RR vs PBKS IPL 2023 Match: Jos Buttler Takes Stunning Catch to Dismiss Prabhsimran Singh - Sakshi
Sakshi News home page

IPL 2023: బట్లర్‌ కళ్లు చెదిరే క్యాచ్‌.. బ్యాటర్‌కు దిమ్మ తిరిగిపోయింది! వీడియో వైరల్‌

Published Thu, Apr 6 2023 4:01 PM | Last Updated on Thu, Apr 6 2023 4:19 PM

Jos Buttler Takes Stunning Catch to Dismiss Prabhsimran Singh - Sakshi

పంజాబ్‌ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌ ఆటగాడు జోస్‌ బట్లర్‌ సంచలన క్యాచ్‌తో మెరిశాడు. పంజాబ్‌ బ్యాటర్‌ ప్రభ్‌సిమ్రాన్ సింగ్‌ను ఓ అద్భుతమైన క్యాచ్‌తో బట్లర్‌ పెవిలియన్‌కు పంపాడు. ప్రభ్‌సిమ్రాన్ సింగ్‌ ఇన్నింగ్స్‌ ఆరంభం నుంచే రాజస్తాన్‌ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఈ క్రమంలో అతడు తొలి ఐపీఎల్‌ హాఫ్‌ సెంచరీని కూడా అందుకున్నాడు.

విధ్వంసకరంగా మారిన ప్రభ్‌సిమ్రాన్ సింగ్‌ ఔట్‌ చేయడానికి రాజస్తాన్‌ కెప్టెన్‌ సంజూ శాంసన్‌ అన్నివిధాల ప్రయత్నించాడు. ఆఖరికి పంజాబ్‌ ఇన్నింగ్స్‌ 10వ ఓవర్ వేసేందుకు బంతిని జాసెన్‌ హోల్డర్‌ చేతికి సంజూ ఇచ్చాడు. ఈ ఓవర్‌లో నాలుగో బంతికి ప్రభ్‌సిమ్రాన్ లాంగ్‌ ఆఫ్‌ దిశగా భారీ షాట్‌ ఆడేందుకు ప్రయత్నించాడు.

అయితే షాట్‌ సరిగ్గా కనక్ట్‌ కాకపోవడంతో బంతి గాల్లోకి లేచింది. ఈ క్రమంలో లాంగ్‌ఆఫ్‌లో బౌండరీ లైన్‌ వద్ద ఫీల్డింగ్‌ చేస్తున్న బట్లర్‌ పరిగెత్తుకుంటూ వచ్చి అద్భుతమైన డైవింగ్‌ క్యాచ్‌ అందుకున్నాడు. ఇది చూసిన ప్రభ్‌సిమ్రాన్ బిత్తరపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా ఈ మ్యాచ్‌లో కేవలం 34 బంతులు మాత్రమే ఎదుర్కొన్న ప్రభ్‌సిమ్రాన్.. 7 ఫోర్లు, 3 సిక్స్‌లతో 60 పరుగులు చేశాడు.


చదవండి: IPL 2023: దురదృష్టం అంటే బట్లర్‌దే.. అస్సలు ఊహించి ఉండడు! వీడియో వైరల్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement