Surya Kumar Yadav
-
IPL 2025: రోహిత్, పోలార్డ్ తర్వాత సూర్యకుమార్
ఐపీఎల్ 2025లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్‌తో నిన్న (మార్చి 23) జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ తాత్కాలిక సారధి సూర్యకుమార్ యాదవ్ ఓ అరుదైన ఘనత సాధించాడు. ఈ మ్యాచ్‌లో 29 పరుగులు చేసిన స్కై.. ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ తరఫున 3000 పరుగులు పూర్తి చేసుకున్నాడు. తద్వారా రోహిత్ శర్మ, కీరన్ పోలార్డ్ తర్వాత ఈ ఘనత సాధించిన మూడో ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. రోహిత్ 209 ఇన్నింగ్స్‌ల్లో 5458 పరుగులు చేసి ముంబై ఇండియన్స్ తరఫున లీడింగ్ రన్ స్కోరర్‌గా కొనసాగుతుండగా.. పోలార్డ్ 171 ఇన్నింగ్స్‌ల్లో 3412, స్కై 95 ఇన్నింగ్స్‌ల్లో 3015 పరుగులు చేశాడు. ఈ ముగ్గురి తర్వాత ఎంఐ తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా అంబటి రాయుడు ఉన్నాడు. రాయుడు 107 ఇన్నింగ్స్‌ల్లో 2416 పరుగులు చేశాడు.ఇదిలా ఉంటే, సీఎస్కేతో నిన్న జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 4 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. సీజన్ ఆరంభ మ్యాచ్‌ల్లో ఓడటం ముంబైకి ఇది వరుసగా 13వ సారి. ఈ మ్యాచ్‌లో సీఎస్కే బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సత్తా చాటి ముంబై ఇండియన్స్‌ను ఓడించింది. బ్యాటింగ్‌లో విఫలమైన ముంబై ఆతర్వాత బౌలింగ్‌లో రాణించినప్పటికీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై.. నూర్ అహ్మద్ (4-0-18-4), ఖలీల్ అహ్మద్ (4-0-29-3) విజృంభించడంతో 155 పరుగులకే (9 వికెట్ల నష్టానికి) పరిమితమైంది. ముంబై ఇన్నింగ్స్‌లో ఒక్కరు కూడా చెప్పుకోదగ్గ స్కోర్ చేయలేదు. సూర్యకుమార్ (29), తిలక్ వర్మ (31), ఆఖర్లో దీపక్ చాహర్ (15 బంతుల్లో 28 నాటౌట్) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. రోహిత్ శర్మ డకౌట్ కాగా.. విధ్వంసకర వీరులు రికెల్టన్ (13), విల్ జాక్స్ (11), అరంగ్రేటం ఆటగాడు రాబిన్ మింజ్ (3), నమన్ ధిర్ (17), సాంట్నర్ (11) తక్కువ స్కోర్లకే ఔటయ్యారు. సీఎస్కే బౌలర్లలో అశ్విన్, ఇల్లిస్ కూడా తలో వికెట్ తీశారు.ఛేదనలో రచిన్ రవీంద్ర (45 బంతుల్లో 65 నాటౌట్; 2 ఫోర్లు, 4 సిక్సర్లు), రుతురాజ్ గైక్వాడ్ (26 బంతుల్లో 53; 6 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపు అర్ద సెంచరీలు చేసి సీఎస్కేను గెలిపించారు. రుతురాజ్ 22 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసి సీఎస్కే గెలుపుకు బలమైన పునాది వేయగా.. రచిన్ చివరి వరకు క్రీజ్‌లో ఉండి సిక్సర్‌తో మ్యాచ్‌ను ముగించాడు. ఈ మ్యాచ్‌లో ముంబై ఓడినా అద్భుతంగా ప్రతిఘటించింది. అరంగేట్రం స్పిన్నర్ విజ్ఞేశ్ పుథుర్ (4-0-32-3) అద్భుతంగా బౌలింగ్ చేసి ఓ దశలో సీఎస్కేకు దడ పుట్టించాడు. ముంబై బౌలర్లలో విజ్ఞేశ్‌తో పాటు విల్ జాక్స్ (4-0-32-1), నమన్ ధిర్ (3-0-12-0) కూడా రాణించారు. మిడిల్ ఓవర్లలో వీరిద్దరు సీఎస్కేను ఇబ్బంది పెట్టారు. మొత్తంగా మ్యాచ్ ఓడినా ముంబై మంచి మార్కులే కొట్టేసింది. సీఎస్కే తమ తదుపరి మ్యాచ్‌లో ఆర్సీబీతో (మార్చి 28) తలపడనుండగా.. ముంబై ఇండియన్స్ గుజరాత్‌ను (మార్చి 29) ఢీకొట్టనుంది. -
IPL 2025: మా పోరాటం ప్రశంసనీయం.. రుతురాజ్ మ్యాచ్‌ను లాగేసుకున్నాడు: సూర్యకుమార్
ఐపీఎల్ 2025 సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ బోణీ కొట్టింది. తొలి మ్యాచ్‌లో ఓడిపోయే ఆనవాయితీని ముంబై ఇండియన్స్ కొనసాగించింది. వరుసగా 13వ ఏడాది ముంబై తమ తొలి మ్యాచ్‌లో ఓటమిపాలైంది. చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా నిన్న (మార్చి 23) రాత్రి జరిగిన మ్యాచ్‌లో సీఎస్కే ముంబైపై 4 వికెట్ల తేడాతో గెలిచింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఎంఐ తడబడింది. సీఎస్కే బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేయడంతో నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 155 పరుగులు మాత్రమే చేయగలిగింది. రోహిత్ శర్మ డకౌటై నిరాశపరిచగా.. విధ్వంసకర వీరులు రికెల్టన్ (13), విల్ జాక్స్ (11), తాత్కాలిక కెప్టెన్ సూర్యకుమార్ (29), తిలక్ వర్మ (31) తక్కువ స్కోర్లకే ఔటయ్యారు. అరంగేట్రం ఆటగాడు రాబిన్ మింజ్ (3) తేలిపోయాడు. నమన్ ధిర్ 17, సాంట్నర్ 11 పరుగులు చేయగా.. ఆఖర్లో దీపక్ చాహర్ (15 బంతుల్లో 28 నాటౌట్) బ్యాట్ ఝులిపించాడు. సీఎస్కే బౌలర్లలో నూర్ అహ్మద్ (4-0-18-4) ఐపీఎల్ కెరీర్‌ను అద్భుతంగా ప్రారంభించాడు. ఖలీల్ అహ్మద్ (4-0-29-3) సత్తా చాటాడు. వెటరన్ రవిచంద్రన్ అశ్విన్, నాథన్ ఇల్లిస్ తలో వికెట్ తీశారు.స్లో ట్రాక్‌పై ఓ మోస్తరు లక్ష్య ఛేదనకు దిగిన సీఎస్కే ఆదిలోనే వికెట్ కోల్పోయింది. దీపక్ చాహర్ ఓపెనర్ రాహుల్ త్రిపాఠిని 2 పరుగులకే ఔట్ చేశాడు. వన్‌డౌన్‌లో బరిలోకి దిగిన కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు. రుతు 26 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 53 పరుగులు చేసి మ్యాచ్‌ను ముంబై చేతుల్లో నుంచి లాగేసుకున్నాడు. మరో ఎండ్‌లో రచిన్ రవీంద్ర (45 బంతుల్లో 65 నాటౌట్; 2 ఫోర్లు, 4 సిక్సర్లు) బాధ్యతాయుతంగా ఆడి చివరి వరకు క్రీజ్‌లో ఉన్నాడు. సిక్సర్‌తో మ్యాచ్‌ను ముగించాడు. రుతురాజ్ ఔటయ్యాక సీఎస్కే కాస్త తడబడింది. అరంగేట్రం స్పిన్నర్ విజ్ఞేశ్ పుథుర్ వరుసగా తన మూడు ఓవర్లలో మూడు వికెట్లు తీసి ముంబైని తిరిగి మ్యాచ్‌లోకి తెచ్చినట్లు కనిపించాడు. ఈ దశలో విల్ జాక్స్, నమన్ ధిర్ కూడా అద్బుతంగా బౌలింగ్ చేశారు. సీఎస్కే ఆటగాళ్లను కట్టడి చేసి పరుగులు రానివ్వకుండా చేశారు. అయితే అప్పటిదాకా అద్బుతంగా బౌలింగ్ చేసిన విజ్ఞేశ్ పుథుర్‌ను 18వ ఓవర్లో బౌలింగ్‌కు దించి ముంబై కెప్టెన్ స్కై పెద్ద తప్పు చేశాడు. ఆ ఓవర్లో రచిన్ చెలరేగిపోయి 2 సిక్సర్ల సాయంతో 15 పరుగులు పిండుకున్నాడు. ఆ ఓవర్లోనే ముంబై ఓటమి ఖరారైపోయింది. 19వ ఓవర్లో నమన్ ధిర్ జడ్డూ వికెట్ తీసి కేవలం 2 పరుగులే ఇచ్చినా చివరి ఓవర్ తొలి బంతికే సిక్సర్ బాది రచిన్ సీఎస్కేను విజయతీరాలకు చేర్చాడు. ఈ మ్యాచ్‌లో ధోని సూర్యకుమార్‌ను మెరుపు స్టంపింగ్ చేసి వింటేజ్ ధోనిని గుర్తు చేశాడు.మ్యాచ్ అనంతరం సూర్యకుమార్ స్పందిస్తూ.. మేము 15-20 పరుగులు తక్కువ చేశాం. అయినా మా కుర్రాళ్ల పోరాటం ప్రశంసనీయం. యువకులకు అవకాశాలు ఇవ్వడంలో ముంబై ఇండియన్స్ ప్రసిద్ధి చెందింది . ఎంఐ స్కౌట్స్ ఏడాదిలో 10 నెలలు టాలెంట్‌ను వెతికే పనిలో ఉంటారు. విజ్ఞేశ్ పుథుర్ దాని ఫలితమే. తొలి మ్యాచ్‌లోనే విజ్ఞేశ్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. తన తొలి 3 ఓవర్లలో 3 వికెట్లు తీసి తిరిగి తమను మ్యాచ్‌లోకి తెచ్చాడు. ఆట లోతుగా సాగితే అతని కోసమని ఓ ఓవర్‌ను స్పేర్‌గా ఉంచాను. అది మిస్ ఫైర్ అయ్యింది. 18వ ఓవర్ విజ్ఞేశ్‌కు ఇచ్చి తప్పు చేశాను. మ్యాచ్ జరుగుతుండగా మంచు ప్రభావం లేదు. కానీ కాస్త జిగటగా ఉండింది. రుతురాజ్ బ్యాటింగ్ చేసిన విధానం మ్యాచ్‌ను మా నుండి దూరం చేసింది. ఇది తొలి మ్యాచే. ఇంకా చాలా దూరం వెళ్లాల్సి ఉందని అన్నాడు. కాగా, ముంబై తమ రెండో మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌ను ఢీకొంటుంది. ఈ మ్యాచ్ మార్చి 29న అహ్మదాబాద్‌లో జరుగనుంది. -
టీ20 ర్యాంకింగ్స్‌లో టీమిండియా బ్యాటర్ల హవా.. టాప్-5లో ముగ్గురు
ఐసీసీ తాజాగా ప్రకటించిన టీ20 ర్యాంకింగ్స్‌లో టీమిండియా బ్యాటర్ల హవా కొనసాగింది. టాప్-5లో ఏకంగా ముగ్గురు చోటు దక్కించుకున్నారు. రెండో స్థానంలో అభిషేక్ శర్మ, 4, 5 స్థానాల్లో తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ కొనసాగుతున్నారు. ఆసీస్ విధ్వంసకర బ్యాటర్ ట్రవిస్ హెడ్ అగ్రపీఠంపై తిష్ట వేశాడు. పాక్ బ్యాటర్ బాబర్ ఆజమ్ ఓ స్థానం కోల్పోయి ఎనిమిదో ప్లేస్‌కు పడిపోగా.. శ్రీలంక ఆటగాడు పథుమ్ నిస్పంక ఓ స్థానం మెరుగుపర్చుకుని ఏడో స్థానానికి చేరాడు.ఇవి మినహా ఈ వారం టాప్-10 బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో ఎలాంటి మార్పులు లేవు. పాక్‌తో జరుగుతున్న సిరీస్‌లో చెలరేగిపోతున్న న్యూజిలాండ్ బ్యాటర్లు టిమ్ సీఫర్ట్, ఫిన్ అలెన్ ఈ వారం ర్యాంకింగ్స్‌లో గణనీయంగా లబ్ది పొందారు. సీఫర్ట్ 20 స్థానాలు మెరుగుపర్చుకుని 13వ స్థానానికి చేరగా.. అలెన్ 8 స్థానాలు మెరుగుపర్చుకుని 18వ స్థానానికి ఎగబాకాడు. భారత బ్యాటర్లలో యశస్వి జైస్వాల్ 12, రుతురాజ్ గైక్వాడ్ 26, సంజూ శాంసన్ 36, శుభ్‌మన్ గిల్ 41, హార్దిక్ పాండ్యా 52, రింకూ సింగ్ 54, శివమ్‌దూబే 57 స్థానాల్లో ఉన్నారు.బౌలర్ల ర్యాంకింగ్స్ విషయానికొస్తే.. విండీస్ స్పిన్నర్ అకీల్ హొసేన్ టాప్ ర్యాంక్‌లో కొనసాగుతుండగా.. భారత మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి రెండో స్థానంలో నిలిచాడు. వరుణ్‌కు టాప్ ప్లేస్‌లో ఉన్న అకీల్ హొసేన్‌కు కేవలం ఒక్క పాయింట్ వ్యత్యాసం మాత్రమే ఉంది. టాప్-10లో వరుణ్ సహా ముగ్గురు భారత బౌలర్లు ఉన్నారు. రవి బిష్ణోయ్ 6, అర్షదీప్ సింగ్ 9 స్థానాల్లో కొనసాగుతున్నారు. తాజాగా పాక్‌తో జరిగిన రెండు టీ20ల్లో అద్భుత ప్రదర్శనలు చేసిన న్యూజిలాండ్ బౌలర్లు ర్యాంక్‌లను భారీగా మెరుగుపర్చుకున్నారు. జేకబ్ డఫీ 23 స్థానాలు మెరుగుపర్చుకుని 12వ స్థానానికి ఎగబాకగా.. బెన్ సియర్స్ 22 స్థానాలు మెరుగుపర్చుకుని 67వ స్థానానికి.. జకరీ ఫౌల్క్స్ 41 స్థానాలు మెరుగుపర్చుకుని 90వ స్థానానికి చేరారు. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ 38, బుమ్రా 41, హార్దిక్ పాండ్యా 48 స్థానాల్లో ఉన్నారు.ఇదిలా ఉంటే, ప్రస్తుతం పాక్, న్యూజిలాండ్ టీ20 సిరీస్ మినహా ఎలాంటి అంతర్జాతీయ మ్యాచ్‌లు జరగడం లేదు. ఈ సిరీస్ ముగిశాక మరో మూడు నెలలు అస్సలు అంతర్జాతీయ మ్యాచ్‌లే జరుగవు. మార్చి 22 నుంచి ఐపీఎల్ స్టార్ట్ కానుండగా అన్ని జట్ల ఆటగాళ్లు ఆ లీగ్‌తోనే బిజీగా ఉంటారు. ఈ మూడు నెలల కాలంలో ఐసీసీ ర్యాంకింగ్స్‌కు సంబంధించి ఎలాంటి అప్డేట్స్ ఉండవు. -
IPL 2025: ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్
ఐపీఎల్ 2025లో ముంబై ఇండియన్స్ తమ తొలి మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్ చెన్నైలోని చిదంబరం స్టేడియం వేదికగా మార్చి 23న జరుగనుంది. ఆ రోజు డబుల్ హెడర్ మ్యాచ్‌లు జరుగనుండగా.. ఎంఐ, సీఎస్కే మ్యాచ్ రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతుంది.ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ తమ రెగ్యులర్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా సేవలు కోల్పోనుంది. గత సీజన్లో చేసిన తప్పుల కారణంగా హార్దిక్ సీఎస్కేతో మ్యాచ్‌కు దూరం కానున్నాడు. గత సీజన్లో ముంబై ఇండియన్స్ మూడు మ్యాచ్‌ల్లో స్లో ఓవర్ రేట్‌తో బౌలింగ్ చేసింది.దీంతో ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ ముంబై కెప్టెన్‌గా ఉన్న హార్దిక్ పాండ్యాకు రూ.30 లక్షల జరిమానాతో పాటు ఓ మ్యాచ్ ఆడకుండా నిషేధం విధించింది. గత సీజన్లో ముంబై గ్రూప్ దశలోనే నిష్క్రమించడంతో హార్దిక్‌పై నిషేధం సాధ్యం కాలేదు. ఈ క్రమంలో ఈ సీజన్లో తొలి మ్యాచ్‌లోనే అతను నిషేధం ఎదుర్కొంటున్నాడు.హార్దిక్ గైర్హాజరీలో ముంబై ఇండియన్స్ తాత్కాలిక సారధిగా సూర్యకుమార్ యాదవ్ ఎంపికయ్యాడు. ఈ విషయాన్ని రెగ్యులర్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఇవాళ (మార్చి 19) స్వయంగా ప్రకటించాడు. సూర్యకుమార్‌కు భారత టీ20 జట్టు కెప్టెన్‌గా అనుభవం ఉండటంతో ఎంఐ మేనేజ్మెంట్ అతనికే సారథ్య బాధ్యతలు కట్టబెట్టింది.కాగా, ముంబై ఇండియన్స్‌ను ఐదు సార్లు ఛాంపియన్‌గా నిలబెట్టిన రోహిత్ శర్మ కెప్టెన్సీపై అయిష్టతతో 2023 సీజన్ తర్వాత తప్పుకున్న విషయం తెలిసిందే. మరో సీనియర్ ఆటగాడు జస్ప్రీత్ బుమ్రా ఈ సీజన్ ఆరంభ మ్యాచ్‌లకు దూరం కానున్నాడని తెలుస్తుంది. ఈ నేపథ్యంలో సీనియర్లలో ఒకరైన సూర్యకుమార్‌కే సీఎస్కేతో మ్యాచ్‌లో ముంబై కెప్టెన్‌గా వ్యవహరించే అవకాశం వచ్చింది.టీ20ల్లో సూర్య కుమార్ యాదవ్‌కు అద్భుతమైన ట్రాక్ రికార్డు ఉంది. స్కై సారథ్యంలో భారత్ 18 మ్యాచ్‌ల్లో కేవలం నాలుగింట మాత్రమే ఓడింది. ఓవరాల్‌గా స్కై 39 టీ20 మ్యాచ్‌ల్లో సారథ్యం వహించి 28 మ్యాచ్‌ల్లో తన జట్టును గెలిపించుకున్నాడు. స్కై.. గతంలోనూ ఓ సందర్భంలో (2023 సీజన్లో) ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా వ్యవహరించాడు. స్కై తన కెప్టెన్సీలో బ్యాటర్‌గానూ విశేషంగా రాణించాడు. 37 ఇన్నింగ్స్‌ల్లో సెంచరీ, 8 హాఫ్ సెంచరీల సాయంతో 164.56 స్ట్రయిక్‌రేట్‌తో 1068 పరుగులు చేశాడు.కాగా, ఐపీఎల్ 2025 సీజన్లో ముంబై ఇండియన్స్ దేశీయ స్టార్లపై ఆధారపడి ఉంది. మెగా వేలానికి ముందు ఆ జట్టు రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రాను రీటైన్ చేసుకుంది. మెగా వేలంలోనూ ఆ జట్టు పెద్దగా విదేశీ స్టార్ల కోసం పాకులాడలేదు.విల్ జాక్స్, మిచెల్ సాంట్నర్, ముజీబ్ ఉర్ రెహ్మాన్, కార్బిన్ బాష్, ర్యాన్ రికెల్టన్ లాంటి ఆటగాళ్లు కొత్తగా జట్టులోకి చేర్చుకుంది. ఈసారి జట్టులోకి వచ్చిన ట్రెంట్ బౌల్ట్‌కు గతంలో ముంబై ఇండియన్స్‌తో అనుబంధం ఉంది. మెగా వేలంలో దక్కించుకున్న రీస్ టాప్లే గాయం కారణంగా ఈ సీజన్‌కు దూరమయ్యాడు. దేశీయ పేసర్ దీపక్ చాహర్‌ను ముంబై సీఎస్కేతో పోటీపడి దక్కించుకుంది.ఐపీఎల్ 2025 సీజన్ కోసం ముంబై ఇండియన్స్..హార్దిక్ పాండ్యా (కెప్టెన్), రోహిత్ శర్మ, తిలక్ వర్మ, నమన్ ధిర్, సూర్యకుమార్ యాదవ్, బెవాన్ జాకబ్స్, రాజ్ భవా, విల్ జాక్స్, విజ్ఞేశ్ పుథుర్, మిచెల్ సాంట్నర్, కార్బిన్ బాష్, సత్యనారాయణ రాజు, అర్జున్ టెండూల్కర్, ర్యాన్ రికెల్టన్, రాబిన్ మింజ్, కృష్ణణ్ శ్రీజిత్, ట్రెంట్ బౌల్ట్, జస్ప్రీత్ బుమ్రా, అశ్వనీ కుమార్, రీస్ టాప్లే, కర్ణ్ శర్మ, దీపర్ చాహర్, ముజీబ్ రెహ్మాన్ -
IPL 2025: హార్దిక్‌పై నిషేధం.. ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా సూర్యకుమార్..?
ఐపీఎల్ 2025 సీజన్లో ముంబై ఇండియన్స్ తమ తొలి మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్ చెన్నైలోని చిదంబరం స్టేడియం వేదికగా మార్చి 23న జరుగనుంది. ఆ రోజు డబుల్ హెడర్ మ్యాచ్‌లు జరుగనుండగా.. ఎంఐ, సీఎస్కే మ్యాచ్ రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతుంది.ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ తమ కెప్టెన్ సేవలు కోల్పోనుంది. గత సీజన్లో ముంబై ఇండియన్స్ మూడు మ్యాచ్‌ల్లో స్లో ఓవర్ రేట్‌తో బౌలింగ్ చేసింది. దీంతో ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ ముంబై కెప్టెన్‌గా ఉన్న హార్దిక్ పాండ్యాకు రూ.30లక్షల జరిమానా విధించడంతో పాటు ఓ మ్యాచ్ ఆడకుండా నిషేధం విధించింది. గత సీజన్లో ముంబై గ్రూప్ దశలోనే వెనుదిరగడంతో హార్దిక్‌పై నిషేధం సాధ్యం కాలేదు. ఈ క్రమంలోనే ఐపీఎల్ 2025 సీజన్లో తొలి మ్యాచ్‌లోనే అతను నిషేధం ఎదుర్కోవాల్సి ఉంటుంది.తొలి మ్యాచ్‌లో హార్దిక్ గైర్హాజరీలో సూర్యకుమార్ యాదవ్ ముంబై ఇండియన్స్ సారధిగా వ్యవహరించే అవకాశం ఉంది. భారత టీ20 జట్టుకు సారధిగా వ్యవహరిస్తుండటంతో ఎంఐ యాజమాన్యం అతనిరే సారథ్య బాధ్యతలు అప్పజెప్పనుందని తెలుస్తుంది. రోహిత్ కెప్టెన్సీపై అయిష్టతను ఇదివరకే తెలియజేశాడు. మరో సీనియర్ బుమ్రా ఆరంభ మ్యాచ్‌లకు దూరమవుతాడని సమాచారం. ఈ నేపథ్యంలో సీనియర్లలో ఒకరైన సూర్యకుమార్‌కే తొలి మ్యాచ్‌లో కెప్టెన్‌గా వ్యవహరించే అవకాశం రావచ్చు.టీ20ల్లో టీమిండియా కెప్టెన్‌గా సూర్య కుమార్ యాదవ్‌కు మంచి ట్రాక్ రికార్డు ఉంది. స్కై సారథ్యంలో భారత్ 18 మ్యాచ్‌ల్లో కేవలం నాలుగింట మాత్రమే ఓడింది.కాగా, ఐపీఎల్ 2025 సీజన్లో ముంబై ఇండియన్స్ దేశీయ స్టార్లపై ఆధారపడి ఉంది. మెగా వేలానికి ముందు ఆ జట్టు యాజమాన్యం రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రాను రీటైన్ చేసుకుంది. మెగా వేలంలోనూ ఆ జట్టు పెద్దగా విదేశీ స్టార్ల కోసం పాకులాడలేదు.విల్ జాక్స్, మిచెల్ సాంట్నర్, ముజీబ్ ఉర్ రెహ్మాన్, కార్బిన్ బాష్, ర్యాన్ రికెల్టన్ లాంటి ఆటగాళ్లు కొత్తగా జట్టులోకి చేర్చుకుంది. ఈసారి జట్టులోకి వచ్చిన ట్రెంట్ బౌల్ట్‌కు గతంలో ముంబై ఇండియన్స్‌తో అనుబంధం ఉంది. మెగా వేలంలో దక్కించుకున్న రీస్ టాప్లే గాయం కారణంగా ఈ సీజన్‌కు దూరమయ్యాడు. దేశీయ పేసర్ దీపక్ చాహర్‌ను ముంబై సీఎస్కేతో పోటీపడి దక్కించుకుంది.ఐపీఎల్ 2025 సీజన్ కోసం ముంబై ఇండియన్స్..హార్దిక్ పాండ్యా (కెప్టెన్), రోహిత్ శర్మ, తిలక్ వర్మ, నమన్ ధిర్, సూర్యకుమార్ యాదవ్, బెవాన్ జాకబ్స్, రాజ్ భవా, విల్ జాక్స్, విజ్ఞేశ్ పుథుర్, మిచెల్ సాంట్నర్, కార్బిన్ బాష్, సత్యనారాయణ రాజు, అర్జున్ టెండూల్కర్, ర్యాన్ రికెల్టన్, రాబిన్ మింజ్, కృష్ణణ్ శ్రీజిత్, ట్రెంట్ బౌల్ట్, జస్ప్రీత్ బుమ్రా, అశ్వనీ కుమార్, రీస్ టాప్లే, కర్ణ్ శర్మ, దీపర్ చాహర్, ముజీబ్ రెహ్మాన్ -
CT 2025: ఎల్లలు దాటిన అభిమానం.. సూర్యకుమార్ యాదవ్‌తో ఫోటోలకు ఎగబడిన పాక్ మహిళా అభిమాని
ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో నిన్న (ఫిబ్రవరి 23) పాక్‌పై భారత్ 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో భారత్ అన్ని విభాగాల్లో సత్తా చాటి దాయాదిని మట్టికరిపించింది. పాక్ నిర్దేశించిన 242 పరుగుల సాధారణ లక్ష్యాన్ని భారత్ సునాయాసంగా ఛేదించింది. కోహ్లి సూపర్ సెంచరీతో మెరిసి భారత్‌ను గెలిపించాడు. బౌండరీతో సెంచరీ పూర్తి చేసుకోవడంతో పాటు భారత్‌ను విజయతీరాలకు చేర్చాడు. కోహ్లి మ్యాచ్ విన్నింగ్ సెంచరీని విశ్వవాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నారు. కోహ్లి సెంచరీ అనంతరం పాక్‌లోనూ సంబరాలు జరిగాయి. అసలైన క్రికెట్ అభిమానులు భారత్-పాక్ మధ్య ఉన్న అంతరాలను మరిచి క్రికెట్‌ను ఆస్వాధించారు. మ్యాచ్‌కు వేదిక అయిన దుబాయ్ స్టేడియంలో ఓ ఆసక్తికర సన్నివేశం అందరి దృష్టిని ఆకర్శించింది. Suryakumar Yadav poses with a Pakistani fan 🇵🇰🇮🇳♥️#INDvsPAK #ChampionsTrophy2025 pic.twitter.com/CUHBhOjWM3— Ahtasham Riaz (@ahtashamriaz22) February 23, 2025భారత టీ20 జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌తో ఫోటో కోసం ఓ పాక్ మహిళా అభిమాని ఎగబడింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతుంది. అభిమానం ఎల్లలు దాటడమంటే ఇదేనేమో అని అభిమానులు చర్చించుకుంటున్నారు. కాగా, ఈ మ్యాచ్ చూసేందుకు భారత క్రికెటర్లతో పాటు చాలామంది సెలబ్రిటీలు హాజరయ్యారు.మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ 49.4 ఓవర్లలో 241 పరుగులకు ఆలౌటైంది. సౌద్ షకీల్ (62) అర్ద సెంచరీతో రాణించగా.. కెప్టెన్ రిజ్వాన్ (46), ఖుష్దిల్ షా (38) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. వీరు మినహా పాక్ ఇన్నింగ్స్‌లో ఎవరూ చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేదు. ఇమామ్ ఉల్ హక్ 10, బాబర్ ఆజమ్ 23, సల్మాన్ అఘా 19, తయ్యబ్ తాహిర్ 4, షాహీన్ అఫ్రిది 0, నసీం షా 14, హరీస్ రౌఫ్ 8 పరుగులు చేసి ఔటయ్యారు. భారత బౌలర్లలో కుల్దీప్ 3, హార్దిక్ 2, హర్షిత్ రాణా, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా తలో వికెట్ తీశారు.అనంతరం బరిలోకి దిగిన భారత్.. కోహ్లి సెంచరీతో కదంతొక్కడంతో 42.3 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. శ్రేయస్ అయ్యర్ (56).. విరాట్‌తో కలిసి కీలకమైన భాగస్వామ్యాన్ని నెలకొల్పి భారత విజయాన్ని ఖరారు చేశాడు. ఓపెనర్లు రోహిత్ శర్మ (20), శుభ్‌మన్ గిల్ (46) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. పాక్ బౌలర్లలో అఫ్రిది 2, అబ్రార్ అహ్మద్, ఖుష్దిల్ షా తలో వికెట్ తీశారు. ఈ గెలుపుతో భారత్ సెమీస్ బెర్త్ దాదాపుగా ఖరారు చేసుకుంది. వరుస పరాజయాలతో పాక్ సెమీస్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. -
ఎట్టకేలకు ఫామ్‌లోకి వచ్చిన సూర్యకుమార్ యాదవ్
గత కొంతకాలంగా ఫామ్‌లేమితో సతమతమవుతున్న భారత టీ20 జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (Surya Kumar Yadav) ఎట్టకేలకు ఫామ్‌లోకి వచ్చాడు. రంజీ ట్రోఫీలో (Ranji Trophy) భాగంగా హర్యానాతో జరుగుతున్న క్వార్టర్ ఫైనల్లో బాధ్యతాయుతమైన హాఫ్ సెంచరీతో మెరిశాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో 9 పరుగులకే ఔటైన స్కై.. రెండో ఇన్నింగ్స్‌లో 86 బంతుల్లో 70 పరుగులు చేసి ఔటయ్యాడు. ఈ మ్యాచ్‌లో తన జట్టు (ముంబై) కష్టాల్లో ఉన్నప్పుడు (100/3) బరిలోకి దిగిన స్కై.. కెప్టెన్ ఆజింక్య రహానేతో కలిసి నాలుగో వికెట్‌కు 129 పరుగులు జోడించాడు. అనూజ్ థక్రాల్ బౌలింగ్‌లో భారీ సిక్సర్ బాదిన స్కై.. ఆతర్వాతి బంతికే ఔటయ్యాడు. మూడో రోజు మూడో సెషన్ సమయానికి ముంబై 4 వికెట్ల నష్టానికి 238 పరుగులు చేసింది. రహానేకు (71) జతగా శివమ్ దూబే (7) క్రీజ్‌లో ఉన్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో లభించిన 14 పరుగుల ఆధిక్యం కలుపుకుని ప్రస్తుతం ముంబై ఆధిక్యం 252 పరుగులుగా ఉంది. ముంబై సెకెండ్ ఇన్నింగ్స్‌లో ఆయుశ్ మాత్రే 31, ఆకాశ్ ఆనంద్ 10, సిద్దేశ్ లాడ్ 43 పరుగులు చేసి ఔటయ్యారు. హర్యానా బౌలర్లలో అన్షుల్ కంబోజ్, సుమిత్ కుమార్, అనూజ్ థక్రాల్, జయంత్ యాదవ్ తలో వికెట్ పడగొట్టారు.ఆరేసిన శార్దూల్అంతకుముందు హర్యానా తొలి ఇన్నింగ్స్‌లో 301 పరుగులకు ఆలౌటైంది.కెప్టెన్ అంకిత్ కుమార్ (136) సెంచరీ చేసి హర్యానాకు గౌరవప్రదమైన స్కోర్ అందించాడు. అంకిత్ మినహా హర్యానా ఇన్నింగ్స్‌లో ఎవ్వరూ చెప్పుకోదగ్గ స్కోర్ చేయలేదు. ముంబై బౌలర్ శార్దూల్ ఠాకూర్ 6 వికెట్లు తీసి హర్యానా పతనాన్ని శాశించాడు. షమ్స్ ములానీ, తనుశ్ కోటియన్ తలో రెండు వికెట్లు తీశారు.సెంచరీలు చేజార్చుకున్న ములానీ, కోటియన్ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై 315 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ రహానే సహా టాపార్డర్ బ్యాటర్లంతా విఫలమయ్యారు. ఆయుశ్ మాత్రే 0, ఆకాశ్ ఆనంద్ 10, సిద్దేశ్ లాడ్ 4, రహానే 31, సూర్యకుమార్ యాదవ్ 9, శివమ్ దూబే 28, శార్దూల్ ఠాకూర్ 15 పరుగులకు ఔటయ్యారు. ఏడు, తొమ్మిది స్థానాల్లో బ్యాటింగ్‌కు దిగిన షమ్స్ ములానీ (91), తనుశ్ కోటియన్ (97) భారీ అర్ద సెంచరీలు సాధించి ముంబైకు గౌరవప్రదమైన స్కోర్ అందించారు. వీరిద్దరూ లేకపోయుంటే ముంబై 200 పరుగలలోపే ఆలౌటయ్యేది.చాలాకాలం తర్వాత హాఫ్ సెంచరీతో మెరిసిన సూర్యకుమార్భారత టీ20 జట్టు కెప్టెన్ సూర్యకుమార్‌యాదవ్ చాలాకాలం తర్వాత హాఫ్ సెంచరీతో మెరిశాడు. స్కై.. ఇటీవల ఇంగ్లండ్‌తో జరిగిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో.. అంతకుముందు సౌతాఫ్రికాతో జరిగిన నాలుగు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో దారుణంగా విఫలమయ్యాడు. టీ20ల్లో గత 9 ఇన్నింగ్స్‌ల్లో స్కై కనీసం ఒక్క హాఫ్ సెంచరీ కూడా చేయలేదు. గతేడాది అక్టోబర్‌లో బంగ్లాదేశ్‌తో జరిగిన టీ20లో స్కై చివరిసారి హాఫ్ సెంచరీ మార్కును తాకాడు. వన్డేల్లో కూడా స్కై పేలవ ప్రదర్శన కొనసాగుతుంది. 2023 వన్డే వరల్డ్‌కప్‌కు ముందు ఆసీస్‌తో జరిగిన రెండో వన్డేలో స్కై చివరిసారి హాఫ్ సెంచరీ చేశాడు. మూడు మ్యాచ్‌ల ఆ సిరీస్‌లో స్కై.. వరుసగా రెండు వన్డేల్లో హాఫ్ సెంచరీలు చేశాడు. ఆ సిరీస్ అనంతరం జరిగిన వన్డే వరల్డ్‌కప్‌లో స్కై దారుణంగా విఫలమయ్యాడు. ఆ మెగా టోర్నీలో స్కై ఆడిన ఏడు మ్యాచ్‌ల్లో కనీసం ఒక్క హాఫ్ సెంచరీ కూడా చేయలేకపోయాడు. ఆ టోర్నీలో ఇంగ్లండ్‌పై చేసిన 49 పరుగులే స్కైకు అత్యధికం. -
సూర్యకుమార్.. అందుకు సమయం అసన్నమైంది: అశ్విన్
ఇంగ్లండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌ను 4-1 తేడాతో టీమిండియా సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. కానీ భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్(suryakumar yadav) మాత్రం తన పేలవ ఫామ్‌తో తీవ్ర నిరాశపరిచాడు. దక్షిణాఫ్రికా సిరీస్‌లో విఫలమైన సూర్య.. ఇంగ్లండ్ సిరీస్‌లోనూ అదే తీరును కనబరిచాడు.ఐదు మ్యాచ్‌ల్లో మిస్టర్ 360 కేవలం 28 పరుగులు మాత్రమే చేశాడు. అతడి చివరి ఐదు ఇన్నింగ్స్‌లో రెండు డకౌట్లు కూడా ఉండటం గమనార్హం. కెప్టెన్సీ పరంగా ఆకట్టుకుంటున్నప్పటికి.. వ్యక్తిగత ప్రదర్శన పరంగా పూర్తిగా ఈ ముంబైకర్ తేలిపోతున్నాడు. తన ఫేవరేట్ షాట్ల ఆడటంలో కూడా సూర్య విఫలమవుతున్నాడు.ఈ సిరీస్‌లో అన్ని మ్యాచ్‌ల్లోనూ సూర్య ఒకేలా ఔటయ్యాడు. దీంతో అతడిపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్‌ది కూడా ఇదే పరిస్థితి. దక్షిణాఫ్రికా సిరీస్‌లో వరుస సెంచరీలతో చెలరేగిన శాంసన్.. ఇంగ్లండ్‌పై మాత్రం పూర్తిగా తేలిపోయాడు. ఈ సిరీస్‌లో శాంసన్ కేవలం 51 పరుగులు (26,5,3,1,16) మాత్రమే చేశాడు. సంజూ షార్ట్ పిచ్ బంతులను ఎదుర్కోవడంలో చాలా ఇబ్బంది పడ్డాడు. తొలి మూడు మ్యాచ్‌ల్లో జోఫ్రా అర్చర్ చేతికే సంజూ చిక్కాడు. అయితే ఆఖరి టీ20లో శాంసన్ చేతి వేలికి గాయం కావడంతో ఆరు వారాల పాటు ఆటకు దూరంగా ఉండనున్నాడు. అతడు తిరిగి మళ్లీ ఐపీఎల్-2025తో మైదానంలో అడుగుపెట్టే ఛాన్స్ ఉంది. ఈ నేపథ్యంలో సూర్యకుమార్, సంజూను ఉద్దేశించి భారత మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. సూర్యకుమార్ తన బ్యాటింగ్ స్టైల్‌ను మార్చుకోవాల్సిన సమయం అసన్నమైందని అశ్విన్ అన్నాడు."సిరీస్ గెలిచినప్పటికి సూర్యకుమార్ యాదవ్ పేలవ ఫామ్ మాత్రం భారత్‌కు ప్రధాన సమస్యగా మారింది. ఈ సిరీస్‌లో అతడి కెప్టెన్సీ అద్భుతంగా ఉంది. అతడి కెప్టెన్సీలో ఎటువంటి లోపాలు లేవు. కానీ బ్యాటింగ్ పరంగా మెరుగ్గా రాణించాల్సిన అవసరముంది. మరోవైపు సంజూ శాంసన్ కూడా తన బ్యాటింగ్‌తో ఆకట్టుకోలేకపోయాడు.వీరిద్దిరూ ఒకే రకమైన బంతి, ఒకే ఫీల్డ్ పొజిషేన్‌లో ఔట్ అవ్వుతున్నారు. ఒకట్రెండు మ్యాచ్‌ల్లో ఇలా జరిగితే ఫర్వాలేదు. కానీ వీరిద్దరూ ప్రతీ మ్యాచ్‌లోనూ ఇదే తరహాలో తమ వికెట్లను కోల్పోతున్నారు. ఆటగాళ్లు స్వేఛ్చతో ఆడాలన్న విషయంతో నేను కూడా ఏకీభవిస్తాను. కానీ ఒకే తరహాలో ఔట్ అవుతున్నప్పుడు దానికి కొత్త సమాధానం కనుగొనాల్సిన బాధ్యత మీపై ఉంది. సూర్యకుమార్ యాదవ్ చాలా అనుభవం ఉన్న ఆటగాడు.బ్యాటింగ్‌లో భారత క్రికెట్ అప్రోచ్‌ను మార్చడంలో సూర్య భాగమయ్యాడు. అందులో ఎటువంటి సందేహం లేదు. కానీ తన బ్యాటింగ్ విధానాన్ని కొద్దిగా మార్చుకోవాల్సిన సమయం ఆసన్నమైందని భావిస్తున్నానని" అశ్విన్ తన యూట్యూబ్ ఛానల్లో పేర్కొన్నాడు.చదవండి: CT 2025: భారత్-పాకిస్తాన్ మ్యాచ్.. హాట్‌కేకుల్లా అమ్ముడుపోయిన టికెట్లు -
రంజీ బాట పట్టిన టీమిండియా విధ్వంసకర వీరులు
హర్యానాతో జరిగే రంజీ ట్రోఫీ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ (ఫిబ్రవరి 8-12) కోసం 18 మంది సభ్యుల ముంబై జట్టును ఇవాళ (ఫిబ్రవరి 3) ప్రకటించారు. వెటరన్ బ్యాటర్ అజింక్య రహానే ఈ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ఈ మ్యాచ్ కోసం ముంబై సెలెక్టర్లు భారత టీ20 జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, టీమిండియా విధ్వంసకర బ్యాటర్ శివమ్ దూబేను ఎంపిక చేశారు. ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్ నేపథ్యంలో శ్రేయస్ అయ్యర్, రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్ పేర్లను ముంబై సెలెక్టర్లు పరిగణలోకి తీసుకోలేదు. ఈ ముగ్గురు భారత వన్డే జట్టులో సభ్యులుగా ఉన్నారు. ముంబై జట్టులో యువ బ్యాటర్లు ఆయుశ్ మాత్రే, అంగ్క్రిష్ రఘువంశీ, సిద్దేశ్ లాడ్ చోటు దక్కించుకున్నారు. ముంబై బౌలింగ్ అటాక్‌ను శార్దూల్ ఠాకూర్ లీడ్ చేస్తాడు. బౌలింగ్ విభాగంలో మోహిత్ అవస్తి, శివమ్ దూబే, తనుశ్ కోటియన్, షమ్స్ ములానీ సభ్యులుగా ఉన్నారు. ఆకాశ్ ఆనంద్, హార్దిక్ తామోర్ వికెట్ కీపర్లుగా ఎంపికయ్యారు.కాగా, ముంబై జట్టు గ్రూప్ దశలో తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో మేఘాలయాపై ఘన విజయం సాధించి క్వార్టర్ ఫైనల్‌కు చేరింది. ఈ మ్యాచ్‌లో ముంబై భారీ తేడాతో గెలుపొందడంతో బోనస్ పాయింట్ కూడా సాధించింది. ఈ మ్యాచ్‌లో ముంబై కేవలం ఒకే ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేసి ఇన్నింగ్స్ 456 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన మేఘాలయా 86 పరుగులకే కుప్పకూలింది. శార్దూల్ ఠాకూర్ హ్యాట్రిక్ సాధించాడు. మేఘాలయా ఇన్నింగ్స్‌లో మొదటి ఆరుగురు బ్యాటర్లలో ఐదుగురు డకౌట్లయ్యారు. అనంతరం ముంబై తొలి ఇన్నింగ్స్‌లో 671 పరుగులు చేసింది. సిద్దేశ్ లాడ్ (145), ఆకాశ్ ఆనంద్ (103), షమ్స్ ములానీ (100 నాటౌట్) సెంచరీలు చేశారు. ఆజింక్య రహానే (96), శార్దూల్ ఠాకూర్ (84) సెంచరీలు మిస్ చేసుకున్నారు. అనంతరం మేఘాలయా రెండో ఇన్నింగ్స్‌లో 129 పరుగులకే కుప్పకూలి ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది.ముంబై జట్టు అజింక్య రహానే (కెప్టెన్), ఆయుష్ మాత్రే, అంగ్క్రిష్ రఘువంశీ, అమోఘ్ భత్కల్, సూర్యకుమార్ యాదవ్, సిద్ధేష్ లాడ్, శివమ్ దూబే, ఆకాశ్ ఆనంద్ (వికెట్‌కీపర్), హార్దిక్ తమోర్ (వికెట్‌కీపర్), సూర్యాంశ్ షెడ్గే, శార్దూల్ ఠాకూర్, షమ్స్ ములానీ, తనుశ్ కోటియన్, మోహిత్ అవస్తి, సిల్వెస్టర్ డిసౌజా, రాయ్స్టన్ డయాస్, అథర్వ అంకోలేకర్, హర్ష్ తన్నా -
ఐదో టీ20లో భారత్ ఘన విజయం
ఐదో టీ20లో భారత్ ఘన విజయంముంబై వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన ఐదో టీ20లో భారత్ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో భారత్ ఇంగ్లండ్‌ను 150 పరుగుల తేడాతో మట్టికరిపించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 247 పరుగులు చేయగా.. ఇంగ్లండ్ 10.3 ఓవర్లలో 97 పరుగులకే ఆలౌటైంది. ఈ మ్యాచ్‌లో అభిషేక్ శర్మ విధ్వంసకర శతకంతో విరుచుకుపడ్డాడు. భారత బౌలర్లు తలో చేయి వేసి ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌ను పేకమేడలా కూల్చారు. ఈ గెలుపుతో భారత్ ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 4-1 తేడాతో కైవసం చేసుకుంది.మూడో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్59 పరుగుల వద్ద ఇంగ్లండ్ మూడో వికెట్ కోల్పోయింది. బిష్ణోయ్ బౌలింగ్‌లో హ్యారీ బ్రూక్ (2) ఔటయ్యాడు.రెండో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్48 పరుగుల వద్ద ఇంగ్లండ్ రెండో వికెట్ కోల్పోయింది. జోస్ బట్లర్‌ను (7) వరుణ్ చక్రవర్తి పెవిలియన్‌కు పంపాడు. టార్గెట్ 248.. తొలి వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్248 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇంగ్లండ్‌కు శుభారంభమే లభించింది. అయితే ఆ జట్టు 3వ ఓవర్ తొలి బంతికి తొలి వికెట్ కోల్పోయింది. షమీ బౌలింగ్‌లో బెన్ డకెట్ డకౌటాయ్యాడు. 4 ఓవర్లలో ఇంగ్లండ్ స్కోర్ 48/1గా ఉంది. ఫిల్ సాల్ట్ (39) ధాటిగా ఆడుతున్నాడు. అభిషేక్ విధ్వంసకర శతకం.. టీమిండియా భారీ స్కోర్ముంబై వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదో టీ20లో టీమిండియా భారీ స్కోర్ (247/9) చేసింది. ఈ మ్యాచ్‌లో అభిషేక్ శర్మ (54 బంతుల్లో 135; 7 ఫోర్లు, 13 సిక్సర్లు) విధ్వంసకర శతకంతో విరుచుకుపడ్డాడు. హాఫ్ సెంచరీని 17 బంతుల్లో పూర్తి చేసిన అభిషేక్.. సెంచరీని 37 బంతుల్లో శతక్కొట్టాడు. టీ20ల్లో అభిషేక్‌ది భారత్ తరఫున రెండో వేగవంతమైన హాఫ్ సెంచరీ (17), సెంచరీ (37). టీ20ల్లో భారత్ తరఫున ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డు రోహిత్ శర్మ (35 బంతుల్లో) పేరిట ఉండగా.. ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ యువరాజ్ సింగ్ (12 బంతుల్లో) పేరిట ఉంది. అభిషేక్‌కు టీ20ల్లో ఇది రెండో సెంచరీ.టీ20ల్లో భారత్ తరఫున అత్యధిక స్కోర్ (135) కూడా అభిషేక్‌దే. అలాగే ఓ టీ20లో భారత్ తరఫున అత్యధిక సిక్సర్లు (13) కొట్టింది కూడా అభిషేకే. అభిషేక్ ధాటికి భారత్ పవర్ ప్లేల్లో అత్యధిక స్కోర్ (95/1) నమోదు చేసింది. అభిషేక్ సెంచరీ పూర్తయ్యాక భారత్ స్కోర్ బాగా నెమ్మదించింది. వరుస క్రమంలో వికెట్లు పడిపోయాయి. ఆరంభంలో సంజూ శాంసన్ (7 బంతుల్లో 16; ఫోర్, 2 సిక్సర్లు).. మధ్యలో తిలక్ వర్మ (15 బంతుల్లో 24; 3 ఫోర్లు, సిక్స్), శివమ్ దూబే (13 బంతుల్లో 30; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడారు. వేగంగా పరుగులు రాబట్టే క్రమంలో సూర్యకుమార్ యాదవ్ (3 బంతుల్లో 2), హార్దిక్ పాండ్యా (6 బంతుల్లో 9; సిక్స్), రింకూ సింగ్ 6 బంతుల్లో 9; ఫోర్), అక్షర్ పటేల్ (11 బంతుల్లో 15; 2 ఫోర్లు), బిష్ణోయ్ (0) ఔటయ్యారు. ఇంగ్లండ్ బౌలర్లలో బ్రైడన్ కార్స్ 3, మార్క్ వుడ్ 2, జోఫ్రా ఆర్చర్, జేమీ ఓవర్టన్, ఆదిల్ రషీద్ తలో వికెట్ తీశారు.37 బంతుల్లో శతక్కొట్టిన అభిషేక్హాఫ్ సెంచరీ తర్వాత పేట్రేగిపోయిన అభిషేక్ శర్మ 37 బంతుల్లో 5 ఫోర్లు, 10 సిక్సర్ల సాయంతో సెంచరీ పూర్తి చేశాడు. టీ20ల్లో భారత్ తరఫున ఇది రెండో వేగవంతమైన శతకం. టీ20ల్లో భారత్ తరఫున వేగవంతమైన సెంచరీ రికార్డు రోహిత్ శర్మ పేరిట ఉంది. హిట్‌మ్యాన్ 2017లో శ్రీలంకపై 35 బంతుల్లోనే శతక్కొట్టాడు. ఓవరాల్‌గా టీ20ల్లో ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డు ఎస్టోనియాకు చెందిన సాహిల్ చౌహాన్ పేరిట ఉంది. గతేడాది చౌహాన్ సైప్రస్‌పై కేవలం 27 బంతుల్లోనే సెంచరీ చేశాడు. అభిషేక్ శర్మ విధ్వంసం.. 17 బంతుల్లో అర్ధ శతకంఈ మ్యాచ్‌లో అభిషేక్ శర్మ పూనకం వచ్చినట్లు ఊగిపోయాడు. సంజూ ఔటయ్యాక ఒక్కసారిగా బీస్ట్ మోడ్‌లోకి వచ్చిన అభిషేక ఎడాపెడా బౌండరీలు, సిక్సర్లు బాది 17 బంతుల్లో హాఫ్‌సెంచరీ పూర్తి చేసుకున్నాడు. టీ20ల్లో యువరాజ్ సింగ్ (12 బంతుల్లో) తర్వాత అభిషేక్‌దే ఫాస్టెస్ట్ ఫిఫ్టి. అభిషేక్ దెబ్బకు భారత్ తొలి 6 ఓవర్లలో 95 పరుగులు చేసిం్ది. అభిషేక్ 58, తిలక్ 19 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు.సంజూ శాంసన్ మరోసారి విఫలంటీమిండియా ఓపెనర్ సంజూ శాంసన్ మరోసారి విఫలమయ్యాడు.వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో విఫలమైనా టీమిండియా మేనేజ్మెంట్ సంజూకు మరో ఛాన్స్ ఇచ్చింది. ఈ మ్యాచ్‌లో తొలి బంతికే సిక్సర్ బాదిన సంజూ.. ఆతర్వాత అదే ఓవర్లో మరో సిక్సర్, బౌండరీ బాదాడు. అయితే సంజూ (7 బంతుల్లో 16; ఫోర్, 2 సిక్సర్లు) ఆతర్వాతి ఓవర్లోనే మార్క్ వుడ్ బౌలింగ్‌లో జోఫ్రా ఆర్చర్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్ముంబై వేదికగా భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య ఇవాళ (ఫిబ్రవరి 2) నామమాత్రపు ఐదో టీ20 జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ టాస్ గెలిచి తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ కోసం ఇరు జట్లు చెరో మార్పు చేశాయి. భారత్ తరఫున అర్షదీప్ సింగ్ స్థానంలో మహ్మద్ షమీ తుది జట్టులోకి రాగా.. గత మ్యాచ్‌లో సంచలన బౌలింగ్ ప్రదర్శన చేసిన సాకిబ్ మహమూద్‌కు ఇంగ్లండ్ రెస్ట్ ఇచ్చింది. సాకిబ్ స్థానంలో మార్క్ వుడ్ తుది జట్టులోకి వచ్చాడు. కాగా, ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌ను భారత్ ఇదివరకే 3-1 తేడాతో కైవసం చేసుకున్న విషయం తెలిసిందే.తుది జట్లు..ఇంగ్లండ్: ఫిలిప్ సాల్ట్, బెన్ డకెట్, జోస్ బట్లర్(కెప్టెన్), హ్యారీ బ్రూక్, లియామ్ లివింగ్‌స్టోన్, జేకబ్ బేతెల్, జామీ ఓవర్టన్, బ్రైడన్ కార్సే, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్భారత్: సంజు శాంసన్(వికెట్ కీపర్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), రింకూ సింగ్, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, మహ్మద్ షమీ, రవి బిష్ణోయ్, వరుణ్ చక్రవర్తి -
వారిద్దరి వల్లే గెలిచాము.. కానీ అది మాత్రం ఊహించలేదు: సూర్య
భారత క్రికెట్ జట్టు మరో టీ20 సిరీస్‌ను తమ ఖాతాలో వేసుకుంది. పుణే వేదికగా జరిగిన నాలుగో టీ20లో ఇంగ్లండ్‌పై 15 పరుగుల తేడాతో టీమిండియా(Teamindia) విజయం సాధించింది. దీంతో ఐదు టీ20ల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలూండగానే భారత్ 3-1 తేడాతో సొంతం చేసుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 181 పరుగులు చేసింది. హార్దిక్ పాండ్యా( 30 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లతో 53), శివమ్ దూబే(34 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్‌లతో 53) హాఫ్ సెంచరీలతో రాణించారు. అనంతరం ఇంగ్లండ్ 19.4 ఓవర్లలో 166 పరుగులకు ఆలౌటైంది. భారత బౌలర్లలో కంకషన్ సబ్‌స్ట్యూట్‌గా వచ్చిన హర్షిత్ రాణా(Harshit Rana) మూడు వికెట్లు పడగొట్టగా.. వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్ తలా రెండు వికెట్లు పడగొట్టారు.ఇంగ్లండ్ బ్యాటర్లలో హ్యారీ బ్రూక్(26 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 51) హాఫ్ సెంచరీతో మెరిసినప్పటకి ఫలితం లేకుండా పోయింది. ఇక ఈ విజయంపై మ్యాచ్ అనంతరం టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్(suryakumar yadav) స్పందించాడు. అద్బుత ఇన్నింగ్స్‌లు ఆడిన దూబే, హార్దిక్ పాండ్యాలపై సూర్య ప్రశంసల వర్షం కురిపించాడు.ఈ విజయంలో జట్టులోని ప్రతీ ఒక్కరూ తమ వంతు పాత్ర పోషించారు. అదేవిధంగా మ్యాచ్ ఆరంభం నుంచి చివరి వరకు ప్రేక్షకులు మద్దతు అద్భుతంగా ఉంది. మా విజయాలు వెనక వారి సపోర్ట్ ఎల్లప్పుడూ ఉంటుంది. 10 వికెట్లకే మూడు వికెట్లు కోల్పోయిన సమయంలో మేము వెనకంజ వేయాలని అనుకోలేదు. బ్రాండ్ ఆఫ్ క్రికెట్ ఆడాలో మా కుర్రాళ్లకు బాగా తెలుసు. ఒకే ఓవర్లో మూడు వికెట్లు కోల్పోవడం గట్టి ఎదురు దెబ్బే. నేను అస్సలు ఊహించలేదు. కానీ అక్కడ నుంచి మా బ్యాటర్లు ఆడిన విధానం నిజంగా అద్భుతం. హార్దిక్ పాండ్యా, దూబే ఆసాధరణ బ్యాటింగ్ చేశారు. వారిద్దరూ తమ అనుభవాన్ని చూపించారు. మేం ఎప్పుడూ మాట్లాడేది ఇదే. నెట్స్‌లో ఎలా ఆడుతారో, మ్యాచ్‌లో ఆలానే స్వేఛ్చగా ఆడాలని మా బాయ్స్‌కు చెబుతాం. మా ఆటగాళ్లు నెట్ సెషన్లలో తీవ్రంగా శ్రమిస్తున్నారు. వారు నెట్ ప్రాక్టీస్‌లో ఆడినట్లే గేమ్‌లో కూడా ఆడుతున్నారు. కాబట్టి నేను చాలా సంతోషంగా ఉన్నాను. మేము సరైన దిశలోనే పయనిస్తున్నామని నేను భావిస్తున్నాను. పవర్ ప్లే తర్వాత(7 -10 ఓవర్ల మధ్య) పరుగులు సాధించడం అంత ఈజీ కాదు. ఇంగ్లండ్ పవర్ ప్లేలో దూకుడుగా ఆడినప్పటికి.. తర్వాత మేము కొన్ని వికెట్లు తీసి గేమ్‌ని మా నియంత్రణలోకి తీసుకున్నాము. దురదృష్టవశాత్తు శివమ్ దూబే ఫీల్డింగ్‌కు రాలేకపోయాడు. హర్షిత్ రాణా మూడువ సీమర్‌గా బరిలోకి దిగాడు. అతడు కూడా అద్భుతమైన ప్రదర్శన చేశాడు. ముంబైలో జరిగే ఆఖరి టీ20లో కూడా మేము దుమ్ములేపుతాం అని పోస్ట్ మ్యాచ్ ప్రేజెంటేషన్‌లో సూర్య పేర్కొన్నాడు.చదవండి: IND vs ENG: సబ్‌స్ట్యూట్‌గా వచ్చాడు.. గేమ్నే మార్చేశాడు! రూల్స్ ఏమి చెబుతున్నాయి? -
హార్దిక్, దూబే విధ్వంసం.. నిప్పులు చెరిగిన రాణా.. నాలుగో టీ20లో టీమిండియా విజయం
స్వదేశంలో ఇంగ్లండ్‌తో (England) జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను భారత్ (Team India) మరో మ్యాచ్ మిగిలుండగానే 3-1 తేడాతో కైవసం చేసుకుంది. పూణే వేదికగా ఇవాళ (జనవరి 31) జరిగిన నాలుగో మ్యాచ్‌లో భారత్ 15 పరుగుల తేడాతో గెలుపొందింది. భారత్ ఇంగ్లండ్‌పై టీ20 సిరీస్ గెలవడం ఇది వరుసగా ఐదుసారి. భారత్‌కు స్వదేశంలో ఇది వరుసగా 17వ సిరీస్ విజయం.మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. హార్దిక్ పాండ్యా (Hardik Pandya) (30 బంతుల్లో 53; 4 ఫోర్లు, 4 సిక్సర్లు), శివమ్ దూబే (Shivam Dube) (34 బంతుల్లో 53; 7 ఫోర్లు, 2 సిక్సర్లు) విరుచుకుపడటంతో నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 181 పరుగుల భారీ స్కోర్ చేసింది.12 పరుగుల వద్ద ఒకే ఓవర్లో మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉండిన భారత్‌ను హార్దిక్, దూబే మెరుపు ఇన్నింగ్స్‌లతో ఆదుకున్నారు.వీరికి ముందు అభిషేక్ శర్మ (19 బంతుల్లో 29; 4 ఫోర్లు, సిక్స్), రింకూ సింగ్ (26 బంతుల్లో 30; 4 ఫోర్లు, సిక్స్) ఓ మోస్తరు ఇన్నింగ్స్‌లు ఆడారు. 19 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసిన భారత్.. చివరి ఓవర్లో కేవలం 3 పరుగులు మాత్రమే చేసి మూడు వికెట్లు కోల్పోయింది. చివరి ఓవర్‌ను జేమీ ఓవర్టన్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు.భారత ఆటగాళ్లలో సంజూ శాంసన్ (1), తిలక్ వర్మ (0), సూర్యకుమార్ యాదవ్ (0) దారుణంగా విఫలమయ్యారు. ఇంగ్లండ్ బౌలర్లలో సాకిబ్ మహమూద్ 3, జేమీ ఓవర్టన్ 2, బ్రైడన్ కార్స్, ఆదిల్ రషీద్ తలో వికెట్ పడగొట్టారు. 182 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇంగ్లండ్ 19.4 ఓవర్లలో 166 పరుగులకు ఆలౌటైంది. ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో హ్యారీ బ్రూక్ (51) అర్ద సెంచరీతో రాణించగా.. ఓపెనర్లు బెన్ డకెట్ (39), ఫిలిప్ సాల్ట్ (23) ఓ మోస్తరు స్కోర్లు చేశారు.బ్రూక్ క్రీజ్‌లో ఉండగా.. ఇంగ్లండ్ విజయం సాధించేలా కనిపించింది. అయితే వరుణ్ చక్రవర్తి ఒకే ఓవర్లో బ్రూక్‌తో పాటు బ్రైడన్ కార్స్‌ను ఔట్ చేసి తిరిగి భారత్‌ను గేమ్‌లోకి తెచ్చాడు. బ్రూక్, కార్స్ ఔటయ్యాక జేమీ ఓవర్టన్ కొద్ది సేపు భారత బౌలర్లను బయపెట్టాడు. ఈ మ్యాచ్‌లో బ్యాటింగ్ చేస్తూ గాయపడిన శివమ్ దూబేకు కన్కషన్ సబ్‌స్టిట్యూట్‌గా వచ్చిన హర్షిత్ రాణా (Harshit Rana) మ్యాజిక్ చేశాడు. తన కెరీర్లో తొలి టీ20 ఆడిన హర్షిత్.. ఏకంగా మూడు వికెట్లు తీసి ఇంగ్లండ్‌ను చావుదెబ్బ కొట్టాడు. హర్షిత్.. ప్రమాదకరమైన లివింగ్‌స్టోన్ (9), జేకబ్ బేతెల్ (6), జేమీ ఓవర్టన్ (19) వికెట్లు తీశాడు. ఈ మ్యాచ్‌లో హర్షిత్ 150 కిమీకు పైగా వేగంతో బంతులు సంధించడం విశేషం. హర్షిత్‌తో పాటు రవి బిష్ణోయ్ మూడు వికెట్లు పడగొట్టగా.. వరుణ్ చక్రవర్తి 2, అక్షర్ పటేల్, అర్షదీప్ సింగ్ చెరో వికెట్ దక్కించుకున్నారు. ఈ సిరీస్‌లో నామమాత్రపు ఐదో టీ20 ఫిబ్రవరి 2న ముంబైలో జరుగుతుంది. -
తీరు మార్చుకోని సంజూ శాంసన్.. వైఫల్యాల పరంపర కొనసాగిస్తున్న సూర్య
ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో పలువురు టీమిండియా బ్యాటర్ల వైఫల్యాల పరంపర కొనసాగుతుంది. ఈ సిరీస్‌లో ఇప్పటివరకు జరిగిన నాలుగు మ్యాచ్‌ల్లో ఓపెనర్ సంజూ శాంసన్, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ దారుణంగా విఫలమయ్యారు. తొలి మ్యాచ్‌లో 20 బంతుల్లో 26 పరుగులు చేసిన సంజూ.. ఆతర్వాత వరుసగా మూడు మ్యాచ్‌ల్లో (5,3,1) సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యాడు. సూర్య విషయానికొస్తే.. ఏదో కెప్టెన్సీ బాధ్యత మోస్తున్నాడని తప్పిస్తే, ఈ సిరీస్ మొత్తంలో సూర్య ప్రదర్శనలు శూన్యం. సిరీస్‌ను డకౌట్‌తో ప్రారంభించిన సూర్య.. ఇవాళ జరుగుతున్న నాలుగో టీ20లోనూ ఖాతా తెరవకుండానే వెనుదిరిగాడు. మధ్యలో రెండు, మూడు మ్యాచ్‌ల్లో అతను 12, 14 పరుగులు చేశాడు. సూర్య ప్రదర్శన ఈ సిరీస్‌కు ముందు నుంచే చెత్తగా ఉంది. చివరి 10 ఇన్నింగ్స్‌ల్లో అతను కేవలం ఒక్క హాఫ్ సెంచరీ మాత్రమే చేశాడు. వరుస వైఫల్యాల నేపథ్యంలో సూర్యపై విమర్శలు తారా స్థాయికి చేరాయి. కెప్టెన్సీకి వేరే వాళ్లకు కట్టబెట్టి ముందు అతన్ని జట్టులో నుంచి తీసేయండని అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. ఇతను కేవలం ఐపీఎల్ ప్లేయర్ మాత్రమేనని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.అభిషేక్ శర్మది అదే తీరు.. మంచి ఆరంభాలు లభించినా..!ఈ సిరీస్‌లో అభిషేక్ శర్మ కాస్త పర్వాలేదనిపిస్తున్నా అతని నిలకడలేమి ఆందోళన కలిగిస్తుంది. తొలి టీ20లో మ్యాచ్ విన్నింగ్ నాక్ (34 బంతుల్లో 79) ఆడిన అభిషేక్ ఆతర్వాత వరుసగా మూడు మ్యాచ్‌ల్లో మంచి ఆరంభాలు లభించినా సద్వినియోగం చేసుకోలేకపోయాడు. రెండు, మూడు టీ20ల్లో వరుసగా 12, 24 పరుగులు చేసిన అభిషేక్.. ఇవాళ జరుగుతున్న నాలుగో మ్యాచ్‌లో 19 బంతుల్లో 29 పరుగులు చేసి ఔటయ్యాడు. ఈ మ్యాచ్‌లో అభిషేక్‌కు లభించిన ఆరంభాన్ని బట్టి చూస్తే అతను చివరి వరకు క్రీజ్‌లో ఉండాల్సింది. అయితే అతను తన సహజ సిద్దమైన దూకుడును ప్రదర్శించి వికెట్ పారేసుకున్నాడు. అభిషేక్ వికెట్ సమర్పించుకోవడంతో పాటు భారత్‌ను కష్టాల్లోకి నెట్టాడు.తిలక్ ఖాతాలో వరుసగా రెండు వైఫల్యాలుసిరీస్లోని రెండో టీ20లో అద్భుతమైన ఇన్నింగ్స్ (55 బంతుల్లో 72 నాటౌట్) ఆడి టీమిండియాను విజయతీరాలకు చేర్చిన తిలక్.. ఆతర్వాత వరుసగా రెండు మ్యాచ్‌ల్లో విఫలమై నిరాశపరిచాడు. మూడో టీ20లో 18 పరుగులు చేసిన తిలక్.. ఇవాళ జరుగుతున్న నాలుగో మ్యాచ్‌లో గోల్డెన్ డకౌటయ్యాడు. వరుసగా రెండు మ్యాచ్‌ల్లో విఫలం కావడంతో తిలక్‌పై కూడా విమర్శలు మొదలవుతున్నాయి.నాలుగో టీ20 విషయానికొస్తే.. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ భారీ స్కోర్ (181/9) చేసింది. 12 పరుగుల వద్ద మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉండిన జట్టును హార్దిక్ పాండ్యా (30 బంతుల్లో 53; 4 ఫోర్లు, 4 సిక్సర్లు), శివమ్ దూబే (34 బంతుల్లో 53; 7 ఫోర్లు, 2 సిక్సర్లు) ఆదుకున్నారు.వీరికి ముందు అభిషేక్ శర్మ (19 బంతుల్లో 29; 4 ఫోర్లు, సిక్స్), రింకూ సింగ్ (26 బంతుల్లో 30; 4 ఫోర్లు, సిక్స్) ఓ మోస్తరు ఇన్నింగ్స్‌లు ఆడారు. 19 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసిన భారత్.. చివరి ఓవర్లో కేవలం 3 పరుగులు మాత్రమే చేసి మూడు వికెట్లు కోల్పోయింది.చివరి ఓవర్‌ను జేమీ ఓవర్టన్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. భారత ఆటగాళ్లలో సంజూ శాంసన్ (1), తిలక్ వర్మ (0), సూర్యకుమార్ యాదవ్ (0) దారుణంగా విఫలమయ్యారు. ఇంగ్లండ్ బౌలర్లలో సాకిబ్ మహమూద్ 3, జేమీ ఓవర్టన్ 2, బ్రైడన్ కార్స్, ఆదిల్ రషీద్ తలో వికెట్ పడగొట్టారు. -
నాలుగో టీ20లో ఇంగ్లండ్‌పై భారత్ గెలుపు.. సిరీస్ కైవసం
ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను భారత్ మరో మ్యాచ్ మిగిలుండగానే 3-1 తేడాతో కైవసం చేసుకుంది. ఇవాళ (జనవరి 31) జరిగిన నాలుగో మ్యాచ్‌లో భారత్ 15 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. హార్దిక్ పాండ్యా (30 బంతుల్లో 53; 4 ఫోర్లు, 4 సిక్సర్లు), శివమ్ దూబే (34 బంతుల్లో 53; 7 ఫోర్లు, 2 సిక్సర్లు) విరుచుకుపడటంతో నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 181 పరుగుల భారీ స్కోర్ చేసింది.భారత ఇన్నింగ్స్‌లో హార్దిక్, దూబేతో పాటు అభిషేక్ శర్మ (19 బంతుల్లో 29; 4 ఫోర్లు, సిక్స్), రింకూ సింగ్ (26 బంతుల్లో 30; 4 ఫోర్లు, సిక్స్) రాణించగా.. సంజూ శాంసన్ (1), తిలక్ వర్మ (0), సూర్యకుమార్ యాదవ్ (0) దారుణంగా విఫలమయ్యారు. ఇంగ్లండ్ బౌలర్లలో సాకిబ్ మహమూద్ 3, జేమీ ఓవర్టన్ 2, బ్రైడన్ కార్స్, ఆదిల్ రషీద్ తలో వికెట్ పడగొట్టారు. 182 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇంగ్లండ్ 19.4 ఓవర్లలో 166 పరుగులకు ఆలౌటైంది. ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో హ్యారీ బ్రూక్ (51) అర్ద సెంచరీతో రాణించగా.. ఓపెనర్లు బెన్ డకెట్ (39), ఫిలిప్ సాల్ట్ (23) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. ఆఖర్లో జేమీ ఓవర్టన్ (19) వేగంగా పరుగులు రాబట్టినప్పటికీ అప్పటికే ఇంగ్లండ్ ఓటమి ఖరారైపోయింది. ఇంగ్లండ్ ఆటగాళ్లు జోస్ బట్లర్ (2), లివింగ్‌స్టోన్ (9), జేకబ్ బేతెల్ 96), బ్రైడన్ కార్స్ (0), జోఫ్రా ఆర్చర్ (0) నిరాశపరిచారు. భారత బౌలర్లలో హర్షిత్ రాణా (గాయపడిన శివమ్ దూబే స్థానంలో కన్కషన్ సబ్‌స్టిట్యూట్‌గా వచ్చాడు), రవి బిష్ణోయ్ తలో మూడు వికెట్లు పడగొట్టగా.. వరుణ్ చక్రవర్తి 2, అక్షర్ పటేల్, అర్షదీప్ సింగ్ చెరో వికెట్ దక్కించుకున్నారు. ఏడో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్137 పరుగుల వద్ద ఇంగ్లండ్ ఏడో వికెట్ కోల్పోయింది. హర్షిత్ రాణా బౌలింగ్‌లో జేకబ్ బేతెల్ (6) ఔటయ్యాడు. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ గెలవాలంటే 24 బంతుల్లో 45 పరుగులు చేయాలి.ఐదో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్129 పరుగుల వద్ద ఇంగ్లండ్ ఐదో వికెట్ కోల్పోయింది. 25 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసి ప్రమాదకరంగా కనిపించిన హ్యారీ బ్రూక్.. వరుణ్ చక్రవర్తి బౌలింగ్‌లో ఔటయ్యాడు.నాలుగో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్గాయపడిన శివమ్ దూబే స్థానంలో కన్కషన్ సబ్‌స్టిట్యూట్‌గా వచ్చిన హర్షిత్ రాణా డేంజరెస్ ఆటగాడు లియామ్ లివింగ్‌స్టోన్ (9) వికెట్ పడగొట్టాడు. 12 ఓవర్ల తర్వాత ఇంగ్లండ్ స్కోర్ 99/4గా ఉంది. హ్యారీ బ్రూక్ (23), జేకబ్ బేతెల్ క్రీజ్‌లో ఉన్నారు. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ గెలవాలంటే 48 బంతుల్లో 83 పరుగులు చేయాలి. మూడో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్.. బట్లర్ ఔట్67 పరుగుల వద్ద ఇంగ్లండ్ మూడో వికెట్ కోల్పోయింది. రవి బిష్ణోయ్ బౌలింగ్‌లో హర్షిత్ రాణాకు క్యాచ్ ఇచ్చి జోస్ బట్లర్ (2) ఔటయ్యాడు. టార్గెట్ 182.. 65 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్182 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇంగ్లండ్ 65 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. తొలుత బెన్ డకెట్‌ను (39) రవి బిష్ణోయ్ ఔట్ చేయగా.. ఆతర్వాత ఫిల్ సాల్ట్‌ను (23) అక్షర్ పటేల్ క్లీన్ బౌల్డ్ చేశాడు. 7.1 ఓవర్ల అనంతరం ఇంగ్లండ్ స్కోర్ 66/2గా ఉంది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ గెలవాలంటే మరో 77 బంతుల్లో 116 పరుగులు చేయాలి. జోస్ బట్లర్, హ్యారీ బ్రూక్ క్రీజ్‌లో ఉన్నారు. హార్దిక్, దూబే విధ్వంసం.. టీమిండియా భారీ స్కోర్ఇంగ్లండ్తో నాలుగో టీ20లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ భారీ స్కోర్ (181/9) చేసింది. 12 పరుగుల వద్ద మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉండిన జట్టును హార్దిక్ పాండ్యా (30 బంతుల్లో 53; 4 ఫోర్లు, 4 సిక్సర్లు), శివమ్ దూబే (34 బంతుల్లో 53; 7 ఫోర్లు, 2 సిక్సర్లు) ఆదుకున్నారు. వీరికి ముందు అభిషేక్ శర్మ (19 బంతుల్లో 29; 4 ఫోర్లు, సిక్స్), రింకూ సింగ్ (26 బంతుల్లో 30; 4 ఫోర్లు, సిక్స్) ఓ మోస్తరు ఇన్నింగ్స్‌లు ఆడారు. 19 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసిన భారత్.. చివరి ఓవర్లో కేవలం 3 పరుగులు మాత్రమే చేసి మూడు వికెట్లు కోల్పోయింది. చివరి ఓవర్‌ను జేమీ ఓవర్టన్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. భారత ఆటగాళ్లలో సంజూ శాంసన్ (1), తిలక్ వర్మ (0), సూర్యకుమార్ యాదవ్ (0) దారుణంగా విఫలమయ్యారు. ఇంగ్లండ్ బౌలర్లలో సాకిబ్ మహమూద్ 3, జేమీ ఓవర్టన్ 2, బ్రైడన్ కార్స్, ఆదిల్ రషీద్ తలో వికెట్ పడగొట్టారు. సుడిగాలి ఇన్నింగ్స్ ఆడి ఔటైన హార్దిక్చాలాకాలం తర్వాత హార్దిక్ పాండ్యా తన స్థాయికి తగ్గట్టుగా బ్యాట్‌ను ఝులిపించాడు. ఈ మ్యాచ్‌లో హార్దిక్ జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు బరిలోకి దిగి మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ఈ మ్యాచ్‌లో 30 బంతులు ఎదుర్కొన్న హార్దిక్ 4 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 53 పరుగులు చేసి ఔటయ్యాడు. 18 ఓవర్ల తర్వాత భారత్ స్కోర్ 166/6గా ఉంది. శివమ్ దూబే (43), అక్షర్ పటేల్ క్రీజ్‌లో ఉన్నారు. ఐదో వికెట్ కోల్పోయిన భారత్79 పరుగుల వద్ద భారత్ ఐదో వికెట్ కోల్పోయింది. బ్రైడన్ కార్స్ బౌలింగ్‌లో ఆదిల్ రషీద్‌కు క్యాచ్ ఇచ్చి రింకూ సింగ్ (30) ఔటయ్యాడు. 11 ఓవర్ల అనంతరం భారత్ స్కోర్ 79/5గా ఉంది. శివమ్ దూబే (13), హార్దిక్ పాండ్యా క్రీజ్‌లో ఉన్నారు. కష్టాల్లో భారత్57 పరుగుల వద్ద భారత్ నాలుగో వికెట్ కోల్పోయింది. ఆదిల్ రషీద్ బౌలింగ్‌లో జేకబ్ బేతెల్‌కు క్యాచ్ ఇచ్చి అభిషేక్ శర్మ (29) ఔటయ్యాడు. 8 ఓవర్ల అనంతరం భారత్ స్కోర్ 65/4గా ఉంది. రింకూ సింగ్ (26), శివమ్ దూబే (7) క్రీజ్‌లో ఉన్నారు. సాకిబ్ మహమూద్ విజృంభణ.. ఒకే ఓవర్లో మూడు వికెట్లు కోల్పోయిన భారత్‌ఇంగ్లండ్ సాకిబ్ మహమూద్ రెచ్చిపోయాడు. ఇన్నింగ్స్ రెండో ఓవర్లో ఏకంగా మూడు వికెట్లు పడగొట్టాడు. తొలి రెండు బంతులకు సంజూ శాంసన్, తిలక్ వర్మ వికెట్లు తీసిన సాకిబ్.. ఓవర్ చివరి బంతికి సూర్యకుమార్ యాదవ్‌ను (0) పెవిలియన్‌కు పంపాడు. శాంసన్, సూర్యకుమార్ తమ వైఫల్యాల పరంపరను కొనసాగించారు. అభిషేక్ శర్మ (11), రింకూ సింగ్ క్రీజ్‌లో ఉన్నారు. 12 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయిన భారత్12 పరుగుల వద్ద టీమిండియా రెండు వికెట్లు కోల్పోయింది. సంజూ శాంసన్ (1) మరోసారి విఫలమయ్యాడు. ఆతర్వాత బంతికే తిలక్ వర్మ కూడా డకౌటయ్యాడు. సాకిబ్ మహమూద్‌కు రెండు వికెట్లు దక్కాయి. జోఫ్రా ఆర్చర్ వేసిన తొలి ఓవర్ చివరి రెండు బంతులకు అభిషేక్ శర్మ వరుసగా సిక్సర్, బౌండరీ బాదాడు. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్పూణే వేదికగా నాలుగో టీ20లో భారత్-ఇంగ్లండ్ జట్లు తలపడతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ కోసం ఇంగ్లండ్ రెండు మార్పులు చేసింది. మార్క్ వుడ్ స్థానంలో సాకిబ్ మహమూద్.. జేమీ స్మిత్ స్థానంలో జేకబ్ బేతెల్ తుది జట్టులోకి వచ్చారు.ఈ మ్యాచ్ కోసం టీమిండియా మూడు మార్పులు చేసింది. షమీ స్థానంలో అర్షదీప్.. దృవ్ జురెల్ స్థానంలో రింకూ సింగ్.. వాషింగ్టన్ సుందర్ స్థానంలో శివమ్ దూబే తుది జట్టులోకి వచ్చారు. కాగా, ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో భారత్ 2-1 ఆధ్యింలో ఉన్న విషయం తెలిసిందే.తుది జట్లుఇంగ్లండ్: ఫిలిప్ సాల్ట్, బెన్ డకెట్, జోస్ బట్లర్(కెప్టెన్), హ్యారీ బ్రూక్, లియామ్ లివింగ్‌స్టోన్, జేకబ్ బేతెల్, జామీ ఓవర్టన్, బ్రైడన్ కార్సే, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, సాకిబ్ మహమూద్భారత్: సంజు శాంసన్(వికెట్ కీపర్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), రింకూ సింగ్, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, అర్షదీప్ సింగ్, రవి బిష్ణోయ్, వరుణ్ చక్రవర్తి -
రాజ్‌కోట్ టీ20లో టీమిండియా ఓటమి..
India vs England 3rd T20I Live Updates And Highlights: భారత్ ఓటమి.. రాజ్‌కోట్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన మూడో టీ20లో 26 పరుగుల తేడాతో భారత్ ఓటమి పాలైంది. 172 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 145 పరుగులకే పరిమితమైంది. ఇంగ్లండ్ బౌలర్లలో జామీ ఓవర్టన్ మూడు వికెట్లు పడగొట్టగా.. బ్రైడన్ కార్స్, జోఫ్రా అర్చర్ తలా రెండు వికెట్లు సాధించారు.వీరిద్దరితో పాటు అదిల్ రషీద్, మార్క్ వుడ్ తలా వికెట్ సాధించారు. భారత బ్యాటర్లలో హార్దిక్ పాండ్యా(40) టాప్ స్కోరర్‌గా నిలవగా.. అభిషేక్ శర్మ(24), తిలక్ వర్మ(18) పర్వాలేదన్పించాడు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. భారత బౌలర్లలో వరుణ్ చక్రవర్తి 5 వికెట్లతో మెరిశాడు. తన 4 ఓవర్ల కోటాలో 24 పరుగులిచ్చి 5 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇంగ్లండ్ బ్యాటర్లలో బెన్ డకెట్(51) టాప్ స్కోరర్‌గా నిలవగా.. లివింగ్ స్టోన్(43), జోస్ బట్లర్(24) పరుగులతో రాణించారు. ఈ విజయంతో ఇంగ్లండ్ సిరీస్ ఆశలను 2-1 సజీవంగా ఉంచుకుంది.ఆరో వికెట్ డౌన్.. అక్షర్ పటేల్ ఔట్అక్షర్ పటేల్ రూపంలో భారత్ ఆరో వికెట్ కోల్పోయింది. 15 పరుగులు చేసిన అక్షర్ పటేల్.. అర్చర్ బౌలింగ్‌లో ఔటయ్యాడు.17 ఓవర్లకు భారత్ స్కోర్:122/517 ఓవర్లు ముగిసే సరికి భారత్ 5 వికెట్ల నష్టానికి 122 పరుగులు చేసింది. భారత్ విజయానికి 18 బంతుల్లో 50 పరుగులు కావాలి. క్రీజులో హార్దిక్ పాండ్యా(33),అక్షర్ పటేల్(15) ఉన్నారు.భారత్ ఐదో వికెట్ డౌన్..వాషింగ్టన్ సుందర్ రూపంలో భారత్ ఐదో వికెట్ కోల్పోయింది. 6 పరుగులు చేసిన సుందర్... జామీ ఓవర్టన్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 12.1 ఓవర్లకు భారత్ స్కోర్: 85/4తిలక్ వర్మ ఔట్..తిలక్ వర్మ రూపంలో భారత్ నాలుగో వికెట్ కోల్పోయింది. 18 పరుగులు చేసిన వర్మ.. అదిల్ రషీద్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయ్యాడు. 10 ఓవర్లకు భారత్ స్కోర్: 78/4సూర్యకుమార్ ఔట్..భారత్ మూడో వికెట్ కోల్పోయింది. 14 పరుగులు చేసిన సూర్యకుమార్ యాదవ్.. మార్క్ వుడ్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. క్రీజులో హార్దిక్ పాండ్యా వచ్చాడు. 6 ఓవర్లకు భారత్ స్కోర్: 51/3అభిషేక్ ఔట్..అభిషేక్ శర్మ రూపంలో భారత్ రెండో వికెట్ కోల్పోయింది. 24 పరుగులు చేసిన అభిషేక్.. బ్రైడన్ కార్స్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. క్రీజులోకి తిలక్ వర్మ వచ్చాడు.తొలి వికెట్ డౌన్..టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది. కేవలం మూడు పరుగులు మాత్రమే చేసిన సంజూ శాంసన్.. అర్చర్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. క్రీజులోకి సూర్యకుమార్ యాదవ్ వచ్చాడు. అభిషేక్ శర్మ(16) దూకుడుగా ఆడుతున్నాడు. 3 ఓవర్లకు ఇంగ్లండ్ స్కోర్: 23/1ఐదేసిన వరుణ్.. భారత్ టార్గెట్ ఎంతంటే?రాజ్‌కోట్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టీ20లో భారత బౌలర్లు రాణించారు. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. భారత బౌలర్లలో వరుణ్ చక్రవర్తి 5 వికెట్లతో మెరిశాడు. తన 4 ఓవర్ల కోటాలో 24 పరుగులిచ్చి 5 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇంగ్లండ్ బ్యాటర్లలో బెన్ డకెట్(51) టాప్ స్కోరర్‌గా నిలవగా.. లివింగ్ స్టోన్(43), జోస్ బట్లర్(24) పరుగులతో రాణించారు.ఐదేసిన వరుణ్.. ఇంగ్లండ్ ఎనిమిదో వికెట్ డౌన్వరుణ్ చక్రవర్తి ఐదు వికెట్లతో చెలరేగాడు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్ 16వ ఓవర్ వేసిన చక్రవర్తి.. నాలుగో బంతికి కార్సే, ఐదో బంతికి అర్చర్న ఔట్ చేశాడు.వరుణ్ మ్యాజిక్.. ఒకే ఓవర్లలో రెండు వికెట్లువరుణ్ చక్రవర్తి మరోసారి తన స్పిన్ మయాజాలాన్ని మరోసారి ప్రదర్శించాడు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్ 14వ ఓవర్ వేసిన చక్రవర్తి.. మూడో బంతికి స్మిత్, నాలుగో బంతికి ఓవర్టన్ వరుస క్రమంలో ఔట్ చేశాడు.ఇంగ్లండ్ నాలుగో వికెట్ డౌన్..హ్యారీ బ్రూక్ రూపంలో ఇంగ్లండ్ నాలుగో వికెట్ కోల్పోయింది. 8 పరుగులు చేసిన బ్రూక్.. రవి బిష్ణోయ్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయ్యాడు. క్రీజులోకి స్మిత్ వచ్చాడు. 13 ఓవర్లకు ఇంగ్లండ్ స్కోర్: 108/4ఇంగ్లండ్ మూడో వికెట్ డౌన్..దూకుడుగా ఆడుతున్న బెన్ డకెట్(51) వికెట్ భారత్ ఎట్టకేలకు సాధించింది. అక్షర్ పటేల్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి డకెట్ తన వికెట్‌ను కోల్పోయాడు. క్రీజులోకి లైమ్ లివింగ్‌స్టోన్ వచ్చాడు.ఇంగ్లండ్ రెండో వికెట్ డౌన్.. బట్లర్ ఔట్జోస్ బట్లర్ రూపంలో ఇంగ్లండ్ రెండో వికెట్ కోల్పోయింది. 24 పరుగులు చేసిన బట్లర్.. వరుణ్ చక్రవర్తి బౌలింగ్‌లో ఔటయ్యాడు. క్రీజులోకి హ్యారీ బ్రూక్ వచ్చాడు. 9 ఓవర్లకు ఇంగ్లండ్ స్కోర్: 83/28 ఓవర్లకు ఇంగ్లండ్ స్కోర్: 74/1ఇంగ్లండ్ ప్లేయర్లు బెన్ డకెట్(42), బట్లర్(23) దూకుడుగా ఆడుతున్నారు. 8 ఓవర్లకు ఇంగ్లండ్ స్కోర్: 74/1దూకుడుగా ఆడుతున్న డకెట్..4 ఓవర్లు ముగిసే సరికి ఇంగ్లండ్ వికెట్ నష్టానికి 34 పరుగులు చేసింది. ఇంగ్లండ్ ఓపెనర్ బెన్ డకెట్(24) దూకుడుగా ఆడుతున్నాడు. అతడితో పాటు జోస్ బట్లర్(5) ఉన్నాడు.తొలి వికెట్ డౌన్..ఫిల్ సాల్ట్ రూపంలో ఇంగ్లండ్ తొలి వికెట్ కోల్పోయింది. 5 పరుగులు చేసిన సాల్ట్.. హార్దిక్ పాండ్యా బౌలింగ్‌లో ఔటయ్యాడు. క్రీజులోకి కెప్టెన్ జోస్ బట్లర్ వచ్చాడు. 3 ఓవర్లకు ఇంగ్లండ్ స్కోర్: 25/1బౌలింగ్ ఎంచుకున్న భారత్..రాజ్‌కోట్ వేదికగా మూడో టీ20లో భారత్-ఇంగ్లండ్ జట్లు తలపడతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌తో టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ షమీ అంతర్జాతీయ క్రికెట్లోకి రీఎంట్రీ ఇచ్చాడు.రాజ్‌కోట్ టీ20లో యువ పేసర్ అర్ష్‌దీప్ సింగ్ స్ధానంలో షమీ తుది జట్టులోకి వచ్చాడు. అర్ష్‌దీప్‌కు జట్టు మెనెజ్‌మెంట్ విశ్రాంతి ఇచ్చింది. మరోవైపు ఇంగ్లండ్ తమ తుది జట్టులో ఎటువంటి మార్పులు చేయలేదు. చెపాక్‌లో ఆడిన జట్టునే ఇంగ్లండ్ కొనసాగించింది.తుది జట్లుఇంగ్లండ్: ఫిలిప్ సాల్ట్, బెన్ డకెట్, జోస్ బట్లర్(కెప్టెన్), హ్యారీ బ్రూక్, లియామ్ లివింగ్‌స్టోన్, జామీ స్మిత్(వికెట్ కీపర్), జామీ ఓవర్టన్, బ్రైడన్ కార్సే, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్భారత్: సంజు శాంసన్(వికెట్ కీపర్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), ధ్రువ్ జురెల్, హార్దిక్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, మహ్మద్ షమీ, రవి బిష్ణోయ్, వరుణ్ చక్రవర్తిచదవండి: ఐసీసీ మెన్స్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్‌గా బుమ్రా -
సంతోషంగా ఉంది.. అతడి వల్లే ఓడిపోయే మ్యాచ్‌లో గెలిచాము: సూర్య
చెపాక్ స్టేడియం వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టీ20లో రెండు వికెట్ల తేడాతో భారత్ విజయాన్ని అందుకుంది. ఆఖరి ఓవర్ వరకు ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో తిలక్ వర్మ(Tilak Varma) తన అద్భుత ఇన్నింగ్స్‌తో టీమిండియాను విజయతీరాలకు చేర్చాడు.తిలక్ 55 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్స్‌లతో 72 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. అతడి విరోచిత పోరాటం ఫలితంగా 166 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా 19.2 ఓవర్లలో చేధించింది. ఈ క్రమంలో తిలక్ వర్మ ఆసాదరణ బ్యాటింగ్‌పై కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్(Suryakumar Yadav) ప్రశంసల వర్షం కురిపించాడు."గేమ్ సాగిన తీరు నాకు కాస్త ఉపశమనం ఇచ్చింది. 160 ప్లస్ టార్గెట్‌ను సులువగానే ఛేదించవచ్చని భావించాం. కానీ ఇంగ్లండ్ పేసర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. ఒక్కసారిగా మ్యాచ్ వారి వైపు మలుపు తిరిగింది. మేము గత రెండు, మూడు సిరీస్‌ల నుంచి ఓ అదనపు బ్యాటర్‌తో ఆడుతున్నాము. అదే బ్యాటర్ మాకు బంతితో రెండు లేదా మూడు ఓవర్లు బౌలింగ్ కూడా వేస్తున్నాడు. అందుకే ఈ మ్యాచ్‌లో వాషింగ్టన్‌ను ఆడించాము. అయితే గత మ్యాచ్‌లో దూకుడుగా ఆడినట్లే ఇక్కడ పరుగులు రాబట్టడం కుదరలేదు. కానీ ఎటువంటి పరిస్థితులలోనైనా ఆ అగ్రిసివ్ బ్రాండ్ ఆఫ్ క్రికెట్‌ను కొనసాగించాలని ముందే నిర్ణయించుకున్నాము.ఈ మ్యాచ్‌లో మా బాయ్స్ చిన్న చిన్న భాగస్వామ్యాలను నెలకొల్పారు. మా విజయంలో ఆ భాగస్వామ్యాలు కీలక పాత్ర పోషించాయి. మ్యాచ్ మధ్యలో కాస్త నేను కంగారు పడ్డాను. ఇవన్నీ ఆటలో భాగమే అని నాకు నేను సర్ది చెప్పుకున్నాను. ఆ సమయంల తిలక్ వర్మ అద్బుతమైన ఇన్నింగ్స్ ఆడాడు.అతడు బ్యాటింగ్ చేసిన తీరు నన్ను ఎంతగానో ఆకట్టుకుంది. అతడు బాధ్యత తీసుకుని జట్టును గెలిపించడం చాలా సంతోషంగా ఉంది. బిష్ణోయ్ కూడా ఈ రెండు మ్యాచ్‌ల్లో వికెట్ లెస్‌గా ఉండవచ్చు గానీ, అతడు నెట్స్‌లో చాలా కష్టపడుతున్నాడు.బ్యాటింగ్ ప్రాక్టీస్ కూడా ఎక్కువగా చేస్తున్నాడు. ఈ రోజు బంతితో రాణించికపోయిన బ్యాట్‌తో రవి తన వంతు సహకారం అందించాడు. అర్షదీప్ కూడా ఆఖరిలో విలువైన పరుగులు చేశాడు. మా కుర్రాళ్లు నాపై ఒత్తిడి తగ్గించారు. దీంతో నేను స్వేఛ్చగా వెళ్లి ఆడేందుకు మార్గం సుగమమైంది. సీనియర్లు, యువకులతో డ్రెస్సింగ్ రూమ్ చాలా ఆహ్లాదకరంగా ఉంది. అందరూ ఒకే మాటపై ఉంటే ఫలితాలు కూడా సానుకూలంగా వస్తాయి’’ అని సూర్యకుమార్ పోస్ట్ మ్యాచ్ కాన్ఫరెన్స్‌లో పేర్కొన్నాడు. -
సూపర్ ఇన్నింగ్స్.. తిలక్‌కు సలాం కొట్టిన సూర్యకుమార్
అంతర్జాతీయ టీ20ల్లో టీమిండియా యువ ఆటగాడు తిలక్ వర్మ(Tilak Varma) తన సూపర్ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. చెన్నైలోని చిదంబరం స్టేడియం వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టీ20లో తిలక్ మ్యాచ్ విన్నింగ్ నాక్ ఆడాడు. తన అద్బుతప్రదర్శనతో భారత్‌కు వరుసగా రెండో విజయాన్ని అందించాడు. సంజూ శాంసన్, అభిషేక్, సూర్య వంటి ప్రధాన ఆటగాళ్లు తేలిపోయిన చోట తిలక్ విరోచిత పోరాటం కనబరిచాడు. లక్ష్య చేధనలో క్రమం తప్పకుండా వికెట్లు పడుతున్నప్పటికి తిలక్ మాత్రం టెయిలాండర్లతో కలిసి తన సూపర్ ఇన్నింగ్స్‌ను కొనసాగించాడు. ఫస్ట్ డౌన్లో బ్యాటింగ్‌కు వచ్చిన తిలక్ వర్మ.. ఆఖరివరకు క్రీజులో నిలబడి మ్యాచ్‌ను ముగించాడు.ఓవరాల్‌గా వర్మ 55 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్స్‌లతో 72 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. అతడి విరోచిత పోరాటం ఫలితంగా 166 పరుగుల లక్ష్యాన్ని భారత్ 8 వికెట్లు కోల్పోయి 19.2 ఓవర్లలో అందుకుంది. తద్వారా చెపాక్ టీ20లో 2 వికెట్ల తేడాతో టీమిండియా విజయాన్ని అందుకుంది. దీంతో ఐదు టీ20ల సిరీస్‌లో భారత జట్టు 2-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.సూర్య పిధా.. కాగా హైదరాబాదీ తిలక్ వర్మ అసాధారణ బ్యాటింగ్‌కు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్(Suryakumar Yadav) పిధా అయ్యాడు. విజయనంతరం గ్రౌండ్లోకి వచ్చిన సూర్య.. తిలక్ వద్దకు వెళ్లి తల వంచి మరి చప్పట్లు కొడుతూ అభినందించాడు. అందుకు తిలక్ కూడా సంతోషించాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. కాగా తిలక్, సూర్యకు మంచి అనుబంధం ఉంది.వర్మ భారత జట్టులోకి రాకముందే ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ తరపున సూర్యతో కలిసి ఆడాడు. ఇక ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసినఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 165 పరుగులు చేసింది. ఇంగ్లండ్ బ్యాటర్లలో జోస్ బట్లర్ (45; 30 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లు) టాప్ స్కోరర్‌గా నిలవగా.. బ్రైడన్ కార్సే (31; 17 బంతుల్లో 1 ఫోర్, 3 సిక్స్‌లు), జేమీ స్మిత్ (22; 12 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్స్‌లు) రాణించారు.భారత బౌలర్లలో వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్ తలా రెండు వికెట్లు సాధించగా.. అర్ష్‌దీప్, వాషింగ్టన్ సుందర్, అభిషేక్ తలా వికెట్ సాధించారు. ఇక ఇరు జట్ల మధ్య మూడో టీ20 మంగళవారం (జనవరి 28) రాజ్‌కోట్‌లో జరగనుంది.చదవండి: IND vs ENG: తిలక్ వర్మ సరికొత్త చరిత్ర.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్‌గా Tilak Verma with Suryakumar yadav after match yesterday at Chapeuk.!!!!- A beautiful Video, Mumbai Indians boy's..!!pic.twitter.com/y3Jcb2ou3G— MANU. (@Manojy9812) January 26, 2025 -
తిలక్ వర్మ విరోచిత పోరాటం.. రెండో టీ20లో భారత్ విజయం
India vs England 2nd T20I Live Updates And Highlights: చెన్నైలోని చిదంబరం స్టేడియం వేదికగా రెండో టీ20లో భారత్-ఇంగ్లండ్ జట్లు తలపడుతున్నాయి.తిలక్ సూపర్ ఇన్నింగ్స్..చెపాక్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టీ20లో 2 వికెట్ల తేడాతో భారత్ విజయం సాధించింది. 166 పరుగుల లక్ష్యాన్ని భారత్ 8 వికెట్లు కోల్పోయి చేధించింది. టీమిండియా విజయంలో హైదరాబాదీ తిలక్ వర్మ కీలక పాత్ర పోషించాడు. లక్ష్య చేధనలో క్రమం తప్పకుండా వికెట్లు పడుతున్నప్పటకి తిలక్ విరోచిత పోరాటం కనబరిచాడు.ఆఖరివరకు క్రీజుల ఉండి భారత్‌కు అద్బుతమైన విజయాన్ని అందించాడు. తిలక్ 55 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్స్‌లతో 72 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. భారత బ్యాటర్లలో తిలక్‌తో పాటు వాషింగ్టన్ సుందర్(26) రాణించాడు. ఇక ఇంగ్లండ్ బౌలర్లలో బ్రైడన్ కార్సే మూడు వికెట్లు పడగొట్టగా.. రషీద్, వుడ్, అర్చర్, ఓవర్టన్ తలా వికెట్ సాధించారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 165 పరుగులు చేసింది. ఇంగ్లండ్ బ్యాటర్లలో జోస్ బట్లర్(45) టాప్ స్కోరర్‌గా నిలవగా.. బ్రైడన్ కార్సే(31), జేమీ స్మిత్(22) రాణించారు. భారత బౌలర్లలో వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్ తలా రెండు వికెట్లు సాధించగా.. అర్ష్‌దీప్, వాషింగ్టన్ సుందర్, అభిషేక్ తలా వికెట్ సాధించారు.18 ఓవర్లకు భారత్ స్కోర్: 153/818 ఓవర్లు ముగిసే సరికి భారత్ 8 వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది. భారత విజయానికి కేవలం 12 బంతుల్లో 13 పరుగులు కావాలి.క్రీజులో తిలక్ వర్మ(63), రవి బిష్ణోయ్(5) ఉన్నారు.ఏడో వికెట్ డౌన్..టీమిండియా ఏడో వికెట్ కోల్పోయింది. 2 పరుగులు చేసిన అక్షర్ పటేల్..లివింగ్ స్టోన్ బౌలింగ్‌లో ఔటయ్యాడు.భారత్ ఆరో వికెట్ డౌన్..వాషింగ్టన్ సుందర్ రూపంలో భారత్ ఆరో వికెట్ కోల్పోయింది. 26 పరుగులు చేసిన సుందర్.. బ్రైడన్ కార్సే బౌలింగ్‌లో ఔటయ్యాడు. 14 ఓవర్లకు భారత్ స్కోర్: 119/6. భారత్ విజయానికి 6 ఓవర్లలో 47 పరుగులు కావాలి. క్రీజులో తిలక్ వర్మ(41), అక్షర్ పటేల్(1) ఉన్నారు.భారత్ ఐదో వికెట్ డౌన్.. పాండ్యా ఔట్టీమిండియా వరుస క్రమంలో వికెట్లు కోల్పోయింది. 8వ ఓవర్లో బ్రైడన్ కార్సే బౌలింగ్‌లో ధ్రువ్ జురెల్(4) ఔట్ కాగా.. 9వ ఓవర్లో ఓవర్టన్ బౌలింగ్‌లో హార్దిక్ పాండ్యా(7) ఔటయ్యాడు. 10 ఓవర్లకు భారత్ స్కోర్: 79/5మూడో వికెట్ డౌన్..58 పరుగులు వద్ద భారత్ మూడో వికెట్ కోల్పోయింది. 12 పరుగులు చేసిన సూర్యకుమార్ యాదవ్.. బ్రైడన్ కార్సే బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయ్యాడు. 7 ఓవర్లకు భారత్ స్కోర్: 63-3, క్రీజులో తిలక్‌వర్మ(27), ధ్రువ్ జురెల్(3)ఉన్నారు.భారత్ రెండో వికెట్ డౌన్..భారత్ రెండో వికెట్ కోల్పోయింది. 5 పరుగులు చేసిన సంజూ శాంసన్.. జోఫ్రా అర్చర్ బౌలింగ్‌లో స్మిత్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. క్రీజులోకి కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ వచ్చాడు. 3 ఓవర్లకు భారత్ స్కోర్: 28/2తొలి వికెట్ డౌన్.. అభిషేక్ ఔట్‌అభిషేక్ శర్మ రూపంలో టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది. 12 పరుగులు చేసిన అభిషేక్.. మార్క్ వుడ్ బౌలింగ్‌లో వికెట్ల ముందు దొరికిపోయాడు. క్రీజులో తిలక్ వర్మ వచ్చాడు.భారత టార్గెట్ ఎంతంటే?చెపాక్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టీ20లో భారత బౌలర్లు రాణించారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 165 పరుగులు చేసింది. ఇంగ్లండ్ బ్యాటర్లలో జోస్ బట్లర్(45) టాప్ స్కోరర్‌గా నిలవగా.. బ్రైడన్ కార్సే(31), జేమీ స్మిత్(22) రాణించారు. భారత బౌలర్లలో వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్ తలా రెండు వికెట్లు సాధించగా.. అర్ష్‌దీప్, వాషింగ్టన్ సుందర్, అభిషేక్ తలా వికెట్ సాధించారు.ఏడో వికెట్ డౌన్..ఇంగ్లండ్ ఏడో వికెట్ కోల్పోయింది. 5 పరుగులు చేసిన జెమ్మీ ఓవర్టన్.. వరుణ్ చక్రవర్తి బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయ్యాడు. 16ఓవర్లకు ఇంగ్లండ్ స్కోర్: 136/7ఇంగ్లండ్ ఆరో వికెట్ డౌన్..104 పరుగుల వద్ద ఇంగ్లండ్ ఆరో వికెట్ కోల్పోయింది. 22 పరుగులు చేసిన జేమీ స్మిత్.. అభిషేక్ శర్మ బౌలింగ్‌లో ఔటయ్యాడు. క్రీజులోకి కార్సే వచ్చాడు.ఐదో వికెట్ డౌన్..ఇంగ్లండ్ ఐదో వికెట్ కోల్పోయింది. 13 పరుగులు చేసిన లివింగ్ స్టోన్..అక్షర్ పటేల్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 12 ఓవర్లకు ఇంగ్లండ్ స్కోర్: 94/5బట్లర్ ఔట్..బట్లర్ రూపంలో ఇంగ్లండ్ నాలుగో వికెట్ కోల్పోయింది. 45 పరుగులు చేసిన బట్లర్.. అక్షర్ పటేల్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. క్రీజులోకి స్మిత్ వచ్చాడు. 9.3 ఓవర్లకు ఇంగ్లండ్ స్కోర్: 77/4ఇంగ్లండ్ మూడో వికెట్ డౌన్.. ఇంగ్లండ్ మూడో వికెట్ కోల్పోయింది. 13 పరుగులు చేసిన బ్రూక్.. వరుణ్ చక్రవర్తి బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయ్యాడు. క్రీజులోకి లివింగ్స్టోన్వచ్చాడు. 7 ఓవర్లకు ఇంగ్లండ్ స్కోర్:61/3ఇంగ్లండ్ రెండో వికెట్ డౌన్.. డకెట్ ఔట్బెన్ డకెట్ రూపంలో ఇంగ్లండ్ రెండో వికెట్ కోల్పోయింది. కేవలం 3 పరుగులు మాత్రమే చేసిన డకెట్.. వాషింగ్టన్ సుందర్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. క్రీజులోకి హ్యారీ బ్రూక్ వచ్చాడు. 4 ఓవర్లకు ఇంగ్లండ్ స్కోర్: 35/2. క్రీజులో జోస్ బట్లర్(26), హ్యారీ బ్రూక్(1) ఉన్నారు.ఇంగ్లండ్ తొలి వికెట్ డౌన్..టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్‌కు ఆదిలోనే బిగ్ షాక్ తగిలింది. స్టార్ ఓపెనర్ ఫిల్ సాల్ట్(4)ను అర్ష్‌దీప్ సింగ్ పెవిలియన్‌కు పంపాడు. క్రీజులోకి కెప్టెన్ జోస్ బట్లర్ వచ్చాడు. మొదటి ఓవరు ముగిసే సరికి ఇంగ్లండ్ స్కోర్: 8/1చెన్నైలోని చిదంబరం స్టేడియం వేదికగా రెండో టీ20లో భారత్-ఇంగ్లండ్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా తొలుత బ్యాటింగ్ చేసుకుంది. చెపాక్ టీ20లో భారత్ రెండు మార్పులతో బరిలోకి దిగింది. స్టార్ ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి గాయం కారణంగా ఈ సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు.అదేవిధంగా రింకూ సింగ్ కూడా ఈ మ్యాచ్‌కు దూరమయ్యాడు. వీరిద్దరి స్ధానంలో ప్లేయింగ్ ఎలెవన్‌లోకి వాషింగ్టన్ సుందర్, ధ్రువ్‌జురెల్ వచ్చారు. అయితే ఈ మ్యాచ్‌లో కూడా స్టార్ పేసర్ మహ్మద్ షమీ ఆడటం లేదు. షమీ అందుబాటుపై కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఎటువంటి అప్డేట్ ఇవ్వలేదు. మరోవైపు ఇంగ్లండ్ రెండు మార్పులతో బరిలోకి దిగింది. గాస్ అట్కినసన్, బెతల్ స్ధానంలో బ్రైడన్ కార్సే, జామీ స్మిత్‌లు వచ్చారు.తుది జట్లు..భారత్: సంజు శాంసన్(వికెట్ కీపర్), అభిషేక్ శర్మ, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్, ధ్రువ్ జురెల్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తిఇంగ్లండ్: బెన్ డకెట్, ఫిలిప్ సాల్ట్(వికెట్ కీపర్), జోస్ బట్లర్(కెప్టెన్), హ్యారీ బ్రూక్, లియామ్ లివింగ్‌స్టోన్, జామీ స్మిత్, జామీ ఓవర్టన్, బ్రైడన్ కార్సే, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్చదవండి: BCCI: టీమిండియాకు భారీ షాక్.. ఇంగ్లండ్ సిరీస్ నుంచి ఇద్దరు స్టార్లు ఔట్ -
మా బాయ్స్ అందరూ అద్బుతం.. గౌతీ భాయ్ చాలా సపోర్ట్‌గా ఉంటాడు: సూర్య
ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను టీమిండియా అద్భుతమైన విజయంతో ఆరంభించింది. కోల్‌కతా వేదికగా జరిగిన తొలి టీ20లో ఇంగ్లండ్‌ను 7 వికెట్ల తేడాతో భారత్ చిత్తు చేసింది. 133 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని టీమిండియా కేవలం 3 వికెట్లు మాత్రమే కోల్పోయి 12.5 ఓవర్లలోనే ఊదిపడేసింది. భారత బ్యాటర్లలో అభిషేక్ శర్మ (34 బంతుల్లో 5 ఫోర్లు,8 సిక్స్‌లతో 79) విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడగా.. సంజూ శాంసన్(20 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 26), తిలక్ వర్మ(16 బంతుల్లో 3 ఫోర్లతో 19 నాటౌట్) రాణించారు.ఇంగ్లండ్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్ రెండు వికెట్లు తీయగా.. స్పిన్నర్ అదిల్ రషీద్ ఒక్క వికెట్ సాధించాడు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో 132 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ జోస్ బట్లర్(44 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్‌లతో 68) టాప్ స్కోరర్‌గా నిలవగా.. మిగితా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు.భారత బౌలర్లలో వరుణ్ చక్రవర్తి మూడు వికెట్లు పడగొట్టగా.. అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, హార్దిక్ పాండ్యా తలా రెండు వికెట్లు తీశారు. ఇక ఈ విజయంపై మ్యాచ్ అనంతరం టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్(suryakumar yadav) స్పందించాడు. తమ ప్రణాళికలను సరిగ్గా అమలు చేసినందుకు సంతోషంగా ఉందని సూర్య చెప్పుకొచ్చాడు."సిరీస్‌ను విజయంతో ఆరంభించినందుకు సంతోషంగా ఉంది. మా విజయంలో టాస్ కూడా కీలక పాత్ర పోషించిందనే చెప్పాలి. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోవడం మాకు సత్పలితాలను ఇచ్చింది. ఆరంభంలోనే అర్ష్‌దీప్ రెండు వికెట్లు పడగొట్టి మాకు ఒక ప్లాట్ ఫామ్ సెట్ చేశాడు.ఈ మ్యాచ్‌లో మా బౌలర్లందరూ తమ ప్రణాళికలను సరిగ్గా అమలు చేశారు. ఆ తర్వాత మా బ్యాటర్లు కూడా అద్బుతంగా ఆడారు. గత సిరీస్‌లో దక్షిణాఫ్రికాపై ఇదే తరహా బ్యాటింగ్ చేశాము. ముఖ్యంగా అభిషేక్ గురుంచి ఎంత చెప్పుకున్న తక్కువే. అతడి సత్తా ఎంటో మాకు ముందే తెలుసు. ఇక కొత్త బంతితో బౌలింగ్ చేయాల్సిన బాధ్యత హార్దిక్ పాండ్యాపై ఉందని మాకు తెలుసు. అందుకే ముందు జాగ్రత్తగా అదనపు స్పిన్నర్‌తో బరిలోకి దిగాము. ముగ్గురు స్పిన్నర్లు కూడా ప్రస్తుతం అద్బుతమైన ఫామ్‌లో ఉన్నాడు. వరుణ్ చక్రవర్తి తన సూపర్ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. అర్ష్‌దీప్ సింగ్ అదనపు బాధ్యతలు తీసుకుని రాణిస్తున్నాడు. మాకు గౌతీ భాయ్(గౌతం గంభీర్) పూర్తి స్వేఛ్చను ఇచ్చాడు. మేము టీ20 వరల్డ్‌కప్-2024 కంటే కొంచెం భిన్నంగా ఆడాలనుకుంటున్నాము. ఫీల్డింగ్‌లో కూడా మేము చాలా మెరుగుపడ్డాము. అందుకోసం సెషన్లలో ఫీల్డింగ్ కోచ్‌తో కలిసి తీవ్రంగా శ్రమిస్తున్నాము. హాఫ్ ఛాన్స్‌లను కూడా క్యాచ్లగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నాము" అని పోస్ట్ మ్యాచ్ కాన్ఫరెన్స్‌లో సూర్య పేర్కొన్నాడు.చదవండి: IND vs ENG: చరిత్ర సృష్టించిన అభిషేక్.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్‌గా -
Ind Vs Eng 1st T20I: తుది జట్లు ఇవే.. షమీకి దక్కని చోటు
భారత్-ఇంగ్లండ్ మధ్య ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు తెరలేచింది. ఈ సిరీస్‌లో భాగంగా ఇరు జట్ల మధ్య తొలి టీ20 కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా మొదట బౌలింగ్ ఎంచుకుంది. అయితే ఈ మ్యాచ్‌కు టీమిండియా స్టార్ ప్లేయర్ మహ్మద్ షమీ దూరమయ్యాడు.ఈ మ్యాచ్‌తో షమీ రీఎంట్రీ ఇస్తాడని అంతా భావించినప్పటికి.. జట్టు మెనెజ్‌మెంట్ తుది జట్టు ఎంపికకు పరిగణలోకి తీసుకోలేదు. అతడు ఇంకా పూర్తి ఫిట్నెస్ సాధించనట్లు తెలుస్తోంది. రెండో టీ20కు షమీ జట్టులోకి వచ్చే ఛాన్స్ ఉంది. ఇక ఈ మ్యాచ్‌లో భారత్ ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగింది. అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, వరుణ్ చక్రవర్తి స్పిన్నర్ల కోటాలో చోటు దక్కించుకున్నారు.అయితే రెగ్యూలర్ ఫాస్ట్ బౌలర్ ఒక్క అర్ష్‌దీప్ సింగ్ ఒక్కడే ఉండడం అందరిని ఆశ్చర్యపరుస్తోంది. పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్లు నితీశ్ రెడ్డి, హార్దిక్ పాండ్యా అర్ష్‌దీప్‌తో పాటు బంతిని పంచుకునే అవకాశముంది. బ్యాటింగ్ లైనప్‌లో మాత్రం శాంసన్, అభిషేక్, రింకూ సింగ్ వంటి విధ్వంసకర ఆటగాళ్లు ఉన్నారు.తుది జట్లుభారత్: సంజూ శాంసన్ (వికెట్ కీపర్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), రింకు సింగ్, హార్దిక్ పాండ్యా, నితీష్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చకరవర్తి, రవి బిష్ణోయ్ఇంగ్లండ్: బెన్ డకెట్, ఫిల్ సాల్ట్ (వికెట్ కీపర్), జోస్ బట్లర్ (కెప్టతెన్), హ్యారీ బ్రూక్ (వైస్ కెప్టెన్), లియామ్ లివింగ్‌స్టోన్, జాకబ్ బెథెల్, జామీ ఓవర్టన్, జోఫ్రా ఆర్చర్, గస్ అట్కిన్సన్, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్ -
నేనేమి బాధ పడడం లేదు.. జట్టు చాలా బాగుంది: సూర్యకుమార్
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025కు ఎంపిక చేసిన భారత జట్టులో విధ్వంసకర ఆటగాడు సూర్యకుమార్ యాదవ్‌కు చోటు దక్కపోయిన సంగతి తెలిసిందే. టీ20ల్లో అద్భుత ప్రదర్శన కనబరుస్తున్న సూర్యకుమార్.. వన్డేల్లో మాత్రం తన మార్క్‌ను చూపించలేకపోయాడు.తనకు వచ్చిన అవకాశాలను సూర్య సద్వినియోగపరుచుకోలేకపోయాడు. దీంతో అతడిని వన్డే ఫార్మాట్‌కు సెలక్టర్లు పక్కన పెట్టారు. టీ20ల్లో భారత జట్టు రెగ్యూలర్ కెప్టెన్‌గా ఉన్నప్పటికి.. వన్డేలకు మాత్రం సూర్యను పరిగణలోకి తీసుకోవడం లేదు. అయితే ఛాంపియన్స్ ట్రోఫీకి సూర్యను ఎంపిక చేయాలని పలువురు మాజీ క్రికెటర్లు సూచించారు. కానీ సెలక్టర్లు మాత్రం అతడిని ఎంపిక చేయలేదు.తాజాగా ఛాంపియన్స్ ట్రోఫీ జట్టులో చోటు దక్కకపోవడంపై సూర్యకుమార్ యాదవ్ స్పందించాడు. ఇంగ్లండ్‌తో తొలి టీ20కు ముందు విలేకరుల సమావేశంలో సూర్యకుమార్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఛాంపియన్స్ ట్రోఫీ జట్టులో చోటు దక్కనందుకు మీరు బాధపడ్డారా? అన్న ప్రశ్న మిస్టర్ 360కు ఎదురైంది."నేనేమి బాధ పడడం లేదు. వన్డే ఫార్మాట్లో బాగా రాణించి ఉంటే ఛాంపియన్స్ ట్రోఫీ జట్టులో ఉండేవాడిని. నేను ఆ పని చేయలేకపోయాను కాబట్టి నాకు అవకాశం దక్కలేదు. మన తప్పిదాన్ని అంగీకరించడం ముఖ్యం. అయితే నాకు వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకోలేకపోయినందుకు బాధగా ఉంది. అదే నేను బాగా ఆడి ఉండే వన్డే జట్టులో కూడా కొనసాగేవాడిని. ఛాంపియన్స్ ట్రోపీకి ఎంపిక చేసిన జట్టు చాలా బాగుంది. జట్టులో ఉన్న వారంతా అద్భుతమైన ఆటగాళ్లు. వన్డే ఫార్మాట్లో భారత్ తరఫున అద్భుత ప్రదర్శన కనబర్చారు. దేశవాళీ క్రికెట్లో కూడా రాణించారు. కాబట్టి వారందరూ జట్టు సెలక్షన్‌కు ఆర్హులే" అని ప్రీ మ్యాచ్ కాన్ఫరెన్స్‌లో సూర్యకుమార్ పేర్కొన్నాడు.ఛాంపియన్స్ ట్రోఫీకి భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభమన్ గిల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్, యశస్వి జైస్వాల్, రిషబ్ పంత్, రవీంద్ర జడేజా.ట్రావెలింగ్ రిజర్వ్స్: వరుణ్ చక్రవర్తి, ఆవేశ్ ఖాన్, నితీశ్ కుమార్ రెడ్డిచదవండి: IND vs ENG: వరల్డ్ రికార్డుపై కన్నేసిన తిలక్ వర్మ.. -
భారత్‌తో తొలి టీ20.. ఇంగ్లండ్ తుది జట్టు ప్రకటన
భారత్-ఇంగ్లండ్ మధ్య ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు సర్వం సిద్దమైంది. బుధవారం(జనవరి 22) ఈడెన్‌గార్డెన్స్ వేదికగా జరగనున్న తొలి టీ20తో ఈ సిరీస్ ప్రారంభం కానుంది. ఇప్పటికే కోల్‌కతాకు చేరుకున్న ఇరు జట్లు నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నాయి.తొలి టీ20లో ఎలాగైనా గెలిచి సిరీస్‌ను విజయంతో ఆరంభించాలని ఇరు జట్లు పట్టుదలతో ఉన్నాయి. ఈ క్రమంలో కోల్‌కతా టీ20కు ఇంగ్లండ్ క్రికెట్ తమ ప్లేయింగ్ ఎలెవన్‌ను ప్రకటించింది. మొదటి టీ20లో ఇంగ్లండ్ నలుగురు ఫాస్ట్ బౌలర్లతో బరిలోకి దిగనుంది. పేస్ బౌలర్లలో కోటాలో మార్క్‌వుడ్, జోఫ్రా ఆర్చర్, జామీ ఓవర్టన్, గుస్ అట్కిన్సన్‌లకు చోటు దక్కింది. శ్రీలంకతో మాంచెస్టర్ టెస్టు సందర్భంగా గాయపడిన మార్క్‌వుడ్ దాదాపు ఆరు నెలల తర్వాత మళ్లీ ఇంగ్లండ్ లైనప్‌లోకి తిరిగి వచ్చాడు. అదిల్ రషీద్ స్పెషలిస్ట్ స్పిన్నర్‌గా చోటు దక్కించుకున్నాడు. ఇక ఇంగ్లండ్ బ్యాటింగ్ లైనప్‌లో ఫిల్ సాల్ట్, బెన్ డకెట్, లివింగ్‌స్టోన్, హ్యారీ బ్రూక్ వంటి విధ్వంసకర ఆటగాళ్లు ఉన్నారు. అదేవిధంగా వికెట్ కీపర్‌గా కెప్టెన్ జోస్ బట్లర్ బదులుగా ఫిల్ సాల్ట్ బాధ్యతలు నిర్వర్తించనున్నాడు. ఈ మ్యాచ్ సాయంత్రం 7:30 గంటలకు ప్రారంభం కానుంది.మరోవైపు భారత్ తొలి టీ20లో ముగ్గురు ఫాస్ట్ బౌలర్లు, ఇద్దరు స్పిన్నర్లతో ఆడే అవకాశముంది. మహ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్ స్పెషలిస్టు ఫాస్ట్ బౌలర్లగా ఉండగా.. పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా వీరిద్దరితో పాటు బంతిని పంచుకోనున్నాడు. స్పిన్నర్లగా వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్‌కు ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు దక్కే ఛాన్స్ ఉంది.ఇంగ్లండ్ తుది జట్టు: బెన్ డకెట్, ఫిల్ సాల్ట్ (వికెట్ కీపర్), జోస్ బట్లర్ (కెప్టతెన్), హ్యారీ బ్రూక్ (వైస్ కెప్టెన్), లియామ్ లివింగ్‌స్టోన్, జాకబ్ బెథెల్, జామీ ఓవర్టన్, జోఫ్రా ఆర్చర్, గస్ అట్కిన్సన్, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్ Firepower with bat and ball 💥 Brendon McCullum has named the first white-ball team of his reign for tomorrow's opening IT20 v India 💪 pic.twitter.com/DSFdaWVPrB— England Cricket (@englandcricket) January 21, 2025 ఇంగ్లండ్‌తో తొలి టీ20కి భారత తుదిజట్టు(అంచనా)సంజూ శాంసన్, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్, నితీశ్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్, మహ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి.బెంచ్: వాషింగ్టన్ సుందర్, ధ్రువ్ జురెల్, హర్షిత్ రాణా, రవి బిష్ణోయి.చదవండి: ‘నా కుమారుడిపై పగబట్టారు.. కావాలనే తొక్కేస్తున్నారు’ -
ఇంగ్లండ్‌తో తొలి టీ20.. చరిత్రకు అడుగు దూరంలో సూర్య
స్వదేశంలో ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో తలపడేందుకు సూర్యకుమార్ యాదవ్(Suryakumar Yadav) సారథ్యంలోని భారత జట్టు సిద్దమైంది. ఈ సిరీస్‌లో భాగంగా ఇరు జట్ల మధ్య తొలి టీ20 బుధవారం(జనవరి 22) ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరగనుంది. ఈ మ్యాచ్ కోసం ఇప్పటికే కోల్‌కతాకు చేరుకున్న ఇంగ్లండ్, భారత జట్లు నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నాయి.ఇక తొలి టీ20కు ముందు టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌ను ఓ అరుదైన రికార్డు ఊరిస్తోంది. ఈ మ్యాచ్‌లో సూర్యకుమార్ సెంచరీ సాధిస్తే.. ఇంగ్లండ్‌పై టీ20ల్లో రెండు శతకాలు నమోదు చేసిన తొలి బ్యాటర్‌గా రికార్డులకెక్కుతాడు. ఇంగ్లండ్‌పై సూర్య ఇప్పటికే ఓ టీ20 సెంచరీని నమోదు చేశాడు.సూర్యతో పాటు భారత వన్డే కెప్టెన్ రోహిత్ శర్మ, పాకిస్తాన్ స్టార్ ప్లేయర్ బాబర్ ఆజం సైతం ఇంగ్లండ్‌పై తలా ఓ టీ20 సెంచరీని బాదాడు. ఇప్పుడు కోల్‌కతా టీ20లో మిస్టర్ 360 సెంచరీతో మెరిస్తే ఈ ఇద్దరి దిగ్గజ క్రికెటర్లను అధిగమిస్తాడు. ఒకవేళ తొలి టీ20లో వీలు కాకపోయినా, సిరీస్ మధ్యలోనైనా ఈ రికార్డు బద్దులు అయ్యే అవకాశముంది.అదేవిధంగా అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక సెంచరీలు చేసిన ఆసీస్ ఆల్‌రౌండర్ గ్లెన్ మాక్స్వెల్, రోహిత్ శర్మ రికార్డును సమం చేస్తాడు. మాక్సీ, రోహిత్ ఇద్దరూ ఇప్పటివరకు 5 టీ20 సెంచరీలు నమోదు చేశారు. సూర్యకుమార్ ఖాతాలో ప్రస్తుతం 4 అంతర్జాతీయ టీ20 సెంచరీలు ఉన్నాయి.కాగా గత కొన్నేళ్ల నుంచి సూర్యకుమార్ యాదవ్ టీ20ల్లో భారత బ్యాటింగ్ యూనిట్‌కు వెన్నెముకగా నిలుస్తున్నాడు. ఇప్పటివరరకు 78 మ్యాచ్‌లు ఆడిన ఈ ముంబైకర్.. 40.8 సగటుతో 2570 పరుగులు చేశాడు.అతడి కెరీర్లో ఇప్పటివరకు 4 టీ20 సెంచరీలు ఉన్నాయి. అయితే గతేడాది ఆఖరిలో సౌతాఫ్రికాతో జరిగిన సిరీస్‌లో మాత్రం సూర్యకుమార్ నిరాశపరిచాడు. 3 మ్యాచ్‌ల సిరీస్‌లో కేవలం 8.67 సగటుతో కేవలం 26 పరుగులు మాత్రమే చేశాడు. ఇప్పుడు ఇంగ్లండ్ సిరీస్‌తో తన రిథమ్‌ను తిరిగి పొందాలని సూర్య భావిస్తున్నాడు.కాగా భారత్‌తో తొలి టీ20 కోసం ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు తమ ప్లేయింగ్ ఎలెవన్‌ను ప్రకటించింది. నలుగురు పేస్ బౌలర్లతో ఇంగ్లండ్ బరిలోకి దిగనుంది. అదేవిధంగా ఈ జట్టులో యువ సంచలనం జాకబ్ బెథెల్‌కు చోటు దక్కింది.ఇంగ్లండ్ తుది జట్టు: బెన్ డకెట్, ఫిల్ సాల్ట్ (వికెట్ కీపర్), జోస్ బట్లర్ (కెప్టతెన్), హ్యారీ బ్రూక్ (వైస్ కెప్టెన్), లియామ్ లివింగ్‌స్టోన్, జాకబ్ బెథెల్, జామీ ఓవర్టన్, జోఫ్రా ఆర్చర్, గస్ అట్కిన్సన్, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్ఇంగ్లండ్తో తొలి టీ20కి భారత తుదిజట్టు(అంచనా)సంజూ శాంసన్, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్, నితీశ్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్, మహ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి.బెంచ్: వాషింగ్టన్ సుందర్, ధ్రువ్ జురెల్, హర్షిత్ రాణా, రవి బిష్ణోయి.చదవండి: ఇంగ్లండ్ వైస్ కెప్టెన్‌గా యువ క్రికెటర్.. ప్రకటించిన ఈసీబీ -
అన్ని ఫార్మాట్లలో ఆడటమే లక్ష్యం
భారత టి20 జట్టు సారథి సూర్యకుమార్ యాదవ్‌ను ఒప్పించి దక్షిణాఫ్రికా గడ్డపై మూడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి వరుస మ్యాచ్‌ల్లో సెంచరీలు కొట్టి భారత టి20 జట్టులో స్థానం సుస్థిరం చేసుకున్న తిలక్ వర్మ... మూడు ఫార్మాట్లలోనూ భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించడమే తన భవిష్యత్ లక్ష్యమని అంటున్నాడు. అంతర్జాతీయ షెడ్యూల్ కారణంగా దేశవాళీల్లో ఎక్కువ మ్యాచ్‌లు ఆడలేకపోయిన తిలక్ వర్మ... అవకాశం వస్తే నిరూపించుకునేందుకు సిద్ధంగా ఉన్నానని వెల్లడించాడు. కేవలం బ్యాటర్‌గానే కాకుండా... బౌలింగ్‌పై కూడా దృష్టి సారించడంతో జట్టులో సమతుల్యం తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు పేర్కొన్నాడు. అహ్మదాబాద్‌లో జరుగుతున్న దేశవాళీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలో హైదరాబాద్ జట్టుకు సారథ్యం వహిస్తున్న తిలక్ వర్మ... కర్ణాటకపై రికార్డు ఛేదన తర్వాత తన భవిష్యత్తు లక్ష్యాలను వివరించాడు. తిలక్ చెప్పిన వివరాలు అతడి మాటల్లోనే... » విజయ్ హజారే టోర్నీలో భాగంగా కర్ణాటకతో మ్యాచ్‌లో 99 పరుగుల మీద బ్యాటింగ్ చేస్తున్న అనే విషయాన్ని పట్టించుకోలేదు. జట్టు ప్రయోజనాల దృష్ట్యా ఆ ఓవర్లో భారీ షాట్లు ఆడాలని అనుకున్నా... అది కాస్త ఫలించలేదు. ఒక ఆటగాడు 45వ ఓవర్ వరకు క్రీజులో నిలిస్తే 380–400 స్కోరు కూడా ఛేదించగలమని జట్టు సమావేశాల్లో ఎన్నోసార్లు చెప్పాను. జట్టును గెలిపించేంత వరకు క్రీజులో ఉండాలనుకున్నా కానీ దురదృష్టవశాత్తు అది సాధ్యపడలేదు. » కీలక సమయంలో రాణించి జట్టుకు అవసరమైన ఇన్నింగ్స్ ఆడటం ఆనందంగా ఉంది. అంతిమంగా జట్టు విజయం సాధించడమే ముఖ్యం. నా ఇన్నింగ్స్‌తో అది సాధ్యమైనందుకు ఆనందం రెండింతలైంది. » దక్షిణాఫ్రికా పర్యటన సమయంలో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌తో చర్చించా. నాలుగో స్థానంలో సూర్యకు మెరుగైన రికార్డు ఉందనే విషయం గుర్తుచేశా. ఆ ప్లేస్‌లో అతడు గతంలో సెంచరీలు సాధించాడు. నాకు మూడో స్థానంలో అవకాశం ఇస్తే నిరూపించుకుంటాను అని చెప్పా. దానికి సూర్యకుమార్ ఒప్పుకోవడంతో బ్యాటింగ్ ఆర్డర్లో ప్రమోషన్ దక్కింది. » వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని బలంగా భావించా. అందుకు తగ్గట్లే దక్షిణాఫ్రికాపై వరుస మ్యాచ్‌ల్లో సెంచరీలు సాధించా. మూడో స్థానంలో బ్యాటింగ్ చేయడం ఎంతో బాగుంటుంది. » అండర్–19 స్థాయికి ముందు వరకు నేను ఓపెనర్‌గానే బరిలోకి దిగే వాడిని. స్వింగ్ అవుతున్న బంతులను ఆడేందుకు ఇష్టపడతా. పరిస్థితులు సవాలు విసురుతున్నప్పుడు నాలోని అత్యుత్తమ ఆట బయటకు వస్తుంది. ముందుగా క్రీజులో అడుగు పెడితే... అదనపు సమయం లభించడంతో పాటు బాధ్యతలు కూడా పెరుగుతాయి. » భారత్ ‘ఎ’తరఫున, దులీప్ ట్రోఫీలో మెరుగైన ప్రదర్శన చేశా. అంతర్జాతీయ మ్యాచ్‌ల కారణంగా రంజీ ట్రోఫీలో నిరూపించుకునేందుకు తగినన్ని అవకాశాలు లభించలేదు. కానీ సుదీర్ఘ ఫార్మాట్ కోసం సిద్ధంగా ఉన్నా. నా వరకు శక్తివంచన లేకుండా ప్రయతి్నస్తున్నా. » మూడు ఫార్మాట్లలో జాతీయ జట్టులో చోటు సుస్థిరం చేసుకోవాలని అనుకుంటున్నా. జట్టుకు వీలైనన్ని ఎక్కువ విజయాలు సాధించి పెట్టడమే నా లక్ష్యం. గతేడాది ఐపీఎల్ నుంచే బౌలింగ్‌పై మరింత దృష్టి సారించా. ఎర్ర బంతితో ఎక్కువ బౌలింగ్ సాధన చేస్తున్నా. దాని వల్ల టి20, వన్డే క్రికెట్లో ఆఫ్ స్పిన్నర్‌గా మరింత ప్రభావం చూపగలనని నమ్ముతున్నా. » జట్టును సమతుల్యంగా ఉంచేందుకు నా వంతు కృషి చేస్తా. అందుకోసం బౌలింగ్‌పై ఎక్కువ దృష్టి పెడుతున్నా. బౌలింగ్ చేయగల బ్యాటర్ ఉంటే మేనేజ్మెంట్కు ఎంతో సౌలభ్యంగా ఉంటుంది. రానున్న మ్యాచ్‌ల్లో మరిన్ని ఓవర్లు బౌలింగ్ చేసే అవకాశం లభిస్తుంది అనుకుంటున్నా. పరిస్థితులకు తగ్గట్లు ఆటతీరును మార్చుకోవడం ముఖ్యం. అందుకు నేను సిద్ధం. -
సూర్యకుమార్ యాదవ్ సిక్సర్ల రికార్డును బద్దలు కొట్టిన అభిషేక్ శర్మ
టీమిండియా యంగ్ ఓపెనర్ అభిషేక్ శర్మ భారత టీ20 జట్టు సారధి సూర్యకుమార్ యాదవ్ పేరిట ఉన్న ఓ రికార్డును బద్దలు కొట్టాడు. అభిషేక్ ఓ క్యాలెండర్ ఇయర్లో అత్యధిక సిక్సర్లు (టీ20ల్లో) బాదిన బ్యాటర్‌గా సరికొత్త రికార్డు నెలకొల్పాడు. గతంలో ఈ రికార్డు సూర్యకుమార్ యాదవ్ పేరిట ఉండేది. స్కై 2022లో 41 ఇన్నింగ్స్‌ల్లో 85 సిక్సర్లు (టీ20ల్లో) బాదగా.. అభిషేక్ ఈ ఏడాది కేవలం 38 ఇన్నింగ్స్‌ల్లోనే 87 సిక్సర్లు కొట్టాడు. టీ20ల్లో ఓ క్యాలెండర్ ఇయర్లో అత్యధిక సిక్సర్లు బాదిన భారత ఆటగాళ్ల జాబితాలో అభిషేక్ అగ్రస్థానంలో ఉండగా.. స్కై వరుసగా రెండు, మూడు స్థానాల్లో (2023లో 71 సిక్సర్లు) ఉన్నాడు.క్యాలెండర్ ఇయర్లో అత్యధిక టీ20 సిక్సర్లు బాదిన భారత ఆటగాళ్లుఅభిషేక్ శర్మ (38 ఇన్నింగ్స్‌ల్లో 87 సిక్సర్లు, 2024)సూర్యకుమార్ యాదవ్ (41 ఇన్నింగ్స్‌ల్లో 85 సిక్సర్లు, 2022)సూర్యకుమార్ యాదవ్ (33 ఇన్నింగ్స్‌ల్లో 71 సిక్సర్లు, 2023)రిషబ్ పంత్ (31 ఇన్నింగ్స్‌ల్లో 66 సిక్సర్లు, 2018)శ్రేయస్ అయ్యర్ (42 ఇన్నింగ్స్‌ల్లో 63 సిక్సర్లు, 2019)సంజూ శాంసన్ (32 ఇన్నింగ్స్‌ల్లో 60 సిక్సర్లు, 2024)సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో భాగంగా మేఘాలయతో జరిగిన మ్యాచ్‌లో అభిషేక్ సూర్యకుమార్ రికార్డును బద్దలు కొట్టాడు. ఈ మ్యాచ్‌లో అభిషేక్ 11 సిక్సర్లు బాదాడు. ఈ మ్యాచ్‌లో అభిషేక్ కేవలం 28 బంతుల్లోనే సెంచరీ చేశాడు. తద్వారా టీ20ల్లో భారత్ తరఫున వేగవంతమైన సెంచరీ చేసిన ఆటగాడిగా ఉర్విల్ పటేల్ (గుజరాత్) రికార్డును సమం చేశాడు. ఉర్విల్ కూడా ఇదే సీజన్ సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో ఫాసెస్ట్ సెంచరీ నమోదు చేశాడు. మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన మేఘాలయ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 142 పరుగులు చేసింది. మేఘాలయ ఇన్నింగ్స్‌లో అర్పిత్ భటేవారా (31) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అనంతరం నామమాత్రపు లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన పంజాబ్.. అభిషేక్ సుడిగాలి శతకంతో విరుచుకుపడటంతో 9.3 ఓవరల్లోనే విజయతీరాలకు చేరింది. -
సూర్యకుమార్ యాదవ్ విధ్వంసం.. శివమ్ దూబే ఊచకోత
సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో టీమిండియా ఆటగాళ్లు, ముంబై ప్లేయర్లు శివమ్ దూబే, సూర్యకుమార్ యాదవ్ రెచ్చిపోయారు. సర్వీసెస్‌తో ఇవాళ (డిసెంబర్ 5) జరిగిన మ్యాచ్‌లో స్కై విధ్వంసం సృష్టిస్తే.. శివమ్ దూబే ప్రత్యర్ధి బౌలర్లను ఊచకోత కోశాడు. స్కై 46 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 70 పరుగులు చేయగా.. దూబే 36 బంతుల్లో 2 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో అజేయమైన 71 పరుగులు చేశాడు. The Surya-Dube show for Mumbai. 🤯pic.twitter.com/wNgwqLA7Cd— Mufaddal Vohra (@mufaddal_vohra) December 3, 2024దూబే సిక్సర్ల వర్షానికి హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియం తడిసి ముద్దైంది. గాయం కారణంగా గత మూడు నెలలుగా కాంపిటేటివ్ క్రికెట్‌కు దూరంగా ఉన్న దూబే ఈ మ్యాచ్‌తోనే రీఎంట్రీ ఇచ్చాడు. రీఎంట్రీలోనే దూబే అదరగొట్టాడు. ఈ మ్యాచ్‌లో దూబే బంతితోనూ రాణించాడు. 3 ఓవర్లు వేసి 21 పరుగులిచ్చి ఓ వికెట్ తీశాడు.మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై సూర్యకుమార్ యాదవ్ (70), శివమ్ దూబే (71) చెలరేగడంతో నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. ఓపెనర్ పృథ్వీ షా తన పేలవ ఫామ్‌ను కొనసాగిస్తూ డకౌట్ కాగా.. మరో ఓపెనర్ అజింక్య రహానే 18 బంతుల్లో 3 బౌండరీల సాయంతో 22 పరుగులు చేశాడు. అనంతరం వన్‌డౌన్‌లో వచ్చిన కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 14 బంతుల్లో 4 ఫోర్ల సాయంతో 20 పరుగులు చేశాడు. సర్వీసెస్ బౌలర్లలో పూనియా, విశాల్ గౌర్, వికాస్ యాదవ్, శుక్లా తలో వికెట్ పడగొట్టారు.అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన సర్వీసెస్ 19.3 ఓవర్లలో 153 పరుగులకే ఆలౌటై, 39 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. శార్దూల్ ఠాకూర్ 4 వికెట్లు తీసి సర్వీసెస్ పతనాన్ని శాశించాడు. షమ్స్ ములానీ 3, మోహిత్ అవస్తి, శివమ్ దూబే తలో వికెట్ పడగొట్టారు. సర్వీసెస్ ఇన్నింగ్స్‌లో మోహిత్ అహ్లావత్ (54) ఒక్కడే అర్ద సెంచరీతో రాణించాడు. సర్వీసెస్ ఇన్నింగ్స్‌లో ముగ్గురు డకౌట్ అయ్యారు. ఈ గెలుపుతో ముంబై గ్రూప్-ఈ పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి ఎగబాకింది. -
శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో ఆడనున్న సూర్యకుమార్..!
ముంబై జట్టు కెప్టెన్‌గా తిరిగి బాధ్యతలు చేపట్టేందుకు టీమిండియా మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ సిద్దమయ్యాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ-2024లో అయ్యర్‌ను తమ జట్టు కెప్టెన్‌గా నియమించాలని ముంబై క్రికెట్ అసోసియేషన్ సీనియర్ సెలక్షన్ కమిటీ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.అయితే ప్రస్తుత రంజీ ట్రోఫీ సీజన్లో ముంబైకి కెప్టెన్‌గా ఉన్న అజింక్య రహానేనే సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో కూడా సారథిగా వ్యహరిస్తాడని తొలుత వార్తలు వినిపించాయి. కానీ ఎంసీఎ మాత్రం అయ్యర్ వైపు మొగ్గుచూపుతున్నట్లు సమాచారం.ఈ దేశీవాళీ టోర్నీలో శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో రహానే ఆడనున్నట్లు ఇండియన్ ఎక్స్‌ప్రెస్ తమ కథనంలో పేర్కొంది.ఇక టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కూడా సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ఆడనున్నట్లు వినికిడి. అయ్యర్ కెప్టెన్సీలో అతడు ముంబై తరపున బరిలోకి దిగనున్నట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. అయితే వ్యక్తిగత కారణాల వల్ల ఆరంభ మ్యాచ్‌లకు సూర్య దూరం కానున్నట్లు తెలుస్తోంది.కాగా ఇటీవలే సూర్య కెప్టెన్సీలోని భారత జట్టు దక్షిణాఫ్రికాపై టీ20 సిరీస్‌ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. మరోవైపు ముంబై స్టార్ ప్లేయర్లు శివమ్ దూబే, ముషీర్ ఖాన్ గాయాల కారణంగా దూరమయ్యారు. ఇక ఈ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ నవంబర్ 22 నుంచి ప్రారంభం కానుంది. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీకి ముంబై ప్రాబుబుల్స్పృథ్వీ షా, ఆయుష్ మ్హత్రే, అంగ్క్రిష్ రఘువంశీ, జే బిస్తా, శ్రీరాజ్ ఘరత్, అజింక్య రహానే, శ్రేయాస్ అయ్యర్, సూర్యాంశ్ షెడ్గే, ఇషాన్ ముల్చందానీ, సిద్దేష్ లాడ్, హార్దిక్ తమోర్ (వికెట్‌కీపర్), ఆకాష్ ఆనంద్ (వికెట్ కీపర్), షా ముపార్కర్, సాయి పార్క్రాజ్, సాయి పార్క్, , హిమాన్షు సింగ్, సాగర్ ఛబ్రియా, శార్దూల్ ఠాకూర్, మోహిత్ అవస్తి, సిల్వెస్టర్ డిసౌజా, రాయిస్టన్ డయాస్, యోగేష్ పాటిల్, హర్ష్ తన్నా, ఇర్ఫాన్ ఉమైర్, వినాయక్ భోయిర్, కృతిక్ హనగవాడి, శశాంక్ అత్తార్డే, జునేద్ ఖాన్ -
'పుష్ప 3'లో నటించాలనుకుంటున్నావా? తిలక్-సూర్య డిస్కషన్
ప్రస్తుతం దేశవ్యాప్తంగా 'పుష్ప' ఫీవర్ నడుస్తోంది. ఆదివారం జరిగే ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం బిహార్‌లో ఎంత రచ్చ జరుగుతుందో ఇప్పటికే సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ అవుతున్నాయి. సగటు సినీ ప్రేక్షకుడు ఈ మూవీ కోసం వెయిటింగ్. ఇప్పుడు ఈ సినిమా క్రేజ్ టీమిండియా జట్టు వరకు చేరింది. లేటెస్ట్ సెన్సేషన్ హైదరాబాదీ కుర్రాడు తిలక్ వర్మ, కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ ఇంట్రెస్టింగ్ డిస్కషన్ పెట్టుకున్నారు. ఆ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20 సిరీస్‌ని టీమిండియా 3-1 తేడాతో కైవసం చేసుకుంది. ఈ సిరీస్‌లో రెండు సెంచరీలు చేసిన తిలక్ వర్మ హీరో అయిపోయాడు. దీంతో ఇతడిని కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ ఇంటర్వ్యూ చేశాడు. నిన్ను ఓ ప్రశ్న అడుగుతాను, నీ హెయిర్ స్టైల్ సీక్రెట్ ఏంటి? ఈ హెయిర్‌ను చూసి అందరు అల్లు అర్జున్.. అల్లు అర్జున్ అని అంటున్నారు.. ఏంటి అక్కడ తెలుగు సూపర్ స్టార్.. ఇక్కడ నీవు అని సూర్య అడిగాడు.(ఇదీ చదవండి: ఇంత దిగజారుతావ్ అనుకోలేదు.. హీరో ధనుష్‌తో నయనతార గొడవ)దీనికి సమాధానమిచ్చిన తిలక్ వర్మ.. ఏం లేదు, ఈ హెయిర్ స్టైల్‌ని ఇప్పుడే మొదలుపెట్టా. అప్పటి నుంచి అల్లు అర్జున్, అల్లు అర్జున్ అని పిలుస్తున్నారు. చాలామంది ఆయనలానే కనిపిస్తున్నావ్ అని అంటున్నారు. నాకు లాంగ్ హెయిర్ బాగా అనిపించింది. హెల్మెట్ పెట్టుకున్నప్పుడు మస్త్ అనిపిస్తుంది. అందుకే ఇలా పెంచాను అని చెప్పాడు.ఏంటి మరి 'పుష్ప 3'లో నటించాలనుకుంటున్నావా? అని సూర్య అడగ్గా.. అలాంటిది ఏం లేదు, నా పని బాల్, బ్యాట్‌తో ఆడటం మాత్రమే. గ్రౌండ్లో ఆడాలి.. బయటకెళ్లి ఎంజాయ్ చేయాలి. మిగతాది ఆ దేవుడు చూసుకుంటాడు అని తిలక్ వర్మ చెప్పుకొచ్చాడు. ఈ వీడియో చూసి అటు క్రికెట్ ఫ్యాన్స్, ఇటు అల్లు అర్జున్ అభిమానులు ఫుల్ ఖుషీ అయిపోతున్నారు.(ఇదీ చదవండి: 'పుష్ప' కోసం శ్రీలీల రెమ్యునరేషన్.. ఒక్క పాట కోసం అన్ని కోట్లా..!)Nicee @alluarjun @TilakV9 🧡 pic.twitter.com/q708J77eiY— Yash 🪓🐉 (@YashR066) November 16, 2024 -
టీమిండియా సరికొత్త చరిత్ర.. దెబ్బకు ఆసీస్ వరల్డ్ రికార్డు బ్రేక్
దక్షిణాఫ్రికా పర్యటనను టీమిండియా అద్బుత విజయంతో ముగించింది. జోహన్నెస్‌బర్గ్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన నాలుగో టీ20లో 135 పరుగులతో భారత్ గెలుపొందింది. తద్వారా నాలుగు మ్యాచ్‌ల సిరీస్ 3-1తో సూర్య సేన సొంతం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో భారత బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగారు.సిక్సర్లు, ఫోర్ల వర్షంతో వాండరర్స్ మైదానం తడిసి ముద్దైంది. తిలక్ వర్మ, సంజూ శాంసన్ అద్బుత సెంచరీలతో చెలరేగారు. వీరిద్దరూ ప్రత్యర్ధి బౌలర్లను ఊచకోత కోశారు. తిలక్ వర్మ 47 బంతుల్లో 9 ఫోర్లు, 10 సిక్స్‌లతో 120, సంజూ శాంసన్ 56 బంతుల్లో 6 ఫోర్లు, 9 సిక్స్‌లతో 109 పరుగులు చేసి ఆజేయంగా నిలిచారు. అదేవిధంగా ఈ యువ జోడీ రెండో వికెట్‌కు 210 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని జోడించారు.దీంతో భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో వికెట్ నష్టానికి 283 పరుగులు చేసింది. అనంతరం 284 పరుగుల భారీ లక్ష్యాన్ని చేధించలేక ప్రోటీస్ జట్టు కేవలం 148 పరుగులకే కుప్పకూలింది. ఈ మ్యాచ్‌లో ఘన విజయం సాధించిన టీమిండియా పలు అరుదైన రికార్డులను తమ ఖాతాలో వేసుకుంది.ఆసీస్ రికార్డు బద్దలు..👉సౌతాఫ్రికాపై టీ20ల్లో అత్యధిక విజయాలు సాధించిన జట్టుగా టీమిండియా వరల్డ్ రికార్డు నెలకొల్పింది. దక్షిణాఫ్రికాపై భారత్ ఇప్పటివరకు 31 టీ20లు ఆడి 18 విజయాలు సాధించింది. ఇంతకుముందు ఈ రికార్డు ఆస్ట్రేలియా పేరిట ఉండేది. ఆస్ట్రేలియా సౌతాఫ్రికాపై 25 మ్యాచ్‌ల్లో 17 విజయాలు నమోదు చేసింది.తాజా మ్యాచ్‌తో ఆసీస్ అల్‌టైమ్ రికార్డును భారత్ బ్రేక్ చేసింది. టీ20ల్లో సౌతాఫ్రికాపై అత్యధిక విజయాలు సాధించిన జట్ల జాబితాలో భారత్, ఆస్ట్రేలియా తర్వాత వెస్టిండీస్ (14), ఇంగ్లండ్ (12), పాకిస్తాన్ (12), శ్రీలంక (5), న్యూజిలాండ్ (4), ఐర్లాండ్ (1), నెదర్లాండ్స్ (1) జట్లు ఉన్నాయి.👉టీ20ల్లో భారత్‌కు ఇది రెండో అత్యధిక స్కోరు(284). గత నెలలో హైదరాబాద్‌లో బంగ్లాదేశ్‌పై భారత్ 297 పరుగులు చేసింది. 👉అంతర్జాతీయ టీ20ల్లో ఏ వికెట్‌కైనా అత్యధిక భాగస్వామ్యం(210) జోడించిన జోడీగా తిలక్-శాంసన్ నిలిచారు. దీంతో రోహిత్, రింకూ (190; అఫ్గానిస్తాన్‌పై 2024లో) రికార్డు కనుమరుగైంది.చదవండి: IND vs SA: చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్.. ప్రపంచంలో ఒకే ఒక్కడు -
అందులో సీక్రెట్ ఏమీ లేదు.. వారిద్దరూ మాత్రం అద్బుతం: సూర్య
జోహన్నెస్‌బర్గ్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన నాలుగో టీ20లో 135 పరుగులతో టీమిండియా భారీ విజయాన్ని అందుకుంది. తద్వారా నాలుగు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 3-1 తేడాతో భారత్ సొంతం చేసుకుంది. ఆఖరి టీ20లో భారత బ్యాటర్లు విధ్వంసం సృష్టించారు.తిలక్ వర్మ (47 బంతుల్లో 120 నాటౌట్; 9 ఫోర్లు, 10 సిక్స్‌లు), సంజూ శాంసన్ (56 బంతుల్లో 109 నాటౌట్; 6 ఫోర్లు, 9 సిక్స్‌లు) మెరుపు సెంచరీలతో చెలరేగారు. ఫలితంగా టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో వికెట్ నష్టానికి 283 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య చేధనలో దక్షిణాఫ్రికా 18.2 ఓవర్లలో 148 పరుగులకే ఆలౌటైంది.భారత బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్ మూడు వికెట్లతో సత్తాచాటగా.. వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్ తలా రెండు వికెట్లు సాధించారు. ఇక ఈ విజయంపై మ్యాచ్ అనంతరం భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ స్పందించాడు. ఈ విజయం తనకెంతో ప్రత్యేకమని సూర్య చెప్పుకొచ్చాడు.వారిద్దరూ అద్బుతం: సూర్య"పరిస్థితులకు అనుగుణంగా మారి ఆడటంలో ఎటువంటి రహస్యం లేదు. మేము డర్బన్‌లో అడుగుపెట్టిన వెంటనే మా ప్రణాళికలను సిద్దం చేసుకున్నాము. మేము గతంలో దక్షిణాఫ్రికాకు వచ్చినప్పుడు ఎలా ఆడామో ఈ సారి కూడా అదే బ్రాండ్ ఆఫ్ క్రికెట్‌ను కొనసాగించాలని నిర్ణయించుకున్నాము.ఫలితాలు గురించి మేము ఎప్పుడూ ఆలోచించలేదు. తిలక్ వర్మ, సంజూ శాంసన్ ఇద్దరూ అద్భుతమైన ఇన్నింగ్స్‌లు ఆడారు. ఇద్దరిలో ఎవరిది గొప్ప నాక్ అని ఎంచుకోవడం నాకు చాలా కష్టంగా ఉంది. వారిద్దరితో పాటు అభిషేక్ కూడా తన బ్యాటింగ్ స్కిల్స్‌ను ప్రదర్శించాడు.ఉష్ణోగ్రత తగ్గిన అనంతరం బౌలింగ్‌కు అనుకూలిస్తుందని భావించాం. చక్కని లైన్ అండ్ లెంగ్త్‌తో బౌలింగ్ చేస్తే ప్రత్యర్ధి బ్యాటర్లను కట్టడి చేయవచ్చని మా బౌలర్లకు చెప్పారు. అందుకు తగ్గట్టే వారు అద్భుతంగా బౌలింగ్ చేశారు. మేము ఇక్కడే మా తదుపరి టీ20 వరల్డ్‌కప్‌ను ఆడనున్నాము.దక్షిణాఫ్రికా వంటి పరిస్థితుల్లో విజయాలు సాధించడం అంత ఈజీ కాదు. కాబట్టి ఇది ఎంతో ప్రత్యేకమైన విజయం. కోచింగ్ స్టాప్ కూడా మాకు ఎంతో సపోర్ట్‌గా ఉన్నారు. ఈ సిరీస్ మొదటి రోజే మాకు ఓ క్లారిటీ ఇచ్చేశారు. మీకు నచ్చిన విధంగా ఆడడండి, మేము కూర్చోని మీ ప్రదర్శనను ఎంజాయ్ చేస్తాము అని మాతో చెప్పారు" అని పోస్ట్ మ్యాచ్ ప్రేజేంటేషన్‌లో సూర్య పేర్కొన్నాడు.చదవండి: #Rohit Sharma: రెండోసారి తండ్రైన రోహిత్ శర్మ.. మగబిడ్డకు జన్మనిచ్చిన రితికా -
అతడి కోసం నా ప్లేస్‌ను త్యాగం చేశా.. చెప్పి మరీ సెంచరీ బాదాడు: సూర్య
దక్షిణాఫ్రికాతో రెండో టీ20లో ఓటమి చవిచూసిన టీమిండియా తిరిగి పుంజుకుంది. బుధవారం సెంచూరియన్ వేదికగా సఫారీలతో జరిగిన మూడో టీ20లో 11 పరుగుల తేడాతో భారత్ ఘన విజయాన్ని అందుకుంది.దీంతో నాలుగు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో 2-1 ఆధిక్యంలోకి భారత జట్టు దూసుకెళ్లింది. ఈ మ్యాచ్‌లో ఆల్‌రౌండ్ ప్రదర్శనతో టీమిండియా అదరగొట్టింది. తొలుత బ్యాటింగ్ చేసిన మెన్ ఇన్ బ్లూ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 219 పరుగుల భారీ స్కోర్ సాధించింది. భారత బ్యాటర్లలో తిలక్ వర్మ(107 నాటౌట్) ఆజేయ సెంచరీతో చెలరేగగా.. అభిషేక్(50) హాఫ్ సెంచరీతో మెరిశాడు.అనంతరం లక్ష్య చేధనలో ఆతిథ్య సౌతాఫ్రికా నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 208 పరుగులు చేయగల్గింది. అర్ష్‌దీప్ సింగ్ మూడు వికెట్లతో సత్తాచాటగా.. వరుణ్ చక్రవర్తి రెండు వికెట్లు సాధించాడు. ఇక ఈ విజయంపై మ్యాచ్ అనంతరం టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ స్పందించాడు."మళ్లీ విజయాన్ని అందుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఈ మ్యాచ్ కంటే ముందు టీమ్ మీటింగ్‌లో మేము చాలా విషయాలు చర్చించుకున్నాము. మా బ్రాండ్ క్రికెట్‌ను కొనసాగించాలనుకున్నాము. సెంచూరియన్‌లో అదే చేసి చూపించాము.జట్టులో ప్రతీ ఒక్కరికి వారి రోల్‌పై ఓ క్లారిటీ ఉంది. మా కుర్రాళ్లకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చాము. నెట్స్‌లో కూడా తీవ్రంగా శ్రమిస్తున్నారు. వారు దూకుడుగా ఆడి నా పనిని సులువు చేస్తున్నారు. అన్నీ సానుకూలంగా జరుగుతుండటం చాలా అనందంగా ఉంది. మైదానంలోనూ ఆరేడు నిమిషాలు ముందే ఉన్నాం.మేము సరైన దిశలో వెళ్తున్నామని భావిస్తున్నాను. ఇక తిలక్ వర్మ అద్బుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. రెండో టీ20 అనంతరం తిలక్ నా గదికి వచ్చి మూడో స్ధానంలో బ్యాటింగ్ చేసే అవకాశమివ్వండి అని అడిగాడు.అందుకు నేను సరే అని పూర్తి స్వేచ్ఛగా ఆడమని చెప్పాను. తను చెప్పినట్లే తిలక్ అదరగొట్టాడు. తొలి సెంచరీ సాధించడంతో అతడి కుటంబ సభ్యులు ఆనందపడి ఉంటారు" అని పోస్ట్ మ్యాచ్ ప్రజెంటేషన్‌లో సూర్య పేర్కొన్నాడు.చదవండి: ఆ నలుగురు మావాడి కెరీర్‌ను నాశనం చేశారు: శాంసన్ తండ్రి -
సూర్యకుమార్ యాదవ్‌ను నిలదీసిన పాక్ అభిమాని
వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరుగనున్న ఛాంపియన్స్ ట్రోఫీకి పాకిస్తాన్ ఆతిథ్యమివ్వనున్న విషయం తెలిసిందే. అయితే భద్రతా కారణాల రిత్యా టీమిండియా పాక్‌లో పర్యటించేది లేదని స్పష్టం చేసింది. హైబ్రిడ్ పద్దతిలో (తటస్థ వేదిక) టోర్నీని నిర్వహిస్తే పాల్గొంటామని భారత్ తెలిపింది. ఈ ప్రతిపాదనకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఒప్పుకోవడం లేదు. అవసరమైతే టోర్నీ నుంచి తప్పుకుంటాం కానీ.. హైబ్రిడ్ పద్దతిలో మాత్రం టోర్నీని నిర్వహించేది లేదని తేల్చి చెప్పింది. మరోవైపు పీసీబీ హైబ్రిడ్ పద్దతిలో టోర్నీని నిర్వహించేందుకు అంగీకరించకపోతే వేదికను సౌతాఫ్రికాకు మారుస్తామని ఐసీసీ వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తుంది. View this post on Instagram A post shared by Aayat Raza Qureshi (@aayatqureshi.14)ఇదిలా ఉంటే, సూర్యకుమార్ నేతృత్వంలోని భారత జట్టు ప్రస్తుతం సౌతాఫ్రికాలో పర్యటిస్తుంది. ఈ పర్యటనలో రెండో టీ20 ముగిసిన అనంతరం ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. ఈ మ్యాచ్‌కు హాజరైన ఓ పాక్ అభిమాని టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌తో కలిసి ఫోటో దిగాడు. అనంతరం సదరు అభిమాని మీరు పాక్‌కు ఎందుకు రావడం లేదని స్కైని ప్రశ్నించాడు. ఇందుకు స్కై బదులిస్తూ.. మా చేతుల్లో ఏముంది అంటూ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతుంది. కాగా, పాక్ మొండిపట్టు వీడకపోవడంతో ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణ సందిగ్దంలో పడింది. ఒకవేళ పాక్ హైబ్రిడ్ మోడల్‌కు ఒప్పుకోక పోతే టోర్నీ రద్దైనా ఆశ్చర్యపోనక్కర్లేదు.ఇదిలా ఉంటే, భారత సీనియర్ జట్టు బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ కోసం ఆస్ట్రేలియాతో పర్యటిస్తుంది. ఈ పర్యటనలోని తొలి మ్యాచ్ పెర్త్ వేదికగా నవంబర్ 22న ప్రారంభమవుతుంది. మరోవైపు భారత టీ20 జట్టు సౌతాఫ్రికాలో పర్యటిస్తుంది. ఈ పర్యటనలో భారత్ ఇదివరకే రెండు మ్యాచ్‌లు ఆడేసింది. ఇందులో ఇరు జట్లు చెరో మ్యాచ్ గెలిచాయి. ఈ సిరీస్‌లో మరో రెండు మ్యాచ్‌లు జరగాల్సి ఉంది. -
సూర్యకుమార్ యాదవ్ రికార్డును సమం చేసిన హసరంగ
శ్రీలంక స్టార్ స్పిన్నర్ వనిందు హసరంగ ఓ అరుదైన ఘనత సాధించాడు. టీ20ల్లో అత్యధిక ప్లేయర్ల ఆఫ్ ద సిరీస్ అవార్డులు దక్కించుకున్న ఆటగాళ్ల జాబితాలో సూర్యకుమార్ యాదవ్, బాబర్ ఆజమ్, డేవిడ్ వార్నర్, షకీబ్ అల్ హసన్‌లతో కలిసి రెండో స్థానంలో నిలిచాడు. ప్రస్తుతం హసరంగ ఖాతాలో ఐదు ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డులు ఉన్నాయి. అలాగే సూర్యకుమార్ యాదవ్, బాబర్ ఆజమ్, డేవిడ్ వార్నర్, షకీబ్ అల్ హసన్ పేరిట కూడా ఐదు ఐదు ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డులు ఉన్నాయి. హసరంగ 23 టీ20 సిరీస్‌ల్లో ఐదు ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డులు గెలుచుకుంటే.. స్కై 22 సిరీస్‌ల్లో, బాబర్ ఆజమ్ 35, వార్నర్ 42, షకీబ్ 45 సిరీస్‌ల్లో ఐదు ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డులు గెలుచుకున్నారు. టీ20ల్లో అత్యధిక ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డులు గెలుచుకున్న రికార్డు టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి పేరిట ఉంది. విరాట్ 46 సిరీస్‌ల్లో ఏడు సార్లు ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డులు గెలుచుకున్నాడు. కాగా, తాజాగా న్యూజిలాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో హసరంగ ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు గెలుచుకున్నాడు. ఇది అతనికి ఐదో ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు.ఇదిలా ఉంటే, న్యూజిలాండ్‌తో నిన్న (నవంబర్ 10) జరిగిన రెండో టీ20లో శ్రీలంక జట్టు 109 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించలేక ఓటమిపాలైంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్.. హసరంగ (4-1-17-4), మతీశ పతిరణ (4-1-11-3, నువాన్ తుషార (4-0-22-2), తీక్షణ (3.3-0-16-1) దెబ్బకు 19.3 ఓవర్లలో 108 పరుగులకు ఆలౌట్ కాగా.. శ్రీలంక ఈ మాత్రం స్కోర్‌ను కూడా ఛేదించలేక 19.5 ఓవర్లలో 103 పరుగులకే కుప్పకూలింది. ఫలితంగా న్యూజిలాండ్ 5 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ గెలుపులో న్యూజిలాండ్ రెండు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 1-1 సమం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో హ్యాట్రిక్ వికెట్లు తీసి శ్రీలంక పతనానికి బీజం వేసిన లోకీ ఫెర్గూసన్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించగా.. రెండు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో ఆరు వికెట్లు తీసిన హసరంగకు ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు దక్కింది. -
చాలా గర్వంగా ఉంది.. ఈ రోజు కోసమే అతడు ఎంతో కష్టపడ్డాడు: సూర్య
పోర్ట్ ఎలిజబెత్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టీ20లో 3 వికెట్ల తేడాతో టీమిండియా ఓటమి పాలైంది. 125 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని 19 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి ఆతిథ్య ప్రోటీస్ చేధించింది. ఓ దశలో ఆఫ్ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి (4–0–17–5) మాయాజాలంతో భారత్ గెలిచేలా కన్పించినప్పటకి.. సఫారీ బ్యాటర్ ట్రిస్టన్ స్టబ్స్ (47 నాటౌట్) విరోచిత పోరాటంతో తన జట్టును ఓటమి నుంచి గట్టెక్కించాడు. దీంతో నాలుగు మ్యాచ్‌ల సిరీస్‌ను 1-1తో సౌతాఫ్రికా సమం చేసింది. ఇక ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి కేవలం 124 పరుగులు చేసింది. టీమిండియా బ్యాటర్లలో హార్దిక్ పాండ్యా(39 నాటౌట్) ఫైటింగ్ నాక్ ఆడాడు. అతడితో పాటు అక్షర్ పటేల్(27), తిలక్ వర్మ(20) పరుగులతో పర్వాలేదన్పించారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో జాన్సెన్, కోయిట్జీ, పీటర్, సీమీలేన్ తలా వికెట్ సాధించారు. ఇక ఈ ఓటమిపై మ్యాచ్ అనంతరం టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ స్పందించాడు. ఓటమి పాలైనప్పటకి వరుణ్ చక్రవర్తి అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడని సూర్య కోనియాడు.చాలా గర్వంగా ఉంది: సూర్యకుమార్"ఎప్పుడైనా సరే ఎంత లక్ష్యం నమోదు చేసినా కానీ డిఫెండ్ చేసుకునేందుకు ప్రయత్నించాలి. సెకెండ్ ఇన్నింగ్స్ ఆరంభానికి ముందు మా కుర్రాళ్లకు ఇదే విషయం చెప్పాను. ఫలితాలు కోసం ఆలోచించకండి, ఆఖరి వరకు పోరాడాదం అని చెప్పాను. వాస్తవానికి టీ20 గేమ్‌లో 125 లేదా 140 పరుగుల టార్గెట్‌ను కాపాడుకోవడం అంత సులభం కాదు. కానీ మా బౌలర్లు అద్బుతమైన పోరాట పటిమ కనబరిచారు. వారి పోరాట పటిమ చూసి గర్వపడుతున్నా. ముఖ్యంగా వరుణ్ చక్రవర్తి బంతితో మ్యాజిక్ చేశాడు. 125 పరుగుల లోస్కోరింగ్ మ్యాచ్‌లో టార్గెట్‌ను డిఫెండ్ క్రమంలో ఒక్క బౌలర్ 5 వికెట్లు సాధించడం చాలా గొప్ప విషయం. అతడు ఈ రోజు కోసమే ఎప్పటినుంచో ఎదురుచేస్తున్నాడు. అందుకోసం చాలా కష్టపడ్డాడు. ఈ రోజు అతడి కష్టానికి తగ్గ ఫలితం దక్కింది. చాలా సంతోషంగా ఉంది. ఇక ఈ సిరీస్‌లో ఇంకా రెండు మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. జోహాన్స్‌బర్గ్‌లో జరగనున్న మూడో టీ20లో ఈ ఓటమికి బదులు తీర్చుకుంటామని" పోస్ట్ మ్యాచ్ ప్రేజేంటేషన్‌లో సూర్య పేర్కొన్నాడు.చదవండి: IND vs SA: విజయాన్ని వదిలేశారు -
IND vs SA 2nd T20: టీమిండియా అభిమానులకు బ్యాడ్ న్యూస్..
ఆదివారం గెబేహా వేదికగా జరగనున్న రెండో టీ20లో భారత్-దక్షిణాఫ్రికా జట్లు తలపడనున్నాయి. తొలి టీ20లో సౌతాఫ్రికాను చిత్తు చేసిన టీమిండియా ఇప్పుడు రెండో టీ20లో కూడా అదే జోరును కొనసాగించాలని భావిస్తోంది. మరోవైపు మొదటి టీ20లో ఓటమి చవిచూసిన సఫారీ జట్టు.. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా టీమిండియాను ఓడించి ప్రతీకారం తీర్చుకోవాలని యోచిస్తోంది.అయితే ఈ మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించే అవకాశముంది. ఆక్యూవెదర్ రిపోర్ట్ ప్రకారం.. మ్యాచ్ ప్రారంభ సమయానికి గెబేహాలో 50 శాతం వర్షం పడే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. వర్షం కారణంగా టాస్ కూడా ఆలస్యమయ్యే సూచనలు కన్పిస్తున్నాయి. కాగా ఈ మ్యాచ్ సాయంత్రం 4 గంటలకు ప్రారంభం కానుంది. అంటే భారత కాలమానం ప్రకారం మ్యాచ్ రాత్రి 7.30 గంటలకు మొదలు కానుంది. అదే విధంగా మ్యాచ్ జరుగుతున్న సమయంలో కూడా వరుణుడు ఇబ్బంది కలిగించే అస్కారం ఉన్నట్లు స్ధానిక వాతవారణ శాఖ కూడా ఓ ప్రకటనలో వెల్లడించింది. ఒకవేళ పూర్తి స్థాయిలో మ్యాచ్ నిర్వహణ సాధ్యం కాకపోతే.. కనీసం 5 ఓవర్ల గేమ్‌నైనా ఆడిస్తారు. అలా కూడా కుదరకపోతే మ్యాచ్‌ను అంపైర్లు రద్దు చేస్తారు.తుది జట్లు(అంచనా)దక్షిణాఫ్రికా: ర్యాన్ రికెల్టన్, రీజా హెండ్రిక్స్, ఐడెన్ మార్క్రామ్ (కెప్టెన్), ట్రిస్టన్ స్టబ్స్, డేవిడ్ మిల్లర్, హెన్రిచ్ క్లాసెన్, పాట్రిక్ క్రూగర్, మార్కో జాన్సెన్, కేశవ్ మహరాజ్, ఒట్నీల్ బార్ట్‌మన్, గెరాల్డ్ కోయెట్జీభారత్: సంజు శాంసన్ (వికెట్ కీపర్), అభిషేక్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, అవేష్ ఖాన్చదవండి: CK Nayudu Trophy: ఊచకోత.. ఒకే ఇన్నింగ్స్‌లో 426 పరుగులు! 46 ఫోర్లు, 8 సిక్స్‌లతో -
సంజూతో గొడవ పడ్డ సౌతాఫ్రికా ప్లేయర్.. ఇచ్చిపడేసిన సూర్య! వీడియో
దక్షిణాఫ్రికాతో నాలుగు టీ20ల సిరీస్‌ను టీమిండియా విజయంతో ఆరంభించింది. శుక్రవారం డర్బన్ వేదికగా జరిగిన తొలి టీ20లో 61 పరుగుల తేడాతో భారత్ గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో ఆల్‌రౌండ్ షోతో భారత్ అదరగొట్టింది. తొలుత బ్యాటింగ్‌లో దుమ్ములేపిన టీమిండియా.. అనంతరం బౌలింగ్‌లో సఫారీలను చిత్తు చేసింది. దీంతో నాలుగు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి భారత్ దూసుకెళ్లింది. ఇక ఈ మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తన ప్రశాంతతను కోల్పోయాడు. దక్షిణాఫ్రికా స్టార్ ఆల్‌రౌండర్ మార్కో జాన్సెన్, సూర్యకుమార్ మధ్య చిన్నపాటి మాటల యుద్దం చోటు చేసుకుంది.అసలేం జరిగిందంటే?దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ 15 ఓవర్ వేసిన రవి బిష్ణోయ్ బౌలింగ్‌లో రెండో బంతిని గెరాల్డ్ కోట్జీ లాంగ్-ఆఫ్ దిశగా షాట్ ఆడాడు. బంతి బౌన్స్ అయి నేరుగా లాంగా ఆఫ్ ఫీల్డర్ చేతికి వెళ్లింది. వెంటనే సదరు ఫీల్డర్ బంతిని వికెట్ కీపర్ సంజూ శాంసన్‌కు త్రో చేశాడు.ఈ క్రమంలో ఆ బంతిని సంజూ పిచ్‌పై కుడివైపు నుండి అందుకున్నాడు. అయితే సంజూ పిచ్ మధ్యలోకి వచ్చి బంతి అందుకోవడం జాన్సెన్కు నచ్చలేదు. దీంతో అతడు శాంసన్‌తో వాగ్వాదానికి దిగాడు. శాంసన్ కూడా అతడికి బదులిచ్చాడు. ఈ క్రమంలో మిడాన్‌లో ఉన్న సూర్యకుమార్ యాదవ్ సంజూ శాంసన్‌కు సపోర్ట్‌గా నిలిచాడు. జాన్సెన్ వద్దకు వెళ్లి సీరియస్‌గా ఏదో అన్నాడు. ఆ తర్వాత నాన్‌స్ట్రైక్‌లో ఉన్న గెరాల్డ్ కోయెట్జీ కూడా ఈ గొడవలో భాగమయ్యాడు. అయితే ఫీల్డ్ అంపైర్లు జోక్యం చేసుకోవడంతో గొడవ సద్దుమణిగింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.కాగా ఈ మ్యాచ్‌లో సంజూ శాంసన్(107) అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు.pic.twitter.com/s1ufl4WqNB— Drizzyat12Kennyat8 (@45kennyat7PM) November 8, 2024 pic.twitter.com/x8Jf2rR4wN— Drizzyat12Kennyat8 (@45kennyat7PM) November 8, 2024 -
రికార్డుల కోసం ఆడడు.. అతడు నిజంగా చాలా గ్రేట్: సూర్యకుమార్
దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌లో టీమిండియా శుభారంభం చేసింది. డర్బన్ వేదికగా జరిగిన తొలి టీ20లో ఆతిథ్య జట్టును 61 పరుగుల తేడాతో భారత్ చిత్తు చేసింది. 203 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన సౌతాఫ్రికా.. భారత బౌలర్ల దాటికి 141 పరుగులకే కుప్పకూలింది.టీమిండియా స్పిన్నర్లు వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్ తలా మూడు వికెట్లతో ప్రోటీస్ పతనాన్ని శాసించాడు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 202 పరుగుల భారీ స్కోర్ సాధించింది.భారత బ్యాటర్లలో సంజూ శాంసన్(107) అద్బుతమైన సెంచరీతో చెలరేగగా.. తిలక్ వర్మ(33), సూర్యకుమార్ యాదవ్(21) రాణించారు. సౌతాఫ్రికా బౌలర్లలో గెరాల్డ్ కోయిట్జీ మూడు వికెట్లు పడగొట్టగా.. మార్కో జాన్సెన్, కేశవ్ మహరాజ్, పీటర్, క్రుగర్ తలో వికెట్ సాధించారు. ఇక ఈ విజయంపై మ్యాచ్ అనంతరం టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ స్పందించాడు."డర్బన్‌లో మాకు మంచి రికార్డు ఉందన్న విషయం నాకు తెలియదు. ఆ సంగతి నాకు ఇప్పుడే తెలిసింది. గత మూడు నాలుగు సిరీస్‌ల నుంచి మేం మా బ్రాండ్ ఆఫ్ క్రికెట్‌ను కొనసాగిస్తున్నాం. తొలి మ్యాచ్‌లోనే విజయం సాధించడం చాలా సంతోషంగా ఉంది. ఇక సంజూ శాంసన్ ఒక అద్బుతం. గత కొన్నేళ్లుగా సంజూ శాంసన్ పడ్డ కష్టానికి ఫలితం దక్కింది. ఈ మ్యాచ్‌లో తన స్కోర్ 90లలో ఉన్నప్పుడు కూడా అతడు బౌండరీలు కొట్టేందుకు ప్రయత్నించాడు. సంజూ ఎప్పుడు వ్యక్తిగత రికార్డుల కోసం కాకుండా, జట్టు ప్రయోజానాల కోసం ఎప్పుడూ ఆలోచిస్తాడు.మ్యాచ్ కీలక దశలో స్పిన్నర్లను ఎటాక్‌లోకి తీసుకురావాలని ముందే ప్లాన్ చేశాము. క్లాసెన్, మిల్లర్ క్లాసెన్, మిల్లర్ వికెట్లను స్పిన్నర్లతో తీయాలనుకున్నాం. మా స్పిన్నర్లు మా ప్రణాళికలను సరిగ్గా అమలు చేశారు అని పోస్ట్ మ్యాచ్ ప్రేజేంటేషన్‌లో సూర్యకుమార్ పేర్కొన్నాడు.కెప్టెన్సీని ఎంజాయ్ చేస్తున్నారా?అవును నా కెప్టెన్సీని నేను ఆస్వాదిస్తున్నాను. మా కుర్రాళ్లు అద్బుతంగా ఆడి నా పనిని మరింత సులువు చేస్తున్నారు. ఇదే విషయాన్ని టాస్, ప్రీ మ్యాచ్ కాన్ఫరెన్స్‌లో చెప్పాను. ప్రస్తుతం నాపై ఎటువంటి ఒత్తడి లేదు. మా బాయ్స్ అంతా ఫియర్లెస్ క్రికెట్ ఆడుతున్నాను. వికెట్లు కోల్పోయినప్పటకీ భయపడకుండా ఆడుతున్నాము. మా బ్రాండ్ క్రికెట్‌ను కొనసాగిస్తున్నాము అని సూర్య చెప్పుకొచ్చాడు. -
South Africa vs India: సఫారీ గడ్డపై సమరానికి సై
దాదాపు ఐదు నెలల క్రితం... టి20 వరల్డ్‌కప్ ఫైనల్లో దక్షిణాఫ్రికాను ఓడించి భారత్ చాంపియన్‌గా నిలిచింది. ఇప్పుడు ఆ మ్యాచ్ తర్వాత ఇరు జట్లు మరోసారి ఇదే ఫార్మాట్లో పోరుకు సిద్ధమయ్యాయి. వరల్డ్‌కప్ ఫైనల్ ఓటమికి ఒక ద్వైపాక్షిక సిరీస్‌లో మ్యాచ్‌ను ప్రతీకార సమరంగా చూడలేం. పైగా నాటి మ్యాచ్ ఆడిన టీమ్ నుంచి ఇరు జట్లలో పలు మార్పులు జరిగాయి. అయితే తర్వాతి టి20 వరల్డ్‌కప్ కోసం కొత్త జట్లను తయారు చేసే ప్రణాళికల్లో భాగంగా ఇరు జట్లూ సన్నద్ధమవుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ టి20 సమరానికి రంగం సిద్ధమైంది. డర్బన్: స్వదేశంలో ఐదు రోజుల క్రితమే టెస్టు సిరీస్‌లో చిత్తయిన భారత్ ఇప్పుడు విదేశీ గడ్డపై టి20 ఫార్మాట్లో సత్తా చాటేందుకు ‘సై’ అంటోంది. అయితే టెస్టు సిరీస్ ఆడిన వారిలో ఒక్క ఆటగాడు కూడా లేకుండా బరిలోకి దిగుతుండటంతో టీమిండియాపై ఈ ఓటమి భారం లేదు. నాలుగు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా నేడు దక్షిణాఫ్రికాను తొలి టి20 మ్యాచ్‌లో భారత్ ఎదుర్కోనుంది. సఫారీ జట్టు పరిస్థితి చూస్తే వరల్డ్‌కప్ ఓటమి నుంచి ఇంకా కోలుకున్నట్లుగా లేదు. ఆ తర్వాత టి20ల్లోనే విండీస్ చేతిలో 0–3తో ఓడిన జట్టు ఐర్లాండ్‌తో 1–1తో ‘డ్రా’ చేసుకుంది. ఇప్పుడు స్వదేశంలోనైనా తమ స్థాయికి తగ్గ ప్రదర్శన ఇచ్చి సిరీస్ గెలుచుకోవాలని జట్టు ఆశిస్తోంది. సుస్థిర స్థానం కోసం... సొంతగడ్డపై బంగ్లాదేశ్‌ను టి20 సిరీస్‌లో 3–0తో ఓడించిన భారత యువ జట్టు ఉత్సాహంతో ఉంది. సూర్యకుమార్ నాయకత్వంలో ఈ టీమ్ అన్ని విధాలా బలంగా కనిపిస్తోంది. బంగ్లాదేశ్‌పై హైదరాబాద్‌లో జరిగిన చివరి టి20 మ్యాచ్‌లో మెరుపు సెంచరీతో చెలరేగిన సంజూ సామ్సన్ అదే జోరును ఇక్కడా కొనసాగించాలని పట్టుదలతో ఉన్నాడు. యశస్వి, గిల్వంటి రెగ్యులర్ ఓపెనర్లు మళ్లీ వచ్చినా ఓపెనర్‌గా తన స్థానాన్ని సుస్థిరం చేసుకోవాలని అతను భావిస్తున్నాడు. రెండో ఓపెనర్‌గా అభిషేక్ శర్మ కూడా అదే ప్రయత్నంలో ఉన్నాడు. జింబాబ్వేపై 36 బంతుల్లోనే శతకం బాదినా... మిగిలిన ఆరు ఇన్నింగ్స్‌లలో అతను ఒక్కసారి కూడా 20 పరుగులు దాటలేదు. ఇటీవల ఎమర్జింగ్ కప్‌లో భారత టాప్‌స్కోరర్‌గా నిలిచిన అభిషేక్ ఇక్కడ రాణించడం అవసరం. సూర్య, హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్‌లతో మన బ్యాటింగ్ బలంగా కనిపిస్తోంది. అయితే హైదరాబాద్ ప్లేయర్ తిలక్ వర్మ కూడా తనను తాను మళ్లీ నిరూపించుకోవాల్సిన స్థితిలో ఉన్నాడు. అంతర్జాతీయ కెరీర్ ఆరంభంలో మంచి ప్రదర్శనలే వచ్చినా... ఆ తర్వాత చోటు కోల్పోయి ఇటీవలే మళ్లీ జట్టులోకి వచ్చాడు. ఎమర్జింగ్ కప్‌లో కెప్టెన్ హోదాలో ఆడిన తిలక్ 4 ఇన్నింగ్స్‌లలో 117 పరుగులే చేయగలిగాడు. మిడిలార్డర్లో పోటీ పెరిగిన నేపథ్యంలో రెగ్యులర్‌గా మారాలంటే తిలక్ మంచి స్కోర్లు సాధించాల్సి ఉంది. దూకుడైన బ్యాటింగ్‌తో పాటు అద్భుతమైన ఫీల్డర్ అయిన రమణ్‌దీప్ సింగ్ ఈ మ్యాచ్‌తో అరంగేట్రం చేసే అవకాశం ఉంది. మెరుపు ప్రదర్శనతో ముస్తాక్ అలీ టోర్నీలో పంజాబ్, ఐపీఎల్లో కేకేఆర్ జట్ల విజయాల్లో కీలకపాత్ర పోషించిన అతను ఎమర్జింగ్ టోర్నీలోనూ రాణించాడు. వరల్డ్ కప్ విన్నింగ్ టీమ్ సభ్యుడైన అర్ష్‌దీప్ సింగ్ బౌలింగ్‌ను నడిపిస్తుండగా...అవేశ్‌కు రెండో పేసర్‌గా అవకాశం దక్కవచ్చు. హిట్టర్లు వచ్చేశారు... వరల్డ్‌కప్ ఫైనల్ మ్యాచ్ తర్వాత హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్ మళ్లీ ఇప్పుడే మైదానంలోకి దిగుతున్నారు. వీరిద్దరి రాకతో పాటు మరో దూకుడైన ప్లేయర్ స్టబ్స్‌తో దక్షిణాఫ్రికా మిడిలార్డర్ పటిష్టంగా మారింది. ప్రపంచకప్ ఆడిన డికాక్, రబడ, నోర్జే ఈ సిరీస్‌కు అందుబాటులో లేకపోయినా... గాయాల నుంచి కోలుకున్న జాన్సెన్, కొయెట్జీ పునరాగమనం చేయడంతో టీమ్ మెరుగ్గా కనిపిస్తోంది. ఓపెనర్లుగా అనుభవజ్ఞుడైన హెన్డ్రిక్స్తో పాటు రికెల్టన్ శుభారంభం ఇవ్వాలని టీమ్ ఆశిస్తోంది. ఇద్దరు కొత్త ఆటగాళ్లు సిమ్‌లేన్, ఎన్ఖబయోమ్జి అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగు పెట్టనున్నారు. అయితే కెప్టెన్ మార్క్రమ్ ఫామ్ టీమ్‌ను కలవరపరుస్తోంది. ఈ ఏడాది ఆడిన 14 ఇన్నింగ్స్‌లలో మార్క్రమ్ ఒకే ఒక్కసారి 25 పరుగుల స్కోరు దాటగలిగాడు. ఈ సిరీస్ ద్వారా ఫామ్‌లోకి వస్తానని అతను చెబుతున్నాడు. ఐపీఎల్ వేలానికి ముందు భారత జట్టుపై రాణించడం ద్వారా తమ సత్తాను ప్రపంచానికి చూపించేందుకు సఫారీ ఆటగాళ్లకు ఇది చక్కటి అవకాశం. ఒక్క క్లాసెన్ మినహా మిగతా వారందరూ వేలంలోకి రానున్నారు. తుది జట్ల వివరాలు (అంచనా) భారత్: సూర్యకుమార్ (కెప్టెన్), సామ్సన్, అభిషేక్, తిలక్, పాండ్యా, రింకూ, రమణ్‌దీప్, అక్షర్, అవేశ్, అర్‡్షదీప్, వరుణ్ చక్రవర్తి. దక్షిణాఫ్రికా: మార్క్రమ్ (కెపె్టన్), హెన్డ్రిక్స్, రికెల్టన్, స్టబ్స్, క్లాసెన్, మిల్లర్, జాన్సెన్, సిమ్‌లేన్, ఎన్ఖబయోమ్జి, కేశవ్, బార్ట్‌మన్.పిచ్, వాతావరణం కింగ్స్‌మీడ్ మైదానం భారీ స్కోర్లకు వేదిక. మరోసారి అదే జరిగే అవకాశం ఉంది. అయితే మ్యాచ్ రోజు వర్షసూచన ఉంది.6: దక్షిణాఫ్రికా గడ్డపై ఇరు జట్ల మధ్య 9 టి20 మ్యాచ్‌లు జరిగాయి. ఇందులో భారత్ 6 మ్యాచ్‌ల్లో నెగ్గి, 3 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. -
సౌతాఫ్రికాతో టీ20 సిరీస్.. భారీ రికార్డులపై కన్నేసిన సూర్యకుమార్
భారత్, సౌతాఫ్రికా మధ్య నాలుగు మ్యాచ్‌ల టీ20 సిరీస్ రేపటి నుంచి ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌లోని తొలి మ్యాచ్ నవంబర్ 8న డర్బన్ వేదికగా జరుగనుంది. రెండో టీ20 గ్వ్కెబెర్హా వేదికగా నవంబర్ 10న జరుగుతుంది. మూడో మ్యాచ్ సెంచూరియన్ వేదికగా నవంబర్ 13న.. నాలుగో టీ20 జొహనెస్‌బర్గ్ వేదికగా నవంబర్ 15న జరుగనున్నాయి. టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఈ సిరీస్‌లో పలు భారీ రికార్డులపై కన్నేశాడు.మరో 107 పరుగులు చేస్తే..ఈ సిరీస్‌లో స్కై మరో 107 పరుగులు చేస్తే, భారత్-సౌతాఫ్రికా మధ్య టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా రికార్డు సృష్టిస్తాడు. ప్రస్తుతం ఈ రికార్డు డేవిడ్ మిల్లర్ మిల్లర్ పేరిట ఉంది. మిల్లర్ 21 మ్యాచ్‌ల్లో 156.94 స్ట్రయిక్‌రేట్‌తో 452 పరుగులు చేశాడు. స్కై సౌతాఫ్రికాతో ఇప్పటివరకు ఆడిన ఏడు మ్యాచ్‌ల్లో సెంచరీ, నాలుగు హాఫ్ సెంచరీల సాయంతో 175.63 స్ట్రయిక్‌రేట్ చొప్పున 346 పరుగులు చేశాడు.మరో ఆరు సిక్సర్లు..ఈ సిరీస్‌లో సూర్యకుమార్ యాదవ్ మరో ఆరు సిక్సర్లు కొడితే టీ20ల్లో అత్యంత వేగంగా 150 సిక్సర్ల మార్కును తాకిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పుతాడు. ప్రస్తుతం స్కై 71 ఇన్నింగ్స్‌ల్లో 144 సిక్సర్లు బాది, అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాళ్ల జాబితాలో నికోలస్ పూరన్‌తో (144) కలిసి సంయుక్తంగా మూడో స్థానంలో ఉన్నాడు. ఈ జాబితాలో రోహిత్ శర్మ (205) టాప్‌లో ఉండగా.. మార్టిన్ గప్తిల్ (173) రెండో స్థానంలో ఉన్నాడు.మరో రెండు శతకాలు..అంతర్జాతీయ టీ20ల్లో ఇప్పటివరకు నాలుగు శతకాలు బాదిన సూర్యకుమార్, దక్షిణాఫ్రికాతో రేపటి నుంచి ప్రారంభం కాబోయే సిరీస్‌లో మరో రెండు శతకాలు బాదితే అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక సెంచరీలు బాదిన ఆటగాడిగా ప్రపంచ రికార్డు నెలకొల్పుతాడు. టీ20ల్లో అత్యధిక శతకాల జాబితాలో సూర్యకుమార్ కంటే ముందు రోహిత్ శర్మ, గ్లెన్ మ్యాక్స్‌వెల్ ఉన్నారు. ఈ ఇద్దరు పొట్టి ఫార్మాట్లో చెరి ఐదు శతకాలు సాధించారు. దక్షిణాఫ్రికాతో సిరీస్‌కు భారత టీ20 జట్టు: సూర్యకుమార్ యాదవ్, అభిషేక్ శర్మ, సంజు శాంసన్, రింకూ సింగ్, తిలక్ వర్మ, జితేష్ శర్మ, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రమణదీప్ సింగ్, వరుణ్ చకరవర్తి, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్, విజయ్‌కుమార్ వైషాక్, అవేష్ ఖాన్, యశ్ దయాల్ -
IND vs SA: దక్షిణాఫ్రికాకు చేరుకున్న టీమిండియా.. వీడియో వైరల్
న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌ను కోల్పోయిన టీమిండియా ఇప్పుడు మరో కఠిన సవాల్‌కు సిద్దమైంది. నాలుగు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో దక్షిణాఫ్రికాతో భారత్ తలపడనుంది. ఈ క్రమంలో సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోని భారత జట్టు సోమవారం సఫారీ గడ్డపై అడుగుపెట్టింది. డర్బన్‌కు చేరుకున్న భారత జట్టుకు సౌతాఫ్రికా క్రికెట్ ఆధికారులు ఘన స్వాగతం పలికారు. ఇందుకు సంబంధించిన వీడియోను బీసీసీఐ ఎక్స్‌లో షేర్ చేసింది. కాగా ఈ సిరీస్‌లో భారత జట్టు ప్రధాన కోచ్‌గా నేషనల్ క్రికెట్ అకాడమీ హెడ్ లక్ష్మణ్ వ్యహరించనున్నాడు. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ కోసం సిద్దమవుతుండడంతో రెగ్యూలర్ హెడ్‌కోచ్ గౌతం గంభీర్‌కు బీసీసీఐ విశ్రాంతి ఇచ్చింది. నవంబర్ 8న డర్బన్ వేదికగా జరగనున్న తొలి టీ20 ఈ సిరీస్ ప్రారంభం కానుంది.అద్భుత ఫామ్‌లో టీమిండియా..ఇక ఈ ఏడాదిలో టీ20ల్లో భారత్ క్రికెట్ జట్టు అదరగొడుతోంది. 2024 ఏడాదిలో 22 టీ20లు ఆడిన టీమిండియా కేవలం ఒక్క మ్యాచ్‌లో మాత్రమే ఓటమి చవిచూసింది. కొత్త కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలో భారత జట్టు దూసుకుపోతుంది. ఇప్పుడు దక్షిణాఫ్రికాపై కూడా అదే జోరును కనబరచాలని యంగ్ ఇండియా ఉవ్విళ్లూరుతోంది.భారత్: సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, సంజు శాంసన్ (వికెట్ కీపర్), రింకు సింగ్, తిలక్ వర్మ, జితేష్ శర్మ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రమణదీప్ సింగ్. వరుణ్ చకరవర్తి, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్, విజయ్‌కుమార్ వ్యాషాక్, అవేష్ ఖాన్, యశ్ దయాల్దక్షిణాఫ్రికా: ఐడెన్ మార్క్రామ్ (కెప్టెన్), ఒట్నీల్ బార్ట్‌మన్, గెరాల్డ్ కోయెట్జీ, డోనోవన్ ఫెర్రీరా, రీజా హెండ్రిక్స్, మార్కో జాన్సెన్, హెన్రిచ్ క్లాసెన్, పాట్రిక్ క్రూగర్, కేశవ్ మహరాజ్, డేవిడ్ మిల్లర్, మిహ్లాలీ మ్పోంగ్వానా, న్కాబా పీటర్, ర్యాన్ సిమిప్లాన్, ర్యాన్ సిమిప్లామ్టన్, ట్రిస్టన్ స్టబ్స్చదవండి: IPL 2025: రిషబ్ పంత్‌కు రూ. 50 కోట్లు!? Touchdown Durban 🛬🇿🇦How good is #TeamIndia's knowledge of their next destination 🤔#SAvIND pic.twitter.com/m4YjikAw6Y— BCCI (@BCCI) November 4, 2024 -
స్కై, విరాట్లను అధిగమించిన సికందర్ రజా
జింబాబ్వే టీ20 జట్టు కెప్టెన్ సికందర్ రజా ఓ విషయంలో టీమిండియా స్టార్లు సూర్యకుమార్ యాదవ్, విరాట్ కోహ్లిలను అధిగమించాడు. అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు గెలుచుకున్న ఆటగాడిగా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. టీ20 వరల్డ్‌కప్ క్వాలిఫయర్ పోటీల్లో భాగంగా గాంబియాతో నిన్న (అక్టోబర్ 23) జరిగిన మ్యాచ్‌లో సికందర్ రజాకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. ఇది అతని కెరీర్లో 17వ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు. ఈ మ్యాచ్‌కు ముందు వరకు టీ20ల్లో అత్యధిక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డుల రికార్డు రజా, స్కై, విరాట్, విరన్‌దీప్ సింగ్‌ల పేరిట సంయుక్తంగా ఉండేది. వీరంతా తలో 16 ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు గెలుచుకున్నారు. తాజాగా రజా.. స్కై, విరాట్, విరన్లను అధిగమించి తన పేరిట సింగిల్‌గా ఈ రికార్డును నమోదు చేసుకున్నాడు. అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు గెలుచుకున్న ఆటగాళ్ల జాబితాలో సికందర్ రజా, స్కై, విరాట్, విరన్ తర్వాత రోహిత్ శర్మ (14), మొహమ్మద్ నబీ (14) ఉన్నారు.జింబాబ్వే, గాంబియా మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌లో జింబాబ్వే వరల్డ్ రికార్డు స్కోర్ నమోదు చేసింది. ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఏకంగా 344 పరుగులు చేసింది. అంతర్జాతీయ టీ20ల్లో ఇదే అత్యధిక టీమ్ స్కోర్. ఈ మ్యాచ్‌లో సికందర్ రజా సుడిగాలి శతకం (43 బంతుల్లో 133 నాటౌట్; 7 ఫోర్లు, 15 సిక్సర్లు) బాదాడు. బ్రియాన్ బెన్నెట్ (26 బంతుల్లో 50; 7 ఫోర్లు, సిక్స్), మరుమణి (19 బంతుల్లో 62; 9 ఫోర్లు, 4 సిక్సర్లు), మదండే (17 బంతుల్లో 53 నాటౌట్; 3 ఫోర్లు, 5 సిక్సర్లు) మెరుపు అర్ద సెంచరీలు సాధించారు. అనంతరం కష్ట సాధ్యమైన లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన గాంబియా 14.4 ఓవర్లలో 54 పరుగులకే కుప్పకూలి 290 పరుగుల భారీ తేడాతో ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. చదవండి: శ్రీలంక జోరు.. విండీస్ బేజారు -
'టీమ్ కంటే ఏదీ ఎక్కువ కాదు.. జట్టులో నిస్వార్థ క్రికెటర్లు ఉండాలి'
టీ20ల్లో తమకు తిరుగులేదని టీమిండియా మరోసారి నిరూపించింది. హైదరాబాద్ వేదికగా జరిగిన మూడో టీ20లో 133 పరుగుల తేడాతో భారత్ విజయ భేరి మ్రోగించింది. తద్వారా టీ20 సిరీస్‌ను 3-0 తేడాతో టీమిండియా క్లీన్‌స్వీప్ చేసింది. ఈ మ్యాచ్‌లో భారత్ ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టింది. తొలుత బ్యాటింగ్‌లో 297 పరుగులు చేసిన టీమిండియా.. ఆ తర్వాత బౌలింగ్‌లో 164 పరుగులకే ప్రత్యర్ధిని కట్టడి చేసింది. ఇక ఈ అద్బుత విజయంపై మ్యాచ్ అనంతరం భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ స్పందించాడు. తమ కుర్రాళ్ల ఆటతీరు పట్ల సూర్య సంతోషం వ్యక్తం చేశాడు."బంగ్లాతో టీ20 సిరీస్‌ను వైట్ వాష్ చేయడం చాలా సంతోషంగా ఉంది. మేము ఒక జట్టుగా చాలా సాధించాము. నా జట్టులో నిస్వార్థమైన క్రికెటర్లు ఉండాలని కోరుకుంటా. హార్దిక్ చెప్పినట్లుగా ఫీల్డ్‌లోనైనా, ఆఫ్‌ది ఫీల్డ్‌లోనైనా ఒకరి ప్రదర్శనలను ఒకరు ఆస్వాదించాలనుకుంటున్నాము.వీలైనంత ఎక్కువ సమయం సరదగా గడపాలని అనుకుంటున్నాము. మైదానంలో కూడా మా స్నేహాన్ని కొనసాగిస్తాము. ఇక గతంలో శ్రీలంకతో సిరీస్‌కు వెళ్లినప్పుడు గౌతీ భాయ్(గౌతమ్ గంభీర్) ఏం చెప్పాడో.. ఈ సిరీస్ ప్రారంభానికి ముందు కూడా అదే సలహా ఇచ్చాడు. జట్టు కంటే ఏది ముఖ్యం కాదు. ఎవరైనా 99 లేదా 49 మీద ఉన్నప్పుడు షాట్ ఆడే ఆవకాశం వస్తే ఏమాత్రం ఆలోచించకుండా ఆడేయాలి. ఈ మ్యాచ్‌లో సంజూ శాంసన్ అదే చేశాడు. నిజంగా అతడి ప్రదర్శన పట్ల చాలా సంతోషంగా ఉన్నాను. జట్టుకు బ్యాటింగ్, బౌలింగ్ విషయంలో ఖచ్చితంగా ఆప్షన్స్ ఉండాలి. ఓవరాల్‌గా ఈ సిరీస్‌లో మా జట్టు ప్రదర్శన నాకు సంతృప్తినిచ్చింది. జట్టు విజయాల్లో ప్రతీ ఒక్కరూ భాగస్వామ్యం కావడం చాలా అనందంగా ఉంది" అని పోస్ట్ మ్యాచ్ ప్రేజేంటేషన్‌లో సూర్యకుమార్ పేర్కొన్నాడు.చదవండి: IND vs BAN: చరిత్ర సృష్టించిన టీమిండియా.. ప్రపంచంలోనే తొలి జట్టుగా -
చెలరేగిన సంజూ, సూర్య.. బంగ్లాను చిత్తు చేసిన భారత్
హైదరాబాద్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన మూడో టీ20లో 133 పరుగుల తేడాతో టీమిండియా ఘన విజయం సాధించింది. దీంతో మూడు టీ20ల సిరీస్‌ను 3-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసింది. ఈ మ్యాచ్‌లో భారత బ్యాటర్లు విధ్వంసం సృష్టించారు. బంగ్లాదేశ్ బౌలర్లను ఊతికారేశారు.అభిషేక్ శర్మ మినహా మిగితా అందరూ ఆకాశమే హద్దుగా చెలరేగారు. భారత బ్యాటర్లలో ఓపెనర్ సంజూ శాంసన్ (47 బంతుల్లో 111; 11 ఫోర్లు, 8 సిక్సర్లు) విధ్వంసకర సెంచరీతో చెలరేగగా.. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (35 బంతుల్లో 75; 8 ఫోర్లు, 5 సిక్సర్లు) మెరుపు హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. వీరిద్దరితో పాటు హార్దిక్ పాండ్యా (18 బంతుల్లో 47; 4 ఫోర్లు, 4 సిక్సర్లు), రియాన్ పరాగ్ (13 బంతుల్లో 34; ఫోర్, 4 సిక్సర్లు) కూడా కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. దీంతో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 297 పరుగుల భారీ స్కోర్ చేసింది. బంగ్లా బౌలర్లలో తంజిమ్ హసన్ సకీబ్ మూడు వికెట్లు పడగొట్టగా.. తస్కిన్ అహ్మద్, ముస్తాఫిజుర్, మహ్మదుల్లా తలో వికెట్ దక్కించుకున్నారు.3 వికెట్లతో చెలరేగిన బిష్ణోయ్..అనంతరం బ్యాటింగ్‌కు దిగిన నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 164 పరుగులకే పరిమితమైంది. భారత బౌలర్లలో స్పిన్నర్ రవి బిష్ణోయ్ 3 వికెట్లతో మెరిశాడు. అతడితో పాటు మయాంక్ యాదవ్ రెండు వికెట్లు, వాషింగ్టన్ సుందర్, నితీష్ కుమార్ రెడ్డి తలా వికెట్ సాధించారు. బంగ్లా బ్యాటర్లలో తహిద్ హృదాయ్(63) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు.చదవండి: దంచికొట్టిన పఠాన్ బ్రదర్స్.. అయినా..! 🚨 ONE OF THE MOST RIDICULOUS SHOTS EVER 🚨- Sanju Samson is a beast...!!!! pic.twitter.com/e3hblLeXyA— Johns. (@CricCrazyJohns) October 12, 2024 -
సంజూ శాంసన్ విధ్వంసకర శతకం.. టీమిండియా అతి భారీ స్కోర్
హైదరాబాద్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మూడో టీ20లో టీమిండియా బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఫలితంగా భారత్ అంతర్జాతీయ టీ20 చరిత్రలో రెండో భారీ స్కోర్ నమోదు చేసింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 297 పరుగులు చేసింది.సంజూ శాంసన్ (47 బంతుల్లో 111; 11 ఫోర్లు, 8 సిక్సర్లు) విధ్వంసకర శతకంతో, సూర్యకుమార్ యాదవ్ (35 బంతుల్లో 75; 8 ఫోర్లు, 5 సిక్సర్లు) మెరుపు హాఫ్ సెంచరీతో చెలరేగిపోయారు. ఆఖర్లో హార్దిక్ పాండ్యా (18 బంతుల్లో 47; 4 ఫోర్లు, 4 సిక్సర్లు), రియాన్ పరాగ్ (13 బంతుల్లో 34; ఫోర్, 4 సిక్సర్లు) కూడా తలో చేయి వేయడంతో భారత్ రికార్డు స్కోర్ సాధించింది. భారత ఇన్నింగ్స్‌లో అభిషేక్ శర్మ 4, రింకూ సింగ్ 8, నితీశ్ రెడ్డి 0, వాషింగ్టన్ సుందర్ ఒక్క పరుగు చేశారు. బంగ్లా బౌలర్లలో తంజిమ్ హసన్ సకీబ్ మూడు వికెట్లు పడగొట్టగా.. తస్కిన్ అహ్మద్, ముస్తాఫిజుర్, మహ్మదుల్లా తలో వికెట్ దక్కించుకున్నారు. -
రోహిత్, కోహ్లి సరసన చేరేందుకు 31 పరుగుల దూరంలో ఉన్న సూర్య
భారత టీ20 జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ అంతర్జాతీయ టీ20ల్లో మరో అరుదైన మైలురాయికి చేరువయ్యాడు. బంగ్లాదేశ్‌తో ఇవాళ (అక్టోబర్ 12) జరుగబోయే మ్యాచ్‌లో స్కై మరో 31 పరుగులు చేస్తే 2500 పరుగుల క్లబ్లో చేరతాడు. భారత్ తరఫున కేవలం విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ మాత్రమే 2500 పరుగుల మార్కును దాటారు. స్కై నేటి మ్యాచ్‌లో 31 పరుగులు సాధిస్తే.. కోహ్లి, రోహిత్ సరసన చేరతాడు. ప్రస్తుతం సూర్యకుమార్ యాదవ్ ఖాతాలో 2469 పరుగులు ఉన్నాయి. భారత్ తరఫున అత్యధిక టీ20 పరుగుల రికార్డు రోహిత్ శర్మ పేరిట ఉంది. హిట్‌మ్యాన్ పొట్టి ఫార్మాట్లో 4231 పరుగులు చేశాడు. రోహిత్ తర్వాత భారత్ తరఫున అత్యధిక పరుగుల రికార్డు విరాట్ కోహ్లి పేరిట ఉంది. కోహ్లి 125 మ్యాచ్‌ల్లో 4188 పరుగులు చేశాడు. టీ20 వరల్డ్‌కప్-2024 విజయానంతరం రోహిత్, కోహ్లి అంతర్జాతీయ టీ20లకు గుడ్‌బై చెప్పిన విషయం తెలిసిందే.ఇదిలా ఉంటే, భారత్-బంగ్లాదేశ్ మధ్య హైదరాబాద్ వేదికగా ఇవాళ మూడో టీ20 జరుగనుంది. ఈ మ్యాచ్‌కు వర్షం ముప్పు పొంచి ఉందని తెలుస్తుంది. ఒకవేళ ఈ మ్యాచ్‌కు ఎలాంటి అవాంతరాలు ఎదురుకాకుంటే భారత్‌కే విజయావకాశాలు అధికంగా ఉన్నాయి. మూడు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లోని తొలి రెండు మ్యాచ్‌లు టీమిండియానే గెలిచింది. మరో మ్యాచ్ మిగిలుండగానే భారత్ 2-0 తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకుంది. గ్వాలియర్‌లో జరిగిన తొలి టీ20లో 7 వికెట్ల తేడాతో నెగ్గిన భారత్.. న్యూఢిల్లీ వేదికగా జరిగిన రెండో మ్యాచ్‌లో 86 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. వర్షం కారణంగా ఈ మ్యాచ్ రద్దైనా టీమిండియాకు ఎలాంటి నష్టం జరగనప్పటికీ.. హైదరాబాద్ అభిమానులు మాత్రం చాలా నిరాశ చెందుతారు. ఈ మ్యాచ్ కోసం నగర వాసులు చాలా రోజుల నుంచి ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. చదవండి: భారత్-బంగ్లాదేశ్ టీ20 మ్యాచ్: ఉప్పల్ స్టేడియం వద్ద హైటెన్షన్ -
నితీష్ రెడ్డి ఒక అద్భుతం.. నేను అనుకున్నదే జరిగింది: భారత కెప్టెన్
టీ20ల్లో భారత జట్టు జోరు కొనసాగుతోంది. ఢిల్లీ వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో టీ20లో 86 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. దీంతో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలూండగానే భారత్ కైవసం చేసుకుంది.ఈ మ్యాచ్‌లో ఆల్‌రౌండ్ షోతో యంగ్ ఇండియా అదరగొట్టింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 221 పరుగుల భారీ స్కోర్ సాధించింది. భారత బ్యాటర్లలో నితీష్ కుమార్ రెడ్డి(74), రింకూ సింగ్(53)ల హాఫ్ సెంచరీలతో మెరిశారు. అనంతరం లక్ష్య చేధనలో బంగ్లాదేశ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 135 పరుగులకే పరిమితమైంది. టీమిండియా బౌలర్లలో వరుణ్ చక్రవర్తి, నితీష్ కుమార్ రెడ్డి తలా రెండు వికెట్లు సాధించారు. వీరితో పాటు అభిషేక్ శర్మ, అర్ష్‌దీప్, మయాంక్ యాదవ్, రియాన్ పరాగ్ తలా వికెట్ పడగొట్టారు.ఇక ఈ అద్భుత విజయంపై మ్యాచ్ అనంతరం టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ స్పందించాడు."మరో టీ20 సిరీస్ విజయం సాధించడం చాలా సంతోషంగా ఉంది. ఈ మ్యాచ్‌లో మా టాపార్డర్ బ్యాటర్ల విఫలమైనందుకు మేము నిరాశ చెందలేదు. నిజంగా చెప్పాలంటే నేను కోరుకున్నది కూడా అదే. ఎందుకంటే మిడిలార్డర్ బ్యాటర్లు కఠినమైన పరిస్థితులను ఎదుర్కోవాలని నేను భావించాను. క్లిష్ట సమయంలో ఎలా ఆడుతారో పరీక్షించాలనకున్నాము. ముఖ్యంగా ఐదు, ఆరు, ఏడో స్ధానంలో బ్యాటింగ్‌కు వచ్చే వారు ఆటగాళ్లు జట్టుకు చాలా ముఖ్యం. ఒకవేళ టాపర్డర్ విఫలమైనా వారు జట్టును ఆదుకునే విధంగా ఉండాలి. అయితే ఈ మ్యాచ్‌లో నేను కోరుకున్న విధంగానే మా మిడిలార్డర్ బ్యాటర్లు బ్యాటింగ్ చేశారు.రింకూ, నితీష్ అద్భుతమైన ఇన్నింగ్స్‌లు ఆడారు. బౌలర్లను కూడా టెస్టు చేయాలనుకున్నాను. ప్రస్తుత తరం క్రికెట్లో జట్టులో పార్ట్‌టైమ్ బౌలర్లు ఉండటం చాలా ముఖ్యం. జట్టుకు అవసరమైనప్పుడు బౌలింగ్ చేసేందుకు సిద్దంగా ఉండాలి. అందుకే ఏడుగురు బౌలర్లతో బౌలింగ్ చేయించాను" అని పోస్ట్ మ్యాచ్ ప్రేజేంటేషన్‌లో సూర్య పేర్కొన్నాడు.చదవండి: IND vs BAN: టీమిండియా అరుదైన రికార్డు.. 92 ఏళ్ల భారత క్రికెట్ హిస్టరీలోనే -
టీమిండియా అరుదైన రికార్డు.. 92 ఏళ్ల భారత క్రికెట్ హిస్టరీలోనే
ఢిల్లీ వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో టీ20లో 86 పరుగుల తేడాతో టీమిండియా ఘన విజయం సాధించింది. దీంతో మూడు టీ20ల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలూండగానే భారత్ సొంతం చేసుకుంది. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆతిథ్య జట్టు అదరగొట్టింది.నితీష్ కుమార్ రెడ్డి(74), రింకూ సింగ్(53)ల హాఫ్ సెంచరీలతో మెరవడంతో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 221 పరుగుల భారీ స్కోరు సాధించింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 135 పరుగులకే పరిమితమైంది.చరిత్ర సృష్టించిన భారత్..ఈ మ్యాచ్‌లో భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తన మార్క్‌ను చూపించాడు. ఏకంగా ఏడుగురు బౌలర్లతో బౌలింగ్ చేయించి ఔరా అన్పించాడు. అర్ష్‌దీప్ సింగ్, నితీష్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, వరుణ్ చక్రవర్తి, వాషింగ్టన్ సుందర్, రియాన్ పరాగ్, అభిషేక్ శర్మ బంతిని పంచుకున్నారు. అయితే ఆ ఏడుగురు బౌలర్లలో ప్రతీ ఒక్కరు వికెట్ సాధించారు. కాగా 92 ఏళ్ల భారత క్రికెట్ హిస్టరీలో ఒక ఇన్నింగ్స్‌లో ఏడుగురు బౌలర్లు కనీసం ఒక్క వికెట్ అయినా తీయడం ఇదే తొలిసారి. 1932లో మొదటి అంతర్జాతీయ మ్యాచ్ ఆడిన భారత జట్టు.. ఢిల్లీ టీ20 ముందు వరకు ఏ ఫార్మాట్(వన్డే, టీ20, టెస్టు)లో కూడా భారత జట్టు ఈ అరుదైన ఫీట్ నమోదు చేయలేదు. ఓవరాల్‌గా వరల్డ్ క్రికెట్లో టెస్టుల్లో 4 సార్లు, వన్డేల్లో 10 సార్లు, టీ20ల్లో 4 సార్లు ఈ ఫీట్ నమోదు అయింది.చదవండి: కోహ్లి కేవలం రెండు సెంచరీలు చేస్తే రూట్ ఏకంగా 18 సెంచరీలు బాదాడు..! -
బంగ్లాతో రెండో టీ20.. అరుదైన రికార్డుపై కన్నేసిన సూర్య భాయ్
ఢిల్లీలోని అరుణ్‌జైట్లీ స్టేడియం వేదికగా బంగ్లాదేశ్‌తో రెండో టీ20లో తలపడేందుకు టీమిండియా సిద్దమైంది. ఈ మ్యాచ్‌లో బంగ్లాను చిత్తు చేసి సిరీస్‌ను సొంతం చేసుకోవాలని భారత జట్టు భావిస్తోంది. మరోవైపు బంగ్లా కూడా ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి కమ్‌బ్యాక్ ఇవ్వాలని భావిస్తోంది.కోహ్లి రికార్డుపై కన్నేసిన సూర్య.. అయితే ఈ మ్యాచ్‌కు ముందు టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌ను ఓ అరుదైన రికార్డు ఊరిస్తోంది. రెండో టీ20లో సూర్య మరో 39 పరుగులు చేస్తే.. అంతర్జాతీయ టీ20ల్లో అత్యంత వేగంగా 2500 పరుగులు చేసిన రెండో బ్యాటర్‌గా విరాట్ కోహ్లితో సమంగా నిలుస్తాడు.కోహ్లి 73 మ్యాచ్‌ల్లో ఈ రేర్ ఫీట్ అందుకోగా.. ఇప్పుడు సూర్యకుమార్ కూడా ఢిల్లీ టీ20లో 39 పరుగులు చేస్తే సరిగ్గా 73 మ్యాచ్‌ల్లోనే అందుకుంటాడు. ఇక అరుదైన ఘనత సాధించిన జాబితాలో పాకిస్తాన్ స్టార్ ప్లేయర్ బాబర్ ఆజం అగ్రస్ధానంలో ఉన్నాడు. బాబర్ 67 మ్యాచ్‌ల్లోనే 2500 పరుగుల మైలు రాయిని అందుకున్నాడు.రెండో టీ20కు భారత తుది జట్టు(అంచనా)సంజూ శాంసన్, అభిషేక్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), రియాన్ పరాగ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్, వాషింగ్టన్ సుందర్, వరుణ్ చక్రవర్తి, హర్షిత్ రానా, అర్షదీప్ సింగ్. -
తొలి టీ20.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన భారత్
బంగ్లాదేశ్‌తో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో టీమిండియా శుభారంభం చేసింది. గ్వాలియర్ వేదికగా జరిగిన తొలి టీ20లో 7 వికెట్ల తేడాతో భారత్ ఘన విజయాన్ని అందుకుంది.128 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని భారత్ ఊదిపడేసింది. కేవలం 11.5 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి చేధించింది. భారత బ్యాటర్లలో హార్దిక్ పాండ్యా ( 39 నాటౌట్) టాప్ స్కోరర్‌గా నిలవగా.. సూర్యకుమార్ యాదవ్(29), సంజూ శాంసన్(29) పరుగులతో రాణించారు. అరంగేట్ర ఆటగాడు నితీష్ కుమార్ రెడ్డి 16 పరుగులతో ఆజేయంగా నిలిచాడు.ఇక బంగ్లా బౌలర్లలో ముస్తఫిజుర్ రెహ్మాన్, మెహాది హసన్ మిరాజ్ తలా వికెట్ సాధించాడు. ఇక తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 127 పరుగులకే ఆలౌటైంది. పేసర్ అర్ష్‌దీప్ సింగ్, మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి తలా 3 వికెట్ల పడగొట్టి బంగ్లా పతనాన్ని శాసించారు.వీరిద్దరితో పాటు హార్దిక్ పాండ్యా, సుందర్, మయాంక్ యాదవ్ తలా వికెట్ సాధించారు. బంగ్లా బ్యాటర్లలో ఆల్‌రౌండర్ మెహదీ హసన్(35 నాటౌట్) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అతడితో పాటు కెప్టెన్ షాంటో(27) పరుగులతో పర్వాలేదన్పించాడు. -
వరల్డ్ రికార్డుపై కన్నేసిన సూర్య భాయ్..!
భారత టీ20 జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఓ భారీ రికార్డుపై కన్నేశాడు. అక్టోబర్ 6న బంగ్లాదేశ్‌తో జరుగబోయే తొలి టీ20లో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు సాధిస్తే.. పొట్టి క్రికెట్ చరిత్రలో అత్యధిక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు గెలిచిన ఆటగాడిగా ప్రపంచ రికార్డు నెలకొల్పుతాడు. స్కై ప్రస్తుతం అంతర్జాతీయ టీ20ల్లో 71 మ్యాచ్‌లు ఆడి 16 ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు గెలుచుకున్నాడు. స్కైతో పాటు మలేషియా ఆటగాడు విరన్‌దీప్ సింగ్, టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి కూడా 16 ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు గెలుచుకున్నారు. అయితే వీరిద్దరితో పోలిస్తే స్కై అతి తక్కువ మ్యాచ్‌ల్లో ఈ ఘనత సాధించాడు. విరన్‌దీప్ 84 మ్యాచ్‌ల్లో 16 ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు గెలిస్తే.. విరాట్ 125 మ్యాచ్‌ల్లో 16 ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు సాధించాడు. ఈ జాబితాలో స్కై, విరన్‌దీప్, విరాట్ తర్వాత జింబాబ్వే ఆటగాడు సికందర్ రజా (15), ఆఫ్ఘన్ ఆటగాడు మొహమ్మద్ నబీ (14), టీమిండియా టెస్ట్, వన్డే జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ (14) ఉన్నారు.కాగా, బంగ్లాదేశ్‌తో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ అక్టోబర్ 6 నుంచి ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఈ సిరీస్‌లోని తొలి మ్యాచ్‌కు గ్వాలియర్‌లోని మాధవరావ్ సింథియా స్టేడియం వేదిక కానుంది. అనంతరం రెండో టీ20 అక్టోబర్ 9న న్యూఢిల్లీ వేదికగా.. మూడో టీ20 అక్టోబర్ 12న హైదరాబాద్ వేదికగా జరుగనున్నాయి.బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌కు భారత జట్టు..అభిషేక్ శర్మ, సంజు శాంసన్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), రియాన్ పరాగ్, హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్, శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, అర్షదీప్ సింగ్, మయాంక్ యాదవ్, నితీశ్ కుమార్ రెడ్డి, జితేశ్ శర్మ, వరుణ్ చక్రవర్తి, హర్షిత్ రాణాచదవండి: టీమిండియా స్పీడ్ గన్స్... ఫైరింగ్‌కు సిద్ధం! -
అభిమన్యు ఈశ్వరన్ సెంచరీ.. నిరాశపరిచిన స్కై, రుతు, ఇషాన్
దులీప్ ట్రోఫీ 2024లో ఇండియా-బి కెప్టెన్ అభిమన్యు ఈశ్వరన్ వరుసగా రెండో సెంచరీ చేశాడు. అనంతపురం వేదికగా ఇండియా-డితో జరుగుతున్న మ్యాచ్‌లో ఈశ్వరన్ 116 పరుగులు చేసి ఔటయ్యాడు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఇండియా-బి తొలి ఇన్నింగ్స్‌లో 6 వికెట్ల నష్టానికి 210 పరుగులు చేసింది. వాషింగ్టన్ సుందర్ (39), రాహుల్ చాహర్ (0) క్రీజ్‌లో ఉన్నారు. ఇండియా-డి బౌలర్లలో అర్షదీప్ సింగ్ 3, ఆధిత్య థాకరే 2, సౌరభ్ కుమార్ ఓ వికెట్ పడగొట్టారు. ఇండియా-బి ఇండియా-డి తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు ఇంకా 139 పరుగులు వెనుకపడి ఉంది.సూర్యకుమార్ యాదవ్ విఫలంఇండియా-బి ఇన్నింగ్స్‌లో ఈశ్వరన్ మినహా ఎవ్వరూ రాణించలేదు. గాయం తర్వాత రీ ఎంట్రీ ఇచ్చిన స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ ఐదు పరుగులు మాత్రమే చేసి అర్షదీప్ సింగ్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. ఎన్ జగదీషన్ (13), సుయాశ్ ప్రభుదేశాయ్ (16), ముషీర్ ఖాన్ (5), నితీశ్ రెడ్డి (0) కూడా విఫలమయ్యారు.సంజూ మెరుపు సెంచరీసంజూ శాంసన్ మెరుపు సెంచరీతో (106) చెలరేగడంతో ఇండియా-డి తొలి ఇన్నింగ్స్‌లో 349 పరుగులకు ఆలౌటైంది. దేవ్‌దత్ పడిక్కల్ (50), శ్రీకర్ భరత్ (52), రికీ భుయ్ (56) అర్ద సెంచరీలతో రాణించారు. ఇండియా-బి బౌలర్లలో నవ్‌దీప్ సైనీ ఐదు వికెట్లు తీయగా.. రాహుల్ చాహర్ 3, ముకేశ్ కుమార్ ఓ వికెట్ పడగొట్టారు.నిరాశపరిచిన రుతురాజ్, ఇషాన్ కిషన్అనంతపురంలోనే జరుగుతున్న మరో మ్యాచ్‌లో (ఇండియా-ఏతో) ఇండియా-సి ఆటగాళ్లు రుతురాజ్ గైక్వాడ్ (17), సాయి సుదర్శన్ (17), రజత్ పాటిదార్ (0), ఇషాన్ కిషన్ (5) నిరాశపరిచారు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఇండియా-సి తొలి ఇన్నింగ్స్‌లో 7 వికెట్ల నష్టానికి 216 పరుగులు చేసింది.రాణించిన అభిషేక్ పోరెల్ఇండియా-సి ఇన్నింగ్స్‌లో అభిషేక్ పోరెల్ (82) ఒక్కడే చెప్పుకోదగ్గ స్కోర్ చేశాడు. పుల్కిత్ నారంగ్ (35 నాటౌట్), విజయ్ కుమార్ వైశాఖ్ (14 నాటౌట్) క్రీజ్‌లో ఉన్నారు. ఇండియా-ఏ చేసిన తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు ఇండియా-సి ఇంకా 81 పరుగులు వెనుకపడి ఉంది. ఇండియా-ఏ బౌలర్లలో ఆకిబ్ ఖాన్ 3, షమ్స్ ములానీ 2, ఆవేశ్ ఖాన్, తనుశ్ కోటియన్ తలో వికెట్ పడగొట్టారు.శాశ్వత్ రావత్ సెంచరీ.. హాఫ్ సెంచరీ చేసిన ఆవేశ్ ఖాన్శాశ్వత్ రావత్ సెంచరీతో (124) కదంతొక్కడంతో ఇండియా-ఏ తొలి ఇన్నింగ్స్‌లో 297 పరుగులు చేసింది. ఆవేశ్ ఖాన్ (51 నాటౌట్) అర్ద సెంచరీతో రాణించాడు. టెయిలెండర్లు షమ్స్ ములానీ (44), ప్రసిద్ద్ కృష్ణ (34) పర్వాలేదనిపించారు. ఇండియా-సి బౌలర్లలో విజయ్‌కుమార్ 4, అన్షుల్ కంబోజ్ 3, గౌరవ్ యాదవ్ 2 వికెట్లు పడగొట్టారు. చదవండి: IND VS BAN 1st Test: మరో అరుదైన మైలురాయిని అధిగమించిన విరాట్ -
శ్రేయస్ అయ్యర్‌కు షాక్.. కేకేఆర్ కెప్టెన్‌గా సూర్యకుమార్!?
ఐపీఎల్-2025 సీజన్‌కు ముందు అన్ని ఫ్రాంచైజీలు కీలక మార్పులు దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది ఆఖరిలో జరగనున్న మెగా వేలం కోసం ఆయా జట్లు ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్దం చేసుకుంటున్నాయి.ఇప్పటికే ముంబై ఇండియన్స్‌కు రోహిత్ శర్మ గుడ్‌బై చెప్పనున్నాడనే ప్రచారం జోరుగా సాగుతుండగా.. డిఫెండింగ్ ఛాంపియన్ కోల్‌కోతా నైట్‌రైడర్స్‌కు సంబంధించి ఓ వార్త సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతోంది. ఐపీఎల్-2024లో తమ జట్టును ఛాంపియన్‌గా నిలిపిన కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌ను కేకేఆర్ యాజమాన్యం విడిచిపెట్టనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.కేకేఆర్ కెప్టెన్‌గా సూర్యకుమార్..?గౌతం గంభీర్ తర్వాత కేకేఆర్‌కు టైటిల్ అందించిన రెండో కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ నిలిచాడు. అయితే మెంటార్‌గా పనిచేసిన గౌతం గంభీర్.. ఇప్పుడు భారత ప్రధాన కోచ్ బాధ్యతలు చేపట్టడంతో తమ కెప్టెన్ కూడా మార్చాలని కేకేఆర్ భావిస్తున్నట్లు వినికిడి.ముంబై ఇండియన్స్ స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్‌ను ట్రేడింగ్ ద్వారా సొంతం చేసుకోవాలని కేకేఆర్ యోచిస్తున్నట్లు సమాచారం. అందుకు బదులుగా కేకేఆర్ అయ్యర్‌ను ముంబైకి అప్పగించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఇరు ఫ్రాంచైజీల మధ్య డీల్ కుదిరినట్లు సమాచారం. సూర్యకు అయ్యర్ స్ధానంలో తమ జట్టు పగ్గాలని అప్పగించాలని కేకేఆర్ ప్లాన్ చేస్తున్నట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. అదేవిధంగా గంభీర్ స్ధానంలో ఆసీస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ మెంటార్ బాధ్యతలు చేపట్టనున్నట్లు క్రికెట్ వర్గాలు వెల్లడించాయి.చదవండి: AUS vs ENG: లివింగ్ స్టోన్ ఊచకోత.. ఆసీస్‌పై ఇంగ్లండ్‌పై ఘన విజయం -
సూర్యకుమార్‌కు గాయం.. దులీప్ ట్రోఫీకి దూరం
ముంబై తరఫున బుచ్చిబాబు టోర్నమెంట్ ఆడుతున్న టీమిండియా స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ అనూహ్యంగా గాయడపడ్డాడు. తమిళనాడుతో మ్యాచ్ సందర్భంగా స్కై చేతికి గాయమైంది. ఈ కారణంగా అతను దులీప్ ట్రోఫీ ఓపెనింగ్ రౌండ్‌కు దూరం కానున్నాడు. స్కై దులీప్ ట్రోఫీలో ఇండియా-సికి ఆడాల్సి ఉండింది. దులీప్ ట్రోఫీలో ఇండియా-సి మ్యాచ్ సెప్టెంబర్ 5 నుంచి 8 వరకు అనంతపురం వేదికగా జరుగనుంది. ఈ మ్యాచ్‌లో ఇండియా-సి.. ఇండియా-డితో తలపడనుంది. సూర్యకుమార్ గాయపడిన విషయాన్ని బీసీసీఐ వర్గాలు ధృవీకరించాయి. సై.. బెంగళూరులోని నేషనల్ క్రికెట్ ఆకాడమీలో రిపోర్ట్ చేసినట్లు తెలుస్తుంది.స్కై గాయం కారణంగా దులీప్ ట్రోఫీ తొలి రౌండ్ మ్యాచ్‌కు దూరం కావడంతో టెస్ట్ క్రికెట్లోకి రీఎంట్రీ ఇవ్వాలన్న అతని కలలు కల్లలుగా మారిపోయాయి. స్కై లేకుండానే టీమిండియా మిడిలార్డర్లో తీవ్రమైన పోటీ నెలకొని ఉంది. ఒకవేళ దులీప్ ట్రోఫీలో స్కై ఊహించిన దానికంటే అధికంగా రాణించినా జట్టులో చోటు దక్కడం కష్టమే అవుతుంది. మిడిలార్డర్లో ఎవరిని ఎంపిక చేయాలో తెలియక టీమిండియా మేనేజ్మెంట్ ఇప్పటినుంచే తలలు పట్టుకుని కూర్చుంది. దులీప్ ట్రోఫీలో ప్రదర్శనల ఆధారంగా బంగ్లాదేశ్‌తో టెస్ట్ సిరీస్‌కు భారత జట్టును ఎంపిక చేసే అవకాశం ఉంది. దులీప్ ట్రోఫీలో సీనియర్లు మినహా టీమిండియాలో చోటు ఆశిస్తున్న వారంతా పాల్గొంటున్నారు.దులీప్ ట్రోఫీ తొలి మ్యాచ్ ఇండియా-ఏ, ఇండియా-బి మధ్య సెప్టెంబర్ 5న బెంగళూరు వేదికగా మొదలవుతుంది. అదే రోజు అనంతపురంలో ఇండియా-సి, ఇండియా-డి జట్లు పోటీపడతాయి. ఈ టోర్నీలో మొత్తం ఆరు మ్యాచ్‌లు జరుగుతాయి. ప్రతి జట్టు తలో మూడు మ్యాచ్‌లు ఆడుతుంది. ఈ టోర్నీ అనంతరం స్వదేశంలోనే బంగ్లాదేశ్‌తో టెస్ట్ సిరీస్ మొదలవుతుంది. సెప్టెంబర్ 19న తొలి టెస్ట్, సెప్టెంబర్ 27న రెండో టెస్ట్ మ్యాచ్ జరుగుతుంది. అనంతరం అక్టోబర్ 6, 9, 12 తేదీల్లో మూడు టీ20 జరుగుతాయి. -
నిరాశపరిచిన శ్రేయస్, సూర్యకుమార్
బుచ్చిబాబు టోర్నీలో టీమిండియా స్టార్లు శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్ తీవ్రంగా నిరాశపరిచారు. తమిళనాడు క్రికెట్ అసోసియేషన్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబైకి ప్రాతనిథ్యం వహించిన ఈ ఇద్దరు తక్కువ స్కోర్లకే ఔటయ్యారు. శ్రేయస్ 3 బంతుల్లో 2 పరుగులు చేసి సాయి కిశోర్ బౌలింగ్‌లో ఔట్ కాగా.. సూర్యకుమార్ యాదవ్ 38 బంతుల్లో 3 ఫోర్లు, సిక్సర్ సాయంతో 30 పరుగులు చేసి అజిత్ రామ్ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. ఫలితంగా ముంబై తొలి ఇన్నింగ్స్‌లో 8 వికెట్ల నష్టానికి 141 పరుగులు చేసింది. దివ్యాన్ష్ సక్సెనా(61 నాటౌట్) హాఫ్ సెంచరీతో రాణించగా.. మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. అంతకుముందు తమిళనాడు 117.3 ఓవర్లలో 379 పరుగులకు ఆలౌటైంది. ప్రదోష్ 65, ఇంద్రజిత్ 61, భూపతి 82, అజిత్ 53 పరుగులు చేయగా.. ముంబై బౌలర్ హిమాన్షు 81 పరుగులిచ్చి ఐదు వికెట్లు పడగొట్టాడు.కాగా, బుచ్చిబాబు టోర్నీలో సత్తా చాటి బంగ్లాదేశ్ సిరీస్‌కు ముందు భారత సెలెక్టర్లను ఆకర్శిgచాలని శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్ అనుకున్నారు. అయితే వారి ఆశలు అడియాసలయ్యాయి. సాయి కిషోర్, అజిత్ రామ్ వారి ఆశలపై నీళ్లు చల్లారు. వీరిద్దరు మిగతా టీమిండియా ఆటగాళ్లతో కలిసి వచ్చే నెలలో జరిగే దులీప్ ట్రోఫీలో మరోసారి తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఈ టోర్నీలో రాణిస్తే బంగ్లాతో సిరీస్‌కు టీమిండియాలో చోటు దక్కడం దాదాపుగా ఖయమనే చెప్పాలి. అయితే ఈ టోర్నీలో సత్తా చాటడం అంత ఈజీ కాదు. జాతీయ జట్టుకు ఆడిన ఆటగాళ్లంతా ఈ టోర్నీలో పాల్గొంటున్నారు. దీంతో ఇక్కడ పరుగులు సాధించడం కష్టమవుతుంది. వచ్చే నాలుగు నెలల్లో భారత్ 10 టెస్ట్ మ్యాచ్‌లు ఆడనుండటంతో శ్రేయస్, సూర్యకుమార్ లాంటి చాలామంది క్రికెటర్లు రెడ్ బాల్ క్రికెట్‌పై దృష్టి పెట్టారు. టీమిండియాలో చోటే లక్ష్యంగా వీరంతా పావులు కదుపతునున్నారు. -
టెస్ట్‌లకే నా మొదటి ప్రాధాన్యత: సూర్యకుమార్ యాదవ్
టీమిండియా విధ్వంసకర ఆటగాడు, మిస్టర్ 360 డిగ్రీస్ ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్ టెస్ట్ క్రికెట్‌పై తన మనోగతాన్ని వెల్లడించాడు. టెస్ట్‌ల్లో ఆడటమే తన లక్ష్యమని పేర్కొన్నాడు. స్పోర్ట్స్టార్తోమాట్లాడుతూ.. రెడ్ బాల్ క్రికెట్‌కే తన మొదటి ప్రాధాన్యత అని అన్నాడు. టీ20ల్లో అత్యున్నత శిఖరాలు అధిరోహించిన స్కై.. సుదీర్ఘ ఫార్మాట్లోకి రీఎంట్రీ ఇచ్చేందుకు ఆసక్తి కనబరుస్తున్నాడు. చిన్నతనం నుంచి రెడ్ బాల్ క్రికెట్ ఆడుతూనే పెరిగానని గుర్తు చేసుకున్న స్కై.. ఆ వయసు నుంచే టెస్ట్ క్రికెట్‌పై మక్కువ ఎక్కువగా ఉండేదని అన్నాడు.భారత టెస్ట్ జట్టులో స్థానం కోసం చాలామంది అహర్నిశలు శ్రమించారని అన్న స్కై.. తాను కూడా టెస్ట్ జట్టులో చోటే లక్ష్యంగా కష్టపడుతున్నానని తెలిపాడు. యువ క్రికెటర్లకు టెస్ట్ జట్టులో స్థానంపై స్కై స్పందిస్తూ.. అర్హులైన వారందరికీ సరైన అవకాశాలు లభించాయని అన్నాడు. కాగా, సూర్యకుమార్ గతేడాది టెస్ట్‌ల్లో అరంగేట్రం చేసిన విషయం తెలిసిందే. అయితే తొలి టెస్ట్ ఆడిన అనంతరం అతను గాయపడి జట్టుకు దూరమయ్యాడు. అతని గైర్హాజరీలో యువ ఆటగాళ్లు అతని స్థానాన్ని ఆక్రమించాడు. తనకు లభించిన ఏకైక అవకాశాన్ని స్కై సద్వినియోగం చేసుకోలేకపోయాడు. స్కై టెస్ట్‌ల్లో తన ఏకైక ఇన్నింగ్స్‌లో 8 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు.త్వరలో బంగ్లాదేశ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియాతో టెస్ట్ మ్యాచ్‌లు జరుగనున్న నేపథ్యంలో స్కై టెస్ట్ జట్టులో చోటు ఆశిస్తున్నాడు. మిడిలార్డర్లో స్కై.. కేఎల్ రాహుల్, సర్ఫరాజ్ ఖాన్, శ్రేయస్ అయ్యర్ లాంటి వారి నుంచి పోటీ ఎదుర్కోవాల్సి ఉంటుంది. స్కై.. త్వరలో జరుగనున్న దేశవాలీ మ్యాచ్‌ల్లో రాణిస్తే టెస్ట్ జట్టు తలుపులు తట్టే అవకాశాలు లేకపోలేదు. ఏదిఏమైనా మిడిలార్డర్లో పోటీ తీవ్రంగా ఉంది కాబట్టి స్కై అనుకున్న దానికంటే మరింత ఎక్కువగా కష్టపడాల్సి ఉంటుంది. -
సిక్సర్ల వర్షం.. సూర్యకుమార్ రికార్డు బ్రేక్ చేసిన పూరన్
దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టీ20లో 7 వికెట్ల తేడాతో వెస్టిండీస్ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో వెస్టిండీస్ వికెట్ కీపర్ బ్యాటర్ నికోలస్ పూరన్ విధ్వంసం సృష్టించాడు. 175 పరుగుల లక్ష్య చేధనలో సఫారీ బౌలర్లను పూరన్ ఊచకోత కోశాడు. కేవలం 26 బంతులు మాత్రమే ఎదుర్కొన్న పూరన్.. 7 సిక్స్‌లు, 2 ఫోర్లతో 65 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. అతడి విధ్వంసకర ఇన్నింగ్స్ ఫలితంగా విండీస్ లక్ష్యాన్ని కేవలం 17.5 ఓవర్లలో కేవలం 3 వికెట్లు మాత్రమే కోల్పోయి ఊదిపడేసింది.సూర్యను అధిగమించిన పూరన్.. ఇక మ్యాచ్‌లో సిక్సర్ల వర్షం కురిపించిన పూరన్ ఓ అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక సిక్స్‌లు బాదిన జాబితాలో పూరన్ మూడో స్ధానానికి ఎగబాకాడు. 96 టీ20ల్లో 139 సిక్స్‌లు బాదిన ఈ కరేబియన్ వీరుడు.. మోస్ట్ సిక్స్‌ల జాబితాలో మూడో స్ధానంలో కొనసాగుతున్నాడు.ఈ క్రమంలో ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్(137), టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్(136)ను పూరన్ అధిగమించాడు. ఇక ఈ అరుదైన ఘనత సాధించిన జాబితాలో రోహిత్ శర్మ(205) అగ్రస్ధానంలో కొనసాగుతున్నాడు. -
గంభీర్‌కు షాకిచ్చిన సూర్య.. మనసులో మాట చెప్పిన మిస్టర్ 360
టీమిండియా స్టార్ క్రికెటర్, టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ రెడ్ బాల్ క్రికెట్లో రీ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్దమయ్యాడు. బుచ్చి బాబు టోర్నమెంట్-2024లో ముంబై తరపున సూర్యకుమార్ ఆడనున్నాడు.ఈ టోర్నీతో పాటు రాబోయో రంజీ ట్రోఫీ సీజన్లో కూడా సూర్యకుమార్ ఆడనున్నట్లు తెలుస్తోంది. ఈ రెండు టోర్నీల్లో మెరుగ్గా రాణించి భారత్ తరపున టెస్టుల్లో పునరాగమనం చేయాలని సూర్య భావిస్తున్నాడు. ఈ ముంబైకర్ టీమిండియా తరపున ఇప్పటివరకు కేవలం ఒక టెస్టు మ్యాచ్ ఆడాడు. గతేడాది బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఆస్ట్రేలియాపై సూర్య టెస్టు అరంగేట్రం చేశాడు. తన అరంగేట్ర మ్యాచ్‌లో అతడు కేవలం 8 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. అనంతరం గాయం కారణంగా సిరీస్ నుంచి ఈ మిస్టర్ 360 తప్పుకున్నాడు.ఆ తర్వాత అతడికి టెస్టుల్లో అవకాశం లభించలేదు. ఈ క్రమంలో తాజాగా టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడిన సూర్యకుమార్ మూడు ఫార్మాట్లలో ఆడాలన్న తన కోరికను వ్యక్తం చేశాడు.నేను టీమిండియా తరపున మూడు ఫార్మాట్లలో ఆడాలనకుంటున్నాను. టెస్టు క్రికెట్ ఆడేందుకు బుచ్చిబాబు టోర్నమెంట్ మంచి ప్రాక్టీస్‌గా ఉపయోగపడుతుందని భావిస్తున్నానని సూర్య పేర్కొన్నాడు. స్కై బుచ్చిబాబు టోర్నీలో ఆడటం పట్ల ముంబై చీఫ్ సెలక్టర్ సంజయ్ పాటిల్ సైతం సంతోషం వ్యక్తం చేశాడు.సూర్య నాకు ఫోన్ చేసి బుచ్చి బాబు టోర్నమెంట్లో ఆడాలనుకుంటున్నానని చెప్పాడు. తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ నిర్వహిస్తున్న ఈ టోర్నీ రెండో మ్యాచ్‌లో సూర్య ఆడనున్నాడు. అతడు జట్టులోకి వస్తాను అంటే వద్దు అనే వారు ఎవరూ లేరు.సూర్య రాకతో ముంబై జట్టు మరింత బలోపేతం కానుంది. అతడు ఈ టోర్నీలో ఆడటం చాలా సంతోషంగా ఉంది అని సంజయ్ పాటిల్ చెప్పుకొచ్చాడు. కాగా ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో సూర్యకు మంచి ట్రాక్ రికార్డు ఉంది. 137 ఇన్నింగ్స్‌ల్లో 63.74 స్ట్రయిక్ రేటుతో అతడు 5,628 పరుగులు సాధించాడు. అతడి ఇన్నింగ్స్‌లలో 14 సెంచరీలు, 29 అర్ధ శతకాలు ఉన్నాయి. అయితే భారత కొత్త హెడ్‌కోచ్ గౌతం గంభీర్, బీసీసీఐ సూర్యను కేవలం టీ20 స్పెషలిస్ట్ బ్యాటర్‌గానే పరిగణించారు. ఈ క్రమంలోనే సూర్యకు భారత టీ20 జట్టు పగ్గాలు అప్పగించారు. లంకతో టీ20లు ఆడిన సూర్యను వన్డే సిరీస్‌కు మాత్రం ఎంపిక చేయలేదు. ఈ నేపథ్యంలో సూర్య మూడు ఫార్మాట్ల ఆడాలనకుంటున్నట్లు ప్రకటించడం గమనార్హం. అయితే అంతర్జాతీయ క్రికెట్లో సూర్యకు టీ20ల్లో తప్ప మిగితా ఫార్మాట్లలో గణనీయమైన రికార్డు లేదు. -
హార్దిక్ పాండ్యాకు షాక్!.. ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా సూర్యకుమార్?
ఐపీఎల్ 2025 మెగా వేలానికి ముందు ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ కీలక మార్పులు దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. తమ జట్టు కెప్టెన్, టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాను ముంబై ఫ్రాంచైజీ విడిచిపెట్టాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఐపీఎల్-2024 సీజన్‌కు ముందు గుజరాత్ టైటాన్స్ నుంచి ట్రేడ్ చేసుకుని మరి తమ జట్టు పగ్గాలను ముంబై మెనెజ్‌మెంట్ హార్దిక్‌కు అప్పగించింది. రోహిత్ శర్మ స్ధానంలో ముంబై కెప్టెన్‌గా బాధ్యతలు చేపపట్టిన హార్దిక్.. తన మార్క్‌ను చూపించలేకపోయాడు.అతడి సారథ్యంలో దారుణ ప్రదర్శరన కనబరిచిన ముంబై కనీసం లీగ్ స్టేజిని కూడా దాటలేకపోయింది. ఈ ఏడాది సీజన్లో 14 మ్యాచ్‌లు ఆడిన ముంబై కేవలం నాలుగింట మాత్రమే విజయం సాధించింది. ఆటగాడిగా కూడా పాండ్యా విఫలమయ్యాడు. ఈ క్రమంలోనే అతడిని రిటైన్ చేసుకోకూడదని ముంబై నిర్ణయించుకున్నట్లు వినికిడి. అతడి స్ధానంలో సూర్యకుమార్ యాదవ్‌ను తమ జట్టు కెప్టెన్‌గా నియమించాలని ముంబై ఫ్రాంచైజీ యోచిస్తున్నట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. సూర్యకుమార్ యాదవ్ ఇటీవలే భారత టీ20 జట్టు కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టాడు. హార్దిక్ పాండ్యాను కాదని రోహిత్ శర్మ వారసుడిగా సూర్యను బీసీసీఐ ఎంపిక చేసింది. శ్రీలంక టీ20 సిరీస్‌తో భారత జట్టు కెప్టెన్‌గా సూర్య తన ప్రయాణాన్ని ప్రారంభించాడు. కెప్టెన్‌గా తన తొలి సిరీస్‌లోనే సూర్య ఆకట్టుకున్నాడు. లంకతో మూడు టీ20ల సిరీస్‌ను భారత్ 3-0 క్లీన్ స్వీప్ చేసింది. -
వార్నర్ రికార్డును సమం చేసిన సూర్యకుమార్ యాదవ్
శ్రీలంకతో జరిగిన మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో అద్భుత ప్రదర్శన కనబర్చినందుకు గానూ టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు గెలుచుకున్నాడు. ఈ సిరీస్‌లో స్కై 3 మ్యాచ్‌ల్లో 92 పరుగులే చేసినప్పటికీ.. చాలా కీలకమైన ఇన్నింగ్స్‌లు ఆడాడు. మూడో టీ20లో అతను బంతితోనూ (1-0-5-2) మ్యాజిక్ చేశాడు. ఫుల్ టైమ్ కెప్టెన్‌గా స్కైకు ఇది తొలి సిరీస్. తొలి సిరీస్‌లోనే స్కై.. ప్రత్యర్ది జట్టును క్లీన్ స్వీప్ చేశాడు.టీ20ల్లో స్కైకు ఇది ఐదో ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు. ఈ అవార్డుతో అతను అత్యధిక ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డులు గెలుచుకున్న ఆటగాళ్ల జాబితాలో రెండో స్థానానికి ఎగబాకాడు. స్కై.. బాబర్ ఆజమ్, డేవిడ్ వార్నర్, షకీబ్ అల్ హసన్‌లతో సమంగా ఐదు ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డులు గెలుచుకున్నాడు. ఈ జాబితాలో విరాట్ కోహ్లి (7) టాప్‌లో ఉన్నాడు.మూడో టీ20 విషయానికొస్తే.. లంకపై భారత్ సూపర్ ఓవర్లో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 137 పరుగులు చేయగా.. ఛేదనలో శ్రీలంక సైతం అన్నే పరుగులు చేసింది. రింకూ సింగ్, సూర్యకుమార్ చివరి రెండో ఓవర్లు అద్భుతంగా బౌలింగ్ చేసి టీమిండియాను ఓటమి నుంచి గట్టెక్కించారు. అనంతరం సూపర్ ఓవర్లో వాషింగ్టన్ సుందర్ అద్భుతంగా బౌలింగ్ చేసి (2/2) భారత్ గెలుపుకు బాటలు వేశాడు. సూర్యకుమార్ తొలి బంతికే బౌండరీ మ్యాచ్‌ను ముగించాడు. ఈ గెలుపుతో భారత్ మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 3-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసింది. రెగ్యులర్ మ్యాచ్‌లో 2 వికెట్లు, 25 పరుగులు.. సూపర్ ఓవర్లో 2 వికెట్లు తీసి టీమిండియా గెలుపులో ప్రధానపాత్ర పోషించిన సుందర్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. -
రింకూ, సూర్యకుమార్ అద్భుత బౌలింగ్.. సూపర్ ఓవర్లో లంకను చిత్తు చేసిన భారత్
శ్రీలంకతో జరిగిన మూడో టీ20లో టీమిండియా ఓడాల్సిన మ్యాచ్‌లో గెలిచింది. పార్ట్ టైమ్ బౌలర్ల అయిన రింకూ సింగ్, సూర్యకుమార్ అద్బుతంగా బౌలింగ్ చేసి మ్యాచ్‌ను 'టై' చేశారు. అనంతరం సూపర్ ఓవర్లో టీమిండియా ఘన విజయం సాధించింది. 138 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనలో శ్రీలంక తడబడింది. చివరి ఏడు వికెట్లను 22 పరుగుల వ్యవధిలో (4.2 ఓవర్లలో) కోల్పోయింది. 19వ ఓవర్ వేసిన రింకూ సింగ్ కేవలం మూడు పరుగులు మాత్రమే ఇచ్చి 2 వికెట్లు తీయగా.. 20వ ఓవర్ వేసిన కెప్టెన్ సూర్యకుమార్ 5 పరుగులిచ్చి రెండు వికెట్లు పడగొట్టాడు. రింకూ, స్కై సూపర్ బౌలింగ్‌తో చెలరేగడంతో మ్యాచ్ 'టై'గా మారి సూపర్ ఓవర్‌కు దారి తీసింది.GG & SURYA 🤝 DOING INNOVATION. 😄- A 20th over of the match was bowled by Suryakumar Yadav and he defended 6 runs. 🤯pic.twitter.com/dBIT8XdqX0— Mufaddal Vohra (@mufaddal_vohra) July 30, 2024సూపర్ ఓవర్లో వాషింగ్టన్ సుందర్ సూపర్‌గా బౌలింగ్ చేసి రెండు వికెట్లు తీసి రెండు పరుగులు మాత్రమే ఇచ్చాడు. అనంతరం సూర్యకుమార్ తొలి బంతికే బౌండరీ బాది టీమిండియాకు చిరస్మరణీయ విజయాన్నందించాడు. ఈ గెలుపుతో భారత్ మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 3-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసింది. ఓడాల్సిన మ్యాచ్‌ను సూపర్ ఓవర్ దాకా తీసుకెళ్లి గెలవడంతో పార్ట్ టైమ్ బౌలర్లు రింకూ సింగ్, సూర్యకుమార్ యాదవ్‌లపై ప్రశంసల వర్షం కురుస్తుంది. ముఖ్యంగా చివరి ఓవర్ అద్భుతంగా బౌలింగ్ చేసిన స్కైను అభిమానులు ఆకాశానికెత్తుతున్నారు. RINKU SINGH, THE STAR IN THE 19TH OVER. 🔥 pic.twitter.com/eDv1Qt3uYj— Johns. (@CricCrazyJohns) July 30, 2024నిజమైన మ్యాచ్ విన్నర్ అంటూ కొనియాడుతున్నారు. సూపర్ ఓవర్ వేసిన సుందర్‌పై కూడా ప్రశంసల వర్షం కురుస్తుంది. సూపర్ ఓవర్లో అద్బుతంగా బౌలింగ్ చేశాడంటూ నెటిజన్లు కితాబునిస్తున్నారు. రెగ్యులర్ మ్యాచ్‌లో రెండు, సూపర్ ఓవర్లో రెండు వికెట్లు తీయడంతో పాటు కీలకమైన 25 పరుగులు చేసిన సుందర్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా ఎంపికయ్యాడు. రెగ్యులర్ కెప్టెన్‌గా తొలి సిరీస్‌లోనే అద్భుతంగా రాణించిన సూర్యకుమార్‌కు ప్లేయర్ ఆఫ్ సిరీస్ అవార్డు లభించింది.ఇక ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 137 పరుగులు చేసింది. శుభ్‌మన్ గిల్ (39), రియాన్ పరాగ్ (26), సుందర్ (25) ఓ మోస్తరు పరుగులు చేశారు. లంక బౌలరల్లో తీక్షణ 3, హసరంగ 2, విక్రమసింఘే, అశిత ఫెర్నాండో, రమేశ్ మెండిస్ తలో వికెట్ పడగొట్టారు.అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనకు దిగిన శ్రీలంక ఆదిలో గెలుపు దిశగా పయనించినప్పటికీ చివర్లో తడబడి ఓటమిని కొనితెచ్చుకుంది. ఆ జట్టు నిర్ణీత ఓవర్లు పూర్తయ్యేసరికి 8 వికెట్ల నష్టానికి 137 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఓపెనర్లు నిస్సంక (26), కుశాల్ మెండిస్ (43), వన్‌డౌన్ బ్యాటర్ (46) ఓ మోస్తరు స్కోర్లు చేసినా ప్రయోజనం లేకుండా పోయింది. మిగతా ఆటగాళ్లంతా కనీసం రెండంకెల స్కోర్లు కూడా చేయలేకపోయారు. భారత బౌలర్లలో సుందర్, బిష్ణోయ్, రింకూ సింగ్, స్కై తలో 2 వికెట్లు తీశారు. కాగా, ఇరు జట్ల మధ్య మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ఆగస్ట్ 2, 4, 7 తేదీల్లో కొలొంబో వేదికగా జరుగనుంది. -
IND vs SL 3rd T20: తడబడిన భారత బ్యాటర్లు.. శ్రీలంక టార్గెట్ ఎంతంటే?
పల్లెకెలె వేదికగా శ్రీలంకతో జరుగుతున్న ఆఖరి టీ20లో టీమిండియా బ్యాటర్లు తడబడ్డారు. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 137 పరుగులకే పరిమిత మైంది. లంక బౌలర్ల దాటికి భారత బ్యాటర్లు వరుసగా పెవిలియన్‌కు క్యూ కట్టారు. శ్రీలంక బౌలర్లలో మహేష్ థీక్షణ మూడు వికెట్లతో సత్తాచాటగా.. హసరంగా రెండు, విక్రమసింఘే, ఆసితా ఫెర్నాండో చెరో వికెట్ పడగొట్టారు.భారత బ్యాటర్లలో శుబ్‌మన్ గిల్(39) టాప్ స్కోరర్‌గా నిలవగా.. రియాన్ పరాగ్(26), వాషింగ్టన్ సుందర్(25) పరుగులతో పర్వాలేదన్పించాడు. మిగితా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు. భారత వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ వరుసగా రెండో మ్యాచ్‌లోనూ డకౌట్‌గా వెనుదిరిగాడు.కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ కూడా ఈ మ్యాచ్‌లో తన మార్క్‌ను చూపించలేకపోయాడు. ఇక ఇప్పటికే సిరీస్‌ను 2-0 తేడాతో భారత్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. -
పదేళ్ల పాటు టీమిండియా కెప్టెన్ అతడే.. కానీ!
ముప్పై ఏళ్ల వయసులో టీమిండియాలో అరంగేట్రం చేసిన సూర్యకుమార్ యాదవ్.. అనతికాలంలోనే ప్రపంచ నంబర్ వన్ టీ20 బ్యాటర్‌గా ఎదిగాడు. అంతేకాదు.. ఊహించని రీతిలో భారత టీ20 జట్టు కెప్టెన్‌గానూ నియమితుడయ్యాడు. రోహిత్ శర్మ వారసుడిగా.. పూర్తిస్థాయి కెప్టెన్‌గా తొలి సిరీస్‌లోనే విజయం అందుకున్నాడు ఈ మిస్టర్ 360 డిగ్రీ ప్లేయర్.గొప్ప ఆప్షన్లు లేవు కాబట్టేఅయితే, సూర్య పదవి తాత్కాలికమే అంటున్నాడు న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ స్కాట్ స్టైరిస్. దీర్ఘకాలిక ప్రయోజనాల దృష్ట్యా బీసీసీఐ అతడిని ఎంచుకోలేదని అభిప్రాయపడ్డాడు. కొత్త హెడ్ కోచ్ గౌతం గంభీర్‌కు ఇప్పటికిప్పుడు గొప్ప ఆప్షన్లు లేవు కాబట్టే.. సూర్య వైపు మొగ్గుచూపారని పేర్కొన్నాడు. సీనియర్లు రిటైర్ కావడం, హార్దిక్ పాండ్యా ఫిట్నెస్ సమస్యలు సూర్యను కెప్టెన్‌గా నియమించడానికి దోహదం చేశాయని స్టైరిస్ అభిప్రాయం వ్యక్తం చేశాడు.రెండేళ్లపాటు మాత్రమేఏడాది లేదంటే రెండేళ్లపాటు మాత్రమే సూర్యకుమార్ యాదవ్ టీమిండియా టీ20 కెప్టెన్‌గా ఉంటాడని స్టైరిస్ అంచనా వేశాడు. అతడి స్థానంలో యువ ఓపెనర్ శుబ్‌మన్ గిల్ భారత జట్టు పగ్గాలు చేపడతాడని.. అతడిని పూర్తిస్థాయి సారథిగా తీర్చిదిద్దేందుకే సూర్య డిప్యూటీగా నియమించారని పేర్కొన్నాడు. గంభీర్‌కు- భవిష్య కెప్టెన్‌కు మధ్య సూర్య కేవలం ఓ వారథి లాంటివాడు మాత్రమే అని స్టైరిస్ చెప్పుకొచ్చాడు.పదేళ్ల పాటు అతడేటీమిండియా భవిష్య కెప్టెన్ శుబ్‌మన్ గిల్ మాత్రమే అని.. 24 ఏళ్ల ఈ రైట్‌హ్యాండ్ బ్యాటర్ పదేళ్ల పాటు ఆ పదవిలో కొనసాగుతాడని స్కాట్ స్టైరిస్ అభిప్రాయపడ్డాడు. అయితే, ఇప్పుడే భారత జట్టు పగ్గాలు చేపట్టేందుకు తగిన అనుభవం అతడికి లేదని.. అందుకే సూర్య రూపంలో తాత్కాలిక ఏర్పాటు చేశారని పేర్కొన్నాడు. ఒకవేళ సూర్య ద్వైపాక్షిక సిరీస్‌లలో టీమిండియాను విజయవంతంగా ముందుకు నడిపిస్తే.. టీ20 ప్రపంచకప్-2026 వరకు అతడే సారథిగా కొనసాగుతాడని స్టైరిస్ అంచనా వేశాడు.భారత క్రికెట్‌ను ఏలుతాడుశుబ్మన్ గిల్ రోజురోజుకు తన ఆటను మెరుగుపరచుకుంటున్నాడని.. అయితే, మూడు ఫార్మాట్లలో నిలకడగా ఆడటం ముఖ్యమని స్టైరిస్ పేర్కొన్నాడు. అలా అయితేనే, వరుస అవకాశాలు దక్కించుకుని కెప్టెన్ రేసులో ముందుంటాడని అభిప్రాయపడ్డాడు. భవిష్యత్తు ఎలా ఉంటుందో ఎవరూ ఊహించలేరని.. అయితే, తన దృష్టిలో మాత్రం రానున్న దశాబ్దంలో గిల్ భారత క్రికెట్‌ను ఏలుతాడని స్కాట్ స్టైరిస్ పేర్కొన్నాడు. ఇండియా టుడేతో మాట్లాడుతూ ఈ మేరకు తన అభిప్రాయాలు పంచుకున్నాడు.ఇద్దరూ విజయవంతంగాకాగా రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా గైర్హాజరీలో 33 ఏళ్ల సూర్యకుమార్ యాదవ్ తొలిసారిగా భారత టీ20 జట్టుకు సారథ్యం వహించాడు. సొంతగడ్డపై ఆస్ట్రేలియాపై, సౌతాఫ్రికా పర్యటనలో టీమిండియాను విజేతగా నిలిపాడు. తాజాగా రెగ్యులర్ కెప్టెన్‌గా తొలి ప్రయత్నంలోనే శ్రీలంక టూర్లో భారత్‌కు 2-0తో సిరీస్‌ను అందించాడు. మరోవైపు.. టీ20 ప్రపంచకప్-2024 తర్వాత జింబాబ్వే పర్యటనకు వెళ్లిన యువ భారత జట్టుకు శుబ్‌మన్ గిల్ సారథ్యం వహించాడు. 4-1తో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ గెలిచాడు.చదవండి: ‘ద్రవిడ్ వల్లే కాలేదు.. ఇక్కడ నేనే బాస్ అంటే కుదరదు’ -
దటీజ్ సూర్యకుమార్.. విరాట్ కోహ్లి వరల్డ్ రికార్డు సమం
టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ అరుదైన ఘనత సాధించాడు. అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌లు అందుకున్న భారత స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లి రికార్డును సూర్యకుమార్ సమం చేశాడు. పల్లెకెల్ వేదికగా శ్రీలంకతో జరిగిన తొలి టీ20లో ప్లేయర్ ఆఫ్‌ది మ్యాచ్‌గా నిలిచిన సూర్య.. ఈ అరుదైన ఫీట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పటివరకు 125 టీ20లు ఆడిన కోహ్లి 16 సార్లు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అందుకోగా.. సూర్య కూడా సరిగ్గా 16 సార్లు మ్యాన్ ఆఫ్‌ది మ్యాచ్‌గా నిలిచాడు. అయితే సూర్య ఈ ఘనతను కేవలం 69 మ్యాచ్లల్లోఅందుకోవడం గమనార్హం. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. శ్రీలంకపై 43 పరుగుల తేడాతో టీమిండియా ఘన విజయం సాధించింది. 214 పరుగుల భారీ లక్ష్యం సాధించడంలో లంక విఫలమైంది. 19.2 ఓవర్లలో 170 పరుగులకు శ్రీలంక ఆలౌటైంది. భారత బౌలర్లలో రియాన్ పరాగ్ మూడు వికెట్లు పడగొట్టగా.. అర్ష్‌దీప్, అక్షర్ పటేల్ తలా రెండు వికెట్లు సాధించారు. లంక బ్యాటర్లలో నిస్సాంక(79) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 213 పరుగులు చేసింది. సూర్యకుమార్ యాదవ్(58) హాఫ్ సెంచరీతో అదరగొట్టగా.. పంత్(49), జైశ్వాల్(40) పరుగులతో రాణించారు. లంక పేసర్ మతీషా పతిరానా 4 వికెట్లతో సత్తాచాటాడు. ఇరు జట్ల మధ్య రెండో టీ20 పల్లెకెలె వేదికగా ఆదివారం జరగనుంది. -
మేము నిజంగా అదృష్టవంతులం.. అలా జరిగింటేనా: సూర్యకుమార్
శ్రీలంకతో మూడు టీ20ల సిరీస్‌లో భారత్ శుభారంభం చేసింది. పల్లెకెలె వేదికగా శ్రీలంకతో జరిగిన తొలి టీ20లో 43 పరుగుల తేడాతో టీమిండియా ఘన విజయం సాధించింది. 214 పరుగుల భారీ లక్ష్యం సాధించడంలో లంక విఫలమైంది. 19.2 ఓవర్లలో 170 పరుగులకు శ్రీలంక ఆలౌటైంది. భారత బౌలర్లలో రియాన్ పరాగ్ మూడు వికెట్లు పడగొట్టగా.. అర్ష్‌దీప్, అక్షర్ పటేల్ తలా రెండు వికెట్లు సాధించారు. లంక బ్యాటర్లలో నిస్సాంక(79) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 213 పరుగులు చేసింది. సూర్యకుమార్ యాదవ్(58) హాఫ్ సెంచరీతో అదరగొట్టగా.. పంత్(49), జైశ్వాల్(40) పరుగులతో రాణించారు. లంక పేసర్ మతీషా పతిరానా 4 వికెట్లతో సత్తాచాటాడు. ఇక ఈ విజయంపై మ్యాచ్ అనంతరం భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ స్పందించాడు. ఈ మ్యాచ్‌లో అదరగొట్టిన భారత బ్యాటర్లపై సూర్య ప్రశంసల వర్షం కురిపించాడు."కెప్టెన్‌గా తొలి మ్యాచ్‌లో విజయం సాధించడం చాలా సంతోషంగా ఉంది. తొలి బంతి నుంచే మా దూకుడైన స్టైల్లో బ్యాటింగ్ చేశాము. ఓపెనర్లు మాకు మంచి ఆరంభాన్ని ఇచ్చారు. వారు కూడా ఛేజింగ్‌లో అద్భుతంగా ఆడారు. మేము ఇదే పిచ్‌పై దాదాపు మూడు రోజుల ప్రాక్టీస్ చేశాము. ఇక్కడ వికెట్ ఇలా ఉంటుందో మాకు బాగా తెలుసు. ముఖ్యంగా రాత్రి పూట మంచు ఎక్కువగా ఉండి బ్యాటింగ్‌కు ఈజీగా ఉంటుంది. కానీ ఆదృష్టవశాత్తు ఈ మ్యాచ్‌లో మంచు ప్రభావం ఎక్కువగా లేదు. అది మాకు బాగా కలిసొచ్చింది.వరల్డ్‌కప్‌లో కనబరిచిన ఆటతీరునే కొనసాగించేందుకు ప్రయత్నిస్తున్నాము. అదేవిధంగా బ్యాటింగ్ ఆర్డర్లో లెఫ్ట్ అండ్ రైట్ కాంబినేషన్‌ను కొనసాగించాలా లేదా అన్నది జట్టు మెనెజ్‌మెంట్ నిర్ణయం తీసుకుంటుంది. మేము ఆడాల్సిన క్రికెట్ ఇంకా చాలా ఉంది. కాబట్టి జట్టు అవసరం తగ్గటు ఏ నిర్ణమైనా తీసుకుంటామని" పోస్ట్ మ్యాచ్ ప్రేజెంటేషన్‌లో సూర్యకుమార్ యాదవ్ పేర్కొన్నాడు. -
కెప్టెన్‌గా అదుర్స్.. తొలి మ్యాచ్‌లోనే సూర్య ఊచకోత
శ్రీలంకతో జరుగుతున్న తొలి టీ20లో భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ సత్తాచాటాడు. టీమిండియా ఫుల్‌టైమ్ కెప్టెన్‌గా మొదటి మ్యాచ్‌లోనే సూర్యకుమార్ తన విశ్వరూపాన్ని చూపించాడు. శుబ్‌మన్ గిల్ ఔటయ్యాక క్రీజులోకి వచ్చిన సూర్యకుమార్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. లంక బౌలర్లను ఈ ఇండియన్ మిస్టర్ 360 ఊచకోత కోశాడు. తన ట్రేడ్ మార్క్ షాట్లతో అభిమానులను సూర్య అలరించాడు. కేవలం 22 బంతుల్లోనే తన హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. ఈ మ్యాచ్‌లో ఓవరాల్‌గా 26 బంతులు మాత్రమే ఎదుర్కొన్న సూర్యకుమార్.. 8 ఫోర్లు, 2 సిక్స్‌లతో 58 పరుగులు చేసి ఔటయ్యాడు. అతడి ఇన్నింగ్స్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.ఇక ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 213 పరుగుల భారీ స్కోర్ సాధించింది. భారత బ్యాటర్లలో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (58 పరుగులు) టాప్ స్కోరర్‌గా నిలవగా.. యశస్వీ జైశ్వాల్(40), రిషబ్ పంత్(49), శుబ్‌మన్ గిల్(34) పరుగులతో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడారు. లంక బౌలర్లలో మతీషా పతిరాన 4 వికెట్లు పడగొట్టగా.. మధుషంక, హసరంగా, ఫెర్నాండో తలా వికెట్ సాధించారు. Captain's knock by Surya Dada 🌞SKY leading from the front with a quickfire 50 🤩Watch #SLvIND LIVE NOW on #SonyLIV 🍿 #MaamlaGambhirHai pic.twitter.com/BsUmTkm5oH— Sony LIV (@SonyLIV) July 27, 2024 -
మరోసారి నో ఛాన్స్.. పాపం శాంసన్! వరల్డ్ మోస్ట్ అన్‌లక్కీ క్రికెటర్
సంజూ శాంసన్.. ఎప్పుడు జట్టులో ఉంటాడో? ఎప్పుడు డగౌట్లో కూర్చుంటాడో ఎవరికి తెలియదు. గత కొంత కాలంగా అద్భుతంగా రాణిస్తున్నప్పటికి శాంసన్‌ను మాత్రం దురుదృష్టం వెంటాడుతూనే ఉంది. జింబాబ్వే సిరీస్‌లో సత్తాచాటి శ్రీలంకకు పయనమైన సంజూకు మరోసారి నిరాశే ఎదురైంది. లంకతో తొలి టీ20కు భారత తుది జట్టులో శాంసన్‌కు చోటు దక్కలేదు.అతడి స్ధానంలో స్పెషలిస్ట్ వికెట్ కీపర్‌గా రిషబ్ పంత్‌కు జట్టు మెనెజ్‌మెంట్ అవకాశమిచ్చింది. కనీసం టాప్ ఆర్డర్ బ్యాటర్‌గానూ సంజూను పరిగణలోకి తీసుకోలేదు. జింబాబ్వే సిరీస్‌లో విఫలమైన పరాగ్‌కు ఈ మ్యాచ్‌కు అవకాశమిచ్చి.. సంజూను పక్కన పెట్టడాన్ని అభిమానులు తప్పుబడుతున్నారు. శాంసన్ వరల్డ్‌లోనే మోస్ట్ అన్ లక్కీ క్రికెటర్ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఈ జట్టులో సంజూతో పాటు శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్‌లకు సైతం చోటు దక్కలేదు.శ్రీలంకతో తొలి టీ20కు భారత తుది జట్టు ఇదే..శుబ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), రిషబ్ పంత్ (వికెట్ కీపర్), రియాన్ పరాగ్, హార్దిక్ పాండ్యా, రింకు సింగ్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్, మహ్మద్ సిరాజ్ -
India vs sri lanka 1st t20: తొలి టీ20లో భారత్ ఘనవిజయం..
తొలి టీ20లో భారత్ ఘనవిజయం..పల్లెకెలె వేదికగా శ్రీలంకతో జరిగిన తొలి టీ20లో 43 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. 214 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి శ్రీలంక 19.2 ఓవర్లలో 170 పరుగులకు ఆలౌటైంది. భారత బౌలర్లలో రియాన్ పరాగ్ 3 వికెట్లు పడగొట్టగా.. అర్ష్‌దీప్ సింగ్, అక్షర్ పటేల్ తలా రెండు వికెట్లు సాధించారు. మహ్మద్ సిరాజ్, రవి బిష్ణోయ్ చెరో వికెట్ పడగొట్టారు. శ్రీలంక బ్యాటర్లలో నిస్సాంక(79) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 213 పరుగుల భారీ స్కోర్ సాధించింది. భారత బ్యాటర్లలో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (26 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్‌లతో 58 పరుగులు) టాప్ స్కోరర్‌గా నిలవగా.. యశస్వీ జైశ్వాల్(40), రిషబ్ పంత్(49), శుబ్‌మన్ గిల్(34) పరుగులతో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడారు. లంక బౌలర్లలో మతీషా పతిరాన 4 వికెట్లు పడగొట్టగా.. మధుషంక, హసరంగా, ఫెర్నాండో తలా వికెట్ సాధించారు.కమ్‌బ్యాక్ ఇచ్చిన భారత బౌలర్లు..శ్రీలంక వరుస క్రమంలో రెండు వికెట్లు కోల్పోయింది. అక్షర్ పటేల్ బౌలింగ్‌లో కుశాల్ పెరీరా(20) ఔట్ కాగా.. రవి బిష్ణోయ్ బౌలింగ్‌లో అసలంక ఔటయ్యాడు. లంక విజయానికి 24 బంతుల్లో 56 పరుగులు కావాలి. 16 ఓవర్లకు శ్రీలంక స్కోర్: 158/4శ్రీలంక రెండో వికెట్ డౌన్..140 పరుగుల వద్ద శ్రీలంక రెండో వికెట్ కోల్పోయింది. 79 పరుగులతో దూకుడుగా ఆడుతున్న నిస్సాంక.. అక్షర్ పటేల్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయ్యాడు. 14.1 ఓవర్లకు శ్రీలంక స్కోర్: 140/113 ఓవర్లకు శ్రీలంక స్కోర్: 106/1శ్రీలంక దూకుడుగా ఆడుతోంది. 13 ఓవర్లు ముగిసే సరికి వికెట్ నష్టానికి 131 పరుగులు చేసింది. క్రీజులో నిస్సాంక(71), కుశాల్ పెరీరా(12) పరుగులతో ఉన్నారు. లంక విజయానికి 42 బంతుల్లో 83 పరుగులు కావాలి.11 ఓవర్లకు శ్రీలంక స్కోర్: 106/1శ్రీలంక 11 ఓవర్లు ముగిసే సరికి వికెట్ నష్టానికి 106 పరుగులు చేసింది. క్రీజులో నిస్సాంక(49), కుశాల్ పెరీరా(10) పరుగులతో ఉన్నారు.తొలి వికెట్ కోల్పోయిన శ్రీలంక..84 పరుగుల వద్ద శ్రీలంక తొలి వికెట్ కోల్పోయింది. 45 పరుగులు చేసిన కుశాల్ మెండిస్.. అర్ష్‌దీప్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 6 ఓవర్లకు శ్రీలంక స్కోర్: 55/0214 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక 6 ఓవర్లు ముగిసే సరికి వికెట్ నష్టపోకుండా 55 పరుగులు చేసింది. క్రీజులో నిస్సాంక(31), కుశాల్ మెండిస్(23) పరుగులతో ఉన్నారు. 3 ఓవర్లకు శ్రీలంక స్కోర్: 25/0214 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక 3 ఓవర్లు ముగిసే సరికి వికెట్ నష్టపోకుండా 23 పరుగులు చేసింది. క్రీజులో నిస్సాంక(18), కుశాల్ మెండిస్(5) పరుగులతో ఉన్నారు.శ్రీలంక ముందు భారీ టార్గెట్పల్లెకెలె వేదికగా శ్రీలకంతో జరుగుతున్న తొలి టీ20లో టీమిండియా బ్యాటర్లు అదరగొట్టారు. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 213 పరుగుల భారీ స్కోర్ సాధించింది. భారత బ్యాటర్లలో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (26 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్‌లతో 58 పరుగులు) టాప్ స్కోరర్‌గా నిలవగా.. యశస్వీ జైశ్వాల్(40), రిషబ్ పంత్(49), శుబ్‌మన్ గిల్(34) పరుగులతో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడారు. లంక బౌలర్లలో మతీషా పతిరాన 4 వికెట్లు పడగొట్టగా.. మధుషంక, హసరంగా, ఫెర్నాండో తలా వికెట్ సాధించారు.నాలుగో వికెట్ డౌన్..టీమిండియా నాలుగో వికెట్ కోల్పోయింది. 9 పరుగులు చేసిన హార్దిక్ పాండ్యా.. పతిరాన బౌలింగ్‌లో ఔటయ్యాడు. క్రీజులోకి రియాన్ పరాగ్ వచ్చాడు. అతడితో పాటు రిషబ్ పంత్(41) కూడా క్రీజులో ఉన్నాడు. 18 ఓవర్లకు భారత్ స్కోర్: 192/4సూర్య ఔట్..సూర్యకుమార్ యాదవ్ రూపంలో టీమిండియా మూడో వికెట్ కోల్పోయింది. 58 పరుగులు చేసిన సూర్య.. పతిరానా బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగాడు. 14 ఓవర్లకు భారత్ స్కోర్: 153/3సూర్య హాప్ సెంచరీ..కెప్టెన్‌గా తొలి మ్యాచ్‌లోనే సూర్యకుమార్ యాదవ్ అదరగొట్టాడు. శ్రీలంకతో జరుగుతున్న తొలి టీ20లో సూర్యకుమార్ హాప్ సెంచరీతో చెలరేగాడు. 54 పరుగులతో సూర్య బ్యాటింగ్ చేస్తున్నాడు. 13 ఓవర్లు ముగిసే సరికి భారత జట్టు రెండు వికెట్ల నష్టానికి 145 పరుగులు చేసింది. క్రీజులో సూర్యకుమార్ యాదవ్(54), రిషబ్ పంత్(16) పరుగులతో ఉన్నారు.10 ఓవర్లకు భారత్ స్కోర్ 111/210 ఓవర్లు ముగిసే సరికి భారత జట్టు రెండు వికెట్ల నష్టానికి 111 పరుగులు చేసింది. క్రీజులో సూర్యకుమార్ యాదవ్(28), రిషబ్ పంత్(9) పరుగులతో ఉన్నారు.రెండో వికెట్ డౌన్..యశస్వీ జైశ్వాల్ రూపంలో టీమిండియా రెండో వికెట్ కోల్పోయింది. 40 పరుగులు చేసిన జైశ్వాల్.. వనిందు హసరంగా బౌలింగ్‌లో స్టంపౌటయ్యాడు. క్రీజులోకి రిషబ్ పంత్ వచ్చాడు.తొలి వికెట్ డౌన్.. గిల్ ఔట్74 పరుగుల వద్ద టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది. 34 పరుగులు చేసిన ఓపెనర్ శుబ్‌మన్ గిల్.. మధుశంక బౌలింగ్‌లో ఔటయ్యాడు. క్రీజులో యశస్వీ జైశ్వాల్ 40 పరుగులతో ఉన్నాడు. 6 ఓవర్లకు భారత్ స్కోర్: 74/1దూకుడుగా ఆడుతున్న భారత్.. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు అదిరిపోయే ఆరంభం లభించింది. ఓపెనర్లు శుబ్‌మన్ గిల్(9), యశస్వీ జైశ్వాల్(27) దూకుడుగా ఆడుతున్నారు. 3 ఓవర్లు ముగిసే సరికి భారత్ వికెట్ నష్టపోకుండా 36 పరుగులు చేసింది.పల్లెకలె వేదికగా భారత్-శ్రీలంక మధ్య తొలి టీ20 ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన శ్రీలంక తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. భారత తుది జట్టులో సంజూ శాంసన్, శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్, ఖాలీల్ ఆహ్మద్‌లకు చోటు దక్కలేదు. అయితే జింబాబ్వే సిరీస్‌లో తీవ్ర నిరాశపరిచిన రియాన్ పరాగ్‌కు మాత్రం భారత ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు లభించింది.ఈ మ్యాచ్‌లో భారత్ కేవలం ఇద్దరు పేసర్లతో బరిలోకి దిగింది. మరోవైపు శ్రీలంక ముగ్గురు పేసర్లతో ఆడనుంది. ఇక ఈ సిరీస్‌లో ఇరు జట్లకు కొత్త సారథిలే కావడం విశేషం. భారత జట్టు కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్ వ్యవహరిస్తుండగా.. చరిత్ అసలంక లంక కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వరిస్తున్నాడు.తుది జట్లుశ్రీలంక: పాతుమ్ నిస్సాంక, కుసల్ మెండిస్(వికెట్ కీపర్), కుసల్ పెరీరా, కమిందు మెండిస్, చరిత్ అసలంక(కెప్టెన్), వనిందు హసరంగా, దసున్ షనక, మహేశ్ తీక్షణ, మతీషా పతిరణ, అసిత ఫెర్నాండో, దిల్షన్ మధుశంకభారత్: శుభమన్ గిల్, యశస్వి జైస్వాల్, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), రిషబ్ పంత్(వికెట్ కీపర్), రియాన్ పరాగ్, హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్, మహ్మద్ సిరాజ్ -
కోహ్లి కాదు!.. నాకిష్టమైన కెప్టెన్ అతడే: సూర్య కుమార్
టీమిండియా టీ20 కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్ తన తొలి పరీక్షకు సిద్దమయ్యాడు. అతడి సారథ్యంలోని భారత జట్టు శ్రీలంకతో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో తలపడనుంది. ఈ సిరీస్‌లో భాగంగా తొలి టీ20 జూలై 27న పల్లెకెలె వేదికగా జరగనుంది.తొలి టీ20కు ముందు భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ విలేకరుల సమావేశం పాల్గోన్నాడు. ఈ సందర్భంగా భారత వన్డే కెప్టెన్ రోహిత్ శర్మపై సూర్య ప్రశంసల వర్షం కురిపించాడు. కెప్టెన్‌గా రోహిత్ శర్మ తనకు ఎంతో ఆదర్శమని సూర్య తెలిపాడు. కాగా రోహిత్ పొట్టి ఫార్మాట్ విడ్కోలు పలకడంతో భారత టీ20 జట్టు పగ్గాలు సూర్య చేపట్టాడు. హార్దిక్ పాండ్యాను కాదని సూర్యను కెప్టెన్‌గా బీసీసీఐ నియమించింది."2014 నుంచి రోహిత్ శర్మతో కలిసి ఆడుతున్నాను. అతడితో నా జర్నీ దాదాపుగా పదేళ్లు పూర్తయింది. నేను అతడి నుంచి చాలా విషయాలు నేర్చుకున్నా. ముఖ్యంగా కెప్టెన్ అంటే ఎలా ఉండాలో రోహిత్‌ను చూసే నేర్చుకున్నాను. రోహిత్ ఒక అద్భుతమైన నాయకుడు. రోహిత్‌లాంటి కెప్టెన్‌ను నేను ఇప్పటివరకు చూడలేదు. అతడి కెప్టెన్సీ నాలాంటి ఎంతో మందికి ఆదర్శం. ప్రస్తుత జట్టులో పెద్దగా ఏ మార్పు లేదు. కెప్టెన్సీలో మాత్రమే మార్పు వచ్చింది. రోహిత్ అడుగుజాడల్లోనే నడిచేందుకు అన్ని విధాల ప్రయత్నిస్తానని" ప్రీమ్యాచ్ కాన్ఫరెన్స్‌లో సూర్యకుమార్ పేర్కొన్నాడు. కాగా విరాట్ కోహ్లి సారథ్యంలో కూడా సూర్య ఆడినప్పటకి అతడి పేరును ప్రస్తావించకపోవడం గమనార్హం. -
'గౌతీతో నా బంధం చాలా స్పెషల్.. అదే నా కెరీర్ టర్నింగ్ పాయింట్'
టీమిండియా టీ20 కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్, నూతన హెడ్ కోచ్‌గా గౌతం గంభీర్ తమ ప్రయణాన్ని ప్రారంభించేందుకు సిద్దమయ్యారు. జూలై 27న పల్లెకెలె వేదికగా శ్రీలంకతో జరగనున్న తొలి టీ20తో వీరిద్దరి ప్రస్ధానం మొదలు కానుంది.రోహిత్ శర్మ స్ధానంలో భారత టీ20 కెప్టెన్‌గా సూర్య బాధ్యతలు చేపట్టగా.. రాహుల్ ద్రవిడ్ వారసుడిగా గంభీర్ ఎంపికయ్యాడు. ఈ నేపథ్యంలో కొత్త హెడ్‌కోచ్ గంభీర్‌ను ఉద్దేశించి సూర్యకుమార్ కీలక వ్యాఖ్యలు చేశాడు. గౌతమ్ గంభీర్‌తో కలిసి పనిచేసేందుకు ఆతృతగా ఎదురుచూస్తున్నట్లు సూర్య తెలిపాడు."గౌతం గంభీర్‌తో నా బంధం చాలా ప్రత్యేకం. ఎందుకంటే నా ఐపీఎల్ అరంగేట్రంలో కేకేఆర్ తరపున గంభీర్ కెప్టెన్సీలోనే ఆడాను. కేకేఆర్ ఫ్రాంచైజీలో నాకు ఆడే అవకాశం రావడం నిజంగా చాలా గొప్పవిషయం. అక్కడ నుంచే నా కెరీర్ మలుపు తిరిగింది. ఆ తర్వాత జాతీయ జట్టులో ఆడే అవకాశం నాకు లభించింది. మా మధ్య ఆ బంధం ఇప్పటికీ బలంగా ఉంది. నా మైండ్‌సెట్, పనితీరు ఎలా ఉంటుందో గంభీర్‌కు బాగా తెలుసు. అతడు కోచ్‌గా ఎలా పనిచేస్తాడో నాకు కూడా తెలుసు.గంభీర్ లాంటి వ్యక్తితో కలిసి పనిచేసే అవకాశం రావడం నా అదృష్టం. మా మా ఇద్దరి కాంబినేషన్లో అన్ని మంచి ఫలితాలే రావాలని ఆశిస్తున్నట్లు" బీసీసీఐ టీవీకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సూర్యకుమార్ పేర్కొన్నాడు. ఇక ఈ సిరీస్‌లో భారత్ ఆతిథ్య జట్టుతో మూడు టీ20లు, మూడు వన్డేల సిరీస్ ఆడనుంది. -
చేసింది 25 పరుగులే.. అయినా టీమిండియాలో ఛాన్స్! అస్సలు కారణమిదే?
శ్రీలంకతో పరిమిత ఓవర్ల సిరీస్‌లకు టీమిండియా సిద్దమైంది. లంక పర్యటనలో భాగంగా భారత జట్టు మూడు టీ20లు, మూడు వన్డేల సిరీస్‌లు ఆడనుంది. జూలై 27 జరగనున్న తొలి టీ20తో భారత పర్యటన ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌తో భారత కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్, హెడ్ కోచ్‌గా గౌతం గంభీర్ల ప్రస్ధానం మొదలు కానుంది. ఇప్పటికే ఆతిథ్య దేశానికి చేరుకున్న భారత జట్టు గంభీర్ నేతృత్వంలో తీవ్రంగా శ్రమిస్తోంది. అయితే శ్రీలంకతో టీ20, వన్డేలకు భారత జట్టులో యువ ఆటగాడు రియాన్ పరాగ్‌కు చోటు దక్కడం అందరిని ఆశ్యర్యపరిచింది.జింబాబ్వే టీ20 సిరీస్‌తో అరంగేట్రం చేసిన పరాగ్.. తన మార్క్‌ను చూపించలేకపోయాడు. దారుణంగా విఫలమై విమర్శలు ఎదుర్కొన్నాడు. అయినప్పటకి సెలక్టర్లు ఏ ప్రాతిపాదికన అతడిని లంక టూర్‌కు ఎంపిక చేశారని పెద్ద ఎత్తున ఇప్పటికి చర్చనడుస్తోంది. కాగా తాజాగా ఇదే విషయంపై టైమ్స్ ఆఫ్ ఇండియా ఆసక్తికర కథనాన్ని ప్రచురించింది. టైమ్స్ ఆఫ్ ఇండియా రిపోర్ట్ ప్రకారం.. శ్రీలంకతో వైట్‌బాల్ సిరీస్‌లకు తొలుత హైదరాబాదీ తిలక్ వర్మను ఎంపిక చేయాలని సెలక్టర్లు భావించారట. కానీ తిలక్ వర్మ గాయపడటంతో పరాగ్‌ను అతడి స్ధానంలో పరిగణలోకి తీసుకున్నట్లు సమాచారం."పరాగ్ చాలా టాలెంటడ్. అతడికి అద్భుతమైన ఆల్‌రౌండ్ స్కిల్స్ ఉన్నాయి. ఆఫ్ ది ఫీల్డ్, ఆన్ ది ఫీల్డ్ తన వైఖరిని కూడా మార్చుకున్నాడు. చాలా విషయాల్లో అతడు మెరుగయ్యాడు. ఇప్పడు అతడి ఆట తీరు పూర్తిగా మారిపోయింది. క్రీజులో నిలదొక్కకునే ప్రయత్నం చేస్తున్నాడు. పరాగ్ అద్భుతమైన ఫీల్డర్ కూడా. అయితే సెలక్టర్ల దృష్టిలో పరాగ్ కంటే ముందు తిలక్ వర్మ ఉండేవాడు. కానీ అతడి గాయపడటం రియాన్‌కు మార్గం సుగమమైందని" బీసీసీఐ వర్గాలు టైమ్స్ ఆఫ్ ఇండియాతో వెల్లడించాయి. కాగా జింబాబ్వే సిరీస్‌లో మూడు మ్యాచ్‌లు ఆడిన పరాగ్ కేవలం 25 పరుగులు మాత్రమే చేశాడు.భారత టీ20 జట్టు: సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), శుబ్‌మన్ గిల్ (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, రింకు సింగ్, రియాన్ పరాగ్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), సంజు శాంసన్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్, ఖలీల్ అహ్మద్, మొహమ్మద్. సిరాజ్.భారత వన్డే జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుబ్‌మన్ గిల్ (వైస్‌ప్టెన్), విరాట్ కోహ్లీ, కెఎల్ రాహుల్ (వికెట్ కీపర్), రిషబ్ పంత్ (వికెట్ కీపర్), శ్రేయాస్ అయ్యర్, శివమ్ దూబే, కుల్దీప్ యాదవ్, మహ్మద్. సిరాజ్, వాషింగ్టన్ సుందర్, అర్ష్‌దీప్ సింగ్, రియాన్ పరాగ్, అక్షర్ పటేల్, ఖలీల్ అహ్మద్, హర్షిత్ రాణా. -
'ఛాంపియన్స్ ట్రోఫీ 2025.. భారత్ జట్టులో సూర్యకుమార్‌కు నో ఛాన్స్'
భారత టీ20 కెప్టెన్‌గా స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ ఎంపికైన సంగతి తెలిసిందే. జూలై 26 నుంచి శ్రీలంకతో జరగనున్న టీ20 సిరీస్‌తో టీమిండియా కెప్టెన్‌గా సూర్యకుమార్ ప్రస్థానం మొదలు కానుంది. అయితే ఇకపై సూర్య కేవలం టీ20ల్లో మాత్రమే భారత జెర్సీలో కన్పించే అవకాశముంది. ఎందుకంటే టీ20ల్లో అద్బుతమైన ట్రాక్ రికార్డు కలిగి ఉన్న సూర్యకుమార్.. వన్డేలు, టెస్టుల్లో మాత్రం తన మార్క్‌ను చూపించలేకపోయాడు. గతేడాది వన్డే వరల్డ్‌కప్ రన్నరప్‌గా నిలిచిన భారత జట్టులో సైతం సూర్య సభ్యునిగా ఉన్నాడు.కానీ మిస్టర్ 360 టోర్నీలో దారుణంగా విఫలమయ్యాడు. ఇప్పటివరకు 37 వన్డేలు ఆడిన ఈ ముంబైకర్ కేవలం 773 పరుగులు మాత్రమే చేశాడు. ఈ నేపథ్యంలోని అతడిని కేవలం టీ20లకే పరిమితం చేయాలని బీసీసీఐ సెలక్షన్ కమిటీతో పాటు కొత్త హెడ్ కోచ్ గౌతం గంభీర్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఇదే విషయంపై భారత మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో సూర్యకుమార్ యాదవ్ ఆడే అవకాశం లేదని చోప్రా అభిప్రాయపడ్డాడు. కాగా వచ్చే ఏడాది ఛాంపియన్స్ ట్రోఫీ పాకిస్తాన్ వేదికగా జరగనుంది. అయితే భారత్ పాల్గోంటుందా లేదా అన్నది ఇంకా క్లారిటీ రాలేదు."గతేడాది వన్డే వరల్డ్‌కప్ ఫైనల్‌కు చేరిన భారత జట్టులో సూర్యకుమార్ భాగంగా ఉన్నాడు. అదే విధంగా టీ20 వరల్డ్‌కప్-2024 విజేతగా నిలిచిన జట్టులోనూ సూర్య సభ్యునిగా ఉన్నాడు. డేవిడ్ మిల్లర్ క్యాచ్‌ను అద్భుతంగా అందుకుని భారత్‌ను ఛాంపియన్స్‌గా నిలిపాడు.అంతేకాకుండా టీ20ల్లో దాదాపు ఏడాది పాటు వరల్డ్‌నెం1గా కొనసాగాడు. కానీ ఇటువంటి అద్భుత ఆటగాడికి వన్డేల్లో మాత్రం చోటు దక్కడం కష్టమనే చెప్పుకోవాలి. ఇకపై సూర్య టీ20ల్లో మాత్రమే కొనసాగనున్నాడు. ఇదే విషయాన్ని బీసీసీఐ ఛీప్ సెలక్టర్ అజిత్ అగార్కర్ స్పష్టం చేశాడు. అంటే వచ్చే ఏడాది ఛాంపియన్స్ ట్రోఫీలో సూర్య ఆడడని ఆర్దం చేసుకోవచ్చు" అని తన యూట్యూబ్ ఛానల్లో ఆకాష్ చోప్రా పేర్కొన్నాడు. -
శ్రీలంకకు చేరుకున్న భారత జట్టు.. వీడియో వైరల్
శ్రీలంకతో పరిమిత ఓవర్ల సిరీస్‌లకు టీమిండియా సిద్దమైంది. ఈ పర్యటనలో భాగంగా ఆతిథ్య జట్టుతో భారత్ మూడు టీ20లు, మూడు వన్డేల సిరీస్‌లో తలపడనుంది. జూలై 26న జరగనున్న తొలి టీ20తో టీమిండియా పర్యటన ప్రారంభం కానుంది.ఈ క్రమంలో భారత జట్టు సోమవారం శ్రీలంక గడ్డపై అడుగుపెట్టింది. తొలి బ్యాచ్‌గా సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోని భారత టీ20 జట్టు శ్రీలంకకు చేరుకుంది. టీమిండియా హెడ్ కోచ్ గౌతం గంభీర్ కూడా జట్టు వెంట ఉన్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది.వన్డే జట్టులో భాగమైన ఆటగాళ్లు వారం రోజుల తర్వాత లంకకు పయనం కానున్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా ప్రస్తుతం వేకేషన్లో స్టార్ క్రికెటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి నేరుగా శ్రీలంకకు చేరుకున్నట్లు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి.ఇక పర్యటనతో భారత క్రికెట్లో కొత్త శకం ఆరంభం కానుంది. టీమిండియా టీ20 కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్ తన ప్రయాణాన్ని ప్రారంభించనుండగా.. హెడ్ కోచ్‌గా గంభీర్ ప్రస్ధానం మొదలు కానుంది. వన్డేల్లో రోహిత్ శర్మనే భారత జట్టును నడిపించనున్నాడు. అయితే ఈ పర్యటనకు స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా దూరమయ్యాడు.భారత టీ20 జట్టు: సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్ (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, రిషబ్ పంత్, రింకూ సింగ్, సంజూ శాంసన్, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్, ఖలీల్ అహ్మద్, మహ్మద్ సిరాజ్భారత వన్డే జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్, శివమ్ దూబే, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, వాషింగ్టన్ సుందర్, అర్ష్‌దీప్ సింగ్, రియాన్ పరాగ్, అక్షర్ పటేల్, ఖలీల్ అహ్మద్, హర్షిత్ రాణా. Breaking 🚨@GautamGambhir leads the way as Team India reaches the team hotel in Sri Lanka. @rohitjuglan reports for RevSportz. @tribes_social_ @BCCI #INDvsSL #INDvSL #GautamGambhir pic.twitter.com/kgf12oZVQm— RevSportz Global (@RevSportzGlobal) July 22, 2024 -
'అదే హార్దిక్ కొంపముంచింది'.. అగార్కర్ అస్సలు ఒప్పుకోలేదంట!?
టీమిండియా నూతన టీ20 కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్ ఎంపికైన సంగతి తెలిసిందే. టీ20ల్లో రోహిత్ శర్మ వారుసుడిగా సూర్యకుమార్ భారత జట్టు పగ్గాలు చేపట్టనున్నాడు. శ్రీలంకతో టీ20 సిరీస్ నుంచి భారత ఫుల్‌టైమ్ కెప్టెన్‌గా సూర్య ప్రస్ధానం మొదలు కానుంది. అయితే హార్దిక్ పాండ్యాను కాదని సూర్యకుమార్‌ను టీమిండియా కెప్టెన్‌గా ఎంపిక చేయడం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. ఇదే విషయం క్రీడా వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. ఐపీఎల్‌లోనూ, భారత జట్టు తత్కాలిక సారథిగా మంచి ట్రాక్ రికార్డు ఉన్నప్పటకి కెప్టెన్‌గా పాండ్యాను ఎంపిక చేయలేదన్నది అందరి మెదడలను తొలుస్తున్న ప్రశ్న.ఇందుకు ఒక్కొక్కరు ఒక్క కారణం చెబుతున్నారు. కొంత మంది ఫిట్నెస్ వాళ్లే అతడిని ఎంపిక చేయలేదని, మరికొంత మంది శ్రీలంకతో వన్డేలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకోవడంతోనే పాండ్యాకు జట్టు పగ్గాలు అప్పగించలేదని అభిప్రాయపడుతున్నారు. కాగా వైస్ కెప్టెన్సీ బాధ్యతల నుంచి కూడా పాండ్యాను తప్పించడం అందరని విస్మయానికి గురిచేసింది.ఒప్పుకోని అగార్కర్..కాగా హార్దిక్ పాండ్యాకు భారత జట్టు సారథ్య బాధ్యతలు అప్పగించేందుకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ చైర్మెన్ అజిత్ అగార్కర్ ఒప్పుకోలేదంట. పాండ్యా కెప్టెన్సీపై తనకు నమ్మకం లేదంటూ అగార్కర్ బీసీసీఐకి తెలియజేసినట్లు సమాచారం. అందుకు ఐపీఎల్లో పాండ్యా కెప్టెన్సీనే కారణమని పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. పాండ్యా ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్‌ను వరుసగా రెండు సార్లు ఫైనల్‌కు చేర్చినప్పటకి.. ముంబై ఇండియన్స్ సారథ్య బాధ్యతలు చేపట్టాక తన మార్క్‌ను మాత్రం చూపించలేకపోయాడు. ఐపీఎల్-2024లో అతడి సారథ్యంలోని ముంబై ఇండియన్స్ దారుణ ప్రదర్శన కనబరిచింది. వరుస ఓటములతో లీగ్ స్టేజిలోనే ఇంటిముఖం పట్టింది. దీంతో పాండ్యా కెప్టెన్సీపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలో అగార్కర్ అండ్ కో సైతం పాండ్యా కెప్టెన్సీ స్కిల్స్‌పై సంతృప్తిగా లేనట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే అతడిపై వేటు వేసినట్లు వినికిడి. మరోవైపు భారత కొత్త హెడ్ కోచ్ గౌతం గంభీర్ సైతం పాండ్యా కెప్టెన్సీపై విముఖత చూపినట్లు తెలుస్తోంది. -
ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలు.. ఇప్పుడు నాపై మరింత బాధ్యత ఉంది: సూర్యకుమార్
టీ20ల్లో టీమిండియా కెప్టెన్ ఎవరన్న సస్పెన్స్‌కు తెరపడింది. భారత టీ20 కెప్టెన్‌గా స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్‌ను బీసీసీఐ ఎంపిక చేసింది. జూలై 27 నుంచి శ్రీలంకతో జరగనున్న టీ20 సిరీస్‌తో భారత కెప్టెన్‌గా సూర్యకుమార్ ప్రయాణం ప్రారంభం కానుంది. స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాను కాదని మరి సూర్యకు భారత జట్టు పగ్గాలు బీసీసీఐ అప్పగించింది. ఇక కెప్టెన్‌గా ఎంపికయ్యాక తొలిసారి సూర్యకుమార్ యాదవ్ స్పందించాడు. కొత్త బాధ్యతలు చేపట్టేందుకు ఆతృతగా ఎదురుచూస్తున్నాని, మద్దతుగా నిలుస్తున్న అభిమానులందరికి సూర్య ధన్యవాదాలు తెలిపాడు."మీరు నాపై చూపిస్తున్న ప్రేమాభిమానాలకు నేను ఎల్లప్పుడూ కృతజ్ఞుడని. నాకు శుభాకాంక్షలు తెలుపుతున్న ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. గత కొన్ని రోజుల నుంచి అంత కలగానే ఉంది. దేశం కోసం ఆడటం ఎల్లప్పుడూ నా దృష్టిలో ప్రత్యేకమే. భారత జెర్సీ ధరిస్తే కలిగే ఆ ఫీలింగ్ వేరు. మాటల్లో వర్ణించలేని ఓ అనుభూతి. కొత్త పాత్రను స్వీకరించేందుకు సిద్దంగా ఉన్నాను. నాపై ఇక నుంచి చాలా బాధ్యత ఉంటుంది. ఎప్పటిలాగే ఇక ముందు కూడా మీ నుంచి నాకు మద్దతు లభిస్తుందని ఆశిస్తున్నాను. ఆ దేవుని దయకూడా నాపై ఉందంటూ సూర్య సోషల్ మీడియాలో భావోద్వేగ నోట్ షేర్ చేశాడు. ఇక శ్రీలంక పర్యటనలో భాగంగా భారత జట్టు మూడు టీ20లు, మూడు వన్డేల సిరీస్‌లో తలపడనుంది.భారత టీ20 జట్టు: సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్ (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, రిషబ్ పంత్, రింకూ సింగ్, సంజూ శాంసన్, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్, ఖలీల్ అహ్మద్, మహ్మద్ సిరాజ్భారత వన్డే జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్, శివమ్ దూబే, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, వాషింగ్టన్ సుందర్, అర్ష్‌దీప్ సింగ్, రియాన్ పరాగ్, అక్షర్ పటేల్, ఖలీల్ అహ్మద్, హర్షిత్ రాణా. -
హార్దిక్ పాండ్యాకు బిగ్ షాకిచ్చిన బీసీసీఐ.. కారణమిదే?
టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాకు బీసీసీఐ ఊహించని షాక్ ఇచ్చింది. భారత టీ20 కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యాను కాదని స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్‌ను బీసీసీఐ నియమించింది. అంతేకాకుండా భారత జట్టు వైస్ కెప్టెన్సీ బాధ్యతల నుంచి కూడా పాండ్యాను బీసీసీఐ తప్పించింది. అతడి స్ధానంలో భారత జట్టు వైస్ కెప్టెన్‌గా శుబ్‌మన్ గిల్ ఎంపికయ్యాడు. శ్రీలంకతో టీ20 సిరీస్‌కు జట్టు ఎంపిక సందర్భంగా బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది. రోహిత్ శర్మ తర్వాత టీ20ల్లో భారత జట్టు సారథిగా పాండ్యా బాధ్యతలు చేపడతాడని అంతా భావించారు. కానీ బీసీసీఐ సెలక్షన్ కమిటీ మాత్రం సూర్యకుమార్ యాదవ్ వైపే మొగ్గు చూపింది. టీమిండియా కొత్త హెడ్ కోచ్ గౌతం గంభీర్ సైతం సూర్యకుమార్‌కు మద్దతిచ్చినట్లు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం ఇదే విషయంపై క్రీడా వర్గాల్లో ఇదే హాట్‌టాపిక్‌గా మారింది. అస్సలు ఎందుకు హార్దిక్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేయలేదన్న సందేహం అందరిలో నెలకొంది.కారణమిదేనా?ఫిట్నెస్ సమస్య కారణంగానే హార్దిక్ పాండ్యాకు కెప్టెన్సీ పగ్గాలు అప్పగించకపోయినట్లు సమాచారం. పాండ్యా ఎప్పటికప్పుడు గాయాల బారిన పడుతుండంతో దీర్ఘకాలిక ప్రణాళికల దృష్ట్యా సూర్యకు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించినట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. గతేడాది వన్డే వరల్డ్‌కప్‌లో గాయపడ్డ పాండ్యా.. దాదాపు 6 నెలల పాటు ఆటకు దూరంగా ఉన్నాడు. మళ్లీ ఐపీఎల్-2024తో తిరిగి రీ ఎంట్రీ ఇచ్చాడు. ఐపీఎల్లో కూడా పాండ్యా తన మార్క్‌ను చూపించలేకపోయాడు.గాయాల కారణంగా వర్క్‌లోడ్‌ను పాండ్యా మెనెజ్ చేయలేడని అజిత్ అగర్కర్ సారథ్యంలోని సెలక్షన్ కమిటీ భావించినట్లు తెలుస్తోంది. అదే విధంగా హెడ్ కోచ్ గౌతం గంభీర్ సైతం ఆటగాళ్లు అన్ని ఫార్మాట్ల్లో ఆడేందుకు సిద్దంగా ఉండాలని ఇప్పటికే సృష్టం చేశాడు. ఈ క్రమంలోనే హార్దిక్‌కు డిమోషన్ లభించినట్లు వినికిడి.భారత టీ20 జట్టు: సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్ (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, రిషబ్ పంత్, రింకూ సింగ్, సంజూ శాంసన్, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్, ఖలీల్ అహ్మద్, మహ్మద్ సిరాజ్భారత వన్డే జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్, శివమ్ దూబే, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, వాషింగ్టన్ సుందర్, అర్ష్‌దీప్ సింగ్, రియాన్ పరాగ్, అక్షర్ పటేల్, ఖలీల్ అహ్మద్, హర్షిత్ రాణా. -
శ్రీలంక సిరీస్‌లకు భారత జట్ల ప్రకటన.. టీ20 కెప్టెన్‌గా సూర్యకుమార్
త్వరలో శ్రీలంకతో జరుగబోయే పరిమిత ఓవర్ల సిరీస్‌ల కోసం భారత జట్లను ఇవాళ (జులై 18) ప్రకటించారు. అందరూ ఊహించిన విధంగానే సూర్యకుమార్ యాదవ్ భారత నూతన టీ20 జట్టు కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. వన్డే జట్టుకు రోహిత్ సారథ్యం వహించనుండగా.. రెండు జట్లకు (టీ20, వన్డే) శుభ్‌మన్ గిల్ వైస్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. టీ20 జట్టు కెప్టెన్సీ ఆశించిన హార్దిక్‌కు మొండిచెయ్యి ఎదురైంది. వన్డే జట్టుకు హర్షిత్ రాణా కొత్తగా ఎంపికయ్యాడు. కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ వన్డేల్లోకి రీఎంట్రీ ఇచ్చారు. కోహ్లి కూడా వన్డే జట్టులో ఉన్నాడు. రిషబ్ పంత్, రియాన్ పరాగ్, శుభ్‌మన్ గిల్, మహ్మద్ సిరాజ్, వాషింగ్టన్ సుందర్, శివమ్ దూబే, అర్షదీప్ సింగ్, అక్షర్ పటేల్, ఖలీల్ అహ్మద్ రెండు జట్లకు ఎంపికయ్యారు. హార్దిక్‌కు వన్డే జట్టులో చోటు దక్కలేదు. తాజాగా జింబాబ్వేతో జరిగిన సిరీస్‌లో సూపర్ ఫామ్‌లో ఉండిన రుతురాజ్ గైక్వాడ్, అభిషేక్ శర్మలకు రెండు జట్లలో చోటు దక్కలేదు.కాగా, టీమిండియా.. మూడు మ్యాచ్‌ల టీ20, వన్డే సిరీస్‌ల కోసం శ్రీలంకలో పర్యటించనుంది. ఈ పర్యటనలో తొలుత టీ20 సిరీస్ జరుగనుంది. ఈ నెల 27, 28, 30 తేదీల్లో మూడు టీ20లు జరుగనున్నాయి. అనంతరం ఆగస్ట్ 2, 4, 7 తేదీల్లో మూడు వన్డేలు జరుగుతాయి. టీ20 సిరీస్ మొత్తం పల్లెకెలెలో.. వన్డే సిరీస్ కొలొంబోలో జరుగనుంది.భారత టీ20 జట్టు: సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్ (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, రిషబ్ పంత్, రింకూ సింగ్, సంజూ శాంసన్, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్, ఖలీల్ అహ్మద్, మహ్మద్ సిరాజ్భారత వన్డే జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్, శివమ్ దూబే, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, వాషింగ్టన్ సుందర్, అర్ష్‌దీప్ సింగ్, రియాన్ పరాగ్, అక్షర్ పటేల్, ఖలీల్ అహ్మద్, హర్షిత్ రాణా. -
Team India Captaincy: రోహిత్ ఓటు సూర్యకే..?
రోహిత్ శర్మ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించాక టీమిండియా కెప్టెన్ పదవి ఖాళీగా ఉన్న విషయం తెలిసిందే. ఈ పదవి రేసులో తొలుత హార్దిక్ పాండ్యా ఒక్కడి పేరే వినిపించినప్పటికీ.. నిన్న మొన్నటి నుంచి సూర్యకుమార్ యాదవ్ కూడా రేసులో ఉన్నాడని ప్రచారం జరుగుతుంది. హార్దిక్ తరుచూ ఫిట్నెస్ సమస్యలు ఎదుర్కొంటుంటాడన్న విషయాన్ని సాకుగా చూపుతూ బీసీసీఐలోకి కొందరు పెద్దలు సూర్య పేరును తెరపైకి తెచ్చినట్లు తెలుస్తుంది.తాజాగా ఈ అంశానికి సంబంధించి ఓ బిగ్ అప్డేట్ అందింది. సూర్యకుమార్‌కు బీసీసీఐలోని ఓ వర్గం అండదండలతో పాటు మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ, కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ మద్దతు కూడా ఉన్నట్లు తెలుస్తుంది. ఇదే నిజమైతే 2026 టీ20 వరల్డ్‌కప్ వరకు భారత టీ20 జట్టు కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్ కొనసాగే అవకాశం ఉంది. మరి కొద్ది గంటల్లో ఈ అంశం అధికారిక ప్రకటన వెలువడవచ్చు.వాస్తవానికి శ్రీలంక పర్యటన కోసం భారత జట్టును ఇవాళే ప్రకటించాల్సి ఉండింది. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల సెలెక్షన్ కమిటీ భేటి వాయిదా పడింది. లంకలో పర్యటించే భారత జట్టుతో పాటు కొత్త టీ20 కెప్టెన్ పేరును రేపు ప్రకటించే అవకాశం ఉంది. కాగా, టీ20 వరల్డ్‌కప్ విజయానంతరం రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లి, రవీంద్ర జడేజా పొట్టి ఫార్మాట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే.ఇదిలా ఉంటే, భారత్.. శ్రీలంక పర్యటన ఈ నెల 27 నుంచి మొదలుకానుంది. ఈ పర్యటనలో తొలుత టీ20 సిరీస్ జరుగనుంది. 27, 28, 30 తేదీల్లో మూడు మ్యాచ్‌లు జరుగనున్నాయి. అనంతరం ఆగస్ట్ 2, 4, 7 తేదీల్లో మూడు వన్డేలు జరుగనున్నాయి. టీ20 సిరీస్ మొత్తం పల్లెకెలెలో.. వన్డే సిరీస్ కొలొంబోలో జరుగనుంది. -
శ్రీలంకతో వన్డే సిరీస్.. టీమిండియాకు బిగ్ షాక్! స్టార్ ప్లేయర్ దూరం
శ్రీలంక పర్యటనకు ముందు టీమిండియాకు బిగ్ షాక్ తగిలింది. శ్రీలంకతో వన్డే సిరీస్‌కు స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా దూరం కానున్నట్లు తెలుస్తోంది. వ్యక్తిగత కారణాలతో లంకతో వన్డే సిరీస్ దూరంగా ఉండాలని పాండ్యా నిర్ణయించకున్నట్లు సమాచారం.ఇప్పటికే తన నిర్ణయాన్ని బీసీసీఐకు హార్దిక్ తెలియజేసినట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. బీసీసీఐ కూడా హార్దిక్ నిర్ణయాన్ని అంగీకరించినట్లు తెలుస్తోంది. అయితే శ్రీలంకతో వన్డేలకు భారత రెగ్యూలర్ కెప్టెన్ రోహిత్ శర్మ కూడా దూరం కానున్నాడు.ఈ క్రమంలో లంకతో వన్డే సిరీస్‌లలో భారత జట్టు పగ్గాలను హార్దిక్ పాండ్యకు అప్పగించాలని సెలక్టర్లు భావించారు. కానీ అంతలోనే హార్దిక్ కూడా వన్డేలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకోవడంతో కెప్టెన్సీ పగ్గాలు ఎవరికి అప్పగించాలని సెలక్టర్లు సతమతవుతున్నట్లు వినికిడి. ఈ పర్యటనకు భారత జట్టును బీసీసీఐ మంగళవారం ప్రకటించే అవకాశముంది. లంకేయులతో వన్డే సిరీస్‌లో భారత జట్టు సారథిగా స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్‌ను నియమించాలని బీసీసీఐ సెలక్టర్లు భావిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఈ సిరీస్‌లో భాగంగా భారత్ మూడు వన్డేలు, మూడు టీ20ల్లో శ్రీలంకతో తలపడనుంది. పల్లెకెలె వేదికగా జూలై 27న జరగనున్న తొలి టీ20తో టీమిండియా పర్యటన ప్రారంభం కానుంది. -
మిల్లర్ క్యాచ్ కాదు.. నా లైఫ్‌లో ఇంపార్టెంట్ క్యాచ్ అదే: సూర్యకుమార్
టీ20 వరల్డ్‌కప్-2024లో విజేతగా భారత్ నిలవడంలో స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్‌ది కీలక పాత్ర. దక్షిణాఫ్రికాతో జరిగిన ఫైనల్లో డేవిడ్ మిల్లర్ ఇచ్చిన క్యాచ్‌ను అద్భుతంగా అందుకున్న సూర్యకుమార్.. 13 ఏళ్ల టీమిండియా వరల్డ్‌కప్ నిరీక్షణకు తెరదించాడు. సూర్య తన సంచలన క్యాచ్‌తో విశ్వవేదికపై భారత పతాకాన్ని రెపరెపలాడించారు. భారత క్రికెట్ చరిత్రలో సూర్య పట్టిన క్యాచ్ చిరస్థాయిగా నిలిచిపోతుందనడంలో ఎటువంటి సందేహం లేదు. కాగా ఫైనల్ మ్యాచ్ ముగిసి దాదాపు 10 రోజులు పైగా అవుతున్నప్పటికి సూర్యపై ఇంకా ప్రశంసల వర్షం కురిస్తోంది. అయితే సూర్య తన జీవితంలో ఇంతకంటే ముఖ్యమైన క్యాచ్ ఎప్పుడో అందుకున్నాడంట. తన భార్య దేవిశా శెట్టిని వివాహం చేసుకోవడమే ముఖ్యమైన క్యాచ్ అంటూ సూర్య సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు.సూర్యకుమార్ యాదవ్, దేవిశా శెట్టిలు ఇటీవల తమ ఎనిమిదో వివాహ వార్షికోత్సవాన్ని గ్రాండ్ సెలబ్రేట్ చేసుకున్నారు. పెద్ద కేక్‌ను తీసుకువచ్చి కట్ చేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోను సూర్యకుమార్ ఇనాస్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. "వరల్డ్‌కప్‌లో క్యాచ్ అందుకుని నిన్నటకి 8 రోజులైంది. కానీ నిజానికి నా జీవితంలో అంత్యంత ముఖ్యమైన 8 ఏళ్ల క్రితమే అందుకున్నానంటూ" ఆ ఫోటోకు సూర్య క్యాప్షన్‌గా ఇచ్చాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరలవతున్నాయి. ఇది చూసిన నెటిజన్లు మీరిద్దరూ కలకలం ఇలానే సంతోషంగా కలిసి ఉండాలని కామెంట్లు చేస్తున్నారు.ఇక వరల్డ్‌కప్‌లో 8 మ్యాచ్‌లు ఆడిన సూర్యకుమార్.. 135.37 స్ట్రైక్‌రేట్‌తో 199 పరుగులు చేశాడు. వరల్డ్‌కప్ విజయనంతరం సూర్య విశ్రాంతి తీసుకుంటున్నాడు. తిరిగి శ్రీలంక పర్యటకు సూర్యకుమార్ అందుబాటులోకి రానున్నాడు. View this post on Instagram A post shared by Surya Kumar Yadav (SKY) (@surya_14kumar) -
భారత స్టార్ క్రికెటర్ సూర్యకుమార్- దేవిషా పెళ్లి రోజు నేడు (ఫోటోలు)
-
సూర్యకుమార్ యాదవ్ వరల్డ్‌కప్ విన్నింగ్ క్యాచ్... వివాదాస్పదం
టీమిండియా 2024 టీ20 వరల్డ్‌కప్ గెలవడంలో కీలకపాత్ర పోషించిన సూర్యకుమార్ యాదవ్ సూపర్ మ్యాన్ క్యాచ్ ప్రస్తుతం వివాదాస్పదంగా మారింది. హార్దిక్ పాండ్యా బౌలింగ్‌లో డేవిడ్ మిల్లర్ కొట్టిన షాట్‌ను స్కై బౌండరీ లైన్ వద్ద అద్భుతమైన విన్యాసం చేసి క్యాచ్‌గా మలిచాడు. ఈ క్యాచ్‌కు సంబంధించిన వీడియో నెట్టింట వైరలైంది. స్కై సూపర్ మ్యాన్‌లా క్యాచ్ పట్టాడని అభిమానులు కొనియాడారు.అయితే స్కై పట్టిన ఈ క్యాచ్ క్యాచ్ కాదు సిక్సర్ అని కొందరు సౌతాఫ్రికా అభిమానులు అంటున్నారు. దీనికి సంబంధించిన ఓ వీడియో నిన్నటి నుంచి సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఈ వీడియోలో స్కై క్యాచ్ పట్టుకునే క్రమంలో అతని కాలు బౌండరీ లైన్‌ను తాకినట్లు కనిపిస్తుంది.This certainly deserved more than one look, just saying. Boundary rope looks like it clearly moves. 🤷 pic.twitter.com/ulWyT5IJxy— Ben Curtis 🇿🇦 (@BenCurtis22) June 29, 2024ఈ వీడియోను పోస్ట్ చేస్తూ.. ఓ సౌతాఫ్రికా అభిమాని మేం దోచుకోబడ్డాం అని కామెంట్ చేశాడు. ఈ వీడియోకు సోషల్‌మీడియాలో విపరీతమైన రెస్పాన్స్ వస్తుంది. టీమిండియా వ్యతిరేకులు ఈ వీడియోను ఆసరగా చేసుకునే భారత జట్టును నిందిస్తున్నారు. టీమిండియా మోసం చేసి గెలిచిందని కామెంట్ చేస్తున్నారు.బంతి చేతిలో ఉన్నప్పుడు సూర్యకుమార్ కాలు బౌండరీ లైన్‌ను తాకినట్లు రీప్లేలో స్పష్టంగా కనిపించినా థర్డ్ అంపైర్ నిజాయితీగా వ్యవహరించలేదని ఆరోపిస్తున్నారు. ఒకవేళ ఆ బంతిని సిక్సర్‌గా ప్రకటించి ఉంటే సౌతాఫ్రికా వరల్డ్‌కప్ గెలిచేదని కామెంట్స్ చేస్తున్నారు. మొత్తంగా ఈ వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్ను షేక్ చేస్తుంది. కాగా, 2024 వరల్డ్‌కప్ ఫైనల్లో టీమిండియా సౌతాఫ్రికాపై 7 పరుగుల స్వల్ప తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. చివరి నిమిషం వరకు ఉత్కంఠ రేపిన ఈ మ్యాచ్‌లో భారత్ పైచేయి సాధించింది. సూర్యకుమార్ క్యాచ్ మ్యాచ్‌ను మలుపు తిప్పింది. చివరి ఓవర్లో సౌతాఫ్రికా గెలుపుకు 16 పరుగులు అవసరం కాగా.. ఆ ఓవర్ తొలి బంతికే మిల్లర్ ఔటయ్యాడు. మిల్లర్ ఔట్ కావడంతో సౌతాఫ్రికా విజయావకాశాలు దెబ్బతిన్నాయి. -
ఐసీసీ టీ20 వరల్డ్‌కప్ 2024 జట్టు ప్రకటన.. విరాట్‌కు నో ప్లేస్
ఐసీసీ తమ టీ20 వరల్డ్‌కప్ 2024 జట్టును ఇవాళ (జులై 1) ప్రకటించింది. ఇందులో ఏకంగా టీమిండియా క్రికెటర్లకు చోటు దక్కింది. భారత్ వరల్డ్‌కప్ విన్నింగ్ జట్టు నుంచి రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్, అక్షర్ పటేల్, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్ ఐసీసీ వరల్డ్‌కప్ జట్టులో చోటు దక్కించుకున్నారు. ఇందులో నలుగురు ముంబై ఇండియన్స్ ఆటగాళ్లు ఉండగా.. భారత స్టార్ ఆటగాడు, ఫైనల్ మ్యాచ్ హీరో విరాట్ కోహ్లికి చోటు దక్కకపోవడం గమనార్హం.ఐసీసీ జట్టులో భారత క్రికెటర్లతో పాటు ఆఫ్ఘనిస్తాన్, వెస్టిండీస్, ఆస్ట్రేలియా జట్ల ఆటగాళ్లకు ప్రాతినిథ్యం లభించింది. భారత్ తర్వాత అత్యధికంగా ఆఫ్ఘన్ క్రికెటర్లకు ఐసీసీ జట్టులో చోటు దక్కింది. ఆ జట్టు నుంచి వరల్డ్‌కప్ లీడింగ్ రన్ స్కోరర్ రహ్మానుల్లా గుర్బాజ్, వరల్డ్‌కప్ లీడింగ్ వికెట్ టేకర్ ఫజల్హక్ ఫారూఖీ, రషీద్ ఖాన్లకు ఐసీసీ జట్టుకు ఎంపికయ్యారు. వీరితో పాటు ఆస్ట్రేలియా నుంచి స్టోయినిస్.. వెస్టిండీస్ నుంచి పూరన్‌లకు ఛాన్స్ దక్కింది. 12వ ఆటగాడిగా సఫారీ స్పీడ్ గన్ నోర్జే ఎంపికయ్యాడు. వరల్డ్‌కప్ లాంటి మెగా టోర్నీలు ముగిసాక ఐసీసీ జట్టును ప్రకటించడం ఆనవాయితీ.వరల్డ్‌కప్ 2024లో ఐసీసీ జట్టు సభ్యుల ప్రదర్శన..రోహిత్ శర్మ- 257 పరుగులు, సగటు 36.71, స్ట్రయిక్‌రేట్ 156.7, అర్దసెంచరీలు 3రహ్మానుల్లా గుర్బాజ్- 281 పరుగులు, సగటు 35.12, స్ట్రయిక్‌రేట్ 124.33, అర్దసెంచరీలు 3పూరన్- 228 పరుగులు, సగటు 38.0, స్ట్రయిక్‌రేట్ 146.15, అర్దసెంచరీలు 1సూర్యకుమార్ యాదవ్- 199 పరుగులు, సగటు 28.42, స్ట్రయిక్‌రేట్ 135.37, అర్దసెంచరీలు 2స్టోయినిస్- 169 పరుగులు, స్ట్రయిక్‌రేట్ 164.07, వికెట్లు 10, ఎకానమీ 8.88హార్దిక్ పాండ్యా- 144 పరుగులు, స్ట్రయిక్‌రేట్ 151.57, వికెట్లు 11, ఎకానమీ 7.64అక్షర్ పటేల్- 92 పరుగులు, స్ట్రయిక్‌రేట్ 139.39, వికెట్లు 9, ఎకానమీ 7.86రషీద్ ఖాన్- 14 వికెట్లు, సగటు 12.78, ఎకానమీ 6.17, అత్యుత్తమ ప్రదర్శన 4/17బుమ్రా- 15 వికెట్లు, సగటు 8.26, ఎకానమీ 4.17, అత్యుత్తమ ప్రదర్శన 3/7అర్ష్‌దీప్ సింగ్- 17 వికెట్లు, సగటు 12.64, ఎకానమీ 7.16, అత్యుత్తమ ప్రదర్శన 4/9ఫజల్హక్ ఫారూఖీ- 17 వికెట్లు, సగటు 9.41, ఎకానమీ 6.31, అత్యుత్తమ ప్రదర్శన 5/912 ఆటగాడు అన్రిచ్ నోర్జే- 15 వికెట్లు, సగటు 13.4, ఎకానమీ 5.74, అత్యుత్తమ ప్రదర్శన 4/7 -
Suryakumar Yadav Catch: 'సూపర్ మేన్' సూర్య.. క్రికెట్ చరిత్రలో నిలిచిపోయే క్యాచ్! వీడియో వైరల్
టీ20 వరల్డ్‌కప్-2007లో మీకు శ్రీశాంత్ పట్టిన క్యాచ్ గుర్తుందా? అదేనండి పాక్ బ్యాటర్ మిస్బా కొట్టిన బంతిని అనూహ్యంగా షార్ట్ ఫైన్ లెగ్‌లో క్యాచ్ పట్టి భారత్‌కు తొట్టతొలి వరల్డ్‌కప్‌ను అందించాడు కదా. శ్రీశాంత్ పట్టంది ఈజీ క్యాచే అయినా అంతటి ఒత్తిడిలో బంతిని ఒడిసిపట్టడం అంత సులభం కాదు. అప్పుడు ఏ క్యాచ్ అయితే భారత్‌ను టీ20 వరల్డ్ ఛాంఫియన్స్‌గా నిలవడంలో కీలక పాత్ర పోషించిందో.. ఇప్పుడు అటువంటి మరో అద్భుత క్యాచే 17 ఏళ్ల తర్వాత టీమిండియాను విశ్వవిజేతగా నిలిపింది.టీ20 వరల్డ్‌కప్-2024లో భాగంగా దక్షిణాఫ్రికాతో జరిగిన ఫైనల్లో సూర్యకుమార్ అద్బుతం చేశాడు. సూర్య సంచలన క్యాచ్‌తో భారత్ రెండో సారి పొట్టి ప్రపంచకప్‌ను ముద్దాడడంలో కీలక పాత్ర పోషించాడు.అసలేం జరిగిందంటే?దక్షిణాఫ్రికా విజయానికి ఆఖరి ఓవర్లో 16 పరుగులు అవసరమయ్యాయి. ఈ క్రమంలో చివరి ఓవర్ వేసే బాధ్యతను కెప్టెన్ రోహిత్ శర్మ.. హార్దిక్ పాండ్యాకు అప్పగించాడు. స్ట్రైక్‌లో కిల్లర్ మిల్లర్ ఉండడంతో స్టేడియంలో ఉన్న ప్రేక్షుకులతో పాటు టీవీల ముందు కూర్చుకున్న భారత అభిమానల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈ సమయంలో తొలి బంతిని పాండ్యా.. ఫుల్ టాస్‌గా మిల్లర్‌కు సంధించాడు. దీంతో మిల్లర్ లాంగాఫ్ దిశగా భారీ షాట్ ఆడాడు. షాట్ సరిగ్గా కనక్ట్ కావడంతో అంతా సిక్సర్ అనే భావించారు. కానీ లాంగాఫ్‌లో ఉన్న సూర్య మాత్రం అసాధ్యాన్ని సుసాధ్యం చేశాడు. పరిగెత్తుకుంటూ వచ్చి అద్బుతమైన క్యాచ్‌ను అందుకున్నాడు.క్యాచ్ పట్టే సమయంలో నియంత్రణ(బ్యాలెన్స్) కోల్పోయిన సూర్యకుమార్.. బౌండరీ రోపును దాటేశాడు. అయితే అది గ్రహించిన సూర్య జంప్ చేస్తూ బంతిని గాల్లోకి విసిరేశాడు. వెంటనే బౌండరీ రోపు నుంచి మైదానం లోపలకి తిరిగి వచ్చి సూపర్ మేన్‌లా అందుకున్నాడు. దీంతో స్టేడియం మొత్తం ఒక్కసారిగా దద్దరిల్లిపోయింది. ఒకవేళ ఆ బంతి సిక్సర్‌గా వెళ్లి ఉంటే ప్రోటీస్ సమీకరణం అయిదు బంతుల్లో 10 పరుగులుగా మారిపోయేది. క్రీజులో ఉన్న మిల్లర్‌కు అది పెద్ద టార్గెట్ కాకపోయిండేది. సూర్యకుమార్ క్యాచ్‌కు సంబధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ మారింది. ఇది చూసిన నెటిజన్లు.. సూపర్ మేన్ సూర్య అంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా బార్బోడస్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన ఫైనల్లో 7 పరుగుల తేడాతో విజయం సాధించిన భారత్ రెండో సారి టీ20 వరల్డ్‌కప్ విజేతగా నిలిచింది. What A Catch By Suryakumar Yadav 🔥🔥Game changing catch 🥹❤️Congratulations India 🇮🇳#INDvSA #T20WorldCup pic.twitter.com/2GGj4tgj7N— Elvish Army (Fan Account) (@elvisharmy) June 29, 2024 -
డ్రెస్సింగ్ రూమ్ ‘బెస్ట్ ఫీల్డర్’గా సూర్య.. ఈసారి ‘గెస్ట్’ ఎవరంటే?
టీ20 వరల్డ్‌కప్-2024 సూపర్-8లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో 50 పరుగుల తేడాతో టీమిండియా ఘన విజయం సాధించింది. ఈ విజయంతో టీమిండియా తమ సెమీస్ బెర్త్‌ను దాదాపుగా ఖారారు చేసుకుంది. ఈ మ్యాచ్‌లో భారత్ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టింది. అయితే ప్రతీ మ్యాచ్ అనంతరం డ్రెస్సింగ్ రూమ్‌లో ఇచ్చే ‘బెస్ట్ ఫీల్డర్’ మెడల్‌ను ఈసారి స్టార్ బ్యాటర్ సుర్యకుమార్ యాదవ్ దక్కించుకున్నాడు. సూపర్ 8 మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై అద్బుతమైన ఫీల్డింగ్ ప్రదర్శన కనబరిచినందుకు సూర్యకు ఉత్తమ ఫీల్డింగ్ మెడల్ అవార్డు వరించింది. కాగా ప్రత్యేకంగా గెస్ట్‌ను పిలిచి ఈ అవార్డు అందజేయడం సాంప్రదాయకంగా వస్తున్న సంగతి తెలిసిందే. ఈసారి అవార్డు అందజేసేందుకు వెస్టిండీస్ గ్రేట్ ,దిగ్గజ బ్యాటర్ సర్ వివియన్ రిచర్డ్స్‌ను భారత ఫీల్డింగ్ కోచ్ టి దిలీప్ తీసుకు వచ్చాడు. వివియన్ రిచర్డ్స్ డ్రెస్సింగ్ రూమ్‌లోకి రాగానే భారత టీమ్ మొత్తం లేచి నిలబడి చప్పట్లు కొడుతూ స్వాగతించారు. వివియన్ రిచర్డ్స్ చేతుల మీదగా సూర్య బెస్ట్ ఫీల్డర్ అవార్డును అందుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. -
కోహ్లికి 121 మ్యాచ్‌లు అవసరమైతే.. సూర్యకుమార్ కేవలం 64 మ్యాచ్‌ల్లోనే సాధించాడు..!
గత రెండేళ్లుగా నంబర్ వన్ టీ20 బ్యాటర్‌గా చలామణి అవుతున్న టీమిండియా విధ్వంసకర వీరుడు సూర్యకుమార్ యాదవ్ పొట్టి క్రికెట్లో తాజాగా మరో ఘనత సాధించాడు. అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు (15) గెలుచుకున్న ఆటగాడిగా విరాట్ కోహ్లి రికార్డును సమం చేశాడు. టీ20 వరల్డ్‌కప్ 2024 సూపర్-8 మ్యాచ్‌ల్లో భాగంగా ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు గెలుచుకోవడం ద్వారా స్కై ఈ రికార్డు నెలకొల్పాడు.విరాట్‌కు 15 ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు గెలుచుకునేందుకు 121 మ్యాచ్‌లు అవసరమైతే.. స్కై కేవలం 64 మ్యాచ్‌ల్లోనే ఈ ఘనత సాధించాడు. అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు గెలుచుకున్న ఆటగాళ్ల జాబితాలో స్కై, విరాట్ తర్వాత విరన్‌దీప్ సింగ్ (14), సికందర్ రజా (14), మొహమ్మద్ నబీ (14) ఉన్నారు.భారత్-ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌లో సూర్యకుమార్ మెరుపు అర్దశతకం (28 బంతుల్లో 53; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) సాధించి, టీమిండియా గెలుపులో కీలకపాత్ర పోషించాడు. తద్వారా ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు గెలుచున్నాడు. ఏకపక్షంగా సాగిన ఈ మ్యాచ్‌లో టీమిండియా ఆఫ్ఘనిస్తాన్‌ను 47 పరుగుల తేడాతో చిత్తు చేసింది.తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. స్కై ఆకాశమే హద్దుగా చెలరేగడంతో నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. భారత ఇన్నింగ్స్‌లో విరాట్ కోహ్లి (24), రిషబ్ పంత్ (20), హార్దిక్ పాండ్యా (32) ఓ మోస్తరు స్కోర్లు చేయగా.. రోహిత్ శర్మ (8), శివమ్ దూబే (10), రవీంద్ర జడేజా (7) తక్కువ స్కోర్లకే ఔటయ్యారు. ఆఖర్లో అక్షర్ పటేల్ (12) ఆకట్టుకున్నాడు. ఆఫ్ఘన్ బౌలర్లలో రషీద్ ఖాన్, ఫజల్ హక్ ఫారూఖీ తలో 3 వికెట్లు పడగొట్టగా.. నవీన్ ఉల్ హక్ ఓ వికెట్ దక్కించుకున్నాడు.నిప్పులు చెరిగిన బుమ్రా..182 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆఫ్ఘనిస్తాన్.. బుమ్రా (4-1-7-3) నిప్పులు చెరగడంతో 134 పరుగులకే ఆలౌటైంది. భారత బౌలర్లలో అర్ష్‌దీప్ 3, కుల్దీప్ 2, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా తలో వికెట్ పడగొట్టారు. ఆఫ్ఘనిస్తాన్ బ్యాటర్లలో అజ్మతుల్లా ఒమర్జాయ్ (26) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. -
T20 World Cup 2024 Super 8: ఆఫ్ఘనిస్తాన్‌ను చిత్తు చేసిన టీమిండియా
టీ20 వరల్డ్‌కప్ 2024లో భాగంగా బార్బడోస్ వేదికగా ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన సూపర్-8 మ్యాచ్‌లో టీమిండియా 47 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేయగా.. ఛేదనలో చేతులెత్తేసిన ఆఫ్ఘనిస్తాన్ 20 ఓవర్లలో 134 పరుగులకు చాపచుట్టేసింది.స్కై మెరుపులు..టాస్ ఓడి ప్రత్యర్ధి ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా.. సూర్యకుమార్ యాదవ్ (28 బంతుల్లో 53; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపు అర్ద సెంచరీతో సత్తా చాటడంతో భారీ స్కోర్ చేసింది. భారత ఇన్నింగ్స్‌లో విరాట్ కోహ్లి (24), రిషబ్ పంత్ (20), హార్దిక్ పాండ్యా (32) ఓ మోస్తరు స్కోర్లు చేయగా.. రోహిత్ శర్మ (8), శివమ్ దూబే (10), రవీంద్ర జడేజా (7) తక్కువ స్కోర్లకే ఔటయ్యారు. ఆఖర్లో అక్షర్ పటేల్ (12) ఆకట్టుకున్నాడు. ఆఫ్ఘన్ బౌలర్లలో రషీద్ ఖాన్, ఫజల్ హక్ ఫారూఖీ తలో 3 వికెట్లు పడగొట్టగా.. నవీన్ ఉల్ హక్ ఓ వికెట్ దక్కించుకున్నాడు.నిప్పులు చెరిగిన బుమ్రా..182 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆఫ్ఘనిస్తాన్.. బుమ్రా (4-1-7-3) నిప్పులు చెరగడంతో 134 పరుగులకే ఆలౌటైంది. భారత బౌలర్లలో అర్ష్‌దీప్ 3, కుల్దీప్ 2, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా తలో వికెట్ పడగొట్టారు. ఆఫ్ఘనిస్తాన్ బ్యాటర్లలో అజ్మతుల్లా ఒమర్జాయ్ (26) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. -
T20 World Cup 2024: సత్తా చాటిన సూర్యకుమార్.. ఆఫ్ఘనిస్తాన్ ముందు భారీ లక్ష్యం
టీ20 వరల్డ్‌కప్ 2024లో భాగంగా బార్బడోస్ వేదికగా ఆఫ్ఘనిస్తాన్‌తో ఇవాళ (జూన్ 20) జరుగుతున్న సూపర్-8 మ్యాచ్‌లో టీమిండియా టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో భారత్ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. సూర్యకుమార్ యాదవ్ (28 బంతుల్లో 53; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపు అర్ద సెంచరీతో సత్తా చాటగా.. విరాట్ కోహ్లి (24), రిషబ్ పంత్ (20), హార్దిక్ పాండ్యా (32) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. రోహిత్ శర్మ (8), శివమ్ దూబే (10), రవీంద్ర జడేజా (7) తక్కువ స్కోర్లకే ఔటయ్యారు. ఆఖర్లో అక్షర్ పటేల్ (12) రెండు బౌండరీలు బాది ఆకట్టుకున్నాడు. ఆఫ్ఘన్ బౌలర్లలో రషీద్ ఖాన్, ఫజల్ హక్ ఫారూఖీ తలో 3 వికెట్లు పడగొట్టగా.. నవీన్ ఉల్ హక్ ఓ వికెట్ దక్కించుకున్నాడు. తుది జట్లు..భారత్: రోహిత్ శర్మ(కెప్టెన్), విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్(వికెట్‌కీపర్), సూర్యకుమార్ యాదవ్, శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రాఆఫ్ఘనిస్తాన్ : రహ్మానుల్లా గుర్బాజ్(వికెట్‌కీపర్), ఇబ్రహీం జద్రాన్, నజీబుల్లా జద్రాన్, హజ్రతుల్లా జజాయ్, గుల్బాదిన్ నైబ్, అజ్మతుల్లా ఒమర్జాయ్, మహ్మద్ నబీ, రషీద్ ఖాన్(కెప్టెన్), నూర్ అహ్మద్, నవీన్-ఉల్-హక్, ఫజల్ హక్ ఫారూఖీ -
టీమిండియాకు బిగ్ షాక్.. స్టార్ బ్యాటర్‌కు గాయం
టీ20 వరల్డ్‌కప్-2024 గ్రూపు స్టేజిలో అదరగొట్టిన టీమిండియా.. ఇప్పుడు సూపర్-8 పోరుకు సిద్దమవుతోంది. ఇప్పటికే కరేబియన్ దీవుల్లో అడుగుపెట్టిన భారత జట్టు ప్రాక్టీస్‌ను మొదలు పెట్టింది.లీగ్ స్టేజిలో కనబరిచిన జోరునే సూపర్-8 రౌండ్లో కొనసాగించాలని రోహిత్ సేన భావిస్తోంది. సూపర్-8లో భాగంగా భారత్ తమ తొలి మ్యాచ్‌లో జూన్ 20న అఫ్గానిస్తాన్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌కు ముందు భారత జట్టుకు ఊహించని షాక్ తగిలింది.టీమిండియా స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ నెట్ ప్రాక్టీస్ గాయపడ్డాడు. త్రోడౌన్స్ స్పెషలిస్ట్ బౌలింగ్‌ను ప్రాక్టీస్ చేస్తుండగా సూర్య చేతికి వేలికి గాయమైంది. బంతి సూర్య కుడి చేతి వేలికి బలంగా తాకినట్లు తెలుస్తోంది. అయితే మ్యాజిక్ స్ప్రే చేసిన తర్వాత సూర్య తిరిగి మళ్లీ ప్రాక్టీస్ మొదలు పెట్టినట్లు స్పోర్ట్స్టాక్ తమ నివేదికలో పేర్కొంది. సూర్య గాయం తీవ్రత ఇంకా తెలియాల్సి ఉంది. కాగా సూర్యకుమార్ గాయంపై జట్టు మెనెజ్‌మెంట్ గానీ బీసీసీఐ గానీ ఎటువంటి ప్రకటన చేయలేదు. -
T20 WC 2024: అమెరికాపై ఘన విజయం.. సూపర్-8కు టీమిండియా
టీ20 వరల్డ్‌కప్-2024లో టీమిండియా జైత్ర యాత్ర కొనసాగుతోంది. ఈ మెగా టోర్నీలో భాగంగా న్యూయర్క్ వేదికగా అమెరికాతో జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో భారత్ విజయం సాధించింది. ఈ విజయంతో సూపర్-8కు టీమిండియా అర్హత సాధించింది.కాగా ఈ మ్యాచ్‌లో 111 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు టీమిండియా కొంచెం కష్టపడింది. బ్యాటింగ్‌కు కష్టమైన పిచ్‌పై భారత్ 18.2 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి టార్గెట్‌ను ఛేజ్ చేసింది.భారత బ్యాటర్లలో సూర్యకుమార్ యాదవ్(50), శివమ్ దూబే(31) పరుగులతో ఆఖరి వరకు ఆజేయంగా నిలిచి తమ జట్టుకు అద్బుతమైన విజయాన్ని అందించారు. ఈ మ్యాచ్‌లో భారత టాపర్డర్ బ్యాటర్లు విరాట్ కోహ్లి(0), రోహిత్ శర్మ(3), రిషబ్ పంత్(18) పరుగులతో నిరాశపరిచారు. అమెరికా బౌలర్లలో నెత్రావల్కర్ రెండు వికెట్లు పడగొట్టగా.. అలీ ఖాన్ ఒక్క వికెట్ సాధించారు.చెలరేగిన అర్ష్‌దీప్.. తొలుత బ్యాటింగ్ చేసిన అమెరికా భారత బౌలర్లు దాటికి నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి కేవలం 110 పరుగులు మాత్రమే చేసింది. అమెరికా బ్యాటర్లలో నితీష్ కుమార్(27), టేలర్(24) పరుగులతో రాణించారు. ఇక భారత బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్ నాలుగు వికెట్లతో చెలరేగగా.. పాండ్యా రెండు, అక్షర్ పటేల్ ఒక్క వికెట్ సాధించారు. -
Ind vs Pak: ప్రతిసారీ ఇంతే.. టీ20 మేటి బ్యాటర్‌కు ఏమైంది?
టీమిండియా స్టార్, టీ20 వరల్డ్ నంబర్ వన్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ పొట్టి ప్రపంచకప్ తాజా ఎడిషన్‌లో ఇంత వరకూ బ్యాట్ ఝులిపించనే లేదు. వరల్డ్‌కప్-2024లో భాగంగా తొలుత ఐర్లాండ్‌తో టీమిండియా తలపడగా.. సూర్య నాలుగు బంతులు ఎదుర్కొని కేవలం 2 పరుగులే చేశాడు.ఇక చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో మ్యాచ్‌లోనూ మిస్టర్ 360 చేతులెత్తేశాడు. ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన సూర్య.. 8 బంతులు ఎదుర్కొని ఏడు పరుగులు మాత్రమే చేయగలిగాడు. హ్యారిస్ రవూఫ్ బౌలింగ్‌లో ఆమిర్‌కు క్యాచ్ ఇచ్చి నిష్క్రమించాడు.ఇక ఈ మ్యాచ్‌లో టీమిండియా గెలిచినా సూర్య ఫామ్ మాత్రం ఆందోళనకరంగా పరిణమించింది. ముఖ్యంగా ఇలాంటి కీలక మ్యాచ్‌లలో సూర్య తేలిపోవడం విమర్శలకు దారితీసింది.ప్రపంచకప్-2022 సమయంలోనూ పాక్‌తో మ్యాచ్‌లో సూర్యకుమార్ యాదవ్ 10 బంతుల్లో 15 రన్స్ చేసి నిష్క్రమించాడు. ఇక గతేడాది వన్డే వరల్డ్‌కప్ సమయంలోనూ ఒత్తిడిలో చిత్తయ్యాడు ఈ ముంబైకర్. ఆస్ట్రేలియాతో జరిగిన ఫైనల్లో 28 బంతులు ఎదుర్కొని కేవలం 18 పరుగులు మాత్రమే చేశాడు.ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా సూర్యకుమార్ ఆట తీరు గురించి కీలక వ్యాఖ్యలు చేశాడు. ప్రధానమైన మ్యాచ్‌లలో చేతులెత్తేయడం సూర్యకు పరిపాటిగా మారిందని పేర్కొన్నాడు.బిగ్ మ్యాచ్‌లలో ఒత్తిడిని తట్టుకోలేకపాకిస్తాన్తో తాజా మ్యాచ్‌లో టీమిండియా బ్యాటింగ్ తీరును ప్రస్తావిస్తూ.. ‘‘పాకిస్తాన్ టాస్ గెలిచి ఇండియాను తొలుత బ్యాటింగ్ చేయమని అడిగింది. విరాట్ కోహ్లి.. ఆ తర్వాత రోహిత్ శర్మ అవుటయ్యారు.ఆ సమయంలో రిషభ్ పంత్ బాధ్యతగా ఆడాడు. అతడికి తోడైన సూర్యకుమార్ ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోయాడు. అదే ఇక్కడ పెద్ద ప్రశ్న.మామూలుగా అయితే సూర్య బాగానే ఆడతాడు. కానీ బిగ్ మ్యాచ్‌లలో మాత్రం రాణింలేకపోతున్నాడు. గతంలో మెల్బోర్న్లో.. 2023 వరల్డ్‌కప్ సమయంలోనూ ఇలాగే జరిగింది. బిగ్ మ్యాచ్‌లలో అతడు ఒత్తిడిని తట్టుకోలేకపోతున్నాడా అనే ప్రశ్న తలెత్తుతోంది’’ అని ఆకాశ్ చోప్రా సూర్య ప్రదర్శనపై ఆందోళన వ్యక్తం చేశాడు. చదవండి: Ind vs Pak: కావాలనే బంతులు వృథా చేశాడు: పాక్ మాజీ కెప్టెన్ ఫైర్ -
"టీమ్ ఆఫ్ ద ఇయర్" క్యాప్స్ అందుకున్న టీమిండియా క్రికెటర్లు
టీ20 వరల్డ్‌కప్ 2024కు ముందు పలువురు టీమిండియా క్రికెటర్లు "టీమ్ ఆఫ్ ద ఇయర్" క్యాప్స్ అందుకున్నారు. గతేడాది జాతీయ జట్టు తరఫున అత్యుత్తమ ప్రదర్శన కనబర్చినందుకు గాను సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్, కుల్దీప్ యాదవ్, మొహమ్మద్ సిరాజ్‌లను టీమ్ ఆఫ్ ద ఇయర్ క్యాప్స్‌తో పాటు ఐసీసీ అవార్డులు వరించాయి.ప్రపంచ నంబర్ వన్ టీ20 బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ టీ20 క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డుతో పాటు టీమ్ ఆఫ్ ద ఇయర్ క్యాప్‌ను అందుకున్నాడు. ఎడమచేతి వాటం పేసర్ అర్ష్‌దీప్ సింగ్ కూడా టీ20 టీమ్ ఆఫ్ ది ఇయర్ క్యాప్‌ను అందుకున్నాడు.ఆల్ రౌండర్ రవీంద్ర జడేజాకు టెస్ట్ టీమ్ ఆఫ్ ద ఇయర్ క్యాప్ లభించింది. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్, కుల్దీప్ యాదవ్, మొహమ్మద్ సిరాజ్ వన్డే టీమ్ ఆఫ్ ది ఇయర్ క్యాప్‌లు అందుకున్నారు.ఇదిలా ఉంటే, టీ20 వరల్డ్‌కప్ 2024లో భారత ప్రస్తానం జూన్ 5న ఐర్లాండ్‌తో జరిగే మ్యాచ్‌తో మొదలవుతుంది. అనంతరం జూన్ 9న భారత జట్టు దాయాది పాకిస్తాన్‌ను ఢీకొట్టనుంది. ఈ మెగా టోర్నీలో భారత్.. పాకిస్తాన్, కెనడా, యూఎస్ఏ, ఐర్లాండ్‌లతో కలిసి గ్రూప్-ఏలో పోటీపడనుంది.టీ20 ప్రపంచకప్ కోసం ప్రకటించిన భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, సంజూ శాంసన్, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్, అర్ష్‌దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, మొహమ్మద్ సిరాజ్ట్రావెలింగ్ రిజర్వ్స్: శుభ్‌మన్ గిల్, రింకూ సింగ్, ఖలీల్ అహ్మద్, ఆవేశ్ ఖాన్ -
ఓటేసిన సచిన్, సూర్యకుమార్.. ఫోటోలు వైరల్
దేశంలో సార్వత్రిక ఎన్నికల సమరం తుది అంకానికి చేరుకుంది. ఐదో దశలో భాగంగా మహారాష్ట్రతో పాటు ఆరు రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లోని 49 స్థానాలకు పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఓటింగ్.. సాయంత్రం 6 గంటలకు ముగియనుంది. ఈ నేపథ్యంలో పలువురు క్రికెటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌తో పాటు టీమిండియా స్టార్ సూర్యకుమార్ యాదవ్, వెటరన్ అజింక్యా రహానే, అర్జున్ టెండూల్కర్ సైతం ఓటు వేశారు. సచిన్ తన తనయుడు అర్జున్‌తో కలిసి ముంబైలోని ఓ పోలింగ్ కేంద్రంలో తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. పోలింగ్ స్టేషన్ బయట సిరాతో ఉన్న వేలిని చూపిస్తూ ఫోటోలకు ఫోజులిచ్చారు. అదేవిధంగా సూర్యకుమార్ సైతం ఓటు వేసిన అనంతరం తన ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. మన దేశ భవిష్యత్తును నిర్ణయించే ఓటు హక్కును వినియోగించుకోవాలని సూర్య పిలుపునిచ్చాడు. Let’s shape the future of our nation by casting our vote today. ✌️ pic.twitter.com/ZYgT69zhis— Surya Kumar Yadav (@surya_14kumar) May 20, 2024 -
MI Vs SRH: ఆల్‌టైమ్ రికార్డు సమం
2024 ఐపీఎల్ సీజన్ గత సీజన్లకు భిన్నంగా జోరుగా సాగుతుంది. ఈ సీజన్లో దాదాపుగా ప్రతి మ్యాచ్‌లో పరుగుల వరద పారడంతో పాటు భారీ సంఖ్యలో మెరుపు ఇన్నింగ్స్‌లు నమోదవుతున్నాయి. నిన్న (మే 6) ముంబై-ఎస్ఆర్హెచ్ మ్యాచ్‌లోనూ ఇలాంటి ఓ మెరుపు ప్రదర్శన నమోదైంది. ముంబై ఆటగాడు సూర్యకుమార్ (51 బంతుల్లో 102 నాటౌట్; 12 ఫోర్లు, 6 సిక్సర్లు) సునామీ శతకంతో విరుచుకుపడి తన జట్టుకు అపురూప విజయాన్నందించాడు. ఈ క్రమంలో ఓ ఆల్‌టైమ్ రికార్డు సమం అయ్యింది.ఓ సీజన్లో అత్యధిక సెంచరీల రికార్డును ప్రస్తుత సీజన్ సమం చేసింది. 2023 సీజన్లో రికార్డు స్థాయిలో 12 సెంచరీలు (అన్ని జట్లు కలిపి) నమోదు కాగా.. ఈ సీజన్లో ఇప్పటికే 12 సెంచరీలు పూర్తయ్యాయి. ఇంకా 19 మ్యాచ్‌లు ఆడాల్సి ఉండగానే భారీ సంఖ్యలో నమోదు కావడంతో ఈ సీజన్ గత సీజన్ల కంటే భిన్నమని మరోసారి రుజువైపోయింది.ఐపీఎల్లో ఏ యేడుకాయేడు సెంచరీల సంఖ్య పెరుగుతూ వస్తుంది. 2022 సీజన్ మొత్తంలో 8 సెంచరీలు నమోదైనప్పుడు అభిమానులు ఆహా ఓహో అన్నారు. ఇప్పుడు మరికొన్ని మ్యాచ్‌లు మిగిలుండగానే 12 సెంచరీలు నమోదవడం చూసి ఫ్యాన్స్ ముక్కున వేలేసుకుంటున్నారు.మ్యాచ్ విషయానికొస్తే.. నిన్నటి మ్యాచ్‌లో ఎస్ఆర్హెచ్పై ముంబై 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ ముక్కీ మూలిగి 173 పరుగులు చేసింది. ట్రవిస్ హెడ్ (48). కెప్టెన్ కమిన్స్ (35 నాటౌట్) ఓ మోస్తరు స్కోర్లు చేసి సన్‌రైజర్స్ పరువు కాపాడారు. ముంబై బౌలర్లలో పియూశ్ చావ్లా, హార్దిక్ పాండ్యా తలో 3 వికెట్లు పడగొట్టగా.. బుమ్రా, అన్షుల్ కంబోజ్ చెరో వికెట్ దక్కించుకున్నారు.అనంతరం నామమాత్రపు లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ముంబై 31 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. అయితే సూర్యకుమార్.. తిలక్ వర్మ (37 నాటౌట్) సాయంతో తన జట్టును విజయతీరాలకు చేర్చాడు. ఈ మ్యాచ్‌లో ఓటమితో సన్‌రైజర్స్ పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి పడిపోవడంతో పాటు నెట్ రన్‌రేట్‌ను కూడా దిగజార్చుకుంది. ఈ మ్యాచ్‌లో గెలుపుతో ముంబై ఆఖరి స్థానం నుంచి లేచొచ్చి తొమ్మిదో స్థానానికి చేరుకుంది. -
సూర్య విధ్వంసకర సెంచరీ.. ఎస్ఆర్హెచ్పై ముంబై విజయం
ఐపీఎల్-2024లో వరుస ఓటములను చవిచూసిన ముంబై ఇండియన్స్ తిరిగి పుంజుకుంది. ఈ మెగా ఈవెంట్లో భాగంగా వాంఖడే స్టేడియం వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో ముంబై ఇండియన్స్ ఘన విజయం సాధించింది. 174 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై కేవలం 3 వికెట్లు కోల్పోయి 17.2 ఓవర్లలో చేధించింది. కాగా లక్ష్య చేధనలో ముంబై 30 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ సమయంలో మిడిలార్డర్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ ఎస్ఆర్హెచ్ బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. సూర్య తన హోం గ్రౌండ్లో విధ్వంసకర సెంచరీతో చెలరేగాడు. ఎస్ఆర్హెచ్ బౌలర్లను ఊచకోత కోశాడు. ఓవైపు గాయంతో బాధపడుతూనే ముంబై ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. సూర్య కేవలం 51 బంతుల్లోనే 12 ఫోర్లు, 6 సిక్స్‌లతో 102 పరుగులతో ఆజేయంగా నిలిచి తన జట్టుకు అద్బుతమైన విజయాన్ని అందించాడు. అతడితో పాటు తిలక్ వర్మ(37నాటౌట్) పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఎస్ఆర్హెచ్ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్, మార్కో జానెసన్, కమ్మిన్స్ తలా వికెట్ సాధించారు. అంతకుముందు బ్యాటింగ్‌కు దిగిన ఎస్ఆర్హెచ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. ఎస్ఆర్హెచ్ బ్యాటర్లలో ఓపెనర్ ట్రావిస్ హెడ్(48) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ ఆఖరిలో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. 17 బంతులు ఎదుర్కొన్న కమ్మిన్స్ 2 సిక్స్‌లు, 2 ఫోర్లతో 35 పరుగులతో ఆజేయంగా నిలిచాడు. వీరిద్దరితో పాటు నితీష్ రెడ్డి(20), జానెసన్(17) రాణించారు. ఇక ముంబై బౌలర్లలో కెప్టెన్ హార్దిక్ పాండ్యా, చావ్లా తలా మూడు వికెట్లు సాధించగా.. అన్షుల్ కాంబోజ్, బుమ్రా చెరో వికెట్ సాధించారు. -
కోహ్లి, రోహిత్ కాదు.. వారిద్దరే టాప్ 2 టీ20 బ్యాటర్లు?
ఐపీఎల్-2024లో పంజాబ్ కింగ్స్ స్టార్ ఓపెనర్ జానీ బెయిర్‌స్టో దారుణమైన ప్రదర్శన కనబరుస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది సీజన్లో ఇప్పటివరకు 6 మ్యాచ్‌లు ఆడిన బెయిర్ స్టో.. 16.00 సగటుతో కేవలం 96 పరుగులు మాత్రమే చేశాడు. ఈ క్రమంలో గురువారం(ఏప్రిల్ 18) ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో బెయిర్ స్టోకు ఆడే అవకాశం దక్కలేదు. అతడిని పంజాబ్ మెనెజ్‌మెంట్ పక్కన పెట్టి రిలీ రూసోను జట్టులోకి తీసుకువచ్చారు. కానీ రూసో కూడా నిరాశపరిచాడు. అయితే తాజాగా బెయిర్ స్టో ప్రముఖ క్రీడా వెబ్సైట్ ఈఎస్పీఎన్ క్రిక్ ఇన్ ఫోకి ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ క్రమంలో ప్రస్తుత వరల్డ్ క్రికెట్లో టాప్ 3 టీ20 బ్యాటర్లు ఎవరన్న ప్రశ్న బెయిర్‌స్టోకు ఎదురైంది. బెయిర్ స్టో వెంటనే తన తొలి రెండు ఎంపికలగా దక్షిణాఫ్రికా స్టార్ హెన్రిచ్ క్లాసెన్, భారత విధ్వంసకర ఆటగాడు సూర్యకుమార్ యాదవ్‌లను ఎంచుకున్నాడు. మూడో ప్లేయర్‌ను ఎంచుకోవడానికి జానీ కాస్త సమయం తీసుకున్నాడు. కాస్త ఆలోచించి తన సహచర ఆటగాడు, ఇంగ్లండ్ పరిమిత ఓవర్ల కెప్టెన్ జోస్ బట్లర్‌ను తన మూడో ఛాయిస్ గా ఎంచుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోను ఈఎస్పీఎన్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. అయితే ప్రస్తుత ఐపీఎల్లో అదరగొడుతున్న టీమిండియా స్టార్లు విరాట్ కోహ్లి,రోహిత్ శర్మలను బెయిరో స్టో ఎంచుకోపోవడం గమనార్హం. Can you argue with this? 🤔 #25Questions with Jonny Bairstow 👉 https://t.co/u7aCIY24E4 pic.twitter.com/jIg4WSd7YQ — ESPNcricinfo (@ESPNcricinfo) April 19, 2024 -
CSK Vs MI: వావ్ వాట్ ఏ క్యాచ్.. మ్యాచ్ టర్నింగ్ పాయింట్! వీడియో వైరల్
ఐపీఎల్-2024లో భాగంగా వాంఖడే వేదికగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 20 పరుగుల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించింది. ఈ హైవోల్టేజ్ పోరులో సీఎస్కే ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టింది. తొలుత బ్యాటింగ్‌లో దంచి కొట్టిన సీఎస్కే.. తర్వాత బౌలింగ్‌లోనూ సత్తాచాటింది. అయితే ఈ మ్యాచ్‌లో చెన్నై ఆటగాడు ముస్తాఫిజుర్ రెహ్మన్ కళ్లు చెదిరే క్యాచ్‌ను అందుకున్నాడు. ముస్తాఫిజుర్ పట్టిన క్యాచ్ మ్యాచ్ టర్నింగ్ పాయింట్‌గా నిలిచింది. ముస్తాఫిజుర్ అద్బుతమైన క్యాచ్‌తో ముంబై విధ్వంసకర ఆటగాడు సూర్యకుమార్ యాదవ్‌ను పెవిలియన్‌కు పంపాడు. ముంబై ఇన్నింగ్స్ 8వ ఓవర్ వేసిన పతిరాన తొలి బంతికే ఇషాన్ కిషన్‌ను పెవిలియన్‌కు పంపాడు. ఈ క్రమంలో ఇంపాక్ట్ ప్లేయర్‌గా సూర్యకుమార్ యాదవ్ వచ్చాడు. అయితే ఆ ఓవర్లో మూడో బంతిని పతీరణ ఔట్ సైడ్ ఆఫ్ స్టంప్ దిశగా షార్ట్ లెంగ్త్ డెలివరీగా సంధిచాడు. సూర్యకుమార్ యాదవ్ అప్పర్ కట్ షాట్ ఆడటానికి ప్రయత్నించాడు. షాట్ సరిగ్గా కనక్ట్ అయినప్పటికి బౌండరీ లైన్‌వద్ద ముస్తాఫిజుర్ అద్బుత విన్యాసం చేశాడు. థర్డ్‌మ్యాన్‌లో ఫీల్డింగ్ చేస్తున్న రెహ్మాన్ కాస్త ఎడమవైపు జరిగి జంప్ చేస్తూ క్యాచ్‌ను అందుకున్నాడు. కానీ జంప్ చేసే క్రమంలో సమన్వయం కోల్పోయిన రెహ్మన్.. బంతిని గాల్లోకి విసిరేసి తిరిగొచ్చి అందుకున్నాడు. ఇది చూసిన మిస్టర్ 360 బిత్తరపోయాడు. చేసేదేమి లేక సూర్య ఖాతాతెరవకుండానే పెవిలియన్‌కు చేరాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. Ishan Kishan ✅ Suryakumar Yadav ✅ Relive Matheesha Pathirana's double-delight over which also included a magnificent catch by Mustafizur Rahman at the ropes 👏👏 Watch the match LIVE on @starsportsindia and @JioCinema 💻📱#TATAIPL | #MIvCSK | @ChennaiIPL pic.twitter.com/XbSsEiXLgZ — IndianPremierLeague (@IPL) April 14, 2024 -
Surya Kumar Yadav: కొడితే కెమెరా పగలిపోయింది..!
ఐపీఎల్లో ఇవాళ (ఏప్రిల్ 14) రాత్రి బిగ్ ఫైట్ జరుగనుంది. చెరి ఐదు సార్లు ఛాంపియన్లైన ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. ముంబై ఇండియన్స్ హోం గ్రౌండ్ అయిన వాంఖడే మైదానంలో ఈ మ్యాచ్ జరుగనుంది. క్రికెట్ ఎల్ క్లాసికోగా పిలువబడే ఈ మ్యాచ్‌పై భారీ అంచనాలు ఉన్నాయి. ధోని, రోహిత్ మెరుపులు చూసేందుకు అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రాత్రి 7:30 గంటలకు ప్రారంభమయ్యే ఈ రసవత్తర సమరంలో పైచేయి ఎవరిదో వేచి చూడాలి. ఈ మ్యాచ్ కోసం ఇరు జట్ల ఆటగాళ్లు ప్రత్యేకంగా సాధన చేస్తున్నారు. భారీ అంచనాలు ఉండటంతో ఇరు జట్ల ఆటగాళ్లు ప్రాక్టీస్ సెషన్స్‌లో కఠోరంగా శ్రమిస్తున్నారు. ముంబై ఇండియన్స్ విధ్వంసకర వీరుడు సూర్యకుమార్ అందరికంటే ఎక్కువగా నెట్స్‌లో టైమ్ స్పెండ్ చేశాడు.స్కై నిన్న అంతా బ్రేక్ లేకుండా పాక్టీస్లో పాల్గొన్నాడు. ప్రాక్టీస్ చేసే క్రమంలో స్కై ఓ కెమెరాను పగలగొట్టాడు. Suryakumar Yadav broke a camera in the practice session 😁pic.twitter.com/dWM2RlEbwl — CricTracker (@Cricketracker) April 13, 2024 నెట్స్‌లో సాధన చేస్తుండగా.. డిఫెన్స్ షాట్ అడినప్పటికీ స్కై పక్కనే ఉన్న కెమెరా తునాతునకలైంది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతుంది. డిఫెన్స్ ఆడితేనే ఇలా అయితే స్కై భారీ షాట్ కొడితే పరిస్థితి ఏంటని అభిమానులు చర్చించుకుంటున్నారు. చాలాకాలం తర్వాత ఇటీవలే రీఎంట్రీ ఇచ్చిన స్కై.. ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఈ మ్యాచ్‌లో 19 బంతులు ఎదుర్కొన్న స్కై.. 5 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 52 పరుగులు చేశాడు. ఈ మెరుపు ఇన్నింగ్స్ నేపథ్యంలో నేటి మ్యాచ్‌లోనూ సూర్యపై భారీ అంచనాలు ఉన్నాయి. స్కై నుంచి అభిమానలు మరో సుడిగాలి ఇన్నింగ్స్ ఆశిస్తున్నారు. నేటి మ్యాచ్‌లో స్కైతో పాటు రోహిత్ శర్మపై కూడా అభిమానులు ఓ కన్నేసి ఉంచారు. ఈ సీజన్లో హిట్‌మ్యాన్ పెద్ద స్కోర్లు చేయనప్పటికీ జట్టుకు మెరుపు ఆరంభాలు ఇచ్చాడు. రోహిత్, స్కై చెలరేగితే నేటి మ్యాచ్‌లో సీఎస్కేకు కష్టాలు తప్పకపోవచ్చు. సీఎస్కేలోనూ స్కై లాంటి మెరుపు వీరులు చాలామంది ఉన్నారు. ధోని, శివమ్ దూబే, రచిన్ రవీంద్రపై ఆ జట్టు అభిమానులు గంపెడాశలు పెట్టుకున్నారు. -
'డివిలియర్స్ కంటే అతడు చాలా డేంజరస్.. ఆపడం ఎవరి తరం కాదు'
ఐపీఎల్-2024లో భాగంగా వాంఖడే వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ విధ్వంసం సృష్టించాడు. ఈ ఏడాది సీజన్లో రెండో మ్యాచ్ ఆడిన సూర్యకుమార్.. ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఫస్ట్ డౌన్లో బ్యాటింగ్‌కు వచ్చిన సూర్య ఆర్సీబీ బౌలర్లకు చుక్కలు చూపించాడు. గ్రౌండ్ నలుమూలల షాట్లు ఆడుతూ బౌలర్లకు చమెటలు పట్టించాడు. ఈ క్రమంలో కేవలం 17 బంతుల్లోనే తన హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. ఓవరాల్‌గా 19 బంతులు ఎదుర్కొన్న సూర్యకుమార్.. 5 ఫోర్లు, 4 సిక్స్‌లతో 52 పరుగులు చేశాడు. ఈ క్రమంలో గాయం నుంచి కోలుకుని అద్బుత ఇన్నింగ్స్ ఆడిన సూర్యకుమార్‌పై భారత మాజీ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ప్రశంసల వర్షం కురిపించాడు. సూర్య అతను దక్షిణాఫ్రికా దిగ్గజం ఏబీ డివిలియర్స్‌కు బెటర్ వెర్షన్ భజ్జీ కొనియాడాడు. "సూర్యకుమార్ లాంటి ఆటగాడిని ఇప్పటివరకు నేను చూడలేదు. అతడి బౌలర్లను ఎటాక్ చేసే విధానం నమ్మశక్యం కానిది. అతడికి బౌలర్లకు ఎక్కడ బౌలింగ్ చేయాలో ఆర్ధం కాక తలలపట్టుకుంటున్నారు. ఒకవేళ నేను ఆడిన కూడా సూర్యకి బౌలింగ్ చేసేందుకు భయపడేవాడిని. సూర్య వేరే గ్రహంపై ఆడుతున్నట్లు ఉంది. సూర్యకుమార్ యాదవ్ చెలరేగితే ఆపడం ఎవరి తరం కాదు. ఇంతకముందు అందరూ ఏబీ డివిలియర్స్ గురించి మాట్లాడునుకోవారు. కానీ సూర్య తన ఆటతీరుతో ఏబీడీని మయమరిపిస్తున్నాడు. డివిలియర్స్ కంటే సూర్య డెంజరస్ ఆటగాడని నేను భావిస్తున్నాను. టీ20 ఫార్మాట్లో ప్రస్తుత తరం క్రికెటర్లలో సూర్యనే అత్యుత్తమ ఆటగాడని" స్టార్‌స్పోర్ట్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో భజ్జీ పేర్కొన్నాడు. చదవండి: రోహిత్‌ను టీజ్ చేసిన కోహ్లి.. హిట్‌మ్యాన్ రియాక్షన్ వైరల్ -
RCB Vs MI: ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చి విధ్వంసం.. దటీజ్ సూర్య భాయ్! వీడియో
ఐపీఎల్-2024లో తన తొలి మ్యాచ్‌లో విఫలమైన ముంబై ఇండియన్స్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్.. రెండో మ్యాచ్‌లో మాత్రం ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఈ మెగా ఈవెంట్లో భాగంగా వాంఖడే వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్‌లో సూర్యకుమార్ విధ్వంసం సృష్టించాడు. ఇంపాక్ట్ ప్లేయర్‌గా బరిలోకి దిగిన సూర్య భాయ్ ఆర్సీబీ బౌలర్లను ఊచకోత కోశాడు. క్రీజులోకి వచ్చినప్పటి నుంచే ప్రత్యర్ధి బౌలర్లను తన ట్రేడ్ మార్క్ షాట్లతో స్కై వీరవీహరం చేశాడు. ఈ క్రమంలో కేవలం 17 బంతుల్లోనే తన హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. ఓవరాల్‌గా 19 బంతులు ఎదుర్కొన్న సూర్యకుమార్.. 5 ఫోర్లు, 4 సిక్స్‌లతో 52 పరుగులు చేశాడు. కాగా అతడికి ఇది తన ఐపీఎల్లో కెరీర్లోనే ఫాస్ట్స్ట్ హాఫ్ సెంచరీ కావడం విశేషం. అదేవిధంగా ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ తరపున ఫాస్టెస్ట్ ఫిప్టీ నమోదు చేసిన రెండో ఆటగాడిగా మిస్టర్ 360 నిలిచాడు. ఈ జాబితాలో ఇషాన్ కిషన్ తొలి స్ధానంలో ఉన్నాడు. ఐపీఎల్-2021 సీజన్లో ఎస్ఆర్హెచ్పై కిషన్ కేవలం 16 బంతుల్లోనే ఆర్ధశతకాన్ని సాధించాడు. ఇక సూర్యకుమార్ విధ్వంసకర ఇన్నింగ్స్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన నెటిజన్లు వెలకమ్ బ్యాక్ టూ సూర్యభాయ్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా టీ20 వరల్డ్‌కప్‌కు ముందు సూర్య ఈ తరహా ప్రదర్శన చేయడం భారత జట్టుకు కలిసొచ్చే ఆంశం. pic.twitter.com/4Z9pwCdawR — Muskaan Bhatt (@MuskaanBhatt11) April 11, 2024 -
ఎన్నో ఆశలు పెట్టుకున్నాము.. ఇలా చేస్తావని అనుకోలేదు!డకౌట్‌గా
ముంబై ఇండియన్స్ స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ తన రీఎంట్రీ మ్యాచ్‌లో తీవ్ర నిరాశపరిచాడు. గత రెండు నెలలగా ఆటకు దూరంగా ఉన్న సూర్యకుమార్.. ఐపీఎల్-2024లో భాగంగా వాంఖడే వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌తో పునరాగమనం చేశాడు. ఈ మ్యాచ్‌లో సూర్య దారుణ ప్రదర్శన కనబరిచాడు. రీ ఎంట్రీలో సత్తాచాటాతుడాని భావించిన ముంబై అభిమానుల ఆశలను మిస్టర్ 360 ఆడియాశలు చేశాడు. ఫస్ట్ డౌన్లో బ్యాటింగ్‌కు వచ్చిన సూర్యకుమార్ సిల్వర్ డక్‌గా వెనుదిరిగాడు. రెండు బంతులు ఎదుర్కొన్న ఈ ముంబైకర్ అన్రిచ్ నోర్జే బౌలింగ్‌లో చెత్త షాట్ ఆడి ఖాతా తెరవకుండానే పెవిలియన్‌కు చేరాడు. మిడాన్‌లో సబ్‌స్టిట్యూట్ ఫీల్డర్ జేక్ ఫ్రేజర్-మెక్‌గర్క్‌కు క్యాచ్ ఇచ్చి సూర్య ఔటయ్యాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఏంటి సూర్య భయ్యా ఇలా చేశావు.. ఎన్నో ఆశలు పెట్టుకున్నాము అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. pic.twitter.com/CbTPcnUbnx — Cricket Videos (@cricketvid123) April 7, 2024 -
ముంబై ఇండియన్స్‌కు గుడ్ న్యూస్.. విధ్వంసకర వీరుడు వచ్చేస్తున్నాడు..!
ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో వరుస పరాజయాలతో (హ్యాట్రిక్) సతమతమవుతున్న ముంబై ఇండియన్స్‌కు శుభవార్త తెలిసింది. ఆ జట్టు స్టార్ ఆటగాడు, విధ్వంసకర వీరుడు సూర్యకుమార్ యాదవ్ ముంబై ఆడబోయే తదుపరి మ్యాచ్‌కు అందుబాటులో ఉంటాడని తెలుస్తుంది. ఎన్సీఏ వైద్యులు స్కైకు ఫిట్నెస్ క్లియెరెన్స్ ఇచ్చినట్లు సమాచారం. ఏప్రిల్ 7న (ఆదివారం) ఢిల్లీతో జరుగబోయే మ్యాచ్ సమయానికి స్కై వంద శాతం ఫిట్‌గా ఉంటాడని ఎన్సీఏకి చెందిన కీలక అధికారి వెల్లడించాడు. సూర్యకుమార్ గాయం కారణంగా ప్రస్తుత సీజన్లో ముంబై ఆడిన మొదటి మూడు మ్యాచ్‌లకు దూరంగా ఉన్న విషయం తెలిసిందే. స్కై గైర్హాజరీలో హార్దిక్ పాండ్యా నేతృత్వంలోని ముంబై హ్యాట్రిక్ పరాజయాలు ఎదుర్కొంది. ఈ మూడు మ్యాచ్‌ల్లో సూర్య లేని లోటు స్పష్టంగా కనిపించింది. మడమ, స్పోర్ట్స్ హెర్నియా సర్జరీల కారణంగా సూర్యకుమార్ యాదవ్ గత నాలుగు నెలలుగా క్రికెట్‌కు దూరంగా ఉన్నాడు. రెండు సర్జరీలు విజయవంతంగా పూర్తి చేసుకున్న స్కై.. మార్చి నుంచి ఎన్సీఏ వైద్యుల పర్యవేక్షణలో ఉన్నాడు. ఐపీఎల్ ప్రారంభానికి ముందు స్కైకు ఫిట్నెస్ పరీక్ష చేయగా అందులో విఫలమయ్యాడు. తిరిగి జరిపిన మరో రెండో పరీక్షల్లో స్కై పూర్తి ఫిట్నెస్ సాధించినట్లు తేలడంతో ఎన్సీఏ అతనికి ఐపీఎల్ అడేందుకు అనుమతిచ్చింది. -
#Riyan Parag: 'అతడొక సంచలనం.. సూర్యకుమార్‌లా ఆడుతున్నాడు'
ఐపీఎల్-2024లో రాజస్తాన్ రాయల్స్ ఆటగాడు రియాన్ పరాగ్ తన సూపర్ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. తొలి రెండు మ్యాచ్‌ల్లో అదరగొట్టిన పరాగ్.. సోమవారం ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. సంజూ శాంసన్, బట్లర్, జైశ్వాల్ వంటి స్టార్ ఆటగాళ్లు విఫలమైన చోట పరాగ్ సత్తాచాటాడు. తన అద్బుత ఇన్నింగ్స్‌తో రాజస్తాన్‌ను పరాగ్ గెలిపించాడు. ఈ మ్యాచ్‌లో 39 బంతులు ఎదుర్కొన్న పరాగ్ 5 ఫోర్లు, 3 సిక్సర్లతో 54 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. ఈ ఏడాది సీజన్లో ఇప్పటివరకు 3 మ్యాచ్‌లు ఆడిన పరాగ్.. 181 పరుగులతో ఆరెంజ్ క్యాప్ హోల్డర్‌గా కొనసాగుతున్నాడు. ఈ నేపథ్యంలో పరాగ్‌పై రాజస్తాన్ రాయల్స్ బౌలింగ్ కోచ్ షేన్ బాండ్ ప్రశంసల వర్షం కురిపిస్తున్నాడు. పరాగ్ తన ఆట తీరుతో సూర్యకుమార్ యాదవ్‌ను గుర్తు చేస్తున్నడంటూ బాండ్ కొనియాడాడు. "పరాగ్ అద్బుతమైన ఆటగాడు. అతడు తన ఆట తీరుతో సూర్యకుమార్ యాదవ్‌ను గుర్తు చేశాడు. సూర్య ముంబై ఇండియన్స్‌లోకి కొత్తగా వచ్చినప్పుడు ఈ తరహా ప్రదర్శనే చేసేవాడు. పరాగ్‌కు మంచి బ్యాటింగ్ స్కిల్స్ ఉన్నాయి. అతడు కేవలం 22 ఏళ్ల వయస్సుకే అద్బుతమైన టాలెంట్‌ను సంపాందించుకున్నాడు. కచ్చితంగా మంచి భవిష్యత్తు ఉంటుంది. ఈ ఏడాది సీజన్ ఆరంభానికి ముందు అతడు దేశవాళీ క్రికెట్లో అద్బుతమైన ప్రదర్శన కనబరిచాడు. అందుకే అతడికి బ్యాటింగ్ ఆర్డర్లో ప్రమోషన్ ఇచ్చాం. దేవ్‌దత్ పడిక్కల్‌ను వదులుకోవడంతో పరాగ్ ఆ స్ధానంలో బ్యాటింగ్ చేసే ఛాన్స్ ఉంది. అతడి నుంచి ఈ తరహా ప్రదర్శన కోసం మేము ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నాము. రాజస్తాన్ అతడిపై పెట్టిన పెట్టుబడికి ఇప్పుడు ప్రతిఫలం పొందుతుంది. మిగిలిన సీజన్లో కూడా రియాన్ తన ఫామ్‌ను కొనసాగించాలని ఆశిస్తున్నానని" క్రిక్‌ట్రాకర్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో బాండ్ పేర్కొన్నాడు. -
ఓటమి బాధలో ఉన్న ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్! ఇక కష్టమే
ఐపీఎల్-2024లో ముంబై ఇండియన్స్‌ను కష్టాలు వెంటాడుతున్నాయి. ఇప్పటికే తొలి రెండు మ్యాచ్‌ల్లో ఓటమి పాలై బాధలో ఉన్న ముంబైకు మరో బిగ్ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ ఈ ఏడాది సీజన్లో మరి కొన్ని మ్యాచ్‌లకు దూరం కానున్నట్లు తెలుస్తోంది. అతడు ఇప్పటిలో జట్టుతో చేరేలా సూచనలు కన్పించడం లేదు. ప్రస్తుతం ఏన్సీఏలో ఉన్న సూర్య గాయం నుంచి కోలుకుంటున్నాడు. టైమ్స్ ఆఫ్ ఇండియా రిపోర్ట్ ప్రకారం.. సూర్య పూర్తి ఫిట్నెస్ సాధించడానికి మరి కొన్ని రోజుల పట్టనున్నట్లు తెలుస్తోంది. ఇదే విషయాన్ని బీసీసీఐ వర్గాలు కూడా ధ్రువీకరించాయి. సూర్య చాలా త్వరగా కోలుకుంటున్నాడు. అతడు అతి త్వరలోనే ముంబై జట్టుతో కలవనున్నాడు. అయితే మొదటి రెండు మ్యాచ్‌లు ఆడలేకపోయిన సూర్య.. మరి కొన్ని మ్యాచ్‌లకు దూరంగా ఉండే ఛాన్స్ ఉందని బీసీసీఐ సీనియర్ ఆధికారి ఒకరు పేర్కొన్నారు. కాగా ప్రస్తుతం సూర్యలేని లోటు ముంబై జట్టులో స్పష్టంగా కన్పిస్తోంది. ఇక గతేడాది డిసెంబర్ లో దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టీ20లో సూర్యకుమార్ యాదవ్ గాయపడ్డాడు. ఆ తర్వాత జర్మనీలో స్పోర్ట్స్ హెర్నియా సర్జరీ చేయించుకున్నాడు. అప్పటి నుంచి సూర్య మళ్ళీ మైదానంలో కనిపించలేదు. కాగా ముంబై ఇండియన్స్ తమ తదుపరి మ్యాచ్‌లో ఏప్రిల్ 1న రాజస్తాన్ రాయల్స్‌తో తలపడనుంది. -
IPL 2024: సన్‌రైజర్స్‌తో మ్యాచ్‌కు ముందు ముంబైకు మరో ఎదురుదెబ్బ
ఈ సీజన్ తొలి మ్యాచ్‌లో గుజరాత్ చేతిలో అనూహ్య ఓటమిని ఎదుర్కొన్న ముంబై ఇండియన్స్‌కు సన్‌రైజర్స్‌తో రేపు (మార్చి 27) జరుగబోయే కీలక మ్యాచ్‌కు ముందు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఎన్సీఏ నుంచి ఎన్ఓసీ లభించని కారణంగా తొలి మ్యాచ్‌కు (గుజరాత్) దూరంగా ఉండిన సూర్యకుమార్ యాదవ్.. సన్‌రైజర్స్‌తో మ్యాచ్‌కు కూడా అందుబాటులో ఉండటం కష్టమేనని తెలుస్తుంది. ఎన్సీఏ స్కైకు ఇంకా ఎన్ఓసీ ఇవ్వలేదని సమాచారం. ఇవాళ సాయంత్రలోగా ఎన్సీఏ సూర్యకుమార్‌కు ఎన్ఓసీ ఇవ్వకపోతే.. రేపటి మ్యాచ్‌కు అతను అందుబాటులోకి రావడం దాదాపుగా అసాధ్యమే. ముంబై తొలి మ్యాచ్‌లో స్కై లేని లోటు స్పష్టంగా కనిపించింది. గుజరాత్‌తో మ్యాచ్‌లో సూర్యకుమార్ ఉండివుంటే ముంబై సునాయాసంగా లక్ష్యాన్ని ఛేదించి ఉండేది. రేపటి మ్యాచ్‌కు కూడా స్కై దూరమైతే అది ముంబై విజయావకాశాలపై తీవ్ర ప్రభావం చూపడం ఖాయం. Suryakumar Yadav didn't get the clearance from NCA to be fit for the IPL 2024. (Sports Tak). - He will miss 2nd match for Mumbai Indians. pic.twitter.com/bcpsTFtcMC — CricketMAN2 (@ImTanujSingh) March 26, 2024 కాగా, సూర్యకుమార్ గతకొంతకాలంగా గాయాలతో సతమతమవుతున్న విషయం తెలిసిందే. స్కై ఇటీవలే పలు సర్జరీలు చేయించుకుని ప్రస్తుతం ఎన్సీఏ వైద్యుల పర్యవేక్షణలో ఉన్నాడు. స్కై ఐపీఎల్ ఆడాలంటే ఎన్సీఏ వైద్యుల అనుమతి తప్పనిసరి. వారు ఎన్ఓసీ ఇస్తేనే స్కైకు ఐపీఎల్ ఆడేందుకు గ్రీన్ సిగ్నల్ లభిస్తుంది. ఇదిలా ఉంటే, ముంబై ఇండియన్స్ హైదరాబాద్ వేదికగా ఎస్ఆర్హెచ్తో రేపు జరుగబోయే మ్యాచ్‌లో తాడోపేడో తేల్చుకోబోతుంది. ఇరు జట్లు తమతమ తొలి మ్యాచ్‌ల్లో ప్రత్యర్దుల చేతుల్లో ఓడటంతో ఈ మ్యాచ్ ఇరు జట్లకు కీలకంగా మారింది. ముంబై తమ తొలి మ్యాచ్‌లో గుజరాత్ చేతిలో ఓడగా.. సన్‌రైజర్స్ కేకేఆర్ చేతిలో పరాజయంపాలైంది. సన్‌రైజర్స్, ముంబై ఇండియన్స్ మధ్య రేపటి మ్యాచ్ రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతుంది. -
ముంబై ఇండియన్స్‌కు గుండె పగిలే వార్త.. హార్ట్ బ్రేక్ పోస్ట్ పెట్టిన స్కై
ఐపీఎల్ 2024 ప్రారంభానికి ముందు ముంబై ఇండియన్స్‌కు గుండె పగిలే వార్త. ఆ జట్టు స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ ఇన్‌స్టా స్టోరీలో హార్ట్ బ్రేక్ పోస్ట్ పెట్టి అభిమానులను కలవరపెట్టాడు. స్కై పరోక్షంగా తాను ఐపీఎల్ 2024 ఆడలేనన్న సంకేతాలిచ్చాడు. స్కై పోస్ట్ పెట్టిన సందర్భాన్ని బట్టి చూస్తే ఇదే నిజమని తెలుస్తుంది. గతకొంతకాలంగా గాయాలతో సతమతమవుతున్న స్కై ఇటీవలే పలు సర్జరీలు చేయించుకుని ఎన్సీఏ వైద్యుల పర్యవేక్షణలో ఉన్నాడు. స్కై ఐపీఎల్ ఆడాలంటే ఎన్సీఏ నో అబ్జక్షన్ సర్టిఫికెట్ ఇవ్వాల్సి ఉంటుంది. తాజా పరిస్థితులను బట్టి చూస్తే ఎన్సీఏ సూర్యకుమార్‌కు ఎన్ఓసీ ఇచ్చేందుకు నిరాకరించినట్లుంది. అందుకే అతను సోషల్ మీడియా వేదికగా తన బాధను బహిర్గతం చేసి ఉండవచ్చు. Suryakumar Yadav's Instagram story. pic.twitter.com/2M7ZGBhTDN — Mufaddal Vohra (@mufaddal_vohra) March 19, 2024 ఇటీవలే రిషబ్ పంత్, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్‌కు ఎన్ఓసీ ఇచ్చిన ఎన్సీఏ.. స్కై విషయంలో అధికారికంగా ఏమేరకు స్పందిస్తుందో వేచి చూడాలి. ఐపీఎల్ 2024 ప్రారంభానికి మరో మూడు రోజుల సమయం మాత్రమే ఉన్న నేపథ్యంలో స్కై క్రిప్టిక్ పోస్ట్ క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. గతేడాది డిసెంబర్ నుంచి క్రికెట్‌కు దూరంగా ఉన్న సూర్యకుమార్ చీలిమండ, స్పోర్ట్స్ హెర్నియాలకు సర్జరీలు చేయించుకున్నాడు. సూర్యకుమార్ తాజా పోస్ట్ నేపథ్యంలో ముంబై ఇండియన్స్ అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఒకవేళ ఎన్సీఏ స్కైకు ఎన్ఓసీ ఇవ్వకపోతే అతను సీజన్ మొత్తానికి దూరంగా ఉంటాడా లేక తొలి దశ మ్యాచ్‌లకు మాత్రమే దూరమవుతాడా అన్న సందేహాలు ఉత్పన్నమవుతున్నాయి. ఇదిలా ఉంటే, ఐపీఎల్ 2024 సీజన్ మార్చి 22 నుంచి ప్రారంభంకానున్న విషయం తెలిసిందే. ఈ సీజన్ తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ సీఎస్కే.. ఆర్సీబీ జట్లు తలపడనున్నాయి. ముంబై ఇండియన్స్ ఈ సీజన్ తొలి మ్యాచ్‌ను మార్చి 24న ఆడనుంది. అహ్మదాబాద్‌లో జరిగే ఆ మ్యాచ్‌లో ముంబై.. గుజరాత్ టైటాన్స్‌ను ఢీకొంటుంది. -
IPL 2024: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్..!
ఐపీఎల్ 2024 ప్రారంభానికి ముందు ఫైవ్ టైమ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్‌కు చేదు వార్త వినిపిస్తుంది. ఆ జట్టు స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ రాబోయే సీజన్ తొలి రెండు మ్యాచ్‌లకు దూరం కానున్నాడని తెలుస్తుంది. ఈ ఏడాది ఆరంభంలో స్పోర్ట్స్ హెర్నియా సర్జరీ చేయించుకున్న స్కై.. ముంబై ఆడే తొలి రెండు మ్యాచ్‌లకు అందుబాటులో ఉండే అవకాశాలు తక్కువేనని ముంబై ఇండియన్స్ వర్గాల సమాచారం. ప్రస్తుతం నేషనల్ క్రికెట్ అకాడమీ వైద్యుల పర్యవేక్షణలో ఉన్న సూర్యకుమార్.. బ్యాటింగ్ ప్రాక్టీస్ ఇంకా మొదలుపెట్టలేదని తెలుస్తుంది. స్కై ఇటీవల తన ఫిట్నెస్ను రివీల్ చేస్తే కొన్ని వీడియోలు సోషల్‌మీడియాలో పోస్ట్ చేసినప్పటికీ.. వాటిలో ఎక్కడా బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తున్నట్లు కనపడలేదు. దీంతో అతను ఇంకా పూర్తి ఫిట్నెస్ సాధించలేదన్న విషయం స్పష్టమైంది. ఎన్సీఏ వైద్య బృందం సైతం స్కైకు ఎన్ఓసీ ఇచ్చేందుకు మల్లగుల్లాలు పడుతున్నట్లు సమాచారం. టీ20 ఫార్మాట్లో వరల్డ్ నంబర్ వన్ ర్యాంకర్ అయిన స్కై.. ఎంఐ ఆడే తొలి రెండు మ్యాచ్‌లకు దూరమైతే దాని ప్రభావం ఆ జట్టుపై భారీగా పడే అవకాశం ఉంటుంది. ఐపీఎల్ ప్రారంభానికి 10 రోజులు, ముంబై ఇండియన్స్ తొలి మ్యాచ్‌కు మరో 12 రోజుల సమయం ఉన్న నేపథ్యంలో స్కై పూర్తి ఫిట్నెస్ సాధిస్తాడో లేదో వేచి చూడాలి. కాగా, రాబోయే ఐపీఎల్ సీజన్లో ముంబై ఇండియన్స్ తమ తొలి మ్యాచ్‌ను మార్చి 24న ఆడనుంది. అహ్మదాబాద్‌లో జరిగే ఈ మ్యాచ్‌లో ముంబై.. గుజరాత్‌ను ఢీకొట్టనుంది. గుజరాత్ నుంచి వలస వచ్చిన హార్దిక్ ఈ సీజన్లో ముంబై ఇండయన్స్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. అతను తన తొలి మ్యాచ్‌లోనే తన మాజీ జట్టుతో తలపడాల్సి ఉండటం ఆసక్తికరంగా మారింది. మరోవైపు ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ తనకంటే చాలా జూనియర్ అయిన హార్దిక్ సారథ్యంలో సాధారణ ఆటగాడిగా కొనసాగుతాడో లేదో అన్న అంశంపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఇంగ్లండ్‌తో ఐదో టెస్ట్ చివరి రోజు ఆటలో రోహిత్ బరిలోకి దిగకపోవడాన్ని బట్టి చూస్తే, అతను ఈ సీజన్లో ముంబై ఇండియన్స్‌కు హ్యాండ్ ఇచ్చేలానే కనిపిస్తున్నాడు. ముంబై ఇండియన్స్‌కు చెందిన మరో స్టార్ ఆటగాడు, టీమిండియా పేసు గుర్రం జస్ప్రీత్ బుమ్రా కూడా హార్దిక్ సారథ్యంలో ఆడేందుకు ముందు నుంచే ససేమిరా అంటున్నాడు. ఇన్ని ప్రతికూలతల నడుమ ముంబై ఇండియన్స్ ఈ సీజన్లో ఏ మేరకు రాణిస్తుందో వేచి చూడాలి. 2024 ఐపీఎల్ సీజన్.. మార్చి 22న సీఎస్కే-ఆర్సీబీ మధ్య మ్యాచ్‌తో మొదలవుతుంది. -
Viral Video: ఆ ముగ్గురి షాట్లను ఎంత చక్కగా ఆడాడో చూడండి..!
గత కొన్ని రోజులుగా భారత క్రికెట్ సర్కిల్స్‌లో వినిపిస్తున్న పేరు ముషీర్ ఖాన్. ఈ 18 ఏళ్ల ముంబై కుర్రాడు అండర్-19 ప్రపంచకప్‌లో వరుస సెంచరీలతో విరుచుకుపడుతూ టాక్ ఆఫ్ ద కంట్రీగా మారాడు. క్రికెట్‌కు సంబంధించి ఏ ఇద్దరు ముగ్గురి మధ్య డిస్కషన్ జరిగినా ముషీర్ ఖాన్ పేరు వినిపిస్తుంది. అంతలా ముషీర్ ఓవర్‌నైట్ స్టార్ అయిపోయాడు. అయితే, ముషీర్ ఇంత హైప్ ఊరికే రాలేదు. వరల్డ్‌కప్ అతను పారించిన పరుగుల వరద, అతను ఆడిన షాట్లు, దూకుడు, టెక్నిక్.. ఇలా ఎన్నో కారణాల వల్ల అతనికి ఈ స్థాయి క్రేజ్ వచ్చింది. తాజాగా ఓ అభిమాని వరల్డ్‌కప్‌లో ముషీర్ ఆడిన కొన్ని షాట్లను ఎడిట్ చేసి సోషల్‌మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్ను షేక్ చేస్తుంది. అంతలా ఆ వీడియోలో ఏముందని అనుకుంటున్నారా..? అయితే ఈ వీడియోను మీరు కూడా చూసేయండి. Musheer khan channels his inner Ms Dhoni, Sachin Tendulkar, Suryakumar yadav #U19WorldCup2024 #IndianCricket pic.twitter.com/WJJLoyy4RU — Sahil (@Vijayfans45) January 31, 2024 నిలకడ, దూకుడు, వైవిధ్యంతో పాటు బలమైన టెక్నిక్ కలిగిన ముషీర్.. తనలో భారత క్రికెట్ దిగ్గజాల టాలెంట్ అంతా కలగలుపుకుని ఉన్నాడు. కెరీర్లో అత్యుత్తమ ఫామ్‌లో ఉన్నట్లు కనిపిస్తున్న ముషీర్ ప్రస్తుత వరల్డ్‌కప్‌లో తాను ఆడిన ప్రతి షాట్‌ను ఎంతో కాన్ఫిడెంట్‌గా ఆడాడు. ముషీర్ కాన్ఫిడెన్స్ ఏ స్థాయిలో ఉందంటే.. అతను అచ్చుగుద్దినట్లు సచిన్, ధోని, సూర్యకుమార్ యాదవ్ ట్రేడ్‌మార్క్ షాట్లను ఆడాడు. ముషీర్ ఈ షాట్లు ఆడిన విధానం చూసి అంతా నివ్వెరపోతున్నారు. ఇంత చిన్న వయసులో ఈ కుర్రాడు దిగ్గజాలు ఆడిన షాట్లను ఎంత చక్కగా ఇమిటేట్ చేస్తున్నాడంటే ఆశ్చర్యపోతున్నారు. ఈ వీడియో ప్రస్తుతం వైరలవుతుంది. ఇదిలా ఉంటే, ప్రస్తుతం భారత క్రికెట్ సర్కిల్స్‌లో ముషీర్‌తో పాటు అతని అన్న సర్ఫరాజ్ ఖాన్ పేరు కూడా వినిపిస్తుంది. దేశవాలీ క్రికెట్లో పరుగుల వరద పారించి, అభినవ బ్రాడ్‌మన్‌గా కీర్తించబడిన సర్ఫరాజ్ సుదీర్ఘ నిరీక్షణ తర్వాత టీమిండియా చోటు దక్కించుకున్నాడు. సర్ఫరాజ్ ఇంగ్లండ్‌తో రేపటి నుంచి ప్రారంభంకాబోయే రెండో టెస్ట్‌లో అరంగేట్రం చేయడం ఖాయమని తెలుస్తుంది. సర్ఫరాజ్, ముషీర్ల పేర్లు ఒకేసారి దేశం మొత్తం మార్మోగుతుండటంతో వీరి తండ్రి ఆనందోత్సాహాలతో ఉప్పొంగిపోతున్నాడు. ముషీర్.. ప్రస్తుత వరల్డ్‌కప్‌లో ఇప్పటివరకు 4 మ్యాచ్‌లు ఆడి 81.25 సగటున 2 సెంచరీలు (ఐర్లాండ్‌పై 106 బంతుల్లో 118 పరుగులు, యూఎస్ఏపై 76 బంతుల్లో 73 పరుగులు), ఓ హాఫ్ సెంచరీ (యూఎస్ఏపై 76 బంతుల్లో 73 పరుగులు) సాయంతో 325 పరుగులు చేసి లీడింగ్ రన్‌స్కోరర్‌గా కొనసాగుతున్నాడు. ముషీర్ అన్న సర్ఫరాజ్ సైతం 2016 అండర్-19 వరల్డ్‌కప్‌లో లీడింగ్ రన్ స్కోరర్‌గా నిలిచాడు. ప్రస్తుత అండర్-19 వరల్డ్‌కప్ ఎడిషన్‌లో వరుస విజయాలతో దూసుకుపోతున్న యువ భారత్.. అనధికారికంగా సెమీస్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. ఈ టోర్నీలో భారత్ ఇప్పటివరకు ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు. యంగ్ ఇండియా తమ తదుపరి సూపర్ సిక్స్ మ్యాచ్‌లో (ఫిబ్రవరి 2) నేపాల్‌ను ఢీకొంటుంది. -
చాలా సంతోషంగా ఉంది.. సంబరాలకు రెడీ అవ్వు సర్ఫరాజ్: సూర్య
భారత జట్టులో చోటు కోసం ఎదురుచూస్తున్న ముంబై ఆటగాడు సర్ఫరాజ్ ఖాన్ నిరీక్షణకు ఎట్టకేలకు తెరపడింది. విశాఖపట్నం వేదికగా ఇంగ్లండ్‌తో రెండు టెస్టుకు సర్ఫరాజ్‌ను బీసీసీఐ సెలక్షన్ కమిటీ ఎంపిక చేసింది. వైజాగ్ టెస్టుకు కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా దూరం కావడంతో సెలక్టర్లు ఈ నిర్ణయం తీసుకున్నారు. సర్ఫరాజ్‌తో పాటు యూపీ ఆల్‌రౌండర్ సౌరభ్ కుమార్, వాషింగ్టన్ సుందర్‌లను సెలక్టర్లు ఎంపిక చేశారు. ఈ క్రమంలో సర్ఫరాజ్‌కు టీమిండియా స్టార్ బ్యాటర్ సూర్య కుమార్ యాదవ్ అభినంధనలు తెలిపాడు. భారత జట్టు నుంచి తొలిసారి పిలుపు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. సంబరాలకు రెడీ అవ్వు సర్ఫరాజ్ అంటూ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో రాసుకొచ్చాడు. వీరిద్దరూ దేశీవాళీ క్రికెట్లో ముంబై జట్టుకు ప్రాతినథ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. కాగా గత కొంత కాలంగా దేశీవాళీ క్రికెట్లో సర్ఫరాజ్ అదరగొడుతున్నాడు. ఇప్పటివరకు 45 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు ఆడిన సర్ఫరాజ్.. 69.85 సగటుతో 3,912 రన్స్ చేశాడు. 14 శతకాలు, 11 హాఫ్ సెంచరీలు చేశాడు. ఇందులో ఓ ట్రిపుల్ సెంచరీ కూడా ఉంది. ఫిబ్రవరి 2 నుంచి వైజాగ్ వేదికగా రెండో టెస్టు ప్రారంభం కానుంది. చదవండి: Ind vs Eng: ఆఖరి 3 టెస్టులకు జట్టు ఎంపిక?.. కోహ్లి రీఎంట్రీ డౌటే!? -
చరిత్ర సృష్టించిన సూర్యకుమార్.. ప్రపంచంలో ఒకే ఒక్కడు
టీమిండియా విధ్వంసకర ఆటగాడు సూర్యకుమార్ యాదవ్‌కు ఐసీసీ ప్రతిష్టాత్మక అవార్డు వరించింది. 2023 ఏడాదికిగాను ఐసీసీ టీ20 క్రికెటర్ ఆఫ్ ద ఇయర్‌గా సూర్య భాయ్ ఎంపికయ్యాడు. ఈ ప్రతిష్టాత్మక అవార్డును సూర్య అందుకోవడం వరుసగా రెండో సారి కావడం విశేషం. తద్వారా టీ20 ఫార్మాట్లో ఈ అవార్డును రెండు సార్లు అందుకున్న ఏకైక క్రికెటర్‌గా మిస్టర్ 360 నిలిచాడు. ఇక ఈ అవార్డు కోసం సూర్యతో పాటు సికందర్ రజా (జింబాబ్వే), అల్పేష్ రమ్‌జాని (ఉగాండా), మార్క్ చాప్మన్ (న్యూజిలాండ్) అవార్డు కోసం పోటీపడ్డారు. కానీ వీళ్లందరిలో సూర్య వైపే ఐసీసీ మొగ్గు చూపింది. 2023 ఏడాదిలో సూర్యకుమార్ 17 ఇన్నింగ్స్‌లో 48 సగటుతో 733 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్‌లో రెండు సెంచరీలు ఉన్నాయి. కాగా అంతకుముందు 2022 ఏడాదిలోనూ ఐసీసీ టీ20 క్రికెటర్ ఆఫ్ ద ఇయర్‌గా సూర్యకుమార్ నిలిచిన సంగతి తెలిసిందే. కాగా ఈ అవార్డును ఐసీసీ 2021 నుంచి బహుకరిస్తుంది. 2021లో పాకిస్థాన్ వికెట్ కీపర్ మహ్మద్ రిజ్వాన్ అందుకున్నాడు. మరోవైపు 2023 ఏడాదికి గాను ఐసీసీ ప్రకటించిన టీ20 జట్టుకు సూర్యనే కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. ఈ జట్టులో భారత్ నుంచి యశస్వి జైస్వాల్, రవి భిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్‌లకు చోటు దక్కింది. ఇక సూర్య ప్రస్తుతం గాయం కారణంగా జట్టుకు దూరంగా ఉన్నాడు. ఐపీఎల్-2024 సమయానికి అతడు పూర్తి ఫిట్నెస్ సాధించే అవకాశం ఉంది. -
ఐసీసీ టెస్ట్ జట్టు ప్రకటన.. టీమిండియా నుంచి ఇద్దరు!
2023 అత్యుత్తమ టెస్ట్ జట్టును ఐసీసీ ఇవాళ (జనవరి 23) ప్రకటించింది. ఈ జట్టుకు సారధిగా ఆసీస్ కెప్టెన్ పాట్ కమిన్స్ ఎంపిక కాగా.. టీమిండియా నుంచి ఇద్దరు ఆటగాళ్లకు చోటు లభించింది. ఈ జట్టుకు ఓపెనర్లుగా ఆసీస్ ఆటగాడు ఉస్మాన్ ఖ్వాజా, శ్రీలంక ప్లేయర్ దిముత్ కరుణరత్నే ఎంపిక కాగా.. వన్ డౌన్ బ్యాటర్‌గా న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్, నాలుగో స్థానంలో ఇంగ్లండ్ ఆటగాడు జో రూట్, ఐదో ప్లేస్‌లో ఆసీస్ ఆటగాడు ట్రవిస్ హెడ్, వికెట్‌కీపర్ బ్యాటర్‌గా ఆసీస్ ఆటగాడు అలెక్స్ క్యారీ, ఆల్‌రౌండర్ల కోటాలో భారత ఆటగాళ్లు రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్‌గా ఆసీస్ సారధి పాట్ కమిన్స్, స్పెషలిస్ట్ పేసర్లుగా ఇంగ్లండ్ బౌలర్ మిచెల్ స్టార్క్, ఇంగ్లండ్ మాజీ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ ఎంపికయ్యారు. ఈ జట్టులో రిటైర్డ్ ఆటగాడు స్టువర్ట్ బ్రాడ్‌కు చోటు లభించడం అనూహ్యం. జట్ల వారీగా చూస్తే.. ఆస్ట్రేలియా నుంచి అత్యధికంగా ఐదుగురు ఆటగాళ్లు ఎంపిక కాగా.. ఇంగ్లండ్ నుంచి ఇద్దరు, భారత్ నుంచి ఇద్దరు, శ్రీలంక, న్యూజిలాండ్ జట్ల నుంచి చెరో ఆటగాడు ఎంపికయ్యాడు. భారత స్టార్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలకు ఈ జట్టులో చోటు దక్కకపోవడం ఆసక్తికరం. ఇదిలా ఉంటే, ఐసీసీ గతేడాది అత్యుత్తమ టెస్ట్ జట్టుతో పాటు వన్డే, టీ20 జట్లను కూడా ప్రకటించింది. ఒక్క ఆటగాడికి కూడా మూడు ఫార్మాట్ల జట్లలో చోటు లభించలేదు. 2023 ఐసీసీ టెస్ట్ జట్టు: ఉస్మాన్ ఖ్వాజా, దిముత్ కరుణరత్నే, కేన్ విలియమ్సన్, జో రూట్, ట్రవిస్ హెడ్, రవీంద్ర జడేజా, అలెక్స్ క్యారీ (వికెట్‌కీపర్), పాట్ కమిన్స్ (కెప్టెన్), రవిచంద్రన్ అశ్విన్, మిచెల్ స్టార్క్, స్టువర్ట్ బ్రాడ్ 2023 ఐసీసీ వన్డే జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, ట్రవిస్ హెడ్, విరాట్ కోహ్లి, డారిల్ మిచెల్, హెన్రిచ్ క్లాసెన్ (వికెట్‌కీపర్), మార్కో జన్సెన్, ఆడమ్ జంపా, కుల్దీప్ యాదవ్, మొహమ్మద్ షమీ, మొహమ్మద్ సిరాజ్ 2023 ఐసీసీ టీ20 జట్టు: ఫిలిప్ సాల్ట్, యశస్వి జైస్వాల్, నికోలస్ పూరన్, మార్క్ చాప్మన్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), సికందర్ రజా, అల్పేష్ రంజనీ, మార్క్ అడైర్, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్, రిచర్డ్ నగరవ -
ఐసీసీ టీ20 జట్టు ప్రకటన.. కెప్టెన్‌గా సూర్య భాయ్
ఐసీసీ 2023 సంవత్సరపు అత్యుత్తమ టీ20 జట్టును ఇవాళ (జనవరి 22) ప్రకటించింది. ఈ జట్టుకు టీమిండియా విధ్వంసకర ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్‌గా ఎంపిక కాగా.. భారత స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మలకు చోటు దక్కలేదు. ప్రపంచ మేటి బ్యాటర్లైన కోహ్లి, రోహిత్‌లను విస్మరించిన ఐసీసీ అనూహ్యంగా భారత యువ ఆటగాళ్లు యశస్వి జైస్వాల్, రవి భిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్‌లకు చోటు కల్పించింది. సూర్యతో కలుపుకుని ఐసీసీ జట్టులో మొత్తం నలుగురు భారత ఆటగాళ్లకు చోటు లభించింది. యశస్వికి జతగా ఇంగ్లండ్ ఆటగాడు ఫిలిప్ సాల్ట్‌ను ఓపెనర్‌గా ఎంపిక చేసిన ఐసీసీ.. వన్‌డౌన్‌లో విండీస్ ప్లేయర్ నికోలస్ పూరన్, నాలుగో స్థానంలో సూర్యకుమార్ యాదవ్, ఐదో స్థానంలో న్యూజిలాండ్ ఆటగాడు మార్క్ చాప్మన్, ఆల్‌రౌండర్ల కోటా జింబాబ్వే ఆటగాడు సికందర్ రజా, ఉగాండ ప్లేయర్ అల్పేష్ రంజనీ, స్పెషలిస్ట్ బౌలర్లుగా మార్క్ అడైర్ (ఐర్లాండ్), రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్ (భారత్), రిచర్డ్ నగరవ (జింబాబ్వే)లను ఎంపిక చేసింది. ఐసీసీ ఈ జట్టులో ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, పాకిస్తాన్, శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్ జట్ల నుంచి ఒక్క ఆటగాడిని కూడా ఎంపిక చేయకపోవడం విశేషం. -
టీమిండియాకు బిగ్ షాక్
జనవరి 11 14, 17 తేదీల్లో ఆఫ్ఘనిస్తాన్‌తో జరుగబోయే మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు ముందు టీమిండియాకు భారీ షాక్ తగిలింది. గాయం కారణంగా ఇన్ ఫామ్ ఆటగాళ్లు రుతురాజ్ గైక్వడ్, సూర్యకుమార్ యాదవ్ ఆఫ్ఘన్ సిరీస్‌కు దూరమయ్యారు. వన్డే వరల్డ్‌కప్ సందర్భంగా గాయపడ్డ హార్దిక్ పాండ్యా కూడా ఈ సిరీస్‌కు దూరంగా ఉండనున్నాడు. ఈ విషయాన్ని ఈఎస్పీఎన్ క్రిక్ఇన్ఫో వెల్లడించింది. కాగా, ఆఫ్ఘనిస్తాన్‌తో టీ20 సిరీస్ కోసం జట్టును ఎంపిక చేసేందుకు సెలెక్టర్లు ఇవాళ ముంబైలో సమావేశం కానున్నారు. అజిత్ అగర్కార్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ ఆఫ్ఘనిస్తాన్ సిరీస్‌తో పాటు ఆతర్వాత ఇంగ్లండ్‌తో జరుగబోయే టెస్ట్ సిరీస్ (తొలి రెండు టెస్ట్‌లకు) కోసం కూడా భారత జట్టును ఎంపిక చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఆఫ్ఘనిస్తాన్ సిరీస్‌తో రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి తిరిగి టీ20ల్లోకి పునరాగమనం చేయనున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే, టీమిండియాతో సిరీస్ కోసం ఆఫ్ఘనిస్తాన్ జట్టును ఇదివరకే ప్రకటించారు. ఆఫ్ఘన్ జట్టుకు సారధిగా ఇబ్రహీం జద్రాన్ వ్యవహరించనున్నాడు. ఇటీవలే వెన్నునొప్పికి సర్జరీ చేయించుకున్న రషీద్ ఖాన్ కూడా ఈ జట్టుకు ఎంపికయ్యాడు. టీమిండియాతో టీ20 సిరీస్‌కు అఫ్గనిస్తాన్ జట్టు.. ఇబ్రహీం జద్రాన్ (కెప్టెన్), రహ్మతుల్లా గుర్బాజ్ (వికెట్ కీపర్), ఇక్రమ్ అలీఖిల్ (వికెట్ కీపర్), హజ్రతుల్లా జజాయ్, రహ్మత్ షా, నజీబుల్లా జద్రాన్, మహ్మద్ నబీ, కరీం జనత్, అజ్మతుల్లా ఒమర్జాయ్, షరాఫుద్దీన్ అష్రఫ్, ముజీబ్ ఉర్ రెహ్మాన్, ఫజల్ హక్ ఫారూఖీ, ఫరీద్ అహ్మద్, నవీన్ ఉల్ హక్, నూర్ అహ్మద్, మహ్మద్ సలీం, కైస్ అహ్మద్, గుల్బదిన్ నైబ్, రషీద్ ఖాన్. -
ప్రతిష్టాత్మక అవార్డుల రేసులో సూర్యకుమార్, యశస్వి జైస్వాల్
ఐసీసీ ప్రతిష్టాత్మక అవార్డులైన మెన్స్ టీ20 ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ (2023), మెన్స్ ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ (2023) రేసులో ఇద్దరు టీమిండియా స్టార్ ఆటగాళ్లు నిలిచారు. మెన్స్ టీ20 ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు నామినీస్ జాబితాలో విధ్వంసకర ఆటగాడు సూర్యకుమార్ యాదవ్.. మెన్స్ ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు నామినీస్ జాబితాలో యశస్వి జైస్వాల్ ఉన్నారు. టీ20 ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు రేసులో స్కైతో పాటు జింబాబ్వే ఆటగాడు సికందర్ రజా, న్యూజిలాండ్ ఆటగాడు మార్క్ చాప్మన్, ఉగాండ ఆటగాడు అల్పేశ్ రామ్‌జనీ ఉండగా.. ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు రేసులో యశస్వితో పాటు న్యూజిలాండ్ ఆటగాడు రచిన్ రవీంద్ర, సౌతాఫ్రికా పేసర్ గెరాల్డ్ కొయెట్జీ, శ్రీలంక పేసర్ దిల్షన్ మధుషంక నిలిచారు. గతేడాది ప్రదర్శన ఆధారంగా ఐసీసీ ఆయా ఆటగాళ్లను నామినేట్ చేసింది. 2023 టీ20ల్లో సూర్యకుమార్ యాదవ్ (17 ఇన్నింగ్స్‌ల్లో 48.86 సగటున 155.95 స్ట్రయిక్‌రేట్‌తో 733 పరుగులు) 2023 టీ20ల్లో సికందర్ రజా (11 ఇన్నింగ్స్‌ల్లో 51.50 సగటున 150.14 స్ట్రయిక్‌రేట్‌తో 515 పరుగులు), బౌలింగ్‌లో 14.88 సగటున 6.57 ఎకానమీతో 17 వికెట్లు 2023 టీ20ల్లో అల్పేశ్ రామ్‌జనీ (30 మ్యాచ్‌ల్లో 8.98 సగటున 4.77 ఎకానమీతో 55 వికెట్లు) 2023 టీ20ల్లో మార్క్ చాప్మన్ (17 ఇన్నింగ్స్‌ల్లో 50.54 సగటున 145.54 స్ట్రయిక్‌రేట్‌తో 556 పరుగులు) ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ నామినీస్ విషయానికొస్తే.. రచిన్ రవీంద్ర (10 మ్యాచ్‌ల్లో 3 సెంచరీలు, 2 హాఫ్ సెంచరీల సాయంతో 578 పరుగులు, 7 వికెట్లు), గెరాల్డ్ కొయెట్జీ (8 మ్యాచ్‌ల్లో 20 వికెట్లు), దిల్షన్ మధుషంక (9 మ్యాచ్‌ల్లో 21 వికెట్లు) వన్డే వరల్డ్‌కప్ 2023లో అద్భుత ప్రదర్శనల కారణంగా ఈ అవార్డుకు నామినేట్ అయ్యారు. యశస్వి జైస్వాల్ (4 టెస్ట్‌లు, 15 టీ20ల్లో 2 సెంచరీలు, 4 హాఫ్ సెంచరీల సాయంతో 718 పరుగులు) అయితే ఫార్మాట్లకతీతంగా ఇరగదీసి ఐసీసీ ప్రతిష్టాత్మక అవార్డు రేసులో ముందున్నాడు. -
అయ్యో సూర్య.. ఊతకర్ర సాయంతో మిస్టర్ 360! వీడియో వైరల్
టీమిండియా స్టార్ ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ గాయం కారణంగా దాదాపు రెండు నెలల పాటు ఆటకు దూరంగా ఉండనున్న సంగతి తెలిసిందే. దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టీ20లో ఫీల్డింగ్ చేస్తుండగా సూర్య కాలు మెలిక పడింది. అనంతరం స్కానింగ్ తరలించగా చీలమండలో చీలిక వచ్చినట్లు తేలింది. సూర్య పూర్తిగా కోలుకోవడానికి కనీసం రెండు నుంచి మూడు నెలల సమయం పట్టనున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే స్వదేశంలో జరగనున్న అఫ్గాన్‌తో టీసిరీస్‌కు మిస్టర్ 360 దూరమయ్యాడు. అయితే తన గాయంపై సూర్యకుమార్ తొలిసారి స్పందించాడు. త్వరగా గాయం నుంచి కోలుకుని తిరిగి మైదానంలో అడుగుపెట్టేందుకు ప్రయత్నిస్తాని సూర్య తెలిపాడు. ఊతకర్ర సాయంతో నడుస్తున్న వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో సూర్య షేర్ చేశాడు. "గాయపడటం సరదాగా ఏమీ ఉండదు. అయితే, గాయాలను నేను మరీ అంత సీరియస్‌గా తీసుకోను. ఈ గాయం నుంచి త్వరగా బయటపడేందుకు తీవ్రంగా శ్రమిస్తాను. అతి త్వరలోనే తిరిగి మైదానంలో అడుగుపెడతానని హామీ ఇస్తున్నాను. అప్పటివరకు మీరందరూ ఈ హాలిడే బ్రేక్నును ఫ్యామీలీతో ఎంజాయ్ చేస్తూ సరదాగా ఉంటారని ఆశిస్తున్నాను" ఆ వీడియోకు క్యాప్షన్‌గా సూర్య రాసుకొచ్చాడు. ఇదిచూసిన నెటిజన్లు సూర్య త్వరగా కోలుకోవాలని కామెంట్లు చేస్తున్నారు. కాగా దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20 సిరీస్‌లో సూర్య అదరగొట్టాడు. మూడో మ్యాచ్‌ల సిరీస్‌లో సూర్య ఒక సెంచరీ, ఒక ర్ధ సెంచరీతో 156 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్'గా నిలిచాడు. అదే విధంగా ఈ ఏడాది మొత్తం కూడా టీ20ల్లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. . ఈ ఏడాది 18 టీ 20 మ్యాచ్‌లు ఆడిన సూర్యకుమార్.. 48.86 సగటు.. 155.95 స్ట్రైక్ రేట్‌తో 733 పరుగులు చేశాడు. ఓవరాల్‌గా తన కెరీర్లో ఇప్పటివరకు 60 టీ20 మ్యాచుల్లో సూర్యకుమార్ నాలుగు సెంచరీలు, 17 అర్ధసెంచరీలతో 2,141 పరుగులు చేశాడు. కాగా సూర్య ప్రస్తుతం టీ20ల్లో నెం1 బ్యాటర్‌గా కొనసాగుతున్నాడు. చదవండి: IND Vs SA: దక్షిణాఫ్రికాతో తొలి టెస్టు.. భారత తుది జట్టు ఇదే! ఓపెనర్లు ఎవరంటే? View this post on Instagram A post shared by Surya Kumar Yadav (SKY) (@surya_14kumar) -
అర్ష్‌దీప్‌పై కోపంతో ఊగిపోయిన సూర్య..
-
అర్ష్‌దీప్‌పై కోపంతో ఊగిపోయిన సూర్య.. వేలు చూపిస్తూ! వీడియో వైరల్
దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టీ20లో 106 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 1-1తో డ్రాగా భారత జట్టు ముగించింది. కాగా మూడో టీ20 అనంతరం టీమిండియా స్టాండింగ్ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్.. పేసర్ అర్ష్‌దీప్ సింగ్‌పై కోపంతో ఊగిపోయాడు. టీమ్ ప్రయాణిస్తున్న బస్సులో అర్ష్‌దీప్ వైపు వేలు చూపిస్తూ సూర్య ఏదో అన్నాడు. అయితే సూర్య కోపానికి గల కారణమింటో మాత్రం తెలియదు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన నెటిజన్లు సూర్య సరదగా అలా రియాక్ట్ అయివుంటాడని కామెంట్లు చేస్తున్నారు. కాగా మూడో టీ20లో సూర్య భాయ్ అద్భుతమైన సెంచరీతో చెలరేగిన సంగతి తెలసిందే. ఇక ప్రోటీస్‌తో టీ20 సిరీస్‌ను సమం చేసిన టీమిండియా.. ఇప్పుడు వన్డే సిరీస్‌కు సిద్దమవుతోంది. డిసెంబర్ 17న జోహన్నెస్‌బర్గ్ వేదికగా జరగనున్న తొలి వన్డేతో ఈ సిరీస్ ప్రారంభం కానుంది. కాగా ఈ సిరీస్‌లో భారత కెప్టెన్‌గా కేఎల్ రాహుల్ వ్యవహరించనుండగా.. దక్షిణాఫ్రికా సారథిగా మార్క్రమ్ బాధ్యతలు చేపట్టనున్నాడు. చదవండి: SA vs IND: ముంబై కెప్టెన్సీ నుంచి అవుట్.. దక్షిణాఫ్రికాకు బయలుదేరిన రోహిత్! వీడియో వైరల్ -
సిరాజ్ బుల్లెట్ త్రో.. సౌతాఫ్రికా బ్యాటర్ ఫ్యూజ్‌లు ఔట్! వీడియో వైరల్
జోహన్నెస్‌బర్గ్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టీ20లో 106 పరుగుల తేడాతో భారత్ విజయం సాధించింది. దీంతో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ సమమైంది. తొలి వర్షం కారణంగా రద్దు కాగా.. రెండో టీ20 దక్షిణాఫ్రికా, మూడో టీ20లో భారత్ గెలుపొందాయి. కాగా ఈ మ్యాచ్‌లో భారత పేసర్ మహ్మద్ సిరాజ్ సంచలన త్రోతో మెరిశాడు. సిరాజ్ తన మెరుపు త్రో సౌతాఫ్రికా స్టార్ ఓపెనర్ రీజా హెండ్రిక్స్‌ను పెవిలియన్‌కు పంపాడు. ఏమి జరిగిందంటే? ప్రోటీస్ ఇన్నింగ్స్ 4వ ఓవర్ వేసిన అర్ష్‌దీప్ సింగ్ బౌలింగ్‌లో రెండో బంతిని హెండ్రిక్స్ మిడ్-ఆన్ దిశగా షాట్ ఆడాడు. ఈ క్రమంలో సింగిల్ కోసం హెండ్రిక్స్ నాన్-స్ట్రైకర్స్ ఎండ్ పరిగెత్తాడు. అయితే మిడ్-ఆన్‌లో ఫీల్డింగ్ చేస్తున్న సిరాజ్ వెంటనే బంతిని అందుకుని నాన్-స్ట్రైకర్స్ ఎండ్ వైపు డైరక్ట్ త్రో చేశాడు. హెండ్రిక్స్ క్రీజుకు చేరిటప్పటికే బంతి స్టంప్స్‌ను గిరాటేసింది. ఇది చూసిన ప్రోటీస్ బ్యాటర్ షాక్‌కు గురయ్యాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా ఈ మ్యాచ్‌లో సిరాజ్ వికెట్ సాధించికపోయినప్పటికీ తన బౌలింగ్‌తో అందరని అకట్టుకున్నాడు. 3 ఓవర్లు వేసిన సిరాజ్ కేవలం 13 పరుగులు మాత్రమే ఇచ్చాడు. అందులో ఒక మెయిడిన్ ఓవర్ ఉండడం విశేషం. చదవండి: IND vs SA: చరిత్ర సృష్టించిన సూర్యకుమార్.. ప్రపంచంలో ఒకే ఒక్కడు With outswingers and direct hits, @mdsirajofficial has not missed his target today 🎯 Tune-in to the 3rd #SAvIND T20I LIVE NOW | Star Sports Network#Cricket pic.twitter.com/6UTxXnN7Fs — Star Sports (@StarSportsIndia) December 14, 2023 -
'సూర్య' ప్రతాపం.. టీ20 కింగ్ (ఫోటోలు)
-
చరిత్ర సృష్టించిన సూర్యకుమార్.. ప్రపంచంలో ఒకే ఒక్కడు
జోహన్నెస్‌బర్గ్ వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన మూడో టీ20లో భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ విధ్వంసకర శతకంతో చెలరేగాడు. ఈ మ్యాచ్‌లో ప్రోటీస్ బౌలర్లకు సూర్య భాయ్ చుక్కలు చూపించాడు. కేవలం 56 బంతుల్లో 7 ఫోర్లు, 8 సిక్స్‌లతో 100 పరుగులు చేశాడు. కాగా సూర్యకు ఇది నాలుగో టీ20 సెంచరీ కావడం విశేషం. తద్వారా అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక సెంచరీలు చేసిన రోహిత్ శర్మ(4), గ్లేన్ మ్యాక్స్‌వెల్(4) సరసన సూర్య నిలిచాడు. ఇక ఈ మ్యాచ్‌లో విరోచిత శతకంతో చెలరేగిన సూర్యకుమార్ మరో అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు. అంతర్జాతీయ టీ20ల్లో అత్యంత వేగంగా నాలుగు శతకాలు బాదిన బ్యాటర్‌గా రికార్డులకెక్కాడు. సూర్యకుమార్ యాదవ్ 57 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఫీట్ సాధించాడు. ఇప్పటివరకు ఈ రికార్డు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ పేరిట ఉండేది. రోహిత్ 79 ఇన్నింగ్స్‌లలో ఈ ఘనతను సాధించాడు. తాజా మ్యాచ్‌తో హిట్‌మ్యాన్ రికార్డును మిస్టర్ 360 బ్రేక్ చేశాడు. కాగా మ్యాక్స్‌వెల్ తన నాలుగు సెంచరీల మార్క్‌ను 92 ఇన్నింగ్స్‌లలో అందుకున్నాడు. అదే విధంగా దక్షిణాఫ్రికా గడ్డపై టీ20ల్లో సెంచరీ చేసిన తొలి భారత కెప్టెన్ కూడా సూర్యనే కావడం గమనార్హం. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. దక్షిణాఫ్రికాపై 106 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. దీంతో మూడు టీ20ల సిరీస్ 1-1తో సమమైంది. ఇరు జట్ల మధ్య వన్డే సిరీస్ డిసెంబర్ 17 నుంచి ప్రారంభం కానుంది. చదవండి: Suryakumar Yadav: 'నేను బాగానే ఉన్నాను.. అతడు పుట్టిన రోజున తనకు తనే గిఫ్ట్ ఇచ్చుకున్నాడు' सूर्य कुमार यादव में ताकत और नजाकत दोनों है, जिस दक्षिण अफ्रीका की पिच से भारतीय बल्लेबाज डरते है उसी पिच पर सूर्या का तूफानी शतक अब तो मान लो सूर्य कुमार यादव जैसा T20 खिलाड़ी कोई नही है #SuryakumarYadavpic.twitter.com/iPj9Dx81Oh — Surya Samajwadi (@surya_samajwadi) December 14, 2023 𝐂𝐄𝐍𝐓𝐔𝐑𝐘 There is no stopping @surya_14kumar! Mr. 360 brings up his 4th T20I century in just 55 balls with 7x4 and 8x6. The captain is leading from the front!🙌🏽👌🏽https://t.co/s4JlSnBAoY #SAvIND pic.twitter.com/t3BHlTiao4 — BCCI (@BCCI) December 14, 2023 -
'నేను బాగానే ఉన్నాను.. అతడు పుట్టిన రోజున తనకు తనే గిఫ్ట్ ఇచ్చుకున్నాడు'
దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌ను టీమిండియా డ్రాగా ముగించింది. జోహన్నెస్‌బర్గ్ వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన మూడో టీ20లో 106 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. ఈ విజయంతో మూడు టీ20ల సిరీస్‌ను 1-1 భారత్ సమం చేసింది. తొలి టీ20 వర్షర్పాణం కాగా.. రెండో టీ20, మూడో టీ20లో వరుసగా ప్రోటీస్, భారత్ గెలుపొందాయి. 202 పరుగుల లక్ష్య ఛేదనలో కేవలం 95 పరుగులకే ప్రోటీస్ కుప్పకూలింది. భారత బౌలర్లలో స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ 5 వికెట్లతో దక్షిణాఫ్రికా పతనాన్ని శాసించాడు. అతడితో పాటు రవీంద్ర జడేజా రెండు, ముఖేష్, అర్ష్‌దీప్ సింగ్ తలా వికెట్ సాధించారు. దక్షిణాఫ్రికా బ్యాటర్లలో డేవిడ్ మిల్లర్(35) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. భారత బ్యాటర్లలో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్(100) విధ్వంసకర శతకంతో చెలరేగాడు. అతడితో జైశ్వాల్(60) హాఫ్ సెంచరీతో రాణించాడు. ఇక అద్భుత విజయంపై టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ స్పందించాడు. సమతుల్యంగా ఆడటంతోనే విజయం సాధించామని సూర్య తెలిపాడు. అదే విధంగా తన గాయంపై కూడా సూర్య అప్డేట్ ఇచ్చాడు. ఫీల్డింగ్ చేస్తుండగా అతడి చీలమండకు గాయమైంది. "నేను బాగానే ఉన్నాను. ప్రస్తుతం మంచిగా నడవగలుగుతున్నాను. ఈ మ్యాచ్‌లో విజయం సాధించినందుకు చాలా ఆనందంగా ఉంది. ఫియర్లెస్ క్రికెట్ ఆడాలని నిర్ణయించుకున్నాం. ఈ మ్యాచ్‌లో అదే చూసి చూపించాం. ముందుగా బ్యాటింగ్ చేసి ప్రత్యర్ధి ముందు మంచి టార్గెట్‌ను పెట్టాలనుకున్నాం. అందుకే టాస్ ఓడినప్పటికీ తొలుత బ్యాటింగ్ చేయాలనుకున్నాను. ఈ మ్యాచ్‌లో మా బాయ్స్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచారు. 17th t20i 50 for Surya kumar yadav #SKY #SuryakumarYadav #Surya #INDvsSApic.twitter.com/gEFzn4K6FX — Chitra 😴 (@chittu_chitra12) December 12, 2023 వారి ప్రదర్శన పట్ల నేను సంతృప్తిగా ఉన్నాను. ఇక కుల్దీప్ కోసం ఎంత చెప్పుకున్న తక్కువే. ఎప్పుడూ వికెట్లు సాధించాలన్న ఆకలితో ఉంటాడు. కుల్దీప్ పుట్టిన రోజున తనకు తనే గిఫ్ట్ ఇచ్చుకున్నాడు. ఏ మ్యాచ్‌లోనైనా విజయం సాధించాలంటే అక్కడి పరిస్ధితులను అర్ధం చేసుకోవాలి. సమతుల్యంగా ఆడితే ఎక్కడైనా గెలుపొందవచ్చు"అని పోస్ట్ మ్యాచ్ ప్రేజేంటేషన్‌లో సూర్య పేర్కొన్నాడు. కాగా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డులు సూర్య భాయ్‌కే దక్కాయి. -
IND VS SA 3rd T20: కోహ్లిని వెనక్కునెట్టిన సూర్యకుమార్
దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడో టీ20లో మెరుపు శతకంతో (56 బంతుల్లో 7 ఫోర్లు, 8 సిక్సర్ల సాయంతో 100 పరుగులు) విరుచుకుపడిన సూర్యకుమార్.. భారత్ తరఫున అత్యధిక సిక్సర్లు సాధించిన ఆటగాళ్ల జాబితాలో మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లిని వెనక్కునెట్టి రెండో స్థానానికి ఎగబాకాడు. విరాట్ 107 ఇన్నింగ్స్‌ల్లో 117 సిక్సర్లు బాదగా.. స్కై కేవలం 57 ఇన్నింగ్స్‌ల్లోనే విరాట్ రికార్డును అధిగమించాడు (123 సిక్సర్లు). ఈ విభాగంలో టీమిండియా రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ (140 ఇన్నింగ్స్‌ల్లో 182 సిక్సర్లు) స్కై, విరాట్ల కంటే ముందున్నాడు. వీరి తర్వాతి స్థానాల్లో కేఎల్ రాహుల్ (68 ఇన్నింగ్స్‌ల్లో 99), యువరాజ్ సింగ్ (51 ఇన్నింగ్స్‌ల్లో 74) ఉన్నారు. ఇదే మ్యాచ్‌లో స్కై మరిన్ని రికార్డులు కూడా సాధించాడు. అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక సెంచరీల రికార్డు (4).. రోహిత్ తర్వాత సెంచరీ చేసిన రెండో టీమిండియా కెప్టెన్‌గా.. నాలుగు అంతకంటే కింది స్థానాల్లో వచ్చి అత్యధిక 50 ప్లస్ స్కోర్లు (15) చేసిన ఆటగాడిగా పలు రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. కాగా, సూర్యకుమార్సుడిగాలి శతకంతో విరుచుకుపడటంతో ఈ మ్యాచ్‌లో టీమిండియా భారీ స్కోర్ చేసింది. స్కైకు యశస్వి జైస్వాల్ (60) అర్ధసెంచరీ తోడవ్వడంతో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 201 పరుగులు స్కోర్ చేసింది. వీరిద్దరు మినహా టీమిండియా ఆటగాళ్లంతా తక్కువ స్కోర్లకే పరిమితమయ్యారు. అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన సౌతాఫ్రికా ఆదిలోనే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. -
సూర్యకుమార్ సుడిగాలి శతకం.. ప్రపంచ రికార్డు సమం
మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా దక్షిణాఫ్రికాతో ఇవాళ జరుగుతున్న మూడో టీ20లో టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఈ మ్యాచ్‌లో 55 బంతుల్లో 7 ఫోర్లు, 8 సిక్సర్ల సాయంతో శతక్కొట్టిన స్కై.. అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక సెంచరీల (4) ప్రపంచ రికార్డును సమం చేశాడు. ఈ రికార్డును మ్యాక్స్‌వెల్, రోహిత్ శర్మ సంయుక్తంగా షేర్ చేసుకోగా.. తాజాగా స్కై ఈ ఇద్దరి సరసన చేరాడు. స్కైకు ఈ రికార్డు సాధించేందుకు కేవలం 57 ఇన్నింగ్స్‌లు మాత్రమే అవసరం కాగా.. మ్యాక్స్‌వెల్ 92 ఇన్నింగ్స్‌ల్లో, రోహిత్ శర్మ 140 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఘనతను సాధించారు. ఈ మ్యాచ్‌లో టీమిండియా కష్టాల్లో ఉన్నప్పుడు (29/2) బరిలోకి దిగిన స్కై.. తొలి 25 బంతుల్లో కేవలం 27 పరుగులు మాత్రమే చేశాడు. ఆతర్వాత పట్టపగ్గాల్లేకుండా చెలరేగిపోయిన సూర్యకుమార్.. ఆతర్వాతి 31 బంతుల్లో ఏకంగా 73 పరుగులు పిండుకుని సెంచరీ పూర్తి చేసుకున్నాడు. స్కై తన కెరీర్లో చేసిన నాలుగు సెంచరీలు నాలుగు వేర్వేరు దేశాల్లో (భారత్, ఇంగ్లండ్, న్యూజిలాండ్, సౌతాఫ్రికా) చేసినవి కావడం విశేషం. కాగా, సూర్యకుమార్ యాదవ్ సుడిగాలి శతకంతో విరుచుకుపడటంతో ఈ మ్యాచ్‌లో టీమిండియా భారీ స్కోర్ చేసింది. స్కైకు యశస్వి జైస్వాల్ (60) అర్ధసెంచరీ తోడవ్వడంతో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 201 పరుగులు స్కోర్ చేసింది. ఈ మ్యాచ్‌లో స్కై, యవస్వి మినహా టీమిండియా ఆటగాళ్లంతా తక్కువ స్కోర్లకే పరిమితమయ్యారు. -
స్కై విధ్వంసకర శతకం.. కుల్దీప్ మాయాజాలం.. టీమిండియా ఘన విజయం
స్కై విధ్వంసకర శతకం.. కుల్దీప్ మాయాజాలం.. టీమిండియా ఘన విజయం దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టీ20లో టీమిండియా 106 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఫలితంగా మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ 1-1తో డ్రాగా (తొలి టీ20 వర్షం కారణంగా రద్దైంది) ముగిసింది. ఈ మ్యాచ్‌లో తొలుత సూర్యకుమార్ విధ్వంసకర శతకంతో (56 బంతుల్లో 100; 7 ఫోర్లు, 8 సిక్సర్లు) విరుచుకుపడగా.. అనంతరం కుల్దీప్ ఐదు వికెట్ల ప్రదర్శనతో (2.5-0-17-5) మాయాజాలం చేసి టీమిండియాను గెలిపించారు. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా.. స్కై శతక్కొట్టడంతో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 201 పరుగులు స్కోర్ చేసింది. అనంతరం ఛేదనకు దిగిన సౌతాఫ్రికా కుల్దీప్ ధాటికి 13.5 ఓవర్లలో 95 పరుగులకే కుప్పకూలి ఓటమిపాలైంది. భారత బౌలర్లలో జడేజా 2, అర్షదీప్, ముకేశ్ తలో వికెట్ పడగొట్టగా.. సౌతాఫ్రికా ఇన్నింగ్స్‌లో మిల్లర్ (35) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఏడో వికెట్ కోల్పోయిన సౌతాఫ్రికా 89 పరుగుల వద్ద సౌతాఫ్రికా ఏడో వికెట్ కోల్పోయింది. కుల్దీప్ బౌలింగ్‌లో కేశవ్ మహారాజ్ (0) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆరో వికెట్ కోల్పోయిన సౌతాఫ్రికా 82 పరుగుల వద్ద సౌతాఫ్రికా ఆరో వికెట్ కోల్పోయింది. జడేజా బౌలింగ్‌లో ఫెహ్లుక్వాయో (0) ఔటయ్యాడు. 75 పరుగులకే సగం వికెట్లు కోల్పోయిన సౌతాఫ్రికా 202 పరుగుల లక్ష్య ఛేదనలో సౌతాఫ్రికా 75 పరుగులకే సగం వికెట్లు కోల్పోయింది. కుల్దీప్ బౌలింగ్‌లో ఫెరియెరా (12) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. నాలుగో వికెట్ కోల్పోయిన సౌతాఫ్రికా జడేజా బౌలింగ్‌లో జైస్వాల్‌కు క్యాచ్ ఇచ్చి మార్క్రమ్ (25) ఔటయ్యాడు. 6.1 ఓవర్ల తర్వాత సౌతాఫ్రికా స్కోర్ 42/4గా ఉంది. మూడో వికెట్ కోల్పోయిన సౌతాఫ్రికా 42 పరుగుల వద్ద సౌతాఫ్రికా మూడో వికెట్ కోల్పోయింది. అర్షదీప్ బౌలింగ్‌లో క్లాసెన్ (5) క్యాచ్ ఔటయ్యాడు. 5.4 ఓవర్ల తర్వాత సౌతాఫ్రికా స్కోర్ 42/3గా ఉంది. మార్క్రమ్ (25), మిల్లర్ క్రీజ్‌లో ఉన్నారు. టార్గెట్ 202.. రెండో వికెట్ కోల్పోయిన సౌతాఫ్రికా సిరాజ్ అద్భుతమైన డైరెక్ట్ త్రోతో రీజా హెండ్రిక్స్‌ను (8) రనౌట్ చేశాడు. టార్గెట్ 202.. తొలి వికెట్ కోల్పోయిన సౌతాఫ్రికా ముకేశ్ కుమార్ వేసిన రెండో ఓవర్లో సౌతాఫ్రికా వికెట్ కోల్పోయింది. ముకేశ్ బౌలింగ్‌లో బ్రీట్జ్కీ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అంతకుముందు తొలి ఓవర్‌ను సిరాజ్ మెయిడిన్ చేశాడు. సూర్యకుమార్ సుడిగాలి శతకం.. టీమిండియా భారీ స్కోర్ సూర్యకుమార్ యాదవ్ సుడిగాలి శతకంతో (56 బంతుల్లో 100; 7 ఫోర్లు, 8 సిక్సర్లు) చెలరేగడంతో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడో టీ20లో టీమిండియా భారీ స్కోర్ చేసింది. స్కైకు యశస్వి జైస్వాల్ (60) అర్ధసెంచరీ తోడవ్వడంతో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 201 పరుగులు స్కోర్ చేసింది. ఆఖరి ఓవర్లో భారత్ మూడు వికెట్లు కోల్పోయింది. జడేజాను (4) అనవసరంగా రనౌట్ చేసిన జితేశ్ శర్మ (4) హిట్ వికెట్‌గా ఔటయ్యాడు. సూర్యకుమార్ ఊచకోత.. 55 బంతుల్లో శతకం టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ 55 బంతుల్లో 7 ఫోర్లు, 8 సిక్సర్ల సాయంతో సెంచరీ పూర్తి చేశాడు. 19.1 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 194/4గా ఉంది. స్కైతో పాటు జితేశ్ శర్మ క్రీజ్‌లో ఉన్నాడు. సెంచరీకి చేరువైన స్కై హాఫ్ సెంచరీ తర్వాత పట్టపగ్గాలు లేకుండా రెచ్చిపోతున్న స్కై సెంచరీకి చేరువయ్యాడు. 50 బంతుల్లో 6 ఫోర్లు, 8 సిక్సర్ల సాయంతో 92 పరుగులతో అజేయంగా నిలిచాడు. 17 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 173/3గా ఉంది. స్కైతో పాటు రింకూ (5) క్రీజ్‌లో ఉన్నాడు. మూడో వికెట్ కోల్పోయిన టీమిండియా.. జైస్వాల్ ఔట్ 141 పరుగుల వద్ద టీమిండియా మూడో వికెట్ కోల్పోయింది. షంషి బౌలింగ్‌లో యశస్వి జైస్వాల్ (60) ఔటయ్యాడు. 14 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 141/3గా ఉంది. సూర్యకుమార్ (65), రింకూ సింగ్ క్రీజ్‌లో ఉన్నారు. 12 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 108/2 12 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 108/2గా ఉంది. జైస్వాల్ (57), స్కై (35) ధాటిగా బ్యాటింగ్ చేస్తున్నారు. 2 వికెట్లు పడ్డా చెలరేగి ఆడుతున్న జైస్వాల్, స్కై మూడో ఓవర్లోనే రెండు వికెట్లు కోల్పోయినా టీమిండియా బ్యాటర్లు ఏమాత్రం తగ్గకుండా దూకుడుగా ఆడుతున్నారు. జైస్వాల్ (28), జ్కై (19) పోటాపోటీగా బౌండరీలు, సిక్సర్లు బాదుతూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టిస్తున్నారు. 6 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 62/2గా ఉంది. వరుస బంతుల్లో వికెట్లు కోల్పోయిన టీమిండియా 29 పరుగుల వద్ద (2.2 ఓవర్లు) టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది. అతర్వాతి బంతికే టీమిండియా మరో వికెట్ కూడా కోల్పోయింది. కేశవ్ మహారాజ్ బౌలింగ్‌లో శుభ్‌మన్ గిల్ (12), తిలక్ వర్మ (0) వరుస బంతుల్లో ఔటయ్యారు. తొలి ఓవర్లోనే హ్యాట్రిక్ ఫోర్లు బాదిన గిల్ రెండో టీ20లో డకౌట్ అయిన శుభ్‌మన్ గిల్.. ఈ మ్యాచ్‌లో తొలి ఓవర్లోనే హ్యాట్రిక్ ఫోర్లతో విరుచుకుపడ్డాడు. అరంగేట్రం బౌలర్ నండ్రే బర్గర్ బౌలింగ్‌లో చివరి 3 బంతులను గిల్ బౌండరీలుగా మలిచాడు. జోహన్నెస్‌బర్గ్ వేదికగా టీమిండియాతో జరుగుతున్న కీలకమైన మూడో టీ20లో సౌతాఫ్రికా టాస్ గెలిచి తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ కోసం సౌతాఫ్రికా ఏకంగా మూడు మార్పులు చేయగా.. భారత్, రెండో మ్యాచ్‌లో బరిలోకి దిగిన జట్టునే యధాతథంగా కొనసాగిస్తుంది. ట్రిస్టన్ స్టబ్స్ స్థానంలో డొనొవన్ ఫెరియెరా.. మార్కో జాన్సెన్, గెరాల్డ్ కొయెట్జీ స్థానాల్లో కేశవ్ మహారాజ్, నండ్రే బర్గర్ జట్టులోకి వచ్చారు. టీమిండియా: యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), రింకూ సింగ్, జితేశ్ శర్మ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, ముకేష్ కుమార్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, అర్ష్‌దీప్ సింగ్. సౌతాఫ్రికా: రీజా హెండ్రిక్స్, మాథ్యూ బ్రీట్జ్కే, ఎయిడెన్ మార్క్రమ్ (కెప్టెన్), హెన్రిచ్ క్లాసెన్, డొనొవన్ ఫెరియెరా, డేవిడ్ మిల్లర్, కేశవ్ మహారాజ్, నండ్రే బర్గర్, అండిల్ ఫెహ్లుక్వాయో, లిజాడ్ విలియమ్స్, తబ్రేజ్ షంసీ. -
అగ్రపీఠాన్ని మరింత సుస్థిరం చేసుకున్న సూర్యకుమార్
భారత టీ20 జట్టు తాత్కాలిక సారధి సూర్యకుమార్ యాదవ్ పొట్టి ఫార్మాట్లో తన బ్యాటింగ్ అగ్రస్థానాన్ని మరింత సుస్థిరం చేసుకున్నాడు. సౌతాఫ్రికాతో నిన్న (డిసెంబర్ 12) జరిగిన రెండో టీ20లో మెరుపు అర్ధసెంచరీ (36 బంతుల్లో 56; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) సాధించిన స్కై.. 10 రేటింగ్ పాయింట్లు అదనంగా కూడగట్టుకుని, తన సమీప ప్రత్యర్ధులందరికీ అందనంత ఎత్తుకు వెళ్లిపోయాడు. ప్రస్తుతం స్కై ఖాతాలో 865 రేటింగ్ పాయింట్లు ఉండగా.. రెండో స్థానంలో ఉన్న మొహమ్మద్ రిజ్వాన్ ఖాతాలో 787 పాయింట్లు మాత్రమే ఉన్నాయి. ఈ ఇద్దరి మధ్య వ్యత్యాసం 78 పాయింట్లుగా ఉంది. టాప్ 10 ర్యాంకింగ్స్‌లో స్కై తర్వాత 700కు పైగా పాయింట్లు కేవలం ముగ్గురు ఆటగాళ్లకు మాత్రమే ఉన్నాయి. రిజ్వాన్ 787, మార్క్రమ్ 758, బాబర్ ఆజమ్ 734 పాయింట్లు కలిగి ఉన్నారు. టాప్-10 ఉన్న మరో భారత ఆటగాడు రుతురాజ్ గైక్వాడ్ (ఏడో ర్యాంక్) అనారోగ్యం కారణంగా సౌతాఫ్రికాతో రెండో టీ20 ఆడలేకపోవడంతో అతని ర్యాంకింగ్స్‌లో ఎలాంటి మార్పు లేదు. సూర్యకుమార్ ప్రస్తుత ఫామ్‌ను మరికొద్ది రోజుల పాటు కొనసాగించగలిగితే టీ20 వరల్డ్‌కప్ 2024లో టాప్ ర్యాంకింగ్ బ్యాటర్‌గా బరిలోకి దిగుతాడు. మరోవైపు సౌతాఫ్రికాతో నిన్న జరిగిన మ్యాచ్‌లో మెరుపు అర్ధసెంచరీతో విరుచుకుపడిన రింకూ సింగ్ ఏకంగా 46 స్థానాలు మెరుగుపర్చుకుని 59వ స్థానానికి చేరగా.. అదే మ్యాచ్‌లో మెరుపు ఇన్నింగ్స్ ఆడిన తిలక్ వర్మ 10 స్థానాలు మెరుగుపర్చుకుని 55వ ప్లేస్‌కు చేరాడు. బౌలర్ల ర్యాంకింగ్స్ విషయానికొస్తే.. పొట్టి ఫార్మాట్లో ఇటీవలే టాప్ ర్యాంక్ దక్కించుకున్న భారత అప్‌కమింగ్ స్పిన్నర్ రవి భిష్ణోయ్.. సౌతాఫ్రికాతో రెండో టీ20 ఆడే అవకాశం రాకపోవడంతో ఎలాంటి రేటింగ్ పాయింట్లు సాధించలేకపోయాడు. ప్రస్తుతానికి రవి తన టాప్ ర్యాంక్‌ను కాపాడుకున్నప్పటికీ.. ఆఫ్ఘన్ స్పిన్నర్ రషీద్ ఖాన్ రూపంలో అతనికి ప్రమాదం పొంచి ఉంది. ప్రస్తుతం ఈ ఇద్దరు బౌలర్లు సమానంగా 692 రేటింగ్ పాయింట్లు కలిగి ఒకటి, రెండు స్థానాల్లో కొనసాగుతున్నారు. టాప్ 10లో రవి మినహా భారత్ నుంచి ఎవ్వరికీ ప్రాతినిథ్యం లభించకపోగా.. హసరంగ, ఆదిల్ రషీద్, తీక్షణ, సామ్ కర్రన్, ఫజల్ హక్ ఫారూకీ, ముజీబ్, అకీల్ హొసేన్, తబ్రేజ్ షంషి వరుసగా 3 నుంచి 10 స్థానాలో నిలిచారు. -
IND VS SA 2nd T20: చరిత్ర సృష్టించిన సూర్యకుమార్
సెయింట్ జార్జ్స్ పార్క్ వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న రెండో టీ20లో టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ చరిత్ర సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో 15 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద టీ20ల్లో 2000 పరుగుల మార్కును తాకిన స్కై.. బంతుల పరంగా అంతర్జాతీయ టీ20ల్లో అత్యంత వేగంగా ఈ మార్కును తాకిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. పొట్టి ఫార్మాట్లో స్కై కేవలం 1164 బంతుల్లోనే 2000 పరుగుల మార్కును తాకగా.. అంతకుముందు ఈ రికార్డు ఆసీస్ మాజీ కెప్టెన్ ఆరోన్ ఫించ్ పేరిట ఉండింది. ఫించ్ 1283 బంతుల్లో 2000 పరుగుల మార్కును దాటాడు. ఈ రికార్డుతో పాటు స్కై మరో రెండు రికార్డులను కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. ఇన్నింగ్స్‌ల పరంగా అత్యంత వేగంగా 2000 పరుగులు పూర్తి చేసిన ఆటగాళ్ల జాబితాలో నాలుగో స్థానంలో నిలిచాడు. స్కై 56 ఇన్నింగ్స్‌ల్లో ఈ మార్కును అందుకోగా.. పాక్ మాజీ కెప్టెన్ బాబర్ ఆజమ్, అదే దేశానికి చెందిన మొహమ్మద్ రిజ్వాన్ (52 ఇన్నింగ్స్‌ల్లో) ఈ విభాగంలో అందరి కంటే ముందున్నారు. స్కైతో పాటు విరాట్ కోహ్లి కూడా 56 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ మార్కును అందుకోగా.. కేఎల్ రాహుల్ (58 ఇన్నింగ్స్‌ల్లో) వీరిద్దరి తర్వాతి స్థానంలో నిలిచాడు. ఈ మ్యాచ్‌లో 2000 అంతర్జాతీయ టీ20 పరుగులు పూర్తి చేసిన స్కై.. భారత్ తరఫున ఈ ఘనత సాధించిన నాలుగో ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. స్కైకు ముందు విరాట్ కోహ్లి (107 ఇన్నింగ్స్‌ల్లో 4008 పరుగులు), రోహిత్ శర్మ (140 ఇన్నింగ్స్‌ల్లో 3853 పరుగులు), కేఎల్ రాహుల్ (68 ఇన్నింగ్స్‌ల్లో 2256 పరుగులు) భారత్ తరఫున ఈ ఫీట్‌ను సాధించారు. కాగా, ఈ మ్యాచ్‌లో సూర్యకుమార్ (55 నాటౌట్) జోరుమీదుండటంతో భారత్ 13 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 122 పరుగులు చేసింది. స్కైతో పాటు రింకూ సింగ్ (32) క్రీజ్‌లో ఉన్నాడు. భారత ఇన్నింగ్స్‌లో ఓపెనర్లు శుభ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్ డకౌట్లు కాగా.. తిలక్ వర్మ 29 పరుగులు చేసి ఔటయ్యాడు. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడిన భారత్.. సౌతాఫ్రికా ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్‌కు దిగింది. -
SA VS IND 2nd T20: భారత్‌పై సౌతాఫ్రికా విజయం
భారత్‌పై సౌతాఫ్రికా విజయం భారత్‌పై ఐదు వికెట్ల తేడాతో సౌతాఫ్రికా విజయం సాధించింది. సౌతాఫ్రికా స్కోరు 154-5 ఐదో వికెట్ కోల్పోయిన సౌతాఫ్రికా 139 పరుగుల వద్ద సౌతాఫ్రికా తమ ఐదో వికెట్ కోల్పోయింది. మిల్లర్ ఔటయ్యాడు. నాలుగవ వికెట్ కోల్పోయిన సౌతాఫ్రికా 108 పరుగుల వద్ద సౌతాఫ్రికా నాలుగవ వికెట్ కోల్పోయింది. హేఇన్రిచ్ క్లాసేన్ ఔటయ్యాడు. టార్గెట్ 152.. 22 బంతుల్లోనే 50 పరుగులు పూర్తి చేసిన సౌతాఫ్రికా 152 పరుగుల లక్ష్య ఛేదనలో సౌతాఫ్రికా 22 బంతుల్లోనే 50 పరుగులు పూర్తి చేసుకుంది. 4 ఓవర్ల తర్వాత ఆ జట్టు స్కోర్ 56/1గా ఉంది. మార్క్రమ్ (14), హెండ్రిక్స్ (21) క్రీజ్‌లో ఉన్నారు. తొలి వికెట్ కోల్పోయిన సౌతాఫ్రికా 42 పరుగుల వద్ద (2.5 ఓవర్) సౌతాఫ్రికా తొలి వికెట్ కోల్పోయింది. అనవసర పరుగుకు ప్రయత్నించి బ్రీట్జ్కీ (16) రనౌటయ్యాడు. టార్గెట్ 152.. 2 ఓవర్లలోనే 38 పరుగులు బాదిన సౌతాఫ్రికా 152 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన సౌతాఫ్రికా శరవేగంగా పరుగులు సాధిస్తుంది. ఆ జట్టు 2 ఓవర్లలోనే 38 పరుగులు పిండుకుంది. హెండ్రిక్స్ (19), బ్రీట్జ్కీ (14) క్రీజ్‌లో ఉన్నారు. తగ్గిన వర్షం.. సౌతాఫ్రికా లక్ష్యం ఎంతంటే..? వర్షం తగ్గిన అనంతరం అంపైర్లు ఓవర్లను కుదించారు. భారత ఇన్నింగ్స్‌ను 19.3 ఓవర్ల వద్దనే ముగించిన అంపైర్లు.. డక్‌వర్త్ లూయిస్ పద్దతిన సౌతాఫ్రికా లక్ష్యాన్ని 15 ఓవర్లలో 152 పరుగులకు మార్చారు. వర్షం అంతరాయం భారత ఇన్నింగ్స్ మరో 3 బంతుల్లో ముగుస్తుందనగా వర్షం మొదలైంది. 19.3 ఓవర్ల తర్వాత భారత స్కోర్ 180/7గా ఉంది. గెరాల్డ్ కొయెట్జీ బౌలింగ్‌లో చివరి రెండు బంతుల్లో రవీంద్ర జడేజా (19), అర్షదీప్ సింగ్(0) ఔటయ్యారు. రింకూ సింగ్ (68)తో పాటు సిరాజ్ క్రీజ్‌లో ఉన్నాడు. రింకూ మెరుపు అర్ధశతకం రింకూ సింగ్ కేవలం 30 బంతుల్లో 9 ఫోర్ల సాయంతో తన కెరీర్లో తొలి అర్ధసెంచరీని పూర్తి చేసుకున్నాడు. దీనికి ముందు జితేశ్ శర్మ (1) మార్క్రమ్ బౌలింగ్‌లో స్టబ్స్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. నాలుగో వికెట్ కోల్పోయిన టీమిండియా 125 పరుగుల వద్ద (13.5 ఓవర్లలో) టీమిండియా నాలుగో వికెట్ కోల్పోయింది. షంషి బౌలింగ్‌లో జన్సెన్కు క్యాచ్ ఇచ్చి సూర్యకుమార్ యాదవ్ (56) ఔటయ్యాడు. రింకూ (34), జితేశ్ శర్మ క్రీజ్‌లో ఉన్నారు. మూడో వికెట్ కోల్పోయిన టీమిండియా 55 పరుగుల వద్ద టీమిండియా మూడో వికెట్ కోల్పోయింది. కొయెట్జీ బౌలింగ్‌లో జన్సెన్కు క్యాచ్ ఇచ్చి తిలక్ వర్మ (29) ఔటయ్యాడు. ధాటిగా ఆడుతున్న తిలక్, స్కై ఓపెనర్లు గిల్, యశస్వి డకౌట్లు అయ్యాక తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ ధాటిగా ఆడుతున్నారు. వీరి ధాటికి భారత్ 5 ఓవర్లలోనే 50 పరుగుల మార్కు (53) దాటింది. స్కై (21), తిలక్ (28) క్రీజ్‌లో ఉన్నారు. రెండో వికెట్ కోల్పోయిన టీమిండియా.. గిల్ డకౌట్ 6 పరుగులకే టీమిండియా 2 వికెట్లు కోల్పోయింది. తొలి ఓవర్లో యశస్వి జైస్వాల్ డకౌట్ కాగా.. రెండో ఓవర్ ఆఖరి బంతికి శుభ్‌మన్ గిల్ కూడా సున్నా పరుగులకే ఔటయ్యాడు. లిజాడ్ విలియమ్స్ బౌలింగ్‌లో గిల్ ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. మూడో బంతికే వికెట్ కోల్పోయిన టీమిండియా టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా మూడో బంతికే వికెట్ కోల్పోయింది. జన్సెన్ బౌలింగ్‌లో మిల్లర్‌కు క్యాచ్ ఇచ్చి యశస్వి జైస్వాల్ డకౌటయ్యాడు. సెయింట్ జార్జ్స్ పార్క్ వేదికగా టీమిండియాతో జరుగుతున్న రెండో టీ20లో సౌతాఫ్రికా టాస్ గెలిచి తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. స్వల్ప అనారోగ్యం కారణంగా రుతురాజ్ ఈ మ్యాచ్‌కు అందుబాటులో లేడని భారత కెప్టెన్ సూర్యకుమార్ ప్రకటించాడు. భారత జట్టులో శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్‌లకు కూడా అవకాశం దక్కలేదు. తిలక్ వర్మ, జితేశ్ శర్మ వీరి స్థానాల్లో జట్టులోకి వచ్చారు. టీమిండియా: యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), రింకూ సింగ్, జితేశ్ శర్మ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, ముకేష్ కుమార్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, అర్ష్‌దీప్ సింగ్. సౌతాఫ్రికా: రీజా హెండ్రిక్స్, మాథ్యూ బ్రీట్జ్కే, ఎయిడెన్ మార్క్రమ్ (కెప్టెన్), హెన్రిచ్ క్లాసెన్, ట్రిస్టన్ స్టబ్స్, డేవిడ్ మిల్లర్, మార్కో జాన్సెన్, అండిల్ ఫెహ్లుక్వాయో, గెరాల్డ్ కొయెట్జీ, లిజాడ్ విలియమ్స్, తబ్రేజ్ షంసీ. -
భారత్ వర్సెస్ దక్షిణాఫ్రికా.. షెడ్యూల్, జట్లు.. ఎక్కడ చూడొచ్చంటే?
సుమారు రెండేళ్ల తర్వాత దక్షిణాఫ్రికా గడ్డపై భారత జట్టు అడుగుపెట్టింది. ముంబై నుంచి నేరుగా ప్రత్యేక విమానంలో టీమిండియా సౌతాఫ్రికాకు గురువారం చేరుకుంది. ఈ పర్యటనలో భాగంగా ఆతిథ్య జట్టుతో మూడు టీ20లు, మూడు వన్డేలు, రెండు టెస్టుల సిరీస్‌లో టీమిండియా తలపడనుంది. డర్బన్ వేదికగా డిసెంబర్ 10న జరిగే టీ 20 మ్యాచ్‌తో భారత జట్టు ప్రోటీస్ పర్యటన షురూ కానుంది. ఇప్పటికే ఈ సిరీస్‌ల కోసం ఇరు దేశాల క్రికెట్ బోర్డుల తమ జట్లను ప్రకటించాయి. ఈ నేపథ్యంలో భారత్-దక్షిణాఫ్రికా సిరీస్‌కు సంబంధించిన షెడ్యూల్? టైమింగ్స్? వంటి తదితర వివరాలపై ఓ లుకేద్దాం. భారత్-దక్షిణాఫ్రికా సిరీస్ షెడ్యూల్ టీ20 సిరీస్ డిసెంబర్ 10: 1వ T20I- కింగ్స్‌మీడ్, డర్బన్ డిసెంబర్ 12: 2వ T20I- సెయింట్ జార్జ్ పార్క్, గ్కెబెర్హా డిసెంబర్ 14: 3వ T20I – న్యూ వాండరర్స్ స్టేడియం, జోహన్నెస్‌బర్గ్ ►మూడు టీ20లు భారత కాలమానం ప్రకారం రాత్రి 9:30 గంటలకు ప్రారంభం కానున్నాయి. వన్డే సిరీస్ డిసెంబర్ 17: 1వ ODI – న్యూ వాండరర్స్ స్టేడియం, జోహన్నెస్‌బర్గ్ డిసెంబర్ 19: 2వ ODI – సెయింట్ జార్జ్ పార్క్, గ్కెబెర్హా డిసెంబర్ 21: 3వ ODI- బోలాండ్ పార్క్, పార్ల్ ►తొలి వన్డే మధ్యాహ్నం 1:30 గంటలకు ప్రారంభం అవ్వనుండగా.. తదుపరి రెండు మ్యాచ్‌లు సాయంత్రం 4:30 గంటలకు మొదలు కానున్నాయి. టెస్ట్ సిరీస్ డిసెంబర్ 26-30: 1వ టెస్టు- సూపర్‌స్పోర్ట్ పార్క్, సెంచూరియన్ జనవరి 3-7: 2వ టెస్ట్- న్యూలాండ్స్, కేప్ టౌన్ ►బాక్సింగ్ డే టెస్టు మధ్యాహ్నం 1:30 గంటలకు, రెండో టెస్టు మధ్యాహ్నం 2:00 గంటలకు ప్రారంభం కానున్నాయి. ఎక్కడ చూడొచ్చంటే? భారత్ వర్సెస్ దక్షిణాఫ్రికా సిరీస్‌ను ఇండియాలో స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో వీక్షించివచ్చు. అలాగే డిస్నీ+ హాట్‌స్టార్‌లో కూడా మ్యాచ్‌లు ప్రసారం అవుతాయి. భారత టీ20జట్టు: సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభమన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, తిలక్ వర్మ, రింకు సింగ్, శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), జితేష్ శర్మ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా (వైస్ కెప్టెన్), వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, కుల్దీప్ యాదవ్, అర్షదీప్ సింగ్, మహమ్మద్ సిరాజ్, ముఖేష్ కుమార్, దీపక్ చాహర్. భారత వన్డే జట్టు: కేఎల్ రాహుల్ (కెప్టెన్)(వికెట్ కీపర్), రుతురాజ్ గైక్వాడ్, సాయి సుదర్శన్, తిలక్ వర్మ, రజత్ పాటిదార్, రింకూ సింగ్, శ్రేయస్ అయ్యర్, సంజు శాంసన్ (వికెట్ కీపర్), అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, ముఖేష్ కుమార్, అవేష్ ఖాన్, అర్షదీప్ సింగ్, దీపక్ చాహర్. దక్షిణాఫ్రికా టీ 20 జట్టు: ఐడెన్ మార్క్రమ్ (కెప్టెన్), ఒట్నీల్ బార్ట్‌మన్, మాథ్యూ బ్రీట్జ్కే, నాండ్రే బర్గర్, గెరాల్డ్ కోయెట్జీ, డొనొవాన్ ఫెరీరా, రీజా హెండ్రిక్స్, మార్కో జాన్సన్, హెన్రిచ్ క్లాసెన్, కేశవ్ మహారాజ్, డేవిడ్ మిల్లర్, లుంగి ఎంగిడి, ఆండిలే ఫెహ్లుక్వాయో, షంసి, ట్రిస్టన్ స్టబ్స్, లిజాడ్ విలియమ్స్. దక్షిణాఫ్రికా వన్డే జట్టు: ఐడెన్ మార్క్రమ్ (కెప్టెన్), ఒట్నీల్ బార్ట్‌మన్, నాండ్రే బర్గర్, టోనీ డి జోర్జి, రీజా హెండ్రిక్స్, హెన్రిచ్ క్లాసెన్, కేశవ్ మహారాజ్, మిహ్లాలీ మ్పోంగ్వానా, డేవిడ్ మిల్లర్, వియాన్ ముల్డర్, ఆండిలే ఫెహ్లుక్వాయో, షంసి, వాండర్ డసెన్, కైల్ వెరిన్నే, లిజాడ్ విలియమ్స్. -
ఏకంగా 56 స్థానాలు మెరుగుపర్చుకున్న రుతురాజ్.. టాప్‌లో భిష్ణోయ్
ఐసీసీ తాజాగా ప్రకటించిన టీ20 ర్యాంకింగ్స్‌లో టీమిండియా ఆటగాళ్లు సత్తా చాటారు. ఆసీస్‌తో ఇటీవల ముగిసిన సిరీస్‌లో మూకుమ్మడిగా రాణించిన భారత ఆటగాళ్లు ర్యాంకింగ్స్‌ను భారీగా మెరుగుపర్చుకున్నారు. ఆసీస్‌తో సిరీస్‌లో 5 మ్యాచ్‌ల్లో 55.75 సగటున 223 పరుగులు చేసి లీడింగ్ రన్ స్కోరర్‌గా నిలిచిన రుతురాజ్.. ఏకంగా 56 స్థానాలు మెరుగపర్చుకుని ఏడో స్థానానికి ఎగబాకగా.. అదే సిరీస్‌లో బౌలింగ్‌లో సత్తా చాటిన రవి భిష్ణోయ్ (5 మ్యాచ్‌ల్లో 9 వికెట్లు) నంబర్ 1 ర్యాంకు అందుకున్నాడు. ఇదే సిరీస్‌లో రెండో లీడింగ్ రన్ స్కోరర్‌గా నిలిచిన టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ (5 మ్యాచ్‌ల్లో 144 పరుగులు) తన టాప్ ర్యాంక్‌ను (881 పాయింట్లు) మరింత పదిలం చేసుకున్నాడు. ఈ మార్పులు మినహాయించి తాజా టీ20 ర్యాంకింగ్స్ పెద్దగా మార్పులు జరగలేదు. బ్యాటింగ్‌లో స్కై తర్వాత మహ్మద్ రిజ్వాన్, మార్క్రమ్, బాబార్ ఆజమ్, రిలీ రొస్సో, డేవిడ్ మలాన్, రుతురాజ్, జోస్ బట్లర్, రీజా హెండ్రిక్స్, గ్లెన్ ఫిలిప్స్ వరుసగా టాప్-10లో ఉన్నారు. బౌలింగ్ విషయానికొస్తే.. రషీద్ ఖాన్ టాప్ ర్యాంక్‌లో కొనసాగుతుండగా.. హసరంగ, ఆదిల్ రషీద్, తీక్షణ, భిష్ణోయ్, సామ్ కర్రన్, ఫజల్ హక్ ఫారూకీ, ముజీబ్, అకీల్ హొసేన్, హాజిల్‌వుడ్ టాప్-10 జాబితాలో నిలిచారు. కాగా, ఆసీస్‌తో జరిగిన 5 మ్యాచ్‌ల సిరీస్‌ను భారత్ 4-1 తేడాతో కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. -
చివరి ఓవర్లో సూర్య భాయ్ ఒకే మాట చెప్పాడు: అర్ష్‌దీప్ సింగ్
ఆస్ట్రేలియాతో ఆఖరి వరకు ఉత్కంఠ భరితంగా సాగిన ఐదో టీ20లో 6 పరుగుల తేడాతో టీమిండియా విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ విజయంలో యువ పేసర్ అర్ష్‌దీప్ సింగ్‌ది కీలక పాత్ర. ఆఖరి ఓవర్లో ఆసీస్ విజయానికి కేవలం 10 పరుగులు మాత్రమే అవసరం. ఈ సమయంలో భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ బంతిని అర్ష్‌దీప్ సింగ్ చేతికి ఇచ్చాడు. అయితే స్ట్రైక్‌లో మాథ్యూ వేడ్ వంటి హిట్టర్ ఉండడంతో కంగరూలదే గెలుపు అని అంతా భావించారు. కానీ అర్ష్‌దీప్ అందరి అంచానలను తలకిందులు చేస్తూ కేవలం 3 పరుగులు మాత్రమే ఇచ్చి జట్టుకు అద్భుతమైన విజయాన్ని అందించాడు. ఇక మ్యాచ్ అనంతరం తన ఆఖరి ఓవర్ అనుభవంపై అర్ష్‌దీప్ స్పందించాడు. కెప్టెన్ సూర్యకుమార్ తనకు ఎంతో సపోర్ట్‌గా నిలిచాడని అర్ష్‌దీప్ తెలిపాడు. నేను మొదటి ఓవర్లలో చాలా పరుగులు ఇచ్చాను. కానీ దేవుడు నాకు మరొక అవకాశం ఇచ్చాడు. కెప్టెన్‌తో పాటు సపోర్ట్ స్టాప్ కూడా నన్ను నమ్మి ఆఖరి ఓవర్ ఇచ్చారు. నిజం చెప్పాలంటే ఆ సమయంలో నాపై ఎటువంటి ఒత్తిడి లేదు. ఎందుకంటే సూర్య భాయ్ ముందే నా వద్దకు వచ్చి ఏమి జరగాలో అది జరుగుతుందని భయపడవద్దు అని చెప్పాడు. నా నేను కెరీర్లో చాలా పాఠాలు నేర్చుకొన్నాను. ఆ తర్వాత పుంజుకొన్నాను’ అని పోస్ట్ మ్యాచ్ ప్రేజేంటేషన్‌లో అర్ష్‌దీప్ పేర్కొన్నాడు. చదవండి: నాకు బౌలింగ్ చేయాలనుంది.. కానీ అదొక్కటే: శ్రేయస్ అయ్యర్ -
మిషన్ సౌతాఫ్రికా.. సూర్యకుమార్‌కు బిగ్ ఛాలెంజ్
స్వదేశంలో ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌ను సొంతం చేసుకున్న టీమిండియా.. ఇప్పుడు దక్షిణాఫ్రికా పర్యటనకు సిద్దమవుతోంది. ప్రోటీస్ పర్యటనలో భాగంగా తొలుత టీమిండియా ఆతిథ్య జట్టుతో మూడు మ్యాచ్‌ల టీ20ల సిరీస్‌లో తలపడనుంది. ఈ సిరీస్‌కు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, హార్దిక్ పాండ్యా, కేఎల్ రాహుల్ వంటి సీనియర్లు దూరం కావడంతో మరోసారి భారత జట్టుకు సూర్యకుమార్ యాదవ్ సారథ్యం వహించనున్నాడు. డిసెంబర్10న డర్బన్ వేదికగా జరగనున్న తొలి టీ20తో ఈ సిరీస్ ప్రారంభం కానుంది. ఆ నలుగురు వచ్చేసారు.. వన్డే వరల్డ్‌కప్-2023 తర్వాత విశ్రాంతి తీసుకున్న స్టార్ ఆటగాళ్లు రవీంద్ర జడేజా, శుబ్‌మన్ గిల్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్ తిరిగి భారత టీ20 జట్టులోకి వచ్చారు. వీరితో పాటు ఆసీస్ సిరీస్‌లో అదరగొట్టిన రింకూ సింగ్, యశస్వీ జైశ్వాల్ కూడా ప్రోటీస్‌తో టీ20 జట్టులో ఉన్నారు. వీరితో పాటు యువ వికెట్ కీపర్ జితేష్ శర్మను సెలక్టర్లు ఎంపిక చేశారు. కాగా ఈ సిరీస్‌లో సూర్యకు డిప్యూటీగా రవీంద్ర జడేజా వ్యవహరించనున్నాడు. బ్యాటింగ్‌లో అదుర్స్.. టీమిండియా బ్యాటింగ్ పరంగా బలంగా కన్పిస్తోంది. ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌లో సీనియర్ల బ్యాటర్లు లేని లోటు అస్సలు కన్పించలేదు. ఈ సిరీస్ ఆసాంతం భారత యువ బ్యాటర్లు దుమ్మురేపారు. ముఖ్యంగా రింకూ సింగ్, జైశ్వాల్ వంటి వారు తమ బ్యాటింగ్ స్కిల్స్‌తో అందరని అకట్టుకున్నారు. ఇప్పుడు శ్రేయస్, శుబ్‌మన్ గిల్ కూడా జట్టులోకి రావడంతో భారత బ్యాటింగ్ విభాగం మరింత పటిష్టంగా మారనుంది. అయితే బౌలింగ్‌లో మాత్రం టీమిండియా కాస్త బలహీనంగా కన్పిస్తోంది. ఆసీస్ సిరీస్‌లో బిష్ణోయ్, ముఖేష్ మినహా మిగితా ఎవరూ చెప్పుకొదగ్గ ప్రదర్శన చేయలేకపోయాడు. ఆఖరి రెండు టీ20ల్లో అద్బుతమైన ప్రదర్శన కనబరిచిన అక్షర్‌పటేల్‌కు దక్షిణాఫ్రికా సిరీస్ జట్టులో చోటు దక్కలేదు. అయితే కుల్దీప్, సిరాజ్ వంటి సీనియర్ బౌలర్లు జట్టులో రావడం బౌలింగ్ విభాగం కూడా మెరుగుపడనుంది. ప్రోటీస్ గడ్డపై మనదే పైచేయి... దక్షిణాఫ్రికా గడ్డపై టెస్టు, వన్డేల్లో భారత్‌కు చెప్పుకోదగ్గ విజయాలు లేకపోయినా.. టీ20ల్లో మాత్రం అద్బుతమైన రికార్డు ఉంది. ఇప్పటివరకు ప్రోటీస్ జట్టుతో వారి సొంత గడ్డపై ఐదు టీ20 మ్యాచ్‌లు ఆడిన భారత్.. మూడింట విజయం సాధించింది. అంతేకాకుండా 2007లో దక్షిణాఫ్రికా వేదికగా జరిగిన తొలి టీ20 ప్రపంచకప్‌ను కూడా టీమిండియానే సొంతం చేసుకుంది. ప్రోటీస్ గడ్డపై చివరగా 2017లో భారత్ జట్టు మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడింది. ఈ సిరీస్‌ను 2-1 తేడాతో విరాట్ కోహ్లి సారథ్యంలోని టీమిండియా సొంతం చేసుకుంది. ఇక ఓవరాల్‌గా ఇరు జట్లు ముఖాముఖి టీ20ల్లో 24 సార్లు తలపడగా.. భారత్ 13 మ్యాచ్‌లు, దక్షిణాఫ్రికా పదింట గెలుపొందింది. ఒక మ్యాచ్‌లో ఎటువంటి ఫలితం తేలలేదు. ప్రోటీస్‌తో అంత ఈజీ కాదు.. సూర్యకు బిగ్ ఛాలెంజ్ ఆసీస్‌పై సిరీస్ గెలిచి మంచి జోష్‌లో ఉన్న టీమిండియా.. ప్రోటీస్ గడ్డపై అదే జోరును కొనసాగించాలని భావిస్తోంది. అయితే దక్షిణాఫ్రికాతో అంత ఈజీ కాదు. ఎందుకంటే ప్రస్తుతం దక్షిణాఫ్రికా జట్టులో విధ్వంసకర ఆటగాళ్లు ఉన్నారు. కెప్టెన్ మార్క్రమ్, క్లాసెన్, మిల్లర్ వంటి వారు చెలరేగితే భారత బౌలర్లకు తిప్పలు తప్పవు. అయితే ఈ సిరీస్‌కు వరల్డ్‌క్లాస్ పేసర్ రబాడ దూరం కావడం కాస్త ఊరటనిచ్చే ఆంశం. వరల్డ్‌కప్‌లో అదరగొట్టిన మార్కో జన్సెన్,గెరాల్డ్ కొయెట్జీ వంటి యువ పేసర్లు మాత్రం జట్టులో ఉన్నారు. అదే విధంగా స్పిన్నర్ కేశవ్ మహారాజ్ కూడా భారత్‌తో టీ20 సిరీస్‌కు భాగమయ్యాడు. కాబట్టి ప్రోటీస్ బౌలర్ల నుంచి కూడా భారత్‌కు గట్టి సవాలు ఎదురు కానుంది. ఈ నేపథ్యంలో సూర్యకుమార్ యాదవ్‌ను జట్టును ఎలా నడిపిస్తాడో వేచి చూడాలి. భారత్‌తో టీ20లకు దక్షిణాఫ్రికా జట్టు: ఎయిడెన్ మార్క్రమ్ (కెప్టెన్), ఒట్నీల్ బార్ట్‌మ్యాన్, మాథ్యూ బ్రీట్జ్కీ, నండ్రే బర్గర్, గెరాల్డ్ కొయెట్జీ, డొనొవన్ ఫెరియెరా, రీజా హెండ్రిక్స్, మార్కో జన్సెన్, హెన్రిచ్ క్లాసెన్, కేశవ్ మహారాజ్, డేవిడ్ మిల్లర్, లుంగి ఎంగిడి, అండీల్ ఫెహ్లుక్వాయో, తబ్రేజ్ షంషి, ట్రిస్టన్ స్టబ్స్, లిజాడ్ విలియమ్స్ భారత టీ20 జట్టు: యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), రింకూ సింగ్, శ్రేయాస్ అయ్యర్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), జితేష్ శర్మ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, కుల్దీప్ యాదవ్ , అర్ష్‌దీప్ సింగ్, మహ్మద్ సిరాజ్, ముఖేష్ కుమార్, దీపక్ చాహర్ చదవండి: వాళ్ల కంటే బెటర్ అని కోహ్లి నిరూపించుకోవాలి.. అప్పుడే ఆ ఛాన్స్! రోహిత్‌కు అతడితో పోటీ.. -
అనవాయితీని కొనసాగించిన సూర్యకుమార్.. రింకూ, జితేశ్‌లకు..!
స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరిగిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను టీమిండియా 4-1 తేడాతో కైవసం చేసుకుంది. సూర్యకుమార్ యాదవ్ టీమిండియా కెప్టెన్‌గా తన తొలి సిరీస్‌లోనే విజయం సాధించి, దిగ్గజ కెప్టెన్ల సరసన చేరాడు. ట్రోఫీ గెలిచిన అనంతరం స్కై భారత కెప్టెన్లు ఆచరించిన ఆనవాయితీని కొనసాగించాడు. ఇటీవలికాలంలో భారత్ సిరీస్ నెగ్గిన ప్రతిసారి కెప్టెన్లు కొత్త ఆటగాళ్లకు ట్రోఫీని అందించడం ఆనవాయితీగా వస్తుంది. అదే ఆనవాయితీని స్కై కూడా కొనసాగిస్తూ.. జట్టులోకి కొత్తగా ఎంట్రీ ఇచ్చిన రింకూ సింగ్, జితేశ్ శర్మలకు ట్రోఫీని అందించాడు. టీమిండియాలో ఈ ఆనవాయితీని మహేంద్ర సింగ్ ధోని 2007లో ప్రవేశపెట్టాడు. నాటి నుంచి భారత్ ట్రోఫీ నెగ్గిన ప్రతిసారి కెప్టెన్ ఎవరైనా ఈ ట్రెడిషన్ కొనసాగుతూనే ఉంది. Suryakumar Yadav with the T20I series Trophy. - A memorable start for Captain SKY. pic.twitter.com/zo3elColpN — Johns. (@CricCrazyJohns) December 3, 2023 ఇదిలా ఉంటే, ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా బెంగళూరు వేదికగా ఆస్ట్రేలియాతో నిన్న (డిసెంబర్ 3) జరిగిన నామమాత్రపు ఐదో టీ20లో టీమిండియా 6 పరుగుల స్వల్ప తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో టీమిండియా స్వల్ప లక్ష్యాన్ని విజయవంతంగా డిఫెండ్ చేసుకుని అద్భుత విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసి 160 పరుగులు చేసిన భారత్.. బౌలర్లు మూకుమ్మడిగా రాణించడంతో ఆసీస్‌ను నిలువరించగలిగింది. Suryakumar Yadav handed over the Trophy to Rinku & Jitesh. - A lovely gesture by the leader. pic.twitter.com/gwHdVxZRlA — Johns. (@CricCrazyJohns) December 3, 2023 ఆఖరి ఓవర్లో ఆసీస్ గెలుపుకు 10 పరుగుల చేయాల్సిన తరుణంలో అర్షదీప్ సింగ్ మ్యాజిక్ చేశాడు. 6 బంతుల్లో వికెట్ తీసి కేవలం మూడు పరుగులు మాత్రమే ఇచ్చి టీమిండియాను గెలిపించాడు. ఈ సిరీస్‌లో ఆసీస్ కేవలం మూడో టీ20లో మాత్రమే విజయం సాధించగా.. భారత్ మిగిలిన మ్యాచ్‌లన్నిటిలో గెలుపొంది సిరీస్ కైవసం చేసుకుంది. -
బెదురులేని క్రికెట్ ఆడాలనుకున్నాం.. 200 కూడా తక్కువే, అయినా..!: సూర్యకుమార్
ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా బెంగళూరు వేదికగా ఆస్ట్రేలియాతో నిన్న (డిసెంబర్ 3) జరిగిన నామమాత్రపు ఐదో టీ20లో టీమిండియా 6 పరుగుల స్వల్ప తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా స్వల్ప లక్ష్యాన్ని విజయవంతంగా డిఫెండ్ చేసుకుని అద్భుత విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసి 160 పరుగులు చేసిన భారత్.. బౌలర్లు మూకుమ్మడిగా రాణించడంతో ఆసీస్‌ను నిలువరించగలిగింది. ఆఖరి ఓవర్లో ఆసీస్ గెలుపుకు 10 పరుగుల చేయాల్సిన తరుణంలో అర్షదీప్ సింగ్ మ్యాజిక్ చేశాడు. 6 బంతుల్లో వికెట్ తీసి కేవలం మూడు పరుగులు మాత్రమే ఇచ్చి టీమిండియాను గెలిపించాడు. ఈ గెలుపుతో భారత్ 5 మ్యాచ్‌ల సిరీస్‌ను 4-1 తేడాతో కైవసం చేసుకుంది. మ్యాచ్ అనంతరం భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ ఇలా అన్నాడు. ఓవరాల్‌గా ఇది మంచి సిరీస్. అందరూ అద్భుతంగా ఆడారు. భారత ఆటగాళ్లు నైపుణ్యాన్ని ప్రదర్శించిన తీరు అభినందనీయం. బెదురులేని క్రికెట్ ఆడుతూ గేమ్‌ను ఎంజాయ్ చేయాలనుకున్నాం. అదే చేశాం. ఏది కరెక్ట్ అనిపిస్తే అదే చేయమని సహచరులకు చెప్పాను. వారు దాన్ని ఫాలో అయ్యారు. మొత్తంగా సిరీస్ గెలవడం పట్ల సంతోషంగా ఉంది. ఈ మ్యాచ్‌లో వాషింగ్టన్ సుందర్ ఉండి ఉంటే యాడ్ ఆన్ అయ్యుండేది. ఈ పిచ్‌పై 200 ప్లస్ స్కోర్‌ను ఛేజ్ చేయడం సులభం. మేము తక్కువ స్కోర్ చేసి కూడా దాన్ని విజయవంతంగా కాపాడుకోగలిగాం. 10 ఓవర్ల తర్వాత మేము ఆటలో ఉన్నామని సహచరులకు చెప్పాను. బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. ముఖ్యంగా అర్షదీప్ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. -
ఆసీస్‌తో ఐదో టీ20.. బెంగళూరుకు చేరుకున్న భారత జట్టు! వీడియో వైరల్
ఆస్ట్రేలియాతో ఐదో టీ20కు టీమిండియా సిద్దమవుతోంది. డిసెంబర్ 3(ఆదివారం)న బెంగళూరు వేదికగా ఆస్ట్రేలియా-భారత్ జట్లు తలపడనున్నాయి. ఇప్పటికే సిరీస్‌ను 3-1తో సొంతం చేసుకున్న యువ భారత జట్టు.. నామమాత్రపు మ్యాచ్‌లోనూ సత్తాచాటాలాని ఉవ్విళ్లూరుతోంది. ఈ క్రమంలో ఆఖరి పోరు కోసం సూర్యకుమార్ సారథ్యంలోని భారత జట్టు శనివారం బెంగళూరుకు చేరుకుంది. భారత్‌తో పాటు ఆస్ట్రేలియా జట్టు కూడా బెంగళూరులో అడుగుపెట్టింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా ఈ మ్యాచ్‌లో భారత్ పలు మార్పులతో బరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది. కెప్టెన్ సూర్యకుమార్‌తో పాటు రింకూ సింగ్, అక్షర్ పటేల్‌కు విశ్రాంతి ఇవ్వనున్నట్లు సమాచారం. దీంతో శ్రేయస్ అయ్యర్ భారత జట్టును నడిపించనున్నట్లు వినికిడి. ఇక వీరిముగ్గురి స్ధానాల్లో తిలక్ వర్మ, శివమ్ దుబే,వాషింగ్టన్ సుందర్ తుది జట్టులోకి రానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఆసీస్‌తో ఐదో టీ20కు భారత తుది జట్టు(అంచనా): యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్, శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), తిలక్ వర్మ, శివమ్ దూబే, జితేష్ శర్మ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, దీపక్ చాహర్, రవి బిష్ణోయ్, అవేష్ ఖాన్, ముఖేష్ కుమార్ VIDEO | India and Australia cricket teams reach Bengaluru ahead of final T20 match. pic.twitter.com/FoIKLCp3cI — Press Trust of India (@PTI_News) December 2, 2023 -
IND vs AUS: నాలుగో టీ20లో భారత్ ఘన విజయం.. సిరీస్ మనదే
రాయ్‌పూర్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగో టీ20లో 20పరుగుల తేడాతో టీమిండియా ఘన విజయం సాధించింది. తద్వారా ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలూండగానే 3-1తో భారత్ సొంతం చేసుకుంది. 175 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 154 పరుగులు మాత్రమే చేసింది. భారత బౌలర్లలో ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ 3 వికెట్లతో ఆసీస్‌ను దెబ్బతీశాడు. అతడితో పాటు దీపక్ చాహర్ రెండు, బిష్ణోయ్, అవేష్‌ఖాన్ తలా వికెట్ సాధించారు. ఆస్ట్రేలియా బ్యాటర్లలో కెప్టెన్ మాథ్యూ వేడ్(36) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఇక ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన భారత్.. నిర్ణీత 20 ఓవర్లో 9 వికెట్ల నష్టానికి 9 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. టీమిండియా బ్యాటర్లలో రింకూ సింగ్ మరోసారి అదరగొట్టాడు. రింకూ 29 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 46 పరుగులు చేశాడు. రింకూతో పాటు జితేష్ శర్మ(35), యశస్వీ జైశ్వాల్(37), రుతురాజ్ గైక్వాడ్(32) పరుగులతో రాణించారు. ఆసీస్ బౌలర్లలో బెన్ ద్వార్షుయిస్ మూడు వికెట్లతో అదరగొట్టగా.. జాసన్ బెహ్రెన్‌డార్ఫ్, సంగా తలా రెండు వికెట్లు పడగొట్టారు. ఇక ఇరు జట్ల మధ్య ఆఖరి మ్యాచ్ డిసెంబర్ 3న బెంగళూరు వేదికగా జరగనుంది. -
వస్తాడు.. సునామీలా విరుచుకుపడతాడు..!
-
అతడు నిర్దాక్షిణ్యంగా విరుచుకుపడ్డాడు.. ప్లాన్ వర్కౌట్ అవ్వలేదు: సూర్యకుమార్
గౌహతి వేదికగా భారత్‌తో జరిగిన మూడో టీ20లో గ్లెన్ మ్యాక్స్‌వెల్ విధ్వంసకర శతకంతో (48 బంతుల్లో 104 నాటౌట్; 8 ఫోర్లు, 8 సిక్సర్లు) విరుచుకుపడి ఆసీస్‌ను గెలిపించాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా.. రుతురాజ్ అజేయమైన మెరుపు శతకంతో (57 బంతుల్లో 123 నాటౌట్; 13 ఫోర్లు, 7 సిక్సర్లు) చెలరేగడంతో నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 222 పరుగుల భారీ స్కోర్ చేసింది. అనంతరం లక్ష్యఛేదనలో మ్యాక్స్‌వెల్ విశ్వరూపం ప్రదర్శించి ఆసీస్‌ను విజయతీరాలకు చేర్చాడు. చివరి రెండు ఓవర్లలో 43 పరుగులు అవసరం కాగా మ్యాక్సీ, మాథ్యూ వేడ్ (16 బంతుల్లో 28 నాటౌట్; 3 ఫోర్లు, సిక్స్) తలో చేయి వేసి ఆసీస్‌ను గెలిపించారు. ఈ గెలుపుతో ఆసీస్ ఐదు మ్యాచ్‌లో సిరీస్‌లో భారత్ ఆధిక్యాన్ని 1-2కు తగ్గించింది. మ్యాచ్ అనంతరం టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ.. మ్యాక్స్‌వెల్‌ను త్వరగా ఔట్ చేయాలనుకున్న మా ప్లాన్ వర్కౌట్ అవ్వలేదు. అతడు మాపై నిర్దాక్షిణ్యంగా విరుచుకుపడ్డాడు. మంచులో 220 స్కోర్‌ను డిఫెండ్ చేయాలంటే, బౌలర్లకు పూర్తి స్వేచ్ఛనివ్వాలి. ఈ విషయంలో కూడా మా ప్లాన్ ఫెయిల్ అయ్యింది. ఆస్ట్రేలియా మొదటి నుంచే గేమ్‌లో ఉండింది. ఆఖర్లో వారు మాపై పైచేయి సాధించారు. అక్షర్ అనుభవజ్ఞుడైన బౌలర్. మంచు అధికంగా కురుస్తున్నప్పుడు అనుభవజ్ఞుడైన బౌలర్ స్పిన్నర్ అయినా పేసర్ అయినా ఫలితం ఒకేలా ఉంటుంది. అందుకే 19వ ఓవర్ అక్షర్‌కు ఇచ్చా. ఇది కూడా మిస్ ఫైర్ అయ్యింది. ఓడినప్పటికీ అబ్బాయిల ప్రదర్శన పట్ల చాలా గర్వంగా ఉందని అన్నాడు. -
IND vs AUS: మాక్స్వెల్ విధ్వంసకర సెంచరీ.. భారత్‌పై ఆసీస్ విజయం
గౌహతి వేదికగా టీమిండియాతో జరిగిన మూడో టీ20లో 5 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా అద్బుత విజయం సాధించింది. 223 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా ఆఖరి బంతికి 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఆస్ట్రేలియా విజయంలో గ్లెన్ మాక్స్వెల్ మెరుపు సెంచరీతో కీలక పాత్ర పోషించాడు. ప్రసిద్ద్ కృష్ణ వేసిని ఆఖరి ఓవర్లో ఆసీస్ విజయానికి 21 పరుగులు అవసరమవ్వగా.. తొలి బంతిని ఆసీస్ కెప్టెన్ మాథ్యూ వెడ్ ఫోర్ బాదాడు. అనంతరం రెండో బంతికి సింగిల్ తీసి మాక్స్‌వెల్‌కు స్ట్రైక్ ఇచ్చాడు. 4 బంతుల్లో 16 పరుగులు కావాల్సిన నేపథ్యంలో వరుసగా ఒక సిక్స్, మూడు ఫోర్లు బాది తన జట్టుకు చారిత్రాత్మక విజయాన్ని అందించాడు. కేవలం 48 బంతుల్లో 8 ఫోర్లు, 8 సిక్స్‌లతో 104 పరుగులు చేసి మాక్సీ ఆజేయంగా నిలిచాడు. కాగా ఈ విజయంతో సిరీస్ అధిక్యాన్ని 2-1కు ఆసీస్ తగ్గించింది. భారత బౌలర్లలో రవి బిష్ణోయ్ రెండు వికెట్లు, అవేష్ ఖాన్, అర్ష్‌దీప్ సింగ్ తలా వికెట్ సాధించారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 222 పరుగుల భారీ స్కోర్ చేసింది. భారత బ్యాటర్లలో ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ సెంచరీతో అదరగొట్టాడు. 57 బంతులు ఎదుర్కొన్న రుత్‌రాజ్ 13 ఫోర్లు, 7 సిక్స్‌లతో 123 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. 19 ఓవర్లకు ఆసీస్ స్కోర్: 202 /5 19 ఓవర్లు ముగిసే సరికి ఆసీస్ 5 వికెట్ల నష్టానికి 202 పరుగులు చేసింది. ఆసీస్ విజయానికి 6 బంతుల్లో 21 పరుగులు కావాలి. 18 ఓవర్లకు ఆసీస్ స్కోర్: 180/5 18 ఓవర్లు ముగిసే సరికి ఆసీస్ 5 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. ఆసీస్ విజయానికి 12 బంతుల్లో 43 పరుగులు కావాలి. 16 ఓవర్లకు ఆసీస్ స్కోర్: 174/5 గ్లెన్ మాక్స్వెల్ విధ్వంసక ఇన్నింగ్స్ ఆడుతున్నాడు.16 ఓవర్లు ముగిసే సరికి ఆసీస్ 5 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. ఆసీస్ విజయానికి 18 బంతుల్లో 49 పరుగులు కావాలి. మాక్స్వెల్ హాఫ్ సెంచరీ.. మాక్స్వెల్ అద్భుతమైన సెంచరీతో మెరిశాడు. 29 బంతుల్లో మాక్సీ తన హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. ఐదో వికెట్ డౌన్.. భారత బౌలర్లు తిరిగి కమ్‌బ్యాక్ ఇచ్చారు. ఆసీస్ ఐదో వికెట్ కోల్పోయింది. టిమ్ డేవిడ్.. రవి బిష్ణోయ్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 14 ఓవర్లకు ఆసీస్ స్కోర్: 136/5 నాలుగో వికెట్ డౌన్.. 128 పరుగుల వద్ద ఆస్ట్రేలియా నాలుగో వికెట్ కోల్పోయింది. 17 పరుగులు చేసిన మార్క్స్ స్టోయినిష్.. అక్షర్ పటేల్ బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు. 9 ఓవర్లకు ఆస్ట్రేలియా స్కోర్: 99/3 9 ఓవర్లు ముగిసే సరికి ఆస్ట్రేలియా 3 వికెట్ల నష్టానికి 99 పరుగులు చేసింది. క్రీజులో మాక్స్వెల్(26), స్టోయినిష్(5) పరుగులతోఉన్నారు. మూడో వికెట్ కోల్పోయిన ఆసీస్.. జోష్ ఇంగ్లీష్(10) రూపంలో ఆస్ట్రేలియా మూడో వికెట్ కోల్పోయింది. ఇంగ్లీష్‌ను బిష్ణోయ్ క్లీన్ బౌల్డ్ చేశాడు. రెండో వికెట్ డౌన్.. 66 పరుగుల వద్ద ఆస్ట్రేలియా రెండో వికెట్ కోల్పోయింది. 35 పరుగులు చేసిన ట్రావిస్ హెడ్.. అవేష్ ఖాన్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. తొలి వికెట్ కోల్పోయిన ఆసీస్.. 223 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా 47 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. 16 పరుగులు చేసిన ఆరోన్ హార్డీ.. అర్ష్‌దీప్ సింగ్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 5 ఓవర్లకు ఆసీస్ స్కోర్: 56/1. క్రీజులో ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లీష్(10) పరుగులతో ఉన్నారు. రుత్‌రాజ్ విధ్వంసకర సెంచరీ.. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 222 పరుగుల భారీ స్కోర్ చేసింది. భారత బ్యాటర్లలో యువ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. ఆసీస్ రుతురాజ్ బౌలర్లను ఊచ కోశాడు. ఈ మ్యాచ్‌లో 57 బంతులు ఎదుర్కొన్న రుత్‌రాజ్ 13 ఫోర్లు, 7 సిక్స్‌లతో 123 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. కాగా రుత్‌రాజ్‌కు ఇదే తొలి అంతర్జాతీయ సెంచరీ. అతడితో పాటు సూర్యకుమార్ యాదవ్(39), తిలక్ వర్మ(31) పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడారు. రుతురాజ్ గైక్వాడ్ సెంచరీ.. ఆసీస్‌తో జరుగుతున్న మూడో టీ20లో భారత యువ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్‌తో సెంచరీతో సత్తాచాటాడు. 52 బంతుల్లో 10 ఫోర్లు, 5 సిక్స్‌లతో రుతురాజ్ తన సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. 17 ఓవర్లకు టీమిండియా స్కోర్: 155/3 17 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా 3 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. క్రీజులో రుత్‌రాజ్ గైక్వాడ్(71), తిలక్ వర్మ(21) పరుగులతో ఉన్నారు. రుతురాజ్ గైక్వాడ్ హాఫ్ సెంచరీ.. టీమిండియా యువ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ మరో హాఫ్ సెంచరీ సాధించాడు. 33 బంతుల్లో 9 ఫోర్లతో రుతు తన హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు.15 ఓవర్లకు టీమిండియా స్కోర్: 143/3. క్రీజులో గైక్వాడ్(63), తిలక్ వర్మ(17) పరుగులతో ఉన్నారు. టీమిండియా మూడో వికెట్ డౌన్.. సూర్యకుమార్ ఔట్ 81 పరుగుల వద్ద టీమిండియా మూడో వికెట్ కోల్పోయింది. 39 పరుగులు చేసిన సూర్యకుమార్ యాదవ్.. ఆరోన్ హార్డీ బౌలింగ్‌లో వికెట్ కీపర్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. 12 ఓవర్లకు టీమిండియా స్కోర్: 101/3 దూకుడుగా ఆడుతున్న సూర్య.. 8ఓవర్లు ముగిసే సరికి టీమిండియా 2 వికెట్ల నష్టానికి 65 పరుగులు చేసింది. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మరోసారి తన బ్యాట్‌ను ఝుళిపిస్తున్నాడు. 33 పరుగులతో సూర్య బ్యాటింగ్ చేస్తున్నాడు. అతడితో పాటు క్రీజులో రుత్‌రాజ్ గైక్వాడ్(12) ఉన్నాడు. 5 ఓవర్లకు టీమిండియా స్కోర్: 39/2 5 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా 2 వికెట్ల నష్టానికి 39 పరుగులు చేసింది. క్రీజులో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్(13), రుత్‌రాజ్ గైక్వాడ్(6) పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు. టీమిండియాకు బిగ్ షాక్.. ఇషాన్ కిషన్ ఔట్ 24 పరుగుల వద్ద టీమిండియా రెండో వికెట్ కోల్పోయింది. కేన్ రిచర్డ్సన్ బౌలింగ్‌లో ఇషాన్ కిషన్ ఖాతా తెరవకుండానే పెవిలియన్‌కు చేరాడు. తొలి వికెట్ కోల్పోయిన టీమిండియా టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియాకు అదిలోకి బిగ్ షాక్ తగిలింది. యువ ఓపెనర్ జైశ్వాల్(6) తొలి వికెట్‌గా పెవిలియన్‌కు చేరాడు. బెహ్రెన్‌డార్ఫ్ బౌలింగ్‌లో వికెట్ కీపర్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. క్రీజులోకి ఇషాన్ కిషన్ వచ్చాడు. 2 ఓవర్లకు భారత్ స్కోర్: 18/1 గౌహతి వేదికగా మూడో టీ20లో ఆస్ట్రేలియా-భారత్ జట్లు తలపడతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా తొలుత బౌలింగ్ ఎంచుకుంది. కాగా ఈ మ్యాచ్‌కు టీమిండియా ముఖేష్ కుమార్ దూరమయ్యాడు. అతడి స్ధానంలో అవేష్ ఖాన్ తుది జట్టులోకి వచ్చాడు. మరోవైపు ఆస్ట్రేలియా ఏకంగా నాలుగు మార్పులతో బరిలోకి దిగింది. జట్టులోకి ట్రావిస్ హెడ్, ఆరోన్ హార్డీ, కేన్ రిచర్డ్సన్, బెహ్రెన్‌డార్ఫ్ వచ్చారు. తుది జట్లు ఆస్ట్రేలియా: ట్రావిస్ హెడ్, ఆరోన్ హార్డీ, జోష్ ఇంగ్లిస్, గ్లెన్ మాక్స్వెల్, మార్కస్ స్టోయినిస్, టిమ్ డేవిడ్, మాథ్యూ వేడ్ (కెప్టెన్), నాథన్ ఎల్లిస్, జాసన్ బెహ్రెన్‌డార్ఫ్, తన్వీర్ సంఘా, కేన్ రిచర్డ్సన్ భారత్: యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్ (వైస్ కెప్టెన్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), తిలక్ వర్మ, రింకూ సింగ్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, అవేష్ ఖాన్, అర్ష్‌దీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ -
టాస్ ఓడిన టీమిండియా.. ఆసీస్ విధ్వంసకర వీరుడి రీఎంట్రీ
ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా తిరువనంతపురం వేదికగా భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య ఇవాళ (నవంబర్ 26) రెండో టీ20 జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో ఆసీస్ టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా తొలి మ్యాచ్‌లో ఆడిన జట్టునే యధాతథంగా కొనసాగించగా.. ఆసీస్ రెండు మార్పులతో బరిలోకి దిగింది. బెహ్రాన్‌డార్ఫ్, ఆరోన్ హార్డీ స్థానాల్లో గ్లెన్ మ్యాక్స్‌వెల్, ఆడమ్ జంపా ఆసీస్ జట్టులోకి వచ్చారు. టీమిండియా: యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్(వికెట్‌కీపర్), సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), తిలక్ వర్మ, రింకూ సింగ్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్, ముఖేష్ కుమార్, ప్రసిద్ధ్ కృష్ణ ఆస్ట్రేలియా: స్టీవెన్ స్మిత్, మాథ్యూ షార్ట్, జోష్ ఇంగ్లిస్, మార్కస్ స్టోయినిస్, టిమ్ డేవిడ్, గ్లెన్ మాక్స్వెల్, మాథ్యూ వేడ్(కెప్టెన్), సీన్ అబాట్, నాథన్ ఎల్లిస్, ఆడమ్ జంపా, తన్వీర్ సంఘ -
టీ20ల్లో అత్యుత్తమ ఛేజింగ్.. రోహిత్‌ను దాటేసిన సూర్యకుమార్
ఆస్ట్రేలియాతో నిన్న (నవంబర్ 23) జరిగిన తొలి టీ20లో టీమిండియా ఓ అత్యుత్తమ రికార్డు సాధించింది. నిన్నటి మ్యాచ్‌లో ఆసీస్‌పై విజయం సాధించిన భారత్.. పొట్టి ఫార్మాట్లో తమ అత్యుత్తమ రన్ ఛేజింగ్ రికార్డును మెరుగుపర్చుకుంది. ఈ మ్యాచ్‌లో భారత్.. ఆసీస్ నిర్ధేశించిన 209 పరుగుల లక్ష్యాన్ని ఆఖరి బంతికి ఛేదించింది. ఈ మ్యాచ్‌కు ముందు టీ20ల్లో భారత్ అత్యుత్తమ ఛేజింగ్ రికార్డు 208 పరుగులుగా ఉండింది. హైదరాబాద్ వేదికగా 2019లో వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ 208 పరుగుల లక్ష్యాన్ని విజయవంతంగా ఛేదించింది. టీ20ల్లో భారత్ అన్ని దేశాల కంటే అధికంగా ఐదు సార్లు 200 ప్లస్ స్కోర్లను ఛేదించింది. భారత్ పొట్టి ఫార్మాట్లో 209, 208, 207, 204, 202 పరుగులకు విజయవంతంగా ఛేదించింది. భారత్ తర్వాత సౌతాఫ్రికా (4), పాకిస్తాన్ (3), ఆస్ట్రేలియా (3) అత్యధికంగా 200 ప్లస్ స్కోర్లను ఛేదించాయి. రోహిత్‌ను దాటేసిన సూర్యకుమార్.. భారత్ తరఫున టీ20ల్లో అత్యధిక మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు అందుకున్న ఆటగాళ్ల జాబితాలో సూర్యకుమార్ యాదవ్ రెండో స్థానానికి ఎగబాకాడు. ఆసీస్‌తో తొలి టీ20లో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అందుకున్న స్కై.. తన 54 మ్యాచ్‌ల టీ20 కెరీర్లో 13 సార్లు ఈ అవార్డును సొంతం చేసుకున్నాడు. ఈ జాబితాలో విరాట్ కోహ్లి (115 మ్యాచ్‌ల్లో 15) టాప్‌లో ఉండగా.. రోహిత్ శర్మ (148 మ్యాచ్‌ల్లో 12) మూడో స్థానంలో నిలిచాడు. ఇదిలా ఉంటే, ఆసీస్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 2 వికెట్ల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్.. జోష్ ఇంగ్లిస్ (50 బంతుల్లో 110; 11 ఫోర్లు, 8 సిక్సర్లు) శతక్కొట్టడంతో నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 208 పరుగుల భారీ స్కోర్ చేసింది. స్టీవ్ స్మిత్ (52) అర్ధసెంచరీతో రాణించాడు. 209 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్.. సూర్యకుమార్ యాదవ్ (42 బంతుల్లో 80; 9 ఫోర్లు, 4 సిక్సర్లు), ఇషాన్ కిషన్ (39 బంతుల్లో 58; 2 ఫోర్లు, 5 సిక్సర్లు), రింకూ సింగ్ (14 బంతుల్లో 22 నాటౌట్; 4 ఫోర్లు) మెరుపు ఇన్నింగ్స్‌లతో విజృంభించడంతో ఆఖరి బంతికి విజయం సాధించింది. -
IND VS AUS 1st T20: సెంచరీ కొట్టిన సూర్యకుమార్ యాదవ్
ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా విశాఖ వేదికగా ఆసీస్‌తో నిన్న (నవంబర్ 23) జరిగిన తొలి టీ20లో సూర్యకుమార్ యాదవ్ మెరుపు ఇన్నింగ్స్ ఆడి టీమిండియాను గెలిపించాడు. ఈ మ్యాచ్‌లో 42 బంతులు ఎదుర్కొన్న సూర్య భాయ్ 9 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 80 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో కొట్టిన సిక్సర్లతో స్కై అంతర్జాతీయ టీ20ల్లో ఓ అరుదైన రికార్డు సాధించాడు. T20 format is so easy for Suryakumar Yadav. 🔥pic.twitter.com/8XcKGl6MO6 — Johns. (@CricCrazyJohns) November 23, 2023 బ్యాటింగ్ ఆర్డర్లో 3 అంతకంటే కింది స్థానాల్లో వచ్చి 100 సిక్సర్లు (47 ఇన్నింగ్స్‌ల్లో) బాదిన ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. ఈ విభాగంలో ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ టాప్‌లో ఉన్నాడు. మోర్గాన్ 107 ఇన్నింగ్స్‌ల్లో 120 సిక్సర్లు బాదాడు. ఇతని తర్వాత ఈ విభాగంలో విరాట్ కోహ్లి (98 ఇన్నింగ్స్‌ల్లో 106 సిక్సర్లు), డేవిడ్ మిల్లర్ (98 ఇన్నింగ్స్‌ల్లో 105) తర్వాతి స్థానాల్లో ఉన్నారు. ఓవరాల్‌గా స్కై తన 51 ఇన్నింగ్స్‌ల టీ20 కెరీర్లో 108 సిక్సర్లు బాదాడు. ఇదిలా ఉంటే, ఆసీస్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 2 వికెట్ల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్.. జోష్ ఇంగ్లిస్ (50 బంతుల్లో 110; 11 ఫోర్లు, 8 సిక్సర్లు) శతక్కొట్టడంతో నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 208 పరుగుల భారీ స్కోర్ చేసింది. స్టీవ్ స్మిత్ (52) అర్ధసెంచరీతో రాణించాడు. 209 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్.. సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్ (39 బంతుల్లో 58; 2 ఫోర్లు, 5 సిక్సర్లు), రింకూ సింగ్ (14 బంతుల్లో 22 నాటౌట్; 4 ఫోర్లు) మెరుపు ఇన్నింగ్స్‌లతో విజృంభించడంతో ఆఖరి బంతికి విజయం సాధించింది. -
ఆఖరి బంతికి సిక్సర్ కొట్టిన రింకూ.. మ్యాచ్ గెలిచాం, కానీ..!
ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా విశాఖ వేదికగా ఆసీస్‌తో నిన్న (నవంబర్ 23) జరిగిన తొలి టీ20లో టీమిండియా 2 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఉత్కంఠగా సాగిన ఈ సమరంలో ఆసీస్ నిర్ధేశించిన 209 పరుగుల లక్ష్యాన్ని భారత్ ఆఖరి బంతికి ఛేదించింది. సీన్ అబాట్ బౌలింగ్‌లో రింకూ సింగ్ ఆఖరి బంతికి సిక్సర్ బాదాడు. అయితే రింకూ ఈ సిక్సర్ కొట్టినందుకు టీమిండియా గెలవలేదు. భారత్ గెలుపుకు ఆఖరి బంతికి సింగిల్ అవసరం కాగా.. అబాట్ నో బాల్ వేశాడు. అంపైర్లు రింకూ సిక్సర్‌ను పరిగణలోకి తీసుకోకుండా నో బాల్ ద్వారా లభించిన పరుగుతోనే టీమిండియా గెలిచినట్లు ప్రకటించారు. దీంతో రింకూ సింగ్ సిక్సర్ వృధా అయ్యింది. The Finisher Rinku Singh is here to rule for India. 💪🫡pic.twitter.com/p3TtZOm7iC — Johns. (@CricCrazyJohns) November 23, 2023 కాగా, ఛేదనలో అప్పటిదాకా సాఫీగా సాగిన టీమిండియా ప్రయాణం ఆఖరి ఓవర్లో కీలక మలుపులు తిరిగింది. చివరి ఓవర్లో భారత్ గెలుపుకు 7 పరుగులు మాత్రమే అవసరం కాగా.. రింకూ సింగ్ తొలి బంతికే బౌండరీ బాది భారత్‌ను గెలుపు వాకిటికి చేర్చాడు. అనంతరం రెండో బంతికి బైస్ రూపంలో మరో పరుగు వచ్చింది. దీంతో భారత్ గెలుపుకు మరింత చేరువగా వెళ్లింది. ఇక భారత్ గెలవాలంటే 4 బంతుల్లో కేవలం 2 పరుగులు మాత్రమే చేయాలి. ఇక్కడే మ్యాచ్ మలుపులు తిరిగింది. మూడు (అక్షర్ క్యాచ్ ఔట్), నాలుగు (బిష్ణోయ్ రనౌట్), ఐదు బంతులకు (అర్షదీప్) భారత్ వికెట్లు కోల్పోయింది. ఐదో బంతికి అర్షదీప్ రెండో పరుగుకు వెళ్తూ రనౌటయ్యాడు. దీంతో భారత్ గెలవాలంటే ఆఖరి బంతికి ఒక్క పరుగు చేయాల్సి వచ్చింది. స్ట్రయిక్‌లో ఉన్న రింకూ సింగ్ అబాట్ వేసిన బంతిని సిక్సర్‌గా మలిచాడు. మ్యాచ్ చూస్తున్నవారంతా రింకూ సిక్సర్ కారణంగానే భారత్ గెలిచినందని అనున్నారు. కానీ, అబాట్ ఆఖరి బంతి క్రీజ్ దాటి బౌలింగ్ చేయడంతో భారత్ ఖాతాలోని పరుగు చేరి శ్రమ లేకుండానే టీమిండియాకు విజయం దక్కింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్.. జోష్ ఇంగ్లిస్ (50 బంతుల్లో 110; 11 ఫోర్లు, 8 సిక్సర్లు) శతక్కొట్టడంతో నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 208 పరుగుల భారీ స్కోర్ చేసింది. స్టీవ్ స్మిత్ (52) అర్ధసెంచరీతో రాణించాడు. 209 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్.. సూర్యకుమార్ యాదవ్ (42 బంతుల్లో 80; 9 ఫోర్లు, 4 సిక్సర్లు), ఇషాన్ కిషన్ (39 బంతుల్లో 58; 2 ఫోర్లు, 5 సిక్సర్లు), రింకూ సింగ్ (14 బంతుల్లో 22 నాటౌట్; 4 ఫోర్లు) మెరుపు ఇన్నింగ్స్‌లతో విజృంభించడంతో ఆఖరి బంతికి విజయం సాధించింది. -
బాగానే ఆడాం.. గెలుస్తామని అనుకున్నాం.. కానీ అతను అలా..!: ఆసీస్ కెప్టెన్
ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా విశాఖ వేదికగా టీమిండియాతో నిన్న (నవంబర్ 23) జరిగిన తొలి టీ20లో ఆసీస్ 2 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ఈ మ్యాచ్‌లో ఆసీస్ భారీ స్కోర్ సాధించినప్పటికీ.. సూర్యకుమార్ యాదవ్ (42 బంతుల్లో 80; 9 ఫోర్లు, 4 సిక్సర్లు), ఇషాన్ కిషన్ (39 బంతుల్లో 58; 2 ఫోర్లు, 5 సిక్సర్లు), రింకూ సింగ్ (14 బంతుల్లో 22 నాటౌట్; 4 ఫోర్లు) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడి భారత్‌ను గెలిపించారు. చివరి ఓవర్లో భారత్ 3 బంతుల్లో 3 వికెట్లు కోల్పోయి ఓటమిపాలయ్యేలా కనిపించినప్పటికీ.. రింకూ సింగ్ చివరి బంతికి సిక్సర్ బాది టీమిండియాను గెలిపించాడు. అంతకుముందు జోష్ ఇంగ్లిస్ (50 బంతుల్లో 110; 11 ఫోర్లు, 8 సిక్సర్లు) శతక్కొట్టడంతో ఆసీస్ నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 208 పరుగుల భారీ స్కోర్ చేసింది. స్టీవ్ స్మిత్ (52) అర్ధసెంచరీతో రాణించాడు. ఇంగ్లిస్ విధ్వంసం ధాటికి భారత బౌలర్లంతా ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. మ్యాచ్ అనంతరం ఆసీస్ కెప్టెన్ మాథ్యూ వేడ్ మాట్లాడుతూ ఇలా అన్నాడు. ఓవరాల్‌గా మంచి మ్యాచ్. ఇంగ్లిస్ మాకు మంచి స్కోర్ అందించాడు. డిఫెండ్ చేసుకోగలమని భావించాం. కానీ సూర్యకుమార్ మా నుంచి మ్యాచ్ లాగేసుకున్నాడు. మ్యాచ్ గెలిచేందుకు ఆఖరి ఓవర్లోనూ అవకాశం వచ్చింది. అయితే రింకూ సింగ్ సిక్సర్ బాది ఖేల్ ఖతం చేశాడు. యువ భారత ఆటగాళ్లకు ఐపీఎల్‌తో పాటు స్థానిక దేశవాలీ టీ20లు ఆడటం బాగా కలిసొచ్చింది. మా వరకు మేము బౌలింగ్ బాగానే చేశాం. అయితే యార్కర్లు సంధించడంలో విఫలమయ్యాం. ఈ గేమ్ నుండి చాలా పాజిటివ్‌లు తీసుకోవాలి. ఇంగ్లిస్ క్లాసీ బ్యాటింగ్. 19వ ఓవర్లో ఇల్లిస్ కట్టుదిట్టమైన బౌలింగ్. మొత్తంగా మా వైపు నుంచి అద్బుత ప్రదర్శన చేశాం. కానీ, టీమిండియా ఆటగాళ్లు మా కంటే మెరుగైన ప్రదర్శన కనబర్చి మాపై పైచేయి సాధించారు. సూర్య విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడినప్పటికీ చివరి బంతి వరకు మ్యాచ్‌ను తీసుకెళ్లామంటే మా ప్రదర్శన బాగానే ఉన్నట్లు అనుకుంటున్నామని వేడ్ అన్నాడు. -
కెప్టెన్సీని డ్రెస్సింగ్ రూమ్‌లోనే వదిలేశాను.. రింకూ కోసమే అనిపించింది: సూర్యకుమార్
ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా విశాఖ వేదికగా ఆస్ట్రేలియాతో నిన్న (నవంబర్ 23) జరిగిన తొలి టీ20లో టీమిండియా 2 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్.. జోష్ ఇంగ్లిస్ (50 బంతుల్లో 110; 11 ఫోర్లు, 8 సిక్సర్లు) శతక్కొట్టడంతో నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 208 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఓపెనర్‌గా వచ్చిన స్టీవ్ స్మిత్ (52) అర్ధసెంచరీతో రాణించాడు. ఇంగ్లిస్ విధ్వంసం ధాటికి ముకేశ్ కుమార్ (4-0-29-0), అక్షర్ పటేల్ (4-0-32-0) మినహా భారత బౌలర్లంతా కుదేలయ్యారు. ప్రసిద్ద్, రవి బిష్ణోయ్‌కు తలో వికెట్ దక్కింది. అనంతరం 209 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్.. మరో బంతి మిగిలుండగానే విజయతీరాలకు చేరింది. సూర్యకుమార్ యాదవ్ (42 బంతుల్లో 80; 9 ఫోర్లు, 4 సిక్సర్లు) కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడి టీమిండియా గెలుపుకు బాటలు వేశాడు. ఇషాన్ కిషన్ (39 బంతుల్లో 58; 2 ఫోర్లు, 5 సిక్సర్లు) అర్ధసెంచరీతో రాణించాడు. స్కై ఔటయ్యాక ఆఖర్లో టీమిండియా 3 బంతుల్లో 3 వికెట్లు కోల్పోయి ఓటమిపాలయ్యేలా కనినపించింది. అయితే రింకూ సింగ్ చివరి బంతికి సిక్సర్ బాది టీమిండియాను గెలిపించాడు. భారత్ గెలుపుకు చివరి బంతికి సింగిల్ అవసరం కాగా సీన్ అబాట్ నో బాల్ వేసి భారత గెలుపును లాంఛనం చేశాడు. దీంతో రింకూ సిక్సర్‌తో సంబంధం లేకుండానే టీమిండియా విజయం సాధించింది. రింకూ సిక్సర్ గణాంకాల్లో కూడా కలవలేదు. మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడిన సూర్యకుమార్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. మ్యాచ్ అనంతరం స్కై మాట్లాడుతూ.. ఈ రోజు మా ఆటతీరు అద్భుతంగా ఉంది. ఓ దశలో ఒత్తిడికి గురయ్యాము. కానీ మా ఆటగాళ్లు దాన్ని అధిగమించి సత్తా చాటారు. టీమిండియా కెప్టెన్‌గా ఇది నాకు గర్వించదగ్గ క్షణం. మ్యాచ్ సమయంలో మంచు కురుస్తుందని భావించాము. కానీ అలా జరగలేదు. మైదానం చిన్నది కావడంతో ఛేదనలో బ్యాటింగ్ సులభం అవుతుందని తెలుసు. వారు 230-235 సాధించవచ్చని భావించాం. కానీ ఆఖర్లో మా బౌలర్లు వారిని అద్భుతంగా కట్టడి చేశారు. బ్యాటింగ్‌ను ఎంజాయ్ చేయమని ఇషాన్‌కు చెప్పాను. అందుకే అతను ఫ్రీగా షాట్లు ఆడగలిగాడు. కెప్టెన్సీ లగేజీని డ్రెస్సింగ్ రూమ్‌లో వదిలేసి బరిలోకి దిగాను. అందుకే బ్యాటింగ్‌ను ఆస్వాదించగలిగాను. ఆఖరి బంతికి రింకూ సిక్సర్ కొట్టడంపై స్పందిస్తూ.. అతడి కొరకే ఇలాంటి పరిస్థితులు వస్తాయన్నట్లుగా అనిపించింది. అతను ప్రశాంతంగా ఉండటమే కాకుండా నన్ను కూడా శాంతింపజేశాడు. ఇక్కడి (విశాఖ) వాతావరణం అద్భుతంగా ఉంది. ప్రేక్షకులకు ధన్యవాదాలు అని అన్నాడు. -
సూర్యకుమార్ విధ్వంసం.. ఆస్ట్రేలియాపై టీమిండియా ఘన విజయం
వన్డే ప్రపంచకప్-2023 ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఓటమికి టీమిండియా బదులు తీర్చుకుంది. విశాఖపట్నం వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టీ20లో 5 వికెట్ల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. 209 పరుగుల భారీ లక్ష్యాన్ని 19 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి టీమిండియా ఛేదించింది. భారత బ్యాటర్లలో స్టాండింగ్ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. వలం 42 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్స్‌లతో 80 పరుగులు చేసి జట్టుకు అద్భుతమైన విజయాన్ని అందించాడు. అతడితో పాటు ఇషాన్ కిషన్(58), రింకూ సింగ్(22) కీలక ఇన్నింగ్స్ ఆడారు. ఆఖరిలో రింకూ సూపర్ ఇన్నింగ్స్‌తో మ్యాచ్‌ను ఫినిష్ చేశాడు. ఆస్ట్రేలియా బౌలర్లో సంఘా రెండు వికెట్లు పడగొట్టగా.. అబాట్, బెహ్రెండార్ఫ్, షార్ట్ తలా వికెట్ సాధించారు. ఆఖరి ఓవర్లో హైడ్రామా.. చివరి ఓవర్లో భారత విజయానికి 7 పరుగులు కావాల్సిన సమయంలో రింకూ తొలి బంతిని బౌండరీగా మలిచాడు.. దీంతో 5 బంతుల్లో గెలుపు కేవలం 2 పరుగులు మాత్రమే అవసరమయ్యాయి. రెండో బంతికి సింగిల్ తీసి అక్షర్‌కు రింకూ స్ట్రైక్ ఇచ్చాడు. అయితే అక్షర్ మాత్రం భారీ షాట్‌కు ప్రయత్నించి తన వికెట్‌ను కోల్పోయాడు. దీంతో ఆఖరి మూడు బంతుల్లో భారత్ గెలుపుకు రెండు పరుగులు అవసరమయ్యాయి. క్రీజులోకి వచ్చిన బిష్ణోయ్ నాలుగో బంతిని సింగిల్ తీసి రింకూకు స్ట్రైక్ ఇచ్చే ప్రయత్నం చేశాడు. కానీ రింకూకు స్ట్రైక్ ఇచ్చే ప్రయత్నంలో బిష్ణోయ్ రనౌటయ్యాడు. ఐదో బంతిని లాంగ్ ఆన్ దిశగా ఆడిన రింకూ రెండో పరుగు కోసం ట్రై చేశాడు. ఈ క్రమంలో అర్ష్‌దీప్ రనౌటయ్యాడు. అయితే ఆఖరి బంతికి భారత విజయానికి ఒక్కపరుగు అవసరమైంది. స్ట్రైక్‌లో ఉన్న రింకూ చివరి బంతిని సిక్స్‌గా మలిచి మ్యాచ్‌ను ఫినిష్ చేశాడు. అయితే ఆసీస్ బౌలర్ అబాట్ నోబాల్‌గా వేయడంతో రింకూ కొట్టిన సిక్స్‌ను పరిగణలోకి తీసుకోలేదు. ఇక అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్.. నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి ఏకంగా 208 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ఆస్ట్రేలియా బ్యాటర్లలో జోష్ ఇంగ్లీష్ అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. కేవలం 50 బంతుల్లో 9 ఫోర్లు, 8 సిక్స్‌లతో ఇంగ్లీష్ 110 పరుగులు చేశాడు. అతడితో పాటు స్టీవ్ స్మిత్(52), డేవిడ్ (19) పరుగులతో రాణించారు. భారత బౌలర్లలో బిష్ణోయ్, ప్రసిద్ద్ కృష్ణ తలా వికెట్ సాధించారు. -
India vs Australia 1st T20I: రింకూ ది ఫినిషర్.. ఆస్ట్రేలియాపై భారత్ విజయం
విశాఖపట్నం వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టీ20లో 2 వికెట్ల తేడాతో భారత్ విజయం సాధించింది. 209 పరుగుల భారీ లక్ష్యాన్ని 19. 5 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి టీమిండియా ఛేదించింది. భారత బ్యాటర్లలో స్టాండింగ్ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 42 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్స్‌లతో 80 పరుగులు చేసి జట్టుకు అద్భుతమైన విజయాన్ని అందించాడు. అతడితో పాటు ఇషాన్ కిషన్(58), రింకూ సింగ్(22) కీలక ఇన్నింగ్స్ ఆడారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి ఏకంగా 208 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ఆస్ట్రేలియా బ్యాటర్లలో జోష్ ఇంగ్లీష్ అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. కేవలం 50 బంతుల్లో 9 ఫోర్లు, 8 సిక్స్‌లతో ఇంగ్లీష్ 110 పరుగులు చేశాడు. అతడితో పాటు స్టీవ్ స్మిత్(52), డేవిడ్ (19) పరుగులతో రాణించారు. భారత బౌలర్లలో బిష్ణోయ్, ప్రసిద్ద్ కృష్ణ తలా వికెట్ సాధించారు. సూర్యకుమార్ యాదవ్ ఔట్.. విజయానికి మరో 15 పరుగులు అవసరమైన సమయంలో సూర్యకుమార్ యాదవ్ వికెట్‌ను టీమిండియా కోల్పోయింది. 80 పరుగులు చేసిన సూర్యకుమార్ యాదవ్.. బెహ్రెండార్ఫ్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. క్రీజులోకి అక్షర్ పటేల్ వచ్చాడు. విజయం దిశగా భారత్.. తొలి టీ20లో టీమిండియా విజయం దిశగా అడుగులు వేస్తోంది. 18 బంతుల్లో భారత్ విజయానికి కేవలం 20 పరుగులు కావాలి. క్రీజులో సూర్యకుమార్ యాదవ్(76), రింకూ సింగ్(11) పరుగులతో ఉన్నారు. నాలుగో వికెట్ డౌన్.. తిలక్ వర్మ ఔట్ 154 పరుగుల వద్ద టీమిండియా నాలుగో వికెట్ కోల్పోయింది. 12 పరుగులు చేసిన తిలక్ వర్మ.. సంఘా బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు. 16 ఓవర్లకు భారత్ స్కోర్: 171/4. టీమిండియా విజయానికి 24 బంతుల్లో 38 పరుగులు కావాలి. క్రీజులో సూర్యకుమార్(65), రింకూ సింగ్(10) పరుగులతో ఉన్నారు. సూర్యకుమార్ హాఫ్ సెంచరీ.. టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తన హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. 29 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లతో సూర్య హాఫ్ సెంచరీ సాధించాడు. టీమిండియా మూడో వికెట్ డౌన్.. ఇషాన్ కిషన్ ఔట్ ఇషాన్ కిషన్ రూపంలో టీమిండియా మూడో వికెట్ కోల్పోయింది. హాప్ సెంచరీతో అదరగొట్టిన గిల్(39 బంతుల్లో 58).. సంఘా బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు. క్రీజులోకి తిలక్ వర్మ వచ్చాడు. భారత విజయానికి 42 బంతుల్లో 74 పరుగులు కావాలి. దూకుడుగా ఆడుతోన్న సూర్యకుమార్, కిషన్ సూర్యకుమార్ యాదవ్(48), ఇషాన్ కిషన్(48) అద్బుతమైన ఇన్నింగ్స్ ఆడుతున్నారు. వీరిద్దరూ 12 ఓవర్లు ముగిసే సరికి 102 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. 12 ఓవర్లకు టీమిండియా స్కోర్: 124/2 9 ఓవర్లకు ఆసీస్ స్కోర్: 98/2 209 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 9 ఓవర్లు ముగిసే సరికి రెండు వికెట్ల నష్టానికి 98 పరుగులు చేసింది. సూర్యకుమార్ యాదవ్(37), ఇషాన్ కిషన్(36) పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు. భారత్ విజయానికి 66 బంతుల్లో 111 పరుగులు కావాలి. 5 ఓవర్లకు భారత్ స్కోర్: 54/2 5 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా 2 వికెట్ల నష్టానికి 54 పరుగులు చేసింది. క్రీజులో సూర్యకుమార్ యాదవ్(18), ఇషాన్ కిషన్(13) పరుగులతో ఉన్నారు. రెండో వికెట్ డౌన్.. జైశ్వాల్ ఔట్ 22 పరుగుల వద్ద 22 పరుగుల వద్ద టీమిండియా రెండో వికెట్ కోల్పోయింది. 21 పరుగులు చేసిన యశస్వీ జైశ్వాల్.. షార్ట్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. క్రీజులోకి కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ వచ్చాడు. టీమిండియా తొలి వికెట్ డౌన్.. రుత్‌రాజ్ ఔట్ 209 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా.. 11 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. రుత్‌రాజ్ గైక్వాడ్ డైమండ్ డక్‌గా వెనుదిరిగాడు. క్రీజులోకి ఇషాన్ కిషన్ వచ్చాడు. చెలరేగిన ఆసీస్ బ్యాటర్లు.. విశాఖ వేదికగా టీమిండియాతో జరుగుతున్న తొలి టీ20లో ఆస్ట్రేలియా బ్యాటర్లు విధ్వంసం సృష్టించారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్.. నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి ఏకంగా 208 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ఆస్ట్రేలియా బ్యాటర్లలో జోష్ ఇంగ్లీష్ అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. కేవలం 50 బంతుల్లో 9 ఫోర్లు, 8 సిక్స్‌లతో ఇంగ్లీష్ 110 పరుగులు చేశాడు. అతడితో పాటు స్టీవ్ స్మిత్(52), డేవిడ్ (19) పరుగులతో రాణించారు. భారత బౌలర్లలో బిష్ణోయ్, ప్రసిద్ద్ కృష్ణ తలా వికెట్ సాధించారు. ఆసీస్ మూడో వికెట్ డౌన్.. ఆస్ట్రేలియా మూడో వికెట్ కోల్పోయింది. సెంచరీతో విధ్వంసం సృష్టించిన జోష్ ఇంగ్లీష్.. ప్రసిద్ద్ కృష్ణ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 50 బంతుల్లో 9 ఫోర్లు, 8 సిక్స్‌లతో ఇంగ్లీష్ 110 పరుగులు చేశాడు. 19 ఓవర్లకు ఆస్ట్రేలియా స్కోర్: 203/3, క్రీజులో స్టోయినిష్(5), టిమ్ డేవిడ్(10) ఉన్నారు. జోష్ ఇంగ్లీస్ సెంచరీ.. భారీ స్కోర్ దిశగా ఆసీస్ వైజాగ్ వేదికగా టీమిండియాతో జరుగుతున్న తొలి టీ20లో ఆసీస్ వికెట్ కీపర్ బ్యాటర్ జోష్ ఇంగ్లీష్ సెంచరీతో చెలరేగాడు. కేవలం 47 బంతుల్లో 9 ఫోర్లు, 8 సిక్స్‌లతో తన తొలి టీ20 సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. 17 ఓవర్లకు ఆసీస్ స్కోర్: 179/2 ఆసీస్ రెండో వికెట్ డౌన్.. స్మిత్ ఔట్ 161 పరుగుల వద్ద ఆస్ట్రేలియా రెండో వికెట్ కోల్పోయింది. 52 పరుగులు చేసిన స్టీవ్ స్మిత్ రనౌట్ రూపంలో పెవిలియన్‌కు చేరాడు. క్రీజులోకి స్టోయినిష్ వచ్చాడు. దంచి కొడుతున్న ఆస్ట్రేలియా బ్యాటర్లు.. ఆస్ట్రేలియా బ్యాటర్లు దంచి కొడుతున్నారు. ముఖ్యంగా ఆసీస్ వికెట్ కీపర్ బ్యాటర్ జోష్ ఇంగ్లీష్ టీమిండియా బౌలర్లకు చుక్కలు చూపిస్తున్నాడు. బౌండరీలతో బౌలర్లపై విరుచుకుపడుతున్నాడు. కేవలం 38 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్స్‌లతో 75 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నాడు. అతడితో పాటు స్టీవ్ స్మిత్(40) పరుగులతో క్రీజులో ఉన్నాడు. 14 ఓవర్లకు ఆస్ట్రేలియా స్కోర్: 130/1 దూకుడుగా ఆడుతోన్న ఇంగ్లీష్.. 9 ఓవర్లు ముగిసే సరికి ఆసీస్ వికెట్ నష్టానికి 75 పరుగులు చేసింది. క్రీజులో జోష్ ఇంగ్లీష్(37), స్టీవ్ స్మిత్(23) పరుగులతో ఉన్నారు. తొలి వికెట్ కోల్పోయిన ఆసీస్.. టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన ఆస్ట్రేలియా 31 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. 13 పరుగులు చేసిన మాథ్యూ షార్ట్‌ను రవి బిష్ణోయ్ క్లీన్ బౌల్డ్ చేశాడు. క్రీజులోకి జోష్ ఇంగ్లీష్ వచ్చాడు. 2 ఓవర్లకు ఆసీస్ స్కోర్: 20/0 టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన ఆస్ట్రేలియా 2 ఓవర్లు ముగిసే సరికి వికెట్ నష్టపోకుండా 20 పరుగులు చేసింది. క్రీజులో స్టీవ్ స్మిత్(13), మాథ్యూ షార్ట్(4) పరుగులతో ఉన్నారు. భారత్-ఆస్ట్రేలియా మధ్య టీ20 సిరీస్ సమరానికి రంగం సిద్దమైంది. ఈ సిరీస్‌లో భాగంగా విశాఖపట్నం వేదికగా తొలి టీ20లో టీమిండియా-ఆస్ట్రేలియా జట్లు తలపడతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ సిరీస్‌కు రెగ్యూలర్ కెప్టెన్ రోహిత్ శర్మ, కోహ్లి, హార్దిక్‌తో పాటు సీనియర్ ఆటగాళ్లు దూరమయ్యారు. దీంతో యువ భారత జట్టుకు సూర్యకుమార్ యాదవ్ సారథ్యం వహిస్తున్నాడు. మరోవైపు వరల్డ్ ఛాంపియన్స్ ఆస్ట్రేలియా జట్టుకు సీనియర్ ఆటగాళ్లు అందుబాటులో లేరు. ఈ సిరీస్‌లో ఆస్ట్రేలియా జట్టును వెటరన్ మాథ్యూ వేడ్ నడిపించనున్నాడు. తుది జట్లు ఆస్ట్రేలియా: మాథ్యూ వేడ్ (కెప్టెన్), జోష్ ఇంగ్లిస్, మాథ్యూ షార్ట్, నాథన్ ఎల్లిస్, సీన్ ఆంథోనీ అబాట్, స్టీవ్ స్మిత్, టిమ్ డేవిడ్, ఆరోన్ హార్డీ, జాసన్ బెహ్రెండార్ఫ్, మార్కస్ స్టోయినిస్, తన్వీర్ సంఘా భారత్: యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్ (వైస్ కెప్టెన్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), రింకు సింగ్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, ప్రసిద్ధ్ కృష్ణ, అర్ష్‌దీప్ సింగ్, ముఖేష్ కుమార్ -
ఆసీస్‌తో తొలి టీ20.. టీమిండియాలో ఎవరెవరు..?
భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా ఇవాళ (నవంబర్ 23) తొలి మ్యాచ్ జరుగనుంది. వైజాగ్ వేదికగా జరుగబోయే ఈ మ్యాచ్ రాత్రి 7 గంటల నుంచి ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌లో ఆసీస్‌పై గెలిచి వరల్డ్‌కప్ ఫైనల్లో ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకోవాలని టీమిండియా పట్టుదలగా ఉంది. ఈ సిరీస్‌లో సూర్యకుమార్ యాదవ్ టీమిండియా సారధిగా వ్యవహరించనున్నాడు. మాథ్యూ వేడ్ ఆసీస్ కెప్టెన్‌గా బరిలో ఉంటాడు. ఈ సిరీస్ కోసం భారత సెలెక్టర్లు సీనియర్లకు విశ్రాంతినిచ్చి యువ జట్టును ఎంపిక చేసిన విషయం తెలిసిందే. ఆసీస్ సైతం పలువురు రెగ్యులర్ ఆటగాళ్లకు విశ్రాంతి కల్పించింది. కెప్టెన్ పాట్ కమిన్స్, వెటరన్ ఓపెనర్ డేవిడ్ వార్నర్, పేసర్లు స్టార్క్, హాజిల్‌వుడ్, ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్ వరల్డ్‌కప్ ముగిసిన అనంతరం స్వదేశానికి వెళ్లిపోయారు. వరల్డ్‌కప్ హీరోలు ట్రవిస్ హెడ్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, ఆడమ్ జంపా జట్టులో ఉన్నప్పటికీ వారు తొలి మ్యాచ్ ఆడకపోవచ్చు. ఆసీస్ మేనేజ్మెంట్ వారికి విశ్రాంతి కల్పించవచ్చు. ఆసీస్ ఇన్నింగ్స్‌ను మాథ్యూ షార్ట్, స్టీవ్ స్మిత్ ఆరంభించే అవకాశం ఉంది. ఇతర సభ్యులుగా మ్యాథ్యూ వేడ్, జోష్ ఇంగ్లిస్, ఆరోన్ హర్డీ, మార్కస్ స్టోయినిస్, టిమ్ డేవిడ్, సీన్ అబాట్, నాథన్ ఇల్లిస్, జేసన్ బెహ్రన్‌డార్ఫ్, తన్వీర్ సంగా బరిలోకి దిగే అవకాశం ఉంది. టీమిండియా విషయానికొస్తే.. ఓపెనింగ్ విషయంలో తీవ్ర పోటీ నెలకొంది. యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్‌లలో ఎవరికి అవకాశం ఇస్తారో వేచి చూడాలి. ఇషాన్ కిషన్‌తో పాటు వీరిద్దరిలో ఎవరో ఒకరు బరిలోకి దిగుతారు. వన్‌డౌన్‌లో తిలక్ వర్మ, ఆ తర్వాత సూర్యకుమార్ యాదవ్, రింకూ సింగ్, శివమ్ దూబే, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, ఆర్షదీప్ సింగ్, ప్రసిద్ద్ కృష్ణ, ముకేశ్ కుమార్ బరిలోకి దిగుతారు. అదనపు బ్యాటర్‌తో బరిలోకి దిగాలనుకుంటే ఓ పేసర్ బదులు రుతురాజ్, యశస్విలలో ఎవరో ఒకరు బరిలోకి దిగుతారు. -
భారత్-ఆసీస్ తొలి టీ20.. వైజాగ్‌లో వాతావరణ పరిస్థితి ఏంటి..?
ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా వైజాగ్‌లోని వైఎస్సార్ ఏసీఏ–వీడీసీఏ స్టేడియం వేదికగా ఇవాళ భారత్-ఆస్ట్రేలియా మధ్య తొలి మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్ రాత్రి ఏడు గంటలకు ప్రారంభం కావాల్సి ఉంది. అయితే వైజాగ్‌లో ప్రస్తుత వాతావరణ పరిస్థితి కొంత ఆందోళనకరంగా ఉండటంతో మ్యాచ్‌పై నీలినీడలు కమ్ముకున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనాల కారణంగా వైజాగ్‌లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మ్యాచ్ జరిగే సమయానికి వర్షం పడే అవకాశాలు ఉండటంతో టాస్ ఆలస్యమవ్వవచ్చని స్థానికులు అంటున్నారు. వర్షం కారణంగా మ్యాచ్ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయే ప్రమాదమేమీ లేనప్పటికీ, ప్రస్తుత వాతావరణ పరిస్థితి మాత్రం కాస్త ఆందోళనకరంగానే ఉన్నట్లు సమాచారం. కాగా, భారత సెలెక్టర్లు ప్రధాన ఆటగాళ్లకంతా విశ్రాంతినివ్వడంతో ఈ సిరీస్‌లో యువ జట్టు బరిలోకి దిగనుంది. ఈ జట్టుకు సూర్యకుమార్ యాదవ్ నాయకత్వం వహించనున్నాడు. వరల్డ్‌కప్ ఫైనల్లో ఎదురైన పరాభవం నుంచి ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న భారత క్రికెటర్లు.. వైజాగ్ టీ20లో ఆసీస్‌ను మట్టికరిపించాలని పట్టుదలగా ఉన్నారు. ఈ సిరీస్ కోసం ఆసీస్ సైతం కొందరు ప్రధాన ఆటగాళ్లకు విశ్రాంతి కల్పించింది. వరల్డ్‌కప్ అనంతరం కెప్టెన్ పాట్ కమిన్స్, వెటరన్ డేవిడ్ వార్నర్, పేసర్లు స్టార్క్, హాజిల్‌వుడ్, ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్ స్వదేశానికి వెళ్లిపోయారు. ఈ సిరీస్‌లో మాథ్యూ వేడ్ ఆస్ట్రేలియా కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. తొలి మ్యాచ్‌కు మ్యాక్స్‌వెల్, ట్రవిస్ హెడ్, ఆడమ్ జంపా దూరంగా ఉండనున్నారని సమాచారం. తుది జట్లు (అంచనా).. భారత్: సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్ ), ఇషాన్ కిషన్, యశస్వి/రుతురాజ్, తిలక్ వర్మ, శివమ్ దూబే, రింకూ సింగ్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, అర్షదీప్ సింగ్, ప్రసిధ్ కృష్ణ, ముకేశ్ కుమార్. ఆస్ట్రేలియా: మాథ్యూ వేడ్ (కెప్టెన్ ), స్మిత్, షార్ట్, హార్డీ, ఇన్‌గ్లిస్, స్టొయినిస్, టిమ్ డేవిడ్, సీన్ అబాట్, ఎలిస్, బెహ్రన్‌డార్ఫ్, తన్విర్ సంఘా. -
IND VS AUS 1st T20: మనదే పైచేయి.. విశాఖలోనూ మనోళ్లే..!
భారత్-ఆస్ట్రేలియా మధ్య ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా ఇవాళ (నవంబర్ 23) తొలి మ్యాచ్ జరుగనుంది. వైజాగ్ వేదికగా జరుగబోయే ఈ మ్యాచ్ రాత్రి 7 గంటల నుంచి ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌లో ఆసీస్‌పై గెలిచి వరల్డ్‌కప్ ఫైనల్లో ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకోవాలని టీమిండియా పట్టుదలగా ఉంది. ఈ సిరీస్‌లో సూర్యకుమార్ యాదవ్ టీమిండియా సారధిగా వ్యవహరించనున్నాడు. ఈ సిరీస్ కోసం భారత సెలెక్టర్లు సీనియర్లకు విశ్రాంతినిచ్చి యువ జట్టును ఎంపిక చేశారు. ఆసీస్ సైతం వారి కెప్టెన్ పాట్ కమిన్స్, వెటరన్ ఓపెనర్ డేవిడ్ వార్నర్‌లకు విశ్రాంతి కల్పించింది. వరల్డ్‌కప్ ఫైనల్ హీరో ట్రవిస్ హెడ్ జట్టులో ఉన్నప్పటికీ తొలి టీ20కి ఆడే అవకాశం లేదు. అతనితో పాటు మ్యాక్స్‌వెల్, ఆడమ్ జంపా విశ్రాంతి తీసుకోనున్నట్లు తెలుస్తుంది. ఆసీస్ తమ రిజర్వ్ బెంచ్ ఆటగాళ్లను తొలి మ్యాచ్‌లో అడించే అవకాశం ఉంది. సీనియర్లకు విశ్రాంతి కల్పించినప్పటికీ టీమిండియా ఆసీస్‌తో పోలిస్తే పటిష్టంగా కనిపిస్తుంది. కెప్టెన్ స్కై, ఇషాన్ కిషన్, యశస్వి, తిలక్ వర్మ, శివమ్ దూబే, రింకూ సింగ్ లాంటి విధ్వంసకర ఆటగాళ్లతో భారత బ్యాటింగ్ చాలా పటిష్టంగా ఉంది. అక్షర్, బిష్ణోయ్‌లతో భారత స్పిన్ విభాగం పటిష్టంగా కనిపిస్తుంది. ఆర్షదీప్, ప్రసిద్ద్, ముకేశ్ కుమార్‌లతో కూడిన పేస్ విభాగమే కాస్త వీక్‌గా ఉంది. మనదే పైచేయి.. ఇరు జట్ల మధ్య జరిగిన టీ20ల తీరును పరిశీలిస్తే.. ఆసీస్‌పై భారత్ స్పష్టమైన ఆధిక్యత కలిగి ఉందని తెలిస్తుంది. ఈ రెండు జట్లు ఇప్పటివరకు 26 టీ20ల్లో ఎదురెదురుపడగా.. భారత్ 15, ఆసీస్ 10 మ్యాచ్‌ల్లో గెలిచాయి. ఓ మ్యాచ్ రద్దైంది. స్వదేశంలో ఆస్ట్రేలియాతో 10 మ్యాచ్‌లు ఆడగా భారత్ 6 మ్యాచ్‌ల్లో గెలిచి, 4 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. విశాఖలోనూ మనోళ్లే..! విశాఖపట్నంలో టీమిండియా ఇప్పటి వరకు మూడు అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లు ఆడగా రెండింటిలో (2016లో శ్రీలంకపై, 2022లో దక్షిణాఫ్రికాపై) గెలిచి, ఓ మ్యాచ్‌లో (2019లో ఆ్రస్టేలియా) ఓటమిపాలైంది. -
నిస్వార్ధంగా, నిర్భయంగా ఆడండి.. వ్యక్తిగత మైలురాళ్లను ఇష్టపడే వ్యక్తిని కాదు..!
వైజాగ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగే తొలి టీ20 ముందు టీమిండియా కొత్త కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మీడియాతో మాట్లాడాడు. ఈ సందర్భంగా అతను వరల్డ్‌కప్ అనుభవాలను పంచుకున్నాడు. ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోవడం బాధాకరమని అన్నాడు. వరల్డ్‌కప్‌లో తమ ప్రయాణం అద్భుతంగా సాగిందని తెలిపాడు. ఫైనల్లో ఓడినప్పటికీ తమ ప్రదర్శన యావత్ భారత దేశానికి గర్వకారణంగా నిలిచిందని పేర్కొన్నాడు. పైనల్లో ఎదురైన చేదు అనుభవాన్ని మరచిపోయి ముందుకు సాగాలని అనుకుంటున్నామన్నాడు. వరల్డ్‌కప్‌లో రోహిత్ శర్మ టీమిండియాను అద్భుతంగా ముందుండి నడిపించాడని కితాబునిచ్చాడు. హిట్‌మ్యాన్ కెప్టెన్సీపై ప్రశంసల వర్షం కురిపించాడు. వన్డే వరల్డ్ ఛాంపియన్లను ఢీకొట్టేందుకు కుర్రాళ్లు ఉత్సాహంగా ఉన్నారని తెలిపాడు. రోహిత్ లాగే తాను కూడా జట్టుకు ఉపయోగపడే సాహసోపేత నిర్ణయాలు తీసుకుంటానని వివరించాడు. వ్యక్తిగతంగా మైలురాళ్లను ఇష్టపడే వ్యక్తిని కాదని పేర్కొన్నాడు. సిరీస్ యొక్క ప్రాముఖ్యతను వివరిస్తూ.. వచ్చే ఏడాది జరుగబోయే టీ20 వరల్డ్‌కప్ దృష్ట్యా ఈ సిరీస్ చాలా కీలకమని తెలిపాడు. నిర్భయంగా, నిస్వార్ధంగా, జట్టు ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని ఆడమని సభ్యులతో చెప్పానని అన్నాడు. ఇటీవలికాలంలో జరిగిన దేశవాళీ టోర్నీల్లో, ఐపీఎల్లో వారు అదే చేశారని తెలిపాడు. కాగా, వైజాగ్ వేదికగా ఇవాళ రాత్రి 7 గంటలకు భారత్-ఆసీస్ మధ్య తొలి ట20 జరుగనున్న విషయం తెలిసిందే. తుది జట్లు (అంచనా) భారత్: సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్ ), ఇషాన్ కిషన్, యశస్వి/రుతురాజ్, తిలక్ వర్మ, శివమ్ దూబే, రింకూ సింగ్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, అర్షదీప్ సింగ్, ప్రసిధ్ కృష్ణ, ముకేశ్ కుమార్. ఆస్ట్రేలియా: మాథ్యూ వేడ్ (కెప్టెన్ ), స్మిత్, షార్ట్, హార్డీ, ఇన్‌గ్లిస్, స్టొయినిస్, టిమ్ డేవిడ్, సీన్ అబాట్, ఎలిస్, బెహ్రన్‌డార్ఫ్, తన్విర్ సంఘా. -
ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్.. టీమిండియా కెప్టెన్‌గా విధ్వంసకర ఆటగాడు!
వన్డే ప్రపంచకప్-2023 ముగిసిన తర్వాత సొంతగడ్డపై ఆస్ట్రేలియాతో ఐదు టీ20ల సిరీస్‌లో టీమిండియా తలపడనుంది. నవంబర్ 23న విశాఖపట్నం వేదికగా జరగనున్న తొలి టీ20తో ఈ సిరీస్ ప్రారంభం కానుంది. కాగా ఈ సిరీస్‌కు రెగ్యూలర్ కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్, బుమ్రా, షమీ, సిరాజ్‌లకు సెలక్టర్లు విశ్రాంతి ఇవ్వాలని భావిస్తున్నట్లు సమాచారం. మరోవైపు చీలమండ గాయంతో వరల్డ్‌కప్ నుంచి మధ్యలోనే తప్పుకున్న భారత వైస్ కెప్టెన్, స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా కూడా కంగారూలతో సిరీస్ దూరం కానున్నట్లు తెలుస్తోంది. కాగా గత కొన్ని సిరీస్‌ల నుంచి రోహిత్ గైర్హజరీలో భారత సారధిగా హార్దిక్ పాండ్యనే వ్యవహరిస్తున్నాడు. అయితే ఇప్పుడు హార్దిక్ కూడా దూరమయ్యే సూచనలు కన్పిస్తుండడంతో.. ఆసీస్ సిరీస్‌లో టీమిండియా కెప్టెన్సీ పగ్గాలు విధ్వంసకర ఆటగాడు సూర్యకుమార్ యాదవ్‌కు అప్పజెప్పాలని సెలక్షన్ కమిటీ ఆలోచిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. సూర్యకు డిప్యూటీగా యువ ఓపెనర్ రుత్‌రాజ్ గైక్వాడ్‌ను నియమించనున్నట్లు వినికిడి. అదే విధంగా ఈ సిరీస్‌కు భారత జట్టులో తిలక్ వర్మ, జైశ్వాల్, జితేష్ శర్మ వంటి యువ ఆటగాళ్లకు చోటుదక్కే అవకాశం ఉంది. చదవండి: CWC 2023: శ్రీలంకకు మరో భారీ షాక్! ఘోర పరాభవంతో నిష్క్రమణ.. అదొక్కటేనా?