జూమ్ మీటింగ్‌లో ఉన్నానన్న సంగతి మరిచిపోయి నగ్నంగా దర్శనమిచ్చిన కెనడా ఎంపీ విలియం ఆమోస్ గుర్తున్నాడా? ఈ పనితో అతను వరల్డ్ ఫేమస్ అయ్యాడు. అయితే పనిలో పనిగా ప్రభుత్వం నుంచి వార్నింగ్ కూడా అందుకున్నాడు. కానీ, అతని బుద్ధి మారినట్లు లేదు. ఈసారి అంతకుమించిన పనితో మరోసారి వార్తల్లోకెక్కాడు. జూమ్ మీటింగ్ అది కూడా అధికారిక సమావేశం అనే సోయి లేకుండా కాఫీ కప్పులో మూత్రవిసర్జన చేశాడు.
ఒట్టావా: కెనడా ఎంపీ విలియమ్ ఆమోస్ మరో వివాదంలో ఇరుకున్నాడు. వర్చువల్ పార్లమెంట్ సెషన్ జరుగుతున్న టైంలో కాఫీ కప్పులో మూత్రవిసర్జన చేశాడు. దీంతో లైవ్‌లో ఉన్నవాళ్లంతా అవాక్కయ్యారు. విమర్శలు రావడంతో విలియమ్‌ను పక్కనపెట్టాలని, చర్యలు తీసుకోవాలని ప్రధాని జస్టిన్ ట్రూడో నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ లోపే తాను బాధ్యతల నుంచి విశ్రాంతి తీసుకోవాలని భావిస్తున్నట్లు ఆమోస్ ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేశాడు.
చదవండి: బట్టల్లేకుండా ఎంపీ
కాగా, ఉద్దేశపూర్వకంగా తాను ఆ పని చేయలేని విలియమ్ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఘటనపై తాను పశ్చాత్తాపం చెందుతున్నానని పేర్కొన్నాడు. అది వీడియో కాల్ అనే విషయం మరిచిపోయానని, అందరూ చూస్తారనే విషయం తనకు తట్టలేదని విలియమ్ చెప్పాడు. కాగా, కెనడాలోని కొందరు ఎంపీలు లైంగిక వేధింపుల విమర్శలను కూడా ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఈ తరుణంలో విలియమ్‌ను పక్కనపెట్టడమే మంచిదని ట్రూడోకి సహచరులు సలహా ఇచ్చినట్లు తెలుస్తోంది.
Please see my statement. Veuillez lire ma déclaration. pic.twitter.com/ICc8WjqNZi
— William Amos (@WillAAmos) May 28, 2021
ఇక ఈ రెండు సంఘటనలు యాదృచ్చికమని, ఇప్పుడు ఎంతో చింతిస్తున్నానని ఆమోస్ అంటున్నాడు. అంతేకాదు తన చర్య ఎవరికైనా బాధ కలిగించి ఉంటే క్షమించాలని తన ట్విట్టర్లో కోరాడు. లిబరల్ పార్టీలో కీలక సభ్యుడైన విలియం ఆమోస్.. పార్లమెంటరీ సెక్రటరీగా బాధ్యతల నుంచి కొంతకాలం తప్పుకుంటానని తెలిపాడు. పోయిన నెలలో జూమ్ మీటింగ్‌లో విలియమ్ పూర్తి నగ్నంగా ఉన్న ఓ స్క్రీన్ షాట్ వైరల్ అయ్యింది. ఆ సమయంలో క్షమాపణలు చెబుతూ.. ట్విట్టర్లో ఒక పోస్ట్ పెట్టాడు విలియమ్ ఆమోస్. విలియమ్ మానసిక స్థితి పలు సందేహాలున్నాయని తోటి సభ్యులు చెప్తుండడం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment