జట్టుతో కొనసాగించనున్న సన్‌రైజర్స్
కమిన్స్, అభిషేక్‌లను కూడా
న్యూఢిల్లీ: ఐపీఎల్ గత సీజన్‌లో తన అద్భుత ఆటతో జట్టును ఫైనల్ వరకు చేర్చిన హెన్రిచ్ క్లాసెన్‌పై సన్‌రైజర్స్ హైదరాబాద్ నమ్మకముంచింది. వచ్చే సీజన్‌కూ అతడిని తమతో అట్టి పెట్టుకునేందుకు రైజర్స్ ఆసక్తి చూపిస్తోంది. ఇందు కోసం భారీగా రూ. 23 కోట్లు చెల్లించేందుకు కూడా టీమ్ మేనేజ్‌మెంట్ సిద్ధమైనట్లు సమాచారం. ఐపీఎల్ నిబంధనల ప్రకారం ఒక్కో టీమ్ గరిష్టంగా ఆరుగురు ఆటగాళ్లను కొనసాగించవచ్చు.
వీరిలో ఒకరైనా జాతీయ జట్టుకు ఆడని ‘అన్‌క్యాప్డ్’ ప్లేయర్ అయి ఉండాలి. ఈ ఆటగాళ్ల పేర్లను వెల్లడించేందుకు అక్టోబర్ 31 వరకు గవరి్నంగ్ కౌన్సిల్ గడువు ఇచి్చంది. ప్రతీ టీమ్ తాము కొనసాగించే తొలి ఐదుగురు ఆటగాళ్లకు వరుసగా రూ. 18 కోట్లు, రూ. 14 కోట్లు, రూ. 11 కోట్లు, రూ. 18 కోట్లు, రూ. 14 కోట్ల చొప్పున ఇవ్వాల్సి ఉంటుంది. ఆరో ఆటగాడు అన్‌క్యాప్డ్ అయితే రూ. 4 కోట్లు చెల్లించాలి.
అయితే తొలి ఐదుగురు ఆటగాళ్లకు కలిపి గరిష్ట పరిమితి అయిన రూ.75 కోట్ల నుంచి తమకు నచి్చన విధంగా ఖర్చు చేసుకునే స్వేచ్ఛ ఫ్రాంచైజీలకు ఉంది. ఈ నేపథ్యంలో కెపె్టన్ ప్యాట్ కమిన్స్‌కు రూ. 18 కోట్లు, ఓపెనర్ అభిషేక్ శర్మకు రూ. 14 కోట్లు ఇచ్చేందుకు రైజర్స్ సిద్ధంగా ఉంది. 2024 సీజన్‌లో క్లాసెన్ 15 ఇన్నింగ్స్‌లలో 171.07 స్ట్రయిక్‌రేట్‌తో 479 పరుగులు సాధించాడు. ఇందులో 19 ఫోర్లు, 38 సిక్స్‌లు ఉన్నాయి.
అభిõÙక్ 16 ఇన్నింగ్స్‌లలో 204.21 స్ట్రైక్‌రేట్‌తో 484 పరుగులు చేయగా... 36 ఫోర్లు, 42 సిక్స్‌లు బాదాడు. 2023 ఐపీఎల్‌కు ముందు మినీ వేలంలో క్లాసెన్‌ను సన్‌రైజర్స్ రూ. 5.25 కోట్లకు తీసుకొని తర్వాతి ఏడాది కొనసాగించింది. ఇప్పుడు అతనికి లభించే మొత్తం గతంతో పోలిస్తే ఏకంగా 338 శాతం ఎక్కువ కావడం విశేషం. ఈ ముగ్గురి కొనసాగింపు దాదాపు ఖరారు కాగా... నాలుగో, ఐదో ఆటగాళ్లుగా ట్రవిస్ హెడ్, నితీశ్ కుమార్ రెడ్డిలను కూడా అట్టి పెట్టుకోవాలని సన్‌రైజర్స్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment