sunrisers hyderabad
-
IPL 2025: తెలుగు సినిమా అభిమానిని.. తగ్గేదేలేదు: నితీష్ రెడ్డి
సాక్షి, సిటీబ్యూరో: సచిన్ టెండూల్కర్, రిషబ్ పంత్ తర్వాత ఆ్రస్టేలియాలో శతకం సాధించిన మూడో అత్యంత పిన్న వయస్కుడిగా తెలుగు క్రికెటర్ నితీష్ కుమార్ రెడ్డి చరిత్రలో నిలిచాడు. ఆ మ్యాచ్‌కు ముందు విరాట్ కోహ్లీ తనకు కానుకగా ఇచ్చిన షూతో ఆడి సెంచరీ చేశానని నితీష్ వెల్లడించాడు. ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ సీజన్లో హైదరాబాద్ జట్టు సన్ రైజర్స్ ఆల్‌రౌండర్‌గా నితీష్ కుమార్ రెడ్డి ఆడుతున్నాడు. ఈ నేపథ్యంలో తను బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న ప్యూమా ఇండియా ఆధ్వర్యంలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో తన క్రికెట్ అనుభవాలను పంచుకున్నాడు. విరాట్ కోహ్లీ ఇచ్చిన ప్రత్యేక బహుమతి మొదలు తన మొదటి టెస్ట్ అర్ధ శతకం తరువాత వేసిన పుష్పా స్టెప్ వరకూ నితీష్ పంచుకున్న అనుభవాలు ఆయన మాటల్లోనే.. కోహ్లీ షూ కోసం అబద్దం చెప్పాను.. ‘డ్రెస్సింగ్ రూమ్‌లో కోహ్లీ.. సర్ఫరాజ్ ఖాన్ వద్దకు వచ్చి ‘సర్ఫూ, నీ షూ సైజ్ ఎంత?’ అని అడగ్గా.. తను ‘తొమ్మిది’ అని చెప్పాడు. తర్వాత నన్ను చూసి షూ నంబర్ ఎంత అన్నాడు. ఆ క్షణం ఎలాగైనా నా ఫేవరెట్ కోహ్లీ బూట్లు పొందాలనే ఆశతో నా సైజ్ కాకుండా ‘పది’ అని చెప్పాను. వెంటనే కోహ్లీ వాటిని నాకు ఇచ్చాడు. తదుపరి మ్యాచ్‌లో ఆ షూస్ వేసుకుని సెంచరీ కొట్టాను. ఆ జ్ఞాపకం ఎప్పటికీ మర్చిపోలేను. 21 ఏళ్ల వయస్సులో మొదటి టెస్ట్ అర్ధ శతకాన్ని చేసిన తరుణంలో ఆ సంతోషాన్ని పుష్పా సినిమా తగ్గేదెలే అనే స్టయిల్లో సెలబ్రేట్ చేసుకున్నాను. ‘నేను తెలుగు సినిమా అభిమాని.. నేను తెలుగు వాడిని కాబట్టి టాలీవుడ్ అభిమానులు ఆనందించేలా సెలబ్రేట్ చేసుకున్నాను. తర్వాతి మ్యాచ్‌లలో కూడా మరికొన్ని సినిమా సెలబ్రేషన్స్ ప్లాన్ చేసుకున్నాను.నా విజయంలో మామయ్య త్యాగం.. నా క్రికెట్ ప్రయాణంలో కుటుంబ ప్రాముఖ్యత ప్రధానమైనది. ఆర్థిక పరిస్థితులు అనుకూలించకపోయినా.. మా మామయ్య అండగా నిలిచాడు. ‘ఆర్థిక సమస్యల కారణంగా మా నాన్న నాకు స్పైక్ షూస్, క్రికెట్ బ్యాట్ కొనలేని సందర్భాల్లో మామయ్య తన తక్కువ జీతంలోనే నేను కోరుకున్న విరాట్ కోహ్లీ ధరించే షూస్ కొనిచ్చాడు. ఆ బూట్లు వేసుకుని మైదానంలో కోహ్లీలా ఫీలయ్యేవాడిని. అలాంటిది 2024లో ప్యూమా ఇండియా బ్రాండ్ అంబాసిడర్‌గా మారడం గర్వంగా ఉంది. పాడ్‌కాస్ట్‌లో మామయ్యకు వీడియో కాల్ చేసి, ప్యూమా షూస్ గిఫ్ట్‌గా ఇస్తున్నట్టు తెలిపాను. ఆయన చేసిన త్యాగం తీర్చలేనిది.. ఇది ఆయనను సంతోషపెట్టడానికి నా చిన్న ప్రయత్నం.కాగా, గత సీజన్ రన్నరప్ అయిన సన్‌రైజర్స్ హైదరాబాద్ ఈ సీజన్‌ను మెరుపు విజయంతో ప్రారంభించింది. సొంత మైదానంలో రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆరెంజ్ ఆర్మీ 44 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ ఇషాన్ కిషన్ సుడిగాలి సెంచరీతో విరుచుకుపడటంతో 286 పరుగుల రికార్డు స్కోర్ చేసింది. సన్‌రైజర్స్ భారీ స్కోర్‌లో నితీశ్ కూడా భాగమయ్యాడు. 15 బంతుల్లో 4 ఫోర్లు, సిక్సర్ సాయంతో 30 పరుగులు చేశాడు. దాదాపుగా అసాధ్యమైన లక్ష్యం కావడంతో రాయల్స్ ఛేదనలో తడబడింది. అయినా ఆ జట్టు అద్భుతంగా పోరాడి 20 ఓవర్లలో 242 పరుగులు చేయగలిగింది. సంజూ శాంసన్, దృవ్ జురెల్ మెరుపు అర్ద సెంచరీలతో పోరాడారు. సన్‌రైజర్స్ తమ తదుపరి మ్యాచ్‌ను లక్నో సూపర్ జెయింట్స్‌తో ఆడుతుంది. ఈ మ్యాచ్ మార్చి 27న హైదరాబాద్‌లోనే జరుగనుంది. -
జట్టు స్వరూపమే మారిపోయింది.. కావ్యా మారన్‌కు ఇంతకంటే ఏం కావాలి?
గత సీజన్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు లో కొన్ని కీలక మార్పులు చేసింది. అందులో మొదటిది ఆస్ట్రేలియా ప్రస్తుత కెప్టెన్, పేస్ బౌలర్ పాట్ కమిన్స్ (Pat Cummins)కి నాయకత్వ బాధ్యతలను అప్పగించడం.. రెండోది ఆస్ట్రేలియాకే చెందిన ఓపెనర్, టీమిండియాకు ‘తలనొప్పి’ తెప్పించే ట్రావిస్ హెడ్ (Travis Head)ని అభిషేక్ శర్మకి జతగా ఓపెనింగ్‌కి పంపాలని నిర్ణయించడం. ఈ రెండు నిర్ణయాలు సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు స్వరూపాన్నే మార్చేశాయి.పవర్ ప్లే అంటే ప్రత్యర్థికి దడేఅంతవరకూ ఎప్పుడూ విజయం కోసం ఎదురు చూసిన జట్టు.. ఇప్పుడు ప్రత్యర్థులను భయపెట్టే స్థాయికి చేరిపోయింది. మ్యాచ్ తొలి ఓవర్లలో, ముఖ్యంగా పవర్ ప్లే లో ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మల ద్వయం ప్రత్యర్థి బౌలర్ల పై విరుచుకుపడి విధ్వంసకర బ్యాటింగ్ తో వారి రిథమ్‌ని దెబ్బతీశారు. ఫలితంగా పరుగుల వెల్లువ ప్రవహించింది. వీరిద్దరూ ఐపీఎల్ అత్యధిక స్కోర్ రికార్డులను తిరగరాశారు. ఈ ఫార్ములా అద్భుతంగా పనిచేసింది. గత సంవత్సరం ఫైనల్ లో కోల్‌కతా నైట్ రైడర్స్ చేతిలో పరాజయం పాలైనప్పటికీ.. సన్‌రైజర్స్ హైదరాబాద్ టైటిల్‌కు చేరువగా రావడంలో బ్యాటర్లదే కీలక పాత్ర.సన్‌రైజర్స్ ఫార్ములాకి అప్‌గ్రేడ్ కిషన్ఇంత అద్భుత ఫలితాల్నిచ్చిన ఫార్ములాను సన్‌రైజర్స్ హైదరాబాద్ వదులుకుఉంటుందా? అందుకే అదే ఫార్ములాను అప్‌గ్రేడ్ చేసింది. భారత్ జట్టులో స్థానం కోల్పోయి అవకాశం కోసం ఎదురు చేస్తున్న ఇషాన్ కిషన్ ని మునుపటి నంబర్ 3 బ్యాటర్ రాహుల్ త్రిపాఠి స్థానం లో తీసుకొచ్చింది. ఈ నేపధ్యం లో సొంతగడ్డ పై సన్‌రైజర్స్ హైదరాబాద్ తన సత్తా మరోసారి ప్రదర్శించింది.ఇందుకు రాజస్థాన్ రాయల్స్ కూడా సన్‌రైజర్స్ కి తన వంతు సహకారం అందించింది. ఎందుకంటే అలాంటి ఊపు మీదున్న సన్‌రైజర్స్ బ్యాట్స్‌మన్ కి టాస్ గెలిచినప్పటికీ ముందుగా బ్యాటింగ్ కి ఆహ్వానించడం రాయల్స్ చేసిన పెద్ద తప్పిదనం. ఇందుకు భారీ మూల్యమే చెల్లించాల్సివచ్చింది.రాయల్స్ కొంపముంచిన టాస్రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ టాస్ గెలిచి మొదట బౌలింగ్ ఎంచుకున్న తర్వాత సన్‌రైజర్స్ బ్యాటర్లు ఆ జట్టు బౌలర్ల పై విరుచుకు పడ్డారు. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ మొదటి ఆరు ఓవర్లలో 94 పరుగులు చేయడంతో స్కోర్ రాకెట్ వేగంతో ముందుకు పోయింది. వీరిద్దరి నిష్క్రమణ తర్వాత ఇషాన్ కిషన్ నంబర్ 3 స్థానంలో బ్యాటింగ్ కి వచ్చి అదే ఊపును కొనసాగించాడు.గతంలో ముంబై ఇండియన్స్ కి ప్రాతినిధ్యం వహించిన కిషన్ 47 బంతుల్లో 11 బౌండరీలు, ఆరు సిక్సర్లుతో అజేయంగా నిలిచి 106 పరుగులు చేశాడు. ఇషాన్ కిషన్ కి ఐపీఎల్ లో ఇది మొదటి సెంచరీ. ఫలితంగా సన్‌రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 286 పరుగులు చేసి మరోసారి సత్తా చాటింది. గత సంవత్సరం బెంగళూరు లోని చిన్నస్వామి స్టేడియంలో బెంగుళూరు తో జరిగిన మ్యాచ్ లో 5 వికెట్ల నష్టానికి 287 పరుగుల ఐపీఎల్ స్కోర్ ని ఒక్క పరుగుతో వెనుక పడింది.చివరి వరకూ పోరాడిన రాయల్స్ఇంత అత్యధిక లక్ష్యాన్ని సాధించడం ఏ జట్టుకైనా కష్టమే. అయితే నిజానికి రాయల్స్ చివరి వరకూ పోరాడింది. ప్రారంభంలోనే భారత్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ మరియు కెప్టెన్ రియాన్ పరాగ్‌ల వికెట్లను కోల్పోయినప్పటికీ తన పోరాటాన్ని కొనసాగించింది. ఇద్దరు వికెట్ కీపర్ బ్యాట్సమన్ సంజు సామ్సన్, మరియు ధ్రువ్ జురెల్ రాయల్స్‌ను జట్టుకి ఆత్మవిశ్వాసం కలిగించే రీతిలో ఆడారు.నాల్గవ వికెట్‌కు వారిద్దరు 111 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. సామ్సన్ 66 పరుగులు చేయగా, జురెల్ 70 పరుగులు చేశాడు. చివర్లో షిమ్రాన్ హెట్‌మైర్, శుభం దూబే వచ్చి స్కోర్ ని పరుగు పెట్టించినప్పటికీ ఫలితం లేకపోయింది. హెట్‌మైర్ 44 పరుగులు సాధించగా దూబే 32 పరుగులు చేయడంతో రాయల్స్ స్కోర్ ఆరు వికెట్ల నష్టానికి 242 కి చేరింది. కావ్యా మారన్ కళ్లలో ఆనందంఈ మ్యాచ్ లో చివరికి రాయల్స్ 44 పరుగుల తేడాతో పరాజయం చవిచూసినప్పటికీ ముందు జరిగే మ్యాచ్ లకు కొండంత ఆత్మ విశ్వాసాన్నిచిదనడంలో సందేహంలేదు. ఇక క్లాసెన్, ఇషాన్ కిషన్ ప్ర్యతర్థి జట్టు బౌలింగ్‌ను చితక్కొడుతుంటే.. రైజర్స్ జట్టు యజమాని కావ్యా మారన్ పలికించిన హావభావాలు, భావోద్వేగానికి గురైన తీరు జట్టు ప్రదర్శన పట్ల ఆమె ఎంత సంతోషంగా ఉన్నారో చెప్పేందుకు నిదర్శనాలుగా నిలిచాయనడంలో అతిశయోక్తి లేదు.చదవండి: మా వాళ్లకు అస్సలు బౌలింగ్ చేయను.. అతడొక అసాధారణ బ్యాటర్: కమిన్స్An epic run-fest goes the way of @SunRisers 🧡The Pat Cummins-led side registers a 4️⃣4️⃣-run win over Rajasthan Royals 👏Scorecard ▶ https://t.co/ltVZAvInEG#TATAIPL | #SRHvRR pic.twitter.com/kjCtGW8NdV— IndianPremierLeague (@IPL) March 23, 2025 -
ఇ'షాన్‌దార్' రైజర్స్
తొలి 42 బంతుల్లో 100 పరుగులు... 87 బంతుల్లో 200 పరుగులు... ఇక మిగిలింది 300 లక్ష్యమే... ఐపీఎల్లో 300 పరుగులు సాధ్యమా అనే ప్రశ్నకు జవాబిచ్చేలా ఆడిన సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు దానిని ఈసారి అందుకోలేకపోయినా దాదాపు చేరువగా వచ్చిoది. తమ అత్యధిక టీమ్ స్కోరుకు ఒక పరుగు మాత్రమే తక్కువ చేసి ఐపీఎల్ టోర్నీ చరిత్రలో రెండో అత్యధిక స్కోరును తమ పేరిటే లిఖించుకుంది. మారింది సీజన్ మాత్రమే తాము కాదు అంటూ సన్‌రైజర్స్ బ్యాటర్లు చెలరేగిపోయారు. గత ఏడాది లాగే అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ మెరుపులకు తోడు ఈసారి కొత్తగా జట్టులో చేరిన ఇషాన్ కిషన్ కూడా దూకుడుగా ఆడడంతో జట్టు ఆకాశమే హద్దుగా చెలరేగింది. ఛేదనకు ముందే ఓటమిని అంగీకరించినట్లు కనిపించిన రాజస్తాన్ కొంత పోరాడినా లక్ష్యం మరీ పెద్దది కావడంతో చివరకు ఆ జట్టుకు ఓటమి తప్పలేదు. మొత్తానికి 528 పరుగుల మ్యాచ్‌తో హైదరాబాద్ అభిమానులు ఆదివారం పండుగ చేసుకున్నారు. సాక్షి, హైదరాబాద్: ఐపీఎల్–18 సీజన్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తమదైన రీతిలో మెరుపు బ్యాటింగ్‌తో చెలరేగింది. ఘన విజయంతో టోర్నీని మొదలు పెట్టింది. ఆదివారం ఉప్పల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో గత ఏడాది రన్నరప్ సన్‌రైజర్స్ 44 పరుగుల తేడాతో మాజీ చాంపియన్ రాజస్తాన్ రాయల్స్‌ను ఓడించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 286 పరుగులు చేసింది.‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ ఇషాన్ కిషన్ (47 బంతుల్లో 106 నాటౌట్; 11 ఫోర్లు, 6 సిక్స్‌లు) సెంచరీతో కదం తొక్కాడు. ట్రావిస్ హెడ్ (31 బంతుల్లో 67; 9 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్ధసెంచరీ సాధించాడు. హెన్రిచ్ క్లాసెన్ (14 బంతుల్లో 34; 5 ఫోర్లు, 1 సిక్స్), నితీశ్ కుమార్ రెడ్డి (15 బంతుల్లో 30; 4 ఫోర్లు, 1 సిక్స్) కూడా దూకుడుగా ఆడారు. సన్‌రైజర్స్ టాప్–5 బ్యాటర్లంతా 200కు పైగా స్ట్రయిక్‌రేట్‌తో పరుగులు సాధించడం విశేషం. 3ఇషాన్ కిషన్పరుగులు 106 బంతులు 47 ఫోర్లు 11 సిక్స్‌లు 6 స్ట్రయిక్‌రేట్ 225.53 అనంతరం 287 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్తాన్ రాయల్స్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 242 పరుగులు చేసి ఓడిపోయింది. ధ్రువ్ జురేల్ (35 బంతుల్లో 70; 5 ఫోర్లు, 6 సిక్స్‌లు), సంజూ సామ్సన్ (37 బంతుల్లో 66; 7 ఫోర్లు, 4 సిక్స్‌లు) మెరుపు అర్ధ సెంచరీలతో ఆకట్టుకున్నారు. సన్‌రైజర్స్ బౌలర్లలో సిమర్జీత్ సింగ్, హర్షల్ పటేల్ రెండు వికెట్ల చొప్పున తీశారు. సన్‌రైజర్స్ జట్టు తమ తదుపరి మ్యాచ్‌ను ఈనెల 27న ఉప్పల్ స్టేడియంలోనే లక్నో సూపర్ జెయింట్స్ జట్టుతో ఆడుతుంది. మెరుపు బ్యాటింగ్... అభిషేక్ శర్మ (11 బంతుల్లో 24; 5 ఫోర్లు), హెడ్ ఎప్పటిలాగే రైజర్స్‌కు శుభారంభం అందించారు. ఫారుఖీ ఓవర్లో అభిషేక్ మూడు ఫోర్లు కొట్టగా, అదే ఓవర్లో హెడ్ సిక్స్ కొట్టాడు. తొలి వికెట్‌కు 19 బంతుల్లో 45 పరుగుల భాగస్వామ్యం తర్వాత అభిషేక్ వెనుదిరిగాడు. అభిషేక్ స్థానంలో వచ్చిన ఇషాన్ కిషన్ కూడా అదే జోరును కొనసాగించాడు. ఆర్చర్ వేసిన ఐదో ఓవర్లో హెడ్ చెలరేగిపోయాడు. ఈ ఓవర్లో అతను 4 ఫోర్లు, సిక్స్ బాదడంతో మొత్తం 23 పరుగులు వచ్చాయి. పవర్‌ప్లే ముగిసేసరికి సన్‌రైజర్స్ స్కోరు 94 పరుగులకు చేరగా, 21 బంతుల్లోనే హెడ్ హాఫ్ సెంచరీ పూర్తయింది. ఎట్టకేలకు హెడ్‌ను తుషార్ అవుట్ చేసినా... కిషన్ తనదైన శైలిలో ధాటిగా ఆడాడు. హెడ్, కిషన్ రెండో వికెట్‌కు 39 బంతుల్లోనే 85 పరుగులు జోడించారు. ఆర్చర్ ఓవర్లో రెండు వరుస సిక్స్‌లతో కిషన్ 25 బంతుల్లో హాఫ్ సెంచరీని అందుకున్నాడు. అదే ఓవర్లో అతను మరో సిక్సర్ బాదాడు. మరోవైపు నితీశ్ రెడ్డి, క్లాసెన్ ఎక్కడా తగ్గలేదు. వీరిద్దరు దూకుడుతో స్కోరు వేగంగా దూసుకుపోయింది. సందీప్ ఓవర్లో వరుసగా 6, 4 కొట్టిన క్లాసెన్, ఆర్చర్ ఓవర్లో మూడు ఫోర్లు కొట్టాడు. సందీప్ ఓవర్లో వరుసగా రెండు సిక్స్‌లు బాది 98కి చేరిన కిషన్ తర్వాతి బంతికి రెండు పరుగులు చేసి సెంచరీ (45 బంతుల్లో)తో విజయనాదం చేశాడు. శతక భాగస్వామ్యం... దాదాపు అసాధ్యమైన లక్ష్య ఛేదనకు బరిలోకి దిగిన రాజస్తాన్ 50 పరుగులకే 3 కీలక వికెట్లు కోల్పోయింది. యశస్వి జైస్వాల్ (1), రియాన్ పరాగ్ (4), నితీశ్ రాణా (11) వెనుదిరగడంతో జట్టు ఛేదనావకాశాలు తగ్గిపోయాయి. అయితే సామ్సన్, జురేల్ కొద్దిగా ప్రయత్నం చేశారు. సిమర్జీత్ ఓవర్లో సామ్సన్ 2 ఫోర్లు, సిక్స్ కొట్టగా, కమిన్స్ ఓవర్లో జురేల్ 3 ఫోర్లు, సిక్స్ కొట్టడం హైలైట్‌గా నిలిచాయి. రాయల్స్ బ్యాటర్లు కూడా అక్కడక్కడా మెరుపులు మెరిపించినా హైదరాబాద్ ఇన్నింగ్స్ ముందు అవన్నీ దిగదుడుపుగా కనిపించాయి. నాలుగో వికెట్‌కు 60 బంతుల్లో 111 పరుగులు జత చేసిన అనంతరం ఒకే స్కోరు వద్ద సామ్సన్, జురేల్ అవుట్ కావడంతో రాజస్తాన్ ఆశలు అడుగంటాయి. చివర్లో హెట్‌మైర్ (23 బంతుల్లో 42; 1 ఫోర్, 4 సిక్స్‌లు), శుభమ్ దూబే (11 బంతుల్లో 34 నాటౌట్; 1 ఫోర్, 4 సిక్స్‌లు) పోరాడినా లాభం లేకపోయింది. స్కోరు వివరాలుసన్‌రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్: అభిషేక్ శర్మ (సి) యశస్వి జైస్వాల్ (బి) తీక్షణ 24; హెడ్ (సి) హెట్‌మైర్ (బి) తుషార్ దేశ్‌పాండే 67; ఇషాన్ కిషన్ (నాటౌట్) 106; నితీశ్ కుమార్ రెడ్డి (సి) యశస్వి జైస్వాల్ (బి) తీక్షణ 30; క్లాసెన్ (సి) పరాగ్ (బి) సందీప్ 34; అనికేత్ (సి) ఆర్చర్ (బి) తుషార్ దేశ్‌పాండే 7; అభినవ్ మనోహర్ (సి) పరాగ్ (బి) తుషార్ దేశ్‌పాండే 0; కమిన్స్ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 18; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 286. వికెట్ల పతనం: 1–45, 2–130, 3–202, 4–258, 5–279, 6–279. బౌలింగ్: ఫారుఖీ 3–0–49–0, తీక్షణ 4–0–52–2, ఆర్చర్ 4–0–76–0, సందీప్ శర్మ 4–0–51–1, నితీశ్ రాణా 1–0–9–0, తుషార్ దేశ్‌పాండే 4–0–44–3. రాజస్తాన్ రాయల్స్ ఇన్నింగ్స్: యశస్వి జైస్వాల్ (సి) మనోహర్ (బి) సిమర్జీత్ 1; సంజూ సామ్సన్ (సి) క్లాసెన్ (బి) హర్షల్ పటేల్ 66; పరాగ్ (సి) కమిన్స్ (బి) సిమర్జీత్ 4; నితీశ్ రాణా (సి) కమిన్స్ (బి) షమీ 11; ధ్రువ్ జురేల్ (సి) ఇషాన్ కిషన్ (బి) ఆడమ్ జంపా 70; హెట్‌మైర్ (సి) మనోహర్ (బి) హర్షల్ పటేల్ 42; శుభమ్ దూబే (నాటౌట్) 34; ఆర్చర్ (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 13; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 242. వికెట్ల పతనం: 1–20, 2–24, 3–50, 4–161, 5–161, 6–241. బౌలింగ్: మొహమ్మద్ షమీ 3–0–33–1, సిమర్జీత్ సింగ్ 3–0–46–2, కమిన్స్ 4–0–60–0, అభిషేక్ 2–0–17–0, ఆడమ్ జంపా 4–0–48–1, హర్షల్ పటేల్ 4–0–34–2.286 ఐపీఎల్లో ఇది రెండో అత్యధిక స్కోరు. గత ఏడాది రాయల్ చాలెంజర్స్ బెంగళూరుపై సన్‌రైజర్స్ చేసిన 287 పరుగుల స్కోరు అగ్రస్థానంలో ఉంది. ఐపీఎల్ చరిత్రలో టాప్–5 అత్యధిక టీమ్ స్కోర్లలో నాలుగు సన్‌రైజర్స్ పేరిటే ఉండటం విశేషం.76 జోఫ్రా ఆర్చర్ ఇచ్చిన పరుగులు. ఐపీఎల్‌లోని ఒక మ్యాచ్‌లో ఒక బౌలర్ ఇచ్చిన అత్యధిక పరుగులు ఇవే. గత ఏడాది ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ బౌలర్ మోహిత్ శర్మ అత్యధికంగా 73 పరుగులు ఇచ్చాడు. మోహిత్ పేరిట ఉన్న రికార్డును ఆర్చర్ తన పేరిట లిఖించుకున్నాడు. 34 టి20 ఫార్మాట్లో ఒక మ్యాచ్ ఇన్నింగ్స్‌లో అత్యధిక ఫోర్లు (34) కొట్టిన జట్టుగా సన్‌రైజర్స్ రికార్డు నెలకొల్పింది. గతంలో ఈ రికార్డు మిడిల్సెక్స్ కౌంటీ (33 ఫోర్లు; సర్రే జట్టుపై 2023లో) జట్టు పేరిట ఉంది. ఐపీఎల్ టోర్నీ మ్యాచ్‌లో ఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక బౌండరీలు కొట్టిన రికార్డు ఢిల్లీ డేర్‌డెవిల్స్ (31 ఫోర్లు; 2017లో గుజరాత్ లయన్స్‌పై) జట్టు పేరిట ఉంది. దానిని కూడా సన్‌రైజర్స్ బ్రేక్ చేసింది. 3 ఐపీఎల్లో ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన మూడో భారత ప్లేయర్‌గా ఇషాన్ కిషన్ (45 బంతుల్లో) గుర్తింపు పొందాడు. తొలి స్థానంలో యూసుఫ్ పఠాన్ (37 బంతుల్లో ముంబై ఇండియన్స్‌పై 2010లో) ఉన్నాడు. తాజా ఇన్నింగ్స్‌తో మయాంక్ అగర్వాల్ (45 బంతుల్లో; రాజస్తాన్ రాయల్స్‌పై 2020లో) సరసన ఇషాన్ కిషన్ చేరాడు. -
చరిత్ర సృష్టించిన సన్‌రైజర్స్.. ప్రపంచంలోనే తొలి జట్టుగా
ఐపీఎల్-2025ను సన్‌రైజర్స్ హైదరాబాద్ అద్బుతమైన విజయంతో ప్రారంభించింది. ఉప్పల్ వేదికగా రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 44 పరుగుల తేడాతో ఎస్ఆర్హెచ్ గెలుపొందింది. 287 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్తాన్ 6 వికెట్లు కోల్పోయి 242 పరుగులు మాత్రమే చేయగల్గింది. ఎస్ఆర్హెచ్ బౌలర్లలో సిమర్జీత్ సింగ్, హర్షల్ పటేల్ తలా రెండు వికెట్లు పడగొట్టగా.. షమీ, జంపా చెరో వికెట్ సాధించారు. రాజస్తాన్ బ్యాటర్లలో ధ్రువ్ జురెల్(70) టాప్ స్కోరర్‌గా నిలిచాడు.ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగారు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఎస్ఆర్హెచ్ 6 వికెట్ల నష్టానికి 286 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఇన్నింగ్స్ ఆరంభం నుంచే రాజస్తాన్ బౌలర్లను సన్‌రైజర్స్ బ్యాటర్లు ఊచకోత కోశారు. క్రీజులోకి వచ్చిన ప్రతీ బ్యాటర్ బంతిని స్టాండ్స్‌కు తరలించాడు. ఎస్ఆర్హెచ్ బ్యాటర్లలో ఇషాన్ కిషన్ అద్బుతమైన సెంచరీతో చెలరేగాడు. కేవలం 47 బంతుల్లో 11 ఫోర్లు, 6 సిక్స్‌లతో 106 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. ఇషాన్‌కు ఇదే తొలి ఐపీఎల్ సెంచరీ కావడం గమనార్హం. కాగా ఐపీఎల్-2025 మెగా వేలంలో కిషన్‌ను రూ.11.25 కోట్లకు ఎస్ఆర్హెచ్ కొనుగోలు చేసింది. కిషన్‌తో పాటు ట్రావిస్ హెడ్(67), క్లాసెన్(34), నితీశ్ కుమార్(30) పరుగులతో రాణించారు. రాజస్తాన్ బౌలర్లలో తుషార్ దేశ్‌పాండే మూడు వికెట్లు పడగొట్టగా.. థీక్షణ రెండు, సందీప్ శర్మ ఒక్క వికెట్ సాధించారు. ఇక ఈ మ్యాచ్‌లో భారీ స్కోర్ చేసిన సన్‌రైజర్స్ ఓ అరుదైన రికార్డును తమ పేరిట లిఖించుకుంది.ఎస్ఆర్హెచ్ వరల్డ్ రికార్డు..టీ20 క్రికెట్లో అత్యధిక సార్లు 250 ప్లస్ స్కోర్లు సాధించిన తొలి జట్టుగా ఎస్ఆర్హెచ్ వరల్డ్ రికార్డు సృష్టించింది. సన్‌రైజర్స్ ఇప్పటివరకు 4 సార్లు 250 పైగా పరుగులు చేసింది. ఇంతకుముందు రికార్డు ఇంగ్లండ్ క్రికెట్ క్లబ్ సర్రే పేరిట ఉండేది. సర్రే 3 సార్లు 250 ప్లస్ స్కోర్లు నమోదు చేసింది. తాజా మ్యాచ్‌తో సర్రే అల్‌టైమ్ రికార్డును కమ్మిన్స్ సేన బ్రేక్ చేసింది. అదేవిధంగా ఐపీఎల్ చరిత్రలో ఇది రెండో అత్యధిక స్కోర్ కావడం గమనార్హం.చదవండి: IPL 2025: ముంబై ఇండియన్స్ వదిలేసింది.. కట్ చేస్తే! తొలి మ్యాచ్‌లోనే భారీ సెంచరీ -
SRH Vs RR: ట్రావిస్ హెడ్ ఊచకోత.. ఎగిరి గంతేసిన కావ్య పాప! వీడియో వైరల్
ఐపీఎల్-2025ను సన్‌రైజర్స్ స్టార్ ఓపెనర్ ట్రావిస్ హెడ్ తనదైన స్టైల్లో ఆరంభించాడు. ఈ మెగా టోర్నీలో భాగంగా ఉప్పల్ స్టేడియంలో రాజస్తాన్ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో హెడ్ విధ్వంసకర హాఫ్ సెంచరీతో చెలరేగాడు. రాజస్తాన్ బౌలర్లను హెడ్ ఊచకోత కోశాడు. ఉప్పల్ మైదానంలో ఈ ఆసీస్ ఓపెనర్ బౌండరీల వర్షం కురిపించాడు. రాజస్తాన్ స్టార్ పేసర్ జోఫ్రా అర్చర్‌ను అయితే హెడ్ ఓ ఆట ఆడేసికున్నాడు. 5వ ఓవర్ వేసిన అర్చర్ బౌలింగ్‌లో హెడ్ ఏకంగా 22 పరుగులు పిండుకున్నాడు. ఈ క్రమంలో హెడ్ కేవలం 21 బంతుల్లోనే తన హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. ఓవరాల్‌గా 31 బంతులు ఎదుర్కొన్న హెడ్.. 9 ఫోర్లు, 3 సిక్స్‌లతో 67 పరుగులు చేసి ఔటయ్యాడు. అతడి ఇన్నింగ్స్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది.ఆనందంలో కావ్యపాప..కాగా ఈ మ్యాచ్‌లో హెడ్ ఓ భారీ సిక్సర్ బాదాడు. జోఫ్రా ఆర్చర్ బౌలింగ్‌లో డీప్ మిడ్ వికెట్ మీదగా 105 మీటర్ల సిక్స్‌ను హెడ్ కొట్టాడు. ఈ క్రమంలో స్టాండ్స్‌లో ఉన్న ఎస్ఆర్హెచ్ ఓనర్ కావ్య మారన్ ఎగిరి గంతేసింది. చప్పట్లు కొడుతూ హెడ్‌ను అభినందించింది. ఆ షాట్ చూసి ఎస్ఆర్హెచ్ కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ కూడా షాకయ్యాడు.Hurricane Head graces #TATAIPL 2025 🤩Travis Head smashing it to all parts of the park in Hyderabad 💪👊Updates ▶️ https://t.co/ltVZAvInEG#SRHvRR | @SunRisers pic.twitter.com/cxr6iNdR3S— IndianPremierLeague (@IPL) March 23, 2025 -
SRH Vs RR: సన్‌రైజర్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్.. ఎవరిది పైచేయి..?
ఐపీఎల్ 2025 సీజన్లో భాగంగా ఇవాళ (మార్చి 23) మధ్యాహ్నం జరుగబోయే మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌కు ఎస్ఆర్హెచ్ హోం గ్రౌండ్ ఉప్పల్ స్టేడియం (హైదరాబాద్) వేదిక కానుంది. గత సీజన్ ఫైనల్లో కేకేఆర్ చేతిలో ఓడి తృటిలో టైటిల్ చేజార్చుకున్న ఆరెంజ్ ఆర్మీ.. తొలి మ్యాచ్‌లో గెలిచి సీజన్‌ను ఘనంగా ప్రారంభించాలని భావిస్తుంది. గతేడాది మూడో స్థానంతో సరిపెట్టుకున్న రాయల్స్ సైతం గెలుపుతో సీజన్‌ను ప్రారంభించాలని పట్టుదలగా ఉంది.ఇరు జట్ల మధ్య హెడ్ టు హెడ్ రికార్డులు పరిశీలిస్తే.. రాయల్స్‌పై సన్‌రైజర్స్ కాస్త పైచేయి కలిగి ఉంది. ఇరు జట్లు ఇప్పటివరకు 20 మ్యాచ్‌ల్లో తలపడగా.. సన్‌రైజర్స్ 11, రాయల్స్ 9 మ్యాచ్‌ల్లో గెలుపొందాయి. ఇరు జట్లు మధ్య జరిగిన గత మూడు మ్యాచ్‌ల్లో సన్‌రైజర్సే విజయం సాధించింది. హైదరాబాద్‌లో ఇరు జట్లు తలపడిన చివరిసారి (2023) మాత్రం రాయల్స్‌నే విజయం వరించింది. ఇరు జట్లు హైదరాబాద్‌లో నాలుగుసార్లు తలపడగా రాయల్స్ ఆ ఒక్కసారి మాత్రమే గెలుపొందింది.జట్లను పరిశీలిస్తే.. బ్యాటింగ్ విభాగంలో ఇరు జట్లు సమవుజ్జీలుగా కనిపిస్తున్నా.. బౌలింగ్‌లో మాత్రం సన్‌రైజర్స్‌దే పైచేయిగా తెలుస్తుంది. సన్‌రైజర్స్‌లో సమర్దవంతమైన పేసర్లతో (కమిన్స్, షమీ, హర్షల్ పటేల్, జయదేవ్ ఉనద్కత్) పాటు నాణ్యమైన స్పిన్నర్లు (రాహుల్ చాహర్, ఆడమ్ జంపా, కమిందు మెండిస్, అభిషేక్ శర్మ, ట్రవిస్ హెడ్) ఉన్నారు. రాయల్స్‌లో అది లోపించింది. పేసర్లలో సందీప్ శర్మ, జోప్రా ఆర్చర్.. స్పిన్నర్లలో హసరంగ, తీక్షణ మాత్రమే ఆ జట్టు తరఫున అనుభవజ్ఞులుగా ఉన్నారు. బ్యాటింగ్ విషయానికొస్తే.. ఇరు జట్లలో విధ్వంసకర వీరులు ఉన్నారు. సన్‌రైజర్స్‌లో హెడ్, అభిషేక్, క్లాసెన్, ఇషాన్ కిషన్ ఉండగా.. రాయల్స్‌లో సంజూ శాంసన్, యశస్వి జైస్వాల్, షిమ్రోన్ హెట్‌మైర్, రియాన్ పరాగ్ లాంటి మెరుపు వీరులు ఉన్నారు. ఇరు జట్ల బ్యాటర్లు సీజన్ ప్రారంభానికి ముందు ఆడిన ఇంట్రా స్క్వాడ్ మ్యాచ్‌ల్లో బీభత్సమైన ఫామ్ కనబర్చారు. దీన్ని బట్టి చూస్తే నేటి మ్యాచ్‌లో పరుగుల వరద పారడం ఖాయమనిపిస్తుంది. గత సీజన్లో సన్‌రైజర్స్ ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్ (ఆర్సీబీపై 287) నమోదు చేయడంతో పాటు మూడు సార్లు 250 ప్లస్ స్కోర్లు నమోదు చేసిన విషయం తెలిసిందే.సన్‌రైజర్స్ హైదరాబాద్..పాట్ కమిన్స్ (కెప్టెన్), అథర్వ్ తైడే, అభినవ్ మనోహర్, అనికేత్ వర్మ, సచిన్ బేబి, ట్రవిస్ హెడ్, నితీశ్ కుమార్ రెడ్డి, కమిందు మెండిస్, వియాన్ ముల్దర్, అభిషేక్ శర్మ, హెన్రిచ్ క్లాసెన్, ఇషాన్ కిషన్, జీషన్ అన్సారీ, మహ్మద్ షమీ, హర్షల్ పటేల్, రాహుల్ చాహర్, సిమర్జీత్ సింగ్, ఎషాన్ మలింగ, ఆడమ్ జంపా, జయదేవ్ ఉనద్కత్రాజస్థాన్ రాయల్స్..సంజూ శాంసన్ (కెప్టెన్), వైభవ్ సూర్యవంశీ, యశస్వి జైస్వాల్, నితీశ్ రాణా, శుభమ్ దూబే, షిమ్రోన్ హెట్‌మైర్, రియాన్ పరాగ్, యుద్ద్‌వీర్ సింగ్ చరక్, వనిందు హసరంగ, దృవ్ జురెల్, కునాల్ సింగ్ రాథోడ్, సందీప్ శర్మ, తుషార్ దేశ్‌పాండే, కుమార్ కార్తీకేయ, ఆకాశ్ మధ్వాల్, క్వేనా మపాకా, మహీశ్ తీక్షణ, ఫజల్ హక్ ఫారూకీ, అశోక్ శర్మ, జోఫ్రా ఆర్చర్ -
IPL 2025: తొలి మ్యాచ్‌లో ఆరెంజ్ ఆర్మీ.. స్టార్ స్పిన్నర్‌కు నో ప్లేస్..!
ఐపీఎల్-2025లో ఇవాళ (మార్చి 23) డబుల్ హెడర్ మ్యాచ్‌లు జరుగుతున్న విషయం తెలిసిందే. మధ్యాహ్నం 3:30 గంటలకు ప్రారంభమయ్యే మ్యాచ్‌లో గత సీజన్ రన్నరప్ సన్‌రైజర్స్ హైదరాబాద్ రాజస్థాన్ రాయల్స్‌తో తలపడనుంది. రాత్రి 7:30 గంటలకు ప్రారంభమయ్యే మ్యాచ్‌లో సీఎస్కే, ముంబై ఇండియన్స్‌ను ఢీకొట్టనుంది. ఎస్ఆర్హెచ్, రాయల్స్ మ్యాచ్ హైదరాబాద్‌లో జరుగనుండగా.. సీఎస్కే, ఎంఐ మ్యాచ్‌కు చెన్నై ఆతిథ్యమివ్వనుంది.రాజస్థాన్, ఎస్ఆర్హెచ్ మ్యాచ్ విషయానికొస్తే.. ఈ సీజన్లో ఇరు జట్లకు ఇదే తొలి మ్యాచ్. గత సీజన్లో తృటిలో టైటిల్ చేజార్చుకున్న సన్‌రైజర్స్ ఈ సీజన్లో ఎలాగైనా చేజారిన టైటిల్‌ను చేజిక్కించుకోవాలన్న కసితో బరిలోకి దిగుతుంది. గత సీజన్లో తమ విజయాల్లో కీలక పాత్ర పోషించిన చాలామంది ఆటగాళ్లను సన్‌రైజర్స్ ఈ సీజన్లోనూ కొనసాగించింది. ఈ సీజన్లో కొత్తగా షమీ, హర్షల్ పటేల్, ఇషాన్ కిషన్, ఆడమ్ జంపా జట్టులో చేరారు.రాజస్థాన్‌తో మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌కు తుది జట్టు కూర్పు సవాలుగా మారనుంది. బ్యాటర్ల విషయంలో ఆ జట్టుకు ఓ ఐడియా ఉన్నా బౌలర్ల ఎంపికలో మాత్రం తలనొప్పులు ఉన్నాయి. పేసర్లుగా కమిన్స్, షమీ, హర్షల్ పటేల్ స్థానాలు ఖరారైనా.. స్పిన్నర్లలో స్వదేశీ రాహుల్ చాహర్‌కు అవకాశం ఇవ్వాలా లేక విదేశీ స్టార్ స్పిన్నర్ ఆడమ్ జంపాకు చోటు ఇవ్వాలా అన్న సందిగ్దత నెలకొంది. రాహుల్‌కు అవకాశం ఇస్తే పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ వియాన్ ముల్దర్ లేదా స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ కమిందు మెండిస్‌ను తుది జట్టులోకి తీసుకోవచ్చు. ఒకవేళ జంపానే కావాలనుకుంటే ఓ విదేశీ ఆల్‌రౌండర్‌ను త్యాగం చేయాల్సి వస్తుంది. అదనంగా బ్యాటర్లు సచిన్ బేబి, అనికేత్ వర్మలో ఎవరో ఒకరికి అవకాశం ఇవ్వవచ్చు.బ్యాటింగ్ కూర్పు విషయానికొస్తే.. ట్రవిస్ హెడ్, అభిషేక్ శర్మ ఓపెనర్లుగా బరిలోకి దిగుతారు. ఇషాన్ కిషన్ వన్‌డౌన్‌లో బ్యాటింగ్ చేయడం ఖాయం. మిడిలార్డర్లో నితీశ్ రెడ్డి, క్లాసెన్ ఉంటారు. ఇంపాక్ట్ ప్లేయర్‌గా అభినవ్ మనోహర్ బరిలోకి దిగవచ్చు.రాజస్థాన్‌తో మ్యాచ్‌లో సన్‌రైజర్స్ తుది జట్టు (అంచనా)ట్రవిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, నితీశ్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్, అభినవ్ మనోహర్, వియాన్ ముల్దర్/కమిందు మెండిస్, పాట్ కమిన్స్ (కెప్టెన్), మహ్మద్ షమీ, రాహుల్ చాహర్, హర్షల్ పటేల్2025 ఐపీఎల్ సీజన్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ పూర్తి జట్టు..పాట్ కమిన్స్ (కెప్టెన్), అథర్వ్ తైడే, అభినవ్ మనోహర్, అనికేత్ వర్మ, సచిన్ బేబి, ట్రవిస్ హెడ్, నితీశ్ కుమార్ రెడ్డి, కమిందు మెండిస్, వియాన్ ముల్దర్, అభిషేక్ శర్మ, హెన్రిచ్ క్లాసెన్, ఇషాన్ కిషన్, జీషన్ అన్సారీ, మహ్మద్ షమీ, హర్షల్ పటేల్, రాహుల్ చాహర్, సిమర్జీత్ సింగ్, ఎషాన్ మలింగ, ఆడమ్ జంపా, జయదేవ్ ఉనద్కత్ -
రైజర్స్ బొణీ కొట్టేనా!
బాదుడే పరామావధిగా చెలరేగి గత సీజన్లో రన్నరప్‌గా నిలిచిన సన్రజర్స్ హైదరాబాద్... ఈ ఏడాది అదే జోరు కొనసాగించేందుకు సిద్ధమైంది. సొంతగడ్డపై మాజీ చాంపియన్ రాజస్తాన్ రాయల్స్‌తో... నేడు కమిన్స్ సేన కప్ వేట ప్రారంభించనుంది. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, నితీశ్‌కుమార్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్‌తో సన్‌రైజర్స్ బ్యాటింగ్ లైనప్ శత్రు దుర్బేధ్యంగా ఉండగా... యశస్వి జైస్వాల్, సంజూ సామ్సన్, రియాన్ పరాగ్, హెట్‌మైర్, ధ్రువ్ జురెల్‌తో సవాలు విసిరేందుకు రాజస్తాన్ రాయల్స్ రెడీ అయింది. మరి రైజర్స్ దూకుడుకు రాయల్స్ అడ్డుకట్ట వేస్తుందా చూడాలి! సాక్షి, హైదరాబాద్: గత ఏడాది అందినట్లే అంది దూరమైన ఐపీఎల్ ట్రోఫీని ఈసారైనా ఒడిసి పట్టాలనే లక్ష్యంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు తొలి మ్యాచ్‌కు రెడీ అయింది. ఐపీఎల్ 18వ సీజన్లో భాగంగా జరగనున్న తొలి ‘డబుల్ హెడర్’లో ఆదివారం జరగనున్న తొలి మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్‌తో హైదరాబాద్ అమీతుమీ తేల్చుకోనుంది. ఒకప్పుడు కట్టుదిట్టమైన బౌలింగ్‌కు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన సన్‌రైజర్స్... గత సీజన్లో విధ్వంసక బ్యాటింగ్‌తో రికార్డులు తిరగరాసింది. ఓపెనర్లు అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ నుంచి మొదలు పెట్టుకొని కెప్టెన్ కమిన్స్ వరకు ప్రతి ఒక్కరూ దూకుడుగా ఆడేవాళ్లు ఉండటం రైజర్స్‌కు కలిసి రానుండగా... సీజన్ ఆరంభ మ్యాచ్‌లో ఆరెంజ్ ఆర్మీ ఎలాంటి ప్రదర్శన కనబరుస్తుందో చూడాలి. గత ఏడాది మ్యాచ్ మ్యాచ్‌కు మరింత రాటుదేలుతూ అరాచకం సృష్టించిన రైజర్స్ బ్యాటర్లు... ఈ సీజన్లో తొలి మ్యాచ్ నుంచే జోరు కనబర్చాలని తహతహలాడుతున్నారు. ప్రాక్టీస్ సెషన్లలో హెడ్, క్లాసెన్, అభిషేక్, నితీశ్ వంతులు వేసుకొని మరి భారీ షాట్లు సాధన చేశారు. ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరగనున్న ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. వేలంలో కొత్తగా తీసుకున్న ఇషాన్ కిషన్ రాకతో రైజర్స్ బ్యాటింగ్ మరింత పదునెక్కింది. గతేడాది ఒకటికి మూడుసార్లు 250 పైచిలుకు పరుగులు చేసిన రైజర్స్... ఈ సారి 300 మార్క్ అందుకోవాలనే లక్ష్యంతో కనిపిస్తోంది. గాయం నుంచి కోలుకున్న ఆంధ్ర ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి మిడిలార్డర్లో కీలకం కానున్నాడు. మరోవైపు వేలి గాయంతో ఇబ్బంది పడుతున్న రాజస్తాన్ రాయల్స్ రెగ్యులర్ కెప్టెన్ సంజూ సామన్స్ ఈ మ్యాచ్‌లో కేవలం ప్లేయర్‌గా బరిలోకి దిగనున్నాడు. సీజన్ తొలి మూడు మ్యాచ్‌లకు సామ్సన్ స్థానంలో రియాన్ పరాగ్ రాయల్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. సామ్సన్ ఇంపాక్ట్ ప్లేయర్‌గా... స్వదేశీ ఆటగాళ్ల నైపుణ్యంపైనే ప్రధానంగా ఆధారపడుతున్న రాజస్తాన్ రాయల్స్‌కు... రెగ్యులర్ కెప్టెన్ సంజూ సామ్సన్ గాయం ఇబ్బంది పెడుతోంది. అతడు కేవలం బ్యాటర్‌గా మాత్రమే బరిలోకి దిగనున్నాడు. అంటే ఇంపాక్ట్ ప్లేయర్‌గా బ్యాటింగ్ చేసే అవకాశాలు ఉన్నాయి. అతడి స్థానంలో రియాన్ పరాగ్ జట్టును నడిపించనుండగా... ధ్రువ్ జురెల్ వికెట్ కీపింగ్ బాధ్యతలు అందుకోనున్నాడు. యశస్వి జైస్వాల్, సామ్సన్, నితీశ్ రాణా, పరాగ్, ధ్రువ్ జురేల్ ఇలా టాప్–5లో స్వదేశీ ఆటగాళ్లే బ్యాటింగ్ చేయనున్నారు. మిడిలార్డర్లో విండీస్ హిట్టర్ హెట్‌మైర్ కీలకం కానుండగా... ఆర్చర్, తీక్షణ, వనిందు హసరంగ బౌలింగ్ భారం మోయనున్నారు. విధ్వంసానికి కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తున్న రైజర్స్ బ్యాటింగ్ లైనప్‌ను రాయల్స్ బౌలింగ్ దళం ఎలా అడ్డుకుంటుందనే దానిపైనే ఈమ్యాచ్ విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి. బ్యాటింగ్ బలంగా... ఇంటా బయటా అనే తేడా లేకుండా గతేడాది బరిలోకి దిగిన ప్రతి మ్యాచ్‌లో పరుగుల వరద పారించిన సన్‌రైజర్స్... ముఖ్యంగా ఉప్పల్‌లో ఊచకోత సాగించింది. లక్నో సూపర్ జెయింట్స్‌తో పోరులో ఆ జట్టు నిర్దేశించిన 166 పరుగుల లక్ష్యాన్ని ఆరెంజ్ ఆర్మీ 9.4 ఓవర్లలో వికెట్ కోల్పోకుండానే ఛేదించి సంచలనం సృష్టించింది.ఓపెనర్లు అభిషేక్ శర్మ, హెడ్ బంతిపై పగబట్టినట్లు విజృంభిస్తుండటం రైజర్స్‌కు ప్రధాన బలం కాగా... ఇషాన్ కిషన్, నితీశ్ కుమార్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్‌తో కూడిన మిడిలార్డర్ జట్టుకు మరింత బలాన్నిస్తోంది. అయితే ఫ్రాంఛైజీ తరఫున తొలిసారి బరిలోకి దిగనున్న అభినవ్ మనోహర్, అనికేత్ వర్మ ఎలాంటి ప్రదర్శన కనబరుస్తారనేది ఆసక్తికరం. గాయం కారణంగా శ్రీలంకతో పర్యటనతో పాటు ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీకి దూరమైన ఆ్రస్టేలియా స్టార్ పేసర్ ప్యాట్ కమిన్స్... గాయం నుంచి కోలుకొని జట్టును నడిపించేందుకు సిద్ధమయ్యాడు. పేస్ బౌలింగ్‌లో మొహమ్మద్ షమీ, హర్షల్ పటేల్ కీలకం కానుండగా, ఆడమ్ జంపా స్పిన్ బాధ్యతలు మోయనున్నాడు. తుది జట్లు (అంచనా) సన్‌రైజర్స్ హైదరాబాద్: కమిన్స్ (కెప్టెన్), హెడ్, అభిషేక్, ఇషాన్ కిషన్, నితీశ్ రెడ్డి, క్లాసెన్, అనికేత్ వర్మ, అభినవ్ మనోహర్, హర్షల్ పటేల్, రాహుల్ చాహర్, షమీ, జాంపా. రాజస్తాన్ రాయల్స్: రియాన్ పరాగ్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, సంజూ సామ్సన్, నితీశ్ రాణా, ధ్రువ్ జురెల్, హెట్‌మైర్, హసరంగ, శుభమ్ దూబే, ఆర్చర్, తీక్షణ, సందీప్ శర్మ, తుషార్ దేశ్ పాండే. పిచ్, వాతావరణం గతేడాది ఉప్పల్‌లో జరిగిన మ్యాచ్‌ల్లో పరుగుల వరద పారింది. మొత్తం 13 మైదానాల్లో ఐపీఎల్ మ్యాచ్‌లు జరగగా... అందులో రెండో అత్యధికం (ఓవర్‌కు 10.54 పరుగులు) హైదరాబాద్‌లో నమోదైంది. ఈసారి కూడా అందుకు భిన్నంగా ఉండకపోవచ్చు. మ్యాచ్‌కు వర్ష సూచన లేదు. చెన్నై X ముంబైసాయంత్రం గం. 7:30 నుంచిచెన్నై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 18వ సీజన్లో మరో కీలక పోరుకు రంగం సిద్ధమైంది. లీగ్‌లో అత్యంత విజయవంతమైన జట్లుగా చెరో ఐదు సార్లు ట్రోఫీలు గెలిచిన ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య చెపాక్ వేదికగా ఆదివారం రెండో మ్యాచ్ జరగనుంది. గాయం కారణంగా ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా, నిషేధం కారణంగా హార్దిక్ పాండ్యా ఈ మ్యాచ్‌కు అందుబాటులో లేకపోగా... సూర్యకుమార్ యాదవ్ ముంబై ఇండియన్స్ జట్టును నడిపించనున్నాడు. రోహిత్ శర్మ, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, రికెల్టన్, నమన్ ధిర్‌తో ముంబై బ్యాటింగ్ బలంగానే ఉంది. బౌలింగ్‌లో ట్రెంట్ బౌల్ట్ అనుభవం ముంబైకి ప్రధానాయుధం కాగా... దీపక్ చాహర్, కరణ్ శర్మ, సాంట్నర్, ముజీబ్ ఉర్ రహమాన్ మిగిలిన బాధ్యతలు చూసుకోనున్నారు. మరోవైపు ఇటీవల అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన రవిచంద్రన్ అశ్విన్ సుదీర్ఘ విరామం తర్వాత చెన్నై జట్టులో తిరిగి చేరాడు. చెపాక్ లాంటి స్లో పిచ్‌పై అశ్విన్, జడేజా, నూర్ అహ్మద్‌ను ఎదుర్కోవడం కష్టమైన పనే. ఎప్పట్లాగే మహేంద్ర సింగ్ ధోని వికెట్ల వెనుక నుంచి చెన్నై జట్టుకు దిశానిర్దేశం చేయనుండగా... బ్యాటింగ్‌లో కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్, కాన్వే, రాహుల్ త్రిపాఠి, శివమ్ దూబే, స్యామ్ కరన్, జడేజా కీలకం కానున్నారు. గత సీజన్లో ఎక్కువ శాతం బ్యాటింగ్‌కు రాని ధోని ఈ సారి బ్యాటింగ్ ఆర్డర్లో ముందుకు వస్తాడా చూడాలి. ఇరు జట్ల మధ్య చివరగా జరిగిన ఐదు మ్యాచ్‌ల్లో నాలుగింట చెన్నై విజయం సాధించింది. గత సీజన్లో పేలవ ప్రదర్శనతో పట్టిక అట్టడుగు స్థానంలో నిలిచిన ముంబై ఇండియన్స్ ఈ సీజన్‌ను తాజాగా ప్రారంభించాలని చూస్తోంది. -
#IPL2025కు ఉప్పల్ స్టేడియం సిద్ధం.. పటిష్ట భద్రతా (ఫొటోలు)
-
‘ఈసారి విజేతగా ఆ జట్టే.. సన్‌రైజర్స్ ప్లే ఆఫ్స్ చేరడం కష్టమే’
అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మెగా క్రికెట్ టోర్నీ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) వినోదం పంచేందుకు సిద్ధమైంది. రెండు నెలలకు పైగా నిర్విరామంగా క్రికెట్ ప్రేమికులకు పొట్టి క్రికెట్ మజా అందించనుంది. ఐపీఎల్-2025 మార్చి 22న మొదలై.. మే 25న ఫైనల్‌తో ముగియనుంది.గతేడాది.. కోల్‌కతా నైట్ రైడర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad), రాజస్తాన్ రాయల్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్, గుజరాత్ టైటాన్స్, పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్ పాయింట్ల పట్టికలో వరుసగా ఒకటి నుంచి పది స్థానాల్లో నిలిచిన విషయం తెలిసిందే.పది జట్లలో భారీ మార్పులువీటిలో కోల్‌కతా- హైదరాబాద్ ఫైనల్లో తలపడగా.. రైజర్స్పై నైట్ రైడర్స్ విజయం సాధించి చాంపియన్‌గా నిలిచింది. ఇక ఏడాది ఈ పది జట్లలో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. మెగా వేలం-2025 నేపథ్యంలో ఐదు జట్ల కెప్టెన్లూ మారారు. లక్నోకు రిషభ్ పంత్, పంజాబ్‌కు శ్రేయస్ అయ్యర్, ఢిల్లీకి అక్షర్ పటేల్, బెంగళూరుకు రజత్ పాటిదార్, కోల్‌కతాకు అజింక్య రహానే సారథులుగా నియమితులయ్యారు.అత్యధికంగా పదికి 9 పాయింట్లుఈ పరిణామాల నేపథ్యంలో ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ ఐపీఎల్-2025లో పది జట్లకు తనదైన శైలిలో రేటింగ్ ఇచ్చాడు. అదే విధంగా.. ప్లే ఆఫ్స్ చేరే జట్లు, విజేతపై తన అంచనా తెలియజేశాడు. గుజరాత్ టైటాన్స్ జట్టుకు అత్యధికంగా పదికి 9 పాయింట్లు ఇచ్చిన మైకేల్ వాన్.. అతి తక్కువగా ఢిల్లీ క్యాపిటల్స్‌కు 5 పాయింట్లు వేశాడు.అయితే, గతేడాది పేలవ ప్రదర్శన కనబరిచిన పంజాబ్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్‌కు ఏడేసి పాయింట్లు ఇవ్వడం విశేషం. ఇక 2024లో పద్నాలుగింట కేవలం నాలుగే గెలిచి అట్టడుగున నిలిచిన ముంబై ఇండియన్స్‌కు ఏకంగా 7.5 రేటింగ్ ఇవ్వడం గమనార్హం. అన్ని జట్ల కంటే ఈసారి గుజరాత్ టైటాన్స్ గొప్పగా ఉందన్న మైకేల్ వాన్.. ఆ జట్టును తొమ్మిది పాయింట్లతో టాప్‌లో నిలిపాడు.ఇక గతేడాది ఫైనలిస్టు అయిన సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు 6.5 పాయింట్లే ఇచ్చిన వాన్.. ఈసారి ఆ జట్టు ప్లే ఆఫ్స్ చేరే అవకాశాలు చాలా తక్కువని అభిప్రాయపడ్డాడు. నాలుగో స్థానం కోసం ఎస్ఆర్హెచ్.. పంజాబ్, లక్నోలతో పోటీ పడుతుందని అంచనా వేశాడు. ఈసారి ముంబై ఇండియన్స్ చాంపియన్‌గా నిలవడం ఖాయమని వాన్ జోస్యం చెప్పాడు. ఈ మేరకు క్రిక్‌బజ్‌తో తన అభిప్రాయాలు పంచుకున్నాడు.ఐపీఎల్-2025 జట్లకు మైకేల్ వాన్ ఇచ్చిన రేటింగ్(పది పాయింట్లకు)👉గుజరాత్ టైటాన్స్- 9👉కోల్‌కతా నైట్ రైడర్స్- 8👉లక్నో సూపర్ జెయింట్స్- 7👉పంజాబ్ కింగ్స్- 7👉సన్‌రైజర్స్ హైదరాబాద్- 6.5👉రాయల్ చాలెంజర్స్ బెంగళూరు- 6.5👉రాజస్తాన్ రాయల్స్- 6.5👉చెన్నై సూపర్ కింగ్స్- 6👉ఢిల్లీ క్యాపిటల్స్- 5.మైకేల్ వాన్ ఎంచుకున్న టాప్-4 జట్లు(ప్లే ఆఫ్స్)గుజరాత్, కోల్‌కతా, ముంబై ఇండియన్స్ టాప్-3లో ఉండగా.. నాలుగో స్థానం కోసం లక్నో, పంజాబ్, సన్‌రైజర్స్ పోటీ.విజేతపై మైకేల్ వాన్ అంచనాఈసారి ముంబై ఇండియన్స్ ట్రోఫీ గెలిచే అవకాశం.చదవండి: CT 2025: టీమిండియాకు భారీ నజరానా ప్రకటించిన బీసీసీఐ -
ఐపీఎల్‌కి ముందే విధ్వంసం మొదలుపెట్టిన ఇషాన్ కిషన్
ఐపీఎల్ 2025 సీజన్ ప్రారంభానికి ముందే సన్‌రైజర్స్ హైదరాబాద్ న్యూ జాయినీ ఇషాన్ కిషన్ విధ్వంసం మొదలైంది. ఎస్ఆర్హెచ్ ఇంట్రా స్క్వాడ్ మ్యాచ్‌ల్లో పాకెట్ డైనమైట్ చెలరేగిపోతున్నాడు. ఇప్పటివరకు ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో మూడు మెరుపు అర్ద సెంచరీలు సాధించాడు. తాజాగా జరిగిన ఓ ఇంట్రా స్క్వాడ్ మ్యాచ్‌లో ఇషాన్ ఆకాశమే హద్దుగా చెలరేగి 22 బంతుల్లో 51 పరుగులు చేశాడు. అంతకుముందు ఓ మ్యాచ్‌లో 19 బంతుల్లో 49.. మరో మ్యాచ్‌లో 30 బంతుల్లో 70.. ఇంకో మ్యాచ్‌లో 23 బంతుల్లో 64 పరుగులు చేశాడు. సీజన్ ప్రారంభానికి ముందు ఇషాన్ అరివీర భయంకర ఫామ్ చూసి సన్‌రైజర్స్ శ్రేణులు ఖుషీగా ఉన్నాయి. ఈ సీజన్లో ఇషాన్ మరో విధ్వంకర ఓపెనర్ అభిషేక్ శర్మతో కలిసి సన్‌రైజర్స్ ఇన్నింగ్స్‌కు ప్రారంభించే అవకాశం ఉంది. ఇషాన్, అభిషేక్ తమ సహజ శైలిలో చెలరేగితే ఈ సీజన్లో సన్‌రైజర్స్ ఆపడం ఎవరి తరమూ కాదు. ఇషాన్‌ను ఈ సీజన్ మెగా వేలంలో సన్‌రైజర్స్ రూ. 11.25 కోట్లకు దక్కించుకుంది. గత సీజన్ వరకు ముంబై ఇండియన్స్‌కు ఆడిన ఇషాన్.. ఆ జట్టు విజయాల్లో అత్యంత ప్రాముఖ్యమైన పాత్ర పోషించాడు.ఈ సీజన్లో సన్‌రైజర్స్ బ్యాటింగ్ లైనప్ ఇషాన్, అభిషేక్, హెడ్, క్లాసెన్, అభినవ్ మనోహర్, నితీశ్ కుమార్ రెడ్డితో కూడి అత్యంత ప్రమాదకరంగా కనిపిస్తుంది. గత సీజన్లో ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత భారీ స్కోర్లు నమోదు చేసిన సన్‌రైజర్స్ ఈసారి ఆ స్కోర్లను కూడా అధిగమించే అవకాశం ఉంది. ఇంట్రా స్క్వాడ్ మ్యాచ్‌ల్లోనే 260, 270 పరుగులను సునాయాసంగా చేస్తున్న ఆరెంజ్ ఆర్మీ.. అస్సలు మ్యాచ్‌ల్లో 300 స్కోర్‌ను దాటినా ఆశ్చర్యపోనక్కర్లేదు. గత సీజన్లో సన్‌రైజర్స్ ఆర్సీబీపై 287 (ఐపీఎల్ హిస్టరీలో ఇదే అత్యధిక స్కోర్), ముంబై ఇండియన్స్‌పై 277, ఢిల్లీ క్యాపిటల్స్‌పై 266 పరుగులు చేసింది. గత సీజన్‌తో పోలిస్తే ఈ సీజన్లో మరింత ప్రమాదకరంగా కనిపిస్తున్న ఆరెంజ్ ఆర్మీ పరుగుల సునామీ సృష్టించడం ఖాయమనిపిస్తుంది. గత సీజన్లో తృటిలో టైటిల్ చేజార్చుకున్న హైదరాబాద్ ఫ్రాంచైజీ ఈసారి ఎలాగైనా కప్పు కొట్టాలని పట్టుదలగా ఉంది. ఈ సీజన్లో బ్యాటింగ్‌తో పాటు సన్‌రైజర్స్ బౌలింగ్ కూడా సమతూకంగా ఉంది. కెప్టెన్ కమిన్స్‌తో పాటు ఈ సీజన్లో కొత్తగా షమీ, ఉనద్కత్, హర్షల్ పటేల్, ఆడమ్ జంపా జట్టులో చేరారు.ఈ సీజన్లో సన్‌రైజర్స్ ప్రయాణం మార్చి 23న రాజస్థాన్ రాయల్స్‌తో జరిగే మ్యాచ్‌తో మొదలవుతుంది. ఈ మ్యాచ్ ఎస్ఆర్హెచ్ హోం గ్రౌండ్ ఉప్పల్ స్టేడియంలో జరుగనుంది. ఈ ఏడాది ఐపీఎల్ మార్చి 22న ప్రారంభం కానుండగా.. తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ కేకేఆర్.. ఆర్సీబీతో తలపడనుంది.2025 ఐపీఎల్ కోసం సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఇదే..పాట్ కమిన్స్ (కెప్టెన్), అథర్వ్ తైడే, అభినవ్ మనోహర్, అనికేత్ వర్మ, సచిన్ బేబి, ట్రవిస్ హెడ్, నితీశ్ కుమార్ రెడ్డి, కమిందు మెండిస్, వియాన్ ముల్దర్, అభిషేక్ శర్మ, హెన్రిచ్ క్లాసెన్, ఇషాన్ కిషన్, జీషన్ అన్సారీ, మహ్మద్ షమీ, హర్షల్ పటేల్, రాహుల్ చాహర్, సిమర్జీత్ సింగ్, ఎషాన్ మలింగ, ఆడమ్ జంపా, జయదేవ్ ఉనద్కత్ -
IPL 2025: ‘విన్’రైజర్స్ అయ్యేనా!
మొదట ఓ మాదిరి స్కోరు చేయడం... ఆ తర్వాత కట్టుదిట్టమైన బౌలింగ్‌తో దాన్ని కాపాడుకోవడం ఇది ఒకప్పుడు ఐపీఎల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు తీరు! కానీ గతేడాది బౌలింగ్ బలాన్ని పక్కన పెట్టిన రైజర్స్... బ్యాటింగ్‌తో లీగ్‌లో ప్రకంపనలు సృష్టించింది. ఒకటికి మూడుసార్లు 250 పైచిలుకు పరుగులు చేసిన సన్‌రైజర్స్... ఐపీఎల్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన జట్టుగా... పవర్‌ప్లేలో అత్యధిక పరుగులు పిండుకున్న టీమ్‌గా రికార్డుల్లోకెక్కింది!! లీగ్ ఆసాంతం రాణించిన బ్యాటర్లు ఆఖర్లో విఫలమవడంతో గత సీజన్లో రన్నరప్ ట్రోఫీతో సరిపెట్టుకున్న హైదరాబాద్ ఫ్రాంచైజీ ఈసారి కప్పు కొట్టాలని కృతనిశ్చయంతో ఉంది. కమిన్స్ కెప్టేన్సీకి... అభిషేక్ శర్మ, హెడ్ ఆరంభ మెరుపులు... క్లాసన్, నితీశ్ కుమార్ రెడ్డి ఫినిషింగ్ టచ్ తోడైతే సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను ఆపడం ప్రత్యర్థులకు శక్తికి మించిన పనే!!! –సాక్షి క్రీడావిభాగం ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో నాణ్యమైన బౌలింగ్‌కు పెట్టింది పేరైన సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్) జట్టు... గతేడాది అందుకు పూర్తి భిన్నంగా బాదుడే పరమావధిగా విజృంభించి కొత్త గుర్తింపు తెచ్చుకుంది. గత సీజన్లో సన్‌రైజర్స్ సాగించిన విధ్వంసకాండ మాటలకు అందనిది. అరాచకం అనే పదానికి అర్థం మార్చుతూ... ప్రత్యర్థి బౌలర్లను బెంబేలెత్తిస్తూ సన్‌రైజర్స్ బ్యాటర్లు సాగించిన ఊచకోత గురించి ఎంత చెప్పినా తక్కువే! ఒకరి తర్వాత ఒకరు అన్నట్లు వంతులు వేసుకొనిమరీ వీరబాదుడు బాదడంతోనే రైజర్స్... లీగ్ చరిత్రలోనే అత్యధిక స్కోరు తమ పేరిట లిఖించుకుంది. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, హెన్రిచ్ క్లాసెన్, నితీశ్ కుమార్ రెడ్డి... ఈ ‘రన్’ చతుష్టయానికి ఇప్పుడు మరో పిడుగు తోడయ్యాడు. ‘పాకెట్ డైనమైట్’ ఇషాన్ కిషన్ ఈ ఏడాది నుంచి రైజర్స్‌కు ప్రాతినిధ్యం వహించనున్నాడు. ఇప్పటికే హిట్టర్లతో దట్టంగా ఉన్న హైదరాబాద్ బ్యాటింగ్ లైనప్... ఇషాన్ రాకతో మరింత రాటుదేలనుంది. వేలంలో అత్యధికంగా 25 మందిని తీసుకునే అవకాశం ఉన్నా... కేవలం 20 మంది ప్లేయర్లనే కొనుగోలు చేసుకున్న రైజర్స్... అట్టిపెట్టుకున్న ఆటగాళ్ల కోసమే భారీగా ఖర్చు పెట్టింది. క్లాసెన్‌కు రూ. 23 కోట్లు, కెప్టేన్ ప్యాట్ కమిన్స్‌కు రూ. 18 కోట్లు... అభిషేక్ శర్మ, హెడ్లకు రూ. 14 కోట్ల చొప్పున ఇచ్చిన రైజర్స్... రూ. 6 కోట్లకు నితీశ్ కుమార్ రెడ్డిని కొనసాగించింది. 2016లో తొలిసారి టైటిల్ సాధించిన ఎస్ఆర్హెచ్... 2018, 2024లో రన్నరప్‌గా నిలిచింది. ఈసారి అటు బ్యాటింగ్‌తో పాటు ఇటు బౌలింగ్ దళాన్ని కూడా మరింత పటిష్ట పరుచుకున్న హైదరాబాద్... రెండోసారి కప్పు చేజక్కించుకోవాలని తహతహలాడుతోంది. నాలుగో ఆటగాడు ఎవరో? కెప్టేన్ కమిన్స్‌తో పాటు క్లాసెన్, హెడ్ తుది జట్టులో ఉండటం ఖాయమే కాగా... గతేడాది నాలుగో విదేశీ ప్లేయర్‌గా మార్క్రమ్ను ఎంచుకుంది. అయితే ఈసారి మాత్రం ఆడమ్ జాంపా, ముల్డర్, కమిందు మెండిస్ రూపంలో పరిమిత వనరులే ఉన్నాయి. దీంతో హెడ్ కోచ్ డానియల్ వెటోరీ... ఆసీస్ స్పిన్నర్ జాంపా వైపే మొగ్గుచూపే అవకాశాలున్నాయి. అయితే రాహుల్ త్రిపాఠి, అబ్దుల్ సమద్, షాబాజ్ అహ్మద్ వంటి దేశీయ ఆటగాళ్లు ఈసారి అందుబాటులో లేకపోవడం రైజర్స్‌కు ప్రతిబంధకంగా మారింది. అభినవ్ మనోహర్, అనికేత్ వర్మ, అథర్వ తైడె, సచిన్ బేబీకి తుది జట్టులో అవకాశం దక్కుతుందో లేదో వేచి చూడాలి. గత సీజన్లో తొలి ఏడు మ్యాచ్‌ల్లో ఐదింట నెగ్గి ఆరంభంలోనే ఆధిపత్యం కనబర్చిన హైదరాబాద్ జట్టు... పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలిచి ప్లే ఆఫ్స్‌కు చేరింది. క్వాలిఫయర్–1లో కోల్‌కతా నైట్‌రైడర్స్ చేతిలో ఓడిన రైజర్స్... క్వాలిఫయర్–2లో రాజస్తాన్ రాయల్స్‌పై గెలిచినా... ఫైనల్లో మరోసారి కోల్‌కతా చేతిలోనే ఓడి రన్నరప్‌తో సరిపెట్టుకుంది. తమదైన రోజులో అరవీర భయంకరంగా రెచ్చిపోయి రికార్డులు తిరగరాసే రైజర్స్... టాపార్డర్ విఫలమైతే మాత్రం తేలిపోతోందని గత సీజన్‌తోనే అర్థమైంది. దీంతో ఈసారి ఎలాంటి ప్రణాళికతో ముందడుగు వేస్తుందో చూడాలి. షమీ రాకతో రాత మారేనా! సుదీర్ఘ కాలంగా సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలింగ్ తురుపుముక్కగా ఉన్న భువనేశ్వర్ కుమార్‌తో పాటు యార్కర్ కింగ్ నటరాజన్‌ను వదిలేసుకున్న జట్టు... గతేడాది వేలంలో టీమిండియా సీనియర్ పేసర్ మొహమ్మద్ షమీ, హర్షల్ పటేల్‌లను ఎంపిక చేసుకుంది. కమిన్స్, జైదేవ్ ఉనాద్కట్లకు ఈ ఇద్దరూ తోడవడంతో మన బౌలింగ్ మరింత రాటుదేలనుంది. అవకాశం వస్తే పేస్ బౌలింగ్ బాధ్యతలు నిర్వర్తించేందుకు ఆంధ్ర ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి ఉండనే ఉన్నాడు. ఆడమ్ జాంపా, రాహుల్ చహర్ స్పిన్ బాధ్యతలు మోయనున్నారు. అయితే తుది 11 మందితో కూడిన జట్టులో అనికేత్ వర్మ, అభినవ్ మనోహర్, సచిన్ బేబీలలో ఇద్దరికి అవకాశం దక్కొచ్చు. రైజర్స్ తరఫున తొలిసారి ప్రాతినిధ్యం వహిస్తున్న వీరు కూడా మేనేజ్మెంట్ అంచనాలను అందుకుంటే జట్టుకు తిరుగుండదు. పవర్‌ప్లేలో జట్టుకు వికెట్లు అందించాల్సిన బాధ్యత మాత్రం షమీపైనే ఉంది. 2022, 2023 సీజన్లలో మెరుగైన ప్రదర్శన కనబర్చిన షమీ... గాయం నుంచి తిరిగి వచ్చిన అనంతరం అదే తీవ్రత కొనసాగిస్తే జట్టుకు అదనపు బలం చేకూరినట్లే. గాయం కారణంగా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీకి దూరమైన ఆ్రస్టేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ సుదీర్ఘ విరామం తర్వాత టి20 ఫార్మాట్లో బరిలోకి దిగనున్నాడు. అతడు జట్టును ఎలా నడిపిస్తాడనేది కీలకం. గాయంతో జట్టుకు దూరమైన కార్స్ స్థానంలో దక్షిణాఫ్రికా ప్లేయర్ ముల్డర్‌ను రైజర్స్ ఎంపిక చేసుకుంది. సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు: కమిన్స్ (కెప్టేన్), ట్రావిస్ హెడ్, హెన్రిచ్ క్లాసెన్, అభిషేక్ శర్మ, నితీశ్ కుమార్ రెడ్డి, ఇషాన్ కిషన్, అథర్వ తైడె, అభినవ్ మనోహర్, అనికేత్ వర్మ, సచిన్ బేబీ, హర్షల్ పటేల్, కమిందు మెండిస్, ముల్డర్, షమీ, రాహుల్ చాహర్, ఆడమ్ జాంపా, సిమర్జీత్ సింగ్, జీషాన్ అన్సారీ, జైదేవ్ ఉనాద్కట్, ఇషాన్ మలింగ. అంచనా: గతేడాది కళ్లుచెదిరే ఆటతీరుతో రన్నరప్‌గా నిలిచిన సన్‌రైజర్స్... ఈసారి కూడా హిట్టర్లు దంచికొడితే ప్లే ఆఫ్స్ చేరడం దాదాపు ఖాయమే! -
IPL 2025: సన్‌రైజర్స్ ఆల్‌రౌండర్ రేర్ టాలెంట్
ఐపీఎల్ 2025 సీజన్ ప్రారంభానికి ముందు గత సీజన్ రన్నరప్ సన్‌రైజర్స్ హైదరాబాద్ కఠోరంగా శ్రమిస్తుంది. ఈ సీజన్ కోసం చాలా రోజుల కిందటే ప్రాక్టీస్ షూరూ చేసిన ఆరెంజ్ ఆర్మీ.. ప్రస్తుతం ఇంటర్ స్క్వాడ్ మ్యాచ్‌లతో బిజీగా ఉంది. నిన్న జరిగిన ఓ ప్రాక్టీస్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ ఆల్‌రౌండర్ కమిందు మెండిస్లోని ఓ రేర్ టాలెంట్ బయటపడింది. కమిందు రెండు చేతులతో బౌలింగ్ చేసి వైవిధ్యాన్ని ప్రదర్శించాడు. ఇన్నింగ్స్ 8వ ఓవర్ తొలి రెండు బంతులను కుడి చేతితో వేసిన కమిందు.. ఆతర్వాత బంతిని ఎడమ చేతితో బౌలింగ్ చేశాడు. కమిందు కుడి చేతితో బౌలింగ్ చేస్తూ అప్పటికే బౌండరీ బాది జోష్ మీదున్న ఇషాన్ కిషన్‌ను ఔట్ చేశాడు. ఆ తర్వాత బంతికి అభినవ్ మనోహర్ క్రీజ్‌లోకి రాగా.. అతనికి తన ఎడమ చేతి వాటాన్ని రుచి చూపించాడు. కమిందు రెండు చేతులతో బౌలింగ్ చేస్తూ ప్రదర్శించిన వైవిధ్యాన్ని సన్‌రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం సోషల్‌మీడియాలో షేర్ చేయగా.. అభిమానుల నుంచి మంచి స్పందన వస్తుంది. రేర్ టాలెంట్ అంటూ ఫ్యాన్స్ కమిందును పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. శ్రీలంక నయా సంచలనం కమిందును ఎస్ఆర్హెచ్ ఈ సీజన్ మెగా వేలంలో రూ. 75 లక్షల బేస్ ప్రైజ్‌కు కొనుగోలు చేసింది.కాగా, ఐపీఎల్-2025లో సన్‌రైజర్స్ తమ తొలి మ్యాచ్‌ను మార్చి 23న ఆడుతుంది. ఈ మ్యాచ్‌లో ఆరెంజ్ ఆర్మీ రాజస్థాన్ రాయల్స్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్ ఎస్ఆర్హెచ్ హోం గ్రౌండ్ ఉప్పల్ స్టేడియంలో జరుగనుంది. ఈ ఏడాది ఐపీఎల్ మార్చి 22న ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ కేకేఆర్.. ఆర్సీబీతో తలపడనుంది. కేకేఆర్ హోం గ్రౌండ్ ఈడెన్ గార్డెన్స్‌లో ఈ మ్యాచ్ జరుగనుంది.ఇదిలా ఉంటే, ఈ సీజన్ మెగా వేలానికి ముందు సన్‌రైజర్స్ ఎయిడెన్ మార్క్రమ్, గ్లెన్ ఫిలిప్స్ లాంటి విధ్వంకర బ్యాటర్లను వదిలేసి ఇషాన్ కిషన్, అభినవ్ మనోహర్, జయదేవ్ ఉనద్కత్ లాంటి లోకల్ టాలెంట్‌ను అక్కున చేర్చుకుంది. మెగా వేలానికి ముందు సన్‌రైజర్స్ భువనేశ్వర్ కుమార్, నటరాజన్ లాంటి నాణ్యమైన పేసర్లను కూడా వదిలేసింది. టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ షమీ, గత సీజన్ అత్యధిక వికెట్ల వీరుడు హర్షల్ పటేల్, ఆసీస్ స్టార్ స్పిన్నర్ ఆడమ్ జంపా, శ్రీలంక ఆల్‌రౌండర్ కమిందు మెండిస్ కొత్తగా జట్టులోకి చేరారు. 2025 ఐపీఎల్ కోసం సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఇదే..పాట్ కమిన్స్ (కెప్టెన్), అథర్వ్ తైడే, అభినవ్ మనోహర్, అనికేత్ వర్మ, సచిన్ బేబి, ట్రవిస్ హెడ్, నితీశ్ కుమార్ రెడ్డి, కమిందు మెండిస్, వియాన్ ముల్దర్, అభిషేక్ శర్మ, హెన్రిచ్ క్లాసెన్, ఇషాన్ కిషన్, జీషన్ అన్సారీ, మహ్మద్ షమీ, హర్షల్ పటేల్, రాహుల్ చాహర్, సిమర్జీత్ సింగ్, ఎషాన్ మలింగ, ఆడమ్ జంపా, జయదేవ్ ఉనద్కత్ -
IPL 2025: టైటిల్ లక్ష్యంగా బరిలోకి దిగనున్న సన్ రైజర్స్ హైదరాబాద్
గత సీజన్ లో అనూహ్యంగా ఫైనల్ కి దూసుకొచ్చి కోల్‌కతా నైట్ రైడర్స్ చేతిలో పరాజయంపాలై రన్నరప్ టైటిల్ తో సరిపెట్టుకున్న సన్ రైజర్స్ హైదరాబాద్ ఈ సీజన్ లో మరింత దూకుడుగా ఆడి టైటిల్ సాధించాలని ప్రణాళిక సిద్దం చేసుకుంది.ఆరు సంవత్సరాల విరామం తర్వాత సన్ రైజర్స్ 2024లో తొలిసారి ఫైనల్‌కు చేరుకుంది. సన్ రైజర్స్ తమ మొదటి ఏడు మ్యాచ్ ల లో ఐదింటి లో విజయం సాధించి గత సీజన్ లో శుభారంభం చేసింది. చివరి దశలో మరో మూడు విజయాలు నమోదు చేసుకొని గ్రూప్ దశ చివరిలో రాజస్థాన్ రాయల్స్ తో పాటు 17 పాయింట్లతో సమంగా నిలిచింది. కానీ మెరుగైన నెట్ రన్ రేట్ తో సన్ రైజర్స్ రెండవ స్థానం పొందింది. ఆ తర్వాత క్వాలిఫైయర్ 1లో కోల్‌కతా నైట్ రైడర్స్ చేతిలో పరాజయం చవిచూసింది. కానీ క్వాలిఫైయర్ 2లో రాజస్థాన్ రాయల్స్ ను ఓడించి ఫైనల్‌కు చేరుకుని అక్కడ మళ్ళీ నైట్ రైడర్స్ చేతిలో పరాజయం చేతిలో పరాజయం చవిచూసి రన్నర్ ఆప్ తో సర్దుకోవాల్సి వచ్చింది. బ్యాటింగ్ బ్యాండ్ బాజా గత సీజన్లో బ్యాటింగ్ బ్యాండ్ బాజాతో ప్రారంభించి ప్రత్యర్థులను హడలెత్తించిన సన్ రైజర్స్ ఈ ఏడాది కూడా తమ ఫార్ములా లో పెద్దగా మార్పులు చేయకపోవచ్చు. ఆస్ట్రేలియా కి చెందిన ట్రావిస్ హెడ్, భారత్ యువ ఓపెనర్ అభిషేక్ శర్మ ల ద్వయం ప్రారంభం లో తమ విధ్వంసకర బ్యాటింగ్ తో ప్రత్యర్థులను పరుగులు పెట్టించారు. గత సీజన్ లో మూడుసార్లు 250 పరుగులు కి పైగా స్కోర్ చేసి సన్ రైజర్స్ ఐపీఎల్ చరిత్రలో అత్యధిక స్కోరు సాధించిన జట్టుగా రికార్డును సృష్టించింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పై 3 వికెట్లకు 287 పరుగులు స్కోర్ తో కొత్త రికార్డ్ ని నమోదు చేసింది. అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, హెన్రిచ్ క్లాసెన్ మరియు నితీష్ కుమార్ రెడ్డి ఇప్పటికీ లైనప్‌లో ఉండటంతో మరియు వేలంలో ఇషాన్ కిషన్‌ను చేర్చడంతో, సన్ రైజర్స్ హైదరాబాద్ తన పంథాను మార్చుకునే అవకాశం లేదు. ఈ సీజన్లో కూడా సన్ రైజర్స్ యొక్క టాప్ ఐదుగురు అలాగే కొనసాగే అవకాశముంది. అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, నితీష్ కుమార్ రెడ్డి, ఇషాన్ కిషన్, హెన్రిచ్ క్లాసెన్. లీగ్‌లోని ప్రతి బౌలింగ్ లైనప్‌ను వణికించడానికి ఇది సరిపోతుంది. కర్ణాటకకు చెందిన అభినవ్ మనోహర్ కూడా దిగువ ఆర్డర్లో ఫైర్‌పవర్‌ను జోడిస్తాడు. లీగ్‌లో అత్యంత శక్తివంతమైన బ్యాటింగ్ లైనప్ సన్ రైజర్స్ హైదరాబాద్ సొంతం.బలహీనంగా బౌలింగ్ అయితే సన్ రైజర్స్ హైదరాబాద్ బౌలింగ్ కొంత బలహీనంగా ఉన్నట్టు కనిపిస్తోంది. భువనేశ్వర్ కుమార్, టి నటరాజన్‌ను తప్పించి వారి స్థానంలో మహమ్మద్ షమీ మరియు హర్షల్ పటేల్‌ను జట్టులోకి తీసుకున్నారు. ఇక సన్ రైజర్స్ ప్రధాన స్పిన్నర్ రాహుల్ చాహర్ కూడా ఇటీవలి కాలంలో ఆశించిన ఫామ్‌లో లేడు. దీంతో కెప్టెన్ పాట్ కమ్మిన్స్ భారత్ సీనియర్ పేసర్ మహమ్మద్ షమీతో కొత్త బంతిని పంచుకోవచ్చు. సన్ రైజర్స్ తమ ఓపెనింగ్ బౌలర్లుగా ప్రపంచ స్థాయి బౌలింగ్ జతతో బరిలోకి దిగనుంది. అయితే కమ్మిన్స్ మరియు ఆస్ట్రేలియా స్పిన్నర్ ఆడమ్ జంపా ఇద్దరూ విదేశీ ఆటగాళ్లు అయినందున వారిపై భారం ఎక్కువగా ఉండే అవకాశముంది, జంపా, కమిండు మెండిస్, ఎషాన్ మలింగ మరియు వియాన్ ముల్డర్లలో ఒకరిని నాల్గవ విదేశీ ఆటగాడిగా ఆడించాల్సి ఉంటుంది. జంపా ఆడటం అంటే చాహర్‌కు విశ్రాంతి ఇవ్వడం లేదా ఇద్దరు లెగ్ స్పిన్నర్లను ఫీల్డింగ్ చేయడం.ప్రధాన ఆటగాళ్లు:పాట్ కమ్మిన్స్: ప్రపంచ ప్రధాన ఫాస్ట్ బౌలర్లలో ఒకడైన పాట్ కమ్మిన్స్ జట్టు పగ్గాలు చేపట్టిన తర్వాత సన్ రైజర్స్ దశ మారిపోయింది. కమ్మిన్స్ నాయకత్వం, అపార అనుభవం ఒత్తిడి లో తట్టుకొని బౌలింగ్ చేయగల సామర్ధ్యం సన్ రైజర్స్ విజయాల్లో కీలక పాత్ర వహించే అవకాశముంది.ట్రావిస్ హెడ్: ట్రావిస్ హెడ్ సన్ రైజర్స్ బ్యాటింగ్ లైనప్‌లో చాలా ముఖ్యమైన భాగంగా మారాడు. టాప్ ఆఫ్ ది ఆర్డర్లో అతని విధ్వంసకర బ్యాటింగ్ సన్ రైజర్స్ కి శుభారంభం ఇస్తుందనడంలో సందేహం లేదు.హెన్రిచ్ క్లాసెన్: టి 20 క్రికెట్లో అత్యంత విధ్వంసక మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్లలో ఒకడిగా హెన్రిచ్ క్లాసెన్ ఖ్యాతి గడించాడు. సులభంగా బౌండరీలను క్లియర్ చేయగల అతని సామర్థ్యం మరియు స్కోరింగ్ రేటును వేగవంతం చేయడంలో నైపుణ్యం అతన్ని సన్ రైజర్స్ కి గేమ్-ఛేంజర్‌గా చేస్తాయి.అభిషేక్ శర్మ: యువ ఆల్ రౌండర్ అభిషేక్ శర్మ గత సీజన్ లో నిలకడగా ఆడి తన సామర్థ్యాన్ని ప్రదర్శించాడు. అతని దూకుడు బ్యాటింగ్ శైలి, మెరుగైన బౌలింగ్ సన్ రైజర్స్ కి అదనపు బలాన్నిస్తాయి.సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుపాట్ కమ్మిన్స్, అభిషేక్ శర్మ, నితీష్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్, ట్రావిస్ హెడ్, మహ్మద్ షమీ, హర్షల్ పటేల్, ఇషాన్ కిషన్, రాహుల్ చాహర్, ఆడమ్ జంపా, అథర్వ తైడే, అభినవ్ మనోహర్, సిమర్జీత్ సింగ్, జీషాన్ అన్సారీ, జయదేవ్ ఉనద్కట్, కమిందు మెండిస్, అనికేత్ వర్మ, ఎషాన్ మలింగ, సచిన్ బేబీ, వియాన్ ముల్డర్. -
IPL 2025: సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు గుడ్‌న్యూస్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) ఫ్రాంఛైజీ సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు శుభవార్త. ఆ జట్టు యువ ఆల్‌రౌండర్, తెలుగు తేజం నితీశ్ కుమార్ రెడ్డి (Nitish Kumar Reddy) ఫిట్నెస్ సాధించాడు. జాతీయ క్రికెట్ అకాడమీ (NCA) నుంచి క్లియరెన్స్ సర్టిఫికెట్ పొందాడు.ఈ క్రమంలో నితీశ్ రెడ్డి ఆదివారం సన్‌రైజర్స్ జట్టుతో చేరనున్నాడు. కాగా గతేడాది ఐపీఎల్లో సత్తా చాటి ‘ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్’గా నిలిచాడు ఈ విశాఖపట్నం కుర్రాడు. రైజర్స్ తరఫున బరిలోకి దిగిన ఈ పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ 13 మ్యాచ్‌లలో కలిపి 303 పరుగులు చేశాడు. అంతర్జాతీయ క్రికెట్లో అడుగుఇందులో రెండు అర్ధ శతకాలు ఉండటం విశేషం. అదే విధంగా.. మూడు వికెట్లు కూడా తీశాడు ఈ ఆంధ్ర ఆల్‌రౌండర్. ఈ నేపథ్యంలో టీమిండియా సెలక్టర్ల దృష్టిని ఆకర్షించిన నితీశ్ రెడ్డి గతేడాది అక్టోబరులో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. బంగ్లాదేశ్‌తో స్వదేశంలో టీ20 సిరీస్ సందర్భంగా అరంగేట్రం చేసిన ఈ 21 ఏళ్ల ఆటగాడు.. అనూహ్య రీతిలో అదే ఏడాది టెస్టుల్లోనూ రంగప్రవేశం చేశాడు.కంగారూ గడ్డపై శతకంతో..ఏకంగా ఆస్ట్రేలియాతో ప్రతిష్టాత్మక బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో ఆడే అవకాశం దక్కించుకున్న నితీశ్ రెడ్డి.. కంగారూ గడ్డపై అదరగొట్టాడు. ముఖ్యంగా సీనియర్లంతా విఫలమైన వేళ మెల్బోర్న్లో శతకం సాధించి క్రికెట్ ప్రపంచం దృష్టిని తనవైపునకు తిప్పుకున్నాడు. అయితే, ఇటీవల స్వదేశంలో ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌కు ఎంపికైన నితీశ్.. దురదృష్టవశాత్తూ గాయపడ్డాడు.18.1 పాయింట్లుపక్కటెముకల నొప్పి కారణంగా సిరీస్ మొత్తానికి దూరమైన నితీశ్ రెడ్డి.. ఇప్పటి వరకు మైదానంలో దిగలేదు. ఈ క్రమంలో బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో చికిత్స పొందిన అతడు.. యో-యో టెస్టు పాస్ అయ్యాడు. బెంగళూరులోని NCAలో నిర్వహించిన పరీక్షలో నితీశ్ 18.1 పాయింట్లు సాధించాడు. ఈ క్రమంలో క్లియరెన్స్ సర్టిఫికెట్ పొందిన అతడు ఆదివారం సన్‌రైజర్స్ శిబిరంలో చేరనున్నాడు.కాగా తన అంతర్జాతీయ కెరీర్లో ఇప్పటి వరకు 5 టెస్టులు ఆడిన నితీశ్ రెడ్డి.. 298 పరుగులు చేయడంతో పాటు.. ఐదు వికెట్లు తీశాడు. అదే విధంగా నాలుగు టీ20లలో కలిపి 90 రన్స్ చేసిన నితీశ్.. మూడు వికెట్లు పడగొట్టాడు. ఇక ఐపీఎల్లో ఇప్పటి వరకు 15 మ్యాచ్‌లలో కలిపి 303 పరుగులు సాధించడంతో పాటు.. మూడు వికెట్లు తీశాడు.రన్నరప్ఇదిలా ఉంటే.. గతేడాది ప్యాట్ కమిన్స్ కెప్టెన్సీలో ఫైనల్ చేరిన సన్‌రైజర్స్ టైటిల్ పోరులో మాత్రం ఓడిపోయింది. కోల్‌కతా నైట్ రైడర్స్ చేతిలో పరాజయం పాలై రన్నరప్‌తో సరిపెట్టుకుంది. ఇక ఈ ఏడాది మార్చి 23న సొంతమైదానం ఉప్పల్‌లో రైజర్స్ తమ తొలి మ్యాచ్ ఆడనుంది. రాజస్తాన్ రాయల్స్‌తో మ్యాచ్‌తో తమ ఐపీఎల్-2025లో ప్రయాణం మొదలుపెట్టనుంది. కాగా కోల్‌కతా- బెంగళూరు మధ్య పోరుతో మార్చి 22 నుంచి తాజా ఎడిషన్ ఆరంభం కానుంది.చదవండి: ఇంగ్లండ్‌తో టెస్టులు.. టీమిండియా కెప్టెన్‌గా అతడే! బీసీసీఐ గ్రీన్ సిగ్నల్? -
అతడి గురించి ఎవరూ మాట్లాడమే లేదు.. మూడో స్థానంలో ఆడిస్తారా?
ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL) ద్వారా వెలుగులోకి వచ్చి టీమిండియా తరఫున అరంగేట్రం చేసిన ఆటగాళ్లు ఎంతో మంది ఉన్నారు. జస్ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యా మొదలు.. తాజాగా అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హర్షిత్ రాణా, నితీశ్ కుమార్ రెడ్డి లాంటి వాళ్లు ఇందుకు నిదర్శనం. అయితే, ఒకప్పుడు టీమిండియా స్టార్‌గా వెలిగి.. ఇప్పుడు జట్టులో చోటే కరువైన ప్లేయర్ ఇషాన్ కిషన్(Ishan Kishan).సెలక్టర్లు అతడిని పట్టించుకోవడం లేదుజాతీయ జట్టు ఓపెనర్‌గా చిన్న వయసులోనే ఓ వెలుగు వెలిగిన 26 ఏళ్ల ఇషాన్.. క్రమశిక్షణా రాహిత్యం వల్ల బోర్డు ఆగ్రహానికి గురయ్యాడు. ఫలితంగా టీమిండియాలో చోటు కోల్పోయాడు. ప్రస్తుతం ఓపెనింగ్ స్థానంతో పాటు వికెట్ కీపర్‌గానూ సెలక్టర్లు అతడిని పరిగణనలోకి తీసుకునే పరిస్థితి లేదు.కేఎల్ రాహుల్, రిషభ్ పంత్, సంజూ శాంసన్ కీపర్ల కోటాలో పాతుకుపోగా.. కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma)కు ఓపెనింగ్ జోడీగా శుబ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్ ఆయా ఫార్మాట్లలో కొనసాగుతున్నారు. అయితే, ఇషాన్ కిషన్‌కు ఐపీఎల్-2025 రూపంలో సువర్ణావకాశం వచ్చిందంటున్నాడు భారత మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా. రూ. 11.25 కోట్లకు కొనుగోలుక్యాష్ రిచ్ లీగ్ పద్దెమినిదవ ఎడిషన్‌లో సత్తా చాటితే మరోసారి సెలక్టర్ల దృష్టిని ఆకర్షించవచ్చని పేర్కొన్నాడు. కాగా గతేడాది వరకు ముంబై ఇండియన్స్ తరఫున ఆడిన ఇషాన్‌ను మెగా వేలానికి ముందు ఫ్రాంఛైజీ వదిలేసింది. ఈ క్రమంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు అతడిని ఏకంగా రూ. 11.25 కోట్లకు కొనుగోలు చేసింది.అయితే, రైజర్స్ జట్టులో ఇప్పటికే విధ్వంసకర ఓపెనింగ్ జోడీగా ట్రవిస్ హెడ్- అభిషేక్ శర్మ తమ స్థానాలు సుస్థిరం చేసుకున్నారు. గతేడాది జట్టు ఫైనల్ వరకు చేరడంలో ఈ ఇద్దరిది కీలక పాత్ర. కాబట్టి ఇషాన్ కిషన్‌కు ఓపెనర్‌గా ఛాన్స్ రాదు. టాపార్డర్‌లోనే ఉండాలంటే.. అతడు మూడో స్థానంలో ఆడాల్సిన పరిస్థితి.ఎవరూ కనీసం మాట్లాడటం లేదుఈ నేపథ్యంలో కామెంటేటర్ ఆకాశ్ చోప్రా మాట్లాడుతూ.. ‘‘ఇషాన్ కిషన్‌కు మరోసారి గొప్ప అవకాశం వచ్చింది. కారణమేదైనా టీమిండియా సెలక్టర్లు అతడిని అస్సలు పట్టించుకోవడం లేదు. రంజీల్లో ఆడి తనను తాను నిరూపించుకున్నాడు. పరుగులు చేశాడు.అయినా సరే అతడి ప్రాధాన్యాన్ని సెలక్టర్లు గుర్తించడం లేదు. అతడి గురించి ఎవరూ కనీసం మాట్లాడటం లేదు. జాతీయ జట్టులో స్థానం కోసం చేయాల్సిందంతా చేస్తున్నాడు. కానీ.. అసలు అతడి పేరు కూడా తెరమీదకు రావడం లేదు. వన్డేల్లో డబుల్ సెంచరీ చేయడం అందరికీ సాధ్యం కాదు.కానీ ఇషాన్ ఆ పని చేసి చూపించాడు. భారీ సిక్సర్లు బాదగల సమర్థత, మ్యాచ్‌ను ఒంటిచేత్తో మలుపు తిప్పగల సత్తా అతడికి ఉన్నాయి. ఇక సన్‌రైజర్స్ అతడిని మూడో స్థానంలో ఆడించేందుకు తీసుకుందని తెలిసి నేను ఆశ్చర్యపోయాను.సద్వినియోగం చేసుకుంటేఓపెనర్ల కోటా ఖాళీ లేదు కాబట్టి వాళ్లకూ వేరే ఆప్షన్ లేదు. ముఖ్యంగా టీ20 క్రికెట్లో వేరే స్థానంలో ఆడి పరుగులు రాబట్టడం అంత తేలికేమీ కాదు. అయితే, ఇషాన్ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే అతడికి తిరుగు ఉండదు.ప్రస్తుతం టీమిండియలో బ్యాటర్ల స్థానాలు ఫిక్స్‌డ్‌గా ఏమీ లేవు. ఏస్థానంలోనైనా బ్యాటింగ్ చేయగల ఆటగాళ్లకు ప్రాధాన్యం ఇవ్వాలని హెడ్‌కోచ్ గౌతం గంభీర్ భావిస్తున్నాడు. కాబట్టి ఇషాన్ ఐపీఎల్-2025లో సత్తా చాటితే కచ్చితంగా టీమిండియాలోకి రాగలడు’’ అని ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు.కాగా మార్చి 22 నుంచి ఐపీఎల్ ఆరంభం కానుండగా.. సన్‌రైజర్స్ మార్చి 23న తమ తొలి మ్యాచ్ ఆడనుంది. రాజస్తాన్ రాయల్స్‌తో హైదరాబాద్ వేదికగా తలపడనుంది.చదవండి: టీమిండియా ఆడకుంటే రూ. 45 కోట్ల నష్టం! -
IPL 2025: సన్‌రైజర్స్ తొలి రెండు మ్యాచ్‌ల టికెట్లు అమ్మకం
సాక్షి, హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 18వ సీజన్లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు సొంతగడ్డపై ఆడే తొలి రెండు మ్యాచ్‌లకు సంబంధించి టికెట్లను ఈరోజు ఆన్లైన్లో విక్రయించనున్నారు. ఈనెల 23న ఉప్పల్ స్టేడియంలో జరిగే తమ తొలి లీగ్ మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ జట్టుతో సన్‌రైజర్స్ ఆడనుంది. ఈ మ్యాచ్ మధ్యాహ్నం గం. 3:30 నుంచి జరుగుతుంది. అనంతరం ఈనెల 27న ఉప్పల్ స్టేడియంలోనే జరిగే రెండో లీగ్ మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌తో సన్‌రైజర్స్ తలపడుతుంది. ఈ మ్యాచ్‌ను రాత్రి గం. 7:30 నుంచి నిర్వహిస్తారు. ఈ రెండు లీగ్ మ్యాచ్‌లకు సంబంధించి టికెట్లను ఈరోజు ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నారు. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ మ్యాచ్‌ల అధికారిక టికెటింగ్ పార్ట్నర్ districtappలో district.in వెబ్సైట్లో ఈ టికెట్లను ఆన్లైన్లో కొనుగోలు చేయవచ్చు. -
IPL 2025: సన్‌రైజర్స్ జట్టులోకి సౌతాఫ్రికా ఆల్‌రౌండర్
సన్‌రైజర్స్ హైదరాబాద్(Sunrisers Hyderabad) జట్టులోకి కొత్త క్రికెటర్ వచ్చాడు. సౌతాఫ్రికాకు చెందిన వియాన్ ముల్దర్(Wiaan Muldar)కు రైజర్స్ స్వాగతం పలికింది. ఈ ప్రొటిస్ ఆల్‌రౌండర్‌ను తమ జట్టులోకి చేర్చుకున్నట్లు హైదరాబాద్ ఫ్రాంఛైజీ గురువారం అధికారిక ప్రకటన విడుదల చేసింది. గాయం కారణంగా దూరమైన బ్రైడన్ కార్సే స్థానాన్ని ముల్దర్‌తో భర్తీ చేసినట్లు వెల్లడించింది.ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL)-2025 మెగా వేలానికి ముందు సన్‌రైజర్స్ ఐదుగురు ప్లేయర్లను రిటైన్ చేసుకున్న విషయం తెలిసిందే. సౌతాఫ్రికా స్టార్ హిట్టర్ హెన్రిచ్ క్లాసెన్(రూ. 23 కోట్లు), ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్(రూ. 18 కోట్లు), టీమిండియా స్టార్లు అభిషేక్ శర్మ(రూ. 14 కోట్లు), నితీశ్ కుమార్ రెడ్డి(రూ. 6 కోట్లు ), ఆసీస్ హార్డ్ హిట్టర్ ట్రావిస్ హెడ్(రూ. 14 కోట్లు)లను రైజర్స్ యాజమాన్యం అట్టిపెట్టుకుంది.ఈ క్రమంలో రూ. 45 కోట్ల పర్సు వాల్యూతో ఐపీఎల్-2025 మెగా వేలం బరిలో దిగిన సన్‌రైజర్స్.. ఇషాన్ కిషన్, హర్షల్ పటేల్, మహ్మద్ షమీ, రాహుల్ చహర్ వంటి భారత స్టార్లతో పాటు ఆడం జంపా, బ్రైడన్ కార్సే, కమిందు మెండిస్, ఇషాన్ మలింగ రూపంలో విదేశీ క్రికెటర్లను కూడా కొనుగోలు చేసింది.బొటనవేలికి గాయం.. సీజన్ మొత్తానికి దూరంఅయితే, ఇంగ్లండ్ రైటార్మ్ ఫాస్ట్‌బౌలర్ బ్రైడన్ కార్సే ఇటీవల గాయపడ్డాడు. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 టోర్నమెంట్లో భాగంగా ఫిబ్రవరి 22న ఆస్ట్రేలియాతో మ్యాచ్ సందర్భంగా.. కార్సే బొటనవేలికి గాయమైంది. ఫలితంగా అతడు ఈ వన్డే టోర్నీలో మిగిలిన మ్యాచ్‌లకు దూరమైనట్లు ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. అతడి స్థానంలో రెహాన్ అహ్మద్‌ను తీసుకువచ్చింది.ఇక ఐపీఎల్ నాటికి కూడా కార్సే కోలుకునే పరిస్థితి లేకపోవడంతో 18వ సీజన్ మొత్తానికి అతడు దూరమైనట్లు సన్‌రైజర్స్ ప్రకటించింది. అతడి స్థానంలో వియాన్ ముల్దర్‌ను రూ. 75 లక్షలకు జట్టులోకి తీసుకుంది. త్వరలోనే ఈ ఆల్‌రౌండర్ సన్‌రైజర్స్‌తో చేరనున్నాడు. ఆఖరిగా సెమీస్లోకాగా 27 ఏళ్ల వియాన్ ముల్దర్ పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్. కుడిచేతం వాటం బ్యాటర్ అయిన అతడు.. రైటార్మ్ మీడియం పేసర్. చాంపియన్స్ ట్రోఫీ-2025లో ఆడిన ఈ ప్రొటిస్ ప్లేయర్ చివరగా న్యూజిలాండ్‌తో సెమీస్‌లో మాత్రం నిరాశపరిచాడు. కేన్ విలియమ్సన్(102) రూపంలో కీలక వికెట్ తీసినా.. బ్యాటింగ్‌లో మాత్రం నిరాశపరిచాడు. ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి 13 బంతులు ఎదుర్కొన్న ముల్దర్ కేవలం ఎనిమిది పరుగులే చేసి.. మైకైల్ బ్రాస్‌వెల్ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. ఇక సౌతాఫ్రికా తరఫున 2017లో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన ముల్దర్ ఇప్పటి వరకు 18 టెస్టులు, 24 వన్డేలు, 11 టీ20లు ఆడాడు. ఆయా ఫార్మాట్లలో వరుసగా 589, 268, 105 పరుగులు చేయడంతో పాటు... 30, 21, 8 వికెట్లు కూల్చాడు. టెస్టుల్లో అతడి ఖాతాలో ఓ శతకం కూడా ఉండటం విశేషం. ఇదిలా ఉంటే.. సన్‌రైజర్స్ గతేడాది కమిన్స్ కెప్టెన్సీలో ఫైనల్ చేరింది.. కానీ కోల్‌కతా నైట్ రైడర్స్‌కు టైటిల్‌ను చేజార్చుకుంది.ఐపీఎల్-2025లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుహెన్రిచ్ క్లాసెన్, ప్యాట్ కమిన్స్, ట్రవిస్ హెడ్, అభిషేక్ శర్మ, నితీశ్ కుమార్ రెడ్డి, ఇషాన్ కిషన్, మహ్మద్ షమీ, హర్షల్ పటేల్, రాహుల్ చహర్, అభినవ్ మనోహర్, ఆడం జంపా., సిమర్జీత్ సింగ్, ఇషాన్ మలింగ, బ్రైడన్ కార్సే, జయదేవ్ ఉనాద్కట్, కమిందు మెండిస్, జీషాన్ అన్సారీ, అనికేత్ వర్మ, అథర్వ టైడే.చదవండి: వాళ్లిద్దరు అద్భుతం.. టీమిండియాపై ఒత్తిడి పెంచాం.. మరోసారి: సాంట్నర్ వార్నింగ్ Welcome onboard 🧡The all-rounder from 🇿🇦 is now a RISER 🔥#PlayWithFire pic.twitter.com/we4AfNuExc— SunRisers Hyderabad (@SunRisers) March 6, 2025 -
SRH: హైదరాబాదీలకు పండుగే.. సన్‌రైజర్స్ ప్రాక్టీస్ ఆరోజే మొదలు
ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL)-2025 నేపథ్యంలో ఉప్పల్ స్టేడియం కొత్త హంగులతో సిద్ధం కానుంది. రెండు వారాల్లోపు పునరుద్ధరణ పనులు పూర్తి కానున్నట్లు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(HCA) అధ్యక్షుడు జగన్ మోహన్ రావు తెలిపారు. అదే విధంగా సన్‌రైజర్స్ హైదరాబాద్(Sunrisers Hyderabad) జట్టు ప్రాక్టీస్ సెషన్ తేదీని కూడా ఈ సందర్భంగా వెల్లడించారు. విధ్వంసకర బ్యాటింగ్‌కు మారుపేరుగాకాగా గతేడాది ఐపీఎల్లో సన్‌రైజర్స్ అదరగొట్టిన విషయం తెలిసిందే. మూడేళ్లుగా ఎదురైన వైఫల్యాలను అధిగమించి.. వరుస విజయాలతో ఫైనల్‌కు దూసుకువెళ్లింది. కమిన్స్ సారథ్యంలో.. విధ్వంసకర బ్యాటింగ్‌కు మారుపేరుగా మారి రికార్డులు కొల్లగొట్టింది. అయితే, ఆఖరి పోరులో కోల్‌కతా నైట్ రైడర్స్ చేతిలో ఓటమిపాలైన రైజర్స్ రన్నరప్‌తో సరిపెట్టుకుంది.అయితే, టైటిల్ చేజారినా టోర్నీ ఆసాంతం అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుని ఆరెంజ్ ఆర్మీ మనసులు గెలుచుకుంది. ఇక ఈ ఏడాది సన్‌రైజర్స్ సరికొత్తగా అభిమానుల ముందుకు రానుంది. ఐపీఎల్-2025 మెగా వేలానికి ముందు ఐదుగురు ఆటగాళ్లను రీటైన్ చేసుకున్న రైజర్స్ యాజమాన్యం.. హెన్రిచ్ క్లాసెన్(దక్షిణాఫ్రికా) కోసం అత్యధికంగా రూ. 23 కోట్లు ఖర్చు చేసింది.కమిన్స్ సారథ్యంలోనేఅదే విధంగా ప్యాట్ కమిన్స్(ఆస్ట్రేలియా)ను రూ. 18 కోట్లు, అభిషేక్ శర్మ(భారత్)ను రూ. 14 కోట్లు, ట్రావిస్ హెడ్(ఆస్ట్రేలియా)ను రూ. 14 కోట్లు, నితీశ్ రెడ్డి(భారత్)ని రూ. 6 కోట్లకు అట్టిపెట్టుకుంది. ఇక వేలంపాటలో భాగంగా టీమిండియా స్టార్లు ఇషాన్ కిషన్, మహ్మద్ షమీలను కొనుగోలు చేసిన సన్‌రైజర్స్ కమిన్స్ సారథ్యంలోనే తాము ఈసారీ బరిలోకి దిగుతామని ప్రకటించింది.ఇదిలా ఉంటే.. మార్చి 22 నుంచి ఐపీఎల్ పద్దెమినిదవ సీజన్ మొదలుకానుంది. డిఫెండింగ్ చాంపియన్ కోల్‌కతా నైట్ రైడర్స్- రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య మ్యాచ్‌తో ఈ క్యాష్ రిచ్ లీగ్ 2025 ఎడిషన్‌కు తెరలేవనుంది. ఈ క్రమంలో మార్చి 23న సన్‌రైజర్స్ హైదరాబాద్ తమ సొంత మైదానం ఉప్పల్‌లో రాజస్తాన్‌తో తొలి మ్యాచ్ ఆడనుంది.హైదరాబాదీలకు పండుగే.. సన్‌రైజర్స్ ప్రాక్టీస్ ఆరోజే మొదలుఈ నేపథ్యంలో రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియం పునరుద్ధరణ పనులు వేగవంతం చేశామని HCA అధ్యక్షుడు జగన్ మోహన్ రావు తాజాగా వెల్లడించారు. వార్తా సంస్థ ఏఎన్ఐతో మాట్లాడుతూ.. ‘‘ఈసారి హైదరాబాద్ ప్రజలకు పండుగే. మనకు ఇక్కడ తొమ్మిది మ్యాచ్‌లు జరుగబోతున్నాయి.ప్రేక్షకులకు మరింత మెరుగైన అనుభవాన్ని ఇచ్చేందుకు రెనోవేషన్ చేస్తున్నాం. గతంలో అద్భుతమైన పిచ్‌లు రూపొందించినందుకు గానూ అవార్డు అందుకున్నాం. రానున్న పదిహేను రోజుల్లో పునరుద్ధరణ పనులు పూర్తవుతాయి. ఐపీఎల్ మ్యాచ్‌ల నిర్వహణకు మైదానం సిద్ధమవుతుంది. మార్చి 2 నుంచి సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఇక్కడ ప్రాక్టీస్ మ్యాచ్‌లు మొదలుపెడుతుంది’’అని జగన్ మోహన్ రావు తెలిపారు.ఐపీఎల్-2025లో సన్‌రైజర్స్ హైదరాబాద్ షెడ్యూల్👉మార్చి 23- సన్‌రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ (హైదరాబాద్)👉మార్చి 27 - సన్‌రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ లక్నో సూపర్ జెయింట్స్ (హైదరాబాద్)👉మార్చి 30- సన్‌రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ (వైజాగ్)👉ఏప్రిల్ 3- సన్‌రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ కేకేఆర్ (కోల్‌కతా)👉ఏప్రిల్ 6- సన్‌రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్ (హైదరాబాద్)👉ఏప్రిల్ 12 - సన్‌రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ (హైదరాబాద్)👉ఏప్రిల్ 17- సన్‌రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ ముంబై ఇండియన్స్ (ముంబై)👉ఏప్రిల్ 23- సన్‌రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ ముంబై ఇండియన్స్ (హైదరాబాద్)👉ఏప్రిల్ 25- సన్‌రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ సీఎస్కే (చెన్నై)👉మే 2- సన్‌రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్ (అహ్మదాబాద్)👉మే 5- సన్‌రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ (హైదరాబాద్)👉మే 10- సన్‌రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ కేకేఆర్ (హైదరాబాద్)👉మే 13- సన్‌రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ ఆర్సీబీ (బెంగళూరు)👉మే 18- సన్‌రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ లక్నో (లక్నో)ఐపీఎల్ 2025లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుఅథర్వ తైడే, అభినవ్ మనోహర్, అనికేత్ వర్మ, సచిన్ బేబి, ట్రవిస్ హెడ్, నితీశ్ కుమార్ రెడ్డి, అభిషేక్ శర్మ, కమిందు మెండిస్, హెన్రిచ్ క్లాసెన్, ఇషాన్ కిషన్, జీషన్ అన్సారీ, ప్యాట్ కమిన్స్ (కెప్టెన్), మహ్మద్ షమీ, హర్షల్ పటేల్, రాహుల్ చాహర్, సిమ్రన్‌జీత్ సింగ్, ఎషాన్ మలింగ, ఆడమ్ జంపా, జయదేశ్ ఉనాద్కట్, బ్రైడన్ కార్సే.చదవండి: ఆస్ట్రేలియానూ వదలకండి: అఫ్గనిస్తాన్ జట్టుపై పాక్ మాజీ క్రికెటర్ ప్రశంసలు #WATCH | Hyderabad, Telangana: Rajiv Gandhi International Cricket Stadium being renovated for upcoming IPL matchesJagan Mohan Rao, President, Hyderabad Cricket Association, says, " There is good news for Hyderabad people, this time we are getting 9 matches (of IPL)...for that… pic.twitter.com/qyQ3CKOd44— ANI (@ANI) February 27, 2025 -
హైదరాబాద్ ఫ్యాన్ కు పండుగ.. కెప్టెన్ గా నితీశ్ రెడ్డి?
-
ఐపీఎల్ 2025లో SRH షెడ్యూల్ ఇదే.. హైదరాబాద్‌లో జరుగబోయే మ్యాచ్‌లు ఇవే..!
ఐపీఎల్ 2025 షెడ్యూల్‌ను బీసీసీఐ ఇవాళ (ఫిబ్రవరి 16) విడుదల చేసింది. 65 రోజుల పాటు జరిగే ఈ సీజన్లో మొత్తం 74 మ్యాచ్‌లు జరుగనున్నాయి. దేశవ్యాప్తంగా 13 వేదికల్లో మెగా లీగ్ నిర్వహించబడుతుంది. ఈ సీజన్ తొలి మ్యాచ్ మార్చి 22న జరుగనుంది. ఈ మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ కోల్‌కతా నైట్‌రైడర్స్.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడనుంది. ఈ మ్యాచ్ కేకేఆర్ హోం గ్రౌండ్ అయిన ఈడెన్ గార్డెన్స్‌లో జరుగుతుంది.ఇదే ఈడెన్ గార్డెన్స్‌లో క్వాలిఫయర్-2 (మే 23) మరియు ఫైనల్ మ్యాచ్‌లు (మే 25) జరుగనున్నాయి. హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో క్వాలిఫయర్-1 (మే 20) మరియు ఎలిమినేటర్ (మే 21) మ్యాచ్‌లు జరుగుతాయి.మార్చి 23న జరిగే సీజన్ రెండో మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్.. రాజస్థాన్ రాయల్స్‌తో తలపడుతుంది. ఈ మ్యాచ్‌ను ఎస్ఆర్హెచ్ తమ సొంత మైదానమైన ఉప్పల్ స్టేడియంలో ఆడుతుంది. ఈ సీజన్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ మొత్తం 14 మ్యాచ్‌లు ఆడుతుంది (ప్లే ఆఫ్స్ కాకుండా). ఇందులో ఏడు మ్యాచ్‌లు హైదరాబాద్‌లో జరుగనున్నాయి. వీటితో పాటు క్వాలిఫయర్-1 (మే 20) మరియు ఎలిమినేటర్ (మే 21) మ్యాచ్‌లు కూడా హైదరాబాద్‌లోనే జరుగుతాయి.విశాఖపట్నంలో రెండు మ్యాచ్‌లు జరుగుతాయి. ఇందులో ఒకటి సన్‌రైజర్స్ ఆడే మ్యాచ్ కాగా.. రెండోది ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ లక్నో సూపర్ జెయింట్స్ (మార్చి 24) మ్యాచ్.ఈ సీజన్లో సన్‌రైజర్స్.. ఢిల్లీ, కేకేఆర్, ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జెయింట్స్, గుజరాత్ టైటాన్స్‌తో తలో రెండు మ్యాచ్‌లు ఆడుతుంది. రాజస్థాన్, ఆర్సీబీ, పంజాబ్, సీఎస్కేతో తలో మ్యాచ్ ఆడుతుంది. ఐపీఎల్-2025లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆడే మ్యాచ్‌లు..మార్చి 23 (ఆదివారం)- సన్‌రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ (హైదరాబాద్)మార్చి 27 (గురువారం)- సన్‌రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ లక్నో సూపర్ జెయింట్స్ (హైదరాబాద్)మార్చి 30 (ఆదివారం)- సన్‌రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ (వైజాగ్)ఏప్రిల్ 3 (గురువారం)- సన్‌రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ కేకేఆర్ (కోల్‌కతా)ఏప్రిల్ 6 (ఆదివారం)- సన్‌రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్ (హైదరాబాద్)ఏప్రిల్ 12 (శనివారం)- సన్‌రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ (హైదరాబాద్)ఏప్రిల్ 17 (గురువారం)- సన్‌రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ ముంబై ఇండియన్స్ (ముంబై)ఏప్రిల్ 23 (బుధవారం)- సన్‌రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ ముంబై ఇండియన్స్ (హైదరాబాద్)ఏప్రిల్ 25 (శుక్రవారం)- సన్‌రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ సీఎస్కే (చెన్నై)మే 2 (శుక్రవారం)- సన్‌రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్ (అహ్మదాబాద్)మే 5 (సోమవారం)- సన్‌రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ (హైదరాబాద్)మే 10 (శనివారం)- సన్‌రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ కేకేఆర్ (హైదరాబాద్)మే 13 (మంగళవారం)- సన్‌రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ ఆర్సీబీ (బెంగళూరు)మే 18 (ఆదివారం)- సన్‌రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ లక్నో (లక్నో)ఐపీఎల్ 2025 సీజన్ కోసం సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు..అథర్వ తైడే, అభినవ్ మనోహర్, అనికేత్ వర్మ, సచిన్ బేబి, ట్రవిస్ హెడ్, నితీశ్ కుమార్ రెడ్డి, అభిషేక్ శర్మ, కమిందు మెండిస్, హెన్రిచ్ క్లాసెన్, ఇషాన్ కిషన్, జీషన్ అన్సారీ, పాట్ కమిన్స్ (కెప్టెన్), మొహమ్మద్ షమీ, హర్షల్ పటేల్, రాహుల్ చాహర్, సిమ్రన్‌జీత్ సింగ్, ఎషాన్ మలింగ, ఆడమ్ జంపా, జయదేశ్ ఉనద్కత్, బ్రైడన్ కార్స్ -
IPL 2025: కీలక మ్యాచ్‌లకు ఆతిథ్యమివ్వనున్న హైదరాబాద్
ఐపీఎల్–2025 సీజన్ మార్చి 22 నుంచి ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ కోల్‌కతా నైట్‌రైడర్స్ హోం గ్రౌండ్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో తలపడుతుంది. మార్చి 23న ఉప్పల్ స్టేడియంలో జరిగే పోరులో గతేడాది రన్నరప్ సన్‌రైజర్స్ హైదరాబాద్.. రాజస్తాన్ రాయల్స్‌ను ఢీకొంటుంది. అదే రోజు ఆదివారం చెన్నై వేదికగా ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ జరుగుతుంది. చాంపియన్స్ ట్రోఫీ ముగిసిన 12 రోజుల తర్వాత ఐపీఎల్ మొదలవుతుంది.మే 25న ఫైనల్‌కు కూడా కోల్‌కతానే వేదిక కానుండగా... క్వాలిఫయర్ 1, ఎలిమినేటర్ మ్యాచ్‌లు హైదరాబాద్‌లోనే జరుగుతాయి. పది జట్లు పాల్గొనే ఈ టోర్నీలో పది టీమ్‌ల సొంత మైదానాలతో పాటు రెండు ఇతర వేదికలు (ధర్మశాల, గువహటి) కలిపి మొత్తం 12 చోట్ల లీగ్‌ను నిర్వహిస్తారు. రాజస్తాన్ రాయల్స్ టీమ్‌కు గువహటి తమ రెండో సొంత వేదిక కాగా...ప్రతీ ఏడాదిలాగే ఈ సారి కూడా పంజాబ్ కింగ్స్ తమ మూడు హోం మ్యాచ్‌లను ధర్మశాలలో ఆడుతుంది. -
అభిషేక్ శర్మ తుపాన్ ఇన్నింగ్స్.. నితీశ్ రెడ్డి ఊరమాస్ కామెంట్! వైరల్
ఇంగ్లండ్‌తో ఐదో టీ20(India vs England)లో టీమిండియా ఓపెనర్ అభిషేక్ శర్మ(Abhishek Sharma) సృష్టించిన పరుగుల విధ్వంసాన్ని ఎవరూ అంత తేలికగా మర్చిపోలేరు. సహచరులు విఫలమైన చోట.. ‘చేతికే బ్యాట్ మొలిచిందా’ అన్నట్లుగా.. పొట్టి ఫార్మాట్‌కే వన్నె తెచ్చేలా అతడి ఇన్నింగ్స్ సాగింది.మిగిలిన భారత ఆటగాళ్లు పెవిలియన్‌కు క్యూ కట్టిన వేళ.. తను మాత్రం ‘తగ్గేదేలే’ అన్నట్లు ప్రత్యర్థి బౌలింగ్‌ను చితక్కొట్టిన విధానం టీ20 ప్రేమికులకు అసలైన మజా అందించింది. ఈ నేపథ్యంలో అభిషేక్ శర్మపై ప్రశంసల వర్షం కురుస్తోంది. నితీశ్ రెడ్డి ఊరమాస్ కామెంట్!ఈ క్రమంలో అభిషేక్ శర్మను ఉద్దేశించి సహచర ఆటగాడు, సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్మేట్ నితీశ్ కుమార్ రెడ్డి(Nitish Kumar Reddy) పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది. సలార్ సినిమాలో ప్రభాస్ కత్తి పట్టుకుని ఉన్న ఫొటోతో పాటు.. బ్యాట్‌తో అభిషేక్ పోజులిస్తున్న ఫొటోను పంచుకున్న నితీశ్.. ‘‘మెంటల్ నా కొడుకు’’ అంటూ క్యాప్షన్ జతచేశాడు. ఇందుకు సెల్యూట్ ఎమోజీతో పాటు లవ్ సింబల్ జతచేశాడు. పూనకం వస్తే అతడిని ఎవరూ ఆపలేరన్న అర్థంలో అభిషేక్ ఇన్నింగ్స్‌ను ప్రశంసిస్తూ ఇలా ఊరమాస్ కామెంట్ పెట్టాడు. అయితే, కొంతమంది నెటిజన్లు మాత్రం నితీశ్ వాడిన పదాన్ని తప్పుబడుతుండగా.. మరికొందరు అభిషేక్ ఆట తీరును వర్ణించేందుకే ఆ పదం వాడాడని పేర్కొంటున్నారు.150 పరుగుల తేడాతో మట్టికరిపించికాగా ఇప్పటికే ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌ను టీమిండియా 3-1తో కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆదివారం నాటి నామమాత్రపు ఐదో టీ20లోనూ సూర్యకుమార్ సేన సత్తా చాటింది. సమిష్టి ప్రదర్శనతో బట్లర్ బృందాన్ని 150 పరుగుల తేడాతో మట్టికరిపించి ఏకపక్ష విజయం సాధించింది. ప్రఖ్యాత వాంఖడే మైదానంలో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ భారీ స్కోరు సాధించింది. ఇందుకు ప్రధాన కారణం అభిషేక్ శర్మ.ఆది నుంచే ఆకాశమే హద్దుగా చెలరేగిన అభిషేక్ శర్మ.. పదిహేడు బంతుల్లోనే హాఫ్ సెంచరీ మార్కు అందుకున్నాడు. అదే జోరులో 37 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకున్న ఈ ఎడమచేతి వాటం బ్యాటర్.. మొత్తంగా 54 బంతుల్లో 135 పరుగులు సాధించాడు. అతడి ఇన్నింగ్స్‌లో ఏడు ఫోర్లు, పదమూడు సిక్స్‌లు ఉన్నాయి.అభిషేక్ సునామీ ఇన్నింగ్స్ కారణంగా నిర్ణీత 20 ఓవర్లలో టీమిండియా తొమ్మిది వికెట్ల నష్టానికి 247 పరుగులు సాధించింది. అయితే, లక్ష్య ఛేదనలో ఆది నుంచే తడబడ్డ ఇంగ్లండ్ 97 పరుగులకే కుప్పకూలింది. ఫలితంగా టీమిండియాకు ఘన విజయం దక్కింది. దీంతో 4-1తో ఈ ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను సూర్యకుమార్ సేన సొంతం చేసుకుంది.కాగా అంతర్జాతీయ టీ20లలో అభిషేక్ శర్మకు రెండో శతకం. ఇంతకు ముందు జింబాబ్వేపై అతడు సెంచరీ సాధించాడు. ఇక ఐపీఎల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ఆడుతున్న అభిషేక్ శర్మ.. గత సీజన్లో పరుగుల వరద పారించాడు. మరో ఓపెనర్ ట్రవిస్ హెడ్‌తో కలిసి విధ్వంసక బ్యాటింగ్‌తో చెలరేగి.. జట్టు ఫైనల్ చేరడంలో కీలక పాత్ర పోషించాడు. గాయం వల్ల దూరంఇక విశాఖపట్నం కుర్రాడు, పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి కూడా సన్‌రైజర్స్‌కే ప్రాతినిథ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. టీమిండియాలోనూ ఇద్దరూ కలిసే ఆడుతున్నారు. ఈ నేపథ్యంలో అభిషేక్‌తో స్నేహం దృష్ట్యా ఈ మేర కామెంట్ చేయడం గమనార్హం. కాగా నితీశ్ రెడ్డి కూడా ఇంగ్లండ్‌తో టీ20లకు సెలక్ట్ అయ్యాడు. కోల్‌కతా మ్యాచ్‌లో కూడా భాగమయ్యాడు. అయితే, గాయం కారణంగా అనంతరం జట్టుకు దూరమయ్యాడు. చదవండి: టీమిండియా ప్రపంచ రికార్డు.. సరికొత్త చరిత్ర -
ప్రపంచంలోనే బెస్ట్ బౌలర్ బుమ్రా.. నా మనుమలకూ చెబుతా: ఆసీస్ స్టార్ బ్యాటర్
టీమిండియా ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రాపై ఆస్ట్రేలియా బ్యాటర్ ట్రవిస్ హెడ్ ప్రశంసల వర్షం కురిపించాడు. ప్రపంచంలోని అత్యుత్తమ, గొప్ప బౌలర్లలో బుమ్రా ఒకడని కొనియాడాడు. అతడి బౌలింగ్‌లో ఆడటం తనకు దక్కిన గౌరవమని.. తన మనవళ్లకు కూడా ఈ విషయం గురించి గర్వంగా చెప్పగలనంటూ బుమ్రాను ఆకాశానికెత్తాడు.భారత జట్టు బోర్డర్- గావస్కర్ ట్రోఫీ ఆడేందుకు ఆసీస్ గడ్డపై అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో భాగంగా పెర్త్ మ్యాచ్‌లో టీమిండియా భారీ విజయం సాధించింది. బుమ్రా కెప్టెన్సీలో ఆసీస్‌ను ఏకంగా 295 పరుగుల తేడాతో మట్టికరిపించి.. కంగారూ గడ్డపై అతిపెద్ద విజయాన్ని నమోదు చేసింది.ఇటు కెప్టెన్‌గా.. అటు బౌలర్గానూఫలితంగా పెర్త్ వేదికగా తొలి టెస్టులో ఇటు కెప్టెన్‌గా.. అటు బౌలర్‌గానూ బుమ్రాకు మంచి మార్కులు పడ్డాయి. ఈ మ్యాచ్‌లో రైటార్మ్ పేసర్ బుమ్రా మొత్తంగా ఎనిమిది వికెట్లు కూల్చి.. ఆసీస్ బ్యాటింగ్ ఆర్డర్‌ను కుదేలుచేశాడు. తద్వారా టీమిండియా గెలుపులో కీలక పాత్ర పోషించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. బుమ్రా వంటి గొప్ప బౌలర్‌ను ఎదుర్కొన్నాననిఈ నేపథ్యంలో బుమ్రా నైపుణ్యాలను కొనియాడిన ఆసీస్ టెస్టు మిడిలార్డర్ బ్యాటర్ ట్రవిస్ హెడ్.. ‘‘ప్రపంచంలోని అత్యుత్తమ, గొప్పనైన ఫాస్ట్ బౌలర్లలో ఒకడిగా బుమ్రా ఎదుగుతాడు. మన కెరీర్ ముగిసిన తర్వాత.. వెనక్కి తిరిగి చూసుకుంటే.. బుమ్రా వంటి గొప్ప బౌలర్‌ను ఎదుర్కొన్నానని మనవలు, మనవరాళ్లకు చెప్పడం ఎంతో బాగుంటుంది’’ అని పేర్కొన్నాడు.89 పరుగులతో ఆసీస్ టాప్ స్కోరర్గాకాగా తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో 11 పరుగులు చేసి.. భారత అరంగేట్ర పేసర్ హర్షిత్ రాణా బౌలింగ్‌లో హెడ్ బౌల్డ్ అయ్యాడు. ఇక రెండో ఇన్నింగ్స్‌లో 89 పరుగులతో ఆసీస్ టాప్ స్కోరర్‌గా నిలిచిన ఈ ఎడమచేతి వాటం బ్యాటర్.. బుమ్రా బౌలింగ్‌లో వికెట్ కీపర్ రిషభ్ పంత్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఇక ఐపీఎల్లో సన్‌రైజర్స్ విధ్వంసకర ఓపెనర్‌గా హెడ్ ఆరెంజ్ ఆర్మీకి ఫేవరెట్ ప్లేయర్‌గా మారిపోయిన విషయం తెలిసిందే.ఇదిలా ఉంటే.. భారత్- ఆస్ట్రేలియా మధ్య అడిలైడ్ వేదికగా రెండో టెస్టు జరుగనుంది. డిసెంబరు 6- 10 వరకు పింక్ బాల్‌తో ఈ మ్యాచ్‌ను నిర్వహించేందుకు షెడ్యూల్ ఖరారైంది. ఇక తొలి టెస్టు నాలుగు రోజుల్లోనే ముగిసిపోగా.. రెండో టెస్టు ఎన్నిరోజుల పాటు సాగనుందనే అంశంపై క్రీడా వర్గాల్లో చర్చ జరుగుతోంది.గిల్ అర్ధ శతకంకాగా వ్యక్తిగత కారణాల దృష్ట్యా తొలి టెస్టుకు దూరంగా ఉన్న భారత జట్టు రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ.. రెండో మ్యాచ్‌కు అందుబాటులోకి వచ్చాడు. దీంతో బుమ్రా రోహిత్ సారథ్యంలో వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. మరోవైపు.. గాయం నుంచి కోలుకున్న భారత యువ బ్యాటర్ శుభ్‌మన్ గిల్ కూడా తిరిగి జట్టుతో చేరాడు. గులాబీ బంతితో ప్రైమ్ మినిస్టర్స్ ఎలెవన్‌తో జరిగిన మ్యాచ్‌లో గిల్ అర్ధ శతకం(50- రిటైర్డ్ హర్ట్)తో చెలరేగాడు. రోహిత్ మాత్రం మూడు పరుగులే చేసి నిష్క్రమించాడు. ఈ మ్యాచ్‌లో టీమిండియా ఆరు వికెట్ల తేడాతో గెలిచింది.చదవండి: SMAT 2024 PUN Vs HYD: తిలక్ వర్మ విఫలం.. అన్మోల్ప్రీత్ సింగ్ విధ్వంసం -
IPL 2025: గుడ్ బై.. స్వింగ్ కింగ్ భావోద్వేగం!.. ఆరెంజ్ ఆర్మీపై భువీ పోస్ట్
టీమిండియా వెటరన్ పేసర్ భువనేశ్వకుమార్ భావోద్వేగానికి లోనయ్యాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో తన పదకొండేళ్ల సుదీర్ఘ ప్రయాణం ముగిసిపోయిందన్నాడు. ఈ జట్టుతో తనకెన్నో మరపురాని, మధురజ్ఞాపకాలు ఉన్నాయంటూ భారమైన హృదయంతో వీడ్కోలు పలికాడు. ఈ సందర్భంగా ఆరెంజ్ ఆర్మీని ఉద్దేశించి భువీ ఉద్వేగపూరిత వ్యాఖ్యలు చేశాడు.కరగని కావ్య మనసు!కాగా ఐపీఎల్ మెగా వేలం-2025కి ముందు సన్‌రైజర్స్ హైదరాబాద్ భువీని వదిలేసిన విషయం తెలిసిందే. అయితే, ఆక్షన్లోనైనా అతడిని కొనుగోలు చేయాలని సన్‌రైజర్స్ యజమాని కావ్యా మారన్‌కు అభిమానులు సోషల్ మీడియా వేదికగా విజ్ఞప్తి చేశారు. అయితే, ఆరెంజ్ ఆర్మీ కోరుకున్నది జరుగలేదు.భువీ కోసం పోటీ పడ్డ ముంబై, లక్నోసౌదీ అరేబియాలోని జెద్దా నగరంలో జరిగిన వేలంలో భువనేశ్వర్ కుమార్ కోసం సన్‌రైజర్స్ ఎలాంటి ప్రయత్నం చేయలేదు. రూ. 2 కోట్ల కనీస ధరతో అందుబాటులో ఉన్న భువీ కోసం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) ఆది నుంచి ఆసక్తి చూపించింది. రూ. 10.75 కోట్లకు ఆర్సీబీ సొంతంముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జెయింట్స్‌లతో పోటీపడి మరీ ధరను రూ. 10 కోట్లకు పెంచింది. ఆ తర్వాత కూడా లక్నో పోటీకి రాగా.. ఒక్కసారిగా 75 లక్షలు పెంచి రూ. 10.75 కోట్లకు ఆర్సీబీ భువీని సొంతం చేసుకుంది.సన్‌రైజర్స్ టైటిల్ గెలవడంలో భువీది కీలక పాత్రకాగా ఉత్తరప్రదేశ్‌కు చెందిన కుడిచేతి వాటం పేసర్ భువనేశ్వర్ కుమార్ 2011లో ఐపీఎల్లో ఎంట్రీ ఇచ్చాడు. 2013లో సన్‌రైజర్స్‌తో చేరిన అతడు 2024 వరకు జట్టుతోనే కొనసాగాడు. 2016లో సన్‌రైజర్స్ టైటిల్ గెలవడంలో భువీది కీలక పాత్ర. ఆ ఏడాది అతడు 23 వికెట్లతో చెలరేగాడు. ఆ తర్వాతి సీజన్లో అత్యుత్తమంగా 26 వికెట్లు పడగొట్టాడు. కానీ.. అప్పటి నుంచి ఒక్కసారి కూడా మళ్లీ 20 వికెట్లు కూడా తీయలేకపోయాడు. దీంతో వేలానికి ముందు సన్‌రైజర్స్ భువీని వదిలేసింది. ఈ నేపథ్యంలో తమ హార్ట్‌బ్రేక్ అయిందని ఆరెంజ్ ఆర్మీ నెట్టింట భువీ పేరును ట్రెండ్ చేసింది.గుడ్ బై.. ఆరెంజ్ ఆర్మీఈ నేపథ్యంలో భువనేశ్వర్‌కుమార్ తాజాగా ఎక్స్ వేదికగా ఆరెంజ్ ఆర్మీని ఉద్దేశించి వీడియో షేర్ చేశాడు. ‘‘ఎస్ఆర్హెచ్తో అద్భుతమైన పదకొండేళ్ల ప్రయాణానికి ఇక వీడ్కోలు. ఇక్కడ నాకెన్నో మరుపురాని చిర్మసరణీయ జ్ఞాపకాలు ఉన్నాయి. అయితే, మీ ప్రేమను మాత్రం మిస్ అవ్వను. మీ మద్దతను ఎన్నటికీ మరువను. మీరు, మీ మద్దతే నా బలం. నా ప్రయాణాన్ని అద్భుతంగా మలిచినందుకు ధన్యవాదాలు. నాపై మీ ప్రేమ ఇలాగే కొనసాగాలి’’ అని 34 ఏళ్ల భువీ ఉద్వేగానికి లోనయ్యాడు. ఇక వచ్చే ఏడాది ఈ స్వింగ్ కింగ్ ఆర్సీబీ జెర్సీలో దర్శనమివ్వబోతున్నాడు.చదవండి: KKR: అతడు 12 కోట్లకే వచ్చేవాడు.. ఇషాన్ కూడా చీప్.. అయినా ఎందుకిలా?After 11 incredible years with SRH, I say goodbye to this team. I have so many unforgettable and cherishable memories.One thing unmissable is the love of the fans which has been splendid! Your support has been constant.I will carry this love and support with me forever 🧡 pic.twitter.com/SywIykloHp— Bhuvneshwar Kumar (@BhuviOfficial) November 28, 2024After 11 incredible years with SRH, I say goodbye to this team. I have so many unforgettable and cherishable memories.One thing unmissable is the love of the fans which has been splendid! Your support has been constant.I will carry this love and support with me forever 🧡 pic.twitter.com/SywIykloHp— Bhuvneshwar Kumar (@BhuviOfficial) November 28, 2024 -
వేలం ముగిసింది.. ఇంకా ఎవరి పర్సులో ఎంత? ఎన్ని ఖాళీలు.. పూర్తి వివరాలు
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)-2025 సీజన్‌కు సంబంధించి మెగా వేలం కార్యక్రమం పూర్తయింది. సౌదీ అరేబియాలోని జెద్దా నగరంలో రెండు రోజుల పాటు నిర్వహించిన వేలంపాటలో.. తాము కోరుకున్న ఆటగాళ్ల కోసం పది ఫ్రాంఛైజీలు పోటీపడ్డాయి. ఎట్టకేలకు తమకు కావాల్సిన వారిని దక్కించుకున్నాయి. ఇక వేలం ప్రక్రియ ముగిసింది కాబట్టి... ఇక వచ్చే ఏడాది మార్చిలో జరిగే టోర్నీకి ఎలా సమాయత్తం కావాలో ఫ్రాంచైజీలు ప్రణాళికలు రచించుకుంటాయి.కాగా ఐపీఎల్లో ఇంతవరకూ టైటిల్ నెగ్గలేకపోయిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్లు ఈసారి ఎలాగైనా ఆ లోటును తీర్చుకోవాలనే పట్టుదలతో ఉన్నాయి. మరి వచ్చే సీజన్లోనైనా ఈ జట్లలో ఒకటి ఐపీఎల్ ట్రోఫీని సొంతం చేసుకుంటుందో లేదో వేచి చూడాలి.ఇక ఆదివారం నాటి తొలిరోజు వేలంలో టీమిండియా స్టార్లు రిషభ్ పంత్, శ్రేయస్ అయ్యర్, వెంకటేశ్ అయ్యర్ భారీ ధర పలికారు. వికెట్ కీపర్ బ్యాటర్, కెప్టెన్ ఆప్షన్ అయిన పంత్ కోసం లక్నో ఏకంగా రూ. 27 కోట్లు వెచ్చించింది. మరోవైపు.. పంజాబ్ కింగ్స్ శ్రేయస్ అయ్యర్‌ను రూ. 26.75 కోట్లకు సొంతం చేసుకుంది. ఇక కోల్‌కతా నైట్ రైడర్స్ తాము రిలీజ్ చేసిన వెంకటేశ్ అయ్యర్‌ను ఏకంగా రూ. 23.75 కోట్లకు కొనుగోలు చేసి మరోసారి జట్టులో చేర్చుకుంది.ఇదిలా ఉంటే.. సోమవారం నాటి రెండో రోజు వేలంలోని విశేషాలను గమనిస్తే.. భువనేశ్వర్ కుమార్ కోసం ముంబై ఇండియన్స్, లక్నో మధ్య తీవ్ర పోటీ సాగింది. ఈ రెండు కలిసి అతడి విలువను రూ.10 కోట్ల 50 లక్షల వరకు తీసుకెళ్లాయి. ఈ స్థితిలో అనూహ్యంగా ముందుకు వచ్చిన బెంగళూరు రూ.10 కోట్ల 75 లక్షలకు అతడిని సొంతం చేసుకుంది. మరోవైపు.. తమ పాత ఆటగాడు దీపక్ చహర్‌ను తీసుకునేందుకు చెన్నై సూపర్‌కింగ్స్ చివరి వరకు ప్రయత్నించింది. ముంబై, పంజాబ్ కింగ్స్ ఫ్రాంఛైజీలతో పోటీ పడి రూ. 8 కోట్ల వరకు బరిలో నిలిచింది. అయితే వెనక్కి తగ్గని ముంబై రూ.9 కోట్ల 75 లక్షలకు అతడిని దక్కించుకుంది.వీరికి మంచి ధర👉సోమవారం వేలంలో అందరికంటే ముందుగా న్యూజిలాండ్ ప్లేయర్ కేన్ విలియమ్సన్ పేరు రాగా అతడిని తీసుకునేందుకు ఆసక్తి చూపించలేదు. 👉గత ఏడాది వరకు బెంగళూరు జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన డుప్లెసిస్‌ను ఈసారి అతని కనీస విలువ రూ.2 కోట్లకే ఢిల్లీ క్యాపిటల్స్ ఎంచుకుంది. 👉భారత పేస్ బౌలర్లలో ఆకాశ్‌దీప్ (రూ.8 కోట్లు; లక్నో), ముకేశ్ కుమార్ (రూ. 8 కోట్లు; ఢిల్లీ), తుషార్ దేశ్‌పాండే (రూ. 6 కోట్ల 50 లక్షలు; రాజస్తాన్ రాయల్స్) మంచి ధర పలికారు. 👉అఫ్గానిస్తాన్ మిస్టరీ ఆఫ్‌స్పిన్నర్ అల్లా గజన్ఫర్(రూ. 4.80 కోట్లు) కోసం కోల్‌కతా, బెంగళూరులతో పోటీ పడి ముంబై సొంతం చేసుకుంది. భారత స్పిన్నర్ వరుణ్ చక్రవర్తిని పోలిన బౌలింగ్ శైలిగల గజన్ఫర్ గత ఏడాది కోల్‌కతా టీమ్‌లో ఉన్నా మ్యాచ్ ఆడే అవకాశం రాలేదు. 👉ఢిల్లీ ప్రీమియర్ లీగ్‌లో ఒకే ఓవర్లో ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు బాది అందరి దృష్టిలో పడిన ప్రియాన్ష్ ఆర్య కోసం నాలుగు జట్లు బరిలో నిలవగా, చివరగా పంజాబ్ దక్కించుకుంది. 👉పదేళ్ల క్రితం చివరి టీ20 మ్యాచ్ ఆడి టెస్టుల రిటైర్మెంట్ తర్వాత ఇప్పుడు ఐపీఎల్లో రిజిస్టర్ చేసుకున్న ఇంగ్లండ్ పేసర్ జేమ్స్ అండర్సన్‌ను ఎవరూ పట్టించుకోలేదు.👉రిటెయిన్ చేసుకున్న వారితో కలిపి మొత్తం 25 ఆటగాళ్ల గరిష్ట కోటాను చెన్నై సూపర్‌కింగ్స్, గుజరాత్ టైటాన్స్, పంజాబ్ కింగ్స్ పూర్తి చేసుకోగా... లక్నో సూపర్ జెయింట్స్ (24), ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్ (23), రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (22), డిఫెండింగ్ చాంపియన్ కోల్‌కతా నైట్‌రైడర్స్ (21), రాజస్తాన్ రాయల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ (20) అంతకంటే తక్కువ మందితో సరిపెట్టాయి. చెన్నై సూపర్ కింగ్స్రుతురాజ్ (రూ. 18 కోట్లు) జడేజా (రూ. 18 కోట్లు) పతిరణ (రూ. 13 కోట్లు) శివమ్ దూబే (రూ. 12 కోట్లు) ధోని (రూ. 4 కోట్లు) నూర్ అహ్మద్ (రూ.10 కోట్లు) ఆర్. అశి్వన్ (రూ. 9.75 కోట్లు) కాన్వే (రూ. 6.25 కోట్లు) ఖలీల్ అహ్మద్ (రూ. 4.80 కోట్లు) రచిన్ రవీంద్ర (రూ. 4 కోట్లు) రాహుల్ త్రిపాఠి (రూ. 3.40 కోట్లు) అన్షుల్ కంబోజ్ (రూ.3.40 కోట్లు) స్యామ్ కరన్ (రూ. 2.40 కోట్లు) గుర్జప్నీత్ సింగ్ (రూ. 2.20 కోట్లు) నాథన్ ఎలిస్ (రూ. 2 కోట్లు) దీపక్ హుడా (రూ.1.70 కోట్లు) జేమీ ఓవర్టన్ (రూ.1.50 కోట్లు) విజయ్ శంకర్ (రూ. 1.20 కోట్లు) వంశ్ బేడీ (రూ. 55 లక్షలు) ముకేశ్ చౌదరీ (రూ. 30 లక్షలు) షేక్ రషీద్ (రూ. 30 లక్షలు) అండ్రి సిద్ధార్థ్ (రూ. 30 లక్షలు) కమలేశ్ నాగర్కోటి (రూ. 30 లక్షలు) రామకృష్ణ ఘోష్ (రూ. 30 లక్షలు) శ్రేయస్ గోపాల్ (రూ.30 లక్షలు) ఖర్చు: రిటెయినర్లకు రూ. 65 కోట్లు; వేలానికి రూ. 54.95 కోట్లు; మిగిలింది: 5 లక్షలుఢిల్లీ క్యాపిటల్స్అక్షర్ పటేల్ (రూ. 16.50 కోట్లు) కుల్దీప్ యాదవ్ (రూ. 13.25 కోట్లు) స్టబ్స్ (రూ. 10 కోట్లు) అభిషేక్ పోరెల్ (రూ. 4 కోట్లు) కేఎల్ రాహుల్ (రూ. 14 కోట్లు) స్టార్క్ (రూ. 11.75 కోట్లు) నటరాజన్ (రూ. 10.75 కోట్లు) జేక్ ఫ్రేజర్ (రూ 9 కోట్లు) ముకేశ్ కుమార్ (రూ. 8 కోట్లు) హ్యారీ బ్రూక్ (రూ. 6.25 కోట్లు) అశుతోష్ శర్మ (రూ. 3.80 కోట్లు) మోహిత్ శర్మ (రూ.2.20 కోట్లు) డుప్లెసిస్ (రూ. 2 కోట్లు) సమీర్ రిజ్వీ (రూ. 95 లక్షలు) దుష్మంత చమిర (రూ. 75 లక్షలు) డోనొవన్ ఫెరీరా (రూ. 75 లక్షలు) విప్రాజ్ నిగమ్ (రూ.50 లక్షలు) కరుణ్ నాయర్ (రూ. 50 లక్షలు) మాధవ్ తివారి (రూ. 40 లక్షలు) అజయ్ జాదవ్ (రూ.30 లక్షలు) దర్శన్ నల్కండే (రూ. 30 లక్షలు) త్రిపురాణ విజయ్ (రూ. 30 లక్షలు) మన్వంత్ కుమార్ (రూ. 30 లక్షలు) ఖర్చు: రిటెయినర్లకు రూ. 47 కోట్లు; వేలానికి రూ 72.80 కోట్లు; మిగిలింది: రూ. 20 లక్షలు గుజరాత్ టైటాన్స్రషీద్ ఖాన్ (రూ. 18 కోట్లు) శుబ్‌మన్ గిల్ (రూ. 16.50 కోట్లు) సాయి సుదర్శన్ (రూ. 8.5 కోట్లు) రాహుల్ తెవాటియా (రూ. 4 కోట్లు) షారుక్ ఖాన్ (రూ. 4 కోట్లు) బట్లర్ (రూ.15.75 కోట్లు) సిరాజ్ (రూ.12.25 కోట్లు) రబాడ (రూ.10.75 కోట్లు) ప్రసిధ్ కృష్ణ (రూ.9.50 కోట్లు) సుందర్ (రూ. 3.20 కోట్లు) రూథర్‌ఫర్డ్ (రూ. 2.60 కోట్లు) కొయెట్జీ (రూ. 2.40 కోట్లు) ఫిలిప్స్ (రూ. 2 కోట్లు) సాయి కిషోర్ (రూ. 2 కోట్లు) మహిపాల్ లోమ్రోర్ (రూ.1.70 కోట్లు) గుర్నూర్ సింగ్ (రూ. 1.30 కోట్లు) అర్షద్ ఖాన్ (రూ.1.30 కోట్లు), జయంత్ (రూ. 75 లక్షలు) ఇషాంత్ (రూ. 75 లక్షలు) కరీమ్ జనత్ (రూ. 75 లక్షలు) కుమార్ కుశాగ్ర (రూ.65 లక్షలు) మానవ్ సుతార్ (రూ. 30 లక్షలు) అనూజ్ రావత్ (రూ.30 లక్షలు) నిశాంత్ సింధు (రూ. 30 లక్షలు) కుల్వంత్ (రూ. 30 లక్షలు) ఖర్చు: రిటెయినర్లకు రూ. 51 కోట్లు; వేలానికి రూ. 68.85 కోట్లు; మిగిలింది: 15 లక్షలు పంజాబ్ కింగ్స్శశాంక్ సింగ్ (రూ.5.5 కోట్లు) ప్రభ్‌సిమ్రన్ సంగ్ (రూ.4 కోట్లు) శ్రేయస్ అయ్యర్ (రూ.26.75 కోట్లు) అర్ష్‌దీప్ సింగ్ (రూ.18 కోట్లు) యుజువేంద్ర చహల్ (రూ.18 కోట్లు) స్టొయినిస్ (రూ.11 కోట్లు) మార్కొ జాన్సెన్ (రూ. 7 కోట్లు) నేహల్ వధేరా (రూ.4.20 కోట్లు) మ్యాక్స్‌వెల్ (రూ.4.20 కోట్లు) ప్రియాన్‡్ష ఆర్య (రూ. 3.80 కోట్లు) జోష్ ఇంగ్లిస్ (రూ. 2.60 కోట్లు) అజ్మతుల్లా (రూ. 2.40 కోట్లు) ఫెర్గూసన్ (రూ. 2 కోట్లు) వైశాక్ విజయ్‌కుమార్ (రూ.1.80 కోట్లు) యశ్ ఠాకూర్ (రూ.1.60 కోట్లు) హర్‌ప్రీత్ బ్రార్ (రూ.1.50 కోట్లు) ఆరోన్ హార్డి (రూ. 1.25 కోట్లు) విష్ణు వినోద్ (రూ.95 లక్షలు) జేవియర్ బార్ట్లెట్ (రూ. 80 లక్షలు) కుల్దీప్ సేన్ (రూ. 80 లక్షలు) అవినాశ్ (రూ. 30 లక్షలు) సూర్యాంశ్ షెడ్గే (రూ. 30 లక్షలు) ముషీర్‌ఖాన్ (రూ.30 లక్షలు) హర్నూర్ (రూ.30 లక్షలు) ప్రవీణ్ దూబే (రూ. 30 లక్షలు) ఖర్చు: రిటెయినర్లకు రూ.9.50 కోట్లు; వేలానికి రూ. 110.15 కోట్లు; మిగిలింది: రూ. 35 లక్షలు రాజస్తాన్ రాయల్స్యశస్వి జైస్వాల్ (రూ. 18 కోట్లు) సంజూ సామ్సన్ (రూ. 18 కోట్లు) ధ్రువ్ జురేల్ (రూ. 14 కోట్లు) రియాన్ పరాగ్ (రూ. 14 కోట్లు) హెట్‌మైర్ (రూ. 11 కోట్లు) సందీప్‌శర్మ (రూ. 4 కోట్లు) జోఫ్రా ఆర్చర్ (రూ.12.50 కోట్లు) తుషార్ దేశ్‌పాండే (రూ.6.50 కోట్లు) హసరంగ (రూ.5.25 కోట్లు) మహీశ్ తీక్షణ (రూ.4.40 కోట్లు) నితీశ్ రాణా (రూ. 4.20 కోట్లు) ఫజల్హక్ (రూ. 2 కోట్లు) క్వెన మఫాక (రూ. 1.50 కోట్లు) ఆకాశ్ మధ్వాల్ (రూ.1.20 కోట్లు) వైభవ్ సూర్యవంశి (రూ. 1.10 కోట్లు) శుభమ్ దూబే (రూ. 80 లక్షలు) యు«ద్వీర్ చరక్ (రూ. 35 లక్షలు) కుమార్ కార్తికేయ (రూ.30 లక్షలు) అశోక్ శర్మ (రూ. 30 లక్షలు) కునాల్‌సింగ్ (రూ. 30 లక్షలు) ఖర్చు: రిటెయినర్లకు రూ. 79 కోట్లు; వేలానికి రూ. 40.70 కోట్లు; మిగిలింది: రూ. 30 లక్షలు సన్‌రైజర్స్ హైదరాబాద్క్లాసెన్ (రూ. 23 కోట్లు) కమిన్స్ (రూ. 18 కోట్లు) హెడ్ (రూ. 14 కోట్లు) అభిõÙక్ శర్మ (రూ. 14 కోట్లు) నితీశ్ రెడ్డి (రూ. 6 కోట్లు) ఇషాన్ కిషన్ (రూ.11.25 కోట్లు) షమీ (రూ.10 కోట్లు) హర్షల్ పటేల్ (రూ.8 కోట్లు) రాహుల్ చహర్ (రూ.3.20 కోట్లు) అభినవ్ మనోహర్ (రూ.3.20 కోట్లు) రాహుల్ చహర్ (రూ. 3.20 కోట్లు) ఆడమ్ జంపా (రూ.2.40 కోట్లు) సిమర్జీత్ సింగ్ (రూ. 1.50 కోట్లు) ఇషాన్ మలింగ (రూ. 1.20 కోట్లు) బ్రైడన్ కార్స్ (రూ. 1 కోటి) ఉనాద్కట్ (రూ. 1 కోటి) కమిండు మెండిస్ (రూ. 75 లక్షలు) జీషాన్ అన్సారి (రూ. 40 లక్షలు) అనికేత్ వర్మ (రూ. 30 లక్షలు) అథర్వ తైడే (రూ.30 లక్షలు) ఖర్చు: రిటెయినర్లకు రూ. 75 కోట్లు; వేలానికి రూ.44.80 కోట్లు; మిగిలింది: రూ.20 లక్షలు రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకోహ్లి (రూ. 21 కోట్లు) రాజత్ పటిదార్ (రూ.11 కోట్లు) యశ్ దయాళ్ (రూ. 5 కోట్లు) హాజల్‌వుడ్ (రూ.12.50 కోట్లు) ఫిల్ సాల్ట్ (రూ.11.50 కోట్లు) జితేశ్ శర్మ (రూ.11 కోట్లు) భువనేశ్వర్ (రూ.10.75 కోట్లు) లివింగ్‌స్టోన్ (రూ.8.75 కోట్లు) రసిక్ ధార్ (రూ.6 కోట్లు) కృనాల్ పాండ్యా (రూ. 5.75 కోట్లు) టిమ్ డేవిజ్ (రూ. 3 కోట్లు) జాకబ్ బెథెల్ (రూ. 2.60 కోట్లు) సుయాశ్ శర్మ (రూ.2.60 కోట్లు) పడిక్కల్ (రూ. 2 కోట్లు) తుషార (రూ. 1.60 కోట్లు) రొమరియో (రూ. 1.50 కోట్లు ఇన్‌గిడి (రూ. 1 కోటి) స్వప్నిల్ సింగ్ (రూ.50 లక్షలు) మనోజ్ (రూ. 30 లక్షలు) మోహిత్ రాఠి (రూ. 30 లక్షలు) అభినందన్ (రూ. 30 లక్షలు) స్వస్తిక్ చికార (రూ. 30 లక్షలు) ఖర్చు: రిటెయినర్లకు రూ. 37 కోట్లు; వేలానికి రూ. 82.25 కోట్లు; మిగిలింది: రూ. 75 లక్షలు ముంబై ఇండియన్స్బుమ్రా (రూ. 18 కోట్లు) హార్దిక్ పాండ్యా (రూ.16.35 కోట్లు) సూర్యకుమార్ (రూ. 16.35 కోట్లు) రోహిత్ శర్మ (రూ. 16.30 కోట్లు) తిలక్ వర్మ (రూ. 8 కోట్లు) ట్రెంట్ బౌల్ట్ (రూ.12.50 కోట్లు) దీపక్ చహర్ (రూ. 9.25 కోట్లు) నమన్ ధీర్ (రూ.5.25 కోట్లు) విల్ జాక్స్ (రూ.5.25 కోట్లు) ఘజన్ఫర్ (రూ. 4.80 కోట్లు) సాంట్నర్ (రూ. 2 కోట్లు) రికెల్టన్ (రూ. 1 కోటి) రీస్ టోప్లే (రూ. 75 లక్షలు) లిజాద్ విలియమ్స్ (రూ. 75 లక్షలు) రాబిన్ మిన్జ్ (రూ.65 లక్షలు) కరణ్ శర్మ (రూ.50 లక్షలు) అర్జున్ టెండూల్కర్ (రూ.30 లక్షలు) విఘ్నేశ్ (రూ.30 లక్షలు) సత్యనారాయణ (రూ. 30 లక్షలు) రాజ్ అంగద్ (రూ. 30 లక్షలు) శ్రీజిత్ కృష్ణన్ (రూ. 30 లక్షలు) అశ్వని కుమార్ (రూ. 30 లక్షలు) బెవాన్ జాకబ్స్ (రూ. 30 లక్షలు) ఖర్చు: రిటెయినర్లకు రూ. 75 కోట్లు; వేలానికి రూ. 44.80 లక్షలు; మిగిలింది: రూ. 20 లక్షలులక్నో సూపర్ జెయింట్స్నికోలస్ పూరన్ (రూ.21 కోట్లు) రవి బిష్ణోయ్ (రూ.21 కోట్లు) మయాంక్ యాదవ్ (రూ. 11 కోట్లు) మోసిన్ ఖాన్ (రూ.4 కోట్లు) ఆయుశ్ బదోని (రూ.4 కోట్లు) రిషభ్ పంత్ (రూ.27 కోట్లు) అవేశ్ ఖాన్ (రూ.9.75 కోట్లు) ఆకాశ్‌దీప్ (రూ.8 కోట్లు) మిల్లర్ (రూ.7.50 కోట్లు) అబ్దుల్ సమద్ (రూ.4.20 కోట్లు) మిచెల్ మార్‡్ష (రూ.3.40 కోట్లు) షహబాజ్ అహ్మద్ (రూ. 2.40 కోట్లు) మార్క్రమ్ (రూ.2 కోట్లు) బ్రీట్జ్కే (రూ. 75 లక్షలు) షమర్ జోసెఫ్ (రూ. 75 లక్షలు) సిద్ధార్థ్ (రూ. 75 లక్షలు) యువరాజ్ (రూ. 30 లక్షలు) ప్రిన్స్ యాదవ (రూ. 30 లక్షలు) ఆకాశ్ సింగ్ (రూ. 30 లక్షలు) దిగ్వేశ్ సింగ్ (రూ. 30 లక్షలు) హిమ్మత్ సింగ్ (రూ.30 లక్షలు) ఆర్యన్ జుయల్ (రూ.30 లక్షలు) అర్శిన్ కులకర్ణి (రూ. 30 లక్షలు) హంగార్గేకర్ (రూ. 30 లక్షలు) ఖర్చు: రిటెయినర్లకు రూ.51 కోట్లు; వేలానికి రూ. 68.90 కోట్లు; మిగిలింది: రూ. 10 లక్షలు కోల్‌కతా నైట్ రైడర్స్రింకూ సింగ్ (రూ. 13 కోట్లు) నరైన్ (రూ. 12 కోట్లు) రసెల్ (రూ. 12 కోట్లు) వరుణ్ చక్రవర్తి (రూ. 12 కోట్లు) హర్షిత్ రాణా (రూ. 4 కోట్లు) రమణ్‌దీప్ (రూ.4 కోట్లు) వెంకటేశ్ అయ్యర్ (రూ.23.75 కోట్లు) ఆన్రిచ్ నోర్జే (రూ.6.50 కోట్లు) డికాక్ (రూ.3.60 కోట్లు) అంగ్కృష్ (రూ.3 కోట్లు) జాన్సన్ (రూ. 2.80 కోట్లు) గుర్బాజ్ (రూ.2 కోట్లు) మొయిన్ అలీ (రూ. 2 కోట్లు) వైభవ్ అరోరా (రూ.1.80 కోట్లు) రోవ్‌మన్ పావెల్ (రూ.1.50 కోట్లు) రహానే (రూ. 1.50 కోట్లు) మనీశ్ పాండే (రూ. 75 లక్షలు) ఉమ్రన్ మలిక్ (రూ. 75 లక్షలు) అనుకూల్ రాయ్ (రూ. 40 లక్షలు) మయాంక్ మర్కండే (రూ. 30 లక్షలు) లవ్నిత్ సిసోడియా (రూ. 30 లక్షలు) ఖర్చు: రిటెయినర్లకు రూ.69 కోట్లు; వేలానికి రూ. 50.95 కోట్లు; మిగిలింది: రూ.5 లక్షలు. -
ఆరెంజ్ ఆర్మీ హార్ట్‌బ్రేక్.. కావ్యా మేడమ్ ఇలా ఎందుకు చేసింది!
ఆరెంజ్ ఆర్మీ అభిమానులకు చేదువార్త. టీమిండియా వెటరన్ పేసర్ భువనేశ్వర్ కుమార్‌కు సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో బంధం తెగిపోయింది. ఐపీఎల్ మెగా వేలం-2025కి ముందు రిటెన్షన్స్‌లో భాగంగా సన్‌రైజర్స్ భువీని వదిలేసింది.అయితే, కనీసం రైట్ టు మ్యాచ్ కార్డు ద్వారానైనా భువీని తిరిగి సొంతం చేసుకుంటే బాగుండని సన్‌రైజర్స్ అభిమానులు భావించారు. కానీ.. వారికి నిరాశే మిగిలింది. వచ్చే ఏడాది భువనేశ్వర్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు(ఆర్సీబీ) ఆడబోతున్నాడు. కాగా సౌదీ అరేబియాలోని జెద్దా నగరంలో ఆదివారం మెగా వేలం మొదలైంది.ఈ క్రమంలో సోమవారం నాటి ఆఖరి రోజు ఆక్షన్‌లో భాగంగా భువీ రూ. 2 కోట్ల కనీస ధరతో అందుబాటులోకి వచ్చాడు. ఆక్షనీర్ మల్లికా సాగర్ భువీ పేరు చెప్పగానే ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జెయింట్స్ రంగంలోకి దిగాయి. తగ్గేదేలే అన్నట్లు పోటీపడుతూ ఏకంగా రూ. 9 కోట్ల వరకు తలపడ్డాయి.అయితే, ఆ తర్వాత లక్నో భువీ ధరను రూ. 10 కోట్లకు పెంచిన తర్వాత ముంబై పోటీ నుంచి తప్పుకొంది. దీంతో లక్నోకు భువీ సొంతమవుతాడని అంతా భావించారు. కానీ అనూహ్యంగా ఆర్సీబీ రేసులోకి దూసుకువచ్చింది. అమాంతం రూ. 75 లక్షలు పెంచి.. మొత్తంగా 10.75 కోట్ల రూపాయలకు భువీని బెంగళూరు దక్కించుకుంది.సన్‌రైజర్స్‌తో సుదీర్ఘ అనుబంధంఉత్తరప్రదేశ్కు చెందిన భువనేశ్వర్ కుమార్ 2011లో ఐపీఎల్లో అడుగుపెట్టాడు. తొలి సీజన్లో పుణె వారియర్స్(ఇప్పుడు లేదు) జట్టుకు ఆడాడు భువీ. ఏడు కంటే తక్కువ ఎకానమీతో 2013లో 13 వికెట్లు తీసి సత్తా చాటిన ఈ రైటార్మ్ ఫాస్ట్ మీడియం పేసర్‌ను.. 2014లో సన్‌రైజర్స్ దక్కించుకుంది.సన్‌రైజర్స్ ను చాంపియన్‌గా నిలపడంలో కీలకంరైజర్స్ తరఫున 2016లో భువీ 23 వికెట్లతో దుమ్ములేపి జట్టును చాంపియన్‌గా నిలపడంలో కీలక పాత్ర పోషించాడు. ఆ మరుసటి ఏడాది 26 వికెట్లతో దూసుకుపోయాడు. అయితే, ఆ తర్వాతి సీజన్ నుంచి భువీ ఒక్కసారి కూడా 20 వికెట్ల మార్కు అందుకోలేకపోయాడు. ఈ క్రమంలో సన్‌రైజర్స్ అతడిని వదిలేయడం గమనార్హం. అంతేకాదు వేలంలో కూడా అతడిపై ఏమాత్రం ఆసక్తి చూపలేదు.ఆరెంజ్ ఆర్మీ హార్ట్‌బ్రేక్.. కావ్యా మేడమ్ ఇలా ఎందుకు చేసింది!దీంతో ఆరెంజ్ ఆర్మీ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ‘‘కావ్యా మేడమ్ భువీని తీసుకోవాల్సింది. నిన్ను కచ్చితంగా మిస్ అవుతావు భయ్యా!’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరికొంత మందేమో.. ‘‘నా బ్రేకప్ కంటే కూడా.. భువీ- సన్‌రైజర్స్ బ్రేకప్‌తోనే నేను ఎక్కువగా హర్ట్ అయ్యాను’’ అంటూ తమ బాధను పంచుకుంటున్నారు.కాగా గతంలో పలు సందర్భాల్లో భువీ సన్‌రైజర్స్ కెప్టెన్‌గానూ వ్యవహరించాడు.మరోవైపు.. ఆర్సీబీ అభిమానులు భువీ రాకతో హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇప్పటి వరకు భువీ మొత్తంగా 176 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడి 181 వికెట్లు తీశాడు. అత్యుత్తమ గణాంకాలు 5/19. కాగా గత కొంతకాలంగా ఈ యూపీ పేసర్‌కు టీమిండియాలో చోటు దక్కడం లేదు. అయితే, దేశీ టీ20లలో సత్తా చాటుతూ భువనేశ్వర్ వేలంలో ఈ మేర కోట్లు కొల్లగొట్టాడు.చదవండి: అదే మా కొంపముంచింది.. మరింత బలంగా తిరిగి వస్తాము: ఆసీస్ కెప్టెన్ -
వాషింగ్టన్ సుందర్‌పై ఆసక్తి చూపని ఫ్రాంఛైజీలు.. ఆఖరికి!
టీమిండియా యువ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్‌కు ఐపీఎల్ మెగా వేలం-2025లో షాక్ తగిలింది. కనీస ధర రూ. 2 కోట్లతో ఆక్షన్‌లోకి వచ్చిన వాషీ కోసం తొలుత ఏ ఫ్రాంఛైజీ పెద్దగా ఆసక్తి చూపలేదు. కాసేపటికి.. గుజరాత్ టైటాన్స్ తొలుత బిడ్ వేసేందుకు ముందుకు వచ్చింది. కనీస ధరకు అతడిని దక్కించుకోవాలని చూసింది.ఈ క్రమంలో లక్నో సూపర్ జెయింట్స్ రంగంలోకి దిగగా.. గుజరాత్ కూడా వెనక్కి తగ్గలేదు. అయితే, ధర రూ. 3 కోట్లు దాటిన తర్వాత లక్నో తప్పుకోగా.. టైటాన్స్ ఆఖరికి రూ. 3.20 కోట్లకు వాషింగ్టన్ సుందర్‌ను దక్కించుకుంది. కాగా తమిళనాడుకు చెందిన వాషీ.. స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్.మూడు జట్లకుక్యాష్ రిచ్ లీగ్‌లో 2017లో రైజింగ్ పుణె సూపర్‌జెయింట్ తరఫున అడుగుపెట్టిన వాషీ.. ఆ ఏడాది ఎనిమిది వికెట్లు పడగొట్టాడు. అనంతరం 2018లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వాషీని రూ. 3.2 కోట్లకు కొనుక్కుంది. ఆర్సీబీ తరఫున అతడు మొత్తంగా 31 మ్యాచ్‌లు ఆడి 19 వికెట్లు తీశాడు.ఈ క్రమంలో 2022లో సన్‌రైజర్స్ హైదరాబాద్ వాషీని రూ. 8.75 కోట్లకు కొనుగోలు చేసి 2024 వరకు కొనసాగించింది. అయితే, ఐపీఎల్-2025 మెగా వేలానికి ముందు హైదరాబాద్ ఫ్రాంఛైజీ అతడిని వదిలేసింది. కాగా ఎస్ఆర్హెచ్ తరఫున వాషీకి పెద్దగా ఆడే అవకాశం రాలేదు. సన్‌రైజర్స్‌కు మొత్తంగా 18 మ్యాచ్‌లు ఆడిన వాషీ 10 వికెట్లు తీయడంతో పాటు 161 పరుగులు చేశాడు. ఇక వచ్చే ఏడాది అతడు గుజరాత్ టైటాన్స్‌కు ఆడబోతున్నాడు. ఇదిలా ఉంటే.. ఓవరాల్‌గా ఐపీఎల్లో వాషింగ్టన్ సుందర్ ఇప్పటి వరకు 60 మ్యాచ్‌లు ఆడి 378 రన్స్ చేయడంతో పాటు.. 37 వికెట్లు తీశాడు. -
Rishabh Pant: అయ్యర్ రికార్డు బ్రేక్.. కోట్లు కొల్లగొట్టిన పంత్! లక్నో సొంతం
ఐపీఎల్-2025 మెగా వేలంలో టీమిండియా స్టార్ క్రికెటర్ రిషభ్ పంత్ అత్యంత భారీ ధర పలికాడు. రూ. 2 కోట్ల కనీస ధరతో వేలంలోకి వచ్చిన ఈ వికెట్ కీపర్ కోసం లక్నో సూపర్ జెయింట్స్(ఎల్ఎస్జీ), రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) ఆదిలోనే పోటీకి దిగాయి. ఇరు ఫ్రాంఛైజీలు పంత్ కోసం హోరాహోరీగా తలపడి వేలం మొదలైన కాసేపటికే ధరను రూ. 10 కోట్లకు పెంచాయి.సన్‌రైజర్స్ హైదరాబాద్ రేసులోకి వచ్చిఆ తర్వాత కూడా తగ్గేదేలే అన్నట్లు పంత్ ధరను పెంచుతూ పోగా.. సన్‌రైజర్స్ హైదరాబాద్ రేసులోకి వచ్చి.. రూ. 13 కోట్లకు పెంచింది. ఈ క్రమంలో ఆర్సీబీ తప్పుకోగా.. హైదరాబాద్, లక్నో నువ్వా- నేనా అన్నట్లు దూకుడు పెంచాయి. శ్రేయస్ అయ్యర్ రికార్డు బ్రేక్అయితే, రూ. 20 కోట్లకు ధర పెరిగిన తర్వాత హైదరాబాద్ పోటీ నుంచి తప్పుకొంది. అయితే, అనూహ్యంగా ఢిల్లీ క్యాపిటల్స్ రైట్ టు మ్యాచ్ ద్వారా రేసులోకి రాగా.. లక్నో అమాంతం ఏడు కోట్లు పెంచింది. మొత్తంగా రూ. 27 కోట్ల భారీ ధరకు పంత్‌ను లక్నో సొంతం చేసుకుంది. దీంతో శ్రేయస్ అయ్యర్ రికార్డు బ్రేక్ అయింది.పడిలేచిన కెరటంకాగా 2022 చివర్లో పంత్ ఘోర రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. తీవ్రమైన గాయాలపాలైనా అదృష్టవశాత్తూ ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ క్రమంలో ఐపీఎల్-2023 మొత్తానికి దూరమైన పంత్.. ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్‌గా ఈ ఏడాది పునరాగమనం చేశాడు. ఈ సీజన్లో మొత్తంగా 13 ఇన్నింగ్స్‌లో కలిపి 446 పరుగులు చేశాడు. సారథిగా జట్టును ప్లే ఆఫ్స్ చేర్చలేకపోయినా.. ఆరో స్థానంలో నిలపగలిగాడు. ఇక టీమిండియా తరఫున రీఎంట్రీలో కూడా అదరగొడున్నాడు. అయితే, వేలానికి ముందు ఢిల్లీ అతడిని వదిలేసింది. ఇదిలా ఉంటే.. ఐపీఎల్లో పంత్ ఇప్పటి వరకు 111 మ్యాచ్‌లు ఆడి 3284 పరుగులు సాధించాడు.ఇప్పటి వరకు ఐపీఎల్ వేలంలో అత్యధిక ధర పలికిన టాప్-5 ఆటగాళ్లు👉రిషభ్ పంత్(లక్నో సూపర్ జెయింట్స్- 2025)- రూ. 27 కోట్లు(వికెట్ కీపర్ బ్యాటర్- టీమిండియా)👉శ్రేయస్ అయ్యర్(పంజాబ్ కింగ్స్- 2025)- రూ. 26.75 కోట్లు(బ్యాటర్- టీమిండియా)👉మిచెల్ స్టార్క్(కోల్‌కతా నైట్ రైడర్స్- 2024)- రూ. 24.75 కోట్లు(పేస్ బౌలర్)👉ప్యాట్ కమిన్స్(సన్‌రైజర్స్ హైదరాబాద్- 2024)- రూ. 20.5 కోట్లు(పేస్ బౌలర్- ఆస్ట్రేలియా)👉సామ్ కర్రాన్(పంజాబ్ కింగ్స్- 2023)- రూ. 18.50 కోట్లు(ఆల్‌రౌండర్- ఇంగ్లండ్).చదవండి: IPL 2025: కేఎల్ రాహుల్‌కు భారీ షాక్..𝗥𝗲𝗰𝗼𝗿𝗱-𝗯𝗿𝗲𝗮𝗸𝗶𝗻𝗴 𝗥𝗶𝘀𝗵𝗮𝗯𝗵 🔝Snippets of how that Historic bidding process panned out for Rishabh Pant 🎥 🔽 #TATAIPLAuction | #TATAIPL | @RishabhPant17 | @LucknowIPL | #LSG pic.twitter.com/grfmkuCWLD— IndianPremierLeague (@IPL) November 24, 2024 -
IPL 2025: భారీ ధరకు అమ్ముడుపోయిన అర్ష్‌దీప్.. మళ్లీ ఆ జట్టుకే
టీమిండియా స్టార్ పేసర్ అర్ష్‌దీప్ సింగ్ భారీ ధరకు అమ్ముడుపోయాడు. ఐపీఎల్-2025 సీజన్‌కు ముందు జరిగిన మెగా వేలంలో అతడు రూ. 2 కోట్ల కనీస ధరతో పేరును నమోదు చేసుకున్నాడు. ఈ క్రమంలో మొదటి సెట్లో భాగంగా తొలి ఆటగాడిగా ఆక్షన్‌లోకి వచ్చిన అర్ష్‌దీప్ సింగ్ కోసం చెన్నై సూపర్ కింగ్స్ తొలుత రంగంలోకి దిగగా.. ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్తాన్ రాయల్స్, గుజరాత్ టైటాన్స్ పోటీకి వచ్చాయి.అయితే, అనూహ్యంగా రేసులోకి వచ్చిన సన్‌రైజర్స్ హైదరాబాద్ అర్ష్‌దీప్ ధరను రూ. 15.75 కోట్లకు పెంచింది. ఈ నేపథ్యంలో రిటెన్షన్‌కు ముందు అర్ష్‌దీప్‌ను వదిలేసిన పంజాబ్ కింగ్స్ రైజర్స్‌తో పోటీకి దిగింది. రైటు మ్యాచ్ కార్డు ద్వారా అతడిని సొంతం చేసుకునేందుకు ముందుకు వచ్చింది.అయినప్పటికీ సన్‌రైజర్స్ మాత్రం వెనక్కి తగ్గలేదు. అర్ష్‌దీప్ కోసం రూ. 18 కోట్లు వెచ్చించేందుకు సిద్ధమైంది. అయితే, పంజాబ్ మాత్రం ఈ టీమిండియా స్టార్‌ను వదులుకునేందుకు ఇష్టపడలేదు. దీంతో ఫైనల్ బిడ్‌గా రూ. 18 కోట్లకు అర్ష్‌దీప్‌ను దక్కించుకుంది. ఈ క్రమంలో క్యాష్ రిచ్ లీగ్‌లో రూ. 18 కోట్ల భారీ ధరకు అమ్ముడుపోయిన భారత ఆటగాడిగా అర్ష్‌దీప్ నిలిచాడు. కాగా లెఫ్టార్మ్ పేసర్ అయిన అర్ష్‌దీప్ ఇప్పటి వరకు 65 మ్యాచ్‌లలో కలిపి 76 వికెట్లు పడగొట్టాడు. అయితే, టీమిండియా తరఫున మాత్రం అతడికి టీ20లలో మాత్రం గొప్ప రికార్డు ఉంది. ఇప్పటికి ఆడిన 60 మ్యాచ్‌లలోనే అతడు 95 వికెట్లు పడగొట్టడం విశేషం. చదవండి: RTM కార్డు విషయంలో ట్విస్ట్ ఇచ్చిన బీసీసీఐ.. ఈ వేలం మునుపటిలా ఉండదు! -
టాలెంటెడ్ కిడ్.. కానీ.. : నితీశ్ రెడ్డిపై ప్యాట్ కమిన్స్ కామెంట్స్
టీమిండియా యువ క్రికెటర్ నితీశ్ కుమార్ రెడ్డిపై ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ప్రశంసలు కురిపించాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున అతడితో కలిసి ఆడిన జ్ఞాపకాలు మధురమైనవని.. ఆట పట్ల నితీశ్ అంకితభావం అమోఘమని కొనియాడాడు. ఆసీస్ గడ్డపై కూడా అతడు బంతిని స్వింగ్ చేసే అవకాశం ఉందని పేర్కొన్నాడు.ఆస్ట్రేలియా- టీమిండియా మధ్య ప్రతిష్టాత్మక బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఇరుజట్లు ఐదు టెస్టుల్లో తలపడబోతున్నాయి. ఈ క్రమంలో శుక్రవారం పెర్త్ వేదికగా తొలి మ్యాచ్ జరుగనుంది. ఈ నేపథ్యంలో ఆసీస్ సారథి ప్యాట్ కమిన్స్ గురువారం మీడియాతో మాట్లాడాడు.మాకు ఎంతో కీలకంబోర్డర్- గావస్కర్ ట్రోఫీ తమకు ఎంతో కీలకమైన సిరీస్ అన్న కమిన్స్.. టీమిండియా వంటి పటిష్ట జట్టుతో తలపడటం కఠినమైన సవాలు అని పేర్కొన్నాడు. ఇక సొంతగడ్డపై ఆడటం ఎల్లప్పుడూ ఒత్తిడికి గురిచేస్తుందని.. అయితే, తాము అన్ని రకాలుగా ఈ సిరీస్‌కు సిద్ధమయ్యాం కాబట్టి ఆందోళన చెందడం లేదని తెలిపాడు.టాలెంటెడ్ కిడ్ కానీ..ఈ సందర్భంగా నితీశ్ కుమార్ రెడ్డి ప్రస్తావన రాగా.. ‘‘ఎంతో ప్రతిభావంతుడైన కుర్రాడు. కానీ.. సన్‌రైజర్స్ తరఫున అతడికి పెద్దగా బౌలింగ్ చేసే అవకాశం రాలేదు. ఏదేమైనా అతడు టాలెంటెడ్ కిడ్. తన ఆట తీరుతో నన్ను ఇంప్రెస్ చేశాడు. ఇక్కడ కూడా బంతిని కాస్త స్వింగ్ చేయగలడనే అనుకుంటున్నా’’ అని కమిన్స్ కితాబులిచ్చాడు.సన్‌రైజర్స్ గెలుపులోకాగా ఐపీఎల్-2024లో కమిన్స్ సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్‌గా వ్యవహరించిన విషయం తెలిసిందే. గత వైఫల్యాలను మరిపించేలా జట్టును ఏకంగా ఫైనల్స్‌కు చేర్చాడు. ఇక కమిన్స్ కెప్టెన్సీలో ఆంధ్ర క్రికెటర్ నితీశ్ రెడ్డి తన ప్రతిభను నిరూపించుకున్నాడు.ఈ ఏడాది రైజర్స్ తరఫున 303 పరుగులు చేయడంతో పాటు.. మూడు వికెట్లు తీశాడు. ఇదిలా ఉంటే.. పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ కోటాలో ఆస్ట్రేలియాతో టెస్టులకు నితీశ్ కుమార్ రెడ్డి ఎంపికయ్యాడు. పెర్త్‌లో అతడు అరంగేట్రం చేసే అవకాశం ఉంది.చదవండి: పేసర్లకు కెప్టెన్సీ ఇవ్వాలి.. విరాట్, రోహిత్ వేరు.. నేను వేరు.. తుదిజట్టు ఖరారైంది: బుమ్రా -
IPL 2025: మన లీడర్.. మన కెప్టెన్.. రీటైన్ను సంపూర్ణంగా వాడుకుంది ఎవరు?
గత మూడేళ్లుగా పేలవ ఆట తీరుతో వెనుకబడ్డ సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను తన అద్భుత కెప్టెన్సీతో ఈసారి టైటిల్ రేసులో నిలిపాడు ప్యాట్ కమిన్స్. ఆస్ట్రేలియాకు వన్డే వరల్డ్‌కప్ అందించిన సారథిగా నీరాజనాలు అందుకున్న ఈ ఫాస్ట్ బౌలర్.. ఫ్రాంఛైజీ తనకు చెల్లించిన రూ. 20.50 కోట్లకు పైసా వసూల్ ప్రదర్శన ఇచ్చాడు.సహచర ఆటగాళ్లతో మమేమకమవుతూ సరైన సమయంలో అవకాశాలు ఇచ్చి జట్టును ఫైనల్‌కు తీసుకువెళ్లాడు. తద్వారా ఆరెంజ్ ఆర్మీకి ఇష్టమైన కెప్టెన్‌గా మారిపోయాడు. కానీ.. జాతీయ జట్టు విధుల దృష్ట్యా ఈసారి కమిన్స్ అసలు ఐపీఎల్ ఆడతాడా? కెప్టెన్‌గా కొనసాగుతాడా? అనే సందేహాలు వ్యక్తమయ్యాయి. అయితే, రిటెన్షన్ లిస్టు విడుదల సందర్భంగా సన్‌రైజర్స్ ఆ అనుమానాలన్నింటినీ పటాపంచలు చేసింది.మన లీడర్.. మన కెప్టెన్వచ్చే ఏడాది కూడా ప్యాటీనే రైజర్స్‌ను ముందుకు నడిపించబోతున్నాడని..ఫ్రాంఛైజీ అధికారికంగా ప్రకటించింది. ‘‘మన లీడర్.. మన కెప్టెన్... ప్యాటీ కమిన్స్ మిమ్మల్ని ఉప్పల్‌లో మరోసారి కలిసేందుకు సిద్ధంగా ఉన్నాడు’’ అంటూ ఆరెంజ్ ఆర్మీకి శుభవార్త అందించింది. ఇక ఈ ఏడాది పరుగుల విధ్వంసంతో రికార్డులు తిరగరాసిన సన్‌రైజర్స్.. రిటెన్షన్ల విషయంలోనూ దూకుడుగా వ్యవహరించింది. హార్డ్ హిట్టర్ హెన్రిక్ క్లాసెన్ కోసం ఏకంగా రూ. 23 కోట్లు ఖర్చు చేసింది. ఆ జట్లు వదిలేశాయిఇదిలా ఉంటే.. ఇతర ఫ్రాంఛైజీలలో కోల్‌కతా, ఢిల్లీ, లక్నో, పంజాబ్, బెంగళూరు తమ కెప్టెన్లను వేలంలోకి వదిలివేయగా.. చెన్నై, ముంబై, గుజరాత్, రాజస్తాన్ మాత్రం తమ సారథులను కొనసాగించాయి. దీంతో ఈసారి ఈసారి ఐపీఎల్ వేలం ఆసక్తికరంగా సాగడం ఖాయం.ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మెగా వేలం ఈనెల నెలాఖరున జరగనుండగా... రీటైన్ చేసుకున్న ఆటగాళ్ల జాబితాను ఐపీఎల్ నిర్వాహకులు వెల్లడించిన విషయం తెలిసిందే. ఇందులో కొందరు ఆటగాళ్లు అనూహ్యంగా కోట్లు కొల్లగొట్టగా... మరికొందరు స్టార్ ప్లేయర్లు ఫ్రాంచైజీ నమ్మకాన్ని నిలబెట్టుకోలేకపోయారు. అధిక ధర వీరికేఅందరికంటే అత్యధికంగా దక్షిణాఫ్రికా ‘హార్డ్ హిట్టర్’ హెన్రిచ్ క్లాసెన్‌కు సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ రూ. 23 కోట్లు కేటాయించగా... విరాట్ కోహ్లీకి రాయల్ చాలెంజర్స్ బెంగళూరు... నికోలస్ పూరన్‌కు లక్నో సూపర్ జెయింట్స్ రూ.21 కోట్లు ఇచ్చి అట్టిపెట్టుకున్నాయి. ఈ సీజన్లో ముంబై ఇండియన్స్ జట్టుకు సారథ్యం వహించిన హార్దిక్ పాండ్యా... ఇక మీదట కూడా నాయకుడిగా కొనసాగడం ఖాయం కాగా... ముంబై మొత్తంగా ఐదుగురు ప్రధాన ఆటగాళ్లను అట్టిపెట్టుకుంది. మేటి పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు అత్యధికంగా రూ. 18 కోట్లు కేటాయించిన ఫ్రాంచైజీ సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యాలకు చెరో రూ. 16 కోట్ల 35 లక్షలు వెచ్చించింది.ఇక ‘హిట్‌మ్యాన్’ రోహిత్ శర్మకు రూ. 16 కోట్ల 30 లక్షలు కేటాయించింది. హైదరాబాద్ ఆటగాడు ఠాకూర్ తిలక్ వర్మకు రూ.8 కోట్లు ఇచ్చి ముంబై తమ వద్దే పెట్టుకుంది. రీటైన్ను సంపూర్ణంగా వాడుకుంది ఎవరంటే?ఆటగాళ్ల కొనుగోలు కోసం ఒక్కో జట్టు రూ.120 కోట్లు ఖర్చు చేసుకునే అవకాశం ఉండగా... అందులో రూ. 75 కోట్లు రిటెన్షన్‌కు కేటాయించారు. తాజా జాబితాను చూస్తే ముంబై ఇండియన్స్ జట్టు రీటైన్ను సంపూర్ణంగా వాడుకోగా... అత్యల్పంగా పంజాబ్ కింగ్స్ జట్టు కేవలం ఇద్దరు ప్లేయర్లనే అట్టి పెట్టుకుంది. పంజాబ్ మరీ ఇద్దరినేపంజాబ్ హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన ఆ్రస్టేలియా దిగ్గజ కెప్టెన్ రికీ పాంటింగ్ వ్యూహాల్లో భాగంగా... కేవలం ఇద్దరు ‘అన్క్యాప్డ్’ ప్లేయర్లను మాత్రమే రీటైన్ చేసుకున్న పంజాబ్ వద్ద వేలం కోసం అత్యధికంగా రూ. 110.5 కోట్లు మిగిలి ఉన్నాయి. ఈ ఏడాది జట్టుకు ఐపీఎల్ టైటిల్ అందించిన శ్రేయస్ అయ్యర్‌ను కోల్‌కతా నైట్ రైడర్స్ వేలానికి వదిలేయగా... తొమ్మిదేళ్లుగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో కొనసాగుతున్న రిషబ్ పంత్‌ను ఫ్రాంచైజీ వదిలేసుకుంది. లక్నో సూపర్ జెయింట్స్ యాజమాన్యం కేఎల్ రాహుల్‌పై నమ్మకం ఉంచలేదు. రింకూ సింగ్‌కు జాక్‌పాట్.. ధోనీ ‘అన్క్యాప్డ్’ ప్లేయర్చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ధోనీ సహా మొత్తం ఐదుగురు ప్లేయర్లను అట్టిపెట్టుకోగా... రాజస్తాన్ రాయల్స్ కూడా ఆరుగురు ప్లేయర్లను రీటైన్ చేసుకుంది. స్పిన్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ కోసం ఢిల్లీ క్యాపిటల్స్ రూ. 16 కోట్ల 50 లక్షలు కేటాయించగా... సిక్సర్ల వీరుడు రింకూ సింగ్‌కు కోల్‌కతా రూ.13 కోట్లు ఇచ్చి అట్టిపెట్టుకుంది. వెస్టిండీస్ ద్వయం రసెల్, నరైన్‌తో పాటు మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తికి తలా రూ. 12 కోట్లు కేటాయించింది. కోల్‌కతా వదిలేసుకున్న శ్రేయస్ అయ్యర్ కోసం వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ పోటీ పడటం ఖాయమే కాగా... సారథి కోసం చూస్తున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు పంత్‌పై కన్నేసే అవకాశాలు ఉన్నాయి. బేబీ మలింగకు రూ. 13 కోట్లుజాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించి ఐదేళ్లు దాటిపోయిన ధోనీని ఐపీఎల్ నిబంధనల ప్రకారం ‘అన్క్యాప్డ్’ ప్లేయర్ కోటాలో రీటైన్ చేసుకున్న చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ... మాజీ సారథికి రూ.4 కోట్లు కేటాయించింది. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్‌తో పాటు స్పిన్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాకు చెరో రూ. 18 కోట్లు వెచ్చించింది. శ్రీలంక పేసర్ పతిరణకు రూ. 13 కోట్లు, పేస్ ఆల్‌రౌండర్ శివమ్ దూబేను రూ.12 కోట్లకు అట్టిపెట్టుకుంది. రాజస్తాన్ రైట్రైట్రిటైనింగ్లో మొత్తం ఆరు అవకాశాలను వాడుకున్న రాజస్తాన్ రాయల్స్... సంజూ సామ్సన్, యశస్వి జైస్వాల్‌కు చెరో రూ.18 కోట్లు కేటాయించింది. రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్‌కు చెరో రూ. 14 కోట్లు వెచ్చించింది.పూరన్ కోసం అంత అవసరమా?కేఎల్ రాహుల్‌ను వేలానికి వదిలేసిన లక్నో సూపర్ జెయింట్స్ జట్టు నిలకడగా ఆడతాడో లేదో తెలియని వెస్టిండీస్ హిట్టర్ నికోలస్ పూరన్ కోసం రూ. 21 కోట్లు కేటాయించింది. గాయాలతో సహవాసం చేసే సూపర్ ఫాస్ట్ బౌలర్ మయాంక్ యాదవ్, స్పిన్నర్ రవి బిష్ణోయ్‌కు రూ. 11 కోట్లు కేటాయించిన లక్నో... మొహసిన్ ఖాన్, ఆయుష్ బదోనీలకు చెరో రూ. 4 కోట్లు వెచ్చించింది. స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్‌కు రూ.18 కోట్లు కేటాయించిన గుజరాత్ టైటాన్స్ ఫ్రాంచైజీ... కెప్టెన్ శుబ్‌మన్ గిల్‌ను రూ. 16 కోట్ల 50 లక్షలకు అట్టిపెట్టుకుంది. వేలానికి రానున్న ప్రధాన ఆటగాళ్లు కేఎల్ రాహుల్, రిషబ్ పంత్, శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్, అర్ష్‌దీప్ సింగ్, సిరాజ్, చాహల్, అశ్విన్, వాషింగ్టన్ సుందర్, భువనేశ్వర్, శార్దూల్ ఠాకూర్, దీపక్ చాహర్, షమీ (భారత్). వార్నర్, మ్యాక్స్‌వెల్, కామెరూన్ గ్రీన్, మిచెల్ స్టార్క్, స్టొయినిస్ ఆస్ట్రేలియా). బెయిర్‌స్టో, లివింగ్‌స్టోన్, స్యామ్ కరన్, బట్లర్, ఫిల్ సాల్ట్ (ఇంగ్లండ్). డుప్లెసిస్, డేవిడ్ మిల్లర్, క్వింటన్ డికాక్, నోర్జే (దక్షిణాఫ్రికా). కాన్వే, రచిన్ రవీంద్ర, బౌల్ట్ (న్యూజిలాండ్). చదవండి: Ind vs Pak: భారత బ్యాటర్ల విధ్వంసం.. అయినా పాక్ చేతిలో తప్పని ఓటమి -
IPL 2025: అత్యంత ఖరీదైన ఆటగాడు అతడే.. రిటెన్షన్ పూర్తి లిస్టు ఇదే!
ఇండియన్ ప్రీమియర్ లీగ్-2025 రిటెన్షన్ లిస్టు.. క్రికెట్ వర్గాల్లో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. తాము అట్టిపెట్టుకునే ఆటగాళ్ల జాబితాను సమర్పించేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి అక్టోబరు 31 వరకు సమయం ఇచ్చింది. ఈ నేపథ్యంలో పది ఫ్రాంఛైజీలు ఇప్పటికే తాము రిటైన్ చేసుకునే ఆటగాళ్లను ఖరారు చేసినట్లు తెలుస్తోంది.ఈ నేపథ్యంలో ఏ జట్టు ఎవరిని అట్టిపెట్టుకుందనే అంశంపై జోరుగా ఊహాగానాలు సాగుతున్నాయి. ఫ్రాంఛైజీలు కోట్లు కుమ్మరించబోయేది వీరిపైనే అంటూ ఔత్సాహికులు తమ అంచనాలు తెలియజేస్తున్నారు. ఆ విశేషాలపై మనమూ ఓ లుక్కేద్దామా!నిబంధనలు ఇవీఅంతకంటే ముందు ఐపీఎల్-2025 మెగా వేలం నేపథ్యంలో బీసీసీఐ రిటెన్షన్ పాలసీ ఎలా ఉందో పరిశీలిద్దాం. రూల్స్ ప్రకారం.. ఈసారి పర్స్ వాల్యూ 120 కోట్ల రూపాయలకు పెరిగింది. అంతేకాదు.. రైట్ టూ మ్యాచ్ కార్డు కూడా ఉపయోగించుకునే వీలు కలిగింది.అంటే.. ఒక ఆటగాడిని ఓ ఫ్రాంఛైజీ వదిలేసిన తర్వాత.. అతడు వేలంలోకి వస్తే.. మరో ఫ్రాంఛైజీ అతడిని కొనుగోలు చేసిన పక్షంలో.. ఈ కార్డును ఉపయోగించి పాత ఫ్రాంఛైజీ మళ్లీ సదరు ప్లేయర్‌ను వేలంలోని ధరకు సొంతం చేసుకోవచ్చు. గరిష్టంగా ఆరుగురుఇక ఒక్కో టీమ్ గరిష్టంగా ఆరుగురు ఆటగాళ్లను కొనసాగించవచ్చు. అందులో కనీసం ఒక్కరైనా అన్క్యాప్డ్ ప్లేయర్ అయి ఉండాలి. అంటే.. ఇంత వరకు అంతర్జాతీయ క్రికెట్లో ఆడని క్రికెటర్ అయి ఉండాలి.ఇక తాము కొనసాగించాలనుకున్న తొలి ఐదుగురు ఆటగాళ్లకు వరుసగా రూ. 18 కోట్లు, రూ. 14 కోట్లు, రూ. 11 కోట్లు, రూ. 18 కోట్లు, రూ. 14 కోట్ల చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. ఆరో ఆటగాడు గనుక అన్క్యాప్డ్ ప్లేయర్ అయితే రూ. 4 కోట్ల మేర చెల్లించాలి.రూ.75 కోట్ల నుంచి తమకు నచ్చినంతఅయితే, కొన్ని జట్లు కొందరు ఆటగాళ్లను వదులుకోవడానికి అస్సలు సిద్ధపడవు. అలాగే, వారి డిమాండ్‌కు తగ్గట్లు భారీ మొత్తం కూడా చెల్లించాల్సి ఉంటుంది. అలాంటి ప్రాంఛైజీలకు బీసీసీఐ ఓ వెసలుబాటు కల్పించింది. తాము రిటైన్ చేసుకోవాలనుకునే తొలి ఐదుగురు క్రికెటర్లకు కలిపి గరిష్ట పరిమితి అయిన రూ.75 కోట్ల నుంచి తమకు నచ్చినంత ఖర్చు పెట్టుకోవచ్చు.ఐపీఎల్-2025 రిటెన్షన్ లిస్టు అంచనాలు ఇవేముంబై ఇండియన్స్1. హార్దిక్ పాండ్యా- రూ. 18 కోట్లు2. జస్ప్రీత్ బుమ్రా- రూ. 14 కోట్లు3. తిలక్ వర్మ- రూ. 11 కోట్లు4. సూర్యకుమార్ యాదవ్- రూ. 18 కోట్లు5. నమన్ ధీర్(అన్క్యాప్డ్)- రూ. 4 కోట్లు5. ఆకాశ్ మధ్వాల్(అన్క్యాప్డ్)- రూ. 4 కోట్లుపర్సులో మిగిలేది: రూ. 51 కోట్లురాయల్ చాలెంజర్స్ బెంగళూరు1. విరాట్ కోహ్లి- రూ. 18 కోట్లు2. ఫాఫ్ డుప్లెసిస్- రూ. 14 కోట్లు3. మహ్మద్ సిరాజ్- రూ. 11 కోట్లు4. యశ్ దయాల్(అన్క్యాప్డ్)- రూ. 4 కోట్లు5. అనూజ్ రావత్(అన్క్యాప్డ్)- రూ. 4 కోట్లు6. రైట్ టు మ్యాచ్ కార్డుపర్సులో మిగిలేది: రూ. 69 కోట్లుచెన్నై సూపర్ కింగ్స్1. రుతురాజ్ గైక్వాడ్- రూ. 18 కోట్లు2. మతీశ పతిరణ- రూ. 14 కోట్లు3. రచిన్ రవీంద్ర- రూ. 11 కోట్లు4. రవీంద్ర జడేజా- రూ. 18 కోట్లు5. ఎంఎస్ ధోని(అన్క్యాప్డ్- అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన భారత క్రికెటర్)- రూ. 4 కోట్లు6. రైట్ టు మ్యాచ్ కార్డుపర్సులో మిగిలేది: రూ. 51 కోట్లుకోల్‌కతా నైట్ రైడర్స్1. శ్రేయస్ అయ్యర్- రూ. 18 కోట్లు2. సునిల్ నరైన్- రూ. 14 కోట్లు3. రింకూ సింగ్- రూ. 11 కోట్లు4. ఆండ్రీ రసెల్- రూ. 18 కోట్లు5. హర్షిత్ రాణా(అన్క్యాప్డ్)- రూ. 4 కోట్లు6. అంగ్క్రిష్ రఘువంశీ(అన్‌కాప్డ్)- రూ. 4 కోట్లుపర్సులో మిగిలేది: రూ. 55 కోట్లురాజస్తాన్ రాయల్స్1. సంజూ శాంసన్- రూ. 18 కోట్లు2. జోస్ బట్లర్- రూ. 14 కోట్లు3. రియాన్ పరాగ్- రూ. 11 కోట్లు4. యశస్వి జైస్వాల్- రూ. 18 కోట్లు5. సందీప్ శర్మ(అన్క్యాప్డ్)- రూ. 4 కోట్లు6. రైట్ టు మ్యాచ్ కార్డుపర్సులో మిగిలేది- రూ. 55 కోట్లులక్నో సూపర్ జెయింట్స్1. నికోలస్ పూరన్- రూ. 18 కోట్లు2. మార్కస్ స్టొయినిస్- రూ. 14 కోట్లు3. మయాంక్ యాదవ్- రూ. 11 కోట్లు4. ఆయుశ్ బదోని(అన్క్యాప్డ్)- రూ. 4 కోట్లు5. మొహ్సిన్ ఖాన్(అన్క్యాప్డ్)- రూ. 4 కోట్లు6. రైట్ టు మ్యాచ్ కార్డుపర్సులో మిగిలేది: రూ. 69 కోట్లుపంజాబ్ కింగ్స్1. అర్ష్‌దీప్ సింగ్- రూ. 18 కోట్లు2. సామ్ కరన్- రూ. 14 కోట్లు3. కగిసో రబాడ- రూ. 11 కోట్లు4. అశుతోశ్ శర్మ(అన్క్యాప్డ్)- రూ. 4 కోట్లు5. ప్రభ్‌సిమ్రన్ సింగ్(అన్క్యాప్డ్)- రూ. 4 కోట్లు6. రైట్ టు మ్యాచ్ కార్డుపర్సులో మిగిలేది: రూ. 69 కోట్లుఢిల్లీ క్యాపిటల్స్1. రిషభ్ పంత్- రూ. 18 కోట్లు2. అక్షర్ పటేల్- రూ. 14 కోట్లు3. కుల్దీప్ యాదవ్- రూ. 11 కోట్లు4. రసిఖ్ సలాం దర్(అన్క్యాప్డ్)- రూ. 4 కోట్లు5. అభిషేక్ పోరెల్(అన్క్యాప్డ్)- రూ. 4 కోట్లు6. రైట్ టు మ్యాచ్ కార్డుపర్సులో మిగిలేది: రూ. 69 కోట్లుసన్‌రైజర్స్ హైదరాబాద్1. హెన్రిచ్ క్లాసెన్- రూ. 23 కోట్లు (ప్రస్తుత సమాచారం ప్రకారం ఇతడే ఈసారి రిటెన్షన్ జాబితాలో అత్యంత ఖరీదైన ఆటగాడు)2. ప్యాట్ కమిన్స్- రూ. 18 కోట్లు3. అభిషేక్ శర్మ- రూ. 14 కోట్లు4. ట్రవిస్ హెడ్- రూ. 14 కోట్లు5. నితీశ్ రెడ్డి- రూ. 6 కోట్లు 6. రైట్ టు మ్యాచ్ కార్డుపర్సులో మిగిలేది: రూ. 45 కోట్లుగుజరాత్ టైటాన్స్1. శుబ్‌మన్ గిల్- రూ. 18 కోట్లు2. మహ్మద్ షమీ/డేవిడ్ మిల్లర్- రూ. 14 కోట్లు3. సాయి సుదర్శన్- రూ. 11 కోట్లు4. రషీద్ ఖాన్- రూ. 18 కోట్లు5. రాహుల్ తెవాటియా(అన్క్యాప్డ్)- రూ. 4 కోట్లు6. మోహిత్ శర్మ(అన్క్యాప్డ్)- రూ. 4 కోట్లుపర్సులో మిగిలేది: రూ. 51 కోట్లు.చదవండి: CT 2025: టీమిండియా పాకిస్తాన్‌కు వస్తే గనుక.. : మహ్మద్ రిజ్వాన్ -
సన్‌రైజర్స్ సంచలన నిర్ణయం.. క్లాసెన్‌కు రూ.23 కోట్లు!
న్యూఢిల్లీ: ఐపీఎల్ గత సీజన్లో తన అద్భుత ఆటతో జట్టును ఫైనల్ వరకు చేర్చిన హెన్రిచ్ క్లాసెన్‌పై సన్‌రైజర్స్ హైదరాబాద్ నమ్మకముంచింది. వచ్చే సీజన్‌కూ అతడిని తమతో అట్టి పెట్టుకునేందుకు రైజర్స్ ఆసక్తి చూపిస్తోంది. ఇందు కోసం భారీగా రూ. 23 కోట్లు చెల్లించేందుకు కూడా టీమ్ మేనేజ్మెంట్ సిద్ధమైనట్లు సమాచారం. ఐపీఎల్ నిబంధనల ప్రకారం ఒక్కో టీమ్ గరిష్టంగా ఆరుగురు ఆటగాళ్లను కొనసాగించవచ్చు. వీరిలో ఒకరైనా జాతీయ జట్టుకు ఆడని ‘అన్క్యాప్డ్’ ప్లేయర్ అయి ఉండాలి. ఈ ఆటగాళ్ల పేర్లను వెల్లడించేందుకు అక్టోబర్ 31 వరకు గవరి్నంగ్ కౌన్సిల్ గడువు ఇచి్చంది. ప్రతీ టీమ్ తాము కొనసాగించే తొలి ఐదుగురు ఆటగాళ్లకు వరుసగా రూ. 18 కోట్లు, రూ. 14 కోట్లు, రూ. 11 కోట్లు, రూ. 18 కోట్లు, రూ. 14 కోట్ల చొప్పున ఇవ్వాల్సి ఉంటుంది. ఆరో ఆటగాడు అన్క్యాప్డ్ అయితే రూ. 4 కోట్లు చెల్లించాలి. అయితే తొలి ఐదుగురు ఆటగాళ్లకు కలిపి గరిష్ట పరిమితి అయిన రూ.75 కోట్ల నుంచి తమకు నచి్చన విధంగా ఖర్చు చేసుకునే స్వేచ్ఛ ఫ్రాంచైజీలకు ఉంది. ఈ నేపథ్యంలో కెపె్టన్ ప్యాట్ కమిన్స్‌కు రూ. 18 కోట్లు, ఓపెనర్ అభిషేక్ శర్మకు రూ. 14 కోట్లు ఇచ్చేందుకు రైజర్స్ సిద్ధంగా ఉంది. 2024 సీజన్లో క్లాసెన్ 15 ఇన్నింగ్స్‌లలో 171.07 స్ట్రయిక్‌రేట్‌తో 479 పరుగులు సాధించాడు. ఇందులో 19 ఫోర్లు, 38 సిక్స్‌లు ఉన్నాయి.అభిõÙక్ 16 ఇన్నింగ్స్‌లలో 204.21 స్ట్రైక్‌రేట్‌తో 484 పరుగులు చేయగా... 36 ఫోర్లు, 42 సిక్స్‌లు బాదాడు. 2023 ఐపీఎల్‌కు ముందు మినీ వేలంలో క్లాసెన్‌ను సన్‌రైజర్స్ రూ. 5.25 కోట్లకు తీసుకొని తర్వాతి ఏడాది కొనసాగించింది. ఇప్పుడు అతనికి లభించే మొత్తం గతంతో పోలిస్తే ఏకంగా 338 శాతం ఎక్కువ కావడం విశేషం. ఈ ముగ్గురి కొనసాగింపు దాదాపు ఖరారు కాగా... నాలుగో, ఐదో ఆటగాళ్లుగా ట్రవిస్ హెడ్, నితీశ్ కుమార్ రెడ్డిలను కూడా అట్టి పెట్టుకోవాలని సన్‌రైజర్స్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. -
IPL 2025: ‘కమిన్స్‌ను వదిలేయనున్న సన్‌రైజర్స్! కారణం ఇదే’
ఐపీఎల్-2024లో సన్‌రైజర్స్ హైదరాబాద్ రాతను మార్చేశాడు ప్యాట్ కమిన్స్. మూడేళ్లుగా పేలవ ప్రదర్శనతో విమర్శలు మూటగట్టుకున్న జట్టును తన కెప్టెన్సీ నైపుణ్యాలతో ఏకంగా ఫైనల్ చేర్చాడు. ఆఖరి మెట్టుపై రైజర్స్ తడబడ్డా.. అక్కడి దాకా జట్టు సాగించిన విధ్వంసకర పరుగుల ప్రయాణం ఐపీఎల్ చరిత్రలోనే ఓ అద్బుతం లాంటిది.నిజానికి ఐపీఎల్ వేలంలో ఆస్ట్రేలియా వన్డే, టెస్టు కెప్టెన్ ప్యాట్ కమిన్స్ కోసం సన్‌రైజర్స్ ఏకంగా రూ. 20.50 కోట్లు ఖర్చు చేసినపుడు విమర్శలే ఎక్కువగా వచ్చాయి. ఈ ఫాస్ట్ బౌలర్ కోసం భారీ మొత్తం వెచ్చించడం వల్ల ప్రయోజనం ఉండదని చాలా మంది మాజీ క్రికెటర్లు పెదవి విరిచారు.సంచలన ఆట తీరుతో టైటిల్‌కు చేరువగాఅయితే, అందరి అంచనాలు తలకిందులు చేస్తూ కమిన్స్ సారథ్యంలోని జట్టు సంచలన ఆట తీరుతో టైటిల్‌కు చేరువగా వచ్చింది. ఇక బౌలర్‌గానూ, సారథిగానూ కమిన్స్.. ఫ్రాంఛైజీ తనపై పెట్టిన పెట్టుబడికి పైసా వసూల్ ప్రదర్శన ఇచ్చాడు. ఆరెంజ్ ఆర్మీకి ఇష్టమైన కెప్టెన్‌గా మారిపోయాడు. వచ్చే ఏడాది కూడా తానే కెప్టెన్‌గా ఉండాలనేంత బలంగా ముద్ర వేశాడు. ఫ్రాంఛైజీ సైతం కమిన్స్‌నే నాయకుడిగా కొనసాగిస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా మాత్రం భిన్నంగా స్పందించాడు. సన్‌రైజర్స్ కమిన్స్‌ను అట్టిపెట్టుకోదని.. వేలానికి ముందు అతడిని టీమ్ నుంచి రిలీజ్ చేస్తుందని జోస్యం చెప్పాడు. తాను ఇలా అనడానికి గల కారణాన్ని కూడా వెల్లడించాడు. కంగారూ ఆటగాళ్ల ప్రాధాన్యాలు వేరుగా ఉంటాయి‘‘ప్యాట్ కమిన్స్ వచ్చే ఏడాది ఐపీఎల్ ఆడతానో.. లేదోనన్న అంశంపై స్పష్టత లేదని చెప్పాడు. ఆస్ట్రేలియాకు ఉన్న బిజీ షెడ్యూల్ ఇందుకు కారణం. యాషెస్, వరల్డ్‌కప్స్.. ఇలా కంగారూ ఆటగాళ్ల ప్రాధాన్యాలు వేరుగా ఉంటాయి.ఒకవేళ ఆసీస్ షెడ్యూల్‌కు ఐపీఎల్ షెడ్యూల్ అడ్డు రానట్లయితే.. అప్పుడు పరిస్థితులు వేరుగా ఉంటాయి. ఐపీఎల్లో కొత్త నిబంధనలు వచ్చాయని కూడా కమిన్స్ చెప్పాడు. మరి అతడి నిర్ణయం ఎలా ఉండబోతుందో తెలియదు.హైదరాబాద్ ఈసారి అతడిని రిటైన్ చేసుకోదువేలంలో తన పేరు నమోదు చేసుకుని.. ఆ తర్వాత తప్పుకొన్న సందర్భాలు లేవని కూడా అతడే చెప్పాడు. గతంలో మిచెల్ స్టార్క్ వంటి ఆసీస్ ఆటగాళ్లు ఇలా చేసిన మాట వాస్తవం. అయితే, కమిన్స్ ఈ విషయంలో క్లారిటీగానే ఉన్నాడు. నా అభిప్రాయం ప్రకారం.. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఈసారి అతడిని రిటైన్ చేసుకోదు.ఎందుకంటే.. మొదటి ప్లేయర్‌గా అతడిని తీసుకుంటే 18 కోట్ల రూపాయలు ఇవ్వాలి. ఈ సీజన్లో కమిన్స్ బౌలర్‌గా.. కెప్టెన్‌గా అద్భుతంగా రాణించినా.. ఫ్రాంఛైజీ మాత్రం అతడిని రిలీజ్ చేస్తుందనే నేను నమ్ముతున్నాను’’ అని ఆకాశ్ చోప్రా విచిత్ర వ్యాఖ్యలు చేశాడు.నిబంధనలు ఇవేకాగా ఐపీఎల్-2025 మెగా వేలం నేపథ్యంలో బీసీసీఐ ఇటీవలే రిటెన్షన్ పాలసీని ప్రకటించింది. మొత్తం ఆరుగురి(ఆర్టీఎమ్ కార్డుతో కలిపి)ని తమతో పాటే జట్లు అట్టిపెట్టుకోవచ్చు. ఇందులో ఐదుగురు క్యాప్డ్, కనీసం ఒక్కరు అన్క్యాప్డ్(ఇండియన్ ప్లేయర్స్) ఉండాలి. ఐదుగురు క్యాప్డ్ ప్లేయర్లను అట్టిపెట్టుకుంటే మొదటి మూడు రిటెన్షన్లకు వరుసగా రూ. 18 కోట్లు, రూ. 14 కోట్లు, రూ. 11 కోట్లు చెల్లించాలి.మిగతా రెండు రిటెన్షన్లకు రూ. 18 కోట్లు, రూ. 14 కోట్లు ఇవ్వాల్సి ఉంటుంది. ఇక వేలంలోకి వచ్చి అమ్ముడుపోయి.. సీజన్ ఆరంభానికి ముందు సహేతుక కారణాలు లేకుండా తప్పుకొంటే సదరు ఆటగాళ్లపై రెండేళ్ల నిషేధం విధిస్తారు.చదవండి: T20 WC 2024: పట్టిక తారుమారు.. సెమీస్ బెర్తులు ఖరారు -
రెండోసారి తండ్రి కాబోతున్న సన్‌రైజర్స్ కెప్టెన్!
ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు కెప్టెన్ ప్యాట్ కమిన్స్ తన అభిమానులకు శుభవార్త చెప్పాడు. తాను రెండోసారి తండ్రి కాబోతున్నట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. ఈ మేరకు.. ‘‘మా బేబీకి సంబంధించిన శుభవార్తను మీతో పంచుకోవడం ఎంతో సంతోషంగా ఉంది!మా జీవితాలను మరింత క్రేజీగా మార్చేందుకు వస్తున్న చిన్నారి కోసం ఆతురతగా ఎదురుచూస్తున్నాం’’ అని బెకీతో పాటు కమిన్స్ ఇన్‌స్టాలో ఈ విషయాన్ని పంచుకున్నాడు. ఈ సందర్భంగా భార్య బెకీ, కుమారుడు ఆల్బీ ఫొటోలను షేర్ చేశాడు. ఇందులో బెకీ బేబీ బంప్‌తో కనిపించగా.. ఆల్బీ తల్లిని ముద్దాడుతున్నాడు.కుమారుడి సమక్షంలో వివాహంకాగా ఆసీస్ పేసర్ ప్యాట్ కమిన్స్ 2020లో బెకీ బోస్టన్తో నిశ్చితార్థం చేసుకున్నాడు. ఈ జంట 2022లో వివాహ బంధంతో ఒక్కటైంది. పెళ్లికి ముందే వీరికి అల్బీ(2021) జన్మించాడు. తాజాగా మరోసారి కమిన్స్- బెకీ తల్లిదండ్రులు కాబోతున్నారు. కాగా కమిన్స్ ఐపీఎల్-2024లో సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్‌గా వ్యవహరించిన విషయం తెలిసిందే.మూడేళ్లుగా నిరాశాజనక ప్రదర్శనతో డీలా పడ్డ రైజర్స్‌ను ఏకంగా ఫైనల్‌కు చేర్చి ఆరెంజ్ ఆర్మీ హృదయాలు గెలుచుకున్నాడు కమిన్స్. ఐపీఎల్ సమయంలో కమిన్స్‌తో పాటు బెకీ, ఆల్బీ.. ఇతర కుటుంబ సభ్యులు సైతం హైదరాబాద్‌కు విచ్చేశారు.ఎనిమిది వారాల విరామంటీ20 ప్రపంచకప్-2024లో ఆసీస్ సెమీస్‌లోనే నిష్క్రమించగా.. కమిన్స్ అప్పటి నుంచి ఎనిమిది వారాల పాటు విరామం తీసుకున్నాడు. టీమిండియాతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీకి ముందు ఈ బ్రేక్ తీసుకున్న కమిన్స్.. ఏ ఆటగాడికైనా విరామం కచ్చితంగా అవసరమని పేర్కొన్నాడు. వరల్డ్ చాంపియన్‌షిప్ సైకిల్లో భాగంగా వరుస టెస్టులు ఆడాల్సిన నేపథ్యంలో తాను ఈ మేరకు విశ్రాంతి తీసుకున్నట్లు వెల్లడించాడు. View this post on Instagram A post shared by Rebecca Jane Cummins (@becky_cummins) -
అక్కడ రూ. 10 కోట్లు.. ఇక్కడ కోటిన్నర!.. కావ్యా మారన్ వ్యాఖ్యలు వైరల్
ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) మెగా వేలానికి సంబంధించి ఫ్రాంఛైజీలు- భారత క్రికెట్ నియంత్రణ మండలి మధ్య చర్చలు వాడివేడిగా సాగినట్లు సమాచారం. ముఖ్యంగా ఆటగాళ్ల రిటెన్షన్ విధానంలో తమకు స్వేచ్ఛ ఇవ్వాలని పలువురు ఫ్రాంఛైజీ యజమానులు కోరినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓనర్ కావ్యా మారన్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.నిషేధం విధించాలి‘‘వేలంలో ఓ ఆటగాడిని కొనుగోలు చేసిన తర్వాత.. గాయం మినహా ఇతరత్రా కారణాలు చెప్పి సీజన్‌కు దూరమైతే అతడిపై కచ్చితంగా నిషేధం విధించాలి. నిజానికి ఒక్కో ఫ్రాంఛైజీ తమ జట్టు కూర్పు కోసం అన్ని విధాలుగా ఆలోచించిన తర్వాతే ఒక ఆటగాడిని కొనుగోలు చేసేందుకు సిద్ధపడుతుంది.కానీ కొందరు ఆటగాళ్లు ముఖ్యంగా విదేశీ ప్లేయర్లు వివిధ కారణాలు చెప్పి సీజన్ మొత్తానికి అందుబాటులో ఉండటం లేదు. తక్కువ మొత్తానికి అమ్ముడు పోవడం వల్లే వాళ్లు ఇలా చేస్తున్నట్లు అనిపిస్తోంది. కానీ.. వాళ్లను కొనుక్కున్న మేము.. అర్ధంతరంగా వారు వెళ్లిపోవడం వల్ల కాంబినేషన్ విషయంలో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది.ఒక్కో జట్టు బలం ఒక్కో విధంగా ఉంటుందిఇక రిటెన్షన్ విషయానికొస్తే.. అట్టిపెట్టుకునే ఆటగాళ్లకు కేటాయించే మొత్తంలో మాకు స్వేచ్ఛ ఇవ్వాలి. అలా అయితే ఆటగాళ్లతో విభేదాలు తలెత్తకుండా ఉంటుంది. ఎందుకంటే.. కొంతమంది తమ కంటే తక్కువ నైపుణ్యాలు కలిగి ఉన్న ఆటగాళ్లకు ఫ్రాంఛైజీ తమ అవసరాల దృష్ట్యా ఎక్కువ మొత్తం చెల్లిస్తుందని భావిస్తూ ఉంటారు. ఇలాంటివి విభేదాలకు దారితీస్తాయి. ఈ వ్యవహారం కాంట్రాక్టు రద్దు చేసుకునేదాకా కూడా వెళ్తుంది.అయినా.. ఒక్కో జట్టు బలం ఒక్కో విధంగా ఉంటుంది. కొన్ని జట్లలో చాకుల్లాంటి విదేశీ ప్లేయర్లు ఉంటే.. మరికొన్ని జట్లలో టీమిండియా సూపర్స్టార్లు ఉంటారు. ఇంకొన్నింటిలో నైపుణ్యాలు గల అన్క్యాప్డ్ ప్లేయర్లు కూడా ఉంటారు.మా జట్టు బలం వారేఉదాహరణకు.. మా విషయమే తీసుకుంటే.. మా జట్టులో విదేశీ ఆటగాళ్ల బెంచ్ పటిష్టంగా ఉంది. కాబట్టి మేము.. నలుగురు విదేశీ ఆటగాళ్లతో పాటు ఇద్దరు క్యాప్డ్ ఇండియన్స్ లేదంటే ముగ్గురు విదేశీ ఆటగాళ్లతో పాటు ముగ్గురు అన్క్యాప్డ్ ఇండియన్స్.. ఇలాంటి కాంబినేషన్లలో రిటైన్ చేసుకునే విధానం ఉంటే బాగుంటుందని భావిస్తాం. ఈ విషయంలో ఐపీఎల్ పాలక మండలి సాధ్యాసాధ్యాలు పరిశీలించి నిర్ణయం తీసుకోవాలి’’ అని కావ్యా మారన్ అభిప్రాయపడింది. ఈ మేరకు క్రిక్‌బజ్ కథనం ప్రచురించింది.రన్నరప్‌తో సరికాగా సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులో ఎక్కువ శాతం విదేశీ ఆటగాళ్లే కీలక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. కెప్టెన్ ప్యాట్ కమిన్స్‌తో పాటు వరల్డ్‌క్లాస్ టీ20 స్టార్ హెన్రిచ్ క్లాసెన్, ట్రవిస్ హెడ్, గ్లెన్ ఫిలిప్స్, మార్కో జాన్సెన్ వంటి వాళ్లు జట్టుకు బలం. ఇక గత మూడేళ్లుగా పేలవ ప్రదర్శనతో విమర్శలపాలైన హైదరాబాద్ జట్టు ఈ ఏడాది ఏకంగా ఫైనల్ చేరుకుంది.అయితే, కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన టైటిల్ పోరులో వెనుకబడి రన్నరప్‌తో సరిపెట్టుకుంది. అయితే, ఆద్యంతం విధ్వంసకర బ్యాటింగ్‌తో విరుచుకుపడి లీగ్ చరిత్రలో ఆల్‌టైమ్ హయ్యస్ట్ స్కోరు(287/3) రికార్డును తమ పేరిట లిఖించుకుంది.అక్కడ పది కోట్లు కాగా ఐపీఎల్-2024 వేలంలో శ్రీలంక మిస్టరీ స్పిన్నర్ వనిందు హసరంగను రూ. 1.5 కోట్లకు సన్‌రైజర్స్ కొనుగోలు చేసింది. అయితే, గాయం పేరు చెప్పి అతడు సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. కానీ అతడు వేరే కారణాల వల్ల జట్టుకు దూరంగా ఉన్నాడని ఫ్రాంఛైజీ భావించినట్లు తెలుస్తోంది. కాగా గతంలో ఆర్సీబీకి ఆడిన అతడు రూ. 10 కోట్లు అందుకున్న విషయం తెలిసిందే. -
అతడు కెప్టెన్ నమ్మకాన్ని కోల్పోయాడు.. అందుకే ఇలా!
టీమిండియాలోకి ఎంత ‘వేగం’గా దూసుకువచ్చాడో.. అంతే త్వరగా జట్టుకు దూరమయ్యాడు కశ్మీర్ ఎక్స్‌ప్రెస్ ఉమ్రాన్ మాలిక్. ఐపీఎల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ నెట్ బౌలర్‌గా ఎంట్రీ ఇచ్చిన ఈ పేసర్.. ఆ తర్వాత జట్టులో కీలక సభ్యుడిగా ఎదిగాడు.అత్యంత వేగంగా బంతులు విసురుతూ టీమిండియా సెలక్టర్ల దృష్టిని ఆకర్షించిన ఉమ్రాన్ మాలిక్.. 2022లో అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేశాడు. ఐర్లాండ్ పర్యటనలో భాగంగా టీ20లలో ఎంట్రీ ఇచ్చాడు.అనంతరం వన్డేల్లోనూ అడుగుపెట్టాడు ఈ స్పీడ్‌గన్. అయితే, నిలకడలేమి ప్రదర్శన కారణంగా మేనేజ్మెంట్ నమ్మకం పోగొట్టుకున్న ఉమ్రాన్ మాలిక్.. ఏడాది కాలంగా జట్టుకు దూరమయ్యాడు. చివరగా గతేడాది వెస్టిండీస్‌తో వన్డే మ్యాచ్‌లో ఆడాడు.ఈ నేపథ్యంలో టీమిండియా బౌలింగ్ మాజీ కోచ్ పారస్ మాంబ్రే ఉమ్రాన్ మాలిక్ గురించి కీలక వ్యాఖ్యలు చేశాడు. అతడు కెప్టెన్ నమ్మకాన్ని పోగొట్టుకున్నాడని.. అందుకే జట్టుకు దూరమైపోయాడని పేర్కొన్నాడు.కెప్టెన్ నమ్మకాన్ని కోల్పోయాడు‘‘మనలోని ప్రతిభకు ఎప్పటికప్పుడు మెరుగులు దిద్దుకోవాలి. ఓ బౌలర్ ఎక్స్‌ప్రెస్ పేస్ కలిగి ఉండటం అరుదైన అంశం. అతడి శక్తిసామర్థ్యాలకు నిదర్శనం.అతడు గంటకు 145- 148 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేసినపుడు.. అంతకంటే వేగంగా బంతులు విసరగలడని భావించాం. కానీ అలా జరుగలేదు.కానీ తన బౌలింగ్‌లోని పేస్ మాత్రమే తన బలం. అంతేగానీ బౌల్ చేసేటపుడు లైన్ అండ్ లెంగ్త్ విషయంలో జాగ్రత్త అవసరం. ముఖ్యంగా టీ20లలో పూర్తి కంట్రోల్ ఉండాలి.అందులో విఫలమైతే కచ్చితంగా కష్టాలు మొదలవుతాయి. బ్యాటర్ బాల్‌ను బాదుతూ ఉంటే.. చూస్తూ ఉండటం తప్ప ఏమీ చేయలేం. అలాంటపుడు కెప్టెన్ నమ్మకాన్ని కోల్పోవడం ఖాయం.రంజీలు ఆడమని పంపించాంఅతడికి బౌలింగ్‌పై పూర్తి నియంత్రణ రావాలనే ఉద్దేశంతోనే రంజీలు ఆడమని పంపించాం. తీవ్రమైన ఒత్తిడి నెలకొన్న సమయంలోనూ కచ్చితంగా నైపుణ్యాలు ప్రదర్శించగలగాలి’’ అని పారస్ మాంబ్రే ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌తో వ్యాఖ్యానించాడు.కాగా ఉమ్రాన్ మాలిక్ టీమిండియా తరఫున ఇప్పటి వరకు ఎనిమిది టీ20లు, పది వన్డేలు ఆడి.. ఆయా ఫార్మాట్లలో 13, 11 వికెట్లు తీశాడు. -
టీమిండియాలో ఎంట్రీ.. నితీశ్ కుమార్ రెడ్డికి ఏసీఏ అభినందనలు
టీమిండియా టీ20 జట్టుకు ఎంపికైన యువ క్రికెటర్ నితీశ్ కుమార్ రెడ్డికి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అభినందనలు తెలిపింది. ఆంధ్రప్రదేశ్ నుంచి పొట్టి ఫార్మాట్లో అంతర్జాతీయ జట్టుకు ఎంపికైన విశాఖపట్నం కుర్రాడిపై ప్రశంసలు కురిపించింది.కాగా సీనియర్ల గైర్హాజరీలో యువ భారత జట్టు జింబాబ్వే పర్యటనకు వెళ్లనుంది. జూలై 6 నుంచి మొదలుకానున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు శుబ్‌మన్ గిల్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు.ఈ జట్టులో ఐపీఎల్ హీరోలు తెలుగు తేజం నితీశ్ కుమార్ రెడ్డి(సన్‌రైజర్స్ హైదరాబాద్)తో పాటు అభిషేక్ శర్మ(యోహానన్ ప్రధాన కోచ్‌గా), రియాన్ పరాగ్(రాజస్తాన్ రాయల్స్), తుషార్ దేశ్‌పాండే(చెన్నై సూపర్ కింగ్స్) తదితర యంగ్క్రికెటర్లు తొలిసారిగా చోటు దక్కింది.ఈ నేపథ్యంలో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు పి. శరత్ చంద్రా రెడ్డితో పాటు కార్యదర్శి ఎస్.ఆర్.గోపీనాథ్ రెడ్డి, అపెక్స్ మెంబర్స్ నితీశ్ కుమార్ రెడ్డికి అభినందనలు తెలియజేశారు. కాగా ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో అరంగేట్రం చేసిన మూడేళ్ల వ్యవధిలోనే నితీశ్ రెడ్డి ఐపీఎల్లో స్థానం సంపాదించాడు.ఈ ఏడాది సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున 13 మ్యాచ్‌లు ఆడి 303 పరుగులు చేశాడు. రైజర్స్ ఫైనల్ చేరడంలో తన వంతు పాత్ర పోషించిన ఈ పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్.. టీమిండియా సెలక్టర్ల దృష్టిని ఆకర్షించాడు. ఈ క్రమంలో ఆంధ్ర నుంచి టీమిండియా టీ20 జట్టుకు ఎంపికైన తొలి ఆటగాడిగా చరిత్రకెక్కాడు.ఇక ఆంధ్ర ప్రీమియర్ లీగ్ వేలంలోనూ నితీశ్ రెడ్డి సరికొత్త రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే. రూ. 15.6 లక్షలకు ఈ యంగ్ సెన్సేషన్‌ను గోదావరి టైటాన్స్ యాజమాన్యం సొంతం చేసుకుంది. ఐపీఎల్-2024 వేలంలో భాగంగా నితీశ్ రెడ్డిని రూ. 20 లక్షల కనీస ధరకు సన్‌రైజర్స్ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ప్రధాన కోచ్‌గా యోహానన్నియామకంక్రికెట్ అడ్వైజరీ కమిటీ (సీఏసీ) 2024–25 సీజన్ కోసం పురుషులు, మహిళల ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) జట్లలోని పలు విభాగాలకు ప్రధాన కోచ్‌లను నియమించారు. 71 ఏళ్ల ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) చరిత్రలో గతంలో ఎప్పుడూ లేనివిధంగా అంతర్జాతీయ స్థాయిలో ఆడిన కేరళ రాష్ట్రానికి చెందిన భారతీయ మాజీ క్రికెటర్ టిను యోహానన్‌ను సీనియర్ పురుషుల విభాగానికి ప్రధాన కోచ్‌గా నియమించారు.అదే విధంగా అండర్ –23 పురుషుల విభాగానికి ప్రధాన కోచ్‌గా జె.క్రిష్ణారావు, సీనియర్ మహిళా విభాగానికి ఎం.ఎన్. విక్రమ్ వర్మ, అండర్–23 మహిళా విభాగానికి ఎస్.రమాదేవి, అండర్–19 మహిళా విభాగానికి ఎస్.శ్రీనివాసరెడ్డి, అండర్–15 మహిళా విభాగానికి ఎం.సవితను ప్రధాన కోచ్‌లుగా నియమించారు.ఇంటర్నేషనల్‌కు ఆడిన యోహానన్‌ను ప్రధాన కోచ్‌గా తీసుకొచ్చేందుకు ఏసీఏ అధ్యక్షుడు పి.శరత్ చంద్రారెడ్డి, కార్యదర్శి ఎస్.ఆర్.గోపినాథ్‌రెడ్డి తీవ్రంగా కృషి చేసినందుకు సీఏసీ చైర్మన్ ఎన్.మధుకర్ వారికి కృతజ్ఞతలు తెలియజేశారు. యోహానన్ ప్రధాన కోచ్‌గా నియమించడం వల్ల రాష్ట్రానికి చెందిన ప్లేయర్లకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని ఎన్.మధుకర్ వెల్లడించారు.యోహానన్ గురించి..యోహానన్ 1979 ఫిబ్రవరి 18న జన్మించారు. టీమిండియా మాజీ క్రికెటర్. అతను కుడిచేతి వాటం కలిగిన ఫాస్ట్ మీడియం బౌలర్. కేరళ తరపున ఫస్ట్–క్లాస్ క్రికెట్ ఆడాడు.భారత్ తరపున టెస్ట్, వన్డే క్రికెట్ ఆడిన మొదటి కేరళ ఆటగాడు. అతను ప్రస్తుత కేరళ క్రికెట్ జట్టు కోచ్. 2000లో బెంగుళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీకి మొదటి ఇన్‌టేక్ కోసం ఎంపికయ్యాడు. డిసెంబర్ 2001లో ఇంగ్లండ్‌తో జరిగిన స్వదేశీ సిరీస్‌లో తన టెస్టు అరంగేట్రం చేశాడు.మొహాలీలో జరిగిన మొదటి టెస్టులో అతను ఇంగ్లండ్ ఓపెనర్లిద్దరినీ అవుట్ చేశాడు. అతను తన మొదటి ఓవర్ నాల్గవ బంతికి తన మొదటి టెస్ట్ వికెట్ సాధించారు. 2024–25 సీజన్‌ను విజయవంతంగా నిర్వహించాలని ఏసీఏ అధ్యక్షులు పి.శరత్ చంద్రారెడ్డి, కార్యదర్శి ఎస్.ఆర్.గోపినాథ్‌రెడ్డి కోరారు. -
టీమిండియాలో చోటే లక్ష్యం
విశాఖ స్పోర్ట్స్: ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో అరంగేట్రం చేసిన మూడేళ్ల వ్యవధిలోనే.. ఐపీఎల్లో స్థానం సంపాదించి సన్‌రైజర్స్ హైదరాబాద్ విజయాల్లో కీలక పాత్ర పోషించడం ద్వారా ఎమర్జింగ్ ప్లేయర్ అవార్డు అందుకున్న విశాఖకు చెందిన కాకి నితీష్‌కుమార్‌రెడ్డి.. జాతీయ జట్టులో స్థానం సంపాదించడమే తన లక్ష్యమని వెల్లడించాడు. బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లోనూ రాణించి నిఖార్సైన ఆల్‌రౌండర్‌గా ఎదుగుతానంటున్న నితీష్కుమార్రెడ్డితో ‘సాక్షి’ ఇంటర్వ్యూ.. ఆయన మాటల్లోనే.. దేశంలోనే బెస్ట్ క్రికెటర్‌గా.. అండర్–12, 14లో ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్(ఏసీఏ) అకాడమీ ద్వారా శిక్షణ తీసుకున్నా. అనంతరం అండర్–16లో రాణించి ఏకంగా దేశంలోనే బెస్ట్ క్రికెటర్‌గా బీసీసీఐ నుంచి జగ్మోహన్ దాల్మియా అవార్డు అందుకోవడంతో నాలో ఆత్మవిశ్వాసం వచ్చింది. 2020లో తొలి ఫస్ట్‌క్లాస్ క్రికెట్ మ్యాచ్ ఆడి ఆ తర్వాతి ఏడాదే లిస్ట్–ఏ మ్యాచ్‌ల్లో ఇండియా–బి జట్టుకు ఆడాను. 2021 చివరికల్లా టి20ల్లో ఆడే స్థాయికి ఎదిగాను. ఇప్పుడు ఐపీఎల్లో ఎమర్జింగ్ క్రికెటర్ అవార్డు లభించడం వల్ల నా ప్రతిభకు మరింత మెరుగులు దిద్దుకునే అవకాశం కలిగింది. అది.. గొప్ప అనుభూతి ఐపీఎల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున ఆడటం ఆనందాన్నిచ్చింది. కీలక సమయాల్లో రాణించి సన్‌రైజర్స్ గెలుపులో భాగం కావడం నా ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. టైటిల్ పోరులో సరిగ్గా ఆడలేకపోవడం కాస్త నిరాశ కలిగించింది. స్వదేశీ ఆటగాళ్లతో పాటు విదేశీ ఆటగాళ్లు ఇచ్చిన సూచనలను జాగ్రత్తగా నా ఆటకు అన్వయించుకున్నా. చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మహీ భాయ్(ధోనీ) చూస్తుండగా చివరి బంతిని స్టాండ్స్‌లోకి తరలించడం.. మా జట్టు విజయం సాధించడం మరపురాని సంఘటన. మొత్తంగా ఐపీఎల్లో రాణించడం గొప్ప అనుభూతినిచి్చంది. ఏపీఎల్‌లోనూ రాణిస్తా.. ప్రస్తుతం నా దృష్టి ఆంధ్ర ప్రీమియర్ లీగ్(ఏపీఎల్) మూడో సీజన్‌పైనే ఉంది. గోదావరి టైటాన్స్ ఫ్రాంచైజీ అత్యధిక ధరకు నన్ను దక్కించుకుంది. ఈ నెలాఖరు నుంచి ఏపీఎల్ మూడో సీజన్ ప్రారంభం కానుంది. నా అనుభవంతో జట్టును ముందుకు తీసుకువెళ్తా. నేను బౌలింగ్‌లోనూ రాణించేందుకు యార్కర్లపై దృష్టి పెడుతున్నా. అప్పుడే ఫర్ఫెక్ట్ ఆల్‌రౌండర్‌గా ఎదగగలను. ఐపీఎల్‌తో పాటు ఏపీఎల్ నా లక్ష్యానికి దోహదపడతాయని భావిస్తున్నా. ఆల్‌రౌండర్‌గా రాణించి జాతీయ జట్టులో స్థానం సాధించడమే నా తదుపరి లక్ష్యం. అదీ త్వరలోనే జరుగుతుందని ఆశిస్తున్నా. -
అభిషేక్ శర్మ ఊచకోత.. 26 బంతుల్లో శతకం.. 14 సిక్సర్లతో విధ్వంసం
ఐపీఎల్ 2024 సెన్సేషన్, సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్ అభిషేక్ శర్మ ఐపీఎల్ ఫామ్‌ను కొనసాగించాడు. గురుగ్రామ్‌లో జరిగిన ఓ క్లబ్ మ్యాచ్‌లో అభిషేక్ 26 బంతుల్లో శతక్కొట్టి మరోసారి వార్తల్లో నిలిచాడు. స్థానికంగా జరిగిన ఓ మ్యాచ్‌లో అభిషేక్ పంటర్స్ అనే క్లబ్‌కు ప్రాతనిథ్యం వహిస్తూ.. ప్రత్యర్థి మారియో క్రికెట్ క్లబ్‌ను షేక్ చేశాడు. ఈ ఇన్నింగ్స్‌లో అభిషేక్ 26 బంతులు ఎదుర్కొని 14 సిక్సర్లు, 4 ఫోర్ల సాయంతో 103 పరుగులు చేసి ఔటయ్యాడు. అభిషేక్ సునామీ ఇన్నింగ్స్‌తో చెలరేగడంతో అతని జట్టు పంటర్స్.. ప్రత్యర్థిపై 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మ్యాచ్ వివరాల్లోకి వెళితే.. గురుగ్రామ్‌లో జరిగిన ఫ్రెండ్షిప్ సిరీస్‌లో నిన్న పంటర్స్-మారియో జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో మారియో టీమ్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. కృనాల్ సింగ్ (21 బంతుల్లో 60), నదీమ్ ఖాన్ (32 బంతుల్లో 74) చెలరేగడంతో మారియో టీమ్ నిర్ణీత 20 ఓవర్లలో 249 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఓ ఓవర్ బౌల్ చేసిన అభిషేక్ 13 పరుగులు సమర్పించుకున్నాడు.అనంతరం 250 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన అభిషేక్ టీమ్ (పంటర్స్) 26 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో బరిలోకి దిగిన అభిషేక్.. మారియో బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఎడాపెడా సిక్సర్లు బాది మారియో టీమ్ బౌలర్ల భరతం పట్టాడు. ఫలితంగా పంటర్స్ టీమ్ మరో 11 బంతులు మిగిలుండగానే విజయం సాధించింది. పంటర్స్ తరఫున అభిషేక్‌తో పాటు పునీత్ (21 బంతుల్లో 52), లక్షయ్ (29 బంతుల్లో 44 నాటౌట్) రాణించారు.కాగా, ఈ మ్యాచ్‌లో సెంచరీతో చెలరేగిన అభిషేక్‌కు టీమిండియా మాజీ క్రికెటర్, సిక్సర్ల కింగ్ యువరాజ్ సింగ్ మెంటార్‌గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. యూవీ మెంటార్షిప్లో అభిషేక్ గత ఐపీఎల్ సీజన్లో అద్భుతాలు చేశాడు. గత సీజన్లో అభిషేక్ 200కు పైగా స్ట్రయిక్‌రేట్‌తో 400 పరుగులు చేసి సన్‌రైజర్స్‌ను ఫైనల్స్‌కు చేర్చడంలో కీలకపాత్ర పోషించాడు. -
Pat Cummins: ఆమెపై కోపం వచ్చింది.. కానీ!
ఇండియాలో ఉన్నన్ని రోజులు తమ కుటుంబం ఎంతో సంతోషంగా గడిపిందని ఆస్ట్రేలియా సారథి, సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ అన్నాడు. ఐపీఎల్-2024 నేపథ్యంలో తొలిసారిగా తమ ఫ్యామిలీ ఇక్కడికి వచ్చిందని.. ఎన్నో అందమైన జ్ఞాపకాలను పోగు చేసుకుందని పేర్కొన్నాడు.కాగా వన్డే వరల్డ్‌కప్-2023 విజేత అయిన ప్యాట్ కమిన్స్‌ను సన్‌రైజర్స్ యాజమాన్యం ఏకంగా రూ. 20.50 కోట్లు పెట్టి కొనుక్కున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో అతడిని కెప్టెన్‌గా నియమించగా.. అనూహ్య రీతిలో జట్టు పుంజుకుంది.గత మూడేళ్ల వైఫల్యాలకు చరమగీతం పాడుతూ ఏకంగా ఫైనల్ చేరుకుంది. అయితే, తుదిపోరులో కోల్‌కతా నైట్ రైడర్స్ చేతిలో ఓడి రన్నరప్‌తోనే సరిపెట్టుకుంది. అయినా.. గతం కంటే మెరుగైన ప్రదర్శన కారణంగా అభిమానుల మనసు గెలుచుకుంది కమిన్స్ బృందం.ఇక ఇండియాలో ఉన్నపుడు ఆట నుంచి విరామం దొరికిన సమయంలో ప్యాట్ కమిన్స్ కుటుంబంతో కలిసి వివిధ రకాల హోటళ్లను సందర్శించి భోజనం రుచిచూశాడు. అదే విధంగా బాలీవుడ్ పాటకు స్టెప్పులేస్తూ ఫ్యామిలీ అంతా సరాదాగా గడిపారు.తాజాగా ఈ జ్ఞాపకాలను గుర్తు చేసుకున్న ప్యాట్ కమిన్స్.. ఆసకిక్తకర వ్యాఖ్యలు చేశాడు. బాలీవుడ్ సాంగ్‌కు డాన్స్ చేయడం ఎలా అనిపించింది అన్న ప్రశ్నకు బదులిస్తూ.. ‘‘నా సోదరి పట్టుబట్టడం వల్లే నేను డాన్స్ చేయాల్సి వచ్చింది.తనే నన్ను బాలీవుడ్ డాన్సింగ్ క్లాసుకు తీసుకువెళ్లింది. ఆ తర్వాత తనే మా డాన్స్ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. దాంతో నాకు చాలా కోపం వచ్చింది.అయితే, ఇప్పుడు అదెంతో గొప్పగా అనిపిస్తోంది. ఐపీఎల్ కోసం అక్కడ ఉన్నన్ని రోజులు ఎంతో ఎంజాయ్ చేశాం. ఎక్కడికి వెళ్లాలి? ఎలాంటి ఫుడ్ తినాలి? అన్న విషయాల గురించి నా సహచర ఆటగాళ్లు మంచి సలహాలు ఇచ్చారు.తొలిసారి నా ఫ్యామిలీ ఇండియా సందర్శించి.. అందమైన జ్ఞాపకాలు పోగు చేసుకుంది’’ అని ప్యాట్ కమిన్స్ ఈఎస్‌పీఎన్‌క్రిక్ ఇన్ఫోతో చెప్పుకొచ్చాడు. కాగా కమిన్స్ ప్రస్తుతం టీ20 ప్రపంచకప్-2024తో బిజీగా ఉన్నాడు. అమెరికా- వెస్టిండీస్ వేదికగా జరుగుతున్న ఈ మెగా టోర్నీలో జూన్ 5 ఆసీస్ ఒమన్‌తో తమ తొలి మ్యాచ్ ఆడనుంది. Pat Cummins dancing on a Bollywood song wasn't on my Bingo Card 😂😂👏👏👏 pic.twitter.com/OZgP6qtJ8G— aman (@bilateral_bully) May 8, 2024 -
వీర ఐపీఎల్ విజయగాథ!
దేశంలో లోక్‌సభ ఎన్నికలకు సమాంతరంగా రెండు నెలల పైగా సాగిన క్రికెట్ వేడి ఎట్టకేలకు ముగిసింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 17వ ఎడిషన్‌కు ఆదివారం నాటి ఫైనల్‌తో శుభం కార్డు పడింది. కలకత్తా నైట్ రైడర్స్ (కేకేఆర్), సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్)ల మధ్య చెన్నైలో జరిగిన తుది సమరం అనూహ్యంగా ఏకపక్షంగా సాగింది. తొమ్మిది ఓవర్లు మిగిలి ఉండగానే, 8 వికెట్ల తేడాతో కేకేఆర్ విజయం సాధించి, కప్ చేజిక్కించుకుంది. 2014 తర్వాత సరిగ్గా దశాబ్ద కాలపు నిరీక్షణకు తెర దించి, మూడోసారి విజేతగా నిలిచింది. ఫైనల్ చప్పగా ముగిసిందన్న మాటే కానీ, గత రెండునెలలుగా ఐపీఎల్ పట్ల జనంలో వ్యక్తమైన ఉత్సాహం, ఉద్వేగాలను తక్కువ చేయలేం. 2008లో ఆరంభమైన ఐపీఎల్ ఏయేటికాయేడు ప్రాచుర్యం పెంచుకుంటూ, ప్రస్తుతం ప్రపంచస్థాయి సంబరంగా మారింది. నరాలు తెగే ఉత్కంఠ, వినోదం అందించే ఈ పొట్టి ఫార్మట్ క్రికెట్ ఆట వీరాభిమానుల నుంచి అదాటుగా చూసేవారి దాకా అందరినీ ఆకర్షించగలుగుతోంది. అంతర్జాతీయ ఆటగాళ్ళతో కలసి ఆడడమే కాక, శిక్షణ, వ్యూహరచనల్లో భాగస్వాములు కావడంతో మన కొత్త తరం ఆటగాళ్ళు రాటుదేలడానికి కావాల్సినంత వీలు చిక్కుతోంది. ఈసారి మొత్తం 74 మ్యాచ్‌ల ఐపీఎల్ అనేక ఆశ్చర్యాలను ఆవిష్కరించింది. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక సిక్సులు (1260), అత్యధిక సెంచరీలు, 9 అత్యధిక స్కోర్లలో 8 ఈ సీజన్లోనే వచ్చాయి. వాటిలోనూ 5 అత్యధిక స్కోర్లు ఫైనల్లో తలపడిన కేకేఆర్, ఎస్ఆర్హెచ్లు సాధించినవే! విరాట్ కోహ్లీ ఈ సీజన్లో 741 పరుగులు చేసి తన ఐపీఎల్ కెరీర్లోనే రెండో అత్యధిక పరుగుల వరద పారించాడు. అదీ కనివిని ఎరుగని 154.70 రేటుతో! ఏడు మ్యాచ్‌లలో వరుసగా 6 మ్యాచ్‌లు ఓడి, రెండే రెండు పాయింట్లు సాధించిన రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు జట్టు ఆపైన వరుసగా 6 మ్యాచ్‌లు భారీ తేడాతో గెలిచి, ప్లేఆఫ్ దశకు చేరడం మరో అబ్బురం. ఆశలు వదులుకోకుండా నిలబడి, కలబడితే ఏదైనా సాధ్యమనే పాఠానికి నిదర్శనం. అలాగే, అంకితభావం ఉంటే వయసనేది అడ్డంకి కాదని, గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో 42 ఏళ్ళ ధోనీ గాలిలోకి 3 మీటర్లు గెంతి మరీ ఒంటిచేతితో పట్టిన విజయ్‌శంకర్ క్యాచ్ నిరూపించింది. శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో కప్ గెలిచిన కేకేఆర్ ఈసారి సాధించిన విజయంలో గమనించాల్సిన ఒక ప్రత్యేకత ఉంది. కేకేఆర్‌లో భారత క్రికెట్ జట్టు మెగాస్టార్స్ ఎవరూ లేరు. అయినా సరే టోర్నమెంట్లో అద్భుత ప్రతిభ కనబరిచింది. ఆ జట్టు పక్షాన అత్యధిక పరుగులు సాధించిన బ్యాట్స్‌మన్ సునీల్ నరైన్ నిజానికి మొత్తం పట్టికలో 9వ స్థానంలో ఉంటాడు. కానీ, టాప్ ఆర్డర్లో బ్యాటింగ్‌కు దిగి స్కోర్‌బోర్డ్‌ను పరుగులెత్తించిన తీరు, చూపిన ప్రభావం అసామాన్యం. కేకేఆర్ జట్టు కప్పు గెలిచిన గడచిన రెండుసార్లు (2012, 2014) కూడా ఆ యా సీజన్లలో అత్యధిక వికెట్లు (24, 21) తీసింది ఈ లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్‌మన్ కమ్ రైట్ ఆర్మ్ ఆఫ్ స్పిన్నరే! ఈ సీజన్లోనూ 15 వికెట్లు, 488 పరుగులు సాధించి, ముచ్చటగా మూడోసారి ‘మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్’ అవార్డు అందుకున్నాడు. సునీల్ కాక మరొక్క టాప్ 20 ఆటగాడు మాత్రమే కేకేఆర్ జట్టులో కనిపిస్తాడు. అయితేనేం, ఆ జట్టు మైదానంలో జోరు కొనసాగించి, విజయతీరాలు చేరింది.పరుగుల వరద ఎప్పటి కన్నా మరో మెట్టు పైకెక్కి బ్యాట్స్మన్ల రాజ్యంగా సాగిన టోర్నీ ఇది. ఈ పరిస్థితుల్లో అత్యధిక వికెట్లు పడగొట్టే బౌలర్ లేకున్నా టాప్5 బౌలర్లలో ముగ్గురున్న కేకేఆర్ గెలుపు నమోదు చేసింది. అలాగే, కొన్నేళ్ళుగా విజయాలు రాకున్నా... ఇష్టారీతిన జట్టును మార్చేయకుండా, ఆటగాళ్ళను నమ్మి వారిని కొనసాగిస్తే అద్భుతాలు సాధ్యమేనని నిరూపించింది. పస అయిపోందని పలువురు విమర్శించినా... సునీల్, వరుణ్ చక్రవర్తి, వెంకటేశ్ అయ్యర్‌లను దీర్ఘకాలంగా జట్టులోనే అట్టిపెట్టుకుంది. ఆసిస్ పేసర్ మిషెల్ స్టార్క్ తాజా టోర్నీలో మొదట రాణించకున్నా అతణ్ణి కొనసాగించింది. అవన్నీ కీలక సమయంలో ఫలించాయి. వెరసి, పేరున్న ఆటగాళ్ళపై అతిగా ఆధారపడ్డ ఇతర ఫ్రాంఛైజీలకు కేకేఆర్ కథలో ఓ పాఠముంది. భారతజట్టులో ఆడకపోతేనేం, ప్రతిభావంతులైన యువతరంతో అద్భుతాలు చేయవచ్చని కేకేఆర్ ప్రస్థానం చాటింది.ఆదాయంలో, ఆకర్షణలో భారత జాతీయక్రీడ హాకీ సహా అన్నింటినీ క్రికెట్ ఎన్నడో మించిపోయింది. ఐపీఎల్ దెబ్బతో స్థానిక, రాష్ట్ర స్థాయుల్లోనూ టీ20 క్రికెట్ పోటీలొచ్చాయి. మన ఐపీఎల్ మూసలో ఆస్ట్రేలియాలో బిగ్‌బాష్, సౌతాఫ్రికాలో ఎస్ఏ 20 లీగ్, వెస్టిండీస్‌లో కరేబియన్ ప్రీమియర్ లీగ్, పాకిస్తాన్ – బంగ్లాదేశ్ – శ్రీలంకల్లోనూ ఆ యా దేశాల ప్రీమియర్ లీగ్‌లు వచ్చేశాయి. ప్రతిభావంతులైన యువ భారతీయ క్రికెటర్ల ప్రత్యామ్నాయ కెరీర్‌కు ఇది ద్వారాలు తెరిచింది. అదే సమయంలో ఈ వెర్రి పెచ్చుమీరిన బెట్టింగ్ బెడద తెచ్చింది. బ్యాట్‌కూ బంతికీ మధ్య పోటీలో సమతూకాన్ని చెడగొట్టింది. గత 16 విడతల ఐపీఎల్ టోర్నీల్లో మొత్తం 1032 మ్యాచ్‌లు ఆడితే, వాటిలో 250 పైచిలుకు స్కోర్లు వచ్చింది రెండు, మూడు మ్యాచ్‌లలోనే. కానీ, ఈ తడవ ఏకంగా 8సార్లు అది జరిగింది. బ్యాట్స్మన్లదే పైచేయిగా మారుతున్న ఈ లోపాన్ని సరిదిద్దేందుకు బీసీసీఐ కొత్త రూల్‌ను ఆలోచించకపోతే కష్టమే. ఏమైనా, ఈ ఏటి ఐపీఎల్ సీజన్ ముగిసింది. రెండేళ్ళకు ఒకసారి జరిగే ఐసీసీ టీ20 వరల్డ్ కప్ ఆదివారం మొదలవుతోంది. రోహిత్‌శర్మ జట్టులో సభ్యులైనæ కోహ్లీ, పంత్ తదితరులు గనక ప్రస్తుత ఐపీఎల్ ప్రతిభాప్రదర్శననే ఆ వరల్డ్ కప్‌లోనూ కొనసాగిస్తే అంతకన్నా కావాల్సింది ఏముంది! చాలాకాలంగా ఊరిస్తున్న కప్పు మళ్ళీ మన ఇంటికొస్తుంది!! -
Kavya Maran: మంచి మనసు.. కానీ ఒంటరితనం? పర్సనల్ లైఫ్‌లో..
ఐపీఎల్ వేలం మొదలు... స్టేడియంలో తన జట్టును ఉత్సాహపరచడం.. గెలిచినపుడు చిన్న పిల్లలా సంబరాలు చేసుకోవడం.. ఓడినపుడు అంతే బాధగా మనసు చిన్నబుచ్చుకోవడం..అంతలోనే ఆటలో ఇవన్నీ సహజమే కదా అన్నట్లుగా ప్రత్యర్థిని అభినందిస్తూ చప్పట్లు కొట్టడం.. ఇలా ప్రతీ విషయంలోనూ ఆమె ఓ ప్రత్యేక ఆకర్షణ. క్యాష్ రిచ్ లీగ్‌ను ఫాలో అయ్యే వాళ్లలో చాలా మందికి ఆమె కంటే క్రష్.ఆమె మ్యాచ్ వీక్షించడానికి వచ్చిందంటే చాలు.. ఆద్యంతం తను పలికించే హావభావాలు.. స్టాండ్స్‌లో చుట్టుపక్కల వారితో తను మెదిలే విధానం.. ఆనాటి హైలైట్స్‌లో ముఖ్యమైనవిగా నిలుస్తాయనడం అతిశయోక్తి కాదు.తను నవ్వితే అభిమానులూ నవ్వుతారు. తను భావోద్వేగంతో కంటతడి పెడితే తామూ కన్నీటి పర్యంతమవుతారు. ఐపీఎల్-2024 ఫైనల్ సందర్భంగా ఇలాంటి దృశ్యాలు చోటుచేసుకున్నాయి. ఇప్పటికే ఆమె పేరేంటో అర్థమైపోయిందనుకుంటా.. యెస్.. కావ్యా మారన్. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంఛైజీ ఓనర్.వేల కోట్ల సామ్రాజ్యానికి ఏకైక వారసురాలుదేశంలోనే అతి పెద్ద మీడియా గ్రూపులో ఒకటైన సన్ టీవీ గ్రూప్ నెట్వర్క్ అధినేత కళానిధి మారన్- కావేరీ మారన్ దంపతుల ఏకైక కుమార్తె. వేల కోట్ల సామ్రాజ్యానికి ఏకైక వారసురాలు.తమిళనాడులోని చెన్నైలో ఆగష్టు 6, 1992లో జన్మించారు కావ్య. అక్కడే స్టెల్లా మేరీ కాలేజీలో బీకామ్ చదివిన ఆమె.. 2016లో ఇంగ్లండ్‌లోని వార్విక్ బిజినెస్ స్కూల్ నుంచి ఎంబీఏ పట్టా పుచ్చుకున్నారు.తల్లిదండ్రులు ఇద్దరూ వ్యాపారవేత్తలే కావడంతో కావ్య కూడా అదే బాటలో పయనిస్తున్నారు. 2018లో సన్‌రైజర్స్ సీఈఓగా ఎంట్రీ ఇచ్చిన కావ్య.. అంతకంటే ముందే సన్ మ్యూజిక్, సన్ టీవీ ఎఫ్ఎం రేడియోలో కీలక బాధ్యతలు నిర్వర్తించారు.తీవ్ర స్థాయిలో విమర్శలుఇక ఐపీఎల్లో వేలం మొదలు కెప్టెన్ నియామకం వరకు అన్ని విషయాల్లోనూ భాగమయ్యే కావ్యా మారన్.. ఈ ఏడాది అనుకున్న ఫలితాలు రాబట్టడంలో సఫలమయ్యారు. కానీ.. సీజన్ ఆరంభంలో మాత్రం తీవ్ర విమర్శల పాలయ్యారు కావ్య.ఆస్ట్రేలియా కెప్టెన్, వన్డే వరల్డ్‌కప్-2023 విజేత ప్యాట్ కమిన్స్ కోసం ఏకంగా.. రూ. 20.50 కోట్లు ఖర్చు చేయడం.. అతడిని కెప్టెన్‌గా నియమించడం, బ్రియన్ లారా స్థానంలో డానియల్ వెటోరీని కోచ్‌గా తీసుకురావడం వంటి నిర్ణయాలను మాజీ క్రికెటర్లు తప్పుబట్టారు.ఇప్పటికే ఐడెన్ మార్క్రమ్, హెన్రిచ్ క్లాసెన్, ట్రావిస్ హెడ్, గ్లెన్ ఫిలిప్స్ వంటి వాళ్లు జట్టులో ఉండటంతో తుదిజట్టు కూర్పు ఎలా ఉంటుందో అంటూ ఎద్దేవా చేశారు. పేపర్ మీద చూడటానికి జట్టు బాగానే కనిపిస్తున్నా.. మైదానంలో తేలిపోవడం ఖాయమంటూ విమర్శించారు.సంచలన ప్రదర్శనఅయితే, అందరి అంచనాలు తలకిందులు చేస్తూ సన్‌రైజర్స్ ఈసారి అద్భుతాలు చేసింది. గతేడాది పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచిన హైదరాబాద్ ఈసారి సంచలన ప్రదర్శనతో ఫైనల్ చేరింది.విధ్వంసకర బ్యాటింగ్‌కు మారుపేరుగా నిలిచి లీగ్ చరిత్రలోనే అత్యధిక స్కోరు నమోదు చేసిన జట్టుగా రికార్డులు సృష్టించింది. అయితే, తుదిమెట్టుపై కోల్‌కతా నైట్ రైడర్స్ చేతిలో ఓటమి పాలై రన్నరప్‌తో సరిపెట్టుకుంది.చెన్నై వేదికగా సాగిన ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ బ్యాటింగ్ ఆర్డర్ కుప్పకూలడం.. కేకేఆర్ ఏకపక్షంగా గెలవడంతో కావ్యా మారన్ కన్నీటి పర్యంతమయ్యారు. కన్నీళ్లు కారుస్తూనే కేకేఆర్‌ను అభినందించారు కూడా!ఈ నేపథ్యంలో కావ్య మంచి మనసును కొనియాడుతూ ఆమె అభిమానులు సైతం ఉద్వేగానికి లోనయ్యారు. ఈ క్రమంలో సన్ నెట్వర్క్ మాజీ ఉద్యోగిగా చెప్పుకొన్న ఓ నెటిజన్ పెట్టిన పోస్టు వైరల్‌గా మారింది.ఆమెను ఒంటరితనం నుంచి బయటపడేసేందుకు మాత్రమే!‘‘తన తలిదండ్రుల కంటే కూడా కావ్య ఎంతో గొప్ప వ్యక్తి. మంచి మనసున్న అమ్మాయి. కానీ ఎందుకో తనకు ఎక్కువగా ఫ్రెండ్స్ ఉండరు. సన్ మ్యూజిక్, ఎస్ఆర్హెచ్ మినహా ఇతర కంపెనీ బాధ్యతలేవీ తల్లిదండ్రులు ఆమెకు అప్పగించరు.ఇది కూడా ఆమెను ఒంటరితనం నుంచి బయటపడేసేందుకు మాత్రమే!ఐపీఎల్ వేలం సమయంలో కావ్య గురించి చాలా మంది జోకులు వేశారు. కానీ క్రికెట్ పట్ల తనకున్న ప్యాషన్ వేరు. వేలం నుంచి ఫైనల్ దాకా ప్రతి విషయంలోనూ తనదైన ముద్ర వేయగలిగింది. తను కోరుకున్న ఫలితాలు రాబట్టింది.కావ్య మిలియనీర్ అయినప్పటికీ లక్నో సూపర్ జెయింట్స్ ఓనర్(సంజీవ్ గోయెంకా కేఎల్ రాహుల్‌ను బహిరంగంగానే తిట్టడం)లా కాదు. ఫైనల్లో తమ జట్టు ఓటమిపాలైనా కన్నీళ్లు దిగమింగుకుంటూ నవ్వడానికి ప్రయత్నించిన గొప్ప హృదయం ఉన్న వ్యక్తి’’ అని సదరు నెటిజన్ పేర్కొన్నారు.ఒంటరితనమా? ఎందుకు?తన పోస్టులో సదరు నెటిజన్ కావ్య ఒంటరితనం నుంచి విముక్తి పొందడం కోసమే ఈ వ్యాపకాలు అంటూ పేర్కొనడం చర్చనీయాంశమైంది. తోబుట్టువులు, స్నేహితులు(ఎక్కువగా) లేరు కాబట్టి ఇలా అన్నారా?లేదంటే 32 ఏళ్ల కావ్య వ్యక్తిగత జీవితంలో ఏమైనా దెబ్బతిన్నారా? అనే చర్చ జరుగుతోంది. కాగా కావ్య ప్రస్తుతం సింగిల్‌గానే ఉన్నారు. గతంలో.. తమిళ ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచంద్రన్, టీమిండియా స్టార్ రిషభ్ పంత్‌తో కావ్య పేరును ముడిపెట్టే ప్రయత్నం చేశారు గాసిప్‌రాయుళ్లు.అయితే, అవన్నీ వట్టి వదంతులేనని తేలిపోయింది. మరికొన్ని సైట్లు మాత్రం కావ్య ఓ బిజినెస్‌మేన్‌తో గతంలో ప్రేమలో ఉన్నారని కథనాలు ఇచ్చాయి. కానీ.. అవి కూడా రూమర్లే! ప్రస్తుతానికి కావ్య తన కెరీర్, తన తండ్రి వ్యాపారాలను ఎలా ముందుకు తీసుకువెళ్లాలన్న విషయాల మీద మాత్రమే దృష్టి సారించారని సమాచారం.సౌతాఫ్రికాలో దుమ్ములేపుతూఅందుకు తగ్గట్లుగానే ఆమె అడుగులు సాగుతున్నాయి. కేవలం ఐపీఎల్‌లోనే కాకుండా సౌతాఫ్రికా టీ20 లీగ్‌లోనూ కావ్య కుటుంబానికి ఫ్రాంఛైజీ ఉంది. సన్‌రైజర్స్ ఈస్టర్న్‌కేప్ పేరిట నెలకొల్పిన ఈ జట్టుకు ఐడెన్ మార్క్రమ్ కెప్టెన్. 2023 నాటి అరంగేట్ర సీజన్లో, ఈ ఏడాది కూడా సన్‌రైజర్స్‌కు అతడు టైటిల్ అందించాడు. సౌతాఫ్రికాలో వరుసగా రెండుసార్లు ట్రోఫీ సాధించిన సన్‌రైజర్స్.. ఐపీఎల్-2024లో ఆఖరి పోరులో ఓడి టైటిల్ చేజార్చుకుంది. -
SRH: ‘హృదయం ముక్కలైంది.. బాధ పడొద్దు మామయ్యా’! ఫొటో వైరల్
ఐపీఎల్-2024 సీజన్ ఆసాంతం విధ్వంసకర బ్యాటింగ్‌తో దుమ్ములేపిన సన్‌రైజర్స్ హైదరాబాద్.. అసలు సమయం వచ్చేసరికి చేతులెత్తేసింది. ఏదైతే తమ బలం అనుకుందో అదే బలహీనతగా మారిన వేళ ప్రత్యర్థి ముందు తలవంచింది.ముఖ్యంగా బ్యాటింగ్ లైనప్‌లో పెట్టనికోటగా ఉన్న ఓపెనర్లు అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ అనూహ్య రీతిలో పూర్తిగా విఫలం కావడంతో 113 పరుగులకే కుప్పకూలింది. కోల్‌కతా నైట్ రైడర్స్ బౌలర్ల దెబ్బకు అభిషేక్ శర్మ ఐదు బంతులు ఎదుర్కొని కేవలం 2 పరుగులకే నిష్క్రమించగా.. పరుగుల విధ్వంసానికి మారుపేరుగా నిలిచిన హెడ్ మరీ ఘోరంగా డకౌట్ అయ్యాడు.వీరితో పాటు వన్‌డౌన్ బ్యాటర్ రాహుల్ త్రిపాఠి(13 బంతుల్లో 9) కూడా త్వరగానే పెవిలియన్ చేరగా.. మిగతా వాళ్లలో ఐడెన్ మార్క్రమ్(20), హెన్రిచ్ క్లాసెన్(17 బంతుల్లో 16), కెప్టెన్ ప్యాట్ కమిన్స్(19 బంతుల్లో 24) మాత్రమే డబుల్ డిజిట్ స్కోర్లు చేశారు.ఈ క్రమంలో ఐపీఎల్ ఫైనల్లోనే అత్యల్ప స్కోరు నమోదు చేసిన జట్టుగా చెత్త రికార్డు తన పేరిట లిఖించుకుంది సన్‌రైజర్స్. ఈ సీజన్లో ఏకంగా 287 పరుగులతో లీగ్ చరిత్రలోనే అత్యధిక స్కోరు సాధించిన జట్టుగా ప్రశంసలు అందుకున్న కమిన్స్ బృందం.. ఫైనల్లో ఇలా తేలిపోయింది. దీంతో ఆరెంజ్ ఆర్మీ హృదయం ముక్కలైంది.ఇక ఆద్యంతం అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న కేకేఆర్ సన్‌రైజర్స్‌ను ఏకంగా ఎనిమిది వికెట్ల తేడాతో చిత్తు చేసి చాంపియన్‌గా నిలిచింది. ఏకపక్ష విజయంతో ముచ్చటగా మూడోసారి ట్రోఫీని ముద్దాడింది.ఈ నేపథ్యంలో కేకేఆర్ శిబిరంలో సంతోషాలు వెల్లివిరియగా.. సన్‌రైజర్స్ క్యాంపు నిరాశలో కూరుకుపోయింది. జట్టు యజమాని కావ్యా మారన్ ఓటమిని జీర్ణించుకోలేక కన్నీళ్లు పెట్టుకోగా.. ఆటగాళ్లు కూడా ఇంచుమించు ఇదే స్థితికి చేరుకున్నారు.ఇక ఈ సీజన్లోనే అత్యధిక సిక్సర్లు(42) బాదిన సన్‌రైజర్స్ ఓపెనర్ అభిషేక్ శర్మ కూడా తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు. ఆ సమయంలో అభిషేక్ చిన్నారి మేనకోడలు అమైరా చేసిన పని నెటిజన్ల మనసు దోచుకుంది.‘‘ఏం కాదులే మామయ్య’’ అన్నట్లుగా అభిషేక్‌ను హత్తుకున్న అమైరా అతడిని ఓదార్చింది. తర్వాత ఇద్దరూ కలిసి కాసేపు ముచ్చటించుకున్నారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలను అభిషేక్ రెండో అక్క కోమల్ శర్మ సోషల్ మీడియాలో షేర్ చేశారు.కాగా పంజాబ్‌కు చెందిన అభిషేక్ శర్మ తండ్రి రాజ్‌కుమార్ శర్మ కూడా క్రికెటర్. దేశవాళీ క్రికెట్ ఆడిన ఆయన తన కుమారుడికి మొదటి కోచ్. ఇక అభిషేక్ తల్లి పేరు మంజు శర్మ. అభిషేక్‌కు ఇద్దరు అక్కలు సానియా, కోమల్ ఉన్నారు. పెద్దక్క సానియా శర్మ కూతురే ఈ అమైరా!Tough day, Never give up 😔Win or lose part of the game!Chin up guys, you fought hard. ♥️ #KKRvsSRHFinal #IPLFinal #IPL2024 pic.twitter.com/ar96np1klB— Dr. Komal Sharma (@KomalSharma_20) May 26, 2024Such a sweet moment heartwarming hug Amayra encouraging his uncle. 🫂So proud of you bhaiya ❤️🥹#KKRvsSRH #IPL2024 pic.twitter.com/DlE62WtaZu— Dr. Komal Sharma (@KomalSharma_20) May 26, 2024 -
IPL 2024: ఓ పక్క స్టార్క్.. మరోపక్క అయ్యర్..!
ఐపీఎల్ 2024 సీజన్లో కోల్‌కతా నైట్‌రైడర్స్ ఛాంపియన్‌గా అవతరించింది. నిన్న జరిగిన ఫైనల్లో ఈ జట్టు సన్‌రైజర్స్‌పై 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి, మూడో ఐపీఎల్ టైటిల్‌ను సొంతం చేసుకుంది. అంతిమ సమరంలో మిచెల్ స్టార్క్ (3-0-14-2), వెంకటేశ్ అయ్యర్ (26 బంతుల్లో 52 నాటౌట్; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) ఆరెంజ్ ఆర్మీని చెడుగుడు ఆడుకున్నారు. వీరికి రసెల్ (2.3-0-19-3), హర్షిత్ రాణా (4-1-24-2), సునీల్ నరైన్ (4-0-16-1), వరుణ్ చక్రవర్తి (2-0-9-1), రహ్మానుల్లా గుర్భాజ్ (32 బంతుల్లో 39; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) కూడా తోడవ్వడంతో కేకేఆర్ సునాయాస విజయం సాధించింది.క్వాలిఫయర్ మ్యాచ్‌లోనూ వీరిద్దరే.. నిన్నటి ఫైనల్లో సన్‌రైజర్స్‌ను డామేజ్ చేసిన స్టార్క్, వెంకటేశ్ అయ్యర్లు ఇదే సన్‌రైజర్స్‌ను క్వాలిఫయర్-1లోనూ ముప్పుతిప్పలు పెట్టారు. నాటి మ్యాచ్‌లోనూ స్టార్క్ అద్భుతమైన గణాంకాలు (4-0-34-3) నమోదు చేసి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డుకు ఎంపిక కాగా.. వెంకటేశ్ అయ్యర్ సైతం ఫైనల్లోలానే మెరుపు ఇన్నింగ్స్‌తో (28 బంతుల్లో 51 నాటౌట్) విరుచుకుపడ్డాడు. ఈ ఇద్దరు పోటీపడి మరీ సన్‌రైజర్స్‌పై దండయాత్ర చేసి వారికి టైటిల్ దక్కకుండా చేశారు.సీజన్ ఆరంభ మ్యాచ్‌ల్లో పెద్దగా ప్రభావం చూపలేకపోయిన స్టార్క్ కీలకమైన ప్లే ఆఫ్స్‌లో ఫామ్‌లోని వచ్చి కేకేఆర్ పాలిట గెలుపు గుర్రంగా మారగా.. వెంకటేశ్ అయ్యర్ సీజన్ స్టార్టింగ్ నుంచి ఓ మోస్తరు ప్రదర్శనలతో అలరించాడు. ప్లే ఆఫ్స్‌లో తిరుగులేని అయ్యర్.. నిన్నటి ఫైనల్‌తో వెంకటేశ్ అయ్యర్ ప్లే ఆఫ్స్ హీరో అని మరోసారి నిరూపించుకున్నాడు. అయ్యర్‌కు ప్లే ఆఫ్స్‌లో ఇది వరుసగా నాలుగో హాఫ్ సెంచరీ (55, 50, 51*, 52*). ఐపీఎల్ ప్లే ఆఫ్స్‌లో అత్యధిక హాఫ్ సెంచరీలు సాధించిన ఘనత మిస్టర్ ఐపీఎల్ సురేశ్ రైనాకు దక్కుతుంది. రైనా ప్లే ఆఫ్స్‌లో ఏడు 50కి పైగా స్కోర్లు సాధించాడు.ఫైనల్స్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న సన్‌రైజర్స్.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ మిచెల్ స్టార్క్ ధాటికి 18.3 ఓవర్లలో కేవలం 113 పరుగులకే కుప్పకూలింది. సన్‌రైజర్స్ ఇన్నింగ్స్‌లో కమిన్స్ (24) టాప్ స్కోరర్‌గా నిలువగా.. మెరుపు వీరులు అభిషేక్ శర్మ (2), ట్రివిస్ హెడ్ (0) దారుణంగా విఫలమయ్యారు.అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన కేకేఆర్.. వెంకటేశ్ అయ్యర్ అజేయమైన మెరుపు అర్దశతకంతో విరుచుకుపడటంతో కేవలం 10.3 ఓవర్లలోనే విజయతీరాలకు చేరింది. రహ్మానుల్లా గుర్భాజ్ (32 బంతుల్లో 39; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) కీలకమైన ఇన్నింగ్స్ ఆడగా.. భీకర ఫామ్‌లో ఉన్న సునీల్ నరైన్ 6 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. ఎస్ఆర్హెచ్ బౌలర్లలో కమిన్స్, షాబాజ్ అహ్మద్‌లకు తలో వికెట్ దక్కింది. -
IPL 2024: వారికి భారీ నజరానా.. బీసీసీఐ కీలక ప్రకటన
పొట్టి క్రికెట్ ప్రేమికులకు రెండున్నర నెలలుగా వినోదం అందించిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 సీజన్‌కు ఆదివారంతో తెరపడింది. చెన్నై వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన ఫైనల్లో కోల్‌కతా నైట్ రైడర్స్ విజయం సాధించింది.ప్యాట్ కమిన్స్ బృందాన్ని ఎనిమిది వికెట్ల తేడాతో చిత్తుగా ఓడించి పదేళ్ల తర్వాత మరోసారి ట్రోఫీని ముద్దాడింది. ఈ క్రమంలో క్యాష్ రిచ్ లీగ్ పదిహేడో ఎడిషన్ చాంపియన్‌గా నిలిచిన కేకేఆర్‌కు రూ. 20 కోట్ల ప్రైజ్‌మనీ దక్కగా.. రన్నరప్ సన్‌రైజర్స్‌కు రూ. 12.5 కోట్లు అందాయి. ICYMI! That special run to glory 💫💜Recap the #Final on @StarSportsIndia and @JioCinema 💻📱#TATAIPL | #KKRvSRH | #TheFinalCall pic.twitter.com/qUDfUFHpka— IndianPremierLeague (@IPL) May 26, 2024అన్సంగ్ హీరోలకు భారీ నజరానాఈ నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి కార్యదర్శి జై షా కీలక ప్రకటన చేశారు. ఐపీఎల్ పదిహేడో సీజన్ ఇంతగా విజయవంతం కావడం వెనుక ఉన్న ‘అన్సంగ్ హీరో’లకు భారీ మొత్తం కానుకగా ప్రకటించారు.గ్రౌండ్స్‌మెన్, పిచ్ క్యూరేటర్లకు రూ. 25 లక్షల చొప్పున బహుమతిగా అందించనున్నట్లు ఎక్స్ వేదికగా జై షా వెల్లడించారు. ‘‘తాజా టీ20 సీజన్‌ను ఇంతగా సక్సెస్ కావడానికి గ్రౌండ్ సిబ్బంది నిర్విరామంగా పనిచేయడమూ కారణమే.వాతావరణ పరిస్థితులు ఎలా ఉన్నా అద్భుతమైన పిచ్‌లను తయారు చేయడంలో వారు సఫలమయ్యారు. అందుకే గ్రౌండ్స్‌మెన్, క్యూరేటర్ల శ్రమను గుర్తించి వారికి ప్రోత్సాహకాలు ఇవ్వాలని నిర్ణయించాం.ఈ సీజన్లో రెగ్యులర్‌గా ఐపీఎల్ మ్యాచ్‌లు సాగిన 10 వేదికల సిబ్బందికి ఒక్కొక్కరికి రూ. 25 లక్షలు, అదనంగా సేవలు అందించిన మూడు వేదికల సిబ్బందికి రూ. 10 లక్షల చొప్పున అందజేస్తాం. మీ కఠిన శ్రమ, అంకితభావానికి థాంక్యూ’’ అని జై షా సోమవారం ట్వీట్ చేశారు.వేదికలు ఇవేకాగా ఐపీఎల్-2024 సీజన్లో ముంబై(ముంబై ఇండియన్స్), ఢిల్లీ(ఢిల్లీ క్యాపిటల్స్), చెన్నై(చెన్నై సూపర్ కింగ్స్), కోల్‌కతా(కోల్‌కతా నైట్ రైడర్స్), చండీఘర్(పంజాబ్ కింగ్స్), హైదరాబాద్(సన్‌రైజర్స్), బెంగళూరు(ఆర్సీబీ), లక్నో(లక్నో సూపర్ జెయింట్స్), అహ్మదాబాద్(గుజరాత్ టైటాన్స్), జైపూర్(రాజస్తాన్ రాయల్స్)లలో రెగ్యులర్‌గా మ్యాచ్‌లు జరగగా.. గువాహటి(రాజస్తాన్ రాయల్స్), విశాఖపట్నం(ఢిల్లీ క్యాపిటల్స్), ధర్మశాల(పంజాబ్ కింగ్స్) మైదానాల్లోనూ మ్యాచ్‌లు నిర్వహించారు.చదవండి: SRH: అందుకే ఓడిపోయాం.. మా వాళ్లు మాత్రం సూపర్: కమిన్స్The unsung heroes of our successful T20 season are the incredible ground staff who worked tirelessly to provide brilliant pitches, even in difficult weather conditions. As a token of our appreciation, the groundsmen and curators at the 10 regular IPL venues will receive INR 25…— Jay Shah (@JayShah) May 27, 2024 -
SRH: అందుకే ఓడిపోయాం.. మా వాళ్లు మాత్రం సూపర్: కమిన్స్
ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ముచ్చటగా మూడోసారి ఫైనల్ ఆడిన సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు చేదు అనుభవమే మిగిలింది. ఐపీఎల్-2024లో కోల్‌కతా నైట్ రైడర్స్‌తో చెన్నై వేదికగా జరిగిన తుదిపోరులో పేలవ ప్రదర్శనతో పరాజయం పాలైంది. ఏకంగా ఎనిమిది వికెట్ల తేడాతో చిత్తుగా ఓడి రన్నరప్‌తో సరిపెట్టుకుంది.గతేడాదితో పోలిస్తే ఈ సీజన్ ఆసాంతం అద్భుతంగా ఆడినా అసలు మ్యాచ్‌లో చేతులెత్తేసింది. విధ్వంసకర బ్యాటింగ్‌కు మారుపేరుగా మారిన కమిన్స్ బృందం ఫైనల్లో మాత్రం తుస్సుమనిపించింది.అందుకే ఓడిపోయాంఈ నేపథ్యంలో కేకేఆర్ చేతిలో ఘోర పరాజయంపై సన్‌రైజర్స్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ విచారం వ్యక్తం చేశాడు. ప్రత్యర్థి జట్టు అద్భుతంగా బౌలింగ్ చేసిందని కితాబులు ఇచ్చాడు. తమ బ్యాటర్లు సీజన్ ఆరంభం నుంచి సంచలన ప్రదర్శనతో ఆకట్టుకున్నారని.. అయితే, చెన్నై వికెట్‌ను అంచనా వేయడంలో తాము విఫలమయ్యామని పేర్కొన్నాడు.‘‘వాళ్లు అత్యద్భుతంగా బౌలింగ్ చేశారు. స్టార్కీ(మిచెల్ స్టార్క్) మ్యాచ్ స్వరూపాన్నే మార్చివేశాడు. ఈ మ్యాచ్‌లో మా ఆట తీరు అస్సలు బాగాలేదు. బౌండరీలు రాబట్టానికి ఎంతో కష్టపడాల్సి వచ్చింది. అయినప్పటికీ అనుకున్న స్థాయిలో రాణించలేకపోయాం. గత వారం అహ్మదాబాద్(క్వాలిఫయర్-1)లోనూ వాళ్ల బౌలర్లు అద్భుతంగా ఆడారు. కాబట్టి ఈ క్రెడిట్ మొత్తం వాళ్లకు ఇవ్వాల్సిందే. ఈ వికెట్ స్వభావాన్ని మేము పసిగట్టలేకపోయాం. కనీసం 160 పరుగులు స్కోరు చేసినా కనీస పోటీ ఉండేది’’ అని కమిన్స్ పేర్కొన్నాడు.మా వాళ్లు మాత్రం సూపర్అదే విధంగా.. ‘‘ఏదేమైనా.. ఈ సీజన్లో మాకు అనేక సానుకూలాంశాలు ఉన్నాయి. మా వాళ్లు సూపర్‌గా బ్యాటింగ్ చేశారు. మూడుసార్లు 250 పరుగుల మేర స్కోరు చేశాం.తీవ్రమైన ఒత్తిడి నెలకొన్న సమయంలోనూ మ్యాచ్‌ను మాకు అనుకూలంగా మార్చివేశారు. హైదరాబాద్‌లో అభిమానులు మాకు పూర్తి మద్దతుగా నిలిచారు.ఈ సీజన్ మొత్తం అద్భుతంగా సాగింది. ఈసారి చాలా మంది కొత్త ఆటగాళ్లతో కలిసి ఆడే అవకాశం వచ్చింది. భువీ, నట్టు, జయదేవ్‌లతో పాటు చాలా మంది ప్రతిభావంతులైన యువ ఆటగాళ్లతో మమేకమయ్యాను.సాధారణంగా టీమిండియాతో మ్యాచ్ అంటే మొత్తం నీలిరంగుతో స్టేడియం నిండిపోతుంది. అయితే, ఇప్పుడు ఇక్కడ ప్రేక్షకులు మా(నా)కు మద్దతుగా నిలవడం కొత్త అనుభూతినిచ్చింది’’ అని ప్యాట్ కమిన్స్ తమ జట్టు ప్రదర్శన పట్ల సంతృప్తిగా ఉన్నట్లు తెలిపాడు.ఐపీఎల్-2024 ఫైనల్: కేకేఆర్ వర్సెస్ సన్‌రైజర్స్👉వేదిక: చెపాక్ స్టేడియం.. చెన్నై👉టాస్: సన్‌రైజర్స్.. బ్యాటింగ్👉సన్‌రైజర్స్ స్కోరు: 113 (18.3)👉కేకేఆర్ స్కోరు: 114/2 (10.3)👉ఫలితం: ఎనిమిది వికెట్ల తేడాతో సన్‌రైజర్స్‌ను చిత్తు చేసి చాంపియన్‌గా కేకేఆర్👉ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: మిచెల్ స్టార్క్👉ప్లేయర్ ఆఫ్ ది సిరీస్: సునిల్ నరైన్.చదవండి: IPL 2024: ఎస్ఆర్హెచ్ ఓటమి.. వెక్కివెక్కి ఏడ్చిన కావ్య! వీడియో వైరల్ ICYMI! That special run to glory 💫💜Recap the #Final on @StarSportsIndia and @JioCinema 💻📱#TATAIPL | #KKRvSRH | #TheFinalCall pic.twitter.com/qUDfUFHpka— IndianPremierLeague (@IPL) May 26, 2024 -
IPL 2024 Final: కేకేఆర్‌కు అచ్చొచ్చిన 'M'
ఐపీఎల్ 2024 సీజన్లో కోల్‌కతా నైట్‌రైడర్స్ విజేతగా ఆవిర్భవించింది. నిన్న (మే 26) జరిగిన ఫైనల్లో ఈ జట్టు సన్‌రైజర్స్‌ను 8 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడించి మూడోసారి టైటిల్‌ను ఎగరేసుకుపోయింది.అంతిమ సమరంలో మిచెల్ స్టార్క్ అద్భుతంగా రాణించి కేకేఆర్‌ను పదేళ్ల తర్వాత మరోసారి ఛాంపియన్‌గా నిలబెట్టాడు. ఫైనల్లో స్టార్క్ 3 ఓవర్లలో కేవలం 14 పరుగులు మాత్రమే ఇచ్చి రెండు కీలకమైన వికెట్లు, రెండు క్యాచ్‌లు పట్టాడు. ఫలితంగా ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు గెలుచుకున్నాడు.ఐపీఎల్ చరిత్రలో నాకౌట్ మ్యాచ్‌ల్లో ఒకటి కంటే ఎక్కువ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు గెలుచుకున్న ఆటగాడిగా స్టార్క్ చరిత్ర సృష్టించాడు. స్టార్క్ సన్‌రైజర్స్‌తోనే జరిగిన తొలి క్వాలిఫయర్లోనూ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా (4-0-34-3) నిలిచాడు.సీజన్ ఆరంభంలో దారుణంగా విఫలమైన స్టార్క్ అత్యంత కీలకమైన నాకౌట్ మ్యాచ్‌ల్లో అద్భుతంగా రాణించి కేకేఆర్‌కు పదేళ్ల తర్వాత మరోసారి టైటిల్‌ను అందించాడు. ఓవరాల్‌గా చూస్తే ఈ సీజన్లో స్టార్క్ సన్‌రైజర్స్ పాలిట విలన్‌గా దాపురించాడు.మరోసారి కలిసొచ్చిన 'M'ఇదిలా ఉంటే, ఐపీఎల్ ఫైనల్స్‌లో కేకేఆర్‌కు 'M' అక్షరం మరోసారి కలిసొచ్చింది. కేకేఆర్ ఐపీఎల్ టైటిల్స్ గెలిచిన మూడు సందర్భాల్లో ఈ అక్షరంతో పేరు మొదలయ్యే ఆటగాళ్లే ఆ జట్టు పాలిట గెలుపు గుర్రాలయ్యారు. MMM2012లో మన్విందర్ బిస్లా, 2014లో మనీశ్ పాండే, తాజాగా మిచెల్ స్టార్క్ ఫైనల్స్‌లో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌లుగా నిలిచి కేకేఆర్‌కు టైటిల్స్ అందించారు. దీన్ని బట్టి చూస్తే ఐపీఎల్ ఫైనల్స్‌లో కేకేఆర్‌కు M అక్షరం సెంటిమెంట్ బాగా అచ్చొచ్చిందని స్పష్టమవుతుంది.మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న సన్‌రైజర్స్ మిచెల్ స్టార్క్ ధాటికి 18.3 ఓవర్లలో కేవలం 113 పరుగులకే కుప్పకూలింది. ఆ జట్టు ఇన్నింగ్స్‌లో కెప్టెన్ కమిన్స్ (24) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. మెరుపు వీరులు, ఓపెనర్లు అభిషేక్ శర్మ (2), ట్రివిస్ హెడ్ (0) సింగిల్ డిజిట్ స్కోర్లకే వెనుదిరిగారు. కమిన్స్ కాకుండా మార్క్రమ్ (20), నితీశ్ రెడ్డి (13), క్లాసెన్ (16) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. కేకేఆర్ బౌలర్లలో స్టార్క్‌తో పాటు రసెల్ (2.3-0-19-3), హర్షిత్ రాణా (4-1-24-2), సునీల్ నరైన్ (4-0-16-1), వరుణ్ చక్రవర్తి (2-0-9-1) ఇరగదీశారు. వైభవ్ అరోరా ఓ వికెట్ పడగొట్టాడు.అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన కేకేఆర్.. వెంకటేశ్ అయ్యర్ అజేయమైన మెరుపు అర్దశతకంతో (26 బంతుల్లో 52; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) విరుచుకుపడటంతో కేవలం 10.3 ఓవర్లలోనే విజయతీరాలకు చేరింది. రహ్మానుల్లా గుర్భాజ్ (32 బంతుల్లో 39; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) కీలకమైన ఇన్నింగ్స్ ఆడగా.. భీకర ఫామ్‌లో ఉన్న సునీల్ నరైన్ 6 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. వెంకటేశ్ అయ్యర్‌తో పాటు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (6) అజేయంగా నిలిచి కేకేఆర్‌కు పదేళ్ల తర్వాత మరో టైటిల్‌ను అందించాడు. ఎస్ఆర్హెచ్ బౌలర్లలో కమిన్స్, షాబాజ్ అహ్మద్‌లకు తలో వికెట్ దక్కింది. సిరీస్ ఆధ్యాంతం బ్యాట్‌తో (14 మ్యాచ్‌ల్లో 488 పరుగులు), బంతితో (17 వికెట్లు) మాయ చేసిన సునీల్ నరైన్‌కు ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు లభించింది. -
IPL 2024: కేకేఆర్‌దే 'కిరీటం' (ఫొటోలు)
-
IPL 2024 Final: సన్‌రైజర్స్‌కు గుండెకోత.. చరిత్ర సృష్టించిన స్టార్క్
చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా నిన్న (మే 26) జరిగిన ఐపీఎల్ 2024 సీజన్ ఫైనల్లో కోల్‌కతా నైట్‌రైడర్స్ విజేతగా ఆవిర్భవించింది. తుది సమరంలో కేకేఆర్.. సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను 8 వికెట్ల తేడాతో చిత్తు చేసి మూడోసారి టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఫైనల్లో సన్‌రైజర్స్ తమ ప్రధాన బలమైన బ్యాటింగ్‌లో దారుణంగా విఫలమై ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. నమ్మకాన్ని వమ్ము చేయని స్టార్క్కేకేఆర్ పేసర్, ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఆటగాడు మిచెల్ స్టార్క్ తనపై యాజమాన్యం పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా తనకు లభించిన ధరకు న్యాయం చేశాడు. అంతిమ సమరంలో స్టార్క్ అద్భుతంగా బౌలింగ్ చేసి సన్‌రైజర్స్‌కు గుండెకోత మిగిల్చాడు. అతను 3 ఓవర్లలో కేవలం 14 పరుగులు మాత్రమే ఇచ్చి రెండు కీలకమైన వికెట్లు, రెండు క్యాచ్‌లు పట్టాడు. ఫలితంగా ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు గెలుచుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలో తొలి ఆటగాడుఐపీఎల్ చరిత్రలో నాకౌట్ మ్యాచ్‌ల్లో ఒకటి కంటే ఎక్కువ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు గెలుచుకున్న ఆటగాడిగా స్టార్క్ చరిత్ర సృష్టించాడు. స్టార్క్ సన్‌రైజర్స్‌తోనే జరిగిన తొలి క్వాలిఫయర్లోనూ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా (4-0-34-3) నిలిచాడు. సీజన్ ఆరంభంలో దారుణంగా విఫలమైన స్టార్క్ అత్యంత కీలకమైన నాకౌట్ మ్యాచ్‌ల్లో అద్భుతంగా రాణించి కేకేఆర్‌కు పదేళ్ల తర్వాత మరోసారి టైటిల్‌ను అందించాడు. ఓవరాల్‌గా చూస్తే ఈ సీజన్లో స్టార్క్ సన్‌రైజర్స్ పాలిట విలన్లా దాపురించాడు.మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ గెలిచి అత్యుత్సాహంగా తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న సన్‌రైజర్స్ నిర్ణీత ఓవర్లైనా కూడా ఆడకుండానే (18.3 ఓవర్లు) 113 పరుగులకు చాపచుట్టేసింది. ఆ జట్టు ఇన్నింగ్స్‌లో కెప్టెన్ కమిన్స్ (24) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. మెరుపు వీరులు, ఓపెనర్లు అభిషేక్ శర్మ (2), ట్రివిస్ హెడ్ (0) దారుణంగా నిరాశపరిచారు. కమిన్స్ కాకుండా మార్క్రమ్ (20), నితీశ్ రెడ్డి (13), క్లాసెన్ (16) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. కేకేఆర్ బౌలర్లలో స్టార్క్‌తో పాటు రసెల్ (2.3-0-19-3), హర్షిత్ రాణా (4-1-24-2), సునీల్ నరైన్ (4-0-16-1), వరుణ్ చక్రవర్తి (2-0-9-1) ఇరగదీశారు. వైభవ్ అరోరా ఓ వికెట్ పడగొట్టాడు.The winning by Celebration by Kolkata Knight Riders after winning the third IPL title. 🏆 pic.twitter.com/OgQBi87Kzt— Johns. (@CricCrazyJohns) May 26, 2024ఆడుతూ పాడుతూ..అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన కేకేఆర్.. వెంకటేశ్ అయ్యర్ అజేయమైన మెరుపు అర్దశతకంతో (26 బంతుల్లో 52; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) విరుచుకుపడటంతో కేవలం 10.3 ఓవర్లలోనే ఆడుతూ పాడుతూ విజయతీరాలకు చేరింది. రహ్మానుల్లా గుర్భాజ్ (32 బంతుల్లో 39; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) కీలకమైన ఇన్నింగ్స్ ఆడగా.. భీకర ఫామ్‌లో ఉన్న సునీల్ నరైన్ 6 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. వెంకటేశ్ అయ్యర్‌తో పాటు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (6) అజేయంగా నిలిచి కేకేఆర్‌కు పదేళ్ల తర్వాత మరో టైటిల్‌ను అందించాడు. ఎస్ఆర్హెచ్ బౌలర్లలో కమిన్స్, షాబాజ్ అహ్మద్‌లకు తలో వికెట్ దక్కింది. గత సీజన్లో టేబుల్ చివర్లో ఉండిన సన్‌రైజర్స్ ఈ సీజన్లో రన్నరప్‌గా నిలవడం ఆ జట్టు అభిమానులకు ఊరట కలిగించే అంశం. సిరీస్ ఆధ్యాంతం బ్యాట్‌తో (14 మ్యాచ్‌ల్లో 488 పరుగులు) ఇరగదీసి, బంతితో (17 వికెట్లు) మాయ చేసిన సునీల్ నరైన్‌కు ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు లభించింది. -
IPL 2024: కోల్‌కతాకే కిరీటం
సన్‌రైజర్స్ అభిమానులకు తీవ్ర వేదన... లీగ్ దశలో విధ్వంసకర బ్యాటింగ్‌తో ఐపీఎల్‌కు కొత్త పాఠాలు నేర్పిన టీమ్ అదే బ్యాటింగ్ వైఫల్యంతో చివరి మెట్టుపై చతికిలపడింది. 8 బంతుల వ్యవధిలో అభిషేక్ శర్మ, హెడ్ లాంటి హిట్టర్లు వెనుదిరగ్గా... క్లాసెన్‌కు కూడా కాలం కలిసిరాని వేళ జట్టంతా కుప్పకూలింది. ఏ మూలకూ సరిపోని 114 పరుగుల లక్ష్యాన్ని కోల్‌కతా నైట్‌రైడర్స్ 63 బంతుల్లోనే ఛేదించేసి సంబరాలు చేసుకుంది. దశాబ్ద కాలం తర్వాత మూడో టైటిల్ అందుకొని సగర్వంగా నిలిచింది. ఎనిమిదేళ్ల తర్వాత ట్రోఫీ గెలవాలని ఆశించిన హైదరాబాద్ 2018 తరహాలో ఫైనల్‌కే పరిమితమై నిరాశలో మునిగింది. ఆసాంతం బ్యాటర్లు చెలరేగిన 2024 టోర్నీ చివరకు బౌలర్ల అద్భుత ప్రదర్శనతో ముగిసింది. విజేతగా నిలిచిన కోల్‌కతాకు రూ. 20 కోట్లు... రన్నరప్ హైదరాబాద్ జట్టుకు రూ. 12 కోట్ల 50 లక్షలు ప్రైజ్‌మనీగా లభించాయి. చెన్నై: పదేళ్ల తర్వాత కోల్‌కతా నైట్‌రైడర్స్ (కేకేఆర్) మళ్లీ ఐపీఎల్ చాంపియన్‌గా అవతరించింది. ఆదివారం చెపాక్ మైదానంలో ఏకపక్షంగా సాగిన ఐపీఎల్ 17వ సీజన్ ఫైనల్ పోరులో కోల్‌కతా 8 వికెట్ల తేడాతో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్ 18.3 ఓవర్లలో 113 పరుగులకే ఆలౌటైంది. ఐపీఎల్ చరిత్రలో ఫైనల్ మ్యాచ్‌లో ఇదే అత్యల్ప స్కోరు. కెప్టెన్ ప్యాట్ కమిన్స్ (19 బంతుల్లో 24; 2 ఫోర్లు, 1 సిక్స్)దే అత్యధిక స్కోరు. అనంతరం నైట్‌రైడర్స్ 10.3 ఓవర్లలో 2 వికెట్లకు 114 పరుగులు చేసి గెలిచింది. వెంకటేశ్ అయ్యర్ (26 బంతుల్లో 52 నాటౌట్; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు), రహ్మానుల్లా గుర్బాజ్ (32 బంతుల్లో 39; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) రెండో వికెట్‌కు 45 బంతుల్లో 91పరుగులు జోడించి జట్టును గెలిపించారు. సమష్టి వైఫల్యం... తొలి ఓవర్లో స్టార్క్ వేసిన అద్భుత బంతికి అభిõÙక్ శర్మ (2) క్లీన్‌బౌల్డ్ కావడంతో మొదలైన సన్‌రైజర్స్ పతనం వేగంగా సాగింది. కోల్‌కతా కట్టుదిట్టమైన బౌలింగ్ ముందు ఏ దశలోనూ హైదరాబాద్ తిరిగి కోలుకోలేకపోయింది. హెడ్ (0) తన వైఫల్యాన్ని కొనసాగిస్తూ ఆడిన తొలి బంతికి అవుటై మరో డకౌట్ ఖాతాలో వేసుకున్నాడు. త్రిపాఠి (13 బంతుల్లో 9; 1 ఫోర్) ఈసారి ఆదుకోలేకపోగా, నితీశ్ రెడ్డి (10 బంతుల్లో 13; 1 ఫోర్, 1 సిక్స్), షహబాజ్ (7 బంతుల్లో 8; 1 సిక్స్), అబ్దుల్ సమద్ (4) విఫలమయ్యారు. మరోవైపు మార్క్రమ్ (23 బంతుల్లో 20; 3 ఫోర్లు) పరుగులు తీయడానికి ఇబ్బంది పడగా... క్లాసెన్ (17 బంతుల్లో 16; 1 ఫోర్) కూడా భారీ షాట్లు ఆడలేకపోయాడు. 14 ఓవర్ల తర్వాత సన్‌రైజర్స్ స్కోరు 90/7. క్లాసెన్ క్రీజ్‌లో ఉండటంతో చివరి 6 ఓవర్లలోనైనా ఎక్కువ పరుగులు సాధించవచ్చని రైజర్స్ ఆశించింది. అయితే తర్వాతి బంతికే అతను బౌల్డ్ కావడంతో ఆశలు ఆవిరయ్యాయి. చివర్లో కమిన్స్ కొన్ని పరుగులు జత చేసి స్కోరును 100 దాటించాడు. ఫటాఫట్... స్వల్ప ఛేదనలో కేకేఆర్‌కు ఎలాంటి ఇబ్బందీ ఎదురు కాలేదు. నరైన్ (2 బంతుల్లో 6; 1 సిక్స్) ఆరంభంలోనే వెనుదిరిగినా... వెంకటేశ్, గుర్బాజ్ వేగంగా జట్టును గెలుపు దిశగా తీసుకెళ్లారు. భువనేశ్వర్ ఓవర్లో వరుసగా 4, 6, 6 కొట్టిన వెంకటేశ్, ఆ తర్వాత నటరాజన్ బౌలింగ్‌లో వరుసగా 4, 4, 6, 4 బాది లక్ష్యాన్ని మరింత సులువగా మార్చేశాడు. 24 బంతుల్లోనే వెంకటేశ్ హాఫ్ సెంచరీ పూర్తయింది. విజయానికి 12 పరుగుల దూరంలో గుర్బాజ్ అవుటైనా... వెంకటేశ్, కెపె్టన్ శ్రేయస్ (3 బంతుల్లో 6 నాటౌట్; 1 ఫోర్) కలిసి ఆట ముగించారు. స్కోరు వివరాలు సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్: అభిషేక్ శర్మ (బి) స్టార్క్ 2; హెడ్ (సి) గుర్బాజ్ (బి) వైభవ్ అరోరా 0; త్రిపాఠి (సి) రమణ్‌దీప్ (బి) స్టార్క్ 9; మార్క్రమ్ (సి) స్టార్క్ (బి) రసెల్ 20; నితీశ్ కుమార్ రెడ్డి (సి) గుర్బాజ్ (బి) హర్షిత్ రాణా 13; క్లాసెన్ (బి) హర్షిత్ రాణా 16; షహబాజ్ (సి) నరైన్ (బి) వరుణ్ 8; సమద్ (సి) గుర్బాజ్ (బి) రసెల్ 4; కమిన్స్ (సి) స్టార్క్ (బి) రసెల్ 24; జైదేవ్ ఉనాద్కట్ (ఎల్బీ) (బి) నరైన్ 4; భువనేశ్వర్ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 13; మొత్తం (18.3 ఓవర్లలో ఆలౌట్) 113. వికెట్ల పతనం: 1–2, 2–6, 3–21, 4–47, 5–62, 6–71, 7–77, 8–90, 9–113, 10– 113. బౌలింగ్: స్టార్క్ 3–0–14–2, వైభవ్ అరోరా 3–0–24–1, హర్షిత్ రాణా 4–1–24– 2, నరైన్ 4–0–16–1, రసెల్ 2.3–0– 19–3, వరుణ్ చక్రవర్తి 2–0–9–1. కోల్‌కతా నైట్‌రైడర్స్ ఇన్నింగ్స్: గుర్బాజ్ (ఎల్బీ) (బి) షహబాజ్ 39; నరైన్ (సి) షహబాజ్ (బి) కమిన్స్ 6; వెంకటేశ్ అయ్యర్ (నాటౌట్) 52; శ్రేయస్ అయ్యర్ (నాటౌట్) 6; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం (10.3 ఓవర్లలో 2 వికెట్లకు) 114. వికెట్ల పతనం: 1–11, 2–102. బౌలింగ్: భువనేశ్వర్ 2–0– 25–0, కమిన్స్ 2–0–18–1, నటరాజన్ 2–0– 29–0, షహబాజ్ 2.3–0–22–1, ఉనాద్కట్ 1–0–9–0, మార్క్రమ్ 1–0–5–0. ఐపీఎల్–17 బౌండరీ మీటర్ మొత్తం సిక్స్‌లు: 1260 మొత్తం ఫోర్లు: 2174 -
IPL 2024 Final: వార్న్, రోహిత్, హార్దిక్ సరసన కమిన్స్ చేరేనా..?
ఐపీఎల్ 2024 సీజన్ ఫైనల్ ఇవాళ (మే 26) రాత్రి 7:30 గంటలకు ప్రారంభంకానున్న విషయం తెలిసిందే. చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా కేకేఆర్.. సన్‌రైజర్స్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ ఫైనల్ మ్యాచ్ నేపథ్యంలో పలు ఆసక్తికర అంశాలు తెరపైకి వస్తున్నాయి. అందులో తొలి సీజన్లోనే టైటిల్ కైవసం చేసుకున్న కెప్టెన్ల విషయం అందరి దృష్టిని ఆకర్శిస్తుంది. కేవలం ముగ్గురు మాత్రమే..16 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో ఇప్పటివరకే కేవలం ముగ్గురు కెప్టెన్లు మాత్రమే తొలి సీజన్లోనే టైటిల్ గెలిచారు. తొట్ట తొలి సీజన్లో (2008) షేన్ వార్న్ (రాజస్థాన్ రాయల్స్), 2013 సీజన్లో రోహిత్ శర్మ (ముంబై ఇండియన్స్), 2022 సీజన్లో హార్దిక్ పాండ్యా (గుజరాత్ టైటాన్స్) ఐపీఎల్ టైటిల్ గెలిచారు. ప్రస్తుత సీజన్ ఫైనల్లో తలపడుతున్న పాట్ కమిన్స్ కూడా కెప్టెన్ ఇదే తొలి సీజన్ కావడంతో అతనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కెప్టెన్‌గా పాట్ ట్రాక్ రికార్డు చూస్తే వార్న్, రోహిత్, హార్దిక్ సరసన చేరడం ఖాయంగా కనిపిస్తుంది. మరి నేటి ఫైనల్లో కమిన్స్ ఏం చేస్తాడో వేచి చూడాలి. కేవలం బ్యాటింగ్‌ను నమ్ముకున్న సన్‌రైజర్స్.. అన్ని విభాగాల్లో సత్తా చాటుతున్న కేకేఆర్‌ను ఏమేరకు నిలువరిస్తుందో మరికొద్ది గంటల్లో తేలిపోనుంది. అలా చూస్తే కేకేఆర్‌దే టైటిల్..గత ఆరు సీజన్లలో క్వాలిఫయర్-1లో గెలిచిన జట్టే టైటిల్ గెలుస్తుంది. ఈ సెంటిమెంట్‌నే కేకేఆర్ కొనసాగిస్తుందో లేక సన్‌రైజర్స్ సెంటిమెంట్‌ను బ్రేక్ చేస్తుందో చూడాలి. ఈ ఏడాది సన్‌రైజర్స్ మరో టైటిల్ గెలుస్తుందా..?మరోవైపు సన్‌రైజర్స్‌కు ఈ ఏడాది బాగా కలిసొచ్చినట్లు కనిపిస్తుంది. ఈ ఫ్రాంచైజీ ఈ ఏడాది సౌతాఫ్రికా టీ20 లీగ్ గెలిచి అదే జోరును ఐపీఎల్‌లోనూ కొనసాగిస్తుంది. ఫైనల్లో హాట్ ఫేవరెట్ కేకేఆరే అయినప్పటికీ.. కమిన్స్ కెప్టెన్సీ సామర్థ్యం, బ్యాటర్ల విధ్వంసంపై ఆరెంజ్ ఆర్మీ అభిమానులు గంపెడాశలు పెట్టుకున్నారు. ఎస్ఆర్హెచ్ అభిమానులు అంచనాలు నిజమైతే ఐపీఎల్ టైటిల్ గెలిచిన నాలుగో ఆసీస్ ఆటగాడిగా కమిన్స్ రికార్డు బుక్కుల్లోకెక్కుతాడు. కేకేఆర్‌కు చెపాక్ స్పెషల్..మరోవైపు చెపాక్ మైదానంతో కేకేఆర్‌కు ప్రత్యేక అనుబంధం ఉంది. 12 ఏళ్ల క్రితం కేకేఆర్ ఇక్కడే తమ తొలి ఐపీఎల్ టైటిల్ నెగ్గింది. కేకేఆర్ చెపాక్ సెంటిమెంట్ కూడా తమకు వర్కౌట్ అవుతుందని అశిస్తుంది. ఈ సీజన్లో సన్‌రైజర్స్‌తో ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ విజయం తమనే వరించడంపై కూడా కేకేఆర్ ధీమాగా ఉంది. ఫైనల్లో మరోసారి ఎస్ఆర్హెచ్ను మట్టికరిపించి ఈ సీజన్లో హ్యాట్రిక్ విక్టరీ నమోదు చేస్తామని కేకేఆర్ ధీమాగా ఉంది. -
ఫైనల్లో తలపడనున్న SRH, KKR జట్లు
-
SRH vs RR: మా ఓటమికి కారణం అదే.. బుమ్రా తర్వాత అతడే: సంజూ
‘‘కీలకమైన మ్యాచ్. తొలి ఇన్నింగ్స్‌లో మా వాళ్లు బౌలింగ్ చేసిన విధానం పట్ల గర్వంగా ఉంది. అయితే, రెండో ఇన్నింగ్స్ మిడిల్ ఓవర్లలో వారి స్పిన్ వ్యూహాలను ఎదుర్కోవడంలో మేము తడబడ్డాం.అక్కడే మ్యాచ్ మా చేజారింది. ఈ పిచ్‌పై తేమ ఉంటుందా? లేదా అన్నది ముందే ఊహించడం కష్టం. రెండో ఇన్నింగ్స్‌కు వచ్చే సరికి వికెట్ పూర్తి భిన్నంగా మారిపోయింది.బంతి కాస్త టర్న్ కావడం మొదలైంది. ఆ అవకాశాన్ని వాళ్లు సద్వినియోగం చేసుకున్నారు. మిడిల్ ఓవర్లలో మా కుడిచేతి వాటం బ్యాటర్ల కోసం లెఫ్టార్మ్ స్పిన్నర్లను దింపి ఫలితం రాబట్టారు.అక్కడే వాళ్లు మాపై పైచేయి సాధించారు. లెఫ్టార్మ్ స్పిన్ బౌలింగ్‌లో రివర్స్ స్వీప్ షాట్లకు ఎక్కువగా ప్రయత్నించి ఉంటే బాగుండేది. ఏదేమైనా వాళ్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు’’ అని రాజస్తాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ అన్నాడు.ఐపీఎల్-2024 క్వాలిఫయర్-2లో సన్‌రైజర్స్ హైదరాబాద్ చేతిలో ఓటమికి బ్యాటింగ్ వైఫల్యమే కారణమని అంగీకరించాడు. అయితే, జట్టు ప్రదర్శన పట్ల మాత్రం తనతో పాటు ఫ్రాంఛైజీ కూడా సంతృప్తిగానే ఉందని సంజూ ఈ సందర్భంగా తెలిపాడు.బుమ్రా తర్వాత అతడేఈ మేరకు.. ‘‘మేము ఈ ఒక్క సీజన్లోనే కాదు.. గత మూడేళ్లుగా నిలకడగా రాణిస్తున్నాం. మా ఫ్రాంఛైజీ మా ప్రదర్శన పట్ల సంతృప్తిగానే ఉంది. ముఖ్యంగా భారత్‌లోని యంగ్ టాలెంట్‌ను మేము వెలికితీయగలుగుతున్నాం.రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్ అందుకు ఉదాహరణ. వీళ్లిద్దరు కేవలం రాజస్తాన్‌కే కాదు టీమిండియా తరఫున కూడా రాణిస్తే చూడాలని కోరుకుంటున్నా.ఇక సందీప్ శర్మ.. అతడి బౌలింగ్ తీరు పట్ల నేను చాలా సంతోషంగా ఉన్నాను. వేలంలో తను మా జట్టులోకి రాకపోయినా వేరొకరి స్థానంలో మాతో చేరాడు. అద్భుత ఆట తీరుతో అందరినీ మెప్పించాడు.గత రెండేళ్లుగా అతడి ప్రదర్శన బాగుంది. బుమ్రా తర్వాత అతడే బెస్ట్!’’ అంటూ రాజస్తాన్ యువ ఆటగాళ్లపై సంజూ శాంసన్ ప్రశంసలు కురిపించాడు. కాగా చెన్నై వేదికగా శుక్రవారం నాటి కీలక మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ 36 పరుగుల తేడాతో ఓడిపోయింది.విఫలమైన సంజూ శాంసన్ఈ క్రమంలో సన్‌రైజర్స్ ఫైనల్లో అడుగుపెట్టగా.. రాజస్తాన్ టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈ మ్యాచ్‌లో లక్ష్య ఛేదనలో సంజూ శాంసన్ పూర్తిగా విఫలమయ్యాడు. 11 బంతులు ఎదుర్కొని కేవలం 10 పరుగులే చేశాడు. యశస్వి జైస్వాల్(21 బంతుల్లో 42), ధ్రువ్ జురెల్(56 నాటౌట్) మాత్రమే రాణించారు.తిప్పేసిన స్పిన్నర్లుఅంతకు ముందు సన్‌రైజర్స్ ఇన్నింగ్స్‌లో రాజస్తాన్ పేసర్ సందీప్ శర్మ నాలుగు ఓవర్ల కోటా పూర్తి చేసి 25 పరుగులు మాత్రమే ఇచ్చి రెండు వికెట్లు తీశాడు. కాగా ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ లెఫ్టార్మ్ స్పిన్నర్లు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ షాబాజ్ అహ్మద్, అభిషేక్ శర్మ అద్బుతంగా రాణించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు.క్వాలిఫయర్-2: సన్‌రైజర్స్ వర్సెస్ రాజస్తాన్ స్కోర్లు:👉టాస్: రాజస్తాన్.. తొలుత బౌలింగ్👉సన్‌రైజర్స్ స్కోరు: 175/9 (20)👉రాజస్తాన్ స్కోరు: 139/7 (20)👉ఫలితం: రాజస్తాన్‌పై 36 పరుగుల తేడాతో గెలుపొంది ఫైనల్‌కు దూసుకెళ్లిన సన్రైజర్స్చదవండి: SRH Captain Pat Cummins: ఆ నిర్ణయం నాది కాదు.. అతడొక సర్ప్రైజ్.. ఇంకొక్క అడుగు SRH vs RR: ఓవరాక్షన్.. మూల్యం చెల్లించకతప్పలేదు! Plenty to cheer & celebrate for the @SunRisers 🥳An impressive team performance to seal a place in the all important #Final 🧡Scorecard ▶️ https://t.co/Oulcd2FuJZ… #TATAIPL | #Qualifier2 | #SRHvRR | #TheFinalCall pic.twitter.com/nG0tuVfA22— IndianPremierLeague (@IPL) May 24, 2024 -
SRH vs RR: ఎంత టాలెంట్ ఉంటే ఏం లాభం?: టీమిండియా దిగ్గజం ఫైర్
రాజస్తాన్ రాయల్స్ యువ బ్యాటర్ రియాన్ పరాగ్ ఆట తీరుపై టీమిండియా దిగ్గజం సునిల్ గావస్కర్ మండిపడ్డాడు. ప్రతిభ ఉంటే సరిపోదని.. దానిని ఎలా వినియోగించుకోవాలో కూడా తెలిసి ఉండాలంటూ చురకలు అంటించాడు.ఐపీఎల్-2024లో ఆది నుంచి వరుస విజయాలు సాధించిన రాజస్తాన్ రాయల్స్.. ఆ తర్వాత వరుస ఓటములతో విమర్శలు మూటగట్టుకుంది. ప్లే ఆఫ్స్ చేరినప్పటికీ సంజూ శాంసన్ సేన స్థాయికి తగ్గట్లు రాణించడం లేదని విశ్లేషకులు పెదవి విరిచారు.ఎలిమినేటర్ మ్యాచ్‌లో విశ్వరూపంఅలాంటి సమయంలో కీలకమైన ఎలిమినేటర్ మ్యాచ్‌లో అద్భుత ఆట తీరుతో రాజస్తాన్ తిరిగి సత్తా చాటింది. అహ్మదాబాద్‌లో బుధవారం నాటి మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరును చిత్తు చేసి క్వాలిఫయర్-2కు అర్హత సాధించింది.విలువైన ఇన్నింగ్స్ ఆడిన రియాన్ఈ విజయంలో రియాన్ పరాగ్ కీలక పాత్ర పోషించాడు. 26 బంతుల్లో 36 విలువైన పరుగులు జోడించి జట్టును గెలుపు తీరాలకు చేర్చడంలో సహకారం అందించాడు. అయితే, మరో కీలకమైన మ్యాచ్‌లో మాత్రం ఒత్తిడిలో అతడు చిత్తయ్యాడు.మరో కీలక మ్యాచ్‌లో మాత్రం విఫలంసన్రైజర్స్ హైదరాబాద్‌లో శుక్రవారం నాటి క్వాలిఫయర్-2లో రియాన్ పరాగ్ పూర్తిగా విఫలమయ్యాడు. లక్ష్య ఛేదనలో రాజస్తాన్ తడబడుతున్న వేళ నాలుగో నంబర్లో బ్యాటింగ్‌కు వచ్చిన 22 ఏళ్ల ఈ రైట్ హ్యాండ్ బ్యాటర్.. 10 బంతులు ఎదుర్కొని కేవలం 6 పరుగులే చేశాడు.రాజస్తాన్ ఇన్నింగ్స్‌లో 12వ ఓవర్ వేసిన రైజర్స్ లెఫ్టార్మ్ స్పిన్నర్ షాబాజ్ అహ్మద్ బౌలింగ్‌లో మొదటి బంతిని ఎదుర్కొనే క్రమంలో.. నిర్లక్ష్యంగా వికెట్ పారేసుకున్నాడు. అనవసరపు షాట్‌కు యత్నించి బంతిని గాల్లోకి లేపగా.. అభిషేక్ శర్మ క్యాచ్ పట్టాడు.Shahbaz Ahmed has put Sunrisers Hyderabad on 🔝🧡#RR in deep trouble and in search of something special in Chennai! Watch the match LIVE on @StarSportsIndia and @JioCinema 💻📱#TATAIPL | #SRHvRR | #Qualifier2 | #TheFinalCall pic.twitter.com/8sGV8fzxcZ— IndianPremierLeague (@IPL) May 24, 2024 దీంతో రియాన్ పరాగ్ తడ‘బ్యాటు’ అంతటితో ముగిసిపోయింది. అతడు అవుటైన తీరుకు రాజస్తాన్ కోచ్ సంగక్కర షాక్‌లో ఉండిపోగా.. కామెంటేటర్ సునిల్ గావస్కర్ తీవ్ర స్థాయిలో విమర్శించాడు.ఎంత టాలెంట్ ఉంటే ఏం లాభం?‘‘ఎలా ఉపయోగించుకోవాలో తెలియనపుడు నీకు ఎంత ప్రతిభ ఉంటే ఏం లాభం? అసలు ఇలాంటి షాట్ ఎలా ఆడతావు? నాకైతే ఏమీ అర్థం కావడం లేదు. అపారమైన ప్రతిభ.. కానీ దాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో తెలియదు. ఇంకొన్ని బంతుల వరకు పరుగులు రానంత మాత్రాన ఏం మునిగిపోతుంది? ఆ తర్వాత మళ్లీ పుంజుకోవచ్చు కదా!’’ అంటూ గావస్కర్ లైవ్ కామెంట్రీలోనే రియాన్ పరాగ్‌పై ఫైర్ అయ్యాడు. కాగా ఈ ఏడాది ఐపీఎల్లో రియాన్ పరాగ్ 16 మ్యాచ్‌లలో కలిపి 573 పరుగులు సాధించాడు.చదవండి: Kavya Maran Viral Reaction Video: దటీజ్ కావ్య.. సరైన నిర్ణయాలు!.. తండ్రిని హత్తుకుని చిన్నపిల్లలా! -
SRH vs RR: ఓవరాక్షన్.. మూల్యం చెల్లించకతప్పలేదు!
ఐపీఎల్-2024లో రాజస్తాన్ రాయల్స్ ప్రయాణం ముగిసిపోయింది. క్వాలిఫయర్-2లో సన్‌రైజర్స్ హైదరాబాద్ చేతిలో ఓటమి పాలైన సంజూ శాంసన్ సేన టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఫలితంగా ఈసారి టైటిల్ పోరుకు అర్హత సాధించాలన్న కల కలగానే మిగిలిపోయింది.ఇదిలా ఉంటే.. ఓటమి బాధలో ఉన్న రాజస్తాన్ ఆటగాడు షిమ్రన్ హెట్మెయిర్కు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఐపీఎల్ నిర్వాహకులు అతడికి జరిమానా విధించారు. ఇంతకీ ఏం జరిగిందంటే?!..వాళ్లిద్దరు మినహా అంతా విఫలంచెన్నైలోని చెపాక్ వేదికగా సన్‌రైజర్స్‌తో తలపడ్డ రాజస్తాన్ 36 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఎస్ఆర్హెచ్ విధించిన 176 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక చతికిలపడింది. ఓపెనర్ యశస్వి జైస్వాల్(42), ఐదో నంబర్ బ్యాటర్(56- నాటౌట్) మినహా మిగతా బ్యాటర్లంతా పూర్తిగా విఫలమయ్యారు.Plenty to cheer & celebrate for the @SunRisers 🥳An impressive team performance to seal a place in the all important #Final 🧡Scorecard ▶️ https://t.co/Oulcd2FuJZ… #TATAIPL | #Qualifier2 | #SRHvRR | #TheFinalCall pic.twitter.com/nG0tuVfA22— IndianPremierLeague (@IPL) May 24, 2024 ఆశలన్నీ వమ్ముచేసి.. వికెట్ పారేసుకునిసన్రైజర్స్ బౌలర్ల ట్రాప్‌లో చిక్కుకుని పెవిలియన్‌కు క్యూ కట్టారు. ఇక పవర్ఫుల్ హిట్టర్‌గా పేరొందిన షిమ్రన్ హెట్మెయిర్ 10 బంతులు ఎదుర్కొని కేవలం 4 పరుగులే చేసి ఘోరంగా విఫలమయ్యాడు.పద్నాలుగవ ఓవర్లో రైజర్స్ లెఫ్టార్మ్ స్పిన్ ఆల్‌రౌండర్ అభిషేక్ శర్మ బౌలింగ్‌లో ఊహించని రీతిలో బౌల్డ్ అయి వికెట్ పారేసుకున్నాడు. జట్టు తనపై పెట్టుకున్న ఆశలు వమ్ము చేశాడు. ఈ క్రమంలో.. అప్పటికే పరాజయం దిశగా జట్టు పయనించడం.. పార్ట్‌టైమ్ బౌలర్ చేతిలో తనకు భంగపాటు ఎదురుకావడంతో హెట్మెయిర్ తీవ్ర అసహనానికి లోనయ్యాడు.పనిష్మెంట్ ఇచ్చిన బీసీసీఐక్రీజును వీడే సమయంలో బ్యాట్‌తో వికెట్లను కొట్టేందుకు ప్రయత్నించాడు. ఈ నేపథ్యంలో బీసీసీఐ అతడికి జరిమానా విధించడం గమనార్హం. ‘‘షిమ్రన్ హెట్మెయిర్.. ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.2 ప్రకారం.. లెవల్ 1 తప్పిదానికి పాల్పడ్డాడని మ్యాచ్ రిఫరీ తేల్చారు. అతడు కూడా తన తప్పును అంగీకరించాడు’’ అని ప్రకటన విడుదల చేసింది. హెట్మెయిర్ మ్యాచ్ ఫీజులో 10 శాతం మేర కోత విధిస్తున్నట్లు తెలిపింది.చదవండి: SRH: ఆ నిర్ణయం నాది కాదు.. అతడొక సర్ప్రైజ్.. ఇంకొక్క అడుగు: కమిన్స్Kavya Maran: దటీజ్ కావ్య.. సరైన నిర్ణయాలు!.. తండ్రిని హత్తుకుని చిన్నపిల్లలా! -
Kavya Maran: శెభాష్ కావ్య.. సరైన నిర్ణయాలు!.. వీడియో వైరల్
సన్‌రైజర్స్... ఈ ఏడాది టీ20 లీగ్‌లలో ఈ ఫ్రాంఛైజీకి బాగా కలిసి వస్తోంది. సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో వరుసగా రెండోసారి చాంపియన్‌గా నిలిచిన సన్‌రైజర్స్.. క్యాష్ రిచ్ లీగ్ ఐపీఎల్‌లోనూ దుమ్ములేపుతోంది.గత మూడేళ్ల వైఫల్యాలను మరిపించేలా సంచలన ప్రదర్శనతో ఫైనల్‌కు దూసుకువెళ్లింది. ప్యాట్ కమిన్స్ సారథ్యంలో.. విధ్వంసకర బ్యాటింగ్‌తో సరికొత్త రికార్డులు సృష్టిస్తూ అనూహ్య రీతిలో ఆరేళ్ల తర్వాత టైటిల్ రేసులో నిలిచింది.క్వాలిఫయర్-2లో రాజస్తాన్ రాయల్స్‌ను 36 పరుగులతో ఓడించి కోల్‌కతా నైట్‌రైడర్స్‌ను ఢీకొట్టేందుకు సిద్ధమైంది. కేకేఆర్ రూపంలో ఇంకొక్క గండం దాటేస్తే ట్రోఫీని ముద్దాడే అవకాశం ముంగిట నిలిచింది.ఈ నేపథ్యంలో సన్‌రైజర్స్ యజమాని కావ్యా మారన్ సంబరాలు అంబరాన్నంటాయి. కీలక మ్యాచ్‌లో ఆద్యంతం తన హావభావాలతో హైలైట్‌గా నిలిచారామె. ముఖ్యంగా రాజస్తాన్ కెప్టెన్, స్టార్ బ్యాటర్ సంజూ శాంసన్‌ను అభిషేక్ శర్మ అవుట్ చేయగానే జట్టు గెలిచినంతగా సెలబ్రేట్ చేసుకున్నారు.Abhishek-ing things up at Chepauk, with the ball 🔥💪#TATAIPLPlayoffs #IPLonJioCinema #SRHvRR #TATAIPL #IPLinTelugu pic.twitter.com/XsOdHkMnir— JioCinema (@JioCinema) May 24, 2024 తండ్రిని ఆలింగనం చేసుకునిఇక రాజస్తాన్‌పై తమ విజయం ఖరారు కాగానే ఆమె ఎగిరి గంతేశారు. తన తండ్రి కళానిధి మారన్‌ను ఆలింగనం చేసుకుని ఆనందం పంచుకున్నారు. వేలంలో తాను అనుసరించిన వ్యూహాలు ఫలితాలు ఇస్తున్న తీరుకు మురిసిపోతూ చిరునవ్వులు చిందించారు. కరతాళ ధ్వనులతో ఎస్ఆర్హెచ్ ఆటగాళ్లను అభినందిస్తూ పట్టరాని సంతోషంతో ఉద్వేగానికి లోనయ్యారు.Celebrations in the @SunRisers camp 🔥👏#TATAIPLPlayoffs #IPLonJioCinema #SRHvRR #TATAIPL pic.twitter.com/GAJpI7nngY— JioCinema (@JioCinema) May 24, 2024 ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా ఐపీఎల్-2024 ఆరంభానికి ముందు సన్‌రైజర్స్ యాజమాన్యం కీలక మార్పులు చేసింది. బ్రియన్ లారా స్థానంలో న్యూజిలాండ్ స్పిన్ దిగ్గజం డానియల్ వెటోరిని ప్రధాన కోచ్‌గా నియమించింది.ఆటతోనే సమాధానంఅదే విధంగా వన్డే ప్రపంచకప్-2023 విజేత, ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ కోసం ఏకంగా రూ. 20.50 కోట్లు ఖర్చు పెట్టింది. అతడికి సారథ్య బాధ్యతలు అప్పగించి పూర్తి నమ్మకం ఉంచింది. Plenty to cheer & celebrate for the @SunRisers 🥳An impressive team performance to seal a place in the all important #Final 🧡Scorecard ▶️ https://t.co/Oulcd2FuJZ… #TATAIPL | #Qualifier2 | #SRHvRR | #TheFinalCall pic.twitter.com/nG0tuVfA22— IndianPremierLeague (@IPL) May 24, 2024 అందుకు తగ్గట్లుగానే ఈ ఆసీస్ పేసర్ జట్టును విజయపథంలో నిలిపాడు. వేలం నాటి నుంచే సన్‌రైజర్స్ మేనేజ్మెంట్ వ్యూహాలను, కావ్య మారన్ నిర్ణయాలను విమర్శించిన వాళ్లకు అద్భుత ప్రదర్శనతో జట్టును ఫైనల్‌కు చేర్చి సమాధానమిచ్చాడు.సౌతాఫ్రికాలో వరుసగా రెండుసార్లుఇదిలా ఉంటే.. 2023లో మొదలైన సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో సన్‌రైజర్స్ ఈస్టర్న్‌కేప్ పేరిట అడుగుపెట్టింది సన్‌గ్రూప్. ఐడెన్ మార్క్రమ్ను కెప్టెన్‌గా నియమించగా.. అరంగేట్రంలోనే జట్టును టైటిల్ విజేతగా నిలిపాడు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ముగిసిన ఫైనల్లోనూ సన్‌రైజర్స్‌ను గెలిపించి ట్రోఫీ అందించాడు.చదవండి: SRH: ఆ నిర్ణయం నాది కాదు.. అతడొక సర్ప్రైజ్.. ఇంకొక్క అడుగు: కమిన్స్ -
SRH: ఆ నిర్ణయం నాది కాదు.. అతడొక సర్ప్రైజ్: కమిన్స్
ఎనిమిది.. ఎనిమిది.. పది.. గత మూడేళ్లుగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ పాయింట్ల పట్టికలో సన్‌రైజర్స్ హైదరాబాద్ స్థానాలు. చెత్త ప్రదర్శనతో గతేడాది అట్టడుగున నిలిచిన ఆరెంజ్ ఆర్మీ ఈసారి అద్భుత ఆట తీరుతో సంచలనాలు సృష్టించింది.విశ్లేషకుల అంచనాలు తలకిందులు చేస్తూ ఏకంగా ఫైనల్లో అడుగుపెట్టింది. క్వాలిఫయర్-2లో రాజస్తాన్ రాయల్స్‌ను చిత్తు చేసి.. ఆరేళ్ల తర్వాత తుదిపోరుకు అర్హత సాధించింది.కొత్త కోచ్ డానియల్ వెటోరి మార్గదర్శనంలో.. నూతన కెప్టెన్ ప్యాట్ కమిన్స్ సారథ్యంలో ఊహించని ఫలితాలు సాధిస్తూ టైటిల్ వేటలో నిలిచింది. ఈ నేపథ్యంలో రాజస్తాన్‌పై విజయానంతరం ఎస్ఆర్హెచ్ సారథి కమిన్స్ మాట్లాడుతూ తన మనసులోని భావాలు పంచుకున్నాడు.మా బలం అదే‘‘ఈ సీజన్ ఆసాంతం మా వాళ్లు అదరగొట్టారు. ఆరంభం నుంచే ఫైనల్ లక్ష్యంగా ముందుకు సాగాము. ఇప్పుడు ఆ కలను నెరవేర్చుకున్నాము. మా బలం బ్యాటింగ్ అన్న సంగతి మాకు తెలుసు. అయినప్పటికీ మా బౌలర్లను తక్కువ అంచనా వేయడానికి లేదు. అనుభవజ్ఞులైన బౌలర్లు మా జట్టులో ఉన్నారు. భువీ, నట్టు, ఉనాద్కట్ నా పని మరింత సులువు చేశారు.ఆ నిర్ణయం నాది కాదుఇక ఈ రోజు షాబాజ్ అహ్మద్‌ను ఇంపాక్ట్ ప్లేయర్‌గా తీసుకురావాలన్న నిర్ణయం డాన్ వెటోరీదే. ఈ లెఫ్టార్మ్ ఆర్థోడాక్స్ బౌలర్ జట్టులో ఎంత మంది వీలైతే అంత మంది లెఫ్టార్మ్ ఆర్థోడాక్స్ బౌలర్లను ఈరోజు ఆడించాలని అనుకున్నాడు.అతడొక సర్ప్రైజ్ఇక అభిషేక్ శర్మ ఈరోజు ఇలా బౌలింగ్(2/24) చేయడం నిజంగా ఓ సర్ప్రైజ్ లాంటిదే. మిడిల్ ఓవర్లలో అతడు ప్రభావం చూపాడు. వాస్తవానికి ఈ పిచ్ మీద 170 పరుగుల టార్గెట్‌ను ఛేదించడం అంత సులువేమీ కాదని తెలుసు.కాస్త మెరుగ్గా ఆడితే గెలిచే అవకాశం ఉంటుందని తెలుసు. అయితే, వికెట్‌ను బట్టి పరిస్థితులను అంచనా వేయడంలో నేనేమీ దిట్ట కాదు. ఎందుకంటే వారం వారం ఇదంతా మారిపోతూ ఉంటుంది.ఇంకొక్కటి మిగిలి ఉందిమేము ఇక్కడిదాకా చేరడం వెనుక ఫ్రాంఛైజీకి చెందిన ప్రతి ఒక్కరి సహకారం ఉంది. దాదాపుగా 60- 70 మంది మనస్ఫూర్తిగా కఠిన శ్రమకోర్చి మమ్మల్ని ఈస్థాయిలో నిలిపారు.ఇంకొక్క అడుగు.. అందులోనూ సఫలమైతే ఇంకా బాగుంటుంది’’ అని కమిన్స్ హర్షం వ్యక్తం చేశాడు. సమిష్టిగా రాణించినందు వల్లే తాము ఫైనల్ చేరుకోగలిగామని జట్టులోని ప్రతి ఒక్కరికి క్రెడిట్ ఇచ్చాడు.ఇంపాక్ట్ చూపిన షాబాజ్కాగా రాజస్తాన్‌తో మ్యాచ్‌లో ట్రావిస్ హెడ్ స్థానంలో ఇంపాక్ట్ సబ్‌స్టిట్యూట్‌గా వచ్చిన లెఫ్టార్మ్ స్పిన్నర్ షాబాజ్ అహ్మద్.. యశస్వి జైస్వాల్(42), రియాన్ పరాగ్(6), రవిచంద్రన్ అశ్విన్(0) వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. కీలక సమయంలో రాణించి జట్టు విజయంలో ప్రధాన పాత్ర పోషించి.. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. మరో లెఫ్టార్మ్ స్పిన్నర్ అభిషేక్ శర్మ కెప్టెన్ సంజూ శాంసన్(10), షిమ్రన్ హెట్మెయిర్(4) రూపంలో రెండు కీలక వికెట్లు కూల్చాడు.క్వాలిఫయర్-2: సన్‌రైజర్స్ వర్సెస్ రాజస్తాన్ స్కోర్లు:👉వేదిక: ఎంఏ చిదంబరం స్టేడియం(చెపాక్), చెన్నై👉టాస్: రాజస్తాన్.. తొలుత బౌలింగ్👉సన్‌రైజర్స్ స్కోరు: 175/9 (20)👉రాజస్తాన్ స్కోరు: 139/7 (20)👉ఫలితం: రాజస్తాన్‌పై 36 పరుగుల తేడాతో సన్‌రైజర్స్ విజయం.. ఫైనల్‌కు అర్హత👉ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: షాబాజ్ అహ్మద్(18 పరుగులు, 3/23).చదవండి: T20 WC: టీ20 వరల్డ్‌కప్-2024కు పాకిస్తాన్ జట్టు ప్రకటన.. Plenty to cheer & celebrate for the @SunRisers 🥳An impressive team performance to seal a place in the all important #Final 🧡Scorecard ▶️ https://t.co/Oulcd2FuJZ… #TATAIPL | #Qualifier2 | #SRHvRR | #TheFinalCall pic.twitter.com/nG0tuVfA22— IndianPremierLeague (@IPL) May 24, 2024 -
ఐపీఎల్ ఫైనల్ కు దూసుకెళ్లిన సన్‌రైజర్స్ హైదరాబాద్
-
RR Vs SRH Pics: ఆర్ఆర్ను చిత్తు చేసి.. ఫైనల్‌కు సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఫొటోలు)
-
IPL 2024: సూపర్ సన్‌రైజర్స్
సన్‌రైజర్స్ హైదరాబాద్ తమ అసలు సత్తాను మరోసారి ప్రదర్శించింది. తొలి క్వాలిఫయర్‌లో పేలవ ఆటతో ఓటమి పాలైన జట్టు రెండో క్వాలిఫయర్‌కు వచ్చేసరికి అన్ని అ్రస్తాలతో చెలరేగింది. ఫలితంగా ఆరేళ్ల తర్వాత ఐపీఎల్ ఫైనల్లోకి అడుగు పెట్టింది. బ్యాటింగ్‌లో హెడ్, అభిõÙక్, మార్క్రమ్ విఫలమైనా... క్లాసెన్, త్రిపాఠి ఆదుకోవడంతో హైదరాబాద్ మెరుగైన స్కోరు సాధించగలిగింది. ఆ తర్వాత బౌలర్లు చెలరేగి ప్రత్యర్థి బ్యాటర్లను పూర్తిగా కట్టిపడేశారు. బెంగళూరుతో ఎలిమినేటర్‌లో కూడా దాదాపు ఇదే స్కోరును తడబడుతూనే ఛేదించిన రాజస్తాన్ ఈసారి మాత్రం కుప్పకూలింది. చెపాక్ మైదానంలో ఇద్దరు లెఫ్టార్మ్ స్పిన్నర్లు షహబాజ్, అభిõÙక్ శర్మ కలిసి 47 పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లు పడగొట్టి రాయల్స్ కథను ముగించడంలో కీలక పాత్ర పోషించారు. ఇక తొలి క్వాలిఫయర్‌లో ఓటమికి ప్రతీకారం తీర్చుకునే సమయమూ వచి్చంది. రెండో టైటిల్ వేటలో ఆదివారం కోల్‌కతాతో సమరానికి సన్‌రైజర్స్ సిద్ధంగా ఉంది. చెన్నై: ఐపీఎల్–17 ఫైనల్ సమరం కోల్‌కతా నైట్‌రైడర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య జరగనుంది. శుక్రవారం జరిగిన రెండో క్వాలిఫయర్‌లో సన్‌రైజర్స్ 36 పరుగుల తేడాతో రాజస్తాన్ రాయల్స్‌పై ఘన విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. హెన్రిచ్ క్లాసెన్ (34 బంతుల్లో 50; 4 సిక్స్‌లు) అర్ధ సెంచరీ సాధించగా... రాహుల్ త్రిపాఠి (15 బంతుల్లో 37; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు), ట్రవిస్ హెడ్ (28 బంతుల్లో 34; 3 ఫోర్లు, 1 సిక్స్) కీలక ఇన్నింగ్స్ ఆడారు. అనంతరం రాజస్తాన్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 139 పరుగులే చేయగలిగింది. ధ్రువ్ జురేల్ (35 బంతుల్లో 56 నాటౌట్; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు), మినహా అంతా విఫలమయ్యారు. రాణించిన త్రిపాఠి... ఓపెనర్ అభిషేక్ (12) తొలి ఓవర్లోనే వెనుదిరగ్గా... హెడ్ తన శైలికి భిన్నంగా నెమ్మదిగా ఆడాడు. అయితే త్రిపాఠి దూకుడైన ఇన్నింగ్స్‌తో స్కోరును పరుగెత్తించాడు. అశి్వన్ ఓవర్లో వరుసగా 4, 4, 6 బాదిన అతను, బౌల్ట్ ఓవర్లోనూ వరుసగా సిక్స్, ఫోర్ కొట్టి అదే జోరులో తర్వాతి బంతికి అవుటయ్యాడు. అదే ఓవర్లో మార్క్రమ్ (1) కూడా పెవిలియన్ చేరాడు. ఈ దశలో రాయ ల్స్ కట్టుదిట్టమైన బౌలింగ్‌తో హెడ్, క్లాసెన్ కూడా భారీ షాట్లు ఆడటంలో విఫలమయ్యారు. ఫలితంగా వరుసగా 29 బంతుల పాటు బౌండరీనే రాకపోగా, హెడ్ కూడా అవుటయ్యాడు. చహల్ వరుస బంతుల్లో నితీశ్ రెడ్డి (5), సమద్ (0)లను అవుట్ చేసి మరింత దెబ్బ తీశాడు. మరోవైపు 33 బంతుల్లో క్లాసెన్ అర్ధసెంచరీ పూర్తయింది. 18 ఓవర్లు ముగిశాక స్కోరు 163/6 కాగా క్లాసెన్ ఉండటంతో రైజర్స్ మరిన్ని పరుగులు ఆశించింది. అయితే 19వ ఓవర్ తొలి బంతికి క్లాసెన్ బౌల్డ్ కావడంతో ఆఖరి 11 బంతుల్లో 12 పరుగులే వచ్చాయి. టపటపా... ఛేదనలో రాయల్స్‌కు సరైన ఆరంభం లభించలేదు. టామ్ కోలర్ (10) ప్రభావం చూపలేకపోగా, 5 ఓవర్లలో 32 పరుగులే వచ్చాయి. అయితే భువనేశ్వర్ వేసిన ఆరో ఓవర్లో యశస్వి జైస్వాల్ సిక్స్, 3 ఫోర్లతో చెలరేగడంతో రాజస్తాన్ దారిలో పడినట్లు అనిపించింది. కానీ ఆ తర్వాత పరిస్థితి అంతా ఒక్కసారిగా మారిపోయింది. 13 పరుగుల వ్యవధిలో జట్టు 3 ప్రధాన వికెట్లు కోల్పోయింది. ముందుకొచ్చి షాట్లు ఆడే క్రమంలో యశస్వి, సామ్సన్ (10), పరాగ్ (6) వెనుదిరిగారు. అశి్వన్ (0) డకౌట్ కాగా, ఆశలు పెట్టుకున్న హెట్‌మైర్ (4) కూడా చేతులెత్తేశాడు. 39 బంతుల్లో 84 పరుగులు చేయాల్సిన స్థితిలో విండీస్ బ్యాటర్ల నుంచి రాజస్తాన్ అద్భుతం ఆశించింది. కానీ హెట్‌మైర్ (4), పావెల్ (6) విఫలం కావడంతో జట్టు గెలుపు ఆశలు కోల్పోయింది. మరోవైపు జురేల్ పోరాడినా అది ఏమాత్రం సరిపోలేదు.స్కోరు వివరాలు సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్: హెడ్ (సి) అశి్వన్ (బి) సందీప్ శర్మ 34; అభిõÙక్ శర్మ (సి) కోలర్ (బి) బౌల్ట్ 12; త్రిపాఠి (సి) చహల్ (బి) బౌల్ట్ 37; మార్క్రమ్ (సి) చహల్ (బి) బౌల్ట్ 1; క్లాసెన్ (బి) సందీప్ 50; నితీశ్ రెడ్డి (సి) చహల్ (బి) అవేశ్ 5; సమద్ (బి) అవేశ్ 0; షహబాజ్ (సి) జురేల్ (బి) అవేశ్ 18; కమిన్స్ (నాటౌట్) 5; ఉనాద్కట్ (రనౌట్) 5; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 175. వికెట్ల పతనం: 1–13, 2–55, 3–57, 4–99, 5–120, 6–120, 7–163, 8–170, 9–175. బౌలింగ్: బౌల్ట్ 4–0–45–3, అశి్వన్ 4–0–43–0, సందీప్ 4–0–25–2, అవేశ్ 4–0–27–3, చహల్ 4–0–34–0. రాజస్తాన్ రాయల్స్ ఇన్నింగ్స్: జైస్వాల్ (సి) సమద్ (బి) షహబాజ్ 42; టామ్ కోలర్ (సి) త్రిపాఠి (బి) కమిన్స్ 10; సామ్సన్ (సి) మార్క్రమ్ (బి) అభిõÙక్ 10; పరాగ్ (సి) అభిషేక్ (బి) షహబాజ్ 6; జురేల్ (నాటౌట్) 56; అశ్విన్ (సి) క్లాసెన్ (బి) షహబాజ్ 0; హెట్‌మైర్ (బి) అభిషేక్ 4; పావెల్ (సి) అభిõÙక్ (బి) నటరాజన్ 6; బౌల్ట్ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 139. వికెట్ల పతనం: 1–24, 2–65, 3–67, 4–79, 5–79, 6–92, 7–124. బౌలింగ్: భువనేశ్వర్ 3–0–33–0, కమిన్స్ 4–0–30–1, నటరాజన్ 3–0–13–1, ఉనాద్కట్ 1–0–5–0, షహబాజ్ 4–0–23–3, అభిషేక్ 4–0–24–2, మార్క్రమ్ 1–0–10–0.2: డెక్కన్ చార్జర్స్ జట్టు తర్వాత ఐపీఎల్ టోరీ్నలో గత సీజన్లో పాయింట్ల పట్టికలో అట్టడున నిలిచి తర్వాతి సీజన్లో ఫైనల్‌కు చేరిన రెండో జట్టుగా సన్‌రైజర్స్ హైదరాబాద్ నిలిచింది. 2023 లో సన్‌రైజర్స్ చివరి స్థానంలో నిలిచింది. 2008 తొలి సీజన్లో డెక్కన్ చార్జర్స్ పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలో నిలిచి 2009లో అగ్రస్థానంలో నిలవడంతోపాటు విజేతగా కూడా అవతరించింది.3: ఐపీఎల్ టోర్నీలో సన్‌రైజర్స్ ఫైనల్‌కు చేరడం ఇది మూడోసారి. 2016లో తొలిసారి విజేత అయింది. 2018లో రన్నరప్‌గా నిలిచింది. -
SRH vs RR: అతడి మీదే భారం.. సన్‌రైజర్స్ గెలవాలంటే..
ఐపీఎల్-2024 ఫైనల్ రేసులో మరో పోరుకు రంగం సిద్ధమైంది. క్వాలిఫయర్-1లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను ఓడించి కోల్‌కతా నైట్ రైడర్స్ ఇప్పటికే తుదిపోరుకు అర్హత సాధించిన విషయం తెలిసిందే.ఈ క్రమంలో క్వాలిఫయర్-2 రూపంలో మరో అవకాశం దక్కించుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ శుక్రవారం రాజస్తాన్ రాయల్స్‌తో తాడోపేడో తేల్చుకోనుంది. చెన్నైలోని చెపాక్ స్టేడియంలో ఇరు జట్ల మధ్య ఈ కీలక మ్యాచ్ జరుగనుంది.ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ ఓపెనర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు గురించి కీలక వ్యాఖ్యలు చేశాడు. ఓపెనర్లు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ రాణిస్తే తప్ప ఈ మ్యాచ్‌లో ఎస్ఆర్హెచ్ ముందంజ వేయలేదని అభిప్రాయపడ్డాడు.సన్‌రైజర్స్ బలం వాళ్ల ఓపెనర్లేఈ మేరకు.. ‘‘సన్‌రైజర్స్ బలం వాళ్ల ఓపెనర్లే. వీరిద్దరూ గనుక బ్యాట్ ఝులిపిస్తే ఆపటం ఎవరితరం కాదు. క్రీజులో ఒక్కసారి పాతుకుపోతే తొలి 8- 10 ఓవర్లలోపే మ్యాచ్ ఫలితాన్ని తమకు అనుకూలంగా మార్చేస్తారు.ముఖ్యంగా ట్రావిస్ హెడ్ దంచికొడితే తిరుగే ఉండదు. అయితే, గత రెండు మ్యాచ్‌లలో వరుసగా అతడు డకౌట్ అయ్యాడు. అయినప్పటికీ తిరిగి పుంజుకోగలడనే ఆశిద్దాం.ఈసారి వాళ్లు అతడి ఆటకు చెక్ పెట్టేందుకుఈ సీజన్లో ట్రావిస్ హెడ్ గణాంకాలు అద్భుతంగా ఉన్నాయి. గత మ్యాచ్‌లో అవుట్ చేసినప్పటికీ ట్రెంట్ బౌల్ట్ అతడిని పెద్దగా ఇబ్బంది పెట్టలేదు. రియాన్ పరాగ్ క్యాచ్ వదిలేయడంతో లైఫ్ పొందిన హెడ్ బాగా ఆడాడు.అర్ధ శతకం కూడా సాధించాడు. అయితే, ఈసారి వాళ్లు అతడి ఆటకు చెక్ పెట్టేందుకు మరింత గట్టిగానే ప్రయత్నం చేయడం ఖాయం. ట్రావిస్ హెడ్ గనుక ఈసారి పరుగులు రాబట్టకపోతే సన్‌రైజర్స్ ముందుకు సాగలేదు’’ అని ఆకాశ్ చోప్రా పేర్కొన్నాడు.ట్రావిస్ హెడ్‌తో పాటు అభిషేక్ శర్మ కూడా రాణిస్తే మాత్రం రాజస్తాన్ బౌలర్లు వాళ్లను ఆపలేరని పేర్కొన్నాడు. ఇక ఈ సీజన్లో దుమ్ములేపుతున్న అభిషేక్ శర్మ త్వరలోనే టీమిండియాకు ఆడటం ఖాయమని ఆకాశ్ చోప్రా ఈ సందర్భంగా జోస్యం చెప్పాడు.వరుసగా రెండుసార్లు డకౌట్‌కాగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఓపెనర్లు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, హెన్రిచ్ క్లాసెన్ ప్రధాన బలం అన్న విషయం తెలిసిందే. అయితే, గత రెండు మ్యాచ్‌లలో హెడ్ లెఫ్టార్మ్ సీమర్ల చేతికి చిక్కి పరుగుల ఖాతా తెరవకుండానే నిష్క్రమించాడు. ఈ క్రమంలో క్వాలిఫయర్-2లో రాజస్తాన్ సీమర్ ట్రెంట్ బౌల్ట్ నుంచి అతడికి గండం పొంచి ఉంది. కాగా ఈ సీజన్లో హెడ్ ఇప్పటి వరకు 13 ఇన్నింగ్స్ ఆడి 199.62 స్ట్రైక్‌రేటుతో 533 పరుగులు సాధించాడు.చదవండి: T20: బంగ్లాదేశ్‌కు ఊహించని షాకిచ్చిన పసికూన.. సిరీస్ సొంతం -
IPL 2024: ‘ఫైనల్’ వేటలో...
ఓవరాల్‌గా ఆరుసార్లు 200కుపైగా స్కోర్లు... వీటిలో గత ఏడాది వరకు ఉన్న అత్యుత్తమ స్కోరును అధిగమిస్తూ మూడుసార్లు 250కు పైగా పరుగులు... పవర్‌ప్లేలో ఏ జట్టుకూ సాధ్యం కాని విధంగా రెండుసార్లు 100కు పైగా స్కోర్లు... ముగ్గురు ప్రధాన బ్యాటర్లు కలిపి ఏకంగా 106 సిక్సర్లు... ఈ సీజన్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ మెరుపు బ్యాటింగ్ ప్రదర్శన ఇది. ఈ జోరులో ప్లే ఆఫ్స్‌కు దూసుకొచి్చన జట్టు తొలి క్వాలిఫయర్‌లో కాస్త తడబడింది. అయితే ఆరేళ్ల తర్వాత మళ్లీ ఫైనల్ చేరేందుకు ఆ జట్టుకు మరో అవకాశం లభించగా, రాజస్తాన్ రాయల్స్ రూపంలో ఎదురుగా ప్రత్యర్థి ఉంది. నాణ్యమైన బౌలింగ్‌తో రాజస్తాన్ ఎలాంటి ప్రత్యర్థినైనా నిలువరించగలుగుతోంది. ఈ నేపథ్యంలో ఇరు జట్ల మధ్య రెండో క్వాలిఫయర్ మ్యాచ్ ఆసక్తి రేపుతోంది.చెన్నై: ఐపీఎల్–17 సీజన్ తుది పోరులో కోల్‌కతా నైట్‌రైడర్స్ ప్రత్యరి్థని నిర్ణయించే క్వాలిఫయర్–2 సమరానికి రంగం సిద్ధమైంది. పాయింట్ల పట్టికలో రెండు, మూడు స్థానాల్లో నిలిచిన హైదరాబాద్, రాజస్తాన్ జట్ల మధ్య చెపాక్ మైదానంలో ఈ పోరు జరగనుంది. ఈ సీజన్లో ఇరు జట్ల తలపడిన ఏకైక మ్యాచ్‌లో సన్‌రైజర్స్ ఒక పరుగు తేడాతో నెగ్గింది. టోర్నీలో దూకుడైన బ్యాటింగ్‌తో హైదరాబాద్ శాసించగా... రాజస్తాన్ విజయాల్లో బౌలింగ్ కీలకంగా నిలిచింది. ఇరు జట్లు తాజా సీజన్లో చెన్నై వేదికగా ఒక్కో మ్యాచ్ ఆడాయి. హైదరాబాద్ 134, రాజస్తాన్ 141 పరుగులు మాత్రమే చేసి చెన్నై చేతిలో ఓటమి పాలవడం విశేషం. మార్క్రమ్ను ఆడిస్తారా! కోల్‌కతాతో తొలి క్వాలిఫయర్‌లో హైదరాబాద్ బ్యాటింగ్ పూర్తిగా విఫలమైంది. హెడ్ వరుసగా రెండోసారి డకౌట్ కాగా, అభిõÙక్ శర్మ కూడా విఫలం కావడం జట్టుపై ప్రభావం చూపింది. క్లాసెన్ మాత్రం తన ఫామ్ కొనసాగించాడు. ఓపెనర్లు లీగ్ మ్యాచ్ తరహాలో తమ జోరును అందిపుచ్చుకుంటే జట్టు మరోసారి భారీ స్కోరుకు అవకాశం ఉంటుంది. ఇతర బ్యాటర్లు రాహుల్ త్రిపాఠి, నితీశ్ కుమార్ రెడ్డి, అబ్దుల్ సమద్ కూడా సహకరించాల్సి ఉంది. అయితే బ్యాటింగ్‌ను పటిష్టం చేసేందుకు నాలుగో విదేశీ ఆటగాడిగా మార్క్రమ్ లేదా గ్లెన్ ఫిలిప్స్‌లలో ఒకరిని రైజర్స్ ఆడించవచ్చు. పెద్దగా ప్రభావం చూపలేని విజయకాంత్ స్థానంలో లెగ్ స్పిన్నర్ మయాంక్ మార్కండేను తీసుకొని ‘ఇంపాక్ట్’ ద్వారా మరో బ్యాటర్‌ను ఆడించే అవకాశం ఉంది. చెపాక్ పిచ్‌పై షహబాజ్‌తో పాటు మరో స్పిన్నర్ జట్టుకు అవసరం. పేస్ బౌలింగ్‌లో భువనేశ్వర్, కమిన్స్‌లతో పాటు సొంత మైదానంలో ఆడుతున్న నటరాజన్ కీలకం అవుతారు. మార్పుల్లేకుండా... రాజస్తాన్ మాత్రం బుధవారం ఆర్సీబీని ఓడించిన టీమ్‌లో ఎలాంటి మార్పులు చేయకపోవచ్చు. స్పిన్‌కు అనుకూలిస్తే ఒక పేసర్‌ను తప్పించి కేశవ్‌ను ఆడించాలని భావించినా... జట్టు విదేశీ కూర్పుపై ప్రభావం పడవచ్చు. బౌల్ట్ కీలక బౌలర్ కాగా ఓపెనర్‌గా టామ్ కోలర్ ఖాయం. లోయర్ మిడిలార్డర్లో హెట్‌మైర్, పావెల్ల మెరుపు బ్యాటింగ్‌ను కోల్పోయి పరిస్థితి రాజస్తాన్ తెచ్చుకోదు. కాబట్టి ఇద్దరు అగ్రశ్రేణి స్పిన్నర్లు అశి్వన్, చహల్ జట్టు భారం మోస్తారు. ముఖ్యంగా ఓనమాలు నేర్చుకున్న మైదానంలో అశి్వన్ చెలరేగితే హైదరాబాద్‌కు కష్టాలు తప్పవు. రాయల్స్ బ్యాటింగ్‌లో కాస్త దూకుడు లోపించింది. ఎలిమినేటర్‌లో కూడా అది కనిపించింది కానీ లక్ష్యం చిన్నది కావడంతో దాని ప్రభావం కనపడలేదు. ముఖ్యంగా సామ్సన్ వరుసగా మూడు మ్యాచ్‌లలో విఫలమయ్యాడు. రియాన్ పరాగ్ మాత్రమే నిలకడగా ఆడుతుండగా, జురేల్ కూడా రాణించడం లేదు. తుది జట్ల వివరాలు (అంచనా) హైదరాబాద్: కమిన్స్ (కెప్టెన్), హెడ్, అభిషేక్, త్రిపాఠి, నితీశ్ రెడ్డి, క్లాసెన్, సమద్, షహబాజ్, భువనేశ్వర్, నటరాజన్, మార్కండే, మార్క్రమ్. రాజస్తాన్: సామ్సన్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, టామ్ కోలర్, పరాగ్, జురేల్, హెట్‌మైర్, పావెల్, అశ్విన్, బౌల్ట్, అవేశ్ ఖాన్, సందీప్ శర్మ, చహల్.పిచ్, వాతావరణం చెన్నైలో వేడి చాలా ఎక్కువగా ఉంది. అయితే సాయంత్రం మంచు ప్రభావం కూడా ఉండటంతో టాస్ గెలిచిన జట్టు ఫీల్డింగ్ ఎంచుకోవచ్చు. ఈ సీజన్లో జరిగిన 7 మ్యాచ్‌లలో 5 సార్లు తర్వాత బ్యాటింగ్ చేసిన జట్టే నెగ్గింది. 19: ఐపీఎల్లో ఇప్పటి వరకు సన్‌రైజర్స్, రాజస్తాన్ రాయల్స్ జట్లు ముఖాముఖిగా 19 సార్లు తలపడ్డాయి. 10 మ్యాచ్‌ల్లో హైదరాబాద్... 9 మ్యాచ్‌ల్లో రాజస్తాన్ గెలుపొందాయి. ఈ సీజన్లో ఈ రెండు జట్లు ఒకసారి పోటీపడగా సన్‌రైజర్స్ ఒక పరుగు తేడాతో నెగ్గింది. రాజస్తాన్‌పై సన్‌రైజర్స్ అత్యధిక స్కోరు 217, అత్యల్ప స్కోరు 127 కాగా... సన్‌రైజర్స్‌పై రాజస్తాన్ అత్యధిక స్కోరు 220, అత్యల్ప స్కోరు 102. -
SRH vs RR: ‘సన్‌రైజర్స్ కాదు!.. రాజస్తాన్‌కే గెలిచే ఛాన్స్’
ఐపీఎల్-2024 ఆరంభం నుంచి వరుస విజయాలు సాధించిన రాజస్తాన్ రాయల్స్.. ఆ తర్వాత చతికిల పడింది. వరుస ఓటములతో విమర్శలు మూటగట్టుకుంది. ప్లే ఆఫ్స్ చేరినప్పటికీ పాయింట్ల పట్టికలో మూడో స్థానానికే పరిమితమైంది.ఈ క్రమంలో అమీ తుమీ తేల్చుకోవాల్సిన ఎలిమినేటర్ మ్యాచ్‌లోనూ రాజస్తాన్ గెలిచే అవకాశాల్లేవంటూ విశ్లేషకులు పెదవి విరిచారు. స్టార్ ఓపెనర్ జోస్ బట్లర్ స్వదేశానికి వెళ్లిపోవడం.. యశస్వి జైస్వాల్ స్థాయికి తగ్గట్లు రాణించకపోవడం.. బౌలింగ్ విభాగంలోనూ లోపాలు అంటూ రాజస్తాన్‌ను విమర్శించారు.ఆర్సీబీని చిత్తుచేసి.. క్వాలిఫయర్-2లోఇక సునిల్ గావస్కర్ వంటి దిగ్గజాలు సైతం ఆర్సీబీ- రాజస్తాన్ వార్ వన్‌సైడ్ అంటూ బెంగళూరు జట్టుకు మద్దతు పలికారు. ఈ క్రమంలో రాజస్తాన్ ఆర్సీబీకి ఊహించని షాకిచ్చింది. అహ్మదాబాద్‌లో బుధవారం నాటి మ్యాచ్‌లో బెంగళూరును నాలుగు వికెట్ల తేడాతో ఓడించి క్వాలిఫయర్-2కు అర్హత సాధించింది.ఫైనల్ రేసులో నిలిచే క్రమంలో చెన్నై వేదికగా శుక్రవారం సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో తలపడేందుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.రాజస్తాన్ రాయల్స్ ఫేవరెట్సన్రైజర్స్- రాజస్తాన్ మ్యాచ్ గురించి మాట్లాడుతూ.. ‘‘ఈ మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ ఫేవరెట్‌గా కనిపిస్తోంది. వాళ్లు ఇక్కడిదాకా చేరుకున్న తీరు అద్బుతం.చెన్నై పిచ్ పరిస్థితులు కూడా రాజస్తాన్ స్పిన్నర్లకు బాగా నప్పుతాయి. కాబట్టి ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ చేసేటపుడు ఆటగాళ్లు తమ మెదళ్లను బాగా ఉపయోగించాలి.అది హైదరాబాద్ వికెట్ కాదు. చెన్నైలో మీరు వికెట్లు తీయలేరు. అందుకే బ్యాటింగ్‌పై దృష్టి సారించాలి. నిజానికి చెన్నై పిచ్ మీద పరుగులు రాబట్టాలంటే కచ్చితంగా ఆచితూచి ఆడుతూ బ్యాట్స్‌మన్‌షిప్ చూపాలి’’ అని అంబటి రాయుడు స్టార్ స్పోర్ట్స్ షోలో తన అభిప్రాయాలు పంచుకున్నాడు.ఆరెంజ్ ఆర్మీ ఫ్యాన్స్ ఫైర్అయితే, ఆరెంజ్ ఆర్మీ ఫ్యాన్స్ రాయుడు వ్యాఖ్యలను జీర్ణించుకోలేకపోతున్నారు. సన్‌రైజర్స్ ఆటగాళ్లను తక్కువ చేసి మాట్లాడటం సరికాదని మండిపడుతున్నారు. రాజస్తాన్ మాదిరే సన్‌రైజర్స్ కూడా ఆది నుంచి దూకుడుగా ఆడుతూ ఇక్కడిదాకా వచ్చిందని పేర్కొంటున్నారు.హైదరాబాద్ జట్టులోనూ షాబాజ్ అహ్మద్, మయాంక్ మార్కండే, విజయకాంత్ వియస్కాంత్, వాషింగ్టన్ సుందర్ వంటి స్పిన్నర్లు ఉన్నారని గుర్తు చేస్తున్నారు. అనుభవం లేకపోయినా మొమెంటమ్ తీసుకురావడంలో వీళ్లు సఫలమవుతారంటూ అంబటి రాయుడుకి కౌంటర్లు వేస్తున్నారు. కాగా రాజస్తాన్ రాయల్స్ జట్టులో చెన్నై దిగ్గజం రవిచంద్రన్ అశ్విన్‌తో పాటు యజువేంద్ర చహల్ రూపంలో ఇద్దరు మేటి స్పిన్నర్లు ఉన్న విషయం తెలిసిందే.చదవండి: Hardik Pandya: భార్యతో హార్దిక్ పాండ్యాకు విభేదాలు?.. అతడి వల్లే అంటూ నటాషా పోస్ట్ వైరల్ -
KKR Vs SRH: కోల్‌కతాకే ‘ఫైనల్’ సత్తా
ఈ సీజన్లో 7 సార్లు ముందుగా బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు నాలుగుసార్లు 200 పైచిలుకు స్కోర్లను అవలీలగా చేసింది. ఎనిమిదోసారి మాత్రం ‘సన్’ బృందం రైజింగ్ కాలేదు. కీలకమైన ప్లే ఆఫ్స్‌లో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్ పూర్తి ఓవర్లు ఆడకుండానే 159 పరుగులకే కుప్పకూలింది. రెండో క్వాలిఫయర్ ఉందన్న ధీమానో లేదంటే ఓడినా పోయేదేం లేదన్న అలసత్వమో గానీ హైదరాబాద్ బ్యాటర్లు పేలవ ప్రదర్శనతో కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు సులువుగా ఫైనల్ దారి చూపారు. ఆద్యంతం పక్కా ప్రణాళికతో ఆడిన కోల్‌కతా ముందుగా బంతితో సన్‌రైజర్స్‌ను కట్టడి చేసి... ఆ తర్వాత బ్యాట్‌తో మెరిపించి 160 పరుగుల లక్ష్యాన్ని 13.4 ఓవర్లలోనే ఛేదించేసి దర్జాగా నాలుగోసారి ఐపీఎల్ టోర్నీలో ఫైనల్లోకి దూసుకెళ్లింది. అహ్మదాబాద్: ‘ప్లే ఆఫ్స్’ దశ వరకు తగిన ప్రదర్శన చేసిన కోల్‌కతా నైట్‌రైడర్స్ (కేకేఆర్) ఇంకో అవకాశం కోసం ఎదురుచూడకుండా ఐపీఎల్ 17వ సీజన్లో నేరుగా ఫైనల్‌కు అర్హత సంపాదించింది. మంగళవారం జరిగిన తొలి క్వాలిఫయర్‌లో కేకేఆర్ 8 వికెట్ల తేడాతో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను చిత్తుగా ఓడించింది. లీగ్ దశలో భీకరమైన ఫామ్ కనబరిచిన సన్‌రైజర్స్ మాత్రం కీలకమైన దశలో నిర్లక్ష్యంగా ఆడి ఓడింది. ఫైనల్ బెర్త్ కోసం ఆ జట్టు రెండో క్వాలిఫయర్ కోసం నిరీక్షించనుంది. టాస్ నెగ్గి తొలుత బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్ 19.3 ఓవర్లలో 159 పరుగులకే ఆలౌటైంది. రాహుల్ త్రిపాఠి (35 బంతుల్లో 55; 7 ఫోర్లు, 1 సిక్స్) రాణించగా, హెన్రిచ్ క్లాసెన్ (21 బంతుల్లో 32; 3 ఫోర్లు, 1 సిక్స్) మెరుగ్గా ఆడాడు. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ మిచెల్ స్టార్క్ 3 వికెట్లు, వరుణ్ చక్రవర్తి 2 వికెట్లు తీశారు. అనంతరం కోల్‌కతా 13.4 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 164 పరుగులు చేసి గెలిచింది. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (24 బంతుల్లో 58 నాటౌట్; 5 ఫోర్లు, 4 సిక్స్‌లు), వెంకటేశ్ అయ్యర్ (28 బంతుల్లో 51 నాటౌట్; 5 ఫోర్లు, 4 సిక్స్‌లు) సన్‌రైజర్స్ బౌలర్ల భరతం పట్టి మూడో వికెట్‌కు కేవలం 44 బంతుల్లో 97 పరుగుల భాగస్వామ్యం జోడించడం విశేషం. గతంలో కోల్‌కతా జట్టు 2012, 2014లలో టైటిల్ సాధించి, 2021లో రన్నరప్‌గా నిలిచింది. ఆది నుంచే కష్టాల్లో... అసలైన మ్యాచ్‌లో స్టార్క్ బంతితో నిప్పులు చెరిగాడు. రెండో బంతికే ట్రవిస్ హెడ్ (0)ను క్లీన్ బౌల్డ్ చేశాడు. అభిషేక్ శర్మ (3)ను కూడా సింగిల్ డిజిట్‌కే వైభవ్ పెవిలియన్ చేర్చాడు. ఆ తర్వాత ఫామ్‌లో ఉన్న నితీశ్ కుమార్ రెడ్డి (9), షహబాజ్ (0)లను స్టార్క్ వరుస బంతుల్లో అవుట్ చేశాడు. దాంతో సన్‌రైజర్స్ 39 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఏడో ఓవర్లో జట్టు స్కోరు 50కి చేరింది.మెల్లిగా ఈ కష్టాల నుంచి గట్టెక్కుతున్న సమయంలో 8, 9, 10 ఓవర్లు సన్‌రైజర్స్ ఇన్నింగ్స్‌కు ఊరటనిచ్చాయి. హర్షిత్ వేసిన 8వ ఓవర్లో రాహుల్ త్రిపాఠి సిక్సర్‌తో 12 పరుగులొచ్చాయి. నరైన్ తొమ్మిదో ఓవర్లో త్రిపాఠి బౌండరీ బాదితే... క్లాసెన్ 6, 4 కొట్టడంతో 18 పరుగుల్ని రాబట్టుకుంది. రసెల్ పదో ఓవర్లో ఇద్దరు చెరో ఫోర్ కొట్టడంతో మరో 12 పరుగులు రావడంతో సగం ఓవర్లు ముగిసేసరికి సన్‌రైజర్స్ 92/4 స్కోరు చేసింది. వరుణ్ దెబ్బతో.... ఇంకేం ఓవర్‌కు 9.2 రన్‌రేట్‌తో గాడిలో పడుతోందనుకుంటున్న తరుణంలో స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి దెబ్బకొట్టాడు. అతను వేసిన 11వ ఓవర్లో త్రిపాఠి బౌండరీతో జట్టు స్కోరు 100కు చేరింది. కానీ ఆఖరి బంతికి క్లాసెన్ అవుటయ్యాడు. దీంతో ఐదో వికెట్‌కు 62 పరుగుల విలువైన భాగస్వామ్యానికి తెరపడింది. తర్వాత కాసేపటికే 5 పరుగుల వ్యవధిలోనే త్రిపాఠి, సన్విర్ (0), సమద్ (16), భువనేశ్వర్ (0) ఇలా నాలుగు వికెట్లను కోల్పోయిన సన్‌రైజర్స్ 126/9 స్కోరు వద్ద ఆలౌట్‌కు సిద్ధమైపోయింది. ఈ దశలో కెపె్టన్ కమిన్స్ (24 బంతుల్లో 30; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) మెరుపులతో 150 పైచిలుకు స్కోరు చేయగలిగింది. అదరగొట్టిన ‘అయ్యర్’లు బౌలింగ్‌లోనూ హైదరాబాద్ తేలిపోవడం, ఫీల్డర్లు క్యాచ్‌లు నేలపాలు చేయడంతో నైట్‌రైడర్స్‌కు లక్ష్యఛేదన మరింత సులువైంది. ఓపెనర్లు గుర్బాజ్ (14 బంతుల్లో 23; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), సునీల్ నరైన్ (16 బంతుల్లో 21; 4 ఫోర్లు) వేగంగా ఆడే క్రమంలో అవుటయ్యారు. 67 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత ఒక్క వికెట్టు పడలేదు. వెంకటేశ్ అయ్యర్, శ్రేయస్ అయ్యర్ వచ్చిన లైఫ్‌లను సద్వినియోగం చేసుకొని హైదరాబాద్ బౌలర్లపై విరుచుకుపడ్డారు. దీంతో 9.4 ఓవర్లలోనే కోల్‌కతా స్కోరు వందకు చేరింది. లక్ష్యంవైపు చకచకా పరుగులు తీసింది. వెంకటేశ్ 28 బంతుల్లో, శ్రేయస్ 23 బంతుల్లో అర్ధసెంచరీలు పూర్తి చేసుకున్నారు. వెంకటేశ్, శ్రేయస్ ధాటికి కోల్‌కతా 38 బంతులు మిగిలుండగానే విజయతీరానికి చేరింది. స్కోరు వివరాలు సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్: హెడ్ (బి) స్టార్క్ 0; అభిõÙక్ శర్మ (సి) రసెల్ (బి) వైభవ్ 3; త్రిపాఠి (రనౌట్) 55; నితీశ్ కుమార్ రెడ్డి (సి) గుర్బాజ్ (బి) స్టార్క్ 9; షహబాజ్ (బి) స్టార్క్ 0; క్లాసెన్ (సి) రింకూ సింగ్ (బి) వరుణ్ 32; సమద్ (సి) శ్రేయస్ (బి) హర్షిత్ 16; సన్వీర్ (బి) నరైన్ 0; కమిన్స్ (సి) గుర్బాజ్ (బి) రసెల్ 30; భువనేశ్వర్ (ఎల్బీడబ్ల్యూ) (బి) వరుణ్ 0; విజయకాంత్ (నాటౌట్) 7; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (19.3 ఓవర్లలో ఆలౌట్) 159. వికెట్ల పతనం: 1–0, 2–13, 3–39, 4–39, 5–101, 6–121, 7–121, 8–125, 9–126, 10–159. బౌలింగ్: స్టార్క్ 4–0–34–3, వైభవ్ 2–0–17–1, హర్షిత్ 4–0–27–1, నరైన్ 4–0–40–1, రసెల్ 1.3–0–15–1, వరుణ్ చక్రవర్తి 4–0–26–2. కోల్‌కతా నైట్‌రైడర్స్ ఇన్నింగ్స్: గుర్బాజ్ (సి) విజయకాంత్ (బి) నటరాజన్ 23; నరైన్ (సి) విజయకాంత్ (బి) కమిన్స్ 21; వెంకటేశ్ అయ్యర్ (నాటౌట్) 51; శ్రేయస్ అయ్యర్ (నాటౌట్) 58; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం (13.4 ఓవర్లలో 2 వికెట్లకు) 164. వికెట్ల పతనం: 1–44, 2–67. బౌలింగ్: భువనేశ్వర్ 3–0–28–0, కమిన్స్ 3–0–38–1, నటరాజన్ 3–0–22–1, విజయకాంత్ 2–0–22–0, హెడ్ 1.4–0–32–0, నితీశ్ రెడ్డి 1–0–13–0. -
SRH Vs KKR: పాపం రాహుల్ త్రిపాఠి.. షాక్‌లో కావ్య మారన్! వీడియో వైరల్
ఐపీఎల్-2024లో భాగంగా అహ్మదాబాద్ వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరుగుతున్న క్వాలిఫయర్-1లో సనరైజర్స్ హైదరాబాద్ ఆటగాడు రాహుల్ త్రిపాఠి ఇన్నింగ్స్ ఆడాడు. విధ్వంసకర ఓపెనర్లు ట్రావిస్ హెడ్, అభిషేక్ శరక్మ విఫలమైన చోట.. త్రిపాఠి తన బ్యాట్‌కు పనిచెప్పాడు. ఐదో వికెట్‌కు క్లాసెన్‌తో కలిసి 62 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఓవరాల్‌గా 35 బంతులు ఎదుర్కొన్న త్రిపాఠి 7 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 55 పరుగులు చేశాడు.అయ్యో రాహుల్..అయితే ఈ మ్యాచ్‌లో మంచి టచ్‌లో కన్పించిన త్రిపాఠిని దురదృష్టం వెంటాడింది. అనూహ్య రీతిలో త్రిపాఠి రనౌటయ్యాడు. ఎస్ఆర్హెచ్ ఇన్నింగ్స్ 14 ఓవర్ వేసిన సునీల్ నరైన్ బౌలింగ్‌లో తొలి బంతిని సమద్ భారీ సిక్స్ మలిచాడు. అదే ఓవర్లో రెండో బంతిని సమద్ పాయింట్ దిశగా షాట్ ఆడాడు. పాయింట్లో ఉన్న రస్సెల్ అద్బుతంగా డైవ్ చేస్తూ బంతిని ఆపాడు. అయితే షాట్ ఆడిన వెంటనే సమద్ నాన్‌స్ట్రైక్‌లో ఉన్న రాహుల్ త్రిపాఠితో ఎటువంటి సమన్వయం లేకుండా సింగిల్ కోసం ప్రయత్నించాడు. త్రిపాఠి మాత్రం బంతిని చూస్తూ మిడిల్ పిచ్‌లోనే ఉండిపోయాడు. ఈ క్రమంలో రస్సెల్ బంతిని వికెట్ కీపర్ గుర్బాజ్ అందజేయగా.. అతడు స్టంప్స్‌ను గిరాటేశాడు. కాగా ఔటైన అనంతరం త్రిపాఠి భావోద్వేగానికి లోనయ్యాడు. పెవిలియన్‌కు వెళ్లే క్రమంలో మెట్లపై కూర్చోని కన్నీరు పెట్టుకున్నాడు. ఎస్ఆర్హెచ్ ఓనర్ కావ్యా మారన్ సైతం షాక్‌కు గురైంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. Dre-Russ produces a piece of magic 🔥💜#IPLonJioCinema #TATAIPL #KKRvSRH #TATAIPLPlayoffs #AndreRussell pic.twitter.com/eaZRQNkes5— JioCinema (@JioCinema) May 21, 2024 -
KKR Vs SRH Photos: ఓ వైపు టెన్షన్.. మరోవైపు ఉత్సాహం: స్టేడియంలో తళుక్కుమన్న షారుఖ్ (ఫొటోలు)
-
SRH Vs KKR: ఫైనల్ చేరడమే మిగిలింది: కమిన్స్ పోస్ట్ వైరల్
ఐపీఎల్-2024లో సన్‌రైజర్స్ హైదరాబాద్ సంచలన ఆట తీరుతో ఎన్నో రికార్డులు బద్దలు కొట్టింది. క్యాష్ రిచ్ లీగ్ చరిత్రలో అత్యధిక స్కోరు(287) నమోదు చేసిన జట్టుగా చరిత్ర సృష్టించింది. గత మూడేళ్లుగా పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానం కోసం పోటీ పడ్డ దుస్థితి నుంచి.. ఈసారి ఏకంగా ఫైనల్ రేసులో నిలిచే స్థాయికి చేరుకుంది. కనీసం ప్లే ఆఫ్స్ చేరినా చాలంటూ ఆరెంజ్ ఆర్మీ అభిమానులు ఎదురుచూస్తున్న వేళ.. విధ్వంసకర ఆట తీరుతో ఏకంగా క్వాలిఫయర్-1కు అర్హత సాధించింది. ఇంకొక్క ఆటంకం దాటితే చాలు.. ఐపీఎల్ పదిహేడో ఎడిషన్‌లో ఫైనల్ చేరిన తొలి జట్టుగా అర్హత సాధించే అవకాశం ముంగిట నిలిచింది. ప్రధాన కారణాలు ఇవేఇక ఈ సీజన్లో సన్‌రైజర్స్ అద్భుత విజయాలకు ప్రధాన కారణం విధ్వంసకర బ్యాటింగ్‌తో పాటు కెప్టెన్ ప్యాట్ కమిన్స్ వ్యూహాలు, కోచ్ డానియల్ వెటోరీ ప్రణాళికలు అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా సారథిగా కమిన్స్ జట్టును గెలుపు బాట పట్టించడంలో పూర్తిగా విజయవంతమయ్యాడు.ప్రత్యర్థి జట్ల వ్యూహాలను చిత్తు చేస్తూ మైదానంలో ఎప్పటికప్పుడు సరికొత్త ప్రణాళికలతో ముందుకు సాగి సన్‌రైజర్స్ విన్‌రైజర్స్‌గా మార్చడంలో సఫలమయ్యాడు ఈ పేస్ బౌలర్. ఒత్తిడి నెలకొన్న సమయాల్లోనూ ఏమాత్రం సహనం కోల్పోకుండా ఆటగాళ్లకు అండగా నిలుస్తూ ఫలితాలు రాబడుతున్నాడు. ఫ్రాంఛైజీ తన కోసం ఖర్చు పెట్టిన రూ. 20.50 కోట్లకు పూర్తి న్యాయం చేస్తూ పైసా వసూల్ ప్రదర్శన ఇస్తున్నాడు.మరో అవకాశం కూడా ఉందిఇక కమిన్స్ సారథ్యంలో ఆకాశమే హద్దుగా చెలరేగుతున్న సన్‌రైజర్స్ క్వాలిఫయర్-1లోనూ ఇదే జోష్ కనబరిస్తే.. టైటిల్‌కు కేవలం ఒక్క అడుగు దూరంలో నిలుస్తుంది.ఒకవేళ కేకేఆర్‌తో ఈ మ్యాచ్‌లో ఓడినా క్వాలిఫయర్-2 రూపంలో కమిన్స్ బృందానికి మరో అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఎలా చూసినా ఈసారి సన్‌రైజర్స్‌కు ఫైనల్ చేరేందుకు సానుకూలతలే ఎక్కువగా కనిపిస్తున్నాయంటూ ఆరెంజ్ ఆర్మీ ఫ్యాన్స్ నెట్టింట సందడి చేస్తున్నారు.ఫైనల్స్‌లో అడుగుపెట్టడమే తరువాయిఈ నేపథ్యంలో సన్‌రైజర్స్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ఇన్‌స్టా పోస్ట్ వైరల్‌గా మారింది. కాగా సొంతమైదానం ఉప్పల్‌లో సన్‌రైజర్స్ ఆదివారం.. ఈ సీజన్ లీగ్ దశలో తమ ఆఖరి మ్యాచ్ ఆడింది. పంజాబ్ కింగ్స్‌పై నాలుగు వికెట్ల తేడాతో గెలుపొంది పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరుకుంది.అనంతరం కేకేఆర్- రాజస్తాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ రద్దు కావడంతో రెండో స్థానాన్ని మరింత పదిలం చేసుకుని క్వాలిఫయర్-1కు అర్హత సాధించింది. ఈ నేపథ్యంలో కమిన్స్ స్పందిస్తూ.. ‘‘ఉప్పల్‌లో మరో అద్భుతమైన రోజు. మాకు మద్దతుగా నిలిచినందుకు ధన్యవాదాలు. ఇక మనం ఫైనల్స్‌లో అడుగుపెట్టడమే తరువాయి’’ అని అభిమానులను ఉత్సాహపరిచాడు.ఈసారి కచ్చితంగా తుదిపోరుకు అర్హత సాధిస్తామని ఈ సందర్భంగా కమిన్స్ ధీమా వ్యక్తం చేశాడు. కాగా కేకేఆర్- సన్‌రైజర్స్ మధ్య క్వాలిఫయర్-1కు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదిక. ఇదే గడ్డపై వన్డే వరల్డ్‌కప్-2023 ఫైనల్లో ప్యాట్ కమిన్స్ సారథ్యంలోని ఆస్ట్రేలియా విజేతగా నిలిచిన విషయం తెలిసిందే.చదవండి: KKR vs SRH: ప్రమాదకారి.. ఫైనల్ చేరే తొలి జట్టు ఇదే: పాక్ లెజెండ్ Locked and loaded for Qualifier 1 🔥💪#PlayWithFire #KKRvSRH pic.twitter.com/nkTpipX0I8— SunRisers Hyderabad (@SunRisers) May 21, 2024 -
KKR vs SRH: ప్రమాదకారి.. ఫైనల్ చేరే తొలి జట్టు ఇదే!
ఐపీఎల్-2024లో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. ఫైనల్ చేరే తొలి జట్టును ఖరారు చేసే క్వాలిఫయర్-1లో మాజీ చాంపియన్లు కోల్‌కతా నైట్ రైడర్స్- సన్‌రైజర్స్ హైదరాబాద్ మంగళవారం తలపడనున్నాయి.అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో అమీ తుమీ తేల్చుకోనున్నాయి. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ లెజెండరీ పేసర్ వసీం అక్రం కీలక వ్యాఖ్యలు చేశాడు. కేకేఆర్ చాలా ప్రమాదకర జట్టు అంటూ ప్రత్యర్థి సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను హెచ్చరించాడు.అగ్రస్థానంలో నిలవడానికి ప్రధాన కారణం‘‘పాయింట్ల పట్టికలో కేకేఆర్ అగ్రస్థానంలో నిలవడానికి ప్రధాన కారణం వారి బౌలింగ్ లైనప్. ఎలాంటి పరిస్థితుల్లోనైనా వికెట్లు తీయగల సమర్థులు ఆ జట్టులో ఉన్నారు.అలాంటి బౌలర్లు ఉన్న జట్టు ఏదైనా కచ్చితంగా విజయాలు సాధిస్తుంది. ఈ సీజన్లో ఇప్పటికే వరుణ్ చక్రవర్తి 18, హర్షిత్ రాణా 16, ఆల్‌రౌండర్లు ఆండ్రీ రసెల్, సునిల్ నరైన్ చెరో 15, మిచెల్ స్టార్క్ 12 వికెట్లు పడగొట్టారు.ప్రమాదకర జట్టు ముఖ్యంగా ఒంటిచేత్తో మ్యాచ్‌ను గెలిపించగల స్టార్క్ ఉండటం వారికి ప్రధాన బలం. కేకేఆర్ ఎలాంటి హడావుడి లేకుండా.. పూర్తి ఆత్మవిశ్వాసంతో.. ఫైనల్ చేరేందుకు అర్హతలు ఉన్న ప్రమాదకర జట్టు అని కచ్చితంగా చెప్పగలను.ఇక ఈ జట్టులో ఉన్న ప్రతి ఒక్క బ్యాటర్ కూడా కీలక సమయంలో ఏదో ఒక మ్యాచ్‌లో రాణిస్తూనే ఉన్నాడు. దూకుడుగా ఆడుతున్నట్లుగా కనిపిస్తున్నా ఎక్కడా అతి విశ్వాసం ప్రదర్శించరు’’ అని వసీం అక్రం పేర్కొన్నాడు.కోల్‌కతా నైట్ రైడర్స్‌కే ఎక్కువ అవకాశాలుక్వాలిఫయర్-1 నేపథ్యంలో ఫైనల్ చేరే తొలి జట్టుగా కోల్‌కతా నైట్ రైడర్స్‌కే ఎక్కువ అవకాశాలు ఉన్నాయని స్పోర్ట్స్‌కీడాతో మాట్లాడుతూ ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు. అయితే, ఓపెనర్ ఫిల్ సాల్ట్(ఇంగ్లండ్) జట్టుకు దూరం కావడం కచ్చితంగా ప్రభావం చూపుతుందని వసీం అక్రం అభిప్రాయపడ్డాడు. కాగా వసీం అక్రం గతంలో కేకేఆర్ జట్టుతో కలిసి పనిచేశాడు. ఇదిలా ఉంటే.. ఈ సీజన్లో తమ ఆరంభ మ్యాచ్‌లో కేకేఆర్- సన్‌రైజర్స్ పరస్పరం తలపడ్డాయి. ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో కేకేఆర్ 4 పరుగుల స్వల్ప తేడాతో రైజర్స్‌ను ఓడించింది.చదవండి: MI: ఈ సీజన్లో నిరాశే మిగిలింది.. అయితే: నీతా అంబానీ వ్యాఖ్యలు వైరల్ -
IPL 2024: ఫైనల్ వేటలో ఎవరిదో జోరు!
అహ్మదాబాద్: గత రెండు నెలలుగా పది జట్ల పోరు ‘ప్లే ఆఫ్స్’ లక్ష్యంగా సాగింది. మెరుపులు, ధనాధన్ ధమాకాలతో ఐపీఎల్ 17వ సీజన్ మరింత మజాను పంచింది. ఇప్పుడు నాలుగు జట్ల సమరం ఫైనల్ దిశగా జరగనుంది. ముందుగా మంగళవారం జరిగే తొలి క్వాలిఫయర్‌లో జోరు మీదున్న సన్‌రైజర్స్ హైదరాబాద్... రెండుసార్లు (2012, 2014) చాంపియన్ అయిన కోల్‌కతా నైట్‌రైడర్స్ (కేకేఆర్)తో తలపడనుంది. 2016లో ఐపీఎల్ ట్రోఫీ సాధించిన సన్‌రైజర్స్ ప్రస్తుత సీజన్లో భీకరమైన ఫామ్ దృష్ట్యా టైటిల్ వేటలో ముందంజ వేయాలనే పట్టుదలతో ఉంది. మరోవైపు కోల్‌కతా తక్కువేం కాదు... తగ్గేలా లేనేలేదు! ఈ సీజన్లో కేవలం 3 మ్యాచ్‌లే ఓడిన నైట్‌రైడర్స్ ఎవరికి సాధ్యం కానీ 9 విజయాల్ని సాధించి పాయింట్ల పట్టికలో ‘టాప్’లో నిలిచింది. అటు బౌలింగ్, బ్యాటింగ్‌లో సమతూకంగా ఉన్న కేకేఆర్ రెండో క్వాలిఫయర్‌దాకా చాన్స్ తీసుకోకుండా ఫైనల్ బెర్త్ సాధించాలని ఆశిస్తోంది. సన్ తుఫాన్‌కు ఎదురేది? సన్‌రైజర్స్ కొట్టిన కొట్టుడు... దంచిన దంచుడు... 200 పైచిలుకు లక్ష్యమైనా మాకేంటని ఛేదించిన వైనం చూస్తే హైదరాబాద్‌కు ఎదురు నిలవడం ఏ జట్టుకైనా కష్టమే! దంచేసే ఓపెనర్ హెడ్ డకౌటైన గత మ్యాచ్‌లో సన్‌రైజర్స్ 215 పరుగుల లక్ష్యాన్ని 19.1 ఓవర్లలోనే ఛేదించి టాప్–2లోకి దూసుకొచ్చింది. అభిషేక్ శర్మ, ఆంధ్రప్రదేశ్ ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి, క్లాసెన్ సూపర్ ఫామ్‌లో ఉన్నారు. సిక్సర్లతో ప్రత్యర్థి బౌలర్లకు పదేపదే చుక్కలు చూపిస్తున్నారు. ఈ జట్టు బలం బ్యాటింగే! అయితే నిలకడ లేని బౌలింగ్‌తోనే అసలు సమస్యంతా! బౌలర్ల వైఫల్యం వల్లే 277/3, 287/3, 266/7 లాంటి రికార్డు స్కోర్లు నమోదు చేసినా భారీ తేడాతో ఏ మ్యాచ్ కూడా గెలవలేకపోయింది. కెపె్టన్ కమిన్స్, భువనేశ్వర్, నటరాజన్ సహా బౌలర్లంతా కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తేనే సన్‌రైజర్స్‌కు విజయం సులువవుతుంది. ఫైట్ రైడర్స్ ఫిల్ సాల్ట్–సునీల్ నరైన్ ఓపెనింగ్ జోడీ మెరుపులతో కోల్‌కతా నైట్‌రైడర్స్ కాస్తా ఫైట్‌రైడర్స్‌గా మారింది. కీలకమైన మ్యాచ్‌లో సాల్ట్ (స్వదేశానికి తిరుగుముఖం) లేకపోయినప్పటికీ బ్యాటింగ్ బలం ఏమాత్రం తగ్గలేదు. ఎందుకంటే వెంకటేశ్ అయ్యర్, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, నితీశ్ రాణా, రసెల్, రింకూ సింగ్, రమణ్‌దీప్ ఇలా ఎనిమిదో వరుస వరకు తిరుగులేని బ్యాటింగ్ లైనప్ ఉన్న జట్టు కోల్‌కతా. ప్రత్యేకించి రసెల్, రింకూ, రమణ్‌దీప్‌లైతే స్పెషలిస్టు హిట్టర్లు. టాప్–3 విఫలమైన ప్రతీసారీ జట్టును నడిపించారు. బౌలింగ్‌లో అనుభవజు్ఞడైన స్టార్క్, నరైన్, రసెల్‌లతో పాటు హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తిలు నైట్‌రైడర్స్ విజయాల్లో భాగమవుతున్నారు. ఇక నైట్‌రైడర్స్ మ్యాచ్ ఆడి పది రోజులవుతోంది. ఈ నెల 11న ముంబై ఇండియన్స్‌పై మొదట 157/7 స్కోరే చేసినా... ప్రత్యరి్థని 139/8కు కట్టడి చేసి 18 పరుగులతో గెలిచింది. తర్వాత గుజరాత్, రాజస్తాన్‌లతో జరగాల్సిన రెండు మ్యాచ్‌లు వర్షంతో రద్దయ్యాయి. దీంతో ఆటగాళ్లంతా ‘మ్యాచ్ ఆకలి’ మీదున్నారు. తప్పకుండా ఇరుజట్ల మధ్య హోరాహోరీ సమరం గ్యారంటీ! జట్లు (అంచనా) హైదరాబాద్: కమిన్స్ (కెప్టెన్), హెడ్, అభిõÙక్ శర్మ, రాహుల్ త్రిపాఠి, నితీశ్ కుమార్ రెడ్డి, క్లాసెన్, షహబాజ్, సమద్, సన్వీర్, భువనేశ్వర్, విజయకాంత్, నటరాజన్. కోల్‌కతా: శ్రేయస్ అయ్యర్ (కెపె్టన్), నరైన్, గుర్బాజ్, వెంకటేశ్, నితీశ్ రాణా, రింకూ సింగ్, రసెల్, రమణ్‌దీప్, స్టార్క్, హర్షిత్ రాణా, వరుణ్, అనుకుల్/వైభవ్. పిచ్, వాతావరణం నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఆరు మ్యాచ్‌ల్ని పరిశీలిస్తే... పిచ్ బౌలర్లకు, బ్యాటర్లకు సమాన అవకాశాలు కల్పించింది. మూడు మ్యాచ్‌ల్లో 200 పైచిలుకు స్కోర్లు నమోదయ్యాయి. తక్కువ స్కోర్ల మ్యాచ్ (గుజరాత్ 89 ఆలౌట్; ఢిల్లీ 92/4) కూడా ఇక్కడే నమోదైంది. మ్యాచ్‌కు వర్ష సూచన లేదు.26: ఐపీఎల్లో ఇప్పటి వరకు సన్‌రైజర్స్, నైట్‌రైడర్స్ జట్లు ముఖాముఖిగా 26 సార్లు తలపడ్డాయి. 17 మ్యాచ్‌ల్లో నైట్‌రైడర్స్... 9 మ్యాచ్‌ల్లో సన్‌రైజర్స్ గెలుపొందాయి. ఈ సీజన్లో ఈ రెండు జట్లు ఒకసారి పోటీపడగా నైట్‌రైడర్స్ నాలుగు పరుగుల తేడాతో నెగ్గింది. నైట్‌రైడర్స్‌పై సన్‌రైజర్స్ అత్యధిక స్కోరు 228, అత్యల్ప స్కోరు 116 కాగా... సన్‌రైజర్స్‌పై నైట్‌రైడర్స్ అత్యధిక స్కోరు 208, అత్యల్ప స్కోరు 101. -
చరిత్ర సృష్టించిన హైదరాబాద్ యువ కెరటం అభిషేక్ శర్మ..
-
ప్లే ఆఫ్‌కు సన్ రైజర్స్ : థాంక్యూ హైదారబాద్ (ఫొటోలు)
-
SRH Vs PBKS: విన్‌రైజర్స్...
సాక్షి, హైదరాబాద్: అద్భుత ప్రదర్శనలు, మెరుపు ఇన్నింగ్స్‌లతో సీజన్ ఆసాంతం అదరగొట్టిన సన్‌రైజర్స్ హైదరాబాద్ ఎనిమిదో విజయంతో లీగ్ దశను ముగించింది. పాయింట్ల పట్టికలో రెండో స్థానాన్ని దక్కించుకుంది. హైదరాబాద్, రాజస్తాన్ 17 పాయింట్లతో సంయుక్తంగా రెండో స్థానంలో నిలిచినా... మెరుగైన రన్‌రేట్ కారణంగా హైదరాబాద్‌కు రెండో స్థానం ఖరారైంది. ఉప్పల్ స్టేడియంలో ఆదివారం జరిగిన తమ చివరి లీగ్ పోరులో హైదరాబాద్ 4 వికెట్ల తేడాతో పంజాబ్ కింగ్స్‌ను ఓడించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పంజాబ్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 214 పరుగులు చేసింది. ప్రభ్‌సిమ్రన్ సింగ్ (45 బంతుల్లో 71; 7 ఫోర్లు, 4 సిక్స్‌లు), రిలీ రోసో (24 బంతుల్లో 49; 3 ఫోర్లు, 4 సిక్స్‌లు), అథర్వ తైడే (27 బంతుల్లో 46; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. అనంతరం సన్‌రైజర్స్ 19.1 ఓవర్లలో 6 వికెట్లకు 215 పరుగులు సాధించి గెలిచింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అభిõÙక్ శర్మ (28 బంతుల్లో 66; 5 ఫోర్లు, 6 సిక్స్‌లు), క్లాసెన్ (26 బంతుల్లో 42; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), నితీశ్ కుమార్ రెడ్డి (25 బంతుల్లో 37; 1 ఫోర్, 3 సిక్స్‌లు), రాహుల్ త్రిపాఠి (18 బంతుల్లో 33; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించారు. భారీ భాగస్వామ్యం... పంజాబ్ ఓపెనర్లు అథర్వ, ప్రభ్‌సిమ్రన్ పవర్‌ప్లేలో దూకుడుగా ఆడి 8 ఫోర్లు, 2 సిక్సర్లతో 61 పరుగులు సాధించారు. ఎట్టకేలకు 10వ ఓవర్లో అథర్వను అవుట్ చేసిన నటరాజన్ ఈ జోడీని విడదీశాడు. తొలి వికెట్‌కు ఈ ఇద్దరు బ్యాటర్లు 55 బంతుల్లో 97 పరుగులు జోడించారు. ప్రభ్‌సిమ్రన్ 34 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకోగా, మూడో స్థానంలో వచ్చిన రోసో కూడా దూకుడు ప్రదర్శిస్తూ నితీశ్ కుమార్ రెడ్డి ఓవర్లో 2 సిక్స్‌లు, ఫోర్ బాదాడు. ఆ తర్వాత పంజాబ్ తక్కువ వ్యవధిలో ప్రభ్‌సిమ్రన్, శశాంక్ సింగ్ (2), రోసో, అశుతోష్ శర్మ (2) వికెట్లు కోల్పోయింది. అయితే చివర్లో జితేశ్ శర్మ ధాటిగా ఆడటంతో పంజాబ్ స్కోరు 200 పరుగులు దాటింది. నితీశ్ వేసిన ఆఖరి ఓవర్లో జితేశ్ 2 సిక్స్‌లు, ఫోర్ కొట్ట డంతో 19 పరుగులు వచ్చాయి. హెడ్ విఫలం... ఛేదనలో రైజర్స్‌కు తొలి బంతికే షాక్ తగిలింది. అర్‡్షదీప్ సింగ్ వేసిన చక్కటి బంతికి హెడ్ (0) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అయితే ఆ తర్వాత హైదరాబాద్ తడబాటు లేకుండా విజయం దిశగా సాగింది. వరుసగా 72, 57, 47 పరుగుల భాగస్వామ్యాలు రైజర్స్ ఇన్నింగ్స్‌ను నడిపించాయి. ప్రత్యర్థి బ్యాటర్లను నిలువరించడంలో పంజాబ్ బౌలర్లు విఫలమయ్యారు. రిషి ధావన్ ఓవర్లో 2 ఫోర్లు, సిక్స్ కొట్టిన అభిషేక్ శర్మ...అర్‡్షదీప్ ఓవర్లోనూ 2 ఫోర్లు, సిక్స్ బాదాడు. హర్షల్ పటేల్ ఓవర్లో 22 పరుగులు రాబట్టిన రైజర్స్ 6 ఓవర్లలో 84 పరుగులు సాధించింది. 21 బంతుల్లోనే అభిషేక్ హాఫ్ సెంచరీని చేరుకున్నాడు. అభిషేక్ అవుటయ్యాక అటు నితీశ్, ఇటు క్లాసెన్ జోరు ప్రదర్శించి జట్టును గెలుపు దిశగా తీసుకెళ్లారు. అనంతరం వేగంగా మ్యాచ్‌ను ముగించే క్రమంలో రైజర్స్ వెంటవెంటనే వికెట్లు కోల్పోయినా ఎలాంటి ఇబ్బందీ ఎదురు కాలేదు. స్కోరు వివరాలు పంజాబ్ కింగ్స్ ఇన్నింగ్స్: అథర్వ (సి) సన్విర్ (బి) నటరాజన్ 46; ప్రభ్‌సిమ్రన్ (సి) క్లాసెన్ (బి) విజయకాంత్ 71; రోసో (సి) సమద్ (బి) కమిన్స్ 49; శశాంక్ (రనౌట్) 2; జితేశ్ (నాటౌట్) 32; అశుతోష్ (సి) సన్వీర్ (బి) నటరాజన్ 2; శివమ్ సింగ్ (నాటౌట్) 2; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 214. వికెట్ల పతనం: 1–97, 2–151, 3–174, 4–181, 5–187. బౌలింగ్: భువనేశ్వర్ 4–0–36–0, కమిన్స్ 4–0–36–1, నటరాజన్ 4–0–33–2, విజయకాంత్ 4–0–37–1 షహబాజ్ 1–0–13–0, నితీశ్ రెడ్డి 3–0–54–0. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్: హెడ్ (బి) అర్‡్షదీప్ 0; అభిషేక్ (సి) శివమ్ (బి) శశాంక్ 66; రాహుల్ త్రిపాఠి (సి) అర్‡్షదీప్ (బి) హర్షల్ 33; నితీశ్ కుమార్ రెడ్డి (సి) శివమ్ (బి) హర్షల్ 37; క్లాసెన్ (బి) హర్‌ప్రీత్ 42; షహబాజ్ (సి) శశాంక్ (బి) అర్‡్షదీప్ 3; సమద్ (నాటౌట్) 11; సన్వీర్ (నాటౌట్) 6; ఎక్స్‌ట్రాలు 17; మొత్తం (19.1 ఓవర్లలో 6 వికెట్లకు) 215. వికెట్ల పతనం: 1–0, 2–72, 3–129, 4–176, 5–197, 6–208. బౌలింగ్: అర్‡్షదీప్ 4–0–37–2, రిషి ధావన్ 3–0–35–0, హర్షల్ 4–0–49–2, చహర్ 4–0–43–0, హర్‌ప్రీత్ 3–0– 36–1, శశాంక్ 1–0–5–1, అథర్వ 0.1–0–4–0. ఐపీఎల్ ప్లే ఆఫ్స్ షెడ్యూల్ మే 21: క్వాలిఫయర్–1కోల్‌కతా నైట్‌రైడర్స్ X సన్‌రైజర్స్ హైదరాబాద్ వేదిక: అహ్మదాబాద్; రాత్రి గం. 7:30 నుంచిమే 22: ఎలిమినేటర్బెంగళూరు X రాజస్తాన్ రాయల్స్ వేదిక: అహ్మదాబాద్; రాత్రి గం. 7:30 నుంచి మే 24: క్వాలిఫయర్–2 క్వాలిఫయర్–1లో ఓడిన జట్టు X ఎలిమినేటర్ విజేత వేదిక: చెన్నై; రాత్రి గం. 7:30 నుంచి మే 26: ఫైనల్ క్వాలిఫయర్–1 విజేత క్వాలిఫయర్–2 విజేత వేదిక: చెన్నై; రాత్రి గం. 7:30 నుంచి -
క్లాసెన్ మాస్ క్యాచ్.. బ్యాటర్ మైండ్‌బ్లాంక్! వీడియో
ఐపీఎల్-2024లో ఇప్పటికే ప్లే ఆఫ్స్‌లో అడుగుపెట్టిన సన్‌రైజర్స్ హైదరాబాద్ లీగ్ దశలో ఆఖరి మ్యాచ్ ఆడుతోంది. సొంత మైదానం ఉప్పల్‌లో పంజాబ్ కింగ్స్‌పై గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతోంది.ఈ మ్యాచ్‌లో గనుక సన్‌రైజర్స్ భారీ తేడాతో గెలిచి.. తదుపరి మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ రాజస్తాన్ రాయల్స్‌ను ఓడిస్తే ఏకంగా రెండో స్థానానికి చేరుకుంటుంది. ఇక ఆదివారం నాటి ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పంజాబ్ తొలుత బ్యాటింగ్ చేసింది.ఓపెనర్లు అథర్వ టైడే(27 బంతుల్లో 46), ప్రభ్‌సిమ్రన్ సింగ్(45 బంతుల్లో 71) అద్భుత ఇన్నింగ్స్‌తో శుభారంభం అందించారు. ముఖ్యంగా ప్రభ్‌సిమ్రన్ సన్‌రైజర్స్ బౌలర్లకు కొరకరాని కొయ్యగా మారి ముప్పుతిప్పలు పెట్టాడు.ఈ క్రమంలో 15వ ఓవర్లో బౌలింగ్‌కు దిగిన విజయకాంత్ వియస్కాంత్ రెండో బంతికి ప్రభ్‌సిమ్రన్‌ను ఊరించాడు. దీంతో షాట్ ఆడేందుకు ప్రయత్నించిన కనెక్ట్ కాలేదు. ఈ క్రమంలో వెంటనే స్పందించిన వికెట్ కీపర్ హెన్రిచ్ క్లాసెన్ ఒంటిచేత్తో బంతిని ఒడిసిపట్టాడు. దీంతో ప్రభ్‌సిమ్రన్ నిరాశగా పెవిలియన్ చేరాడు. అలా దురదృష్టకరరీతిలో ప్రభ్‌సిమ్రన్ అవుట్ కావడంతో పంజాబ్ ఫ్యాన్స్ నిరాశ చెందారు.అయితే, ఈ మ్యాచ్‌లో ఓపెనర్లతో పాటు వన్‌డౌన్‌బ్యాటర్ రిలీ రొసో(49), కెప్టెన్ జితేశ్ శర్మ(15 బంతుల్లో 32 నాటౌట్) రాణించడంతో పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 214 పరుగులు చేసింది.మరోవైపు.. లక్ష్య ఛేదనకు దిగిన ఆరెంజ్ ఆర్మీకి ఆరంభంలోనే షాకిచ్చాడు పంజాబ్ పేసర్ అర్ష్‌దీప్ సింగ్. అతడి దెబ్బకు రైజర్స్ విధ్వంసకర ఓపెనర్ ట్రవిస్ హెడ్(0) పరుగుల ఖాతా తెరవకుండానే బౌల్డ్ అయ్యాడు. ఇక వన్‌డౌన్ బ్యాటర్ రాహుల్ త్రిపాఠి(18 బంతుల్లో 33)ని హర్షల్ పటేల్ అవుట్ చేశాడు. దీంతో పవర్ ప్లేలో సన్‌రైజర్స్ రెండు వికెట్ల నష్టానికి 84 పరుగులు చేసింది. Right wicket at the right time 😎Prabhsimran's solid knock comes to an end courtesy of a Klaasy catch 💪Watch the match LIVE on @JioCinema and @StarSportsIndia 💻📱#TATAIPL | #SRHvPBKS pic.twitter.com/a87LCfvi9g— IndianPremierLeague (@IPL) May 19, 2024 -
SRH vs PBKS: రాణించిన టాపార్డర్.. పంజాబ్ భారీ స్కోరు!
ఐపీఎల్-2024 లీగ్ దశలో తమ ఆఖరి మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ దంచికొట్టింది. సన్‌రైజర్స్ హైదారాబాద్‌తో ఆదివారం నాటి మ్యాచ్‌లో భారీ స్కోరు సాధించింది. టాపార్డర్ రాణించడంతో సన్‌రైజర్స్‌కు 215 పరుగుల లక్ష్యం విధించగలిగింది.కాగా ఈ సీజన్లో ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించిన రెండో జట్టుగా నిలిచిన పంజాబ్ కింగ్స్.. ఇప్పటికే ప్లే ఆఫ్స్ బెర్తు ఖరారు చేసుకున్న సన్‌రైజర్స్‌తో పోటీకి దిగింది. ఉప్పల్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పంజాబ్ తాత్కాలిక కెప్టెన్ జితేశ్ శర్మ తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు.ఈ క్రమంలో ఓపెనర్లు అథర్వ టైడే(27 బంతుల్లో 46), ప్రభ్‌సిమ్రన్ సింగ్(45 బంతుల్లో 71), వన్‌డౌన్ బ్యాటర్ రిలీ రోసో(24 బంతుల్లో 49) మెరుపు ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నారు. అదే విధంగా వికెట్ కీపర్ బ్యాటర్ జితేశ్ శర్మ కెప్టెన్ (15 బంతుల్లో 32 నాటౌట్) ఇన్నింగ్స్‌తో మెరిశాడు.ఈ క్రమంలో పంజాబ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 214 పరుగులు సాధించింది. ఇక సన్‌రైజర్స్ బౌలర్లలో నటరాజన్‌కు రెండు, కెప్టెన్ ప్యాట్ కమిన్స్, విజయకాంత్ వియస్కాంత్‌కు ఒక్కో వికెట్ దక్కాయి.కాగా గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్ రద్దు కావడంతో ప్లే ఆఫ్స్ చేరిన సన్‌రైజర్స్.. పంజాబ్‌తో మ్యాచ్‌లో గనుక గెలిస్తే పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరుకునే అవకాశం ఉంటుంది. అయితే, కేకేఆర్- రాజస్తాన్ మధ్య మ్యాచ్ ఫలితం తర్వాతే రెండో స్థానం ఖరారవుతుందో లేదో తెలుస్తుంది. -
IPL 2024- SRH: నితీశ్ రెడ్డి.. పక్కా లోకల్! త్వరలోనే టీమిండియాలో..
సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ మధ్య ఐపీఎల్ మ్యాచ్. హైదరాబాద్‌కు చెందిన యువ బ్యాటర్ క్రీజ్‌లో ఉన్నాడు. ఆల్‌టైమ్ స్పిన్ దిగ్గజాల్లో ఒకడైన అశ్విన్ వేసిన బంతి ఆఫ్‌స్టంప్‌పై పడింది. బలంగా బాదితే వైడ్ లాంగాన్ దిశగా సిక్సర్! ఆ తర్వాత లెగ్‌స్పిన్నర్ చహల్ వచ్చాడు. టి20 క్రికెట్ స్టార్లలో ఒకడిగా, 350 వికెట్లు తీసిన అనుభవం అతనిది. వరుసగా ఫోర్, సిక్సర్! అంతటితో ఆగిపోలేదు. మరో రెండు బంతుల విరామం తర్వాత అదే ఓవర్లో వరుసగా మళ్లీ సిక్స్, ఫోర్.. కొద్ది సేపటికి అశ్విన్ తిరిగొచ్చాక వరుస బంతుల్లో మళ్లీ రెండు భారీ సిక్సర్లు! ఎక్కడా ఎలాంటి తడబాటు లేదు. పొరపాటున బ్యాట్ చివర తగిలి బంతి స్టాండ్స్‌లోకి వెళ్లింది కాదు. పూర్తిగా సాధికారికంగా, సంపూర్ణ ఆత్మవిశ్వాసంతో ఆడిన షాట్లతో అతను ఆయా బంతులను సిక్సర్లుగా మలిచాడు. ఎంతో అనుభవం ఉన్న సీనియర్ తరహాలో అతను ఆడిన తీరు, అగ్రశ్రేణి స్పిన్నర్లను సమర్థంగా ఎదుర్కొన్న శైలి.. మాజీ ఆటగాళ్లు, వ్యాఖ్యాతలు అతని గురించి మాట్లాడుకునేలా చేసింది. భవిష్యత్తులో భారత జట్టుకు ఆడగల సత్తా ఉన్న ప్లేయర్‌గా అతనిపై ప్రశంసల జల్లు కురిసింది. ఆ కుర్రాడే కె. నితీశ్ కుమార్ రెడ్డి. విశాఖపట్నానికి చెందిన 21 ఏళ్ల నితీశ్ తాజా ఐపీఎల్లో తన ఆటతో అందరినీ ఆకర్షించాడు. అటు బ్యాటింగ్‌లో చెలరేగుతూ, ఇటు బౌలింగ్‌లో కీలక సమయాల్లో వికెట్లు తీయడమే కాకుండా ఫీల్డింగ్‌లో కూడా చురుకైన ప్రదర్శనతో సన్‌రైజర్స్ విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. ఆరేళ్ల క్రితమే జూనియర్ స్థాయి క్రికెట్లో టన్నుల కొద్దీ పరుగులు సాధించి తన రాకను ఘనంగా చాటిన నితీశ్ ఇప్పుడు సీనియర్ ఇండియా క్రికెట్లోనూ తనదైన ముద్ర వేసేందుకు సిద్ధంగా ఉన్నాడు.ఐపీఎల్లో ఒక అచ్చమైన తెలుగబ్బాయి ఆటను చూసి ఎంత కాలమైంది! హైదరాబాద్ టీమ్ దక్కన్ చార్జర్స్‌గా ఉన్నప్పటి నుంచి ఇప్పటి సన్‌రైజర్స్ వరకూ మనవాళ్ల ప్రాతినిధ్యం చాలా తక్కువ. అటు ఆంధ్ర నుంచి గానీ, ఇటు హైదరాబాద్ నుంచి గానీ ఒక్కరికి కూడా అవకాశం ఇవ్వకుండా చాలా సందర్భాల్లో బయటి ఆటగాళ్లతోనే లోకల్ టీమ్‌ను ఫ్రాంచైజీ నడిపిస్తూనే ఉంది. ఏ సగటు క్రికెట్ అభిమానిని అడిగినా ఇదే చెబుతాడు. టీమ్‌లోకి తీసుకున్నా తుది జట్టులో ఆడించకుండా, ఒక్క మ్యాచ్ కూడా ఇవ్వకుండా సాగిన రోజులే ఎక్కువ. అక్కడక్కడా ఎవరైనా బరిలోకి దిగినా.. వాహ్ అనిపించే గుర్తుంచుకోదగ్గ ప్రదర్శనలూ తక్కువే. ఇలాంటి స్థితిలో నితీశ్‌ను అందరూ రెండు రాష్ట్రాల ప్రతినిధిగా, తమవాడిగా అభిమానిస్తున్నారు. అతను కూడా తన అద్భుత ఆటతో అందరి నమ్మకాన్ని నిలబెడుతూ కొత్త సంచలనంలా మారాడు. అలా మొదలై..నితీశ్లోని సహజ ప్రతిభే అతడిని బ్యాటింగ్‌లో రాటుదేలేలా చేసింది. చాలా మందిలాగే నితీశ్ తండ్రి ముత్యాల రెడ్డి కూడా అబ్బాయి అల్లరిని భరించలేక ఆరేళ్ల వయసులో వేసవి శిక్షణ శిబిరంలో చేర్పించడంతో మైదానంలో అతని ఆట మొదలైంది. ఆపై అబ్బాయి ఆసక్తి, నేర్చుకోవాలనే పట్టుదల వెరసి పూర్తి స్థాయిలో తండ్రి అతడిని క్రికెట్ శిక్షణ వైపు మళ్లించేలా చేసింది. కోచ్‌ల పర్యవేక్షణలో రాటుదేలిన నితీశ్ చిన్న వయసులోనే తనలోని అపార ప్రతిభను ప్రదర్శిస్తూ వచ్చాడు. అండర్–12 స్థాయికి వచ్చేసరికి గమ్యం స్పష్టమైపోయింది. అప్పటికే అతని బ్యాటింగ్‌లో స్ట్రోక్ మేకింగ్, పట్టుదల చూసినవారికి భవిష్యత్తులో ఉత్తమ క్రికెటర్ కావాల్సిన లక్షణాలున్నాయని అర్థమైంది. ఈ క్రమంలోనే అప్పటి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ డైరెక్టర్, భారత మాజీ ఆటగాడు ఎమ్మెస్కే ప్రసాద్ దృష్టి కూడా నితీశ్‌పై పడింది. ట్రయల్స్‌లో అతని ప్రతిభను చూసిన ఎమ్మెస్కే కడపలోని ఏసీఏ అండర్–14 అకాడమీలో చేరే అవకాశం కల్పించారు. అక్కడి నుంచి నితీశ్‌కు 24 గంటలూ క్రికెట్టే జీవితంగా మారిపోయింది. తన ఆటను మరింత సానబెట్టుకునే అవకాశం దక్కిన చోట కష్టపడిన అతను మరింత రాటుదేలాడు. మరో వైపు వైజాగ్ జింక్ ఫ్యాక్టరీలో ఉద్యోగిగా ఉన్న తండ్రి ముత్యాల రెడ్డికి రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌కు ట్రాన్స్ఫర్ అయింది. తాను అక్కడికి వెళితే బిడ్డ భవిష్యత్తుకు ఇబ్బంది రావచ్చని భావించిన ఆయన ఏకంగా తన ఉద్యోగానికే రాజీనామా ఇచ్చేశారు. పూర్తి స్థాయిలో కొడుకుకు అండగా ఉండి సరైన మార్గనిర్దేశనంలో నడిపించారు. పరుగుల వరద పారించి..నితీశ్ కెరీర్లో 2017–18 దేశవాళీ సీజన్ హైలైట్‌గా నిలిచింది. 14 ఏళ్ల నితీశ్ అండర్–16 విజయ్ మర్చంట్ ట్రోఫీలో ఆంధ్ర జట్టు తరఫున బరిలోకి దిగి సత్తా చాటాడు. ప్రత్యర్థి జట్లపై చెలరేగిన 8 ఇన్నింగ్స్‌లలోనే ఏకంగా 176.71 సగటుతో రికార్డు స్థాయిలో 1237 పరుగులు సాధించి సంచలనం సృష్టించాడు. ఇందులో 4 సెంచరీలు, 2 అర్ధసెంచరీలు ఉన్నాయి. అన్నింటికి మించి నాగాలాండ్‌తో జరిగిన పోరులో అతను సాధించిన క్వాడ్రూపల్ సెంచరీ హైలైట్‌గా నిలిచింది. రాజ్‌కోట్‌లో జరిగిన ఈ ప్రీక్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో నితీశ్ 366 బంతులు ఎదుర్కొని 60 ఫోర్లు, 7 సిక్సర్లతో 441 పరుగులు సాధించడం విశేషం. ఇదే జోరును కొనసాగిస్తూ అండర్–19 టోర్నీ వినూ మన్కడ్ ట్రోఫీలో కూడా ఆకట్టుకున్న అతను బీసీసీఐ చాలెంజర్ టోర్నీలోనూ అవకాశం దక్కించుకున్నాడు. అదే జోరులో 17 ఏళ్ల వయసులో ఆంధ్ర తరఫున తొలి సీనియర్ మ్యాచ్ ఆడే అవకాశం దక్కింది. ఒంగోలులో జరిగిన కేరళతో జరిగిన మ్యాచ్‌లో రంజీ ట్రోఫీలో అతను అరంగేట్రం చేశాడు. తర్వాతి సీజన్లో విజయ్‌హజారే వన్డే టోర్నీలో అడుగు పెట్టిన నితీశ్‌కు కొన్నాళ్ల తర్వాత ముస్తాక్ అలీ టి20 టోర్నీలోనూ ఆంధ్రకు ఆడే అవకాశం దక్కింది. ప్రతికూల పరిస్థితులను దాటి..అండర్–19 స్థాయిలో ఆకట్టుకున్నా.. అక్కడి నుంచి సీనియర్ స్థాయికి చేరే క్రమంలో యువ క్రికెటర్లంతా ఒక రకమైన ఒడిదుడుకులను ఎదుర్కొంటారు. రెండింటి మధ్య ఉండే అంతరం కారణంగా అంచనాలను అందుకోలేక వెనుకబడిపోయే ప్రమాదం ఉంటుంది. దాదాపు అందరు ఆటగాళ్లు ఈ పరిస్థితిని ఎదుర్కొంటారు. నితీశ్‌కు కూడా ఇలాగే జరిగింది. జూనియర్ స్థాయి మెరుపుల తర్వాత కొంత కాలం పాటు అతను ఇదే స్థితిని అనుభవించాడు. రంజీ అరంగేట్రం తర్వాత ఆశించిన ప్రదర్శన లేకపోవడంతో పాటు కోవిడ్ వల్ల వచ్చిన విరామం, ఇతర వేర్వేరు కారణాలు అతడిని ఇబ్బంది పెట్టాయి. ఈ దశలో అతను తన ఆటకు మరో రూపంలో పదును పెట్టాడు. అప్పటి వరకు వేర్వేరు వయో విభాగాల్లో ఓపెనర్‌గా భారీగా పరుగులు సాధించి అప్పుడప్పుడు మీడియం పేస్ బౌలింగ్ చేసిన నితీశ్ ఇప్పుడు తన బౌలింగ్‌పై మరింత శ్రద్ధ పెట్టాడు. అది 2022–23 రంజీ సీజన్లో బ్రహ్మండంగా పని చేసింది. 8 మ్యాచ్‌లలో 25 వికెట్లు పడగొట్టి సత్తా చాటడంతో ఆంధ్ర టీమ్‌లో ఆల్‌రౌండర్‌గా అతనికి గుర్తింపు దక్కింది. ఇదే క్రమంలో 2023–24 సీజన్లో పూర్తి స్థాయి ప్రదర్శనతో రెగ్యులర్‌గా టీమ్‌లో తన స్థానం సుస్థిరం చేసుకున్నాడు. ఈ ఏడాది కూడా అతను మళ్లీ 25 వికెట్లతో చెలరేగడంతో పాటు గతంలోలాగా బ్యాటింగ్‌లో కూడా తన పదును చూపించడం విశేషం. ఐపీఎల్లో అదరగొట్టి..‘నితీశ్‌కు 12 ఏళ్ల వయసు ఉన్నప్పుడే నేను ఉద్యోగానికి రాజీనామా చేశాను. అప్పటికి నాకు మరో 25 ఏళ్ల సర్వీస్ ఉంది. ఆ సమయంలో నేను అలాంటి నిర్ణయం తీసుకోవడం వల్ల అందరూ హతాశులయ్యారు. సహజంగానే ఆ తర్వాత ఎన్నో ఆర్థిక సమస్యలు చుట్టుముట్టాయి. మేమందరం ఎన్నో ఇబ్బందులు పడ్డాం. అయితే వాటి ప్రభావం అబ్బాయిపై పడరాదని భావించాం. అతడి ఆటకు మాత్రం ఇబ్బంది రాకుండా అన్నీ చూసుకున్నాం. అసలు ఆటల గురించి ఏమాత్రం అవగాహన లేని నా భార్య మానస కూడా కొడుకు కోసం ఎన్నో త్యాగాలు చేసి శ్రమించింది. ఇప్పుడు అతడిని ఐపీఎల్లో చూస్తుంటే మాకెంతో గర్వంగా ఉంది’ భావోద్వేగంతో ముత్యాల రెడ్డి నాటి రోజులను గుర్తుకు తెచ్చుకున్నారు.నితీశ్ గత ఏడాదే సన్‌రైజర్స్ టీమ్‌తో పాటు ఉన్నాడు. కానీ ఆడిన రెండు మ్యాచ్‌లలో బ్యాటింగ్ అవకాశమే రాకపోగా, బౌలింగ్‌లోనూ వికెట్లు దక్కలేదు. అప్పుడు కొంత నిరాశకు గురైనా.. ఈసారి దక్కిన అవకాశాన్ని అతను అద్భుతంగా వాడుకున్నాడు. అటు బ్యాటింగ్‌లోనూ, ఇటు బౌలింగ్, ఫీల్డింగ్‌లో చెలరేగుతూ రైజర్స్ టీమ్‌లో కీలకంగా మారాడు.‘చిన్నప్పుడే నితీశ్‌లో ప్రతిభను గుర్తించాం. ఆపై సరైన అవకాశాలు అతడిని వెతుక్కుంటూ వచ్చాయి. ఐపీఎల్లో అతని ఆట చూస్తే సంతోషం కలుగుతోంది. ఒత్తిడిలోనూ ఎక్కడా తడబాటుకు, ఆందోళనకు గురికాని అతని ఆత్మవిశ్వాసం నాకు నచ్చుతుంది. ఇప్పుడు అతను కెరీర్ కీలక దశలో ఉన్నాడు. బ్యాటింగ్ అద్భుతంగా చేస్తున్నాడు. బౌలింగ్‌లో స్టోక్స్, పాండ్యా తరహాలో మీడియం పేస్‌తోనే వేరియేషన్లు ప్రదర్శించడం, బంతిని ఇరు వైపుల స్వింగ్ చేయడం వంటివి మెరుగుపరచుకుంటే మంచి ఆల్‌రౌండర్‌గా త్వరలోనే టీమిండియాకు ఆడగలడు’ అని ఎమ్మెస్కే ప్రసాద్ విశ్వాసం వ్యక్తం చేశారు. ఆయనలాగే సగటు తెలుగు క్రికెట్ అభిమానులదీ అదే కోరిక. త్వరలోనే నెరవేరుతుందని ఆశిద్దాం.-మొహమ్మద్ అబ్దుల్ హాది -
SRH: సన్‌రైజర్స్ కెప్టెన్ చేసిన పనికి అభిమానులు ఫిదా
సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ చేసిన పనికి ఆరెంజ్ ఆర్మీ అభిమానులు ఫిదా అవుతున్నారు. ‘‘నువ్వు చాలా మంచోడివి కమిన్స్ మామా.. మా హృదయాలు గెలుచుకున్నావు’’ అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.ఇదంతా కేవలం.. సన్‌రైజర్స్‌ను ప్లే ఆఫ్స్‌నకు చేర్చినందుకు మాత్రమే అనుకుంటే పొరపడినట్లే! ఆరెంజ్ ఆర్మీ ఆఖరిసారిగా 2020లో ప్లే ఆఫ్స్ చేరింది.ఆ తర్వాత గత మూడేళ్లుగా చెత్త ప్రదర్శనతో పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానం కోసం పోటీపడింది. అయితే, ఐపీఎల్-2024లో మాత్రం పూర్తిగా సీన్ రివర్స్ అయింది. ఇప్పుడు టాప్-2 రేసులోనూ సన్‌రైజర్స్‌ముందు వరుసలో ఉంది.టికెట్ కన్ఫామ్‌ఆస్ట్రేలియా సారథి, 2023 వన్డే వరల్డ్‌కప్ విజేత ప్యాట్ కమిన్స్, కొత్త కోచ్ డానియల్ వెటోరి రాకతో ఆరెంజ్ ఆర్మీ ఇలా విజయవంతమైన పంథాలో దూసుకుపోతోంది. ఈ క్రమంలో వరుస విజయాలు సాధించి ప్లే ఆఫ్స్ బెర్తుపై కన్నేసిన కమిన్స్ బృందం గుజరాత్ టైటాన్స్‌తో గురువారం నాటి మ్యాచ్ రద్దు కావడంతో టికెట్ కన్ఫామ్ చేసుకుంది.ఈ సీజన్లో కోల్‌కతా నైట్ రైడర్స్, రాజస్తాన్ రాయల్స్ తర్వాత టాప్-4లో అడుగుపెట్టిన మూడో జట్టుగా నిలిచింది. లీగ్ దశలో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే ఈ ఘనత సాధించింది. ఆ మ్యాచ్‌లోనూ గెలిస్తే టాప్-2కి కూడా చేరుకునే అవకాశాలు ఉన్నాయి.ప్రభుత్వ పాఠశాలకు వెళ్లిన కమిన్స్‌ఇదిలా ఉంటే.. రైజర్స్‌ను ప్లే ఆఫ్స్ చేర్చిన ఉత్సాహంలో ఉన్న కెప్టెన్ ప్యాట్ కమిన్స్ బిజీ షెడ్యూల్ నుంచి కాస్త విరామం తీసుకున్నాడు. ఈ క్రమంలో ఓ ప్రభుత్వ పాఠశాలకు వెళ్లిన కెప్టెన్ సాబ్.. అక్కడి పిల్లలతో సరదాగా క్రికెట్ ఆడాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఇది చూసిన ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. విద్యార్థుల ముఖాల్లో నవ్వులు నింపినందుకు సంతోషంగా ఉందంటూ కమిన్స్‌కు ధన్యవాదాలు చెబుతున్నారు. కాగా ఈ సీజన్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇప్పటి దాకా ఆడిన 13 మ్యాచ్‌లలో ఏడు గెలిచింది. ఒకటి రద్దైపోయింది. ఇదిలా ఉంటే.. కమిన్స్ ఈ సీజన్లో ఇప్పటి దాకా 14 వికెట్లు వికెట్లు పడగొట్టాడు. కాగా 2024 వేలంలో సన్‌రైజర్స్ అతడిని రూ. 20.50 కోట్లకు కొనుగోలు చేసిన విషయం తెలిసిందే.Pat Cummins at zphs . You hav my heart champ 😭😭❤️❤️ @patcummins30 #ipl pic.twitter.com/ZReUDCUSYc— SURYA BHAI 🚩 (@Surya_2898AD) May 17, 2024PAT CUMMINS IS WINNING THE HEART OF ALL HYDERABAD. ❤️- Cummins playing cricket with school kids. pic.twitter.com/0Io3X8pN2Y— Johns. (@CricCrazyJohns) May 17, 2024 -
APL వేలంలో నితీశ్ కుమార్ రెడ్డికి అత్యధిక ధర.. సరికొత్త రికార్డు
సన్‌రైజర్స్ హైదరాబాద్ యువ సంచలనం, ఆంధ్ర క్రికెటర్ నితీశ్ కుమార్ రెడ్డి పట్టరాని సంతోషంలో మునిగితేలుతున్నాడు. ఐపీఎల్-2024లో సన్‌రైజర్స్ ప్లే ఆఫ్స్ చేరడం ఇందుకు ఓ కారణమైతే.. ఆంధ్ర ప్రీమియర్ లీగ్ వేలంలో అతడు సరికొత్త చరిత్ర సృష్టించడం మరో కారణం.జోనల్ స్థాయి క్రీడాకారులకి గుర్తింపు తెచ్చేందుకు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆంధ్ర ప్రీమియర్ లీగ్ పేరిట గత రెండేళ్లుగా టోర్నీ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పేరెన్నికగన్న క్రికెటర్లతో పాటు ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న ఆటగాళ్లు కూడా ఈ లీగ్‌లో భాగమవుతున్నారు.బెజవాడ టైగర్స్, ఉత్తరాంధ్ర లయన్స్, గోదావరి టైటాన్స్, రాయలసీమ కింగ్స్, వైజాగ్ వారియర్స్, కోస్టల్ రైడర్స్ పేరిట ఆరు జట్లు ఏపీఎల్‌లో పాల్గొంటున్నాయి. ఇక ఇప్పటికే రెండు సీజన్లు విజయవంతంగా పూర్తి చేసుకున్న ఏపీఎల్.. మూడో సీజన్ కోసం సిద్ధమైంది.ఈ నేపథ్యంలో ఆటగాళ్ల కొనుగోలుకై గురువారం వేలం నిర్వహించారు. ఇందులో భాగంగా 76 మంది ఆటగాళ్లు అమ్ముడుపోయారు. ఇక ఇప్పటికే 44 మంది ప్లేయర్లను ఆయా జట్లు రిటైన్ చేసుకున్నాయి.ఇక ఏ,బీ,సీ,డీ పేరిట నాలుగు కేటగిరీలుగా ఆటగాళ్లను విభజించారు. ‘ఏ’ కేటగిరీ కనీస ధర: లక్ష... బీ కేటగిరీ కనీస ధర: 50 వేలు.. సీ,డీ కేటగిరీ కనీస ధర: 25 వేలుగా నిర్ణయించారు. ఇదిలా ఉంటే.. సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులో దుమ్ము లేపుతున్న పేస్ ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి కూడా ఈ వేలంలో పాల్గొన్నాడు.ఈ నేపథ్యంలో ఆంధ్ర ప్రీమియర్ లీగ్ చరిత్రలోనే తొలిసారిగా ఏకంగా రికార్డు స్థాయిలో రూ. 15.6 లక్షలకు నితీశ్ రెడ్డి అమ్ముడుపోయాడు. ఈ యంగ్ సెన్సేషన్ కోసం గోదావరి టైటాన్స్ యాజమాన్యం ఈ మేరకు భారీ మొత్తం వెచ్చించింది.ఈ విషయం తెలియగానే నితీశ్ కుమార్ రెడ్డి నమ్మలేకపోతున్నా అన్నట్లుగా ఎక్స్ప్రెషన్స్ ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.కాగా ఐపీఎల్-2024 వేలంలో భాగంగా వైజాగ్ కుర్రాడు నితీశ్ రెడ్డిని రూ. 20 లక్షల కనీస ధరకు సన్‌రైజర్స్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే, అంచనాలకు మించి రాణించిన 20 ఏళ్ల ఈ ఆల్‌రౌండర్ 7 ఇన్నింగ్స్ ఆడి 239 పరుగులు చేశాడు. అదే విధంగా.. 3 వికెట్లు కూడా తీశాడు. NITISH KUMAR REDDY - Highest paid player in Andhra Premier League. 💥IPL salary - 20 Lakhs. APL salary - 15.6 Lakhs. His reaction is priceless. 🫡 The future star. pic.twitter.com/33i0hT3F3a— Johns. (@CricCrazyJohns) May 16, 2024 -
ప్లే ఆఫ్స్‌లో సన్‌రైజర్స్: కేన్ మామను హత్తుకున్న కావ్యా.. వైరల్
ఐపీఎల్- 2021, 2022, 2023లో పాయింట్ల పట్టికలో వరుసగా 8, 8, 10వ స్థానాలు.. పేలవ ప్రదర్శన కారణంగా విమర్శలపాలైన జట్టు.. అయితే, ఈ ఏడాది ఆ జట్టు రాత పూర్తిగా మారింది.కొత్త కెప్టెన్ వచ్చాడు... అదిరిపోయే ఓపెనింగ్ కాంబినేషన్ కుదిరింది. మిడిలార్డర్, లోయర్ ఆర్డర్లోనూ మెరుపులు మెరిపించగల ఆటగాళ్లు.. వీరికి తోడు ఎలాంటి పరిస్థితుల్లోనైనా ప్రత్యర్థిని కట్టడి చేయగల బౌలర్లు.. వెరసి లీగ్ దశలో మరొక మ్యాచ్ మిగిలి ఉండగానే ప్లే ఆఫ్స్‌నకు అర్హత. అర్థమైంది కదా! అవును ఆరెంజ్ ఆర్మీ గురించే ఇదంతా! సన్‌రైజర్స్ హైదరాబాద్ చివరిసారిగా 2020లో టాప్-4లో అడుగుపెట్టింది. ఇదిగో మళ్లీ ఇప్పుడే ఈ ఘనత సాధించడం. వరల్డ్‌కప్ విన్నింగ్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ సారథ్యంలో అభిషేక్ శర్మ- ట్రావిస్ హెడ్ ఓపెనింగ్ జోడీకి తోడు హిట్టర్ హెన్రిచ్ క్లాసెన్ చెలరేగడం.. అవసరమైన సమయంలో నితీశ్‌కుమార్ రెడ్డి, షాబాజ్ అహ్మద్, అబ్దుల్ సమద్.. కమిన్స్‌తో పాటు భువనేశ్వర్ కుమార్, మయాంక్ మార్కండే రాణించడం జట్టుకు సానుకూలాంశాలుగా మారాయి.సమిష్టి కృషితో టాప్-4 వరకుఈ క్రమంలో విధ్వంసకర బ్యాటింగ్‌కు మారుపేరుగా మారిపోయిన సన్‌రైజర్స్.. ఈసారి ప్లే ఆఫ్స్ చేరడం పక్కా అని అభిమానులు మురిసిపోయారు. అందుకు తగ్గట్లుగానే అన్ని విభాగాల్లో రాణిస్తూ సమిష్టి కృషితో టాప్-4 వరకు చేరింది సన్‌రైజర్స్.గుజరాత్ టైటాన్స్‌తో గురువారం నాటి మ్యాచ్ రద్దైన నేపథ్యంలో నేరుగా ప్లే ఆఫ్స్‌లో అడుగుపెట్టింది. నిజానికి ఫామ్ దృష్ట్యా ఈ మ్యాచ్‌లో రైజర్స్ గెలిచేదే! కానీ వర్షం కారణంగా ఇలా పెద్దగా కష్టపడకుండానే అర్హత సాధించింది.పట్టరాని సంతోషంలో కావ్యా మారన్దీంతో ఆరెంజ్ ఆర్మీ సంబరాల్లో మునిగిపోయింది. ఇక ఆ జట్టు సహ యజమాని కావ్యా మారన్ అయితే ఆనందంతో ఉబ్బితబ్బిబ్బైపోయారు. ఐపీఎల్-2024 వేలంలో తాను అనుసరించిన వ్యూహాలు ఇలా ఫలితాలు ఇస్తుండటంతో సంతోషంతో ఉప్పొంగిపోయారు.కేన్ మామను హత్తుకున్న సన్‌రైజర్స్ ఓనర్ఇలా ఆనందంలో ఉన్న కావ్యా మారన్‌కు ‘పాత చుట్టం’ ఎదురయ్యారు. అతడిని ఆమె ఎంతో ఆప్యాయంగా పలకరించడమే గాకుండా ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.అతడు మరెవరో కాదు గుజరాత్ టైటాన్స్ ఆటగాడు కేన్ విలియమ్సన్. అదేనండీ ఆరెంజ్ ఆర్మీ అభిమానులు ముద్దుగా కేన్ మామగా పిలుచుకునే న్యూజిలాండ్ కెప్టెన్. 2021, 2022లో సన్‌రైజర్స్ కెప్టెన్‌గా వ్యవహరించాడు విలియమ్సన్. పాత ఓనర్‌ను కలుసుకునిఅయితే, ఆ రెండు సీజన్లలో జట్టు దారుణ వైఫల్యాల నేపథ్యంలో హైదరాబాద్ ఫ్రాంఛైజీ అతడిని రిలీజ్ చేయగా.. 2023 వేలంలో గుజరాత్ కొనుక్కుంది. ఇప్పుడిలా తన పాత జట్టు.. ప్రస్తుత జట్టుతో మ్యాచ్ రద్దు కావడం వల్ల ప్లే ఆఫ్స్ చేరడం... ఆ సమయంలో పాత ఓనర్‌ను విలియమ్సన్ కలుసుకోవడం విశేషంగా నిలిచింది. చదవండి: అతడి కంటే చెత్త కెప్టెన్ ఇంకొకరు లేరు.. పైగా హార్దిక్‌ను అంటారా?.. గంభీర్ ఫైర్ 🧡 pic.twitter.com/QVyGH6KdNP— SunRisers Hyderabad (@SunRisers) May 16, 2024 -
IPL 2024- SRH: ప్లే ఆఫ్స్‌కు సన్‌రైజర్స్
సాక్షి, హైదరాబాద్: భాగ్యనగరాన్ని ముంచెత్తిన వాన దెబ్బ ఐపీఎల్ మ్యాచ్‌పై కూడా పడింది. గురువారం కురిసిన భారీ వర్షానికి ఉప్పల్ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ టైటాన్స్ మధ్య జరగాల్సిన ఐపీఎల్ మ్యాచ్ రద్దయింది. వాన తెరిపినివ్వకపోవడంతో కనీసం టాస్ కూడా వేసే అవకాశం రాలేదు. మధ్యాహ్నం తర్వాత కురిసిన వానకు నగరం మొత్తం జలమయమైంది. రాజీవ్‌గాంధీ స్టేడియంలో కూడా అవుట్‌ఫీల్డ్‌ను కవర్స్‌తో కప్పేశారు. అయితే ఏ దశలోనూ వాన పూర్తిగా ఆగలేదు. టాస్ కాస్త ఆలస్యం కాగా... నిర్ణీత రాత్రి 7:30 గంటల సమయంలో కాస్త తగ్గినట్లు అనిపించింది. కానీ వెంటనే చిరు చినుకులతో మొదలై మళ్లీ విరామం లేకుండా కురిసింది. కనీసం 5 ఓవర్ల మ్యాచ్ నిర్వహించాలన్నా రాత్రి 10:15 గంటలకు పూర్తిగా వాన ఆగాలి. కానీ అలా జరగలేదు. దాంతో అంపైర్లు గ్రౌండ్‌ను పరిశీలించి మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. గుజరాత్ జట్టు వరుసగా రెండో మ్యాచ్ కూడా రద్దు కావడం గమనార్హం. ఈ ఫలితంతో సన్‌రైజర్స్ 13 మ్యాచ్‌ల తర్వాత 15 పాయింట్ల వద్ద మూడో స్థానంలో నిలిచింది. దాంతో టీమ్‌కు ప్లే ఆఫ్స్ స్థానం ఖాయమైంది. ఆదివారం సన్‌రైజర్స్ సొంతగడ్డపైనే పంజాబ్ కింగ్స్‌తో తలపడుతుంది. ఈ మ్యాచ్‌లో హైదరాబాద్ గెలిచి... అదే రోజు రాత్రి కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో తమ చివరి మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ ఓడితే సన్‌రైజర్స్‌కు రెండో స్థానం ఖాయమవుతుంది. 2020లో చివరిసారి ప్లే ఆఫ్స్‌కు అర్హత పొందిన సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు 2021, 2022, 2023 సీజన్లలో వరుసగా 8వ, 8వ, 10వ స్థానాల్లో నిలిచింది. ఐపీఎల్లో నేడుముంబై X లక్నో వేదిక: ముంబైరాత్రి 7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో సినిమా యాప్‌లో ప్రత్యక్ష ప్రసారం -
ఇంకొక్కటి.. అలా అయితే టాప్-2లో సన్‌రైజర్స్! నేరుగా..
ఐపీఎల్-2024 ఆరంభం నుంచి వరుస విజయాలతో దూసుకుపోయిన రాజస్తాన్ రాయల్స్ పరిస్థితి ఇప్పుడు తారుమారైంది. పంజాబ్ కింగ్స్‌తో బుధవారం నాటి మ్యాచ్‌లో ఓటమితో వరుసగా నాలుగో పరాజయం నమోదు చేసింది.ఈ మ్యాచ్‌లో భారీ తేడాతో గెలిస్తేనేలీగ్ దశలో రాజస్తాన్‌కు ఇంకొక్క మ్యాచ్ మాత్రం మిగిలి ఉంది. టేబుల్ టాపర్ కోల్‌కతా నైట్ రైడర్స్‌తో సంజూ సేన మే 19న తలపడనుంది. అయితే, కేకేఆర్‌తో పాటు రాజస్తాన్ కూడా ఇప్పటికే ప్లే ఆఫ్స్ చేరినా.. ఈ మ్యాచ్‌లో భారీ తేడాతో గెలిస్తేనే రాజస్తాన్ రెండో స్థానంలో నిలవగలుగుతుంది.అప్పుడు నేరుగా కేకేఆర్‌తో క్వాలిఫయర్-1 ఆడుకోవచ్చు. లేదంటే ఎలిమినేటర్ గండం దాటాల్సి ఉంటుంది. ఇక రాజస్తాన్ ఇలా చిక్కుల్లో పడటం సన్‌రైజర్స్ హైదరాబాద్ పాలిట వరంలా మారింది.సన్‌రైజర్స్ పాలిట వరం.. ఎందుకంటే?లీగ్ దశలో హైదరాబాద్ జట్టుకు ఇంకా రెండు మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. గుజరాత్ టైటాన్స్(మే 16), పంజాబ్ కింగ్స్(మే 19)న ఎస్ఆర్హెచ్ తలపడనుంది. ఈ రెండింటికి రెండూ గెలిస్తే రైజర్స్ ఖాతాలో 18 పాయింట్లు చేరతాయి.సొంతమైదానం ఉప్పల్‌లో ఈ మ్యాచ్‌లు జరుగనుండటం, ఇప్పటికే సొంతగడ్డపై ఆరెంజ్ ఆర్మీకి ఉన్న విధ్వంసకర రికార్డు చూస్తే ఇది సాధ్యమే అనిపిస్తోంది.ఒక్కటి ఓడినా కూడాఅలా కాకుండా.. రాజస్తాన్ తమ ఆఖరి మ్యాచ్‌లో ఓడి.. సన్‌రైజర్స్ కూడా ఈ రెండింటిలో ఒకటి ఓడితే.. అప్పుడు కూడా హైదరాబాద్ జట్టు టాప్-2తో ముగించే అవకాశం ఉంటుంది.ఈ నేపథ్యంలో రెండు జట్లకు సమానంగా పాయింట్లు(16) వచ్చినా రన్‌రేటు పరంగా సన్‌రైజర్స్ ముందుంటే రాజస్తాన్‌ను వెనక్కినెట్టడం ఖాయం. అప్పుడు పట్టికలో సన్‌రైజర్స్ రెండో స్థానానికి చేరితే క్వాలిఫయర్-1కు అర్హత సాధిస్తుంది.అలా అయితే మొదటికే మోసం మరి!అలా కాకుండా ఆఖరి రెండు మ్యాచ్‌లూ ఓడిపోతే మాత్రం మొదటికే మోసం వస్తుంది. ప్లే ఆఫ్స్ చేరాలంటే.. కేకేఆర్- రాజస్తాన్, చెన్నై సూపర్ కింగ్స్- ఆర్సీబీ మ్యాచ్ ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది. అదీ సంగతి!ఐపీఎల్-2024 పాయింట్ల పట్టిక(మే 15 నాటికి)లో టాప్-5 ఇలా:1. కేకేఆర్- ఆడినవి 13.. గెలిచినవి 9.. పాయింట్లు 19.. నెట్ రన్‌రేటు 1.428(ప్లే ఆఫ్స్‌నకు అర్హత)2. రాజస్తాన్- ఆడినవి 13.. గెలిచినవి 8.. పాయింట్లు 16.. నెట్ రన్‌రేటు 0.273(ప్లే ఆఫ్స్‌నకు అర్హత)3. చెన్నై సూపర్ కింగ్స్- ఆడినవి 13.. గెలిచినవి 7.. పాయింట్లు 14.. నెట్ రన్‌రేటు 0.5284. సన్‌రైజర్స్- ఆడినవి 12.. గెలిచినవి 7.. పాయింట్లు 14.. నెట్ రన్‌రేటు.. 0.406.5. ఆర్సీబీ- ఆడినవి 13.. గెలిచినవి 6.. పాయింట్లు 12.. నెట్ రన్‌రేటు.. 0.387.విజేతకు దారిలా👉 క్వాలిఫయర్-1(మే 21): టాప్-2 జట్ల మధ్య.. గెలిచిన జట్టు నేరుగా ఫైనల్లోకి..👉ఎలిమినేటర్(మే 22): టాప్-3, 4 లో ఉన్న జట్ల మధ్య.. ఓడిన జట్టు ఇంటికి.. 👉గెలిచిన జట్టు క్వాలిఫయర్-1లో ఓడిన జట్టుతో క్వాలిఫయర్-2 ఆడుతుంది.👉క్వాలిఫయర్-2(మే 24): గెలిచిన జట్టు ఫైనల్లో అడుగుపెడుతుంది.👉ఫైనల్(మే 26): క్వాలిఫయర్-1- క్వాలిఫయర్-2 మధ్య పోరు. గెలిచిన జట్టు చాంపియన్.చదవండి: Virat Kohli: కోహ్లి నోట రిటైర్మెంట్ మాట.. ఒక్కసారి క్రికెట్‌కు వీడ్కోలు పలికితే! -
IPL 2024: సన్‌రైజర్స్ ప్లే ఆఫ్స్ చేరదు.. ఆ నాలుగు జట్లే! ఫ్యాన్స్ ఫైర్
ఐపీఎల్-2024 ప్లే ఆఫ్స్ రేసు రసవత్తరంగా సాగుతోంది. లీగ్ దశ ముగింపునకు వచ్చినా టాప్-4 బెర్తులపై ఇంత వరకూ స్పష్టత రాలేదు. కోల్‌కతా నైట్ రైడర్స్, రాజస్తాన్ రాయల్స్ ఇప్పటికే ప్లే ఆఫ్స్ చేరగా.. మిగిలిన రెండు స్థానాల కోసం ఆసక్తికర పోటీ నడుస్తోంది.ప్రస్తుతం మూడో స్థానంలో ఉన్న చెన్నై సూపర్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ ఈ రేసులో ముందుండగా.. రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు కూడా ఆశలు ఇంకా సజీవంగానే ఉన్నాయి.చెన్నై ఇప్పటికి 13 మ్యాచ్‌లు ఆడి ఏడింట గెలిచి 14 పాయింట్లు(నెట్ రన్‌రేటు 0.528) సాధించగా.. పన్నెండు ఆడి ఏడింట గెలిచి 14 పాయింట్లతో ఉన్న సన్‌రైజర్స్ నెట్ రన్‌రేటు (0.406) పరంగా కాస్త వెనుకబడి ప్రస్తుతం నాలుగో స్థానంలో ఉంది.అతిపెద్ద సానుకూలాంశంఅయితే, రైజర్స్‌కు ఇంకా రెండు మ్యాచ్‌లు మిగిలి ఉండటం.. అది కూడా సొంతగడ్డపై జరుగనుండటం అతిపెద్ద సానుకూలాంశం. గుజరాత్ టైటాన్స్, పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లలో ఏదో ఒకటి గెలిచినా 16 పాయింట్లతో కనీసం నాలుగో స్థానం ఖరారు చేసుకుంటుంది.మరోవైపు.. ఆర్సీబీ ఖాతాలో 12 పాయింట్లే ఉన్నాయి. మిగిలింది ఇంకొక్క మ్యాచ్. అది కూడా సీఎస్కే(మే 18)తో! ఈ మ్యాచ్‌లో చెన్నైని కచ్చితంగా ఓడిస్తేనే ఆర్సీబీకి అవకాశం ఉంటుంది. లేదంటే ఇంటికి వెళ్లడమే తరువాయి!చెన్నై పరిస్థితి కూడా ఇంచుమించు ఇదే. ఓడితే ఇంటికే లేదంటే సన్‌రైజర్స్ మ్యాచ్‌ల ఫలితం తేలేవరకు వేచి చూడాలి. ఈ సమీకరణల నేపథ్యంలో ఎలా చూసినా సన్‌రైజర్స్ సీఎస్కే, ఆర్సీబీ కంటే ఓ మెట్టు పైనే ఉన్నట్లు స్పష్టమవుతోంది.రెండు మ్యాచ్‌లో ఎస్ఆర్హెచ్ ఓడిపోతే పరిస్థితి ఏంటి?అయితే, టీమిండియా స్పిన్ దిగ్గజం హర్భజన్ సింగ్ మాత్రం సన్‌రైజర్స్ హైదరాబాద్ ఈసారి ప్లే ఆఫ్స్ చేరదంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. స్టార్ స్పోర్ట్స్ షోలో తన అభిప్రాయాలు పంచుకుంటూ.. చెన్నై సూపర్ కింగ్స్‌తో పాటు ఆర్సీబీ టాప్-4లో అడుగుపెడుతుందని జోస్యం చెప్పాడు.‘‘తదుపరి రెండు మ్యాచ్‌లో ఎస్ఆర్హెచ్ ఓడిపోతే పరిస్థితి ఏంటి? ఐపీఎల్లో ఏదైనా జరగొచ్చు కదా! ఒకవేళ హైదరాబాద్ రెండు మ్యాచ్‌లూ ఓడి.. ఆర్సీబీ చెన్నై మీద గెలిస్తే.. అప్పుడు రెండు జట్ల ఖాతాలో 14 పాయింట్లే ఉంటాయి.రన్‌రేటు పరంగా సన్‌రైజర్స్ కంటే ఈ రెండు జట్లు మెరుగ్గానే ఉంటాయి. అందుకే నా టాప్ 4.. కేకేఆర్, రాజస్తాన్, చెన్నై, బెంగళూరు’’ అని హర్భజన్ సింగ్ చెప్పుకొచ్చాడు.భగ్గుమంటున్న ఆరెంజ్ ఆర్మీ ఫ్యాన్స్కాగా భజ్జీ వ్యాఖ్యలపై సన్‌రైజర్స్ హైదరాబాద్ అభిమానులు భగ్గుమంటున్నారు. విధ్వంసకర బ్యాటింగ్‌తో సొంతగడ్డపై చెలరేగే ప్యాట్ కమిన్స్ బృందాన్ని తక్కువ అంచనా వేయడమే గాకుండా.. అపశకునపు మాటలు మాట్లాడటం సరికాదంటూ ఫైర్ అవుతున్నారు. ఇక సన్‌రైజర్స్ గురువారం నాటి మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌తో తలపడనుంది. ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం ఇందుకు వేదిక.చదవండి: అతడి కంటే చెత్త కెప్టెన్ ఇంకొకరు లేరు.. పైగా హార్దిక్‌ను అంటారా?.. గంభీర్ ఫైర్ Ready to put on a show this evening 🧡💙#PlayWithFire #SRHvGT pic.twitter.com/o07Or5fu12— SunRisers Hyderabad (@SunRisers) May 16, 2024 -
ఉప్పల్ స్టేడియంలో ఫుల్ జోష్‌లో SRH, GT ప్లేయర్ల ప్రాక్టీస్ (ఫొటోలు)
-
సిక్సర్ల మోత.. ఐపీఎల్ చరిత్రలో ఇదే తొలిసారి
ఐపీఎల్-2024 తుది అంకానికి చేరుకుంటోంది. ఈ సీజన్లో ప్లే ఆఫ్స్‌లో అడుగుపెట్టిన తొలి జట్టుగా కోల్‌కతా నైట్ రైడర్స్ నిలవగా.. ఢిల్లీ క్యాపిటల్స్- లక్నో సూపర్ జెయింట్స్ మ్యాచ్ ఫలితంతో రాజస్తాన్ రాయల్స్ కూడా టాప్-4కు అర్హత సాధించింది.సొంత మైదానంలో ఢిల్లీ క్యాపిటల్స్ లక్నోను ఓడించడంతో రాజస్తాన్ ప్లే ఆఫ్స్ బెర్తును ఖరారు చేసుకుంది. ఇదిలా ఉంటే.. ఐపీఎల్ తాజా ఎడిషన్‌లో 64వ మ్యాచ్ అయిన ఢిల్లీ- లక్నో పోరు తర్వాత సరికొత్త చరిత్ర ఆవిష్కృతమైంది.ఈసారి ఏకంగాక్యాష్ రిచ్ లీగ్ చరిత్రలో అత్యధిక సిక్సర్లు నమోదైన సీజన్‌గా 2024 నిలిచింది. ఈ ఎడిషన్‌లో ఇప్పటి వరకు మొత్తంగా 1125 సిక్సర్లు నమోదయ్యాయి. ఇక మంగళవారం నాటి మ్యాచ్ సందర్భంగా ఢిల్లీ బ్యాటర్లలో అభిషేక్ పోరెల్ 4, షాయీ హోప్ రెండు, ట్రిస్టన్ స్టబ్స్ 4 సిక్సర్లు బాదగా.. లక్నో ఆటగాళ్లలో నికోలసన్ పూరన్ 4, అర్షద్ ఖాన్ 5, యుద్వీర్ సింగ్ చరక్ ఒక సిక్సర్ కొట్టారు.కాగా ఐపీఎల్-2024 ఆరంభం నుంచే సిక్సర్ల మోత మోగుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా విధ్వంసకర బ్యాటింగ్‌కు మారుపేరుగా మారిన సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో పాటు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కూడా సిక్స్‌ల వర్షం కురిపించింది. తద్వారా ఈ సీజన్లో ఇప్పటి వరకు అత్యధిక సిక్స్‌లు నమోదు చేసిన తొలి రెండు జట్లుగా సన్‌రైజర్స్, ఆర్సీబీ నిలవగా.. అనూహ్య రీతిలో ఢిల్లీ క్యాపిటల్స్ మూడో స్థానం ఆక్రమించింది.ఒక ఐపీఎల్ సీజన్లో అత్యధిక సిక్సర్లు👉1125 సిక్సర్లు - 2024👉1124 సిక్సర్లు - 2023👉1062 సిక్సర్లు - 2022👉872 సిక్సర్లు- 2018👉784 సిక్సర్లు- 20192024లో ఇప్పటి వరకు అత్యధిక సిక్స్‌లు నమోదు చేసిన జట్లు👉సన్‌రైజర్స్ హైదరాబాద్- 12 మ్యాచ్‌లలో 146 సిక్స్‌లు👉ఆర్సీబీ- 13 మ్యాచ్‌లలో 141 సిక్స్‌లు👉ఢిల్లీ క్యాపిటల్స్- 14 మ్యాచ్‌లలో 135 సిక్స్‌లు👉కోల్‌కతా నైట్ రైడర్స్- 12 మ్యాచ్‌లలో 125 సిక్స్‌లు👉ముంబై ఇండియన్స్- 13 మ్యాచ్‌లలో 122 సిక్స్‌లు👉పంజాబ్ కింగ్స్- 12 మ్యాచ్‌లలో 102 సిక్స్‌లు👉రాజస్తాన్ రాయల్స్- 12 మ్యాచ్‌లలో 100 సిక్స్‌లు. Fearless striking from Arshad Khan 🔥He's not given up yet in this chase 💪Watch the match LIVE on @StarSportsIndia and @JioCinema 💻📱#TATAIPL | #DCvLSG pic.twitter.com/JxfdwBnG0t— IndianPremierLeague (@IPL) May 14, 2024 -
కేఎల్ రాహుల్‌కు సారీ.. లక్నోతోనే టీమిండియా స్టార్?!
భారత స్టార్ క్రికెటర్ కెప్టెన్ కేఎల్ రాహుల్ లక్నో సూపర్ జెయింట్స్‌ను వీడనున్నాడనే వార్తల నేపథ్యంలో ఆ జట్టు సన్నిహిత వర్గాలు కీలక అప్డేట్ అందించాయి. కెప్టెన్- యాజమాన్యం మధ్య అంతాబాగానే ఉందని స్పష్టం చేశాయి. కాగా ఐపీఎల్-2024లో హైదరాబాద్‌లో సన్‌రైజర్స్‌తో ఘోర ఓటమి నేపథ్యంలో కేఎల్ రాహుల్‌కు ఘోర అవమానం జరిగిన విషయం తెలిసిందే. లక్నో ఫ్రాంచైజీ యజమాని సంజీవ్ గోయెంకా మైదానంలోకి వచ్చి రాహుల్‌పై తీవ్ర అసహనాన్ని ప్రదర్శించారు. రాహుల్‌పై గోయెంకా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లుగా ఉన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఫలితంగా.. ఫ్రాంచైజీ అసంతృప్తి నేపథ్యంలో రాహుల్ మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో పగ్గాలు వదిలేసి పూర్తిగా బ్యాటింగ్‌పై శ్రద్ధ పెడతాడా లేదా ఫ్రాంఛైజీకి గుడ్‌బై చెబుతాడా? అనేవి చర్చనీయాంశంగా మారాయి. ఈ క్రమంలో.. ‘లక్నో ఈ నెల 14న ఢిల్లీ క్యాపిటల్స్‌తో తలపడుతుంది. ఇందుకు ఇంకా గడువు ఉండటంతో ఏ నిర్ణయం తీసుకోలేదు. మేనేజ్మెంట్ తప్పిస్తుందా లేదంటే కెప్టెన్ రాహులే వైదొలగుతాడా అనే దానిపై త్వరలోనే స్పష్టత వస్తుంది’ అని ఐపీఎల్ వర్గాలు తెలిపాయి.తాజాగా ఈ విషయం గురించి లక్నో వర్గాలు స్పందిస్తూ.. ‘‘కేఎల్ రాహుల్‌ను కెప్టెన్సీ నుంచి తప్పించడమే గాక... వచ్చే వేలంలో కూడా అతడిని లక్నో తీసుకోదు అని వస్తున్నవి కేవలం వదంతులు మాత్రమే.గత మ్యాచ్ ఫలితం మాకు అనుకూలంగా లేదనే బాధ ఉంది. అయితే, జట్టు, ఓనర్ల మధ్య అంతా బాగానే ఉంది. రాహుల్ కూడా బాగున్నాడు. ఢిల్లీతో మ్యాచ్‌కు ముందు అతడు విశ్రాంతి తీసుకుంటున్నాడంతే!’’ అని వార్తా సంస్థ IANSకు తెలిపాయి. కాగా సంజీవ్ గోయెంకా తీరుతో రాహుల్ తీవ్ర మనస్తాపం చెందడం, సోషల్ మీడియాలో తనపై పెద్ద ఎత్తున నెగటివిటీ రావడంతో ఆయన అతడిని క్షమాపణ కోరినట్లు వదంతులు వినిపిస్తున్నాయి.చదవండి: ప్లే ఆఫ్స్ రేసులో ఉండాలంటే.. సన్‌రైజర్స్ చేయాల్సిందిదే! ఆ రెండు జట్లు కన్ఫామ్!? -
అలా అయితేనే ప్లే ఆఫ్స్‌లో సన్‌రైజర్స్.. ఆ రెండు జట్లు కన్ఫామ్!?
చెన్నై సూపర్ కింగ్స్- గుజరాత్ టైటాన్స్ మ్యాచ్ తర్వాత ఐపీఎల్-2024 ప్లే ఆఫ్స్ రేసు మరింత రసవత్తరంగా మారింది. ఇప్పటికే ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ కింగ్స్ టాప్-4 రేసు నుంచి నిష్క్రమించగా.. వరుస విజయాలతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, సీఎస్కేపై తాజా విజయంతో గుజరాత్ టైటాన్స్ ఆశలను సజీవం చేసుకున్నాయి.మరోవైపు ఈ రెండు జట్ల కంటే మెరుగైన స్థితిలో ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్ కూడా ప్లే ఆఫ్స్‌పై కన్నేశాయి. ఇక ఇప్పటికే రన్‌రేటు పరంగా అన్ని జట్ల కంటే పటిష్ట స్థితిలో ఉన్న కోల్‌కతా నైట్ రైడర్స్(16 పాయింట్లు) అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. రాజస్తాన్ రాయల్స్(16 పాయింట్లు) రెండో స్థానం ఆక్రమించింది.మూడో స్థానం కోసం జరిగిన పోరులో చెన్నై సూపర్ కింగ్స్(12 పాయింట్లు)ను వెనక్కి నెట్టి.. సన్‌రైజర్స్ హైదరాబాద్(14 పాయింట్లు) ముందుకు దూసుకువచ్చింది. ఈ నేపథ్యంలో ప్లే ఆఫ్స్‌నకు సంబంధించిన కొన్ని సమీకరణలు ఇలా ఉన్నాయి.కేకేఆర్.. టాప్ఇప్పటికే టాప్-1లో ఉన్న కేకేఆర్ శనివారం ముంబై ఇండియన్స్‌తో తలపడనుంది. సొంతమైదానంలో జరిగే ఈ మ్యాచ్‌లో శ్రేయస్ అయ్యర్ సేన ముంబైని ఓడించిందంటే మరో రెండు పాయింట్లు ఖాతాలో పడతాయి.ఫలితంగా 18 పాయింట్లతో కేకేఆర్ ఈ సీజన్లో ప్లే ఆఫ్స్‌లో అడుగుపెట్టిన తొలి జట్టుగా నిలుస్తుంది. అలా కాక ముంబైతో కాకుండా గుజరాత్ టైటాన్స్, రాజస్తాన్ రాయల్స్‌తో మిగిలిన మ్యాచ్‌లలో ఏ ఒక్కటి గెలిచినా బెర్తు ఖాయమే!అయితే, ఇక్కడో మెలిక ఉంది. రాజస్తాన్, సీఎస్కే, సన్‌రైజర్స్ లేదా లక్నో ఈ జట్లలో మూడు 18 పాయింట్లు సాధిస్తేనే కేకేఆర్ ప్రయాణం సాఫీగా సాగుతుంది. ముఖ్యంగా ముంబైతో మ్యాచ్‌లో ఓడినా రాజస్తాన్‌పై మాత్రం కచ్చితంగా గెలవాలి.రాజస్తాన్.. రైట్ రైట్చెన్నై, పంజాబ్, కేకేఆర్ రూపంలో రాజస్తాన్‌కు ఇంకా మూడు మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. ఇందులో ఏ ఒక్కటి గెలిచినా, కేకేఆర్, సీఎస్కే, లక్నో/సన్రైజర్స్లలో ఏ జట్టు 18 పాయింట్లు సాధించినా రాజస్తాన్ బెర్త్ ఖరారవుతుంది.టాప్-2లో నిలవాలంటే కేకేఆర్‌ను మాత్రం ఓడించడం తప్పనిసరి.సన్‌రైజర్స్ రైజ్ అవ్వాలంటే!సన్‌రైజర్స్‌కు ఇంకా రెండు మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. గుజరాత్ టైటాన్స్, పంజాబ్ కింగ్స్‌ల రూపంలో ప్లే ఆఫ్స్ అవకాశాలను దెబ్బ తీసేందుకు ప్రత్యర్థులు సిద్ధంగా ఉన్నాయి.ఈ రెండు మ్యాచ్‌లలో సన్‌రైజర్స్ గెలిస్తే సన్‌రైజర్స్ టాప్-4కు అర్హత సాధిస్తుంది. ఏ ఒక్కటి ఓడినా ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడక తప్పని దుస్థితి ఎదురవుతుంది.చెన్నై చమక్ అనాలంటే!డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ సీజన్ ఆరంభంలో వరుస విజయాలు సాధించింది. కానీ ఆ తర్వాత పడుతూ లేస్తూ ప్రస్తుతం 12 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉంది.గుజరాత్ టైటాన్స్‌తో శుక్రవారం నాటి మ్యాచ్‌లో ఓటమి తర్వాత సీఎస్కే కాస్త డీలా పడింది. ప్రస్తుతం సీఎస్కేకు రాజస్తాన్, ఆర్సీబీలతో మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి.ఈ రెండింటిలోనూ గెలిస్తేనే సీఎస్కే ప్రయాణా సాఫీగా సాగుతుంది. లేదంటే.. లేదంటే ఢిల్లీ, లక్నోతో సీఎస్కే పోటీపడాల్సి ఉంటుంది. అయితే, రన్‌రేటు పరంగా సీఎస్కే ప్రస్తుతం ఆ రెండు జట్ల కంటే మెరుగ్గా ఉండటం ఊరటనిచ్చే అంశం.ఢిల్లీ దబాంగ్ అనిపించుకోవాలంటే..ఆరంభంలో అపజయాలు ఎదురైనా తిరిగి పుంజుకుని ప్రస్తుతం 12 పాయింట్లతో ఐదో స్థానంలో ఉంది ఢిల్లీ క్యాపిటల్స్. ఆర్సీబీ, ఢిల్లీ క్యాపిటల్స్‌తో మిగిలిన మ్యాచ్‌లలో గెలవడం సహా.. ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది.లక్నో హ్యాట్రిక్ కొట్టాలంటే..ఐపీఎల్ ప్లే ఆఫ్స్‌లో లక్నో హ్యాట్రిక్ కొట్టాలంటే ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లలో తప్పక గెలవాలి. ప్రస్తుతం 12 పాయింట్లతో చెన్నై, ఢిల్లీతో సమానంగా ఉన్నా రన్‌రేటు పరంగా వెనుకబడి ఉంది రాహుల్ సేన.కాబట్టి మిగిలిన రెండు మ్యాచ్‌లలో గెలవడంతో పాటు ప్రస్తుతం టాప్-4లో ఉన్న కేకేఆర్, రాజస్తాన్, సన్‌రైజర్స్, చెన్నై వీలైనన్ని మ్యాచ్‌లు ఓడిపోతేనే లక్నో ఆశలు సజీవంగా ఉంటాయి.ఆర్సీబీ, గుజరాత్ పరిస్థితి ఇదీ!ఆర్సీబీకి ఢిల్లీ, సీఎస్కేలతో మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. ఈ రెండూ కచ్చితంగా గెలిచి.. నెట్ రన్‌రేటు పరంగా మిగతా జట్ల కంటే మెరుగపడటం సహా ఇతర జట్ల ఫలితాల కోసం వేచి చూడాలి. ఒక్క మ్యాచ్ ఓడినా ఇంటికే!గుజరాత్ టైటాన్స్ పరిస్థితి కూడా ఇంచుమించు ఇదే. కేకేఆర్, సన్‌రైజర్స్‌తో మ్యాచ్‌లలో ఏ ఒక్కటి ఓడినా ప్రయాణం ముగిసినట్లే. రెండూ గెలిస్తే అప్పుడు ఇతర జట్ల ఫలితాలు, నెట్ రన్ రేటు తదితర అంశాలపై ఆధారపడాల్సి ఉంటుంది. -
IPL 2024- WI: అలా అయితే.. సన్‌రైజర్స్, రాజస్తాన్‌కు షాక్!
ఐపీఎల్-2024 ప్లే ఆఫ్స్ సమరానికి సమయం ఆసన్నమవుతున్న వేళ వెస్టిండీస్ క్రికెట్ బోర్డు కీలక ప్రకటన చేసింది. సౌతాఫ్రికాతో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు సంబంధించి షెడ్యూల్‌ను విడుదల చేసింది.మే 23, 25, 26 తేదీల్లో ప్రొటిస్ జట్టుతో ద్వైపాక్షిక సిరీస్ ఆడనున్నట్లు వెల్లడించింది. జమైకాలోని సబీనా పార్కు వేదికగా ఈ మూడు మ్యాచ్‌లు జరుగనున్నట్లు వెల్లడించింది. కాగా విండీస్- సౌతాఫ్రికా సిరీస్ సమయంలోనే ఐపీఎల్ పదిహేడో ఎడిషన్ నాకౌట్, క్వాలిఫయర్, ఫైనల్ మ్యాచ్‌లు కూడా జరుగనున్నాయి.సన్‌రైజర్స్, రాజస్తాన్‌కు షాక్!ఈ నేపథ్యంలో ప్లే ఆఫ్స్ చేరిన జట్లలో భాగమైన ఆటగాళ్లను గనుక విండీస్- ప్రొటిస్ బోర్డులు వెనక్కి పిలిపిస్తే ఆయా ఫ్రాంఛైజీలకు తలనొప్పి తప్పదు. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో టాప్-4లో ఉన్న రాజస్తాన్ రాయల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్‌లోనే ఈ రెండు జట్ల ఆటగాళ్లు ఎక్కువగా ఉన్నారు.ప్లే ఆఫ్స్ రేసులో దూసుకుపోతున్న ఈ రెండు జట్లు గనుక కీలక సమయంలో ఆటగాళ్లను కోల్పోతే కష్టాలు తప్పవు. కాగా మే 21న ఐపీఎల్-2024 తొలి క్వాలిఫయర్, మే 22న ఎలిమినేటర్ మ్యాచ్, మే 24న రెండో క్వాలిఫయర్, మే 26న ఫైనల్ జరుగనున్నాయి.మెగా ఈవెంట్‌కు ముందుకాగా గత టీ20 ప్రపంచకప్‌నకు అర్హత సాధించలేక చతికిలపడ్డ వెస్టిండీస్.. ఆ తర్వాత స్వదేశంలో టీమిండియా, ఇంగ్లండ్‌లపై సిరీస్‌లు గెలిచి ఫామ్‌లోకి వచ్చింది. తాజాగా సౌతాఫ్రికాతో సిరీస్‌లోనూ అదే ఫలితం పునరావృతం చేయాలని పట్టుదలగా ఉంది.ఇక జూన్ 1 నుంచి అమెరికా- వెస్టిండీస్ వేదికగా టీ20 ప్రపంచకప్-2024 టోర్నీ జరుగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మెగా ఈవెంట్‌కు ముందు సొంతగడ్డపై సౌతాఫ్రికాతో సిరీస్‌తో విండీస్‌కు కావాల్సినంత ప్రాక్టీస్ దొరకనుంది.ఇదిలా ఉంటే.. ప్రపంచకప్ టోర్నీ నేపథ్యంలో పాకిస్తాన్‌తో ద్వైపాక్షిక సిరీస్ సందర్భంగా ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు ఐపీఎల్ నుంచి తమ ఆటగాళ్లను వెనక్కి పిలిపించేందుకు సమాయత్తమైన విషయం తెలిసిందే.ఐపీఎల్-2024లో భాగమైన వెస్టిండీస్, సౌతాఫ్రికా ఆటగాళ్లు వీరేవిండీస్ ప్లేయర్లురోవ్మన్ పావెల్ (రాజస్తాన్ రాయల్స్), షిమ్రాన్ హెట్మెయిర్ (రాజస్తాన్ రాయల్స్), అల్జారీ జోసెఫ్ (ఆర్సీబీ), షాయ్ హోప్ (ఢిల్లీ క్యాపిటల్స్), షమర్ జోసెఫ్ (లక్నో సూపర్ జెయింట్స్), నికోలస్ పూరన్ (లక్నో సూపర్ జెయింట్స్), ఆండ్రీ రస్సెల్ (కోల్‌కతా నైట్ రైడర్స్), రొమారియో షెఫర్డ్ (ముంబై ఇండియన్స్).సౌతాఫ్రికా ఆటగాళ్లుఐడెన్ మార్క్రమ్ (సన్‌రైజర్స్ హైదరాబాద్), హెన్రిచ్ క్లాసెన్ (సన్‌రైజర్స్ హైదరాబాద్), మార్కో జాన్సన్ (సన్‌రైజర్స్ హైదరాబాద్), గెరాల్డ్ కోట్జీ (ముంబై ఇండియన్స్), క్వింటన్ డికాక్ (లక్నో సూపర్ జెయింట్స్), కేశవ్ మహరాజ్ (రాజస్తాన్ రాయల్స్), డేవిడ్ మిల్లర్ (గుజరాత్ టైటాన్స్), అన్రిచ్ నోర్జే (దక్షిణాఫ్రికా), కగిసో రబడ (పంజాబ్ కింగ్స్), ట్రిస్టన్ స్టబ్స్ (ఢిల్లీ క్యాపిటల్స్).చదవండి: గుజరాత్ టైటాన్స్ జట్టు మొత్తానికి భారీ జరిమానా.. గిల్‌కు ఏకంగా! -
KL Rahul: జట్టు గెలవాలన్న తపనే అది: ఆసీస్ దిగ్గజం.
రెండేళ్ల క్రితం ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో అడుగుపెట్టింది లక్నో సూపర్ జెయింట్స్. కేఎల్ రాహుల్ కెప్టెన్సీలో వరుసగా రెండుసార్లు ప్లే ఆఫ్స్ చేరింది. తద్వారా క్యాష్ రిచ్ లీగ్ ఆరంభం నుంచి ఉన్న కొన్ని జట్లకు సాధ్యం కాని ఘనతను లక్నో సాధించింది.ఐపీఎల్-2024లోనూ ప్లే ఆఫ్స్ రేసులో ముందుకు వెళ్లాలని పట్టుదలగా ఉంది. కేఎల్ రాహుల్ వికెట్ కీపర్ బ్యాటర్‌గా, కెప్టెన్‌గా రాణిస్తూ జట్టును టాప్-4లో నిలిపేందుకు తన వంతు కృషి చేస్తున్నాడు.అయితే, టాప్-4లో అడుగుపెట్టాలంటే కీలకమైన మ్యాచ్‌లో లక్నో చిత్తుగా ఓడిపోయింది. సన్‌రైజర్స్ హైదాబాద్తో బుధవారం నాటి మ్యాచ్‌లో పది వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. ఈ మ్యాచ్‌లో కేఎల్ రాహుల్ బ్యాటర్‌గా, సారథిగా విఫలమయ్యాడు.ఈ నేపథ్యంలో లక్నో సూపర్ జెయింట్స్ యజమాని సంజీవ్ గోయెంకా అందరి ముందే కేఎల్ రాహుల్, కోచ్ జస్టిన్ లాంగర్‌కు గట్టిగా చీవాట్లు పెట్టాడు. దీంతో సంజీవ్ గోయెంకా తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రెండుసార్లు జట్టును ప్లే ఆఫ్స్ వరకు తీసుకువచ్చిన కెప్టెన్‌కు మీరిచ్చే గౌరవం ఇదేనా అంటూ మహ్మద్ షమీ వంటి ప్రముఖులు ఫైర్ అవుతున్నారు.ఈ క్రమంలో ఆస్ట్రేలియా దిగ్గజ పేసర్ బ్రెట్ లీ భిన్నంగా స్పందించాడు. ‘‘అందరి ముందు అలా మాట్లాడేకంటే.. లోపలికి వెళ్లిన తర్వాత చర్చించాల్సింది. ఒకవేళ అదే జరిగితే ఈ విషయం గురించి స్పందించమనే ప్రశ్న నాకు ఎదురయ్యేదే కాదు.అయితే, నాణేనికి మరోవైపు కూడా ఆలోచించాలి. ఆట పట్ల జట్ల యజమానులు, కోచ్‌లకు ఉన్న ప్యాషన్‌ను మనం అర్థం చేసుకోవాలి. వాళ్ల జట్టు అత్యుత్తమంగా రాణించాలని కోరుకోవడంలో తప్పు లేదు. బహుశా అందుకే ఈ ఘటన జరిగి ఉంటుంది’’ అని బ్రెట్ లీ ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో వ్యాఖ్యానించాడు. చదవండి: ద్రవిడ్ గుడ్ బై!.. టీమిండియా కొత్త కోచ్‌గా ఫారినర్?.. జై షా కామెంట్స్ వైరల్ -
కౌంటీల్లో ఆడనున్న సన్‌రైజర్స్ మాజీ బౌలర్
సన్‌రైజర్స్ మాజీ పేసర్, టీమిండియా బౌలర్ సిద్దార్థ్ కౌల్ ఇంగ్లండ్ కౌంటీల్లో ఆడేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. కౌంటీ ఛాంపియన్షిప్ 2024 సీజన్ కోసం నార్తంప్టన్‌షైర్ కౌంటీ ఇతన్ని ఎంపిక చేసుకుంది. ఈ మేరకు నార్తంప్టన్‌షైర్ కౌంటీ ఓ ప్రకటన విడుదల చేసింది. మే 10 నుంచి గ్లోసెస్టర్‌షైర్‌తో జరుగబోయే మ్యాచ్‌లో సిద్దార్థ్ నార్తంప్టన్‌షైర్‌కు ప్రాతినిథ్యం వహిస్తాడు. సిద్దార్థ్ తొలిసారి ఇంగ్లండ్ కౌంటీల్లో ఆడేందుకు ఒప్పందం చేసుకున్నాడు. ఆస్ట్రేలియా ఆటగాడు క్రిస్ ట్రెమెయిన్కు ప్రత్యామ్నాంగా సిద్దార్థ్‌ను నార్తంప్టన్‌షైర్ ఎంపిక చేసుకుంది. 33 ఏళ్ల సిద్దార్థ్ 2023 సీజన్ వరకు ఐపీఎల్లో బిజీగా ఉన్నాడు. గత సీజన్లో అతను ఆర్సీబీకి ఆడాడు. సిద్దార్థ్ ఐపీఎల్ అరంగేట్రం సీజన్లో కేకేఆర్‌కు, ఆతర్వాత 2013-2014 వరకు ఢిల్లీ డేర్‌డెవిల్స్‌కు.. 2016-2021 వరకు సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ప్రాతినిథ్యం వహించాడు. సన్‌రైజర్స్‌కు ఆడుతున్నప్పుడు సిద్దార్థ్ చాలా పేరు వచ్చింది. అక్కడి ప్రదర్శనలతోనే అతను టీమిండియాకు ఎంపికయ్యాడు. దేశవాలీ క్రికెట్లో పంజాబ్‌కు ఆడే సిద్దార్థ్‌కు ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో మంచి ట్రాక్ రికార్డు ఉంది. ఇతను పంజాబ్ తరఫున 59 మ్యాచ్‌ల్లో 205 వికెట్లు పడగొట్టాడు. ఇందులో 12 ఐదు వికెట్ల ఘనతలు ఉన్నాయి. సిద్దార్థ్ టీమిండియా ఛాంపియన్‌గా నిలిచిన 2008 అండర్-19 ప్రపంచకప్‌లో సభ్యుడిగా ఉన్నాడు. ఆ మెగా టోర్నీలో యువ భారత్ విరాట్ కోహ్లి సారథ్యంలో టైటిల్ గెలిచింది. టీమిండియా తరఫున 3 వన్డేలు, 2 టీ20లు ఆడిన సిద్దార్థ్ ఐపీఎల్ కెరీర్లో 55 మ్యాచ్‌లు ఆడి 58 వికెట్లు పడగొట్టాడు. -
IPL 2024: పిచ్చెక్కిస్తున్న సన్‌రైజర్స్.. ఈసారి టైటిల్ పక్కా..!
ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆటగాళ్లు ఏ రేంజ్లో రెచ్చిపోతున్నారో ప్రత్యక్షంగా చూస్తున్నాం. ఈ సీజన్లో ఆరెంజ్ ఆర్మీ గతంలో ఎన్నడూ లేనంతగా అన్ని విభాగాల్లో పటిష్టంగా ఉంది. ఇంతటి సమతూకమైన జట్టు బహుశా పొట్టి క్రికెట్ చరిత్రలో ఎక్కడా లేదనే చెప్పవచ్చు. బ్యాటింగ్ విభాగంలో సన్‌రైజర్స్ ప్రదర్శన న భూతో న భవిష్యతి అన్న చందంగా ఉంది. ఈ జట్టులో ఉన్నటువంటి విధ్వంసకర వీరులు యావత్ పొట్టి క్రికెట్ చరిత్రలోనే ఏ జట్టులోనూ లేరు. ఓపెనర్ల దగ్గరి నుంచి ఎనిమిది, తొమ్మిదో స్థానం ఆటగాళ్ల వరకు అందరూ మెరుపు వీరులే ఉన్నారు.ఓపెనర్లు అభిషేక్, హెడ్ ఊచకోత గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. వీరిద్దరు తమకెదురైన ప్రతి బౌలర్‌ను గడగడలాడిస్తున్నారు. వీరి దెబ్బకు బ్యాటింగ్ రికార్డులు ఒక్కొటిగా బద్దలవుతూ ఉన్నాయి. వీరిద్దరి తర్వాత బ్యాటింగ్‌కు దిగే మార్క్రమ్, క్లాసెన్ విధ్వంసం ఇంకో లెవెల్లో ఉంది. వీరు కూడా తమేమీ తక్కువ కాదు అన్నట్లు విధ్వంసం సృస్టిస్తున్నారు.మార్క్రమ్ గత కొన్ని మ్యాచ్‌లుగా లయ తప్పినట్లు కనిపిస్తున్నా క్లాసెన్ మాత్రం అవకాశం దొరికిన ప్రతిసారి రెచ్చిపోతున్నాడు. ఈ నలుగురితో పాటు యువ ఆల్‌రౌండర్లు నితీశ్ రెడ్డి, అబ్దుల్ సమద్, షాబాజ్ అహ్మద్, పాట్ కమిన్స్‌లు కూడా తమ దాకా వస్తే మెరుపులు మెరిపిస్తున్నారు.బౌలింగ్ విభాగంలో సైతం సన్‌రైజర్స్ చాలా పటిష్టంగా ఉంది. స్వింగ్ సుల్తాన్ భునేశ్వర్ కుమార్ అద్భుతంగా రాణిస్తున్నాడు. ఇతనికి కమిన్స్, నటరాజన్, ఉనద్కత్ తోడవుతున్నారు. నిన్న లక్నోతో జరిగిన మ్యాచ్‌తో ఐపీఎల్ అరంగేట్రం స్పిన్నర్ విజయ్‌కాంత్ వియాస్కాంత్ పర్వాలేదనిపించాడు. షాబాజ్ అహ్మద్, నితీశ్ రెడ్డి కూడా బంతితో రాణిస్తున్నారు.సన్‌రైజర్స్ బ్యాటింగ్, బౌలింగ్ విభాగాలతో పాటు ఫీల్డింగ్‌లోనూ పటిష్టంగా ఉంది. లక్నోతో జరిగిన మ్యాచ్‌లో నితీశ్, సన్వీర్ సింగ్ పట్టిన క్యాచ్‌లే ఇందుకు నిదర్శనం. ఈ సీజన్లో సన్‌రైజర్స్ బెంచ్ కూడా చాలా పటిష్టంగా ఉంది. ఎంతలా అంటే.. బెంచ్‌పై ఉన్న ఆటగాళ్లతో మరో సమతూకమైన జట్టును తయారు చేయవచ్చు. మొత్తంగా ఈ సీజన్లో ఆరెంజ్ ఆర్మీ గతంలో ఎన్నడూ లేనట్లు అత్యంత పటిష్టంగా కనిపిస్తూ టైటిల్ దిశగా పరుగులు పెడుతుంది. ఈసారి సన్‌రైజర్స్ టైటిల్ ఎగరేసుకుపోవడం పక్కా అని అభిమానులు ధీమాగా ఉన్నారు. విశ్లేషకులు, మాజీలు సైతం ఇదే విషయాన్ని చెబుతున్నారు. -
పిచ్ స్వరూపం మారిందా లేక మార్చేశారా.. మరీ ఈ రేంజ్లో విధ్వంసమా..?
ఐపీఎల్ 2024 సీజన్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నారు. దాదాపుగా ప్రతి మ్యాచ్‌లో పట్టపగ్గాల్లేకుండా విరుచుకుపడుతున్నారు. ఓపెనర్లు అభిషేక్ శర్మ, ట్రవిస్ హెడ్ విధ్వంసం మాటల్లో వర్ణించలేనట్లుగా ఉంది. వీరిద్దరి ఊచకోత ధాటికి పొట్టి క్రికెట్ రికార్డులు బద్దలవుతున్నాయి. నిన్న లక్నోతో జరిగిన మ్యాచ్‌లో వీరి విధ్వంసం వేరే లెవెల్లో ఉంది. వీరిద్దరు లక్నో బౌలర్లపై నిర్దాక్షిణ్యంగా విరుచుకుపడ్డారు. ఫలితంగా 166 పరుగుల ఓ మోస్తరు లక్ష్యం 9.4 ఓవర్లలోనే తునాతునకలైంది. అభిషేక్ (28 బంతుల్లో 75 నాటౌట్; 8 ఫోర్లు, 6 సిక్సర్లు), హెడ్ (30 బంతుల్లో 89 నాటౌట్; 8 ఫోర్లు, 8 సిక్సర్లు) ఊహకందని విధ్వంసం సృష్టించి తమ జట్టుకు చిరస్మరణీయ విజయాన్నందించారు. ఈ విజయంతో సన్‌రైజర్స్ ప్లే ఆఫ్స్ అవకాశాలను మరింత మెరుగుపర్చుకుంది.పిచ్ స్వరూపం మారిందా.. ఆ ఇద్దరూ మార్చేశారా..?నిన్నటి మ్యాచ్‌లో అభిషేక్, హెడ్ విధ్వంసం ఏ రేంజ్లో సాగిందన్నదానికి ఓ విషయం అద్దం పడుతుంది. ఈ మ్యాచ్‌లో లక్నో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఉప్పల్ మైదానంలోని పిచ్ ఆనవాయితీగా తొలుత బ్యాటింగ్ చేసే జట్లకు సహకరిస్తుంది. అయితే సన్‌రైజర్స్ బౌలర్లు, ముఖ్యంగా భువీ చెలరేగడంతో లక్నో ఇన్నింగ్స్ నత్తనడకలా సాగింది. ఆఖర్లో పూరన్, బదోని మెరుపులు మెరిపించడంతో లక్నో గౌరవప్రదమైన స్కోర్ చేయగలిగింది.ఇక్కడ ఓ ఆసక్తికర విషయం ఏంటంటే.. లక్నో తొలుత బ్యాటింగ్ చేస్తూ పవర్ ప్లేలో (తొలి 6 ఓవర్లలో) 2 వికెట్లు కోల్పోయి కేవలం 27 పరుగులు మాత్రమే చేసింది. అదే సన్‌రైజర్స్ తొలి ఆరు ఓవర్లలో మాటల్లో వర్ణించలేని విధ్వంసాన్ని సృష్టించి ఏకంగా 107 పరుగులు పిండుకుంది. సన్‌రైజర్స్ ఓపెనర్ల విధ్వంసం చూశాక అభిమానులు పలు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. పిచ్ స్వరూపం మారిందా లేక ఆ ఇద్దరూ మార్చేశారా..? అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఒకే మ్యాచ్‌లో పవర్ ప్లేల్లో మరీ ఇంత వ్యత్యాసమా అని ముక్కునవేల్లేసుకుంటున్నారు. ఇరు జట్ల పవర్ ప్లే స్కోర్లలో 80 పరుగుల వ్యత్యాసం ఉంది. మొత్తానికి నిన్నటి మ్యాచ్‌లో సన్‌రైజర్స్ ఓపెనర్ల విధ్వంసం ధాటికి పలు రికార్డులు బద్దలయ్యాయి. వాటిపై ఓ లుక్కేద్దాం.ఐపీఎల్ పవర్ ప్లేల్లో రెండో అత్యధిక స్కోర్ (107/0)ఐపీఎల్లో సన్‌రైజర్స్ మాత్రమే రెండు సందర్భాల్లో (ఇదే సీజన్లో ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో (125/0) పవర్ ప్లేల్లో 100 పరుగుల మార్కును దాటింది.ఓ మ్యాచ్ పవర్ ప్లేల్లో అత్యధిక వ్యత్యాసం (80 పరుగులు- లక్నో 27/2, సన్‌రైజర్స్ 107/0)లక్నోకు పవర్ ప్లేల్లో ఇదే అత్యల్ప స్కోర్ (27/2)ఈ సీజన్ బ్యాటింగ్ పవర్ ప్లేల్లో ట్రవిస్ హెడ్‌కు ఇది నాలుగో అర్ద సెంచరీ. ఓ సీజన్ పవర్ ప్లేల్లో ఇవే అత్యధికం.ఒకే సీజన్లో 20 బంతుల్లోపే మూడు హాఫ్ సెంచరీలు సాధించిన హెడ్. ఐపీఎల్ చరిత్రలో ఢిల్లీ ఆటగాడు జేక్ ఫ్రేజర్, హెడ్ మాత్రమే ఈ ఘనత సాధించారు.ఐపీఎల్ చరిత్రలో రెండో వేగవంతమైన 100 పరుగుల భాగస్వామ్యం (అభిషేక్, హెడ్ (34 బంతుల్లో). ఇదే జోడీ పేరిటే వేగవంతమైన 100 పరుగుల భాగస్వామ్యం రికార్డు కూడా నమోదై ఉంది. ఇదే సీజన్లో ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌ల్లో ఈ ఇద్దరు 30 బంతుల్లోనే 100 పరుగుల పార్ట్‌నర్‌షిప్‌ను నమోదు చేశారు.ఐపీఎల్ చరిత్రలోనే తొలి 10 ఓవర్లలో అత్యధిక స్కోర్ (సన్‌రైజర్స్ 9.4 ఓవర్లలో 167/0)100కు పైగా లక్ష్య ఛేదనలో అత్యధిక మార్జిన్‌తో విజయం (166 పరుగుల లక్ష్యాన్ని మరో 62 బంతులు మిగిలుండగానే ఛేదించిన సన్‌రైజర్స్)మూడో వేగవంతమైన 100 పరుగులు (జట్టు స్కోర్)-5.4 ఓవర్లలో 100 పరుగులు టచ్ చేసిన సన్రైజర్స్ఓ సింగిల్ ఎడిషన్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన జట్టుగా రికార్డుల్లోకెక్కిన సన్‌రైజర్స్. ఆరెంజ్ ఆర్మీ ఈ సీజన్లో ఇప్పటికే 146 సిక్సర్లు బాదింది. 2018 సీజన్లో సీఎస్కే 145 సిక్సర్లతో రెండో స్థానంలో ఉంది. -
చరిత్ర సృష్టించిన సన్‌రైజర్స్.. ప్రపంచంలోనే తొలి టీ20 జట్టుగా..
ఐపీఎల్-2024లో ముంబై ఇండియన్స్ చేతిలో ఓటమి తర్వాత అదిరిపోయే కమ్‌బ్యాక్ ఇచ్చింది సన్‌రైజర్స్ హైదరాబాద్. సొంత మైదానం ఉప్పల్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌ను చిత్తు చిత్తుగా ఓడించింది.ఓపెనర్లు అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ తుఫాన్ ఇన్నింగ్స్ కారణంగా క్యాష్ రిచ్ లీగ్ చరిత్రలో తొలిసారి లక్నోపై విజయం నమోదు చేసింది. అదే విధంగా ఈ సీజన్లో ఆడిన 12 మ్యాచ్‌లలో ఏడో గెలుపు నమోదు చేసింది.విధ్వంసకర బ్యాటింగ్తద్వారా 14 పాయింట్లతో పట్టికలో మూడోస్థానానికి ఎగబాకి.. ప్లే ఆఫ్స్ రేసులో ముందుకు దూసుకువచ్చింది. కాగా లక్నోతో మ్యాచ్ సందర్భంగా సన్‌రైజర్స్ సరికొత్త ప్రపంచ రికార్డు సాధించింది. ఓపెనర్లు అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ విధ్వంసకర బ్యాటింగ్ వల్లే ఇది సాధ్యమైంది.ఉప్పల్‌లో టాస్ గెలిచిన లక్నో తొలుత బ్యాటింగ్ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది రాహుల్ సేన.సునామీ ఇన్నింగ్స్అయితే, లక్ష్య ఛేదనకు దిగిన తర్వాత లక్నోకు ఏమాత్రం అవకాశం ఇవ్వలేదు రైజర్స్ ఓపెనర్లు. ట్రావిస్ హెడ్ ఆది నుంచే దూకుడుగా బ్యాటింగ్ చేస్తూ లక్నో బౌలర్లను ఒత్తిడిలోకి నెట్టాడు. అతడి ప్రోద్బలంతో అభిషేక్ శర్మ కూడా హిట్టింగ్తో మెరిశాడు.హెడ్ 30 బంతుల్లోనే 89 పరుగులతో దుమ్ములేపగా.. అభిషేక్ 28 బంతుల్లో 75 పరుగులతో విరుచుకుపడ్డాడు. వీరిద్దరి సునామీ ఇన్నింగ్స్ కారణంగా 8.2 ఓవర్లలోనే 150 పరుగుల మార్కు అందుకుంది.ప్రపంచంలోనే తొలి జట్టు👉టీ20 చరిత్రలో అత్యంత తక్కువ ఓవర్లలో ఇలా 150 స్కోరు చేసిన తొలి జట్టు సన్‌రైజర్స్ కావడం విశేషం. ఇక హెడ్, అభి విధ్వంసం కారణంగా సన్‌రైజర్స్ 9.4 ఓవర్లలోనే లక్నో విధించిన 166 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది.తద్వారా మరో వరల్డ్ రికార్డు కూడా సాధించింది. టీ20 క్రికెట్ చరిత్రలో 150కి పైగా లక్ష్యాన్ని అత్యంత వేగంగా ఛేదించిన జట్టుగా నిలిచింది. లక్నోతో మ్యాచ్ సందర్భంగా సన్‌రైజర్స్ సాధించిన ప్రపంచ రికార్డులు క్లుప్తంగా..టీ20 హిస్టరీలో ఫాస్టెస్ట్ 150+ ఛేజింగ్1. సన్‌రైజర్స్ హైదరాబాద్- లక్నో సూపర్ జెయింట్స్ మీద- 9.4 ఓవర్లలోఏ 166 పరుగుల లక్ష్య ఛేదన.2. బ్రిస్బేన్ హీట్- మెల్బోర్న్ స్టార్స్ మీద- 10 ఓవర్లలో 157 పరుగుల లక్ష్య ఛేదన.3. గయానా అమెజాన్ వారియర్స్- జమైకా తలావాస్- 10.3 ఓవర్లలో 150 పరుగుల లక్ష్య ఛేదన.ఐపీఎల్ చరిత్రలో 10 ఓవర్లలోపే మూడుసార్లు అత్యధిక పరుగులు సాధించిన ఏకైక జట్టు సన్‌రైజర్స్ హైదరాబాద్👉లక్నో సూపర్ జెయింట్స్ మీద- 167/0 (9.4)- 2024లో👉ఢిల్లీ క్యాపిటల్స్ మీద- 157/4- 2024లో👉ముంబై ఇండియన్స్ మీద- 148/2- 2024లో.WHAT. A. CHASE 🧡A 🔟-wicket win for @SunRisers with more than 🔟 overs to spare! Scorecard ▶️ https://t.co/46Rn0QwHfi#TATAIPL | #SRHvLSG pic.twitter.com/kOxzoKUpXK— IndianPremierLeague (@IPL) May 8, 2024 -
కొడితే ఫోర్లు, సిక్సర్లే!.. ఓడిపోతే అందరూ అనేవాళ్లే!
‘‘నాకసలు ఏం మాట్లాడాలో అర్థం కావడం లేదు. టీవీలోనే ఇలాంటి బ్యాటింగ్ చూశాం. కానీ ఇప్పుడిలా.. అస్సలు నమ్మలేకపోతున్నాం. ప్రతి బంతి బౌండరీ లేదంటే సిక్సర్.వారి నైపుణ్యాలకు హ్యాట్సాఫ్. సిక్స్‌లు కొట్టేందుకు వాళ్లు పడిన శ్రమ ఇక్కడ కనిపిస్తోంది. సెకండ్ ఇన్నింగ్స్‌లో అసలు పిచ్ ఎలా ఉంటుందో అంచనా వేసే ఛాన్స్ కూడా వాళ్లు మాకివ్వలేదు.మొదటి బంతి నుంచే వారి దూకుడు కొనసాగగా.. మేము ఏ దశలోనూ అడ్డుకట్ట వేయలేకపోయాం. జట్టు ఓడిపోయినట్లయితే.. మనం తీసుకున్న ప్రతీ నిర్ణయాన్ని ప్రశ్నిస్తూనే ఉంటారు.మేము కనీసం ఇంకో 40- 50 పరుగులు చేయాల్సింది. పవర్ ప్లేలో వికెట్లు కోల్పోయిన తర్వాత అస్సలు కోలుకోలేకపోయాం. ఆయుశ్, నిక్కీ అద్భుతంగా బ్యాటింగ్ చేసినందు వల్లే 166 టార్గెట్ విధించగలిగాం’’ అని లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ అన్నాడు.ఒకవేళ తాము 240 పరుగులు చేసినా సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఆ లక్ష్యాన్ని ఛేదించేదేనేమో అంటూ ప్రశంసలు కురిపించాడు. కాగా ఐపీఎల్-2024 తాజా మ్యాచ్‌లో లక్నో సన్‌రైజర్స్‌తో తలపడింది.టాపార్డర్ పూర్తిగా విఫలం ఉప్పల్‌లో బుధవారం జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన లక్నో తొలుత బ్యాటింగ్ చేసి.. పరుగులు రాబట్టేందుకు ఆపసోపాలు పడింది. ఓపెనర్, కెప్టెన్ కేఎల్ రాహుల్(29) సహా టాపార్డర్‌లో క్వింటన్ డికాక్(2), మార్కస్ స్టొయినిస్(3) పూర్తిగా విఫలమయ్యారు.నాలుగో నంబర్ బ్యాటర్ కృనాల్ పాండ్యా(21 బంతుల్లో 24) నిలదొక్కునే ప్రయత్నం చేసినా రైజర్స్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ అతడి పప్పులు ఉడకనివ్వలేదు. దీంతో కష్టాల్లో పడిన లక్నోను నికోలస్ పూరన్(26 బంతుల్లో 48), ఆయుశ్ బదోని(30 బంతుల్లో 55) ఆదుకున్నారు.పరుగుల సునామీవీరిద్దరి భాగస్వామ్యం కారణంగానే లక్నో నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 165 పరుగులు చేయగలిగింది. అయితే, లక్ష్య ఛేదనలో ఊహించని విధంగా పరుగుల సునామీ సృష్టించారు సన్‌రైజర్స్ ఓపెనర్లు అభిషేక్ శర్మ(28 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్స్‌లు- 75 పరుగులు), ట్రావిస్ హెడ్(30 బంతుల్లో 8 ఫోర్లు, 8 సిక్స్‌లు- 89 రన్స్).కొడితే బౌండరీ లేదంటే సిక్స్ అన్నట్లుగా సాగింది వీళ్లిద్దరి విధ్వంసం. అభిషేక్ 267.86, హెడ్ 296.67 స్ట్రైక్‌రేటుతో బ్యాటింగ్ చేయడంతో.. దెబ్బకు 9.4 ఓవర్లలోనే టార్గెట్ పూర్తి చేసింది సన్‌రైజర్స్.పాపం రాహుల్లక్నోను 10 వికెట్ల తేడాతో చిత్తు చేసింది. ఇక ఈ పరుగుల విధ్వంసానికి సాక్షిగా నిలిచిన వికెట్ కీపర్ బ్యాటర్, కెప్టెన్ కేఎల్ రాహుల్ ఓటమి అనంతరం పైవిధంగా స్పందించాడు. కాగా ఓటమి నేపథ్యంలో లక్నో యజమాని సంజీవ్ గోయెంకా రాహుల్‌పై సీరియస్ అయ్యాడు. చదవండి: SRH: కాస్త ఓపిక పట్టు.. నీకూ టైమ్ వస్తుంది: యువీ పోస్ట్ వైరల్WHAT. A. CHASE 🧡A 🔟-wicket win for @SunRisers with more than 🔟 overs to spare! Scorecard ▶️ https://t.co/46Rn0QwHfi#TATAIPL | #SRHvLSG pic.twitter.com/kOxzoKUpXK— IndianPremierLeague (@IPL) May 8, 2024 -
SRH: కాస్త ఓపిక పట్టు.. నీకూ టైమ్ వస్తుంది: యువీ పోస్ట్ వైరల్
#Abhishek Sharma: లక్నో సూపర్ జెయింట్స్‌తో మ్యాచ్ సందర్భంగా సన్‌రైజర్స్ యువ ఓపెనర్ అభిషేక్ శర్మ మరోసారి తన బ్యాటింగ్ పవర్ చూపించాడు. గత కొన్ని రోజులుగా భారీ స్కోర్లు నమోదు చేయలేక చతికిల పడిన ఈ లెఫ్టాండర్ బ్యాటర్.. ఉప్పల్‌లో మాత్రం శివాలెత్తిపోయాడు.మరో ఓపెనర్ ట్రావిస్ హెడ్(30 బంతుల్లో 89)తో కలిసి ఆకాశమే హద్దుగా చెలరేగాడు. లక్నో విధించిన 166 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో 8 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 28 బంతుల్లోనే 75 పరుగులు సాధించాడు అభిషేక్ శర్మ.హెడ్‌తో కలిసి అజేయంగా నిలిచి 9.4 ఓవర్లలోనే సన్‌రైజర్స్ టార్గెట్ పూర్తి చేసి ఉప్పల్ స్టేడియాన్నిహోరెత్తించాడు. ఈ నేపథ్యంలో అభిషేక్ శర్మపై ప్రశంసల వర్షం కురుస్తోంది.That's Sunrisers Hyderabad for you 💥#IPLonJioCinema #SRHvLSG #TATAIPL pic.twitter.com/xFiuuafuXa— JioCinema (@JioCinema) May 8, 2024యువీ పాజీకి థాంక్స్ఇక మ్యాచ్ అనంతరం అభిషేక్ శర్మ మాట్లాడుతూ.. ‘‘ఈ టోర్నీ ఆరంభానికి ముందు నేను చేసిన హార్డ్‌వర్క్ ఫలితాన్నిస్తోంది. యువీ పాజీ(యువరాజ్ సింగ్), బ్రియన్ లారా, నా తండ్రికి ధన్యవాదాలు. మా నాన్నే నా మొదటి కోచ్’’ అంటూ ఉద్వేగానికి లోనయ్యాడు 23 ఏళ్ల అభిషేక్.కాస్త ఓపికగా పట్టుఈ నేపథ్యంలో యువరాజ్ సింగ్ స్పందిస్తూ.. ‘‘అద్భుతంగా ఆడావు అభిషేక్ శర్మ. ఇలాగే నిలకడగా ఆడు. కాస్త ఓపికగా ఉండు! త్వరలోనే నీకూ టైమ్ వస్తుంది’’ అంటూ టీమిండియాలో ఎంట్రీ ఇవ్వాలని ఆకాంక్షించాడు.అదే విధంగా ట్రావిస్ హెడ్ గురించి ప్రస్తావిస్తూ.. ‘‘నువ్వు ఏ గ్రహం నుంచి వచ్చావు ఫ్రెండ్? అస్సలు నమ్మలేకున్నాం’’ అని యువీ అతడిని ఆకాశానికెత్తాడు. కాగా టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ పంజాబ్ యువ సంచలనం అభిషేక్ శర్మకు మెంటార్!!సూపర్ అభికాగా ఐపీఎల్-2024లో అభిషేక్ శర్మ నమోదు చేసిన స్కోర్లు వరుసగా.. 32(19), 63(23), 29(20), 37(12), 16(11), 34(22), 46(12), 31(13), 15(9), 12(10), 11(16), 75*(28). మొత్తం 195 బంతుల్లో 35 సిక్సర్ల సాయంతో 401 పరుగులు.సన్‌రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ లక్నో సూపర్ జెయింట్స్ స్కోర్లు👉వేదిక: ఉప్పల్ స్టేడియం.. హైదరాబాద్👉టాస్: లక్నో.. బ్యాటింగ్👉లక్నో స్కోరు: 165/4 (20)👉సన్‌రైజర్స్ స్కోరు: 167/0 (9.4)👉ఫలితం: 10 వికెట్ల తేడాతో లక్నోను చిత్తు చేసిన సన్‌రైజర్స్👉ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: ట్రావిస్ హెడ్ (30 బంతుల్లో 8 ఫోర్లు, 8 సిక్స్‌ల సాయంతో 89 రన్స్- నాటౌట్). -
Playoffs: పాండ్యాకు పరాభవం.. ముంబై కథ ముగిసిందిలా!
ఐపీఎల్-2024 ప్లే ఆఫ్స్ రేసు నుంచి ముంబై ఇండియన్స్ నిష్క్రమించింది. సన్‌రైజర్స్ హైదరాబాద్- లక్నో సూపర్ జెయింట్స్ మధ్య బుధవారం మ్యాచ్ ఫలితంతో పాండ్యా సేన టాప్-4 ఆశలు గల్లంతయ్యాయి. లక్నోను సన్‌రైజర్స్ చిత్తు ఓడించడంతో ఈ సీజన్లో ముంబై ప్రయాణం ముగిసినట్లయింది.ఎలా అంటే?ఉప్పల్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ లక్నోను పది వికెట్ల తేడాతో చిత్తుగా ఓడించింది. కేఎల్ రాహుల్ సేన విధించిన 166 పరుగుల లక్ష్యాన్ని వికెట్ నష్టపోకుండా 9.4 ఓవర్లలోనే ఛేదించింది.WHAT. A. CHASE 🧡A 🔟-wicket win for @SunRisers with more than 🔟 overs to spare! Scorecard ▶️ https://t.co/46Rn0QwHfi#TATAIPL | #SRHvLSG pic.twitter.com/kOxzoKUpXK— IndianPremierLeague (@IPL) May 8, 2024తద్వారా క్యాష్ రిచ్ లీగ్ పదిహేడో ఎడిషన్‌లో ఏడో విజయం(పన్నెండు మ్యాచ్‌లకు గానూ) నమోదు చేసి.. మొత్తంగా 14 పాయింట్లు సాధించింది. నెట్ రన్‌రేటు(0.406) కూడా మెరుగుపరచుకుని పట్టికలో మూడో స్థానానికి చేరుకుంది. టాప్-2లో తిష్ట వేసిన కేకేఆర్, రాజస్తాన్‌మరోవైపు.. కోల్‌కతా నైట్ రైడర్స్(రన్‌రేటు 1.453), రాజస్తాన్ రాయల్స్(రన్‌రేటు 0.476) పదకొండేసి మ్యాచ్‌లు ఆడి చెరో 16 పాయింట్లతో టాప్-2లో కొనసాగుతున్నాయి. ఇక చెన్నై సూపర్ కింగ్స్ 11 మ్యాచ్‌లలో ఆరు గెలిచి 12 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉంది.ఈ నేపథ్యంలో చెరో 12 పాయింట్లతో ఐదు, ఆరు స్థానాల్లో ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్(రన్‌రేటు -0.316), లక్నో సూపర్ జెయింట్స్(రన్‌రేటు -0.769) వచ్చే వారం తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో ఏ జట్టు గెలిచినా 14 పాయింట్లతో పైకి ఎగబాకుతుంది.పాండ్యా సేనకు తప్పని పరాభవంమరోవైపు.. ఆర్సీబీ(11 మ్యాచ్‌లు- 8 పాయింట్లు- మిగిలినవి 3), పంజాబ్ కింగ్స్(11 మ్యాచ్‌లు- 8 పాయింట్లు- మిగిలినవి 3) ఏడు, ఎనిమిది స్థానాల్లో కొనసాగుతున్నాయి. అయితే, ముంబై ఇండియన్స్ తొమ్మిదో స్థానంలో ఉన్నప్పటికీ ఇప్పటికే 12 మ్యాచ్‌లు ఆడేసింది. కేవలం నాలుగింట గెలిచి 8 పాయింట్లతో ఉంది.మిగిలిన రెండు మ్యాచ్‌లు గెలిచినా మహా అయితే మొత్తంగా 12 పాయింట్లు వస్తాయి. కాబట్టి టాప్-4లో అడుగుపెట్టేందుకు ముంబైకి దారులు మూసుకపోయినట్లే! ఇక అట్టడుగున ఉన్న గుజరాత్ టైటాన్స్‌కు ఇంకో మూడు మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. ఈ నేపథ్యంలో కేకేఆర్, రాజస్తాన్, సన్‌రైజర్స్ దాదాపుగా ప్లే ఆఫ్స్ బెర్తు ఖరారు చేసుకోగా.. ముంబై టోర్నీ నుంచి నిష్క్రమించినట్లయింది.చదవండి: #KL Rahul: కెప్టెన్‌పై కోపంతో ఊగిపోయిన లక్నో ఓనర్.. అందరూ చూస్తుండగానే అలా.. -
కేఎల్ రాహుల్‌పై లక్నో ఓనర్ ఫైర్.. చెప్పేది విను! వీడియో
లక్నో సూపర్ జెయింట్స్ ఫ్రాంఛైజీ యజమాని సంజీవ్ గోయెంకాపై కేఎల్ రాహుల్ అభిమానులు మండిపడుతున్నారు. కెప్టెన్ పట్ల మరీ ఇంత దారుణంగా వ్యవహరిస్తారా? అంటూ ఫైర్ అవుతున్నారు. ఇంతకు ముందు ఏ జట్టు ఓనర్ కూడా ఇలా ప్రవర్తించినట్లు చూడలేదని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్నారు.ఐపీఎల్-2024లో భాగంగా లక్నో జట్టు బుధవారం సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో తలపడింది. టాస్ గెలిచిన లక్నో సారథి కేఎల్ రాహుల్ తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అయితే, సొంత మైదానం ఉప్పల్‌లో ప్యాట్ కమిన్స్ బృందం సమిష్టి ప్రదర్శనతో ఆకట్టుకుంది.సన్‌రైజర్స్ బౌలర్లు, ఫీల్డర్ల అద్భుత ప్రదర్శన కారణంగా లక్నో నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 165 పరుగులకు పరిమితమైంది. కేఎల్ రాహుల్(29), కృనాల్ పాండ్యా(24) ఓ మోస్తరు స్కోర్లు చేయగా.. నికోలస్ పూరన్(26 బంతుల్లో 48*), ఆయుశ్ బదోని(30 బంతుల్లో 55*) అద్భుతంగా రాణించారు.అయితే, లక్నో విధించిన నామమాత్రపు లక్ష్యాన్ని సన్‌రైజర్స్ హైదరాబాద్ ఉఫ్‌మని ఊదేసింది. ఓపెనర్లు అభిషేక్ శర్మ(28 బంతుల్లో 75), ట్రావిస్ హెడ్(30 బంతుల్లో 89) పరుగుల వరద పారించి.. 10 వికెట్ల తేడాతో సన్‌రైజర్స్‌ను గెలిపించారు. వీరిని కట్టడి చేసేందుకు లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్ అమలు చేసిన వ్యూహాలలో ఒక్కటీ ఫలితాన్నివ్వలేదు.ఈ నేపథ్యంలో ఘోర ఓటమి అనంతరం లక్నో ఓనర్ సంజీవ్ గోయెంకా కేఎల్ రాహుల్‌తో వాదనకు దిగాడు. అందరూ చూస్తుండగానే సీరియస్‌గా రాహుల్‌కు క్లాస్ తీసుకున్నాడు.కెప్టెన్ వివరణ ఇచ్చినా పట్టించుకోకుండా.. ‘‘సాకులు చెప్పొద్దు.. నేను సహించను.. ఆ రెండు పాయింట్లు ఎంత ముఖ్యమో తెలుసు కదా’’ అన్నట్లుగా కోపంతో ఊగిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.Mr Goenka is a pathetic owner.I support KL Rahul 100%Repost and show your support towards #KLRahul #SRHvLSG #PBKSvRCB #PBKSvsRCBpic.twitter.com/JUYv9AgVdd— Samira (@Logical_Girll) May 9, 2024 ఈ నేపథ్యంలో సంజీవ్ గోయెంకా ప్రవర్తనను రాహుల్ ఫ్యాన్స్ తప్పుబడుతున్నారు. కాగా ప్లే ఆఫ్స్ రేసులో సాఫీగా ముందుకు వెళ్లాలంటే గెలవాల్సిన మ్యాచ్‌లో లక్నో చిత్తుగా ఓడిపోయింది. పాయింట్ల పట్టికలో ప్రస్తుతానికి ఆరో స్థానంలోనే నిలిచిపోయింది. మరోవైపు సన్‌రైజర్స్ మూడో స్థానానికి దూసుకువచ్చింది.చదవండి: SRH: వాళ్లిద్దరు పిచ్‌ను మార్చేశారు.. అతడొక అద్భుతం.. నమ్మలేకపోతున్నా! WHAT. A. CHASE 🧡A 🔟-wicket win for @SunRisers with more than 🔟 overs to spare! Scorecard ▶️ https://t.co/46Rn0QwHfi#TATAIPL | #SRHvLSG pic.twitter.com/kOxzoKUpXK— IndianPremierLeague (@IPL) May 8, 2024 -
SRH: వాళ్లిద్దరు పిచ్‌ను మార్చేశారు.. అతడొక అద్భుతం!
IPL 2024 SRH vs LSG: ఉప్పల్ స్టేడియంలో మరోసారి పరుగుల వరద పారింది. మ్యాచ్‌కు వాన గండం పొంచి ఉందంటూ అభిమానులు ఆందోళన పడిన వేళ.. ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపించి అసలైన టీ20 మజాను అందించారు సన్‌రైజర్స్ ఓపెనర్లు అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్.తమ బ్యాటింగ్ విధ్వంసంతో లక్నో సూపర్ జెయింట్స్ జట్టు కళ్లు తేలేసేలా చేసి జట్టుకు అపూర్వ విజయాన్ని అందించారు. రాహుల్ సేన పరుగులు చేసేందుకు తడబడిన పిచ్‌పై.. 166 పరుగుల లక్ష్యాన్ని అలవోకగా ఛేదించారు.కనీవినీ ఎరుగని రీతిలో 62 బంతులు మిగిలి ఉండగానే సన్‌రైజర్స్‌ను గెలుపుతీరాలకు చేర్చారు. తమ కెప్టెన్ ప్యాట్ కమిన్స్‌కు ఈ విజయాన్ని పుట్టినరోజు కానుకగా అందించారు. న భూతో న భవిష్యతి అన్న చందంగా ప్రత్యర్థి జట్టు బౌలింగ్‌ను ఊచకోత కోశారు అభిషేక్, హెడ్.వాళ్లిద్దరు పిచ్‌ను మార్చేశారుఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం ప్యాట్ కమిన్స్ మాట్లాడుతూ.. ‘‘బహుశా ట్రావిస్, అభిషేక్ కలిసి పిచ్‌ను మార్చేసి ఉంటారు(నవ్వుతూ). వాళ్లు ఏం చేయగలరో మాకు తెలుసు. అందుకే వారికి పూర్తి స్వేచ్ఛనిచ్చాం.నిజానికి నేనొక బౌలర్‌ను. కాబట్టి ఆ బ్యాటర్లకు పెద్దగా ఇన్పుట్స్ ఇవ్వలేను. ట్రావిస్ హెడ్ విషయానికొస్తే.. అతడు గత రెండేళ్లుగా ఇలాగే ఆడుతున్నాడు.అతడొక అద్భుతంకఠినమైన పిచ్‌లపై కూడా అద్భుతంగా రాణిస్తున్నాడు. ఇక అభిషేక్ శర్మ.. అతడొక అద్భుతమైన ఆటగాడు. స్పిన్, పేస్ బౌలింగ్‌ను సమర్థవంతంగా ఎదుర్కోగలడు.పవర్ ప్లేలో వీళ్లిద్దరిని ఎదుర్కోవడం ప్రత్యర్థి బౌలర్లకు కష్టమే. ఈ సీజన్లో మా వాళ్లు సూపర్‌గా ఆడుతున్నారు. అయితే, పది కంటే తక్కువ ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించడం నమ్మలేకపోతున్నాం’’ అంటూ హర్షం వ్యక్తం చేశాడు.10 వికెట్ల తేడాతో గెలుపుకాగా లక్నోతో బుధవారం నాటి మ్యాచ్‌లో టాస్ ఓడిన సన్‌రైజర్స్ తొలుత బౌలింగ్ చేసింది. భువనేశ్వర్ కుమార్(2/12)కు తోడు ఫీల్డర్లు అద్భుతంగా రాణించడంతో లక్నోను 165/4 స్కోరుకు కట్టడి చేసింది.ఇక లక్ష్య ఛేదనకు దిగిన సన్‌రైజర్స్.. ఓపెనర్లు అభిషేక్ శర్మ(28 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్స్‌లు), ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ ట్రావిస్ హెడ్(30 బంతుల్లో 8 ఫోర్లు, 8 సిక్సర్లు) తుఫాన్ ఇన్నింగ్స్ కారణంగా 10 వికెట్ల తేడాతో గెలుపొందింది. తద్వారా ప్లే ఆఫ్స్ రేసులో మరో ముందడుగు వేసింది. WHAT. A. CHASE 🧡A 🔟-wicket win for @SunRisers with more than 🔟 overs to spare! Scorecard ▶️ https://t.co/46Rn0QwHfi#TATAIPL | #SRHvLSG pic.twitter.com/kOxzoKUpXK— IndianPremierLeague (@IPL) May 8, 2024 -
SRH Vs LSG Photos: సన్‌రైజర్స్ విధ్వంసం..లక్నోపై 10 వికెట్లతో ఘనవిజయం (ఫొటోలు)
-
IPL 2024 SRH Vs LSG: సన్‌రైజర్స్ విధ్వంసం
250 పరుగుల లక్ష్యమైనా సన్‌రైజర్స్ ఛేదించేదేమో? ఓటమి తర్వాత లక్నో సూపర్ జెయింట్స్ జట్టు కెప్టెన్ రాహుల్ వ్యాఖ్య... ప్రత్యర్థి బ్యాటర్ల వీర బాదుడుకు మైదానంలో మొదటి బాధితుడిగా అతను చెప్పిన మాట అక్షరసత్యం. తొలుత బ్యాటింగ్ చేస్తూ సీజన్లో రికార్డు స్కోర్లు సాధించిన హైదరాబాద్ ఇప్పుడు ఛేదనలోనూ వి«ధ్వంసం సృష్టించింది. వీడియోగేమ్ తరహాలో ట్రవిస్ హెడ్, అభిõÙక్ శర్మ విరుచుకుపడుతుంటే స్టేడియంలో పరుగుల ఉప్పెన వచ్చింది. 16 ఫోర్లు, 14 సిక్స్‌లంటే 148 పరుగులు బౌండరీలతోనే... లక్నో విధించిన 166 పరుగుల లక్ష్యం మరీ చిన్నదేమీ కాదు. కానీ 10 ఓవర్లకు ముందే కేవలం 52 నిమిషాల్లో రైజర్స్ ఛేదించిపడేసింది. రైజర్స్ ఛేజింగ్ రాత్రి 9 గంటల 23 నిమిషాలకు మొదలై 10 గంటల 15 నిమిషాలకు ముగిసింది. ఈ గెలుపుతో సన్‌రైజర్స్ పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి ఎగబాకింది. లక్నో పరాజయంతో ముంబై ఇండియన్స్ జట్టు ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించింది.సాక్షి, హైదరాబాద్: సన్‌రైజర్స్ హైదరాబాద్ తమ బ్యాటింగ్ పవర్‌ను మరోసారి చూపించింది. బుధవారం ఉప్పల్ స్టేడియంలో జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ 10 వికెట్ల తేడాతో లక్నో సూపర్ జెయింట్స్‌ను చిత్తుగా ఓడించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న లక్నో 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. ఆయుశ్ బదోని (30 బంతుల్లో 55 నాటౌట్; 9 ఫోర్లు), నికోలస్ పూరన్ (26 బంతుల్లో 48 నాటౌట్; 6 ఫోర్లు, 1 సిక్స్) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. అనంతరం హైదరాబాద్ కేవలం 9.4 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 167 పరుగులు సాధించి గెలిచింది. ఓపెనర్లు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ ట్రవిస్ హెడ్ (30 బంతుల్లో 89 నాటౌట్; 8 ఫోర్లు, 8 సిక్స్‌లు), అభిషేక్ శర్మ (28 బంతుల్లో 75 నాటౌట్; 8 ఫోర్లు, 6 సిక్స్‌లు) మరో అవకాశం ఇవ్వకుండా చెలరేగి కేవలం 58 బంతుల్లోనే మ్యాచ్‌ను ముగించారు. లక్నో ఓటమితో ముంబై ఇండియన్స్ జట్టు ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించింది. ముంబై తమ చివరి రెండు మ్యాచ్‌ల్లో నెగ్గినా 12 పాయింట్లతో టాప్–4లో స్థానాన్ని దక్కించుకునే అవకాశం లేదు. రాహుల్ విఫలం... భువనేశ్వర్ చక్కటి బౌలింగ్ వల్ల లక్నో ఇన్నింగ్స్ పేలవంగా ప్రారంభమైంది. భువీ తన వరుస ఓవర్లలో డికాక్ (2), స్టొయినిస్ (3)లను పెవిలియన్ పంపించాడు. ఈ రెండు సందర్భాల్లో ఆంధ్ర క్రికెటర్ నితీశ్ కుమార్ రెడ్డి, సన్వీర్ సింగ్ అద్భుత క్యాచ్‌లు కారణంగా నిలిచాయి. పవర్‌ప్లే ముగిసేసరికి లక్నో 27 పరుగులకే పరిమితమైంది. ఈ దశలో రాహుల్, కృనాల్ ఆదుకునే ప్రయత్నం చేసినా వీరిద్దరూ నెమ్మదిగా ఆడటంతో పరుగులు రావడం మందగించింది. పదో ఓవర్ చివరి బంతికి రాహుల్ అవుట్ కాగా... లక్నో స్కోరు 57 పరుగులకు చేరింది. అవుటయ్యే వరకు కూడా ఏ దశలోనూ రాహుల్ స్ట్రయిక్‌రేట్ కనీసం 100 కూడా లేకపోవడం జట్టు అవకాశాలను దెబ్బ తీసింది. ఆ తర్వాత కొద్ది సేపటికే కృనాల్ రనౌట్ కావడంతో స్కోరు 66/4గా మారింది. ఇలాంటి స్థితిలో పూరన్, బదోని బ్యాటింగ్ లక్నో కాస్త గౌరవప్రదమైన స్కోరును అందించింది. చివరి 5 ఓవర్లలో 63 పరుగులు రాగా... వీరిద్దరు 52 బంతుల్లోనే అభేద్యంగా 99 పరుగులు జోడించారు. మెరుపు వేగంతో... 8, 17, 22, 17, 23, 20, 19, 17, 14, 10... ఛేదనలో సన్‌రైజర్స్ ఒక్కో ఓవర్లో చేసిన పరుగులు ఇవి. తొలి ఓవర్ మినహాయిస్తే ఎక్కడా తగ్గకుండా హెడ్, అభిషేక్ చెలరేగిపోయారు. యశ్ ఓవర్లో అభిషేక్ 4 ఫోర్లు కొట్టగా, గౌతమ్ ఓవర్లో హెడ్ 3 సిక్స్‌లు, ఫోర్ బాదాడు. నవీనుల్ ఓవర్లో వరుసగా 4, 4, 6, 4, 4 బాదిన హెడ్... ఈ క్రమంలో 16 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. యశ్ ఓవర్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లు కొట్టిన అభిషేక్ హాఫ్ సెంచరీ 19 బంతులకు పూర్తయింది. పవర్‌ప్లేలో 107 పరుగులు చేసిన రైజర్స్ ఆట ముగించేందుకు ఎక్కువ సమయం పట్టలేదు. యశ్ వేసిన పదో ఓవర్ నాలుగో బంతిని అభిõÙక్ సిక్స్‌గా మలచడంతో ఉప్పల్ స్టేడియంలో సంబరాలు మొదలయ్యాయి. స్కోరు వివరాలు లక్నో సూపర్ జెయింట్స్ ఇన్నింగ్స్: కేఎల్ రాహుల్ (సి) నటరాజన్ (బి) కమిన్స్ 29; డికాక్ (సి) నితీశ్ (బి) భువనేశ్వర్ 2; స్టొయినిస్ (సి) సన్వీర్ (బి) భువనేశ్వర్ 3; కృనాల్ పాండ్యా (రనౌట్) 24; పూరన్ (నాటౌట్) 48; బదోని (నాటౌట్) 55; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (20 ఓవర్లలో 4 వికెట్లకు) 165. వికెట్ల పతనం: 1–13, 2–21, 3–57, 4–66. బౌలింగ్: భువనేశ్వర్ 4–0–12–2, కమిన్స్ 4–0–47–1, షహబాజ్ 2–0–9–0, విజయకాంత్ 4–0–27–0, ఉనాద్కట్ 2–0–19–0, నటరాజన్ 4–0–50–0. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్: అభిషేక్ శర్మ (నాటౌట్) 75; హెడ్ (నాటౌట్) 89; ఎక్స్‌ట్రాలు 3; మొత్తం (9.4 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా) 167. బౌలింగ్: గౌతమ్ 2–0–29–0, యశ్ ఠాకూర్ 2.4–0–47–0, బిష్ణోయ్ 2–0–34–0, నవీనుల్ హక్ 2–0–37–0, బదోని 1–0–19–0. ఐపీఎల్లో నేడుపంజాబ్ X బెంగళూరు వేదిక: ధర్మశాలరాత్రి 7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో సినిమా యాప్‌లో ప్రత్యక్ష ప్రసారం -
SRH Vs LSG: లక్నోపై 10 వికెట్ల తేడాతో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఘన విజయం
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 17వ సీజన్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ నేడు(బుధవారం) లక్నో సూపర్‌జెయింట్‌తో తలపడింది. హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో లక్నో టాస్ గెలిచింది. దీంతో హైదరాబాద్ ముందుగా బౌలింగ్‌ను ఎంచుకుంది. హైదరాబాద్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో లక్నో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేయగా 4 నాలుగు వికెట్ల నష్టానికి మొత్తం 165 పరుగులు చేసింది. అనంతరం రంగంలోకి దిగిన సన్‌రైజర్స్ జట్టు లక్ష్యాన్నిఅలవోకగా ఛేదించింది. కనీసం ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా 167 పరుగులు చేసి విజేతగా నిలిచింది.స్కోర్లు: లక్నో 165/4, హైదరాబాద్ 167/0 -
IPL 2024: భువీ విజృంభణ.. నామమాత్రపు స్కోర్‌కే పరిమితమైన లక్నో
ఐపీఎల్ 2024 సీజన్లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో ఇవాళ (మే 8) జరుగుతున్న మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ నామమాత్రపు స్కోర్‌కే పరిమితమైంది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న లక్నోను భువనేశ్వర్ కుమార్ (4-0-12-2) కట్టడి చేయడంతో ఆ జట్టు నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 165 పరుగులు మాత్రమే చేసింది. ఆఖర్లో ఆయుశ్ బదోని (55 నాటౌట్), పూరన్ (48 నాటౌట్) చెలరేగి ఆడటంతో లక్నో ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది. లక్నో ఇన్నింగ్స్‌లో డికాక్ (2), స్టోయినిస్ (3), కృనాల్ పాండ్యా (24), రాహుల్ (29) తక్కువ స్కోర్లకే ఔటయ్యారు. బదోని, పూరన్ ఆఖరి రెండు ఓవర్లలో ఆకాశమే హద్దుగా చెలరేగడంతో ఏకంగా 34 పరుగులు వచ్చాయి. కమిన్స్ వేసిన ఆఖరి ఓవర్లో 19, నటరాజన్ వేసిన 19 ఓవర్లో 15 పరుగులు వచ్చాయి.ఈ మ్యాచ్‌లో బర్త్ డే బాయ్ కమిన్స్‌ను బదోని, పూరన్ ఆడుకున్నారు. కమిన్స్ 4 ఓవర్లలో వికెట్ తీసి ఏకంగా 47 పరుగులు సమర్పించుకున్నాడు. నటరాజన్ సైతం ధారాళంగా పరుగులిచ్చాడు. నటరాజన్ 4 ఓవర్లలో ఏకంగా 50 పరుగులిచ్చాడు. అరంగేట్రం బౌలర్ (శ్రీలంక) విజయ్‌కాంత్ వియాస్కాంత్ (4-0-27-0) అకట్టుకున్నాడు. -
SRH VS LSG: సిక్సర్ల సునామీ.. ఐపీఎల్ చరిత్రలో అత్యంత వేగంగా..!
ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో గతంలో ఎన్నడూ లేని విధంగా సిక్సర్ల మోత మోగుతుంది. ఈ సీజన్ మరో 18 మ్యాచ్‌లు మిగిలుండగానే 1000 సిక్సర్ల అత్యంత అరుదైన మైలురాయిని తాకింది. సన్‌రైజర్స్‌తో ఇవాళ (మే 8) జరుగుతున్న మ్యాచ్‌లో కృనాల్ పాండ్యా కొట్టిన సిక్సర్‌తో ఈ సీజన్లో 1000 సిక్సర్లు పూర్తయ్యాయి. ఈ మైలురాయిని చేరుకునే క్రమంలో ప్రస్తుత ఐపీఎల్ సీజన్ ఆల్‌టైమ్ రికార్డును బద్దలు కొట్టింది. వెయ్యి సిక్సర్ల మార్కును అత్యంత వేగంగా చేరుకున్న సీజన్‌గా ఐపీఎల్ 2024 సరికొత్త చరిత్ర సృష్టించింది.1000TH SIXES IN IPL 2024...!!!! 🤯- THE MOST CRAZIEST IPL SEASON EVER. 🔥 pic.twitter.com/mfYwS6fbUY— Tanuj Singh (@ImTanujSingh) May 8, 2024ఐపీఎల్ చరిత్రలో 2022 (1062 సిక్సర్లు), 2023 (1124 సిక్సర్లు), 2024 సీజన్లలో మాత్రమే 1000కి పైగా సిక్సర్లు నమోదు కాగా.. ఈ సీజన్లోనే అత్యంత వేగంగా ఆ మార్కు తాకింది. 2022 సీజన్లో ఈ మార్కును తాకేందుకు 16269 బంతులు అవసరమైతే.. గత సీజన్లో 15390 బంతులు.. ఈ సీజన్లో అన్నిటికంటే తక్కువగా 13079 బంతుల్లోనే వెయ్యి సిక్సర్లు పూర్తయ్యాయి.సన్‌రైజర్స్-లక్నో మ్యాచ్ విషయానికొస్తే.. హైదరాబాద్‌లో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో లక్నో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేస్తుంది. 18 ఓవర్లు పూర్తయ్యాక లక్నో స్కోర్ 4 వికెట్ల నష్టానికి 131 పరుగులుగా ఉంది. డికాక్ (2), స్టోయినిస్ (3), కృనాల్ పాండ్యా (24), రాహుల్ (29) ఔట్ కాగా.. పూరన్ (30), బదోని (39) క్రీజ్‌లో ఉన్నారు. భువనేశ్వర్ కుమార్ అద్భుతమైన స్పెల్‌తో (4-0-12-3) లక్నోను దారుణంగా దెబ్బ కొట్టగా.. కమిన్స్ ఓ వికెట్ పడగొట్టాడు. కృనాల్‌ను కమిన్స్ అద్భుతమైన త్రోతో రనౌట్ చేశాడు. -
IPL 2024: ఇవెక్కడి క్యాచ్‌లు రా బాబు.. చూస్తే ఫ్యూజ్‌లు ఎగిరిపోవాల్సిందే..!
ఐపీఎల్ 2024 సీజన్లో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్‌తో ఇవాళ (మే 8) జరుగుతున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆటగాళ్లు కళ్లు చెదిరే క్యాచ్‌లు పట్టారు. తొలుత నితీశ్ కుమార్ రెడ్డి, ఆ తర్వాత సన్వీర్ సింగ్ నమ్మశక్యంకాని రీతిలో క్యాచ్‌లు పట్టి హైలైటయ్యారు.సన్వీర్ సూపర్ క్యాచ్భువనేశ్వర్ కుమార్ బౌలింగ్‌లో సన్వీర్ మిడ్ ఆన్ దిశగా ముందుకు పరిగెడుతూ అద్భుతమన డైవింగ్ క్యాచ్ అందుకున్నాడు. సన్వీర్ క్యాచ్ పట్టిన విధానం క్లారిటీగా లేకపోవడంతో ఫీల్డ్ అంపైర్ థర్డ్ అంపైర్‌కు రిఫర్ చేయగా రీ ప్లేలో స్పష్టమైన క్యాచ్‌గా తేలింది. దీంతో బ్యాటర్ స్టోయినిస్ నిరాశగా పెవిలియన్ బాట పట్టాడు. ఈ క్యాచ్ చూసిన జనాలకు ఫ్యూజులు ఎగిరిపోయాయి. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతుంది. - First Nitish Reddy.- Then Sanvir Singh.- Two Incredible Catches by these SRH's youngsters. 🤯🙌 pic.twitter.com/DHtMenorn5— Tanuj Singh (@ImTanujSingh) May 8, 2024నితీశ్ అద్భుత విన్యాసంసన్వీర్ పట్టిన అద్భుతమైన క్యాచ్‌కు ముందు నితీశ్ కుమార్ రెడ్డి కూడా సూపర్ క్యాచ్ పట్టాడు. భువీ బౌలింగ్‌లోనే నితీశ్ బౌండరీ లైన్ వద్ద చూడచక్కని క్యాచ్ అందుకున్నాడు. సిక్సర్‌కు వెళ్లాల్సిన బంతిని నితీశ్ అద్భుతంగా బ్యాలెన్స్ చేసి తన జట్టుకు 6 పరుగులు ఆదా చేయడంతో పాటు కీలకమైన డికాక్‌ను పెవిలియన్‌కు సాగనంపాడు. ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ ఆటగాళ్లు మైదానంలో చాలా చురుగ్గా కదులుతున్నారు. బౌలింగ్‌లోనూ సత్తా చాటుతున్నారు.టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేస్తున్న లక్నో.. భువీ దెబ్బకు (3-0-7-2) 9 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి కేవలం 49 పరుగులు మాత్రమే చేయగలిగింది. డికాక్ (2), స్టోయినిస్ (3) పెవిలియన్‌కు చేరగా.. రాహుల్ (22), కృనాల్ (21) క్రీజ్‌లో ఉన్నారు. -
IPL 2024: సన్‌రైజర్స్, లక్నో మ్యాచ్.. లంక యువ స్పిన్నర్ అరంగేట్రం
ఐపీఎల్ 2024 సీజన్లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో ఇవాళ (మే 8) జరుగుతున్న మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్ ప్లే ఆఫ్స్ రేసులో ఉన్న ఇరు జట్లకు అత్యంత కీలకంగా మారింది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో సన్‌రైజర్స్ నాలుగులో.. లక్నో ఆరో స్థానంలో ఉన్నాయి. నగరంలో నిన్న రాత్రి అతి భారీ వర్షం కురిసిన నేపథ్యంలో నేటి మ్యాచ్ సాధ్యాసాధ్యాలపై అనుమానాలు ఉండేవి. అయితే ప్రస్తుత పరిస్థితిని బట్టి చూస్తే వరుణుడి నుంచి మ్యాచ్‌కు ఎలాంటి ముప్పు లేదని తెలుస్తుంది. తుది జట్ల విషయానికొస్తే.. ఇరు జట్లు పలు మార్పులతో బరిలోకి దిగుతున్నాయి. లక్నో జట్టుకు సంబంధించి డికాక్ తిరిగి జట్టులోకి రాగా.. మొహిసిన్ ఖాన్ ఔటయ్యాడు. సన్‌రైజర్స్ తరఫున లంక యువ స్పిన్నర్ విజయ్‌కాంత్ వియాస్కాంత్ అరంగేట్రం చేయనుండగా.. మయాంక్ అగర్వాల్ స్థానంలో సన్వీర్ సింగ్ జట్టులోకి వచ్చాడు.హెడ్ టు హెడ్ రికార్డ్స్ విషయానికొస్తే.. ఐపీఎల్లో ఇరు జట్లు ఇప్పటివరకు మూడు సార్లు తలపడగా.. అన్ని సందర్భాల్లో లక్నోనే విజయం సాధించింది.తుది జట్లు..లక్నో సూపర్ జెయింట్స్ (ప్లేయింగ్ XI): క్వింటన్ డికాక్, కేఎల్ రాహుల్ (కెప్టెన్/వికెట్‌కీపర్), మార్కస్ స్టోయినిస్, నికోలస్ పూరన్, ఆయుష్ బదోని, దీపక్ హుడా, కృనాల్ పాండ్యా, కృష్ణప్ప గౌతమ్, యశ్ ఠాకూర్, రవి బిష్ణోయ్, నవీన్-ఉల్-హక్సన్రైజర్స్ హైదరాబాద్ (ప్లేయింగ్ XI): ట్రవిస్ హెడ్, నితీష్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్ (వికెట్‌కీపర్), అబ్దుల్ సమద్, షాబాజ్ అహ్మద్, సన్వీర్ సింగ్, పాట్ కమిన్స్ (కెప్టెన్), భువనేశ్వర్ కుమార్, జయదేవ్ ఉనద్కత్, విజయకాంత్ వియాస్కాంత్, టి నటరాజన్ -
IPL 2024 SRH VS LSG: మరో మూడేస్తే..!
ఐపీఎల్ 2024 సీజన్లో ఇవాళ (మే 8) మరో బిగ్ ఫైట్ జరుగనుంది. విధ్వంసకర ఆటగాళ్లతో నిండిన సన్‌రైజర్స్, లక్నో సూపర్ జెయింట్స్ అమీతుమీకి సిద్దమయ్యాయి. సన్‌రైజర్స్ హోం గ్రౌండ్ అయిన ఉప్పల్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగునుంది. హైదరాబాద్‌లో నగరంలో నిన్న రాత్రి అతి భారీ వర్షం కురిసింది. ఇవాళ కూడా వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అయితే నగరంలో ప్రస్తుత పరిస్థితిని బట్టి చూస్తే వరుణుడి నుంచి మ్యాచ్‌కు ఎలాంటి ముప్పు లేదని తెలుస్తుంది. ప్రస్తుతం సన్‌రైజర్స్, ఎల్ఎస్జీ పాయింట్ల పట్టికలో సమవుజ్జీలుగా ఉన్నాయి. రెండు జట్లు చెరి 11 మ్యాచ్‌లు ఆడి ఆరింట గెలుపొందాయి. అయితే లక్నోతో పోలిస్తే సన్‌రైజర్స్ రన్‌రేట్ కాస్త మెరుగ్గా ఉండటంతో ఆ జట్టు మెరుగైన స్థానంలో ఉంది. సన్‌రైజర్స్ నాలుగులో.. లక్నో ఆరో స్థానంలో కొనసాగుతున్నాయి. ఇరు జట్లకు ప్లే ఆఫ్స్ అవకాశాలు సమానంగా ఉండటంతో ఈ మ్యాచ్ ఫలితం అత్యంత కీలకం కానుంది. ఈ మ్యాచ్‌లో గెలిచే జట్టు టెన్షన్ లేకుండా తదుపరి మ్యాచ్‌కు వెళ్లవచ్చు. ఇరు జట్ల ఈ సీజన్లో ఇదే తొలి మ్యాచ్. ఐపీఎల్లో ఇరు జట్లు ఇప్పటివరకు మూడు సార్లు తలపడగా.. అన్ని సందర్భాల్లో లక్నోనే విజయం సాధించింది.మరో మూడేస్తే..ఇక ఈ మ్యాచ్ ఓ భారీ మైలురాయికి వేదిక కానుంది. ఈ మ్యాచ్‌లో మరో మూడు సిక్సర్లు నమోదైతే ఈ సీజన్లో 1000 సిక్సర్లు (అన్ని జట్లు కలిపి) పూర్తవుతాయి. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక సిక్సర్లు నమోదైన సీజన్‌గా ఐపీఎల్ 2023 ఉంది. గత సీజన్లో రికార్డు స్థాయిలో 1124 సిక్సర్లు నమోదయ్యాయి. ఈ సీజన్లో ఇంకా 18 మ్యాచ్‌లు మిగిలుండగానే 1000 సిక్సర్లు మార్కు తాకితే ఆల్‌టైమ్ హైయెస్ట్ సిక్సర్ల రికార్డు బద్దలవడం ఖాయం. నేటి మ్యాచ్‌లో తలపడబోయే సన్‌రైజర్స్, లక్నో జట్లలో భారీ హిట్టర్లు ఉండటంతో ఈ మ్యాచ్‌లో కనీసం 20 సిక్సర్లు నమోదయ్యే అవకాశం ఉంది. సీజన్ల వారీగా సిక్సర్లు..2008- 6222009- 5062010- 5852011- 6392012- 7312013- 6722014- 7142015- 6922016- 6382017- 7052018- 8722019- 7842020- 7342021- 6872022- 10622023- 11242024- 997* -
కమిన్స్ మాటలు విని షాకైన హార్దిక్! వీడియో వైరల్
మైదానంలో ఉన్నంత సేపు ప్రత్యర్థులు.. ఒక్కసారి ఆట ముగియగానే స్నేహితులు.. దాదాపు క్రీడాకారులంతా ఇలాగే ఉంటారు. ముఖ్యంగా లీగ్ క్రికెట్లో ఇలాంటి దృశ్యాలు ఎక్కువగా కనబడుతూ ఉంటాయి.ఐపీఎల్-2024లో భాగంగా సోమవారం ముంబై ఇండియన్స్- సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య మ్యాచ్ సందర్భంగా ఇలాంటి దృశ్యం ఆవిష్కృతమైంది. సన్‌రైజర్స్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్, ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా, విధ్వంసకర బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్‌తో ముచ్చటించాడు.పరస్పరం ఆప్యాయంగా పలకరించుకుని ముచ్చట్లలో మునిగిపోయిన వేళ.. కమిన్స్ తన వేలి గాయం గురించి పాండ్యా, సూర్యలకు చెప్పాడు. తన కుడిచేతి మధ్యవేలు ముందరి భాగం చిన్నప్పుడే విరిగిపోయిందని కమిన్స్ చెప్పగానే వాళ్లిద్దరు ఆశ్చర్యంతో నోరెళ్లబెట్టారు.ముఖ్యంగా హార్దిక్ పాండ్యా అయితే.. ‘‘అయ్యె అవునా?’’ అన్నట్లుగా షాకింగ్ రియాక్షన్ ఇచ్చాడు. సాటి ఫాస్ట్ బౌలర్‌గా కమిన్స్ కష్టాన్ని తెలుసుకుని సానుభూతి వ్యక్తం చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.కాగా రైటార్మ్ పేసర్ అయిన ప్యాట్ కమిన్స్ 2011లో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. ఈ సందర్భంగా.. ‘‘నాకు నాలుగేళ్ల వయసున్నపుడు.. డోర్ మధ్య వేలు ఇరుక్కోవడంతో పైభాగంలో సెంటీమీటర్ మేర విరిగిపోయింది. అయినా.. నా బౌలింగ్ యాక్షన్‌పై ఎలాంటి ప్రభావం పడలేదు.ఎందుకంటే నా వేళ్లు అన్నీ దాదాపుగా ఒకే లెంగ్త్‌తో ఉంటాయి. ఈ విషయంలో ఇప్పటికీ నా సోదరి బాధపడుతూనే ఉంటుంది. ఎందుకంటే తనే డోర్ వేసింది’’ అని కమిన్స్ తెలిపాడు. అదన్న మాట సంగతి!ఇక మ్యాచ్ విషయానికొస్తే.. సోమవారం నాటి మ్యాచ్‌లో ముంబై సన్‌రైజర్స్‌ను ఓడించింది. సూర్యకుమార్ యాదవ్ వీరోచిత అజేయ శతకం(51 బంతుల్లో 102)తో రాణించి ముంబై ఇండియన్స్‌ను గెలిపించాడు. ఈ మ్యాచ్‌లో కమిన్స్ బ్యాట్(17 బంతుల్లో 35)తో రాణించడమే గాక ఒక వికెట్ కూడా తీశాడు. మరోవైపు హార్దిక్ పాండ్యా మూడు కీలక వికెట్లు తీసి సన్‌రైజర్స్ ఓటమిలో సూర్యతో పాటు తానూ కీలక పాత్ర పోషించాడు.చదవండి: T20 WC: ద్రవిడ్, రోహిత్‌కు నచ్చకపోవచ్చు.. కానీ నా సలహా ఇదే!Pat Cummins must be telling about how he lost the top of his middle finger on his dominant right hand when his sister accidentally slammed a door on it. Hardik's reaction 😱 pic.twitter.com/oinHeW99mn— 𝗔𝗱𝗶𝘁𝘆𝗔 (@StarkAditya_) May 7, 2024 -
SRH vs LSG: ఉప్పల్ మ్యాచ్‌కు వెళ్తున్న వారికి అలర్ట్! ఇలా అయితే..
సాక్షి, హైదరాబాద్: సన్‌రైజర్స్ హైదరాబాద్ సొంత మైదానంలో మరో మ్యాచ్‌కు సిద్ధమైంది. లక్నో సూపర్ జెయింట్స్‌తో ఉప్పల్ వేదికగా బుధవారం తలపడనుంది. ప్లే ఆఫ్స్ రేసులో సాఫీగా ముందుకు వెళ్లాలంటే లక్నోతో మ్యాచ్‌లో కమిన్స్ బృందం తప్పక గెలవాలి.అయితే, వర్షం రూపంలో సన్‌రైజర్స్- లక్నో పోరుకు ఆటంకం కలిగే అవకాశం ఉంది. నగరంలో కురుస్తున్న అకాల వర్షాల కారణంగా మ్యాచ్ గనుక రద్దైతే ఇరు జట్లకు చెరో పాయింట్ వస్తుంది.ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లుఇదిలా ఉంటే.. హోంగ్రౌండ్లో సన్‌రైజర్స్ మెరుపులను వీక్షించడానికి వచ్చే అభిమానుల కోసం ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో జరగనున్న ఐపీఎల్ మ్యాచ్ కోసం నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు.ఆ ప్రాంతాల నుంచి స్పెషల్ బస్సులు ఈసీఐఎల్, ఎల్బీనగర్, కొండాపూర్, జీడిమెట్ల, వనస్థలిపురం, ఇబ్రహీంపట్నం,మియాపూర్,లక్డీకాపూల్, కూకట్పల్లి హౌసింగ్‌బోర్డ్, జూబ్లీ బస్‌స్టేషన్, హకీంపేట్, మేడ్చల్, చార్మినార్, చాంద్రాయణగుట్ట, మెహిదీపట్నం, బీహెచ్ఈఎల్ తదితర ప్రాంతాల నుంచి ఉప్పల్ స్టేడియంకు ప్రత్యేక బస్సులను నడుపనున్నారు.మెట్రోలో సైతంఅలాగే ప్రయాణికుల రద్దీ మేరకు వివిధ మార్గాల్లో అర్ధరాత్రి వరకు మెట్రో రైళ్లను నడిపేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. రాయదుర్గం నుంచి నాగోల్ వరకు మియాపూర్ నుంచి ఎల్బీనగర్, జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్ మధ్య ప్రయాణికుల డిమాండ్ మేరకు మెట్రో సేవలు అందుబాటులో ఉంటాయి.చదవండి: సంజూ శాంసన్‌కు ఊహించని షాకిచ్చిన బీసీసీఐThe Risers are back to Hyderabad 🧡💪 pic.twitter.com/uecAotesSz— SunRisers Hyderabad (@SunRisers) May 7, 2024 -
Pat Cummins Photos: ఓ రేంజ్లో ఆరెంజ్ ఆర్మీ అంటున్న పాట్ కమ్మిన్స్.. హ్యాపీ బర్త్‌డే కెప్టెన్ (ఫొటోలు)
-
SRH: సన్‌రైజర్స్ గుండెల్లో గుబులు.. మ్యాచ్ గనుక రద్దైతే!
ఐపీఎల్-2024 ప్లే ఆఫ్స్ రేసు రసవత్తరంగా సాగుతోంది. ఇప్పటికే పదకొండేసి మ్యాచ్‌లు ఆడిన కోల్‌కతా నైట్ రైడర్స్(నెట్ రన్‌రేటు 1.453), రాజస్తాన్ రాయల్స్ రాయల్స్(నెట్ రన్‌రేటు 0.476) ఎనిమిది గెలిచి టాప్-2లో తిష్ట వేశాయి.చెరో పదహారు పాయింట్లతో ప్లే ఆఫ్స్ బెర్తును దాదాపుగా ఖరారు చేసుకున్నాయి. ఇక ప్రస్తుతం మూడో స్థానం కోసం 12 పాయింట్లతో ఉన్న చెన్నై సూపర్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ (-0.065)మధ్య జరుగుతున్న పోటీలో ఇప్పటి వరకు రన్‌రేటు పరంగా మెరుగ్గా ఉన్న సీఎస్కే(0.700)నే పైచేయి సాధించింది.ప్లే ఆఫ్స్ పోటీలో కీలక మ్యాచ్దీంతో రైజర్స్ నాలుగో స్థానంలో కొనసాగుతుండగా.. రాజస్తాన్ రాయల్స్‌పై మంగళవారం నాటి విజయంతో ఢిల్లీ క్యాపిటల్స్ సైతం ముందుకు దూసుకువచ్చింది. ఇక లక్నో సూపర్ జెయింట్స్ సైతం 12 పాయింట్లతో ఆరో స్థానంలో కొనసాగుతూ టాప్-4పై కన్నేసింది.ఈ నేపథ్యంలో సన్‌రైజర్స్ హైదరాబాద్- లక్నో సూపర్ జెయింట్స్ మధ్య బుధవారం నాటి మ్యాచ్ ఆసక్తికరంగా మారింది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు ప్లే ఆఫ్స్ రేసులో ముందుకు దూసుకువెళ్తుంది. అదే సమయంలో ఓడిన జట్టు ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది.పొంచి ఉన్న వాన గండంఅయితే, సొంతగడ్డపై మ్యాచ్ జరుగనుండటం సన్‌రైజర్స్‌కు సానుకూల అంశమే అయినా.. వర్షం రూపంలో ప్రమాదం పొంచి ఉంది. ఐపీఎల్ తాజా ఎడిషన్‌లో ఇప్పటి వరకు 56 మ్యాచ్‌లు జరిగాయి.కానీ ఒక్క మ్యాచ్ కూడా వరణుడి కారణంగా రద్దు కాలేదు. అయితే, ఉప్పల్ స్టేడియంలో జరగాల్సిన సన్‌రైజర్స్- లక్నో మ్యాచ్‌కు మాత్రం వాన గండం పొంచి ఉంది. హైదరాబాద్‌లో మంగళవారం కుండపోతగా వర్షం కురిసింది.ఈ నేపథ్యంలో స్టేడియం సిబ్బంది మైదానంలోని మధ్య భాగాన్ని కవర్లతో కప్పి ఉంచారు. అయితే, వాతావరణ శాఖ రెండు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని మంగళవారం హెచ్చరించడం ఆరెంజ్ ఆర్మీ గుండెల్లో గుబులు రేపుతోంది.మ్యాచ్ గనుక రద్దు అయితేకాగా తాజా సీజన్లో ఆరంభ మ్యాచ్‌లో తడబడ్డా ప్యాట్ కమిన్స్ బృందం తర్వాత అనూహ్య రీతిలో పుంజుకుంది. 266.. 277.. 287 స్కోర్లు నమోదు చేసి పరుగుల విధ్వంసానికి మారుపేరుగా నిలిచింది.అయితే, గత కొన్ని మ్యాచ్‌ల నుంచి సన్‌రైజర్స్ పేలవ బ్యాటింగ్‌తో తేలిపోతోంది. ఆఖరిగా సోమవారం ముంబై ఇండియన్స్‌తో ఆడిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ ఏడు వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ఇక బుధవారం నాటి మ్యాచ్ గనుక రద్దైతే సన్‌రైజర్స్, లక్నోల ఖాతాలో చెరో పాయింట్ చేరుతుంది. అలా కాక మ్యాచ్ సాఫీగా సాగితే గెలిచిన జట్టుకు రెండు పాయింట్లు వస్తాయి.వాతావరణ శాఖ హెచ్చరికనగరంలో వర్షాల నేపథ్యంలో వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. హైదరాబాద్‌లో బుధవారం సాయంత్రం లేదా రాత్రి సమయంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని తెలిపింది.చదవండి: సంజూ శాంసన్‌కు ఊహించని షాకిచ్చిన బీసీసీఐ 𝙇𝙤𝙘𝙠𝙚𝙙 𝙖𝙣𝙙 𝙡𝙤𝙖𝙙𝙚𝙙 👊🔥#PlayWithFire #SRHvLSG pic.twitter.com/En1XXReksW— SunRisers Hyderabad (@SunRisers) May 8, 2024 -
కన్నీళ్లు పెట్టుకున్న రోహిత్ శర్మ.. డ్రెస్సింగ్ రూంలో అలా!
ఐపీఎల్-2024 టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు పెద్దగా కలిసి రావడం లేదు. సీజన్ ఆరంభానికి ముందే ముంబై ఇండియన్స్ కెప్టెన్ పదవిని కోల్పోయిన హిట్‌మ్యాన్.. హార్దిక్ పాండ్యా సారథ్యంలో ఆటగాడిగా కొనసాగుతున్నాడు.కానీ బ్యాటర్‌గా స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోతున్నాడు. ఇప్పటి వరకు ఆడిన 12 ఇన్నింగ్స్‌లో కలిపి రోహిత్ శర్మ చేసిన పరుగులు 330. అత్యధిక పరుగుల వీరుల జాబితాలో పదిహేడో స్థానం(మే 7 నాటికి)లో ఉన్నాడు.ఆ సెంచరీ మినహా!ఈ ఎడిషన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ మీద సాధించిన శతకం(105 నాటౌట్) మినహా మిగతా మ్యాచ్‌లలో రాణించలేకపోయాడు. తాజాగా సన్‌రైజర్స్‌తో సోమవారం ముగిసిన మ్యాచ్‌లోనూ రోహిత్ శర్మ విఫలమయ్యాడు.భావోద్వేగానికి గురైన రోహిత్!వాంఖడే మైదానంలో ఐదు బంతులు ఎదుర్కొన్న రోహిత్.. కేవలం ఒక్క ఫోర్ కొట్టి అవుటయ్యాడు. రైజర్స్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ బౌలింగ్‌లో వికెట్ కీపర్ హెన్రిచ్ క్లాసెన్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.ఈ నేపథ్యంలో నిరాశగా మైదానం వీడిన రోహిత్ శర్మ డ్రెస్సింగ్ రూంలోకి వెళ్లి తీవ్ర భావోద్వేగానికి గురైనట్లుగా కనిపించాడు. దుఃఖాన్ని ఆపుకొంటూ రోహిత్ కన్నీళ్లను తుడుచుకుంటున్నట్లుగా కనిపిస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.పాపం రోహిత్ఈ వీడియో చూసిన రోహిత్ శర్మ అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు. ‘‘టీ20 వరల్డ్‌కప్‌నకు ముందు నిన్నిలా చూడలేకపోతున్నాం హిట్‌మ్యాన్. ముంబై ఇండియన్స్ ఫ్రాంఛైజీ నిర్ణయం వల్లే ఇదంతా. కెప్టెన్సీ నుంచి అవమానకరంగా తప్పించి అతడిని ఒత్తిడిలోకి నెట్టేశారు.ఐదుసార్లు ట్రోఫీ అందించిన కెప్టెన్‌పై వేటు వేశారు. అందుకు తగిన మూల్యం చెల్లిస్తున్నారు’’ అంటూ ముంబై జట్టు మేనేజ్మెంట్పై మండిపడుతున్నారు. ఏదేమైనా రోహిత్ శర్మ వైఫల్యాలను అధిగమించి రెట్టించిన ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని ఆకాంక్షిస్తున్నారు. కాగా సన్‌రైజర్స్‌తో మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ ఏడు వికెట్ల తేడాతో గెలుపొందింది. తద్వారా ఈ సీజన్లో నాలుగో విజయం అందుకుంది. చదవండి: ధోని గురించి నిజాలు ఇవే! మాజీ క్రికెటర్లకు కౌంటర్Rohit Sharma crying in the dressing room. pic.twitter.com/GRU5uF3fpc— Gaurav (@Melbourne__82) May 6, 2024💯 & winning runs in styleSuryakumar Yadav hits a maximum to bring up his century 👏Watch the recap on @StarSportsIndia and @JioCinema 💻📱#TATAIPL | #MIvSRH | @mipaltan pic.twitter.com/RlaOZ8l2i0— IndianPremierLeague (@IPL) May 6, 2024 -
ప్లే ఆఫ్స్ రేసులో ఉన్నారా? హార్దిక్ సమాధానం ఇదే!
ఐపీఎల్-2024లో ముంబై ఇండియన్స్ నాలుగో విజయం నమోదు చేసింది. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో సోమవారం నాటి మ్యాచ్‌లో ఏడు వికెట్ల తేడాతో గెలిచి పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానానికి చేరుకుంది. స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ అద్భుత ఇన్నింగ్స్ వల్లే ముంబైకి ఈ గెలుపు సాధ్యమైంది.తద్వారా ఈ సీజన్లో ప్లే ఆఫ్స్ నుంచి నిష్క్రమించే తొలి జట్టుగా అపఖ్యాతి మూటగట్టుకునే ప్రమాదం నుంచి ముంబై తప్పించుకోగలిగింది. ఈ నేపథ్యంలో ఆ జట్టు కెప్టెన్ హార్దిక్ పాండ్యా హర్షం వ్యక్తం చేశాడు.సూర్యలాంటి విధ్వంసకర బ్యాటర్ తమ జట్టులో ఉండటం అదృష్టమంటూ అతడిని కొనియాడాడు. అదే విధంగా.. విజయానంతరం కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్ నుంచి ఎదురైన ప్రశ్నకు హార్దిక్ తనదైన శైలిలో సమాధానమిచ్చాడు.ప్లే ఆఫ్స్ రేసులో ఉన్నారా?ప్లే ఆఫ్స్ రేసు గురించి మంజ్రేకర్ ప్రస్తావించగా.. ‘‘మీరు ఏ సమీకరణల గురించి మాట్లాడుతున్నారో నాకు తెలియదు. అయితే, మేము ఇంకాస్త మెరుగ్గా ఆడాలని అనుకుంటున్నాం’’ అని హార్దిక్ బదులిచ్చాడు.ఇక సన్‌రైజర్స్‌తో మ్యాచ్ ఫలితం గురించి మాట్లాడుతూ.. ‘‘మేము 10- 15 పరుగులు అదనంగా సమర్పించుకున్నాం. ఏదేమైనా మా బ్యాటర్లు అత్యద్భుతంగా ఆడారు. ఇక నేను కూడా ఈరోజు మెరుగ్గా బౌలింగ్ చేయగలిగాను.అత్యుత్తమ బ్యాటర్పరిస్థితులకు అనుగుణంగా నా వ్యూహాలను అమలు చేయగా సత్ఫలితాలు వచ్చాయి. ఇక ‘స్కై’ గురించి చెప్పేదేముంది. తనలోని అత్యుత్తమ బ్యాటర్ మరోసారి బయటకు వచ్చాడు.ప్రత్యర్థి జట్టు బౌలర్లను ఒత్తిడిలో కూరుకుపోయేలా చేశాడు. ఆత్మవిశ్వాసంతో అతడు బ్యాటింగ్ చేసిన తీరు మ్యాచ్ స్వరూపాన్నే మార్చి వేసింది. ఒంటిచేత్తో జట్టును గెలిపించగల సత్తా అతడి సొంతం’’ అని సూర్యకుమార్ యాదవ్‌పై హార్దిక్ పాండ్యా ప్రశంసలు కురిపించాడు.ముంబై వర్సెస్ హైదరాబాద్ స్కోర్లు:👉వేదిక: వాంఖడే, ముంబై👉టాస్: ముంబై.. బౌలింగ్👉హైదరాబాద్ స్కోరు: 173/8 (20)👉ముంబై స్కోరు: 174/3 (17.2)👉ఫలితం: ఏడు వికెట్ల తేడాతో హైదరాబాద్‌పై ముంబై గెలుపు👉ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: సూర్యకుమార్ యాదవ్(51 బంతుల్లో 12 ఫోర్లు, 6 సిక్స్‌ల సాయంతో 102 రన్స్- నాటౌట్).చదవండి: తండ్రిని ఎంకరేజ్ చేసేందుకు వచ్చిన జూనియర్ బుమ్రా..!💯 & winning runs in styleSuryakumar Yadav hits a maximum to bring up his century 👏Watch the recap on @StarSportsIndia and @JioCinema 💻📱#TATAIPL | #MIvSRH | @mipaltan pic.twitter.com/RlaOZ8l2i0— IndianPremierLeague (@IPL) May 6, 2024 -
తండ్రిని ఎంకరేజ్ చేసేందుకు వచ్చిన జూనియర్ బుమ్రా..!
ఐపీఎల్ 2024 సీజన్లో భాగంగా నిన్న (మే 6) జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ సన్‌రైజర్స్‌పై 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో సూర్యకుమార్ యాదవ్ మెరుపు శతకంతో (51 బంతుల్లో 102 నాటౌట్; 12 ఫోర్లు, 6 సిక్సర్లు) విరుచుకుపడి ముంబైని ఒంటిచేత్తో గెలిపించాడు. తొలుత ముంబై బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో సన్‌రైజర్స్ 173 పరుగుల నామమాత్రపు స్కోర్‌కే పరిమితమైంది. ఛేదనలో ముంబై సైతం ఆదిలో తడబడినప్పటికీ స్కై.. తిలక్ వర్మ (37 నాటౌట్) సహకారంతో ముంబైని విజయతీరాలకు చేర్చాడు. ఐపీఎల్లో స్కైకు ఇది రెండో సెంచరీ. Angad bumrah is here !!! So cute ,,#MIvSRH #bumrah #RohitSharma @Jaspritbumrah93 pic.twitter.com/EzxEdHwRPI— Randhir_45 (@Mr_Randhir_45) May 6, 2024ఈ మ్యాచ్‌లో ముంబై బౌలర్లు హార్దిక్ పాండ్యా (4-0-31-3), పియూశ్ చావ్లా (4-0-33-3) సైతం సత్తా చాటారు. నాలుగు వరుస పరాజయాల తర్వాత ఎట్టకేలకు ముంబైకు ఊరటనిచ్చే గెలుపు దక్కింది. ఈ గెలుపుతో ముంబై పాయింట్ల పట్టికలో పదో స్థానం నుంచి తొమ్మిదో ప్లేస్‌కు ఎగబాకింది. ఈ సీజన్లో ముంబై మరో రెండు మ్యాచ్‌లు (మే 11న కేకేఆర్‌తో, మే 17న లక్నోతో) ఆడాల్సి ఉన్నా ప్లే ఆఫ్స్‌కు చేరే పరిస్థితి లేదు. అలాగని టెక్నికల్‌గా ఇంకా ఔట్ కాలేదు. ఏదైనా మహాద్భుతం జరిగితే తప్ప ముంబై ఈ సీజన్ ప్లే ఆఫ్స్‌కు చేరలేదు.జూనియర్ బుమ్రా వచ్చాడు..ఇదిలా ఉంటే, నిన్న వాంఖడే వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఓ చిట్టిపొట్టి అతిథి అందరి దృష్టిని ఆకర్శించాడు. అతడే బుమ్రా తనయుడు అంగద్ బుమ్రా. అంగద్.. తన తల్లి సంజనా గణేశన్‌తో కలిసి తన తండ్రి జస్ప్రీత్ బుమ్రాను ఎంకరేజ్ చేసేందుకు వాంఖడేకు వచ్చాడు. వీఐపీ స్టాండ్స్‌లో సంజనా.. అంగద్‌ను ఒడిలో కూర్చొబెట్టుకుని కెమెరా కంటికి చిక్కింది. ఈ ఫోటోలు నెట్టింట వైరలవుతున్నాయి. అంగద్ తొలిసారి పబ్లిక్‌లోకి రావడంతో చిన్నారిని చూసేందుకు జనాలు ఎగబడుతున్నారు. అంగద్ ముంబై ఇండియన్స్ జెర్సీ ధరించి ఉండటంతో ఆ ఫ్రాంచైజీ అభిమానులు తెగ సంబురపడిపోతున్నారు. జూనియర్ బుమ్రా వచ్చేశాడంటూ కామెంట్లు చేస్తున్నారు. ఈ మ్యాచ్‌లో బుమ్రా బౌలింగ్‌లో యధావిధిగా అదరగొట్టాడు. ఈ మ్యాచ్‌లో తన కోటా నాలుగు ఓవర్లు పూర్తి చేసిన బుమ్రా కేవలం 23 పరుగులు మాత్రమే ఇచ్చి కీలకమైన అభిషేక్ శర్మ (11) వికెట్ పడగొట్టాడు. మొత్తానికి బుమ్రా కొడుకు అంగద్ నిన్నటి మ్యాచ్ సందర్భంగా చర్చనీయాంశంగా మారాడు. -
IPL 2024: ముంబై ఆశలకు సూర్య ఊపిరి
ముంబై: ఐపీఎల్ నుంచి ‘ఫైవ్ స్టార్’ చాంపియన్ ముంబై ఇండియన్స్ అందరికంటే ముందుగా ని్రష్కమించే ముప్పును సూర్యకుమార్ యాదవ్ (51 బంతుల్లో 102 నాటౌట్; 12 ఫోర్లు, 6 సిక్స్‌లు) తప్పించాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్లపై విరుచుకుపడి ముంబైని రేసులో నిలిపాడు. సోమవారం జరిగిన మ్యాచ్‌లో ముంబై 7 వికెట్ల తేడాతో హైదరాబాద్‌పై ఘనవిజయం సాధించింది. మొదట సన్‌రైజర్స్ నిరీ్ణత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. హెడ్ (30 బంతుల్లో 48; 7 ఫోర్లు, 1 సిక్స్), ప్యాట్ కమిన్స్ (17 బంతుల్లో 35 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) ధాటిగా ఆడారు. హార్దిక్ పాండ్యా, పియూశ్ చావ్లా చెరో 3 వికెట్లు తీశారు. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన ముంబై 17.2 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 174 పరుగులు చేసి గెలిచింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ సూర్యకుమార్‌కు అండగా తిలక్ వర్మ (32 బంతుల్లో 37 నాటౌట్; 6 ఫోర్లు) నిలిచాడు. ఆదుకున్న హెడ్ ఆరంభంలో హెడ్, ఆఖర్లో కమిన్స్ మెరుపులు మినహా సన్‌రైజర్స్ ఇన్నింగ్స్ ఈ మ్యాచ్‌లో బోర్ కొట్టించింది. పవర్‌ప్లేలో 56/1 స్కోరు చేసిన హైదరాబాద్ 10 ఓవర్ల దాకా 88/2 స్కోరుతో పటిష్టంగానే కనిపించింది. అభిషేక్ (11), మయాంక్ అగర్వాల్ (5), నితీశ్ కుమార్ రెడ్డి (15 బంతుల్లో 20; 2 ఫోర్లు), క్లాసెన్ (2)... ఇలా కీలక బ్యాటర్లందరినీ వరుస విరామంలో కోల్పోవడంతో హైదరాబాద్ కోలుకోలేదు. 16వ ఓవర్ వేసిన పాండ్యా... షహబాజ్ అహ్మద్ (10), మార్కో జాన్సెన్ (17)లను అవుట్ చేయగా, సమద్ (3)ను చావ్లా వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. దీంతో 136 పరుగులకే 8 వికెట్లు పడిపోవడంతో డెత్ ఓవర్లలో దూకుడుగా ఆడే స్పెషలిస్టు బ్యాటరే కరువయ్యాడు. అయితే కెపె్టన్ కమిన్స్ 2 ఫోర్లు, 2 సిక్సర్లతో సత్తాచాటడంతో హైదరాబాద్ 170 పైచిలుకు స్కోరు చేయగలిగింది. ‘సూర్య’ మేటి ఇన్నింగ్స్ నాలుగో ఓవర్లో రోహిత్ (4) అవుటవగానే సూర్యకుమార్ క్రీజులోకి వచ్చాడు. అంతకుముందే ఇషాన్ కిషన్ (9) పెవిలియన్‌లో కూర్చుకున్నాడు. ఆ తర్వాత నమన్ ధీర్ (0) డకౌటయ్యాడు. ముంబై స్కోరు 31/3. సంబరాల్లో హైదరాబాద్! ఒత్తిడిలో ముంబై... ఈ దశలో తిలక్ వర్మ అండతో ముంబైని పీకల్లోతు కష్టాల్లోంచి ఘనవిజయం దాకా సూర్యకుమార్ గ్రేటెస్ట్ ఇన్నింగ్స్ ఆడాడు. మొదట్లో బౌండరీలతో జట్టును నడిపించిన ‘భారత 360’ డిగ్రీ బ్యాటర్ తర్వాత భారీషాట్లతో విరుచుకుపడ్డాడు. దీంతో జట్టు స్కోరు ఆరో ఓవర్లో 50 దాటగా... 12వ ఓవర్లో వంద పరుగుల్ని అధిగమించింది. ఈ భాగస్వామ్యం మెరుపులతో లక్ష్యాన్ని చేరింది. 30 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసుకున్న సూర్య... శతక్కొట్టేందుకు మరో 21 బంతుల్లే అవసరమయ్యాయి. 18వ ఓవర్లో భారీ సిక్సర్‌తో 51 బంతుల్లో సెంచరీని పూర్తిచేసుకోవడంతోనే మ్యాచ్ కూడా ముగిసింది. స్కోరు వివరాలు సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్: హెడ్ (సి) తిలక్ వర్మ (బి) చావ్లా 48; అభిõÙక్ (సి) ఇషాన్ (బి) బుమ్రా 11; మయాంక్ (బి) అన్షుల్ 5; నితీశ్ కుమార్ రెడ్డి (సి) అన్షుల్ (బి) హార్దిక్ 20; క్లాసెన్ (బి) చావ్లా 2; జాన్సెన్ (బి) హార్దిక్ 17; షహబాజ్ (సి) సూర్యకుమార్ (బి) హార్దిక్ 10; సమద్ (ఎల్బీడబ్ల్యూ) (బి) చావ్లా 3; కమిన్స్ (నాటౌట్) 35; సనీ్వర్ (నాటౌట్) 8; ఎక్స్‌ట్రాలు 14; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 173. వికెట్ల పతనం: 1–56, 2–68, 3–90, 4–92, 5–96, 6–120, 7–124, 8–136. బౌలింగ్: తుషార 4–0–42–0, అన్షుల్ 4–0–42–1, బుమ్రా 4–0–23–1, హార్దిక్ పాండ్యా 4–0–31–3, పియూశ్ చావ్లా 4–0–33–3. ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్: ఇషాన్ (సి) మయాంక్ (బి) జాన్సెన్ 9; రోహిత్ (సి) క్లాసెన్ (బి) కమిన్స్ 4; నమన్ (సి) జాన్సెన్ (బి) భువనేశ్వర్ 0; సూర్యకుమార్ (నాటౌట్) 102; తిలక్ వర్మ (నాటౌట్) 37; ఎక్స్‌ట్రాలు 22; మొత్తం (17.2 ఓవర్లలో 3 వికెట్లకు) 174. వికెట్ల పతనం: 1–26, 2–31, 3–31. బౌలింగ్: భువనేశ్వర్ 4–1–22–1, జాన్సెన్ 3–0–45–1, కమిన్స్ 4–1–35–1, నటరాజన్ 3.2–0–31–0, నితీశ్ కుమార్ రెడ్డి 2–0–16–0, షహబాజ్ 1–0–11–0. -
‘SRH కాదు.. పరుగుల విధ్వంసానికి మారు పేరు ఆ జట్టే’
లక్నో సూపర్ జెయింట్స్‌ను చిత్తుగా ఓడించిన కోల్‌కతా నైట్ రైడర్స్‌పై టీమిండియా మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా ప్రశంసలు కురిపించాడు. ఏకపక్ష విజయం అన్న మాటలకు కేకేఆర్ సరైన నిర్వచనం ఇచ్చిందని.. విధ్వంసకర ఆట తీరును కళ్లకు కట్టిందని ఆకాశానికెత్తాడు.లక్నో గల్లీకి వెళ్లి గల్లీ క్రికెట్లో మాదిరి వారిని మట్టికరిపించిన తీరు అద్భుతమంటూ కేకేఆర్‌ను కొనియాడాడు. కాగా సొంత మైదానంలో ఆదివారం నాటి మ్యాచ్‌లో టాస్ గెలిచిన లక్నో తొలుత బౌలింగ్ ఎంచుకుంది.సంచలన ఇన్నింగ్స్ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 235 పరుగులు చేసింది. ఓపెనర్లు ఫిలిప్ సాల్ట్(14 బంతుల్లో 32), సునిల్ నరైన్(39 బంతుల్లో 81) మెరుపు ఇన్నింగ్స్‌తో ఆకట్టుకోగా.. ఏడో నంబర్ బ్యాటర్ రమణ్ దీప్ సింగ్ సంచలన ఇన్నింగ్స్ ఆడాడు.కేవలం ఆరు బంతుల్లోనే 25 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఇక లక్ష్య ఛేదనకు దిగిన లక్నోను కేకేఆర్ 137 పరుగులకే కుప్పకూల్చింది. పేసర్లు హర్షిత్ రాణా(3/24, రసెల్(2/17), మిచెల్ స్టార్క్(1/22).. స్పిన్నర్లు వరుణ్ చక్రవర్తి(3/30), సునిల్ నరైన్(1/22) లక్నో బ్యాటింగ్ ఆర్డర్‌ను కుదేలు చేశారు.ఏకపక్ష విజయం ఫలితంగా కేకేఆర్ లక్నోపై ఏకంగా 98 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఇక ఐపీఎల్లో లక్నోకు ఇదే అతిపెద్ద పరాజయం కావడం గమనార్హం. ఈ నేపథ్యంలో భారత మాజీ ఓపెనర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.‘‘లక్నో గల్లీకి వెళ్లి గల్లీ క్రికెట్ మాదిరే వారిని చిత్తు చేసింది కేకేఆర్. ఏకపక్ష విజయం ఎలా ఉంటుందన్న దానికి ప్రత్యక్ష ఉదాహరణగా నిలిచింది.SRH అని ఎవరన్నారు?లక్నోకు తమ రెండున్నరేళ్ల ప్రయాణంలో అతిపెద్ద ఓటమిని రుచి చూపించింది. ఈ ఏడాది ఐపీఎల్ టోర్నీలో సన్‌రైజర్స్ హైదరాబాద్ అత్యంత విధ్వంసకర జట్టు అని ఎవరు చెప్పారు?ఎస్ఆర్హెచ్ కాదు! అది కేకేఆర్ మాత్రమే’’ అని ఆకాశ్ చోప్రా శ్రేయస్ అయ్యర్ సేనకు కితాబులిచ్చాడు. ఇప్పటికే కేకేఆర్ ఆరుసార్లు 200 పరుగుల స్కోరు దాటిందని.. కోల్‌కతా కంటే ప్రమాదకర జట్టు ఇంకేది ఉందని టేబుల్ టాపర్‌ను ప్రశంసించాడు. కాగా ఐపీఎల్ చరిత్రలో అత్యధిక స్కోరు(287) సాధించిన జట్టుగా సన్‌రైజర్స్ ఈ ఎడిషన్ సందర్బంగా అరుదైన రికార్డు సాధించిన విషయం తెలిసిందే.చదవండి: అచ్చా.. అలాగా?: కోహ్లిపై గావస్కర్ కామెంట్స్.. వసీం అక్రం కౌంటర్High-Fives in the @KKRiders camp 🙌With that they move to the 🔝 of the Points Table with 16 points 💜Scorecard ▶️ https://t.co/CgxfC5H2pD#TATAIPL | #LSGvKKR pic.twitter.com/0dUMJLasNQ— IndianPremierLeague (@IPL) May 5, 2024 -
MI Vs SRH: ఐపీఎల్లో నేడు (మే 6) మరో బిగ్ మ్యాచ్
ఐపీఎల్లో ఇవాళ మరో భారీ మ్యాచ్ జరుగనుంది. స్టార్లతో నిండిన ముంబై ఇండియన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. ముంబై హోం గ్రౌండ్ అయిన వాంఖడేలో రాత్రి 7: 30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ సీజన్లో ముంబై వరుస చెత్త ప్రదర్శనలు చేస్తూ పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో ఉంది. మహాద్భుతం జరిగే తప్ప ఈ సీజన్లో ముంబై ప్లే ఆఫ్స్‌కు చేరుకోలేదు. ఈ జట్టు ఇప్పటివరకు ఆడిన 11 మ్యాచ్‌ల్లో కేవలం మూడింట మాత్రమే గెలుపొంది ఆరు పాయింట్లు ఖాతాలో కలిగి ఉంది. ముంబై ఈ సీజన్లో మరో మూడు మ్యాచ్‌లు (సన్‌రైజర్స్, కేకేఆర్, లక్నో) ఆడాల్సి ఉంది.సన్‌రైజర్స్ విషయానికొస్తే.. ఈ జట్టు ప్రస్తుతం పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో కొనసాగుతూ ప్లే ఆఫ్స్ బెర్త్ కోసం ప్రధాన పోటీదారుగా ఉంది. సన్‌రైజర్స్ ఇప్పటివరకు ఆడిన 10 మ్యాచ్‌ల్లో ఆరు మ్యాచ్‌లు గెలిచి 12 పాయింట్లు ఖాతాలో కలిగి ఉంది. ఆరెంజ్ ఆర్మీ ఈ సీజన్లో ఇంకా నాలుగు మ్యాచ్‌లు (ముంబై, లక్నో, గుజరాత్, పంజాబ్) ఆడాల్సి ఉంది. ఇతర జట్ల జయాపజయాలతో పని లేకుండా ప్లే ఆఫ్స్‌కు చేరుకోవాలంటే సన్‌రైజర్స్ ఇకపై జరిగే అన్ని మ్యాచ్‌లు గెలవాల్సి ఉంటుంది.హెడ్ టు హెడ్ రికార్డ్స్: ఐపీఎల్లో ముంబై, సన్‌రైజర్స్ ఇప్పటివరకు 22 మ్యాచ్‌ల్లో ఎదురెదురుపడగా.. ముంబై 12, సన్‌రైజర్స్ 10 మ్యాచ్‌ల్లో విజయాలు సాధించాయి. చివరిసారిగా ఈ రెండు జట్ల మధ్య తలపడిన మ్యాచ్‌లో అతి భారీ స్కోర్లు నమోదయ్యాయి. హైదరాబాద్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ 31 పరుగుల తేడాతో ముంబైని చిత్తు చేసింది.ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ ట్రవిస్ హెడ్ (62), అభిషేక్ శర్మ (63), మార్క్రమ్ (42 నాటౌట్), క్లాసెన్ (80 నాటౌట్) విజృంభించడంతో నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 277 పరుగులు చేసింది.అనంతరం ఛేదనలో ముంబై ఇండియన్స్ సైతం ఏమాత్రం తగ్గకుండా బ్యాటింగ్ చేసి సన్‌రైజర్స్ శిబిరంలో దడ పుట్టించింది. ఈ జట్టు నిర్ణీత ఓవర్లు పూర్తయ్యేసరికి లక్ష్యానికి 32 పరుగుల దూరంలో నిలిచిపోయి ఓటమిపాలైంది. రోహిత్ శర్మ (26), ఇషాన్ కిషన్ (34), నమన్ ధిర్ (30), తిలక్ వర్మ (64), హార్దిక్ పాండ్యా (24), టిమ్ డేవిడ్ (42 నాటౌట్), రొమారియో షెపర్డ్ (15 నాటౌట్) తలో చేయి వేసి సన్‌రైజర్స్‌ను భయపెట్టారు.తుది జట్లు (అంచనా)..ముంబై ఇండియన్స్: ఇషాన్ కిషన్ (వికెట్‌కీపర్), రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), నమన్ ధిర్, టిమ్ డేవిడ్, గెరాల్డ్ కోయెట్జీ, పీయూష్ చావ్లా, జస్ప్రీత్ బుమ్రా, నువాన్ తుషార [ఇంపాక్ట్ ప్లేయర్: నేహాల్ వధేరా]సన్‌రైజర్స్: ట్రవిస్ హెడ్, అభిషేక్ శర్మ, అన్మోల్ప్రీత్ సింగ్, హెన్రిచ్ క్లాసెన్ (వికెట్‌కీపర్), నితీష్ రెడ్డి, అబ్దుల్ సమద్, షాబాజ్ అహ్మద్, మార్కో జాన్సెన్, పాట్ కమిన్స్ (కెప్టెన్), భువనేశ్వర్ కుమార్, టి నటరాజన్ [ఇంపాక్ట్ ప్లేయర్: జయదేవ్ ఉనద్కత్/ఉమ్రాన్ మాలిక్] -
‘నాకు దక్కలేదు.. సంజూ భయ్యాను మాత్రం సెలక్ట్ చేశారు’
‘‘నేను చాలా విషయాల్లో మెరుగుపడాలి. ప్రస్తుతం నేను నా అత్యుత్తమ ఫామ్‌లో లేను. ఒకవేళ ఫామ్‌లో ఉండి ఉంటే గనుక కచ్చితంగా మ్యాచ్‌ను విజయంతో ముగించేవాడిని.నా తప్పుల నుంచి పాఠాలు నేర్చుకుంటాను. అవి మళ్లీ పునరావృతం కాకుండా చూసుకుంటాను. ఇది నా అత్యుత్తమ ఇన్నింగ్సేనా అంటే కానేకాదు. ఒకవేళ సెంచరీ చేసి ఉంటే పరిస్థితి వేరేలా ఉండేది.మ్యాచ్‌లో ఓడిపోయిన జట్టుగా మిగిలిపోవడం నిరాశకు గురిచేస్తుంది. ఈరోజు మ్యాచ్‌లో మేము ఆఖరి వరకు పోరాడగలిగాం. ఓటమిని తలచుకుంటూ కూర్చుంటే ముందుకు సాగలేం.రెండు- మూడు ఓవర్లలో చేసిన తప్పుల కారణంగా మ్యాచ్ రూపంలో భారీ మూల్యమే చెల్లించాం. టీ20 అంటేనే ఇలా ఉంటుంది. కాబట్టి తదుపరి మ్యాచ్‌పై దృష్టి సారించే క్రమంలో ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతాం’’ అని రాజస్తాన్ రాయల్స్ యువ బ్యాటర్ రియాన్ పరాగ్ అన్నాడు.కాగా ఐపీఎల్-2024లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో రాజస్తాన్ గురువారం తలపడింది. ఉప్పల్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన సన్‌రైజర్స్ తొలుత బ్యాటింగ్ చేసింది.నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్లు నష్టపోయి 201 పరుగులు చేసింది. ఈ క్రమంలో లక్ష్య ఛేదనకు దిగిన రాజస్తాన్ విజయానికి ఒక్క పరుగు దూరంలో నిలిచిపోయింది. 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 200 పరుగులు మాత్రమే చేయగలిగింది.రియాన్ పరాగ్ ఇన్నింగ్స్ వృథాఆఖరి బంతికి రెండు పరుగులు అవసరమైన వేళ రైజర్స్ సీనియర్ భువనేశ్వర్ కుమార్ రోవ్‌మన్ పావెల్‌ను ఎల్బీడబ్ల్యూగా వెనక్కి పంపడంతో రాజస్తాన్ కథ ముగిసిపోయింది.ఫలితంగా ఈ మ్యాచ్‌లో రాజస్తాన్ కష్టాల్లో కూరకుపోయి ఉన్నవేళ.. 77 పరుగులతో రాణించిన రియాన్ పరాగ్ ఇన్నింగ్స్ వృథాగా పోయింది. ఈ నేపథ్యంలో ఓటమి అనంతరం రియాన్ పరాగ్ మాట్లాడుతూ ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు.కాగా వరల్డ్‌కప్-2024కు ప్రకటించిన జట్టులో రిజర్వ్ ప్లేయర్‌గా అయినా పరాగ్‌కు చోటు దక్కుతుందని అతడి అభిమానులు ఆశపడ్డారు. అయితే, బీసీసీఐ మాత్రం 22 ఏళ్ల ఈ అసోం బ్యాటింగ్ ఆల్‌రౌండర్‌కు అప్పుడే పిలుపునిచ్చేందుకు సిద్ధంగా లేనట్లు స్పష్టం చేసింది. సంజూ భయ్యాకు చోటు దక్కడం సంతోషంఈ నేపథ్యంలో రియాన్ పరాగ్ మాట్లాడుతూ.. ‘‘గతేడాది అసలు నేను ఐపీఎల్ పోటీలోనే లేను. కానీ ఈసారి నా గురించి ఏవో వదంతులు కూడా వినిపిస్తున్నాయి. నా గురించి అందరూ చర్చించుకునే స్థాయికి వచ్చాను.నా గురించి గళం వినిపిస్తున్న వారికి ధన్యవాదాలు. అయితే, నేను మాత్రం ఇప్పుడే వాటి(టీమిండియాలో చోటు) గురించి ఆలోచించడం లేదు. మా జట్టు నుంచి వరల్డ్‌కప్ టీమ్‌లో చోటు దక్కించుకున్న వారికి అభినందనలు. ముఖ్యంగా సంజూ భయ్యాకు చోటు దక్కడం చాలా చాలా సంతోషంగా ఉంది’’ అని రియాన్ పరాగ్ పరిణతితో కూడిన వ్యాఖ్యలు చేశాడు.ఇక సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మ్యాచ్‌లో 49 బంతుల్లో 77 పరుగులు చేసిన రియాన్ పరాగ్.. ఈ సీజన్లో 409 పరుగులు పూర్తి చేసుకున్నాడు. తద్వారా ఐపీఎల్-2024లో 400 పరుగుల మార్కు అందుకున్న తొలి అన్క్యాప్డ్ ప్లేయర్‌గా నిలిచాడు.చదవండి: SRH: కావ్యా మారన్ వైల్డ్ సెలబ్రేషన్స్.. వీడియో వైరల్ -
SRH: కావ్యా మారన్ వైల్డ్ సెలబ్రేషన్స్.. వీడియో వైరల్
సొంతగడ్డపై.. టీ20 మ్యాచ్.. నరాలు తెగే ఉత్కంఠ నడుమ.. ఆఖరి బంతికి ఒక్క పరుగు తేడాతో గెలిస్తే ఆ కిక్కే వేరు.. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆటగాళ్లు, అభిమానులు గురువారం నాటి మ్యాచ్‌లో ఈ మధురానుభూతిని చవిచూశారు.ఆఖరి బంతికి భువనేశ్వర్ కుమార్ వికెట్ తీసి.. పటిష్ట రాజస్తాన్ రాయల్స్‌పై రైజర్స్‌ను గెలుపు తీరాలకు చేర్చడంతో వారి సంతోషానికి అవధుల్లేకుండా పోయాయి. ఆటగాళ్లు, ఆరెంజ్ ఆర్మీ పరిస్థితి ఇలా ఉంటే.. ఫ్రాంఛైజీ సహ యజమాని కావ్యా మారన్ అయితే ఆనందంతో ఉబ్బితబ్బిబ్బైపోయారు. #TATAIPL Matches 📂↳ Last Ball Thrillers 📂Bhuvneshwar Kumar wins it for @SunRisers 👌👏Recap the Match on @StarSportsIndia and @JioCinema 💻📱#SRHvRR pic.twitter.com/mHdbR2K3SH— IndianPremierLeague (@IPL) May 2, 2024 ‘‘హేయ్.. మేమే గెలిచాం’’ అన్నట్లుగా సంతోషం పట్టలేక గాల్లోకి ఎగిరి దుముకుతూ వైల్డ్‌గా సెలబ్రేట్ చేసుకున్నారు కావ్యా. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి.అగ్ర స్థానంలోనే రాజస్తాన్కాగా ఐపీఎల్-2024లో వరుస విజయాలతో జోరు మీదున్న రాజస్తాన్ రాయల్స్‌కు సన్‌రైజర్స్ షాకిచ్చిన విషయం తెలిసిందే. ఉప్పల్‌లో గురువారం జరిగిన మ్యాచ్‌లో ఆఖరి వరకు ఉత్కంఠగా సాగిన పోరులో ఒక్క పరుగు తేడాతో రైజర్స్ గట్టెక్కింది. Jumps of Joy in Hyderabad 🥳Terrific turn of events from @SunRisers' bowlers as they pull off a nail-biting win 🧡Scorecard ▶️ https://t.co/zRmPoMjvsd #TATAIPL | #SRHvRR pic.twitter.com/qMDgjkJ4tc— IndianPremierLeague (@IPL) May 2, 2024 తద్వారా వరుసగా రెండు ఓటముల తర్వాత గెలుపొంది పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి దూసుకువచ్చింది. మరోవైపు.. రైజర్స్ చేతిలో పరాభవం ఎదురైనా రాజస్తాన్ అగ్రస్థానానికి వచ్చిన చిక్కేమీ లేదు. ఇప్పటికే 8 విజయాలు సాధించిన సంజూ సేన 16 పాయింట్లతో ప్లే ఆఫ్స్ రేసులో అందరి కంటే ముందే ఉంది.సన్‌రైజర్స్ వర్సెస్ రాజస్తాన్ స్కోర్లు:👉వేదిక: ఉప్పల్, హైదరాబాద్👉టాస్: సన్‌రైజర్స్- బ్యాటింగ్👉హైదరాబాద్ స్కోరు: 201/3 (20)👉రాజస్తాన్ స్కోరు: 200/7 (20)👉ఫలితం: ఒక్క పరుగు తేడాతో రాజస్తాన్‌పై సన్‌రైజర్స్ గెలుపు👉ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: భువనేశ్వర్ కుమార్(3/41)👉టాప్ స్కోరర్లు: నితీశ్ రెడ్డి(సన్‌రైజర్స్- 42 బంతుల్లో 76 రన్స్- నాటౌట్)👉రియాన్ పరాగ్ (రాజస్తాన్- 49 బంతుల్లో 77 పరుగులు).చదవండి: వాళ్లిద్దరు అద్భుతం.. నితీశ్‌రెడ్డి సూపర్: కమిన్స్ ప్రశంసలు -
SRH: వాళ్లిద్దరు అద్భుతం.. నితీశ్‌రెడ్డి సూపర్: కమిన్స్
సన్‌రైజర్స్ హైదరాబాద్- రాజస్తాన్ రాయల్స్ మధ్య గురువారం నాటి మ్యాచ్ ప్రేక్షకులను మునివేళ్ల మీద నిలబెట్టింది. నువ్వా- నేనా అన్నట్లుగా ఆఖరి బంతి వరకు సాగిన ఈ ఉత్కంఠ పోరు అసలైన టీ20 మజాను అందించింది.ఈ హోరాహోరీ పోరులో రాయల్స్‌పై సన్‌రైజర్స్ పైచేయి సాధించి సొంతగడ్డపై గెలుపు జెండా ఎగురవేసింది. దీంతో ఆరెంజ్ ఆర్మీ సంబరాలు అంబరాన్నంటాయి.ఇక గత రెండు మ్యాచ్‌లలో పరాజయాలు చవిచూసి ఎట్టకేలకు మళ్లీ గెలుపు బాట పట్టడంతో కెప్టెన్ ప్యాట్ కమిన్స్ సైతం హర్షం వ్యక్తం చేశాడు.అసలైన టీ20 క్రికెట్ అంటే ఇదేటేబుల్ టాపర్ రాజస్తాన్ రాయల్స్‌పై సన్‌రైజర్స్ గెలుపులో కీలక పాత్ర పోషించిన ఆటగాళ్లపై కమిన్స్ ఈ సందర్భంగా ప్రశంసలు కురిపించాడు. మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ.. ‘‘నాకు చాలా సంతోషంగా ఉంది. అద్భుతమైన మ్యాచ్ ఇది.అసలైన టీ20 క్రికెట్ అంటే ఇదే. ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ ఊహించలేరు. ఆఖరి బంతిని సంధించేపుడు భువీ తన ప్రణాళికను పక్కాగా అమలు చేశాడు.మిడిల్ ఓవర్లలో వీలైనన్ని వికెట్లు తీసేందుకు ప్రయత్నించాం. అదృష్టవశాత్తూ ఆఖరి వరకు పోరాడగలిగాం. ఇక నటరాజన్ గురించి ప్రత్యేకంగా చెప్పేదేం లేదు. యార్కర్లు సంధించడంలో అతడు దిట్ట.ఉప్పల్‌లో మేము ఇప్పటికే చాలా మ్యాచ్‌లు ఆడాం. కాబట్టి 200 లక్ష్యమనేది ఛేదించగలిగే టార్గెట్ అని తెలుసు. అయితే, విజయం మమ్మల్ని వరించింది.అతడొక అద్భుతం అంతేఈరోజు నితీశ్ రెడ్డి పరిస్థితులను అర్థం చేసుకుని చక్కగా ఆడాడు. అతడొక అద్భుతం అంతే! ఫీల్డింగ్‌లోనూ రాణిస్తున్నాడు. బౌలర్‌గానూ తన వంతు సేవలు అందిస్తున్నాడు’’ అంటూ ఆల్‌రౌండర్ నితీశ్ రెడ్డి, పేసర్లు భువనేశ్వర్ కుమార్, నటరాజన్‌ల ఆట తీరును ప్యాట్ కమిన్స్ కొనియాడాడు.కాగా ఉప్పల్‌లో టాస్ గెలిచిన సన్‌రైజర్స్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్ ట్రావిస్ హెడ్(44 బంతుల్లో 58) శుభారంభం అందించగా.. నాలుగో స్థానంలో వచ్చిన నితీశ్ రెడ్డి దుమ్ములేపాడు.42 బంతులు ఎదుర్కొన్న ఈ యువ ఆటగాడు 76 పరుగులతో అజేయంగా నిలిచాడు. అతడి ఇన్నింగ్స్‌లో 3 ఫోర్ల పాటు ఏకంగా 8 సిక్సర్లు ఉండటం విశేషం. ఇక విధ్వంసకర వీరుడు హెన్రిచ్ క్లాసెన్ మరోసారి తన బ్యాట్ పవర్ చూపించాడు.కేవలం 19 బంతుల్లోనే 42 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్ ఆడి నాటౌట్‌గా నిలిచాడు. ఈ క్రమంలో నిర్ణీత 20 ఓవర్లలో సన్‌రైజర్స్ కేవలం 3 వికెట్ల నష్టపోయి 201 పరుగులు సాధించింది.లక్ష్య ఛేదనకు దిగిన రాజస్తాన్‌ను భువీ ఆరంభంలోనే దెబ్బకొట్టాడు. ఓపెనర్ జోస్ బట్లర్(0), వన్‌డౌన్‌లో వచ్చిన సంజూ శాంసన్(3)ను డకౌట్ చేశాడు.ఇక 40 బంతుల్లో 67 పరుగులతో ప్రమాదకరంగా మారుతున్న యశస్వి జైస్వాల్ వికెట్‌ను నటరాజన్ తన ఖాతాలో వేసుకోగా.. టాప్ స్కోరర్ రియాన్ పరాగ్(77)ను కమిన్స్ పెవిలియన్‌కు పంపాడు.నరాలు తెగే ఉత్కంఠఈ క్రమంలో చివరి 3 ఓవర్లలో రాయల్స్ విజయ సమీకరణం 27 పరుగులుగా మారగా.. అప్పటికి చేతిలో ఆరు వికెట్లు ఉన్నాయి. ఈ నేపథ్యంలో రాయల్స్ సునాయాసంగానే లక్ష్యాన్ని ఛేదిస్తుందని అంతా భావించారు.అయితే, రైజర్స్ పేసర్లు అంతా తలకిందులు చేశారు. 18వ ఓవర్లో నటరాజన్, 19వ ఓవర్లో కమిన్స్ తలా కేవలం ఏడు పరుగులే ఇచ్చి రెండు వికెట్లు తీయగా.. చివరి ఓవర్లో సమీకరణం 13 పరుగులు మారింది.అప్పుడు బంతిని అందుకున్న భువీ బౌలింగ్‌లో తొలి ఐదు బంతుల్లో 11 పరుగులు వచ్చాయి. చివరి బంతికి 2 పరుగులు అవసరమైన వేళ రోవ్‌మన్ పావెల్‌ను భువీ వికెట్ల ముందు దొరకబుచ్చుకోవడంతో రైజర్స్ ఊపిరి పీల్చుకుంది. నరాలు తెగే ఉత్కంఠ రేపిన మ్యాచ్‌లో ఒక్క పరుగు తేడాతో గట్టెక్కింది. భువీ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు.Jumps of Joy in Hyderabad 🥳Terrific turn of events from @SunRisers' bowlers as they pull off a nail-biting win 🧡Scorecard ▶️ https://t.co/zRmPoMjvsd #TATAIPL | #SRHvRR pic.twitter.com/qMDgjkJ4tc— IndianPremierLeague (@IPL) May 2, 2024 -
నితీశ్ రెడ్డి మెరుపులు..సన్‌రైజర్స్ అనూహ్య గెలుపు (ఫొటోలు)
-
SRH Vs RR: ఓటమి అంచుల నుంచి...ఒక పరుగు విజయం వరకు...
సన్‌రైజర్స్‌పై 202 పరుగుల లక్ష్యఛేదనలో చివరి 3 ఓవర్లలో రాజస్తాన్ రాయల్స్‌కు 27 పరుగులు కావాలి. చేతిలో 6 వికెట్లు ఉన్నాయి. ఎలా చూసినా ఇది సులువుగా అందుకోగలిగేదే. కానీ ఇక్కడే హైదరాబాద్ బౌలింగ్ అనూహ్యంగా పుంజుకుంది. ప్రత్యర్థి బ్యాటర్లను పూర్తిగా ఒత్తిడిలోకి నెట్టింది. 18వ ఓవర్లో నటరాజన్ 7 పరుగులే ఇచ్చి ఒక వికెట్ తీయగా, 19వ ఓవర్లో కమిన్స్ 7 పరుగులు ఇచ్చి ఒక వికెట్ తీశాడు. చివరి ఓవర్లో 13 పరుగులు అవసరం కాగా, 5 బంతుల్లో 11 పరుగులు వచ్చాయి. ఆఖరి బంతికి 2 పరుగులు చేయాల్సి ఉండగా, భువనేశ్వర్ వేసిన చివరి బంతిని ఆడలేక పావెల్ వికెట్ల ముందు దొరికిపోయాడు. దాంతో ఉప్పల్ మైదానం హోరెత్తింది. గెలిచే మ్యాచ్‌ను చేజేతులా రాయల్స్ కోల్పోగా, ఓటమి అంచుల నుంచి హైదరాబాద్ ఒక పరుగుతో గట్టెక్కింది. సాక్షి, హైదరాబాద్: ఉత్కంఠభరిత పోరులో చివరకు హైదరాబాద్ పైచేయి సాధించింది. ఉప్పల్ స్టేడియంలో గురువారం జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ ఒక పరుగు తేడాతో రాజస్తాన్ రాయల్స్‌ను ఓడించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న హైదరాబాద్ 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది.ఆంధ్ర క్రికెటర్ నితీశ్ కుమార్ రెడ్డి (42 బంతుల్లో 76 నాటౌట్; 3 ఫోర్లు, 8 సిక్సర్లు), ట్రవిస్ హెడ్ (44 బంతుల్లో 58; 6 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్ధ సెంచరీలు సాధించగా... హెన్రిచ్ క్లాసెన్ (19 బంతుల్లో 42 నాటౌట్; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) కీలక ఇన్నింగ్స్ ఆడాడు.అనంతరం రాజస్తాన్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 200 పరుగులు చేసింది. రియాన్ పరాగ్ (49 బంతుల్లో 77; 8 ఫోర్లు, 4 సిక్స్‌లు), యశస్వి జైస్వాల్ (40 బంతుల్లో 67; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధసెంచరీలు చేశారు. భువనేశ్వర్‌కు (3/41) ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. నితీశ్ ధమాకా... పవర్‌ప్లే ముగిసేసరికి 2 వికెట్లకు 37 పరుగులు... ఈ సీజన్లో సన్‌రైజర్స్ చేసిన అత్యల్ప పరుగులివి. దీనిని చూస్తే రైజర్స్ 200 పరుగులకు చేరగలదని ఎవరూ ఊహించలేదు. అభిషేక్ శర్మ (12), అన్మోల్ప్రీత్ (5) విఫలం కాగా... హెడ్ అప్పటికి 17 బంతుల్లో 18 పరుగులే చేసి ఇబ్బంది పడుతున్నాడు. అయితే ఆ తర్వాత పరిస్థితి మారింది. చహల్ ఓవర్లో వరుసగా 6, 6, 4 బాది హెడ్ జోరు ప్రదర్శించగా... నితీశ్ తన బ్యాటింగ్‌తో ఇన్నింగ్స్‌కు ఊపు తెచ్చాడు. 10 ఓవర్ల తర్వాత స్కోరు 75 పరుగులకు చేరింది. 37 బంతుల్లో హెడ్ హాఫ్ సెంచరీ పూర్తయింది. చహల్ వేసిన 13వ ఓవర్లో 2 సిక్స్‌లు, 2 ఫోర్లతో నితీశ్ చెలరేగిపోయాడు. ఎట్టకేలకు హెడ్‌ను బౌల్డ్ చేసి అవేశ్ ఈ జోడీని విడదీయగా, కొద్ది సేపటికి 30 బంతుల్లో నితీశ్ అర్ధసెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. ఆఖరి 5 ఓవర్లలో రైజర్స్ బ్యాటర్లు నితీశ్, క్లాసెన్ మరింత చెలరేగడంతో 70 పరుగులు వచ్చాయి. అశ్విన్ ఓవర్లో వరుసగా 2 సిక్స్‌లు కొట్టిన నితీశ్... అవేశ్ ఓవర్లో ఫోర్, సిక్స్ కొట్టాడు. మరోవైపు చహల్ ఓవర్లో వరుసగా 2 సిక్స్‌లు బాదిన క్లాసెన్... చివరి నాలుగు బంతుల్లో 14 పరుగులు రాబట్టి స్కోరును 200 పరుగులు దాటించాడు. కీలక భాగస్వామ్యం... భువనేశ్వర్ వేసిన తొలి ఓవర్లోనే రెండో బంతికి బట్లర్ (0), ఐదో బంతికి సామ్సన్ (0) అవుట్... రైజర్స్ పైచేయి! కానీ 7 పరుగుల వద్ద యశస్వి ఇచ్చిన క్యాచ్‌ను వదిలేసిన కమిన్స్... 24 పరుగుల వద్ద పరాగ్ ఇచ్చిన క్యాచ్‌ను వదిలేసిన అభిషేక్... అంతే... ఆట రాజస్తాన్ వైపు మొగ్గింది. 1 పరుగు వద్దే 2 వికెట్లు కోల్పోయిన తర్వాత యశస్వి, పరాగ్ కలిసి ఇన్నింగ్స్‌ను నడిపించారు. వికెట్లు పడినా వీరిద్దరు ధాటిగా ఆడి పరుగులు రాబట్టడంతో పవర్‌ప్లే ముగిసేసరికి స్కోరు 60 పరుగులకు చేరింది. ఇద్దరూ బ్యాటర్లు రైజర్స్ బౌలర్లకు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా దూసుకుపోయారు. ఒకే ఓవర్లో యశస్వి 30 బంతుల్లో, ఆ తర్వాత 31 బంతుల్లో హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. అయితే విజయం వైపు దూసుకుపోతున్న దశలో వీరిద్దరు తక్కువ వ్యవధిలో వెనుదిరగడంతో ఉత్కంఠ పెరిగింది. ఆ తర్వాత కీలక సమయాల్లో మరో మూడు వికెట్లు చేజార్చుకున్న రాయల్స్ ఓటమిని ఆహా్వనించింది. స్కోరు వివరాలు సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్: హెడ్ (బి) అవేశ్ 58; అభిషేక్ (సి) జురేల్ (బి) అవేశ్ 12; అన్మోల్ప్రీత్ (సి) యశస్వి (బి) సందీప్ 5; నితీశ్ కుమార్ రెడ్డి (నాటౌట్) 76; క్లాసెన్ (నాటౌట్) 42; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (20 ఓవర్లలో 3 వికెట్లకు) 201. వికెట్ల పతనం: 1–25, 2–35, 3–131. బౌలింగ్: బౌల్ట్ 4–0–33–0, అశి్వన్ 4–0–36–0, అవేశ్ 4–0–39–2, సందీప్ శర్మ 4–0–31–1, చహల్ 4–0–62–0. రాజస్తాన్ రాయల్స్ ఇన్నింగ్స్: యశస్వి (బి) నటరాజన్ 67; బట్లర్ (సి) జాన్సెన్ (బి) భువనేశ్వర్ 0; సామ్సన్ (బి) భువనేశ్వర్ 0; పరాగ్ (సి) జాన్సెన్ (బి) కమిన్స్ 77; హెట్‌మైర్ (సి) జాన్సెన్ (బి) నటరాజన్ 13; పావెల్ (ఎల్బీ) (బి) భువనేశ్వర్ 27; జురేల్ (సి) అభిõÙక్ (బి) కమిన్స్ 1; అశ్విన్ (నాటౌట్) 2; ఎక్స్‌ట్రాలు 13; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 200. వికెట్ల పతనం: 1–1, 2–1, 3–135, 4–159, 5–181, 6–182, 7–200. బౌలింగ్: భువనేశ్వర్ 4–0–41–3, జాన్సెన్ 4–0–44–0, కమిన్స్ 4–0–34–2, నటరాజన్ 4–0–35–2, ఉనాద్కట్ 2–0–23–0, నితీశ్ కుమార్ రెడ్డి 1–0–12–0, షహబాజ్ 1–0–11–0. ఐపీఎల్లో నేడుముంబై X కోల్‌కతావేదిక: ముంబైరాత్రి 7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో సినిమా యాప్‌లో ప్రత్యక్ష ప్రసారం -
ఐపీఎల్లో ఇవాళ (మే 2) కొదమ సింహాల సమరం
ఐపీఎల్లో ఇవాళ (మే 2) బిగ్ ఫైట్ జరుగనుంది. విధ్వంసకర వీరులతో నిండిన సన్‌రైజర్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు హైదరాబాద్ వేదికగా అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఇరు జట్లలో భారీ హిట్టర్లు ఉండటంతో ఈ మ్యాచ్‌పై భారీ అంచనాలు ఉన్నాయి.ప్రస్తుతం రాజస్థాన్ రాయల్స్ 9 మ్యాచ్‌ల్లో 8 విజయాలతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉండగా.. సన్‌రైజర్స్ 9 మ్యాచ్‌ల్లో 5 విజయాలు సాధించి ఐదో స్థానంలో కొనసాగుతుంది. ప్రస్తుత సీజన్లో తిరుగులేని విజయాలతో దూసుకుపోతున్న రాజస్థాన్ అనధికారికంగా ప్లే ఆఫ్స్ బెర్త్ ఖరారు చేసుకోగా.. సన్‌రైజర్స్ ప్లే ఆఫ్స్ రేసులో ప్రధాన పోటీదారుగా నిలిచింది.హెడ్ టు హెడ్ రికార్డుల విషయానికొస్తే.. ఐపీఎల్లో ఇరు జట్లు ఇప్పటివరకు 18 మ్యాచ్‌ల్లో ఎదురెదురుపడగా.. చెరి 9 మ్యాచ్‌ల్లో విజయాలు సాధించాయి. ఈ సీజన్లో రాజస్థాన్ ఒక్క గుజరాత్ చేతుల్లో మాత్రమే ఓడి మాంచి జోష్‌లో ఉండగా.. సన్‌రైజర్స్ కొన్ని మ్యాచ్‌ల్లో భారీ స్కోర్లు సాధిస్తూ మరికొన్ని మ్యాచ్‌ల్లో తక్కువ స్కోర్లకే చేతులెత్తేస్తూ అటుఇటు కాకుండా ఉంది.తుది జట్లు (అంచనా)..సన్‌రైజర్స్: అభిషేక్ శర్మ, ట్రవిస్ హెడ్, ఎయిడెన్ మార్క్రమ్, హెన్రిచ్ క్లాసెన్ (వికెట్‌కీపర్), నితీష్ రెడ్డి, అబ్దుల్ సమద్, షాబాజ్ అహ్మద్, పాట్ కమిన్స్ (కెప్టెన్), భువనేశ్వర్ కుమార్, జయదేవ్ ఉనద్కత్, టి నటరాజన్. [ఇంపాక్ట్ ప్లేయర్: అన్మోల్ప్రీత్ సింగ్/మయాంక్ మార్కండే]రాజస్థాన్ రాయల్స్: యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్, సంజు శాంసన్ (కెప్టెన్/వికెట్‌కీపర్), రియాన్ పరాగ్, షిమ్రోన్ హెట్మెయర్, ధ్రువ్ జురెల్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, అవేష్ ఖాన్, సందీప్ శర్మ, యుజ్వేంద్ర చాహల్. [ఇంపాక్ట్ ప్లేయర్: రోవ్‌మన్ పావెల్] -
ఉప్పల్‌లో ఉల్లాసంగా SRH,RR ప్లేయర్ల ప్రాక్టీస్ (ఫొటోలు)
-
SRH Team In Hyderabad: సిటీలో సందడి చేసిన సన్ రైజర్స్ టీమ్ (ఫొటోలు)
-
కమిన్స్‌పై బ్రెట్ లీ విమర్శలు.. మరీ లేట్‌గా వచ్చి
సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్‌ను ఉద్దేశించి ఆస్ట్రేలియా దిగ్గజ ఫాస్ట్ బౌలర్ బ్రెట్ లీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. చెన్నై సూపర్ కింగ్స్‌తో ఆదివారం నాటి మ్యాచ్‌లో ఆలస్యంగా బౌలింగ్‌కు రావటాన్ని విమర్శించాడు.ప్రపంచంలోనే అత్యుత్తమ బౌలర్ అయిన కమిన్స్.. సహచరులకు ప్రాధాన్యం ఇచ్చే క్రమంలో ఇలాంటి పనులు చేయడం బాగానే ఉన్నప్పటికీ.. జట్టు ప్రయోజనాల దృష్ట్యా సరికాదని బ్రెట్ లీ అభిప్రాయపడ్డాడు.ఐపీఎల్-2024లో సన్‌రైజర్స్ సారథిగా అడుగుపెట్టిన కమిన్స్ మంచి ఫలితాలు రాబడుతున్నాడు. అయితే, గత రెండు మ్యాచ్‌లలో వరుస ఓటముల కారణంగా అతడిపై విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో చెన్నైతో చెపాక్ మ్యాచ్‌లో కమిన్స్ కొత్త బంతితో బౌలింగ్ చేయకపోవడాన్ని బ్రెట్ లీ తప్పుబట్టాడు.కాగా సన్‌రైజర్స్ సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్‌తో బౌలింగ్ అటాక్ ఆరంభించిన కమిన్స్.. తదుపరి ఓవర్లో బంతిని ఆల్‌రౌండర్ నితీశ్‌రెడ్డికి చేతికిచ్చాడు. అనంతరం షాబాజ్ అహ్మద్, నటారాజన్, జయదేవ్ ఉనాద్కట్‌తో బౌలింగ్ చేయించాడు. తాను మాత్రం తొమ్మిదో ఓవర్లో బౌలింగ్‌కు దిగాడు.మొత్తంగా నాలుగు ఓవర్ల కోటా పూర్తి చేసి 49 పరుగులు ఇచ్చి ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. ఇక ఈ మ్యాచ్‌లో 212 పరుగులు చేసిన చెన్నై.. లక్ష్య ఛేదనలో చేతులెత్తేసిన సన్‌రైజర్స్‌ను 78 పరుగుల తేడాతో చిత్తు చేసింది.ఈ నేపథ్యంలో బ్రెట్ లీ మాట్లాడుతూ.. ‘‘ప్యాట్ కమిన్స్ చాలా ఆలస్యంగా బరిలోకి వచ్చాడు. నాలుగు ఓవర్లు బౌల్ చేసి 49 పరుగులు ఇచ్చాడు. తను ధారాళంగా పరుగులు ఇచ్చిన మాట వాస్తవమే.నిజానికి తను కొత్త బంతితో అద్భుతంగా రాణించగలడు. కానీ వేరే వాళ్లకు అవకాశం ఇచ్చాడు. కొన్నిసార్లు మరీ మంచి కెప్టెన్‌గా మారిపోతాడు. బౌలింగ్ కెప్టెన్‌గా.. ఇతర బౌలర్లకు ప్రాధాన్యం ఇవ్వడం మంచిదే.కానీ వరల్డ్ బెస్ట్ బౌలర్ బౌలింగ్ అటాక్ ఆరంభించకపోవడం సరికాదు. స్వార్థంగా ఉండమని నేను చెప్పటం లేదు. ప్యాట్ కమిన్స్.. ప్యాట్ కమిన్సే. కనీసం రెండో ఓవర్లోనైనా అతడు బౌలింగ్‌లోకి దిగాల్సింది’’ అని జియో సినిమా షోలో వ్యాఖ్యానించాడు. -
ఎంత పనిచేశావు కమిన్స్!.. కావ్య రియాక్షన్ వైరల్
పవర్ హిట్టింగ్తో దుమ్ములేపుతూ ఐపీఎల్-2024లో రికార్డులు సృష్టించిన సన్‌రైజర్స్ హైదరాబాద్.. ప్రస్తుతం వరుస పరాజయాలతో సతమతమవుతోంది. బారీ విజయాల తర్వాత తొలుత ఆర్సీబీ చేతిలో ఓడిపోయిన ప్యాట్ కమిన్స్ బృందం.. తాజాగా ఆదివారం నాటి మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో చిత్తైంది.చెపాక్ వేదికగా 78 పరుగుల తేడాతో ఓడి.. ఐపీఎల్ చరిత్రలోనే తమ భారీ పరాజయాన్ని నమోదు చేసింది. ఈ మ్యాచ్ చూస్తున్నంత సేపు అసలు బ్యాటింగ్ చేసేది సన్‌రైజర్స్ జట్టేనా అనేంత మందకొడిగా బ్యాటింగ్ సాగింది. Batting 🤝 Bowling 🤝 Fielding @ChennaiIPL put on a dominant all-round performance & continue their good show at home 🏠 Scorecard ▶️ https://t.co/uZNE6v8QzI#TATAIPL | #CSKvSRH pic.twitter.com/RcFIE9d46K— IndianPremierLeague (@IPL) April 28, 2024 అదే విధంగా.. తొలుత ఫీల్డింగ్ చేసిన సమయలోనూ సన్‌రైజర్స్ ఏమాత్రం ఆకట్టులేకపోయింది. ఈ నేపథ్యంలో సన్‌రైజర్స్ సహ యజమాని కావ్యా మారన్ ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.చెపాక్‌లో చెన్నైతో ఆదివారం నాటి మ్యాచ్‌లో టాస్ గెలిచిన ప్యాట్ కమిన్స్ బౌలింగ్ ఎంచుకున్నాడు. ఈ క్రమంలో తొలుత బ్యాటింగ్‌కు దిగిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 212 పరుగులు స్కోరు చేసింది.ఓపెనర్, కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ 98 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. అయితే, గైక్వాడ్ 97 పరుగుల వద్ద ఉన్నపుడు రనౌట్ అయ్యేందుకు ఆస్కారం ఏర్పడింది.కానీ సన్‌రైజర్స్ ఫీల్డర్ల తప్పిదం వల్ల అతడు బతికిపోయాడు. చెన్నై ఇన్నింగ్స్ పందొమ్మిద ఓవర్లో ఈ ఘటన జరిగింది. ఉనాద్కట్ బౌలింగ్‌లో నాలుగో బంతిని అవుట్ సైడ్ ఆఫ్ దిశగా.. ఆఫ్ కట్టర్‌గా సంధించగా.. గైక్వాడ్ షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు.బంతిని అందుకున్న కమిన్స్ వికెట్లకు గిరాటేయడంలో విఫలమయ్యాడు. ఈ క్రమంలో గైక్వాడ్ రెండు పరుగులు తీసుకుని సింగిల్ తీసి రెండో పరుగు పూర్తి చేసుకున్నాడు. ఈ నేపథ్యంలో కావ్యా మారన్ స్పందిస్తూ.. ‘‘నో.. దేవుడా ఎంత పనిపోయింది’’ అన్నట్లుగా ఎక్స్ప్రెషన్స్ ఇచ్చారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు వైరల్ అవుతున్నాయి. -
T20 WC: తుదిజట్టులో చోటివ్వాల్సిందే.. కెప్టెన్ కూడా కాదనలేడు!
చెన్నై సూపర్ కింగ్స్ ఆల్‌రౌండర్ శివం దూబే మరోసారి అద్భుత ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో ఆదివారం నాటి మ్యాచ్‌లో 20 బంతుల్లో ఒక ఫోర్, నాలుగు సిక్సర్ల సాయంతో 39 పరుగులతో అజేయంగా నిలిచాడు.కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్(98), డారిల్ మిచెల్(52)తో కలిసి చెన్నై సూపర్ కింగ్స్‌కు 212 పరుగుల భారీ స్కోరు అందించాడు. తద్వారా రైజర్స్పై 78 పరుగుల తేడాతో గెలుపొందడంలో తన వంతు పాత్ర పోషించాడు.కాగా ఐపీఎల్-2024లో ఈ లెఫ్టాండర్ బ్యాటర్ దుమ్మురేపుతున్న విషయం తెలిసిందే. సీఎస్కే తరఫున మిడిలార్డర్ బ్యాటర్‌గా బరిలోకి దిగుతున్న దూబే.. తొమ్మిది ఇన్నింగ్స్‌లో కలిపి 350 పరుగులు చేశాడు.ధనాధన్ ఇన్నింగ్స్ ఆడి జట్టు ఇప్పటి దాకా సాధించిన ఐదు విజయాల్లో తనదైన ముద్ర వేశాడు. ఈ నేపథ్యంలో టీ20 వరల్డ్‌కప్-2024 ఆడనున్న టీమిండియాలో అతడికి తప్పక చోటివ్వాలని డిమాండ్లు పెరిగాయి.ఈ నేపథ్యంలో సీఎస్కే తాజా విజయం నేపథ్యంలో దూబే ఇన్నింగ్స్‌పై స్పందించిన భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘ఈ పిల్లాడు సంచలన ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నాడు. అతడిని కేవలం ప్రపంచకప్ జట్టుతో పంపించడమే కాదు.తుదిజట్టులోనూ అతడిని తప్పక ఆడించాలి. కేవలం ఎంపిక గురించి కాదు.. ప్లేయింగ్ ఎలెవన్‌లోనూ చోటివ్వాలని సెలక్టర్లు ఫిక్సైపోవాలి. కెప్టెన్‌గానీ.. మేనేజ్మెంట్ గానీ అతడిని విస్మరించడానికి వీల్లేదు.ప్రస్తుత టీమిండియా ప్లేయర్లలో అతడి కంటే బెటర్‌గా హిట్టింగ్ ఆడే బ్యాటర్ మరొకరు లేరు. ఒకవేళ అతడిని గనుక బెంచ్‌కే పరిమితం చేస్తే అంతకంటే అన్యాయం మరొకటి ఉండదు’’ అని ఆకాశ్ చోప్రా చెప్పుకొచ్చాడు. కాగా జూన్ 1 నుంచి అమెరికా- వెస్టిండీస్ వేదికగా టీ20 ప్రపంచకప్-2024 మొదలుకానుంది. ఈ నేపథ్యంలో జట్ల ప్రకటనకు మే 1 ఆఖరి తేదీగా పేర్కొంది ఐసీసీ. -
సన్ రైజర్స్ ను చిత్తుగా ఓడించిన చెన్నై సూపర్ కింగ్స్ (ఫొటోలు)
-
సన్‌రైజర్స్ తడబాటు...
చెన్నై: మొన్న బెంగళూరు బౌలర్లు... ఇప్పుడేమో చెన్నై బౌలర్లు... సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు బ్యాటర్ల ఆటల్ని సాగనివ్వలేదు. దీంతో 250 ప్లస్ స్కోర్లను అవలీలగా చేసిన హైదరాబాద్ తాజాగా 213 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక ఓడిపోయింది. సొంతగడ్డపై చెన్నై 78 పరుగుల తేడాతో హైదరాబాద్‌పై ఘనవిజయం సాధించింది. ముందుగా చెన్నై 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 212 పరుగుల భారీస్కోరు చేసింది. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (54 బంతుల్లో 98; 10 ఫోర్లు, 3 సిక్స్‌లు) సెంచరీ అవకాశాన్ని చేజార్చుకున్నాడు. మిచెల్ (32 బంతుల్లో 52; 7 ఫోర్లు, 1 సిక్స్), శివమ్ దూబే (20 బంతుల్లో 39 నాటౌట్; 1 ఫోర్లు, 4 సిక్స్‌లు) దూకుడుగా ఆడారు. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన హైదరాబాద్ 18.5 ఓవర్లలో 134 పరుగులకే కుప్పకూలి ఓడిపోయింది. తుషార్ దేశ్‌పాండే (4/27) సన్‌రైజర్స్ ను దెబ్బ కొట్టాడు. స్కోరు వివరాలు చెన్నై సూపర్‌కింగ్స్ ఇన్నింగ్స్: రహానే (సి) షహబాజ్ (బి) భువనేశ్వర్ 9; రుతురాజ్ (సి) నితీశ్ (బి) నటరాజన్ 98; మిచెల్ (సి) నితీశ్ (బి) ఉనాద్కట్ 52; దూబే (నాటౌట్) 39; ధోని (నాటౌట్) 5; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (20 ఓవర్లలో 3 వికెట్లకు) 212. వికెట్ల పతనం: 1–19, 2–126, 3–200. బౌలింగ్: భువనేశ్వర్ 4–0–38–1, నితీశ్ 1–0–8–0, షహబాజ్ 3–0– 33–0, నటరాజన్ 4–0–43–1, ఉనాద్కట్ 4–0–38–1, కమిన్స్ 4–0– 49–1. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్: హెడ్ (సి) మిచెల్ (బి) తుషార్ 13; అభిõÙక్ (సి) మిచెల్ (బి) తుషార్ 15; అన్మోల్ప్రీత్ (సి) మొయిన్ అలీ (బి) తుషార్ 0; మార్క్రమ్ (బి) పతిరణ 32; నితీశ్ (సి) ధోని (బి) జడేజా 15; క్లాసెన్ (సి) మిచెల్ (బి) పతిరణ 20; సమద్ (సి) సబ్–రిజ్వీ (బి) శార్దుల్ 19; షహబాజ్ (సి) మిచెల్ (బి) ముస్తఫిజుర్ 7; కమిన్స్ (సి) మిచెల్ (బి) తుసార్ 5; భువనేశ్వర్ (నాటౌట్) 4; ఉనాద్కట్ (సి) మొయిన్ (బి) ముస్తఫిజుర్ 1; ఎక్స్‌ట్రాలు 3; మొత్తం (18.5 ఓవర్లలో ఆలౌట్) 134. వికెట్ల పత నం: 1–21, 2–21, 3–40, 4–72, 5–85, 6–117, 7–119, 8–124, 9–132, 10–134 బౌలింగ్: దీపక్ చహర్ 3–0–22–0, తుషార్ 3–0–27–4, ముస్తఫిజుర్ 2.5–0–19–2, జడేజా 4–0–22–1, శార్దుల్ 4–0–27–1, పతిరణ 2–0–17–2. -
ఐపీఎల్లో ఇవాళ (Apr 28) రెండు మ్యాచ్‌లు.. రెండూ భారీ సమరాలే..!
ఐపీఎల్లో ఇవాళ (ఏప్రిల్ 28) రెండు మ్యాచ్‌లు జరుగనున్నాయి. మధ్యాహ్నం (3:30 గంటలకు) మ్యాచ్‌లో గుజరాత్, ఆర్సీబీ.. రాత్రి 7:30 గంటలకు ప్రారంభమయ్యే మ్యాచ్‌లో సన్‌రైజర్స్, సీఎస్కే జట్లు తలపడనున్నాయి. ఆదివారం కావడంతో ఐపీఎల్ ఇవాళ రెండూ భారీ మ్యాచ్‌లనే షెడ్యూల్ చేసింది.మధ్యాహ్నం మ్యాచ్ విషయానికొస్తే..పేపర్‌పై పటిష్టంగా కనిపించే ఆర్సీబీ.. అడపాదడపా ప్రదర్శనలతో నెట్టుకొస్తున్న గుజరాత్‌ను ఢీకొట్టనుంది. ఈ మ్యాచ్ గుజరాత్ హోం గ్రౌండ్ అయిన నరేంద్ర మోదీ స్టేడియంలో జరుగనుంది.పాయింట్ల పట్టిక విషయానికొస్తే.. ఆర్సీబీ ఇప్పటివరకు ఆడిన 9 మ్యాచ్‌ల్లో కేవలం రెండే విజయాలతో పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉండగా.. గుజరాత్ 9 మ్యాచ్‌ల్లో 3 విజయాలతో ఏడో స్థానంలో నిలిచింది. గుజరాత్‌కు ఈ మ్యాచ్ చాలా కీలకంగా మారింది. ప్లే ఆఫ్స్ రేసులో నిలబడాలంటే గుజరాత్ ఈ మ్యాచ్‌లో తప్పక గెలవాల్సి ఉంది. మరోవైపు ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించిన ఆర్సీబీకి ఈ మ్యాచ్ నామమాత్రం కానుంది. ఈ మ్యాచ్‌లో గెలిచినా, ఓడినా ఆర్సీబీకి పెద్ద ఫరక్ పడదు.హెడ్ టు హెడ్ ఫైట్స్ విషయానికొస్తే.. ఇరు జట్లు ఇప్పటివరకు మూడు సందర్భాల్లో ఎదురెదురుపడగా.. గుజరాత్ 2, ఆర్సీబీ ఒక మ్యాచ్‌లో గెలుపొందాయి. తుది జట్లు (అంచనా)..గుజరాత్: వృద్ధిమాన్ సాహా (వికెట్‌కీపర్), శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), డేవిడ్ మిల్లర్, అజ్మతుల్లా ఒమర్జాయ్, రాహుల్ తెవాటియా, షారుఖ్ ఖాన్, రషీద్ ఖాన్, ఆర్ సాయి కిషోర్, నూర్ అహ్మద్, మోహిత్ శర్మ, సందీప్ వారియర్‌ఆర్సీబీ: విరాట్ కోహ్లి, ఫాఫ్ డుప్లెసిస్ (కెప్టెన్), విల్ జాక్స్, రజత్ పాటిదార్, కామెరాన్ గ్రీన్, దినేష్ కార్తీక్ (వికెట్‌కీపర్), మహిపాల్ లోమ్రోర్, కర్ణ్ శర్మ, లోకీ ఫెర్గూసన్, మహ్మద్ సిరాజ్, యశ్ దయాల్రాత్రి మ్యాచ్ విషయానికొస్తే.. సీఎస్కే తమ సొంత మైదానమైన చెపాక్‌లో పటిష్టమైన సన్‌రైజర్స్‌ను ఢీకొట్టనుంది. ఈ సీజన్లోనే ఇది బిగ్ ఫైట్‌గా చెప్పవచ్చు. ఈ మ్యాచ్ కోసం అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో సన్‌రైజర్స్ మూడో స్థానంలో.. సీఎస్కే ఆరో స్థానంలో ఉన్నాయి. ప్లే ఆఫ్స్‌కు చేరాలంటే ఇరు జట్లకు ఈ మ్యాచ్ చాలా కీలకంగా మారింది.హెడ్ టు హెడ్ రికార్డ్ విషయానికొస్తే.. ఐపీఎల్లో ఇరు జట్లు ఇప్పటివరకు 20 మ్యాచ్‌ల్లో తలపడగా.. సీఎస్కే 14, సన్‌రైజర్స్ 6 మ్యాచ్‌ల్లో గెలుపొందాయి.తుది జట్లు (అంచనా)..సన్‌రైజర్స్: అభిషేక్ శర్మ, ట్రవిస్ హెడ్, ఎయిడెన్ మార్క్రమ్, నితీష్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్, అబ్దుల్ సమద్, షాబాజ్ అహ్మద్, పాట్ కమిన్స్, భువనేశ్వర్ కుమార్, మయాంక్ మార్కండే, జయదేవ్ ఉనద్కత్ [ఇంపాక్ట్ సబ్: టి నటరాజన్]సీఎస్కే: రుతురాజ్ గైక్వాడ్, అజింక్య రహానే, డారిల్ మిచెల్, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, మొయిన్ అలీ, ఎంఎస్ ధోని, దీపక్ చాహర్, తుషార్ దేశ్‌పాండే, ముస్తాఫిజుర్ రెహ్మాన్, మతీషా పతిరణ [ఇంపాక్ట్ సబ్: శార్దూల్ ఠాకూర్] -
హైదరాబాదీ బిర్యానీకి కమిన్స్ ఫిదా.. తొలిసారి ఇలా!
సన్‌రైజర్స్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ హైదరాబాదీ బిర్యానీకి ఫిదా అయ్యాడు. కమ్మని బిర్యానీ రుచితో కడుపు నిండిపోయిందని.. మరో వారం రోజుల పాటు తాము ఇంకేమీ తినాల్సిన పనిలేదంటూ చమత్కరించాడు.తన కుటుంబం తొలిసారి భారత్‌కు వచ్చిందని.. వారితో కలిసి హైదరాబాద్‌లో పర్యటించడం సంతోషంగా ఉందని కమిన్స్ హర్షం వ్యక్తం చేశాడు. తమకు రుచికరమైన భోజనం అందించిన హోటల్‌కు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపాడు.కుటుంబంతో కలిసి అక్కడ దిగిన ఫొటోలను కమిన్స్ ఇన్‌స్టాలో షేర్ చేయగా వైరల్ అవుతున్నాయి. కాగా ఐపీఎల్-2024 సీజన్లో ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్‌ను సన్‌రైజర్స్ ఫ్రాంఛైజీ తమ సారథిగా ప్రకటించిన విషయం తెలిసిందే.అయితే, టీ20లలో నాయకుడిగా పెద్దగా అనుభవం లేని ఈ వన్డే వరల్డ్‌కప్ విన్నింగ్ కెప్టెన్‌ను ఎంపిక చేసి రైజర్స్ రిస్క్ తీసుకుందని చాలా మంది భావించారు. కానీ.. అందరి అంచనాలను తారుమారు చేస్తూ సన్‌రైజర్స్‌ను విజయపథంలో నడిపిస్తున్నాడు కమిన్స్.ఇప్పటి వరకు ఈ ఎడిషన్‌లో సన్‌రైజర్స్ ఎనిమిదింట ఐదు గెలిచి పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో కొనసాగుతోంది. ఇప్పటి వరకు ఏకంగా మూడుసార్లు 250కి పైగా స్కోర్లు నమోదు చేసి రికార్డులు సృష్టించింది. కెప్టెన్‌గా భేష్ అనిపిస్తున్న ఈ పేస్ బౌలర్.. ఇప్పటి వరకు ఎనిమిది మ్యాచ్‌లలో కలిపి పది వికెట్లు పడగొట్టాడు.కాగా గురువారం నాటి ఉప్పల్ మ్యాచ్‌లో ఆర్సీబీ చేతిలో సన్‌రైజర్స్ ఓడిపోయింది. తదుపరి ఆదివారం చెన్నై సూపర్ కింగ్స్‌తో చెపాక్ వేదికగా కమిన్స్ బృందం తలపడనుంది.చదవండి: రోహిత్, స్కై కాదు!.. వరల్డ్‌కప్‌లో ఒకే ఓవర్లో 6 సిక్స్‌లు కొట్టేది ఇతడే: యువీ -
IPL 2024: డీజే టిల్లు పాటకు చిందేసిన విరాట్
స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లికి ఆన్ ఫీల్డ్‌లో డ్యాన్సులేయడం కొత్తేమీ కాదు. గతంలో చాలా సందర్భాల్లో అతను మైదానంలో స్టెప్పులేస్తూ కనిపించాడు. సందర్భమేదైనా సరే పాట ప్లే అయ్యిందంటే చాలు విరాట్‌కు పూనకం వస్తుంది. పక్కన ఎవరన్నా ఉంటే వారితో కలిసి చిందేస్తాడు. లేదంటే ఒక్కడే రెచ్చిపోతాడు. ఇలాంటి సందర్భమే తాజాగా మరోసారి వచ్చింది. నిన్న సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్ సందర్భంగా విరాట్ బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్నాడు. ఈ సమయంలో స్టేడియం స్పీకర్లలో తెలుగు పాపులర్ డీజే టిల్లు పాట ప్లే అయ్యింది. ఈ పాట వినగానే కోహ్లి రెచ్చిపోయాడు. బీట్‌కు తగ్గట్టు స్టెప్పులేశాడు. విరాట్‌కు ఈ పాట ఫాస్ట్ బీట్ బాగా నచ్చినట్లుంది. ఈ సాంగ్ ప్లే అవుతున్నంత సేపు విరాట్ బాగా ఎంజాయ్ చేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతుంది. Virat Kohli dancing on Tillu Anna DJ song at Hyderabad yesterday.- KING KOHLI IS A VIBE. ❤️🐐 pic.twitter.com/KkI3wTKdKp— Tanuj Singh (@ImTanujSingh) April 26, 2024 ఇదిలా ఉంటే, సన్‌రైజర్స్‌కు నిన్న సొంత మైదానంలో చుక్కెదురైంది. ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో ఆరెంజ్ ఆర్మీ 35 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ.. విరాట్ (43 బంతుల్లో 51; 4 ఫోర్లు, సిక్స్), పాటిదార్ (20 బంతుల్లో 50; 2 ఫోర్లు, 5 సిక్సర్లు) అర్దసెంచరీలతో రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 206 పరుగులు చేసింది. అనంతరం 207 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన సన్‌రైజర్స్.. నిర్ణీత ఓవర్లు పూర్తయ్యేసరికి 8 వికెట్లు కోల్పోయి 171 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఆర్సీబీ బౌలర్లు చాలాకాలం తర్వాత కలిసికట్టుగా బౌలింగ్ చేసి సన్‌రైజర్స్‌ను ఇబ్బంది పెట్టారు.స్వప్నిల్ సింగ్, గ్రీన్, కర్ణ్ శర్మ తలో 2 వికెట్లు పడగొట్టగా.. విల్ జాక్స్, యశ్ దయాల్ చెరో వికెట్ దక్కించుకున్నారు. సన్‌రైజర్స్ ఇన్నింగ్స్‌లో షాబాజ్ అహ్మద్ (40 నాటౌట్), కమిన్స్ (31), అభిషేక్ శర్మ (31) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. -
చిన్న పిల్లాడిలా కోహ్లి సంబరాలు.. వాళ్లకు థాంక్స్!
ఐపీఎల్-2024లో ఎట్టకేలకు రాయల్ చాలెంజర్స్ పరాజయాలకు బ్రేక్ పడింది. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో గురువారం నాటి మ్యాచ్‌లో గెలిచిన ఆర్సీబీ.. ఈ సీజన్లో రెండో గెలుపు నమోదు చేసింది. దీంతో ఆర్సీబీ శిబిరంలో నవ్వులు పూశాయి.ఆ జట్టు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి అయితే.. చిన్నపిల్లాడిలా సంతోషంతో గంతులేశాడు. రైజర్స్ వికెట్ పడిన ప్రతిసారీ పెద్ద ఎత్తున సెలబ్రేట్ చేసుకున్న కోహ్లి.. జట్టు విజయం ఖరారు కాగానే ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యాడు.ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇందుకు స్పందనగా.. ‘‘చాలా రోజుల తర్వాత కోహ్లి మనస్ఫూర్తిగా నవ్వడం చూస్తున్నాం’’ అంటూ కింగ్ కోహ్లి ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు.కాగా ఐపీఎల్-2024లో సన్‌రైజర్స్‌తో మ్యాచ్‌లో ఆర్సీబీ 35 పరుగుల తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే. ఉప్పల్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లి అర్ధ శతకం(43 బంతుల్లో 51) సాధించాడు. రజత్ పాటిదార్ (20 బంతుల్లో 50) మెరుపు ఇన్నింగ్స్ ఆడగా.. కామెరాన్ గ్రీన్(37 నాటౌట్) సైతం రాణించాడు.దీంతో 206 పరుగులు స్కోరు చేసిన ఆర్సీబీ.. లక్ష్య ఛేదనకు దిగిన సన్‌రైజర్స్‌ను 171 పరుగులకే కట్టడి చేసింది. తద్వారా రైజర్స్ విజయపరంపరకు బ్రేక్ వేసి.. సొంతమైదానం చిన్నస్వామి స్టేడియంలో తమకు ఎదురైన పరాభవానికి బదులు తీర్చుకుంది.ఇక ఈ సీజన్లో ఆర్సీబీకి ఇది రెండో విజయం. సీజన్లో తమ రెండో మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌పై గెలుపొందిన ఆర్సీబీ.. మళ్లీ ఇప్పుడిలా హైదరాబాద్ గడ్డపై గెలుపును రుచిచూసింది. దీంతో ఆటగాళ్లలో ఒక్కసారిగా ఉత్సాహం నిండింది.ఇక రైజర్స్ సొంతమైదానంలో జరిగిన ఈ మ్యాచ్‌కు ఆరెంజ్ ఆర్మీతో పాటు ఆర్సీబీ 12th మ్యాన్ ఆర్మీ కూడా భారీగానే తరలి వచ్చింది. జట్టు జెర్సీలు ధరించి ఫాఫ్ డుప్లెసిస్ బృందాన్ని చీర్ చేశారు ఫ్యాన్స్. ఈ నేపథ్యంలో తమకు మద్దతుగా నిలిచిన ఉప్పల్ ప్రేక్షకులకు కోహ్లి చేతులు జోడిస్తూ ధన్యవాదాలు తెలపడం విశేషం. కాగా ఇప్పటి వరకు ఆడిన తొమ్మిది మ్యాచ్‌లలో రెండు గెలిచిన ఆర్సీబీ 4 పాయింట్లతో ప్రస్తుతం పదో స్థానంలో కొనసాగుతోంది. మరోవైపు.. సన్‌రైజర్స్ ఎనిమిదింట ఐదు గెలిచి మూడో స్థానంలో ఉంది.చదవండి: SRH Vs RCB: అరెరే.. ఏమైంది మీకు! కావ్య రియాక్షన్ వైరల్ Yesterday RCB Fans Be Like......#RCBvsSRH #SRHvsRCB #ViratKohli𓃵pic.twitter.com/VfXTDJNJP0— Analytic Board (@AnalyticB0ard) April 26, 2024 -
కోహ్లి.. ఇలాగేనా ఆడేది?: టీమిండియా దిగ్గజం విమర్శలు
సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి ఆట తీరుపై టీమిండియా దిగ్గజం సునిల్ గావస్కర్ పెదవి విరిచాడు. స్థాయికి తగ్గట్లు రాణించడంలో కోహ్లి విఫలమవుతున్నాడని విమర్శించాడు.ఐపీఎల్-2024లో భాగంగా సన్‌రైజర్స్- ఆర్సీబీ మధ్య బుధవారం నాటి మ్యాచ్‌లో కోహ్లి అర్ధ శతకం బాదిన విషయం తెలిసిందే. ఉప్పల్ వేదికగా కోహ్లి 43 బంతులు ఎదుర్కొని 4 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 51 పరుగులు చేశాడు.ఈ క్రమంలో కోహ్లి స్ట్రైక్ రేటు 118.6గా నమోదైంది. ఇక రైజర్స్ పేసర్ జయదేవ్ ఉనాద్కట్ బౌలింగ్‌లో ఈ ఓపెనింగ్ బ్యాటర్ పెవిలియన్ చేరాడు. ఈ మ్యాచ్‌లో కోహ్లితో పాటు రజత్ పాటిదార్(20 బంతుల్లో 50) హాఫ్ సెంచరీ చేయగా.. కామెరాన్ గ్రీన్(20 బంతుల్లో 37 నాటౌట్) విలువైన ఇన్నింగ్స్ ఆడాడు.ఈ నేపథ్యంలో ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 206 పరుగులు చేసింది. ఇందులో కీలక పాత్ర మాత్రం 250 స్ట్రైక్‌రేటుతో అర్ధ శతకం సాధించిన పాటిదార్దే.ఇక లక్ష్య ఛేదనలో 171 పరుగులకే సన్‌రైజర్స్ పరిమితం కావడంతో ఆర్సీబీ 35 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ నేపథ్యంలో సునిల్ గావస్కర్ కోహ్లి స్ట్రైక్‌రేటు గురించి కీలక వ్యాఖ్యలు చేశాడు.‘‘ఆరంభంలో బాగానే ఆడినా మధ్యలో కాస్త వెనుకబడినట్లు కనిపించింది. నంబర్స్ గురించి స్పష్టంగా ప్రస్తావించలేకపోతున్నాను గానీ.. 31- 32 స్కోరు వరకు అతడు బౌండరీ బాదలేకపోయాడు.ఇన్నింగ్స్ తొలి బంతి నుంచి క్రీజులో ఉండి.. 14- 15 ఓవర్ వరకు బ్యాటింగ్ కొనసాగించాలనుకుంటే ఈ స్ట్రైక్‌రేటు మాత్రం సరిపోదు. ఫ్రాంఛైజీ కోహ్లి వంటి టాప్ క్లాస్ ప్లేయర్‌నుంచి ఇలాంటి ఇన్నింగ్స్ ఆశించదు’’ అని సునిల్ గావస్కర్ స్టార్ స్ట్పోర్స్ షోలో వ్యాఖ్యానించాడు. విరాట్ కోహ్లి ఇంకాస్త మెరుగ్గా ఆడితే బాగుండేదని అభిప్రాయపడ్డాడు.కాగా సన్‌రైజర్స్‌తో మ్యాచ్‌లో పరుగుల విధ్వంసం సృష్టించి ఆర్సీబీ గెలుపులో ప్రధాన పాత్ర పోషించిన రజత్ పాటిదార్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఇక ఈ సీజన్లో ఆర్సీబీకి ఇది రెండో గెలుపు. ఈ విజయంతో ఆర్సీబీ ఖాతాలో మరో రెండు పాయింట్లు చేరినప్పటికీ పట్టికలో మాత్రం అట్టడుగున పదో స్థానంలోనే కొనసాగుతోంది.Lofted with perfection and style! 😎@RCBTweets move to 61/1 after 6 oversWatch the match LIVE on @JioCinema and @StarSportsIndia 💻📱#TATAIPL | #SRHvRCB | @imVkohli pic.twitter.com/WdVkWT99yz— IndianPremierLeague (@IPL) April 25, 2024 var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4381453179.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
SRH: మాకున్న బలం అదే.. తగ్గేదేలే: కమిన్స్
ఐపీఎల్-2024లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జైత్రయాత్రకు అడ్డుకట్ట పడింది. సొంతగడ్డపై తమకు ఎదురైన పరాభవానికి రాయల్ చాలెంజర్స్ బెంగళూరు రైజర్స్పై ప్రతీకారం తీర్చుకుంది. ఉప్పల్ మైదానంలో ప్యాట్ కమిన్స్ బృందాన్ని 35 పరుగుల తేడాతో ఓడించి ఈ సీజన్ లెక్క సరిచేసింది.రాణించిన కోహ్లి, పాటిదార్, గ్రీన్ ఇరుజట్ల మధ్య గురువారం జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆర్సీబీ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. విరాట్ కోహ్లి (51), రజత్ పాటిదార్(20 బంతుల్లో 50) అర్ధ శతకాలు సాధించగా.. కామెరాన్ గ్రీన్(20 బంతుల్లో 37*) దూకుడుగా ఆడాడు.ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లు నష్టపోయిన ఆర్సీబీ 206 పరుగులు స్కోరు చేసింది. ఇప్పటికే ఈ సీజన్లో మూడుసార్లు 250 పైచిలుకు పరుగులు సాధించిన రైజర్స్ ఈ లక్ష్యాన్ని తేలికగ్గానే ఛేదిస్తుందని ఆరెంజ్ ఆర్మీ భావించింది.దూకుడుగా ఆరంభించి.. భారీ మూల్యమే చెల్లించికానీ ఆర్సీబీ బౌలర్ల దెబ్బకు 171 పరుగులకే రైజర్స్ కథ ముగిసిపోయింది. విధ్వంసకర ఓపెనర్ ట్రావిస్ హెడ్(1) ఆదిలోనే అవుట్ కావడం.. అభిషేక్ శర్మ(13 బంతుల్లో 31) మెరుపులు మెరిపించినా ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోవడం ప్రభావం చూపింది.అయినప్పటికీ దూకుడును కొనసాగించిన రైజర్స్ బ్యాటర్లు ఐడెన్ మార్క్రమ్(7), నితీశ్ రెడ్డి(13), హెన్రిచ్ క్లాసెన్(7)లను ఆర్సీబీ బౌలర్లు త్వరత్వరగా పెవిలియన్‌కు పంపారు. కాసేపు పోరాడినాఈ క్రమంలో ఆరో స్థానంలో వచ్చిన షాబాజ్ అహ్మద్ (37 బంతుల్లో 40 నాటౌట్) ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేయగా.. కెప్టెన్ ప్యాట్ కమిన్స్(15 బంతుల్లో 31) ధనాధన్ ఇన్నింగ్స్ ఆడాడు. కానీ మిగతా వాళ్ల నుంచి సహకారం అందకపోవడంతో రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసి ఓటమిని అంగీకరించింది. ఇక ఆర్సీబీ బౌలర్లలో స్వప్నిల్ సింగ్, కరణ్ శర్మ, లాకీ ఫెర్గూసన్ రెండేసి వికెట్లు తీయగా.. విల్ జాక్స్, యశ్ దయాళ్ ఒక్కో వికెట్ పడగొట్టారు. ఈ నేపథ్యంలో సన్‌రైజర్స్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ఓటమిపై స్పందిస్తూ.. తమ బ్యాటర్లు దూకుడుగా ఆడటాన్ని సమర్థించాడు. ‘‘ఈరోజు మాకు సరైన ముగింపు లభించలేదు. తొలుత పరుగులు కట్టడి చేయలేకపోయాం.ప్రతి మ్యాచ్ గెలవలేంఆ తర్వాత లక్ష్య ఛేదనలో వరుసగా వికెట్లు కోల్పోయాం. నిజానికి మేము ముందుగా బ్యాటింగ్ చేసి ఉంటే బాగుండేది. ఏదేమైనా మా వాళ్లు చాలా బాగా ఆడారు. టీ20 క్రికెట్లో ప్రతీ మ్యాచ్ గెలవడం ఎవరికీ సాధ్యం కాదు. ఈ ఓటమినే తలచుకుంటూ కూర్చోము.మాకున్న బలం అదేరిస్క్ ఉన్నా సరే దూకుడుగా బ్యాటింగ్ చేయడమే మాకున్న బలం. అయితే, ప్రతి మ్యాచ్‌లోనూ ఇది వర్కౌట్ అవ్వాలని లేదు. ఒకటీ రెండు మ్యాచ్‌లలో ప్రతికూల ఫలితాలు రావచ్చు. ఈ మ్యాచ్‌లో మేము మెరుగైన స్కోరే చేశాం. ఇక ముందు కూడా మా వాళ్లు ఇంతే దూకుడుగా బ్యాటింగ్ చేయడమే మంచిదని భావిస్తున్నా’’ అని పేర్కొన్నాడు. చదవండి: #Kavya Maran: అరెరే.. ఏమైందిరా మీకు! కావ్య రియాక్షన్ వైరల్ 📍 Hyderabad VIBE Virat Kohli ☺️ ❤️#TATAIPL | #SRHvRCB | @RCBTweets | @imVkohli pic.twitter.com/llKITaKky3— IndianPremierLeague (@IPL) April 26, 2024 var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_7522010156.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
సన్‌రైజర్స్ బ్రేక్..బెంగళూరు గెలుపు (ఫొటోలు)
-
రైజింగ్‌కు బ్రేక్
హెడ్ విధ్వంసం సృష్టించలేదు... క్లాసెన్ కుమ్మేయలేదు... మార్క్రమ్ మెరుపుల్లేవు... అభిషేక్ ఆశించిన స్థాయిలో చెలరేగలేదు... వరుస మ్యాచ్‌లలో పరుగుల వరద పారిస్తూ ప్రత్యర్థుల పాలిట సింహస్వప్నంలా మారిన సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు దూకుడుకు సొంతగడ్డపై బ్రేక్ పడింది. 300 స్కోరు సంగతేమో కానీ ఛేదనలో ఒకదశలో 100 కూడా దాటడమే కష్టమనిపించింది.వరుసగా నాలుగు విజయాల తర్వాత హైదరాబాద్ జట్టు తలవంచింది. మరోవైపు వరుసగా ఆరు పరాజయాలు... మైదానంలో దిగేదే ఓడేందుకా అన్నట్లు ఆడుతూ ఒక్క గెలుపు కోసం తపించిపోయిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టుకు భారీ ఊరట లభించింది. బ్యాటింగ్‌తోపాటు బౌలింగ్‌లోనూ రాణించడంతో ఎట్టకేలకు ఆ జట్టుకు ఈ ఐపీఎల్ సీజన్లో రెండో విజయం దక్కింది. సాక్షి, హైదరాబాద్: సీజన్లో తిరుగులేకుండా సాగుతున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు అనూహ్య పరాజయం ఎదురైంది. గురువారం ఉప్పల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 35 పరుగుల తేడాతో సన్‌రైజర్స్‌పై విజయం సాధించింది.టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బెంగళూరు 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 206 పరుగులు సాధించింది. విరాట్ కోహ్లి (43 బంతుల్లో 51; 4 ఫోర్లు, 1 సిక్స్), ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ రజత్ పటిదార్ (20 బంతుల్లో 50; 2 ఫోర్లు, 5 సిక్స్‌లు) అర్ధసెంచరీలు చేయగా... కామెరాన్ గ్రీన్ (20 బంతుల్లో 37 నాటౌట్; 5 ఫోర్లు) రాణించాడు.అనంతరం హైదరాబాద్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 171 పరుగులు చేసి ఓడిపోయింది. షహబాజ్ అహ్మద్ (37 బంతుల్లో 40 నాటౌట్; 1 ఫోర్, 1 సిక్స్), అభిషేక్ శర్మ (13 బంతుల్లో 31; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), ప్యాట్ కమిన్స్ (15 బంతుల్లో 31; 1 ఫోర్, 3 సిక్స్‌లు) ఫర్వాలేదనిపించారు. పటిదార్ మెరుపులు... భువనేశ్వర్ ఓవర్లో 3 ఫోర్లతో డుప్లెసిస్ (12 బంతుల్లో 25; 3 ఫోర్లు, 1 సిక్స్) ధాటిగా ఇన్నింగ్స్ ఆరంభించగా... కమిన్స్ ఓవర్లో కోహ్లి 2 ఫోర్లు కొట్టాడు. పవర్‌ప్లే ముగిసేసరికి స్కోరు 61 పరుగులకు చేరింది. డుప్లెసిస్, జాక్స్ (6) వెనుదిరిగిన తర్వాత కోహ్లి ఆశ్చర్యకర రీతిలో ఒక్కసారిగా నెమ్మదించాడు. తన 17వ బంతికి సిక్స్ కొట్టిన కోహ్లి... ఆ తర్వాత 25 బంతులపాటు బౌండరీ కొట్టలేకపోవడం అనూహ్యం.అయితే మరో ఎండ్‌లో పటిదార్ విధ్వంసం ఆర్సీబీ స్కోరును పరుగెత్తించింది. లెగ్‌స్పిన్నర్ మార్కండే లక్ష్యంగా అతను చెలరేగిపోయాడు. అతని రెండో ఓవర్లో ఒక సిక్స్ కొట్టిన పటిదార్... అతని తర్వాతి ఓవర్లో వరుసగా 6, 6, 6, 6 బాదడం విశేషం. కోహ్లి, పటిదార్ తక్కువ వ్యవధిలో వెనుదిరిగినా... గ్రీన్ చక్కటి షాట్లతో స్కోరును 200 పరుగులు దాటించాడు. ఆఖరి 5 ఓవర్లలో ఆర్సీబీ 64 పరుగులు చేసింది. టపటపా... తొలి ఓవర్లోనే హెడ్ (1) అవుట్ కావడంతో రైజర్స్‌కు సరైన ఆరంభం లభించలేదు. జాక్స్ ఓవర్లో 2 సిక్స్‌లు, ఫోర్ కొట్టిన అభిషేక్ తర్వాతి ఓవర్లో వెనుదిరిగాడు. అంతే... ఆ తర్వాత పరుగులు రావడం ఆగిపోవడంతో పాటు హైదరాబాద్ వరుసగా వికెట్లు కోల్పోయింది.మార్క్రమ్ (8 బంతుల్లో 7; 1 ఫోర్), క్లాసెన్ (3 బంతుల్లో 7; 1 సిక్స్), నితీశ్ కుమార్ రెడ్డి (13 బంతుల్లో 13; 1 సిక్స్) ఇలా వచ్చి అలా పెవిలియన్‌కు వెళ్లిపోయారు. దాంతో సన్‌రైజర్స్‌కు ఏ దశలోనూ గెలుపు అవకాశాలు కనిపించలేదు. స్కోరు వివరాలు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్: కోహ్లి (సి) సమద్ (బి) ఉనాద్కట్ 51; డుప్లెసిస్ (సి) మార్క్రమ్ (బి) నటరాజన్ 25; జాక్స్ (బి) మార్కండే 6; పటిదార్ (సి) సమద్ (బి) ఉనాద్కట్ 50; గ్రీన్ (నాటౌట్) 37; లోమ్రోర్ (సి) కమిన్స్ (బి) ఉనాద్కట్ 7; కార్తీక్ (సి) సమద్ (బి) కమిన్స్ 11; స్వప్నిల్ (సి) అభిషేక్ (బి) నటరాజన్ 12; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 206. వికెట్ల పతనం: 1–48, 2–65, 3–130, 4–140, 5–161, 6–193, 7–206. బౌలింగ్: అభిషేక్ శర్మ 1–0–10–0, భువనేశ్వర్ 1–0–14–0, కమిన్స్ 4–0–55–1, నటరాజన్ 4–0–39–2, షహబాజ్ 3–0–14–0, మార్కండే 3–0–42–1, జైదేవ్ ఉనాద్కట్ 4–0–30–3. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్: అభిషేక్ శర్మ (సి) కార్తీక్ (బి) యశ్ 31; హెడ్ (సి) కరణ్ (బి) జాక్స్ 1; మార్క్రమ్ (ఎల్బీ) (బి) స్వప్నిల్ 7; నితీశ్ కుమార్ రెడ్డి (బి) కరణ్ 13; క్లాసెన్ (సి) గ్రీన్ (బి) స్వప్నిల్ 7; షహబాజ్ (నాటౌట్) 40; సమద్ (సి అండ్ బి) శర్మ 10; కమిన్స్ (సి) సిరాజ్ (బి) గ్రీన్ 31; భువనేశ్వర్ (సి) సిరాజ్ (బి) గ్రీన్ 13; ఉనాద్కట్ (నాటౌట్) 8; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 171. వికెట్ల పతనం: 1–3, 2–37, 3–41, 4–56, 5–69, 6–85, 7–124, 8–141. బౌలింగ్: జాక్స్ 2–0–23–1, సిరాజ్ 4–0–20–0, యశ్ దయాళ్ 3–0–18–1, స్వప్నిల్ 3–0–40–2, కరణ్ శర్మ 4–0–29–2, ఫెర్గూసన్ 2–0–28–0, గ్రీన్ 2–0–12–2. ఐపీఎల్లో నేడుకోల్‌కతా X పంజాబ్ వేదిక: కోల్‌కతారాత్రి 7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో సినిమా యాప్‌లో ప్రత్యక్ష ప్రసారం -
IPL 2024: తిరుగులేని సన్‌రైజర్స్.. అన్ని జట్లు ఓడినా..!
ఐపీఎల్ 2024 సీజన్లో సగానికి పైగా మ్యాచ్‌లు పూర్తయిన తర్వాత రాజస్థాన్ రాయల్స్ (14 పాయింట్లు), కోల్‌కతా నైట్‌రైడర్స్ (10), సన్‌రైజర్స్ హైదరాబాద్ (10), లక్నో సూపర్ జెయింట్స్ (10) జట్లు పాయింట్ల పట్టికలో తొలి నాలుగు స్థానాల్లో నిలిచి ప్లే ఆఫ్స్ రేసులో ముందున్నాయి. సీఎస్కే (8), గుజరాత్ (8), ముంబై ఇండియన్స్ (6), ఢిల్లీ క్యాపిటల్స్ (6) జట్లు ఐదు నుంచి ఎనిమిది స్థానాల్లో నిలిచి ప్లే ఆఫ్స్ బెర్తుల కోసం పోటీ పడుతున్నాయి. పంజాబ్ కింగ్స్ (4), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (2) చివరి రెండు స్థానాల్లో ఉంటూ ప్లే ఆఫ్స్ అశలను దాదాపుగా వదులుకున్నాయి.ప్రస్తుత సీజన్లో 39 మ్యాచ్‌ల అనంతరం ఓ ఆసక్తికర అంశం తెరపైకి వచ్చింది. ఇప్పటివరకు జరిగిన మ్యాచ్‌ల్లో సన్‌రైజర్స్ మినహా మిగతా తొమ్మిది జట్లు తమతమ సొంత మైదానాల్లో పరాజయాలు ఎదుర్కొన్నాయి. ఒక్క సన్‌రైజర్స్ మాత్రమే హోం గ్రౌండ్లో తిరుగులేని శక్తిగా ఉంది. భారీ ఫ్యాన్ బేస్ ఉన్న చెన్నై, ఆర్సీబీ, ముంబై జట్లు సైతం సొంత మైదానాల్లో ఓటములు ఎదుర్కొంటే, కమిన్స్ సేన మాత్రం సొంత అభిమానుల మధ్యలో దర్జాగా తలెత్తుకు నిలబడింది.ఈ సీజన్లో సన్‌రైజర్స్ కమిన్స్ నేతృత్వంలో మునుపెన్నడూ లేనంత పటిష్టంగా ఉంది. పటిష్టం అంటే అట్లాంటి ఇట్లాంటి పటిష్టం కాదు. ఐపీఎల్ పునాదులు దద్దరిల్లేంత పటిష్టంగా కమిన్స్ సేన ఉంది. సన్‌రైజర్స్ బ్యాటింగ్ వీరులు విధ్వంసం ధాటికి పొట్టి క్రికెట్ బ్యాటింగ్ రికార్డులన్నీ బద్దలవుతున్నాయి. వీరి దెబ్బకు ఆరెంజ్ ఆర్మీ ఈ సీజన్లో ఇప్పటికే మూడు సార్లు 260 ప్లస్ స్కోర్లు నమోదు చేసింది.మరోవైపు బౌలింగ్‌లోనూ సన్‌రైజర్స్‌ను తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. కమిన్స్ నేతృత్వంలో సన్‌రైజర్స్ బౌలింగ్ విభాగంలో కూడా అదరగొడుతుంది. మొత్తంగా ఈ సీజన్లో ఆరెంజ్ ఆర్మీ పట్టపగ్లాల్లేకుండా టైటిల్ దిశగా దూసుకెళ్తుంది. రేపు (ఏప్రిల్ 25) జరుగబోయే మ్యాచ్‌లో సన్‌రైజర్స్ సొంత మైదానంలో ఆర్సీబీతో తలపడనుంది. ఈ మ్యాచ్‌లోనూ పరుగుల వరద పారి ఆల్‌టైమ్ రికార్డు బద్దలు కావడం ఖాయమని సన్‌రైజర్స్ అభిమానులు నమ్మకంగా ఉన్నారు.ఇదే సీజన్లో ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో ఏం జరిగిందో అందరం చూశాం. ఆర్సీబీ హోం గ్రౌండ్లో జరిగిన ఆ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ బ్యాటర్లు పరుగుల ప్రళయం సృష్టించారు. హెడ్ (102), అభిషేక్ శర్మ (34), క్లాసెన్ (67), మార్క్రమ్ (32 నాటౌట్), అబ్దుల్ సమద్ (37 నాటౌట్) సునామీ ఇన్నింగ్స్‌లతో విరుచుకుపడటంతో సన్‌రైజర్స్ ఐపీఎల్ చరిత్రలో అత్యంత భారీ స్కోర్ (287) నమోదు చేసింది. ప్రత్యర్ది హోం గ్రౌండ్‌లోనే సన్‌రైజర్స్ బ్యాటర్లు ఈ తరహాలో రెచ్చిపోతే.. రేపు సొంత మైదానంలో వీరిని కంట్రోల్ చేయడం ఎవరి వల్ల కాదు. -
IPL 2024: అరెరె.. మీరెందుకిలా అంటున్నార్సార్?!
గుజరాత్ టైటాన్స్.. చెన్నై సూపర్ కింగ్స్.. లక్నో సూపర్ జెయింట్స్.. ముంబై ఇండియన్స్.. ఐపీఎల్-2023లో ప్లే ఆఫ్స్ చేరిన జట్లు.. వీటిలో గుజరాత్- చెన్నై మధ్య టైటిల్ పోరు జరుగగా సూపర్ కింగ్స్ చాంపియన్‌గా అవతరించింది. ఇక పాయింట్ల పట్టికలో సన్‌రైజర్స్ హైదరాబాద్ అట్టడుగున నిలవగా.. ఢిల్లీ క్యాపిటల్స్(9), పంజాబ్ కింగ్స్(8), కోల్‌కతా నైట్ రైడర్స్(7) కింద నుంచి నాలుగు స్థానాల్లో నిలిచాయి. రాజస్తాన్ రాయల్స్, ఆర్సీబీ మెరుగైన ప్రదర్శనతో వరుసగా ఐదు, ఆరో స్థానంలో నిలిచాయి. 2023 పూర్తైన తర్వాత పాయింట్ల పట్టిక స్వరూపం ఇది. ఇక ఇప్పుడు ఐపీఎల్-2024లో సగానికి పైగా మ్యాచ్‌లు అయిపోయాయి. గతేడాది పట్టికతో తాజా సీజన్‌ను టేబుల్‌ను పోలిస్తే టాప్-5 జట్లలో పూర్తి వ్యత్యాసం కనిపిస్తోంది. రాజస్తాన్ రాయల్స్ ఎనిమిదింట ఏడు విజయాలతో నంబర్ వన్‌లో ఉండగా.. గతేడాది నామమాత్రపు ప్రదర్శనకు పరిమితమైన కోల్‌కతా, చెత్త ప్రదర్శనతో విమర్శలు మూటగట్టుకున్న సన్‌రైజర్స్ ముందుకు దూసుకువచ్చాయి. కేకేఆర్, ఎస్ఆర్హెచ్ ఆడిన ఏడింట ఐదు విజయాలతో వరుసగా రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. డిఫెండింగ్ చాంపియన్ చెన్నై ఏడింట నాలుగు విజయాలతో టాప్-4లో కొనసాగుతోంది. లక్నో ప్రస్తుతం ఐదో స్థానంలో ఉంది. అయితే, ఆర్సీబీ, ముంబై మాత్రం చెత్త ప్రదర్శన కనబరుస్తున్నాయి. కొత్త కెప్టెన్ హార్దిక్ పాండ్యా సారథ్యంలో ముంబై ఎనిమిదింట కేవలం మూడుసార్లు గెలవగా..ఫాఫ్ డుప్లెసిస్ బృందం ఆర్సీబీ ఎనిమిదింట ఒక్కటి మాత్రమే గెలిచి ప్లే ఆఫ్స్ నుంచి దాదాపుగా నిష్క్రమించింది. అయితే..ఈసారి ధనాధన్ బ్యాటింగ్‌తో దుమ్ములేపుతున్న జట్టు ఏదైనా ఉందంటే.. సన్‌రైజర్స్. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక స్కోరు సాధించడంతో పాటు మూడుసార్లు 250కి పైగా స్కోర్లు సాధించి సత్తా చాటింది. కేకేఆర్, ఆర్సీబీ సైతం ఈ మార్కును టచ్ చేశాయి. ఈ నేపథ్యంలో సునిల్ గావస్కర్ వంటి దిగ్గజాలు.. ప్రతిసారి హిట్టింగ్ చేస్తే ఐపీఎల్ బోర్ కొట్టడం ఖాయమంటూ వ్యాఖ్యానించడం కొంతమంది అభిమానులకు మింగుడుపడటం లేదు. ముంబై, ఆర్సీబీ, సీఎస్కే వంటి జట్లు పరుగుల వరద పారిస్తే మురిసిపోయే మాజీ క్రికెటర్లు ఈసారి వేరే జట్లు హిట్టింగ్ ఆడితే చూసి ఓర్వలేకపోతున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈసారి టేబుల్ తలకిందులయ్యేట్లుగా కనిపిస్తునందువల్లే బోర్ కొడుతుందంటూ ఇన్ఫ్ల్యూయెన్స్ చేసేలా కామెంట్లు చేస్తున్నారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కాగా ఈసారి ఇప్పటికైతే ప్లే ఆఫ్స్ రేసులో రాజస్తాన్, కేకేఆర్, ఎస్ఆర్హెచ్, చెన్నై ముందు వరుసలో ఉండగా.. లక్నో, గుజరాత్ సైతం పోటీనిచ్చే అవకాశం ఉంది. సగానికి పైగా మ్యాచ్‌లు పూర్తయ్యేసరికి ఈ జట్లు టాప్-6లో ఉండగా.. ముంబై, ఢిల్లీ, పంజాబ్, ఆర్సీబీ వరుసగా ఏడు, ఎనిమిది, తొమ్మిది, పదో స్థానంలో నిలిచాయి. -
SRH: ‘టాలీవుడ్ ప్రిన్స్’తో కమిన్స్.. సూపర్‌స్టార్ రిప్లై.. ఫ్యాన్స్ ఫిదా
Pat Cummins And Mahesh Babu- Crazy Viral: ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ రాక సన్‌రైజర్స్ హైదరాబాద్‌లో సరికొత్త ఉత్సాహం నింపింది. అతడి సారథ్యంలో ఐపీఎల్-2024లో వరుస విజయాలతో సన్‌రైజర్స్ కాస్తా సన్‘డేంజర్స్’గా మారి ప్రత్యర్థులకు వణుకు పుట్టిస్తోంది. ట్రావిస్ హెడ్, హెన్రిచ్ క్లాసెన్, అభిషేక్ శర్మ, నితీశ్‌కుమార్ రెడ్డి, అబ్దుల్ సమద్.. ఇలా ఒక్కొక్కరు వ్యక్తిగతంగా పరుగుల సునామీ సృష్టిస్తూ సన్‌రైజర్స్‌ను విధ్వంసకర బ్యాటింగ్‌కు మారుపేరుగా మార్చగా.. వీరి సేవలను ఎప్పుడు ఎలా ఉపయోగించుకోవాలో తెలిసిన కమిన్స్ తనదైన వ్యూహాలతో విజయాల పరంపరకు తెరతీశాడు. ఈ నేపథ్యంలో.. గత మూడేళ్లుగా పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానం కోసం పోటీపడ్డ రైజర్స్ ఇప్పుడు.. ప్లే ఆఫ్స్ రేసులో ముందు వరుసలో ఉంది. ఆడిన ఏడు మ్యాచ్‌లలో ఐదు విజయాలతో ప్రస్తుతం పట్టికలో మూడో స్థానంలో కొనసాగుతోంది. కాగా సన్‌రైజర్స్ తమ తదుపరి మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్‌తో బెంగళూరుతో తలపడనుంది. హైదారాబాద్ వేదికగా గురువారం ఈ మ్యాచ్ జరుగనుంది. ఈ క్రమంలో సొంతగడ్డపై మరోసారి దుమ్ము రేపేందుకు సిద్ధమైన ప్యాట్ కమిన్స్ బృందం సోమవారం సూపర్‌స్టార్ మహేశ్ బాబును కలిసింది. View this post on Instagram A post shared by Pat Cummins (@patcummins30) ఈ సందర్భంగా మహేశ్ బాబుతో దిగిన ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసిన కమిన్స్.. ‘‘ఈరోజు మధ్యాహ్నం.. టాలీవుడ్ ప్రిన్స్‌తో సమయం సంతోషంగా గడిచింది’’ అంటూ హర్షం వ్యక్తం చేశాడు. ఇక మహేశ్ బాబు సైతం.. ‘‘మిమ్మల్ని నేరుగా కలవడం నాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నా. వీరాభిమానిని. మీకు, ఎస్ఆర్హెచ్ జట్టుకు ఆల్ ది బెస్ట్’’ అంటూ విషెస్ తెలిపాడు. వీరిద్దరి పోస్టులు చూసిన ఫ్యాన్స్ సంతోషంలో మునిగిపోయారు. ఇద్దరు లెజెండ్స్ ఒకే ఫ్రేమ్‌లో అంటూ మురిసిపోతున్నారు. View this post on Instagram A post shared by Mahesh Babu (@urstrulymahesh) కాగా గతంలో ఎస్ఆర్హెచ్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన విషయం తెలిసిందే. మహేశ్ బాబు, అల్లు అర్జున్, ప్రభాస్ వంటి స్టార్స్‌ను అనుకరిస్తూ అతడు చేసే రీల్స్ నెట్టింట వైరల్ అయిన సందర్భాలు కోకొల్లలు. చదవండి: ఓడినా.. మళ్లీ అదే నవ్వు.. అర్థంపర్థం లేని వాగుడు: సౌతాఫ్రికా స్టార్ పోస్ట్ వైరల్ SunRisers 🤝 Superstar of Telugu cinema, Mahesh Babu 👑🧡 pic.twitter.com/Nd4MQWCfi8 — SunRisers Hyderabad (@SunRisers) April 22, 2024 -
ఈసారి టైటిల్ సన్‌రైజర్స్‌దే!.. రిక్కీ పాంటింగ్ కామెంట్స్ వైరల్
ఐపీఎల్-2024లో చాంపియన్‌గా నిలవడానికి గల అర్హత ఇదేనంటూ ఢిల్లీ క్యాపిటల్స్ హెడ్ కోచ్ రిక్కీ పాంటింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. దూకుడైన బ్యాటింగ్‌తో ముందుకు సాగే జట్టే టైటిల్ సాధిస్తుందని అభిప్రాయపడ్డాడు. కాగా క్యాష్ రిచ్ తాజా ఎడిషన్‌లో ఇప్పటి వరకు 31 మ్యాచ్‌లు జరుగగా.. తొమ్మిదికి పైగా మ్యాచ్‌లలో.. ఒక ఇన్నింగ్స్‌లో 200.. అంతకంటే పైచిలుకు స్కోర్లు నమోదయ్యాయి. ఇక ఈ సీజన్లో కొత్త కెప్టెన్ ప్యాట్ కమిన్స్ సారథ్యంలో రెట్టించిన ఉత్సాహంతో ముందుకు సాగుతున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ రోజుల వ్యవధిలోనే తమ రికార్డు తామే బద్దలు కొట్టింది. దుమ్మురేపుతున్న సన్‌రైజర్స్ తొలుత ముంబై ఇండియన్స్‌పై 277 పరుగులు సాధించిన ఎస్ఆర్హెచ్.. ఆ తర్వాత ఆర్సీబీపై 287 పరుగులు స్కోరు చేసింది. తద్వారా ఐపీఎల్ చరిత్రలో అత్యధిక స్కోరు సాధించిన జట్టుగా రికార్డులకెక్కింది. Captain Pat reflects on the game ➕ who clinched the dressing room awards? 👀🏅 Watch as we soak in the post match vibes from our strong win in #RCBvSRH 🧡 pic.twitter.com/Ey7VhksA6B — SunRisers Hyderabad (@SunRisers) April 16, 2024 తగ్గేదేలే అంటున్న కేకేఆర్ మరోవైపు కోల్‌కతా నైట్ రైడర్స్ సైతం ఢిల్లీ క్యాపిటల్స్‌పై 272 పరుగులతో సత్తా చాటింది. ఇక తాజాగా మంగళవారం నాటి మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్, కేకేఆర్ వరుసగా 224, 223 పరుగులు స్కోరు చేశాయి. ఈ పరిణామాల నేపథ్యంలో రిక్కీ పాంటింగ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ‘‘ఇప్పటికే రెండుసార్లు భారీ స్కోరు చేసిన జట్టుగా ఎస్ఆర్హెచ్ రికార్డులు సాధించింది. కేకేఆర్ కూడా మా జట్టు మీద 272 రన్స్ స్కోరు చేసింది. సన్‌రైజర్స్ సూపర్ ఫామ్ నాకు తెలిసి ఇంపాక్ట్ ప్లేయర్ కారణంగానే బ్యాటింగ్ జట్లకు ఈ మేరకు ప్రయోజనం చేకూరుతున్నట్లు అనిపిస్తోంది. ఆర్సీబీతో మ్యాచ్‌లో ట్రావిస్ హెడ్ ఎంతగా ప్రభావం చూపాడో చూశాం. ఎంతో ఆత్మవిశ్వాసం ఉంటేగానీ ఆ మాదిరి షాట్లు ఆడలేరు. బ్యాటింగ్ ఆర్డర్లో డెప్త్ ఉన్న కారణంగా కూడా అతడు స్వేచ్ఛగా బ్యాట్ ఝులిపించగలిగాడు. ఐపీఎల్ వంటి మేజర్ టోర్నీల్లో లేదా బిగ్ బాష్ లీగ్‌లో.. ఇలా ఎక్కడ చూసినా సరే లక్ష్యాన్ని కాపాడుకోగలిగి జట్లే విజయం సాధించాయి. అయితే.. ఈసారి ఐపీఎల్ మాత్రం భిన్నంగా సాగుతోంది. ఆ జట్టుదే టైటిల్ బౌలర్లను చితక్కొడుతూ భారీ స్కోర్లు సాధించిన జట్లే టైటిల్ దిశగా వెళ్లే సూచనలు కనిపిస్తున్నాయి. డిఫెన్సివ్ బౌలింగ్‌పై ఆధారపడే జట్ల కంటే దూకుడుగా బ్యాటింగ్ చేసే జట్లకే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయి’’ అని రిక్కీ పాంటింగ్ అభిప్రాయపడ్డాడు. అలా అయితే ఈసారి సన్‌రైజర్స్‌దే టైటిల్! ఇక పాంటింగ్ వ్యాఖ్యలను బట్టి చూస్తే సీజన్ ఆరంభం(కేకేఆర్‌తో మ్యాచ్‌లో 204) నుంచి దూకుడుగా బ్యాటింగ్ చేస్తున్న సన్‌రైజర్స్‌కే టైటిల్ విన్నర్‌గా నిలిచే ఛాన్స్ ఉందని ఆరెంజ్ ఆర్మీ ఫ్యాన్స్ క్రేజీ కామెంట్లు చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. పాంటింగ్ మార్గదర్శనంలోని ఢిల్లీ క్యాపిటల్స్ ఈ సీజన్లో ఇప్పటి వరకు ఆడిన ఆరు మ్యాచ్‌లలో కేవలం రెండే గెలిచి పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానంలో ఉంది. ఇక పంత్ సేన తమ తదుపరి మ్యాచ్‌లో భాగంగా బుధవారం గుజరాత్ టైటాన్స్‌ను అహ్మదాబాద్‌లో ఢీకొట్టనుంది. చదవండి: #Pat Cummins: శెభాష్.. ఇది సరైన నిర్ణయం! కమిన్స్ అన్నతో అట్లుంటది మరి.. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_7552012696.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
RCB కెప్టెన్‌గా అతడు ఉంటే ఏం మాట్లాడగలరు: సెహ్వాగ్
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ఆట తీరుపై విమర్శలు వెల్లుతుతున్నాయి. సొంతమైదానంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ చేతిలో చిత్తుగా ఓడిపోవడంతో సొంత జట్టు అభిమానులు సైతం అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇలాగే కొనసాగితే ఐపీఎల్-2024లో కనీసం ప్లే ఆఫ్స్ కూడా చేరే అవకాశం ఉండదని మండిపడుతున్నారు. ఇక ఇప్పటికే భారత టెన్నిస్ దిగ్గజం మహేశ్ భూపతి సైతం ఆర్సీబీని కొత్త వాళ్లకు అమ్మేయాలంటూ యాజమాన్యం తీరును విమర్శించాడు. జట్టు నిండా స్టార్లు ఉన్నా ఇలాంటి చెత్త ప్రదర్శన ఏమిటని ఘాటు వ్యాఖ్యలు చేశాడు. ఈ నేపథ్యంలో ఆర్సీబీ వైఫల్యాలను ఎత్తిచూపుతూ టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. అదే ఇక్కడ ప్రధాన సమస్య ‘‘జట్టులో 12- 15 మంది భారత ఆటగాళ్లు ఉన్నారు. కేవలం 10 మంది విదేశీ క్రికెటర్లు ఉన్నారు. కానీ ఆర్సీబీ కోచింగ్ సిబ్బందిలో దాదాపుగా అందరూ విదేశీయులే ఉన్నారు. అదే ఇక్కడ ప్రధాన సమస్య. ఇక ఆటగాళ్లలో కొంతమంది మాత్రమే అంతర్జాతీయ స్థాయిలో ఆడుతున్నారు. వీరిలో సగం మందికి ఇంగ్లిష్ పూర్తిగా అర్థమే కాదు. అలాంటపుడు ఆ విదేశీ కోచ్‌లు వీరిని ఎలా మోటివేట్ చేయగలరు? వారితో ఎక్కువ సమయం ఎలా గడపగలరు? భాష పూర్తిగా రాని ఆటగాళ్లు తమ సమస్యలను కోచ్‌లకు ఎలా వివరించగలరు? నాకైతే ఆర్సీబీలో ఒక్క ఇండియన్ కోచ్ కూడా కనిపించడం లేదు. కనీసం ఒక్కరైనా అనుభవజ్ఞుడైన కోచ్ ఉంటే బాగుంటుంది కదా! ఆటగాళ్లు ఏది చర్చించాలన్నా అందుకు తగిన వాతావరణం ఉండాలి. కెప్టెన్‌గా అతడు ఉంటే ఏం మాట్లాడతారు? నాకు తెలిసి చాలా మంది ఆటగాళ్లు కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ దగ్గరికి వెళ్లడానికే సంశయిస్తారు. ఎందుకంటే అతడు ఏదైనా అడిగితే వీరు సమాధానం చెప్పలేరు కదా! ఒకవేళ కెప్టెన్ గనుక భారతీయుడైతే.. సదరు ఆటగాళ్లు తాము అనుకుంటున్న విషయాన్ని స్పష్టంగా అతడికి తెలియజేయగలరు. కానీ విదేశీ ఆటగాడితో సరిగా కమ్యూనికేట్ చేయలేక.. ఒకదానికి బదులు ఇంకొకటి మాట్లాడితే తదుపరి మ్యాచ్‌లో తుదిజట్టులో చోటు దక్కే అవకాశం కూడా ఉండకపోవచ్చు. ఆర్సీబీ సహాయక సిబ్బందిలో కనీసం ఇద్దరు నుంచి ముగ్గురైనా భారతీయులు ఉండాలి’’ అని క్రిక్‌బజ్ షోలో సెహ్వాగ్ వ్యాఖ్యానించాడు. కాగా ఐపీఎల్-2024లో ఆర్సీబీ ఇప్పటి వరకు ఆడిన ఏడు మ్యాచ్‌లలో కేవలం ఒక్కటి గెలిచి ఆరు ఓడిపోయింది. దీంతో ప్లే ఆఫ్స్ అవకాశాలను సంక్లిష్టంగా మార్చుకుంది. ఇక ఈ సీజన్లో ఆర్సీబీ హెడ్‌కోచ్‌గా ఆండీ ఫ్లవర్ బాధ్యతలు చేపట్టగా.. బ్యాటింగ్, స్పిన్ బౌలింగ్ కోచ్‌గా టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ శ్రీధరన్ శ్రీరామ్, బౌలింగ్ కోచ్‌గా ఆడం గ్రిఫిత్(టాస్మేనియా మాజీ క్రికెటర్), ఫీల్డింగ్ కోచ్‌గా మలోలన్ రంగరాజన్ వ్యవహరిస్తున్నారు. చదవండి: SRH: ‘బాధితులు’ కూడా అసూయ పడేలా.. కమిన్స్ ఏమన్నాడో తెలుసా? var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4381453179.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
శెభాష్.. ఇది సరైన నిర్ణయం! కమిన్స్ అన్నతో అట్లుంటది మరి..
SRH Fans Hails Pat Cummins Captaincy: ఐపీఎల్లో గత మూడేళ్లుగా పేలవ ప్రదర్శనతో విమర్శలు మూటగట్టుకున్న జట్టు సన్‌రైజర్స్ హైదరాబాద్. ఐపీఎల్-2023లో పద్నాలుగింట కేవలం నాలుగు మ్యాచ్‌లు మాత్రమే గెలిచి పట్టికలో అట్టడుగున పదోస్థానంలో నిలిచింది. ఫలితంగా ఇక ఈ జట్టు ఇంతే! ఊరించి ఉసూరుమనిపించడం.. గెలుస్తారనుకున్న మ్యాచ్‌లో కూడా ఓడిపోవడం.. అనే విమర్శలు ఎదుర్కొంది. సరైన కెప్టెన్, ఓపెనింగ్ జోడీ లేకపోవడం.. డెత్ ఓవర్లలో బౌలింగ్ చేసే ప్రధాన పేసర్ భువనేశ్వర్ కుమార్ విఫలం కావడం వంటివి తీవ్ర ప్రభావం చూపాయి. భారీ ధరకు కొనుక్కున్న హ్యారీ బ్రూక్ రాణించకపోవడం.. హెన్రిచ్ క్లాసెన్‌తో పాటు గ్లెన్ ఫిలిప్స్‌ను బరిలోకి దింపినా అప్పటికే ఆలస్యం కావడం గతేడాది ఎస్ఆర్హెచ్ కొంపముంచింది. అయితే, తప్పుల నుంచి పాఠాలు నేర్చుకుని.. లోపాలు సరిచేసుకుని ముందు సాగడం కూడా సన్‌రైజర్స్‌కు చేతకాదు అనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. వన్డే వరల్డ్‌కప్-2023 విన్నింగ్ కెప్టెన్ కోసం 20 కోట్లు కానీ.. సన్‌రైజర్స్ యాజమాన్యం వ్యూహాత్మంగా అడుగులు వేసింది. ఐపీఎల్-2024 వేలంలో భాగంగా వన్డే వరల్డ్‌కప్-2023 విజేత ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్‌ను భారీ ధరకు కొనుగోలు చేసింది. అతడి కోసం ఏకంగా రూ. 20.50 కోట్లు వెచ్చించింది. అదే విధంగా వరల్డ్‌కప్ హీరో ట్రావిస్ హెడ్‌ను కూడా రూ. 6.80 కోట్లు పెట్టి కొనుక్కుంది. అయితే.. టీ20లలో అంతగా అనుభవం లేని కమిన్స్‌ను కెప్టెన్ చేయడం సన్‌రైజర్స్ పొరపాటేనని మరోసారి విమర్శలు వచ్చాయి. అతడి కోసం అంత ఖర్చు చేయడం అవసరమా అనే పెదవి విరుపులు కూడా! నమ్మకం నిలబెట్టుకుంటున్న కమిన్స్ కానీ మేనేజ్మెంట్ తనమీద పెట్టుకున్న నమ్మకాన్ని నిజం చేస్తూ సన్‌రైజర్స్‌ను విజయపథంలో నడుపుతున్నాడు కమిన్స్. అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, హెన్రిచ్ క్లాసెన్, మార్క్రమ్ వంటి హిట్టర్లకు తోడు నితీశ్ కుమార్‌రెడ్డి, అబ్దుల్ సమద్ సేవలను సరైన సమయంలో సరిగ్గా ఉపయోగించుకుంటూ ఫలితాలు రాబడుతున్నాడు. ఇక బౌలింగ్ విభాగంలో ఈ స్టార్ పేసర్ తనతో పాటు భువీ, నటరాజన్, జయదేవ్ ఉనాద్కట్‌లతో పాటు స్పిన్నర్ మయాంక్ మార్కండేను కూడా అవసరమైన సమయంలో రంగంలోకి దించుతున్నాడు. మాస్టర్ మైండ్ ఆర్సీబీతో సోమవారం నాటి మ్యాచ్‌లో పిచ్‌ను సరిగ్గా రీడ్ చేసిన కమిన్స్ వన్‌డౌన్‌లో క్లాసెన్‌ను దింపి ఫలితం రాబట్టాడు. అందుకు తగ్గట్లే క్లాసెన్(31 బంతుల్లో 67) ట్రావిస్ హెడ్(41 బంతుల్లో 102)కు సహకారం అందిస్తూనే.. ఆచితూచి ఆడుతూ వీలు చిక్కిన్నపుడల్లా బంతిని బౌండరీకి తరలించాడు. ఆఖర్లో మార్క్రమ్(17 బంతుల్లో 32), అబ్దుల్ సమద్(10 బంతుల్లో 37) ధనాధన్ ఇన్నింగ్స్‌తో అజేయంగా నిలిచి ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోరు(287) నమోదు చేసిన జట్టుగా ఆల్‌టైమ్ రికార్డు సృష్టించడంలో తమ వంతు పాత్ర పోషించారు. Abdul Samad in the house now 😎 Flurry of sixes at the Chinnaswamy 💥 Watch the match LIVE on @JioCinema and @StarSportsIndia 💻📱#TATAIPL | #RCBvSRH pic.twitter.com/eWFCtZ5Usq — IndianPremierLeague (@IPL) April 15, 2024 ఇక ఆర్సీబీ లక్ష్య ఛేదనలో ఆరంభంలో దూకుడుగా ఆడినా ప్యాట్ కమిన్స్ ముఖంపై నవ్వులు పూశాయే గానీ.. అతడు ఏమాత్రం తడబడలేదు. ముందుగా పార్ట్‌టైమ్ స్పిన్నర్ అభిషేక్ శర్మ చేతికి బంతినిచ్చాడు. ఐదో బంతికే క్యాచ్ డ్రాప్ చేయడంతో కోహ్లికి లైఫ్ లభించగా అతడు దూకుడు మరింత పెంచాడు. ఆ తర్వాత భువీని రంగంలోకి దింపాడు. అనంతరం మళ్లీ లెఫ్టార్మ్ స్పిన్నర్ షాబాజ్ అహ్మద్..నటరాజన్ ఇలా ఒక్కో ఓవర్‌కు వైవిధ్యం చూపించాడు. పిచ్ పరిస్థితిని అంచనా వేస్తూ మరో స్పిన్నర్ మయాంక్‌తో బౌలింగ్ చేయించి ఫలితం రాబట్టాడు. ఆర్సీబీని దెబ్బకొట్టడంలో సఫలం మయాంక్ మార్కండే కోహ్లి(42) బౌల్డ్ కావడంతో అప్పటిదాకా ఆర్సీబీ విజయంపై ఆశలు పెట్టుకున్న అభిమానులు ఒక్కసారిగా నీరుగారిపోయారు. అయితే, కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్(28 బంతుల్లో 62), దినేశ్ కార్తిక్(35 బంతుల్లో 83) ఇన్నింగ్స్ నిలబెట్టే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. తన వ్యూహాలను పక్కాగా అమలు చేసిన ప్యాట్ కమిన్స్ మూడు వికెట్లు తీయడంతో పాటు కెప్టెన్‌గానూ తానేంటో మరోసారి నిరూపించాడు. మిస్టర్ కూల్ ధోనిలా కూల్‌గా డీల్ చేస్తూ సన్‌రైజర్స్‌ను 25 పరుగుల తేడాతో గెలిపించాడు. తద్వారా రైజర్స్ ఖాతాలో నాలుగో(ఆరింట) విజయం చేరింది. ఇక కమిన్స్ చేరిక జట్టుకు నష్టం చేకూరుస్తుందే తప్ప లాభం ఉండదన్న విమర్శకులకు అద్బుత నైపుణ్యాలతో సమాధానమిస్తున్న ఈ పేస్ బౌలర్.. తొలుత ప్లే ఆఫ్స్‌నకు గురిపెట్టాడు. Nothing but bright smiles and 𝙜𝙤𝙤𝙤𝙤𝙤𝙤𝙙 vibes after a historic night of cricket 😁🔥#PlayWithFire #RCBvSRH pic.twitter.com/RXn6mb5pF1 — SunRisers Hyderabad (@SunRisers) April 16, 2024 అంతా సవ్యంగా సాగితే ఈసారి ఫైనల్లోనూ రైజర్స్‌ను చూస్తామంటూ హర్షం వ్యక్తం చేస్తున్నారు ఆరెంజ్ ఆర్మీ ఫ్యాన్స్. డేవిడ్ వార్నర్ తర్వాత తమకు దొరికిన మరో ఆణిముత్యం కెప్టెన్ ప్యాట్ కమిన్స్ అంటూ కొనియాడుతున్నారు. విశ్లేషకులు సైతం కమిన్స్ కెప్టెన్సీకి మంచి మార్కులే వేస్తున్నారు. పనిలో పనిగా రిస్క్ తీసుకున్నా సరే అనుకున్న ఫలితాలు వస్తున్నాయి అంటూ సన్‌రైజర్స్ ఓనర్ కావ్యా మారన్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. చదవండి: #T20WorldCup2024: రోహిత్‌తో ద్రవిడ్, అగార్కర్ చర్చలు.. హార్దిక్ పాండ్యాకు నో ఛాన్స్! Captain Pat reflects on the game ➕ who clinched the dressing room awards? 👀🏅 Watch as we soak in the post match vibes from our strong win in #RCBvSRH 🧡 pic.twitter.com/Ey7VhksA6B — SunRisers Hyderabad (@SunRisers) April 16, 2024 -
IPL 2024 RCB Vs SRH: ఆర్సీబీ బౌలింగ్.. నభూతో నభవిష్యతి..!
ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో ఆర్సీబీ బౌలింగ్ ఎంత ఛండాలంగా ఉందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఈ సీజన్లో ఆ జట్టులో ఒక్కరంటే ఒక్కరు కూడా కనీస స్థాయి బౌలర్‌గా కనిపించడం లేదు. కోట్లు కుమ్మరించి కొనుక్కున్న విదేశీ పేసర్లు అల్జరీ జోసఫ్, కెమరూన్ గ్రీన్, రీస్ టాప్లే, లోకీ ఫెర్గూసన్ గల్లీ స్థాయి బౌలర్లకంటే హీనంగా బౌలింగ్ చేస్తుండగా.. స్వదేశీ హీరోలు సిరాజ్, యశ్ దయాల్, విజయ్‌కుమార్ తామేమీ తక్కువ కాదన్నట్లు పోటీపడి పరుగులు సమర్పించుకుంటున్నారు. సన్‌రైజర్స్‌తో నిన్నటి మ్యాచ్‌లో అయితే ఆర్సీబీ బౌలర్ల చెత్త ప్రదర్శన శృతి మించిపోయింది. ఈ మ్యాచ్‌లో ఏకంగా నలుగురు బౌలర్లు తమ కోటా నాలుగు ఓవర్లలో 50పైగా పరుగులు సమర్పించుకున్నారు. ఐపీఎల్ చరిత్రలో ఇలా ఒకే ఇన్నింగ్స్‌లో ఇంత మంది ఫిఫ్టి ప్లస్ స్కోర్లు సమర్పించుకోవడం ఇదే మొదటిసారి. ఈ మ్యాచ్‌లో రీస్ టాప్లే 68, విజయ్‌కుమార్ 64, ఫెర్గూసన్ 52, యశ్ దయాల్ 51 పరుగులు సమర్పించుకున్నారు. ఆర్సీబీ చెత్త బౌలింగ్ కారణంగా సన్‌రైజర్స్ బ్యాటర్లు పేట్రేగిపోయి ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్‌ను నమోదు చేశారు. ఆర్సీబీ బౌలర్ల చెత్త ప్రదర్శనను ఎప్పుడూ వెనకేసుకొచ్చే సొంత అభిమానులే జీర్ణించుకోలేకతున్నారు. ఆర్సీబీ బౌలింగ్.. నభూతో నభవిష్యతి అంటూ వ్యంగ్యంగా కామెంట్స్ చేస్తున్నారు. మ్యాచ్ విషయానికొస్తే.. భారీ స్కోర్లు నమోదైన ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ 25 పరుగుల తేడాతో పరాజయంపాలైంది. సన్‌రైజర్స్ నిర్దేశించిన 288 పరుగుల కష్టసాధ్యమైన లక్ష్యాన్ని ఛేదిస్తూ ఆర్సీబీ 262 పరుగులకు పరిమితమైంది. తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్.. ట్రవిస్ హెడ్ (41 బంతుల్లో 102; 9 ఫోర్లు, 8 సిక్సర్లు), హెన్రిచ్ క్లాసెన్ (31 బంతుల్లో 67; 2 ఫోర్లు, 7 సిక్సర్లు), అబ్దుల్ సమద్ (10 బంతుల్లో 37 నాటౌట్; 4 ఫోర్లు, 3 సిక్సర్లు), అభిషేక్ శర్మ (22 బంతుల్లో 34; 2 ఫోర్లు, 2 సిక్సర్లు), మార్క్రమ్ (10 బంతుల్లో 37 నాటౌట్; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) శివాలెత్తిపోవడంతో నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 287 పరుగులు చేసింది. ఛేదనలో విరాట్ (20 బంతుల్లో 42; 6 ఫోర్లు, 2 సిక్సర్లు), డుప్లెసిస్ (28 బంతుల్లో 62; 7 ఫోర్లు, 4 సిక్సర్లు), దినేశ్ కార్తీక్ (35 బంతుల్లో 83; 5 ఫోర్లు, 7 సిక్సర్లు), లోమ్రార్ (11 బంతుల్లో 19; 2 సిక్సర్లు), అనూజ్ రావత్ (14 బంతుల్లో 25 నాటౌట్; 5 ఫోర్లు) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడినప్పటికీ ఆర్సీబీని గెలిపించలేకపోయారు. ఆర్సీబీ లక్ష్యానికి 26 పరుగుల దూరంలో నిలిచిపోయింది. డీకే ఆఖర్లో జూలు విదిల్చినప్పటికీ లక్ష్యం పెద్దది కావడంతో ప్రయోజనం లేకుండా పోయింది. -
ఏంట్రా ఈ బ్యాటింగ్?.. ఆగ్రహం వెళ్లగక్కిన కోహ్లి.. రియాక్షన్ వైరల్
‘‘నేను కొడితే అదోలా ఉంటుందని..ఆళ్లూ.. ఈళ్లూ చెప్పడమే గానీ.. నాకు కూడా తెలియదు.. ఇప్పుడు మీకు తెలుస్తుంది’’.. బిజినెస్‌మేన్ సినిమాలో మహేశ్ బాబు చెప్పిన మాదిరే సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లు కూడా ఆర్సీబీ బౌలింగ్‌ను చితక్కొట్టారు. ఏమాత్రం కనికరం లేకుండా బెంగళూరు బౌలర్లపై విరుచుపడుతూ చిన్నస్వామి స్టేడియంలో పరుగుల వరద పారించాడు. కో..డితే సిక్స్.. లేదంటే ఫోర్.. తగ్గేదేలే అన్నట్లు ట్రావిస్ హెడ్(41 బంతుల్లో 102) ఓవైపు ఊచకోత కోస్తుంటే మరోవైపు హెన్రిచ్ క్లాసెన్(31 బంతుల్లో 67) ఛాన్స్ వచ్చినప్పుడల్లా వీరబాదుడు బాదాడు. THE SHOOTING STAR...!!! 💫 - 106M monster by Heinrich Klaasen. 🥵 pic.twitter.com/raWQGOLOiM — Mufaddal Vohra (@mufaddal_vohra) April 15, 2024 వీరిద్దరి తుఫాన్ ఇన్నింగ్స్ చూసి ఆరెంజ్ ఆర్మీ కేకలతో స్టేడియం హోరెత్తిపోగా.. ఆర్సీబీ ఫ్యాన్స్ మాత్రం జరుగుతున్న పరుగుల విధ్వంసాన్ని చూడలేక తమలో తామే మదనపడిపోతూ సతమతమయ్యారు. అభిమానుల పరిస్థితే ఇలా ఉంటే.. మరి ఆర్సీబీ బౌలర్లు, ఫీల్డర్ల పరిస్థితి ఇంకెలా ఉంటుంది? వికెట్ తీయడం సంగతి దేవుడెరుగు.. ముందు పరుగుల ప్రవాహానికి కట్టడి చేయడం ఎలా అని తలలు పట్టుకున్నారంతా! కాలితో తంతూ ఆగ్రహం వెళ్లగక్కిన కోహ్లి ఇక ఆర్సీబీ ముఖచిత్రంగా భావించే స్టార్ విరాట్ కోహ్లి అయితే తీవ్ర అసహానికి లోనయ్యాడు. రైజర్స్ బ్యాటర్లు తమ సొంత మైదానంలో దుమ్ములేపుతుంటే అస్సలు చూడలేకపోయాడు. ఏ దశలోనూ వారిని కట్టడి చేయలేక బౌలర్లు చేతులెత్తేస్తుంటే గాల్లోకి కాలితో పంచ్‌లు విసురుతూ కోపాన్ని వెళ్లగక్కాడు. అదే సమయంలో వికెట్ పడినప్పుడల్లా జట్టును ఉత్సాహపరుస్తూ.. చప్పట్లు కొడుతూ సంతోషం వ్యక్తం చేశాడు. సన్‌రైజర్స్ బ్యాటింగ్ పూర్తయ్యేంత వరకు కోహ్లి ఇచ్చిన వైవిధ్యమైన ఎక్స్ప్రెషన్స్, రియాక్షన్స్ చూసి ఫ్యాన్స్.. ‘‘అయ్యో పాపం ఆర్సీబీ’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. Everyone's mental health after watching RCB bowlers #RCBvsSRH pic.twitter.com/dSy38RctKC — Rohan Naik (@RohanNaik_) April 15, 2024 ఆర్సీబీ బౌలర్లపై ఫ్యాన్స్ మండిపాటు ఇలాగే ఆడితే ఆర్సీబీ ఈసారి కనీసం ప్లే ఆఫ్స్ కూడా చేరదంటూ ఆర్సీబీ బౌలర్లను పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్నారు. కాగా బెంగళూరులో సోమవారం జరిగిన మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 287 పరుగులు చేసింది. తద్వారా ఐపీఎల్ చరిత్రలో తమ రికార్డును తామే బ్రేక్ చేసి.. అత్యధిక పరుగులు సాధించిన జట్టుగా చరిత్రకెక్కింది. ఇక లక్ష్య ఛేదనలో కోహ్లి(42), ఫాఫ్ డుప్లెసిస్(28 బంతుల్లో 62) శుభారంభం అందించినా.. మిడిలార్డర్ పూర్తిగా విఫలమైంది. ఇక ఆఖర్లో దినేశ్ కార్తిక్(35 బంతుల్లో 83) విధ్వంసకర అర్ధ శతకం బాదినా.. అనూజ్ రావత్(14 బంతుల్లో 25 నాటౌట్) మెరుపులు మెరిపించినా లక్ష్యాన్ని ఛేదించడంలో ఆర్సీబీ విఫలమైంది. ఫలితంగా 25 పరుగుల తేడాతో ఓడిపోయి వరుసగా ఐదో పరాజయం నమోదు చేసింది. చదవండి: #T20WorldCup2024: రోహిత్‌తో ద్రవిడ్, అగార్కర్ చర్చలు.. హార్దిక్ పాండ్యాకు నో ఛాన్స్! var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_7552012696.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); A 1⃣0⃣8⃣m monster! 💥 The bowlers can finally breathe at the Chinnaswamy as the batting carnage comes to an end! 🥶 Recap the match on @StarSportsIndia and @JioCinema 💻📱#TATAIPL | #RCBvSRH pic.twitter.com/lclY9rs2Kf — IndianPremierLeague (@IPL) April 15, 2024 -
పాట్ కమిన్స్‌కు ప్రతిష్టాత్మక అవార్డు
సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ పాట్ కమిన్స్‌కు (ఆస్ట్రేలియా) ప్రతిష్టాత్మక విజ్డెన్ లీడింగ్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు లభించింది. 2023 సంవత్సరానికి గాను విజ్డెన్ ఈ అవార్డుకు పాట్‌ను ఎంపిక చేసింది. గతేడాది వ్యక్తిగతంగా, కెప్టెన్‌గా సాధించిన ఘనతలకు గాను పాట్‌ను ఈ అవార్డు వరించింది. కమిన్స్ 2023లో కెప్టెన్‌గా వన్డే వరల్డ్‌కప్, వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్, యాషెస్ సిరీస్‌లను గెలిచాడు. గతేడాది ఐసీసీ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డును సైతం దక్కించుకున్న కమిన్స్.. వ్యక్తిగత ప్రదర్శనల కారణంగా ప్లేయర్ ఆఫ్ ద మంత్, ఇంగ్లండ్‌తో బాక్సింగ్ డే టెస్ట్‌లో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ తదితర అవార్డులు అందుకున్నాడు. ఐపీఎల్ 2024 సీజన్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీని కూడా విజయవంతంగా ముందుండి నడిపిస్తున్న కమిన్స్.. ఈ సీజన్ వేలంలో 20.5 కోట్ల రికార్డు ధర దక్కించుకున్నాడు. విజ్డెన్.. కమిన్స్‌తో పాటు ఉస్మాన్ ఖ్వాజా, మిచెల్ స్టార్క్, ఆష్లే గార్డ్నర్ (ఆసీస్ మహిళా క్రికెటర్), హ్యారీ బ్రూక్, మార్క్ వుడ్ లాంటి అత్యుత్తమ ప్రతిభావంతులను కూడా సత్కరించింది. 2015 నుంచి విజ్డెన్ లీడింగ్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు దక్కించుకున్నవారు.. 2015లో కేన్ విలియమ్సన్ 2016లో విరాట్ కోహ్లి 2017లో విరాట్ కోహ్లి 2018లో విరాట్ కోహ్లి 2019లో బెన్ స్టోక్స్ 2020లో బెన్ స్టోక్స్ 2021లో జో రూట్ 2022లో బెన్ స్టోక్స్ 2023లో పాట్ కమిన్స్ -
వారెవ్వా.. ఏమా విధ్వంసం! సంభ్రమాశ్చర్యంలో కావ్యా మారన్
#OrangeArmy: సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్ల విజృంభణతో చిన్నస్వామి స్టేడియం చిన్నబోయింది. ఆరంభం నుంచే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు బౌలర్లపై విరుచుకుపడుతూ సృష్టించిన పరుగుల సునామీలో పాత రికార్డులు కొట్టుకుపోతుంటే అందుకు సాక్షిగా నిలిచింది. అయినా.. లక్ష్య ఛేదనలో ఆర్సీబీ బ్యాటర్లు మ్యాజిక్ చేస్తారనే ఆశ. సొంతమైదానంలో కచ్చితంగా రికార్డు టార్గెట్‌ను చేధిస్తారనే నమ్మకం ఆ జట్టు అభిమానుల్లో! కానీ సన్‌రైజర్స్ బౌలర్ల ముందు ఆర్సీబీ బ్యాటర్లు ఎక్కువసేపు నిలవలేకపోయారు. అయినప్పటికీ.. కొండంత లక్ష్యాన్ని కరిగించేందుకు ఆఖరి వరకు అసాధారణ పోరాట పటిమ కనబరిచారు. అయితే.. హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లో చివరికి సన్‌రైజర్స్ పైచేయి సాధించింది. ఆర్సీబీపై 25 పరుగుల తేడాతో జయభేరి మోగించి ఘన విజయాన్ని అందుకుంది. దీంతో ఆరెంజ్ ఆర్మీ సంబరాలు అంబరాన్నంటాయి. ఆద్యంతం పరుగుల వరద పారిన ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ యజమాని కావ్యా మారన్ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. తొలుత తమ జట్టు హిట్టింగ్ చేసినపుడు.. ముఖ్యంగా ట్రావిస్ హెడ్ విధ్వంసకర శతకం నేపథ్యంలో ఆమె సంభ్రమాశ్చర్యాలకు లోనైంది. సన్‌రైజర్స్ బ్యాటర్లు పరుగుల వరద పారించిన సమయంలో సంతోషంతో కావ్య ముఖం వెలిగిపోయింది. The art 🎨 of nailing practice to execution for a record breaking total! 🧡 Travis Head 🤝 Heinrich Klaasen#TATAIPL | #RCBvSRH | @SunRisers pic.twitter.com/gA5HcYGwFM — IndianPremierLeague (@IPL) April 16, 2024 అలాగే ప్రమాదకరంగా మారుతున్న ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్(28 బంతుల్లో 62) అవుటైన సమయంలో ఏకంగా చిన్నపాటి స్టెప్పులేసిందామె! ఇందుకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. కావ్యా ఎక్స్ప్రెషన్స్కు ఫిదా అవుతున్న నెటిజన్లు ఆమెకు, సన్‌రైజర్స్‌కు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. కాగా ఆర్సీబీతో బెంగళూరులో సోమవారం జరిగిన సన్‌రైజర్స్ మ్యాచ్‌కు కావ్యా మారన్ తన తల్లిదండ్రులతో కలిసి హాజరయ్యారు. సన్‌రైజర్స్ వర్సెస్ ఆర్సీబీ స్కోర్లు: ►టాస్: ఆర్సీబీ.. బౌలింగ్ ►సన్‌రైజర్స్ స్కోరు: 287/3 (20) ►ఆర్సీబీ స్కోరు: 262/7 (20) ►ఫలితం: ఆర్సీబీపై 25 పరుగుల తేడాతో సన్‌రైజర్స్ విజయం ►ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: ట్రావిస్ హెడ్ (41 బంతుల్లో 102 పరుగులు). చదవండి: ఐపీఎల్ నుంచి తప్పుకున్న మ్యాక్స్‌వెల్ Kavya Maran enjoying the Head-Abhishek show. pic.twitter.com/jaYpDIquOS — Mufaddal Vohra (@mufaddal_vohra) April 15, 2024 -
చరిత్రపుటల్లోకెక్కిన సన్‌రైజర్స్-ఆర్సీబీ మ్యాచ్.. టీ20 రికార్డులు బద్దలు
ఐపీఎల్ 2024 సీజన్లో భాగంగా ఆర్సీబీ-సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య నిన్న (ఏప్రిల్ 15) జరిగిన మ్యాచ్ చాలా వరకు టీ20 రికార్డులను బద్దలు కొట్టింది. ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ చేసిన స్కోర్ (287/3) 17 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలోనే అత్యధికం కాగా.. పొట్టి క్రికెట్ చరిత్రలో రెండో అత్యధిక టీమ్ స్కోర్‌గా (గతేడాది ఏషియన్ గేమ్స్‌లో నేపాల్ మంగోలియాపై చేసిన 314 పరుగుల స్కోర్ టీ20ల్లో అత్యధికం) రికార్డైంది. ఈ మ్యాచ్‌లో ఇరు జట్లు కలిపి చేసిన స్కోర్ (సన్‌రైజర్స్ 287 + ఆర్సీబీ 262=549) టీ20 హిస్టరీలో (ఓ మ్యాచ్‌లో) నమోదైన అత్యధిక స్కోర్‌గా నిలిచింది. ఈ మ్యాచ్‌లో 22 సిక్సర్లు కొట్టిన సన్‌రైజర్స్.. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక సిక్సర్లు (ఓ ఇన్నింగ్స్‌లో) కొట్టిన జట్టుగా ఆల్‌టైమ్ రికార్డు నెలకొల్పింది. ఈ మ్యాచ్‌లో ట్రవిస్ హెడ్ (39 బంతులు) చేసిన సెంచరీ సన్‌రైజర్స్ తరఫున వేగవంతమైన శతకంగా రికార్డుల్లోకెక్కింది. ఈ మ్యాచ్‌లో నమోదైన బౌండరీలు (43 ఫోర్లు, 38 సిక్సర్లు= 81), సిక్సర్లు (38) (ఇరు జట్లు కలిపి కొట్టినవి) పొట్టి క్రికెట్ చరిత్రలోనే ఓ మ్యాచ్‌లో నమోదైన అత్యధిక బౌండరీలు, సిక్సర్లుగా రికార్డయ్యాయి. ఈ రికార్డులే కాక ఈ మ్యాచ్‌లో మరెన్నో చిన్నా చితక రికార్డులు నమోదయ్యాయి. మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్.. ట్రవిస్ హెడ్ (41 బంతుల్లో 102; 9 ఫోర్లు, 8 సిక్సర్లు), హెన్రిచ్ క్లాసెన్ (31 బంతుల్లో 67; 2 ఫోర్లు, 7 సిక్సర్లు), అబ్దుల్ సమద్ (10 బంతుల్లో 37 నాటౌట్; 4 ఫోర్లు, 3 సిక్సర్లు), అభిషేక్ శర్మ (22 బంతుల్లో 34; 2 ఫోర్లు, 2 సిక్సర్లు), మార్క్రమ్ (10 బంతుల్లో 37 నాటౌట్; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) శివాలెత్తిపోవడంతో నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 287 పరుగులు చేసింది. ఆర్సీబీ బౌలర్లలో ఫెర్గూసన్ 2, టాప్లే ఓ వికెట్ పడగొట్టాడు. కష్టసాధ్యమైన లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆర్సీబీ.. పోరాడితే పోయేదేమీ లేదనుకుని చివరి నిమషం వరకు గెలుపు కోసం ప్రయత్నించింది. విరాట్ కోహ్లి (20 బంతుల్లో 42; 6 ఫోర్లు, 2 సిక్సర్లు), డుప్లెసిస్ (28 బంతుల్లో 62; 7 ఫోర్లు, 4 సిక్సర్లు), దినేశ్ కార్తీక్ (35 బంతుల్లో 83; 5 ఫోర్లు, 7 సిక్సర్లు), మహిపాల్ లోమ్రార్ (11 బంతుల్లో 19; 2 సిక్సర్లు), అనూజ్ రావత్ (14 బంతుల్లో 25 నాటౌట్; 5 ఫోర్లు) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడినప్పటికీ ఆర్సీబీ లక్ష్యానికి 26 పరుగుల దూరంలో నిలిచిపోయింది. డీకే ఆఖర్లో జూలు విదిల్చినప్పటికీ లక్ష్యం పెద్దది కావడంతో ప్రయోజనం లేకుండా పోయింది. సన్‌రైజర్స్ బౌలర్లలో కమిన్స్ 3, మయాంక్ మార్కండే 2, నటరాజన్ ఓ వికెట్ పడగొట్టాడు. -
బెంగళూరులో దుమ్మురేగొట్టిన ఆరెంజ్ ఆర్మీ ‘ఓ రేంజ్’ బ్యాటింగ్ (ఫొటోలు)
-
IPL 2024 RCB Vs SRH: 277 కాదు... 287
బెంగళూరు: సన్‌రైజర్స్ ఆటతీరు చిన్నస్వామి స్టేడియాన్ని పెద్ద పెద్ద రికార్డుల్లో నిలిపింది. బెంగళూరు టాస్ నెగ్గి ఫీల్డింగ్ ఎంచుకోగానే విధ్వంసానికి పునాది పడింది...బ్యాటింగ్ తుఫాన్‌తో హైదరాబాద్ మ్యాచ్ గెలిచింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఒక సీజన్లో తమ రికార్డుకు ‘2.0’ ను చూపించింది. ముంబైపై 277 రికార్డును రోజుల వ్యవధిలోనే 287 పరుగుల అత్యధిక స్కోరుతో హైదరాబాద్ జట్టు తిరగరాసింది. ఈ ఎండల్ని తట్టుకోలేని జనాలకు మెరుపుల పండగని పంచిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ 25 పరుగుల తేడాతో బెంగళూరుపై గెలిచింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి మునుపెన్నడూ చేయని 287 పరుగుల భారీ స్కోరు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ ట్రవిస్ హెడ్ (41 బంతుల్లో 102; 9 ఫోర్లు, 8 సిక్స్‌లు) శతకం బాదగా... హెన్రిచ్ క్లాసెన్ (31 బంతుల్లో 67; 2 ఫోర్లు, 7 సిక్స్‌లు) ఆకాశానికే చిల్లులుపడేలా సిక్స్‌లు కొట్టాడు. అనంతరం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 262 పరుగులు చేసింది. దినేశ్ కార్తీక్ (35 బంతుల్లో 83; 5 ఫోర్లు, 7 సిక్స్‌లు) దంచేశాడు చివరి వరకు పోరాడగా..డుప్లెసిస్ (28 బంతుల్లో 62; 7 ఫోర్లు, 4 సిక్స్‌లు) మెరిపించాడు. దంచుడే... దంచుడు! రెండో ఓవర్ నుంచే హెడ్ వీరంగం మొదలైంది. టాప్లీ ఓవర్లో 4, 6 కొట్టగా, ఫెర్గూసన్ ఐదో ఓవర్లో రెండు సిక్స్‌లతో పాటు ఓ బౌండరీ బాదాడు. దీన్ని యశ్ తదుపరి ఓవర్లోనూ రిపీట్ చేయడంతో 20 బంతుల్లో హెడ్ ఫిఫ్టీ పూర్తవగా, పవర్‌ప్లే స్కోరు 76/0. జాక్స్ ఏడో ఓవర్ వేస్తే హెడ్ వరుసగా 4, 6, 6 బాదేశాడు. తర్వాత అభిషేక్ సిక్సర్‌తో 7.1 ఓవర్లోనే సన్‌రైజర్స్ వందను దాటేసింది. తర్వాతి ఓవర్లో అభిషేక్ (22 బంతుల్లో 34; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు)ను టాప్లీ అవుట్ చేసి 108 పరుగుల ఓపెనింగ్ జోడీని విడగొట్టాడు. క్లాసెన్ క్రీజులోకి రాగా... వైశాక్ 12వ ఓవర్లో మూడు ఫోర్లతో హెడ్ 39 బంతుల్లో శతకం పూర్తి చేసుకొని కాసేపటికే అవుటయ్యాడు. ఇక క్లాసెన్ వంతు! అప్పటిదాకా అడపాదడపా షాట్లతో 21 పరుగులు చేసిన క్లాసెన్ బాదే బాధ్యత తను తీసుకున్నాడు. లోమ్రోర్ 9 బంతులేసిన 14వ ఓవర్లో రెండు భారీ సిక్స్‌లు కొట్టాడు. తదుపరి వైశాక్ బౌలింగ్‌లో ఫోర్, సిక్స్ కొట్టి 23 బంతుల్లో ఫిఫ్టీ సాధించాడు. టాప్లీ, ఫెర్గూసన్‌ల వరుస ఓవర్లలో ఒక్కో సిక్స్‌తో విరుచుకుపడిన క్లాసెన్‌కు ఫెర్గూసన్ చెక్‌పెట్టాడు. క్రీజులో ఉన్న మార్క్రమ్ (17 బంతుల్లో 32నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు)కు అప్పుడే వచి్చన సమద్ (10 బంతుల్లో 37 నాటౌట్; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు) తోడయ్యాడు. వచ్చీ రాగానే టార్గెట్ తుఫాన్‌పై కదం తొక్కుతూ టాప్లీ వేసిన 19వ ఓవర్లో ఆడిన ఐదు బంతుల్ని 4, 4, 6, 6, 4లుగా బాదాడు. ఆఖరి ఓవర్లో మార్క్రమ్ 4, 6 కొడితే సమద్ మరో సిక్సర్ బాదాడు. 19వ ఓవర్లో 25, 20వ ఓవర్లో 21 పరుగులు హైదరాబాద్ గెలుపులో కీలకమయ్యాయి. బెంగళూరు తగ్గలేదు! ఎంతకొట్టినా ఎంతకీ కరగని లక్ష్యమని బెంగళూరు బెదిరిపోలేదు. ఆఖరి దాకా తగ్గేదే లే అన్నట్లుగా సన్‌రైజర్స్ ఫీల్డర్లను చెమటలు పట్టించింది. ఓపెనర్లు కోహ్లి (20 బంతుల్లో 42; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు), డుప్లెసిస్ కొండంత లక్ష్యానికి దీటైన ఆరంభం ఇచ్చారు. ఇద్దరు తొలి ఓవర్లో చెరో బౌండరీతో ఇన్నింగ్స్‌కు శ్రీకారం చుట్టారు. తర్వాత ఓవర్ ఓవర్‌కూ సిక్స్‌లు, ఫోర్లతో వేగాన్ని పెంచారు. భువీ నాలుగో ఓవర్లో ఇద్దరు చెరో 2 బౌండరీలతో 3.5 ఓవర్లోనే బెంగళూరు 50 దాటింది. నటరాజన్, కమిన్స్ ఓవర్లలో అవలీలగా ఫోర్లు, సిక్స్‌లు బాదడంతో పవర్‌ప్లేలో జట్టు 78/0 స్కోరు చేసింది. కోహ్లిని మార్కండే బౌల్డ్ చేయడంతో తొలిదెబ్బ తగిలింది. మరోవైపు డుప్లెసిస్ 24 బంతుల్లో అర్ధసెంచరీ సాధించాడు. కానీ విల్‌జాక్స్ (7) నాన్‌స్ట్రయిక్ ఎండ్‌లో దురదృష్టవశాత్తు రనౌటవడం, పటిదార్ (9)తో పాటు డుప్లెసిస్ స్వల్పవ్యవధిలో పెవిలియన్ చేరడం జట్టును వెనుకబడేలా చేసింది. అయితే పదో ఓవర్లో క్రీజులోకి వచి్చన దినేశ్ కార్తీక్ షాట్లతో విరుచుకుపడటంతో భారీ స్కోరు కాస్తా దిగి వస్తుండటంతో హైదరాబాద్ శిబిరం కాస్తా ఇబ్బంది పడింది. 23 బంతుల్లో కార్తీక్ ఫిఫ్టీ పూర్తిచేసుకున్నాడు. అయితే 12 బంతుల్లో 58 పరుగుల సమీకరణం కష్టసాధ్యం కావడంతో పాటు 19వ ఓవర్లో 6, 4 కొట్టిన కార్తీక్‌ను నటరాజన్ అవుట్ చేయడంతో పరాజయం ఖాయమైంది. 11, 12 ఓవర్లలో వరుసగా 5, 8 పరుగులే రావడం.... 15వ ఓవర్లో కమిన్స్... హిట్టర్ మహిపాల్ (11 బంతుల్లో 19; 2 సిక్స్‌లు)ను అవుట్ చేసి 6 పరుగులే ఇవ్వడం సన్‌రైజర్స్‌ను గట్టెక్కించింది. లేదంటే పరిస్థితి కచి్చతంగా మరోలా ఉండేది! స్కోరు వివరాలు సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్: అభిషేక్ (సి) ఫెర్గూసన్ (బి) టాప్లీ 34; హెడ్ (సి) డుప్లెసిస్ (బి) ఫెర్గూసన్ 102; క్లాసెన్ (సి) వైశాక్ (బి) ఫెర్గూసన్ 67; మార్క్రమ్ నాటౌట్ 32; సమద్ నాటౌట్ 37; ఎక్స్‌ట్రాలు 15; మొత్తం (20 ఓవర్లలో 3 వికెట్లకు) 287. వికెట్ల పతనం: 1–108. 2–165, 3–231. బౌలింగ్: విల్ జాక్స్ 3–0–32–0, టాప్లీ 4–0–68–1, యశ్ దయాళ్ 4–0–51–0, ఫెర్గూసన్ 4–0–52–2, వైశాక్ 4–0–64–0, మహిపాల్ 1–0–18–0. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్: కోహ్లి (బి) మార్కండే 42; డుప్లెసిస్ (సి) క్లాసెన్ (బి) కమిన్స్ 62; జాక్స్ రనౌట్ 7; పటిదార్ (సి) నితీశ్ (బి) మార్కండే 9; సౌరవ్ (ఎల్బీడబ్ల్యూ) (బి) కమిన్స్ 0; దినేశ్ కార్తీక్ (సి) క్లాసెన్ (బి) నటరాజన్ 83; మహిపాల్ (బి) కమిన్స్ 19; అనూజ్ నాటౌట్ 25; వైశాక్ నాటౌట్ 1; ఎక్స్‌ట్రాలు 14; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 262. వికెట్ల పతనం: 1–80, 2–100, 3–111, 4–121, 5–122, 6–181, 7–244. బౌలింగ్: అభిషేక్ 1–0–10–0, భువనేశ్వర్ 4–0–60–0, షహబాజ్ 1–0–18–0, నటరాజన్ 4–0–47–1, కమిన్స్ 4–0–43–3, మార్కండే 4–0–46–2, ఉనాద్కట్ 2–0–37–0. 287: ఐపీఎల్లో ఒక టీమ్ సాధించిన అత్యధిక స్కోరు. ఇదే సీజన్లో తాము చేసిన 277 స్కోరును సన్‌రైజర్స్ సవరించింది. ఓవరాల్‌గా టి20ల్లో ఇది రెండో అత్యధిక స్కోరు. ఆసియా క్రీడల్లో మంగోలియాపై నేపాల్ 314 పరుగులు చేసింది. 22: సన్‌రైజర్స్ సిక్సర్లు. గతంలో బెంగళూరు కొట్టిన 21 సిక్సర్ల రికార్డు బద్దలైంది. 4: హెడ్ చేసిన సెంచరీ (39 బంతుల్లో) ఐపీఎల్లో నాలుగో వేగవంతమైంది. గేల్ (30), యూసుఫ్ పఠాన్ (37), మిల్లర్ (38) ముందున్నారు. సన్‌రైజర్స్ తరఫున గతంలో వార్నర్ 43 బంతుల్లో సెంచరీ చేశాడు. 549: ఒక టి20ల్లో నమోదైన అత్యధిక పరుగులతో కొత్త రికార్డు. ఇదే సీజన్లో హైదరాబాద్, ముంబై మధ్య 523 పరుగులు నమోదయ్యాయి. ఐపీఎల్లో నేడు కోల్‌కతా X రాజస్తాన్ వేదిక: కోల్‌కతా రాత్రి 7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో సినిమా యాప్‌లో ప్రత్యక్ష ప్రసారం