breaking news
viral video
-
ప్లీజ్ సరిగా కూర్చోండి..! యువర్ స్టోరీ వ్యవస్థాపకురాలు ఫైర్
భోజనం హాయిగా నచ్చిన విధంగా ఆస్వాదిస్తేనే కదా మజా..!. దానికి కూడా ఆంక్షలు అంటే చిర్రెత్తుకొచ్చేస్తుంది ఎవ్వరికైనా. అది సహజం. అందులోనూ సరదాగా వీకెండ్లో నచ్చిన హోటల్ లేదా రెస్టారెంట్లకు వెళ్లి డబ్బులు వెచ్చిస్తున్నా..ఇలాంటి మాటలు ఎదురైతే ఎవ్వరికైన ఒళ్లు మండిపోతుంది. అలాంటి అనుభవవే యువర్ స్టోరీ వ్యవస్థాపకురాలు శ్రద్ధా శర్మకి ఎదురైంది. పాపం ఆమె ఇదేంటి డబ్బులు కట్టేది కూడా నేనే అయినప్పుడూ ఇదేంటంటూ తనకెదురైన అనుభవాన్ని సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకున్నారు. అసలేం జరిగిందంటే..ఆమె ఢిల్లీలో హౌస్ ఆఫ్ మింగ్లో ప్రసిద్ధ తాజ్ మహల్ హోటల్‌కి వెళ్లింది. ఆ హోటల్లో తనకెదురైన వ్యక్తిగత అనుభవాన్ని షేర్ చేసుకున్నారామె. దీపావళి సందర్భంగా ఏదైనా వెరైటీగా చేయాలనకున్నామని తెలిపింది. ఆ నేపథ్యంలోనే తను సోదిరితో కలిసి తాజ్ హోటల్లో విందుకు వచ్చినట్లు వెల్లడించింది. అంతా బాగానే సాగుతుండగా ఇంతలో మేనేజర్ వచ్చి అతిథుల్లో ఒకరికి మీ వల్ల ఇబ్బంది ఉందంటూ..సరిగా కూర్చొమని చెప్పడం జీర్ణించుకోలేకపోయింది. అక్కడ శ్రద్ధా కూర్చిమీదనే షూస్ వదిలేసి పద్మాసనంలో కూర్చొన్నారు. అది మన భారతీయ సంప్రదాయ విధానమే. అయినా..అలా అనడం శ్రద్ధాని బాగా బాధించడంతో ఈ విషయాన్ని సోషల్‌మీడియాలో వివరిస్తూ..తానెలా కూర్చొందో కూడా వీడియో రూపంలో చూపించింది. ఇది ఫైన్ డైనింగ్ రెస్టారెంట్ అని తనకు తెలుసని, ఇక్కడకు చాలామంది ధనవంతులు వస్తుంటారని తనకు తెలుసంటూ ఆగ్రహంగా మాట్లాడారామె. అయినా తాను సంపాదించిన డబ్బుతోనేగా ఇక్కడకు రాగలిగింది అంటూ తన ఆవేదనను వెలిబుచ్చారు. ఎవరికో సమస్య ఉంటే ..తనను ఇలా కాళ్లు దించి సరిగా కూర్చోమని చెప్పడం సరికాదు, ఎందుకంటే డబ్బులు కట్టేది తానే కదా అంటూ వాపోయారు. ఇక్కడ సంస్కృతిని, సంపదతో వేరుచేసి చూస్తూ..గోడలు కట్టుకుంటున్నామంటూ మండిపడ్డారమె. అయినా తాను సల్వార్ కుర్తా ధరించి సరిగానే కూర్చొన్నా, మర్యాదగానే ప్రవర్తించాన, మరి దీనికెందుకు అభ్యంతరం చెప్పాలంటూ నిలదీశారు. నిజానికి పారిశ్రామిక దిగ్గజం దివంగత రతన్ టాటా తన కంపెనీలో పెట్టుబడులు పెట్టారని, కానీ ఇవాళ ఆయనకు చెందిన తాజ్ హోటల్ తనను చాలా నిరాశపరిచేలా అవమానించిందని బాధగా చెప్పుకొచ్చారు. నెటిజన్లు సైతం ఈ పోస్ట్‌ని చూసి..లగ్జరీ హోటళ్లు డ్రెస్ కోడ్లంటూ ప్రవర్తన నియమావళి పెడుతున్నారని, ఇవి తప్పనిసరి కాదంటూ ఆమెకు మద్దతు పలికారు. అయినా సరదాగా విందుని ఎంజాయ్ చేయడానికి వచ్చినప్పుడూ ఆ సమయం మనది మనకు నచ్చినట్లు ప్రవర్తించే హక్కు ఉందని, ఎందుకంటే ఆ వ్యవధికి బిల్లు చెల్లించేది మనమే కదా అంటూ శ్రద్ధని సపోర్టు చేస్తూ పోస్టుల పెట్టడం గమనార్హం. మనం వెళ్లే ప్రదేశం బట్టి దానికి అనుగుణంగా మన వ్యవహారశైలి ఉండాలి గానీ, మరి ఇలా సవ్వంగా ఉన్నాకూడా అతి చేస్తే..అసలుకే పెనుముప్పు కదూ..!. హాయిగా ఆస్వాదించే భోజనం వద్ద ఇలా రూల్స్ పెట్టి ఇబ్బంది పెట్టడం సబబు కాదనేది అంగీకరించాల్సిన వాస్తవం.एक आम इंसान, जो मेहनत करके, अपना पैसा कमा कर, अपनी इज़्ज़त के साथ ताज होटल में आता है — उसे आज भी इस देश में ज़लील और अपमानित होना पड़ता है।और मेरी गलती क्या है? सिर्फ़ ये कि मैं बैठ गई एक “regular padmasana style” में?क्या ये मेरी गलती है कि ताज मुझे सिखा रहा है कि कैसे बैठना… pic.twitter.com/vKBYjg8ltb— Shradha Sharma (@SharmaShradha) October 21, 2025 (చదవండి: శతాధిక బాడీబిల్డర్..ఇప్పటికీ పోటీల్లో పాల్గొనడం, శిక్షణ..) -
పసికందును మోసుకుంటూ గడ్డ కట్టే చలిలో..
పిల్లల్ని కంటికి రెప్పలా చూసుకోవాల్సిన తల్లిదండ్రుల్లో కొందరు.. నిర్లక్ష్యంతో, ఏమరుపాటుతో వాళ్ల ప్రాణాలు పోవడానికి కారణమైన ఘటనలెన్నో చూశాం. అయితే ఇక్కడో జంట ప్రమాదం అని తెలిసి కూడా తమ నెలల పసికందుతో సాహసానికి సిద్ధపడింది. పోనీ అందుకు ప్రత్యేకమైన కారణం ఏదైనా ఉందా? అనుకుంటే.. పప్పులో కాలేసినట్లే!.. లిథువేనియాకు చెందిన ఓ జంట.. పోలాండ్లోని మంచుతో కప్పబడిన మౌంట్ రైసీ పర్వతాన్ని అధిరోహించేందుకు సిద్ధపడింది. అయితే తమ 9 నెలల బిడ్డతో కలిసి ఎలాంటి సురక్షిత పరికరాలు లేకుండానే ముందుకు వెళ్లింది. తల్లిని ముందు భాగంలో క్యారీ చేస్తూ ఆ తల్లి పైకి ఎక్కడం ప్రారంభించింది. ఇది గమనించిన కొందరు అలా చేయొద్దని వారించినా వినలేదు. అయినా వినకుండా ఆ పేరెంట్స్ మొండిగా ముందుకు వెళ్లారు. అయితే.. కాస్త దూరం వెళ్లాక ఆ బిడ్డ తండ్రి ప్రమాదాన్ని అంచనా వేశాడు. ఆ సమయంలో క్రాంపాన్(మంచులో జారకుండా షూలకు బిగించే పరికరాలు) కోసం ఓ మౌంట్ గైడ్‌ను సంప్రదించాడు. బిడ్డకు ప్రమాదం అని భావించిన ఆ మౌంట్గైడ్.. వాళ్లు సర్దిచెప్పి కిందకు తీసుకొచ్చారు. ఆ బిడ్డ పరిస్థితి ఆరోగ్యంగానే ఉన్నట్లు తెలుస్తోంది. వీడియో వైరల్ కావడంతో.. చిన్నారిని ప్రమాదంలోకి నెట్టినందుకు ప్రయత్నించిన ఆ పేరెంట్స్‌పై సోషల్ మీడియా తీవ్ర ఆగ్రహాం వ్యక్తం చేస్తోంది. మౌంట్ రైసీ (Mount Rysy) అనేది పోలాండ్లోని అత్యంత ఎత్తైన పర్వతం. దీని ఎత్తు సుమారు 2,501 మీటర్లు (8,205 అడుగులు). పోలాండ్- స్లోవేకియా సరిహద్దులో ఉన్న హై టాట్రాస్ పర్వత శ్రేణిలో విస్తరించి ఉంది.“No words.” A couple climbed Poland’s highest mountain with a baby — and sparked outrageA Lithuanian couple attempted to ascend Mount Rysy while carrying their nine-month-old child, Delfi reports.Conditions were extremely dangerous. Guides and rescuers warned them repeatedly,… pic.twitter.com/jgN8l6mPEg— NEXTA (@nexta_tv) October 21, 2025 -
స్వరంతో ఉర్రూతలూగించే..స్పాటీఫై క్వీన్ పరమ్‌జీత్ కౌర్..!
ఈ అమ్మాయి పేరు పరమ్‌జీత్ కౌర్... వయసు 19 ఏళ్లు. ప్రత్యేకత.. పంజాబీ ర్యాపర్. తెర మీది ‘గల్లీ బాయ్’కు నిజ జీవిత ప్రతిబింబం! ఘనత.. స్పాటిఫై గ్లోబల్ 50 చార్ట్‌లో టాప్‌లో నిలిచి రికార్డ్స్ బ్రేక్ చేసింది. పంజాబ్ గ్రామీణ ప్రాంతం నుంచి ప్రపంచ ఖ్యాతి దాకా సాగిన ఆమె ర్యాప్ ప్రయాణం గురించి...పరమ్గా సుపరిచితమైన ఈ రాప్ గాయని తన లేటెస్ట్ ట్రాక్ ‘దట్ గర్ల్’తో స్పాటిఫై గ్లోబల్ వైరల్ 50 చార్ట్‌లో నంబర్ వన్‌కి చేరి.. ఆ ఖ్యాతిని ఆర్జించిన ఫస్ట్ ఇండియన్ ఫిమేల్ ఆర్టిస్ట్‌గా చరిత్ర సృష్టించింది. పంజాబ్, మోగా జిల్లాలోని డనేకే అనే పల్లెటూరుకు చెందిన పరమ్‌కి సంగీతం అంటే ణం. పాటలు పాడటమే కాదు రాయటమూ అంతే ఇష్టం. ఆమె తండ్రి తాపీ మేస్త్రీ. అమ్మ ఇళ్లల్లో పనిచేస్తుంది. పరమ్ తన నేపథ్యాన్నే ర్యాప్‌గా వినిపిస్తుంది. తాను ఎదుర్కొంటున్న సవాళ్లూ.. చేస్తున్న పోరాటాలూ.. చూపిస్తున్న ధైర్యసాహసాలకే శ్రుతిలయలు అద్దుతోంది. ఆ సహజత్వమే తన ట్రాక్స్‌కి లేబుల్గా మారి ఆమెను ఈ రోజు అంతర్జాతీయ సంగీత సంచలనంగా మలిచింది. అందులోనిదే లేటెస్ట్ ‘దట్ గర్ల్’ ట్రాక్ కూడా! ఈ పంజాబీ సంప్రదాయ జానపద స్వరాలు.. ఆధునిక హిప్–హాప్ బీట్స్ల మిశ్రమమే ఆమె సంగీత బాణి. ఈ ప్రతిభ భాషనే కాదు భౌగోళిక హద్దులనూ చెరిపేసి ప్రపంచానికి వీనులవిందు చేస్తోంది. కళకు రాగాల మీటర్ కన్నా జీవితంలోని రానెస్సే మ్యాటర్ అని నిరూపిస్తోంది. ‘పంజాబ్‌లో చాలామంది మహిళా పాప్ గాయనులున్నారు. కాని పంజాబీ రాపర్స్ లేరు. అందుకే పరమ్‌జీత్.. అమె స్వరం రెండూ ప్రత్యేకమే. గల్లీ బాయ్ స్పేస్‌లో ఉన్న ఒకే ఒక సింగర్ ఆమె’ అంటారు మ్యూజిక్ ఇండస్ట్రీలోని పెద్దలు. ‘నాకు నచ్చిన పని ఇది. నా కల, లక్ష్యం ఒకటే.. మంచి ఇల్లు కట్టుకోవాలి.. ఆ ఇంట్లో మా పేరెంట్స్ ఏ చింతా లేకుండా హాయిగా సేదతీరాలి’ అంటుంది పరమ్‌జీత్ కౌర్. (చదవండి: వయసు 82... వెనక్కి తగ్గేదే ల్యా..) -
వయసు 82.. వెనక్కి తగ్గేదే ల్యా..
సాహసం వయసు అడుగుతుందా?‘అబ్బే! అలాంటిదేమీ లేదు’ అంటుంది 82 సంవత్సరాల బామ్మ. ఈ బామ్మగారి పేరు ఏమిటో, ఊరు ఏమిటో తెలియదుగానీ నెటిజనులు మాత్రం ‘బంగీజంప్ గ్రాండ్మా’ అని పిలుచుకుంటున్నారు.82 ఏళ్ల వయసులో గట్టిగా నడవడం కూడా కష్టమే. అలాంటిది మన గ్రేట్ గ్రాండ్మా రిషికేష్‌లోని శివ్‌పురిలో బంగీ జంప్ చేసి ‘వావ్’ అనిపించింది. బంగీ జంప్ చేసే ముందు బామ్మలో ఎలాంటి సంకోచం, బెదురు కనిపించలేదు. హుషారుగా స్టెప్పులు వేసింది!ఆమె కళ్లలో నిండైన ఆత్మవిశ్వాసం కనిపించింది. బామ్మగారి బంగీ జంప్ విన్యాసాలు చూస్తే... ‘అయ్బాబోయ్’ అనుకోవాల్సిందే.ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఈ వీడియో వైరల్ అయింది. రెండు రోజుల్లోనే 20 లక్షల వ్యూస్‌ను సొంతం చేసుకుంది.‘ఆత్మవిశ్వాసం అనే రెక్కలతో గాల్లో దేవకన్యలా ఎగురుతోంది’ అని ఒక నెటిజనుడు కామెంట్ రాశాడు. View this post on Instagram A post shared by Bungee Jumping & Adventure in Rishikesh (@globesomeindia)(చదవండి: సమంత హైప్రోటీన్ డైట్..ఆ మూడింటితో ఫుల్‌ఫిల్..!) -
క్యాబ్ డ్రైవర్‌గా మిలటరీ వైద్యుడు..! దయచేసి అలాంటి నిర్ణయం..
విదేశాల్లో సెటిల్ అవ్వడం చాలామంది యువత డ్రీమ్. విదేశాల్లో ఉన్నత చదువులు చదువుకుని అక్కడే సెటిల్ అవ్వాలనుకుంటారు. కానీ అలాంటి ఆలోచన చేసే ముందు అక్కడ నియమ నిబంధనలు గురించి క్షణ్ణంగా తెలుసుకోవాలి లేదంటే..తీరా కోర్సు పూర్తి చేశాక ఉద్యోగం చేసేందుకు వీలు లేకపోతే పరిస్థితి అగమ్యగోచరం. అందుకు నిర్ణయం తీసుకునే ముందు ఆలోచించండి అంటోంది ఈ బెంగళూరు మహిళ. అసలేం జరిగిందంటే..కెనడాలో క్యాబ్ నడుపుతున్న ఒక వైద్యుడిని కలిసిన బెంగళూరుకి చెందిన మేఘన శ్రీనివాస్ అందుకు సంబంధించిన వీడియో సంభాషణను నెట్టింట షేర్ చేశారు. మిస్సిసాగా నుంచి టొరంటోకు ట్రావెల్ చేస్తుండగా ఆ డ్రైవర్ని కలిశారామె. అఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చి ఆ డ్రైవరర్ తాను కెనడాలో డిగ్రీ చదువుతున్నట్లు తెలిపాడు. తన ఖర్చుల కోసం అని క్యాబ్నడుపుతున్నట్లు ఆమెతో చెప్పాడు. క్యాబ్ నడపుతూ తాను రూ. 3 లక్షల వరకు సంపాదిస్తున్నానని, అందులో కేవలం సింగిల్ బెడ్రూం కోసమే ఏకంగా రూ 2 లక్షలు పైనే ఖర్చు చేస్తున్నట్లు మేఘనతో వాపోయాడు. తాను గతంలో అమెరికా, కెనడా సైనిక వైద్యుడిగా పనిచేసినట్లు తెలిపారు. ప్రస్తుతం కెనడాలో ప్రజప్రతినిధిగా ఉన్నట్లు తెలిపారు. తాను కెనడాలో తన వైద్య వృత్తిని కొనసాగించడానికి, వైద్య లైసెన్సు పొందేందుకు నానా తిప్పలు పడుతున్నట్లు చెప్పుకొచ్చారు. చివరగా ఆ వీడియోలో మేఘన దయచేసి కెనడాలో సెటిల్ అవ్వాలనుకుంటే అన్ని విషయాలను తెలుసుకుని సరైన విధంగా ప్లాన్ చేసుకోవాలని సూచించారు. అలాగే భవిష్యత్తులో ఇక్కడకు రావాలనుకునే విద్యార్థులు కూడా ఇక్కడ విద్యా వ్యవస్థ తీరు తెన్నులు..జీవిత వాస్తవాలు గుర్తించి పూర్తిగా తెలుసుకుని రావడం మంచిదని చెప్పుకొచ్చింది మేఘన. చివరగా ఆమె ఈ దేశం మనకు అద్భతమైన అవకాశాలను ఇస్తుంది. అందులో ఎలాంటి సందేహం లేదు కానీ అందుకు అచంచలమైన ఓర్పు చాలా అవసరమని అన్నారామె. నెటిజన్లు సైతం ఈ వీడియోని చూసి..అంతర్జాతీయ వైద్య గ్రాడ్యుయేట్లకు సంబంధించి.. నియమాలు, చట్టాల మారాయి. స్థానికత లభించడం దాదాపు అసాధ్యం అని ఒకరు, విదేశీ వైద్యులు అక్కడ ఉద్యోగం పొందడం చాలా కష్టం అని అభిప్రాయం వ్యక్తం చేస్తూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by Meghana Srinivas | Realtor, Windsor ON (@meghana.srinivasa_) (చదవండి: 'కూతుళ్లు మన ఇంటి లక్ష్మీ దేవతలు'..! వారి రాకతోనే..: నీతా అంబానీ) -
'కూతుళ్లు మన ఇంటి లక్ష్మీ దేవతలు'..! వారి రాకతోనే..: నీతా అంబానీ
ఆడపిల్లలను ఇంటి లక్ష్మిగా కీర్తిస్తుంటారు మన పెద్దలు. ఆ విషయాన్ని గుర్తుచేశారు రిలయన్స్ ఫౌండేషన్ చైర్పర్సన్ నీతా అంబానీ. ఈ దీపావళి పండుగలో వెలుగుని తెచ్చేది కూతుళ్లే అంటూ హృదయపూర్వక సందేశాన్ని అందించారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.రిలయన్స్ దీపావళి పార్టీలో నీతా అంబానీ కూతుళ్ల కోసం జరుపుకునే పండుగగా అభివర్ణించిన సందేశం ప్రతి ఒక్కరు మనుసును హత్తుకుంది. తరుచుగా మన పెద్దలు చెప్పేమాటను ఆమె గుర్తు చేస్తూ..ఈ పండుగ అందమే కూతుళ్లని, వారి రాకతోనే మన ఇల్లుకాంతిమయం అవుతుందంటూ భావోద్వేగంగా మాట్లాడారు. అంతేగాదు. తన మనవరాళ్లు ఆదియ శక్తి పిరమల్, వేద అంబానీలను తన ఇంటి లక్ష్మీగా పరిచయం చేసింది. వారి వల్ల తమ ఇల్లు వెలిగిపోతుంటుందని, నట్టింట వారు నడయాడుతుంటే లక్ష్మీ దేవి ఉన్నట్లే అనిపిస్తుందని అన్నారామె. భారతీయ సంప్రదాయంలో కూమార్తెలను లక్ష్మీదేవత ప్రతిరూపంగా భావిస్తుంటారు. వారి వల్లే తమ ఇంటి శ్రేయస్సు, ఆనందం, అదృష్టమని ప్రగాఢంగా విశ్వసిస్తారు. దాన్ని ఆమె ఈ పండుగ నేపథ్యంలో గుర్తు చేస్తూ..ఆడపిల్లలు మన ఇంటి లక్ష్ములు అంటూ మన సంస్కృతిని లింగ సమానత్వం, సాధికారతను మిళితం చేసేలా గొప్పగా సందేశమిచ్చారామె. అంతేగాదు ఈ పండుగకు అసలైన అర్థం, అంతరార్థం బహుచక్కగా వివరించి.. నెటిజన్ల మనసును దోచుకున్నారామె. పైగా కుటుంబం విలువను తెలియజేసేలా ఐక్యత, ప్రేమ, అనేవి దీపాల వెలుగల వలే మన జీవితాల్ని కాంతిమయం చేస్తాయని తన భావోద్వేగ సందేశంతో చెప్పకనే చెప్పారు నీతా అంబానీ. View this post on Instagram A post shared by The Times of India (@timesofindia) (చదవండి: Hungover After Diwali: దీపావళి హ్యాంగోవర్‌ని తగ్గించే నేచురల్ డిటాక్స్..తక్షణ ఉపశమనం!) -
ప్రమోషన్ రావాలంటే 4 చిట్కాలు..
ఆఫీసులో బాగా పనిచేయడం ఒక్కటే సరిపోదు.. దాన్ని ఉన్నత ఉద్యోగుల వద్ద చూపించుకోగలిగితేనే ప్రమోషన్లు వస్తాయని, ఈ విషయంలో వ్యూహాత్మకంగా వ్యవహరించాలని ఇన్స్టాగ్రామ్ పోస్ట్‌లో ఓ ఉద్యోగి తెలిపారు. ఈ విధానం వల్లే తనకు ప్రమోషన్ వచ్చినట్లు చెప్పారు. తాను చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో చర్చకు దారి తీసింది. రోహిత్ యాదవ్ అనే ఈ ఉద్యోగి తన ప్రమోషన్‌కు దోహదపడిన నాలుగు ప్రత్యేకమైన అంశాలను తెలిపారు.యాదవ్ తన కెరీర్లో ఎదిగేందుకు మొదటగా బాగా పని చేసినప్పటికీ, తన పనిని ఇతరులకు కనిపించేలా చేయడం ప్రారంభించినప్పటి నుంచే ఉద్యోగం పరంగా వృద్ధి సాధించినట్లు చెప్పారు.వీక్లీ విన్స్(వారంలో సాధించిన విజయాలు)ప్రతి శుక్రవారం యాదవ్ పని పరిమాణంతో సంబంధం లేకుండా తాను సాధించిన మూడు పని సంబంధిత విజయాలను డాక్యుమెంట్ చేసేవాడు. ఇది పనిపై స్పష్టతను పొందడానికి, సమీక్షల సమయంలో తన పని గురించి చర్చించడానికి సహాయపడినట్లు చెప్పారు.మంత్లీ మేనేజర్ అప్డేట్స్ప్రతి నెలా తన మేనేజర్‌కు కీలక ఫలితాలు, తాను నేర్చుకున్న పాఠాలను క్లుప్తంగా సందేశం పంపేవారు. ఈ అప్డేట్స్ తన పని ఫలితాలకు సంబంధించినవి మాత్రమే ఉండేవి. పని పరంగా గొప్పలు చెప్పుకోకుండా తనను తాను ఎలా తీర్చిదిద్దుకుంటున్నాడో పేర్కొన్నారు.సరైన ప్రశ్న అడగడంవన్-ఆన్-వన్ సమావేశాల్లో ఆయన అడిగే ప్రధాన ప్రశ్న.. ‘తదుపరి స్థాయికి సిద్ధంగా ఉండటానికి నేను ఏమి మెరుగుపరుచుకోవాలి?’. ఈ ప్రశ్న నిర్మాణాత్మక అభిప్రాయానికి మార్గం వేసింది. మేనేజర్ తనను చూసే విధానాన్ని మార్చిందని యాదవ్ వివరించారు.సమావేశాలలో మాట్లాడటంప్రతి మీటింగ్‌లోనూ తన అభిప్రాయాలు చెప్పేవాడని తెలిపారు. సమావేశాల్లో నిశ్శబ్దంగా ఉండే వారిని అధికారులు విస్మరించే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు. View this post on Instagram A post shared by Rohit Yadav (@rohitdecoded)ఈ పోస్ట్‌పై నెటిజన్లు విభిన్నంగా స్పందించారు. యాదవ్ వ్యూహాత్మక కెరీర్ విధానాన్ని చాలా మంది లింక్డ్ఇన్ వినియోగదారులు ప్రశంసించారు. ‘నేను కార్పొరేట్ వాతావరణానికి కొత్త. ఈ చిట్కాలకు చాలా ధన్యవాదాలు. రేపటి నుంచి ప్రారంభిస్తాను’ అని ఒక కొత్త ఉద్యోగి స్పందించారు. ‘నేను మీరు చెప్పిన దాంట్లో కొన్ని పాయింట్లను ప్రయత్నించాను. కానీ మీలా జరగలేదు. చెప్పేది కనీసం వినే సహాయక మేనేజర్ అవసరమని నమ్ముతున్నాను’ అని మరో వ్యక్తి రాశారు. మరొకరు ‘పక్షపాతం పనిచేసే చోట ఇది పని చేయదు’ అని చెప్పారు.ఇదీ చదవండి: చైనాకు యూఎస్ వార్నింగ్.. భయమంతా అదే.. -
ఇన్ఫోసిస్ క్యాంపస్ పాత వీడియో వైరల్
ఒకప్పుడు సాఫ్ట్వేర్ కార్యాలయాల్లో విరామ సమయాలంటే సహోద్యోగులతో సరదా సంభాషణలు, కలిసి భోజనం చేస్తూ అనుభవాలు పెంచుకునే అవకాశం ఉండేది. కానీ ప్రస్తుతం విరామ సమయాల్లో ఫోన్లను చూస్తూ గడుపుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో 1990 దశకంలో బెంగళూరులోని ఇన్ఫోసిస్ క్యాంటీన్ లోపల తీసిన ఒక పాత వీడియో ఇంటర్నెట్లో వైరల్‌గా మారింది.ఈ వీడియోలో యువ నిపుణుల బృందం భోజనం చేస్తూ, ఉల్లాసంగా మాటామంతి చేస్తూ, నవ్వుతూ కనిపిస్తున్నారు. ‘1990లలో బెంగళూరులోని ఇన్ఫోసిస్ క్యాంటీన్ ఫుటేజ్. ఇందులో దాదాపు చాలామంది మల్టీ-మిలియనీర్లు అయ్యారు. ప్రస్తుతం వారు విదేశాల్లో స్థిరపడ్డారు’ అనే క్యాప్షన్‌లో ఈ వీడియో షేర్ అయింది. ఆ సమయంలో భారతదేశ సాంకేతిక విప్లవంలో తాము భాగమవుతున్నామన్న విషయం వారికి తెలియకపోయి ఉండవచ్చు. ఈ వీడియో మాజీ ఉద్యోగులు, ఐటీ ఎక్స్‌పర్ట్‌లతో సహా అనేక మందిని ఆకట్టుకుంది.దీనిపై నెటిజన్లు స్పందిస్తూ..‘చాలా క్లాస్! వారు రిలాక్స్‌గా కనిపిస్తున్నారు. ప్రతి ఒక్కరూ ఫిట్‌గా, తెలివిగా ఉన్నారు. చేతిలో ఫోన్ కూడా లేదు. అవి నిజంగా గోల్డెన్ డేస్’ అని ఒకరు రాశారు. మరొకరు ‘కులం, మతం, లింగ వ్యత్యాసాలను పట్టించుకోని, సమాజంలో సానుకూలంగా ప్రభావితమైన క్యాంపస్’ అని రాశారు.Footage from Infosys canteen, Bangalore in 1990s. Almost everyone in this is probably a multi-millionaire and settled abroad today. pic.twitter.com/nTKDQMiXrJ— Arjun* (@mxtaverse) October 18, 2025ఇదీ చదవండి: చైనాకు యూఎస్ వార్నింగ్.. భయమంతా అదే.. -
ఢిల్లీ మెట్రోలో అమ్మాయిల స్టెప్పులు : వీడియో వైరల్
ఢిల్లీ మెట్రోలో ఒక వీడియో మళ్లీ తెగ వైరలవుతోంది. ప్రయాణీకులకు అసౌకర్యం , భద్రతల నేపథ్యంలో ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (DMRC) మెట్రో రైళ్లు , స్టేషన్లలో ఫోటోలు, వీడియోలు తీయడాన్ని నిషేధించినప్పటికీ అందమైన సాంప్రదాయ దుస్తులలో ముగ్గురు అమ్మాయిల డ్యాన్స్ మాత్రం విపరీతంగా ఆకట్టుకుంటోంది.బాలీవుడ్ హిట్ సినిమా ‘హమ్ ఆప్కే హై కౌన్’లోని ‘పెహ్లా పెహ్లా ప్యార్ హై’ అనే సాంగ్‌కు ముగ్గురు అమ్మాయిలు అందంగా డ్యాన్స్ చేశారు. చక్కటి హావభావాలు, అందమైన స్టెప్పులతో ఆకట్టుకున్నారు. చాలా బావుంది అంటూ నెటిజన్లు ప్రశంసించారు. వీడియోను జ్యోతి JSK (hezal_little_dancer) అనే యూజర్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఎండింగ్ అస్సలు మిస్ కావద్దు అనే క్యాప్షన్‌తో షేర్ చేశారు. ట్రెడిషన్ల్ దుస్తుల్లో భలే అందంగా డ్యాన్స్ చేశారు అంటూ నెటిజన్లు వ్యాఖ్యానించారు. ఇటీవల నవరాత్రి సందర్భంగా, తండ్రీ కూతుళ్ల ఉత్సాహభరితమైన గర్బా డ్యాన్స్వీడియో వైరల్ అయిన సంగతి తెలిసిందే. నైషా అనే యూజర్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఆరోగ్యకరమైన వీడియోలో తండ్రి వేడుకల్లో ఆనందంగా స్టెప్పులేయడం అందర్నీ ఆకట్టుకుంది. View this post on Instagram A post shared by Jyoti JSK (@hezal_little_dancer) -
ఆల్ ఫార్మాట్ గ్రేట్‌గా ఎదుగుతాడు: నితీశ్ రెడ్డిపై రోహిత్ శర్మ ప్రశంసలు
టీమిండియా యువ ఆల్‌రౌండర్ నితీశ్ కమార్ రెడ్డి (Nitish Kumar Reddy)పై భారత దిగ్గజ కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma)ప్రశంసలు కురిపించాడు. ఈ ఆంధ్ర ఆటగాడు మూడు ఫార్మాట్లలోనూ సత్తా చాటి ఉన్నత శిఖరాలకు చేరుకుంటాడని పేర్కొన్నాడు.అరుదైన పేస్ బౌలింగ్ ఆల్‌రౌండ్ నైపుణ్యాలతో జట్టులోకి వచ్చిన నితీశ్ రెడ్డి.. ఇప్పటికే టెస్టుల్లో కీలక ఆటగాడిగా మారాడు. అంతకుముందే టీ20 ఫార్మాట్లోనూ అరంగేట్రం చేసిన ఈ విశాఖ కుర్రాడు.. తాజాగా ఆస్ట్రేలియాతో తొలి మ్యాచ్‌తో వన్డేల్లోనూ అడుగుపెట్టాడు.ఆల్ ఫార్మాట్ గ్రేట్‌గా టీమిండియా దిగ్గజ సారథి రోహిత్ శర్మ చేతుల మీదుగా వన్డే క్యాప్ అందుకున్నాడు నితీశ్ రెడ్డి. ఈ సందర్భంగా రోహిత్ మాట్లాడుతూ.. ‘‘క్యాప్ నంబర్ 260. నితీశ్ రెడ్డి. నీ ఆటిట్యూడ్, నైపుణ్యాలతో కెరీర్‌ను గొప్పగా ఆరంభించావు. ఇదే జోరును కొనసాగిస్తే వందకు 110 శాతం.. నువ్వు టీమిండియాతో సుదీర్ఘకాలం పాటు ప్రయాణం చేస్తావని చెప్పగలను. ఆల్ ఫార్మాట్ గ్రేట్‌గా ఎదగబోతున్నావని అనిపిస్తోంది. నీపై నాకు ఆ నమ్మకం ఉంది. ప్రతి ఫార్మాట్లోనూ ఆడాలన్న నీ కల నెరవేరింది. అందరూ నీకు తోడుగా ఉంటారునీకు జట్టు ఎల్లప్పుడూ అండగా ఉంటుంది. ఆటగాడిగా నీకేం కావాలో అన్నీ సమకూరుస్తుంది. ఎప్పుడు, ఏం కావాలన్నా అందరూ నీకు తోడుగా ఉంటారు. ఎల్లవేళలా మద్దతుగా నిలుస్తారు. గుడ్ లక్. నీ కెరీర్ గొప్పగా ఉండాలి’’ అంటూ రోహిత్ శర్మ నితీశ్ రెడ్డిపై ప్రశంసలు కురిపిస్తూ శుభాకాంక్షలు తెలియజేశాడు. ఇందుకు సంబంధించిన వీడియోను భారత క్రికెట్ నియంత్రణ మండలి సోషల్ మీడియాలో షేర్ చేసింది.కాగా ఆసీస్‌తో తొలి వన్డేలో ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన నితీశ్ రెడ్డి 11 బంతుల్లో రెండు సిక్సర్ల సాయంతో 19 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఇక ఇప్పటి వరకు టీమిండియా తరఫున టీ20 మ్యాచ్‌లు, తొమ్మిది టెస్టులు ఆడిన ఈ రైటార్మ్ మీడియం పేసర్.. టెస్టుల్లో ఎనిమిది, టీ20లలో మూడు వికెట్లు తీశాడు.అపుడు కోహ్లి.. ఇపుడు రోహిత్అదే విధంగా ఈ కుడిచేతి వాటం బ్యాటింగ్ ఆల్‌రౌండర్ ఖాతాలో టెస్టుల్లో 386, టీ20లలో 90 పరుగులు ఉన్నాయి. కాగా గతేడాది పెర్త్ వేదికగా భారత దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లి చేతుల మీదుగా టీమిండియా టెస్టు క్యాప్ అందుకున్న 22 ఏళ్ల నితీశ్ రెడ్డి.. తాజాగా అదే వేదిక మీద రోహిత్ చేతుల మీదుగా వన్డే క్యాప్ అందుకోవడం విశేషం. తన కెరీర్లో చిరస్మరణీయంగా గుర్తుండిపోయే ఈ క్షణాలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.గిల్ సేనకు ఓటమిఇక మ్యాచ్ విషయానికొస్తే.. ఆసీస్‌తో తొలి వన్డేలో టీమిండియా ఓటమిని చవిచూసింది. వర్షం కారణంగా 26 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో భారత జట్టు తొలుత బ్యాటింగ్ చేసి తొమ్మిది వికెట్ల నష్టానికి 136 పరుగులు చేసింది.ఇక డక్‌వర్త్ లూయీస్ పద్ధతి ప్రకారం ఆస్ట్రేలియా తమ ముందు 131 పరుగుల లక్ష్యాన్ని కేవలం మూడు వికెట్లు కోల్పోయి 21.1 ఓవర్లలోనే ఛేదించింది. తద్వారా టీమిండియాపై ఏడు వికెట్ల తేడాతో జయభేరి మోగించి.. మూడు వన్డేల సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఇరుజట్ల మధ్య గురువారం అడిలైడ్ వేదికగా రెండో వన్డే నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది.చదవండి: నితీశ్ రెడ్డిని అందుకే తీసుకున్నారు.. కానీ ఇదేం పద్ధతి?: అశూ ఫైర్ View this post on Instagram A post shared by Team India (@indiancricketteam) -
విమాన ప్రమాదం.. అదుపుతప్పి సముద్రంలోకి దూసుకెళ్లి..
హాంకాంగ్: హాంకాంగ్‌లో ఘోర విమాన ప్రమాద ఘటన చోటుచేసుకుంది. హాంకాంగ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో(Hong Kong Airport) కార్గో విమానం రన్‌వేపై అదుపు తప్పి సముద్రంలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఇద్దరు సిబ్బంది చనిపోయినట్టు సమాచారం.ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. హాంకాంగ్‌లో అంతర్జాతీయ విమానాశ్రయంలో(cargo Flight Accident) సోమవారం తెల్లవారుజామున 3.50 సమయంలో బోయింగ్ 747-481 మోడల్‌కి చెందిన కార్గో విమానం ప్రమాదానికి గురైంది. దుబాయ్ నుంచి హాంకాంగ్ చేరుకొన్న ఎమిరేట్స్ విమానం అత్యంత రద్దీగా ఉండే నార్త్ రన్‌వేపై దిగి అదుపుతప్పి ఓ వాహనాన్ని ఢీకొని సముద్రంలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఇద్దరు విమానాశ్రయ గ్రౌండ్ సిబ్బంది మృతి చెందారు. విమానంలో ఉన్న నలుగురు సిబ్బంది సురక్షితంగా బయటపడ్డారు.New footage of the Air ACT 747 that ran off the runway at Hong Kong International Airport this morning. pic.twitter.com/3tHlBwruwu— OSINTtechnical (@Osinttechnical) October 20, 2025ప్రమాదం కారణంగా విమానం పాక్షికంగా నీటిలో మునిగిపోయింది. బోయింగ్ 737 శ్రేణికి చెందిన EK9788 విమానాన్ని ఎమిరేట్స్ నుంచి తుర్కియే సంస్థ ఏసీటీ ఎయిర్ లైన్స్ లీజుకు తీసుకొని నడుపుతోంది. ప్రమాదం జరిగిన రన్‌వేను అధికారులు తాత్కాలికంగా మూసివేశారు. అయితే విమానాశ్రయంలోని మిగతా రెండు రన్వేలు కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయి.‼️Sortie de piste d’un Boeing 747 Cargo à Hong Kong🔸L’appareil de la compagnie turque Air Act opérait un vol depuis Dubaï pour le compte d’Emirates🔸Le Boeing était à l’atterrissage piste 07L, quand il a fait une sortie latérale de piste et a terminé sa course dans la mer… pic.twitter.com/1LRFBnzv24— Aero Gazette ✈️ (@AeroGazette) October 20, 2025 -
పనిమనిషి జీతం రూ. 45 వేలు : అంత అవసరమా, నెట్టింట చర్చ!
సిలికాన్ సిటీ, ఐటీ సిటీ బెంగళూరు (Bengaluru) ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో ఒకటి. గార్డెన్ సిటీ బెంగళూరులో జీవితం అంటే చాలా ఖరీదైనదే. అలాంటిది బెంగళూరులో కుటుంబంతో నివసిస్తున్న ఒక రష్యన్ మహిళ తన ఇంటి సహాయకురాలికి నెలకు రూ.45,000 కంటే ఎక్కువ చెల్లించడం చర్చకు దారితీసింది.తాజాగా రష్యాకు చెందిన ఒక కంటెంట్ క్రియేటర్ యులియా అస్లమోవా బెంగళూరు లైఫ్ గురించి పంచుకున్న వీడియో ఇప్పుడు నెట్టింట సందడి చేస్తోంది. తన బిడ్డను చూసుకునేందుకు నియమించుకున్న పనిమనిషికి నెలకు రూ. 45,000 చెల్లిస్తానని వెల్లడించింది. అంతేకాదు ఇంటి పనిని కూడా "వృత్తిపరంగా" చూస్తానని, ఏదేని కార్పొరేట్ ఉద్యోగం లాగే ప్రోత్సాహకాలను అందిస్తానని అస్లమోవా చెప్పారు. View this post on Instagram A post shared by Iuliia Aslamova (@yulia_bangalore) ఇంకా ఇంటి అద్దెకు 1.25 లక్షల రూపాయలు, తన పిల్లల స్కూల్ ఫీజు కోసం రూ.30వేలు, ఆహారంతో సహా ఇంటి ఖర్చుల కోసం రూ.75,000 రూపాయలు ఖర్చు చేస్తున్నట్లుగా కూడా ఈ మహిళ వెల్లడించింది. పనిమిషికి 45 వేలు ఇవ్వడం అంటే తనను "పిచ్చిదానిని" అని అనుకోవచ్చు. కానీ ఆమె విధేయత, వృత్తి నైపుణ్యం కారణంగా ఆమె ఈ ప్రతిఫలానికి అర్హురాలని తాను భావించినట్లు తెలిపింది. తన కుమార్తె ఎలినా కోసం నానీని నియమించుకునే ముందు కనీసం 20 మంది అభ్యర్థులను ఇంటర్వ్యూ చేశానని ఆమె చెప్పారు. దీనిపై నెటిజన్లు స్పందించారు. బెంగళూరు సహా భారతదేశంలోని నలుమూలల నుండి ప్రజలు స్పందించారు. కొందరు ఆమెను ప్రశంసించగా మరికొందరు విమర్శించారు. మీరు ఎక్కువ చెల్లిస్తున్నారనీ, ఇంతకంటే తక్కువకు ఫ్లాట్లు దొరుకుతాయని కమెంట్ చేశారు. మరొక వినియోగదారు “అది TCS, ఇన్ఫోసిస్ ,యాక్సెంచర్ టెక్ ఫ్రెషర్లకు చెల్లించే దానికంటే ఎక్కువ.” అని పేర్కొన్నారు.అయితే విమర్శలపై స్పందిస్తూ అస్లమోవా తన వైఖరికి కట్టుబడి ఉండటం విశేషం. "మీరు ఇతరులతో చెడుగా ప్రవర్తిస్తే, కర్మ మీకు ఫలితం ఇస్తుంది" అని కౌంటర్ ఇవ్వడం గమనార్హం. అలాగే వ్యక్తిగత లేదా వృత్తిపరమైన వృద్ధికి బదులుగా ఇంటి పనికి రోజుకు చాలా గంటలు కేటాయించేవారు విలువైన అవకాశాలను కోల్పోతున్నారని చెబుతూ, వారు తమ సమయాన్ని ఎలా గడుపుతున్నారో ఒక్కసారి పునరాలోచించుకోవాలని కోరారు. -
ముద్దుల కోడలి పుట్టిన రోజు వేడుకల్లో నీతా : ఆమె టీ షర్ట్ గమనించారా?
రిలయన్స్ ముఖేష్ అంబానీ, నీతా దంపతుల ముద్దుల కోడలు, అనంత్ అంబానీ భార్య రాధిక మర్చంట్ పుట్టిన రోజు పార్టీ ఉత్సాహంగా జరిగింది.అనన్య పాండే, జాన్వి కపూర్ , తారా సుతారియా వంటి అనేక మంది బి-టౌన్ సెలబ్రిటీలు వేడుకలకు హాజరు కావడంతో ఈ బర్త్‌డే వేడుక స్టార్-స్టడ్ ఈవెంట్‌గా మారింది. ఓర్రీ అని పిలిచే ఓర్హాన్ అవత్రమణి తన సోషల్ మీడియా హ్యాండిల్ దీనికి సంబంధించిన వీడియోను షేర్ చేశాడు. దీంతో వేడుకలు వైరల్‌గా మారాయి.అక్టోబర్ 16న రాధిక మర్చంట్ పుట్టినరోజు సెలబ్రేషన్ జరిగింది. ఈ వేడుకలో అత్తగారు నీతా అంబానీ హైలైట్‌గా నిలిచారు. రాధిక ఫోటో ఉన్నటీ షర్టు ధరించి, ముద్దుల కోడల్ని ముద్దుగా ఆలింగనం చేసుకోవడం అందర్నీ ఆకట్టుకుంది. ఈ బర్త్‌డే సెలబ్రేషన్స్‌లో ఆకాష్ అంబానీతో పాటు, రాధిక స్నేహితులు కూడా పార్టీలో కనిపించారు. View this post on Instagram A post shared by Orhan Awatramani (@orry) కాగా వ్యాపారవేత్త వీరెన్ , శైలా మర్చంట్ దంపతుల కుమార్తె రాధిక, తన బాల్య స్నేహితుడు, ప్రేమికుడుఆకాష్ అంబానీని ( జూలై 2024)వివాహం చేసుకుంది. -
Viral Video: వామ్మో..భారీ అనకొండతో ఎవరీ డేర్ డెవిల్!
-
‘నన్ను చూస్తూ వెలికిగా నవ్వాడు, అందుకే కోపంతో..’ సారీ చెప్పిన దీపిక
ఏకంగా ప్రొఫెసర్‌పై.. అదీ పోలీసుల సమక్షంలో చెయ్యి చేసుకుంది ఓ విద్యార్థి సంఘం నాయకురాలు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో తీవ్ర దుమారం రేగింది. ఆమె క్షమాపణలు చెప్పేదాకా ఊరుకునేది లేదని లెక్చరర్ల సంఘం ఆందోళనకు దిగింది. ఈ తరుణంలో ఆమె వివరణ ఇచ్చుకుంది. ఢిల్లీ యూనివర్సిటీ స్టూడెంట్స్ యూనియన్ జాయింట్ సెక్రటరీ, ఏబీవీపీ సభ్యురాలు దీపిక ఝా(Deepika Jha) ఎట్టకేలకు క్షమాపణలు చెప్పారు. గురువారం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కాలేజీలో ప్రొఫెసర్ సుజీత్ కుమార్‌పై ఆమె చెయ్యి చేసుకున్నారు. క్రమశిక్షణా కమిటీ భేటీలో.. అందునా అక్కడ ఉన్న పోలీసుల సమక్షంలోనే ఈ దాడి జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో.. శుక్రవారం క్షమాపణలు చెబుతూ దీపికా ఝా ఓ వీడియో రిలీజ్ చేశారు. ఆయన (సుజీత్ కుమార్) నన్ను తదేకంగా చూశారు. నోటికొచ్చినట్లు తిట్టారు. బెదిరించారు. వెటకారంగా నవ్వారు. తట్టుకోలేకపోయా. అందుకే అలా చేయాల్సి వచ్చింది అని తన చర్యను సమర్థించుకున్నారామె. This is what happens when authority abuses power and impulse overtakes discipline.A drunk, politically biased DU professor misbehaved with students — police intervened but made no arrest.DUSU JS Deepika Jha reacted wrongly.This is not ABVP’s way.pic.twitter.com/d53LetxRiP— Gaurav (@gjha88) October 17, 2025బహిరంగంగా సిగరెట్ కాల్చడంతో విద్యార్థులు పాడైపోతారని ఆయన్ని మేం ఆపే ప్రయత్నం చేశాం. దీంతో ఆయన క్రమశిక్షణా కమిటీ మీటింగ్ పెట్టారు. ఆ మీటింగ్‌లో నాతో అనుచితంగా వ్యవహరించాడు. కోపంతో అలా చేయాల్సి వచ్చింది. ఎవరి మనోభావాలు దెబ్బతీయాలన్నది తన ఉద్దేశం కాదని చెబుతూనే జరిగిందానికి టీచర్స్ కమ్యూనిటీకి క్షమాపణలు తెలియజేశారామె. అయితే.. ఈ ఘటనపై కామర్స్ ప్రొఫెసర్ సుజీత్ కుమార్ వెర్షన్ మరోలా ఉంది. కాలేజీ స్టూడెంట్ కౌన్సిల్లో మూడు పోస్టులకు జరిగిన ఎన్నికల వ్యవహారమే దీనంతటికి కారణమని అంటున్నారాయన. ఈ ఎన్నికకు సంబంధించిన ఎన్ఎస్యూఐ(కాంగ్రెస్ విద్యార్థి విభాగం) సభ్యులపై ఏబీవీపీ సభ్యులు దాడి చేశారని.. దీంతో వాళ్లను సస్పెండ్ చేశామని.. ఆ వ్యవహారంపై చర్చించే సమయంలో కమిటీ ముందు కూడా మరోసారి దాడి జరిగిందని అన్నారాయన. ఈ వ్యవహారంలో తనను రాజీనామా చేయాలంటూ ఎబీవీపీ సభ్యులు ఒత్తిడి చేశారని, ఆ టైంలో దీపిక వచ్చి తనపై దాడి చేసిందని ఏఎన్ఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలియజేశారాయన. #WATCH | Delhi: On being slapped by DUSU Joint Secretary, Professor Sujeet Kumar says, "...I am the convener of the discipline committee in my college and it is my responsibility to maintain law and order in college... The day before yesterday, we had a fresher's function at our… pic.twitter.com/2scFkzg3kx— ANI (@ANI) October 17, 2025ఇదిలా ఉంటే.. ఈ ఘటనపై ఢిల్లీ యూనివర్సిటీ టీచర్స్ అసోషియేషన్(DUTA) భగ్గుమంది. దీపికా ఝాతో ఆ ప్రొఫెసర్‌కు క్షమాపణలు చెప్పించాల్సిందేనని పట్టుబడుతోంది. మరోవైపు.. స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(SFI) సైతం ఘటనను తీవ్రంగా ఖండించింది. తీవ్ర దుమారం రేపడంతో ఈ ఘటనపై దర్యాప్తు కోసం ఆరుగురు సభ్యులతో కూడిన కమిటీ ఏర్పాటు చేశారు. ప్రొఫెసర్ నీతా సెహగల్ నేతృత్వంలోని కమిటీ రెండు వారాల్లో నివేదికను వీసీ యోగేష్ సింగ్‌కు సమర్పించనుంది. -
ఎలాన్ మస్క్ 'బేకరీ'.. కానీ ఇక్కడ కేక్‌లు, పేస్ట్రీలు ఉండవు..
టెస్లా అధినేత, టెక్ బిలియనీర్ ఎలాన్ మస్క్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అపర కుభేరుడు, ఎలాన్ మస్క్ వ్యవస్థపక విజయాలన్నీ..కొత్త వ్యాపారం చేయాలనుకునేవారికి మార్గదర్శకం. అలాంటి టెక్ దిగ్గజం ఒక 'బేకరీ'ని కూడా నడుపుతున్నట్లు మీకు తెలుసా..!. అయితే ఆ బేకరీలో కేక్‌లు, పేస్ట్రీలు, బ్రెడ్లు ఉండవు ఉండవు. మరీ ఏం తయారవుతాయంటే..ఈ బేకరీ స్టార్‌షిప్ అంతరిక్ష నౌకలో ఉపయోగించే సిరామిక్ హీట్ షీల్డ్ టైల్స్ తయారు చేస్తుంది. చలా జాగ్రత్తగా రూపొందించే ఈ టైల్స్ పదునైన షడ్భుజాకారాల్లో ఉంటాయి. అవి భూమి వాతావరణంలోకి ప్రవేశించగానే మండే ఉష్ణోగ్రతలో అంతరిక్ష నౌకను రక్షిస్తాయి. వీటి ష్ణోగ్రతలో కొన్నిసార్లు 1,400 డిగ్రీల సెల్సియస్ వరకు పెరుగుతుంటుందట. ఆ నేపథ్యంలోనే వీటికి ప్రత్యేకమైన డిజైన్ ఉంది. ఇందులో సంక్లిష్టమైన పిన్ అటాచ్మెంట్లు, చిన్న విస్తరణ అంతరాలు ఉంటాయి. ఇవి పగుళ్లు లేకుండా వంగడానికి, స్వీకరించడానికి వీలు కల్పిస్తాయి. ప్రతి స్టార్‌షిప్‌కు 18,000 షడ్భుజాకార టైల్స్ అవసరం. ఇవి నల్లటి బోరోసిలికేట్ గాజుతో పొరలుగా ఉన్న అధునాతన సిలికా-ఆధారిత సిరామిక్స్‌తో నిర్మిస్తారు. దీనిలో వేసే ముడి పదార్థం నుంచి తుది ఉత్పత్తికి చేరుకునే ప్రక్రియకు సుమారు 40 గంటలు పైనే పడుతుందట. ఈ బేకరీ ప్రతిరోజు వేలాది టైల్స్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఆ పేరే ఎందుకంటే..ఇక్కడ టైల్స్ కఠినమైన బేకింగ ప్రక్రియకు లోనవ్వుతాయి కాబట్టి. బ్రెడ్‌ను తయారు చేసినట్లుగానే ఈ ప్రత్యేకమైన టైల్స్‌ని అధిక ఉష్ణోగ్రత వద్ద సంపూర్ణ ఏకరీతి నిర్మాణాంలోకి వచ్చేలా చేస్తారు. ఇదంతా ఎందుకంటే.. అంతలా చేస్తేనే అంతరిక్ష ప్రయాణాన్ని సరసమైన ధరలో లభించేలా చేసేందుకు దోహదపడుతుంది ఇది ఎలాన్ మస్క్ కలల వెంచర్. అలాగే ఈ స్టార్షిప్ని ఇంతల బేక్ చేయడం వల్లే చంద్రుడు, భూమి, అంగారక గ్రహాలపై బహుళ రీ ఎంట్రీలు, ల్యాండింగ్‌లు నావిగేట్ చేసేటప్పుడూ తీవ్ర ఉష్ణోగ్రతలను ఈజీగా తట్టుకుంటుందట. Our fully automated bakery in Florida is setup to produce thousands of heat shield tiles per day to outfit the coming fleet of Starship vehicles pic.twitter.com/9Ki278wakx— SpaceX (@SpaceX) October 13, 2025 (చదవండి: తొలి ప్రయత్నంలోనే సివిల్స్‌లో సక్సెస్..కానీ ఐఏఎస్ వద్దని..) -
Viral Video: విచారణ లైవ్ లో మహిళతో జడ్జీ ముద్దులాట
-
ఏకంగా 200 రకాల వెరైటీ సమోసాలు..! ఎక్కడంటే..
సమోసా అంటే ఎవరికి ఇష్టం ఉండదు. వేడివేడి చాయ్‌తో ఆరగించే స్నాక్ ఐటెం అది. ఈ చిరు తిండిని బంగాళ దుంప మసాల, లేదా బఠానీలతో క్రిస్పీగా అందించడం విన్నాం. బంగారు త్రిభుజాకారంలో నోరూరించే ఈ వంటకం భారతీయుల వంటకాలలో అంతర్భాగం. మహా అయితే ఆ సమోసాలో మూడు, నాలుగు రకాల వెరైటీలు చూసుంటాం. కానీ ఏకంగా వందల రకాల వెరైటీ సమోసాలు అందించే ఫుడ్‌స్టాల్ గురించి విన్నారా?. ఔను మీరు వింటుంది నిజమే. నో ఛాన్స్ అనుకోకండి..అన్ని రకాలు అమ్ముతూ నెట్టింట వైరల్ అయ్యాడు ఈవ్యక్తి. ఎక్కడుందంటే ఆ ఫుడ్ స్టాల్.. పంజాబ్‌లో జలంధర్(Jalandhar)లోని వీధిలో ఈ దుకాణం దర్శనమిస్తుంది. అక్కడ ఇన్ని రకాల సమోసా వెరైటీలను(Samosa Varieties) చూడొచ్చు. పది రకాల సమోసాలు విక్రయిస్తేనే..వామ్మో..! అనేస్తాం. కానీ ఇక్కడ ఏకంగా 200 రకాల సమోసాలను అందిస్తున్నారు ఆహారప్రియులకు. అవేంటో చూద్దామా..ముందుగా లేడిఫింగర్ సమోసాతో మొదలై..బీన్స్ సమోసా, పచ్చి అరటి సమోసా, పనీర్ సమోసా, గోబీ సమోసా, సోయా సమోసా, నూడిల్స్ సమోసా, మాకరోని, పుట్టగొడుగులు ఇలా పలు రకాల సమోసాలు దర్శనమిస్తున్నాయి. వాటిని చూడగానే..ఆ రకరకాల సమోసాలు టేస్ట్ చేయగలమా అనే సందేహం తప్పక కలుగుతుంది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. నెటిజన్లు సైతం బ్రో నేను ఆలుతో చేసిన సమోసా తప్ప మరేది ట్రై చేయను అని ఒకరు, బాబోయ్ సమోసాపై ఉన్న ఇష్టాన్ని చంపేశావు కదా అని మరొకరు ఇలా కామెంట్లు చేస్తూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by Foodpandits! (@foodpandits) (చదవండి: చలి పులి వచ్చేస్తోంది..ఆరోగ్యం జాగ్రత్త! హెచ్చరిస్తున్న నిపుణులు) -
పులి: ‘నన్ను పిలవలేదని..నేనే వచ్చేశా’
-
జడ్జీ కక్కుర్తి.. విచారణ లైవ్‌లో మహిళతో రాసలీలలు..
ఉన్నత వృత్తిలో ఉండి పలువురికి మార్గదర్శకంగా ఉండాల్సిన కొందరు వ్యక్తులు అనుచితంగా ప్రవర్తిస్తున్నారు. వారి ప్రవర్తన కారణంగా సోషల్ మీడియాలో, వార్తల్లో నిలుస్తున్నారు. అలాగే, వీరు చేస్తే పనుల కారణంగా ఆ వృత్తికే చెడ్డ పేరు వస్తుంది. ఇంతకీ ఏం జరిగిందంటే..తాజాగా ఓ జడ్జీ.. లైవ్‌లోనే ఒక మహిళతో రాసలీలలు(Judge Viral Video) చేసిన వీడియో బయటకు వచ్చింది. దీంతో, ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటన చండీగఢ్‌లో జరిగినట్టు తెలుస్తోంది. ఈ వీడియో ప్రకారం.. ఆన్లైన్లో కోర్టులో వాదనలు నడుస్తున్నాయి. కేసుల విచారణలో భాగంగా కోర్టుకు లాయర్లు, పోలీసులు వస్తున్నారు. ఈ జడ్జీ కూడా ఆన్లైన్లో కోర్టుకు హజరయ్యారు. తన కేసు విచారణ కంటే ముందే వచ్చి లైవ్‌లో రెడీగా కూర్చున్నాడు. అయితే, ఆయన తన లాప్ టాప్‌లో వీడియో మోడ్‌ను ఆన్ చేసిన సంగతి మర్చిపోయాడు.ఇంతలో ఒక మహిళ.. సదరు జడ్జీ వద్దకు రాగానే.. కాసేపు ఏదో మాట్లాడుకున్నారు. అనంతరం, ఆయన ముద్దులాటకు దిగాడు. మహిళను బలవంతంగా తనవైపునకు లాగి.. ముద్దుపెట్టాడు. వీళ్ల రాసలీలలు.. లైవ్‌లో స్పష్టంగా రికార్డు అయ్యాయి. దీంతో మిగత వారు ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఇంతలో కొంత మంది ఆయనకు ఫోన్ చేసి అలర్ట్ చేసినట్లు సమాచారం. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం కాస్త జరిగిపోయింది. ఈ వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోయింది. దీన్ని చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. జడ్జీలే ఇలా చేస్తే.. ఇంకా న్యాయం కోసం ఎక్కడకు వెళ్లాలని కామెంట్లు చేస్తున్నారు. -
ఓరి దీని వేషాలో... దీనికి ఆస్కార్ పక్కా!
-
ఇదేందీ ఇది.. చనిపోయిన వాళ్లతో జీవించడమా..?! పర్యాటకులు సైతం..
కొన్ని దేశాల్లో ఉండే ఆచారాలు ఎంతలా వింతగా ఉంటాయంటే..వినడానికి నమ్మశక్యం కానంతగా ఉంటాయి. ఇవేమి పద్ధతులు..ఎందుకిలా అని ఆరా తీసినా..వాటి వివరణ సైతం నోరెళ్లబెట్టేలా ఉంటుంది. అచ్చం అలాంటి విచిత్రమైన సంస్కృతే ఇండోనేషియాలోని ఓ తెగ ఆచరిస్తుంది. ఆ కారణంగానే వార్తల్లో నిలిచింది కూడా. అంతేకాదండోయ్ దాన్ని చూసేందుకు పర్యాటకులు సైతం ఎగబడుతున్నారు. పైగా అలాంటి థ్రిల్ కావలంటూ.. మరి వస్తున్నారట టూరిస్టులు. మరి ఇంతకీ అంతలా ఆశ్చర్యపరిచే ఆ ఆచారం కథాకమామీషు ఏంటో సవివరంగా తెలుసుకుందామా..!.కుటుంబంలో ఎవ్వరైన చనిపోతే అంత్యక్రియలు నిర్వహిస్తారు..ఆ తర్వాత జరిగే కార్యక్రమాలు వారి వర్గాల నేపథ్యం అనుసరించి పదకొండు అంతకు మించిన రోజులు కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఇది అత్యంత సర్వసాధారణం. కానీ ఇండోనేషియాలోని దక్షిణ సులవేసి ప్రావిన్స్‌లోనే తానా తోరాజా అనే గిరిజన తెగ మాత్రం అలాచేయరు. చనిపోయిన వారిని మమ్మీలుగా మార్చి వాటితో జీవిస్తారట. అంత్యక్రియలకు కావల్సినంత సొమ్ము సమకూరాక గానీ నిర్వహించరట. పైగా ఆ వారి పూర్వీకుల శవాలను ఎంతో భద్రంగా చూసుకుంటారట. కొత్తబట్టలు తొడిగి, ఆహారాలను కూడా నివేదిస్తారట. వారి కుటుంబంలోకి కొత్తగా వచ్చిన తరాలకు వీటని చూపించి..ప్రతి రెండేళ్లకు ఒకసారి ఆ మమ్మీలను బయటకు తీసి..కొత్త బట్టలు వేయడం, ఆహారం నివేదించడం వంటివి చేస్తారట. ఎందుకిలా అంటే..అక్కడ అంత్యక్రియల తంతు చాలా ఖర్చుతో కూడుకున్నదట. అందువల్ల వారికి వాటిని ఖననం చేయడాని సంత్సరాల తరబడి సమయం పడుతుందట. ఈ ప్రాంతాన్ని సందర్శించిన ఒక ట్రావెలర్ దీని గురించి ఆరా తీయగా.. అందుకు ఏకంగా రూ.4 కోట్లు పైనే ఖర్చు అవుతుందని చెప్పారట ఆ తెగ ప్రజలు. వాళ్లకి అంత్యక్రియలనేవి వేడుకలాంటివట. ఈ తంతు ఐదురోజుల జరుగుతుందట. పైగా ఆ కుటుంట సభ్యుల సంఖ్యను అనుసరించి అంతే సంఖ్యలో గెదెలను, పందులను బలి ఇవ్వాలి. అలాగే వందలాది మంది అతిథులకు ఆతిథ్యం ఇవ్వాలి. దీంతోపాటు చనిపోయిన వారికి ఒక కొత్త స్థలంలో గుడిసెను నిర్మించి అందులో దహన సంస్కారాలు నిర్వహిస్తారట. అందువల్ల అంత డబ్బు సమకూరేంత వరకు వాటిని మమ్మీలుగా మార్చి జాగ్రత్తగా సంరక్షిస్తారట ఆ తెగ ప్రజలు. అప్పటి వరకు ఆ కుటుంబ సభ్యులంతా ఆ శవాలతోనే జీవిస్తారు. చెప్పాలంటే..వాళ్లు తమతో ఉన్నట్లుగానే వాళ్లు వ్యవహరిస్తారట. కాగా, ఇటీవల ట్రావెల్ ఇన్ఫ్లుయెన్సర్ శరణ్య అయ్యర్ ఇండోనేషియా గ్రామాన్ని సందర్శించి..అక్కడ సంస్కృతిని వీడియో రూపంలో నెట్టింట షేర్ చేయడంతో ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక ఆమె తానా తోరాజా ఏజెన్సీ సందర్శించి చనిపోయిన వారి మద్య జీవించడం, వారితో కలిసి ఉండటం వంటి థ్రిల్లింగ్ అనుభవాన్ని పొందానని పోస్ట్‌లో వివరించింది. అంతేగాదు ఈ ప్రత్యేకమైన సంస్కృతిని తిలకించేందుకే పర్యాటకులు ఇక్కడకు తండోపతండాలు తరలి వస్తుంటారని చెప్పుకొచ్చింది. View this post on Instagram A post shared by Sharanya Iyer 🇮🇳 | Travel (@trulynomadly) (చదవండి: ఇటలీలో డీజే ఫెస్టివల్లో మారుమ్రోగిన శివ తాండవస్త్రోతం..!) -
Chittoor District : బాధితుడు దినేష్ సెల్ఫీ వీడియో వైరల్
-
ఆ దంపతుల అభి‘రుచే’ సపరేటు.. అమెరికాలో వడాపావ్ పిక్నిక్కి అదే రూటు
న్యూయార్క్ నగరంలోని మాన్ హట్టన్ లోని సెంట్రల్ పార్క్, ప్రశాంతమైన సరస్సులు, పచ్చని పచ్చిక బయళ్లు, వనాలకు పేరొందింది. ఇక్కడే ఉన్న సెంట్రల్ పార్క్ జూ బెథెస్డా టెర్రస్ వంటి ప్రత్యేక ఆకర్షణలకు కూడా ఇది చిరునామా. అయితే ఇప్పుడు అది మరికొన్ని వైవిధ్యభరిత రుచులకు కూడా చిరునామాగా మారింది. ముఖ్యంగా భారతీయ రుచుల కోసం వెతుకుతున్న ఆహార ప్రియులకు అది తప్పనిసరి సందర్శనీయ స్థలంగా కూడా అవతరించింది. ఈ పార్క్ మధ్యలో తాజాగా తయారుచేసిన వడ పావ్‌ల సువాసన నాసికకు సోకుతుంటే ఆ ఉద్యానవనం మీదుగా వెళ్లే ఇండియన్ రుచుల అభిమానులు ఆగగలరా? ఇంతకీ ఈ పార్క్‌లో మన వంటల మార్క్ ఎలా సాధ్యపడింది?ఈ ప్రశ్నకు సమాధానం న్యూయార్క్‌లో నివసిస్తున్న భారతీయ జంట షౌనక్ శివానీలు మాత్రమే చెప్పగలరు. ఎందుకంటే వారి ప్రత్యేకమైన ’వడ పావ్ ప్రాజెక్ట్’ ఆలోచన దీని వెనుక ఉంది కాబట్టి. మహారాష్ట్రలోనే పుట్టి పెరిగిన వారికి వడా పావ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అలాగే ఆ వంటకం దొరకని ప్రదేశంలో సదరు మహారాష్ట్రీయుల్ని ఉంచడం అంటే వారి జిహ్వకు ఎంత లోటో కూడా చెప్పనక్కర్లేదు. అదే విధంగా ఈ జంట కూడా న్యూయార్క్‌కు వెళ్లాక తమకు ఇష్టమైన స్ట్రీట్ ఫుడ్ ఐటమ్, భారతీయ సంప్రదాయ వంటకాల్లో పేరొందిన వడ పావ్‌ను మిస్ అయ్యారు. మసాలాతో వేయించిన బంగాళాదుంప ముద్దని మృదువైన బన్ లోపల ఉంచి, టాంగీ, స్పైసీ చట్నీలతో చవులూరింపచేసే ఈ వంటకం మిస్ అవడం కన్నా బాధ ఏముంటుంది? అంటూ వాపోయారా దంపతులు.‘ఈ నగరంలో దోసెలు, పానీపురి, కతి రోల్స్( విభిన్న రకాల వెరైటీలను రొట్టెల్లో చుట్టి అందించేవి) అందించే స్టాల్స్ చాలా ఉన్నప్పటికీ, ఇప్పటికీ వడ పావ్ మాత్రం ఇక్కడకి రాలేదు‘ అని శివాని తన అభిమాన వంటకం లేకపోవడం గురించి పంచుకున్నారు. దాంతో ‘మేం పటేల్ బ్రదర్స్(అమెరికాలో భారతీయ ఉత్పత్తులకు పేరొందిన స్టోర్)కు ట్రిప్‌లు వేశాం, మా రెసిపీతో ప్రయోగాలు చేశాం, చట్నీలను తయారు చేసాం ఓ ఫైన్ మార్నింగ్ నుంచి సెంట్రల్ పార్క్‌లో వడ పావ్ పిక్నిక్లను నెలవారిగా నిర్వహించడం ప్రారంభించాం‘ అంటూ వీరు చెబుతున్నారు.వీరి ప్రాజెక్టుకు అక్కడి భారతీయుల నుంచే కాక స్థానికుల నుంచి కూడా మంచి స్పందన వచ్చింది. ‘మేం ఇప్పటికే వందలాది మందికి పైగా వడ్డించాం అందరి ప్రేమ అభిప్రాయాలకు చాలా కృతజ్ఞతలు. ఇకపై మా నెలవారీ కార్యక్రమాలను మరింత ఉత్సాహఃగా కొనసాగించాలని ఆశిస్తున్నాం‘ అని వారు అంటున్నారు. వీరి రుచుల పిక్నిక్ ఆన్ లైన్ లో కూడా అనేకమందిని ఆకర్షించింది, నెటిజన్లు ఎందరో ఈ ప్రయత్నాన్ని ప్రశంసించారు. ‘అద్భుతం అని ఒకరంటే..‘‘ మాకు కూడా చికాగోలో ఒకటి అవసరం’’ అని మరొకరు, ‘ఓరి దేవుడా, ఇది ఎప్పటి నుంచో నా మనసులో ఉంది. ఇప్పటికి నిజమవడం చూసి చాలా సంతోషంగా ఉంది’’ అని ఇంకొకరు వ్యాఖ్యానించారు. ‘‘ ఈ నగరానికి ఖచ్చితంగా వడ పావ్ అవసరం. ఇక్కడ మిలియన్ బేకరీలు ఉన్నప్పటికీ, ప్రపంచంలోని ఏ బ్రెడ్ ముంబై పావ్‌తో సరిపోలదు‘ అంటూ ఒక వడ పావ్ ప్రేమికుడు సగర్వంగా ఆన్లైన్లో తన అభిప్రాయం పంచుకున్నారు. ఒక భోజన ప్రియుడు మరింత ముందుకెళ్లి ‘అమెరికాలో ప్రతి మూలలో తాజా వడా పావ్, దబేలి, భేల్పురి చాట్ అవసరం’’ అంటూ తేల్చేశాడు. View this post on Instagram A post shared by The Vada Pav Project (@thevadapavproject) (చదవండి: Success Story: అతను ఐఐటీ, ఐఐఎం గ్రాడ్యుయేట్ కాదు..కానీ సంపదలో అదానీ రేంజ్..!) -
ఖరీదైన స్టంట్.. అదిరింది ట్విస్ట్!
బండితో రోడ్డెక్కితే చాలు కొంత మంది సినిమాల్లో హీరోల్లా ఫీలైపోతున్నారు. తమ చేతిలోని వాహనాలతో ప్రమాదకర ఫీట్లు చేస్తూ తోటి వాహనదారులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. తాము ఉన్నది రహదారులపై అని మరిచిపోయి మితిమీరిన విన్యాసాలతో జనాన్ని బెంబేలెత్తిస్తున్నారు. థ్రిల్ కోసమే, ఫేమ్ కోసమే ఇలాంటి ఫీట్లు చేస్తూ ఒక్కోసారి ప్రాణాలకు మీదకు తెచ్చుకుంటున్నారు. ఇలాంటి వీడియో ఒకటి తాజాగా గ్రేటర్ నోయిడాలో (Greater Noida) బయటకు వచ్చింది. ఈ వీడియో వైరల్ కావడంతో పోలీసులు వెంటనే స్పందించి.. ఓవరాక్షన్ చేసిన వ్యక్తి తిక్క కుదిర్చారు.వీడియోలో ఏముందంటే..మెయిన్ రోడ్డులో వేగంగా దూసుకుపోతున్న కారు.. కొంచెం దూరం వెళ్లాక సడన్‌గా రివర్స్ తిరుగుతుంది. మరొక కారులోని వీడియో ద్వారా దృశ్యాన్ని రికార్డు చేశారు. అదే కారు మళ్ళీ అదే స్టంట్ చేసి.. ఓ రెసిడెన్షియల్ సొసైటీ పార్కింగ్‌లోకి వేగంగా దూసుకెళ్లి ఆగుతుంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ (Viral) కావడంతో గ్రేటర్ నోయిడా ట్రాఫిక్ పోలీసులు స్పందించారు. కారుతో ప్రమాదకర విన్యాసాలు చేసిన వ్యక్తికి 57,500 రూపాయల జరిమానా విధించారు. నిర్లక్ష్యంగా, ప్రమాదకరంగా వాహనం నడిపినందుకు ఈ జరిమానా వేశారు."గ్రేటర్ నోయిడా రోడ్లపై ఓ వ్యక్తి కారుతో విన్యాసాలు చేశాడు. నోయిడా ట్రాఫిక్ పోలీసులు చర్య తీసుకుని రూ. 57,500 జరిమానా విధించారు. నోయిడా ట్రాఫిక్ పోలీసులు మంచి పని చేశారని" పేర్కొంటూ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో ఈ వీడియోను షేర్ చేశారు. దీన్ని పోలీసులు ధ్రువీకరించారు. ఫిర్యాదును పరిగణనలోకి తీసుకుని చర్యలు చేపట్టినట్టు వెల్లడించారు. ట్రాఫిక్ నిబంధనలను (Traffic Rules) ఉల్లంఘించినందుకు సంబంధిత వాహనంపై నిబంధనల ప్రకారం ఈ-చలాన్ (రూ. 57,500/- జరిమానా) జారీ చేయడం జరిగిందన్నారు.సోషల్ మీడియా స్పందనఈ వ్యహారంపై సోషల్ మీడియాలో నెటిజనులు పలు రకాల వ్యాఖ్యలు చేశారు. "ఖరీదైన స్టంట్'' అని ఒక నెటిజన్ (Netizen) కామెంట్ చేశారు. జరిమానా విధించకుండా.. కారును స్వాధీనం చేసుకోవాల్సింది. ప్రమాదకర విన్యాసాలు చేసిన వ్యక్తికి కర్రలతో బడితపూజ చేసి.. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయాలి. అప్పుడే ఇలాంటి వారు గుణపాఠం నేర్చుకుంటారని మరొక నెటిజన్ వ్యాఖ్యానించారు.చదవండి: 'బెడ్రూంలో సీక్రెట్ కెమెరా పెట్టి.. గలీజు పనులు'''ఇలాంటి వారికి ప్రతిరోజూ ఇది మామూలే. ఆల్ఫా 2 మార్కెట్ చుట్టూ నేను ప్రతిరోజూ ఇలాంటి డ్రైవర్లను చూస్తుంటాను. గ్రేటర్ నోయిడాలో ట్రాఫిక్ నియమాలను ఎలా జోక్‌గా చూస్తారో చూసి నేను ఆశ్చర్యపోతుంటాను. యూపీ అంతటా ఇలాంటి సమస్య ఉందని అనుకుంటున్నాను. నేను బెంగళూరులో (Bengaluru) ఉన్నప్పుడు ఇలాంటి ర్యాష్ డ్రైవింగ్‌ను ఎప్పుడూ చూడలేదు. ఇది ప్రధానంగా పౌర సమస్య అయినప్పటికీ, మరి పోలీసింగ్ మాట ఏమిటి?'' అంటూ మరో నెటిజన్ వాపోయారు.A guy performed stunts with his car onthe streets of Greater Noida. 🚗💨Noida Traffic Police took action and imposed a fine of ₹57,500.Good Job, @Noidatraffic 👏👏 pic.twitter.com/Qn1nmGpmJj— Greater Noida West (@GreaterNoidaW) October 10, 2025 -
భార్య కోసం బ్రిటిష్ వ్యక్తి కర్వా చౌత్ ఉపవాసం..! పాపం చంద్రుడి దర్శనం కోసం..
ఆశ్వయుజ మాసం పౌర్ణమి తర్వాత వచ్చే మూడో రోజుని దక్షిణ భారతదేశంలో అట్లతద్దిగా జరుపుకుంటే ఉత్తర భారతదేశంలో పౌర్ణమి తర్వాత నాల్గవ రోజు.. చవితి తిధి నాడు కర్వాచౌత్ పండుగ జరుపుకుంటారు. ఈ రెండు పర్వదినాలు, వివాహితులకు, కన్నెపిల్లలకు ప్రత్యేకం అనే చెప్పాలి. ఆ రోజు కన్నెపిల్లలు మంచి వరడు కోసం, పెళ్లైన స్త్రీలు తమ భర్త క్షేమం కోసం పచ్చి మంచినీళ్లు కూడా ముట్టకుండా ఉపవాసం ఉంంటారు. సాయంత్రం చంద్ర దర్శన అనంతరం విరమిస్తారు. కానీ ఉత్తర భారతదేశంలో మాత్రంలో చంద్ర దర్శనాన్ని భర్త సమక్షంలో సందర్శించి ఉపవాసాన్ని విరమించడం విశేషం. అయితే ఈ పండుగ భారతీయ విశిష్ట సంస్కృతికి ప్రతీకగా ప్రజలు విభిన్న రకాలుగా జరుపుకుంటారు. అయితే ఇప్పుడు ఇదంతా ఎందుకంటే..ఈ ఆచారాన్ని ఓ విదేశీయుడి ఆచారించిన ఘటన నెట్టింట వైరల్‌గా మారింది. బ్రిటిష్ కంటెంట్ క్రియేటర్ నిక్ బుకర్ తన భార్య కోసం ఉపవాసం ఉండటం సోషల్ మీడియాలో వైరల్‌గా మారడమే కాదు హాట్‌టాపిక్‌గా మారింది. భారతచరిత్రకు సంబంధించిన ఆసక్తికర విషయాలను సదా షేర్ చేసుకునే నిక్ బుకర్ "మై డెస్పరేట్ కర్వా చౌత్ సెర్చ్ ఫర్ ది మూన్" అనే వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఆ వీడియోలో నిక్ తన భార్యతో కలిసి ఈ పండుగను జరుపుకున్నానని, ఉపవాసం కూడా ఉన్నట్లు వెల్లడించాడు. ఆయన ముంబైలోని జుహూ బీచ్ సమీపంలో తన నివాసంలో ఈ పండుగను నిర్వహించి ఉపవాసం ఉన్నారు. అయితే త్వరితిగతిన చంద్రుడిని సందర్శించేందుకు ముంబై నుంచి ఢిల్లీ వచ్చి..అక్కడ లోధి హోటల్ నుంచి చంద్రుడిని చాలా త్వరితగతిన సందర్శించి తన భార్యతో కలిసి ఉపవాసం విరమించినట్లు తెలిపాడు. అంతేగాదు కర్వా చౌత్‌ను ఎందుకు జరుపుకుంటారు చాలా చక్కగా వివరించి భారతీయులందరి మనసులను గెలుచుకున్నాడు. చివరగా ఆ వీడియోలో ఈ రోజు ఉపవాసం ఉన్నవారందరికీ శుభాకాంక్షలు అని చెప్పాడు. అయితే నెటిజన్లంతా మా భారతీయ సంస్కృతిని హృదయపూర్వకంగా స్వీకరించినందుకు ధన్యవాదాలు, అలాగే మీరు మీ కుటుంబం ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో ఉండాలని నిక్ని ఆశీర్వదిస్తూ..పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by IndoGenius | Nick Booker (@indogenius) (చదవండి: 'ఖతర్నాక్ మొక్కలు'..! వీటి టక్కు టమారాలకు విస్తుపోవాల్సిందే..!) -
గిల్‌పై అసహనం!.. తలబాదుకున్న జైస్వాల్.. తప్పు నీదే!
వెస్టిండీస్‌తో రెండో టెస్టులో భారీ శతకంతో కదంతొక్కిన టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ (Yashasvi Jaiswal) డబుల్ సెంచరీ చేసే అవకాశాన్ని చేజార్చుకున్నాడు. శనివారం నాటి రెండో రోజు ఆట ఆరంభమైన కాసేపటికే రనౌట్ అయ్యాడు. ద్విశతకానికి పాతిక పరుగుల దూరంలో నిలిచిపోయాడు.ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ (WTC) 2025-27 సైకిల్లో భాగంగా భారత్- వెస్టిండీస్ (IND vs WI) మధ్య రెండు మ్యాచ్‌ల సిరీస్ జరుగుతున్న విషయం తెలిసిందే. అహ్మదాబాద్‌లో జరిగిన తొలి టెస్టులో ఇన్నింగ్స్ 140 పరుగుల తేడాతో విండీస్‌ను చిత్తు చేసిన టీమిండియా.. 1-0తో ఆధిక్యంలో ఉంది.తొలిరోజు భారత్దేఈ క్రమంలో ఇరుజట్ల మధ్య ఢిల్లీ వేదికగా శుక్రవారం రెండో టెస్టు మొదలుకాగా.. టాస్ గెలిచిన టీమిండియా తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్లలో కేఎల్ రాహుల్ (38) విఫలం కాగా.. యశస్వి జైస్వాల్ భారీ శతకం బాదాడు. అతడికి తోడుగా వన్‌డౌన్ బ్యాటర్ సాయి సుదర్శన్ (Sai Sudharsan- 87) రాణించాడు.జైసూ డబుల్ సెంచరీ మిస్ఈ క్రమంలో తొలిరోజు ఆట ముగిసే సరికి భారత్ రెండు వికెట్ల నష్టానికి 318 పరుగులు చేసింది. జైస్వాల్ 173, కెప్టెన్ శుబ్‌మన్ గిల్ 20 పరుగులతో క్రీజులో నిలిచారు. ఇక శనివారం ఆట సందర్భంగా డబుల్ సెంచరీ పూర్తి చేసుకోవాలని భావించిన జైస్వాల్ తన తొందరపాటు చర్యతో రనౌట్ అయ్యాడు.గిల్ తప్పా?టీమిండియా తొలి ఇన్నింగ్స్ 92వ ఓవర్లో విండీస్ పేసర్ జేడన్ సీల్స్ బంతితో రంగంలోకి దిగాడు. అతడి బౌలింగ్‌లో రెండో బంతికి మిడాఫ్ దిశగా జైసూ బాదిన బంతి నేరుగా ఫీల్డర్ చెంతకు చేరింది. అయితే, ఇంతలోనే జైస్వాల్ పరుగు కోసం క్రీజు వీడగా.. గిల్ మాత్రం పరిస్థితికి తగ్గట్టుగా నాన్-స్ట్రైకర్ ఎండ్‌లోనే ఉండిపోయాడు.Yashasvi Jaiswal (runout) seems to have developed a habit of taking off for a run even when the ball goes straight to the fielder. He really needs to learn from this —When you're on a big score, what's the rush for a single? 🤦♂️pic.twitter.com/asdamXT1zj— Sporttify (@sporttify) October 11, 2025 తల బాదుకున్న జైసూదీంతో జైస్వాల్ వెనక్కి పరిగెత్తగా.. అప్పటికే ఫీల్డర్ నుంచి బంతిని అందుకున్న వికెట్ కీపర్ టెవిన్ ఇమ్లాచ్ దానిని వికెట్లకు గిరాటేశాడు. ఫలితంగా తన ఓవర్‌నైట్ స్కోరుకు కేవలం రెండు పరుగులు జతచేసి రనౌట్‌గా వెనుదిరిగాడు. ఈ క్రమంలో తీవ్ర నిరాశకు గురైన జైసూ.. కోపంలో తలబాదుకుంటూ క్రీజును వీడాడు.తప్పు నీదేఇందుకు సంబంధించిన దృశ్యాలు వైరల్ అవుతుండగా.. కొంతమంది గిల్‌ను తప్పుబడుతున్నారు. అయితే, చాలా మంది మాత్రం.. ‘బంతి ఫీల్డర్ చేతుల్లోకి వెళ్లినా తొందరపడి పరుగుకు రావడం జైసూ తప్పు. అతడికి ఇదొక అలవాటుగా మారింది. 175 పరుగులు చేసిన నీకు ఈ రిస్కీ సింగిల్ అవసరమా? ఇది నీ స్వీయ తప్పిదం’’ అంటూ జైస్వాల్‌ను విమర్శిస్తున్నారు.కాగా జైస్వాల్ తొలి ఇన్నింగ్స్‌లో మొత్తంగా 258 బంతులు ఎదుర్కొని 22 ఫోర్ల సాయంతో 175 పరుగులు సాధించాడు. వంద ఓవర్ల ఆట పూర్తయ్యేసరికి టీమిండియా మూడు వికెట్ల నష్టానికి 371 పరుగులు చేసింది. గిల్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోగా.. ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన నితీశ్ కుమార్ రెడ్డి 20 పరుగులతో క్రీజులో ఉన్నాడు. చదవండి: యువీ తల్లిని పెళ్లి చేసుకుని తప్పు చేశా.. ఆమెను ఇంట్లో పెట్టి తాళం వేసేవాడిని! -
నిజమే!.. ‘ప్రియురాలి’తో హార్దిక్ పాండ్యా.. వీడియో వైరల్
టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ప్రస్తుతం క్రికెట్‌కు దూరంగా ఉన్నాడు. ఆసియా టీ20 కప్-2025 సందర్భంగా గాయపడిన అతడు.. ఆస్ట్రేలియా పర్యటనకు కూడా దూరమయ్యాడు.ఈ క్రమంలో తనకు దొరికిన విరామ సమయాన్ని హార్దిక్ పాండ్యా ‘ప్రియురాలి’తో గడుపుతున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ బరోడా ఆల్‌రౌండర్ గతంలో నటాషా స్టాంకోవిక్ అనే సెర్బియా మోడల్‌తో ప్రేమలో పడిన విషయం తెలిసిందే. పెళ్లికి ముందే కుమారుడు అగస్త్యకు ప్రాణం పోసిన ఈ జంట.. కోవిడ్ సమయంలో అత్యంత సన్నిహితుల నడుమ దండలు మార్చుకున్నారు.కుమారుడు జన్మించిన మూడేళ్లకు అంటే.. 2023, ఫిబ్రవరి 14న ఉదయ్‌పూర్‌లో హార్దిక్- నటాషా మరోసారి ఘనంగా వివాహం చేసుకున్నారు. హిందూ- క్రిస్టియన్ సంప్రదాయాల ప్రకారం మరోసారి పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. అయితే, ఆ తర్వాత ఏడాదికే విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించి అభిమానులకు షాకిచ్చారు.విడాకులు తర్వాత హార్దిక్- నటాషా కుమారుడు అగస్త్య బాధ్యతను సమంగా పంచుకుంటున్నారు. ఇదిలా ఉంటే.. నటాషాతో విడాకుల తర్వాత హార్దిక్.. సింగర్ జాస్మిన్ వాలియాతో ప్రేమలో పడినట్లు ప్రచారం జరిగింది. అయితే, ఆమెతోనూ కటీఫ్ చెప్పిన హార్దిక్.. మోడల్ మహీక శర్మతో డేటింగ్ చేస్తున్నట్లు ఇటీవల వార్తలు వినిపించాయి.ఇందుకు బలం చేకూరుస్తూ మహీకతో కలిసి ఒకే కారులో ముంబై ఎయిర్‌పోర్టుకు వచ్చిన హార్దిక్.. ఆమె చేయిని పట్టుకుని ముందుకు నడిపించాడు. ఆ సమయంలో ఇద్దరూ నలుపు రంగు వస్త్రాల్లో.. ఒకే రకమైన జాకెట్ ధరించి.. వైట్ షూస్ వేసుకుని ట్విన్నింగ్ లుక్‌తో కనిపించారు.ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన నెటిజన్లు.. ‘‘ఇద్దరూ ఒకేలా ఉన్నారే’’ అంటూ ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు. మరికొందరేమో విడాకుల సమయంలో నటాషాను అనవసరంగా తప్పుబట్టామని.. హార్దిక్‌ను వెనకేసుకువచ్చిన వాళ్లు ఇప్పుడు సమాధానం చెప్పాలంటూ కామెంట్లు చేస్తున్నారు.కాగా 2016లో టీమిండియా తరఫున అరంగేట్రం చేసిన 31 ఏళ్ల హార్దిక్ పాండ్యా.. ఇప్పటి వరకు 11 టెస్టులు, 94 వన్డేలు, 120 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. ఈ రైటార్మ్ పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్.. టెస్టుల్లో 532, వన్డేల్లో 1904, టీ20లలో 1860 పరుగులు సాధించడంతో పాటు.. ఆయా ఫార్మాట్లలో 17, 91, 98 వికెట్లు తీశాడు. View this post on Instagram A post shared by Instant Bollywood (@instantbollywood) -
అయ్యో పెళ్లికొడుకా.. ఎంతపనైపాయే, ఇజ్జత్ పాయే!
-
హ్యాపీగా ఏసీ కోచ్‌లో తిష్ట, చూశారా ఈవిడ డబల్ యాక్షన్!
ప్రయాణాల్లో అనేక వింత ఘటనలు చూస్తూ ఉంటాం. కొంతమంది తప్పు తమది అయినా విడ్డూరంగా ప్రవర్తిస్తూ ఉంటారు. టికెట్ లేకుండా ప్రయాణించడమే కాకుండా, అనుచితంగా ప్రవర్తించిన ఘటన నెట్టింట వైరల్‌గా మారింది.బిహార్‌కు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయిని టికెట్ లేకుండానే రైల్లో ప్రయాణిస్తోంది. అదీ ఏసీ కోచ్‌లో టికెట్ లేకుండా ప్రయాణిస్తు న్నప్పుడు తనిఖీ అధికారి టీటికి ట్టుబడింది. అయితే తప్పు ఒప్పుకొని జరిమానా చెల్లించాల్సింది పోయి, ఎదురు దాడికి దిగింది. తాను ప్రభుత్వ టీచర్ననీ, ఇబ్బంది పెడుతున్నావు... కావాలనే, ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశ్యంతో ఇలా చేస్తున్నావు అంటూ అతనిపై మండిపడింది. దానికి "ఇది ఇబ్బంది పెట్టడం కాదు. మీ దగ్గర టిక్కెట్లేదు, గతంలో కూడా ఇలానే టికెట్ లేకుండా ప్రయాణించారని సమాధానం చెప్పాడు టీటీ. అయినా ఆమె ఎక్కడా వెనక్కి తగ్గలేదు. అబద్ధం చెబుతున్నావంటూ ఆయన మీద ఎగిరిపడింది. దీంతో ఈ తతంగాన్నంతా తన మొబైల్లో వీడియో తీయడం మొదలు పెట్టడంతో మరింత ఆగ్రహం వ్యక్తం చేసింది. వీడియో రికార్డింగ్ ఆపేయాలంటూ ఫోన్‌ను లాక్కోవడానికి ప్రయత్నించింది. తన విధులకు ఆటంకం కలగించొద్దు అంటూ ఆయన మళ్లీ మందలించాడు. దీంతో నన్ను వేధిస్తున్నారు అంటూ చివరి అస్త్రం ప్రయోగించింది. ఆతరువాత అక్కడినుంచి మెల్లగా జారుకుంంటూ నువ్వు వేస్ట్ ఫెలోవి అంటూ నోరు పారేసుకుంది. ఇదంతా వీడియోలో రికార్డైంది. Victim Genderpic.twitter.com/CbiKB63sd7— NCMIndia Council For Men Affairs (@NCMIndiaa) October 7, 2025ఈ వీడియో ఆన్లైన్లో చర్చకు దారితీసింది, చాలామంది సోషల్ మీడియా వినియోగదారులు ఆ మహిళ "విక్టిమ్ కార్డు" వాడిందని విమర్శించారు. ప్రభుత్వ టీచర్ అయి ఉండా కూడా టికెట్ లేకుండా ప్రయాణించడం, ముఖ్యంగా తన పని తాను చేసుకుంటున్న టికెట్ ఎగ్జామినర్‌పై మండిపడటం సరికాదని కొందరు విమర్శించారు. -
'హిమాలయన్ ఆంటీ'..ఆమె శిఖరాగ్ర శక్తికి సాటిలేదు!
కసరత్తులు, వర్కౌట్లు చేస్తేనే స్ట్రాంగ్‌గా ఉంటారనుకుంటే పొరబడ్డట్టే. ఎందుకంటే..ఎలాంటి వర్కౌట్లు, శిక్షణ ట్రైనింగ్ లేకుండా ఈ మహిళ అవలీలగా బరువులు ఎత్తి ఔరా అనిపించుకుంది. అంతేగాదు..ట్రెక్కింగ్ వంటి సాహస కృత్యాలు చేసే విదేశీ మహిళ సైతం అంతలా ఆ బరువులను ఎత్తలేకపోయింది. అంతేగాదు ఆమెను చూసి పోటీ అనే పదానికి తావివ్వని శక్తిమంతులు ఈ మహిళలు అని కితాబిచ్చేసింది. ఇంతకీ ఎవరా మహిళ అంటే..ఆమె ఉత్తరాఖండ్‌లోని చమోలీ అనే స్థానిక పహాడి(పర్వత) మహిళ. హిమాలయాల్లో నివశిసించే ఈ మహిళల శక్తి సామర్థ్యాలకు ఎవ్వరైనా ఫిదా కావాల్సిందే. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవ్వుతోంది. ఆ వీడియోకి గెమ్మకోల్లెల అనే విదేశీ మహిళ 'నువ్వు బలవంతుడివని విశ్వసిస్తావు..అది తప్పని నిరూపించేంత వరకు' అనే క్యాష్షన్ జోడించి మరి పోస్ట్ చేసింది. ఆ విదేశీ మహిళ గెమ్మ ఉత్తరాఖండ్‌లోని చమోలిలో నది సమీపంలోని ఒక చిన్నగ్రామంలోని ఇద్దరు మహళలు తమ గెదెల కోసం గడ్డికోస్తున్నట్లుగా కనిపించారు. వాళ్లలో ఒక మహిళ సదరు విదేశీ మహిళను చూడటమే గాదు, ఓ సవాలు కూడా విసిరారు. కొంటెగా నవ్వుతూ ఈ గడ్డిమోపు ఎత్తగలవా అని సవాలు విసిరింది స్థానిక హిమాలయన్ ఆంటి. అక్కడంతా ముద్దుగా ఆ మహిళలను అలా పిలుచుకుంటుంటారు. అయితే ట్రెక్కింగ్‌కి వెళ్లే అనుభవం ఉన్న విదేశీ మహాళ గెమ్మకి అదేమంతా పెద్ద కష్టమైన విషయం కాదు. ఎందుకంటే ట్రెక్కింగ్ చేసేటప్పుడు..సుమారు 20 నుంచి 25 కిలోలు దాక బరువులు మోసే అలవాటు ఉంది ఆమెకు. దాంతో అదేమంతా పని అన్నట్లుగా సై అంది విదేశీ మహిళ. ఆ తర్వాత మొదలయ్యాయి..ఆమె కష్టాలు, పాట్లు చూస్తే నవ్వు ఆగదు. కొంచెం కూడా గడ్డిమోపుని ఎత్తలేక నానా అవస్థలు పడింది. కానీ ఈ పర్వతాల్లో నివశించే హిమాలయన్ మహిళ మాత్రం చాలా అలవోకగా ఆ భారీ గడ్డిమోపుని సులభంగా ఎత్తేయడమే కాదు ట్రక్కు వద్దకు నేరుగా తీసుకెళ్లింది కూడా. ఆమె శక్తి సామర్థ్యాలకు ఫిదా అవ్వతూ ఆ మహిళ ఎంతలా అప్రయత్నంగా ఆ గడ్డిమోపుని ఎత్తేసిందంటూ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసింది.అస్సలు పోటీ అనేదే ఆమెకు లేదు అంటూ గడ్లల జల్లు కురిపించింది సదరు విదేశీ మహిళ. అయితే నెటిజన్లు..హిమాలయల ఇళ్లకు వెన్నముక ఈ స్త్రీలు. సగటు పర్వతపు మహిళ దినచర్య ఇదేనని అభినందన జల్లు కురిపిస్తున్నారు. పైగా ఆమె చాలా క్యాజువల్‌గా పహాడి కండరాలను వంచు తోందంటూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by Gemma Colell (@indra.creativa) View this post on Instagram A post shared by Gemma Colell (@indra.creativa) (చదవండి: Success Story: ఐఏఎస్‌గా సెక్యూరిటీ గార్డు కుమార్తె..! హిందీ మాధ్యమంలో టాపర్‌గా..) -
చనిపోయిన మహిళ లేచి వచ్చింది.. దెబ్బకి షాకైన జనం
-
విడాకులను సెలబ్రేట్ చేసుకున్న తల్లీ కొడుకులు, కొడుక్కి పాలాభిషేకం
విడాకులు (Divoce) అంటేనే అదేదో వినకూడని మాటలాగా, కళంకం అన్న భావన మన సమాజంలో పాతుకుపోయింది. కానీ మనస్ఫర్తలతో, ఒకర్నొకరు ద్వేషించుకుంటూ, తీవ్ర ఒత్తిడిలో జీవించడం కంటే.. అభిప్రాయాలు కలవన్నప్పుడు, విభేదాలు తారాస్థాయికి చేరినప్పుడు.. స్త్రీపురుషులిద్దరూ పరస్పర అంగీకారంతో విడిపోవడమే మేలు అనేది నేటి మాట. విడాకులు అనేవి అటు మహిళలకుగానీ, ఇటు పురుషులకు గానీ జీవితంలో ఒక ముగింపు కాదని ఒక కొత్త ప్రారంభమని తెలియజేసే ఘటనలో గతంలో కూడా చూశాం. గతంలో యూపీకి చెందిన అనిల్ కుమార్ అనే రిటైర్డ్ ఉద్యోగి, విడాకులు తీసుకున్న తన కూతురు ఉర్విని బారాత్ ఊరేగించి, ఘనంగా ఇంటికి స్వాగతం పలికిన ఘటన నెట్టింట తెగ సందడి చేసింది. తాజాగా ఢిల్లీలో జరిగిన ఉదంతం పలువుర్ని ఆలోచింప జేస్తోంది. విడాకులిచ్చిన కొడుక్కి పాలాభాషేకం, కొత్తబట్టలిచ్చి.. కొత్త జీవితానికి నాంది పలకమని ఆశీర్వదించింది. దీనికి సంబంధించిన వీడియో ఇపుడు హాట్ టాపిక్. స్టోరీ ఏంటి అంటే..ఢిల్లీకి చెందిన డీకే బిరాదర్, భార్యకు విడాకులిచ్చాడు. ఆ తర్వాత అతని తల్లి కొడుక్కి పాలాభిషేకం చేసింది. పాత ఆలోచనలను మర్చిపొమ్మనే సంకేతంగా శుద్ధిగా సంకేతంగా భావించే పాలతో కొడుకుని శుద్ధి చేసింది. అనంతరం కొత్త పెళ్లి కొడుకులా ముస్తాబయ్యాడు అతను. బట్టలు, షూ, వాచీ.. ఇలా అన్నీ కొత్తవే అతనికిచ్చింది. అంతేకాదు ‘హ్యాపీ డివోర్స్’ కేక్ కట్ చేసి పెద్ద సంబరమే చేసుకున్నాడు. ఇక్కడ ఇంకో విషయం ఏమిటంటే కేక్ పై భార్యకు భరణంగా ఇచ్చింది కూడా రాయడం. అంటే ‘120 గ్రాముల బంగారం, 18 లక్షల డబ్బుతో లభించిన అని అర్థం వచ్చేలా ‘హ్యాపీ డివోర్స్’ అని రాసి ఉండటం గమనార్హం. ఈ కేక్ కట్ చేసి తల్లికి తినిపించి, తానూ తినిపించాడు సంతోషంగా. ఈ వీడియో ఇన్‌స్టాలో వైరల్ అయ్యింది.చదవండి: నో అన్న గూగుల్లోనే కీలక పదవి.. ఎవరీ రాగిణీ? Man celebrates divorce with ritual, sweets, and a cake reading “Happy Divorce 120g gold 18L cash.” sharing a caption: “I’m single, happy, free my life, my rules.” Urges others to celebrate themselves.pic.twitter.com/Rrhhlpqoqx— Ghar Ke Kalesh (@gharkekalesh) October 7, 2025 ‘‘120 గ్రాముల బంగారం, రూ.18 లక్షలు తీసుకోలేదు. కానీ నేను ఇచ్చాను.. ఇప్పుడు సంతోషంగా, స్వేచ్ఛగా ఉన్నాను’’అని పేర్కొన్నాడు. ఈ వీడియో నెట్టింట తీవ్ర చర్చకు దారితీసింది. నెటిజన్లు విభిన్నంగా స్పందించారు. వెడ్డింగ్ స్వీట్స్ టూ డివోర్స్ ట్రీట్స్ అని కొందరు, ఏమైనా గానీ మొత్తానికి బతికే ఉన్నాడు అనికొందరు కమెంట్ చేశారు. జీవితంలోతీవ్ర ఒత్తిడితో సఫర్ అయ్యి, చివరకు ఆ ఒత్తిడి నుండి ఉపశమనం వచ్చినపుడు జీవితాన్ని ఆస్వాదించాలని కోరుకుంటారు. బహుశా విడాకుల తర్వాత ఈ బ్రో ఒత్తిడి తగ్గిపోయి ఉండవచ్చు -అందుకే నిజంగా సంతోషంగా ఉన్నాడని మరొకరు వ్యాఖ్యానించారు. -
వీడియో: 18వేల అడుగుల ఎత్తు! సెల్ఫీ తీయబోతే పట్టు తప్పి..
సెల్ఫీ మోజు.. ఓ పర్వతారోహకుడి ప్రాణం బలి తీసుకుంది(Selfie Death). ఏకంగా 18వేల అడుగుల ఎత్తైన శిఖరాన్ని అధిరోహించే క్రమంలో ఆ వ్యక్తి పెద్ద పొరపాటు చేశాడు. తోటి బృందంతో సెల్ఫీ కోసమని కట్టుకున్న తాడును విప్పదీసుకున్నాడు. అదే.. అతని మరణానికి కారణమైంది. చైనా సిచువాన్‌లోని మౌంట్ నామా(Mount Nama) శిఖరంపై(ఎత్తు: 5,588 మీటర్లు.. సుమారుగా 18,300 అడుగులు) ఓ బృందం ట్రెక్కింగ్ చేస్తోంది. ఆ సమయంలో ఓ హైకర్.. సేఫ్టీ రోప్‌ను విప్పేసి సెల్ఫీ కోసం ప్రయత్నించాడు. అయితే పట్టు తప్పి దొర్లుకుంటూ పడిపోయాడు. అలా.. 200 మీటర్లు(656 మీటర్లు) జారిపడి మృతి చెందాడు. ఆ సమయంలో తోటి బృందంలోని సభ్యులు నిస్సహాయంగా చూస్తూ ఉండిపోవాల్సి వచ్చింది.మృతుడ్ని 31 ఏళ్ల హాంగ్గా గుర్తించారు. రక్షణ బృందాలు అతన్ని కాపాడే ప్రయత్నం చేయగా.. అప్పటికే అతని ప్రాణం పోయింది. అతికష్టం మీద స్వాధీనం చేసుకున్న హాంగ్ మృతదేహాన్ని.. గోంగ్గా మౌంటెన్ టౌన్‌కు తరలించారు. సెల్ఫీ కోసం తన సేఫ్టీ రోప్ తీసేయడం.. ఐస్ యాక్స్ లేకపోవడంతో కాళ్లకు ఉన్న క్రాంపాన్ బూట్లు మంచుపై జారి ఈ ఘోరం జరిగిందని అధికారులు తెలిపారు. ఇదిలా ఉంటే.. హంగ్ మంచు కొండలు ఎక్కడం ఇదే తొలిసారి అని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఈ ఘటన సెప్టెంబర్ 25న చోటుచేసుకోగా, వీడియో సోషల్ మీడియాలోMount Nama Viral Video వైరల్ అవుతోంది. Terrifying Footage Shows Tourist Sliding To His Death After Taking A Selfie On Mount Nama Feng In Sichuan, 🇨🇳He reportedly unclipped his safety harness to take a picture, but slipped on the ice and was sent plummeting into the abyss - to the horror of fellow climbers. pic.twitter.com/Z4Wa5esHlT— sanjay patel (@Sanjaypatel12Dr) October 3, 2025 ఇదిలా ఉంటే.. హంగ్‌తో పాటు వెళ్లిన బృందం ఎలాంటి అనుమతులు లేకుండానే శిఖరాన్ని అధిరోహించే ప్రయత్నం చేసిందని అధికారులు వెల్లడించారు. అయితే అతను ప్రొఫెషనల్ కాదని, అరుదుగా కొండలెక్కిన అనుభవం మాత్రమే ఉందని సిచువాన్ మౌంటెనీరింగ్ అసోషియేషన్ అంటోంది.ఇదీ చదవండి: మీరు తినగా వదిలేసిన ఆహారం ఏమవుతుందో తెలుసా? -
84 ఏళ్ల వయసులో తల్లి, కూతురి వయసు మాత్రం అడక్కండి: గుర్తుపట్టారా!
ప్రముఖ యాంకర్ సుమ కనకాల గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఏళ్ల తరబడి టీవీ షోలలో తన యాంకరింగ్‌తో అలరిస్తోంది. ఒక్క చేత్తో టీవీ షోలు, మరో చేత్తో సినిమా ఈవెంట్లు, విదేశీ టూర్లతో నిరంతరం బిజీగానే ఉంటుంది. అందర్నీ మెప్పించే వాక్చాతుర్యం, ఛలోక్తులు, ఎక్కడలేని ఎనర్జీతో అభిమానుల విశేషాభిమానం, పాపులారిటీతో పాటు చేతి నిండా సంపాదనే. ఇది చాలదన్నట్టు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్‌గా ఉంటూ అభిమానులకు ప్రేరణగా నిలుస్తూ ఉంటుంది.తాజాగా 84 ఏళ్ల తన మాతృమూర్తి వీడియోను ఇన్స్టాలోప్టె్ చేసింది. దీంతో ఇది అభిమానుల మనసు దోచుకుంటోంది.నెట్టింట వైరల్ అవుతున్న ఈ వీడియోలో సుమ తల్లి 84 వయస్సులో కూడా ఎక్సర్సైజ్లు చేస్తూ ఉండటం విశేషం. ‘84 ఏళ్ల మదర్, వెర్సస్ డాటర్’ అనే క్యాప్షన్‌తో సమ వీడియో పోస్ట్ చేసింది. అయితే 84 ఏళ్ల వయసులో తల్లి అంటూ తల్లి వయసు చెప్పింది గానీ, తన వయసు మాత్రం చెప్ప లేదు. పైగా మీకు తోచినంత అని చమత్కరించింది. View this post on Instagram A post shared by Suma Kanakala (@kanakalasuma)ఈ ఏజ్‌లో కూడా అమ్మ ఫిట్నెస్ గ్రేట్ అని నెటిజన్లు కామెంట్స్ చేయగా, మీ ఏజ్ 62, 28 ..48? అంటూ మరికొందరు ఫన్నీగా కమెంట్స్ చేశారు. -
సెంట్రల్ జైల్లో రౌడీ బర్త్‌డే.. వీడియో వైరల్
సెంట్రల్ జైలు అంటే ఎంత సెక్యురిటీ ఉంటుందో అందరికీ తెలిసింది. కారాగారంలో ఉన్నవారిని కలవాలంటే చాలా తతంగం ఉంటుంది. ఏదైనా తీసుకెళ్లాలన్న కూడా చాలా రూల్స్ ఉంటాయి. అలాంటిది సెంట్రల్ జైలులో ఏకంగా ఓ రౌడీ తన అనుచరులతో కలిసి బర్త్ డే సెలబ్రేట్ చేసుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో బయటకు రావడంతో జైలు అధికారులు దిద్దుబాటు చర్యలు చేపట్టారు. ఇదంతా ఎలా జరిగిందో విచారణ చేపడతామని చెబుతున్నారు.బెంగళూరు పరప్పణ అగ్రహార సెంట్రల్ జైలులో ఈ ఘటన వెలుగు చూసింది. అండర్ ట్రయల్ ఖైదీగా ఉన్న రౌడీ షీటర్ శ్రీనివాస అలియాస్ గుబ్బచ్చి సీనా (Gubbachhi Seena) కేక్‌ను కట్ చేసి పుట్టినరోజు జరుపుకున్నాడు. అతడు కేక్ కట్ చేస్తుండగా చుట్టూ ఉన్నవారు చప్పట్లు కొడుతూ, ఈలలు వేస్తూ కనిపించారు. ఆపిల్ పండ్లతో తయారు చేసిన దండను అతడి మెడలో వేశారు. ఈ వీడియోను ఒక ఖైదీ చిత్రీకరించినట్లు తెలుస్తోంది. 50 సెకన్ల నిడివి గల ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తీవ్ర కలకలం రేగింది.వీడియో ఎలా తీశారు?జైలులో రౌడీషీటర్ బర్త్ డే చేసుకోవడమే కాకుండా, దాన్ని సెల్ఫోన్లో వీడియో కూడా తీయడంపై విమర్శలు వస్తున్నాయి. జైలు అధికారుల పనితీరుపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. అంతేకాదు కారాగారం లోపలవున్న తమ వారి భద్రతపై ఖైదీల కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. కాగా, ఈ సంఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. జైలు నిబంధనల ప్రకారం మొబైల్ ఫోన్లకు అనుమతి లేదు. ఖైదీ వీడియోను ఎలా రికార్డ్ చేయగలడనే దానిపై కూడా వారు కూపీ లాగుతున్నారు.ఎవరీ సీనా?రౌడీ షీటర్ శ్రీనివాస తన ప్రత్యర్థి హత్య కేసులో ప్రధాన ముద్దాయిగా ఉన్నాడు. ఈ ఏడాది జనవరిలో బెంగళూరులోని దొడ్డ బొమ్మసంద్రలో తన ప్రత్యర్థి వెంకటేష్‌ను హత్య చేసినట్లు సీనాపై ఆరోపణలు ఉన్నాయి. ఫిబ్రవరిలో అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ సమయంలో దొరక్కుండా తప్పించుకునేందుకు ప్రయత్నించగా పోలీసులు కాల్పులు జరపడంతో అతడి కాలికి గాయమైంది.Criminals in Comfort Video Shows Rowdy-Sheeter Enjoying Royal Treatment in Karnataka’s Parappana Agrahara JailParappana Agrahara Central Jail is once again under the spotlight, this time for a shocking display of privilege to a rowdy sheeter. Notorious Srinivas, alias Gubbachi… pic.twitter.com/bpdzxGLH19— Karnataka Portfolio (@karnatakaportf) October 5, 2025భాస్కరరావు ఫైర్ఈ వ్యహహారంపై బెంగళూరు మాజీ పోలీసు కమిషనర్, బీజేపీ నేత భాస్కరరావు ఎక్స్‌లో స్పందించారు. 'కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. పరప్పణ అగ్రహార జైలు మళ్ళీ వార్తల్లోకి వచ్చింది. జైలులోకి ఒక భారీ కేక్ ప్రవేశించింది. జైలులో ఉన్న మినీ రౌడీలతో కలిసి ఒక రౌడీ తన పుట్టినరోజును జరుపుకున్నాడు. అంతేకాదు దీన్ని రికార్డ్ చేసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు. కర్ణాటకలో పాలన కుప్పకూలిపోయింది. సీఎం, మంత్రులు పట్టించుకోవడం లేదు. కాంట్రాక్టర్లు ఇప్పుడు అవినీతి గురించి బహిరంగంగా ఏడుస్తున్నారు. ఖాళీలను భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ యువత వీధుల్లోకి వచ్చారు. బెంగళూరు పరిపాలన గుంతలు, చెత్తతో చెత్తగా ఉంది. నలుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు జైలులో ఉన్నారు. శాంతిభద్రతలు క్షీణించాయ'ని ఎక్స్‌లో పోస్ట్ చేశారు. Parrapana Agrahara Jail is in news again !!!!! A massive cake enters the jail and a rowdy with all his incarcerated mini Rowdies celebrate his birthday with total impunity and the same is recorded and uploaded on Social Media…..!!!!!!🤣🤣🤣🤣@DrParameshwara has now abdicated &… pic.twitter.com/DsQxPi4kVj— Bhaskar Rao (@Nimmabhaskar22) October 5, 2025గతంలోనూ.. పరప్పణ అగ్రహార సెంట్రల్ జైలులో గతంలోనూ ఇలాంటి ఘటన జరిగింది. 2020, డిసెంబర్లో రిజ్వాన్ అలియాస్ రౌడీ కుల్లా తన మద్దతుదారులతో కలిసి తన పుట్టినరోజును జరుపుకోవడమే కాక, దాన్నంతా సెల్ఫోన్లో చిత్రీకరించి బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అటాచ్ చేసి మరీ సోషల్ మీడియలో పోస్ట్ చేశాడు. ఈ వ్యవహారం అప్పట్లో విస్తృత చర్చ జరిగింది. పోలీసులు ఎప్పటిలాగానే స్పందించారు. దర్యాప్తు చేస్తామని ప్రకటించి చేతులు దులుపుకున్నారు. పోలీసుల మెతక వైఖరి కారణంగానే ఇలాంటి ఘటనలు పునరావృతంఅవుతున్నాయని కర్ణాటక ప్రజలు అనుకుంటున్నారు. చదవండి: బెడ్రూంలో సీక్రెట్ కెమెరా పెట్టి.. గలీజు పనులు -
రెండేళ్ల శ్రమ ఒక మినిట్‌లో : భారీ కాయంనుంచి సన్నగా వైరల్వీడియో
అధిక బరువుతో బాధపడే వాళ్లు తీవ్రమైన క సరత్తు చేయాల్సిందే. గుట్టలకొద్దీ పేరుకు పోయిన కొవ్వు కరగాలంటే చెమట చిందించాల్సిందే. దీనికి కొందరికి రోజులు, నెలలు సరిపోవు. సంవత్సరాల తరబడి కృషి చేయాలి. ఏదో నాలుగు రోజులో, నెలలో చేసి నావల్ల కాదు చేతులెత్తేయకూడదు. ఓపిగ్గా ప్రయత్నించాలి. అప్పుడు అనుకున్న శరీరాకృతి సాధ్యమవుతుంది. ఇదే నిరూపించిందో యువతి. దీనికి సంబంధించిన వీడియో ట్విటర్లో వైరల్‌గా మారింది. ఈ వెయిట్ లాస్ జర్నీ వీడియో ఎక్స్‌లో సుమారు 60లక్షల వ్యూస్‌ను సాధించింది. అద్భుతం, అమోఘం అంటూ చాలా మంది ఆమెను అభినందించగా, అయితే దీనిపై కొంతమంది అనుమానాలు కూడా వ్యక్తం చేశారు. వీడియో చివర్లో ఆమె స్మార్ట్‌లుక్ చూసి అందరూ ఆశ్చర్యపోయారు. అంత భారీగా బరువు తగ్గినపుడు, చర్మం వేలాడుతూ ఉంటుంది.అలా లేదేమిటి? అని కొందరు, బహుశా శస్త్రచికిత్స చేయించుకొని ఉండవచ్చు అని కొందరు అభిప్రాయపడ్డారు. దాదాపు నేను కూడా సుమారు 200 పౌండ్లు బరుదు తగ్గాను. చర్మంఅలాగే ఉండిపోయింది. చాలా శస్త్రచికిత్సలు జరగకుండా ఆమె అలా అయ్యే అవకాశం లేదు. అది సాధ్యం కాదని నేను చెప్పడం లేదు, అది ఆమెదేనా అని అనుమానం అని మరో యూజర్ సందేహం వ్యక్తం చేయడం గమనార్హం. Two years of hard work in 1 minute.Impressive!!! pic.twitter.com/QP5QubvmwJ— MALEEK 1.0 (@Maleekoyibo) October 4, 2025 -
Viral Video: ఢిల్లీ మెట్రోలో పొట్టు పొట్టు కొట్టుకున్న ప్రయాణికులు
-
కేఎఫ్సీలో కంపుకొట్టే చికెన్ బర్గర్? వీడియో చూస్తే వాంతులే!
ప్రముఖ ఫాస్ట్ ఫుడ్ చెయిన్ కేఎప్‌సీ (KFC)మరోసారి చిక్కుల్లో పడింది. బెంగళూరు ఔట్లెట్లో కుళ్లిపోయినచికెన్ వడ్డించారనే ఆరోపణలు గుప్పుమన్నాయి. దీనికి సంబంధించి ఒక పోస్ట్ ఎక్స్‌లో వైరల్‌గా మారింది. వివరాలు ఇలా ఉన్నాయి..బెంగళూరుకు చెందిన ఒక కస్టమర్ కేఎఫ్సీపై విమర్శలు గుప్పిస్తూ పోస్ట్ చేసిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీని ప్రకారం బెంగళూరు(Bangalore) కోరమంగళ అవుట్‌లెట్‌లో ఉన్న KFCలో ఒక మహిళా కస్టమర్ హాట్ & స్పైసీ చికెన్ జింజిర్ బర్గర్ ఆర్డర్ చేశారు. దాంట్లోని మాంసం కుళ్లి భరించలేని వాసన వచ్చింది. దీంతో దాన్ని రీప్లేస్ చేయమని అడిగారు. కానీ రెండోసారి కూడా దుర్వాసనతో చెడిపోయిన బర్గర్ ఇవ్వడంతో షాక్ అవ్వడం ఆమె వంతైంది.దీంతో ఆమె సిబ్బందిని గట్టి నిలదీయంతో "ఇది కేవలం సాస్ వాసన" తోసిపుచ్చారని తన పోస్ట్‌లో పేర్కొన్నారు. అంతేకాదు ఈ సమస్యను పరిష్కరించడానికి బదులుగా, సిబ్బంది తన చికెన్ బర్గర్‌ను వెజిటేరియన్‌తో భర్తీ చేయడానికి ప్రయత్నించారని పేర్కొన్నారు. కోరమంగళ కేఎఫ్‌సీ అవుట్‌లెట్‌లో తాను క్రమం తప్పకుండా అదే బర్గర్‌ను ఆర్డర్ చేస్తానని , ఇంతకు ముందెపుడూ ఇలాంటి పరిస్థితి రాలేదని ఆమె వెల్లడించించింది. అంతేకాదు ఈ వివాదంతో కస్టమర్లు వంటగదిని చూడాలని డిమాండ్ చేశాడు. దీనికి మొదట అంగీకరించని సిబ్బంది, రాత్రి 10 గంటల తర్వాత ప్రవేశం లేదని, మేనేజర్ అందుబాటులో లేరని సిబ్బంది అనేక సాకులు చెప్పారు.చివరికి అనుమతించారు. దీంతో అక్కడి దృశ్యాల్నిచూసి జనం షాకయ్యారని తన పోస్ట్‌లో ఆరోపించింది.అంతా కలుషితం, మురికి వాసన, కోల్డ్ స్టోరేజ్ ప్రాంతంలో దుర్వాసన వెదజల్లే మాంసం, బూజు పట్టిన, తుప్పు పట్టిన షీట్లు, మరకలు ఉమ్మి గుర్తులు ఉన్నాయంటూ పేర్కొంది. (పబ్లిక్ టాయిలెట్స్‌లో హ్యాండ్ డ్రైయర్ వాడుతున్నారా?)🚨 WARNING: HSR KFC, Bangalore Extremely Unsafe Food 🚨One of our followers has shared a shocking and disturbing experience at the KFC outlet in HSR Layout, Bangalore. She had ordered a Hot & Spicy Chicken Zinger Burger, but the moment she opened it, the stench was unbearable.… pic.twitter.com/yFpIcblaAA— Karnataka Portfolio (@karnatakaportf) October 4, 2025దీనికి సంబంధించి పోలీసులకు ఫిర్యాదు చేయగా, పోలీసులు వచ్చిన తర్వాత సిబ్బంది దాదాపు అరగంట పాటు వంటగదిని తాళం వేసి ఉంచారని, ఆ సమయంలో స్విగ్గీ , జొమాటో ఆర్డర్లు పంపడం కొనసాగిందని పోస్ట్ పేర్కొంది. "30-40 డెలివరీలు ఒకే చెడిపోయిన మాంసాన్ని ఉపయోగించి పంపించారని కూడా ఆరోపించారు. మేనేజ్మెంట్ షాకింగ్ రియాక్షన్ఇదిలా ఉంటే మేనేజ్మెంట్ స్పందన అత్యంత షాకింగ్‌గా ఉంది. తన సొంత కుటుంబానికి అలాంటి ఆహారాన్ని అందిందని అని ఒప్పుకుంటూనే, ఈఫుడ్ ప్రమాణాలకు అనుగుణంగా ఉందని అవుట్లెట్ మేనేజర్ వాదించడం విడ్డూరంగా నిలిచింది.ఈ సంఘటన నెట్టింట విమర్శలకు తావిచ్చింది. పిల్లలతో సహా వెళ్లే కుటుంబాలకు ఇలాంటి ఆహారం వడ్డించడంపై చాలామంది ఆందోళన వ్యక్తం చేశారు. ‘‘అక్కడ ఇలా జరగడం ఇదే మొదటిసారి కాదు. ఈ సమస్యను చాలాసార్లు ఎదుర్కొన్నా.. అందుకే ఆ అవుట్లెట్కు వెళ్లడం పూర్తిగా మానేశాను. వీలైతే, మీరు మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహిస్తే అక్కడి నుండి తినకండి" అని మరొకరు కామెంట్ చేశారు. "ప్రతి రెస్టారెంట్ ఏ సమయంలోనైనా కస్టమర్లు వంటగదిని సందర్శించడానికి అనుమతించాలి. సరైన పరిశుభ్రత పాటించని రెస్టారెంట్లను ఆహార లైసెన్స్ రద్దు చేయడంతో వెంటనే మూసివేయాలి. అని మరొకరు ఆగ్రహం వ్యక్తం చేశారు. పాపులర్ ఆహార డెలివరీ యాప్‌ల ద్వారా అందించే క్లౌడ్ కిచెన్ల పరిస్థితి ఏంటి ఒకయూజర్ ఆందోళనవ్యక్తం చేశారు.ఇదీ చదవండి: ఎంగేజ్మెంట్ : దేవ కన్యలా అన్షులా కపూర్, అమ్మకోసం అలా..!ఈ సంఘటన నిజమని నిరూపితమైతే, అవుట్‌లెట్‌లో పరిశుభ్రత ,ఆహార భద్రత ఆందోళన కలిగించే అంశమే. ఇలాంటి ఆహారం తీసుకుంటే ఫుడ్ పాయిజనింగ్, ఇన్ఫెక్షన్లతో సహా తీవ్రమైన ఆరోగ్య సమస్యలు రావడం ఖాయం. మరి ఈ వివాదం, వీడియోలోని ఆరోపణలపై కేఎఫ్‌సీ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి. -
కోతి చేతిలో 5 వందల నోట్ల కట్టలు
-
కంగారు పెట్టకండి.. గుద్దితే నాకే బొ*.. : మంత్రి నారా లోకేష్
సాక్షి, విజయవాడ: టీడీపీ ఎంతో క్రమశిక్షణ కలిగిన పార్టీ అని, ఇందులో నేతలకు ఓ పద్ధతి అంటూ ఉంటుందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తరచూ చెబుతుంటారు. అయితే కూటమి అధికారంలోకి వచ్చాక.. ఆ పార్టీ నేతల బూతు పురాణాలు నిత్యం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతూనే ఉన్నాయి. తాజాగా.. స్వయంగా చంద్రబాబు తనయుడు, మంత్రి నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవువుతున్నాయి. ఆటో డ్రైవర్ల సేవలో పథకం ప్రారంభోత్సవంలో భాగంగా ఓ మహిళా ఆటోడ్రైవర్ పక్కనే కూర్చున్న లోకేష్.. ఆమె కంగుతినే రేంజ్లో మాట అన్నారు. విజయవాడలో జరిగిన ఈ కార్యక్రమంలో.. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్.. ఇతర నేతలంతా ఆటోలో ప్రయాణించారు. ఆ సమయంలో.. ఆటో వెనుక రాసిన కొటేషన్లు చదువుతూ, లోకేష్ హాస్యం చేయబోయారు. ‘‘కంగారు పెట్టకండి..గుద్దితే నాకే బొ*’’ అంటూ లోకేష్ నోట మాట వచ్చింది. దీంతో ఆ మహిళా డ్రైవర్ ఒక్కసారిగా కంగుతింది. అయితే మంత్రిగారూ ఫీలవుతారనుకుందో ఏమో.. ఆమె కూడా ఇబ్బందిగానే నవ్వుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాకు చేరింది. కనీస గౌరవం లేకుండా ఓ మహిళ ముందు ఇలాగేనా మాట్లాడేంది అంటూ ప్రశ్నిస్తున్నారు పలువురు. -
అదిరిపోవాల్సిన అందాల పోటీలు..భయం..భయంగా..!
ఫిలిప్పీన్స్‌లోని సెబులో మిస్ ఆసియా పసిఫిక్ ఇంటర్నేషనల్ 2025 గాలా ఎంతో అట్టహాసంగా ప్రారంభమైంది. సాయంత్రం ఎంతో ఆకర్షణీయంగా జరుగుతున్న వేడుక ఒక్కసారిగా భయాందోళనలతో గందరగోళంగా మారిపోయింది. అందాల భామలు రన్‌వేపే హోయలు ఒలికిస్తున్న సమయంలోనే 6.9 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఒక్కసారిగా పోటీదారులు భయంతో వేదిక నుంచి దూరంగా పారిపోతున్న దృశ్యాలు నెట్టింట వైరల్‌గా మారాయి.ఫిలిప్పీన్స్ భూకంపంభూకంప కేంద్రం సెబు నుంచి 95 కిలోమీటర్ల దూరంలో ఉన్న బోగో నగరం వరకు భూకంపం సంభవిస్తుందని గుర్తించి ప్రజలకు అలర్ట్ ప్రకటించారు అధికారులు. ఇక ఈ ప్రమాదంలో సుమారు 60 మందికి పైగా మరణించగా, 150 మందికి పైగా గాయపడినట్లు సమాచారం. ఈ ఆకస్మిక ప్రకృతి విపత్తు అంతర్జాతీయ అందాల పోటీకి అంతరాయ కలిగించిందని అందాల పోటీ నిర్వాకులు తెలిపారు. అయితే మిస్ ఆసియా-పసిఫిక్ ఇంటర్నేషనల్ (MAPI) ఆర్గనైజేషన్ ప్రతినిధులు, సిబ్బంది అంతా క్షేమంగానే ఉన్నట్లు ఓ ప్రకటనలో వెల్లడించారు. పైగా అక్టోబర్ 1న జరగాల్సిన అందాలపోటీలకు సంబంధించిన అన్ని ఈవెంట్లను రద్దుచేస్తున్నట్లు కూడా ప్రకటించారు నిర్వాహకులు. అంతేగాక మిస్ యూనివర్స్ ఫిలిప్పీన్స్ (MUPH) ఆర్గనైజేషన్ సోషల్‌మీడియా పోస్ట్‌లో ఈ ఘోర విపత్తుకు సంఘీభావం తెలుపుతున్నట్లు పేర్కొంది. "ఈ ప్రకృతి విలయం నుంచి కోలుకునేలా తమ సోదరీసోదరీమణులకు అండంగా నిలబడతాం. ఈ విషాద సమయంలో ఫిలిప్పీన్స్ బలం, స్ఫూర్తి, స్థితిస్థాపకత కొనసాగేలా మనవంతుగా కృషి చేద్దాం." అని పోస్ట్‌లో పిలుపునిచ్చింది. కాగా, సెబులో 6.9 తీవ్రతతో ఘోర భూకంపం సంభవించినట్లు అధికారులు వెల్లడించారు. అలాగే ఈ విపత్తులో చిక్కుకున్న క్షతగాత్రులను సంరక్షించే పనులను వేగవంతం చేసినట్లు ఫిలిప్పీన్స్ భద్రతా అధికారులు తెలిపారు. View this post on Instagram A post shared by 𝐏𝐚𝐠𝐞𝐚𝐧𝐭 𝐄𝐦𝐩𝐫𝐞𝐬𝐬 (@pageantempress) (చదవండి: మచ్చలేని చర్మం, నిగనిగలాడే జుట్టు కోసం డీఎన్ఏ డీకోడ్..!) -
పండుగ పూట పెట్టెతో సహా గోల్డ్ కొట్టేసింది..! వీడియో వైరల్
బంగారం ధరలు రోజురోజుకి ఆకాశాన్నంటుతున్నాయి.కనీవినీ ఎరుగని రీతిలో పెరుగుతూ సామాన్యుడికి అందని ద్రాక్షగా మిగిలిపోతోంది పసిడి. గ్రాము బంగారం కొనాలంటే జనం బెంబేలెత్తుతున్న పరిస్ఙతి. ఈ క్రమంలో ట్విటర్లో ఒక వీడియో తెగ వైరల్ అవుతోంది.ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్‌లోని ఒక జ్యుయల్లరీ దుకాణంలో ఒక మహిళ తన చేతివాటి చూపించింది. బంగారం షాపింగ్ చేస్తున్నట్టుగానే నటిస్తూ లక్షలు విలువ చేసే నగను పెట్టెతో సహా దాచేసింది. కానీ విషయం షాపులోనే ఉన్న కెమెరానుంచి మాత్రం తప్పించు కోలేక పోయింది. ఒక ట్విటర్ యూజర్ దీనికి సంబంధించిన వీడియోను షేర్ చేశారు. బంగారం ధరలు గ్రాముకు రూ 12 వేలు దాటేసింది. ఇలాంటి దొంగతనాలు బాగా పెరిగే అవకాశం ఉంది... ఆభరణాలు కొనుగోలు చేసేవారు ఎప్పుడూ లేనంతగా అప్రమత్తంగా ఉండాలి! అనే క్యాప్షన్‌తో ఈ వీడియోను పోస్ట్ చేశారు. 🚨 With gold prices soaring past ₹12k/gram, theft cases are bound to spike...Jewellers must stay more alert than ever!#UttarPradesh | Bulandshahr: Woman caught on camera stealing..stuffs an entire jewellery box inside her saree 👇 pic.twitter.com/5FRxWAQrA0— Nabila Jamal (@nabilajamal_) October 1, 2025 -
Viral Video: చిరుతకు చుక్కలే.. అలా ఎలా కట్టేసింది భయ్యా!
-
ఇదేం పేరెంటింగ్..! వామ్మో ఈ రేంజ్లో డేరింగ్ పాఠాలా..?
కొన్ని విషయాలు పిల్లలకు అనుభవపూర్వకంగా చెప్పాల్సిందే. సరైనదే అయినా..ప్రాణాలను పణంగా పెట్టేంత డేరింగ్ నిర్ణయాలు గురించి చెప్పకపోవడమే మేలు. సురక్షితమైన చర్యలు తీసుకుంటే పర్లేదు. జరగరానీ నష్టం జరిగితే ఇక అంతే పరిస్థితులు. ఇక్కడ అలాంటి భయానక పేరెంటింగ్ టీచింగ్‌కి సంబంధించిన ఘటనే చోటుచేసుకుంది. ఆ వీడియో చూస్తే..మరీ ఈ రేంజ్లో ధైర్యం విలువ గురించి నేర్పించాలా? అని ప్రశ్నిస్తున్నారు నెటిజన్లు..ఆ వీడియోలో ఓ ప్రముఖ ట్రావెల్ ఇన్ఫ్లుయెన్సర్ గారెట్ గీ తన కొడుకుని పెద్ద పర్వతం మీద నుంచి నదిలోకి దూకేయమని ప్రోత్సహిస్తాడు. మొదట ఆ పిల్లవాడు భయంతో వెనకడుగు వేస్తాడు. ఆ తర్వాత తండ్రి మాటలకు కాస్త ప్రేరేపించబడినా..దూకే సాహసం చేయలేకపోయాడు. దాంతో చివరికి తండ్రే అతడిని ఎత్తుకుని విసిరేస్తాడు. పాపం ఆ పిల్లవాడు భయంతో నాన్న అని అరవడం స్పష్టంగా వీడియోలో కనిపిస్తుండటం చూడొచ్చు. ఆ తర్వాత తండ్రి వెంటనే దూకేసి అతడిని పట్టుకుని ఒడ్డుకి వచ్చేస్తాడు. అందుకు సంబంధించిన వీడియోని చూసిన నెటిజన్లు సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోవడం ఎలాగో నేర్పడం మరీ ఈ రేంజ్‌లోనా అంటూ ఫైర్ అయ్యారు. పిల్లలందరూ ఒకేలా ఉండరని, కొందరూ చాలా పిరికిగా ఉంటారంటూ హితవు పలికారు. నెమ్మదిగా ధైర్యాన్ని నూరిపోస్తూ..స్వతహాగా సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకునేలా ప్రోత్సహించాలే తప్ప ప్రాణాలకే ముప్పు వాట్లిలే ఇలాంటి ప్రమాదకరమైన సాహసాలు తగదు అని సదరు ఇన్ఫ్లుయెన్సర్ గీకి హితవు పలికారు. అందుకు సంబంధించిన భయానక వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. అంతేగా పిల్లలకు భయం పోగొట్టాలంటే మరి ఇంతలా నేర్పించాలా అని తిట్టిపోస్తున్నారు నెటిజన్లు. అయితే గీ మాత్రం తల్లిదండ్రులుగా తమ ఉద్దేశ్యాలు వేరని, తాము ప్రేమగా జాగ్రత్తగా పిల్లలను చూసుకోగలమని తనదైన శైలిలో కౌంటరిచ్చాడు ఇన్ఫ్లుయెన్సర్ గీ. View this post on Instagram A post shared by Garrett Gee (@garrettgee) (చదవండి: రుచికరమైన వంట కోసం '3-3-2-2 రూల్.'.!) -
జోరు వర్షంలోనూ ఆగని గర్భా నృత్యం..!
దసరా వేడుక కొన్ని చోట్ల విశేషమైన ప్రత్యేకతను సంతరించుకుంటాయి. ఆ సంప్రదాయలకు అనుగుణంగా జరిగే పూజ ఆచారాల కారణంగానే అవి వార్తల్లో నిలుస్తాయి. కొన్ని చోట్ల గర్భా, దాండియా వంటి నృత్యాలతో జరుపుకుంటే..మరికొన్ని చోట్ల నైవేద్యాల పరంగా విశిష్టతను కలిగి ఉంటాయి. జనసందోహంతో ఘనంగా జరుపుకుంటున్న పండుగ సమయంలో అనుకోని అతిథిలా వర్షం వస్తే..అబ్బా ఎంత పనిచేసిందంటూ..తల తడవకుండా ఏదో ఒకటి అడ్డు పెట్టుకుని సమీపంలోని చెట్ల వద్దకు, లేదా ఇళ్లు/షెడ్డు వద్దకు వస్తాం. కానీ ఈ వ్యక్తి పండుగ సంబరం ఆగకూడదు..ఆ సరదా పోకూడదనుకున్నాడేమో అంతటి జోరు వర్షంలోనూ అలా గర్భా నృత్యం చేస్తూనే ఉన్నాడు. ఎంత అద్భుతంగా ఉందంటే దటీజ్ గర్భా పవర్ అన్నట్లుగా ఉంది. అందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారడమే కాదు, నెటిజన్లను తెగా ఆకర్షించింది. ఆ వీడియోలో చత్తీస్‌గఢ్‌కు చెందిన వ్యక్తి సంప్రదాయ బ్లాక్ కలర్ డ్రస్ ధరించి, కుండపోత వర్షంలో కూడా ఆగకుండా గర్భా నృత్యం చేస్తున్న కమనీయ దృశ్యం స్పష్టంగా కనిపిస్తోంది. కాగా, గుజరాత్ నవరాత్రి వేడుకలకు పెట్టింది పేరు. పైగా ఇక్కడ జరిగే గర్భా రాత్రులు అత్యంత ప్రజాదరణ కలిగినవి. రంగురంగుల సంప్రదాయ దుస్తులతో చేసే గర్భా నృత్యాలు ప్రజలందర్నీ అమితంగా ఆకర్షిస్తాయి. అందులోనూ ఈ ఏడాది పదిరోజులు కాకుండా పదకొండు రోజుల కావడంతో మరింత వైభవోపేతంగా చాలాపెద్ద పెద్ద గర్భారాత్రులు నిర్వహిస్తున్నారు కొందరు. View this post on Instagram A post shared by Parth Suri (@parth_suri) (చదవండి: ఫస్ట్ డే డ్యూటీ హైరానా..! వైరల్‌గా బస్సు కండక్టర్ స్టోరీ..) -
ఆక్సిజన్ సిలిండర్ లేకుండా ఎవరెస్టుని అధిరోహించిన తొలి వ్యక్తి..!
ఎవరెస్టు శిఖరం అధిరోహించడం అనేది ఔత్సాహిక పర్వతారోహకులకు అపురూపమైన కల. ఆ క్రమంలో ప్రాణాలు కోల్పోయిన వారెందదో ఉన్నారు కూడా. అయినా ఆ పర్వతాన్ని అధిరోహించాలనే క్రేజ్ మాత్రం తగ్గదు పర్వతారోహకులకు. పైగా అక్కడి కఠినమైన వాతావరణ పరిస్థితులు అందుకు తగ్గట్టుగా ఉండే ఎముకల కొరికే చలి వంటి పరిస్థితులన్నింటినీ ఓర్చుకుంటూ అధిరోహించడం అంత ఈజీ కాదు. అలాంటిది ఆక్సిజన్ సిలిండర్ లేకుండానే అధిరోహించాడు ఈ 37 ఏళ్ల వ్యక్తి. పైగా అక్కడ స్కీయింగా కూడా చేయడం మరింత విశేషం.అతడే పోలాండ్ దేశానికి చెందిన ఆండ్రెజ్ బార్గియల్. గతంలో అతడికి రెండు మూడుసార్లు ఇదే ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించే ప్రయత్నాలను మధ్యలోనే విరమించుకోవాల్సిన పరిస్థితి ఎదురైంది. అయినా వెరవక మూడో ప్రయంత్నంలో దాదాపు 8,849 మీటర్లు (29,032 అడుగులు) ఎత్తులో ఉన్న ఈ ఎత్తైన ఎవరెస్టు పర్వతాన్ని ఆక్సిజన్ సపోర్టు కూడా లేకుండా విజయవంతంగా అధిరోహించి చరిత్ర సృష్టించాడు. శరదృతువులో మరింత క్లిష్టతరం ఉండే సమయంలో ఈ పర్వతాన్ని అధిరోహించి అందర్ని ఆశ్చర్యపోయేలా చేసే అరుదైన ఘనతను దక్కించుకున్నాడు. ఈ మేరకు బార్గియల్ మాట్లాడుతూ.. ఈ సాహసాన్ని తన క్రీడా జీవితంలో అత్యంత ముఖ్యమైన మెలురాయిగా అభివర్ణించాడు. ఈ శిఖరాన్ని అధిరోహించే మార్గం ఎంత క్లిష్టతరమైందో కూడా వివరించాడు. ఏదేమైతేనేం..చివరికి అధిరోహించడమే గాక అంత ఎత్తులో చాలాసేపు గడిపాడు. పైగా అక్కడే స్కీయింగ్ చేయాలన్నది తన డ్రీమ్ అని, అది అనుకోకుండా ఇవాళ సాకారమైందని సంతోషం వ్యక్తం చేశాడు. అలాగే తాను కష్టతరమైన శరదృతువులో ఖంబు హిమనీనదం ద్వారా అవరోహణ రేఖ నుంచి అధిరోహించే ప్లాన్ చేయడమనేది ఎంత పెద్ద సవాలో కూడా తనకు తెలసునని చెప్పుకొచ్చాడు బార్గియల్ఎలా సాగిందంటే..ఆయన ఈ ఎవరెస్టు శిఖరాన్ని సెప్టెంబర్ 19న నేపాల్‌లోని ఎవరెస్ట్ బేస్ క్యాంప్ నుంచి ప్రారంభించారు. అలా మొత్తం క్యాంప్‌లు I, II, III గుండా ఎక్కినట్లు తెలిపారు. ఇక సెప్టెంబర్ 21న క్యాంప్ IV నుంచి పర్వతం డెత్జోన్కి చేరుకున్నానని, ఇది సముద్ర మట్టానికి దాదాపు ఎనిమిది వేల మీటర్లు పైనే ఉంటుందని అన్నారు. అక్కడ ఆక్సిజన్ స్థాయిలు చాలా ప్రమాదకర స్థాయిలో ఉంటాయన్నారు. అక్కడ నుంచి సుమారు 16 గంటల అధిరోహణ అనంతరం సెప్టెంబర్ 22కి శిఖరాన్ని చేరుకున్నట్లు తెలిపారు. ఆ తర్వాత మంగళవారం తెల్లవారుజామున ఎవరెస్టు శిఖరం అత్యంత ప్రమాదకరమైన విభాగాలలో ఒకటిగా పేర్కొనే ఖంబు ఐస్‌ఫాల్ గుండా స్కీయింగ్ చేసి బేస్ క్యాంపుకు చేరుకున్నాడు. అక్కడ అతనికి తన సోదరడు బార్టెక్ ఎగరువేసిన డ్రోన్ మార్గనిర్దేశం చేసినట్లు చెప్పుకొచ్చారు. నిజంగా అత్యంత ఎత్తైన పర్వతంగా పిలిచే ఈ ఎవరెస్టుని అధిరోహించడమే గ్రేట్ అంటే బార్గియల్ ఆక్సిజన్ బాటిల్ లేకుండా అధిరోహించడమే కాకుండా స్కీయింగ్ కూడా చేసి సరికొత్త రికార్డుని నెలకొల్పారు. View this post on Instagram A post shared by Andrzej Bargiel (@andrzejbargiel) (చదవండి: నవరాత్రుల సమయంలో అరుదైన దృశ్యం..! దుర్గమ్మ ఆలయానికి కాపాలాగా..) -
నవరాత్రుల సమయంలో అరుదైన దృశ్యం..! దుర్గమ్మ ఆలయానికి కాపాలాగా..
ఇప్పుడు బనానా ఏఐ నయా ట్రెండ్‌తో ఏది రియల్, ఏది ఫేక్ పోటో/వీడియోనో గుర్తించడం కష్టంగా ఉంది. అలాంటి పరిస్థితుల్లో నెట్టింట వైరల్ అవుతున్న వీడియో నెటిజన్లు నమ్మశక్యం కానీ గందరగోళానికి గురిచేసింది. అందులోనూ శరన్నవరాత్రుల సమయంలో ఇలాంటి కమనీయ దృశ్యం కంటపడితే..దుర్గమ మహిమ లేక ఇది నమ్మదగినది కాదో అన్న సందేహాలను లేవనెత్తింది భక్తుల్లో. చివరికి అది ఫేక్ కాదని తేలాక..ఒక్కసారిగా 'మా దుర్గ' అన్న నామస్మరణతో భక్తిపారవశ్యంలో మునిగిపోయారు. ఇంతకీ ఏంటా అపురూపమైన దృశ్యం అంటే..ఒక దుర్గమ్మ ఆలయం వెలుపల కాపలా కాస్తున్న సింహం వీడియో నెట్టింట తెగ వైరల్‌గా మారింది. మొదట చూడగానే అందరూ ఏఐ మాయ అనుకున్నారు. కానీ దాని గురించి సాక్షాత్తు ఐఎఫ్ఎస్ ఆఫీసర్ షేర్ చేయడంతో అది రియల్ అని నమ్మారు. ఆ దైవిక దృశ్యం చూడటం అదృష్టం అన్నంతగా బావించారు నెటిజన్లు. ఒక్కసారిగా నెట్టింట ఆ ఆలయానికి ఆ సింహం రక్షణగా ఉందేమో అనే చర్చలు లేవనెత్తాయి. అయితే ఇది గిర్ అడవిలోనిదని, అక్కడ చాలా దుర్గమ్మ ఆలయాలు ఉన్నాయని, వాటికి కాపలాగా ఈ సింహలు ఉంటాయని ఓ నెటిజన్ పోస్ట్‌లో పేర్కొన్నాడు. అంతేగాదు గిర్ అటవీ ప్రాంతంలో తిరిగే ఈ సింహాలు మానవులపై దాడి చేసిన సందర్భాలు చాలా తక్కువేనని అన్నారు. అవి గుజరాత్‌లోని సౌరాష్ట్రా ప్రాంతంలో కనిపించే అరుదైన సింహ జాతిగా అని పేర్కొనన్నారు నెటిజన్లు. ఇక ఆ ప్రాంతంలోని సాంస్కృతిక సంప్రదాయాలకు ఆ వన్య ప్రాణులకు మధ్య ఉన్న బలమైన సంబంధాన్ని ఆ వీడియో హైలెట్ చేస్తోందని అన్నారు. కాగా, భారతదేశంలో సింహాల జనాభా 2020లో 674 కాగా, 2025 కల్లా 891కి చేరుకుంది. అంటే 70 శాతంపైగా సింహాల సంఖ్య పెరిగిందని ఇటీవలే కేంద్ర పర్యావరణ మంత్రి భూపేందర్ యాదవ్ వెల్లడించారు.What a divine sight. Look like that lioness is guarding the temple !! pic.twitter.com/bBlxlmKD4m— Parveen Kaswan, IFS (@ParveenKaswan) September 28, 2025 (చదవండి: అక్కడ అమ్మవారి నైవేద్యాన్ని పీర్లకు ప్రసాదంగా..! మతసామరస్యాన్ని ప్రతీకగా..) -
"మైక్ లేదు, వాయిద్యాలు లేవు": అద్భుతమైన గర్భా నృత్యం..!
ప్రస్తుతం విభిన్న సంస్కృతుల మేళవింపుగా ఆధునికతకు అద్ధం పట్టేలా దసరా వేడుకలను అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నారు. ఎక్కడ చూసిన డీజే మ్యూజిక్‌లు, అదిరిపోయ్ డ్రమ్స్ ధ్వనిలతో దద్ధిరిల్లిపోయేలా ధూం ధాంగా జరుపుతున్నారు. అలాంటిది అవేమి లేకుండా నాటి సంబరాన్ని గుర్తుకు చేసేలా అద్భుతంగా చేశారు. ఎంత లయబద్ధంగా ఉందంటే..ఇది గర్భా మ్యాజిక్ ఏమో అనొచ్చు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఆ వీడియోలో మహిళలంతా సాంప్రదాయ గర్భా నృత్యం చేస్తూ అలరించారు. ఎలాంటి మైక్, మ్యూజిక్ సౌండ్స్ లేకపోయినా అద్భుతంగా ఉంది. కేవలంగా వారి చేతి చప్పట్లు, లయబద్ధంగా పాడుతున్న పాట..సహజత్వాన్ని ఉట్టిపడేలా సాగింది. చెప్పాలంటే సౌండ్ పొల్యూషన్‌కి తావివ్వని విధంగా ఆహ్లాదకంరగా నాటి మన సంప్రదాయ సంస్కృతిని గుర్తుచేసింది..ఈ గర్భా నృత్యం. ఆ వీడియోలో మహిళలంతా "అంబే మా కీ జై" అంటూ వృత్తాకారంలో చేస్తున్న నృత్యం ఎక్కడ బీట్ మిస్‌కాకుండా అలల ప్రవాహంలా సాగిపోతోంది. నెట్టింట వైరల్ అవుతున్న ఈ వీడియో నెటిజన్లను తెగ ఆకర్షించింది. ఈ వీడియోని చూసిన నెటిజన్లు వాణిజ్యంతో ముడిపడిలేని గర్భా నృత్యమని కొనియాడారు. అంతేగాదు గర్బాను 'తరం' సమస్యగా మార్చాల్సిన అవసరం లేదని ఆ మహిళలు తమదైన శైలిలో చెప్పారంటూ ప్రశంసల వర్షం కురిపించారు. View this post on Instagram A post shared by Artistic Life with Preeti (@artisticlifewithpreeti) (చదవండి: కళ్లు బైర్లు కమ్మేలా బంగారం ధరలు.. అక్కడ మాత్రం 10 కేజీలతో డ్రెస్సు..!) -
పాక్‌లో మిన్నంటిన నవరాత్రి సంబరాలు, గార్బా, దాండియా సందడి
దసరా నవరాత్రి ఉత్సవాలు ఒక్క భారతదేశానికే పరిమితం కాదు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భారతీయులు దసరా వేడుకలను నిర్వహించుకుంటారు. దేశంలోని అనేక నగరాల్లో శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. అయితే పాకిస్థాన్‌లోని కరాచీ నగరంలో దసరా సంబరాలు అంబరాన్నంటాయి. ఈ వేడుకలకు సంబంధించిన వీడియోలు నెట్టింట విశేషంగా నిలిచాయి.పాకిస్తాన్లో నివాసం ఉంటున్న ఇండియన్ ప్రీతం దేవ్రియా ఈ వీడియోను షేర్ చేశారు. అక్కడి భారతీయ భక్తులు గర్బా, దాండియా నృత్యాలతో సందడి చేశారు. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కరాచీ నుండి మరొక వీడియో, ధీరజ్ షేర్ చేసిన మరో వీడియోలు కూడా దసరా సంబరాలను ఘనంగా నిర్వహించారు. సాంప్రదాయ దుస్తుల్లో ఇవిద్యుత్ దీపాలతో అలంకరించిన ఒక వీధిలో దుర్గామాత చిత్రపటాన్ని ఏర్పాటు చేసి పూజలు నిర్వహించడం విశేషం. ముస్లింలు ఎక్కువగా నివసించే పాక్‌లో నవరాత్రి సంబరాలు ప్రత్యేకంగా నిలిచాయి. వ సోషల్ మీడియా వినియోగదారులు పాకిస్తాన్‌లోని హిందూ సమాజం గురించి హృదయపూర్వక శుభాకాంక్షలు మరియు ఉత్సుకతతో స్పందించారు.పాకిస్తాన్లో శాకాహారులు , జైనులు ఉన్నారా అని అడిగినప్పుడు, ప్రీతమ్ దేవ్రియా ఉన్నారని ధృవీకరించారు. ఈ వేడుకలను చూసిన నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ ప్రశంసలు కురిపించారు. పలువురు వారికి "నవరాత్రి శుభాకాంక్షలు" అందించారు. View this post on Instagram A post shared by प्रीतम (@preetam_devria) View this post on Instagram A post shared by प्रीतम (@preetam_devria) -
ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ కావాలి.. ఓ రెండు రూపాయలు ప్లీజ్-‘బ్యూటీ క్వీన్’
విలాసవంతమైన ఐ ఫోన్ అంటే అందరికీ మోజే. అందులోనూ ఇటీవల అధునాతన ఫీచర్ల ఐఫోన్ 17 సిరీస్‌ను లాంచ్ చేసింది యాపిల్. దీంతో యాపిల్ లవర్స్‌లో మరింత క్రేజ్ పెరిగింది. దీనికోసం ఎగబడి, ఘర్షణకు దిగిన వీడియోలు కూడా నెట్టింట హల్ చల్ చేసిన సంగతి తెలిసిందు. ఎలాగైనా ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్‌ను (iphone 17pro max) దక్కించుకునేందుకు కొన్ని అసాధారణ మార్గాలను ఎంచు కుంటున్నారు. తాజాగా దానం చేయండి ప్లీజ్.. అంటూ ఆన్లైన్లో అడుక్కుంటున్న ఒక ఇన్ఫ్లూయెన్సర్ (బ్యూటీ క్వీన్) వీడియో ఒకటి నెట్టింట వైరల్‌గా మారింది. అదేంటో చూద్దా రండి!ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్‌కు చెందిన కంటెంట్ సృష్టికర్త, 'బ్యూటీ క్వీన్' మహి సింగ్ తన అనుచరులను QR కోడ్ ద్వారా చిన్న మొత్తంలో విరాళంగా ఇవ్వమని అభ్యర్థించింది. ఒక్కొక్కరూ ఒక్కో రూపాయి, లేదా రెండు రూపాయల చొప్పున దానం చేస్తే, ఆ డబ్బులతో ఐఫోన్ 17 ప్రో మాక్స్‌ను కొనుక్కుంటానంటూ వేడుకుంటోంది. చదవండి: చదివింది 12 th.. సంపాదన నెలకు రూ. 3 లక్షలకు పైనేఇక్కడ ఇంకో విషయం ఏమిటంటే మూడు నెలల క్రితమే తన తండ్రి తనకు ఐఫోన్ 16 కొని ఇచ్చాడనీ, కానీ తాను తాజా మోడల్ కోసం అడిగినప్పుడు,నిరాకరించాడని చెబుతోంది. అక్టోబర్ 21న తన పుట్టినరోజు సమీపిస్తుండటంతో, కొత్త ఐఫోన్‌ను సొంతం చేసుకోవాలని ఆరాటపడుతోంది. ఐఫోన్ 17 ప్రో మాక్స్ కలర్ , డిజైన్ భలే నచ్చాయనీ, అది తన “కలల ఫోన్”గా అభివర్ణించింది. ఈ విషయంలో తనకు సపోర్ట్‌గా చేసిన వారందరికీ రుణపడి ఉంటానని తెలిపింది.भीख मांगने का नया तरीका है माही सिंह को 17 मैक्स प्रो मोबाइल चाहिए जिसके लिए पब्लिक से पैसा मांग रही हैं 😂#ModiBhajanlal4Rajasthan pic.twitter.com/sRNFGLYio5— Surendra Yadav (@Surendr0032083) September 25, 2025 దీంతో ఆన్లైన్లో చాలామంది ఆమెను తిట్టిపోస్తున్నారు. అడుక్కోవడానికి ఇదోమార్గం... పనికిమాలిన పని విమర్శించారు ఇలాంటి వారికి దానం చేస్తే పుణ్యం కంటే పాపమే వస్తుందని కొందరు, ఫాలోవర్స్‌ను పెంచుకునేందుకు ఇదో చీప్ ట్రిక్ అంటూ మరికొందరు. మండిపడ్డారు. మహి సింగ్ బ్యూటీ క్వీన్ అనే ఐడీతో వీడియోలు అప్లోడ్ చేస్తూ ఉంటుంది. -
వాలు జడ తోలు బెల్టు!
ఆయనో స్కూల్‌కు హెడ్మాస్టర్. ఓ మహిళా టీచర్‌ను వేధించారని ఆయనకు ఉన్నతాధికారి నుంచి నోటీసులు జారీ అయ్యాయి. ఆ నోటీసుకు వివరణ ఇచ్చేందుకు ఆ అధికారి ఆఫీస్‌కు హెచ్ఎం వెళ్లారు. చేతిలో ఫైల్‌ను బల్లకేసి కొట్టి.. నడుముకు ఉన్న బెల్డ్ తీసి అధికారిని చితకబాదడం మొదలుపెట్టారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా ఆయన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఆ పెద్దసారుకు మద్దతుగా పిల్లలు, వాళ్ల తల్లిదండ్రులు రోడ్డెక్కడంతో ప్రభుత్వమే దిగి వచ్చింది!!..సీతాపూర్ హెడ్మాస్టర్ బృజేంద్ర కుమార్ వర్మ వ్యవహారం ఉత్తర ప్రదేశ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. సీతాపూర్ విద్యా శాఖ అధికారి(BSA) అఖిలేష్ ప్రతాప్ సింగ్‌ను వర్మ బెల్ట్‌తో బాదిన వీడియో ఒకటి విపరీతంగా వైరల్ అయ్యింది. ఈ ఘటనపై కేసు నమోదు కావడంతో ఆయన్ని సస్పెండ్ చేయడంతో పాటు అరెస్ట్ చేశారు. దీనికి నిరసనగా వర్మ భార్య సీమ, స్టూడెంట్స్-పేరెంట్స్‌తో కలిసి స్కూల్ బయట నిరసనలకు దిగారు. ఈ క్రమంలో అఖిలేష్‌పై సంచలన ఆరోపణలకు దిగారామె.అవంతిక గుప్తా మహ్ముదాబాద్లోని నద్వా ప్రైమరీ స్కూల్‌కి పోస్టింగ్ మీద వచ్చి చేరింది. అయితే ఆమె బడికి రెగ్యులర్‌గా రావడం లేదు.దీంతో.. హెడ్మాస్టర్ బృజేంద్ర కుమార్ వర్మ ఆమె నుంచి వివరణ కోరాడు. అయితే.. ఆమె నేరుగా బదులివ్వకుండా సీతాపూర్ BSA కార్యాలయం నుంచి ఫోన్ చేయించింది. ఆమె బడికి రాదని.. అయినా అటెండెన్స్ వేయమని బీఎస్ఏ అధికారి అఖిలేష్ ప్రతాప్ సింగ్ ఆదేశించాడు. ఆమె నిత్యం తన ఇంటి ముందు నుంచే వెళ్తోందని.. పిల్లలు, వాళ్ల తల్లిదండ్రులు అడిగితే ఏం సమాధానం చెప్పాలని వర్మ అభ్యంతరం చెప్పాడు. ఎవరైనా అడిగితే మెడికల్ లీవ్‌లో ఉందని చెప్పమంటూ అఖిలేష్ ఫోన్ పెట్టేశాడు. అయితే..హెచ్ఎం వర్మ మాత్రం ఆ ఒత్తిళ్లకు తలొగ్గలేదు. ఇది అవంతిక, అఖిలేష్‌లకు కోపం తెప్పించింది. అప్పటి నుంచి వర్మను రకరకాలుగా వేధించడం మొదలుపెట్టారు. ఈ క్రమంలో ఆమె వర్మపై అఖిలేష్‌కు వేధింపుల ఫిర్యాదు చేయడంతో పరిస్థితి మరోలా మారింది. వివరణ కోరుతూ నోటీసులు జారీ చేయడంతో.. వర్మకు పట్టరాని కోపం వచ్చింది. అంతే దాడి చేశారు.. అని వర్మ సతీమణి సీమ మీడియాకు వివరించారు. ఈ క్రమంలో.. వర్మ-అఖిలేష్ మధ్య ఫోన్ సంభాషణను ఆమె మీడియాకు విడుదల చేశారు.UP govt headmaster slams file, flogs BSA using beltIn UP's Sitapur, a primary school headmaster Brijendra Kumar Verma was summoned by the Basic Siksha Adhikari (BSA) Akhilesh Pratap Singh over a complaint registered against Verma. Verbal argument ensued. Headmaster Verma… pic.twitter.com/8YGiFBTmfw— Piyush Rai (@Benarasiyaa) September 23, 2025 ఇదిలా ఉంటే..పిల్లలు-తల్లిదండ్రుల నిరసనలతో ప్రభుత్వం కదిలొచ్చింది. బీఎస్ఏ అఖిలేష్‌ను విధుల నుంచి తొలగిస్తూ సీఎం యోగి ఆదిత్యానాథ్ ఉన్నత స్థాయి దర్యాప్తునకు ఆదేశించారు. మరోవైపు విద్యాశాఖ మంత్రి వర్మకు వేధింపులు ఎదురైన మాట వాస్తవమేనని ప్రకటించారు. ఇంకోవైపు.. సోషల్ మీడియాలో హెచ్ఎం వర్మకు సపోర్టుగా పలువురు పోస్టులు చేయసాగారు. ఈ మొత్తం వ్యవహారానికి కారణమైన అవంతికను విద్యాశాఖ సస్పెండ్ చేయగా.. ఆమె పరారీలో ఉన్నట్లు సమాచారం. అవంతిక-అఖిలేష్‌కు మధ్య ఉన్న సంబంధం ఏంటన్నది ఇంకా బయటకు రాలేదు. అయితే ఆమె స్టూడెంట్స్‌తో కలిసి రీల్స్ చేసిన వీడియోలు మాత్రం ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. -
'ధోలిడా' పాటకి అమెరికన్ ఇన్ఫ్లుయెన్సర్ స్టెప్పులు..!
దేశం మొత్తం నవరాత్రుల సందడితో ఉంది. ఎటుచూసిన దాండియా, గర్భా నృత్యాలతో పండుగా వాతావరణంతో కళకళలాడుతోంది. ఈ పండుగను ఒకే దేశంలో పలు విధాలుగా జరుపుకుంటారు. భిన్నత్వంలో ఏకత్వానికి నిదర్శనంలా ఉండే మన సంస్కృతిక సంపద్రాయాన్ని గౌరవిస్తూ..నృత్యం చేసి నెటిజన్ల మనసును దోచుకున్నాడు ఈ అమెరికన్ ఇన్ఫ్లుయెన్సర్. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.ఆవీడియోలో ప్రుమఖ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ రికీ పాండ్ గంగూబాయి కతియావాడిలోని ప్రసిద్ధ పాట 'ధోలిడా'కి నృత్యంకి నటి ఆలియా భట్ని తలపించేలా డ్యాన్స్ చేశారు. తన లివింగ్ రూమ్‌లో సాధారణ డ్రెస్ వేర్లో ఎంతో అందంగా డ్యాన్స్ చేశారు. అంతేగాదు ఆయన ఈ వీడియోని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తూ..నవరాత్రి శుభాకాంక్షలు అని రాసుకొచ్చారు. ఈ పోస్ట్ ఆన్లైన్లో అతని అభిమానుల్లో నూతనోత్సాహాన్ని తెచ్చిపెట్టింది. అతని ఎనర్జీకి నెటిజన్లు ఫిదా అవ్వుతూ..వేరే దేశం నుంచి వచ్చి భారతీయ సంస్కృతిని స్వీకరించడం నిజంగా చాలాగ్రేట్ అంటూ ప్రశంసిస్తూ పోస్టులు పెట్టారు. మరికొందరూ గుజరాత్‌కు రండి ఇక్కడ నవరాత్రి పండుగను ఆస్వాదించండి, మీ రాకకై ఎదురుచూస్తున్నాం అని పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by Ricky Pond (@ricky.pond) (చదవండి: అగరుబత్తీలు వెలిగిస్తే క్యాన్సర్ వచ్చే ప్రమాదం!) -
భారత్ వ్యక్తిని పెళ్లి చేసుకుంటే లైఫ్ ఇంతలా మారిపోతుందా..?
భారతీయవ్యక్తిని పెళ్లాడటంతోనే ఇంతలా మారిపోతానని అస్సలు అనుకోలేదు. ముఖ్యంగా ఈ మార్పుని అస్సలు ఊహించలేదంటోంది ఓ విదేశీ మహిళ. చాలామంది విదేశీ వనితలు భారత్ అబ్బాయిలను పెళ్లాడి, ఇక్కడి కట్టుబొట్టుకి ఆకర్షితులై తమ లైఫ్‌స్టైల్‌నే మార్చుకున్న వారెందరో ఉన్నారు. అలాంటి వ్యక్తుల కోవలోకి తాజాగా ఈ ఉక్రెయిన్ మహిళ కూడా చేరింది. ఎవరామె? అంతలా ఏం మార్చుకుందామె అంటే..ఉక్రెయిన్ మహిళ విక్టోరియా చక్రవర్తి భారతీయ కుటుంబంలోకి కోడలిగా అడుగు పెట్టక ముందు, ఆ తర్వాత తన జీవితంలో చోటు చేసుకున్న మార్పులను వివరిస్తూ ఓ వీడియోను సోషల్ మీడియాలో షేర్చేసింది. అది నెట్టింట వైరల్‌గా మారి, నెటిజన్లను తెగ ఆకర్షించింది. ఆమె ఆ వీడియోలో తన డ్రెస్సింగ్ స్టైల్ నుంచి భారతీయ ఆహారం, స్థానిక పండుగల వరకు ప్రతీది ఎలా తన జీవితంల భాగమైందో తెలిపింది. అలాగే తన జీవింతంలోకి వచ్చిన ఈ మార్పులతో వెల్లివిరిసిన ఆనందం, జాయ్‌నెస్ గురించి కూడా చెప్పుకొచ్చింది. ప్రధానంగా ఆ మూడు మార్పులు తన జీవితంలోకి భాగమయ్యేలా స్వాగతించానని అంటోంది. అవేంటంటే..చీర నెమ్మదిగా తన వార్డ్‌రోబ్‌లో భాగమైంది. అది లేకుండా ఏ పెళ్లికి లేదా ఏ కార్యక్రమానికి హాజరు కాకుండా ఉండటం ఊహించలేం అన్నంతగా..చేతులతో సాంప్రదాయ ఆహారాన్ని తినడం, చాలా సహజంగా అనిపిస్తుంది. ఏడాదిలో నాకు కొన్ని పండుగలు ఇష్టమైనవిగా మారిపోయాయి. వేడుకల గొప్పదనం, ఆ సంబరం కలిగించే ఆనందం తన మదిలో స్థిరంగా ఉండిపోడమే కాదు సంతోషాన్ని తెచ్చిపెట్టాయని అంటోంది. అందుకు తగ్గట్టుగా ధరించే భారతీయ దుస్తులు అదరహో అనేలా ఉంటాయిని ప్రశంసించింది. అలాగే విక్టోరియాలో భారత్‌లోనే గొప్ప వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నట్లు చెప్పుకొచ్చింది. చాలామంది తనను భారత్‌కి వెళ్లొద్దని సూచించారని, కానీ ఇక్కడకు రావడంతో తన జీవనశైలి మారిపోవడమే కాదు, ఎన్నో ఆనంద క్షణాలకు నెలవుగా మారిపోయిందని సంతోషంగా చెబుతోందామె. నెటిజన్లు కూడా భారతీయ దుస్తులు చాలా అందంగా కనిపిస్తున్నారని, మా సంస్కృతిని స్వీకరించినందుకు ధన్యవాదాలు. అలాగే దాన్ని ఇష్టపడతున్నందుకు మరింత సంతోషంగా ఉంది అంటూ పోస్టులు పెట్టారు. కాగా, విక్టోరియా తను ఇండియాకు రావడాన్ని అందరూ వ్యతిరేకించినా..అక్కడి నుంచే మనకు కొత్త అధ్యయనం ప్రారంభమవ్వడమే కాదు, కొంగొత్త విషయాలు తెలుసుకుంటామని అంటోంది. View this post on Instagram A post shared by Foreigner In India | Influencer | Kolkata | UGC (@viktoriia.chakraborty) (చదవండి: భారత్‌లో పర్యటించాలనుకుంటే ఈ తప్పిదాలు చెయ్యొద్దు..! విదేశీ యువతి సూచనలు) -
సగ్గుబియ్యాన్ని ఎలా తయారు చేస్తారో తెలుసా..!
ఈ నవరాత్రుల ఉపవాసాల్లో సగ్గుబియ్యంతో చేసిన వంటకాలనే ఆరగిస్తుంటారు చాలామంది . ముఖ్యంగా సగ్గుబియ్యంతో చేసే స్వీట్లు రుచి తలుచుకుంటేనే నోరూరిపోతుంటుంది. అలాంటి సగ్గుబియ్యాన్ని ఎలా తయారు చేస్తారో తెలుసా..? వేటితో తయారు చేస్తారు..? మొత్తం విధానం ఎలా ఉంటుంది తదితరాల గురించి సవివరంగా తెలుసకుందామా.!కొంచె ఒంట్లో నలతగా ఉన్నా..లేదా ఏం తిన్న జీర్ణం కాక ఇబ్బందిగా ఉన్నా..శరీరానికి సత్తువనిచ్చేలా ఈ సగ్గుబియ్యం జావాని వెంటనే తీసుకుంటుంటారు. ఇది తేలిగ్గా అరిగిపోతుంది. పైగా ఇందులో ఉండే కార్బోహైడ్రేట్లు శరీరానికి తక్షణ శక్తిని అందిస్తాయి. అందువల్ల ఉపవాసాల్లో స్ప్రుహ తప్పిపోకుండా ఎనర్జిటిక్‌గా ఉండేందుకు తప్పనిసరిగా ఈ సగ్గుబియ్యంతో చేసే పాయసం, లేదా రెసిపీలు తీసుకుంటుంటారు భక్తులు. మరి ఈ సగ్గుబియ్యం ఎలా తయారవుతాయంటే..కస్సావా దుంప నుంచి ఈ సగ్గుబియ్యాన్ని తయారు చేస్తారు. ఈ దుంపనే కర్రపెండలం అనికూడా అంటారు. వీటిని ముందుగా శుభ్రం చేసుకుని తొక్క యంత్రం సాయంతో చక్కగా బయటి చర్మాన్ని ఒలిచేస్తారు. ఆ తర్వాత వాటిని పాలు, పిండి మిశ్రమంగా ప్రాసెస్ చేస్తారు. ఆ తర్వాత పూర్తిగా శుద్ధి చేసి ఎండబెట్టి..ఈ స్టార్చ్ పేస్ట్‌ను వరుస యంత్రాల ద్వారా పంపుతారు. చివరి దశలో ఎండిన మిశ్రమాన్ని చూర్ణం చేసి, జల్లెడ ద్వారా పంపి చిన్న చిన్న ముత్యాల లాంటి బంతులను తయారు చేస్తారు. వీటినే సబుదాన లేదా సగ్గుబియ్యం అని పిలుస్తారు. తర్వాత వీటిని ప్యాక్ చేసి అమ్మకానికి రెడి చేస్తారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఇది తమిళనాడులోని సబుదాన కర్మాగారంలో చ్రితించిన వీడియో. దీంతో వడలు, దగ్గర నుంచి ఖిచ్డి, పాయసం వంటి పలు రెసిపీలను తయారు చేస్తారు. View this post on Instagram A post shared by ABHISHEK ASHRA 💫🧿 (@thefoodiehat) (చదవండి: రాజాధిరాజ.. రాజమార్తాండ.. బహుపరాక్! మైసూర్ ప్యాలెస్‌లో నవరాత్రి ఉత్సవాలు) -
భారత్‌లో పర్యటించాలనుకుంటే ఈ తప్పిదాలు చెయ్యొద్దు..!
మన దేశంలో పర్యటించి.. ఇక్కడి విభిన్నమైన సంస్కృతిక సంప్రదాయాలకు ఫిదా అయ్యి ఇక్కడే స్థిరపడాలనుకున్న ఎందరో విదేశీయుల మనోభావాలను విన్నాం. ఇప్పుడూ తాజాగా ఓ విదేశీ యువతి భారత్‌లో పర్యటించాలంటే ఈ తప్పులు చేయకండి..ఈ నేల తప్పక చూడాల్సిన ఎన్నో ప్రదేశాలకు నెలవు అంటూ భారత్‌పై పొగడ్తల వర్షం కురిపించింది. ఇక్కడ కొన్ని పర్యటనల్లో పాశ్చాత్య దేశాల కట్టుబొట్టు తీరుని అనుసరించపోవడమే మేలు. పైగా కొన్ని రాష్ట్రాల్లో అక్కడి సంస్కృతికి మీకు తెలియకుండానే ఆటోమేటిగ్గా కట్టుబడిపోతుంటారని అంటోంది. మరి ఇంతకీ ఆమె పర్యటించేటప్పుడూ ఏ తప్పులు చెయ్యొందంటోంది? ఎవరామె?ఎమ్మా అనే విదేశీ యువతి(Foreigner) భారత్(India)లో పర్యటించేటప్పుడూ ఈ తప్పిదాలు అస్సలు చేయొద్దంటూ టూరిస్ట్‌లకు సూచనలిచ్చే వీడియో నెటిజన్ల దృష్టిని అమితంగా ఆకర్షించింది. పైగా ఆ వీడియో నెట్టింట తెగ వైరల్‌గా మారింది కూడా. భారతదేశం పర్యటించడానికి అనువైన అద్భుతమైన ప్రదేశాల్లో ఒకటని అభివర్ణించింది. తొలిసారిగా భారత్‌లో పర్యటించేటప్పుడూ తరచుగా అందరూ ఇలాంటి తప్పిదాలే చేస్తుంటారని అవి అస్సలు చేయొద్దని సూచించిందామె. చాలామంది భారత్ పర్యటన అనగానే ఢిల్లీ, ఆగ్రా, జైపూర్ వంటి పర్యాట ప్రదేశాలనే ఎంచుకుంటారు. అవి పర్యాటకులు రద్ధీగా ఉండే ప్రదేశాలని, వాటికంటే ప్రకృతి రమ్యతకు నెలవైనా ముగ్ధమనోహర ప్రదేశాలు చాలానే ఉన్నాయని అంటోంది. చేయకూడని ఏడు తప్పిదాలు..గోల్డెన్ ట్రయాంగిల్ (ఢిల్లీ, ఆగ్రా, జైపూర్) సందర్శించడం మాత్రమే అద్భుతమైని అనుకోకండి. ఎందుకంటే భారతదేశం చాలా పెద్దది. ముఖ్యంగా కేరళ, రాజస్థాన్, హిమచల్‌ప్రదేశ్ వంటి రాష్ట్రాలను అస్సలు మిస్ అవ్వద్దు.నిరాడంబరమైన దుస్తులను ధరించొద్దు. ముఖ్యంగా దేవాలయాల్లో, గ్రామీణ ప్రాంతాలు భుజాలు, మోకాళ్లను కవర్ చేసే దుస్తులు ధరిస్తే గౌరవప్రదంగా చూస్తారని, ఇబ్బందికరమైన చూపులు ఎదురవ్వవని అంటోంది.ప్రయాణ సమయాన్ని తక్కువగా అంచనా వేయొద్దు. అదీగాక గూగుల్ మ్యాప్ మీకు ఐదు గంటలని చూపిస్తే..సులభంగా ఎనిమిది గంటలు పడుతుందని అర్థం. దూరం తక్కువే అయినా, రోడ్లు ట్రాఫిక్ మయం అనే విషయం జ్ఞప్తికి ఉంచుకోండి.కుళాయి నీరు తాగొద్దు బాటిల్ వాటర్‌కే ప్రాధాన్యత ఇవ్వండి.అలాగే వీధి ఆహారాల జోలికి వెళ్లొద్దు. ప్రజలు రద్దీగా ఉన్న ఫుడ్స్టాల్స్కి ప్రాధాన్యత ఇవ్వండి.ముందుగానే రైళ్లను బుక్‌చేసుకోండి. ఎందుకంటే భారతీయ రైల్వేల్లో టికెట్లు వేగంగా అమ్ముడైపోతాయి. ముందుగానే ప్లానే చేసుకుంటేనే మంచిదిఅలాగే భారత్‌లో పాశ్చాత్య టైమింగ్స్‌ని ఫాలో అవ్వద్దు. భారతదేశ సమయానుకూలంగా ప్రవర్తించండి. విశ్రాంతి తీసుకోండి, అలాగే కాస్త కన్ఫ్యూజన్ని కూడా ఓర్చుకోండి. ఎమ్మా షేర్ చేసిన వీడియో నెట్టింట తెగ వైరల్‌గా మారడమే కాదు ఆమె సూచనలకు ధన్యావాదాలు అంటూ పోస్టులు పెట్టారు. ప్రతి టూరిస్ట్ పొందే అనుభవమే ఇది అని చమత్కరిస్తూ పోస్టులు పెట్టారు కొందరు. కాగా, ఎమ్మా భారత్ పర్యటన తనను పూర్తిగా మార్చేసిందని, కేరళ తనను అణుకువగా ఉండటం ఎలా అనేది ప్రోత్సహించింది, ఆలోచింపచేసిందని, ఇక్కడి సంస్కృతికి బాగా కనెక్ట్ అయ్యిపోయా అంటూ తన పోస్ట్‌ని ముగించిందామె. View this post on Instagram A post shared by Gems in Asia 💎🌎 (@gemsinasia) (చదవండి: ఇద్దరు పిల్లల తల్లి వెయిట్ లాస్ సీక్రెట్: ఏకంగా 84 కిలోల నుంచి 56 కిలోలకు తగ్గి..) -
ఉద్యోగం కంటే ఆరోగ్యమే ముద్దు..!
ఆరోగ్యమే మహాభాగ్యం అని కొందరూ ఫిట్నెస్కి ఎంతగా ప్రాముఖ్యత ఇస్తున్నారో చెప్పాల్సిన పనిలేదు. డబ్బు ఎప్పుడైనా సంపాదించొచ్చు..ఆరోగ్యం పోతే అంత ఈజీ కాదు ఇదివరకటిలా ఉండటం. అలానే భావించి ఇక్కడొక అమ్మాయి ఏకంగా రూ. 60 వేల వేతనంతో కూడిన ఉద్యోగాన్ని తృణప్రాయంగా వదులుకుంది. ఆమె డేరింగ్‌కి నెటిజన్లు ఫిదా అవ్వడమే కాదు..మేడమ్ మీరు చాలా గ్రేట్ అంటూ ప్రసంశలు కురిపిస్తున్నారు. ఈ రోజుల్లో ఉద్యోగాల షిఫ్ట్‌లు ఏవిధంగా ఉంటాయో తెలిసిందే. కంఫర్ట్ జోన్లో ఉద్యోగం చేయడం అందరికీ సాధ్యం కాదు. అలా కుదిరే ఛాన్స్ లేదు. అందువల్ల యువత చిన్న వయసులోనే రకరకాల దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడుతున్నారు. ఇది అందరికీ తెలిసింది. ఇలానే ఆరోగ్య సమస్యలు ఎదుర్కొన్న ఉపాసన అనే భారత యువతి ఎంత పెద్ద నిర్ణయం తీసుకుందో వింటే విస్తుపోతారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. ఫ్రెంచ్ అసోసీయేట్గా పనిచేస్తున్న ఆమె నెలకు రూ. 60 వేలు దాక సంపాదిస్తున్నట్లు పేర్కొంది. తన ఉద్యోగం చేయడం అత్యంత సులభమని, కాకపోతే నైట్ షిఫ్ట్‌ల్లో పనిచేయాల్సిన పరిస్థితి అని చెప్పుకొచ్చింది. అందువల్ల ప్రతి మూడో రోజు తలనొప్పి, ఎసిడిటీ, తక్కువ రక్తపోటు, ఒత్తిడి వంటి సమస్యలను ఎదుర్కొంటున్నట్లు వాపోయింది. ప్రస్తుతం ఆర్థిక పరంగా సేఫ్‌గానే ఉన్నా..అందువల్ల ధైర్యంగా అంత వేతనంతో కూడిన ఉద్యోగాన్ని ధీమాగా వదిలేశానని తెలిపింది. డబ్బు తాత్కాలికం, అదే ఆరోగ్యం పాడైతే మళ్లీ యథాస్థితికి తీసుకురావడం అంత ఈజీ కాదు. అందుకే తాను డబ్బు కంటే ఆరోగ్యానికే ప్రాధాన్యత ఇచ్చి ఉద్యోగాన్ని వదులుకున్నానని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం పూర్తిగా ఆరోగ్యంపై దృష్టిపెట్టా, మళ్లీ యథావిధిగా తన జీవితంలో సక్సెస్‌ని అందుకుంటానా లేదా అనేది తెలియదు. చూద్దాం ఏ జరుగుతోందో అంటూ ముగించింది తన పోస్ట్‌ని. అందుకు సంబంధించిన వీడియోని కూడా జత చేసి మరి పోస్ట్ చేసింది. అయితే నెటిజన్లంత ఆమె సాహసోపేతమైన నిర్ణయాన్ని మెచ్చుకోవడమే కాదు.. మీ అర్హతకు తగిన ప్రతిదీ మీరు అందుకోవాలని ఆశిస్తున్నాం అంటూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by Upasana (@upasanaa._)(చదవండి: -
క్షణం.. క్షణం.. ఉత్కంఠ రేపే జానపద నృత్యం..!
ఎన్నో రకాల నృత్యాలు చూశాం. కానీ ఈ నృత్యం చూస్తుంటే ఎలా చేయగలదా అన్న అనుమానం..ఏం జరుగుతోందో అన్న టెన్షన్‌తో అలర్ట్‌గా ఉండేలా చేసే అద్భుతమైన నృత్యం. సాహసోపేతమైన డ్యాన్స్‌కి మరో రూపం ఇదేనేమో అన్నట్లు ఉంది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఆ వీడియొలో ఒక మహిళ సంప్రదాయ లెహెంగా చోలి, చక్కటి ఆభరణాలు ధరించి అద్భుతమైన జానపద నృత్య ప్రదర్శన ఇచ్చింది. ఉత్కంఠభరితమైన ఆ నృత్యం భారతీయ సంస్కృతికి అసలైన అందంగా అలరారింది. చూస్తున్నంతసేపు చేయగలదా అన్న టెన్షన్, నిజమైన ప్రతిభకు అర్థం పట్టే డ్యాన్స్ ఇది. ఆ వీడియోలో ఒక మహిళ తన తలపై మూడు మట్టికుండలను బ్యాలెన్స్ చేస్తూ..కింద ఒక ప్లేట్‌పై డ్యాన్స్ చేస్తున్నట్లు చూడొచ్చు. ఆ నృత్యాన్ని అద్భుతంగా ప్రదర్శించాలంటే, ప్రతిభ, దృష్టి, ఏకాగ్రత, బ్యాలెన్స్‌పై మంచి పట్టు ఉండాలి. అప్పుడే ఆ నృత్యంలో దాగున్న అద్భతమైన అందం ప్రేక్షకుల్ని అటెన్షన్‌తో తిలకించేలా చేస్తుంది. నెటిజన్లు సైతం ఈ వీడియోని చూసి మీరు చేసిన విధానం అత్యంత అద్భుతంగా ఉంది, నిజమైన ప్రతిభ భారతదేశ సంస్కృతికి అసలైన అందం అని కీర్తిస్తూ పోస్టలు పెట్టారు. View this post on Instagram A post shared by राजस्थानी छोरी🫣 (@lok_nritya) (చదవండి: మంచు పొరలపై బతుకమ్మ, దాండియా సంబరాలు) -
యాక్షన్ సినిమాని తలపించే యాక్సిడెంట్..! వెంట్రుకవాసిలో తప్పిన ప్రమాదం
కార్లుపైకి లేచి దొర్లుకుంటూ వచ్చే భయానక ప్రమాదాలు సినిమాల్లోనే చూస్తుంటాం. హాలీవుడ్ రేంజ్ యాక్షన్ సినిమాలైతే ఏ రైంజ్‌లో కార్లు పైకి లెగుస్తాయో తెలిసిందే. అచ్చం అలాంటి భయానక ప్రమాదం మన కళ్లముందు జరిగి..పొరపాటు ఆ ఘటనలో చిక్కుకుంటే అమ్మో..! ఏ జరుగుతుందో అన్నది ఊహకే అందనిది. అలాంటి యాక్సిడెంట్ బారినేపడి జస్ట్ రెప్పపాటులో ప్రాణాలతో బయటపడ్డాడు. చెప్పాలంటే చావు అంచులదాక వెళ్లొచ్చాడని చెప్పొచ్చు. ఈ ఘటన అమెరికాలోని నెబ్రాస్కా గ్యాస్ స్టేషన్లో చోటు చేసుకుంది. అందుకు సంబంధించిన వీడియో క్లిప్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఆ వీడియోలో జాన్సన్ అనే వ్యక్తి బ్రాడీ గేటు వద్ద తన ట్రక్కును పార్కింగ్ చేసి, విండోని క్లీన్ చేసుకుంటున్నాడు. ఇంతలో ఒక కారు పల్టీలు కొడుతూ అతడివైపుకి దూసుకువస్తుంది. రెప్పపాటులో స్పందించి తప్పించుకున్నాడు లేదంటే ఆ కారుకింద నుజ్జు నుజ్జు అయ్యి ఉండేవాడు. మృత్యువుని చాలా దగ్గర నుంచి చూశాడు. ఏ మాత్రం ఆలస్యం చేసిన జాన్సన్ అక్కడికక్కడే ప్రాణాలు గాల్లో కలసిపోయావు. అంతటి పరిస్థితుల్లోనూ ఆ వ్యక్తి ప్రమాదం నుంచి తప్పించుకుని ఆ కారులోని డ్రైవర్ ఏ పరిస్థితుల్లో ఉన్నాడని కనుక్కోవడానికి వెళ్లడం విశేషం. మితిమీరిన వేగంతో వచ్చిన డ్రైవర్ని తప్పుపట్టక, అతడి బాగోగులు గురించి ఆలోచించి.. తన విశాల హృదయాన్ని చాటుకున్నాడు జాన్సన్. ఈ వీడియోని చూసిన నెటజన్లు కూడా సదరు కారు డ్రైవర్‌పై విమర్శలు ఎత్తడమే గాక, త్రుటిలో ప్రమాదం నుంచి బయటపడ్డ వ్యక్తిని ఉద్దేశిస్తూ..బ్రో నువ్వు మాములు లక్కీవి కాదు అంటూ పొగడ్తల జల్లు కురిపించారు.WATCH: Like an action movie… A man cleaning his windshield at a Nebraska gas station dodges an out-of-control car that flips on its side. He suffered only minor injuries. The speeding driver faces multiple citations. 📹: Lincoln County Sheriff’s Office pic.twitter.com/Yfg7qgNMHU— John-Carlos Estrada 🎙️ (@Mr_JCE) September 17, 2025 (చదవండి: ప్రకృతి సోయగం..! ఆహ్లాదం, ఆనందం..) -
భార్య కోసం 175కి.మీ. దాటి, చివరకు..
అన్యోన్యంగా ఉన్న ఆ ఆలుమగల మధ్య ఏవో చిన్న చిన్న గొడవలు జరిగాయి. అంతే.. భార్య అతన్ని విడిచి దూరంగా వెళ్లిపోయింది. ఆమెను వెతుక్కుంటూ ఆ భర్త ఊర్లు దాటి వెళ్లాడు. పశ్చాత్తాపంతో.. బతిమాలైనా సరే ఆమెను వెనక్కి తీసుకువద్దామని అతను అనుకున్నాడేమో అని మీరు పొరపడేరు!. కానే కాదు.. షేక్ అంజాద్‌కు, అతని భార్యకు మధ్య మనస్పర్థలు వచ్చాయి. కొంతకాలంగా గొడవలు పడ్డారు. ఈ క్రమంలో.. ఆమె భర్తను విడిచిపెట్టి దూరంగా వెళ్లిపోయింది. ఆమె ఆచూకీ తెలుసుకున్న ఆ భర్త.. 175 కిలోమీటర్లు ప్రయాణించి ఆమె దగ్గరకు చేరాడు. ఆమెతో ప్రేమగా మాట్లాడుతూ.. బతిమాల సాగాడు. ఇదేదో ఇంట్రెస్టింగ్ ఉందనుకున్నాడో ఏమో.. అక్కడే ఉన్న ఓ వ్యక్తి వాళ్ల గొడవను ఫోన్లో రికార్డు చేశాడు. అయితే.. భార్యతో సరదాగా మాట్లాడుతూనే ప్యాంట్ జేబులో ఉన్న కత్తిని అంజాద్ బయటకు తీశాడు. బతిమాలుతున్నట్లు కనిపిస్తూనే.. హఠాత్తుగా ఆమె గొంతు కోశాడు. ఆపై కోపంతో జుట్టు పట్టి లాగి నడిరోడ్డు మీదకు విసిరేశాడు. ఆ పరిణామంతో ఆ వీడియో రికార్డు చేసే వ్యక్తి సహా అక్కడున్నవాళ్లంతా అంతా హాహాకారాలు చేశారు. ఆ మహిళను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. పారిపోయే ప్రయత్నం చేసిన ఆంజాద్‌ను పట్టుకుని పోలీసులకు అప్పప్పించారు. సెప్టెంబర్ 18వ తేదీ గురువారం మధ్యాహ్నాం ఒడిశా బాలాసోర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆ దంపతుల స్వస్థలం కటక్గా పోలీసులు ధృవీకరించుకున్నారు. మనస్పర్థలతోనే అతను అలా చేశాడని ప్రకటించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగానే ఉందని తెలుస్తోంది. కేసు దర్యాప్తు జరుగుతోందని పోలీసులు అంటున్నారు. ఆ భర్త గొంతు కోసిన వీడియో నెట్టింటకు చేరింది. -
నో ఫుడ్.. నోవాటర్.. రోజుకి 8 లీటర్ల ఇంజిన్ ఆయిల్ చాలు, వైరల్ వీడియో
కర్ణాటకకు చెందిన ఒక వ్యక్తి సాధారణ ఆహారాన్ని తీసుకోకుండానే గత 33 ఏళ్లుగా జీవిస్తున్నాడట. అదేంటి? ఎలా? అని ఆశ్చర్య పోతున్నారా? మరదే కదా స్టోరీ.. రోజుకు కేవలం 7-8 లీటర్ల వేస్ట్ ఇంజిన్ ఆయిల్, టీ మాత్రమే సేవిస్తాడు. అందుకే లోకల్‌గా ‘ఆయిల్ కుమార్’గా పాపులర్ అయ్యాడట. దీనికి సంబంధించి ఒక వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో తెగ చక్కర్లు కొడుతోంది. ఈ వైరల్ వీడియోలో రైస్ , చపాతీలు ఇస్తే తీసుకోలేదు. దీనికి బదులుగా ఇంజిన్ ఆయిల్ బాటిల్‌ను ఎత్తి గటా గటా తాగేశాడు. కర్ణాటకలో సాధువు రూపంలో నివసిస్తున్న ఆయిల్ కుమార్ మోటార్ ఆయిల్ తాగుతూ సంతోషంగా జీవిస్తున్నాడు. గత కొన్ని దశాబ్దాలుగా రోజువారీ 7-8 లీటర్ల వేస్ట్ ఇంజిన్ ఆయిల్ తాగుతూ జీవిస్తున్నాడు. అంతేకాదు ఇప్పటివరకు అతనికి ఎలాంటి అనారోగ్యం రాలేదనీ, ఆసుపత్రికి వెళ్లలేదనీ,ఆరోగ్యకరమైన జీవిస్తున్నానని తెలిపాడు పైగా అయ్యప్ప ఆశీస్సుల వల్లే ఈ ప్రత్యేక జీవనశైలి సాధ్యమవుతుందని అయ్యప్ప వేషధారణలోఉన్న ఆయిల్ కుమార్ చెప్పుకొచ్చాడు.తన విశ్వాసమే దీన్ని భరించే సామర్థ్యాన్ని ఇస్తోందనీ, ఆ అయ్యప్ప స్వామి దయ ద్వారా మాత్రమే తాను జీవిస్తున్నాననేది అతని విశ్వాసం.నిపుణులేమంటున్నారంటేఅయితే, వైద్య నిపుణులు మాత్రం దీనిపై ఆందోళన వ్యక్తం చేశారు. మోటారు ఆయిల్లో మానవులకు విషపూరితమైన పెట్రోలియం ఆధారిత సమ్మేళనాలు ఉంటాయని, చాలా ప్రమాదమ నొక్కి చెప్పారు. ఇలాంటి పదార్థాలను మింగడం లేదా పీల్చడం వల్ల అనేక తీవ్రమైన పరిణామాలు సంభవించవచ్చు. ముఖ్యంగా ఊపిరితిత్తులలోకి పీల్చినట్లయితే, తక్షణ , దీర్ఘకాలిక ప్రమాదాలు ఎదురవుతాయని వారు హెచ్చరించారు. ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్,శ్వాసకోశ వైఫల్యం, దీర్ఘకాలిక దగ్గు, శ్వాసలోపం మరియు శ్వాస ఆడకపోవడం ప్రాణాంతక పరిస్థితులకు దారితీయవచ్చుని పేర్కొన్నారు. జీర్ణవ్యవస్థ ప్రభావం చూపుతుంది.నోరు, గొంతు , కడుపులో కాలిపోవచ్చు.అంతర్గత రక్తస్రావం. వాంతులు, కొన్నిసార్లు రక్తపు వాంతులు కావచ్చు. అల్సర్లు, పుండ్లు తీవ్రమైన ఇన్ఫెక్షన్లకు దారి తీయవచ్చు. తలనొప్పి, తలతిరగడం, దిక్కుతోచని స్థితి, మూర్ఛ వంటి నాడీ సంబంధిత సమస్యలొస్తాయి. ఈ విషపూరిత సమ్మేళనాలతో కాలేయం,మూత్రపిండాలకు దెబ్బతినేఅవకాశం ఉంది. హైడ్రోకార్బన్ కంటెంట్ కారణంగా గుండెజబ్బు లాంటి ప్రాణాంతక సమస్యలు రావచ్చని వైద్యులు హెచ్చరిస్తున్నారు. View this post on Instagram A post shared by AvalakkiPavalakki (@avalakki_pavalakki) -
‘హే.. ఆపవమ్మా!’.. కేంద్ర మంత్రి దురుసు ప్రవర్తన!
మలయాళ చిత్ర పరిశ్రమలో ఒకప్పుడు యాంగ్రీ యంగ్‌మ్యాన్ చిత్రాలతో అలరించిన సురేష్ గోపీ.. ఇప్పడు కేంద్ర మంత్రి హోదాలో వరుస వివాదాల్లో చిక్కుకుంటున్నారు. తాజాగా తన గోడును చెప్పే క్రమంలో ఓ మహిళపై ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో కాస్త దురుసు వ్యాఖ్యలే చేశారాయన. గతంలో రాజ్యసభ సభ్యుడిగా పని చేసిన ఆయన.. 2024 లోక్‌సభ ఎన్నికల్లో కేరళ రాష్ట్రం నుంచి గెలిచిన ఏకైక బీజేపీ అభ్యర్థిగా నిలిచారు. త్రిసూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన సురేష్ గోపీ, దాదాపు 75,000 ఓట్ల ఆధిక్యంతో ఘన విజయం సాధించారు. ఇది బీజేపీకి కేరళలో తొలి లోక్‌సభ విజయం కావడం విశేషం. ఈ అర్హతతోనే ఆయనకు కేబినెట్లో చోటు దక్కింది. అయితే.. అటు రాజకీయాలతో పాటు ఇటు సినిమాలతోనూ బిజీ బిజీగా ఉంటున్న ఆయన.. ప్రజా క్షేత్రంలో మాత్రం విమర్శలు ఎదుర్కొంటున్నారు. కేంద్ర పర్యాటకశాఖ సహాయమంత్రి సురేశ్ గోపి ఇటీవల తన నియోజకవర్గంలో పర్యటించారు. ఆ సమయంలో.. సీపీఎం నేతల ప్రమేయం ఉన్నట్లుగా ఆరోపణలున్న కరువన్నూర్ సహకార బ్యాంకు కుంభకోణంలో పలువురి డిపాజిట్లు చిక్కుకుపోయాయి. దీనిపై ఈడీ దర్యాప్తు జరుగుతోంది. కేంద్ర మంత్రిని కలిసిన ఆనందవల్లి అనే మహిళ తన డిపాజిట్ సొమ్ము తిరిగి ఇప్పించడంలో సహకరించాలని కోరారు. అయితే.. ఆమె అలా మాట్లాడుతుండగానే ఆయన ఆపమంటూ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ‘‘అక్కా.. ఎక్కువ మాట్లాడొద్దు. ఈ విషయంలో నన్ను బద్నాం చేసే ప్రయత్నం చేయొద్దు. వెళ్లి మీ మంత్రికో, ముఖ్యమంత్రికో చెప్పు’’ అంటూ మలయాళంలో కాస్త దురుసుగా చెప్పారు. ఈ క్రమంలో స్పందించిన ఆ మహిళ.. ‘‘మీరు కూడా మా మంత్రే’’ అని మహిళ చెప్పగా.. ‘‘నేను దేశానికి మంత్రిని. ఇక్కడ సానుభూతిని ఆశించొద్దు. నేను ముక్కుసూటిగానే చెబుతున్నా’’ అని ఆయన బదులిచ్చారు. ఈ ఉదంతం వైరల్‌గా మారింది. ఈ ఘటనపై వృద్ధురాలు ఆనందవల్లి మీడియాతో మాట్లాడుతూ.. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో తమ డిపాజిట్లు వెనక్కు రప్పిస్తానని సురేశ్ గోపి హామీ ఇచ్చారని, ఆయన కఠువుగా మాట్లాడకుండా.. తన అభ్యర్థనను పరిశీలిస్తానని చెప్పినా సరిపోయేది కదా అని వాపోయారు. ఇదిలా ఉంటే.. ఇంటి నిర్మాణం కోసం అభ్యర్థించిన ఓ వృద్ధుడి దరఖాస్తు తీసుకునేందుకు ఆయన తిరస్కరించడంపై ఈ మధ్యే విమర్శలు వెల్లువెత్తాయి. అమలు చేయలేని హామీలు తాను ఇవ్వబోనని.. తన పరిధిలో అంశాలను మాత్రమే పరిష్కరించగలనంటూ ఆ వైఖరిని సమర్థించుకున్నారాయన. -
ఒకే ఓవర్లో 5 సిక్సర్లు.. ఫాస్టెస్ట్ ఫిఫ్టీ.. నబీ విధ్వంసం.. వీడియో వైరల్
శ్రీలంకతో మ్యాచ్‌లో అఫ్గనిస్తాన్ (SL vs AFG) వెటరన్ ఆల్‌రౌండర్ మహ్మద్ నబీ (Mohammad Nabi) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ప్రత్యర్థి జట్టు బౌలర్లకు చుక్కలు చూపిస్తూ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. సిక్సర్ల వర్షం కురిపిస్తూ ప్రేక్షకులను అలరించాడు.ఫాస్టెస్ట్ ఫిఫ్టీకేవలం 20 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న నబీ.. అఫ్గనిస్తాన్ తరఫున ఫాస్టెస్ట్ ఫిఫ్టీ చేసిన ఆటగాడిగా అజ్మతుల్లా ఒమర్జాయ్ (హాంకాంగ్‌పై) రికార్డును సమం చేశాడు. ఇక లంకతో మ్యాచ్‌లో మొత్తంగా 22 బంతుల్లోనే మూడు ఫోర్లు, ఆరు సిక్స్‌లతో నబీ 60 పరుగులు రాబట్టాడు.ఒకే ఓవర్లో ఐదు సిక్సర్లుముఖ్యంగా ఆఖరి ఓవర్లో నబీ వరుసగా ఐదు సిక్సర్లు బాదడం అఫ్గన్ ఇన్నింగ్స్‌కే హైలైట్‌గా నిలిచింది. లంక యువ స్పిన్నర్ దునిత్ వెల్లలగే బౌలింగ్‌లో వరుసగా మూడు సిక్సర్లు బాదిన నబీకి.. తర్వాత ఫ్రీ హిట్ రూపంలో మరో సిక్స్ లభించింది. ఆ తర్వాత బంతికి కూడా బంతిని బౌండరీ మీదుగా తరలించి.. మొత్తంగా ఐదు సిక్స్‌లు పిండుకున్నాడు.యువీ రికార్డు.. జస్ట్ మిస్ఈ క్రమంలో నబీ జోరు చూస్తే టీమిండియా మాజీ స్టార్ యువరాజ్ సింగ్ ఆరు సిక్సర్ల రికార్డును సమం చేసేలా కనిపించాడు. అయితే, ఆ వెంటనే సింగిల్‌కు ప్రయత్నించిన నబీ.. దురదృష్టవశాత్తూ రనౌట్ అయ్యాడు. కాగా 2007 టీ20 ప్రపంచకప్ టోర్నీలో ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో యువీ.. స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్‌లో వరుసగా ఆరు సిక్స్‌లు బాదిన విషయం తెలిసిందే.ఇదిలా ఉంటే.. శ్రీలంకతో మ్యాచ్‌లో నబీ మెరుపులు వృథాగా పోయాయి. అఫ్గనిస్తాన్‌ను ఆరు వికెట్ల తేడాతో ఓడించిన శ్రీలంక.. గ్రూప్-బి నుంచి సూపర్-4కు అర్హత సాధించింది. అఫ్గన్‌ను ఎలిమినేట్ చేసి తమతో పాటు బంగ్లాదేశ్‌ను తదుపరి దశకు తీసుకువెళ్లింది.శ్రీలంక వర్సెస్ బంగ్లాదేశ్ స్కోర్లు👉వేదిక: షేక్ జాయేద్ స్టేడియం, అబుదాబి👉టాస్: అఫ్గనిస్తాన్.. తొలుత బ్యాటింగ్👉అఫ్గనిస్తాన్ స్కోరు: 169/8 (20)👉శ్రీలంక స్కోరు: 171/4 (18.4)👉ఫలితం: ఆరు వికెట్ల తేడాతో అఫ్గన్‌పై లంక గెలుపు👉సూపర్-4కు శ్రీలంక అర్హత.. టోర్నీ నుంచి అఫ్గన్ నిష్క్రమణ.చదవండి: Asia Cup: శ్రీలంక స్టార్ ఇంట్లో విషాదం.. మ్యాచ్ మధ్యలోనే తండ్రి మరణంMohammad Nabi lit up the Abu Dhabi skyline with some fireworks of his own 🎇💫Watch the #DPWorldAsiaCup2025, from Sept 9-28, 7 PM onwards, LIVE on the Sony Sports Network TV channels & Sony LIV.#SonySportsNetwork #SLvAFG pic.twitter.com/nseqjt4zJJ— Sony Sports Network (@SonySportsNetwk) September 18, 2025 -
'హ్యూమన్ వాచ్': చూపుతిప్పుకోనివ్వని అమేజింగ్ ఆర్ట్..
కొన్ని అద్భుతాలు హృదయానికి హత్తుకునేలా మంత్రముగ్ధల్ని చేస్తుంటాయి. అస్సలు ఇలాంటి ఆలోచన ఎలా వచ్చిందా అని ఆశ్చర్యమేస్తుంది. చూడటానికి రియలిస్టిక్‌గా ఉండే ఆర్ట్‌ల గొప్పదనం మాటల్లో చెప్పలేం. అంత ఓపికగా ఎలా చేస్తున్నారనే అనుమానం కచ్చితంగా వచ్చేస్తుంది. ఓ భారతీయడు ఆ అందమైన క్లాక్ కళకు సంబంధించిన వీడియోని నెట్టింట షేర్ చేయడంతో వైరల్‌గా మారింది. అందులో ఏముందంటే..నెదర్లాండ్ ప్రధాన అంతర్జాతీయ కేంద్రమైన ఆమ్స్టర్డామ్ విమానాశ్రయం షిపోల్లో ప్రత్యేకమైన 'హ్యూమన్ వాచ్'ను చూసి భారతీయ ప్రయాణికుడు ఎస్కే ఆలీ విస్తుపోయాడు. చూడటానికి నిజమైన గడియారాన్ని తలపించే హ్యుమన్ వాచ్ ఇది. ఎంత అద్భుతంగా ఉందంటే రెండు కళ్లు చాలవేమో అన్నంతగా మాయ చేస్తోంది. ఆ గడియారంలో ఒక మనిషి అచ్చం రియల్ గడియారంలో టైం చూపించే ముల్లుల మాదిరిగా క్షణాల్లో టైంని చూపిస్తూ..తుడుస్తూ కనిపిస్తుంది. అదంతా ఏదో మ్యాజిక్ చేసినట్లుగా ఏ మాత్రం ఒంకర టిక్కరి లైన్లు లేకుండా రియల్ గడియారం మాదిరిగా టైంని చూపిస్తున్న విధానం చూస్తే..నోటమాట రాదని అంటున్నాడు అలీ. ఆ గడియారం లోపల వ్యక్తి చేతితో ప్రతి నిమిషాన్ని ఇండికేట్ చేసేలా నిమిషా ముల్లుల గీతలను రిప్రెజెంట్ చేస్తూ చెరిపేయడం చూస్తే..ఇంతలా గీయడం ఎవ్వరికీ సాధ్యం కాదనిపిస్తుంది. చూడటానికీ ఏదో యానిమేటెడ్‌లా ఉంటుంది. ఒక సాధారణ గడియారాన్ని మిళితం చేసేలా ఉంది ఈ హ్యూమన్ వాచ్ కళ. రియల్ టైమ్‌గా పిలిచే హ్యుమన్ వాచ్‌ని డచ్ కళాకారుడు మార్టెన్బాస్ రూపొందించారట. ఇందులో నటుడు టియాగో సాడా కోస్టా పారదర్శక తెరపై గడియారపు ముళ్లను చెరిపివేసి తిరిగి గీస్తున్న 12 గంటల లూప్ చేయబడిన వీడియో ఉంది. ఆ పెయింటింగ్ సయంలో నిమిషానికి కట్టుబడి ఉన్న వ్యక్తి ముద్రను చూపిస్తుంది. నెటిజన్లు ఈ వీడియోని చూసి ఈ కళారూపం వెనుక ఉన్న క్రియేటివిటీకి జోహార్లు అని ప్రశంసిస్తూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by S K Ali (@skali85) (చదవండి: పీహెచ్డీ గ్రాడ్యుయేట్ ఫుడ్ స్టాల్‌తో రోజుకు రూ.లక్ష పైనే..!) -
జ్యూస్ తాగుతుండగా గుండె ఆగింది!
క్రైమ్: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఓ యువకుడు జ్యూస్ తాగుతూ కుప్పకూలిపోయాడు. అది గమనించిన స్థానికులు అతన్ని ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేశారు. అయితే ఆలోపే అతని ప్రాణం పోయింది. బుధవారం రాత్రి 8గం. ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. జ్యూస్ తాగుతూ ఆ యువకుడు ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. అది గమనించిన స్థానికులు అతనికి సీపీఆర్ చేసి బతికించే ప్రయత్నం చేశారు. అయితే అతని నుంచి స్పందన లేకపోవడంతో వాహనంలో ఆస్పత్రికి తరలించారు. కానీ, అప్పటికే అతను మృతి చెందాడు. గుండెపోటుతోనే ఆ యువకుడు మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. మృతుడి స్వస్థలం ఖమ్మం జిల్లా పల్లిపాడుగా పోలీసులు తెలిపారు. అతని పేరు, ఇంతకు ముందు ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉన్నాయా? ఇతర వివరాలు తెలియరావాల్సి ఉంది. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీటీవీల్లో రికార్డయ్యాయి. -
బొద్దుగా ఉన్నోడు కాస్త స్లిమ్‌గా..! జస్ట్ మూడేళ్లలో 76 కిలోలు తగ్గాడు..
బొద్దుగా ఉన్న వ్యక్తులు బరువు తగ్గడం కష్టమేమో అనుకుంటారు. కొందరి అధిక బరువు.. వామ్మో! ఇంత లావు అనేలా ఉంటుంది. అంతలా లావుగా ఉండి కూడా చాలా స్మార్ట్ లుక్‌లోకి మారిపోవడమే కాదు వెయిట్‌లాస్ అవ్వాలనుకునే వాళ్లకు స్ఫూర్తిగా నిలుస్తున్నాడు ఈ యువకుడు. అప్పటికి ఇప్పటికీ ఎంత వ్యత్యాసం ఉందంటే..హీరోని తలపించేలా అతడి ఆహార్యం అత్యంత అందంగా మారిపోయింది. తనకు ఇదెలా సాధ్యమైందో కూడా ఇన్‌స్ట్రాగ్రామ్‌లో షేర్ చేసుకున్నాడు. మరి అంతలా బరువు తగ్గేందుకు అతడు ఏం ట్రిక్ ఫాలో అయ్యాడో సవివరంగా తెలుసుకుందాం..!ఇన్‌స్టాగ్రామ్‌లో సంచలనం సృష్టిస్తున్న అతడి స్ఫూర్తిదాయకమైన కథేంటంటే..ఆ యువకుడే ఫిట్నెస్ ఔత్సాహికుడు నమన్ చౌదరి. బరువు తగ్గడం బోరింగ్‌గా, క్లిష్టంగా ఉండకూడదని చెబుతున్నాడు. కేవలం తెలివిగా తినడం ఎలాగో తెలుసుకుంటే చాలు వెయిట్‌లాస్ అవ్వడం చాలా సులభమని చెబుతున్నాడు. అందుకోసం తాను ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారాలను తీసుకుంటూ..నిబద్ధతో ఉండటం నేర్చుకోవాలని చెబుతున్నాడు. ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారాలు కండరాలను బలంగా ఉంచి, ఆకలిని నియంత్రించడమే కాకుండా కొవ్వు తగ్గడానికి మద్దతిస్తుందని చెబుతున్నాడు. ఆ విధంగానే తాను మూడేళ్లలో 150 కిలోలు నుంచి 74 కిలోలకు చేరుకున్నాని, అలా మొత్తం 76 కిలోలు బరువు తగ్గానని చెప్పుకొచ్చాడు. అంతేగాదు బరువు తగ్గడానికి ఉపకరించిన తన ప్రోటీన్ భోజన ప్రణాళికను కూడా పంచుకున్నాడు.ప్రోటీన్ ఫుడ్ ప్లాన్..ఉదయం అల్పాహారం (400 కిలో కేలరీలు, 35 గ్రా ప్రోటీన్)ఎంపిక 1: 4 గుడ్డులోని తెల్లసొన + ఉల్లిపాయలు, టమోటాలతో గిలకొట్టిన ఆమ్లెట్, క్యాప్సికమ్ పాలకూరతో 50 గ్రా పనీర్ బుర్జీ, మల్టీగ్రెయిన్ టోస్ట్.ఎంపిక 2 (గుడ్లు లేకుండా): కూరగాయలతో 60 గ్రా సోయా ముక్కలు స్టైర్-ఫ్రై, 50 గ్రా తక్కువ కొవ్వు పనీర్ గ్రిల్, ఒక చిన్న మల్టీగ్రెయిన్ టోస్ట్.లంచ్ (350 కిలో కేలరీలు, 30 గ్రా ప్రోటీన్)లంచ్ కోసం, ఇది తేలికగా ఉంచడం గురించి కానీ భోజనంలో ప్రోటీన్ అధికంగా ఉండాలి. అతను 100 గ్రాముల సోయా ముక్కలు కర్రీ, 100 గ్రాముల ఉడికించిన బ్రోకలీ, ఒక చిన్న రోటీని ఎంచుకున్నాడు.సాయంత్రం స్నాక్ (200 కిలో కేలరీలు, 20 గ్రా ప్రోటీన్)చిప్స్ లేదా స్వీట్లకు బదులుగా, నామన్ 150 గ్రాముల తక్కువ కొవ్వు పనీర్ టిక్కాను ఎంచుకున్నాడు, పెరుగు, నిమ్మకాయ, సుగంధ ద్రవ్యాలతో మ్యారినేట్ చేసి, గ్రిల్ చేసిన లేదా వేయించినది.డిన్నర్ (350 కిలో కేలరీలు, 35 గ్రా ప్రోటీన్)నామన్ డిన్నర్ కోసం ఉడికించిన పప్పు (పప్పు), వేయించిన టోఫు లేదా పనీర్, కూరగాయలు దోసకాయ, టమోటా సలాడ్ ఒక చిన్న రోటీ తీసుకున్నట్లు తెలిపాడు.రోజువారీ మొత్తంకేలరీలు 1300–1400 కిలో కేలరీలు, దాదాపు 120 గ్రా ప్రోటీన్‌తో ఉంటాయి. ఇదే నమన్ కడుపు నిండి ఉండటానికి తోడ్పడింది. పైగా అతని వ్యాయామాలకు ఇంధనంగానూ, కండరాలను కోల్పోకుండా కొవ్వును కరిగించడానికి సహాయపడింది. నామన్ పంచుకున్న వాటిలాగే ప్రోటీన్ అధికంగా ఉండే తేలికైన భోజనం తినడం వల్ల కొవ్వు తగ్గడం వాస్తవికంగా స్థిరంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అందువల్ల ఫ్యాన్సీ ఫుడ్స్ లేదా విపరీతమైన డైట్స్ అవసరం లేదు. జస్ట్ ప్రోటీన్ అధికంగా, సమతుల్య పద్ధతిలో తింటే బరువు అదుపులో ఉంటుందని నమ్మకంగా చెబుతున్నారు నిపుణులు. View this post on Instagram A post shared by Naman Chaudhary (@sweat_with_nc) గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం(చదవండి: నానో బనానా ఏఐ చీర ట్రెండ్ ప్రకంపనం..! ప్లీజ్ సోమరిగా మారకు..) -
ఏడ్చేసిన షోయబ్ అక్తర్..! కాస్తైనా బుద్ధి లేదంటూ ఫ్యాన్స్ ఫైర్
పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు టీమిండియా (IND vs PAK) గట్టిగానే కౌంటర్ ఇచ్చింది. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ముఖాముఖి తలపడిన తొలి పోరులో దాయాదికి చుక్కలు చూపించింది. దుబాయ్ వేదికగా ఆసియా కప్-2025 (Asia Cup)లో సమిష్టి ప్రదర్శనతో రాణించి.. పాక్‌ను ఏడు వికెట్ల తేడాతో ఓడించింది.ఊహించని దెబ్బఅయితే, ఆట పరంగానే కాకుండా.. నైతికంగానూ భారత జట్టు పాకిస్తాన్‌ను ఊహించని దెబ్బ కొట్టింది. మైదానంలో పాక్ ఆటగాళ్లతో కరచాలనం చేసేందుకు భారత ఆటగాళ్లు నిరాకరించారు. అంతేకాదు.. షేక్‌హ్యాండ్ కోసం మరోసారి ప్రయత్నం చేసినా డ్రెసింగ్‌రూమ్ తలుపులు మూసివేసినట్లు సమాచారం.మంచిగానే బుద్ధి చెప్పారుఈ విషయంపై స్పందించిన టీమిండియా అభిమానులు.. ‘‘ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే దేశానికి మంచిగానే బుద్ధి చెప్పారు’’ అంటూ సోషల్ మీడియా వేదికగా భారత ఆటగాళ్లను సమర్థిస్తున్నారు. అయితే, పాకిస్తాన్ దిగ్గజ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ మాత్రం నో- షేక్‌హ్యాండ్ చర్యను జీర్ణించుకోలేకపోయాడు.‘‘నాకేం మాట్లాడాలో కూడా అర్థం కావడం లేదు. నా మనసు ముక్కలైంది. హ్యాట్సాఫ్ ఇండియా. కానీ మీరు క్రికెట్ మ్యాచ్‌ను రాజకీయాల నుంచి వేరుగా ఉంచండి. మీ గురించి మేము ఎన్నో గొప్ప విషయాలు చెప్పాము.అక్తర్ కంటతడిఅలాంటి మాకు ఈ నో-షేక్‌హ్యాండ్ చర్య గురించి కూడా ఏదైనా మాట్లాడే హక్కు ఉంటుంది. ప్రతి ఇంట్లోనూ గొడవలు జరుగుతూ ఉంటాయి. కానీ వాటినే గుర్తుపెట్టుకుని ఇలా చేయకూడదు. మరచిపోయి ముందుకు సాగిపోవాలి.ఇది క్రికెట్. చేతులు కలపండి. కాస్త దయ చూపండి’’ అంటూ అక్తర్ కంటతడి పెట్టుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ నేపథ్యంలో భారతీయ నెటిజన్లు అక్తర్‌కు దిమ్మతిరిగేలా కౌంటర్ ఇస్తున్నారు.షేక్‌హ్యాండ్ ఇవ్వనందుకే ఇంత బాధగా ఉంటే..‘‘అమాయకుల ప్రాణాలను పొట్టనబెట్టుకున్న ఉగ్రమూకల గురించి మర్చిపోవాలా?.. నువ్వు అసలు ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతోందా?.. షేక్‌హ్యాండ్ ఇవ్వనందుకే మీరు ఇంతగా బాధపడిపోతున్నారు.. తమ వారిని శాశ్వతంగా పోగొట్టుకున్న బాధితుల మనసులో ఎలాంటి అలజడి చెలరేగుతుందో మీరు కనీసం ఊహించగలరా?మ్యాచ్ గెలవడమే కాదు.. ఇలా వారికి సరైన బుద్ధి చెప్పినందుకు టీమిండియాకు హ్యాట్సాఫ్. దెబ్బ అదుర్స్’’ అంటూ అక్తర్ తీరును ఏకిపారేస్తూ.. సూర్యకుమార్ సేనకు శుభాకాంక్షలు చెబుతున్నారు. కాగా ఇటీవల కశ్మీర్‌లోని పహల్గామ్లో ఉగ్రవాదులు అమాయక పర్యాటకుల ప్రాణాలను పొట్టనబెట్టుకున్నారు.ఇందుకు బదులుగా భారత ఆర్మీ ఆపరేషన్ సిందూర్ పేరిట పాక్, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్ర స్థావరాలపై మెరుపు దాడులు చేసి ధ్వంసం చేసింది. ఈ క్రమంలో రంగంలోకి దిగిన పాకిస్తాన్ సైన్యం.. ఎదురుదాడికి ప్రయత్నించగా.. భారత్ సమర్థవంతంగా తిప్పికొట్టింది. ఇలాంటి ఉద్రిక్త పరిస్థితుల నడుమ ఆసియా కప్ టోర్నీలో టీమిండియా- పాక్ ముఖాముఖి తలపడటం గమనార్హం.చదవండి: IND vs PAK: చరిత్ర సృష్టించిన అభిషేక్ శర్మShoaib Akhtar crying over the handshake saga 😂 Same guy was chilling with Asim Munir & Afridi months back. Well done Surya – strike as deep as Nur Khan Air Base! 🔥🇮🇳 #INDvsPAK #IndianCricket #IndiaVsPakistan #aisacup2025 #indvspak2025 https://t.co/6O4XkugN8U pic.twitter.com/t9V8pCk0U8— Gaurav (@k_gauravs) September 15, 2025CAKEWALK 👏#TeamIndia cruise past Pakistan, chasing 127 inside 16 overs 🤩 Watch #DPWorldAsiaCup2025, from Sept 9-28 on the Sony Sports Network TV channels & Sony LIV.#SonySportsNetwork #INDvPAK pic.twitter.com/EncO07RSlD— Sony Sports Network (@SonySportsNetwk) September 14, 2025 -
ఆరోగ్య సంరక్షణలో భారత్ బెస్ట్..!
భారతదేశంలో నివశిస్తున్న అమెరికన్ మహిళ క్రిస్టెన్ ఫిషర్ ఆరోగ్య సంరక్షణపై నెట్టంట షేర్ చేసిన పోస్ట్ నెటిజన్ల మనసును దోచుకోవడమే కాదు చర్చనీయాంశంగా మారింది. అంతేగాదు అక్కా మీరు చాలా బాగా చెప్పారంటూ ఆము ప్రశంసల వర్షం కురింపించారు నెటిజన్లు. అంతేగాదు అత్యంత నిజాయితీగా మాట్లాడిన తీరు కూడా చాలా బాగుందని మెచ్చుకున్నారు. ఇంతకీ ఆమె పోస్ట్‌లో ఏం రాసిందంటే..భారతదేశంలో గత కొన్నేళ్లుగా నివశిస్తున్న క్రిస్టెన్ ఫిషర్ భారతదేశం, అమెరికాలోని ఆరోగ్య సంరక్షణ వ్యవస్థల తీరు ఎలా ఉంటుందో సోష్ల మీడియా వేదికగా షేర్ చేసుకుంది. ఇరు దేశాల్లోని ఆస్పత్రులు, వైద్యులు, మందులు పరంగా ఆరోగ్య సంరక్షణ ఏ దేశంలో బాగుంటుందో వెల్లడించింది. ఖర్చు, ఔషధాల పరంగా భారతదేశం బెటర్ అని, అదే యూఎస్‌లో ఈ పరంగా రోగిపై అత్యధిక భారం పడుతుందని తెలిపింది. అలాగే అపాయింట్మెంట్ దొరకడం కూడా కష్టం అని అన్నారు. భారత్‌లో అపాయింట్మెంట్తో పనిలేకుండానే క్లినిక్‌కి వెళ్లగలం, పైగా సమయం కూడా ఎక్కువ పట్టదని అంటోంది. అలాగే డాక్టర్లు వైద్యుడిని పర్యవేక్షించే విషయంలో కూడా భారత్ బెటర్ అని, ఎందుకంటే క్షుణ్ణంగా అతడిని విచారించి..చికిత్స అందిస్తుందని, యూఎస్‌లో రోగితో డాక్టర్ స్పెండ్ చేసే టైం చాలా తక్కువ, పైగా అంత సమయం కేటాయించేందుకు ఇష్టపడరనికూడా పేర్కొంది. ఇక ఆస్ప్రతిలో అందించే భోజనం పరంగా అమెరికా బెటర్ అని, కానీ రోగికి ఇచ్చే మెనూ ఆధారంగా వారి పర్యవేక్షకులకు అదే ఆహారం ఉంటుందని, అంత మెరుగ్గా లేదని అన్నారామె. మొత్తంగా చూస్తే ఆరోగ్య సంరక్షణ భారత్‌లోనే బాగుంటుంది, ఇక్కడ వైద్య ఖర్చు తక్కువే, పైగా మందులు కూడా సులభంగా దొరుకుతాయంటూ పోస్ట్‌లో తన అభిప్రాయాన్ని రాసుకొచ్చిందామె. ఈ పోస్ట్ నెట్టింట చర్చకు దారితీయడమే గాక, నిజాయితీగా తన అభిప్రాయాన్ని వెల్లడించిన తీరుకు నెటిజన్లు ఫిదా అయ్యారు. అదీగాక మా దేశాన్ని అభినందిస్తుందన్నందుకు అక్కా మీపై రోజురోజుకి గౌరవం పెరిగిపోతుందోందటూ పోస్ట్‌లు పెట్టారు నెటిజన్లు. కాగా, ఆమె గతంలో కూడా పలు విషయంలో భారత్‌లోనే పిల్లలు మంచిగా పెరుగుతారని, ఈ నేల నివశించడానికి అనువైనదని, ఎవ్వరినైనా తనలో కలిపేసుకునే ఆకర్షణ ఈ ప్రదేశంలో ఉందంటూ భారత్‌పై పొగడ్తల వర్షం కురిపించింది కూడా. View this post on Instagram A post shared by Kristen Fischer (@kristenfischer3) (చదవండి: ఆర్మీ ఆఫీసర్‌గా అందాలరాణి..!) -
షోరూంలో కారు బొక్కాబోర్లా.. స్పందించిన యువతి
నిమ్మకాయ తొక్కించబోయి.. ఓ మహిళా కొత్త కారును ఫస్ట్ ఫ్లోర్ నుంచి కింద పడేసిన సంగతి తెలిసిందే. ఢిల్లీ నర్మన్ విహార్‌లోని మహీంద్రా షోరూమ్‌లో ఈ ఘటన జరిగింది. ఈ ఘటనలో రూ.27 లక్షల విలువైన థార్ వాహనమూ(Thar Rox SUV) నాశనమైంది. అది మీడియా.. అంతకు మించి సోషల్ మీడియా దృష్టిని ఈ ఘటన ఆకర్షించింది. దీంతో ఆ కారును పడేసిన మాని పవార్ స్పందించింది. ఘజియాబాద్ ఇందిరాపురం ప్రాంతానికి చెందిన మాని పరివార్(29) తన భర్త ప్రదీప్‌తో కలిసి కొత్త కారు కోసం ఢిల్లీ నిర్మాణ్ విహార్‌కు వచ్చింది. అక్కడి శివ ఆటో కార్ మహీంద్రా షోరూంలో కారు కొనుగోలు చేసి ఇంటికి తీసుకెళ్లాలనుకుంది. అయితే.. కారును నిమ్మకాయ తొక్కించి షోరూమ్ ఫస్ట ఫ్లోర్ నుంచి కిందకు తీసుకురావాలని ప్రయత్నించింది. ఈలోపు.. పొరపాటును ఎక్సలేటర్‌ను బలంగా తొక్కడంతో హఠాత్తుగా కారు ముందుకు దూసుకెళ్లింది. షోరూం ఫస్ట్‌ఫ్లోర్ అద్దాలు బద్దలు కొట్టుకుని సినిమాలో యాక్షన్ సీన్ మాది 15 అడుగుల ఎత్తు ఎగిరి నేల మీద బొక్కబోర్లా పడిపోయింది. అయితే అదృష్టవశాత్తూ ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. ఆదివారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. ప్రమాదం తర్వాత వీడియో వైరల్ అయ్యింది, అందులో కారు తలకిందుగా రోడ్డుపై పడిపోయిన దృశ్యం కనిపించింది. అయితే.. సోషల్ మీడియాలో మాత్రం మరోలా ప్రచారం జరిగింది. ఈ ఘటనలో మాని పవార్ సహా భర్త, షోరూమ్ సిబ్బంది గాయపడ్డారని కొందరు, ఆమె ముఖం, ముక్కు పగిలిపోయానని మరికొందరు.. లేదు ఆమె చనిపోయిందంటూ ఇంకొందరు కథనాలు, పోస్టులు ఇచ్చారు. దీంతో మాని పవార్ స్పందించారు. నేను బతికే ఉన్నాను. దయచేసి ఫేక్ వీడియోలు పంచుకోవడం ఆపండి అంటూ వీడియో సందేశం ఉంచారామె. ఘటన సమయంలో కారులో నాతో పాటు షోరూమ్ సేల్స్‌మన్ వికాస్, కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. కారు అధిక ఇంజిన్‌తో పని చేస్తోందని అప్పటికే సేల్స్‌మన్ మాకు చెప్పారు. నిమ్మకాయల్ని తొక్కించే పూజ సమయంలో పొరపాటుగా ఎక్స్‌లేటర్ తొక్కడం వల్లే జరిగింది. షోరూమ్ గ్లాస్ బద్దలు కొట్టుకుని మరీ కిందపడిపోయింది. అదృష్టవశాత్తూ ఎయిర్బాగ్స్ తెరుచుకోవడం వల్ల మాకేం కాలేదు. సిబ్బంది సాయంతో పగిలిన ముందు భాగం నుంచి అంతా బయటకు వచ్చాం. ఫస్ట్ ఎయిడ్ తర్వాత ఇంటికి వచ్చేశాం. మేం క్షేమంగానే ఉన్నాం. పుకార్లను, వెటకారాలను దయచేసి ఆపండి. ఈ వీడియో చేయడం వెనుక ఉద్దేశం ఇదే’’ అని అన్నారామె. View this post on Instagram A post shared by 🌸 (@___maanniiiiii) -
చెమటలు గక్కిన హార్దిక్.. పడబోయిన రింకూ.. బీసీసీఐ వీడియో వైరల్
టీమిండియా ఆటగాళ్లు ‘బ్రాంకో టెస్టు’ (Bronco Test)లో భాగంగా చెమటలు గక్కారు. భారత జట్టు స్ట్రెంత్ అండ్ కండిషనింగ్ కోచ్ అడ్రియాన్ లీ రౌక్స్ (Adrian Le Roux) ఆధ్వర్యంలో కఠిన శ్రమకోరుస్తూ ప్రాక్టీస్ చేశారు. కాగా ఆటగాళ్ల ఫిట్నెస్ పరీక్ష కోసం భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఇటీవల బ్రాంకో టెస్టును ప్రవేశ పెట్టిన విషయం తెలిసిందే.1200 మీటర్ల పరుగుసాధారణంగా రగ్బీ ఆటగాళ్లు ఏరోబిక్, కార్టియోవాస్క్యులర్ కెపాసిటీని పెంచుకునేందుకు ఈ టెస్టును ఉపయోగిస్తున్నారు. ఇందులో 0 మీటర్ల నుంచి మొదలు పెట్టి 60 మీ... పరిగెత్తి.. ఆ తర్వాత 0- 40 మీ.. 0-20 మీ. పరుగు తీయాలి. మొత్తంగా 240 మీటర్లను ఓ సెట్లో పూర్తి చేయాలి. మొత్తంగా ఐదు సెట్లను అంటే.. 1200 మీటర్లను ఆరు నిమిషాల్లో పూర్తి చేయాలి.చెమటలు గక్కిన హార్దిక్.. పడబోయిన రింకూఇక ఆసియా కప్-2025లో భాగంగా సెప్టెంబరు 14నాటి పాకిస్తాన్‌తో మ్యాచ్‌కు టీమిండియా తీవ్రంగా శ్రమిస్తోంది. ఈ క్రమంలో మైదానంలోనే రౌక్స్.. ఆటగాళ్లకు బ్రాంకో టెస్టు నిర్వహించాడు. ఇందుకు సంబంధించిన వీడియోను బీసీసీఐ విడుదల చేసింది. హార్దిక్ పాండ్యా, జస్ప్రీత్ బుమ్రా చెమటలు గక్కగా.. రింకూ కిందపడిపోబోయాడు. మిగతా ఆటగాళ్లు సైతం పరుగు పూర్తి చేసేందుకు తీవ్రంగా కష్టపడ్డారు.ప్రపంచంలోని ఏ మూలకు వెళ్లినాఈ విషయం గురించి రౌక్స్ మాట్లాడుతూ.. ‘‘ఈరోజు మేము బ్రాంకో టెస్టు రన్ చేశాము. ఇదేమీ కొత్త రకం పరీక్ష కాదు. వివిధ క్రీడల్లో ఇప్పటికే చాలా ఏళ్లుగా దీనిని వాడుతున్నారు.ఇదొక ఫీల్డ్ టెస్టు. ఎక్కడైనా దీనిని నిర్వహించవచ్చు. ప్రపంచంలోని ఏ మూలకు వెళ్లినా మేము దీనిని ఉపయోగించుకోవచ్చు. ట్రెయినింగ్ పరంగా.. ఆటగాళ్ల శారీరక దృఢత్వాన్ని పరీక్షించేందుకు .. ఇలా రెండు విధాలుగా ఇది ఉపయోగపడుతుంది.శారీరకంగా బలంగా ఉంటేనే..ఆటగాళ్ల ఏరోబిక్ ఫిట్నెస్ పెంచుకోవడానికి సహకరిస్తుంది. క్రికెట్ నైపుణ్యాలతో కూడిన ఆట. అయితే, ఆటగాళ్లు పూర్తి ఫిట్‌గా ఉన్నపుడే వారి కెరీర్సుదర్ఘీ కాలం కొనసాగుతుంది. శారీరకంగా బలంగా ఉన్నపుడే అన్ని రకాల సవాళ్లకు ఆటగాళ్లు సిద్ధం కాగలుగుతారు. మా ఆటగాళ్లు అద్బుతం. వారి హార్డ్‌వర్క్‌తో నన్నెంతగానో ఆకట్టుకుంటున్నారు.నేను గతంలో ఐపీఎల్ జట్లతో పనిచేశాను. ఎంతో మంది ఆటగాళ్లను చూశాను. ఇప్పుడిది నాకు కొత్త జట్టే. అయినా.. గతంలో ఇక్కడ పనిచేసిన అనుభవం నాకు ఉంది. ఇలాంటి పోరాట పటిమ ఉన్న జట్టుతో కలిసి ఉండటం గర్వంగా ఉంది’’ అని జట్టు పట్ల సంతృప్తి వ్యక్తం చేశాడు.చదవండి: 21 సార్లు డకౌట్ అయినా సరే.. జట్టులోనే.. అతడికి గంభీర్ చెప్పిందిదే.. View this post on Instagram A post shared by Team India (@indiancricketteam) -
వాటే పబ్లిక్ టాయిలెట్.. టూరిస్ట్ స్పాటా..?!
టూరిస్ట్ స్పాట్ అనగానే ఏ అద్భుతమైన ప్రకృతి దృశ్యమో లేక మిస్టరీ ప్రదేశాలో అనుకుంటాం. కానీ ఇలాంటి టూరిస్ట్ స్పాట్ ఒకటి ఉందని అస్సలు ఊహించరు. ఆ ప్రదేశం పేరు వినగానే ఇదేం పర్యాటక ప్రదేశం రా బాబు అని తలపట్టుకుంటారు. కానీ చూస్తే మాత్రం..దీన్ని పర్యాటక ప్రదేశంగా మార్చాలన్న వారి అద్భుత ఆలోచనను ప్రశంసించకుండా ఉండలేరు. ఇంతకీ అదేంటో చక చక చదివేయండి మరి..చైనాలోని గన్సు ప్రావిన్స్‌లోని డన్హువాంగ్ నైట్ మార్కెట్లో కొత్తగా పునరుద్ధరించిన పబ్లిక్ టాయిలెట్ ఊహించని విధంగా సాంస్కృతిక ఆకర్షణగా మారింది. ఓ సాధారణ రెస్ట్‌రూమ్‌కి ఇంత క్రేజ్ ఏంటా అనే కదా..!. అయితే ఇది అలాంటి ఇలాంటి రెస్ట్రూమ్ కాదు. "డన్హువాంగ్ ప్యూర్ రియల్మ్ పబ్లిక్ కల్చరల్ స్పేస్"గా పిలిచే ఈ టాయిలెట్ యునెస్కోలో చోటు దక్కించుకున్న ప్రసిద్ధ మొగావో గుహలకు నిలయంగా కళాత్మకంగా తీర్చిదిద్దారు. చారిత్రాత్మక కళా నైపుణ్యానికి నిదర్శనంగా ఉంటుంది ఈ రెస్ట్రూమ్. చెప్పాలంటే వారసత్వ కళకు ప్రతిబింబంలా ఉంటుంది ఈ పబ్లిక్ టాయిలెట్ రూపురేఖలు. రెండు అంతస్తుల్లో విస్తరించి ఉన్న ఈ డన్హువాంగ్ పబ్లిక్ టాయిలెట్ సంస్కృతికి అర్థం పట్టేలా కుడ్య చిత్రాలు, ఏదో రాజదర్బారులో ఉన్న అనుభూతిని ఇస్తాయి. బయటి భాగంలో అల్ట్రా క్లియర్ గాజు కర్టెన్ గోడలు ఉన్నాయి. అంతేకాదండోయ్ ఈ రెస్ట్రూమ్లో యాంటీ బ్యాక్టీరియల్ నర్సింగ్ టేబుల్స్, చైల్డ్ సేఫ్టీ సీట్లు, స్వీయ క్లీనింగ్ సిస్టమ్‌తో కూడిన పాలిచ్చే తల్లుల కోసం ప్రత్యేకంగా ఓ గది కూడా ఉంది. అలాగే ఇక్కడ సౌకర్యవంతమైన సీటింగ్ ప్రదేశం తోపాటు డ్రింక్ డిస్పెన్సర్లు, వృద్ధులు, వికలాంగులకు అనువైన సౌకర్యాలు కూడా ఇక్కడ ఉన్నాయి. ఈ ఆగస్టు 16న ప్రారంభించిన ఈ పబ్లిక్ టాయిలెట్ అతి కొద్ది సమయంలోనే పర్యాటకులకు ఇష్టపమైన స్పాట్‌గా మారిపోయింది. దీన్ని సందర్శించడానికి పర్యాటకులు సాంప్రదాయ హన్పు దుస్తులను కూడా ధరిస్తారట. అందుకు సంబంధించిన వీడీయో నెట్టింట సంచలనం సృష్టించడమే గాదు, రకరకాల చర్చలకు దారితీసింది కూడా. View this post on Instagram A post shared by China Exploring (@china__exploring) (చదవండి: ఫిఫ్టీ ప్లస్.. టాలెంట్ జోష్..! యాభై దాటాకా లైఫ్ స్టార్ట్ అంటున్న 'ఖ్యాల్') -
మైఖేల్ జాక్సన్‌ని తలపించేలా ఆ పక్షి డ్యాన్స్‌కి ఫిదా అవ్వాల్సిందే..!
ఈ ప్రకృతి ఆశ్చర్యంగొలిపే వింతలకు నెలవు. అందులోనూ పక్షులు గురించి ప్రత్యేకగా చెప్పాల్సిన పనిలేదు. ప్రతి పక్షి ఒక్కో ప్రత్యేకతతో అద్భుతం చేస్తుంటాయి. అలాంటి అందమైన పక్షుల్లో ఒకటి ఈ మనాకిన్ అనే ఎర్రటి టోపి పక్షి. వీటిని టోపీ పక్షులు అని కూడా పిలుస్తారు. ఇది అచ్చం మనుషుల మాదిరిగా డ్యాన్స్ చేస్తుందని విన్నారా..?. అది కూడా బ్రేక్ డ్యాన్స్‌లకు పేరుగాంచిన పాప్ రారాజు మైఖేల్ జాక్సన్‌ని తలపించేలా అద్భుతంగా చేస్తోంది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ చక్కెర్లు కొడుతోంది. ఆ వీడియోలో కోస్టారికాలో ఎర్రటి టోపీతో ఉండే మానకిన్ పక్షి అచ్చం మేఖేల్ జాక్సన్ చేసిన మూన్‌వాక్ డ్యాన్స్ మాదిరిగా నృత్యాన్ని ప్రదర్శించింది. దాని మ్యాజిక్ స్టెప్లు చూస్తే కళ్లుఆర్పడం మరిచిపోతాం. అంతలా కాళ్లు అద్భుతంగా కదుపుతోంది. ఇంతవరకు ఈ పక్షుల ఎర్రటి టోపీనే ప్రధాన ఆకర్షణగా ఉండేది. ఇప్పుడూ యూట్యూబర్ పీటర్ బాంబౌసెక్ షేర్ చేసిన వీడియో పుణ్యమా అని డ్యాన్స్‌కి పేరుగాంచిన పక్షులుగా పేరుగాంచుతాయేమో. కాగా, ఈ పక్షులు దక్షిణ అమెరికాలో నివసిస్తాయి. ఇవి ఎక్కువగా బెలిజ్, కొలంబియా, కోస్టారికా, ఈక్వెడార్, గ్వాటెమాల, హోండురాస్, మెక్సికో, నికరాగ్వా, పనామా వంటి దేశాల్లో కనిపిస్తాయి. అవి ఇలా నృత్యం చేసి ఆడపక్షులను ఆకర్షించి సంతానాన్ని పొందుతాయట. ఇంకెందుకు ఆలస్యం ఆ పక్షి అందమైన డ్యాన్స్‌పై మీరు ఓ లుక్కేయండి మరి..!.. (చదవండి: 'కంగ్రాట్యులేటరీ మనీ ఆన్ డెలివరీ' గురించి విన్నారా..?) -
ఆ దేశంలో తల్లులకు ఆర్థిక భరోసా వేరే లెవెల్..!
వర్కింగ్ విమెన్ ప్రెగ్నెంట్ అయితే..కొన్ని కార్పొరేట్ కంపెనీలు నిర్థాక్షిణ్యంగా తొలిగించిన ఉదంతాలను చూశాం. కానీ ఈ దేశంలో ఓ విదేశీ మహిళ ప్రెగ్నెంట్ అయితే అక్కడి ప్రభుత్వం అండగా నిలబడి ఆర్థిక సాయం అందించింది. ఆ ప్రసూతి సాయం డెలివరీ అయినా తర్వాత కూడా నిరంతరాయంగా కొనసాగడం విశేషం. ఇంతకీ అదంతా ఎక్కడంటే..దక్షిణ కొరియాలో నేహా అరోరా అనే భారత సంతతి తల్లికి తన గర్భధారణ సమయంలో అక్కడి ప్రభుత్వం అందించిన ఆర్థిక మద్దతు గురించి నెట్టింట షేర్ చేసుకున్నారు. దక్షిణ కొరియా ప్రభుత్వం కాబోయే తల్లులకు అందించే ఆర్థిక సహాయన్ని గురించి సవివరంగా విని నెటిజన్లు సైతం విస్తుపోయారు. ఆ ఆర్థిక సాయం ఎలా ఉంటుందంటే..నెహా తాను ప్రెగ్నెంట్ అని నిర్థారణ అయ్యిన వెంటనే వైద్య పరీక్షలు, మందులు తదితరాలన్నింటికి అక్కడి కొరియా ప్రభుత్వం రూ. 63,100 ఇచ్చిందని, దాంతోపాటు బస్సు/టాక్సీ లేదా ప్రైవేట్ వాహనం వంటి ట్రావెల్ ఖర్చుల కోసం అదనం రూ. 44,030లు అందించినట్లు వెల్లడించింది. ఇలాంటి సహాయం డెలివరీ సమయంలో సైతం అందించిందని, ప్రసవ సమయంలో ఒకేసారి సుమారు రూ. 1.26 లక్షలు దాక ఆర్థిక సహాయం అందించిందని చెప్పుకొచ్చింది. దీనిని అధికారికంగా “కంగ్రాగ్యులేటరీ మనీ ఆన్ డెలివరీ(అభినందన ప్రసూతి సహాయం)” అని పిలుస్తారని కూడా తెలిపింది. ఈ ఆర్థిక మద్దతు తన బిడ్డ పుట్టాక కూడా కొనసాగిందని, నెలవారీగా ఆర్థిక సహాయ అందించినట్లు వెల్లడించింది. అంటే..నవజాత శిశువు తొలి ఏడాది ప్రతి నెల రూ. 63,100, రెండో ఏడాది నెలకు రూ. 31,000 చోప్పున..అలా తన బిడ్డకు ఎనిమిదేళ్లు వచ్చే వరకు రూ. 12,600లు చొప్పున ఆర్థిక సహాయం అందించిందని ఇన్స్టాగ్రామ్ పోస్ట్‌లో వెల్లడించడమే గాక అందుకు సంబంధించిన వీడియోని కూడా షేర్ చేసింది. ఈ పోస్ట్‌ని చూసిన నెటిజన్లు దక్షిణ కొరియా ప్రభుత్వం ప్రసూతి ప్రయోజనాలను ప్రశంసించడమే గాక భారతదేశంలో అందించే ప్రసూతి ప్రయోజనాలతో పోల్చారు. అలాగే దక్షిణ కొరియా కుటుంబాలు, పిల్లల సంరక్షణను పట్ల ఎంతలా కేర్ తీసుకుంటుందో అవగతమవుతోందంటూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by Neha Arora (@mylovefromkorea17) (చదవండి: 'నాన్ డైరియల్ డీహైడ్రేషన్'..! సాధారణ నీటితో భర్తీ చేయలేం..) -
నేపాల్‌లో భయానకం.. మంత్రులు, కుటుంబాలే టార్గెట్
ఖాట్మాండు: నేపాల్‌లో దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నేపాల్‌లో ‘జన్ జి’ పేరుతో యువతరం చేపట్టిన ఆందోళనలు పీక్ స్టేజ్‌కు చేరుకున్నాయి. యువత ఆందోళనలు చివరకు హింసకు దారితీశాయి. సహనం కోల్పోయిన నిరసనకారులు, పాలకులను తరిమి తరిమికొట్టారు. ఈ క్రమంలో నేపాల్‌కు చెందిన ఓ మంత్రి, ఆయన కుటుంబ సభ్యులు.. తమ ప్రాణాలను అరచేతిలో పట్టుకుని హెలికాప్టర్లో తప్పించుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.వివరాల ప్రకారం.. నేపాల్‌లో సోషల్ మీడియాపై బ్యాన్ అనంతరం దారుణ పరిస్థితులు చోటుచేసుకుంటున్నాయి. నేపాల్ రాజధాని ఖాట్మాండులో నిరసనకారులు రెచ్చిపోయారు. భారీ సంఖ్యలో తరలివచ్చిన యువత.. మంత్రులు, ప్రభుత్వ అధికారుల ఇళ్లను ధ్వంసం చేశారు. అంతటితో ఆగకుండా నేపాల్ పార్లమెంట్ భవనానికి నిప్పంటించారు. డిప్యూటీ పీఎం ఆర్థిక మంత్రి బిష్ణు పౌడెల్ నివాసంపై రాళ్లు రువ్వారు. నేపాల్ ఆర్థిక మంత్రిని వీధిలో నిరసనకారులు వెంబడిస్తుంటే.. ఎదురుగా వచ్చిన ఓ యువకుడు ఆయనను ఎగిరి తన్నుతున్న దృశ్యాలు, విదేశాంగ మంత్రి అర్జు రాణా దేవ్బా, ఆమె భర్త, మాజీ ప్రధాని, నేపాలి కాంగ్రెస్ చీఫ్ షేర్ బహదూర్ దేవ్బాలను ఇంట్లోనే దాడి చేసిన దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి.Parliment in Nepal. Better than voting. pic.twitter.com/NtFehqsycr— ADAM (@AdameMedia) September 10, 2025మరోవైపు..మాజీ ప్రధాని దేవ్బా ముఖానికి రక్తమోడుతూ నిస్సహాయంగా కూర్చున్న దృశ్యం కనిపించింది. తరువాత అధికారులు అక్కడకు చేరుకొని ఆయనను రక్షించారు. ఖాట్మాండు హోటల్‌పై ఎగురుతున్న హెలికాప్టర్లో అధికారులను తరలిస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సైన్యానికి చెందిన హెలికాప్టర్లు కొంతమంది మంత్రులు, వారి కుటుంబాలను సురక్షిత ప్రదేశాలకు తరలించగలిగాయి. పలువురు మంత్రులు హెలికాప్టర్ సాయంతో సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లారు.Politicians escaping the wrath of the people in Nepal pic.twitter.com/tia5JjkqmL— jim Njue (@jimNjue_) September 10, 2025ఇదిలా ఉండగా.. నేపాల్‌లో ఆందోళనలు, అల్లర్లు జైళ్లకు సైతం వ్యాపించాయి. జైళ్లలో నిప్పుపెట్టి, భద్రతా సిబ్బందిని భయభ్రాంతులకు గురిచేసి దేశవ్యాప్తంగా ఆయా జైళ్ల నుంచి దాదాపు 7,000 మంది ఖైదీలు పరారయ్యారు. హోం మంత్రిత్వ శాఖ వర్గాల సమాచారం ప్రకారం ఢిల్లీ బజార్ జైలు నుంచి 1,100 మంది, చిత్వన్-700, నక్కు-1,200, సున్సారి జిల్లా జుంప్కా జైలు-1,575.. కంచన్‌పూర్-450, కైలాలి-612, జలేశ్వర్-576, కాస్కి-773, డాంగ్-124, జుమ్లా-36, సొలుఖుంబు-86, గౌర్-260, బజ్హాంగ్ జైలు నుంచి 65 తప్పించుకున్నారు. మరోవైపు.. నేపాల్‌లో కల్లోల పరిస్థితులను చక్కదిద్దడానికి సైన్యం రంగంలోకి దిగింది. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని సైన్యం ఆదేశించింది. అల్లర్లతో అస్తవ్యస్తమైన నగరంలో శాంతి నెలకొల్పేందుకు సైన్యం కృషి చేస్తోంది.🚨 BREAKING: In response to growing unrest in Nepal, the Nepalese Army deployed a Hindustan ALH Dhruv NA-054 helicopter to transport members of parliament to a safer location. The move comes amid rising tensions and concerns over security. 🇳🇵 #NepalUpdate pic.twitter.com/TuKEoKupn2— Fahad Naim (@Fahadnaimb) September 9, 2025 -
కదులుతున్న ఆటోలో.. ఆమె సాహసాన్ని చూస్తే షాకే!
పంజాబ్‌లో ఓ మహిళ.. దొంగలతో ధైర్యంగా పోరాడి తప్పించుకున్న ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పట్టపగలే ఆటోలో మహిళను దోచుకోవడానికి ప్రయత్నించిన షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. జలంధర్-లుథియానా జాతీయ రహదారిపై ఈ ఘటన చోటుచేసుకుంది. ఆ మహిళ ఫిల్లౌర్‌కు వెళ్లేందుకు ఆటోలో ప్రయాణిస్తుండగా, డ్రైవర్‌తో పాటు ఇద్దరు వ్యక్తులు ఆమెను బెదిరించి దోచుకునేందుకు ప్రయత్నించారు.అయితే, ఆమె ధైర్యంగా దుండగులను ప్రతిఘటించింది.. ఆటో నుంచి బయటకు వేలాడుతూ సాయం కోసం అరవడం ప్రారంభించింది. ఆమె దాదాపు అర కిలోమీటర్ వరకు వేలాడుతూ సాయం కోసం ఆమె పిలుస్తూనే ఉంది. ఇంతలో, వెనుక కారులో ప్రయాణిస్తున్న కొంతమంది యువకులు ఆటోను వెంబడించారు. ఆమె సాహసాన్ని వీడియో తీశారు. దొంగలను పట్టుకోవడానికి వారు సాయం చేశారు.ఆటో వేగంగా వెళ్లి ఒక కారును ఢీకొట్టింది. చివరికి ఆటో బోల్తా పడింది. దాంతో ఇద్దరు దొంగలను స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. నిందితుల్లో ఓ వ్యక్తి పరారయ్యాడు. ఈ వీడియోలో ఆ మహిళ ఆటోకు బయట వేలాడుతూ దొంగల్ని ఎదుర్కొంటున్న దృశ్యాలు వీడియోలో కనిపిస్తాయి. ధైర్యంతో ఆమె తన ప్రాణాలను కాపాడుకోవడమే కాకుండా దొంగలను కూడా పట్టించగలిగిందని.. ఈ ఘటన మహిళల ధైర్యానికి నిదర్శనమంటూ నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.In an extremely courageous act, a Ludhiana woman saved herself from a robbery in a moving auto by clinging on the vehicle while signalling for help from other commuters. Three robbers who tried to snatch her phone and money inside auto arrested by @Ludhiana_Police @IndianExpress pic.twitter.com/N7KXS62Olp— Divya Goyal (@divya5521) September 10, 2025 -
నెలకు రూ.18 వేలు జీతం.. ప్రపంచంలోనే రిచ్..
ఒకప్పుడు నెలకు రూ.18,000 వేతనం వస్తున్నా, దేశంలోని ఖరీదైన నగరాల్లో ఒకటైన బెంగళూరులో నివసిస్తూ సంతోషంగా ఉన్నానని ఓ మహిళ ఉద్యోగి తన అనుభవాన్ని పంచుకున్నారు. ప్రస్తుతం దుబాయ్‌లో గతంలో కంటే భారీగా జీతం సంపాదిస్తున్నా అప్పటి సంతోషాన్ని, ఆనందాన్ని పొందలేకపోతున్నట్లు సామాజిక మాధ్యమాల్లో చేసిన పోస్ట్ ద్వారా చెప్పుకొచ్చారు. ఇదికాస్తా నెటిజన్ల కంటపడి వైరల్‌గా మారింది.సీమా పురోహిత్ తన ఇన్స్టాగ్రామ్ పేజీలో చేసిన పోస్ట్‌లోని వివరాల ప్రకారం..‘బెంగళూరులో నా మొదటి ఉద్యోగం గురించి మాట్లాడాలనుకుంటున్నాను. నెలకు కేవలం రూ.18,000 సంపాదిస్తూ, దాన్ని అదృష్టంగా భావించి, సంతోషంగా జీవించాను. ఆ సమయంలో ప్రపంచంలోనే అత్యంత ధనిక అమ్మాయిగా నేను ఫీల్ అయ్యాను. తక్కువ జీతంతో కూడా జీవితంలో చాలా ఆనందంగా ఉన్నాను. బెంగళూరులో పీజీ ఫీజు చెల్లించడానికి, వీధుల్లో షాపింగ్ చేయడానికి, క్యాంటీన్లో తినడానికి, ప్రతి వారాంతంలో స్నేహితులతో కలిసి పార్టీ చేసుకోవడానికి పోను ఇంకా కొంచెం డబ్బు మిగిలి ఉండేది’ అని చెప్పారు.‘ప్రస్తుతం దుబాయ్‌లో పని చేస్తున్నాను. గతంలో కంటే భారీగానే వేతనం వస్తుంది. కానీ జీవితంలో సంతోషం కోల్పోయాను. అప్పటి ఆనందాన్ని చాలా మిస్ అవుతున్నాను’ అని వీడియోలో చెప్పుకొచ్చారు. ఆమె మాటలు ఆన్లైన్లో చాలా మందికి కనెక్ట్ అయ్యాయి. దాంతో నెటిజన్లు స్పందిస్తున్నారు. ‘మీరు చెప్పింది నిజమే.. ఇక్కడి జీవితం నాకు అసంతృప్తిగానే ఉంది’అని ఒకరు రిప్లై ఇచ్చారు. ‘పని-జీవిత సమతుల్యత, మానసిక ఆరోగ్యంపై చాలా మంది ఆందోళన చెందుతున్నారు’ అని మరొకరు కామెంట్ చేశారు. View this post on Instagram A post shared by Seema (@seemapurohit018)ఇదీ చదవండి: అంతకంతకూ పెరుగుతోన్న పసిడి ధర! -
ఇది ఫ్యామిలీ ఫ్లైట్..!
‘మా అమ్మాయి పైలట్’ ‘నా మనవరాలు పైలట్’ అని చెప్పుకోవడంలో సంతోషం ఉంది. అంతకంటే ఎక్కువ సంతోషం ఆమె నడుపుతున్న విమానంలో ప్రయాణించడంలో ఉంది. ఇండిగో పైలట్ తనిష్క ముగ్దల్ తల్లిదండ్రులు, తాత, అమ్మమ్మలకు విమానం ఎక్కడం అదే మొదటి సారి. అది తమ ఇంటి ఆడబిడ్డ నడిపే విమానం. యూనిఫామ్‌లో ఉన్న తనిష్క ఆనందబాష్పాలతో అమ్మా,నాన్నలు, తాత,అమ్మమ్మలకు ఇండిగో విమానంలో స్వాగతం పలుకుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వీడియో క్లిప్‌లో భారీ సంభాషణలు, గ్రాఫిక్స్ హంగామా లేకపోవచ్చు. భావోద్వేగాలే బలం అయ్యాయి.ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తూ...‘అమ్మానాన్నల ప్రోత్సాహం, చేసిన ప్రార్థనలు, చేసిన త్యాగాలు నేను పైలట్ కావడానికి తోడ్పడ్డాయి’ అని రాసింది తనిష్క. ‘ఆ తల్లిదండ్రుల కళ్లలో ఎంత సంతోషం కనిపిస్తుందో చూడండి’‘పిల్లలు మంచి స్థాయికి వెళ్లినప్పుడు, ఆ స్థాయిని కళ్లారా చూసినప్పుడు, వారికి అంతకు మించిన శక్తి ఏముంటుంది!’ ‘మనం ఎంత పెద్ద స్థాయికి వెళ్లినా తల్లిదండ్రులను ఎప్పుడూ గుండెలో పెట్టుకోవాలి’... ఇలాంటి కామెంట్స్ ఎన్నో నెటిజనుల నుంచి వచ్చాయి. View this post on Instagram A post shared by Tanishka Mudgal ♥️ | aviation | travel | fashion (@pilottanishka) (చదవండి: విలేజ్ సైంటిస్ట్ బనిత) -
విలేజ్ సైంటిస్ట్ బనిత
‘అలా సరే, ఇలా అయితే ఎలా ఉంటుంది?’ అని ఆలోచించడమే ఆవిష్కరణ. వచ్చిన ఆలోచనను ఇష్టపడి, కష్టపడి నిజం చేసుకోవడమే ఆవిష్కరణ. ‘మేక్ ఇన్ ఇండియా’ నినాదం ఆమెకు తెలుసో లేదో తెలియదు. ఆమె సైన్స్ పుస్తకాలు చదివింది కూడా లేదు. అయితే కొత్త కొత్త ఆవిష్కరణలు అంటే ఆమె ఇష్టం. అదే సమయంలో మనం మరిచిపోయిన సంప్రదాయ వస్తువులు అంటే ఇష్టం. వాటిని ఈ తరానికి పరిచయం చేసి తిరిగి వినియోగంలోకి తీసుకురావడం అంటే ఇష్టం.పశ్చిమబెంగాల్లోని గ్రామీణ ప్రాంతానికి చెందిన బనితకు ఇన్‌స్టాగ్రామ్‌లో లక్షమందికి పైగాఫాలోవర్స్ ఉన్నారు. ఎప్పుడూ ఏదో కొత్త ఆవిష్కరణ చేస్తూ ఆ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తుంటుంది.ఇందులో ఎన్నో వీడియోలు వైరల్ అయ్యాయి. తాజాగా...ఫ్యాన్ స్ట్రక్చర్, ప్లాస్టిక్ బాక్స్,నీళ్లు, ఐస్, వైర్లను ఉపయోగించి ‘మినీ ఏసీ’ తయారుచేసింది. ‘ఇది ఎలా పనిచేస్తుందో తెలుసా? ఎలా తయారుచేయాలో తెలుసా?’ అంటూ డెమో కూడా ఇచ్చింది.‘విలేజ్‌లైఫ్ విత్ బనిత’ ట్యాగ్‌లైన్‌తో బనిత ఇన్స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌లలో పోస్ట్ చేసే వీడియోలు సంభ్రమాశ్చర్యాలకు గురి చేయడమే కాదు పట్టణ, గ్రామీణ ప్రాంత పేద ప్రజలకు ఎంతో ఉపయోగపడుతున్నాయి. (చదవండి: చేతుల పరిశుభ్రత కోసం..!) -
Viral Video: కాటేసిన పామును మెడలో వేసుకున్న వ్యక్తీ
-
'మా నాన్న గ్రాడ్యుయేట్'..!
అందరికి ఉన్నత విద్యను అభ్యసించే అవకాశం లభించదు. కుటుంబ బాధ్యతల రీత్యా కొందరికి అది అందని ద్రాక్షలా ఉంటుంది. అలాంటి వాళ్లు తమకు అవకాశం చిక్కినప్పుడు వయోభారాన్ని సైతం పక్కన పెట్టి చదవాలనుకున్న కోర్సులని చదివేయడమే కాదు ఉత్తీర్ణులై ఆశ్చర్యపరుస్తారు. అలాంటి అద్భుత ఘట్టమే ఇక్కడ చోటు చేసుకుంది. దాన్ని అతని కొడుకు ఎలా సెలబ్రేట్ చేశాడో చూస్తే మాత్రం విస్తుపోతారు. అందుకు సంబంధించిన వీడియ నెట్టింట తెగ వైరల్‌గా మారింది 52 ఏళ్ల ముంబై వ్యక్తి ఎంబిఏ పట్టాని సంపాదించి అద్భుతమైన మైలు రాయిని సాధించాడు. చదవాలనే జిజ్ఞాశ ఉంటే వయసు ఆశయానికి అడ్డంకి కాదని ప్రూవ్ చేశాడు. ఆ అపురూప క్షణాన్ని అతడి కుమారుడు మైత్రేయ సాథే ఎంత అందంగా గుర్తుండిపోయేలా సెలబ్రేట్ చేశాడంటే..ఆ తండ్రి ఆ సర్‌ప్రైజ్‌కి ఉబ్బితబ్బిబైపోయాడు. తన తండ్రి ముఖాకృతితో కూడిన గ్రాడ్యుయేట్ క్యాప్‌ని ముఖానికి పెట్టుకుని దర్శనమిస్తూ..కంగ్రాట్స్ చెబుతారు. ఆ అనుహ్యపరిణామానికి నోట మాటరాక ఒక్క క్షణంపాటు బిగిసుకుపోయి..ఆ తర్వాత తేరుకుని చిరునవ్వులు చిందిస్తాడు ఆ తండ్రి. అంతేగాదు అతడి కోసం కుటుంబం మొత్తం రాసిన కలర్‌ఫుల్ సందేశాల నోట్స్‌ని చదువుతూ..ఉప్పొంగిపోతాడు. పైగా ఆ ఘన సత్కారానికి ఆ తండ్రి ముఖం చిచ్చుబుడ్డిలా కాంతిగా వెలిగిపోతుంది. అందుకు సంబంధించిన వీడియోకి ..'మా నాన్న గ్రాడ్యుయేట్' అనే క్యాప్షన్ జత చేసి మరి పోస్ట్ చేశాడు. ఆన్లైన్లో ఇలాంటి విస్తుపోయే కథలెన్ని చూసినా..ఓ తండ్రి తన ఆశయాన్ని నెరవేర్చుకున్నప్పుడూ అతడి మొత్తం కుటుంబమే సంబంరంలో మునిగిపోతుంది. వయసులో ఉన్నప్పుడూ సాధించిన విజయం కంటే వయసు మళ్లినప్పుడూ అంతే ఉత్సాహంతో విజయం సాధిస్తే ఆ కిక్కే వేరు, పైగా ఫ్యామిలీ ముందు హీరో రేంజ్లో ఫోజులిచ్చే ఛాన్స్‌ని కొట్టేయొచ్చు కదూ..! View this post on Instagram A post shared by Maitreya Sathe 「マイトレヤ サテェ」 (@maitreyasathe) (చదవండి: వర్షం సైతం ఆ నృత్యాన్ని అడ్డుకోలేకపోయింది..!) -
ట్రంప్ తీరుతో ఇబ్బందిపడ్డ మనవరాలు!
యూఎస్ ఓపెన్ 2025 ఫైనల్ సందర్భంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. న్యూయార్క్ క్వీన్స్ వేదిక వద్దకు ట్రంప్ రాక సందర్భంగా భద్రతా తనిఖీలతో అభిమానులు తీవ్ర అవస్థలు పడ్డారు. ఈ క్రమంలో.. అర్థర్ యాష్ స్టేడియం రోల్స్ బాక్స్ వద్దకు వచ్చి అభివాదం చేసిన ఆయనకు.. చీర్స్‌తో పాటు బూస్(నిరసనగా చేసే నినాదాలు) స్వాగతం పలికాయి. తమను ఇబ్బందిపెట్టినందుకు టెన్నిస్ అభిమానులు ఆయన్ని తిట్టిపోశారు. ఈ క్రమంలో.. మరో ఆసక్తికరమైన అంశమూ తెర మీదకు వచ్చింది.ట్రంప్ మనవరాలు అరబెల్లా కుష్నర్(18) ఆయన తీరుతో ఇబ్బందిపడినట్లుగా ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ట్రంప్ మొదటి భార్య ఇవానా కూతురు ఇవాంకా. ఇవాంకా భర్త జారెడ్ కుష్నర్ కాగా.. వీళ్లిద్దరికి ముగ్గురు సంతానం. అందులో పెద్ద కూతురు అరబెల్లా. ట్రంప్ కుటుంబంతో తరచూ ఈమె మీడియా కంట కనిపిస్తుంటుంది. ఈ క్రమంలో యూఎస్ ఓపెన్ పురుషుల ఫైనల్ మ్యాచ్ కోసం ట్రంప్ అల్లుడిని, మనవరాలిని, వైట్‌హౌజ్ సిబ్బందినీ వెంటపెట్టుకుని వచ్చారు. ఆ సమయంలో అరబెల్లా ఆందోళనగా కనిపించగా.. ట్రంప్ ఆమెతో ఏదో అన్నారు. దీంతో ఆమె ముఖం చిన్నబోయింది. ఆపై ట్రంప్ పక్కన నిల్చునేందుకు కూడా ఆమె అయిష్టంగా కనిపించింది. అప్పటి నుంచి ఈవెంట్ అయ్యేదాకా ఆమె ముభావంగా ఉండిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియోనే ఇప్పుడు విపరీతంగా వైరల్ అవుతోంది. లిప్ రీడర్ నికోలా హిక్లింగ్ చెబుతోంది ఏంటంటే.. అరబెల్లా తన బ్యాగ్, ఫోన్ కోసం ఆందోళన వ్యక్తం చేసింది. Where is my bag?(నా బ్యాగ్ ఎక్కడ?) అని అడిగింది. దానికి ఆమె తండ్రి కుష్నర్ I don’t have it(నాకు తెలియదు) అని సమాధానమిచ్చారు. ఈలోపు.. తాత ట్రంప్‌ను తనకు దారి ఇవ్వమని కోరగా.. ఆయన నువ్వు అక్కడే ఉండు అని చెప్పారు. దీంతో ఆమె అయిష్టంగా అలా నిలబడి పోయారు. ఇదిలా ఉంటే.. యూఎస్ ఓపెన్ నిర్వాహకులు ట్రంప్ అక్కడ ఉన్న సమయంలో జరిగిన పరిణామాలను టెలికాస్ట్ చేయొద్దని బ్రాడ్కాస్టర్లకు సూచించింది. అయినప్పటికీ సోషల్ మీడియా ద్వారా ప్రెసిడెంట్ ట్రంప్‌నకు తగిలిన నిరసన సెగ, అంతకుమించి అరబెల్లా వైరల్ వీడియో బయటకు వచ్చేసింది. ఈ వీడియో వైరల్ కావడంతో, నెటిజన్లు ట్రంప్ కుటుంబ సంబంధాలపై చర్చ ప్రారంభించారు. ఆమె ముఖంలో ఆందోళన, అసౌకర్యం స్పష్టంగా కనిపించిందని.. పాపం అంటూ మరొక యూజర్ కామెంట్ చేశాడు. అరబెల్లాకు ట్రంప్ పక్కన నిలబడడానికి ఇష్టపడలేదని.. అందుకే తండ్రి చెంతకు చేరిందని కొందరు అభిప్రాయపడ్డారు. వీలైనంత త్వరలో ట్రంప్ కుటుంబం నుంచి ఆమె బయటకు రావడం ఖాయమంటూ ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. Arabella Kushner aged 13 in the green dress does not want to stand next to the pedophile. pic.twitter.com/seJ35nY1SB— KT "Special MI6 Operation" (@KremlinTrolls) September 7, 2025 -
వర్షం సైతం ఆ నృత్యాన్ని అడ్డుకోలేకపోయింది..!
బృందంగా శాస్త్రీయ నృత్యం చేస్తుంటే రెండు కళ్లు చాలవేమో అన్నంత అద్భుతంగా ఉంటుంది. అలాంటి గ్రూప్ డ్యాన్స్ ప్రదర్శనలో అనుకోని అవాంతరంలా వర్షం వస్తే.. కాలు కదపడం కష్టం. అడుగు వేస్తే జరర్రుమని జారిపోవడం ఖాయం. ఆ చిరుజల్లుల్లో అడుగులు తడబడకుండా..లయబద్ధంగా నృత్యం చేయడం అంత ఈజీ కాదు. కానీ ఇక్కడ ఈ బృందం వర్షానికే సవాలు విసిరేలా అత్యంత అద్భుతంగా నృత్యం చేశారు. ఇదంతా ఎక్కడ అంటే..కర్ణాటకలోని ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన మహిళా విద్యార్థులు బృందంగా భరతనాట్యం చేశారు. అది కూడా హనుమాన్ చాలిసాను నృత్య రూపకంగా ప్రదర్శన ఇస్తున్నారు. అయితే కుండపోత వర్షం కురుస్తున్న ఆ విద్యార్థులంతా ఎక్కడ ఆగకుండా ఎంత లయబద్ధంగా డ్యాన్స్ చేశారో చూస్తే..వావ్ ఏం భరతనాట్య ప్రదర్శన అని ప్రశంసించకుండా ఉండలేరు. అందులో అత్యంత హైలెంట్.. అంతమంది అమ్మాయిల మధ్య ఒకేఒక పురుషుడు భరతనాట్య చేస్తూ కనిపించడం. మన కళ్లుచూస్తోంది నిజమేనా అన్నట్లుగా ఆ అమ్మాయిల్లో ఒక అమ్మాయిగా కలిసిపోయిన ఆ కళాకారుడి నృత్యం ప్రధాన ఆకర్షణగా నిలిచింది. అందుకు సంబంధించిన వీడియోని ప్రత్యక్షంగా వీక్షించిన ఒక ప్రేక్షకుడు సోషల్ మీడియాలో షేర్ చేయడంతో నెట్టింట వైరల్‌గా మారింది. ఆయన ఆ వీడియోకి జత చేసిన పోస్ట్‌లో వర్షం మీ ప్రదర్శనను అడ్డుకోలేకపోగా..మీ అసామాన్యమైన ప్రదర్శనకు అందంగా మారింది ఆ వర్షపు జల్లు. జోరు వానలో నాట్యం చేయడం మాటలు కాదనేది సత్యమే అయినా..మీ బృందమంతా ప్రతి స్టెప్ని అత్యంత అద్భుతంగా ప్రదర్శించి అలరించారు అంటూ ఆ వీడియోకి వర్షం మీ బృందం ప్రదర్శన ఇవ్వకుండా ఆపలేకపోయింది అనే క్యాప్షన్ జోడించి మరి పోస్ట్ చేశారు. View this post on Instagram A post shared by Prarthana Rao (@prarthana_nanana) (చదవండి: లండన్‌లో 'బెస్ట్ సమోసా'..! టేస్ట్ అదుర్స్..) -
లండన్‌లో 'బెస్ట్ సమోసా'..! టేస్ట్ అదుర్స్..
విదేశాల్లో మన చిరుతిండ్లు ఫేమస్ అవ్వడం కాదు..వాటి రుచికి విదేశీయులు ఫిదా అవుతూ లొట్టలేసుకుంటూ లాగిస్తున్నారు. కేవలం మన ప్రవాస భారతీయులే కాదు..అక్కడ స్థానిక విదేశీయులు కూడా ఇష్టపడటం విశేషం. మళ్లీ మళ్లీ తినేందుకు ఆయా భారతీయ రెస్టారెంట్లు లేదా హోటళ్లకు వస్తున్న వీడియోలను చూశాం. అయితే ఇప్పుడు మనమంతా ఇష్టంగా స్నాక్స్ టైంలో తినే సమోసా లండన్‌లో నివశిస్తున్న భారతీయులకే కాదు అక్కడున్న విదేశీయలకు కూడా అత్యంత ఇష్టమైన వంటకంగా మారింది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్‌గా మారింది.ఆ వీడియోలో బీహార్‌కి చెందిన వ్యక్తి లండన్‌లోని రద్దీగా ఉండే వీధుల్లో సమోసాలు అమ్ముతున్నట్లు కనపిస్తుంది. ఆ స్టాల్‌పై ఘంటావాలాస్ సమోసాస్. అతడు సమోసాలను పరిశుభ్రంగా తయారు చేసిన తీరుతోపాటు వాటిని అక్కడివాళ్లు ఎంత ఇష్టంగా ఆస్వాదిస్తారో కూడా వివరించడమే కాదు, కళ్లకు కట్టినట్టుగా చూపిస్తాడు. అంతేగాదు ఒక బిహారీ లండన్‌లో ఉన్నంత వరకు సమోసాల రుచి ఎల్లప్పుడూ సజీవంగా ఉంటుందని సగర్వంగా చెబుతున్నాడు. అంతేగాదు ఈ వీడయోకి "లండన్‌లో అత్యుత్తమ సమోసా" అనే క్యాప్షన్ జోడించి మరి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. ఈ వీడియోకి ఏకంగా 37 మిలియన్ల వ్యూస్, లైక్‌లు వచ్చాయి. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఓ లుక్కేయండి మరి..!. View this post on Instagram A post shared by Bihari Samosa UK (@biharisamosa.uk) (చదవండి: భారత్‌లోనే 11 ఏళ్లుగా రష్యన్ మహిళ..! ఆ మూడింటికి ఫిదా..) -
భారత్‌లోనే 11 ఏళ్లుగా రష్యన్ మహిళ..! ఆ మూడింటికి ఫిదా..
విదేశాలను ఆకర్షిస్తున్న మన దేశ సంస్కృతి వారిని ఇక్కడే ఉండేలా చేసేలా మన్ననలను అందుకుంటోంది. ఎందరో మనసులను దోచిన ఇచ్చటి విభిన్న సంస్కృతులు, ఆతిథ్యం తమను మళ్లీ మళ్లీ ఈ గడ్డ వద్దకు వచ్చేలా చేస్తుందని, వదిలి వెళ్లలేమని అంటున్నారు. అలా ప్రశంసలు కురిపిస్తున్న విదేశీయుల కోవలోకి తాజాగా ఈ రష్యన్ మహిళ కూడా చేరిపోయింది. పైగా ఆమూడింటికే పడిపోయానని, అంతలా అవి తనని ప్రభావితం చేశాయని ఇన్స్టాగ్రామ్ వేదికగా షేర్ చేసుకుంది. రష్యాన్ మహిళ కంటెంట్ క్రియేటర్ యులియా ఇన్‌స్టా పోస్ట్‌లో భారత్‌లోనే 11 ఏళ్లుగా ఉన్నట్లు వెల్లడించింది. ఇక్కడి భారతదేశం తనను ఎలా ప్రభావితం చేసిందో పంచుకుంది. ఐదు నెలల్లో పూర్తిచేసే ఇంటర్న్‌షిప్‌కు వచ్చి..అతుక్కుపోయానంటోంది. ఇంటర్న్‌షిప్ పూర్తి అయ్యి తిరిగి రష్యాకు పయనమయ్యానని, ఆ తర్వాత కొన్నేళ్లకు సర్కస్ కోసం ఏనుగుని కొనడానికి వచ్చి ఇక్కడే స్థిరపడిపోయానని చెప్పుకొచ్చింది. ఇక్కడే విజయవంతంగా వ్యాపారం చేయడమే గాక, ఇక్కడ ఒక కుటుంబంలో కోడలిగా అడుగుపెట్టి ఇక్కడే ఉండిపోయానంటోంది. కట్టిపడేసిన ఆ మూడు విషయాలు..భారతదేశంలో ఆతిథ్యం వేరేస్థాయిలో ఉంటుంది. ప్రజలు చాలా ఘటనంగా స్వాగతిస్తారు. వారి విశాల హృదయం కట్టిపడేస్తుంది. ప్రతి విషయంలోనూ మంచి సహాయకారిగా ఉంటారు. ఇక్కడ చాలామటుకు అందరూ సహాయం చేయడానికే ప్రయత్నిస్తారు. అంతేగాదు భారతదేశం ఒక అయస్కాంతంలాంటిదని, ఇక్కడ ఏమి చూడాలనుకుంటున్నారో, విశ్వానికి ఏమి అందించాలనుకుంటున్నారో, అన్నింటిని ఈనేలే మీకు దిశానిర్దేశం చేస్తుంది. నాలా ఈ భారతదేశంలోకి అడుగుపెట్టి, కొన్ని సవాళ్లను అధిగమించి మరి ఇక్కడి అందాలకు మంత్రముగ్ధులైన వారిక కథలెన్నో నా చెంత ఉన్నాయని ఇన్‌స్టా పోస్ట్‌లో రాసుకొచ్చింది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్‌గా మారింది. View this post on Instagram A post shared by Iuliia Aslamova (@yulia_bangalore) (చదవండి: Dance For Fitness: మొన్నటి వరకు ఆనంద తాండవమే..ఇవాళ ఆరోగ్య మార్గం..!) -
భారత్‌లోనే బాగుంది.. అందుకే ఇక్కడ ఉండిపోయా..!
ఒక నైజీరియన్ వ్యక్తి భారతదేశంలోనే ఎందుకు ఉన్నాడో సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు. మరో దేశానికి ఎందుకు వెళ్లాలనపించలేదో కూడా వివరించాడు. గ్రాడ్యుయేషన్ పూర్తి అయ్యిన వెంటనే భారత్‌లో అడగుపెట్టి ఇక్కడే ఉండిపోయానని..అంతగా ఈ దేశం తనలోకి కలుపుకుందంటూ భారత్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నాడు. అంతేగాదు ఇక్కడే ఉండిపోవాలనిపించేంతగా ఇష్టం పెరగడానికి గల కారణాలేంటో కూడా షేర్ చేసుకున్నాడు. మరి అవేంటో చూద్దామా..!పాస్కల్ ఒలాలే అనే నైజీరియన్ వ్యక్తి భారతదేశం తనకెంత సౌకర్యవంతంగా అనిపించిందో ఇన్స్టాగ్రామ్ వేదికగా వెల్లడించాడు. తాను 2021 లాగోస్ విశ్వవిద్యాలయం నుంచి బయటకు రాగానే నేరుగా భారతదేశంలో అడుగుపెట్టానని, ఆ క్షణం నుంచే ఈ దేశం నుంచి కాలు బయట పెట్టలేదని, తిరిగి ఏ విదేశాలకు వెళ్లలేదని చెప్పుకొచ్చాడు. ఇక్కడ ఆహారం, భద్రత, బస, వివక్ష వరకు అన్నింటిల్లోనూ స్వచ్ఛమైన స్వేచ్ఛను పొందానని ఆనందంగా చెబుతున్నాడు ఒలాలే. అంతేగాక తాను ఇక్కడే ఉండిపోవడానికి గల ప్రధాన కారణాలను కూడా వివరించాడు.ఇక్కడ ప్రతి ఉదయం ఆందోళనతో మేల్కొను, ఎలాంటి టెన్షన్లేని ప్రశాంత జీవనం గడుపుతానుఅలాగే నా చర్మం రంగు కారణంగా బెదరింపులు ఎదుర్కొనడం అనేవి ఇక్కడ ఉండవు.ఇక్కడ హాయిగా జీవించొచ్చు, ఎలాంటి హడావిడి కల్చర్ ఉండదుప్రజలు ముక్కుసూటిగా ఉంటారు, మంచి నిజాయితీ ఉంటుందితనది నల్లజాతి అని తన జాతిని నిరంతరం గుర్తు చేసేలా వివక్షకు తావుండదు.అలాగే యూఎస్‌లో కంటే ఇక్కడ రాత్రిపూట వీధుల్లో సురక్షితంగా వెళ్లగలనుఇంటి అద్దె చౌక, ఆహారం సహజమైనది, ఒత్తిడి తక్కువగా ఉంటుంది. స్వేచ్ఛ అనేది చాలా దేశాల్లో అది కాగితాలకే పరిమితమై ఉంది, కాని ఇక్కడ అనుభవపూర్వకంగా తెలుస్తుంది. నా ఆహార్యాన్ని బట్టి కాకుండా కేవలం ఒక వ్యక్తిగా గౌరవం లభిస్తుంది. అందువల్లే ఏ విదేశాలకు వెళ్లకుండా భారత్‌లోనే ఉండిపోయానని, ఇదొక స్వర్గసీమ అంటూ కితాబులిచ్చేశాడు. అందుకు సంబంధిచిన వీడియో నెట్టింట తెగ వైరల్‌గా మారింది. అంతేగాదు నెటిజన్లు మిస్టర్ ఓలాలే మా దేశానికి స్వాగతం, మీ మాటలు వింటుంటే ఒక భారతీయుడిగా చాలా గర్వపడుతున్నా..అంటూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by Pascal Olaleye🇳🇬🇮🇳🇩🇪🌏 (@pascalolaleye) (చదవండి: జస్ట్ 32 ఏళ్లకే కోటీశ్వరురాలిగా యూట్యూబర్.! ఆ సీక్రెట్ ఇదే..) -
చెట్ల నరికివేతతోనే చేటు!
న్యూఢిల్లీ: వరద విలయంలో తరచూ ఉత్తరాది రాష్ట్రాలు చిక్కుకుపోతున్న ఘటనలపై సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం, ఆవేదన వ్యక్తంచేసింది. విపరీతంగా, విచ్చలవిడిగా వృక్షాలను నేలకూల్చడమే ఈ ప్రకృతివినాశనానికి అసలు కారణమని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కె.వినోద్ చంద్రన్ల సుప్రీంకోర్టు ధర్మాసనం అభిప్రాయపడింది. వరద నీటిని బలంగా ఎదుర్కొనే భారీ వృక్షాలను విపరీతంగా నరికేయడం వల్లే వరదల ప్రభావం అత్యధిక స్థాయిలో ఉంటోందని, చెట్ల అక్రమ నరికివేత పర్వానికి ఇకనైనా ముగింపు పలకాలని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. వరదల బారినపడి అవస్థలు పడుతున్న హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్, జమ్మూకశ్మీర్, పంజాబ్ ప్రభుత్వాలతోపాటు కేంద్ర పర్యావరణ, అడవులు, వాతావరణ మార్పులు, జాతీయ రహదారుల ప్రాధికార సంస్థలకు సుప్రీంకోర్టు నోటీసులు జారీచేసింది. చెట్ల నరికివేతను అడ్డుకునేలా ఏమేం చర్యలు తీసుకుంటున్నారో వివరిస్తూ సంజాయిషీ ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. ఇటీవల హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్‌లో కొండచరియలు విరిగిపడటం, వరదల విలయం సర్వసాధారణంగా మారిన విషయం తెల్సిందే. దీంతో కొండప్రాంతాల్లో చెట్ల అక్రమ నరికివేత కారణంగానే వరద ప్రభావం అధికమైందని, ఈ మేరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను అప్రమత్తం చేయాలంటూ అనామికా రాణా వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు గురువారం విచారణచేపట్టింది. ఈ సందర్భంగా వరద విలయంపై కోర్టు పలు వ్యాఖ్యలు చేసింది. ‘‘ ఉత్తరాఖండ్, హిమాచల్, పంజాబ్‌లో కొండచరియలు పడటం, వరదల వార్తలు మనందరం చూస్తూనే ఉన్నాం. వరద నీటిలో ఎన్నడూలేనంతటి భారీ స్థాయిలో పెద్ద దుంగలు కొట్టుకుపోవడం మీడియా కథనాల్లో గమనించాం. ఇన్ని దుంగలు ఎక్కడి నుంచి కొట్టుకొస్తున్నాయి? అక్రమంగా భారీ చెట్లను నరికివేసి ప్రకృతి విలయానికి కారణమవుతున్నారు. ఈ విషయంలో బాధిత రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రం తక్షణం స్పందించాల్సిందే’’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. సీరియస్‌గా తీసుకోండి వేరే కేసు విచారణ నిమిత్తం అదే కోర్టు హాల్లో ఉన్న సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాకు కేంద్రం సూచనలు చేసింది. కేంద్రం తగు చర్యలు తీసుకునేలా చూడాలని ఆయనను ఆదేశించింది. ‘‘ ఇది చాలా తీవ్రమైన అంశం. అందుకే కేంద్ర ప్రభుత్వం ఈ అంశంపై ప్రధానంగా దృష్టిసారించాలి. చెట్లను నరికేస్తుండటంతో ఆ దుంగలన్నీ వరద ప్రవాహంలో దిగువకు కొట్టుకొస్తున్నాయి. పంజాబ్‌లో వరదనష్టానికి సంబంధించిన ఫొటోలను చూశాం. లక్షల ఎకరాల్లో పంట పాడైంది. కొండప్రాంతాల్లోనూ అభివృద్ధి జరగాల్సిందే. కానీ పర్యావరణం పాడవకుండా అభివృద్ధిని సుసాధ్యంచేయాలి. పర్యావరణానికి, అభివృద్ధికి మధ్య సమతుల్యత దెబ్బతినకుండా చూడాలి’’ అని మెహతాకు కోర్టు సూచించింది. దీంతో మెహతా స్పందించారు. ‘‘ ప్రకృతితో మనం అనవసరంగా అతిగా జోక్యం చేసుకున్నాం. అందుకే ప్రకృతి మన విషయాల్లోనూ జోక్యం చేసుకుంటోంది. ఇలాంటి విలయాలను సాధ్యమైనంతమేరకు నివారించేందుకు ప్రయతి్నస్తాం. ఈరోజే నేను కేంద్ర పర్యావరణ మంత్రికి విషయాన్ని వివరిస్తా. బాధిత రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులతోనూ మాట్లాడతా’’ అని మెహతా కోర్టుకు హామీ ఇచ్చారు. పిటిషనర్ అనామికా రాణా తరఫున న్యాయవాదులు ఆకాశ్ వశిష్ట, శుభం ఉపాధ్యాయ్ వాదించారు. ‘‘ఆకస్మిక వరదల కారణంగా కొందరు సొరంగమార్గాల వద్ద చిక్కుకుపోతున్నారు. మరికొందరి పరిస్థితి ప్రాణసంకటంగా మారింది. ఈ అంశంలో ప్రభుత్వాలు వెంటనే కార్యాచరణతో ముందుకురావాలి. విపత్తులు సంభవించకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి. బాధిత పౌరులకు నష్టపరిహారం, పునరావాసం, సాయం అందించాలి’’ అని న్యాయవాదులు వాదించారు. వీరి వాదనలపై కోర్టు స్పందించింది. సీరియస్ విషయం కాబట్టే ఈ కేసును మరో రెండువారాల్లో మళ్లీ విచారిస్తామని ధర్మాసనం తెలిపింది. Timber mafia knows no borders! 🌲💰In Himachal Pradesh, floods carried away illegally felled trees reminding many of a scene straight out of Pushpa. Nature always exposes the greed of mafias! 🌊⚡#HimachalPradesh #Floods #TimberMafia #Pushpa #ClimateCrisis #IllegalLogging#DAAR… pic.twitter.com/eymf6tTGjX— Daar News (@DaarNews) September 3, 2025 -
దూకమన్న భర్త! ఆ భార్య ఏం చేసిందంటే..
ఆ భార్యాభర్తల మధ్య ఏం గొడవ జరిగిందో ఏమో.. ఆమెను అతగాడు చితకబాదేశాడు. దీంతో ఏడుస్తూ ఆ భార్య ఇంటి మేడ మీదకు చేరింది. అక్కడి నుంచి దూకేస్తానంటూ బెదిరించింది. దమ్ముంటే దూకమంటూ ఆ భర్త ఆమెకు చాలెంజ్ చేస్తూ పదే పదే చెప్పసాగాడు. కట్ చేస్తే.. ఆమె అన్నంత పని చేసింది. ఉత్తర ప్రదేశ్ అలీబాగ్‌లో దారుణం జరిగింది. గోండా ఏరియా దాకౌలి గ్రామంలో రెండతస్తుల మేడ మీద నుంచి దూకిన ఓ మహిళ.. ఆస్పత్రి పాలైంది. భార్యభర్తల మధ్య గొడవ కారణంగానే ఈ ఘటన చోటుచేసుకుందని పోలీసులు చెబుతున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. భర్త కొట్టడంతో ఆమె ఏడుస్తూ మిద్దెపైకి చేరిందని, అక్కడి నుంచి దూకుతానని బెదిరించిందని, దూకి చావమని భర్త అనడంతో ఆమె అన్నంత పని చేసిందని, భూమిని బలంగా తాకడంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయని పోలీసులు తెలిపారు. అయితే కిందపడిన తర్వాత కూడా ఆమెపై భర్త దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఆ సమయంలో ఓ చిన్నారి మమ్మీ.. మమ్మీ.. అంటూ ఏడుస్తూ కనిపించాడు. మహిళ తరఫు బంధువుల ఫిర్యాదు మేరకు ఆమె భర్తపై కేసు నమోదైంది.अलीगढ़ : महिला छत से कूदी, परिजनों का आरोप उकसाकर कूदने पर किया मजबूर। कूदने का वीडियो वायरल, महिला गंभीर घायल। ससुराल पक्ष के खिलाफ थाने में दी तहरीर, थाना गोंडा इलाके के दमकोली गांव की घटना। #Aligarh pic.twitter.com/twWG6yKtuq— Akash Savita (@AkashSa57363793) September 3, 2025 -
అలాంటి ప్రేమనే కదా అంతా కోరుకునేది..!
ఇవాళ ఆలుమగల మధ్య ఉన్న ప్రేమ అనే పదం దారుణంగా అపహస్యం పాలవుతోంది. పెళ్లి అనే పదం కూడా భయాందోళనలు కలిగించేలా మారిపోయింది. అంతలా అనుబంధాలు కనుమరుగైపోతున్న ఈరోజుల్లో అగ్ని కంటే స్వచ్ఛమైన ప్రేమ ఒకటి తారసపడింది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్‌గా మారింది. అంతా కోరుకునేది ఇలాంటి ప్రేమనే కదా అంటున్నారు నెటిజన్లు.అయినా ప్రేమించడానికి, ప్రేమించబడటానికి కూడా అదృష్టం ఉండాలేమో..!. సంపాదన ఏదో రకంగా ఆర్జించొచ్చు. ఒక మనిషి ప్రేమను పొందడం, నిలబెట్టుకోవడం రెండూ అంత ఈజీ కాదు. పైగా ఈ రోజుల్లో అలాంటి ప్రేమనేది మచ్చకైనా కానరాని పరిస్థితి. కానీ ఈ వృద్ధ జంట "ప్రేమ అంటే ఎప్పటికీ ప్రేమే" జీవితాంతం అగ్నికంటే స్వచ్ఛంగా ఉంటుంది అని తమ చేతలతో చెప్పారు.జిష్మా ఉన్నికృష్ణన్ అనే సోషల్ మీడియా వినియోగదారుడు నెట్టింట అందుకు సంబంధించిన వీడియోని షేర్చేశారు.ఆ వీడియోలో ఒక వృద్ధుడు తన భార్య కాలికి పట్టీలు పెట్టుకోవడంలో ఇబ్బందిపడుతుంటే గమనిస్తున్నట్లు కనిపిస్తుంది. వెంటనే అతను ఆమెకు సహాయం చేసిన తీరు అచ్చం సినిమాలోని హీరో హీరోయిన్లను తలపించేలా ఉంది. అతడు నిజంగా తన భార్యకు సాయం చేసిన తీరు సినిమాలోని సీను మాదిరిగా అత్యంత యాదృచికంగా కనిపించింది.ఆ అపూర్వ క్షణాన్ని చూసిన సోషల్ మీడియా వినయోగదారురాలు ఉన్నికృష్ణన్‌కి ఒక్కసారిగా రైలులో ప్రయాణిస్తున్నట్లు అనిపించలేదు. జీవితాంత ప్రేమించడం అనే మాటకు అసలైన అర్థాన్ని తెలుసుకున్నట్లు అనిపించిందట. అందుకే ఆయన వీడియోకి ఓ మధురమైన క్షణంలో జీవితాంతం ప్రేమించడాన్ని చూశాను అనే క్యాప్షన్‌ని జోడించి మరీ ఆ వీడియోని పోస్ట్ చేశారు. అంతేగాదు ఆ వీడియోని చూసి నెటిజన్లు కూడా అంతా అలాంటి ప్రేమనే కదా ఆశించేది అంటూ ఉద్వేగభరితంగా పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by 𝐉𝐢𝐬𝐡𝐦𝐚 (@jishma_unnikrishnan) (చదవండి: అందువల్లే భారత్‌కి తిరిగి రావాలనుకుంటున్నా..? రూ. 1.2 కోట్లు సరిపోతుందా..?) -
వైరల్ వీడియో.. ఈ పక్షిని చూసే విమానం కనిపెట్టారేమో!
సాక్షి, హైదరాబాద్: ఒక చిన్న పక్షి ల్యాండింగ్ అయ్యే విధానం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో పక్షి తన గమ్యస్థానానికి చేరే సమయంలో చూపిన నైపుణ్యం ఏరోడైనమిక్స్‌కు పాఠాలు చెబుతోంది. విమానం ల్యాండింగ్‌ను ఈ పక్షిని చూసే కనిపెట్టారేమోననిపిస్తోంది కదూ.. ఈ ఆలోచింపజేసే వీడియో.. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు.ఓ పక్షి.. గమ్యానికి చేరే చివరి దశలో గాలిలో ఎగురుతూ వచ్చి నీటిలో సురక్షితంగా దిగిన దృశ్యం ఆసక్తి కలిగిస్తోంది. ఆ పక్షి కిందకు దిగే ముందు తన రెక్కలతో వేగాన్ని నియంత్రించుకోవడాన్ని ఈ వీడియోలో చూడవచ్చు. పర్ఫెక్ట్ టచ్‌డౌన్‌తో నీటిపై దిగుతుంది. ప్రకృతి పక్షికి నేర్పించిన గొప్ప ల్యాండింగ్ టెక్నిక్‌ను గమనించండి అంటూ ఓ అందమైన వీడియోను ఆయన షేర్ చేశారు.Sharing this lovely video - please observe the great landing technique taught by nature to a bird with clear application of aerodynamics- Short finals, gears down, thrust reversers activated & Perfect touchdown. Aeroplanes copied it ! pic.twitter.com/TL9u3gwKXF— CV Anand IPS (@CVAnandIPS) September 2, 2025 -
హుషారుగా చిందేస్తూ కుప్పకూలిన అసెంబ్లీ ఉద్యోగి
పండుగ పూట అసెంబ్లీలో సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. సిబ్బంది అంతా హుషారుగా వేడుకల్లో మునిగిపోయారు. కొందరు హుషారుగా చిందులేస్తుండగా.. మరికొందరి విజిల్స్, చప్పట్లతో ఆ ప్రాంగణమంతా మారుమోగిపోయింది. ఈలోపు ఊహించని రీతిలో విషాదం అలుముకుంది. కేరళ శాసనసభలో ఓనం సంబరాల సందర్భంగా సోమవారం విషాదం నెలకొంది. డ్యాన్స్ గ్రూప్‌లో హుషారుగా చిందులేస్తూ ఓ సిబ్బంది.. అకస్మాత్తుగా కుప్పకూలి మరణించాడు. ఆసుపత్రికి తరలించినా, చేరిన కొద్దిసేపటికే మరణించినట్టు వైద్యులు తెలిపారు. ఆయన్ని డిప్యూటీ లైబ్రేరియన్ వి. జునైస్ (46)గా పోలీసులు నిర్ధారించారు.వయనాడ్‌కు చెందిన జునైస్ గతంలో మాజీ ఎమ్మెల్యే పీవీ అన్వర్ దగ్గర పీఏగా పని చేశాడు. 2011 నుంచి కేరళ శాసనసభలో సిబ్బందిగా పని చేస్తూ వచ్చాడు. ఆయనకు భార్యా, ఇద్దరు పిల్లలు ఉన్నాయి. క్రీడలంటే ఇష్టమున్న జునైస్.. ఫిట్నెస్ కూడా ఉంది. అయితే ఈ మధ్యే ఛాతీ నొప్పికి చికిత్స తీసుకున్నట్టు బంధువులు తెలిపారు. సోమవారం జరిగిన ఓనం ఈవెంట్స్‌లో టగ్ ఆఫ్ వార్ కాంపిటీషన్లో జునైస్ బృందం మొదటి బహుమతి గెలుచుకుంది. అయితే.. కాసేపటికే అలా డ్యాన్స్ వేస్తూ ఆయన కన్నమూయడం గమనార్హం. సిబ్బంది మృతితో శాసనసభలో జరిగాల్సిన ఓనం వేడుకలు తక్షణమే నిలిపివేశారు.A 45-year-old man collapsed and died while dancing on stage during the Onam celebrations organised by the Kerala legislative assembly.The deceased was identified as Junais, an assistant librarian who earlier worked as the personal assistant of former MLA PV Anwar.He was… pic.twitter.com/dky9R6XPRP— Vani Mehrotra (@vani_mehrotra) September 2, 2025 -
కుబేరుడి ‘చిల్లర’ చేష్టలు.. తిట్టిపోస్తున్న నెటిజన్లు
ఆయనొక ప్రముఖ కంపెనీకి సీఈవో. కోట్లకు పడగలెత్తిన వ్యక్తి. అలాంటి వ్యక్తి చిల్లర చేష్టలకు దిగాడు. ఓ చిన్నారి అపురూపంగా భావించిన కానుకను హఠాత్తుగా లాగేసుకున్నాడు. పాపం.. దాని కోసం ఆ చిన్నారి ఆయన్ని బతిమిలాడుకోవడమూ వీడియో రూపేణా ఇంటర్నెట్లో వైరల్ అయ్యింది. దీంతో ఆ కుబేరుడిని నెటిజన్లు తెగ తిట్టిపోస్తున్నారు. యూఎస్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్లో జరిగిన ఓ ఘటన.. నెట్టింట తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పోలాండ్ టెన్నిస్ ప్లేయర్ కామిల్ మజ్చ్‌శాక్ (Kamil Majchrzak) తన గెలుపు అనంతరం అక్కడున్న అభిమానులతో సందడి చేశాడు. ఆ సమయంలో ఓ చిన్నపిల్లాడికి క్యాప్ ఇవ్వబోయాడు. అయితే.. పక్కనే ఉన్న ఓ వ్యక్తి ఆ క్యాప్‌ను లాగేసుకుని తన పక్కనే ఉన్న మహిళ బ్యాగులో దాచేశాడు. ఆ పిల్లాడు ఆ క్యాప్ కోసం బతిమాలినా పట్టించుకోలేదు. పైగా తన చేతిలో ఉన్న పెన్నును మాత్రం ఆ పిల్లాడికి అప్పజెప్పాడు. దీంతో ఆ చిన్నారి నిస్సహాయంగా చూస్తూ ఉండిపోయాడు. I wonder if this douche canoe grown man at the U.S. Open is worried that he will be recognized after he snatched a hat away from the boy on his left? pic.twitter.com/Q48ATFDoT7— Brick Suit (@Brick_Suit) August 29, 2025దీనికి సంబంధించిన వీడియో బాగా వైరల్ అయ్యింది. ఆ చిన్నారి చేతుల్లోంచి క్యాప్‌ను లాగేసుకున్న వ్యక్తిని.. పోలాండ్‌కు చెందిన డ్రాగ్బ్రుక్ కంపెనీ CEO పియోటర్ షెరెక్ (Piotr Szczerek)గా గుర్తించారు. ఈ ఘటనతో ఆయనపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. మజ్చ్‌శాక్ స్పందనఈ వివాదంపై కామిల్ మజ్చ్‌శాక్ స్పందించాడు. సోషల్ మీడియా ద్వారా ఆ చిన్నపిల్లాడిని వెతికి.. అతనికి కొత్తగా సంతకం చేసిన క్యాప్‌తో పాటు ఇతర టెన్నిస్ గిఫ్ట్స్ కూడా అందించారు. ‘‘ఈ క్యాప్ గుర్తుందా?’’ అని మజ్చ్‌శాక్ తన పోస్ట్‌లో పేర్కొన్నారు.విమర్శల తరుణంలో.. షెరెక్ సోషల్ మీడియా ఖాతాలు డీయాక్టివేట్ అయినప్పటికీ.. ఆయన పేరుతో గోవర్క్ఫోరం(Gowork) నుంచి ఒక ప్రకటన వైరల్ అవుతోంది. లైఫ్ ఫస్ట్ కమ్, ఫస్ట్ సర్వ్.. అనే తత్వాన్ని ప్రస్తావిస్తూ ‘ఇది కేవలం ఒక టోపీ మాత్రమే. అంత పెద్ద వివాదం చేయాల్సిన అవసరం లేదు’’ అని పేర్కొన్నారు. అలాగే, తనపై దూషణలు చేసినవారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. అయితే అది ఆయన నుంచి వెలువడిన ప్రకటనేనా? అనేదానిపై స్పష్టత రావాల్సి ఉంది.అయితే.. టోపీ వివాదం(Cap Controversy) దెబ్బకు షెరెస్ సీఈవోగా పని చేస్తున్న డ్రాగ్బ్రుక్ కంపెనీకి పెద్ద దెబ్బే పడింది. ఓ ఉద్యోగ రివ్యూ ఫోరంలో వేలాది మంది కంపెనీకి నెగెటివ్ రివ్యూలు ఇచ్చారు. కంపెనీ సేవలను బహిష్కరించాలంటూ పిలుపు ఇచ్చారు. దీంతో షేర్ వాల్యూ గణనీయంగా పడిపోయి.. కంపెనీకి భారీ నష్టం వాటిల్లిందని తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. అమెరికా ఆస్ట్రానమర్ కంపెనీ సీఈవో ఆండీ బైరోన్ అదే కంపెనీలో హెచ్ఆర్ విభాగంలో పని చేసే ఓ ఉద్యోగిణితో క్రిస్ మార్టిన్ కోల్డ్‌ప్లే షోలో అడ్డంగా దొరికిపోయిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత కంపెనీపై విమర్శలు వెల్లువెత్తడంతో ఆయనకు భారీ ప్యాకేజీ ఇచ్చి వదిలించుకుంది కంపెనీ. అయితే ఆ మహిళా ఉద్యోగిణిని మాత్రం లాంగ్ లీవ్‌లో పంపించేసింది. ఇదిలా ఉంటే.. ఈ ఎఫైర్ ఆయన వైవాహిక జీవితంపై ఎలాంటి ప్రభావం చూపించలేదు. -
‘నీ అంత స్వార్థపరుడు మరొకడు ఉండడు’
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) సృష్టికర్త లలిత్ మోదీపై భారత మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. స్వార్థ ప్రయోజనాల కోసం మనుషులు ఎంతకైనా దిగజారుతారంటూ ఫైర్ అయ్యాడు. మనుషులు అన్నాక తప్పులు చేయడం సహజమని.. అయితే, అందుకు పశ్చాత్తాపపడిన తర్వాత కూడా పదే పదే అదే ఘటన గుర్తుచేయడం సరికాదన్నాడు.శ్రీశాంత్ చెంపపై కొట్టాడుఇంతకీ ఏం జరిగిందంటే.. ఐపీఎల్ చరిత్రలో మాయని మచ్చగా మిగిలిపోయింది ‘స్లాప్‌గేట్’. అరంగేట్ర సీజన్లో అంటే.. 2008లో ముంబై ఇండియన్స్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ (Harbhajan Singh)- కింగ్స్ ఎలెవన్ పంజాబ్ (ప్రస్తుతం పంజాబ్ కింగ్స్) పేసర్ శ్రీశాంత్ (Sreesanth) మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలో మ్యాచ్ ముగిసిన అనంతరం ఇరుజట్ల ఆటగాళ్లు కరచాలనం చేసుకుంటున్న సమయంలో భజ్జీ.. శ్రీశాంత్ చెంపపై కొట్టాడు.క్షమాపణలు చెప్పిన భజ్జీఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన ఐపీఎల్ యాజమాన్యం.. భజ్జీ ఆ ఎడిషన్‌లో తదుపరి మ్యాచ్‌లు ఆడకుండా నిషేధం విధించింది. అయితే, ఈ ఘటనపై పశ్చాత్తాపం వ్యక్తం చేసిన హర్భజన్ ఇప్పటికే శ్రీశాంత్‌కు వివిధ వేదికలపై క్షమాపణలు చెప్పాడు. ప్రస్తుతం వారిద్దరి మధ్య ఎలాంటి విభేదాలూ లేవు.కానీ లలిత్ మోదీ.. నాటి ఘటనకు సంబంధించిన వీడియోను తాజాగా విడుదల చేసి పాత గాయాన్ని మళ్లీ రేపాడు. ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైకేల్ క్లార్క్ ఇంటర్వ్యూ ఇస్తున్న క్రమంలో భజ్జీ.. శ్రీశాంత్‌పై చెంప దెబ్బ కొట్టిన వీడియోను లలిత్ మోదీ రిలీజ్ చేశాడు. ఈ నేపథ్యంలో శ్రీశాంత్ భార్య భువనేశ్వరి కుమారి.. ‘‘మీకసలు మానవత్వం ఉందా?’’ అంటూ తీవ్ర స్థాయిలో లలిత్ మోదీ, క్లార్క్‌లపై ఫైర్ అయ్యారు.నీ అంత స్వార్థపరుడు మరొకడు ఉండడుతాజాగా హర్భజన్ సింగ్ కూడా లలిత్ మోదీ చర్యపై స్పందించాడు. ‘‘వీడియోను లీక్ చేసిన విధానం తప్పు. అసలు ఇలా జరిగి ఉండాల్సింది కాదు. దీని వెనుక స్వార్థ ప్రయోజనాలు ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తోంది.పద్దెనిమిదేళ్ల క్రితం జరిగిన ఘటన. దాని గురించి అందరూ ఎప్పుడో మర్చిపోయారు. కానీ వీళ్లు మరోసారి ప్రజలకు దీనిని కావాలనే గుర్తుచేస్తున్నారు’’ అని భజ్జీ ఫైర్ అయ్యాడు. ‘నీ అంత స్వార్థపరుడు మరొకడు ఉండడు’ అన్నట్లుగా లలిత్ మోదీ తీరును తప్పుబట్టాడు.ఇప్పటికే ఎన్నోసార్లు ఒప్పుకొన్నాఅదే విధంగా.. ‘‘నాడు జరిగిన ఘటన నన్నెంతో వేదనకు గురిచేసింది. మ్యాచ్ ఆడే క్రమంలో ఆటగాళ్లు భావోద్వేగాలకు లోనవుతారు. తప్పులు జరగడం సహజం. అందుకు సిగ్గుపడాలి. ఇప్పుడు ఆ వీడియో వైరల్ అయింది. అదో దురదృష్టకర ఘటన. నేను ఆరోజు తప్పుచేశానని ఇప్పటికే ఎన్నోసార్లు ఒప్పుకొన్నాను. ఇంకోసారి తప్పు చేయనని.. ఒకవేళ తప్పు చేస్తే దానిని సరిదిద్దుకునేలా చేయమని ఆ గణేశుడిని ప్రార్థిస్తున్నా’’ అని హర్భజన్ సింగ్ ఉద్వేగానికి లోనయ్యాడు.చదవండి: తొలి మ్యాచ్‌లోనే ప్రపంచ రికార్డు.. చరిత్ర సృష్టించిన భారత యువ స్పిన్నర్ -
Viral Video: లైక్స్ కోసం గొర్రెతో ఫైట్ చేయాలా ?
-
రషీద్ ఖాన్‌ను ఓదార్చిన పాక్ క్రికెటర్లు.. వీడియో
అఫ్గనిస్తాన్ టీ20 జట్టు కెప్టెన్ రషీద్ ఖాన్ (Rashid Khan)ను పాకిస్తాన్ క్రికెటర్లు ఓదార్చారు. ఇరుజట్ల మధ్య టీ20 మ్యాచ్ ముగిసిన తర్వాత పాక్ పేసర్ షాహిన్ ఆఫ్రిది రషీద్‌ను ఆలింగనం చేసుకుని అతడి భుజం తట్టాడు. కాగా రషీద్ ఖాన్ కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది.నా ప్రగాఢ సానుభూతిఈ స్టార్ స్పిన్నర్ అన్న అబ్దుల్ హలీమ్ శిన్వారి మృతి చెందాడు. ఈ విషయాన్ని అఫ్గన్ క్రికెటర్ ఇబ్రహీం జద్రాన్ (Ibrabim Zadran) సోమవారం వెల్లడించాడు. ‘‘రషీద్ ఖాన్ పెద్దన్న హాజీ అబ్దుల్ హలీమ్ మరణించారని తెలిసి నా మనసు బాధతో నిండిపోయింది. ట్రై సిరీస్పెద్దన్న కుటుంబం మొత్తానికి తండ్రిలాంటి వాడు. రషీద్ ఖాన్, అతడి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి’’ అని ఇబ్రహీం జద్రాన్ సోషల్ మీడియాలో పేర్కొన్నాడు.ఇదిలా ఉంటే.. ఆసియా కప్-2025 టోర్నమెంట్ సన్నాహకాల్లో భాగంగా అఫ్గనిస్తాన్- పాకిస్తాన్- యూఏఈ మధ్య ట్రై సిరీస్ శుక్రవారం మొదలైంది. ఈ ముక్కోణపు పోరులో భాగంగా తొలుత పాకిస్తాన్- అఫ్గనిస్తాన్ మధ్య షార్జా వేదికగా మ్యాచ్ జరిగింది.సల్మాన్ ఆఘా కెప్టెన్ ఇన్నింగ్స్ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పాకిస్తాన్ తొలుత బ్యాటింగ్ చేసింది. టాపార్డర్‌లో సాహిబ్జాదా ఫర్హాన్ (21), సయీమ్ ఆయుబ్ (14).. ఫఖర్ జమాన్ (20) విఫలం అయ్యారు. అయితే, సల్మాన్ ఆఘా కెప్టెన్ ఇన్నింగ్స్ (36 బంతుల్లో 53)తో అలరించడంతో పాక్ మెరుగైన స్కోరు సాధించింది. నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది.అఫ్గన్ బౌలర్లలో ఫరీద్ అహ్మద్ రెండు వికెట్లు తీయగా.. ముజీబ్ ఉర్ రెహ్మాన్, అజ్మతుల్లా ఒమర్జాయ్, మహ్మద్ నబీ, కెప్టెన్ రషీద్ ఖాన్ ఒక్కో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు. ఇక లక్ష్య ఛేదనలో అఫ్గనిస్తాన్ శుభారంభం అందుకున్నా దానిని కొనసాగించలేకపోయింది.39 పరుగుల తేడాతో విజయంఓపెనర్లలో రహ్మనుల్లా గుర్బాజ్ (38) ఫర్వాలేదనిపించగా.. ఇబ్రహీం జద్రాన్ (9) నిరాశపరిచాడు. సెదీకుల్లా అటల్ 23, డార్విష్ రసూలీ 21 పరుగులు చేయగా.. రషీద్ ఖాన్ 16 బంతుల్లో 39 పరుగులు చేశాడు.అయితే, మిగతావారి నుంచి సహకారం లేకపోవడంతో రషీద్ మెరుపు ఇన్నింగ్స్ వృథాగా పోయింది. 19.5 ఓవర్లలో 143 పరుగులు చేసి అఫ్గనిస్తాన్ ఆలౌట్ అయింది. ఫలితంగా పాక్ అఫ్గన్‌పై 39 పరుగుల తేడాతో విజయం సాధించింది.ఇక మ్యాచ్ ముగిసిన అనంతరం పాక్ క్రికెటర్లు రషీద్ ఖాన్ అన్న మృతికి సంతాపం వ్యక్తం చేశారు. డ్రెసింగ్‌రూమ్ సమీపంలో ప్రార్థన చేసి అతడిని ఓదార్చారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.చదవండి: ఆసియా కప్-2025: కీలక అప్డేట్.. ఆ ఒక్కటి మినహా.. ఫైనల్‌తో సహా.. Pakistan team offers condolences and prayers on the death of Rashid Khan's elder brother. #PakistanCricket #RashidKhan pic.twitter.com/gxwvXyYdnG— Ahtasham Riaz (@ahtashamriaz22) August 29, 2025 -
బ్యాట్ బండెక్కి నేనొస్త పా... నేనొస్త పా...
ఈ వరుడు పల్లకీలో రాలేదు. పూలతో అలకరించిన కారులో రాలేదు. ఏకంగా... సూపర్ హీరో బ్యాట్మన్ వాహనం బ్యాట్మొబైల్పై వచ్చాడు. థాయ్‌లాండ్‌లో షూట్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వీడియోలో వరుడు ఫెనిల్ బ్యాట్మొబైల్పై, వాహనానికి ఇరువైపులా కుటుంబ సభ్యులు, స్నేహితులు డ్యాన్స్ చేస్తూ కనిపిస్తారు.వరుడి ఉత్సాహం మాట ఎలా ఉన్నా చాలామంది నెటిజనులు ‘వృథా ఖర్చు’ అని, ‘ఇలా డబ్బు వృథా చేసే బదులు మంచి పనులకు ఉపయోగించవచ్చు కదా’ అంటూ విమర్శలు కురిపించారు.కొందరు మాత్రం... ‘భారతీయ వరుడిని కూడా ఇలాంటి బ్యాట్మొబైల్పై చూడాలనుకుంటాం’ అని స్పందించారు.(చదవండి: టీనేజర్లకు థైరోకేర్ వ్యవస్థాపకుడి అమూల్యమైన సలహా..! అదే నిజమైన పేరెంటింగ్) -
ఛీ.. ఇదేం పద్ధతి?: టీమిండియా మాజీ క్రికెటర్ భార్య ఆగ్రహం
ఐపీఎల్-2008 (IPL 2008) నాటి వీడియో తాజాగా విడుదల చేయడంపై టీమిండియా మాజీ క్రికెటర్ శ్రీశాంత్ సతీమణి భువనేశ్వరి కుమారి (Bhuvaneshwari Kumari) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మీకు అసలు మానవత్వం ఉందా?’ అంటూ ఐపీఎల్ తొలి చైర్మన్ లలిత్ మోదీ (Lalit Modi), ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైకేల్ క్లార్క్‌పై మండిపడ్డారు.ఛీ.. ఇదేం పద్ధతి?ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా భువనేశ్వరి కుమారి సుదీర్ఘ పోస్టు పెట్టారు. ‘‘లలిత్ మోదీ, మైకేల్ క్లార్క్.. మీరు చేసిన పనికి సిగ్గు పడండి. 2008లొ జరిగిన ఘటనకు సంబంధించిన వీడియోను ప్రదర్శిస్తూ వ్యూస్ కోసం చీప్‌గా ప్రవర్తించారు.దీని కారణంగా మీరు కేవలం ఇద్దరు వ్యక్తులను మాత్రమే టార్గెట్ చేసినట్లు కాదు.. వారి కుటుంబాలు, పిల్లలపై కూడా దీని ప్రభావం ఉంటుందని గుర్తుపెట్టుకోండి. శ్రీశాంత్, హర్భజన్ సింగ్ ఇద్దరూ ఎప్పుడో ఆ ఘటన గురించి మర్చిపోయారు.వారిప్పుడు కేవలం ఆటగాళ్లు కాదు.. తండ్రులయ్యారు. వారికి స్కూల్‌కు వెళ్లే వయసున్న పిల్లలు ఉన్నారు. కానీ మీరు మాత్రం ఆ పాత గాయాన్ని మళ్లీ రేపుతున్నారు. ఛీ.. ఇదేం పద్ధతి? మీకసలు హృదయం ఉందా? మానవత్వం అన్నది మచ్చుకైనా మీలో ఉందా?మీరు కాస్తైనా ఊహించగలరా?శ్రీశాంత్ ఎంతగానో శ్రమించి మళ్లీ తన కెరీర్‌ను నిర్మించుకున్నాడు. చేదు అనుభవాలను అధిగమించి తనను తాను నిరూపించుకున్నాడు. అతడి భార్యగా.. అతడి పిల్లల తల్లిగా.. ఈ పాత వీడియో చూడటం ద్వారా నా మనసు ఎంత బాధపడుతుందో మీరు కాస్తైనా ఊహించగలరా?ఇరు కుటుంబాలను ట్రామాలోకి నెట్టేసిన ఆ ఘటన గురించి మళ్లీ ఇప్పుడెందుకు? మీకు వ్యూస్ మాత్రమే ముఖ్యమా? చిన్నారి పిల్లల మనసులపై గతం తాలుకు మచ్చలు పడేలా చేయాలనుకుంటున్నారా? మీకు కాస్తైనా సిగ్గుందా?.. చేయని తప్పులకు వారు శిక్ష అనుభవించాలా?మానవత్వం లేని పనులుఇలాంటి చెత్త, మానవత్వం లేని పనులు చేసినందుకు మీపై దావా వేయాలి. శ్రీశాంత్ పట్టుదల, మానసిక దృఢత్వం ఉన్న వ్యక్తి. ఇలాంటి చెత్త వీడియోలు అతడి హుందాతనాన్ని ఏమాత్రం తగ్గించలేవు. మీ స్వార్థం కోసం ఇతరుల కుటుంబాలను, వారి పిల్లల మనసులను బాధపెట్టడం ఎంత మాత్రం సరికాదు’’ అంటూ భువనేశ్వరి కుమారి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.అసలేం జరిగిందంటే..2008లో ఐపీఎల్ మొదలైన విషయం తెలిసిందే. అరంగేట్ర సీజన్లో భారత క్రికెటర్లు హర్భజన్ సింగ్ ముంబై ఇండియన్స్‌కు.. శ్రీశాంత్ కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌కు ఆడారు. ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య మ్యాచ్ సమయంలో ఇరువురి మధ్య వాగ్వాదం జరిగింది. మ్యాచ్ ముగిసిన తర్వాత రెండు జట్లు ఆటగాళ్లు కరచాలనం చేసుకుంటున్న సమయంలో శ్రీశాంత్‌ను భజ్జీ చెంపదెబ్బ కొట్టాడు. ఈ క్రమంలో తదుపరి మ్యాచ్‌లు ఆడకుండా భజ్జీపై నిషేధం పడింది.పెద్ద తప్పు చేశాఈ ఘటన గురించి ఇటీవల హర్భజన్ సింగ్ మాట్లాడుతూ పశ్చాత్తాపం వ్యక్తం చేశాడు. తాను పెద్ద తప్పు చేశానని.. ఇప్పటికే 200 సార్లు శ్రీశాంత్‌కు క్షమాపణ చెప్పి ఉంటానని పేర్కొన్నాడు. అయితే, శ్రీశాంత్ కుమార్తెతో మాట్లాడుతున్న సమయంలో.. ఆమె తనను తన తండ్రిని కొట్టిన వ్యక్తిగా గుర్తించడాన్ని తట్టుకోలేకపోయానని ఆవేదన వ్యక్తం చేశాడు. చిన్నారి మనసులో తనపై ఇలాంటి ముద్ర పడటాన్ని జీర్ణించుకోలేకపోతున్నా.. ఆరోజు అలా చేయకుండా ఉండాల్సింది అని మరోసారి తన తప్పును ఒప్పుకొన్నాడు.వీడియో చూపించిన లలిత్ మోదీఅయితే, ఇటీవల క్లార్క్ ఇంటర్వ్యూకు హాజరైన లలిత్ మోదీ.. భజ్జీ శ్రీశాంత్‌ను చెంపదెబ్బ కొట్టిన వీడియోను లైవ్‌లో చూపించాడు. ప్రస్తుతం ఈ దృశ్యాలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఈ నేపథ్యంలో కేరళ మాజీ పేసర్ శ్రీశాంత్ భార్య భువనేశ్వరి కుమారి పైవిధంగా ఘాటుగా స్పందించారు.చదవండి: ‘టీమిండియా బెస్ట్ కెప్టెన్ అతడే.. సాధారణ జట్టుతో అద్భుత విజయాలు’ View this post on Instagram A post shared by Beyond23 Cricket Podcast (@beyond23cricketpod) -
ఎవరి బౌలింగ్‌లో సిక్స్‌లు బాదడం ఇష్టం?.. రోహిత్ శర్మ ఆన్సర్ ఇదే
రోహిత్ శర్మ (Rohit Sharma).. పవర్ హిట్టర్‌గా గుర్తింపు పొందిన అతికొద్ది మంది బ్యాటర్లలో ఒకడు. టీమిండియా ఓపెనర్‌గా, కెప్టెన్‌గా ఈ ముంబైకర్ ఇప్పటికే ఎన్నో అద్భుత విజయాలు సాధించాడు. మూడు ఫార్మాట్లలోనూ భారత జట్టు సారథిగా పనిచేసిన రోహిత్.. 2024లో టీ20 ప్రపంచకప్, 2025లో ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ గెలిచాడు.సిక్సర్ల వీరుడుఇదిలా ఉంటే.. అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక సిక్సర్లు బాదిన క్రికెటర్‌గా రోహిత్ ప్రపంచ రికార్డు నెలకొల్పిన విషయం తెలిసిందే. వన్డే, టీ20, టెస్టుల్లో కలిపి టీమిండియా తరఫున ఈ హిట్‌మ్యాన్.. 637 సిక్స్‌లు కొట్టాడు. అంతేకాదు వన్డేల్లో 93, అంతర్జాతీయ టీ20లలో 140కి పైగా స్ట్రైక్‌రేటుతో పరుగులు రాబట్టిన ఘనత రోహిత్ సొంతం.ఇక గతేడాది అంతర్జాతీయ టీ20 ఫార్మాట్‌కు వీడ్కోలు పలికిన రోహిత్ శర్మ.. ఇటీవలే టెస్టులకు కూడా గుడ్‌బై చెప్పేశాడు. ప్రస్తుతం వన్డేల్లో టీమిండియా సారథిగా కొనసాగుతున్న హిట్‌మ్యాన్.. ఐపీఎల్ ముంబై తరఫున పొట్టి క్రికెట్లోనూ అలరిస్తున్నాడు.ఎవరో ఒక్కరినే టార్గెట్ చేయనుకాగా ఇటీవల రోహిత్ శర్మ ఓ కార్యక్రమానికి హాజరయ్యాడు. ఇందులో భాగంగా.. ‘‘మీకు ఎవరి బౌలింగ్‌లో సిక్సర్లు బాదడం ఇష్టం?’’ అనే ప్రశ్న ఎదురైంది. ఇందుకు రోహిత్ ఇచ్చిన సమాధానం నవ్వులు పూయించింది.‘‘ప్రతి బౌలర్ బౌలింగ్‌లోనూ సిక్సర్లు బాదడం నాకిష్టం. ప్రత్యర్థి బౌలర్ ఎవరైనా సరే.. హిట్టింగ్ చేయాలనే మైండ్‌సెట్‌తో ఉంటాను. అంతేగానీ.. ఎవరో ఒక్కరినే టార్గెట్ చేసి నేనైతే సిక్సర్లు బాదను’’ అని రోహిత్ చెప్పుకొచ్చాడు.ధనాధన్.. ఫటాఫట్కాగా టీమిండియా తరఫున 67 టెస్టులు, 159 టీ20 మ్యాచ్‌లు ఆడిన రోహిత్ శర్మ.. ఆయా ఫార్మాట్లలో వరుసగా 4301, 4231 పరుగులు సాధించాడు. టెస్టుల్లో 88, టీ20లలో 205 సిక్సర్లు బాదాడు. ఇక 38 ఏళ్ల ఈ కుడిచేతి వాటం బ్యాటర్ ఇప్పటికి 272 వన్డేలు పూర్తి చేసుకుని.. 11168 రన్స్ రాబట్టాడు. ఇందులో 344 సిక్సర్లు ఉన్నాయి. అంతేకాదు యాభై ఓవర్ల ఫార్మాట్లో మూడుసార్లు డబుల్ సెంచరీలు బాదిన ఏకైక క్రికెటర్ కూడా రోహిత్ శర్మనే!.. అంతేకాదు వన్డేల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు (264) అతడి పేరిటే ఉంది.ఐపీఎల్ వీరుడుఐపీఎల్లోనూ రోహిత్ శర్మకు ఘనమైన రికార్డు ఉంది. సారథిగా ముంబై ఇండియన్స్‌ను ఐదుసార్లు చాంపియన్‌గా నిలిపిన ఈ ముంబైకర్.. క్యాష్ రిచ్‌లీగ్‌లో ఈ ఘనత సాధించిన తొలి కెప్టెన్‌గా చరిత్రకెక్కాడు.ఇక ఇప్పటికి 272 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడిన రోహిత్ శర్మ.. 7046 పరుగులు సాధించాడు. ఇందులో 47 హాఫ్ సెంచరీలు, రెండు శతకాలు ఉన్నాయి. అదే విధంగా ఐపీఎల్లో రోహిత్ బాదిన సిక్సర్ల సంఖ్య 302.చదవండి: ఐపీఎల్ ‘ముడేసిన బంధం’.. అప్పుడే ప్రేమ బయటపడింది!Question: One bowler you would always love to hit for six?Rohit Sharma: "Honestly, everyone! I’d love to hit all of them. There’s no particular one. My mindset is always the same—I just want to hit, doesn’t matter who’s in front of me."🔥The Shana for a reason @ImRo45 🐐 pic.twitter.com/NZgfBrtiXx— 𝐑𝐮𝐬𝐡𝐢𝐢𝐢⁴⁵ (@rushiii_12) August 28, 2025 -
ఏ తల్లి అయినా అమ్మే..! హ్యాట్సాప్ బ్రదర్
భారతదేశంలో మహిళ భద్రత గురించి తీవ్రమైన ఆందోళనలు రేకెత్తుత్తున్న తరుణంలో ఈ ఘటన భరోసాకు అర్థం ఏంటో చూపించింది. సోషల్ మీడియాలో చాలామంది మహిళలు పంచుకున్న చేదు అనుభవాలు రీత్యా ఇక్కడ క్యాబ్ రైడ్ అనేది అంత సేఫ్ కాదనే అభిప్రాయం సర్వత్రా బలంగా ఉంది. అలాంటి టైంలో ఈ డ్రైవర్ ప్రతిస్పందన ప్రతి ఒక్కర్ని కదిలించింది. నెటిజన్లు అతడిని హ్యాట్సాప్ భయ్యా అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. యాషికా రాపారియా అనే భారతీయ మహిళ ఒక రైడ్‌లో తాను ఎదుర్కొన్న అసాధారణ అనుభవాన్ని షేర్ చేసుకుంది. ఆ క్యాబ్ డ్రైవర్ అసాధారణ సంజ్ఞ తనను మంత్రముగ్గుల్ని చేసిందని అంటోందామె. ఇలాంటి మనుషులకు కూడా ఉన్నారా అని భావన కలిగిందని చెప్పుకొచ్చిందామె. ఇది పూణేలో చోటుచేసుకుంది. అసలేం జరిగిందంటే..ఆమె తన నెలల పసికందుతో కలిసి క్యాబ్‌లో ప్రయాణిస్తోంది. ఇంతలో బిడ్డకు పాలివ్వాల్సి వచ్చింది. అయితే ఇది భారతదేశం. ఇక్కడ పాలివ్వడం అనేది అసాధారణమైన పనిగా భావిస్తారని ఫీల్‌తో క్యాబ్‌లో బిడ్డకు పాలివ్వడానికి ఇబ్బంది పడింది. ఆ నిమిత్తమై ముందు జాగ్రత్తగా ఒక దుప్పటి కూడా తెచ్చుకుంది. అది వేసుకని మరి పాలిస్తున్న ఏదో తెలియని భయంతో చాలా నెర్వస్‌గా ఫీలయ్యింది. అలానే భయపడుతూ ఒక్కసారి తలెత్తి పైకి చూసింది. ఆ క్యాబ్ డ్రైవర్ ఆమెకు బీ సేవ్ అంటూ భరోసా ఇస్తున్నట్లుగా తన ముందున్న అద్దాన్ని ఎడ్జెస్ట్ చేశాడు. అస్సలు వెనుకసీటులో ఏం జరుగుతుందనేది అస్సలు ఆడ్రైవర్కి తెలియను కూడా తెలియదు. ఒక్కసారిగా ఆ బిడ్డ తల్లిని ఒక్క సంజ్ఞతో ఓ తల్లికి గౌరవం తోపాటు భద్రతకు అర్థం ఏంటో చేతల్లో చేసి చూపించాడు. అయినా అవతలివాళ్లకు భరోసా ఇవ్వాలంటే మాటలతో పనిలేదని, చిన్న సర్దుబాటు చాలని చెప్పకనే చెప్పాడు. క్యాబ్ డ్రైవర్లపై ఉండే అభిప్రాయమే మార్చుకునేలా చేశాడు తన ప్రవర్తనతో. అంతేగాదు మానవత్వం ఇంకా బతికే ఉందని చూపించాడు కూడా అంటూ ఇన్స్టాగ్రామ్ పోస్ట్‌లో తన అనుభవాన్ని రాసుకొచ్చింది ఆ తల్లి. View this post on Instagram A post shared by Yashika Raparia (@baby_led_parenting) (చదవండి: గణేశ్ నిమజ్జనం: భర్తపై పూలు జల్లుతూ రాధికా అంబానీ.. ! వీడియో వైరల్) -
ఆ మాటతో నా మనసు ముక్కలు.. పాత గాయాన్ని మళ్లీ రేపాడు.. షాకింగ్ వీడియో
భారత్‌లో మెగా టీ20 క్రికెట్ లీగ్ 2008లో పురుడుపోసుకుంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) పేరుతో మొదలై.. పద్దెనిమిదేళ్లుగా జైత్రయాత్ర కొనసాగిస్తోంది. ఆటగాళ్లపై కాసుల వర్షం కురిపిస్తూ క్యాష్ రిచ్ లీగ్‌గా పేరొందిన ఐపీఎల్.. ఎంతో మంది దేశీ, విదేశీ ఆటగాళ్ల ప్రతిభకు వేదికై.. అంతర్జాతీయ స్థాయికి చేరుకునే వీలు కల్పించింది.ఈ మెగా లీగ్ వ్యవస్థాపకుడు, తొలి చైర్మన్ లలిత్ మోదీ (Lalit Modi). మనీలాండరింగ్ కేసులో బుక్కైన ఈ వ్యాపారవేత్త ప్రస్తుతం విదేశాల్లో తలదాచుకుంటున్నాడు. తాజాగా అతడు ఓ షాకింగ్ వీడియో విడుదల చేశాడు. ఐపీఎల్ చరిత్రలో మచ్చలా మిగిలిపోయిన ‘‘స్లాప్‌గేట్’’కు సంబంధించిన దృశ్యాలను బయటపెట్టాడు.శ్రీశాంత్‌ను చెంపదెబ్బ కొట్టిన భజ్జీఐపీఎల్ అరంగేట్ర సీజన్ 2008లో టీమిండియా మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ (Harbhajan Singh) ముంబై ఇండియన్స్‌కు ప్రాతినిథ్యం వహించాడు. మరోవైపు.. భారత మాజీ పేసర్ శ్రీశాంత్ కింగ్స్ ఎలెవన్ పంజాబ్ (ప్రస్తుతం పంజాబ్ కింగ్స్)కు ఆడేవాడు. ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య నాడు మ్యాచ్ ముగిసిన తర్వాత.. ఆటగాళ్లు కరచాలనం చేసుకునే సమయంలో భజ్జీ.. శ్రీశాంత్‌ను చెంపదెబ్బ కొట్టాడు.ఇరువురి మధ్య వాగ్వాదం తలెత్తిన క్రమంలో భజ్జీ ఈపని చేయగా.. తదుపరి మ్యాచ్‌లలో ఆడకుండా అతడిపై నిషేధం పడింది. ఇక లలిత్ మోదీ తాజాగా ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైకేల్ క్లార్క్ పాడ్‌కాస్ట్ సందర్భంగా భజ్జీ- శ్రీశాంత్‌ను కొట్టిన వీడియోను విడుదల చేశాడు.‘‘ఆరోజు మ్యాచ్ ముగిసింది. కెమెరాలన్నీ ఆఫ్ చేశారు. అయితే, నా దగ్గర ఉన్న సెక్యూరిటీ కెమెరా మాత్రం ఆన్‌లో ఉంది. శ్రీశాంత్, భజ్జీ మధ్య జరిగిన ఘటన అందులో రికార్డైంది. ఇదిగో ఇదే ఆ వీడియో. చాలా కాలంగా నేను దీనిని దాచి ఉంచాను’’ అని లలిత్ మోదీ పేర్కొన్నాడు.నన్ను నేనే క్షమించుకోలేనుకాగా శ్రీశాంత్‌ను చెంపదెబ్బకొట్టడం గురించి భజ్జీ ఇటీవల పశ్చాత్తాపం వ్యక్తం చేశాడు. రవిచంద్రన్ అశ్విన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘‘నా కెరీర్ నుంచి దేన్నైనా తొలగించుకునే అవకాశం వస్తే.. దానిని లిస్టు నుంచి తుడిచేస్తా. ఆరోజు నేను అలా చేయకుండా ఉండాల్సింది.ఇప్పటికి 200 సార్లు క్షమాపణ చెప్పి ఉంటా. అవకాశం దొరికినప్పుడల్లా ఏ వేదిక మీదైనా సరే సారీ చెబుతూనే ఉన్నా. నిజంగా ఆరోజు నేను తప్పుచేశాను. ఆరోజు కంటే నేను హర్ట్ అయిన విషయం మరొకటి ఉంది.కొన్నేళ్ల క్రితం శ్రీశాంత్ కూతురిని నేను కలిశాను. ఆమెతో ప్రేమగా మాట్లాడుతూ ఉండగా.. ‘నేను నీతో మాట్లాడను. నువ్వు మా నాన్నను కొట్టావు’ అంది. ఆ మాటతో నా మనసు ముక్కలైపోయింది. ఆ చిన్నారి మనసులో నాపై అలాంటి ముద్ర ఉండటాన్ని జీర్ణించుకోలేకపోయాను. తన తండ్రిని చెంపదెబ్బ కొట్టిన వ్యక్తిగా మాత్రమే తను నన్ను గుర్తుపెట్టుకుంటుంది. ఆమెకు కూడా క్షమాపణలు చెప్పాను’’ అంటూ హర్భజన్ సింగ్ పశ్చాత్తాపం వ్యక్తం చేశాడు. అయితే, లలిత్ మోదీ మాత్రం పాత గాయాన్ని రేపుతూ వీడియోను బయటకు తేవడం గమనార్హం.చదవండి: భారత క్రికెట్లో అనూహ్య పరిణామం.. బీసీసీఐ అధ్యక్షుడి రాజీనామా View this post on Instagram A post shared by Beyond23 Cricket Podcast (@beyond23cricketpod) -
రషీద్ ఖాన్ చిరునవ్వులు.. పాక్ కెప్టెన్ ముఖం మాడిపోయింది!
పాకిస్తాన్ క్రికెట్ జట్టు గత కొంతకాలంగా గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటోంది. వన్డే వరల్డ్‌కప్-2023, టీ20 ప్రపంచకప్-2024, ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 వంటి మెగా టోర్నమెంట్లలో కనీసం సెమీస్ కూడా చేరలేక చతికిలపడింది. ద్వైపాక్షిక సిరీస్‌లలోనూ పరిస్థితి అంతంత మాత్రమే.సల్మాన్ ఆఘాకు పగ్గాలుఈ క్రమంలో 2024లో బాబర్ ఆజం (Babar Azam) కెప్టెన్సీ నుంచి తప్పుకోగా.. మహ్మద్ రిజ్వాన్ పాక్ జట్టు వన్డే, టీ20 పగ్గాలు చేపట్టాడు. కానీ ఏడాదిలోపే బాబర్‌తో కలిసి టీ20 జట్టులో స్థానం కోల్పోయాడు రిజ్వాన్. ఆసియా కప్-2025 టీ20 టోర్నీకి పాక్ బోర్డు ప్రకటించిన జట్టులోనూ వీరిద్దరికి స్థానం దక్కలేదు.టీ20 ట్రై సిరీస్ ఇక రిజ్వాన్ స్థానంలో పాకిస్తాన్ టీ20 జట్టు కెప్టెన్‌గా ఎంపికైన సల్మాన్ ఆఘా.. చివరగా ఇటీవల వెస్టిండీస్ పర్యటనలో 2-1తో సిరీస్ నెగ్గాడు. ఈ క్రమంలో ఆసియా టోర్నీకి సన్నాహకంగా తదుపరి యూఏఈ- అఫ్గనిస్తాన్‌తో సల్మాన్ బృందం టీ20 ట్రై సిరీస్ ఆడనుంది. ఆగష్టు 29- సెప్టెంబరు 7 వరకు ఈ ముక్కోణపు సిరీస్ జరుగనుంది.ఈ నేపథ్యంలో గురువారం జరిగిన మీడియా సమావేశంలో యూఏఈ, అఫ్గనిస్తాన్ కెప్టెన్లతో కలిసి సల్మాన్ ఆఘా మీడియా సమావేశంలో పాల్గొన్నాడు. ఈ క్రమంలో అతడికి చేదు అనుభవం ఎదురైంది. ఆసియాలో రెండో అత్యుత్తమ జట్టుగా అఫ్గనిస్తాన్ఓ పాకిస్తానీ జర్నలిస్టు.. అఫ్గన్ కెప్టెన్ రషీద్ ఖాన్‌కు ప్రశ్న సంధిస్తూ.. ‘టీ20 ప్రపంచకప్ టోర్నీలో ఆసియాలో రెండో అత్యుత్తమ క్రికెట్ జట్టుగా అఫ్గనిస్తాన్ నిలిచింది కదా!’ అని పేర్కొన్నాడు.పాపం ముఖం మాడిపోయింది!ఇందుకు ఓ వైపు రషీద్ ఖాన్ బదులిస్తుంటే.. సల్మాన్ ఆఘా ముఖం మాత్రం మాడిపోయింది. ‘‘ఇదేందయ్యా ఇది.. అబ్బో.. అటూ ఇటూ తిరిగి మావైపే విమర్శనాస్త్రాలు వచ్చేలా ఉన్నాయే’’ అన్నట్లుగా అతడి ముఖకవలికలు మారిపోయాయి. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.ఇది చూసిన నెటిజన్లు.. ‘‘పాపం.. పాకిస్తాన్ క్రికెట్ జట్టు.. మీకంటే అఫ్గనిస్తాన్ బెటర్ అని మీ వాళ్లే చెబుతుంటే.. ఇంతకంటే ఇంకేం చేస్తారు’’ అంటూ సెటైర్లు వేస్తున్నారు. కాగా అమెరికా- వెస్టిండీస్ సంయుక్తంగా ఆతిథ్యం ఇచ్చిన టీ20 ప్రపంచకప్-2024లో అఫ్గనిస్తాన్ సంచలన విజయాలు సాధించింది.అఫ్గన్ సంచలన ప్రదర్శనఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వంటి పటిష్ట జట్లను ఓడించి సెమీ ఫైనల్‌కు దూసుకువెళ్లింది అఫ్గన్ జట్టు. మరోవైపు.. పాకిస్తాన్ అమెరికా వంటి పసికూన చేతిలో ఓడి లీగ్ దశ దాటకుండానే టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఇక ఈ టోర్నీలో రోహిత్ శర్మ సారథ్యంలోని టీమిండియా చాంపియన్‌గా అవతరించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. యూఏఈ వేదికగా సెప్టెంబరు 9- 28 వరకు ఆసియా కప్ టోర్నమెంట్ నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది.చదవండి: Danish Malewar: డబుల్ సెంచరీతో చెలరేగిన యువ సంచలనం.. తొలి ప్లేయర్‌గా రికార్డుAgha’s reaction when a journalist in PC called Afghanistan the second best teamin Asia 😭😭😭😭 pic.twitter.com/vKd4jQImNn— 𝐀. (@was_abdd) August 28, 2025 -
స్టేజీపై హీరో షాకింగ్ ప్రవర్తన.. హీరోయిన్ నడుము తాకుతా
ఎలాంటి వ్యక్తి అయినా సరే నలుగురిలో ఉన్నప్పుడు హుందాగా ప్రవర్తించాల్సి ఉంటుంది. అయితే కొందరు సెలబ్రిటీలు మాత్రం పబ్లిక్ ప్లేస్‌ల్లోనూ విచిత్రంగా ప్రవర్తిస్తుంటారు. ఇప్పుడు కూడా అలాంటి ఓ సంఘటన అందరినీ షాక్‌కి గురిచేసింది. ఓ స్టార్ హీరో తన పక్కన మాట్లాడుతున్న హీరోయిన్ నడుము తాకుతూ అసభ్యంగా కనిపించాడు. ఇప్పుడు ఈ వీడియో వైరల్ కావడంతో సోషల్ మీడియాలో సదరు హీరోపై విమర్శలు వస్తున్నాయి.(ఇదీ చదవండి: బిగ్‌బాస్ కంటెస్టెంట్ లోబోకు జైలు శిక్ష)టాలీవుడ్, బాలీవుడ్లానే భోజ్‌పురి సినిమా ఇండస్ట్రీ కూడా ఉంది. ఇందులో కాస్త గుర్తింపు ఉన్న హీరో పవన్ సింగ్. ఇతడే ఇప్పుడు చర్చకు కారణమయ్యాడు. తాజాగా ఓ ఈవెంట్‌కి హాజరైన ఇతడు.. తన పక్కనే నిలబడి మాట్లాడుతున్న నటి అంజలి నడుముని పదే పదే తాకుతా చిత్రంగా ప్రవర్తించాడు. ఆమె అసౌకర్యానికి గురవుతున్నా సరే అందరూ చూస్తుండటంతో నవ్వుతూ కవర్ చేసింది. ఇప్పుడు ఈ వీడియో బయటకు రావడంతో పవన్‌పై గట్టిగానే విమర్శలు వస్తున్నాయి.ఇండస్ట్రీ అంటేనే చాలామందికి చిన్నచూపు ఉంది. కానీ ఒకప్పటితో పోలిస్తే నటీమణుల్లో కాస్త చైతన్యం వచ్చింది. తమకు ఇలాంటి అసౌకర్యం జరిగితే బయటకొచ్చి చెబుతున్నారు. మీటూ ఉద్యమం కూడా అప్పట్లో పెద్ద ఎత్తున నడిచింది. అయినా సరే కొందరు హీరోలు ఇలా పబ్లిక్‌గా అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. మరి దీన్ని పవన్ సింగ్ ఎలా కవర్ చేసుకుంటాడనేది చూడాలి? ప్రస్తుతం భోజ్‌పురిలో సినిమాలు చేస్తున్న ఇతడు.. త్వరలో బాలీవుడ్లో కూడా ఎంట్రీ ఇవ్వాలని చూస్తున్నాడు?(ఇదీ చదవండి: ‘త్రిబాణధారి బార్బరిక్’ రివ్యూ)भोजपुरी के कथित सुपरस्टारकभी भाजपा से सांसद बनना चाह रहे थे और आज ये हरतक...#PawanSingh pic.twitter.com/zVy3iJgvlC— AJAY (@ajaygautamm) August 28, 2025 -
అత్యంత వృద్ధ 'డ్రైవర్ అమ్మ'..!
పారిశ్రామిక దిగ్గజం అనంద్ మహీంద్రా ఎప్పటికప్పుడు స్ఫూర్తిని కలిగించే వీడియోలు, పోస్టులను నెట్టింట్ షేర్ చేస్తుంటారు. అలానే ఈసారి శక్తిమంతమైన వైరల్ వీడియోని నెట్టింట షేర్ చేశారు. ఉత్సాహం ఉరకలు వేసేలా కథన రంగంలోకి దిగడానికి.. ఆమెనే ప్రేరణ అంటూ నెట్టింట ఆమెకు సంబంధించిన వీడియోని పంచుకున్నారు. గతంలో ఆమెకు సంబంధించిన విషయాన్ని సోషల్ మీడియా ఎక్స్‌లో పోస్ట్ చేశారు. తాజాగా ఆమె ప్రస్థానం మరింతకు ముందుకు సాగిన వైనాన్ని తెలుపుతూ వీడియోని పంచుకున్నారు. అంతేగాదు జీవితాన్ని ఆస్వాదించడం పట్ల ఆమెకున్న ఆసక్తిని, తపనని ప్రశంసించారు. ఇంతకీ ఆ వీడియోలో ఏముందంటే..72 ఏళ్ల భారతీయ మహిళ మణి అమ్మ సాంప్రదాయ చీరలో దుబాయ్‌లో విలాసవంతమైన రోల్స్ రాయిస్ నడుపుతున్నట్టు కనిపిస్తోంది. ఈమె ఆత్మవిశ్వాసం, ప్రశాంతతకు నిలువెత్తు దర్శనం. "డ్రైవర్ అమ్మ"గా పిలిచే ఈ మణి అమ్మ సుమారు 11 రకాల వాహనాలకు డ్రైవింగ్ లైసెన్స్‌లను కలిగి ఉంది. కేరళలో డ్రైవింగ్ స్కూల్‌ని నడుపుతోంది. ఆమె కార్లు, ట్రక్కులు, ఫోర్క్‌లిఫ్ట్‌లు, క్రేన్లతో సహా వివిధ వాహానాలను నడపటంలో ప్రావీణ్యం సంపాదించడమే కాదు, ఎందరికో స్ఫూర్తిగా నిలిచారామె. ఆమె స్టోరీ ప్రపంచవ్యాప్తంగా ప్రతిఒక్కరిని ఆకర్షించింది, కదలించింది కూడా. అక్కడితో ఆమె ప్రస్థానం ఆగిపోలేదు. మహర్షి సినిమాలో మహేశ్ బాబు చెప్పినట్లు సక్సెస్ ఈజ్ జర్నీ దానికి పుల్‌స్టాప్‌లు ఉండవు అన్నట్లుగా ఈ మణి అమ్మ అంతర్జాతీయ డ్రైవింగ్ పర్మిట్‌ను కూడా సంపాదించారు. ఆ లైసెన్స్‌తో ఆ దుబాయ్ నగర వీధుల్లో సగర్వంగా తిరుగుతూ..అత్యంత ప్రశాంత వదనంతో ఉన్న ఆమె ఆహార్యం నెటిజన్లను తెగ ఆకట్టుకుంది. ఆనంద్ మహింద్రా సైతం ఈ రోజు ఆమె నాకు స్ఫూర్తి అంటూ అందుకు సంబంధించిన వీడియోని షేర్ చేశారు. జీవితాన్ని పూర్తి స్థాయిలో ఆస్వాదించడం ఎలా అనే విషయంలో ఆ మణి అమ్మ అందరికీ స్ఫూర్తి. అంతేగాదు బహుశా ఈ మణి అమ్మే..అంతర్జాతీయ డ్రైవింగ్ లైసెన్స్ పొందిన అత్యంత వృద్ధమహిళ కావోచ్చు అంటూ నెటిజన్లు ఆమె పై ప్రసంశల జల్లు కురిపిస్తూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by Maniamma - The DRIVER AMMA (@maniamma_official) (చదవండి: నైజీరియా స్టూడెంట్స్ 'దేవ శ్రీ గణేశ'ప్రదర్శన..!) -
Viral Video: దీని సిగతరగ.. కుందేలును గుటుక్కున మింగేసింది!
-
మగాళ్లకు ఒక రూల్... మహిళలకు మరో రూల్
-
కోతి చేతిలో కరెన్సీ నోట్లు.. ఎగబడిన జనం
మంకీ మేనియా అంటే ఇదేనేమో!. కోతి చేతిలో కరెన్సీ కోసం జనం ఎగబడిన వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. చివరకు ఆ సొమ్ము అసలు ఓనర్ నిస్సహాయంగా చూస్తూ ఉండిపోగా.. దొరికిన నోట్లను పట్టుకుని జనాలు అక్కడి నుంచి పరుగులు తీశారు. ఉత్తర ప్రదేశ్ ఔరయ్య Auraiya జిల్లా డొండాపూర్ గ్రామంలో విచిత్ర ఘటన చోటు చేసుకుంది. అనూజ్ కుమార్ అనే రైతు తన తండ్రి రోహితాష్ చంద్రతో కలిసి భూమి నమోదు కోసం రూ.80,000 నగదు తీసుకుని మోపెడ్‌లో వచ్చారు. రోహితాష్ లాయర్‌తో పత్రాలు సిద్ధం చేస్తుండగా.. ఓ కోతి మోటార్ సైకిల్ ట్రంక్ తెరచి నగదు సంచిని లాక్కొని సమీప చెట్టుపైకి ఎక్కింది. ఊహించని పరిణామంతో ఆ తండ్రీకొడుకులు షాక్‌లో ఉండిపోయారు. ఈలోపు చెట్టు మీద నుంచి కోతి నోట్లను చింపుతూ చుట్టూ విసరడం ప్రారంభించింది. ఆ ప్రాంగణంలో ఉన్నవారు నోట్ల వర్షాన్ని చూసి పరుగులు పెట్టారు. నోట్లు ఎరుకోవద్దని ఆ తండ్రీ కొడుకులు బతిమాలినా ఎవరూ వినలేదు. దీంతో నిస్సహాయంగా చూస్తూ ఉండిపోయారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.उत्तर प्रदेश के औरैया में एक हैरान करने वाला मामला सामने आया। तहसील परिसर में बंदर किसान की बाइक से बैग ले उड़ा और पेड़ पर चढ़कर उसमें से नोट उड़ाने लगा। अचानक हुई "नोटों की बारिश" देख लोग इकट्ठा होकर पैसे लूटने लगे, जबकि किसान बेबस निहारता रह गया।#ViralVideo #Auraiya #Monkey pic.twitter.com/yEOueSxt9y— Headlines Trend (@headlinetrend) August 27, 2025చివరికి, రోహితాష్ కోతి ఎత్తుకెళ్లిన మొత్తంలో రూ.52,000 మాత్రమే తిరిగి పొందగలిగారు. కోతి చింపగా.. జనాలు ఎరుకుని పోయిన సొమ్ము రూ.28,000 ఉన్నట్లు వాపోయారు. స్థానికుల కథనం ప్రకారం.. బిధూనా తహసీల్ ప్రాంతంలో కోతుల సమస్య చాలా కాలంగా ఉంది. కోతుల దాడి చేస్తాయనే భయంతో ఆ చుట్టుపక్కల ఎలాంటి ఆహార పదార్థాలను అమ్మరంట. ఇలాంటి సంఘటనలు నవ్వు తెప్పించడమే కాకుండా జంతు సమస్యలపై దృష్టి పెట్టాల్సిన అవసరాన్ని కూడా సోషల్ మీడియాలో పలువురు గుర్తుచేస్తున్నారు. -
దళపతి విజయ్‌పై కేసు పెట్టిన ఫ్యాన్
ప్రముఖ నటుడు, తమిళగ వెట్రి కగళం(TVK) అధినేత విజయ్‌కు ఓ అభిమాని షాకిచ్చాడు. మధురై మహనాడులో తనపై విజయ్ బౌన్సర్లు తనపై దాడి చేశారంటూ ఆయన అభిమానే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో వ్యక్తిగత సిబ్బందితోపాటు విజయ్‌పైనా కేసు నమోదు అయ్యింది.ప్రముఖ నటుడు, తమిళిగ వెట్రి కళగం (టీవీకే) పార్టీ అధినేత విజయ్ (Actor Vijay)పై కేసు నమోదైంది. ఆగస్టు 21వ తేదీన మదురై పరపతిలో జరిగిన టీవీకే పార్టీ కార్యక్రమంలో తనపై దాడి జరిగిందని శరత్‌కుమార్ అనే అభిమాని ఫిర్యాదు చేశారు. సభ ప్రారంభ సమయంలో వేదికపై విజయ్ వేదిక మీద నడుచుకుంటూ ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగాడు. ఆ సమయంలో.. కొందరు యువకులు అత్యుత్సాహం ప్రదర్శించారు. విజయ్ నడుస్తున్న వేదికపైకి ఎక్కి హల్చల్ చేశారు. ఈ క్రమంలో.. విజయ్‌కు దగ్గరగా వచ్చిన ఆ వ్యక్తిని బౌన్సర్లు ఎత్తి స్టేజ్ అవతల పారవేసే ప్రయత్నం చేశారు. అయితే అదృష్టవశాత్తూ అతను కింద పడలేదు. ఆ సమయంలో విజయ్ సైతం తన బౌన్సర్లను కాస్త తగ్గమంటూ సైగ చేసి చూపించాడు. అయితే.. ఆ యువకుడు వేదికకు ఉన్న పైప్‌ను పట్టుకుని వేలాడి కిందకి దిగాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలోనూ ట్రోలింగ్ రూపేణా విపరీతంగా వైరల్ అయ్యింది. த.வெ.க மாநாட்டில் தொண்டரை தூக்கி வீசிய பாதுகாவலர்கள்.. நடவடிக்கை எடுக்கக்கோரி கண்காணிப்பாளரிடம் புகார்.. த.வெ.க தொண்டர் வேதனை பேட்டி#TVKManaadu | #Vijay | #Police | #Complaint | #Bouncers pic.twitter.com/AKgg1vdrM3— Polimer News (@polimernews) August 27, 2025 TVK Vijay Manaadu Issue | Perambalur | "பவுன்சர்கள் என்ன தூக்கி கெடாசிட்டாங்க"இளைஞர் பரபரப்பு புகார்#tvkvijay | #Vijay | #tvk | #perambalur | #thanthitv pic.twitter.com/t7WAXyQshW— Thanthi TV (@ThanthiTV) August 27, 2025 దీంతో మనస్తాపం చెందిన శరత్.. నటుడిని కలిసేందుకు వెళ్తుండగా అడ్డుకొన్న బౌన్సర్లు తనపై దాడికి పాల్పడ్డారని బాధితుడు ఆరోపించారు. దీంతో పోలీసులు విజయ్, ఆయన బౌన్సర్లపై కేసు నమోదు చేశారు. ‘‘నేను ఆయన్ని చూసేందుకు వచ్చా. కానీ, ర్యాంప్ నుంచి నన్ను కిందకు తోసేశారు. నాకు గాయాలయ్యాయి. ఘటనకు కారకులపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరాను’’ అని శరత్ తన తల్లితో సహా మీడియాతో మాట్లాడాడు. ఫిర్యాదు ఆధారంగా విజయ్, ఆయన వ్యక్తిగత సిబ్బందిపై బీఎన్ఎస్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఇదీ చదవండి: స్టాలిన్ అంకుల్.. వెరీ వెరీ రాంగ్ అంకుల్! -
కుంకుమ పెడుతూ అసభ్యంగా తాకాడని..
22 ఏళ్లుగా ఈ గుడిలో పూజారిగా పని చేస్తున్నా. ఆచారంగా వస్తున్న పనే నేను చేస్తున్నా. ఎవరూ ఇప్పటిదాకా అభ్యంతరం చెప్పలేదు. ఏనాడూ నాపై ఇలాంటి ఆరోపణలు రాలేదు అంటూ ఆలయ పూజారి నాగభూషణచార్ అంటున్నాడు. ఈలోపు.. ఆ పూజారి తమతోనూ అసభ్యంగా ప్రవర్తించాడంటూ కొందరు సోషల్ మీడియాలో సంచలన ఆరోపణలకు దిగుతున్నారు. కర్ణాటక తుమకూరు దేవరాయనదుర్గ కొండ మీద ఆలయ పూజారి నాగభూషణచార్ మీద జరిగిన దాడి నెట్టింట వైరల్ అవుతోంది. కుంకుమ పెట్టే వంకతో తమను అసభ్యంగా తాకాడంటూ ఓ మహిళ.. తన కుటుంబ సభ్యుల సహకారంతో ఆయనపై దాడికి దిగారు. గుడి మెట్ల మీదనే కర్రలతో ఆయన్ని చితకబాదారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. అయితే.. తానేమీ భక్తులతో అనుచితంగా ప్రవర్తించలేదని ఆయన అంటున్నారు. నా నుంచి ఆశీర్వాదం తీసుకునే సమయంలో భక్తుల మెడకు కుంకుమ రాయడం ఎప్పటి నుంచో చేస్తున్నా. వాళ్లు పొరపాటు పడి నా మీద దాడి చేశారు. ఘటనపై పోలీసులకు ఫిర్యాదు కూడా చేశా అని తెలిపారాయన. ఇదిలా ఉంటే.. దాడి చేసిన కుటుంబం హసన్ జిల్లాకు చెందిందిగా తెలుస్తోంది. అయితే వాళ్లు పూజారిపై పోలీసులకు ఫిర్యాదు చేయలేదని తెలుస్తోంది. దాడికి సంబంధించిన వీడియోను క్షుణ్ణంగా పరిశీలించాకే చర్యలు తీసుకుంటామని పోలీసులు అంటున్నారు. A group of devotees has been accused of assaulting an elderly priest at a temple on #DevarayanadurgaHill in #Tumakuru Sunday, alleging he inappropriately touched women while applying vermilion.pic.twitter.com/vo4U4QNNpa— Hate Detector 🔍 (@HateDetectors) August 25, 2025 -
పోలీసుల పరిస్థితే ఇలా వుంటే సామాన్య ప్రజల సంగతేంటి?
సాక్షి, నెల్లూరు: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడుపై పోలీసులకు ఫిర్యాదు వెళ్లింది. మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్, వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ చంద్రశేఖర్ మంగళవారం వేదాయపాళెం పోలీస్ స్టేషన్‌కు వెళ్లి అయ్యన్నపై పిర్యాదు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ‘‘అయ్యన్నపాత్రుడు అనకాపల్లి, దొండపూడి గ్రామంలో ఓ సిఐ, ఎసైను నోటికి వచ్చినట్లు మాట్లాడారు. ఎస్స్కార్ట్ ఆలస్యంపై పరుషపదజాలం ఉపయోగించడం సిగ్గుచేటు. రాజ్యాంగ వ్యవస్థలో ఉన్నత స్థానంలో వున్న వ్యక్తి మాట్లాడాల్సిన మాటలు కావవి. అయ్యన్నపాత్రుడి వ్యాఖ్యలపై పోలీస్ అసోసియేషన్ స్పందించకపోవడం బాధాకరం.. .. మా పార్టీకి, నాయకులకు పోలీసులపై గౌరవ మర్యాదలు వున్నాయి. సభ్యసమాజం తల దించుకునేలా వుంది అయ్యన్నపాత్రుని తీరు. పోలీసుల పరిస్థితే ఇలా వుంటే సామాన్య ప్రజల సంగతి ఏంటి అని ఆలోచించాలి’’ అని అన్నారు. అయ్యన్న సొంత జిల్లా అనకాపల్లి జిల్లా దొండపూడిలో గ్రామ దేవత సంబరాలు ఆదివారం ప్రారంభమయ్యాయి. మూడు రోజుల పాటు సాగే ఈ ఉత్సవాలను.. స్పీకర్ అయ్యన్న ప్రారంభించేందుకు వచ్చారు. అయితే.. ఆయనను చూడగానే పెద్ద ఎత్తున ప్రజలు గుమిగూడారు. ఈ సందులో తనపై దాడి జరిగితే ఏంటి? అనేది అయ్యన్న ఆవేదన. దీంతో పోలీసులపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. తమాషాలు చేస్తున్నారా?. మేం వస్తుంటే సీఐ,ఎస్సై ఏం చేస్తున్నారు? కనీసం ప్రొటోకాల్ కూడా తెలియకపోతే మీకు ఉద్యోగాలు ఎందుకు? ఈ సంగతి అసెంబ్లీలోనే తేలుస్తా అంటూ పోలీసులను బండబూతులు తిట్టారాయన. ఈ వ్యవహారం సోషల్ మీడియాలో రచ్చకు దారితీసింది. పోలీసులను తిట్టారంటూ.. అయ్యన్నపై పలువురు మండిపడుతున్నారు. దీంతో సీఎంవో, డీజీపీ కార్యాలయం అసలు ఏం జరిగిందో వివరణ ఇవ్వాలని డీఎస్పీని ఆదేశించారు. -
అన్నామలైకు చేదు అనుభవం, అయినా సరే..!
బీజేపీ నేత, తమిళనాడు మాజీ బీజేపీ చీఫ్ అన్నామలైకు చేదు అనుభవం ఎదురైంది. ఓ ఈవెంట్‌కు హాజరైన ఆయన నుంచి మెడల్ స్వీకరించేందుకు ఓ యువకుడు నిరాకరించాడు. తీరా ఆ యువకుడు ఆ రాష్ట్ర మంత్రి కొడుకు కావడం గమనార్హం.తమిళనాడు పరిశ్రమల శాఖ మంత్రి టీఆర్బీ రాజా తనయుడు సూర్య రాజా బాలు చేసిన పని ఇప్పుడు తమిళనాట చర్చనీయాంశమైంది. మాజీ ఐపీఎస్ అన్నామలై నుంచి మెడల్‌ను నిరాకరించాడు. తమిళనాడు 51వ రాష్ట్ర స్థాయి షూటింగ్ పోటీలకు అన్నామలై ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. విజేతల మెడలో మెడల్స్ వేస్తుండగా.. సూర్య అందుకు ఒప్పుకోలేదు. అన్నామలై నుంచి దూరందూరంగా జరిగాడు. ఆపై అన్నామలై నుంచి చేత్తో ఆ మెడల్‌ను తీసుకున్నాడు.அசிங்கப்பட்டான் ஆடு மேய்ப்பன் @annamalai_k pic.twitter.com/19l5XerZfH— ஜோக்கர் ᵖʰᵒᵉⁿⁱˣ (@lahudapandi) August 25, 2025అయితే ఈ పరిణామంపై అన్నామలై ఏమాత్రం అసహనం వ్యక్తం చేయలేదు. బాలును దగ్గరికి తీసుకుని సక్సెస్ కావాలంటూ అభినందించి ఫొటో దిగారు. ఆపై ఈ వీడియో వైరల్ అయ్యింది. ఓ ఈవెంట్‌కు హాజరైన మీడియా నుంచి ఆయనకు వైరల్ వీడియోపై ప్రశ్న ఎదురైంది. దానికి అన్నామలై స్పందిస్తూ.. నేత అనేవాడు ప్రజలతో ప్రేమాభిమానాలతో ఉండాలిగానీ ద్వేషంతో కాదు అని బుదులిచ్చారు. బాలుకు విజయాలు కలగాలి అంటూ మరోసారి ఆశీర్వదించారు. దీంతో అక్కడ నవ్వులు విరబూశాయి.అన్నామలై 2011 బ్యాచ్‌కు చెందిన మాజీ IPS అధికారి. కర్ణాటకలో ఆయన సేవలందించారు. 2019లో పోలీస్ ఉద్యోగానికి రాజీనామా చేసి.. 2020లో BJPలో చేరారు. తమిళనాడు BJP అధ్యక్షుడిగా పనిచేసి.. సింగంగా ప్రజాదరణ పొందారు. అయితే వరుసగా ఎన్నికల్లో పార్టీ సరైన ఫలితాలు రాబట్టకపోవడంతో బీజేపీ అధిష్టానం ఈమధ్యే ఆయన్ని అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పించింది. అయినప్పటికీ నిత్యం ఆయన స్టాలిన్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూ వార్తల్లో కనిపిస్తున్నారు.మొన్నీమధ్యే తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవికి ఇదే తరహా అనుభవం ఎదురైంది. తిరునెల్వేలిలో ఓ యూనివర్సిటీ స్నాతకోత్సవానికి ఆయన హాజరు కాగా.. ఆయన నుంచి కాకుండా యూనివర్సిటీ వైస్ చాన్సలర్ నుంచి ఓ యువతి పట్టా అందుకుంది. డీఎంకే నేత ఎం రాజన్ తనయ జీన్ జోసెఫ్‌గా తేలింది. గవర్నర్ తమిళ భాషకు, తమిళనాడుకు వ్యతిరేకి అని.. పైగా వైస్ చాన్సలర్ తమిళనాడుకు ఎంతో చేశారని.. అందుకే ఆయన నుంచి పట్టా తీసుకున్నానని జీన్ తెలిపింది. -
నైజీరియా స్టూడెంట్స్ 'దేవ శ్రీ గణేశ'ప్రదర్శన..!
ఎటు చూసినా..వినాయక చవితి పండుగ కోలాహలంతో సందడిగా ఉంది. ప్రతి చోట గణపతి ప్రతిమల దర్శనంతో..జై గణేశ..అనే శ్మరణే కనిపిస్తోంది. బాద్రపదమాసం రాకే గణనాథుడి పండుగనే హైలెట్ చేస్తుంది. ఈ పండుగ అందరిని ఒకచోటకు చేర్చి..ఐక్యంతగా జరుపుకునేలా చేసే సంబరం. అలాంటి పండుగ వాతావరణం నైజీరియాలో కూడా కనిపించడమే విశేషం. అక్కడ ప్రజలు కూడా చవితి పండుగను జరుపుకుంటారా అని విస్తుపోకండి. అసలు కథేంటంటే..దేశవ్యాప్తంగా గణేష్ చతుర్థి వేడుకల సన్నహాలు, ఉత్సవాలతో సందడిగా ఉంది. ఈ వేడుకలు అంబరాన్నంటేలా ఘనంగా సాగుతున్న ఈ తరుణంలో నెట్టింట ఓ వీడియో అందరిని అమితంగా ఆకర్షించడమే కాదు మా బొజ్జగణపయ్య అన్ని చోట్ల ఉన్నాడనడానికి ఇదే సంకేతం అని మురిసిపోతున్నారు నెటిజన్లు. ఆ వీడియోలో నైజీరియన్ విద్యార్థుల బృందం బాలీవుడ్ ఫేమస్ పాట "దేవ శ్రీ గణేశ" అనే భక్తి గీతానికి డ్యాన్స్ చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఆ వీడియోని నైజీరియాలోఏని డ్రామ్ క్యాచర్స్ అకాడమీ అనే ఎన్జీవో ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. గణేష్ చతుర్థికి ముందు అకాడమీ పిల్లలు శ్రీ గణేశ దేవా అనే పాటకు ఎంత అద్భుత డ్యాన్స్ చేశారంటే కళ్లురెప్పవేయడమే మర్చిపోయేంత అందంగా చేశారు. ఆ పాట బీట్‌కి తగ్గట్లుగా వేస్తున్న స్టెప్పులు వావ్ వాట్ ఏ ఎనర్జీ అనే ఫీల్ కలుగుతోంది . అంతేకాదండోయ్ వాళ్లు ఆ వీడియోకి "హలో ఇండియా మీరు ఈ వీడియోని ఇష్టపడతారని మేము ఆశిస్తున్నాం" అంటూ ఇవ్వడం మరింత విశేషం. ఈ వీడియోకి మూడు లక్షలకు పైగా వ్యూస్, లైక్‌లు వచ్చాయి. View this post on Instagram A post shared by Dream Catchers Academy 🇳🇬 🌍 (@dreamcatchersda) (చదవండి: భాగ్యనగరంపై మనసు పారేసుకున్న రష్యన్ చిన్నది..!) -
బొజ్జ గణపయ్యను ముస్తాబు చేసిన నటి మేకింగ్ వీడియో వైరల్
వినాయకచవితి వేడుకల కోసం దేవ్యాప్తంగా భక్తజనం సన్నాహాల్లో ఉన్నారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి గణేషులనే పూజించాలని ఇటు ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు, సెలబ్రిటీలు సైతం ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. మట్టి గణపతే మహా గణపతి అనే నినాదంతో గ్రీన్ గణేషుడికి జై కొడుతున్నారు. తాజాగా టాలీవుడ్ హీరో వరుణ్ సందేశ్ భార్య, హీరో వితికా షేరు కూడా ఈ నినాదాన్నే ముందుకు తీసుకెడుతూ మట్టితో బొజ్జగణపయ్య విగ్రహాన్ని అందొగా రూపొందించింది. దీనికి సంబంధించిన వీడియోన ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. మా వినాయకుడు రెడీ జై బోలో గణేష్ మహారాజ్ కి మా గణపతి ఎలా అనిపించారో చెప్పండి అని తెలిపింది. దీంతో అటు అభిమానులు, ఇటు పర్యావరణ ప్రేమికులు వితికా ప్రయత్నాన్ని, ప్రచారాన్ని ప్రశంసిస్తున్నారు. View this post on Instagram A post shared by Vithika Sheru (@vithikasheru) చదవండి: పొలాల్లో ప్లాస్టిక్ భూతం! బయోపాస్టిక్‌లూ విషపూరితమే!వినాయక చవితి సందర్భంగా మట్టి గణేషుని తయారు చేసే విషయంలో వితిక తన ట్యాలెంట్‌తో నెటిజన్లను మెస్మరైజ్ చేసారు. మట్టితో వినాయకుడిని తయారు చేసి, అందంగా బుజ్జి గణేషున్ని తయారు చేసి. సహజ సిద్ధమైన రంగులతో మరింత అందంగా రూపొందించింది. ఈ తయారీ విధానాన్ని వీడియోగా తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అలాగే అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అందించింది. ప్రస్తుతంఈ వీడియో వైరల్ అవుతోంది. ఇదీ చదవండి: Yoga మైగ్రేన్‌తో భరించలేని బాధా? బెస్ట్ యోగాసనాలు మట్టి గణపతినే పూజిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుకుందాం! -
భాగ్యనగరంపై మనసు పారేసుకున్న రష్యన్ చిన్నది..!
మన హైదరాబాద్ ఎందరికో ఆతిథ్యం ఇవ్వడమే గాక వాహ్ భాగ్యనగరం అని అనిపించుకుంది. ఈ నగరం తన రుచులతో, సంస్కృతితో చాలామంది అభిమానులను సంపాదించుకుంది కూడా. అలాంటి మన భాగ్యనగరంలోని హైటెక్ సొగసులకు ఫిదా అవ్వుతూ..వావ్ అని నోరెళ్లబెట్టింది ఈ విదేశీ మోడల్. అంతేగాదు ఐ లవ్ హైదరాబాద్ అని అంటోంది కూడా.ఢిల్లీకి చెందిన రష్యా మోడల్ క్సేనియా మన హైదరాబాద్‌లోని ఆకాశ హర్మ్యాలు, మౌలిక సదుపాయాలను చూసి మంత్రముగ్దురాలైంది. హైటెక్ సిటీలోని టెక్ హబ్‌ని చూసి ఆశ్చర్యపోయింది. అందుకు సంబంధించిన వీడియోని షేర్ చేస్తూ..ఇది ముంబై అనుకుంటున్నారు కాదు హైదరాబాద్ అంటూ తాను చూసిన వాటిని అన్నింటిని చూపిస్తోంది వీడియోలో. ఆకాశాన్ని తాకేలా ఉన్న విలాసవంతమైన ఆ బిల్డింగ్లు కళ్లుతిప్పుకోనివ్వడం లేదని చెబుతూ..హైటెక్ నగరంపై ప్రశంసల జల్లు కురిపించింది. అంతేగాదు ఇక్కడ స్కైలైన్లు, ఆధునిక పట్టణంగా తీర్చిదిద్దిన తీరు తదితరాలన్నింటిని అభినందించింది. అంతేగాదు ఆ వీడియోకి "హబీబీ, ఇది దుబాయ్ కాదు, హైదరాబాద్," అనే క్యాప్షన్‌ని జోడించి మరి పోస్ట్ చేసింది. ఈ వీడియోని చూసిన నెటిజన్లు కూడా..ఇక్కడ భాషా వివాదం ఉండదని, మంచి వాతవరణానికి నెలవు, అలాగే భారతదేశానికే ఈ నగరం గర్వకారణం. మాకు కూడా అత్యంత ఇష్టం అని కితాబిస్తూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by 𝙆𝙨𝙚𝙣𝙞𝙞𝙖✨ (@vegkseniia) (చదవండి: ఆమె మోడల్ కాదు..ఐపీఎస్ అధికారిణి..! సక్సెస్‌ని ఆస్వాదించేలోపే..) -
రామ్ భజనలకు లయబద్ధంగా ఆర్థికవేత్త స్టెప్పులు..!
ప్రధానమత్రి ఆర్థిక మండలి(EAC–PM) సభ్యుడు సంజీవ్ సన్యాల్ అయోధ్య రాముడి భక్తిగీతాలకు ఆయన ఉత్సాహంగా నృత్యం చేశారు. అది కూడా ఓ సాధారణ వ్యక్తిగా నవ్వతూ చిందులేశారు. ఆ నృత్యం అక్కడున్న వారందని ఆకర్షించడమే కాదు..ఒక్క క్షణం తన హోదాను మరిచిపోయి భక్తిపారవశ్యంతో చేస్తున్న ఆ నృత్యం అందరిని అలరించింది. న్యూఢిల్లీలో సంగమ్ టాక్స్ నిర్వహించిన స్వరాజ్య కాన్క్లేవ్ 2025 సందర్భంగా ఆర్థికవేత్త సన్యాల్ భజనల్లో పాల్గొన్నారు. ప్రముఖు వక్తల ఉపన్యాసం సెషన్ల జనసందోహలోనే సీనియర్ ఆర్థికవేత్త తన సాధారణ విధాన కేంద్రీకృత ఇమేజ్ను పక్కకు యువకుడి మాదిరిగా ఎంజాయ్ చేస్తూ కనిపించారు. ఆ వీడియోని ఒక సోషల్ మీడియా యూజర్ ఎక్స్‌లో పోస్ట్ చేస్తూ. ప్రధాని ఆర్థిక వ్యవస్థను నడపడానికి సహాయపడే వ్యక్తి పదివ శతాబ్దపు నౌకా నిర్మాణ వేత్తగా స్టెప్పులు వేస్తూ..చరిత్ర పాఠ్యపుస్తకాలను తిరగ రాసేలా రామభజనలకు బ్రేక్ డ్యాన్స్‌లు వేశాడు అని పేర్కొన్నారు. కాగా, ఆయన భారతదేశ సివిల్ సర్వీసెస్ పరీక్ష విధానంపై స్పష్టమైన అభిప్రాయల చర్చలో కూడా పాల్గొన్నారు. అలాగే చార్టడ్ అకౌంటెంట్ కంటెంట్ క్రియేటర్ కుశాల్ లోధా పాడ్‌కాస్ట్‌లో కూడా అతను వ్యవస్థపై పదునైన విమర్శలు ఎక్కుపెట్టాడు. చాలామంది ఈ సివిల్స్ ఎగ్జామ్ సుమారు 99% మంది వైఫల్యమవుతున్నారు. అయినా అన్నేళ్లు ఈ ఎగ్జామ్ ప్రిపరేషన్ కోసం వృధా చేసుకోవడం ఏంటని ప్రశ్నించారు కూడా. అంతేగాక దేశం ఈ పరీక్ష విధానంలోని అసమాన ప్రాముఖ్యతను పునః పరిశీలించాలని భావించారు కూడా. Imagine being the guy who helps the PM run the economy, cosplays as a 10th-century shipbuilder, rewrites history textbooks… and then break dances on Ram bhajans.Yeah, that’s @sanjeevsanyal 🙇🏻 pic.twitter.com/RAQBdvioT4— Prateek (@poignantPrateek) August 22, 2025 (చదవండి: ఆ ప్రేమ లేఖ ఖరీదు ఎంతో తెలిస్తే..విస్తుపోతారు..!) -
Viral Video: గురువాయూర్ టెంపుల్లో.. భజనకు బుజ్జి ఏనుగు పారవశ్యం
-
ఆ ప్రేమ లేఖ ఖరీదు ఎంతో తెలిస్తే..విస్తుపోతారు..!
ఈ రోజుల్లో ప్రేమ అనే పదం కనుమరుగైపోతోంది. పచ్చని సంసారాలు చిన్న చిన్న అపార్థాలతో భగ్గుమంటున్నాయి. అలాంటి తరుణంలో కొన్ని ప్రేమకథలు వింటుంటే..అలాంటి ప్రేమలు ఇప్పుడెందుకు ఉండటం లేదు అనిపిస్తోంది. అలాంటి భావోద్వేగభరిత లవ్‌స్టోరీ నెట్టింట వైరల్‌గా మారింది.అదేంటంటే..భారత మాజీ ఆర్మీ అదికారి కెప్టెన్ ధర్మవీర్ సింగ్ తన ప్రియురాలు రాసిన లేఖను పంచుకున్నారు. ప్రస్తుతం ఆమె అతడి అర్థాంగి. తాను 2001 ఆ టైంలో చెన్నైలో ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీలో చేరినప్పుడు రాసిన లవ్‌లెటర్ అని చెప్పుకొచ్చారు. తన స్నేహితురాలైన ఠాకురైన్ ఆ ప్రేమలేఖ రాసినట్లు వివరించారు. అయితే సైనిక అకాడమీలో లెటర్లు మావద్దకు చేరాలంటే సీనియర్లు పెట్టే షరతులను, టెస్ట్‌లను అంగీకరించాల్సి వచ్చేది. అయితే తనకు వచ్చిన లేఖ చాలా బరువుగా ఉందంటూ తన సీనియర్లు తన చేత ఏకంగా 500 పుష్అప్లు చేయాలని బలవంతం పెట్టారట. దాంతో చేసేదేమి లేఖ అన్ని పుష్అప్లు చేయక తప్పలేదని చెప్పుకొచ్చారు. తాను అకాడమీలో ఉండగా అందుకున్న మొదటి లేఖ అదేనట. రాయడానికి ఎంత టైం పట్టిందో గానీ, ఆ భావాలు తన మనసులో ఇంకా అలానే పదిలంగా ఉన్నాయంటూ ఆ లేఖ తాలుకా వీడియోని జత చేస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. నెటిజన్లు ఆ వీడియోని చూసి ఆమెది చాలా అందమైన చేతిరాత, మీ ప్రేమ కథ హృదయాన్నిదోచే గొప్ప ప్రేమకథ అని ప్రశంసిస్తూ పోస్టుల పెట్టారు. View this post on Instagram A post shared by Capt. Dharmveer Singh (@capt_dvs) (చదవండి: ఆమె చిరునవ్వులో ఏదో మాయజాలం..!) -
ఆమె చిరునవ్వులో ఏదో మాయజాలం..!
ఒక్క చిరునవ్వు సంభాషణతో పనిలేకుండా చేస్తుంది. అదే వెయ్యి మాటలకు సమానం అని చెప్పొచ్చు. కొందరు ప్రతి మాటకు చిన్న చిరునవ్వుతో సమాధానం చెప్పి..అవతలి వారి మనసులో గొప్ప స్థానాన్ని సంపాదించుకుంటారు. అలాంటి హృదయపూర్వక సంఘటనే ఇక్కడ చోటుచేసుకుంది. ఆమె ఆ ఒక్క సంజ్ఞతో సంభాషణకు తావివ్వకుండా మాట్లాడింది.అందుకు సంబంధించిన వీడియోనెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఆ వీడియోలో సంచిత అగర్వాల్ అనే కంటెంట్ క్రియేటర్ ఒక వృద్ధురాలికి లిఫ్ట్ ఇస్తున్నట్లు కనిపిస్తుంది. ఇది అచ్చం సినిమాలో కనిపించే సన్నివేశంలా ఉంటుంది. ఆ వృద్ధ మహిల కృజ్ఞత చూపిస్తూ..ఆమె సాయం తీసుకుంటుంది. ఆ కారు ఎక్కగానే ఆమె ముఖం వెలిగిపోతుంది. ఎక్కడకి వెళ్లున్నావని సంచిత ప్రశ్నించగా ఆమె "జీవన్ భారతి" అని సమాధానం ఇస్తుంది. గమ్యస్థానంకి చేరుకోగానే కంటెంట్ క్రియేటర్ జాగ్రత్తలు చెబుతూ నిష్క్రమిస్తుంది. అయితే ఆమె మాత్రం మారుమాట్లాడకుండా ఒక్క చిరునవ్వుతో సమాధానమిస్తుంది. చిన్న స్మైల్‌తో తన భావన అంతా చెబుతున్నట్లుగా ఉంది ఆ వృద్ధురాలి నవ్వు. ఆ నవ్వులో ఏదో మాయ జాలం ఉంది అంటూ ఇన్‌స్టాలో ఆ విషయాన్ని షేర్ చేసుకుంది కంటెంట్ క్రియేటర్. అంతేగాదు కొన్నిసార్లు జీవితంలో సినిమాలోని సన్నివేశాలు చోటుచేసుకుంటాయి అనే క్యాప్షన్‌తో ఈ వీడియోని పంచుకున్నారామె. ఈ వీడియోకి ఏకంగా రెండు మిలియన్ల వ్యూస్, లైక్‌లు వచ్చాయి. ఇంకెందుకు మీరు ఓ లుక్కేయండి మరి.. View this post on Instagram A post shared by Sanchita Agarwal (@littlesweet_family) (చదవండి: వద్దనుకున్న బిడ్డ నవ్వుల రాణి అయింది) -
రైలులో మహిళతో కానిస్టేబుల్ అసభ్య ప్రవర్తన.. లైట్స్ ఆఫ్‌లో ఉండగా..
లక్నో: రైలులో రాత్రిపూట ఓ మహిళతో అసభ్యకరంగా ప్రవర్తించిన కానిస్టేబుల్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అనంతరం, ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న ప్రభుత్వం అతడిని సస్పెండ్ చేసింది. ఈ షాకింగ్ ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. ఇంతకీ ఏం జరిగిందంటే..వివరాల ప్రకారం.. ఢిల్లీ నుంచి ప్రయాగ్ రాజ్ వెళ్తున్న ప్రయాగ్‌రాజ్ ఎక్స్‌ప్రెస్‌లో జీఆర్పీ కానిస్టేబుల్ ఆశిష్ గుప్తా విధులు నిర్వహిస్తున్నాడు. సదరు రైలులో మహిళల భద్రత కోసం అతడిని విధుల్లో పెట్టారు. అయితే, రైలులో మహిళల భద్రతను కాపాడాల్సిన కానిస్టేబుల్ దారుణంగా ప్రవర్తించాడు. రాత్రివేళలో లైట్లు ఆఫ్ చేసి ఉండటాన్ని అవకాశంగా తీసుకున్న అతను, నిద్రలో ఉన్న ఓ మహిళను అసభ్యకరంగా తాకేందుకు ప్రయత్నించాడు. ఆమె పట్ల అనుచితంగా ప్రవర్తించాడు. కోచ్‌లో చీకటిగా ఉండడంతో తన చర్యలను ఎవరూ గమనించలేరనే ఉద్దేశంతో ఈ పాడుపనికి పాల్పడ్డాడు.GRP constable Ashish Gupta suspended for inappropriately touching a sleeping girl on a Delhi-Prayagraj train. Victim recorded video of incident, showing constable apologizing.pic.twitter.com/JoG7T0m6em— Ghar Ke Kalesh (@gharkekalesh) August 23, 2025ఈ క్రమంలో వెంటనే యువతి నిద్రలేచి అతడిని పట్టుకుంది. దీంతో, ఆందోళనకు గురైన కానిస్టేబుల్ తనను క్షమించాలని వేడుకున్నాడు. దండం పెట్టి ఆమెను క్షమాపణలు కోరారు. అయితే, సదరు మాత్రం ఇదంతా తన ఫోన్లో వీడియో తీసింది. అనంతరం, ఈ ఘటనపై బాధితురాలు.. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది. వీడియో ఆధారంగా ఉన్నతాధికారులు స్పందించి ఆశిష్ గుప్తాను సస్పెండ్ చేశారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. -
రెండు నెలల బిడ్డను కాపాడేందుకు నర్సు సాహసం వీడియో వైరల్
ఆపద సమయంలో, విధి నిర్వహణలో ధైర్య సాహసాలను ప్రదర్శించిన వారే అసలైన హీరోలు. ఒక పసిబిడ్డను కాపాడేందుకు షీరోనర్స్ చేసిన సాహసం, ధైర్యం విశేషంగా నిలిచింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. మీ ధైర్యానికి సెల్యూట్! అంటూ నెటిజన్లు ఆమెపై ప్రశంసలు కురిపించారు.టిక్కర్ గ్రామానికి చెందిన స్టాఫ్ నర్సు కమల అనారోగ్యంతో ఉన్న పసిపాపకు ఇంజెక్షన్ ఇచ్చేందుకు హురాంగ్ గ్రామానికి చేరుకోవాల్సి ఉంది. అయితే ఇటీవలి భారీ వర్షాల కారణంగా విస్తృతంగా విధ్వంసం సంభవించింది. సిల్బుధాని , తార్స్వాన్ పంచాయతీలలో రోడ్లు , ఫుట్‌బ్రిడ్జిలు కొట్టుకుపోయాయి. ఆ గ్రామానికి వెళ్లే మార్గం కష్టంగా మారింది. పద్దర్ సబ్ డివిజన్ పరిధిలోని చౌహార్ లోయ మండిలోని అత్యంత ప్రభావిత ప్రాంతాలలో ఒకటి. అటు చూస్తే కాలువ పొంగిపొర్లుతోంది నీరు చాలా వేగంగా ప్రవహిస్తోంది ఏ మాత్రం స్లిప్ అయినా ప్రాణాలకే ముప్పు. అయినా సరే వృత్తి ధర్మం నెరవేర్చాలనే ఆశయంతో రాళ్లపై ఒక్క ఉదుటున దూకి జాగ్రత్తగా బ్యాలెన్స్ చేస్తూ కాలువ దాటింది. Meet Staff Nurse Kamla, who risked her life to ensure a two-month-old baby received a crucial injection. With the bridge in her area swept away, she crossed the river to reach the child. She is From Paddhar's Chauharghati, Mandi. @CMOFFICEHP @mansukhmandviya @nhmhimachalp @WHO pic.twitter.com/o9JFmIHskx— Vinod Katwal (@Katwal_Vinod) August 23, 2025> అద్భుత సాహసానికి సంబంధించిన ఈ ఘటన హిమాచల్ ప్రదేశ్‌లోని మండి జిల్లాలోని సుధార్ పంచాయతీలోని చౌహర్ఘాటిలో చోటు చేసుకుంది. నర్సు ధైర్యానికి అందరూ ముగ్ధులయ్యారు. అదే సమయంలో, వరద ప్రభావిత ప్రాంతాల్లో ఫ్రంట్‌లైన్ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు, ప్రమాదాలపై ఆందోళన కూడా వ్యక్తమైంది. ఇదీ చదవండి: అందమైన హారాన్ని షేర్ చేసిన సుధామూర్తి , విశేషం ఏంటంటే! -
Viral Video: వామ్మో..! కోబ్రాతో చెడుగుడు ఆడుకున్నబుడ్డోడు!
-
బిడ్డ భవిష్యత్తు కోసం..
తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్తు కోసం శక్తిమేరకు కూడబెట్టాలని ప్రయత్నిస్తుంటారు. స్థలాలు, ఇళ్లు లాంటి స్థిరాస్తులు తమ వారసులకు ఇచ్చేందుకు కష్టపడుతుంటారు. దుబాయ్‌కు చెందిన ఒక ఇన్ఫ్లుయెన్సర్ జంట తమ పసిపాప కోసం అపురూప కానుకను సిద్ధం చేసింది. ప్రపంచంలోనే ఎత్తైన భవనంగా పేరు గడించిన బుర్జ్ ఖలీఫాలో ఫ్లాట్ కొనుగోలు చేసి.. తమ పాప భవిష్యత్తుకు ఢోకా లేకుండా చేశారు. దీనికి సంబంధించిన వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయడంతో వీరిపై నెటిజనులు ప్రశంసలు కురిపిస్తున్నారు.దుబాయ్‌కు చెందిన ఇన్ఫ్లుయెన్సర్లు నోరా, ఖలీద్ భార్యాభర్తలు. ఐకానిక్ బిల్డింగ్ బుర్జ్ ఖలీఫాలో తమ బిడ్డ కోసం ఒక ఫ్లాట్ కొన్నారు. ఈ సందర్భంగా తమ పాపతో కలిసి ఆనందాన్ని పంచుకున్న వీడియోను ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. 24 గంటలు గడవకముందే ఈ వీడియోకు 5 లక్షలకుపైగా వ్యూస్, 26 వేలకు పైగా లైకులు వచ్చాయి. పెద్దయ్యాక తమ కూతురికి ఆర్థిక సమస్యలు లేకుండా చేయాలన్న ముందుచూపుతో ఈ ఫ్లాట్ కొన్నామని నోరా వెల్లడించారు.తమ జీవితంలోని ఉత్తమ పెట్టుబడులలో ఇది ఒకటని ఆమె తెలిపారు. 1% పేమెంట్ ప్లాన్‌తో ఈ ఫ్లాట్‌ను కొనుగోలు చేశామని, తమ బిడ్డ పెద్దయ్యే నాటికి మొత్తం చెల్లించేస్తామని నోరా చెప్పారు. ఫ్లాట్ రెడీ అయిన తర్వాత అద్దెకు ఇస్తామని, తమ కూతురు పెద్దైన తర్వాత ఇందులో ఉండాలనుకుంటే ఉంటుందన్నారు. బుర్జ్ ఖలీఫాలో వ్యూ ఫ్లాట్ కాబట్టి దీని విలువ భవిష్యత్తులో బాగా పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ వీడియో చూసిన నెటిజనులు.. నోరా, ఖలీద్ దంపతులను అభినందిస్తూ పోస్టులు పెడుతున్నారు. ప్రతి తల్లిదండ్రులు తమ బిడ్డకు ఇలాంటి స్థిరత్వం కావాలని కలలు కంటారని ఒకరు కామెంట్ చేశారు. కాగా, నోరా, ఖలీద్ ఉమ్మడి ఇన్స్టాగ్రామ్ ఖాతాకు 2.5 మిలియన్ ఫాలోవర్లు ఉన్నారు. View this post on Instagram A post shared by Nora & Khalid (@noraandkhalid) -
16 వేల అడుగుల ఎత్తులో పూతరేకులు తిన్నారా..?
ఆంధ్రప్రదేశ్‌లోని ఆత్రేయపురం గ్రామం ఫేమస్ వంటకం పూతరేకులు. జీఐ ట్యాగ్ దక్కించుకున్న ఈ స్వీట్ వివాహాలు, పండుగల్లో భాగమై అందరు ఇష్టపడే వంటకంగా పేరుతెచ్చుకుంది. అలాంటి ఫేమస్ స్వీట్‌ని నచ్చిన పర్యాటనలకు వెళ్లినప్పుడూ కూడా వెంట తీసుకువెళ్తాం. అది కామన్. కానీ ఎత్తైన పర్వతాలను ట్రెక్కింగ్ చేస్తున్నప్పుడూ లేదా ఎముకలు కొరికే చలిప్రాంతాల్లో దీన్ని ఆస్వాదించే ప్రయత్నం చేశారా.!. ఇదంతా ఎందుకంటే 16 వేల అడుగుల ఎత్తులో హిమగిరులను చూస్తూ.. తెల్లటి కాగితం పొరల్లా ఉండే ఈ పూతరేకులను తింటే ఎలా ఉంటుందో ఆలోచించారా..? ఇంకెందుకు ఆలస్యం తింటే ఎలా ఉంటుందో తెలుసుకుందాం రండి మరి..ఆధ్యాత్మిక గురు సద్గురు జగ్గీ వాసుదేవ్,ఈశా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు ఆ ప్రయత్నం చేశారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఆయన తన కైలస యాత్రలో భాగంగా..16,400 అడుగుల ఎత్తులో ఉన్న హిమాలయాలను చూస్తూ..ఈ స్వీట్‌ని ఆస్వాదించారు. ఎతైన, కొండలు, మంచు పర్వతాల వద్ద కొన్ని వంటకాలు రుచి మారుతుంది. ఒక్కోసారి పాడైపోతాయి కూడా. బ్రెడ్, ఎనర్జీ బార్లు, చాక్లెట్లు సూప్ లాంటివి అక్కడ చలికి బాగా గట్టిగా మారిపోతాయి. తినేందుకు అంత బాగోవు కూడా. మరి ఈ వంటకం రుచి కూడా అలానే ఉంటుందా..! అన్నట్లుగా సద్గురు ఆ ప్రదేశంలో ఈ గ్రామీణ వంటకాన్ని తింటూ..చిన్నపిల్లాడి మాదిరిగా ఎంజాయ్ చేశారు. బహుశా నాలా ఎవ్వరూ ఈ ప్రాంతంలో ఈ టేస్టీ.. టేస్టీ.. వంటకాన్ని తిని ఉండరు.. హ్హ..హ్హ.. అంటూ ఆనందంగా తినేశారు. ఈ ఎత్తైన హిమాలయాలు భక్తికి నియంగానే కాదు ప్రముఖ వంటకాలను ఆస్వాదించేందుకు వేదికగా మారిందా అన్నట్లుంది కదూ..!. ఆంధ్రప్రదేశ్‌లోని ఆత్రేయపురంకి చెందిన ఈ గ్రామీణ వంటకం హిమాలయాల వద్ద కూడా దాని రుచిని, రంగుని కోల్పోలేదు. ఇది గ్రామీణ వంటకం గొప్పతనానికి నిదర్శనం కాబోలు. పొరలు పొరలుగా చక్కెర లేదా బెల్లం యాలకులు, డ్రైప్రూట్స్, నెయ్యితో చేసే వంటకం నోట్లో పెట్టుకోగానే వెన్నలా కరిగిపోతుంది. అబ్బా..! తలుచుకుంటేనే నోరూరిపోతుంటుంది. View this post on Instagram A post shared by Sadhguru (@sadhguru) (చదవండి: శునకాలనే దైవంగా ఆరాధించే క్షేత్రం..! ఎక్కడుందంటే..) -
పెట్రోల్ పంపు, 210 ఎకరాలు, 3 కిలోల వెండి.. రూ.15 కోట్ల కట్నం : షాకింగ్ వీడియో
అంగరంగ వైభవంగా పెళ్లి.... వేల మంది అతిథులు వేల కోట్ల రూపాయల ఖర్చు ఇలా మన దేశంలో ముఖేష్ అంబానీ ,అదానీ లాంటి కుబేరుల ఇళ్లల్లో జరిగే పెళ్లిళ్ల గురించి తెలుసు. భారీ కట్నాలు, కానుకల గురించి మరీ బహిరంగంగా కాకపోయినాఅప్పుడప్పుడు వార్తలు వినిపిస్తూనే ఉంటాయి. తాజాగా సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్‌గా మారింది. మనదేశంలో వరుడుకిచ్చిన షాకింగ్ కట్నం చర్చనీయాంశంగా మారింది.ఇండియా వరకట్నం చట్టపరంగా నేరం. కానీ కట్న కానుకలివ్వడం లోపాయికారీగా జరిపోతూనే ఉంది. కానీ ఈ వీడియోలో వరుడికిచ్చిన కట్నం గురించి తెలిస్తే నోరెళ్ల బెట్టాల్సిందే. ఏకంగా ఒక పెట్రోల్ పంపు, 210 ఎకరాల భూమి, 3 కిలోల వెండి.. రూ.15 కోట్ల నగదును కట్నంగా ఇచ్చారు ఈ వివరాలన్నీ ఈ వీడియోలో ప్రస్తావించడం విశేషం. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో జరిగినట్టు తెలుస్తోంది. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు విభిన్నంగా స్పందించారు. Wednesday @Shizukahuji అనే ట్విటర్ ఖాతాలో ఈ వీడియోను షేర్ చేశారుఇదీ చదవండి: PCOS Belly తగ్గేదెలా? ఇవిగో అమోఘమైన టిప్స్ Love marriage vo kya hota hai 💀 pic.twitter.com/otmFucQnep— Wednesday (@Shizukahuji) August 20, 2025 దీనిపై స్పందించిన కొంతమంది నెటిజన్లు ఆదాయ పన్ను శాఖ, ఈడీ ఎక్కడ ఉన్నాయి అంటూ ఫన్నీగా ప్రశ్నించారు. ఇంత బహిరంగంగా కట్నం తీసుకుంటోంటే పోలీసులు స్పందించరా అంటూ మరికొంతమంది కమెంట్ చేశారు.ఇదీ చదవండి: MegaStar Chiranjeevi Birthday70 ఏళ్లలోనూ షాకింగ్ ఫిట్నెస్, డైట్ సీక్రెట్స్ -
ఇండియన్ స్పైసీ రెస్టారెంట్ ఇన్ జపాన్
జపనీస్ దంపతులు నకయమ–సాన్, సచికో–సాన్ జపాన్‌లోని కసుగలో ‘ఇండియన్ స్పైసీ ఫ్యాక్టరీ’ పేరుతో ఒక రెస్టారెంట్ నడుపుతున్నారు. ఈ దంపతులకు ఇండియా అంటే ఇష్టం. ఇండియాలోని రుచికరమైన వంటలు అంటే బోలెడు ఇష్టం. ఆ ఇష్టంతోనే ‘ఇండియన్ స్పైసీ ఫ్యాక్టరీ’ని ప్రారంభించారు.బెంగాలీ సంప్రదాయ వంటకాల నుంచి దక్షిణాది వంటకాల వరకు ఈ రెస్టారెంట్లో వడ్డిస్తారు.మరో విశేషం ఏమిటంటే ఈ రెస్టారెంట్ యజమాని సచికో ఎప్పుడూ చీరలోనే కనిపిస్తుంది. ఆమె కొంతకాలం టు కోల్‌కత్తాలో జపానీ రెస్టారెంట్ నిర్వహించింది. దిల్లీ, చెన్నైలలో కూడా రెస్టారెంట్లు నిర్వహించింది.‘ఇండియన్ స్పైసీ రెస్టారెంట్’లో భారతీయ సంగీత పరికరాలు, కళాకృతులు దర్శనమిస్తాయి. ఈ రెస్టారెంట్‌కు వెళ్లడానికి ఇండియన్స్ మాత్రమే కాదు ప్రపంచ నలుమూలల నుంచి జ΄ాన్కు వచ్చే భోజనప్రియులందరూ ఇష్టపడతారు. View this post on Instagram A post shared by Sonam Midha (@sonammidhax) (చదవండి: భార్యభర్తల కేసు..! నవ్వు ఆపుకోవడం జడ్జి తరం కాలేదు..) -
బరువు పెరగాలనుకుంటే ఇలా తినండి..! 45 కిలోలు నుంచి 87 కిలోలు..
కొందరు ఎత్తుకి తగ్గ బరువు లేక బాధపడుతుంటారు. చాలామటుకు అధిక బరువుతో బాధపడుతంటే..ఈ వ్యక్తులు మాత్రం ఎంత తిన్నా.. పీలగానే ఉంటారు. ఏదైనా అనారోగ్యం వచ్చిందా.. మరింత బక్కచిక్కిపోతారు. చూసేందుకు కూడా బాగోదు వారి ఆహార్యం. అలాంటి వాళ్లు ఆరోగ్యంగా లావు అవ్వాలనుకుంటే.. ఇలా తినండని చెబుతున్నారు కంటెంట్ క్రియేటర్ సుజీత్ చౌరాసియా. సోషల్ మీడియా వేదికగా అత్యంత బలహీనంగా ఉండే తను ఎలా ఆరోగ్యకరమైన రీతీలో బరువు పెరిగాడో వీడియో రూపంలో షేర్ చేసుకున్నాడు. మరి అదెలాగో తెలుసుకుందామా..!. కంటెంట్ క్రియేటర్ 46 కిలోలు బరువుతో బక్కపలచగా ఉండేవాడు. తన ఎత్తుకి బరువుకి వ్యత్యాసమే లేనట్లు గాలిస్తే ఎగిరిపోయేలా ఉండేవాడు. అలాంటి వాడు మంచి ఫిజిక్‌తో ఏకంగా 85 కిలోల ఆరోగ్యకరమైన బరువుతో ఉన్నాడు. అందుకోసం అతడు డైట్ ఎలా సెట్ చేశాడంటే ఉదయం శరీరాన్ని హైడ్రేట్ చేసేలా ఒక లీటర్ నీటితో రోజుని ప్రారంభించేవాడట. ప్రోటీన్ రిచ్ స్టార్ కోసం 70 గ్రా బ్లాక్ చనా + 60 గ్రా పెరుగు తీసుకునేవాడు. ఆ తర్వాత బ్రేక్‌ఫాస్ట్‌గా నెమ్మదిగా జీర్ణమయ్యే 100 గ్రా ఓట్స్, రెండు అరటిపండ్లు, ఆరోగ్యకరమైన కొవ్వుల కోసం ఒక టేబుల్ స్పూన్ పీనట్ బటర్, ప్రోటీన్ బూస్ట్ కోసం బ్రెడ్ లేదా ఆమ్లెట్‌తో 4 బ్రెడ్, మిల్క్‌షేక్ రెసిపీ తీసుకునేవాడినని తెలిపాడు. అది కూడా పాలు, అరటి పండ్లు, డ్రైఫ్రూట్స్‌తో చేసిన మిల్క్ షేక్. లంచ్ టైంలో వందగ్రాముల బియ్యం, 80 గ్రాముల నెయ్యి,ఫైబర్, విటమిన్ల కోసం సలాడ్ తీసుకున్నట్లు చెప్పాడు. సాయంత్రం వ్యాయమానికి ముందు 80 గ్రా ఓట్స్ + 2 అరటిపండ్లు. వ్యాయమం చేసిన తర్వాత శక్తిని నింపడానికి, కోలుకోవడానికి 100 గ్రా బంగాళాదుంపలు లేదా మిల్క్ షేక్. ఇక రాత్రి డిన్నర్‌కి సముతల్యమైన ఆహారం కోసం మూడు రోటీలు, సబ్జి, వందగ్రాముల పన్నీర్ తీసుకునేవాడిని అంటూ తన డైటింగ్ విధానాన్ని పోస్ట్‌లో వివరించాడు. మెరుగైన ఫలితాల కోసం..భోజనం పరిమాణం పెంచుకోవడంహైడ్రేట్గా ఉండేలా ప్రతిరోజూ మూడు నుంచి 4 లీటర్ల నీటిని తీసుకోండిఏడు నుంచి ఎనిమిది గంటల నిద్రవ్యాయామాలను 1.5 గంటల కంటే తక్కువగా ఉండాలి. View this post on Instagram A post shared by Sujeet Chaurasia l Content Creator (@fearlesshimm)గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులను లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం (చదవండి: శంఖారావం' చేస్తే..ఆ వ్యాధి తగ్గిపోతుందట..! అధ్యయనంలో వెల్లడి) -
భార్యభర్తల కేసు..! నవ్వు ఆపుకోవడం జడ్జి తరం కాలేదు..
ప్రపంచంలో అత్యంత దయగల న్యాయమూర్తిగా పేరుగాంచిన అమెరికన్ న్యాయమూర్తి ఫ్రాంక్ కాప్రియో ఇక లేరు. ప్యాంక్రియాటిక్ కేన్సర్‌తో పోరాడుతూ 88 ఏళ్ల వయసులో మరణించారు. ఆయన పలు కేసుల విషయంలో వ్యవహరించిన తీరు అందరిని ఆకట్టుకుంటుంది. ఆయన కోర్టు గదిని దయతో న్యాయం అందించే పవిత్ర ప్రదేశంగా మార్చారు. ఆయన పలు తీర్పుల్లో నిందితులను దయతో క్షమించి మార్పు వచ్చేలా చేయడమే గాక బాధితుడికి న్యాయం అందేలా చేసేవారు కూడా. ఆయన తీర్పులందించిన పలు కేసులకు సంబంధించిన వీడియోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. వాటిలో ఒకటి ఈ భార్యభర్తల కేసు. ఇది కోర్టులో అంత్యంత నవ్వులు పూయించిన కేసు. భర్తను డామినేట్ చేస్తూ తానే మాట్లాడుతూ ఉండటం చూసి జడ్డి కాప్రియో సైతం నవ్వు ఆపుకోలేకపోయారు. ఏంటంటే..భార్యభర్తలిద్దరూ ఒక కేసులో ఇరుకుంటారు. దాని విచారణ నిమిత్తం కోర్టుకి హాజరవుతారు. అయితే భార్య లిండా ఫీల్డ్స్ తన భర్తను మాట్లాడనివ్వకుండా జరిమాన విధించిన చలానా తీసుకుని స్పీడ్‌గా కోర్టులోకి వచ్చి నాన్‌స్టాప్‌గా మాట్లాడేస్తూ ఉంటుంది. మధ్యలో భర్త జోక్యం చేసుకోవాలని ప్రయత్నించినా..అవకాశం ఇవ్వకుండా. ఆ కారు తనదేనని, అయితే నడిపింది తన భర్తేనని చెబుతుంది. దోషిని తాను కానంటూ టకటక చెప్పేస్తుంది. ఆమె మాట్లకు ఆ కోర్టు హాలులో ఉన్నవాళ్లంతా పడి పడి నవ్వుతారు. ఆమె తీరు చూసి న్యాయమూర్తి కాప్రియో కూడా నవ్వు ఆపుకోలేకపోతారు. అయితే మీరు భర్తను ఈ కేసులోకి పూర్తిగా ఇరికించేయాలనుకుంటున్నారు కదా అని అడగ్గా..మరి నేనెందుకు బలవ్వాలి అంటూ బదులిస్తుంది. అంతా విన్నాక కాప్రియో అసలు ఎందుకు అంత వేగంగా వాహనాన్ని పోనిచ్చారని ఆమె భర్తను ప్రశ్నించగా దానికి కూడా ఆమెనే బదులిస్తుంది. తమకొడుకు ఘోరమైన ప్రమాదానికి గురై ఆస్పత్రిలో ఉన్నాడని. అతడి పర్యవేక్షణ నిమిత్తం తన భర్త రోజుకు రెండు మూడు సార్లు అక్కడకు వెళ్తున్నారని లిండా ఫీల్డ్స్ వివరిస్తుంది. ఆ హృదయపూర్వకమైన సంభాషణ అనంతరం ఆయన విశాల హృదయంతో ఆ కేసును కొట్టేస్తాడు. ట్విస్ట్ ఏంటంటే.. పసుపు లైట్ వెళ్లినప్పుడూ కారు నడిపినందుకే జరిమానా పడిందని అనుకుంటారు ఆ భార్యభర్తలు, కానీ రెడ్‌లైట్ పడినప్పుడే కారు నడిపామని సీసీఫుటేజ్ ద్వారా తెలుసుకుని కంగుతింటారు.ఇక్కడ ఈ కేసులో తన భర్తదే తప్పన్నట్లు..భార్య మాట్లాడటం, తన భర్తకి మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడం..వంటి భార్య అమాయత్వం తీరు అందర్నీ ఆకట్టుకుంది. చివర్లో తన భర్త కావాలని వేగంగా వెళ్లలేదంటూ చెప్పి న్యాయమూర్తి మనసుని గెలుచుకుంది. ఇది న్యాయమూర్తి కాప్రియా విచారించిన కేసుల్లో అత్యంత నవ్వు తెప్పించిన హాస్యస్పదమైన భార్యభర్తల కేసుగా నిలిచిపోయింది. న్యాయమూర్తి కాప్రియో నేపథ్యం..కాప్రియో సఫోల్క్ విశ్వవిద్యాలయ లా స్కూల్ నుంచి గ్రాడ్యుయేన్ పూర్తి చేశారు. అతను రోడ్ ఐలాండ్ ఆర్మీ నేషనల్ గార్డ్‌లో పనిచేశాడు. అతను 1962లో ప్రావిడెన్స్ సిటీ కౌన్సిపట్టల్కు ఎన్నికయ్యాడు. కాప్రియో 1985 నుంచి 2023లో పదవీ విరమణ చేసే వరకు ప్రావిడెన్స్‌లో మునిసిపల్ జడ్జిగా పనిచేశారు. ఆయన 2018 నుంచి 2020 వరకు టెలివిజన్ సిరీస్ కాట్ ఇన్ ప్రావిడెన్స్‌లో దయగల న్యాయమూర్తిగా నటించిన తీరు అందరిని బాగా ఆకట్టుకుంది. అదీగాక ఈ సిరీస్ జాతీయ స్థాయిలో ప్రశారం కావడంతో కాప్రియో మరింత ఫేమస్ అయిపోయారు. న్యాయం ఎల్లప్పుడూ దయను కలిగి ఉండాలనే ఆయన ఆ కాంక్షే ఈ సిరీస్ ప్రధాన ఉద్దేశ్యం కావడం విశేషం. అందువల్లే ఈ షో మరింత హైలెట్‌గా నిలిచి ఆయన పేరు దశదిశలా మారుమ్రోగిపోయింది. (చదవండి: ఓపెన్‌గా మాట్లాడేస్తా.. అంటే కుదరదు..! నటి శ్రుతి హాసన్ ఎదుర్కొన్న చేదు అనుభవం..) -
లాస్ట్ మీల్ అంటే ఇదేనేమో..! పగోడికి కూడా ఇలాంటి అనుభవం వద్దు
-
దాన వీర శూర... మిస్టర్ బీస్ట్
అమెరికన్ యూట్యూబర్ మిస్టర్ బీస్ట్, వీర శూర సాహస వైరల్ స్టంట్స్ ద్వారా మాత్రమే కాదు దాతృత్వ కార్యక్రమాల ద్వారా కూడా ప్రసిద్ధి పొందాడు. తాజాగా... పదిహేను గంటల నలభై నిమిషాల΄ాటు మారథాన్ లైవ్‌స్ట్రీమ్ చేసి రికార్డ్ సృష్టించాడు. మారథాన్ లైవ్‌స్ట్రీమ్ ముగిసే సమయానికి వందకోట్లు సేకరించాడు. ఈ నిధులను ‘టీమ్వాటర్’ అనే స్వచ్ఛంద సంస్థ కోసం ఉపయోగిస్తారు. సురక్షితమైన తాగునీటి కోసం పనిచేస్తోంది టీమ్ వాటర్. లైవ్‌స్ట్రీమ్ ద్వారా అధిక నిధులు సేకరించిన వ్యక్తిగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌లో చోటుసాధించాడు మిస్టర్ బీస్ట్. ‘ఈ స్ట్రీమ్ ద్వారా ఎంతోమంది జీవితాలు మారుతాయి’ అని తన ఆనందాన్ని పంచుకున్నాడు. ‘మిస్టర్ బీస్ట్’గా సుపరిచితుడైన జేమ్స్ జిమ్మీ డోనల్డ్సన్ ప్రపంచంలోని యూట్యూబర్లలో అగ్రగామి. ఈ మోస్ట్ పాపులర్ యూట్యూబర్‌కు ప్రపంచవ్యాప్తంగా 422 మిలియన్ల సబ్స్క్రైబర్లు ఉన్నారు. ‘ఫోర్బ్స్’ జాబితాలో చోటు సాధించిన ఈ సంపన్నుడికి యూట్యూబ్ స్ట్రీమింగ్ షోలతో పాటు ఫాస్ట్‌ఫుడ్ చైన్లు కూడా ఆదాయ మార్గాలు. ‘రింగ్‌మాస్టర్ ఆఫ్ స్టంట్స్ అండ్ ఛాలెంజెస్’ అని ఈ సోషల్ మీడియా మెగా స్టార్‌ను ఆకాశానికెత్తింది ఫోర్బ్స్. ‘థ్రెడ్’లో ఒక మిలియన్ ఫాలోవర్స్‌ను సాధించిన తొలి వ్యక్తిగా కూడా తన ప్రత్యేకతను నిలుపుకున్నాడు మిస్టర్ బీస్ట్. (చదవండి: సలాం సఫురా..! నెటిజన్ల మనసు గెలుచుకున్న మహిళా డ్రైవర్..) -
షకీరా పాటకు చీరతో డాన్స్.. భలే చేసింది!
టాలెంట్ అనేది ఏ ఒక్కరి సొత్తు కాదు. ప్రతిభ ఉండాలే గానీ ప్రపంచమంతా మనవైపు చూసేలా చేసుకోవచ్చు. టాలెంట్ ఉన్నా ఎక్కడ, ఎలా ప్రదర్శించాలనే మీమాంస ఇదివరటి రోజుల్లో ఉండేది. ఇప్పుడా సంశయం అక్కర్లేదు. సోషల్ మీడియా వేదికగా సామాన్యులు సైతం తమ ప్రతిభను ప్రపంచానికి పరిచయం చేస్తున్నారు. తమ టాలెంట్‌తో జనాన్ని ఆకట్టుకున్న వారు సెలబ్రిటీలుగా, ఇన్ఫ్లుయెన్సర్లుగా మారుతున్నారు. కంటెంట్ (Content) బాగుంటే చాలు జనం ఆదరిస్తున్నారు.తాజాగా రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌కు చెందిన కాంచన్ అగర్వత్ అనే మహిళ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన డాన్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. గ్లోబల్ ఐకాన్ ప్రియాంక చోప్రాతో సహా ఎంతో మంది ఈ వీడియోను లైక్ చేశారు. ఈ వీడియో క్లిప్‌కు ఇప్పటివరకు 3.8 మిలియన్లకు పైగా వ్యూస్, దాదాపు 2 లక్షల లైకులు వచ్చాయి.వీడియోలో ఏముందంటే..?కొలంబియా పాప్ సింగర్ షకీరా 2006 గ్లోబల్ హిట్ సాంగ్‌కు కాంచన్ అగర్వత్ చేసిన స్టెప్పులు వీక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. సంప్రదాయ చీర కట్టుతో పాప్ సాంగ్‌కు తనదైన శైలిలో డాన్స్ (Dance) చేశారామె. చీర, ఘున్ఘాట్ను బ్యాలెన్స్ చేస్తూ.. షకీరా సిగ్నేచర్ హుక్ స్టెప్లను చూడముచ్చటగా ప్రదర్శించడంతో వీక్షకులు ఫిదా అవుతున్నారు.చదవండి: రిసెప్షన్లో డాన్స్ చేస్తూ ప్రాణాలు వదిలిన మహిళనెటిజనుల ప్రశంసలుకాంచన్ అగర్వత్ డాన్స్‌పై నెటిజనులు (Netizens) ప్రశంసలు కురిపించారు. ఆమె నృత్యం చేసే విధానం ఎంతో పద్ధతిగా ఉందని, డాన్స్‌తో పాటు చీరను బ్యాలెన్స్ చేసిన తీరు బాగుందని నెటిజనులు పొగిడారు. 'అలసటగా ఉన్నప్పుడు ఈ రీల్ చూశాను. నాకు చాలా సంతోషంగా అనిపించింది. ఇప్పటికే చాలాసార్లు చూశాన'ని ఒక నెటిజన్ వెల్లడించారు. View this post on Instagram A post shared by Kanchan Agrawat (@kanchan_agrawat) -
రిసెప్షన్లో డ్యాన్స్ చేస్తూనే ప్రాణాలొదిలేసింది: వైరల్ వీడియో
అంతా పెళ్లి రిసెప్షన్ వేడుకల్లోఎంతో సంతోషంగా ఉన్న సమయంలో ఒక్కసారిగా కలకలం రేగింది. ఆనందంగా నృత్యం చేస్తున్న మహిళ ఉన్నట్టుండి కుప్పకూలిపోయింది. ఏం జరిగిందో అర్థం అయ్యే లోపే అంతులేని విషాదం చోటు చేసుకుంది. తమిళనాడులోని చెంగల్పట్టు జిల్లాలోని మామల్లపురం మంగళవారం రాత్రి ఈ సంఘటన చోటు చేసుకుంది. పలు మీడియా నివేదికల ప్రకారం తమిళనాడులోని జరిగిన వివాహ రిసెప్షన్‌కు హాజరయ్యారు కాంచీపురం నివాసితులు జీవా , ఆమె భర్త జ్ఞానం. తమ స్నేహితుడి కొడుకు వివాహ కార్యక్రమంలో ఎంతో ఆనందంగా పాలు పంచుకుంటున్నారు. ఈ వేడుకల్లో భాగంగా, ప్రముఖ తమిళ నేపథ్య గాయకుడు వేల్మురుగన్ పాల్గొన్న సంగీత కచేరీని నిర్వహించారు. ఈ సమయంలో, వేల్మురుగన్ ప్రేక్షకులను వేదికపైకి వచ్చి నృత్యం చేయమని ఆహ్వానించారు. అలా జీవా కూడా ఆమె వేదిక పైకి వెళ్లి నృత్యం చేయడం ప్రారంభించింది. అంతలోనే కుప్పకూలిపోయింది. వెంటనే ఆమెకు వేదిక వద్దనే ప్రథమ చికిత్స అందించారు. అయినా స్పందించచకపోవడంతో సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే ఆమె మరణించినట్టు వైద్యులు ప్రకటించారు. జీవా కుప్పకూలిపోయే ముందు నృత్యం చేస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.Woman dies after collapsing while dancing on stage at wedding event in Mamallapuram, in Tamil Nadu’s Chengalpattu district.#TamilNadu #Tragedy #ITVideo #SoSouth #Chengalpattu @PramodMadhav6 pic.twitter.com/18SkHkx4X2— IndiaToday (@IndiaToday) August 20, 2025 -
సలాం సఫురా..! నెటిజన్ల మనసు గెలుచుకున్న మహిళా డ్రైవర్..
అమ్మాయిలు అన్ని రంగాల్లోకి రావాలని చెబుతుంటారు. గానీ ఇంట్లో వాళ్ల వల్లనో సమాజం ధోరణి కారణంగానే కొన్ని రంగాలవైపుకి అస్సలు రారు. పొరపాటున కన్నెత్తి కూడా అటువైపుగా చూడరు. కానీ ఈ అమ్మాయి తనకు డ్రైవింగ్ ఇష్టం అని చెప్పడమే కాదు ఏ వాహనమైనా సరే నడిపేస్తానని ధైర్యంగా చెబుతోంది. ఆమె ధైర్యానికి, ఆలోచన తీరుకి ఫిదా అవ్వుతూ ప్రశంసలు కురిపిస్తున్నారు. తమన్నా తన్వీర్ అనే ప్రయాణికురాలు ఓలా లేదా రాపిడో బుక్ చేసుకోవడం కుదరకపోవడంతో..ఏదో ఒక ఆటోని పట్టుకని వెళ్లిపోదాం అనుకుంటుంది. సరిగ్గా ఆ సమయానికి ఒక మహిళ డ్రైవర్ నడుపుతున్న ఆటో ఎదురవుతుంది. మహిళ డ్రైవర్ నడుపుతున్న ఆటోని చూడటం ఇదే తోలిసారి అనుకుంటూ తమన్నా వెంటనే ఎక్కేయడమే గాక..ఆ రైడ్‌లో తనతో మాటలు కలుపుతుంది. అదంతా రికార్డు చేసి నెట్టింట షేర్ చేసింది. ఆ వీడియోలో సఫురా అనే మహిళా డ్రైవర్ ఆటో నడుపుతున్నట్లు చూడొచ్చు. తనకు డ్రైవింగ్ అంటే పాషన్ అని, ఏ వెహికల్ అయినా నడుపుతానని చెబుతోంది. అయితే తన వద్ద అంత బడ్డెట్ లేకపోవడంతో ఆటోతో ప్రారంభించానని, భవిష్యత్తులో స్విఫ్ట్ కారు కొనాలనుకుంటున్నా అని చెప్పుకొచ్చింది. తనకు ఇలా డ్రైవింగ్ చేయడం ఇష్టమైన పని కాబట్టి, అలసట అనిపించిందని చెబుతోంది. ప్రతిరోజు అత్యంత ఉత్సాహంగా పనిచేస్తానని తెలిపింది. మరి తన కుటుబం ఈ వృత్తిని ఎంచుకుంటే ఏం అనలేదా అని ప్రయణికురాలు తమన్నా ప్రశ్నించగా..మొదట తన అమ్మ భయపడిందని, అయితే తన కూతురు ధైర్యవంతురాలని, ఏదైనా చేయగలదని ఆమెకు తెలుసని గర్వంగా చెప్పింది. రైడ్ ముగింపులో తమన్నాకు హైఫై ఇచ్చి చిరునవ్వులు చిందిస్తూ వెళ్లిపోయింది. సఫురా మూసధోరణలను బద్ధలు కొట్టి మహిళలకు స్ఫూర్తిని అందివ్వడమే కాకుండా మనసుకు నచ్చింది చేయడంలో ఉన్న ఆనందం ప్రాముఖ్యతను కూడా హైలెట్ చేసింది. ఈ వీడియోని చూసిన నెటిజన్లు ఆమె శక్తికి సలాం అంటున్నారు, ఏళ్లనాటి స్లీరియోటైప్ను బద్దలు కొట్టినందుకు హ్యాట్సాఫ్ అంటూ కీర్తిస్తున్నారు. View this post on Instagram A post shared by Tamanna Tanweer | Your Online Bestie (@tamannapasha_official) (చదవండి: పారాచూట్ వెడ్డింగ్ గౌను'..! వెనుక ఇంత అద్భుతమైన లవ్ స్టోరీనా..) -
క్షణం ఆలస్యమైతే అంతే సంగతులు : వైరల్ వీడియో
రైలు ప్రయాణాల్లో పిల్లలు, పెద్దలూ చాలా అప్రమత్తంగా ఉండాలి. ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్నా క్షణాల్లో ప్రాణాలు పోయే అవకాశం ఉంది. ముఖ్యంగా రైలు ఎక్కేటపుడు, దిగేటపుడు జాగ్రత్తగా ఉండాలి. తొందరపాటు అసలు పనికి రాదు. ప్రాణాలు ముఖ్యం అనే విషయాన్ని అస్సలు మర్చిపోకూడదు. తాజాగా కేరళలో జరిగిన ఒక ఘటన ఈ విషయాలను మరోసారి గుర్తు చేస్తుంది.కేరళలోని ఎర్నాకుళం నార్త్ రైల్వే స్టేషన్లో ఒక మహిళను ప్రాణాపాయం నుంచి కాపాడిన ఘటన విశేషంగా నిలిచింది. రైలు నుండి దిగడానికి ప్రయత్నించినప్పుడు ఆమె బ్యాలెన్స్ కోల్పోయింది. దాదాపు పట్టాలపై పడిపోయింది. అక్కడనే రైల్వే ఉద్యోగి రాఘవన్ ఉన్ని తక్షణమే స్పందించారు. ఆమెను ఒడుపుగా పట్టుకొని పక్కకు లాగారు. వెంటనే అలర్ట్ అయ్యి శరవేగంగా ఆయన స్పందించకపోతే ఆమె ప్రాణాలకే ముప్పు ఏర్పడేది. ఆసీసీ టీవీ కెమెరాలో ఈ దృశ్యాలు రికార్డైనాయి. ఆగస్టు 9న జరిగిన ఈ సంఘటన నెట్టింట్ వైరల్‌గా మారింది. నెటిజన్లు రాఘవన్ చాకచక్యంపై ప్రశంసలు కురిపించారు. మరోవైపు రైల్వే సిబ్బంది అంకితభావాన్ని ప్రశంసిస్తూనే, మెరుగైన భద్రతా చర్యల అవసరాన్ని కూడా నొక్కి చెబుతుండటం గమనార్హం.ఇదీ చదవండి: ప్రాజెక్టులు తగ్గినా, క్వాలిటీ తగ్గలేదు : గ్రాజియా కవర్‌పేజీపై మెరిసిన సమంతKerala : ಚಲಿಸುವ ರೈಲಿನಿಂದ ಇಳಿಯಲು ಹೋದ ಮಹಿಳೆಗೆ ಏನಾಯಿತು ನೋಡಿ.? | Sanjevani News....#kerala #train #Ernakulam #NorthRailwayStation #viralvideo #ಕೇರಳ pic.twitter.com/LTd6J1YQmF— Sanjevani News (@sanjevaniNews) August 20, 2025కాగా 2022లో ఇలాంటి ఘటన ఒకటి రైలు ప్రమాదాల్లో సిబ్బంది అప్రమత్తతను గుర్తు చేస్తూ కేరళలోని తిరూర్ రైల్వే స్టేషన్లో సతీష్ అనే RPF హెడ్ కానిస్టేబుల్ కదులుతున్న రైలు ఎక్కేందుకు ప్రయత్నిస్తూ జారిపడిన మైనర్ బాలికను రక్షించాడు. దీనికి సంబంధించిన RPF ఇండియా విడుదల చేసింది. ఈ వీడియోలో లిప్తపాటులో స్పందించి కానిస్టేబుల్ అమ్మాయిని రక్షించాడు. -
ఈదురు గాలిలో భారీ వాన.. విమానం సురక్షిత ల్యాండింగ్.. ప్రయాణికుల ఆనందం
ముంబై: దేశవ్యాప్తంగా వర్షాలు దంచికొడుతున్నాయి. ఢిల్లీ, ముంబై సహ పలు నగరాల్లో కుండపోత వర్షం కురుస్తోంది. వరద నీరు కారణంగా ముంబై నగరం అతలాకుతలమైంది. వర్షాల ప్రభావం విమానాలు, రైళ్ల రాకపోకలపై పడింది. ఈ క్రమంలో భారీ వర్షంలో కూడా ఎయిరిండియా విమానాన్ని ఓ పైలట్ సురక్షితంగా ల్యాండ్ చేశారు. దీంతో, సదరు పైలట్‌పై ప్రయాణికులు ప్రశంసలు కురిపిస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.వివరాల ప్రకారం.. ముంబై ఎయిర్‌పోర్టులో మంగళవారం ఈదురుగాలులతో వర్షం కురిసింది. ఆ సమయంలో ఓ ఎయిరిండియా విమానం ల్యాండింగ్ అయ్యేందుకు విమనాశ్రయానికి వచ్చింది. ల్యాండింగ్‌కు సిద్ధమైన సమయంలో ఈదురు గాలులు, వర్షం పడుతున్న క్లిష్ట పరిస్థితులు ఉన్నప్పటికీ పైలట్ నీరజ్ సేథీ ఎలాంటి అలజడి లేకుండా విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేశారు. ప్రతికూల వాతావరణంలో కూడా ఇలా విమానం ల్యాండింగ్ చేయడం పట్ల ప్రయాణికులు నీరజ్‌పై ప్రశంసలు కురిపించారు. విమానంలోని ఓ ప్రయాణికుడు దీన్ని వీడియో తీసి సోషల్ మీడియా వేదికగా పైలట్‌కు కృతజ్ఞతలు తెలిaపారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నీరజ్ సేథీ ‘నిజమైన హీరో’ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.#MumbaiRain #AirIndia Landing at Mumbai airport midst of heavy rain ,Hats off to captain Neeraj Sethi for landing 🛬 safely with less visibility pic.twitter.com/MBrndAmKrF— 💝🌹💖🇮🇳jaggirmRanbir🇮🇳💖🌹💝 (@jaggirm) August 20, 2025ముంబైకి ఆరెంజ్ అలర్ట్.. ఇదిలా ఉండగా.. రెండు రోజులుగా ముంబైలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో నగరంలోని రోడ్లన్నీ జలమయమయ్యాయి. పాఠశాలలు, కళాశాలలు, ప్రభుత్వ కార్యాలయాలను మూసివేశారు. 345 విమానాలు ఆలస్యంగా నడిచాయి. ఎనిమిది విమానాలను దారి మళ్లించారు. ఇక, బుధవారం ఐఎండీ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఈ నేపథ్యంలో ప్రముఖ విమానయాన సంస్థలు ఇండిగో, స్పైస్‌జెట్ తమ ప్రయాణికులకు హెచ్చరికలు జారీ చేశాయి. ప్రతికూల వాతావరణం వల్ల విమానాలు ఆలస్యం కావచ్చని లేదా రద్దయ్యే అవకాశం ఉందని, ప్రయాణికులు ఎయిర్‌పోర్టుకు బయలుదేరే ముందు తమ విమాన స్థితిని సరిచూసుకోవాలని సూచించాయి.ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా ముంబైలోని లోకల్ రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రైల్వే ట్రాక్‌లు నీట మునగడంతో సెంట్రల్ రైల్వే నేడు ఏకంగా 17 లోకల్ రైలు సర్వీసులను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. నగరంలోని పలు ప్రధాన రహదారులు నదులను తలపిస్తుండటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పరిస్థితి తీవ్రత దృష్ట్యా థానే, నవీ ముంబై, లోనావాలా వంటి ప్రాంతాల్లో అధికారులు పాఠశాలలకు సెలవులు ప్రకటించారు.ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు కూడా పాక్షికంగానే పనిచేస్తున్నాయి. కుండపోత వానల కారణంగా బాంబే హైకోర్టు సైతం మధ్యాహ్నం 12:30 గంటలకే కార్యకలాపాలను నిలిపివేసింది. అయితే, గురువారం నుంచి వర్షాల తీవ్రత తగ్గే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. -
లాస్ట్ మీల్ అంటే ఇదేనేమో..!
చక్కగా ఫుడ్‌ని ఆస్వాదించి ఎలా ఉందో చెప్పే ఫీల్ భలే ఉంటుంది. మన ఇంట్లో మనం చెప్పేస్తాం. గానీ బయట రెస్టారెంట్లో టేస్ట్ చూసి చెప్పే సోషల్‌మీడియా ఔత్సాహికులను చూస్తే..ఆహా ఈ పేరుతో భలే అన్ని వంటకాలు రుచి చూస్తేస్తున్నారుగా అనిపిస్తుంది కదూ..!. అలానే ఇద్దరు ఫుడ్ బ్లాగర్లు ఒక రెస్టారెంట్లో ఫుడ్‌ని రుచి చూసి రివ్యూ ఇచ్చేలోపు చావు పరిచయమైంది. పాపం ఆ ఇద్దరు బాబోయ్ ఇలాంటి అనుభవం ఎవ్వరికి వద్దు అని దండం పెట్టేస్తున్నారు. ఏం జరిగిందంటే..హుస్టన్కి చెందిన ఇన్ఫ్లుయెన్సర్ నినా శాంటియాగో, తన తోటి కంటెంట్ క్రియేటర్ పాట్రిక్ బాలివుడ్‌తో కలిసి ఒక రెస్టారెంట్‌కి వచ్చారు. అక్కడ ఫుడ్ రివ్యూ ఇచ్చే ఒక వీడియోని రికార్డు చేస్తున్నారు ఇద్దరు. అందులో భాగంగా ఆ రెస్టారెంట్‌లోని శాండ్విచ్ శాంపిల్‌ని టేస్ట్ చేసి రేట్ ఇవ్వబోయే సమయానికి ఊహించని హఠాత్పరిణామం చోటు చేసుకుంది. సరిగ్గా అదే సమయానికి ఓ ఎస్యూవీ కారు రెస్టారెంట్లోకి దూసుకొచ్చి వారి ఫుడ్ టేబుల్ని స్ట్రాంగ్‌గా ఢీ కొట్టింది. ఆ షాకింగ్ ఘటనకు శాంటియోగా కిందపడిపోగా, మరొకరు నిలదొక్కుకుని అక్కడ నుంచి నెమ్మదిగా వెళ్లిపోయారు. చెప్పాలంటే త్రుటిలో పెను ప్రమాదం తప్పింది ఆ ఫుడ్ బ్లాగర్లకి. అందుకు సంబంధించిన వీడియోని నెట్టింట షేర్ చేస్తూ..ఆ ఘటనలో తమకు ఎలాంటి గాయాలు అయ్యాయో కూడా పోస్ట్‌లో వివరించారు. ఇదేదో పగ, కోపంతో చేసినట్లుగా అనిపించింది. చెప్పాలంటే అదే మాకు చివరి భోజనం ఏమో అనిపించేలా చావుని పరిచయం చేశారు. కానీ దేవుడి దయ వల్ల ఆ భయానక ఆపద నుంచి సునాయాసంగా బయటపడ్డాం అని చెబుతున్నారు ఆ ఫుడ్ బ్లాగర్లు. View this post on Instagram A post shared by @NINAUNRATED (@ninaunrated) (చదవండి: టమాటాలతో 'బయోలెదర్'..! పర్యావరణ హితం, ఆ సమస్యకు చెక్ కూడా..) -
‘నేను మారాను.. మీరే ఏం మారలేదు’.. నవ్వులు పూయించిన జెలెన్స్కీ-ట్రంప్
వైట్‌హౌజ్ వేదికగా.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీల మధ్య జరిగిన శాంతి చర్చలలో ఆసక్తికర ఘటనలు చోటు చేసుకున్నాయి. జెలెన్స్కీ సూట్ అద్భుతంగా ఉందంటూ అమెరికా మీడియా ప్రతినిధులు పేర్కొనగా.. తాను అదే చెప్పానంటూ ట్రంప్ అనడంతో నవ్వులు విరబూశాయి. మూడున్నరేళ్లుగా కొనసాగుతున్న ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలికేందుకు సోమవారం ఒవెల్ ఆఫీస్‌లో ట్రంప్-జెలెన్స్కీ, ఈయూ దేశాధినేతల మధ్య జరిగిన తాజా భేటీ పూర్తిగా ఆహ్లాదకరమైన వాతావరణంలో కొనసాగింది. అధ్యక్షులు ఇద్దరూ యుద్ధం ముగింపు ప్రయత్నాలపై సానుకూల ప్రకటనలు చేశారు. ఈ క్రమంలో.. ‘‘ఈ సూట్లో మీరు అద్భుతంగా కనిపిస్తున్నారు. బాగున్నారు’’ అని గతంలో జెలెన్స్కీని విమర్శించిన బ్రియాన్ గ్లెన్ ప్రశంసలు కురిపించడం విశేషం. ట్రంప్ వెంటనే జోక్యం చేసుకొని.. గతంలో మీపై మాటలతో దాడి చేసింది కూడా ఈ విలేకరేనని చెప్పారు. ‘‘అవును నాకు గుర్తుంది’’ అని జెలెన్స్కీ బదులిచ్చారు. ఆ వెంటనే ‘మీరు అదే సూట్లో ఉన్నారు. నేను మాత్రం మార్చుకున్నాను’ అని గ్లెన్ను ఉద్దేశిస్తూ జెలెస్కీ చెప్పడంతో ట్రంప్‌తో పాటు అక్కడ ఉన్నవారంతా నవ్వుల్లో మునిగిపోయారు.Brian Glenn: President Zelenskyy, you look fabulous in that suitZelenskyy: You are in the same suit. I changed, you did not. pic.twitter.com/A6556L1G1M— Acyn (@Acyn) August 18, 2025ఈ ఏడాది ఫిబ్రవరిలో ట్రంప్జెలెన్స్కీలు వైట్‌హౌస్‌లో భేటీ అయిన విషయం తెలిసిందే. ఆ సమావేశం వాడీవేడిగా జరగడంతో అప్పుడు జెలెన్స్కీ వేసుకున్న డ్రెస్‌పై అమెరికా అధ్యక్షుడు సహా అక్కడి మీడియా విమర్శలు గుప్పించింది. టీ షర్టుతోనే వైట్‌హౌస్‌లో అధికారిక భేటీలో పాల్గొనడం విమర్శలకు కారణమైంది. ఆక్రమంలో కన్జర్వేటివ్ రిపోర్టర్ బ్రియాన్ గ్లెన్.. ‘‘మీరెందుకు సూట్ వేసుకోలేదు? దేశంలోనే అత్యున్నత కార్యాలయాన్ని మీరు గౌరవించడం లేదని అనేకమంది అమెరికన్లు అనుకుంటున్నారు. అసలు మీకు సొంత సూట్ ఉందా?’’ అని జెలెన్స్కీని నేరుగా ప్రశ్నించారు. దానికి జెలెన్స్కీ బదులిస్తూ.. యుద్ధం ముగిసిన తర్వాత సూట్ వేసుకుంటానని వివరించారు. ఇక.. తాజా భేటీలో.. జెలెన్స్కీ భార్య ఒలెనా జెలెన్స్కా (Olena Zelenska) రాసిన ఓ లేఖను ట్రంప్‌కు బహుకరించారు. ‘‘ఇది నా సతీమణి, ఉక్రెయిన్ ప్రథమ మహిళ రాసిన లేఖ. కానీ, ఇది మీకు కాదు.. మీ భార్య కోసం’’ అనడంతో అక్కడ నవ్వులు విరబూశాయి. రాజకీయాల్లోకి రాకముందు జెలెన్స్కీ సినిమాలు, స్టేజ్ షోల్లో నటించేవారు. అలాగే.. ఒలెనా ఒక రచయిత్రిగా, సామాజిక కార్యకర్తగా గుర్తింపు పొందారు. -
లగ్జరీ కారులో పేరెంట్స్‌ను సర్ప్రైజ్ చేసిన భారతీయ యువతి
బాగా చదువుకోవాలి..మంచి ఉద్యోగం సంపాదించాలి అమ్మానాన్నల్నికారులో తీసుకెళ్లి సర్ప్రైజ్ చేయాలి. లేదంటే.. తొలిసారి వాళ్లని విమానం ఎక్కించాలనే కలను సాకారం చేసుకోవాలి. ఇలాంటి కలలు విదేశాల్లో ఉద్యోగాలు చేసే సగటు భారతీయ ఉద్యోగులకు సర్వ సాధారణం. అలా ఒక భారతీయ యువతి ఖరీదైన కారులో తల్లిదండ్రులను షికారుకు తీసుకెళ్లిన వీడియో ఒకటి నెట్టింట్ పలువుర్ని ఆకట్టుకుంటోంది.ఇండియాకు చెందిన అపూర్వ బింద్రే తన తల్లిదండ్రులను డ్రైవర్ లేని కారులో శాన్ ఫ్రాన్సిస్కోలో డ్రైవ్‌కు తీసుకెళ్లింది. దీనికి సంబంధించిన వీడియోతో పాటు తన సంతోషాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీంతో నెటిజన్ల ఆమెను, ఆమె తల్లిదండ్రులను అభినందనల్లో ముంచెత్తారు. సోషల్ మీడియాలో వీడియోను పోస్ట్ చేస్తూ, బింద్రే “నా తల్లిదండ్రులను శాన్ ఫ్రాన్సిస్కోలో డ్రైవర్ లెస్ కారు వేమోలో తీసుకెళ్లా.. వావ్, నైస్ ఫీలింగ్! ఇది మాన్యువల్ డ్రైవర్ కంటే సురక్షితంగా, స్మూత్‌గా అనిపించింది. అందుకే వెంటనే ఇంకో రైడ్ కూడా బుక్ చేసుకున్నాం. మా అమ్మా నాన్న చెప్పాల్సింది చాలా ఉంది అది త్వరలోనే’’ అంటూ పోస్ట్ చేసింది. ఈ వీడియోకు ఇప్పటికే 94 వేలకు పైగా వ్యూస్ వచ్చాయి.ఇదీ చదవండి: బంగారం కాదు..కానీ కిలో కోటి రూపాయలు View this post on Instagram A post shared by Apurva Bendre (@apurva_bendre)‘‘ఈ రైడ్‌తో మీ పేరెంట్స్ పూర్తిగా థ్రిల్ అయి ఉండాలి!” అని ఒకరు, “చాలా సరదాగా ఉంది! వారి స్పందన ఏమిటి?” అని మరొకరు దీనిని “ఒక తరాల ప్రయాణం” అని ఇంకొకరు అభివర్ణించారు. చాలా గర్వంగా ఉంది. మీరు మీ తల్లిదండ్రుల కలను నెరవేర్చడం సంతోషంగా ఉంది, చాలా అద్భుతంగా ఉంది అనే కమెంట్లు కూడా చూడొచ్చు.చదవండి: ఉద్యోగాన్ని వదిలేసిన ఇంజనీర్ కపుల్.. ఇపుడు ఏడాదికి రూ. 30 లక్షలు -
'ఇండియాలో ధరలు ఇలా ఉన్నాయ్': ఎన్ఆర్ఐ షాక్
కెనడాలో పాలు రూ.396, బ్రెడ్ రూ.230 అని ఇప్పటికే చదువుకున్నాం. ఇప్పుడు తాజాగా భారతదేశంలో కూడా ఒక కప్పు టీ తాగడానికి రూ.1000 ఖర్చు చేశానని పేర్కొన్నాడు. దీనికి సంబంధించిన ఒక వీడియో కూడా నెట్టింట్లో వైరల్ అవుతోంది.సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో గమనిస్తే.. దుబాయ్‌కు చెందిన భారతీయ ట్రావెల్ వ్లాగర్ & రేడియో ప్రెజెంటర్ 'పరీక్షిత్ బలోచి'.. ఇండియాలో పెరుగుతున్న జీవన వ్యయం గురించి వెల్లడించడం చూడవచ్చు. ముంబైలోని ఒక హోటల్లో ఒక కప్పు టీ తాగడానికి తనకు రూ. 1,000 ఖర్చైన విషయాన్ని వెల్లడించాడు.వస్తువుల ధరలు కొంత తక్కువ ఉంటాయని.. అప్పుడప్పుడు భారతదేశానికి వస్తూ ఉంటానని బలోచి చెప్పాడు. ఎన్నారైలు బలమైన విదేశీ కరెన్సీల నుంచి ప్రయోజనం పొందుతారు. ఇండియాకు వచ్చి విదేశీ కరెన్సీలతో.. ఖర్చులు చేస్తూ ఉంటారు. అయితే ఇకపై భారతదేశంలో అది సాధ్యం కాదని అన్నారు. తాను దిర్హామ్‌లలో సంపాదిస్తున్న ఎన్ఆర్ఐ అయినప్పటికీ, ఆర్థికంగా ఇబ్బందులకు గురయ్యానని పేర్కొన్నాడు.ఇదీ చదవండి: పిల్లలు కనడానికి సిద్దమవుతున్న రోబోలు!ముంబై వంటి నగరాల్లో జీవన విధానం, జీవన వ్యయం అన్నీ మారాయి. ప్రస్తుతం ముంబై దుబాయ్ మాదిరిగా ఖరీదైనదిగా అనిపిస్తోందని పరీక్షిత్ బలోచి అన్నాడు. భారతదేశానికి వచ్చిన తర్వాత నేను మాత్రమే 'గరీబ్' అనిపించిందని వ్యాఖ్యానించాడు. దీనిపై పలువురు నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు. View this post on Instagram A post shared by Parikshit Balochi | RJ | Emcee | Travel | Lifestyle | Dubai (@parikshitbalochi) -
భారత్ వ్యక్తిని పెళ్లాడిన బ్రెజిలియన్ ముద్దుగుమ్మ..!
ప్రేమ అంటే ఇదేరా అనేలా ఉండేలా ఎన్నో లవ్ స్టోరీలను చూశాం. వాటన్నింటిలో ప్రేమ ప్రేమే. దాని కోసం ఏం చేయడానికైనా రెడీ అనట్లుగా సిద్ధపడుతున్న ప్రేమికులు గాథల వింటుంటే ఆశ్చర్యంగా ఉంటుంది. ఎల్లలు, సరిహద్దు దాటి ఎన్నో ప్రయాసలు పడి ఒక్కటైన జంటలెందరినో చూశాం. కానీ ఇక్కడ ఈ జంట అంత కష్టాలు చవి చూడకపోయినా..వీరిద్దరూ ఒక్కటైనా విధం చూస్తే..ఎక్కడైన లవ్వు..లవ్వే కథ అనిపిస్తుంది. మరి ఆ జంట అందమైన కథేంటో చకచక్క చదివేయండి మరి..బ్రెజిలియన్ మహిళ తైనాషా భారతీయ వ్యక్తిని పెళ్లాడింది. ఎలా తమ ప్రేమ చిగురించి పెళ్లిపీటలక్కెందో సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకుంది. తామిద్దరం విభిన్న సంస్కృతి, సంప్రదాయాలకు చెందిన వాళ్లం. కానీ తాను ఆ గుజరాతి వ్యక్తితో ఆశ్చర్యకరంగా ప్రేమలో పడిపోయానని అంటోంది. 2020 కోవడిడ్ 19 సమంయంలో ఇద్దరు ఆన్లైన్ కలుసుకున్నారు. ఇంకా అప్పటికీ టీకాలు వేయించుకోని క్రిటికల్ టైంలో ఆమెను కలవాలని గుజరాతీ భర్త పడిన ప్రయాసను చూసి..ఫస్ట్ మీట్లోనే అతని ప్రేమకు ఫిదా అయి లవ్‌లో పడిపోయిందట. ప్రేమలో పడిన ఐదునెలలకే ఇద్దరు పెళ్లిచేసుకున్నాం అని పేర్కొంది. తమ వివాహం బ్రెజిల్‌లోనే జరిగిందని, తమ పెళ్లిని తన భర్త తరుఫు భారతీయ కుటుంబం కూడా అంగీకరించిందని చెప్పుకొచ్చింది తైనా. తామిద్దరిది వేర్వేరు నేపథ్యమే అయినా..మా మధ్య ఉన్న అభిమానం, ప్రేమ రోజు రోజుకి మరింతగా బలపడుతుందని, ఇంతవరకు తమ దాంపత్య జీవితాన్ని విజయవంతంగా లీడ్ చేయగలిగేలా చేసినా ఈ విశ్వానికి సదా కృతజ్ఞతలు అని చెబుతోంది తైనా. ఆ దంపతుల ప్రేమ కథ నెటిజన్లను తెగ ఆకర్షించడమే గాక, ఎక్కడైన ప్రేమ.. ప్రేమే..దానికున్న శక్తి అనంతం, అజేయం అంటూ ఆ జంటని ప్రశంసిస్తూ ఆశీర్వదించారు. View this post on Instagram A post shared by Tainá Shah (@tainashah) (చదవండి: ‘రాక్‌స్టార్’: 150 ఏళ్ల నాటి పియానోని ప్లే చేసిన సీఎం) -
‘రాక్‌స్టార్’: 150 ఏళ్ల నాటి పియానోని ప్లే చేసిన సీఎం
కళ వద్దకు వచ్చేటప్పటికీ..ఎంత అత్యున్నత హోదాలో ఉన్న వ్యక్తి అయినా చిన్నపిల్లవాడిలా మారిపోతారు. బహుశా ఆర్ట్‌కి ఉన్న శక్తి కాబోలు. ఇక్కడ అలానే ఒక రాష్ట్ర సీఎం పియానో చూడగానే ఆలపించాలనిపించిందో లేదా తన టాలెంట్‌ని చూపించాలనుకున్నారో గానీ అందరూ ఆశ్చర్యపోయేలా ప్లే చేయడమే గాక మైమరచిపోయేలా చేశారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. రాజకీయాలకు అతీతంగా మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్ కె సంగ్మా తన సంగీత ప్రతిభతో మరోసారి ప్రజలను మంత్రముగ్దుల్ని చేశారు. ఆ వీడియోల ఆయన 150 ఏళ్ల నాటి పియానోపై బాలీవుడ్ ప్రసిద్ధ పాట షెహ్లో నషా పాటను ప్లే చేశారు. షిల్లాంగ్‌లోని రాజ్‌భవన్‌లో ముఖ్యమంత్రి అలా ప్లే చేశారో లేదా ఒక్కసారిగా ప్రేక్షకులు చిరునవ్వులు చిందిస్తూ ఆస్వాదించారు. ఈ రాక్‌స్టార్ సీఎం సగ్మా ఆలసించిన శ్రావ్యమైన సంగీతాన్ని అక్కడున్న చాలామంది తన ఫోన్ రికార్డు చేశారు కూడా. ఇక గవర్నర్ సీహెచ్ విజయ్ శకంర్ అక్కడున్న ప్రేక్షకుల్లో భాగం కావడం విశేషం. సంగ్మా ఇలా సంగీత వాయిద్యాన్ని సీఎం సంగ్మా ప్లే చేయడం కొత్తేం కాదు. గతంలో కూడా ఇలానే పలు సందర్భాల్లో తన సంగీత ప్రతిభను చాటుకున్నారు కూడా. ఇక సంగ్మా ప్రస్తుం పియానోపై ఆలపించిన పాట 1992లో విడుదలైన అమీర్‌ఖాన్ మూవీ ‘జో జీతా వోహి సికందర్’లోనిది. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఆ వీడియోపై ఓ లుక్కేయండి మరి. View this post on Instagram A post shared by rahul gupta (@mr_raulgupta) (చదవండి: కుటుంబం దూరమై... శునకాలే కుటుంబమై!) -
వీధి కుక్కలు కనిపించకపోతే ఏమవుతుందంటే..!
కుక్కలు వీధుల్లో కనిపించకుండా చూడాలని, వాటిని పునరావాస కేంద్రాలకు తరలించాలనే సుప్రీం కోర్టు తీర్పుపై హర్షం వ్యక్తం చేసిన వారితో పాటు తీవ్రంగా అభ్యంతరం చెప్పినవారు ఎంతోమంది ఉన్నారు. ఈ నేపథ్యంలో మూగజీవులైన వీధికుక్కలు మాట్లాడుతున్నట్లు క్రియేట్ చేసిన వీడియోలు నెట్‌లోకంలో హల్చల్ చేస్తున్నాయి. కంటెంట్ క్రియేటర్ షిరిన్ సెవనీ శునకవేషధారణతో, శునకంలా మాట్లాడిన వీడియోకు మంచి స్పందన వచ్చింది. ఆమె వీధికుక్కల తరఫున వకాల్తా పుచ్చుకుంది. ‘వీధికుక్కలు కనిపించకుండాపోతే ఏం జరుగుతుంది?’ కాప్షన్‌తో సుమిత్ మిత్రా అనే కంటెంట్ క్రియేటర్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఎమోషనల్ వీడియోను పోస్ట్ చేశాడు. కొందరు క్రియేటర్లు ఏఐ–జనరేటెడ్ వీడియోలతో వీధి శునకాలతో మాట్లాడించారు. అలాంటి ఒక వీడియోలో ఒక శునకం గట్టిగా ఇలా నినాదం ఇస్తుంది.... ‘వీధుల్లో ఉండడం అనేది వీధి కుక్కలుగా మా ప్రాథమిక హక్కు’ ఢిల్లీలోని ఇండియా గేట్ దగ్గర ఒక కోతి గన్మైక్తో శునకాన్ని ఇంటర్వ్యూ చేస్తున్న వీడియో, బాలుడికి, శునకానికి మధ్య జరిగిన సంభాషణ... ఇలాంటి వీడియోలు ఎన్నో బాగా పాపులర్ అయ్యాయి. View this post on Instagram A post shared by Shirin sewani (@shirin_sewani) (చదవండి: కుటుంబం దూరమై... శునకాలే కుటుంబమై!) -
మీకో, మీ మంత్రికో, మీ ఎమ్మెల్యేకో జరిగితే ఇలాగే చేస్తారా?
జమ్ము కశ్మీర్ కిష్తవాడ్ జిల్లా చోసితీ గ్రామంలో ఫ్లాష్‌ఫ్లడ్ సహాయక చర్యలు మూడో రోజుకి చేరాయి. ఇప్పటిదాకా 60 మంది మరణించగా.. గల్లంతైన 80 మంది కోసం(ఆ సంఖ్యే ఎక్కువే ఉండొచ్చని తెలుస్తోంది) గాలింపు కొనసాగుతోందని అధికారులు ప్రకటించారు. అదే సమయంలో స్థానికుల ఆగ్రహమూ తారాస్థాయికి చేరింది. అందుకు అక్కడి ప్రజాప్రతినిధులు తీరే కారణంగా తెలుస్తోంది.గురువారం మధ్యాహ్నాం క్లౌడ్‌బరస్ట్ కారణంగా మెరుపు వరదలు చోసితీని ముంచెత్తాయి. బురద నుంచి శకలాలను తొలగిస్తున్న కొద్దీ.. మృతదేహాలు బయటపడుతూ వస్తున్నాయి. దీంతో గల్లంతైన వాళ్ల కుటుంబ సభ్యుల్లో ఆందోళన పెరిగిపోతోంది. ఈ క్రమంలో.. జమ్ము కశ్మీర్ ఒమర్ అబ్దుల్లా శనివారం ఆ ప్రాంతంలో పర్యటించగా.. స్థానికుడి నుంచి ఆయనకు నిలదీత ఎదురైంది.‘‘పోలీసులు, సైన్యం మా వాళ్ల జాడ కోసం అహర్నిశలు ఇక్కడ కష్టపడుతున్నారు. మేమూ మాకు చేతనైన ప్రయత్నాలు చేస్తున్నాం. ఇక్కడ 20 జేసీబీలు ఉన్నాయి.కానీ, ఇందులో రెండే పని చేస్తున్నాయి. మంత్రులు, ఎమ్మెల్యేలు పదే పదే ఇక్కడికి వస్తున్నారు. ఫొటోలకు ఫోజులిస్తున్నారు. దీంతో సహాయక చర్యలు ఆటంకాలు ఏర్పడుతున్నాయి. గత మూడురోజుల్లో ఇక్కడ రెండే రెండు పెద్ద బండరాళ్లను తొలగించారంటే పరిస్థతి అర్థం చేసుకోండి. మాకు కుటుంబాలు లేవా?. కనీసం మా వాళ్ల శవాలనైనా మాకు అప్పగించండి’’ అని ఎన్డీటీవీతో బాధితుడొకరు తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. సరిగ్గా అదే సమయంలో సీఎం ఒమర్ అబ్దుల్లా అటుగా వచ్చారు. ఏం జరిగిందో చెప్పమంటూ ఆ వ్యక్తిని ఆరా తీశారు.జరిగిందంతా చెప్పి.. కనీసం తమవాళ్ల మృతదేహాలనైనా అప్పగించాలని కోరాడా వ్యక్తి. జరుగుతోంది అదేనని.. ఘటన జరిగిన నాటి సహాయక చర్యలు కొనసాగుతున్నాయని ఆ వ్యక్తికి సీఎం బదులిచ్చారు. ఈ క్రమంలో.. అతను మరోసారి తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. ‘‘సర్.. నేను చెప్పేది ఓసారి వినండి. నా కుటుంబం నుంచి 13 మంది జాడ లేకుండా పోయారు(తమ పిల్లల ఆచూకీ లేదంటూ పలువురు ఆ సమయంలో గట్టిగా రోదించారు). ఎమ్మెల్యేలు, మంత్రులు పది పదిసార్లు ఇక్కడికి వస్తున్నారు. జేసీబీలను ఆపేయించి ఫొటోలు దిగుతున్నారు. మేం నిస్సహాయంగా చూస్తూ ఉండిపోతున్నాం’’ అని వివరించాడు. విషాదంతో చాలా కుటుంబాలు బాధపడుతున్నాయని, అది తాను అర్థం చేసుకోగలనని సీఎం ఫరూక్ అబ్దుల్లా అన్నారు. దీంతో ఆ యువకుడు.. మీకో, మీ ఎమ్మెల్యేకో, మీ మంత్రికో జరిగితే ఇలాగే చేస్తారా?.. త్వరగతిన చర్యలు తీసుకుంటారు కదా అని నిలదీశాడా వ్యక్తి. దీంతో అధికారులను పిలిపించిన సీఎం ఫరూక్ అబ్దుల్లా.. సహాయక చర్యలు త్వరగతిన జరిగేలా చూడాలంటూ ఆదేశాలు జారీ చేశారు. -
Viral Video: కొండచిలువ ఎటాక్...నాకేం భయం!
-
వీడియో: ట్రంప్ ఓవరాక్షన్ ప్లాన్.. పుతిన్‌నే భయపెట్టే ప్రయత్నం!
అలాస్కా: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు పుతిన్ కలిసిన వేళ ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. అమెరికా ఎంత బలమైన దేశమో.. చెప్పేందుకు పుతిన్‌కు చూపించాలనే ఉద్దేశ్యంతో ట్రంప్ పెద్ద ప్లానే చేశారు. పుతిన్‌ను ట్రంప్ ఆహ్వానిస్తున్న సమయంలో స్టెల్త్ బాంబర్లు, ఫైటర్ జెట్స్ విమానాలు గాల్లో చక్కర్లు కొట్టాయి. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.అలాస్కా వేదికగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో భేటీ కోసం రష్యా అధ్యక్షుడు పుతిన్ అమెరికాకు వెళ్లారు. ఈ సందర్భంగా విమానం దిగిన పుతిన్‌కు ట్రంప్ ఘన స్వాగతం పలికారు. అయితే, వారిద్దరూ ముందుకు సాగుతున్న సమయంలో అనూహ్యంగా స్టెల్త్ బాంబర్లు, F-22, F-35 ఫైటర్ జెట్లువిమానాలు గాల్లో దర్శనమిచ్చాయి. ఆకాశంలో ఎగురుతూ కనిపించాయి. దీంతో, ట్రంప్ చప్పట్లు కొడుతూ.. పుతిన్‌తో ఏదో మాట్లాడారు. మరోవైపు.. పుతిన్ మాత్రం వాటిని చూస్తూ ముందుకు కదిలారు.Trump flies a B-2 over Putin’s head in a show of strength, look at the Trump’s body language, it’s all about dominance pic.twitter.com/cleGOmuedF— Prayag (@theprayagtiwari) August 15, 2025ఇక, ట్రంప్-పుతిన్ సమావేశం జరుగుతున్నంత సేపూ కూడా అవి గాల్లోనే చక్కర్లు కొడుతూ కనిపించాయి. దీని ద్వారా పుతిన్ అమెరికా సైనిక శక్తిని గ్రహించాలని ట్రంప్ భావించారు. గత నెలలో ఇరాన్ అణు కర్మాగారాలను ట్రంప్ సైన్యం ఇదే బీ-2 స్టెల్త్ బాంబర్లను ఉపయోగించి నాశనం చేసిన విషయం తెలిసిందే. అయితే, ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియోపై పలువురు నెటిజన్లు స్పందిస్తున్నారు. అందరి కంటే తానే బలవంతుడు, తన దేశమే బలమైన దేశం అని నిరూపించాలని ట్రంప్ ఇలా చేశారని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. పుతిన్‌ను హెచ్చరించేందుకే ట్రంప్ ఇలా చేశారని మరి కొందరు అంటున్నారు. 🔥 THIS is how you negotiate.Trump forced Putin and his motorcade to drive past a HUGE lineup of F-22s and attack helicopters on his way to the meeting…… Immediately after buzzing Putin’s head with a B-2 Stealth BomberIt’s pretty obvious who’s in the power position 🇺🇸 pic.twitter.com/0SF8sqDXQr— Nick Sortor (@nicksortor) August 15, 2025Trump made B-2 bombers fly over Putin in Alaska.What an insecure guy! Flexing military muscle for a guest he himself invited after failing to make any impact in Ukraine, like a scared kid trying to look tough with gimmicks. pic.twitter.com/29aFCTEvJD— THE SKIN DOCTOR (@theskindoctor13) August 15, 2025 -
కాబోయే కోడలితో పూజలో సచిన్- అంజలి.. సారా ఫొటోలు వైరల్
భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండుల్కర్ కుమార్తె సారా టెండుల్కర్ (Sara Tendulkar) వ్యాపార రంగంలో అడుగుపెట్టింది. ఇప్పటికే మోడల్‌గా గుర్తింపు పొందిన సారా.. తాజాగా వెల్నెస్ సెంటర్‌ను ఆరంభించింది. ముంబైలోని అంధేరి ప్రాంతంలో తన పేరిట పైలేట్స్ అకాడమీ (Type of mind-body exercise)ని నెలకొల్పింది.హైలైట్‌గా సానియా చందోక్ తల్లిదండ్రులు సచిన్- అంజలిలతో కలిసి సారా తన అకాడమీ పూజా కార్యక్రమంలో పాల్గొంది. ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. అయితే, ఈ వీడియోలో అర్జున్ టెండుల్కర్‌కు కాబోయే భార్య సానియా చందోక్ (Saaniya Chandhok) హైలైట్‌గా నిలిచింది.అర్జున్‌తో ఎంగేజ్మెంట్!కాబోయే అత్తా- మామలు, వదినతో కలిసి సానియా ఈ పూజా కార్యక్రమాల్లో భాగమైంది. సచిన్ టెండూల్కర్ తనయుడు తనయుడు అర్జున్ వివాహ నిశ్చితార్థం జరిగినట్లు గురువారం వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. కేవలం కుటుంబసభ్యులు, అత్యంత సన్నిహితులు, మిత్రుల మధ్య బుధవారం ఈ వేడుకను నిర్వహించినట్లు తెలిసింది. సానియా చందోక్‌తో అర్జున్ టెండూల్కర్ ఎంగేజ్మెంట్ జరిగింది.బ్యాక్‌గ్రౌండ్ పెద్దదేకాగా ముంబైకి చెందిన ప్రముఖ పారిశ్రామిక వేత్త రవి ఘయ్ మనువరాలు సానియా. గ్రావిస్ గ్రూప్ చైర్మన్ రవి ఘయ్. ఫుడ్, హాస్పిటాలిటీ సెక్టార్లో ఈ గ్రూప్ పేరుగడించింది. ముంబైలోని ఇంటర్ కాంటినెంటల్ హోటల్, బ్రూక్లిన్ క్రీమరీ ఐస్ క్రీమ్ బ్రాండ్ వీరిదే. హైదరాబాద్ సహా దేశవ్యాప్తంగా మెట్రో నగరాల్లో ‘బాస్కిన్ అండ్ రాబిన్స్’ బ్రాండ్‌తో ఉన్న ప్రీమియం చైన్ ఐస్‌క్రీమ్ పార్లర్లు బ్రూక్లిన్ క్రీమరి సంస్థకు చెందినవే. క్వాలిటీ ఐస్ క్రీమ్స్ కూడా ఆ సంస్థ ఉత్పత్తులే!ఇక పరిమిత సంఖ్యలో, కేవలం ఆత్మీయుల మధ్యే జరిగిన ఎంగేజ్మెంట్పై ఇరు కుటుంబసభ్యులు గోప్యత పాటించడం గమనార్హం. వార్త బయటికి పొక్కినా... అటు రవి ఘయ్ కుటుంబం నుంచి గానీ, ఇటు సచిన్ కుటుంబం నుంచి గానీ ఇంకా ఎలాంటి ధ్రువీకరణ వెలువడలేదు. విషయం తెలిసిన ఐకాన్ క్రికెటర్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు.కెరీర్లో వెనుకబాటుకాగా 25 ఏళ్ల అర్జున్ లెఫ్టార్మ్ పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్. ముందుగా ముంబై అండర్–19 జట్టు నుంచి క్రికెట్లో అరంగేట్రం చేసిన అతను చెప్పుకోదగిన స్థాయిలో రాణించలేకపోయాడు. ప్రస్తుతం గోవా తరఫున దేశవాళీ క్రికెట్ ఆడుతున్నాడు. ఐపీఎల్లో సచిన్ మెంటార్‌గా ఉన్న ముంబై ఇండియన్స్ జట్టులో ఉన్నాడు. కానీ ఇప్పటివరు కేవలం ఐదు మ్యాచ్‌లే ఆడి మూడే వికెట్లు తీయగలిగాడు. బ్యాట్ నుంచి ఇప్పటివరకు రాణించిన ఇన్నింగ్స్ లేదు. అర్జున్ చేయి అందుకున్న సానియా జంతు ప్రేమికురాలు. ముంబైలో ఉన్న పెంపుడు జంతువులు, మూగ జీవాల కోసం ఏర్పాటైన ‘మిస్టర్ పాస్’ను సానియా ప్రారంభించారు.సారా రిలేషన్షిప్ స్టేటస్?ఇదిలా ఉంటే.. అర్జున్.. అక్క సారా కంటే పెళ్లిపీటలు ఎక్కనున్నట్లు తెలుస్తోంది. సచిన్ తనయగానే కాకుండా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సారా.. బయోమెడికల్ సైంటిస్ట్, న్యూట్రీషనిస్ట్. అంతేగాకుండా సచిన్ టెండుల్కర్ ఫౌండేషన్ డైరెక్టర్‌గానూ సేవలు అందిస్తున్న సారా.. ఇటీవలే ఆస్ట్రేలియా టూరిజం అంబాసిడర్‌గానూ ఎంపికైంది. కాగా టీమిండియా టెస్టు కెప్టెన్ శుబ్‌మన్ గిల్‌తో సారా ప్రేమలో ఉన్నట్లు గతంలో వార్తలు వచ్చాయి. అయితే, వీటిపై ఇంత వరకు ఇటు సారా.. అటు గిల్ నోరు విప్పలేదు. అయితే, తాజాగా తమ్ముడి నిశ్చితార్థం జరగడంతో సారా రిలేషన్షిప్ స్టేటస్ మరోసారి వైరల్ అవుతోంది. చదవండి: ధోని జట్టు నుంచి నన్ను తప్పించాడు.. అప్పుడే రిటైర్ అయ్యేవాడిని.. కానీ..: సెహ్వాగ్ View this post on Instagram A post shared by Pilates Academy x Sara Tendulkar (@pilates.academy.andheri) -
Viral Video: కర్మ రిటర్న్ అంటే ఇదే.. తనని తినాలనుకున్న యువతిపై రొయ్య ప్రతీకారం..
-
ఆరోగ్యకరమైన ఆహారం అనారోగ్యాన్ని ఆపలేదు..!
ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటున్నాం కదా మనకేంటి అనుకుంటాం. ఇద సహజం. కానీ ఆ ఆలోచనే ముమ్మాటికి తప్పట. ఆరోగ్యకరమైన ఆహారంతోనే బాగుంటాం అనుకోవడం అనేది అవాస్తవమట. దాంతో బాడీకి కావల్సిన శారీరక శ్రమ తప్పనిసరి అట. పాపం ఇలాంటి అపోహతోనే చేజేతులారా ఆరోగ్యాన్ని పాడుచేసుకోని బాధపడుతోంది ఓ కేన్సర్ బాధితురాలు. తనలాంటి తప్పిదాలు చేయొద్దంటూ బాడీ చెప్పే సంకేతాలను వినండి..అద చెబుతున్నట్లుగా ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండి లేదంటే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదంటూ ఇన్స్టాగ్రామ్ వేదికగా తన బాధను షేర్‌చేసుకుంటూ ఆరోగ్య స్పృహను కలిగిస్తోందామె. ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లనే అనుసరిస్తున్నాం కదా అనారోగ్యం దరిచేరదు అనుకుంటే పొరబడినట్టేనని అంటోంది 29 ఏళ్ల మోనిక చౌదరి. తాను పోషకవంతమైన ఆహారాన్ని తీసుకునేదాన్ని తను మంచి ఆహారపు అలవాట్లనే అనుసరించానని అయినప్పటికీ స్టేజ్ 4 కేన్సర్‌తో పోరాడుతున్నని వాపోయింది. అందుకు కారణాలేంటో కూడా ఆమె వివరించింది. ఒత్తిడి ఆరోగ్యాన్ని ఎలా చిత్తు చేసిందంటే..తాను మంచి ఫుడ్‌నే తీసుకునేదాన్ని అని అంటోంది. వేయించిన పదార్థాలు, జంక్‌ఫుడ్ జోలికి అస్సలు వెళ్లదట. అయితే వృత్తిరీత్యా ఎక్కువగంటలు స్క్రీన్ సమయం, పనిభారం తనకు తెలియకుడానే ఒత్తిడిని పెంచేసి శారీరకంగా ప్రభావితం చేశాయంటోంది. ఇంతకుముందు సాయంత్రాలు చేసే జాగింగ్ వంటి దినచర్యలకు స్వస్తి చెప్పాల్సి వచ్చింది. చెప్పాలంటే పెద్దగా కదలికలు లేదు, శారీరక శ్రమ అనే దినచర్య పూర్తిగా లేకుండాపోయింది. అక్కడికి తన బాడీ సంకేతాలు ఇస్తునే ఉందని, కానీ తాను మాత్రం ఇది పని ఒత్తిడి వల్లే అనుకుంటూ లైట్ తీసుకుందట. సాధ్యమైనంత తొందరలో ఇదివరకటి జీవనశైలిని అనుసరించి వ్యాయామాలు చేద్దా అనుకుంటూనే ఉండేదాన్ని తప్ప..ఎప్పుడూ ఆచరణలోకి తీసుకురాలేకపోయానని వాపోయింది. అలా ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తూనే వచ్చానని చెప్పుకొచ్చారామె. ఫలితంగా అలిసిపోవడం, అసౌకర్యంగా ఉండటం వంటి కొద్దిపాటి సంకేతాలు వస్తూనే ఉన్నా..ఆ..! అదంతా పని ఒత్తిడి, నిద్రలేక వచ్చేవే కామన్ అనుకుని పెద్దగా సీరియస్‌గా తీసుకోలేదని చెబుతోంది మోనిక. అప్పుడే ఒకరోజు ఉన్నటుండి స్ప్రుహ తప్పి పడిపోవడం..ఇక అలా బెడ్‌కే పరిమితమయ్యేలా స్టేజ్ 4 కొలొరెక్టల్ కేన్సర్ నిర్థారణ అయ్యిందని తెలిపింది. ఒక్కసారిగా తన కాళ్ల కింద భూమి కంపించిపోతున్నట్లుగా.. చెప్పలేని ఏదో బాధ గుండెల్లోంచి పొంగుకొచ్చిందంటూ కన్నీటి పర్యంతమైంది. శారీరక వ్యాయమాల పట్ల చూపిన నిర్లక్ష్యం, అశ్రద్ధ ఫలితానికి భారీ మూల్యమే చెల్లించుకుంటున్నానని నెమ్మది నెమ్మదిగా అర్థమవ్వడం ప్రారంభమైందంటూ తన ఆవేదనను చెప్పుకొచ్చింది. కష్టపడటంలోనే కాదు, ఆరోగ్య విషయంలోనూ రాజీకి తావిస్తే..నిర్థాక్షిణ్యంగా అనారోగ్యం కోరల్లో చిక్కుకుపోతామని హెచ్చరిస్తోంది మోనికా. సాధ్యమైనంతవరకు మన బాడీ సంకేతాలతో కోరే శ్రద్ధపై ఫోకస్ పెట్టి వ్యాధుల బారిన పడకుండా ఆరోగ్యాన్ని కాపాడుకోండి. అన్నింట్లకంటే విలువైనది, వెల కట్టలేని సంపద ఆరోగ్యమేనని, అదే మహాభాగ్యం అని అంటోంది కేన్సర్ బాధితురాలు మోనిక. View this post on Instagram A post shared by CancerToCourage (@cancertocourage) (చదవండి: అలాంటి ఇలాంటి అధిక బరువు కాదు..! ఏకంగా 325 కిలోలు..చివరికి..) -
జయా బచ్చన్‌కు మళ్లీ కోపమొచ్చింది...సెల్ఫీ తీసుకోబోతే
ప్రముఖ నటి,సమాజ్‌వాది పార్టీ నాయకురాలు, రాజ్యసభ ఎంపీ జయాబచ్చన్ (Jaya Bachchan) మరోసారి వార్తల్లోనిలిచారు. ఆమెతో సెల్ఫీ దిగేందుకు ప్రయత్నించిన ఒక వ్యక్తిపై జయాబచ్చన్ అసహనంగా ప్రవర్తించారు. దీనికి సంబంధించిన వీడియో ఇంటర్నెట్లో వైరలవుతోంది. తనతో సెల్ఫీ తీసుకోవడానికి ప్రయత్నిస్తున్న వ్యక్తిని సీరియస్‌గా పక్కకు తోసేశారు జయా బచ్చన్. అంతేకాదు ‘ఏం చేస్తున్నావు ..ఏంటిది ?’ అంటూ అతడిపై ఆగ్రహం వ్యక్తంచేశారు. దీంతో అక్కడున్నవారంతా ఒక్కసారిగా హతాశులయ్యారు. ఢిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్ ఆఫ్ ఇండియాలో ఈ సంఘటన జరిగినట్లు తెలుస్తోంది. చిన్న విషయాలకే సహనం కోల్పోతున్న జయాబచ్చన్ తీరుపై నెటిజన్లు విస్తుపోతున్నారు. ఇంత యాటిట్యూడ్ పనికిరాదంటూ విమర్శిస్తున్నారు.I get the whole 'privacy & permission' thing, but you’re in the public sector, Attitude kis baat ka hai? Bachchan ki biwi hone ka ya khairaat ki Rajya Sabha seat ka? If the ego is this high, next time try winning a Lok Sabha seat on your own #JayaBachchan pic.twitter.com/AvL4ToArjQ— Prayag (@theprayagtiwari) August 12, 2025కాగా సీనియర్ బాలీవుడ్ సీనియర్ నటుడు అమితాబ్ బచ్చన భార్య అయిన జయా పబ్లిక్ ప్రదేశాల్లో ఉన్నప్పుడు జయాబచ్చన్ దురుసు తనం, సహనం కోల్పోవడం ఇదే తొలిసారి కాదు. ఇటీవల ఆపరేషన్ సింధూర్‌పై పార్లమెంట్లో, ఆపరేషన్ సిందూర్ పేరును ప్రశ్నించి, పహల్గామ్ ఉగ్రవాద దాడిలో చాలా మంది మహిళల "సిందూర్‌ను నాశనం" చేసినప్పుడు దానికి ఆ పేరు ఎందుకు పెట్టారని బచ్చన్ ఇటీవల ప్రశ్నించడంతో వివాదం చెలరేగింది. అధికార పార్టీ ఎంపీలు తన ప్రసంగానికి అంతరాయం కలిగించినప్పుడు జయ అసహనానికి గురయ్యారు. మీరే..నేనో ఒక్కరే మాట్లాడాలి. మీరు మాట్లాడేటప్పుడు, నేను అంతరాయం కలిగించలేదు. ఒక మహిళ మాట్లాడేటప్పుడు, నేనైతే అంతరాయం కలిగించను. కాబట్టి నోరు అదుపులోపెట్టుకోండి అన్నట్టు మండిపడ్డారు. ఏప్రిల్‌లో ముంబైలో జరిగిన దివంగత మనోజ్ కుమార్ నివాళి అర్పించే కార్యక్రమంలో జయా బచ్చన్ ఒక మహిళతో చాలా రూడ్‌గా ప్రవర్తించిన వీడియో వైరల్ అయింది. She is so rude..😒#jayabachchan pic.twitter.com/c6GN5ClxJS— Cabinet Minister, Ministry of Memes,🇮🇳 (@memenist_) August 12, 2025 -
'ఏక్ దిన్-ఏక్ గల్లీ'..! స్వచ్ఛమైన భారతీయుడిగా విదేశీయుడు..
మన ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిష్టాత్మకంగా స్వచ్ఛ భారత్ మిషన్‌ని చేపట్టి.. దశల వారీగా పలు కార్యక్రమాలు చేపట్టిన సంగతి తెలిసిందే. మరుగుదొడ్లు నుంచి పారిశుధ్య కార్యక్రమాలు, తాగునీరు, తదతరాలన్నింటిని స్వచ్ఛంగా పరిరక్షించుకునేలా సమర్థవంతమైన పథకాలు, కార్యక్రమాలను ప్రవేశపెట్టారు. ఇంకా కొన్ని రాష్ట్రల్లో అక్కడక్కడ పరిశుభ్రత విషయంలో పరిస్థితి అత్యంత అధ్వాన్నంగానే ఉంది. అందుకు స్వచ్ఛందంగా ముందుకు వచ్చే వారే కరువు. అలాంటిది ఒక విదేశీయడు ఓ నియమాన్ని ఏర్పాటు చేసుకుని మరి వీధులను శుభ్రం చేస్తున్నాడు అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఆ వీడియోలో ఒక విదేశీయుడు వీధులను శుభ్రం చేస్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. హర్యానాలోని గురుగ్రామ్‌లో ఒక సెర్బియన్ దేశస్తుడు మార్పుని ఆహ్వానించేలా ఆయనే స్వయంగా నడుంకట్టాడు. ఆయన్ ఏక్‌దిన్‌కే ఏక్ గల్లీ అనే చొరవతో ఈ కార్యక్రమాన్నిచేపట్టినట్లు వీడియోలో వివరించాడు. View this post on Instagram A post shared by 4cleanindia (@4cleanindia) దీన్ని నాలుగు రోజుల క్రితం ప్రారంభించినట్లు తెలిపాడు. ఇప్పటి వరకు ‘మిలీనియం సిటీ’లోని అనేక ప్రాంతాలను శుభ్రం చేస్తున్న వీడియోలను కూడా పంచుకున్నాడు. దీనికి స్థానికుల నుంచి కూడా మద్దతు లభించడం విశేషం. ఈ వీడియోలను చూసిన నెటిజన్లు అతడు నిజంగా స్వచ్ఛమైన భారతీయుడిని అభివర్ణించడమే కాకుండా క్లీన్ ఇండియా కోసం భారతీయులను ప్రేరేపించేలా చేస్తున్న మహోన్నత వ్యక్తి అని మరి కొందరూ ఆ విదేశీయుడిపై ప్రశంసల జల్లు కురిపిస్తూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by 4cleanindia (@4cleanindia) (చదవండి: అలాంటి ఇలాంటి అధిక బరువు కాదు..! ఏకంగా 325 కిలోలు..చివరికి..) -
హాలీవుడ్ మోడల్‌గా ఈ-రిక్షాడ్రైవర్..!
మన కళ్లముందే సాదాసీదాగా కనిపించని వ్యక్తులు ఒక్కసారిగా స్టన్నింగ్ మోడల్ లుక్‌లో కనిపిస్తే..కచ్చితంగా షాకవ్వతాం. నిజంగా మోడల్ రైంజ్ లుక్ ఉందా వీరికి అని విస్తుపోతాం. అందుకు కావాల్సినంత డబ్బు లేకపోవడంతోనే ముఖాకృతికి సంబంధించిన హంగులు, మేకప్ జోలికి వెళ్లే ఛాన్స్ ఉండదు. దాంతో సాధారణ వ్యక్తుల్లా మన మధ్య ఉంటారు. ఎవరో ఓ టాలెంటెడ్ మేకప్ ఆర్టిస్ట్ లేదా మోడల్నో దాన్ని గుర్తించి వారిలో ఉన్న అద్భుత మోడల్ని వెలికితీస్తారు. అలానే ఇక్కడొక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఓ రిక్షడ్రైవర్ని ఎంత గ్లామరస్‌గా మార్చాడో చూస్తే విస్తుపోతారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్‌గా మారింది. ఆ వీడియోలో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ మోడల్‌గా తీర్చిదిద్దే మాస్టర్‌పీస్ కోసం వెదుకుతున్నట్లు కనిపిస్తుంది. ఎదురుగా ఈ రిక్షాడ్రైవర్. అతని లుక్స్‌లో ఏదో మోడ్రన్ని గుర్తించి మొత్తం అతడి రూపురేఖలనే మార్చేస్తాడు. ఇంట్లో దొరికే పెరుగు, పుదీనా ప్యాక్‌తో స్కిన్ లుక్, విటమిన్ ఈ వంటి ఆయిల్స్ హెయిర్‌ని అందంగా మార్చేస్తాడు. మంచి డ్రెస్సింగ్ వేర్‌తో అతడిలో దాగున్న అద్భుతమైన మరో వ్యక్తిని వెలికితీస్తాడు. నిజంగా ముందున్న లుక్‌కి ఇప్పుడున్నీ స్టన్నింగ్ లుక్‌కి చాలా వ్యత్యాసం ఉంటుంది. కచ్చితంగా ఈ వ్యక్తి అంతకుముందు చూసి వ్యక్తేనే అని మన కళ్లను మనమే నమ్మలేనంతంగా అతడి మొత్తం ఆహార్యాన్ని అత్యంత అద్భుతంగా తీర్చిదిద్దుతాడు ఈ ఇన్ఫ్లుయెన్సర్. నెటిజన్లు కూడా అంత అందంగా మార్చే వ్యక్తి మాక్కూడా కావాలి. బ్రో నీ చేతుల్లో ఏదో మ్యాజిక్ ఉంది అంటూ కామెంట్లు చేస్తూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by Karron S Dhinggra (@theformaledit) (చదవండి: తొమ్మిది పదుల వయసులో ఆ తల్లికి ఎంత కష్టం..? పాపం కొడుకు కోసం..) -
వీడియో: డే కేర్ సెంటర్ నిర్వాకం.. పిల్లల విషయంలో జాగ్రత్త!
నోయిడా: చిన్నారులను వారి పేరెంట్స్ ఎంత జాగ్రత్తగా చూసుకుంటారో చెప్పాల్సిన పని లేదు. కానీ.. ప్రస్తుత జనరేషన్లో ఉద్యోగాలు, ఇతర కారణాల రీత్యా.. వారి పిల్లలను చూసుకునేందుకు కొందరు పేరెంట్స్‌కి సమయం ఉండటం లేదు. ఈ కారణంగా చిన్నారులను డే కేర్ సెంటర్లలో వదిలేసి వెళ్తున్నారు. ఇక, కొన్ని డే కేర్ సెంటర్లలో చిన్నారుల పట్ల అక్కడి సిబ్బంది ప్రవర్తిస్తున్న తీరు దారుణంగా ఉంటోంది. తాజాగా నోయిడాలోని ఓ డే కేర్ సెంటర్లో 15 నెలల చిన్నారిని తీవ్రంగా కొట్టిన ఘటన సీసీ కెమెరాలో రికార్డు అయ్యింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో డే కేర్ అంటే వణికిపోయే పరిస్థితి ఏర్పడింది.వివరాల ప్రకారం.. ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాకు చెందిన ఇద్దరు పేరెంట్స్ ఉద్యోగస్తులు కావడంతో.. తమ 15 నెలల పసిబిడ్డను స్థానికంగా ఉన్న ఓ డేకేర్ సెంటర్లో జాయిన్ చేశారు. అయితే ఆగస్టు 4వ తేదీన ఆ ఆడశిశువు ఎందుకో గుక్కపట్టి ఏడ్చింది. దీంతో డే కేర్‌లో యువతి.. ఏడుస్తున్న పాపను లాలించాల్సింది పోయి.. క్రూర మృగంలా ప్రవర్తించింది. ఏడుస్తున్న ఆ పసిబిడ్డను ఎత్తుకుని పలుమార్లు నేలకేసి కొట్టింది. అయినా ఏడుపు మానడం లేదని తలను గోడకేసి కొట్టింది. చెంప దెబ్బలతో తీవ్రంగా గాయపరిచింది. అంతటితో ఆగకుండా.. బ్యాట్‌తో కొట్టడంతో తొడలకు తీవ్ర గాయాలయ్యాయి.#Noida DAY CARE HORROR: A 15-month-old child was beaten, head smashed against a wall, dropped on the ground and bitten.Every working parent's worst nightmare! pic.twitter.com/KttIyyL0g3— Karan Singh (@Journo_Karan) August 11, 2025అదే రోజున సాయంత్రం కావడంతో డే కేర్ సెంటర్‌కు వచ్చిన పేరెంట్స్.. తమ బిడ్డను ఇంటికి తీసుకెళ్లారు. ఈ క్రమంలో ఆ పసిపాప శరీరంపై ఉన్న గాయాలను చూసి షాక్ అయ్యారు. తొడపై కొరికనట్టు గాయం, పలుచోట్ల ఎర్రగా కమిలిపోయి ఉండటంతో ఆవేదనకు గురైన పేరెంట్స్.. బిడ్డను తీసుకుని స్థానిక ఆసుపత్రిలో డాక్టర్‌ను సంప్రదించారు. ఈ గాయాలన్నీ ఎవరో కొట్టినవి అని.. సదరు డాక్టర్ నిర్ధారించడంతో ఖంగుతిన్నారు.దీంతో డే కేర్ సెంటర్లోని సీసీటీవీ ఫుటేజీని బాధిత చిన్నారి పేరెంట్స్ పరిశీలించారు. చంటిబిడ్డను పనిమనిషి హింసించిన భయానక దృశ్యాలను చూసి తల్లిదండ్రులు షాక్ అయ్యారు. దీంతో డే కేర్ సెంటర్ హెడ్‌తో పాటు పని మనిషిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారిద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు డే కేర్ సెంటర్ నిర్వాకంపై మండిపడుతున్నారు. Noida - Sector-137 - पारस टियरा सोसायटी डे-केयर में 15 महीने की बच्ची से मारपीट और दांत काटने का आरोपमेड ने थप्पड़ मारा, पटक दिया, प्लास्टिक बेल्ट से मारा और काटाबच्ची जोर-जोर से रोती हुई दिखीआरोपी मेड को पुलिस ने गिरफ्तार कियाअपने बच्चों को किसी के सहारे ना छोड़े 🙏🏻 pic.twitter.com/iTkb95I0VB— Rimjhim Jethani (@RimjhimJethani1) August 11, 2025 -
Viral Video: మనిషిని చూసి భయపడ్డ సింహం