మైదానంలో ఉన్నంత సేపు ప్రత్యర్థులు.. ఒక్కసారి ఆట ముగియగానే స్నేహితులు.. దాదాపు క్రీడాకారులంతా ఇలాగే ఉంటారు. ముఖ్యంగా లీగ్ క్రికెట్‌లో ఇలాంటి దృశ్యాలు ఎక్కువగా కనబడుతూ ఉంటాయి.
ఐపీఎల్-2024లో భాగంగా సోమవారం ముంబై ఇండియన్స్- సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య మ్యాచ్ సందర్భంగా ఇలాంటి దృశ్యం ఆవిష్కృతమైంది. సన్‌రైజర్స్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్, ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా, విధ్వంసకర బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్‌తో ముచ్చటించాడు.
పరస్పరం ఆప్యాయంగా పలకరించుకుని ముచ్చట్లలో మునిగిపోయిన వేళ.. కమిన్స్ తన వేలి గాయం గురించి పాండ్యా, సూర్యలకు చెప్పాడు. తన కుడిచేతి మధ్యవేలు ముందరి భాగం చిన్నప్పుడే విరిగిపోయిందని కమిన్స్ చెప్పగానే వాళ్లిద్దరు ఆశ్చర్యంతో నోరెళ్లబెట్టారు.
ముఖ్యంగా హార్దిక్ పాండ్యా అయితే.. ‘‘అయ్యె అవునా?’’ అన్నట్లుగా షాకింగ్ రియాక్షన్ ఇచ్చాడు. సాటి ఫాస్ట్ బౌలర్‌గా కమిన్స్ కష్టాన్ని తెలుసుకుని సానుభూతి వ్యక్తం చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
కాగా రైటార్మ్ పేసర్ అయిన ప్యాట్ కమిన్స్ 2011లో అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టాడు. ఈ సందర్భంగా.. ‘‘నాకు నాలుగేళ్ల వయసున్నపుడు.. డోర్ మధ్య వేలు ఇరుక్కోవడంతో పైభాగంలో సెంటీమీటర్ మేర విరిగిపోయింది. అయినా.. నా బౌలింగ్ యాక్షన్‌పై ఎలాంటి ప్రభావం పడలేదు.
ఎందుకంటే నా వేళ్లు అన్నీ దాదాపుగా ఒకే లెంగ్త్‌తో ఉంటాయి. ఈ విషయంలో ఇప్పటికీ నా సోదరి బాధపడుతూనే ఉంటుంది. ఎందుకంటే తనే డోర్ వేసింది’’ అని కమిన్స్ తెలిపాడు. అదన్న మాట సంగతి!
ఇక మ్యాచ్ విషయానికొస్తే.. సోమవారం నాటి మ్యాచ్‌లో ముంబై సన్‌రైజర్స్‌ను ఓడించింది. సూర్యకుమార్ యాదవ్ వీరోచిత అజేయ శతకం(51 బంతుల్లో 102)తో రాణించి ముంబై ఇండియన్స్‌ను గెలిపించాడు.
ఈ మ్యాచ్‌లో కమిన్స్ బ్యాట్(17 బంతుల్లో 35)తో రాణించడమే గాక ఒక వికెట్ కూడా తీశాడు. మరోవైపు హార్దిక్ పాండ్యా మూడు కీలక వికెట్లు తీసి సన్‌రైజర్స్ ఓటమిలో సూర్యతో పాటు తానూ కీలక పాత్ర పోషించాడు.
చదవండి: T20 WC: ద్రవిడ్, రోహిత్‌కు నచ్చకపోవచ్చు.. కానీ నా సలహా ఇదే!
Pat Cummins must be telling about how he lost the top of his middle finger on his dominant right hand when his sister accidentally slammed a door on it. Hardik's reaction 😱 pic.twitter.com/oinHeW99mn
— 𝗔𝗱𝗶𝘁𝘆𝗔 (@StarkAditya_) May 7, 2024
Comments
Please login to add a commentAdd a comment