PC: IPL/SRH
ఐపీఎల్-2024లో ఇప్పటికే ప్లే ఆఫ్స్‌లో అడుగుపెట్టిన సన్‌రైజర్స్ హైదరాబాద్ లీగ్ దశలో ఆఖరి మ్యాచ్ ఆడుతోంది. సొంత మైదానం ఉప్పల్‌లో పంజాబ్ కింగ్స్‌పై గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతోంది.
ఈ మ్యాచ్‌లో గనుక సన్‌రైజర్స్ భారీ తేడాతో గెలిచి.. తదుపరి మ్యాచ్లో కోల్‌కతా నైట్ రైడర్స్ రాజస్తాన్ రాయల్స్‌ను ఓడిస్తే ఏకంగా రెండో స్థానానికి చేరుకుంటుంది. ఇక ఆదివారం నాటి ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పంజాబ్ తొలుత బ్యాటింగ్ చేసింది.
ఓపెనర్లు అథర్వ టైడే(27 బంతుల్లో 46), ప్రభ్‌సిమ్రన్ సింగ్(45 బంతుల్లో 71) అద్భుత ఇన్నింగ్స్‌తో శుభారంభం అందించారు. ముఖ్యంగా ప్రభ్‌సిమ్రన్ సన్‌రైజర్స్ బౌలర్లకు కొరకరాని కొయ్యగా మారి ముప్పుతిప్పలు పెట్టాడు.
ఈ క్రమంలో 15వ ఓవర్లో బౌలింగ్‌కు దిగిన విజయకాంత్ వియస్కాంత్ రెండో బంతికి ప్రభ్‌సిమ్రన్‌ను ఊరించాడు. దీంతో షాట్ ఆడేందుకు ప్రయత్నించిన కనెక్ట్ కాలేదు. ఈ క్రమంలో వెంటనే స్పందించిన వికెట్ కీపర్ హెన్రిచ్ క్లాసెన్ ఒంటిచేత్తో బంతిని ఒడిసిపట్టాడు. దీంతో ప్రభ్‌సిమ్రన్ నిరాశగా పెవిలియన్ చేరాడు. అలా దురదృష్టకరరీతిలో ప్రభ్‌సిమ్రన్ అవుట్ కావడంతో పంజాబ్ ఫ్యాన్స్ నిరాశ చెందారు.
అయితే, ఈ మ్యాచ్‌లో ఓపెనర్లతో పాటు వన్‌డౌన్‌బ్యాటర్ రిలీ రొసో(49), కెప్టెన్ జితేశ్ శర్మ(15 బంతుల్లో 32 నాటౌట్) రాణించడంతో పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 214 పరుగులు చేసింది.
మరోవైపు.. లక్ష్య ఛేదనకు దిగిన ఆరెంజ్ ఆర్మీకి ఆరంభంలోనే షాకిచ్చాడు పంజాబ్ పేసర్ అర్ష్‌దీప్ సింగ్. అతడి దెబ్బకు రైజర్స్ విధ్వంసకర ఓపెనర్ ట్రవిస్ హెడ్(0) పరుగుల ఖాతా తెరవకుండానే బౌల్డ్ అయ్యాడు. ఇక వన్‌డౌన్ బ్యాటర్ రాహుల్ త్రిపాఠి(18 బంతుల్లో 33)ని హర్షల్ పటేల్ అవుట్ చేశాడు. దీంతో పవర్ ప్లేలో సన్‌రైజర్స్ రెండు వికెట్ల నష్టానికి 84 పరుగులు చేసింది.
Right wicket at the right time 😎
Prabhsimran's solid knock comes to an end courtesy of a Klaasy catch 💪
Watch the match LIVE on @JioCinema and @StarSportsIndia 💻📱#TATAIPL | #SRHvPBKS pic.twitter.com/a87LCfvi9g— IndianPremierLeague (@IPL) May 19, 2024
Comments
Please login to add a commentAdd a comment