Afghan Mystery Girl- Who Is Wazhma Ayoubi: వజ్మా అయూబీ.. సోషల్ మీడియాను ఫాలో అయ్యే వాళ్లకు అఫ్గనిస్తాన్ ‘మిస్టరీ గర్ల్’ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఆసియా కప్-2023 టోర్నీలో టీమిండియాకు మద్దతుగా పోస్టులు పెడుతూ వార్తల్లో నిలుస్తోందీమె.
కోహ్లికి వీరాభిమాని
విరాట్ కోహ్లికి వీరాభిమాని అయిన వజ్మా.. ఇప్పటికే కింగ్ సంతకంతో కూడిన జెర్సీని కూడా దక్కించుకుంది. ఆసియా కప్‌లో పాకిస్తాన్‌తో మ్యాచ్ సందర్భంగా కోహ్లి 13 వేల పరుగుల మైలురాయిని చేరుకోగానే ఆ జెర్సీ ధరించి కింగ్ రికార్డును సెలబ్రేట్ చేసుకుంది.
అంతేకాదు.. పాకిస్తాన్ సహా ఇతర జట్లపై టీమిండియా గెలిచినపుడు శుభాకాంక్షలు తెలుపుతూ వజ్మా అభిమానం చాటుకుంది. ఇక ఆదివారం నాటి ఫైనల్ మ్యాచ్‌లో భారత జట్టు శ్రీలంకను చిత్తు చేసి చాంపియన్‌గా నిలవడంతో ఆమె పట్టరాని సంతోషంలో మునిగిపోయింది.
సిరాజ్ బౌలింగ్‌కు ఫిదా
అంతేకాదు టీమిండియా గెలుపులో కీలక పాత్ర పోషించిన పేసర్ మహ్మద్ సిరాజ్ బౌలింగ్‌కు ఫిదా అయిపోయింది. మ్యాచ్ చూస్తున్నపుడు.. ‘‘11.2 ఓవర్లలో స్కోరు 33-7. కనీవిని ఎరుగని రీతిలో ఇలా ఏడు వికెట్లు పడటం చూశాం. అందులో 6 వికెట్లు మహ్మద్ సిరాజ్‌వే! ఈరోజు ఈ మ్యాచ్ చరిత్ర సృష్టిస్తుందనడంలో సందేహం లేదు’’ అని వజ్మా అయూబ్ ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేసింది.
మోదీ జీకి అదిరిపోయే బర్త్‌డే గిఫ్ట్
ఇక రోహిత్ సేన ఎనిమిదోసారి ఆసియా కప్ ట్రోఫీని ముద్దాడటంతో అద్భుతమైన పోస్ట్‌తో టీమిండియా సహా భారత ప్రధాని నరేంద్ర మోదీ అభిమానులను ఆకట్టుకుంది. ‘‘టీమ్ భారత్‌కు శుభాభినందనలు. శ్రీ మోదీ జీకి అదిరిపోయే బర్త్‌డే(సెప్టెంబరు 17) గిఫ్ట్ ఇచ్చారు.
ప్రపంచంలో ఉన్న టీమిండియా ఫ్యాన్స్ అందరికీ కంగ్రాట్స్’’ అని వజ్మా విష్ చేసింది. ఆమె పోస్టుకు వేలల్లో లైకులు వస్తున్నాయి. థాంక్యూ.. ‘నిజంగా మా లక్కీ ఫ్యాన్’ అంటూ ఆమెకు కూడా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.
ఎవరీ వజ్మా ఆయుబ్?
అఫ్గనిస్తాన్‌లో జన్మించిన వజ్మా ఆయుబి వృత్తిరిత్యా మోడల్. దుబాయ్‌లో నివాసం ఉంటున్న ఆమె వ్యాపారవేత్తగా రాణిస్తోంది. అంతేకాదు సాయం కోసం ఎదురుచూసే వారికి తన వంతు విరాళం అందిస్తూ ఫిలాంత్రపిస్ట్‌గానూ పేరొందింది.
వజ్మాకు ‘LAMAN’ అనే ఫ్యాషన్ బ్రాండ్ కూడా ఉంది. బాలీవుడ్‌లో అడుగుపెట్టి నటిగా గుర్తింపు పొందాలనేది ఆమె చిరకాల కోరిక. అయితే, ఆసియా కప్-2023 నుంచి అఫ్గనిస్తాన్ నిష్క్రమించిన తర్వాతే వజ్మా తన సెకండ్ హోం టీమ్ అదేనండి రోహిత్ సేనకు ఈ అందాల సుందరి మద్దతు ఇవ్వడం విశేషం.
చదవండి: కాస్త ఓవర్ అయిందేమో భయ్యా! అందుకే ఆ బంతి వెంట పరిగెత్తాను: సిరాజ్
Congratulations team Bharat, what a birthday gift for Sri Modi Ji @PMOIndia
— Wazhma Ayoubi 🇦🇫 (@WazhmaAyoubi) September 17, 2023
Congratulations to all Fans all around the world 🇮🇳👏🏻👏🏻👏🏻 #SLvsIND #AsiaCup2023final #AsiaCup pic.twitter.com/A6sIgXlifv
Super11 Asia Cup 2023 | Final | India vs Sri Lanka | Highlights https://t.co/74ghboYcrR#AsiaCup2023
— AsianCricketCouncil (@ACCMedia1) September 17, 2023
Comments
Please login to add a commentAdd a comment