టీమిండియా మాజీ క్రికెటర్ అమిత్ మిశ్రా పాకిస్తాన్ నటికి దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చాడు. మిశ్రాను ట్రోల్ చేయాలని ప్రయత్నించిన యువతి.. తాను తీసుకున్న గొయ్యిలో తానే పడ్డట్లయింది. విషయంలోకి వెళితే.. ఆసియా కప్ టోర్నీలో భాగంగా బుధవారం అఫ్గనిస్తాన్.. పాకిస్తాన్ చేతిలో ఓటమి పాలవ్వడంతో టీమిండియా టోర్నమెంట్ నుంచి అధికారికంగా నిష్ర్కమించినట్లయింది. ఆఫ్గన్ గెలిచి ఉంటే భారత్‌కు ఎంతో కొంత ఫైనల్ అవకాశాలు మిగిలి ఉండేవి. కానీ ఆఖర్లో పాకిస్తాన్ బౌలర్ నసీమ్ షా రెండు సిక్సర్లు బాది తన జట్టును ఫైనల్‌కు చేర్చాడు.
అయితే మ్యాచ్ ఆరంభానికి ముందు అఫ్గనిస్తాన్ మ్యాచ్ గెలవాలని టీమిండియా అభిమానులు బలంగా కోరుకున్నారు. అలా కోరుకున్నవారిలో టీమిండియా మాజీ క్రికెటర్ అమిత్ మిశ్రా కూడా ఉన్నాడు. ఒకవేళ అఫ్గనిస్తాన్ పాక్‌పై గెలిస్తే మాత్రం.. ఈ వారం మొత్తం ''అఫ్గన్ చాప్''ను తింటానని ట్వీట్ చేశాడు. అయితే అఫ్గనిస్తాన్ పాకిస్తాన్ చేతిలో ఓడిపోయిన తర్వాత పాకిస్తాన నటి సెహర్ షిన్వరీ అమిత్ మిశ్రాను ట్రోల్ చేయడానికి ప్రయత్నించింది. ''అఫ్గనిస్తాన్ ఓడిపోయింది.. పూర్ మిశ్రా.. ఈ వారం మొత్తం ఆవు పేడ తినాల్సిందే'' అంటూ కామెంట్ చేసింది. కాగా సెహర్ ట్వీట్‌కు వెంటనే బదులిచ్చిన అమిత్ మిశ్రా.. అయ్యో నాకు పాకిస్తాన్ వచ్చేందుకు ఎలాంటి ప్లాన్స్ లేవు అంటూ దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చాడు.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్గనిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 129 పరుగులు మాత్రమే చుసింది. అయితే బ్యాటింగ్‌లో తక్కువ స్కోరే చేసినప్పటికి ఆఫ్గన్ బౌలర్లు వికెట్లు తీసిన ప్రతీసారి టీమిండియా అభిమానులు పండగ చేసుకున్నారు. దాదాపు పాక్‌ను ఓడించినంత పని చేసిన అఫ్గనిస్తాన్‌ను ప్రశంసించారు. 119కే 9 వికెట్లు కోల్పోయిన దశలో క్రీజులోకి వచ్చిన నసీమ్ షా చివరి ఓవర్లో తొలి రెండు బంతులను సిక్సర్లుగా మలచడంతో అఫ్గనిస్తాన్ ఓటమిపాలైంది. ఇక విజయంతో పాక్ ఆసియా కప్ ఫైనల్‌కు చేరుకుంది. ఈ ఆదివారం(సెప్టెంబర్ 11న) పాకిస్తాన్, శ్రీలంక మధ్య ఫైనల్ పోరు జరగనుంది.
Will eat Afghani chaap whole week if Afganistan defeats Pakistan today. Fingers crossed. #AFGvsPAK
— Amit Mishra (@MishiAmit) September 7, 2022
No, I have no plans of coming to Pakistan. 👍 https://t.co/HbFWeZSjij
— Amit Mishra (@MishiAmit) September 8, 2022
చదవండి: Naseem Shah: మ్యాచ్‌ను శాసించిన సిక్సర్ల కోసం బ్యాట్‌ను అప్పుగా..
Comments
Please login to add a commentAdd a comment