pakistan actress
-
కన్నబిడ్డను కాటికి పంపించాలనుకున్నా: పాకిస్తాన్ నటి
కడుపులో బిడ్డను మోసే మహిళ.. తల్లినయ్యే క్షణాల కోసం ఎంతో ఎదురుచూస్తుంది. డెలివరీ అవగానే బిడ్డను ఎత్తుకుని మురిసిపోతుంది. అయితే కొందరు ఈ సమయంలో పోస్ట్‌పార్టమ్ డిప్రెషన్ (ప్రసూతి వైరాగ్యం) బారిన పడుతున్నారు. ప్రతికూల ఆలోచనలతో సతమతమవుతున్నారు. అందులో తానూ ఒకరిని అంటోంది పాకిస్తాన్ నటి సర్వత్ గిలానీ.ఆపరేషన్ అయిన నాలుగు రోజులక..సర్వత్ గిలానీ మాట్లాడుతూ.. 'డెలివరీ సమయంలో నాకు పెద్ద సర్జరీ చేశారు. నాలుగు రోజుల తర్వాతే నా బిడ్డను ఎత్తుకున్నాను. ప్రసూతి అనంతరం ఒత్తిడికి లోనయ్యాను. పాలివ్వడానికి నేను, తాగడానికి తాను కష్టపడుతోంది. ఈ బాధను భరించేబదులు తను పోయినా బాగుండేదనుకున్నాను. చిన్నారిని పైకి పంపించాలన్న ఆలోచనలు వస్తున్నాయని ఏడుస్తూ నా భర్త ఫహద్‌కు చెప్పాను.పోస్ట్‌పార్టమ్ డిప్రెషన్..అది విన్న అతడు ఇది ప్రసవానంతరం వచ్చే ఒత్తిడి మాత్రమే! ఈ పరిస్థితిలో ఏదైనా జరగొచ్చు. ముందు పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ అంటే ఏంటో తెలుసుకో.. అప్పుడు నీకంటూ ఓ అవగాహన వస్తుంది. దాన్నుంచి ఎలా బయటపడాలో తెలుస్తుందని ఓదార్చాడు' అని చెప్పుకొచ్చింది. కాగా సర్వత్ గిలానీ.. జవానీ ఫిర్ నహీ 1, 2 చిత్రాల్లో నటించింది. జాయ్‌లాండ్ సినిమాలో సపోర్టింగ్ రోల్లోనూ మెరిసింది. View this post on Instagram A post shared by Sarwat Gilani 🇵🇰 (@sarwatg) చదవండి: హిందీలో ‘మర్యాద రామన్న’ సిక్వెల్.. సోనాక్షి ప్లేస్‌లో మృణాల్! -
నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్
-
రెండుసార్లు దాడి.. కిడ్నాప్, అత్యాచారం.. భయంగా ఉంది: పాకిస్తాన్ నటి
తన దేశంలో తనకు రక్షణ లేకుండా పోయిందంటోంది పాకిస్తాన్ నటి ఆయేషా ఒమర్. తనతో పాటు ఆ దేశంలో ఉన్న మహిళలందరికీ స్వేచ్ఛా స్వాతంత్య్రాలే కరువైపోయాయంటోంది. తాజాగా ఆమె ఓ మీడియాతో మాట్లాడుతూ.. 'నాకు ఇక్కడ సేఫ్‌గా అనిపించడం లేదు. కాసేపు స్వచ్ఛమైన గాలి పీల్చుకోవడానికి బయటకు వెళ్లాలనిపిస్తుంది. సరదాగా సైకిల్ తొక్కాలనిపిస్తుంది. వాకింగ్ చేయాలనీ ఉంటుంది. కానీ ఏదీ చేయలేకపోతున్నాను. కరాచీ అంత సురక్షితమైన ప్రదేశం కాదనిపిస్తోంది. ఇక్కడ నాకు ఒత్తిడి, ఆందోళన ఎక్కువవుతోంది. బహుశా చాలామంది మహిళల పరిస్థితి ఇంచుమించు ఇలాగే ఉండొచ్చు. వాళ్లకు ఎన్నటికీ అర్థం కాదు పాకిస్తాన్ మహిళలు ఎంత ఇబ్బందిపడుతున్నారో మగవాళ్లు ఎంత ప్రయత్నించినా అస్సలు అర్థం చేసుకోలేరు. ఆడవాళ్ల భయాందోళనలు వారికి ఎన్నటికీ అర్థం కావు. ఇక్కడివాళ్లు ప్రతి క్షణం భయపడుతూ నరకం చస్తున్నారు. నాపై రెండుసార్లు దాడి జరిగింది. ఎప్పుడు, ఎవరు.. ఎటు నుంచి వచ్చి కిడ్నాప్ చేస్తారో, దాడి చేస్తారో, అత్యాచారం చేస్తారోనని చాలా భయంగా ఉంది. ప్రతి మనిషికి స్వేచ్ఛ, రక్షణ తప్పనిసరిగా అవసరం. కానీ ఆ రెండు ఇక్కడ దొరకట్లేదు. రక్షణ లేదు బయటకు వెళ్తే చాలు వేధిస్తున్నారు. ఇంట్లో ఉన్నా కూడా రక్షణ లభించట్లేదు' అని ఆవేదన వ్యక్తం చేసింది ఒమర్. కాగా ఈ నటి సోదరుడు పాకిస్తాన్‌ను వదిలేసి డెన్మార్క్‌కు వెళ్లిపోయి అక్కడే సెటిలయ్యాడు. ఇప్పుడు ఆమె తల్లి కూడా దేశాన్ని వదిలి ఎక్కడికైనా వెళ్లిపోవాలనుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. నటి మాత్రం తనకు పాకిస్తాన్ అంటే ఇష్టమని కానీ ఇక్కడ బతకనిచ్చేలా లేరని వాపోయింది. చదవండి: కొత్త కండీషన్లు పెడుతున్న రైతుబిడ్డ! -
కోట్ల ఆస్తులు.. టాయిలెట్స్ శుభ్రం చేసిన షారుక్ హీరోయిన్!
బాలీవుడ్లో చిన్న వయసులోనే హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన తారలు ఉన్నారు. వారిలో చాలామంది స్టార్ హీరోయిన్స్‌గా ఎదిగారు. బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ సరసన ఎంట్రీ ఇచ్చిన దీపికా పదుకొణె ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్గా రాణించింది. అయితే అలాగే పాకిస్థాన్‌కు చెందిన ప్రముఖ నటి సైతం షారుక్ సరసన ఎంట్రీ ఇచ్చింది. 2017లో వచ్చిన రయీస్ చిత్రంలో బాద్షాతో కలిసి రొమాన్స్ చేసింది. ఇటీవలే పెళ్లి చేసుకున్న భామకు ఓ పాప కూడా ఉంది. అయితే సినిమాల్లోకి రాకముందు ఆమె పరిస్థితి ఏంటి? బాలీవుడ్ ఎంట్రీ ఎలా ఇచ్చింది? అనే పలు ఆసక్తికర విషయాలు బయటకొచ్చాయి. ఇంతకీ ఆమెవరో తెలుసుకోవాలనుందా? అయితే ఈ స్టోరీ చదివేయండి. పాకిస్థానీ ప్రముఖ నటి మహిరా ఖాన్ బీ టౌన్లో పరిచయం అవసరం లేని పేరు. ఆమెకు పాకిస్థాన్‌లోనే కాకుండా భారత్‌లో కూడా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. మహిరా ఖాన్ 2006లో వీజేగా తన కెరీర్‌ను ప్రారంభించింది. ఆ తరువాత ప్రముఖ పాకిస్థానీ దర్శకుడు షోయబ్ మన్సూర్ దర్శకత్వం వహించిన బోల్ చిత్రంలో నటించింది. టీవీ షో హమ్‌సఫర్‌లో ఆమె పాత్రకు గుర్తింపును తీసుకొచ్చింది. ఆ తర్వాత 2017లో నటి రయీస్ చిత్రంలో షారుఖ్ ఖాన్ సరసన నటించింది. రాహుల్ ధోలాకియా తెరకెక్కించిన ఈ చిత్ ద్వారా అరంగేట్రం చేసింది. ఈ మూవీలో షారుక్, మహిరా కెమిస్ట్రీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆమె పాత్రకు ఆడియన్స్ నుంచి ప్రశంసలు అందుకుంది. ఈ మూవీ కమర్షియల్‌గా మంచి విజయం సాధించింది. బాక్సాఫీస్ వద్ద ప్రపంచవ్యాప్తంగా రూ.281.45 కోట్లు వసూలు చేసింది. అయితే మహీరా ఖాన్ తన చదువుల కోసం 17 సంవత్సరాల వయస్సులో యూఎస్‌లోని కాలిఫోర్నియాకు వెళ్లింది. అక్కడ తన వ్యక్తిగత ఖర్చుల కోసం మహిరా ఖాన్ టాయిలెట్లను శుభ్రం చేయడం, ఇళ్లు తుడవడం లాంటి పనులు చేసింది. ఆ తర్వాత నటి లాస్ ఏంజిల్స్‌లోని ఓ దుకాణంలో క్యాషియర్‌గా ఉద్యోగంలో చేరింది. ఈ విషయాన్ని 2021లో ఓ మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలోచెప్పింది. తన జీవితంలో ఎదురైన అనుభవాలను పంచుకుంది. మహిరా ఖాన్ మాట్లాడుతూ..'నా జీవితంలో అత్యంత కష్టమైన రోజులు కూడా చూశా. ప్రజల కోసం నా వ్యక్తిగత విషయాలను పంచుకుంటున్నా. నేను లాస్ఎంజిల్స్లో ఉన్న సమయంలో ఫ్లోర్లు, టాయిలెట్లను కూడా శుభ్రం చేశా. ఇప్పుడు మీరు నన్ను చాలా గౌరవిస్తారు. ఒక సమయంలో రెస్టారెంట్‌కు వెళ్లి నేను, నా సోదరుడు కలిసి ఒక భోజనాన్ని ఇద్దరం తినేవాళ్లం. నా జీవితంలో ఇలాంటి అనుభవాలను బయటికి చెప్పకుండా ఉండలేను." అని అన్నారు. కాగా.. ప్రస్తుతం మహీరా ఖాన్ పాకిస్తాన్లో అత్యంత ధనిక నటిగా నిలిచింది. పాకిస్తాన్లో కూడా అత్యధిక పారితోషికం తీసుకునే నటీమణులలో ఆమె ఒకరు. ప్రస్తుతం ఒక్కో చిత్రానికి రూ. 3 నుండి 5 లక్షల భారీ మొత్తంలో రెమ్యునరేషన్ తీసుకుంటోంది. ప్రస్తుతం ఆమె ఆస్తుల విలువ సుమారు రూ. 58 కోట్లు ఉన్నట్లు తెలుస్తోంది. కాగా.. జో బచాయ్ హైన్ సాంగ్ సమైత్ లో పేరుతో రాబోయే పాకిస్తాన్ మొదటి ఒరిజినల్ నెట్‌ఫ్లిక్స్ సిరీస్ కోసం మహిరా ఖాన్ ఫవాద్ ఖాన్‌తో జతకట్టనుంది. -
రెండో పెళ్లి చేసుకున్న హీరోయిన్, ఏడ్చేసిన వరుడు
పాకిస్తాన్ హీరోయిన్ మహీరా ఖాన్.. ఇండియాలో ఒకే ఒక్క సినిమాలో నటించింది. రేయిస్ మూవీలో షారుక్ ఖాన్‌తో జోడీ కట్టిన ఈ బ్యూటీ తర్వాత మరే భారతీయ చిత్రంలోనూ నటించలేదు. కానీ ఈ సినిమాతో బోలెడంత పాపులారిటీ తెచ్చుకున్న ఈ హీరోయిన్ తాజాగా వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టింది. వ్యాపారవేత్త సలీమ్ కరీమ్‌ను రెండో పెళ్లి చేసుకుంది. మహీరా మేనేజర్ అనుషయ్ తల్హా ఖాన్ ఈ పెళ్లి వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయగా అది ప్రస్తుతం వైరల్‌గా మారింది. మహీరా తనవైపు నడుచుకుంటూ వస్తుండటంతో వరుడు ఎమోషనల్ అయ్యాడు. తనను దగ్గరకు తీసుకుని కంటతడి పెట్టుకున్నాడు. ఆమెకు ప్రేమగా ముద్దుపెట్టి తనను హత్తుకుని ఆనందభాష్పాలు రాల్చాడు. ఇక పెళ్లికూతురి గెటప్‌లో మహీరా మెరిసిపోయింది. పేస్టల్ లెహంగా ధరించిన వధువు దానికి మ్యాచింగ్‌గా వజ్రాభరణాలు ధరించింది. సలీమ్ బ్లాక్ షేర్వాణీ వేసుకోగా తలకు నీలిరంగు తలపాగా చుట్టుకున్నాడు. పాకిస్తాన్‌లోని ముర్రేలో వీరి వివాహం ఘనంగా జరిగింది. ఈ కొత్త జంటకు అభిమానులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కాగా మహీరా, సలీమ్ కొన్నేళ్లుగా డేటింగ్ చేస్తున్నారు. ఈ విషయాన్ని గతేడాదే ఆమె అధికారికంగా వెల్లడించింది. ఇంత కాలానికి తమ ప్రేమను ముందుకు తీసుకువెళ్లి పెళ్లితో ఒక్కటయ్యారు. If he does not tear up looking at you as a bride, is it even worth it?🥹♥️#MahiraKhan #SalimKarim pic.twitter.com/MXgQEEmyL8 — Sania Yasin (@SaniaYasin4) October 2, 2023 AWWW MY HEART 🥹🤍#Mahirakhan pic.twitter.com/jEQv3gC96I — sadia (@sadiajeelani) October 1, 2023 చదవండి: ప్రతివారం ఆ పని చేయకపోతే మనసు ఊరుకోదంటున్న చంద్రముఖి 2 నటి -
హీరోతో కలిసి సిగరెట్ తాగిన పిక్స్.. డిప్రెషన్లోకి వెళ్లిపోయా: హీరోయిన్
ఆ ఫోటోలు బయటకు వచ్చినప్పుడు తలెత్తుకు తిరగలేకపోయాను. ఎవరికీ సమాధానం చెప్పుకోలేకపోయాను. డిప్రెషన్‌కు లోనయ్యాను అంటోంది పాకిస్తాన్ హీరోయిన్ మహీరా ఖాన్. తాజాగా ఆమె మానసిక ఆందోళన, డిప్రెషన్‌తో బాధపడిన క్షణాల గురించి చెప్పుకొచ్చింది. 2017లో రాయిస్ సినిమాతో బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చింది మహీరా. అదే సమయంలో రణ్‌బీర్ కపూర్‌తో కలిసి సిగరెట్ తాగుతున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో ఎంతోమంది ఆమెను ఆన్లైన్లో దారుణంగా తిట్టిపోశారు. నాపై దాడి చేసినట్లు.. అప్పటి పరిస్థితులను మహీరా గుర్తు చేసుకుంటూ.. 'నాపై వచ్చిన విమర్శలు చూసి నేను ఎంతో కలత చెందాను. తీవ్రమైన ఒత్తిడితో డిప్రెషన్లోకి వెళ్లిపోయాను. టీవీ ఛానల్స్, ట్వీట్స్, కామెంట్స్.. ఇలా ఎక్కడ చూసినా అందరూ తిడుతూనే ఉన్నారు. అది నేను భరించలేకపోయాను. పిచ్చిదాన్నయ్యాను. ఒకరోజైతే ఆందోళనతో ఒళ్లంతా చెమటలు పట్టాయి. అందరూ కలిసి నాపై దాడి చేసినట్లు అనిపించింది. చికిత్స చేయించుకునేందుకు ప్రయత్నించాను. కానీ అది వర్కవుట్ కాలేదు. చాలామంది డాక్టర్లను కలిశాను. ఎన్నో ప్రయత్నాలు చేశాను. నిద్రలేని రాత్రులు గడిపాను. చేతులు కూడా వణికిపోయేవి' అని చెప్పుకొచ్చింది. రాయిస్ సినిమా పూర్తయ్యాక ఉగ్రదాడి 2016లో జరిగిన ఉరి ఉగ్రదాడుల ఫలితంగా పాకిస్తాన్ నటులు ఇకమీదట బాలీవుడ్లో నటించడానికి వీల్లేదన్న షరతు అమల్లోకి వచ్చింది. దీని గురించి ఆమె మాట్లాడుతూ.. 'అప్పటికే నేను రాయిస్ సినిమా పూర్తి చేశాను. అంతా బాగానే ఉందనుకున్న సమయంలో ఉరి ఉగ్రదాడి జరిగింది. నాకు బెదిరింపులు వచ్చాయి. చంపేస్తామని ఫోన్ కాల్స్ కూడా చేశారు. అప్పుడే రాయిస్ సినిమా ప్రమోషన్‌కు నేను వెళ్లలేనని అర్థమైంది. కానీ ఆ మూవీ పాక్‌లో కూడా రిలీజైతే బాగుండనుకున్నాను. ఎందుకంటే షారుక్ ఖాన్‌ను ప్రేమించేవారు ఇక్కడ కూడా ఉన్నారు' అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం మహీరా.. ఫర్హాత్ ఇష్తియాఖ్ అనే వెబ్ సిరీస్‌లో నటిస్తోంది. ఇది నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం కానుంది. చదవండి: హీరోయిన్ రిఫర్ చేసింది.. కానీ డైరెక్టర్ ఆ ఆమాట అని రిజెక్ట్ చేశాడు.. అర్జున్ కల్యాణ్ -
చంద్రయాన్ విజయంపై సంచలన వ్యాఖ్యలు చేసిన పాకిస్తాన్ హీరోయిన్
చందమామపై మన విక్రమ్ కాలుమోపుతున్నప్పటి ఆ కొన్ని నిమిషాలు సస్పెన్స్ సినిమా క్లైమాక్స్‌ని తలదన్నేలా ఉత్కంఠ రేపాయి. ఒక హీరో సినిమాలో అదిరిపోయే యాక్షన్ సీన్స్ చేస్తుంటే విజిల్స్ వేయడం సహజం.. అలా బుధవారం సాయంత్రం కొన్ని కోట్ల మంది భారతీయులు కూడా విజిల్స్ వేశారు. అంతేకాకుండా వారందరూ ఎంతో భావోద్వేగానికి గురయ్యారు. మన ఇస్రోని, శాస్త్రవేత్తల బృందం ఘనతని కొనియాడుతూ వారి ఆనందాన్ని మన సినీ తారలతో పాటు ప్రపంచం మొత్తం సోషల్‌మీడియా ద్వారా పంచుకున్నారు. ఇందులో భాగంగా పాకిస్తాన్‌కు చెందిన నటి హర్ షిన్వారీ చంద్రయాన్ -3 విజయం సాధించడంతో ఇస్రో శాస్త్రవేత్తలను అభినందిస్తూ భారత్‌కు శుభాకాంక్షలు తెలిపింది. అంతేకాకుండా తన సొంత దేశం అయిన పాకిస్థాన్ పై తీవ్రమైన విమర్శలు చేసింది. భారత్‌తో శత్రుత్వాన్ని పక్కనపెడితే ఎవరైనా ఇస్రోను అభినందించాల్సిందేనని ఆమె తెలిపింది. (ఇదీ చదవండి: చంద్రయాన్-3 విజయంతో మళ్లీ తెరపైకి వచ్చిన ఆదిపురుష్) పాకిస్తాన్, భారత్ మధ్య అన్ని కోణాల్లో అంతరం పెరిగింది. భారత్‌ను తాము అందుకోవాలంటే సుమారు 2,3 దశాబ్దాలు పట్టవచ్చని ఆమె అభిప్రాయ పడింది. ప్రస్తుతం ప్రపంచదేశాల్లో భారత్ ఎంత ఎత్తుకు ఎదిగిందో చూసి పాకిస్తాన్ తలదించుకోవాల్సి వస్తుందని పేర్కొంది. దురదృష్టవశాత్తు తమకు ఇలాంటి దుస్థితి రావడానికి కారణం పాకిస్తాన్ ప్రజలే అని తన ఎక్స్ (ట్విటర్)లో తెలిపింది. దీంతో పలువురు పాకిస్థానీయులు కూడా ఆమెకు మద్ధతుగా కామెంట్లు చేస్తున్నారు. Apart from animosity with India, I would really congratulate ISRO for making history in the space research through Chandaryan3. The gap between Pakistan and India has widened to such a level in all aspects that now it will take two to three decades for Pakistan to reach there.… — Sehar Shinwari (@SeharShinwari) August 23, 2023 -
షారుక్ ఖాన్‌కు యాక్టింగే రాదు, అసలు అందగాడే కాదు: నటి
ఇండస్ట్రీలో ఉన్న అందరు హీరోలకు అభిమానులు ఉంటారు. స్టార్ హీరో అంటే ఆ అభిమాన గణం కాస్త ఎక్కువే ఉంటుంది. ఇందులో సాధారణ అభిమానులే కాదు వీరాభిమానులు కూడా ఉంటారు. కొందరు స్టార్స్కైతే దేశమంతా అభిమానులుంటారు. వారిలో షారుక్ ఖాన్ ముందు వరుసలో ఉంటాడు. నాలుగేళ్ల తర్వాత పఠాన్ సినిమాతో అభిమానులను పలకరించిన షారుక్ తన హవా ఏమాత్రం తగ్గలేదని నిరూపించాడు. అభిమానులను అన్నేళ్లు వెయిట్ చేయించిన ఫలితంగా ఇప్పుడు వరుసపెట్టి సినిమాలు చేస్తున్నాడు. జవాన్, డుంకీ, టైగర్ 3 అంటూ సినిమాల అప్డేట్లు ఇస్తూ పోతున్నాడు. తాజాగా ఈ స్టార్ హీరోకు నటన రాదంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది నటి మనూర్ బలోచ్. పాకిస్తాన్‌కు చెందిన నటి మనూర్ మాట్లాడుతూ.. 'షారుక్ ఖాన్ మంచి మనిషి. కానీ అతడు అంత అందగాడేమీ కాదు. అసలు ఆ జాబితాలోకే రాడు. తన వ్యక్తిత్తం, ఆత్మస్థైర్యం అతడికి అందాన్ని తెచ్చిపెడుతున్నాయి. కొందరు అందంగా ఉన్నా సరే ముఖంలో ఆ కళ ఉండదు. అలాంటివారిని జనాలు అంతగా పట్టించుకోరు. ఇకపోతే షారుక్ ఖాన్‌కు నటన రాదని నా అభిప్రాయం. అతడొక గొప్ప బిజినెస్మెన్. మార్కెట్ ఎలా క్రియేట్ చేసుకోవాలనేదానిపై అతడికి పూర్తి పట్టు ఉంది. తనకు చాలా మంది అభిమానులు ఉన్నారు. ఈ విషయంలో వాళ్లంతా కూడా నన్ను తప్పు పట్టవచ్చు. కానీ నావరకు మాత్రం అతడికి నటన తెలియదనే అనిపిస్తుంది. తనకంటూ ప్రత్యేకంగా మార్కెట్ సృష్టించుకోవడం షారుక్‌కు బాగా తెలుసు. చాలామంది నటులకు అది రాదు. ఫలితంగా వాళ్లు ఇండస్ట్రీలో విజయాలను అలాగే కొనసాగించలేరు. షారుక్ రొమాంటిక్ పాత్రలకు సూట్ అవడు. సైకో పాత్రలకే సరిగ్గా సరిపోతాడు' అని చెప్పుకొచ్చింది. బరూచా వ్యాఖ్యలపై షారుక్ ఫ్యాన్స్ భగ్గుమంటున్నారు. 'లెజెండ్‌ను పట్టుకుని ఇష్టమొచ్చినట్లు వాగుతోంది', 'షారుక్‌ను అడ్డుపెట్టుకుని పాపులారిటీ తెచ్చుకోవాలని చూస్తోంది', 'నీలా అతడు పక్కవాళ్ల గురించి ఏది పడితే అది వాగడు.. ఈ లెక్కన షారుక్ నీకంటే గొప్ప వ్యక్తే కదా' అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. చదవండి: మెహబూబ్ ఇంట పెళ్లి వేడుకలు, ఫోటోలు వైరల్ స్టార్ హీరోపై ఆరోపణలు.. రూ.10 కోట్ల పరువు నష్టం కేసు దాఖలు -
పాకిస్థాన్‌లో అత్యంత ధనవంతురాలైన హిందూ మహిళ.. సంపాదన తెలిస్తే..?
Pakistani Film Actress Sangeeta: పాకిస్థాన్‌లో ముస్లిం జనాభా చాలా ఎక్కువ ఉంటుందని అందరికి తెలుసు. అయితే అక్కడ అతి తక్కువ సంఖ్యలో హిందువులు కూడా నివసిస్తున్నట్లు గతంలో చాలా సందర్భాల్లో తెలిసింది. 1947లో విభజన జరిగినప్పటి నుంచి కొందరు అక్కడే ఉండిపోయారు. అలాంటి వారిలో 'సంగీత' ఒకరు. ఈమె ప్రస్తుతం పాకిస్థాన్‌లో ఉన్న అత్యంత ధనిక హిందూ మహిళ కావడం విశేషం. ఇంతకీ సంగీత ఎవరు? ఆమె సంపాదన ఎంత? అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. పాకిస్థాన్ ఆర్థిక సంక్షోభంలో మునిగిపోయిన వేళ అత్యంత సంపన్నుల జాబితాలో హిందువులు కూడా ఉండటం గమనార్హం. ఇందులో అత్యంత ధనిక హిందువు 'దీపక్ పెర్వానీ' అనే ఫ్యాషన్ డిజైనర్ కాగా, ధనిక హిందూ మహిళగా 'సంగీత' రికార్డ్ సృష్టించింది. వీరిద్దరూ కూడా సినీ రంగానికి చెందినవారు కావడం మరో గొప్ప విషయం. సంగీత పాకిస్థాన్‌లో ప్రముఖ నటి. ఈమెను 'పర్వీన్ రిజ్వీ' (Parveen Rizvi) అని కూడా పిలుస్తారు. అయితే తన పేరు అక్కడ మతానికి వ్యతి రేఖంగా ఉండటం వల్లే పర్వీన్ రిజ్వీగా పేరు మార్చుకుంది. విభజనకు ముందు ఇండియాలో జన్మించిన సంగీత హిందూ మహిళగానే పాకిస్థాన్‌లో జీవనం సాగిస్తోంది. కాగా ఇప్పుడు పాకిస్థాన్‌లో అత్యంత ధనిక మహిళగా రికార్డ్ సృష్టించింది. (ఇదీ చదవండి: బిర్యాని అమ్ముతూ రూ. 10 కోట్లు టర్నోవర్.. బెంగళూరు యువతి సక్సెస్ స్టోరీ!) పర్వీన్ రిజ్వీ కేవలం నటి మాత్రమే కాదు, చిత్ర దర్శకురాలు కూడా. ఈమె కోహ్-ఎ-నూర్ అనే సినిమాతో సినీ రంగంలో అరంగేట్రం చేసినప్పటికీ.. తన 21 ఏట నుంచి ఈ రంగంలో మరింత దృఢంగా నిలదొక్కుకోగలిగింది. నికాహ్, ముత్తి భర్ చావల్, యే అమన్, నామ్ మేరా బద్నామ్ వంటి అనేక విజయవంతమైన సినిమాల్లో నటించి అతి తక్కువ కాలంలోనే ఒక పాపులర్ నటిగా గుర్తింపు పొందగలిగింది. (ఇదీ చదవండి: మెట్లెక్కిన మహీంద్రా స్కార్పియో ఎన్.. వైరల్ అవుతున్న వీడియో & ఫిదా అవుతున్న జనం) సంగీత కేవలం పాకిస్థాన్‌లోని హిందూ మహిళగా మాత్రమే కాకుండా.. భారతదేశంలో కూడా బలమైన సంబంధాలను కలిగి ఉంది. ఈమె దివంగత భారతీయ నటి 'జియా ఖాన్'కు అత్త. సంగీత సంవత్సరానికి ఎంత సంపాదిస్తుంది అనే విషయం ఖచ్చితంగా అందుబాటులో లేదు, కానీ ఈమె ఏడాదికి సుమారు రూ. 39 కోట్లు సంపాదిస్తున్నట్లు సమాచారం. ఆమె సంపాదన అంతకంటే ఎక్కువ వుండే అవకాశం ఉంటుందని మరికొందరు భావిస్తున్నారు. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి సాక్షి బిజినెస్ చూస్తూ ఉండండి. -
వైరల్ వీడియో: నాటు నాటు పాటకు దుమ్ముదులిపిన పాక్ నటి
-
నాటు నాటు పాటకు దుమ్ముదులిపిన పాక్ నటి, వీడియో వైరల్
పాన్ ఇండియా మూవీ 'ఆర్ఆర్ఆర్'తోపాటు అందులోని పాటలు కూడా అభిమానులను ఓ ఊపు ఊపాయి. నాటు నాటు పాటకైతే గోల్డెన్ గ్లోబ్ అవార్డు కూడా వచ్చిపడింది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఆస్కార్‌కు నామినేట్ అయింది. ఈ పాటకు స్టెప్పులేయడం కొంత కష్టమైనా సరే అందరూ దీనికి రీల్స్ చేస్తూ ఆ మధ్య తెగ హడావుడి చేశారు. తాజాగా ఈ పాటకు పాకిస్తాన్ ప్రముఖ నటి హనియా ఆమిర్ డ్యాన్స్ చేసింది. ఓ పెళ్లి ఫంక్షన్లో నాటునాటు హిందీ వర్షన్ నాచో నాచో సాంగ్‌కు ఓ రేంజ్లో స్టెప్పులేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన నెటిజన్లు భలే ఎనర్జీతో స్టెప్పులేసిందని కామెంట్లు చేస్తున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమా విషయానికి వస్తే జూనియర్ ఎన్టీఆర్, రామ్‌చరణ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి రాజమౌళి దర్శకత్వం వహించాడు. ప్రపంచవ్యాప్తంగా రూ.1200 కోట్లకు పైగా రాబట్టిన ఈ సినిమాకు హాలీవుడ్ ప్రముఖుల నుంచి సైతం ప్రశంసలు లభించాయి. కాగా ఈ సినిమా అమెరికాలో మార్చి 3న 200 థియేటర్లలో రీరిలీజ్ అవుతోంది. చదవండి: సినిమా అంటే నానికి ఎంత ప్రేమో.. ట్వీట్ వైరల్ -
అందం ఒక్కటే సరిపోదు.. తెలివి కూడా ఏడిస్తే బాగుండు!
పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ ప్రస్తుతం ఓటీటీ యాంకర్‌గా మారిపోయాడు. 'షోయబ్ అక్తర్ షో' పేరిట ఓటీటీ ఫ్లాట్‌ఫామ్.. ఉర్ఫూప్లిక్స్(UrfuFlix)లో కొత్త ప్రోగ్రామ్‌ను ప్రారంభించిన అక్తర్ తానే స్వయంగా హోస్ట్ చేస్తున్నాడు. తాజాగా తన షోకు నిదా యాసిర్ అనే మహిళా సెలబ్రిటీని అతిథిగా ఆహ్వానించాడు. నిదా యాసిర్‌ను టీజ్ చేద్దామని భావించిన అక్తర్ ఒక సింపుల్ ప్రశ్నను అడిగాడు. అయితే అతిథిని కన్ఫూజ్ చేసేందుకు కొంచెం తికమకగా అడిగాడు. '1992 వరల్డ్‌కప్‌ను పాకిస్తాన్ ఏ సంవత్సరంలో గెలిచింది' అంటూ అడిగాడు. నిజానికి ప్రశ్నలోనే జవాబు ఉంది. ఆ విషయాన్ని పసిగట్టని నిదా యాసిర్ కన్ఫూజన్‌కు గురైంది. తనతో పాటు వచ్చిన రెండో గెస్ట్‌ను సహాయం కూడా కోరింది. అయితే చివరకు '2006' అంటూ తప్పుడు సమాధానం చెప్పింది. నిదా యాసిర్ సమాధానం విన్న అక్తర్ తనలో తానే నవ్వుకుంటూ ఈసారి ప్రశ్నను మరో రూపంలో అడిగాడు. '2009 టి20 వరల్డ్‌కప్‌ను పాకిస్తాన్ ఏ సంవత్సరంలో గెలుచుకుంది' అంటూ ప్రశ్న వేశాడు. ఈసారి ప్రశ్న మారిందన్న కనీస అవగాహన లేకుండా '1992' అంటూ నిదా యాసిర్ టక్కున చెప్పేసింది. దీంతో అక్తర్‌తో పాటు షో చూడడానికి వచ్చిన ప్రేక్షకులు కూడా నిదా యాసిర్ తెలివికి నవ్వాలో.. ఏడ్వాలో అర్థం కాలేదు.దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సోషల్ మీడియాలో మాత్రం ఈ అమ్మడు ట్రోల్స్ బారిన పడిపోయింది. ''ప్రశ్నలోనే జవాబున్నా కనుక్కోలేకపోయావు.. నీ తెలివికి జోహార్లు''.. ''అందం ఒక్కటే ఉంటే సరిపోదు.. కాస్త తెలివి కూడా ఏడిస్తే బాగుండు'' అంటూ కామెంట్స్ చేశారు. కాగా ఇదే ఫ్లాట్‌ఫామ్‌లో క్రికెటర్ షోయబ్ మాలిక్, సానియా మీర్జాలు కలిసి సంయుక్తంగా నిర్వహిస్తున్న మాలిక్ మీర్జా షోకు పోటీగా అక్తర్ తన షోను నిర్వహిస్తున్నాడు. pic.twitter.com/OXdAQTFDsH — Out Of Context Cricket (@GemsOfCricket) February 15, 2023 చదవండి: టెస్టుల్లోనూ నెంబర్‌వన్.. కెప్టెన్‌గా రోహిత్ శర్మ కొత్త చరిత్ర -
టీమిండియాను జింబాబ్వే ఓడిస్తే అతన్ని పెళ్లి చేసుకుంటా: పాకిస్తాన్ నటి
ICC Mens T20 World Cup 2022 - India vs Zimbabwe: పాకిస్తాన్ నటి సెహర్ షిన్వారీ భారత్- జింబాబ్వే మ్యాచ్ నేపథ్యంలో సంచలన వ్యాఖ్యలు చేసింది. టీ20 వరల్డ్ కప్ 2022లో భాగంగా నవంబర్ 6న ఇరు జట్లు తలపడనున్నాయి. అయితే ఈ మ్యాచ్‌లో టీమిండియాను చిత్తుగా జింబాబ్వే ఓడిస్తే ఆ దేశపు వ్యక్తిని పెళ్లాడతానని వ్యాఖ్యానించింది. ఈ మేరకు ఆమె ట్వీట్ చేసింది. ‘తదుపరి మ్యాచ్‌లో జింబాబ్వే అద్భుతంగా భారత్‌ను ఓడించినట్లయితే.. నేను ఆ దేశానికి చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకుంటాను’ అని తెలిపింది. ఇదిలా ఉండగా ఈ పాకిస్తాన్ నటి గతంలో కూడా టీమిండియాపై అక్కసు వెళ్లగక్కుతూ వివాదాస్పద ట్వీట్లతో వార్తల్లో నిలిచింది. బంగ్లాదేశ్- భారత్ మ్యాచ్ సందర్భంగా కూడా రోహిత్ సేన ఓడిపోవాలని పదే పదే కోరుకుంటూ ట్వీట్ చేసింది. అంతకుముందు.. స్వదేశంలో టీ20 సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియా చేతిలో టీమిండియా నాలుగు వికెట్ల తేడాతో ఓడిపోయినపుడు కూడా భారత జట్టుపై విమర్శలు గుప్పించింది. I'll marry a Zimbabwean guy, if their team miraculously beats India in next match 🙂 — Sehar Shinwari (@SeharShinwari) November 3, 2022 కాగా పాకిస్తాన్ నటి చేసిన ఈ ట్వీట్లు నెట్టింట్లో విమర్శలకు దారి తీసింది. క్రికెట్ లవర్స్, భారత్ అభిమానులు ఓ రేంజ్లో విరుచుకుపడుతున్నారు. భారత్- బంగ్లాదేశ్ మ్యాచ్ సమయంలో ఆమె అంచనాలు తలకిందులయ్యాయి. ఇప్పుడు కూడా అదే తప్పు చేస్తున్నారు. పాపం మీ జీవితమంతా పెళ్లి లేకుండా ఒంటరిగా ఎలా జీవిస్తారో తలుచుకుంటేనే బాధగా ఉంది’ అంటూ పలువురు ట్రోల్ చేస్తున్నారు. మరికొంతమంది జింబాబ్వేను భారత్ ఓడిస్తే మీరు మీ ట్విటర్‌ను డిలీట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. జింబాబ్వే ఒక్క పరుగుతో ఓడించడానికి మాది పాకిస్తాన్ జట్టు కాదంటూ సెటైర్లు వేస్తున్నారు. చదవండి: Ind Vs Ban: కోహ్లి ఫేక్ ఫీల్డింగ్.. అంపైర్లు సహకరించారు.. వరుణుడు కాపాడాడు..! -
పాకిస్తాన్ నటికి టీమిండియా మాజీ క్రికెటర్ దిమ్మతిరిగే కౌంటర్
టీమిండియా మాజీ క్రికెటర్ అమిత్ మిశ్రా పాకిస్తాన్ నటికి దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చాడు. మిశ్రాను ట్రోల్ చేయాలని ప్రయత్నించిన యువతి.. తాను తీసుకున్న గొయ్యిలో తానే పడ్డట్లయింది. విషయంలోకి వెళితే.. ఆసియా కప్ టోర్నీలో భాగంగా బుధవారం అఫ్గనిస్తాన్.. పాకిస్తాన్ చేతిలో ఓటమి పాలవ్వడంతో టీమిండియా టోర్నమెంట్ నుంచి అధికారికంగా నిష్ర్కమించినట్లయింది. ఆఫ్గన్ గెలిచి ఉంటే భారత్‌కు ఎంతో కొంత ఫైనల్ అవకాశాలు మిగిలి ఉండేవి. కానీ ఆఖర్లో పాకిస్తాన్ బౌలర్ నసీమ్ షా రెండు సిక్సర్లు బాది తన జట్టును ఫైనల్‌కు చేర్చాడు. అయితే మ్యాచ్ ఆరంభానికి ముందు అఫ్గనిస్తాన్ మ్యాచ్ గెలవాలని టీమిండియా అభిమానులు బలంగా కోరుకున్నారు. అలా కోరుకున్నవారిలో టీమిండియా మాజీ క్రికెటర్ అమిత్ మిశ్రా కూడా ఉన్నాడు. ఒకవేళ అఫ్గనిస్తాన్ పాక్‌పై గెలిస్తే మాత్రం.. ఈ వారం మొత్తం ''అఫ్గన్ చాప్''ను తింటానని ట్వీట్ చేశాడు. అయితే అఫ్గనిస్తాన్ పాకిస్తాన్ చేతిలో ఓడిపోయిన తర్వాత పాకిస్తాన నటి సెహర్ షిన్వరీ అమిత్ మిశ్రాను ట్రోల్ చేయడానికి ప్రయత్నించింది. ''అఫ్గనిస్తాన్ ఓడిపోయింది.. పూర్ మిశ్రా.. ఈ వారం మొత్తం ఆవు పేడ తినాల్సిందే'' అంటూ కామెంట్ చేసింది. కాగా సెహర్ ట్వీట్‌కు వెంటనే బదులిచ్చిన అమిత్ మిశ్రా.. అయ్యో నాకు పాకిస్తాన్ వచ్చేందుకు ఎలాంటి ప్లాన్స్ లేవు అంటూ దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్గనిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 129 పరుగులు మాత్రమే చుసింది. అయితే బ్యాటింగ్‌లో తక్కువ స్కోరే చేసినప్పటికి ఆఫ్గన్ బౌలర్లు వికెట్లు తీసిన ప్రతీసారి టీమిండియా అభిమానులు పండగ చేసుకున్నారు. దాదాపు పాక్‌ను ఓడించినంత పని చేసిన అఫ్గనిస్తాన్‌ను ప్రశంసించారు. 119కే 9 వికెట్లు కోల్పోయిన దశలో క్రీజులోకి వచ్చిన నసీమ్ షా చివరి ఓవర్లో తొలి రెండు బంతులను సిక్సర్లుగా మలచడంతో అఫ్గనిస్తాన్ ఓటమిపాలైంది. ఇక విజయంతో పాక్ ఆసియా కప్ ఫైనల్‌కు చేరుకుంది. ఈ ఆదివారం(సెప్టెంబర్ 11న) పాకిస్తాన్, శ్రీలంక మధ్య ఫైనల్ పోరు జరగనుంది. Will eat Afghani chaap whole week if Afganistan defeats Pakistan today. Fingers crossed. #AFGvsPAK — Amit Mishra (@MishiAmit) September 7, 2022 No, I have no plans of coming to Pakistan. 👍 https://t.co/HbFWeZSjij — Amit Mishra (@MishiAmit) September 8, 2022 చదవండి: Naseem Shah: మ్యాచ్‌ను శాసించిన సిక్సర్ల కోసం బ్యాట్‌ను అప్పుగా.. ఆస్ట్రేలియానే దారుణమనుకుంటే.. అంతకన్నా చెత్తగా ఆడి! -
అఫ్గాన్‌పై టీమిండియా గెలుపు.. బీసీసీఐపై పాక్ నటి వివాదాస్పద వ్యాఖ్యలు
Pakistani Actress Makes Allegation On BCCI After India Beat Afghanistan In T20 WC 2021: టీ20 ప్రపంచకప్-2021లో భాగంగా అఫ్గానిస్థాన్‌పై టీమిండియా 66 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన నేపథ్యంలో ప్రముఖ పాకిస్థాన్ టీవీ నటి సెహర్ షిన్వారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. ఈ మ్యాచ్‌ను భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) కొనుగోలు చేసిందని అర్ధం వచ్చేలా సంచలన ఆరోపణలు చేసింది. భారత మాజీ క్రికెటర్, ప్రముఖ వ్యాఖ్యాత ఆకాష్ చోప్రా మ్యాచ్ అనంతరం చేసిన ట్వీట్‌కు బదులుగా ఆమె రీ ట్వీట్ చేసింది. BCCI bought a good match 👍 https://t.co/2SWhLRbAig — Sehar Shinwari (@SeharShinwari) November 3, 2021 వివరాల్లోకి వెళితే.. అఫ్గాన్‌పై విజయానంతరం టీమిండియాకు విషెష్ తెలుపుతూ "భారత్.. భారత్‌లా ఆడిందంటూ" ఆకాశ్ చోప్రా ట్వీట్ చేశాడు. అయితే, ఆకాశ్ చేసిన ట్వీట్‌ను ట్యాగ్ చేస్తూ రిప్లై ఇచ్చిన పాక్ నటి.. "BCCI Bought A Good Match" అంటూ రీ ట్వీట్ చేసింది. సెహర్ షిన్వారి చేసిన వ్యాఖ్యలకు ఆకాష్ చోప్రా తనదైన స్టైల్లో రిప్లై ఇచ్చాడు. “వక్రబుద్ది గల మనుషుల నుంచి ఇలాంటి నెగిటివ్ మాటలే వస్తాయి” అంటూ కౌంటర్ ఇచ్చాడు. వీరిద్దరి మధ్య జరిగిన ఈ ట్వీటర్ వార్ ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరలవుతుంది. పాక్ నటిపై టీమిండియా అభిమానులు దుమ్మెత్తిపోస్తున్నారు. ఆమె వ్యాఖ్యలకు సంబంధించిన ట్వీట్‌ను ట్యాగ్ చేస్తూ విరుచుకుపడుతున్నారు. 🙏 https://t.co/ezg5o98KOh pic.twitter.com/KnxQkIDjQi — Aakash Chopra (@cricketaakash) November 3, 2021 చదవండి: మ్యాచ్ మధ్యలో అనిల్ కపూర్ పాటకు చిందేసిన విరాట్.. -
రహస్య పెళ్లిపై స్పందించిన పాకిస్తాన్ నటి
సీక్రెట్‌గా పెళ్లి చేసుకుందన్న వార్తలపై పాకిస్తాన్ నటి మహీరా ఖాన్ స్పందించింది. తాను రహస్య వివాహం చేసుకోలేదని స్పష్టం చేసింది. "నా చేతి వేళ్లకేమైనా ఉంగరం కనిపిస్తుందా? లేదు కదా, నేను పెళ్లి పీటలెక్కితే ఆ విషయాన్ని తప్పకుండా మీ అందరితో పంచుకుంటాను. అయినా నేను మ్యారేజ్ చేసుకుంటే అది మీకు తెలీకుండా ఉంటుందా! ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ ద్వారా ఎప్పుడో దాన్ని మీకు షేర్ చేసేదాన్ని. కాబట్టి నేనిప్పుడు చెప్పొచ్చేదేంటంటే నాకు పెళ్లి కాలేదు. కనీసం నిశ్చితార్థం కూడా జరగలేదు" అని తన యూట్యూబ్ ఛానల్ మ్యాషన్లో ఓ వీడియో రిలీజ్ చేసి క్లారిటీ ఇచ్చింది. కాగా 'హమ్‌సఫర్', 'షెహర్ ఇ జాత్', 'బిన్ రోయ్' వంటి టీవీ షోల ద్వారా మహీరా ఖాన్ హిందీ ప్రేక్షకులకు దగ్గరైంది. 2017లో 'రేస్' సినిమా ద్వారా బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చింది. ఇందులో బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ సరసన హీరోయిన్గా నటించింది. ప్రస్తుతం స్టార్ హీరో టామ్ క్రూయిజ్‌తో కలిసి హాలీవుడ్ చిత్రంలోనూ నటిస్తోంది. ఉరి ఉగ్రదాడుల తర్వాత ఈ పాకిస్తానీ నటి భారత్‌లో అడుగు పెట్టనేలేదు. -
ఆ విమానంలో లేను : నటి
ఇస్లామాబాద్ : కరాచీ సమీపంలో శుక్రవారం కుప్పకూలిన పీఐఏ విమానంలో తాను, తన భర్త మరణించినట్టు సాగిన ప్రచారాన్ని పాకిస్తాన్ నటి ఆయేజా ఖాన్ తోసిపుచ్చారు. విమాన ప్రమాదంలో తనతో పాటు తన భర్త డానిష్ తైమూర్ మరణించినట్టు అర్ధం లేని వదంతులను పుట్టిస్తున్నారని ఆమె మండిపడ్డారు. అసత్యాలను వ్యాప్తి చేయడం మానుకోవాలని ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ‘దయచేసి సవ్యంగా వ్యవహరించండి..ఇలాంటి ఫేక్ న్యూస్‌ను వ్యాప్తి చేయడం విరమించండ’ని ఆమె కోరారు. కాగా, లాహోర్ నుంచి 99 మంది ప్రయాణీకులతో బయలుదేరిన పీఐఏ విమానం కరాచీ విమానాశ్రయంలో ల్యాండ్ అయ్యే కొన్ని నిమిషాల ముందు కుప్పకూలింది. -
భర్త చేతిలో నటి దారుణహత్య
ఇస్లామాబాద్ : పాకిస్తాన్లో మహిళా ఆర్టిస్టులపై దారుణాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలో మరో నటి-సింగర్ భర్త చేతిలో దారుణహత్యకు గురయ్యారు. ఈ దారుణం పాక్‌లోని ఖైబర్ ఫంక్తుఖ్వాలో చోటుచేసుకుంది. నటి రేష్మ పలు సినిమాల్లో నటించారు. గాయనిగానూ ఆమెకు మంచి పేరుంది. భర్తతో విభేదాలు ఉండటంతో రేష్మ గత కొన్నిరోజులుగా నౌషెరా కలాన్ లోని హకిమాబాద్‌లోని తన సోదరుడి ఇంట్లో ఉంటున్నారు. ఈ క్రమంలో ప్లాన్ ప్రకారం అక్కడికి వచ్చిన రేష్మ భర్త ఆమెపై విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. తూటాలకు ఆమె ఒక్కసారిగా కుప్పకూలిపోగా, నిందితుడు అక్కడినుండి పరారయ్యాడు. అనంతరం నటి రేష్మ తీవ్ర రక్తస్రావంతో మృతిచెందారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. భర్తకు రేష్మ నాలుగో భార్య కాగా, వీరి మధ్య మనస్పర్థలున్నాయని పోలీసులు తెలిపారు. కాగా, రేష్మ హత్య ఈ ఏడాది మహిళా ఆర్టిస్టులపై జరిగిన 15వ ఉదంతం(దాడి) కావడం గమనార్హం. ఈ ఏడాది ఫిబ్రవరి 3న ఆర్టిస్ట్ సంబల్ ఓ ప్రైవేట్ పార్టీలో హత్యకు గురైన విషయం విదితమే. -
ఆ నటిపై రూ 100 కోట్ల పరువునష్టం దావా
ఇస్లామాబాద్ : పాకిస్తాన్ నటి, గాయని మిసా షఫీపై గాయకుడు అలీ జఫర్ రూ 100 కోట్లకు పరువు నష్టం దావా వేశారు. అలీ జఫర్ తనను లైంగికంగా వేధించాడని గతంలో మిష ఆరోపించడంపై అలీ జఫర్ లాహోర్ జిల్లా కోర్టులో కేసు వేశారు. తన ప్రతిష్టను మిసా ఆరోపణలు తీవ్రంగా దెబ్బతీశాయని, తన గుడ్‌విల్‌ను మసకబార్చేలా ఉండటంతో పాటు జీవనోపాధిని దెబ్బతీసేలా ఆమె ఆరోపణలు చేశారని అలీ ఆమెకు పంపిన నోటీసులో పేర్కొన్నారు. తనను మానసికంగా వేధించినందుకు రూ 2 కోట్లు, కాంటాక్టులు కోల్పోయినందుకు రూ 8 కోట్లు, ప్రతిష్ట దెబ్బతీసినందుకు రూ 50 కోట్లు, వ్యాపార అవకాశాలు నష్టపోయినందుకు రూ 40 కోట్ల చొప్పున చెల్లించాలని నోటీసులో అలీ కోరారు. అలీ రెండు సందర్భాల్లో తన పట్ల అసభ్యంగా ప్రవర్తించారని మీసా ఓ ఇంటర్వ్యూలో ఆరోపించిన సంగతి తెలిసిందే. తొలిసారి అలీ తన పట్ల అమర్యాదకరంగా వ్యవహరించిన సందర్భంలో తాను ఆ విషయం తేలిగ్గా తీసుకున్నానని, తామిద్దరం సెలబ్రిటీలు కావడంతో అతడిపై ఎలాంటి చర్యలూ తీసుకోవద్దని తన భర్తకు సూచించానని చెప్పారు. మరో సందర్భంలోనూ అలీ ఇలాగే వ్యవహరించారని ఆరోపించారు. అయితే మీసా ఆరోపణలను అలీ తోసిపుచ్చారు. న్యాయస్ధానాల్లోనే ఆమెతో తేల్చుకుంటానని మీసాపై ప్రత్యారోపణలు చేయడం తనకు ఇష్టం లేదని చెప్పారు. -
కారు ప్రమాదంలో నటి సనాఖాన్ మృతి
కరాచీ: పాకిస్తాన్ నటి సనా ఖాన్ కారు ప్రమాదంలో దుర్మరణం చెందింది. పాకిస్తాన్ లోని హైదరాబాదుకు ముప్పై కిలో మీటర్ల దూరంలో సూపర్ జాతీయ రహదారిపై ఈ దుర్ఘటన జరిగింది. సనా ఖాన్ భర్త బాబర్ ఖాన్ కారు నడుపుతున్న సమయంలో కారు అదుపుతప్పి బోల్తా కొట్టింది. దీంతో సనా ఖాన్ కు , బాబర్ కు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు, అంబులెన్స్ సాయంతో అక్కడికి చేరుకున్నారు. హుటాహుటినా వారిని ఆస్పత్రికి తరలించారు. కాగా ఆస్పత్రికి చేరుకునే సరికే సనా ఖాన్ మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాబర్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. శుక్రవారం జరిగిన ఈ ప్రమాద ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది.