![India vs sri lanka 1st t20 live updates and highlights](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2024/07/27/WhatsApp%20Image%202024-07-27%20at%2018.48.58.jpeg.webp?itok=XIhK27Je)
తొలి టీ20లో భారత్ ఘనవిజయం..
పల్లెకెలె వేదికగా శ్రీలంకతో జరిగిన తొలి టీ20లో 43 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. 214 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి శ్రీలంక 19.2 ఓవర్లలో 170 పరుగులకు ఆలౌటైంది.
భారత బౌలర్లలో రియాన్ పరాగ్ 3 వికెట్లు పడగొట్టగా.. అర్ష్‌దీప్ సింగ్, అక్షర్ పటేల్ తలా రెండు వికెట్లు సాధించారు. మహ్మద్ సిరాజ్, రవి బిష్ణోయ్ చెరో వికెట్ పడగొట్టారు. శ్రీలంక బ్యాటర్లలో నిస్సాంక(79) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 213 పరుగుల భారీ స్కోర్ సాధించింది.
భారత బ్యాటర్లలో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (26 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్‌లతో 58 పరుగులు) టాప్ స్కోరర్‌గా నిలవగా.. యశస్వీ జైశ్వాల్(40), రిషబ్ పంత్(49), శుబ్‌మన్ గిల్(34) పరుగులతో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడారు. లంక బౌలర్లలో మతీషా పతిరాన 4 వికెట్లు పడగొట్టగా.. మధుషంక, హసరంగా, ఫెర్నాండో తలా వికెట్ సాధించారు.
కమ్‌బ్యాక్ ఇచ్చిన భారత బౌలర్లు..
శ్రీలంక వరుస క్రమంలో రెండు వికెట్లు కోల్పోయింది. అక్షర్ పటేల్ బౌలింగ్‌లో కుశాల్ పెరీరా(20) ఔట్ కాగా.. రవి బిష్ణోయ్ బౌలింగ్‌లో అసలంక ఔటయ్యాడు. లంక విజయానికి 24 బంతుల్లో 56 పరుగులు కావాలి. 16 ఓవర్లకు శ్రీలంక స్కోర్: 158/4
శ్రీలంక రెండో వికెట్ డౌన్..
140 పరుగుల వద్ద శ్రీలంక రెండో వికెట్ కోల్పోయింది. 79 పరుగులతో దూకుడుగా ఆడుతున్న నిస్సాంక.. అక్షర్ పటేల్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయ్యాడు. 14.1 ఓవర్లకు శ్రీలంక స్కోర్: 140/1
13 ఓవర్లకు శ్రీలంక స్కోర్: 106/1
శ్రీలంక దూకుడుగా ఆడుతోంది. 13 ఓవర్లు ముగిసే సరికి వికెట్ నష్టానికి 131 పరుగులు చేసింది. క్రీజులో నిస్సాంక(71), కుశాల్ పెరీరా(12) పరుగులతో ఉన్నారు. లంక విజయానికి 42 బంతుల్లో 83 పరుగులు కావాలి.
11 ఓవర్లకు శ్రీలంక స్కోర్: 106/1
శ్రీలంక 11 ఓవర్లు ముగిసే సరికి వికెట్ నష్టానికి 106 పరుగులు చేసింది. క్రీజులో నిస్సాంక(49), కుశాల్ పెరీరా(10) పరుగులతో ఉన్నారు.
తొలి వికెట్ కోల్పోయిన శ్రీలంక..
84 పరుగుల వద్ద శ్రీలంక తొలి వికెట్ కోల్పోయింది. 45 పరుగులు చేసిన కుశాల్ మెండిస్.. అర్ష్‌దీప్ బౌలింగ్‌లో ఔటయ్యాడు.
6 ఓవర్లకు శ్రీలంక స్కోర్: 55/0
214 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక 6 ఓవర్లు ముగిసే సరికి వికెట్ నష్టపోకుండా 55 పరుగులు చేసింది. క్రీజులో నిస్సాంక(31), కుశాల్ మెండిస్(23) పరుగులతో ఉన్నారు.
3 ఓవర్లకు శ్రీలంక స్కోర్: 25/0
214 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక 3 ఓవర్లు ముగిసే సరికి వికెట్ నష్టపోకుండా 23 పరుగులు చేసింది. క్రీజులో నిస్సాంక(18), కుశాల్ మెండిస్(5) పరుగులతో ఉన్నారు.
శ్రీలంక ముందు భారీ టార్గెట్
పల్లెకెలె వేదికగా శ్రీలకంతో జరుగుతున్న తొలి టీ20లో టీమిండియా బ్యాటర్లు అదరగొట్టారు. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 213 పరుగుల భారీ స్కోర్ సాధించింది.
భారత బ్యాటర్లలో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (26 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్‌లతో 58 పరుగులు) టాప్ స్కోరర్‌గా నిలవగా.. యశస్వీ జైశ్వాల్(40), రిషబ్ పంత్(49), శుబ్‌మన్ గిల్(34) పరుగులతో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడారు. లంక బౌలర్లలో మతీషా పతిరాన 4 వికెట్లు పడగొట్టగా.. మధుషంక, హసరంగా, ఫెర్నాండో తలా వికెట్ సాధించారు.
నాలుగో వికెట్ డౌన్..
టీమిండియా నాలుగో వికెట్ కోల్పోయింది. 9 పరుగులు చేసిన హార్దిక్ పాండ్యా.. పతిరాన బౌలింగ్‌లో ఔటయ్యాడు. క్రీజులోకి రియాన్ పరాగ్ వచ్చాడు. అతడితో పాటు రిషబ్ పంత్(41) కూడా క్రీజులో ఉన్నాడు. 18 ఓవర్లకు భారత్ స్కోర్: 192/4
సూర్య ఔట్..
సూర్యకుమార్ యాదవ్ రూపంలో టీమిండియా మూడో వికెట్ కోల్పోయింది. 58 పరుగులు చేసిన సూర్య.. పతిరానా బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగాడు. 14 ఓవర్లకు భారత్ స్కోర్: 153/3
సూర్య హాప్ సెంచరీ..
కెప్టెన్‌గా తొలి మ్యాచ్‌లోనే సూర్యకుమార్ యాదవ్ అదరగొట్టాడు. శ్రీలంకతో జరుగుతున్న తొలి టీ20లో సూర్యకుమార్ హాప్ సెంచరీతో చెలరేగాడు. 54 పరుగులతో సూర్య బ్యాటింగ్ చేస్తున్నాడు. 13 ఓవర్లు ముగిసే సరికి భారత జట్టు రెండు వికెట్ల నష్టానికి 145 పరుగులు చేసింది. క్రీజులో సూర్యకుమార్ యాదవ్(54), రిషబ్ పంత్(16) పరుగులతో ఉన్నారు.
10 ఓవర్లకు భారత్ స్కోర్ 111/2
10 ఓవర్లు ముగిసే సరికి భారత జట్టు రెండు వికెట్ల నష్టానికి 111 పరుగులు చేసింది. క్రీజులో సూర్యకుమార్ యాదవ్(28), రిషబ్ పంత్(9) పరుగులతో ఉన్నారు.
రెండో వికెట్ డౌన్..
యశస్వీ జైశ్వాల్ రూపంలో టీమిండియా రెండో వికెట్ కోల్పోయింది. 40 పరుగులు చేసిన జైశ్వాల్.. వనిందు హసరంగా బౌలింగ్‌లో స్టంపౌటయ్యాడు. క్రీజులోకి రిషబ్ పంత్ వచ్చాడు.
తొలి వికెట్ డౌన్.. గిల్ ఔట్
74 పరుగుల వద్ద టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది. 34 పరుగులు చేసిన ఓపెనర్ శుబ్‌మన్ గిల్.. మధుశంక బౌలింగ్‌లో ఔటయ్యాడు. క్రీజులో యశస్వీ జైశ్వాల్ 40 పరుగులతో ఉన్నాడు. 6 ఓవర్లకు భారత్ స్కోర్: 74/1
దూకుడుగా ఆడుతున్న భారత్..
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు అదిరిపోయే ఆరంభం లభించింది. ఓపెనర్లు శుబ్‌మన్ గిల్(9), యశస్వీ జైశ్వాల్(27) దూకుడుగా ఆడుతున్నారు. 3 ఓవర్లు ముగిసే సరికి భారత్ వికెట్ నష్టపోకుండా 36 పరుగులు చేసింది.
పల్లెకలె వేదికగా భారత్-శ్రీలంక మధ్య తొలి టీ20 ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన శ్రీలంక తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. భారత తుది జట్టులో సంజూ శాంసన్, శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్, ఖాలీల్ ఆహ్మద్‌లకు చోటు దక్కలేదు. అయితే జింబాబ్వే సిరీస్‌లో తీవ్ర నిరాశపరిచిన రియాన్ పరాగ్‌కు మాత్రం భారత ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు లభించింది.
ఈ మ్యాచ్‌లో భారత్ కేవలం ఇద్దరు పేసర్లతో బరిలోకి దిగింది. మరోవైపు శ్రీలంక ముగ్గురు పేసర్లతో ఆడనుంది. ఇక ఈ సిరీస్‌లో ఇరు జట్లకు కొత్త సారథిలే కావడం విశేషం. భారత జట్టు కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్ వ్యవహరిస్తుండగా.. చరిత్ అసలంక లంక కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వరిస్తున్నాడు.
తుది జట్లు
శ్రీలంక: పాతుమ్ నిస్సాంక, కుసల్ మెండిస్(వికెట్ కీపర్), కుసల్ పెరీరా, కమిందు మెండిస్, చరిత్ అసలంక(కెప్టెన్), వనిందు హసరంగా, దసున్ షనక, మహేశ్ తీక్షణ, మతీషా పతిరణ, అసిత ఫెర్నాండో, దిల్షన్ మధుశంక
భారత్: శుభమన్ గిల్, యశస్వి జైస్వాల్, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), రిషబ్ పంత్(వికెట్ కీపర్), రియాన్ పరాగ్, హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్, మహ్మద్ సిరాజ్
Comments
Please login to add a commentAdd a comment