Zoom
-
బాబుగారు మనం ఫెయిల్.. లైవ్ లో షాక్ ఇచ్చిన కార్యకర్త
-
స్కూటర్లో వెళ్తూ జూమ్ మీటింగ్ !
యశవంతపుర: ఇండియన్ సిలికాన్ వ్యాలీగా పేరొందిన బెంగళూరు నగరంలో ట్రాఫిక్ గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ఈనెల 23న ఓ మహిళ తన కార్యాలయం వెళ్లేందుకు స్కూటర్లో బయలుదేరారు. ఈ నేపథ్యంలో ట్రాఫిక్‌లో చిక్కుకుపోయారు. దీంతో రోడ్డు పక్కన వాహనం నిలిపి సంస్థ నిర్వహించిన జూమ్ మీటింగ్‌లో పాల్గొన్నారు. ఈ వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. సదరు మహిళను నెటిజన్లు అభినందిస్తున్నారు. ఓ వ్యక్తి వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో అప్లోడ్ చేశాడు. -
అదిరిపోయే ఫీచర్: జూమ్ మీటింగ్‌లో ఇక ఆ ఇబ్బంది ఉండదు..
Zoom Notes Feature: వర్చువల్ మీటింగ్ ప్లాట్‌ఫామ్ జూమ్ (Zoom) అదిరిపోయే ఫీచర్‌ను తీసుకొస్తోంది. వీడియో కాల్స్ (Video Call) సమయంలో టెక్స్ట్ డాక్యుమెంట్‌ను రూపొందించడానికి, షేర్ చేయడానికి, ఏకకాలంలో ఎడిట్ చేయడానికి అనుమతించే 'నోట్స్' (Notes) అనే కొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. (Layoffs: భారత్‌లో లేఆఫ్‌లు.. విస్తుగొలుపుతున్న లెక్కలు!) ఈ నోట్స్.. జూమ్ చాట్ బాక్స్ లాగే వీడియో కాల్ స్క్రీన్‌పై ఓ వైపున కనిపిస్తాయి. కాల్లో ఉన్న వ్యక్తులు మీటింగ్ జరుగుతున్నప్పుడు మరొక స్క్రీన్‌కి మారే పని లేకుండా ఈ నోట్స్‌లో రాసుకోవడం, ఎడిట్ వంటివి చేసుకోవచ్చు. క్రియేట్ చేసిన లేదా ఎడిట్ చేసిన నోట్స్‌ను జూమ్ మీటింగ్‌లో పాల్గొన్న వారికి షేర్ చేయవచ్చు. దీని వల్ల ఇతర థర్డ్ పార్టీ డాక్యుమెంట్స్‌ను, టూల్స్‌ను ఆశ్రయించే పని ఉండదు. యూజర్లకు మరింత మెరుగైన అనుభవాన్ని అందించేందుకు వారు ఇతర కంటెంట్ మేనేజ్మెంట్ టూల్స్‌కు వెళ్లే పని లేకుండా జూమ్ ప్లాట్‌ఫారమ్‌లోనే ఉంటూ మీటింగ్ అజెండాలు, ఇతర నోట్స్ తయారు చేసుకునేలా ఈ ఫీచర్‌ను తీసుకొచ్చినట్లు జూమ్ ప్రొడక్టివిటీ అప్లికేషన్స్ హెడ్ డారిన్ బ్రౌన్ పేర్కొన్నారు. జూమ్ మీటింగ్ ప్రారంభానికి ముందు కానీ, మీటింగ్ జరుగుతున్న సమయంలో కానీ నోట్స్ ద్వారా అజెండా రూపొందించి ఇతరులకు షేర్ చేయవచ్చు. మీటింగ్ ముగిసిన తర్వాత కూడా ఈ నోట్స్‌ను ఇతరులకు షేర్ చేసే వీలు ఉంటుంది. ఇక ఈ నోట్స్‌లో ఫాంట్, స్టైలింగ్, బుల్లెట్లు, టెక్ట్స్ కలర్స్ వంటి ఆప్షన్లు ఉంటాయి. అలాగే వీటికి ఇమేజ్‌లను, లింక్‌లను యాడ్ చేయవచ్చు. ఈ నోట్స్ ఎప్పటికప్పడు ఆటోమేటిక్‌గా సేవ్ అవుతుంది. ఈ ఫీచర్ త్వరలోనే అందుబాటులోకి రానుంది. ఇదీ చదవండి: WFH: అక్కడ వర్క్ ఫ్రమ్ హోం.. కంపెనీలకు పోలీసు శాఖ సూచన -
ఉద్యోగులకు షాకిచ్చిన కంపెనీ.. ఇక ఆ విధానానికి చెక్!
కరోనా మహమ్మారి భారతదేశంలో విస్తృతంగా వ్యాపించిన తరువాత లాక్డౌన్ విధించిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో విద్యార్థులతో పాటు ఉద్యోగులు కూడా ఇళ్లకే పరిమితమయ్యారు. ఆ సమయంలో జూమ్ (Zoom) యాప్ ఎంతగానో ఉపయోగపడింది. కరోనా తగ్గుముఖం పట్టిన తరువాత ఉద్యోగుల వర్క్ ఫ్రమ్ హోమ్ విధానానికి చాలా కంపెనీకి స్వస్తి పలికాయి. కాగా ఇప్పుడు జూమ్ కంపెనీ వంతు వచ్చింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నివేదికల ప్రకారం, జూమ్ కంపెనీ తన ఉద్యోగులను తిరిగి ఆఫీసుకి రావాలని కోరింది. ఆఫీసుకి 50 కిమీ దూరంలో ఉన్నవారు రిపోర్ట్ చేయాలనీ, ఇంకా దూరం ఉన్నట్లయితే వారానికి కనీసం రెండు రోజులు రావాలని విజ్ఞప్తి చేసింది. దీనికి సంబంధించిన ఒక ట్వీట్ కూడా పోస్ట్ చేసింది. ఇది సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇదీ చదవండి: సంతకం చేయలేకపోయిన ఉద్యోగి.. ఎందుకో తెలిస్తే ఆశ్చర్యపోతారు! కొంతమంది జూమ్ వీడియో ప్లాట్‌ఫాంకు ఆఫీస్ ఉందా అంటూ.. మరి కొందరు ఆఫీస్ ఉన్నా వారు అక్కడికెళ్లి ఏం చేయాలి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి కొందరు RIP వర్క్ ఫ్రమ్ హోమ్ అంటూ కామెంట్ చేశారు. కంపెనీ అధికారిక వెబ్సైట్ ప్రకారం, జూమ్ యునైటెడ్ స్టేట్స్లో డెన్వర్ అండ్ కాలిఫోర్నియాలో రెండు కార్యాలయాలను కలిగి ఉన్నట్లు సమాచారం. ఇదీ చదవండి: ముఖేష్ అంబానీ వేతనం ఎంతో తెలుసా? మరో ఐదేళ్లూ అదే జీతం! Zoom tells employees to return to office for work pic.twitter.com/v6X5Bo88vr — Daily Loud (@DailyLoud) August 6, 2023 -
వాట్సాప్ నుంచి కొత్త ఫీచర్.. గూగుల్ మీట్ తరహాలో
ప్రముఖ ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్ ‘వాట్సాప్’ యూజర్లను ఆకట్టుకునేందుకు ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్లను అందుబాటులోకి తెస్తున్న విషయం తెలిసిందే. అయితే, తాజాగా వీడియో కాల్స్ చేసే సమయంలో యూజర్లు వినియోగార్ధం స్క్రీన్ షేరింగ్ ఫీచర్‌ను విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. జూమ్, గూగుల్ మీట్, మైక్రోసాఫ్ట్ టీమ్స్ తరహాలో వీడియో కాల్స్ చేస్తున్నప్పుడు స్క్రీన్ షేరింగ్ ఆప్షన్ ఉంది. ఇప్పుడు వాట్సాప్ సైతం అదే తరహాలో ‘స్క్రీన్ షేరింగ్’ ఆప్షన్ తెచ్చేందుకు నిమగ్నమైంది. ప్రస్తుతం ఈ ఫీచర్‌పై బీటా టెస్టర్లకు అందుబాటులో ఉందని, త్వరలో అందరికి పూర్తిస్థాయిలో వినియోగించేలా విడుదల కానుందని వాబీటా ఇన్ఫో వెల్లడించింది. ఇక, స్క్రీన్ ఫీచర్ ముఖ్య ఉద్దేశం..యూజర్లు వీడియో కాల్ మాట్లాడే సమయంలో అదే కాల్‌ను ఇతరులకు షేర్ చేసేలా డెవెలప్ చేస్తోంది. స్క్రీన్ కింద కొత్తగా స్క్రీన్ షేరింగ్ బటన్ అందిస్తున్నది. ఈ బటన్ క్లిక్ చేస్తే సరి.. మీ ఫోన్ లో చేసేది ప్రతిదీ రికార్డు అవుతుంది. అవతలి వ్యక్తికి కూడా షేర్ అవుతుంది. అయితే ఇలా వీడియో కాలింగ్ రికార్డు చేయడానికి యూజర్ అనుమతి తీసుకోవడం తప్పనిసరి. -
పొంగి పొర్లిన శివ భక్తి.. ఖండాంతరాల్లో శివ పద నాద తరంగాలు!
శివ పదాలు అంటే మహా దేవుడైన శివుని భావస్వరాంజలులే, అటువంటి పదాలను పూజ్య గురువులు బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ దాదాపు 1100 పైగా అత్యద్భుతంగా రచించారు. ఋషీపీఠం ఆధ్వర్యంలో మూడవ శివపద అంతర్జాతీయ అంతర్జాల పాటల పోటీలు ఈ మే నెల 12,13,14వ తేదీల్లో యూట్యూబ్ మాధ్యమంగా శివపదాంకిత వాణీ, నాగసంపత్ వారణాసి, శ్రీకాంత్ వడ్లమాని, శ్రీనివాస్ మేడూరు సహకారంతో నిర్వహించారు. శివపద గీతాల పోటీను పూర్తిగా విన్న షణ్ముఖ శర్మ.. ఇంత మంది చిన్నారులు, పెద్దలూ అందరూ భావానికి ప్రాధాన్యమిస్తూ వందల కొద్దీ శివ పదాలను పాడటం ఎంతో సంతోషాన్ని కలిగిస్తోందని శివాశీస్సులు అందించారు. ఈ పోటీలు ఇంత అద్భుతంగా నిర్వహించినందుకు "గ్లోబల్ శివపదం టీం"ను, న్యాయనిర్ణేతలను అభినందించి ఆశీర్వదించారు. ఋషిపీఠం తరఫున పూర్ణ సహకారాలు అందించినందుకు శ్రీ మారేపల్లి సూర్యనారాయణకు, విద్యుత్ అంతరాయాలు ఉన్నా కార్యక్రమంలో ఎటువంటి అంతరాయాలూ రాకుండా మెరుగైన సాంకేతిక సహకారం అందించిన శ్రీ తోలేటి వెంకట పవన్ కి ప్రత్యేక ఆశీస్సులు అందించారు. మొత్తం 5 ఖండాలలోని వివిధ దేశాల నుంచి 300 మంది ఔత్సాహికులు ఈ పాటల పోటీల్లో పాల్గునగా, 17 మంది ప్రఖ్యాత సంగీత గురువులు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు. వీరిలో భారతదేశం నుంచి శారదా సుబ్రమణియమ్, తులసి విశ్వనాథ్, పద్మ త్యాగరాజన్,పెద్దాడ సూర్యకుమారి, విష్ణుప్రియ భరధ్వాజ్, విద్యా భారతి, రాధికా కృష్ణ, శ్రీదేవి దేవులపల్లి, లక్ష్మి మూర్తి, మోహన కృష్ణ, ప్రతిమ పాల్గొన్నారు. అమెరికా నుంచి పావని మల్లాజ్యోస్యుల, లక్ష్మి కొలవెన్ను, అనీల కుమార్ గరిమెళ్ళ , లలిత రాంపల్లి, ప్రభల శ్రీనివాస్ పాల్గొన్నారు. అంతే కాకుండా సింగపూర్ నుంచి శేషు కుమారి యడవల్లి న్యాయ నిర్ణేతలుగా ఉన్నారు. వయసులవారీగా ఉపమన్యు, మార్కండేయ, భక్త కన్నప్ప, నత్కీర, పుష్పదంత అనే 5 విభాగాలలో ఈ పోటీలు నిర్వహించారు. ఇందులో ప్రవాసులయిన ఎందరో పిల్లలు సంప్రదాయబద్ధమైన వస్త్రధారణతో, స్పష్టమైన ఉఛ్చారణతో శృతి, లయ బద్ధంగా శివపదాలను అద్భుతంగా వీనులవిందుగా పాడారు. న్యాయనిర్ణేతలు తగు సూచనలు, ప్రోత్సాహం అందిస్తూ ఉత్సాహవంతంగా కార్యక్రమాన్ని నిర్వహించారు. పోటీలలో పాల్గొనటం వలన పిల్లలకు సంప్రదాయం, సత్ప్రవర్తన అలవడుతుందని కొందరు న్యాయ నిర్ణేతలు అన్నారు. ఈ కార్యక్రమం మొత్తం అంతా శివమయంగా మారిపోయింది. పాడే వారు, వినే వారు అందరూ కూడా శివ భక్తి సారంలో తన్మయులయ్యారు. రసరమ్యముగా సాగిన ఈ కార్యక్రమం శుక్రవారం మొదలై ఆదివారం రోజు ముగిసింది. అప్పుడే పోటీలు అయిపోయాయా అన్నట్టుగా ఉందని, వచ్చే ఏడాది కోసం ఇప్పటి నించే వేచిచూస్తామని న్యాయనిర్ణేతలుగా వ్యవహరించినవారు అన్నారు. ఇలాంటి శివపద భక్తిభావనలో ఓలలాడే అవకాశం రావటం తమ అదృష్టంగా భావిస్తామని, గాయకులూ, నిర్వాహకులూ, న్యాయనిర్ణేతలు, వీక్షకులూ అంతా అన్నారు. -
జూమ్‌కు టెలికం లైసెన్సు - ఇక వారికి పండగే..!
న్యూఢిల్లీ: వెబ్ కాన్ఫరెన్స్ కంపెనీ జూమ్ వీడియో కమ్యూనికేషన్స్ (జెడ్వీసీ)కి తాజాగా భారత్‌లో దేశవ్యాప్త టెలికం లైసెన్స్ లభించింది. దీంతో ఇకపై బహళ జాతి కంపెనీలు, వ్యాపార సంస్థలకు తమ క్లౌడ్ ఆధారిత ప్రైవేట్ ఎక్స్చేంజ్ (పీబీఎక్స్) ’జూమ్ ఫోన్’ టెలిఫోన్ సర్వీసులను కూడా అందించడానికి వీలవుతుందని జెడ్వీసీ జీఎం సమీర్ రాజె తెలిపారు. భారత మార్కెట్‌కు కట్టుబడి ఉన్న తమకు ఇది కీలక మైలురాయిలాంటిదని ఆయన పేర్కొన్నారు. దేశీ యూజర్లకు వినూత్న సొల్యూషన్స్ అందించేందుకు కృషి చేస్తామన్నారు. -
జూమ్‌లో.. కామ్‌గా ఆధారాలు ధ్వంసం!
సాక్షి, అమరావతి: మార్గదర్శి చిట్‌ఫండ్స్ అక్రమ వ్యవహారాల కేసులో ఉక్కిరిబిక్కిరి అవుతున్న చెరుకూరి రామోజీరావు (ఏ–1) కీలక ఆధారాలను మాయం చేసేందుకు విఫలయత్నం చేసినట్లు బహిర్గతమైంది. మార్గదర్శి బ్రాంచ్ కార్యాలయాల్లో కీలక ఆధారాలు, రికార్డులను గుట్టు చప్పుడు కాకుండా ధ్వంసం చేసినట్లు తాజాగా సీఐడీ అధికారులు గుర్తించారు. ఈ తతంగాన్ని హైదరాబాద్‌లోని మార్గదర్శి ప్రధాన కార్యాలయం నుంచే పర్యవేక్షించారని, అందుకోసం ఫోర్మెన్లతో ప్రత్యేకంగా జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించినట్లు తేలింది. ఏ ఒక్కటీ ఆధారం దొరకకుండా రికార్డులు డిలీట్ చేయాలని మార్గదర్శి చిట్స్ బ్రాంచీల సిబ్బందిని ఆదేశించిన యాజమాన్యం జూమ్ మీటింగ్‌లో అర్థరాత్రి దాకా ఈ వ్యవహారాన్ని పర్యవేక్షించినట్లు వెలుగు చూసింది. మరోవైపు గత డిసెంబర్ నుంచి రాష్ట్రవ్యాప్తంగా తమ లావాదేవీలు దాదాపు స్తంభించిపోవడంతో గొలుసుకట్టు తరహా మోసాలకు అలవాటుపడిన మార్గదర్శి యాజమాన్యం కొత్త చిట్టీలు లేకపోవడంతో దిక్కులు చూస్తోంది. పాడుకున్న చిట్టీల మొత్తం కోసం చందాదారులు మార్గదర్శి కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తుండగా.. రశీదు రూపంలో డిపాజిట్లు చేసిన వారిలో ఆందోళన నెలకొంది. తమ వివరాలు ఏమవుతాయోనన్న ఆందోళన ఖాతాదారుల్లో నెలకొంది. అడ్డదారిలో.. గుట్టుగా మార్గదర్శి చిట్‌ఫండ్స్ ఆర్థిక అక్రమ వ్యవహారాల కేసులో తిమ్మిని బమ్మిని చేసేందుకు రామోజీరావు బరి తెగించారు. నిధుల మళ్లింపు, అక్రమ పెట్టుబడులు పెట్టినట్లు తేలడంతో కేసు దర్యాప్తును తప్పుదారి పట్టించేందుకు అడ్డదారులు పట్టారు. మార్గదర్శి చిట్‌ఫండ్స్ బ్రాంచి కార్యాలయాల్లో కీలక ఆధారాలు, రికార్డులను ధ్వంసం చేయించారు. దర్యాప్తులో ఉన్న కేసుకు సంబంధించిన ఆధారాలను ధ్వంసం చేయకూడదన్న నిబంధనను అతిక్రమించారు. గతంలో కూడా మార్గదర్శి ఫైనాన్సియర్స్ పేరిట రామోజీరావు అక్రమంగా రూ.2,600 కోట్ల డిపాజిట్లు వసూలు చేసినట్లు 2006లో బయటపడింది. నాడు రిజర్వు బ్యాంకు ఆదేశాలతో వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వ హయాంలో సీఐడీ విభాగం మార్గదర్శి ఫైనాన్సియర్స్‌పై కేసు నమోదు చేసింది. దీంతో డిపాజిట్లు వసూలు చేయడం తమ తప్పిదమేనని రామోజీరావు అంగీకరించారు. ఆ కేసు దర్యాప్తులో ఉండగానే మార్గదర్శి ఫైనాన్సియర్స్‌ను ఆయన హఠాత్తుగా మూసివేశారు. ఇప్పుడు మార్గదర్శి చిట్‌ఫండ్స్ కేసులో కూడా అదే తరహాలో రికార్డులను నాశనం చేసే ప్రక్రియను గుట్టు చప్పుడు కాకుండా ముగించారు. అర్ధరాత్రి విధ్వంసం.. జూమ్‌లో పర్యవేక్షణ మార్గదర్శి కార్యాలయాల్లో సోదాలను సీఐడీ అధికారులు విస్తృతం చేయడంతో బెంబేలెత్తిన రామోజీరావు తనకు అలవాటైన రీతిలో ఆధారాలను ధ్వంసం చేసేందుకు సిద్ధపడ్డారు. అందుకోసం బ్రాంచి కార్యాలయాల మేనేజర్లతో (ఫోర్‌మెన్) మార్గదర్శి చిట్‌ఫండ్స్ యాజమాన్యం ప్రత్యేకంగా జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించింది. అక్రమ వ్యవహారాలకు సంబంధించిన పత్రాలు, రికార్డులు, ఇతర ఆధారాలను ఎలా ధ్వంసం చేయాలో వారికి క్షుణ్నంగా వివరించారు. ఈ తతంగాన్ని హైదరాబాద్‌లోని మార్గదర్శి ప్రధాన కార్యాలయం నుంచే పర్యవేక్షించారు. ప్రధాన కార్యాలయానికి మళ్లించిన చందాదారుల నగదు వివరాలు, భారీగా నిధుల తరలింపు, రశీదుల ముసుగులో అక్రమ డిపాజిట్ల వసూలు, పాట పాడిన చందాదారులకు చిట్టీ మొత్తం ఇవ్వకుండా కొంత మొత్తాన్ని అక్రమ డిపాజిట్‌గా అట్టిపెట్టడం, యాజమాన్య వాటా కింద అట్టిపెట్టిన చిట్టీల టికెట్లు, వాటిపై చందా చెల్లించకుండానే చెల్లించినట్టుగా మాయ చేయడం.. వీటన్నింటికి సంబంధించిన రికార్డులు, పత్రాలను ఆన్లైన్లో, ఆఫ్లైన్లోనూ ఎలా ధ్వంసం చేయాలో మార్గదర్శి ప్రధాన కార్యాలయ అధికారులు బ్రాంచి మేనేజర్లకు వివరించారు. ఆధారాల ధ్వంసం ప్రక్రియను ప్రధాన కార్యాలయం నుంచే అర్ధరాత్రి వరకూ పర్యవేక్షించారు. సీఐడీ అధికారులు తాజాగా నిర్వహించిన సోదాల్లో ఈ వ్యవహారం బహిర్గతం కావడంతో తీవ్రంగా పరిగణిస్తున్నారు. ధ్వంసం చేసిన ఆధారాలు, ఆన్లైన్ రికార్డులను సీఐడీ విభాగం రిట్రీవ్ చేసింది. డిసెంబర్ నుంచి కొత్త చిట్టీలు లేవు మార్గదర్శి అక్రమ వ్యవహారాలు వెలుగులోకి రావడంతో కొత్త చిట్టీలు వేసేందుకు చందాదారులు ముందుకు రావడం లేదు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా మార్గదర్శి చిట్‌ఫండ్స్ బ్రాంచి కార్యాలయాల్లో ఆర్థిక కార్యకలాపాలు 2022 డిసెంబర్ నుంచి దాదాపుగా స్తంభించిపోయాయి. కేంద్ర చిట్‌ఫండ్స్ చట్టం నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలని చిట్ రిజిస్ట్రార్ స్పష్టం చేస్తుండగా రామోజీరావు ఆ చట్టాన్ని ఏనాడూ పట్టించుకోలేదు. దీంతో కొత్త చిట్టీలు ఆగిపోయాయి. స్టాంపులు–రిజిస్ట్రేషన్ శాఖ అధికారుల సోదాల్లో బయటపడిన వివరాల ప్రకారం రాష్ట్రంలో మార్గదర్శి 37 బ్రాంచి కార్యాలయాల్లో రూ.273 కోట్ల వేలం టర్నోవర్‌తో 2,357 చిట్టీలను నిర్వహిస్తున్నారు. ప్రతి నెలా రూ.6.29 కోట్లు వేలం టర్నోవర్ విలువ ఉన్న 148 కొత్త చిట్టీలను ప్రారంభిస్తారు. వాటిపై మార్గదర్శి యాజమాన్యానికి కమీషన్ రూపంలోనే రూ.31.45 లక్షల వస్తాయి. డిసెంబర్ నుంచి చందాదారులు ముందుకు రాకపోవడంతో ఏకంగా 1,200కుపైగా కొత్త చిట్టీలు ప్రారంభం కాలేదు. రూ.51 కోట్ల వేలం టర్నోవర్ ఉన్న చిట్టీలు నిలిచిపోయాయి. ఆ మొత్తాన్ని మ్యూచ్‌వల్ ఫండ్స్, షేర్ మార్కెట్లతోపాటు తమ సొంత సంస్థల్లో పెట్టుబడిగా మళ్లించేందుకు సాధ్యం కావడం లేదు. ఇక కమీషన్ రూపంలో రూ.2.55 కోట్ల మేర మార్గదర్శి యాజమాన్యానికి రాకుండా పోయింది. కొత్త చిట్టీల కోసం చందాదారులను రప్పించేందుకు బ్రాంచి మేనేజర్ల ద్వారా చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. చందాదారుల ప్రదక్షిణలు... డిపాజిట్‌దారుల్లో ఆందోళన గతేడాది డిసెంబర్ నుంచి కొత్త చిట్టీలు ప్రారంభం కాకపోవడంతో మార్గదర్శి చిట్‌ఫండ్స్‌లో మనీ సర్క్యులేషన్ నిలిచిపోయింది. పాత చిట్టీల చందాదారులు చెల్లించిన మొత్తాన్ని రామోజీరావు అక్రమంగా తమ సొంత సంస్థల్లో పెట్టుబడులుగా మళ్లించేశారు. రశీదు రూపంలో సేకరించిన అక్రమ డిపాజిట్లను మ్యూచ్‌వల్ ఫండ్స్, షేర్ మార్కెట్లో పెట్టుబడిగా పెట్టారు. కొత్త చిట్టీలు ప్రారంభమైతే ఆ చందాదారులు చెల్లించే మొత్తాన్ని పాత చిట్టీలు పాడిన వారికి చెల్లిస్తుంటారు. గడువు తీరిన అక్రమ డిపాజిట్ల విత్‌డ్రాయల్స్ మొత్తంగా చెల్లించడం, వడ్డీలు చెల్లించడం మొదలైన వ్యవహారాలు నిర్వహించేవారు. ప్రతి చిట్టీలోనూ యాజమాన్యం వాటా కింద అట్టిపెట్టుకున్న టికెట్ల చందా మొత్తాన్ని కూడా అవే నిధుల్లో చెల్లించినట్టు రికార్డుల్లో మాయ చేసేవారు. ఈ గొలుసు కట్టు తరహా మోసాన్ని దశాబ్దాలుగా చేస్తున్నారు. ఇప్పుడు కొత్త చిట్టీలు లేనందున మార్గదర్శి లావాదేవీలు నిలిచిపోయాయి. పాత చిట్టీలు పాడిన చందాదారులకు సకాలంలో చెల్లించడం లేదు. తాము ష్యూరిటీ సంతకాలన్నీ చేయించినా చిట్టీ మొత్తం చెల్లించకపోవడంతో చందాదారులు ఆందోళన చెందుతున్నారు. మార్గదర్శి కార్యాలయాల చుట్టూ మండుటెండల్లో ప్రదక్షిణలు చేస్తున్నారు. విజయవాడలోని లబ్బీపేట, విశాఖపట్నంలోని సీతంపేట, గుంటూరు అరండల్‌పేట బ్రాంచి కార్యాలయాలకు వచ్చి రిక్త హస్తాలతో వెనుదిరుగుతున్నారు. దీనిపై కొందరు చిట్ రిజిస్ట్రార్‌కు ఫిర్యాదులు కూడా చేస్తుండటం గమనార్హం. మరోవైపు గతంలో చిట్టీలు పాడిన మొత్తాన్ని వారికి చెల్లించకుండా రశీదు ఇచ్చి అక్రమంగా డిపాజిట్లు సేకరించారు. మార్గదర్శి అక్రమాలు బయటపడటంతో ఆ డిపాజిట్‌దారులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. తమ డిపాజిట్ మొత్తాన్ని తిరిగి ఇవ్వాలని, వడ్డీ లేకపోయినా అసలైనా ఇవ్వాలని ఒత్తిడి చేస్తున్నారు. బ్రాంచి కార్యాలయాల నుంచి సరైన స్పందన లేకపోవడంతో వారిలో ఆందోళన తీవ్రమవుతోంది. కొందరు సీఐడీ అధికారులను కూడా సంప్రదించడం ప్రాధాన్యం సంతరించుకుంది. మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ను నమ్మి తమ కష్టార్జితాన్ని ధారపోసి నిండా మునిగిపోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా నిబంధనలు పాటిస్తే ఈ పరిస్థితి తలెత్తేది కాదని, ప్రతి చిట్కూ ఓ బ్యాంకు ఖాతా ఉంటే జాప్యానికి ఆస్కారమే ఉండదని, నిధుల మళ్లింపు జరగకుంటే చిట్‌దారులకు చెల్లింపులు ఆలస్యమయ్యేవి కావని అధికారులు పేర్కొంటున్నారు. -
అదంతా ఫేకేనా.. శాంసంగ్ చీటింగ్ చేస్తోందా?
అత్యంత కెమెరా జూమింగ్ సామర్థ్యంతో శాంసంగ్ అల్ట్రా సిరీస్ స్మార్ట్ఫోన్లను గత నెలలో విడుదల చేసింది. ఇందులో ముఖ్యంగా శాంసంగ్ గెలాక్సీ ఎస్23 అల్ట్రా ఫోన్ స్పేస్ జూమ్ ఫీచర్‌తో వచ్చింది. అయితే ఈ ఫోన్ తీసే స్పేస్ జూమ్ ఫోటోలు నకిలీవని తాను చేసిన పరిశోధనలో తేలిందని ఓ రెడిట్ యూజర్ పేర్కొన్నారు. ఇదీ చదవండి: Oscar Award: థియేటర్ నుంచి ఆస్కార్‌కు.. ఈ పాప్‌కార్న్ గయ్ మామూలోడు కాదు.. ఇటీవల శాంసంగ్ గెలాక్సీ ఎస్23 జూమ్ లెన్స్‌లతో తీసిన చంద్రుని ఫోటోలను అందరూ ఆసక్తిగా చూశారు కానీ వాటి ప్రామాణికతపై తనకు మొదటి నుంచే సందేహాలు ఉన్నాయని, అవి పూర్తిగా అసలైనవి కావని అని రెడిట్‌లో ibreakphotos అనే పేరుతో ఉన్న ఓ యూజర్ పోస్ట్ చేశారు. దానికి సంబంధంచి పూర్తి వివరణ కూడా అందులో ఇచ్చారు. ఇదీ చదవండి: Oscar Awards: ఆస్కార్ నామినీలకు ఆస్ట్రేలియాలో భూమి! కానీ.. తాను ఇంటర్నెట్ నుంచి చంద్రుని హై రెజల్యూషన్ ఫొటోను డౌన్లోడ్ చేసి దాని సైజ్ తగ్గించి గాస్సియన్ బ్లర్‌ను అప్లయి చేశానని, దీంతో అస్పష్టంగా మారిందని రెడిట్ యూజర్ పేర్కొన్నారు. ఆ తర్వాత దాన్ని శాంసంగ్ స్పేస్ జూమ్ కెమెరాతో ఫొటో తీస్తే ఆ ఫొటో చాలా స్పష్టంగా వచ్చిందని తెలిపారు. కానీ అది అసలైన ఫొటో కాదని, ఇలా అస్పష్టంగా ఉన్న ఫొటో స్పష్టంగా చేసేందుకు శాంసంగ్ ఏఐ(ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్) మోడల్‌ను ఉపయోగిస్తోందని ఆరోపించారు. ఇదీ చదవండి: ట్విటర్ తరహాలో మెటా.. జుకర్‌బర్గ్‌పై ఎలాన్ మస్క్ తీవ్ర వ్యాఖ్యలు! -
జూమ్ ప్రెసిడెంట్‌కి షాక్ ఇచ్చిన కంపెనీ: కారణం లేకుండానే
ప్రముఖ వీడియో కాన్ఫరెన్సింగ్ సంస్థ ‘జూమ్’ కారణం లేకుండానే ప్రెసిడెంట్ Greg Tombను ఫైర్ చేసింది. సేల్స్ ఆపరేషన్స్, ఎర్నింగ్స్ కాల్స్‌లో కీరోల్ పోషించిన జార్జ్‌ను విధులు తొలగించడం చర్చాంశనీయంగా మారింది. మార్చి 03న జూమ్ తన రెగ్యులరేటరీ ఫైలింగ్‌లో జార్జ్‌కు సంస్థ తరుపు నుంచి అన్నీ ప్రయోజనాలకు కల్పిస్తూ ఎలాంటి కారణం లేకుండానే ఫైర్ చేస్తున్నట్లు పేర్కొంది. గత నెలలో జూమ్ కంపెనీ 15 శాతం వర్క్ ఫోర్స్‌తో 1,300 మందిని ఫైర్ చేసింది. వారిలో సీఈవో ఎరిక్ యువాన్ సైతం ఉన్నారు. గూగుల్ ఉద్యోగిగా విధులు నిర్వహించిన యువాన్ జూన్ 2022లో జూమ్‌లో చేరారు. వీడియో కాన్ఫరెన్స్ సర్వీసుల్లోని అవకాశాల్ని ఒడిసి పట్టుకొని సంస్థను లాభాలవైపు నడిపించారు. వందల కోట్ల స్టాక్ గ్రాంట్ అనూహ్యంగా పింక్ స్లిప్ జారీ చేసిన ప్రెసిడెంట్ జార్జ్ టాంబ్కు 45 మిలియన్ల విలువైన కంపెనీ స్టాక్స్‌తో పాటు బేస్ శాలరీ 4లక్షల బిలియన్ డాలర్లు, గతేడాది జూన్ నెలలో కంపెనీ 8శాతం బోనస్‌గా ఇస్తున్నట్లు తన ఫైలింగ్‌లో పేర్కొంది. ఈ సందర్భంగా జూమ్ అధికార ప్రతినిధి శాన్ జోస్ మాట్లాడుతూ.. మాజీ ప్రెసిడెంట్ జార్జ్ టాంబ్ స్థానంలో మరో వ్యక్తిని నియమించుకుంటున్నట్లు తెలిపారు, కానీ జార్జ్‌ను ఎందుకు తొలగించారనేదాని మీద ఎటువంటి స్పష్టత ఇవ్వలేదు. -
Zoom layoffs: అరగంటలో 1300 ఉద్యోగాలు ఊస్టింగ్
వీడియో కాన్ఫరెన్సింగ్ సేవలు అందించే సంస్థ జూమ్ కూడా లేఆఫ్స్ కంపెనీల జాబితాలో చేరింది. తమ వర్క్‌ఫోర్స్‌లో 15 శాతం లేదా 1300 మంది ఉద్యోగుల్ని తొలగిస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు కంపెనీ సీఈఓ ఎరిక్ యువాన్ మంగళవారం ఒక బ్లాగ్ పోస్ట్ చేశారు. తొలగిస్తున్న ఉద్యోగులకు 30 నిమిషాల్లో మెయిల్ ద్వారా సమాచారం అందిస్తామన్నారు. కరోనా సమయంలో ఇంటి దగ్గర నుంచి పనిచేసేవారు ఎక్కువైన నేపథ్యంలో డిమాండ్‌కు తగ్గట్లుగా ఎక్కువ మందిని నియమించుకోవాల్సి వచ్చిందని, ఇప్పుడు కొందరిని తొలగించక తప్పట్లేదని వివరణ ఇచ్చారు. డిమాండ్‌ను అందుకోవడానికి 24 నెలల వ్యవధిలో ఉద్యోగుల్ని మూడు రెట్లు ఎక్కువగా నియమించుకున్నట్లు వివరించారు. ఇప్పట్లో అలా కొనసాగడం కష్టమని చెప్పిన ఎరిక్.. సంస్థ దీర్ఘకాల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందన్నారు. కష్టపడి పనిచేస్తున్న, ప్రతిభావంతులైన 1300 మంది ఉద్యోగులకు గుడ్‌బై.. అంటూ భావోద్వేగ పూరిత లేఖ రాశారు. ఉద్యోగం కోల్పోయిన వారందరికీ 30 నిమిషాల్లో మెయిల్స్ వస్తాయని, ఈ విధంగా సమాచారం అందిస్తున్నందుకు తనను క్షమించాలని కోరారు. (ఇదీ చదవండి: విప్రో బాటలో ఇన్ఫీ: 600 మంది ఫ్రెషర్లు ఔట్!) జీతంలో 98 శాతం కోత మరోవైపు కంపెనీ ఖర్చును తగ్గించేందుకు సీఈఓ ఎరిక్ కీలక నిర్ణయం తీసుకున్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో తన వేతనంలో ఏకంగా 98 శాతం కోత విధించుకున్నట్లు సంచలన నిర్ణయం ప్రకటించారు. ప్రస్తుత పరిస్థితికి జవాబుదారీగా తాను ఈ నిర్ణయం తీసుకున్నానని, 2023లో కార్పొరేట్ బోనస్‌ను కూడా వదులుకుంటున్నానని వెల్లడించారు. ఇంకా ఎగ్జిక్యూటివ్ లీడర్షిప్ టీమ్ కూడా తమ కనీస వేతనాలను 20 శాతం మేర తగ్గించుకుంటున్నాయన్నారు. ఇక ఉద్యోగం కోల్పోయిన వారు యూఎస్‌లో ఉన్నట్లయితే వారికి 16 వారాల వేతనం, హెల్త్‌కేర్ కవరేజీ, యాన్యువల్ బోనస్ అందుతాయని తెలిపారు. -
ఎఫ్ఎంసీజీ కంపెనీలకు ‘వింటర్’ దన్ను
న్యూఢిల్లీ: చలి పెరగడంతో చర్మ, ఆరోగ్య సంరక్షణ ఉత్పత్తుల కొనుగోళ్లు పెరిగాయి. ఈ సీజన్‌తో అయినా గ్రామీణ ప్రాంతాల్లో తమ ఉత్పత్తుల అమ్మకాలు పుంజు కుంటాయని ప్రముఖ ఎఫ్ఎంసీజీ కంపెనీలు అంచనా వేసుకుంటున్నాయి. రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత తగ్గుముఖం పట్టనుండడంతో వినియోగం మరింత పెరుగు తుందని, గ్రామీణ ప్రాంతాల నుంచి వృద్ధి రికవరీ ఉంటుందని భావిస్తున్నాయి. డాబర్, ఇమామీ, మారికో కంపెనీలకు సంబంధించి చర్మ సంరక్షణ, రోగ నిరోధక శక్తిని పెంచే (చ్యవన్‌ప్రాశ్) ఉత్పత్తుల అమ్మకాలు గ్రామీణ ప్రాంతాల్లో, ఈ కామర్స్ వేదికలపై పెరిగాయి. ఈ ఏడాది సాగు బలంగా ఉండడం, ద్రవ్యోల్బణం తగ్గుముఖం పడుతున్నందున, రానున్న త్రైమాసికాల్లో గ్రామీణ ప్రాంత అమ్మకాలు బలపడతాయన్న అంచనాలు కంపెనీల్లో ఉన్నాయి. 50 శాతం మేర వృద్ధి తమ ఉత్పత్తుల్లో బాడీ లోషన్, సఫోలా ఇమ్యూనివేద శ్రేణి తదితర అమ్మకాలకు శీతాకాలం కీలకమని మారికో ఇండియా బిజినెస్ సీవోవో సంజయ్ మిశ్రా తెలిపారు. ఈ ఏడాది కూడా అమ్మకాలు బలంగా ఉంటాయని అంచనా వేస్తున్నట్టు చెప్పారు. ఇప్పటికే హెయిర్ ఆయిల్ అమ్మకాలు పెరిగాయని తెలిపారు. గత కొన్ని నెలలుగా చూస్తే బాడీ లోషన్ అమ్మకాలు క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే రెండంకెల స్థాయిలో పెరిగాయన్నారు. కనుక అంతక్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే బాడీలోషన్ అమ్మకాల్లో 50 శాతానికి పైనే వృద్ధి నమోదు చేయగలమని భావిస్తున్నట్టు మిశ్రా చెప్పారు. మంచి డిమాండ్.. ఈ ఏడాది పండుగల సీజన్ తమకు రికవరీపై ఆశలు కలిగించినట్టు డాబర్ ఇండియా సీవోవో ఆదర్శ్ శర్మ తెలిపారు. డాబర్ చ్యవన్ ప్రాశ్, డాబర్ హనీ, గులాబరితోపాటు, చర్మ సంరక్షణ ఉత్పత్పత్తులతో వింటర్ పోర్ట్‌ఫోలియోను రూపొందించామని చెప్పారు. ప్రస్తుతం శీతాకాలం ప్రారంభంలో ఉన్నామని, తమ ఉత్పత్తులకు డిమాండ్ కనిపిస్తోందని చెబుతూ.. ఈ ఏడాది మంచి వృద్ధి నమోదు అయితే, తదుపరి డిమాండ్‌కు ఊతంగా నిలుస్తుందన్నారు. పట్టణాలతో పోలిస్తే గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్ తక్కువగా ఉందన్నారు. ఈ ఏడాది సాగు మంచిగా ఉండడంతో వచ్చే త్రైమాసికంలో అమ్మకాలు పుంజుకుంటాయన్న అంచనాను వ్యక్తీకరించారు. ఈ ఏడాది వింటర్ ఉత్పత్తులకు డిమాండ్ కనిపిస్తున్నట్టు ఇమామీ సేల్స్ ప్రెసిడెంట్ వినోద్ రావు తెలిపారు. ద్రవ్యోల్బణం ఉన్నప్పుటికీ శీతాకాలంలో వినియోగించే ఉత్పత్తులకు గ్రామీణ ప్రాంతాల్లో మంచి రికవరీ కనిపిస్తుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. హెచ్‌యూఎల్, డాబర్, ఇబామీ చర్మ సంరక్షణ విభాగంలో అధిక వాటాను ఆక్రమిస్తున్నాయని, ఇటీవల పామాయిల్, ముడి చమురు ధరలు తగ్గడం వల్ల తయారీ వ్యయాల పరంగా ఇవి లాభపడతాయని నువమా గ్రూపు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అబనీష్ రాయ్ అంచనా వేశారు. క్రమంగా పెరుగుతున్న -
వైరల్ వీడియో: ఖెర్సన్ జూలో జంతువులను ఎత్తుకుపోతున్న రష్యా సేనలు
-
ప్చ్! పోరాడలేకపోయాం...కనీసం కొట్టేద్దాం: రష్యా బలగాలు
ఖెర్సన్ నుంచి రష్యా బలగాలు వైదొలగడంతో ఉక్రెయిన్‌లో పండగ వాతావరణం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. నగరమంతా రష్యా బలగాలను తరిమికొట్టేశాం అని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ కూడా ఆనందంగా ప్రకటించారు. ఈ మేరకు వెనక్కు మళ్లుతున్న రష్యా సేనాలు ఎలాగో పోరాడలేకపోయం కదా పోతూపోతూ... ఖెర్సన్ ప్రాంతంలో జూలోని జంతువులను పట్టుకుపోతున్నారు. బహుశా ఎలాగో పోతున్నాం కదా అని దొంగతనం చేస్తున్నారు కాబోలు. ఈ క్రమంలో ఖెర్సన్ జూలోని ఏడు రకూన్లు అనే అమెరికన్ ఎలుగుబంటి జాతులను, లామా అనే ఒంటె, నెమళ్లు, రెండు ఆడ తోడేళ్లు, గాడిద వంటి జంతువులను బలవంతంగా పట్టుకుని వాహనంలో ఎక్కించారు. కేవలం జంతువులే కాదు అక్కడ ఆస్పత్రుల్లో ఉన్న వివిధ కళాఖండాలు, వైద్య పరికరాలు వంటివి పట్టుకుపోయారు. ఈ మేరకు ఉక్రెయిన్ రక్షణ మంత్రిత్వ శాఖ జంతు ప్రదర్శనశాల నుంచి రష్యా బలగాలు జంతువులను పట్టుకుపోవడాన్ని తప్పపట్టారు. ఆర్ట్ గ్యాలరీ నుంచి పెయింటింగ్‌లు,మ్యూజియంల నుంచి పురాత వస్తువులు తదితరాలన్నింటిని దొంగలించినట్లు తెలిపింది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది. దీంతో నెటిజన్లు రష్యా బలగాలు ఉక్రెయిన్‌ని ఏమీ చేయలేక ఈ దొంగతనానికి ఒడిగట్టారంటూ కామెంట్లు చేస్తూ ట్వీట్ చేశారు. (చదవండి: చర్చల ప్రసక్తే లేదు...తెగేసి చెప్పిన జెలెన్స్కీ) -
జూమ్ బాబు జూమ్.. మా బుర్రలు తినొద్దు మహాప్రభో..!
ఆయన ఏపీలో ప్రతిపక్ష నేత. నిత్యం ప్రజల్లో ఉండాలని తన పార్టీ నేతలను ఆయన ఆదేశిస్తారు. ప్రజా సమస్యలు తెలుసుకుని ఉద్యమించాలని ఉద్భోదిస్తారు. కాని ప్రతిరోజూ జూమ్ మీటింగ్‌లు పెట్టి గంటల కొద్దీ వారి మెదళ్ళను తినేస్తుంటారు. అయినను మీటింగ్ బెల్ కొట్టాల్సిందే.! తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు వ్యవహరిస్తున్న తీరు ఆ పార్టీ నేతలకే చిరాకు పుట్టిస్తోంది. వారంలో ఐదు రోజులపాటు జూమ్ సమావేశాలంటూ తమ మెదళ్ళు తినేస్తున్నారంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారు. అధికారంలో ఉన్నప్పుడు ప్రతి రోజు గంటల కొద్దీ జూమ్ సమావేశాలు పెట్టిన చంద్రబాబు అధికారం పోగొట్టుకున్న తర్వాత కూడా అదే తరహాలో వ్యవహరించడం పట్ల మండిపడుతున్నారు. వారంలో ఐదు రోజుల పాటు తండ్రి, కొడుకులు రోజుకు మూడు గంటల పాటు జూమ్ సమావేశాల పేరుతో హింసించడం పట్ల వారు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సోమవారం నుంచి శుక్రవారం వరకు రోజూ తమకు ఈ బాధ తప్పడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మా బుర్రలు తినొద్దు మహాప్రభో..! సోమవారం వర్కింగ్ వీక్ మొదలవుతుంది. టీడీపీ నాయకులకు మాత్రం చంద్రబాబు, లోకేష్‌తో సోమవారం నుంచి జూమ్ సమావేశాలు ప్రారంభమవుతాయి. సోమవారం నాడు పార్టీ అనుబంధ సంఘాలు చేయాల్సిన కార్యక్రమాలపై వాటి ఇన్చార్జ్ లోకేష్ ఆయా సంఘాల నేతలతో మాట్లాడతారు. మంగళవారం పార్టీ పనితీరు, అనుబంధ సంఘాల పనితీరుపై అధినేత చంద్రబాబు సమీక్ష జరుపుతారు. బుధవారం పార్టీ వ్యూహాత్మక కార్యక్రమాలపై చంద్రబాబు పార్టీ నేతలకు దిశానిర్దేశం చేస్తారు. గురువారం గ్రౌండ్ లెవెల్లో పార్టీ బలోపేతంపై సుదీర్ఘంగా మాట్లాడతారు. శుక్రవారం రాష్ట్రస్థాయి నేతలతో, 175 నియోజకవర్గాల ఇన్ఛార్జిలతో సమావేశం నిర్వహిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ పార్టీ పరంగా చేయాల్సిన కార్యక్రమాలపై వివరిస్తారు. శని, ఆదివారాల్లో తండ్రి కొడుకులు ఇద్దరూ హైదరాబాదులో ఉంటారు కాబట్టి తమకు జూమ్ బాధ తప్పిందని, అదే ఈ రెండు రోజులు కూడా అమరావతిలోనే ఉండి ఉంటే వారం రోజులపాటు వరుసగా తమకు హింస తప్పేది కాదంటున్నారు. ఇంకెన్నాళ్లు ఇవే విషపు కుట్రలు? జూమ్ సమావేశాల ద్వారా రోజూ ఏదైనా కొత్త విషయాలు చెబుతారా అంటే అది కూడా ఉండదంటున్నారు. రోజు చెప్పిందే చెప్పడంతో తమకు విసుగు పుడుతోందని.. రోజు కాన్ఫరెన్స్ ప్రారంభించడం ప్రభుత్వాన్ని విమర్శించడం.. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పై వ్యక్తిగత విమర్శలు చేయమని తమకు ఆదేశాలివ్వడమే తప్ప కొత్త విషయాలు ఏమీ ఉండవని తేల్చేస్తున్నారు టీడీపీ నాయకులు. ఒక్కో సందర్భంలో తండ్రి కొడుకులు ఇద్దరూ చెప్పిన సమయానికి జూన్ కాన్ఫరెన్స్ కు రాకపోవడం వల్ల ఐదారు గంటల సమయం వృధా అవుతోందంటున్నారు. ప్రతిపక్ష పార్టీ నేతలు నిత్యం ప్రజల్లో ఉండాలే గాని జూమ్ సమావేశాలతో కాలక్షేపం చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిత్యం ప్రజలతోనే మమేకమైన విషయాన్ని ఈ సందర్భంగా టిడిపి నేతలు ప్రస్తావిస్తున్నారు. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు మారకపోతే జీవితాంతం ప్రతిపక్ష నేత హోదాలోనే ఉంటారని టిడిపి నేతలు హెచ్చరిస్తున్నారు. -
జూమ్‌కార్, ఐఐఏసీ విలీనం
కార్ షేరింగ్ ప్లాట్‌ఫామ్ జూమ్‌కార్ తాజాగా ఇన్నోవేటివ్ ఇంటర్నేషనల్ అక్విజిషన్ కార్ప్‌తో విలీన ఒప్పందాన్ని కుదుర్చుకుంది. విలీనం అనంతరం జూమ్‌కార్ హోల్డింగ్స్‌గా పేరు మారనుంది. ఈ లావాదేవీ ద్వారా జూమ్‌కార్ హోల్డింగ్స్ విలువ రూ.3,753 కోట్లుగా లెక్కించారు. విలీనం అనంతరం ఏర్పడిన కంపెనీని నాస్డాక్లో లిస్ట్ చేస్తారు. 2013లో ప్రారంభం అయిన జూమ్‌కార్ హోల్డింగ్స్ ప్రపంచవ్యాప్తంగా 50కిపైగా నగరాల్లో కార్యకలాపాలు సాగిస్తోంది. 30 లక్షల పైచిలుకు కస్టమర్లు ఉన్నారు. కార్ షేరింగ్ మార్కెట్‌ప్లేస్‌లో 25,000 కంటే ఎక్కువగా వాహనాలు నమోదయ్యాయి. ఆగ్నేయాసియా, లాటిన్ అమెరికా, మధ్యప్రాచ్య, ఉత్తర ఆఫ్రికా, ఆఫ్రికాలోని దక్షిణ సహారా దేశాల్లో అపార అవకాశాలను లక్ష్యంగా చేసుకున్నట్టు జూమ్‌కార్ కో–ఫౌండర్, సీఈవో గ్రెగ్ మోరన్ తెలిపారు. 2025 నాటికి రూ.7.4 లక్షల కోట్ల మార్కెట్ అవకాశాలు ఉన్నాయని చెప్పారు. చదవండి: ఇది ఊహించలేదు.. యూజర్లకు భారీ షాకిచ్చిన జియో! -
Army Dog Zoom: ఉగ్రవాదులతో వీరోచితంగా పోరాడిన ‘జూమ్’ మృతి
శ్రీనగర్: శత్రువులకు ఎదురొడ్డి వీరోచితంగా పోరాడిన ఇండియన్ ఆర్మీ శునకం ‘జూమ్’ మృతి చెందింది. జమ్మూకశ్మీర్‌లో ఇటీవల భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన ఎన్కౌంటర్లో జూమ్ అనే జాగిలం తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. అడ్వాన్స్ ఫీల్డ్ వెటర్నరీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఈ శునకం గురువారం మధ్యాహ్నం ప్రాణాలు విడిచింది. ఉదయం 11:45 గంటల వరకు వైద్యానికి బాగానే సహకరించిందని, అకస్మాత్తుగా ఊపిరి పీల్చుకోవడం ఆపేసి కుప్పకూలినట్లు ఆర్మీ అధికారులు వెల్లడించారు. కాగా సైన్యంలో కఠిన శిక్షణ పొందిన ‘జూమ్’.. కొన్ని సంవత్సరాలుగా ఇండియన్ ఆర్మీ తరపున సేవలు అందిస్తుంది. అనేక సెర్చ్ ఆపరేషన్లలో పాల్గొంది. జమ్మూకశ్మీర్‌లో నిర్వహించిన సెర్చ్ ఆపరేషన్‌లోనూ భాగం అయ్యింది. శత్రువులతో వీరోచితంగా పోరాడి ప్రాణాలు త్యాగం చేసింది. అసలేం జరిగిందంటే.. జమ్మూకశ్మీర్ అనంత్‌నాగ్ జిల్లాలోని టాంగ్పావా ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కి ఉన్నారనే సమాచారంతో భద్రతా దళాలు సెర్చ్ ఆపరేషన్ చేపట్టాయి. ముందుగా సైన్యం ఉగ్రవాదులు ఉంటున్న ఇంటికి జూమ్ అనే ఆర్మీ కుక్కను పంపారు. అది టెర్రరిస్టులను గుర్తించి వారిపై దాడి చేసింది. దీనిని గమనించిన ఉగ్రవాదులు ఎదురు కాల్పులు జరిపారు. #UPDATE | Army dog Zoom, under treatment at 54 AFVH (Advance Field Veterinary Hospital ), passed away around 12 noon today. He was responding well till around 11:45 am when he suddenly started gasping & collapsed: Army officials He had received 2 gunshot injuries in an op in J&K pic.twitter.com/AaEdKYEhSh — ANI (@ANI) October 13, 2022 దీంతో ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఆపరేషన్‌లో 'జూమ్' అనే ఆర్మీ కుక్కకు రెండు తుపాకీ బుల్లెట్లు తగిలాయి. తీవ్రంగా గాయపడి నెత్తురు కారుతున్నా.. జూమ్ తన పోరాటాన్ని కొనసాగించింది.. దీని ఫలితంగా ఇద్దరు ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుపెట్టాయి. ఈ ఎన్కౌంటర్లో మృతి చెందిన ఉగ్రవాదులు లష్కరే తోయిబా సంస్థకు చెందినవారుగా అధికారులు గుర్తించారు. ఈ ఆపరేషన్‌లో పలువురు జవాన్లు సైతం గాయపడ్డారు. సెర్చ్ ఆపరేషన్ ముగిసిన వెంటనే జూమ్‌ను ఇక్కడి ఆర్మీ వెటర్నరీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ జూమ్ మరణించింది. -
శాస్త్రీయ పద్ధతులతో సమగ్ర దర్యాప్తు
అనంతపురం శ్రీకంఠంసర్కిల్: కీలకమైన కేసులకు సంబంధించి శాస్త్రీయమైన పద్ధతుల్లో దర్యాప్తును సమగ్రంగా చేపట్టాలని ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి సూచించారు. శనివారం గుంతకల్లు సబ్ డివిజన్ పోలీసు అధికారులతో ఆయన జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా నేర సమీక్ష నిర్వహించారు. నమోదైన కేసులు, నిందితుల అరెస్టు, దర్యాప్తు దశ, చార్జిషీటు దాఖలు వరకు పురోగతిపై ఆరా తీశారు. పోలీస్స్టేషన్ల వారీగా యూఐ కేసులు తగ్గించి నిర్ణిత గడువులోపు పెండింగ్ కేసులకు పరిష్కారం చూపాలన్నారు. నిందితుల అరెస్టు, చార్జ్ షీట్లు దాఖలు, సమన్లు, నాన్ బెయిలబుల్ వారెంట్లు పెండింగ్ లో ఉంచకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కేసుల ఛేదింపు, నేర నియంత్రణకు దోహదం చేసే నైపుణ్యాలను వివరించారు. సమగ్ర దర్యాప్తు చేపట్టి నేరస్తులు తప్పించుకునే వీలు లేకుండా న్యాయ స్థానాలలో తగిన సాక్ష్యాధారాలతో ప్రవేశపెట్టి శిక్ష పడే విధంగా చేయాలన్నారు. హత్య కేసులు, మహిళలపై నేరాలు, చిన్నారుల అదృశ్యం తదితర కేసుల్లో అలసత్వం చూపకుండా వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. చోరీ కేసుల్లో నిందితులను త్వరగా పట్టుకోవాలని, సొత్తు రికవరీపై దృష్టి సారించాలని సూచించారు. అనధికార ఆన్లైన్ లోన్ యాప్‌ల మోసాలు, సైబర్ నేరాలపై ప్రజల్లో అవగాహన తీసుకురావాలన్నారు. ముఖ్యమైన ప్రదేశాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంతో పాటు వాటి ప్రాముఖ్యత గురించి ప్రజలకు వివరించి వారు కూడా అవసరమైన చోట్ల సీసీ కెమెరాలు అమర్చుకునేలా చూడాలన్నారు. రహదారులపై ప్రమాదాలు, నేరాల నియంత్రణకు హైవే మొబైల్ టీంతో నిరంతర గస్తీ నిర్వహించాలని ఆదేశించారు. గుట్కా, మట్కా, పేకాట, అక్రమ మద్యం రవాణాపై ఉక్కు పాదం మోపాలన్నారు. సమావేశంలో గుంతకల్లు డీఎస్పీ యు.నరసింగప్ప, సబ్ డివిజన్ పరిధిలోని సీఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు. (చదవండి: జగనన్న కాలనీలో మహిళలకు ఉపాధి) -
ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు జూమ్..
న్యూఢిల్లీ: దేశీయంగా ఎలక్ట్రిక్ ద్విచక్ర, త్రిచక్ర వాహనాల అమ్మకాలు గణనీయంగా పెరగనున్నాయి. 2030 నాటికి మొత్తం అమ్మకాల్లో వీటి వాటా 50-70 శాతం వరకూ ఉండనుంది. ఆటోమోటివ్ విడిభాగాల తయారీ సంస్థల సమాఖ్య ఏసీఎంఏ, కన్సల్టెన్సీ సంస్థ మెకిన్సే సంయుక్తంగా రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. ఏసీఎంఏ సదస్సు సందర్భంగా దీన్ని ఆవిష్కరించారు. ఈ నివేదిక ప్రకారం ప్యాసింజర్, భారీ వాణిజ్య వాహనాలతో పోలిస్తే నిర్వహణ వ్యయాలు తక్కువగా ఉండటమనేది ఎలక్ట్రిక్ ద్వి, త్రిచక్ర వాహనాల విషయంలో ఆకర్షణీయ అంశంగా ఉండనుంది. దేశీయంగా ప్యాసింజర్, భారీ వాణిజ్య వాహనాల విభాగంలో విద్యుదీకరణ నెమ్మదిగా ఉండనుంది. ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్లతో (ఐసీఈ) నడిచే వాహనాల ఆధిపత్యమే కొనసాగనుంది. 2030 నాటికి కొత్త వాహనాల అమ్మకాల్లో ఎలక్ట్రిక్ ప్యాసింజర్ వాహనాల వాటా 10-15 శాతం, విద్యుత్ వాణిజ్య వాహనాల వాటా 5-10 శాతంగా ఉండనుంది. (బిలియనీర్ అదానీ భారీ పెట్టుబడులు: అంబానీకి షాకేనా?) నివేదిక ప్రకారం వచ్చే దశాబ్దకాలంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరగడమనేది వాహనాల పరిశ్రమ దిశను మార్చేయనుంది. యూరప్, చైనా మార్కెట్లు ఈ మార్పునకు సారథ్యం వహించనుండగా, మిగతా ప్రపంచ దేశాలు వాటిని అనుసరించనున్నాయి. ఈ దశాబ్దం మధ్య నాటికి భారత్, చైనాలో ప్యాసింజర్ వాహనాల అమ్మకాలు గరిష్ట స్థాయికి పుంజుకోనున్నాయి. సమీప కాలంలో సరఫరాపరమైన అంతరాయాలు ఎదురైనప్పటికీ వాహనాల పరిశ్రమకు దీర్ఘకాలికంగా అవకాశాలు అత్యంత ఆశావహంగానే ఉన్నట్లు నివేదిక పేర్కొంది. పరిశ్రమ ముఖచిత్రం మారుతున్న నేపథ్యంలో దేశీ ఆటో విడిభాగాల పరిశ్రమ సాంప్రదాయ మార్కెట్లకే పరిమితం కాకుండా కొత్త మార్కెట్లకు కూడా ఎగుమతులను పెంచుకోవాల్సిన అవసరం ఉందని సూచించింది. (Swiggy, Zepto: లేట్ నైట్ అయినా సరే.. చిటికెలో డెలివరీ!) -
మరోసారి వార్తల్లో కెక్కిన బెటర్ డాట్ కామ్ సీఈవో విశాల్ గార్గ్!
ప్రముఖ మార్టిగేజ్ సంస్థ బెటర్‌డాట్ కామ్ ఉద్యోగులకు షాకిచ్చింది. మొత్తం మూడు దశల్లో 4వేల మందిని ఉద్యోగుల్ని తొలగించిన ఆ సంస్థ తాజాగా మరో 250 మంది ఉద్యోగుల్ని ఫైర్ చేసినట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. వెలుగులోకి వచ్చిన రిపోర్ట్‌ల ప్రకారం.. ఆగస్ట్ 23న బెటర్ డాట్ కామ్ 250 ఉద్యోగులపై వేటు వేసింది. వేటు వేసిన ఉద్యోగులు ఏ విభాగానికి చెందిన వారనేది తెలియాల్సి ఉండగా.. తాజాగా ఆ సంస్థ సీఈవో తీసుకున్న నిర్ణయం మరోసారి సంచలనంగా మారింది. ఎందుకంటే ? గతేడాది డిసెంబర్ నెలలో బెటర్ డాట్ కామ్ సీఈవో విశాల్ గార్గ్ ఉద్యోగులతో జూమ్ మీటింగ్ నిర్వహించారు. జూమ్ మీటింగ్ జరిగే సమయంలో కేవలం 3 నిమిషాల వ్యవధిలో 900 మంది ఉద్యోగుల్ని తొలగించి వారి ఆగ్రహానికి కారణమయ్యారు. అలా నాటి నుంచి ఉద్యోగుల తొలగింపుల్ని ముమ్మరం చేశారు విశాల్ గార్గ్. గతేడాది డిసెంబర్ నెలలో జూమ్ మీటింగ్ జరిగే సమయంలో 900మందిని, ఈ ఏడాది మార్చిలో 2వేల మందిని, ఏప్రిల్‌లో వెయ్యిమందిని ఇంటికి సాగనంపారు. ఇప్పటి వరకు సుమారు 4వేల మందిపై వేటు వేయగా..తాజాగా 250మందిని తొలగించడంతో చర్చాంశనీయమయ్యారు. ఫైర్ చేసిన ఉద్యోగులు, స్వచ్ఛందంగా బయటకు వెళ్లేందుకు సిద్ధపడుతున్న ఉద్యోగులకు హెల్త్ ఇన్స్యూరెన్స్‌తో పాటు కొంత మొత్తాన్ని చెల్లిస్తున్నట్లు వెలుగులోకి వచ్చిన నివేదికలు చెబుతున్నాయి. కాగా, కానీ మార్కెట్లో నెలకొన్న అనిశ్చితులు బెటర్ డాట్ కామ్ సీఈవో గార్గ్‌ను ఆర్ధికంగా దెబ్బతీశాయి. దీంతో తీసుకున్న రుణాల్ని తీర్చేందుకు భారీ ఎత్తున ఉద్యోగుల్ని తొలగిస్తున్నారు. చదవండి👉 పీకల్లోతు అప్పుల్లో ఉన్నా! నన్ను క్షమించండి! -
యూజర్లకు అలర్ట్..ఈ ల్యాప్‌టాప్‌లలో జూమ్ యాప్ సేవలు బంద్!
కరోనా కారణంగా వరల్డ్ వైడ్‌గా జూమ్ యాప్ పాపులర్ అయిన విషయం తెలిసిందే. స్కూల్ విద్యార్ధులకు ఆన్లైన్ క్లాసుల నుంచి ఆఫీస్‌లో నిర్వహించే ఆన్లైన్ మీటింగ్స్ వరకు..ఇలా అన్నీ జూమ్ యాప్‌లో జరిగేవి.ఈ తరుణంలో జూమ్ యాప్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది ఆగస్ట్ నుంచి క్రోమ్ బుక్స్ ల్యాప్‌ట్యాప్‌లలో తమ సేవల్ని నిలిపివేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ల్యాప్ ట్యాప్స్ కంటే లిమిటెడ్ సపోర్ట్‌తో గూగుల్ క్రోమ్‌బుక్స్(ల్యాప్ ట్యాప్ తరహాలో) ను విడుదల చేసింది. వీటిలో విండోస్ సపోర్ట్ చేయదు. గూగుల్ ప్రత్యేకంగా తయారు చేసిన క్రోమా ఓఎస్ మాత్రమే వినియోగించుకోవచ్చు. క్రోమ్ బుక్స్‌కు సపోర్ట్ చేసే జుమ్‌లాంటి యాప్స్‌తో పాటు ఇతర యాప్స్‌ను వినియోగించుకోవచ్చు. ఈ నేపథ్యంలో 2020 ప్లాన్‌లో భాగంగా యూజర్లకు ఫస్ట్ క్లాస్ యూజర్ ఎక్స్‌పీరియన్స్‌ను గూగుల్ అందించేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. జూమ్ తరహాలో గూగుల్ ప్లేస్టోర్‌లోకి వెళ్లి యాప్స్‌ను డౌన్లోడ్ చేసుకునే అవసరం లేకుండా డైరెక్ట్‌గా సాఫ్ట్‌వేర్‌ను డౌన్లోడ్ చేసుకొని మనకు కావాల్సిన యాప్స్‌ను ఇన్స్టాల్ చేసుకునే టెక్నాలజీపై దృష్టిసారించింది. అందుకే 2020లో తొలిసారిగా ప్రకటించిన వ్యూహానికి అనుగుణంగా, క్రోమా ఓఎస్ ఆధారిత క్రోమ్‌బుక్‌లలో క్రోమ్ యాప్‌లను లిపివేయనుంది. వాటిలో జూమ్ యాప్ కూడా ఉంది. ప్రోగ్రెసీవ్ వెబ్ యాప్స్‌కు మాత్రమే అనుమతిస్తుండగా..గూగుల్ నిర్ణయంతో..జూమ్ సైతం క్రోమ్ బుక్స్‌లో సేవల్ని నిలిపివేస్తున్నట్లు చెప్పింది. ఒకవేళ క్రోమ్ బుక్స్‌లో జూమ్ యాప్ కావాలనుకుంటే జూమ్ ఫర్ క్రోమ్ పీడబ్ల్యూఏ వాడాలని జూమ్ సంస్థ క్రోమ్‌బుక్ యూజర్లను కోరింది. చదవండి👉ఈ యూట్యూబర్ల నెలవారీ సంపాదన తెలిస్తే దిమ్మ తిరిగిపోద్ది! -
లోకేష్ జూమ్ మీటింగ్ లోకి అందుకే వెళ్ళాం: కొడాలి నాని ఎక్స్లూజివ్ ఇంటర్వ్యూ
-
జూమ్‌లో నేను కనపడగానే లోకేశ్ పారిపోయాడు: కొడాలి నాని
సాక్షి, అమరావతి: టీడీపీ నేత నారా లోకేశ్ పిల్లలతో రాజకీయాలు చేస్తున్నారని మాజీ మంత్రి కొడాలి నాని మండిపడ్డారు. అభం శుభం తెలియని చిన్న పిల్లలను ఆత్మహత్యలకు ప్రేరేపించేందకు లోకేశ్ ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. విద్యార్థులకు ధైర్యం చెప్పకుండా ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. తాము ఫేక్ ఐడీలతో లాగిన్ అవ్వలేదని స్పష్టం చేశారు. తన మేనల్లుడి ఐడీతో మాట్లాడేందుకు ప్రయత్నించినట్లు తెలిపారు. విద్యార్థి మేనమామతో లోకేశ్ ఎందుకు మాట్లాడరని ప్రశ్నించారు. పిల్లలు కొడతారనే భయంతోనే లోకేశ్ జూమ్‌లో మాట్లాడారని కొడాలి నాని ఎద్దేవా చేశారు. తాను కనపడగానే జూమ్ మీటింగ్ కట్ చేసి పారిపోయారని అన్నారు. విద్యార్థులను పిలిచి మరోసారి చర్చ పెట్టమనండని, తాము వెళ్తామని అన్నారు. తన ప్రశ్నలకు లోకేష్ సమాధానం చెబితే బాగుండేదన్నారు. కరోనా సమయంలో పాఠశాలలు మూసివేశాలని గొడవ చేసింది ఎవరని కొడాలి నాని ప్రశ్నించారు. విద్యార్థుల కోసం ప్రభుత్వ పాఠశాలలు తెరిస్తే.. కరోనా సమయంలో పిల్లల ప్రాణాలతో చెలగాటమాడుతారా అని స్కూల్స్‌ను మూసివేయాలని ఆందోళనలు చేసింది టీడీపీ వాళ్లే కదా అని గుర్తు చేశారు. చదవండి: Nara Lokesh: జూమ్ కాన్ఫరెన్స్‌లో నారా లోకేష్‌కు ఝలక్ -
లైవ్ కట్ చేయకుంటే లోకేష్ కు మేమేంటో చూపించే వాళ్లం: వల్లభనేని వంశీ
-
నేను కనపడగానే జూమ్ మీటింగ్ కట్ చేసి పారిపోయాడు: కొడాలి నాని
-
లోకేష్ జూమ్ మీటింగ్ లో అందుకే జాయిన్ అయ్యా: కొడాలి నాని
-
జూమ్ కాన్ఫెరెన్స్ లో లోకేష్ కు ఝలక్ ఇచ్చిన కొడాలి నాని,వల్లభనేని వంశీ
-
బెటర్‌డాట్ కామ్ సీఈవో, పీకల్లోతు అప్పుల్లో ఉన్నా! నన్ను క్షమించండి!
జూమ్ మీటింగ్ జరిగే సమయంలో కేవలం 3 నిమిషాల్లో 900 మంది ఉద్యోగుల్ని తొలగించిన బెటర్.కామ్ సీఈవో విశాల్ గార్గ్ మరోసారి చర్చాంశనీయమయ్యారు. ఈ సారి ఏకంగా 920మంది భారతీయ ఉద్యోగుల్ని ఇంటికి సాగనంపారు. మోర్టగేజ్ లెండింగ్ కంపెనీ బెటర్ డాట్ కామ్ అమెరికా కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తుంది. ఆ సంస్థకు జపాన్‌కు చెందిన సాఫ్ట్‌బ్యాంక్ ఆర్ధికంగా ఆదుకుంటుంది. బెటర్ డాట్ కామ్ సంస్థ నిర్వహణ, ఇతర ఖర్చుల కోసం 1.5 బిలియన్ల నిధుల్ని సేకరించారు. అందులో వ్యక్తిగతంగా సాఫ్ట్ బ్యాంక్‌కు 750 మిలియన్ డాలర్లను చెల్లిస్తామని హామీ ఇచ్చారు. కానీ మార్కెట్లో నెలకొన్న అనిశ్చితులు గార్గ్‌ను ఆర్ధికంగా దెబ్బతీశాయి. దీంతో తీసుకున్న రుణాల్ని తీర్చేందుకు భారీ ఎత్తున ఉద్యోగుల్ని తొలగించారు. గతేడాది డిసెంబర్లో బెటర్ డాట్ కామ్ సంస్థలో పనిచేసే ఉద్యోగులకు విశాల్ గార్గ్ జూమ్ మీటింగ్ నిర్వహించారు. ఈ మీటింగ్‌లో 900మంది ఉద్యోగుల్ని విధుల నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించారు. ఈ తొలగింపు సంచలనం సృష్టించింది. తమ అనుమతులు లేకుండా విధుల నుంచి తొలగించడం ఎంతవరకు సమంజసం అంటూ ఉద్యోగులు గార్గ్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినా సరే ఈ ఏడాది మార్చిలో 4వేల మంది ఉద్యోగుల్ని ఇంటికి పంపించారు. ఇక మనదేశానికి చెందిన 920 ఉద్యోగులు స్వచ్ఛంద రాజీనామాలకు ఆమోదం తెలిపారు. అరోరాను సొంతం చేసుకునేందుకే గతేడాది నవంబర్‌లో అరోరా అక్విజిషన్ కార్ప్ సంస్థను బెటర్.కామ్ 1.5బిలియన్లకు కొనుగోలు చేసింది. ఈ కొనుగోళ్ల ఒప్పందంలో భాగంగా సాఫ్ట్ బ్యాక్ ఇచ్చే రుణం కోసం ఎదురు చూడకుండా అరోరా అక్విజిషన్ కార్ప్‌కు సగం చెల్లించి ఈ కొనుగోళ్ల డీల్‌ను క్లోజ్ గార్గ్ క్లోజ్ చేశారు. ఈ సందర్భంగా అరోరా ప్రతినిధులు మాట్లాడుతూ.. బెటర్ సంస్థ ఫౌండర్, అధినేత విశాల్ గార్గ్ సాఫ్ట్ బ్యాంక్‌కు రుణాల్ని ఇచ్చేలా వ్యక్తిగత హామీ ఇచ్చినట్లు తెలిపారు. ఇప్పుడు ఆ రుణాల్ని చెల్లించేందుకు ఇబ్బందులు పడుతున్నట్లు చెప్పారు. కాబట్టి స్వచ్ఛంగా సంస్థ నుంచి స్వచ్చందంగా వెళ్లి పోవాలనుకున్న 920మంది భారతీయ ఉద్యోగులు రాజీనామాల్ని అంగీకరించారు. ఈ క్రమంలో సాఫ్ట్ బ్యాంక్‌కు 750 బిలియన్ డాలర్లు చెల్లించాల్సి ఉంది. ఇక నాదగ్గర ఏమీలేదు. ఇది నిజం. నేను వ్యక్తిగతంగా మూడు వంతుల బిలియన్ డాలర్లకు హామీ ఇచ్చాను. దానికి నేను వ్యక్తిగతంగా బాధ్యత వహిస్తాను. "అని ఉద్యోగులకు పెట్టిన మెయిల్స్‌లో బెటర్ డాట్ కామ్ సీఈవో పేర్కొన్నారు. చదవండి👉విశాల్ గార్గ్ ఎంత దుర్మార్గంగా ఆలోచించాడంటే.. -
జూమ్ కాల్లో 800 మంది ఉద్యోగుల తొలగింపు! మరి ఇంత దుర్మార్గమా..ప్రధాని ఆగ్రహం!
మీకు బెటర్ డాట్ కామ్ సీఈఓ విశాల్ గార్గ్ చేసిన నిర్వాకం తెలిసే ఉంటుంది. భారత సంతతికి చెందిన విశాల్ గార్గ్ 2016నుంచి 'బెటర్ డాట్ కామ్' అనే సంస్థ ద్వారా మోర్టగేజ్ లెండింగ్ కార్యకాలాపాల్ని నిర్వహిస్తున్నాడు. గతేడాది డిసెంబర్ నెలలో జూమ్ మీటింగ్‌లో కేవలం మూడే నిమిషాల్లో 900 మందికి ఉద్యోగాల నుంచి తీసేస్తున్నట్లు ప్రకటించి తీవ్ర విమర్శల పాలయ్యారు. తాజాగా మరో కంపెనీ సీఈఓ 3నిమిషాల జూమ్ కాల్లో 800మంది ఉద్యోగాల నుంచి తొలగించాడు. ప్రస్తుతం ఈ అంశం యూకే వ్యాప్తంగా హాట్ టాపిగ్గా మారింది. ఆ దేశ ప్రధాని బోరిస్ జాన్సన్ సైతం ఉద్యోగుల పట్ల సంస్థ వ్యవహరిస్తున్న తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పీ&ఓ ఫెర్రీస్ అనే బ్రిటీష్ షిప్పింగ్ కంపెనీ యూకే, ఐర్లాండ్, యూరప్ దేశాల్లో వ్యాపార కార్యకలాపాల్ని నిర్వహిస్తుంది. ఈ నేపథ్యంలో సంస్థలో పనిచేస్తున్న 800 మందిని జూమ్ కాల్లో విధుల నుంచి తొలగిస్తున్నట్లు ఆ సంస్థ సీఈఓ జానెట్ బెల్ ప్రకటించారు. P&O ferries doing mass sacking by zoom call https://t.co/lhvkGTiP7g — David Dryburgh (@DavyDryburgh) March 17, 2022 నిధుల దుర్వినియోగం కరోనా కారణంగా విధించిన లాక్ డౌన్లో 1100 మంది ఉద్యోగులకు జీతాలిచ్చేందుకు పీ&ఓ యాజమాన్యం యూకే ప్రభుత్వం నుంచి 10 మిలియన్లను అప్పుగా తీసుకుంది. అయితే కోవిడ్ దెబ్బతో గత రెండేళ్లలో కంపెనీ 200 మిలియన్ డాలర్ల నష్టాల్ని చవిచూసింది. అదే సమయంలో యూకే ప్రభుత్వం ఇచ్చిన నిధుల్ని దుర్వినియోగం చేయడం, తీసుకున్న మొత్తాన్ని తిరిగి చెల్లించకపోవడం వంటి అంశాలు తెరపైకి వచ్చాయి. అందుకే నష్టాల్ని కారణంగా చూపిస్తూ జానెట్ బెల్ జూమ్ కాల్ మీటింగ్ లో విధుల నుంచి ఉద్యోగుల్ని తొలగిస్తున్నట్లు చెప్పారు. ప్రధాని ఆగ్రహం ఉద్యోగుల పట్ల పీ&ఓ ఫెర్రీస్ సంస్థ వ్యవహరిస్తున్న తీరుపై యూకే ప్రధాని బోరిస్ జాన్సన్ స్పందించారు. ఉద్యోగం నుంచి తీసివేస్తున్నామని ఇలా ప్రకటించడం సరైన పద్దతి కాదు. సంవత్సరాలుగా కష్టపడి పనిచేస్తూ, సంస్థను అలాగే అంటి పెట్టుకొని, కరోనా కష్టకాలంలో సంస్థకు వెన్నంటే ఉన్నారు. అలాంటి ఉద్యోగుల పట్ల మర్యాదగా మెలగాలి. ఇలా దుర్మార్గంగా వ్యవహరించకూడదు అంటూ యూకే ప్రధాని కార్యాలయం స్పోక్ పర్సన్ తెలిపారు. అంతేకాదు ఉద్యోగుల వ్యవహారంలో కంపెనీ తీసుకున్న నిర్ణయం వెనక్కి తీసుకోవాలని, లేదంటే యూకే ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందంటూ హెచ్చరించారు. చదవండి: విశాల్ గార్గ్ ఎంత దుర్మార్గంగా ఆలోచించాడంటే.. -
అప్పుడేమో 900 మంది..ఇప్పుడు ఏకంగా 3వేల ఉద్యోగుల ఊస్టింగ్..!
జూమ్ వీడియో కాల్లో ఒకేసారి 900 మంది ఉద్యోగులను తొలగించి బెటర్.కామ్ సీఈఓ విశాల్ గార్గ్ అప్పట్లో వైరలైనా విషయం తెలిసిందే. మరోసారి కంపెనీ కి చెందిన మూడు వేల ఉద్యోగులను తొలగిస్తూ కంపెనీ నిర్ణయం తీసుకుంది. అమెరికా, ఇండియా ఉద్యోగులను.. అమెరికా, భారత్‌లో పనిచేస్తున్న మరో 3,000 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు బెటర్ డాట్ కాం కంపెనీ మంగళవారం ప్రకటించింది. ఆయా దేశాల్లో శ్రామిక్ శక్తిని గణనీయంగా తగ్గించే పనిలో భాగంగా కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది. మంగళవారం బెటర్ డాట్ కాం వెబ్సైట్లో పోస్ట్ చేసిన ఒక లేఖలో బెటర్ డాట్ కాం తాత్కాలిక అధ్యక్షుడు కెవిన్ ర్యాన్ ఈ విషయం వెల్లడించారు. పెరుగుతున్న వడ్డీ రేట్లతో క్యాపిటల్‌లో తగ్గుదల కారణంగా ఉద్యోగులను తొలగించాల్సి వచ్చిందని కెవిన్ ర్యాన్ చెప్పారు. ఈ తొలగించిన ఉద్యోగులకు కనీసం 60 పని దినాలు లేదా 80 పనిదినాల వరకు నగదు చెల్లింపులకు అర్హులని తాత్కాలిక చీఫ్ పేర్కొన్నారు. జూమ్ వీడియో కాల్లో..! బెటర్.కామ్ కంపెనీ వ్యవస్థాపకుడు, సీఈఓ విశాల్ గార్గ్ జూమ్ వీడియో కాల్లో మాట్లాడుతూ.. ఒకేసారి 900 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించాడు. దీంతో, జూమ్ కాల్లో కంపెనీ సీఈఓ చెప్పిన మాటలు వీని ఉద్యోగులు షాక్‌కు గురి అయ్యారు. ఈ వీడియోను ఒక ఉద్యోగి షేర్ చేయడంతో ఆ వీడియో అప్పట్లో వైరల్‌గా మారింది. చదవండి: హైదరాబాద్‌లో అడుగుపెట్టిన లండన్ బేస్డ్ యూనికార్న్ కంపెనీ డెలివరూ -
జూమ్ యూజర్లకు అలర్ట్..!
కరోనా రాకతో ఉద్యోగులు, విద్యార్థులు పూర్తిగా ప్రముఖ వీడియో మీటింగ్ యాప్లికేషన్ జూమ్‌కే పరిమితమైన విషయం తెలిసిందే. తాజాగా జూమ్ ప్లాట్‌ఫాంలో బగ్ ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో యాప్‌ను యూజ్ చేయనప్పుడు ఆటోమేటిక్‌గా జూమ్ రికార్డు చేస్తోన్నట్లు పలువురు యూజర్లు నివేదించారు. యాపిల్ మ్యాక్ వాడే వారిలో..! యాపిల్‌కు చెందిన మ్యాక్ ల్యాప్‌ట్యాప్స్‌లో ఈ సమస్య ఉన్నట్లు తెలుస్తోంది. యాపిల్ మ్యాక్ ల్యాప్టాప్స్లోని జూమ్ యాప్‌లో బగ్ ఉన్నట్లు ఆయా యాపిల్ మ్యాక్ యూజర్లు నివేదిస్తున్నారు. యూజర్లు జూమ్ ఫ్లాట్‌ఫాంను ఉపయోగించని సమయంలో కూడా జూమ్ యాప్ మైక్రోఫోన్‌ను, వీడియోను ఆన్‌లో ఉంటున్నట్లు తెలుస్తోంది. దీంతో ఆయా యాపిల్ మ్యాక్ యూజర్లు ఆందోళనకు గురవుతున్నారు. కాగా పలుమార్లు ఈ సమస్యపై ఫిర్యాదు రావడంతో సమస్యను పరిష్కరించడానికి జూమ్ గత ఏడాది డిసెంబర్లోనే వెర్షన్ 5.91.(3506) అప్డేట్ను విడుదల చేసింది. కాగా తాజా అప్డేట్ సమస్యను పరిష్కరించలేదు. ఈ సమస్య తిరిగి ఆయా యాపిల్ మ్యాక్ యూజర్లకు వచ్చినట్లు తెలుస్తోంది. మైక్రోఫోన్, వీడియో ఆన్‌లో ఉన్నప్పుడు యాపిల్ మ్యాక్ తన యూజర్లను అలర్ట్ చేస్తోంది. కాగా ఈ సమస్యకు త్వరలోనే పరిష్కారం చూపుతామని జూమ్ తెలిపింది. చదవండి: గూగుల్ అనూహ్య నిర్ణయం..! ఆ సేవలు పూర్తిగా షట్‌డౌన్..! -
విశాల్ గార్గ్ ఎంత దుర్మార్గంగా ఆలోచించాడంటే..
Laid Off In Zoom Better CEO Vishal Garg wanted to give one week of severance pay: బెటర్ డాట్ కామ్ సీఈవో విశాల్ గార్గ్.. జూమ్ మీటింగ్‌లో కేవలం మూడే నిమిషాల్లో 900 మందికి ఉద్యోగాల నుంచి తీసేస్తున్నట్లు ప్రకటించి.. ప్రపంచవ్యాప్తంగా విమర్శలు ఎదుర్కొన్న విషయం తెలిసిందే. ఈ సీఈవో గురించి విస్తూపోయే విషయాలు ఇప్పుడు వెలుగు చూశాయి. విమర్శల నేపథ్యంలో తన నిర్ణయంపై పశ్చాత్తాపం ప్రకటించి.. క్షమాపణలతో పాటు ఉద్యోగుల్ని తొలగించడానికి కారణం సైతం వివరించాడు విశాల్ గార్గ్. అయినా వ్యవహారం చల్లారకపోవడంతో ఆయన్ని బలవంతపు సెలవుల మీద పంపింది కంపెనీ. అంతేకాదు ఈ వ్యవహారంలో సమీప భవిష్యత్తులో ఆయనపై వేటు తప్పదని హింట్ కూడా అందించింది. ఇదిలా ఉంటే ఉద్యోగుల్ని తొలగించే ముందు విశాల్ ఎంత దుర్మార్గంగా ఆలోచించాడో వెలుగు చూసింది ఇప్పుడు. బిజినెస్ ఇన్సైడర్ కథనం ప్రకారం.. మోర్టగేజ్ లెండింగ్ కంపెనీ బెటర్ డాట్ కామ్ ‘లే ఆఫ్’ ప్రకటన కంటే ముందు విశాల్ తన ఆధ్వర్యంలో డజనుకి పైగా మీటింగ్‌లు జరిపాడట. ఆ సమావేశంలో తొలగించబోయే ఉద్యోగులకు కేవలం వారం, మరీ కాదంటే రెండు వారాల జీతం మాత్రమే (severance pay) చెల్లించాలన్న ప్రతిపాదన చేశాడట విశాల్. విశేషం ఏంటంటే.. అప్పటికీ బెటర్ డాట్ కామ్ బోర్డు ఇంకా తొలగింపులపై ఒక స్పష్టతకి రాలేదట. ఈలోపే ఉద్యోగులకు న్యాయంగా చెల్లించాల్సిన పరిహారంలో కోతపై విశాల్ ఓ ప్రతిపాదన చేయడం.. ఈ అంశం గురించి బెటర్ డాట్ కామ్ బోర్డు అంతర్గత భేటీలో చర్చ జరగడం చకచకా జరిగిపోయాయి. చట్టపరమైన ఇబ్బందులు.. అయితే కొందరు ఎగ్జిక్యూటివ్స్ మాత్రం విశాల్ ప్రతిపాదనను (వారం, రెండు వారాల జీతం) వ్యతిరేకించారట. అయినా విశాల్ తన నిర్ణయానికే కట్టుబడి ఉండడంతో.. చేసేది లేక బోర్డు సైతం ఆయన ప్రతిపాదనను అమలు చేయాలని అనుకుంది. ఈ లోపు తెర మీదకు వచ్చిన కంపెనీ లీగల్ అడ్వైజర్లు, అమెరికా చట్టం (WARN Act)లోని పలు సెక్షన్ల గురించి బెటర్ డాట్ కామ్ ముందు ఉంచారు. ఇలా భారీ స్థాయిలో లే ఆఫ్‌లు ప్రకటించిన సమయంలో.. ఉద్యోగులకు 60 రోజుల ముందస్తు నోటీసుగానీ, ఒకవేళ ఉన్నపళంగా తొలగిస్తే రెండు నెలల జీతాలుగానీ చెల్లించాల్సి ఉంటుంది. లేకుంటే కంపెనీలు భారీ జరిమానాలు చెల్లించాల్సి వస్తుంది. ఈ విషయం విశాల్‌కి తెలిసి కూడా వారం పరిహారం నిర్ణయం వైపే మొగ్గు చూపడం విశేషం. .@betterdotcom’s CEO @vishalgarg_ lays off ~900 employees right before the holidays and ahead of the company’s public market debut. The firm also got a $750 million cash infusion from its backers THIS WEEK, which include @SoftBank. pic.twitter.com/F8EfSkCRF6 — Bucky with the Good Arm (@benjancewicz) December 3, 2021 దీంతో న్యాయపరమైన చిక్కులు ఎదుర్కొవాల్సి వస్తుందన్న భయంతో బెటర్ డాట్ కామ్ బోర్డు.. విశాల్‌కు సర్దిచెప్పింది. చివరకు రెండు నెలల జీతం చెల్లింపు ప్రతిపాదనకు విశాల్ గార్గ్‌ను ఒప్పించింది బోర్డు. ఇక సుమారు 20 మందికి పైగా తొలగింపబడిన ఉద్యోగులు.. విశాల్ ఉద్యోగుల పట్ల కనీస మర్యాద లేకుండా వ్యవహరిస్తారంటూ ఆరోపించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే ఆరోపణలపై స్పందించేందుకు విశాల్.. ఇష్టపడడం లేదు. చదవండి: జూమ్ మీటింగ్‌లో ఉద్యోగుల తొలగింపు.. విమర్శలపై స్పందన -
‘జూమ్‌లో 900 మంది తొలగింపు’.. విశాల్‌పై చర్యలు!
CEO Vishal Garg Who Fired 900 On Zoom Call Takes Time Off With Immediate Effect: బెటర్ డాట్ కామ్ సీఈవోగా కిందటి ఏడాది ఫోర్బ్స్ జాబితాకు ఎక్కిన విశాల్ గార్గ్.. ఈమధ్య జూమ్ మీటింగ్ వ్యవహారంతో విమర్శల పాలైన విషయం తెలిసిందే. జూమ్ మీటింగ్ జరుగుతుండగా మధ్యలో ఒకేసారి 900 మందితో ‘మీ ఉద్యోగాలు పోయాన’ని ప్రకటించాడు. దీంతో రగడ మొదలైంది. ఆన్లైన్ వేదికగా ఉద్యోగుల లేఆఫ్ ప్రకటన చేసిన బెటర్ డాట్ కామ్ సీఈవో విశాల్ గార్గ్ తీరును టెక్ దిగ్గజాలు సైతం తప్పుబట్టారు. ఈ విమర్శల పర్వం మధ్యే తాను చేసిన తప్పిదానికి క్షమాపణలు చెప్పాడు విశాల్. అయినప్పటికీ వివాదం సర్దుమణగడం లేదు. ఈ తరుణంలో శుక్రవారం అర్థాంతరంగా ఆయన్ని సెలవులపై తప్పించడం చర్చనీయాంశంగా మారింది. జూమ్‌లో ఉద్యోగుల తొలగింపు ప్రకటన చేసిన విశాల్‌కు.. ఈ-మెయిల్ ద్వారా సెలవులపై వెళ్లాలని బెటర్ డాట్ కామ్ కంపెనీ ఒత్తిడి చేసినట్లు రాయిటర్స్ ఓ కథనం ప్రచురించింది. ఈ మేరకు చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ కెవిన్ ర్యాన్ ప్రస్తుతం బెటల్ డామ్ వ్యవహరాలను చూసుకుంటున్నారు. అంతేకాదు బోర్డుకు రిపోర్ట్ చేసే బాధ్యతను కూడా ఆయనే స్వీకరించారు అని ఆ కథనంలో పేర్కొంది. అయితే కెవిన్‌తో పాటు కీలక వ్యవహారాలను చూసుకునేందుకు స్వతంత్ర్య బోర్డు (మూడో పార్టీ)కు బాధ్యతలు అప్పగించడమే అసలు ఆసక్తికి కారణమైంది. బిజినెస్ టైకూన్ల నుంచి విమర్శలు వెల్లువెత్తడం, షేర్ల విలువ పడిపోతుండడంతో విశాల్‌కు బెటర్ డాట్ కామ్ శాశ్వతంగా పక్కన పెట్టనుందా? అనే అనుమానం వ్యక్తం చేసింది రాయిటర్స్. అయితే ఇదంతా జిమిక్కు అని, వ్యవహారం చల్లబడే వరకు మాత్రమే బెటర్ డాట్ కామ్ తీసుకున్న చర్య మాత్రమేనని ఓ బిజినెస్ డెయిలీ కథనం ప్రచురించింది. పైగా క్రిస్మస్ బోనస్ అందుకున్న విషయాన్ని సైతం ప్రస్తావించింది. ఇదిలా ఉంటే ఈ ఊహాగానాలపై బెటర్ డాట్ కామ్ స్పందించలేదు. .@betterdotcom’s CEO @vishalgarg_ lays off ~900 employees right before the holidays and ahead of the company’s public market debut. The firm also got a $750 million cash infusion from its backers THIS WEEK, which include @SoftBank. pic.twitter.com/F8EfSkCRF6 — Bucky with the Good Arm (@benjancewicz) December 3, 2021 ‘‘విశాల్ గార్గ్ జూమ్ వీడియో కాల్ ద్వారా 900 మంది ఉద్యోగులను తొలగించటం చూసి నా హృదయం చలించింది. ఇది పూర్తిగా తప్పు! ఉద్యోగుల తొలగింపుపై వారికి వ్యక్తిగతంగా చెప్పాల్సి ఉండేది. క్రిస్మస్ ముందు ఇటీవల 750 మిలియన్ డాలర్లు సేకరించిన తర్వాత ఈ నిర్ణయం సరైంది కాదు. ఈ విధానం వల్లే కార్పొరేట్లకు హృదయం లేదు అనే ముద్ర పడుతుంది" అని ట్వీట్లో పేర్కొన్నారు ప్రముఖ వ్యాపారవేత్త హర్ష్ గోయెంకా. ఇక మరో వ్యాపార దిగ్గజం ఆనంద్ మహీంద్రా ఓ అడుగు ముందుకేశారు. ‘ఇది సబబేనా? కాదా? ఇలాంటి పొరపాటు తర్వాత ఆ కంపెనీ సీఈవో మనుగడ కొనసాగించగలడు అని మీరు భావిస్తున్నారా? అతనికి(విశాల్) మరో ఛాన్స్ ఇవ్వడం కరెక్టేనా? న్యాయమా?’ అంటూ ట్విటర్ ఫాలోవర్స్ అభిప్రాయాన్ని కోరారాయన. I’m curious whether you think a CEO can survive after a blunder like this? Is it fair, or not, to allow a second chance…? https://t.co/sPDcr9qmYE — anand mahindra (@anandmahindra) December 9, 2021 తొలగింపునకు కారణం ఇదే.. ఇదిలా 2016లో న్యూయార్క్ కేంద్రంగా బెటర్ డాట్ కామ్ మోర్టగేజ్ లెండింగ్ సేవల్ని ప్రారంభించింది. అయితే ఈ మే నెలలోనే కంపెనీ ఐపీవోకు వెళ్తుందని సంకేతాలు ఇవ్వడంతో పాటు ఈ నెల మొదట్లో సాఫ్ట్‌బ్యాంక్‌తో హడావిడి ఒప్పందం కూడా ముగించింది. ఇదిలా ఉంటే 750 మిలియన్ డాలర్ల సేకరణ తర్వాత కంపెనీ.. ఇలా 9 శాతం ఉద్యోగుల్ని తొలగించడంతో బెటర్ డాట్ కామ్‌పై విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే మార్కెట్, పర్ఫార్మెన్స్, ప్రొడక్టివిటీ.. ఉద్యోగుల తొలగింపునకు కారణాలని స్పష్టత ఇచ్చాడు భారత సంతతికి చెందిన విశాల్ గార్గ్. తాను వ్యక్తిగతంగా ఉద్యోగులకు ఈ విషయం తెలియజేయాల్సి ఉండొచ్చని.. కానీ, అలా ఆన్లైన్లో ప్రకటించి వాళ్ల మనసు నొప్పించినందుకు క్షమించాలని గార్గ్ తన ప్రకటనలో పేర్కొన్నాడు. -
జూమ్ మీటింగ్‌లో చెప్పి తప్పు చేశా: విశాల్ క్షమాపణ
Better.com CEO Apology For Laying Off 900 Employees Via Zoom Call: జూమ్ మీటింగ్ వేదికగా 900 మంది ఉద్యోగుల్ని ఒకేసారి తొలగించిన ఘటన విమర్శలకు దారితీయడంతో బెటర్ డాట్ కామ్ సీఈవో విశాల్ గార్గ్ ఎట్టకేలకు స్పందించాడు. భారత సంతతికి చెందిన విశాల్ గార్గ్.. బెటర్ డాట్ కామ్. అనే మోర్టగేజ్ లెండింగ్ కంపెనీకి సీఈవో. గత ఏడాది నవంబర్ నెలలో వ్యాపార పత్రిక ఫోర్బ్స్ లో స్థానం సంపాదించుకున్నాడాయన. అయితే కిందటి వారం జూమ్ మీటింగ్‌లో ఆయన వ్యవహరించిన తీరుపై తీవ్ర విమర్శలు ఎదురయ్యాయి. సమావేశం జరుగుతుండగా.. ఒక్కసారిగా ఒకేసారి 900 ఎంప్లాయిస్ను తొలగిస్తున్నట్లు ప్రకటించాడు. దీంతో షాక్ అవ్వడం ఉద్యోగుల వంతు అయ్యింది. ఆన్లైన్లో అదీ జూమ్ కాల్లో ఉండగా.. ఉద్యోగులకు అలాంటి షాక్ ఇవ్వడంపై విశాల్ తీరును చాలామంది తప్పుబట్టారు. ఓ ఉద్యోగి ద్వారా తొలింపునకు సంబంధించిన వీడియో ఇంటర్నెట్లో వైరల్ అయ్యింది కూడా. ఇక ప్రముఖ వ్యాపారవేత్త హర్ష్ గోయెంకా లాంటి వాళ్లు సైతం ఇది పూర్తిగా తప్పు అంటూ అభిప్రాయం వెలిబుచ్చారు. విమర్శలు తారాస్థాయికి చేరడంతో విశాల్ గార్గే బహిరంగ లేఖ ద్వారా తొలగించిన ఉద్యోగులకు క్షమాపణలు తెలియజేశారు. .@betterdotcom’s CEO @vishalgarg_ lays off ~900 employees right before the holidays and ahead of the company’s public market debut. The firm also got a $750 million cash infusion from its backers THIS WEEK, which include @SoftBank. pic.twitter.com/F8EfSkCRF6 — Bucky with the Good Arm (@benjancewicz) December 3, 2021 అలా తొలగిస్తున్నట్లు ప్రకటించడాన్ని తప్పిదంగా పేర్కొంటూ క్షమాపణలు చెప్పాడు విశాల్ గార్గ్. ‘నేను ఇలా ప్రవర్తించిన తీరు వార్తల్లోకి ఎక్కడం పరిస్థితిని ఇంకా ఘోరంగా మార్చేసింది’ అంటూ లేఖలో పేర్కొన్నాడు. మార్కెట్, పర్ఫార్మెన్స్, ప్రొడక్టివిటీ.. ఉద్యోగుల తొలగింపునకు కారణాలని స్పష్టత ఇచ్చాడు. తాను వ్యక్తిగతంగా ఉద్యోగులకు ఈ విషయం తెలియజేయాల్సి ఉండొచ్చని.. కానీ, అలా ఆన్లైన్లో ప్రకటించి వాళ్ల మనసు నొప్పించినందుకు క్షమించాలని గార్గ్ తన ప్రకటనలో పేర్కొన్నాడు. ఇదిలా 2016లో న్యూయార్క్ కేంద్రంగా బెటర్ డాట్ కామ్ సేవల్ని ప్రారంభించింది. అయితే ఈ మే నెలలోనే కంపెనీ ఐపీవోకు వెళ్తుందని సంకేతాలు ఇవ్వడంతో పాటు ఈ నెల మొదట్లో సాఫ్ట్‌బ్యాంక్‌తో హడావిడి ఒప్పందం కూడా ముగించింది. ఇదిలా ఉంటే 750 మిలియన్ డాలర్ల సేకరణ తర్వాత కంపెనీ.. ఇలా 9 శాతం ఉద్యోగుల్ని తొలగించడంతో బెటర్ డాట్ కామ్‌పై విమర్శలు వినిపిస్తున్నాయి. -
900 మంది ఉద్యోగుల తొలగింపుపై హర్ష్ గోయెంకా కీలక వ్యాఖ్యలు!
జూమ్ వీడియో కాల్లో ఒకేసారి 900 మంది ఉద్యోగులను తొలగించి బెటర్.కామ్ సీఈఓ విశాల్ గార్గ్ వార్తలో వైరల్ అయ్యారు. అమెరికాకు చెందిన ఆ కంపెనీ తీసుకున్న నిర్ణయంపై ప్రముఖ వ్యాపారవేత్త హర్ష్ గోయెంకా స్పందించారు. ఈ మేరకు ఒక ట్వీట్ ఇలా చేశారు.. "విశాల్ గార్గ్ జూమ్ వీడియో కాల్ ద్వారా 900 మంది ఉద్యోగులను తొలగించటం చూసి నా హృదయం చలించింది. ఇది పూర్తిగా తప్పు! ఉద్యోగుల తొలగింపుపై వారికి వ్యక్తిగతంగా చెప్పాల్సి ఉండేది. క్రిస్మస్ ముందు ఇటీవల 750 మిలియన్ డాలర్లు సేకరించిన తర్వాత ఈ నిర్ణయం సరైంది కాదు. ఈ విధానం వల్లే కార్పొరేట్లకు హృదయం లేదు అనే ముద్ర పడుతుంది" అని ట్వీట్లో పేర్కొన్నారు. బెటర్.కామ్ కంపెనీ వ్యవస్థాపకుడు, సీఈఓ విశాల్ గార్గ్ జూమ్ వీడియో కాల్లో మాట్లాడుతూ.. ఒకేసారి 900 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించాడు. దీంతో, జూమ్ కాల్లో కంపెనీ సీఈఓ చెప్పిన మాటలు వీని ఉద్యోగులు షాక్‌కు గురి అయ్యారు. ప్రస్తుతం అనేక కారణాల వల్ల మేము కంపెనీలో15 శాతం ఉద్యోగులను తొలిగించాల్సి వస్తుంది అని అన్నారు. ఈ వీడియోను ఒక ఉద్యోగి షేర్ చేయడంతో ఆ వీడియో కాస్త వైరల్ అయ్యింది. My heart went out to the 900 employees sacked through Zoom by Vishal Garg. Totally wrong! Do it on a one on one basis. And in person. And not before Christmas and after a $750 mn recent infusion. This is how Corporates get a heartless tag!pic.twitter.com/9aPoFNybKp — Harsh Goenka (@hvgoenka) December 7, 2021 (చదవండి: అపర కుబేరుడి పెద్ద మనసు.. భారీగా సొమ్ము దానం!) -
ప్రపంచవ్యాప్తంగా జూమ్ యాప్ డౌన్
కరోనా మహమ్మారి భాగ పాపులర్ అయిన ప్రముఖ వీడియో-కాన్ఫరెన్సింగ్ జూమ్ యాప్ సర్వర్లలో ఏర్పడిన సాంకేతిక సమస్య కారణంగా షట్ డౌన్ అయ్యింది. ఆస్ట్రేలియాలో వినియోగదారులు ఎక్కువగా ఈ సమస్యలను ఎదుర్కొన్నారు. కొద్ది సమయం తర్వాత ఆస్ట్రేలియాలో ఏర్పడిన సమస్యను పరిష్కరించినట్లు సంస్థ తెలిపింది. తాజాగా భారతదేశంలో కూడా సమస్యలు తలెత్తినట్లు తెలుస్తోంది. భారతీయ జూమ్ వినియోగదారులు వీడియో మీటింగ్స్ యాప్ లో వచ్చిన సమస్యల గురించి ఫిర్యాదు చేస్తున్నారు. డౌన్ డిటెక్టర్ వెబ్ సైట్ ప్రకారం.. జూమ్ యాప్ మధ్యాహ్నం 1 గంటల నుంచి భారతదేశంలో సమస్యలు వస్తున్నాయి. ఇప్పటి వరకు 600 మందికి పైగా వినియోగదారులు జూమ్ వెబ్ సైట్ లో తమ సమస్యలను నివేదించారు. చాలా మంది వినియోగదారులు తమ సమస్య గురుంచి ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్, ట్విట్టర్లో ఫిర్యాదు చేస్తున్నారు. ఒకవేళ మీరు కనుక ఇలాంటి సమస్యలను ఎదుర్కొంటున్నట్లయితే సర్వర్‌లో ఏర్పడిన సమస్యను పరిష్కరించే వరకు వేచి ఉండాల్సి ఉంటుంది. డౌన్ డిటెక్టర్ నివేదిక ప్రకారం.. 48 శాతం వినియోగదారులు ఈ సమస్యలను ఎదుర్కొన్నట్లు పేర్కొన్నారు. 30 శాతం మంది వినియోగదారులు వీడియో కాన్ఫరెన్స్ ప్రారంభించలేకపోయారు. ఈ సమస్య భారతదేశం, ఆస్ట్రేలియా దేశాలకు మాత్రమే పరిమితం కాలేదు, ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో ఈ సమస్య ఏర్పడింది. తాత్కాలికంగా గూగుల్ మీట్ మరో యాప్ లను వాడుకోవచ్చు.(చదవండి: మారుతి సుజుకిపై భారీ జరిమానా విధించిన సీసీఐ) -
విద్యార్థుల కోసం జూమ్ సరికొత్త ఫీచర్!
Zoom Focus Mode Feature: కరోనా మహమ్మరి కారణంగా ఆన్లైన్ వినియోగం రోజు రోజుకి భారీగా పెరిగిపోతుంది. ప్రస్తుతం పరిస్థితులలో వీడియో కాలింగ్ యాప్‌లకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. విద్యార్థుల పాఠ్యాంశాల నుంచి ఉద్యోగుల బోర్డు సమావేశాల వరకు అన్నీ ఆన్లైన్లోనే జరిగిపోతున్నాయి. దీంతో జూమ్, గూగుల్ మీట్ వంటి వీడియో కాలింగ్ యాప్‌లు వాడే వారి సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. వినియోగదారుల కోసం ఈ యాప్‌లు ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్స్‌ను తీసుకొస్తున్నాయి. తాజాగా జూమ్ యాప్ విద్యార్థులకు కోసం మరో కొత్త ఫీచర్‌ను పరిచయం చేసింది. ‘ఫోకస్ మోడ్’ అనే పేరుతో తీసుకొచ్చిన ఈ ఫీచర్ వల్ల విద్యార్థులు శ్రద్ధగా ఆన్లైన్ క్లాసులు వినడమే కాకుండా తోటి విద్యార్థుల ఏకాగ్రతకు ఎటువంటి భంగం కలగకుండా సహాయపడనున్నట్లు జూమ్ పేర్కొంది. ఈ ఫీచర్ యాక్టివేట్ చేస్తే విద్యార్థి కేవలం టీచర్ / హోస్ట్ ని మాత్రమే చూడగలడు. ఆ విధ౦గా ఒక ఉపాధ్యాయుడు భోదించే సమయ౦లో తన అనుమతి లేకుండా విద్యార్థులు షేర్ చేసే వీడియోలు, స్క్రీన్ షేర్లను ఇది కనిపించకుండా చేస్తుంది. టీచర్స్ కూడా తమ విద్యార్థులు ఏం చేస్తున్నారని, ఎలాంటి అంశాలు షేర్ చేస్తున్నారనేది చూడవచ్చు. అలాగే, టీచర్/హోస్ట్ ఫోకస్ మోడ్ డిసేబుల్ చేస్తేనే విద్యార్థులు ఒకరితో ఒకరు మాట్లాడుకునే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఇది జూమ్ డెస్క్ టాప్ క్లయింట్లకు మాత్రమే లభ్యం అవుతున్నట్లు తెలుస్తుంది. కుటుంబ సమావేశాలు, చిన్న వ్యాపార సమావేశాలు, ఇతర సమావేశలకు కూడా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ ఫీచర్ కొద్ది మందికి మాత్రమే ప్రస్తుతం అందుబాటులో ఉంది. త్వరలో అందరికీ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. -
జూమ్ ఇతరులతో మీ డేటాను పంచుకుంటుందా..! ఎంతవరకు నిజం..!
వాషింగ్టన్: ప్రపంచవ్యాప్తంగా కరోనా రాకతో వీడియో సమావేశాల యాప్ జూమ్ గణనీయంగా అభివృద్ధి చెందింది. విద్యార్థులకు ఆన్లైన్ క్లాసులను నిర్వహించడంలో, ఉద్యోగులకు ఆఫీసు కార్యకలాపాలకు జూమ్ యాప్ ఎంతగానో ఉపయోగపడింది. జూమ్ యాప్‌కు పోటిగా పలు దిగ్గజ కంపెనీలు సైతం సమావేశాల కోసం సపరేటుగా యూజర్లకోసం యాప్‌లను తీసుకొచ్చాయి. ప్రపంచవ్యాప్తంగా జూమ్ యాప్‌ను ఎన్నో కోట్ల మంది వాడుతున్నారు. అయితే జూమ్ తన యూజర్ల డేటాను ఇతర థర్డ్ యాప్స్‌తో పంచుకుంటోందని యూఎస్ సంస్థలు నిగ్గుతేల్చాయి. జూమ్ తన యూజర్ల డేటాను ప్రముఖ దిగ్గజ సంస్థలు ఫేస్బుక్, గూగుల్, లింక్డిన్తో పంచుకుంటున్నట్లు తెలుస్తోంది. జూమ్ యూజర్ల ప్రైవసీని దెబ్బతీసింనందుకు గాను యూఎస్ న్యాయస్థానం సుమారు 85 మిలియన్ డాలర్ల(రూ. 630 కోట్లు)ను జరిమానా విధించింది. ఈ మొత్తాన్ని చెల్లించడానికి జూమ్ యాజమాన్యం ఒప్పకున్నట్లు తెలుస్తోంది. జూమ్ సరైన భద్రతా పద్ధతులను పాటించక పోవడంతో హ్యాకర్లు జూమ్ సమావేశాలను హ్యక్ చేయడం సింపుల్ అవుతోంది. దీనినే జూమ్‌బాంబింగ్ అని అంటారు. జూమ్ బాంబింగ్ అనేది బయటి వ్యక్తులు జూమ్ సమావేశాలను హైజాక్ చేసి, అశ్లీలత ప్రదర్శించడం, జాత్యహంకార భాషను ఉపయోగించడం లేదా ఇతర కలవరపెట్టే కంటెంట్‌ను పోస్ట్ చేయడం. కాగా , యూఎస్‌లో కాలిఫోర్నియా శాన్‌జోస్‌లోని యూఎస్ డిస్ట్రిక్ న్యాయమూర్తి లూసీ కో ప్రిలిమినరీ సెటిల్మెంట్ ఫైల్‌పై ఆమోదం తెలపాల్సి ఉంది. మీటింగ్ హోస్ట్‌లు లేదా ఇతర పార్టిసిపెంట్లు మీటింగ్‌లలో థర్డ్ పార్టీ యాప్‌లను ఉపయోగించినప్పుడు యూజర్లను హెచ్చరించడం, ప్రైవసీ, డేటా హ్యాండ్లింగ్‌పై ఉద్యోగులకు ప్రత్యేక శిక్షణను అందించడం వంటి భద్రతా చర్యలకు జూమ్ అంగీకరించింది. శాన్ జోస్ ఆధారిత కంపెనీ ప్రిలిమినరీ సెటిల్మెంట్ ఫైల్‌ను పరిష్కరించడానికి అంగీకరించడంలో తన తప్పును ఖండించింది. జూమ్ ఆదివారం చేసిన ఒక ప్రకటనలో.. గోప్యత, సెక్యూరిటీ విషయంలో యూజర్లు మాపై ఉంచే విశ్వాసాన్ని తీవ్రంగా పరిణిస్తామని జూమ్ పేర్కొంది. కోవిడ్-19 మహామ్మారి సమయంలో యూజర్ల సంఖ్య ఆరు రెట్లు పెరిగింది. -
సీరియస్ మీటింగ్స్ కాస్తా ఎంటర్టైన్ చేస్తున్నాయే
వార్ రూమ్ తరహాలో సీరియస్‌గా సాగే జూమ్ మీటింగ్స్ ఇకపై ఈ స్నాప్ కెమెరా ఆప్షన్ తో మరింత ఎంటర్ టైన్మెంట్గా మారనున్నాయి. కోవిడ్ కారణంగా ఆన్లైన్ క్లాసుల నుంచి ఆఫీస్ మీటింగ్స్ వరకు అన్నీ ఆన్లైన్లో జరుగుతున్నాయి.అయితే ఆయా టెక్ దిగ్గజాలు సరికొత్త ఫీచర్లతో ఆన్లైన్ మీటింగ్స్ ను మరింత అందంగా తీర్చిదిద్దేందుకు ప్రయత్నిస్తున్నాయి. తాజాగా వీడియో కమ్యూనికేషన్ 'జూమ్'లో స్నాప్ చాట్ కు చెందిన స్నాప్ కెమెరా ఫిల్టర్ ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. ఈ ఫీచర్‌ను వినియోగించి ఆన్ లైన్లో కుటుంబ సభ్యులతో,స్నేహితులతో కలిసి ఫన్ జనరేట్ చేసుకోవచ్చు. జూమ్ మీటింగ్‌లో ఫిల్టర్ ఫీచర్‌ను వినియోగించి మన ఫేస్ కంప్లీట్‌గా జనరిక్ ఫిక్సార్, డ్రీమ్ వర్క్స్ కార్టూన్ క్యారక్టర్ లోకి ట్రాన్స్ ఫామ్ అయ్యేలా ఎనేబుల్ చేసుకోవచ్చు. ఈ ఆప్షన్ స్నాప్ కెమెరా v1.14.0 , విండోస్ 10, మాక్ 10.13 ఓఎస్, ఇంటెల్ కోర్ ఐ 3 2.5 జీహెచ్‌జెడ్, ఎఎమ్డి ఎఫ్ఎక్స్ 4300 2.6 జీహెచ్‌జెడ్, ఇంటెల్ హెచ్డి గ్రాఫిక్స్ 4000 లేదంటే ఎన్విడియా జిఫోర్స్ 710, ఎఎమ్డి రేడియన్ హెచ్డి 6450 ఈ ఆపరేటింగ్ సిస్టమ్స్‌లో మాత్రమే పనిచేస్తుంది. ఈ కార్టూన్ ఫిల్టర్ కావాలనుకుంటే అఫీషియల్ వెబ్ సైట్ స్నాప్ ఐఎన్‌సీ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆప్షన్ ఎలా ఎనేబుల్ చేసుకోవాలి జూమ్ ఓపెన్ చేసిన తరువాత రైట్ సైడ్ కార్నర్లో వీడియో గేర్ ఐకాన్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే డ్రాప్ డౌన్ మెనూ బార్ లో వీడియో క్లిక్ చేస్తే కెమెరా ఆన్ అవుతుంది కెమెరా ఆన్ చేస్తే స్నాప్ కెమెరా ఆప్షన్ కనిపిస్తుంది. ఆ స్నాప్ కెమెరా ఆప్షన్‌లోకి వెళ్లితే మీకు కావాల్సినట్లు మీ ఫేస్ కార్టూన్ కేరక్టర్‌లోకి ట్రాన్స్ ఫార్మ్ అవుతుంది. -
జులై 29న దోహాలో ఓపెన్ హౌజ్
దోహా: ఖతార్ లో ఇండియన్ ఎంబసీలో 2021 జులై 29న ఓపెన్ హౌజ్ నిర్వహించనున్నారు. ఖతార్ లో నివసిస్తున్న భారతీయుల కార్మిక (లేబర్), కాన్సులర్ (దౌత్య) సంబంధమైన అత్యవసర సమస్యలు వినడానికి, పరిష్కరించడానికి ఈ సమావేశం వేదిక కానుంది. జులై 29 మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు దోహాలోని ఇండియన్ ఎంబసీ ఆవరణలో ఈ సమావేశం జరుగుతుంది. భారత దౌత్య అధికారులు ఈ సమావేశం నిర్వహిస్తున్నారు. వర్చువల్‌గా ఈ సమావేశానికి నేరుగా రాలేకపోయిన వారు జులై 29వ తేది మధ్యాహ్నం 4 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు 00974 50411241 ఫోన్ ద్వారా అయినా ఎంబసీ అధికారులను సంప్రదించవచ్చు. అదే విధంగా సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు ఆన్ లైన్ జూమ్ మీటింగ్ లో పాల్గొనవచ్చు. మీటింగ్ ఐడీ ID: 830 1392 4063 పాస్‌కోడ్‌లను 121700 ఉపయోగించి జూమ్ సమావేశంలో జాయిన్ కావొచ్చు. వీటితో పాటు labour.doha@mea.gov.in కు మెయిల్ ద్వారా కూడా సమస్యలను విన్నవించుకోవచ్చు. -
Zoom: లక్ష కోట్లతో జూమ్ భారీ డీల్...! అందుకోసమేనా..!
వీడియో కాన్ఫరెన్సింగ్ దిగ్గజం జూమ్ కీలక ఒప్పందాన్నికుదుర్చుకోనుంది. ప్రముఖ క్లౌడ్ సాఫ్ట్వేర్ ప్రొవైడర్ ఫైవ్9 ను కొనుగోలు చేయాలని భావిస్తోంది. జూమ్ తన కస్టమర్లకు మరింత సేవలను అందించడం కోసం సుమారు 14.7 బిలియన్ డాలర్ల( సుమారు రూ. లక్ష కోట్ల)తో ఫైవ్9 ను కొనుగోలు చేయనున్నట్లు తెలుస్తోంది. దీంతో ఫైవ్9 క్లౌడింగ్ సాఫ్ట్వేర్ జూమ్‌కు ఆపరేటింగ్ యూనిట్‌గా మారనుంది. అంతేకాకుండా ఫైవ్9 కంపెనీ ఛీఫ్ ఎగ్జిక్యూటివ్ రోవాన్ ట్రోలోప్ జూమ్ సంస్థకు ప్రెసిడెంట్ కానున్నారు. రెండు కంపెనీల మధ్య ఒప్పందం 2022 మొదటి అర్ధభాగంలో ముగుస్తుందని నిపుణులు భావిస్తున్నారు. ఒప్పందం ప్రకారం..రెండు కంపెనీల బోర్డులచే ఆమోదం పొందిన తరువాత, ఫైవ్ 9 కంపెనీ ప్రతి వాటాకు ఫైవ్ 9 స్టాక్ హోల్డర్లు క్లాస్ ఎ కామన్ స్టాక్ ఆఫ్ జూమ్ 0.5533 షేర్లను అందుకుంటారు. అంతర్జాతీయ మార్కెట్లో ఫైవ్ 9 షేర్లు శుక్రవారం 0.6 శాతం పెరిగి 177.60 డాలర్లకు చేరుకున్నాయి. జూమ్ 1.4 శాతం పెరిగి 361.97 డాలర్ల వద్ద స్థిర పడింది. జూమ్ కంపెనీ విలువ సుమారు 106 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 7,92,450 కోట్లు). ఈ భారీ డీల్ అందుకోసమేనా..! ఫైవ్ 9 కంపెనీ క్లౌడ్-బేస్డ్ సాఫ్ట్వేర్ కంపెనీల్లో మేటి. దీని అత్యంత స్కేలబుల్ , సురక్షితమైన క్లౌడ్ కాంటాక్ట్ సెంటర్. అనేక రకాల ఛానెళ్లలో కస్టమర్ ఇంటరాక్షన్ల నిర్వహణ, ఆప్టిమైజేషన్‌ను అనుమతించే సులభమైన యాప్. ఈ క్లౌడ్ ఆధారిత సాఫ్ట్‌వేర్‌తో జూమ్ ఆన్లైన్ సమావేశాల్లో పంచుకునే వివిధ అంశాలకు చెందిన డాక్యుమెంట్లు మరింత సురక్షితంగా ఉంటాయని తెలుస్తోంది. -
ఫ్యాన్స్‌కు ఓపెన్ ఆఫర్..హీరోయిన్‌తో డైరెక్ట్‌గా జూమ్ కాల్లో..
సినిమాలు ప్రమోట్ చేసుకోవడంలో ఒక్కొక్కరు ఒక్కో స్టైల్‌ను అనుసరిస్తారు. అయితే ఇటీవలి కాలంలో సోషల్ మీడియా వాడకం బాగా పెరిగిపోయింది. దీంతో సెలబ్రిటీలు సైతం సోషల్ మీడియాకే జై కొడుతున్నారు. సినిమా ప్రమోషన్ల కోసం సోషల్ మీడియాను తెగ వాడుతున్నారు. తాజాగా ఈ లిస్టులోకి బాలీవుడ్ బ్యూటీ కృతి కర్బందా సైతం చేరింది. ప్రస్తుతం ఆమె ‘14 ఫేరే’ అనే చిత్రంలో నటించింది. ఈ మూవీ ట్రైలర్ ఇటీవలె విడుదలై సినిమాపై అంచనాల్ని పెంచేసింది. ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. దేవాన్షుసింగ్ దర్శకత్వంలో జీ స్టూడియోస్ నిర్మించిన ఈ సినిమాలో విక్రాంత్ మాస్సే, కృతి కర్బందా హీరో హీరోయిన్లుగా నటించారు. తాజాగా తన మూవీని ప్రమోషన్లో భాగంగా ఫ్యాన్స్‌కు బంపర్ ఆఫర్ ఇచ్చింది కృతి. ఈ మూవీ ట్రైలర్ అందరికీ నచ్చిందని భావిస్తున్నానని, అయితే ట్రైలర్లో తమకు నచ్చిన విషయాలేంటో చెప్పాలని ఫ్యాన్స్‌ను కోరింది. ఎవరైతే తనకు నచ్చిన అంశాల్ని ప్రస్తావిస్తారో వారితో జూమ్ కాల్లో మాట్లాడతానని అదిరిపోయే ఆఫర్ ఇచ్చింది. ఇక కృతి తెలుగులో తీన్మార్, ఒంగోలు గిత్త, బ్రూస్లీ చిత్రాల్లో తళుక్కున మెరిసింది. తెలుగుతో పాటు తమిళం, కన్నడ సినిమాల్లోనూ నటించింది. ఆ తర్వాత హిందీలో కాలు మోపిన ఈ భామ ప్రస్తుతం బాలీవుడ్లోనే ఎక్కువ సినిమాలు చేస్తూ అక్కడే సెటిలైంది. ఇటీవలే హిందీలో ‘పాగల్ పంతి’ ‘హౌస్ ఫుల్-4’ సినిమాలతో హిట్స్ అందుకుంది ఈ ముద్దుగుమ్మ. -
ZOOM : ఇకపై... ఏ లాంగ్వేజైనా ఓకే
వర్చువల్ సమావేశాలు మరింత సౌకర్యవంతంగా నిర్వహించుకునేందుకు వీలుగా నూతన టెక్నాలజీని జూమ్ అందుబాటులోకి తేబోతుంది. విభిన్న ప్రాంతాలు, వేర్వేరు భాషలకు చెందిన ప్రజలు ఇబ్బంది లేకుండా మాట్లాడుకునే వెసులుబాటు కల్పిస్తోంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లలో జూమ్ బిజీగా ఉంది. మరింత సమర్థంగా మాట్లాడుతుండగానే ఒక భాషను అనువైన భాషలోకి తర్జుమా చేసి చెప్పే టెక్నాలజీతో దూసుకుపోతున్న జర్మనీకి చెందిన కైట్స్ సంస్థను జూమ్ టేకోవర్ చేసింది. కైట్స్‌కి సంబంధించిన సాంకేతికతను ఉపయోగించి వర్చువల్ మీటింగ్స్ మరింత సమర్థంగా ఉండేలా చూస్తామంటూ జూమ్ ప్రకటించింది. అంతేకాదు కైట్స్‌కి చెందిన ఇంజనీర్లు మెషిన్ ట్రాన్స్‌లేషన్‌లో మరిన్ని నూతన ఆవిష్కరణలు చేస్తారని, అవి తమ యూజర్లకు మరింత సౌకర్యాన్ని అందిస్తాయని జూమ్ తెలిపింది. ఇప్పటికే ఉన్నా వర్చువల్ మీటింగ్‌లో విభిన్న భాషలు మాట్లాడేప్పుడు తర్జుమా చేసే ఫీచర్‌ను ఈ ఏడాది ప్రారంభంలో జూమ్ ప్రవేశపెట్టింది. అయితే మీటింగ్ జరిగేప్పుడు ఇతర శబ్ధాలు వినిపించినా, కొన్ని భాషలకు సంబంధించి స్థానిక యాసల్లో మాట్లాడినా, పదాలు పలికేప్పుడు స్పస్టత లోపించినా.... వాటిని అనువదించడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీన్ని అధిగమించేందుకు మెషిన్ ట్రాన్స్‌లేషన్‌లో మెరుగైన సంస్థగా ఉన్న కైట్స్‌ని జూమ్ టేకోవర్ చేసింది. చదవండి : Incom Tax : జులై 1 నుంచి కొత్త టీడీఎస్ రూల్స్ -
Jeffrey Toobin: నా చేష్టల్ని సమర్థించుకోలేను!
న్యూయార్క్: అమెరికా న్యూస్ పర్సనాలిటీ జెఫెర్రె టూబిన్ ఎనిమిది నెలల గ్యాప్ తర్వాత హఠాత్తుగా టీవీ ముందు ప్రత్యక్షమయ్యాడు. ఇప్పటి నుంచి ప్రముఖ న్యూస్ ఛానెల్ సీఎన్ఎన్లో లీగల్ అనలిస్ట్‌గా ఆయన పని చేయనున్నారు. పోయినేడాది అక్టోబర్‌లో జూమ్ కాల్లో ఆయన అసభ్య చేష్టలకు పాల్పడడంతో ప్రపంచం నివ్వెరపోయింది. ఈ చర్యతో ది న్యూయార్కర్ ఆయన్ని అనధికారికంగా విధుల నుంచి తప్పించింది. కాగా, తన చేష్టలకు ఆయన అందరికీ క్షమాపణలు చెబుతూ కొత్త విధుల్ని ప్రారంభించడం విశేషం. ‘‘ఆరోజు నేను చాలా మూర్ఖంగా నేను ప్రవర్తించా. ఇతరులు చూస్తారనే ధ్యాస నాకు లేదు. నా కుటుంబానికి, సహచర జర్నలిస్టులకు, అందరికీ క్షమాపణలు చెప్పుకుంటున్నా. నా చేష్టలను ఎట్టిపరిస్థితుల్లో సమర్థించుకోలేను. ఆ ఘటన తర్వాత మామూలు మనిషిగా మారేందుకు టైం పట్టింది. మానసిక ప్రశాంతత కోసం థెరపీ తీసుకున్నా. ఒక ఫుడ్ బ్యాంక్‌లో పని చేశా. ఓక్లాహోమా సిటీ పేలుళ్ల గురించి ఒక బుక్ రాయడంలో లీనమయ్యా’’ అని 61 ఏళ్ల టూబిన్ చెప్పుకొచ్చాడు. కాగా, అక్టోబర్ 19, 2020న న్యూయార్కర్, డబ్ల్యూఎన్వైసీ రేడియో స్టాఫర్స్ మధ్య జూమ్ మీటింగ్ జరుగుతుండగా.. టూబిన్ తన వ్యక్తిగత వీడియో కాల్లో ఎవరితోనో మాట్లాడుతూ, హస్తప్రయోగం చేసుకున్నాడనే విమర్శలు వెల్లువెత్తాయి. ఈ ఘటనపై దిగ్భ్రాంతి చెందిన న్యూయార్కర్.. ఆయన్ని విధుల నుంచి దూరంగా ఉంచింది. కాగా, దాదాపు మూడు దశాబ్దాలుగా న్యూయార్కర్‌తో అనుబంధం ఉన్న టూబిన్.. జూమ్ చేష్టల ద్వారా జర్నలిజానికి మాయని మచ్చ వేశాడంటూ జిమ్మీ ఫాలోన్, డొనాల్డ్ ట్రంప్ జూనియర్ లాంటి ప్రముఖులు.. శాటర్ డే నైట్ లైవ్ ప్రోగ్రాం దుమ్మెత్తిపోశారు. లా స్టూడెంట్‌గా ఉన్నప్పటి నుంచే మానవీయ కోణంలో ఎన్నో పుస్తకాలు రాసి ప్రపంచవ్యాప్తంగా గొప్ప రచయితగా పేరు దక్కించుకున్నాడు టూబిన్. -
ప్రజలు నన్ను అర్థం చేసుకోలేకపోయారు
సాక్షి, హైదరాబాద్: ప్రజలు తనను అర్థం చేసుకోలేకపోయారని, అర్థం చేసుకుంటారని అనుకున్నానని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు అన్నారు. న్యూజిలాండ్ టీడీపీ మహానాడు పేరుతో హైదరాబాద్ నుంచి ఆదివారం జూమ్ కాన్ఫరెన్స్‌లో పలువురు ఎన్ఆర్ఐలతో మాట్లాడారు. ప్రజలు తనను అర్థం చేసుకోకపోవడం వల్ల తనకు నష్టం రాలేదని, ప్రజలే నష్టపోయారని చెప్పారు. అభివృద్ధి చేయలేదా అంటే చేశామన్నారు. ఎక్కడ తప్పు చేశానో తనకు ఇప్పటికీ అర్థం కావడంలేదన్నారు. మంచిని అర్థం చేసుకోలేని ప్రజానీకం ఉంటే ఏం చేయగలుగుతామని ఆవేదన వ్యక్తం చేశారు. లక్ష కోట్ల అవినీతి చేసిన వ్యక్తిని సరిగా విశ్లేషించలేని ప్రజానీకం ఉన్నప్పుడు తమకు బాధలు తప్పవన్నారు. తమ వాళ్లు అందరూ బాధపడుతున్నారని, తనను మారాలంటున్నారని, కానీ దానికి ముందు నిలబడి ఉండాలి కదా అని నిర్వేదం వ్యక్తం చేశారు. 2024 ఎన్నికల్లో టీడీపీ నూటికి నూరు శాతం గెలుస్తుందని, ఇందులో అనుమానం అవసరం లేదన్నారు. ఎన్నికలు ముందు జరిగినా గెలుస్తామని చెప్పారు. -
జూమ్ మీటింగ్‌లో మళ్లీ చెండాలం!
జూమ్ మీటింగ్‌లో ఉన్నానన్న సంగతి మరిచిపోయి నగ్నంగా దర్శనమిచ్చిన కెనడా ఎంపీ విలియం ఆమోస్ గుర్తున్నాడా? ఈ పనితో అతను వరల్డ్ ఫేమస్ అయ్యాడు. అయితే పనిలో పనిగా ప్రభుత్వం నుంచి వార్నింగ్ కూడా అందుకున్నాడు. కానీ, అతని బుద్ధి మారినట్లు లేదు. ఈసారి అంతకుమించిన పనితో మరోసారి వార్తల్లోకెక్కాడు. జూమ్ మీటింగ్ అది కూడా అధికారిక సమావేశం అనే సోయి లేకుండా కాఫీ కప్పులో మూత్రవిసర్జన చేశాడు. ఒట్టావా: కెనడా ఎంపీ విలియమ్ ఆమోస్ మరో వివాదంలో ఇరుకున్నాడు. వర్చువల్ పార్లమెంట్ సెషన్ జరుగుతున్న టైంలో కాఫీ కప్పులో మూత్రవిసర్జన చేశాడు. దీంతో లైవ్‌లో ఉన్నవాళ్లంతా అవాక్కయ్యారు. విమర్శలు రావడంతో విలియమ్‌ను పక్కనపెట్టాలని, చర్యలు తీసుకోవాలని ప్రధాని జస్టిన్ ట్రూడో నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ లోపే తాను బాధ్యతల నుంచి విశ్రాంతి తీసుకోవాలని భావిస్తున్నట్లు ఆమోస్ ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేశాడు. చదవండి: బట్టల్లేకుండా ఎంపీ కాగా, ఉద్దేశపూర్వకంగా తాను ఆ పని చేయలేని విలియమ్ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఘటనపై తాను పశ్చాత్తాపం చెందుతున్నానని పేర్కొన్నాడు. అది వీడియో కాల్ అనే విషయం మరిచిపోయానని, అందరూ చూస్తారనే విషయం తనకు తట్టలేదని విలియమ్ చెప్పాడు. కాగా, కెనడాలోని కొందరు ఎంపీలు లైంగిక వేధింపుల విమర్శలను కూడా ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఈ తరుణంలో విలియమ్‌ను పక్కనపెట్టడమే మంచిదని ట్రూడోకి సహచరులు సలహా ఇచ్చినట్లు తెలుస్తోంది. Please see my statement. Veuillez lire ma déclaration. pic.twitter.com/ICc8WjqNZi — William Amos (@WillAAmos) May 28, 2021 ఇక ఈ రెండు సంఘటనలు యాదృచ్చికమని, ఇప్పుడు ఎంతో చింతిస్తున్నానని ఆమోస్ అంటున్నాడు. అంతేకాదు తన చర్య ఎవరికైనా బాధ కలిగించి ఉంటే క్షమించాలని తన ట్విట్టర్లో కోరాడు. లిబరల్ పార్టీలో కీలక సభ్యుడైన విలియం ఆమోస్.. పార్లమెంటరీ సెక్రటరీగా బాధ్యతల నుంచి కొంతకాలం తప్పుకుంటానని తెలిపాడు. పోయిన నెలలో జూమ్ మీటింగ్‌లో విలియమ్ పూర్తి నగ్నంగా ఉన్న ఓ స్క్రీన్ షాట్ వైరల్ అయ్యింది. ఆ సమయంలో క్షమాపణలు చెబుతూ.. ట్విట్టర్లో ఒక పోస్ట్ పెట్టాడు విలియమ్ ఆమోస్. విలియమ్ మానసిక స్థితి పలు సందేహాలున్నాయని తోటి సభ్యులు చెప్తుండడం విశేషం. -
జూమ్ మీటింగ్‌లో అడ్డంగా దొరికిన యూఎస్ సెనేటర్...! కానీ..
వాషింగ్టన్: కరోనా నేపథ్యంలో విద్యార్థులు, అధికారులు, ఉద్యోగస్తులు పూర్తిగా జూమ్ మీటింగ్లకే పరిమితమయ్యారు. జూమ్‌లోనే అన్నీ కార్యాకలాపాలు జరుగుతున్నాయి. కాగా జూమ్ మీటింగ్‌లలో అప్పుడప్పుడు కొన్ని తమాషా సంఘటనలు కూడా జరుగుతుంటాయి. తాజాగా జూమ్ మీటింగ్‌లో ఏకంగా యూఎస్ సెనేటర్ విషయంలో ఒక ఆసక్తికర సంఘటన జరిగింది. అమెరికాలోని ఓహియో స్టేట్‌లో ప్రతిష్టాత్మక డ్రైవింగ్ డిస్ట్రక్షన్ నిషేధ బిల్లుపై జరిగిన చర్చ సమావేశంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. ఓహియో రిపబ్లికన్ సెనేటర్ ఆండ్రూ బ్రెన్నర్ డ్రైవింగ్ చేస్తూ జూమ్ సమావేశానికి హజరయ్యాడు. అతడు డ్రైవింగ్ చేస్తున్నట్లు కన్పించకుండా ఉండడం కోసం తన బ్యాక్ గ్రాండ్లో ఇంట్లో ఉన్నట్లు స్క్రీన్‌ను వాడాడు. కానీ అతడు వేసుకున్న సీట్ బెల్ట్‌తో డైవింగ్ చేస్తున్నట్లుగా సమావేశంలో ఉన్నవారికి తెలిసిపోయింది. సెనేటర్ ఈ విధంగా చేయడానికి ముఖ్యకారణం .. డిస్ట్రాక్షన్ డ్రైవింగ్‌ను నిషేధించాలని ఓహియో స్టేట్ అసెంబ్లీ ఒక కొత్త బిల్లును తీసుకొని వచ్చింది. ఓహియో స్టేట్ అసెంబ్లీ లో బిల్లుపై చర్చ జరపుతూ సెనేటర్ ఈ బిల్లును వ్యతిరేకిస్తూ తన నిరసనను తెలిపాడు. తన చర్యలను సెనేటర్ తోసిపుచ్చాడు. కాగా తను జూమ్ మీటింగ్‌లో శ్రద్ధగా వింటూ, డ్రైవింగ్ పై దృష్టి పెట్టానని తెలిపాడు. కాగా డ్రైవింగ్ చేసేటప్పుడు ఫోన్ మాట్లాడేటప్పుడు, ఇతరత్రా చర్యలు చేసేటప్పుడు డ్రైవర్ తన ఏకాగ్రతను కొల్పోయి ప్రమాదాలకు గురవుతున్నారని ఈ బిల్లును ఓహియో స్టేట్ సెనేట్‌లో ప్రవేశపెట్టారు. View this post on Instagram A post shared by The Guardian (@guardian) చదవండి: వెనక్కు తగ్గిన ఆస్ట్రేలియా.. వారి ప్రయాణానికి ఓకే -
జూమ్ లో అదిరిపోయే కొత్త ఫీచర్
జూమ్ ఇమ్మర్సివ్ వ్యూ అని పేరుతో అదిరిపోయే కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొని వచ్చింది. గతంలో జూమ్ నుంచి వీడియో కాల్ చేసినప్పుడు మన బ్యాక్‌గ్రౌండ్ ఎలా ఉంటే అలా కనబడేది. ఇప్పుడు జూమ్ తీసుకొచ్చిన ఇమ్మర్సివ్ వ్యూ అనే ఫీచర్ సహాయంతో ఉద్యోగులు అయితే నిజంగానే మనం ఆఫీసులో ఉన్నమా?, విద్యార్థులు అయితే పాఠశాలలో ఉన్నమా? అనే అనుభూతి కలుగుతుంది. జూమ్ గత సంవత్సరం తన జూమ్ టోపియా పేరుతో ఈ ఫీచర్‌ను ప్రకటించింది. జూమ్ ఇమ్మర్సివ్ వ్యూ పేరుతో నిర్వహించే సమావేశంలో 25 మందికి మాత్రమే పాల్గొనే అవకాశం ఉంది. ప్రస్తుతానికి ఈ ఫీచర్ విదేశాల్లో ఉన్న ఉచిత, ప్రో వినియోగదారులకు అందుబాటులో ఉంది. ఈ ఆప్షన్‌ను ఎంచుకుంటే ఒక గదిలో ఐదారు స్థానాలు కనిపిస్తాయి. అందులో టేబుల్ దగ్గర(పైన ఒకటో ఫొటోలో ఉన్నట్లు) సమావేశంలో కూర్చున్నట్లుగా అడ్జెస్ట్ చేయవచ్చు. అవసరమైతే బ్యాగ్రౌండ్‌ను కూడా మీకు నచ్చింది పెట్టుకోవచ్చు. అయితే దీనిలో ఎటువంటి మార్పులు చేయాలన్న కేవలం హోస్ట్‌కు మాత్రమే అవకాశం ఉంటుంది. త్వరలో మన దేశంలోనూ అందుబాటులోకి తీసుకొనిరనున్నారు. ఈ ఫీచర్ ప్రస్తుతానికి జూమ్ డెస్క్ టాప్ వెర్షన్లో మాత్రమే అందుబాటులో ఉంది. అయితే దీనికి పోటీగా ఇదే తరహా ఫీచర్ మైక్రోసాఫ్ట్ టీమ్స్ ‘టుగెదర్ మోడ్’ పేరుతో అందుబాటులో ఉంది. చదవండి: టెకీలకు ఊరట: వేతనంతో కూడిన సెలవులు -
పార్లమెంట్ జూమ్ మీటింగ్‌లో నగ్నంగా ఎంపీ: ఫోటో వైరల్
కరోనామహమ్మారి పుణ్యమాని నేరుగా కలిసి మాట్లాడటమే కరువైంది. అన్నీ మాటలు వర్చువల్‌గానే నిచ్చేస్తున్నారు. ఇక ఐటీ సంస్థలు, కంపెనీలు, విద్యాసంస్థలే కాదు న్యాయస్థానాలు..చట్టసభలు కూడా మూతపడ్డాయి. దీంతో కేసుల విచారణలు, అధికారుల సమావేశాలు, ఇలా ముఖ్యమైనవన్నీ జూమ్ కాల్స్‌కే పరిమితం కావాల్సిన పరిస్థితి. ఈ క్రమంలో ఏకంగా పార్లమెంట్ సమావేశాలు జూమ్ కాల్లో ఒక ఎంపీ నగ్నంగా దర్శనమివ్వడం హాట్ టాపిక్‌గా నిలిచింది. ఈ అనూహ్య పరిణామంతో సభాధ్యక్షుడితో పాటు తోటి ఎంపీలంతా ఒక్కసారిగా ఉలిక్కిపడిన ఘటన కెనడాలో జరిగింది. దీంతో పొరపాటు జరిగిందంటూ తన సహోద్యోగులందరికీ క్షమాపణలు చెప్పుకున్నాడు. అసలు అక్కడ ఏం జరిగింది ప్రపంచ దేశాలతో పాటు కరోనా కెనడాను కుదిపేస్తోంది. దీంతో పార్లమెంట్ సమావేశాల్ని జూమ్ మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారు. ఈ క్రమంలో సమావేశాలు జరుగుతున్న సందర్భంలో విలియమ్ ఆమోస్ అనే ఎంపీ ఉదయాన్నే లేచి జాగింగ్ కు వెళ్లి ఆ రోజు లేట్‌గా ఇంటికి వచ్చాడు. దీంతో పార్లమెంట్ సమావేశాల్లో పాల్గొన సమయం దగ్గరపడటంతో స్నానం చేయకుండానే సమావేశాల్లో పాల్గొందామనుకున్నారు. తన ల్యాప్‌టాప్ కెమెరా ఆన్ చేసి ఇంకా కొంచెం టైమ్ ఉందిలే ఈ లోపు బట్టలు మార్చేసుకుందామని అనుకున్నారు. అలా బట్టలు మార్చుకునే సమయంలోనే జూమ్ వీడియో సడెన్‌గా ఆన్ అయ్యింది. దాంతో ఆమోస్ సమావేశాల్లో నగ్నంగా తెరపై దర్శనమిచ్చారు. దీంతో సభాధ్యక్షుడితో పాటు తోటి ఎంపీలంతా షాక్ అయ్యారు.దీనికి సంబంధించి స్క్రీన్ షాట్ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అయితే ఈ ఘటన పొరపాటున జరిగిందని హౌజ్ ఆఫ్ కామన్స్ సభ్యులు తనను క్షమించాలని సోషల్ మీడియా ద్వారా వేడుకున్నారు. ఆ ఘటన తనను ఇబ్బందికి గురి చేసిందంటూ ట్వీట్ చేశారు. నిజాయితీగా తప్పును ఒప్పుకుంటున్నానని..మరోసారి ఇటువంటి పొరపాటు జరగకుండా చూసుకుంటానని తన ట్విటర్లో పోస్ట్ చేశారు. ఈ ఘటనపై అధ్యక్షుడు జస్టిన్ ట్రూడో ఇంకా ఎటువంటి రియాక్షన్ ఇవ్వలేదు. ( చదవండి: సెలవు కోసం భార్యకు విడాకులిచ్చిన భర్త...అది కూడా 3 సార్లు ) I made a really unfortunate mistake today & obviously I’m embarrassed by it. My camera was accidentally left on as I changed into work clothes after going for a jog. I sincerely apologize to all my colleagues in the House. It was an honest mistake + it won’t happen again.— Will Amos (@WillAAmos) April 14, 2021 -
జూమ్ కితకితలు : ప్యాంట్ లేకుండానే
సాక్షి, న్యూఢిల్లీ : కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు రేపింది. ఈ మహమ్మారి విస్తరణకు అడ్డుకునేందుకు మొత్తం ప్రపంచమంతా కఠిన నిబంధనల మధ్య లాక్డౌన్ అయిపోయింది. ఫలితంగా దేశ ఆర్థికవ్యవస్థలు చిన్నాభిన్నా మైపోయాయి. దీంతో ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కోల్పోయిన వారికి లెక్కే లేదు. దీంతోపాటు లాక్డౌన్ కారణంగా వర్క్ స్టయిల్ పెనుమార్పులకు 2020 ఏడాది సాక్క్ష్యంగా నిలిచింది. చాలామంది ఉద్యోగులు వర్క్‌ఫ్రం హోంకు పరిమితమై పోయారు. పాఠశాలలు, విద్యార్థులు ఆన్లైన్ తరగతులను ఆశ్రయించక తప్పలేదు. (జూమ్ కాల్లో ఫన్నీ రొమాన్స్ : వైరల్) ఇవన్నీ ఒక ఎత్తయితే.. వర్క్ ఫ్రం హోం, జూం మీటింగులు, వీడియో కాల్స్‌లో చోటు చేసుకున్న ఫన్నీ ఇన్సిడెంట్స్ కోకొల్లలు. 2020 ఏడాదిలో అత్యంత ఇబ్బందికరమైన జూమ్ క్షణాలు అని వీటన్నింటిని ఒక చోట చేరిస్తే..పొట్ట చెక్కలవ్వడం ఖాయం. అలాంటి వీడియోలు సోషల్ మీడియాలో ఇప్పటికీ చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. మిలియన్ల కొద్దీ వ్యూస్‌తో నెటిజన్లకు గిలిగింతలు పెడుతూనే ఉన్నాయి. ప్రధానంగా ఇంట్లోని చిన్నపిల్లలు,పెంపుడు జంతువుల సందడి ఒక ఎత్తయితే.. ఆన్లైన్లో ఉన్నామనే సోయి లేకుండా, జూమ్ బుట్టలో పడ్డ పెద్దవారి గురించి ఎంత చెప్పుకున్నా తరగదు. ఉదాహరణకు ఒక మీటింగ్‌లో కెమెరా ఆన్‌లో ఉందన్న సంగతి మర్చిపోయి ఒక బాయ్ ఫ్రెండ్ ప్యాంట్ లేకుండా లోదుస్తులతో దర్శమిస్తాడు. మరో వ్యక్తి.. ప్యాంట్ లేకుండానే..ఇంటర్వ్యూని ఫినిష్ చేస్తాడు.. ఇక పాపం..జెన్నిఫర్ గురించి ఏమని చెప్పాలి.. ఆనక విషయం తెలిసి వారు బిక్కమొహం వేస్తే....మనం మాత్రం వై దిస్ కొలవెర్రీ అంటూ.. కడుపుబ్బ నవ్వుకోవడమే. -
‘నేనేం పిల్లిని కాను’: జూమ్ యాప్‌లో ఫన్నీ ఘటన
అమెరికాలో కరోనాతో ఇబ్బంది పడ్డ ప్రజలకు ఓ ప్యాకేజీ ప్రకటిద్దామని అధికారులు నిర్ణయం తీసుకుని దానిపై చర్చించేందుకు జూమ్ యాప్‌ను ఉపయోగించారు. జూమ్ యాప్‌లో మాట్లాడుతున్న సమయంలో జరిగిన ఓ చిన్న సంఘటన వైరల్‌గా మారింది. తలకిందులుగా ప్రసారమవడంతో ఓ కాంగ్రెస్ సభ్యుడు అసహనం వ్యక్తం చేశారు. ‘తానేం పిల్లిని కాను’ అని తలకిందులుగా వచ్చిన ఫొటోను స్క్రీన్‌షాట్ తీసి ట్వీట్ చేశారు. దీనికి నెటిజన్లు పలువిధాలుగా కామంట్స్ చేస్తున్నారు. యునైటెడ్ స్టేట్స్ హౌస్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కమిటీ కరోనాతో బాధపడుతున్న ప్రజలకు ప్రత్యేక ప్యాకేజీ ఏర్పాటుపై చర్చా సమావేశం జూమ్ యాప్‌లో నిర్వహించింది. సభ్యులు, అధికారులతో కలిసి ఆన్లైన్ జూమ్ యాప్ కేంద్రంగా సమావేశం నిర్వహించగా ఈ సమయంలో చిన్న తప్పిదం జరిగింది. కాంగ్రెస్ సభ్యుడు టామ్ ఎమ్మర్ మాట్లాడుతుండగా వీడియో తలకిందులుగా ప్రసారమైంది. దీంతో టామ్ ఎమ్మర్ కూడా తలకిందులుగా కనిపించాడు. దీన్ని చూసిన అక్కడి ప్రజాప్రతినిధులు, అధికారులు మీరు బాగానే ఉన్నారు కదా..? అని ప్రశ్నించారు. ‘ఇలా ఎందుకు వస్తుందో తనకు తెలియదని, దీనిని ఒకసారి ఆపివేసి, తిరిగి మళ్లీ ప్రారంభిస్తా’ అని చెప్పారు. దీనిపై ఆయన అసహనానికి గురయ్యాడు. వెంటనే స్క్రీన్‌షాట్ తీసుకుని దాన్ని ట్విటర్లో పంచుకున్నాడు. ‘తాను తలకిందులుగా వేలాడడానికి పిల్లిని కాదు’ అని ట్వీట్ చేశాడు. I am not a cat. pic.twitter.com/d4lhQd0sJ4 — Tom Emmer (@RepTomEmmer) February 10, 2021 -
మేకలతో జూమ్ మీటింగ్... ఆదిరిపోయే ఆదాయం
లండన్: కరోనా మహమ్మారి ఒక్కొక్కరి జీవితంలో ఒక్కో కొత్త అనుభవాన్ని మిగిల్చింది. ఉపాధి కోల్పోయిన వారు కొందరైతే, ఆరోగ్యాన్నీ, ప్రాణాల్ని సైతం కోల్పోయిన వారు కోకొల్లలు. లక్షలాది మంది వ్యాపారాలు దెబ్బతిన్నాయి. కరోనా నేర్పిన అనుభవాల్లో జూమ్ మీటింగ్ ఒకటి. అయితే మనుషులు సమావేశమయ్యే జూమ్ మీటింగే కాదు, మేకలు హాజరయ్యే జూమ్ మీటింగ్ గురించి మీరు విని ఉండరు. కానీ, యూకేలోని రాసెండేల్‌కు చెందిన డాట్ మెక్ కార్టీ మేకలను జూమ్ మీటింగ్‌లోకి తెచ్చి అక్షరాలా 50 లక్షలు సంపాదించారు. లాక్‌డౌన్‌తో తగ్గిన ఆదాయం మేకలేంటీ? జూమ్ మీటింగేంటీ అని ఆశ్చర్యపోతున్నారా? అవును, నిజమే కానీ జూమ్ మీటింగ్ పెట్టుకునేది మేకలు కాదు. మనుషుల జూమ్ మీటింగ్‌కి మేకలు అటెండ్ అవుతాయి అంతే. అది కూడా ప్రత్యక్షంగా కాదు ఆన్లైన్లో. ! డాక్ మెక్ కార్టీకి కొంత పొలం ఉంది. అందులో ఆమె మేకలను పెంచుతున్నారు. వ్యవసాయంతో పాటు, మేకల పెంపకంపై విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు గాను విద్యార్థుల మేకల సందర్శనను కూడా ఒక ఆదాయ వనరుగా మలుచుకున్నారు మెక్ కార్టీ. కరోనా మహమ్మారి కారణంగా లాక్డౌన్ విధించడంతో విద్యాసంస్థలు మూతపడ్డాయి. వివాహాలకూ ఆమె వ్యవసాయ క్షేత్రాన్ని అద్దెకిచ్చేవారు. అయితే, పెళ్లిళ్లకూ అవకాశం లేకపోవడంతో ఇటు మేకలూ, అటు మెక్ కార్టీకి ఖాళీ సమయం దొరికింది. ఆదాయమూ తగ్గింది. జోక్ అనుకున్నా.. నిజమయ్యింది..! అంతా జూమ్ మీటింగుల్లో మునిగిపోయిన సమయంలో మెక్ కార్ట్ మేకలూ జూమ్ మీటింగ్ కి అటెండ్ అవ్వొచ్చుగా అనిపించి, ఈ సరదా ఆలోచనని ఓ జోక్‌లా వ్యవసాయ క్షేత్రానికి సంబంధించిన వెబ్ సైట్లో ప్రకటించారు. తన మేకలను జూమ్ మీటింగుల్లో కనిపించడానికి అద్దెకిస్తానంటూ చేసిన ఈ ప్రకటనకు నెటిజన్ల నుంచి అనూహ్యమైన స్పందన వచ్చింది. దీంతో సరదాగా వచ్చిన ఈ ఆలోచన మెక్ కార్టీకి యిప్పుడు కాసులు కురిపిస్తోంది.‘‘నెటిజన్లు సరదాగా నవ్వుకునేందుకు 2020 ఏప్రిల్ లో తొలి లాక్డౌన్ అప్పుడు జోక్‌గా దీన్ని వెబ్సైట్లో పెట్టి, నిద్రపోయాను. మేల్కొనే సరికి ఈ ఆలోచనని ఆహ్వానిస్తూ 200 మెయిల్స్. అందరూ తమ తమ జూమ్ మీటింగ్స్‌లో మేకలను హాజరు పర్చాలంటూ రిక్వెస్టులు’’అని ఆనందాన్ని వ్యక్తం చేశారు మెక్. ఆనందం కోసమే.. అయిదేళ్ల క్రితం తన తల్లి నుంచి ఈ వ్యవసాయ క్షేత్రాన్ని తీసుకున్న 32 ఏళ్ల మెక్ కార్టీ జూమ్ మీటింగుల్లో తన మేకలు పాల్గొనేలా చేసి, వారికి ఆనందాన్నిస్తున్నారు. జూమ్ మీటింగ్‌లను ఆహ్లాదపరిచేందుకు తన మేకలను వీడియో కాల్స్‌లో చమక్కున మెరిపిస్తున్నారు. అనేక సంస్థలూ, వ్యక్తులు, కుటుంబ సభ్యులు, తమ స్నేహితులను ఆశ్చర్యపరచడం కోసం మేకలను అద్దెకు తీసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఒక్కో మీటింగ్‌కి మేకకు ఐదు పౌండ్లు మీటింగ్ వీడియో లింక్ వివరాలు పంపిస్తే చాలు మెక్ కార్టీ ఉద్యోగులు మేకలను వీడియో సమావేశంలో కనిపించేలా చేస్తారు. అయితే, ఒక్కో మీటింగ్‌కి మేక హాజరు ఖరీదు 5 పౌండ్లు. ఇలా ఇప్పటి వరకు మెక్ కార్టీ 50 వేల పౌండ్లు అంటే దాదాపు రూ.50 లక్షలు సంపాదించారు. యిప్పుడు తన మేకలు అంతర్జాతీయ మీటింగుల్లో పాల్గొంటున్నాయంటారు మెక్. రష్యా, అమెరికా, చైనా, ఆస్ట్రేలియా దేశాలు నిర్వహించే వర్చువల్ మీటింగ్స్‌లో తన మేకలను హాజరు పరుస్తున్నానని చెప్పారు. కొందరు దాని ఖరీదుకన్నా ఎక్కువగా డబ్బులు విరాళంగా ఇస్తున్నారట. తన వ్యవసాయ క్షేత్రాన్ని మెరుగుపర్చుకోవడానికీ, లాక్డౌన్ కాలంలో తన సిబ్బంది వేతనాలకూ ఈ మేకల జూమ్ మీటింగ్‌లు అవకాశం కల్పించాయంటారు మెక్ కార్టీ. ఆదాయం కోసం ఎరువుని విక్రయించడం కన్నా ఇది చాలా సులభతరంగా, ఆనందంగా ఉందంటారు మెక్. చదవండి: పోలీస్ అయితే పెళ్లి సంబంధాలు రావన్నారు.. జూమ్ క్లాస్‌లో ఈ పిల్లాడేం చేశాడో తెలుసా? -
జూమ్ యూజర్లకు గుడ్ న్యూస్
ప్రపంచవ్యాప్తంగా కోవిడ్-19 నేపథ్యంలో లాక్ డౌన్ విధించిన సంగతి మనకు తెలిసిందే. దింతో ఒకరికొకరు కలుసుకోవడం చాలా కష్టం అయినప్పుడు జూమ్ ఆన్లైన్ వీడియో ప్లాట్ ఫామ్ ఒక్కసారిగా మార్కెట్ లోకి దూసుకొచ్చింది. దింతో జూమ్ వినియోగం చాలా వరకు పెరిగింది. లాక్ డౌన్ కాలం నుండి ఇప్పటి వరకు వీడియో సమావేశాలు, రాజకీయ సమావేశాలు, ఆన్లైన్ క్లాసులు ఇలా అన్ని జూమ్ లోనే జరుగుతున్నాయి. డిజిటల్ ప్రపంచంలో జూమ్ తన స్థానాన్ని సుస్థిర పరుచుకునేందుకు ప్రయత్నాలు చేస్తుంది. దింట్లో భాగంగానే ఇప్పుడు వెబ్ ఈమెయిల్, క్యాలెండర్ సేవలను కొత్తగా తీసుకురాబోతుంది.(చదవండి: ఆపిల్ బ్లూటిక్‌ను ఫేస్బుక్ తొలగించిందా?) ఇప్పటి వరకు తెలిసిన సమాచారం మేరకు జూమ్ వెబ్ ఈమెయిల్ సేవలను అభివృద్ధి చేస్తున్నట్లు తెలుస్తుంది. "వచ్చే ఏడాది 2021 ప్రారంభంలో కొంతమంది వినియోగదారులకు దీని యొక్క బీటా వెర్షన్" అందుబాటులోకి తీసుకోని రావచ్చు. అలాగే కంపెనీ క్యాలెండర్ అప్లికేషన్‌ను కూడా అభివృద్ధి చేస్తోందని ఒక నివేదిక తెలిపింది. మార్కెట్ వీడియో కాలింగ్ సేవలలో జూమ్ పైచేయి సాధించినప్పటికీ, మెయిల్ కి సంబంధించి తీవ్ర పోటీని ఎదుర్కొంటుంది. ప్రస్తుతం మైక్రోసాఫ్ట్(ఆఫీస్ 365), గూగుల్(జీ సూట్) మాత్రమే ఈ సేవలను అందిస్తున్నాయి. వీటికి పోటీగా జూమ్ సంస్థ తక్కువ ఖర్చుతో యూజర్లకు కొత్త సేవలను తీసుకురానున్నట్లు పేర్కొంది. ప్రస్తుతం కంపెనీ జూమ్ రూమ్స్, సిస్టమ్స్, వైర్లెస్ సేవలను వినియోగదారులకు అందిస్తోంది. వీడియో కాన్ఫరెన్సింగ్ మార్కెట్లో జూమ్ వాటా 485 శాతానికి పైగా పెరిగినట్లు సంస్థ పేర్కొంది. -
3.3 ట్రిలియన్ గంటలు ఫోన్లకు అతుక్కుపోయారు..
ప్రస్తుతం ప్రపంచంలో ఇంటర్ నెట్ అనే పదం తెలియని వారు చాలా కొద్దీమంది ఉండవచ్చు. ప్రతి చిన్న దానికి ఏదైనా వెతకాలంటే అందరికి మొదటగా గుర్తుకు వచ్చేది ఇంటర్ నెట్. అందుకే రోజు రోజుకి నెట్ మీద ప్రజలు ఎక్కువ సమయం గడుపుతున్నట్లు నివేదికలు చెపుతున్నాయి. ఈ ఏడాది ఆండ్రాయిడ్ వినియోగదారులు 3.3 ట్రిలియన్ గంటలు తమ మొబైల్ ఫోన్లకు అతుక్కుపోయినట్లు ఒక అనలిటిక్స్ సంస్థ తెలిపింది. గత ఏడాదితో పోలిస్తే ఇంటర్ నెట్ వినియోగం 25 శాతం పెరిగింది అని పేర్కొంది. (చదవండి: ఆ ఫోన్లు కొనకండి అంటున్న నాగార్జున) ఒక అనలిటిక్స్ సంస్థ విడుదల చేసిన నివేదికలో ట్విటర్ లేదా ఇన్స్టాగ్రామ్ ఫీడ్‌తో పోలిస్తే వీడియో కాన్ఫరెన్సింగ్ యాప్స్ అయిన జూమ్, మైక్రోసాఫ్ట్ టీమ్స్ వంటి యాప్స్ పై ఎక్కువ సమయం గడపడం విశేషం. కరోనా మహమ్మారి కారణంగా వర్క్ ఫ్రమ్ హోమ్ చేయడం ద్వారా బిజినెస్ యాప్స్ మీద గత ఏడాది కంటే ఈ ఏడాది రెండు రెట్లు ఎక్కువ సమయాన్ని వెచ్చించారు. వ్యాక్సిన్లు త్వరలో రానున్నప్పటికీ వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది వచ్చే ఏడాది కూడా కొనసాగుతున్నట్లు తెలుస్తుంది. అందుకే వచ్చే ఏడాది 2021లో కూడా ఇదే ధోరణి కొనసాగే అవకాశం ఉంది. 2020లో వినియోగదారులు ఇంటర్ నెట్లో ఎక్కువ గంటలు గడపడానికి కొన్ని ఇతర అంశాలు కూడా ఉండవచ్చు. ఈ ఏడాది ఆండ్రాయిడ్ డౌన్లోడ్లు 10 శాతం పెరిగి 90 బిలియన్ల మార్కును దాటాయి. వినియోగదారులు ఎక్కువగా డౌన్లోడ్ చేసుకున్న వాటిలో గేమ్స్ కి సంబందించిన యాప్స్ 45 శాతం వాటాను ఆక్రమించుకున్నాయి. ఆశ్చర్యకరంగా ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్లలో భారతదేశం, బ్రెజిల్, ఇండోనేషియా ప్రజలు అధిక మొత్తంలో డౌన్లోడ్ చేసుకున్నారు. టిక్‌టాక్ ను ఎక్కువ సంఖ్యలో డౌన్లోడ్ చేసుకోవడంతో పాటు ఎక్కువ సమయాన్ని దాని మీదే గడిపారు. అందుకే ఇది డౌన్లోడ్ పరంగా మొదటి స్థానంలో నిలిచింది. జూమ్, గూగుల్ మీట్ వంటి వీడియో కాన్ఫరెన్సింగ్ యాప్స్ కూడా డౌన్లోడ్ల పరంగా టాప్ 10లో ఉన్నాయి. యూత్ ఎక్కువ ఇష్ట్టపడే టిండర్ యాప్ కరోనా కారణంగా ఒకరిని ఒకరు కలవడం సాధ్యం కాకున్నా ప్రజలు అన్నింటికంటే దీని మీద ఎక్కువ సమయం గడిపినట్లు తెలుస్తుంది. దీనికి లాక్డౌన్ సమయంలో వర్చువల్ డేట్స్ కోసం గ్లోబల్ స్వైపింగ్, వీడియో కాలింగ్ వంటి ఫీచర్స్ ని తీసుకురావడమే. మల్టిపుల్ ప్లేయర్స్ కలిసి ఆడే గేమ్స్ ‘అమాంగ్ అస్’, ‘లూడో కింగ్’ వంటివి జనాకర్షణ పొందాయి. 2021లో కూడా ఇదే ధోరణి కొనసాగుతుందని నిపుణుల అంచనా. ఈ ఏడాది మొబైల్ కంపెనీల ఆదాయం 120 బిలియన్ డాలర్లు దాటాయి. -
గంటల్లోనే 4.2 బిలియన్ డాలర్లు "జూమ్"
సాక్షి, న్యూఢిల్లీ : కరోనా కాలంలో టెక్ ప్రపంచంలో అత్యంత ధనవంతుల ఆదాయం జామ్ జామ్ అంటూ రికార్డు స్థాయిలో పరుగులు పెడుతోంది. అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ ఒక రోజులో నికర విలువ13 బిలియన్ డాలర్లు పెరగ్గా, టెస్లా సీఈఓ ఎలోన్ మస్క్ ఆదాయం గత నెల 24 గంటల్లో 8 బిలియన్లు పెరిగింది. తాజాగా రికార్డు ఆదాయం సాధించినవారి జాబితాలో ప్రముఖ వీడియో కాన్ఫరెన్సింగ్ యాప్ జూమ్ వీడియో కమ్యూనికేషన్స్ వ్యవస్థాపకుడు, సీఈఓ ఎరిక్ యువాన్ చేరారు. (ప్రపంచ ధనవంతుల జాబితా.. 4వ స్థానంలో ఎలన్) ఆగస్టు 31న ప్రకటించిన జూలై 31తో ముగిసిన త్రైమాసిక ఫలితాల్లో జూమ్ ఆదాయం 355 శాతం పెరిగి 663.5 మిలియన్ డాలర్లకు చేరుకుంది. కేవలం ఒక సంవత్సరంలో ఆదాయం దాదాపు నాలుగు రెట్లు పెరుగుదలను నమోదు చేసింది. దీంతో కంపెనీ షేర్లు 26 శాతం ఎగిసాయి. ఎరిక్ యువాన్ కొద్ది గంటల్లోనే వందల కోట్ల డాలర్లను తన సంపదకు జోడించుకున్నారు. ఫలితంగా అతని సంపద 4.2 బిలియన్ డాలర్ల మేర పెరిగిందని బ్లూమ్‌బెర్గ్ నివేదించింది. జూమ్ వీడియో పేరు ఇదే జోరు కొనసాగిస్తే యువాన్ సంపద 20 బిలియన్ డాలర్లకు మించిపోతుందని పేర్కొంది. కరోనా వైరస్ మహమ్మారి సంక్షోభ సమయం, లాక్ డౌన్ నిబంధనల కారణంగా ప్రజలు వర్చువల్ జీవితానికి అలవాటు పడాల్సిన పరిస్థితి. దీంతో వీడియోకాలింగ్ యాప్ కు భారీ ఆదరణ లభించింది. దీంతో ఈ త్రైమాసికంలో యువాన్ ఆదాయం గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే నాలుగు రెట్లు పెరిగింది. సుమారు 50 మిలియన షేర్లతో కంపెనీలో దాదాపు 29 శాతం వాటా యువాన్ సొంతం. ఏప్రిల్ 2019లో పబ్లిక్ ఆఫర్ నాటికి ఇది 22 శాతంగా ఉంది. కాగా ఫోర్బ్స్ రియల్ టైమ్ బిలియనీర్స్ జాబితా ప్రకారం యువాన్ నికర విలువ 14.4 బిలియన్ల డాలర్లు. -
అభిమానికి బ్రెయిన్ ట్యూమర్: చలించిపోయిన నాగ్
ఆమె పేరు లక్ష్మి, నెల్లూరువాసి. హీరో నాగార్జునకు వీరాభిమాని. అయితే ఆమె బ్రెయిన్ ట్యూమర్‌తో బాధపడుతోంది. మరికొద్ది నెలల్లో చివరి సర్జరీ చేయించుకోనుంది. ఈ విషయం కాస్తా నాగ్ చెవిన పడింది. ఆమె ఆరోగ్య పరిస్థితి తెలుసుకుని ఆయన చలించిపోయారు. ఎలాగైనా తన అభిమానిని సంతోషపెట్టాలనుకున్నారు. ఆమెకు కొండంత ధైర్యం ఇవ్వాలనుకున్నారు. కానీ కరోనా కాలం కాబట్టి ఆమె దగ్గరకు వెళ్లలేకపోయారు. వెంటనే మరో ఐడియా రచించి, అనుకున్నదే తడవుగా అమలు చేశారు. నేడు(శుక్రవారం) ఆమెకు సర్ప్రైజ్ కాల్ చేశారు. తాను ఆరాధించే హీరో తనకు కాల్ చేతనకే స్వయంగా కాల్ చేశారన్న విషయాన్ని ఆమె నమ్మలేకపోయింది. నాగ్ గొంతు విని ఆనందంతో ఉబ్బితబ్బిబైపోయింది. (చదవండి: బిగ్‌బాస్ 4 ప్రోమో.. గోపి ఎవరు?) జూమ్ వీడియో కాల్లో అటు హీరో, ఇటు అభిమాని సరదాగా కాసేపటివరకు ముచ్చట్లాడుకున్నారు. 'ఈ జన్మకిది చాలు.. ఇక నేను చనిపోయినా ఫర్వాలేదు' అని లక్ష్మి సంతోషాన్ని వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా నాగ్.. ఆమెకు తానున్నానంటూ ధైర్యాన్ని నూరిపోశారు. త్వరలోనే జబ్బు నయమవుతుంటూ భరోసా కల్పించారు. నాగ్‌తో మాట్లాడుతున్నంత సేపు లక్ష్మి ఈ లోకాన్నే మర్చిపోయింది. తనకసలు ఏ జబ్బు లేనట్లు, ఉన్నా అది చిటికెలో నయమైపోయినంత సంబరపడిపోయింది. ఇప్పుడు సర్జరీకి వెళ్లడానికి ఆమెకు కొంచెం కూడా భయం లేదు. ఎందుకంటే ఆమె వెనక నాగ్ ఇచ్చిన బలం, ధైర్యం జంటగా ఉందిప్పుడు. (చదవండి:ఇది బిగ్గెస్ట్ ఫ్యాన్ మూమెంట్: తమన్) -
జూమ్ క్లాస్‌లో ఘోరం..
ఫ్లోరిడా : పదేళ్ల బాలిక జూమ్ క్లాస్‌లో జాయిన్ కాగానే వార్ఫీల్డ్ ఎలిమెంటరీలో ఆమె టీచర్ ఏదో జరగరానిది జరుగుతోందని గమనించేలోగా బాలిక తల్లి హత్యకు గురైన ఘటన అమెరికాలోని ఫ్లోరిడాలో బుధవారం వెలుగుచూసింది. ఆ సమయంలో ఆన్లైన్ క్లాసులో లాగిన్ అవుతున్న ఇతర విద్యార్థులు భయపడకుండా ఉండేందుకు బాలికను టీచర్ మ్యూట్ చేశారు. కానీ కొద్దిసేపటికే భారీ శబ్ధాలు వినిపించడం ఆ బాలిక తన చెవులపై చేతులు వేసుకోవడం గమనించగా అంతలోనే స్క్రీన్‌పై చీకటి అలుముకుంది. సరిగ్గా జూమ్ క్లాస్ ప్రారంభం కాగానే బాలిక తల్లి మర్బియల్ రొసాడో మోరేల్స్ (32) ఆమె మాజీ బాయ్‌ఫ్రెండ్ డొనాల్డ్ జే విలియమ్స్ (27) మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఇరువురి మధ్య ఘర్షణ తీవ్రతరం కావడంతో విలియమ్స్ మోరేల్స్పై నాలుగుసార్లు కాల్పులకు తెగబడ్డాడు. మోరేల్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారని పోలీసులు తెలిపారు. ఘటన జరిగిన గంటలోనే విలియమ్స్‌ను అరెస్ట్ చేసి హత్య సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు మార్టిన్ కౌంటీ షెరీఫ్ విలియం సిండర్ తెలిపారు. జూమ్ క్లాస్‌లో ఉన్న బాలికతో పాటు అదే ఇంట్లో ఉన్న మరో ఐదుగురు పిల్లలు ఈ హత్యను చూశారని పోలీసులు పేర్కొన్నారు. మోరేల్స్ ఇంట్లోకి చొరబడిన విలియమ్స్ ఫేస్బుక్లో పోస్టు చేసిన ఓ వీడియోపై ఆమెను ప్రశ్నించాడని, ఆమె నవ్వుతూ బదులిస్తుండగా ఆగ్రహంతో విలియమ్స్ ఆమెపై కాల్పులు జరిపాడని సిండర్ తెలిపారు. 2015లో విలియమ్స్ తాను దొంగిలించిన తుపాకీని తీసి మోరేల్స్పై పలుమార్లు కాల్పులకు తెగబడ్డాడని పేర్కొన్నారు. కాగా, జూమ్ క్లాస్ తీసుకున్న స్కూల్ టీచర్ వివరాలను పోలీసులు వెల్లడించలేదు. చదవండి : భారత సంతతి రీసెర్చర్ హత్య -
మళ్లీ మొదలైన చంద్రబాబు మార్కు రాజకీయం
సాక్షి, అమరావతి : కరోనా వైరస్ మొదలైనప్పటి నుంచి హైదరాబాద్‌కే పరిమితమై జూమ్ యాప్‌లో ఊదరగొడుతున్న ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు మళ్లీ తన పాత పంథానే కొనసాగిస్తున్నారు. వెన్నుపోటు రాజకీయ నేతగా విమర్శలు ఎదుర్కొంటున్న ఆయన తాజాగా మరోసారి సీమకు వెన్నుపోటు పొడిచేందుకు సిద్దమయ్యారు. ప్రతిపక్షంలో ఉన్నపుడు అధికారంలో ఉన్నవారికి అడ్డం పడటమే ఆయన లక్ష్యం. అప్పుడు వైఎస్ రాజశేఖరరెడ్డి జలయజ్ఞం చేపట్టినా, ఇప్పుడు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి రాయలసీమ ఎత్తిపోతల పథకం నిర్మిస్తున్నా అడ్డంకులు సృష్టించడమే బాబు నైజం. (ఆరోపణలపై స్పందించిన ఏపీ పోలీస్ శాఖ ) రాయలసీమ ఎత్తిపోతల పథకానికి వ్యతిరేకంగా దక్షిణ తెలంగాణకు అన్యాయం జరుగుతుందని గగ్గోలు పెడుతుంటే ఏపీలో పరిస్థితి ఇందుకు భిన్నంగా తయారైంది. ప్రభుత్వానికి అండగా నిలవాల్సిన ప్రతిపక్ష పార్టీలు ముఖ్యంగా టీడీపీ రాష్ట్ర ప్రభుత్వంపైనే ఎదురు దాడి చేస్తున్నాయి. చంద్రబాబు నాయుడు ఏ విధంగానైనా ప్రాజెక్ట్ ఆపాలనే ధోరణిలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పావులు కదుపుతున్నారు. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా ప్రజలకు వెన్నుపోటు ఖాయం అనే ధోరణి బాబు కొనసాగిస్తూనే ఉన్నారు. సొంత రాష్ట్రానికి ముఖ్యంగా సొంత ప్రాంతానికి నష్టం చేకూర్చేందుకు సిద్ధమయ్యారు. ('ఏ ఒక్కరి మీద ఆంక్షలు లేవు.. పూర్తిగా మీ స్వేచ్ఛ' ) తెలంగాణా రాష్ట్రం ఏర్పడిన తరువాత ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు పొరుగు రాష్ట్రాలతో సఖ్యతగా ఉండి సమస్యలను పరిష్కరించుకోవాలని ప్రయత్నం చేశారు. అందులో భాగంగానే కాళేశ్వరం ఎత్తిపోతల పథకం నిర్మించే సమయంలో పక్కనే ఉన్న మహారాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరిపి అప్పటి వరకు ఉన్న సమస్యను సామరస్య పూర్వకంగా పరిష్కరించుకున్నారు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకం నిర్మాణం పూర్తయ్యింది. లక్షల ఎకరాలకు సాగునీరు అందుతోంది. (చంద్రబాబు ట్వీట్‌పై స్పందించిన వైద్యారోగ్యశాఖ) తాజాగా ఏపీ సీఎం వైఎస్ జగన్ కూడా అదే బాటలో నడిచేందుకు సిద్ధమయ్యారు. పొరుగున ఉన్న తెలంగాణ, ఒడిశా వంటి రాష్ట్రాలతో చర్చలు జరిపి సామరస్య పూర్వకంగా సమస్యలను పరిష్కరించుకోవాలని ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగానే తెలంగాణ ముఖ్యమంత్రితో సమావేశమై సాగునీటితో పాటు ఇతర వివాదాలు పరిష్కరించుకునేందుకు సిద్ధం అయ్యారు. అయితే ఇది నచ్చని చంద్రబాబు, వారిద్దరూ స్నేహపూర్వకంగా ఉంటే తమకు రాజకీయంగా పబ్బం గడవదని భావించారు. రాష్ట్రానికి ప్రయాజనం చేకూర్చే పథకాలకుఅడ్డంకులు సృష్టించేందుకు సిద్ధమయ్యారు. (రాజకీయాల కోసం వాడుకుంటున్నారు!) రాయలసీమతో పాటు నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు ప్రయోజనం చేకూర్చాలని సీఎం జగన్ రాయలసీమ ఎత్తిపోతల పథకానికి సిద్ధమయ్యారు. ఆ పథకం ప్రస్తుతం టెండర్ల దశలో ఉంది. ఈ పథకంపై తెలంగాణ ప్రభుత్వం, ప్రతిపక్ష పార్టీలు ఒక్కటై ఆరోపణలు చేస్తుంటే ఏపిలో మాత్రం పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. ప్రతిపక్ష తెలుగుదేశం ప్రభుత్వానికి మద్దతు ఇవ్వకపోగా ప్రాజెక్ట్ కు వ్యతిరేకంగా పావులు కదుపుతున్నాయి. ప్రాజెక్ట్ కు వ్యతిరేకంగా తెలంగాణ కాంగ్రెస్ నేతలు రేవంత్ రెడ్డి ఉత్తమ్‌కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క, నాగం మాట్లాడడం ప్రారంభించారు. ఇప్పుడు వారికి ఏపీ నుంచి చంద్రబాబు జత కలిశారు. తెలంగాణా ప్రభుత్వం నుంచి ఎలాంటి అభ్యంతరాలు లేని ప్రాజెక్ట్ ని చంద్రబాబు వివాదంలోకి లాగారు. ఈ పథకం వల్ల రాష్ట్రానికి ప్రయోజనం అంటూనే మరో పక్క ఆ ప్రాజెక్ట్ కు గండి కొట్టేందుకు సిద్ధం అయ్యారు. తనతో పాటు తనకు వంతపాడే తన అనుకూల వర్గం నేతలను రంగంలోకి దించి ఈ ప్రాజెక్ట్ కు వ్యతిరేకంగా మాట్లాడిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ పైన ప్రభుత్వ వైఖరి వల్ల నష్టం జరుగుతుందని కలర్ ఇచ్చేలా చంద్రబాబు శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తున్నారు. రాష్ట్ర ప్రయోజనాలు కాపాడే విధంగా చర్యలు చేపట్టిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను అభినందిచక పోయినా నష్టం కలిగించేలా వ్యహరించకుండా చంద్రబాబు ఉండాల్సిందనే అభిప్రాయం ప్రజల నుంచి వ్యక్తం అవుతోంది. -
జూమ్ క్లాస్‌లో ఈ పిల్లాడేం చేశాడో తెలుసా?
కరోనా అన్నింటినీ మార్చేసింది. తినే తిండినీ, మనిషి నడతను, నడవడికను పూర్తిగా మార్చివేసింది. ఆఫీసు గదుల్లో కంప్యూటర్‌తో కుస్తీ పట్టేవాళ్లు ఇప్పుడు ఇంట్లోనే పని చేస్తున్నారు. ఒక ఇంట్లోనే ఉన్నా కూడా ఒకరి మొహాలు మరొకరు చూసుకోవడమే గగనమైపోయిన నగరవాసులు ఇప్పుడు ఇంటిల్లిపాది కలిసి ముచ్చట్లాడుతూ భోజనం చేస్తున్నారు. ఇక ఈ సమయానికల్లా మొదలవాల్సిన పాఠశాలలు, కాలేజీలు మాత్రం ఇంకా మూతపడే ఉన్నాయి. కానీ ఆన్లైన్లో మాత్రం పిల్లలకు క్లాసులు జరుగుతున్నాయి. (‘యాపిల్’లో లోపం కనిపెట్టి.. జాక్‌పాట్!) ఈ నేపథ్యంలో నిద్రిస్తే లేపే స్నేహితుడు లేక, నిద్రను ఆపుకోలేక ఓ బుడ్డోడు జూమ్‌లో నిర్వహించిన క్లాసులోనే నిద్రపోయాడు. ఎంతలా అంటే కుర్చీనే పరుపుగా భావిస్తూ వెల్లకిలా పడుకుండిపోయాడు. అయితే అటువైపు టీచర్ మాత్రం 40 నిమిషాలు పాఠాలు చెప్తూనే ఉంది. ఈ ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కారణం ప్రస్తుతం ఇది అందరి జీవనానికి నిదర్శనంగా కనిపిస్తోంది. నిద్రను మించిన పని లేదంటూ అనేకమంది బెడ్డుకే పరిమితమవుతూ మరింత బద్ధకస్తులవుతున్నారు. 2020 మొత్తం ఇలాగే గడిచిపోయేలా ఉందని కామెంట్లు చేస్తున్నారు. (మూగజీవిని చితకబాది సెల్ఫీలు తీశారు..) -
జూమ్ యాప్‌లో సీఎల్పీ సమావేశం
సాక్షి, హైదరాబాద్: భట్టి విక్రమార్క నేతృత్వంలో జూమ్ యాప్‌లో సీఎల్పీ సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా కాంగ్రెస్ సీనియర్ నేత,మాజీ ఎంపీ నంది ఎల్లయ్య మృతి పట్ల రెండు నిమిషాలు మౌనం పాటించి, సంతాపం తెలిపారు. సమావేశంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, రేవంత్‌రెడ్డి, ఎమ్మెల్యే జగ్గారెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, సీతక్క, శ్రీధర్ బాబు, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కరోనా నిర్ధారణ పరీక్షలు, వైరస్ నివారణలో రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యాలపై కాంగ్రెస్ నేతలు చర్చించారు. సమావేశంలో రాజగోపాల్‌రెడ్డి, జగ్గారెడ్డిల మధ్య ఆసక్తికరమైన చర్చ జరిగింది. ‘‘జగన్న.. గడ్డాలు, మీసాలు బాగా పెంచడంతో మాస్కు కూడా పెట్టాల్సిన పనిలేకుండా పోయిందని రాజగోపాల్ రెడ్డి సరదాగా వ్యాఖ్యానించారు. తన తమ్ముడు రాజగోపాల్‌రెడ్డిని కరోనా టెస్టు చేయించుకోమని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సూచించారు. -
జూమ్ కొత్త టెక్ సెంటర్, కొత్త ఉద్యోగాలు
సాక్షి, బెంగళూరు : కరోనా సంక్షోభం, లాక్డౌన్ కాలంలో ఏర్పడిన భారీ డిమాండ్‌తో దూసుకుపోయిన అమెరికాకు చెందిన యాప్ జూమ్ మరింత విస్తరించేందుకు అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో బెంగళూరులో కొత్త టెక్నాలజీ సెంటర్‌ను ప్రారంభించనున్నామని మంగళవారం ప్రకటించింది. అంతేకాదు త్వరలోనే దీనికి సంబంధించిన నియామకాలను కూడా ప్రారంభిస్తామని వెల్లడించింది. జూమ్‌కు ఇప్పటికే ముంబైలో ఒక కార్యాలయం, డేటా సెంటర్ ఉంది. తాజాగా బెంగళూరులో రెండవ డేటా సెంటర్‌ను ఏర్పాటు చేయనుంది. ఇది తమ ప్లాట్‌ఫాంను మరింత మెరుగుపరిచేందుకు ఇన్నోవేషన్ హబ్‌గా ఉంటుందని, రాబోయే కొన్నేళ్లలో ఇక్కడ అత్యంత ప్రతిభావంతులైన నిపుణులను నియమించుకోవడానికి కూడా కట్టుబడి ఉన్నామని ప్రొడక్షన్ అండ్ ఇంజనీరింగ్ ప్రెసిడెంట్ వెల్చమీ శంకర్ లింగ్ వెల్లడించారు. ఈ వ్యూహాత్మక పెట్టుబడులు తమ నిబద్దతకు సూచికని చెప్పారు. దేశంలో నిరంతర వృద్ధి, పెట్టుబడులపై ఆశావహంగా ఉన్నామని, కరోనా మహమ్మారి సమయంలో భారతదేశంలో 2,300కి పైగా విద్యాసంస్థలకు తమ సేవలను ఉచితంగా అందించడం గర్వకారణమని జూమ్ సీఈఓ ఎరిక్ఎస్ యువాన్ వ్యాఖ్యానించారు. భారత ప్రభుత్వంతో కలిసి పని చేసేందుకు ఎదురు చూస్తున్నామని పేర్కొన్నారు. కోవిడ్-19, లాక్డౌన్ నిబంధనల కారణంగా చాలా విద్యా ,ఇతర సంస్థలు వీడియో కాన్ఫరెన్సింగ్ ప్లాట్‌ఫాం జూమ్‌ను ఆశ్రయించడంతో, 2020 జనవరి-ఏప్రిల్ మధ్య 67శాతం వృద్ధిని సాధించింది. సిస్కో సిస్టమ్స్ వెబెక్స్, మైక్రోసాఫ్ట్ టీమ్స్, గూగుల్ మీట్ లాంటి వీడియో కాన్ఫరెన్స్ ప్లాట్‌ఫామ్‌లతో పోటీ పడుతోంది. తాజాగా రిలయన్స్ జియోమీట్, అమెరికా టెలికాం సర్వీసెస్ ప్రొవైడర్ వెరిజోన్‌తో కలిసి ఎయిర్టెల్ తీసుకొచ్చిన బ్లూజీన్స్ కూడా ఈ వరుసలో చేరాయి. ఈ నేపథ్యంలోనే జూమ్ విభిన్న వ్యూహాలతో మార్కెట్లో నిలదొక్కుకునేందుకు ప్రయత్నిస్తోంది. కాగా జూమ్ "సురక్షితమైన వేదిక కాదు" అని కేంద్రం గతంలో చెప్పింది. సెక్యూరిటీ రీత్యా అంత మంచిది కాదని సూచించిన ప్రభుత్వం, ప్రభుత్వ సంస్థలు, కార్యాలయాల అధికారిక సమావేశాలకు ఈ యాప్‌ను వినియోగించ వద్దని హెచ్చరించిన సంగతి తెలిసిందే. -
జూమ్ వర్సెస్ జియోమీట్
సాక్షి, న్యూఢిల్లీ : జూమ్‌కు దీటుగా రిలయన్స్ జియో రూపొందించిన జియో వీడియో కాన్ఫరెన్సింగ్ సర్వీస్ జియోమీట్‌పై వాడివేడి చర్చ సాగుతోంది. జియోమీట్‌పై న్యాయపరమైన చర్యలకు దిగేందుకు జూమ్ సిద్ధమైనట్టు వార్తలు వచ్చాయి. జూమ్ యాప్‌ను పోలినవిధంగా జియోమీట్ యాప్ ఉండటంతో తాను కంగుతిన్నానని జూమ్ కమ్యూనికేషన్స్ ఇండియా హెడ్ సమీర్ రాజే విస్మయం వ్యక్తం చేశారు. జియోమీట్‌పై కేసు వేయడంపై రాజే నేరుగా స్పందించకపోయినా దీనిపై తమ న్యాయ విభాగం ఓ నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. జియోమీట్ యాప్ వస్తుందని తమకు ముందుగా తెలుసునని..దీన్ని తాము స్వాగతించామని, పోటీని ఎదుర్కోవడం జూమ్‌కు కొత్త కాదని అన్నారు. తమ ఉత్పత్తులు, సాంకేతికతే తమ బలమని..కస్టమర్లకు మెరుగైన సేవలందించడంపైనే తాము దృష్టి సారిస్తామని స్పష్టం చేశారు. తమ ప్రత్యర్ధులు వారి వ్యూహాలకు అనుగుణంగా నడుచుకుంటారని రాజే పేర్కొన్నారు. జూమ్ బృందం ఎలక్ర్టానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ, హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖతో సంప్రదింపులు జరుపుతోందని చెప్పారు. జూమ్ డేటా సెంటర్ల గురించి సాంకేతిక సమాచారంపై చర్చలు జరుగుతున్నాయని తెలిపారు. తాము ఎవరితోనూ డేటాను పంచుకోవడం లేదని, తమ ప్లాట్‌ఫాంపై సాంకేతిక అంశాలను, ఎలా ఆపరేట్ చేయాలనే వివరాలను పంచుకుంటామని పేర్కొన్నారు. గల్వాన్ లోయలో చైనా జవాన్లతో జరిగిన ఘర్షణలో 20 మంది భారత సైనికులు మరణించిన నేపథ్యంలో భారత్ గతవారం 59 చైనా యాప్‌లను నిషేధించిన సంగతి తెలిసిందే. చైనా యాప్‌లను నిషేధించిన అనంతరం పెద్ద ఎత్తున స్వదేశీ యాప్‌లను భారతీయులు డౌన్లోడ్ చేసుకున్నారు. జియోమీట్‌ను లాంఛ్ చేసిన వారం రోజుల్లోనే 10 లక్షల మంది డౌన్లోడ్ చేసుకున్నారు. మరోవైపు చైనా వ్యతిరేక సెంటిమెంట్ నెలకొన్న క్రమంలో జూమ్ చైనా యాప్ అనే ప్రచారం సాగుతుండటంపై కంపెనీ వివరణ ఇచ్చింది. తమది చైనా కంపెనీ కాదని, అమెరికన్ కంపెనీ అని నాస్డాక్లో ట్రేడవుతోందని జూమ్ పేర్కొంది. కాలిఫోర్నియాలోని శాంజోస్‌లో కంపెనీ ప్రధాన కార్యాలయం పనిచేస్తోందని జూమ్ ట్వీట్ చేసింది. భారత్‌లో తమకు రెండు డేటా సెంటర్లు ఉన్నాయని, తాము డేటాను ఏ ప్రభుత్వంతోనూ పంచుకోవడం లేదని జూమ్ కమ్యూనికేషన్స్ ఇండియా హెడ్ సమీర్ రాజే సైతం వివరణ ఇచ్చారు. చదవండి : జియో మీట్ : 10 లక్షలు దాటిన డౌన్లోడ్స్ -
త్వరలో భారీగా ఉద్యోగ నియామకాలు: జూమ్
న్యూఢిల్లీ: అత్యాధునిక వీడియో సెషన్స్‌కు పేరొందిన అమెరికాకు చెందిన జూమ్ యాప్ దేశంలో మరిన్ని పెట్టుబడులు పెట్టేందుకు రంగం సిద్దం చేసుకుంటుంది. ఈ నేపథ్యంలో రాబోయే ఐదేళ్లలో భారీ స్థాయిలో ఉద్యోగ నియామకాలు చేపట్టనున్నట్లు తెలిపింది. కాగా కొందరు జూమ్ యాప్ చైనాకు సంబంధించినదిగా ప్రచారం చేస్తున్నారని, అందులో ఏ మాత్రం నిజం లేదని జూమ్ ప్రాడక్ట్ ఇంజనీరింగ్ ప్రెసిడెంట్ శంకర్‌లింగమ్ తెలిపారు. దేశంలోని వినియోగదారులకు జూమ్ యాప్ వీడియో కాలింగ్స్, వీడియో మీటింగ్స్ ద్వారా మెరుగైన సేవలందిస్తున్న విషయం తెలిసిందే. కాగా ఇటీవల కాలంలో సరిహద్దు వివాదాల నేపథ్యంలో భారత్, చైనా సంబంధాలు క్షీణించిన విషయం విదితమే. ప్రస్తుతం జూమ్ యాప్ 40నిమిషాల వీడియో ఫ్రీ కాలింగ్ సేవలు అందిస్తుంది. మరోవైపు దేశీయ వ్యాపారాలు, ప్రభుత్వ ఏజన్సీలు, స్కూల్ టీచర్లకు జూమ్ యాప్ మెరుగైన సేవలందిస్తున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం దేశంలో మూడు నగరాల్లో జూమ్ ప్రధాన కార్యాలయాలు ఉన్నాయి. కాగా సెక్యూరిటీ, ప్రైవసీ కొరకు 100ఫీచర్లు అందిస్తున్నట్లు సంస్థ ప్రతినిథులు తెలిపారు. దేశంలో అన్ని రంగాలలో దూసుకెళ్తున్న రిలయన్స్ జియో సంస్థ తాజాగా జూమ్ యాప్‌కు పోటీగా జియో మెట్(వీడియో కాలింగ్) యాప్‌ను విడుదల చేసింది. అయితే జియో మీట్ పోటీని తట్టుకునేందుకు జూమ్ సంస్థ అనేక వ్యూహ్యాలు రచిస్తున్నట్లు కంపెనీ ప్రతినిధులు పేర్కొన్నారు -
టిక్‌టాక్ ఓకే.. మరి ‘జూమ్’ సంగతి ఏంటి?
భారత్- చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో 59 చైనీస్ యాప్‌లపై నిషేధం విధిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న విషయం తెలిసిందే. దేశ సమగ్రత, సార్వభౌమాధికారం, రక్షణ, ప్రజా భద్రత దృష్ట్యా టిక్‌టాక్, హెలో, షేర్ ఇట్, యూసీ బ్రౌజర్ వంటి పలు పాపులర్ యాప్‌లను నిషేధించింది. ఈ క్రమంలో ప్రభుత్వ నిర్ణయం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. గల్వాన్ లోయలో ఘాతుకానికి పాల్పడి 20 మంది భారత జవాన్లను పొట్టనబెట్టుకున్న డ్రాగన్‌కు బాగా బుద్ధి చెప్పారని కొంతమంది కేంద్రాన్ని ప్రశంసిస్తుండగా... మరికొంత మంది కేవలం చైనా యాప్‌లను నిషేధించడం వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదని పెదవి విరుస్తున్నారు. ప్రజల గోప్యత హక్కును పరిరక్షించాలంటే వీడియో కాలింగ్ యాప్ జూమ్‌ను బ్యాన్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.(టిక్‌టాక్ పోయింది..'చింగారి' వచ్చేసింది) ఆ దేశంలో జూమ్‌పై ఆంక్షలు.. ఈ క్రమంలో కొంతమంది జూమ్‌ను చైనీస్ యాప్‌గా పేర్కొంటున్నారు. నిజానికి ‘జూమ్’ అమెరికా కేంద్రంగా పనిచేసే జూమ్ వీడియో కమ్యూనికేషన్స్ కంపెనీకి చెందినది. అమెరికా పౌరసత్వం కలిగిన చైనీస్- అమెరికన్ ఎరిక్ యువాన్ దీనిని స్థాపించారు. ఈ యాప్‌ను లాంచ్ చేసే సమయంలో ఇది అమెరికన్ యాపేనంటూ ఆయన ప్రకటన చేశారు. కాగా చైనాతో లింక్ ఉన్న యాప్ లేదా సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించడం ద్వారా డేటా చోరీకి గురయ్యే అవకాశం ఉందని నిఘా విభాగం అధికారులు గతంలో హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఇందులో జూమ్ యాప్ పేరును కూడా వారు ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ సమావేశాలకు ఈ యాప్‌ని వినియోగించరాదంటూ కేంద్రం స్పష్టం చేసిన విషయం విదితమే. అంతేకాదు జర్మనీలోనూ ఈ యాప్‌పై ఆంక్షలు విధించగా.. తైవాన్‌లో పూర్తిస్థాయిలో దీనిని నిషేధించడంతో జూమ్ భద్రతా ప్రమాణాల పట్ల ఆందోళనలు వ్యక్తమయ్యాయి. జూమ్ విశ్వసనీయతపై చర్చ లేవనెత్తిన వాళ్లు ఈ సందర్భంగా ఈ అంశాలను ప్రస్తావిస్తున్నారు.(RIP Tiktok: నెటిజన్ల రియాక్షన్ ఇదీ..) మరోవైపు... డిజిటల్ యుగంలో జూమ్, ఫేస్బుక్, వాట్సాప్ తదితర మరే ఇతర యాప్‌ల వల్లనైనా వ్యక్తిగత భద్రతకు భంగం వాటిల్లే ప్రమాదం ఉన్నందున సోషల్ మీడియా ప్రమాణాలను మరింత కట్టుదిట్టం చేయాలని మరికొంతమంది నెటిజన్లు వాదిస్తున్నారు. ఇంకొంత మంది పబ్ జీ గేమ్‌ను దక్షిణ కొరియా కంపెనీ అభివృద్ధి చేసింది.. ఇది చైనా యాప్ కాదు కాబట్టి దీనిపై నిషేధం విధించలేదు కదా అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. ప్రమాణాలకు విరుద్ధంగా, నిబంధనలు ఉల్లంఘిస్తున్న కొన్ని దేశీయ యాప్‌లపై కూడా ఇదే రకమైన కఠిన వైఖరి అవలంభిచాలంటూ డిమాండ్ చేస్తున్నారు. btw India did not ban Zoom, the Chinese app that actually matters #indiabanschineseapps — Waqas (@worqas) June 29, 2020 Why some apps like #Zoom #pubgban are not banned yet.#Zoom is a big threat for privacy of our Country's sovereignty. Merely ban these app is not sufficient Govt should try to contact with Playstore to ensure that these app will not work if anyone has already downloaded it. pic.twitter.com/k4HCwjj9ph — Armaan Saini (@ArmaanS77722969) June 30, 2020 -
చైనా యాప్స్‌తో ముప్పు: ఇంటెలిజెన్స్
ఢిల్లీ : చైనాకు చెందిన 52 మొబైల్ అప్లికేషన్లపై నిషేధం విధించాలని లేదా ప్రజలు వాటిని వాడకుండా చూడాలని నిఘా వర్గాలు బుధవారం కేంద్రానికి సిఫారసు చేశాయి. వీటి వల్ల దేశ భద్రతకే ముప్పు ఉందని హెచ్చరించాయి. చైనాతో లింక్ ఉన్న యాప్ లేదా సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించడం ద్వారా డేటా చోరీకి గురయ్యే అవకాశం ఉందని నిఘా విభాగం అధికారులు తెలిపారు. భద్రతా సంస్థకు చెందిన సిబ్బంది ఎవరూ వీటిని వినియోగించరాదని సూచించారు. జూమ్, టిక్‌టాక్, యూసీ బ్రౌజర్, జెండర్, షేర్ఇట్, క్లీన్ మాస్టర్ సహా 52 ఇతర మొబైల్ అప్లికేషన్ల ద్వారా డేటా తస్కరణకు గురవుతుందని ఓ నివేదికను ప్రభుత్వానికి నిఘా విభాగం సమర్పించింది. ఈ నివేదికపై ఇప్పటికే జాతీయ భద్రతా మండలి సానుకూలంగా స్పందించిందని, దీనికి సంబంధించిన చర్చలు కొనసాగుతున్నాయని ఓ అధికారి వెల్లడించారు. (గాల్వన్ లోయ ప్రాంతం మాదే: చైనా రెచ్చగొట్టే వ్యాఖ్యలు) జూమ్ వీడియో కాలింగ్ యాప్ ద్వారా వినియోగదారుల గోప్యతకు ముప్పు ఉందని ఈ ఏడాది ఏప్రిల్‌లో కేంద్రం ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ సమావేశాలకు ఈ యాప్‌ని వినియోగించరాదంటూ ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే జూమ్ యాప్ వాడకంపై పలు దేశాలు ఇప్పటికే ఆంక్షలు విధించగా, కొన్ని దేశాల్లో పూర్తిగా నిషేధం కొనసాగుతుంది. జర్మనీలో ఈ యాప్‌పై ఆంక్షలు విధించగా, తైవాన్‌లో పూర్తిగా జూమ్ వాడరాదంటూ ప్రభుత్వం నిషేధం పెట్టింది. ఇక అమెరికా కూడా సెనేట్ సభ్యులను జూమ్ యాప్ కాకుండా ఇతర సోషల్ నెట్ వర్కింగ్ యాప్‌లను ఉపయోగించాలని పేర్కొంది. పెద్ద ఎత్తున ఈ యాప్‌పై ఆరోపణలు వస్తుండటంతో యూజర్లకు కొత్త వెర్షన్‌ను అందుబాటులోకి తెచ్చింది కంపెనీ. సరికొత్త రీతిలో జూమ్ రూమ్స్‌ను నవీకరిస్తున్నందున వీడియో సెషన్స్ అద్భుతంగా కొనసాగుతాయని కంపెనీ స్పష్టం చేసింది. (‘భారత మాతా సినిమా’ కథ ముగిసిందా?! ) -
ఉచితంగా అందించలేం: జూమ్ సీఈఓ
ముంబై: ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్‌ను నియంత్రించేందుకు అన్ని దేశాలు లాక్‌డౌన్‌ను విధించాయి. లాక్డౌన్ వల్ల అందరు ఇంట్లో ఉంటూ సోషల్ మీడియాతో కాలక్షేపం చేస్తున్నారు. అత్యాధునిక వీడియో సెషన్స్‌కు పేరొందిన అమెరికాకు చెందిన జూమ్ యాప్ లాక్డౌన్ కారణంగా గత రెండు నెలలుగా అధిక లాభాలను అర్జించినట్లు జూమ్ సంస్థ తెలిపింది. అయితే టెక్నాలజీ, భద్రతకు ప్రాధాన్యతమిస్తు కొత్త అప్‌గ్రేడ్ వర్షన్‌ను ఇన్స్టాల్ చేశామని.. అయితే ఈ వెర్షన్‌ను ఫ్రీగా అందించడంలేదని, రీచార్జ్ చేసుకోవాలని జూమ్ సీఈఓ ఎరిక్ యాన్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. త్వరలో ఎఫ్‌బీఐ(ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్) అధికారులతో కలిసి తమ సంస్థ పనిచేయనుందని.. అందువలన ఉచితంగా యూజర్లకు అందించలేకపోతున్నామని ఆయన పేర్కొన్నారు. యాప్‌ను ఉచితంగా అందించడం వలన కొందరు దుర్వినియోగం చేసే అవకాశం ఉందని తెలిపారు. తాజా నివేదికల ప్రకారం జూమ్ యాప్ AES 256-bit జీసీఎమ్ అనే కొత్త వెర్షన్‌ను ఇన్స్టాల్ చేయనుందని సంస్థ అధికారులు పేర్కొన్నారు. ఈ కొత్త వర్షన్‌తో అనేక నూతన సాంకేతిక అంశాలను పొందుపరిచామని కంపెనీ తెలిపింది. ప్రస్తుతం కంపెనీ జూమ్ రూమ్స్, సిస్టమ్స్, వైర్లెస్ సేవలను యూజర్లకు అందిస్తోంది. సరికొత్త రీతిలో జూమ్ రూమ్స్‌ను నవీకరిస్తున్నందున వీడియో సెషన్స్ అద్భుతంగా కొనసాగుతాయని కంపెనీ స్పష్టం చేసింది. చదవండి: హైదరాబాద్: సిటీ బస్సులకూ ఇక రైట్ రైట్! సరికొత్త వెర్షన్లో జూమ్ యాప్.. -
‘యాపిల్’లో లోపం కనిపెట్టి.. జాక్‌పాట్!
న్యూఢిల్లీ: టెక్ దిగ్గజం యాపిల్ సాఫ్ట్‌వేర్‌లో లోపాన్ని కనిపెట్టిన ఢిల్లీ టెకీకి యాపిల్ సంస్థ సుమారుగా రూ. 75 లక్షల నజరానా ప్రకటించింది. ఐఓస్ 13లో యాపిల్ ఐడీ ద్వారా లాగిన్ అయ్యే ఆప్షన్‌ను యాపిల్ అందుబాటులోకి తెచ్చింది. అయితే సరైన ఐడీ లేకుండానే యాపిల్ మొబైల్లో వాడే వెసులుబాటు కల్పించే ఓ లోపాన్ని ఢిల్లీకి చెందిన భావుక్ జైన్ కనిపెట్టి యాపిల్ సంస్థకు తెలిపారు. దీంతో వెంటనే ఆ లోపాన్ని యాపిల్ సంస్థ సరిచేసింది. లక్ష డాలర్ల ప్రైజ్ మనీ అందిస్తామని యాపిల్ చెప్పినట్లు వెల్లడించారు. భావుక్ జైన్ గతంలో ఫేస్బుక్, యాహూ, గూగుల్, గ్రాబ్ వంటి వాటిల్లో సైతం లోపాలను కనిపెట్టి వారికి తెలియజేశారు. (ఇన్ఫోసిస్ సీఈఓ వేతనం ఎంతంటే..?) జూమ్ యాప్‌లో ఎన్క్రిప్షన్ అప్డేట్ న్యూఢిల్లీ: ప్రముఖ వీడియో కాన్ఫరెన్స్ ప్లాట్ ఫాం జూమ్ తమ యాప్‌నకు తాజా అప్డేట్ ఇచ్చింది. ఈ అప్డేట్లో వినియోగదారులకు మరింత భద్రత, వ్యక్తిగత విషయాల్లో గోప్యతతో పాటు ఏఈఎస్ 256 బిట్ జీసీఎం ఎన్క్రిప్షన్ అందుబాటులోకి తెచ్చినట్లు ప్రకటించింది. దీనివల్ల ఇతరులకు వినియోగదారుల సమాచారం దక్కదని చెప్పింది. ఈ సదుపాయాలను పొందేందుకు జూమ్ 5.0కు వినియోగదారులు అప్డేట్ చేసుకోవాలని సూచించింది.