శ్రీలంకతో మూడు టీ20ల సిరీస్‌లో భారత్ శుభారంభం చేసింది. పల్లెకెలె వేదికగా శ్రీలంకతో జరిగిన తొలి టీ20లో 43 పరుగుల తేడాతో టీమిండియా ఘన విజయం సాధించింది. 214 పరుగుల భారీ లక్ష్యం సాధించడంలో లంక విఫలమైంది. 19.2 ఓవర్లలో 170 పరుగులకు శ్రీలంక ఆలౌటైంది. భారత బౌలర్లలో రియాన్ పరాగ్ మూడు వికెట్లు పడగొట్టగా.. అర్ష్‌దీప్, అక్షర్ పటేల్ తలా రెండు వికెట్లు సాధించారు.
లంక బ్యాటర్లలో నిస్సాంక(79) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 213 పరుగులు చేసింది. సూర్యకుమార్ యాదవ్(58) హాఫ్ సెంచరీతో అదరగొట్టగా.. పంత్(49), జైశ్వాల్(40) పరుగులతో రాణించారు. లంక పేసర్ మతీషా పతిరానా 4 వికెట్లతో సత్తాచాటాడు. ఇక ఈ విజయంపై మ్యాచ్ అనంతరం భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ స్పందించాడు. ఈ మ్యాచ్‌లో అదరగొట్టిన భారత బ్యాటర్లపై సూర్య ప్రశంసల వర్షం కురిపించాడు.
"కెప్టెన్‌గా తొలి మ్యాచ్‌లో విజయం సాధించడం చాలా సంతోషంగా ఉంది. తొలి బంతి నుంచే మా దూకుడైన స్టైల్‍లో బ్యాటింగ్ చేశాము. ఓపెనర్లు మాకు మంచి ఆరంభాన్ని ఇచ్చారు. వారు కూడా ఛేజింగ్‌లో అద్భుతంగా ఆడారు. మేము ఇదే పిచ్‌పై దాదాపు మూడు రోజుల ప్రాక్టీస్ చేశాము. ఇక్కడ వికెట్ ఇలా ఉంటుందో మాకు బాగా తెలుసు.
ముఖ్యంగా రాత్రి పూట మంచు ఎక్కువగా ఉండి బ్యాటింగ్‌కు ఈజీగా ఉంటుంది. కానీ ఆదృష్టవశాత్తు ఈ మ్యాచ్‌లో మంచు ప్రభావం ఎక్కువగా లేదు. అది మాకు బాగా కలిసొచ్చింది.వరల్డ్‌కప్‌లో కనబరిచిన ఆటతీరునే కొనసాగించేందుకు ప్రయత్నిస్తున్నాము. అదేవిధంగా బ్యాటింగ్ ఆర్డర్‌లో లెఫ్ట్ అండ్ రైట్ కాంబినేషన్‌ను కొనసాగించాలా లేదా అన్నది జట్టు మెనెజ్‌మెంట్ నిర్ణయం తీసుకుంటుంది. మేము ఆడాల్సిన క్రికెట్ ఇంకా చాలా ఉంది. కాబట్టి జట్టు అవసరం తగ్గటు ఏ నిర్ణమైనా తీసుకుంటామని" పోస్ట్ మ్యాచ్ ప్రేజెంటేషన్‌లో సూర్యకుమార్ యాదవ్ పేర్కొన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment