Pakistan vs Afghanistan
-
పాక్‌ను ఓడించగానే రాత్రంతా సంబరాలు: రషీద్ ఖాన్
వన్డే ప్రపంచకప్-2023 ఆరంభంలో ఓటములు చవిచూసిన అఫ్గనిస్తాన్ ఇంగ్లండ్‌ను ఓడించి సంచలన గెలుపుతో విజయాల బాట పట్టింది. ఆ తర్వాత పాకిస్తాన్‌ను మట్టికరిపించిన హష్మతుల్లా బృందం.. శ్రీలంక, నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌లలో కూడా గెలుపు బావుటా ఎగురవేసింది.ఈ క్రమంలో చాంపియన్స్ ట్రోఫీ-2025కి కూడా అర్హత సాధించింది. భారత్ వేదికగా జరిగిన ఈ మెగా టోర్నీలో ఏమాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగిన అఫ్గన్ ఊహించని స్థాయిలో ప్రత్యర్థులకు షాకిచ్చి సత్తా చాటింది.అదే హైలైట్ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లోనూ ఆఖరి వరకు అద్భుతంగా పోరాడి ఓడినా అభిమానుల హృదయాలు గెలిచింది. సంతృప్తిగానే మెగా టోర్నీ నుంచి నిష్క్రమించింది. అయితే, అన్నింటికంటే పాకిస్తాన్‌పై గెలుపు మాత్రం అఫ్గన్‌కు ప్రత్యేకంగా నిలిచిపోయింది.ఎందుకంటే.. అంతర్జాతీయ వన్డేల్లో అది కూడా.. వరల్డ్‌కప్ లాంటి ప్రధాన ఈవెంట్లో తొలిసారి పాక్‌పై అఫ్గనిస్తాన్ పైచేయి సాధించింది. స్టార్ బ్యాటర్లు రహ్మనుల్లా గుర్బాజ్(65), ఇబ్రహీం జద్రాన్(87), రెహమత్ షా(77) ఇన్నింగ్స్ కారణంగా తొలిసారి పాక్‌ను ఓడించింది. దీంతో అఫ్గన్ ఆటగాళ్ల సంబరాలు అంబరాన్నంటాయి.రాత్రి మొత్తం డాన్స్ చేస్తూతాజాగా ఈ విషయం గురించి గుర్తుచేసుకున్నాడు అఫ్గనిస్తాన్ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్. ‘‘పాకిస్తాన్ మీద గెలిచిన తర్వాత ఆ రోజు రాత్రి మొత్తం నేను డాన్స్ చేస్తూ సెలబ్రేట్ చేసుకుంటూనే ఉన్నాను.గ్రౌండ్ నుంచి హోటల్ దాకా సంబరాలు చేసుకున్నా. అర్ధరాత్రి దాటిన తర్వాత నేను విశ్రాంతి తీసుకోలేదు. అప్పుడు నన్నెవరైనా చూసి ఉంటే.. అసలు నాకు వెన్నునొప్పి ఉందంటే నమ్మేవారే కాదు.గతంలో ఎప్పుడూ లేని విధంగాఅప్పటికీ జాగ్రత్తగా ఉండాలని మా ఫిజియో చెప్తూనే ఉన్నారు. ఏదేమైనా నేను అలా పిచ్చిపట్టినట్లుగా డాన్స్ చేస్తూ సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటే మా జట్టు మొత్తం ఆశ్చర్యపోయింది. ఎందుకంటే గతంలో ఎప్పుడూ వాళ్లు నన్ను అలా చూడనేలేదు’’ అని ఈఎస్పీఎన్ క్రిక్ఇన్ఫోతో రషీద్ ఖాన్ చెప్పుకొచ్చాడు.కాగా ఆ మ్యాచ్‌లో పది ఓవర్లు బౌల్ చేసిన రషీద్ వికెట్ తీయకపోయినా పొదుపుగా(ఎకానమీ 4.10) బౌలింగ్ చేశాడు. నాటి మ్యాచ్‌లో నూర్ అహ్మద్ మూడు వికెట్లతో చెలరేగి పాక్ బ్యాటింగ్ ఆర్డర్‌ను దెబ్బకొట్టాడు. ఐపీఎల్‌తో బిజీఇదిలా ఉంటే.. రషీద్ ఖాన్ ప్రస్తుతం ఐపీఎల్-2024తో బిజీగా ఉన్నాడు. గుజరాత్ టైటాన్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న అతడు ఇప్పటి వరకు 102 పరుగులు చేయడంతో పాటు 8 వికెట్లు తీశాడు.చదవండి: T20 WC: ద్రవిడ్, రోహిత్‌కు నచ్చకపోవచ్చు.. కానీ నా సలహా ఇదే! -
U19 Asia Cup: సెమీస్‌కు దూసుకెళ్లిన భారత్, పాకిస్తాన్
ACC U19 Asia Cup, 2023: అండర్-19 ఆసియా కప్-2023 టోర్నీలో భారత టీనేజ్ సీమర్ రాజ్ లింబాని అదరగొట్టాడు. దుబాయ్ వేదికగా నేపాల్‌తో మ్యాచ్‌లో (7/13) నిప్పులు చెరిగే బౌలింగ్‌తో ఆకట్టుకున్నాడు. తన అద్భుత ప్రదర్శనతో నేపాల్ బ్యాటింగ్ ఆర్డర్‌ను కూల్చేశాడు. ఈ నేపథ్యంలో ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో యువ భారత జట్టు అలవోక విజయం సాధించి సెమీ ఫైనల్లోకి దూసుకెళ్లింది. కాగా మంగళవారం జరిగిన గ్రూప్ ‘ఎ’ చివరి లీగ్ మ్యాచ్‌లో భారత జట్టు 10 వికెట్ల తేడాతో నేపాల్‌పై ఘనవిజయం సాధించింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన నేపాల్‌ను 18 ఏళ్ల రాజ్ లింబాని స్పెల్ హడలెత్తించింది. దీంతో నేపాల్ 22.1 ఓవర్లలో 52 పరుగులకే కుప్పకూలింది. రాజ్ 9.1 ఓవర్లలో 3 మెయిడెన్లు వేసి 13 పరుగులిచ్చి 7 వికెట్లు తీశాడు. నేపాల్ ఓపెనర్ల నుంచి ఆఖరి వరుస బ్యాటర్ వరకు అంతా సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. అనంతరం భారత జట్టు 7.1 ఓవర్లలో వికెట్ కోల్పోకుండా 57 పరుగులు చేసి ఛేదించింది. అర్షిన్ కులకర్ణి (30 బంతుల్లో 43 నాటౌట్; 1 ఫోర్, 5 సిక్స్‌లు) భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. అర్షిన్, ఆదర్శ్ సింగ్ (13 నాటౌట్; 2 ఫోర్లు) అబేధ్యమైన ఓపెనింగ్ బాగస్వామ్యంతో జట్టును గెలిపించారు. ఇక ఈ టోర్నీలో భారత్‌కు ఇది రెండో విజయం. అంతకుముందు ఆరంభ మ్యాచ్‌లో అఫ్గనిస్తాన్‌ను భారత యువ జట్టు చిత్తు చేసింది. గ్రూప్-ఏ టాపర్‌గా పాకిస్తాన్ ఈ క్రమంలో మొత్తంగా... ఆడిన మూడు మ్యాచ్‌లలో రెండు గెలిచిన భారత్ గ్రూప్ ‘ఎ’లో రెండో స్థానంలో నిలిచింది. మరోవైపు.. దాయాది జట్టు పాకిస్తాన్ మంగళవారం నాటి రెండో మ్యాచ్‌లో అఫ్గనిస్తాన్‌ను చిత్తుగా ఓడించింది. ఏకంగా 83 పరుగుల తేడాతో అఫ్గన్‌ను మట్టికరిపించి మూడో విజయం నమోదు చేసింది. తద్వారా ఆడిన మూడింట మూడు నెగ్గి గ్రూప్-ఏ టాపర్‌గా నిలిచి సెమీస్‌లో అడుగుపెట్టింది. ACC Men's U19 Asia Cup | Pakistan-U19 vs Afghanistan-U19 | Highlights. https://t.co/E72GAXu9OB#ACCMensU19AsiaCup #ACC — AsianCricketCouncil (@ACCMedia1) December 12, 2023 -
నాడు పాక్‌లో తలదాచుకున్న కుటుంబం.. డాక్టర్ కావాలనుకున్న రషీద్ ఇప్పుడిలా
వన్డే ప్రపంచకప్-2023లో పాకిస్తాన్‌తో అఫ్గానిస్తాన్ మ్యాచ్.. పదకొండేళ్ల వ్యవధిలో.. వన్డేల్లో పాక్‌తో తలపడిన 7 సార్లూ అఫ్గాన్‌కు ఓటమే ఎదురైంది. విజయానికి కొన్నిసార్లు చేరువగా రాగలిగినా.. లక్ష్యాన్ని అందుకోవడం మాత్రం అఫ్గాన్ల వల్ల కాలేదు. కానీ ఈసారి లెక్క మారింది. అప్పటికి ఇంగ్లండ్‌పై గెలిచిన అఫ్గన్.. మరోసారి అద్భుత ప్రదర్శనతో అదరగొట్టి పాక్‌ను చిత్తు చేయడంలో సఫలమైంది. ఈ గెలుపుతో వచ్చిన జోష్‌లో తర్వాత మరో రెండు మ్యాచ్‌లు నెగ్గి.. ప్రపంచకప్‌లో తొలిసారిగా సెమీస్ రేసులోనూ నిలవగలిగింది. ఇక పాకిస్తాన్‌పై చిరస్మరణీయమైన విజయం తర్వాత కీలక సభ్యుడైన రషీద్ ఖాన్ ఆట పాటతో మైదానంలోనే సంబరాలు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ విజయం జట్టుదే కావచ్చు. కానీ రషీద్‌కు సంబంధించి ఇది మరింత ప్రత్యేకం. ఎందుకంటే అఫ్గానిస్తాన్ ఒక జట్టుగా ఎదగడంలో అతడి పాత్ర కూడా ఎంతో కీలకం. వరుస పరాజయాల నుంచి బయటపడి క్రికెట్ వేదికపై టీమ్‌గా ఆ జట్టు సత్తా చాటడంలో రషీద్ కూడా ప్రధాన భాగస్వామి. సరిగ్గా చెప్పాలంటే అఫ్గాన్ క్రికెట్‌తో పాటు సమాంతరంగా అతనూ ఎదిగాడు. అంతకుమించి కూడా వ్యక్తిగతంగా పేరు ప్రఖ్యాతులు సంపాదించాడు. తమ సొంత దేశంలో యుద్ధ వాతావరణం, మరెన్నో ప్రతికూలతలను అధిగమించి ఈ స్థాయికి చేరిన అతని పట్టుదల, కఠోర సంకల్పం గురించి ఎంత చెప్పినా తక్కువే. ఒక దశలో యుద్ధ భయంతో పాకిస్తాన్‌కు వలస వెళ్లిపోయి అక్కడే దేశవాళీ క్రికెట్లోనూ సత్తా చాటి వెలుగులోకి వచ్చిన రషీద్ ప్రస్థానం అసాధారణం. తొలి గ్లోబల్ సూపర్ స్టార్ అఫ్గానిస్తాన్ దేశం నుంచి వచ్చిన తొలి గ్లోబల్ సూపర్ స్టార్.. ఈ వాక్యం రషీద్‌ఖాన్‌కు సరిగ్గా సరిపోతుంది. ఒకటి కాదు రెండు కాదు ప్రపంచవ్యాప్తంగా రషీద్ వేర్వేరు టోర్నీలు, లీగ్స్‌లో ఏకంగా 30 జట్లకు ప్రాతినిధ్యం వహించాడు. ఇందులో తన సొంత దేశం నుంచి పాకిస్తాన్, భారత్, శ్రీలంక, బంగ్లాదేశ్ మొదలు అటు ఆస్ట్రేలియా నుంచి అమెరికా, ఇంగ్లండ్‌కు చెందిన జట్ల వరకు ఉన్నాయి. అన్నింటా, అంతటా ఎక్కడ ఆడినా అతనికి అన్ని వైపుల నుంచి అభిమానం దక్కింది. క్రికెట్ ప్రేమికులందరూ లెగ్‌స్పిన్నర్‌గా రషీద్ ఆటను చూసి చప్పట్లు కొట్టినవారే! ఏదో ఒక దశలో తమవాడిగా సొంతం చేసుకున్నవారే. సన్‌రైజర్స్ హైదరాబాద్ క్రికెట్ ఫ్యాన్స్‌ను అడిగితే చెప్తారు ఐపీఎల్లో అతని విలువేంటో, అతని ప్రభావం ఎలాంటిదో! తొలిసారి ఐపీఎల్లో అడుగు పెట్టినప్పుడే 2017 నుంచి ఐదు సీజన్ల పాటు హైదరాబాద్‌కు ఆడిన అతను గత రెండేళ్లుగా గుజరాత్ టైటాన్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. అతని గూగ్లీలు ప్రపంచంలో ఎంతటి బ్యాటర్‌నైనా ఇబ్బంది పెడతాయి. తొలిసారి ఐపీఎల్లో అడుగు పెట్టినప్పుడే అతను అసోసియేట్ టీమ్ నుంచి ఈ మెగా లీగ్‌లో ఆడిన తొలి ఆటగాడిగా కొత్త ఘనతతో బరిలోకి దిగాడు. అదీ ఏకంగా రూ. 4 కోట్ల విలువతో రైజర్స్ అతడిని ఎంచుకుంది. అప్పటి నుంచి అతను ఒక వైపు తన ఫ్రాంచైజీ టీమ్‌లకు, మరో వైపు జాతీయ జట్టుకు స్టార్‌గా మారాడు. ఇంకా చెప్పాలంటే అతను రాక ముందు వేళ్ల మీద లెక్కించగలిగే విజయాలు మాత్రమే సాధించిన అఫ్గానిస్తాన్ ఆ తర్వాత ఎన్నో సంచలనాలకు కారణమైందంటే అందులో రషీద్ పాత్ర ఎంతుందో అర్థం చేసుకోవచ్చు. యుద్ధ వాతావరణం నుంచి వచ్చి... అఫ్గానిస్తాన్‌లోని నన్‌గర్హర్ రాష్ట్రం అతని స్వస్థలం. ఏడుగురు అన్నదమ్ముల్లో అతను ఆరోవాడు. చాలామంది లాగే తన అన్నలు సరదాగా టెన్నిస్ బాల్‌తో క్రికెట్ ఆడుతుండటం చూసి అతనికీ ఆసక్తి కలిగింది. అయితే ఆ దేశంలో పరిస్థితులు కనీస స్థాయిలో కూడా లేవు. కాబట్టి ఇంతకంటే మెరుగ్గా క్రికెట్లో ఏమీ చేయలేమనేది అందరి భావన. డాక్టర్ కావాలనుకుంటే విధిరాత మరోలా పెద్దయ్యాక తామేం కావాలో కలలు కనే అందరి పిల్లల్లానే చిన్నప్పుడు రషీద్ కూడా డాక్టర్ కావాలని, కంప్యూటర్స్ నేర్చుకొని పెద్ద స్థాయికి చేరుకోవాలని, మంచి ఇంగ్లిష్ నేర్చుకొని టీచర్ కావాలని.. ఇలా చాలా కలలు కన్నాడు. కానీ అతనికి మరో విధంగా రాసి పెట్టి ఉంది. రషీద్ ఉండే ఊరు బాటి కోట్ పాకిస్తాన్ సరిహద్దులో ఉంటుంది. పెషావర్ సమీప నగరం. చిన్న చిన్న క్రికెట్ టోర్నీలు ఆడేందుకు ఇక్కడివారు అక్కడికి, అక్కడివారు ఇక్కడికి వస్తుంటారు. అలాంటి సమయంలో నజీమ్ అనే మేనేజర్ రషీద్‌లోని ప్రతిభను గుర్తించాడు. ధాటిగా బ్యాటింగ్ చేయడంతో పాటు ప్రత్యర్థి బ్యాటర్లకు ఏమాత్రం అర్థం కాని అతని బౌలింగ్ శైలి నజీమ్‌ను ఆకర్షించింది. తన మాట మీద పెషావర్‌లోని ఒక కళాశాల కోచింగ్ కార్యక్రమంలో రషీద్‌ను అక్కడివారు తీసుకున్నారు. పాకిస్తాన్‌కు వలస వెళ్లి దాంతో రషీద్‌కు కొత్త తరహా శిక్షణ లభించింది. అప్పటి వరకు ఎలాంటి నాణ్యత లేని సిమెంట్ టర్ఫ్‌లపై ప్రాక్టీస్ చేస్తూ వచ్చిన అతనికి అసలైన క్రికెట్ ఏమిటో అర్థమైంది. దాదాపు అదే సమయంలో అఫ్గానిస్తాన్‌లో యుద్ధ వాతావరణం ఏర్పడింది. కారణాలు ఏమైనా తీవ్రవాదుల హల్చల్, ప్రభుత్వ నియంత్రణ లేకపోవడం పరిస్థితులను ఇబ్బందికరంగా మార్చాయి. దాంతో రషీద్ కుటుంబం మొత్తం పాకిస్తాన్‌లోని పెషావర్‌కే వెళ్లి తలదాచుకుంది. అక్కడ అతడిని చాలా మంది ముహాజిర్ (శరణార్థి) అంటూ ఆట పట్టించినా.. తన క్రికెట్‌తో అతను అన్ని మరచిపోయేవాడు. తిరుగులేని ప్రదర్శనతో... అపార ప్రతిభ ఉండటంతో పాకిస్తాన్లో జరిగే పలు దేశవాళీ టోర్నీల్లో రషీద్ చెలరేగిపోయాడు. అయితే సహజంగానే జాతీయ బోర్డు నిబంధనల కారణంగా అతనికి పాక్ టీమ్‌లో అవకాశాలైతే రాలేదు. కానీ అప్పటికే మెరికలా మారిన అతను తన సొంత దేశం చేరి ఆటపై పూర్తిగా దృష్టి పెట్టాడు. పాకిస్తాన్ దిగ్గజం ఇంజమామ్ ఉల్ హక్ తమ కోచ్‌గా రావడం రషీద్ కెరీర్‌ను మలుపు తిప్పింది. ఇంజమామ్ ఒత్తిడి తేవడంతో జింబాబ్వే పర్యటనకు తొలుత.. అతడిని సెలక్టర్లు ఎంపిక చేయలేదు. రషీద్‌ను తీసుకున్న తర్వాతే మిగతా విషయాలు మాట్లాడదామంటూ ఇంజమామ్ ఒత్తిడి తేవడంతో స్థానం ఖాయమైంది. ఆ తర్వాత కొన్నేళ్లకు చూస్తే అందరికంటే ముందుగా రషీద్ పేరుతోనే టీమ్ షీట్ తయారు కావడం విశేషం. జింబాబ్వే సిరీస్‌తో అరంగేట్రం చేసిన రషీద్ ఆ తర్వాత అమిత వేగంగా దూసుకుపోయాడు. ఆ తర్వాత లెక్కలేనన్ని ఘనతలు అతడి ఖాతాలో వచ్చి చేరాయి. టెస్టుల్లో, వన్డేల్లో కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన అతి పిన్న వయస్కుడిగా, టి20ల్లో అత్యంత వేగంగా 100 వికెట్లు తీసిన బౌలర్‌గా పలు ఘనతలు అతడి జాబితాలో చేరాయి. సహాయకార్యక్రమాల్లో ముందుంటూ... భారత గడ్డపై వన్డే వరల్డ్ కప్ మొదలైన రెండు రోజులకు.. అఫ్గానిస్తాన్ జట్టు తమ తొలి మ్యాచ్‌లో ధర్మశాల మైదానంలో మరికొద్ది సేపట్లో బంగ్లాదేశ్‌తో తలపడేందుకు సన్నద్ధమైంది. అప్పుడే ఒక విషాద వార్త బయటకు వచ్చింది. అఫ్గానిస్తాన్ దేశాన్ని అతి పెద్ద భూకంపం కుదిపేసింది. మ్యాచ్ ఫీజును విరాళంగా దేశంలో మూడో పెద్ద నగరమైన హిరాట్లో పరిస్థితి చాలా భయంకరంగా ఉంది. ఎలాగోలా అఫ్గాన్ ఆటగాళ్లు మ్యాచ్‌ను ముగించేశారు. ఆ వెంటనే జట్టు స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ తన తరఫు నుంచి మొత్తం ప్రపంచకప్ మ్యాచ్ ఫీజును విరాళంగా ప్రకటించేశాడు. ఆపై తగిన సహాయం చేయాలంటూ తన ఫౌండేషన్ ద్వారా కోరాడు. ఒకవైపు టోర్నీలో సత్తా చాటుతూ మరోవైపు తన సన్నిహితుల సహకారంతో అతను అఫ్గానిస్తాన్‌లో సహాయ కార్యక్రమాలను పర్యవేక్షిస్తూనే ఉన్నాడు. నిధులతో పాటు పునరావాస కార్యక్రమాలూ కొనసాగుతున్నాయి. 25 ఏళ్ల రషీద్ ఇలా స్పందించడం మొదటిసారి కాదు. గతంలోనూ తన దేశంలో ఎన్నో సేవా కార్యక్రమాల్లో భాగం కావడంతోపాటు తన సొంత డబ్బుతో చిన్నారుల చదువు, పేదలకు సహకారం వంటి పనుల్లో చురుగ్గా పాల్గొన్నాడు. అక్కడి పరిస్థితులు కూడా తన దేశం కోసం ఏదైనా చేయాలనే ప్రేరణను కలిగిస్తాయని అతను చెబుతుంటాడు. పేద దేశం, టెర్రరిజం మొదలు ఇతర తీవ్రమైన ప్రతికూలతలకు ఎదురొడ్డి తాను ఇప్పుడు ఒక గొప్ప ఆటగాడిగా ఎదగడం వరకు ఎక్కడా తన మూలాలను మర్చిపోలేదు. ప్రపంచంలో ఏ చోట క్రికెట్ ఆడుతున్నా.. సాయం చేసేందుకు ఎప్పుడైనా సిద్ధమని అతను అన్నాడు. అదే అతడిని మరింత ప్రత్యేకంగా నిలబెట్టింది. -మొహమ్మద్ అబ్దుల్ హాది -
WC 2023: కోహ్లిలా ఉండాలన్నందుకు.. నాపై ద్రోహి అనే ముద్ర వేశారు! కానీ..
WC 2023- Babar Azam: ‘‘ఏడాది క్రితం నా చానెల్లో నేను కూడా ఇవే మాటలు చెప్పాను. బాబర్ ఆజం గొప్ప బ్యాటర్. విరాట్ కోహ్లిలాగా అతడు కూడా కెప్టెన్సీ వదిలేస్తే మరిన్ని అద్భుతాలు చేయగలడు. విరాట్ నాయకత్వ బాధ్యతల నుంచి తప్పుకొన్న తర్వాత బ్యాటర్‌గా మరింత గొప్పగా రాణిస్తున్నాడు. ద్రోహిగా ముద్ర వేశారు అలాగే బాబర్ ఆజం కూడా కెప్టెన్సీ వదిలేసి బ్యాటింగ్‌పై దృష్టి పెడితే బాగుంటుంది. ఈ మాటలు మాట్లాడినందుకు సోషల్ మీడియాలో కొందరు నన్ను బాబర్ వ్యతిరేకిగా ప్రచారం చేశారు. నాకు బాబర్ ఆజం అంటే ఇష్టం లేదని.. అందుకే ఇలా అంటున్నానని విమర్శించారు. నా మాటలు వక్రీకరించి ద్రోహిగా నాపై ముద్ర వేశారు’’ అని పాకిస్తాన్ మాజీ బ్యాటర్ బసిత్ అలీ ఆవేదన వ్యక్తం చేశాడు. ఇప్పుడు అందరూ అదే మాట తాను బాబర్ మంచి కోరితే ద్రోహి అన్నవాళ్లు ఇప్పుడు ఏమంటారో చూడాలని ఉందని పేర్కొన్నాడు. వన్డే వరల్డ్‌కప్-2023లో పాకిస్తాన్ హ్యాట్రిక్ ఓటముల నేపథ్యంలో బాబర్ ఆజం కెప్టెన్సీ నుంచి వైదొలగాలనే డిమాండ్లు వస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా అఫ్గనిస్తాన్ చేతిలో గతంలో ఎన్నడూ లేని విధంగా తొలిసారిగా వన్డేలో ఓటమి పాలు కావడం.. అది కూడా ప్రపంచకప్ వంటి మెగా ఈవెంట్లో పాక్ పరాభవం నేపథ్యంలో బాబర్‌పై విమర్శలు మరింత ఎక్కువయ్యాయి. సెమీస్ చేరాలంటే ఈ నేపథ్యంలో బసిత్ అలీ పాత జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ బాబర్ ఆజం విషయంలో తనను విమర్శించిన వాళ్లకు ఇలా గట్టి కౌంటర్ ఇచ్చాడు. కాగా భారత్ వేదికగా ప్రపంచకప్-2023లో పాకిస్తాన్ తొలి రెండు మ్యాచ్‌లలో విజయం సాధించింది. అయితే, ఆ తర్వాత మూడింటిలోనూ ఓడిపోయింది. తదుపరి ఐదు మ్యాచ్‌లలో గెలిస్తేనే పాకిస్తాన్ సెమీస్ అవకాశాలు సజీవంగా ఉంటాయి. చదవండి: WC 2023: స్నేహాలు, పర్సనల్ రిలేషన్షిప్స్.. అందుకే జట్టుకు ఈ దుస్థితి! -
ఓటమి బాధతో బాబర్ ఏడ్చాడు.. తప్పు అతనొక్కడిదే కాదు: పాకిస్తాన్ లెజెండ్
వన్డే ప్రపంచకప్-2023లో భాగంగా ఆఫ్గానిస్తాన్ చేతిలో పాకిస్తాన్ ఘోర పరాజయం పాలైన సంగతి తెలిసిందే. చెన్నై వేదికగా జరిగిన మ్యాచ్‌లో పాక్‌ను 8 వికెట్ల తేడాతో ఆఫ్గానిస్తాన్ చిత్తు చేసింది. వన్డేల్లో ఆఫ్గాన్ చేతిలో పాక్‌కు ఇదే తొలి ఓటమి కావడం గమనార్హం. ఈ ఓటమి బాధ్యడిగా బాబర్ ఆజంను కెప్టెన్సీ నుంచి తప్పించాలని పాక్ మజీ క్రికెటర్లు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో బాబర్‌కు మద్దతుగా పాక్ మాజీ ఆటగాడు మహ్మద్ యూసఫ్ నిలిచాడు. ఈ ఓటమికి బాబర్ ఒక్కడే కాదు జట్టు మొత్తం బాధ్యత వహించాలని యూసఫ్ అభిప్రాయడ్డాడు. "ఆఫ్గానిస్తాన్ మ్యాచ్ అనంతరం బాబర్ డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్లి ఏడ్చినట్లు నాకు తెలిసింది. ఈ ఓటమికి బాబర్ ఒక్కడే కారణం కాదు. మొత్తం జట్టుతో పాటు మేనేజ్మెంట్ తప్పుకూడా ఉంది. ఇటువంటి సమయంలో మేముంతా బాబర్‌కు సపోర్ట్‌గా ఉంటాం. దేశం మొత్తం అతనితో ఉందని" పాకిస్తానీ టీవీ షోలో యూసఫ్ పేర్కొన్నాడు. కాగా ఈ టోర్నీలో ఇప్పటివరకు 5 మ్యాచ్‌లు పాకిస్తాన్.. రెండింట విజయం సాధించి పాయింట్ల పట్టికలో మూడో స్ధానంలో కొనసాగుతోంది. చదవండి: Muttiah Muralitharan: తండ్రి బేకరీ వ్యాపారం.. అడుగడుగునా అవమానాలు.. దోషిలా విచారణ! 800వ వికెట్ అతడే.. -
అఫ్గానిస్తాన్ చేతిలో ఘోర ఓటమి.. పాకిస్తాన్ కెప్టెన్‌పై వేటు!
వన్డే ప్రపంచకప్-2023లో ఆఫ్గానిస్తాన్ చేతిలో పాకిస్తాన్‌కు ఘోర పరాభావం ఎదురైన సంగతి తెలిసిందే. చెన్నై వేదికగా జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్‌ను 8 వికెట్ల తేడాతో ఆఫ్గాన్ చిత్తు చేసింది. అంతర్జాతీయ వన్డేల్లో ఆఫ్గాన్ చేతిలో పాక్ ఓడిపోవడం ఇదే తొలిసారి. ఈ ఓటమిని పాకిస్తాన్ అభిమానులతో పాటు మాజీలు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. పాకిస్తాన్ జట్టుపై తీవ్ర విమర్శల వర్షం కురుస్తోంది. అంతకుముందు టీమిండియా చేతిలో కూడా పాక్ జట్టు ఘోర ఓటమి చవిచూసింది. ఈ క్రమంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఓ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. తమ జట్టు కెప్టెన్ బాబర్ ఆజంపై వేటు వేయాలని పీసీబీ ఆలోచిస్తున్నట్లు పాక్ మీడియా వర్గాలు వెల్లడించాయి. వరల్డ్‌కప్ తర్వాత తిరిగి స్వదేశానికి వచ్చాక పీసీబీ తమ నిర్ణయాన్ని వెల్లడించనున్నట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. బాబర్ స్ధానంలో సర్ఫరాజ్ అహ్మద్, ముహమ్మద్ రిజ్వాన్, షాహీన్ షా ఆఫ్రిది పేర్లను పీసీబీ మేనెజ్మెంట్ కమిటీ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రపంచకప్ ముగిసిన వెంటనే పాకిస్తాన్ ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనుంది. ఈ టూర్‌కు ముందే పాకిస్తాన్ జట్టుకు కొత్త కెప్టెన్ వచ్చే ఛాన్స్ ఉంది. కాగా మెగా టోర్నీలో వ్యక్తిగత ప్రదర్శన పరంగా పర్వాలేదనపిస్తున్న బాబర్.. కెప్టెన్సీ పరంగా మాత్రం దారుణంగా విఫలమయ్యాడు. ఈ క్రమంలోనే అతడి వేటు వేయాలని పీసీబీ ఆలోచిస్తోంది. ఇప్పటివరకు ఈ టోర్నీలో ఐదు మ్యాచ్‌లు ఆడిన పాకిస్తాన్ కేవలం రెండు మ్యాచ్‌ల్లో మాత్రమే విజయం సాధించింది. చదవండి: World Cup 2023: ఇంగ్లండ్‌తో మ్యాచ్.. టీమిండియాకు భారీ షాక్! -
నిజంగా సిగ్గు చేటు.. రోజూ 8 కేజీల మటన్ తింటున్నట్టు ఉన్నారు: పాకిస్తాన్ లెజెండ్ ఫైర్
వన్డే ప్రపంచకప్-2023లో భాగంగా అఫ్గానిస్తాన్ చేతిలో పాకిస్తాన్ దారుణ ఓటమి చవిచూసిన సంగతి తెలిసిందే. 8 వికెట్ల తేడాతో ఓడి ఘోర పరాభవం మూటకట్టుకున్న పాకిస్తాన్‌పై మాజీలతో పాటు అభిమానులు తీవ్ర విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ఈ జాబితాలో తాజాగా పాకిస్తాన్ మాజీ కెప్టెన్ వసీం అక్రమ్ చేరాడు. ఆఫ్ఘనిస్తాన్ చేతిలో ఓటమి పాలవ్వడం నిజంగా సిగ్గు చేటు అని అక్రమ్ మండి పడ్డాడు. కాగా వన్డే క్రికెట్ చరిత్రలో ఆఫ్గానిస్తాన్ చేతిలో పాకిస్తాన్ ఓడిపోవడం ఇదే తొలి సారి. ఇక ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్ బౌలింగ్‌తో పాటు ఫీల్డింగ్‌లో చెత్త ప్రదర్శన కనబరిచింది. అదే విధంగా ఆటగాళ్ల ఫిట్నెస్ లెవల్స్ కూడా మరీ దారుణంగా ఉన్నాయి. "ఆఫ్గానిస్తాన్ వంటి జట్టు చేతిలో ఓడిపోవడం చాలా అవమానకరం. 280 పరుగుల పైగా టార్గెట్‌ను కేవలం 2 వికెట్లు కోల్పోయి ఛేదించడమంటే సాధారణ విషయం కాదు. పిచ్ ఎలా ఉందన్న విషయం పక్కన పెట్టండి. పాక్ ఫీల్డింగ్ చూస్తే వీళ్ల ఫిట్నెస్ లెవెల్స్ ఎలా ఉన్నాయో తెలిసిపోతుంది. గత రెండేళ్లగా ఆటగాళ్లకు ఫిట్నెస్ పరీక్షలు కూడా నిర్వహించలేదు. ఇదే విషయం మనం చాలా సార్లు చర్చించుకున్నాం. ప్రస్తుత జట్టులో ఫిట్నెస్ లేని క్రికెటర్లు చాలా మంది ఉన్నారు. ఇక్కడ పేర్లు ప్రస్తావిస్తే వారికి నచ్చదు. వారు రోజుకు 8 కేజీల చొప్పున మటన్ తింటున్నట్టు ఉంది. ఆటగాళ్లకు కచ్చితంగా ఫిట్నెస్ పరీక్షలు నిర్వహించాలి. మీరు మీ ప్రోపిషన్ పరంగా దేశం కోసం ఆడుతున్నారు. మీరు మంచిగా ఆడేందుకే జీతం ఇస్తున్నారు. మిస్బా ఉల్ హక్ కోచ్‌గా ఉన్నప్పుడు ఆటగాళ్లకు ఫిట్నెస్ పరీక్షలు నిర్వహించేవాడు. అతడికి అటువంటి ప్రమాణాలు ఉన్నాయి. అతడు అన్ని విషయాల్లో కచ్చితంగా ఉంటాడు కాబట్టి పాక్ ఆటగాళ్లు అసహ్యించుకునేవారు. ఫిట్నెస్ అనేది జట్టుకు చాలా కీలకం. ఫిట్నెస్ ఉంటే ఫీల్డింగ్‌లో కూడా రాణించగలరు" అని ఏ1 స్పోర్ట్స్‌లో అక్రమ్ పేర్కొన్నాడు. చదవండి: World Cup 2023: అఫ్గానిస్తాన్ సంచలనాల వెనుక ఇండియన్ లెజెండ్.. ఎవరంటే? -
అఫ్గానిస్తాన్ సంచలనాల వెనుక ఇండియన్ లెజెండ్.. ఎవరంటే?
అఫ్గానిస్తాన్.. వన్డే ప్రపంచకప్-2023లో పెను సంచలనాలు నమోదు చేస్తోంది. ఎటువంటి అంచనాలు లేకుండా అండర్ డాగ్స్‌గా బరిలోకి దిగిన అఫ్గాన్.. వరల్డ్‌క్లాస్ జట్లకు చుక్కలు చూపిస్తోంది. ఈ మెగా టోర్నీలో మొన్నటికి మొన్న డిఫెండింగ్ ఛాంపియన్స్ ఇంగ్లండ్‌ను మట్టికరిపించిన ఆఫ్గాన్స్.. ఇప్పుడు పాకిస్తాన్‌ను చిత్తు చేశారు. ధర్మశాల వేదికగా పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో 8 వికెట్లతో తేడాతో ఆఫ్టానిస్తాన్ విజయం సాధించింది. వన్డే క్రికెట్లో పాకిస్థాన్‌పై అఫ్గానిస్థాన్‌కు ఇదే తొలి విజయం కావడం విశేషం ఈ విజయంతో అఫ్గాన్ తాము పసికూనలు కాదని క్రికెట్ ప్రపంచానికి చాటిచెప్పింది. అయితే అఫ్గాన్ చరిత్రాత్మక విజయాల వెనక భారతీయుడి పాత్ర ఉందన్న సంగతి మీకు తెలుసా? ఈ మెగా టోర్నీకి ముందు కేవలం వారం రోజుల ముందే జట్టుతో కలిసిన అతడు.. ఆఫ్గాన్‌ను పసికూనలా కాదు పులిలా తాయారు చేశాడు. అతడో ఎవరో కాదు భారత క్రికెట్ దిగ్గజం అజేయ్ జడేజా. వన్డే ప్రపంచకప్-2023కు ముందు అజేయ్ జడేజాను తమ జట్టు మోంటార్, అస్టెంట్ కోచ్‌గా ఆఫ్గాన్ క్రికెట్ బోర్డు నియమించింది. భారత్ పిచ్‌లు, వాతావరణ పరిస్థితులపై మంచి అవగాహన ఉన్న అజయ్ జడేజా సాయంతో ప్రణాళికలను సిద్దం చేసుకొని అఫ్గాన్ బరిలోకి దిగుతోంది. జడేజా ఎంట్రీ.. అఫ్గాన్స్ అదుర్స్ జడేజా మెంటార్‌గా తన బాధ్యతలు చేపట్టనప్పటినుంచి ఆఫ్గానిస్తాన్ జట్టు అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తోంది. ఒకట్రెండు మ్యాచ్‌లు మినహా మిగితా అన్నింటిల్లోనూ ప్రత్యర్ధి జట్లకు గట్టిపోటి ఇచ్చింది. ఇంగ్లండ్ వంటి వరల్డ్‌క్లాస్ జట్టుకే ఆఫ్గానిస్తాన్ చుక్కలు చూపించింది. రాబోయే రోజుల్లో ఆఫ్గాన్ జడేజా నేతృత్వంతో మరింత రాటుదేలే అవకాశం ఉంది. జడేజా తన అనుభవంతో మరిన్ని సంచలానాలు సృష్టించేలా ఆఫ్గాన్స్ను తాయారు చేస్తాడని క్రికెట్ నిపుణులు జోస్యం చెబుతున్నారు. టీమిండియాలో పవర్ హిట్టర్.. భారత క్రికెట్ చరిత్రలో అజయ్ జడేజాకు పవర్ హిట్టర్‌గా పేరుంది. ఎన్నో మ్యాచ్‌లను జడేజా ఒంటి చేత్తో గెలిపించాడు. మూడు వరల్డ్‌కప్‌లు టోర్నీలు ఆడిన భారత జట్టులొ జడేజా సభ్యునిగా ఉన్నాడు. జడేజా తన కెరీర్లో 196 వన్డేలు, 15 టెస్టుల్లో భారత్‌కు ప్రాతినిథ్యం వహించాడు. టెస్టుల్లో 576 పరుగులు చేసిన జడేజా.. వన్డేల్లో 5359 పరుగులు ఉన్నాయి. 13 వన్డేల్లో భారత జట్టు కెప్టెన్‌గా కూడా వ్యవహరించాడు. పాకిస్తాన్‌పై సూపర్ రికార్డు.. అజేయ్ జడేజాకు పాకిస్తాన్‌పై మంచి రికార్డు ఉంది. పాకిస్తాన్ అంటే జడేజాకు పూనకలే. మొత్తంగా పాక్‌పై 40 మ్యాచ్‌లు ఆడిన అజయ్ 892 పరుగులు చేశాడు. బౌలర్‌గా రెండు వికెట్లు తీశాడు. తన అనుభవాన్ని ఆఫ్గాన్ యువ క్రికెటర్లు పంచిన అజేయ్.. పాకిస్తాన్‌ను చిత్తు కావడానికి పరోక్షంగా కారణమయ్యాడు. చదవండి: చరిత్ర సృష్టించడానికే వచ్చాం.. నేను ముందే చెప్పా: అఫ్గాన్ కెప్టెన్ -
మీకెందుకు వరల్డ్‌కప్.. వెంటనే ఫ్లైట్ ఎక్కి వచ్చేయండి! పాక్‌పై సెటైర్లు
వన్డే ప్రపంచకప్-2023లో పాకిస్తాన్ వరుసగా మూడో ఓటమి చవిచూసింది. ఈ మెగా ఈవెంట్లో భాగంగా సోమవారం చెన్నై వేదికగా అఫ్గానిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో పాకిస్తాన్ చిత్తు అయింది. తొలుత బ్యాటింగ్‌లో పర్వాలేదనపించిన పాకిస్తాన్.. బౌలింగ్‌లో మాత్రం పూర్తిగా తేలిపోయింది. 283 పరుగుల లక్ష్యాన్ని అఫ్గాన్ కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. ఇక్కడే మనం అర్ధం చేసుకోవచ్చు పాక్ బౌలర్లు తీరు ఎలా ఉందో. షాహీన్ అఫ్రిది, హ్యారీస్ రవూఫ్ వంటి వరల్డ్‌క్లాస్ బౌలర్లకు ఆఫ్గాన్ బ్యాటర్లు చుక్కలు చూపించాడు. కాగా ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 282 పరుగులు చేసింది. పాక్ బ్యాటర్లలో కెప్టెన్ బాబర్ ఆజం(74) హాఫ్ సెంచరీతో రాణించాడు. పాకిస్తాన్ జట్టుపై ట్రోల్స్.. ఈ ఓటమితో పాకిస్తాన్ తమ సెమీస్ అవకాశాలను సంక్లిష్టం. చేసుకుంది. ఇప్పటివరకు ఐదు మ్యాచ్‌లు ఆడిన బాబర్ సేన.. రెండు విజయాలతో పాయింట్ల పట్టికలో ఐదో స్ధానంలో ఉంది. ఇక పసికూన అఫ్గాన్ చేతిలో ఓటమిని పాక్ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. సోషల్ మీడియా వేదికగా తమ జట్టును దారుణంగా ట్రోలు చేస్తున్నారు. మీకెందుకు ఇంకా ఆట.. వెంటనే ఫ్లైట్ ఎక్కి పాకిస్తాన్ వచ్చేయండి అంటూ ఓ యూజర్ ఎక్స్(ట్విటర్)లో రాసుకొచ్చాడు. కాగా పాకిస్తాన్ తమ తదుపరి మ్యాచ్‌లో ఆక్టోబర్ 27న దక్షిణాఫ్రికాతో తలపడనుంది. చదవండి: LIVE result of #PAKvsAFG match. pic.twitter.com/2JdLI7877r — Krishna (@Atheist_Krishna) October 23, 2023 #PAKvAFG Ajay Jadeja looks enjoying Pakistan's downfall!! Looks like he played his part perfectly as mentor #PAKvsAFG pic.twitter.com/PAHMa7lKYE — Kohli Das 👌👑⭐ (@kingsuper1816) October 23, 2023 -
చరిత్ర సృష్టించడానికే వచ్చాం.. నేను ముందే చెప్పా: అఫ్గాన్ కెప్టెన్
వన్డే ప్రపంచకప్-2023లో అఫ్గానిస్తాన్ మరో సంచలన విజయం సాధించింది. ఈ మెగా టోర్నీలో భాగంగా చెన్నై వేదికగా జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్‌ను 8 వికెట్ల తేడాతో అఫ్గాన్ చిత్తు చేసింది. అంతర్జాతీయ వన్డేల్లో పాక్‌పై అఫ్గాన్‌కు ఇదే తొలి విజయం. ఈ చారిత్రత్మక విజయంలో అఫ్టాన్ బ్యాటర్లు గుర్బాజ్(65), ఇబ్రహీం జద్రాన్(87), రెహమత్ షా(77) పరుగులతో కీలక పాత్ర పోషించారు. ముఖ్యంగా 283 పరుగుల లక్ష్య ఛేదనలో ఆఫ్గాన్ ఓపెనర్లు గుర్బాజ్, ఇబ్రహీం జద్రాన్ 130 పరుగుల అద్భుతమైన భాగస్వామ్యం అందించారు. ఆ తర్వాత రెహమత్ షా, కెప్టెన్ షాహిది మ్యాచ్‌ను ఫినిష్ చేశారు. పాకిస్తాన్ బౌలర్లలో షాహీన్ అఫ్రిది, హసన్ అలీ తలా వికెట్ సాధించారు. ఇక ఈ అద్బుత విజయంపై మ్యాచ్ అనంతరం అఫ్గానిస్తాన్ కెప్టెన్ షాహిది స్పందిచాడు. ఈ మ్యాచ్‌లో తమ జట్టు ఆల్‌రౌండ్ ప్రదర్శన పట్ల సంతోషం వ్యక్తం చేశాడు. "ఈ విజయం మాకెంతో ప్రత్యేకం. మేము చాలా ప్రొఫెషనల్‌గా ఛేజ్ చేశాం. ఈ మ్యాచ్‌లో మా జట్టు ప్రదర్శన పట్ల చాలా సంతోషంగా ఉంది. టోర్నీలో మిగిలిన మ్యాచ్‌ల కోసం అతృతగా ఎదురుచూస్తున్నాము. ఇదే ఆట తీరును మా తదుపరి మ్యాచ్‌ల్లో కూడా కొనసాగిస్తాము. మేము గత రెండేళ్లుగా క్వాలిటీ క్రికెట్ ఆడుతున్నాం. ఆసియాకప్‌లో కూడా మేము మంచి క్రికెట్ ఆడాం. దురదృష్టవశాత్తూ టోర్నీ నుంచి బయటకు వచ్చాం. కానీ అదే పట్టుదలో భారత్‌కు వచ్చాం. మా దేశ ప్రజల కోసం ఈ టోర్నీని చరిత్రాత్మకం చేస్తామని ముందే చెప్పా. అందులో భాగాంగానే తొలుత ఇంగ్లండ్‌ను చిత్తు చేశాం.. ఇప్పుడు పాకిస్తాన్‌ను ఓడించాం. ఈ టోర్నీ అసాంతం ఇదే దృక్పథంతో ఆడుతాం. మా స్పిన్నర్లు అద్భుతంగా రాణించారు. నూర్ అహ్మద్‌పై నమ్మకంతో ఈ మ్యాచ్‌లో అవకాశం ఇచ్చాం. అతడు మా నమ్మకాన్ని వమ్ము చేయలేదు. తన టాలెంట్ ఎంటో చూపించాడు. ఇక గుర్భాజ్, ఇబ్రహీం ఇన్నింగ్స్ ప్రారంభించిన విధానం గురించి ఎంత చెప్పుకున్న తక్కువే. ఆట ప్రారంభం నుంచి చివరి వరకు మా చేతిలోనే ఉంది. నేను రహమత్ కలిసి మ్యాచ్ విన్నింగ్ భాగస్వామ్యం నెలకొల్పడం ఆనందంగా ఉందని" పోస్ట్‌మ్యాచ్ ప్రేజేంటేషన్‌లో షాహిది పేర్కొన్నాడు. చదవండి: AFG vs PAK: చాలా బాధగా ఉంది.. అదే మా కొంపముంచింది! క్రెడిట్ మాత్రం వారికే: బాబర్ ఆజం -
చాలా బాధగా ఉంది.. అదే మా కొంపముంచింది! క్రెడిట్ మాత్రం వారికే: బాబర్ ఆజం
వన్డే ప్రపంచకప్-2023లో పాకిస్తాన్‌కు ఘోర పరాభవం ఎదురైంది. ఈ మెగా టోర్నీలో భాగంగా సోమవారం చెన్నై వేదికగా ఆఫ్గానిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో పాకిస్తాన్ ఓటమి పాలైంది. 283 పరుగుల లక్ష్యాన్ని కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి ఆఫ్గానిస్తాన్ విజయం సాధించింది. అంతర్జాతీయ వన్డేల్లో పాక్‌పై ఆఫ్గాన్‌కు ఇదే తొలి విజయం కావడం విశేషం. ఆఫ్గాన్ విజయంలో గుర్బాజ్(65), ఇబ్రహీం జద్రాన్(87), రెహమత్ షా(77) పరుగులతో కీలక పాత్ర పోషించారు. కాగా ఈ మెగా టోర్నీలో పాక్‌కు ఇది వరుసగా మూడో ఓటమి కావడం గమానార్హం. ఇక ఆఫ్గాన్‌పై ఓటమిపై మ్యాచ్ అనంతరం పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజం స్పందించాడు. తమ ఓటమికి కారణం బౌలర్ల వైఫల్యమనేని బాబర్ అన్నాడు. "ఈ మ్యాచ్‌లో ఓటమి మాకు చాలా బాధ కలిగించింది. ముందు బ్యాటింగ్‌లో మంచి టార్గెట్‌ను సెట్ చేశాము. కానీ మా బౌలర్లు విఫలమయ్యారు. ముఖ్యంగా మిడిల్ ఓవర్లలో వికెట్లు తీయలేకపోయారు. మా స్పిన్నర్లు కూడా పెద్దగా ప్రభావితం చేయలేదు. బ్యాటర్లపై ఏమాత్రం ఒత్తిడి తీసుకుని రాలేకపోయారు. ప్రపంచకప్ వంటి మెగా టోర్నీలో ఏ ఒక్క విభాగంలో రాణించకపోయినా మ్యాచ్ ఓడిపోతాం. అది బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ అయినా కావచ్చు. ఈ రోజు ఫీల్డింగ్‌లో కూడా మేము మెరుగ్గా రాణించలేకపోయాం. మేము బౌండరీలు ఆపలేదు, అదనపు పరుగులు కూడా సమర్పించుకున్నాం. అదే మా కొంపముంచింది. కానీ ఆఫ్గానిస్తాన్ మాత్రం అద్భుతమైన క్రికెట్ ఆడింది. కాబట్టి క్రెడిట్ వారికే ఇవ్వాలనకుంటున్నాను. వారు మూడు విభాగాల్లోనూ అద్భుతంగా రాణించారు. అందుకే విజయం సాధించారు. మా తదుపరి మ్యాచ్‌ల్లో మరింత మెరుగ్గా రాణించేందుకు ప్రయత్నిస్తామని పోస్ట్‌మ్యాచ్ ప్రేజేంటేషన్‌లో బాబర్ పేర్కొన్నాడు. చదవండి: ODI WC 2023 PAK Vs AFG: పాకిస్తాన్ పై అఫ్గాన్ సంచలన విజయం -
హాఫ్ సెంచరీతో చెలరేగిన బాబర్ ఆజం.. ఆఫ్గాన్ టార్గెట్ 283 పరుగులు
వన్డే ప్రపంచకప్-2023లో భాగంగా చెన్నై వేదికగా ఆఫ్గానిస్తాన్, పాకిస్తాన్ జట్లు తలపడతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 282 పరుగులు చేసింది. పాక్ బ్యాటర్లలో కెప్టెన్ బాబర్ ఆజం హాఫ్ సెంచరీతో చెలరేగాడు. ఈ మ్యాచ్‌లో 92 బంతులు ఎదుర్కొన్న బాబర్.. 4 ఫోర్లు, 1 సిక్స్‌తో 74 పరుగులు చేశాడు. అతడితో పాటు అబ్దుల్లా షఫీక్(58), ఇఫ్తికర్ అహ్మద్(40), షాదాబ్ ఖాన్(40) పరుగులతో రాణించాడు. ఆఫ్గాన్ బౌలర్లలో నూర్ అహ్మద్ మూడు వికెట్లు తీయగా.. నవీన్ ఉల్ హక్ రెండు అజ్మతుల్లా, నబీ తలా వికెట్ సాధించారు. -
ఆఫ్గానిస్తాన్‌తో మ్యాచ్.. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాక్
వన్డే ప్రపంచకప్-2023లో భాగంగా చెన్నై వేదికగా పాకిస్తాన్-న్యూజిలాండ్ జట్లు తలపడతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పాకిస్తాన్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. సెమీస్ రేసులో నిలవాలంటే పాక్‌కు ఈ మ్యాచ్ చాలా కీలకం. ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్ ఒకే మార్పుతో బరిలోకి దిగింది. ఆల్‌రౌండర్ మహ్మద్ నవాజ్ స్ధానంలో షాదాబ్ ఖాన్ జట్టులోకి వచ్చాడు. మరోవైపు ఆఫ్గానిస్తాన్ కూడా తమ జట్టులో ఒక మార్పు చేసింది. ఫారూఖీ స్ధానంలో స్పిన్నర్ నూర్ ఆహ్మద్‌కు చోటు దక్కింది. కాగా ఈ మ్యాచ్‌లో ఆఫ్గానిస్తాన్ నలుగురు స్పిన్నర్లతో బరిలోకి దిగడం గమానర్హం. తుది జట్లు ఆఫ్ఘనిస్తాన్ : రహ్మానుల్లా గుర్బాజ్, ఇబ్రహీం జద్రాన్, రహ్మత్ షా, హష్మతుల్లా షాహిదీ(కెప్టెన్), అజ్మతుల్లా ఒమర్జాయ్, ఇక్రమ్ అలీఖిల్(వికెట్ కీపర్), మహ్మద్ నబీ, రషీద్ ఖాన్, ముజీబ్ ఉర్ రహ్మాన్, నవీన్-ఉల్-హక్, నూర్ అహ్మద్ పాకిస్తాన్ : అబ్దుల్లా షఫీక్, ఇమామ్-ఉల్-హక్, బాబర్ ఆజం(కెప్టెన్), మహ్మద్ రిజ్వాన్(వికెట్ కీపర్), సౌద్ షకీల్, ఇఫ్తీకర్ అహ్మద్, షాదాబ్ ఖాన్, ఉసామా మీర్, షాహీన్ అఫ్రిది, హసన్ అలీ, హరీస్ రవూఫ్ చదవండి: చాలా సంతోషంగా ఉంది.. చిన్న చిన్న తప్పులు సహజం! అతడొక మాస్టర్ క్లాస్: రోహిత్ శర్మ -
ఆఫ్గానిస్తాన్‌తో మ్యాచ్.. పాకిస్తాన్ గెలవడం కష్టమే! ఒక వేళ అది జరిగితే
వన్డే ప్రపంచకప్-2203లో వరుసగా రెండు ఓటములు చవిచూసిన పాకిస్తాన్.. ఇప్పుడు మరో ఆసియా జట్టుతో తలపడేందుకు సిద్దమైంది. ఈ మెగా టోర్నీలో భాగంగా ఆక్టోబర్ 23న చెన్నై వేదికగా ఆఫ్గానిస్తాన్‌తో పాక్ అమీతుమీ తెల్చుకోనుంది. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి తిరిగి కమ్‌బ్యాక్ ఇవ్వాలని బాబర్ సేన భావిస్తోంది. మరోవైపు ఈ టోర్నీలో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్‌కే షాకిచ్చిన ఆఫ్గాన్.. పాకిస్తాన్‌ను కూడా మట్టి కరిపించాలని వ్యూహాలు సిద్దం చేస్తోంది. ఈ మ్యాచ్ నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ ఆటగాడు రమీజ్ రజా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. చెపాక్ వేదికగా జరగనున్న ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్ కంటే ఆఫ్గానిస్తాన్ కాస్త ఫేవరెట్‌గా కన్పిస్తోంది అని రమీజ్ రాజా అభిప్రాయపడ్డాడు. "పాకిస్తాన్ తిరిగి కోలుకోవడం చాలా కష్టం. చెన్నైలో ఆఫ్గానిస్తాన్‌తో జరగనున్న మ్యాచ్‌లో ఎదైనా జరగవచ్చు. ఆఫ్గానిస్తాన్ స్పిన్నర్లను మా బ్యాటర్లు ఎలా ఎదుర్కొంటారన్నది వేచి చూడాలి. ఒక వేళ పిచ్ స్పిన్నర్లకు అనుకూలిస్తే పాకిస్తాన్‌పై ఆఫ్గాన్ కచ్చితంగా పై చేయి సాధిస్తుంది. అదే వికెట్‌పై ఇంగ్లండ్‌పై ఆఫ్గాన్ ఏమి చేసిందే మనం చూశామని" తన యూట్యూబ్ ఛానల్లో రమీజ్ రజా పేర్కొన్నాడు. కాగా అంతర్జాతీయ వన్డేల్లో పాకిస్తాన్‌పై ఆఫ్గానిస్తాన్ ఇప్పటివరకు ఒక్కసారి కూడా విజయం సాధించలేదు. ఇరు జట్లు ముఖాముఖి 7 సార్లు తలపడగా.. అన్ని మ్యాచ్‌ల్లోనూ పాకిస్తానే విజయం సాధించింది. అయితే చాలాసార్లు మాత్రం పాకిస్తాన్‌కు ఆఫ్గాన్ గట్టిపోటీ ఇచ్చింది. చదవండి: IND vs NZ WC 2023: టీమిండియాతో మ్యాచ్.. న్యూజిలాండ్‌కు గుడ్ న్యూస్! -
పాకిస్తాన్‌కు ఘోర ఓటమి.. ఫైనల్లో టీమిండియాతో అఫ్గన్
Asian Games Mens T20I 2023- Pakistan vs Afghanistan, Semi Final 2: ఆసియా క్రీడలు-2023లో పాకిస్తాన్‌కు ఘోర ఓటమి ఎదురైంది. సెమీ ఫైనల్లో అఫ్గనిస్తాన్ చేతిలో 4 వికెట్ల తేడాతో ఓడిపోయిన పాక్ జట్టుకు చేదు అనుభవం మిగిలింది. గోల్డ్ మెడల్ రేసు నుంచి పాక్ క్రికెట్ బృందం నిష్క్రమించింది. మరోవైపు.. అఫ్గన్ టీమ్ ఈ విజయంతో ఫైనల్‌కు అర్హత సాధించింది. తద్వారా పటిష్ట టీమిండియాతో ఫైనల్లో స్వర్ణ పతకం కోసం పోటీపడే సువర్ణావకాశం దక్కింది. 115 పరుగులకే ఆలౌట్ చైనాలోని హోంగ్జూలో 19వ ఆసియా క్రీడలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో శుక్రవారం నాటి రెండో సెమీఫైనల్లో పిన్ఫెంగ్ క్యాంపస్ క్రికెట్ ఫీల్డ్ వేదికగా పాకిస్తాన్- అఫ్గనిస్తాన్ పోటీపడ్డాయి. టాస్ గెలిచిన అఫ్గన్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో పాకిస్తాన్ 18 ఓవర్లకే చాపచుట్టేసింది. అఫ్గనిస్తాన్ బౌలర్ల ధాటికి కేవలం 115 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయింది. పాక్ ఇన్నింగ్స్‌లో ఓపెనర్ ఒమైర్ యూసఫ్ 24 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అఫ్గన్ బౌలర్లలో కెప్టెన్ గులాబదిన్, కరీం జనత్ ఒక్కో వికెట్ తీయగా.. ఫరీద్ అహ్మద్ అత్యధికంగా మూడు వికెట్లు పడగొట్టాడు. కెప్టెన్ ఇన్నింగ్స్‌తో ఫైనల్‌కు చేర్చి కైస్ అహ్మద్, జహీర్ ఖాన్ రెండేసి వికెట్లు కూల్చారు. ఇక స్వల లక్ష్యంతో బరిలోకి దిగిన అఫ్గనిస్తాన్‌కు ఆరంభంలోనే షాక్ తగిలింది. ఓపెనర్లు సెదీకుల్హా అటల్ 5, మహ్మద్ షాజాద్ 9 పరుగులకే అవుటయ్యారు. ఈ క్రమంలో వన్‌డౌన్ బ్యాటర్ నూర్ అలీ జద్రాన్ 39 పరుగులతో రాణించగా.. ఏడోస్థానంలో వచ్చిన గులాబిదిన్ 19 బంతుల్లో 26 పరుగులతో అజేయంగా నిలిచి కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. 18వ ఓవర్ ఆఖరి బంతికి ఫోర్ బాది అఫ్గనిస్తాన్‌ను ఫైనల్‌కు చేర్చాడు. పసిడి కోసం టీమిండియాతో పోటీ ఇక పాక్‌తో మ్యాచ్‌లో 13 బంతులు మిగిలి ఉండగానే 4 వికెట్ల తేడాతో గెలుపొందిన అఫ్గనిస్తాన్ ఫైనల్లో టీమిండియాను ఢీకొట్టనుంది. రుతురాజ్ గైక్వాడ్ సేనతో శనివారం(అక్టోబరు 7) అమీతుమీ తేల్చుకోనుంది. భారత కాలమానం ప్రకారం ఈ మ్యాచ్ ఉదయం 11.30 నిమిషాలకు ఆరంభమవుతుంది. కాంస్యం కోసం బంగ్లాతో పాక్ పోరు కాగా మొదటి సెమీ ఫైనల్లో బంగ్లాదేశ్‌ను ఓడించి టీమిండియా గోల్డ్ మెడల్ రేసుకు అర్హత సాధించిన విషయం తెలిసిందే. మరోవైపు.. సెమీస్ ఫైనల్స్‌లో ఓడిన బంగ్లాదేశ్, పాకిస్తాన్ మధ్య శనివారం ఉదయం 6.30 గంటలకు కాంస్య పతక పోరు మొదలుకానుంది. చదవండి: ఇంగ్లండ్‌కే చుక్కలు చూపించాడు.. ఎవరీ రచిన్ రవీంద్ర? భారత్‌తో సంబంధం ఏంటి? -
చరిత్ర సృష్టించిన ఆఫ్గాన్ ఆటగాడు.. వన్డేల్లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ!
ఆఫ్గానిస్తాన్ ఆటగాడు, స్టార్ స్పిన్నర్ ముజీబ్ ఉర్ రెహ్మాన్ అరుదైన ఘనత సాధించాడు. వన్డేల్లో అత్యంత వేగంగా హాఫ్‌సెంచరీ చేసిన తొలి ఆఫ్గాన్ క్రికెటర్‌గా ముజీబ్ రికార్డులకెక్కాడు. కొలాంబో వేదికగా పాకిస్తాన్‌తో జరిగిన మూడో వన్డేలో 26 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసిన ముజీబ్.. ఈ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ఈ మ్యాచ్‌లో 269 పరుగుల లక్ష్య ఛేదనలో ఆఫ్గానిస్తాన్ కేవలం 97 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ సమయంలో 9వ స్ధానంలో బ్యాటింగ్‌కు వచ్చిన ముజీబ్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. పాక్ బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. 37 బంతులు ఎదుర్కొన్న ముజీబ్ 5 ఫోర్లు, 5 సిక్స్‌లతో 64 పరుగులు చేశాడు. అదే విధంగా మరోరికార్డును కూడా ముజీబ్ తన పేరిట లిఖించుకున్నాడు. వన్డేల్లొ పాకిస్తాన్‌పై తొమ్మిదో స్ధానంలో బ్యాటింగ్‌కు వచ్చి అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా ముజీబ్ చరిత్ర సృష్టించాడు. ఈ క్రమంలో శ్రీలంక వికెట్ కీపర్- బ్యాటర్ అటెర్ గై డి అల్విస్ రికార్డును ముజీబ్ బ్రేక్ చేశాడు. 1983 ప్రపంచ కప్‌లో ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని పాక్‌పై 56 బంతుల్లో 59 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. తాజా మ్యాచ్‌లో 64 పరుగులు చేసిన ముజీబ్.. 40 ఏళ్ల అల్విస్ రికార్డును బద్దలు కొట్టాడు. ఇక ఈ మ్యాచ్‌లో ముజీబ్ దురదృష్టవశాత్తూ హిట్‌వికెట్‌గా వెనుదిరిగాడు. తద్వారా వన్డేల్లో హిట్‌వికెట్‌గా వెనుదిరిగిన తొలి ఆఫ్గాన్ క్రికెటర్‌గా చెత్త రికార్డును కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. చదవండి: నా కూతురు ఫీజు కూడా కట్టలేకపోయా.. కన్నీళ్లు పెట్టుకున్న స్టార్ క్రికెటర్ Mujeeb Ur Rahman smashes fastest ODI fifty for Afghanistan in just 26 balls 💪#AFGvsPAK pic.twitter.com/UH631kKngj — FanCode (@FanCode) August 26, 2023 -
ఏదో ఒకరోజు నాకు గుండెపోటు మాత్రం రావొద్దు: పాక్ యువ పేసర్
Pakistan Star Big Statement: నరాలు తెగే ఉత్కంఠ రేపిన మ్యాచ్.. ఆఖరి వరకు విజయం ఎవరిదో తేలని సందర్భాల్లో తరచూ వాడే పదం.. చూసే ప్రేక్షకులకే ఇలా ఉంటే.. మరి మైదానంలో స్వతహాగా ఆ పరిస్థితిని ఎదుర్కొంటున్న ఆటగాళ్లకు ఎలా ఉంటుంది! ఎవరి సంగతి ఎలా ఉన్నా తనకైతే గుండెపోటు వచ్చినంత పని అవుతుందంటున్నాడు పాకిస్తాన్ యువ సంచలనం నసీం షా. శ్రీలంక వేదికగా అఫ్గనిస్తాన్‌తో పాకిస్తాన్ మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ఆడుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా తొలి మ్యాచ్‌లో 142 పరుగులతో జయభేరి మోగించిన బాబర్ ఆజం బృందం.. రెండో మ్యాచ్‌లో మాత్రం విజయం కోసం చెమటోడ్చాల్సి వచ్చింది. ఓపెనర్లు అదరగొట్టడంతో హొంబన్టోట వేదికగా గురువారం జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచిన అఫ్గనిస్తాన్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్లు రహ్మనుల్లా గుర్బాజ్ 151 పరుగులు, ఇబ్రహీం జర్దాన్ 80 పరుగులతో చెలరేగడంతో భారీ స్కోరు సాధించింది. నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 300 పరుగులు చేసింది. ఇక లక్ష్య ఛేదనకు దిగిన పాకిస్తాన్‌కు ఓపెనర్ ఇమామ్-ఉల్- హక్(91) శుభారంభం అందించగా.. మిడిలార్డర్ విఫలం కావడంతో కష్టాలు తప్పలేదు. ఈ క్రమంలో ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్ చేసిన షాదాబ్ ఖాన్ 48 పరుగులతో రాణించి ఇన్నింగ్స్‌ను గాడినపడేశాడు. మరో బంతి మిగిలి ఉండగానే.. అయితే, ఆఖరి రెండు ఓవర్లలో పాక్ విజయానికి 27 పరుగులు అవసరం కాగా.. చివరి బంతి వరకు తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అయితే, టెయిలెండర్ నసీం షా ఆఖరి ఓవర్ ఐదో బాల్‌కు ఫోర్ బాది జట్టును విజయతీరాలకు చేర్చడంతో పాక్ కథ సుఖాంతమైంది. అఫ్గనిస్తాన్‌ను దురదృష్టం వెక్కిరించడంతో మ్యాచ్‌తో పాటు సిరీస్‌నూ కోల్పోయింది. గుండెపోటు మాత్రం రావొద్దు ఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం నసీం షా మాట్లాడుతూ.. ‘‘ఈ ఏడాది నాకు ఇన్నింగ్స్ ముగించే ఛాన్స్‌లు వస్తున్నాయి. ఏదో ఒకరోజు నాకు గుండెపోటు మాత్రం రావొద్దు. ఆ అల్లా ఆశీసులు ఇలాగే ఎల్లప్పుడూ నాపై ఉండాలి. ఆ దేవుడి దయ ఉంటే ఇలాంటి క్లిష్ట పరిస్థితులను నేను తేలికగానే అధిగమిస్తాను’’ అని వ్యాఖ్యానించాడు. కాగా పెషావర్‌కు చెందిన రైట్ ఆర్మ్ పేసర్ నసీం షా 2019లో పాకిస్తాన్ తరఫున అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. ఆసియా కప్-2023కి ముందు ఇప్పటి వరకు మొత్తంగా 17 టెస్టుల్లో 51, 10 వన్డేల్లో 25, 19 టీ20లలో 15 వికెట్లు పడగొట్టాడు. ఇదిలా ఉంటే.. అఫ్గనిస్తాన్‌తో సిరీస్ ముగిసిన తర్వాత పాక్ ఆసియా కప్-2023కి సన్నద్ధమవుతుంది. ఈ మెగా టోర్నీకి ప్రకటించిన జట్టులో 20 ఏళ్ల నసీం షా కూడా సభ్యుడు. కీలక ఈవెంట్‌కు ముందు నసీం చేసిన తాజా కామెంట్ నెట్టింట వైరల్‌గా మారింది. ఇప్పుడే భయపడితే ఎలా.. ముందుంది ముసళ్ల పండుగ అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. చదవండి: కోహ్లి కాదు! వరల్డ్‌కప్ అంటే అతడికి ఊపొస్తుంది.. టాప్ స్కోరర్ తనే: సెహ్వాగ్ -
చరిత్ర సృష్టించిన ఆఫ్గానిస్తాన్ ఓపెనర్.. సచిన్ ప్రపంచ రికార్డు బద్దలు
ఆఫ్గానిస్తాన్ స్టార్ ఓపెనర్ రహ్మానుల్లా గుర్బాజ్ అరుదైన ఘనత సాధించాడు. 21 ఏళ్ల వయస్సులో అంతర్జాతీయ వన్డేల్లో అత్యధిక సెంచరీలు సాధించిన మూడో క్రికెటర్‌గా గుర్బాజ్ రికార్డులకెక్కాడు. హంబన్‌టోటా వేదికగా పాకిస్తాన్‌తో జరిగిన రెండో వన్డేలో సెంచరీతో చెలరేగిన గుర్బాజ్.. ఈ అరుదైన ఫీట్‌ను తన పేరిట లిఖించకున్నాడు. ఇప్పటివరకు వన్డేల్లో గుర్బాజ్ 5 సెంచరీలు సాధించాడు. ఈ క్రమంలో భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ రికార్డును గుర్బాజ్ బ్రేక్ చేశాడు. సచిన్ తన 21 ఏళ్ల వయస్సులో 4 వన్డే సెంచరీలు సాధించాడు. తాజా మ్యాచ్‌తో సచిన్‌ను ఈ ఆఫ్గాన్ ఓపెనర్ అధిగమించాడు. ఈ అరుదైన ఘనత సాధించిన జాబితాలో దక్షిణాఫ్రికా స్టార్ ఓపెపర్ క్వింటన్ డికాక్, శ్రీలంక మాజీ ఓపెనర్ ఉపుల్ తరంగా చెరో 6 సెంచరీలతో అగ్రస్ధానంలో సంయుక్తంగా కొనసాగుతున్నాడు. అదే విధంగా మరో అరుదైన ఘనతను కూడా గుర్భాజ్ తన ఖాతాలో వేసుకున్నాడు. అంతర్జాతీయ వన్డేల్లో అత్యంత వేగంగా 5 సెంచరీలు సాధించిన మూడో ఆటగాడిగా గుర్భాజ్ రికార్డులకెక్కాడు. గుర్బాజ్ కేవలం 23 ఇన్నింగ్స్‌లలోనే ఈ ఫీట్‌ను అందుకున్నాడు. ఈ క్రమంలో బాబర్ ఆజం రికార్డును గుర్బాజ్ బ్రేక్ చేశాడు. బాబర్ 25 ఇన్నింగ్స్‌లలో ఈ ఘనత సాధించాడు. ఈ అరుదైన ఫీట్ నమోదు చేసిన లిస్ట్‌లో క్వింటన్ డికాక్(13 ఇన్నింగ్స్‌లు), పాక్ ఓపెనర్ ఇమామ్ ఉల్ హక్(13 ఇన్నింగ్స్‌లు) తొలి రెండు స్ధానాల్లో కొనసాగుతున్నారు. చదవండి: Asia Cup 2023: విరాట్ కోహ్లికి బీసీసీఐ వార్నింగ్.. కారణమిదే! మరోసారి అలా చేయొద్దంటూ! Rahmanullah Gurbaz surpasses Babar Azam to become the 3rd fastest to 5 ODI centuries. pic.twitter.com/BX5B41b4RV — Mufaddal Vohra (@mufaddal_vohra) August 24, 2023 -
చరిత్ర సృష్టించిన బాబర్ ఆజం.. ప్రపంచంలో తొలి క్రికెటర్‌గా!
పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజం మరో అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు. అంతర్జాతీయ వన్డేల్లో 100 ఇన్నింగ్స్‌ల తర్వాత అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా బాబర్ ఆజం నిలిచాడు. గురువారం ఆఫ్గానిస్తాన్‌తో జరిగిన రెండో వన్డేతో బాబర్ తన వందో ఇన్నింగ్స్‌ను మార్క్‌ను అందుకున్నాడు. ఈ మ్యాచ్‌లో 53 పరుగులతో అదరగొట్టిన ఆజం.. ఈ అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. బాబర్ తన 100 వన్డే ఇన్నింగ్స్‌లలో 5,142 పరుగులు సాధించాడు. ఇప్పటివరకు ఈ రికార్డు దక్షిణాఫ్రికా లెజెండ్ హసీం ఆమ్లా పేరిట ఉండేది. ఆమ్లా తన వంద ఇన్నింగ్స్‌లలో 4946 పరుగులు చేశాడు. తాజా మ్యాచ్‌తో ఆమ్లా రికార్డును బాబర్ బ్రేక్ చేశాడు. బాబర్ వన్డే కెరీర్లో ఇప్పటివరకు 18 సెంచరీలు, 27 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇక అరుదైన ఘనత సాధించిన జాబితాలో బాబర్ తర్వాత స్ధానాల్లో వరుసగా ఆమ్లా(4946), వెస్టిండీస్ దిగ్గజం వివ్ రిచర్డ్స్(4607), విండీస్ కెప్టెన్(4436), ఇంగ్లండ్ స్టార్ జో రూట్(4428) కొనసాగుతున్నారు. కాగా ఈ ఫీట్ టీమిండియా స్టార్ విరాట్ కోహ్లికి కూడా సాధ్యపడలేదు. విరాట్ తన 100 వన్డే ఇన్నింగ్స్‌లలో 4230 పరుగులు చేశాడు. ఈ జాబితాలో కోహ్లి తొమ్మిదో స్ధానంలో ఉన్నాడు. ఇక మ్యాచ్ విషయానికి.. ఆఫ్గానిస్తాన్‌పై ఒక్క వికెట్ తేడాతో పాకిస్తాన్ విజయం సాధించింది. దీంతో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 2–0తో సిరీస్‌ను పాక్ సొంతం చేసుకుంది. చదవండి: #Bray Wyatt: డబ్ల్యూడబ్ల్యూఈలో తీవ్ర విషాదం.. గుండెపోటుతో సూపర్ స్టార్ మృతి -
ఓడినా.. పాకిస్తాన్‌కు చుక్కలు చూపించింది!
హంబన్‌టోటా వేదికగా జరిగిన రెండో వన్డేలో పాకిస్తాన్‌కు ఆఫ్గానిస్తాన్ చుక్కలు చూపించింది. ఆఖరి వరకు ఉత్కంఠ భరితంగా జరిగిన ఈ మ్యాచ్‌లో కేవలం ఒక్క వికెట్ తేడాతో పాకిస్తాన్ విజయం సాధించింది. చివరి రెండు ఓవర్లలో పాక్ విజయానికి 27 పరుగులు అవసరమవ్వగా.. షాదాబ్ ఖాన్, నసీం షా తమ అద్భుత ఇన్నింగ్స్‌లతో జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించారు. ఆఫ్గాన్ బౌలర్లలో ఫజల్హాక్ ఫారూఖీ మూడు వికెట్లతో అదరగొట్టాడు. దీంతో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 2–0తో సొంతం చేసుకుంది. రెండో వన్డేలో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన అఫ్గానిస్తాన్ 50 ఓవర్లలో 5 వికెట్లకు 300 పరుగులు చేసింది. ఓపెనర్ గుర్బాజ్ (151; 14 ఫోర్లు, 3 సిక్స్‌లు) సెంచరీ సాధించాడు. ఓపెనర్ ఇబ్రహీమ్ జద్రాన్ (80; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు)తో కలిసి తొలి వికెట్‌కు 227 పరుగులు జోడించాడు. అనంతరం పాకిస్తాన్ 49.5 ఓవర్లలో 9 వికెట్లకు 302 పరుగులు చేసి గెలిచింది. పాక్ బ్యాటర్లలో ఇమామ్ ఉల్ హఖ్ (91; 4 ఫోర్లు), షాదాబ్ ఖాన్ (48; 3 ఫోర్లు, 1 సిక్స్), బాబర్ ఆజమ్ (53; 6 ఫోర్లు) రాణించారు. చదవండి: Praggnanandhaa: అక్క చేసిన ఆ పని వల్లే.. ఇలా! ఆ తల్లికేమో ‘భయం’.. అందుకే తండ్రితో పాటు! -
తొలి వన్డేలో 59 పరుగులకే చిత్తు.. రెండో వన్డేలో 227/0.. ఇంతలో ఎంత మార్పు..!
ఆఫ్ఘనిస్తాన్ జట్టులో కేవలం గంటల వ్యవధిలో భారీ మార్పు వచ్చింది. మొన్న (ఆగస్ట్ 24) హంబన్‌తోటలో పాకిస్తాన్‌తో జరిగిన తొలి వన్డేలో 59 పరుగులకే చిత్తై, చెత్త రికార్డులు మూటగట్టుకున్న ఆఫ్ఘన్లు.. ఇవాళ (ఆగస్ట్ 24) అదే పాకిస్తాన్‌తో అదే హంబన్‌తోటలో జరుగుతున్న మ్యాచ్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోతూ పలు అరుదైన రికార్డులు తమ ఖాతాలో వేసుకున్నారు. ఈ మ్యాచ్‌లో ఆ జట్టు ఓపెనర్లు రహ్మానుల్లా గుర్భాజ్ (135), ఇబ్రహీమ్ జద్రాన్ (80) తొలి వికెట్‌కు ఏకంగా 227 పరుగులు జోడించి పలు రికార్డులు సొంతం చేసుకున్నారు. పాక్‌పై 100 కంటే ఎక్కువ పరుగుల భాగస్వామ్యం నమోదు చేసిన తొలి ఆఫ్ఘనిస్తాన్ ఓపెనింగ్ జోడీగా.. అలాగే ఆఫ్ఘనిస్తాన్ తరఫున వన్డేల్లో రెండు సెంచరీ భాగస్వామ్యాలు నమోదు చేసిన జోడీగా.. 2010 తర్వాత పాక్‌పై అత్యధిక ఓపెనింగ్ భాగస్వామ్యం (227) నమోదు చేసిన రెండో జోడీగా పలు రికార్డులు మూటగట్టుకుంది. ఈ మ్యాచ్‌లో సెంచరీతో చెలరేగిన రహ్మానుల్లా గుర్భాజ్.. పాకిస్తాన్‌పై వన్డే సెంచరీ చేసిన తొలి ఆప్ఘన్ ప్లేయర్‌గా చరిత్ర సృష్టించాడు. తొలి వికెట్‌కు 227 పరుగుల భారీ భాగస్వామ్యం జోడించిన అనంతరం ఉసామా మిర్ బౌలింగ్‌లో ఇఫ్తికార్ అహ్మద్‌కు క్యాచ్ ఇచ్చి జద్రాన్ (80) ఔట్ కావడంతో ఆఫ్ఘనిస్తాన్ తొలి వికెట్ కోల్పోయింది. 43 ఓవర్ల తర్వాత ఆ జట్టు వికెట్ నష్టానికి 247 పరుగులు చేసింది. గుర్భాజ్ (147), మహ్మద్ నబీ (7) క్రీజ్‌లో ఉన్నారు. తేలిపోయిన పాక్ పేసర్లు.. తొలి వన్డేలో ఆఫ్ఘన్ ప్లేయర్ పాలిట సింహస్వప్నల్లా ఉండిన పాక్ పేసర్లు ఈ మ్యాచ్‌లో తేలిపోయారు. తొలి మ్యాచ్‌లో 5 వికెట్ల ప్రదర్శనతో నిప్పులు చెరిగిన హరీస్ రౌఫ్ ఈ మ్యాచ్‌లో ధారాళంగా పరుగులు సమర్పించుకున్నాడు. షాహీన్ అఫ్రిది, నసీం షా సైతం అతన్ని ఫాలో అయ్యారు. ఈ మ్యాచ్‌లో ఈ పేస్ త్రయం ఏమాత్రం ప్రభావం చూపలేకపోయింది. -
ఆసియా కప్-2023లో టీమిండియాను ఢీకొట్టబోయే పాకిస్తాన్ జట్టు ఇదే..!
శ్రీలంక వేదికగా ఆగస్ట్ 22 నుంచి 26 వరకు ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగే 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్ కోసం.. అలాగే ఆగస్ట్ 20 నుంచి సెప్టెంబర్ 17 వరకు పాకిస్తాన్, శ్రీలంక దేశాలు సంయుక్తంగా ఆతిథ్యమిచ్చే ఆసియా కప్ వన్డే టోర్నీ కోసం పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఇవాళ (ఆగస్ట్ 9) 18 మంది సభ్యుల జట్టును ప్రకటించింది. ఈ జట్టుకు బాబర్ ఆజమ్ నాయకత్వం వహించనుండగా.. షాదాబ్ ఖాన్ వైస్ కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు. ఈ జట్టులో కొత్తగా ఫహీమ్ అఫ్రాఫ్, సౌద్ షకీల్, తయ్యబ్ తాహిర్‌లు చోటు దక్కించుకోగా.. పేలవ ఫామ్ కారణంగా షాన్ మసూద్‌పై వేటు పడింది. గాయం నుంచి ఇంకా తేరుకోని ఇహసానుల్లాను ఇంజమామ్ నేతృత్వంలోని సెలెక్టర్లు ఎంపిక చేయలేదు. ఆసియా కప్-2023, ఆఫ్ఘనిస్తాన్ సిరీస్‌కు పాక్ జట్టు.. అబ్దుల్లా షఫీక్, ఫహీమ్ అఫ్రాఫ్, ఫకర్ జమాన్, హరీస్ రౌఫ్, ఇఫ్తికార్ అహ్మద్, బాబర్ ఆజామ్ (కెప్టెన్), ఇమామ్ ఉల్ హాక్, మహ్మద్ హరీస్ (వికెట్‌కీపర్), మహ్మద్ నవాజ్, మహ్మద్ రిజ్వాన్ (వికెట్‌కీపర్), షాదాబ్ ఖాన్ (వైస్ కెప్టెన్), మహ్మద్ వసీం జూనియర్, నసీం షా, అఘా సల్మాన్, సౌద్ షకీల్, షాహీన్ అఫ్రిది, తయ్యబ్ తాహిర్, ఉసామా మీర్ ఆఫ్ఘనిస్తాన్‌తో వన్డే సిరీస్.. తొలి వన్డే (హంబన్‌తోట): ఆగస్ట్ 22 రెండో వన్డే (హంబన్‌తోట): ఆగస్ట్ 24 మూడో వన్డే (కొలొంబో): ఆగస్ట్ 26 ఆసియా కప్‌లో పాక్ మ్యాచ్‌లు.. ఆగస్ట్ 30: పాకిస్తాన్ వర్సెస్ నేపాల్ (ముల్తాన్) సెప్టెంబర్ 2: ఇండియా వర్సెస్ పాకిస్తాన్ (పల్లెకెలె) -
ఇలాంటి చెత్త పనులు చేయొద్దు: పీసీబీపై పాక్ మాజీ క్రికెటర్ ఫైర్
ICC ODI WOrld Cup 2023: పాకిస్తాన్ క్రికెట్ బోర్డు తీరుపై ఆ దేశ మాజీ క్రికెటర్ కమ్రాన్ అక్మల్ మండిపడ్డాడు. అర్థంపర్ధంలేని అభ్యర్థనలతో పరువు తీయొద్దంటూ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. దయచేసి.. ఆటగాళ్ల ఆత్మవిశ్వాసం దెబ్బతినే పనులు చేయకండని బోర్డు సభ్యులకు విజ్ఞప్తి చేశాడు. కాగా భారత్ వేదికగా వన్డే ప్రపంచకప్-2023 జరుగనున్న విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించిన షెడ్యూల్‌ను అంతర్జాతీయ క్రికెట్ మండలి మంగళవారం విడుదల చేసింది. ఈ క్రమంలో పాకిస్తాన్.. హైదరాబాద్, అహ్మదాబాద్‌లలో ఒక్కో మ్యాచ్, బెంగళూరు, చెన్నై, కోల్‌కతాలో రెండేసి మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. మారుస్తారా ప్లీజ్! అయితే, షెడ్యూల్లో భాగంగా అఫ్గనిస్తాన్‌తో చెన్నైలో, ఆస్ట్రేలియాతో బెంగళూరులో ఆడాల్సిన మ్యాచ్‌లను మార్చాల్సిందిగా పీసీబీ ఐసీసీని కోరినట్లు సమాచారం. పిచ్‌ల స్వభావం రిత్యా అఫ్గన్‌తో మ్యాచ్ బెంగళూరులో, ఆసీస్‌తో మ్యాచ్ చెన్నైలో ఆడేలా వేదికలు మార్చాలని కోరినట్లు తెలుస్తోంది. ఈ విషయంపై స్పందించిన మాజీ వికెట్ కీపర్ బ్యాటర్ కమ్రాన్ అక్మల్ పీసీబీ తీరును ఎండగట్టాడు. పాక్ టీవీతో మాట్లాడుతూ ‘‘వాతావరణ పరిస్థితులు, వేదికలు జట్ల విజయావకాశాలను ప్రభావితం చేయలేవు. ముఖ్యంగా అంతర్జాతీయ క్రికెట్లో వీటి గురించి ప్రస్తావన అనవసరం. చెత్త రిక్వెస్టులు వద్దు భారత్.. ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, న్యూజిలాండ్ వంటి జట్లను ఓడిస్తూ పోతోంది. అది వాళ్ల సత్తా. మనమేమో ఆసీస్‌తో అక్కడే ఆడతాం.. అఫ్గనిస్తాన్‌తో ఇక్కడే ఆడతామంటూ కుంటిసాకులు వెదుక్కోవడం ఎందుకు? మన దృష్టి మొత్తం కేవలం ఆట మీద మాత్రమే ఉండాలి. బోర్డు సభ్యులకు ఇదే నా విజ్ఞప్తి. దయచేసి ఇలాంటి చెత్త ప్రమాణాలతో కూడిన అభ్యర్థనలు చేయకండి. అంతర్జాతీయ క్రికెట్ విస్తృతి మరింత పెరిగింది. ఆటగాళ్లు తమ విజయాల గురించి సగర్వంగా చాటిచెప్పుకొంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో బోర్డు మాత్రం మేము ఇక్కడైతేనే ఆడి గెలవగలం అంటూ ఆటగాళ్ల ఆత్మవిశ్వాసం దెబ్బతినేలా మాట్లాడటం సరికాదు. ఇలాంటి వాటికి బోర్డు సభ్యులు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. దేశ క్రికెట్ స్థాయిని పెంచాలే గానీ తగ్గించేలా వ్యవహరించకూడదు’’ అని అక్మల్ పీసీబీని తూర్పారబట్టాడు. వరల్డ్‌కప్-2023లో పాకిస్తాన్ జట్టు మ్యాచ్‌ల షెడ్యూల్, వివరాలు: ►అక్టోబర్ 12: హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ స్టేడియంలో పాకిస్థాన్ vs క్వాలిఫయర్ 2 ►అక్టోబర్ 15: అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో పాకిస్థాన్ వర్సెస్ భారత్ ►అక్టోబర్ 20: బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో పాకిస్థాన్ vs ఆస్ట్రేలియా ►అక్టోబర్ 23: చెన్నైలోని చిదంబరం స్టేడియంలో పాకిస్థాన్ vs ఆఫ్ఘనిస్తాన్ ►అక్టోబర్ 27: చెన్నైలోని చిదంబరం స్టేడియంలో పాకిస్థాన్ vs దక్షిణాఫ్రికా ►అక్టోబర్ 31: కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో పాకిస్థాన్ vs బంగ్లాదేశ్ ►నవంబర్ 4: బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో పాకిస్థాన్ vs న్యూజిలాండ్ ►నవంబర్ 12: కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో పాకిస్థాన్ vs ఇంగ్లాండ్. చదవండి: భార్యతో టీమిండియా స్టార్ హార్దిక్ పాండ్యా.. ఫొటోలు వైరల్! మరీ.. మాకు భుజాల నొప్పులు.. ధోనికి మెకాలి సమస్య.. అసలే సచిన్ బరువు! అందుకే.. -
చారిత్రాత్మక విజయం.. ఆఫ్గన్ సుందరి మళ్లీ వచ్చేసింది
పాకిస్తాన్‌తో జరిగిన టి20 సిరీస్‌ను అఫ్గానిస్తాన్ 2-1 తేడాతో గెలిచి చారిత్రక విజయాన్ని నమోదు చేసింది. టి20ల్లో పాకిస్తాన్‌పై ఆఫ్గన్‌కు ఇదే తొలి టి20 సిరీస్ విజయం కావడం విశేషం. దీంతో అఫ్గానిస్తాన్ క్రికెట్ ప్రేమికులు చారిత్రాత్మక విజయాన్ని ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నారు. అందులో ఆఫ్గన్ సూపర్ ఫ్యాన్.. అందాల సుందరి వజ్మా ఆయూబి కూడా ఉంది. వజ్మా అయూబీ అనగానే టక్కున గుర్తొచ్చేది ఆసియా కప్ 2022.అఫ్గానిస్తాన్, బంగ్లాదేశ్ మధ్య జరిగిన మ్యాచ్‌కు వజ్మా అయూబీ హాజరైంది. ఆమె అందానికి ఆరోజు స్టేడియానికి వచ్చిన వారితో పాటు టీవీల్లో మ్యాచ్ చూసినవారు కూడా ఫిదా అయ్యారు. అంతగా కుర్రకారు మనసులు దోచుకుంది. అఫ్గానిస్తాన్ అభిమాని అయిన వాజ్మా బౌండరీ లైన్ వద్ద అఫ్గాన్ జెండా పట్టుకొని ఆటగాళ్లతో పాటు వీక్షకులను తన అందరంతో కట్టిపడేసింది. కాగా మ్యాచ్ గెలిచిన తర్వాత అఫ్గానిస్తాన్‌కు శుభాకాంక్షలు తెలుపుతూ.. ''కంగ్రాట్స్ బ్లూ టైగర్స్'' అంటూ వాజ్మా ఆయూబీ తన ట్విటర్లో పేర్కొంది. అప్పట్లో ఈ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. తాజాగా పాకిస్తాన్‌తో జరిగిన చివరి టి20 మ్యాచ్ సందర్భంగా వజ్మా అయూబీ మరోసారి ప్రత్యక్షం అయింది. తమ దేశం చారిత్రక సిరీస్ విజయాన్ని అందుకోవడంతో తన ఆనందానికి పట్టపగ్గాలు లేకుండా పోయాయి. సిరీస్ విజయం అనంతరం అప్గానిస్తాన్ జెండా పట్టుకొని గట్టిగా అరుస్తూ తన సంతోషాన్ని వ్యక్తం చేసింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా సోషల్ యాక్టివిస్ట్ అయిన వజ్మా అయూబీ దుబాయ్‌లోనే నివాసం ఉంటుంది. ఎంటర్ప్రెన్యుర్గా రాణిస్తున్న ఈమెకు లమన్ పేరుతో సొంతంగా ఫ్యాషన్ లేబుల్ కంపెనీ నడుపుతోంది. That winning moment Alhamdulillah. Now you guys know why do I keep losing my voice after every Afghanistan match 😂 #AFGvsPAK pic.twitter.com/WV8lF6LGiz — Wazhma Ayoubi (@WazhmaAyoubi) March 27, 2023 Congratulations blue tigers #AFGvsBAN #AsiaCup2022 pic.twitter.com/ia7X8slfjJ — Wazhma Ayoubi (@WazhmaAyoubi) August 30, 2022 చదవండి: Asia Cup IND Vs AFG: టీమిండియాతో అఫ్గానిస్తాన్ మ్యాచ్.. కళ్లన్నీ ఆ యువతిపైనే! రిషబ్ పంత్ స్థానంలో బెంగాల్ సంచలనం! -
ఆఫ్గన్ ఆటగాడిపై గుడ్లు ఉరిమి చూశాడు.. ఎవరీ క్రికెటర్?
పాకిస్తాన్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల టి20 సిరీస్‌ను అఫ్గానిస్తాన్ 2-1 తేడాతో కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. చివరి టి20 పాకిస్తాన్ గెలిచినప్పటికి తొలి రెండు మ్యాచ్‌లను నెగ్గిన ఆఫ్గన్ తొలిసారి పాక్‌పై సిరీస్ విజయాన్ని అందుకొని చరిత్ర సృష్టించింది. ఆఫ్గన్ విజయంలో సీనియర్ ఆటగాడు మహ్మద్ నబీ కీలకపాత్ర పోషించి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా ఎంపికయ్యాడు. అయితే మూడో టి20 సందర్భంగా మహ్మద్ నబీని పాకిస్తాన్ క్రికెటర ఒకరు గుడ్డు ఉరిమి చూశాడు. అతని చూపు చూస్తే.. కోపంతో రగిలిపోతూ అవకాశం వస్తే తినేస్తా అన్నట్లుగా ఉంది. మరి ఇంతకీ నబీవైపు కోపంగా చూసిన ఆ క్రికెటర్ ఎవరో తెలుసా.. అజమ్ ఖాన్. సొంత క్రికెటర్ల చేత బాడీ షేమింగ్ అవమానాలు ఎదుర్కొన్నది ఇతనే. అంతేకాదు మాజీ క్రికెటర్ మొయిన్ ఖాన్ కొడుకు కూడా. జట్టుతో పాటే ఉన్నప్పటికి ఆఫ్గన్‌తో టి20 సిరీస్‌లో ఒక్క మ్యాచ్ ఆడలేదు. అయితే రెండో టి20లో మాత్రం రెగ్యులర్ కీపర్ మహ్మద్ హారిస్ స్థానంలో అజమ్ ఖాన్ కొంతసేపు వికెట్ కీపింగ్ చేశాడు. ఆ మ్యాచ్‌లో నబీ కీలక ఇన్నింగ్స్ ఆడి జట్టును గెలిపించాడు. ఈ సందర్భంగా నబీవైపు అజమ్ ఖాన్ కోపంగా చూడడం గమనించిన కెమెరామెన్ క్లిక్ మనిపించాడు. కాగా అజమ్ ఖాన్ పాకిస్తాన్ తరపున మూడు టి20 మ్యాచ్‌లు ఆడాడు. ఇక సోమవారం జరిగిన చివరి టి20 మ్యాచ్‌లో పాకిస్తాన్ 66 పరుగులతో విజయాన్ని అందుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. సయీమ్ అయూబ్ 49 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. షాదాబ్ ఖాన్ 28 పరుగులు చేశాడు. అనంరతం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆఫ్గన్ 18.4 ఓవర్లలో 116 పరుగులకు ఆలౌట్ అయింది. అజ్మతుల్లా ఒమర్జెయ్ 21 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. పాక్ బౌలర్లలో కెప్టెన్ షాదాబ్ ఖాన్, ఇషానుల్లా చెరో మూడు వికెట్లు తీయగా.. జమాన్ ఖాన్, ఇమాద్ వసీమ్, మహ్మద్ వసీమ్ జూనియర్లు తలా ఒక వికెట్ తీశారు. pic.twitter.com/knDEtRhZDb — Out Of Context Cricket (@GemsOfCricket) March 27, 2023 చదవండి: 'నా దృష్టిలో కోహ్లినే బెటర్.. ఎందుకంటే?' చివరి టి20లో ఓడినా ఆఫ్గన్‌ది చరిత్రే -
చివరి టి20లో ఓడినా ఆఫ్గన్‌ది చరిత్రే
పాకిస్తాన్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల టి20 సిరీస్‌ను అఫ్గానిస్తాన్ 2-1 తేడాతో కైవసం చేసుకుంది. తటస్థ వేదికలో పాకిస్తాన్‌పై సిరీస్ గెలవడం ఆఫ్గన్‌కు ఇదే తొలిసారి. సోమవారం రాత్రి జరిగిన చివరి టి20 మ్యాచ్‌లో పాకిస్తాన్ 66 పరుగులతో విజయాన్ని అందుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. సయీమ్ అయూబ్ 49 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. షాదాబ్ ఖాన్ 28 పరుగులు చేశాడు. అనంరతం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆఫ్గన్ 18.4 ఓవర్లలో 116 పరుగులకు ఆలౌట్ అయింది. అజ్మతుల్లా ఒమర్జెయ్ 21 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. పాక్ బౌలర్లలో కెప్టెన్ షాదాబ్ ఖాన్, ఇషానుల్లా చెరో మూడు వికెట్లు తీయగా.. జమాన్ ఖాన్, ఇమాద్ వసీమ్, మహ్మద్ వసీమ్ జూనియర్లు తలా ఒక వికెట్ తీశారు. ఈ మ్యాచ్‌లో ఓటమి పాలైనప్పటికి సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకున్న ఆఫ్గన్ ఆటతీరుపై అన్ని వైపుల నుంచి హర్షం వ్యక్తమయింది. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో మెరిసిన షాదాబ్ ఖాన్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ రాగా.. సిరీస్ ఆద్యంతం తన ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకున్న మహ్మద్ నబీ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా ఎంపికయ్యాడు. Afghanistan put on a remarkable all-round display in the 3-match T20I series to secure a historic 2-1 series win over Pakistan after winning the first two matches of the series. Read More: https://t.co/a8pQYZh5f6 pic.twitter.com/tMg7wgXt8y — Afghanistan Cricket Board (@ACBofficials) March 27, 2023 What a momentous occasion for Afghanistan cricket! 🙌😍 AfghanAtalan have created history by securing their first-ever T20I series win over traditional rivals Pakistan. It's a triumph of grit, courage, and teamwork. pic.twitter.com/nQ7jjqmm14 — Afghanistan Cricket Board (@ACBofficials) March 26, 2023 -
పాకిస్తాన్‌కు ఘోర అవమానం.. చరిత్ర సృష్టించిన ఆఫ్గానిస్తాన్! ఇదే తొలిసారి
Afghanistan vs Pakistan, 2nd T20I: షార్జా వేదికగా పాకిస్తాన్‌తో జరిగిన రెండో టీ20ల్లో 7 వికెట్ల తేడాతో ఆఫ్గానిస్తాన్ సంచలన విజయం సాధించింది. తద్వారా మూడు టీ20ల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే ఆఫ్గాన్ సొంతం చేసుకుంది. కాగా పాకిస్తాన్‌పై టీ20 సిరీస్‌ను గెలుచుకోవడం ఆఫ్గానిస్తాన్‌కు ఇదే తొలి సారి. రాణించిన గుర్భాజ్, ఇబ్రహీం 134 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఆఫ్గానిస్తాన్ 3 వికెట్లు కోల్పోయి 19.5 ఓవర్లలో ఛేదించింది. ఆఫ్గాన్ బ్యాటర్లలో ఓపెనర్ రహ్మానుల్లా గుర్బాజ్(49 బంతుల్లో 44) కీలక ఇన్నింగ్స్ ఆడగా.. మిడిలార్డర్ బ్యాటర్ ఇబ్రహీం జద్రాన్(38) కూడా అద్భుతంగా రాణించాడు. పాకిస్తాన్ బౌలర్లలో జమాన్ ఖాన్, ఇహ్సానుల్లా తలా వికెట్ సాధించారు. మరో వికెట్ రనౌట్ రూపంలో పాకిస్తాన్‌కు లభించింది. ఇక తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 130 పరుగులకే పరిమితమైంది. పాక్ బ్యటర్లలో ఇమాద్ వసీం(64 నాటౌట్) టాప్ స్కోరర్‌గా నిలవగా.. ఆఖరిలో కెప్టెన్ షాదాబ్ ఖాన్(32) పర్వాలేదనిపించాడు. ఆఫ్గాన్ బౌలర్లలో ఫజల్హక్ ఫారూఖీ రెండు కీలక వికెట్లు సాధించగా.. జనత్, రసీద్ ఖాన్, నవీన్ ఉల్ హాక్ తలా వికెట్ పడగొట్టారు. ఇక నామమాత్రపు మూడో టీ20 షార్జా వేదికగా సోమవారం జరగనుంది. చదవండి: PAK vs AFG: టీ20ల్లో పాక్ బ్యాటర్ అత్యంత చెత్త రికార్డు.. ప్రపంచంలోనే తొలి క్రికెటర్‌గా What a momentous occasion for Afghanistan cricket! 🙌😍 AfghanAtalan have created history by securing their first-ever T20I series win over traditional rivals Pakistan. It's a triumph of grit, courage, and teamwork. pic.twitter.com/nQ7jjqmm14 — Afghanistan Cricket Board (@ACBofficials) March 26, 2023 -
క్రికెట్ చరిత్రలోనే అత్యంత చెత్త రికార్డు.. ప్రపంచంలో తొలి బ్యాటర్‌గా
అంతర్జాతీయ టీ20ల్లో పాకిస్తాన్ క్రికెటర్ అబ్దుల్లా షఫీక్ అత్యంత చెత్త రికార్డు నమోదు చేశాడు. వరుసగా నాలుగు టీ20 మ్యాచ్‌ల్లో డకౌటైన తొలి ఆటగాడిగా నిలిచాడు. ఆదివారం ఆఫ్గానిస్తాన్‌తో జరిగిన రెండో టీ20లో గోల్డన్ డకౌటైన షఫీక్ ఈ ప్రతిష్టతను మూటకట్టుకున్నాడు. అంతకుముందు ఆఫ్గాన్‌తో తొలి టీ20లోనూ డకౌట్‌గా వెనుదిరగాడు. అదే విధంగా ఆఫ్గాన్‌తో సిరీస్‌కు ముందు న్యూజిలాండ్‌తో ఆడిన రెండు టీ20ల్లోనూ షఫీక్ డకౌటయ్యాడు. దీంతో ఈ చెత్త రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. కాగా తన అంతర్జాతీయ కెరీర్లో ఇప్పటివరకు ఐదు టీ20లు ఆడిన షఫీక్.. అందులో నాలుగు మ్యాచ్‌ల్లో డకౌటయ్యాడు. ఈ నాలుగు మ్యాచ్‌ల్లో కలిపి షఫీక్ కేవలం 7 బంతులు మాత్రమే ఎదుర్కొన్నాడు. కాగా ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్‌లో టీమిండియా స్టార్ ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ వరుసగా మూడు మ్యాచ్‌ల్లో గోల్డన్ డక్‌గా వెనుదిరిగిన సంగతి తెలిసిందే. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. పాకిస్తాన్‌పై ఆఫ్గానిస్తాన్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే ఆఫ్గానిస్తాన్ సొంతం చేసుకుంది. అదే విధంగా పాకిస్తాన్‌పై ఆఫ్గానిస్తాన్‌కు ఇదే తొలి టీ20 సిరీస్ విజయం. చదవండి: BCCI: బీసీసీఐ కాంట్రాక్ట్‌ల ప్రకటన.. జడ్డూకు ప్రమోషన్.. రాహుల్‌కు షాక్.. భరత్‌కు చోటు -
బ్యాటర్ కొంపముంచిన బంతి.. వీడియో వైరల్
టి20 క్రికెట్లో అఫ్గానిస్తాన్ జట్టు పాకిస్తాన్‌పై తొలిసారి విజయం సాధించి చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. శుక్రవారం రాత్రి జరిగిన తొలి టి20లో అఫ్గానిస్తాన్ ఆరు వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. మహ్మద్ నబీ తొలుత బౌలింగ్(2/12).. తర్వాత బ్యాటింగ్‌లో (38 పరుగులు నాటౌట్) రాణించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. ఈ విజయంతో మూడు మ్యాచ్‌ల టి20 సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలో నిలిచింది. ఇరుజట్ల మధ్య రెండో టి20 మార్చి 26న(ఆదివారం) జరగనుంది. ఈ విషయం పక్కనబెడితే.. పాకిస్తాన్ బౌలర్ నసీమ్ షా ఔటైన విధానం సోషల్ మీడియాలో నవ్వులు పూయిస్తోంది. ఇన్నింగ్స్ 16వ ఓవర్లో నసీమ్ షా హిట్ వికెట్‌గా వెనుదిరిగాడు. అయితే హిట్‌వికెట్ అవ్వడంలో తన తప్పు లేదు. మహ్మద్ నబీ వేసిన గుడ్ లెంగ్త్ డెలివరీని ఆడే క్రమంలో మిస్ అయ్యాడు. దీంతో బంతి అతని పొట్ట బాగానికి తగలడంతో బ్యాలెన్స్ కోల్పోయాడు. దీంతో బ్యాట్ వెళ్లి వికెట్లను గిరాటేసింది. ఇది ఊహించని నసీమ్ షా ఇచ్చిన రియాక్షన్ బాధ కలిగించినా అతని చర్య నవ్వు తెప్పించింది. చేసేదేం లేక తెగ బాధపడుతూ నసీమ్ పెవిలియన్ చేరాడు. దీనికి సంబంధించిన వీడియోపై ఒకసారి లుక్కేయండి. .@MohammadNabi007 Strikes again - Naseem Shah departs 🤩 Naseem swung hard but lost his balance in the process as he's gone back to hit his stumps 🇵🇰- 71/8 (15.4 Overs)#AfghanAtalan | #AFGvPAK | #LobaBaRangRawri pic.twitter.com/F2x0EmbDAR — Afghanistan Cricket Board (@ACBofficials) March 24, 2023 చదవండి: IPL 2023: ఏకకాలంలో బ్యాటింగ్, బౌలింగ్.. ధోనికి మాత్రమే సాధ్యం! క్రికెట్లో 13 మ్యాచ్‌లు ఫిక్సింగ్.. టీమిండియా సేఫ్! -
పాక్‌కు ఘోర అవమానం.. చరిత్ర సృష్టించిన అఫ్గానిస్తాన్
పాకిస్తాన్ జట్టుకు అఫ్గానిస్తాన్ షాక్ ఇచ్చింది. శుక్రవారం జరిగిన తొలి టి20లో ఆఫ్గన్ ఆరు వికెట్ల తేడాతో పాక్‌ను చిత్తు చేసింది. సీనియర్లు లేని లోటు పాక్ జట్టుపై ప్రభావం చూపించింది. షాదాబ్‌ఖాన్ కెప్టెన్సీలో ఘోర ప్రదర్శన కనబరిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 92 పరుగులు చేసింది. ఇమాద్ వసీమ్(18), షాదాబ్ ఖాన్(23), సయీమ్ అయూబ్(17), తయూబ్ తాహిర్(16) రెండంకెల స్కోరు దాటగా మిగతావారు దారుణంగా విఫలమయ్యారు. ఆఫ్గన్ బౌలర్లలో ముజీబ్, నబీ, ఫజల్లా ఫరుఖీలు రెండు వికెట్లు తీయగా.. అజ్మతుల్లా, నవీన్ హుల్ హక్, రషీద్ ఖాన్లు తలా ఒక వికెట్ తీశారు. అనంతరం స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన అఫ్గానిస్తాన్ 17.5 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి టార్గెట్‌ను చేధించింది. మహ్మద్ నబీ 38 పరుగులు నాటౌట్ జట్టును గెలిపించాడు. నజీబుల్లా జర్దన్ 17 నాటౌట్, రహమనుల్లా గుర్బాజ్ 16 పరుగులు చేశారు. ఇషానుల్లా రెండు వికెట్లు తీయగా.. నసీమ్ షా, ఇమాద్ వసీమ్‌లు చెరొక వికెట్ తీశారు. ఇక టి20ల్లో పాకిస్తాన్‌ను ఓడించడం అఫ్గానిస్తాన్‌కు ఇదే తొలిసారి కావడం విశేషం. ఇక పాకిస్తాన్‌కు టి20ల్లో ఇది ఐదో అత్యల్ప స్కోరు. ఆల్‌రౌండ్ ప్రదర్శన చేసిన మహ్మద్ నబీ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. ఇరుజట్ల మధ్య జరిగిన రెండో టి20 మార్చి 26న(ఆదివారం) జరగనుంది. Mohammad Nabi - The PoTM 🔥 Watch what the man of the moment, @MohammadNabi007, had to say after he stole the show with his (38* (38) & 2/12) incredible all-round performance to take Afghanistan to an incredible historic win. 🤩#AfghanAtalan | #AFGvPAK | #LobaBaRangRawri pic.twitter.com/bCggEWbsxW — Afghanistan Cricket Board (@ACBofficials) March 24, 2023 This was the 𝓜𝓞𝓜𝓔𝓝𝓣! 👌 The President @MohammadNabi007 finished the job in some style to make history and win the game for Afghanistan. 🤩🔥#AfghanAtalan | #AFGvPAK | #LobaBaRangRawri pic.twitter.com/QPdMimCEdB — Afghanistan Cricket Board (@ACBofficials) March 24, 2023 -
పాకిస్తాన్ క్రికెట్ టీమ్‌కు కొత్త కెప్టెన్
పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు నూతన సారధిని ఎంపిక చేసింది పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ). షార్జా వేదికగా ఆఫ్ఘనిస్తాన్‌తో త్వరలో ప్రారంభంకానున్న మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం ఈ నియామకం చేపట్టినట్లు పీసీబీ వెల్లడించింది. వర్క్ లోడ్ కారణంగా రెగ్యులర్ కెప్టెన్ బాబర్ ఆజమ్‌తో పాటు సీనియర్లు మహ్మద్ రిజ్వాన్, షాహీన్ అఫ్రిది, ఫకర్ జమాన్, హరీస్ రౌఫ్‌లకు విశ్రాంతినిచ్చి కొత్త కెప్టెన్‌గా ఆల్‌రౌండర్ షాదాబ్ ఖాన్‌ను ఎంపిక చేసినట్లు పీసీబీ సోమవారం (మార్చి 13) ప్రకటించింది. ఆఫ్ఘనిస్తాన్‌తో టీ20 సిరీస్ కోసం ఎంపిక చేసిన 15 మంది సభ్యుల బృందంలో సైమ్ అయూబ్, ఇహసానుల్లా లాంటి పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్) స్టార్లకు తొలిసారి అవకాశం కల్పించిన పీసీబీ.. సీనియర్ ఇమాద్ వసీంను చాలాకాలం తర్వాత తిరిగి జట్టులోకి తీసుకుంది. పీసీబీ సెలెక్షన్ కమిటీ నూతన చీఫ్ హరూన్ రషీద్ అమల్లోకి తెచ్చిన కొత్త వర్క్ లోడ్ పాలసీ ఆధారంగా సెలెక్షన్ ప్రక్రియ సాగినట్లు పీసీబీ పేర్కొంది. ఆఫ్ఘనిస్తాన్‌తో టీ20 సిరీస్‌కు పాకిస్తాన్ జట్టు.. షాదాబ్ ఖాన్ (కెప్టెన్), అబ్దుల్లా షఫీక్, ఆజమ్ ఖాన్ (వికెట్‌కీపర్), ఫహీమ్ అష్రాఫ్, ఇఫ్తికార్ అహ్మద్, ఇహసానుల్లా, ఇమాద్ వసీం, మహ్మద్ హరీస్ (వికెట్‌కీపర్), మహ్మద్ నవాజ్, మహ్మద్ వసీం, నసీం షా, సైమ్ అయూబ్, షాన్ మసూద్, తయాబ్ తాహిర్, జమాన్ ఖాన్ -
అఫ్రిది యార్కర్ దెబ్బ.. ఆస్పత్రి పాలైన ఆఫ్గన్ ఓపెనర్
పాకిస్తాన్ ఫాస్ట్ బౌలర్ షాహిన్ అఫ్రిది యార్కర్ దెబ్బకు అఫ్గానిస్తాన్ బ్యాటర్ రహమనుల్లా గుర్బాజ్ ఆస్పత్రి పాలయ్యాడు. విషయంలోకి వెళితే.. టి20 ప్రపంచకప్‌లో భాగంగా అప్గానిస్తాన్, పాకిస్తాన్ మధ్య బుధవారం వార్మప్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్ స్టార్ షాహిన్ అఫ్రిది ఆఫ్గన్ బ్యాటర్లకు తన బౌలింగ్ పవర్ చూపించాడు. మ్యాచ్‌లో రహమనుల్లా గుర్బాజ్, హజరతుల్లా జజైయ్ల రూపంలో రెండు వికెట్లు తీసి దెబ్బతీశాడు. అయితే రహమనుల్లాను యార్కర్ డెలివరీతో ఎల్బీగా పెవిలియన్ చేర్చాడు. అఫ్రిది వేసిన యార్కర్ రహమనుల్లా గుర్బాజ్ కాలికి బలంగా తగిలింది.దీంతో నొప్పితో విలవిల్లాడిన గుర్బాజ్ మైదానంలోనే ఫిజియోతో మసాజ్ చేయించుకున్నాడు. అయినప్పటికి నడవలేని స్థితిలో ఉన్న గుర్బాజ్‌ను సబ్‌స్టిట్యూట్ ఆటగాడు తన వీపుపై గుర్బాజ్‌ను ఎక్కించుకొని పెవిలియన్‌కు తీసుకెళ్లాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ తర్వాత ఎక్స్‌రే నిమిత్తం గుర్బాజ్‌ను ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే గాయం తీవ్రత ఎంత అనేది రిపోర్ట్స్ వచ్చాకే తెలియనుంది. ఒకవేళ గుర్బాజ్ గాయంతో దూరమైతే ఆఫ్గనిస్తాన్‌కు పెద్ద దెబ్బే అని చెప్పొచ్చు. ఇక షాహిన్ అఫ్రిది వేసిన యార్కర్‌పై అభిమానులు వినూత్న రీతిలో స్పందించారు. టీమిండియాతో మ్యాచ్‌ను దృష్టిలో పెట్టుకొనే అఫ్రిది పదునైన యార్కర్‌తో హెచ్చరికలు పంపాడంటూ కామెంట్ చేశారు. ఇక గాయంతో ఆసియా కప్‌కు దూరమైన షాహిన్ అఫ్రిది టీమిండియాతో మ్యాచ్ ఆడేందుకు ఎదురుచూస్తున్నాడు. గతేడాది జరిగిన టి20 ప్రపంచకప్‌లో టీమిండియా ఓడిపోవడానికి ప్రధాన కారణం షాహిన్ అఫ్రిదియే. ఆ మ్యాచ్‌లో టీమిండియా టాపార్డర్‌ను తక్కువ స్కోర్లకే పెవిలియన్ చేర్చి మూడు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక అఫ్గానిస్తాన్‌తో జరిగిన వార్మప్ మ్యాచ్ వార్షార్పణం అయింది. తొలుత బ్యాటింగ్ చేసిన అప్గానిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసింది. కెప్టెన్ మహ్మద్ నబీ 51 పరుగులతో రాణించగా.. ఇబ్రహీం జర్దన్ 35 పరుగులు, ఆఖర్లో ఉస్మాన్ ఘనీ 32 పరుగులతో ఆకట్టుకున్నారు. అనంతరం బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 2.2 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 19 పరుగులు చేసింది. ఈ దశలో ఆటకు వర్షం అంతరాయం కలిగించడం.. ఎంతకు తెరిపినివ్వకపోవడంతో మ్యాచ్‌ను నిలిపివేసినట్లు అంపైర్లు ప్రకటించారు. ఇక ఇంగ్లండ్‌తో జరిగిన తొలి వార్మప్ మ్యాచ్‌లో పాకిస్తాన్ ఓటమి పాలైన సంగతి తెలిసిందే. pic.twitter.com/dyXoaUxPBd — Guess Karo (@KuchNahiUkhada) October 19, 2022 చదవండి: గంగూలీ అయిపోయాడు.. ఇప్పుడు చేతన్ శర్మ వంతు?! 'భారత్‌లో జరిగే వరల్డ్‌కప్‌ను బాయ్‌కాట్ చేస్తాం' భారత్-పాక్ మ్యాచ్‌పై స్పందించిన డబ్ల్యూడబ్ల్యూఈ దిగ్గజం -
టీమిండియా ఆశలపై నీళ్లు చల్లిన బ్యాట్‌ను వేలానికి పెట్టిన పాక్ ప్లేయర్
Naseem Shah: ఆసియా కప్-2022లో పాకిస్తాన్‌ను ఫైనల్స్‌కు చేర్చడానికి, టీమిండియాను పరోక్షంగా ఇంటికి పంపడానికి కారణమైన బ్యాట్‌ను వేలానికి పెట్టాడు పాక్ యువ పేసర్ నసీమ్ షా. సూపర్-4 దశలో భాగంగా ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన కీలక సమరంలో నసీమ్ షా.. సహచరుడు మహ్మద్ హస్నైన్ నుంచి అరువు తెచ్చుకున్న బ్యాట్‌తో చివరి ఓవర్ తొలి రెండు బంతులను సిక్సర్లుగా మలిచి (విజయానికి 11 పరుగులు అవసరమైన దశలో), ఓటమి అంచుల్లో ఉన్న పాక్‌కు చిరస్మరణీయ విజయాన్ని అందించిన విషయం తెలిసిందే. వరుస సిక్సర్లు బాది రాత్రికిరాత్రే హీరో అయిపోయిన నసీమ్.. తను సిక్సర్లు కొట్టడానికి తోడ్పడిన బ్యాట్‌ను వేలం వేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ వేలం ద్వారా వచ్చే డబ్బును పాక్ వరద బాధితుల సహాయార్ధం వినియోగిస్తానని తెలిపాడు. ఈ విషయాన్ని పాక్ క్రికెట్ బోర్డు ట్విటర్ వేదికగా వెల్లడించింది. The bat with which he struck the two last-over sixes 🤩@iNaseemShah decides to auction the bat gifted to him by @MHasnainPak for a charitable cause. #AsiaCup2022 pic.twitter.com/uCF1loEXCT — Pakistan Cricket (@TheRealPCB) September 8, 2022 కాగా, గత నెల రోజులుగా పాకిస్తాన్ మునుపెన్నడూ లేని వరదల ధాటికి అతలాకుతలమైంది. వందల సంఖ్యలో జనం మృత్యువాత పడ్డారు. లక్షల సంఖ్యలో నిరాశ్రయులయ్యారు. కనీవినీ ఎరుగని వరదలను జాతీయ విపత్తుగా ప్రకటించింది పాక్ ప్రభుత్వం. భారత్ సహా చాలా దేశాలు పాక్‌కు తోచిన సాయం చేశాయి. తాజాగా పాక్ యువ క్రికెటర్ నసీమ్ షా సైతం తనవంతు సాయంగా బ్యాట్ వేలం ద్వారా వచ్చిన సొమ్మును వరద బాధితుల సహాయార్ధం వినియోగిస్తానని తెలిపాడు. ఇదిలా ఉంటే, ఆసియా కప్‌లో టీమిండియా వరుస పరాజయాలు ఎదుర్కోవడంతో శ్రీలంక, పాక్ జట్లు ఫైనల్స్‌కు చేరాయి. ఆదివారం జరిగే తుదిపోరులో ఈ రెండు జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. సూపర్-4 దశ చివరి మ్యాచ్‌లో పాక్‌ను మట్టికరిపించిన లంక జట్టు ఆత్మ విశ్వాసంతో ఉరకలేస్తుంది. అద్భుత ఫామ్‌ను కొనసాగిస్తూ టైటిల్‌ను ఎగరేసుకుపోవాలని పట్టుదలగా ఉంది. మరోవైపు పాక్ సైతం ఆసియా ఛాంపియన్‌గా నిలిచేందుకు ఉవ్విళ్ళూరుతుంది. చదవండి: గ్రౌండ్లో గొడవపడ్డారు.. ఆ ఇద్దరు ఆటగాళ్లకు ఐసీసీ బిగ్ షాక్! -
పాకిస్తాన్ నటికి టీమిండియా మాజీ క్రికెటర్ దిమ్మతిరిగే కౌంటర్
టీమిండియా మాజీ క్రికెటర్ అమిత్ మిశ్రా పాకిస్తాన్ నటికి దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చాడు. మిశ్రాను ట్రోల్ చేయాలని ప్రయత్నించిన యువతి.. తాను తీసుకున్న గొయ్యిలో తానే పడ్డట్లయింది. విషయంలోకి వెళితే.. ఆసియా కప్ టోర్నీలో భాగంగా బుధవారం అఫ్గనిస్తాన్.. పాకిస్తాన్ చేతిలో ఓటమి పాలవ్వడంతో టీమిండియా టోర్నమెంట్ నుంచి అధికారికంగా నిష్ర్కమించినట్లయింది. ఆఫ్గన్ గెలిచి ఉంటే భారత్‌కు ఎంతో కొంత ఫైనల్ అవకాశాలు మిగిలి ఉండేవి. కానీ ఆఖర్లో పాకిస్తాన్ బౌలర్ నసీమ్ షా రెండు సిక్సర్లు బాది తన జట్టును ఫైనల్‌కు చేర్చాడు. అయితే మ్యాచ్ ఆరంభానికి ముందు అఫ్గనిస్తాన్ మ్యాచ్ గెలవాలని టీమిండియా అభిమానులు బలంగా కోరుకున్నారు. అలా కోరుకున్నవారిలో టీమిండియా మాజీ క్రికెటర్ అమిత్ మిశ్రా కూడా ఉన్నాడు. ఒకవేళ అఫ్గనిస్తాన్ పాక్‌పై గెలిస్తే మాత్రం.. ఈ వారం మొత్తం ''అఫ్గన్ చాప్''ను తింటానని ట్వీట్ చేశాడు. అయితే అఫ్గనిస్తాన్ పాకిస్తాన్ చేతిలో ఓడిపోయిన తర్వాత పాకిస్తాన నటి సెహర్ షిన్వరీ అమిత్ మిశ్రాను ట్రోల్ చేయడానికి ప్రయత్నించింది. ''అఫ్గనిస్తాన్ ఓడిపోయింది.. పూర్ మిశ్రా.. ఈ వారం మొత్తం ఆవు పేడ తినాల్సిందే'' అంటూ కామెంట్ చేసింది. కాగా సెహర్ ట్వీట్‌కు వెంటనే బదులిచ్చిన అమిత్ మిశ్రా.. అయ్యో నాకు పాకిస్తాన్ వచ్చేందుకు ఎలాంటి ప్లాన్స్ లేవు అంటూ దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్గనిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 129 పరుగులు మాత్రమే చుసింది. అయితే బ్యాటింగ్‌లో తక్కువ స్కోరే చేసినప్పటికి ఆఫ్గన్ బౌలర్లు వికెట్లు తీసిన ప్రతీసారి టీమిండియా అభిమానులు పండగ చేసుకున్నారు. దాదాపు పాక్‌ను ఓడించినంత పని చేసిన అఫ్గనిస్తాన్‌ను ప్రశంసించారు. 119కే 9 వికెట్లు కోల్పోయిన దశలో క్రీజులోకి వచ్చిన నసీమ్ షా చివరి ఓవర్లో తొలి రెండు బంతులను సిక్సర్లుగా మలచడంతో అఫ్గనిస్తాన్ ఓటమిపాలైంది. ఇక విజయంతో పాక్ ఆసియా కప్ ఫైనల్‌కు చేరుకుంది. ఈ ఆదివారం(సెప్టెంబర్ 11న) పాకిస్తాన్, శ్రీలంక మధ్య ఫైనల్ పోరు జరగనుంది. Will eat Afghani chaap whole week if Afganistan defeats Pakistan today. Fingers crossed. #AFGvsPAK — Amit Mishra (@MishiAmit) September 7, 2022 No, I have no plans of coming to Pakistan. 👍 https://t.co/HbFWeZSjij — Amit Mishra (@MishiAmit) September 8, 2022 చదవండి: Naseem Shah: మ్యాచ్‌ను శాసించిన సిక్సర్ల కోసం బ్యాట్‌ను అప్పుగా.. ఆస్ట్రేలియానే దారుణమనుకుంటే.. అంతకన్నా చెత్తగా ఆడి! -
మ్యాచ్‌ను శాసించిన సిక్సర్ల కోసం బ్యాట్‌ను అప్పుగా..
ఆసియా కప్ టోర్నీలో సూపర్-4లో భాగంగా బుధవారం పాకిస్తాన్, అఫ్గనిస్తాన్ మధ్య ఉత్కంఠ పోరు జరిగిన సంగతి తెలిసిందే. చివరి వరకు పాక్ బ్యాటర్లకు అఫ్గన్ బౌలర్లు చుక్కలు చూపించినప్పటికి.. ఆఖరి ఓవర్లో వచ్చిన పదో నెంబర్ ఆటగాడు నసీమ్ షా రెండు సిక్సర్లు బాది తన జట్టుకు ఒక వికెట్‌తో సంచలన విజయాన్ని అందించాడు. ఈ విజయంతో ఆసియా కప్ ఫైనల్‌కు చేరుకున్న పాకిస్తాన్.. ఈ ఆదివారం(సెప్టెంబర్ 11న) తుదిపోరులో శ్రీలంకతో అమితుమీ తేల్చుకోనుంది. అయితే మ్యాచ్‌ను శాసించిన ఆ రెండు సిక్సర్ల కోసం నసీమ్ షా బ్యాట్‌ను అప్పుగా తెచ్చుకున్నాడు. అదేంటి నసీమ్ షాకు బ్యాట్ లేదా.. అనే డౌట్ రావొచ్చు. నసీమ్ షాకు బ్యాట్ ఉన్నప్పటికి అది బాగా లేకపోవడంతో తనతో పాటే క్రీజులో ఉన్న మహ్మద్హస్నైన్ను బ్యాట్ అడిగి తీసుకున్నాడు. హస్నైన్ బ్యాట్‌తోనే నసీమ్ షా ఆఖరి ఓవర్లో రెండు సిక్సర్లు బాది జట్టును గెలిపించాడు. కాగా మ్యాచ్ అనంతరం నసీమ్ షా మాట్లాడుతూ.. ''నాకు తెలిసి ఈరోజు అందరూ నా బ్యాటింగ్ గురించే మాట్లాడుకుంటారు. అయితే మీకు తెలియని విషయమేంటంటే.. మ్యాచ్ ప్రారంభానికి ముందు నెట్స్‌లో తీవ్ర బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశా. అయితే నా బ్యాట్ సరిగా లేకపోవడంతో మహ్మద్ హస్నైన్ బ్యాట్‌ను తీసుకున్నా. ఆ బ్యాట్‌తోనే రెండు సిక్సర్లు బాది జట్టును గెలిపించా'' అంటూ సంతోషం వ్యక్తం చేశాడు. ఆ తర్వాత మహ్మద్ హస్నైన్ కూడా స్పందింస్తూ.. ''ఓవర్ ప్రారంభానికి ముందు నసీమ్ నా దగ్గరకి వచ్చి బ్యాట్ అడిగాడు. సరే ఒకవేళ సింగిల్ తీస్తే బ్యాట్‌ను తిరిగి ఇవ్వు అని చెప్పా. కానీ నసీమ్ నాకు బ్యాట్ ఇచ్చే అవకాశం లేకుండానే తానే రెండు సిక్సర్లు బాది సంచలన విజయం అందించాడు.'' అంటూ చెప్పుకొచ్చాడు. The winning sixes from Naseem Shah🔥 Pakistan goes straight into the final 🇵🇰#STARZPLAY #AsiaCup #AsiaCup2022 #asiacup22 #Watchlive #cricketlive #cricketmatch #teampakistan #teamafghanistan #crickethighlights pic.twitter.com/aMupmwKKGA — Cricket on STARZPLAY (@starzplaymasala) September 7, 2022 చదవండి: పాకిస్తాన్ ఫైనల్‌కు.. టీమిండియా ఇంటికి -
ఆఫ్ఘన్ బౌలర్‌ను బ్యాట్‌తో కొట్టబోయిన పాక్ బ్యాటర్.. వైరల్ వీడియో
ఆసియా కప్ 2022 సూపర్-4 దశలో భాగంగా నిన్న (సెప్టెంబర్ 7) ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన ఉత్కంఠ సమరంలో పాకిస్తాన్ వికెట్ తేడాతో గట్టెక్కింది. హోరాహోరీగా సాగిన ఈ పోరులో పాక్ పదో నంబర్ ఆటగాడు నసీమ్ షా.. ఆఖరి ఓవర్ తొలి రెండు బంతులను సిక్సర్లుగా మలిచి పాక్‌కు అపురూప విజయాన్ని అందించాడు. అప్పటివరకు ఆఫ్ఘన్ చేతుల్లోనే ఉన్న మ్యాచ్ (6 బంతుల్లో 11 పరుగులు).. నసీమ్ వీర విజృంభణ ధాటికి పాక్ వశమైంది. అయితే అంతకుముందు ఓవర్లో చోటు చేసుకున్న ఓ దురదృష్టకర ఘటన క్రికెట్ ప్రేమికులను విస్మయాన్ని గురి చేసింది. 19వ ఓవర్ నాలుగో బంతికి సిక్సర్ బాది జోరుమీదున్న పాక్ బ్యాటర్ ఆసిఫ్ అలీ.. ఆ తర్వాతి బంతికే ఔటయ్యానన్న కోపంతో ఆఫ్ఘన్ బౌలర్ ఫరీద్ అహ్మద్‌ను బ్యాట్‌తో కొట్టబోయాడు. ఇందులో ఫరీద్ తప్పు కూడా ఉంది. ఆసిఫ్‌ను ఔట్ చేశానన్న ఆనందంలో ఫరీద్ అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తూ అత్యుత్సాహం ప్రదర్శించాడు. దీంతో కోపం ఆపుకోలేక పోయిన ఆసిఫ్ అలీ.. ఫరీద్‌పై బ్యాట్‌తో దాడి చేయబోయాడు. పెవిలియన్ వైపు వెళ్తూవెళ్తూ ఫరీద్‌కు కూడా వార్నింగ్ ఇచ్చాడు. దీనికి సంబంధించిన వీడియో క్షణాల్లో వైరలైంది. క్రికెట్ అభిమానులు ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నారు. పాక్ ఆటగాడి ఓవరాక్షన్‌పై మండిపడుతున్నారు. క్రికెట్లో వికెట్ తీశాక సంబురాలు చేసుకోవడం కామనేనని, దానికి ఆసిఫ్ అంతలా రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదని దండిస్తున్నారు. భౌతిక దాడులకు పాల్పడటం అనేది జెంటిల్మెన్ గేమ్ సంస్కృతి కాదని హితవు పలుకుతున్నారు. మరికొందరైతే పాక్ ఆటగాడిపై కఠిన చర్యలు తీసుకోవాలిన ఐసీసీని కోరుతున్నారు. The fight between Asif Ali and the Afghan bowler💥 Very unfortunate #PAKvAFG pic.twitter.com/AQzxurWNB7 — Nadir Baloch (@BalochNadir5) September 7, 2022 కాగా, ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్.. పాక్ బౌలర్లు సమిష్టిగా రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 129 పరుగులు మాత్రమే చేయగలిగింది. 35 పరుగులు చేసిన ఇబ్రహీం జద్రాన్ ఆఫ్ఘన్ టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన పాక్‌కు ఆఫ్గన్ బౌలర్లు చుక్కలు చూపించారు. పొదుపుగా బౌలింగ్ చేయటంతో పాటు క్రమం తప్పకుండా వికెట్లు తీసి పాక్‌పై ఒత్తిడి పెంచారు. అయితే చివర్లో షాదాబ్ ఖాన్ (26 బంతుల్లో 36; ఫోర్, 3 సిక్సర్లు), ఆసిఫ్ అలీ (8 బంతుల్లో 16; 2 సిక్సర్లు), నసీమ్ షా (4 బంతుల్లో 14 నాటౌట్; 2 సిక్సర్లు) భారీ సిక్సర్లు బాది ఆఫ్ఘన్ చేతుల్లో నుంచి మ్యాచ్‌ను లాగేసుకున్నారు. ఆఫ్ఘన్ బౌలర్లు ఫజల్ హక్ ఫారూఖీ (3/31), ఫరీద్ మాలిక్ (3/31), రషీద్ ఖాన్ (2/25) చెలరేగినప్పటికీ నసీమ్ షా వరుస సిక్సర్లతో పాక్‌ను గెలిపించాడు. ఈ దెబ్బతో ఆఫ్ఘన్ సహా భారత్ కూడా ఇంటిముఖం పట్టింది. సెప్టెంబర్ 11న జరిగే ఫైనల్లో పాక్-శ్రీలంక జట్లు తలపడతాయి. చదవండి: Viral Video: ఆఫ్ఘన్ ఫ్యాన్స్ క్రూర ప్రవర్తన.. పాక్ అభిమానులపై దాడులు -
Viral Video: ఆఫ్ఘన్ ఫ్యాన్స్ క్రూర ప్రవర్తన.. పాక్ అభిమానులపై దాడులు
ఆసియా కప్ సూపర్-4 దశలో భాగంగా నిన్న (సెప్టెంబర్ 7) పాకిస్తాన్‌తో జరిగిన కీలక మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్ వికెట్ తేడాతో పరాజయం పాలై, టీమిండియాతో పాటు టోర్నీ నుంచి నిష్క్రమించింది. తీవ్ర ఉత్కంఠ నడుమ సాగిన ఈ మ్యాచ్‌లో పాక్ పదో నంబర్ ఆటగాడు నసీమ్ షా ఆఖరి ఓవర్లో మొదటి రెండు బంతులను సిక్సర్లుగా మలిచి పాక్‌ను గెలిపించాడు. అప్పటివరకు ఆఫ్ఘన్ చేతుల్లోనే ఉన్న మ్యాచ్ (6 బంతుల్లో 11 పరుగులు).. నసీమ్ వీర విజృంభణ ధాటికి పాక్ వశమైంది. ఈ మ్యాచ్‌లో ఆఫ్ఘాన్ చేసింది 129 పరుగులే అయినప్పటికీ.. పాక్‌కు ముచ్చెమటలు పట్టించి ఓడించినంత పని చేసింది. గెలుస్తామనుకున్న మ్యాచ్‌లో ఓడటంతో ఆఫ్ఘాన్ ఆటగాళ్లు తీవ్ర నిరుత్సాహానికి లోనయ్యారు. Afghanistan fans once again showing that they cannot take defeat gracefully #AFGvPAK #AsiaCup #Cricket pic.twitter.com/0u5yrMx9Xa — Saj Sadiq (@SajSadiqCricket) September 7, 2022 అయితే, జట్టు ఓటమిని జీర్ణించుకోలేని ఆఫ్ఘన్ అభిమానులు మాత్రం ఓవరాక్షన్ చేశారు. మ్యాచ్ అనంతరం షార్జా స్టేడియంలో రచ్చరచ్చ చేశారు. కుర్చీలు విరుగగొట్టి, పాక్ అభిమానులపై దాడులు చేసి క్రూరంగా ప్రవర్తించారు. అప్పటివరకు పాక్ అభిమానులతో కలిసి మ్యాచ్ చూసిన ఆఫ్ఘన్ ఫ్యాన్స్ ఒక్కసారిగా పేట్రేగిపోయి తాలిబన్లలా అమానవీయంగా వ్యవహరించారు. కొద్ది నిమిషాల పాటు స్టేడియంలో వీరంగం సృష్టించారు. ఆఫ్ఘన్ ఫ్యాన్స్ దెబ్బకు పాక్ అభిమానులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని స్టేడియం నుంచి దౌడు తీశారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరలవుతుంది. ఏ క్రీడలోనైనా గెలుపోటములు సహజమని, వాటిని క్రీడా స్పూర్తితో స్వీకరించాలే కానీ ఇలా దాడులకు దిగడం సరికాదని నెటిజన్లు మండిపడుతున్నారు. జెంటిల్మెన్ గేమ్‌లో ఇలాంటి చర్యలను సహించకూడదని, ఆఫ్ఘన్ అభిమానులను స్టేడియాల్లోకి రానీయకుండా నిషేధించాలని మరికొందరు కామెంట్ చేస్తున్నారు. కాగా, ఈ వీడియోపై పాక్ మాజీ బౌలర్ షోయబ్ అక్తర్ స్పందించడాన్ని మాత్రం భారత అభిమానులు తప్పుపడుతున్నారు. అక్తర్ ఆఫ్ఘన్ అభిమానుల దుశ్చర్యను ఖండిస్తూ, హిత బోధ చేయడంపై టీమిండియా ఫ్యాన్స్ ఫైరవుతున్నారు. అక్తర్ చిలకపలుకులు పలికింది చాలు.. ముందు మీ ఆటగాళ్లను ప్రవర్తన సరిచేసుకోమని చెప్పు అంటూ ఆసిఫ్ అలీ-ఆఫ్ఘన్ బౌలర్ వ్యవహారాన్ని ప్రస్తావిస్తున్నారు. ఈ మ్యాచ్‌లో ఆఫ్ఘన్ బౌలర్ ఫరీద్ అహ్మద్‌ను ఆసిఫ్ అలీ బ్యాట్‌తో కొట్టబోయాడు. చదవండి: మహ్మద్ నబీ చెత్త రికార్డు.. టి20 క్రికెట్లో తొలి బ్యాటర్‌గా -
పాకిస్తాన్ ఫైనల్‌కు.. టీమిండియా ఇంటికి
షార్జా: భారత్ అభిమానుల్లో ఆశలు రేపేలా ఉత్కంఠ రేకెత్తించిన మ్యాచ్‌లో చివరకు పాకిస్తానే వికెట్ తేడాతో అఫ్గానిస్తాన్‌పై గెలిచింది. దీంతో ఎలాంటి సమీకరణాలతో సంబంధం లేకుండా పాక్, శ్రీలంక జట్లు ఆదివారం జరిగే ఫైనల్ పోరుకు సిద్ధమయ్యాయి. ఈ రెండు జట్లు రెండేసి విజయాలు సాధించగా, ఆడిన రెండూ ఓడిన భారత్, అఫ్గానిస్తాన్ ఆసియా కప్ టి20 టోర్నీ నుంచి నిష్క్రమించాయి. ‘సూపర్–4’లో బుధవారం అఫ్గానిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 130 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్ 19.2 ఓవర్లలో 9 వికెట్లకు 131 పరుగులు చేసి గెలిచింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ షాదాబ్ (26 బంతుల్లో 36; 1 ఫోర్, 3 సిక్స్‌లు), ఇఫ్తికార్ (33 బంతుల్లో 30; 2 ఫోర్లు) రాణించారు. జట్టు స్కోరు 97 పరుగుల స్కోరు వద్ద షాదాబ్ అవుట్ కాగా... స్వల్పవ్యవధిలో పాక్ 6 వికెట్లు కోల్పోయి పరాజయానికి దగ్గరైంది. పాక్ నెగ్గేందుకు ఆఖరి ఓవర్లో 6 బంతుల్లో 11 పరుగులు చేయాల్సి ఉండగా... ఫారూఖి వేసిన తొలి రెండు బంతులపై సిక్సర్లు కొట్టిన నసీమ్ షా (4 బంతుల్లో 14 నాటౌట్; 2 సిక్స్‌లు) పాక్ జట్టును గెలిపించడంతోపాటు ఫైనల్‌కు చేర్చాడు. అంతకుముందు అఫ్గానిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 129 పరుగులు చేసింది. ఇబ్రహీమ్ జద్రాన్ (37 బంతుల్లో 35; 2 ఫోర్లు, 1 సిక్స్) రాణించాడు. ఓపెనర్ హజ్రతుల్లా (17 బంతుల్లో 21; 4 ఫోర్లు), ఆఖర్లో రషీద్ ఖాన్ (15 బంతుల్లో 18 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్) ధాటిగా ఆడారు. పాక్ బౌలర్లు రవూఫ్ 2, నసీమ్ షా, హస్నైన్, నవాజ్, షాదాబ్ తలా ఒక వికెట్ తీశారు. -
పాక్ టార్గెట్ 130.. ఇక బౌలర్లపైనే భారం
ఆసియాకప్ టోర్నీలో సూపర్-4 లో భాగంగా పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో అఫ్గనిస్తాన్ పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 129 పరుగులు మాత్రమే చేయగలిగింది. పాక్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో ఆఫ్గన్ బ్యాటర్లు పరుగులు తీయడంలో ఇబ్బంది పడ్డారు. అఫ్గనిస్తాన్ బ్యాటర్లలో ఇబ్రహీ జర్దన్ 35 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. హజరతుల్లా జజేయ్ 21, రహమనుల్లా గుర్బాజ్ 17 పరుగులు చేశారు. పాకిస్తాన్ బౌలర్లలో హారిస్ రౌఫ్ 2, నసీమ్ షా, మహ్మద్ హుస్నైన్, మహ్మద్ నవాజ్, షాదాబ్ ఖాన్ తలా ఒక వికెట్ తీశారు.కాగా ఈ మ్యాచ్‌లో అఫ్గనిస్తాన్ గెలుపుపైనే భారత్ ఫైనల్ అవకాశాలు ఆధారపడి ఉన్నాయి. అయితే ఆఫ్గన్ నామమాత్రపు స్కోరుకే పరిమితం కావడంతో ఇక బౌలర్లపైనే బారం పడనుంది. చదవండి: Asia Cup 2022: మహ్మద్ నబీ చెత్త రికార్డు.. టి20 క్రికెట్లో తొలి బ్యాటర్‌గా -
మహ్మద్ నబీ చెత్త రికార్డు.. టి20 క్రికెట్లో తొలి బ్యాటర్‌గా
సూపర్-4లో భాగంగా పాకిస్తాన్‌తో జరుగుతున్న మ్యాచ్ అఫ్గనిస్తాన్ కెప్టెన్ మహ్మద్ నబీకి వందో మ్యాచ్. సాధారణంగా ఒక క్రికెటర్‌కు వందో మ్యాచ్ అంటే చాలా ప్రతిష్టాత్మకం. ఎలాగైనా ఆ మ్యాచ్‌ను మధురానుభూతిగా మలుచుకోవాలని అనుకుంటాడు. అలాంటి నబీ ప్రతిష్టాత్మక వందో మ్యాచ్‌లో గోల్డెన్ డక్‌గా వెనుదిరిగాడు. తద్వారా నబీ టి20 క్రికెట్లో చెత్త రికార్డు నమోదు చేశాడు. టి20ల్లో వందో మ్యాచ్‌లో గోల్డెన్ డక్ అయిన తొలి ఆటగాడిగా మహ్మద్ నబీ నిలిచాడు. ఇక నబీ వరుసగా ఎనిమిదో మ్యాచ్‌లో సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యాడు. చివరగా ఆడిన ఎనిమిది టి20ల్లో నబీ స్కోర్లు 5, 9, 6, 5, 0, 8, 1, 0 ఉన్నాయి. ఇందులో రెండు గోల్డెన్ డక్‌లు ఉండడం గమనార్హం. ఇక పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో అఫ్గనిస్తాన్ గెలుస్తూనే టీమిండియాకు ఫైనల్ అవకాశాలు ఉంటాయి. -
పాక్‌తో మ్యాచ్.. ఆఫ్గన్ గెలిస్తేనే టీమిండియాకు అవకాశం
ఆసియా కప్ టోర్నీలో సూపర్-4లో బుధవారం పాకిస్తాన్, అఫ్గానిస్తాన్ మద్య ఆసక్తికర పోరు జరగనుంది. టాస్ గెలిచిన పాకిస్తాన్ బౌలింగ్ ఎంచుకుంది. ఇక అఫ్గానిస్తాన్ గెలుపుపైనే టీమిండియాకు ఆసియా కప్‌లో అవకాశాలు మిగిలి ఉన్నాయి. ఆఫ్గన్ ఓడిందో ఇక టీమిండియా ఇంటిబాట పట్టాల్సిందే. శ్రీలంకతో జరిగిన సూపర్-4 మ్యాచ్‌లో ఓడిన అఫ్గానిస్తాన్‌కు పాక్‌తో మ్యాచ్ కీలకమని చెప్పొచ్చు. బ్యాటింగ్‌లో నజీబుల్లా జర్దన్, రహమతుల్లా గుర్బాజ్, ఇబ్రహీం జర్దన్, హజరతుల్లా జజాయ్‌లు, కెప్టెన్ మహ్మద్ నబీ పెద్ద బలం కాగా.. వీరు విఫలమైతే మాత్రం అఫ్గన్‌లో చెప్పుకోదగ్గ బ్యాటర్లు లేరు. ఇక బౌలింగ్‌లో రషీద్ ఖాన్, ముజీబుర్ రెహమాన్‌లు సూపర్ ఫామ్‌ను కొనసాగిస్తున్నారు. ఇక టీమిండియాపై విజయంతో జోష్‌లో ఉన్న పాకిస్తాన్.. ఆఫ్గన్‌తో మ్యాచ్‌లో గెలిచి ఫైనల్‌కు చేరాలని ఉవ్విళ్లూరుతుంది. కెప్టెన్ బాబర్ ఆజం విఫలమైనప్పటికి.. మరో ఓపెనర్ మహ్మద్ రిజ్వాన్ సహా ఫఖర్ జమాన్, మహ్మద్ నవాజ్, ఆసిఫ్ అలీ, కుష్దిల్ షా, ఇఫ్తికర్ అహ్మద్‌లు బ్యాటింగ్‌లో రాణిస్తుండడం సానుకూలాంశం. ఇక బౌలింగ్‌లో నసీమ్ షా, షాదాబ్ ఖాన్, హారిస్ రౌఫ్ అంచనాలకు మంచి రాణిస్తున్నారు. ఇక రికార్డులు పరిశీలిస్తే.. ఇరుజట్లు టి20ల్లో రెండుసార్లు తపలడగా.. రెండుసార్లు పాక్‌నే విజయం వరించింది. 2013లో షార్జా వేదికగా జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్ ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఆ తర్వాత గతేడాది టి20 ప్రపంచకప్‌లో మరోసారి తలపడగా పాకిస్తాన్ ఐదు వికెట్ల తేడాతో గెలుపు సాధించింది. ఇక వన్డేల్లో నాలుగుసార్లు తలపడగా.. అన్నింటిలోనూ పాకిస్తాన్నే విజయం వరించింది. -
వరుస ఓటములు.. అయినా భారత్ ఫైనల్‌కు చేరే ఛాన్స్! ఎలా అంటే?
ఆసియాకప్-2022 లీగ్ మ్యాచ్‌ల్లో అదరగొట్టిన టీమిండియా.. కీలకమైన సూపర్-4 దశలో చేతులెత్తేసింది. తొలి మ్యాచ్‌లో పాకిస్తాన్‌పై ఓటమి చెందిన భారత్.. శ్రీలంకతో డూ ఆర్ డై మ్యాచ్‌లో కూడా పరాజయం పాలైంది. దుబాయ్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్ 6 వికెట్ల తేడాతో ఓటమి చవిచూసింది. తద్వారా ఫైనల్‌కు చేరే అవకాశాలను టీమిండియా సంక్లిష్టం చేసుకుంది. అయితే సాంకేతికంగా చూస్తే ఈ మెగా ఈవెంట్లో భారత్ ఫైనల్‌కు చేరే దారులు ఇంకా మూసుకుపోలేదు. అయితే టీమిండియా భవితవ్యం ఆఫ్గానిస్తాన్ శ్రీలంక జట్టులపై ఆధారపడి ఉంది. భారత్ ఫైనల్‌కు చేరాలంటే ఈ మెగా ఈవెంట్లో టీమిండియా ఫైనల్‌కు చేరాలంటే అద్భుతాలే జరగాలి. సూపర్-4లో భాగంగా బుధవారం పాకిస్తాన్‌తో జరగనున్న మ్యాచ్‌లో ఆఫ్గానిస్తాన్ విజయం సాధించాలి. అదే విధంగా సెప్టెంబర్ 8న ఆఫ్గానిస్తాన్‌తో జరగనున్న సూపర్-4 మ్యాచ్‌లో టీమిండియా భారీ విజయం సాధించాలి. అంతేకాకుండా సెప్టెంబర్ 9న పాకిస్తాన్‌తో జరగబోయే మ్యాచ్‌లో శ్రీలంక విజయం సాధించాలి. ఈ క్రమంలో భారత్, పాక్, ఆఫ్గాన్ జట్లు చెరో విజయంతో సమంగా నిలుస్తాయి. అప్పుడు రన్‌రేట్ ఆధారంగా మూడింటిలో ఒక జట్టు ఫైనల్లో అడుగుపెట్టనుంది. కాగా సూపర్-4లో వరుసగా రెండు విజయాలు సాధించిన శ్రీలంక దాదాపుగా ఫైనల్లో అడుగుపెట్టినట్టే. ఇక రన్‌రేట్ విషయానికి వస్తే.. భారత్(-0.126), ఆఫ్గానిస్తాన్(-0.589) కంటే పాకిస్తాన్(+0.126) మెరుగ్గా ఉంది. టీ20 ప్రపంచకప్-2021లో కూడా.. టీ20 ప్రపంచకప్-2021లో కూడా ఇదే పరిస్థితి ఏర్పడింది. వరల్డ్‌కప్ లీగ్ మ్యాచ్‌ల్లో వరుసగా పరాజయాలు చవిచూసిన భారత్ సెమీస్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. ఈ క్రమంలో న్యూజిలాండ్‌ను ఆఫ్ఘనిస్తాన్ ఓడించడంపైనే భారత్ సెమీస్ ఆశలు ఆధారపడ్డాయి. అయితే ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ చేతిలో ఆఫ్గాన్ ఓటమిపాలైంది. దీంతో భారత్ టీ20 ప్రపంచకప్ నుంచి ఇంటిముఖం పట్టింది. అయితే ఈసారైనా ఆసియా కప్‌లో పాకిస్తాన్‌ను ఆఫ్ఘనిస్తాన్ ఓడించాలని భారత జట్టుతో పాటు అభిమానులు కూడా కోరుకుంటున్నారు. Hoping for the best, ready for the worst 🤞🏻#INDvSL #AsiaCupT20 #TeamIndia pic.twitter.com/yRqWCsZgN4 — Sportskeeda (@Sportskeeda) September 6, 2022 (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) చదవండి: Asia Cup 2022: ఆసియాకప్‌లో విరాట్ కోహ్లి చెత్త రికార్డు.. తొలి ఆటగాడిగా! -
అచ్చం ధోనిలానే చేశాడు.. అతని స్టైల్లోనే మ్యాచ్ ముగించాడు..
Asif Ali Refreshes Dhoni Gun Shot Celebration After Hitting Four Sixes Against Afghanistan: టీ20 ప్రపంచకప్-2021లో భాగంగా అక్టోబర్ 29న అఫ్గానిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్ 5 వికెట్ల తేడాతో సూపర్ విక్టరీ సాధించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో పాక్ విజయానంతరం ఓ ఆసక్తికర సన్నివేశం తారసపడింది. ఇన్నింగ్స్ 19వ ఓవర్లో నాలుగు సిక్సర్లు బాది పాక్‌కు అద్భుత విజయాన్నందించిన ఆసిఫ్ అలీ.. టీమిండియా మాజీ కెప్టెన్, ప్రస్తుతం మెంటార్ ఎంస్ ధోని తరహాలో విన్నింగ్ మూమెంట్‌ను సెలబ్రేట్ చేసుకుంటూ కనిపించాడు. ఈ మ్యాచ్‌ను ధోని స్టైల్లోనే ఫినిష్ చేసిన ఆసిఫ్.. అచ్చం అతనిలానే గన్ షాట్ సెలబ్రేషన్స్ చేసుకున్నాడు. #PakvsAfg #Dhoni #AsifAli #Dubai #WorldT20 #T20WC #RememberTheNameAsifAli pic.twitter.com/oVtn43Bkd0 — Zeeshan Ali Rizvi (@zshalyrizvi) October 29, 2021 గతంలో ధోని ఎప్పుడు విన్నింగ్ షాట్ కొట్టినా.. ఇలానే సెలబ్రేట్ చేసుకునేవాడు. బ్యాట్‌తో గన్ ట్రిగ్గర్ నొక్కినట్లు ఫోజు ఇస్తూ సందర్భాన్ని ఎంజాయ్ చేసేవాడు. ఈ మ్యాచ్‌లో పాక్‌కు ఓటమి తప్పదనుకున్న సమయంలో.. భారీ సిక్సర్లతో విరుచుకుపడిన ఆసిఫ్ అలీ కూడా ధోని తరహాలోనే విజయాన్ని సెలబ్రేట్ చేసుకున్నాడు. దీనికి సంబంధించిన ఇమేజస్ ప్రస్తుతం సోషల్‌మీడియాలో ట్రెండింగ్‌లో ఉన్నాయి. ఆసిఫ్ అలీ మరో ధోని.. అంటూ క్రికెట్ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, పాక్ ఈ మెగా టోర్నీలో ఆడిన మూడు మ్యాచ్‌ల్లో విజయాలు సాధించి సెమీస్ బెర్తును దాదాపుగా ఖరారు చేసుకుంది. తొలి మ్యాచ్‌లో టీమిండియాపై 10 వికెట్ల తేడాతో గెలుపొందిన పాక్.. తరువాతి మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై 5 వికెట్ల తేడాతో, తాజాగా అఫ్గాన్‌పై కూడా 5 వికెట్ల తేడాతో ఘన విజయాలు నమోదు చేసింది. Close enough #AsifAli#PAKvAFG #T20WorldCup #Pak #Afganisthan pic.twitter.com/bKyNHsQF9Q — Bhanu Kumar Jha (@BhanuKumarJha) October 29, 2021 చదవండి: కోహ్లి రికార్డును బ్రేక్ చేసిన బాబర్ ఆజమ్: కోహ్లిని వెంటాడుతున్న ఆజమ్ అంటూ.. -
Pak vs Afg: టిక్కెట్లు లేకుండానే.. ఫ్యాన్స్ రచ్చ.. ఐసీసీ క్షమాపణలు
ICC Issues Apology Fans Without Tickets Enters Stadium: టీ20 వరల్డ్‌కప్-2021 టోర్నీలో భాగంగా పాకిస్తాన్, అఫ్గనిస్తాన్ మధ్య దుబాయ్‌లో అక్టోబరు 29న మ్యాచ్ సందర్బంగా అభిమానులు గందరగోళం సృష్టించారు. కొంతమంది టికెట్లు లేకుండానే స్టేడియంలో ప్రవేశించారు. దీంతో టికెట్ కొని మ్యాచ్‌ను వీక్షిద్దామనుకున్న ప్రేక్షకులకు ఇబ్బంది ఎదురైంది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఈ ఘటనపై స్పందించిన ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ విచారం వ్యక్తం చేసింది. టికెట్లు కొన్న వారికి అంతరాయం కలిగినందుకు క్షమాపణ తెలియజేసింది. ఈ మేరకు.. ‘‘పాకిస్తాన్- అఫ్గనిస్తాన్ మ్యాచ్ నేపథ్యంలో 16 వేలకు పైగా టిక్కెట్లు అందుబాటులో ఉంచాము. కానీ... టిక్కెట్లు లేకుండానే వేలాది మంది అభిమానులు మ్యాచ్ వేదిక వద్దకు వచ్చి... బలవంతంగా మైదానంలోకి ప్రవేశించేందుకు యత్నించారు. అయితే, దుబాయ్ పోలీసులు, భద్రతా సిబ్బంది వెంటనే స్పందించారు. అదనపు బలగాలను రంగంలోకి దించి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు’’ అని అధికారిక ప్రకటనలో పేర్కొంది. అదే విధంగా ఈ ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ చేపట్టాల్సిందిగా ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు(ఈసీబీ)ని ఆదేశించినట్లు పేర్కొంది. టిక్కెట్లు కొని మ్యాచ్ చూద్దామని వచ్చిన ప్రేక్షకులకు ఇబ్బంది కలిగినందుకు ఐసీసీ, ఈసీబీ క్షమాపణ కోరుతున్నాయని పేర్కొంది. చదవండి: T20 World Cup 2021 Final: ఆ పేరు గుర్తుపెట్టుకోండి.. ఫైనల్లో ఆ రెండు జట్లే: స్టోక్స్ -
Pak Vs Afg: భేష్.. ఇలాంటి జట్టును ఎన్నడూ చూడలేదు: ఇమ్రాన్ ఖాన్
Imran Khan Says I have never seen a cricketing nation rise as rapidly as Afghanistan: టీ20 ప్రపంచప్-2021 టోర్నీ సూపర్-12 రౌండ్‌కు నేరుగా అర్హత సాధించి సత్తా చాటింది అఫ్గనిస్తాన్ క్రికెట్ జట్టు. ఈ మెగా ఈవెంట్లో శ్రీలంక, బంగ్లాదేశ్ క్వాలిఫైయర్స్ ఆడగా .. అఫ్గన్ మాత్రం డైరెక్ట్‌గా టీమిండియా, పాకిస్తాన్‌తో కలిసి గ్రూపు-2లో చేరింది. తద్వారా తమను పసికూనలుగా భావించవద్దనే గట్టి సంకేతాలు ఇచ్చింది. ఇక మొదటి మ్యాచ్‌లో స్కాట్లాండ్పై 130 పరుగుల తేడాతో విజయం సాధించి ఘనంగా టోర్నీ ప్రయాణాన్ని ఆరంభించింది. తాలిబన్ల పాలనలో సతమతవుతున్న ప్రజలకు కాస్త ఊరటనిచ్చేలా.. ప్రపంచ వేదికపై అద్వితీయమైన గెలుపును అందుకుంది. అదే విధంగా... అక్టోబరు 29న పాకిస్తాన్‌తో మ్యాచ్‌లోనూ బాబర్ ఆజమ్ బృందాన్ని ఓడించినంత పని చేసింది. ఆఖర్లో ఆసిఫ్ అలీ మెరుపులు మెరిపించకపోయి ఉంటే... సంచలన విజయం అఫ్గన్ సొంతమయ్యేది. ఏదేమైనా శుక్రవారం నాటి మ్యాచ్‌లో ఓడినప్పటికీ నబీ బృందం మెరుగైన ప్రదర్శనతో ఆకట్టుకుంది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ ప్రధాని, మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ అఫ్గనిస్తాన్ జట్టుపై ప్రశంసలు కురిపించారు. గత దశాబ్దకాలంగా అఫ్గన్ జట్టు ఎదిగిన విధానం తనను ఆశ్చర్యానికి గురిచేసిందన్నారు. ఈ మేరకు ట్విటర్ వేదికగా పాకిస్తాన్‌కు శుభాకాంక్షలు చెబుతూనే... మహ్మద్ నబీ టీమ్‌ను కొనియాడారు. ‘‘పాకిస్తాన్ జట్టుకు శుభాభినందనలు. అఫ్గనిస్తాన్ జట్టు ఆకట్టుకునే ప్రదర్శన కనబరిచింది. అంతర్జాతీయ క్రికెట్లో ఇంత వేగంగా ఎదిగి... ఈ స్థాయిలో ప్రత్యర్థి జట్లకు సవాల్ విసరగలిగే జట్టును నేనింత వరకు చూడలేదు. ఇంతటి ప్రతిభ, పోటీతత్వం కలిగిన అఫ్గనిస్తాన్ జట్టుకు ఎంతో మెరుగైన భవిష్యత్తు ఉంది’’ అని ఇమ్రాన్‌ఖాన్ ట్వీట్ చేశారు. అయితే, ఇందుకు నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. చదవండి: T20 World Cup 2021 Final: ఆ పేరు గుర్తుపెట్టుకోండి.. ఫైనల్లో ఆ రెండు జట్లే: స్టోక్స్ Congratulations Team Pakistan. Impressive cricket by Team Afghanistan. Never have I seen a cricketing nation rise as rapidly as Afghanistan in international cricket & become so competitive. With this competitive spirit & talent the future of cricket is bright in Afghanistan. — Imran Khan (@ImranKhanPTI) October 29, 2021 -
T20 World Cup Pak Vs Afg: పాకిస్తాన్ ‘హ్యాట్రిక్’.. సెమీస్ బెర్త్ ఖాయం!
Pakistan Beat Afghanistan By 5 Wickets Hat Trick Win: టీ20 వరల్డ్‌కప్-2021... అఫ్గనిస్తాన్‌తో మ్యాచ్... ఆఖరి 2 ఓవర్లలో పాకిస్తాన్ విజయానికి 24 పరుగులు కావాలి. బౌలర్ ఎవరైనా ఇది అంత సులువు కాదు. పైగా అంతకుముందు ఓవర్లో 2 పరుగులే రావడంతో పాక్ బ్యాటర్లపై తీవ్ర ఒత్తిడి ఉంది. అఫ్గానిస్తాన్ జట్టు సంచలన విజయం సాధించడం ఖాయమనిపించింది. అయితే ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ ఆసిఫ్ అలీ (7 బంతుల్లో 25 నాటౌట్; 4 సిక్సర్లు) పాక్ రాత మార్చేశాడు. కరీమ్ వేసిన 19వ ఓవర్లో ఏకంగా 4 సిక్సర్లతో చెలరేగి జట్టును గెలిపించాడు. అతను వరుసగా 6, 0, 6, 0, 6, 6 పరుగులు సాధించాడు. దాంతో పాకిస్తాన్ ఐదు వికెట్ల తేడాతో నెగ్గింది. వరుసగా మూడో విజయంతో పాక్‌కు సెమీస్ బెర్త్ దాదాపు ఖాయమైంది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన అఫ్గానిస్తాన్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 147 పరుగులు చేసింది. గుల్బదిన్ నైబ్ (25 బంతుల్లో 35 నాటౌట్; 4 ఫోర్లు, 1 సిక్స్), నబీ (32 బంతుల్లో 35 నాటౌట్; 5 ఫోర్లు) రాణించారు. వీరిద్దరు ఏడో వికెట్‌కు 45 బంతుల్లో 71 పరుగులు జోడించారు. పాక్ 19 ఓవర్లలో 5 వికెట్లకు 148 పరుగులు సాధించి గెలిచింది. ఇక పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్ (47 బం తుల్లో 51; 4 ఫోర్లు), ఫఖర్ జమాన్ (25 బంతుల్లో 30; 2 ఫోర్లు, 1 సిక్స్) కీలక ఇన్నింగ్స్ ఆడారు. బాబర్ అర్ధసెంచరీ... సాధారణ లక్ష్య ఛేదనలో పాక్ ఆరంభంలోనే రిజ్వాన్ (8) వికెట్‌ను కోల్పోయింది. అయితే బాబర్, ఫఖర్ కలిసి ప్రశాంతంగా ఇన్నింగ్స్‌ను నడిపించారు. అయితే తక్కువ వ్యవధిలో ఫఖర్‌తో పాటు హఫీజ్ (10) కూడా నిష్క్రమించాడు. బాబర్‌ను రషీద్ అవుట్ చేయడంతో ఉత్కంఠ పెరిగింది. 18వ ఓవర్లో నవీన్ ఉల్ హఖ్ 2 పరుగులే ఇచ్చి మాలిక్ (19) వికెట్ తీయడంతో అఫ్గాన్ గెలుపుపై ఆశలు పెంచుకుంది. అయితే ఆసిఫ్ తన మెరుపు బ్యాటింగ్‌తో పాక్‌ను గెలిపించాడు. రషీద్ ఖాన్ ఘనత అంతర్జాతీయ టి20ల్లో 100 వికెట్లు పూర్తి చేసుకున్న నాలుగో బౌలర్ రషీద్ ఖాన్. గతంలో షకీబ్ (బంగ్లాదేశ్–117 వికెట్లు), మలింగ (శ్రీలంక–107), సౌతీ (న్యూజిలాండ్ –100) మాత్రమే ఈ ఘనత సాధించారు. స్కోరు వివరాలు అఫ్గానిస్తాన్ ఇన్నింగ్స్: హజ్రతుల్లా (సి) రవూఫ్ (బి) ఇమాద్ 0; షహజాద్ (సి) బాబర్ (బి) అఫ్రిది 8; రహ్మానుల్లా (సి) బాబర్ (బి) హసన్ 10; అస్గర్ (సి అండ్ బి) రవూఫ్ 10; కరీమ్ (సి) ఫఖర్ (బి) ఇమాద్ 15; నజీబుల్లా (సి) రిజ్వాన్ (బి) షాదాబ్ 22; నబీ (నాటౌట్) 35; గుల్బదిన్ (నాటౌట్) 35; ఎక్స్‌ట్రాలు 12, మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 147. వికెట్ల పతనం: 1–7, 2–13, 3–33, 4–39, 5–64, 6–76. బౌలింగ్: షాహిన్ అఫ్రిది 4–0– 22–1, ఇమాద్ 4–0–25–2, రవూఫ్ 4–0–37–1, హసన్ 4–1–38–1, షాదాబ్ 4–0–22–1. పాకిస్తాన్ ఇన్నింగ్స్: రిజ్వాన్ (సి) నవీన్ (బి) ముజీబ్ 8; బాబర్ (బి) రషీద్ 51; ఫఖర్ (ఎల్బీ) (బి) నబీ 30; హఫీజ్ (సి) గుల్బదిన్ (బి) రషీద్ 10; షోయబ్ మాలిక్ (సి) షహజాద్ (బి) నవీన్ 19; ఆసిఫ్ అలీ (నాటౌట్) 25; షాదాబ్ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 5, మొత్తం (19 ఓవర్లలో 5 వికెట్లకు) 148. వికెట్ల పతనం: 1–12, 2–75, 3–97, 4–122, 5–124. బౌలింగ్: ముజీబ్ 4–0–14–1, నబీ 4–0–36–1, నవీన్ 3–0–22–1, కరీమ్ 4–0–48–0, రషీద్ 4–0–26–2. చదవండి: Ishan Kishan: ఇషాన్ ఓపెనర్‌గా వస్తే దుమ్మురేపడం ఖాయం -
టి20 క్రికెట్లో రషీద్ ఖాన్ అరుదైన ఘనత
Rashid Khan Takes 100 Wickets In T20 Cricket.. టి20 క్రికెట్లో రషీద్ ఖాన్ 100 వికెట్ల మైలురాయిని అందుకున్నాడు. టి20 ప్రపంచకప్‌లో పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో రషీద్ ఖాన్ ఈ ఘనత సాధించాడు. పాక్ బ్యాటర్ మహ్మద్ హఫీజ్‌ను ఔట్ చేయడం ద్వారా రషీద్ 100 వికెట్ల మార్క్‌ను అందుకున్నాడు. అయితే అత్యంత వేగంగా 100 వికెట్ల మైలురాయిని అందుకున్న ఆటగాడిగా రషీద్ చరిత్ర సృష్టించాడు. ఈ ఫీట్ అందుకోవడానికి రషీద్ 53 మ్యాచ్‌లు తీసుకున్నాడు. చదవండి: BAN Vs WI: డిపెండింగ్ చాంపియన్ ఆటతీరు.. వెస్టిండీస్‌కు అలవాటే కాగా టి20 క్రికెట్ చరిత్రలో 100 వికెట్ల మార్క్‌ను చేరుకున్న నాలుగో ఆటగాడిగా రషీద్ నిలిచాడు. ఇంతకముందు షకీబ్ అల్ హసన్(117 వికెట్లు, బంగ్లాదేశ్), లసిత్ మలింగ(107 వికెట్లు, శ్రీలంక), టిమ్ సౌథీ(100 వికెట్లు, న్యూజిలాండ్) ఉన్నారు. చదవండి: T20 WC 2021 PAK Vs AFG:ఆసిఫ్ అలీ సిక్సర్ల వర్షం.. పాక్ హ్యట్రిక్ విజయం Rashid Khan snares Hafeez for 100th T20I wicket via @t20worldcup https://t.co/MubG7GVSij — varun seggari (@SeggariVarun) October 29, 2021 -
తాలిబన్ల రాజ్యంలో తొలి నియామకం.. అఫ్గాన్ క్రికెట్ చీఫ్‌గా ఫజ్లీ
కాబూల్: అఫ్గనిస్తాన్‌ను తమ ఆధీనంలోకి తెచ్చుకున్న తర్వాత తాలిబన్లు మొట్టమొదటి అధికారిక నియామకాన్ని చేపట్టారు. అఫ్గానిస్తాన్ క్రికెట్ బోర్డు (ఏసీబీ) చైర్మన్‌గా అజీజుల్లా ఫజ్లీకి పట్టం కట్టారు. కొద్ది రోజుల కిందట అఫ్గాన్ క్రికెట్ బోర్డు అధికారులతో సమావేశమైన తాలిబన్లు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. అఫ్గాన్‌లో తాలిబన్ల రాజ్యం ఏర్పడ్డాక చోటు చేసుకున్న అతిపెద్ద నియామకం ఇదే కావడం విశేషం. ఫజ్లీ 2018-19లో ఏసీబీ చీఫ్‌గా వ్యవహరించాడు. అయితే 2019 వన్డే ప్రపంచకప్‌లో అఫ్గానిస్తాన్ దారుణ ప్రదర్శన(చివరి స్థానంలో నిలవడంతో) కారణంగా అతడు పదవి నుంచి వైదొలిగాడు. ఫజ్లీ హాయంలో అఫ్గాన్ క్రికెట్ అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తుందని తాలిబన్లు ఆశాభావం వ్యక్తం చేశారు. Former ACB Chairman @AzizullahFazli has been re-appointed as ACB's acting Chairman. He will oversee ACB's leadership and course of action for the upcoming competitions. pic.twitter.com/IRqekHq7Jt— Afghanistan Cricket Board (@ACBofficials) August 22, 2021 ఇదిలా ఉంటే, అఫ్గానిస్తాన్ జట్టు వచ్చేనెలలో పాక్‌తో మూడు వన్డేల సిరీస్‌లో తలపడాల్సి ఉండింది. అయితే కారణాలు ప్రకటించకుండా ఈ సిరీస్‌ను వాయిదా వేస్తున్నట్లు అఫ్గాన్ క్రికెట్ బోర్డు తాజాగా ప్రకటించింది. ఓవైపు క్రికెట్‌కు మద్దతిస్తామని.. క్రికెటర్లు భయపడాల్సిన అవసరం లేదని.. స్వేచ్చగా క్రికెట్ ఆడుకోవచ్చని ప్రకటించిన తాలిబన్లు.. ఒక్కరోజు వ్యవధిలోనే కారణాలు వెల్లడించకుండా సిరీస్‌ను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించడం అందరినీ ఆశ్చర్యపరిచింది. వాస్తవంగా ఈ సిరీస్ శ్రీలంకలో జరగాల్సి ఉండింది. అయితే, కాబూల్ నుంచి వాణిజ్య విమానాల రాకపోకలను రద్దు చేయడం, కరోనా కేసులు బాగా పెరగడంతో శ్రీలంకలో 10 రోజుల లాక్డౌన్ విధించారు. ఈ పరిణామాల నేపథ్యంలో సిరీస్‌ను పాక్‌లో జరపాలని ఏసీబీ తొలుత నిర్ణయించింది. షెడ్యూల్ ప్రకారం ఈ సిరీస్ వచ్చే నెల 3 నుంచి ప్రారంభం కావాల్సి ఉండింది. చదవండి: అరుదైన రికార్డుకు చేరువలో టీమిండియా పేసు గుర్రం.. -
పాక్‌తో వన్డే సిరీస్‌కు తాలిబన్ల గ్రీన్ సిగ్నల్..
లాహోర్: అఫ్గనిస్తాన్‌లో ప్రస్తుతం నెలకొన్న దుర్భర పరిస్థితుల నేపథ్యంలో పొరుగు దేశమైన పాక్‌తో శ్రీలంక వేదికగా వచ్చే నెలలో జరగాల్సిన వన్డే సిరీస్‌పై నీలినీడలు కమ్ముకున్నాయి. అయితే, ఈ సిరీస్‌కు తాలిబన్లు అంగీకారం తెలిపారని, ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమే సిరీస్ యధావిధిగా కొనసాగుతుందని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) పేర్కొనడం సంచలనంగా మారింది. తాలిబన్లు మొదటి నుంచి క్రికెట్‌కు వ్యతిరేకులుగా ఉండటంతో ఈ సిరీస్ జరగడం అసాధ్యమని అంతా అనుకున్నారు. అయితే, సిరీస్ నిర్వహణకు తాలిబన్ల నుంచి అనూహ్యంగా మద్దతు లభించడంతో క్రికెట్ ప్రపంచం మొత్తం అవాక్కయ్యింది. కాగా, సెప్టెంబర్ 1 నుంచి 5 వరకు శ్రీలంకలోని హంబన్‌తోట వేదికగా పాక్, ఆఫ్గన్ల మధ్య మూడు వన్డేల సిరీస్ జరగాల్సి ఉంది. చదవండి: స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా రషీద్ ఖాన్ భావోద్వేగం -
స్టేడియంలో గొడవ; ఛీకొట్టేలా ఉందీయవ్వారం..!
-
స్టేడియంలో గొడవ; ఛీకొట్టేలా ఫ్యాన్స్ ఘర్షణ
లీడ్స్ : అఫ్గాన్, పాక్ అభిమానుల చేష్టలతో క్రికెట్ ప్రపంచం నివ్వెరపోయింది. ఆటను ఆస్వాదిస్తూ తమవాళ్లకు మద్దతుగా నిలవాల్సిందిపోయి.. వీధిరౌడిల్లా కొట్టుకోవడంతో ఆయా దేశాలకు తలవంపులు తెచ్చారని క్రికెట్ ప్రేమికులు మండిపడుతున్నారు. స్థానిక మైదానంలో శనివారం అఫ్గాన్, పాక్‌ల మధ్య మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. అఫ్గాన్ నిర్దేశించిన 227 పరుగుల లక్ష్యాన్ని పాక్ 49.4 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి ఛేదించింది. అయితే, మ్యాచ్‌కు ముందు ఇరుదేశాల అభిమానుల మధ్య నెలకొన్న ఘర్షణపూరిత వాతావరణం అనంతరం కూడా కొనసాగింది. మ్యాచ్ జరగుతున్న క్రమంలో రెండు దేశాల అభిమానులు ఒకరిపై ఒకరు పిడిగుద్దుల వర్షం కురిపించారు. ఈ నేపథ్యంలో స్టేడియం బయట కూడా ఘర్షణ చెలరేగింది. అక్కడా అభిమానులు పరస్పర దాడులకు దిగారు. స్టేడియం వెలుపల ఉన్న ఆస్తులను ధ్వంసం చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు గొడవకు కారణమైన వారిని బయటికి పంపించి వేశారు. వరల్డ్‌కప్ మిగతా మ్యాచ్‌లు చూడకుండా ఐసీసీ వారిపై నిషేదం విధించింది. ఇలాంటి చర్యలను ఎంతమాత్రం సహించబోమని స్పష్టం చేసింది. పాకిస్తాన్‌కు చెందిన ఓ వృద్ధ అభిమానిపై అఫ్గాన్ మద్దతుదారు నోరుజారడంతో ఈ గొడవ జరినట్టు తెలుస్తోంది. ఇక ఈ వివాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. -
ఉండబట్టలేక బంతులేశాడు.. జట్టును ముంచాడు..!
లీడ్స్: ప్రపంచకప్‌లో భాగంగా పాకిస్తాన్‌తో శనివారం జరిగిన మ్యాచ్‌లో అఫ్గాన్ చేజేతులో ఓడింది. స్పిన్నర్లు అద్భుత బౌలింగ్‌తో పాక్ బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేస్తున్న తరుణంలో అఫ్గాన్ కెప్టెన్ గుల్బదిన్ చెత్త నిర్ణయం తీసుకున్నాడు. అప్పటికీ 228 పరుగుల లక్ష్య ఛేదనలో తడబడిన పాక్ ఒక దశలో 45 ఓవర్లలో 6 వికెట్లకు 182 పరుగులు చేసింది. 5 ఓవర్లలో 46 పరుగులు అంటే 9కి పైగా రన్‌రేట్‌తో కష్టసాధ్యమైన పరిస్థితి! ప్రధాన స్పిన్నర్లు రషీద్, ముజీబ్‌లకు కలిపి 3 ఓవర్లు, అంతకుముందు ఓవర్లో 2 పరుగులే ఇచ్చిన లెగ్‌స్పిన్నర్ షిన్వారికి మరో 2 ఓవర్లు మిగిలే ఉన్నాయి. కానీ, అప్పటికే అందరికంటే ఎక్కువ పరుగులు ఇచ్చిన నైబ్ అత్యుత్సాహంతో బౌలింగ్‌కు సిద్ధమయ్యాడు. బౌలింగ్ (46వ ఓవర్) చేసి విజయాన్ని బంగారు పళ్లెంలో పెట్టి ప్రత్యర్థికి అందించాడు. ఈ ఓవర్లో చెలరేగిన ఇమాద్ వసీం మూడు ఫోర్లు సహా ఏకంగా 18 పరుగులు రాబట్టి పాక్ పని సులువు చేశాడు. ఒక్కసారిగా 18 బంతుల్లో 28 పరుగులకు సమీకరణం మారిపోగా, 16 బంతుల్లోనే పాక్ పని పూర్తి చేసింది. ఈ విజయంతో పాక్ పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి చేరగా.. ఇంగ్లండ్ ఐదో స్థానానికి పడిపోయింది. (అయ్యో అఫ్గాన్!) ఇదిలాఉండగా.. గుల్బదిన్ అత్యుత్సాహంపై స్వదేశీ అభిమానులతోపాటు ఇంగ్లండ్ మాజీ ఆటగాళ్లు, అభిమానులు సైతం మండిపడుతున్నారు. ప్రపంచకప్‌లో అఫ్గాన్ తొలి విజయం సాధించే అవకాశానికి గండికొట్టడంతో పాటు ఇంగ్లండ్ సెమీస్ అవకాశాలనూ సంక్లిష్టం చేశారని ఇంగ్లీష్ జుట్టు మాజీ కెప్టెన్ మైఖేల్‌వాన్ అసహనం వ్యక్తం చేశాడు. ఓటమితో సెమీస్‌రేసులో వెనకబడిపోతుందనుకున్న పాక్‌కు అనూహ్య విజయాన్నందించాడని ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇక పాక్ విజయంతో సెమీస్ చేరాలంటే ఇంగ్లండ్ భారత్, న్యూజిలాండ్‌తో తప్పక గెలవాల్సిన పరిస్థితి నెలకొంది. ఒకవేళ అఫ్గాన్ చేతిలో పాక్ పరాజయం పాలైతే ఇంగ్లండ్ సెమీస్ అవకాశాలు మరింత సరళమయ్యేవి. శనివారం ఇక్కడి హెడింగ్లీ మైదానంలో జరిగిన లీగ్ మ్యాచ్‌లో పాకిస్తాన్ 3 వికెట్ల తేడాతో అఫ్గాన్‌పై గెలుపొందింది. ఫలితంగా తమ సెమీస్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన అఫ్గాన్ 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 227 పరుగులు చేసింది. అస్గర్ అఫ్గాన్ (35 బంతుల్లో 42; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), నజీబుల్లా జద్రాన్ (54 బంతుల్లో 42; 6 ఫోర్లు) టాప్ స్కోరర్లుగా నిలిచారు.షాహిన్ అఫ్రిది 4 వికెట్లతో ప్రత్యర్థిని దెబ్బ తీశాడు. అనంతరం పాకిస్తాన్ 49.4 ఓవర్లలో 7 వికెట్లకు 230 పరుగులు సాధించింది. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ ఇమాద్ వసీం (54 బంతుల్లో 49 నాటౌట్; 5 ఫోర్లు) అద్భుత బ్యాటింగ్‌తో చివరి వరకు నిలిచి జట్టును గెలిపించగా... బాబర్ ఆజమ్ (51 బంతుల్లో 45; 5 ఫోర్లు), ఇమామ్ ఉల్ హఖ్ (36) రాణించారు. -
అఫ్గాన్‌పై పాకిస్థాన్ విజయం
-
అయ్యో అఫ్గాన్!
గెలుపు అంచుల దాకా రావడం వేరు... మ్యాచ్ గెలవడం వేరు... అఫ్గానిస్తాన్ జట్టుకు ఇప్పుడు ఈ రెండింటి మధ్య తేడా అర్థమై ఉంటుంది. ఈ కప్‌లో భారత్‌ను గడగడలాడించిన ఆ టీమ్ శనివారం పాకిస్తాన్‌ను దాదాపు ఓడించే స్థితిలో నిలిచింది. కానీ మరోసారి ఆ జట్టు అరుదైన అవకాశాన్ని చేజార్చుకుంది...పేలవ ఫీల్డింగ్‌కు తోడు కెప్టెన్ గుల్బదిన్ నైబ్ చెత్త నాయకత్వం అఫ్గన్‌కు వరుసగా ఎనిమిదో పరాజయాన్ని మిగిల్చాయి. మరో వైపు ఈ మ్యాచ్‌లో ఓడితే సెమీస్ అవకాశాలు దాదాపుగా కోల్పోయే పరిస్థితిలో నిలిచిన పాక్ ఎట్టకేలకు గట్టెక్కింది. బౌలింగ్‌లో షాహిన్ అఫ్రిది సత్తా చాటి ప్రత్యర్థిని కట్టడి చేయగా... తీవ్ర ఒత్తిడిలో ఇమాద్ వసీమ్ అద్భుత బ్యాటింగ్‌తో జట్టును గెలిపించాడు. లీడ్స్: 228 పరుగుల లక్ష్య ఛేదనలో తడబడిన పాక్ ఒక దశలో 45 ఓవర్లలో 6 వికెట్లకు 182 పరుగులు చేసింది. 5 ఓవర్లలో 46 పరుగులు అంటే 9కి పైగా రన్‌రేట్‌తో కష్టసాధ్యమైన పరిస్థితి! కానీ అఫ్గానిస్తాన్ కెప్టెన్ గుల్బదిన్ విజయాన్ని బంగారు పళ్లెంలో పెట్టి ప్రత్యర్థికి అందించాడు. ప్రధాన స్పిన్నర్లు రషీద్, ముజీబ్‌లకు కలిపి 3 ఓవర్లు, అంతకుముందు ఓవర్లో 2 పరుగులే ఇచ్చిన లెగ్‌స్పిన్నర్ షిన్వారికి మరో 2 ఓవర్లు మిగిలి ఉన్నాయి. పాక్ బ్యాట్స్‌మెన్ స్పిన్‌లో తీవ్రంగా ఇబ్బంది పడుతున్న దశలో వీరి బౌలింగ్ అఫ్గాన్‌కు అరుదైన విజయాన్ని అందించేదే. కానీ అప్పటికే అందరికంటే ఎక్కువ పరుగులు ఇచ్చిన నైబ్ అత్యుత్సాహంతో బౌలింగ్‌కు సిద్ధమయ్యాడు. ఈ ఓవర్లో చెలరేగిన ఇమాద్ మూడు ఫోర్లు సహా ఏకంగా 18 పరుగులు రాబట్టి పాక్ పని సులువు చేశాడు. ఒక్కసారిగా 18 బంతుల్లో 28 పరుగులకు సమీకరణం మారిపోగా, 16 బంతుల్లోనే పాక్ పని పూర్తి చేసింది. శనివారం ఇక్కడి హెడింగ్లీ మైదానంలో జరిగిన లీగ్ మ్యాచ్‌లో పాకిస్తాన్ 3 వికెట్ల తేడాతో అఫ్గాన్‌పై గెలుపొందింది. ఫలితంగా తమ సెమీస్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన అఫ్గాన్ 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 227 పరుగులు చేసింది. అస్గర్ అఫ్గాన్ (35 బంతుల్లో 42; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), నజీబుల్లా జద్రాన్ (54 బంతుల్లో 42; 6 ఫోర్లు) టాప్ స్కోరర్లుగా నిలిచారు. షాహిన్ అఫ్రిది 4 వికెట్లతో ప్రత్యర్థిని దెబ్బ తీశాడు. అనంతరం పాకిస్తాన్ 49.4 ఓవర్లలో 7 వికెట్లకు 230 పరుగులు సాధించింది. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ ఇమాద్ వసీం (54 బంతుల్లో 49 నాటౌట్; 5 ఫోర్లు) అద్భుత బ్యాటింగ్‌తో చివరి వరకు నిలిచి జట్టును గెలిపించగా... బాబర్ ఆజమ్ (51 బంతుల్లో 45; 5 ఫోర్లు), ఇమామ్ ఉల్ హఖ్ (36) రాణించారు. స్కోరు వివరాలు అఫ్గానిస్తాన్ ఇన్నింగ్స్ : రహ్మత్ షా (సి) బాబర్ (బి) ఇమాద్ 35; గుల్బదిన్ (సి) సర్ఫరాజ్ (బి) షాహిన్ 15; హష్మతుల్లా (సి) ఇమాద్ (బి) షాహిన్ 0; ఇక్రామ్ (సి) హఫీజ్ (బి) ఇమాద్ 24; అస్గర్ (బి) షాదాబ్ 42; నబీ (సి) ఆమిర్ (బి) రియాజ్ 16; నజీబుల్లా (బి) షాహిన్ 42; షిన్వారి (నాటౌట్) 19; రషీద్ (సి) ఫఖర్ (బి) షాహిన్ 8; హమీద్ (బి) వహాబ్ 1; ముజీబ్ (నాటౌట్) 7; ఎక్స్‌ట్రాలు 18; మొత్తం (50 ఓవర్లలో 9 వికెట్లకు) 227. వికెట్ల పతనం: 1–27, 2–27, 3–57, 4–121, 5–125, 6–167, 7–202, 8–210, 9–219. బౌలింగ్: ఇమాద్ 10–0–48–2, ఆమిర్ 10–1–41–0, షాహిన్ 10–0–47–4, హఫీజ్ 2–0–10–0, వహాబ్ 8–0–29–2, షాదాబ్ 10–0–44–1. పాకిస్తాన్ ఇన్నింగ్స్: ఫఖర్ ఎల్బీడబ్ల్యూ (బి) ముజీబ్ 0; ఇమామ్ (స్టంప్డ్) ఇక్రామ్ (బి) నబీ 36; బాబర్ ఆజమ్ (బి) నబీ 45; హఫీజ్ (సి) హష్మతుల్లా (బి) ముజీబ్ 19; హారిస్ సొహైల్ ఎల్బీడబ్ల్యూ (బి) రషీద్ 27; సర్ఫరాజ్ రనౌట్ 18; ఇమాద్ (నాటౌట్) 49; షాదాబ్ రనౌట్ 11; వహాబ్ నాటౌట్ 15; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం (49.4 ఓవర్లలో 7 వికెట్లకు)230. వికెట్ల పతనం: 1–0, 2–72, 3–81, 4–121, 5–142, 6–156, 7–206. బౌలింగ్: ముజీబ్ 10–1–34–2, హమీద్ 2–0–13–0, నైబ్ 9.4–0–73–0, నబీ 10–0–23–2, రషీద్ 10–0–50–1, షిన్వారీ 8–0–32–0. -
చెలరేగిన షాహిన్ అఫ్రిది
లీడ్స్: వన్డే వరల్డ్‌కప్‌లో భాగంగా పాకిస్తాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో అఫ్గానిస్తాన్ 228 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్న అఫ్గాన్..27 పరుగుల వద్ద ఉండగా గుల్బదిన్ నైబ్ (15) వికెట్‌ను నష్టపోయింది. ఆపై వెంటనే హస్మతుల్లా షాహిది గోల్డెన్ డక్‌గా ఔటయ్యాడు. ఆ తరుణంలో రహ్మత్ షా- ఇక్రమ్ అలీ ఖిల్ జోడి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే యత్నం చేసింది. వీరిద్దరూ 30 పరుగులు జత చేసిన తర్వాత రహ్మత్ షా(35) పెవిలియన్ చేరాడు. అటు తర్వాత అలీ ఖిల్- అస్గర్ అఫ్గన్లు మరమ్మత్తులు చేపట్టారు. అస్గర్ దూకుడుగా ఆడటంతో అఫ్గాన్ స్కోరు పరుగులు పెట్టింది. అయితే అస్గర్(42; 35 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లు) నాల్గో వికెట్‌గా ఔట్ కావడంతో 64 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ఆపై నాలుగు పరుగుల వ్యవధిలో అలీ ఖిల్(24) కూడా ఔట్ కావడంతో అఫ్గానిస్తాన్ 125 పరుగుల వద్ద ఐదో వికెట్‌ను కోల్పోయింది. కాగా, నజీబుల్ల జద్రాన్(42; 54 బంతుల్లో 6 ఫోర్లు) సమయోచితంగా ఆడటంతో పాటు షిన్వారీ(19 నాటౌట్) కడవరకూ క్రీజ్‌లో ఉండటంతో అఫ్గాన్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 227 పరుగులు చేసింది. పాకిస్తాన్ బౌలర్లలో షాహిన్ అఫ్రిది చెలరేగి బౌలింగ్ చేశాడు. న్యూజిలాండ్‌తో జరిగిన గత మ్యాచ్‌లో మూడు వికెట్లు సాధించి విజయంలో కీలక పాత్ర పోషించిన షాహిన్.. తాజా మ్యాచ్‌లో నాలుగు వికెట్లతో సత్తాచాటాడు. ఇక ఇమాద్ వసీం, వహాబ్ రియాజ్‌లు తలో రెండు వికెట్లు తీశారు. షాదబ్ ఖాన్‌కు వికెట్ దక్కింది. -
పాకిస్తాన్ గెలిచి నిలిచేనా?
లీడ్స్: వన్డే వరల్డ్‌కప్‌లో పాకిస్తాన్ మరో కీలక పోరుకు సిద్ధమైంది. శనివారం అఫ్గానిస్తాన్‌తో మ్యాచ్‌లో అమీతుమీ తేల్చుకునేందుకు పాక్ సమాయత్తమైంది. ఈ మ్యాచ్‌లో అఫ్గానిస్తాన్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన అఫ్గాన్ కెప్టెన్ గుల్బదిన్ నైబ్ ముందుగా బ్యాటింగ్ చేసేందుకు మొగ్గుచూపాడు. సర్ఫ్రాజ్ సేన ఆరు మ్యాచ్‌ల్లో మూడింటిలో గెలిచి.. మూడు ఓడింది. వర్షం కారణం ఒక మ్యాచ్ రద్దుకావడంతో ఆ జట్టు 7 పాయింట్లతో ఆరోస్థానంలో ఉంది. నాకౌట్‌కు చేరాలంటే పాక్ తమ చివరి రెండు మ్యాచ్‌లో తప్పక గెలవాలి. దీంతో అఫ్గాన్‌పై నెగ్గి సెమీస్ ఆశలను సజీవంగా ఉంచుకోవాలని పాక్ పట్టుదలగా ఉంది. గత రెండు మ్యాచ్‌ల్లో దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్‌పై గెలిచిన ఆత్మవిశ్వాసంతో సర్ఫ్రాజ్ సేన బరిలోకి దిగనుంది. ఇమామ్ ఉల్ హక్, ఫఖర్ జమాన్, బాబర్ ఆజమ్‌తో బ్యాటింగ్ విభాగం పటిష్ఠంగా ఉంది. ఈ మ్యాచ్‌లోనూ టాపార్డర్‌పై భారీ అంచనాలున్నాయి. పేసర్లు ఆమిర్, షహీన్ షా అఫ్రీది, ఇమాద్ వసీం, షాదబ్ ఖాన్ బౌలింగ్ విభాగానికి నేతృత్వం వహించనున్నారు. అఫ్ఘాన్ ఆడిన ఏడు మ్యాచ్‌ల్లోనూ ఓడి సెమీస్ రేస్ నుంచి నిష్క్రమించింది. భారత్‌పై పోరాటపటిమ చూపినా.. గత మ్యాచ్‌లో బంగ్లా చేతి లో చిత్తుగా ఓడింది. కనీసం పాకిస్తాన్‌తో జరిగే మ్యాచ్‌లో గెలిచి టోర్నమెంట్లో బోణీ కొట్టాలని యోచిస్తోంది. దాంతో ఆసక్తికర సమరం జరిగే అవకాశం ఉంది. తుది జట్లు అఫ్గాన్ గుల్బదిన్ నైబ్(కెప్టెన్), రహ్మత్ షా, హస్మతుల్లా షాహిది, అస్గర్ అఫ్గాన్, మహ్మద్ నబీ, సమిల్లాహ్ షిన్వారి, నజీబుల్లా జద్రాన్, ఇక్రమ్ అలీ ఖిల్, రషీద్ ఖాన్, హమీద్ హసన్, ముజీబ్ ఉర్ రహ్మాన్ పాకిస్తాన్ సర్ఫరాజ్ అహ్మద్(కెప్టెన్), ఇమాముల్ హక్, ఫకార్ జమాన్, బాబర్ అజామ్, మహ్మద్ హఫీజ్, హరీస్ సొహైల్, ఇమాద్ వసీం, షాదబ్ ఖాన్, వహాబ్ రియాజ్, మహ్మద్ అమిర్, షాహిన్ అఫ్రిది