సిరాజ్‌ మియా.. మరోసారి వరల్డ్‌ నంబర్‌ 1 బౌలర్‌గా.. ఏకంగా.. | ICC ODI Rankings Mohammed Siraj Becomes World No.1 Bowler After Asia Cup Final 2023 Heroics - Sakshi
Sakshi News home page

సిరాజ్‌ మియా.. మరోసారి వరల్డ్‌ నంబర్‌ 1 బౌలర్‌గా.. ఏకంగా..

Published Wed, Sep 20 2023 1:59 PM | Last Updated on Wed, Sep 20 2023 5:42 PM

ICC Rankings Siraj Becomes World No 1 Bowler After Asia Cup Final Heroics - Sakshi

ICC Men's ODI Bowling Rankings: టీమిండియా స్టార్‌ పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌ ఐసీసీ తాజా వన్డే ర్యాంకింగ్స్‌లో అదరగొట్టాడు. మరోసారి ప్రపంచ నెంబర్‌ 1 బౌలర్‌గా అవతరించాడు. ఆసియా కప్‌-2023 ఫైనల్లో అద్భుత ప్రదర్శనతో సంచలన రికార్డులు నమోదు చేయడంతో పాటు బౌలింగ్‌ ర్యాంకింగ్స్‌లో ఏకంగా 8 స్థానాలు ఎగబాకాడు.

తద్వారా మరోసారి అగ్రపీఠం కైవసం చేసుకున్నాడు.  ఆస్ట్రేలియా బౌలర్‌ జోష్‌ హాజిల్‌వుడ్‌ని వెనక్కినెట్టి 694 రేటింగ్‌ పాయింట్లతో టాప్‌-1లోకి దూసుకువచ్చాడు. కాగా శ్రీలంకతో ఆసియా వన్డే కప్‌ ఫైనల్లో సిరాజ్‌ ఆకాశమే హద్దుగా చెలరేగిన విషయం తెలిసిందే. ఒకే ఓవర్లో నాలుగు వికెట్లు తీసిన ఈ హైదరాబాదీ స్టార్‌.. మరో రెండు వికెట్లు కూడా పడగొట్టాడు.

సిరాజ్‌ దెబ్బకు శ్రీలంక కకావికలం
సిరాజ్‌ దెబ్బకు లంక బ్యాటింగ్‌ ఆర్డర్‌ కుదేలైంది. లంకను 50 పరుగులకే ఆలౌట్‌ చేయడంలో కీలక పాత్ర పోషించిన మియా.. ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు అందుకున్నాడు. కొలంబో మ్యాచ్‌లో మొత్తంగా ఏడు ఓవర్లు బౌలింగ్‌ చేసిన ఈ ఫాస్ట్‌బౌలర్‌.. 21 పరుగులు మాత్రమే ఇచ్చి ఆరు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు.

10 ఓవర్ల కోటా పూర్తి చేసేందుకు సిద్ధం అవుతుండగా.. టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ అతడిని వారించాడు. ఫిట్‌నెస్‌ కూడా ముఖ్యమంటూ ట్రైనర్‌ సూచనలు ఇవ్వడంతో.. అలా సిరాజ్‌ పేస్‌ అటాక్‌కు తెరపడింది. లేదంటే.. మరిన్ని వికెట్లు కూల్చేవాడేమో!

మొత్తం ఎన్ని వికెట్లంటే?
ప్రస్తుతం సిరాజ్‌ వన్డే వరల్డ్‌కప్‌-2023కి సిద్ధమయ్యే పనిలో ఉన్నాడు. అంతకంటే ముందు ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌లో భాగం కానున్నాడు. కాగా ఈ ఏడాది ఆరంభంలో సిరాజ్‌ మొట్టమొదటి సారి వరల్డ్‌ నంబర్‌ 1 ర్యాంకు దక్కించుకున్న విషయం తెలిసిందే.  ఇదిలా ఉంటే.. ఆసియా టోర్నీ తాజా ఎడిషన్‌లో సిరాజ్‌ 12.2 సగటుతో మొత్తంగా 10 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు.

ఐసీసీ తాజా వన్డే బౌలింగ్‌ ర్యాంకింగ్స్‌ టాప్‌-5లో ఉన్నది వీళ్లే
1. మహ్మద్‌ సిరాజ్‌- ఇండియా- 694 పాయింట్లు
2. జోష్‌ హాజిల్‌వుడ్‌- ఆస్ట్రేలియా- 678 పాయింట్లు
3. ట్రెంట్‌ బౌల్ట్‌- న్యూజిలాండ్‌- 677 పాయింట్లు
4. ముజీబ్‌ ఉర్‌ రెహమాన్‌- అఫ్గనిస్తాన్‌- 657 పాయింట్లు
5. రషీద్‌ ఖాన్‌- అఫ్గనిస్తాన్‌- 655 పాయింట్లు.

చదవండి: ఆసియా కప్ ఫైనల్‌లో ఘోర ఓటమి.. శ్రీలంక కెప్టెన్‌పై వేటు! కొత్త కెప్టెన్‌ ఎవరంటే?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement