Asia Cup 2023
-
Jay Shah: 32 ఏళ్ల వయసులో తొలిసారి.. ముచ్చటగా మూడోసారి
బీసీసీఐ కార్యదర్శి జై షా మరోసారి ఆసియా క్రికెట్ మండలి(ఏసీసీ) అధ్యక్షుడిగా నియమితులయ్యారు. ఇండోనేషియాలోని బాలిలో ఏసీసీ బుధవారం వార్షిక సర్వసభ్య సమావేశం నిర్వహించింది. ఇందులో భాగంగా జై షాను తమ చీఫ్‌గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. 32 ఏళ్ల వయసులో తొలిసారి.. కాగా జై షా ఏసీసీ బాస్‌గా ఎన్నికకావడం ఇది వరుసగా మూడోసారి. నజ్ముల్ హుసేన్ స్థానంలో 2021లో తొలిసారిగా అధ్యక్ష పదవిని చేపట్టిన ఆయన.. ఈ ఘనత సాధించిన పిన్న వయస్కుడిగా నిలిచారు. అప్పటికి జై షాకు 32 ఏళ్లు. ఇక తాజా సమావేశంలో సభ్యుల నిర్ణయానికి అనుగుణంగా జై షా పదవీ కాలం కొనసాగనుంది. కాగా బీసీసీఐలో కీలక వ్యక్తిగా ఉన్న ఆయన.. ఏసీసీలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. కోవిడ్ సమయంలో బాస్‌గా బాధ్యతలు స్వీకరించి సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొన్నారు. ప్రతీ విషయంలోనూ తనదైన ముద్ర ఇక గతేడాది ఆసియా కప్-2023 హైబ్రిడ్ మోడల్లో నిర్వహించడంలో జై షా కీలక పాత్ర పోషించారు. ఈవెంట్ నిర్వహణ హక్కులు దక్కించుకున్న పాకిస్తాన్‌కు టీమిండియాను పంపే ప్రసక్తే లేదని కుండబద్దలు కొట్టారు. పాక్ పంతం వీడకపోతే.. ప్రత్యామ్నాయాలు వెదుక్కోవాల్సి ఉంటుందని హెచ్చరించి శ్రీలంక- పాక్ వేదికగా టోర్నీని నిర్వహించేలా జై షా ఏర్పాట్లు చేశారు. టీమిండియా ఆడే మ్యాచ్‌లన్నింటికీ లంక ఆతిథ్యం ఇచ్చింది. ఇక ఈ దఫా వన్డే ఫార్మాట్లో నిర్వహించిన ఆసియా కప్ ఈవెంట్ ఫైనల్లో టీమిండియా శ్రీలంకను ఓడించి విజేతగా అవతరించింది. కాగా భారత హోం మంత్రి అమిత్ షా కుమారుడే జై షా అన్న విషయం తెలిసిందే. చదవండి: Ind vs Eng 2nd Test: ఇంగ్లండ్‌కు షాక్.. కీలక స్పిన్నర్ దూరం -
సెమీస్‌లో భారత్‌ను ఓడించి.. కట్‌చేస్తే ఇప్పుడు ఏకంగా ఛాంపియన్స్‌గా
అండర్-19 ఆసియాకప్ 2023 ఛాంపియన్స్‌గా బంగ్లాదేశ్ నిలిచింది. దుబాయి వేదికగా జరిగిన ఫైనల్లో యూఏఈను 195 పరుగుల తేడాతో చిత్తు చేసిన బంగ్లాదేశ్.. తొలిసారి అండర్-19 ఆసియాకప్ టైటిల్‌ను ముద్దాడింది. తుది పోరులో మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 282 పరుగులు చేసింది. బంగ్లా బ్యాటర్లలో ఓపెనర్ అషికర్ రెహ్మాన్ షిబ్లీ అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. 149 బంతులు ఎదుర్కొన్న అషికర్ రెహ్మాన్.. 12 ఫోర్లు, 1 సిక్సర్‌తో 129 పరుగులు చేశాడు. అతడితోపాటు రిజ్వాన్(60), అరిఫుల్ ఇస్లాం(50) పరుగులతో రాణించారు. యూఏఈ బౌలర్లలో ఆయామన్ ఆహ్మద్ 4 వికెట్లతో చెలరేగగా.. ఒమిడ్ రెహ్మద్ రెండు వికెట్లు సాధించాడు. అనంతరం 283 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన యూఏఈ.. బంగ్లా బౌలర్ల దాటికి కేవలం 87 పరుగులకే కుప్పకూలింది. బంగ్లా బౌలర్లలో రోహనత్, మరూఫ్ మిర్దా తలా మూడు వికెట్లు పడగొట్టగా... ఇక్భాల్, షేక్ ఫవీజ్ చెరో రెండు వికెట్లు సాధించారు. కాగా సెమీఫైనల్లో భారత్‌ను బంగ్లాదేశ్ ఓడించిన సంగతి తెలిసిందే. చదవండి: IND VS SA 1st ODI: ఏ భారత కెప్టెన్‌కు సాధ్యం కాని ఘనతను సాధించిన కేఎల్ రాహుల్ -
ఒకే రోజు రెండు సంచలనాలు.. పసికూనల చేతిలో భారత్, పాక్‌లకు పరాభవం
అండర్-19 ఆసియా కప్‌లో ఒకే రోజు రెండు సంచలనాలు నమోదయ్యాయి. పసికూనలైన బంగ్లాదేశ్, యూఏఈల చేతుల్లో మాజీ ఛాంపియన్లు భారత్, పాకిస్తాన్ ఓటమిపాలయ్యాయి. ఇవాళ (డిసెంబర్ 15) జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌ల్లో తొలుత యూఏఈ పాకిస్తాన్‌ను మట్టికరిపించగా.. ఆతర్వాతి మ్యాచ్‌లో బంగ్లాదేశ్ టీమిండియాకు షాకిచ్చింది. ఫలితంగా యూఏఈ, బంగ్లాదేశ్ జట్లు ఫైనల్‌కు చేరాయి. దుబాయ్ వేదికగా డిసెంబర్ 17న ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. మ్యాచ్‌ల విషయానికొస్తే.. పాకిస్తాన్‌తో జరిగిన తొలి సెమీఫైనల్లో తొలుత బ్యాటింగ్ చేసిన యూఏఈ.. 47.5 ఓవర్లలో 193 పరుగులు మాత్రమే చేసి ఆలౌటైంది. పాక్ పేసర్ ఉబెయిద్ షా (4/43) యూఏఈ పతనాన్ని శాశించాడు. యూఏఈ ఇన్నింగ్స్‌లో కెప్టెన్ అయాన్ ఖాన్ (55) అర్దసెంచరీతో రాణించగా.. ఓపెనర్ ఆర్యాన్ష్ శర్మ (46), డిసౌజా (37) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన పాక్.. యూఏఈ బౌలర్లు మూకుమ్మడిగా అటాకింగ్ చేయడంతో 49.3 ఓవర్లలో 182 పరుగులకే ఆలౌటైంది. పాక్ ఇన్నింగ్స్‌లో కెప్టెన్ సాద్ బేగ్ (50), అజాన్ అవైస్ (41) మాత్రమే రాణించారు. యూఏఈ బౌలర్లలో అయ్మాన్ అహ్మద్, హార్దిక్ చెరో 2 వికెట్లు పడగొట్టగా.. రెహ్మాన్, ధృవ్, బదామీ తలో వికెట్ దక్కించుకున్నారు. ఇక బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో సెమీఫైనల్లో తొలుత బ్యాటింగ్ చేసిన యువ భారత్.. 42.4 ఓవర్లలో 188 పరుగులు మాత్రమే చేసి ఆలౌటైంది. భారత ఇన్నింగ్స్‌లో ముషీర్ ఖాన్ (50), మురుగన్ అభిషేక్ (62) అర్ధసెంచరీలతో రాణించారు. బంగ్లా బౌలర్ మరూఫ్ 4 వికెట్లు పడగొట్టి టీమిండియా పతనాన్ని శాశించాడు. అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనకు దిగిన బంగ్లాదేశ్.. అరీఫుల్ ఇస్లాం (94) చెలరేగడంతో 42.5 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. అరీఫుల్కు అహ్రార్ అమీన్ (44) సహకరించాడు. నమన్ తివారీ (3/35), రాజ్ లింబానీ (2/47) చివరి వరకు ప్రయత్నించినప్పటికీ టీమిండియాను గెలిపించలేకపోయారు. -
ఏడు వికెట్లతో చెలరేగిన భారత పేసర్.. 52 పరుగులకే ప్రత్యర్థి ఆలౌట్
ACC U19 Asia Cup, 2023- India U19 vs Nepal U19: అండర్-19 ఆసియా కప్-2023 టోర్నీలో భారత యువ జట్టు ఘన విజయం సాధించింది. నేపాల్‌ను పది వికెట్ల తేడాతో చిత్తు చేసి సెమీస్ రేసులో ముందుకు దూసుకెళ్లింది. దుబాయ్ వేదికగా జరుగుతున్న ఈ మెగా ఈవెంట్లో గ్రూప్-‘ఏ’లో ఉన్న భారత్ తొలుత అఫ్గనిస్తాన్‌తో తలపడింది. ఈ మ్యాచ్‌లో అఫ్గన్‌ను ఏడు వికెట్ల తేడాతో ఓడించిన ఉదయ్ సహారన్ సేన.. రెండో మ్యాచ్‌లో మాత్రం ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ చేతిలో ఎనిమిది వికెట్ల తేడాతో ఓడిపోయింది. దీంతో సెమీస్ చేరాలంటే.. లీగ్ దశలో తమ ఆఖరి మ్యాచ్‌లో తప్పక గెలవాల్సిన స్థితిలో నిలిచింది. ఏడు వికెట్లతో చెలరేగిన రాజ్ లింబాని ఈ నేపథ్యంలో మంగళవారం నేపాల్‌తో తలపడ్డ భారత జట్టు టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది. పేసర్ రాజ్ లింబాని ఏడు వికెట్లతో చెలరేగి నేపాల్ బ్యాటింగ్ ఆర్డర్ పతనాన్ని శాసించాడు. 9.1 ఓవర్లలో కేవలం 13 పరుగులు మాత్రమే ఇచ్చి బ్యాటర్లపై పూర్తి ఆధిపత్యం కనబరిచాడు. లింబానికి తోడుగా.. ఆరాధ్య శుక్లా రెండు, అర్షిన్ కులకర్ణి ఒక వికెట్‌తో రాణించారు. ఈ ముగ్గురు అద్భుత ప్రదర్శన కారణంగా.. నేపాల్ 22.1 ఓవర్లలోనే చాపచుట్టేసింది. ఓపెనర్లే పూర్తి చేశారు భారత బౌలర్ల విజృంభణ కారణంగా 52 పరుగులకే ఆలౌట్ అయింది. ఇక స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టును ఓపెనర్లు ఆదర్శ్, అర్షిన్ కులకర్ణి విజయతీరాలకు చేర్చారు. ఆదర్శ్ 13 బంతుల్లో 13 పరుగులతో అజేయంగా నిలవగా.. అర్షిన్ 30 బంతుల్లోనే 43 పరుగులు రాబట్టి భారత్ విజయాన్ని ఖరారు చేశాడు. ఇక ఈ గెలుపుతో భారత జట్టు సెమీస్ బెర్తును అనధికారికంగా ఖాయం చేసుకుంది. మరోవైపు.. గ్రూప్-‘ఏ’లో భాగమైన పాకిస్తాన్ మంగళవారం అఫ్గనిస్తాన్‌తో పోటీపడుతోంది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ జట్టు 48 ఓవర్లలో 303 పరుగులకు ఆలౌట్ అయింది. ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్ గెలిస్తే సెమీస్ చేరడం లాంఛనమే! దీంతో మరోసారి దాయాదులు భారత్- పాక్ మ్యాచ్ చూసే అవకాశం అభిమానులకు దక్కుతుంది. చదవండి: Virat Kohli: రాజు ఎక్కడైనా రాజే! టాప్‌లో కింగ్ కోహ్లి ACC Men's U19 Asia Cup | India-U19 vs Nepal-U19 | Highlights. https://t.co/6wE0HM9pDH#ACCMensU19AsiaCup #ACC — AsianCricketCouncil (@ACCMedia1) December 12, 2023 -
Ind vs Pak: మెగా క్రికెట్ టోర్నీ షెడ్యూల్ విడుదల.. భారత్- పాక్ మ్యాచ్ ఆరోజే
దాయాదులు భారత్- పాకిస్తాన్ మరోసారి మెగా క్రికెట్ టోర్నీలో పోటీ పడనున్నాయి. ఆసియా మెన్స్ అండర్-19 వన్డే కప్‌లో భాగంగా డిసెంబరు 10న ముఖాముఖి తలపడనున్నాయి. దుబాయ్‌లోని ఐసీసీ అకాడమీ గ్రౌండ్ ఇందుకు వేదిక కానుంది. కాగా అండర్-19 మెన్స్ ఆసియా కప్-2023కి సంబంధించిన షెడ్యూల్‌ను ఆసియా క్రికెట్ మండలి శనివారం విడుదల చేసింది. దుబాయ్‌లో వన్డే ఫార్మాట్లో నిర్వహించనున్న ఈ టోర్నీకి శుక్రవారం(డిసెంబరు 8) తెరలేవనుంది. గ్రూప్-ఏలో భాగమైన భారత్- అఫ్గనిస్తాన్‌తో మ్యాచ్‌తో ఈ ఈవెంట్ ఆరంభం కానుంది. అదే రోజు మరో మ్యాచ్‌లో పాకిస్తాన్- నేపాల్‌తో తలపడనుంది. గ్రూప్ దశలో మ్యాచ్‌లన్నీ ఐసీసీ అకాడమీ గ్రౌండ్, ఐసీసీ అకాడమీ గ్రౌండ్-2లో జరుగనున్నాయి. అయితే, డిసెంబరు 17నాటి ఫైనల్‌కు మాత్రం దుబాయ్ అంతర్జాతీయ స్టేడియం వేదిక కానుంది. ఇక మ్యాచ్‌లన్నీ భారత కాలమానం ప్రకారం ఉదయం 11 గంటలకు ఆరంభం కానున్నాయి. కాగా ఆసియా అండర్-19 కప్‌లో మొత్తం ఎనిమిది జట్లు పాల్గొననున్నాయి. గ్రూప్-ఏలో డిఫెండింగ్ చాంపియన్ భారత్ సహా పాకిస్తాన్, నేపాల్, అఫ్గనిస్తాన్ పోటీ పడనుండగా.. గ్రూప్-బి నుంచి శ్రీలంక, బంగ్లాదేశ్, జపాన్, యూఏఈ తలపడనున్నాయి. భారత జట్టు కెప్టెన్‌గా ఉదయ్ సహారన్ ఉదయ్ సహారన్ (కెప్టెన్), సౌమి కుమార్ పాండే (వైస్ కెప్టెన్), అర్షిన్ కులకర్ణి, ఆదర్శ్ సింగ్, రుద్ర మయూర్ పటేల్, సచిన్ దాస్, ప్రియాన్షు మొలియా, ముషీర్ ఖాన్, ధనుష్ గౌడ, అవినాష్ రావు (వికెట్ కీపర్), ఎం అభిషేక్, ఇన్నేష్ మహాజన్ (వికెట్ కీపర్), ఆర్ధ్య శుక్లా, రాజ్ లింబాని, నమన్ తివారీ. ట్రావెలింగ్ రిజర్వ్స్: ప్రేమ్ దేవ్కర్, అన్ష్ గోసాయి, మహ్మద్ అమన్. నాన్ ట్రావెలింగ్ రిజర్వులు: దిగ్విజయ్ పాటిల్, జయంత్ గోయత్, పి.విఘ్నేష్, కిరణ్ చోర్మాలే. -
సచిన్, కోహ్లి కాదు! అతడికి బౌలింగ్ చేయడం చాలా కష్టం: డేల్ స్టెయిన్
Rohit Sharma- Dale Steyn: ‘‘నా కెరీర్లో నాకు సవాల్ విసిరిన బౌలర్ ఎవరైనా ఉన్నారా అంటే డేల్ స్టెయిన్ మాత్రమే. తన బౌలింగ్‌లో పరుగులు సాధించడం చాలెంజింగ్‌గా ఉంటుంది. అయినప్పటికీ తన ఆట తీరును నేను ఎంతగానో ఆస్వాదిస్తాను. క్లాస్ ప్లేయర్ తను. అతడి నైపుణ్యాలు అమోఘం. బంతి స్వింగ్ చేయడంలో తనకు తానే సాటి. గంటకు 140+ కి.మీ. వేగంతో బంతిని స్వింగ్ చేయగలిగిన స్పీడ్స్టర్లు కొంతమందే ఉంటారు. అందులో స్టెయిన్ ముందు వరసలో ఉంటాడు’’.. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఇటీవల చేసిన వ్యాఖ్యలివి. రోహిత్ ఇలా.. అతడేమో అలా అంతర్జాతీయ క్రికెట్లో ప్రొటిస్ మాజీ పేసర్ డేల్ స్టెయిన్ బౌలింగ్‌లో రోహిత్ శర్మ ఒకే ఒక్కసారి అవుటయ్యాడు. ఇక, మూడు ఫార్మాట్లలోనూ స్టెయిన్ బౌలింగ్‌లో హిట్‌మ్యాన్ సగటు 30 కంటే తక్కువ కావడం గమనార్హం. ఈ నేపథ్యంలో స్టెయిన్ బౌలింగ్ ఎలా ఉంటుందో.. అతడిని ఎదుర్కోవడంలో తాను ఇబ్బంది పడిన విషయాన్ని రోహిత్ శర్మ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. తాజాగా రోహిత్‌ను ఉద్దేశించి డేల్ స్టెయిన్ చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌గా మారాయి. రోహిత్ శర్మ అతడికి బౌలింగ్ చేయడం కష్టం ‘అద్భుతమైన బ్యాటర్.. జట్టును ముందుండి నడిపించే నాయకుడు.. రోహిత్‌కు బౌలింగ్ చేయడం నాకెల్లప్పుడూ కష్టతరంగానే ఉండేది’’ అంటూ అంతర్జాతీయ స్థాయిలో తనకు సవాల్ విసిరిన మేటి బ్యాటర్‌గా రోహిత్ శర్మ పేరును చెప్పాడు స్టెయిన్. ఈ క్రమంలో ఇద్దరు దిగ్గజాలు.. పరస్పర గౌరవం అంటూ హిట్‌మ్యాన్ అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. కాగా సౌతాఫ్రికా తరఫున 93 టెస్టులు, 125 వన్డేలు, 47 టీ20లు ఆడిన డేల్ స్టెయిన్ ఆయా ఫార్మాట్లలో వరుసగా 439, 196, 64 వికెట్లు పడగొట్టాడు. సూపర్ ఫామ్‌లో హిట్‌మ్యాన్ పరిమిత ఓవర్ల క్రికెట్‌పై దృష్టి సారించే క్రమంలో 2019లో టెస్టులకు గుడ్‌బై చెప్పిన స్టెయిన్ గన్.. 2021లో అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇదిలా ఉంటే.. అక్టోబరు 5 నుంచి ఆరంభం కానున్న వన్డే వరల్డ్‌కప్-2023 నేపథ్యంలో సారథి రోహిత్ శర్మ మంచి ఫామ్‌లో ఉండటం టీమిండియాకు శుభసూచకంగా పరిణమించింది. గత ఆరు వన్డే ఇన్నింగ్స్‌లో రోహిత్ నాలుగు అర్ధ శతకాలు చేశాడు. అందులో వరుసగా మూడు ఫిఫ్టీలు సాధించడం విశేషం. ఆసియా కప్-2023లో నేపాల్, పాకిస్తాన్, శ్రీలంకపై హాఫ్ సెంచరీలు నమోదు చేశాడు. ఇక రోహిత్ శర్మ సారథ్యంలో వన్డే ఫార్మాట్లో వరుసగా రెండోసారి టీమిండియా ఆసియా చాంపియన్‌గా నిలిచిన విషయం తెలిసిందే. చదవండి: WC 2023: బహుశా నాకు ఇదే చివరి వరల్డ్‌కప్ కావొచ్చు: టీమిండియా స్టార్ క్రికెటర్ Rohit Sharma - Dale Steyn is the most challenging bowler I've faced. Dale Steyn - I've struggled bowling to Rohit Sharma, he's just amazing. - The mutual respect between two legends of the game! pic.twitter.com/D4tFlqAN6l — Mufaddal Vohra (@mufaddal_vohra) September 30, 2023 -
ఆసియా క్రీడల్లో భారత్‌కు తొలి స్వర్ణం..
-
ఆసియా కప్ ఫైనల్లో అశూ ఆడాల్సింది.. అతడికి వీలు కాలేదనే సుందర్‌కు ఛాన్స్
India vs Australia, 1st ODI: ఆస్ట్రేలియాతో తొలి వన్డేలో వాషింగ్టన్ సుందర్‌ను కాదని.. రవిచంద్రన్ అశ్విన్‌కు చోటు ఇవ్వడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆసియా కప్-2023 ఫైనల్లో మైదానంలో దిగిన వాషీకి ఆసీస్‌తో తుదిజట్టులో చోటు దక్కుతుందని అంతా అనుకున్నారు. దాదాపు ఏడాదిన్నర తర్వాత జట్టులోకి అశూ రీఎంట్రీ ఇస్తున్న తరుణంలో సుందర్ వైపే మొగ్గుచూపుతారని హర్భజన్ సింగ్ వంటి మాజీలు కూడా అభిప్రాయపడ్డారు. ఆసియా కప్ ఫైనల్లో ఆడించారు కాబట్టి తొలి వన్డేలో అతడికి ప్రాధాన్యం ఉంటుందని పేర్కొన్నారు. అక్షర్ పటేల్ గాయం కారణంగా ఆశల పల్లకిలో కాగా అక్షర్ పటేల్ గాయం కారణంగా చెన్నై ఆఫ్ స్పిన్నర్లు రవిచంద్రన్ అశ్విన్, వాషింగ్టన్ సుందర్ వరల్డ్‌కప్-2023 ఆశలు సజీవంగా నిలిచిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆసీస్‌తో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో రాణిస్తే ఐసీసీ ఈవెంట్లో అడుగుపెట్టే అవకాశం ముంగిట నిలిచారు. ఈ నేపథ్యంలో మొహాలీ వేదికగా శుక్రవారం మొదలైన తొలి మ్యాచ్‌లో అశూకు చోటు దక్కగా.. వాషీకి మొండిచేయి ఎదురైంది. దీంతో మేనేజ్మెంట్ తీరుపై అభిమానులు ఫైర్ అవుతున్నారు. వాషీని పరిగణనలోకి తీసుకోనపుడు ఎందుకు శ్రీలంకకు పంపించారని ప్రశ్నిస్తున్నారు. ఆసియా కప్ ఫైనల్‌కు ఫస్ట్ ఛాయిస్ అశూనే ఈ క్రమంలో.. దినేశ్ కార్తిక్ ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. అక్షర్ పటేల్ స్థానంలో ఆసియా కప్-2023 శ్రీలంకతో ఫైనల్‌కు తొలి ఛాయిస్ అశ్వినే అని పేర్కొన్నాడు. అశూ కుదరదన్నాడు కాబట్టే వాషీని ఫ్లైట్ ఎక్కించారని తనకు తెలిసిందన్నాడు. ఈ మేరకు క్రిక్‌బజ్ షోలో డీకే మాట్లాడుతూ.. ‘‘నాకు తెలిసిన అంతర్గత సమాచారం ప్రకారం.. ఈ విషయంలో రోహిత్, అజిత్, రాహుల్ ద్రవిడ్‌లను నేను సమర్థిస్తాను. ఆసియా కప్ ఫైనల్‌కు ముందుగా వాళ్లు అశ్విన్‌కే పిలుపునిచ్చారు. ఆ తర్వాతే అశూను ఎంపిక చేశారు అయితే, తాను మ్యాచ్ ఆడేందుకు సిద్ధంగా లేనని అశ్విన్ చెప్పాడు. అంతేకాదు.. తనకు బదులు లోకల్ మ్యాచ్‌లు ఆడి రిథమ్‌లో ఉన్న వాషింగ్టన్ సుందర్‌ను పంపిస్తే బాగుంటుందని సూచించాడు. దీంతో ఎన్సీఏలోనే ఉన్న సుందర్‌ను శ్రీలంకకు పంపించారు. ఆ తర్వాత అశ్విన్ రెండు క్లబ్ మ్యాచ్‌లు ఆడాడు. ఆ తర్వాతే ఆసీస్‌తో సిరీస్‌కు అతడిని ఎంపిక చేశారు. అసలు విషయం ఇదే. వాళ్ల మొదటి ప్రాధాన్యం అశ్విన్‌కే. వాషింగ్టన్ ఈ విషయంలో కాస్త నిరాశకు గురికావొచ్చు. అయితే, వాళ్లు మాత్రం అశ్విన్ వైపే మొగ్గుచూపారు’’ అని చెప్పుకొచ్చాడు. వరల్డ్‌కప్ జట్టులోనూ.. కాగా గత ఆరేళ్ల వ్యవధిలో అశ్విన్ రెండే రెండు వన్డేలు ఆడిన విషయం తెలిసిందే. ఇక అక్షర్ గనుక కోలుకోకపోతే అక్టోబరు 5 నుంచి మొదలయ్యే వన్డే వరల్డ్‌కప్ టోర్నీలో ఈ 2011 ప్రపంచకప్ విజేతకు చోటు ఖాయమే అనిపిస్తోంది. ఇదిలా ఉంటే ఆసీస్‌తో తొలి వన్డేలో అశూ ఒక వికెట్ తీశాడు. మార్నస్ లబుషేన్ వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు. చదవండి: అవును.. నాకు ధోనితో విభేదాలున్నాయి.. కానీ! గంభీర్‌కు స్ట్రాంగ్ కౌంటర్? WC: అలాంటి వాళ్లకు నో ఛాన్స్! అందుకే అతడిని ఎంపిక చేయలేదు: చీఫ్ సెలక్టర్ -
మహ్మద్ సిరాజ్ తీవ్ర భావోద్వేగం.. ‘మిస్ యు పప్పా’ అంటూ!
దుబాయ్: ఆసియా కప్ ఫైనల్లో అద్భుత ప్రదర్శనతో అదరగొట్టిన భారత పేస్ బౌలర్ మొహమ్మద్ సిరాజ్ అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) వన్డే బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో 694 పాయింట్లతో నంబర్‌వన్‌గా నిలిచాడు. ఇప్పటి వరకు 9వ స్థానంలో ఉన్న ఈ హైదరాబాదీ ఏకంగా ఎనిమిది స్థానాలు మెరుగుపర్చుకొని అగ్రస్థానానికి చేరుకోవడం విశేషం. వన్డే ర్యాంకింగ్స్‌లో సిరాజ్ టాప్‌గా నిలవడం ఇది రెండోసారి. ఈ ఏడాది జనవరిలో నంబర్‌వన్‌గా నిలిచిన అతను రెండు నెలల తర్వాత ఆసీస్ పేసర్ జోష్ హాజల్‌వుడ్‌కు ఆ స్థానాన్ని కోల్పోయాడు. ఆసియా కప్ ఫైనల్లో 21 పరుగులకే 6 వికెట్లు తీసిన ప్రదర్శనతో ఇప్పుడు మళ్లీ శిఖరానికి చేరాడు. సిరాజ్ తీవ్ర భావోద్వేగం కెరీర్లో అత్యుత్తమ దశను చూస్తున్న సిరాజ్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో భావోద్వేగ పోస్ట్ చేశాడు. కొంత కాలం క్రితం చనిపోయిన తన తండ్రిని గుర్తు చేసుకుంటూ ‘మిస్ యు పాపా’ అంటూ క్యాప్షన్ పెట్టాడు. తనను తల్లిదండ్రులు ఆశీర్వదిస్తున్న ఫోటోను వారిద్దరు చూస్తున్న చిత్రానికి తాను గ్రౌండ్లో ఆడుతున్న ఫోటోను అతను జత చేశాడు. చదవండి: ‘నా అకౌంట్లో 80 వేలే ఉన్నాయి’.. భారత టెన్నిస్ స్టార్ ఆవేదన -
వేటు తప్పదా? ‘అతడే జట్టును ముందుండి నడిపిస్తాడు! సెలక్టర్ల నిర్ణయం ఇదే’
Asia Cup 2023- ICC ODI WC 2023: ఆసియా కప్-2023 ఫైనల్లో టీమిండియా చేతిలో చిత్తుగా ఓడి ఘోర పరాభవం మూటగట్టుకుంది శ్రీలంక. గతేడాది టీ20 ఫార్మాట్లో చాంపియన్‌గా నిలిచిన దసున్ షనక బృందం.. ఈసారి కనీస పోటీ ఇవ్వలేకపోయింది. భారత పేసర్లు మహ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యా ధాటికి 50 పరుగులకే ఆలౌటై చెత్త గణాంకాలు నమోదు చేసింది. వన్డే ఈవెంట్ ఆసాంతం.. ముఖ్యంగా ఫైనల్లో కెప్టెన్ దసున్ షనక బ్యాటింగ్ వైఫల్యం తీవ్ర ప్రభావం చూపింది. వేటు తప్పదంటూ వార్తలు ఈ నేపథ్యంలో వన్డే ప్రపంచకప్-2023కి ముందు అతడిపై వేటు వేయడం ఖాయమని.. షనక స్థానంలో వికెట్ కీపర్ కుశాల్ మెండిస్‌ను శ్రీలంక సారథిగా నియమించనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో శ్రీలంక క్రికెట్‌కు చెందిన సీనియర్ అధికారి మాట్లాడుతూ... సెలక్టర్ల నిర్ణయం ఇదే ‘‘వరల్డ్‌కప్-2023 ముగిసేంత వరకు కెప్టెన్‌గా దసున్ షనకకే కొనసాగించాలని సెలక్టర్లు నిర్ణయం తీసుకున్నారు’’ అని తెలిపినట్లు న్యూస్‌వైర్ పేర్కొంది. దీంతో శ్రీలంక కెప్టెన్ మార్పు ఇప్పట్లో లేదని స్పష్టమైంది. కాగా ప్రపంచకప్‌లో అక్టోబరు 7న శ్రీలంక తమ ఆరంభ మ్యాచ్‌లో సౌతాఫ్రికాతో తలపడనుంది. అంతకంటే ముందు సెప్టెంబరు 27న అఫ్గనిస్తాన్‌తో వార్మప్ మ్యాచ్ ఆడనుంది. ఇక వరల్డ్‌కప్ జట్టును ప్రకటించేందుకు సెప్టెంబరు 28 వరకు సమయం ఉన్న నేపథ్యంలో శ్రీలంక ఇంకా తమ జట్టును ప్రకటించలేదు. మొన్ననే సెలక్టర్లకు థాంక్స్ చెప్పిన షనక.. మెరుగ్గానే టీమిండియాతో ఫైనల్‌కు ముందు దసున్ షనక మాట్లాడుతూ.. బ్యాటర్‌గా విఫలమైనా కెప్టెన్‌గా తనను నమ్మినందుకు సెలక్టర్లకు ధన్యవాదాలు చెప్పాడు. ప్రస్తుతం సారథ్య బాధ్యతలపైనే తన దృష్టి కేంద్రీకృతం అయి ఉందని పేర్కొన్నాడు. కాగా కెప్టెన్‌గా వన్డేల్లో షనక రికార్డు బాగుంది. 37 వన్డేల్లో 23 గెలిపించాడు. వన్డే సారథిగా దసున్ షనక విజయాల శాతం 60.5. ఈ నేపథ్యంలో అతడిపై ఇప్పట్లో వేటుపడే అవకాశం లేదని అభిమానులు చర్చించుకుంటున్నారు. చదవండి: Ind vs Aus: కనీసం ఆ జట్టులో కూడా పనికిరాడా? కెప్టెన్ కావాల్సినోడు.. -
Ind vs Aus: కనీసం ఆ జట్టులో కూడా పనికిరాడా? కెప్టెన్ కావాల్సినోడు..
Asian Games 2023: చైనాలో జరుగనున్న ఆసియా క్రీడలు-2023కి ఈసారి భారత క్రికెట్ నియంత్రణ మండలి మహిళా, పురుష జట్లను పంపుతున్న విషయం విదితమే. హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలో వుమెన్స్ టీమ్.. రుతురాజ్ గైక్వాడ్ నాయకత్వంలో ద్వితీయ శ్రేణి జట్టు హోంగ్జూకు వెళ్లనున్నాయి. అయితే, అంతకంటే ముందు స్వదేశంలో సెప్టెంబరు 22న ఆరంభం కానున్న ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌లో రుతురాజ్ ఆడేందుకు రంగం సిద్ధమైంది. ఆసీస్‌తో తొలి మ్యాచ్‌లో అతడు తుదిజట్టులో చోటు దక్కించుకునే అవకాశం ఉంది. రెంటికీ చెడ్డ రేవడి ఇదిలా ఉంటే.. ఆసియా క్రీడల్లో పాల్గొనే భారత జట్టులో తిలక్ వర్మ, రింకూ సింగ్ సహా పలువురు యువ స్టార్లు చోటు దక్కించుకున్నారు. మరోవైపు.. కేరళ బ్యాటర్ సంజూ శాంసన్ పరిస్థితి రెంటికీ చెడ్డ రేవడిలా తయారైంది. సంజూ శాంసన్ ఆసియా కప్‌లో అలా.. వరల్డ్కప్జట్టులో ఇలా కేఎల్ రాహుల్ ఆగమనంతో ఆసియా కప్-2023లో వికెట్ కీపర్‌గా ఇషాన్ కిషన్‌తో పోటీలో ఓడిన సంజూ.. రిజర్వ్ ప్లేయర్‌గా ఎంపికయ్యాడు. ఇక బ్యాటర్‌గా సూర్యకుమార్ యాదవ్ కంటే మెరుగైన స్థితిలోనే ఉన్నా ఈ వన్డే ఈవెంట్లో అతడిని దురదృష్టం వెక్కిరించింది. కెప్టెన్ కావాల్సినోడు.. మరీ ఇంత అన్యాయమా? ప్రపంచకప్-2023 జట్టులోనూ సూర్య వైపే మొగ్గు చూపిన సెలక్టర్లు సంజూను పక్కనపెట్టేశారు. ఆస్ట్రేలియాతో సిరీస్‌లోనూ అవకాశం ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో ఆకాశ్ చోప్రా బీసీసీఐ సెలక్షన్ కమిటీ తీరును తప్పుబట్టాడు. ‘‘ఆసియా క్రీడల జట్టులో సంజూ శాంసన్ పేరు లేకపోవడం నన్ను ఆశ్చర్యపరిచింది. ఆసియా కప్‌లో రిజర్వ్‌గా ఉన్నాడు.. ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌లో చోటు దక్కలేదు. ఇషాన్ కిషన్ ఓపెనింగ్ చేసే అవకాశం లేదు. రుతురాజ్ గైక్వాడ్‌తో కలిసి శుబ్‌మన్ గిల్ ఇన్నింగ్స్ ఆరంభిస్తాడు. ఇషాన్‌కు వరుస అవకాశాలు ఇషాన్ మిడిలార్డర్లో నిలదొక్కుకునేందుకు ఇప్పటికే మేనేజ్మెంట్ కావాల్సినన్ని అవకాశాలు ఇచ్చింది. సంజూ శాంసన్ ఆసియా క్రీడల జట్టులో ఉంటేనైనా బాగుండేది. వరల్డ్‌కప్ టీమ్‌లో ఎలాగూ చోటివ్వలేదు.. కనీసం ఆసియా క్రీడల్లో ఆడేందుకు కూడా పనికిరాడా? ఇది సరైన పద్ధతి కాదు.. ప్రపంచకప్ జట్టులో ఆఖరి నిమిషం వరకు పోటీ పడ్డ వ్యక్తి కచ్చితంగా ఈ టీమ్‌లోనైనా ఉండాల్సింది కదా. కేవలం సభ్యుడిగా కాదు.. నిజానికి కెప్టెన్ అవ్వాల్సింది’’ అని ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు. చదవండి: అంబానీ ఇంట పూజకు భార్య అతియాతో రాహుల్.. వీడియో వైరల్ -
సిరాజ్ మియా.. మరోసారి వరల్డ్ నంబర్ 1 బౌలర్‌గా.. ఏకంగా..
ICC Men's ODI Bowling Rankings: టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ ఐసీసీ తాజా వన్డే ర్యాంకింగ్స్‌లో అదరగొట్టాడు. మరోసారి ప్రపంచ నెంబర్ 1 బౌలర్‌గా అవతరించాడు. ఆసియా కప్-2023 ఫైనల్లో అద్భుత ప్రదర్శనతో సంచలన రికార్డులు నమోదు చేయడంతో పాటు బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో ఏకంగా 8 స్థానాలు ఎగబాకాడు. తద్వారా మరోసారి అగ్రపీఠం కైవసం చేసుకున్నాడు. ఆస్ట్రేలియా బౌలర్ జోష్ హాజిల్‌వుడ్‌ని వెనక్కినెట్టి 694 రేటింగ్ పాయింట్లతో టాప్-1లోకి దూసుకువచ్చాడు. కాగా శ్రీలంకతో ఆసియా వన్డే కప్ ఫైనల్లో సిరాజ్ ఆకాశమే హద్దుగా చెలరేగిన విషయం తెలిసిందే. ఒకే ఓవర్లో నాలుగు వికెట్లు తీసిన ఈ హైదరాబాదీ స్టార్.. మరో రెండు వికెట్లు కూడా పడగొట్టాడు. సిరాజ్ దెబ్బకు శ్రీలంక కకావికలం సిరాజ్ దెబ్బకు లంక బ్యాటింగ్ ఆర్డర్ కుదేలైంది. లంకను 50 పరుగులకే ఆలౌట్ చేయడంలో కీలక పాత్ర పోషించిన మియా.. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. కొలంబో మ్యాచ్‌లో మొత్తంగా ఏడు ఓవర్లు బౌలింగ్ చేసిన ఈ ఫాస్ట్‌బౌలర్.. 21 పరుగులు మాత్రమే ఇచ్చి ఆరు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. 10 ఓవర్ల కోటా పూర్తి చేసేందుకు సిద్ధం అవుతుండగా.. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అతడిని వారించాడు. ఫిట్నెస్ కూడా ముఖ్యమంటూ ట్రైనర్ సూచనలు ఇవ్వడంతో.. అలా సిరాజ్ పేస్ అటాక్‌కు తెరపడింది. లేదంటే.. మరిన్ని వికెట్లు కూల్చేవాడేమో! మొత్తం ఎన్ని వికెట్లంటే? ప్రస్తుతం సిరాజ్ వన్డే వరల్డ్‌కప్-2023కి సిద్ధమయ్యే పనిలో ఉన్నాడు. అంతకంటే ముందు ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌లో భాగం కానున్నాడు. కాగా ఈ ఏడాది ఆరంభంలో సిరాజ్ మొట్టమొదటి సారి వరల్డ్ నంబర్ 1 ర్యాంకు దక్కించుకున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. ఆసియా టోర్నీ తాజా ఎడిషన్‌లో సిరాజ్ 12.2 సగటుతో మొత్తంగా 10 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. ఐసీసీ తాజా వన్డే బౌలింగ్ ర్యాంకింగ్స్ టాప్-5లో ఉన్నది వీళ్లే 1. మహ్మద్ సిరాజ్- ఇండియా- 694 పాయింట్లు 2. జోష్ హాజిల్‌వుడ్- ఆస్ట్రేలియా- 678 పాయింట్లు 3. ట్రెంట్ బౌల్ట్- న్యూజిలాండ్- 677 పాయింట్లు 4. ముజీబ్ ఉర్ రెహమాన్- అఫ్గనిస్తాన్- 657 పాయింట్లు 5. రషీద్ ఖాన్- అఫ్గనిస్తాన్- 655 పాయింట్లు. చదవండి: ఆసియా కప్ ఫైనల్లో ఘోర ఓటమి.. శ్రీలంక కెప్టెన్‌పై వేటు! కొత్త కెప్టెన్ ఎవరంటే? Record-breaking Siraj! 🤯@mdsirajofficial rewrites history, now recording the best figures in the Asia Cup! 6️⃣ for the pacer! Tune-in to #AsiaCupOnStar, LIVE NOW on Star Sports Network#INDvSL #Cricket pic.twitter.com/2S70USxWUI — Star Sports (@StarSportsIndia) September 17, 2023 -
ఆసియా కప్ ఫైనల్లో ఘోర ఓటమి.. శ్రీలంక కెప్టెన్‌పై వేటు! కొత్త కెప్టెన్ ఎవరంటే?
ఆసియాకప్-2023 ఫైనల్లో భారత్ చేతిలో 10 వికెట్ల తేడాతో శ్రీలంక ఘోర ఓటమిని చవిచూసిన సంగతి తెలిసిందే. తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక.. భారత బౌలర్ల ధాటికి కేవలం 50 పరుగులకే కుప్పకూలింది. ఈ ఘోర పరాభావం నేపథ్యంలో శ్రీలంక క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దసున్ షనకను జట్టు కెప్టెన్సీ నుంచి తొలిగించాలని శ్రీలంక క్రికెట్ భావిస్తున్నట్లు సమాచారం. భారత్ వేదికగా జరగనున్న వన్డే ప్రపంచకప్‌కు ముందే లంక బోర్డు తమ నిర్ణయాన్ని వెల్లడించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అతడి స్ధానంలో స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ కుశాల్ మెండీస్‌కు జట్టు పగ్గాలు అప్పజెప్పాలని శ్రీలంక క్రికెట్ ప్రణాళికలలు సిద్దం చేస్తున్నట్లు పలు రిపోర్టులు పేర్కొంటున్నాయి. త్వరలో జరగనున్న బోర్డు మీటింగ్‌లో ఈ విషయంపై చర్చించనున్నట్లు వినికిడి. కెప్టెన్‌గా ఎన్నో రికార్డులు శ్రీలంక జట్టు కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన షనక జట్టును విజయ పథంలోనే నడిపించాడని చేప్పుకోవాలి. ఇప్పటివరకు దసున్ షనక కెప్టెన్సీలో 37 మ్యాచ్‌లు ఆడిన శ్రీలంక.. 23 విజయాలు సాధించింది. కేవలం 14 మ్యాచ్‌ల్లోనే ఓటమి పాలైంది. కెప్టెన్‌గా అతడి విజయం శాతం 60.5గా ఉంది. అదే విధంగా షనక సారథ్యంలోనే 8 ఏళ్ల తర్వాత దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్, 12 ఏళ్ల తర్వాత ఆస్ట్రేలియాపై శ్రీలంక విజయం సాధించింది. గతేడాది ఆసియాకప్‌ను కూడా షనక నాయకత్వంలోని శ్రీలంకనే సొంతం చేసుకుంది. చదవండి: IND vs AUS: అశ్విన్.. ఆసీస్‌తో ఆడినంత మాత్రాన సరిపోతుందా?: ఇర్ఫాన్ పఠాన్ -
పాక్ క్రికెట్లో ముసలం.. బాబర్‌తో విభేదాలు! వైస్ కెప్టెన్‌పై వేటు
పాకిస్తాన్ క్రికెట్ జట్టులో ముసలం మొదలైనట్లు తెలుస్తోంది. పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజంతో జట్టులోని మిగితా ఆటగాళ్లకు విభేధాలు తలెత్తున్నట్లు సమాచారం. ఆసియాకప్-2023 లీగ్ దశలో అదరగొట్టిన పాకిస్తాన్.. సూపర్-4లో ఓటమి పాలై టోర్నీ అనుహ్యంగా టోర్నీ నుంచి నిష్క్రమించింది. అయితే ఈ టోర్నీ అంతటా కెప్టెన్‌గా బాబర్ ఆజం తీసుకున్న నిర్ణయాలపై కొంతమంది ఆటగాళ్ళు ఆసంతృప్తి వ్యక్తం చేసినట్లు వినికిడి. అదేవిధంగా పాకిస్తాన్ డ్రెసింగ్ రూమ్‌లో రెండు వర్గాలు ఉన్నాయని, కొంతమంది ఆటగాళ్ళు బాబర్ ఆజం నాయకత్వాన్ని బహిరంగంగా వ్యతిరేకిస్తున్నారని పలు రిపోర్టులు పేర్కొంటున్నాయి. శ్రీలంక చేతిలో ఓటమి తర్వాత డ్రెస్సింగ్ రూమ్‌లో బాబర్ ఆజం, స్టార్ పేసర్ షాహీన్ షా అఫ్రిది మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. స్టార్ బ్యాటర్ మహమ్మద్ రిజ్వాన్ కూడా బాబర్‌కు వ్యతిరేకంగా ఉన్నట్లు సమాచారం. అదే విధంగా బాబర్ ఆజంపై పాక్ వైస్ కెప్టెన్ షాదాబ్ ఖాన్ కూడా కీలక వాఖ్యలు చేశాడు. "ఫీల్డ్‌లో బాబర్ ఆజంతో అంత ఆనందంగా ఉండలేకపోతున్నాం. ఎందుకంటే అతడు మైదానంలో పూర్తి భిన్నంగా ఉంటాడు. కానీ ఆఫ్‌ది ఫీల్డ్ మాత్రం అతడితో మేము మంచిగా ఎంజాయ్ చేస్తామని షాదాబ్ పేర్కొన్నాడు. షాదాబ్ ఖాన్‌పై వేటు.. కాగా బాబర్‌పై షాదాబ్ బహిరంగంగా చేసిన వాఖ్యలను పాకిస్తాన్ క్రికెట్ బోర్డు సీరియస్‌గా తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వైస్ కెప్టెన్సీ పదవి నుంచి షాదాబ్‌ను తప్పించాలని పీసీబీ భావిస్తున్నట్లు సమాచారం. త్వరలో జరగనున్న పీసీబీ బోర్డు మీటింగ్‌లో ఈ నిర్ణయం తీసుకున్నట్లు జియోన్యూస్ తమ రిపోర్టులో వెల్లడించింది. చదవండి: Asia Cup 2023: 'అతడు ఫ్యూచర్ ఆఫ్ ఇండియన్ క్రికెట్.. చాలా గర్వంగా ఉంది' -
'అతడు ఫ్యూచర్ ఆఫ్ ఇండియన్ క్రికెట్.. చాలా గర్వంగా ఉంది'
ఆసియాకప్-2023ను రోహిత్ శర్మ సారథ్యంలోని భారత జట్టు కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. ఫైనల్లో శ్రీలంకను 10వికెట్ల తేడాతో చిత్తు చేసిన టీమిండియా.. 8వ సారి ఆసియా విజేతగా నిలిచింది. కాగా ఈ టోర్నీలో టీమిండియా యువ ఓపెనర్ శుబ్‌మన్ గిల్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. ఈ మెగా ఈవెంట్లో 6 మ్యాచ్‌లు ఆడిన గిల్.. 302 పరుగులతో టోర్నీ టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అతడి ఇన్నింగ్స్‌లలో రెండు హాఫ్ సెంచరీలు, ఒక సెంచరీ ఉన్నాయి. పాకిస్తాన్‌తో తొలి మ్యాచ్‌లో విఫలమైన గిల్.. ఆ తర్వాత అద్భుతమైన కమ్‌బ్యాక్ ఇచ్చాడు. కాగా గిల్ ఒక్క టోర్నీలో మాత్రమే కాకుండా అంతకుముందు విండీస్ సిరీస్‌లో కూడా అద్భుతంగా రాణించాడు. ఓవరాల్‌గా ఈ ఏడాది ఇప్పటివరకు 17 ఇన్నింగ్స్‌లు ఆడిన గిల్ 68.33 సగటుతో 1025 పరగులు చేశాడు. ఈ నేపథ్యంలో శుభ్‌మన్ గిల్‌పై భారత క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ ప్రశంసల జల్లు కురిపించాడు. గిల్‌ను ఫ్యూచర్ ఆఫ్ భారత్ క్రికెట్ అని కపిల్ దేవ్ అభివర్ణించాడు. "శుబ్‌మన్ గిల్ ఒక అద్భుతం. అతడు భారత్ క్రికెట్ భవిష్యతు. ఈ యువ క్రికెటర్ కచ్చితంగా భారత క్రికెట్‌ను అత్యున్నత స్ధాయికి తీసుకువెళ్తాడు. ఇండియాలో ఇటువంటి అద్భుతమైన ఆటగాడు ఉన్నందుకు చాలా గర్వంగా ఉందంటూ" పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కపిల్‌దేవ్ పేర్కొన్నాడు. చదవండి: ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌కు భారత జట్టు ప్రకటన.. కెప్టెన్‌గా కేఎల్ రాహుల్.. అశ్విన్ రీఎంట్రీ -
ఆసియా కప్ 2023 టాప్ పెర్ఫార్మర్స్ వీరే..!
ఆసియా కప్ 2023 విజేతగా టీమిండియా అవతరించిన విషయం తెలిసిందే. శ్రీలంకతో నిన్న (సెప్టెంబర్ 17) జరిగిన ఫైనల్లో భారత్ 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి, ఎనిమిదో సారి ఆసియా ఛాంపియన్‌గా నిలిచింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 15.2 ఓవర్లలో 50 పరుగులకే కుప్పకూలగా.. టీమిండియా ఆడుతూ పాడుతూ 6.1 ఓవర్లలో వికెట్లు నష్టపోకుండా లక్ష్యాన్ని ఛేదించింది. ఇషాన్ కిషన్ (23), శుభ్‌మన్ గిల్ (27) టీమిండియాను విజయతీరాలకు చేర్చారు. అంతకుముందు మహ్మద్ సిరాజ్ (7-1-21-6), బుమ్రా (5-1-23-1), హార్దిక్ పాండ్యా (2.2-0-3-3) చెలరేగడంతో శ్రీలంక 15.2 ఓవర్లలో 50 పరుగులకే కుప్పకూలింది. లంక ఇన్నింగ్స్‌లో ఏకంగా ఐదుగురు డకౌట్లు కాగా.. కేవలం కుశాల్ మెండిస్ (17), దుషన్ హేమంత (13 నాటౌట్) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. ఆసియా కప్ 2023 టాప్ పెర్ఫార్మర్స్ వీరే..! 2023 ఆసియా కప్‌లో టాప్ పెర్ఫార్మెన్స్లపై ఓ లుక్కేస్తే, ఈ జాబితాలో అంతా టీమిండియా ఆటగాళ్లే కనిపిస్తారు. అత్యధిక పరుగులు, అత్యధిక బౌండరీలు, అత్యధిక సిక్సర్లు, అత్యుత్తమ బౌలింగ్ సగటు, అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు.. ఇలా దాదాపు ప్రతి విభాగంలో భారత ఆటగాళ్లు టాప్‌లో ఉన్నారు. అత్యధిక పరుగులు: శుభ్‌మన్ గిల్ (6 ఇన్నింగ్స్‌ల్లో 302 పరుగులు) అత్యధిక అర్ధసెంచరీలు: రోహిత్ శర్మ, కుశాల్ మెండిస్ (3) అత్యధిక సిక్సర్లు: రోహిత్ శర్మ (11) అత్యధిక బౌండరీలు: శుభ్‌మన్ గిల్ (35) అత్యధిక స్కోర్: బాబర్ ఆజమ్ (151) అత్యధిక సగటు: మహ్మద్ రిజ్వాన్ (4 ఇన్నింగ్స్‌ల్లో 97.5) అత్యుత్తమ స్ట్రయిక్‌రేట్: మహ్మద్ నబీ (178.95) అత్యధిక వికెట్లు: మతీష పతిరణ (11) అత్యుత్తమ బౌలింగ్ సగటు: హార్ధిక్ పాండ్యా (11.33) అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు: మహ్మద్ సిరాజ్ (6/21) టోర్నీ మొత్తంలో 7 సెంచరీలు నమోదు కాగా.. ఇందులో మూడు సెంచరీలు (కోహ్లి, రాహుల్, గిల్) భారత ఆటగాళ్లు చేసినవే కావడం విశేషం. -
'అతడు గాయం నుంచి తిరిగొచ్చినట్లు లేదు .. చుక్కలు చూపిస్తున్నాడు'
దాదాపు ఏడాది తర్వాత వన్డేక్రికెట్‌లో అడుగుపెట్టిన టీమిండియా పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా తన ప్రదర్శనతో అకట్టుకున్నాడు. ఈ ఏడాది ఆసియాకప్ వన్డే టోర్నీతో రీ ఎంట్రీ ఇచ్చిన బుమ్ బుమ్ బుమ్రా తన పేస్ బౌలింగ్‌తో ప్రత్యర్ధి బ్యాటర్లకు చుక్కలు చూపించాడు. ఈ టోర్నీలో బుమ్రా నాలుగు వికెట్లు మాత్రమే సాధించినప్పటికీ.. పవర్‌ప్లేలో మాత్రం భారత్‌కు అద్బుతమైన ఆరంభాన్ని అందించాడు. కొత్త బంతితో బుమ్రా అద్బుతాలు సృష్టించాడు. ఈ క్రమంలో బుమ్రాపై టీమిండియా మాజీ ఓపెనర్ అకాష్ చోప్రా ప్రశంసల వర్షం కురిపించాడు. బుమ్రా గాయం నుంచి తిరిగి వచ్చినట్లు కనిపించడం లేదని చోప్రా అభిప్రాయపడ్డాడు. "జస్ప్రీత్ బుమ్రా 10 ఓవర్లు వేయగలడా అని మనం ఆలోచిస్తున్నాము. ఆసియాకప్‌లో అతడు ఏ మ్యాచ్‌లో కూడా తన ఫుల్ ఓవర్ల కోటాను పూర్తి చేయలేదు. కానీ ఈ ఈవెంట్లో అతడు వేసిన ప్రతీ ఓవర్ కూడా ఒక అద్భుతం. అది జట్టుకు చాలు . అతడు ప్రతీ సారి 10 ఓవర్లు బౌలింగ్ చేయాల్సిన అవసరం లేదు. నా వరకు అయితే బుమ్రా గాయం నుంచి తిరిగి వచ్చినట్లు కనిపించడం లేదు. బుమ్రా పూర్తి ఫిట్నెస్గా ఉన్నాడు. అదే విధంగా మంచి రిథమ్‌లో కూడా ఉన్నాడు. అతడు ఫీల్డ్‌లో కొంచెం కూడా ఇబ్బంది పడడడం లేదు. అతడు బంతిని రెండు వైపులా అద్భుతంగా స్వింగ్ చేస్తున్నాడు. అతడు పేస్‌లో వైవిధ్యం చూపిస్తున్నాడు. బుమ్రా తిరిగి రావడం జట్టుకు ఎంతో బలాన్ని ఇచ్చిందని "చోప్రా తన యూట్యూబ్ ఛానల్లో పేర్కొన్నాడు. చదవండి: AUS vs IND: ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్.. టీమిండియా కెప్టెన్‌గా రాహుల్! మరి రోహిత్? -
క్రికెటర్ కాదు.. కోచ్? ఫిజియో? కానే కాదు.. ట్రోఫీ ఎత్తాడుగా! సచిన్, ద్రవిడ్ వల్ల
Who's The Man Who Lifted Asia Cup Trophy?: మ్యాచ్‌కు వర్ష సూచన.. ఒకవేళ ఫలితం తేలకుంటే రిజర్వ్ డే వరకు ఆగాలా? ఏమో.. ఏదేమైనా ఈసారి టీమిండియా గెలవాల్సిందే..! కప్పు కొట్టాల్సిందే.. ఆసియా కప్-2023 ఫైనల్లో టీమిండియా- శ్రీలంక ఫైనల్‌కు ముందు సగటు అభిమాని మదిలో మెదిలిన భావాలు.. కానీ వరణుడు ‘కరుణించాడు’... కాస్త ఆలస్యమైనా మ్యాచ్ జరిగేందుకు వీలుగా తానే వెనక్కి వెళ్లిపోయాడు.. టాస్ గెలిచిన శ్రీలంక బ్యాటింగ్‌కు రాగా.. టీమిండియా ఆటగాళ్లంతా మైదానంలో దిగారు.. ఆ తర్వాత ఏం జరిగిందో క్రికెట్ ప్రేమికులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా తొలి వికెట్ తీసి శుభారంభం అందించగా.. మరో ఫాస్ట్‌బౌలర్ మహ్మద్ సిరాజ్ లంక బ్యాటింగ్ ఆర్డర్‌ను కకావికలం చేశాడు. ఏకంగా ఆరు వికెట్లతో అదరగొట్టాడు. ఈ హైదారాబాదీ దెబ్బకు శ్రీలంక బ్యాటర్లు క్యూ కట్టగా.. హార్దిక్ పాండ్యా వచ్చి మిగిలిన మూడు వికెట్లు తీసి లాంఛనం పూర్తి చేశాడు. 51 పరుగుల లక్ష్యంతో బరిలోగి దిగిన టీమిండియా 6.1 ఓవర్లలోనే టార్గెట్ ఛేదించింది. ఎనిమిదోసారి ఆసియా కప్ భారత్ కైవసమైంది. ఆటగాళ్లతో పాటు అభిమానుల సంబరాలు అంబరాన్నంటాయి. ఇక ట్రోఫీ ప్రదానోత్సవం.. గత కొంతకాలంగా ఏదైనా సిరీస్ గెలిస్తే.. సెలబ్రేషన్స్ సమయంలో జట్టులోకి కొత్తగా అడుగుపెట్టిన వాళ్లు.. లేదంటే అందరికంటే వయసులో చిన్నవాళ్లకు ట్రోఫీని అందజేయడం ఆనవాయితీగా వస్తోందన్న విషయం తెలిసిందే. తిలక్ వర్మకే ఆ అదృష్టం ఈసారి హైదరాబాదీ బ్యాటర్ 20 ఏళ్ల తిలక్ వర్మకు ఏకంగా ఆసియా కప్ రూపంలో ఆ అదృష్టం దక్కింది. ఆ తర్వాత వెంటనే మరో వ్యక్తి ట్రోఫీని ఎత్తాడు. ఫొటోలు క్లిక్‌మన్నాయి.. అతడు ఎవరు? టీమిండియా ప్లేయర్ కాదు.. అలా అని కోచ్ లేదంటే ఫిజియో.. వీళ్లెవరూ కాదు.. మరెవరు.. జట్టుకు సుదీర్ఘకాలంగా సేవలు అందిస్తున్న వ్యక్తుల్లో అతి ముఖ్యమైనవాడు. హి ఈజ్ రఘు రాఘవేంద్ర అతడి పేరు రఘు రాఘవేంద్ర.. త్రో డౌన్ స్పెషలిస్టు. బ్యాటర్లు నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తున్నపుడు వాళ్లకు స్లింగర్ నుంచి బంతులు రిలీజ్ చేసేది ఇతడే. నిజానికి బౌలర్ల కంటే మన బ్యాటర్లు ఇతడినే ఎక్కువసార్లు నెట్స్‌లో ఎదుర్కొంటారు. బ్యాటర్ల స్టైల్‌ను బట్టి.. మైదానంలో వాళ్లు ప్రత్యర్థి బౌలర్లను ఎదుర్కొనేందుకు సంసిద్ధం కావడంలో త్రో డౌన్ స్పెషలిస్టు కీలకంగా వ్యవహరిస్తాడు. కేవలం బ్యాటింగ్ మాత్రమే కాదు.. ఫీల్డింగ్ ప్రాక్టీస్‌లోనూ రఘుదే కీలక పాత్ర. అతడికి తోడుగా మరో ఇద్దరు త్రో డౌన్ స్పెషలిస్టులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. వాళ్లిద్దరి సిఫారసుతోనే! అయితే, టీమిండియా మొట్టమొదటి త్రో డౌన్ స్పెషలిస్టు మాత్రం రఘు రాఘవేంద్రనే! టీమిండియా దిగ్గజాలు సచిన్ టెండుల్కర్, ప్రస్తుత హెడ్‌కోచ్ రాహుల్ ద్రవిడ్ సిఫారసుతో భారత జట్టుతో చేరాలన్న అతడి కోరిక నెరవేరింది. ఈ క్రమంలో కర్ణాటకకు చెందిన రఘు 2011లో బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీ సిబ్బందిలో ఒకరిగా అడుగుపెట్టాడు. సచిన్, ధోని వంటి బ్యాటర్లకు త్రో డౌన్స్ ఇవ్వటమే కాదు.. జట్టుకు అవసరమైనపుడు అన్నీ తానై వ్యవహరించడంలో రఘు ముందుంటాడు. అన్నింట్లో ముందే ఉంటాడు ఈ విషయాన్ని గతంలో టీమిండియా మాజీ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ తన ట్వీట్ ద్వారా వెల్లడించాడు. ‘‘టీమిండియాలో అత్యంత కఠిన శ్రమకోచ్చే రఘు. కేవలం త్రో డౌన్స్ ఇవ్వడమే కాదు.. మ్యాచ్ టిక్కెట్ల దగ్గర నుంచి హోటల్స్, లాజిస్టిక్స్, భోజనం.. ఇలా ఏ విషయాల్లోనైనా సాయానికి తానున్నాంటూ ముందుకు వస్తాడు’’ అని ప్రశంసలు కురిపించాడు. ఇక టీమిండియాకు అతిపెద్ద చీర్ లీడర్ అయిన రఘు.. గతేడాది టీ20 వరల్డ్‌కప్ సందర్భంగా.. ఆటగాళ్లతో పాటు అభిమానుల మనసు గెలుచుకున్నాడు. టీమిండియా- బంగ్లాదేశ్ మ్యాచ్ చూసిన వారికి ఈ సంగతి గుర్తుండే ఉంటుంది. షూస్ తుడుస్తూ.. మనసులు గెలిచాడు లక్ష్య ఛేదనకు దిగిన బంగ్లా బ్యాటింగ్ చేస్తున్న సమయంలో.. వర్షం పడింది. కాసేపటి తర్వాత వాన తగ్గుముఖం పట్టడంతో మళ్లీ ఆట మొదలుపెట్టగా.. అవుట్ ఫీల్డ్ కాస్త తడిగా ఉండటంతో టీమిండియా ప్లేయర్లు ఎక్కడ ఇబ్బంది పడతారోనని బ్రష్ పట్టుకుని రంగంలోకి దిగాడు రఘు. ఫీల్డర్లు పట్టుజారి పడే ప్రమాదం ఉన్న నేపథ్యంలో.. బౌండరీ లైన్ దగ్గరికి వచ్చి.. వారి షూస్‌కు అంటిన మట్టిని బ్రష్‌తో క్లీన్చేస్తూ ఏ ఇబ్బంది కలగకుండా చూసుకున్నాడు. అప్పుడు అతడి ఫొటో నెట్టింట వైరల్ కాగా.. ప్రశంసల జల్లు కురిసింది. తాజాగా ఆసియా కప్ విజయం నేపథ్యంలో టీమిండియా క్రికెటర్లు అతడికి ట్రోఫీ అందించి కృతజ్ఞతాభావం చాటుకోవడంతో పాటు సముచిత గౌరవం కల్పించడంతో మరోసారి ఇలా వార్తల్లోకెక్కాడు. చదవండి: అంతా బాగానే ఉంది కానీ.. అప్పట్లో కోహ్లి, ద్రవిడ్: రోహిత్‌కు వార్నింగ్ Team india @BCCI s most hard working guy RAGHU in th team management from giving throw downs in the nets to match tickets,hotel,logistics,food or anything..always ready to help the team.keep up the good work and by the way how can u sit like this man?On one leg👌can anyone copy👇 pic.twitter.com/Ot1wjjRprf — Harbhajan Turbanator (@harbhajan_singh) December 7, 2018 Introducing the Super11 Asia Cup 2023 Champions! 💙🇮🇳#AsiaCup2023 pic.twitter.com/t0kf09xsCJ — AsianCricketCouncil (@ACCMedia1) September 17, 2023 Introducing the Super11 Asia Cup 2023 Champions! 💙🇮🇳#AsiaCup2023 pic.twitter.com/t0kf09xsCJ — AsianCricketCouncil (@ACCMedia1) September 17, 2023 Off field hero of Indian team.👏 He is India's sidearm thrower Raghu who is running around the ground with a brush in hand to clean the shoes of Indian players to avoid the possibility of them sleeping.#T20Iworldcup2022 #INDvsBAN #ViratKohli𓃵 #Rain #KLRahul𓃵 #T20WorldCup pic.twitter.com/d3BdJkHn5M — Rajan Rai (@RajanRa05092776) November 2, 2022 -
అంతా బాగానే ఉంది కానీ.. అప్పట్లో కోహ్లి, ద్రవిడ్: రోహిత్‌కు వార్నింగ్
Asia Cup 2023 Winning Captain- Rohit Sharma: ‘‘రోహిత్ శర్మ కెప్టెన్సీపై ఎవరికీ ఎలాంటి సందేహాలు లేవు. ఐపీఎల్లో కొంతమందైతే ఒక్కసారి జట్టును గెలిపించలేకపోయారు. కానీ.. రోహిత్ ఏకంగా ఐదు టైటిళ్లు గెలిచాడు. అయితే, అసలు పరీక్ష ముందుంది. రాబోయే 15 రోజులలో ఏం జరుగుతుందని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. జట్టులో ప్రస్తుతం 15- 18 అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తున్న ఆటగాళ్లు ఉన్నారు. అయితే, వారిలో ఒక్కరైనా సరే సరైన సమయంలో రాణించకపోతే అప్పుడు అన్ని వేళ్లు రోహిత్ వైపే చూపిస్తాయి. వరల్డ్‌కప్ ముగిసిన తర్వాత ప్రతి కెప్టెన్ ఇలాంటి పరిస్థితి ఎదుర్కోవాల్సి ఉంటుంది. గతంలో కోహ్లి, ద్రవిడ్ ఫేస్ చేశారు విరాట్ కోహ్లి గతంలో ఇదంతా ఫేస్ చేశాడు. 2007లో రాహుల్ ద్రవిడ్‌కు సైతం ఇలాంటి పరిస్థితే ఎదురైంది’’ అని టీమిండియా మాజీ ఓపెనర్ గౌతం గంభీర్ భారత సారథి రోహిత్ శర్మను హెచ్చరించాడు. ఆసియా విజయంతో నూతనోత్సాహం కాగా సొంతగడ్డపై పుష్కరకాలం తర్వాత టీమిండియా వన్డే ప్రపంచకప్ ఆడనున్న విషయం తెలిసిందే. ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, సౌతాఫ్రికా, బంగ్లాదేశ్, అఫ్గనిస్తాన్, పాకిస్తాన్, శ్రీలంక, నెదర్లాండ్స్ ఈ ఐసీసీ టోర్నీలో పాల్గొననున్నాయి. అయితే, అంతకంటే ముందే భారత జట్టు ఆసియా కప్-2023లో భాగంగా పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంకతో మ్యాచ్‌లు ఆడింది. ఈసారి వన్డే ఫార్మాట్లో నిర్వహించిన టోర్నీ ఫైనల్లో శ్రీలంకను 10 వికెట్ల తేడాతో చిత్తు చేసి చాంపియన్‌గా అవతరించింది. లోపాలు బయటపడ్డాయి ప్రపంచకప్‌నకు ముందు ఈ గెలుపు టీమిండియా ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేస్తుందనడంలో సందేహం లేదు. అయితే.. చెత్త ఫీల్డింగ్‌తో పరుగులు ఇవ్వడం, క్యాచ్‌లు డ్రాప్ చేయడం.. చెత్త షాట్ల ఎంపిక వంటి కొన్ని పొరపాట్లు సరిచేసుకోవాల్సి ఉంది. ఆసీస్‌తో సన్నాహక సిరీస్ ఇదిలా ఉంటే.. ఆసియా విజయంతో పాటు మెగా టోర్నీ కంటే ముందు ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ ఆడటం కూడా భారత్‌కు మంచి సన్నాహకంగా ఉపయోగపడనుంది. ఈ నేపథ్యంలో.. గౌతం గంభీర్ స్టార్ స్పోర్ట్స్ షోలో మాట్లాడుతూ.. అంతా బాగానే ఉంది కానీ.. రోహిత్ కెప్టెన్సీకి అసలు పరీక్ష వరల్డ్‌కప్ రూపంలో ముందు ఉందని అభిప్రాయపడ్డాడు. జాగ్రత్త రోహిత్.. గంభీర్ వార్నింగ్ ఆసియా కప్ రెండుసార్లు గెలిచిన రోహిత్‌ను ప్రశంసిస్తూనే.. వరల్డ్‌కప్- 2023లో గనుక ఏమాత్రం తేడా జరిగినా విమర్శల పాలుకాక తప్పదని వార్నింగ్ ఇచ్చాడు. గతంలో కోహ్లి, ద్రవిడ్ విషయంలో ఇలాగే జరిగిందని గుర్తు చేశాడు. అయితే, ఈసారి జట్టు పటిష్టంగా ఉన్న కారణంగా రోహిత్ పని సులువు కానుందని.. కచ్చితంగా ఫైనల్ చేరతారని గంభీర్ అంచనా వేశాడు. ఒకవేళ టీమిండియా రాణించకపోతే రోహిత్ కెప్టెన్సీపై ప్రశ్నలు, చర్చలు మొదలవుతాయని పేర్కొన్నాడు. చదవండి: అతడే మా కొంపముంచాడు.. మమ్మల్ని క్షమించండి ప్లీజ్: శ్రీలంక కెప్టెన్ సిరాజ్ కాదు!; వరల్డ్‌కప్‌లో టీమిండియా ప్రధాన అస్త్రం అతడే: పాక్ లెజెండ్ Record-breaking Siraj! 🤯@mdsirajofficial rewrites history, now recording the best figures in the Asia Cup! 6️⃣ for the pacer! Tune-in to #AsiaCupOnStar, LIVE NOW on Star Sports Network#INDvSL #Cricket pic.twitter.com/2S70USxWUI — Star Sports (@StarSportsIndia) September 17, 2023 Super11 Asia Cup 2023 | Final | India vs Sri Lanka | Highlights https://t.co/74ghboYcrR#AsiaCup2023 — AsianCricketCouncil (@ACCMedia1) September 17, 2023 -
రోహిత్ శర్మ అరుదైన ఘనత.. ధోనికి అలా సాధ్యం కాలేదు!
Asia Cup, 2023 India vs Sri Lanka, Final- Rohit Sharma Record: ఐదేళ్ల క్రితం ఆసియా కప్ టోర్నీలో టీమిండియాను చాంపియన్‌గా నిలిపిన రోహిత్ శర్మ.. కెప్టెన్‌గా మరోసారి అదే ఫీట్‌ను పునరావృతం చేశాడు. హిట్‌మ్యాన్ సారథ్యంలో భారత జట్టు ఆసియా కప్-2023 ఫైనల్లో శ్రీలంకను చిత్తు చేసింది. ఏకంగా 10 వికెట్ల తేడాతో మట్టికరిపించి విజయకేతనం ఎగురవేసింది. మిస్టర్కూల్తో పాటు లంక లెజెండ్ మాదిరిగానే వన్డే మ్యాచ్‌లో 50 పరుగులకే ఆలౌట్ అయిన శ్రీలంక విధించిన స్వల్ప లక్ష్యాన్ని టీమిండియా 6.1 ఓవర్లలోనే ఛేదించి రికార్డు స్థాయిలో అతి పెద్ద విజయం నమోదు చేసింది. కాగా ఆటగాడిగా రోహిత్ శర్మ కెరీర్లో ఇది 250వ అంతర్జాతీయ వన్డే కావడం విశేషం. అదే విధంగా ఆసియా కప్ వన్డే చరిత్రలో 28వది. ఇక ఈ మ్యాచ్‌లోనే కెప్టెన్‌గానూ రోహిత్ అరుదైన ఘనతలు సాధించాడు. శ్రీలంకపై విజయంతో ఆసియా వన్డే కప్‌లో సారథిగా తొమ్మిది మ్యాచ్‌లు గెలిచి.. టీమిండియా దిగ్గజ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని, శ్రీలంక లెజెండ్ అర్జున రణతుంగతో కలిసి సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచాడు. ధోనికి అలా సాధ్యం కాలేదు అయితే, ధోని(14 మ్యాచ్‌లలో), రణతుంగ(13 మ్యాచ్‌లలో)ల కంటే అత్యంత వేగంగా ఈ ఫీట్ నమోదు చేశాడు. 11 మ్యాచ్‌లలో 9 విజయాలు సాధించి చరిత్రకెక్కాడు. ఇదిలా ఉంటే.. కొలంబోలో శ్రీలంకతో ఆదివారం నాటి ఫైనల్లో గెలుపుతో రోహిత్ శర్మ కెప్టెన్‌గా రెండోసారి ఆసియా కప్ అందుకున్నాడు. అజారుద్దీన్‌తో పాటు.. ధోని, రోహిత్ ఈ క్రమంలో ఒకటి కంటే ఎక్కువసార్లు ఈ ఘనత సాధించిన కెప్టెన్‌గా మహ్మద్ అజారుద్దీన్, మహేంద్ర సింగ్ ధోని తర్వాతి స్థానంలో నిలిచాడు. 1990-91లో అజారుద్దీన్, 2010, 2016(టీ20 ఫార్మాట్లో తొలిసారి)లో ధోని టీమిండియాకు టైటిల్ అందించారు. కాగా ఫైనల్లో ఆరు వికెట్లతో చెలరేగి హైదరాబాదీ పేసర్ మహ్మద్ సిరాజ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలవగా.. చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు అందుకున్నాడు. చదవండి: Asia Cup 2023: కాస్త ఓవర్ అయిందేమో భయ్యా! అందుకే ఆ బంతి వెంట పరిగెత్తాను: సిరాజ్ అతడే మా కొంపముంచాడు.. మమ్మల్ని క్షమించండి ప్లీజ్: శ్రీలంక కెప్టెన్ Super11 Asia Cup 2023 | Final | India vs Sri Lanka | Highlights https://t.co/74ghboYcrR#AsiaCup2023 — AsianCricketCouncil (@ACCMedia1) September 17, 2023 -
శ్రీలంకకు గిఫ్ట్‌గా 4 పరుగులు.. ముఖం దాచుకున్న కోహ్లి! వీడియో వైరల్
సెప్టెంబర్ 17(ఆదివారం).. శ్రీలంక క్రికెట్‌కు మరచిపోలేని రోజుగా మిగిలిపోతుంది. ఆసియాకప్-2023 భాగంగా టీమిండియాతో జరిగిన ఫైనల్లో 10 వికెట్ల తేడాతో శ్రీలంక ఘోర ఓటమి చవిచూసింది. భారత ఫాస్ట్‌బౌలర్ల ధాటికి కేవలం 50 పరుగులకే శ్రీలంక కుప్పకూలింది. తమ వన్డే క్రికెట్ చరిత్రలో లంకకు ఇది రెండో అత్యల్ప స్కోర్ కావడం గమనార్హం. టీమిండియా ఫాస్ట్‌బౌలర్ మహ్మద్ సిరాజ్ పేస్ ముందు.. లంక బ్యాటర్లు పట్టుమని పది నిమిషాల కూడా నిలవలేకపోయారు. సిరాజ్ 6 వికెట్లతో లంకను చావు దెబ్బతీశాడు. అసియాకప్ చరిత్రలో భారత్ తర్వాత అత్యుత్తమ రికార్డు కలిగి ఉన్న శ్రీలంక.. ఇటువంటి ప్రదర్శన కనబరిచడం అందరని ఆశ్చర్యపరిచింది. విరాట్ కోహ్లి ఓవర్ త్రో గిఫ్ట్ కాగా శ్రీలంక 50 పరుగుల మార్క్‌ను అయినా అందుకుందంటే అది టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి పుణ్యమే అని చెప్పుకోవాలి. ఎందుకంటే విరాట్ ఓవర్ త్రో రూపంలో 4 పరుగులు శ్రీలంకకు గిఫ్ట్‌గా ఇచ్చాడు. లంక ఇన్నింగ్స్ 14 ఓవర్ వేసిన సిరాజ్ బౌలింగ్‌లో దుషాన్ హేమంత ఫైన్ లెగ్ దిశగా షాట్ ఆడాడు. ఈ క్రమంలో హేమంత రెండో పరుగు కోసం ప్రయత్నించాడు. దీంతో ఫీల్డర్ వికెట్ కీపర్ దిశగా త్రో వేశాడు. అయితే త్రోలో పవర్ లేకపోవడంతో బంతి స్లిప్‌లో ఉన్న కోహ్లి చేతికి వెళ్లింది. కోహ్లి వెంటనే నాన్‌స్ట్రైకర్ ఎండ్‌కు విసిరాడు. అయితే బంతి స్టంప్స్‌కు తాకకుండా బౌండరీ లైన్‌కు వెళ్లింది. దీంతో లంకకు ఆదనంగా నాలుగు పరుగులు వచ్చాయి. బంతి బౌండరీకి వెళ్లడంతో కోహ్లి నిరాశ చెందాడు. తన క్యాప్‌తో ముఖాన్ని అడ్డుపెట్టుకున్నాడు. కానీ భారత్ అప్పటికే లంకపై చేయి సాధించడంతో విరాట్ కాసేపటికే చిరునవ్వు నవ్వాడు. కోహ్లి రియాక్షన్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చదవండి: అతడే మా కొంపముంచాడు.. మమ్మల్ని క్షమించండి ప్లీజ్: శ్రీలంక కెప్టెన్ pic.twitter.com/9NJLcluBOW — Rahul Chauhan (@ImRahulCSK11) September 17, 2023 Super11 Asia Cup 2023 | Final | India vs Sri Lanka | Highlights https://t.co/74ghboYcrR#AsiaCup2023 — AsianCricketCouncil (@ACCMedia1) September 17, 2023 -
అతడే మా కొంపముంచాడు.. మమ్మల్ని క్షమించండి ప్లీజ్: శ్రీలంక కెప్టెన్
ఆసియాకప్-2023 ఫైనల్లో టీమిండియా చేతిలో 10 వికెట్ల తేడాతో శ్రీలంక ఘోర ఓటమిని చవిచూసింది. లీగ్,సూపర్-4 దశలో అదరగొట్టిన లంకేయులు.. ఫైనల్లో మాత్రం దారుణంగా విఫలమయ్యారు. భారత బౌలర్ల ధాటికి లంక బ్యాటింగ్ లైనప్ పేకమేడలా కూలిపోయింది.భారత పేసర్ మహ్మద్ సిరాజ్ 6 వికెట్లతో లంక పతనాన్ని శాసించంగా.. హార్దిక్ పాండ్యా 3 వికెట్లతో ఫినిషింగ్ టచ్ ఇచ్చాడు. వీరిద్దరి అద్భుత ప్రదర్శన ఫలితంగా ప్రత్యర్థి లంక కేవలం 50 పరుగులకే కుప్పకూలింది. అంతర్జాతీయ వన్డేల్లో లంకకు ఇది రెండో అత్యల్ప స్కోర్ కావడం గమనార్హం. లంక బ్యాటర్లలో 8 మంది సింగిల్ డిజిట్ స్కోర్‌కే పరిమితమయ్యారు. ఇక వరల్డ్‌కప్‌కు ముందు ఈ దారుణ ఓటమి లంక ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు. మరోవైపు గాయాలు కూడా శ్రీలంక క్రికెట్‌ను వెంటాడుతున్నాయి. హసరంగా, చమీరా, అవిష్క ఫెర్నాండో, థీక్షణ వంటి స్టార్ ఆటగాళ్లు గాయాలతో బాధపడుతున్నారు. వీరు వరల్డ్‌కప్ సమయానికి కోలుకుంటారన్నది అనుమానమే. ఇక భారత చేతిలో ఘోర ఓటమిపై మ్యాచ్ అనంతరం లంక కెప్టెన్ దసున్ షనక స్పందించాడు. టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్ తమ ఓటమిని శాసించాడని షనక తెలిపాడు. అతడే మా కొంపముంచాడు.. మహ్మద్ సిరాజ్ అద్బుతమైన బౌలింగ్ ప్రదర్శన కనబరిచాడు. ఈ పిచ్ బ్యాటర్లకు బాగా అనుకూలిస్తుందని నేను భావించాను. అందుకే టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాను. కానీ ఈ నిర్ణయం మిస్‌ఫైర్ అయింది. వాతవారణ పరిస్ధితులు కూడా కీలక పాత్ర పోషించాయి. మేము ఇది మర్చిపోలేని రోజు. మేము మా బ్యాటింగ్ టెక్నిక్‌ను మెరుగుపరుచుకుని క్రీజులో నిలదొక్కుకుని ఉండి ఉంటే బాగుండేది. కానీ అది మేము చేయలేకపోయాం. ఫైనల్లో మేము ఓడిపోయినప్పటికీ మాకు చాలా సానుకూలాంశాలు ఉన్నాయి. ఈ టోర్నీలో సదీర, కుసల్ మెండీస్ స్పిన్నర్లను ఆడిన విధానం గురుంచి ఎంత చెప్పుకున్న తక్కువే. అదేవిధంగా ఆసలంక కూడా తన మార్క్‌ను చూపించాడు. ఈ ముగ్గురూ భారత పిచ్‌లపై కూడా అద్భుతంగా ఆడగలరు. అయితే ఇటువంటి క్లిష్ట పరిస్థితుల నుంచి ఎలా పుంజుకోవాలో మాకు తెలుసు. మేము పాకిస్తాన్ వంటి మేటి జట్లను ఓడించి ఫైనల్‌కు వచ్చాం. మా బాయ్స్ గత కొంతకాలంగా బాగా రాణిస్తున్నారు. మాకు సపోర్ట్ చేయడానికి వచ్చిన అభిమానులందరికీ ధన్యవాదాలు. అయితే మా ఆటతీరుతో మిమ్మల్ని నిరాశపరిచినందుకు క్షమించండి. అదే విధంగా విజేత భారత్‌కు నా అభినందనలు అంటూ పోస్ట్‌మ్యాచ్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో షనక చెప్పుకొచ్చాడు. చదవండి: నాకు ఒక మెసేజ్ వచ్చింది.. అందుకే సిరాజ్‌కు మళ్లీ బౌలింగ్ ఇవ్వలేదు: రోహిత్ శర్మ -
సిరాజ్ కాదు!; వరల్డ్‌కప్‌లో టీమిండియా ప్రధాన అస్త్రం అతడే: పాక్ లెజెండ్
Asia Cup, 2023 India vs Sri Lanka, Final- Mohammed Siraj: ఆసియా కప్-2023లో ఎనిమిదోసారి చాంపియన్‌గా నిలిచి టోర్నమెంట్లో అత్యధిక టైటిళ్లు గెలిచిన జట్టుగా మరో మెట్టు ఎక్కింది టీమిండియా. శ్రీలంకను తమ సొంతగడ్డపై మట్టికరిపించి జయభేరి మోగించింది. కొలంబో వేదికగా ఆదివారం నాటి మ్యాచ్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగిన భారత ఫాస్ట్‌బౌలర్లు రోహిత్ సేనకు చిరస్మరణీయ విజయం అందించారు. బుమ్రా మొదలెడితే.. సిరాజ్ చుక్కలు చూపించాడు ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా తొలి వికెట్ తీసి శుభారంభం అందించగా.. హైదరాబాదీ స్టార్ మహ్మద్ సిరాజ్ ఏకంగా ఆరు వికెట్లు కూల్చాడు. ఆ తర్వాత అతడికి ‘రెస్ట్’ ఇవ్వడంతో బరిలోకి దిగిన హార్దిక్ పాండ్యా మిగిలిన మూడు వికెట్లు తీసి పనిపూర్తి చేశాడు. ఈ క్రమంలో 50 పరుగులకే శ్రీలంక ఆలౌట్ కాగా.. 6.1 ఓవర్లలోనే టీమిండియా టార్గెట్ ఛేదించి ఆసియా కప్ ట్రోఫీని కైవసం చేసుకుంది. స్వదేశంలో వన్డే వరల్డ్‌కప్-2023కు ముందే అంతర్జాతీయ టైటిల్ సాధించి నయా జోష్‌లో ఉంది. వరల్డ్‌కప్‌లో టీమిండియా ప్రధాన అస్త్రం అతడే ఈ నేపథ్యంలో పాకిస్తాన్ లెజండరీ పేసర్ వసీం అక్రం కీలక వ్యాఖ్యలు చేశాడు. ఐసీసీ టోర్నీలో పేస్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా టీమిండియాకు ప్రధాన ఆయుధం కానున్నాడని పేర్కొన్నాడు. అదే విధంగా చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ సైతం కీలక పాత్ర పోషిస్తాడని చెప్పుకొచ్చాడు. ఆసియా కప్ ఫైనల్లో భారత బౌలర్ల విజృంభణ నేపథ్యంలో ఈ మాజీ లెఫ్టార్మ్ ఫాస్ట్‌బౌలర్ మాట్లాడుతూ.. ‘‘వరల్డ్‌కప్ టోర్నీలో టీమిండియా ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. వారి అమ్ములపొదిలో ఉన్న ప్రధాన అస్త్రం హార్దిక్ పాండ్యా అనడంలో సందేహం లేదు. కుల్దీప్ యాదవ్ సైతం అద్భుతరీతిలో ఇక కుల్దీప్ యాదవ్.. ఆసియా కప్ ఈవెంట్లో పటిష్ట జట్ల బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టాడు. నిజానికి భారత జట్టు ఇప్పుడు పూర్తి సమతూకంగా కనిపిస్తోంది. టీమిండియా మేనేజ్మెంట్ తమ ఆటగాళ్లకు ఎల్లవేళలా మద్దతుగా నిలుస్తూ ఇక్కడిదాకా తీసుకువచ్చింది. ప్రపంచకప్ టోర్నీ ఆరంభానికి ముందే వాళ్లు సరైన జట్టుతో అన్ని రకాలుగా సంసిద్ధమయ్యారు’’ అని స్టార్ స్పోర్ట్స్ షోలో తన అభిప్రాయాలు పంచుకున్నాడు. కాగా ఫైనల్ చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో పాకిస్తాన్ శ్రీలంక చేతిలో ఓడి సూపర్-4లోనే నిష్క్రమించిన విషయం తెలిసిందే. బ్యాట్‌తోనే కాదు.. బాల్‌తోనూ ఇక ఆసియా కప్-2023లో కుల్దీప్ యాదవ్ 9 వికెట్లు కూల్చి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు అందుకున్న విషయం తెలిసిందే. మరోవైపు హార్దిక్ పాండ్యా బంతితోనూ రాణించడం టీమిండియాకు సానుకూలాంశంగా మారింది. కాగా అక్టోబరు 5 నుంచి భారత్ వేదికగా ప్రపంచకప్ ఆరంభం కానున్న విషయం విదితమే. అంతకంటే ముందు రోహిత్ సేన ఆస్ట్రేలియాతో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ఆడనుంది. చదవండి: నాకు మెసేజ్ వచ్చింది.. అందుకే సిరాజ్ చేతికి మళ్లీ బంతిని ఇవ్వలేదు: రోహిత్ Asia Cup 2023: కాస్త ఓవర్ అయిందేమో భయ్యా! అందుకే ఆ బంతి వెంట పరిగెత్తాను: సిరాజ్ Record-breaking Siraj! 🤯@mdsirajofficial rewrites history, now recording the best figures in the Asia Cup! 6️⃣ for the pacer! Tune-in to #AsiaCupOnStar, LIVE NOW on Star Sports Network#INDvSL #Cricket pic.twitter.com/2S70USxWUI — Star Sports (@StarSportsIndia) September 17, 2023 -
నువ్వు క్లాస్..బాసూ! ఆనంద్ మహీంద్ర లేటెస్ట్ ట్వీట్ వైరల్
ఆసియా కప్2023లో భారత ఘన విజయంలో కీలక పాత్ర పోషించిన మహమ్మద్ సిరాజ్ హీరోగా మారిపోయాడు. హైదరాబాదీ ఎక్స్‌ప్రెస్ మొహమ్మద్ సిరాజ్ వీరవిహారంతో శ్రీలంక బ్యాటింగ్ ఆర్డర్‌ను కుప్పకూల్చి అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. భారత జట్టు సభ్యుడిగా టైటిల్ సాధించడంలో మియాన్ మ్యాజిక్ చేయడం మాత్రమే కాదు తన ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ 5000డాలర్ల ప్రైజ్ మనీని కొలంబో గ్రౌండ్ స్టాఫ్‌కి విరాళంగా ప్రకటించి మరింత ఎత్తుకు ఎదిగాడు. దీంతో సిరాజ్‌పై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో పారిశ్రామిక వేత్త, ఎం అండ్ అధినేత ఆనంద్ మహీంద్ర స్పందించారు. నువ్వు క్లాస్ బాసూ అన్న రీతిలో స్పందించారు. ‘‘ఒకటే మాట.. క్లాస్.. అంతే .. ఈ క్లాస్ అనేది ఇది మీ సంపద లేదా మీరు ఎక్కడి నుంచి వచ్చారు. మీ బ్యాక్ గ్రౌండ్ అనే దాన్నుంచి రాదు.. అది మీలోనే ఉంటుంది’’ అంటూ ట్విట్ చేశారు. 2021లో మహీంద్ర థార్ గిఫ్ట్ ఇదే మ్యాచ్‌లో సిరాజ్ వన్ మ్యాన్ షోపై కూడా ఆనంద్ మహీంద్ర స్పందించారు. అయితే ఈ రైజింగ్ స్టార్‌కు దయచేసి ఎస్యూవీ ఇచ్చేయండి సార్ అంటూ ఒక యూజర్ కోరగా, 2021లో మహీంద్రా థార్ ఇచ్చిన సంగతిని గుర్తుచేస్తూ బదులిచ్చారు. కాగా ఆసియా కప్ ఫైనల్లో టీమ్ ఇండియా 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి ఆసియా కప్ విజేతగా నిలిచాన సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఫైనల్ మ్యాచ్‌లో సిరాజ్ ఒకే ఓవర్లో 4 వికెట్లు, 10 బంతుల వ్యవధిలో 5 వికెట్లు సాధించడం అరుదైన రికార్డ్ తన ఖాతాలో వేసుకున్నాడు. Just one word: CLASS. It doesn’t come from your wealth or your background. It comes from within…. https://t.co/hi8X9u4z1O — anand mahindra (@anandmahindra) September 17, 2023 -
నాకు మెసేజ్ వచ్చింది.. అందుకే సిరాజ్ చేతికి మళ్లీ బంతిని ఇవ్వలేదు: రోహిత్
Asia Cup, 2023 India vs Sri Lanka, Final- Mohammed Siraj: టీమిండియా పేసర్, హైదరాబాదీ మహ్మద్ సిరాజ్ తన అంతర్జాతీయ కెరీర్లో అత్యత్తుమ గణాంకాలు నమోదు చేశాడు. ఆసియాకప్-2023లో భాగంగా శ్రీలంకతో జరిగిన ఫైనల్లో సిరాజ్ విశ్వరూపం చూపించాడు. ఒకే ఓవర్లో 4 వికెట్లు పడగొట్టి శ్రీలంకను తమ సొంతగడ్డపై చావు దెబ్బతీశాడు. ఓవరాల్‌గా 7 ఓవర్లు బౌలింగ్ చేసిన సిరాజ్.. 6 వికెట్లు పడగొట్టి కేవలం 21 పరుగులు మాత్రమే ఇచ్చాడు. సిరాజ్ మియా మ్యాజిక్ దాటికి ఆతిథ్య జట్టు కేవలం 50 పరుగులకే కుప్పకూలింది. అయితే సిరాజ్ 7 వికెట్ల ఘనత సాధించే అవకాశం ఉన్నప్పటికీ.. కెప్టెన్ రోహిత్ శర్మ మాత్రం అతడికి బౌలింగ్ చేసే అవకాశం ఇవ్వలేదు. సిరాజ్ చేత 7 ఓవర్లు బౌలింగ్ చేయించి హిట్‌మ్యాన్ ఆపేశాడు. రోహిత్ నిర్ణయంపై భిన్నభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. సిరాజ్‌తో మరో ఓవర్ అదనంగా వేయించి వుంటే 7 వికెట్ల హాల్ సాధించి చరిత్రపుటలకెక్కేవాడని చాలా మంది అభిప్రాయపడ్డారు. ఇక ఇదే విషయంపై మ్యాచ్ అనంతరం రోహిత్ శర్మ మాట్లాడాడు. సపోర్ట్ స్టాప్ సూచన మేరకు సిరాజ్‌తో మరో ఓవర్ వేయించలేదని రోహిత్ తెలిపాడు. "స్లిప్స్‌లో అంతమంది ఫీల్డర్లను చూడటం చాలా ఆనందంగా అన్పించింది. మా ముగ్గురు పేసర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. ముఖ్యంగా సిరాజ్ మిగిలిన వారికంటే చాలా కష్టపడ్డాడు. అయితే అందరూ ప్రతీరోజు రాణించాలంటే సాధ్యం కాదు. ఒక్కో రోజు ఒక్కొక్కరు హీరో అవుతారు. ఈ రోజు సిరాజ్‌ది. అప్పటికే సిరాజ్ తొలి స్పెల్‌తో కలుపుకుని వరుసుగా 7 ఓవర్లు బౌలింగ్ చేశాడు. 7 ఓవర్లు అంటే చాలా ఎక్కువ. అయితే అతడితో మరో ఒకట్రెండు ఓవర్లు వేయించాలని నేను అనుకున్నాను. కానీ అతడికి ఓవర్లను ఆపాలని మా మా ట్రైనర్ నుంచి నాకు సందేశం వచ్చింది. సిరాజ్ మాత్రం బౌలింగ్ కొనసాగించడానికి ఉత్సాహంగా ఉన్నాడు. ఒక రిథమ్‌లో ఉన్నప్పుడు అది ఒక బ్యాటర్‌కు అయినా, బౌలర్‌కైనా సహజం. కానీ ఫిట్నెస్ కూడా ముఖ్యం. ఎందుకంటే అతడి దూకుడు ఇక్కడితో ఆగకూడదు కదా" అని పోస్ట్‌మ్యాచ్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో రోహిత్ పేర్కొన్నాడు. Super11 Asia Cup 2023 | Final | India vs Sri Lanka | Highlights https://t.co/74ghboYcrR#AsiaCup2023 — AsianCricketCouncil (@ACCMedia1) September 17, 2023 చదవండి: Afghan Mystery Girl: వారెవ్వా టీమ్ భారత్.. మోదీ జీకి బర్త్‌డే గిఫ్ట్! ఎవరీ అందాల సుందరి? వ్యాపారవేత్త మాత్రమే కాదు.. Asia Cup 2023: ఆసియా ఛాంపియన్స్‌గా టీమిండియా.. ప్రైజ్ మనీ ఎంతంటే?