Surya Kumar Yadav: కొడితే కెమెరా పగలిపోయింది..! | IPL 2024, MI vs CSK: Suryakumar Yadav Breaks Camera In Practice Session - Sakshi

Surya Kumar Yadav: కొడితే కెమెరా పగలిపోయింది..!

Apr 14 2024 11:44 AM | Updated on Apr 14 2024 11:50 AM

IPL 2024 MI VS CSK: Suryakumar Yadav Broke A Camera In Practice Session - Sakshi

ఐపీఎల్‌లో ఇవాళ (ఏప్రిల్‌ 14) రాత్రి బిగ్‌ ఫైట్‌ జరుగనుంది. చెరి ఐదు సార్లు ఛాంపియన్లైన ముంబై ఇండియన్స్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌ అమీతుమీ తేల్చుకోనున్నాయి. ముంబై ఇండియన్స్‌ హోం గ్రౌండ్‌ అయిన వాంఖడే మైదానంలో ఈ మ్యాచ్‌ జరుగనుంది. క్రికెట్‌ ఎల్‌ క్లాసికోగా పిలువబడే ఈ మ్యాచ్‌పై భారీ అంచనాలు ఉన్నాయి. ధోని, రోహిత్‌ మెరుపులు చూసేందుకు అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రాత్రి 7:30 గంటలకు ప్రారంభమయ్యే ఈ రసవత్తర సమరంలో పైచేయి ఎవరిదో వేచి చూడాలి. 

ఈ మ్యాచ్‌ కోసం ఇరు జట్ల ఆటగాళ్లు ప్రత్యేకంగా సాధన చేస్తున్నారు. భారీ అంచనాలు ఉండటంతో ఇరు జట్ల ఆటగాళ్లు ప్రాక్టీస్‌ సెషన్స్‌లో కఠోరంగా శ్రమిస్తున్నారు. ముంబై ఇండియన్స్‌ విధ్వంసకర వీరుడు సూర్యకుమార్‌ అందరికంటే ఎక్కువగా నెట్స్‌లో టైమ్‌ స్పెండ్‌ చేశాడు.స్కై నిన్న అంతా బ్రేక్‌ లేకుండా పా​క్టీస్‌లో పాల్గొన్నాడు. ప్రాక్టీస్‌ చేసే క్రమంలో స్కై ఓ కెమెరాను పగలగొట్టాడు. 

నెట్స్‌లో సాధన చేస్తుండగా.. డిఫెన్స్‌ షాట్‌ అడినప్పటికీ స్కై పక్కనే ఉన్న కెమెరా తునాతునకలైంది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతుంది. డిఫెన్స్‌ ఆడితేనే ఇలా అయితే స్కై భారీ షాట్‌ కొడితే పరిస్థితి ఏంటని అభిమానులు చర్చించుకుంటున్నారు. చాలాకాలం తర్వాత ఇటీవలే రీఎంట్రీ ఇచ్చిన స్కై.. ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగాడు.

ఈ మ్యాచ్‌లో 19 బంతులు ఎదుర్కొన్న స్కై..  5 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 52 పరుగులు చేశాడు. ఈ మెరుపు ఇన్నింగ్స్‌ నేపథ్యంలో నేటి మ్యాచ్‌లోనూ సూర్యపై భారీ అంచనాలు ఉన్నాయి. స్కై నుంచి అభిమానలు మరో సుడిగాలి ఇన్నింగ్స్‌ ఆశిస్తున్నారు.

నేటి మ్యాచ్‌లో స్కైతో పాటు రోహిత్‌ శర్మపై కూడా అభిమానులు ఓ కన్నేసి ఉంచారు. ఈ సీజన్‌లో హిట్‌మ్యాన్‌ పెద్ద స్కోర్లు చేయనప్పటికీ జట్టుకు మెరుపు ఆరంభాలు ఇచ్చాడు. రోహిత్‌, స్కై చెలరేగితే నేటి మ్యాచ్‌లో సీఎస్‌కేకు కష్టాలు తప్పకపోవచ్చు. సీఎస్‌కేలోనూ స్కై లాంటి మెరుపు వీరులు చాలామంది ఉన్నారు. ధోని, శివమ్‌ దూబే, రచిన్‌ రవీంద్రపై ఆ జట్టు అభిమానులు గంపెడాశలు పెట్టుకున్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement