్ అన్యమనస్కంగానే దానిని ఆమోదించడం జరిగిపోయాయి. అయితే ఈ విమర్శలపై ప్రధాని బోరిస్ తాజాగా స్పందించాడు. మహమ్మారి విజృంభణ టైంలో ఆరోగ్య మంత్రి మార్పును అంత త్వరగా చేయడం సబబు కాదనే ఉద్దేశంతో.. కాస్త ఆలస్యం జరిగినట్లు బోరిస్ వివరణ ఇచ్చాడు. ఈ వ్యవహారంలో మరిన్ని అనుమానాలు ఉన్నాయి. హాంకాక్ మెయిల్స్ పాలసీని బబ్రేక్ చేశాడని, నిధుల అవకతవకలకు పాల్పడ్డాడని, వ్యక్తిగత ఉద్దేశాలకు కార్యాలయాన్ని వాడుకున్నాడని.. ఇలా ఆరోపణలెన్నో ఉన్నాయి. ఈ తరుణంలో వీటిపై దర్యాప్తునకు ఆదేశించడంపై బోరిస్ మౌనం వహించడం ఇప్పుడు బ్రిటన్ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఎలా బయటికొచ్చింది ఒక ఎంపీ ఆఫీస్‌లో నిషేధిత జోన్లో సీసీ కెమెరా బిగించడం ఒక ఎత్తు అయితే.. ఆ వీడియో ఫుటేజీ బయటకు రావడం మరింత చర్చనీయాంశంగా మారింది. దీని వెనుక ఎవరి ప్రమేయం ఉందన్న విషయాన్ని తేల్చే పనిలో పడ్డాయి బ్రిటన్ నిఘా వర్గాలు. ఇక ఈ వీడియో/ఫొటోలో ఉన్న హాంకాక్ మాజీ కార్యదర్శి గినా కొలాడాంగెలో మీద అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్ అండ్ సోషల్ కేర్‌లో పని చేసిన గినా.. చాలా ఏళ్లుగా మ్యాట్ హాంకాక్తో దగ్గరి సంబంధాలు కలిగి ఉన్నట్లు ఆధారాలున్నాయి. అంతేకాదు ఆ పరిచయాలతోనే ఆమె తన పనుల్ని చక్కబెట్టుకున్నట్లు, కుటుంబ సభ్యుల్ని ఉన్నత స్థానాల్లో నియమించుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ప్రభుత్వ లాక్డౌన్ ఆంక్షలను వ్యతిరేకించిన ఓ డీహెచ్ఎస్సీ ఉద్యోగి.. బ్లాక్మెయిల్ ఉద్దేశంతో ఈ పని చేసి ఉండటానే అనుమానాలు ఉన్నాయి. దీంతో ఈ కోణంలోనూ దర్యాప్తు కొనసాగుతోంది కూడా. చదవండి: పాత ఎఫైర్‌ని పీఏగా.. ఆపై ఆఫీస్‌లోనే కసితీరా ముద్దులు -
పీఏతో మంత్రి రాసలీలలు.. ఫొటోలు లీక్
కరోనా టైం.. అందులో కఠిన ఆంక్షలు అమలులో ఉన్నవేళ. సోయి మరిచి తన అనుచరురాలితో ఆఫీసులోనే రాసలీలలు సాగించాడు ఓ మంత్రి. ఆ మంత్రి రొమాంటిక్ యాంగిల్ఫొటోలు మీడియా ద్వారా జనాల్లోకి లీక్ అయ్యాయి. ఇంకేం ప్రజాగ్రహం పెల్లుబిక్కింది. రాజకీయ విమర్శలు చుట్టు ముట్టాయి. చివరికి యూకే ఆరోగ్యశాఖా మంత్రి మ్యాట్ హాంకాక్ రాజీనామా చేయాల్సి వచ్చింది. లండన్: ఆరోగ్య శాఖ మంత్రి, కార్యదర్శి మ్యాట్ హాంకాక్ యవ్వారం.. వారం నుంచి యూకే రాజకీయాలను కుదేలు చేస్తోంది. వివాహితుడైన హాంకాక్.. ఓ మహిళను ఏరికోరి తన అసిస్టెంట్‌గా నియమించుకున్నాడు. ఆమెతో తన కార్యాలయంలోనే రాసలీలు కొనసాగించాడు. ఆమెను ముద్దులు పెట్టుకున్నట్లుగా ఓ ఫొటోతో ‘పీఏతో హాంకాక్ రాసలీలలు’ పేరుతో ది సన్ టాబ్లాయిడ్ ప్రముఖంగా ప్రచురించింది. పైగా కరోనా నిబంధనలు అమలులో ఉన్న టైంలో ఆ పని చేశాడంటూ కథనం ప్రచురించింది. ఇంకేం విమర్శలు మొదలయ్యాయి. ఈ బంధం ఏనాటిదో.. కాగా, ఆ ఫొటోలు మే 6 నుంచి 11 మధ్య కాలంలో, అది కూడా మ్యాట్ కార్యాలయంలోనే తీసినవని సమాచారం. అయితే ఆ ఫొటోల్ని ఎలా సంపాదించింది మాత్రం సన్ వెల్లడించలేదు. అప్పటికీ ఇంకా లాక్డౌన్ కఠిన నిబంధనల్ని, ఆంక్షల్ని ఎత్తివేయలేదని మాత్రం పేర్కొంది. ఇంట్లో వ్యక్తులతో తప్ప బయటివారిని కౌగిలించుకోవడం, వారితో శారీరక సంబంధం పెట్టుకోవడానికి అనుమతించని రోజుల్లో ఈ ఘటన జరిగిందని తెలిపింది. అంతేకాకుండా ఆ ఫొటోలో ఉన్న మహిళను హాంకాక్.. 2000 సంవత్సరంలో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో కలిశాడని, పోయిన నెలలోనే ఆమెను ఇన్‌కంటాక్స్ విభాగంలో తన సహాయకురాలిగా నియమించుకున్నాడని తేలింది. ఎట్టకేలకు రాజీనామా కరోనా టైంలో మాస్క్‌లు లేకుండా తిరగొద్దని హాంకాక్ విస్తృతంగా ప్రచారం చేశాడు. పైగా భావోద్వేగంగా ఉపన్యాసాలు దంచాడు. అలాంటి వ్యక్తే.. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించడంపై విమర్శలు వెలువెత్తాయి. ఈ మేరకు శనివారం ప్రధాని బోరిస్ జాన్సన్‌కు, మాట్ హాంకాక్‌కు ఓ క్షమాపణ లేఖ రాశాడు. నేనే మార్గదర్శకాల్ని ఉల్లంఘించా.. అందుకే రాజీనామా చేస్తున్నా అని తెలిపాడు. ఇక విమర్శల నేపథ్యంలో హాన్కాక్ రాజీనామాను ఆమోదించిన బోరిస్.. అప్పటిదాకా ఆయన అందించిన సేవలను కొనియాడాడు. చదవండి: పార్లమెంట్లో పొంగుతున్న బీర్లు -
100 కోట్ల టీకా డోసులిద్దాం
కార్బిస్‌బే: కరోనా మహమ్మారిపై ఉమ్మడి పోరాటం, సంపూర్ణ వ్యాక్సినేషనే లక్ష్యంగా గ్రూప్ ఆఫ్ సెవెన్(జీ7) దేశాల మూడు రోజుల శిఖరాగ్ర సదస్సు ఆతిథ్య దేశం యునైటెడ్ కింగ్డమ్(యూకే)లో శుక్రవారం ప్రారంభమయ్యింది. కార్బిస్‌బే రిసార్టులో ఏర్పాటు వేదిక నుంచి యూకే ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ ప్రపంచదేశాల అధినేతలకు అభివాదం చేసి, సదస్సుకు శ్రీకారం చుట్టారు. కరోనాపై కలిసి పోరాడుదామని పిలుపునిస్తూ ప్రారంభోపన్యాసం చేశారు. ప్రపంచంపై కోవిడ్–19 వైరస్ దాడి మొదలయ్యాక ఇదే మొదటి జీ7 సదస్సు. యూకే, అమెరికా, కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్ పాల్గొంటున్నాయి. మళ్లీ మెరుగైన సమాజాన్ని నిర్మిద్దాం (బిల్డింగ్ బ్యాక్ బెట్టర్ ఫ్రమ్ కోవిడ్–19) అన్న నినాదంతో జరుగుతున్న జీ7 సదస్సులో భారత్, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, దక్షిణ కొరియా అతిథి దేశాలుగా భాగస్వాములవుతున్నాయి. భారత ప్రధాని మోదీ కూడా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించనున్నారు. జీ7 సదస్సులో మొదటిరోజు దేశాల అధినేతలు ఉల్లాసంగా కనిపించారు. ప్రధానంగా కరోనా వ్యాప్తి, నియంత్రణ చర్యలు, వ్యాక్సినేషన్ పైనే చర్చించారు. కనీసం 100 కోట్ల కరోనా టీకా డోసులను ప్రపంచ దేశాలకు అందజేయాలని, మహమ్మారి వల్ల నష్టపోయిన దేశాలకు చేయూతనందించాలని ఈ సంపన్న దేశాధినేతలు నిర్ణయానికొచ్చారు. 10 కోట్ల డోసులిస్తాం: బోరిస్ జాన్సన్ తమ వద్ద అవసరానికి మించి ఉన్న 10 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులను ఏడాదిలోగా ప్రపంచ దేశాలకు ఉదారంగా అందజేస్తామని యూకే ప్రధాని బోరిస్ జాన్సన్ ప్రకటించారు. జీ7 సదస్సు ప్రారంభోపన్యాసంలో ఆయన.. కరోనా మహమ్మారిని అంతం చేసే యజ్ఞంలో పాలు పంచుకుంటున్నామని తెలిపారు. ఇందులో భాగంగా 10 కోట్ల టీకా డోసులను ఇతర దేశాలకు ఇస్తామన్నారు. కరోనా వ్యాక్సిన్ అభివృద్ధి కోసం ఆక్స్ఫర్డ్ వర్సిటీ–ఆస్ట్రాజెనెకాకు నిధులు సమకూర్చామని గుర్తుచేశారు. లాభార్జనను పక్కనపెట్టామని, తమ కృషి ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా 160 దేశాలకు ఇప్పటిదాకా 50 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులు అందాయని వెల్లడించారు. జీ7 సదస్సులో పాల్గొంటున్న దేశాల అధినేతలు సైతం ఇలాంటి దాతృత్వాన్నే ప్రదర్శిస్తారని ఆశిస్తున్నట్లు బోరిస్ జాన్సన్ పేర్కొన్నారు. 50 కోట్ల టీకా డోసులు అందజేస్తాం సదస్సులోఅమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మాట్లాడుతూ.. ప్రపంచ దేశాలకు 50 కోట్ల కోవిడ్ టీకా డోసులు అందజేస్తామని ప్రకటించారు. బహుళ జాతి కార్పొరేట్ సంస్థలపై కనీసం 15 శాతం పన్ను విధించాలన్న ప్రతిపాదన జీ7 సదస్సులో చర్చకు వచ్చింది. ఈ మేరకు దీనిపై ఆయా దేశాల ఆర్థిక మంత్రుల మధ్య వారం క్రితం ఒక ఒప్పందం కుదిరింది. కాలుష్యం, వాతావరణ మార్పుల అంశం కూడా జీ7 సదస్సు అజెండాలో ఉంది. కాగా, సదస్సు జరుగుతున్న కార్బిస్‌బే రిసార్టు ఎదుట వందలాది మంది వాతావరణ పరిరక్షణ ఉద్యమ కార్యకర్తలు గుమికూడారు. వాతావరణ మార్పులను వ్యతిరేకిస్తూ నిరసన తెలిపారు.సెయింట్ ఇవీస్లో జరిగిన ర్యాలీలో 500 మంది పాల్గొన్నారు. నిరసనకారులు ఆకుపచ్చ, నీలి రంగు దుస్తులు ధరించారు. హామీలతో తుంగలో తొక్కుతున్న జీ7, మాటలే తప్ప చేతల్లేవ్ అని రాసి ఉన్న జెండాలను ప్రదర్శించారు. -
కోవిడ్ నుంచి వాతావరణ మార్పుల దాకా..
లండన్/ వాషింగ్టన్: కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలకు సవాళ్లు విసురుతున్న నేపథ్యంలో సంపన్న దేశాల కూటమి జీ–7 సదస్సు యూకేలోని కార్నవాల్‌లోని కార్బిస్ బే హోటల్లో ఈనెల 11 నుంచి 13 తేదీ వరకు జరగనుంది. సముద్రం ఒడ్డున ఉన్న ఒక గ్రామంలో, ప్రశాంతంగా ఉండే రిసార్ట్‌లో ఆతిథ్య దేశం యూకే ఈ సదస్సుని ఏర్పాటు చేసింది. అమెరికా, యూకే, కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్ సభ్య దేశాలుగా ఉన్న జీ–7 సదస్సు ఈసారి కోవిడ్‌పై యుద్ధం, వాతావరణంలో మార్పులపైనే ప్రధానంగా చర్చించనుంది. ఈ సదస్సులో పాల్గొనడం కోసం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఇప్పటికే ఇంగ్లండ్‌కు చేరుకున్నారు. బైడెన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయనకు ఇదే మొదటి విదేశీ పర్యటన. ఇక జర్మనీ చాన్సలర్ ఎంజెలా మెర్కెల్ కూడా పదవీ బాధ్యతలు స్వీకరించాక తొలిసారి విదేశీ పర్యటనకు వచ్చారు. ఈ ఏడాది జీ–7 సదస్సుకి అతిథి దేశాలుగా భారత్, ఆస్ట్రేలియా, దక్షిణ కొరియా దేశాలను ఆహ్వానించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మోదీ హాజరు కరోనా విజృంభణ కారణంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సదస్సుకి ప్రత్యక్షంగా హాజరుకాలేకపోతున్నారు. ఈ నెల 12, 13 తేదీల్లో జరిగే సమావేశానికి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మోదీ హాజరుకానున్నట్టుగా విదేశాంగ శాఖ వెల్లడించింది. మోదీ తన యూకే ప్రయాణాన్ని గత నెలలోనే రద్దు చేసుకున్నారు. 92 దేశాలకు 50 కోట్ల ఫైజర్ వ్యాక్సిన్లు నిరుపేద, అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఉచిత కోవిడ్ వ్యాక్సిన్ అందించడానికి అమెరికాలో బైడెన్ ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. 50 కోట్ల ఫైజర్ కంపెనీ టీకా డోసుల్ని కొనుగోలు చేసి 92 దేశాలకు పంపిణీ చేయనున్నట్టు వైట్‌హౌస్ వెల్లడించింది. దీనిపై అధ్యక్షుడు జో బైడెన్ జీ–7 సదస్సులో ఒక ప్రకటన చేయనున్నారు. ప్రపంచ ప్రజల ఆరోగ్యంపై అమెరికాకున్న చిత్తశుద్ధి ఎలాంటిదో ఈ ప్రకటనతో తేటతెల్లమవుతుందని, మరే ఇతర దేశమూ ఇంత భారీ స్థాయిలో సాయాన్ని అందించలేదని వైట్‌హౌస్ ఆ ప్రకటనలో పేర్కొంది. ఈ వ్యాక్సిన్ల షిప్పింగ్ ఆగస్టులో ప్రారంభమవుతుంది. ఈ ఏడాది చివరి నాటికి 20 కోట్ల టీకా డోసుల్ని పంపిణీ చేస్తారు, మిగిలిన 30 కోట్ల డోసుల్ని వచ్చే ఏడాది మొదటి ఆరు నెలల్లో పంపిణీ చేసేలా అమెరికా చర్యలు తీసుకుంది. అందరికీ టీకా సంపన్న దేశాల బాధ్యత కరోనా నుంచి ప్రపంచాన్ని కాపాడాలంటే వచ్చే ఏడాది చివరి నాటికల్లా ప్రపంచ జనాభాకు టీకా ఇవ్వడం పూర్తి కావాలని యూకే ప్రధాని బోరిస్ జాన్సన్ అన్నారు. ఈ దిశగా జీ–7 దేశాలు చర్యలు తీసుకోవాలని, ప్రపంచ జనాభా వ్యాక్సినేషన్ బాధ్యత సంపన్న దేశాలే తీసుకోవాలని అభిప్రాయపడ్డారు. సదస్సుకి ఒక్క రోజు ముందు ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇదే ఎజెండా ► కరోనా మహమ్మారితో అతలాకుతలమవుతున్న సమయంలో బిల్ట్ బ్యాక్ బెటర్ అన్న నినాదంతో సదస్సు జరగనుంది. ► కోవిడ్‌పై పోరాటంతో పాటు భవిష్యత్‌లో వచ్చే మహమ్మారుల్ని ఎదుర్కొనేలా ప్రపంచ దేశాల ఆరోగ్య వ్యవస్థలను బలోపేతం చేయడం. ► స్వేచ్ఛా వాణిజ్య విధానానికి ప్రోత్సాహం. ► వాతావరణంలో మార్పుల్ని తట్టుకుంటూ జీవవైవిధ్యాన్ని కాపాడే చర్యలు. -
మూడోసారి పెళ్లికొడుకైన బ్రిటన్ ప్రధాని
-
ప్రియురాలిని పెళ్లాడిన బ్రిటిష్ ప్రధాని
లండన్: బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ (56) తన ప్రియురాలు క్యారీ సైమండ్స్ (33)ను పెళ్లాడారు. లండన్‌లోని రోమన్ క్యాథలిక్ వెస్ట్‌మినిస్టర్ క్యాథెడ్రల్ చర్చిలో శనివారం మధ్యాహ్నం నిరాడంబరంగా ఈ వివాహం జరిగినట్లు అధికార వర్గాలు ఆదివారం తెలిపాయి. వధూవరుల కుటుంబ సభ్యులు, మిత్రులు అతికొద్ది మంది మాత్రమే హాజరయ్యారని వెల్లడించాయి. రానున్న వేసవిలో బంధుమిత్రులతో కలిసి వివాహ సంబరాలు ఘనంగా జరుపుకోనున్నారని పేర్కొన్నాయి. బోరిస్ జాన్సన్, క్యారీ సైమండ్స్ చాలాకాలంగా సహజీవనం చేస్తున్నారు. వారికి 2020 ఏప్రిల్‌లో కుమారుడు విల్ఫ్రెడ్ క్యారీ నికోలస్ జాన్సన్ జన్మించాడు. సైమండ్స్‌కు ఇది మొదటి పెళ్లి కాగా, జాన్సన్‌కు మూడో వివాహం. తాము కలిసి జీవిస్తున్నామని, ఎంగేజ్మెంట్ సైతం చేసుకున్నామని వారిద్దరూ 2020లో ఫిబ్రవరిలో బహిర్గతం చేశారు. క్యారీ సైమండ్స్ అప్పటికే గర్భవతి అనే విషయాన్ని కూడా బయటపెట్టారు. గత 200 సంవత్సరాల్లో పదవిలో ఉండగా పెళ్లి చేసుకున్న మొదటి బ్రిటన్ ప్రధానమంత్రిగా బోరిస్ జాన్సన్ రికార్డుకెక్కడం విశేషం. ప్రియురాలితో బోరిస్ జాన్సన్ చివరిసారిగా 1822లో అప్పటి ప్రధాని రాబర్ట్ బ్యాంక్స్ జెంకిన్సన్ పదవిలో ఉండగా వివాహం చేసుకున్నారు. బోరిస్ జాన్సన్ తొలుత 1987లో కళాకారిణి, జర్నలిస్టు అలెగ్రా మోస్టిన్ ఓవెను, తర్వాత 1993లో భారత సంతతికి చెందిన న్యాయవాది, జర్నలిస్టు మెరీనా వీలర్‌ను పెళ్లాడారు. 25 ఏళ్ల వైవాహిక జీవితం అనంతరం తాము విడాకులు తీసుకుంటున్నట్లు జాన్సన్, వీలర్ 2018లో ప్రకటించారు. 2020లో ఈ విడాకుల తంతు పూర్తయ్యింది. క్యారీ సైమండ్స్ 1988 మార్చి 17న జన్మించారు. ఆమె తండ్రి మాథ్యూ సైమండ్స్ ‘ద ఇండిపెండెంట్’ పత్రిక సహ వ్యవస్థాపకుడు. తల్లి జోసెఫైన్ లాయర్. క్యారీ సైమండ్స్ 2010లో కన్జర్వేటివ్ పార్టీ ప్రెస్ ఆఫీసులో చేరారు. రెండేళ్ల తర్వాత బోరిస్ జాన్సన్ ప్రచార బృందంలో చేరారు. ఆయన రెండోసారి లండన్ మేయర్‌గా ఎన్నిక కావడం వెనుక ఆమె కృషి ఉందని అంటుంటారు. 2018లో కన్జర్వేటివ్ పార్టీ కమ్యూనికేషన్ల విభాగం బాధ్యతలు చేపట్టారు. ప్రధాని అధికారిక నివాసమైన 10 డౌనింగ్ స్ట్రీట్‌లో పెళ్లికాకుండానే ప్రధానితో కలిసి జీవనం సాగించిన తొలి మహిళగా క్యారీ సైమండ్స్ పేరుగాంచారు. -
బ్రిటన్ ప్రధాని రహస్య వివాహం!
లండన్: బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ వివాహం చేసుకున్నట్లు సమాచారం. ప్రియురాలు క్యారీ సైమండ్స్‌తో శనివారం బోరిస్ రహస్య వివాహం జరిగినట్లు తెలుస్తోంది. లండన్‌లో వెస్ట్‌మినిస్టర్ క్యాథెడ్రల్లో ఆయన వివాహం చేసుకున్నారని ది సన్, మెయిల్ ఆన్ సండేవర్క్ లాంటి టాబ్లాయిడ్లు ప్రముఖంగా ప్రచురించాయి. బోరిస్-సైమండ్స్ వివాహానికి సీనియర్ సభ్యులతో సహా ఎవరికీ ఆహ్వానం అందనట్లు తెలుస్తోంది. కేవలం కొద్దిమంది గెస్టుల మధ్య.. అది కూడా చివరి నిమిషంలో వాళ్లకు ఆహ్వానం ఇచ్చినట్లు ఆ పత్రికలు రాశాయి. ప్రస్తుతం కరోనా ఆంక్షలు కొనసాగుతుండడంతో 30 మందికి మాత్రమే వివాహ వేడుకలకు అనుమతి ఉంది. ఈ నేపథ్యంలో మధ్యాహ్నం 1గం.30ని సమయంలో వివాహం జరిగిందని, సైమండ్స్ అరగంట ఆలస్యంగా వచ్చిందని ఆ కథనాలు వెల్లడించాయి. కాగా, బోరిస్ 2019లో ప్రధాని అయ్యాక డౌనింగ్ స్ట్రీట్‌లో తన గర్ల్‌ఫ్రెండ్ సైమండ్స్(33)తో కలిసి ఉంటున్న విషయం తెలిసిందే. పోయినేడాది ఎంగేజ్మెంట్ చేసుకున్న ఈ జంటకు ఓ బాబు కూడా పుట్టాడు. అయితే వచ్చే ఏడాది జులైలో వీళ్ల పెళ్లి జరగొచ్చని కొన్ని పత్రికలు కథనాలు రాసినప్పటికీ.. ఇప్పుడు హడావుడిగా పెళ్లి జరిగిందని అదే పత్రికలు మరోసారి కథనాలు రాశాయి. గతంలో బోరిస్(56) వివాహేతర సంబంధంతో కన్జర్వేటివ్ పార్టీ నుంచి సస్పెండ్ అయ్యాడు. కాగా, బోరిస్ జాన్సన్‌కి ఇది మూడో వివాహం. గతంలో రెండుసార్లు విడాకులు తీసుకున్నారు. చివరిసారిగా మరీనా వీలర్ అనే లాయర్‌కి 2018లో విడాకులిచ్చారు. ఈమధ్యే బోరిస్‌కు సలహాదారుడిగా పని చేసిన డొమినిక్ కమింగ్స్.. ప్రధాని పదవికి బోరిస్ అనర్హుడంటూ సంచలన కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. కాగా, బ్రిటన్ ప్రధాని పదవిలో ఉండి లార్డ్ లివర్‌పూల్ 1822లో పెళ్లి చేసుకున్నాడు. -
England: లాక్డౌన్ ఆంక్షలు ఎత్తివేయాలా..వద్దా!
లండన్: గతేడాది ఇంగ్లాండ్ దేశాన్ని కరోనా మహమ్మారి అల్లకల్లోలం చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆ దేశం కరోనాపై విజయం సాధిస్తున్నట్లు కనిపిస్తోంది. అయితే బ్రిటన్‌లో లాక్డౌన్ అమలులో ఆంక్షలను ఎత్తివేయాలా... వద్దా అని బోరిస్ జాన్సన్ ప్రభుత్వం తర్జనభర్జన పడుతోంది. భారత్‌లో కరోనా సెకండ్ వేవ్ తీవ్రంగా ఉంది. ఈ సమయంలో లాక్‌డౌన్‌పై ఆంక్షలను ఎత్తివేస్తే మళ్లీ కేసులు పెరిగే ప్రమాదం ఉందని ప్రధాని బోరిస్ జాన్సన్ శుక్రవారం అభిప్రాయపడ్డారు. అయితే బ్రిటన్ ప్రభుత్వం సోమవారం లాక్‌డౌన్‌పై కొన్ని ఆంక్షలను ఎత్తివేయనుండగా.. మిగతా వాటిని జూన్ 21వ తేదీన ఎత్తివేయాలని నిర్ణయించింది. కరోనా సెకండ్ వేవ్ తీవ్ర ప్రభావం చూపించవచ్చు బోరిస్ జాన్సన్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే ప్రజలను సురక్షితంగా ఉంచడానికి తమ ప్రభుత్వం ఏదైనా చేస్తుందని తెలిపారు. ఇంగ్లాండ్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం..బీ1.617.2 కరోనా వేరియంట్ ఆ దేశ వాయువ్య ప్రాంతంలో వేగంగా వ్యాప్తి చెందుతోందని, దీనిని నియంత్రించడానికి నిర్ణయాత్మక చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. బ్రిటన్‌లో 50 సంవత్సరాలు దాటిన వారికి కోవిడ్ వ్యాక్సిన్ రెండో డోస్ వేసే ప్రక్రియ వేగం పెరిగిందని, ఇది కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకుంటుదని జాన్సన్ ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ కొత్త రకం కరోనా వేరియంట్ మిగతా వాటి కంటే వేగంగా వ్యాప్తిసుందా..లేదా అనే సమాచారం కోసం తమ ప్రభుత్వం వేచి ఉందని చెప్పారు. కరోనా సెకండ్ వేవ్ వ్యాప్తి అంతగా లేకుంటే మళ్లీ దేశంలో కార్యక్రమాలు పునః ప్రారంభమవుతాయని జాన్సన్ తెలిపారు. కాగా శాస్త్రవేత్తలు కరోనా సెకండ్ వేవ్ తొందరగా వ్యాప్తి చెందుతుందని చెబుతున్నారు. కానీ ఎంతవరకు నిజం అనేది పరిశోధనల్లో తెలియాల్సి ఉందని బ్రిటన్ ప్రధాన వైద్య అధికారి క్రిస్ విట్టి వెల్లడించారు. దీనిపై లండన్‌లోని క్వీన్ మేరీ విశ్వవిద్యాలయంలో ఎపీడెమియాలజీ సీనియర్ లెక్చరర్ దీప్తి గురుదాసిని మాట్లాడుతూ.. ప్రస్తుతం కరోనా వ్యాప్తి పెరుగుతుండడంతో మరిన్ని ఆంక్షలను విధించాలి’ అని చెప్పారు. కరోనా కేసులు గతవారం 520 నుంచి ఈ వారం 1,313కి పెరగడంతో ఆంక్షలు కొనసాగుతాయని అధికారులు తెలిపారు. మా టీకాలను నమ్మండి ‘‘బ్రిటన్‌లో కొన్ని నెలలుగా కరోనా కేసులు తగ్గుతున్నాయి. దానికి కారణం వ్యాక్సిన్లు, అవి కొత్త వేరియంట్‌ను సమర్థవంతంగా ఎదుర్కొంటున్నాయి. మా టీకాలు కరోనాను ఎదుర్కోవడంలో తక్కువ ప్రభావం కలిగిస్తాయని ఇప్పటివరకు ఎటువంటి ఆధారాలు లేవు. గతంలో బ్రిటన్ కరోనా సెకండ్ వేవ్ ఎదుర్కొన్నప్పటి కంటే ఇప్పుడు పరిస్థితులు మారాయి. దానికి కారణం వ్యాక్సినేషన్. కాబట్టి వ్యాక్సిన్లపై నమ్మకం ఉంచాలి.’’ అని జాన్సన్ అభిప్రాయపడ్డారు. కాగా బ్రిటన్‌లో కరోనా ఉధృతి తగ్గుతుండడంతో క్రమంగా ఆ దేశంలో ఆర్థిక కార్యకలాపాలు తిరిగి పుంజుకుంటున్నాయి. ఇక భారత్‌లో కరోనా వ్యాప్తి పెరుగుతుండడంతో బ్రిటన్‌కి వచ్చే ప్రయాణికులపై నిషేధం కొనసాగుతోంది. భారత్ నుంచి ప్రయాణికులు వస్తే బ్రిటన్ ప్రభుత్వం కొన్నిరోజులపాటు వారిని హోటల్లో ఉంచుతోంది. (చదవండి: ఆన్లైన్ ఉగ్రవాదంపై పోరుకు అమెరికా మద్దతు) -
కరోనా: ఆ టీకా ఒక్క డోసుతో 80 శాతం మరణాల రేటు తగ్గుదల!
లండన్: ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. అయితే పలు దేశాలు టీకాలు పంపిణీ చేస్తూ కరోనా కట్టడికి ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఆస్ట్రాజెనికా కరోనా వ్యాక్సిన్ ఫస్ట్ డోస్‌తో 80 శాతం మరణాలు తగ్గే అవకాశం ఉందని పబ్లిక్ హెల్త్ ఇంగ్లాడ్ పేర్కొంది. అంతే కాకుండా ఫైజర్ బయోటెక్ ఫస్ట్ డోస్‌తో 80శాతం, రెండో డోస్‌తో 97శాతం కోవిడ్ మరణాలు తగ్గుతాయని వెల్లడించింది. ఏప్రిల్ నెలలో కరోనా సోకి 28 రోజుల అనంతరం మృతి చెందిన బాధితులపై బ్రిటన్‌లో రియల్ వరల్డ్ సెట్టింగ్ సంస్థ అధ్యయనం చేపట్టింది. ఈ అధ్యయనం ప్రకారం.. ఎటువంటి టీకా తీసుకోని వారితో పోల్చితే ఒక డోసు ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్ తీసుకున్న వారిలో 55 శాతం, ఒక డోసు ఫైజర్ టీకా తీసుకున్న వారిలో 44 శాతం మంది మరణించకుండా సురక్షితంగా కోవిడ్ నుంచి బయటపడినట్లు తెలిపింది. అయితే వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల 80 శాతం మరణాలు తగ్గుతాయని కూడా పేర్కొంది. అదేవిధంగా ఫైజర్-బయోటెక్ వ్యాక్సిన్ రెండో డోస్ తీసుకోవడం వల్ల 69శాతం మరణాలు తగ్గడంతో పాటు 97 శాతం సురక్షితమని ఈ అధ్యయనం వివరించింది. ఫైజర్-బయోటెక్ రెండు డోస్‌లు తీసుకున్న 80సంవత్సరాల వయసు వారిలో 93శాతం ఆస్పత్రిలో చేరే అవసరం ఉండదని తెలిపింది. ఇక ఇంగ్లండ్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ దేశంలో లాక్డౌన్ ఆంక్షలను మరింత సడలించడానికి సిద్ధమయ్యారు. ఈ క్రమంలో కరోనా వ్యాక్సిన్‌ను దేశ ప్రజలకు వేగంగా అందిస్తే కోవిడ్ నియంత్రణ మెరుగవుతుందని రియల్ వరల్డ్ సెట్టింగ్ అధ్యయన సంస్థ అభిప్రాయపడింది. (చదవండి: కోవిడ్ సంక్షోభం: భారత్‌కు మద్దతుగా ట్విటర్ భారీ విరాళం) -
యూకేలో 2200 కోట్ల పెట్టుబడి: సీరం అధినేత నిర్ణయం
లండన్: ప్రపంచంలోని అతిపెద్ద వ్యాక్సిన్ తయారీదారు సీరం ఇన్ట్సిట్యూట్ ఆఫ్ ఇండియా అధిపతి అదార్ పూనావాలా భారత్‌లో తనను బెదిరిస్తున్నారని చెప్పి తన ఫ్యామిలీతో కలిసి యూకే వెళ్లిన విషయం తెలిసిందే. యూకేలో కొత్త వ్యాక్సిన్ ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి అదార్ పూనావాలా సన్నాహాలను మొదలు పెట్టారు. దానిలో భాగంగా సుమారు 300 మిలియన్ డాలర్లును బ్రిటన్‌లో పెట్టుబడి పెట్టేందుకు సిద్ధమయ్యాడు. భవిషత్తులో టీకా ఉత్పతి కేంద్రాలకు అవసరమైన సౌలభ్యాలను నిర్మించనున్నట్లు బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ సోమవారం రోజున ఒక ప్రకటనలో తెలిపారు. కాగా 334 మిలియన్ డాలర్ల ప్రాజెక్టుతో బ్రిటన్‌లో క్లినికల్ ట్రయల్స్, పరిశోధనలు, వ్యాక్సిన్ ఉత్పత్తి కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు జాన్సన్ అధికార కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. సీరం తక్కువ ఖర్చుతో కూడిన ఆస్ట్రాజెనెకా కరోనావైరస్ షాట్‌ను ఉత్పత్తి చేయడంలో ముందంజలో ఉంది. కరోనాను కట్టడి చేయడానికి నాజిల్ వ్యాక్సిన్‌ను తయారు చేయడంలో సీరం కీలకపాత్ర పోషిస్తోంది. ఈ వ్యాక్సిన్ నేరుగా ముక్కులో ఒక డోసు స్ప్రే చేస్తారు. ప్రస్తుతం సీరం యూకేలో మొదటి ఫేజ్ క్లినికల్ ట్రయల్స్‌ను మొదలుపెట్టింది. సీరం పెట్టుబడి భారత్, యూకే వాణిజ్య, పెట్టుబడి ఒప్పందాల విస్తృత ప్యాకేజీలో భాగమని డౌనింగ్ స్ట్రీట్ తెలిపింది. దీంతో సుమారు 6500 మందికి ఉద్యోగకల్పన జరుగుతుందని తెలిపారు. ఈ ఒప్పందం యూకే ప్రధాని బోరిస్, భారత ప్రధాని నరేంద్రమోదీకి మంగళవారం జరిగిన వర్చువల్ మీటింగ్ కంటే ముందుగానే జరగడం విశేషం. చదవండి: కరోనా వ్యాక్సిన్‌పై కీలక వ్యాఖ్యలు చేసిన సీరం -
బోరిస్‌పై ఎన్నికల నిధుల అక్రమ వినియోగ దర్యాప్తు
లండన్: బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్‌పై ఎన్నికల నిధుల అక్రమ వినియోగ దర్యాప్తు ప్రారంభిస్తున్నట్లు యూకే ఎన్నికల కమిషన్ బుధవారం వెల్లడించింది. ప్రధాని అధికారిక నివాసమైన 11 డౌనింగ్ స్ట్రీట్ పక్క వీధిలో ఉన్న బోరిస్‌కు చెందిన సొంత ప్లాట్‌కు పలు మరమ్మతులు చేపట్టారు. వీటిలో అధికార పార్టీకి చెందిన నిధులు ఉన్నాయన్నది ఎన్నికల కమిషన్ ప్రధాన అభియోగం. ఈ వ్యవహారంపై తమ వద్ద ప్రాథమిక ఆధారాలు కూడా ఉన్నాయని ఎన్నికల కమిషన్ పేర్కొనడం విశేషం. ఇంటి నిర్మాణంలో ఎన్నికల నిధుల వ్యవహారాన్ని కనుగొనేందుకు విచారణ సాగుతోందని ఎన్నికల కమిషన్ చెప్పింది. నిధుల అక్రమ వినియోగంపై బోరిస్‌కు గతంలో ఎన్నికల వ్యూహకర్తగా పని చేసిన డామినిక్ కమింగ్స్ చేసిన వ్యాఖ్యలు మరింత ఆజ్యం పోసేలా ఉన్నాయి. పార్టీ కోసం ఫండ్ ఇవ్వాలనుకున్న వారి నుంచి ప్రధాని ఇంటి నిర్మాణానికి డబ్బు చేరేవేసే ప్రణాళికలు అప్పట్లో జరిగాయని ఆయన ఓ బ్లాగ్‌లో రాశారు. దీంతో బ్రిటన్‌లో ప్రతిపక్షం దీనిపై తీవ్రంగా మండిపడుతోంది. దీనిపై బోరిస్ వర్గం స్పందిస్తూ.. ఈ వ్యవహారంపై తాము పారదర్శకంగా ఉన్నామని, గతంలోనే ఇంటి నిర్మాణానికి సంబంధించిన వివరాలను ఎన్నికల కమిషన్ ఎదుట వ్యక్తపరిచామని తెలిపింది. చదవండి: కరోనాపై ప్రచారాల్లో వాస్తవమెంత.. డబ్ల్యూహెచ్ఓ ఏం చెబుతోంది? -
మరోసారి రద్దు: భారత్‌కు రాలేకపోతున్న బోరిస్
లండన్: బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ తన భారత భారత పర్యట నను రద్దు చేసుకు న్నారు. భారత్‌లో కరోనా తీవ్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సోమవారం వెల్లడించారు. ఆయన వచ్చే వారం భారత్‌కు రావాల్సి ఉంది అయితే తాజా నిర్ణయంతో ఆ పర్యటన రద్దైంది. దీనికి ముందు గణతంత్ర దినోత్సవ వేడుకలకే ఆయన రావాల్సి ఉండగా, అప్పుడు బ్రిటన్‌లో కరోనా తీవ్రంగా ప్రబలి ఉండటంతో రాలేకపోయారు. పర్యటన రద్దుపై ఆయన స్పందిస్తూ.. భారత్‌లో కరోనా తీవ్ర పంజా విసురుతున్న నేపథ్యంలో పర్యటనను రద్దు చేసుకోవడం మంచి నిర్ణయమని భావిస్తున్నట్లు తెలిపారు. భారత ప్రధాని మోదీతో చర్చించిన అనంతరం ఇరువురూ కలసి ఈ నిర్ణయానికి వచ్చినట్లు పేర్కొన్నారు. గతంలో తాము కూడా కరోనా వల్ల దెబ్బతిన్నామని, అదే స్థితిలో ఇప్పుడు భారత్ ఉందని చెప్పారు. ఈ స్థితి నుంచి భారత్ కోలుకోవాలని ఆశిస్తున్నట్లు తెలిపారు. బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ పర్యటన రద్దైన నేపథ్యంలో త్వరలోనే ఓ వర్చువల్ సమావేశం ఉంటుందని కేంద్రం ప్రకటించింది. ఈ ఏడాది చివర్లో వ్యక్తిగతంగా ఆ దేశ అధికారులను కలిసే అవకాశం ఉంటుందని తెలిపారు. ఇలా ఉండగా, బ్రిటన్‌లో ఇటీవల భారత మూలాలున్న డబుల్ మ్యూటంట్ వైరస్ కేసులు 77 నమోదైన నేపథ్యంలో.. భారత్‌ను ప్రయాణ నిషేధ జాబితాలో చేరుస్తూ సోమవారం ఆదేశాలు జారీ చేసింది. చదవండి: హే! హెర్డ్ ఇమ్యూనిటీ ఉత్త ముచ్చట చదవండి: తస్మాత్ జాగ్రత్త! లింక్ నొక్కితే.. నిలువు దోపిడీ -
టీకా తీసుకున్నా వస్తున్నా.. బోరిస్ భారత పర్యటన ఖరారు
ఈ ఏడాది గణతంత్ర వేడుకల్లో ముఖ్య అతిథిగా బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ పాల్గొనాల్సి ఉండగా కరోనా కొత్త స్ట్రెయిన్ కేసుల పెరుగుదలతో పర్యటన రద్దయ్యింది. అప్పటి పర్యటన ఇప్పుడు ఖరారైంది. ఏప్రిల్ 26వ తేదీన భారత్‌కు ఆయన రానున్నట్లు అధికారిక ప్రకటన వెలువడింది. అయితే ఎన్ని రోజుల పర్యటన.. ఎక్కడెక్కడ పర్యటిస్తారనే విషయం ఇంకా స్పష్టత రాలేదు. జనవరిలో 26వ తేదీన పర్యటించాల్సిన బోరిస్ మళ్లీ ఈసారి ఏప్రిల్ 26వ తేదీన ఖరారైంది. దీంతో 26వ తేదీతో ఏదో ప్రత్యేకత ఉందని తెలుస్తోంది. అయితే ఆ పర్యటనలో భాగంగా చెన్నెకు కూడా వెళ్తారని సమాచారం. ఈ మేరకు బ్రిటన్ అధికారులు చెన్నెలో పరిస్థితులు గమనిస్తున్నట్లు తెలుస్తోంది. బోరిస్ ప్రస్తుత పర్యటనతో ఇరు దేశాల మధ్య జరగాల్సిన వాణిజ్య చర్చలు కొలిక్కి రానున్నాయి. భవిష్యత్‌లో బ్రిటన్ ప్రభుత్వం ఇంటిగ్రేటెడ్ రివ్యూలో భాగంగా ఇండో-పసిఫిక్ ప్రాంతం వైపు దృష్టి సారించనున్నట్లు జాన్సన్ ప్రభుత్వం తెలిపింది.ఈ ప్రాంతం భవిష్యత్తులో ప్రపంచంలో భౌగోళిక రాజకీయ కేంద్రంగా ప్రాతినిధ్యం వహించనుంది. బ్రెగ్జిట్ అనంతరం, నెలకొన్న పరిస్థితులు, వాణిజ్యం కోసం కొత్త మార్గాలను అన్వేషించడానికి 11 దేశాల కూటమిలో సభ్యత్వం కోరుతూ, గత నెలలో బ్రిటన్ ట్రాన్స్-పసిఫిక్ పార్ట్నర్షిప్ కోసం సమగ్ర మరియు ప్రగతిశీల ఒప్పందం (సీపీటీపీపీ)లో చేరాలని భారత్‌కు అధికారికంగా అభ్యర్థన చేసింది. ఈ పర్యటనతో ఆ అంశాలపై ఒక స్పష్టత రానుంది. అయితే శుక్రవారం బ్రిటన్ ప్రధాని బోరిస్ కరోనా టీకా మొదటి డోస్ వేసుకున్నారు. ‘చాలా బాగుంది.. చాలా వేగవంతం’ అని లండన్‌లోని ఆస్పత్రిలో ఆస్ట్రాజెన్‌కా టీకా వేయించుకున్న అనంతరం బోరిస్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా వ్యాక్సిన్‌పై 56 ఏళ్ల బోరిస్ నమ్మకం వెలిబుచ్చారు. ప్రతిఒక్కరూ టీకా పొందాలని ప్రజలకు ప్రధాని పిలుపునిచ్చారు. -
టీకా తీసుకున్నా వస్తున్నా.. బోరిస్ భారత పర్యటన ఖరారు
-
పరస్పర సహకారంతోనే విపత్తులపై విజయం
న్యూఢిల్లీ/లండన్: విపత్తులను ఎదుర్కొనే విషయంలో ప్రపంచ దేశాల మధ్య పరస్పర సహకారం కచ్చితంగా అవసరమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, షిప్పింగ్ లైన్లు, వైమానిక నెట్వర్క్స్ వంటివి ప్రపంచమంతటా విస్తరించి ఉంటాయని వెల్లడించారు. ఎక్కడైనా విపత్తు సంభవిస్తే దాని ప్రభావం ప్రపంచవ్యాప్తంగా వెంటనే కనిపిస్తుందన్నారు. విపత్తుల కారణంగా దెబ్బతిన్న మౌలిక వసతులను పునరుద్ధరించడానికి, పూర్వ స్థితికి తీసుకురావడానికి అన్ని దేశాలు కలిసి పని చేయాలని సూచించారు. డిజాస్టర్ రిసైలియెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనే అంశంపై బుధవారం జరిగిన అంతర్జాతీయ సదస్సు (ఐసీడీఆర్ఐ–2021) ప్రారంభోత్సవంలో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు. భారత్‌లాంటి దేశాలు మౌలిక వసతుల రంగంలో భారీగా పెట్టుబడులు పెడుతున్నాయని తెలిపారు. విపత్తుల నుంచి కోలుకోవడానికి కూడా నిధుల కేటాయింపులు అవసరమన్నారు. కరోనా నేర్పిన పాఠాలు మరవొద్దు కోవిడ్–19 మహమ్మారి ఒక ఊహించని విపత్తు అని నరేంద్ర మోదీ అభివర్ణించారు. వందేళ్లకు ఒకసారి సంభవించే ఇలాంటి విపత్తుకు మనం సాక్షీభూతంగా నిలిచామన్నారు. ఈ మహమ్మారి వల్ల పేద–ధనిక, తూర్పు–పడమర, ఉత్తరం–దక్షిణం అనే తేడా లేకుండా ప్రపంచంలోని అన్ని దేశాలూ నష్టపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఒకచోట మొదలైన విపత్తు ప్రపంచాన్ని ఎంతో వేగంగా ప్రభావితం చేస్తుందన్న పాఠాన్ని కరోనా వైరస్ మనకు నేర్పిందన్నారు. ఉమ్మడి శత్రువును ఎదిరించడానికి ప్రపంచమంతా ఒక్కతాటిపైకి ఎలా రావాలో తెలియజేసిందని పేర్కొన్నారు. అంతర్జాతీయ సవాళ్లను ఎదుర్కొనేందుకు అవసరమైన వ్యూహాలు ప్రపంచంలో ఎక్కడైనా పురుడు పోసుకోవచ్చని వివరించారు. 2021లో కరోనా మహమ్మారి నుంచి ప్రపంచం వేగంగా కోలుకుంటుందని ప్రధాని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. కరోనా నేర్పిన పాఠాలను మర్చిపోవద్దని సూచించారు. ఈ పాఠాలను ప్రజారోగ్య విపత్తులకే కాకుండా ఇతర విపత్తులకు కూడా అన్వయించుకోవాలని పిలుపునిచ్చారు. ఆధునిక ప్రపంచం పాలిట పెనుభూతంగా మారిన వాతావరణ మార్పుల నుంచి గట్టెక్కడానికి ఉమ్మడి కృషి కావాలని ప్రధానమంత్రి మోదీ సూచించారు. ఈ సదస్సులో ఇటలీ ప్రధానమంత్రి మారియో డ్రాఘీ, యూకే ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ తదితరులతోపాటు పలు అంతర్జాతీయ సంస్థల, విద్యా సంస్థల ప్రతినిధులు, పలువురు నిపుణులు పాల్గొన్నారు. మోదీ పాత్ర ప్రశంసనీయం వాతావరణ మార్పులపై జరుగుతున్న అంతర్జాతీయ పోరాటంలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అద్భుతమైన పాత్ర పోషిస్తున్నారని యునైటెడ్ కింగ్డమ్(యూకే) ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ ప్రశంసించారు. ఆయన నాయకత్వం విస్మరించలేనిదని అన్నారు. తాను వచ్చే నెలలో భారత్‌లో పర్యటించబోతున్నానని, వాతావరణ మార్పులతోపాటు ఇతర కీలక అంశాలపై తన మిత్రుడు మోదీతో చర్చిస్తానని చెప్పారు. ఐసీడీఆర్ఐ సదస్సులో బోరిస్ జాన్సన్ మాట్లాడారు. ఈ సదస్సును నిర్వహించిన నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. -
బ్రిటన్ ప్రధాని భారత పర్యటన ఖరారు
లండన్: బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ఏప్రిల్ చివరి వారంలో భారత్‌కు రానున్నట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని బ్రిటన్ ప్రధాని కార్యాలయం తెలిపింది. యూరోపియన్ యూనియన్ (ఈయూ) నుంచి బ్రిటన్ బయటకు వచ్చిన తరువాత బోరిస్ చేస్తోన్న మొదటి అంతర్జాతీయ పర్యటన ఇది. యూకే అవసరాలను మెరుగుపర్చడం కోసం ఈయూ నుంచి బ్రిటన్ బయటకు వచ్చిన విషయం తెలిసిందే. కాగా, ఈ ఏడాది రిపబ్లిక్ వేడుకల్లో ముఖ్య అతిథిగా బోరిస్ పాల్గొనాల్సి ఉండగా, బ్రిటన్‌లో కరోనా కొత్త స్ట్రెయిన్ కేసులు అధికంగా నమోదుకావడంతో తన పర్యటనను రద్దు చేసుకొన్నారు. దాంతో ఇరు దేశాల మధ్య జరగాల్సిన వాణిజ్య చర్చలు నిలిచిపోయాయి. ప్రస్తుత పర్యటనతో ఈ చర్చలు కొలిక్కిరానున్నాయి. రాబోయే రోజుల్లో బ్రిటన్ ప్రభుత్వం ఇంటిగ్రేటెడ్ రివ్యూలో భాగంగా ఇండో-పసిఫిక్ ప్రాంతం వైపు దృష్టి సారించనున్నట్లు జాన్సన్ ప్రభుత్వం తెలిపింది.ఈ ప్రాంతం భవిష్యత్తులో ప్రపంచంలో భౌగోళిక రాజకీయ కేంద్రంగా ప్రాతినిధ్యం వహించనుంది. బ్రెగ్జిట్ అనంతరం, నెలకొన్న పరిస్థితులు, వాణిజ్యం కోసం కొత్త మార్గాలను అన్వేషించడానికి 11 దేశాల కూటమిలో సభ్యత్వం కోరుతూ, గత నెలలో బ్రిటన్ ట్రాన్స్-పసిఫిక్ పార్ట్నర్షిప్ కోసం సమగ్ర మరియు ప్రగతిశీల ఒప్పందంలో (సిపిటిపిపి) చేరాలని ఇండియాకు అధికారికంగా అభ్యర్థన చేసింది.(చదవండి: రష్యాను అధిగమించిన భారత్..!) -
నాలుగు దశల్లో లాక్డౌన్ సడలింపు
లండన్: యూకేలో ప్రస్తుతం అమలవుతున్న కోవిడ్ లాక్డౌన్ ఆంక్షలను నాలుగు దశల్లో ఎత్తి వేసేందుకు ఉద్దేశించిన రోడ్ మ్యాప్‌ను ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ సోమవారం పార్లమెంట్ ముందుంచారు. కరోనా కేసులు నియంత్రణలో ఉంటే, ముందుగా ప్రకటించిన జూన్ 21వ తేదీకి చాలా వరకు ఆంక్షలను కనీసం 5 వారాల వ్యవధితో సడలించేందుకు అవకాశం ఉందని చెప్పారు. ప్రస్తుత ‘స్టే ఎట్ హోం’పిలుపును మార్చి 29వ తేదీ నుంచి ‘స్టే లోకల్’కు మారుస్తామని చెప్పారు. అవసరమైతే మళ్లీ కోవిడ్ ఆంక్షలను విధించే అవకాశం ఉందని వ్యాఖ్యానించారు. ప్రధాని తెలిపిన ప్రకారం.. ► మొదటి దశ మార్చి 8వ తేదీ నుంచి అన్ని వయస్సుల విద్యార్థులకు స్కూళ్లు, యూనివర్సిటీలు ప్రారంభం. ► రెండో దశ..ఏప్రిల్ 12 నుంచి అత్యవసరం కాని దుకాణాలు, ఔట్‌డోర్ డైనింగ్, బీర్ గార్డెన్స్‌కు ఓకే. ► మూడో దశ.. మే 17వ తేదీ నుంచి పబ్‌లు, సినిమా హాళ్లు, జిమ్‌లను తెరిచేందుకు అనుమతి. ► నాలుగో దశ.. జూన్ 21వ తేదీతో నైట్ క్లబ్బులు, ఉత్సవాలు, సమావేశాలు, ఫుట్‌బాల్ మ్యాచ్‌లు సహా అన్ని ఆంక్షల ఎత్తివేత. కరోనా వైరస్ ప్రమాదం నుంచి బయటపడినట్లు గణాంకాలతో రుజువైతేనే ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి అమల్లోకి వస్తాయని బోరిస్ స్పష్టం చేశారు. -
మార్చి 8దాకా బడి బంద్
లండన్: ఇంగ్లాండ్‌లో కరోనా వైరస్ ఉధృతి ఇంకా తగ్గకపోవడంతో పాఠశాలలను మార్చి 8వ తేదీ వరకు మూసివేస్తున్నట్లు యునైటెడ్ కింగ్డమ్(యూకే) ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ చెప్పారు. ఆయన తాజాగా పార్లమెంట్ హౌస్ ఆఫ్ కామన్స్‌లో మాట్లాడారు. మార్చి 8 తర్వాత పాఠశాలలను తెరవడంపై అప్పటి పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకుంటామన్నరు. దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతోందని గుర్తుచేశారు. దేశంలో లాక్‌డౌన్‌ను దశలవారీగా ఎత్తివేయడానికి రోడ్‌మ్యాప్ సిద్ధం చేస్తున్నామని తెలిపారు. ఫిబ్రవరి 15న దీనిపై నిపుణులతో సమీక్ష నిర్వహిస్తామన్నారు. ఈ సమీక్షలో వెల్లడైన అంశాల ఆధారంగానే లాక్‌డౌన్‌పై తుది నిర్ణయం ఉంటుందని స్పష్టం చేశారు. పాఠశాలలు పునఃప్రారంభమయ్యదాకా అర్హులైన విద్యార్థులకు ఫుడ్ పార్సెళ్లు/ఓచర్లు అందుతాయని బోరిస్ జాన్సన్ స్పష్టం చేశారు. -
బంధం మరింత బలోపేతం కావాలి
వాషింగ్టన్: నాటో కూటమిలో కీలకపాత్ర పోషిస్తూ దానిని బలోపేతం చేయాలని, కోవిడ్ మహమ్మారి, పర్యావరణ మార్పులపై కలసికట్టుగా పోరాటం చేయాలని అమెరికా, బ్రిటన్ నిర్ణయించాయి. అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత విదేశాలతో సంబంధాలపై దృష్టి సారించిన జో బైడెన్ బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్‌కి ఫోన్ చేసి మాట్లాడారు. ఈ సందర్భంగా బ్రిటన్‌తో ఉన్న ప్రత్యేక బంధాన్ని మరింత బలోపేతం చేయాలన్న తన ఉద్దేశాన్ని విడమరిచి చెప్పారు. ‘జో బైడెన్‌తో మాట్లాడడం చాలా ఆనందం కలిగించింది. రెండు దేశాల మధ్య చిరకాలంగా ఉన్న స్నేహసంబంధాల్ని మరింత పటిష్టం చేయాలని నిర్ణయించాం. కోవిడ్ మహమ్మారిని జయించి సుస్థిరత ఏర్పాటు చేయడానికి ఇరు దేశాలు కృషి చేస్తాం’’ అని బైడెన్ శనివారం ట్వీట్ చేశారు. ఇరుదేశాల మధ్య వాణిజ్య సంబంధాల్లో ఉన్న విభేదాల్ని త్వరలోనే పరిష్కరించుకోవడానికి ఇరువురు నేతలు అంగీకరించినట్టుగా వైట్‌హౌస్ వర్గాలు వెల్లడించాయి. ‘‘నాటో కూటమిలో మళ్లీ కీలక పాత్ర పోషించేలా , ఇరు దేశాల మధ్య చాలా కాలంగా రక్షణ రంగంలో ఉన్న బంధాన్ని మరింత పటిష్టం చేసేలా మాత్రమే బైడెన్ దృష్టి సారించారు. అందుకే జాన్సన్‌తో మాట్లాడినప్పుడు ఇరు దేశాల ప్రత్యేక సంబంధాల గురించి మాత్రమే మాట్లాడారు’’ అని వైట్‌హౌస్ వర్గాలు చెప్పాయి. మరోవైపు ప్రపంచ ఆరోగ్య సంస్థ, పారిస్ ఒప్పందంలో తిరిగి చేరడంపై బైడెన్‌ను జాన్సన్ అ«భినందించారు. కరోనా ముప్పు తొలగిన తర్వాత ఇరు దేశాల అధినేతలు కలిసి మాట్లాడుకోవాలని నిర్ణయానికి వచ్చినట్టు బ్రిటన్ కార్యాలయం ప్రతినిధులు చెప్పారు. -
అక్కడ వేసవి వరకూ లాక్డౌన్..
బ్లూంబర్గ్: బ్రిటన్‌లో కొనసాగుతోన్న మూడో దఫా లాక్‌డౌన్‌ని ఎత్తివేస్తామని ముందస్తుగా ప్రకటించడం తొందరపాటు చర్య అవుతుందని బ్రిటన్ ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్, హోంమంత్రి ప్రీతీ పటేల్ అభిప్రాయపడుతున్నారు. గ్రేట్ బ్రిటన్‌లో 50 లక్షల మందికి కరోనా వ్యాక్సిన్ అందిస్తున్నప్పటికీ, కరోనా తీవ్రత కొనసాగుతూనే ఉందని, ఈ వేసవి కాలం ఏప్రిల్ నాటికి గానీ పరిస్థితులు మెరుగుపడవని వారు భావిస్తున్నారు. ఇప్పటికీ అనేక మంది ప్రజలు కోవిడ్ నిబంధనలను పాటించకపోవడం వల్ల మహమ్మారిని కట్టడి చేయడం కష్టతరంగా మారడంతో, కోవిడ్ ఆంక్షలను మరింత కఠినతరం చేయాలని భావిస్తున్నారు. ఇళ్ళల్లో గుంపులు గుంపులుగా కలిసి పార్టీలు నిర్వహించే వారిపై బ్రిటన్ పోలీసులు 1,097 డాలర్ల జరిమానా విధిస్తూన్నట్టు లండన్‌లో జరిగిన మీడియ సమావేశంలో ప్రీతీ పటేల్ తెలిపారు. అది మళ్ళీ కరోనా మహమ్మారి కోరల్లో చిక్కుకునే ప్రమాదాన్ని కొనితెచ్చుకున్నట్టేనని వారు అభిప్రాయపడ్డారు. మార్చి ప్రారంభంలో ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరిస్తామని బ్రిటన్ మంత్రులు గతంలో ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. అయితే ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో లాక్డౌన్ ఆంక్షలను సవరించే అవకాశం కనిపించడం లేదు. ఫిబ్రవరి 15లోగా బ్రిటన్‌లోని దయనీయమైన పరిస్థితుల్లో ఉన్న 15 లక్షల మందికి వ్యాక్సినేషన్ ఇవ్వాలని భావిస్తోంది. ఈ లక్ష్యాన్ని చేరుకోగానే లాక్డౌన్ ఆంక్షలను సడలించాలని బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్‌పై ఆయన పార్టీకి చెందిన కన్సర్వేటివ్ పార్టీ సభ్యుల నుంచి ఒత్తిడి ఎక్కువయ్యింది. (చదవండి: బ్రెగ్జిట్తో మారేవేంటంటే...) ఆంక్షలు... బ్రిటన్‌లో షాప్స్, రెస్టారెంట్లు, స్కూల్స్‌ని మూసివేశారు. అత్యవసరమైతే తప్ప ప్రజలెవ్వరూ బయటకు రాకూడదని ప్రభుత్వం ప్రకటించింది. ఈ ఆంక్షలు వేసవి వరకూ కొనసాగడం తప్పదని ప్రభుత్వం తేల్చి చెపుతోంది. మూడు శతాబ్దాల్లో అత్యంత తీవ్ర తిరోగమనానికి గురైన ఆర్థిక వ్యవస్థను ఈ ఆంక్షలు మరింత సంక్షోభంలోకి నెట్టివేస్తాయన్న విమర్శలూ వెల్లువెత్తుతున్నాయి. కోవిడ్ వల్ల గత 24 గంటల్లో బ్రిటన్‌లో 1,290 మంది మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 95,829 కి చేరుకుంది. -
గడ్డు స్థితిలో జీ–7 అడుగులు
ప్రపంచ ఆర్థిక వ్యవస్థలన్నీ ఏటికి ఎదురీదుతున్న వర్తమానంలో అందరూ కొత్త అవకాశాల కోసం, సరికొత్త సాన్నిహిత్యాల కోసం ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మరికొన్ని నెలల్లో జరగబోయే జీ–7 దేశాల శిఖరాగ్ర సమావేశాలకు రావాల్సిందిగా మన దేశాన్ని బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ఆహ్వానించారు. కరోనా వైరస్ విరుచుకుపడిన తర్వాత సంపన్న రాజ్యాలు కూడా సమస్యల్లో చిక్కుకున్నాయి. అన్ని దేశాలూ ఈ ఏడాది తెరిపినపడే అవకాశం వున్నదని ఇటీవలే అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ(ఐఎంఎఫ్) తెలిపింది. అలాగని కరోనా ముందున్నప్పటి స్థితి ఇప్పట్లో అసాధ్యమని కూడా వివరించింది. అందుకు సుదీర్ఘకాలం పడుతుంది. నిర్దిష్టంగా దాన్ని అంచనా వేయటం కుదర దని ఆర్థిక నిపుణులు కూడా అంటున్నారు. కొత్త ఆర్థిక సంవత్సరంలో 5.2 శాతం వృద్ధి నమోదవు కావొచ్చన్నది ఒక అంచనా. ఆ వృద్ధిలో ఎవరికి వారు తాము కూడా భాగస్వాములం కావాలని ఉవ్విళ్లూరుతున్నారు. అందుకే బోరిస్ జాన్సన్ జీ–7 శిఖరాగ్ర సదస్సు కోసం ఉత్సాహపడుతున్నారు. సదస్సులో ఆయనే అధ్యక్షుడవుతారు. యూరప్ యూనియన్(ఈయూ) నుంచి బ్రిటన్ ఇటీవలే తప్పుకుంది. ఈ ఒంటరి ప్రస్థానం నేపథ్యంలో అంతర్జాతీయంగా చురుకైన పాత్ర నిర్వహించాలని, సాధ్యమైనంత త్వరగా స్వీయ ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దాలని ఆ దేశం ఆత్రంగా వుంది. జీ–7 దేశాల శిఖరాగ్ర సదస్సులో నేరుగా దేశాధినేతలు పాల్గొని రెండేళ్లవుతోంది. కరోనా వైరస్ మహమ్మారి బెడద లేకపోతే నిరుడు అమెరికాలో అధినేతలంతా కలిసేవారే. 2019లో ఫ్రాన్స్‌లో జరిగిన సంస్థ శిఖరాగ్ర సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఇందులో బ్రిటన్‌తోపాటు కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, అమెరికాలు భాగస్వాములు కాగా... దక్షిణ కొరియా, ఆస్ట్రే లియాతోపాటు మనల్ని కూడా ప్రత్యేక ఆహ్వానితుల హోదాలో పిలవాలని అటు అమెరికా, ఇటు బ్రిటన్ నిరుడు నిర్ణయించాయి. 45 ఏళ్లనాటి ఈ సంస్థలో సోవియెట్ యూనియన్ పతనానంతరం రష్యాకు కూడా సభ్యత్వం లభించింది. అయితే 2013లో క్రిమియాను రష్యా విలీనం చేసుకున్నాక ఆగ్రహం వ్యక్తం చేసిన అగ్రరాజ్యాలు సంస్థ నుంచి దాన్ని బహిష్కరించాయి. 2019నాటి సదస్సులో ఆ దేశాన్ని మళ్లీ జీ–7లో చేర్చుకోవాలని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఒత్తిడి తెచ్చారు. అయితే ఆయన వాదనను ఇతర దేశాలు ససేమిరా అంగీకరించలేదు. యూరప్ దేశాలకు ముప్పు కలిగిం చేలా వ్యవహరిస్తున్న రష్యా పోకడలు మారకుండా ఎలా చేర్చుకుంటామని అందరికందరూ ఎదురు తిరిగారు. దాంతో ట్రంప్ ఏకాకయ్యారు. వాస్తవానికి అమెరికాలో సదస్సు నిర్వహించి, ఆ సంస్థ సారథ్యాన్ని స్వీకరించి ఎలాగైనా రష్యాకు చోటీయాలని ఆయన నిర్ణయించుకున్నారు. కానీ కరోనా కారణంగా సదస్సు నిర్వహణ అసాధ్యమైంది. ఇప్పుడు జీ–7 ముందు చాలా సమస్యలే వున్నాయి. వర్థమాన దేశాలు చెల్లించాల్సిన రుణాలను పూర్తిగా లేదా పాక్షికంగా రద్దు చేయటం అందులో ఒకటి. సమీప భవిష్యత్తులో ఏ దేశమూ తీసుకున్న అప్పును చెల్లించే స్థితిలో లేదు. పైగా కోలుకోవటం కోసం వాటికి కొత్తగా భారీ రుణాలు అవసరమవుతాయి. ఆదాయాలు దారుణంగా పడిపోయి, వ్యయం అపారంగా పెరిగిన వర్తమానంలో అన్ని దేశాలూ గడ్డు పరిస్థితుల్లో కొట్టుమిట్టాడు తున్నాయి. మొన్న డిసెంబర్ మధ్యకు ప్రపంచ దేశాల రుణం 20 లక్షల కోట్ల డాలర్లుంది. ఇది వున్నకొద్దీ మరింతగా పెరుగుతుందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. ఒకపక్క కరోనా వైరస్‌ను అరికట్టేందుకు వ్యాక్సిన్లు ఇవ్వటం మొదలుకాగా, మరోపక్క అది కొత్త రూపంతో కలవరపెడుతోంది. ప్రపంచవ్యాప్తంగా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. కరోనా తర్వాత విమాన రాకపోకల్ని నిలిపేసిన అనేక దేశాలు ఇప్పుడిప్పుడే వాటిని పునరుద్ధరిస్తుండగా తాజాగా పుట్టుకొ చ్చిన వైరస్ కారణంగా మళ్లీ వెనకడుగేస్తున్నాయి. నిషేధాలు విధిస్తున్నాయి. ఈ పరిస్థితి పూర్తిగా మారి, ఒక దేశం నుంచి మరో దేశానికి రాకపోకలు ముమ్మరంగా పెరిగితే తప్ప ఆర్థిక వ్యవస్థలు గాడినపడటం సాధ్యంకాదు. ఇదిగాక రష్యాకు సభ్యత్వమిచ్చే సమస్య సరేసరి. సదస్సు నాటికి ఎటూ ట్రంప్ స్థానంలో అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్ వస్తారు గనుక ఆ విషయంలో ఆ దేశం వైఖరి మారుతుంది. జీ–7 దేశాల మధ్య ఆర్థిక రంగంతోపాటు పర్యావరణం, ఆరోగ్యం, వాణిజ్యం, సాంకే తికాభివృద్ధి వగైరా రంగాల్లో సైతం దృఢమైన సహకారం ఏర్పడాలని బోరిస్ జాన్సన్ ప్రతిపాది స్తున్నారు. సభ్య దేశాలతోపాటు సదస్సులో పాల్గొనే మూడు దేశాలనూ కలుపుకొంటే ప్రజాస్వామ్య దేశాల్లోని 60 శాతం జనాభాకు ప్రాతినిధ్యం ఇచ్చినట్టవుతుందని, దీన్ని మరింత మెరుగ్గా వినియో గించుకుంటే అందరూ ఎదగటానికి అవకాశం వుంటుందని బ్రిటన్ విశ్వసిస్తోంది. సంక్షోభంలోనే జీ–7 పుట్టింది. 1975లో ఒపెక్ దేశాల నిర్ణయం కారణంగా ఏర్పడిన చమురు సంక్షోభం నుంచి గట్టెక్కటానికి అమెరికా, ఇతర పాశ్చాత్య దేశాలు దీన్ని స్థాపించాయి. అన్ని రంగా ల్లోనూ కలిసి కదలాలని, ప్రపంచ దేశాలన్నిటినీ కలుపుకొని తమ ఆధిపత్యాన్ని ప్రతిష్టించాలని భావించాయి. దాంతో పోలిస్తే ఈనాటి సంక్షోభం అనేక రెట్లు పెద్దది. ఒక అంచనా ప్రకారం కరోనా తర్వాత ఉపాధి కోల్పోయి ప్రపంచవ్యాప్తంగా దాదాపు పదికోట్ల మంది తీవ్ర దారిద్య్రంలో కూరుకు పోయారు. చిన్నా చితకా వ్యాపారాలు సైతం తీవ్ర నష్టాలను చవిచూశాయి. జీ–7 దేశాల్లోనే తీసుకుంటే ఒక్క జర్మనీ మినహా అన్నిచోట్లా నిరుద్యోగం ఉగ్రరూపం దాల్చింది. ప్రజల ఆదాయం కూడా భారీగా పడిపోయింది. ఈ గడ్డు పరిస్థితుల్లో భారీ మొత్తంలో నిధులు పారించి, ఉద్దీపన ప్యాకేజీలు ప్రకటిస్తే తప్ప కోలుకోవటం అసాధ్యం. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను దాదాపు సున్నా శాతానికి తీసుకొచ్చింది. దాన్ని ఇప్పట్లో పెంచబోమని చెబుతోంది. అటు యూరొపియన్ సెంట్రల్ బ్యాంకు కూడా భిన్న మార్గాల్లో భారీగా నిధుల విడుదలకు సిద్ధమవుతోంది. ఇవన్నీ శిఖ రాగ్ర సదస్సునాటికి సత్ఫలితాలిస్తే సంపన్న దేశాలు ఉత్సాహంగా అడుగులేయటం ఖాయం. -
మోదీజీ.. ‘జీ–7’కు రండి
లండన్: ఈ ఏడాది జరగనున్న జీ–7 దేశాల శిఖరాగ్ర సమావేశాలకు భారత ప్రధాని నరేంద్ర మోదీని కూడా ఆహ్వానించినట్లు బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ఆదివారం వెల్లడించారు. బ్రిటన్ అధ్యక్షతన ఈ ఏడాది జూన్ 11 నుంచి 13వ తేదీ వరకు జరగనున్న అభివృద్ధి చెందిన దేశాల సమావేశాలకు తీర ప్రాంతమైన కార్న్‌వాల్ వేదికగా మారనుందని ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. ఈ శిఖరాగ్ర భేటీకి భారత్‌తోపాటు దక్షిణ కొరియా, ఆస్ట్రేలియా లను ఆతిథ్య హోదాలో ఆహ్వానిం చామన్నారు. గత ఏడాది భారత ప్రధాని మోదీతో ఫోన్ కాల్ సంభాషణ సమయంలోనే ఈ విషయం తెలిపానన్నారు. జనవరి 26వ తేదీన భారత గణతంత్ర ఉత్సవాలకు ముఖ్య అతిథిగా వెళ్లాల్సి ఉండగా దేశంలో కరోనా సంక్షోభం కారణంగా ఆ పర్యటన రద్దయిందని ఆయన చెప్పారు. త్వరలోనే, జీ–7 భేటీలకు ముందే భారత్ సందర్శించే ఆలోచనలో ఉన్నామని చెప్పారు. జూన్‌లో జీ7 భేటీకి హాజరయ్యే 10 మంది నేతలు ప్రపంచంలోని ప్రజాస్వామ్యదేశాల్లోని 60% ప్రజలకు ప్రాతినిధ్యం వహించనున్నారని బోరిస్ జాన్సన్ తెలిపారు. తగరం, రాగి గనులతో 200 ఏళ్ల క్రితం బ్రిటన్‌లో పారిశ్రామిక విప్లవానికి కీలకంగా నిలిచిన కార్న్‌వాల్‌లో జీ7 భేటీ జరుగుతుందన్నారు. జీ 7 (గ్రూప్ ఆఫ్ సెవెన్)బృందంలో ప్రపంచంలో పలుకుబడి కలిగిన అమెరికా, యూకే, కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్ దేశాలున్నాయి. ఈ ఏడాది ఈ దేశాల మధ్య కోవిడ్ మహమ్మారిపైనే ప్రధాన చర్చ జరుగుతుందని భావిస్తున్నారు. దాదాపు రెండేళ్లకు ముఖాముఖి జరగనున్న ఈ భేటీకి ముందుగా బ్రిటన్ వర్చువల్‌గా, నేరుగా వివిధ దేశాలతో మంత్రుల స్థాయిలో విస్తృతంగా చర్చలు జరపనుంది. యూకే ఈ ఏడాది ఫిబ్రవరిలోనే భద్రతా మండలి అధ్యక్ష బాధ్యతలను చేపట్టనుంది. ప్రపంచ ఔషధాగారం భారత్ ప్రపంచ వ్యాక్సిన్ అవసరాల్లో 50% వరకు సరఫరాచేసిన భారత్ ప్రపంచ ఔషధాగారంగా మారిందని యూకే విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. కోవిడ్ మహమ్మారి విషయంలో యూకే, భారత్ కలిసికట్టుగా పనిచేస్తున్నాయని తెలిపింది. భద్రతా మండలిలో భారత్ శాశ్వత సభ్యత్వానికి మద్దతిచ్చిన పీ–5 దేశాల్లో యూకే మొట్టమొదటిదని పేర్కొంది. 2005లో భారత్‌ను జీ–7 సమ్మిట్‌కు యూకే మొదటగా ఆహ్వానం పంపింది. త్వరలో బ్రిక్స్ అధ్యక్ష హోదాతోపాటు, 2023లో జీ20 అధ్యక్ష బాధ్యతలను భారత్ చేపట్టనుందంది. -
బ్రిటన్‌లో ఫిబ్రవరి వరకు లాక్డౌన్
లండన్: యూకేలో కరోనా కొత్త స్టెయిన్ ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. కేసులు పెరిగిపోతూ ఆస్పత్రులపై ఒత్తిడి అధికం కావడంతో ప్రభుత్వం బుధవారం నుంచి సంపూర్ణ లాక్డౌన్ ప్రకటించింది. అత్యవసరమైతే తప్ప ప్రజలెవరూ ఇల్లు కదిలి బయటకు రావద్దని ప్రధాని బోరిస్ జాన్సన్ విజ్ఞప్తి చేశారు. ఈ కొత్త నిబంధనలు ఫిబ్రవరి మధ్య వరకు అమల్లో ఉంటాయని చెప్పారు. ఆ తర్వాత పరిస్థితుల్ని సమీక్షించాక ఆంక్షల సడలింపుపై నిర్ణయం తీసుకుంటారు. ‘70 శాతం వేగంతో కరోనా కేసులు వ్యాప్తిచెందుతున్నాయి. జనాభాలో అత్యధిక శాతం కరోనా బారిన పడే అవకాశం ఉంది’ అని జాన్సన్ అన్నారు. ఇంటి నుంచి పని చేసే అవకాశం లేనివారు, నిత్యావసరాలు వైద్య అవసరాల కోసం, కరోనా టెస్ట్ చేయించుకోవడానికి, గృహ హింస ఎదుర్కొన్నప్పుడు, వ్యాయామం కోసం బయటకు రావచ్చునని జాన్సన్ స్పష్టం చేశారు. గత మార్చిలో విధించిన లాక్డౌన్ నిబంధనలన్నీ ఇప్పుడు కూడా వర్తిస్తాయని జాన్సన్ వెల్లడించారు. ఇంగ్లండ్, వేల్స్, ఉత్తర ఐర్లాండ్‌లలో బుధవారం నుంచి ఆంక్షలు అమల్లోకి వస్తే, స్కాట్లాండ్లో నెలకొన్న అత్యవసర పరిస్థితి దృష్ట్యా మంగళవారం నుంచే లాక్డౌన్ అమల్లోకి వచ్చింది. పాఠశాలలు, దుకాణాలు మూసివేశారు. హౌస్ ఆఫ్ కామన్స్ సమావేశమై లాక్‌డౌన్‌కు ఆమోద ముద్ర వేయనుంది. లెవెల్5కి కరోనా యూకే వ్యాప్తంగా కోవిడ్–19 లెవల్ 5కి చేరుకుంది. కరోనా లెవల్స్‌లో ఇదే అత్యధిక స్థాయి. ఇప్పుడే తక్షణ చర్యలు తీసుకోకపోతే మరో 21 రోజుల్లో కరోనా జాతీయ ఆరోగ్య సర్వీసు (ఎన్హెచ్ఎస్) చేతులు కూడా దాటిపోయే అవకాశం ఉంది. దీంతో బ్రిటన్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ సిఫారసుతో యూకే వ్యాప్తంగా లాక్డౌన్ విధించారు. గత వారం రోజులుగా రోజుకి 50 వేలకు పైగా కేసులు నమోదవుతుంటే, ఇంగ్లండ్‌లో కొన్ని ఆస్పత్రుల్లో ప్రతీ 10 పడకల్లో ఆరింట్లో కరోనా రోగులు చికిత్స పొందుతున్నారు. క్రిస్మస్ తర్వాత కరోనాతో ఆస్పత్రుల పాలయ్యే రోగుల సంఖ్య 50% పెరిగితే మరణాలు 20 శాతం పెరిగాయి. మంగళవారం ఒక్కరోజే 60,916 కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు యూకే వ్యాప్తంగా 27 లక్షలకు పైగా కేసులు నమోదైతే, 76 వేల మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. టీకాపైనే ఆశలు కరోనా కట్టడికి బ్రిటన్ ప్రభుత్వం టీకాపైనే ఆశలు పెట్టుకుంది. దేశ చరిత్రలోనే అతి పెద్ద టీకా కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఫైజర్, కోవిషీల్డ్ రెండు టీకాలు ప్రజలకి ఇస్తున్నారు. ‘‘రాబోయే రోజుల్లో మరిన్ని గడ్డు పరిస్థితులు ఎదుర్కోబోతున్నాం. అయినప్పటికీ ప్రజలందరూ ఆత్మవిశ్వాసంతో సహకరించాలి. కరోనా వ్యాక్సిన్ పని చేస్తుందన్న విశ్వాసం ఉంది. మనం యుద్ధానికి చివరి దశకి చేరుకున్నాం’’ అని జాన్సన్ అన్నారు. పరీక్షలపై ఫిబ్రవరిలో నిర్ణయం బ్రిటన్ వ్యాప్తంగా ప్రాథమిక పాఠశాలలు, కళాశాలలు, యూనివర్సిటీలన్నీ మూసివేశారు. విద్యార్థులందరూ ఇక ఇళ్లలోనే ఉండి చదువుకోవాల్సి ఉంటుంది. ఈ ఏడాది మే–జూన్లలో పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం తొలుత ప్రణాళికలు సిద్ధం చేసింది. కానీ లాక్డౌన్ కారణంగా మళ్లీ పరీక్షల నిర్వహణపై పునరాలోచన చేస్తోంది. విద్యాసంస్థలు తిరిగి తెరవడం, పరీక్షల నిర్వహణపై ఫిబ్రవరి 15 తర్వాత తుది నిర్ణయం తీసుకుంటారు. భారత పర్యటన వాయిదా భారత్‌లో జనవరి 26న జరిగే గణతంత్రదిన వేడుకలకి హాజరు కావాల్సిన బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ తన పర్యటనని వాయిదా వేసుకున్నారు. భారత ప్రధాని మోదీతో మంగళవారం ఆయన ఫోన్లో మాట్లాడారు. దేశంలో కొత్త కరోనా కేసులు ఉ«ధృతరూపం దాల్చడంతో తాను భారత్‌కి రాలేకపోతున్నానంటూ ఆయన విచారం వ్యక్తం చేశారు. త్వరలోనే భారత్‌కి వస్తానని జాన్సన్ హామీ ఇచ్చారు. యూకే ఆధ్వర్యంలో ఈ ఏడాది చివర్లో జరిగే జీ–7 సదస్సు కంటే ముందుగానే భారత్‌కి వస్తానని చెప్పారు. బోరిస్, మోదీ మధ్య జరిగిన సంభాషణను బ్రిటన్ అధికార ప్రతినిధి వెల్లడించారు. ‘కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉన్న ఈ సమయంలో తాను బ్రిటన్‌లో ఉండడం అత్యవసరమని జాన్సన్ చెప్పారు. కలసికట్టుగా కరోనాపై పోరాటం చేయాలని ఇరువురు నేతలు ఒక నిర్ణయానికి వచ్చారు. ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి కృషి చేయాలని అవగాహనకు వచ్చినట్టుగా ప్రతినిధి తెలిపారు. -
రిపబ్లిక్‌డే : చీఫ్ గెస్ట్‌కు కొత్త కరోనా దెబ్బ
సాక్షి, న్యూఢిల్లీ: బ్రిటన్‌లో కొత్త కరోనా వైరస్ విజృంభణ కారణంలో బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. స్ట్రెయిన్ కారణంగా బోరిస్ జాన్సన్ భారత పర్యటనను రద్దు చేసుకున్నారు. మహమ్మారి నివారణ చర్యలను పర్యవేక్షించాల్సిన అవసరాన్ని పేర్కొంటూ ఆయన తన టూర్‌ను విరమించుకున్నారు. ఈ మేరకు జాన్సన్ భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీతో మాట్లాడారు. గత రాత్రి ప్రకటించిన జాతీయ లాక్డౌన్, కొత్త కరోనావైరస్ వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందుతున్ననేపథ్యంలో తాను దేశంలో ఉండడం చాలా ముఖ్యం అని ప్రధాని పేర్కొన్నారు. ప్రణాళిక ప్రకారం ఈ నెలాఖరులో భారతదేశాన్ని సందర్శించలేకపోతున్నారని విచారం వ్యక్తం చేశారని డౌనింగ్ స్ట్రీట్ ప్రతినిధి ఒకరు తెలిపారు. (దేశంలో విస్తరిస్తున్న కొత్త కరోనా) జనవరి 26, భారత గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ హాజరు కావాల్సి వుంది. అయితే కొత్తరకం కరోనా స్ట్రెయిన్ ప్రకంపనలు కొనసాగుతుండటంతో యూకేలో మరోసారి లాక్డౌన్ విధిస్తున్నట్టు ప్రధాని సోమవారం ప్రకటించారు. దేశంలోని చాలా ప్రాంతం ఇప్పటికే కఠిన ఆంక్షల్లో ఉందనీ, కొత్త వేరియంట్‌ను నియంత్రించడం అత్యంత క్లిష్టమని, అందుకే దేశవ్యాప్త లాక్డౌన్ విధించాల్సి వచ్చిందని, కొత్త మహమ్మారిని అదుపులోకి తీసుకొచ్చేందకు మరింతగా శ్రమించాల్సి ఉందని జాన్సన్ పేర్కొన్న సంగతి తెలిసిందే. -
బ్రెగ్జిట్తో మారేవేంటంటే...
లండన్: బ్రెగ్జిట్ ట్రాన్సిషన్ కాలం ముగియడంతో యూకే–ఈయూ ఒప్పందం అమల్లోకి వచ్చింది. అయితే బ్రిటిష్ పౌరులు దీని కారణంగా కొన్ని మార్పులను చవిచూడనున్నారు. అవేంటంటే.. 1. ఈయూ పరిధిలోని ఇతర దేశాల్లో యూకే ప్రజలు స్థిరనివాసం ఏర్పాటు చేసుకోవాలంటే తప్పనిసరిగా ఇమ్మిగ్రేషన్ నియమాలను పాటించాల్సి ఉంటుంది. ఇతర దేశాలకు వెళ్లడానికి వీసాలు, రెడ్‌టేప్ వంటి ప్రక్రియలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. కుటుంబాలు వివిధ దేశాల్లో ఉన్నవారికి ఇది ప్రధాన సమస్యగా మారే అవకాశం ఉంది. 2. గతంలో ఉన్నట్లుగా ఈయూ కూటమిలోని దేశాల్లోకి అంత సులువుగా ప్రయాణించలేరు. అయితే సెలవుల్లో వీసా–ఫ్రీ ప్రక్రియతో వెళ్లే అవకాశాలు ఉన్నాయి. బ్రిటీషర్లకు యూరోపియన్ ఆరోగ్య బీమా కార్డులు కూడా ఉండవు. కోవిడ్ ప్రయాణ నిబంధనలు కూడా జతకావచ్చు. 3. ఎరాస్మస్ ప్రక్రియ కింద బ్రిటిష్ వారు గతంలోలా ఈయూ దేశాల్లో చదువుకోవడం, పనిచేయడం, బోధించడం, శిక్షణ ఇవ్వడం వంటివి చేయలేరు. అప్పట్లో ఈయూ పథకం కింద నేర్చుకునేవారికి, చదువుకునేవారికి గ్రాంట్లు కూడా ఉండేవి. 4. యూకే వారికి ఇకపై ఫ్రీ రోమింగ్ సదుపాయం ముగిసినట్లే. దేశం దాటి ఈయూ కూటమిలో ప్రవేశిస్తే రోమింగ్ చార్జీలు ఉంటాయి. అయితే అక్కడున్న ఈఈ, ఓటూ, వొడాఫోన్ వంటి కంపెనీలు ప్రస్తుతానికి రోమింగ్ సంబంధించి ప్లాన్లేమీ లేవన్నాయి. 5. తమ వాహన లైసెన్స్‌తో బ్రిటిషర్లు.. యూరోపియన్ యూనియన్ దేశాల్లో తిరగవచ్చు. అయితే ప్రయాణసమయాల్లో గ్రీన్ కార్డును వెంట తీసుకెళ్లాల్సి ఉంటుంది. వాహనం మీద జీబీ స్టిక్కర్ తప్పనిసరి. 6. యూరోపియన్ పార్లమెంట్ ఎన్నికల్లో బ్రిటన్ దేశస్తుల ప్రాధాన్యత తగ్గిపోనుంది. ఎన్నికల్లో పోటీచేసే అధికారాలు, ఓటు వేసే హక్కులు బ్రిటిషర్లకు బాగా తగ్గిపోతాయి. 7. ఈయూ భాగస్వాములతో వ్యాపారం చేయడానికి ఇకపై అధిక పేపర్ వర్క్, అదనపు రుసుములు ఉండవచ్చు. ఫ్రెంచ్ పౌరసత్వానికి బోరిస్ తండ్రి దరఖాస్తు.. బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ తండ్రి స్టాన్లీ జాన్సన్ ఫ్రెంచ్ పౌరసత్వానికి దరఖాస్తు చేసుకున్నారు. తానెల్లప్పుడూ యూరోపియన్గానే ఉంటానని ఫ్రెంచ్ రేడియో స్టేషన్ ఆర్టీఎల్లో పేర్కొన్నారు. ఈయూ నుంచి యూకే బయటికొస్తున్న వేళ ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. తన తల్లి, అమ్మమ్మ ఇద్దరూ ఫ్రెంచ్ వారేనని, అందువల్ల తానూ ఫ్రెంచ్వాడినేనని పేర్కొన్నారు. బ్రిటిష్ ప్రజలకు యూరోపియన్లుగా ఉండాలో వద్దో వేరేవారు చెప్పలేరని అన్నారు. యూరోపియన్ యూనియన్‌తో సంబంధాలు కలిగి ఉండటం ముఖ్యమని అభిప్రాయపడ్డారు. -
ఆక్స్ఫర్డ్ టీకాకు బ్రిటన్ ఓకే
లండన్/న్యూఢిల్లీ/బీజింగ్: ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ, ఆస్ట్రాజెనెకా అభివృద్ధిపరిచిన కోవిడ్ వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి బ్రిటన్ అనుమతిచ్చింది. బయోటెక్ ల్యాబ్స్ ఫైజర్ టీకా తరువాత యూకె.. ఓకే చెప్పిన రెండో కరోనా టీకాగా ఆస్ట్రాజెనెకా కోవిడ్ వ్యాక్సిన్ మరో వారం రోజుల్లో బ్రిటన్ ప్రజలకు అందుబాటులోకి రానుంది. ఈ వ్యాక్సిన్‌ని బ్రిటిష్ రెగ్యులేటరీ మెడిసిన్స్ అండ్ హెల్త్‌కేర్ ప్రొడక్ట్స్ రెగ్యులేటరీ ఏజెన్సీ(ఎంహెచ్ఆర్ఏ) పరిశీలించింది. ఈ వ్యాక్సిన్ సురక్షితమైనదీ, శక్తివంతమైనదని ఎంహెచ్ఆర్ఏ నిర్ధారించింది.సాధ్యమైనంత ఎక్కువ మందికి వ్యాక్సిన్ అందించేందుకు సిద్ధంగా ఉన్నట్టు బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ వెల్లడించారు. జనవరి 4 నుంచి వ్యాక్సినేషన్ ప్రారంభించనున్నట్టు బ్రిటన్ ఆరోగ్య మంత్రి మాట్ హాన్కాక్ తెలిపారు. భారత్‌లో ఇలా.. ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి బ్రిటన్ ఓకే చెప్పడంతో భారత్‌లో ౖ టీకా వాడకానికి అనుమతికోసం సీరం కంపెనీ ఎదురుచూస్తోంది. ఆస్ట్రాజెనెకా టీకాను సీరం ఇన్స్టిట్యూట్ ఉత్పత్తి చేస్తోంది. పుణేకి చెందిన సీరం ఇన్స్టిట్యూట్ భారత్‌లో ఈ టీకా అత్యవసర వినియోగం కోసం డీసీజీఐకి దరఖాస్తు చేసుకుంది. ఈ విజ్ఞప్తిని ప్రభుత్వం నియమించిన నిపుణుల బృందం పరిగణనలోనికి తీసుకుంది. వీరు అందించిన వ్యాక్సిన్ సంబంధిత సమాచారాన్ని ప్యానల్ పరిశీలిస్తోంది. శుక్రవారం నిపుణుల బృందం సమావేశం జరగనుంది. -
ఎట్టకేలకు ఒప్పందం
యూరప్ యూనియన్(ఈయూ) నుంచి నిష్క్రమించే బ్రెగ్జిట్ ప్రక్రియ సజావుగా ముగుస్తుందా లేదా అని ఎంతో ఉత్కంఠతో ఎదురుచూసిన బ్రిటన్ పౌరులకు ఆ దేశ ప్రధాని బోరిస్ జాన్సన్ క్రిస్మస్ పర్వదినాన బ్రస్సెల్స్ నుంచి మంచి కబురు అందించారు. ఈయూ నుంచి వైదొలగడానికి సంబంధించిన ఒప్పందానికి ఇక కేవలం ఏడు రోజులే గడువుండగా ఎవరూ ఊహించని రీతిలో దీనికి శుభం కార్డు పడింది. వాస్తవానికి ఈ ఏడాది జనవరి 1 నుంచి లాంఛనంగా బ్రిటన్ ఈయూ నుంచి బయటికొచ్చింది. కానీ దానికి సంబంధించిన సాంకేతిక అంశాలపై ఒప్పందం కుదరడానికి మళ్లీ ఏడాది పట్టింది. ఒకటా రెండా... నాలుగేళ్లుగా అటు ఈయూకూ, ఇటు బ్రిటన్‌కూ ఇదొక సంక్లిష్ట సమస్యగా మారింది. ఎడతెగకుండా సాగిన చర్చలు ప్రతిసారీ ప్రతిష్టంభనలోనే ముగిసి ఉసూరనిపించాయి. ఒప్పందం వల్ల జాతీయ ప్రయోజనాలకు విఘాతం కలగకుండా చూడటం.... అందుకు అనువైన రీతిలో ఈయూను ఒప్పించడం జాన్సన్‌కు పెను సమస్యగా మారింది. ఒక దశలో విసుగెత్తి ఒప్పందం లేకున్నా ఖాతరు చేసేది లేదని, దేనికైనా సిద్ధమని ఆయన ప్రకటించారు. అటు ఈయూకు సైతం ఇది జీవన్మరణ సమస్యే. బయటికెళ్లిన బ్రిటన్‌కు అంతా బాగుందని, అందువల్ల అది ఎంతో లాభపడిందని ఇతర సభ్య దేశాలు అనుకుంటే ఈయూ నుంచి ఒక్కొక్కరుగా నిష్క్రమిస్తారు. వెళ్లిపోవడం వల్ల అది ఎంతో నష్టపోయిందన్న అభిప్రాయం కలగడం దాని మనుగడకు ముఖ్యం. కనుకనే ఒప్పందం కుదరడానికి నాలుగేళ్ల సుదీర్ఘ సమయం పట్టింది. అయితే తాజాగా ఒప్పందం కుదిరిందంటూ చేసిన ప్రకటనతోపాటు విడుదలైన జాన్సన్ ఫొటో చూస్తే అంతా బ్రిటన్‌కు అనుకూలంగానే ముగిసిందన్న అభిప్రాయం అందరికీ కలుగుతుంది. అటు ఈయూ కూడా ఈ ఒప్పందం ఇరుపక్షాలకూ ప్రయోజనం చేకూర్చేదని, న్యాయమైనదని అంటోంది. అయితే ఇంతమాత్రం చేత ఇంకా అంతా అయిపోయినట్టు కాదు. ఈ ఒప్పందాన్ని జాన్సన్ బ్రిటన్ పార్లమెంట్ ముందుంచి దాని ధ్రువీకరణ పొందాలి. అందుకోసం మరో అయిదు రోజుల్లో బ్రిటన్ పార్లమెంటు సమావేశం కాబోతోంది. అటు 27 మంది ఈయూ పెద్దలు సభ్య దేశాల రాయబారులనూ సమావేశపరిచి ఒప్పంద వివరాలు చెప్పడం క్రిస్మస్ రోజునే మొదలైంది. ఈ రాయబారులంతా వెనువెంటనే స్వదేశాలకెళ్లి అధినేతలకు ఒప్పందాన్ని వివరిస్తారు. అన్ని దేశాల పార్లమెంటులూ ఈ నెలాఖరుకల్లా ఒప్పందంపై ఆమోదముద్ర వేయాలి. ఇది నష్టదాయకమైనదని ఏ దేశం భావించినా ఒప్పందాన్ని వీటో చేయొచ్చు. ఈ ప్రక్రియ సాఫీగా ముగిసిపోతే ఈయూ పార్లమెంటు వచ్చే నెల మొదట్లో ఒప్పందాన్ని పరిశీలించడం మొదలెడుతుంది. అది ధ్రువీకరించేవరకూ దీన్ని తాత్కాలిక ఒప్పందంగానే పరిగణిస్తారు. బ్రెగ్జిట్ భూతం 2016లో డేవిడ్ కామెరాన్, నిరుడు థెరిస్సా మే జాతకాలను తలకిందులు చేసింది. వారిద్దరూ అర్ధాంతరంగా తప్పుకోవాల్సి వచ్చింది. నాలుగేళ్ల వ్యవధిలో రెండుసార్లు ఎన్నికలు తప్పలేదు. థెరిస్సా మే స్థానంలో వచ్చిన బోరిస్ జాన్సన్ గత ఏడాది అక్టోబర్‌లో కూడా ఒప్పందం కుదిరిందని ప్రకటించారు. అది కాస్తా పార్లమెంటులో వీగిపోవటంతో ఆయన ప్రభుత్వం రాజీనామా చేసి మధ్యంతర ఎన్నికలకు వెళ్లాల్సివచ్చింది. తిరిగి మళ్లీ ప్రధాని అయిన దగ్గరినుంచి ఆయన బ్రెగ్జిట్పైనే అధిక సమయం వెచ్చించారు. ఒకపక్క హఠాత్తుగా విరుచుకుపడిన కరోనా మహమ్మారితో దేశం అయోమయావస్థలో పడగా... ఆయనే ఆ వ్యాధిబారిన పడ్డారు. ఇలా ఎన్నో అవాంతరాలను ఎదుర్కొని ఈ ఒప్పందాన్ని ఖరారు చేసుకున్నారు. ఇంతకూ ఒప్పందంలో ఏముంది? ఇరు పక్షాలూ చెప్పుకుంటున్నట్టు అది ఉభయత్రా ప్రయోజనకరమైనదేనా... లేక పాత ఒప్పందాల మాదిరే దీన్ని కూడా పార్లమెంటు విసిరికొడుతుందా అన్నది తేలడానికి మరికొన్ని రోజులు పడుతుంది. 1,800 పేజీలున్న ఒప్పందంలో ఇరుపక్షాల సంబంధాలపైనా అనేకానేక నిబంధనలున్నాయి. ఇటు బ్రిటన్, అటు ఈయూ వేర్వేరుగా మనుగడ సాగిస్తూ వాణిజ్యరంగంలో కలిసి పనిచేయడానికి ఏమేం పాటించాలో, ఉత్పత్తయ్యే సరుకుపై విధించే పన్నులు ఎలా వుండాలో చెప్పే నిబంధనలవి. ఒక దేశంగా బ్రిటన్‌కు ఇకపై పూర్తి సార్వభౌమాధికారం చేతికొచ్చినట్టే. అది తన భవిష్యత్తును తానే నిర్దేశించుకోగలుగుతుంది. ఇకపై ఈయూ నియమ నిబంధనలు వర్తించవు. నచ్చిన చట్టాలు స్వేచ్ఛగా చేసుకోవచ్చు. ఈయూ ధ్రువీకరణ అవసరం లేదు. యూరపియన్ న్యాయస్థానం బెడద వుండదు. బ్రిటన్ పౌరులు ఈయూ ప్రాంత దేశాలకు వెళ్లాలన్నా, అక్కడివారు ఇటు రావాలన్నా ఇకపై వీసా తప్పనిసరి కావొచ్చు. బ్రిటన్ పరిధిలోని ఇంగ్లిష్ చానెల్లో చేపలు పట్టడానికి ఈయూ ఫిషింగ్ బోట్లకు అనుమతులు అవసరమవుతాయి. ఈయూ ఏటా 60 లక్షల టన్నుల చేపల్ని ఎగుమతి చేస్తుంది. అందులో ఏడు లక్షల టన్నులు ఇంగ్లిష్ చానెల్, ఇతర కెనాల్స్‌లో లభిస్తాయి. దీని విలువ 65 కోట్ల పౌండ్లు. ఇదే ఒప్పందం కుదరడానికి అడ్డంకిగా మారింది. చివరకు ఏకాభిప్రాయం కుదిరింది. అయితే ప్రశ్నలు చాలానే వున్నాయి. బ్రిటన్ ఆర్థిక వ్యవస్థ ప్రధానంగా సేవారంగంపై ఆధారపడివుంటుంది. ఆ రంగానికి ఈయూ ప్రాంత దేశాల్లో అవకాశాలెలా వుంటాయో తెలియదు. ఎందుకంటే ఈ ఒప్పందంలో దాని ఊసే లేదు. ముఖ్యంగా విత్త సంబంధ సేవారంగం పరిస్థితేమిటో అగమ్యగోచరం. ఆ రంగానికి ఈయూ ఏమేరకు చోటిస్తుందో చూడాలి. ఏడాది క్రితం కుదిరిన అవగాహనకు భిన్నంగా ఇటీవలే అంతర్గత మార్కెట్లకు సంబంధించి బ్రిటన్ ప్రభుత్వం కొత్త బిల్లు తీసుకొచ్చింది. అది ఈయూకు మింగుడుపడటం లేదు. బిల్లును వెనక్కి తీసుకోనట్టయితే ప్రతీకార చర్యలుంటాయని అది హెచ్చరించింది. ఇలాంటి సమస్యలు ఇకముందూ తప్పకపోవచ్చు. మొత్తానికి బ్రిటన్ ఈయూతో వున్న మూడు దశాబ్దాల అనుబంధాన్ని వదులుకుని బయటికొచ్చింది. ఇందువల్ల అది జీడీపీలో 4 శాతం కోల్పోతుంది. ఒప్పందం లేకుండా బయటికొస్తే ఇది 6 శాతం మేర వుండేది. తదుపరి దశలు కూడా సాఫీగా పూర్తయితే అది జాన్సన్ ప్రతిష్టను మరింత పెంచుతుంది. -
ఈయూతో యూకే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం
లండన్: యూరోపియన్ యూనియన్(ఈయూ) నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆ కూటమితో యునైటెడ్ కింగ్డమ్(యూకే) భారీ ఒప్పందం కుదుర్చుకుంది. పోస్ట్–బ్రెగ్జిట్‌స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని(ఎఫ్‌టీఏ) ఇరు వర్గాలు గురువారం ఖరారు చేసుకున్నాయి. ఇందుకు తుది గడువు డిసెంబర్ 31 కాగా, వారం రోజుల ముందే ఒప్పందం కుదరడం విశేషం. ఇందుకు బెల్జియంలోని బ్రస్సెల్స్ నగరం వేదికగా మారింది. ఇది అతిపెద్ద ద్వైపాక్షిక ఒప్పందమని వాణిజ్య వర్గాలు చెబుతున్నాయి. ఈ అగ్రిమెంట్ పూర్తి వివరాలు మరికొద్ది రోజుల్లో బహిర్గతం కానున్నాయి. ఒక స్వతంత్ర వాణిజ్య దేశంగా ఇకపై తమకు ఎన్నో కొత్త అవకాశాలు అందుబాటులోకి రానున్నాయని, ప్రపంచవ్యాప్తంగా ఇతర భాగస్వామ్య దేశాలతో మరిన్ని వాణిజ్య ఒప్పందాలు చేసుకోవడానికి మార్గం సుగమమైందని యూకే అధికార వర్గాలు ఒక ప్రకటనలో పేర్కొన్నాయి. జీరో టారిఫ్‌లు, జీరో కోటాల ఆధారంగా ఈయూతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు వెల్లడించాయి. దీంతో ధనం, సరిహద్దులు, చట్టాలు, వాణిజ్యం, సముద్ర జలాలపై తమ ఆధిపత్యం మళ్లీ తిరిగి వస్తుందని తెలిపాయి. ఒక్కమాటలో చెప్పాలంటే 2021 జనవరి 1వ తేదీన తాము పూర్తిగా రాజకీయ, ఆర్థిక స్వేచ్ఛ పొందుతామని స్పష్టం చేశాయి. ఇదొక పారదర్శక, బాధ్యతాయుతమైన ఒప్పందమని యూరోపియన్ కమిషన్ అధ్యక్షుడు ఉర్సులా వన్‌డెర్ లెయెన్ అభివర్ణించారు. ఈయూకు యూకే దీర్ఘకాలిక భాగస్వామ్య దేశమని గుర్తుచేశారు. ఈయూ నుంచి విడిపోవడం కొంత బాధాకరమే అయినప్పటికీ, ఇది భవిష్యత్తు వైపు దృష్టి సారించాల్సిన సమయమన్నారు. ప్రధాని బోరిస్ హర్షం పోస్ట్–బ్రెగ్జిట్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదరడం పట్ల యూకే ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ‘ద డీల్ ఈజ్ డన్’ అంటూ ఒక మెసేజ్‌ను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. అనంతరం 10 డౌనింగ్ స్ట్రీట్‌లోని తన నివాసం వద్ద ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. బ్రిటిష్ ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నానని చెప్పారు. అతి పెద్ద ఒప్పందాన్ని నేడు ఖరారు చేసుకున్నామని, ప్రజలు కోరుకున్నదే జరిగిందని తెలిపారు. మన ఉత్పత్తులు, వస్తువులను ఇకపై ఈయూ మార్కెట్లలో ఎలాంటి టారిఫ్‌లు, నియంత్రణల భారం లేకుండా విక్రయించుకోవచ్చని అన్నారు. తద్వారా యూకేలో కొత్త ఉద్యోగాలను, గ్రీన్ ఇండస్ట్రియల్ జోన్లను సృష్టించావచ్చని పేర్కొన్నారు. 1973 తర్వాత తొలిసారిగా మన సముద్ర జలాలపై పూర్తి నియంత్రణతో యూకే ఒక స్వతంత్ర తీరప్రాంతం ఉన్న దేశంగా మారుతుందని తెలిపారు. సముద్ర జలాల్లో చేపల వేటపై యథాతథ స్థితి ఒప్పందం మరో ఐదున్నరేళ్లు మాత్రమే అమల్లో ఉంటుందని, ఆ తర్వాత మన జాలర్లు మన సముద్ర జలాల్లో ఎన్ని చేపలయినా పట్టుకోవచ్చని బోరిస్ జాన్సన్ వెల్లడించారు. యూకే ఎప్పటికీ యూరప్‌తో సాంస్కృతికంగా, చరిత్రకంగా, వ్యూహాత్మకంగా, భౌగోళికంగా అనుసంధానమైన ఉంటుందని ఉద్ఘాటించారు. బ్రిటిష్ ఎంపీలు డిసెంబర్ 30న సమావేశమై, ఈ ఒప్పందానికి ఆమోదం తెలుపుతారని పేర్కొన్నారు. -
క్రిస్మస్ వేడుకలపై కఠిన ఆంక్షలు
లండన్: ఇంగ్లాండ్ ప్రజల ఆశలపై బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ నీళ్లు చల్లారు. క్రిస్మస్ వేడుకలపై కఠినమైన ఆంక్షలు విధించారు. బంధు మిత్రులతో కలిసి పండుగ ఘనంగా జరుపుకోవాలని లక్షలాది మంది ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. ఇప్పుడు ఇవన్నీ పక్కన పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. కరోనా వైరస్‌లో కొత్త రకం(వేరియెంట్) విజృంభిస్తున్న నేపథ్యంలో రాజధాని లండన్‌తో సహా పశ్చిమ, ఆగ్నేయ ఇంగ్లాండ్‌లో క్రిస్మస్ వేడుకలపై కొత్త టైర్–4 స్థాయి ఆంక్షలు విధిస్తున్నట్లు బోరిస్ జాన్సన్ శనివారం ప్రకటించారు. ఇవి ఆదివారం ఉదయం నుంచే అమల్లోకి వస్తాయన్నారు. ప్రధానమంత్రిగా దేశ ప్రజల రక్షణ తన బాధ్యత అని పేర్కొన్నారు. ప్రజల భావోద్వేగాలు తనకు తెలుసని, అయినప్పటికీ భారమైన హృదయంతో ఆంక్షలు విధించాల్సి వస్తోందన్నారు. ► ఇంగ్లాండ్‌లో టైర్–4 ప్రాంతంలో ఉన్నవారు క్రిస్మస్ రోజున సొంత ఇంట్లో మినహా బయట ఎక్కడా ఎవరినీ కలవడానికి వీల్లేదు. ఇంట్లో ఒంటరిగా ఉన్న వారికి మినహాయింపు లభిస్తుంది. ఇతర దినాల్లో విద్య, వైద్యం కోసం బయటకు వెళ్లడానికి అనుమతి ఉంటుంది. ► టైర్–4 ప్రాంతాలు మినహా దేశవ్యాప్తంగా డిసెంబర్ 23 నుంచి 27వ తేదీ వరకు కరోనా ఆంక్షల్లో ఇచ్చిన సడలింపులను ప్రభుత్వం రద్దు చేసింది. కేవలం డిసెంబర్ 25న మాత్రమే ఈ సడలింపులు అమల్లో ఉంటాయి. ► టైర్–4 ప్రాంతాల్లో ఆదివారం ఉదయం నుంచి వ్యాయామశాలలు, సెలూన్లు, అత్యవసరం కాని దుకాణాలు మూసివేయాలి. ∙ఆగ్నేయ ఇంగ్లాండ్‌లోని టైర్–3 ప్రాంతాల్లో టైర్–4 ఆంక్షలను అమలు చేస్తారు. కెంట్, బకింగ్హమ్షైర్, బెర్క్‌షైర్, సుర్రే(వేవెర్లీ మినహా), గోస్పోర్ట్, హావెంట్, పోర్ట్స్మౌత్, రోథర్, హేస్టింగ్స్‌లో టైర్–4 ఆంక్షలు ఉంటాయి. ► లండన్ నగరంతోపాటు పశ్చిమ ఇంగ్లాండ్‌లోని బెడ్ఫోర్డ్, సెంట్రల్ బెడ్ఫోర్డ్, మిల్టన్ కీనెస్, లూటన్, పీటర్‌బరో, హెర్ట్‌ఫోర్డ్‌షైర్, ఎసెక్స్(కోలచెస్టర్, అటిల్స్ఫోర్డ్, టెండ్రింగ్ మినహా)లో టైర్–4 ఆంక్షలు అమలవుతాయి. ► యునైటెడ్ కింగ్డమ్(యూకే)లో అంతర్భాగమైన వేల్స్‌లోనూ క్రిస్మస్ సంబరాలపై ఆంక్షలు విధించారు. ఇవి శనివారం అర్ధరాత్రి నుంచే అమల్లోకి వచ్చాయి. డిసెంబర్ 23 నుంచి 28వ తేదీ వరకు ఇచ్చిన సడలింపులను కేవలం డిసెంబర్ 25వ తేదీకే పరిమితం చేశారు. -
బ్రిటన్‌లో ఫైజర్ టీకా మొదలు
లండన్: యూకే తన చరిత్రలోనే అతి పెద్ద వ్యాక్సినేషన్ కార్యక్రమానికి మంగళవారం శ్రీకారం చుట్టింది. కరోనా మహమ్మారిని కట్టడి చేయడానికి ఫైజర్, బయోఎన్‌టెక్ సంయుక్తంగా అభివృద్ధి చేసిన వ్యాక్సిన్‌ను ప్రజలకు ఇవ్వడం ప్రారంభించింది. ఉత్తర ఐర్లండ్‌కు చెందిన మార్గరెట్ కీనన్(90) టీకా తీసుకున్న తొలి మహిళగా రికార్డులకెక్కారు. త్వరలోనే 91వ పుట్టిన రోజు జరుపుకోనున్న మార్గరెట్ వ్యాక్సిన్ తొలి డోసు తీసుకోవడంపై హర్షం వ్యక్తం చేశారు. ఆరోగ్య సిబ్బందితో పాటు, హోమ్ కేర్ వర్కర్లు, 80 ఏళ్ల వయసు పై బడినవారికి తొలి ప్రాధాన్యంగా ఈ టీకా ఇవ్వనున్నారు. మొదటి డోసు ఇచ్చిన 21 రోజుల తర్వాత రెండో డోసు ఇస్తారు. కాగా, కరోనా మహమ్మారిని అరికట్టడానికి బ్రిటన్ చేస్తున్న పోరాటంలో ఇదో ముందడుగు అని బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ అన్నారు. ‘టీకా డోసులు అందడానికి వారాలు, నెలలు అంతకంటే ఎక్కువ సమయమే పడుతుంది. అంతవరకు అందరూ కోవిడ్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి. మాస్కులు, చేతులు శుభ్రం, భౌతికదూరం పాటించండి’ అని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. భారత సంతతి జంటకు.. బ్రిటన్‌లో భారతీయ సంతతికి చెందిన దంపతులు డాక్టర్ హరి శుక్లా (87), ఆయన భార్య రంజన్ (83)కు ఫైజర్ వ్యాక్సిన్‌ను ఇచ్చారు. న్యూకేజల్ ఆస్పత్రిలో కరోనా వ్యాక్సిన్ తీసుకున్న తొలి భారతీయ జంట వీరే. హరిశుక్లా తండ్రి ముంబై నుంచి కెన్యాకి వెళ్లి స్థిరపడ్డారు. వ్యాక్సిన్ మిక్స్ అండ్ మ్యాచ్ కరోనా వ్యాక్సిన్ మరింత సమర్థవంతంగా, సురక్షితంగా పని చేయడానికి ప్రయోగాత్మకంగా రెండు వ్యాక్సిన్లు కలిపి ఇవ్వాలని బ్రిటన్ యోచిస్తోంది. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ– ఆస్ట్రాజెనెకా అభివృద్ధి చేస్తున్న వ్యాక్సిన్‌కు త్వరలోనే అనుమతులు లభించనున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలకి ఇవ్వాల్సిన రెండు టీకాల్లో ఒకటి ఆక్స్ఫర్డ్, మరొకటి ఫైజర్ ఇవ్వాలని వైద్య నిపుణులు యోచిస్తున్నట్టుగా ప్రభుత్వ వ్యాక్సినేషన్ టాస్క్‌ఫోర్స్ వెల్లడించింది. ఆక్స్ఫర్డ్ టీకాకి అనుమ తులు లభించిన తర్వాత వచ్చే నెలలో ప్రయోగా త్మకంగా ఈ కంపెనీలు అభివృద్ధి చేసిన టీకా డోసులు చెరొకటి ఇచ్చి చూడనున్నారు.మోడర్నా టీకాకి అనుమతులు మంజూరైతే దానినీ టీకాల మిక్స్ అండ్ మ్యాచ్ జాబితాలో చేర్చనున్నారు. ఫైజర్, మోడెర్నా వ్యాక్సిన్లు 95% సామర్థ్యంతో పని చేస్తే, ఆక్స్ఫర్డ్ టీకా సగం డోసు ఇచ్చిన వారిలో 90% సమర్థతతో పని చేసింది. -
గణతంత్ర వేడుకలకు బ్రిటన్ ప్రధాని?
లండన్: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆçహ్వానాన్ని అంగీకరిస్తే, 1993 తరువాత బ్రిటన్ ప్రధాని తొలిసారి భారత గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ప్రధాని నరేంద్రమోదీ నవంబర్ 27న బ్రిటిష్ ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్‌తో ఫోన్లో మాట్లాడుతూ జనవరి 26న భారత గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరుకావాలంటూ ఆహ్వానించారు. అలాగే వచ్చేయేడాది బ్రిటన్‌లో జరిగే జీ–7 సమ్మిట్‌కి ప్రధాని మోదీని, బోరిస్ ఆహ్వనించారు. ప్రధాని నిర్ణయంపై అంతా ఆశ్చర్యపోయినప్పటికీ ప్రస్తుత పరిస్థితుల్లో భారత్ బ్రిటన్ సంబంధాలను బలోపేతం చేసుకోవడానికి ప్రధాని మోదీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారని నిపుణులు అభిప్రాయపడ్డారు. రాబోయే దశాబ్దంలో భారత్, బ్రిటన్ల మధ్య సత్సంబంధాలను పెంచుకోవడానికి తన మిత్రుడు బోరిస్ జాన్సన్‌తో సుహృద్భావ చర్చలు జరిపినట్లు నవంబర్ 27న మోదీ ట్విట్టర్లో వ్యాఖ్యానించారు. చివరిసారి 1993లో బ్రిటన్ ప్రధాని జాన్ మేజర్ భారత గణతంత్ర వేడుకలకు హాజరయ్యారు. -
రిపబ్లిక్ డే అతిథిగా బ్రిటన్ ప్రధాని జాన్సన్
సాక్షి, న్యూఢిల్లీ : భాతర గణతంత్ర దినోత్సవ వేడుకలకు(జనవరి 26, 2021) ముఖ్య అతిథిగా బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ హాజరుకానున్నారు. నవంబర్ 27న జాన్సన్‌తో ప్రధాని నరేంద్ర మోదీ జరిపిన ఫోన్ సంభాషణల్లో ఆయన్ను రిపబ్లిక్ డే ముఖ్య అతిధిగా హాజరుకావాలని కోరారు. దీనిపై ఆయన సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. కరోనా నేపథ్యంలో ఈ సారి 50 శాతం మేర వీక్షకుల పాస్‌లను తగ్గించింది. పాఠశాల విద్యార్థులకు వేడుకల్లో పాల్గొనే అవకాశం లేదు. అలాగే ఆయా రాష్ట్రాల శకటాలను ప్రభుత్వం తగ్గించింది. కరోనా కారణంగా ఈ చర్యలు తీసుకున్నట్లు ప్రభుత్వ ప్రకటించింది. -
8 ఏళ్ల చిన్నారి లేఖకి బదులిచ్చిన ప్రధాని
లండన్: కరోనా మహమ్మారి విజృంభణ ప్రారంభమయ్యి ఏడాది పూర్తి అయ్యింది. ఇప్పటికీ మనం దాని కంట్రోల్లోనే ఉన్నాం. మహమ్మారిని కట్టడి చేసే వ్యాక్సిన్ కోసం ప్రపంచ దేశాలు తీవ్రంగా కృషి చేస్తున్నాయి. ఇక కోవిడ్ వ్యాప్తితో ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు పండుగలు, వేడకలకు దూరంగా ఉన్నాయి. ఒకవేళ నిర్వహించాల్సి వచ్చినా ఎన్నో జాగ్రత్తల నడుమ అతి కొద్ది మందితో మాత్రమే జరుపుకుంటున్నారు. ఇక ఈ ఏడాదిలో మిగిలిన చివరి వేడుక, పండుగ క్రిస్టమస్. ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రైస్తవులు భక్తి శ్రద్ధలతో ఈ పండుగను సంతోషంగా జరుపుకుంటారు. ఈ వేడుకలో ప్రధాన ఆకర్షణ శాంటాక్లాజ్.. మనదగ్గర అయితే క్రిస్మస్ తాత. క్రిస్మస్ పండుగ అనగానే చిన్నారులకు కేకులు, క్రిస్మస్ ట్రీ, స్టార్లతోపాటు శాంటాక్లాజ్ తాత కూడా గుర్తుకు వస్తాడు. ఎరుపు, తెలుపు రంగు దుస్తులు ధరించిన శాంటాక్లాజ్ తమకు బోలెడన్ని గిఫ్టులను తీసుకువస్తాడని పిల్లలు ఎదురు చూస్తుంటారు. రాత్రి పూట ఇంటి గుమ్మం ఎదుట సంచుల్లో ఆయన గిఫ్ట్‌లను ఉంచి వెళ్లిపోతాడని కథలు చెబుతారు. ఇక చిన్నారులు శాంటాక్లాజ్ ఇచ్చే బహుమతుల కోసం ఆత్రుతగా ఎదురు చూస్తుంటారు. అయితే ఈ ఏడాది వేడుకలకు కుటుంబ సభ్యులందరు కలవడమే వీలు కావడం లేదు.. ఇక శాంటాక్లాజ్ వస్తాడా రాడా. ఈ సందేహం ఇప్పటికే ఎందరో చిన్నారుల బుర్రలని తొలిచేస్తుంది. దీని గురించి పిల్లలంతా తల్లిదండ్రులను ప్రశ్నలు అడుగుతూ సతాయిస్తూ ఉండగా.. ఓ ఎనిమిదేళ్ల కుర్రాడు మాత్రం దీని గురించి ఏకంగా ప్రధానికే ఉత్తరం రాశాడు. మరో ఆశ్చర్యకరమైన అంశం ఎంటంటే ప్రధాని ఆ చిన్నారికి సమాధానమిస్తూ.. మరో ఉత్తరం రాశాడు. (చదవండి: ఒకటి కొంటే ఇంకోటి ఫ్రీ ఉండదిక) ఆ వివరాలు.. ఎనిమిదేళ్ల మోంటీ అనే చిన్నారి బ్రిటీష్ ప్రధాని బోరిస్ జాన్సన్‌కి శాంటాక్లాజ్ రాక గురించి సమాధానం ఇవ్వాల్సిందిగా ఉత్తరం రాశాడు. ‘ఈ ఏడాది శాంటాక్లాజ్ వస్తాడా.. మాకు బహుమతులు ఇస్తాడా లేదా ప్లీజ్ దీని గురించి నాలానే ఇంకా చాలా మందికి అనుమానం ఉంది. శాంటాక్లాజ్ రావడం గురించి ప్రభుత్వం ఏమైనా చర్యలు తీసుకుంటుందా లేదా దయచేసి క్లారిటీ ఇవ్వండి’ అంటూ మోంటో.. ప్రధానికి తన చిట్టి చిట్టి చేతులతో ఉత్తరం రాశాడు. ఈ లేఖ బోరిస్‌ని కదిలించింది. వెంటనే రిప్లై ఇచ్చారు. క్రిస్మస్ నాడు శాంటా తప్పక వస్తారు అంటూ భరోసా ఇచ్చారు. మోంటో ఉత్తరంతో పాటు తాను ఇచ్చిన రిప్లైని ట్విట్టర్ ద్వారా షేర్ చేశారు బోరిస్. ‘ఇప్పటికే నాకు ఇలాంటి లెటర్లు చాలా వచ్చాయి. దీని గురించి నిపుణులతో మాట్లాడాను. ఇక శాంటాక్లాజ్ తన సంచిని బహుమలతలో నింపుకుని ప్రయాణం అయ్యారు. క్రిస్టమస్ నాడు ఇక్కడికి తప్పక వస్తాడు. అంతేకాక ఇప్పటికే నేను ఉత్తర ధ్రువానికి కాల్ చేసి శాంటాక్లాజ్‌ని రావాల్సిందిగా ఆహ్వానించాను. ఆయన తప్పక వస్తారు’ అంటూ ట్వీట్ చేశారు బోరిస్. ప్రస్తుతం ఈ సంభాషణ తెగ వైరలవుతోంది. ఇక పండుగ సమయంలో ప్రజలు తగిన కోవిడ్ నియమాలు పాటిస్తూ.. తగిన జాగ్రత్తలు తీసుకుంటే వేడుకలు సంతోషంగా ముగుస్తాయన్నారు. (ప్రధాని పెద్ద మనసు: బిడ్డకు వైద్యుడి పేరు) Monti (aged 8) wrote to me asking if Father Christmas will be able to deliver presents this year 🎅🎁🎄 I've had lots of letters about this, so I have spoken with experts and can assure you that Father Christmas will be packing his sleigh and delivering presents this Christmas! pic.twitter.com/pXwcjHSxZg — Boris Johnson (@BorisJohnson) November 25, 2020 -
బ్రిటన్ ప్రధానికి మళ్లీ కరోనా
లండన్: బ్రిటిష్ ప్రధాని బోరిస్ జాన్సన్ మరోసారి కరోనా బారిన పడ్డారు. పార్లమెంటు సభ్యుడు ఒకరు కోవిడ్ పాజిటివ్‌గా తేలిన నేపథ్యంలో కొంత కాలంగా స్వీయ నిర్బంధంలో ఉన్న బోరిస్ జాన్సన్‌కు నిర్వహించిన పరీక్షల్లో ఆయనకూ వైరస్ సోకినట్లు తేలిందని బ్రిటన్ ప్రధాని అధికార నివాస వర్గాలు సోమవారం తెలిపాయి. అధికారుల సూచనలను అనుసరించి ప్రధాని నవంబర్ 26 వరకూ తన ఇంటి నుంచే అధికారిక కార్యకలాపాలు చేపడతారని, కరోనా వైరస్ నిరోధానికి తీసుకుంటున్న చర్యలను పర్యవేక్షిస్తారని వివరించారు. బోరిస్ జాన్సన్ కోవిడ్ బారిన పడినప్పటికీ లక్షణాలేవీ కనిపించడం లేదని చెప్పారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో బ్రిటన్ ప్రధాని తొలిసారి కోవిడ్–19 బారిన పడటమే కాకుండా.. పరిస్థితి తీవ్రం కావడంతో ఐసీయూలో చికిత్స అందించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా.. కోవిడ్–19 నియంత్రణకు జాన్సన్ అండ్ జాన్సన్ అనుబంధ సంస్థ జాన్సెన్ తయారు చేసిన టీకా తుది పరీక్షలకు రంగం సిద్ధమైంది. యూకే మొత్తమ్మీద 6వేల మందికి ఈ టీకా ఇచ్చి 12 నెలలపాటు పరీక్షించనుంది. దశలవారీగా ఈ టీకా పరీక్షల కోసం ఆరు దేశాల నుంచి సుమారు 30 వేల మందిని ఎంపిక చేస్తామంది. -
2030లోనే ఆ వాహనాల అమ్మకాలపై బ్యాన్!
లండన్: పదేళ్ల తర్వాత బ్రిటన్‌లో పెట్రోల్, డీజిల్‌తో నడిచే కార్లు ఇక కనుమరుగు కానున్నాయి. తాజా సమాచారం ప్రకారం.. 2030 నుంచి పెట్రోల్, డీజిల్‌తో నడిచే కొత్త వాహనాల అమ్మకంపై నిషేధం విధించనున్నట్లు వచ్చే వారం బ్రిటిష్ ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్ ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి బ్రిటిష్ ప్రభుత్వం 2040 నుంచి వీటి అమ్మకాలపై నిషేధం విధించాలనుకుందట. అయితే గ్రీన్‌హౌజ్ వాయువుల ప్రభావాన్ని తగ్గించేందుకు బోరిస్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు స్థానిక మీడియా సమాచారం. దీంతో ప్రధాని నిషేధం గడువు కాలాన్ని తగ్గించినట్లు అక్కడి ఫైనాన్స్ టైమ్స్ మీడియా పేర్కొంది. పర్యావరణ విధానంపై ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో వాహనాల అమ్మకాల నిషేధాన్ని 2030కే అమలు చేయాలని నిర్ణయించినట్లు సదరు మీడియా పేర్కొంది. (చదవండి: బ్రిటన్ ప్రధాని నోటి వెంట రాముడు.. సీత) అయితే ఎలక్ట్రిక్, శిలాజ ఇంధన చోదక మిశ్రమాన్ని ఉపయోగించి తయారు చేసే కొన్ని హైబ్రిడ్ కార్లకు ఈ కొత్త నిబంధనలు వర్తించవని, ఇంకా 2035 వరకు ఈ వాహనాలను విక్రయించవచ్చని స్థానిక మీడియా స్పష్టం చేసింది. ఈ ఏడాది ఇప్పటి వరకు కొత్త కార్ల అమ్మాకాల్లో పెట్రోల్, డీజిల్‌తో నడిచే కార్లు 73.6 శాతం ఉండగా ఖరీదైన ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు కేవలం 5.5 శాతం మాత్రమే ఉన్నట్లు పరిశ్రమ గణాంకాలలో వెల్లడైంది. (చదవండి: దేశ ప్రధానికి జీతం చాలట్లేదట!) -
బ్రిటన్ ప్రధాని నోటి వెంట రాముడు.. సీత
లండన్ : బ్రిటన్ ప్రధాని బొరిస్ జాన్సన్ భారతీయ సంప్రదాయంలో పెద్ద వేడుకగా నిర్వహించుకునే దీపావళి పండుగపై ప్రశంసలు కురిపించారు. భారతీయ ప్రజలు చెడుపై మంచి విజయం సాధించినందుకు ప్రతీకగా ఈ పండుగను జరుపుకుంటున్నారని తెలిపారు.తాజాగా బ్రిటన్‌లో సెకెండ్‌వేవ్‌లో కరోనా వైరస్ విజృంబిస్తున్నవేళ డిసెంబర్ 2వరకు అక్కడ మరోసారి లాక్డౌన్ విధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శుక్రవారం లండన్‌లోని 10వ డౌనింగ్ స్ట్రీట్‌లో ఐగ్లోబల్ దివాలి ఫెస్ట్ 2020 పేరుతో మూడు రోజుల పాటు నిర్వహించనున్న కార్యక్రమాన్ని బొరిస్ జాన్సన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. (చదవండి : దేశ ప్రధానికి జీతం చాలట్లేదట!) 'ప్రస్తుతం కరోనా వైరస్ సెకండ్ వేవ్ దేశంలో వేగంగా విస్తరిస్తుందని.. మనందరం మరోసారి అప్రమత్తతో ఉండాల్సిన అవసరం ఏర్పడింది. దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ ఐకమత్యంతో కరోనా వైరస్‌పై పోరాటం చేయల్సిన సమయం వచ్చింది. కాంతిని విరజిమ్ముతూ చీకట్లను పారద్రోలేలా.. చెడుపై మంచి విజయం సాధించినట్లుగా.. అజ్ఞానంపై జ్ఞానం ఆధిపత్యం చూపించిన విధంగా మనం పోరాడాల్సి ఉంటుంది. అచ్చం భారతీయులు జరుపుకునే దీపావళి పండుగ లాగే.. భారతీయ సంప్రదాయంలో రాముడు తన భార్య సీతతో కలిసి రావణుడిని ఓడించి తిరిగి భారతదేశానికి చేరుకున్న సమయంలో దేశ ప్రజలు కొన్ని కోట్ల దీపాల వెలిగించి తమ విజయాన్ని చూపించారు. అదే విధంగా ఇప్పుడు కరోనా వైరస్‌పై యుద్దం చేయడానికి అదే పని మనం చేయాల్సిన అవసరం ఉంది. కరోనా వైరస్ నేపథ్యంలో మా ప్రభుత్వం పెట్టిన ఆంక్షల మేరకు బ్రిటన్‌లోని భారతీయ ప్రజలు పండుగలను జరుపుకోవడం అభినందనీయం. రానున్న దీపావళి పండుగను కూడా ఇదే తరహాలో జరుపుకోవాలని ఆశిస్తున్నా. పండుగను వేడుకలా జరుపుకునే భారతీయులకు ఇది కొంచెం కష్టమే అయినా తప్పనిసరి పరిస్థితుల్లో ఇలా చేయాల్సి వస్తుంది. కాగా తాము ప్రారంభించిన దివాలి ఫెస్ట్‌కు బ్రిటన్‌లోని భారతీయులంతా ఇళ్లలోనే ఉండి వర్చువల్ వీడియో ద్వారా పాల్గొనాలని కోరుతున్నా. అందుకే ఐ గ్లోబల్ దివాలి ఫెస్ట్ 2020 పేరుతో జరగనున్న దివాలి వేడుకను ప్రారంభించాం'అంటూ చెప్పుకొచ్చారు. కాగా వర్చువల్ మోడ్‌లో జరగనున్న దివాలి ఫెస్ట్ శుక్రవారం నుంచి మూడురోజుల పాటు కొనసాగనున్నాయి. ఈ మూడు రోజుల్లో భారతీయ సంప్రదాయాలైన యోగా, భారతీయ సంగీతం, తదితర కార్యక్రమాలు జరగనున్నాయి. ఇదే కార్యక్రమంలో వర్చువల్ సెషన్ ద్వారా ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకుడు శ్రీ శ్రీ రవిశంకర్ నేతృత్వంలో ఆధ్యాత్మిక కార్యక్రమంతో పాటు, బ్రిటీష్ ఇండియన్ మ్యుజిషియన్ నవీన్ కుంద్రా ఆధ్వర్యంలో పలు బాలీవుడ్ గీతాలు ఆలపించనున్నారు. కాగా దేశంలో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయ ప్రజలు నవంబర్ 14 న దీపావళి వేడుకలు జరుపుకోనున్న సంగతి తెలిసిందే. -
కరోనా ఉధృతి.. నెల రోజుల లాక్డౌన్
లండన్ : కరోనా కేసులు పెరుగుతుండటంపై బ్రిటన్ ప్రభుత్వం ఆందోళన చెందుతోంది. ఈ నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ పరిస్థితిని కట్టడి చేసేందుకు నెల రోజులపాటు దేశ వ్యాప్తంగా లాక్డౌన్ విధించింది. శనివారం జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ విషయమై జరిగిన చర్చిన ప్రధాని బోరిస్ జాన్సన్.. గురువారం నుంచి ఇంగ్లండ్‌లో లాక్డౌన్ విధిస్తున్నట్లు ప్రకటించారు. డిసెంబర్ 2 వరకు ఇది కొనసాగనున్నట్లు తెలిపారు. దేశంలో మరోసారి కరోనా ఉధృతి పెరగటంతో లాక్డౌన్ నిర్ణయం తీసుకున్నామని మీడియాకు వెల్లడించారు. కాగా కేబినెట్ భేటీ సందర్భంగా కరోనా కట్టడికి ఆంక్షలను మరింత కఠినతరం చేసే విషయంలో ప్రధాని బోరిస్ జాన్సన్ సీని యర్ మంత్రుల సలహా తీసుకున్నారు. ఈ విషయంలో ఆయన చీఫ్ మెడికల్ ఆఫీసర్ క్రిస్ విట్టీ, చీఫ్ సైంటిఫిక్ అడ్వైజర్ పాట్రిక్ వలాన్స్‌ల సలహాను కూడా తీసుకునున్నారు. వచ్చే డిసెంబర్లో క్రిస్మస్ నాటికి ఈ ఆంక్షలను మళ్లీ సడలించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. శనివారం కొత్తగా బ్రిటన్ 22 వేలకుపైగా కరోనా కేసులు నమోదు అయ్యాయి. యూకే వ్యాప్తంగా ఇప్పటి వరకు 10 లక్షలకు పైగా పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. కాగా గత కొంతకాలంగా యూరప్‌లో కోవిడ్ విజృంభిస్తుండడంతో ఫ్రాన్స్‌లో రెండోసారి లాక్డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. శుక్రవారం నుంచి దేశవ్యాప్తంగా లాక్డౌన్ ఆంక్షలు అమలులోకి వచ్చిన నేపథ్యంలో ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో గురువారం నుంచే లక్షలాది మంది జనం సొంతూళ్ళకు పయనమయ్యారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ప్రతిరోజూ తాజాగా 50,000 కేసులు నమోదు అవుతున్నాయి. ఇప్పటి వరకు ఫ్రాన్స్‌లో 13,31,884 కేసులు నమోదు కాగా, 36,565 మంది మరణించినట్లు జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ వెల్లడించింది. -
దేశ ప్రధానికి జీతం చాలట్లేదట!
లండన్: ఒక దేశ ప్రధాని అంటే మామూలు విషయం కాదు. అధికారం, హోదా, సంపాదన ఇలా ఏ రకంగా చూసినా అబ్బో అనిపించే పోస్టు! కానీ బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ విషయం ఇందుకు విరుద్ధంగా ఉంది. తనకు వచ్చే జీతం సరిపోక ప్రధాని పదవి నుంచి దిగిపోవాలని జాన్సన్ యోచిస్తున్నట్లు బ్రిటన్‌కు చెందిన డైలీ మిర్రర్ ఒక కథనంలో వెల్లడించింది. బ్రెగ్జిట్ అనంతరం జాన్సన్ దిగిపోయేందుకు రెడీగా ఉన్నట్లు ఒక పార్లమెంట్ మెంబర్ చెప్పారని తెలిపింది. జాన్సన్‌కు ప్రధానిగా వచ్చే వేతనం కన్నా గతంలో ఆయన చేసిన ఉద్యోగంలోనే ఎక్కువ జీతం వస్తుందట! ఆయన గతంలో టెలిగ్రాఫ్ పత్రికలో కాలమిస్టుగా చేసేవారు. అప్పుడు తనకు ఏటా 2.75 లక్షల పౌండ్లు వచ్చేవి. దీనికితోడు నెలకు రెండు ప్రసంగాలివ్వడం ద్వారా సుమారు 1.6 లక్షల పౌండ్లు ఆర్జించేవారు. (ఫౌచీ ఒక ఇడియట్: ట్రంప్) ప్రధాని అయ్యాక 1.5 లక్షల డాలర్లే వేతనంగా పొందుతున్నారు. దీనివల్ల ఆయన కనీస అవసరాలు కూడా తీరట్లేదట. బోరిస్‌కు ఆరుగురు పిల్లలున్నారు. విడాకులు ఇచ్చిన ఒక భార్యకు భరణం ఇవ్వాలి. తనకు వచ్చే జీతంతో ఈ ఖర్చులు భరించలేక బోరిస్ వాపోతున్నారట. ప్రస్తుతం ఆయన ఉంటున్న ఇంట్లో కనీసం హౌస్‌కీపర్ కూడా లేదని, అసలా ఇల్లే పెద్ద మురికికూపమని బోరిస్ స్నేహితులు చెప్పినట్లు కథనం పేర్కొంది. బోరిస్‌కు ముందు ప్రధానిగా ఉన్న థెరిసా మే ప్రస్తుతం లెక్చర్లిస్తూ దాదాపు 10 లక్షల పౌండ్లు వెనకేశారని డైలీ మిర్రర్ వెల్లడించింది -
బ్రిటన్‌లో మళ్లీ లాక్డౌన్...!
-
అక్కడ మరోసారి లాక్డౌన్..
లండన్ : బ్రిటన్‌లో రోజు రోజుకు కరోనా కేసులు పెరిగి పోతుండడంతో మరోసారి లాక్డౌన్ విధించాలని ఆ దేశ ప్రధాని బోరిస్ జాన్సన్ నిర్ణయించారు. ఇది వరకటిలా సంపూర్ణ లాక్డౌన్ కాకుండా పాక్షిక లాక్డౌన్ కింద గురువారం నుంచి రాత్రి పది గంటలకల్లా రెస్టారెంట్లు, బార్లు, క్లబ్బులు, పబ్బులు మూసివేయాలంటూ ఉత్తర్వులు జారీ చేశారు. లాక్డౌన్ ఆంక్షలు అమల్లోకి వస్తున్నాయని తెలిసి బ్రిటన్‌లోని పలు నగరాల్లో క్లబ్బులు, పబ్బులు కిక్కిరిసి పోవడమే కాకుండా యువతీ, యువకులు పీకల దాకా తాగి రోడ్లపైనే మత్తుగా పడిపోయారు. ఇదిలావుండగా, మాన్చెస్టర్ నగరంలోని ఓ పబ్‌లో బీరు తాగుతూ మాట్లాడుతున్న ఓ మధ్య వయస్కుడి నోటి నుంచి తుంపర్ల జల్లు కురవడం కనిపించింది. దాన్ని ఎవరో వీడియో తీసి ట్విటర్లో పోస్ట్ చేయగా, దాన్ని లక్షలాది మంది చూస్తున్నారు. జరగాల్సిన నష్టం జరిగి పోయాక రాత్రి పది గంటల నుంచి ఆంక్షలు విధించడం వల్ల కలిగే ప్రయోజనం ఏముంటుందని కొందరు వీడియో వీక్షకులు ప్రశ్నించగా, ఇలా తుంపర్లు చిమ్ముతూ మాట్లాడే వ్యక్తులుంటే ఏ ఆంక్షలు అమలు చేసి ఏం లాభమని కొందరు వ్యాఖ్యానించారు. తుంపర్ల జల్లు కురిపించిన వ్యక్తికి గనుక నిజంగా కరోనా వైరస్ ఉన్నట్లయితే ఈ పాటికి ఆ పబ్‌కు వచ్చిన కస్టమర్లందరికి ఆ వైరస్ సోకే ఉంటుందని వ్యాఖ్యానించిన వారూ ఉన్నారు. చదవండి: చైనాలో మరో ‘అద్భుతం’.. అదేంటో తెలుసా? -
కోవిడ్ నిబంధనల్ని అతిక్రమిస్తే భారీ జరిమానాలు
లండన్: బ్రిటన్‌లో కరోనా కేసులు తీవ్రతరమవుతూ ఉండడంతో ప్రభుత్వం మరిన్ని ఆంక్షల్ని విధించింది. ఈ ఆంక్షల్ని అతిక్రమిస్తే 10 వేల పౌండ్లు (దాదాపుగా 10 లక్షల రూపాయలు) వరకు జరిమానాలు విధించడానికి సిద్ధమైంది. సెప్టెంబర్ 28 నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి వస్తాయి. ఇంటి నుంచి పని చేసుకునే సౌకర్యం లేని నిర్మాణ రంగంలో కార్మికులు, ఆదాయం కోల్పోయిన ఇతర వర్గాల వారికి 500 పౌండ్లు ఇస్తామని ప్రధానమంత్రి బొరిస్ జాన్సన్ వెల్లడించారు. యూకే ప్రస్తుతం కరోనా వైరస్ రెండో దశ ఎదుర్కొంటోందని , నిబంధనల్ని ఎవరైనా అతిక్రమిస్తే తీవ్ర చర్యలుంటాయని హెచ్చరించారు. వైరస్‌ని నియంత్రించాలంటే కఠినంగా ఉండాల్సిన అవసరం ఉందని, ప్రజల ప్రాణాలు కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని అన్నారు. ఇతర దేశాల నుంచి వచ్చిన వారు సెల్ఫ్ క్వారంటైన్ 14 రోజుల నిబంధనల్ని అతిక్రమిస్తే వెయ్యి నుంచి 10 వేల పౌండ్ల జరిమానా విధిస్తామన్నారు. తరచూ ప్రయాణాలు సాగించే వ్యాపారులు, పారిశ్రామిక వేత్తలు కోవిడ్ నిబంధనల్ని పాటించడం లేదన్నారు. -
బడులు తెరిస్తే ఎట్లా...?
లండన్ : బ్రిటన్‌లోని అన్ని పాఠశాలలను వచ్చే వారం నుంచి తెరవాలని అక్కడి ప్రభుత్వం నిర్ణయించింది. పాఠశాలలకు తమ పిల్లలను పంపించే విషయంలో తల్లిదండ్రులు ఎలాంటి భయాందోళనలకు గురికావాల్సిన అవసరం లేదని బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ విద్యార్థుల తల్లిదండ్రులకు పిలుపునిచ్చారు. భయపడి పిల్లలను బడులకు పంపించనట్లయితే వారి భవిష్యత్తును దెబ్బతీసిన వారవుతారని తల్లిదండ్రులను ఆయన హెచ్చరించారు. (కరోనా నివారణలో ‘బీపీ మందులు’) గత మార్చి నెలలో కరోనా లాక్డౌన్ సందర్భంగా మూత పడిన అనేక పాఠశాలల్లో కొన్ని గత జూన్ నెలలోనే తెరచుకోగా, పలు పాఠశాలలు ఇంకా తెరచుకోవాల్సి ఉంది. ఇంగ్లండ్, వేల్స్, నార్త్ ఐర్లాండ్‌లో ఇంకా పలు పాఠాశాలలు తాళాలు వేసి ఉన్నాయి. వీటన్నింటిని వచ్చే సోమవారం నుంచి తెరవాలని బ్రిటన్ ప్రభుత్వం నిర్ణయించింది. పిల్లలను బడికి పంపినట్లయితే కరోనా వైరస్ సోకే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని వారి తల్లిదండ్రులు ఎక్కువగా భయపడుతున్నారు. బడి పిల్లల కన్నా బడి టీచర్లు, ఇతర సిబ్బంది వల్ల కరోనా వైరస్ ఎక్కువగా వ్యాపిస్తోందని బ్రిటన్ సీనియర్ సైంటిస్ట్ డాక్టర్ శ్యామెజ్ జధాని తెలిపారు. ఆయన బ్రిటన్ ప్రభుత్వ వైద్యరంగంలో అంటురోగాల నిపుణుడిగా పని చేస్తున్నారు. జూన్ నుంచి ప్రారంభమైన పాఠశాలలల్లో 23 వేల మంది బడి పిల్లలకు ఒకరు చొప్పున కరోనా బారిన పడగా, బడి పంతుళ్లలో పది వేల మందికి ఒకరు చొప్పున కరోనా బారిన పడ్డారని ఆయన తెలిపారు. ఇప్పటి వరకు 70 మంది పిల్లలు కరోనా బారిన పడగా, 128 మంది టీచర్లు కరోనా బారిన పడ్డారని ఆయన చెప్పారు. తరగతి గదులకు వెలుపలు వారు సామాజిక దూరం పాటించక పోవడమే కరోనా వ్యాప్తికి కారణమని తేల్చారు. పాఠశాలలు ప్రారంభించిన తర్వాత కరోనా విస్తరించినట్లయితే అప్పుడు అమలు చేసేందుకు ‘ప్లాన్ బీ’ సిద్ధంగా ఉండాలని, అలా అయితేనే తాము విధులకు హాజరవుతామని బ్రిటన్‌లో అత్యధిక టీచర్లకు ప్రాతినిధ్యం వహిస్తోన్న టీచర్ల సంఘం ‘నేషనల్ ఎడ్యుకేషన్ యూనియన్’ షరతు విధించింది. (డిసెంబరు నాటికి వ్యాక్సిన్; ప్లాస్మా చికిత్సకు గ్రీన్ సిగ్నల్!) -
నాకలాంటి కోరికేదీ లేదు : రిషి సునక్
లండన్ : బ్రిటన్ తదుపరి ప్రధానమంత్రి కానున్నారనే ఊహాగానాలపై ఆర్థిక మంత్రి రిషి సునక్ (40) స్పందించారు. తనకు అలాంటి కోరికేదీ లేదని కొట్టి పారేశారు. కరోనా మహమ్మారి కట్టడిలో అలసిపోయి ఉన్న సమయంలో బ్రిటన్ ప్రధాని కావాలనే కోరికేదీ తనకు లేదని ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి అల్లుడు రిషి శుక్రవారం స్పష్టం చేశారు. కరోనా కట్టడికి, ఆర్థిక సంక్షోభాన్నిఎదుర్కొనే క్రమంలో రిషి చాలా విజయవంతంగా పనిచేశారని, ప్రస్తుత ప్రధాని బోరిస్ జాన్సన్ తరువాత, ఆ స్థానాన్ని భర్తీ చేయగల సామర్ధ్యం రిషికే ఉందన్న అంచనాలు ఈ మధ్య కాలంలో విస్తృతంగా వ్యాపించాయి. ఈ నేపథ్యంలో ఒక రేడియో ఇంటర్య్వూలో రిషి ఈ వివరణ ఇచ్చారు. కరోనా మహమ్మారిపై పోరులో 24 గంటల పనిభారంతో అలసిపోయానని, తనకు కొంత విశ్రాంతి అవసరమని ఆయన పేర్కొన్నారు. ఈ సంక్షోభంలో తన కుటుంబాన్ని, జిమ్ సెషన్లను మిస్ అయ్యానంటూ చెప్పుకొచ్చారు. కాబట్టి ఈ వారాంతంలో విశ్రాంతి తీసుకొని, మరింత చురుకుగా పనిచేసేందుకు సిద్ధమవుతున్నట్టు తెలిపారు. -
రాజీవ్ గుప్తాకు యూకే ప్రధాని ప్రశంస
లండన్: లాక్డౌన్ కాలంలో ప్రజలు ఆరోగ్యంగా ఉండటానికి ఫ్రీ ఆన్లైన్ భాంగ్రాసైజ్ సెషన్లతో యూకే వాసులకు సాయం చేస్తోన్న భారత సంతతి డ్యాన్సర్ రాజీవ్ గుప్తాపై ఆ దేశ ప్రధాని బోరిస్ జాన్సన్ ప్రశంసలు కురిపించారు. ఈ నేపథ్యంలో గత నెలలో రాజీవ్ గుప్తాకు ‘పాయింట్ ఆఫ్ లైట్ ’అనే గౌరవం కూడా లభించింది. సమాజంలో మార్పు కోసం కృషి చేస్తోన్న వాలంటీర్లను యూకేలో ప్రతివారం ‘పాయింట్ ఆఫ్ లైట్’ పేరుతో గౌరవిస్తారు. ఈ సందర్భంగా జాన్సన్ రాజీవ్ గుప్తాను ప్రశంసిస్తూ ఓ లేఖ రాశారు. ‘గత కొన్ని నెలలుగా మీ భాంగ్రా క్లాసులు.. లాక్డౌన్ కారణంగా దేశవ్యాప్తంగా ఇళ్లకే పరిమితమైన ప్రజల్లో శక్తిని నింపుతున్నాయి. ప్రజలు ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉండటానికి మీ తరగతలు ఎంతో ఉపయోగపడుతున్నాయి. ఈ క్లిష్ట సమయంలో మీరు చాలా మందికి ‘పాయింట్ ఆఫ్ లైట్’గా నిలిచారు. మిమ్మల్ని ఈ విధంగా గుర్తించగలగినందుకు నేను సంతోషిస్తున్నాను’ అని జాన్సన్ లేఖలో పేర్కొన్నారు. (‘మేడ్ ఇన్ ఇండియా’ సైకిల్‌పై బ్రిటన్ ప్రధాని) ఈ సందర్భంగా రాజీవ్ గుప్తా మాట్లాడుతూ.. ‘మనం ఉల్లాసంగా, సానుకూలంగా, శక్తివంతగా ఉండటానికి భాంగ్రా డ్యాన్స్ సాయం చేస్తుందని నేను నమ్ముతాను. నా భాంగ్రా సైజ్ సెషన్లతో లాక్డౌన్ సమయంలో ప్రజలకు ఈ విధంగా సాయం చేయగల్గుతున్నందుకు నేను సంతోషిస్తున్నాను. నాకు ఈ అవార్డు ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. నా ప్రయత్నం ఇంత శక్తివంతమైన ప్రభావాన్ని చూపిస్తుందని నేను ఎప్పుడూ అనుకోలేదు’ అన్నారు. రాజీవ్ గుప్తా గత 15 సంవత్సరాలుగా భాంగ్రా డ్యాన్స్ నేర్పిస్తున్నారు. మాంచెస్టర్, బర్మింగ్‌హామ్‌లో రెగ్యులర్ డ్యాన్స్ ఫిట్నెస్ తరగతులను నిర్వహిస్తున్నారు. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే లండన్ 2012 ఒలంపిక్స్ ప్రారంభోత్సవంలో రాజీవ్ గుప్తా ప్రదర్శన ఇచ్చారు. అంతేకాక బీబీసీ ప్రసిద్ధ ‘స్ట్రిక్ట్లీ కమ్ డాన్సింగ్’ ప్రదర్శనలో భాంగ్రా గురించి ప్రొఫెషనల్ డ్యాన్సర్లకు శిక్షణ ఇచ్చారు. -
‘మేడ్ ఇన్ ఇండియా’ సైకిల్‌పై బ్రిటన్ ప్రధాని
లండన్: బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ‘మేడిన్ ఇండియా’ హీరో సైకిల్ తొక్కి అందరిని ఆశ్చర్యపరిచారు. కరోనాపై పోరులో భాగాంగా స్థూలకాయానికి (ఒబెసిటీ)కి వ్యతిరేకంగా బ్రిటన్ ప్రభుత్వం చేపట్టిన కొత్త జీబీపీ 2 బిలియన్ సైక్లింగ్, వాకింగ్ డ్రైవ్‌ను ప్రారంభించిన బోరిస్.. దానిలో భాగంగా నాటింగ్‌హామ్‌లోని బీస్టన్ వద్ద ఉన్న హెరిటేజ్ సెంటర్లో సైకిల్ తొక్కారు. 56 ఏళ్ళ బోరిస్‌కి సైక్లింగ్ అంటే ఎంతో ఇష్టమట. హెల్త్, ఫిట్నెస్ కోసం సైక్లింగ్ చాలా మంచిదని ఆయన అంటున్నారు. బ్రిటన్‌లో కరోనా వైరస్ కారణంగా మృతి చెందుతున్నవారిలో చాలామంది స్థూలకాయులేనని, మితిమీరిన శరీర బరువు వల్ల వారు మృత్యువాత పడుతున్నారని కొందరు నిపుణులు ఇటీవల తేల్చారు. దాంతో ఊబకాయానికి వ్యతిరేకంగా పోరాటం చేయాలన్న ఉద్దేశంతో బిట్రన్ ప్రభుత్వం ఇప్పటికే ఆహార పదార్థలపై ఇచ్చే వన్ ప్లస్ వన్ ఆఫర్‌ను నిషేధించిన సంగతి తెలిసిందే. తాజాగా బోరిస్ ఈ సైక్లింగ్ డ్రైవ్‌ను ప్రారంభించారు. ప్రధాని తొక్కిన సైకిల్ ఇండియాకు చెందిన హీరో మోటార్స్ కంపెనీది. వికింగ్ ప్రో బైక్ పేరుతో ఆ సైకిల్‌ను మార్కెట్లోకి రిలీజ్ చేశారు. మాంచెస్టర్‌లో సైకిల్‌ను డిజైన్ చేశారు. (ఒకటి కొంటే ఇంకోటి ఫ్రీ ఉండదిక) సైకిల్ తొక్కడాన్ని ఇష్టపడే బోరిస్.. దేశంలో వేల కిలోమీటర్ల బైక్ లేన్లను ఆవిష్కరించాలనుకుంటున్నట్లు తెలిపారు. కొత్త ఫిట్నెస్ స్ట్రాటజీలో భాగంగా ప్రభుత్వం సైకిల్ తొక్కేవారికి ప్రత్యేక లేన్ వేయనున్నట్లు తెలిపింది. అంతేకాక నిత్య జీవితంలో సైక్లింగ్‌ను ప్రొత్సాహించడానికి గాను రవాణా కేంద్రాలు, పట్టణం, నగర కేంద్రాలు, ప్రభుత్వ భవనాల వద్ద మరిన్ని సైకిల్ రాక్లు ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఇళ్లలో పార్కింగ్ స్థంల లేని వారి కోసం వీధుల్లో రాక్లను ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. సైక్లింగ్ వల్ల ఫిట్‌గా ఉండటమే కాక గాలి నాణ్యత మెరుగుపడటంతో పాటు ట్రాఫిక్ కష్టాలు తీరతాయన్నారు బోరిస్. (ఒక్క క్షణం.. అందరినీ పిచ్చోళ్లను చేశాడు) -
ఒకటి కొంటే ఇంకోటి ఫ్రీ ఉండదిక
లండన్: ఒక పిజ్జా కొంటే రెండో పిజ్జా ఫ్రీ, ఒక బిర్యానీ కొంటే ఇంకో బిర్యానీ ఫ్రీ వంటి ఆఫర్లను మనం చూసే ఉంటాం. అయితే బ్రిటన్‌లో ఇలాంటి ఆఫర్లకు అడ్డుకట్ట పడబోతోంది. అంతేకాదు ప్రతి ఆహారం వల్ల ఎంత కేలరీల శక్తి వస్తుందో ఆయా వివరాలను కూడా రెస్టారెంట్లు మెనూలో ఉంచేలా చర్యలు తీసుకోవాలని ఆ దేశ ప్రధాని బోరిస్ జాన్సన్ తెలిపారు. దేశంలో విపరీతంగా పెరిగిపోతున్న ఊబకాయాన్ని నియంత్రించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. ఇలాంటి ఆలోచనలు బ్రిటిష్ ప్రభుత్వానికి కొత్తేం కాదు. గతంలోనూ ఇలాంటి ఆలోచనలు చేశారు. అయితే ప్రస్తుతం కోవిడ్ కారణంగా కూర్చొని తినేవారి సంఖ్య పెరగడం, దాంతో ఊబకాయం కూడా పెరగడంతో ప్రభుత్వం ఈ దిశగా అడుగులేస్తోంది. ఐసీయూకు వచ్చే వారిలో 8 శాతం మంది ఊబకాయంతో ఉన్నవారేనని సమాచారం. యువకుల్లో మూడింటి రెండొంతుల మంది అధిక బరువుతో బాధ పడుతున్నారని, 28 శాతం మంది ఊబకాయంతో బాధపడుతున్నారని ప్రభుత్వం అంటోంది. బరువు తగ్గడం కష్టమే అయినా చిన్న చిన్న మార్పులతో ఫిట్‌గా ఉండొచ్చని ప్రధాని జాన్సన్ అన్నారు. -
తప్పుడు ప్రచారం తడాఖా
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కూ, బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్‌కూ రూపురేఖల్లోనే కాదు... అభిప్రాయాల్లోనూ పోలికలుంటాయి. రష్యా అధ్యక్షుడు పుతిన్ విషయంలోనూ తమ దృక్పథాలు ఒకటేనని ఇప్పుడు జాన్సన్ నిరూపించారు. యూరప్ యూనియన్(ఈయూ) నుంచి బ్రిటన్ విడిపో వాలా వద్దా అన్న అంశంపై నాలుగేళ్లనాడు జరిగిన రెఫరెండంను ప్రభావితం చేయడానికి రష్యా ప్రయత్నించిందన్న ఆరోపణలపై విచారణ జరిపిన పార్లమెంటరీ కమిటీ వెలువరించిన నివేదిక గమనిస్తే జాన్సన్ ప్రభుత్వ సహాయ నిరాకరణ కొట్టొచ్చినట్టు కనబడుతుంది. వాస్తవానికి ఈ నివేదిక తయారై తొమ్మిది నెలలు దాటింది. గత ఏడాది అక్టోబర్‌లో దాన్ని ప్రభుత్వానికి అందజేశారు. కానీ నివేదికను బయటపెట్టడానికి ప్రభుత్వం సిద్ధపడలేదు. ఇందులోని అంశాలు తెలిస్తే జనంలో ఆగ్రహా వేశాలు పెల్లుబుకుతాయని, డిసెంబర్లో జరిగే ఎన్నికల్లో జనం తమను తిరస్కరించే అవకాశం వున్నదని కన్సర్వేటివ్ పార్టీ భయపడింది. ఆ తర్వాత కూడా ప్రభుత్వం మొరాయిస్తూనే వుంది. కానీ ఈ విషయంలో న్యాయస్థానాల్లో పిటిషన్లు దాఖలు కావడంతో గత్యంతరం లేక నివేదికను బయట పెట్టింది. అయితే ఇది రష్యా ప్రమేయం వుండొచ్చునని మాత్రమే తేల్చింది. లోతుగా దర్యాప్తు జరి పించి నేర నిర్ధారణ చేయాల్సింది మాత్రం జాన్సన్ ప్రభుత్వమే. ప్రపంచంలోని రెండు అగ్రరాజ్యాలు అమెరికా, బ్రిటన్లు శక్తిమంతమైనవి. ప్రపంచ రాజకీయా లను అవి దశాబ్దాలపాటు శాసించాయి. ఎన్నో దేశాల్లో వాటి మాటే చెల్లుబాటయింది. ఇప్పటికీ అవుతోంది. తాము చెప్పినట్టు వినడానికి సిద్ధపడని నేతల్ని అధికారం నుంచి కూలదోసిన చరిత్ర కూడా ఆ దేశాలకుంది. అలాంటి దేశాల అంతర్గత రాజకీయాల్లో రష్యా గుట్టు చప్పుడు కాకుండా జోక్యం చేసుకుని, తనకు అనుకూలంగా వుండే నేతల్ని అధికార పీఠాలపై కూర్చోబెట్టిందంటే వినడానికి ఎబ్బెట్టుగా వుంటుంది. కానీ ఇది వాస్తవమని నిరుడు అమెరికాలో రాబర్ట్ మ్యూలర్ నివేదిక చెప్పింది. ఇప్పుడు బ్రిటన్ పార్లమెంటరీ నివేదిక చెబుతోంది. ఇంతకూ రష్యా తన కార్య సాధన కోసం ఏం చేస్తుంది? కోట్లాదిమంది ఓటర్లను మాయా జాలంలో ముంచెత్తే మంత్రదండం ఏమైనా పుతిన్ దగ్గర వుందా? బయటి దేశాలవారెవరో చేసిన ప్రచారానికి అమెరికా, బ్రిటన్ ప్రజలు బోల్తా పడ్డారా? ఈ ప్రశ్నలకు ఎవరిదగ్గరా ఖచ్చితమైన జవాబుల్లేవు. కానీ నిరుడు ఏప్రిల్‌లో అమెరికాలో వెల్లడైన రాబర్ట్ మ్యూలర్ నివేదిక 2016 అధ్యక్ష ఎన్నికల్లో రష్యా ప్రమేయం వున్నదని నిర్ధారించింది. ఇందులో నేరుగా ట్రంప్ బాధ్యత ఎంత అన్న అంశంపై ఆ నివేదిక ఏం చెప్పిందో ఇంతవరకూ తెలియదు. ఏ నివేదికనైనా ఎంతవరకూ బయటపెట్టాలో నిర్ణయించే అధికారం అధ్యక్షుడిగా ట్రంప్‌కు వుంటుంది. ఆయన ఆ అధికారాన్ని వినియోగించుకున్నారు. నివేదిక తనకు క్లీన్ చిట్ ఇచ్చిందని ట్రంప్ చేసుకున్న ప్రచారాన్ని మాత్రం స్వయానా మ్యూలరే ఖండించారు. రష్యా తీరుపై గత అయిదారేళ్లుగా కథలు కథలుగా మీడియాలో వెల్లడవుతూనే వున్నాయి. గత అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలిచే అవకాశం దండిగా వున్న డెమొక్రాటిక్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్‌ను దెబ్బతీయడానికి సామాజిక మాధ్యమాల నిండా ఆమెకు వ్యతిరేకంగా భారీయెత్తున అబద్ధాలు ప్రచారమయ్యాయి. అవి ఏ స్థాయిలో వున్నాయంటే వాటిని ఖండించడానికి హిల్లరీ టీమ్‌కు బోలెడంత సమయం పట్టింది. వాటికి జవాబిచ్చేలోగా మరిన్ని ప్రచారంలోకొచ్చేవి. బ్రిటన్‌లోనూ స్కాట్లాండ్ రెఫరెండం సమయంలో, బ్రెగ్జిట్ ఓటింగ్ సమయంలో మార్ఫింగ్ ఫొటోలనూ, తప్పుడు కథనాలనూ విస్తృతంగా ప్రచారం చేశారు. అమెరికాలో ట్రంప్ వ్యాపార సంస్థల ఎగ్జిక్యూటివ్‌లు, ఇతరులు రష్యా ప్రచారానికి అండదండగా నిలిచారు. వీరు కేంబ్రిడ్జి ఎనలిటికా ఆసరా తీసుకోవడంతోపాటు ఫేస్బుక్, ట్విటర్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ వగైరా సామాజిక మాధ్యమాల్లో దొంగ పేర్లతో అకౌంట్లు తెరిచి నకిలీ సమాచారాన్ని, తప్పుడు వార్తల్ని వ్యాప్తిలోకి తెచ్చారని మ్యూలర్ నివేదిక తేల్చింది. తమ దర్యాప్తును అడుగడుగునా అడ్డుకోవడానికి ట్రంప్ చేసిన ప్రయత్నాలనూ ప్రస్తావించింది. ఇప్పుడు బ్రిటన్ పార్లమెంటరీ నివేదిక చూసినా ఇలాంటి అంశాల ప్రస్తావనే వుంది. బ్రిటన్‌లో న్యాయవాదులు, అకౌంటెంట్లు, ఎస్టేట్ ఏజెంట్లు తెలిసో తెలియకో రష్యా ప్రచారంలో వాహకులుగా మారారని, హౌస్ ఆఫ్ లార్డ్స్‌లోని కొందరు ఎంపీలు సైతం రష్యాలో తమ కున్న వ్యాపార ప్రయోజనాలు నెరవేర్చుకోవడానికి ఇందులో తలదూర్చారని ఆ నివేదిక అంటోంది. బ్రిటన్‌లో కామన్స్ సభ సభ్యులతో పోలిస్తే హౌస్ ఆఫ్ లార్డ్స్ సభ్యులకు అదనపు హక్కులుంటాయి. ఈ పారదర్శకత లేమినే రష్యా ఉపయోగించుకుంటున్నదని పార్లమెంటరీ కమిటీ వ్యాఖ్యానించడం గమనార్హం. ఈ నివేదిక వెల్లడయ్యాక ఎప్పటిలాగే బ్రిటన్ ప్రభుత్వం రష్యా ప్రమేయాన్ని తోసిపుచ్చింది. 2019 ఎన్నికల్లో వారు తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడానికి ప్రయత్నించిన మాట వాస్తవమే అయినా అదేమీ ఫలించలేదన్నది ప్రభుత్వ వాదన. కమిటీ కోరుతున్నట్టు దర్యాప్తు అవసరం లేదన్నదే దాని భావన. కానీ ఇదంత తేలిగ్గా కొట్టిపారేసేది కాదు. 2014లో స్కాట్లాండ్ రెఫరెండం జరిగినప్పుడు ట్విటర్లోని 4,000కుపైగా ఖాతాల ద్వారా తప్పుడు ప్రచారం సాగింది. అందులో 3,841 ఖాతాలు రష్యాకు, 770 ఖాతాలు ఇరాన్‌కి చెందినవని ఇంటర్నెట్ రీసెర్చ్ ఏజెన్సీ 2018లోనే వెల్లడించింది. ఈ ఖాతాల ద్వారా ఒక రోజంతా కోటి ట్వీట్లు విడుదలయ్యాయని కూడా అది లెక్కేసింది. ఈ విషయంలో సామాజిక మాధ్యమాలు కూడా నిస్సహాయంగా వుండటం, జవాబుదారీతనాన్ని ప్రదర్శించలేక పోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇది బ్రిటన్ లేదా అమెరికా సమస్య మాత్రమే కాదు... రష్యాను ఆద ర్శంగా తీసుకుని తప్పుడు ప్రచారాలతో లబ్ధి పొందాలని చూసేవారు అన్ని దేశాల్లోనూ బయల్దేరారు. ఈ విషయంలో తగిన చర్యలు తీసుకోమని ప్రభుత్వాలపై ఒత్తిళ్లు తీసుకురావడంతోపాటు, ప్రజల్లో చైతన్యం కలిగించడం ప్రజాస్వామికవాదుల కర్తవ్యం. -
భారత్-చైనా వివాదం: బ్రిటన్ కీలక వ్యాఖ్యలు
లండన్ : సరిహద్దు వివాదాన్ని భారత్, చైనాలు చర్చల ద్వారా సామరస్యంగా పరిష్కరించుకోవాలని బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ పిలుపు ఇచ్చారు. ఇరు దేశాల సైనికుల మధ్య ఘర్షణలతో సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయని, ఈ పరిణామాలు ఆందోళనకరమని వ్యాఖ్యానించారు. భారత్-చైనాల మధ్య నెలకొన్న పరిణామాలను బ్రిటన్ నిశితంగా గమనిస్తోందని బోరిస్ జాన్సన్ పేర్కొన్నారు. కాగా, సరిహద్దు ఉద్రిక్తతలను నివారించేందుకు సేనల ఉపసంహరణపై భారత్, చైనా సైనికాధికారుల మధ్య ఏకాభిప్రాయం వ్యక్తమైనా డ్రాగన్ దూకుడు తగ్గడం లేదు. చర్చల్లో శాంతి మంత్రం జపిస్తూనే మరోవైపు తూర్పు లడఖ్ సహా వాస్తవాధీన రేఖ వెంబడి పలు ప్రాంతాల్లో బలగాలను మోహరిస్తూనే ఉంది. చదవండి : బాయ్ కాట్ చైనా : సీఏఐటీ మరో అడుగు -
విశ్వవ్యాప్తమవుతున్న భారతీయ సంస్కృతి
లండన్ : ప్రపంచవ్యాప్తంగా ఇద్దరు మనుషులు కలిస్తే సాధారణంగా షేక్ హ్యాండ్ ఇచ్చుకోవడం ఇప్పటి వరకు చూశాము. అయితే కరోనా మహమ్మారి దెబ్బకు ఇప్పుడు షేక్ హ్యాండ్ల పరంపర మరుగున పడి, భారతీయుల సంస్కృతిలో భాగమైన నమస్కారం విస్తృతంగా వాడుకలోకి వస్తోంది. భారతీయ సంప్రదాయం ప్రకారం ఇద్దరు మనుషులు ఎదురైతే వినమ్రతతో రెండు చేతులు జోడించి నమస్కారం చేస్తారు. (నాన్న కోసం నది దాటాడు) బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యువల్ మక్రాన్లు గురువారం కలుసుకున్నారు. ఈ క్రమంలోనే వారిద్దరూ ఇదివరకులా షేక్హ్యాండ్లు ఇచ్చుకోకుండా, నమస్కారంతో పలకరించుకున్నారు. వీరితో పాటూ బ్రిటన్ రాజవంశీయులు సైతం తమ అధికారిక కార్యక్రమాల్లో అగ్రనేతలను కలుసుకున్నప్పుడు నమస్కారంతోనే పలకరిస్తున్నారు.(డీఏసీఏపై ట్రంప్‌కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ) గ్లోబలైజేషన్‌తో వివిధదేశాల నుంచి ప్రాజెక్టులే కాకుండా వారి అలవాట్లు కూడా భారత్‌లోకి రావడంతో కార్పోరేట్ సంస్థల్లో షేక్ హ్యాండ్ సంస్కృతి దాదాపు వచ్చింది. ఈ క్రమంలోనే అగ్గికి ఆజ్యం పోసినట్టు కరోనా వైరస్ వ్యాప్తికి షేక్ హ్యాండ్ సంస్కృతికి కూడా ఒక కారణం కావడంతో, వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి ఇప్పుడందరూ నమస్కారాన్ని వాడుతున్నారు. -
అంతర్జాతీయ టీకా కూటమికి 15 మిలియన్ డాలర్లు
న్యూఢిల్లీ: అంతర్జాతీయ టీకా కూటమి(గ్లోబల్ అలయన్స్ ఆఫ్ వ్యాక్సిన్ అండ్ ఇమ్యూనైజేషన్–జీఏవీఐ)కి భారత్ తరఫున 15 మిలియన్ డాలర్ల(రూ. 113.13 కోట్లు)ను విరాళంగా ప్రధాని మోదీ ప్రకటించారు. బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ నిర్వహించిన గ్లోబల్ వ్యాక్సిన్ సమ్మిట్‌ను ఉద్దేశించి వీడియో లింక్ ద్వారా గురువారం ప్రధాని మోదీ ప్రసంగించారు. ఈ సమావేశంలో దాదాపు 50 దేశాలకు చెందిన అధినేతలు, మంత్రులు, ఐరాస సంస్థల ప్రతినిధులు, వాణిజ్యవేత్తలు, పౌర సమాజ ప్రతినిధులు పాల్గొన్నారు. విపత్తులపై అంతర్జాతీయ సహకారానికి ఉన్న పరిమితులను కరోనా మహమ్మారి ఎత్తి చూపిందని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. ‘బహుశా తొలిసారి ప్రపంచ మానవాళి ఒక స్పష్టమైన ఉమ్మడి శత్రువుతో పోరాడుతోంది’ అని పేర్కొన్నారు. అంతర్జాతీయ టీకా కూటమి.. ఒక అంతర్జాతీయ సంస్థ మాత్రమే కాదని, అది ఒక సంఘీభావ ప్రతీక అని ప్రధాని అభివర్ణించారు. ఇతరులకు సాయం చేయడమంటే మనకు మనం సాయం చేసుకోవడమేనన్న విషయాన్ని ఈ సంస్థ మరోసారి గుర్తు చేస్తోందన్నారు. భారత్ వైద్య సదుపాయాలు ఎక్కువగా లేని అత్యధిక జనాభా ఉన్న దేశమని, అందువల్ల టీకా ప్రాముఖ్యత భారత్‌కు బాగా తెలుసని ఆయన పేర్కొన్నారు. ప్రపంచమంతా ఒకే కుటుంబమని చెప్పే వసుధైక కుటుంబం భావన భారత సంస్కృతిలోనే ఉందని, ఈ కరోనా మహమ్మారిపై పోరాటం విషయంలో అదే భావనను భారత్ ఆచరిస్తోందని చెప్పారు. ఈ మహమ్మారిపై పోరాటం కోసం దాదాపు 120 దేశాలతో భారత్ తన దగ్గరున్న ఔషధాలను పంచుకుందన్నారు. తన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మొదట ప్రారంభించిన పథకాల్లో పిల్లలు, గర్భిణులు అందరికీ టీకా ఇచ్చే ‘మిషన్ ఇంద్రధనుష్’ ఒకటని మోదీ గుర్తు చేశారు. టీకాల తయారీలోనూ భారత్ ముందుందని, ప్రపంచంలోని చిన్నారుల్లో దాదాపు 60% మందికి భారత్‌లో ఉత్పత్తి అయిన టీకాలే అందడం తమకు గర్వకారణమని చెప్పారు. -
దేశం కోసం.. 100 ఏళ్ల వయసులోనూ
లండన్ : యుద్ధరంగంలో శత్రువులపై పోరాడిన బ్రిటన్‌కి చెందిన కెప్టెన్ టామ్ ముర్రే ఇప్పుడు వందేళ్ల వయసులో కనిపించని శత్రువుపై అలుపెరగని పోరాటం చేస్తున్నారు. కరోనా మహమ్మారి బాధితులకు అండగా ఉండేందుకు, నేషనల్ హెల్త్ సర్వీసెస్‌కు విరాళాలు సేకరించాలని ధృఢంగా సంకల్పించారు. 100 ఏళ్ల వయసులో చక్రాల బండి సాయంతో బెడ్ఫోర్డ్శైర్లోని తన గార్డెన్లో నడక ప్రారంభించి దేశ ప్రజలందరినీ ఆకర్షించారు. నువ్వు ఒక్కడివి కాదు నీతోపాటూ మీమ్మున్నామంటూ, బ్రిటన్ పౌరులు టామ్ ముర్రేకు అండగా నిలవడంతో ఏకంగా 40 మిలియన్ డాలర్ల విరాళాలను సేకరించారు. కరోనాపై పోరులో ఇప్పటివరకు సేకరించిన విరాళాల్లో టామ్ రికార్డు సాధించారు. మిలిటరీలో ఉండగా తన పోరాటపటిమతో కెప్టెన్‌గా ఎదిగిన టామ్ ముర్రే, అనంతరం ఆయన చేసిన సేవలకుగానూ ఇటీవలే బ్రిటన్ ప్రభుత్వం ఆయనకు గౌరవ కల్నల్ హోదాను ఇచ్చింది. ఇక, కరోనాపై పోరులో దేశ ప్రజలకు అండగా టామ్ ముర్రే చేస్తున్న పోరాటానికిగానూ, బ్రిటన్ ప్రదానం చేసే వ్యక్తిగత అత్యున్నత పురస్కారమైన నైట్‌హుడ్ పురస్కారానికి ఆయనను ఎంపిక చేసింది. టామ్ చూపిన దేశభక్తికి లండన్ పౌరుల దగ్గర నుంచి దేశ ప్రధాని వరకు అందరూ ఆయన సేవలను కొనియాడారు. ‘టామ్ సేకరించిన నిధులు దేశవ్యాప్తంగా స్పూర్తినిచ్చింది. కరోనా క్లిష్టసమయంలో ఆయన ఒక వెలుగులా దారిచూపారు. ఆయన పోరాటపటి దేశం మొత్తాన్ని కదిలించింది. అందరి తరపున నేను ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నా’ అంటూ ప్రధాని బోరిస్ జాన్సన్ ఓ ప్రకటనలో తెలిపారు. క్వీన్ ఎలిజబెత్ కూడా టామ్ సేవలను కొనియాడుతూ నైట్‌హుడ్ పురస్కారానికి ఆమోదం తెలిపారు. (లాక్డౌన్ ఇప్పట్లో ముగిసేలా లేదు! ) బ్రిటన్‌లో కరోనా కారణంగా దాదాపు 35 వేలమంది ప్రాణాలు కోల్పోయారు. ఇలాంటి విపత్కర సమయంలో దేశానికి సహాయం చేయడానికి తమ వంతు కృషి చేస్తున్న వారిని ఫ్రంట్ హీరోలుగా గుర్తిస్తూమంటూ ప్రభుత్వ ప్రతినిధి ఒకరు వ్యాఖ్యానించారు. ఇక టామ్ త్వరలోనే ప్రభుత్వం నుంచి నైట్‌హుడ్ పురస్కారాన్ని అందుకోనునన్నారు. ఆయన చేసిన సేవలకు దేశం మొత్తం ఫిదా అయ్యింది. అందుకే గత నెలలో ఆయన పుట్టినరోజు సందర్భంగా 1,25,000కు పైగానే గ్రీటింగ్ కార్డులను అందుకున్నారు. వీటిని తెరవడానికి కొంత మంది వాలంటీర్లు సహాయం చేశారంటే టామ్‌పై అభిమానం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. దేశం కష్టకాలాన్ని ఎదుర్కొంటున్న సమయంలో అండగా నిలిచిన వారే నిజమైన హీరోలు అంటూ టామ్‌ని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. (మలేరియా మందు భేష్! ) -
లాక్డౌన్ ఇప్పట్లో ముగిసేలా లేదు!
లండన్ : బ్రిటన్‌లో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. వైరస్‌తో పెద్ద ఎత్తున ప్రజలు మృత్యువాత పడుతున్నారు. ఆ మధ్య కాస్త తగ్గినట్లే కనిపించినా.. గడిచిన రెండు వారాల నుంచి కరోనా పాజిటివ్ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ఈ క్రమంలోనే ఆదివారం దేశ ప్రజలను ఉద్దేశించి బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ మాట్లాడారు. మహమ్మారి విరుగుడుకు విధించిన లాక్డౌన్ ఇప్పట్లో ముగిసేలా లేదని అన్నారు. ప్రజలంతా ఎవరికివారు జాగ్రత్తగా ఉండటం అలవాటు చేసుకోవాలని ప్రధాని పిలుపునిచ్చారు. వైరస్ ప్రభావం ఎక్కువకాలం ఉండే అవకాశం ఉందని, దీనికి సరైన ఔషదం వచ్చే వరకు లాక్డౌన్ తప్ప మరో దారిలేదని స్పష్టం చేశారు. దేశంలో లాక్డౌన్ అమలు చేస్తూనే పలు కార్యక్రమాలకు ఆంక్షలను నుంచి సడలింపులు ఇస్తున్నట్లు ప్రధాని ప్రకటించారు. (కరోనా పోరులో ట్రంప్ విఫలం) దీనిలో భాగంగానే ప్రజలు బయటకువచ్చి వ్యాయామం చేసుకునేందుకు షరతులతో కూడిన అనుమతులు ఇచ్చారు. అలాగే వర్క్ ఫ్రం హోమ్ చేయలేని వారు కార్యాలయాలకు వెళ్లి విధులు నిర్వర్తించవచ్చని ప్రకటించారు. కానీ అన్ని ప్రాంతాల్లో తప్పనిసరిగా బౌతిక దూరం పాటించాలని ఆదేశించారు. బ్రిటన్‌తో పాటు వేల్స్, స్కాట్లాండ్ దేశాల కూడా లాక్డౌన్ నిబందనలను ఖచ్చితంగా పాటించాలని ఆదేశించారు. ‘స్టే ఎట్ హోం’ నినాదంతో పాటు ‘స్టే సేఫ్టీ’ నినాదాన్ని కూడా ప్రజల్లోకి తీసుకురావాలని అధికారులకు ప్రధాని సూచించారు. జూన్ మొదటి వారంలోపు పరిస్థితి అదుపులోకి వస్తే పాఠశాలతో పాటు ఆస్పత్రుల్లో ఓపీ సేవలను ఓపెన్ చేసేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. కాగా ఇప్పటి వరకు బ్రిటన్‌లో 219,183 కరోనా కేసులు నమోదు కాగా.. 32 వేలకు పైగా మరణాలు సంభవించాయి. (2లక్షలు దాటిన కరోనా కేసులు) var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1391284009.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
ప్రధాని పెద్ద మనసు: బిడ్డకు వైద్యుడి పేరు
లండన్ : కరోనా బారిన పడి ఇటీవల పూర్తిగా కోలుకున్న బ్రిటన్ ప్రధానమంత్రి తన చికిత్స అనుభవానుల మీడియాతో పంచుకున్నారు. కోవిడ్ బారినపడిన తనకు వైద్యులు అద్బుతమైన సేవలను అందించారని వారిపై ప్రశంసల జల్లు కురిపించారు. ఐసీయూలో ఉంచి ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు నిర్వహించారని, వారి సేవలతోనే తాను పూర్తిగా కోలుకున్న అని జాన్సన్ తెలిపారు. కాగా మార్చి 26న బ్రిటన్ ప్రధానికి కరోనా పాజిటివ్‌గా తేలిన విషయం తెలిసిందే. దాదాపు 20 రోజుల పాటు ఆస్పత్రిలోనే ఉండి చికిత్స పొందారు. అనంతరం వైరస్ నుంచి పూర్తిగా కోలుకుని ప్రస్తుతం రోజూవారి కార్యక్రమాల్లో పాల్పంచుకుంటున్నారు. కాగా తనకు వైద్య సేవలు చేసి డాక్టర్లకు జాన్సన్ తనదైన శైలిలో కృతజ్ఞతలు తెలిపారు. (బ్రిటన్‌లో లక్ష వరకు కరోనా మృతులు) ఆయన జీవన సహచరి క్యారీ సైమండ్స్(32) బుధవారం లండన్ ఆస్పత్రిలో పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. తన బిడ్డకు వైద్యుడి పేరు వచ్చేలా పేరు పెట్టి తన కృతజ్ఞతను చాటుకున్నారు. ఆ పిల్లోడికి విల్ఫ్రెడ్ లారీ నికోలస్ జాన్సన్ అని పేరు పెట్టారు. ఆ పేరులో ఇద్దరు తాతయ్యల పేర్లు, బోరిస్‌కు చికిత్స అందించిన మరో ఇద్దరు డాక్టర్ల పేర్లు ఉన్నాయి. దీనిపై స్పందిచిన వైద్యులు తమకు ఇంతకన్నా పెద్ద గౌరవం ఏముందటుందని ఆనందం వ్యక్తం చేశారు. మరోవైపు బ్రిటన్‌లో కరోనా వైరస్ విజృంభిస్తోంది. దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,78, 000కి చేరింది. 28 వేల మంది మృత్యువాత పడ్డారు. (మగబిడ్డకు జన్మనిచ్చిన బ్రిటన్ ప్రధాని సహచరి) var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1371282435.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
తండ్రి అయిన బోరిస్ జాన్సన్
లండన్: బ్రిటన్ ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్(55) మరోసారి తండ్రయ్యారు. ఆయన జీవన సహచరి క్యారీ సైమండ్స్(32) బుధవారం లండన్ ఆస్పత్రిలో పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని బోరిస్ జంట అధికార ప్రతినిధి ధ్రువీకరించారు. ‘‘ప్రధాని, మిస్ సైమండ్స్ ఈరోజు ఉదయం తమకు పుత్రుడు జన్మించిన విషయాన్ని ప్రకటించడానికి ఎంతో సంతోషిస్తున్నారు. జాతీయ ఆరోగ్య సేవల మెటర్నరీ విభాగానికి ధన్యవాదాలు చెబుతున్నారు’’ అని పేర్కొన్నారు. ప్రస్తుతం తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నట్లు తెలిపారు. కాగా బోరిస్ జాన్సన్‌కు తన మాజీ భార్య మెరీనా వీలర్‌తో ఇదివరకే నలుగురు సంతానం ఉన్నారు. (కరోనాను జయించి తిరిగి విధులకు ప్రధాని) ఇక అధికార కన్జర్వేటివ్ పార్టీ కమ్యూనికేషన్స్ హెడ్‌గా పనిచేసిన క్యారీ సైమండ్స్‌తో బోరిస్ కొన్నిరోజులుగా డేటింగ్ చేస్తున్నారు. ఈ క్రమంలో 2019లో తమ బంధాన్ని బహిర్గతం చేసిన ఈ జంట త్వరలోనే పెళ్లిచేసుకోబోతున్నామని ప్రకటించారు. కాగా బోరిస్ గతంలో అలెగ్రా మెస్టిన్ అనే మహిళను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. 1993లో ఆమె నుంచి విడిపోయి మెరీనా వీలర్‌ను వివాహమాడారు. అనంతరం ఆమె నుంచి విడాకులు తీసుకుని ప్రస్తుతం క్యారీ సైమండ్స్‌తో జీవితాన్ని గడుపుతున్నారు. ఇక కొన్ని రోజుల క్రితం కరోనా వైరస్ బారిన పడిన బోరిస్ కోలుకున్న విషయం తెలిసిందే. ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయిన రెండు వారాల తర్వాత ప్రధాని కార్యాలయానికి తిరిగి వచ్చిన ఆయన అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. (బ్రిటన్‌లో లక్ష వరకు కరోనా మృతులు ) -
బ్రిటన్‌లో లక్ష వరకు కరోనా మృతులు
సాక్షి, న్యూఢిల్లీ : ప్రాణాంతకమైన కరోనా వైరస్ వల్ల బ్రిటన్‌లో ఈ ఏడాది చివరి నాటికి లక్ష మంది ప్రజలు చనిపోతారని ‘ది ఇంపీరియల్ కాలేజ్’ ఎపిడిమియాలోజిస్ట్ ప్రొఫెసర్ నీల్ ఫెర్గూసన్ అంచనా వేశారు. ఆగస్ట్ నెల నాటికే దేశంలో కరోనా మతుల సంఖ్య 60 వేలకు చేరుకుంటుందని స్వీడన్ ఎపిడిమియాలోజిస్ట్ జొహాన్ గీసెక్స్ అంచనా వేశారు. బ్రిటన్‌లో లాక్‌డౌన్‌ను అమలు చేయడం ద్వారా దారుణ పరిస్థితి నుంచి త్వరగా బయటపడవచ్చని ముందుగా ప్రభుత్వానికి సూచించినదే ఫెర్గూసన్. వ్యాక్సిన్‌ను కనుగొనే వరకు లాక్డౌన్ కొనసాగించడం మంచిదంటూ ఆయన చేసిన సూచనను దేశ ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్ స్ఫూర్తిగా తీసుకొని లాక్డౌన్ ప్రకటించారు. ప్రధానికి కూడా వైరస్ సోకడంతో ఆయన కూడా 14 రోజులపాటు ఏకాంతవాసానికెళ్లి సురక్షితంగా బయటకు వచ్చారు. వద్ధులను, పిలలను ఇంటికే పరిమితం చేసి యువతకు విధులకు పంపించడం ద్వారా లాక్‌డౌన్‌ను కొనసాగించడం మంచిదని ఫెర్గూసన్ చెప్పారు. అలా చేయడం ద్వారా 80 శాతం జనాభా ఇంటికి పరమితం అవడం, 20 శాతం మంది మాత్రమే విధులకు హాజరవడం వల్ల మతుల సంఖ్య ఈ ఏడాది చివరి నాటికి లక్షకు చేరుకంటుందని ఆయన అన్నారు. అప్పటికి వ్యాక్సిన్ అందుబాటులోకి రావచ్చని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే 2021 వరకు వ్యాక్సిన్ వచ్చే అవకాశం లేదని బ్రిటన్ విదేశాంగ మంత్రి డొమినిక్ రాబ్ చెప్పారు. (ఆ దేశంలో భారతీయుల మరణాలు ఎక్కువ!) -
కరోనాను జయించి తిరిగి విధులకు ప్రధాని
లండన్ : కరోనా వైరస్ నుంచి పూర్తిగా కోలుకున్న ప్రధాని బోరిస్ జాన్సన్ తిరిగి విధులకు హాజరయ్యేందుకు డౌనింగ్ స్ర్టీట్ లోని ప్రధానమంత్రి కార్యాలయ్యానికి వచ్చారు. ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయిన రెండు వారాల తర్వాత తిరిగి తన అధికారిక విధుల్లో బోరిస్ పాల్గొన్నారు. కరోనా లక్షణాలు ఉండటంతో మార్చి 26 నుంచి స్వీయనిర్భంధంలోనే ఉన్న ఆయన ఇంటి నుంచే పనులు కొనసాగించారు. అయితే ఆరోగ్యం క్షీణించడంతో లండన్‌లోని ప్రముఖ ఆసుపత్రిలో చికిత్స పొందారు. మూడు రోజులపాటు ఐసీయూలోనే ఉన్నారు. ఏప్రిల్ 12న పూర్తిగా కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ప్రధాని బోరిస్ నేరుగా రంగంలోకి దిగి ఎప్పటికప్పుడు కరోనా పరిస్థితిని సమీక్షిస్తున్నట్లు యూకే అధికారిక వర్గాలు వెల్లడించాయి. (కరోనా : ఆస్పత్రి నుంచి బ్రిటన్ ప్రధాని డిశ్చార్జ్) లండన్ పర్యావరణ కార్యదర్శి జార్జ్ యూస్టిస్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ..ప్రస్తుతం కరోనా మరణాల రేటు తగ్గుతుందని, రాబోయే రోజుల్లో దీని సంఖ్య మరింత తగ్గుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కరోనా వ్యాప్తిని అడ్డుకట్ట వేసేందుకు సామాజిక దూరం పాటించాలని అదే మన ప్రాణాలను నిలబెడుతుందని పేర్కొన్నారు. ప్రస్తుతం 1,52,000 కు పైగానే కోవిడ్ కేసులు నమోదు కాగా, ఈ వైరస్ ధాటికి దాదాపు 20,732 మంది ప్రాణాలు కోల్పోయారు. -
‘దాడి చేస్తే శిక్ష తప్పదు.. ఓ సెల్ ఏర్పాటు చేశాం’
సాక్షి, హైదరాబాద్: ప్రాణాలకు పణంగా పెట్టి కరోనా బాధితులకు సేవలందిస్తున్న వైద్యులపై దాడులు చేసేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర వైద్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. నారాయణగూడలోని ఐపీఎంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ఆయన శనివారం సందర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ‘కరోనా నుంచి కోలుకున్న బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ తనకు ఏ దేవుడు లేడు.. వైద్యుడే దేవుడు అన్నాడు. అలాంటి వైద్యులపై కొందరు మూర్ఖులు, శాడిస్టులు దాడి చేస్తున్నారు. (చదవండి: గ్రేటర్ టెన్షన్..!) వైద్యులపై దాడి చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. డాక్టర్లు వారి ప్రాణాలను పణంగా పెట్టి ప్రజల ప్రాణాలు కాపాడుతున్నారు. వాళ్ల కుటుంబాల్ని పక్కనపెట్టి విధులు నిర్వహిస్తున్నారు. డాక్టర్లపై దాడి చేసిన పేషంట్లను శిక్షించేందుకు ప్రత్యేకంగా ఓ సెల్ ఏర్పాటు చేశాం. కరోనా సోకినవారిలో కొందరు తలసేమియా వంటి వ్యాధులతో బాధ పడుతున్నారు. వారికి రక్తం అవసరం. రక్తం కొరత రాకుండా బ్లడ్ డొనేట్ చేసేందుకు చాలామంది ముందుకు రావాల్సిన అవసరం ఉంది. అందులో భాగంగానే టీఎన్జీవో ఆధ్వర్యంలో రెండు వందల మందికి పైగా రక్తదానం చేశారు’అని మంత్రి పేర్కొన్నారు. (చదవండి: తెలంగాణలో పెరుగుతున్న పాజిటివ్‌లు) -
మీకోసం మాదేశం ప్రార్థిస్తోంది: మెలానియా
కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను గడగడలాడిస్తోంది. సాధారణ ప్రజలతోపాటు సెలబ్రిటీలను, దేశాధినేతలను కూడా వదిలిపెట్టట్లేదు. ఇటీవల బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్‌కు కరోనా పాజిటివ్ అని తేలడంతో సెయింట్ ఆసుపత్రిలో చికిత్స తీసుకున్న విషయం తెలిసిందే. పదిరోజుల పోరాటం అనంతరం ఆయన కోలుకుని హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. అయితే అతని సతీమణి సైమండ్ ప్రస్తుతం గర్భిణీ. ఆమెకు కూడా కరోనా లక్షణాలు ఉన్నాయంటూ వార్తలు వినిపించాయి. (అమెరికాలో భారీగా కోవిడ్ మృతులు) ఈ నేపథ్యంలో ఈ దంపతులను ఉద్దేశించి అమెరికా ప్రథమ మహిళ, అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భార్య మెలానియా వైట్‌హౌస్ నుంచి లేఖ రాశారు. వారి ఆరోగ్యం కుదుటపడాలని, దంపతులిద్దరూ త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. వారి బాగు కోసం తమ దేశమంతా ప్రార్థనలు చేస్తోందని చెప్పుకొచ్చారు. కాగా అమెరికాలో గురువారం నాటికి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 6,54,343కు చేరుకోగా, మరణాలు 33 వేల మార్కును దాటేశాయి. ఒక్క న్యూయార్క్‌లోనే ఇప్పటి వరకు 16,251 మంది చనిపోయినట్లు అధికారులు పేర్కొన్నారు. (ఇంటి నుంచి ఇలా సులువు) -
కోవిడ్ ఒక మహా విపత్తు
వాషింగ్టన్/లండన్/రోమ్: కోవిడ్ రక్కసి గుప్పిట్లో చిక్కుకొని అమెరికా విలవిల్లాడుతోంది. ఈ వైరస్ ప్రతిరోజూ వందలాది మంది ప్రాణాలను బలిగొంటూ తీవ్రరూపం దాలుస్తోంది. కోవిడ్ కేసులు, మృతుల సంఖ్యలో అమెరికా అన్ని దేశాలను దాటేసి పట్టికలో అగ్రస్థానానికి వెళ్లడం ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. కోవిడ్ మృతులు ఇటలీని మించిపోయి 20 వేలు దాటిపోవడంతో అమెరికా ప్రభుత్వం మహా విపత్తుగా ప్రకటించింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అంగీకారంతో వ్యోమింగ్ రాష్ట్రాన్ని కూడా కోవిడ్ విపత్తు పరిధిలోకి తీసుకురావడంతో దేశవ్యాప్తంగా 50 రాష్ట్రాల్లోనూ అత్యవసర పరిస్థితులు విధించినట్టయింది. అమెరికా చరిత్రలో ఇలా జరగడం ఇదే తొలిసారి. కోవిడ్‌ను మహా విపత్తుగా గుర్తించడం వల్ల వైరస్ ముప్పు ఉన్నంతకాలం అమెరికా ఫెడరల్ ప్రభుత్వ నిధులను అన్ని రాష్ట్రాలూ, స్థానిక ప్రభుత్వాలు వినియోగించుకునే అవకాశం ఉంటుంది. ఈ విపత్తును ఎదుర్కొనేం దుకు నేరుగా వైట్ హౌస్ నిధులు అన్ని రాష్ట్రాలకు బదలాయిస్తుంది. అత్యవసర సేవల్ని కూడా ఫెడరల్ ప్రభుత్వమే పర్యవేక్షిస్తుంది. కోవిడ్ ప్రభావం అత్యధికంగా న్యూయార్క్, న్యూజెర్సీలపై ఉంటే, ఇప్పుడిప్పుడే షికాగో వంటి రాష్ట్రాలకూ వ్యాధి విస్తరిస్తోంది. దేశవ్యాప్తంగా కేసుల సంఖ్య కూడా 5 లక్షల 50 వేలకు చేరుకుంది. కోవిడ్‌కు వ్యతిరేకంగా పోరాడడానికి అధ్యక్షుడు ట్రంప్ 50 వేల మంది ఆర్మీ సిబ్బందిని రంగంలోకి దించారు. 60 వేల మంది మరణిస్తారని అంచనాలు కోవిడ్ మహమ్మారితో అమెరికాలో లక్ష నుంచి రెండు లక్షల మంది మరణిస్తారని తొలి దశలో అంచనా వేశారు. కానీ దేశం యావత్తూ లాక్డౌన్లో ఉండడం, 95 శాతానికి పైగా ఇళ్లు వదిలి బయటకు రాకుండా అత్యంత కఠినంగా భౌతిక దూరాన్ని పాటిస్తూ ఉండడంతో మృతుల సంఖ్య ఆ స్థాయిలో ఉండదని కోవిడ్‌పై పోరాటానికి ఏర్పాటు చేసిన టాస్క్‌ఫోర్స్ భావిస్తోంది. ఈ విపత్తు నుంచి బయటపడే సమయానికి మృతుల సంఖ్య 60 వేలు దాటకపోవచ్చునని టాస్క్ ఫోర్స్ సభ్యులు అంచనా వేశారు. అమెరికాకు చేరుకున్న క్లోరోక్విన్ మాత్రలు కరోనా వైరస్‌ను నిరోధించడంలో అత్యంత కీలకంగా భావిస్తున్న మలేరియా వ్యాధికి వాడే క్లోరోక్విన్ మాత్రలు భారత్ నుంచి అమెరికాకు చేరుకున్నాయి. అమెరికా కోరినట్టుగా 35.82 లక్షల మాత్రలతో పాటు ఇతర ఔషధాల తయారీలో వినియోగించే ముడిపదార్థం 9 మెట్రిక్ టన్నుల్ని ప్రత్యేక కార్గో విమానంలో అమెరికాకు పంపింది. అవన్నీ శనివారం న్యూజెర్సీలో నేవార్క్ విమానాశ్రయానికి చేరుకున్నట్టుగా అమెరికాలో భారత రాయబారి తరణ్‌జిత్ సింగ్ ట్వీట్ చేశారు. ► సింగపూర్‌లో సంపూర్ణంగా లాక్డౌన్ ప్రకటించినప్పటికీ 24 గంటల్లో 191 కరోనా కేసులు నమోదయ్యాయి. వారిలో 51 మంది భారతీయులు ఉన్నారని ఆ దేశ ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. ► యూకేలో మృతులు 10 వేలు దాటేశాయి. ఒకే రోజు 657 మంది మృతి చెందడం ఆందోళన పెంచుతోంది. ► యూరప్ దేశాల్లో మృతుల సంఖ్య 75 వేలు దాటింది. స్పెయిన్‌లో ఆదివారం 610 మంది ప్రాణాలు కోల్పోయారు. ► చైనాలో మళ్లీ కరోనా కలవరం రేపుతోంది. మరో 100 కేసులు నమోదయ్యాయి. ► ప్రపంచ దేశాలన్నీ మరికొన్ని రోజులు లాక్డౌన్ పాటించాలని, లేదంటే రెండో విడత వైరస్ విజృంభించే అవకాశాలున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ హితవు హెచ్చరించింది. ఆస్పత్రి నుంచి బోరిస్ జాన్సన్ డిశ్చార్జి బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ కోవిడ్ వ్యాధి నుంచి కోలుకున్నారు. ఆరోగ్యం బాగుపడడంతో లండన్‌లో సెయింట్ థామస్ నుంచి ఆయనను డిశ్చార్చి చేశారు. వైద్య సిబ్బంది తన ప్రాణాలు కాపాడారని, వాళ్లకి ఎప్పుడూ రుణపడి ఉంటానని ఇంటికి వెళ్లే సమయంలో జాన్సన్ పేరు పేరునా ఆస్పత్రిలో అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ప్రధాని మరికొన్నాళ్లు విశ్రాంతి తీసుకోవాలని వైద్య సిబ్బంది సూచించారని, ఆయన విధులకు హాజరుకావడానికి మరి కొద్ది రోజుల సమయం పడుతుందని బ్రిటన్ విదేశాంగ శాఖ మంత్రి డొమినిక్ రాబ్ వెల్లడించారు. -
ఆస్పత్రి నుంచి ప్రధాన మంత్రి డిశ్చార్జ్
లండన్ : కరోనా వైరస్ మహమ్మారి బారిన పడి ఆస్పత్రిలో చేరిన బ్రిటన్ ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్ ఆదివారం డిశ్చార్జ్ అయ్యారు. కరోనా లక్షణాలు కనిపించడంతో మార్చి 26 నుంచి ఆయన స్వీయ నిర్బంధంలో ఉంటూ చికిత్స తీసుకున్నారు. అయినప్పటికీ పరిస్థితిలో మార్పు లేకపోవడంతో వైద్యుల సూచన మేరకు ఏప్రిల్ 5న హాస్పిటల్‌కు వెళ్లారు. వ్యాధి తీవ్రత పెరగడంతో ఆయన్ను ఐసీయూకి తరలించి చికిత్స అందించారు. అయితే ఇప్పుడు ఆయన కోలుకున్నారని, హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారని డౌనింగ్ స్ట్రీట్ వర్గాలు తెలిపాయి.మెడికల్ టీమ్ సూచన మేరకు ఆయన తిరిగి తన వర్క్ ను వెంటనే ప్రారంభించరని తెలిపాయి. కాగా, సెయింట్ థామస్ ఆస్పత్రిలో తనకు వైద్య సేవలు అందించిన నేషనల్ హెల్త్ సిబ్బందికు జీవితాంతం రుణపడి ఉంటానని బోరీస్ పేర్కొన్నారు. మరోవైపు బ్రిటన్ లో ఇప్పటివరకు 78,991కరోనా కేసులు నమోదుకాగా, 9,875 మంది ఈ మహమ్మారి బారిన పడి మృతి చెందారు. -
లక్ష దాటిన కోవిడ్ మరణాలు
జెనీవా/వాషింగ్టన్/రోమ్: ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ కరాళ నృత్యం చేస్తోంది. ఈ వ్యాధి బారిన పడి మరణించిన వారి సంఖ్య శుక్రవారం 1,01,485కు చేరుకుంది. ప్రపంచవ్యాప్తంగా 16లక్షల 75వేల మందికిపైగా కరోనా వైరస్ బారినపడ్డారు. ఈస్టర్ సంబరాల వేళ ప్రపంచ జనాభాలో సగం మంది ఇంటి పట్టునే ఉండడంతో ఎక్కడా సందడి కనిపించడం లేదు. సామాజిక, ఆర్థిక ఎమర్జెన్సీ పరిస్థితులు నెలకొనడంతో మార్కెట్లన్నీ కళావిహీనంగా మారిపోయాయి. కోవిడ్ బారిన పడి విలవిలలాడుతున్న దేశాల్లో అమెరికాయే ముందు వరసలో ఉంది. 24 గంటల్లో 1,700 మంది మృతి చెందారు. వైరస్ దెబ్బకి అగ్రరాజ్యంలో ప్రతీ 10 మందిలో ఒకరు ఉద్యోగం కోల్పోతే, తమ సభ్యదేశాల్లో సహాయ కార్యక్రమాల కోసం 50 వేల కోట్ల యూరోలతో ప్రత్యేక ప్యాకేజీని అందించడానికి ఈయూ ఆర్థిక మంత్రులు అంగీకరించారు. ప్రపంచ శాంతికి భంగకరం కరోనా మహమ్మారి ప్రపంచ దేశాల్లో శాంతి భద్రతల్ని భగ్నం చేస్తుందని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి అంటోనియా గ్యుటెరాస్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మొండి వ్యాధిపై కొన్ని తరాల వారు పోరాడాల్సి ఉంటుందని ఆయన అంచనా వేశారు. త్వరలోనే ప్రపంచ దేశాల్లో సామాజిక అస్థిరత, హింసాత్మక పరిస్థితులు వస్తాయని భద్రతా మండలిని హెచ్చరించారు. కోలుకుంటున్న జాన్సన్ బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ కోవిడ్ నుంచి కోలుకుంటున్నారు. ఆయనను ఐసీయూ నుంచి వార్డుకి మార్చారు. జాన్సన్ ఆరోగ్యాన్ని రేయింబవళ్లు వైద్యులు పర్యవేక్షిస్తున్నారు. జాన్సన్‌తో ఆయన తండ్రి స్టాన్లీ జాన్సన్ మాట్లాడారు. ఇటలీలో మాఫియా కదలికలు కోవిడ్‌తో అతలాకుతలమైన ఇటలీపై పట్టు బిగించడానికి మాఫియా పన్నాగాలు పన్నుతోంది. వివిధ నేరగాళ్ల ముఠాలు పెద్ద ఎత్తున ఆహార పదార్థాలను కొనుగోలు చేసి, ఆకలితో అలమటిస్తున్న వారికి పంపిణీ చేస్తున్నాయి. నిరుపేదల్ని ఆదుకొని వారందరినీ తమ నియంత్రణలోకి తీసుకోవాలని కుట్రలు పన్నుతున్నాయని రచయిత రోబెర్టో సావియానో అనుమానం వ్యక్తం చేశారు. యెమన్‌లో తొలి కరోనా కేసు యుద్ధంతో అతలాకుతలమవుతున్న యెమన్‌లో మొట్టమొదటి కరోనా వైరస్ నమోదైంది. తీవ్రస్థాయిలో మానవ సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న యెమన్‌లో కోవిడ్ జాడలు ఎలాంటి విధ్వంసానికి దారితీస్తుందోనని ఐక్యరాజ్య సమితి ఆందోళన వ్యక్తం చేసింది. క్లినికల్ ట్రయల్స్ దశలో ప్లాస్మా థెరపీ న్యూఢిల్లీ: కరోనా చికిత్సకు కొత్తగా అందుబాటులోకి వచ్చిన కొన్వాలెసెంట్ ప్లాస్మా థెరపీ విధానం క్లినికల్ ట్రయల్స్ దశలో ఉందని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) తెలిపింది. కరోనా బారిన పడి కోలుకున్న వారి రక్తం నుంచి సేకరించిన యాంటీ బాడీస్‌ను కరోనా వైరస్‌తో తీవ్రంగా బాధపడుతున్న వారికి ఎక్కించడమే ప్లాస్మా థెరపీ. ఈ విధానాన్ని దేశంలోనే మొట్టమొదటిసారిగా కేరళలోని శ్రీచిత్ర పెరుమాళ్ ఇన్స్టిట్యూట్ ఫర్ మెడికల్ సైన్సెస్ అండ్ టెక్నాలజీలోని రోగులపై ప్రయోగాత్మకంగా పరిశీలించేందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వానికి అనుమతి ఇచ్చినట్లు ఐసీఎంఆర్ తెలిపింది. అయితే, డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా(డీసీజీఐ) కూడా ట్రయల్స్‌కు అంగీకారం తెలపాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఇటీవల కొన్ని దేశాల్లో కరోనా సోకి విషమంగా ఉన్న రోగులకు, వెంటిలేటర్‌పై ఉన్న వారికి ఈ విధానాన్ని పరిమిత సంఖ్యలో ప్రయోగాత్మకంగా పరిశీలించగా మంచి ఫలితాలు వచ్చాయని పేర్కొంది. -
మంచి వార్త తెలిసింది : ట్రంప్
లండన్ : కరోనా వైరస్ మహమ్మారితో బాధపడుతున్న బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ పరిస్థితి నిలకడగా ఉంది. దీంతో ఐసీయూ నుంచి సాధారణ వార్డుకు తరలించారు. మరికొన్నాళ్లు ఆస్పత్రిలోనే ఉండి చికిత్స తీసుకోవాలని లండన్‌లోని సెయింట్ థామస్ ఆస్పత్రిలోని వైద్య నిపుణుల బృందం ఆయనకు సూచించింది. బోరిస్ జాన్సన్‌ను ఐసీయూ నుంచి సాధారణ వార్డుకు తరలించారని తెలియగానే, మంచి వార్త తెలిసిందని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ట్విటర్లో స్పందించారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. (‘క్లాప్స్ ఫర్ బోరిస్’కు భారీ స్పందన) Great News: Prime Minister Boris Johnson has just been moved out of Intensive Care. Get well Boris!!! — Donald J. Trump (@realDonaldTrump) April 9, 2020 కాగా, వ్యాధి తీవ్రత ఎక్కువ కావడంతో వైద్యులు బోరిస్ జాన్సన్‌ను సోమవారం ఐసీయూకు తరలించిన విషయం తెలిసిందే. బోరిస్‌ను ఐసీయూకు తరలించారనే వార్తలు వెలువడగానే బ్రిటన్‌తో సహా యావత్ ప్రపంచదేశాలు ఆయనకు సంఘీభావం తెలిపాయి. జోరిస్ త్వరగా కోలుకోవాలని భారత ప్రధాని నరేంద్ర మోదీ, జపాన్ ప్రధాని షింజో అబే, ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్, రష్యా అధ్యక్షుడు పుతిన్, స్పెయిన్ ప్రధాని పెడ్రో శాంచెజ్ తదితరులు ఆకాంక్షించారు. (ఐసీయూలో బ్రిటన్ ప్రధాని) -
మరణాలు తక్కువగానే ఉంటాయేమో
వాషింగ్టన్: అమెరికాలో కోవిడ్ మరణాల సంఖ్య ముందుగా అంచనా వేసిన దానికంటే తక్కువగా ఉండే అవకాశముందని ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మంగళవారం నాటి విలేకరుల సమావేశంలో చెప్పారు. ఆశాభావం వ్యక్తం చేశారు. కోవిడ్–19 కారణంగా మంగళవారం నాటికి అమెరికాలో సుమారు 12,700 మంది ప్రాణాలు కోల్పోగా, సోమవారం నుంచి మంగళవారం వరకూ మాత్రమే 1,900 మంది మరణించినట్లు గణాంకాలు చెబుతున్నాయి. వైరస్ బారిన పడ్డ వారి సంఖ్య అత్యధికంగా నాలుగు లక్షలకు చేరుకుంటూండగా ఒక్క న్యూయార్క్ నగరంలోనే 5,400 మంది మరణించారు, 1.38 లక్షల మంది వ్యాధి బారిన పడ్డారు. న్యూజెర్సీలో 1,200 మంది ప్రాణాలు కోల్పోగా, 44,416 మంది కోవిడ్ కోరల్లో చిక్కుకున్నారు. నిలకడగా బ్రిటన్ ప్రధాని ఆరోగ్యం కోవిడ్ లక్షణాలు తీవ్రం కావడంతో ఐసీయూలో చేరిన బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ పరిస్థితి ఇప్పుడు నిలకడగా ఉందని, చికిత్సకు స్పందిస్తున్నారని అధికార వర్గాలు బుధవారం తెలిపాయి. బోరిస్ జాన్సన్ అధికారిక కార్యకలాపాలు చేపట్టకపోయినప్పటికీ అధికారులతో మాట్లాడుతున్నారు. భారత్ నుంచి 2.9 కోట్ల హైడ్రాక్సీ క్లోరోక్విన్ డోసులు కోవిడ్–19 పేషెంట్లకు వినియోగించేందుకు భారత్ నుంచి 2.9 కోట్ల హైడ్రాక్సీ క్లోరోక్విన్ డోస్‌లను కొనుగోలు చేశామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. ‘భారత ప్రధాని మోదీతో మాట్లాడాను. హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ను పంపగలరా? అని అడిగాను. ఆయన చాలా గొప్పవాడు. చాలా మంచివాడు’ అని ఫాక్స్ న్యూస్‌తో ట్రంప్ వ్యాఖ్యానించారు. అమెరికాకు హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ను ఎగుమతి చేసేందుకు భారత్ మంగళవారం అంగీకరించిన విషయం తెలిసిందే. -
ఐసీయూలో ప్రధాని.. కోలుకోవాలని చప్పట్లు!
లండన్ : కరోనా వైరస్ మహమ్మారితో బాధపడుతున్న బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ (55)ను లండన్ ఆస్పత్రిలో ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్న విషయం తెలిసిందే. వ్యాధి తీవ్రత ఎక్కువ కావడంతో గత సోమవారం వైద్యులు ఆయన్ను ఐసీయూకు తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది. జాన్సన్ ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని ఆయనలో ఎలాంటి న్యుమోనియా లక్షణాలు కనిపించలేదని ప్రధాని కార్యాలయం మంగళవారం వెల్లడించింది. కాగా, బోరిస్‌ను ఐసీయూకు తరలించారనే వార్తలు వెలువడగానే బ్రిటన్‌తో సహా యావత్ ప్రపంచదేశాలు ఆయనకు సంఘీభావం తెలిపారు. జోరిస్ త్వరగా కోలుకోవాలని భారత ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, జపాన్ ప్రధాని షింజో అబే, ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్, రష్యా అధ్యక్షుడు పుతిన్, స్పెయిన్ ప్రధాని పెడ్రో శాంచెజ్ తదితరులు ఆకాంక్షించారు. ఇక బ్రిటన్ నెటిజన్లు సైతం బోరిస్‌కు సంఘీభావం తెలిపారు. బోరిస్ త్వరగా కోలుకోవాలని యూకే నెటిజన్లు ‘ క్లాప్స్ ఫర్ బోరిస్’(#ClapForBoris)కు పిలుపునిచ్చారు. బ్రిటన్ ప్రధానికి సంఘీభావంగా మంగళవారం రాత్రి 8 గంటలకు చప్పట్లు కొట్టాలని విజ్ఞప్తి చేశారు. ‘రాజకీయాలు పక్కన పెట్టి ప్రతి ఒక్కరు క్లాప్స్ కొట్టి బోరిస్ వెనుక మనం ఉన్నామనే భావనను చాటుదాం’ అంటూ నెటిజన్లు యూకే ప్రజలను కోరారు. #ClapForBoris అనే హ్యాష్ ట్యాగ్ పెట్టి వేలాది మంది నెటిజన్లు ట్వీట్లు చేశారు. దీంతో #ClapForBoris అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్‌గా మారింది. ఇక ‘క్లాప్ ఫర్ బోరిస్’కు భారీ స్పందన వచ్చింది. యూకే ప్రజలంతా బోరిస్‌కు సంఘీభావం తెలుపుతూ చప్పట్లు కొట్టారు. ‘ బోరిస్ మీరు కచ్చితంగా కరోనాను జయిస్తారు’, ‘కమాన్ బోరిస్.. మీ కోసం వేయిటింగ్’,‘ మీ వెనుక మేమంతా ఉన్నాం’ అని నెటిజన్లు బోరిస్‌కు మద్దతు తెలిపారు. Nice message from the Nason Ward team #CEOGlen @BorisJohnson https://t.co/E35N6C2GLb — George Eliot NHS (@GEHNHSnews) April 7, 2020 I've never felt this way about a politician before - this man has reached out to so many ppl in a rare way. Your majority and even many of your critics are rooting for you to win this battle, dear PM @BorisJohnson - the people care 💙💙💙 #ClapForBoris #PrayForBoris pic.twitter.com/IuIvHCVvaV — LizaUK (@LizaUK3) April 7, 2020 Come on Boris, u can get through this nightmare. #clapforboris https://t.co/gLQtvga4bc — Sumit Agarwal (@sumit_int) April 6, 2020 -
క్లాప్స్ ఫర్ బోరిస్..భారీ స్పందన