PIA plane
-
కరాచీ విమాన ప్రమాదంపై కొత్త అనుమానాలు
కరాచీ: పాకిస్తాన్లో విమానం కూలి 97 మంది మరణించిన ఘటనపై జరిగిన ప్రాథమిక విచారణలో అనేక విషయాలు వెలుగుచూస్తున్నాయి. విమానం మొదటిసారి ల్యాండింగ్ ప్రయత్నం చేయగా అది విఫలమైంది. ఆ విషయాన్ని పైలట్లు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్‌కు చెప్పలేదు. ల్యాండింగ్ ప్రయత్నంలో విఫలమైతే జరిగిన ప్రమాదం వల్ల ఇంజిన్లు, ఇతర విభాగాలు దెబ్బ తిని ఉండవచ్చని.. ఇలా జరిగితే వెంటనే ఎమర్జెన్సీ అలారం యాక్టివేట్ అవుతుందని నిపుణులు చెబుతున్నారు. కానీ, ఆ విమానంలో ఆ అలారం యాక్టివేట్ కాలేదు. ల్యాండిగ్ విఫలమైనపుడు 3,000 అడుగుల ఎత్తుకు తీసుకెళ్లాల్సిందిగా ట్రాఫిక్ కంట్రోలర్ చెప్పినా పైలట్లు 1,800 అడుగుల ఎత్తు వరకు మాత్రమే విమానాన్ని తీసుకెళ్లగలిగారు. విమానంలోని బ్లాక్ బాక్సును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. -
ఇద్దరు తప్ప అందరూ..
కరాచీ: పాకిస్తాన్లో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో 97 మంది మరణించగా ఇద్దరు ప్రాణాలతో బయటపడ్డారు. లాహోర్ నుంచి కరాచీ వెళుతున్న పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్ విమానం శుక్రవారం కరాచీ విమానాశ్రయం దగ్గర్లోని ప్రజానివాస ప్రాంతంలో కుప్పకూలింది. శనివారం ఉదయానికి ప్రమాదంలో మరణించిన, గాయపడిన వారి సంఖ్య బయటకు వచ్చింది. విమానంలో 91 మంది ప్రయాణికులు, 8 మంది సిబ్బంది ఉన్నారు. ప్రమాదంలో 97 మంది మరణించగా ఇద్దరు ప్రాణాలతో బయటపడ్డారు. ప్రస్తుతం వారికి చికిత్స అందిస్తున్నట్లు పాకిస్తాన్ ఆర్మీ తెలిపింది. ప్రమాద సమయంలో విమానంలో ఉన్న వారిలో 51 మంది పురుషులు, 31 మంది మహిళలు, 9 మంది పిల్లలు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. మృతదేహాలను పోస్ట్‌మార్టమ్ కోసం ఆస్పత్రులకు తరలించారు. 19 మృతదేహాలు ఎవరివనేది గుర్తించినట్లు తెలిపారు. విమానం కూలిన ప్రాంతంలో 25 ఇళ్లు ధ్వంసం కాగా, 11 మంది నివాసితులు గాయపడ్డారు. దీనిపై అంతర్జాతీయ స్థాయిలో విచారణ జరిపించాలని పాకిస్తాన్ ఎయిర్ లైన్స్ అసోíసియేషన్ డిమాండ్ చేసింది. దీనిపై పాక్ ప్రభుత్వం ఇప్పటికే నలుగురు సభ్యులతో కమిటీ వేసి విచారణకు ఆదేశించింది. సాంకేతిక సమస్యల వల్ల విమానం కూలి ఉండవచ్చని, దర్యాప్తులో వివరాలు తెలుస్తాయని అధికారులు తెలిపారు. -
ఆ విమానంలో లేను : నటి
ఇస్లామాబాద్ : కరాచీ సమీపంలో శుక్రవారం కుప్పకూలిన పీఐఏ విమానంలో తాను, తన భర్త మరణించినట్టు సాగిన ప్రచారాన్ని పాకిస్తాన్ నటి ఆయేజా ఖాన్ తోసిపుచ్చారు. విమాన ప్రమాదంలో తనతో పాటు తన భర్త డానిష్ తైమూర్ మరణించినట్టు అర్ధం లేని వదంతులను పుట్టిస్తున్నారని ఆమె మండిపడ్డారు. అసత్యాలను వ్యాప్తి చేయడం మానుకోవాలని ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ‘దయచేసి సవ్యంగా వ్యవహరించండి..ఇలాంటి ఫేక్ న్యూస్‌ను వ్యాప్తి చేయడం విరమించండ’ని ఆమె కోరారు. కాగా, లాహోర్ నుంచి 99 మంది ప్రయాణీకులతో బయలుదేరిన పీఐఏ విమానం కరాచీ విమానాశ్రయంలో ల్యాండ్ అయ్యే కొన్ని నిమిషాల ముందు కుప్పకూలింది. -
47మందితో ప్రయాణిస్తూ కూలిన విమానం!
-
47మందితో ప్రయాణిస్తూ కూలిన విమానం!
విమాన ప్రయాణమంటే రోజురోజుకు భయపడే పరిస్థితి కనిపిస్తోంది. తాజాగా పాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్‌కు చెందిన విమానం కూలిపోయింది. ఈ విమానంలో 47 మంది ప్రయాణిస్తున్నారు. ప్రభుత్వ ఎయిర్‌లైన్స్‌కు చెందిన పీకే-661 విమానం చిత్రాల్ నగరం నుంచి ఇస్తామాబాద్‌కు మధ్యాహ్నం 3 గంటలకు బయలుదేరింది. సాయంత్రం 4.30 గంటల సమయంలో అబోటాబాద్ సమీపంలో రాడర్‌తో విమానానికి సంబంధాలు తెగిపోయాయి. ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రావిన్స్‌లోని హవేలియన్ పట్టణ సమీపంలో ఈ విమానం కూలిపోయింది. విమానం కూలిపోయిన సమాచారం తెలియడంతో రక్షణ సిబ్బంది హుటాహుటిన సంఘటన స్థలానికి బయలుదేరారని అధికారులు తెలిపారు. ఈ విమాన ప్రమాదంలో మృతిచెందిన వారిలో ప్రముఖ గాయకుడు, వ్యాపారవేత్త జునైద్ జంషెద్ కూడా ఉన్నారని మీడియా తెలిపింది. విమానం కూలిన ప్రదేశంలో భారీగా మంటలు చెలరేగినట్టు స్థానికులు తెలిపారని పేర్కొంది.