శ్రీలంక వేదికగా ఆగస్ట్ 22 నుంచి 26 వరకు ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగే 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్ కోసం.. అలాగే ఆగస్ట్ 20 నుంచి సెప్టెంబర్ 17 వరకు పాకిస్తాన్, శ్రీలంక దేశాలు సంయుక్తంగా ఆతిథ్యమిచ్చే ఆసియా కప్ వన్డే టోర్నీ కోసం పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఇవాళ (ఆగస్ట్ 9) 18 మంది సభ్యుల జట్టును ప్రకటించింది. ఈ జట్టుకు బాబర్ ఆజమ్ నాయకత్వం వహించనుండగా.. షాదాబ్ ఖాన్ వైస్ కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు. ఈ జట్టులో కొత్తగా ఫహీమ్ అఫ్రాఫ్, సౌద్ షకీల్, తయ్యబ్ తాహిర్‌లు చోటు దక్కించుకోగా.. పేలవ ఫామ్ కారణంగా షాన్ మసూద్‌పై వేటు పడింది. గాయం నుంచి ఇంకా తేరుకోని ఇహసానుల్లాను ఇంజమామ్ నేతృత్వంలోని సెలెక్టర్లు ఎంపిక చేయలేదు.
ఆసియా కప్-2023, ఆఫ్ఘనిస్తాన్ సిరీస్‌కు పాక్ జట్టు..
అబ్దుల్లా షఫీక్, ఫహీమ్ అఫ్రాఫ్, ఫకర్ జమాన్, హరీస్ రౌఫ్, ఇఫ్తికార్ అహ్మద్, బాబర్ ఆజామ్ (కెప్టెన్), ఇమామ్ ఉల్ హాక్, మహ్మద్ హరీస్ (వికెట్‌కీపర్), మహ్మద్ నవాజ్, మహ్మద్ రిజ్వాన్ (వికెట్‌కీపర్), షాదాబ్ ఖాన్ (వైస్ కెప్టెన్), మహ్మద్ వసీం జూనియర్, నసీం షా, అఘా సల్మాన్, సౌద్ షకీల్, షాహీన్ అఫ్రిది, తయ్యబ్ తాహిర్, ఉసామా మీర్
ఆఫ్ఘనిస్తాన్‌తో వన్డే సిరీస్..
- తొలి వన్డే (హంబన్‌తోట): ఆగస్ట్ 22
- రెండో వన్డే (హంబన్‌తోట): ఆగస్ట్ 24
- మూడో వన్డే (కొలొంబో): ఆగస్ట్ 26
ఆసియా కప్‌లో పాక్ మ్యాచ్‌లు..
- ఆగస్ట్ 30: పాకిస్తాన్ వర్సెస్ నేపాల్ (ముల్తాన్)
- సెప్టెంబర్ 2: ఇండియా వర్సెస్ పాకిస్తాన్ (పల్లెకెలె)
Comments
Please login to add a commentAdd a comment