శ్రీలంకతో పరిమిత ఓవర్ల సిరీస్‌లకు టీమిండియా సిద్దమైంది. లంక పర్యటనలో భాగంగా భారత జట్టు మూడు టీ20లు, మూడు వన్డేల సిరీస్‌లు ఆడనుంది. జూలై 27 జరగనున్న తొలి టీ20తో భారత పర్యటన ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌తో భారత కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్, హెడ్ కోచ్‌గా గౌతం గంభీర్‌ల ప్రస్ధానం మొదలు కానుంది.
ఇప్పటికే ఆతిథ్య దేశానికి చేరుకున్న భారత జట్టు గంభీర్ నేతృత్వంలో తీవ్రంగా శ్రమిస్తోంది. అయితే శ్రీలంకతో టీ20, వన్డేలకు భారత జట్టులో యువ ఆటగాడు రియాన్ పరాగ్‌కు చోటు దక్కడం అందరిని ఆశ్యర్యపరిచింది.
జింబాబ్వే టీ20 సిరీస్‌తో అరంగేట్రం చేసిన పరాగ్.. తన మార్క్‌ను చూపించలేకపోయాడు. దారుణంగా విఫలమై విమర్శలు ఎదుర్కొన్నాడు. అయినప్పటకి సెలక్టర్లు ఏ ప్రాతిపాదికన అతడిని లంక టూర్‌కు ఎంపిక చేశారని పెద్ద ఎత్తున ఇప్పటికి చర్చనడుస్తోంది. కాగా తాజాగా ఇదే విషయంపై టైమ్స్ ఆఫ్ ఇండియా ఆసక్తికర కథనాన్ని ప్రచురించింది.
టైమ్స్ ఆఫ్ ఇండియా రిపోర్ట్ ప్రకారం.. శ్రీలంకతో వైట్‌బాల్ సిరీస్‌లకు తొలుత హైదరాబాదీ తిలక్ వర్మను ఎంపిక చేయాలని సెలక్టర్లు భావించారట. కానీ తిలక్ వర్మ గాయపడటంతో పరాగ్‌ను అతడి స్ధానంలో పరిగణలోకి తీసుకున్నట్లు సమాచారం.
"పరాగ్ చాలా టాలెంటడ్. అతడికి అద్భుతమైన ఆల్‌రౌండ్ స్కిల్స్ ఉన్నాయి. ఆఫ్ ది ఫీల్డ్, ఆన్ ది ఫీల్డ్ తన వైఖరిని కూడా మార్చుకున్నాడు. చాలా విషయాల్లో అతడు మెరుగయ్యాడు. ఇప్పడు అతడి ఆట తీరు పూర్తిగా మారిపోయింది.
క్రీజులో నిలదొక్కకునే ప్రయత్నం చేస్తున్నాడు. పరాగ్ అద్భుతమైన ఫీల్డర్ కూడా. అయితే సెలక్టర్ల దృష్టిలో పరాగ్ కంటే ముందు తిలక్ వర్మ ఉండేవాడు. కానీ అతడి గాయపడటం రియాన్‌కు మార్గం సుగమమైందని" బీసీసీఐ వర్గాలు టైమ్స్ ఆఫ్ ఇండియాతో వెల్లడించాయి. కాగా జింబాబ్వే సిరీస్‌లో మూడు మ్యాచ్‌లు ఆడిన పరాగ్ కేవలం 25 పరుగులు మాత్రమే చేశాడు.
భారత టీ20 జట్టు: సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), శుబ్‌మన్ గిల్ (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, రింకు సింగ్, రియాన్ పరాగ్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), సంజు శాంసన్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్, ఖలీల్ అహ్మద్, మొహమ్మద్. సిరాజ్.
భారత వన్డే జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుబ్‌మన్ గిల్ (వైస్‌ప్టెన్), విరాట్ కోహ్లీ, కెఎల్ రాహుల్ (వికెట్ కీపర్), రిషబ్ పంత్ (వికెట్ కీపర్), శ్రేయాస్ అయ్యర్, శివమ్ దూబే, కుల్దీప్ యాదవ్, మహ్మద్. సిరాజ్, వాషింగ్టన్ సుందర్, అర్ష్‌దీప్ సింగ్, రియాన్ పరాగ్, అక్షర్ పటేల్, ఖలీల్ అహ్మద్, హర్షిత్ రాణా.
Comments
Please login to add a commentAdd a comment