India vs Sri lanka
-
45 ఏళ్లలో ఇదే తొలిసారి.. టీమిండియా ఒక్కటీ గెలవలేదు!
గతేడాది టీమిండియాకు మధుర జ్ఞాపకాలతో పాటు చేదు అనుభవాల్నీ మిగిల్చింది. పొట్టి ఫార్మాట్లో తిరుగులేని శక్తిగా ఎదిగిన భారత జట్టు.. దాదాపు పదిహేడేళ్ల తర్వాత మరోసారి టీ20 ప్రపంచకప్(T20 World Cup 2024) గెలిచింది. మహేంద్ర సింగ్ ధోని సారథ్యంలో 2007లో తొట్టతొలి పొట్టి కప్ గెలుచుకున్న భారత్.. మళ్లీ 2024లో రోహిత్ కెప్టెన్సీలో ట్రోఫీని ముద్దాడింది.చాంపియన్లుగా వీడ్కోలుఅయితే, ఈ మెగా టోర్నీలో టీమిండియా టైటిల్ విజేతగా నిలిచిన తర్వాత దిగ్గజ బ్యాటర్లు రోహిత్ శర్మ(Rohit Sharma), విరాట్ కోహ్లి(Virat Kohli)లతో పాటు ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా కూడా అంతర్జాతీయ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించాడు. దీంతో ఇకపై వీరు కేవలం ఫ్రాంఛైజీ క్రికెట్లో మాత్రమే టీ20 ప్రేమికులను అలరించనున్నారు.ఇక.. ఐసీసీ టోర్నమెంట్ తర్వాత శుబ్‌మన్ గిల్ సారథ్యంలో జింబాబ్వేను టీ20 సిరీస్‌లో చిత్తు చేసింది టీమిండియా. ఇక భార టీ20 జట్టు కెప్టెన్‌గా రోహిత్ శర్మ నిష్క్రమించిన తర్వాత సూర్యకుమార్ యాదవ్ అతడి స్థానాన్ని అధికారికంగా భర్తీ చేశాడు. సూర్య సారథ్యంలో తొలిసారి శ్రీలంక పర్యటనకు వెళ్లిన భారత జట్టు 3-0తో ఆతిథ్య జట్టును క్లీన్‌స్వీప్ చేసింది. అనంతరం స్వదేశంలో బంగ్లాదేశ్‌తో సిరీస్‌లోనూ దుమ్ములేపింది.సౌతాఫ్రికా గడ్డపై సత్తా చాటిన సూర్య సేనఆ తర్వాత సౌతాఫ్రికా గడ్డపై కూడా సూర్య సేన టీ20 సిరీస్‌ను కైవసం చేసుకుంది. పొట్టి ఫార్మాట్ సంగతి ఇలా ఉంటే.. టెస్టుల్లో ఆరంభంలో అదరగొట్టిన రోహిత్ సేన.. ఆ తర్వాత మాత్రం పూర్తిగా నిరాశపరిచింది. సొంతగడ్డపై ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో 4-1తో గెలిచిన భారత్.. బంగ్లాదేశ్‌ను 2-0తో క్లీన్‌స్వీప్ చేసింది.మర్చిపోలేని వైట్‌వాష్ పరాభవంఅయితే, స్వదేశంలో న్యూజిలాండ్‌తో టెస్టుల్లో మాత్రం ఘోర పరాభవం ఎదుర్కొంది. పర్యాటక జట్టు చేతిలో 3-0తో వైట్‌వాష్‌కు గురై చరిత్రలోనే తొలిసారిగా సొంతగడ్డపై మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో ప్రత్యర్థి చేతిలో క్లీన్‌స్వీప్ అయిన జట్టుగా రోహిత్ సేన చెత్త రికార్డు మూటగట్టుకుంది.ఆసీస్‌తో సిరీస్లోనూఇక ఆస్ట్రేలియా పర్యటనలోనూ ఈ వైఫల్యాలను కొనసాగిస్తోంది. బోర్డర్- గావస్కర్ ట్రోఫీ సిరీస్‌లో భాగంగా ఆసీస్‌తో ఐదు టెస్టులు ఆడేందుకు అక్కడికి వెళ్లిన భారత్.. తొలి టెస్టులో గెలుపొందినా.. ఆ తర్వాత అదే ఫలితాన్ని పునావృతం చేయలేకపోయింది.అడిలైడ్‌లో ఓడి.. బ్రిస్బేన్ టెస్టును డ్రా చేసుకున్న టీమిండియా.. మెల్బోర్న్లో జరిగిన నాలుగో టెస్టులో మాత్రం ఘోర ఓటమిని చవిచూసింది. అలా చేదు అనుభవంతో గతేడాదిని ముగించింది.ఒక్క వన్డే కూడా గెలవలేదుఇదిలా ఉంటే.. 2024లో భారత జట్టుకు ఎదురైన మరో ఘోర అవమానం ఏమిటంటే.. గతేడాది టీమిండియా ఒక్కటంటే ఒక్క వన్డే కూడా గెలవలేదు.శ్రీలంక పర్యటనలో భాగంగా మూడు వన్డేల సిరీస్‌లో ఓ మ్యాచ్‌ను టై చేసుకున్న రోహిత్ సేన.. మిగిలిన రెండు మ్యాచ్‌లలో ఓడిపోయింది. తద్వారా దాదాపు రెండు దశాబ్దాల అనంతరం లంకతో వన్డే ద్వైపాక్షిక సిరీస్‌లో ఓటమిని చవిచూసింది. ఇలా ఓ ఏడాదిలో వన్డేల్లో భారత్ ఒక్కటి కూడా గెలవకపోవడం 45 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి. 1979లోనే టీమిండియా ఇలాంటి అనుభవమే ఎదుర్కొంది. అదీ విషయం!! వచ్చే ఏడాది మరింత బిజీఇక ఆసీస్‌తో సిడ్నీ టెస్టుతో 2025ను మొదలుపెట్టనున్న టీమిండియా.. తదుపరి స్వదేశంలో ఇంగ్లండ్‌తో పరిమిత ఓవర్ల సిరీస్ ఆడనుంది. ఇందులో ఐదు టీ20లతో పాటు మూడే వన్డేలకు షెడ్యూల్ ఖరారైంది. ఇక ఆ తర్వాత ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో పాల్గొననున్న భారత జట్టు.. అనంతరం ఇంగ్లండ్ పర్యటనకు వెళ్తుంది. అక్కడ నాలుగు టెస్టులు ఆడుతుంది. తదుపరి బంగ్లాదేశ్, ఆస్ట్రేలియా, వెస్టిండీస్, సౌతాఫ్రికా జట్లతోనూ సిరీస్‌లు ఆడాల్సి ఉంది.చదవండి: సిగ్గుపడాలి!.. టీమిండియాకు ఇలాంటి ఆటగాడు అవసరమా?: ఇర్ఫాన్ పఠాన్ -
U19 Asia Cup 2024: ఫైనల్‌కు దూసుకెళ్లిన భారత్
ఆసియా కప్ అండర్–19 మహిళల టీ20 క్రికెట్ టోర్నీలో భారత జట్టు అదరగొడుతోంది. సూపర్-4 మ్యాచ్‌లో శ్రీలంకపై నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది. తాజా గెలుపుతో ఫైనల్ బెర్తును ఖరారు చేసుకుంది. కౌలలంపూర్ వేదికగా జరుగుతున్న ఈ టోర్నీలో భారత్- శ్రీలంక మధ్య బేయ్మాస్ క్రికెట ఓవల్ మైదానంలో శుక్రవారం మ్యాచ్ జరిగింది.ఆకాశమే హద్దుగా ఆయుషిఇందులో టాస్ గెలిచిన యువ భారత్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంకకు భారత బౌలర్లు చుక్కలు చూపించారు. లెఫ్టార్మ్ స్పిన్నర్ ఆయుషి శుక్లా ఆకాశమే హద్దుగా చెలరేగి.. లంక బ్యాటింగ్ ఆర్డర్ పతనాన్ని శాసించింది. కేవలం పది పరుగులే ఇచ్చిన ఆయుశి నాలుగు వికెట్లు కూల్చింది.మరోవైపు పరుణికా రెండు, షబ్నమ్ షకీల్, ద్రితి కేసరి ఒక్కో వికెట్ దక్కించుకున్నారు. ఈ క్రమంలో నిర్ణీత ఇరవై ఓవర్లలో తొమ్మిది వికెట్లు నష్టపోయిన శ్రీలంక కేవలం 98 పరుగులే చేసింది. లంక ఇన్నింగ్స్‌లో మనుడి ననయక్కర 33 పరుగులతో టాప్ రన్‌స్కోరర్‌గా నిలిచింది.రాణించిన త్రిష, కమలినిఇక లక్ష్య ఛేదనలో భారత్ ఆరంభంలో తడబడినా.. గొంగడి త్రిష, కమలిని రాణించడంతో విజయం సాధించింది. నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేసిన తెలుగమ్మాయి త్రిష 32 రన్స్‌తో రాణించగా.. తమిళనాడు స్టార్ జి.కమలిని 28 పరుగులతో ఆకట్టుకుంది. వీరిద్దరు కలిసి మూడో వికెట్‌కు 63 పరుగులు జోడించారు. మిగతా వాళ్లలో మిథిల 17 పరుగులతో ఆఖరి వరకు అజేయంగా నిలిచి.. భవిక(7)తో కలిసి జట్టును విజయతీరాలకు చేర్చింది. ఈశ్వరి డకౌట్ కాగా.. సానికా చాల్కె(4) పూర్తిగా విఫలమైంది. ఈ క్రమంలో 14.5 ఓవర్లలో ఆరు వికెట్లు నష్టపోయి భారత్ 99 పరుగులు సాధించింది. తద్వారా లంకపై జయభేరి మోగించి ఫైనల్‌కు దూసుకెళ్లింది. భారత్ విజయంలో కీలక పాత్ర పోషించిన ఆయుషికి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. తుదిజట్లుభారత్జి. కమిలిని, త్రిష, సానిక, నికీ ప్రసాద్ (కెప్టెన్), ఈశ్వరి, మిథిల, ఆయుషి, భవిక (వికెట్ కీపర్), షబ్నం, పారుణిక, ద్రితి .శ్రీలంకమనుడి, రష్మిక, లిమాన్సా, సుముడు, హిరుణి, ప్రముది, సంజన, దహామి, చముది, అసేని, షష్ని.చదవండి: భారత్‌తో టెస్టులకు ఆసీస్ జట్టు ప్రకటన.. అతడిపై వేటు.. ‘జూనియర్’ పాంటింగ్‌కు చోటు -
చరిత్ర సృష్టించిన వైభవ్ సూర్యవంశీ
భారత్ అండర్-19 ఆటగాడు వైభవ్ సూర్యవంశీ సరికొత్త చరిత్ర సృష్టించాడు. అండర్-19 ఆసియా కప్‌లో భాగంగా శ్రీలంకతో జరిగిన రెండో సెమీఫైనల్లో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచిన సూర్యవంశీ.. భారత్ అండర్-19 జట్టు తరఫున ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు గెలుచుకున్న అతి పిన్న వయస్కుడిగా రికార్డు నెలకొల్పాడు. భారత్ తరఫున అతి చిన్న వయసులో అండర్-19 గేమ్ ఆడిన వైభవ్.. 13 సంవత్సరాల, 254 రోజుల వయసులో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు గెలుచుకున్నాడు. శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో మెరుపు ఇన్నింగ్స్ (36 బంతుల్లో 67; 6 ఫోర్లు, 5 సిక్సర్లు) ఆడి భారత జట్టు విజయంలో ప్రధాన పాత్ర పోషించినందుకు గాను వైభవ్‌ను ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు వరించింది. ఈ మ్యాచ్‌లో భారత్.. శ్రీలంకపై 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి ఫైనల్‌కు చేరింది. తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 46.2 ఓవర్లలో 173 పరుగులకు ఆలౌట్ కాగా.. వైభవ్ రెచ్చిపోవడంతో భారత్ 21.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది.మరోవైపు ఇవాళే (డిసెంబర్ 6) జరిగిన తొలి సెమీఫైనల్లో బంగ్లాదేశ్ పాకిస్తాన్‌పై 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తద్వారా ఫైనల్లోకి ప్రవేశించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ 37 ఓవర్లలో 116 పరుగులకు ఆలౌట్ కాగా.. బంగ్లాదేశ్ 22.1 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. డిసెంబర్ 8న జరిగే ఫైనల్లో బంగ్లాదేశ్ భారత్‌ను ఢీకొంటుంది.వరుసగా రెండు హాఫ్ సెంచరీలు..అండర్-19 ఆసియా కప్‌లో వైభవ్ వరసగా రెండు హాఫ్ సెంచరీలు చేశాడు. ఈ టోర్నీలో తొలి రెండు మ్యాచ్‌ల్లో విఫలమైన వైభవ్.. యూఏఈతో జరిగిన మ్యాచ్‌లో మెరుపు అర్ద శతకం (43 బంతుల్లో 76 నాటౌట్; 3 ఫోర్లు, 6 సిక్సర్లు).. తాజాగా మరో ఆర్ద శతకం సాధించాడు. ఇటీవల ముగిసిన ఐపీఎల్ మెగా వేలంలో వైభవ్‌ను రాజస్థాన్ రాయల్స్ రూ. 1.1 కోట్లకు సొంతం చేసుకుంది. మెగా వేలం తర్వాతే వైభవ్ ఎక్కువ వార్తల్లో ఉంటున్నాడు. ఐపీఎల్ వేలంలో పాల్గొన్న అతి పిన్న వయస్కుడిగా కూడా వైభవ్ రికార్డు నెలకొల్పాడు. -
విధ్వంసం సృష్టించిన వైభవ్ సూర్యవంశీ.. ఫైనల్లో భారత్
అండర్-19 ఆసియా కప్ 2024లో భారత్ ఫైనల్‌కు చేరింది. ఇవాళ (డిసెంబర్ 6) జరిగిన రెండో సెమీఫైనల్లో భారత్ 7 వికెట్ల తేడాతో శ్రీలంకపై ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక.. భారత బౌలర్లు చేతన్ శర్మ (3/34), కిరణ్ చోర్మలే (2/32), ఆయుశ్ మాత్రే (2/37), యుధజిత్ గుహా (1/19), హార్దిక్ రాజ్ (1/30) ధాటికి 46.2 ఓవర్లలో 173 పరుగులకు ఆలౌటైంది. శ్రీలంక ఇన్నింగ్స్‌లో లక్విన్ అభయ్సింఘే (69) టాప్ స్కోరర్‌గా నిలువగా.. షరుజన్ షణ్ముగనాథన్ (42), విహాస్ తేవ్మిక (14), కవిజ గమగే (10) రెండంకెల స్కోర్లు చేశారు.174 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన యంగ్ ఇండియా.. వైభవ్ సూర్యవంశీ (36 బంతుల్లో 67; 6 ఫోర్లు, 5 సిక్సర్లు) విధ్వంసం సృష్టించడంతో 21.4 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయతీరాలకు చేరింది. భారత ఇన్నింగ్స్‌లో ఆయుశ్ మాత్రే (34), ఆండ్రీ సిద్దార్థ్ (22), కెప్టెన్ మొహమ్మద్ అమాన్ (25 నాటౌట్), కేపీ కార్తికేయ (11) కూడా ఓ మోస్తరు స్కోర్లు చేశారు. లంక బౌలర్లలో విహాస్ తేవ్మిక, విరన్ చముదిత, ప్రవీణ్ మనీషా తలో వికెట్ పడగొట్టారు. కాగా, ఇటీవల జరిగిన ఐపీఎల్ 2025 మెగా వేలంలో వైభవ్ సూర్యవంశీని రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీ 1.1 కోట్లకు కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ఐపీఎల్ వేలంలో పాల్గొన్న అత్యంత పిన్న వయస్కుడిగా సూర్యవంశీ రికార్డు నెలకొల్పాడు. ప్రస్తుతం సూర్యవంశీ వయసు 13 ఏళ్లు. పాకిస్తాన్‌ను చిత్తు చేసిన బంగ్లాదేశ్ఇవాళే జరిగిన తొలి సెమీఫైనల్లో బంగ్లాదేశ్ పాకిస్తాన్‌పై 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తద్వారా ఫైనల్లోకి ప్రవేశించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ 37 ఓవర్లలో 116 పరుగులకు ఆలౌట్ కాగా.. బంగ్లాదేశ్ 22.1 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. డిసెంబర్ 8న జరిగే ఫైనల్లో బంగ్లాదేశ్ భారత్‌ను ఢీకొంటుంది. -
SL vs NZ: మెండిస్ సూపర్ ఇన్నింగ్స్.. కివీస్‌పై శ్రీలంక విజయం
పల్లెకలె వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన రెండో వన్డేలో శ్రీలంక 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో మూడు వన్డేల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలుండగానే 2–0తో ఆతిథ్య శ్రీలంక సొంతం చేసుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన కివీస్ 45.1 ఓవర్లలో 209 పరుగులకే ఆలౌటైంది.మార్క్ చాప్మన్ (81 బంతుల్లో 76; 7 ఫోర్లు, 3 సిక్స్‌లు), మిచెల్ హే (62 బంతుల్లో 49; 4 ఫోర్లు) రాణించారు. శ్రీలంక బౌలర్లలో వాండర్సే, తీక్షణ చెరో 3 వికెట్లు తీయగా, అసిత ఫెర్నాండో 2 వికెట్లు పడగొట్టాడు. అనంతరం 210 పరుగుల సులువైన లక్ష్యాన్ని చేధించేందుకు లంకేయులు తీవ్రంగా శ్రమించారు. చివరకు 46 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 210 పరుగులు చేసి గెలిచింది.‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ కుశాల్ మెండీస్ (102 బంతుల్లో 74 నాటౌట్; 6 ఫోర్లు) అర్ధ సెంచరీ చేయగా... మిగతావారిలో ఓపెనర్ నిసాంక (28; 4 ఫోర్లు), అవిష్క ఫెర్నాండో (5), కమిండు (0), కెపె్టన్ అసలంక (13), సమరవిక్రమ (8) విఫలమవడంతో లంక 163 పరుగులకే 7 వికెట్లు కోల్పోయింది.83 బంతుల్లో 47 పరుగులు చేయాల్సివుండగా... కుశాల్, మహీశ్ తీక్షణ (44 బంతుల్లో 27 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్) అబేధ్యమైన ఎనిమిదో వికెట్‌కు అవసరమైన 47 పరుగులు జోడించి జట్టును గెలిపించారు. బ్రాస్‌వెల్ 4, సాంట్నర్, ఫిలిప్స్, స్మిత్ తలా ఒక వికెట్ తీశారు. మంగళవారం ఇదే వేదికపై ఆఖరి వన్డే జరుగనుంది. కాగా 2012 తర్వాత కివీస్‌పై శ్రీలంక వన్డే సిరీస్‌ను సొంతం చేసుకోవడం ఇదే తొలిసారి.చదవండి: రోహిత్ వచ్చినా అతడినే కెప్టెన్‌గా కొనసాగించండి: హర్భజన్ -
T20 World Cup 2024: రాణించిన మంధన, హర్మన్.. శ్రీలంక టార్గెట్ 173
మహిళల టీ20 వరల్డ్‌కప్-2024లో భాగంగా శ్రీలంకతో ఇవాళ (అక్టోబర్ 9) జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా భారీ స్కోర్ చేసింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్ నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. స్మృతి మంధన (50), హర్మన్‌ప్రీత్ (52 నాటౌట్) అర్ద సెంచరీలతో రాణించగా.. షఫాలీ వర్మ 43 పరుగులు చేసింది. భారత ఇన్నింగ్స్‌లో జెమీమా 16, రిచా ఘోష్ 6 (నాటౌట్) పరుగులు చేశారు. శ్రీలంక బౌలర్లలో చమారీ ఆటపట్టు, కాంచన తలో వికెట్ పడగొట్టగా.. మంధన రనౌటైంది. సెమీస్ రేస్‌లో ముందుండాలంటే టీమిండియా ఈ మ్యాచ్‌లో మెరుగైన రన్‌రేట్‌తో గెలవాల్సి ఉంది. -
T20 WC 2024: శ్రీలంకతో మ్యాచ్.. భారత జట్టుకు గుడ్ న్యూస్
మహిళల టీ20 ప్రపంచకప్-2024లో భారత జట్టు కీలక పోరుకు సిద్దమైంది. బుధవారం దుబాయ్ వేదికగా శ్రీలంక మహిళల జట్టుతో టీమిండియా తలపడనుంది. తమ సెమీస్ అవకాశాలను మెరుగుపరుచుకోవాలంటే ఈ మ్యాచ్‌లో భారత్ కచ్చితంగా విజయం సాధించాలి. భారీ విజయం సాధిస్తే పాయింట్ల పట్టికలో భారత్ రెండో స్ధానానికి చేరుకునే అవకాశం ఉంది.అయితే ఈ మ్యాచ్‌కు ముందు టీమిండియాకు గుడ్ న్యూస్ అందింది. ఈ కీలక పోరుకు కెప్టెన్ హర్మాన్ ప్రీత్ కౌర్ అందుబాటులో ఉండనుంది. ఆదివారం పాకిస్తాన్ జరిగిన మ్యాచ్‌లో కౌర్ గాయపడింది. మ్యాచ్ ముగుస్తుందన్న సమయంలో హర్మాన్ మెడకు గాయమైంది. దీంతో ఆమె 29 పరుగులు చేసి రిటైర్డ్ హార్ట్‌గా వెనుదిరిగింది.ఆ తర్వాత పోస్ట్ మ్యాచ్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో కూడా భారత సారథి పాల్గోనలేదు. దీంతో హర్మాన్ శ్రీలంకతో మ్యాచ్‌కు దూరం కానున్నట్లు వార్తలు వినిపించాయి. అయితే తాజాగా ఆమె అందుబాటుపై భారత వైస్ కెప్టెన్ స్మృతి మంధాన క్లారిటీ ఇచ్చింది. హర్మాన్ గాయం అంత తీవ్రమైనది కాదని, ఆమె శ్రీలంకతో జరగనున్న మ్యాచ్‌కు అందుబాటులో ఉండనున్నట్లు మంధాన తెలిపింది.మరోవైపు స్టార్ ఆల్‌రౌండర్ పూజా వస్త్రాకర్ మాత్రం ఇంకా గాయం నుంచి కోలుకోలేదని, లంకతో మ్యాచ్‌కూ దూరమయ్యే అవకాశముందని స్మృతి ప్రీ మ్యాచ్ కాన్ఫరెన్స్‌లో పేర్కొంది. పాక్‌పై ఆడిన భారత జట్టునే లంకతో మ్యాచ్‌కూ కొనసాగించే ఛాన్స్ ఉంది. కాగా పాయింట్ల పట్టికలో టీమిండియా ప్రస్తుతం మూడో స్ధానంలో ఉంది. భారత్ కంటే ముందు న్యూజిలాండ్, పాకిస్తాన్, ఆస్ట్రేలియా జట్లు ఉన్నాయి. -
T20 World Cup 2024: లంకతో 'కీ' ఫైట్.. టీమిండియాలో కలవరం..!
మహిళల టీ20 వరల్డ్‌కప్ హోరాహోరీగా సాగుతోంది. గ్రూప్ ఆఫ్ డెత్‌గా పరిగణించబడుతున్న గ్రూప్-ఏలో మ్యాచ్‌లు మరింత రసవత్తరంగా సాగుతున్నాయి. ఈ గ్రూప్‌లో ఇప్పటివరకు జరిగిన మ్యాచ్‌ల్లో ఎలాంటి సంచలనాలు నమోదు కానప్పటికీ.. ఏ జట్టు సెమీస్ బెర్త్ ఖరారు చేసుకుంటుందో ఇప్పుడో చెప్పలేని పరిస్థితి ఉంది. గ్రూప్-ఏలో భారత్, పాక్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, శ్రీలంక లాంటి హేమాహేమీ జట్లు ఉన్నాయి. భారత్ ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్‌ల్లో ఒక దాంట్లో ఓడి (న్యూజిలాండ్), ఓ మ్యాచ్‌లో (పాక్‌పై) గెలిచింది. ప్రస్తుతం భారత్ పాయింట్ల పట్టికలో చివరి నుంచి రెండో స్థానంలో ఉంది. ఈ గ్రూప్‌లో న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, పాక్, భారత్, శ్రీలంక వరుస స్థానాల్లో ఉన్నాయి.గ్రూప్-బి విషయానికొస్తే.. ఈ గ్రూప్‌లో ఇంగ్లండ్, వెస్టిండీస్, సౌతాఫ్రికా, బంగ్లాదేశ్, స్కాట్లాండ్ జట్లు ఉన్నాయి. ఈ గ్రూప్‌లో ప్రస్తుతం ఇంగ్లండ్ టాప్‌లో ఉంది. వెస్టిండీస్, సౌతాఫ్రికా, బంగ్లాదేశ్, స్కాట్లాండ్ ఆతర్వాతి స్థానాల్లో ఉన్నాయి.లంకతో కీలక సమరం.. టీమిండియాలో కలవరంగ్రూప్-ఏలో భాగంగా రేపు (అక్టోబర్ 9) మరో కీలక సమరం జరుగనుంది. దుబాయ్ వేదికగా భారత్, శ్రీలంక జట్లు పోటీపడనున్నాయి. లంకతో పోలిస్తే భారత్‌కు ఈ మ్యాచ్‌కు చాలా కీలకం. సెమీస్ రేసులో ముందుండాలంటే భారత్ ఈ మ్యాచ్‌లో తప్పనిసరిగా గెలవాలి. అయితే ఈ కీ ఫైట్‌కు ముందు టీమిండియాను ఓ అంశం తెగ కలవరపెడుతోంది.అక్టోబర్ 6న పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ హర్మన్ ప్రీత్ సింగ్ గాయపడింది. లంకతో మ్యాచ్‌కు ఆమె అందుబాటులో ఉండటంపై సందిగ్దత నెలకొంది. పరిస్థితుల దృష్ట్యా హర్మన్ సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదు. కీలక మ్యాచ్ కావడంతో ఆమె బరిలోకి దిగే ఛాన్స్‌లు కూడా లేకపోలేదు. ఏది ఏమైనా హర్మన్ అంశం టీమిండియాను కలవరపెడుతోంది. చదవండి: T10 League: ఊతప్ప ఊచకోత.. కేవలం 27 బంతుల్లోనే! -
శ్రీలంక క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం
శ్రీలంక క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. మాజీ కెప్టెన్ సనత్ జయసూర్యను పూర్తి స్థాయి హెడ్‌కోచ్‌గా నియమించింది. ఇందుకు సంబంధించి సోమవారం అధికారిక ప్రకటన విడుదల చేసింది. టీ20 ప్రపంచకప్-2026 వరకు అతడిని కోచ్‌గా కొనసాగించనున్నట్లు వెల్లడించింది.కాగా వన్డే వరల్డ్‌కప్-2023, టీ20 ప్రపంచకప్-2024లో చెత్త ప్రదర్శనతో శ్రీలంక జట్టు విమర్శలు మూటగట్టుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పొట్టి వరల్డ్‌కప్ తర్వాత క్రిస్ సిల్వర్‌వుడ్ తన హెడ్‌కోచ్ పదవికి రాజీనామా చేశాడు. ఈ క్రమంలో అతడి స్థానంలో దిగ్గజ బ్యాటర్ సనత్ జయసూర్యను లంక బోర్డు తాత్కాలిక కోచ్‌గా నియమించింది.ఆదిలోనే చేదు అనుభవంటీమిండియాతో సొంతగడ్డపై టీ20 సిరీస్ సందర్భంగా బాధ్యతలు స్వీకరించిన జయసూర్యకు ఆదిలోనే చేదు అనుభవం ఎదురైంది. సూర్యకుమార్ సేన చేతిలో లంక 3-0తో క్లీన్‌స్వీప్‌నకు గురైంది. అయితే, ఈ పరాభవాన్ని మర్చిపోయేలా వన్డే సిరీస్‌లో శ్రీలంక చారిత్రాత్మక విజయం సాధించింది.ఆ తర్వాత వరుస విజయాలుదాదాపు ఇరవై ఏడేళ్ల విరామం తర్వాత భారత జట్టుపై వన్డేల్లో ద్వైపాక్షిక సిరీస్ గెలిచింది. జయసూర్య మార్గదర్శనంలో ఈ అద్వితీయ విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత వరుస విజయాలతో శ్రీలంక జట్టు ముందుకు దూసుకుపోతోంది. ఇంగ్లండ్ పర్యటనలో భాగంగా పదేళ్ల తర్వాత అక్కడ టెస్టు మ్యాచ్ గెలిచిన లంక.. స్వదేశంలో న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌ను 2-0తో వైట్‌వాష్ చేసింది.ఈ జైత్రయాత్రకు ప్రధాన కారణం జయసూర్య గైడెన్స్ అనడంలో సందేహం లేదు. ఈ నేపథ్యంలోనే లంక బోర్డు అతడిని పూర్తి స్థాయి హెడ్‌కోచ్‌గా నియమించింది. ‘‘తాత్కాలిక హెడ్ కోచ్‌గా ఉన్న జయసూర్య మార్గదర్శనంలో.. ఇటీవలి కాలంలో టీమిండియా, ఇంగ్లండ్, న్యూజిలాండ్ జట్లపై శ్రీలంక అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంది.టీ20 వరల్డ్‌కప్ వరకూ అతడే!ఈ విజయాలను పరిగణనలోకి తీసుకుని శ్రీలంక క్రికెట్ ఎగ్జిక్యూటివ్ కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. జయసూర్యను హెడ్‌కోచ్‌గా కొనసాగించాలని నిర్ణయించింది. అక్టోబరు 1, 2024 నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వస్తుంది. మార్చి 31, 2026 వరకు అతడు ఈ పదవిలో కొనసాగుతాడు’’ అని లంక బోర్డు తన ప్రకటనలో తెలిపింది. కాగా జయసూర్య గతంలో చీఫ్ సెలక్టర్‌గానూ పనిచేశాడు. ఇక ఫుల్‌టైమ్ హెడ్‌కోచ్‌గా వెస్టిండీస్‌తో డంబుల్లా వేదికగా మొదలయ్యే పరిమిత ఓవర్ల సిరీస్‌తో అతడి ప్రయాణం మొదలుకానుంది.చదవండి: ఇది టీమిండియా కాదు.. ఐపీఎల్ హీరోల జట్టు: పాక్ మాజీ క్రికెటర్ -
రోహిత్ చెప్పినట్టు మేము వినాల్సిందే.. లేదంటే: షమీ
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మైదానంలో సహచర ఆటగాళ్లతో ఎంత సరదాగా ఉంటాడో.. పరిస్థితిని బట్టి అంతే సీరియస్ అవుతాడు కూడా!.. ఒక్కోసారి సహనం కోల్పోయి భావోద్వేగాలను నియంత్రించుకోలేక ట్రోల్స్‌కు గురైన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే, ఆటలో భాగంగానే రోహిత్ ఇలా చేస్తాడని.. కెప్టెన్‌గా అతడు రచించిన వ్యూహాలు అమలు చేయడంలో తాము విఫలమైతే మాత్రం ఆగ్రహానికి గురికాకతప్పదంటున్నాడు టీమిండియా సీనియర్ బౌలర్ మహ్మద్ షమీ.ఇటీవల జరిగిన అవార్డుల ప్రదానోత్సవంలో రోహిత్ శర్మకు మెన్స్ ఇంటర్నేషనల్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ 2023-24 పురస్కారం లభించింది. ఈ వేడుకలో రోహిత్‌తో పాటు పేసర్ షమీ, మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ తదితర టీమిండియా క్రికెటర్లు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కెప్టెన్‌గా మైదానంలో రోహిత్ శర్మ ఎలా ఉంటాడన్న ప్రశ్న ఎదురుకాగా షమీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.అప్పుడు అతడి రియాక్షన్ చూశామంటే‘‘జట్టులోని ప్రతి ఒక్క ఆటగాడికి రోహిత్ స్వేచ్ఛనిస్తాడు. తనలోని ఉత్తమ గుణం అది. అయితే, ఎప్పుడైతే మేము అతడి అంచనాలు అందుకోలేకపోతామో.. అప్పుడు అతడు భావోద్వేగాలను ప్రదర్శించడం మొదలుపెడతాడు. నువ్విలా చేయాలి లేదంటే చేసి ఉండాల్సిందని ఆటగాళ్లకు చెబుతాడు.అయినప్పటికీ మన ఆట తీరులో మార్పు లేదంటే.. ఇక అతడి రియాక్షన్స్ స్క్రీన్ మీద చూడాల్సిన పరిస్థితి వస్తుంది. అంటే.. తను కోపంగా ఉన్నాడని మాకు అర్థమైపోతుంది. ఇక ఆపై తను ఒక్క మాట చెప్పకుండానే మాకు ఏం చేయాలో తెలిసిపోతుంది’’ అని షమీ చెప్పుకొచ్చాడు.అవును.. నా పని నేను చేస్తా!ఇక ఇందుకు బదులిస్తూ.. ‘‘మైదానంలో ఎవరి పనులు వారు సరిగ్గా చేయాలని వాళ్లకు చెప్తాను. మరి నేను కూడా నా పని చేయాలి కదా. అందుకే నేను ఫీల్డ్‌లో ఒక్కోసారి అలా ప్రవర్తిస్తా’’ అంటూ రోహిత్ శర్మ కెప్టెన్‌గా తన పనిని తాను చేస్తానంటూ చమత్కరించాడు. ఇక టీ20 ప్రపంచకప్-2024 ట్రోఫీ గెలిచిన అనంతరం సెలవులు తీసుకున్న రోహిత్ శర్మ శ్రీలంక పర్యటన సందర్భంగా మళ్లీ జట్టుతో కలిశాడు. అయితే, అతడి సార థ్యంలోని భారత జట్టు 27 ఏ ళ్ల తర్వాత తొలిసారి న్డే సిరీస్‌ను లంకకు కోల్పోయింది. మరోవైపు.. వన్డే వరల్డ్‌కప్ తర్వాత చీలమండ గాయానికి సర్జరీ చేయించుకున్న షమీ ఇంకా పునరాగమనం చేయలేదు. Shreyas Iyer and Mohammed Shami talking about their captain Rohit Sharma.🥹The Captain, the leader, the legend @ImRo45 🐐 pic.twitter.com/DmXJ7YaegC— 𝐑𝐮𝐬𝐡𝐢𝐢𝐢⁴⁵ (@rushiii_12) August 21, 2024 -
చీటర్.. అలాంటి వాళ్లతో జాగ్రత్త! హార్దిక్ పాండ్యాను ఉద్దేశించేనా?
టీమిండియా స్టార్ క్రికెటర్ హార్దిక్ పాండ్యా ప్రస్తుతం సెలవులో ఉన్నాడు. ఆటకు దూరంగా ప్రకృతికి దగ్గరగా ఉంటూ క్రికెట్ నుంచి దొరికిన విరామ సమయాన్ని పూర్తిగా ఆస్వాదిస్తున్నాడు. సాగరతీరాన.. స్విమ్మింగ్‌పూల్ ఒడ్డున సేద తీరుతూ.. నీలాకాశాన్ని వీక్షిస్తున్న దృశ్యాలను తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఈ క్రమంలో హార్దిక్ పాండ్యా మాజీ భార్య నటాషా స్టాంకోవిక్ ‘చీటర్’ అన్న పోస్టుకు లైక్ కొట్టడం నెట్టింట చర్చకు దారితీసింది.నటాషాపై విమర్శలుకాగా ఐపీఎల్-2024లో ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా పూర్తిగా విఫలమైన పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా.. టీ20 ప్రపంచకప్-2024 ద్వారా ఆటగాడిగా తనను తాను నిరూపించుకున్నాడు. దాదాపు పదకొండేళ్ల తర్వాత టీమిండియా మరోసారి ఐసీసీ ట్రోఫీ గెలవడంలో కీలక పాత్ర పోషించి అభిమానుల నీరాజనాలు అందుకున్నాడు. అయితే, ఈ రెండు సందర్భాల్లోనూ భార్య నటాషా హార్దిక్‌తో లేకపోవడంతో వీరి మధ్య విభేదాలు వచ్చాయన్న వార్తలు రాగా.. కొన్నిరోజులు తర్వాత ఈ అంశంపై స్పష్టత వచ్చింది.తమ దారులు వేరయ్యానని.. తాము విడాకులు తీసుకున్నామని హార్దిక్ పాండ్యా- నటాషా స్టాంకోవిక్ సంయుక్త అధికారిక ప్రకటన విడుదల చేశారు. ఈ నేపథ్యంలో హార్దిక్ అభిమానులు నటాషాను పెద్ద ఎత్తున ట్రోల్ చేశారు. హార్దిక్ పేరు, డబ్బు ఉపయోగించుకునేందుకే అతడి జీవితంలోకి వచ్చిందని.. భరణం రూపంలోనూ పెద్ద మొత్తమే తీసుకుందని ఇష్టారీతిన కామెంట్లు చేశారు.ఇక కుమారుడు అగస్త్యను తీసుకుని పుట్టినిల్లు సెర్బియాకు వెళ్లిన నటాషా.. అతడితో ట్రిప్‌నకు వెళ్లిన ఫొటోలు పంచుకోగా.. హార్దిక్ వాటికి హార్ట్ సింబల్ జోడిస్తూ లైక్ కొట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నటాషాను మర్చిపోలేకపోతున్నాడని.. ఆమె వల్ల హార్దిక్ పాండ్యా చాలా బాధపడుతున్నాడంటూ ద్వేషపూరిత వ్యాఖ్యలు చేశారు. అయితే, ఈ విషయంపై నటాషా పరోక్షంగా స్పందించింది.చీటర్.. ఆ పోస్టులకు నటాషా లైక్‘‘చీటర్.. శారీరకంగా, మానసికంగా హింసించే వాళ్లతో బంధం కొనసాగిస్తే ఇలాగే ఉంటుంది.. కొంతమంది తామే సమస్యను సృష్టించి మళ్లీ వారే బాధితులుగా నటిస్తారు.. అందుకు ఇదే ఉదాహరణ... ఇతరుల ముందు మిమ్మల్ని తప్పుగా చూపించేవాళ్లతో జాగ్రత్తగా ఉండండి’’ అంటూ బంధాల గురించి చర్చిస్తున్న ఇన్‌స్టా వీడియోలకు నటాషా స్టాంకోవిక్ లైక్ కొట్టింది. ఇందుకు స్పందించిన నెటిజన్లలో మెజారిటీ మంది నటాషాకు మద్దతుగా నిలుస్తున్నారు. హార్దిక్ ఫ్యాన్స్ అని చెప్పుకొనే వాళ్లు ఇప్పటికైనా నటాషాను వేధించడం మానాలని హితవు పలుకుతున్నారు.కాగా ప్రపంచకప్-2024 తర్వాత హార్దిక్ పాండ్యా శ్రీలంకతో టీ20 సిరీస్ సందర్భంగా రీఎంట్రీ ఇచ్చాడు. అయితే, వన్డే సిరీస్‌కు మాత్రం అతడు ఎంపికకాలేదు. వ్యక్తిగత కారణాల దృష్ట్యా ఈ సిరీస్‌కు అతడు దూరంగా ఉన్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే.. శ్రీలంక టూర్లో 3-0తో టీ20 సిరీస్ క్లీన్‌స్వీప్ చేసిన టీమిండియా.. వన్డే సిరీస్‌ను 0-2తో ఆతిథ్య శ్రీలంకకు కోల్పోయింది. View this post on Instagram A post shared by Hardik Himanshu Pandya (@hardikpandya93) -
'అదొక విచిత్రమైన పిచ్.. అక్కడ ఆడటం కోహ్లి, రోహిత్కైనా కష్టమే'
శ్రీలంకతో జరిగిన వన్డే సిరీస్‌ను భారత్ 2-0 తేడాతో కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ సిరీస్‌లో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి సైతం దారుణ ప్రదర్శన కనబరిచాడు. మూడు మ్యాచ్‌ల్లో కోహ్లి కేవలం 54 పరుగులు మాత్రమే చేశాడు.ముఖ్యంగా ఈ మూడు మ్యాచ్‌ల్లోనూ స్పిన్నర్‌కే కోహ్లి ఔట్ కావడం గమనార్హం. కోహ్లి ఒక్కడే కాకుండా మిగితా బ్యాటర్లు కూడా లంక స్పిన్ ఉచ్చులో చిక్కుకున్నారు. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు భారత జట్టుపై విమర్శలు వర్షం కురిపిస్తున్నారు.తమ సొంతపిచ్లపై తప్ప స్వింగ్, స్పిన్ కండీషన్స్‌లో ఆడలేరని వ్యంగ్యంగా కామెంట్స్ చేస్తున్నారు. ఈ క్రమంలో భారత జట్టుకు మాజీ వికెట్ కీపర్ బ్యాటర్ దినేష్ కార్తీక్ మద్దతుగా నిలిచాడు. కొలంబోలోని వికెట్ కండీషన్స్ చూసి భారత ఆటగాళ్లంతా ఆశ్చర్యపోయారని కార్తీక్ తెలిపాడు."ఈ సిరీస్‌లో టీమిండియా స్ధాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయింది. దాన్ని నేను కూడా అంగీకరిస్తున్నాను. కానీ బంతి కొంచెం పాతబడ్డాక బాగా టర్న్ అవుతోంది. ముఖ్యంగా 8-30 ఓవర్ల మధ్య స్పిన్నర్లను ఎదుర్కొవడం ఆటగాళ్లకు చాలా కష్టమైన పని. అది విరాట్ కోహ్లి లేదా రోహిత్ శర్మ అయినా కావచ్చు. అందులో కొలంబో పిచ్ ఇంకా కఠినమైన పిచ్. ఈ పిచ్‌పై స్పిన్నర్లకు ఆడటం చాలా కష్టం. ఆటలో గెలుపు ఓటుములు సహజం. ఈ ఒక్కసిరీస్లో ఓడిపోయినంతమాత్రాన డీలా పడాల్సిన పనిలేదన్నారు.అన్ని పిచ్‌లు ఈ విధంగా ఉండవు. నేను ఏదో విరాట్ కోహ్లిని సపోర్ట్ చేసేందుకు ఈ వాఖ్యలు చేయడం లేదు. కొలంబో వికెట్ పరిస్థితులను మాత్రమే తెలియజేశానని" క్రిక్‌బజ్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కార్తీక్ పేర్కొన్నాడు. -
జట్టులో చోటు ఎందుకు లేదు?.. సంజూ రిప్లై అదుర్స్
స్వప్రయోజనాల కన్నా జట్టు ప్రయోజనాలే తనకు ముఖ్యమని టీమిండియా క్రికెటర్ సంజూ శాంసన్ అన్నాడు. తన ఆధీనంలో లేని విషయాల గురించి పట్టించుకోనని.. సానుకూల దృక్పథంతో ముందుకు సాగటం తనకు అలవాటని పేర్కొన్నాడు. కాగా టీ20 ప్రపంచకప్-2024 గెలిచిన భారత జట్టులో సభ్యుడైన సంజూ ప్రస్తుతం స్వరాష్ట్రం కేరళలో ఉన్నాడు.ఈ క్రమంలో కేరళ క్రికెట్ లీగ్ ప్రారంభోత్సవంలో సంజూ శాంసన్ పాల్గొన్నాడు. శనివారం జరిగిన ఈ కార్యక్రమం సందర్భంగా మీడియాతో మాట్లాడుతుండగా.. శ్రీలంక వన్డే సిరీస్ గురించి ప్రశ్న ఎదురైంది. సౌతాఫ్రికాతో వన్డే సిరీస్‌లో చివరిసారిగా టీమిండియాకు ఆడిన సంజూ సెంచరీ చేసిన విషయాన్ని ప్రస్తావిస్తూ.. లంక సిరీస్‌కు ఎంపిక చేయకపోవడానికి గల కారణం ఏమిటని ఓ విలేఖరి ప్రశ్నించారు.సానుకూల దృక్పథంతో ఉంటాఇందుకు బదులిస్తూ.. ‘‘వాళ్లు ఎప్పుడైతే నన్ను సెలక్ట్ చేస్తారో.. అప్పుడు వెళ్లి ఆడటం మాత్రమే నా చేతుల్లో ఉంది. ఏదేమైనా మన జట్టు బాగా ఆడితే అదే చాలు. లక్ష్యం నెరవేరిందా లేదా అన్నదే ముఖ్యం. అంతేకానీ.. నా ఆధీనంలోలేని విషయాల గురించి ఎక్కువగా ఆలోచించను. వీలైనంత వరకు సానుకూల దృక్పథంతో ముందుకు వెళ్లాలనే అనుకుంటాను. నేను ఏం చేయగలనో అది మాత్రమే చేస్తాను’’ అని సంజూ శాంసన్ పేర్కొన్నాడు.కాగా టీ20 ప్రపంచకప్-2024 తర్వాత జింబాబ్వే పర్యటనకు వెళ్లింది టీమిండియా. అక్కడ ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 4-1తో కైవసం చేసుకుంది. అనంతరం.. శ్రీలంక పర్యటనకు వెళ్లింది. ఈ టూర్ ద్వారా టీమిండియా హెడ్‌కోచ్‌గా గౌతం గంభీర్ అరంగేట్రం చేశాడు. అయితే, ఈ పర్యటన సందర్భంగా టీ20 సిరీస్‌కు ఎంపికైన సంజూ శాంసన్‌ను.. వన్డే సిరీస్‌కు మాత్రం పక్కనపెట్టారు సెలక్టర్లు.రెండుసార్లూ డకౌట్చాంపియన్స్ ట్రోఫీ-2025కి ముందు భారత్ కేవలం ఆరు వన్డేలు మాత్రమే ఆడననున్న నేపథ్యంలో కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లిలను వెనక్కి పిలిపించారు. ఇదిలా ఉంటే.. టీ20 సిరీస్‌లో రెండు మ్యాచ్‌లు ఆడే అవకాశం వచ్చినా సంజూ పూర్తిగా నిరాశపరిచాడు. రెండుసార్లూ డకౌట్‌గా వెనుదిరిగాడు సంజూ. ఇక ఈ టూర్లో టీ20 సిరీస్‌ను 3-0తో క్లీన్‌స్వీప్ చేసింది సూర్యకుమార్ యాదవ్ సేన. అయితే, రోహిత్ కెప్టెన్సీలోని వన్డే జట్టు మాత్రం 0-2తో సిరీస్‌ను ఆతిథ్య లంకకు సమర్పించుకుంది. తద్వారా 27 ఏళ్ల తర్వాత శ్రీలంకతో ద్వైపాక్షిక వన్డే సిరీస్ కోల్పోయిన భారత జట్టుగా చెత్త రికార్డు మూటగట్టుకుంది. చదవండి: నా కోచింగ్ కెరీర్లో అదే ఘోర పరాభవం: ద్రవిడ్ The Kerala Boy at a press conference🔥#SanjuSamson pic.twitter.com/gsdv9SSHlP— Deepu (@deepu_drops) August 10, 2024 -
'భారత్‌లో అన్ని బ్యాటింగ్ పిచ్లే.. అందుకే ఇక్కడ ఆడలేకపోయారు'
స్వదేశంలో టీమిండియాతో జరిగిన వన్డే సిరీస్‌ను 2-0 తేడాతో శ్రీలంక సొంతం చేసుకుంది. భారత్‌పై వన్డే సిరీస్‌ను కైవసం చేసుకున్న లంకేయులు తమ 27 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరిదించారు. ఈ సిరీస్‌లో శ్రీలంక జట్టు అద్భుతమైన ప్రదర్శన కనబరిచింది.ముఖ్యంగా లంక స్పిన్నర్లు భారత బ్యాటర్లను ముప్పు తిప్పులు పెట్టారు. మూడు వన్డేల్లో కలిపి ఆతిథ్య జట్టు స్పిన్నర్లు ఏకంగా 27 వికెట్లు పడగొట్టారు. తొలి రెండు వన్డేల్లో కాస్త పర్వాలేదన్పంచిన టీమిండియా.. మూడో వన్డేలో మాత్రం పూర్తిగా తేలిపోయింది. కొలంబో వేదికగా జరిగిన ఆఖరి వన్డేలో భారత్ 110 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. ఈ నేపథ్యంలో శ్రీలంక స్పిన్నర్ మహేశ్ తీక్షణ భారత జట్టును ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశాడు. భారత్‌లో అన్నీ బ్యాటింగ్ పిచ్లే ఉంటాయని, తమ దేశంలో అలా ఉండవని తీక్షణ తెలిపాడు."భారత్‌లో దాదాపుగా అన్ని పిచ్‌లు ప్లాట్‌గా ఉండి బ్యాటింగ్‌కు అనుకూలిస్తాయి. అంతేకాకుండా బౌండరీలు కూడా చాలా చిన్నగా ఉంటాయి. ఇటువంటి వికెట్‌పై భారత బ్యాటర్లు బాగా అలవాటు పడి ఉంటారు. అందుకే ఇక్కడ(శ్రీలంక)కు వచ్చి కాస్త ఇబ్బంది పడ్డారు.కొలంబోలోని ప్రేమదాస వికెట్ ఎలా ఉంటుందో మాకు బాగా తెలుసు. మేము ఇక్కడ చాలా మ్యాచ్‌లు ఆడాము. కొంచెం టర్న్ ఉంటే చాలు మా జట్టులో నాణ్యమైన స్పిన్నర్లు ఉన్నందున ప్రత్యర్ధి బ్యాటర్లను కట్టడి చేయవచ్చు. దేశీవాళీ క్రికెట్లో కూడా మాకు ఇటువంటి పిచ్లే ఉంటాయి. కాబట్టి మా బ్యాటర్లకు ఇటువంటి వికెట్లపై ఎలా ఆడాలో తెలుసు అని ఓ స్పోర్ట్స్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో థీక్షణ పేర్కొన్నాడు.చదవండి: #Arshad Nadeem: కూలీ కొడుకు.. ఒక్కపూట తిండిలేక పస్తులు.. ఒలింపిక్ వీరుడిగా -
కొత్త కోచ్ కోసం వెతుకున్నారు: సనత్ జయసూర్య
దాదాపు 27 ఏళ్ల తర్వాత తొలిసారి శ్రీలంక టీమిండియాపై వన్డే సిరీస్ గెలిచింది. సొంతగడ్డపై స్పిన్ వల పన్ని భారత బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టి.. 2-0తో చారిత్రాత్మక విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో లంక తాత్కాలిక హెడ్‌కోచ్, మాజీ కెప్టెన్ సనత్ జయసూర్య హర్షం వ్యక్తం చేశాడు.కుర్రాళ్లు అద్భుత ఆటతీరుతో.. ఎంతో కఠిన శ్రమకోర్చి గెలుపు రుచిని చవిచూశారని ప్రశంసించాడు. టీ20 సిరీస్‌లో ఎదురైన చేదు అనుభవం నుంచి కోలుకుని.. అనూహ్య విజయాన్ని అందుకున్నారని సనత్ జయసూర్య లంక వన్డే జట్టును కొనియాడాడు. కాగా మూడు టీ20, మూడు వన్డే మ్యాచ్‌ల సిరీస్‌లు ఆడేందుకు టీమిండియా శ్రీలంక పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే.చేదు అనుభవంఈ టూర్‌తో టీమిండియా టీ20 రెగ్యులర్ కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్, కొత్త హెడ్‌కోచ్‌గా గౌతం గంభీర్ బాధ్యతలు చేపట్టారు. ఆతిథ్య శ్రీలంకను భారత్ 3-0తో క్లీన్‌స్వీప్ చేయడంతో ఇద్దరి ఖాతాలో భారీ విజయం నమోదైంది. అయితే, వన్డేలో మాత్రం టీమిండియాకు ఘోర పరాభవం ఎదురైంది. రోహిత్ శర్మ సారథ్యంలోని భారత జట్టు 2-0తో సిరీస్‌ను లంకకు సమర్పించుకుంది. తొలి వన్డేను టై చేసుకున్నప్పటికీ... శ్రీలంక స్పిన్నర్లు జెఫ్రె వాండర్సె, దునిత్ వెల్లలగే స్పిన్ మాయాజాలంలో చిక్కి ఆఖరి రెండు వన్డేల్లో ఓటమిని మూటగట్టుకుంది.ఈ నేపథ్యంలో శ్రీలంక కోచ్ సనత్ జయసూర్య మాట్లాడుతూ.. ‘‘సుదీర్ఘకాలం పాటు ఇందుకోసం నిరీక్షించాం. 1997లో నేను జట్టులో ఉన్నపుడు టీమిండియాపై వన్డే సిరీస్ గెలిచాం. మళ్లీ ఇప్పుడు ఇలా విజయం అందుకున్నాం. 27 ఏళ్ల తర్వాత.. ఇలా దక్కిన గెలుపులో నేనూ భాగమైనందుకు సంతోషంగా ఉంది.ప్రతిభావంతులైన క్రికెటర్లకు కొదవలేదుశ్రీలంకలో ప్రతిభావంతులైన క్రికెటర్లకు కొదవలేదు. వాళ్లు ఏం చేయగలరో ఈ సిరీస్ ద్వారా చేసి చూపించారు. టీ20 సిరీస్ తర్వాత అంతా స్తబ్దుగా మారిపోయింది. మేము తిరిగి పుంజుకుంటామని ఎవరూ ఊహించలేదు. అయితే, అందరి అంచనాలు తలకిందులు చేస్తూ.. అద్భుతంగా ఆడారు.వెల్లలగే, నిసాంక, అవిష్క ఫెర్నాండో, అసలంక.. ఇలా జట్టులో చాలా మంది యువ ఆటగాళ్లు ఉన్నారు. హసరంగ గాయం కారణంగా దూరం కాగా.. వాండర్సె అతడి స్థానంలో వచ్చి.. అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకున్నాడు. వెల్లలగే సైతం అద్బుతంగా రాణించాడు’’ అని సనత్ జయసూర్య తమ జట్టు ప్రదర్శన పట్ల సంతృప్తి వ్యక్తం చేశాడు.కొత్త కోచ్ కోసం వెతుకున్నారుటీమిండియా, ఇంగ్లండ్‌లతో సిరీస్‌ల నేపథ్యంలో తాను కోచ్‌గా బాధ్యతలు చేపట్టానని... ఈ మ్యాచ్‌లు ముగిసిన తర్వాత కొత్త కోచ్ వస్తాడని సనత్ జయసూర్య తెలిపాడు. ఇందుకోసం లంక బోర్డు వివిధ ఆప్షన్లు పరిశీలిస్తున్నట్లు తెలిపాడు. అయితే, హై పర్ఫామెన్స్ ఇన్చార్జ్గా తాను శ్రీలంక క్రికెట్‌కు సేవలు అందిస్తూనే ఉంటానని స్పష్టం చేశాడు. -
క్రిస్ గేల్ రికార్డును సమం చేసిన రోహిత్
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ విండీస్ విధ్వంసకర వీరుడు క్రిస్ గేల్ రికార్డును సమం చేశాడు. వన్డేల్లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాళ్ల జాబితాలో గేల్, రోహిత్ సంయుక్తంగా రెండో స్థానంలో నిలిచారు. వన్డేల్లో ఈ ఇద్దరు చెరో 331 సిక్సర్లు బాదారు. ఈ జాబితాలో పాక్ మాజీ ఆటగాడు షాహిద్ అఫ్రిది (351) టాప్‌లో ఉన్నాడు. ప్రస్తుత తరం క్రికెటర్లలో రోహిత్ తర్వాతి స్థానంలో జోస్ బట్లర్ ఉన్నాడు. బట్లర్ ఖాతాలో ప్రస్తుతం 170 సిక్సర్లు ఉన్నాయి. శ్రీలంకతో జరిగిన మూడో వన్డేలో రోహిత్ గేల్ రికార్డును సమం చేశాడు.ఈ మ్యాచ్‌లో రోహిత్ 20 బంతుల్లో ఓ సిక్సర్, 6 ఫోర్ల సాయంతో 35 పరుగులు చేశాడు. రోహిత్ ఓ మోస్తరు స్కోర్‌తో రాణించినా ఈ మ్యాచ్‌లో టీమిండియా ఓటమిపాలైంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 248 పరుగులు చేసింది. పథుమ్ నిస్సంక (45), అవిష్క ఫెర్నాండో (96), కుసాల్ మెండిస్ (59), కమిందు మెండిస్ (23 నాటౌట్) రాణించారు. భారత బౌలర్లలో రియాన్ పరాగ్ 3, సిరాజ్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్ తలో వికెట్ పడగొట్టారు.249 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్ 138 పరుగులకే (26.1 ఓవర్లలో) ఆలౌటై 110 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. దునిత్ వెల్లలగే ఐదు వికెట్లు తీసి టీమిండియాను దెబ్బకొట్టాడు. తీక్షణ, వాండర్సే తలో రెండు, అషిత ఫెర్నాండో ఓ వికెట్ పడగొట్టారు. భారత బ్యాటర్లలో రోహిత్ శర్మ (35), సుందర్ (30), విరాట్ కోహ్లి (20), రియాన్ పరాగ్ (15) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగా.. మిగతా వారంతా సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు.ఈ మ్యాచ్‌లో ఓటమితో భారత్ మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 0-2 తేడాతో కోల్పోయింది. తొలి వన్డే టైగా ముగియగా.. రెండు, మూడు వన్డేల్లో శ్రీలంక విజయం సాధించింది. శ్రీలంక 27 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ద్వైపాక్షిక సిరీస్‌లో భారత్‌పై విజయం సాధించింది. -
అతడు లేకపోతే.. టీమిండియా బౌలింగ్ జీరో: పాక్ మాజీ క్రికెటర్
శ్రీలంకతో మూడు వన్డేల సిరీస్‌ను 0-2 తేడాతో టీమిండియా కోల్పోయింది. టీ20 సిరీస్‌లో సత్తాచాటిన భారత జట్టు.. వన్డేల్లో మాత్రం తేలిపోయింది. తొలి వన్డేను టై ముగించిన రోహిత్ సేన.. ఆ తర్వాత వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఘోర ఓటమి చవిచూసింది.తద్వారా 1997 తర్వాత తొలిసారి శ్రీలంకపై భారత్ వన్డే సిరీస్ ఓడిపోయింది. కాగా ఈ సిరీస్‌లో భారత బ్యాటర్లతో పాటు పేస్ బౌలర్లు కూడా విఫలమయ్యారు. వికెట్ల తీయడంలో సిరాజ్, అర్ష్‌దీప్ వంటి ఫాస్ట్ బౌలర్లు నిరాశపరిచారు.ఈ మొత్తం సిరీస్‌లో ఇరు జట్ల స్పిన్నర్లు ఆధిపత్యం చెలాయించారు. భారత్‌తో పొలిస్తే శ్రీలంక స్పిన్నర్లు మరింత మెరుగ్గా రాణించారు. ఈ నేపథ్యంలో భారత జట్టును ఉద్దేశించి పాకిస్తాన్ మాజీ పేసర్ జునైద్ ఖాన్ సంచలన పోస్ట్ చేశాడు. స్పీడ్‌స్టర్ జస్ప్రీత్ బుమ్రా లేకపోతే భారత బౌలింగ్ విభాగం శూన్యమని జునైద్ తన అక్కసను వెల్లగక్కాడు. "బుమ్రా లేకపోతే భారత బౌలింగ్ జీరో. దీనిపై మీ అభిప్రాయం ఏంటి?" అని జునైద్ ఎక్స్‌లో పోస్ట్ పెట్టాడు.కాగా టీ20 వరల్డ్‌కప్ తర్వాత టీమిండియా పేస్ గుర్రం విశ్రాంతి తీసుకుంటున్నాడు. టీ20 వరల్డ్‌కప్‌ను భారత్ సొంతం చేసుకోవడంలో బుమ్రాది కీలక పాత్ర. స్వదేశంలో బంగ్లాదేశ్‌తో జరగనున్న టెస్టు సిరీస్‌కు బుమ్రా అందుబాటులోకి రానున్నాడు. -
ప్రపంచం ఏం అంతం కాదు.. నిజంగా అదో పెద్ద జోక్: రోహిత్ శర్మ
బుధవారం కొలంబో వేదికగా శ్రీలంకతో జరిగిన మూడో వన్డేలో 110 పరుగుల తేడాతో భారత్ ఘోర ఓటమి చవి చూసింది. దీంతో మూడు వన్డేల సిరీస్‌ను భారత్ 2-0 తేడాతో కోల్పోయింది. కాగా శ్రీలంకపై వన్డే సిరీస్‌లో టీమిండియా ఓడిపోవడం 27 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి కావడం గమనార్హం.మొదటి వన్డేను డ్రాగా ముగించిన భారత్.. వరసుగా రెండు వన్డేల్లో ఓటమి పాలైంది. మరోసారి స్పిన్ ఉచ్చులో భారత్ చిక్కుకుంది. 249 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా.. లంక స్పిన్నర్ల దాటికి కేవలం 138 పరుగులకే కుప్పకూలింది. భారత ఇన్నింగ్స్‌లో 9 వికెట్లు స్పిన్నర్లే పడగొట్టడం గమనార్హం. లంక బౌలర్లలో దునిత్ వెల్లాలగే 5 వికెట్లతో సత్తాచాటగా.. థీక్షణ, జెఫ్రీ వాండర్సే తలా రెండు వికెట్లు సాధించారు. భారత బ్యాటర్లలో రోహిత్ శర్మ(35) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. మిగితా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు. ఇక ఈ ఘోర ఓటమిపై మ్యాచ్ అనంతరం భాతర కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించాడు. ఈ సిరీస్‌లో శ్రీలంక తమ కంటే బాగా ఆడిందని హిట్‌మ్యాన్ కొనియాడాడు."స్పిన్నర్లను ఎదుర్కొవడంలో భారత బ్యాటర్ల తడబాటుపై ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కానీ ఈ విషయాన్నీ మేము తీవ్రంగా పరిగణిస్తాము. వ్యక్తిగతంగా ప్రతీ ఒక్కరూ సరైన గేమ్ ప్లాన్‌తో ఆడాల్సిన అవసరముంది. సిరీస్‌లో మేము ఒత్తిడికి గురయ్యాము.తప్పు ఎక్కడ జరిగిందా అన్నది మేము చర్చించి తర్వాత మ్యాచ్‌ల్లో పునరావృతం కాకుండా ప్రయత్నిస్తాము. రాబోయే మ్యాచ్‌ల్లో సరైన ప్రణాళికలతో బరిలోకి దిగుతాం. అంతే తప్ప టీ20 వరల్డ్‌కప్ విజయంతో మేము రిలాక్స్ కాలేదు. ఇదో పెద్ద జోక్. భారత్ తరుపన ఆడుతున్నంత కాలం మేము రిలాక్స్ అవ్వము. ముఖ్యంగా నేను కెప్టెన్‌గా ఉన్నప్పుడు అటుంటి ఆంశాలకు అస్సలు చోటివ్వను.ప్రతీ మ్యాచ్‌లోనూ విజయం సాధించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తాము. కానీ ఈ సిరీస్ మొత్తం మేము చెత్తగా ఆడాం. కానీ శ్రీలంకకు మాత్రం క్రెడిట్ ఇవ్వాలి. వారు మాకంటే మెరుగైన ప్రదర్శన చేశారు. అందుకే శ్రీలంక సిరీస్‌లో విజయం సాధించింది. మేము ఇక్కడి కండిషన్స్‌కు తగ్గట్లు మా జట్టు కాంబినేషన్‌ను మార్చాము. జట్టులో కొంత మంది యువ ఆటగాళ్లకు ఇటువంటి కండిషన్స్‌కు అలవాటు పడాలనే ఉద్దేశ్యంతో కొన్ని మార్పులు చేశాం. ఈ సిరీస్‌లో మాకు సానుకూల అంశాల కంటే ప్రతికూల ఆంశాలే ఎక్కువగా ఉన్నాయి. వాటిపై కచ్చితంగా దృష్టి పెడతాము. ఎందుకంటే మరోసారి ఎటువంటి పరిస్థితులు ఎదురైతే బాగా ఆడాలి కాదా. ఇక ఆటలో గెలుపోటములు సహజం. సిరీస్ కోల్పోవడం వల్ల ప్రపంచం ఏమి అంతం కాదు. ఈ ఓటమి నుంచి ఎలా పుంజుకుంటామనేదే ముఖ్యమని" పోస్ట్ మ్యాచ్ ప్రేజేంటేషన్‌లో రోహిత్ శర్మ పేర్కొన్నాడు. -
India vs Sri Lanka: భారత్‌కు షాకిచ్చిన శ్రీలంక.. 27 ఏళ్ల తర్వాత (ఫోటోలు)
-
శ్రీలంకతో మూడో వన్డే.. చిత్తుగా ఓడిన టీమిండియా
శ్రీలంకతో మూడో వన్డేలో టీమిండియా చిత్తుగా ఓడింది. 249 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్ 138 పరుగులకే (26.1 ఓవర్లలో) ఆలౌటై 110 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. దునిత్ వెల్లలగే ఐదు వికెట్లు తీసి టీమిండియాను దెబ్బకొట్టాడు. తీక్షణ, వాండర్సే తలో రెండు, అషిత ఫెర్నాండో ఓ వికెట్ పడగొట్టారు. భారత బ్యాటర్లలో రోహిత్ శర్మ (35), సుందర్ (30), విరాట్ కోహ్లి (20), రియాన్ పరాగ్ (15) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగా.. మిగతా వారంతా సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు.అంతకుముందు టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక.. పథుమ్ నిస్సంక (45), అవిష్క ఫెర్నాండో (96), కుసాల్ మెండిస్ (59), కమిందు మెండిస్ (23 నాటౌట్) రాణించడంతో నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 248 పరుగులు చేసింది. లంక ఇన్నింగ్స్‌లో అసలంక 10, సమరవిక్రమ 0, లియనాగే 8, వెల్లలగే 2 పరుగులు చేసి ఔటయ్యారు. భారత బౌలర్లలో రియాన్ పరాగ్ 3, సిరాజ్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్ తలో వికెట్ పడగొట్టారు.ఈ మ్యాచ్‌లో ఓటమితో భారత్ మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 0-2 తేడాతో కోల్పోయింది. తొలి వన్డే టైగా ముగియగా.. రెండు, మూడు వన్డేల్లో శ్రీలంక విజయం సాధించింది. శ్రీలంక 27 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ద్వైపాక్షిక సిరీస్‌లో భారత్‌పై విజయం సాధించడం విశేషం. -
మూడో వన్డేలోనూ ఓటమి.. సిరీస్ కోల్పోయిన భారత్
శ్రీలంకతో మూడో వన్డేలో టీమిండియా చిత్తుగా ఓడింది. 249 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్ 138 పరుగులకే (26.1 ఓవర్లలో) ఆలౌటైంది. దునిత్ వెల్లలగే ఐదు వికెట్లు తీసి టీమిండియాను దెబ్బకొట్టాడు. తీక్షణ, వాండర్సే తలో రెండు, అషిత ఫెర్నాండో ఓ వికెట్ పడగొట్టారు. భారత బ్యాటర్లలో రోహిత్ శర్మ (35), సుందర్ (30), విరాట్ కోహ్లి (20), రియాన్ పరాగ్ (15) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగా.. మిగతా వారంతా సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు.అంతకుముందు టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక.. పథుమ్ నిస్సంక (45), అవిష్క ఫెర్నాండో (96), కుసాల్ మెండిస్ (59), కమిందు మెండిస్ (23 నాటౌట్) రాణించడంతో నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 248 పరుగులు చేసింది. లంక ఇన్నింగ్స్‌లో అసలంక 10, సమరవిక్రమ 0, లియనాగే 8, వెల్లలగే 2 పరుగులు చేసి ఔటయ్యారు. భారత బౌలర్లలో రియాన్ పరాగ్ 3, సిరాజ్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్ తలో వికెట్ పడగొట్టారు. ఈ మ్యాచ్‌లో ఓటమితో భారత్ మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 0-2 తేడాతో కోల్పోయింది. తొలి వన్డే టైగా ముగియగా.. రెండు, మూడు వన్డేల్లో శ్రీలంక విజయం సాధించింది.తొమ్మిదో వికెట్ కోల్పోయిన టీమిండియా138 పరుగుల వద్ద టీమిండియా తొమ్మిదో వికెట్ కోల్పోయింది. తీక్షణ బౌలింగ్‌లో వాండర్సేకు క్యాచ్ ఇచ్చి వాషింగ్టన్ సుందర్ (30) ఔటయ్యాడు. ఎనిమిదో వికెట్ కోల్పోయిన టీమిండియా101 పరుగుల వద్ద టీమిండియా ఎనిమిదో వికెట్ కోల్పోయింది. వాండర్సే బౌలింగ్‌లో శివమ్ దూబే (9) ఎల్బీడబ్ల్యూ అయ్యాడు. ఏడో వికెట్ కోల్పోయిన భారత్100 పరుగుల వద్ద టీమిండియా ఏడో వికెట్ కోల్పోయింది. వాండర్సే బౌలింగ్‌లో రియాన్ పరాగ్ (15) క్లీన్ బౌల్డ్ అయ్యాడు.శివమ్ దూబే (9), వాషింగ్టన్ సుందర్ క్రీజ్‌లో ఉన్నారు.86 పరుగులకే 6 వికెట్లు కోల్పోయిన టీమిండియా249 పరుగుల లక్ష్య ఛేదనలో టీమిండియా 82 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి కష్టాల్లో కూరుకుపోయింది. దునిత్ వెల్లలగే 4 వికెట్లు తీసి టీమిండియాను దారుణంగా దెబ్బకొట్టాడు. రోహిత్ 35, గిల్ 6, విరాట్ 20, రిషబ్ పంత్ 6, శ్రేయస్ అయ్యర్ 8, అక్షర్ పటేల్ 2 ఔట్ కాగా.. రియాన్ పరాగ్ 10, శివమ్ దూబే 0 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. అషిత ఫెర్నాండో, తీక్షణ తలో వికెట్ పడగొట్టారు.తొలి వికెట్ కోల్పోయిన భారత్249 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్.. 37 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. అశిత ఫెర్నాండో బౌలింగ్‌లో శుభ్‌మన్ గిల్ (6) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. మరో ఎండ్‌లో రోహిత్ (13 బంతుల్లో 31; 5 ఫోర్లు, సిక్స్) చెలరేగి ఆడుతున్నాడు. రాణించిన రియాన్ పరాగ్.. నామమాత్రపు స్కోర్‌కే పరిమితమైన శ్రీలంకకొలొంబో వేదికగా శ్రీలంకతో జరుగుతున్న మూడో వన్డేలో భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. ఫలితంగా శ్రీలంక నామమాత్రపు స్కోర్‌కే (248/7) పరిమితమైంది. కెరీర్లో తొలి వన్డే ఆడుతున్న రియాన్ పరాగ్ బంతితో రాణించాడు. రియాన్ 9 ఓవర్లలో 54 పరుగులిచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు. కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి తలో వికెట్ పడగొట్టారు. శివమ్ దూబూ నాలుగు ఓవర్లు వేసి కేవలం తొమ్మిది పరుగులు మాత్రమే ఇచ్చాడు. మహ్మద్ సిరాజ్ ధారళంగా పరుగులు సమర్పించుకుని ఓ వికెట్ తీశాడు. సిరాజ్ 9 ఓవర్లలో ఏకంగా 78 పరుగులు సమర్పించుకున్నాడు.తృటిలో సెంచరీ చేజార్చుకున్న అవిష్కటాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంకకు ఓపెనర్లు పథుమ్ నిస్సంక (45), అవిష్క ఫెర్నాండో (96) శుభారంభాన్ని అందించారు. వీరిద్దరు తొలి వికెట్‌కు 89 పరుగులు జోడించారు. అవిష్క నాలుగు పరుగుల తేడాతో సెంచరీని చేజార్చుకున్నాడు.రాణించిన కుసాల్ మెండిస్అవిష్క ఫెర్నాండో ఔటైన తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన కుసాల్ మెండిస్ (59) అర్ద సెంచరీతో రాణించాడు. వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు దిగిన కుసాల్ ఏడో వికెట్‌గా వెనుదిరిగాడు. ఆఖర్లో కమిందు మెండిస్ (23 నాటౌట్) వేగంగా పరుగులు సాధించడంతో శ్రీలంక ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది. లంక ఇన్నింగ్స్‌లో అసలంక 10, సధీర సమరవిక్రమ 0, లియనాగే 8, వెల్లలగే 2 పరుగులు చేసి ఔటయ్యారు.ఏడో వికెట్ కోల్పోయిన శ్రీలంక235 పరుగుల వద్ద శ్రీలంక ఏడో వికెట్ కోల్పోయింది. కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో శుభ్‌మన్ గిల్‌కు క్యాచ్ ఇచ్చి కుసాల్ మెండిస్ (59) ఔటయ్యాడు. మూడు పరుగుల వ్యవధిలో రెండు వికెట్లు కోల్పోయిన శ్రీలంకశ్రీలంక మూడు పరుగుల వ్యవధిలో రెండు వికెట్లు కోల్పోయింది. 196 పరుగుల వద్ద లియనాగేను (8) వాషింగ్టన్ సుందర్ క్లీన్ బౌల్డ్ చేయగా.. 199 పరుగుల వద్ద వెల్లలగేను (2) రియాన్ పరాగ్ క్లీన్ బౌల్డ్ చేశాడు. 45 ఓవర్ల తర్వాత శ్రీలంక స్కోర్ 207/6గా ఉంది. కుసాల్ మెండిస్ (41), కమిందు మెండిస్ (3) క్రీజ్‌లో ఉన్నారు.నాలుగో వికెట్ డౌన్సధీర సమరవిక్రమ సిరాజ్ బౌలింగ్‌లో తానెదుర్కొన్న తొలి బంతికే ఔటయ్యాడు. 39 ఓవర్ల తర్వాత శ్రీలంక స్కోర్ 184/4గా ఉంది.మూడో వికెట్ కోల్పోయిన శ్రీలంక183 పరుగుల వద్ద శ్రీలంక మూడో వికెట్ కోల్పోయింది. రియాన్ పరాగ్.. అసలంకను (10) ఎల్బీడబ్ల్యూ చేశాడు.తృటిలో సెంచరీని చేజార్చుకున్న అవిష్కలంక ఓపెనర్ అవిష్క ఫెర్నాండో తృటిలో సెంచరీని చేజార్చుకున్నాడు. 96 పరుగుల వద్ద రియాన్ పరాగ్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూ అయ్యాడు. 36 ఓవర్ల తర్వాత శ్రీలంక స్కోర్ 173/2గా ఉంది. కుసాల్ మెండిస్ (28), అసలంక (2) క్రీజ్‌లో ఉన్నారు.తొలి వికెట్ కోల్పోయిన శ్రీలంక89 పరుగుల వద్ద శ్రీలంక తొలి వికెట్ కోల్పోయింది. అక్షర్ పటేల్ బౌలింగ్‌లో వికెట్‌కీపర్ పంత్‌కు క్యాచ్ ఇచ్చి నిస్సంక (45) ఔటయ్యాడు. అవిష్క ఫెర్నాండో (43), కుసాల్ మెండిస్ క్రీజ్‌లో ఉన్నారు.14 ఓవర్ల తర్వాత శ్రీలంక స్కోర్ 65/0ఇన్నింగ్స్ ఆరంభంలో నత్త నడకలా సాగిన శ్రీలంక బ్యాటింగ్ ప్రస్తుతం మెరుగుపడింది. ఆ జట్టు 14 ఓవర్ల అనంతరం వికెట్ నష్టపోకుండా 65 పరుగులు చేసింది. అవిష్క ఫెర్నాండో 26, నిస్సంక 38 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. నత్త నడకన సాగుతున్న శ్రీలంక బ్యాటింగ్టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేస్తున్న శ్రీలంక నిదానంగా ఆడుతుంది. వారి ఇన్నింగ్స్ నత్త నడకు తలపిస్తుంది. 7 ఓవర్ల తర్వాత ఆ జట్టు స్కోర్ 28/0గా ఉంది. నిస్సంక 19, అవిష్క ఫెర్నాండో 8 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంకకొలొంబో వేదికగా టీమిండియాతో జరుగుతున్న మూడో వన్డేలో శ్రీలంక టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో భారత్ రెండు మార్పులతో బరిలోకి దిగింది. కేఎల్ రాహుల్, అర్ష్‌దీప్ సింగ్ స్థానాల్లో రిషబ్ పంత్, రియాన్ పరాగ్ తుది జట్టులోకి వచ్చారు. మరోవైపు లంక సైతం ఓ మార్పు చేసింది. అఖిల ధనంజయ స్థానంలో మహేశ్ తీక్షణ తుది జట్టులోకి వచ్చాడు. కాగా, ఈ సిరీస్‌లో శ్రీలంక 1-0 ఆధిక్యంలో ఉన్న విషయం తెలిసిందే. తొలి వన్డే టైగా ముగియగా.. రెండో వన్డేలో లంక విజయం సాధించింది.తుది జట్లు..భారత్: రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్(వికెట్‌కీపర్), శ్రేయస్ అయ్యర్, రియాన్ పరాగ్, శివమ్ దూబే, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్శ్రీలంక: పథుమ్ నిస్సంక, అవిష్క ఫెర్నాండో, కుసల్ మెండిస్(వికెట్‌కీపర్), సదీర సమరవిక్రమ, చరిత్ అసలంక(కెప్టెన్), జనిత్ లియానాగే, కమిందు మెండిస్, దునిత్ వెల్లలాగే, మహేశ్ తీక్షణ, జెఫ్రీ వాండర్సే, అసిత ఫెర్నాండో -
శ్రీలంకతో మూడో వన్డే.. మళ్లీ టాస్ ఓడిన టీమిండియా..కేఎల్ రాహుల్‌పై వేటు
కొలొంబో వేదికగా శ్రీలంకతో ఇవాళ (ఆగస్ట్ 7) జరుగనున్న మూడో వన్డేలో టీమిండియా టాస్ ఓడి తొలుత బౌలింగ్ చేయనుంది. మూడు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో టీమిండియా టాస్ ఓడటం ఇది వరుసగా మూడోసారి. ఈ మ్యాచ్‌లో భారత్ రెండు మార్పులతో బరిలోకి దిగనుంది. కేఎల్ రాహుల్, అర్ష్‌దీప్ సింగ్ స్థానాల్లో రిషబ్ పంత్, రియాన్ పరాగ్ తుది జట్టులోకి వచ్చారు. మరోవైపు లంక సైతం ఓ మార్పు చేసింది. అఖిల ధనంజయ స్థానంలో మహేశ్ తీక్షణ తుది జట్టులోకి వచ్చాడు. కాగా, ఈ సిరీస్‌లో శ్రీలంక 1-0 ఆధిక్యంలో ఉన్న విషయం తెలిసిందే. తొలి వన్డే టైగా ముగియగా.. రెండో వన్డేలో లంక విజయం సాధించింది.తుది జట్లు..భారత్: రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్(వికెట్‌కీపర్), శ్రేయస్ అయ్యర్, రియాన్ పరాగ్, శివమ్ దూబే, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్శ్రీలంక: పథుమ్ నిస్సంక, అవిష్క ఫెర్నాండో, కుసల్ మెండిస్(వికెట్‌కీపర్), సదీర సమరవిక్రమ, చరిత్ అసలంక(కెప్టెన్), జనిత్ లియనాగే, కమిందు మెండిస్, దునిత్ వెల్లలాగే, మహేశ్ తీక్షణ, జెఫ్రీ వాండర్సే, అసిత ఫెర్నాండో -
కోహ్లి వరుస వైఫల్యాలు.. పాక్ మాజీ క్రికెటర్ విమర్శలు
శ్రీలంకతో తాజా వన్డే సిరీస్‌లో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి వరుస వైఫల్యాల నేపథ్యంలో విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా కోహ్లి అవుటైన తీరును జీర్ణించుకోలేకపోతున్నారు అభిమానులు. ఇప్పటి వరకు ఆడిన రెండు మ్యాచ్‌లలో కలిపి కోహ్లి కేవలం 38 పరుగులు మాత్రమే చేశాడు. అయితే, రెండుసార్లూ అతడు స్పిన్నర్ల చేతికే చిక్కాడు.అది కూడా రెండుసార్లు లెగ్ బిఫోర్ వికెట్‌గా వెనుదిరగడం గమనార్హం. కాగా టీ20 ప్రపంచకప్-2024 తర్వాత కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి అంతర్జాతీయ టీ20లకు వీడ్కోలు పలికిన విరాట్ కోహ్లి.. దాదాపు నెలరోజుల పాటు విశ్రాంతి తీసుకున్నాడు. శ్రీలంకతో వన్డే సిరీస్‌కు కూడా దూరంగా ఉండాలని భావించినప్పటికీ కొత్త హెడ్‌కోచ్ గౌతం గంభీర్ సంప్రదింపుల నేపథ్యంలో అందుబాటులోకి వచ్చాడు.రోహిత్ శర్మతో కలిసి వన్డే సిరీస్ ఆడేందుకు శ్రీలంకలో అడుగుపెట్టాడు. ఇక ఇప్పటి వరకు రెండు వన్డేల్లో కలిపి రోహిత్ శర్మ 122 పరుగులతో ఫామ్‌లో ఉండగా.. కోహ్లి మాత్రం తడబడుతున్నాడు. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ క్రికెటర్ బసిత్ అలీ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఈ సిరీస్ కోసం కోహ్లి పూర్తిస్థాయిలో సన్నద్ధమైనట్లు కనిపించడం లేదని విమర్శించాడు.‘‘ప్రపంచంలోని నంబర్ వన్ బ్యాటర్.. గొప్ప ఆటగాడు విరాట్ కోహ్లి. కానీ వరుసగా రెండుసార్లు ఎల్బీడబ్ల్యూ అయ్యాడు. శ్రేయస్ అయ్యర్ లేదంటే శివం దూబే విషయంలో ఇలా జరిగితే పర్లేదనుకోవచ్చు. కానీ విరాట్ కోహ్లి.. విరాట్ కోహ్లియే. తన స్థాయికి ఇది తగదు. దీనిని బట్టి అతడు పూర్తిస్థాయిలో ప్రాక్టీస్ చేయలేదని అర్థమవుతోంది’’ అని బసిత్ అలీ తన యూట్యూబ్ చానెల్ వేదికగా పేర్కొన్నాడు.ఇక రెండో వన్డేలో లంక స్పిన్నర్ జెఫ్రే వాండర్సె ధాటికి టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్ కుప్పకూలడాన్ని ప్రస్తావిస్తూ.. ‘‘ప్రపంచ క్రికెట్‌ను ఏలే బ్యాటింగ్ ఆర్డర్లా ఏమాత్రం అనిపించలేదు. శ్రేయస్ అయ్యర్, కేఎల్‌రాహుల్ కూడా తగినంత ప్రాక్టీస్ చేసినట్లు కనబడటం లేదు. ప్రాక్టీస్ లేకుండానే మ్యాచ్ ఆడటానికి వచ్చేసినట్లు ఉన్నారు.అసలు అయ్యర్ ఇలా ఎందుకు ఆడుతున్నాడో అర్థమే కావడం లేదు. అయ్యర్ స్థానంలో రిషభ్ పంత్ లేదంటే.. రియాన్ పరాగ్, రింకూ సింగ్ జట్టులోకి వచ్చే సమయం ఆసన్నమైందనిపిస్తోంది. దేశవాళీ వన్డే ఫార్మాట్(లిస్ట్-ఏ)క్రికెట్ నుంచి కొంతమందిని గంభీర్ సెలక్ట్ చేసుకోకతప్పదు’’ అని బసిత్ అలీ అభిప్రాయపడ్డాడు. కాగా శ్రీలంకతో టీ20 సిరీస్‌ను 3-0తో వైట్‌వాష్ చేసిన టీమిండియా.. వన్డేల్లో మాత్రం నిరాశపరుస్తోంది. తొలి వన్డే టై కాగా.. రెండో వన్డేలో శ్రీలంక గెలుపొంది.. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలో ఉంది. -
లంకతో మూడో వన్డే.. రాహల్‌పై వేటు! టీమిండియాలోకి విధ్వంసకర ఆటగాడు?
శ్రీలంకతో టీ20 సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా.. వన్డేల్లో మాత్రం తమ మార్క్‌ను చూపించలేకపోతుంది. తొలి వన్డేలో ఈజీగా గెలవాల్సిన మ్యాచ్‌ను చేజేతులా టై చేసుకున్న భారత్.. రెండో వన్డేలో 32 పరుగుల తేడాతో అనుహ్యంగా ఓటమి చవిచూసింది. ఈ క్రమంలో కీలకమైన మూడో వన్డేలో శ్రీలంకతో తలపడేందుకు టీమిండియా సిద్దమైంది. బుధవారం కొలంబో వేదికగా మూడో వన్డేలో ఇరు జట్లు అమీతుమీ తెల్చుకోనున్నాయి. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి సిరీస్‌ను 1-1తో సమం చేయాలని రోహిత్ సేన పట్టుదలతో ఉంది. మరోవైపు శ్రీలంక మాత్రం ఆఖరి మ్యాచ్‌లోనూ తమ జోరుని కొనసాగించి సిరీస్‌ను సొంతం చేసుకోవాలని భావిస్తోంది. కాగా భారత్‌పై శ్రీలంక వన్డే సిరీస్ గెలిచి దాదాపు 27 ఏళ్లు కావస్తోంది. ఇక ఇది ఇలా ఉండగా.. మూడో వన్డేలో టీమిండియా రెండు మార్పులతో బరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది. తొలి రెండు వన్డేల్లో తమ స్ధాయికి తగ్గ ప్రదర్శన చేయకపోయిన కేఎల్ రాహుల్, శివమ్ దూబేపై జట్టు మెనెజ్‌మెంట్ వేటు వేయనున్నట్లు సమాచారం. వారిద్దరి స్ధానంలో రిషబ్ పంత్, రియాన్ పరాగ్‌లకు చోటు ఇవ్వనున్నట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. కేఎల్ రాహుల్ వికెట్ల వెనక కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. రెండో వన్డేలో ఈజీగా క్యాచ్‌లు విడిచి విమర్శలు ఎదుర్కొన్నాడు. ఈ క్రమంలోనే రిషబ్ పంత్‌ను బరిలోకి దించాలని గంభీర్, రోహిత్ శర్మ నిర్ణయించుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.భారత తుది జట్టు(అంచనా)రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, రిషభ్ పంత్, రియాన్ పరాగ్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ సిరాజ్, అర్ష్‌దీప్ సింగ్. -
'గంభీర్ ఒక చిన్న పిల్లాడు.. ఓటమిని అస్సలు జీర్ణించుకోలేడు'
టీమిండియా హెడ్ కోచ్‌గా గౌతం గంభీర్ తన ప్రయణాన్ని విజయంతో ఆరంభించిన సంగతి తెలిసిందే. శ్రీలంకతో గంభీర్ నేతృత్వంలోని భారత జట్టు టీ20 సిరీస్‌ను 3-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసింది. అయితే లంకతో టీ20 సిరీస్‌లో అదరగొట్టిన టీమిండియా వన్డే సిరీస్‌లో మాత్రం తడబడుతోంది.తొలి వన్డేను టైగా ముగించిన భారత జట్టు.. రెండో వన్డేలో మాత్రం 32 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. కాగా రెండో వన్డేలో గంభీర్ తీసుకున్న నిర్ణయాల వల్లే భారత్ పరాజయం పాలైందని అభిమానులు విమర్శిస్తున్నారు. కేఎల్ రాహుల్ వంటి స్టార్ ఆటగాడిని ఏడో స్ధానంలో బ్యాటింగ్ పంపడాన్ని చాలా మంది మాజీలు తప్పబడుతున్నారు.గంభీర్‌కు అహంకారం ఎక్కువని, తను అనుకున్నదే చేస్తాడని మరి కొంతమంది అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో గంభీర్‌ను ఉద్దేశించి తన చిన్ననాటి కోచ్ సంజయ్ భరద్వాజ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. గౌతీ ఇప్పటకి చిన్నపిల్లవాడేనని, అందరని అభిమానిస్తాడని భరద్వాజ్ తెలిపాడు."గంభీర్ ఒక అహంకారి, దూకుడెక్కువని అందరూ అనుకుంటారు. నిజానికి గంభీర్ చాలా మంచివాడు. అందరని గౌరవిస్తాడు. ఎవరికైనా సహాయం చేయడానికి ముందుంటాడు. ఎంతో మంది యువ క్రికెటర్ల కెరీర్‌ను తీర్చిదిద్దాడు. పేసర్ నవదీప్ సైనీ వంటి వాళ్లు గంభీర్ సాయంతోనే క్రికెట్ ప్రపంచానికి పరిచమయ్యారు. అతడు గెలవడం కోసమే కొన్నిసార్లు దూకుడుగా, సీరియస్‌గా ఉంటాడు. ఎందుకంటే అతడికి ఓడిపోవడం ఇష్టముండదు. చాలా సందర్భాల్లో ప్రాక్టీస్ మ్యాచ్‌ల్లో అతడు రాణించలేకపోయినా ఏడ్చేవాడు. ఎవరైనా సీరియస్‌గా ఉన్నంత మాత్రాన వారు మంచి వారు కాదని అనుకోకూడదు. ఎల్లప్పుడూ నవ్వుతూ ఉంటే ఎవరైనా విజయం సాధిస్తారా?ఎలా గెలవాలో అర్థం చేసుకున్న వారు.. ఓటమి నుంచి ఎలా తప్పించుకోవాలో కూడా తెలుసుకోవాలి. గంభీర్ ఆటగాళ్ల టెక్నికల్ అంశాల జోలికి వెళ్లడు. ఆటగాళ్లలో ఆత్మవిశ్వాసం నింపి.. వారి నుంచి మెరుగైన ఫలితాలు రాబట్టడమే గంభీర్ పని. కోచ్‌గా గంభీర్ విజయవంతమవుతాడని నేను భావిస్తున్నాను. ఇప్పటికీ నా దృష్టిలో గంభీర్ ఒక 12 ఏళ్ల చిన్న పిల్లవాడని" భారత మాజీ క్రికెటర్ మంజోత్ కల్రాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సంజయ్ భరద్వాజ్ పేర్కొన్నాడు. -
'హార్దిక్, రాహుల్ కాదు.. రోహిత్ శర్మ తర్వాత అతడే టీమిండియా కెప్టెన్'
టీమిండియా యువ ఓపెనర్ శుబ్‌మన్ గిల్‌పై భారత మాజీ ఫీల్డింగ్ కోచ్ ఆర్ శ్రీధర్ ప్రశంసల వర్షం కురిపించాడు. రోహిత్ శర్మ తర్వాత మూడు ఫార్మాట్లలోనూ భారత జట్టు కెప్టెన్‌గా గిల్ బాధ్యతలు చేపడతాడని శ్రీధర్ జోస్యం చెప్పాడు. కాగా గిల్ ప్రస్తుతం శ్రీలంక పర్యటనలో ఉన్న భారత జట్టు వైస్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు.ఈ లంక టూర్ కోసం టీమిండియా వైస్ కెప్టెన్‌గా స్టార్ ఆటగాళ్లు హార్దిక్ పాండ్యా, కేఎల్ రాహుల్‌ను కాదని మరి గిల్‌ను బీసీసీఐ నియమించింది. అంతకుముందు జింబాబ్వే పర్యటనతో కెప్టెన్‌గా అరంగేట్రం చేసిన గిల్.. తన నాయకత్వ లక్షణాలతో అందరని ఆకట్టుకున్నాడు. జింబాబ్వేతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 4-1తో భారత్ సొంతం చేసుకుంది. టెస్టుల్లో కూడా రోహిత్ డిప్యూటీగా గిల్‌ను నియమించాలని బీసీసీఐ భావిస్తున్నట్లు తెలుస్తోంది."యశస్వీ జైశ్వాల్, శుబ్‌మన్ గిల్ ఇద్దరూ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్నారు. అంతకుముందు ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌లో కూడా వీరిద్దరూ అత్యుత్తమ ప్రదర్శన కనబరిచారు. వన్డేల్లో కూడా అదరగొడుతున్నారు. ముఖ్యంగా శుబ్‌మన్ గిల్ ఎంత చెప్పుకున్న తక్కువే. అతడొక ఆల్ ఫార్మాట్ ప్లేయర్. అతడు ప్రస్తుతం రోహిత్ శర్మ వద్ద కెప్టెన్సీ పాఠాలు నేర్చుకుంటున్నాడు. గిల్లో కూడా నాయకత్వ లక్షణాలు ఉన్నాయి. జింబాబ్వే టూర్లో కెప్టెన్‌గా గిల్ విజయవంతమయ్యాడు. 2027 వన్డే ప్రపంచకప్ తర్వాత అన్ని ఫార్మాట్లలో భారత కెప్టెన్‌గా గిల్ ఎంపికవుతాడని" శ్రీధర్ పేర్కొన్నాడు.చదవండి: టీ20 వరల్డ్‌కప్-2024పై నీలినీడలు! భారత్ వేదికగా? -
రోహిత్- కోహ్లి విషయంలో గంభీర్ నిర్ణయం సరికాదు: మాజీ బౌలర్
శ్రీలంకతో వన్డే సిరీస్ కోసం రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలను జట్టులోకి పిలిపించడం సరైన నిర్ణయం కాదేమోనని టీమిండియా మాజీ బౌలర్ ఆశిష్ నెహ్రా అన్నాడు. ఈ దిగ్గజ బ్యాటర్లకు విశ్రాంతి ఇవ్వకుండా నూతన కోచ్ గౌతం గంభీర్ తప్పుచేశాడని అభిప్రాయపడ్డాడు. రోహిత్- కోహ్లి గంభీర్‌కు కొత్త కాదని.. వారి ఆట తీరు గురించి అతడికి అవగాహన ఉందని నెహ్రా పేర్కొన్నాడు.టీ20 ప్రపంచకప్-2024 తర్వాత అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్‌కు వీడ్కోలు పలికిన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి.. ఈ టోర్నీ తర్వాత సెలవులు తీసుకున్నారు. భార్య రితిక, కూతురు సమైరాలతో కలిసి రోహిత్ అమెరికాకు వెళ్లిపోగా.. కోహ్లి లండన్‌లో ఉన్న తన సతీమణి అనుష్క శర్మ, పిల్లలు వామిక, అకాయ్‌ల దగ్గరకు వెళ్లాడు.ఈ నేపథ్యంలో వీరిద్దరు శ్రీలంకతో వన్డే సిరీస్‌కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు వార్తలు వినిపించాయి. కుటుంబాలతో మరికొన్నాళ్లు ఎక్కువ సమయం గడపాలని భావించిన కోహ్లి- రోహిత్.. ఈ విషయాన్ని ముందుగానే బీసీసీఐతో చర్చించినట్లు సమాచారం. అయితే, చాంపియన్స్ ట్రోఫీ-2025కి ముందు టీమిండియాకు శ్రీలంక, ఇంగ్లండ్‌తో మాత్రమే మ్యాచ్(3+3)లు మిగిలి ఉండటంతో.. గంభీర్ వీరిద్దరిని వెనక్కిపిలిపించాడని తెలిసింది.సీనియర్లు జట్టులో ఉండాలని అతడు భావించాడని.. తన ఆలోచనను కోహ్లి- రోహిత్‌లతో పంచుకోగా వారు లంక పర్యటనకు వచ్చినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఆశిష్ నెహ్రా కీలక వ్యాఖ్యలు చేశాడు. ‘‘టీమిండియా తదుపరి వన్డే సిరీస్‌కు 2- 3 నెలల సమయం ఉంది. నిజానికి ఇలాంటివి అరుదుగా జరుగుతూ ఉంటాయి.అంతకంటే ముందు టెస్టు, టీ20 సిరీస్‌లు జరుగనున్నాయి. అలాంటపుడు రోహిత్, కోహ్లిలను హడావుడిగా రప్పించాల్సిన అవసరం లేదు. నిజానికి శ్రీలంక సిరీస్ ద్వారా ఇతర ఆటగాళ్లకు మరిన్ని అవకాశాలు ఇస్తే బాగుండేది. గంభీర్ కొత్తగా కోచ్‌గా బాధ్యతలు చేపట్టాడు. అనుభవజ్ఞులైన ఆటగాళ్లతో అతడు ఎక్కువ సమయం గడపాలని భావించడం సహజం.అయితే, రోహిత్- కోహ్లి గురించి అతడికి ముందే తెలుసు కదా! ఈ ఇద్దరితో ఎక్కువ సమయం గడిపి వారి ఆట తీరును పరిశీలించిందేకు తనేమీ విదేశీ కోచ్ కాదు. స్వదేశీ సిరీస్‌లు మొదలైన తర్వాత కోహ్లి- రోహిత్ ఎలాగో ఆడతారు. అప్పటిదాకా వేరే వాళ్లకు అవకాశం ఇస్తే బాగుండేది. ఈ విషయంలో నేను గంభీర్‌ను తప్పుబట్టడం లేదు. అయితే, ఇలాంటి వ్యూహాల వల్ల జట్టుకు మేలే చేకూరుతుంది’’ అని ఆశిష్ నెహ్రా సోనీ స్పోర్ట్స్ షోలో వ్యాఖ్యానించాడు. కాగా శ్రీలంకతో ఇప్పటిదాకా రెండు వన్డేల్లో రోహిత్ 122 పరుగులతో రాణించగా.. కోహ్లి మాత్రం కేవలం 38 పరుగులు మాత్రమే చేశాడు. -
27 ఏళ్ల తర్వాత తొలిసారి.. రోహిత్ సేన చెత్త రికార్డు
శ్రీలంక పర్యటనలో టీ20 సిరీస్‌లో దుమ్ములేపిన టీమిండియా.. వన్డేల్లో మాత్రం స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోతోంది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఇప్పటికే తొలి వన్డే టై గా ముగియగా.. రెండో వన్డేల్లో భారత జట్టు పరాజయం పాలైంది. లక్ష్య ఛేదనను ఘనంగా ఆరంభించినప్పటికీ అనూహ్య రీతిలో లంక చేతిలో 32 పరుగుల తేడాతో ఓడిపోయింది.ఈ నేపథ్యంలో టీమిండియా ఓ చెత్త రికార్డు ముంగిట నిలిచింది. హెడ్‌కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత గౌతం గంభీర్ మార్గదర్శనంలో భారత క్రికెట్ జట్టు తొలిసారి లంక పర్యటనకు వెళ్లింది. ఈ క్రమంలో సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 3-0తో క్లీన్‌స్వీప్ చేసి సత్తా చాటింది.అయితే, మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో మాత్రం తడబడుతోంది. తొలి మ్యాచ్ ఫలితం లేకుండానే ముగిసిపోగా.. రెండో వన్డేలో రోహిత్ సేనకు చేదు అనుభవమే మిగిలింది. కొలంబో వేదికగా ఆర్. ప్రేమదాస స్టేడియంలో ఆదివారం నాటి మ్యాచ్‌లో టీమిండియా టాస్ ఓడి తొలుత బౌలింగ్ చేసింది.ఆరంభంలోనే సిరాజ్.. ఓపెనర్ పాతుమ్ నిసాంక వికెట్ తీసి శుభారంభం అందించగా.. మరో ఓపెనర్ అవిష్క ఫెర్నాండో ఆ ఆనందాన్ని ఎక్కువసేపు నిలవనీయలేదు. 40 పరుగులతో రాణించి ఇన్నింగ్స్‌ను గాడినపెట్టగా.. మిగతా వాళ్లు కూడా ఫర్వాలేదనిపించారు. కమిందు మెండిస్ సైతం 40 పరుగులతో రాణించాడు. ఈ క్రమంలో నిర్ణీత 50 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 240 పరుగులు చేసింది.ఇక లక్ష్య ఛేదనలో ఓపెనర్లు రోహిత్ శర్మ(64), శుబ్‌మన్ గిల్(35) అదిరిపోయే ఆరంభం అందించారు. కానీ.. ఆ తర్వాత సీన్పూర్తిగా మారిపోయింది. శ్రీలంక స్పిన్నర్ జెఫ్రె వాండర్సె తన మాయాజాలంతో టీమిండియాను కోలుకోలేని దెబ్బకొట్టాడు.10 ఓవర్లలో బౌలింగ్ కోటాలో కేవలం 19 పరుగులు మాత్రమే ఇచ్చి ఆరు వికెట్లు పడగొట్టాడు. అక్షర్ పటేల్ 44 పరుగులతో కాసేపు పోరాడినా.. వాండర్సె స్పిన్ దెబ్బకు భారత బ్యాటింగ్ ఆర్డర్ కుప్పకూలిపోవడంతో ఓటమి నుంచి తప్పించలేకపోయాడు. 42.2 ఓవర్లలో 208 పరుగులకే టీమిండియా ఆలౌట్ అయింది. ఫలితంగా శ్రీలంక సిరీస్ 1-0తో ముందంజ వేసింది.ఈ నేపథ్యంలో 27 ఏళ్ల తర్వాత.. తొలిసారిగా శ్రీలంకతో ద్వైపాక్షిక వన్డే సిరీస్ గెలవలేని స్థితిలో టీమిండియా నిలిచింది. మూడో వన్డేలో గెలిస్తే.. సిరీస్ 1-1తో సమం అవుతుంది. లేదంటే 2-0తో సిరీస్ కోల్పోయి 27 ఏళ్ల తర్వాత లంకకు వన్డే సిరీస్ కోల్పోయిన భారత జట్టుగా టీమిండియా నిలుస్తుంది. -
విరాట్ కోహ్లిది ఔటా? నాటౌటా? వీడియో వైరల్
ఆదివారం కొలంబో వేదికగా భారత్‌తో జరిగిన రెండో వన్డేలో 32 పరుగుల తేడాతో శ్రీలంక అద్భుత విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్‌లో థర్డ్ అంపైర్ తీసుకున్న ఓ నిర్ణయం వివాదస్పదమైంది. భారత ఇన్నింగ్స్ 15ఓవర్ వేసిన స్పిన్నర్ అకిల దనంజయ బౌలింగ్‌లో ఆఖరి బంతిని విరాట్ కోహ్లి డిఫెన్స్ ఆడటానికి ప్రయత్నించాడు.ఈ క్రమంలో బంతి బ్యాట్‌కు దగ్గరగా వెళ్తూ విరాట్‌కు ఫ్రంట్ ప్యాడ్‌కు తాకింది. వెంటనే లంక ఆటగాళ్లు ఎల్బీడబ్ల్యూకి అప్పీల్ చేశారు. అంపైర్ కూడా వెంటనే ఔట్ అని వేలు పైకెత్తాడు. కానీ కోహ్లి మాత్రం నాన్‌స్ట్రైక్‌లో ఉన్న శుబ్‌మన్ గిల్‌తో చర్చించి డీఆర్ఎస్ తీసుకున్నాడు. అయితే ఈ రివ్యూ థర్డ్ అంపైర్‌కు బిగ్ ఛాలెంజ్‌గా మారింది. రిప్లేలో బంతి విరాట్ బ్యాట్‌ను దాటి వెళ్లి ప్యాడ్‌ను తాకేముందు అల్ట్రాఎడ్జ్‌లో స్పైక్ చూపించింది. కానీ బిగ్ స్క్రీన్‌లో మాత్రం బ్యాట్‌కు, బంతికి క్లియర్ గ్యాప్ ఉన్నట్లు కన్పించింది. ఆఖరికి థర్డ్ అంపైర్ కోహ్లికి ఫేవర్‌గా నాటౌట్ అంటూ తన నిర్ణయాన్ని ప్రకటించాడు. ఇది చూసిన శ్రీలంక ఫీల్డర్లు కోపంతో ఊగిపోయారు. లంక తాత్కాలిక ప్రధాన కోచ్ సనత్ జయసూర్య సైతం ఆసహనం వ్యక్తం చేశాడు. శ్రీలంక వికెట్ కీపర్ కుశాల్ మెండిస్ అయితే తన హెల్మెట్‌ను నెలకేసి కొట్టాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది.చదవండి: IND vs SL: వాషీని కొట్టడానికి వచ్చిన రోహిత్ శర్మ!?.. వీడియో వైరల్ pic.twitter.com/tNx33xlkmR— hiri_azam (@HiriAzam) August 4, 2024 pic.twitter.com/sIQVG7B2TC— hiri_azam (@HiriAzam) August 4, 2024 -
వాషీని కొట్టడానికి వచ్చిన రోహిత్ శర్మ!?.. వీడియో వైరల్
కొలంబో వేదికగా భారత్-శ్రీలంక మధ్య జరిగిన రెండో వన్డేలో ఓ ఫన్నీ సంఘటన చోటు చేసుకుంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తన చర్యతో నవ్వులు పూయించాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది.అసలేం జరిగిందంటే?శ్రీలంక ఇన్నింగ్స్ 32వ ఓవర్ వేసేందుకు భారత స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్ ఎటాక్‌లో వచ్చాడు. అయితే తొలి బంతిని డెలివరీ చేసే క్రమంలో వాషింగ్టన్ తన రన్ఆప్ను కోల్పోయి వికెట్ల దగ్గరకి వచ్చి ఆగిపోయాడు. ఈ క్రమంలో స్లిప్‌లో ఫీల్డింగ్ చేస్తున్న రోహిత్ శర్మ ఇది చూసి నవ్వుకున్నాడు. కాగా రెండో సారి కూడా సుందర్ బంతిని డెలివరీ చేసే క్రమంలో వికెట్ల వద్దకి వచ్చి ఆగిపోయాడు. అయితే ఈసారి మాత్రం హిట్‌మ్యాన్ తనదైన స్టైల్లో స్పందించాడు. స్లిప్‌లో ఫీల్డింగ్ చేస్తున్న రోహిత్ శర్మ.. వాషింగ్టన్ సుందర్‌ను కొట్టేందుకు పరిగెత్తుకుంటా ముందుకు వచ్చాడు. నిన్ను కొట్టేస్తా అన్నట్లు సరదగా రోహిత్ సైగలు చేశాడు. ఇదంతా స్టంప్ మైక్‌లో రికార్డు అయింది. దీంతో వాషీతో పాటు సహచర ఆటగాళ్లంతా ఒక్కసారిగా నవ్వుకున్నారు. కాగా ఈ మ్యాచ్‌లో శ్రీలంక చేతిలో 32 పరుగుల తేడాతో భారత్ ఓటమి పాలైంది. Rohit Sharma is a complete entertainer in the field. 💥👌 pic.twitter.com/cqjlkFxGP3— Johns. (@CricCrazyJohns) August 4, 2024 -
చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ.. సచిన్ ఆల్‌టైమ్ రికార్డు బద్దలు
శ్రీలంకతో వన్డే సిరీస్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తన సూపర్ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. ఆదివారం కొలంబో వేదికగా లంకతో జరిగిన రెండో వన్డేలో రోహిత్ అద్భుతమైన హాఫ్ సెంచరీతో చెలరేగాడు. 44 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్‌లతో హిట్‌మ్యాన్ 64 పరుగులు చేశాడు.ఈ క్రమంలో రోహిత్ శర్మ పలు అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక ఫిప్టీ ప్లస్ స్కోర్లు సాధించిన భారత ఓపెనర్‌గా రోహిత్ రికార్డులకెక్కాడు. రోహిత్ ఇప్పటివరకు 121 సార్లు 50 ప్లస్ పరుగులు సాధించాడు. ఇంతకుముందు ఈ రికార్డు భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ పేరిట ఉండేది. సచిన్ తన అంతర్జాతీయ కెరీర్లో భారత ఓపెనర్‌గా 120 సార్లు 50కిపైగా స్కోర్లు నమోదు చేశాడు. తాజా మ్యాచ్‌తో సచిన్ ఆల్‌టైమ్ రికార్డును రోహిత్ బ్రేక్ చేశాడు. ఓవరాల్‌గా ఈ ఘనత సాధించిన జాబితాలో హిట్‌మ్యాన్ ఆరో స్ధానంలో నిలిచాడు. తొలి స్ధానంలో ఆసీస్ స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్(146 ఫిఫ్టీ ప్లస్ స్కోర్లు) అగ్రస్ధానంలో ఉన్నాడు.అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక 50 ప్లస్ స్కోర్లు సాధించిన ఆటగాళ్లు 1. డేవిడ్ వార్నర్ - 146 (374 మ్యాచ్‌లు)2. క్రిస్ గేల్ - 144 (441 మ్యాచ్‌లు)3. సనత్ జయసూర్య - 136 (: 506 మ్యాచ్‌లు)4. డెస్మండ్ హేన్స్ - 131 ( 354 మ్యాచ్‌లు)5. గ్రేమ్ స్మిత్ - 125 (342 మ్యాచ్‌లు)6. రోహిత్ శర్మ - 121 (334 మ్యాచ్‌లు)ఇక ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ మరో ఘనతను కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. వన్డేల్లో అత్యధిక పరుగులు సాధించిన భారత ఆటగాళ్ల జాబితాలో భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీని ఈ ముంబైకర్ అధిగమించాడు. ధోనీ మొత్తం 10,773 సాధించగా.. రోహిత్ ఇప్పటివరకు వన్డేల్లో 10,831 చేరాడు. వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో ధోనిని వెనక్కి నెట్టి ఐదో స్ధానానికి హిట్‌మ్యాన్ చేరుకున్నాడు. -
అతడే మా కొంపముంచాడు.. మేము అనుకున్నది జరగలేదు: రోహిత్ శర్మ
శ్రీలంకతో మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఆదివారం జరిగిన రెండో మ్యాచ్‌లో భారత్ 32 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఈజీగా గెలవాల్సిన మ్యాచ్‌లో వరుస క్రమంలో వికెట్లు కోల్పోయి టీమిండియా ఓటమి చవిచూసింది. మరోసారి స్పిన్ వలలో భారత్ చిక్కుకుంది.ఈ మ్యాచ్‌లో ఏకంగా 9 మంది భారత బ్యాటర్లు స్పిన్నర్లకే తమ వికెట్లు సమర్పించుకున్నారు. రోహిత్ శర్మ, శుబ్‌మన్ గిల్ అద్భుతమైన ఆరంభమిచ్చినప్పటకి.. మిడిలార్డర్ మాత్రం పేక మేడలా కుప్పకూలింది. 241 పరుగుల స్వల్ప లక్ష్య చేధనలో 208 పరుగులకే టీమిండియా ఆలౌటైంది. లంక బౌలర్లలో స్పిన్నర్ జెఫ్రీ వాండర్సే 6 వికెట్లతో టీమిండియా పతనాన్ని శాసించాడు. ఇక ఈ ఓటమి పై మ్యాచ్ అనంతరం భారత కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించాడు. పేలవ బ్యాటింగ్ కారణంగా తాము ఓడిపోయామని రోహిత్ శర్మ అంగీకరించాడు.అతడి వల్లే ఓడిపోయాం: రోహిత్"మ్యాచ్ ఓడినప్పుడు ప్రతీది మనల్ని భాదిస్తుంది. నేను చెబుతున్నది కేవలం ఆఖరి 10 ఓవర్లకు సంబంధించి మాత్రమే కాదు. ప్రతీ మ్యాచ్‌లో నిలకడగా ఆడడం చాలా ముఖ్యం. గత కొన్ని మ్యాచ్‌ల్లో ఆలానే ఆడుతున్నాం. కానీ దురదృష్టవశాత్తూ ఈ మ్యాచ్‌లో మేము సమిష్టగా విఫలమయ్యాం. ఈ ఓటమి మమ్మల్ని తీవ్ర నిరాశకు గురిచేసింది. కానీ క్రికెట్లో అప్పుడప్పుడు ఇలా జరుగుతుంటుంది. మనముందు సవాళ్లను స్వీకరించేందుకు ఎల్లప్పుడూ సిద్దంగా ఉండాలి. స్పిన్నర్లకు లెఫ్ట్-రైట్ కాంబనేషన్లలో స్ట్రైక్ రొటేట్ చేయడం ఈజీగా ఉంటుందని భావించాము. అందుకే దూబేను ముందుగా బ్యాటింగ్ పంపించాము. కానీ జెఫ్రీ మాత్రం మా వ్యూహాలను దెబ్బతీశాడు. 6 వికెట్ల పడగొట్టి మ్యాచ్‌ను మా నుంచి లాగేసాడు. కచ్చితంగా అతడికి క్రెడిట్ ఇవ్వాల్సిందే. నేను దూకుడుగా ఆడటం వల్లే 65 పరుగులు చేయగలిగాను. నా బ్యాటింగ్‌లో చాలా రిస్క్ షాట్లు ఉంటాయి. ఆ ప్రయత్నంలో తొందరగా వికెట్ కోల్పోతే నిరాశకు లోనవతాను. ఏదమైనప్పటకి పవర్‌ప్లేలో దాటిగా ఆడి పరుగులు రాబట్టడమే నా ఉద్దేశ్యం. ఈ పిచ్ స్వభావం మేం అర్థం చేసుకున్నాం. మిడిల్ ఓవర్లలో ఈ వికెట్‌పై ఆడటం చాలా కష్టం. తొలి పవర్ ప్లేలోనే వీలైనన్ని పరుగులు చేయాలి. ఈ రోజు మేము అది చేయలేకపోయాం. అయితే ఈ ఓటమిని పెద్దగా చూడాల్సిన అవసరం లేదు. కానీ మిడిల్ ఓవర్లలో మా బ్యాటింగ్ తీరుపై చర్చించాల్సిన అవసరముందని" పోస్ట్ మ్యాచ్ కాన్ఫరెన్స్‌లో రోహిత్ పేర్కొన్నాడు. -
6 వికెట్లతో భారత్‌కు చుక్కలు చూపించాడు.. ఎవరీ జెఫ్రీ వాండర్సే?
కొలంబో వేదికగా జరిగిన రెండో వన్డేలో భారత జట్టుకు శ్రీలంక ఊహించని షాకిచ్చింది. తొలి వన్డేను టైగా ముగించిన శ్రీలంక.. రెండో వన్డేలో మాత్రం 32 పరుగుల తేడాతో భారత్‌ను చిత్తు చేసింది. తొలి వన్డేలో ఏ విధంగా అయితే స్పిన్ వలలో చిక్కుకుని భారత్ విల్లవిల్లాడందో. సేమ్ టూ సేమ్ రెండో వన్డేలో కూడా అంతే. 241 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టు.. రోహిత్ శర్మ మెరుపులతో 13 ఓవర్లు ముగిసే సరికి వికెట్ నష్టపోకుండా 97 పరుగులు చేసింది.దీంతో లక్ష్యాన్ని టీమిండియా సునాయసంగా చేధిస్తుందని అంతా భావించారు. కానీ అందరి అంచనాలను శ్రీలంక స్పిన్నర్ జెఫ్రీ వాండర్సే తలకిందులు చేశాడు. తన స్పిన్ మాయాజాలంతో ప్రత్యర్ధి బ్యాటర్లను ఉక్కిరిబిక్కిరి చేశాడు. 13 ఓవర్లో రోహిత్ శర్మను ఔట్ చేసి వికెట్ల వేట మొదలు పెట్టిన వాండర్సే.. ఆ తర్వాత విరాట్ కోహ్లి, శివమ్ దూబేలను వరుస క్రమంలో పెవిలియన్‌కు పంపాడు.జెఫ్రీ ఓంటి చేత్తో మ్యాచ్‌ను మలుపు తిప్పాడు. ఓవరాల్‌గా 6 వికెట్ల పడగొట్టి తన జట్టుకు అద్భుతమైన విజయాన్ని అందించాడు. ప్లేయర్ ఆఫ్‌ది మ్యాచ్‌గా నిలిచిన వాండర్సే.. తన 10 ఓవర్ల బౌలింగ్ కోటాలో కేవలం 33 పరుగులు మాత్రమే ఇచ్చి 6 వికెట్లు సాధించాడు. ఈ నేపథ్యంలో ఎవరీ వాండర్సే అని నెటిజన్లు తెగ వేతికేస్తున్నారు.ఎవరీ వాండర్సే...?భారత్‌తో మూడు వన్డేల సిరీస్‌కు తొలుత ప్రకటించిన శ్రీలంక జట్టులో వాండర్సేకు చోటు దక్కలేదు. అయితే రెండో వన్డేకు ముందు స్టార్ ఆల్‌రౌండర్ వనిందు హసరంగా గాయం బారిన పడడంతో అనుహ్యంగా వాండర్సే లంక జట్టులోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పుడు తనకు వచ్చిన అవకాశాన్ని వాండర్సే అందిపుచ్చుకున్నాడు. కాగా 34 ఏళ్ల వాండర్సే 2015లో న్యూజిలాండ్‌పై శ్రీలంక తరపున వన్డేల్లో అరంగేట్రం చేశాడు. తన డెబ్యూ మ్యాచ్‌లో వాండర్సే కేవలం రెండు ఓవర్లు మాత్రమే వేసి ఏకంగా 34 పరుగులు సమర్పించుకున్నాడు.ఆ తర్వాత అతడి వన్డేల్లో పెద్దగా అవకాశాలు రాలేదు. తన 9 ఏళ్ల కెరీర్లో ఇప్పటివరకు అతడు ఆడింది కేవలం 22 వన్డేలు మాత్రమే. అయితే లిస్ట్-ఎ క్రికెట్లో మాత్రం వాండర్సేకు అపారమైన అనుభవం ఉంది. 102 మ్యాచ్‌ల లిస్ట్-ఎ మ్యాచ్‌ల్లో 3560 పరుగులతో పాటు 150 వికెట్లు పడగొట్టాడు.దేశీవాళీ క్రికెట్లో మూర్స్ ఎసీ, సీదువ రద్దోలువ సీసీ క్లబ్స్‌కు వాండర్సే ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఇక వాండర్సే ఇప్పటివరకు ఓవరాల్‌గా 37 మ్యాచ్‌ల్లో శ్రీలంక తరపున ఆడాడు. అందులో 22 వన్డేలు, 14 టీ20లు, ఒక టెస్టు మ్యాచ్ ఉన్నాయి.అదే విధంగా వాండర్సే తన కెరీర్లో ఓ వివాదంలో కూడా చిక్కుకున్నాడు. 2018 వెస్టిండీస్ పర్యటనలో శ్రీలంక క్రికెట్ నిబంధనలను ఉల్లఘించినందుకు వాండర్సే ఏడాది పాటు నిషేదం ఎదుర్కొన్నాడు. అంతేకాకుండా వార్షిక కాంట్రాక్ట్ ఫీజులో 20% జరిమానా కూడా శ్రీలంక క్రికెట్ విధించింది. -
టీమిండియాకు షాక్.. రెండో వన్డేలో శ్రీలంక సంచలన విజయం
శ్రీలంకతో జరిగిన రెండో వన్డేలో టీమిండియాకు ఊహించని పరాభవం ఎదురైంది. ఈ మ్యాచ్‌లో భారత్ 32 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. 241 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్‌ను లంక స్పిన్నర్ జెఫ్రీ వాండర్సే (10-0-33-6) దారుణంగా దెబ్బతీశాడు. వాండర్సేకు అసలంక (6.2-2-20-3) కూడా తోడవ్వడంతో టీమిండియా 208 పరుగులకు (42.2 ఓవర్లలో) ఆలౌటైంది. ఛేదనలో రోహిత్ శర్మ మెరుపు హాఫ్ సెంచరీతో (44 బంతుల్లో 64; 5 ఫోర్లు, 4 సిక్సర్లు) టీమిండియాకు శుభారంభాన్ని అందించాడు. దీన్ని భారత్ సద్వినియోగం చేసుకోలేకపోయింది. భారత ఇన్నింగ్స్‌లో రోహిత్‌తో పాటు శుభ్‌మన్ గిల్ (35), అక్షర్ పటేల్ (44) మాత్రమే ఓ మోస్తరు స్కోర్లు చేశారు. విరాట్ (14), శివమ్ దూబే (0), శ్రేయస్ అయ్యర్ (7), కేఎల్ రాహుల్ (0) దారుణంగా విఫలమయ్యారు.ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 240 పరుగులు చేసింది. లంక ఇన్నింగ్స్‌లో పథుమ్ నిస్సంక 0, అవిష్క ఫెర్నాండో 40, కుశాల్ మెండిస్ 30, సమరవిక్రమ 14, అసలంక 25, లియనగే 12, వెల్లలగే 37, కమిందు మెండిస్ 40, అఖిల ధనంజయ 15 పరుగులు చేసి ఔట్ కాగా.. జెఫ్రీ వాండర్సే 1 పరుగుతో అజేయంగా నిలిచారు. భారత బౌలర్లలో వాషింగ్టన్ సుందర్ అద్భుతంగా బౌలింగ్ చేసి మూడు వికెట్లు పడగొట్టగా.. కుల్దీప్ యాదవ్ 2, సిరాజ్, అక్షర్ పటేల్ తలో వికెట్ పడగొట్టారు. ఈ గెలుపుతో శ్రీలంక మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. తొలి వన్డే టైగా ముగిసిన విషయం తెలిసిందే. సిరీస్‌లో చివరిదైన మూడో వన్డే ఆగస్ట్ 7న జరుగనుంది. -
IND VS SL 2nd ODI: శ్రేయస్ అయ్యర్ సూపర్ త్రో.. నమ్మశక్యంకాని రీతిలో రనౌట్
శ్రీలంకతో జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా ఆటగాడు శ్రేయస్ అయ్యర్ సూపర్ త్రోతో అలరించాడు. ఈ మ్యాచ్‌లో అయ్యర్.. క్రీజ్‌లో కుదురుకున్న కమిందు మెండిస్‌ను (40) అద్భుతమైన డైరెక్ట్ త్రోతో పెవిలియన్‌కు పంపాడు. ఈ విన్యాసాన్ని చూసిన వారంతా ఔరా అనుకున్నారు. శ్రేయస్ సూపర్ త్రోకు సంబంధించిన వీడియో నెట్టింట షికార్లు చేస్తుంది.What a direct hit from Shreyas Iyer. 🤯🎯pic.twitter.com/VqZeVfbetk— Mufaddal Vohra (@mufaddal_vohra) August 4, 2024మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 240 పరుగులు చేసింది. లంక ఇన్నింగ్స్‌లో పథుమ్ నిస్సంక 0, అవిష్క ఫెర్నాండో 40, కుశాల్ మెండిస్ 30, సమరవిక్రమ 14, అసలంక 25, లియనగే 12, వెల్లలగే 37, కమిందు మెండిస్ 40, అఖిల ధనంజయ 15 పరుగులు చేసి ఔట్ కాగా.. జెఫ్రీ వాండర్సే 1 పరుగుతో అజేయంగా నిలిచారు. భారత బౌలర్లలో వాషింగ్టన్ సుందర్ అద్భుతంగా బౌలింగ్ చేసి మూడు వికెట్లు పడగొట్టగా.. కుల్దీప్ యాదవ్ 2, సిరాజ్, అక్షర్ పటేల్ తలో వికెట్ పడగొట్టారు.241 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన టీమిండియా ధాటిగా ఇన్నింగ్స్‌ను ప్రారంభించింది. రోహిత్ శర్మ కేవలం 29 బంతుల్లోనే 5 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో సిరీస్‌లో వరుసగా రెండో ఫిఫ్టీ పూర్తి చేశాడు. రోహిత్ సిక్సర్‌తో హాఫ్ సెంచరీని పూర్తి చేయడం విశేషం.19 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 123/3గా ఉంది. ఈ మ్యాచ్‌లో భారత్ గెలవాలంటే మరో 118 పరుగులు చేయాల్సి ఉంది. క్రీజ్‌లో కోహ్లి (14), అక్షర్ పటేల్ (7) ఉన్నారు. -
IND VS SL 2nd ODI: బంతి పట్టిన హిట్‌మ్యాన్.. వైరల్ వీడియో
ప్రస్తుత శ్రీలంక పర్యటనలో టీమిండియా స్పెషలిస్ట్ బ్యాటర్లు పార్ట్ టైమ్ బౌలర్లుగా అవతారమెత్తుతున్నారు. టీ20 సిరీస్‌లో సూర్యకుమార్ యాదవ్, రింకూ సింగ్ బంతితో మ్యాజిక్ చేయగా.. తొలి వన్డేలో శుభ్‌మన్ గిల్, రెండో వన్డేలో రోహిత్ శర్మ బంతితో మ్యాజిక్ చేసే ప్రయత్నం చేశారు. శ్రీలంకతో ఇవాళ జరుగుతున్న మ్యాచ్‌లో రోహిత్ రెండు ఓవర్లు వేసి పర్వాలేదనిపించాడు. క్రీజ్‌లో ఇద్దరు లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్లు ఉండటంతో హిట్‌మ్యాన్ తనలోని ఆఫ్ స్పిన్ బౌలింగ్ నైపుణ్యాన్ని వెలికితీశాడు. రోహిత్ రెండు ఓవర్లలో 11 పరుగులిచ్చాడు. రోహిత్ అంతర్జాతీయ వేదికపై ఎక్కువగా బౌలింగ్ చేయనప్పటికీ.. ఐపీఎల్ మంచి ట్రాక్ రికార్డే ఉంది. ఐపీఎల్లో హిట్‌మ్యాన్ పేరిట హ్యాట్రిక్ కూడా ఉంది.Rohit Sharma this series:Batting ✅Bowling ✅Captaincy ✅Watch #SLvIND 2nd ODI LIVE NOW on #SonyLIV 🍿 pic.twitter.com/qBIl1vNwsU— Sony LIV (@SonyLIV) August 4, 2024మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 240 పరుగులు చేసింది. లంక ఇన్నింగ్స్‌లో పథుమ్ నిస్సంక 0, అవిష్క ఫెర్నాండో 40, కుశాల్ మెండిస్ 30, సమరవిక్రమ 14, అసలంక 25, లియనగే 12, వెల్లలగే 37, కమిందు మెండిస్ 40, అఖిల ధనంజయ 15 పరుగులు చేసి ఔట్ కాగా.. జెఫ్రీ వాండర్సే 1 పరుగుతో అజేయంగా నిలిచారు. భారత బౌలర్లలో వాషింగ్టన్ సుందర్ అద్భుతంగా బౌలింగ్ చేసి మూడు వికెట్లు పడగొట్టగా.. కుల్దీప్ యాదవ్ 2, సిరాజ్, అక్షర్ పటేల్ తలో వికెట్ పడగొట్టారు. All-rounders in India's limited-overs set up after T20 World Cup 2024 💹📸: Sony LIV pic.twitter.com/oorO7IJdIR— CricTracker (@Cricketracker) August 4, 2024 -
శ్రీలంకతో రెండో వన్డే.. టీమిండియా లక్ష్యం ఎంతంటే..?
కొలంబో వేదికగా భారత్‌తో జరుగుతున్న రెండో వన్డేలో శ్రీలంక తొలుత బ్యాటింగ్ చేసి (టాస్ గెలిచి) నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 240 పరుగులు చేసింది. లంక ఇన్నింగ్స్‌లో పథుమ్ నిస్సంక 0, అవిష్క ఫెర్నాండో 40, కుశాల్ మెండిస్ 30, సమరవిక్రమ 14, అసలంక 25, లియనగే 12, వెల్లలగే 37, కమిందు మెండిస్ 40, అఖిల ధనంజయ 15 పరుగులు చేసి ఔట్ కాగా.. జెఫ్రీ వాండర్సే 1 పరుగుతో అజేయంగా నిలిచారు. భారత బౌలర్లలో వాషింగ్టన్ సుందర్ అద్భుతంగా బౌలింగ్ చేసి మూడు వికెట్లు పడగొట్టగా.. కుల్దీప్ యాదవ్ 2, సిరాజ్, అక్షర్ పటేల్ తలో వికెట్ పడగొట్టారు. కాగా, మూడు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో తొలి వన్డే టైగా ముగిసిన విషయం తెలిసిందే. -
IND VS SL 2nd ODI: మొహమ్మద్ సిరాజ్ అరుదైన ఘనత
శ్రీలంకతో జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా పేసర్ మొహమ్మద్ సిరాజ్ అరుదైన ఘనత సాధించాడు. ఈ మ్యాచ్‌లో సిరాజ్ ఇన్నింగ్స్ తొలి బంతికే వికెట్ (పథుమ్ నిస్సంక) తీశాడు. తద్వారా వన్డేల్లో ఈ ఘనత సాధించిన నాలుగో భారత బౌలర్‌గా రికార్డుల్లోకెక్కాడు. గతంలో దేబశిష్ మహంతి, జహీర్ ఖాన్, ప్రవీణ్ కుమార్ భారత్ తరఫున తొలి బంతికే వికెట్ తీశారు. వీరిలో జహీర్ ఖాన్ అత్యధికంగా నాలుగు సార్లు ఈ ఘనత సాధించాడు.దేబశిష్ మహంతి- 1999లో వెస్టిండీస్‌పై (రిడ్లే జాకబ్స్)జహీర్ ఖాన్- 2001లో న్యూజిలాండ్‌పై (మాథ్యూ సింక్లెయిర్)జహీర్ ఖాన్- 2002లో శ్రీలంకపై (సనత్ జయసూర్య)జహీర్ ఖాన్- 2007లో ఆస్ట్రేలియాపై (మైఖేల్ క్లార్క్)జహీర్ ఖాన్- 2009లో శ్రీలంకపై (ఉపుల్ తరంగ)ప్రవీణ్ కుమార్- 2010లో శ్రీలంకపై (ఉపుల్ తరంగ)మొహమ్మద్ సిరాజ్- 2024లో శ్రీలంకపై (పథుమ్ నిస్సంక)మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక 45 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తుంది. పథుమ్ నిస్సంక 0, అవిష్క ఫెర్నాండో 40, కుశాల్ మెండిస్ 30, సమరవిక్రమ 14, అసలంక 25, లియనగే 12 పరుగులు చేసి ఔట్ కాగా.. వెల్లలగే (37), కమిందు మెండిస్ (18) క్రీజ్‌లో ఉన్నారు. భారత బౌలర్లలో వాషింగ్టన్ సుందర్ అద్భుతంగా బౌలింగ్ చేసి మూడు వికెట్లు పడగొట్టగా.. సిరాజ్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ తలో వికెట్ పడగొట్టారు. -
శ్రీలంకతో రెండో వన్డే.. టీమిండియా ఓటమి
IND VS SL 2nd ODI Updates And Highlights: శ్రీలంకతో జరిగిన రెండో వన్డేలో టీమిండియాకు ఊహించని పరాభవం ఎదురైంది. ఈ మ్యాచ్‌లో భారత్ 32 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. 241 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్‌ను లంక స్పిన్నర్ జెఫ్రీ వాండర్సే (10-0-33-6) దారుణంగా దెబ్బతీశాడు. వాండర్సేకు అసలంక (6.2-2-20-3) కూడా తోడవ్వడంతో టీమిండియా 208 పరుగులకు (42.2 ఓవర్లలో) ఆలౌటైంది. ఛేదనలో రోహిత్ శర్మ మెరుపు హాఫ్ సెంచరీతో (44 బంతుల్లో 64; 5 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరుపు ఆరంభాన్ని అందించినప్పటికీ.. భారత్ సద్వినియోగం చేసుకోలేకపోయింది. భారత ఇన్నింగ్స్‌లో రోహిత్‌తో పాటు శుభ్‌మన్ గిల్ (35), అక్షర్ పటేల్ (44) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. విరాట్ (14), శివమ్ దూబే (0), శ్రేయస్ అయ్యర్ (7), కేఎల్ రాహుల్ (0) దారుణంగా విఫలమయ్యారు.ఓటమి దిశగా టీమిండియా190 పరుగుల వద్ద టీమిండియా ఎనిమిదో వికెట్ కోల్పోయింది. అసలంక బౌలింగ్‌లో వాషింగ్టన్ సుందర్ (15) ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు.ఏడో వికెట్ కోల్పోయిన టీమిండియాఅసలంక అద్భుతమైన క్యాచ్ పట్టి అక్షర్ పటేల్‌ను (44) పెవిలియన్‌కు పంపాడు. వాండర్సే మాయాజాలంజెఫ్రీ వాండర్సే తన అద్భుతమైన స్పిన్ మాయాజాలంతో టీమిండియాను ఇరుకున పడేశాడు. ఇప్పటికే నాలుగు వికెట్లు పడగొట్టిన అతను.. స్వల్ప వ్యవధిలో మరో రెండు వికెట్లు కూల్చాడు. శ్రేయస్ అయ్యర్ (7), కేఎల్ రాహుల్ (0) 14 పరుగుల వ్యవధిలో పెవిలియన్ బాట పట్టారు. 26 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 155/6గా ఉంది. అక్షర్ పటేల్ (27), వాషింగ్టన్ సుందర్ (4) క్రీజ్‌లో ఉన్నారు. ఈ మ్యాచ్‌లో టీమిండియా గెలవాలంటే మరో 86 పరుగులు చేయాలి. చేతిలో నాలుగు వికెట్లు మాత్రమే ఉన్నాయి.నాలుగో వికెట్ కోల్పోయిన టీమిండియా.. కోహ్లి ఔట్123 పరుగుల వద్ద టీమిండియా నాలుగో వికెట్ కోల్పోయింది. వాండర్సే బౌలింగ్‌లో విరాట్ కోహ్లి (14) ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. అక్షర్ పటేల్ (7), శ్రేయస్ (7) క్రీజ్‌లో ఉన్నారు. వాండర్సేకు ఇది నాలుగో వికెట్. 116 పరుగుల వద్ద రెండు వికెట్లు కోల్పోయిన భారత్116 పరుగుల వద్ద భారత్ రెండు వికెట్లు కోల్పోయింది. శుభ్‌మన్ గిల్ (35), శివమ్ దూబేను (0) వాండర్సే ఒకే ఓవర్లో ఔట్ చేశాడు. 19 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 123/3గా ఉంది. ఈ మ్యాచ్‌లో భారత్ గెలవాలంటే మరో 118 పరుగులు చేయాల్సి ఉంది.A six over extra cover to bring up his fifty. 🔥- Rohit Sharma in a crazy touch! pic.twitter.com/hI57R7T7Ik— Mufaddal Vohra (@mufaddal_vohra) August 4, 2024తొలి వికెట్ కోల్పోయిన టీమిండియా97 పరుగుల వద్ద టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది. వాండర్సే బౌలింగ్‌లో నిస్సంక సూపర్ క్యాచ్ పట్టడంతో రోహిత్ శర్మ (44 బంతుల్లో 64; 5 ఫోర్లు, 4 సిక్సర్లు) వెనుదిరిగాడు. 14 ఓవర్ల తర్వాత భారత్ స్కోర్ 102/1గా ఉంది. శుభ్‌మన్ గిల్ (31), విరాట్ కోహ్లి (5) క్రీజ్‌లో ఉన్నారు. సిక్సర్‌తో హాఫ్ సెంచరీ పూర్తి చేసిన రోహిత్241 పరుగుల లక్ష్య ఛేదనలో టీమిండియా ధాటిగా ఇన్నింగ్స్‌ను ప్రారంభించింది. రోహిత్ శర్మ కేవలం 29 బంతుల్లోనే 5 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో సిరీస్‌లో వరుసగా రెండో ఫిఫ్టీ పూర్తి చేశాడు. రోహిత్ సిక్సర్‌తో హాఫ్ సెంచరీని పూర్తి చేయడం విశేషం. 10 ఓవర్ల తర్వాత భారత్ స్కోర్ 76/0గా ఉంది. రోహిత్‌కు (51) జతగా శుభ్‌మన్ గిల్ (23) క్రీజ్‌లో ఉన్నాడు.టీమిండియా టార్గెట్ 241కొలంబో వేదికగా భారత్‌తో జరుగుతున్న రెండో వన్డేలో శ్రీలంక తొలుత బ్యాటింగ్ చేసి (టాస్ గెలిచి) నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 240 పరుగులు చేసింది. లంక ఇన్నింగ్స్‌లో పథుమ్ నిస్సంక 0, అవిష్క ఫెర్నాండో 40, కుశాల్ మెండిస్ 30, సమరవిక్రమ 14, అసలంక 25, లియనగే 12, వెల్లలగే 37, కమిందు మెండిస్ 40, అఖిల ధనంజయ 15 పరుగులు చేసి ఔట్ కాగా.. జెఫ్రీ వాండర్సే 1 పరుగుతో అజేయంగా నిలిచారు. భారత బౌలర్లలో వాషింగ్టన్ సుందర్ అద్భుతంగా బౌలింగ్ చేసి మూడు వికెట్లు పడగొట్టగా.. కుల్దీప్ యాదవ్ 2, సిరాజ్, అక్షర్ పటేల్ తలో వికెట్ పడగొట్టారు. ఏడో వికెట్ కోల్పోయిన శ్రీలంక208 పరుగుల వద్ద శ్రీలంక ఏడో వికెట్ కోల్పోయింది. కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో శివమ్ దూబేకు క్యాచ్ ఇచ్చి వెల్లలగే (39) ఔటయ్యాడు.208 పరుగుల వద్ద శ్రీలంక ఏడో వికెట్ కోల్పోయింది. కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో శివమ్ దూబేకు క్యాచ్ ఇచ్చి వెల్లలగే (39) ఔటయ్యాడు.ఆరో వికెట్ కోల్పోయిన శ్రీలంక136 పరుగుల వద్ద శ్రీలంక మరో వికెట్ కోల్పోయింది. వాషింగ్టన్ సుందర్ బౌలింగ్‌లో అక్షర్ పటేల్‌కు క్యాచ్ ఇచ్చి అసలంక (25) ఔటయ్యాడు.136 పరుగులకే సగం వికెట్లు కోల్పోయిన శ్రీలంకశ్రీలంక 136 పరుగులకే సగం వికెట్లు కోల్పోయింది. కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో అతనికే క్యాచ్ ఇచ్చి జనిత్ లియనాగే (12) ఔటయ్యాడు.నాలుగో వికెట్ కోల్పోయిన శ్రీలంక111 పరుగుల వద్ద శ్రీలంక నాలుగో వికెట్ కోల్పోయింది. అక్షర్ పటేల్ బౌలింగ్‌లో విరాట్ కోహ్లికి క్యాచ్ ఇచ్చి సమరవిక్రమ (14) ఔటయ్యాడు.వరుస ఓవర్లలో రెండు వికెట్లు తీసిన సుందర్వాషింగ్టన్ తన స్పెల్ రెండో ఓవర్ చివరి బంతికి, మూడో ఓవర్ తొలి బంతికి వికెట్లు తీశాడు. ఇన్నింగ్స్ 17వ ఓవర్ చివరి బంతికి ఆవిష్క ఫెర్నాండో (40).. 19వ ఓవర్ తొలి బంతికి కుశాల్ మెండిస్ (30) ఔటయ్యారు. 19 ఓవర్ల తర్వాత శ్రీలంక స్కోర్ 80/3గా ఉంది. చరిత్ అసలంక (1), సమరవిక్రమ (0) క్రీజ్‌లో ఉన్నారు.తొలి బంతికే వికెట్ కోల్పోయిన శ్రీలంకతొలుత బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక ఇన్నింగ్స్ తొలి బంతికే వికెట్ కోల్పోయింది. సిరాజ్ బౌలింగ్‌లో వికెట్‌కీపర్ కేఎల్ రాహుల్‌కు క్యాచ్ ఇచ్చి పథుమ్ నిస్సంక ఔటయ్యాడు. WICKET ON THE FIRST BALL BY MOHAMMAD SIRAJ. 🔥- Siraj, a beast against Sri Lanka!pic.twitter.com/7i7IeWcsGr— Mufaddal Vohra (@mufaddal_vohra) August 4, 2024టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంకకొలొంబో వేదికగా భారత్‌తో జరుగుతున్న రెండో వన్డేలో శ్రీలంక టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. తుది జట్లుశ్రీలంక: పాతుమ్ నిస్సాంక, అవిష్క ఫెర్నాండో, కుసల్ మెండిస్(వికెట్ కీపర్), సదీర సమరవిక్రమ, చరిత్ అసలంక(కెప్టెన్), కమిందు మెండిస్, జనిత్ లియానగే, దునిత్ వెల్లలాగే, అకిలా దనంజయ, అసిత ఫెర్నాండో, జెఫ్రీ వాండర్సేభారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్ (వికెట్ కీపర్), శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, అర్ష్‌దీప్ సింగ్ -
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక.. తుది జట్లు ఇవే
కొలంబో వేదికగా శ్రీలంక-భారత్ జట్లు రెండో వన్డేలో తలపడతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. శ్రీలంక రెండు మార్పులతో బరిలోకి దిగింది. ఈ మ్యాచ్‌కు స్టార్ ఆల్‌రౌండర్ వనిందు హసరంగా దూరం కాగా.. పేసర్ షిరాజ్‌ను శ్రీలంక మెనెజ్‌మెంట్ పక్కన పెట్టింది. వీరిద్దరి స్ధానాల్లో జెఫ్రీ వాండర్సే, కమిందు మెండీస్ తుది జట్టులోకి వచ్చారు. మరోవైపు భారత్ మాత్రం ఎటువంటి మార్పులు లేకుండా ఆడుతోంది. కాగా ఇదే వేదికలో ఇరు జట్ల మధ్య జరిగిన తొలి వన్డే టై గా ముగిసింది.తుది జట్లుశ్రీలంక: పాతుమ్ నిస్సాంక, అవిష్క ఫెర్నాండో, కుసల్ మెండిస్(వికెట్ కీపర్), సదీర సమరవిక్రమ, చరిత్ అసలంక(కెప్టెన్), కమిందు మెండిస్, జనిత్ లియానగే, దునిత్ వెల్లలాగే, అకిలా దనంజయ, అసిత ఫెర్నాండో, జెఫ్రీ వాండర్సేభారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్ (వికెట్ కీపర్), శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, అర్ష్‌దీప్ సింగ్ -
అరుదైన రికార్డుపై కన్నేసిన రోహిత్ శర్మ.. 2 పరుగుల దూరంలో
కొలంబో వేదికగా ఆదివారం శ్రీలంకతో రెండో వన్డేలో తలపడేందుకు టీమిండియా సిద్దమైంది. ఈ మ్యాచ్‌కు ముందు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మను ఓ అరుదైన రికార్డు ఊరిస్తోంది. ఈ మ్యాచ్‌లో రోహిత్ మరో 2 పరుగులు సాధిస్తే వన్డే క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన నాలుగో ఆటగాడిగా నిలుస్తాడు. ప్రస్తుతం వన్డే ఫార్మాట్లో రోహిత్ 10,767 పరుగులతో ఐదో స్థానంలో ఉన్నాడు. అదేవిధంగా ఈ రికార్డు ప్రస్తుతం టీమిండియా మాజీ క్రికెటర్ రాహుల్ ద్రవిడ్(10,768) పేరిట ఉంది. ఇప్పుడు కొలంబో వన్డేలో హిట్‌మ్యాన్ కేవలం రెండు పరుగులు చేస్తే ద్రవిడ్‌ను అధిగమిస్తాడు.ఈ అరుదైన ఘనత సాధించిన జాబితాలో భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్(18,426) అగ్రస్ధానంలో ఉండగా.. ఆ తర్వాతి స్ధానాల్లో విరాట్ కోహ్లి(13,872), సౌరవ్ గంగూలీ(11, 221) ఉన్నారు. ఇక తొలి వన్డేను టైగా ముగించిన భారత్.. రెండో వన్డేలో ఎలాగైనా గెలిచి కమ్‌బ్యాక్ ఇవ్వాలని భావిస్తోంది.చదవండి: IPL 2025: హార్దిక్ పాండ్యాకు షాక్!.. ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా సూర్యకుమార్? -
టీమిండియాతో రెండో వన్డే.. శ్రీలంకకు భారీ షాక్
కొలంబో వేదికగా ఆదివారం టీమిండియాతో రెండో వన్డేలో శ్రీలంక తలపడనుంది. అయితే ఈ మ్యాచ్‌కు శ్రీలంకకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ ఆల్‌రౌండర్ వనిందు హసరంగ గాయం కారణంగా భారత్‌తో వన్డే సిరీస్ నుంచి తప్పుకున్నాడు.మోకాలి గాయం కారణంగా హసరంగా మిగిలిన రెండు వన్డేలకు దూరమయ్యాడు. టీమిండియాతో జరిగిన తొలి వన్డేలో హసరంగా మోకాలికి గాయమైంది. అయినప్పటకి మ్యాచ్ మొత్తానికి వనిందు అందుబాటులో ఉన్నాడు. కానీ ఆ తర్వాత స్కానింగ్‌లో అతడి గాయం తీవ్రమైనదిగా తేలడంతో వైద్యులు విశ్రాంతి అవసరమని సూచించారు. ఈ క్రమంలోనే హసరంగా సిరీస్ మధ్యలోనే వైదొలిగాడు. కాగా భారత్‌తో తొలి వన్డే టైగా ముగియడంలో హసరంగా కీలక పాత్ర పోషించాడు. ఇక ఈ సిరీస్‌కు ఇప్పటికే శ్రీలంక స్టార్ పేసర్లు మతీషా పతిరనా, దిల్షాన్ మధుశంక కూడా దూరమయ్యారు. ఇప్పుడు హసరంగా కూడా తప్పుకోవడం ఆతిథ్య జట్టుకు నిజంగా గట్టి ఎదురుదెబ్బ అనే చెప్పుకోవాలి. హసరంగా స్ధానాన్ని జెఫ్రీ వాండర్సేతో శ్రీలంక క్రికెట్ భర్తీ చేసింది.చదవండి: ‘టై’ని బ్రేక్ చేసేదెవరో? -
శ్రీలంకతో రెండో వన్డే.. భారత తుది జట్టు ఇదే! పరాగ్ అరంగేట్రం?
కొలంబో వేదికగా భారత్-శ్రీలంక మధ్య జరిగిన తొలి వన్డే టై అయిన సంగతి తెలిసిందే. ఈజీగా గెలవాల్సిన మ్యాచ్‌ను భారత్ టైగా ముగించింది. విజయానికి ఒక్క పరుగు కావాల్సిన నేపథ్యంలో భారత్ వరుసగా రెండు వికెట్లు కోల్పోవడంతో మ్యాచ్ టై అయింది. అయితే తొలి వన్డేలో చేసిన చిన్న చిన్న తప్పిదాలను రెండో వన్డేలో పునరావృతం చేయకూడదని భారత జట్టు యోచిస్తోంది. ఆదివారం కొలంబో వేదికగా జరగనున్న రెండో వన్డేలో మాత్రం ఎలాగైనా గెలిచి సిరీస్ ఆధిక్యంలోకి వెళ్లాలని టీమిండియా వ్యూహాలు రచిస్తోంది. ఈ మ్యాచ్‌లో భారత జట్టు ఓ కీలక మార్పుతో బరిలోకి దిగనున్నట్లుట్లు తెలుస్తోంది. కొలంబో వికెట్ స్పిన్‌కు అనుకూలిస్తున్న నేపథ్యంలో ఆల్‌రౌండర్ రియాన్ పరాగ్‌కు ఛాన్స్ ఇవ్వాలని భారత జట్టు మెనెజ్‌మెంట్ భావిస్తున్నట్లు సమాచారం. పేస్ ఆల్‌రౌండర్ శివమ్ దూబే స్ధానంలో పరాగ్ తుది జట్టులో వచ్చే అవకాశముందని పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. రిషబ్ పంత్‌కు మరోసారి నో ఛాన్స్..?ఇక ఈ మ్యాచ్‌కు కూడా స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ బెంచ్‌కే పరిమితమయ్యే సూచనలు కన్పిస్తున్నాయి. వన్డేల్లో పంత్ కంటే కేఎల్ రాహుల్‌కు మంచి రికార్డు ఉండడంతో అతడి వైపే జట్టు మెనెజ్‌మెంట్ మొగ్గు చూపుతున్నట్లు వినికిడి.వన్డేల్లో రాహుల్‌కు 50పైగా సగటు ఉంది. అయితే దాదాపు 8 నెలల తర్వాత భారత జట్టులోకి రాహుల్ ఎంట్రీ ఇచ్చాడు. తొలి వన్డేలో రాహుల్ తన మార్క్‌ను చూపించలేకపోయాడు. టైగా ముగిసిన మ్యాచ్‌లో రాహుల్ 31 పరుగులు చేసి ఔటయ్యాడు.భారత తుది జట్టు(అంచనా)రోహిత్ శర్మ (కెప్టెన్), శుబ్‌మన్ గిల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లి, శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్ (వికెట్ కీపర్), రియాన్ పరాగ్, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, అర్ష్‌దీప్ సింగ్ -
‘ఇంత చెత్తగా ఆడతారా?.. గంభీర్‌కు ఇలాంటివి నచ్చవు’
టీమిండియా యువ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్‌పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చెత్త షాట్ సెలక్షన్‌తో గెలవాల్సిన మ్యాచ్‌ను ‘టై’ చేశాడంటూ భారత జట్టు అభిమానులు అతడిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దూకుడుగా బ్యాటింగ్ చేయాలనే సరదానా? లేదంటే ప్రత్యర్థి అంటే లెక్కలేనితనమా అంటూ ఘాటుగా విమర్శిస్తున్నారు.కాగా హెడ్‌కోచ్‌గా గౌతం గంభీర్ నియమితుడైన తర్వాత తొలిసారిగా.. మూడు టీ20, మూడు వన్డే మ్యాచ్‌ల సిరీస్ ఆడేందుకు భారత క్రికెట్ జట్టు శ్రీలంక పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో టీ20 సిరీస్‌ను 3-0తో వైట్‌వాష్ చేసిన టీమిండియా.. రోహిత్ శర్మ సారథ్యంలో శుక్రవారం వన్డే సిరీస్ మొదలుపెట్టింది.కొలంబో వేదికగా జరిగిన తొలి వన్డేలో విజయానికి చేరువగా వచ్చిన టీమిండియా.. ‘టై’తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఆతిథ్య లంక విధించిన 231 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత్ గెలుపొందాలంటే.. 18 బంతుల్లో 5 పరుగులు అవసరమైన సమీకరణానికి చేరుకుంది. చేతిలో అప్పటికి రెండు వికెట్లు ఉన్నాయి.ఈ దశలో.. శ్రీలంక కెప్టెన్ చరిత్ అసలంక 48వ ఓవర్లో కట్టుదిట్టంగా బౌలింగ్ చేశాడు. అప్పటికి శివం దూబే, మహ్మద్ సిరాజ్ క్రీజులో ఉన్నారు. అయితే, అసలంక ఓవర్లో మొదటి రెండు బంతుల్లో దూబే పరుగులు రాబట్టలేకపోయాడు. ఈ క్రమంలో మూడో బంతికి ఫోర్ కొట్టగా ఇరు జట్ల స్కోరు సమమైంది. అయితే, అనూహ్య రీతిలో ఆ మరుసటి బంతికి దూబనే వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు అసలంక.ఈ రైటార్మ్ ఆఫ్ బ్రేక్ స్పిన్నర్ బౌలింగ్‌లో దూబే ముందుకు వచ్చి ఆడబోగా.. బంతి ముందుగా ప్యాడ్‌ను తాకింది. దీంతో ఎల్బీడబ్ల్యూగా దూబే పెవిలియన్ చేరగా.. అర్ష్‌దీప్ సింగ్ క్రీజులోకి వచ్చాడు. అయితే, వచ్చీ రాగానే అసలంక బౌలింగ్‌లో భారీ స్లాగ్‌స్వీప్ షాట్ ఆడబోయిన అర్ష్‌దీప్.. పూర్తిగా విఫలమయ్యాడు. అసలంక బౌలింగ్‌లో లెగ్ బిఫోర్ వికెట్‌గా వెనుదిరిగాడు. ఫలితంగా భారత్ పదో వికెట్ కోల్పోయింది. మ్యాచ్ టై గా ముగిసింది.నిజానికి.. ఇంకా 14 బంతులు మిగిలి ఉండి.. విజయానికి ఒక్క పరుగు తీయాల్సిన సమయంలో అర్ష్‌దీప్ డిఫెన్స్ ఆడాల్సింది. కానీ అలా చేయకుండా బ్యాటర్ మాదిరి భారీ షాట్‌కు యత్నించి వికెట్ పారేసుకున్నాడు. ఈ నేపథ్యంలో అర్ష్‌దీప్ షాట్ సెలక్షన్‌పై విమర్శలు వస్తున్నాయి. మాజీ పేసర్ దొడ్డ గణేశ్ స్పందిస్తూ.. ‘‘టెయిలెండర్ల నుంచి పరుగులు ఆశించలేం.కానీ కనీస క్రికెట్ ప్రమాణాలు తెలిసి ఉండాలి కదా! అర్ష్‌దీప్ షాట్ సెలక్షన్ కచ్చితంగా గంభీర్‌కు నచ్చి ఉండదు. ఏదేమైనా శ్రీలంక బౌలర్లు అద్భుతంగా ఆడారు. అండర్‌డాగ్స్‌గా బరిలోకి దిగిన శ్రీలంకకు ఈ ఫలితం ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది’’ అని పేర్కొన్నాడు. టీమిండియా అభిమానులు సైతం దొడ్డ గణేశ్ వ్యాఖ్యలను సమర్థిస్తూ.. అర్ష్‌పై ఆగ్రహం వెళ్లగక్కుతున్నారు. కాగా ఈ మ్యాచ్‌లో లెఫ్టార్మ్ మీడియం పేసర్ అర్ష్‌దీప్ సింగ్.. 33 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు తీశాడు.What a dramatic turn of events! 😲Back-to-back wickets for skipper Asalanka turned the game on its head, with the match tied! 😶🌫️Watch #SLvIND ODI series LIVE on #SonyLIV 🍿 pic.twitter.com/qwu5rmlZIQ— Sony LIV (@SonyLIV) August 2, 2024Hard to digest Arshdeep Singh's last-over mistake. With just 1 run needed off 14 balls, conceding a six is tough to watch.Was it fearless cricket or a blunder? Either way, it stings. #ArshdeepSingh #INDvsSL #RohitSharma𓃵pic.twitter.com/3ghC56p38r— Sagar Lohatkar (@sagarlohatkar) August 3, 2024 -
ఆ ఒక్క పరుగు చేయాల్సింది.. వారి వల్లే: రోహిత్ శర్మ
‘‘మెరుగ్గా బ్యాటింగ్ చేస్తే ఛేదించగల స్కోరే ఇది. నిజానికి మేము బాగానే ఆడాం. అయితే, నిలకడలేమి బ్యాటింగ్ వల్లే ఈ పరిస్థితి తలెత్తింది. పది ఓవర్ల తర్వాత.. ఒక్కసారి స్పిన్నర్లు బరిలోకి వచ్చారంటే మ్యాచ్ స్వరూపం మారిపోతుందని ముందే ఊహించాం. అందుకే ఆరంభంలో దూకుడుగా ఆడుతూ వీలైనన్ని పరుగులు స్కోరు చేశాం.లక్ష్య ఛేదన మొదలుపెట్టిన సమయంలో మాదే పైచేయి. అయితే, వరుస విరామాల్లో వికెట్లు కోల్పోవడం ప్రభావం చూపింది. కేఎల్ రాహుల్- అక్షర్ పటేల్ వల్ల తిరిగి పుంజుకున్నాం. అయితే, ఆఖర్లో 14 బంతులు ఉండి కూడా ఒక్క పరుగు తీయలేకపోవడం తీవ్ర నిరాశ కలిగించింది.ఆటలో ఇలాంటివన్నీ సహజమే. అయితే, శ్రీలంక ఈరోజు అద్బుతంగా ఆడింది. పిచ్ మొదటి నుంచి ఒకేలా ఉంది. తొలి 25 ఓవర్లలో మేము కూడా బాగా బౌలింగ్ చేశాం. తర్వాత వికెట్.. బ్యాటింగ్‌కు కాస్త అనుకూలంగా మారింది. ఏదేమైనా మేము చివరిదాకా పోరాడిన తీరు పట్ల గర్వంగా ఉంది.రెండు జట్ల మధ్య విజయం దోబూచులాడింది. మేము కనీసం ఒక్కటంటే ఒక్క పరుగు చేయాల్సింది’’ అని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు. శ్రీలంకతో తొలి వన్డే ‘టై’గా ముగియడం పట్ల విచారం వ్యక్తం చేశాడు. కాగా టీ20 ప్రపంచకప్-2024 తర్వాత రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి తొలిసారిగా లంకతో వన్డే సిరీస్‌లో పాల్గొంటున్నారు.దంచికొట్టిన రోహిత్ఈ క్రమంలో శుక్రవారం కొలంబో వేదికగా జరిగిన తొలి మ్యాచ్‌లో భారత జట్టుకు నిరాశే ఎదురైంది. టాస్ ఓడి తొలుత బౌలింగ్ చేసిన టీమిండియా.. ఆతిథ్య జట్టును 230 పరుగులకు పరిమితం చేయగలిగింది. అయితే, లక్ష్య ఛేదనను ఘనంగా ఆరంభించినా మిడిలార్డర్ విఫలం కావడంతో కష్టాల్లో పడింది.ఓపెనర్ రోహిత్ శర్మ 47 బంతుల్లో 58 పరుగులతో కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడగా.. మరో ఓపెనర్ శుబ్‌మన్ గిల్(35 బంతుల్లో 16 రన్స్) మాత్రం తీవ్రంగా నిరాశపరిచాడు. వన్‌డౌన్ బ్యాటర్ విరాట్ కోహ్లి ఆదుకుంటాడని భావిస్తే.. అతడు కూడా 32 బంతుల్లో కేవలం 24 పరుగులకే పరిమితమయ్యాడు.విజయానికి ఒక పరుగు దూరంలోవాషింగ్టన్ సుందర్(5) తేలిపోగా.. రీఎంట్రీ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ 23 పరుగులతో ఫర్వాలేదనిపించాడు. ఇక వికెట్ కీపర్ బ్యాటర్ కేఎల్ రాహుల్(31), అక్షర్ పటేల్(33) కాసేపు పోరాడగా.. శివం దూబే 25 పరుగులతో గెలుపు ఆశలు రేపాడు.అయితే, కేవలం 14 బంతుల్లో ఒక్క పరుగు అవసరమైన వేళ.. శ్రీలంక కెప్టెన్ చరిత్ అసలంక 48వ ఓవర్లో దూబే, అర్ష్‌దీప్ సింగ్(0)ను అవుట్ చేయడంతో టీమిండియా ఆలౌట్ అయింది. విజయానికి ఒక పరుగు దూరంలో నిలిచి.. మ్యాచ్‌ను టై చేసుకుంది. భారత ఓపెనర్ల వికెట్లు తీసిన శ్రీలంక స్పిన్నర్ దునిత్ వెల్లలగే(2/39) ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. చదవండి: గురి చెదిరింది.. కాంస్యం చేజారింది -
IND vs SL 1st ODI : 'టై'గా ముగిసిన భారత్ - శ్రీలంక తొలి వన్డే (ఫొటోలు)
-
భారత్-శ్రీలంక తొలి వన్డే మ్యాచ్ టై
-
చరిత్ర సృష్టించిన రోహిత్.. సెహ్వాగ్, సచిన్ సరసన హిట్‌మ్యాన్
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తన సూపర్ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. కొలంబో వేదికగా శ్రీలంకతో జరిగిన తొలి వన్డేలో రోహిత్ శర్మ అద్భుతమైన హాఫ్ సెంచరీతో మెరిశాడు. 47 బంతులు ఎదుర్కొన్న హిట్‌మ్యాన్.. 7 ఫోర్లు, 3 సిక్స్‌లతో 58 పరుగులు చేశాడు. ఈ క్రమంలో పలు అరుదైన రికార్డులను రోహిత్ శర్మ తన పేరిట లిఖించుకున్నాడు.రోహిత్ సాధించిన రికార్డులు ఇవే.. అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక సిక్స్‌లు కొట్టిన కెప్టెన్‌గా ఇంగ్లండ్ మాజీ సారథి ఇయాన్ మోర్గాన్ రికార్డును రోహిత్ సమం చేశాడు. మోర్గాన్ కెప్టెన్‌గా 180 ఇన్నింగ్స్‌లలో 233 సిక్స్‌లు బాదగా.. రోహిత్ కేవలం 134 ఇన్నింగ్స్‌లలోనే 233 సిక్స్‌లు కొట్టేశాడు.అంతర్జాతీయ క్రికెట్లో 15000 పరుగుల మైలు రాయిని అందుకున్న మూడో భారత ఓపెనర్‌గా రోహిత్ శర్మ నిలిచాడు. రోహిత్ శర్మ ఇప్పటివరకు ఓపెనర్‌గా 352 ఇన్నింగ్స్‌లలో15,035 పరుగులు చేశాడు.ఈ జాబితాలో భారత లెజెండరీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్(16,119) తొలి స్ధానంలో ఉండగా.. రెండో స్ధానంలో భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్(15,335) ఉన్నారు. -
మొహ్మద్ షిరాజ్‌ను ఉతికారేసిన రోహిత్ శర్మ.. వీడియో వైరల్
కొలంబో వేదికగా శ్రీలంకతో మూడో వన్డేలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. . 231 పరుగుల ఛేదనలో శ్రీలంక బౌలర్లను రోహిత్ ఉతికారేశాడు. హిట్‌మ్యాన్ తన స్టైల్లో బౌండరీల వర్షం కురిపించాడు. ముఖ్యంగా శ్రీలంక అరంగేట్ర ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్‌ను రోహిత్ శర్మ టార్గెట్ చేశాడు.4 ఓవర్ వేసిన షిరాజ్ బౌలింగ్‌లో రెండు ఫోర్లు, ఒక సిక్సర్‌తో ఏకంగా 15 పరుగులు రాబట్టాడు. అందులో ఓ సింగిల్ ఉంది. రోహిత్ దెబ్బకు సిరాజ్‌ను మరి బౌలింగ్ ఎటాక్‌లోకి లంక కెప్టెన్ తీసుకురాలేదు. ఇక ఈ మ్యాచ్‌లో ఓవరాల్‌గా 47 బంతులు ఎదుర్కొన్న రోహిత్ శర్మ 7 ఫోర్లు, 3 సిక్స్‌లతో 58 పరుగులు చేసి ఔటయ్యాడు. అతడి ఇన్నింగ్స్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. కాగా టీ20 వరల్డ్‌కప్-2024 విజయం తర్వాత రోహిత్ శర్మ ఆడుతున్న మొదటి సిరీస్ ఇదే. Rohit Sharma retired from T20Is and now he has started treating ODIs like T20Is. 🙇🏻♂️🔥#RohitSharma𓃵 | #INDvsSL pic.twitter.com/W5Ek39y0DO— 𝐒𝐚𝐧𝐠𝐫𝐚𝐦 ⚚ (@shinewid_SAM) August 2, 2024 -
నేనేం చేయాలి.. నన్నెందుకు చూస్తున్నావు?: వాషీపై రోహిత్ ‘ఫైర్’!
దాదాపు నెల రోజుల విశ్రాంతి తర్వాత టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ పునరాగమనం చేశాడు. శ్రీలంకతో వన్డే సిరీస్‌లో భాగంగా శుక్రవారం నాటి తొలి మ్యాచ్ సందర్భంగా మైదానంలో దిగాడు. కొలంబోలోని ఆర్. ప్రేమదాస స్టేడియంలో జరుగుతున్న ఈ వన్డేలో ఆతిథ్య శ్రీలంక టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది.ఈ క్రమంలో భారత జట్టు బౌలింగ్‌కు దిగగా.. పేసర్ మహ్మద్ సిరాజ్ ఆదిలోనే వికెట్ తీశాడు. లంక ఓపెనర్ అవిష్క ఫెర్నాండో(1) రూపంలో టీమిండియాకు తొలి వికెట్ అందించాడు. అనంతరం.. శివం దూబే కుశాల్ మెండిస్(14), అక్షర్ పటేల్ సమరవిక్రమ(8) వికెట్లు తీయగా.. కుల్దీప్ యాదవ్ చరిత్ అసలంక(14)ను పెవిలియన్‌కు పంపాడు.ఇక స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ 27వ ఓవర్ మూడో బంతికి.. హాఫ్ సెంచరీ వీరుడు పాతుమ్ నిసాంక(56)ను అవుట్ చేసి మంచి బ్రేక్ ఇచ్చాడు. అయితే, 29వ ఓవర్లో వాషింగ్టన్ సుందర్ చేసిన పనికి.. కెప్టెన్ రోహిత్ శర్మ ఇచ్చిన ఎక్స్ప్రెషన్ హైలైట్‌గా నిలిచింది. దునిత్ వెల్లలగే క్రీజులో ఉన్న సమయంలో(28.5) సుందర్ గంటకు 91 కిలోమీటర్ల వేగంతో బంతిని విసిరాడు.ఈ క్రమంలో షాట్ ఆడేందుకు ప్రయత్నించిన వెల్లలగే విఫలమయ్యాడు. అయితే, బాల్ బ్యాట్ కంటే ప్యాడ్‌కు ముందు తాకిందని భావించిన వాషీ.. లెగ్ బిఫోర్ వికెట్(ఎల్బీడబ్ల్యూ) కోసం అప్పీలు చేశాడు. అయితే, అంపైర్ నుంచి ఎలాంటి స్పందనా రాలేదు.దీంతో..స్లిప్‌లో ఉన్న కెప్టెన్ రోహిత్ శర్మ వైపు చూసిన వాషీ.. అతడి గైడెన్స్ కావాలన్నట్లుగా సైగ చేశాడు. ఇందుకు బదులుగా.. ‘‘ఏంటి? నువ్వే చెప్పాలి కదా!... అయినా నాకేం కనిపిస్తుందని నన్ను అడుగుతున్నావు? నువ్వు చేయాల్సిన పని కూడా నేనే చేయాలా? ’’ అంటూ సరదాగా కసురుకున్నాడు. స్టంప్ మైకులో ఈ వ్యాఖ్యలు రికార్డు అయ్యాయి. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. కాగా ఈ మ్యాచ్‌లో శ్రీలంక.. నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు నష్టపోయి 230 పరుగులు చేసింది. భారత బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్, అక్షర్ పటేల్ రెండేసి వికెట్లు తీయగా.. శివం దూబే, సిరాజ్, కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు. Vintage stump mic banter from @ImRo45 😆 Watch the action from #SLvIND LIVE now on Sony Sports Ten 1, Sony Sports Ten 3, Sony Sports Ten 4 & Sony Sports Ten 5 🤩 📺#SonySportsNetwork #SLvIND #TeamIndia #RohitSharma pic.twitter.com/HYEM5LxVus— Sony Sports Network (@SonySportsNetwk) August 2, 2024 -
శ్రీలంక తరపున అరంగేట్రం.. ఎవరీ మహ్మద్ సిరాజ్?
శ్రీలంక తరపున అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాలనుకున్న ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ కల ఎట్టకేలకు నేరవేరింది. కొలంబో వేదికగా టీమిండియాతో జరుగుతున్న తొలి వన్డేలో మహ్మద్ సిరాజ్ అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. శ్రీలంక తుది జట్టులో సిరాజ్‌కు చోటు దక్కడంతో తన సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది.కాగా భారత్‌తో వన్డేలకు తొలుత ప్రకటించిన లంక ప్రధాన జట్టులో సిరాజ్‌కు ఛాన్స్ లభించలేదు. అయితే తొలి వన్డేకు ముందు గాయపడిన యువ పేసర్ మతీషా పతిరాన స్ధానంలో షిరాజ్ లంక జట్టులోకి ఎంట్రీ ఇచ్చాడు. ఈ నేపథ్యంలో షిరాజ్ గరుంచి పలు ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం.ఎవరీ మహ్మద్ సిరాజ్?29 ఏళ్ల షిరాజ్ దేశవాళీ క్రికెట్లో అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తున్నాడు. కోల్ట్స్ క్రికెట్ క్లబ్(కొలంబో) తరపున ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో అరంగేట్రం చేసిన సిరాజ్.. ప్రస్తుతం కాండీ క్రికెట్ క్లబ్‌కు ప్రాతనిథ్యం వహిస్తున్నాడు. అదేవిధంగా లిస్ట్-ఎ క్రికెట్లో మాత్రం కురునెగల జట్టు తరపున షిరాజ్ ఆడుతున్నాడు. ఇప్పటివరకు 47 లిస్ట్-ఎ మ్యాచ్‌లు ఆడిన సిరాజ్.. 7.52 సగటుతో 80 వికెట్లు పడగొట్టాడు. ఫస్ట్-క్లాస్ క్రికెట్లో సిరాజ్ 49 మ్యాచ్‌లలో 125 వికెట్లు సాధించాడు. అతడి ఎకానమీ రేటు కూడా 3.65గా ఉంది. దేశవాళీ క్రికెట్లో నిలకడగా రాణిస్తుండడంతో సెలక్టర్ల దృష్టిలో షిరాజ్ పడ్డాడు. ఈ క్రమంలోనే భారత్‌తో వన్డే సిరీస్‌కు అతడికి లంక సెలక్టర్లు పిలుపునిచ్చారు. షిరాజ్‌కు బంతితో పాటు బ్యాట్‌తో కూడా రాణించే సత్తా ఉంది. -
IND vs SL: 4 ఏళ్ల తర్వాత భారత స్టార్ ప్లేయర్ రీ ఎంట్రీ..! ఎవరంటే?
టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ శివమ్ దూబే దాదాపు నాలుగేళ్ల తర్వాత తిరిగి వన్డేల్లో పునరాగమనం చేశాడు. కొలంబో వేదికగా శ్రీలంకతో జరుగుతున్న తొలి వన్డేలో భారత తుది జట్టులో చోటు దక్కించుకున్న దూబే.. తన 1670 రోజుల నిరీక్షణకు తెరదించాడు. డిసెంబర్ 15, 2019న వెస్టిండీస్‌పై వన్డే అంతర్జాతీయ అరంగేట్రం చేసిన దూబే.. తన మొదటి మ్యాచ్‌లో నిరాశపరిచాడు. తన డెబ్యూ మ్యాచ్‌లో 6 బంతులు ఎదుర్కొన్న శివమ్ కేవలం 9 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. దీంతో ఆ తర్వాత అతడికి భారత జట్టులో చోటు దక్కలేదు. అయితే ఐపీఎల్-2024తో పాటు దేశీవాళీ క్రికెట్లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచి భారత టీ20 జట్టులోకి వచ్చిన దూబే.. ఇప్పుడు వన్డేల్లో కూడా రీఎంట్రీ ఇచ్చాడు. ముఖ్యంగా శ్రీలంకతో వన్డే సిరీస్‌కు స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా దూరం కావడంతో దూబేకు రీఎంట్రీ సుగమమైంది. తొలి వన్డేకు పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్‌గా భారత తుది జట్టులో ఈ ముంబైకర్ చోటు దక్కించుకున్నాడు. టీ20 వరల్డ్‌కప్-2024లో కూడా దూబే పర్వాలేదన్పించాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన ఫైనల్లో 27 పరుగులు చేసిన దూబే.. భారత్ ఛాంపియన్స్‌గా నిలవడంలో తన వంతు పాత్ర పోషించాడు. దూబే తన లిస్ట్-ఎ కెరీర్లో ఇప్పటివరకు 54 మ్యాచ్‌లు ఆడి 975 పరుగులతో పాటు 40 వికెట్లు పడగొట్టాడు.తుది జట్లు..భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, వాషింగ్టన్ సుందర్, శివమ్ దూబే, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, మొహమ్మద్ సిరాజ్శ్రీలంక: చరిత్ అసలంక (కెప్టెన్), పథుమ్ నిస్సంక, అవిష్క ఫెర్నాండో, కశాల్ మెండిస్ (వికెట్‌కీపర్), సధీర సమరవిక్రమ, దునిత్ వెల్లలగే, వనిందు హసరంగ, జనిత్ లియనగే, అఖిల ధనంజయ, అషిత ఫెర్నాండో, మొహ్మద్ సిరాజ్ -
IND vs SL: శ్రీలంకతో తొలి వన్డే.. నల్ల బ్యాండ్లతో భారత జట్టు! ఎందుకంటే?
కొలంబోలోని ప్రేమదాస స్టేడియం వేదికగా జరుగుతున్న తొలి వన్డేలో భారత్-శ్రీలంక జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టీమిండియా ఆటగాళ్లు నలుపు రంగు బ్యాండ్లు ధరించి మైదానంలోకి దిగారు. భారత మాజీ క్రికెటర్ కోచ్ అన్షుమాన్ గైక్వాడ్ బుధవారం(జూలై 31) తుది శ్వాస విడిచిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయనకు నివాళిగా భారత ఆటగాళ్లు నల్ల బ్యాండ్లు ధరించారు. క్యాన్సర్‌తో పోరాడుతూ గైక్వాడ్ కన్నుమూశారు. గైక్వాడ్ భారత్ తరఫున మొత్తం 55 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడారు. దేశవాళీ క్రికెట్లో బరోడా తరఫున 250కి పైగా మ్యాచ్‌లు ఆడారు. ఆయన మృతి పట్ల బీసీసీఐతో పాటు పలువురు ఆటగాళ్లు ఇప్పటికే సంతాపం వ్యక్తం చేశారు. ఇక ఈ మ్యాచ్ విషయానికి వస్తే.. టాస్ గెలిచిన శ్రీలంక తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. యువ పేసర్ మహ్మద్ సిరాజ్ ఈ మ్యాచ్‌తో శ్రీలంక తరపున అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. అదేవిధంగా కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ తిరిగి భారత జట్టుతో చేరారు.తుది జట్లు..భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, వాషింగ్టన్ సుందర్, శివమ్ దూబే, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, మొహమ్మద్ సిరాజ్శ్రీలంక: చరిత్ అసలంక (కెప్టెన్), పథుమ్ నిస్సంక, అవిష్క ఫెర్నాండో, కశాల్ మెండిస్ (వికెట్‌కీపర్), సధీర సమరవిక్రమ, దునిత్ వెల్లలగే, వనిందు హసరంగ, జనిత్ లియనగే, అఖిల ధనంజయ, అషిత ఫెర్నాండో, మొహ్మద్ సిరాజ్ -
ఉత్కంఠ పోరు.. భారత్-శ్రీలంక తొలి వన్డే టై
Sri Lanka vs India, 1st ODI Updates: తొలి వన్డే అప్డేట్స్ఉత్కంఠ పోరు.. భారత్-శ్రీలంక తొలి వన్డే టైకొలంబో వేదికగా శ్రీలంక-భారత్ మధ్య ఆఖరి వరకు ఉత్కంఠ భరితంగా సాగిన తొలి వన్డే టైగా ముగిసింది. విజయానికి ఒక్క పరుగు కావల్సిన నేపథ్యంలో టీమిండియా వరుసగా రెండు వికెట్లు కోల్పోవడంతో మ్యాచ్ డ్రా అయింది. ఈజీగా గెలవాల్సిన మ్యాచ్‌ను భారత్ టైగా ముగించింది. తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 230 పరుగులు సాధించింది. శ్రీలంక బ్యాటర్లలో ఆల్‌రౌండర్ దునిత్ వెల్లలాగే(65 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్‌లతో 66 పరుగులు నాటౌట్) టాప్ స్కోరర్‌గా నిలవగా.. ఓపెనర్ ఫాథుమ్ నిస్సాంక(56) మరోసారి కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఇక భారత బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్, అక్షర్ పటేల్ తలా రెండు వికెట్లు పడగొట్టగా.. దుబే, వాషింగ్టన్ సుందర్ తలా వికెట్ సాధించారు. అనంతరం లక్ష్య చేధనలో భారత్ కూడా సరిగ్గా 230 పరుగులకే ఆలౌటైంది. భారత బ్యాటర్లలో కెప్టెన్ నిర్ణీత 50 ఓవర్లలో శ్రీలంక 8 వికెట్లు కోల్పోయి 230 పరుగులు సాధించింది. భారత బ్యాటర్లలో రోహిత్ శర్మ(58) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. కేఎల్ రాహుల్(31), శివమ్ దూబే(25), అక్షర్ పటేల్(33) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. శ్రీలంక బౌలర్లలో హసరంగా, అసలంక తలా మూడువ వికెట్లు పడగొట్టగా.. దునిత్ వెల్లలాగే రెండు ,అకిలా దనుంజయ, ఫెర్నాండో చెరో వికెట్ సాధించారు.అక్షర్ పటేల్ ఔట్..అక్షర్ పటేల్ రూపంలో భారత్ ఏడో వికెట్ కోల్పోయింది. 33 పరుగులు చేసిన అక్షర్ పటేల్.. అసలంక బౌలింగ్‌లో ఔటయ్యాడు. భారత విజయానికి 48 బంతుల్లో 27 పరుగులు కావాలి.కేఎల్ రాహుల్ ఔట్.. కేఎల్ రాహుల్ రూపంలో భారత్ ఆరో వికెట్ కోల్పోయింది. 31 పరుగులు చేసిన రాహుల్.. హసరంగా బౌలింగ్‌లో ఔటయ్యాడు. భారత విజయానికి 58 బంతుల్లో 35 పరుగులు కావాలి. క్రీజులో అక్షర్ పటేల్(33), శివమ్ దూబే(3) పరుగులతో ఉన్నారు.37 ఓవర్లకు భారత స్కోర్: 175/537 ఓవర్లు ముగిసే సరికి శ్రీలంక 5 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. క్రీజులో కేఎల్ రాహుల్(20), అక్షర్ పటేల్(24) పరుగులతో ఉన్నారు. భారత విజయానికి 56 పరుగులు కావాలి.ఐదో వికెట్ డౌన్..శ్రేయస్ అయ్యర్ రూపంలో టీమిండియా ఐదో వికెట్ కోల్పోయింది. 23 పరుగులు చేసిన అయ్యర్.. అషితా ఫెర్నాండో బౌలింగ్‌లో ఔటయ్యాడు. 30 ఓవర్లకు భారత్ స్కోర్: 149/5. క్రీజులో అక్షర్ పటేల్(11), కెఎల్ రాహుల్(8) ఉన్నారు.విరాట్ కోహ్లి ఔట్130 పరుగుల వద్ద టీమిండియా నాలుగో వికెట్ కోల్పోయింది. 24 పరుగులు చేసిన కోహ్లి.. హసరంగా బౌలింగ్‌లో ఔటయ్యాడు.23 ఓవర్లకు భారత్ స్కోర్: 130/323 ఓవర్లు ముగిసేసరికి టీమిండియా 3 వికెట్ల నష్టానికి 130 పరుగులు చేసింది. క్రీజులో శ్రేయస్ అయ్యర్(22), విరాట్ కోహ్లి(24) పరుగులతో ఉన్నారు. భారత విజయానికి ఇంకా 101 పరుగులు కావాలి.భారత్ మూడో వికెట్ డౌన్.. టీమిండియా మూడో వికెట్ కోల్పోయింది. 5 పరుగులు చేసిన వాషింగ్టన్ సుందర్.. దనుంజయ బౌలింగ్‌లో ఔటయ్యాడు. క్రీజులోకి శ్రేయస్ అయ్యర్ వచ్చాడు. 17 ఓవర్లకు భారత్ స్కోర్: 86/2రోహిత్ శర్మ ఔట్..టీమిండియా రెండో వికెట్ కోల్పోయింది. 58 పరుగులు చేసిన రోహిత్ శర్మ.. వెల్లగెలె బౌలింగ్‌లో ఔటయ్యాడు. క్రీజులోకి వాషింగ్టన్ సుందర్ వచ్చాడు. 15 ఓవర్లకు భారత్ స్కోర్: 86/2తొలి వికెట్ కోల్పోయిన భారత్శుబ్మన్ గిల్ రూపంలో టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది. 16 పరుగులు చేసిన గిల్.. వెల్లగలే బౌలింగ్‌లో ఔటయ్యాడు. క్రీజులోకి కోహ్లి వచ్చాడు. 12 ఓవర్లకు భారత్ స్కోర్: 76/1రోహిత్ శర్మ హాఫ్ సెంచరీ..టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ హాఫ్ సెంచరీతో చెలరేగాడు. 33 బంతుల్లో రోహిత్ శర్మ 7 ఫోర్లు, 3 సిక్స్‌లతో తన హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. 10 ఓవర్లకు భారత్ స్కోర్: 71/0దూకుడుగా ఆడుతున్న భారత్231 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా దూకుడుగా ఆడుతోంది. 4 ఓవర్లు ముగిసేసరికి భారత్ వికెట్ నష్టపోకుండా 40 పరుగులు చేసింది. క్రీజులో కెప్టెన్ రోహిత్ శర్మ(29), శుబ్‌మన్ గిల్(10) పరుగులతో ఉన్నారు. రాణించిన బౌలర్లు.. టీమిండియా టార్గెట్ ఎంతంటే?కొలంబో వేదికగా శ్రీలంకతో జరుగుతున్న తొలి వన్డేలో భారత బౌలర్లు రాణించారు. తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక నామమాత్రపు స్కోర్‌కే పరిమితమైంది. నిర్ణీత 50 ఓవర్లలో శ్రీలంక 8 వికెట్లు కోల్పోయి 230 పరుగులు సాధించింది. శ్రీలంక బ్యాటర్లలో ఆల్‌రౌండర్ దునిత్ వెల్లలాగే(65 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్‌లతో 66 పరుగులు నాటౌట్) టాప్ స్కోరర్‌గా నిలవగా.. ఓపెనర్ ఫాథుమ్ నిస్సాంక(56) మరోసారి కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఇక భారత బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్, అక్షర్ పటేల్ తలా రెండు వికెట్లు పడగొట్టగా.. దుబే, వాషింగ్టన్ సుందర్ తలా వికెట్ సాధించారు.ఏడో వికెట్ డౌన్42.6: క్రీజులో కుదురుకున్న వనిందు హసరంగ(24)ను భారత పేసర్ అర్ష్‌దీప్ సింగ్ పెవిలియన్‌కు పంపాడు. అర్ష్ వేసిన బంతిని తప్పుగా అంచనావేసిన హసరంగ.. అక్షర్ పటేల్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. శ్రీలంక స్కోరు: 178-7(43). వనిందు స్థానంలో లెఫ్టాండ్ బ్యాటర్ అకిల ధనంజయ క్రీజులోకి వచ్చాడు. దునిత్ వెల్లలగే 39 పరుగులతో ఆడుతున్నాడు.ఆరో వికెట్ కోల్పోయిన లంకఅక్షర్ పటేల్ బౌలింగ్‌లో జనిత్ లియనగే(20) ఆరో వికెట్‌గా వెనుదిరిగాడు. 35వ ఓవర్ నాలుగో బంతికి రోహిత్ శర్మకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. శ్రీలంక ఐదో వికెట్ డౌన్.. నిస్సాంక రూపంలో శ్రీలంక ఐదో వికెట్ కోల్పోయింది. 56 పరుగులు చేసిన నిస్సాంక.. వాషింగ్టన్ సుందర్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 27 ఓవర్లకు శ్రీలంక స్కోర్: 101/5నిస్సాంక హాఫ్ సెంచరీ.. శ్రీలంక ఓపెనర్ ఫాథుమ్ నిస్సాంక హాఫ్ సెంచరీ సాధించాడు. 68 బంతుల్లో 9 ఫోర్లతో తన హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు.నాలుగో వికెట్ కోల్పోయిన శ్రీలంక..శ్రీలంక పేలవ ఫామ్ వన్డేల్లో కూడా కొనసాగుతోంది. తొలి వన్డేలో 91 పరుగులకే 4 కీలక వికెట్లు కోల్పోయి లంక కష్టాల్లో పడింది. నాలుగో వికెట్‌గా కెప్టన్ అసలంక పెవిలియన్‌కు చేరాడు.శ్రీలంక మూడో వికెట్ డౌన్.. శ్రీలంక మూడో వికెట్ కోల్పోయింది. 8 పరుగులు చేసిన సమరవిక్రమ.. అక్షర్ పటేల్ బౌలింగ్‌లో రిటర్న్ క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. 20 ఓవర్లకు శ్రీలంక మూడు వికెట్ల నష్టానికి 46 పరుగులు చేసింది. శ్రీలంక రెండో వికెట్ డౌన్..శ్రీలంక రెండో వికెట్ కోల్పోయింది. 14 పరుగులు చేసిన కుశాల్ మెండిస్.. శివమ్ దూబే బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగాడు. 13.1 ఓవర్లకు శ్రీలంక రెండు వికెట్ల నష్టానికి 46 పరుగులు చేసింది. 10 ఓవర్లకు శ్రీలంక స్కోర్: 37/110 ఓవర్లు ముగిసే సరికి శ్రీలంక వికెట్ నష్టానికి 37 పరుగులు చేసింది. క్రీజులో నిస్సాంక(25), కుశాల్ మెండిస్(7) ఉన్నారు.లంక తొలి వికెట్ డౌన్..టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంకకు ఆదిలోనే బిగ్ షాక్ తగిలింది. ఓపెనర్ అవిష్క ఫెర్నాండో(1).. మహ్మద్ సిరాజ్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 3 ఓవర్లకు శ్రీలంక స్కోర్: 7/1భారత్-శ్రీలంక మధ్య మూడు వన్డేల సిరీస్ ప్రారంభమైంది. కొలంబోని ఆర్ ప్రేమదాస స్టేడియం వేదికగా జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియా, శ్రీలంక జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన శ్రీలంక తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌తో యువ ఫాస్ట్ బౌలర్ మొహ్మద్ సిరాజ్ శ్రీలంక తరపున అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. అదేవిధంగా భారత కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లి తిరిగి భారత జట్టులో చేరారు.తుది జట్లు..భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, వాషింగ్టన్ సుందర్, శివమ్ దూబే, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, మొహమ్మద్ సిరాజ్శ్రీలంక: చరిత్ అసలంక (కెప్టెన్), పథుమ్ నిస్సంక, అవిష్క ఫెర్నాండో, కశాల్ మెండిస్ (వికెట్‌కీపర్), సధీర సమరవిక్రమ, దునిత్ వెల్లలగే, వనిందు హసరంగ, జనిత్ లియనగే, అఖిల ధనంజయ, అషిత ఫెర్నాండో, మొహ్మద్ సిరాజ్ -
శ్రీలంకతో తొలి వన్డే.. టాస్ ఓడిన టీమిండియా.. తుది జట్లు ఇవే..!
కొలంబో వేదికగా టీమిండియాతో జరుగనున్న తొలి వన్డేలో శ్రీలంక టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి ఈ మ్యాచ్‌తో బరిలోకి దిగనున్నారు. వన్డే స్పెషలిస్ట్‌లు కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ సైతం ఈ మ్యాచ్‌లో బరిలోకి దిగనున్నారు. అందరూ ఊహించినట్లు రియాన్ పరాగ్, హర్షిత్ రాణాలకు తుది జట్టులో చోటు దక్కలేదు. ఆల్రౌండర్లుగా వాషింగ్టన్ సుందర్, శివమ్ దూడే తుది జట్టుకు ఎంపికయ్యారు.తుది జట్లు..భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, వాషింగ్టన్ సుందర్, శివమ్ దూబే, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, మొహమ్మద్ సిరాజ్శ్రీలంక: చరిత్ అసలంక (కెప్టెన్), పథుమ్ నిస్సంక, అవిష్క ఫెర్నాండో, కశాల్ మెండిస్ (వికెట్‌కీపర్), సధీర సమరవిక్రమ, దునిత్ వెల్లలగే, వనిందు హసరంగ, జనిత్ లియనగే, అఖిల ధనంజయ, అషిత ఫెర్నాండో, మొహ్మద్ షిరాజ్ -
రోహిత్ శర్మ సంచలన నిర్ణయం?!
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అంతర్జాతీయ టీ20 రిటైర్మెంట్ వెనక్కి తీసుకుంటాడా? భారత్ తరఫున మళ్లీ పొట్టి ఫార్మాట్ బరిలో దిగుతాడా? టీ20 సిక్సర్ల కింగ్‌గా తన పేరును పదిలం చేసుకుంటూ మరిన్ని భారీ షాట్లు బాదుతాడా? అంటూ హిట్‌మ్యాన్ అభిమానుల్లో చర్చ మొదలైంది. ఇందుకు కారణం రోహిత్ శర్మ చేసిన వ్యాఖ్యలే!టీ20 ప్రపంచకప్-2021 తర్వాత విరాట్ కోహ్లి స్థానంలో టీమిండియా కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టాడు రోహిత్. ద్వైపాక్షిక సిరీస్‌లో అనూహ్య విజయాలతో మూడు ఫార్మాట్లలోనూ భారత్‌ను వరల్డ్ నంబర్ వన్‌గా నిలిపాడు. అయితే, ప్రపంచకప్ గెలవాలన్న కల మాత్రం టీ20 ప్రపంచకప్-2024తో తీరింది. అంతకు ముందు.. రోహిత్ సారథ్యంలో టీ20 వరల్డ్‌కప్-2022లో సెమీస్‌లోనే టీమిండియా నిష్క్రమించగా.. వన్డే వరల్డ్‌కప్-2023లోనూ రన్నరప్‌తోనే సరిపెట్టుకుంది.లంకతో వన్డే సిరీస్‌తో ఈ నేపథ్యంలో రోహిత్ శర్మ కెప్టెన్సీపై విమర్శలు రాగా.. ఐసీసీ టైటిల్ గెలిచి విమర్శకులకు గట్టిగా సమాధానమిచ్చాడు. వరల్డ్‌కప్ ట్రోఫీని ముద్దాడగానే తాను అంతర్జాతీయ టీ20ల నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించాడు. ఈ క్రమంలో దాదాపు నెలరోజుల పాటు విశ్రాంతి తీసుకున్న హిట్‌మ్యాన్.. మళ్లీ శ్రీలంకతో వన్డే సిరీస్‌తో టీమిండియా తరఫున రీఎంట్రీ ఇవ్వనున్నాడు.ఈ నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన రోహిత్ శర్మకు ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. పొట్టి ఫార్మాట్‌కు గుడ్‌బై చెప్పినందుకు మీరు ఎలా ఫీలవుతున్నారు అని విలేకరులు అడిగారు. ఇందుకు బదులిస్తూ.. ‘‘గతంలో మాదిరే ఇప్పుడు కూడా నేను టీ20ల నుంచి విశ్రాంతి తీసుకున్నట్లే అనిపిస్తోంది. ఇక ఏదైనా కీలక టోర్నీ వస్తోందంటే మళ్లీ టీ20లు ఆడేందుకు సిద్ధంగా ఉండాలేమోనన్న ఫీలింగ్ వస్తోంది.పొట్టి ఫార్మాట్ నుంచి పూర్తిగా బయటకు రాలేదుఇప్పటికీ నేను పొట్టి ఫార్మాట్ నుంచి పూర్తిగా బయటకు వచ్చినట్లు అనిపించడం లేదు. ఏదో కొన్నాళ్లు సెలవు తీసుకుని మళ్లీ ఆడాలి కదా అన్న ఫీలింగ్‌లోనే ఉన్నాను’’ అని రోహిత్ శర్మ పేర్కొన్నాడు. దీంతో అభిమానుల ఆశలకు కొత్త రెక్కలు తొడిగినట్లయింది. కాగా గతంలో చాలా మంది క్రికెటర్లు రిటైర్మెంట్ వెనక్కి తీసుకున్న సందర్భాలు ఉన్నాయి. ఇటీవల.. ఇంగ్లండ్ స్టార్ బెన్ స్టోక్స్ వన్డేలకు గుడ్‌బై చెప్పినా.. వన్డే వరల్డ్‌కప్-2023కి ముందు తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు. మరోవైపు.. పాకిస్తాన్ మాజీ కెప్టెన్ షాహిద్ ఆఫ్రిది చాలాసార్లు రిటైర్మెంట్ ఇచ్చి మళ్లీ బరిలోకి దిగాడు.ఆ అవకాశం లేదు.. కానీకాగా టీ20 ప్రపంచకప్-2022 తర్వాత విరాట్ కోహ్లితో పాటు దాదాపు ఏడాది కాలం అంతర్జాతీయ టీ20లకు దూరంగా ఉన్న రోహిత్.. వరల్డ్‌కప్-2024కు ముందే రీఎంట్రీ ఇచ్చాడు. కోహ్లితో కలిసి ఓపెనింగ్ చేసిన హిట్‌మ్యాన్.. భారత్ తరఫున మహేంద్ర సింగ్ ధోని తర్వాత రెండో టీ20 వరల్డ్‌కప్ గెలిచిన కెప్టెన్‌గా నిలిచాడు. ఇక 2026లో మరోసారి టీ20 వరల్డ్‌కప్‌నకు రంగం సిద్దం కాగా.. రోహిత్ శర్మ వయసు అప్పటికి 39 ఏళ్లు అవుతుంది. కాబట్టి అతడు తన నిర్ణయాన్ని మార్చుకునే అవకాశం దాదాపుగా ఉండదు. ఇక రోహిత్ స్థానంలో టీమిండియా టీ20 నూతన కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్ ఎంపికైన విషయం తెలిసిందే. అతడి సారథ్యంలో భారత్ శ్రీలంక తాజా పర్యటనలో టీ20 సిరీస్‌ను 3-0తో వైట్‌వాష్ చేసింది.చదవండి: లంకతో తొలి వన్డే.. అందరి కళ్లు సిరాజ్‌పైనే..!Even we are not over your T20I retirement, @ImRo45 🥹What's your take? 💬#SonySportsNetwork #SLvIND #RohitSharma pic.twitter.com/AMt7HXLR6U— Sony Sports Network (@SonySportsNetwk) August 1, 2024 -
Ind vs SL: ప్రాక్టీస్ సెషన్లో గంభీర్ కోహ్లి.. ఫొటోలు వైరల్
-
భారీ సిక్సర్లు బాదిన కోహ్లి- రోహిత్.. గంభీర్ రియాక్షన్ వైరల్
శ్రీలంకతో వన్డే సిరీస్‌కు టీమిండియా సన్నద్ధమైంది. టీ20 ప్రపంచకప్-2024 తర్వాత అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి ఈ సిరీస్‌తో పునరాగమనం చేయనున్నారు. వీరితో పాటు మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ సైతం సుదీర్ఘ నిరీక్షణ అనంతరం రీఎంట్రీ ఇవ్వనున్నాడు.అదే విధంగా.. ఐపీఎల్-2024 తర్వాత వికెట్ కీపర్ కేఎల్ రాహుల్ కూడా తొలిసారి భారత జట్టుకు ఎంపికయ్యాడు. వీరంతా ఇప్పటికే.. హెడ్‌కోచ్ గౌతం గంభీర్ మార్గదర్శనంలో నెట్స్‌లో ప్రాక్టీస్ చేశారు. ఆతిథ్య శ్రీలంకతో శుక్రవారం నాటి తొలి వన్డే పూర్తి స్థాయిలో సిద్దమయ్యారు.ఇందుకు సంబంధించిన వీడియోను భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) సోషల్ మీడియాలో షేర్ చేసింది. దిగ్గజ బ్యాటర్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ.. నెట్స్‌లో శ్రమిస్తుండగా.. గంభీర్ దగ్గరుండి వారి ప్రాక్టీస్‌ను గమనించాడు. ఇక ఈ ఇద్దరు స్టార్లు భారీ సిక్సర్లతో చెలరేగగా.. గంభీర్ నవ్వుతూ వారెవ్వా అన్నట్లుగా ఇచ్చిన ఎక్స్ప్రెషన్ టీమిండియా అభిమానులను ఆకర్షిస్తోంది.వీడియోపై స్పందిస్తూ.. ముగ్గురు లెజెండ్స్‌ని ఇలా చూస్తూ ఉంటే కళ్లు సరిపోవడం లేదంటూ ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. కాగా రాహుల్ ద్రవిడ్ స్థానంలో గౌతం గంభీర్ హెడ్‌కోచ్‌గా నియమితుడు కాగానే సీనియర్లకు షాకివ్వడం ఖాయమని.. ముఖ్యంగా కోహ్లికి కష్టాలు మొదలైనట్లేనన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అయితే, తన తొలి ప్రెస్ మీట్లోనే గంభీర్ వీటిని కొట్టిపారేశాడు. రోహిత్, కోహ్లి వరల్డ్‌క్లాస్ బ్యాటర్లని.. ఫిట్నెస్ కాపాడుకుంటే వన్డే వరల్డ్‌కప్-2027 దాకా ఆడగలరంటూ ప్రశంసలు కురిపించాడు. వారిద్దరు జట్టుకు బలం అని.. వారితో కలిసి పనిచేసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు తెలిపాడు. ఇదిలా ఉంటే.. ఐపీఎల్-2023లో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్ మెంటార్‌గా ఉన్న సమయంలో గంభీర్- కోహ్లి మధ్య వాగ్వాదం జరిగిన విషయం తెలిసిందే. అయితే, ఈ ఏడాది ఇద్దరు ఆలింగనం చేసుకోవడంతో ఆ వివాదం సమసిపోయినట్లయింది. ఇక ఈసారి కోల్‌కతా నైట్ రైడర్స్ మెంటార్‌గా ఉన్న గంభీర్ ఆ జట్టును విజేతగా నిలిపి.. ఆపై భారత క్రికెట్ జట్టు హెడ్‌కోచ్‌గా బాధ్యతలు చేపట్టాడు. T20I Series ✅It's now time for ODIs 😎🙌#TeamIndia | #SLvIND pic.twitter.com/FolAVEn3OG— BCCI (@BCCI) August 1, 2024 -
లంకతో తొలి వన్డే.. అందరి కళ్లు సిరాజ్‌పైనే..!
కొలొంబో వేదికగా భారత్-శ్రీలంక మధ్య ఇవాళ (ఆగస్ట్ 2) తొలి వన్డే జరుగనుంది. ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి లాంటి స్టార్ ఆడనున్నప్పటికీ.. భారత క్రికెట్ అభిమానుల కళ్లు మాత్రం హైదరాబాదీ పేసర్ మొహమ్మద్ సిరాజ్‌పైనే ఉన్నాయి. ఎందుకంటే సిరాజ్‌కు శ్రీలంకపై ఘనమైన ట్రాక్ రికార్డు ఉంది. ఇక్కడి పిచ్‌లపై సిరాజ్ చెలరేగిపోతాడు. ముఖ్యంగా కొలంబోలో సిరాజ్‌కు పట్టపగ్గాలు ఉండవు. ఇక్కడ చివరిగా ఆడిన మ్యాచ్‌లో (ఆసియా కప్ 2023 ఫైనల్లో) మియా నిప్పులు చెరిగాడు. ఆ మ్యాచ్‌లో అతను కేవలం 21 పరుగులిచ్చి 6 వికెట్లు పడగొట్టాడు. ఫలితంగా శ్రీలంక 50 పరుగులకే కుప్పకూలి, ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. సిరాజ్ శ్రీలంకతో ఇప్పటిదాకా ఆడిన 6 వన్డేల్లో 7.7 సగటున, 3.5 ఎకానమీతో 19 వికెట్లు పడగొట్టాడు. ఇవాళ జరిగే మ్యాచ్‌లోనూ భారత అభిమానులు సిరాజ్ నుంచి మెరుపు ప్రదర్శనను ఆశిస్తున్నారు. సిరాజ్ కొలొంబోలో మరోసారి చెలరేగితే శ్రీలంకకు కష్టాలు తప్పవు.ఇదిలా ఉంటే, లంకతో ఇవాల్టి మ్యాచ్ మధ్యాహ్నం 2:30 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్‌లో గెలుపే లక్ష్యంగా ఇరు జట్లు బరిలోకి దిగనున్నాయి. టీమిండియా.. తాజాగా ముగిసిన టీ20 సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసి మాంచి జోష్‌లో ఉండగా.. లంకేయులు.. భారత్‌కు ఎలాగైనా ఓటమి రుచి చూపించాలని పట్టుదలగా ఉన్నారు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ రాకతో టీమిండియా మరింత పటిష్టంగా మారగా.. శ్రీలంకను గాయాల బెడద వేధిస్తుంది. ఆ జట్టు స్టార్ పేసర్లు పతిరణ, మధుషంక గాయాల కారణంగా సిరీస్ మొత్తానికే దూరమయ్యారు.తొలి వన్డేకు భారత తుది జట్టు (అంచనా)..రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, రియాన్ పరాగ్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, మొహమ్మద్ సిరాజ్, హర్షిత్ రాణా -
భారత్ వర్సెస్ శ్రీలంక..రికార్డులు ఏం చెబుతున్నాయంటే..?
కొలొంబో వేదికగా భారత్, శ్రీలంక మధ్య ఇవాళ (ఆగస్ట్ 2) తొలి వన్డే మ్యాచ్ జరుగనుంది. మధ్యాహ్నం 2:30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభంకానుంది. సోనీ స్పోర్ట్స్‌లో ఈ మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం కానుంది. టీ20 సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసి ఉత్సాహంతో ఉన్న భారత్ వన్డే సిరీస్‌ను సైతం గెలుపుతో ప్రారంభించాలని భావిస్తుంది. మరోవైపు శ్రీలంక.. భారత్‌ను ఎలాగైనా మట్టికరిపించాలని పట్టుదలగా ఉంది.ఇరు జట్ల మధ్య హెడ్ టు హెడ్ రికార్డులను పరిశీలిస్తే.. శ్రీలంకపై భారత్ సంపూర్ణ ఆధిపత్యం కలిగి ఉంది. ఈ ఫార్మాట్లో ఇరు జట్లు 168 మ్యాచ్‌ల్లో తలపడగా.. భారత్ 99, శ్రీలంక 57 మ్యాచ్‌ల్లో విజయాలు సాధించాయి. 11 మ్యాచ్‌ల్లో ఫలితం తేలకపోగా.. ఓ మ్యాచ్ టై అయ్యింది. కొలొంబో వేదికగా జరిగిన మ్యాచ్‌ల విషయానికొస్తే.. ఇక్కడ ఇరు జట్లు 38 మ్యాచ్‌ల్లో ఎదురెదురుపడగా.. 19 మ్యాచ్‌ల్లో భారత్, 16 మ్యాచ్‌ల్లో శ్రీలంక విజయాలు సాధించాయి. మూడు మ్యాచ్‌ల్లో ఎలాంటి ఫలితం రాలేదు. ఇరు జట్ల మధ్య జరిగిన చివరి ఐదు మ్యాచ్‌ల విషయానికొస్తే.. భారత్ ఐదు మ్యాచ్‌ల్లోనూ విజయాలు నమోదు చేసింది. జట్ల విషయానికొస్తే.. రోహిత్, కోహ్లి, రాహుల్, శ్రేయస్‌ల రాకతో భారత్ మరింత పటిష్టంగా మారింది. హర్షిత్ రాణా, రియాన్ పరాగ్ తొలి మ్యాచ్‌తో వన్డే అరంగేట్రం చేయవచ్చు. శ్రీలంక విషయానికొస్తే.. ఆ జట్టును గాయాల సమస్య వేధిస్తుంది. కీలకమైన పేసర్లు పతిరణ, మధుషంక గాయాల కారణంగా సిరీస్ మొత్తానికి దూరమయ్యారు.భారత తుది జట్టు (అంచనా): రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, రియాన్ పరాగ్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, మొహమ్మద్ సిరాజ్, హర్షిత్ రాణా -
Ind vs SL: ఆ విషయం గంభీర్‌తో చర్చిస్తా: రోహిత్ శర్మ
కేఎల్ రాహుల్.. ఈ కర్ణాటక బ్యాటర్ టీమిండియా తరఫున ఇప్పటి వరకు 35 వన్డేల్లో వికెట్ కీపర్‌గా వ్యవహరించాడు. సగటు 58.91తో మొత్తంగా 1355 పరుగులు సాధించాడు ఈ కుడిచేతివాటం బ్యాటర్. ఇందులో రెండు శతకాలు, పది హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అంతేకాదు.. 48 స్టంపింగ్స్లోనూ భాగమయ్యాడు 32 ఏళ్ల కేఎల్ రాహుల్. ఓవరాల్‌గా ఇప్పటి వరకు 75 వన్డేలు ఆడిన రాహుల్ ఖాతాలో 2820 పరుగులు ఉన్నాయి. వన్డే ప్రపంచకప్-2023 జట్టులోనూ అతడే వికెట్ కీపర్‌గా వ్యవహరించాడు.సుదీర్ఘకాలం పాటు జట్టుకు దూరంమరోవైపు.. రిషభ్ పంత్.. 26 ఏళ్ల ఈ వికెట్ కీపర్ బ్యాటర్ 30 వన్డేలు ఆడి 865 పరుగులు సాధించాడు. టెస్టులు(సగటు 43.67- 2271 రన్స్), టీ20(1209 రన్స్)లతో పోలిస్తే వన్డేల్లో ఈ ఉత్తరాఖండ్ ప్లేయర్ రికార్డు గొప్పగా ఏమీ లేదు. 2022 డిసెంబరులో ఘోర కారు ప్రమాదం తర్వాత ఈ ఎడమచేతి వాటం బ్యాటర్ సుదీర్ఘకాలం పాటు జట్టుకు దూరమయ్యాడు.రీ ఎంట్రీలో అదుర్స్ ఈ క్రమంలో పరిమిత ఓవర్ల క్రికెట్లో టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్‌గా కేఎల్ రాహుల్ తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. అయితే, టీ20 ప్రపంచకప్-2024 నాటికి పునరాగమనం చేసిన రిషభ్ పంత్ కారణంగా.. వరల్డ్‌కప్ జట్టులో కేఎల్ రాహుల్‌కు చోటు కరువైంది. తాజాగా శ్రీలంక పర్యటనలోనూ వన్డే సిరీస్‌లో భాగంగా తుదిజట్టులో స్థానానికై వీరి మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది.పంత్.. రాహుల్.. ఇద్దరిలో ఎవరు?ఈ నేపథ్యంలో అనుభవజ్ఞుడైన రాహుల్ వైపు మొగ్గుచూపుతారా.. లేదంటే పంత్‌కే మొదటి ప్రాధాన్యం ఇస్తారా అన్న అంశం చర్చనీయంగా మారింది. ఈ క్రమంలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మొదటి వన్డేకు ముందు మీడియాతో మాట్లాడగా.. ఈ విషయమై ప్రశ్న ఎదురైంది. ఇందుకు బదులిస్తూ.. ‘‘వికెట్ కీపర్ బ్యాటర్లు రాహుల్- పంత్‌ల మధ్య ఒకరినే ఎంచుకోవాలంటే కష్టమే. ఇద్దరూ నాణ్యమైన ఆటగాళ్లే. ఇద్దరు సమర్థులే. మ్యాచ్ విన్నర్లు కూడా!హెడ్‌కోచ్‌తో చర్చిస్తానుగతంలో ఎన్నోసార్లు ఒంటిచేత్తో జట్టును గెలిపించారు. అలాంటివాళ్లలో ఒకరినే ఎంచుకోవాలంటే ఎన్నో రకాలుగా ఆలోచించాల్సి ఉంటుంది. ఒక్కోసారి ఇలాంటివి సమస్యలుగా పరిణమిస్తాయి. అయితే, ఒకందుకు ఇది కూడా మంచిదే. కెప్టెన్‌గా నాకు అనేక ఆప్షన్లు అందుబాటులో ఉండటం మంచి విషయమే.రాహుల్- పంత్‌ల గురించి హెడ్‌కోచ్‌తో చర్చిస్తాను. మేము రేపు మ్యాచ్ ఆడేటపుడు మీకు ఈ విషయంపై స్పష్టత వస్తుంది. భారత క్రికెట్ ప్రమాణాలకు తగ్గట్లుగా ఆడటం ముఖ్యం. ప్రయోగాలు సహజమే అయినా అందుకు ఓటమి రూపంలో మూల్యం చెల్లించాల్సి వస్తే మా ప్రయత్నం విరమించుకోవడమే ఉత్తమమని భావిస్తాం’’ అని రోహిత్ శర్మ పేర్కొన్నాడు.కాగా శ్రీలంక- టీమిండియా మధ్య శుక్రవారం మధ్యాహ్నం తొలి వన్డే జరుగనుంది. ఇక మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను సూర్యకుమార్ యాదవ్ సేన 3-0తో క్లీన్‌స్వీప్ చేసిన విషయం తెలిసిందే.కాగా ఈ సిరీస్‌తోనే టీమిండియా హెడ్‌కోచ్‌గా గౌతం గంభీర్ ప్రయాణం మొదలుపెట్టాడు. తాజాగా వన్డేల్లోనూ తన మార్కు చూపించేందుకు సిద్ధమయ్యాడు.చదవండి: వన్డే వరల్డ్‌కప్ ఆల్‌టైమ్ గ్రేటెస్ట్ జట్టు.. కోహ్లికి నో ఛాన్స్! -
IND vs SL: శ్రీలంకతో తొలి వన్డే.. ఆ ఇద్దరి అరంగేట్రం! పంత్‌కు నో ఛాన్స్
శ్రీలంకతో టీ20 సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా.. ఇప్పుడు అదే జట్టుతో వన్డేలకు సిద్దమైంది. భారత్-శ్రీలంక మధ్య మూడు వన్డేల సిరీస్ రేపటి(ఆగస్టు 2) నుంచి ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌లో భాగంగా తొలి వన్డే కొలంబో వేదికగా శుక్రవారం జరగనుంది. ఛాంపియన్స్ ట్రోఫీ-2025 సన్నాహకాల్లో భాగంగా ఈ సిరీస్ జరగనుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ప్రారంభయ్యే ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు భారత్ కేవలం ఆరు వన్డేల్లో మాత్రమే పాల్గోనుంది. దీంతో ఈ సిరీస్‌ను ప్రాక్టీస్‌గా ఉపయోగించుకోవాలని హెడ్‌కోచ్ గంభీర్ నేతృత్వంలోని భారత జట్టు భావిస్తోంది.హర్షిత్ రానా అరంగేట్రం.. ఇక తొలి వన్డే విషయానికి వస్తే భారత తరపున యువ పేసర్ హర్షిత్ రానా అరంగేట్రం చేయనున్నట్లు తెలుస్తోంది. లంకతో జరిగే తొలి వన్డేకు భారత తుది జట్టులో రానాకు చోటు ఇవ్వాలని టీమిండియా మెనెజ్‌మెంట్ భావిస్తున్నట్లు సమాచారం.ఐపీఎల్-2024 సీజన్లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచినందుకు తొలి సారి భారత వన్డే జట్టులో చోటు దక్కింది. మరోవైపు అతడితో పాటు రియాన్ పరాగ్ సైతం వన్డేల్లో డెబ్యూ చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఆల్‌రౌండ్ స్కిల్స్‌ను పరిగణలోకి తీసుకుని పరాగ్‌కు తుది జట్టులో ఛాన్స్ ఇవ్వనున్నట్లు వినికిడి. మరోవైపు గత కొంత కాలంగా జట్టుకు దూరంగా ఉంటున్న కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ ఈ మ్యాచ్‌తో రీ ఎంట్రీ ఇవ్వడం దాదాపు ఖాయమైంది. మరోవైపు తొలి మ్యాచ్‌కు వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ బెంచ్‌కే పరిమితమయ్యే అవకాశాలు ఎక్కువగా కన్పిస్తున్నాయి.శ్రీలంకతో తొలి వన్డేకు భారత తుది జట్టు(అంచనా)రోహిత్ శర్మ (కెప్టెన్), శుబ్‌మన్ గిల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్ (వికెట్ కీపర్), రియాన్ పరాగ్, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్. -
టీమిండియాతో వన్డే సిరీస్.. శ్రీలంకకు భారీ షాక్! యార్కర్ల కింగ్ ఔట్
టీమిండియాతో వన్డే సిరీస్‌కు ముందు శ్రీలంకకు గట్టి ఎదరు దెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ పేసర్ మతీషా పతిరాన గాయం కారణంగా భారత్‌తో వన్డే సిరీస్‌కు దూరమయ్యాడు. టీమిండియాతో జరిగిన మూడో టీ20లో పతిరాన గాయపడ్డాడు. పల్లెకెలె వేదికగా జరిగిన ఆఖరి టీ20లో బంతిని ఆపే క్రమంలో పతిరాన భుజానికి గాయమైంది.వెంటనే అతడు మైదానాన్ని విడిచి వెళ్లాడు. అయితే అతడి గాయం తీవ్రమైనది కావడంతో రెండు వారాల విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించనట్లు సమాచారం. ఈ క్రమంలో పతిరాన భారత్‌తో వన్డే సిరీస్ నుంచి వైదొలిగాడు. అతడి స్ధానాన్ని యువ పేసర్ మహ్మద్ షిరాజ్‌తో శ్రీలంక క్రికెట్ భర్తీ చేసింది.కాగా టీ20 సిరీస్‌ను శ్రీలంక కోల్పోయినప్పటకి పతిరాన మాత్రం అద్బుతమైన ప్రదర్శన కనబరిచాడు. 5 వికెట్లతో శ్రీలంక తరపున లీడింగ్ వికెట్ టేకర్‌గా నిలిచాడు. ఇక మహ్మద్ సిరాజ్ విషయానికి వస్తే.. డిమాస్టిక్ క్రికెట్లో అతడికి మంచి రికార్డు ఉంది. ఇప్పటివరకు 47 లిస్ట్-ఎ మ్యాచ్‌లు ఆడిన షిరాజ్.. 80 వికెట్లు పడగొట్టాడు. కాగా ఆగస్టు 2 నుంచి భారత్-శ్రీలంక మధ్య మూడు వన్డేల సిరీస్ ఆరంభం కానుంది.భారత్‌తో వన్డే సిరీస్‌కు లంక జట్టు: చరిత్ అసలంక (కెప్టెన్), పాతుమ్ నిస్సాంక, అవిష్క ఫెర్నాండో, కుసల్ మెండిస్, సదీర సమరవిక్రమ, కమిందు మెండిస్, జనిత్ లియానాగే, నిషాన్ మదుష్క, వనిందు హసరంగా, దునిత్ వెల్లలగే, చమిక కరుణరత్నే, మహేశ్ తీక్షణ, అకిల దనంజయ, దిల్షన్ మదుశంక, షిరాజ్, అసిత ఫెర్నాండో -
Ind vs SL: గంభీర్ గైడెన్స్.. కోహ్లి- రోహిత్ ప్రాక్టీస్
శ్రీలంకతో వన్డే సిరీస్ కోసం కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి సన్నద్ధమవుతున్నారు. వీరితో పాటు లంకతో వన్డేలకు ఎంపికైన కుల్దీప్, హర్షిత్ రాణా, శ్రేయస్ అయ్యర్లు ఇప్పటికే కొలంబో చేరుకొని సోమవారం నుంచి నెట్స్‌లో చెమటోడ్చుతున్నారు. గత నెల వెస్టిండీస్ గడ్డపై భారత్ రెండో టీ20 ప్రపంచకప్ గెలిచిన రోజే భారత స్టార్లు రోహిత్, కోహ్లి పొట్టి ఫార్మాట్‌కు గుడ్‌బై చెప్పారు.ఇప్పుడు మళ్లీ.. దాదాపు నెలరోజుల తర్వాత అంతర్జాతీయ వన్డేలు ఆడేందుకు ముమ్మర కసరత్తు చేస్తున్నారు. కొలంబోలో అసిస్టెంట్ కోచ్ అభిషేక్ నాయర్ ట్రెయినింగ్‌లో వీళ్లంతా ప్రాక్టీస్‌లో నిమగ్నమయ్యారు. తాజాగా.. కొత్త హెడ్ కోచ్ గౌతం గంభీర్ మార్గదర్శనంలో రోహిత్ శర్మ- విరాట్ కోహ్లి నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తున్న దృశ్యాలు బుధవారం వెలుగులోకి వచ్చాయి.కోహ్లితో చర్చరోహిత్- కోహ్లి కలిసి నెట్స్ బ్యాటింగ్ చేస్తుండగా.. గంభీర్ దగ్గరుండి వీక్షించాడు. ఈ క్రమంలో కోహ్లితో చాలా సేపు చర్చించినట్లు తెలుస్తోంది. కాగా శ్రీలంకతో టీ20 సిరీస్ ముగిసిన నేపథ్యంలో హెడ్ కోచ్ గంభీర్ వన్డే సిరీస్‌పై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఈ దిగ్గజాలతో పాటు కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ సహా మిగిలిన ఆటగాళ్ల సన్నద్ధతపై కూడా ఫోకస్ చేస్తున్నట్లు కనిపిస్తోంది.కాగా జూలై 27, 28, 30 తేదీల్లో పల్లెకెలె వేదికగా టీమిండియా మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడింది. ఈ క్రమంలో సూర్యకుమార్ యాదవ్ సేన 3-0తో ఆతిథ్య శ్రీలంక జట్టును క్లీన్‌స్వీప్ చేసింది. ఇక ఆగష్టు 2 నుంచి వన్డే సిరీస్ మొదలుకానుంది. మూడు వన్డేలు(ఆగస్టు 2, 4, 7) కొలంబోలని ప్రేమదాస స్టేడియంలోనే జరుగుతాయి. శ్రీలంకతో వన్డే సిరీస్‌కు టీమిండియారోహిత్ శర్మ (కెప్టెన్), శుబ్‌మన్ గిల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్(వికెట్ కీపర్), రిషబ్ పంత్(వికెట్ కీపర్), శ్రేయస్ అయ్యర్, శివం దూబే, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, వాషింగ్టన్ సుందర్, అర్ష్‌దీప్ సింగ్, రియాన్ పరాగ్, అక్షర్ పటేల్, ఖలీల్ అహ్మద్, హర్షిత్ రాణా. Great to see two old Delhi teammates connecting over a long chat after a batting session in Colombo. pic.twitter.com/VfjdjANkxa— Vimal कुमार (@Vimalwa) July 31, 2024 -
‘వాళ్లు ఆడుతుంటే గంగూలీ- సచిన్ గుర్తుకువస్తారు’
టీమిండియా టీ20 కొత్త ఓపెనింగ్ జోడీపై మాజీ క్రికెటర్ రాబిన్ ఊతప్ప ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ జంటను చూస్తుంటే తనకు సౌరవ్ గంగూలీ- సచిన్ టెండుల్కర్ గుర్తుకువస్తున్నారని పేర్కొన్నాడు. టీ20 ప్రపంచకప్-2024లో భారత్ టైటిల్ విజేతగా నిలిచిన తర్వాత కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి అంతర్జాతీయ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే.అమెరికా- వెస్టిండీస్ వేదికగా జరిగిన ఈ ఐసీసీ టోర్నీల్లో రోహిత్- విరాట్ ఓపెనర్లుగా బరిలోకి దిగారు. ఫలితంగా.. యువ బ్యాటర్ యశస్వి జైస్వాల్ ప్రపంచకప్ ప్రధాన జట్టుకు ఎంపికైనా బెంచ్‌కే పరిమితమయ్యాడు. మరోవైపు.. భవిష్య కెప్టెన్ శుబ్‌మన్ గిల్ రిజర్వ్ ప్లేయర్లలో ఒకడిగా జట్టుతో ప్రయాణించాడు. అయితే, దిగ్గజ బ్యాటర్లు కోహ్లి- రోహిత్ రిటైర్మెంట్ తర్వాత పొట్టి ఫార్మాట్లో యశస్వి- గిల్ జోడీ ఓపెనింగ్‌కు వస్తున్నారు.వరల్డ్‌కప్ టోర్నీ తర్వాత భారత ద్వితీయ శ్రేణి జట్టు జింబాబ్వే పర్యటనకు వెళ్లగా.. శుబ్‌మన్ గిల్ తొలిసారిగా టీమిండియా కెప్టెన్‌గా పగ్గాలు చేపట్టాడు. ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 4-1తో గెలిచాడు. ఈ టూర్లో యశస్వి- గిల్ ఎక్కువసార్లు ఓపెనింగ్ చేశారు. తాజాగా శ్రీలంక పర్యటనలోనూ వీరే టీమిండియా ఇన్నింగ్స్ ఆరంభించారు.టీమిండియా లంకతో టీ20 సిరీస్‌ను 3-0తో వైట్‌వాష్ చేయడంలో తమ వంతు పాత్ర పోషించారు. ఈ నేపథ్యంలో భారత మాజీ వికెట్ కీపర్ బ్యాటర్ రాబిన్ ఊతప్ప సోనీ స్పోర్ట్స్‌తో మాట్లాడుతూ.. యశస్వి- గిల్ జోడీని గంగూలీ- సచిన్‌లతో పోల్చాడు.వాళ్లు ఆడుతుంటే గంగూలీ- సచిన్ గుర్తుకువస్తారు‘‘వీళ్లిద్దరిని చూస్తే నాకు సౌరవ్ గంగూలీ- సచిన్ టెండుల్కర్ గుర్తుకువస్తారు. వాళ్లిద్దరు ఎలా పరస్పరం అవగాహనతో ఆడేవారో.. వీరూ అలాగే చేస్తారు. తమవైన వ్యూహాలు అమలు చేస్తూనే.. మెరుగైన భాగస్వామ్యాలు నెలకొల్పుతారు. వీళ్లిద్దరు కలిసి బ్యాటింగ్ చేస్తుంటే చూడముచ్చటగా ఉంటుంది. ఇక జైస్వాల్ గురించి చెప్పాలంటే.. త్వరలోనే అతడు వన్డేల్లో కూడా ఓపెనర్‌గా తన స్థానాన్ని సుస్థిరం చేసుకోగలడు.టెస్టు, టీ20 క్రికెట్లో ఇప్పటికే టీమిండియా తరఫున తానేంటో నిరూపించుకున్నాడు. వన్డేల్లోనూ రాణించగలడు. పరుగులు చేయడమే పరమావధిగా ముందుకు సాగుతున్న అతడికి ఇదేమీ అసాధ్యం కాదు’’ అని రాబిన్ ఊతప్ప అభిప్రాయపడ్డాడు. కాగా యశస్వి గంగూలీ మాదిరే ఎడమచేతి వాటం బ్యాటర్ కాగా.. గిల్ సచిన్‌లా రైట్‌హ్యాండ్ బ్యాటర్. -
టీ20 సిరీస్ క్లీన్‌స్వీప్: ఇది చాలదు.. ఇంకా కావాలి: గంభీర్
టీమిండియా హెడ్‌కోచ్‌గా గౌతం గంభీర్‌కు ఘనమైన ఆరంభం లభించింది. అతడి మార్గదర్శనంలోని టీమిండియా శ్రీలంకతో టీ20 సిరీస్‌ను 3-0తో క్లీన్‌స్వీప్ చేసింది. లంక పర్యటనలో భాగంగా మూడు టీ20లలోనూ గెలుపొంది మరోసారి తమ స్థాయిని చాటుకుంది. ఈ నేపథ్యంలో జట్టును ఉద్దేశించి గంభీర్ ప్రసంగించిన వీడియోను బీసీసీఐ సోషల్ మీడియాలో షేర్ చేసింది.‘‘అద్భుతమైన విజయం ఇది. సిరీస్ గెలిచినందుకు మీ అందరికీ అభినందనలు. అత్యద్భుతమైన కెప్టెన్సీతో జట్టుకు విజయం అందించిన సూర్యకు శుభాకాంక్షలు. బ్యాటర్‌గానూ అతడు అద్భుత ప్రదర్శన కనబరిచాడు. సిరీస్ ఆరంభానికి ముందు నేను ఏం కోరుకుంటున్నానో మీకు చెప్పాను.అయితే, మీరు అంతకంటే ఎక్కువే సాధించారు. అయితే, ఇలాంటి వికెట్లపై రాణించాలంటే మన నైపుణ్యాలకు మరింత పదును పెట్టాల్సిన ఆవశ్యకత ఉంది. పిచ్ స్వభావం, ఎంత మేర స్కోరు చేయవచ్చో ముందుగానే అంచనా వేస్తున్నాం. అయితే, కొన్నిసార్లు అంచనాలు తప్పవచ్చు. ఈ మ్యాచ్ ద్వారా మనమెన్నో కొత్త పాఠాలు నేర్చుకున్నాం. సిరీస్ గెలుపు కంటే కూడా ఇదే గొప్ప విషయం’’ అని గౌతం గంభీర్ టీమిండియాను ఉద్దేశించి స్ఫూర్తిదాయక వ్యాఖ్యలు చేశాడు. కాగా మంగళవారం నాటి మూడో టీ20లో భారత జట్టు బ్యాటింగ్ చెత్తగా సాగింది.నిర్ణీత 20 ఓవర్లలో 137 పరుగుల నామమాత్రపు స్కోరుకు పరిమితమైంది. ఈ క్రమంలో ఆతిథ్య లంక గట్టిపోటీనివ్వడంతో టీమిండియా ఓటమి దాదాపుగా ఖరారైంది. అయితే, భారత బౌలర్ల కారణంగా మ్యాచ్ టై అవడంతో సూపర్ ఓవర్ నిర్వహించారు. ఈ క్రమంలో టీమిండియా స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ సూపర్ ఓవర్ వేయగా.. శ్రీలంక 3 బంతులాడి 2 వికెట్లు కోల్పోయి 2 పరుగులే చేసింది. ఇక 3 పరుగుల లక్ష్యాన్ని భారత్ తొలి బంతికే బౌండరీ బాది ఛేదించింది.𝗧𝗵𝗶𝘀 𝗧𝗲𝗮𝗺 💙 Head Coach Gautam Gambhir 🤝 Hardik Pandya address the dressing room as the action now shifts to the ODIs in Colombo #TeamIndia | #SLvIND | @GautamGambhir | @hardikpandya7 pic.twitter.com/PFrTEVzdvd— BCCI (@BCCI) July 31, 2024 -
సూపర్ ఓవర్లో "అజేయ" భారత
శ్రీలంకతో నిన్న (జులై 30) జరిగిన మూడో టీ20లో టీమిండియా సూపర్ ఓవర్లో విజయం సాధించింది. టీ20ల్లో సూపర్ ఓవర్లో విజయం సాధించడం భారత్‌కు ఇది నాలుగో సారి. బౌల్ ఔట్‌తో కలుపుకుని ఐదో సారి. భారత్ ఇప్పటివరకు ఆడిన ప్రతి సూపర్ ఓవర్లో విజయం సాధించింది. న్యూజిలాండ్‌పై రెండు సార్లు, ఆఫ్ఘనిస్తాన్, శ్రీలంకపై చెరో సారి టీమిండియా సూపర్ విక్టరీలు సాధించింది.మ్యాచ్ విషయానికొస్తే.. నిర్ణీత ఓవర్లలో ఇరు జట్ల స్కోర్లు సమం కావడంతో మ్యాచ్ సూపర్ ఓవర్‌కు దారి తీసింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. 9 వికెట్ల నష్టానికి 137 పరుగులు చేయగా.. ఛేదనలో తడబడిన శ్రీలంక 8 వికెట్ల నష్టానికి అన్నే పరుగులు చేయగలిగింది.భారత ఇన్నింగ్స్‌లో శుభ్‌మన్ గిల్ (39), రియాన్ పరాగ్ (26), సుందర్ (25) ఓ మోస్తరు పరుగులు చేయగా.. లంక ఇన్నింగ్స్‌లో నిస్సంక (26), కుశాల్ మెండిస్ (43), వన్‌డౌన్ బ్యాటర్ (46) పర్వాలేదనిపించారు.లంక బౌలరల్లో తీక్షణ 3, హసరంగ 2, విక్రమసింఘే, అశిత ఫెర్నాండో, రమేశ్ మెండిస్ తలో వికెట్ పడగొట్టగా.. భారత బౌలర్లలో సుందర్, బిష్ణోయ్, రింకూ సింగ్, స్కై తలో 2 వికెట్లు తీశారు.సూపర్ ఓవర్లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక.. వాషింగ్టన్ సుందర్ దెబ్బకు కేవలం రెండు పరుగులు మాత్రమే చేసి రెండు వికెట్లు (3 బంతుల్లో) కోల్పోయింది. అనంతరం సూర్యకుమార్ తొలి బంతికే బౌండరీ బాది టీమిండియాను గెలిపించాడు. ఈ గెలుపుతో భారత్ మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 3-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసింది. ఇరు జట్ల మధ్య వన్డే సిరీస్ ఆగస్ట్ 2, 4, 7 తేదీల్లో కొలొంబో వేదికగా జరుగనుంది. -
వార్నర్ రికార్డును సమం చేసిన సూర్యకుమార్ యాదవ్
శ్రీలంకతో జరిగిన మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో అద్భుత ప్రదర్శన కనబర్చినందుకు గానూ టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు గెలుచుకున్నాడు. ఈ సిరీస్‌లో స్కై 3 మ్యాచ్‌ల్లో 92 పరుగులే చేసినప్పటికీ.. చాలా కీలకమైన ఇన్నింగ్స్‌లు ఆడాడు. మూడో టీ20లో అతను బంతితోనూ (1-0-5-2) మ్యాజిక్ చేశాడు. ఫుల్ టైమ్ కెప్టెన్‌గా స్కైకు ఇది తొలి సిరీస్. తొలి సిరీస్‌లోనే స్కై.. ప్రత్యర్ది జట్టును క్లీన్ స్వీప్ చేశాడు.టీ20ల్లో స్కైకు ఇది ఐదో ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు. ఈ అవార్డుతో అతను అత్యధిక ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డులు గెలుచుకున్న ఆటగాళ్ల జాబితాలో రెండో స్థానానికి ఎగబాకాడు. స్కై.. బాబర్ ఆజమ్, డేవిడ్ వార్నర్, షకీబ్ అల్ హసన్‌లతో సమంగా ఐదు ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డులు గెలుచుకున్నాడు. ఈ జాబితాలో విరాట్ కోహ్లి (7) టాప్‌లో ఉన్నాడు.మూడో టీ20 విషయానికొస్తే.. లంకపై భారత్ సూపర్ ఓవర్లో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 137 పరుగులు చేయగా.. ఛేదనలో శ్రీలంక సైతం అన్నే పరుగులు చేసింది. రింకూ సింగ్, సూర్యకుమార్ చివరి రెండో ఓవర్లు అద్భుతంగా బౌలింగ్ చేసి టీమిండియాను ఓటమి నుంచి గట్టెక్కించారు. అనంతరం సూపర్ ఓవర్లో వాషింగ్టన్ సుందర్ అద్భుతంగా బౌలింగ్ చేసి (2/2) భారత్ గెలుపుకు బాటలు వేశాడు. సూర్యకుమార్ తొలి బంతికే బౌండరీ మ్యాచ్‌ను ముగించాడు. ఈ గెలుపుతో భారత్ మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 3-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసింది. రెగ్యులర్ మ్యాచ్‌లో 2 వికెట్లు, 25 పరుగులు.. సూపర్ ఓవర్లో 2 వికెట్లు తీసి టీమిండియా గెలుపులో ప్రధానపాత్ర పోషించిన సుందర్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. -
భారత్ చేతిలో ఓటమి.. చెత్త రికార్డు మూటగట్టుకున్న శ్రీలంక
మూడో టీ20లో భారత్ చేతిలో ఓడిన శ్రీలంక ఓ చెత్త రికార్డును మూటగట్టుకుంది. అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక మ్యాచ్‌లు ఓడిన జట్టుగా రికార్డుల్లోకెక్కింది. 2006 నుంచి ఇప్పటివరకు 195 టీ20లు ఆడిన శ్రీలంక 105 మ్యాచ్‌ల్లో (సూపర్ ఓవర్లతో కలుపుకుని) ఓటమిపాలైంది. ఈ మ్యాచ్‌కు ముందు ఈ చెత్త రికార్డు బంగ్లాదేశ్ (104) పేరిట ఉండేది. అంతర్జాతీయ టీ20ల్లో సెంచరీ ఓటములు చవి చూసిన మరో జట్టు వెస్టిండీస్. వెస్టిండీస్ ఇప్పటివరకు ఆడిన 202 మ్యాచ్‌ల్లో 101 పరాజయాలు ఎదుర్కొంది.కాగా, శ్రీలంకతో జరిగిన మూడో టీ20లో భారత్ సూపర్ ఓవర్లో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 137 పరుగులు చేయగా.. ఛేదనలో శ్రీలంక సైతం అన్నే పరుగులు చేసింది. రింకూ సింగ్, సూర్యకుమార్ చివరి రెండో ఓవర్లు అద్భుతంగా బౌలింగ్ చేసి టీమిండియాను ఓటమి నుంచి గట్టెక్కించారు. అనంతరం సూపర్ ఓవర్లో వాషింగ్టన్ సుందర్ అద్భుతంగా బౌలింగ్ చేసి (2/2) భారత్ గెలుపుకు బాటలు వేశాడు. సూర్యకుమార్ తొలి బంతికే బౌండరీ మ్యాచ్‌ను ముగించాడు. ఈ గెలుపుతో భారత్ మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 3-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసింది.రెగ్యులర్ మ్యాచ్‌లో 2 వికెట్లు, 25 పరుగులు, సూపర్ ఓవర్లో 2 వికెట్లు తీసి టీమిండియా గెలుపులో ప్రధానపాత్ర పోషించిన సుందర్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. సిరీస్ ఆధ్యాంతం అద్భుతంగా రాణించిన సూర్యకుమార్ యాదవ్ ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ ఆవార్డు సొంతం చేసుకున్నాడు. -
రింకూ, సూర్యకుమార్ అద్భుత బౌలింగ్.. సూపర్ ఓవర్లో లంకను చిత్తు చేసిన భారత్
శ్రీలంకతో జరిగిన మూడో టీ20లో టీమిండియా ఓడాల్సిన మ్యాచ్‌లో గెలిచింది. పార్ట్ టైమ్ బౌలర్ల అయిన రింకూ సింగ్, సూర్యకుమార్ అద్బుతంగా బౌలింగ్ చేసి మ్యాచ్‌ను 'టై' చేశారు. అనంతరం సూపర్ ఓవర్లో టీమిండియా ఘన విజయం సాధించింది. 138 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనలో శ్రీలంక తడబడింది. చివరి ఏడు వికెట్లను 22 పరుగుల వ్యవధిలో (4.2 ఓవర్లలో) కోల్పోయింది. 19వ ఓవర్ వేసిన రింకూ సింగ్ కేవలం మూడు పరుగులు మాత్రమే ఇచ్చి 2 వికెట్లు తీయగా.. 20వ ఓవర్ వేసిన కెప్టెన్ సూర్యకుమార్ 5 పరుగులిచ్చి రెండు వికెట్లు పడగొట్టాడు. రింకూ, స్కై సూపర్ బౌలింగ్‌తో చెలరేగడంతో మ్యాచ్ 'టై'గా మారి సూపర్ ఓవర్‌కు దారి తీసింది.GG & SURYA 🤝 DOING INNOVATION. 😄- A 20th over of the match was bowled by Suryakumar Yadav and he defended 6 runs. 🤯pic.twitter.com/dBIT8XdqX0— Mufaddal Vohra (@mufaddal_vohra) July 30, 2024సూపర్ ఓవర్లో వాషింగ్టన్ సుందర్ సూపర్‌గా బౌలింగ్ చేసి రెండు వికెట్లు తీసి రెండు పరుగులు మాత్రమే ఇచ్చాడు. అనంతరం సూర్యకుమార్ తొలి బంతికే బౌండరీ బాది టీమిండియాకు చిరస్మరణీయ విజయాన్నందించాడు. ఈ గెలుపుతో భారత్ మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 3-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసింది. ఓడాల్సిన మ్యాచ్‌ను సూపర్ ఓవర్ దాకా తీసుకెళ్లి గెలవడంతో పార్ట్ టైమ్ బౌలర్లు రింకూ సింగ్, సూర్యకుమార్ యాదవ్‌లపై ప్రశంసల వర్షం కురుస్తుంది. ముఖ్యంగా చివరి ఓవర్ అద్భుతంగా బౌలింగ్ చేసిన స్కైను అభిమానులు ఆకాశానికెత్తుతున్నారు. RINKU SINGH, THE STAR IN THE 19TH OVER. 🔥 pic.twitter.com/eDv1Qt3uYj— Johns. (@CricCrazyJohns) July 30, 2024నిజమైన మ్యాచ్ విన్నర్ అంటూ కొనియాడుతున్నారు. సూపర్ ఓవర్ వేసిన సుందర్‌పై కూడా ప్రశంసల వర్షం కురుస్తుంది. సూపర్ ఓవర్లో అద్బుతంగా బౌలింగ్ చేశాడంటూ నెటిజన్లు కితాబునిస్తున్నారు. రెగ్యులర్ మ్యాచ్‌లో రెండు, సూపర్ ఓవర్లో రెండు వికెట్లు తీయడంతో పాటు కీలకమైన 25 పరుగులు చేసిన సుందర్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా ఎంపికయ్యాడు. రెగ్యులర్ కెప్టెన్‌గా తొలి సిరీస్‌లోనే అద్భుతంగా రాణించిన సూర్యకుమార్‌కు ప్లేయర్ ఆఫ్ సిరీస్ అవార్డు లభించింది.ఇక ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 137 పరుగులు చేసింది. శుభ్‌మన్ గిల్ (39), రియాన్ పరాగ్ (26), సుందర్ (25) ఓ మోస్తరు పరుగులు చేశారు. లంక బౌలరల్లో తీక్షణ 3, హసరంగ 2, విక్రమసింఘే, అశిత ఫెర్నాండో, రమేశ్ మెండిస్ తలో వికెట్ పడగొట్టారు.అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనకు దిగిన శ్రీలంక ఆదిలో గెలుపు దిశగా పయనించినప్పటికీ చివర్లో తడబడి ఓటమిని కొనితెచ్చుకుంది. ఆ జట్టు నిర్ణీత ఓవర్లు పూర్తయ్యేసరికి 8 వికెట్ల నష్టానికి 137 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఓపెనర్లు నిస్సంక (26), కుశాల్ మెండిస్ (43), వన్‌డౌన్ బ్యాటర్ (46) ఓ మోస్తరు స్కోర్లు చేసినా ప్రయోజనం లేకుండా పోయింది. మిగతా ఆటగాళ్లంతా కనీసం రెండంకెల స్కోర్లు కూడా చేయలేకపోయారు. భారత బౌలర్లలో సుందర్, బిష్ణోయ్, రింకూ సింగ్, స్కై తలో 2 వికెట్లు తీశారు. కాగా, ఇరు జట్ల మధ్య మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ఆగస్ట్ 2, 4, 7 తేదీల్లో కొలొంబో వేదికగా జరుగనుంది. -
IND vs SL 3rd T20: తడబడిన భారత బ్యాటర్లు.. శ్రీలంక టార్గెట్ ఎంతంటే?
పల్లెకెలె వేదికగా శ్రీలంకతో జరుగుతున్న ఆఖరి టీ20లో టీమిండియా బ్యాటర్లు తడబడ్డారు. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 137 పరుగులకే పరిమిత మైంది. లంక బౌలర్ల దాటికి భారత బ్యాటర్లు వరుసగా పెవిలియన్‌కు క్యూ కట్టారు. శ్రీలంక బౌలర్లలో మహేష్ థీక్షణ మూడు వికెట్లతో సత్తాచాటగా.. హసరంగా రెండు, విక్రమసింఘే, ఆసితా ఫెర్నాండో చెరో వికెట్ పడగొట్టారు.భారత బ్యాటర్లలో శుబ్‌మన్ గిల్(39) టాప్ స్కోరర్‌గా నిలవగా.. రియాన్ పరాగ్(26), వాషింగ్టన్ సుందర్(25) పరుగులతో పర్వాలేదన్పించాడు. మిగితా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు. భారత వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ వరుసగా రెండో మ్యాచ్‌లోనూ డకౌట్‌గా వెనుదిరిగాడు.కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ కూడా ఈ మ్యాచ్‌లో తన మార్క్‌ను చూపించలేకపోయాడు. ఇక ఇప్పటికే సిరీస్‌ను 2-0 తేడాతో భారత్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. -
గోల్డెన్ ఛాన్స్‌ను మిస్ చేసుకున్న సంజూ.. మళ్లీ డకౌట్
టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ మరోసారి తనకు వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకోలేకపోయాడు. శ్రీలంకతో రెండో టీ20లో గోల్డెన్ డక్‌గా వెనుదిరిగిన శాంసన్.. ఇప్పుడు మూడో టీ20లో కూడా ఖాతా తెరవకుండానే ఔటయ్యాడు. పల్లెకెలె వేదికగా జరుగుతున్న ఆఖరి టీ20లో నాలుగు బంతులు ఎదుర్కొన్న శాంసన్.. డకౌట్‌గా పెవిలియన్‌కు చేరాడు. శ్రీలంక అరంగేట్ర బౌలర్ చమిందు విక్రమసింఘే బౌలింగ్‌లో హసరంగాకు క్యాచ్‌కు ఇచ్చి సంజూ ఔటయ్యాడు. Back To Back Ducks By Sanju Samson 🦆🦆#INDvsSL pic.twitter.com/benObvbY2q— Ankit (@revengeseeker07) July 30, 2024ఈ క్రమంలో నెటిజన్లు శాంసన్‌ను దారుణంగా ట్రోలు చేస్తున్నారు. అవకాశాలు ఇవ్వడం లేదని అందరూ అంటున్నారు.. ఇస్తే ఇదేనా ఆడే తీరు అని ఓ యూజర్ ఎక్స్‌లో పోస్ట్ చేశాడు. ఇలా అయితే జట్టులో చోటు కష్టమని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. కాగా వరుసగా రెండు మ్యాచ్‌ల్లో సంజూ డకౌట్ కావడంతో ఇకపై అతడిని టీ20లకు పరిగణలోకి తీసుకుంటారో లేదో వేచి చూడాలి. Thank you Sanju Samson pic.twitter.com/AeKCtoEPje— YBJ stan #Hallabol (@jaisballenjoyer) July 30, 2024 -
టీమిండియాతో వన్డే సిరీస్.. శ్రీలంక జట్టు ప్రకటన! స్టార్ క్రికెటర్లకు నో ఛాన్స్
భారత్‌తో మూడు వన్డేల సిరీస్‌కు 16 మంది సభ్యులతో కూడిన తమ జట్టును శ్రీలంక క్రికెట్ మంగళవారం ప్రకటించింది. ఈ జట్టుకు ఆల్‌రౌండర్ చరిత్ అసలంక కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. కుసాల్ మెండిస్‌ను తప్పించి తమ వన్డే జట్టు కెప్టెన్సీ బాధ్యతలను అసలంకకు లంక క్రికెట్ అప్పగించింది. టీమిండియాతో టీ20 సిరీస్‌కు దూరమైన సదీర సమరవిక్రమ, కరుణరత్నే వన్డే జట్టుకు ఎంపికయ్యారు. ఆసియా కప్ 2023లో భారత్‌పై అద్భుతమైన ప్రదర్శన కనబరిరిచిన స్పిన్ ఆల్‌రౌండర్ దునిత్ వెల్లలగేకు కూడా ఈ జట్టులో చోటు దక్కింది.అయితే వన్డే సిరీస్‌కు సీనియర్ ఆల్‌రౌండర్లు దసున్ షనక, మథ్యూస్కు మాత్రం సెలక్టర్లు చోటివ్వలేదు. అదేవిధంగా టీ20 సిరీస్‌కు దూరమైన స్టార్ పేసర్ల దుష్మాంత చమీరా, నువాన్ తుషారా ఇప్పుడు వన్డేలకు కూడా దూరమయ్యారు. ఇక ఆగస్టు 2న కొలంబో వేదికగా జరగనున్న తొలి టీ20తో ఈ సిరీస్ ప్రారంభం కానుంది.భారత్‌తో వన్డే సిరీస్‌కు లంక జట్టు: చరిత్ అసలంక (కెప్టెన్), పాతుమ్ నిస్సాంక, అవిష్క ఫెర్నాండో, కుసల్ మెండిస్, సదీర సమరవిక్రమ, కమిందు మెండిస్, జనిత్ లియానాగే, నిషాన్ మదుష్క, వనిందు హసరంగా, దునిత్ వెల్లలగే, చమిక కరుణరత్నే, మహేశ్ తీక్షణ, అకిల దనంజయ, దిల్షన్ మదుశంక, మతీష పతిరన, అసిత ఫెర్నాండో -
IND vs SL: శ్రీలంకతో మూడో టీ20.. గిల్ వచ్చేశాడు! ఆ నలుగురికి రెస్ట్
పల్లెకెలె వేదికగా మూడో టీ20లో భారత్-శ్రీలంక జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన శ్రీలంక తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఆఖరి టీ20కు భారత జట్టు మెనెజ్‌మెంట్ ఏకంగా నలుగురు ఆటగాళ్లకు విశ్రాంతి ఇచ్చింది. హార్దిక్ పాండ్యా, రిషబ్ పంత్, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్ ఈ మ్యాచ్‌కు దూరమమయ్యారు. వారి స్ధానాల్లో శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్, ఖాలీల్ ఆహ్మద్, శుబ్‌మన్ గిల్ తుది జట్టులోకి వచ్చారు. మరోవైపు శ్రీలంక కూడా తమ తుది జట్టులో ఓ మార్పు చేసింది. షనక స్థానంలో ఆల్‌రౌండర్ విక్రమసింఘే అరంగేట్రం చేశాడు. ఇక ఇప్పటికే సిరీస్‌ను 2-0 తేడాతో భారత్ సొంతం చేసుకుంది.తుది జట్లుభారత్: యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), సంజు శాంసన్ (వికెట్ కీపర్), శివమ్ దూబే, రియాన్ పరాగ్, రింకూ సింగ్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, మహ్మద్ సిరాజ్, ఖలీల్ అహ్మద్శ్రీలంక: పాతుమ్ నిస్సాంక, కుసల్ మెండిస్(వికెట్ కీపర్), కుసల్ పెరీరా, కమిందు మెండిస్, చరిత్ అసలంక(కెప్టెన్), చమిందు విక్రమసింఘే, వనిందు హసరంగా, రమేష్ మెండిస్, మహేశ్ తీక్షణ, మతీషా పతిరణ, అసిత ఫెర్నాండో -
పదేళ్ల పాటు టీమిండియా కెప్టెన్ అతడే.. కానీ!
ముప్పై ఏళ్ల వయసులో టీమిండియాలో అరంగేట్రం చేసిన సూర్యకుమార్ యాదవ్.. అనతికాలంలోనే ప్రపంచ నంబర్ వన్ టీ20 బ్యాటర్‌గా ఎదిగాడు. అంతేకాదు.. ఊహించని రీతిలో భారత టీ20 జట్టు కెప్టెన్‌గానూ నియమితుడయ్యాడు. రోహిత్ శర్మ వారసుడిగా.. పూర్తిస్థాయి కెప్టెన్‌గా తొలి సిరీస్‌లోనే విజయం అందుకున్నాడు ఈ మిస్టర్ 360 డిగ్రీ ప్లేయర్.గొప్ప ఆప్షన్లు లేవు కాబట్టేఅయితే, సూర్య పదవి తాత్కాలికమే అంటున్నాడు న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ స్కాట్ స్టైరిస్. దీర్ఘకాలిక ప్రయోజనాల దృష్ట్యా బీసీసీఐ అతడిని ఎంచుకోలేదని అభిప్రాయపడ్డాడు. కొత్త హెడ్ కోచ్ గౌతం గంభీర్‌కు ఇప్పటికిప్పుడు గొప్ప ఆప్షన్లు లేవు కాబట్టే.. సూర్య వైపు మొగ్గుచూపారని పేర్కొన్నాడు. సీనియర్లు రిటైర్ కావడం, హార్దిక్ పాండ్యా ఫిట్నెస్ సమస్యలు సూర్యను కెప్టెన్‌గా నియమించడానికి దోహదం చేశాయని స్టైరిస్ అభిప్రాయం వ్యక్తం చేశాడు.రెండేళ్లపాటు మాత్రమేఏడాది లేదంటే రెండేళ్లపాటు మాత్రమే సూర్యకుమార్ యాదవ్ టీమిండియా టీ20 కెప్టెన్‌గా ఉంటాడని స్టైరిస్ అంచనా వేశాడు. అతడి స్థానంలో యువ ఓపెనర్ శుబ్‌మన్ గిల్ భారత జట్టు పగ్గాలు చేపడతాడని.. అతడిని పూర్తిస్థాయి సారథిగా తీర్చిదిద్దేందుకే సూర్య డిప్యూటీగా నియమించారని పేర్కొన్నాడు. గంభీర్‌కు- భవిష్య కెప్టెన్‌కు మధ్య సూర్య కేవలం ఓ వారథి లాంటివాడు మాత్రమే అని స్టైరిస్ చెప్పుకొచ్చాడు.పదేళ్ల పాటు అతడేటీమిండియా భవిష్య కెప్టెన్ శుబ్‌మన్ గిల్ మాత్రమే అని.. 24 ఏళ్ల ఈ రైట్‌హ్యాండ్ బ్యాటర్ పదేళ్ల పాటు ఆ పదవిలో కొనసాగుతాడని స్కాట్ స్టైరిస్ అభిప్రాయపడ్డాడు. అయితే, ఇప్పుడే భారత జట్టు పగ్గాలు చేపట్టేందుకు తగిన అనుభవం అతడికి లేదని.. అందుకే సూర్య రూపంలో తాత్కాలిక ఏర్పాటు చేశారని పేర్కొన్నాడు. ఒకవేళ సూర్య ద్వైపాక్షిక సిరీస్‌లలో టీమిండియాను విజయవంతంగా ముందుకు నడిపిస్తే.. టీ20 ప్రపంచకప్-2026 వరకు అతడే సారథిగా కొనసాగుతాడని స్టైరిస్ అంచనా వేశాడు.భారత క్రికెట్‌ను ఏలుతాడుశుబ్మన్ గిల్ రోజురోజుకు తన ఆటను మెరుగుపరచుకుంటున్నాడని.. అయితే, మూడు ఫార్మాట్లలో నిలకడగా ఆడటం ముఖ్యమని స్టైరిస్ పేర్కొన్నాడు. అలా అయితేనే, వరుస అవకాశాలు దక్కించుకుని కెప్టెన్ రేసులో ముందుంటాడని అభిప్రాయపడ్డాడు. భవిష్యత్తు ఎలా ఉంటుందో ఎవరూ ఊహించలేరని.. అయితే, తన దృష్టిలో మాత్రం రానున్న దశాబ్దంలో గిల్ భారత క్రికెట్‌ను ఏలుతాడని స్కాట్ స్టైరిస్ పేర్కొన్నాడు. ఇండియా టుడేతో మాట్లాడుతూ ఈ మేరకు తన అభిప్రాయాలు పంచుకున్నాడు.ఇద్దరూ విజయవంతంగాకాగా రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా గైర్హాజరీలో 33 ఏళ్ల సూర్యకుమార్ యాదవ్ తొలిసారిగా భారత టీ20 జట్టుకు సారథ్యం వహించాడు. సొంతగడ్డపై ఆస్ట్రేలియాపై, సౌతాఫ్రికా పర్యటనలో టీమిండియాను విజేతగా నిలిపాడు. తాజాగా రెగ్యులర్ కెప్టెన్‌గా తొలి ప్రయత్నంలోనే శ్రీలంక టూర్లో భారత్‌కు 2-0తో సిరీస్‌ను అందించాడు. మరోవైపు.. టీ20 ప్రపంచకప్-2024 తర్వాత జింబాబ్వే పర్యటనకు వెళ్లిన యువ భారత జట్టుకు శుబ్‌మన్ గిల్ సారథ్యం వహించాడు. 4-1తో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ గెలిచాడు.చదవండి: ‘ద్రవిడ్ వల్లే కాలేదు.. ఇక్కడ నేనే బాస్ అంటే కుదరదు’ -
క్లీన్ స్వీప్‌పై కన్నేసిన టీమిండియా.. నేడు (జులై 30) శ్రీలంకతో మూడో టీ20
శ్రీలంకతో చివరిదైన మూడో టీ20 ఇవాళ (జులై 30) జరుగనుంది. పల్లెకెలె వేదికగా రాత్రి 7 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌లో కూడా గెలిచి సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేయాలని భారత్ భావిస్తుంది. తొలి రెండు టీ20ల్లో టీమిండియా ఘన విజయాలు సాధించిన విషయం తెలిసిందే.సిరీస్ ఫలితం తేలిపోవడంతో నేటి మ్యాచ్‌లో భారత్ ప్రయోగాల బాట పట్టవచ్చు. ఈ మ్యాచ్‌లో టీమిండియా ఇప్పటివరకు అవకాశాలు రాని వారికి ఛాన్స్ ఇవ్వవచ్చు. తొలి రెండు మ్యాచ్‌ల్లో ఆశించిన మేరకు రాణించలేకపోయిన సిరాజ్ స్థానంలో ఖలీల్ అహ్మద్ తుది జట్టులోకి వచ్చే ఛాన్స్ ఉంది. రెండో టీ20కి ముందు మెడ కండరాలు పట్టేయడంతో ఆ మ్యాచ్ ఆడలేకపోయిన శుభ్‌మన్ గిల్ నేటి మ్యాచ్‌కు కూడా బెంచ్‌కే పరిమితం కావచ్చు. మేనేజ్మెంట్ సంజూ శాంసన్‌కు మరో అవకాశం ఇచ్చే ఛాన్స్ ఉంది. హార్దిక్ పాండ్యా స్థానంలో శివమ్ దూబే.. అక్షర్ పటేల్ స్థానంలో వాషింగ్టన్ సుందర్ తుది జట్టుకు ఎంపికయ్యే అవకాశాలు ఉన్నాయి.మరోవైపు శ్రీలంక నేటి మ్యాచ్ కోసం పూర్తి స్థాయి జట్టునే బరిలోకి దించవచ్చు. ఆ జట్టు ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి పరువు కాపాడుకోవాలని భావిస్తుంది. తొలి రెండు మ్యాచ్‌ల్లో శ్రీలంకకు మంచి ఆరంభాలే లభించినా వాటిని భారీ స్కోర్లుగా మలుచుకోలేకపోయింది. రెండు మ్యాచ్‌ల్లో ఆ జట్టు బ్యాటింగ్ ఆర్డర్ స్వల్ప వ్యవధిలో పేకమేడలా కూలింది. ఈ నేపథ్యంలో నేటి మ్యాచ్‌లో శ్రీలంక టాస్ గెలిస్తే తొలుత బ్యాటింగ్ చేసి భారీ లక్ష్యాన్ని టీమిండియా ముందుంచాలని భావిస్తుంది. ఈ సిరీస్ అనంతరం కొలొంబో వేదికగా ఇరు జట్ల మధ్య వన్డే సిరీస్ ప్రారంభమవుతుంది. ఆగస్ట్ 2, 4 , 7 తేదీల్లో ఈ మ్యాచ్‌లు జరుగనున్నాయి. ఈ సిరీస్ కోసం భారత వన్డే ప్లేయర్లు ఇప్పటికే కొలొంబోకు చేరుకున్నారు. నిన్న వర్షం కారణంగా భారత ఆటగాళ్ల ప్రాక్టీస్ చేయలేకపోయారు.తుది జట్లు (అంచనా)..టీమిండియా: యశస్వి జైస్వాల్, సంజూ శాంసన్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), రిషబ్ పంత్, రియాన్ పరాగ్, రింకూ సింగ్, శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్, అర్ష్‌దీప్ సింగ్, రవి బిష్ణోయ్, ఖలీల్ అహ్మద్ -
మాటల్లో వర్ణించలేను.. లవ్ యూ: హార్దిక్ పాండ్యా
టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ప్రస్తుతం శ్రీలంక పర్యటనలో ఉన్నాడు. లంకతో టీ20 సిరీస్ జట్టుకు ఎంపికైన అతడు తొలి మ్యాచ్‌లో పెద్దగా ఆకట్టుకోలేకపోయినా.. రెండో టీ20లో మాత్రం అదరగొట్టాడు. రెండు కీలక వికెట్లు తీయడంతో పాటు.. తొమ్మిది బంతుల్లోనే 22 పరుగులు చేసి దుమ్ములేపాడు.ఆల్‌రౌండ్ ప్రదర్శనతో రాణించి టీమిండియా లంకపై టీ20 సిరీస్ గెలవడంలో తన వంతు పాత్ర పోషించాడు ఈ వరల్డ్‌కప్ చాంపియన్. ఈ క్రమంలో మంగళవారం నాటి నామమాత్రపు టీ20కి పాండ్యా సిద్ధమవుతున్నాడు. ఇదిలా ఉంటే.. ఈరోజు(జూలై 30)కు హార్దిక్ పాండ్యా జీవితంలో ప్రత్యేక స్థానం ఉంది. అతడి కుమారుడు అగస్త్య పుట్టినరోజు నేడు.ప్రేమను వర్ణించేందుకు మాటలు చాలవుఈ నేపథ్యంలో తన ముద్దుల కుమారుడితో ఉన్న వీడియో షేర్ చేసిన హార్దిక్ పాండ్యా.. ‘‘నేను ఇలా ముందుకు సాగుతున్నానంటే అందుకు కారణం నువ్వే. నా పార్ట్నర్ ఇన్ క్రైమ్. నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు. నా మనసంతా నీ చుట్టూనే తిరుగుతూ ఉంటుంది ఆగూ..! నీపై నాకున్న ప్రేమను వర్ణించేందుకు మాటలు చాలవు’’ అంటూ ఉద్వేగపూరిత క్యాప్షన్ జతచేశాడు. అగస్త్యను ఎంతగానో మిస్సవుతున్నానని చెప్పకనే చెప్పాడు.ముక్కలైన బంధంకాగా సెర్బియా మోడల్ నటాషా స్టాంకోవిక్‌ను హార్దిక్ పాండ్యా ప్రేమించి పెళ్లాడిన విషయం తెలిసిందే. ఎంతో అన్యోన్యంగా ఉన్న ఈ జంట ఏకంగా మూడుసార్లు పెళ్లి చేసుకుంది. అయితే, కాలక్రమంలో ఇద్దరి మధ్య విభేదాలు తారస్థాయికి చేరాయి. ఈ నేపథ్యంలో నాలుగేళ్ల వైవాహిక బంధానికి స్వస్తి పలుకుతూ విడాకులు తీసుకున్నారు. ఇటీవలే ఇందుకు సంబంధించి హార్దిక్ పాండ్యా- నటాషా అధికారిక ప్రకటన విడుదల చేశారు.కుమారుడిపై ప్రేమఅనంతరం కుమారుడు అగస్త్యను తీసుకుని నటాషా సెర్బియాలోని తన పుట్టింటికి వెళ్లిపోగా.. హార్దిక్ పాండ్యా టీమిండియాతో పాటు శ్రీలంకలో ఉన్నాడు. ఇక అంతకుముందు టీ20 ప్రపంచకప్-2024లో భారత్ చాంపియన్‌గా నిలిచిన తర్వాత.. స్వదేశానికి వచ్చిన అనంతరం అగస్త్యతో కలిసి తన ఇంట్లో సంబరాలు చేసుకున్నాడు హార్దిక్. ఇక ఇటీవల అగస్త్యతో కలిసి నటాషా విహారయాత్రకు వెళ్లిన ఫొటోలు పంచుకోగా.. హార్దిక్ పాండ్యా హార్ట్ సింబల్స్‌తో తన ప్రేమను తెలిపాడు. చదవండి: Ind vs SL ODIs: ‘ద్రవిడ్ వల్లే కాలేదు.. ఇక్కడ నేనే బాస్ అంటే కుదరదు’ View this post on Instagram A post shared by Hardik Himanshu Pandya (@hardikpandya93) -
Ind vs SL 3rd T20: క్లీన్‌స్వీప్ లక్ష్యంగా...
పల్లెకెలె: భారత్ రెండు రోజుల్లో రెండు మ్యాచ్‌లు గెలిచింది. టి20 సిరీస్‌ను 2–0తో కైవసం చేసుకుంది. ఇప్పుడు దీన్ని 3–0గా వైట్‌వాష్ చేసేందుకు భారత్ ఆఖరి పోరాటానికి సిద్ధమైంది. తీవ్ర ఒత్తిడిలో ఉన్న ఆతిథ్య శ్రీలంకపై ముచ్చటగా మూడో విజయం సాధించేందుకు సూర్యకుమార్ బృందం తహతహలాడుతోంది. మంగళవారం జరిగే మూడో టి20 బరిలోకి టీమిండియా గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. బ్యాటర్లు, బౌలర్లు ఫామ్‌లో ఉండటంతో ‘హ్యాట్రిక్’ గెలుపుపై ఎవరికి అనుమానాల్లేవ్! మరోవైపు లంక సొంతగడ్డపై పరువు కోసం పాకులాడుతోంది. కనీసం ఆఖరి పోరులో గెలిచి క్లీన్‌స్వీప్ కాకుండా బయటపడాలని ఆరాటపడుతోంది. టీమిండియాకు ఎదురుందా... ఓపెనర్ యశస్వి జైస్వాల్ అదరగొడుతున్నాడు. గిల్ స్థానంలో రెండో టి20 ఆడిన సంజూ సామ్సన్ డకౌట్‌ను మరిచేలా మెరిపిస్తే ఇన్నింగ్స్‌కు ఢోకా ఉండదు. సూర్యకుమార్, రిషభ్ పంత్, హార్దిక్ పాండ్యాలు మిగతా పని కానిచ్చేస్తారు. బౌలర్లు అర్‡్షదీప్, అక్షర్, రవి బిష్ణోయ్, సిరాజ్‌లు కూడా నిలకడగా రాణిస్తున్నారు. తొలి మ్యాచ్‌లో దూసుకెళ్తున్న లంక ఇన్నింగ్స్‌ను 30 పరుగుల వ్యవధిలో 9 వికెట్లను కూల్చారు. రెండో మ్యాచ్‌లో 32 పరుగుల వ్యవధిలో 7 వికెట్లను తీసిన టీమిండియా బౌలింగ్ దళం సత్తాచాటుకుంది. ఈ ఒక్కటైనా గెలవాలని... సిరీస్‌ను చేజార్చుకున్న శ్రీలంక ఆఖరి పోరులో గెలిచేందుకు సర్వశక్తులు ఒడ్డనుంది. వచ్చే నెల 2 నుంచి జరిగే వన్డే సిరీస్‌లో ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగాలంటే ఈ మ్యాచ్ తప్పక గెలవాలని ఆశిస్తోంది. నిలకడలేని బ్యాటింగ్, పసలేని బౌలింగ్ ఆతిథ్య జట్టుకు తలనొప్పిగా మారింది. భారత్ నుంచి వైట్‌వాష్ తప్పించుకోవాలంటే మాత్రం వ్యూహాలకు పదును పెట్టాలని జట్టు మేనేజ్మెంట్ భావిస్తోంది. ఓపెనర్ నిసాంక మాత్రమే రెండు మ్యాచ్‌ల్లో కుదురుగా ఆడాడు. మిగతా వారంతా భారత బౌలింగ్‌ను ఎదుర్కోలేకపోతున్నారు. ఇకపై లోపాలను అధిగమించి విజయాన్నందుకోవాలని లంక సేన పట్టుదలతో ఉంది.పిచ్, వాతావరణం వేదిక మారలేదు కానీ గత రెండు మ్యాచ్‌లు ఆడిన పిచ్‌పై కాకుండా వేరే పిచ్‌పై ఈ మ్యాచ్ జరుగుతుంది. బ్యాటింగ్‌కు అనుకూలమే అలాగే స్పిన్నర్లకు కలిసొచ్చే పిచ్. వర్ష సూచన ఉన్నప్పటికీ మ్యాచ్ జరుగుతుంది. జట్లు (అంచనా) భారత్: సూర్యకుమార్ (కెప్టెన్), యశస్వి, సంజూ సామ్సన్, రిషభ్ పంత్, రింకూ సింగ్, హార్దిక్ పాండ్యా, పరాగ్, అక్షర్, రవి బిష్ణోయ్, అర్‡్షదీప్, సిరాజ్. శ్రీలంక: అసలంక (కెప్టెన్), నిసాంక, కుశాల్ మెండిస్, పెరీరా, కమిండు మెండీస్, షనక, హసరంగ, తీక్షణ, పతిరణ, మదుషంక, ఫెర్నాండో. -
శ్రీలంకతో మూడో టీ20.. సంజూకు మరో ఛాన్స్! భారత తుది జట్టు ఇదే?
పల్లెకెలె వేదికగా శ్రీలంకతో మూడో టీ20లో తలపడేందుకు టీమిండియా సిద్దమైంది. మంగళవారం(జూలై 30) సాయంత్రం 7 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇప్పటికే సిరీస్ కైవసం చేసుకున్న భారత్.. క్లీన్ స్వీప్‌పై కన్నేసింది. మరోవైపు శ్రీలంక కనీసం ఆఖరి మ్యాచ్‌లోనైనా గెలిచి పరువు కాపాడుకోవాలని భావిస్తోంది. అయితే ఈ మ్యాచ్‌లో భారత్ పలు మార్పులతో బరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది.ఈ మ్యాచ్‌కు కూడా టీమిండియా వైస్ కెప్టెన్ శుబ్‌మన్ గిల్ దూరమయ్యే సూచనలు కన్పిస్తున్నాయి. వెన్ను నొప్పితో బాధపడుతున్నగిల్కు విశ్రాంతిని పొడగించాలని జట్టు మెనెజ్‌మెంట్ నిర్ణయించుకున్నట్లు సమాచారం. అతడి స్ధానంలో సంజూ శాంసన్ కొనసాగనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.అదేవిధంగా స్టార్ ఆల్‌రౌండర్లు హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, పేసర్ మహ్మద్ సిరాజ్‌కు కూడా ఆఖరి మ్యాచ్‌కు విశ్రాంతి ఇవ్వనున్నట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. వీరిముగ్గరి స్ధానంలో శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్, ఖాలీల్ ఆహ్మద్ తుది జట్టులో రానున్నట్లు క్రికెట్ వర్గాలు వెల్లడించాయి.భారత తుది జట్టు(అంచనా): యశస్వి జైస్వాల్, సంజూ శాంసన్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), రియాన్ పరాగ్, రింకూ సింగ్, శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, ఖలీల్ అహ్మద్, అర్ష్‌దీప్ సింగ్ -
అందుకే ఓడిపోయాం.. ఎప్పటికీ మర్చిపోలేం: భారత కెప్టెన్
మహిళల ఆసియా టీ20 కప్-2024 టోర్నీ ఫైనల్లో తాము స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయామని టీమిండియా కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ విచారం వ్యక్తం చేసింది. అసలైన పోరులో అనవసర తప్పిదాలతో టైటిల్ చేజార్చుకున్నామని పేర్కొంది. ఏదేమైనా శ్రీలంక మహిళా జట్టు గత కొన్నాళ్లుగా అద్భుతంగా ఆడుతోందని.. వాళ్లకు ఈ విషయంలో క్రెడిట్ ఇవ్వాల్సిందేనని ప్రశంసించింది.భారత మహిళల జైత్రయాత్రకు ఫైనల్లో బ్రేక్ పడిన విషయం తెలిసిందే. ఎనిమిదోసారి ఆసియా కప్ టైటిల్ గెలుస్తుందనుకున్న జట్టును ఆతిథ్య శ్రీలంక గట్టి దెబ్బ కొట్టింది. అన్ని మ్యాచ్‌ల్లో గెలిచిన భారత్‌ను అసలైన ఫైనల్లో శ్రీలంక ఓడించి తొలిసారి ఆసియా కప్‌ను ముద్దాడింది.డంబుల్లా వేదికగా ఆదివారం జరిగిన ఆసియా కప్ టీ20 టోర్నీ ఫైనల్లో హర్మన్‌ప్రీత్ బృందంపై శ్రీలంక 8 వికెట్ల తేడాతో విజయఢంకా మోగించింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది.అందుకే ఓడిపోయాంస్టార్ ఓపెనర్ స్మృతి మంధాన (47 బంతుల్లో 60; 10 ఫోర్లు) రాణించగా, రిచా ఘోష్ (14 బంతుల్లో 30; 4 ఫోర్లు, 1 సిక్స్) ఆఖర్లో మెరిపించింది. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన శ్రీలంక 18.4 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 167 పరుగులు చేసి జయభేరి మోగించింది. కెప్టెన్ చమరి అటపట్టు (43 బంతుల్లో 61; 9 ఫోర్లు, 2 సిక్స్‌లు), హర్షిత (51 బంతుల్లో 69; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధసెంచరీలతో గెలిపించారు.ఈ నేపథ్యంలో హర్మన్‌ప్రీత్ కౌర్ స్పందిస్తూ.. ‘‘ఈ టోర్నీ ఆసాంతం మేము బాగా ఆడాం. అయితే, ఫైనల్లో పొరపాట్లకు తావిచ్చాం. నిజానికి మేము మెరుగైన స్కోరే సాధించాం. అయితే, శ్రీలంక అద్భుతంగా బ్యాటింగ్ చేసింది. లంక బ్యాటర్లు మా బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్నారు. మేము ఇంకా మెరుగ్గా ఆడాల్సింది. ఈరోజును ఎన్నటికీ మర్చిపోలేం. ఏదేమైనా శ్రీలంక అద్భుతంగా ఆడింది. వాళ్లకు కంగ్రాట్స్’’ అంటూ విష్ చేసింది.