Prabhsimran Singh
-
IPL 2025, KKR VS PBKS: చరిత్ర సృష్టించిన ప్రభ్‌సిమ్రన్ సింగ్
పంజాబ్ కింగ్స్ ఓపెనింగ్ బ్యాటర్ ప్రభ్‌సిమ్రన్ సింగ్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్లో 1000 పరుగులు పూర్తి చేసిన తొలి పంజాబ్ కింగ్స్ అన్ క్యాప్డ్ ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. నిన్న (ఏప్రిల్ 26) కేకేఆర్‌తో జరిగిన రద్దైన మ్యాచ్‌లో ఈ ఘనత సాధించాడు. కెరీర్ ప్రారంభం నుంచి (2019) పంజాబ్ కింగ్స్‌కే ఆడుతున్న ప్రభ్‌సిమ్రన్ ఇప్పటివరకు 43 మ్యాచ్‌లు ఆడి 151.88 స్ట్రయిక్‌రేట్‌తో 1048 పరుగులు చేశాడు. ఇందులో 5 హాఫ్ సెంచరీలు, ఓ సెంచరీ ఉన్నాయి. ఓవరాల్‌గా పంజాబ్ కింగ్స్ తరఫున 1000 పరుగులు పూర్తి చేసిన 10వ ఆటగాడిగా ప్రభ్‌సిమ్రన్ నిలిచాడు. ఈ ఫ్రాంచైజీ తరఫున యువరాజ్ సింగ్, శిఖర్ ధవన్‌కు కూడా 1000 పరుగుల మార్కును తాకలేదు. పంజాబ్ తరఫున అత్యధిక పరుగులు చేసిన రికార్డు కేఎల్ రాహుల్ పేరిట ఉంది. రాహుల్ 2018-2021 మధ్యలో 55 మ్యాచ్‌లు ఆడి 2548 పరుగులు చేశాడు.పంజాబ్ కింగ్స్ తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లు..కేఎల్ రాహుల్- 2548షాన్ మార్ష్- 2477డేవిడ్ మిల్లర్- 1974మయాంక్ అగర్వాల్- 1513మ్యాక్స్‌వెల్- 1431క్రిస్ గేల్- 1339సాహా- 1190మనన్ వోహ్రా- 1106మన్దీప్ సింగ్- 1073ప్రభ్‌సిమ్రన్ సింగ్- 1048కుమార సంగక్కర- 1009కాగా, నిన్న కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో సెంచరీకి చేరువలో (49 బంతుల్లో 83; 6 ఫోర్లు, 6 సిక్సర్లు) ఔటైన ప్రభ్‌సిమ్రన్ తన జట్టు భారీ స్కోర్ సాధించడంలో కీలకపాత్ర పోషించాడు. ఈ సీజన్లో ప్రభ్‌సిమ్రన్ ఓ మోస్తరు ఫామ్‌లో ఉన్నాడు. ఇప్పటివరకు ఆడిన 9 మ్యాచ్‌ల్లో 2 హాఫ్ సెంచరీ సాయంతో 292 పరుగులు చేశాడు.నిన్నటి మ్యాచ్‌లో ప్రభ్‌సిమ్రన్ సహా ప్రియాంశ్ ఆర్య (35 బంతుల్లో 69; 8 ఫోర్లు, 4 సిక్సర్లు) కూడా చెలరేగడంతో తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. పంజాబ్ ఇన్నింగ్స్‌లో శ్రేయస్ అయ్యర్ 25, జోస్ ఇంగ్లిస్ 11 (నాటౌట్) చేయగా.. మ్యాక్స్‌వెల్ (7) మరోసారి దారుణంగా విఫలమయ్యాడు. జన్సెన్ 7 బంతులు ఆడి కేవలం 3 పరుగులే చేసి ఔటయ్యాడు. కేకేఆర్ బౌలర్లలో వైభ్వ్ అరోరా 2 వికెట్లు తీయగా.. వరుణ్ చక్రవర్తి, రసెల్ తలో వికెట్ పడగొట్టారు. అనంతరం కేకేఆర్ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో తొలి ఓవర్ తర్వాత వర్షం మొదలైంది. వరుణుడు ఎంతకీ శాంతించకపోవడంతో మ్యాచ్‌ను రద్దు చేశారు. ఇరు జట్లకు చెరో పాయింట్ లభించింది. వర్షం ప్రారంభమయ్యే సమయానికి కేకేఆర్ స్కోర్ 7/0గా (ఒక ఓవర్లో) ఉంది. ఈ మ్యాచ్‌లో లభించిన పాయింట్‌తో పంజాబ్ పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి ఎగబాకింది. గుజరాత్, ఢిల్లీ, ఆర్సీబీ టాప్-3లో ఉన్నాయి. -
PBKS VS RCB: యువరాజ్ సింగ్‌ను అధిగమించిన ప్రభ్‌సిమ్రన్ సింగ్
ఐపీఎల్ 2025 సీజన్లో భాగంగా ఇవాళ (ఏప్రిల్ 20) జరుగుతున్న మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్, ఆర్సీబీ తలపడుతున్నాయి. పంజాబ్ హోం గ్రౌండ్ ముల్లాన్‌పూర్ వేదికగా ఈ మ్యాచ్ జరుగుతుంది. పంజాబ్, ఆర్సీబీ రెండు రోజుల కిందటే బెంగళూరులో తలపడ్డాయి. ఆ మ్యాచ్‌లో ఆర్సీబీ చిత్తుగా ఓడింది.ఇవాళ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకున్న ఆర్సీబీ కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తుంది. కృనాల్ పాండ్యా (4-0-25-2), సుయాశ్ శర్మ (4-0-26-2), రొమారియో షెపర్డ్ (2-0-18-1) చెలరేగడంతో పంజాబ్ 18 ఓవర్ల తర్వాత 6 వికెట్ల నష్టానికి 140 పరుగులు చేసింది. ప్రియాన్ష్ ఆర్య 22, ప్రభ్‌సిమ్రన్ సింగ్ 33, శ్రేయస్ అయ్యర్ 6, జోస్ ఇంగ్లిస్ 29, నేహల్ వధేరా 5, స్టోయినిస్ 1 పరుగు చేసి ఔట్ కాగా.. శశాంక్ సింగ్ 25, జన్సెన్ 14 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు.ఈ మ్యాచ్‌లో పంజాబ్ ఓపెనర్ ప్రభ్‌సిమ్రన్ సింగ్ ఆ ఫ్రాంచైజీ దిగ్గజ ఆటగాడు యువరాజ్ సింగ్ రికార్డును అధిగమించాడు. యువరాజ్ పంజాబ్ కింగ్స్ తరఫున 959 పరుగులు (51 మ్యాచ్‌ల్లో) చేయగా.. ఈ మ్యాచ్‌లో ప్రభ్‌సిమ్రన్ యువీ పరుగుల సంఖ్యను దాటేశాడు. ప్రభ్‌సిమ్రన్ పంజాబ్ తరఫున 42 మ్యాచ్‌ల్లోనే 965 పరుగులు చేశాడు. సగటు, స్ట్రయిక్రేట్లోనూ ప్రభ్‌సిమ్రన్ యువరాజ్ కంటే మెరుగ్గా ఉన్నాడు. పంజాబ్ తరఫున యువీ యావరేజ్ 22.30గా ఉండగా.. ప్రభ్‌సిమ్రన్ యావరేజ్ 22.97గా ఉంది. యువీ స్ట్రయిక్‌రేట్ 127.86గా ఉండగా.. ప్రభ్‌సిమ్రన్ స్ట్రయిక్‌రేట్ 150.55గా ఉంది.టాప్‌లో కేఎల్ రాహుల్.. 12వ స్థానంలో ప్రభ్సిమ్రన్ఐపీఎల్లో పంజాబ్ ఫ్రాంచైజీ తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కేఎల్ రాహుల్ (2548) ఉన్నాడు. అతడి తర్వాత షాన్ మార్ష్ (2477), డేవిడ్ మిల్లర్ (1974), మయాంక్ అగర్వాల్ (1513), మ్యాక్స్‌వెల్ (1424), క్రిస్ గేల్ (1339), వృద్దిమాన్ సాహా (1190), మనన్ వోహ్రా (1106), మన్దీప్ సింగ్ (1073), కుమార సంగక్కర (1009), శిఖర్ ధవన్ (985) ఉన్నారు. ప్రభ్‌సిమ్రన్ ప్రస్తుతం పంజాబ్ తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో 12వ స్థానంలో ఉన్నాడు.ప్రభ్‌సిమ్రన్ ప్రస్తానం ఇలా..2019 సీజన్లో ఐపీఎల్ అరంగేట్రం చేసిన ప్రభ్‌సిమ్రన్ 2023, 2024 సీజన్లలో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. 2023 సీజన్లో 14 మ్యాచ్‌ల్లో 358 పరుగులు చేసిన ప్రభ్‌సిమ్రన్.. 2024 సీజన్లోనూ 14 మ్యాచ్‌ల్లో 334 పరుగులు చేశాడు. ప్రభ్‌సిమ్రన్ 2023 సీజన్లో ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో సెంచరీ చేసి వెలుగులోకి వచ్చాడు. ఈ సీజన్ మెగా వేలానికి ముందు పంజాబ్ ప్రభ్‌సిమ్రన్‌ను రూ. 4 కోట్లకు రీటైన్ చేసుకుంది. ప్రస్తుత సీజన్లో ప్రభ్‌సిమ్రన్ ఓ మోస్తరు ప్రదర్శనలు చేస్తూ పంజాబ్‌కు శుభారంభాలు అందిస్తున్నాడు.ఈ సీజన్లో పంజాబ్ ఇప్పటివరకు ఆడిన 7 మ్యాచ్‌ల్లో 5 విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో కొనసాగుతుంది. గుజరాత్, ఢిల్లీ మొదటి రెండు స్థానాల్లో ఉన్నాయి. -
పంజాబ్ కింగ్స్ ఫాస్టెస్ట్ ఫిప్టీ.. కేవలం 17 బంతుల్లోనే
ఐపీఎల్-2025లో ఉప్పల్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ ఓపెనర్లు ప్రభు సిమ్రాన్ సింగ్, ప్రియాన్ష్ ఆర్య విధ్వంసం సృష్టించారు. ఇన్నింగ్స్ తొలి ఓవర్ నుంచే బౌండరీల వర్షం కురిపించారు. మహ్మద్ షమీ, ప్యాట్ కమ్మిన్స్ వంటి వరల్డ్ క్లాస్ బౌలర్లను ఊతికారేశారు.ఈ క్రమంలో పంజాబ్ కింగ్స్ కేవలం 3 ఓవర్లలోనే 50 పరుగులను క్రాస్ చేసింది. తద్వారా ఈ ఏడాది ఐపీఎల్ సీజన్లో ఫాస్టెస్ట్ ఫిప్టీ చేసిన టీమ్‌గా ఆర్సీబీ సరసన పంజాబ్ నిలిచింది. ఆర్సీబీ కూడా ఢిల్లీ క్యాపిటల్స్‌పై కేవలం 18 బంతుల్లోనే హాఫ్ సెంచరీని అందుకుంది. అయితే ఓవరాల్‌గా ఐపీఎల్ చరిత్రలో ఫాస్టెస్ట్ ఫిప్టీ చేసిన రికార్డు కూడా పంజాబ్ కింగ్స్ పేరిటే ఉంది. 2011 ఐపీఎల్ సీజన్లో రాజస్తాన్ రాయల్స్‌పై పంజాబ్ కేవలం 2.5 ఓవర్లలోనే 50 పరుగులను అందుకుంది. ఇక ప్రస్తుత మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ పవర్ ప్లేలో వికెట్ నష్టానికి 89 పరుగులు చేసింది. ఈ ఏడాది సీజన్లో ఇదే అత్యధిక పవర్ ప్లే స్కోర్ కావడం గమనార్హం. కాగా ఈ మ్యాచ్‌లో ఆర్య(13 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్‌లతో 36), ఫ్రబ్ సిమ్రాన్ సింగ్(23 బంతుల్లో 7 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 42) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడి ఔటయ్యారు. అయితే ఈ ఏడాది సీజన్ మొత్తం ఒకే ఆటతీరుతో పంజాబ్ దూసుకుపోతుంది.చదవండి: IPL 2025: సెన్సేషనల్ సుదర్శన్.. ఆరు మ్యాచ్‌లలో 4 హాఫ్ సెంచరీలు -
పంజాబ్ ఫటాఫట్
లక్నో: కొత్త కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఆధ్వర్యంలో ఐపీఎల్ 18వ సీజన్లో అడుగు పెట్టిన పంజాబ్ కింగ్స్ వరుసగా రెండో విజయం సాధించింది. లక్నో సూపర్ జెయింట్స్ జట్టుతో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ ఎనిమిది వికెట్ల తేడాతో ఘనవిజయాన్ని అందుకుంది. 172 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్ 16.2 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 177 పరుగులు సాధించి గెలిచింది. 171 వద్ద స్కోరు సమమైనపుడు లక్నో బౌలర్ అబ్దుల్ సమద్ వేసిన బంతిని కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (30 బంతుల్లో 52 నాటౌట్; 3 ఫోర్లు, 4 సిక్స్‌లు) సిక్స్‌గా మలిచి పంజాబ్ కింగ్స్‌ను విజయతీరానికి చేర్చాడు. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ ప్రభ్‌సిమ్రన్ సింగ్ (34 బంతుల్లో 69; 9 ఫోర్లు, 3 సిక్స్‌లు) లక్నో బౌలర్ల భరతం పట్టి మెరుపు అర్ధసెంచరీతో అలరించాడు. ప్రభ్‌సిమ్రన్ అవుటయ్యాక వచ్చిన నేహల్ వధేరా (25 బంతుల్లో 43 నాటౌట్; 3 ఫోర్లు, 4 సిక్స్‌లు) కూడా దూకుడుగా ఆడటంతో పంజాబ్ ఆడుతూ పాడుతూ లక్ష్యాన్ని అందుకుంది. అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన రిషభ్ పంత్ సారథ్యంలోని లక్నో జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 171 పరుగులు సాధించింది. అర్ష్ దీప్ సింగ్ (3/43) మూడు కీలక వికెట్టు పడగొట్టగా... మ్యాక్స్‌వెల్, ఫెర్గూసన్, యాన్సెన్, చహల్‌లకు ఒక్కో వికెట్ దక్కింది. లక్నో జట్టుకు ఆశించిన ఆరంభం దక్కలేదు. పవర్‌ప్లే ఆరు ఓవర్లు ముగిసేసరికి లక్నో టాప్–3 బ్యాటర్లను కోల్పోయింది. మిచెల్ మార్ష్ (0) ఖాతా తెరవకుండానే వెనుదిరగ్గా... పంత్ 2 పరుగులతో నిరాశపరిచాడు. క్రీజులో నిలదొక్కుకున్న దశలో మార్క్రమ్ను ఫెర్గూసన్ బౌల్డ్ చేశాడు. ఆ తర్వాత పూరన్ (30 బంతుల్లో 44; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు), ఆయుశ్ బదోని (33 బంతుల్లో 41; 1 ఫోర్, 3 సిక్స్‌లు) ఆటతో లక్నో స్కోరు 100 దాటింది. చివర్లో సమద్ (12 బంతుల్లో 27; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) మెరిపించడంతో లక్నో జట్టు ప్రత్యర్థి కి గౌరవప్రద లక్ష్యాన్ని నిర్దేశించింది. ఛేజింగ్‌లో ఆరంభంలోనే ఆర్య వికెట్ కోల్పోయినా పంజాబ్ వెనక్కి తగ్గలేదు. లక్నో బౌలర్లపై ప్రభ్‌సిమ్రన్, అయ్యర్ ఎదురుదాడికి దిగి స్కోరు బోర్డును పరుగెత్తించారు. ముఖ్యంగా ప్రభ్‌సిమ్రన్ కళ్లు చెదిరే షాట్లతో అలరించాడు. శార్దుల్ వేసిన ఇన్నింగ్స్ తొలి ఓవర్లో 4,6 కొట్టిన ప్రభ్‌సిమ్రన్... రవి బిష్ణోయ్ వేసిన ఆరో ఓవర్లో 4,4,6తో మెరిశాడు. అదే జోరులో 23 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇన్నింగ్స్‌లో 11వ ఓవర్ తొలి బంతికి ప్రభ్‌సిమ్రన్ ఇన్నింగ్స్‌కు తెరపడింది. దిగ్వేశ్ వేసిన బంతిని డీప్ మిడ్‌వికెట్ వైపు ప్రభ్‌సిమ్రన్ షాట్ ఆడగా... ఆయుశ్ బదోని క్యాచ్ తీసుకొని బౌండరీ లైను వద్ద బ్యాలెన్స్ కోల్పోయి బంతిని గాల్లోకి విసిరాడు. డీప్ స్క్వేర్ లెగ్ వద్ద నుంచి వచ్చిన రవి బిష్ణోయ్ గాల్లో ఉన్న బంతిని పట్టుకోవడంతో ప్రభ్‌సిమ్రన్ పెవిలియన్ చేరుకున్నాడు. ప్రభ్‌సిమ్రన్ వెనుదిరిగాక వచ్చిన నేహల్ కూడా బ్యాట్ ఝుళిపించడంతో పంజాబ్ 17వ ఓవర్లోనే విజయాన్ని అందుకుంది. స్కోరు వివరాలు లక్నో సూపర్ జెయింట్స్ ఇన్నింగ్స్: మార్క్రమ్ (బి) ఫెర్గూసన్ 28; మిచెల్ మార్ష్ (సి) యాన్సెన్ (బి) అర్ష్ దీప్ సింగ్ 0; నికోలస్ పూరన్ (సి) మ్యాక్స్‌వెల్ (బి) చహల్ 44; రిషభ్ పంత్ (సి) చహల్ (బి) మ్యాక్స్‌వెల్ 2; ఆయుశ్ బదోని (సి) మ్యాక్స్‌వెల్ (బి) అర్ష్ దీప్ సింగ్ 41; డేవిడ్ మిల్లర్ (సి) ప్రభ్‌సిమ్రన్ సింగ్ (బి) యాన్సెన్ 19; అబ్దుల్ సమద్ (సి) ఆర్య (బి) అర్ష్ దీప్ సింగ్ 27; శార్దుల్ ఠాకూర్ (నాటౌట్) 3; అవేశ్ ఖాన్ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 171. వికెట్ల పతనం: 1–1, 2–32, 3–35, 4–89, 5–119, 6–166, 7–167. బౌలింగ్: అర్ష్ దీప్ సింగ్ 4–0–43–3, ఫెర్గూసన్ 3–0–26–1, మ్యాక్స్‌వెల్ 3–0–22–1, మార్కో యాన్సెన్ 4–0–28–1, స్టొయినిస్ 2–0–15–0, యుజువేంద్ర చహల్ 4–0–36–1. పంజాబ్ కింగ్స్ ఇన్నింగ్స్: ప్రియాంశ్ ఆర్య (సి) శార్దుల్ ఠాకూర్ (బి) దిగ్వేశ్ రాఠి 8; ప్రభ్‌సిమ్రన్ సింగ్ (సి) రవి బిష్ణోయ్ (బి) దిగ్వేశ్ రాఠి 69; శ్రేయస్ అయ్యర్ (నాటౌట్) 52; నేహల్ వధేరా (నాటౌట్) 43; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (16.2 ఓవర్లలో 2 వికెట్లకు) 177. వికెట్ల పతనం: 1–26, 2–110. బౌలింగ్: శార్దుల్ ఠాకూర్ 3–0–39–0, అవేశ్ ఖాన్ 3–0–30–0, దిగ్వేశ్ రాఠి 4–0–30–2, రవి బిష్ణోయ్ 3–0–43–0, మణిమారన్ సిద్ధార్థ్ 3–0–28–0, అబ్దుల్ సమద్ 0.2–0–6–0. ఐపీఎల్లో నేడుబెంగళూరు X గుజరాత్వేదిక: బెంగళూరురాత్రి 7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం -
యజమానులు ఎవరైనా.. జట్టు మాత్రం నాదే: రిక్కీ పాంటింగ్
ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-2025లో సరికొత్త పంజాబ్ కింగ్స్(Punjab Kings)ను చూస్తారని హెడ్‌కోచ్ రిక్కీ పాంటింగ్(Ricky Ponting) అన్నాడు. వేలం విషయంలో ఫ్రాంఛైజీ యజమాన్యం తనకు పూర్తి స్వేచ్ఛనిచ్చిందని.. అందుకే తన వ్యూహాలను పక్కాగా అమలు చేయగలిగినట్లు తెలిపాడు. కోరుకున్న ఆటగాళ్లను దక్కించుకోవడంలో తాము సఫలమయ్యామన్నాడు.ఇక మైదానంలో మెరుగైన ఫలితాలు సాధించడంపైనే ప్రస్తుతం తన దృష్టి మొత్తం కేంద్రీకృతమై ఉన్నట్లు రిక్కీ పాంటింగ్ పేర్కొన్నాడు. కాగా ఈ ఆస్ట్రేలియా దిగ్గజానికి ఐపీఎల్‌తో గత పదేళ్లుగా అనుబంధం ఉంది.ఢిల్లీ క్యాపిటల్స్‌తో ఏడేళ్లుఢిల్లీ క్యాపిటల్స్(Delhi Capitals) ప్రాంఛైజీకి అత్యధికంగా ఏడేళ్లు అతడు హెడ్‌కోచ్‌గా పనిచేశాడు. 2018- 2024 వరకు అతడి మార్గదర్శనంలో ఢిల్లీ జట్టు మిశ్రమ ఫలితాలు అందుకుంది. అయితే, అత్యుత్తమంగా 2020లో ఫైనల్‌కు చేరింది. కానీ రన్నరప్‌తోనే సరిపెట్టుకుంది. ఇక అంతకు ముందు 2019లో.. ఆ తర్వాత 2021లో ప్లే ఆఫ్స్ వరకు చేరగలిగింది.కానీ 2022-2024 వరకు ఒక్కసారి కూడా టాప్-4లోనూ అడుగుపెట్టలేకపోయింది. ఈ నేపథ్యంలో ఢిల్లీ యాజమాన్యం రిక్కీ పాంటింగ్‌తో తమకున్న సుదీర్ఘ అనుబంధాన్ని తెంచుకుంది. అనంతరం.. పంజాబ్ కింగ్స్ పాంటింగ్‌ను తమ కుటుంబంలోకి ఆహ్వానించి ప్రధాన కోచ్‌గా నియమించింది.చెత్త రికార్డుతో పంజాబ్ఇక ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్‌కు ఉన్న చెత్త రికార్డు గురించి తెలిసిందే. క్యాష్ రిచ్ లీగ్ ఆరంభ ఎడిషన్(2008) నుంచి ఇప్పటిదాకా కేవలం రెండుసార్లే ప్లే ఆఫ్స్ చేరింది. ఆఖరి నిమిషంలో చేతులెత్తేసి మ్యాచ్‌లు చేజార్చుకున్న సందర్భాలు కోకొల్లలు. అయితే, ఈసారి మాత్రం పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్లాలనే ఆలోచనతో పాంటింగ్‌ను రంగంలోకి దింపింది.ఈ నేపథ్యంలో పంజాబ్ కింగ్స్ యాజమాన్యం గురించి రిక్కీ పాంటింగ్ హెవీ గేమ్స్ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘వేలానికి ముందు మేము అన్ని రకాలుగా చర్చించుకున్నాం. అంతా అనుకున్నట్లే జరిగినందుకు నాకు సంతోషంగా ఉంది.యజమానులు వాళ్లే అయినా.. జట్టు పూర్తిగా నాదేఇక ఇప్పటి నుంచి ఫ్రాంఛైజీ యజమానులు ఎవరైనా సరే.. జట్టు మాత్రం పూర్తిగా నా చేతుల్లో ఉంటుంది. జట్టు గత చరిత్ర గురించి నేను చాలా విషయాలు విన్నాను. ఇకపై అందుకు భిన్నంగా ఉండాలంటే నాకు స్వేచ్ఛ కావాలని అడిగాను. అందుకు ఓనర్లు కూడా అంగీకరించారు. ఫ్రాంఛైజీ యజమానులతో పాటు అడ్మినిస్ట్రేటర్లు, బోర్డు డైరెక్టర్లు.. ఇలా ప్రతి ఒక్కరికి నా కార్యచరణ గురించి వివరించాను. నా శైలిలో జట్టును ముందుకు తీసుకువెళ్తాను. ముఖ్యంగా భారత క్రికెటర్లపై మేము ఎక్కువగా దృష్టి పెట్టాము. వారి రాక మాకు శుభారంభం లాంటిదే’’ అని రిక్కీ పాంటింగ్ పేర్కొన్నాడు.రికార్డు ధరకు అయ్యర్‌ను కొనికాగా ఐపీఎల్-2025 మెగా వేలంలో పంజాబ్ కింగ్స్ రికార్డు స్థాయిలో .. టీమిండియా స్టార్ శ్రేయస్ అయ్యర్ కోసం ఏకంగా రూ. 26.75 కోట్లు ఖర్చుపెట్టింది. గత సీజన్లో కోల్‌కతా నైట్ రైడర్స్‌కు టైటిల్ అందించిన ఈ విన్నింగ్ కెప్టెన్‌ను తమ సారథిగా నియమించింది. అంతేకాదు.. వేలానికి ముందు ప్రభ్‌సిమ్రన్ సింగ్, శశాంక్ సింగ్‌లను మాత్రమే రిటైన్ చేసుకున్న పంజాబ్.. వేలంలో మరో టీమిండియా స్టార్ స్పిన్నర్ యజువేంద్ర చహల్‌ను రూ. 18 కోట్లకు కొనుగోలు చేసింది. ఇక పంజాబ్ జట్టుకు నెస్ వాడియా, ప్రీతి జింటా సహ యజమానులు అన్న విషయం తెలిసిందే.చదవండి: అతడికి ఇదే చివరి ఐసీసీ టోర్నీ.. టీమిండియా గెలిస్తే చరిత్రే: సురేశ్ రైనా -
భీకర ఫామ్‌లో ప్రభ్‌సిమ్రన్ సింగ్-అభిషేక్ శర్మ.. 644 పరుగులతో..
దేశవాళీ వన్డే టోర్నమెంట్ విజయ్ హజారే ట్రోఫీ 2024-25 సీజన్లో పంజాబ్ ఓపెనర్లు ప్రభ్‌సిమ్రన్ సింగ్(Prabhsimran Singh)- అభిషేక్ శర్మ(Abhishek Sharma) దుమ్ములేపుతున్నారు. అద్బుత బ్యాటింగ్‌తో ప్రత్యర్థి జట్ల బౌలింగ్‌ను ఊచకోత కోస్తూ పరుగుల వరద పారిస్తున్నారు. ఈ క్రమంలో ఇటీవలే లిస్ట్-‘ఎ’ క్రికెట్లో ఈ ఓపెనింగ్ జోడీ అరుదైన రికార్డు సాధించింది.సౌరాష్ట్రతో మ్యాచ్ సందర్భంగా తొలి వికెట్‌కు 298 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన అభిషేక్- ప్రభ్‌సిమ్రన్.. విజయ్ హజారే ట్రోఫీ(Vijay Hazare trophy)లో మొదటి వికెట్‌కు అత్యధిక పరుగులు జోడించిన రెండో జంటగా నిలిచారు. ఇక తాజాగా హైదరాబాద్‌తో శుక్రవారం నాటి మ్యాచ్‌లోనూ ఈ జోడీ ధనాధన్ దంచికొట్టింది.మళ్లీ శతక్కొట్టాడు!అహ్మదాబాద్ వేదికగా హైదరాబాద్ జట్టు టాస్ గెలిచి పంజాబ్‌ను తొలుత బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఈ క్రమంలో ప్రభ్‌సిమ్రన్ సింగ్ మెరుపు శతకం బాదగా.. కెప్టెన్ అభిషేక్ శర్మ సెంచరీకి ఏడు పరుగుల దూరంలో నిలిచిపోయాడు. కాగా ప్రభ్‌సిమ్రన్ 105 బంతుల్లో ఏకంగా 20 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 137 పరుగులు చేశాడు. అభిషేక్ 72 బంతులు ఎదుర్కొని ఏడు ఫోర్లు, ఆరు సిక్స్‌లు బాది 93 రన్స్ చేశాడు. ఇద్దరూ కలిసి 145 బంతుల్లో 196 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు.426 పరుగుల భారీ స్కోరుమిగిలిన బ్యాటర్లలో అన్మోల్ప్రీత్ సింగ్(46), రమణ్‌దీప్ సింగ్(80), నేహాల్ వధేరా(35 నాటౌట్), నమన్ ధీర్(14 నాటౌట్) రాణించారు. ఫలితంగా నిర్ణీత 50 ఓవర్లలో పంజాబ్ జట్టు కేవలం నాలుగు వికెట్లు నష్టపోయి ఏకంగా 426 పరుగుల భారీ స్కోరు సాధించింది.అత్యధిక పరుగుల వీరుడిగాహైదరాబాద్ బౌలర్లలో ముదస్సిర్, శరణు నిశాంత్, అనికేత్ రెడ్డి, తనయ్ త్యాగరాజన్ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు. ఇదిలా ఉంటే.. హైదరాబాద్‌తో మ్యాచ్‌లో శతక్కొట్టిన ప్రభ్‌సిమ్రన్ సింగ్ విజయ్ హజారే ట్రోఫీ తాజా ఎడిషన్‌లో అత్యధిక పరుగుల వీరుడిగా అవతరించాడు. ఇప్పటి వరకు ఆరు మ్యాచ్‌లు ఆడి సగటున 473 పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఇందులో మూడు శతకాలు ఉన్నాయి. అత్యధిక స్కోరు 150 నాటౌట్. మరోవైపు.. పంజాబ్ సారథి అభిషేక్ శర్మ ఒక సెంచరీ, రెండు ఫిఫ్టీల సాయంతో 397 పరుగులు సాధించాడు. అత్యధిక స్కోరు 170. ఏకంగా 644 పరుగులుఇక ఈ ప్రదర్శనలతో.. ఇంగ్లండ్‌తో స్వదేశంలో టీమిండియా పరిమిత ఓవర్ల సిరీస్‌కు ముందు ప్రభ్‌సిమ్రన్ సింగ్- అభిషేక్ శర్మ భారత సెలక్టర్లకు గట్టి సందేశం పంపించినట్లయింది. భీకర ఫామ్‌లో ఉన్న టీమిండియా ఆటగాడు అభిషేక్ శర్మ ఇంగ్లండ్‌తో టీ20లలో ఆడటం ఖాయంగానే అనిపిస్తున్నా.. ఈసారైనా ప్రభ్‌సిమ్రన్‌ను సెలక్టర్లు కనికరిస్తారేమో చూడాలి!కాగా విజయ్ హజారే ట్రోఫీలో గత మూడు మ్యాచ్‌లలో కలిపి ప్రభ్‌సిమ్రన్ సింగ్- అభిషేక్ శర్మ జోడీ ఏకంగా 644 పరుగులు(150, 298, 196) సాధించడం విశేషం. ఇక ప్రస్తుతం ఆస్ట్రేలియాతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీతో బిజీగా ఉన్న టీమిండియా తదుపరి సొంతగడ్డపై ఇంగ్లండ్‌తో టీ20, వన్డే సిరీస్‌లు ఆడనుంది.చదవండి: కొన్‌స్టాస్ ఓవరాక్షన్.. బుమ్రా ఆన్ ఫైర్!.. నాతో పెట్టుకుంటే ఇలాగే ఉంటది! -
అభిషేక్ శర్మ, ప్రభ్‌సిమ్రన్ ఊచకోత.. విధ్వంసకర శతకాలతో రికార్డు
టీమిండియా యువ ఓపెనర్, పంజాబ్ కెప్టెన్ అభిషేక్ శర్మ(Abhishek Sharma) విధ్వంసకర శతకంతో మెరిశాడు. సౌరాష్ట్ర బౌలింగ్‌ను చీల్చి చెండాడుతూ ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపించాడు. అభిషేక్‌తో పాటు మరో ఓపెనర్ ప్రభ్‌సిమ్రన్ సింగ్(Prabhsimran Singh) కూడా ఆకాశమే హద్దుగా చెలరేగి.. శతక్కొట్టాడు. ఈ క్రమంలో అభిషేక్- ప్రభ్‌సిమ్రన్ జోడీ విజయ్ హజారే ట్రోఫీ(Vijay Hazare Trophy 2024-25- వీహెచ్‌టీ)లో సరికొత్త రికార్డు సాధించింది.కాగా దేశవాళీ వన్డే టోర్నమెంట్ వీహెచ్‌టీలో భాగంగా పంజాబ్ మంగళవారం నాటి మ్యాచ్‌లో సౌరాష్ట్ర జట్టుతో తలపడుతోంది. అహ్మదాబాద్‌లోని గుజరాత్ కాలేజ్ గ్రౌండ్లో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన సౌరాష్ట్ర తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్‌కు ఓపెనర్లు అభిషేక్ శర్మ, ప్రభ్‌సిమ్రన్ సింగ్ అదిరిపోయే ఆరంభం అందించారు.అరవై బంతుల్లోనేఅభిషేక్ శర్మ అరవై బంతుల్లోనే వంద పరుగుల మార్కు అందుకున్నాడు. మొత్తంగా 96 బంతులు ఎదుర్కొని 22 ఫోర్లు, 8 సిక్సర్ల సాయంతో 170 పరుగులు సాధించాడు. మరో ఎండ్ నుంచి అభిషేక్‌కు సహకారం అందించిన ప్రభ్‌సిమ్రన్ సింగ్.. 95 బంతుల్లో 125 పరుగులతో చెలరేగాడు. అతడి ఇన్నింగ్స్‌లో 11 ఫోర్లు, 8 సిక్సర్లు ఉండటం విశేషం.అరుదైన రికార్డుఈ క్రమంలో అభిషేక్ శర్మ- ప్రభ్‌సిమ్రన్ కలిసి తొలి వికెట్‌కు 298 పరుగుల రికార్డు భాగస్వామ్యం నెలకొల్పారు. తద్వారా విజయ్ హజారే ట్రోఫీ చరిత్రలో తొలి వికెట్‌కు అత్యధిక పరుగులు(highest first-wicket partnership) జోడించిన రెండో జంటగా నిలిచారు. బెంగాల్ బ్యాటర్లు సుదీప్ ఘరామి- అభిమన్యు ఈశ్వరన్ 2022లో సాధించిన రికార్డును సమం చేశారు.వీరిది మాత్రం ప్రపంచ రికార్డుఇక ఈ టోర్నీలో తొలి వికెట్‌కు అత్యధికంగా 416 పరుగులు జతచేసిన జోడీ తమిళనాడు స్టార్లు నారాయణ్ జగదీశన్, బి. సాయి సుదర్శన్ టాప్‌లో కొనసాగుతున్నారు. కేవలం విజయ్ హజారే ట్రోఫీలోనే కాకుండా లిస్ట్- ‘ఎ’ క్రికెట్లో హయ్యస్ట్ పార్ట్నర్షిప్ సాధించిన జంటగా వీరు ప్రపంచ రికార్డు కూడా సాధించారు.300 పైచిలుకు స్కోరుఇదిలా ఉంటే..ప్రణవ్ కరియా బౌలింగ్‌లో జే గోహిల్‌కు క్యాచ్ ఇవ్వడంతో ప్రభ్‌సిమ్రన్ సింగ్ తొలి వికెట్‌గా వెనుదిరిగాడు. ఇక మరోసారి ప్రణవ్ కరియా తన స్పిన్ మాయాజాలం ప్రదర్శించగా.. రుచిత్ అహిర్‌కు క్యాచ్ ఇచ్చి అభిషేక్ శర్మ రెండో వికెట్‌గా వెనుదిరిగాడు. ఇక అభిషేక్- ప్రభ్‌సిమ్రన్ సింగ్ ఊచకోత కారణంగా పంజాబ్ కేవలం 34 ఓవర్లలోనే 300 పరుగుల మార్కు దాటింది.వరుస విజయాలకు కర్ణాటక బ్రేక్కాగా విజయ్ హజారే ట్రోఫీ 2024-25 సీజన్లో పంజాబ్ తొలి మ్యాచ్‌లో అరుణాచల్ ప్రదేశ్‌పై తొమ్మిది వికెట్ల తేడాతో గెలిచింది. తదుపరి నాగాలాండ్‌ను ఐదు వికెట్ల తేడాతో ఓడించింది. అనంతరం కర్ణాటకతో ఆఖరి వరకు ఉత్కంఠగా సాగిన పోరులో ఒక్క వికెట్ తేడాతో ఓటమిపాలైంది. ఆ తర్వాత ముంబైని ఎనిమిది వికెట్ల తేడాతో చిత్తు చేసి మళ్లీ విజయాల బాట పట్టింది. తాజాగా సౌరాష్ట్రతో మ్యాచ్‌లోనూ గెలుపొంది గ్రూప్-‘సి’లో మరింత పటిష్ట స్థితికి చేరాలని పట్టుదలగా ఉంది.చదవండి: టెస్టులకు రోహిత్ శర్మ గుడ్‌బై!?.. ప్రకటనకు రంగం సిద్ధం! -
పంజాబ్ ఓపెనర్ విధ్వంసం.. 14 ఫోర్లు, 10 సిక్స్‌లతో
విజయ్ హజారే ట్రోఫీ-2024లో వరుస విజయాలతో దూసుకుపోతున్న ముంబై జట్టుకు పంజాబ్ ఊహించని షాకిచ్చింది. ఈ టోర్నీలో భాగంగా అహ్మదాబాద్ వేదికగా ముంబైతో జరిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో పంజాబ్ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై 48.5 ఓవర్లలో 248 పరుగులకు ఆలౌటైంది.పంజాబ్ పేసర్ అర్ష్‌దీప్ సింగ్ 5 వికెట్లతో ముంబైను దెబ్బతీశాడు. శ్రేయస్ అయ్యర్, శివమ్ దూబే వంటి కీలక వికెట్లను అర్షదీప్ తన ఖాతాలో వేసుకున్నాడు. ముంబై బ్యాటర్లలో అంకోలేకర్(66) టాప్ స్కోరర్‌గా నిలవగా.. సూర్యన్ష్ షెగ్దే(44), శార్ధూల్ ఠాకూర్(43) రాణించారు.ప్రభసిమ్రాన్ ఊచకోత..అనంతరం 249 పరుగుల లక్ష్య చేధనలో ప్రభసిమ్రాన్ సింగ్ అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. ప్రత్యర్ధి బౌలర్లను ప్రభసిమ్రాన్ ఊచకోత కోశాడు. కేవలం 101 బంతుల్లో 14 ఫోర్లు, 10 సిక్స్‌లతో 150 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు.అతడితో పాటు అభిషేక్ శర్మ(66) హాఫ్ సెంచరీతో రాణించాడు. ముంబై బౌలర్లలో శార్ధూల్ ఠాకూర్, అయూష్ మాత్రే తలా రెండు వికెట్లు సాధించారు. కాగా ఐపీఎల్-2025కు ముందు ప్రభసిమ్రాన్ సింగ్‌ను పంజాబ్ కింగ్స్ రిటైన్ చేసుకుంది.చదవండి: 'భారత క్రికెట్ చరిత్రలో ఇదే మొదటి సారి'.. రోహిత్‌పై ఎమ్ఎస్కే ఫైర్ -
Ind vs Pak: భారత్‌దే విజయం
ఏసీసీ మెన్స్ ట్వంటీ 20 ఎమర్జింగ్ ఆసియా కప్ 2024 టోర్నీలో భారత -A. జట్టు 7 పరుగుల తేడాతో విజయం సాధించింది. భారత్ విసిరిన 184 పరుగుల లక్ష్య చేదనలో పాక్ నిర్ణీత 20 ఓవర్లలో 176 పరుగులకే పరిమితమైంది. అంతకముందు భారత్- ‘ఎ’ మెరుగైన స్కోరు సాధించింది. నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసింది. ఓపెనర్లు అభిషేక్ శర్మ, ప్రభ్‌సిమ్రన్‌సింగ్ శుభారంభం అందించగా.. తిలక్ వర్మ కెప్టెన్ ఇన్నింగ్స్‌లో అలరించాడు.ఏసీసీ మెన్స్ టీ20 ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్-2024లో భాగంగా భారత్- పాక్ యువ జట్టు ఒమన్‌లోని అల్ అమెరట్ వేదికగా శనివారం మ్యాచ్ ఆడుతున్నాయి. ఓపెనర్లు అభిషేక్ శర్మ 22 బంతుల్లో ఐదు ఫోర్లు, రెండు సిక్సర్లతో 35 పరుగులు చేయగా.. ప్రభ్‌సిమ్రన్ సింగ్ ధనాధన్ ఇన్నింగ్స్‌తో దుమ్ములేపాడు.ప్రభ్‌సిమ్రన్ ధనాధన్.. తిలక్ కెప్టెన్ ఇన్నింగ్స్కేవలం 19 బంతుల్లోనే 3 ఫోర్లు ,3 సిక్సర్ల సాయంతో 36 పరుగులు సాధించాడు. వన్‌డౌన్‌లో వచ్చిన తిలక్ వర్మ 35 బంతుల్లో 44 పరుగులతో రాణించగా.. నేహల్ వధేరా(22 బంతుల్లో 25) ఫర్వాలేదనిపించాడు. మిగిలిన వాళ్లలో రమణ్‌దీప్ సింగ్(17) ఒక్కడే సింగిల్ డిజిట్ స్కోరు దాటాడు. ఆయుశ్ బదోని(2), నిషాంత్ సంధు(6), అన్షుల్ కాంబోజ్(0), రాహుల్ చహర్(4*), రసిద్ దార్ సలాం(6*) కనీసం పోరాట పటిమ ప్రదర్శించలేదు.ఇక పాక్ బౌలర్లలో ఇమ్రాన్, జమాన్ ఖాన్, మిన్హాస్, కాసిం అక్రం ఒక్కో వికెట్ తీయగా.. సూఫియాన్ ముకీమ్ రెండు వికెట్లతో సత్తా చాటాడు. కాగా భారత టాపార్డర్ రాణించిన కారణంగా పాకిస్తాన్‌కు తిలక్ సేన 184 పరుగుల లక్ష్యాన్ని విధించగలిగింది.భారత్- ‘ఎ’ వర్సెస్ పాకిస్తాన్- ‘ఎ’ప్లేయింగ్ ఎలెవన్ఇండియాఅభిషేక్ శర్మ, ప్రభ్ సిమ్రాన్ సింగ్(వికెట్ కీపర్), రమణ్‌దీప్ సింగ్, అన్షుల్ కాంబోజ్, తిలక్ వర్మ(కెప్టెన్), ఆయుష్ బదోని, నేహాల్ వధేరా, నిశాంత్ సింధు, రాహుల్ చాహర్, రసిక్ దార్ సలామ్, వైభవ్ అరోరా.పాకిస్తాన్హైదర్ అలీ, మహ్మద్ హారిస్(కెప్టెన్), యాసిర్ ఖాన్, ఒమైర్ యూసుఫ్, ఖాసీం అక్రమ్, అబ్దుల్ సమద్, అరాఫత్ మిన్హాస్, అబ్బాస్ అఫ్రిది, మహ్మద్ ఇమ్రాన్, జమాన్ ఖాన్, సూఫియాన్ ముకీమ్.చదవండి: Ind vs NZ: అయ్యో పంత్! .. నీకే ఎందుకిలా? -
Asia Cup: పాక్‌తో మ్యాచ్.. టాస్ గెలిచిన భారత్.. తుదిజట్లు ఇవే
ఏసీసీ మెన్స్ టీ20 ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్-2024లో భాగంగా భారత్- ‘ఎ’ జట్టు చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్-‘ఎ’తో తలపడుతోంది. దాయాదుల మధ్య పోరుకు ఒమన్‌లోని అల్ అమెరట్ స్టేడియం వేదికగా నిలిచింది. భారతకాలమానం ప్రకారం శనివారం రాత్రి ఏడు గంటలకు మొదలైన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత యువ జట్టు కెప్టెన్ తిలక్ వర్మ తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు.అభిషేక్ జోడీగా ప్రభ్సిమ్రన్సింగ్ఇక పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో ఆడే భారత తుదిజట్టులో టీమిండియా టీ20 నయా ఓపెనర్ అభిషేక్ శర్మ చోటు దక్కించుకున్నాడు. వికెట్ కీపర్ ప్రభ్సిమ్రన్సింగ్తో కలిసి ఇన్నింగ్స్ ఆరంభించాడు. కాగా ఒమన్‌లో జరుగుతున్న ఈ ఆసియా టీ20 టోర్నీలో బంగ్లాదేశ్, అఫ్గనిస్తాన్ జట్లు ఇప్పటికే శుభారంభం చేశాయి.అంచనాలు రెట్టింపుహాంకాంగ్పై బంగ్లా యువ జట్టు 5 వికెట్లు, శ్రీలంక-ఎ జట్టుపై అఫ్గన్ జట్టు 11 పరుగుల తేడాతో విజయం సాధించాయి. మరోవైపు.. మూడో మ్యాచ్‌లో భాగంగా యూఏఈతో తలపడ్డ ఆతిథ్య ఒమన్ జట్టు నాలుగు వికెట్ల తేడాతో గెలిచింది. ఈ టోర్నీలో నాలుగో మ్యాచ్‌లో భారత్- పాక్ తలపడటం.. అందులోనూ టీమిండియా స్టార్లు తిలక్ వర్మ(కెప్టెన్‌గా), అభిషేక్ శర్మ ఈ జట్టులో ఉండటంతో అంచనాలు రెట్టింపయ్యాయి.భారత్- ‘ఎ’ వర్సెస్ పాకిస్తాన్- ‘ఎ’ తుదిజట్లుయువ భారత తుదిజట్టుఅభిషేక్ శర్మ, ప్రభ్ సిమ్రాన్ సింగ్(వికెట్ కీపర్), రమణ్‌దీప్ సింగ్, అన్షుల్ కాంబోజ్, తిలక్ వర్మ(కెప్టెన్), ఆయుష్ బదోని, నేహాల్ వధేరా, నిశాంత్ సింధు, రాహుల్ చాహర్, రసిక్ దార్ సలామ్, వైభవ్ అరోరా.పాక్ యువ జట్టుహైదర్ అలీ, మహ్మద్ హారిస్(కెప్టెన్), యాసిర్ ఖాన్, ఒమైర్ యూసుఫ్, ఖాసీం అక్రమ్, అబ్దుల్ సమద్, అరాఫత్ మిన్హాస్, అబ్బాస్ అఫ్రిది, మహ్మద్ ఇమ్రాన్, జమాన్ ఖాన్, సూఫియాన్ ముకీమ్.చదవండి: Rohit- Kohli: అంపైర్లతో గొడవ.. రోహిత్ ఆగ్రహం.. కోహ్లి ఆన్ ఫైర్! -
క్లాసెన్ మాస్ క్యాచ్.. బ్యాటర్ మైండ్‌బ్లాంక్! వీడియో
ఐపీఎల్-2024లో ఇప్పటికే ప్లే ఆఫ్స్‌లో అడుగుపెట్టిన సన్‌రైజర్స్ హైదరాబాద్ లీగ్ దశలో ఆఖరి మ్యాచ్ ఆడుతోంది. సొంత మైదానం ఉప్పల్‌లో పంజాబ్ కింగ్స్‌పై గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతోంది.ఈ మ్యాచ్‌లో గనుక సన్‌రైజర్స్ భారీ తేడాతో గెలిచి.. తదుపరి మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ రాజస్తాన్ రాయల్స్‌ను ఓడిస్తే ఏకంగా రెండో స్థానానికి చేరుకుంటుంది. ఇక ఆదివారం నాటి ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పంజాబ్ తొలుత బ్యాటింగ్ చేసింది.ఓపెనర్లు అథర్వ టైడే(27 బంతుల్లో 46), ప్రభ్‌సిమ్రన్ సింగ్(45 బంతుల్లో 71) అద్భుత ఇన్నింగ్స్‌తో శుభారంభం అందించారు. ముఖ్యంగా ప్రభ్‌సిమ్రన్ సన్‌రైజర్స్ బౌలర్లకు కొరకరాని కొయ్యగా మారి ముప్పుతిప్పలు పెట్టాడు.ఈ క్రమంలో 15వ ఓవర్లో బౌలింగ్‌కు దిగిన విజయకాంత్ వియస్కాంత్ రెండో బంతికి ప్రభ్‌సిమ్రన్‌ను ఊరించాడు. దీంతో షాట్ ఆడేందుకు ప్రయత్నించిన కనెక్ట్ కాలేదు. ఈ క్రమంలో వెంటనే స్పందించిన వికెట్ కీపర్ హెన్రిచ్ క్లాసెన్ ఒంటిచేత్తో బంతిని ఒడిసిపట్టాడు. దీంతో ప్రభ్‌సిమ్రన్ నిరాశగా పెవిలియన్ చేరాడు. అలా దురదృష్టకరరీతిలో ప్రభ్‌సిమ్రన్ అవుట్ కావడంతో పంజాబ్ ఫ్యాన్స్ నిరాశ చెందారు.అయితే, ఈ మ్యాచ్‌లో ఓపెనర్లతో పాటు వన్‌డౌన్‌బ్యాటర్ రిలీ రొసో(49), కెప్టెన్ జితేశ్ శర్మ(15 బంతుల్లో 32 నాటౌట్) రాణించడంతో పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 214 పరుగులు చేసింది.మరోవైపు.. లక్ష్య ఛేదనకు దిగిన ఆరెంజ్ ఆర్మీకి ఆరంభంలోనే షాకిచ్చాడు పంజాబ్ పేసర్ అర్ష్‌దీప్ సింగ్. అతడి దెబ్బకు రైజర్స్ విధ్వంసకర ఓపెనర్ ట్రవిస్ హెడ్(0) పరుగుల ఖాతా తెరవకుండానే బౌల్డ్ అయ్యాడు. ఇక వన్‌డౌన్ బ్యాటర్ రాహుల్ త్రిపాఠి(18 బంతుల్లో 33)ని హర్షల్ పటేల్ అవుట్ చేశాడు. దీంతో పవర్ ప్లేలో సన్‌రైజర్స్ రెండు వికెట్ల నష్టానికి 84 పరుగులు చేసింది. Right wicket at the right time 😎Prabhsimran's solid knock comes to an end courtesy of a Klaasy catch 💪Watch the match LIVE on @JioCinema and @StarSportsIndia 💻📱#TATAIPL | #SRHvPBKS pic.twitter.com/a87LCfvi9g— IndianPremierLeague (@IPL) May 19, 2024 -
RCB Vs PBKS: సింగ్ ఈజ్ కింగ్.. సూపర్ హెలికాప్టర్ షాట్! వీడియో వైరల్
ఐపీఎల్-2024లో పంజాబ్ కింగ్స్ యువ ఆటగాడు ప్రభ్సిమ్రాన్ సింగ్ మరోసారి తన ప్రదర్శనతో అకట్టుకున్నాడు. ఈ మెగా ఈవెంట్లో భాగంగా చిన్నస్వామి స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్‌లో ప్రభు సిమ్రాన్ కాసేపు తన బ్యాటింగ్‌తో అలరించాడు. కేవలం 17 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 25 పరుగులు చేసి ఔటయ్యాడు. అయితే ఈ మ్యాచ్‌లో ప్రభు సిమ్రాన్ హెలికాప్టర్ షాట్‌తో మెరిశాడు. పంజాబ్ ఇన్నింగ్స్ 7వ ఓవర్ వేసిన కామెరాన్ గ్రీన్ నాలుగో బంతిని మిడిల్ స్టంప్ లైన్లో బౌలింగ్ చేశాడు. ఈ క్రమంలో కాస్త ఆఫ్ సైడ్ జరిగి హెలికాప్టర్ షాట్ ఆడాడు. అతడి బ్యాట్ స్పిడ్ దాటికి బంతి స్టాండ్స్‌లో పడింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన నెటిజన్లు ధోనిలా ఆడాడంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇక ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. పంజాబ్ బ్యాటర్లలో శిఖర్ ధావన్(45) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. జితేష్ శర్మ(27), శశాంక్ సింగ్(21) పరుగులతో రాణించారు. ఆర్సీబీ బౌలర్లలో మాక్స్వెల్, సిరాజ్ తలా రెండు వికెట్లు పడగొట్టగా.. జోషఫ్, దయాల్ తలా వికెట్ సాధించారు. He Prabhsimran! Ye kya ho gaya 😵💫 What. A. Shot. #IPLonJioCinema #RCBvPBKS #TATAIPL pic.twitter.com/3bfj8NGwnq — JioCinema (@JioCinema) March 25, 2024 -
సన్‌రైజర్స్ ఓపెనర్ ఊచకోత.. ఏకంగా 205 పరుగులతో
రంజీ ట్రోఫీ 2023-24 సీజన్ ఎలైట్ గ్రూప్-సిలో భాగంగా చండీగఢ్ వేదికగా పంజాబ్, చండీగఢ్ జట్లు తలపడతున్నాయి. అయితే ఈ మ్యాచ్ నాలుగో రోజు ఆటకు వర్షం అంతరాయం కలిగించింది. వర్షం తగ్గుముఖం పట్టినప్పటికీ.. ఔట్ ఫీల్డ్ చిత్తడిగా మారడంతో అంపైర్లు ఆటను ప్రారంభించలేదు. అయితే మూడో రోజు ముగిసే సమయానికి పంజాబ్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 2 వికెట్ల నష్టానికి ఏకంగా 477 పరుగులు చేసింది. పంజాబ్ వికెట్ కీపర్ బ్యాటర్ అన్మోల్ప్రీత్ సింగ్ ఆజేయ దిశ్వతకంతో చెలరేగాడు. అన్మోల్ప్రీత్ 329 బంతుల్లో 25 ఫోర్లతో 205 పరుగులు చేసి నాటౌట్‌గా ఉన్నాడు. అతడితో పాటు మరో వికెట్ కీపర్ బ్యాటర్ ప్రభుసిమ్రాన్ సింగ్ సైతం భారీ సెంచరీతో విరుచుకుపడ్డాడు. ప్రభుసిమ్రాన్ 215 బంతుల్లో 20 ఫోర్లు, 4 సిక్స్‌లతో 171 చేసి ఆజేయంగా ఉన్నాడు. కాగా అన్మోల్ప్రీత్ సింగ్ ఐపీఎల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. గతేడాది సీజన్లో ఓపెనర్‌గా వచ్చి ఒకట్రెండు మెరుపు ఇన్నింగ్స్‌లు అన్మోల్ప్రీత్ ఆడాడు. అతడిని ఐపీఎల్-2024 సీజన్‌కు ముందు ఎస్ఆర్హెచ్ రిటైన్ చేసుకుంది. అదే విధంగా ప్రభుసిమ్రాన్ సైతం క్యాష్‌రిచ్ లీగ్‌లో పంజాబ్ కింగ్స్ తరపున ఆడుతున్నాడు. చదవండి: IND vs ENG: ధోనిని గుర్తుచేసిన రోహిత్.. కేవలం 3 సెకండ్లలోనే అద్భుతం! వీడియో వైరల్ -
ఐపీఎల్ ఫామ్‌ను కొనసాగిస్తున్న ప్రభ్‌సిమ్రన్ సింగ్.. మరో మెరుపు సెంచరీ
ఐపీఎల్-2023లో పంజాబ్ కింగ్స్ తరఫున ఏకైక సెంచరీ చేసిన యువ ఆటగాడు ప్రభ్‌సిమ్రన్ సింగ్, ప్రస్తుతం జరుగుతున్న దియోదర్ ట్రోఫీలోనూ తన ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. గత ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 65 బంతుల్లో 10 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో సుడిగాలి శతకం (103) బాదిన ప్రభ్‌సిమ్రన్.. దియోదర్ ట్రోఫీలో సెంట్రల్ జోన్‌తో ఇవాళ (జులై 26) జరుగుతున్న మ్యాచ్‌లో 92 బంతుల్లో శతక్కొట్టాడు. Relive that special 💯 moment here 🔽#TATAIPL | #DCvPBKS https://t.co/eBGUL8gkVh pic.twitter.com/uWI2uW8vB8 — IndianPremierLeague (@IPL) May 13, 2023 ఈ ఇన్నింగ్స్‌లో 107 బంతులు ఎదుర్కొన్న ప్రభ్‌సిమ్రన్ (నార్త్ జోన్).. 13 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 121 పరుగులు చేశాడు. అతనికి కెప్టెన్ నితీశ్ రాణా (51), మన్దీప్ సింగ్ (43) తోడవ్వడంతో నార్త్ జోన్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 307 పరుగులు చేసింది. ఎమర్జింగ్ ఏసియా కప్ హీరోలు అభిషేక్ శర్మ (19), నిషాంత్ సింధు (18), హర్షిత్ రాణా (5), వివ్రాంత్ శర్మ (1) నిరశపర్చగా.. హిమాన్షు రాణా (24) ఓ మోస్తరు స్కోర్ చేశాడు. సెంట్రల్ జోన్ బౌలర్లలో యశ్ ఠాకూర్, వెంకటేశ్ అయ్యర్ తలో 2 వికెట్లు పడగొట్టగా.. శివమ్ మావి, కర్ణ్ శర్మ చెరో వికెట్ దక్కించుకున్నారు. దియోదర్ ట్రోఫీ-2023లో ప్రభ్సిమ్రన్దే తొలి సెంచరీ కావడం విశేషం. తృటిలో సెంచరీని చేజార్చుకున్న మయాంక్ అగర్వాల్.. ఇవాళే జరిగిన మరో మ్యాచ్‌లో సౌత్ జోన్ కెప్టెన్ మయాంక్ అగర్వాల్ (115 బంతుల్లో 98; 9 ఫోర్లు) తృటిలో సెంచరీ చేజార్చుకున్నాడు. మయాంక్, అరుణ్ కార్తీక్ (23), విజయ్‌కుమార్ వైశాఖ్ (20 నాటౌట్), కావేరప్ప (19) మినహా ఎవరూ కనీసం రెండంకెల స్కోర్లు కూడా చేయకపోవడంతో వెస్ట్ జోన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సౌత్ జోన్ 46.4 ఓవర్లలో 206 పరుగులకు ఆలౌటైంది. వెస్ట్ జోన్ బౌలర్లలో పార్థ్ భట్ 3, షమ్స్ ములానీ, హంగార్గేకర్ చెరో 2 వికెట్లు, నగ్వస్వల్లా, అతీథ్ సేథ్, శివమ్ దూబే తలో వికెట్ పడగొట్టారు. -
క్రికెట్ చరిత్రలోనే అత్యుత్తమ క్యాచ్.. చూస్తే మైండ్ బ్లాంక్! వీడియో వైరల్
దేశవాళీ వన్డే టోర్నీ దియోదర్ ట్రోఫీ జూన్ 24(సోమవారం) నుంచి ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ టోర్నీలో భాగంగా సోమవారం సౌత్ జోన్‌తో జరిగిన మ్యాచ్‌లో నార్త్ జోన్,పంజాబ్ వికెట్ కీపర్ ప్రభ్సిమ్రాన్ సంచలన క్యాచ్‌తో మెరిశాడు. సౌత్‌జోన్ బ్యాటర్ రిక్కీ భుయ్‌ను అద్భుతమైన క్యాచ్‌తో ప్రభ్సిమ్రాన్ పెవిలియన్‌కు పంపాడు. సౌత్ జోన్ ఇన్నింగ్స్ 39 ఓవర్ వేసిన మయాంక్ యాదవ్ బౌలింగ్‌లో రెండో బంతిని రిక్కీ భుయ్ ర్యాంప్ షాట్ ఆడటానికి ప్రయత్నించాడు. ఈ సమయంలో మొదటి స్లిప్ దిశగా వెళ్తున్న బంతిని వికెట్ కీపర్ ప్రభ్సిమ్రాన్ కుడివైపు డైవ్ చేస్తూ అద్భుతంగా అందుకున్నాడు. అది చూసిన బ్యాటర్‌తో పాటు మిగితా ఆటగాళ్లందరూ ఒక్కసారిగా షాకయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియోను బీసీసీఐ ట్విటర్లో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక ఇటీవల శ్రీలంక వేదికగా జరిగిన ఎమర్జింగ్ ఆసియాకప్ టోర్నీలో ఫైనల్‌కు చేరిన భారత జట్టులో ప్రభుసిమ్రాన్ భాగంగా ఉన్నాడు. అదే విధంగా వచ్చే నెలలో జరగనున్న ఆసియాక్రీడల్లో భారత సీనియర్ జట్టు తరపున ప్రభ్సిమ్రాన్ పాల్గొనున్నాడు. ఈ జట్టుకు రుత్‌రాజ్ గైక్వాడ్ సారధ్యం వహించనున్నాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. నార్త్‌జోన్‌పై 185 పరుగుల భారీ తేడాతో సౌత్ జోన్ విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన సౌత్‌జోన్.. నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 303 పరుగులు చేసింది. సౌత్ జోన్ బ్యాటర్లలో కెప్టెన్ మయాంక్ అగర్వాల్ (64; 7 ఫోర్లు)తో పాటు ఓపెనర్ కున్నుమ్మల్ (70; 8 ఫోర్లు, 3 సిక్సర్లు), ఎన్ జగదీశన్ (72; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్ధసెంచరీలతో రాణించారు. ఆ తర్వాత మ్యాచ్‌కు వర్షం ఆటంకం కలిగించడంతో విజేడీ (వి జయదేవన్) పద్ధతిన నార్త్ జోన్ లక్ష్యాన్ని 246 పరుగులకు కుదించారు. అయితే విధ్వత్ కావేరప్ప (5/17), విజయ్‌కుమార్ వైశాఖ్ (2/12), వాసుకి కౌశిక్ (1/11), నిప్పులు చెరగడంతో నార్త్ జోన్ 23 ఓవర్లలో 60 పరుగులకే కుప్పకూలింది. చదవండి: IND Vs WI ODI Series: టీమిండియాతో వన్డే సిరీస్.. విండీస్ జట్టు ప్రకటన! విధ్వంసకర ఆటగాడు వచ్చేశాడు Ripper Alert 🚨 You do not want to miss Prabhsimran Singh's flying catch behind the stumps 🔥🔥 WATCH Now 🎥🔽 #DeodharTrophy | #NZvSZhttps://t.co/Tr2XHldbHY — BCCI Domestic (@BCCIdomestic) July 24, 2023 -
లక్షలు పెట్టి కొంటే అద్భుతాలు సృష్టిస్తున్నాడు.. మరి 18 కోట్లు తీసుకున్న నువ్విలా!
ఐపీఎల్-2023లో భాగంగా శనివారం అరుణ్‌జైట్లీ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 31 పరుగుల తేడాతో పంజాబ్ కింగ్స్ ఘన విజయం సాధించింది. ఈ ఘన విజయంతో పంజాబ్ తమ ప్లేఆఫ్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. ఇప్పటివరకు ఈ ఏడాది సీజన్లో 12 మ్యాచ్‌లు ఆడిన పంజాబ్ కింగ్స్.. ఆరింట విజయం సాధించి పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో నిలిచింది. ఇక ఈ పంజాబ్ విజమంలో ఆ జట్టు ఓపెనర్ ప్రభ్సిమ్రాన్ సింగ్ కీలక పాత్ర పోషించాడు. శిఖర్ ధావన్, లైమ్ లివింగ్ స్టోన్ వంటి ఆటగాళ్లు విఫలమైన చోట.. ప్రభ్సిమ్రాన్ సింగ్ అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. ప్రభ్సిమ్రాన్ కేవలం 65 బంతుల్లోనే 10ఫోర్లు, 6 సిక్స్‌లతో 103 పరుగులు చేశాడు. పంజాబ్ 161 గౌరవప్రదమైన స్కోరు చేయడంలో ప్రభ్సిమ్రాన్ ముఖ్య పాత్ర పోషించాడు. ఇక మ్యాన్ ఆఫ్‌ది మ్యాచ్‌గా నిలిచిన ప్రభ్‌సిమ్రాన్‌పై భారత మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ప్రశంసల వర్షం కురిపించాడు. అదే విధంగా పంజాబ్ ఆల్‌రౌండర్ సామ్ కర్రాన్ తన స్థాయికి తగ్గ ప్రదర్శన చేయడంలో విఫలమవతున్నాడని సెహ్వాగ్ విమర్శించాడు. కాగా ఐపీఎల్లో వేలంలో శామ్ కర్రాన్‌ను పంజాబ్ కింగ్స్ రూ.18. 5 కోట్ల భారీ ధరకు కొనుగొలు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటివరకు ఈ ఏడాది సీజన్లో 12 మ్యాచ్‌లు ఆడిన శామ్ కర్రాన్ 216 పరుగులతో పాటు కేవలం 7 వికెట్లు మాత్రమే పడగొట్టాడు.ఈ నేపథ్యంలో క్రిక్‌బజ్‌తో సెహ్వాగ్ మాట్లాడుతూ.. "ప్రభ్‌సిమ్రన్ జట్టులోకి వచ్చినప్పటి నుంచి పంజాబ్ కింగ్స్ అద్భుతంగా రాణిస్తోంది. అతడు ఇదే ఫామ్‌ను కొనసాగిస్తే.. పంజాబ్‌కు చాలా బెనిఫిట్ కలుగుతుంది. ప్రభ్‌సిమ్రన్ తన అరంగేట్ర సీజన్లో భారీ మొత్తం (రూ. 4.8 కోట్లు) దక్కించుకున్నాడు. కానీ ఇప్పుడు అతడు కేవలం రూ. 60 లక్షలకు మాత్రమే ఆడుతున్నాడు. అయితే ఈ మ్యాచ్‌లో ప్రభ్‌సిమ్రన్ తన టాలెంట్ ఎంటో చూపించాడు. అతడికి సెంచరీలు కొట్టగలిగే సత్తా ఉంది అని నిరూపించాడు. ఇటువంటి యువ ఆటగాడు అద్భుతమైన ఇన్నింగ్స్‌లతో జట్టును గెలిపిస్తుంటే అంతకు మించి ఏమి కావాలి. సామ్ కర్రాన్‌ను 18.5 కోట్లు పెట్టి పంజాబ్ కొనుగొలు చేసింది. ఏం లాభం. ఒక్క మ్యాచ్‌లో కూడా సరైన ప్రదర్శన చేయలేకపోతున్నాడు" అని పేర్కొన్నాడు. చదవండి: IPL 2023: నికోలస్ పూరన్ అరుదైన ఘనత.. ఐపీఎల్ చరిత్రలోనే రెండో ఆటగాడిగా 𝙋𝙧𝙖𝙗𝙝 𝙧𝙖𝙖𝙠𝙝𝙖 🔥 Maiden #TATAIPL 💯 for @prabhsimran01 🦁 to give @PunjabKingsIPL an edge in this crucial match!#EveryGameMatters #DCvPBKS #TATAIPL #IPL2023 #IPLonJioCinema pic.twitter.com/hicf7UINCM — JioCinema (@JioCinema) May 13, 2023 -
క్రెడిట్ వారికే.. ప్రభ్‌సిమ్రన్ అత్యద్భుతం: పంజాబ్ కెప్టెన్ శిఖర్ ధవన్
ఐపీఎల్-2023లో నిన్న (మే 13) మరో లో స్కోరింగ్ మ్యాచ్ జరిగింది. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ 31 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో పంజాబ్ ప్లే ఆఫ్స్ అవకాశాలు మెరుగుపర్చుకోగా.. ఢిల్లీ ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్.. ప్రభ్‌సిమ్రన్ (65 బంతుల్లో 103; 10 ఫోర్లు, 6 సిక్సర్లు) వీరోచిత శతకంతో విరుచుకుపడటంతో నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేయగా.. ఛేదనలో తడబడిన ఢిల్లీ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 136 పరుగులు మాత్రమే చేసి ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. డీసీ ఇన్నింగ్స్‌లో వార్నర్ (54) ఒక్కడే కాస్త పర్వాలేదనిపించాడు. మ్యాచ్ అనంతరం పంజాబ్ కెప్టెన్ ధవన్ మాట్లాడుతూ.. తమ బౌలర్లపై, ముఖ్యంగా స్పిన్నర్లపై ప్రశంసల వర్షం కురిపించాడు. బౌలర్లే తమను తిరిగి ఆటలోకి తీసుకొచ్చారని కొనియాడాడు. క్రెడిట్ అంతా వారికే దక్కుతుందని అన్నాడు. తాము బ్యాటింగ్ చేసే సమయంలో సైతం పిచ్ స్పిన్నర్లకు సహకరించిందని, అలాంటి పిచ్‌పై ఓ పక్క వికెట్లు పడుతున్నా ప్రభ్‌సిమ్రన్ అత్యద్భుతమైన నాక్ ఆడాడని ఆకాశానికెత్తాడు. మ్యాచ్‌ను పంజాబ్వైపు టర్న్ చేసిన స్పిన్నర్ హర్‌ప్రీత్ బ్రార్ (4/30)పై కూడా ధవన్ ప్రశంసల వర్షం కురిపించాడు. వికెట్లే లక్ష్యంగా నెమ్మదిగా బౌలింగ్ చేయమని బ్రార్‌కి చెప్పానని.. అతను లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్లను ఔట్ చేసిన తీరు అమోఘమని కొనియాడాడు. డీసీపై గెలుపు తమలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించిందని, ప్రశాంతంగా ఉండటం తమకు బాగా సహాయపడిందని, తదుపరి రెండు మ్యాచ్‌ల్లో ఇలాగే ఉండేందుకు ప్రయత్నిస్తామని ధవన్ చెప్పుకొచ్చాడు. చదవండి: అదే మా కొంపముంచింది.. బౌలర్లు ఒత్తిడికి లోనయ్యారు! చెత్త కెప్టెన్సీ వల్లే ఇదంతా -
ప్రభ్‌సిమ్రన్ ‘హీరో’చితం
న్యూఢిల్లీ: ప్లే ఆఫ్స్ రేసులో నిలవాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ సత్తా చాటింది. శనివారం జరిగిన కీలక పోరులో పంజాబ్ 31 పరుగులతో ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఓడించింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 167 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ ప్రభ్‌సిమ్రన్ సింగ్ (65 బంతుల్లో 103; 10 ఫోర్లు, 6 సిక్స్‌లు) ఒంటిచేత్తో జట్టుకు గౌరవప్రదమైన స్కోరును అందించాడు. ఐపీఎల్లో అతనికి ఇది తొలి సెంచరీ సాధించడం విశేషం. శిఖర్ ధావన్ (7), లివింగ్‌స్టోన్ (4), జితేశ్ శర్మ (5), షారుఖ్ (2) చేతులెత్తేయగా... ప్రభ్‌సిమ్రన్‌కు స్యామ్ కరన్ (20) కాసేపు అండగా నిలిచాడు. అనంతరం హర్‌ప్రీత్ బ్రార్ (4/30) మాయాజాలంతో పంజాబ్ పైచేయి సాధించింది. హర్‌ప్రీత్ స్పిన్ ఉచ్చులో పడిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లన్నీ ఆడి 8 వికెట్ల నష్టానికి 136 పరుగులే చేయగలిగింది. డేవిడ్ వార్నర్ (27 బంతుల్లో 54; 10 ఫోర్లు, 1 సిక్స్) మాత్రమే అర్ధసెంచరీతో జట్టు పరువు నిలిపాడు. ఎలిస్, రాహుల్ చహర్ చెరో 2 వికెట్లు తీశారు. ఈ ఓటమితో ఢిల్లీ క్యాపిటల్స్ అధికారికంగా ‘ప్లే ఆఫ్స్’కు దూరమైన తొలి జట్టుగా నిలిచింది. స్కోరు వివరాలు పంజాబ్ కింగ్స్ ఇన్నింగ్స్: ప్రభ్‌సిమ్రన్ (బి) ముకేశ్ 103; శిఖర్ ధావన్ (సి) రోసో (బి) ఇషాంత్ 7; లివింగ్‌స్టోన్ (బి) ఇషాంత్ 4; జితేశ్ (బి) అక్షర్ 5; స్యామ్ కరన్ (సి) అమన్ హకీమ్ (బి) ప్రవీణ్ దూబే 20; హర్‌ప్రీత్ (సి) మార్ష్ (బి) కుల్దీప్ 2; షారుఖ్ రనౌట్ 2; సికందర్ రజా నాటౌట్ 11; రిషి ధావన్ నాటౌట్ 0; ఎక్స్‌ట్రాలు 13; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 167. వికెట్ల పతనం: 1–10, 2–32, 3–45, 4–117, 5–129, 6–154, 7–165. బౌలింగ్: ఖలీల్ 4–0–36–0, ఇషాంత్ 3–0–27–2, అక్షర్ 4–0–27–1, ప్రవీణ్ దూబే 3–0–19–1, కుల్దీప్ యాదవ్ 4–0–32–1, మార్ష్ 1–0–21–0, ముకేశ్ 1–0–3–1. ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్: వార్నర్ (ఎల్బీడబ్ల్యూ) (బి) హర్‌ప్రీత్ 54; ఫిల్ సాల్ట్ (బి) హర్‌ప్రీత్ 21; మార్ష్ (ఎల్బీడబ్ల్యూ) (బి) చహర్ 3; రోసో (సి) సికందర్ రజా (బి) హర్‌ప్రీత్ 5; అక్షర్ (ఎల్బీడబ్ల్యూ) (బి) చహర్ 1; అమన్ హకీమ్ (సి) హర్‌ప్రీత్ (బి) ఎలిస్ 16; మనీశ్ పాండే (బి) హర్‌ప్రీత్ 0; ప్రవీణ్ దూబే (బి) ఎలిస్ 16; కుల్దీప్ యాదవ్ నాటౌట్ 10; ముకేశ్ నాటౌట్ 6; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 136. వికెట్ల పతనం: 1–69, 2–74, 3–81, 4–86, 5–86, 6–88, 7–118, 8–123. బౌలింగ్: రిషీ ధావన్ 1–0–10–0, స్యామ్ కరన్ 2–0–18–0, హర్‌ప్రీత్ 4–0–30–4, ఎలిస్ 4–0–26–2, అర్ష్‌దీప్ 4–0–32–0, రాహుల్ చహర్ 4–0–16–2, సికందర్ రజా 1–0–3–0. ఐపీఎల్లో నేడు రాజస్తాన్ VS బెంగళూరు (మ. గం. 3:30 నుంచి) చెన్నైVS కోల్‌కతా (రాత్రి గం. 7:30 నుంచి) స్టార్ స్పోర్ట్స్, జియో సినిమాలో ప్రత్యక్ష ప్రసారం -
సూపర్ ప్రబ్‌సిమ్రన్.. ఓపెనర్‌గా వచ్చి సెంచరీ కొట్టి
ఐపీఎల్ 16వ సీజన్లో ఐదో శతకం నమోదైంది. శనివారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ ఓపెనర్ ప్రబ్‌సిమ్రన్ ఐపీఎల్లో మెయిడెన్ సెంచరీ నమోదు చేశాడు. 61 బంతుల్లో శతకం మార్క్ అందుకున్న ప్రబ్‌సిమ్రన్ ఇన్నింగ్స్‌లో 10 ఫోర్లు, ఆరు సిక్సర్లు ఉన్నాయి. కాస్త నెమ్మదిగా బ్యాటింగ్ చేసినప్పటికి బౌలింగ్‌కు అనుకూలిస్తున్న పిచ్‌పై ప్రబ్‌సిమ్రన్ ఒంటరిగా పోరాడాడు. ఒకవైపు వికెట్లు కోల్పోతున్నా తాను మాత్రం స్థిరంగా ఆడి సెంచరీ మార్క్ సాధించాడు. ఈ సీజన్లో ప్రబ్సిమ్రన్ది ఐదో శతకం కాగా.. ఇంతకముందు వెంకటేశ్ అయ్యర్(కేకేఆర్), యశస్వి జైశ్వాల్(రాజస్తాన్ రాయల్స్), హ్యారీ బ్రూక్(ఎస్ఆర్హెచ్), సూర్యకుమార్ యాదవ్(ముంబై ఇండియన్స్) సెంచరీలు బాదారు. అంతేకాదు ఐపీఎల్ చరిత్రలో పిన్న వయసులో సెంచరీ బాదిన క్రికెటర్ల జాబితాలో ప్రబ్‌సిమ్రన్ సింగ్ చోటు సంపాదించాడు. 22 ఏళ్ల 276 రోజుల్లో ప్రబ్‌సిమ్రన్ ఐపీఎల్లో సెంచరీ నమోదు చేశాడు. 𝙋𝙧𝙖𝙗𝙝 𝙧𝙖𝙖𝙠𝙝𝙖 🔥 Maiden #TATAIPL 💯 for @prabhsimran01 🦁 to give @PunjabKingsIPL an edge in this crucial match!#EveryGameMatters #DCvPBKS #TATAIPL #IPL2023 #IPLonJioCinema pic.twitter.com/hicf7UINCM — JioCinema (@JioCinema) May 13, 2023 చదవండి: 'యష్ దయాల్ చివర్లో.. నువ్వు మధ్యలోనే ముంచేశావ్' -
బట్లర్ కళ్లు చెదిరే క్యాచ్.. బ్యాటర్‌కు దిమ్మ తిరిగిపోయింది! వీడియో వైరల్
పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ ఆటగాడు జోస్ బట్లర్ సంచలన క్యాచ్‌తో మెరిశాడు. పంజాబ్ బ్యాటర్ ప్రభ్సిమ్రాన్ సింగ్‌ను ఓ అద్భుతమైన క్యాచ్‌తో బట్లర్ పెవిలియన్‌కు పంపాడు. ప్రభ్సిమ్రాన్ సింగ్ ఇన్నింగ్స్ ఆరంభం నుంచే రాజస్తాన్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఈ క్రమంలో అతడు తొలి ఐపీఎల్ హాఫ్ సెంచరీని కూడా అందుకున్నాడు. విధ్వంసకరంగా మారిన ప్రభ్సిమ్రాన్ సింగ్ ఔట్ చేయడానికి రాజస్తాన్ కెప్టెన్ సంజూ శాంసన్ అన్నివిధాల ప్రయత్నించాడు. ఆఖరికి పంజాబ్ ఇన్నింగ్స్ 10వ ఓవర్ వేసేందుకు బంతిని జాసెన్ హోల్డర్ చేతికి సంజూ ఇచ్చాడు. ఈ ఓవర్లో నాలుగో బంతికి ప్రభ్సిమ్రాన్ లాంగ్ ఆఫ్ దిశగా భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు. అయితే షాట్ సరిగ్గా కనక్ట్ కాకపోవడంతో బంతి గాల్లోకి లేచింది. ఈ క్రమంలో లాంగ్ఆఫ్లో బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న బట్లర్ పరిగెత్తుకుంటూ వచ్చి అద్భుతమైన డైవింగ్ క్యాచ్ అందుకున్నాడు. ఇది చూసిన ప్రభ్సిమ్రాన్ బిత్తరపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా ఈ మ్యాచ్‌లో కేవలం 34 బంతులు మాత్రమే ఎదుర్కొన్న ప్రభ్సిమ్రాన్.. 7 ఫోర్లు, 3 సిక్స్‌లతో 60 పరుగులు చేశాడు. What. A. Take 💪@josbuttler puts in a magnificent dive to dismiss the well set Prabhsimran for 60!@rajasthanroyals with their first wicket.#TATAIPL | #RRvPBKS pic.twitter.com/apJpCQmqjf — IndianPremierLeague (@IPL) April 5, 2023 చదవండి: IPL 2023: దురదృష్టం అంటే బట్లర్‌దే.. అస్సలు ఊహించి ఉండడు! వీడియో వైరల్ -
అన్నా.. ప్రతిసారీ గిట్లనే అయితాంది.. ఎందుకంటావ్?! సంజూ ట్వీట్ వైరల్
IPL 2023- RR Vs PBKS: పంజాబ్ కింగ్స్ చేతిలో ఓటమి నేపథ్యంలో రాజస్తాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ చేసిన ట్వీట్ నెట్టింట వైరల్ అవుతోంది. సంజూతో పాటు శిఖర్ ధావన్ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఐపీఎల్-2023లో భాగంగా రాజస్తాన్- పంజాబ్ అసోంలోని గువాహటి వేదికగా బుధవారం తలపడ్డాయి. పంజాబ్ ఓపెనర్లు సూపర్ హిట్ రాయల్స్‌కు హోం గ్రౌండ్ అయిన బర్సపరా స్టేడియంలో టాస్ గెలిచిన సంజూ.. తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్‌కు ఓపెనర్లు ప్రబ్‌సిమ్రన్ సింగ్(60), కెప్టెన్ శిఖర్ ధావన్ (86 నాటౌట్) అదిరిపోయే ఆరంభం ఇచ్చారు. మిగిలిన వాళ్లలో జితేశ్ శర్మ(27) ఒక్కడు 20 పరుగుల మార్కు దాటాడు. ఈ క్రమంలో నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి పంజాబ్ 197 పరుగులు చేసింది. ఇక ఫీల్డింగ్ సమయంలో రాజస్తాన్ స్టార్ ఓపెనర్ జోస్ బట్లర్ వేలికి గాయం కావడంతో.. యశస్వి జైశ్వాల్(11)కు జతగా ఓపెనింగ్‌కు దిగిన అశ్విన్ డకౌట్ అయ్యాడు. ఇక వన్‌డౌన్‌లో వచ్చిన బట్లర్ సైతం తక్కువ స్కోరుకే పరిమితం కాగా కెప్టెన్ సంజూ 25 బంతుల్లో 42 పరుగులతో రాణించాడు. ఆశలు పెంచిన హెట్మెయిర్, ధ్రువ్.. కానీ పడిక్కల్ 21 , రియాన్ పరాగ్ 20 పరుగులు చేయగా.. ఆఖర్లో షిమ్రన్ హెట్మెయిర్(18 బంతుల్లో 36 పరుగులు), ధ్రువ్ జురెల్ (15 బంతుల్లో 32 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్ ఆడారు. వీరిద్దరి పోరాటంతో గెలుపు అంచుల వరకు వచ్చిన రాజస్తాన్ ఆఖరికి ఐదు పరుగుల తేడాతో ఓటమి పాలైంది. గెలిచే మ్యాచ్‌లో పరాజయాన్ని మూటగట్టుకుంది. ఈ నేపథ్యంలో సంజూ తనదైన శైలిలో ట్వీట్ చేశాడు. పంజాబ్ కెప్టెన్, టీమిండియా వెటరన్ ఓపెనర్ శిఖర్ ధావన్‌తో ఉన్న ఫొటోను పంచుకున్న ఈ కేరళ బ్యాటర్.. ‘‘పాజీ(అన్నా).. మన మధ్య ప్రతిసారీ ఇలాంటి ఉత్కంఠ రేపే మ్యాచ్‌లే ఎందుకు జరుగుతాయంటావు?’’ అని చమత్కరించాడు. ఇందుకు స్పందించిన నెటిజన్లు.. ‘‘ఆటలో గెలుపోటములు సహజం.. కానీ ఆటగాళ్ల ప్రేమాభిమానాలు, క్రీడాస్ఫూర్తి ఇలా శాశ్వతం’’ అని కామెంట్లు చేస్తున్నారు. కాగా ఇప్పటి వరకు రాజస్తాన్- పంజాబ్ ఐపీఎల్లో 25 మ్యాచ్‌లలో తలపడగా.. రాయల్స్ 14, కింగ్స్ 11 మ్యాచ్‌లలో గెలిచాయి. చదవండి: డబ్ల్యూటీసీ ఫైనల్‌కు శ్రేయస్ అయ్యర్ దూరం.. టీమిండియాలోకి ఆంధ్ర ఆటగాడు తొలి మ్యాచ్‌లోనే చుక్కలు చూపించాడు.. ఎవరీ ధ్రువ్ జురెల్? వీడియో వైరల్ “Paaji, har baar itne tight matches kyun?” 🫢 pic.twitter.com/Fn6zrc9La9 — Sanju Samson (@IamSanjuSamson) April 6, 2023 That's that from Match 8. @PunjabKingsIPL win their second game on the trot as they beat #RR by 5 runs. Scorecard - https://t.co/Cmk3rElYKu #TATAIPL #RRvPBKS #IPL2023 pic.twitter.com/R9j1jFpt5C — IndianPremierLeague (@IPL) April 5, 2023 -
బట్లర్‌ను కాదని అందుకే అశూతో ఓపెనింగ్.. గెలిచే మ్యాచ్‌లో ఓడిపోయాం: సంజూ
IPL 2023- Rajasthan Royals vs Punjab Kings: ‘‘నిజం చెప్పాలంటే ఇది బ్యాటింగ్‌కు అనుకూలించే పిచ్. అయినప్పటికీ మా బౌలర్లు వైవిధ్యమైన బంతులతో ప్రత్యర్థి జట్టును కట్టడి చేసేందుకు తమ శాయశక్తులా ప్రయత్నించారు. పంజాబ్ కింగ్స్ ఆది నుంచే అద్భుతంగా బ్యాటింగ్ చేసింది. ముఖ్యంగా పంజాబ్ బ్యాటర్లు పవర్‌ప్లేను బాగా వినియోగించుకున్నారు. ఏదేమైనా బ్యాటింగ్‌కు అనుకూలించే పిచ్‌పై పంజాబ్‌ను 197 పరుగులకు కట్టడి చేశారంటే మా బౌలర్లు మెరుగ్గానే రాణించినట్లు లెక్క!’’ అని రాజస్తాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ అన్నాడు. కాగా ఐపీఎల్-2023లో భాగంగా గువాహటి వేదికగా పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్తాన్ ఆఖరి వరకు పోరాడి 5 పరుగుల తేడాతో ఓడిపోయిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన రాజస్తాన్ సారథి సంజూ తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. దంచికొట్టిన ప్రబ్‌సిమ్రన్, ధావన్ ఈ క్రమంలో పంజాబ్ ఓపెనర్లు ప్రబ్‌సిమ్రన్(60), శిఖర్ ధావన్(86 నాటౌట్) విజృంభించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 197 పరుగులు చేసింది. ఇక ‘హోం గ్రౌండ్’లో లక్ష్య ఛేదనకు దిగిన రాజస్తాన్ 192 పరుగులకే పరిమితమై ఓటమిని మూటగట్టుకుంది. ఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం సంజూ మాట్లాడుతూ ఓటమికి గల కారణాలు విశ్లేషించాడు. దేవ్‌దత్ పడిక్కల్‌ను మిడిలార్డర్లో ఆడించాలన్న నిర్ణయం బెడిసికొట్టిందని చెప్పుకొచ్చాడు. అదే విధంగా తమ జట్టు స్టార్ ఓపెనర్ జోస్ బట్లర్‌ను కాదని.. స్పిన్ ఆల్‌రౌండర్ రవిచంద్ర అశ్విన్‌ను ఓపెనర్‌గా పంపడానికి గల కారణం వెల్లడించాడు. అందుకే అశూతో ఓపెనింగ్ ఈ మేరకు.. ‘‘ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో క్యాచ్ అందుకునే క్రమంలో బట్లర్ వేలికి గాయమైంది. జాస్ పూర్తి ఫిట్‌గా లేడు. అందుకే అశ్విన్‌ను ముందు పంపి పడిక్కల్‌ను మిడిలార్డర్లో ఆడించాలనుకున్నాం. తనైతే స్పిన్నర్లను సమర్థవంతంగా ఎదుర్కోగలడన్న ఉద్దేశంతో ఇలా చేశాం’’ అని సంజూ తెలిపాడు. అతడు అద్భుతం.. ఇక ఆఖర్లో ఇంపాక్ట్ ప్లేయర్ ధ్రువ్ జురెల్ మెరుపు ఇన్నింగ్స్‌పై స్పందిస్తూ.. ‘‘ఐపీఎల్ ఆరంభానికి ముందు నిర్వహించిన శిక్షణా శిబిరంలో ధ్రువ్ జురెల్ పాల్గొన్నాడు. కోచ్‌లు అతడి నైపుణ్యాలు మెరుగుపడేలా రెట్టింపు శ్రద్ధ వహించారు. ధ్రువ్ తన ప్రాక్టీస్‌లో దాదాపు వెయ్యి బంతులు ఎదుర్కొన్నాడు. తన బ్యాటింగ్‌లో పురోగతి పట్ల నేనెంతో సంతోషంగా ఉన్నాను’’ అని ప్రశంసలు కురిపించాడు. గెలిచే మ్యాచ్‌లో ఓడిపోయాం ఇక సెకండ్ ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు వికెట్ మరింత అనుకూలిస్తుందని భావించానని.. అయితే, ఆరంభంలోనే దెబ్బ పడటంతో ఆఖరి వరకు పోరాడిన ఫలితం లేకుండా పోయిందని సంజూ పేర్కొన్నాడు. గెలవాల్సిన మ్యాచ్‌లో ఓటమి ఎదురైందని పరోక్షంగా వ్యాఖ్యానించాడు. తదుపరి మ్యాచ్‌కు సిద్ధమయ్యే క్రమంలో ఓటమి నుంచి పాఠాలు నేర్చుకుంటామని రాజస్తాన్ సారథి అన్నాడు. సంజూ మినహా కాగా తమ తొలి మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై రాజస్తాన్ భారీ విజయం సాధించగా.. రెండో మ్యాచ్‌లో ఇలా పంజాబ్ చేతిలో ఓటమిపాలైంది. బట్లర్ స్థానంలో ఓపెనర్‌గా వచ్చిన అశ్విన్ డకౌట్ కావడం.. కెప్టెన్ సంజూ(42) మినహా టాపార్డర్ విఫలం కావడం తీవ్ర ప్రభావం చూపింది. ఆఖర్లో షిమ్రన్ హెట్మెయిర్(18 బంతుల్లో 36 పరుగులు), ధ్రువ్ జురెల్(15 బంతుల్లో 32 పరుగులు నాటౌట్) పోరాడినా ఫలితం లేకుండా పోయింది. చదవండి: Sam Curran: పర్లేదు.. పెట్టిన సొమ్ముకు న్యాయం చేస్తున్నాడు..! That's that from Match 8. @PunjabKingsIPL win their second game on the trot as they beat #RR by 5 runs. Scorecard - https://t.co/Cmk3rElYKu #TATAIPL #RRvPBKS #IPL2023 pic.twitter.com/R9j1jFpt5C — IndianPremierLeague (@IPL) April 5, 2023 ICYMI - Nathan Ellis grabs a stunner to get the in form batter, Jos Buttler. Watch it here 👇👇#TATAIPL #RRvPBKS pic.twitter.com/rbt0CJRyLe — IndianPremierLeague (@IPL) April 5, 2023 -
రాజస్తాన్ బౌలర్లను ఉతికారేశాడు.. ఎవరీ ప్రబ్‌సిమ్రన్ సింగ్
ఐపీఎల్ 2023లో పంజాబ్ కింగ్స్ నుంచి మరో బ్యాటర్ దూసుకొచ్చాడు. బుధవారం రాజస్తాన్‌తో మ్యాచ్‌లో పంజాబ్ ఓపెనర్ ప్రబ్‌సిమ్రన్ సింగ్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. బౌల్ట్, అశ్విన్,చహల్ లాంటి అంతర్జాతీయ స్థాయి బౌలర్లను చీల్చి చెండాడిన ప్రబ్‌సిమ్రన్ 28 బంతుల్లోనే అర్థశతకం సాధించాడు. ఐపీఎల్లో ప్రబ్‌సిమ్రన్‌కు ఇదే తొలి అర్థశతకం కావడం విశేషం. ఓవరాల్‌గా 34 బంతుల్లో 60 పరుగులు చేయగా.. అతని ఇన్నింగ్స్‌లో ఏడు ఫోర్లు, మూడు సిక్సర్లు ఉన్నాయి. ప్రబ్‌సిమ్రన్ ధాటికి పవర్‌ప్లే ముగిసేసరికి పంజాబ్ స్కోరు 60 పరుగులకు పైగా నమోదయ్యింది. Photo: IPL Twitter ప్రబ్‌సిమ్రన్ సింగ్ ఆటకు ముగ్దులైన క్రికెట్ ఫ్యాన్స్ ఎవరితను అని ఆరా తీస్తున్నారు. వాస్తవానికి ప్రబ్‌సిమ్రన్ సింగ్ గత మూడేళ్లుగా పంజాబ్ కింగ్స్ తరపునే కొనసాగుతున్నాడు. ఇప్పటివరకు అతను మూడుసార్లు వేలానికి వెళితే.. మూడుసార్లు పంజాబ్ కింగ్స్ అతన్ని కొనుగోలు చేయడం ఆసక్తికరం. ఇక 2000 ఆగస్టు 10న పాటియాలలో పుట్టిన ప్రబ్‌సిమ్రన్ 2018లో దేశవాలీ క్రికెట్లో అడుగుపెట్టాడు. 2022లో తొలి ఫస్ట్‌క్లాస్ మ్యాచ్ ఆడిన ఇతను 11 మ్యాచ్‌ల్లో 689 పరుగులు చేశాడు. 24 లిస్ట్ ఏ మ్యాచ్‌ల్లో 664 పరుగులు చేసిన ప్రబ్‌సిమ్రన్ 42 టి20 మ్యాచ్‌ల్లో 1179 పరుగులు సాధించాడు. ఇక ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్ తరపున ఏడు మ్యాచ్‌లాడి 87 పరుగులు చేశాడు. Punjab da fireworks are already on at Barsapara 🏟️#RRvPBKS #IPL2023 #TATAIPL #IPLonJioCinema | @PunjabKingsIPL pic.twitter.com/AOYu057I8D — JioCinema (@JioCinema) April 5, 2023 Prabhsimran Singh - the 22 year old rising star of Punjab Kings! 60 in just 34 balls with 7 fours and 3 sixes. He gave a blistering start to Punjab in the powerplay, a sensational innings by Prabhsimran! pic.twitter.com/R5guWSpOtJ — Mufaddal Vohra (@mufaddal_vohra) April 5, 2023 చదవండి: 'రంజీ మ్యాచ్లనుకున్నావా.. ఇలా ఆడితే కష్టం'