flight accident
-
తమిళనాడు: ఎమిరేట్స్ విమానానికి తప్పిన ప్రమాదం
సాక్షి, చెన్నై: తమిళనాడు ఎమిరేట్స్ విమానానికి తృటిలో ప్రమాదం తప్పింది. విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయ్యే సమయానికి విమానం నుంచి పొగలు రావడంతో అప్రమత్తమైన అధికారులు వెంటనే నిలిపివేశారు. దీంతో, ప్రయాణీకులు ఊపిరి పీల్చుకున్నారు.వివరాల ప్రకారం.. చెన్నై విమానాశ్రయం నుంచి దుబాయ్ వెళ్లాల్సిన ఎమిరేట్స్ విమానానికి తృటిలో ప్రమాదం తప్పింది. మంగళవారం రాత్రి ఎయిర్‌పోర్టు నుంచి విమానం టేకాఫ్ అయ్యే సమయానికి ఫ్లైట్ వింగ్స్ భాగం నుంచి పొగ రావడం కనిపించింది. దీంతో, అప్రమత్తమైన పైలట్ విమానాన్ని అక్కడే నిలిపివేశారు.ఈ క్రమంలో అలర్ట్ అయిన విమాన సిబ్బంది, టెక్నికల్ టీమ్ విమానాన్ని పరిశీలించి ప్రమాదాన్ని గుర్తించారు. పది నిమిషాల సమయంలో పొగ ఆగిపోయినట్టు అధికారులు తెలిపారు. అయితే, పొగ రావడానికి గల కారణాలను సిబ్బంది వెల్లడించలేదు. దీంతో, ప్రయాణీకులు ఆందోళనకు గురయ్యారు. ఇక, రాత్రి 9:15 గంటలకు దుబాయ్ వెళ్లాల్సిన విమానం నాలుగు గంటలు ఆలస్యంగా అర్ధరాత్రి ఒంటి గంట తర్వాత టేకాఫ్ అయినట్టు సమాచారం. ఇక, ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో 320 మంది ప్రయాణీకులు ఉన్నారు.ఇది కూడా చదవండి: తమిళనాడులో ఘోర ప్రమాదం.. ఆరుగురి దుర్మరణం -
కొండలు, లోయ ప్రాంతాల్లో సులువుగా నడిపేలా కొత్త టెక్నాలజీ
ఎత్తైన కొండలు, లోయ ప్రాంతాల్లోని ఎయిర్‌పోర్ట్‌ల్లో విమానాలను దించడం, టేకాఫ్ చేయడం సవాలుతో కూడుకున్న విషయం. ఈ సమస్యను అధిగమించేలా ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో కొత్త టెక్నాలజీని అందుబాటులోకి తీసుకొచ్చినట్లు ప్రకటించింది. నేపాల్ రాజధాని కాఠ్మాండూ లోయ చుట్టూ ఉన్న ప్రతికూల భౌగోళిక పరిస్థితులకు ధీటుగా విమానాన్ని నడిపేందుకు వీలుగా ఆర్ఎన్పీ ఏఆర్ టెక్నాలజీని వినియోగించింది.రిక్వైర్డ్ నేవిగేషన్ ఫర్‌ఫెర్మాన్స్ విత్ ఆథరైజేషన్ రిక్వయిర్డ్(ఆర్ఎన్పీ ఏఆర్)గా పిలువబడే ఈ టెక్నాలజీని విమానంలో వాడడం వల్ల ఎత్తు పల్లాలు వంటి ఎలాంటి భౌగోళిక పరిస్థితుల్లోనైనా విమానాన్ని నడపవచ్చని ఇండిగో తెలిపింది. ఎత్తైన ప్రాంతంపై ఉన్న కాఠ్మాండూ త్రిభువన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ (కేటీఎం) లాంటి విమానాశ్రయాల కోసం ప్రత్యేకంగా ఈ సాంకేతికతను తయారు చేసినట్లు పేర్కొంది. ఇటీవల ఇండిగో ఏ320 ఎయిర్‌క్రాఫ్ట్‌లో ఈ ఆర్ఎన్పీ ఏఆర్ సాంకేతికను ఉపయోగించినట్లు పౌర విమానయాన డైరెక్టరేట్ జనరల్ (డీజీసీఏ) స్పష్టం చేసింది.ఇదీ చదవండి: ‘డిస్కౌంట్ ధరకు హెల్మెట్’‘ఎత్తైన ప్రదేశంలోని ఉన్న కాఠ్మాండూ త్రిభువన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ (కేటీఎం) విమానాశ్రయం చుట్టూ హిమాలయాలు ఉన్నాయి. దాంతో ఎయిర్‌క్రాఫ్ట్‌ను దించడం, టేకాఫ్ చేయడం సవాలుగా మారుతుంది. ఆర్ఎన్పీ ఏఆర్ విధానం ద్వారా విమాన మార్గాన్ని ముందుగానే గుర్తించి అందుకు తగినట్లుగా పైలట్లు స్పందించే అవకాశం ఉంది. దాంతో ప్రమాదాలు తగ్గుతాయి. కొత్త సాంకేతికతతో ఎత్తు పల్లాల ప్రాంతాల్లో విమానాలను నడపడం సులువవుతుంది. అయితే ఈ టెక్నాలజీ వినియోగించాలంటే పైలట్లకు ప్రత్యేకంగా శిక్షణ అవసరం’ అని ఇండిగో తెలిపింది. -
షాకింగ్ వీడియో.. గాల్లోనే రెండు విమానాలు ఢీకొన్నాయా?
ఆకాశంలో తృటిలో ఘోర విమాన ప్రమాదం తప్పింది. ఒక విమానం మరో విమానాన్ని ఢీకొట్టిందా? అన్నట్టుగా విమానాలు చేరువయ్యాయి. ల్యాండ్ అవుతున్న ఒక విమానం, టేకాఫ్ అవుతున్న మరో విమానం ఢీకొట్టుకోబోయాయి. ఇక, దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.వివరాల ప్రకారం.. న్యూయార్క్‌లోని సిరక్యూస్ హాన్కాక్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో జూలై ఎనిమిదో తేదీన ప్రధాన వాణిజ్య విమానయాన సంస్థలకు చెందిన రెండు విమానాలు ఢీకొట్టుకోబోయాయి. ఇక, ఎయిర్‌పోర్ట్‌లో కంట్రోలర్లు మొదట అమెరికన్ ఈగిల్ ఫ్లైట్ AA5511, PSA ఎయిర్‌లైన్స్ నిర్వహిస్తున్న బొంబార్డియర్ CRJ-700ను రన్‌వే 28లో ల్యాండ్ చేయడానికి క్లియర్ చేశారు. కొద్దిసేపటి తర్వాత వారు డెల్టా కనెక్షన్ DL5421, ఎండీవర్ ఎయిర్ నిర్వహిస్తున్న మరో CRJ-700కి అదే రన్‌వే నుండి బయలుదేరడానికి అనుమతి ఇచ్చారు.ఈ రెండు విమానాలు ఆకాశంలో ఒకానొక సమయంలో చాలా దగ్గరగా ఉన్నాయి. రెండు విమానాలు ఢీకొట్టుకునేంత పనైంది. ఫ్లైట్ రాడార్-24 వెబ్సైట్ ప్రకారం, విమానాలు ఒకదానికొకటి నిలువుగా 700-1,000 అడుగుల దూరంలోకి వచ్చాయి. ఈ సమయంలో డెల్టా విమానంలో 76 మంది ప్రయాణికులు ఉండగా, అమెరికన్ ఎయిర్‌లైన్స్ విమానంలో 75 మంది ఉన్నారు. అదృష్టవశాత్తూ ప్రమాదం జరగకపోవడం ప్రయాణికులు క్షేమంగా ఉన్నారు. NEW: The FAA has launched an investigation after two planes nearly collided at New York’s Syracuse Hancock International Airport. A commercial flight was forced to abort the landing when an airplane taking off nearly ran into the plane. The planes came within just… pic.twitter.com/jW5pyqZCeM— Collin Rugg (@CollinRugg) July 10, 2024 ఇక, దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మరోవైపు.. ఈ ఘటనపై సిరక్యూస్ హాన్కాక్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రతినిధి మాట్లాడుతూ.. ఎయిర్పోర్ట్ నుంచి విమాన కార్యకలాపాలకు ఎలాంటి అంతరాయం కలుగలేదన్నారు. ఈ ఘటనపై ఎఫ్ఏఏ విచారణ చేపట్టినట్టు తెలిపారు. -
ల్యాండ్ అవుతుండగా విమానంలో మంటలు.. ప్రయాణికుల కేకలు!
ఇస్లామాబాద్: పాకిస్తాన్లో తృటిలో ఘోర విమానం తప్పింది. సౌదీకి చెందిన ఎయిర్‌లైన్స్‌లోని పెషావర్‌లో ల్యాండ్ అవుతున్న సమయంలో మంటలు వ్యాపించడం అధికారులు గుర్తించారు. వెంటనే సహాయక బృందాలు అప్రమత్తమై విమానాన్ని నిలిపివేసి మంటలను అదుపులోకి తెచ్చారు.వివరాల ప్రకారం.. పాకిస్తాన్‌లోని పెషావర్‌లో సౌదీ ఎయిర్‌లైన్స్ విమానానికి తృటిలో పెను ప్రమాదం తప్పింది. గురువారం ఉదయం 276 మంది ప్రయాణికులు, 21 విమాన సిబ్బందితో రియాద్ నుంచి సౌదీ ఎయిర్‌లైన్స్ విమానం ఎస్వీ 792 పాకిస్థాన్‌లోని పెషావర్‌కు బయలుదేరింది. ఇక, విమానం పెషావర్ ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ అవుతున్న సమయంలో ఎడమ గేర్ నుంచి దట్టమైన పొగలతోపాటు మంటలు వచ్చాయి.ఈ విషయాన్ని ఎయిర్పోర్ట్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ) అధికారులు గుర్తించారు. దీంతో, వెంటనే అప్రమత్తమయ్యారు. మంటల విషయాన్ని విమాన పైలెట్‌తోపాటు సహాయక సిబ్బందికి చేరవేశారు. అనంతరం, విమానాన్ని వెంటనే ఎయిరోపోర్ట్‌లో నిలిపివేశారు. హుటాహుటిన ప్రయాణికులతోపాటు సిబ్బందిని విమానం నుంచి దింపివేశారు. తర్వాత విమానం గేర్ వద్ద ఎగసిపడుతున్న మంటలను ఆర్పివేశారు. Latest: Saudia Airbus A330 operating Riyadh to Peshawar experienced a fire in the left landing gear on landing The aircraft went on to suffer a runway excursion before coming to a complete stop. Evacuation initiated, all passengers and 21 crew are safe.pic.twitter.com/WF34skShM1— Alex Macheras (@AlexInAir) July 11, 2024 ఇక, దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా, విమానంలో గేర్ నుంచి మంటలు రావడానికి గల కారణాలను టెక్నికల్ టీమ్ అన్వేషిస్తోంది. మరోవైపు.. ఈ ప్రమాదంలో ప్రయాణీకులు ఎవరికీ గాయాలు కాలేదని సౌదీ ఎయిర్ లైన్స్ వెల్లడించింది. #SaudiAirlines flight 792 4rm #Riyadh experienced a #fire in the left landing gear while maneuvering at #Peshawar Airport, Rescue Services swiftly extinguished the #blaze after n alert by air traffic preventing a major accident, 276passeng n 21crew evacuated via inflatable slides pic.twitter.com/mUnBYUvPRj— Sajjad Tarakzai (@SajjadTarakzai) July 11, 2024 -
వీడియో: గాల్లో రెండు విమానాలు ఢీ.. పైలట్ మృతి
లిస్బన్: పోర్చుగల్‌లో విషాదకర ఘటన చోటుచేసుకుంది. దక్షిణ పోర్చుగల్‌లో జరుగుతున్న ఎయిర్‌షో కార్యక్రమంలో ప్రమాదం జరిగింది. గాల్లోనే రెండు విమానాలు ఒకదానినొకటి ఢీకొన్న కారణంగా పైలట్ మృతిచెందాడు.వివరాల ప్రకారం.. దక్షిణ పోర్చుగల్‌లోని బెజాలో ఎయిర్‌షో జరుగుతోంది. ఈ ఎయిర్ షో కార్యక్రమంలో మొత్తం ఆరు విమానాలు విన్యాసాలు చేస్తున్నాయి. కాగా, ఆదివారం ఎయిర్‌షో సందర్భంగా ఒక విమానం వేగంగా పైకి దూసుకెళ్లి మరోదాన్ని ఢీకొట్టింది. దీంతో రెండూ ఒక్కసారిగా కుప్పకూలాయి. ఒకటి ఎయిర్‌బేస్‌కు అవతల పడిపోగా మరొకటి సమీపంలో కుప్పకూలింది. ఈ ప్రమాదంలో స్పెయిన్‌కు చెందిన పైలట్ మృతిచెందాడు. మరో పైలట్(పోర్చుగల్)కు తీవ్ర గాయాలయ్యాయి. ఇక, పోర్చుగల్, స్పెయిన్‌కు చెందిన పైలట్లతో కూడిన ‘యాక్ స్టార్స్’ అనే ఏరోబాటిక్ గ్రూప్ ఈ వైమానిక విన్యాసాలను ప్రదర్శిస్తోంది. వీటిలో పాల్గొన్న విమానాలన్నీ యాకోవ్లెవ్ యాక్-52 రకానికి చెందినవి. కాగా, ఈ ఘటనపై విచారణ జరిపి ప్రమాదానికి దారితీసిన కారణాలేంటో గుర్తిస్తామని పోర్చుగల్ రక్షణమంత్రి నునో మెలో తెలిపారు. అయితే, ప్రమాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. #Breaking : Planes collide at Portugal air show, killing at least one. pic.twitter.com/NFY2fxWtZ3— The Spot (@Spotnewsth) June 2, 2024 -
సింగపూర్ విమానంలో భారీ కుదుపులు
బ్యాంకాక్: లండన్ నుంచి సింగపూర్‌కు బయల్దేరిన సింగపూర్ ఎయిర్‌లైన్స్ విమానంలో మార్గమధ్యంలో భారీ కుదుపులకు లోనైంది. దీంతో విమానంలోని ప్రయాణికులు ఒక్కసారిగా సీలింగ్ తగిలి, చెల్లాచెదురుగా పడి గాయాలపాలయ్యారు. ఊహించని పరిణామంతో హతాశుడైన ఒక 73 ఏళ్ల ప్రయాణికుడు అస్వస్థతకు గురై ప్రాణాలు కోల్పోయారు. 30 మంది గాయపడ్డారు. వీరందరినీ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స చేస్తున్నారు. వీరిలో ఏడుగురికి తలకు తీవ్రమైన గాయాలయ్యాయి.బోయింగ్ 777 రకం ఎస్క్యూ321 విమానం మంగళవారం ఉదయం మయన్మార్ దగ్గర్లోని అండమాన్ సముద్ర జలాలపై ప్రయాణిస్తున్నపుడు ఈ ఘటన జరిగింది. విమానం బయల్దేరిన 10 గంటల తర్వాత జరిగిన ఈ ఘటన వివరాలను సింగపూర్ ఎయిర్‌లైన్స్, ప్రయాణికులు వెల్లడించారు. ఘటన తర్వాత విమానాన్ని దారి మళ్లించి దగ్గర్లోని బ్యాంకాక్‌లోని సువర్ణభూమి విమానాశ్రయంలో ల్యాండ్చేశారు. గాయపడని ప్రయాణికులను వేరే విమానాల్లో గమ్యస్థానమైన సింగపూర్‌కు పంపేశారు.అసలేమైంది?211 మంది ప్రయాణికులు, 18 సిబ్బందితో విమానం లండన్‌లోని హీత్రూ విమానాశ్రయం నుంచి బయల్దేరింది. ఎయి ర్‌హోస్టెస్ ప్రయాణికులకు అల్పాహారం అందిస్తున్న సమయంలో విమానం 37,000 అడుగుల ఎత్తులో ప్రయాణిస్తోంది. హఠాత్తుగా విమానం కుదుపులకు లోనైంది. మూడు నిమిషాల వ్యవధిలో ఆరువేల అడుగులు అంటే 37వేల అడుగుల ఎత్తు నుంచి 31వేల అడుగుల స్థాయికి పడిపోయింది. దీంతో విమానంలో బెల్ట్ పెట్టుకోని ప్రయాణికులంతా ఒక్క ఉదుటున గాల్లోకి లేచి సీలింగ్‌కు ఢీకొన్నారు.మూడు నిమిషాల పాటు విమానం అటూఇటూ ఊగుతూ కిందకు పడిపోతుండటంతో లోపలున్న వారంతా చెల్లా చెదు రుగా పడిపోయారు. అసలేం జరుగుతుందోనన్న భయం, ఆందోళనతో అస్వస్థతకు గురై 73 ఏళ్ల బ్రిటిష్ జాతీయుడు అక్కడికక్కడే మరణించారు. గుండెపోటు కారణంగా ఆయన మరణించి ఉంటారని వైద్యులు భావిస్తున్నారు. 31 వేల అడుగుల ఎత్తుకు చేరుకున్నాక విమానం మళ్లీ స్థిరత్వాన్ని సాధించింది. వెంటనే తేరుకున్న పైలట్లు 30 నిమిషాల్లోపే బ్యాంకాక్‌లోని సువర్ణభూమి ఎయిర్‌పోర్ట్‌లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. ప్రయాణికుల్లో ఎక్కువ మంది బ్రిటన్, ఆస్ట్రేలియా, మలేసియా, సింగపూర్, న్యూజిలాండ్ దేశస్తులున్నారు. ముగ్గురు భారతీయులు కూడా ఉన్నారు. -
ట్రక్‌ట్యాక్సీను ఢీకొట్టిన 180 మంది ప్రయాణిస్తున్న విమానం!
ప్రముఖ విమానయాన సంస్థ ఎయిరిండియా ఎయిర్‌క్రాఫ్ట్ టగ్ట్రక్ ట్యాక్సీను ఢీకొన్న సంఘటన బుధవారం పుణె ఎయిర్‌పోర్ట్‌లో చోటుచేసుకుంది. ఈ ఘటన జరిగిన సమయంలో విమానంలో 180 మంది ప్రయాణికులున్నట్లు ఎయిర్పోర్ట్ వర్గాలు చెప్పాయి.గ్రౌండ్ సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం..పుణె నుంచి దిల్లీకి బయలుదేరిన విమానం టగ్ట్రక్ ట్యాక్సీను ఢీకొట్టింది. విమానం ముందు భాగంతోపాటు ట్రక్ దిబ్బతింది. ఫ్లైట్ కిందిభాగం ట్రక్కు తగలడంతో ల్యాండింగ్ గేర్ వద్ద టైర్ పాడయ్యింది. ఘటన సమయంలో విమానంలో 180 మంది ప్రయాణికులు, సిబ్బంది ఉన్నారు. అయితే వారికి ఎలాంటి ప్రమాదం జరగలేదని ఎయిర్పోర్ట్ వర్గాలు చెప్పాయి. భూమిపై విమానాన్ని నడిపేందుకు టగ్ ట్రక్ టాక్సీని ఉపయోగిస్తారు.ఇదీ చదవండి: ఆకాశవీధిలో 41.8 కోట్లమంది.. ఇక్రా నివేదికఘటనకు గల కారణాలను తెలుసుకోవడానికి డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) విచారణ ప్రారంభించినట్లు సమాచారం. పూర్తి విచారణ తర్వాత వివరాలు వెల్లడిస్తామని విమానాశ్రయ అధికారి ఒకరు తెలిపారు. ప్రయాణికులను ప్రమాదం జరిగిన విమానంలో నుంచి దింపేసి వారి గమ్యస్థానాలు చేరేలా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినట్లు ఎయిర్పోర్ట్ వర్గాలు చెప్పాయి. -
విమానంలో ల్యాండింగ్‌గేర్ సమస్య.. గాల్లోనే మూడు గంటలు..
విమానంలో ల్యాండింగ్‌గేర్ సమస్య ఏర్పడి మూడు గంటలు గాల్లోనే ఉన్న ఘటన ఆస్ట్రేలియాలోని న్యూకాజిల్ ఎయిర్పోర్ట్ పరిధిలో చోటుచేసుకుంది. ముగ్గురు వ్యక్తులతో ప్రయాణిస్తున్న ఈ విమానం చివరకు సురక్షితంగా ల్యాండ్ అయింది.వివరాల్లోకి వెళితే..ట్విన్-టర్బోప్రోప్ బీచ్‌క్రాఫ్ట్ సూపర్ కింగ్ ఎయిర్ అనే తేలికపాటి విమానంలో ముగ్గురు వ్యక్తులు ప్రయాణానికి సిద్ధమయ్యారు. సిడ్నీకి 180 కిలోమీటర్ల దూరంలో ఉన్న పోర్ట్ మక్వేరీకి బయలుదేరారు. విమానం టేకాఫ్ అయిన కాసేపటికే(ఉదయం 9:30 సమయం) ల్యాండింగ్ గేర్ సమస్య ఏర్పడినట్లు పైలట్ గుర్తించారు. దాంతో వెంటనే వారు ప్రయాణం ప్రారంభించిన న్యూకాజిల్ ఎయిర్పోర్ట్ సిబ్బందికి, ఆస్ట్రేలియన్ బ్రాడ్‌కాస్టింగ్ కార్పొరేషన్‌కు సమాచారం అందించారు. వెంటనే అత్యవసర ల్యాండింగ్‌కు అనుమతించారు.విమానంలో ల్యాండింగ్‌గేర్ సమస్య తలెత్తింది కాబట్టి అందులోని ఫ్యుయెల్ అయిపోవాలి. లేదంటే భారీ ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. దాంతో దాదాపు మూడు గంటలపాటు గాల్లోనే చక్కర్లు కొట్టాల్సివచ్చింది. చివరకు ఎయిర్‌క్రాఫ్ట్ సురక్షితంగా ల్యాండ్ అయినట్లు పోలీసులు తెలిపారు. విమానం కిందకు చేరే సమయానికి అత్యవసర సేవల్లో భాగంగా అగ్నిమాపక యంత్రాలు, అంబులెన్స్‌ను ఎయిర్పోర్ట్ సిబ్బంది సిద్ధంగా ఉంచారు. విమానంలో కొన్ని సాంకేతిక సమస్యల వల్లే ఈ ఘటన చోటుచేసుకుందని ప్రాథమికంగా ధ్రువీకరించారు. ఈ ఎయిర్‌క్రాఫ్ట్ పోర్ట్ మాక్వారీకి చెందిన ఈస్టర్న్ ఎయిర్ సర్వీసెస్‌కు చెందింది. ఈ ఘటనకు సంబంధించి కంపెనీ ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని తెలిసింది. -
హీరోయిన్ సురభికి తప్పిన ప్రమాదం
హీరోయిన్ సురభికి తృటిలో పెను ప్రమాదం తప్పింది. ఆమె ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక లోపం ఏర్పడింది. ఫలితంగా గాల్లో ఉన్న విమానం కంట్రోల్ తప్పి కిందపడబోయింది. పైలెట్ చాకచక్యంగా వ్యవహరించడంతో ప్రమాదం తప్పి..ఫ్లైట్ సురక్షితంగా ల్యాండ్ అయింది. ఈ విషయాన్ని సురభి ఇన్‌స్టా వేదికగా తెలియజేస్తూ.. చావు నుంచి తప్పించుకున్నామని చెప్పుకొచ్చింది. ‘నేను విమానంలో ప్రయాణిస్తుండగా ఎప్పుడూ జరగని సంఘటన ఎదురైంది. చావు అంచుల వరకు వెళ్ళొచ్చాను. నేను ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక లోపం వల్ల ప్రమాదం జరిగే పరిస్థితి ఏర్పడింది. ఫ్లైట్ కంట్రోల్ లో లేకుండా పోయింది. నాతో పాటు ఫ్లైట్ లో ఉన్నవాళ్ళంతా చాలా భయపడ్డారు. కానీ పైలెట్ జాగ్రత్త వల్ల సురక్షితంగా ల్యాండ్ చేశారు.కానీ కొన్ని గంటల తర్వాత పైలెట్ సురక్షితంగా ఫ్లైట్ ల్యాండ్ చేశారు. ఆ ఘటనని ఊహించుకుంటేనే భయంగా ఉంది. చావు నుంచి తప్పించుకున్నాను. జస్ట్ మిస్. ఇలా జరగడంతో నాలో ఉన్న పాజిటివ్ థింకింగ్ మీద నాకు మరింత నమ్మకం పెరిగింది’ అని సురభి రాసుకొచ్చింది. బీరువా, ఎక్స్ ప్రెస్ రాజా, ఒక్క క్షణం లాంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులను దగ్గరైంది సురభి. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించినా సురభికి తగిన స్థాయిలో గుర్తింపు రాలేదు. దీంతో ఈ బ్యూటీ కోలీవుడ్‌కి షిఫ్ట్ అయింది. అక్కడ అడపాదడపా సినిమాలు చేస్తోంది. చిరంజీవి ‘విశ్వంభర’లో కీలక పాత్ర పోషిస్తోంది. -
ఊడిపడిన జపాన్ కు చెందిన యునైటెడ్ ఎయిర్‌లైన్స్ విమానం టైరు
-
చావు నుంచి తప్పించుకున్నా.. రష్మిక పోస్ట్ వైరల్..!
-
టోక్యో ఎయిర్ పోర్ట్ లో రెండు విమానాలు ఢీ
-
Video: ఓకే రన్‌వేపై ప్రమాదానికి గురైన రెండు విమానాలు
తూర్పు ఆఫ్రికాలోని టాంజానియా దేశంలో ఘోర ప్రమాదం తప్పింది. ఒకే రోజు, ఒకే ఎయిర్‌పోర్టులో రెండు విమానాలు ప్రమాదానికి గురయ్యాయి. కేవలం గంటల వ్యవధిలోనే ఒకే రన్‌వేపై అదుపుతప్పాయి. కికోబోగా ఎయిర్‌పోర్ట్‌లో మంగళవారం జరిగిన ఈ రెండు ఘటనల్లోనూ ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. వివరాలు..యునైటెడ్ ఎయిర్ జాంజిబార్ విమానం 30 మంది ప్రయాణికులు, ముగ్గురు సిబ్బందితో జాంజిబార్ నుంచి బయల్దేరింది. కికోబోగా విమానాశ్రయంలో దిగుతుండగా రన్‌వేను తాకగానే ల్యాండింగ్ గేర్ ఊడిపోయింది. దీంతో విమానం రన్‌వేపై నుంచి కొద్దిదూరం పక్కకు ఈడ్చుకుంటూ వెళ్లింది. ఈ ఘటనలో విమానానికి బాగా నష్టం వాటిల్లినప్పటికీ ప్రయాణికులు, సిబ్బంది అంతా క్షేమంగానే ఉన్నారని అధికారులు వెల్లడించారు. This is crazy 🤯 An Embraer E120 had problems with its landing gear when landing in Kikoboga in Tanzania and left the runway. another aircraft was sent to rescue passengers, but this one had problems taking off, hit a building and caught fire.pic.twitter.com/sTJmeEcRx5 — Flight Emergency (@FlightEmergency) November 29, 2023 కాగా ఉదయం జరిగిన ఈ ప్రమాదం నుంచి ఎయిర్‌పోర్టు సిబ్బంది తేరుకోకముందే మరో ప్రమాదం చోటు చేసుకుంది. కేవలం ఆరుగంటలకే కికోబోగా ఎయిర్పోర్ట్ నుంచి జాంజిబార్ వెళ్లేందుకు మరో విమానం సిద్ధమైంది. 30 మంది ప్రయాణికులు, ఇద్దరు సిబ్బందితో జాంబిజార్కు వెళ్లడానికి బయలు దేరింది. రన్‌వేపై స్పీడ్ అందుకున్నాక గాల్లోకి లేవాల్సిన విమానం అదుపుతప్పి రన్ వే చివర్లో ఉన్న ఓ బిల్డింగ్‌ను బలంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కూడా విమానం చాలా వరకూ దెబ్బతిన్నట్లు అక్కడి మీడియా నివేదించింది. ప్రమాదం తర్వాత ఘటనా స్థలి వద్ద భారీగా పొగలు వచ్చాయి. అయితే ఈ ప్రమాదంలో కూడా ఎలాంటి ప్రాణ నష్టం సంభవించకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. రెండు ప్రమాదాలకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. చదవండి: ఆలస్యం వద్దు.. నిషేధించండి: బైడెన్‌కు లేఖ 🇹🇿 Embraer E120 Brasília had problems with its landing gear in Kikoboga, Tanzania and left the runway. Another Brasília plane had problems taking off, hit a building and caught fire. pic.twitter.com/KauBBB3V5U — Ryan sikorski (@Ryansikorski10) November 30, 2023 -
టాప్ విరిగిన విమానం, భయంతో కేకలు: ఈ షాకింగ్ ఘటన ఎక్కడ?
విమాన ప్రయాణంలో పొరపాటున కిటికీ ఓపెన్ చేస్తేనే చాలా ప్రమాదం. అలాంటిది ఒక విమానం ముందు భాగం పై భాగంలో కొంత లేచి పోతే.. పరిస్థితి ఏంటి? మిరాకిల్ ఏంటంటే ఇది సేఫ్‌గా ల్యాండ్ అయింది. ఒక్కరు తప్ప అందరూ ప్రాణాలతో బయటపడ్డారు. ఏంటి నమ్మలేక పోతున్నారా? అసలు ఊహించడానికే కష్టంగా ఉందా? కానీ షాకింగ్ ఘటన నిజంగానే చోటు చేసుకుంది. ఏప్రిల్ 28, 1988, విమానయాన చరిత్రలో అత్యంత దిగ్భ్రాంతికరమైన రోజు. బోయింగ్ 737-297 విమానంలో ప్రయాణించిన ప్రయాణికులు, సిబ్బంది మాత్రమే, ఎవరు తలచుకున్నా వెన్నులో వణుకు పుట్టే ఘటన ఇది. అలోహా ఎయిర్‌లైన్స్ ఫ్లైట్ 243 89 మంది ప్రయాణికులు , ఆరుగురు సిబ్బందిని హవాయి బిగ్ ఐలాండ్‌లోని హిలో నుండి ఓహులోని హోనోలులు వరకు 300కిమీల హాప్లో తీసుకువెళుతోంది ఇంతలో ఫ్యూజ్లేజ్లోని పైభాగం మధ్యలోసగం భాగం ఎగిరిపోయింది. ట్విన్-ఇంజన్, 110-సీట్ బోయింగ్ జెట్ 40 నిమిషాల ఫ్లైట్‌లో సగం దూరంలో ఉండగా, అకస్మాత్తుగా క్యాబిన్ కంట్రోల్ పోయింది. ఫ్యూజ్‌లేజ్‌లో కొంత భాగం విరిగిపోయింది. అంతే ఒక్కసారిగా భయానక వాతావరణం ఏర్పింది. పసిఫిక్ మహాసముద్రం మీదుగా 24వేల అడుగుల ఎత్తులో విపరీతమైన గాలులకు ప్రయాణీకులు బెంబేలెత్తిపోయారు. భయంతో కేకలు వేశారు. ల్యాండ్ అయ్యే లోపే కూలిపోవడం ఖాయమని దాదాపు అందరూ వణికిపోయారు. భారీ సీలింగ్ ప్యానెల్లు ప్రయాణీకుల తలపై పడ్డాయి. అందరికీ దెబ్బలు, రక్త స్రావాలు. ఆక్సిజన్ మాస్క్‌లు పెట్టుకున్నా.. ఏం లాభం లేదు.. ఉరుములు, తుఫానులాంటి వాతావరణం. కానీ ఆశ్చర్యకరంగా ఈ విపత్కర పరిస్థితి సంభవించిన పదమూడు నిమిషాల తర్వాత మౌయిలోని కహులుయ్ విమానాశ్రయంలో ఈ విమానం సురక్షితంగా ల్యాండ్ అయింది. అంతగా డ్యామేజ్ అయిన విమానం సేఫ్‌గా ల్యాండ్ అవడం చూసి గ్రౌండ్ ఎమర్జెన్సీ సిబ్బంది కూడా తమను తాము నమ్మలేకపోయారు. Let’s take a moment to remember Aloha Airlines Flight 243. On April 28th 1988 the roof ripped off the Boeing 737 at 24,000 ft. The chief flight attendant (the only fatality) fell from the plane and debris struck the tail section. Amazingly the pilot still managed to land safely… pic.twitter.com/TAXzlW6KNo — Mothra P.I. (@Hardywolf359) November 17, 2022 ఇప్పటికీ దొరకని ఎయిర్‌హోస్టెస్ మృతదేహం విమానంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఈ సంఘటన నుండి బయటపడ్డారు. 95 మందిలో కేవలం ఒకరు మృతి చెందగా, ఎనిమిది మందికి తీవ్ర గాయాలయ్యాయి. విషాదం ఏమిటంటే ప్రయాణీకులకు సేవలందిస్తున్న ఫ్లైట్ అటెండెంట్ క్లారాబెల్లె లాన్సింగ్ ప్రాణం మాత్రం గాల్లోనే కలిసిపోయాయి. ఆమె మృతదేహం ఇప్పటికీ లభ్యం కాలేదు. ''అకస్మాత్తుగా, పెద్ద శబ్దం, చప్పుడు వినిపించింది, కానీ పేలుడు కాదు, ఒత్తిడిలో ఏదో మార్పు వచ్చినట్లు అనిపించింది. పైకి చూసాను , విమానం యొక్క ఎడమ ఎగువ భాగం విచ్ఛిన్నం కావడం, విరగడం, ముక్కలు దూరంగా ఎగిరిపోవడం చూశాను. ఇది ఒక గజం వెడల్పు గల రంధ్రంతో ప్రారంభమై, అలా విరుగుతూనే ఉంది’’ అని విమానం వెనుక కూర్చున్న ఒక ప్రయాణీకుడు ఎరిక్ బెక్లిన్ ది వాషింగ్టన్ పోస్ట్‌తో తన భయంకరమైన అనుభవాన్ని పంచుకున్నారు. ది మిరాకిల్ ల్యాండింగ్ ఆఫ్ అలోహా ఎయిర్‌లైన్స్ ఫ్లైట్ 243గా సినిమాగా కూడా తెరకెక్కింది ఈ స్టోరీ. నిజమైన హీరోలంటూ ప్రశంసలు పర్స్సర్ క్లారాబెల్లె లాన్సింగ్తోపాటు, జేన్ సటో-టోమిటా , మిచెల్ హోండా విమానంలో క్యాబిన్ సిబ్బందిగా ఉన్నారు. కెప్టెన్ రాబర్ట్ స్కోర్న్స్టెయినర్కు కాక్‌పిట్‌లో ఫస్ట్ ఆఫీసర్. కోపైలట్ మాడెలైన్ టాంప్కిన్స్ ఉన్నారు. ఈ ఘటనలో వీళ్లు నిజమైన హీరోలంటూ పలువురి ప్రశంసలు దక్కించుకున్నారు. ఇదిఇలా ఉంటే యూఎస్ నేషనల్ ట్రాన్స్‌పోర్టేషన్ సేఫ్టీ బోర్డ్ (NTSB) నివేదిక ప్రకారం, డికంప్రెషన్, స్ట్రక్చరల్ ఫెయిల్యూర్ వల్ల జరిగింది. విమానంలో ఎడమ ఇంజిన్ కూడా విఫలమైంది. ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ సమాచారం ప్రకారం బోర్డింగ్ సమయంలో విమానం ఫ్యూజ్‌లేజ్‌లో పగుళ్లను ఒకామె గమనించింది. అయితే ఆమె టేకాఫ్‌కి ముందు సిబ్బందికి చెప్పలేదు. -
ఆకాశ ఎయిర్‌కు బాంబు బెదిరింపు..185 మంది ప్రయాణికులు!
బ్యాగ్‌లో బాంబు ఉందని బెదిరించడంతో శనివారం ఆకాశ ఎయిర్ విమానాన్ని అత్యవసరంగా ముంబయికి మళ్లించారు. పుణె నుంచి దిల్లీకి బయలుదేరిన ఆకాశ ఎయిర్ విమానాన్ని ఓ ప్రయాణికుడు తన బ్యాగ్‌లో బాంబు ఉందని చెప్పడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. విమానం టేకాఫ్ అయిన 40 నిమిషాల తర్వాత సదరు ప్రయాణికుడు సిబ్బందితో బెదిరింపులకు పాల్పడ్డాడు. అప్పుడు విమానంలో 185 మంది ప్రయాణికులు ఉన్నారు. సిబ్బంది వెంటనే కెప్టెన్‌కు సమాచారం అందించారు. అత్యవసరంగా ముంబైలో విమానాన్ని ల్యాండ్ చేయాలని నిర్ణయించుకున్నారు. దాంతో ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ చేశారు. బాంబు డిటెక్షన్, డిస్పోజల్ స్క్వాడ్ ద్వారా ప్రయాణీకుల బ్యాగ్‌లు పరిశీలించారు. విమానాశ్రయంలో దిగాక జరిపిన తనిఖీల్లో ఎలాంటి పేలుడు పదార్థాలు కన్పించకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. బాంబు బెదిరింపు బూటకమని తేలడంతో, విమానం తిరిగి ఢిల్లీకి బయలుదేరింది. ఘటనకు మందు సదరు ప్రయాణికుడు ఛాతీ సమస్యకు మెడిసిన్ తీసుకున్నట్లు తన కుటుంబ సభ్యులు అన్నారని సీఐఎస్ఎఫ్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు. ప్రయాణికుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు చెప్పారు. -
గాల్లో ఉండగా పైలట్‌కు అస్వస్థత..ఆ టైంలో 65 ఏళ్ల మహిళ..
ప్రమాదాలు అనుకోకుండా వస్తాయి. అయినా ఎవ్వరూ ఊహించం కదా అనారోగ్యానికి గురవ్వుతామని. సరిగ్గా అలాంటి సమయంలో మన పక్కను ఉన్నవాళ్లు కాస్త తెలివిగా వ్యవహరిస్తే కొన్ని ప్రమాదాల నుంచి తేలిగ్గా బయటపడొచ్చు. అందుకు ఉదాహరణ ఆ బామ్మ. 2006లో జరిగిన ఓ ప్రమాద ఘటనలో ఆమె చేసిన సాహసం ఆమెను అందరిచే ప్రశంసలు అందుకునేలా చేసింది. వివరాల్లోకెళ్లే.. న్యూయార్క్‌లో వెస్ట్చెస్టర్ కౌంటీ నుంచి పైపర్ మెరిడియన్ మినీ విమానం వైన్యార్డ్కు బయలుదేరింది. ద్రాక్ష తోట సమీపంలోని రన్‌వేపై విమానం ల్యాండింగ్‌లో ఉండగా పైలట్(79) అస్వస్థతకు గురయ్యాడు. దీంతో విమానంలోని 65 ఏళ్ల మహిళా ప్రయాణికురాలు సత్వరమే స్పందించి..ఆ విమానాన్ని అదుపు చేసే యత్నం చేసింది. ఐతే ఆమె సురక్షితంగా విమానాన్ని ల్యాండ్ చేసే క్రమంలో విమానం ఓ వైపుకి రన్‌వే సమీపంలో కుప్పకూలింది. దీంతో విమానం ఎడమ రెక్క సగానికి విరిగిపోయింది. ఎమర్జెన్సీ రెస్క్యూ టీం వెంటనే అక్కడకు చేరుకుని పైలట్ తోపాటు, మహిళా ప్రయాణికుడిని ఆస్పత్రికి తరలించింది. ఐతే పైలట్ ఆరోగ్యం విషమంగా ఉనట్లు అధికారులు పేర్కొన్నారు. ఐతే సదరు మహిళ ప్రయాణికురాలు మాత్రం స్వల్ప గాయాలతో బయటపడినట్లు వెల్లడించారు. కానీ ఆ విపత్కర పరిస్థితుల్లో ఆ మహిళ ఏ మాత్రం గాబరాపడినా సమస్యల్లో చిక్కుపోయింది. ఆ సమయంలో సమయస్ఫూర్తిగి వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది. (చదవండి: ఇంట్లోనే బీర్ తయారీ..జస్ట్ క్షణాల్లో రెడీ చేసుకోవచ్చు ఎలాగంటే) -
లాండింగ్ సమయంలో కుప్పకూలిన విమానం..
సోమాలియా: హల్లా ఎయిర్ లైన్స్ కు చెందిన ఒక విమానం సోమాలియా మొగదిషు విమానాశ్రయంలో క్రాష్ లాండింగ్ అయ్యింది. సిబ్బంది సహా అందులో ప్రయాణిస్తున్న సుమారు 34 మంది సురక్షితంగా బయటపడ్డారు. అడెన్ అడె విమానాశ్రయంలో ఒక విమానం సాంకేతిక లోపం కారణంగా వేగంగా రన్ వే మీదకు దూసుకొచ్చి క్రాష్ లాండింగ్ అయ్యింది. విమాన తాకిడికి ప్రహారీ కంచె తునాతునకలైంది. ఇంతటి ప్రమాదం జరిగినా కూడా విమానంలో ప్రయాణిస్తున్న వారంతా ప్రాణాలతో బయటపడ్డారు. లేచిన వేళా విశేషం బాగుంది కాబట్టే బ్రతికి బట్టకట్టామని ప్రయాణికులు షాక్ నుండి బయటపడి ఆశ్చర్యంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయాన్ని స్థానిక విలేఖరి ఒకరు వీడియోతో సహా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. హల్లా ఎయిర్ లైన్స్ కు చెందిన E 120 తరహా విమానం అడెన్ అడె అంతర్జాతీయ విమానాశ్రయంలో 5వ నెంబర్ రన్ వే మీద క్రాష్ లాండింగ్ అయ్యింది. సోమాలియా సివిల్ ఏవియేషన్ అధారిటీ తెలిపిన వివరాల ప్రకారం విమానంలో 34 మంది పాసింజర్లు ఉండగా అందరూ సురక్షితంగా బయట పడ్డారని ఒక్కరికి మాత్రమే చిన్న చిన్న గాయాలయ్యాయని తెలిపారు. వీడియో చూశాక అందులోని వారికెవ్వరికీ ఏమీ కాలేదంటే ఆశ్చర్యం కలగక మానదు. Video of aircraft type E120, operated by HALLA AIRLINE, crash landing on Runway 05 at Aden Ade International Airport (AAIA) today, at 12:23pm local time. All 34 crew and passengers on board have survived according to the Somali Civil Aviation Authority . One person suffered… pic.twitter.com/tMrX7mcxsY — Harun Maruf (@HarunMaruf) July 11, 2023 ఇది కూడా చదవండి: నాటో సమావేశాలు: ఒంటరిగా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ -
రక్తం కారుతున్నా లెక్క చేయకుండా విమానాన్ని నడిపిన పైలెట్
ఈక్వెడార్: లాస్ రోస్ ప్రాంతంలో ఓ విమానం పైలెట్ కు వింత అనుభవం ఎదురైంది. విధి నిర్వహణలో విమానాన్ని నడుపుతున్న పైలెట్ కాక్ పిట్ లోకి ఒక పెద్ద పక్షి విండ్ షీల్డుని పగులగొట్టుకుని పొరపాటున లోపలి వచ్చింది. కాక్ పిట్ లో ఇరుక్కున్న ఆ పక్షి తన కాళ్లతో పొడుస్తున్నా, మొహమంతా రక్తం కారుతున్నా ఏమాత్రం లెక్కచేయని పైలెట్ అలాగే విమానాన్ని నడిపాడు. మొహమంతా రక్తం.. లాస్ రోస్ ప్రాంతంలో ఆకాశంలో సుమారు 10 వేల అడుగుల ఎత్తులో ప్రయాణిస్తున్న ఒక విమానం పైలెట్ క్యాబిన్లోకి భారీ పక్షి ఒకటి విండ్ షీల్డ్ ను బద్దలుగొట్టుకుని మరీ లోపలికి చొచ్చుకుని వచ్చింది. అద్దంలో ఇరుక్కుపోయిన ఆ పక్షి సగభాగం లోపల వేలాడుతూ ప్రాణాలు కాపాడుకోవటానికి విశ్వప్రయత్నాలు చేసి చివరికి రక్తమోడుతూ గాల్లోనే ప్రాణాలు విడిచింది. దీంతో పైలెట్ ఏరియల్ వాలియంట్ రక్తమోడుతున్న తన ముఖాన్ని, కాక్ పిట్ లోకి వచ్చిన ఆ భారీ పక్షిని వీడియో తీశారు. ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్నెట్లో వైరల్ గా మారింది. రాబందు జాతి పక్షి.. అంత ఎత్తులో ఎగిరే ఈ పక్షిని ఆండియాన్ కాండోర్ పక్షిగా గుర్తించారు. ఇది దక్షిణ అమెరికా కాథర్టిడ్ రాబందు జాతికి చెందినదని గుర్తించారు. దీని రెక్కలు సుమారుగా పది అడుగుల వెడల్పు ఉంటాయని ఇవి భూమికి 21 వేల అడుగుల ఎత్తులో ఎగురుతుంటాయని అక్కడి స్థానికులు చెబుతున్నారు. Pilot safely lands his plane after a huge bird struck his windshield in the Los Ríos Province, Ecuador. Ariel Valiente was not injured during the incident. pic.twitter.com/Rl3Esonmtp — Breaking Aviation News & Videos (@aviationbrk) June 15, 2023 ఇది కూడా చదవండి: ఆ నరమాంస భక్షకిని భద్రపరుస్తారట! -
నేపాల్‌లో రన్‌వేపై కూలిన విమానం..68 మంది మృత్యువాత
ఖాట్మాండు: నేపాల్‌లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. నేపాల్‌లోని పోఖారా విమానాశ్రయంలో రన్‌వేపై విమానం కులిపోయింది. కాగా, విమానంలో నలుగురు సిబ్బందితో సహా 72 మంది ఉన్నారు. విమానం ఖాట్మాండు నుంచి పోఖారా వెళ్తుండగా ల్యాండింగ్ సమయంలో ప్రమాదం చోటుచేసుకుంది. ఇక, ప్రమాదం నేపథ్యంలో విమానాశ్రయంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. విమానం కూలిపోవడంతో విమానాశ్రయాన్ని అధికారులు మూసివేశారు. నేపాల్ ఆర్మీ.. ఇప్పటి వరకు 68 మంది ప్రయాణికుల డెడ్‌బాడీలను బయటకు తీశారు. ఇందులో ఐదుగురు భారతీయులున్నట్లు గుర్తించారు. ఎయిర్‌పోర్టులో సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. అయితే, పొగమంచు కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్టు అధికారులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. A 72-seater passenger aircraft crashes on the runway at Pokhara International Airport in Nepal. Rescue operations are underway and the airport is closed for the time being. Details awaited. pic.twitter.com/Ozep01Fu4F — ANI (@ANI) January 15, 2023 #Watch: Aircraft with 68 passenger crashes on the runway at Pokhara International Airport in #Nepal. Rescue operations are underway and the airport is closed for the time being.#TYPNews pic.twitter.com/Fdpk2zqCKj — Jammu Kashmir News Network 🇮🇳 (@TheYouthPlus) January 15, 2023 -
ఇండిగో విమానంలో చెలరేగిన మంటలు.. వీడియో వైరల్..
సాక్షి,న్యూఢిల్లీ: ఇండిగో విమానం టేకాఫ్ సమయంలో మంటలు చెలరేగిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. విమానం ఢిల్లీ విమానాశ్రయం నుంచి బెంగళూరుకు బయెల్దేరినప్పుడు శుక్రవారం రాత్రి ఈ ఘటన జరిగింది. ఓ ప్రయాణికుడు ఇందుకు సంబంధించిన వీడియోను ట్విట్టర్లో షేర్ చేశాడు. ఇంజిన్ నుంచి మంటలు రావడం చూసి విమానంలోని వారంతా ఉలిక్కిపడ్డారు. దీంతో వెంటనే ఫ్లయిట్‌ను అత్యవసరంగా ఢిల్లీ విమానాశ్రయంలోనే ల్యాండ్ చేశారు. శుక్రవారం రాత్రి 9:45 గంటలకు ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. రన్‌వేపై మరో ఐదారు సెకన్లలో ఫ్లయిట్ టేకాఫ్ అవుతుందనగా ఒక్కసారిగా మంటలు చెలరేగినట్లు ఓ ప్రయాణికుడు తెలిపారు. ఘటన సమయంలో మొత్తం 184 మంది ప్రయాణికులు ఉన్నట్లు చెప్పారు. అయితే తాము 11 గంటల వరకు కిందకు దిగలేదని, విమానంలోని సిబ్బంది తమకు ధైర్యం చెప్పారని పేర్కొన్నారు. ఇండిగో సంస్థ అర్ధరాత్రి సమయంలో ఈ ప్రయాణికులందరినీ మరో విమానంలో బెంగళూరుకు తరలించినట్లు తెలుస్తోంది. #Delhi - #Bengaluru flight incident Passengers evacuated after fire in #IndigoFlightFire aircraft at IGI Airport’s runway; DGCA orders probehttps://t.co/64FdY0F98f pic.twitter.com/3liUcGtojt — Kiran Parashar (@KiranParashar21) October 29, 2022 ఇండిగో విమానాల్లో ఇప్పటికే పలుసార్లు సాంకేతిక సమస్యలు తలెత్తిన విషయం తెలిసిందే. ఇప్పుడు మరోసారి ఇంజిన్‌లో మంటలు చెలరేగడంపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ ప్రాణాలకు భద్రత లేకుండాపోయిందని విమర్శలు గుప్పిస్తున్నారు. మరోవైపు ఈ ఘటనపై ఏవియేషన్ రెగ్యులేషన్ విచారణకు ఆదేశించింది. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టింది. చదవండి: ఎలాన్ మస్క్‌కు షాక్.. ట్విట్టర్లో యాడ్స్ బంద్! -
మాస్కో విమానంలో బాంబు కలకలం... అప్రమత్తమైన అధికారులు
న్యూఢిల్లీ: మాస్కో విమానంలో బాంబు కలకలం సృష్టించింది. ఢిల్లీలోని అంతర్జాతీయ మిమానాశ్రయానికి గురువారం రాత్రి 11.15 నిమిషాలకు మాస్కో విమానంలో బాంబు ఉందంటూ ఈమెయిల్ హెచ్చరికి వచ్చిందని అధికారులు తెలిపారు. దీంతో అధికారులు భద్రతా ఏజెన్సీలను అప్రమత్తం చేశారు. అంతేగాదు విమానాశ్రయ భద్రతను కూడా పెంచారు. ఈ మేరకు విమానం ఎస్‌యూ 232 శుక్రవారం తెల్లవారుజామున 3.20 గం.లకు మాస్కో నుంచి ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకుంది. వెంటనే అప్రమత్తమైన అధికారులు ఆ విమానంలో ప్రయాణిస్తున్న దాదాపు 386 మంది ప్రయాణికులను సుమారు 16 మంది సిబ్బందిని తక్షణమే దించేశారు. విమానం మొత్తం తనీఖీ చేయడం ప్రారంభించారు అధికారులు. ఈ ఘటనపై పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేయడం ప్రారంభించారు. ఈ మధ్య ఇలాంటి ఘటనలు అధికంగా చోటు చేసుకుంటున్నాయి. అచ్చం అలానే గతనెల సెప్టెంబర్10న లండన్‌కి వెళ్లే ఎయిర్ ఇండియా విమానానికి కూడా బాంబు బెదిరింపు కాల్ వచ్చిన సంగతి తెలిసింది. (చదవండి: గాల్లోకి ఎగిరాక ఊడిపోయిన విమానం టైర్.. వీడియో వైరల్) -
నింగి నుంచి నీళ్లలోకి...!
దక్షిణ ఫ్రాన్స్‌లోని మోంట్‌పిల్లర్ ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండయ్యాక రన్‌వే దాటి దూసుకెళ్లి సరస్సులోకి దూసుకెళ్లింది ఓ సరకు రవాణా విమానం. ఈ ఘటనలో ప్రాణనష్టం జరగలేదు. ప్రమాద సమయంలో బోయింగ్ 737 కార్గో విమానంలో మొత్తం ముగ్గురు ఉన్నారు. విమానాన్ని తొలిగంచే వరకు ఎయిర్‌పోర్ట్‌ను మూసివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. సమీపంలోని సరస్సులోకి దూసుకెళ్లగా విమానంలోని ఒక ఇంజిన్ నీటిలో మునిగిపోయింది. శనివారం తెల్లవారుజామున పారిస్ ఛార్లెస్ డీ గౌల్లే ఎయిర్పోర్ట్ నుంచి మోంట్‌పిల్లర్ ఎయిర్‌పోర్ట్‌కు వచ్చిన క్రమంలో ప్రమాదం జరిగింది. దీనిపై దర్యాప్తు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. ⚠️ Accident du @BoeingFrance #737 immatriculé EC-NLS exploité par #WestAtlantic / sortie de piste pendant atterrissage survenue le 24/09/22 à l’aéroport de @mplaeroport / 4 enquêteurs @BEA_Aero sur place / ouverture d’une enquête de sécurité. pic.twitter.com/H76U3BbRxk — BEA ✈️ ⚙️🔬🇫🇷 (@BEA_Aero) September 24, 2022 ఇదీ చదవండి: 8 నిమిషాల్లోనే గుండె వైఫల్యం నిర్ధారణ -
Las Vegas: రన్ వేపై రెండు విమానాలు ఢీ.. నలుగురు మృతి
వాషింగ్టన్: అమెరికాలోని ఉత్తర లాస్ వేగస్ విమానాశ్రయంలో ఘోర ప్రమాదం జరిగింది. రన్‌వే పై రెండు చిన్న విమానాలు ఒకదానినొకటి ఢీకొన్నాయి. ఈ దుర్ఘటనలో విమానాల్లోని మొత్తం నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఘటన ఆదివారం మధ్యాహ్నం సమయంలో జరిగినట్లు ఫెడరల్ ఏవియేషన్ అధికారులు తెలిపారు. సింగిల్ ఇంజిన్ పైపర్ పీఏ-46, సింగిల్ ఇంజిన్ సెస్నా 172లు ఢీకొన్నాయని తెలిపారు. 'ప్రాథమిక సమాచారం ప్రకారం.. సింగిల్ ఇంజిన్ పైపర్ పీఏ-46 విమానాశ్రయంలో దిగేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలోనే రన్ వేపై సెస్నా 172ను ఢీకొట్టింది. దాంతో పైపర్ పీఏ 46 రన్ వే 30కి తూర్పు వైపు పడిపోయింది. సెస్నా సమీపంలోని నీటి కుంటలో పడింది.' అని ఎఫ్ఏఏ ఓ ప్రకటన విడుదల చేసింది. ఒక్కో విమానంలో ఇద్దరు ఉండగా.. మొత్తం మంది మరణించినట్లు సిటీ అగ్నిమాపక విభాగం తెలిపింది. ఇదీ చదవండి: America Indiana City: ఇండియానా షాపింగ్ మాల్లో కాల్పులు.. ముగ్గురి మృతి.. దుండగుడి హతం -
విమాన ప్రయాణం విషాదాంతం
ఖాట్మండు: నేపాల్‌లో తారా ఎయిర్ సంస్థకు చెందిన 43 ఏళ్లనాటి పాత విమానం ఆదివారం నేలకూలి మంటల్లో చిక్కుకుంది. శకలాలను గుర్తించారు. రెండు ఇంజన్లు గల ఈ చిన్నపాటి ప్యాసింజర్ విమానంలో నలుగురు భారతీయులతో సహా మొత్తం 22 మంది ప్రయాణిస్తున్నారు. సెంట్రల్ నేపాల్‌లో పర్యాటక నగరమైన పొఖారా నుంచి సరిగ్గా ఉదయం 10.15 గంటలకు బయలుదేరింది. పశ్చిమ నేపాల్‌లోని జోమ్సమ్ ఎయిర్‌పోర్టులో ఉదయం 10.15 గంటలకు ల్యాండ్ కావాల్సి ఉండగా, బయలుదేరిన 15 నిమిషాల తర్వాత కంట్రోల్ టవర్‌తో సంబంధాలు తెగిపోయినట్లు తారా ఎయిర్ అధికార ప్రతినిధి సుదర్శన్ బర్తౌలా చెప్పారు. ముస్తాంగ్ జిల్లాలోని కోవాంగ్ గ్రామం వద్ద మనపతీ హిమాల్ కొండచరియల కింద లామ్చే నది ఒడ్డున విమానం శకలాలను గుర్తించినట్లు అధికారులు తెలిపారు. గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్(జీపీఎస్) ద్వారా పైలట్ ప్రభాకర్ ఘిమిరే మొబైల్ సిగ్నల్స్ ట్రాక్ చేసి, విమానం జాడ కనిపెట్టినట్లు నేపాల్ పౌర విమానయాన శాఖ వెల్లడించింది. అయితే, ప్రయాణికులు, సిబ్బంది పరిస్థితి ఏమిటన్నది ఇంకా తెలియరాలేదు. ప్రయాణికుల్లో ముంబై సమీపంలోని థానేకు చెందిన ఆశోక్ కుమార్ త్రిపాఠి, ఆయన భార్య వైభవీ బండేకర్, వారి పిల్లలు ధనుష్ త్రిపాఠి, రితికా త్రిపాఠితోపాటు ఇద్దరు జర్మనీ పౌరులు, 13 మంది నేపాలీలు, ముగ్గురు నేపాల్ సిబ్బంది ఉన్నట్లు తారా ఎయిర్ అధికార ప్రతినిధి సుదర్శన్ బర్తౌలా వెల్లడించారు. విమాన ప్రమాదానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. నేపాల్‌లో 2016లో తారా ఎయిర్‌కు చెందిన విమానం ఇదే పొఖారా–జోమ్సమ్ మార్గంలో కూలిపోయింది. విమానంలోని 23 మంది దుర్మరణం పాలయ్యారు. A Tara Air flight carrying 19 passengers from Pokhara to Jomsom has been reported to have lost contact with the control tower. Aircraft: De Havilland Canada DHC-6-300 Twin Otter Reg: 9N-AET@flightradar24 @KanakManiDixit @HArjyal pic.twitter.com/2H1KI3u1Oy — NepalLinks (@NepaliPodcasts) May 29, 2022 The flight manifest. Source: Devendra Dhakal FB pic.twitter.com/9bTCfvNIBQ — Kanak Mani Dixit (@KanakManiDixit) May 29, 2022 -
అదృష్టం అవకాశం ఇస్తే.. మొహమాటంతో 45 ఏళ్లు ఒంటరిగా
తిరువనంతపురం: 1976లో జరిగిన విమాన ప్రమాదంలో మరణించినట్లు భావించిన ఓ వ్యక్తి.. 45 ఏళ్ల తర్వాత.. తిరిగి తన కుటుంబాన్ని కలుసుకున్నాడు. ప్రమాదం జరిగిన రోజు అతడు విమానంలో లేడు. అలా మృత్యువు నుంచి తప్పించుకున్న సదరు వ్యక్తి.. ఇంటికి వెళ్లడానికి.. బతికి ఉన్నానని చెప్పడానికి సిగ్గుపడి.. ఎక్కడెక్కడో తలదాచుకున్నాడు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న అతడిని రెండేళ్ల క్రితం పాత మిత్రుడు ఒకరు గుర్తించి స్వచ్ఛంద సంస్థకు చెందిన ఆశ్రమంలో చేర్చాడు. ఈ క్రమంలో రెండేళ్ల తర్వాత సదరు వ్యక్తి తన కుటుంబ సభ్యులను కలుసుకున్నాడు. అదృష్టం కొద్ది మృత్యువు నుంచి తప్పించుకున్నప్పటికి.. మోహమాటంతో దాదాపు 45 ఏళ్లుగా కుటుంబానికి దూరంగా.. ఒంటరిగా మిగిలిన ఆ వ్యక్తి వివరాలు.. కేరళ, కొట్టాయంకు చెందిన సాజిద్ థుంగల్ తన 22వ ఏట అనగా 1974లో జీవనోపాధి కోసం నలుగురు అక్కలు, ముగ్గురు సోదరులను, తల్లిదండ్రులను విడిచిపెట్టి గల్ఫ్ వెళ్లాడు. అక్కడ మలయాళ సినిమాలు ప్రదర్శిస్తూ.. భారత్ నుంచి సింగర్లు, డ్యాన్సర్లును పిలిపించి సాంస్కృతిక కార్యక్రమాలు ననిర్వహిస్తుండేవాడు. ఈ క్రమంలో 1976లో సాజిద్ 10 రోజుల పాటు భారత్ నుంచి వచ్చిన ప్రదర్శనకారుల బృందంతో కలిసి ఉన్నాడు. ఈ క్రమంలో ఇండియా నుంచి వచ్చిన బృందం, సిబ్బందితో కలిసి మొత్తం 95 మంది ప్రయాణీకులున్న విమానం అక్టోబర్ 12, 1976న ప్రమాదానికి గురైంది. ఇండియన్ ఎయిర్‌లైన్స్ 171 విమానం చెన్నైకి (అప్పటి మద్రాస్) ప్రయాణిస్తుండగా.. ఇంజన్లో మంటలు చేలరేగడంతో.. బొంబాయి విమానాశ్రయంలో అత్యవసర ల్యాండింగ్ చేయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు విమానం కూలిపోయిందని తెలిసింది. ఇదే ప్రమాదంలో ప్రముఖ మళయాళ నటి రాణి చంద్రా కూడా ప్రాణాలు కోల్పోయారు. సాజిద్ కూడా ఇదే ప్రమాదంలో మరణించినట్లు అతడి కుటుంబ సభ్యులు భావించారు. కాకపోతే ఆ రోజు అదృష్టం కొద్ది సాజిద్ ఆ విమానం ఎక్కలేదు. అలా మృత్యువు నుంచి తప్పించుకున్నాడు. బతికి ఉన్నప్పటికి సాజిద్.. తన కుటుంబ సభ్యులను కలిసే ప్రయత్నం చేయలేదు. ఎందుకంటే వారంతా తనను చనిపోయారని భావిస్తున్నారు.. ఇలాంటప్పుడు వారిని కలవాలంటే సాజిద్ సిగ్గు పడ్డాడు. దాంతో తన గురించి ఎవరికి చెప్పలేదు. ప్రమాదం జరిగిన ఆరేళ్ల తర్వాత ముంబై వెళ్లి చిన్న చిన్న వ్యాపారాలు చేస్తూ.. జీవనం సాగించాడు. 2019 లో అత్యంత దుర్బర స్థితిలో ఉన్న సాజిద్‌ను అతడి స్నేహితుడు గుర్తించాడు. అతను వెంటనే ముంబైలో పాస్టర్ కె.ఎమ్. ఫిలిప్ నడుపుతున్న ఆశ్రమానికి తీసుకువచ్చాడు. ‘‘విమానం ప్రమాదంలో బృందం మరణించిన తరువాత సాజిద్ ‘‘నిరాశ, అపరాధం, మద్యపానం, జ్ఞాపకశక్తి కోల్పోవడం వంటి’’ పలు సమస్యలతో బాధపడుతున్నాడు’’ అని తెలిపాడు సాజిద్ స్నేహితుడు. రెండేళ్లుగా ఆశ్రమంలో ఉంటున్నప్పటికి సాజిద్ తన కుటుంబం గురించి ఎవరికి ఏమీ చెప్పలేదు. కొన్ని వారాల క్రితం ఒక సీల్ సామాజిక కార్యకర్త కేరళను సందర్శించి, కొట్టాయంలోని ఒక స్థానిక మసీదులో సాజిద్ గురించి ఆరా తీయడంతో అతడి కుటుంబం గురించి తెలిసింది. మసీదు ఇమామ్ సాజిద్ కుటుంబానికి తెలుసు. అతడు సీల్ సామాజిక కార్యకర్తను సాజిద్ ఇంటికి తీసుకువెళ్ళాడు. 45 సంవత్సరాల తర్వాత సాజిద్ తన కుటుంబాన్ని మొదటిసారి చూడటానికి వీడియో కాల్ చేశారు. వారితో మాట్లాడిన తర్వాత ఇంటికి వెళ్లాలని నిర్ణియంచుకున్నాడు సాజిద్. "నేను ఇంటికి వెళ్ళాలి. ఇక్కడి ప్రజలు నన్ను చూసుకోకపోతే, నా కుటుంబంతో తిరిగి కలవకుండానే.. నేను చనిపోయేవాడిని” అన్నాడు సాజిద్.