
కరోనా మహమ్మారి భారతదేశంలో విస్తృతంగా వ్యాపించిన తరువాత లాక్‌డౌన్ విధించిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో విద్యార్థులతో పాటు ఉద్యోగులు కూడా ఇళ్లకే పరిమితమయ్యారు. ఆ సమయంలో జూమ్ (Zoom) యాప్ ఎంతగానో ఉపయోగపడింది. కరోనా తగ్గుముఖం పట్టిన తరువాత ఉద్యోగుల వర్క్ ఫ్రమ్ హోమ్ విధానానికి చాలా కంపెనీకి స్వస్తి పలికాయి. కాగా ఇప్పుడు జూమ్ కంపెనీ వంతు వచ్చింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
నివేదికల ప్రకారం, జూమ్ కంపెనీ తన ఉద్యోగులను తిరిగి ఆఫీసుకి రావాలని కోరింది. ఆఫీసుకి 50 కిమీ దూరంలో ఉన్నవారు రిపోర్ట్ చేయాలనీ, ఇంకా దూరం ఉన్నట్లయితే వారానికి కనీసం రెండు రోజులు రావాలని విజ్ఞప్తి చేసింది. దీనికి సంబంధించిన ఒక ట్వీట్ కూడా పోస్ట్ చేసింది. ఇది సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
ఇదీ చదవండి: సంతకం చేయలేకపోయిన ఉద్యోగి.. ఎందుకో తెలిస్తే ఆశ్చర్యపోతారు!
కొంతమంది జూమ్ వీడియో ప్లాట్‌ఫాంకు ఆఫీస్ ఉందా అంటూ.. మరి కొందరు ఆఫీస్ ఉన్నా వారు అక్కడికెళ్లి ఏం చేయాలి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి కొందరు RIP వర్క్ ఫ్రమ్ హోమ్ అంటూ కామెంట్ చేశారు. కంపెనీ అధికారిక వెబ్‌సైట్ ప్రకారం, జూమ్ యునైటెడ్ స్టేట్స్‌లో డెన్వర్ అండ్ కాలిఫోర్నియాలో రెండు కార్యాలయాలను కలిగి ఉన్నట్లు సమాచారం.
ఇదీ చదవండి: ముఖేష్ అంబానీ వేతనం ఎంతో తెలుసా? మరో ఐదేళ్లూ అదే జీతం!
Zoom tells employees to return to office for work pic.twitter.com/v6X5Bo88vr
— Daily Loud (@DailyLoud) August 6, 2023