కరోనా అవతరించినప్పటి నుంచి ఐటీ కంపెనీల ఉద్యోగులతోపాటు చిన్న సంస్థల ఉద్యోగులు కూడా వర్క్ ఫ్రం హోం చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం కరోనా వ్యాప్తి కాస్తా తగ్గుముఖం పట్టినప్పటికీ ఇంకా కొన్ని కంపెనీలు తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోంనే సదుపాయాన్నే కొనసాగిస్తున్నారు. అయితే పలు కంపెనీలు తమ ఉద్యోగులను కార్యాలయాలకు వచ్చి పనిచేయాలని కోరుతున్నా..వర్క్ ఫ్రమ్ హోంకు అలవాటు పడిన అధికశాతం మంది ఉద్యోగులు ఆఫీస్‌లకు వచ్చి పనిచేసేందుకు విముఖత వ్యక్తం చేస్తున్నారు.
ఈ క్రమంలో తాజాగా కరోనా సమయంలో మొదలైన వర్క్ ఫ్రం హోం సంస్కృతిపై బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సస్ కీలక వ్యాఖ్యలు చేశారు. వర్క్ ఫ్రం హోం వల్ల ఉద్యోగుల అటెన్షన్ మారిపోతుందని అన్నారు. తనకూ ఇలాంటి అనుభవమే ఎదురైందని చెప్పుకొచ్చారు. ఇంటి దగ్గర ల్యాప్‌టాప్‌లో పనిచేసేటప్పుడు.. మధ్య మధ్యలో కాఫీ కోసమనో, టిఫిన్ కోసమనో లేచి వెళ్తుంటామని, తిరిగి ల్యాప్‌టాప్ వద్దకు వచ్చేసరికి చేస్తున్న పనేమిటో గుర్తుకు రాదని అన్నారు.
మళ్లీ కార్యాలయాలకు వచ్చి విధులు నిర్వహించాల్సిన అవసరం ఉందని బోరిస్ జాన్సన్ తెలిపారు. చుట్టూ మనతోటి ఉద్యోగులు ఉండటం వల్ల ఉత్పాదకత ఎక్కువ వస్తుందని, మరింత ఉత్సాహంతో పాటు కొత్త కొత్త ఐడియాలతో పనిచేసే అవకాశం ఉంటుందని బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ అన్నారు.
చదవండి: ప్రపంచంలోనే అత్యధికం.. రెండున్నరేళ్లలో 10 లక్షల మరణాలు
Comments
Please login to add a commentAdd a comment