work from home
-
సాఫ్ట్వేర్ ఉద్యోగుల ఇల్లు.. ఇదే కొత్త ట్రెండు!
సొంతిల్లు ప్రతి ఒక్కరి స్వప్నం.. దానికి తగ్గట్టుగానే ఇంటిని (homes) అభిరుచికి తగ్గట్లు నిర్మించుకోవడంతో పాటు సరికొత్త ఇంటీరియర్ (interior) ఏర్పాటు చేసుకుంటున్నారు. విల్లా, ఫ్లాట్, ఇండిపెండెంట్ హౌజ్ ఇలా ఏదైనా సరే.. కొత్తదనం కొట్టొచ్చినట్లు కనిపించేలా తీర్చిదిద్దుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు నగరవాసులు. ఇంట్లోకి అడుగు పెట్టగానే వావ్ అనిపించేలా హాల్, మోడ్రన్ కిచెన్, బెడ్రూమ్స్తో పాటు బాల్కనీని (balcony) ముస్తాబు చేసుకుంటున్నారు. కాఫీ కప్పుతో అలా బాల్కనీలోకి వెళ్తే మనసుకు హాయినిచ్చేలా మలుచుకుంటున్నారు. చాలామంది గ్రీనరీ ఫీల్ కోసం ప్రత్యేకంగా ఆర్టిఫిషియల్ లాన్ ఏర్పాటు చేసుకొని అందమైన మొక్కలతో అలంకరిస్తున్నారు. బాల్కనీ, పెంట్‌హౌస్ సైజును దృష్టిలో ఉంచుకొని కొన్ని సంస్థలు ప్రత్యేక డిజైన్లతో మైమరపిస్తున్నాయి.కరోనా కాలం తర్వాత నగరవాసులు ఎన్నో నూతన ఒరవడుల వైపు ఆసక్తి కనబరిచారు. ముఖ్యంగా సాఫ్ట్వేర్ ఉద్యోగులు (software employees) ఇలాంటి వాటికి అధికంగా మొగ్గుచూపారు. దీనికి ఓ కారణం ఉంది.. లాక్డౌన్ తర్వాత వర్క్ ఫ్రమ్ హోమ్ (work from home) కారణంగా అధిక సంఖ్యలో ఉద్యోగులు ఇళ్లలో ఉండటం, వర్క్ స్ట్రెస్ తగ్గించుకోవడం కోసం ఇంట్లో ఇంటీరియర్‌తో పాటు బాల్కనీ ఆహ్లాదకరంగా ఉండేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. వర్క్ మధ్యలో ఫ్యామిలీతో అలా బాల్కనీ, పెంట్‌హౌస్‌లో కూర్చొని సరదాగా కాసేపు గడిపి మళ్లీ పని చేసుకుంటున్నారు. నగరంలో వేగంగా విస్తరిస్తున్న రియల్ ఎస్టేట్ (real estate) వ్యాపారంతో సమానంగా ఇంటీరియర్, పలు థీమ్స్‌తో కొన్ని సంస్థలు రంగంలోకి దిగాయి. ఇప్పటి వరకు ఒకలా.. ఇప్పటి నుంచి మరోలా అనే విధంగా ముస్తాబు చేస్తున్నాయి. అపార్ట్మెంట్స్ బాల్కనీ.. అపార్ట్మెంట్ బాల్కనీ కొద్ది స్పేస్ అయినా వాటిని మరింత సుందరీకరణకు మొగ్గు చూపుతున్నారు. కొందరు వారికి నచ్చిన థీమ్స్‌తో డిజైన్ చేయించుకుంటారు. థీమ్ నేమ్స్, లైటింగ్ కొటేషన్స్, సేఫ్టీ కోసం ఇన్విజిబుల్ గ్రిల్స్, వాల్ ఆర్ట్‌ను ఎంచుకుంటున్నారు. వర్క్‌ఫ్రమ్ హోమ్ ఉన్న వారు బాల్కానీని ఆఫీస్ థీమ్స్‌తో పాటు పలు విభిన్న థీమ్స్‌తో సిటీ వ్యూ చూస్తూ డిజైన్స్ కోరుకుంటున్నారు. పిల్లలకు స్టడీస్ ఇంట్రెస్ట్ రావడానికి సరికొత్త డిజైన్స్ ఎంచుకుంటున్నారు. గ్రీనరీతో పాటు ఉన్న స్పేస్‌లో మొక్కలు, రెండు మూడు రకాల కూరగాయలు పెంచుతున్నారు. త్రీ బెడ్రూమ్స్లో ఒక బెడ్రూమ్లో కొత్త థీమ్స్‌కి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. విల్లాస్ కల్చర్ పెరిగింది. పెంట్‌హౌస్‌లో ఉన్న స్పేస్‌కి చాలా ఖర్చు పెడుతున్నారు. సిటీ వ్యూ కనబడేలా అవుట్ డోర్ స్విమ్మింగ్ పూల్, జెకూజీ, బార్ కౌంటర్, హోమ్ థియేటర్ తదితర సౌకర్యాలు ఏర్పాటు చేసుకుంటున్నారు.ఫ్యూచర్లో బాల్కనీ స్పేస్ పెరుగుతుంది విల్లాస్, అపార్ట్‌మెంట్స్‌లో ఇంటీరియర్‌కి ఎంతో ఖర్చు చేస్తున్నారు. అందులో భాగంగానే బాల్కనీని చేరుస్తున్నారు. ఫ్యూచర్లో బాల్కనీ స్పేస్ రెట్టింపు అవుతుంది. గ్రీనరీ, ఇంట్లోనే వెజిటబుల్స్ పెంచుకొనేలా ఉన్న స్పేస్‌తో కాకుండా కొత్త స్పేస్ ఇచ్చే ఆలోచన అపార్ట్మెంట్, గేటెడ్ కమ్యూనిటీలో వస్తోంది. వచ్చిన అతిథులు బాల్కనీ, పెంట్‌హౌస్ చూసి వావ్ అనేలా ఉండాలని కోరుకుంటున్నారు. వారు బాల్కనీ, పెంట్హౌస్లనే ఇష్టపడేలా డిజైన్ చేసుకుంటున్నారు. వర్క్‌ఫ్రమ్ హోమ్ ఉన్న వారు ఆఫీస్ థీమ్స్‌తో పాటు పలు విభిన్న థీమ్స్‌తో సిటీ వ్యూ ఉండేలా డిజైన్స్ కోరుకుంటున్నారు. పిల్లలకు స్టడీస్ పట్ల ఇంట్రెస్ట్ రావడానికి వారికి నచ్చినట్లు డిజైన్ చేస్తున్నారు. గ్రీనరీతో పాటు ఉన్న స్పేస్‌లో మొక్కలు, రెండు మూడు రకాల కూరగాయలు పెంచుతున్నారు. – హేమలత రామా, స్వర్గ బాల్కనీ మేకోవర్స్, సీఈఓ -
అమెరికాలో ప్రభుత్వ ఉద్యోగుల మెడపై వేలాడుతున్న ‘లే ఆఫ్’ కత్తి!
వాషింగ్టన్ : డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియెన్సీ (DOGE) సంయుక్త సారథులు బిలియనీర్ ఎలాన్ మస్క్, వివేక్ రామస్వామి అమెరికాలోని 20 లక్షల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు షాక్ ఇవ్వనున్నారు. వర్క్ ఫ్రమ్ హోమ్‌లో పనిచేస్తున్న ఉద్యోగులు ఇకపై వారానికి ఐదురోజులు ఆఫీస్‌కు రావాల్సిందేనని హెచ్చరికలు జారీ చేయనున్నారు. కాదు కూడదు అంటే అంటే వారిని తొలగించే దిశగా అడుగులు వేయనున్నట్లు వాల్ స్ట్రీట్ జర్నల్ కథనం వెలుగులోకి వచ్చింది.అమెరికా ప్రభుత్వం చేస్తున్న దుబారా ఖర్చుల్ని తగ్గించాలని ట్రంప్ ఆదేశాలతో మస్క్, వివేక్ రామస్వామిలు ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగా ప్రభుత్వ ఉద్యోగులు చేస్తున్న వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాన్ని రద్దు చేయనున్నారు. వారానికి ఐదురోజులు కార్యాలయాలకు వచ్చి పనిచేసేలా ఆదేశించనున్నారు.ఒకవేళ ఆఫీస్ నుంచి పనిచేయడాన్ని వ్యతిరేకించే ప్రభుత్వ ఉద్యోగులకు.. కోవిడ్-19 సమయంలో అమెరిన్ ట్యాక్స్ పేయర్స్ చెల్లించిన ప్రత్యేక చెల్లింపుల్ని నిలిపివేయనున్నట్లు వాల్ స్ట్రీట్ జర్నల్ తెలిపింది.ఇటీవల,వివేక్ రామస్వామి మాట్లాడుతూ.. ప్రభుత్వం చేస్తున్న భారీ దుబారా ఖర్చుల్ని తగ్గించే పనిలో ఉన్నాం. ఇందులో భాగంగా ప్రభుత్వ ఉద్యోగులతో బలవంతంగా రాజీనామా చేయించి వారి సంఖ్యను భారీగా తగ్గిస్తాం. దుబారా ఖర్చుల్ని తగ్గిస్తాం. తాము సైతం డోజ్‌లో ఫెడరల్ అధికారులు,ఉద్యోగులులా కాకుండా వాలంటీర్లుగా పనిచేస్తామని తెలిపారు. మీకు మస్క్ గురించి తెలుసో,లేదో.. ఆయన ఉలి తీసుకురాలేదు. రంపం తెచ్చారు. మేం దాన్ని బ్యూరోక్రసీపై వాడాలనుకుంటున్నాం’ అని వ్యాఖ్యానించినట్లు వాల్ స్ట్రీట్ జర్నల్ హైలెట్ చేసింది.కాగా,అమెరికాలోని ప్రముఖ ఎన్జీవో సంస్థ పార్ట్నర్షిప్ ఫర్ పబ్లిక్ సర్వీస్ నివేదిక ప్రకారం.. అమెరికాలో మొత్తం 20లక్షలమంది కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులున్నారు. 400పైగా ప్రభుత్వ సంస్థలు పనిచేస్తున్నాయి. ఈ మొత్తం ఉద్యోగుల్లో 80 శాతం మంది అమెరికా రాజధాని వాషింగ్టన్లో పనిచేస్తున్నారు. -
సగం మంది ఇంటి నుంచే పనిచేయండి
సాక్షి, న్యూఢిల్లీ: ఈ సీజన్లోనే అత్యంత చలిరాత్రిని చవిచూసిన ఢిల్లీవాసులు బుధవారం సైతం పొగచూరిన సూర్యోదయాన్నే ఆస్వాదించాల్సిన దుస్థితి దాపురించింది. హస్తినవాసుల చలి, వాయుకాలుష్య కష్టాలు మరింత పెరిగాయి. మంగళవారం రాత్రి 11.1 డిగ్రీ సెల్సియస్ అత్యల్ప ఉష్ణోగ్రత నమోదైందని భారత వాతావరణ శాఖ బుధవారం ప్రకటించింది. బుధవారం ఉదయం 9 గంటలకు ఢిల్లీలో వాయు నాణ్యతా సూచీ(ఏక్యూఐ) 426గా నమోదైందని కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి ప్రకటించింది. దీంతో కాలుష్య నియంత్రణ మండలి ఇంకా ‘తీవ్రం’ కేటగిరీనే కొనసాగిస్తోంది. కాలుష్యం కోరల్లో చిక్కిన ఢిల్లీలో ఇంకా జనం సొంత, ప్రజారవాణా వాహనాల్లో తిరిగితే కాలుష్యం మరింత పెరగొచ్చన్న ఆందోళనలు ఎక్కువయ్యాయి. రోడ్లపై జనం రద్దీని తగ్గించే ఉద్దేశ్యంతో ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల్లో సగం మంది ఇంటి నుంచే పని(వర్క్ ఫ్రమ్ హోం)చేయాలని ఆమ్ ఆద్మీ సర్కార్ సూచించింది. అయితే అత్యయక సేవల విభాగాలైన ఆరోగ్యం, పారిశుద్ధ్యం, నీటిపారుదల, అగ్నిమాపకదళం, పోలీసులు, విద్యుత్, విపత్తు స్పందన దళం వంటి విభాగాల సిబ్బందికి ఈ వర్క్ ఫ్రమ్ హోం నిబంధన వర్తించదు.ప్రస్తుతం ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వంలో దాదాపు 80 శాఖలు, విభాగాల్లో మొత్తంగా 1.4 లక్షల మంది సిబ్బంది ఉన్నారు. ‘‘ ప్రభుత్వ సిబ్బందితోపాటు పరిశ్రమలు, ప్రైవేట్ సంస్థలు సైతం 50 శాతం మందిని ఇంటి నుంచే పనిచేయిస్తే మంచిది. మీ వంతుగా నగరంలో వాయుకాలుష్యాన్ని తగ్గించినవారవతారు. ఉదయం 10.30 గంటల నుంచి 11 గంటల మధ్య పనివేళలను కొద్దిగా మార్చండి. దీంతో ఆఫీస్వేళల్లో రోడ్లపై వాహనాల రద్దీ తగ్గి కాలుష్యం కాస్తయినా మటుమాయం కావొచ్చు’’ అని ఢిల్లీ రాష్ట్ర పర్యావరణ శాఖ మంత్రి గోపాల్ రాయ్ ‘ఎక్స్’ వేదికగా కోరారు. ‘‘ ఎక్కువ మంది సిబ్బంది రాకపోకల కోసం ప్రైవేట్ సంస్థలు షటిల్ బస్సు సేవలను వినియోగించుకోవాలి. ఢిల్లీ ప్రభుత్వం సైతం గవర్నమెంట్ ఉద్యోగుల కోసం ఇదే నియమాన్ని అమలుచేస్తోంది’’ అని రాయ్ సూచించారు. ఈ సందర్భంగా పొరుగురాష్ట్రాలను పాలిస్తున్న బీజేపీపై విమర్శలు గుప్పించారు. ‘‘ ఢిల్లీ చుట్టూతా బీజేపీపాలిత రాష్ట్రాలే ఉన్నాయి. ఢిల్లీ పొరుగున ఉన్న ఉత్తరప్రదేశ్, హరియాణా, రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలు తమ వంతుగా కాలుష్యాన్ని తగ్గించడంలో పూర్తిగా విఫలమయ్యాయి. మా సర్కార్ అనుసరిస్తున్న కాలుష్య నివారణ విధానాలనే మీరూ ఆచరించండి’ అని రాయ్ హితవుపలికారు.కొనసాగుతున్న గ్రేప్–4 నిబంధనకాలుష్యం ఏమాత్రం తగ్గకపోవడంతో సోమవారం అమలుచేసిన నాల్గవ గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్(గ్రేప్)ను ఢిల్లీ ప్రభుత్వం ఇంకా కొనసాగిస్తోంది. గ్రేప్–4 నియమాల్లో భాగంగా ఢిల్లీ పరిధిలో నిర్మాణ, కూల్చివేత కార్యకలాపాలపై నిషేధం కొనసాగుతోంది. స్కూళ్లను మూసేశారు. డీజిల్‌తో నడిచే మధ్యస్థాయి, భారీ రవాణా వాహనాలను ఢిల్లీలోనికి అనుమతించట్లేరు. పాఠశాల ఢిల్లీలో ఉదయం చాలా ప్రాంతాల్లో అరకిలోమీటర్లోపు ఉన్నవి కూడా కనిపించనంతగా మంచు దుప్పటి కప్పేసింది. రన్‌వే సరిగా కనిపించని కారణంగా ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానాల ల్యాండింగ్, టేకాఫ్ కష్టంగా మారింది. పలు విమానాలు చాలా ఆలస్యంగా నడుస్తున్నాయి. రైళ్ల ఆలస్యం సరేసరి. చలి, తీవ్ర కాలుష్యం కారణంగా చిన్నారులు, వృద్ధులు కళ్ల మంటలు, శ్వాస సంబంధ ఇబ్బందుల్ని ఎదుర్కొన్నారు. వాయు నాణ్యతా సూచీని గణించే ఢిల్లీలోని 38 మానిటరింగ్ స్టేషన్లలోనూ పరిస్థితి ఇంకా రెడ్‌జోన్‌లోనే కొనసాగుతోంది. ఆదివారం ఢిల్లీలో వాయునాణ్యత మరీ దారుణంగా పడిపోయి ‘సివియర్ ప్లస్’గా రికార్డవడం తెల్సిందే. దీంతో సోమవారం నుంచి గ్రేప్–4ను అమల్లోకి తెచ్చారు. ప్రతి ఏటా చలికాలంలో ఉష్ణోగ్రతలు తగ్గి కాలుష్యవాయు గాఢత అలాగే కొనసాగుతుండటంతో ఢిల్లీ వాసుల వాయుకష్టాలు పెరుగుతుండటంతో 2017 ఏడాది నుంచి ఈ గ్రేప్ నిబంధనలను అమలుచేస్తున్నారు. -
ఆఫీస్‌కు రండి.. లేదా కంపెనీ మారండి!
ఇంటి నుంచి పనిచేసే ఉద్యోగులకు అమెజాన్ ఇకపై పూర్తిగా ఆఫీస్ నుంచి పని చేయాలని ఆదేశాలు జారీ చేసింది. జనవరి, 2025 నుంచి వారానికి ఐదు రోజులు కార్యాలయం నుంచే పని చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు అమెజాన్ వెబ్ సర్వీసెస్(ఏడబ్ల్యూఎస్) సీఈఓ మాట్ గార్మాన్ స్పష్టం చేశారు. కంపెనీ వృద్ధి కోసం విభిన్న ఆలోచనలు పంచుకునేందుకు ఉద్యోగుల వ్యక్తిగత సహకారం అవసరమని తెలిపారు.పదిలో తొమ్మిది మంది ఓకేఈ సందర్భంగా గార్మాన్ మాట్లాడుతూ..‘కంపెనీ వృద్ధికి ఉద్యోగులు సహకరించాలి. ఇప్పటి వరకు చాలామంది ఇంటి నుంచి పని చేస్తున్నారు. ఇకపై ఈ విధానం మారనుంది. 2025, జనవరి నుంచి ఉద్యోగులు పూర్తిగా కార్యాలయం నుంచే పని చేయాల్సి ఉంటుంది. ఈ చర్య సంస్థ ప్రతిష్టాత్మక లక్ష్యాలను సాధించడంలో సహాయపడుతుందని నమ్ముతున్నాం. కంపెనీ తీసుకున్న ఈ నిర్ణయానికి కట్టుబడని వారు ఇతర సంస్థల్లో చేరవచ్చు. పూర్తి సమయం పని చేసేందుకు ఇష్టపడని ఉద్యోగుల కోసం ఇతర కంపెనీలు వారి అవసరాలకు బాగా సరిపోయే పని వాతావరణాన్ని అందించవచ్చు. చాలా మంది ఉద్యోగులు మార్పుకు మద్దతు ఇస్తున్నారు. నేను మాట్లాడిన పది మంది ఉద్యోగుల్లో తొమ్మిది మంది కంపెనీ నిర్ణయానికి అనుకూలంగా ఉన్నారు’ అని గార్మాన్ స్పష్టం చేశారు.ఇదీ చదవండి: మస్క్‌పై ట్రంప్ ప్రశంసల జల్లు: ఆయనో మేధావి అంటూ..ఉత్పాదకత పెరుగుతున్నట్లు ఆధారాలు లేవుఇదిలాఉండగా, చాలా మంది అమెజాన్ ఉద్యోగులు కంపెనీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఐదు రోజులు కార్యాలయంలో పని చేసేందుకు తాము సిద్ధంగా లేమన్నారు. ఆఫీస్‌లో పని చేయడం ద్వారా ఉత్పాదకత మెరుగవుతుందనడానికి స్పష్టమైన ఆధారాలు లేవన్నారు. కార్యాలయానికి వెళితే అనవసరమైన ప్రయాణ సమయం, ఒత్తిడి పెరుగుతుందన్నారు. ఇప్పటి వరకు అమెజాన్ తన ఉద్యోగులను వారానికి మూడు రోజులు కార్యాలయంలో పని చేయాలని కోరింది. కొంతమంది ఉద్యోగులు ఇప్పటికీ ఈ విధానాన్ని వ్యతిరేకిస్తున్నారు. గూగుల్, మెటా, మైక్రోసాఫ్ట్ వంటి టెక్ దిగ్గజాలు తమ ఉద్యోగులను వారానికి రెండు లేదా మూడు రోజులు ఆఫీసు నుంచి పని చేయడానికి అనుమతించింది. ఈ విధానాన్ని కాదని అమెజాన్ ఐదు రోజులు ఆఫీస్‌కు రమ్మనడం తగదని కొందరు ఉద్యోగులు అభిప్రాయపడుతున్నారు. -
టెకీ.. ఆరోగ్యం రిస్కీ..
ఎండ కన్నెరుగని శరీరాలు ఎండ్లెస్ సమస్యల చిరునామాలుగా మారుతున్నాయి. ఆరు అంకెల జీతాలు అందుకునే జీవితాలు అనారోగ్యాలకు గురవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఐటీ ఉద్యోగుల ఆరోగ్య పరిస్థితులపై ఆందోళన పెరుగుతోంది. దీనికి పని ఒత్తిడి కారణం ఒకటైతే.. హైబ్రిడ్, వర్క్ ఫ్రమ్ హోం సైతం మరో కారణంగా పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ఈ ఆదోళన నేపథ్యంలో పలు కంపెనీలు.. కార్యాలయ ఆవరణల్లో మార్పులకు కారణమవుతున్నాయి. నగరంలో దాదాపు తొమ్మిది లక్షల మంది పైగా ఐటీ ఉద్యోగులు ఉన్నారు. వీరు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను నడిపించే చోదకశక్తిగా మారినప్పటికీ ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోలేకపోతున్నారు. తద్వారా రానున్న సంవత్సరాల్లో 30 ఏళ్లు 40 ఏళ్ల వయస్సు ఉద్యోగుల్లో నాన్–కమ్యూనికబుల్ డిసీజెస్ (ఎన్సిడి)లో భారీ పెరుగుదల కనిపించనుంది. నగరానికి చెందిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ (ఎన్ఐఎన్) పరిశోధకులు మాదాపూర్‌లోని హైటెక్ సిటీలోని ఐటీ సెక్టార్లో ఇటీవల వర్క్‌ప్లేస్ వెల్నెస్ స్టడీ వెల్లడించిన విషయం ఇది. ఈ అధ్యయనం న్యూట్రియెంట్స్ జర్నల్‌లో ప్రచురితమైంది. అంతర్గత అధ్యయనాల్లోనూ.. ఇదే విధంగా పలు సంస్థలు నిర్వహిస్తున్న అంతర్గత అధ్యయనాల్లోనూ ఇలాంటి ఫలితాలే వస్తున్నాయి. ఎస్ఓఐ హెల్త్‌కేర్ అనే ఒక వెల్నెస్ సంస్థ జరిపిన అధ్యయనంలో అత్యధికంగా టెక్ ఉద్యోగులు మెడనొప్పి, హైపర్ టెన్షన్, లోయర్ బ్యాక్ పెయిన్, సరై్వకల్ స్పాండిలైటిస్‌తో బాధపడుతున్నారని తేల్చింది. అలాగే కార్పల్ టన్నెల్ సిండ్రోమ్.. అనే చేతులకు సంబంధించిన సమస్యతో, లోయర్ బ్యాక్‌కి కాళ్లకు కలిపి నొప్పులు అందించే సాక్రోలియక్ జాయింట్ డిస్ఫంక్షన్తో పలువురు ఇబ్బంది పడుతున్నారని స్పష్టం చేసింది. టెక్నోపార్క్ అంతర్గతంగా చేయించుకున్న అధ్యయనం ఇది. ఫలితం అంతంతే.. గత ఐదు సంవత్సరాల్లో, చురుకైన జీవితం ద్వారా ఆరోగ్యవంతమైన జీవనాన్ని ప్రోత్సహించడంలో అనేక స్వచ్ఛంద సంస్థలు, కంపెనీల హెచ్ఆర్ విభాగాలతో కలిసి పాలుపంచుకుంటున్నాయి. అయినప్పటికీ కరోనా కారణంగా చాలా మంది ఉద్యోగులు మరింత నిశ్చల జీవనశైలికి అలవాటు పడ్డారని ఐటీ రంగ నిపుణులు అంటున్నారు. ‘చురుకైన జీవనశైలిని అలవర్చుకునే విషయంలో కొన్ని సంవత్సరాలుగా సానుకూల మార్పులు కనిపిస్తున్నాయి. జిమ్‌లో వర్కవుట్ చేయడం, రన్నింగ్, యోగా సెషన్లు, నడకలను ప్రోత్సహిస్తూ, ఆరోగ్యకరమైన జీవనంపై అవగాహనా సదస్సులు నిర్వహిస్తున్నాం. అయితే, ఇంకా చాలా పనులు చేయాల్సి ఉంది’ అని హైదరాబాద్ రన్నర్స్ వ్యవస్థాపక అధ్యక్షుడు రాజేష్ వెచ్చా చెబుతున్నారు.ఒత్తిడి ఫుల్.. శ్రమ నిల్.. నగర ఐటీ రంగంలో నిమగ్నమైన ఉద్యోగుల్లో ఎక్కువ మంది నిశ్చల జీవనశైలి కావడంతో శారీరక శ్రమ తక్కువ. మరోవైపు తీవ్ర పని ఒత్తిడి. ఈ కారణంగా సాఫ్ట్వేర్ ఉద్యోగులు గుండె జబ్బులు, రక్తపోటు, మధుమేహం, పక్షవాతం, దీర్ఘకాలిక కిడ్నీ, గుండె సంబంధిత సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితులు కొనసాగితే 26 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల మధ్య వయసు్కల్లో మెటబాలిక్ సిండ్రోమ్ (ఎంఇటీఎస్)కు అంతిమంగా నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్‌కు దారితీసే అవకాశం ఉందని అధ్యయనం హెచ్చరించింది. మగవారిలో 90 సెం.మీ లేదా అంతకంటే ఎక్కువ, మహిళల్లో 80 సెం.మీ లేదా అంతకంటే ఎక్కువ నడుము చుట్టుకొలత, ట్రైగ్లిజరైడ్స్ (టీజీ) స్థాయిలు 150 మి.గ్రా/డీఎల్ లేదా అంతకంటే ఎక్కువ, హై డెన్సిటీ లైపోప్రొటీన్ స్థాయి వంటివి ప్రమాద సంకేతాలుగా హెచ్చరించింది. ఆ అలవాట్లతో చేటు.. రోజుకు సగటున ఎనిమిది గంటలపైనే కూర్చుని ఉంటున్నారు. ఇదే కాకుండా తరచూ బయట, రెస్టారెంట్స్‌లో తినడం, వేళలు పాటించకపోవడం, తాజా పండ్లు, కూరగాయల వినియోగం స్వల్పంగా ఉండడం, పని ఒత్తిడితో తరచూ భోజనాన్ని మానేయడం, ఎయిర్ కండిషన్డ్ గదుల్లో ఉండడం.. వంటివి హానికరంగా మారుతున్నాయి. మొత్తం ఐటి ఉద్యోగుల్లో 20శాతం మంది మాత్రమే వారానికి 150 నిమిషాల పాటు శారీరక శ్రమ చేస్తున్నారు. మరోవైపు వర్చువల్ వర్క్ వారి పాలిట హానికరంగానే పరిణమిస్తోంది. వర్క్ ఫ్రమ్ హోమ్ కల్చర్ మానసిక, శారీరక ఆరోగ్యానికి సమస్య తెచ్చిపెడుతోంది. ఈ నేపథ్యంలో కంపెనీలు దిద్దుబాటు చర్యలు ముమ్మరం చేసినట్టు తెలుస్తోంది.వాటిలో కొన్ని.. 👉వర్క్ ఫ్రమ్ హోమ్ ద్వారా సమస్యలు వస్తున్నప్పటికీ చాలా మంది దాన్నే ఎంచుకున్నారని ఈ పరిస్థితుల్లో పలు సంస్థలు ఉద్యోగిని బట్టి ఉద్యోగాన్ని, వర్క్‌ప్లేస్‌ని డిజైన్ చేసే ఎర్గోనామిక్స్‌ను పరిచయం చేస్తున్నాయి. 👉 ప్రతి 10 నిమిషాలకూ ఒకసారి కళ్లు బ్లింక్ చేయాలి లేదా సిస్టమ్ నుంచి బ్రేక్ తీసుకోవాలని టీసీఎస్ నోటిఫికేషన్స్ ఇస్తోంది. 👉 టెక్నోపార్క్ కంపెనీ.. తమ ప్రాంగణంలో వాక్ వే, యోగా సెంటర్స్.. వంటివి ఏర్పాటు చేసింది. అలాగే ఓపెన్ జిమ్, జాగింగ్ ట్రాక్, ఫుట్ బాల్ టర్ఫ్ వంటివి ప్లాన్ చేస్తోంది. 👉 కాలుష్యరహిత స్మార్ట్ బైక్స్‌ను ఇన్ఫోపార్క్ అందిస్తోంది. అలాగే వాటర్ ఫ్రంట్ వాక్ వే, జాగింగ్ ట్రాక్, స్విమ్మింగ్ పూల్ సైతం ప్లాన్ చేస్తోంది. 👉 జుంబా క్లాసెస్ నిర్వహిస్తున్న సైబర్ పార్క్.. త్వరలో ఫుట్ బాల్ టర్ఫ్ ఏర్పాటు చేయనుంది. -
రిటర్న్ టు ఆఫీస్.. ‘నచ్చకపోతే వెళ్లిపోవచ్చు’
ఇంటి నుంచి పనిచేసే విధానానికి దాదాపు అన్ని కంపెనీలు ఇప్పటికే ముగింపు పలికేశాయి. కొన్ని కంపెనీలు వారంలో కొన్ని రోజులు ఇంటి నుంచి ఇంకొన్ని రోజులు ఆఫీస్ నుంచి పనిచేసే హైబ్రిడ్ విధానాన్ని అనుసరిస్తున్నాయి. ఇప్పుడు ఆ పద్ధతికీ మంగళం పాడేసి పూర్తిగా రిటర్న్ టు ఆఫీస్ విధానాన్ని అమలు చేయడం ప్రారంభించాయి.ప్రపంచ టెక్నాలజీ దిగ్గజమైన అమెజాన్ కూడా ఇటీవల వారానికి 5-రోజుల ఇన్-ఆఫీస్ విధానాన్ని ప్రకటించింది. అయితే దీనిపై ఉద్యోగులు గుర్రుగా ఉన్నారు. వివాదాస్పదమైన ఈ విధానాన్ని అమెజాన్ టాప్ ఎగ్జిక్యూటివ్ ఒకరు తాజాగా సమర్థించారు. దీనికి మద్దతు ఇవ్వని వారు మరొక కంపెనీకి వెళ్లిపోవచ్చని చెప్పారు.ఇదీ చదవండి: ఉద్యోగులను తొలగిస్తున్న మెటా..అమెజాన్ ఏడబ్ల్యూఎస్ ఆల్-హ్యాండ్ మీటింగ్‌లో ఆ యూనిట్ సీఈవో మాట్ గార్మాన్ ప్రసంగిస్తూ.. తాను పది మందితో మాట్లాడితే వారిలో తొమ్మిది మంది జనవరిలో అమలులోకి వచ్చే కొత్త విధానానికి మద్దతుగా మాట్లాడారని చెప్పారు. కొత్త విధానం నచ్చని వారు నిష్క్రమించవచ్చని ఆయన సూచించారని రాయిటర్స్ పేర్కొంది.అమెజాన్ ప్రస్తుతం మూడు రోజుల ఇన్-ఆఫీస్ విధానాన్ని అమలు చేస్తోంది. అయితే సీఈవో ఆండీ జాస్సీ గత నెలలో ఐదు రోజుల ఇన్-ఆఫీస్ విధానాన్ని ప్రకటించారు. దీంతో అనేకమంది ఉద్యోగులు తీవ్ర అసంతృప్తికి గురవుతున్నారు. కొంతమంది అయితే స్వచ్ఛంద రాజీనామాలకు దిగుతున్నట్లు చెప్పారు. గూగుల్, మెటా, మైక్రోసాఫ్ట్ వంటి తోటి టెక్నాలజీ కంపెనీలు రెండు-మూడు రోజుల ఇన్-ఆఫీస్ పాలసీలను అమలు చేస్తుండగా అమెజాన్ మరో అడుగు ముందుకేసి పూర్తిగా ఐదు రోజుల ఇన్-ఆఫీస్ పాలసీ అమలుకు సిద్ధమైంది. -
కదలకపోతే కదల్లేరు
కూర్చుని కదలకుండా చేసే ఉద్యోగాలు (సిట్టింగ్ జాబ్స్) ప్రాణాంతకంగా మారుతున్నాయనే హెచ్చరికలు ఆందోళన కలిగిస్తున్నాయి. రోజూ కార్యాలయం లేదా ఇంట్లో కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు, డెస్్కటాప్ల ముందు ఐటీ ఉద్యోగులు కూర్చుని పనితో కుస్తీ పట్టడం సాధారణమైంది. ఉదయం నుంచి సాయంత్రం దాకా ప్రభుత్వ కార్యాలయాలు మొదలు వివిధ ప్రైవేట్ ఉద్యోగులు కూడా అత్యధిక సమయం డెస్క్‌లు, ఫైళ్ల ముందు గడపడం తెలిసిందే. కార్యాలయ ఉద్యోగాలు, వర్క్ ఫ్రం హోం ఉద్యోగాలతో అధిక శాతం ఉద్యోగులు టేబుళ్ల ముందు కూర్చుని నిర్వహిస్తున్న విధులతో ఈ ముప్పు పెరుగుతున్నట్టు అంచనా వేస్తున్నారు. ఒకేచోట కొన్ని గంటల పాటు కదలకుండా కూర్చుంటే రక్తప్రసారం జరగక ‘డీప్ వీన్ త్రొంబోసిస్’(డీవీటీ)కు దారితీయొచ్చని వైద్యులు హెచ్చరిస్తున్నారు.డీవీటీ వంటి పెను ఆరోగ్య సమస్యతో పాటు రక్తపోటు, మధుమేహం, వెన్నెముక, కీళ్ల నొప్పులు, మానసిక కుంగుబాటు, ఆందోళన, మెటబలైజ్ ఫ్యాట్ తదితర సమస్యలు తప్పవని వారు స్పష్టం చేస్తున్నారు. రోజంతా కార్యాలయం పనిలో, ఇతరత్రా ఎంతగా పని ఒత్తిళ్లను ఎదుర్కొన్నా.. రోజుకు కనీసం 40 నిమిషాల పాటు ఓ మోస్తరు వ్యాయామం, నడక లాంటి వ్యాపకాలతో మంచి ఫలితాలు వస్తాయని నిపుణులు వివరిస్తున్నారు. రోజులో ఎక్కువ గంటల పాటు ఒకేచోట కూర్చుని పనిచేయడం వల్ల ఎదురయ్యే ప్రతికూల అంశాలు, సమస్యలను ఎదుర్కొనేందుకు వ్యాయామమే మంచి ఉపయోగమని సూచిస్తున్నారు. కూర్చుని చేసే ఉద్యోగాల వల్ల ఎదురయ్యే దుష్ఫలితాలు, అనారోగ్య సమస్యలకు సంబంధించి నిర్వహించిన వివిధ పరిశీలనను ‘మెటా అనాలిసిస్’చేశారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) మార్గదర్శకాలకు అనుగుణంగా.. మెరుగైన ఆరోగ్యం కోసం రోజువారీ జీవనవిధానాన్ని కొంత మార్చుకుని, దినచర్యలో వ్యాయామం (ఫిజికల్ యాక్టివిటీ) చేర్చితే మెరుగైన ఫలితాలు వస్తాయని అంచనా వేస్తున్నారు. ఇందుకు అనుగుణంగా.. ‘బ్రిటిష్ జర్నల్ ఆఫ్ స్పోర్ట్స్ మెడిసిన్’ప్రచురితమైన అధ్యయనంలో పలు విషయాలు వెల్లడయ్యాయి.– సాక్షి, హైదరాబాద్ముఖ్యాంశాలు.. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లోని 45 వేల మందిపై ఆయా అంశాల వారీగా జరిపిన పరిశీలనలో వివిధ అంశాలపై స్పష్టత వచ్చింది, రోజులో ఒకేచోట కూర్చుని పనిచేసే ఉద్యోగుల్లో.. రోజుకు కనీ సం 40 నిమిషాల పాటు వ్యాయామం, ఇతర శారీరక శ్రమ వల్ల.. సుదీర్ఘగంటల పాటు కూర్చుని పనిచేయడంతో కలిగే దుష్ఫలితాలను అధిగమించవచ్చునని స్పష్టమైంది. రోజులో దాదాపు పది గంటల పాటు కూర్చుని పనిచేయడం వల్ల ఎదురయ్యే అనారోగ్య సమస్యలు, ఇతర ఇబ్బందులను వ్యాయామంతో దూరం చేయొచ్చునని అంచనా వేస్తున్నారు. ప్రపంచ ఆరోగ్యసంస్థ (2020 గ్లోబల్ గైడ్‌లైన్స్).. వారానికి 150–300 నిమిషాలలోపు ఓ మోస్తరు, 75 నుంచి 150 నిమిషాల దాకా ఒకింత ఉధృతమైన వ్యాయామం (విగరస్–ఇంటెన్సిటీ ఫిజికల్ యాక్టివిటీ) చేయాలని సిఫార్సు చేసింది. దైనందిన కార్యక్రమాల్లో మార్పులు చేసుకోవడం, స్వల్ప వ్యాయామం, లిఫ్ట్‌కు బదులు మెట్లను ఉపయోగించడం, ఇంట్లో పిల్లలతో ఆడుకోవడం వంటి వాటితో ఉపశమనం పొందవచ్చని ఈ అధ్యయనం చెబుతోంది. కార్యాలయం లేదా ఇళ్ల నుంచి పనిచేసేపుడు ఒకేచోట చైతన్యరహితంగా గడపకుండా చురుకుగా వ్యవహరించాల్సిన అవసరాన్ని స్పష్టం చేస్తోంది. వరుసగా ఎన్ని గంటల పాటు ఒకేచోట లేవకుండా పనిచేయడం వల్ల ఏయే రకాల ఆరోగ్య సమస్యలు వస్తాయనే దానిపై మాత్రం మరింత లోతైన పరిశోధన జరగాల్సిన అవసరం ఉందని భావించడం గమనార్హం.సమస్యలివే.. ∙ఒకరోజులో ఎక్కువ గంటల పాటు కూర్చునే ఉండడం, కార్యాలయంలో పని చేయడం వల్ల కదలికలు లేని కారణంగా కాళ్లలో రక్తం, ద్రావకాలు ఒకేచోట చేరడం వల్ల గుండెజబ్బులకు కారణమౌతుంది. ∙ఇది రక్తప్రసారంలో మార్పులకు కారణమై రక్తపోటుకు దారితీయడంతో పాటు రక్తంలో చక్కెర నియంత్రణలు మారే అవకాశాలు పెరుగుతాయి.∙ఎక్కువసేపు ఒకేచోట కూర్చోవడం వల్ల మధుమేహ సమస్య పెరుగుదలకు దారితీస్తుంది. అధిక గంటలు కూర్చోవడం వంటి వాటి వల్ల కొన్నిరకాల కేన్సర్లకు కారణం కావొచ్చు. ∙రోజులో చాలాగంటలు కూర్చుని ఉండడం వల్ల మానసిక ఒత్తిళ్లు పెరగడంతో పాటు ఆందోళనలు, చిరాకు పెరిగే అవకాశాలున్నాయి. ∙అధిక సమయం సిట్టింగ్ వల్ల వాస్తవ వయసు కంటే ముందుగానే వయసు మీదపడిన భావనకు దారితీస్తుంది. ఏం చేయాలి? ∙పనిచేస్తున్నపుడు మధ్యమధ్యలో లేచి నిల్చోవాలి ∙కొంత దూరం అటు ఇటు నడవాలి.∙చేస్తున్న పని నుంచి కొంతసేపు విరామం తీసుకోవాలి. ∙కూర్చునే పనిచేయకుండా.. వీలును బట్టి నిల్చోవాలి. -
వర్క్ ఫ్రమ్ హోమ్ రొటీన్ కాదు.. ఇక వచ్చేయండి..
వర్క్ ఫ్రమ్ హోమ్ సంస్కృతికి ప్రపంచవ్యాప్తంగా దాదాపు అన్ని కంపెనీలు స్వస్తి పలుకుతున్నాయి. తాజాగా టెక్ దిగ్గజం డెల్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ సేల్స్ టీమ్ ఉద్యోగులను సెప్టెంబరు 30 నుండి ఆఫీస్‌లకు వచ్చేయాలని ఆదేశించింది. వారానికి ఐదు రోజులూ ఆఫీస్ నుంచే పనిచేయాలని డెల్ ఉద్యోగులను కోరిందని దీనికి సంబంధించిన మెమోను తాము చూసినట్లు రాయిటర్స్ పేర్కొంది.ఉద్యోగులకు సహకార వాతావరణాన్ని ఏర్పాటు చేయడం, నైపుణ్యాలను పెంపొందించుకోవడం కోసమే ఈ మార్పు చేస్తున్నట్లు డెల్ తెలిపింది. ఇందుకోస టీమ్ ఆఫీస్‌లో ఉండాల్సిన అవసరం ఉందని మెమో పేర్కొంది. "రిమోట్‌గా పని చేయడం అన్నది మినహాయింపుగా ఉండాలి. రొటీన్ కాకూడదు" అని జోడించింది.మెమో ప్రకారం.. సేల్స్ టీమ్‌లోని ఫీల్డ్ ప్రతినిధులు వారానికి ఐదు రోజులు కస్టమర్లు, భాగస్వాములతో లేదా కార్యాలయంలో పనిచేయాల్సి ఉంటుంది. గతంలో వీరు వారానికి మూడు రోజులు కార్యాలయం నుండి పని చేయాల్సి ఉండేది. ఇక ఆఫీస్‌కు వచ్చేందుకు సాధ్యపడని సేల్స్ టీమ్ సభ్యులు రిమోట్‌గానే పని చేయవచ్చని అని డెల్ వెల్లడించింది.కోవిడ్ మహమ్మారి విజృంభణ సమయం నుండి చాలా కంపెనీలు ఉద్యోగులను ఇంటి నుండి పని చేయడానికి అనుమతించాయి. అయితే, కొన్ని టెక్ సంస్థలు, ఇప్పుడు ఉద్యోగులతో వారంలో రెండు నుండి మూడు రోజులు ఆఫీస్‌ల నుంచి పని చేయిస్తున్నాయి. వచ్చే ఏడాది నుంచి వారానికి ఐదు రోజులు కంపెనీ కార్యాలయాలలో పని చేయాలని గత వారం ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ తమ ఉద్యోగులకు ఆదేశాలను జారీ చేసింది. -
ఆఫీస్‌కు రాకుంటే.. ఉద్యోగులకు విప్రో కొత్త కండీషన్!
ఉద్యోగులను ఆఫీస్‌లకు రప్పించడానికి దేశీయ ఐటీ దిగ్గజం విప్రో కొత్త కండీషన్ పెట్టింది. వర్క్ ఫ్రమ్ ఆఫీస్‌కు సంబంధించి నూతన విధానాన్ని అమలు చేస్తోంది. ఇందులో భాగంగా ఆఫీస్‌లో హాజరుకు ఉద్యోగుల లీవ్‌లకు లింక్ పెట్టింది. దీని ప్రకారం.. ఉద్యోగులు వారంలో కనీసం మూడు రోజులు ఆఫీస్‌లకు వచ్చి పనిచేయాలి. లేకుంటే లీవ్స్ వదులుకోవాల్సిందే..కొత్త వర్క్ ఫ్రమ్ ఆఫీస్ పాలసీ గురించి తెలియజేస్తూ సెప్టెంబర్ 2వ తేదీనే ఉద్యోగులకు ఈ-మెయిల్స్ పంపింది. ఈ పాలసీకి కట్టుబడి ఉండాలని ఆదేశించింది. మరోవైపు ఎవరికైనా వర్క్ ఫ్రమ్ హమ్ రిక్వెస్ట్‌లకు అనుమతి ఇచ్చి ఉంటే తక్షణమే వాటన్నింటినీ రద్దు చేసి వారానికి కనీసం మూడు రోజులు ఆఫీస్‌కి వచ్చేలా సూచించాలని హెచ్ఆర్ విభాగానికి కూడా ఆదేశాలు జారీ చేసినట్లు ‘మింట్’ కథనం పేర్కొంది.ఇదీ చదవండి: వచ్చే ఏడాది నుంచి పూర్తిగా ఆఫీస్ నుంచే పనివిప్రో అమలు చేస్తున్న కొత్త వర్క్ ఫ్రమ్ ఆఫీస్ పాలసీ ప్రకారం.. వారంలో మూడు రోజులు ఆఫీస్ హాజరు తప్పనిసరి. ఒక వేళ ఆఫీస్‌కి హాజరుకాకపోతే దాన్ని సెలవుగా పరిగణిస్తారు. అంటే వారంలో మూడు రోజులు ఆఫీస్‌కు రాకపోతే ఆ రోజులను సెలవుగా పరిగణించి ఆ మేరకు లీవ్స్ కట్ చేస్తారని ఓ ఉద్యోగిని ఉటంకిస్తూ మింట్ వివరించింది. అయితే ఈ నిర్భంధ హాజరు విధానం ప్రత్యేకంగా కొన్ని ప్రాజెక్టుల్లో ఉద్యోగులకు మాత్రమేనని, అందరికీ ఇది వర్తించదని చెబుతున్నారు. -
వచ్చే ఏడాది నుంచి పూర్తిగా ఆఫీస్ నుంచే పని
వర్క్ ఫ్రమ్ హోమ్ సంస్కృతికి దాదాపు అన్ని కంపెనీలు ముగింపు పలుకుతున్నాయి. అంతర్జాతీయ వ్యాపార దిగ్గజం అమెజాన్ కూడా దీనికి సంబంధించి తాజాగా ప్రకటన విడుదల చేసింది. వచ్చే ఏడాది నుంచి పూర్తిగా ఆఫీస్ నుంచే పని చేయాలని ఉద్యోగులను ఆదేశించింది.ఉద్యోగులు వారానికి ఐదు రోజులు ఆఫీస్‌కు వచ్చి పనిచేయాలని అమెజాన్ డాట్ కామ్ తెలిపింది. ఇది 2025 జనవరి 2 నుండి అమలులోకి వస్తుంది. "యూఎస్ ప్రధాన కార్యాలయ స్థానాలు (పుగెట్ సౌండ్, ఆర్లింగ్టన్)తో సహా పలు చోట్ల గతంలో మాదిరే డెస్క్ ఏర్పాట్లను తిరిగి తీసుకురాబోతున్నాము" అని సీఈవో ఆండీ జాస్సీ ఉద్యోగులకు ఒక నోట్లో తెలిపారు.సంస్థాగత పునర్నిర్మాణంలో భాగంగా 2025 మొదటి త్రైమాసికం ముగిసే సమయానికి మేనేజర్లు, ఉద్యోగుల నిష్పత్తిని కనీసం 15% పెంచాలని అమెజాన్ చూస్తోంది. గత ఏడాది మేలో అమెజాన్ సీటెల్ ప్రధాన కార్యాలయంలో ఉద్యోగులు వాతావరణ విధానం, తొలగింపులు, రిటర్న్ టు ఆఫీస్ ఆదేశాలను నిరసిస్తూ వాకౌట్ చేశారు. -
‘వర్క్ ఫ్రమ్ హోమ్ మనకు సెట్ కాదు.. ఆఫీస్‌కి వచ్చేయండి’
వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్న తమ ఉద్యోగులందరూ ఆఫీస్‌కి వచ్చి పనిచేయాలని ప్రముఖ స్మార్ట్‌ఫోన్ కంపెనీ ‘నథింగ్’ సీఈఓ కార్ల్ పీ ప్రకటించారు. కోవిడ్ నుంచి సంవత్సరాల తరబడి రిమోట్‌గా పనిచేస్తున్న లండన్ ఉద్యోగులు ఇక ఆఫీస్‌కు రావాలంటూ వారికి ఈమెయిల్స్ పంపించారు.కంపెనీ భవిష్యత్తు వృద్ధికి, ఆవిష్కరణలకు ఆఫీసు నుంచి పని చేయడం చాలా కీలకమని కార్ల్ పీ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన తన లింక్డిన్ ఖాతాలో పూర్తి ఈమెయిల్‌ను కూడా షేర్ చేశారు. "మనం తక్కువ సమయంలోనే చాలా దూరం వచ్చాం. పదేళ్లలో స్మార్ట్‌ఫోన్ వ్యాపారాన్ని స్థాపించి భారతదేశంలో 567 శాతం వార్షిక వృద్ధితో వేగంగా అభివృద్ధి చెందుతున్న స్మార్ట్‌ఫోన్ బ్రాండ్. అయినప్పటికీ, మనం మన సామర్థ్యంలో 0.1% వద్దే ఉన్నాం" అంటూ రాసుకొచ్చారు.రిమోట్ లేదా హైబ్రిడ్ విధానం చాలా కంపెనీలకు సరిపోయినప్పటికీ, ‘నథింగ్’కు సెట్ కాదని వివరించారు. ఇందుకు ఆయన మూడు ముఖ్యమైన కారణాలను పేర్కొన్నారు. భౌతిక ఉత్పత్తులను రూపొందించడంలో సన్నిహిత సహకారం అవసరం. బలమైన పోటీదారులను ఓడించడంలో సృజనాత్మకత, ఆవిష్కరణల ప్రాముఖ్యత. నవతరం టెక్ కంపెనీగా మారాలనే కంపెనీ ఆకాంక్ష అని వివరించారు. -
Standing Desk: నిలబడి వర్క్ చేస్తే ఆరోగ్యానికి మేలు!
నిలబడి వర్క్ చేస్తే ఆరోగ్యానికి మేలంటున్న కార్పొరేట్స్ సుదీర్ఘకాలం కూర్చోవడం స్మోకింగ్‌తో సమానం వెన్నునొప్పికి దారితీస్తున్న సిట్టింగ్ పొజిషన్ పలు అధ్యయనాల నివేదికల్లో స్పష్టం వర్క్ ఫ్రమ్ హోమ్ అలవాటు కారణంగా కార్పొరేట్ ప్రొఫెషనల్స్‌కి వెన్నునొప్పి సమస్య ముదిరి తన రోజువారీ కార్యకలాపాలను సైతం ప్రభావితం చేస్తోంది. నగరంలోని ఓ మొబైల్ వాలెట్ కంపెనీలో పనిచేస్తున్న అన్షుల్, స్నేహితుల సలహా మేరకు స్టాండింగ్ డెస్‌్కను ఎంచుకున్నాడు. ‘ఇప్పుడు, నా వెన్నునొప్పి తగ్గిపోయింది’ అని అన్షుల్ చెబుతున్నారు.. ఎక్కువ గంటలు కూర్చోవడం స్మోకింగ్‌తో సమానమైన వ్యసనంగా తాజా అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. అందుకు తగ్గట్టే పలు రకాల ఆరోగ్య సమస్యలు చుట్టుముడుతున్న నేపథ్యంలో డెస్క్ జాబ్స్ చేసే నగరవాసులకు స్టాండింగ్ డెస్‌్కలు పరిష్కారంగా మారిపోయాయి. ఆధునిక పరిస్థితుల్లో మనం కంప్యూటర్లు, టెలివిజన్లు ఇతర ఎల్రక్టానిక్ పరికరాల ముందు కూర్చొని ఎక్కువ సమయం గడుపుతున్న కొద్దీ, మన శారీరక మానసిక ఆరోగ్యంపై నిశ్చల జీవనశైలి తాలూకు ప్రతికూల ప్రభావాలు మరింత స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే, ఈ ప్రతికూల ప్రభావాలను ఎదుర్కోవడానికి ఒక సులభ పరిష్కారం స్టాండింగ్ డెస్్క., దీనిని సిట్–స్టాండ్ డెస్క్ అని కూడా పిలుస్తారు. కూర్చున్నా.. నిలబడి ఉన్న భంగిమలకు అనుగుణంగా సర్దుబాటు చేయగల డెస్్క. రోజంతా రెండు రకాల భంగిమలకు మధ్య మారడానికి వీలుగా ఇవి రూపొందాయి.చలనం.. ఆలోచనల ఫలం..ఆరోగ్య లాభాలను గుర్తించిన మీదట నగరానికి చెందిన ప్రోగ్రామర్ అభిõÙక్ మాండ్లోయ్ 3 నెలల క్రితం స్టాండింగ్ డెస్్కకి మారారు, కంపెనీ అతనికి ఫరి్నచర్ అలవెన్స్ ఇచి్చంది. ‘ఈ మార్పుకు గాను నాకు రూ.27,000 ఖర్చయ్యింది. అయితే దీని వల్ల లాభాలు అంతకు మించి వస్తున్నాయి. నిలబడి ఉన్నప్పుడు నేను నలువైపులా కదలగలను. అది నేను మరింత వేగంగా ఆలోచించగలిగేలా చేస్తుంది’ అని మాండ్లోయ్ అన్నారు. ఆధునిక సంస్థలు ఉద్యోగుల పని పరిసరాలు, వారి ఆరోగ్యానికి చాలా ప్రాధాన్యతనిస్తున్నాయి. ఉద్యోగులు ఉత్తమమైన ఆరోగ్యాన్ని కలిగి ఉండేలా వివిధ మార్గాల్లో ప్రయతి్నస్తున్నారు. ఫిట్నెస్ అగ్రిగేటర్ జింపిక్ వ్యవస్థాపకుడు అమరేష్ ఓజా మాట్లాడుతూ, ‘స్టాండింగ్ డెస్క్ మరింత చురుకుగా పని చేసేలా చేస్తుందని తన స్టార్టప్‌లోని సగం మంది సిబ్బంది ఇప్పటికే స్టాండింగ్ డెస్‌్కలను కొనుగోలు చేశారని చెప్పారు. అదే క్రమంలో యాపిల్ సంస్థ సైతం తన కొత్త ప్రధాన కార్యాలయం యాపిల్ పార్క్‌లో పనిచేసే ఉద్యోగులందరికీ స్టాండింగ్ డెస్క్‌లను ఏర్పాటు చేసిందని సమాచారం. డెస్‌్కకు డిమాండ్... ఈ స్టాండింగ్ డెస్‌్కకు సంబంధించిన బ్రాండెడ్ ఉత్పత్తుల ధరలు రూ. 20,000 నుంచి ప్రారంభమై రూ. 50,000 వరకూ ఉంటాయి. వర్క్ ఫ్రమ్ హోమ్ ట్రెండ్ బలపడడంతో అది స్టాండింగ్ డెస్‌్కల డిమాండ్ పెరగడానికి దారితీసింది. ‘కోవిడ్‌కు ముందుతో పోలిస్తే ఈ డెస్‌్కల సేల్స్ ఇప్పుడు రెట్టింపైంది’ అని ఎర్గో డెస్క్ రిటైల్ స్టోర్ నిర్వాహకులు రాహుల్ మాథుర్ అన్నారు. గత త్రైమాసికం నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్ సొల్యూషన్ల డిమాండ్ 45% కంటే పెరిగి, ఇప్పటికీ స్థిరంగా పెరుగుతోందని ఫరి్నచర్ రెంటల్ పోర్టల్ సిటీఫరి్నష్ వ్యవస్థాపకుడు నీరవ్ జైన్ వెల్లడించారు. స్టాండింగ్ డెస్‌్కల కోసం కార్యాలయాల నుంచి బల్క్ ఆర్డర్లు తగ్గాయి, అదే సమయంలో రిటైల్ అమ్మకాలు పెరిగాయి. వర్క్ ఫ్రమ్ హోమ్ ప్రారంభమైనప్పటి నుంచి రిటైల్ అమ్మకాలు 100% పెరిగాయని ఎర్గోనామిక్ ఫర్నిచర్ స్టార్టప్ పర్ప్లర్క్ వ్యవస్థాపకుడు గుణశేఖరన్ జయరామన్ అంటున్నారు. నిరి్వరామం ప్రమాదం... నగరంలోని ఓ ఆస్పత్రిలో వెన్నెముక సర్జరీ చీఫ్ డాక్టర్ అరుణ్ భానోట్ మాట్లాడుతూ ‘సరైన భంగిమలో ఉపయోగించినప్పుడు స్టాండింగ్ డెస్క్‌లు మంచి ఫలితాలను అందిస్తాయి’ అని స్పష్టం చేశారు. అయితే ఎక్కువగా వంగిన భంగిమలో గానీ, లేదా నిలుచుని పనిచేస్తుంటే అది కొత్త సమస్యలకు దారి తీస్తుంది’ అని భానోట్ హెచ్చరిస్తున్నారు. మణికట్టు డెస్్కపై ఫ్లాట్‌గా ఉన్నప్పుడు మోచేతులు 90 డిగ్రీల కోణంలో ఉండాలని సూచిస్తున్నారు. అయితే 30 నిమిషాల కంటే ఎక్కువసేపు నిరి్వరామంగా నిలబడడం అంత మంచిది కాదని స్పష్టం చేశారు.కూర్చోవడం వర్సెస్ నిల్చోవడం..⇒ ఎక్కువసేపు కూర్చోవడం వల్ల ఊబకాయం, గుండె జబ్బులు, కొన్ని రకాల క్యాన్సర్లు వంటి అనేక ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుంది. ఈ తరహా నిశ్చల జీవనశైలికి దూరం అయ్యేలా స్టాండింగ్ డెస్్కని ఉపయోగించవచ్చు. తద్వారా పలు వ్యాధుల ప్రమాదాన్ని నివారించవచ్చు. ⇒ ఎక్కువసేపు కూర్చున్నప్పుడు, మెదడుకు రక్త ప్రసరణ పరిమితంగా మారుతుంది. ఇది చిత్తవైకల్యం వంటి మెదడు జబ్బుల ప్రమాదానికి దారితీస్తుంది. నిలబడి ఉన్నప్పుడు, మెదడుకు రక్త ప్రసరణ పెరుగుతుంది. దానికి అవసరమైన ఆక్సిజన్ ఇతర పోషకాలను అందిస్తుంది. ⇒ చాలాసేపు కూర్చోవడం వల్ల అలసట బద్ధకం వస్తాయి. దీనికి విరుద్ధంగా, స్టాండింగ్ శక్తి స్థాయిలను పెంచి చురుకుదనాన్ని ఇస్తాయి. ⇒ సృజన, సమస్యల పరిష్కార సామర్థ్యాలను మెరుగుపరుస్తుంది. ఉత్పాదకతను పెంచడంలో స్టాండింగ్ డెస్‌్కలు సహాయపడతాయని, తక్కువ సమయంలో ఎక్కువ పని చేయడం వీలవుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. ⇒ గంటల తరబడి ఒకే భంగిమలో కూర్చోవడం వల్ల మన వెన్నెముక కుదించబడే అవకాశం ఉంది. ఇది వెన్నునొప్పికి దారితీస్తుంది. అదే నిలబడి ఉన్న డెస్‌్కలు నిటారుగా నిలబడటానికి మన కోర్ కండరాలకు మద్దతు అందించడం ద్వారా వెన్నెముక ఆరోగ్యాన్ని మెరుగు పరచడంలో సహాయపడతాయి. ⇒ గంటల తరబడి ఒకే భంగిమలో కూర్చోవడం వల్ల మన మనస్సు పలు చోట్లకు సంచరించేలా చేస్తుంది. దీని వల్ల ఏకాగ్రత కష్టమవుతుంది. దీనికి భిన్నంగా స్టాండింగ్ డెస్్కని ఉపయోగించడం ద్వారా మన దృష్టి ఏకాగ్రతలను మెరుగుపరచవచ్చు. -
ఫలించిన టీసీఎస్ మంత్రం.. నిండుగా ఆఫీసులు!
వర్క్ ఫ్రమ్ హోమ్‌కు అలవాటు పడిన ఉద్యోగులను ఆఫీసులకు రప్పించడానికి టీసీఎస్ వేసిన మంత్రం ఫలించింది. వేరియబుల్ పేను కార్యాలయ హాజరుకు అనుసంధానించే కొత్త విధానాన్ని అమలు చేశాక దాదాపు 70 శాతం ఉద్యోగులు ఆఫీసులకు వస్తున్నారని టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) చీఫ్ హెచ్ఆర్ ఆఫీసర్ మిలింద్ లక్కడ్ తెలిపారు.అయితే ఇది తాత్కాలిక చర్య అని, దాన్ని ఆ విధంగా చూడాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. గత ఏప్రిల్‌లో ఉద్యోగులకు త్రైమాసిక వేరియబుల్ చెల్లింపును వారి కార్యాలయ హాజరుతో లింక్ చేసింది. దీని ప్రకారం 60 శాతం కంటే తక్కువ హాజరు ఉన్నవారు త్రైమాసిక బోనస్‌కు అర్హులు కాదు.వారానికి ఐదు రోజులు తప్పనిసరిగా ఆఫీసు నుంచి పని చేయాలని ఆదేశించిన నెలల తర్వాత ఈ పాలసీ అప్డేట్ వచ్చింది. కొత్త విధానం ప్రకారం ఉద్యోగులు పూర్తి త్రైమాసిక వేరియబుల్ వేతనాన్ని పొందాలంటే కార్యాలయంలో కనీసం 85 శాతం హాజరు ఉండాలి. 75-85 శాతం హాజరున్న ఉద్యోగులు వారి వేరియబుల్ పేలో 75 శాతం, 60-75 శాతం హాజరు ఉన్నవారు 50 శాతం మాత్రమే వేరియబుల్ పే పొందుతారు. -
అంబానీ ఇంట పెళ్లి.. ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్
అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ వివాహం ఈ రోజు (జులై 12)న ముంబైలో జరగనుంది. ఈ నేపథ్యంలో ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్(BKC)లోని పలు కార్యాలయాలు తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ అవకాశం కల్పించాయి. జూలై 15 వరకు ఎవరూ ఆఫిసులకు రావాల్సిన అవసరం లేదని, ఆ తరువాత కార్యాలయాలకు యధావిధిగా హాజరు కావాలని పేర్కొన్నాయి.అనంత్, రాధికల పెళ్లి కారణంగా ట్రాఫిక్ మళ్లింపులు ముంబైలోని పలు కంపెనీలు ఈ నిర్ణయం తీసుకున్నాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ చైర్మన్ ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ, వీరేన్ మర్చంట్ కుమార్తె రాధిక మర్చంట్ వివాహం జూలై 12న జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లో జరగనుంది. ఈ పెళ్లి వేడుకలు జూలై 14 వరకు.. మూడు రోజులు కొనసాగుతాయి.అంబానీ ఇంట జరగనున్న ఈ వేడుకలకు ప్రపంచ నలుమూలల నుంచి ఎంతో మంది సెలబ్రిటీలు, పారిశ్రామికవేత్తలు హాజరుకానున్నారు. వీరందరికి భద్రత కల్పించడంలో సెక్యూరిటీ చాలా పటిష్టంగా ఉంటుంది. కాబట్టి ఉద్యోగులు ఇంటి నుంచి పనిచేయాలని ఆఫీసులు తెలిపాయి.అనంత్, రాధికల వివాహం కారణంగా ఇప్పటికే ముంబై అంతటా హోటల్ బుకింగ్ ధరలు గణనీయమైన పెరిగాయి. ట్రైడెంట్, ఒబెరాయ్ వంటి వేదికలు జూలై 10 నుంచి 14 వరకు పూర్తిగా బుక్ అయినట్లు సమాచారం. ఇక్కడ ఒక రాత్రి బస చేయడానికి ఏకంగా లక్ష రూపాయలు చెల్లించాల్సి ఉందని పలు నివేదికలు వెల్లడించాయి.అంబానీ ఇంట జరగనున్న పెళ్ళికి హెచ్ఎస్బీసీ హోల్డింగ్స్ పీఎల్సీ ఛైర్మన్ మార్క్ టక్కర్, శామ్సంగ్ ఎలక్ట్రానిక్స్ కో. లిమిటెడ్ ఛైర్మన్ జేలీ, యూకే మాజీ నేతలు బోరిస్ జాన్సన్, టోనీ బ్లెయిర్ వంటి వాటితో పాటు సౌదీ అరామ్కో అమిన్ నాసర్, బీపీ పీఐసీ ముర్రే ఆచిన్‌క్లోస్, జీఎస్కే పీఐసీ ఎమ్మా వాల్మ్స్లే, లాక్‌హీడ్ మార్టిన్ జిమ్ టైక్లెట్, ఫిఫా అధ్యక్షుడు జియాని ఇన్ఫాంటినో వంటి టాప్ ఎగ్జిక్యూటివ్‌లు హాజరయ్యే అవకాశం ఉంది. -
‘వర్క్ ఫ్రమ్ హోమ్’ కోసం డెల్ ఉద్యోగులు చేస్తున్న రిస్క్ ఏంటి?
వర్క్ ఫ్రమ్ హోమ్‌కు అలవాటు పడిన ఉద్యోగులను ఆఫీసులకు రప్పించడం కంపెనీలకు కత్తిమీద సాములా మారింది. ఎన్ని ఆంక్షలు పెట్టినా, కఠిన నిబంధనలు తీసుకొస్తున్నా ఉద్యోగులు జంకడం లేదు. ఆఫీస్‌కు రావడానికి ససేమిరా అంటున్నారు. ప్రముఖ టెక్నాలజీ కంపెనీ డెల్ ఉద్యోగులైతే వర్క్ ఫ్రమ్ హోమ్ కోసం ప్రమోషన్లు సైతం వదులుకునేందుకు సిద్ధమయ్యారు.డెల్ కంపెనీ గత ఫిబ్రవరిలో రిటర్న్-టు-ఆఫీస్ తప్పనిసరి నిబంధనను ప్రవేశపెట్టింది. దీని ప్రకారం.. హైబ్రిడ్‌గా పనిచేస్తారా.. లేక రిమోట్‌గా పనిచేస్తారా అన్నది అధికారికంగా తెలియజేయాల్సి ఉంటుంది. వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్‌ను ఎంచుకున్న ఉద్యోగులు ప్రమోషన్ లేదా పాత్ర మార్పులకు అర్హులు కాదని కంపెనీ పేర్కొంది.హైబ్రిడ్‌ను ఎంచుకున్న ఉద్యోగులకు త్రైమాసికానికి 39 రోజులు, వారానికి సుమారు మూడు రోజులు ఆఫీసులో హాజరును కంపెనీ తప్పనిసరి చేసింది. వారి హాజరును కలర్-కోడ్ సిస్టమ్ ద్వారా పర్యవేస్తుంది. బిజినెస్ ఇన్సైడర్ ప్రకారం.. డెల్ ఫుల్‌టైమ్ యూఎస్ ఉద్యోగులలో దాదాపు 50 శాతం మంది వర్క్ ఫ్రమ్ హోమ్‌ను ఎంచుకున్నారు.దీని అర్థం ఈ ఉద్యోగులు పదోన్నతికి అర్హులు కాదు. ఇక అంతర్జాతీయ సిబ్బందిలోనూ మూడింట ఒక వంతు మంది వర్క్ ఫ్రమ్ హోమ్‌నే ఎంచుకున్నారు. ఆఫీసుకు వెళ్లడం కన్నా ఇంటి నుంచి పనిచేయడంలోనే తమకు ఎక్కువ ప్రయోజనాలు ఉన్నాయని చాలా మంది ఉద్యోగులు భావిస్తున్నారు. దీంతో ప్రమోషన్లను సైతం వదులుకునేందుకు సిద్ధమయ్యారు. -
ఆఫీస్‌కి రాకపోతే ఫైరింగే.. ప్రముఖ ఐటీ కంపెనీ వార్నింగ్!
ప్రముఖ ఐటీ సేవల సంస్థ కాగ్నిజెంట్ (Cognizant) రిటర్న్-టు-ఆఫీస్ పాలసీకి సంబంధించి తమ ఉద్యోగులకు గట్టి హెచ్చరిక జారీ చేసింది. పదేపదే రిమైండర్లు చేసినప్పటికీ కార్యాలయానికి తిరిగి రావాలనే ఆదేశాన్ని విస్మరించేవారు తొలగింపు సహా తీవ్రమైన క్రమశిక్షణా చర్యలను ఎదుర్కోవలసి ఉంటుందని కంపెనీ స్పష్టం చేసిందని ‘లైవ్‌మింట్’ కథనం పేర్కొంది."నిర్దేశాలను పాటించడంలో వైఫల్యం కంపెనీ విధానాల ప్రకారం తీవ్రమైన దుష్ప్రవర్తనకు దారితీస్తుందని దయచేసి గమనించండి. తదనుగుణంగా మీపై తగిన క్రమశిక్షణా చర్యలు ప్రారంభించడం జరుగుతుంది. ఇది తొలగింపునకు కూడా దారితీయవచ్చు" అని ఒక ఉద్యోగికి రాసిన లేఖలో కాగ్నెజెంట్ హెచ్చరించినట్లుగా నివేదిక పేర్కొంది.ఇన్ ఆఫీస్ వర్క్ ప్రాముఖ్యతను కాగ్నిజెంట్ ఇంతకు ముందే పునరుద్ఘాటించింది. ఆఫీస్ పాలసీని పాటించడంలో వైఫల్యాన్ని కంపెనీ పాలసీల ప్రకారం తీవ్రమైన దుష్ప్రవర్తనగా పరిగణిస్తామని, ఇది టర్మినేషన్‌కు సైతం దారితీసే అవకాశం ఉందని ఏప్రిల్ 15 నాటి లేఖలో కాగ్నిజెంట్ స్పష్టం చేసింది.భారత్‌లో కాగ్నిజెంట్ శ్రామిక శక్తి గణనీయంగా ఉంది. కంపెనీ వార్షిక నివేదిక ప్రకారం.. దాని 347,700 మంది ఉద్యోగులలో సుమారు 2,54,000 మంది భారత్‌లోనే ఉన్నారు. కంపెనీ అతిపెద్ద ఉద్యోగుల స్థావరం భారత్ అని దీనిని బట్టీ తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కంపెనీ రిటర్న్-టు-ఆఫీస్ విధానం భారత్‌లో ప్రాధాన్యత సంతరించుకుంది.ఇన్ ఆఫీస్ వర్క్ తప్పనిసరి ఆదేశాలు అనేక కారణాల నుంచి వచ్చాయి. ఆవిష్కరణలు, జట్టు కృషి, బలమైన సంస్థాగత సంస్కృతిని వ్యక్తిగత సహకారం ప్రోత్సహిస్తుందని కంపెనీలు విశ్వసిస్తున్నాయి. అంతేకాకుండా, ప్రత్యేకించి సెన్సిటివ్ డేటా, కాంప్లెక్స్ ప్రాజెక్ట్‌లను నిర్వహించే పరిశ్రమలలో కార్యాచరణ, భద్రతాపరమైన అంశాలు కూడా కారణంగా ఉన్నాయి.టీసీఎస్ (TCS), ఇన్ఫోసిస్ (Infosys), విప్రో (Wipro) వంటి కంపెనీలు కూడా గతంలో రిటర్న్-టు-ఆఫీస్ విధానాన్ని తప్పనిసరి చేశాయి. అయితే, కొన్ని కంపెనీలు రిమోట్ పని సౌలభ్యానికి అలవాటుపడిన కొంతమంది ఉద్యోగుల నుంచి ప్రతిఘటనను ఎదుర్కొన్నాయి. చాలా మంది ఉద్యోగులు రిమోట్ వర్క్ మెరుగైన పని-జీవిత సమతుల్యతను అందిస్తుందని, ప్రయాణ ఒత్తిడిని తగ్గిస్తుందని వాదించారు. అయితే కాగ్నిజెంట్ వంటి కంపెనీలు ఈ ఉద్యోగుల ప్రాధాన్యతలను వ్యాపార అవసరాలు, కార్యాచరణ సామర్థ్యాలతో సమతుల్యం చేస్తున్నాయి. -
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
దేశవ్యాప్తంగా ఆఫీస్ స్పేస్ లీజింగ్ గణనీయంగా పెరిగింది. ప్రస్తుతేడాది తొలి త్రైమాసికంలో ఆఫీస్ స్థలాల లీజింగ్‌లో వృద్ధి నమోదైందని రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ వెస్టియన్ తాజాగా విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. టాప్ ఏడు ప్రధాన నగరాల్లో ఆఫీస్ లీజింగ్ డేటాను విడుదల చేసింది.2024 జనవరి-మార్చిలో ఆఫీస్ లీజింగ్ 13 శాతం పెరిగి 134 లక్షల చదరపు అడుగులకు చేరుకుంది. ఇది సంవత్సరం క్రితం ఇదే కాలంలో 118.5 లక్షల చదరపు అడుగులు ఉండేది. అయితే 2023 నాల్గవ త్రైమాసికంలో గరిష్ట స్థాయికి చేరుకున్న తర్వాత ఈ సంవత్సరం మొదటి త్రైమాసికంలో 31 శాతం తగ్గింది.మెట్రో నగరాల్లో అత్యధికంగా చెన్నైలో ఆఫీస్ స్థలాల డిమాండ్ రెండింతలు పెరిగింది. ఏడాది క్రితం 16 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన స్థలం లీజుకు తీసుకోగా, ఈసారి ఏకంగా 33.5 లక్షల చదరపు అడుగులకు చేరుకున్నట్లు నివేదిక వెల్లడించింది.హైదరాబాద్‌లో భారీగా లీజింగ్ హైదరాబాద్‌లోనూ ఆఫీస్ స్థలం లీజింగ్ భారీగా పెరిగింది. తొలి త్రైమాసికంలో 22.7 లక్షల చదరపు అడుగులు లీజుకు తీసుకున్నట్లు వెస్టియన్ నివేదిక తెలిపింది. ఏడాది క్రితం నమోదైన 15 లక్షల కంటే ఇది 50 శాతం అధికం కావడం విశేషం. మరోవైపు, దేశ రాజధాని న్యూఢిల్లీలో ఆఫీస్ స్థలం లీజు తగ్గుముఖం పట్టింది. జనవరి నుంచి మార్చి మధ్యకాలంలో 18.1 లక్షల చదరపు అడుగుల స్థలం మాత్రమే లీజుకు పోయిందని తెలిపింది.ఏడాది క్రితం తీసుకున్న 24 లక్షల చదరపు అడుగులతో పోలిస్తే 25 శాతం తగ్గింది. అలాగే ఢిల్లీ-ఎన్సీఆర్ రీజియన్‌లో కూడా 40 శాతం తగ్గింది. దేశవ్యాప్తంగా ఆఫీస్ లీజింగ్‌లో దక్షిణాది నగరాలైన బెంగళూరు, హైదరాబాద్, చెన్నై వాటా 61 శాతంగా ఉంది. ఈ మూడు నగరాల్లో వాటా 54 శాతం పెరిగింది. అయితే బెంగళూరులో ఆఫీస్ లీజింగ్ 33 లక్షల చదరపు అడుగుల నుంచి 26.2 లక్షల చదరపు అడుగులకు పడిపోవడం గమనార్హం.ఆర్థిక రాజధాని ముంబైలో ఆఫీస్ స్థలం లీజు 12 లక్షల అడుగుల నుంచి 24.9 లక్షలకు పెరగడం విశేషం. కోల్‌కతాలో మాత్రం 3.5 లక్షల చదరపు అడుగుల నుంచి 1.6 లక్షల అడుగులకు పడిపోయింది. పుణెలో ఆఫీస్ స్థలం సగానికి సగం పడిపోయింది. ఏడాది క్రితం 15 లక్షల చదరపు అడుగులు కాగా, ఈ సారి 7.1 లక్షల చదరపు అడుగులకు జారుకుంది.ఇక రంగాలవారీగా తీసుకుంటే ఐటీ, ఐటీఈఎస్ రంగానికి చెందిన సంస్థలు అధికంగా ఆఫీస్ స్థలాలను లీజుకు తీసుకున్నాయి. వీటి వాటా 47 శాతంగా ఉంది. అలాగే బీఎఫ్ఎస్ఐ రంగం వాటా 11 శాతంగా ఉంది. -
వర్క్ ఫ్రమ్ ఆఫీస్.. మరో ఎత్తు వేసిన ఇన్ఫోసిస్!
దేశీయ ఐటీ సేవల దిగ్గజం ఇన్ఫోసిస్ ఉద్యోగులను ఆఫీస్‌లకు రప్పించడానికి మరో ఎత్తు వేసినట్లు తెలుస్తోంది. ఇంజనీరింగ్-ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ENG-IoT) ప్రాజెక్ట్‌లలో పనిచేసే ఉద్యోగులకు 'ఇన్-పర్సన్ కొల్లాబ్ వీక్స్'ని అమలు చేస్తోంది. తాము సమీక్షించిన ఇన్ఫోసిస్ ఉద్యోగుల ఈమెయిల్స్ ఉటంకిస్తూ ఎకనామిక్స్ టైమ్స్ ఈమేరకు పేర్కొంది. వీటి ప్రకారం.. తమకు కేటాయించిన వారాల్లో ఉద్యోగులు వారి సంబంధిత క్యాంపస్‌లలో హాజరు కావాలి. ఆఫీస్ నుంచి పనిచేయాల్సిన ఆవశ్యకతను తెలియజేస్తూ ప్రతి త్రైమాసికంలో ఉద్యోగులకు నిర్దిష్ట వారాలను నిర్దేశిస్తుంది. గత ఏడాది నవంబర్‌లో ప్రవేశపెట్టిన హైబ్రిడ్ వర్క్ పాలసీ ప్రకారం, ఇన్ఫోసిస్ ఉద్యోగులు నెలకు కనీసం 10 రోజులు లేదా త్రైమాసికానికి 30 రోజులు ఆఫీస్ నుంచి పని చేయాలి. ఈ హైబ్రిడ్ వర్క్ అప్రోచ్ ద్వారా టీమ్ వర్క్, ఉత్పాదకతను పెంపొందించడం ఇన్ఫోసిస్ లక్ష్యం. బేస్ లొకేషన్లకు దూరంగా ఉన్న ఉద్యోగులు ఈ వారాల్లో డెవలప్మెంట్ సెంటర్లకు తిరిగి వచ్చేలా ప్లాన్ చేసుకోవాలని కంపెనీ కోరింది. కొల్లాబ్ వీక్స్‌లో పాల్గొనే ఉద్యోగుల ఖచ్చితమైన సంఖ్య ఇంకా నిర్ణయించలేదని, ప్రతి త్రైమాసికానికి కనీసం ఆరు వారాలు ఆఫీస్ నుంచి పని చేయాల్సి ఉంటుందని తెలుస్తోంది. ఈ విధానాన్ని ఈ త్రైమాసికం నుంచి అమలు చేస్తున్నట్లు సమాచారం. అయితే ఈ నిర్దేశిత వారాలలో ఆఫీస్ నుంచి పనిచేసే ఉద్యోగులకు వారికి అనువైన రోజులను ఎంచుకోవడంలో సౌలభ్యాన్ని కంపెనీ అందిస్తోంది. 10 రోజుల వర్క్ ఫ్రమ్ ఆఫీస్ నిబంధనపై మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ, క్యాంపస్ హాజరును పెంచాలని ఇన్ఫోసిస్ చూస్తోంది. -
ఐటీకి నీటి ట్రాన్స్ఫర్
వరంగల్‌కు చెందిన నిఖిలేశ్ కొన్నేళ్లుగా బెంగళూరులోని ఓ బహుళజాతి ఐటీ కంపెనీలో పనిచేస్తున్నాడు. ఇటీవలే పెళ్లి కావడంతో భార్యతో సహా కేఆర్ పురంలో నెలకు రూ.20 వేల అద్దెతో ఓ గేటెడ్ కమ్యూనిటీలో కాపురం పెట్టాడు. అయితే ఈమధ్య కాలంలో బెంగళూరు ప్రధాన నగరంలో నీటి ఎద్దడి తీవ్రం కావడంతో యాజమాన్యం ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం ఇచ్చింది. కానీ, అపార్ట్మెంట్లో నీటి వినియోగం, సరఫరాలో రెసిడెన్షియల్ సొసైటీ ఆంక్షలు విధించింది.దీంతో అటు ఆఫీసుకు వెళ్లలేక, ఇటు ఇంట్లో ఉండలేక ఈ విషయాన్ని యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లాడు. దీంతో హైదరాబాద్‌లో ఉన్న బ్రాంచ్ ఆఫీసు నుంచి పని చేయాలని సూచించింది. అతడు భార్యను పుట్టింట్లో వదిలిపెట్టి ప్రస్తుతం హైదరాబాద్ నుంచే పనిచేస్తున్నాడు. సాక్షి, హైదరాబాద్:.. ఇదీ బెంగళూరులోని ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) ఉద్యోగికి జరిగిన నీళ్ల బదిలీ. సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియాగా పేరొందిన బెంగళూరు గతంలో ఎన్నడూ లేనివిధంగా నీటి సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఇన్ఫోసిస్, విప్రో, టీసీఎస్ వంటి ప్రముఖ ఐటీ కంపెనీలకు కేంద్రమైన వైట్‌ఫీల్డ్, వర్తూర్ వంటి ఐటీ హబ్‌లలో ఈ సమస్య తీవ్రంగా ఉంది.దీంతో ఐటీ సంస్థలు, ఉద్యోగుల కార్యకలాపాలపై ప్రభావం పడుతోంది. ఐటీ హబ్‌లు, ఉద్యోగుల నీటి కష్టాలు వీడియో పలు సామాజిక మాధ్యమాల్లోనూ వైరల్ కావడం గమనార్హం. హైదరాబాద్, పుణేలకు బదిలీ దేశీయ ఐటీ పరిశ్రమ అమెరికా, యూకే, యూరప్, ఆస్ట్రేలియా వంటి పలు దేశాల మీద ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. దీంతో రాజకీయ అస్థిరత, స్థానిక సమస్యలతో సంబంధం లేకుండా గడువులోగా ప్రాజెక్ట్‌లను పూర్తి చేయడం సాఫ్ట్వేర్ కంపెనీలకు తప్పనిసరి. ఈ నేపథ్యంలో బెంగళూరు ఐటీ పరిశ్రమ నీటి ఎద్దడిని ఎదుర్కొనేందుకు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించింది. తాత్కాలికంగా కొద్దికాలం పాటు ఉద్యోగులను సొంతూళ్ల నుంచి పని చేసే వీలు కల్పించడం, హైదరాబాద్, పుణే వంటి ఇతర నగరాల్లోని బ్రాంచ్ ఆఫీసులకు బదిలీ చేయడం వంటివి చేస్తున్నాయి. విధి నిర్వహణలో ఎదురయ్యే సందేహాలు, టాస్క్‌లను నివృత్తి చేసేందుకు సాంకేతిక నిపుణులను జూమ్ వంటి ఆన్లైన్ మాధ్యమాల్లో అందుబాటులో ఉంచుతున్నాయి. అలాగే ఉద్యోగుల పనితీరుపై ఒత్తిడి ప్రభావం పడకుండా వారాంతాల్లో వర్చువల్‌గా శిక్షణ, మీటింగ్‌లను సైతం నిర్వహిస్తున్నాయి. వేతన పెంపు, అలవెన్స్‌లు కూడా.. ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం ఇచ్చినా బెంగళూరు నుంచే పని చేస్తారని, దీంతో అపార్ట్మెంట్లలో నీటి సమస్య మరింత తీవ్రమవుతుందని భావించిన పలు ఐటీ కంపెనీలు ఉద్యోగులను వర్క్ ఫ్రం హోం బదులుగా వర్క్ ఫ్రం హోంటౌన్ (సొంతూర్ల నుంచి పని) చేయాలని సూచిస్తున్నాయి. అయితే ఉద్యోగులు ఇతర పట్టణాలు/మెట్రో సిటీల నుంచి పని చేయాలంటే వ్యయ ప్రయాసలతో కూడుకున్న పని. కుటుంబంతో సహా వేరేచోటుకు మారడం, ప్రయాణ ఖర్చులతోపాటు అప్పటికే బెంగళూరులో ఉండే ఇంటికి అద్దె చెల్లించాల్సి ఉంటుంది. ఇది ఉద్యోగులకు భారం కావడంతో పలు కంపెనీలు తాత్కాలిక వేతన పెంపు, అలవెన్స్‌లు వంటివి ఇస్తున్నాయి. బెంగళూరులో నీటి సమస్య తీరిన తర్వాత తిరిగి ఆఫీసుకు రావాలని చెబుతున్నాయి. రోజుకు 500 మిలియన్ లీటర్ల నీటి కొరత ప్రస్తుతం కర్ణాటకలో సుమారు 8,785 ఐటీ, ఐటీఈఎస్ కంపెనీల్లో 18 లక్షల మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. వేగవంతమైన పట్టణీకరణ, జనాభా పెరుగుదల, అస్తవ్యస్తమైన పట్టణ ప్రణాళిక, లోటు వర్షపాతం, తలసరి నీటి వినియోగం పెరుగుదల వంటి కారణాలతో బెంగళూరులో నీటి సమస్య జఠిలమైంది. నగరంలో రోజుకు తాగునీరు, పరిశ్రమ అవసరాలకు 2,600 ఎంఎల్డీ (రోజుకు మిలియన్ లీటర్లు) నీరు అవసరం ఉండగా.. ఇందులో 1,450 ఎంఎల్డీలు కావేరి నది నుంచి, 650 ఎంఎల్డీలు బోరు బావుల నుంచి సమకూరుతుండగా, 500 ఎంఎల్డీల నీటి కొరత ఉందని ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. గేటెడ్ కమ్యూనిటీలు, పెద్ద నివాస సముదాయాలతోపాటు ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, అగ్నిమాపక కేంద్రాలు, హోటళ్లు, రెస్టారెంట్లు కూడా నీటి సమస్యను ఎదుర్కొంటున్నాయి. ఐటీ ఆఫీసులపై ప్రభావం బెంగళూరులో నీటి సమస్య ఐటీ కార్యాలయాల మీద కూడా ఎక్కువ ప్రభావం చూపిస్తోంది. మహాదేవపుర,కెంగేరి, వైట్ ఫీల్డ్, సజ్జాపుర్ రోడ్, కోర మంగళ వంటి ప్రాంతాల్లోని ఐటీ సంస్థలు, ఉద్యోగులపై ఈ ప్రభావం ఎక్కువగా ఉంది. దీంతో పలు సంస్థలు రిమోట్ వర్కింగ్, హైబ్రిడ్ మోడల్ పని విధానంతోపాటు ఇతర నగరాల్లోని బ్రాంచీల నుంచి పని చేయాలని ఉద్యోగులకు సూచిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాలకు చెందిన ఐటీ ఉద్యోగులు ఎక్కువగా ఇలా పని చేస్తున్నారు. –సందీప్ కుమార్ మఖ్తల, ప్రెసిడెంట్, తెలంగాణ ఐటీ అసోసియేషన్ -
ఎంప్లాయిస్ కి చుక్కలే ! ప్రమోషన్లకు దానికీ లింకా?
-
ఆఫీస్‌కు రాకపోతే ప్రమోషన్ కట్.. ప్రముఖ టెక్ కంపెనీ కీలక నిర్ణయం
ఉద్యోగులు ఆఫీస్‌కు రాకపోతే పదోన్నతులు ఇవ్వబోమని ప్రముఖ ల్యాప్‌ట్యాప్‌ల తయారీ కంపెనీ డెల్ ప్రకటించింది. ఈమేరకు ఉద్యోగులకు మెమో పంపినట్లు కొన్ని మీడియా కథనాల ద్వారా తెలిసింది. టెక్ కంపెనీల ఉద్యోగులకు కరోనా సమయంలో వర్క్‌ఫ్రం హోం వెసులుబాటు ఇచ్చిన విషయం తెలిసిందే. క్రమంగా కొవిడ్ భయాలు తగ్గి, పరిస్థితులు మెరుగవుతుంటే కంపెనీలు హైబ్రిడ్పని విధానానికి మారాయి. తాజాగా ఆ విధానాన్ని సైతం తొలగించి కొన్ని కంపెనీలు పూర్తిగా కార్యాలయాలకు రావాలని కోరుతున్నాయి. అయినప్పటికీ కొంతమంది ఉద్యోగులు ఇతర కారణాల వల్ల ఆఫీస్ నుంచి పని చేసేందుకు ఇష్టపడడం లేదు. దాంతో కంపెనీలు చేసేదేమిలేక అలాంటి వారిపై చర్యలకు పూనుకున్నాయి. తాజాగా డెల్ కంపెనీ కార్యాలయాలకు రాని ఉద్యోగులకు ప్రమోషన్ ఇవ్వబోమని లేఖలు పంపింది. అయితే కరోనా పరిణామాలకు దశాబ్దం ముందు నుంచే హైబ్రిడ్ పని (వారంలో కొన్ని రోజులు ఇంటి నుంచి, మరికొన్ని రోజులు కార్యాలయాలకు రావడం) విధానాన్ని సంస్థ అనుమతిస్తోంది. ఆ కంపెనీ వ్యవస్థాపకుడు, సీఈఓ మైఖేల్ డెల్ దీనికి ప్రోత్సహించారు. ఉద్యోగులు ఆఫీసుకు రావాలంటూ పట్టుపడుతున్న కంపెనీల విధానాన్ని అప్పట్లో మైఖేల్ తప్పుబట్టారు. ఇపుడు మాత్రం కంపెనీ అందుకు భిన్నంగా వ్యవహరిస్తోందనే వాదనలు ఉన్నాయి. ఇదీ చదవండి: వీడియో క్రియేటర్లకు పెద్దదెబ్బ.. యూట్యూబ్ కొత్త నిబంధన..? కంపెనీ పంపిన లేఖలో ఉద్యోగులను హైబ్రిడ్, రిమోట్ వర్కర్లుగా వర్గీకరించింది. హైబ్రిడ్ సిబ్బంది వారంలో కనీసం 3 రోజులు ఆఫీసుకు రావాల్సి ఉంది. పూర్తిగా ఇంటి నుంచి పనిచేసే వారికి చాలా పరిమితులు ఉంటాయని కంపెనీ లేఖలో పేర్కొంది. పదోన్నతి లేదా కంపెనీలో ఇతర జాబ్ రోల్లకు ఇంటి నుంచి పనిచేసే వారి పేర్లను పరిశీలించరని కంపెనీ తెలిపింది. -
మళ్లీ వర్క్ ఫ్రమ్ హోమ్.. ఐటీ కేంద్రంలో ఊపందుకున్న డిమాండ్!
ఐటీ పరిశ్రమకు కేంద్రంగా ఉన్న బెంగళూరులో నీటి సంక్షోభం తలెత్తింది. నగరంలో నీటి కష్టాలపై స్థానికులు సోషల్ మీడియాను ఆశ్రయిస్తున్నారు. నగరవాసులు, సామాజిక సంఘాలు ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను ట్యాగ్ చేస్తూ వర్క్ ఫ్రమ్ హోమ్ అభ్యర్థనలను హోరెత్తిస్తున్నారు. నగరంలోని ఐటీ కంపెనీలు ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశాన్ని కల్పించేలా చూడాలని, పాఠశాలలు ఆన్లైన్ తరగతులను పునఃప్రారంభించడానికి అనుమతించాలని వారు సీఎంను కోరుతున్నారు. కోవిడ్ మహమ్మారి సమయంలో ఉపయోగపడిన ఈ వ్యూహాన్ని ప్రస్తుత నీటి సంక్షోభాన్ని పరిష్కరించడానికి ఎందుకు ఉపయోగించకూడదు అని ప్రశ్నిస్తున్నారు. దీని వల్ల అందరికీ ప్రయోజనం కలుగుతుందని, మండుతున్న ఎండల నుండి ఉద్యోగులకు, విద్యార్థులకు ఉపశమనం కలగడమే కాకుండా విలువైన సంక్షోభ సమయంలో నీటి సంరక్షణకు దోహదపడుతుందని వాదిస్తున్నారు. "బెంగళూరు నగరంలో పెరిగిన ఎండ వేడి, తీవ్రమైన నీటి సంక్షోభం నెలకొని ఉండటం, ఈ నెలలో పెద్దగా వర్షాలు లేనందున వర్షాకాలం ప్రారంభమయ్యే వరకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్‌ను కర్ణాటక ప్రభుత్వం పరిగణించాల్సిన సమయం ఆసన్నమైంది" అని ‘గో బై కర్ణాటక వెదర్’ (@Bnglrweatherman) అనే వాతావరణ ఔత్సాహికుల బృందం ‘ఎక్స్’లో పేర్కొంది. "నీటి సంక్షోభం.. ఆన్లైన్ తరగతులు, వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంటాయా? విద్యార్థులు, ఉద్యోగులను ఇంటి నుండి పని చేయడానికి అనుమతిస్తే, చాలా మంది వారి స్వస్థలాలకు వెళతారు. నగరంపై ఒత్తిడి తగ్గుతుంది!" అని సిటిజన్స్ ఎజెండా ఫర్ బెంగళూరు (@BengaluruAgenda) రాసుకొచ్చింది. ఉద్యోగులను ఇంటి నుండి పని చేయడానికి అనుమతించడం వల్ల చాలా మంది తమ స్వస్థలాలకు తిరిగి వెళ్లే దృష్టాంతం ఏర్పడవచ్చని మరికొంత హైలైట్ చేశారు. దీని వల్ల పట్టణ ప్రాంతాల్లో నీటి డిమాండ్ తగ్గడానికి దారితీయవచ్చు అంటున్నారు. ముఖ్యంగా ఐటీ రంగానికి ఇంటి నుండి పని కోసం ఆదేశాన్ని అమలు చేయాలని కర్ణాటక ప్రభుత్వాన్ని కోరుతూ నమ్మ వైట్‌ఫీల్డ్ అని పిలిచే నగరంలోని వైట్‌ఫీల్డ్ ప్రాంతంలోని నివాసితులు, నివాస సంక్షేమ సంఘాల సమాఖ్య ‘ఎక్స్’లో పోస్ట్ చేసింది. ఇటువంటి చర్య ఉద్యోగులు తమ స్వస్థలాలకు వెళ్లేందుకు వీలు కల్పిస్తుందని, తద్వారా బెంగళూరుపై భారం తగ్గుతుందని పేర్కొంది. -
ఐటీ కారిడార్‌లో మారుతున్న ట్రెండ్..
వర్క్ ఫ్రం హోం, ఆఫీసులకు తిరిగి వెళ్లడంపై ఉద్యోగుల్లో పెద్ద చర్చే సాగుతోంది. హైదరాబాద్‌తోపాటు ఇతర నగరాల్లోని ఐటీ కారిడార్లు పూర్వ వైభవం సంతరించుకుంటున్నాయి. కరోనా భయం తగ్గిన నేపథ్యంలో ఐటీ కంపెనీలు వర్క్ ఫ్రం హోంకు క్రమంగా స్వస్తి పలుకుతున్నాయి. హైబ్రిడ్ మోడల్‌ను అనుసరిస్తుండటంతో ఉద్యోగులు కార్యాలయాలకు వచ్చి విధులు నిర్వర్తిస్తున్నారు. కొన్ని నెలలుగా ఐటీ కారిడార్‌లో క్రమంగా కార్యకలాపాలు గాడిన పడ్డాయి. హాస్టళ్లలో గదులు నిండుతున్నాయి. మాల్స్ సందర్శకులతో కిక్కిరిసి కనిపిస్తున్నాయి. చిరువ్యాపారులు, హోటళ్లు, ట్రావెల్స్, డ్రైవర్ల జీవన ప్రయాణం గాడిలో పడింది. ఏమిటీ హైబ్రిడ్ మోడల్? ఐటీ కంపెనీల్లో అన్ని విభాగాల ఉద్యోగులు వారంలో కొన్ని రోజులు ఇంటి నుంచి మిగతా రోజులు కార్యాలయానికి వచ్చి పనిచేసేలా ఆదేశాలు ఇస్తున్నాయి. ఈ విధానానికి హైబ్రిడ్ మోడల్ అనే పేరు వాడుకలోకి వచ్చింది. చిన్న కంపెనీల్లో ఉద్యోగులు వంద శాతం కార్యాలయానికి వచ్చి పనిచేస్తున్నారు. ఇప్పుడు ఐటీ కంపెనీ భవనాలు 65 శాతం ఆక్యుపెన్సీతో పని చేస్తున్నాయని ఆ వర్గాలు చెబుతున్నాయి. బహుళజాతి కంపెనీలు మాత్రం పూర్తిగా వర్క్ ఫ్రమ్ హోమ్‌ను ఎత్తేసే ఆలోచన చేయడం లేదు. అలాగని ఉద్యోగులు కార్యాలయానికి రావాలంటూ ఒత్తిడి చేయడం లేదు. కొన్ని బడా కంపెనీలు మాత్రం వంద శాతం వర్క్ ఫ్రమ్ ఆఫీస్‌ను అమలు చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నాయి. ఈ మేరకు ఇప్పటికే వారికి సందేశాలు పంపించాయి. అత్యధిక ఉద్యోగులు హైబ్రిడ్ మోడల్లో పనిచేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. దాంతో కొన్ని కంపెనీలు హైబ్రిడ్ మోడల్‌ను పాటించేందుకు సిద్ధపడుతున్నాయి. ప్రముఖ కంపెనీల్లో ఇలా.. ఇప్పటికే టీసీఎస్, మెటా, గోల్డ్‌మ్యాన్ సాక్స్, జేపీ మోర్గాన్ తదితర కంపెనీలపై కొంత వ్యతిరేకత వ్యక్తమవుతున్నా తమ ఉద్యోగులను ఆఫీసుల నుంచి పనిచేసేలా ప్రోత్సహిస్తున్నాయి. గతంలో వర్క్ ఫ్రం హోంను పూర్తిస్థాయిలో ప్రోత్సహించిన ‘జూమ్’ సంస్థ కూడా తమ ఆఫీసులకు 50 మైళ్ల పరిధిలో ఉన్న వారు వారానికి రెండురోజులు ఆఫీసుకు రావాలని చెబుతోంది. తాజాగా ఇన్ఫోసిస్ సంస్థ నెలలో 11 రోజుల పాటు ఇంటి నుంచి పని చేసేందుకు దరఖాస్తు చేసుకోవడానికి అనుమతించింది. మరో ప్రముఖ ఐటీ సంస్థ కాగ్నిజెంట్ భారత్‌లోని తమ ఉద్యోగులను వారానికి కనీసం మూడురోజులు ఆఫీసుకి వచ్చి పని చేయాలని కోరినట్లు ఒక నివేదిక తెలిపింది. ప్రయోజనాలివే.. ఉద్యోగులకు కొంతకాలంపాటు హైబ్రిడ్ వర్క్‌కు అనుమతించడం ద్వారా కంపెనీలు మౌలిక సదుపాయాల ఖర్చులను గణనీయంగా ఆదా చేయవచ్చని నిపుణులు చెబుతున్నారు. హైబ్రిడ్ పని వాతావరణం కారణంగా ఐటీ కంపెనీలు తమ మౌలిక సదుపాయాల ఖర్చుల్లో కనీసం 50% ఆదా చేసుకోవచ్చని అంచనాలు సూచిస్తున్నాయి. ఉద్యోగులు ఆసక్తిమేరకు పనిచేస్తే ఆఫీస్‌లో ఉన్నా ఇంటి దగ్గర ఉన్నా సమర్థంగా పనిచేస్తారు. అయితే కావాల్సిందల్లా వారిలో ఆసక్తిని రేకిత్తించడమే. అందుకు కంపెనీ యాజమాన్యాలు, టీమ్ నాయకులు ప్రత్యేక చొరవ చూపాలని నిపుణులు సూచిస్తున్నారు. హైబ్రిడ్ వర్క్‌లో తక్కువ ముందే ఆఫీస్‌కు వస్తారు కాబట్టి ఫోకస్‌గా పనిచేసే అవకాశం ఉంది. దాంతో ఉద్యోగులు సృజనాత్మకతతో విధులు నిర్వర్తిస్తారని చెబుతున్నారు. టీమ్‌లోని సభ్యులు వివిధ ప్రాంతాల నుంచి ఆఫీస్‌కు రావాల్సి ఉంటుంది. దాంతో క్రాస్-కల్చరల్ వాతావరణం పెంపొందుతుందని నిపుణులు తెలుపుతున్నారు. ఇదీ చదవండి: ఇక నెలకు 11 రోజులు హాయి.. ఐటీ దిగ్గజం గుడ్‌న్యూస్! మూన్‌లైటింగ్‌కు చెక్.. హైబ్రిడ్ మోడల్లో భాగంగా ప్రధానంగా పనిచేస్తున్న కంపెనీలోనే వర్క్ చేయాల్సి ఉంటుంది. ఇతర కంపెనీలకు చెందిన రహస్య పని ఒప్పందాలు(మూన్‌లైటింగ్ ) ఇకపై సాగవు. దాంతో కంపెనీల సమాచారం దుర్వినియోగం కాకుండా ఉంటుంది. వర్క్ ఫ్రమ్ హోమ్ కారణంగా కొందరు ఉద్యోగులు రహస్యంగా రెండో ఉద్యోగం (మూన్ లైటింగ్) కూడా చేస్తున్నారనే ఫిర్యాదులు ఉన్నాయి. ఇది ఉద్యోగుల నైతికత మీద ఆధారపడి ఉంది. -
ఇక నెలకు 11 రోజులు హాయి.. ఐటీ దిగ్గజం గుడ్‌న్యూస్!
వర్క్ ఫ్రమ్ హోమ్ విధానానికి పూర్తిగా స్వస్తి పలుకుతూ ఉద్యోగులను కంపెనీలు బలవంతంగా ఆఫీస్‌లకు పిలిపిస్తున్న ప్రస్తుత తరుణంలో దేశీయ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ (Infosys) కాస్త ఊరట కలిగిస్తోంది. పూర్తిగా వర్క్ ఫ్రమ్ ఆఫీస్ కాకుండా హైబ్రిడ్ వర్క్ మోడల్‌ను అనుసరిస్తోంది. తాజాగా ఉద్యోగులకు నెలకు 11 రోజుల పాటు వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకునే వెసులుబాటు కల్పిస్తోంది. ఇన్ఫోసిస్ ఉద్యోగుల ఎక్స్పీరియన్స్ ప్లాట్‌ఫామ్ ఇన్ఫీమీ (InfyMe) కొన్ని ఎంపిక చేసిన ఆఫీసుల్లో నెలలో 11 రోజుల పాటు ఇంటి నుండి పని కోసం దరఖాస్తు చేసుకోవడానికి అనుమతిస్తుంది. "మనం ఇప్పుడు హైబ్రిడ్ వర్క్ మోడల్లో ఉన్నాం. మీరు నెలకు పేర్కొన్న కొన్ని వర్క్ ఫ్రమ్ హోమ్ రోజులను పొందవచ్చు మిగిలిన రోజులలో ఆఫీస్ నుండి పని చేయవచ్చు. అదనపు వర్క్ ఫ్రమ్ హోమ్ కోసం అభ్యర్థనలు మీ మేనేజర్ ఆమోదానికి లోబడి ఉంటాయి" అని ఇన్ఫీమీ ప్లాట్‌ఫామ్‌లోని సందేశం పేర్కొంది. వారానికి ఐదు రోజులు వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అమలు చేస్తున్న ఇతర కంపెనీలకు భిన్నంగా ఇన్ఫోసిస్ గత సంవత్సరం నవంబర్ 20 నుండి జూనియర్, మధ్య స్థాయి ఉద్యోగులను నెలకు 10 రోజులు మాత్రమే వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అమలు చేస్తోంది. ఇప్పుడు తాజాగా కల్పించిన వెసులుబాటుతో వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగులకు, ముఖ్యంగా మహిళలకు ఊరట కలుగుతుంది. -
వర్క్ ఫ్రమ్ హోమ్‌కు మరో ఐటీ కంపెనీ మంగళం!
వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్న ఐటీ ఉద్యోగులకు మరో కంపెనీ ఆఫీసుకి పిలిచింది. ప్రముఖ ఐటీ సంస్థ కాగ్నిజెంట్ భారత్‌లోని తమ ఉద్యోగులను వారానికి కనీసం మూడురోజులు ఆఫీసుకి వచ్చి పని చేయాలని కోరినట్లు ఒక నివేదిక తెలిపింది. దీంతో రిమోట్ వర్కింగ్‌ను ముగించిన తాజా కంపెనీగా కాగ్నిజెంట్ అవతరించింది. వారానికి సగటున మూడు రోజులు ఆఫీసులో ఉండాలని, టీమ్ లీడర్ సూచన మేరకు నడుచుకోవాలంటూ భారత్‌లోని ఉద్యోగులకు గత వారం కాగ్నిజెంట్ సీఈఓ రవి కుమార్ పంపిన మెమోను ఉటంకిస్తూ వార్తా సంస్థ రాయిటర్స్ కథనం పేర్కొంది. అయితే ఎప్పటి నుంచి ఈ ఆదేశాలు అమలవుతాయన్నది కంపెనీ పేర్కొనలేదని నివేదిక తెలిపింది. ఆఫీసు నుండి పని చేయడం వల్ల కంపెనీ సంస్కృతిపై మంచి సహకారం, అవగాహన లభిస్తుందని కాగ్నిజెంట్ చెబుతోంది. అయితే దీని వల్ల ఫ్లెక్సిబులిటీ, వర్క్-లైఫ్ బ్యాలెన్స్ దెబ్బతింటాయని చాలా మంది ఉద్యోగులు సోషల్ మీడియా వేదికగా ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. ఆఫీస్‌లో కలిసి పనిచేస్తూ సహకార ప్రాజెక్ట్‌లు, ట్రైనింగ్, టీమ్ బిల్డింగ్ వంటి అంశాలకు సమయం కేటాయించాలని కంపెనీ సీఈవో కోరుతున్నారు. కొత్త యాప్ భారత్ కోసం కొత్త హైబ్రిడ్-వర్క్ షెడ్యూలింగ్ యాప్‌ను కూడా కాగ్నిజెంట్ ప్రారంభించనుంది. ఇది మేనేజర్లకు షెడ్యూల్‌లను సమన్వయం చేయడంలో, వారి టీమ్‌ల కోసం ఆఫీస్‌లో స్పేస్‌ను రిజర్వ్ చేయడంలో సహాయపడుతుందని మెమోలో పేర్కొన్నారు. కాగ్నిజెంట్ 3,47,700 మంది ఉద్యోగులను కలిగి ఉంది. వారిలో దాదాపు 2,54,000 మంది భారతదేశంలోనే ఉన్నారు. టీసీఎస్, విప్రో, ఇన్ఫోసిస్, హెచ్సీఎల్టెక్తో సహా అనేక భారతీయ ఐటీ కంపెనీలు ఆఫీస్‌కి వచ్చి పనిచేయాలని ఉద్యోగులను ఇప్పటికే కోరాయి. మార్చి 31 నాటికి ఉద్యోగులు వారానికి కనీసం మూడు రోజులు ఆఫీసు నుండి పని చేయడాన్ని టీసీఎస్ తప్పనిసరి చేసింది.