
కరాచీ: పాకిస్తాన్‌లో విమానం కూలి 97 మంది మరణించిన ఘటనపై జరిగిన ప్రాథమిక విచారణలో అనేక విషయాలు వెలుగుచూస్తున్నాయి. విమానం మొదటిసారి ల్యాండింగ్ ప్రయత్నం చేయగా అది విఫలమైంది. ఆ విషయాన్ని పైలట్లు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్‌కు చెప్పలేదు. ల్యాండింగ్ ప్రయత్నంలో విఫలమైతే జరిగిన ప్రమాదం వల్ల ఇంజిన్లు, ఇతర విభాగాలు దెబ్బ తిని ఉండవచ్చని.. ఇలా జరిగితే వెంటనే ఎమర్జెన్సీ అలారం యాక్టివేట్ అవుతుందని నిపుణులు చెబుతున్నారు. కానీ, ఆ విమానంలో ఆ అలారం యాక్టివేట్ కాలేదు. ల్యాండిగ్ విఫలమైనపుడు 3,000 అడుగుల ఎత్తుకు తీసుకెళ్లాల్సిందిగా ట్రాఫిక్ కంట్రోలర్ చెప్పినా పైలట్లు 1,800 అడుగుల ఎత్తు వరకు మాత్రమే విమానాన్ని తీసుకెళ్లగలిగారు. విమానంలోని బ్లాక్ బాక్సును అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment