విమాన ప్రమాదం.. అదుపుతప్పి సముద్రంలోకి దూసుకెళ్లి.. | Deadly Cargo Plane Accident at Hong Kong Airport: Boeing 747 Crashes into Sea, Two Ground Staff Killed | Sakshi
Sakshi News home page

Hong Kong Airport: విమాన ప్రమాదం.. అదుపుతప్పి సముద్రంలోకి దూసుకెళ్లి..

Oct 20 2025 9:03 AM | Updated on Oct 20 2025 12:24 PM

Turkish cargo plane skids off Hong Kong runway Video Viral

హాంకాంగ్‌: హాంకాంగ్‌లో ఘోర విమాన ప్రమాద ఘటన చోటుచేసుకుంది. హాంకాంగ్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో(Hong Kong Airport) కార్గో విమానం రన్‌వేపై అదుపు తప్పి సముద్రంలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఇద్దరు సిబ్బంది చనిపోయినట్టు సమాచారం.

ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. హాంకాంగ్‌లో అంతర్జాతీయ విమానాశ్రయంలో(cargo Flight Accident) సోమవారం తెల్లవారుజామున 3.50 సమయంలో బోయింగ్‌ 747-481 మోడల్‌కి చెందిన కార్గో విమానం ప్రమాదానికి గురైంది. దుబాయ్‌ నుంచి హాంకాంగ్‌ చేరుకొన్న ఎమిరేట్స్‌ విమానం అత్యంత రద్దీగా ఉండే నార్త్‌ రన్‌వేపై దిగి అదుపుతప్పి ఓ వాహనాన్ని ఢీకొని సముద్రంలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఇద్దరు విమానాశ్రయ గ్రౌండ్‌ సిబ్బంది మృతి చెందారు. విమానంలో ఉన్న నలుగురు సిబ్బంది సురక్షితంగా బయటపడ్డారు.

ప్రమాదం కారణంగా విమానం పాక్షికంగా నీటిలో మునిగిపోయింది. బోయింగ్‌ 737 శ్రేణికి చెందిన EK9788 విమానాన్ని ఎమిరేట్స్‌ నుంచి తుర్కియే సంస్థ ఏసీటీ ఎయిర్‌ లైన్స్‌ లీజుకు తీసుకొని నడుపుతోంది. ప్రమాదం జరిగిన రన్‌వేను అధికారులు తాత్కాలికంగా మూసివేశారు. అయితే విమానాశ్రయంలోని మిగతా రెండు రన్‌వేలు కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement