
ఇస్లామాబాద్ : కరాచీ సమీపంలో శుక్రవారం కుప్పకూలిన పీఐఏ విమానంలో తాను, తన భర్త మరణించినట్టు సాగిన ప్రచారాన్ని పాకిస్తాన్ నటి ఆయేజా ఖాన్ తోసిపుచ్చారు. విమాన ప్రమాదంలో తనతో పాటు తన భర్త డానిష్ తైమూర్ మరణించినట్టు అర్ధం లేని వదంతులను పుట్టిస్తున్నారని ఆమె మండిపడ్డారు. అసత్యాలను వ్యాప్తి చేయడం మానుకోవాలని ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ‘దయచేసి సవ్యంగా వ్యవహరించండి..ఇలాంటి ఫేక్ న్యూస్‌ను వ్యాప్తి చేయడం విరమించండ’ని ఆమె కోరారు. కాగా, లాహోర్ నుంచి 99 మంది ప్రయాణీకులతో బయలుదేరిన పీఐఏ విమానం కరాచీ విమానాశ్రయంలో ల్యాండ్ అయ్యే కొన్ని నిమిషాల ముందు కుప్పకూలింది.
Comments
Please login to add a commentAdd a comment