PC: IPL.com
ఐపీఎల్-2024లో భాగంగా వాంఖడే వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ విధ్వంసం సృష్టించాడు. ఈ ఏడాది సీజన్‌లో రెండో మ్యాచ్ ఆడిన సూర్యకుమార్.. ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఫస్ట్ డౌన్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన సూర్య ఆర్సీబీ బౌలర్లకు చుక్కలు చూపించాడు.
గ్రౌండ్ నలుమూలల షాట్లు ఆడుతూ బౌలర్లకు చమెటలు పట్టించాడు. ఈ క్రమంలో కేవలం 17 బంతుల్లోనే తన హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. ఓవరాల్‌గా 19 బంతులు ఎదుర్కొన్న సూర్యకుమార్.. 5 ఫోర్లు, 4 సిక్స్‌లతో 52 పరుగులు చేశాడు. ఈ క్రమంలో గాయం నుంచి కోలుకుని అద్బుత ఇన్నింగ్స్ ఆడిన సూర్యకుమార్‌పై భారత మాజీ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ప్రశంసల వర్షం కురిపించాడు. సూర్య అతను దక్షిణాఫ్రికా దిగ్గజం ఏబీ డివిలియర్స్‌కు బెటర్ వెర్షన్ భజ్జీ కొనియాడాడు.
"సూర్యకుమార్ లాంటి ఆటగాడిని ఇప్పటివరకు నేను చూడలేదు. అతడి బౌలర్లను ఎటాక్ చేసే విధానం నమ్మశక్యం కానిది. అతడికి బౌలర్లకు ఎక్కడ బౌలింగ్ చేయాలో ఆర్ధం కాక తలలపట్టుకుంటున్నారు. ఒకవేళ నేను ఆడిన కూడా సూర్యకి బౌలింగ్ చేసేందుకు భయపడేవాడిని. సూర్య వేరే గ్రహంపై ఆడుతున్నట్లు ఉంది.
సూర్యకుమార్ యాదవ్ చెలరేగితే ఆపడం ఎవరి తరం కాదు. ఇంతకముందు అందరూ ఏబీ డివిలియర్స్ గురించి మాట్లాడునుకోవారు. కానీ సూర్య తన ఆటతీరుతో ఏబీడీని మయమరిపిస్తున్నాడు. డివిలియర్స్ కంటే సూర్య డెంజరస్ ఆటగాడని నేను భావిస్తున్నాను. టీ20 ఫార్మాట్‌లో ప్రస్తుత తరం క్రికెటర్లలో సూర్యనే అత్యుత్తమ ఆటగాడని" స్టార్‌స్పోర్ట్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో భజ్జీ పేర్కొన్నాడు.
చదవండి: రోహిత్‌ను టీజ్ చేసిన కోహ్లి.. హిట్‌మ్యాన్ రియాక్షన్ వైరల్
Comments
Please login to add a commentAdd a comment