Jos Buttler
-
బట్లర్ ఊచకోత.. డస్సెన్, లిన్ మెరుపులు వృధా
అబుదాబీ టీ10 లీగ్‌లో ఇంగ్లండ్ పరిమిత ఓవర్ల కెప్టెన్ జోస్ బట్లర్ రెచ్చిపోయాడు. ఈ లీగ్‌లో డెక్కన్ గ్లాడియేటర్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న జోస్.. చెన్నై బ్రేవ్ జాగ్వార్స్‌తో జరిగిన మ్యాచ్‌లో వీరవిహారం చేశాడు. ఈ మ్యాచ్‌లో జోస్ కేవలం 15 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. మొత్తంగా 24 బంతులు ఎదుర్కొన్న జోస్.. 4 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 62 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఫలితంగా డెక్కన్ గ్లాడియేటర్స్ చెన్నై బ్రేవ్‌పై 7 వికెట్ల తేడాతో గెలుపొందింది.ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై బ్రేవ్ నిర్ణీత 10 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 141 పరుగుల భారీ స్కోర్ చేసింది. రస్సీ వాన్ డర్ డస్సెన్ (29 బంతుల్లో 62; 2 ఫోర్లు, 5 సిక్సర్లు), క్రిస్ లిన్ (28 బంతుల్లో 68 నాటౌట్; 8 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపు అర్ద శతకాలు సాధించారు. గ్లాడియేటర్స్ బౌలర్లలో నోర్జే, లూక్ వుడ్‌కు తలో వికెట్ దక్కింది.అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన గ్లాడియేటర్స్.. బట్లర్, టామ్ కొహ్లెర్ కాడ్మోర్ (24 బంతుల్లో 51; 4 ఫోర్లు, 4 సిక్సర్లు) వీర ఉతుకుడు ధాటికి మరో రెండు బంతులు మిగిలుండగానే లక్ష్యాన్ని చేరుకుంది. బట్లర్ అజేయమైన అర్ద శతకంతో గ్లాడియేటర్స్‌ను విజయతీరాలకు చేర్చాడు. బట్లర్ విధ్వంసం ధాటికి డస్సెన్, లిన్ మెరుపు అర్ద శతకాలు వృధా అయ్యాయి. గ్లాడియేటర్స్ ఇన్నింగ్స్‌లో నికోలస్ పూరన్ గోల్డన్ డకౌట్ కాగా.. రిలీ రొస్సో 16 పరుగులు చేసి ఔటయ్యాడు. బట్లర్.. మార్కస్ స్టోయినిస్‌తో (2 నాటౌట్) కలిసి గ్లాడియేటర్స్‌ను గెలిపించాడు. బ్రేవ్ బౌలర్లలో సాబిర్ అలీ రావు 2 వికెట్లు పడగొట్టగా.. నువాన్ తుషార ఓ వికెట్ దక్కించుకున్నాడు. ఈ మ్యాచ్‌లో గెలుపొందిన డెక్కన్ గ్లాడియేటర్స్ రెండుసార్లు అబుదాబీ టీ10 లీగ్ ఛాంపియన్‌గా నిలిచిన విషయం తెలిసిందే. -
ఇషాన్ కాదు!.. అత్యధిక ధరకు అమ్ముడుపోయే వికెట్ కీపర్లు వీరే!
ఇండియన్ ప్రీమియర్ లీగ్-2025 మెగా వేలానికి సమయం ఆసన్నమైంది. సౌదీ అరేబియాలోని జెద్దా నగరంలో ఈ మెగా ఈవెంట్‌ను నిర్వహించాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ఇప్పటికే నిర్ణయించింది. రెండురోజుల పాటు ఈ వేలం పాట జరుగనుండగా.. ఇందుకు సంబంధించిన షెడ్యూల్‌ను బీసీసీఐ నవంబరు 24, 25 తేదీల్లో ఖరారు చేసింది.ఇక ఈసారి వేలంలో టీమిండియా స్టార్లు రిషభ్ పంత్, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్ తదితరులు హైలెట్‌గా నిలవనున్నారు. ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్లు ఎవరు ఎంత ధర పలుకుతారనే అంశం మీద తమ అభిప్రాయాలు పంచుకుంటున్నారు.ఈ క్రమంలో టీమిండియా మాజీ వికెట్ కీపర్ బ్యాటర్ రాబిన్ ఊతప్ప ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈసారి వేలంలో అత్యధిక ధరకు అమ్ముడుపోయే వికెట్ కీపర్లు వీరేనంటూ ఐదుగురి పేర్లు చెప్పాడు. అయితే, ఇందులో మాత్రం ఇషాన్ కిషన్‌కు చోటు దక్కలేదు.కాగా వేలానికి ముందే వికెట్ కీపర్లు భారీ ధర పలికిన విషయం తెలిసిందే. అదేనండీ రిటెన్షన్స్‌లో భాగంగా వికెట్ కీపర్ బ్యాటర్లకు ఆయా ఫ్రాంఛైజీలు భారీ మొత్తం ముట్టజెప్పాయి. అతడికి ఏకంగా రూ. 23 కోట్లుసన్‌రైజర్స్ హైదరాబాద్ హెన్రిచ్ క్లాసెన్ కోసం రూ. 23 కోట్లు, లక్నో సూపర్ జెయింట్స్ నికోలస్ పూరన్ కోసం రూ. 21 కోట్లు, రాజస్తాన్ రాయల్స్ సంజూ శాంసన్ కోసం రూ. 18 కోట్లు, ధ్రువ్ జురెల్ కోసం రూ. 14 కోట్లు ఖర్చు చేశాయి.ఆ ఐదుగురికే అధిక ధరఈ నేపథ్యంలో రాబిన్ ఊతప్ప స్టార్ స్పోర్ట్స్ షోలో మాట్లాడుతూ.. ఈసారి వికెట్ కీపర్ల కోటాలో రిషభ్ పంత్, కేఎల్ రాహుల్, జోస్ బట్లర్, క్వింటన్ డికాక్, ఫిల్ సాల్ట్ అత్యధిక మొత్తానికి అమ్ముడుపోతారని అంచనా వేశాడు. ముఖ్యంగా కేఎల్ రాహుల్‌ను సొంతం చేసుకునేందుకు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కచ్చితంగా ఇతర ఫ్రాంఛైజీలతో పోటీకి వస్తుందని అభిప్రాయపడ్డాడు. ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ టైటాన్స్ కూడా కేఎల్ వైపు చూసే అవకాశం లేకపోలేదని ఊతప్ప చెప్పుకొచ్చాడు.చదవండి: టాలెంటెడ్ కిడ్.. ఇక్కడ కూడా.. : నితీశ్ రెడ్డిపై కమిన్స్ కామెంట్స్ -
ఉతికి ఆరేసిన బట్లర్.. 115 మీటర్ల భారీ సిక్సర్
వెస్టిండీస్‌తో నిన్న (నవంబర్ 10) జరిగిన రెండో టీ20లో ఇంగ్లండ్ స్టార్ ఆటగాడు జోస్ బట్లర్ మెరుపు ఇన్నింగ్స్‌తో విరుచుకుపడ్డాడు. ఈ మ్యాచ్‌లో బట్లర్ 45 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 83 పరుగులు చేశాడు. బట్లర్ సునామీ ఇన్నింగ్స్ కారణంగా ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో బట్లర్ బాదిన ఓ సిక్సర్ మ్యాచ్ మొత్తానికే హైలైట్‌గా నిలిచింది. గుడకేశ్ మోటీ బౌలింగ్ బట్లర్ బాదిన ఈ సిక్సర్ 115 మీటర్ల దూరంలో వెళ్లి పడింది. ఇంగ్లండ్ ఇన్నింగ్స్ తొమ్మిదో ఓవర్లో ఇది జరిగింది. మోటీ లెంగ్త్ బాల్‌ను వేయగా.. బట్లర్ క్రీజ్ దాటి ముందుకు వచ్చి భారీ షాట్ ఆడాడు. బట్లర్ హార్డ్ హిట్టింగ్ దెబ్బకు బంతి స్టేడియం దాటి బయటపడింది.JOS BUTTLER WITH A 115M SIX. 🤯🔥 pic.twitter.com/cfwNjHyWKn— Mufaddal Vohra (@mufaddal_vohra) November 11, 2024మ్యాచ్ విషయానికొస్తే.. వెస్టిండీస్ నిర్దేశించిన 159 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇంగ్లండ్.. బట్లర్ ఉతికి ఆరేయడంతో 14.5 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి గమ్యాన్ని చేరుకుంది. విల్ జాక్స్ (29 బంతుల్లో 38) ఓ మోస్తరు స్కోర్‌తో రాణించగా.. లియామ్ లివింగ్‌స్టోన్ (23 నాటౌట్), జాకబ్ బేతెల్ (2 నాటౌట్) ఇంగ్లండ్‌ను విజయతీరాలకు చేర్చారు. తొలి టీ20లో మెరుపు సెంచరీ చేసిన ఫిల్ సాల్ట్ ఈ మ్యాచ్‌లో గోల్డన్ డకౌట్‌గా వెనుదిరిగాడు. విండీస్ బౌలర్లలో రొమారియో షెపర్డ్ 2 వికెట్లు పడగొట్టగా.. అకీల్ హొసేన్ ఓ వికెట్ దక్కించుకున్నాడు.అంతకుముందు విండీస్ తొలుత బ్యాటింగ్ చేస్తూ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. రోవ్‌మన్ పావెల్ 41 బంతుల్లో 43 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలువగా.. రొమారియో షెపర్డ్ (22), నికోలస్ పూరన్ (14), రోస్టన్ ఛేజ్ (13), మాథ్యూ ఫోర్డ్ (13 నాటౌట్) రెండంకెల స్కోర్లు చేశారు. ఇంగ్లండ్ బౌలర్లలో మౌస్లీ, లివింగ్‌స్టోన్, సకీబ్ మహమూద్ తలో 2 వికెట్లు తీసి విండీస్ బ్యాటర్లను కుదురుకోనివ్వలేదు. జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్ చెరో వికెట్ దక్కించుకున్నారు. ఈ మ్యాచ్‌లో గెలుపుతో ఇంగ్లండ్ ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 2-0 ఆధిక్యంలోకి వెళ్లింది. తొలి టీ20లో ఇంగ్లండ్ 8 వికెట్ల తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే. సెయింట్ లూసియా వేదికగా నవంబర్ 14న మూడో టీ20 జరుగనుంది. -
జోస్ బట్లర్ విధ్వంసం.. విండీస్‌పై ఇంగ్లండ్ ఘన విజయం
బ్రిడ్జిటౌన్ వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో ఇంగ్లండ్ ఘన విజయం సాధించింది. దీంతో ఐదు టీ20ల సిరీస్‌లో ఇంగ్లీష్ జట్టు 2-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 158 పరుగులు సాధించింది.విండీస్ బ్యాటర్లలో కెప్టెన్ రావ్మన్ పావెల్(43) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. షెఫార్డ్ 22 పరుగులతో రాణించాడు. ఇంగ్లండ్ బౌలర్లలో లివింగ్ స్టోన్, మౌస్లీ, మహ్మద్ తలా రెండు వికెట్లు సాధించారు. వీరితో పాటు అర్చర్, రషీద్ చెరో వికెట్ పడగొట్టారు.జోస్ బట్లర్ విధ్వంసం..అనంతరం 159 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లండ్ 14.5 ఓవర్లలో కేవలం 3 వికెట్లు మాత్రమే కోల్పోయి ఊదిపడేసింది. ఇంగ్లండ్ బ్యాటర్లలో కెప్టెన్ జోస్ బట్లర్ విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. 45 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్స్‌లతో 83 పరుగులు చేశాడు.అతడితో పాటు విల్ జాక్స్(38) రాణించాడు. విండీస్ బౌలర్లలో షెఫర్డ్ రెండు, అకిల్ హోస్సేన్ ఓ వికెట్ సాధించారు. ఇక ఇరు జట్ల మధ్య మూడో టీ20 నవంబర్ 14న సెయింట్ లూసియా వేదికగా జరగనుంది.చదవండి: IND vs SA: సంజూ శాంసన్ అత్యంత చెత్త రికార్డు.. భారత క్రికెట్ చరిత్రలో ఒకే ఒక్కడు -
ఇంగ్లండ్ కెప్టెన్‌గా లియామ్ లివింగ్‌స్టోన్
వెస్టిండీస్‌తో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌కు ముందు ఇంగ్లండ్ జట్టుకు భారీ షాక్ తగిలింది. గాయం నుంచి పూర్తిగా కోలుకోని కారణంగా ఆ జట్టు కెప్టెన్ జోస్ బట్లర్ ఈ సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. బట్లర్ గైర్హాజరీలో ఇంగ్లండ్ వన్డే జట్టు కెప్టెన్‌గా లియామ్ లివింగ్‌స్టోన్ బాధ్యతలు చేపట్టనున్నాడు. ఈ సిరీస్ కోసం బట్లర్ ప్రత్యామ్నాయ ఆటగాడిని ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు ఎంపిక చేయలేదు.కాగా, ఈ ఏడాది జూన్‌లో జరిగిన టీ20 వరల్డ్‌కప్ సందర్భంగా బట్లర్ గాయపడిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి అతను వన్డే, టీ20 జట్లకు దూరంగా ఉన్నాడు. గాయం నుంచి పూర్తిగా కోలుకున్నాడని విండీస్‌తో సిరీస్‌కు బట్లర్‌ను తొలుత ఎంపిక చేశారు. అయితే బట్లర్ పూర్తిగా ఫిట్నెస్ సాధించకపోవడంతో ఈసీబీ అతన్ని జట్టు నుంచి తప్పించింది. బట్లర్ విండీస్‌తో తదుపరి జరుగబోయే టీ20 సిరీస్ సమయానికంతా పూర్తిగా కోలుకుంటాడని ఈసీబీ ఆశాభావం వ్యక్తం చేసింది.వెస్టిండీస్‌తో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ అక్టోబర్ 31, నవంబర్ 2, నవంబర్ 8 తేదీల్లో జరుగనుంది. అనంతరం నవంబర్ 9, 10, 14, 16, 17 తేదీల్లో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ జరుగనుంది. ఈ రెండు పరిమిత ఓవర్ల సిరీస్‌లు విండీస్ వేదికగా జరుగనున్నాయి. ఇంగ్లండ్ టెస్ట్ జట్టు ప్రస్తుతం పాక్‌తో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో పాల్గొంటున్న విషయం తెలిసిందే.విండీస్‌తో వన్డే, టీ20 సిరీస్‌ల కోసం ఇంగ్లండ్ జట్టు..లియామ్ లివింగ్‌స్టోన్ (వన్డే జట్టు కెప్టెన్), విల్ జాక్స్, డాన్ మౌస్లీ, జేకబ్ బేతెల్, జేమీ ఓవర్టన్, సామ్ కర్రన్, ఫిలిప్ సాల్ట్, జాఫర్ చోహాన్, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, సాకిబ్ మహమూద్, రీస్ టాప్లే, జాన్ టర్నర్చదవండి: టీమిండియాకు గుడ్ న్యూస్ -
విండీస్‌తో పరిమిత ఓవర్ల సిరీస్‌లు.. ఇంగ్లండ్ జట్టు ప్రకటన.. కెప్టెన్ రీఎంట్రీ
మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్.. ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ల కోసం ఇంగ్లండ్ జట్టు వెస్టిండీస్‌లో పర్యటించనుంది. ఈ పర్యటన అక్టోబర్ 31న ప్రారంభం కానుంది. ఈ పర్యటనలో ఇంగ్లండ్ తొలుత వన్డే సిరీస్ ఆడుతుంది. మూడు వన్డే మ్యాచ్‌లు అక్టోబర్ 31 (ఆంటిగ్వా), నవంబర్ 2 (ఆంటిగ్వా), నవంబర్ 6 (బార్బడోస్) తేదీల్లో జరుగనున్నాయి. అనంతరం నవంబర్ 9 (బార్బడోస్), 10 (బార్బడోస్), 14 (సెయింట్ లూసియా), 16 (సెయింట్ లూసియా), 17 (సెయింట్ లూసియా) తేదీల్లో ఐదు టీ20లు జరుగనున్నాయి. ఈ సిరీస్‌ల కోసం 14 మంది సభ్యుల ఇంగ్లండ్ జట్టును ఇవాళ (అక్టోబర్ 3) ప్రకటించారు. గాయం కారణంగా ఆస్ట్రేలియాతో జరిగిన టీ20, వన్డే సిరీస్‌లకు దూరంగా ఉన్న రెగ్యులర్ కెప్టెన్ జోస్ బట్లర్ విండీస్‌తో సిరీస్‌లతో రీఎంట్రీ ఇవ్వనున్నాడు. ఇంగ్లండ్ జట్టులో ముగ్గురు అన్ క్యాప్డ్ ప్లేయర్లకు చోటు దక్కింది. వీరిలో జాఫర్ చోహాన్ తొలిసారి సీనియర్ జట్టులో చోటు దక్కించుకోగా.. జాన్ టర్నర్, డాన్ మౌస్లీ జాతీయ జట్టుకు మరోసారి ఎంపికయ్యారు. విండీస్‌తో సిరీస్‌లకు ఈ 14 మందితో పాటు మరో ఇద్దరిని కూడా ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు ఎంపిక చేయనుంది. ఆ ఇద్దరు పాకిస్తాన్‌తో టెస్ట్ సిరీస్‌తో ముగిసిన అనంతరం (అక్టోబర్ 28) జట్టుతో చేరతారు. బట్లర్ గైర్హాజరీలో ఇంగ్లండ్ జట్టు పగ్గాలు చేపట్టిన హ్యారీ బ్రూక్ ప్రస్తుతం ఇంగ్లండ్ టెస్ట్ జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. బ్రూక్‌తో పాటు మరో ఆటగాడు ఇంగ్లండ్ పరిమిత ఓవర్ల జట్టులో చేరతాడు.వెస్టిండీస్ వన్డే మరియు టీ20 సిరీస్‌ల కోసం ఇంగ్లండ్ జట్టు: జోస్ బట్లర్ (కెప్టెన్, జోఫ్రా ఆర్చర్, జాకబ్ బెథెల్, జాఫర్ చోహాన్, సామ్ కర్రన్, విల్ జాక్స్, లియామ్ లివింగ్‌స్టోన్, సాకిబ్ మహమూద్, డాన్ మౌస్లీ, జామీ ఓవర్టన్, ఆదిల్ రషీద్, ఫిల్ సాల్ట్, రీస్ టోప్లీ, జాన్ టర్నర్చదవండి: ధోని కంటే రోహిత్ బెటర్ కెప్టెన్: భారత స్పిన్ దిగ్గజం -
ఇంగ్లండ్ జట్టుకు భారీ షాక్
ఆస్ట్రేలియాతో ఐదు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌కు ముందు ఇంగ్లండ్ జట్టుకు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు రెగ్యులర్ కెప్టెన్ జోస్ బట్లర్ గాయం నుంచి పూర్తిగా కోలుకోకపోవడంతో వన్డే సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. బట్లర్ స్థానంలో యువ ఆటగాడు హ్యారీ బ్రూక్ ఇంగ్లండ్ జట్టుకు నాయకత్వం వహించనున్నాడు. సెప్టెంబర్ 19 నుంచి మొదలుకానున్న వన్డే సిరీస్ కోసం ఇంగ్లండ్ జట్టును ఇవాళ (సెప్టెంబర్ 15) ప్రకటించారు. గాయం కారణంగా 6 అడుగుల 7 అంగుళాల ఫాస్ట్ బౌలర్ జోష్ హల్ కూడా ఈ సిరీస్‌కు దూరమయ్యాడు. మరోవైపు ఆసీస్‌తో రెండో టీ20లో చెలరేగిన లియామ్ లివింగ్‌స్టోన్ జట్టులో చోటు దక్కించుకున్నాడు.కెప్టెన్‌గా హ్యారీ బ్రూక్25 ఏళ్ల హ్యారీ బ్రూక్ ఇంగ్లండ్ వన్డే జట్టు కెప్టెన్‌గా తొలిసారి బాధ్యతలు చేపట్టనున్నాడు. 18 నెలల కింద వన్డే అరంగేట్రం చేసిన బ్రూక్.. టెస్ట్, టీ20ల్లో తనను తాను నిరూపించుకున్నప్పటికీ.. వన్డేల్లో చెప్పుకోదగ్గ ప్రదర్శనలు చేయలేకపోయాడు. బ్రూక్ ఇప్పటివరకు 15 వన్డేలు ఆడి 29.1 సగటున 407 పరుగులు చేశాడు. ఇందులో మూడు అర్ద సెంచరీలు ఉన్నాయి. బ్రూక్ ఇటీవల ముగిసిన ద హండ్రెడ్ లీగ్‌లో నార్త్రన్ సూపర్ ఛార్జర్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరించాడు.ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌కు ఇంగ్లండ్ జట్టు..హ్యారీ బ్రూక్ (కెప్టెన్), జోఫ్రా ఆర్చర్, జాకబ్ బెథెల్, బ్రైడన్ కార్సే, జోర్డాన్ కాక్స్, బెన్ డకెట్, విల్ జాక్స్, లియామ్ లివింగ్‌స్టోన్, మాథ్యూ పాట్స్, ఆదిల్ రషీద్, ఫిల్ సాల్ట్, జామీ స్మిత్, ఒల్లీ స్టోన్, రీస్ టోప్లీ, జాన్ టర్నర్ఇదిలా ఉంటే, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ జట్లు ప్రస్తుతం మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో తలపడుతున్నాయి. ఈ సిరీస్‌లో ఇరు జట్లు చెరో మ్యాచ్‌లో గెలిచాయి. మూడో టీ20 ఇవాళ (రాత్రి 7 గంటలకు) జరగాల్సి ఉంది. అయితే వర్షం కారణంగా ఇప్పటివరకు టాస్ కూడా పడలేదు. టీ20 సిరీస్ ముగిసిన అనంతరం సెప్టెంబర్ 19, 21, 24, 27, 29 తేదీల్లో ఐదు వన్డేలు జరుగనున్నాయి. చదవండి: లివింగ్ స్టోన్ ఊచకోత.. ఆసీస్‌పై ఇంగ్లండ్‌పై ఘన విజయం -
ఆసీస్‌తో సిరీస్‌కు ముందు ఇంగ్లండ్‌కు భారీ ఎదురుదెబ్బ
ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌కు ముందు ఇంగ్లండ్ జట్టుకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. గాయం కారణంగా ఇంగ్లండ్ సారధి జోస్ బట్లర్ ఆసీస్‌తో టీ20 సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. బట్లర్.. టీ20 సిరీస్‌తో పాటు తదనంతరం జరిగే ఐదు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌కు కూడా దూరమయ్యే అవకాశం ఉంది. బట్లర్ గైర్హాజరీలో ఫిల్ సాల్ట్ ఇంగ్లండ్ టీ20 జట్టు కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు. ఈ విషయాన్ని ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు గురువారం (సెప్టెంబర్ 5) అధికారికంగా ప్రకటించింది. బట్లర్ స్థానాన్ని ఆల్‌రౌండర్ జేమీ ఓవర్టన్ భర్తీ చేయనున్నాడు. కాగా, మూడు టీ20లు, ఐదు మ్యాచ్‌ల వన్డే సిరీస్ కోసం ఆస్ట్రేలియా జట్టు సెప్టెంబర్ 11 నుంచి ఇంగ్లండ్‌లో పర్యటించనుంది. ఈ పర్యటనలో తొలుత టీ20లు జరుగుతాయి. సెప్టెంబర్ 11, 13, 15 తేదీల్లో మూడు టీ20లు జరుగనున్నాయి. అనంతరం సెప్టెంబర్ 19, 21, 24, 27, 29 తేదీల్లో వన్డే సిరీస్ జరుగనుంది.ఇంగ్లండ్ టీ20 జట్టు: ఫిల్ సాల్ట్ (కెప్టెన్), జోఫ్రా ఆర్చర్, జాకబ్ బెథెల్, బ్రైడన్ కార్సే, జోర్డాన్ కాక్స్, సామ్ కర్రన్, జోష్ హల్, విల్ జాక్స్, లియామ్ లివింగ్‌స్టోన్, సాకిబ్ మహమూద్, డాన్ మౌస్లీ, జేమీ ఓవర్టన్, ఆదిల్ రషీద్, రీస్ టోప్లీ, జాన్ టర్నర్ఇంగ్లండ్ వన్డే జట్టు: జోస్ బట్లర్ (కెప్టెన్), జోఫ్రా ఆర్చర్, గస్ అట్కిన్సన్, జాకబ్ బెథెల్, హ్యారీ బ్రూక్, బ్రైడన్ కార్సే, జోర్డాన్ కాక్స్, బెన్ డకెట్, జోష్ హల్, విల్ జాక్స్, మాథ్యూ పాట్స్, ఆదిల్ రషీద్, ఫిల్ సాల్ట్, జేమీ స్మిత్, రీస్ టోప్లీ, జాన్ టర్నర్ -
ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్.. ఇంగ్లండ్‌కు బిగ్ షాక్!
ఇంగ్లండ్ క్రికెట్ జట్టు స్వదేశంలో ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌కు సిద్దమవుతోంది. ఈ సిరీస్‌కు ముందు ఇంగ్లండ్‌కు బిగ్ షాక్ తగిలే అవకాశముంది. ఆ జట్టు కెప్టెన్ జోస్ బట్లర్ గాయం కారణంగా ఆసీస్ సిరీస్‌కు దూరం కానున్నట్లు తెలుస్తోంది. జోస్ ప్రస్తుతం కాలి పిక్క కండరాల గాయంతో బాధపడుతున్నాడు.ఈ గాయం కారణంగానే ది హండ్రెడ్ టోర్నమెంట్‌కు సైతం దూరమయ్యాడు. అయితే అతడు ఇంకా గాయం నుంచి పూర్తిగా కోలుకోపోయినట్లు తెలుస్తోంది. పూర్తి ఫిట్నెస్ సాధించడానికి మరో రెండు నుంచి మూడు వారాల సమయం పట్టనున్నట్లు సమాచారం. బట్లర్ తిరిగి మళ్లీ ఆసీస్‌తో వన్డే సిరీస్‌కు అందుబాటులో వచ్చే ఛాన్స్ ఉంది. కాగా ఇప్పటికే ఆసీస్‌తో టీ20 సిరీస్‌కు ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు 16 మంది సభ్యులతో కూడిన తమ జట్టును ప్రకటించింది.ఈ జట్టుకు బట్లర్ సారథ్యం వహించినట్లు ఈసీబీ వెల్లడించింది. కానీ ఇప్పుడు బట్లర్ ఫిట్‌నెస్‌పై సందిగ్దం నెలకొనడంతో.. ఇంగ్లండ్ జట్టుకు సామ్ కుర్రాన్ సారథ్యం వహించే అవకాశముంది. కాగా సెప్టెంబర్ 11 ఈ సిరీస్ ప్రారంభం కానుంది.చదవండి: PAKvBAN: క్లీన్‌స్వీప్ దిశగా బంగ్లాదేశ్ -
ఆసీస్‌తో పరిమిత ఓవర్ల సిరీస్‌ల కోసం ఇంగ్లండ్ జట్ల ప్రకటన
స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరిగే పరిమిత ఓవర్ల సిరీస్‌ల కోసం ఇంగ్లండ్ జట్లను నిన్న (ఆగస్ట్ 26) ప్రకటించారు. ఈ జట్లకు జోస్ బట్లర్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. గాయం కారణంగా హండ్రెడ్ లీగ్‌కు దూరంగా ఉండిన బట్లర్ ఆసీస్‌తో సిరీస్‌లతో రీఎంట్రీ ఇవ్వనున్నాడు. ఈ సిరీస్‌లలో తొలుత మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్, ఆతర్వాత ఐదు మ్యాచ్‌ల వన్డే సిరీస్ జరుగనున్నాయి. టీ20 సిరీస్ సెప్టెంబర్ 11, 13, 15 తేదీల్లో.. వన్డే సిరీస్ సెప్టెంబర్ 19, 21, 24, 27, 29 తేదీల్లో జరుగనుంది. లంకతో మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ముగిసిన వెంటనే ఆసీస్‌తో టీ20 సిరీస్ మొదలుకానుంది.ఆసీస్‌తో సిరీస్‌ల కోసం సీనియర్లు జానీ బెయిర్‌స్టో, మొయిన్ అలీ, క్రిస్ జోర్డన్లను పక్కకు పెట్టారు ఇంగ్లండ్ సెలెక్టర్లు. ఈ ముగ్గురు ఇటీవల ముగిసిన టీ20 వరల్డ్‌కప్‌లో ఇంగ్లండ్ జట్టులో సభ్యులుగా ఉన్నారు. వీరి స్థానంలో ఇంగ్లండ్ సెలెక్టర్లు ఐదుగురు అన్క్యాప్డ్ ప్లేయర్లకు (జోర్డన్ కాక్స్, జేకబ్ బేతెల్, డాన్ మౌస్లీ, జోష్ హల్, జాన్ టర్నర్) టీ20 జట్టులో అవకాశం కల్పించారు. ఈ ఐదుగురు వివిధ దేశవాలీ టోర్నీల్లో సత్తా చాటి జాతీయ జట్టుకు ఎంపికయ్యారు. వీరిలో జోర్డన్ కాక్స్ వికెట్‌కీపర్ బ్యాటర్ కాగా.. జోష్ హల్, జాన్ టర్నర్ పేస్ బౌలర్లు. జేకబ్ బేతెల్, డాన్ మౌస్లీ బ్యాటింగ్ ఆల్‌రౌండర్లు. ప్రస్తుత శ్రీలంక టెస్ట్ సిరీస్‌లో సభ్యులుగా ఉన్న హ్యారీ బ్రూక్, మాథ్యూ పాట్స్, గస్ అట్కిన్సన్‌లకు టీ20 జట్టులో చోటు దక్కలేదు. ఈ ముగ్గురు కేవలం వన్డే సిరీస్‌కు మాత్రమే పరిమితమయ్యారు. లంకతో తొలి టెస్ట్ సందర్భంగా గాయపడిన మార్క్ వుడ్‌ను సెలెక్టర్లు పరిగణలోకి తీసుకోకపోగా.. జో రూట్‌కు వన్డే జట్టు నుంచి రెస్ట్ ఇచ్చారు సెలెక్టర్లు. ఏడాదికి పైగా జాతీయ జట్టుకు దూరంగా ఉన్న జోఫ్రా ఆర్చర్ ఈ సిరీస్‌లతో రీఎంట్రీ ఇస్తున్నాడు.ఇంగ్లండ్ టీ20 జట్టు: జోస్ బట్లర్ (కెప్టెన్), జోఫ్రా ఆర్చర్, జేకబ్ బేతెల్, బ్రైడన్ కార్స్, జోర్డన్ కాక్స్, సామ్ కర్రన్, జోష్ హల్, విల్ జాక్స్, లియామ్ లివింగ్‌స్టోన్, సకిబ్ మహమూద్, డాన్ మౌస్లీ, ఆదిల్ రషీద్, ఫిల్ సాల్ట్, రీస్ టాప్లే, జాన్ టర్నర్ఇంగ్లండ్ వన్డే జట్టు: జోస్ బట్లర్(కెప్టెన్), జోఫ్రా ఆర్చర్, గస్ అట్కిన్సన్, జేకబ్ బేతెల్, హ్యారీ బ్రూక్, బ్రైడన్ కార్స్, బెన్ డకెట్, జోష్ హల్, విల్ జాక్స్, మాథ్యూ పాట్స్, ఆదిల్ రషీద్, ఫిల్ సాల్ట్, జేమీ స్మిత్, రీస్ టాప్లే, జాన్ టర్నర్షెడ్యూల్..సెప్టెంబర్ 11- తొలి టీ20 (సౌతాంప్టన్)సెప్టెంబర్ 13- రెండో టీ20 (కార్డిఫ్)సెప్టెంబర్ 15- మూడో టీ20 (మాంచెస్టర్)సెప్టెంబర్ 19- తొలి వన్డే (నాటింగ్హమ్)సెప్టెంబర్ 21- రెండో వన్డే (లీడ్స్)సెప్టెంబర్ 24- మూడో వన్డే (చెస్టర్ లీ స్ట్రీట్)సెస్టెంబర్ 27- నాలుగో వన్డే (లండన్)సెప్టెంబర్ 29- ఐదో వన్డే (బ్రిస్టల్) -
బట్లర్‌తో విభేదాలు.. ఇంగ్లండ్ జట్టుతో ఫ్లింటాప్ తెగదెంపులు?
ఇంగ్లండ్ క్రికెట్లో ముసలం నెలకొంది. ఇంగ్లండ్ పరిమిత ఓవర్ల కెప్టెన్ జోస్ బట్లర్, టీమ్ కన్సల్టెంట్ ఆండ్రూ ఫ్లింటాఫ్‌కు మధ్య విభేదాలు తలెత్తినట్లు తెలుస్తోంది. దీంతో జట్టుతో విడిపోవాలని ఫ్లింటాప్ నిర్ణయించుకున్నట్లు సమాచారం.వచ్చె నెలలో స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరగనున్న వైట్‌బాల్ సిరీస్‌లకు ఇంగ్లండ్ కోచింగ్ స్టాప్‌లో భాగం కాకూడదని అతడు ఫిక్స్ అయినట్లు వినికిడి. ఇప్పటికే తన నిర్ణయాన్ని ఇంగ్లండ్ క్రికెట్ బోర్డుకు కూడా ఈ లెజండరీ క్రికెటర్ తెలియజేసినట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి.గతేడాది నుంచి ఇంగ్లండ్ జట్టుకు తాత్కాలిక కన్సల్టెంట్‌గా ఫ్లింటాఫ్ పనిచేస్తున్నాడు. టీ20 వరల్డ్‌కప్-2024లో కూడా ఈ ఇంగ్లండ్ దిగ్గజ ఆల్‌రౌండర్ తన సేవలను అందించాడు. వరల్డ్‌కప్ సమయంలోనే ఫ్లింటాప్,బట్లర్‌కు గొడవలు మొదలైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి.ఫ్లింటాప్ నిర్ణయాలను బట్లర్ వ్యతిరేకించేవాడని, ఇద్దరి మధ్య సమన్వయం లోపించినట్లు ఇంగ్లండ్ క్రికెట్ వర్గాలు వెల్లడించాయి. ఈ క్రమంలోనే ఇంగ్లండ్ సీనియర్ టీమ్ కోచింగ్ స్టాప్ నుంచి బయటకు వెళ్లాలని ఫ్లింటాప్ నిర్ణయించుకున్నాడంట. అతడు ఫ్రాంచైజీ క్రికెట్లో కోచింగ్‌పై దృష్టిపెట్టినట్లు మార్నింగ్ టెలిగ్రాఫ్ తమ కథనంలో పేర్కొంది. ఫ్లింటాఫ్ ప్రస్తుతం ది హండ్రెడ్ ఫ్రాంచైజీ నార్తర్న్ సూపర్‌చార్జర్స్‌కు హెడ్‌కోచ్‌గా ఉన్నాడు.తాత్కాలిక హెడ్‌కోచ్‌గా ట్రెస్కోథిక్ఇక వన్డే, టీ20 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్ విఫలమకావడంతో హెడ్‌కోచ్ బాధ్యతల నుంచి మాథ్యూ మోట్ తప్పుకున్నాడు. ప్రస్తుతం తాత్కాలిక హెడ్ కోచ్‌గా బ్యాటింగ్ కోచ్ మార్కస్ ట్రెస్కోథిక్ బాధ్యతలు చేపట్టాడు. అయితే అతడిని త్వరలోనే పూర్తి స్ధాయి హెడ్‌కోచ్‌గా నియమించే అవకాశముంది. -
బాధగా ఉంది.. కానీ తప్పడం లేదు: రాయల్స్‌కు బట్లర్ గుడ్‌బై
ఇంగ్లండ్ పరిమిత ఓవర్ల క్రికెట్ కెప్టెన్ జోస్ బట్లర్ కీలక ప్రకటన చేశాడు. సౌతాఫ్రికా టీ20 లీగ్(SA20) నుంచి దూరం అవుతున్నట్లు తెలిపాడు. జాతీయ జట్టు విధుల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించాడు. ప్రపంచవ్యాప్తంగా పొట్టి ఫార్మాట్ లీగ్‌ల హవా కొనసాగుతున్న నేపథ్యంలో సౌతాఫ్రికా క్రికెట్ బోర్డు సైతం.. 2023లో తమ సొంత లీగ్‌ను ఆరంభించింది.ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో భాగమైన ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్, రాజస్తాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంఛైజీలు ఈ లీగ్‌లో పెట్టుబడులు పెట్టాయి. వరుసగా.. ఎంఐ కేప్‌టౌన్, జొబర్గ్ సూపర్ కింగ్స్, డర్బన్ సూపర్ జెయింట్స్, ప్రిటోరియా క్యాపిటల్స్, సన్‌రైజర్స్ ఈస్టర్న్‌కేప్ పేరిట ఆరు జట్లు కొనుగోలు చేశాయి.పర్ల్ రాయల్స్ తరఫునఇక ఐపీఎల్లో రాజస్తాన్ రాయల్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న ఇంగ్లండ్ సారథి జోస్ బట్లర్.. సౌతాఫ్రికా లీగ్‌లోనూ అదే ఫ్రాంఛైజీకి చెందిన పర్ల్ రాయల్స్‌కు ఆడుతున్నాడు. రెండేళ్లపాటు అదే జట్టుతో కొనసాగిన బట్లర్.. 2025 సీజన్‌కు మాత్రం అందుబాటులో ఉండటం లేదని స్పష్టం చేశాడు. ఈ నేపథ్యంలో అభిమానులను ఉద్దేశించి పర్ల్ రాయల్స్ సోషల్ మీడియా వేదికగా తన సందేశం వినిపించాడు.విడిచి వెళ్లాలంటే బాధగా ఉంది‘‘వచ్చే ఏడాది ఇక్కడకు రాలేకపోతున్నందుకు నిరాశగా ఉంది. ఇంగ్లండ్ మ్యాచ్‌లతో బిజీ కాబోతున్నాను. ప్రస్తుతం నా దృష్టి మొత్తం వాటి మీదే ఉంది. ఈ టోర్నీకి ఇక తిరిగి రాలేకపోతున్నందుకు ఎంతగానో బాధపడుతున్నా. ఇక్కడి అభిమానులు నన్నెంతగానో ప్రేమించారు. పర్ల్ రాయల్స్‌ను విడిచి వెళ్లాలంటే బాధగా ఉంది. టీమ్‌కి ఆల్ ది బెస్ట్. బహుశా భవిష్యత్తులో మళ్లీ తిరిగి వస్తానేమో’’ అంటూ జోస్ బట్లర్ ఉద్వేగపూరిత వ్యాఖ్యలు చేశాడు.రెండు సీజన్లలో విజేతగా సన్రైజర్స్ఈ వీడియోను షేర్ చేసిన పర్ల్ రాయల్స్.. ‘‘జోస్.. ది బాస్.. మా జట్టుకు ఆడినందుకు ధన్యవాదాలు. నీ స్కూప్ షాట్స్ మేము కచ్చితంగా మిస్ అవుతాం’’ అంటూ క్యాప్షన్ జత చేసింది. కాగా అరంగేట్ర 2023, 2024 సీజన్లలో సన్‌రైజర్స్ ఈస్టర్న్‌కేప్ సౌతాఫ్రికా టీ20 లీగ్ టైటిల్స్‌ను సొంతం చేసుకుంది. ఇప్పటిదాకా జరిగిన ఈ రెండు ఎడిషన్లలో ప్రిటోరియా క్యాపిటల్స్, డర్బన్ సూపర్ జెయింట్స్ రన్నరప్‌తో సరిపెట్టుకున్నాయి.ఇక 2023లో పది మ్యాచ్‌లకు గానూ నాలుగు మాత్రమే గెలిచి.. పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో నిలిచిన పర్ల్ రాయల్స్.. 2024లో పదికి ఐదు గెలిచి మూడో స్థానంతో ముగించింది. రెండుసార్లు సెమీ ఫైనల్ చేరినా ఓటమినే చవిచూసి టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఇదిలా ఉంటే.. వికెట్ కీపర్ బ్యాటర్ జోస్ బట్లర్ గాయం కారణంగా ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నాడు.Thank you for everything, Jos the Boss. We’ll miss the scoops, we’ll miss you! 💗 pic.twitter.com/OTYR4cfWw2— Paarl Royals (@paarlroyals) August 6, 2024 -
బట్లర్‌పై వేటు.. ఇంగ్లండ్ కొత్త కెప్టెన్‌గా యువ బ్యాటర్?
ఇంగ్లండ్ పరిమిత ఓవర్ల క్రికెట్ కెప్టెన్ జోస్ బట్లర్‌పై వేటు పడనుందంటూ గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. అతడి స్థానంలో ఓ యువ బ్యాటర్‌కు వన్డే, టీ20 పగ్గాలు అప్పగించాలని ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు భావిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే, ఇందులో నిజమెంత?!వన్డే వరల్డ్‌కప్-2023, టీ20 ప్రపంచకప్-2024 టోర్నీల్లో డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన ఇంగ్లండ్ పూర్తిగా విఫలమైంది. భారత్ వేదికగా జరిగిన ఈ వన్డే ప్రపంచకప్‌లో తొమ్మిదింట కేవలం మూడే గెలిచి సెమీస్ కూడా చేరకుండానే నిష్క్రమించింది.బట్లర్‌కు బైబైఇక అమెరికా- వెస్టిండీస్ సంయుక్తంగా ఆతిథ్యమిచ్చిన పొట్టి క్రికెట్ ప్రపంచకప్‌లో సూపర్-8కు చేరుకునేందుకు ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సి వచ్చింది. కష్టమ్మీద సెమీ ఫైనల్ చేరినప్పటికీ.. టీమిండియా చేతిలో చిత్తుగా ఓడి ఇంటిబాట పట్టింది. ఈ నేపథ్యంలో వన్డే, టీ20 కెప్టెన్‌ను మార్చే విషయమై ఇంగ్లండ్ క్రికెట్ డైరెక్టర్ రోబ్ కీ సంకేతాలు ఇచ్చినట్లు స్థానిక మీడియాలో వార్తలు వచ్చాయి.ఈ క్రమంలో 33 ఏళ్ల బట్లర్‌ను తొలగించేందుకే ఇంగ్లండ్ బోర్డు మొగ్గుచూపుతుందనే ప్రచారం జరిగింది. అంతేకాదు.. బట్లర్ వారసుడిగా హ్యారీ బ్రూక్ పేరు తెరమీదకు వచ్చింది. ఈ వార్తలపై హ్యారీ బ్రూక్ తాజాగా స్పందించాడు.నా స్థాయికి మించిన పదవి అది‘‘వావ్.. నా స్థాయికి మించిన పదవి అది. కానీ దీని గురించి నాకేమీ తెలియదు. సూపర్‌చార్జర్స్‌కు తొలిసారిగా కెప్టెన్‌గా వ్యవహరించబోతున్నాను. ఆ బాధ్యతను ఎలా నిర్వర్తిస్తానో చూద్దాం. వచ్చే రెండునెలల పాటు మీతో మాట్లాడుతూనే ఉంటాను కదా!అయితే, ఇంగ్లండ్ కెప్టెన్ కాబోతున్నానంటూ వస్తున్న వార్తల్లో వాస్తవం లేదు. ఇప్పట్లో కెప్టెన్సీ మార్పు ఉండబోదనే అనుకుంటున్నా’’ అని హ్యారీ బ్రూక్ పేర్కొన్నాడు. అదే విధంగా.. టెస్టు క్రికెట్‌కే తన మొదటి ప్రాధాన్యం అని స్పష్టం చేశాడు.ప్రస్తుతం వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్‌తో బిజీగా ఉన్న ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. తదుపరి ‘ది హండ్రెడ్ లీగ్’లో పాల్గొనున్నాడు. నార్తర్న్ సూపర్‌చార్జర్స్ జట్టుకు సారథిగా బాధ్యతలు చేపట్టనున్నాడు. కాగా ఇదే జట్టుకు ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ ఆండ్రూ ఫ్లింటాఫ్ హెడ్‌కోచ్‌గా నియమితుడయ్యాడు.భవిష్య హెడ్‌కోచ్‌గా ఫ్లింటాఫ్?కాగా ఇంగ్లండ్ వన్డే, టీ20ల భవిష్య హెడ్‌కోచ్‌గా ఫ్లింటాఫ్ పేరు వినిపిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ది హండ్రెడ్ లీగ్‌లో అతడి మార్గదర్శనంలో 25 ఏళ్ల హ్యారీ బ్రూక్ కెప్టెన్‌గా పనిచేయడం గమనార్హం. ఇదిలా ఉంటే.. బెన్ స్టోక్స్ సారథ్యంలో వెస్టిండీస్‌తో స్వదేశంలో జరుగుతున్న టెస్టు సిరీస్‌ను ఇంగ్లండ్ ఇప్పటికే 2-0తో కైవసం చేసుకుంది. ఇరుజట్ల మధ్య మూడో టెస్టు శుక్రవారం(జూలై 26) నుంచి ఆరంభం కానుంది. చదవండి: టీమిండియా మ్యాచ్‌లన్నీ లాహోర్‌లోనే!.. నో చెప్పిన ఐసీసీ! -
టీమిండియా ఒక అద్భుతం.. అదే మా కొంపముంచింది: ఇంగ్లండ్ కెప్టెన్
టీ20 వరల్డ్‌కప్-2024లో డిఫెండింగ్ ఛాంపియన్స్ ఇంగ్లండ్ ప్రయాణం ముగిసింది. గురువారం గయానా వేదికగా జరిగిన రెండో సెమీఫైనల్లో భారత్ చేతిలో 68 పరుగుల తేడాతో ఘోర ఓటమి చవిచూసిన ఇంగ్లండ్.. ఈ మెగా టోర్నీ నుంచి ఇంటిముఖం పట్టింది.ఈ సెమీస్ పోరులో బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో ఇంగ్లీష్ జట్టు విఫలమైంది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 171 పరుగుల భారీ స్కోర్ సాధించింది. భారత బ్యాటర్లో కెప్టెన్ రోహిత్ శర్మ(57), సూర్యకుమార్ యాదవ్(47) అద్బుతమైన ఇన్నింగ్స్ ఆడారు. ఇంగ్లండ్ బౌలర్లలో క్రిస్ జోర్డాన్ 3 వికెట్లు పడగొట్టగా.. రషీద్, అర్చర్, టాప్లీ, కుర్రాన్ తలా వికెట్ సాధించారు.అనంతరం 172 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత బౌలర్ల దాటికి 16.4 ఓవర్లలో 103 పరుగులకే కుప్పకూలింది. భారత బౌలర్లలో స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్ తిప్పేశారు. అక్షర్ పటేల్, కుల్దీప్ తలా మూడు వికెట్లు పడగొట్టి ఇంగ్లండ్ పతనాన్ని శాసించారు. వీరితో పాటు జస్ప్రీత్ బుమ్రా రెండు కీలక వికెట్లు పడగొట్టాడు. ఇంగ్లండ్ బ్యాటర్లలో హ్యారీ బ్రూక్(25) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఈ విజయంతో భారత్ ఫైనల్ చేరగా.. ఇంగ్లండ్ స్వదేశానికి పయనమైంది. ఇక ఓటమిపై మ్యాచ్ అనంతరం ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్ స్పందించాడు.అదే మా కొంపముంచింది: బట్లర్ఈ మ్యాచ్‌లో భారత్ మాకంటే అద్బుతమైన ప్రదర్శన కనబరిచింది. తొలుత బ్యాటింగ్‌లో భారత్‌కు అదనంగా 20 నుంచి 25 పరుగులు సమర్పించుకున్నాము. బ్యాటింగ్‌కు కష్టమైన పిచ్‌పైనా కూడా భారత బ్యాటర్లు అద్బుతంగా ఆడారు. కాబట్టి కచ్చితంగా ఈ విజయానికి వారు అర్హలు. గత వరల్డ్‌కప్(2022) కంటే ఇక్కడ పరిస్థితులు పూర్తిగా విభిన్నం. ఇటువంటి పరిస్ధితుల్లో కూడా భారత్ తమ మార్క్ చూపిస్తోంది. నిజంగా భారత బ్యాటర్లు బాగా ఆడారు. వర్షం పడిన తర్వాత పిచ్ కండిషీన్స్ ఇంతగా మారతాయని ఊహించలేదు. భారత్ అద్బుతంగా ఆడి అంచనా వేసిన స్కోర్ కంటే ఎక్కువగా సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఎటువంటి ప్రభావం చూపలేదు. మా స్పిన్నర్లు రషీద్, లివింగ్ స్టోన్ అద్భుతంగా బౌలింగ్ చేశారు. అయితే పిచ్ స్పిన్‌కు అనుకూలిస్తున్నప్పడు మొయిన్ అలీతో బౌలింగ్ చేసి ఉంటే బాగుండేది. కానీ మేము అలా చేయలేదు. ఇది కొంతవరకు ప్రభావం చూపిందని నేను భావిస్తున్నాను. ఏదేమైనప్పటికి ఈ టోర్నీలో మా మా బాయ్స్ అద్బుతమైన పోరాట పటిమ కనబరిచారు. నిజంగా చాలా గర్వంగా ఉందని పోస్ట్‌మ్యాచ్ ప్రేజేంటేషన్‌లో బట్లర్ పేర్కొన్నాడు. -
T20 WC 2024: ఇంగ్లండ్‌పై ఘన విజయం.. ఫైనల్‌కు టీమిండియా
India vs England 2nd Semi final Live Updates: ఫైనల్‌కు టీమిండియాటీ20 వరల్డ్‌కప్-2024 ఫైనల్లో టీమిండియా అడుగుపెట్టింది. ఈ మెగా టోర్నీలో భాగంగా గయానా వేదికగా జరిగిన సెమీఫైనల్లో ఇంగ్లండ్‌ను 68 పరుగుల తేడాతో చిత్తు చేసిన భారత జట్టు.. తమ ఫైనల్ బెర్త్‌ను ఖారారు చేసుకుంది. ఈ విజయంతో గత టీ20 వరల్డ్‌కప్ సెమీస్ ఓటమికి భారత్ బదులు తీర్చుకుంది. ఈ మ్యాచ్‌లో భారత్ ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టింది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. విరాట్ కోహ్లి, రిషబ్ పంత్ ఆరంభంలోనే ఔటైనప్పటికి కెప్టెన్ రోహిత్ శర్మ(57), సూర్యకుమార్ యాదవ్(47) అద్బుతమైన ప్రదర్శన కనబరిచారు.ఆఖరిలో హార్దిక్ పాండ్యా(23), జడేజా(17), అక్షర్ పటేల్(10) కీలక ఇన్నింగ్స్ ఆడారు. ఇంగ్లండ్ బౌలర్లలో క్రిస్ జోర్డాన్ 3 వికెట్లు పడగొట్టగా.. రషీద్, అర్చర్, టాప్లీ, కుర్రాన్ తలా వికెట్ సాధించారు.తిప్పేసిన స్పిన్నర్లు..అనంతరం 172 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత బౌలర్ల దాటికి 103 పరుగులకే కుప్పకూలింది. భారత బౌలర్లలో స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్ తిప్పేశారు. అక్షర్ పటేల్, కుల్దీప్ తలా మూడు వికెట్లు పడగొట్టి ఇంగ్లండ్ పతనాన్ని శాసించాడు. వీరితో పాటు జస్ప్రీత్ బుమ్రా రెండు కీలక వికెట్లు పడగొట్టాడు. ఇంగ్లండ్ బ్యాటర్లలో హ్యారీ బ్రూక్(25) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఇక జూన్ 29న బార్బోడస్ వేదికగా జరగనున్న ఫైనల్లో దక్షిణాఫ్రికాతో భారత్ తలపడనుంది.జ ఆరో వికెట్ డౌన్..68 పరుగుల వద్ద ఇంగ్లండ్ ఆరో వికెట్ కోల్పోయింది. 25 పరుగులు చేసిన హ్యారీ బ్రూక్.. కుల్దీప్ యాదవ్ క్లీన్ బౌల్డయ్యాడు. 11 ఓవర్లకు ఇంగ్లండ్ స్కోర్: 68/649 పరుగులకే 5 వికెట్లు.. కష్టాల్లో ఇంగ్లండ్49 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి ఇంగ్లండ్ పీకల్లోతు కష్టాల్లో పడింది. ఐదో వికెట్‌గా సామ్ కుర్రాన్ వెనుదిరిగాడు. కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో ఎల్బీగా కుర్రాన్ పెవిలియన్‌కు చేరాడు.ఇంగ్లండ్ మూడో వికెట్ డౌన్..ఇంగ్లండ్ మూడో వికెట్ కోల్పోయింది. అక్షర్ పటేల్ బౌలింగ్‌లో జానీ బెయిర్ స్టో(0) క్లీన్ బౌల్డయ్యాడు. క్రీజులోకి హ్యారీ బ్రూక్ వచ్చాడు. 7 ఓవర్లకు ఇంగ్లండ్ మూడు వికెట్ల నష్టానికి 46 పరుగులు చేసింది.రెండో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్..172 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ రెండో వికెట్ కోల్పోయింది. 5 పరుగులు చేసిన ఫిల్ సాల్ట్.. జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్‌లో ఔటయ్యాడు. తొలి వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్..172 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ తొలి వికెట్ కోల్పోయింది. 23 పరుగులు చేసిన జోస్ బట్లర్.. అక్షర్ పటేల్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 4 ఓవర్లకు ఇంగ్లండ్ వికెట్ నష్టానికి 33 పరుగులు చేసింది.అదరగొట్టిన రోహిత్, సూర్య.. ఇంగ్లండ్ టార్గెట్ ఎంతంటే?ఇంగ్లండ్‌తో సెకెండ్ సెమీఫైనల్లో టీమిండియా బ్యాటింగ్‌లో అదరగొట్టింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారతత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. భారత బ్యాటర్లలో రోహిత్ శర్మ(57) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. సూర్యకుమార్ యాదవ్(47), హార్దిక్ పాండ్యా(23) కీలక ఇన్నింగ్స్ ఆడారు. ఇంగ్లండ్ బౌలర్లలో క్రిస్ జోర్డాన్ 3 వికెట్లు పడగొట్టగా.. రషీద్, అర్చర్, టాప్లీ, కుర్రాన్ తలా వికెట్ సాధించారు.ఒకే ఓవర్లలో రెండు వికెట్లు..వరుస క్రమంలో టీమిండియా రెండో వికెట్ కోల్పోయింది. 18వ ఓవర్ వేసిన జోర్డాన్ బౌలింగ్‌లో తొలుత హార్దిక్ పాండ్యా(23) ఔట్ కాగా.. అనంతరం శివమ్ దూబే(0) పెవిలియన్‌కు చేరాడు. 18 ఓవర్లు ముగిసే సరికి భారత్ 6 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది.సూర్యకుమార్ ఔట్...124 పరుగుల వద్ద భారత్ నాలుగో వికెట్ కోల్పోయింది. 47 పరుగులు చేసిన సూర్యకుమార్ యాదవ్.. అర్చర్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 17 ఓవర్లకు భారత్ నాలుగు వికెట్ల నష్టానికి 132 పరుగులు చేసింది. క్రీజులో హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా ఉన్నారు.రోహిత్ శర్మ ఔట్..టీమిండియా మూడో వికెట్ కోల్పోయింది. 57 పరుగులు చేసిన రోహిత్ శర్మ.. అదిల్ రషీద్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయ్యాడు.రోహిత్ శర్మ హాఫ్ సెంచరీ..13 ఓవర్లు ముగిసే సరికి భారత్ రెండు వికెట్లు కోల్పోయి 110 పరుగులు చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ తన హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. రోహిత్ శర్మ(56), సూర్యకుమార్ యాదవ్(39) పరుగులతో ఉన్నారు.10 ఓవర్లకు భారత్ స్కోర్: 77/2మ్యాచ్ తిరిగి మళ్లీ ఆరంభమైంది. 10 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా 2 వికెట్ల నష్టానికి 77 పరుగులు చేసింది. క్రీజులో రోహిత్ శర్మ(41), సూర్యకుమార్ యాదవ్(21) పరుగులతో ఉన్నారు.వర్షం అంతరాయం..గయానా వేదికగా ఇంగ్లండ్-భారత్ మధ్య జరుగుతున్న సెకెండ్ సెమీఫైనల్‌కు వర్షం అంతరాయం కలిగించింది. మ్యచ్ నిలిచిపోయే సమయానికి టీమిండియా 8 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 65 పరుగులు చేసింది. క్రీజులో సూర్యకుమార్ యాదవ్(13), రోహిత్ శర్మ(37) పరుగులతో ఉన్నారు.రెండో వికెట్ డౌన్40 పరుగుల వద్ద టీమిండియా రెండో వికెట్ కోల్పోయింది. 4 పరుగులు చేసిన రిషబ్ పంత్.. సామ్ కుర్రాన్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 6 ఓవర్లు ముగిసే సరికి భారత్ రెండు వికెట్ల నష్టానికి 21 పరుగులు చేసింది. క్రీజులో రోహిత్ శర్మ(26), సూర్యకుమార్ యాదవ్(5) పరుగులతో ఉన్నారు.తొలి వికెట్ డౌన్.. కోహ్లి ఔట్‌టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది. 9 పరుగులు చేసిన విరాట్ కోహ్లి.. టాప్లీ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయ్యాడు. క్రీజులోకి రిషబ్ పంత్ వచ్చాడు. 3 ఓవర్లు ముగిసే సరికి భారత్ వికెట్ నష్టానికి 21 పరుగులు చేసింది.తొలుత బౌలింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్..సెకెండ్ సెమీఫైనల్ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో ఇరు జట్లు ఎటువంటి మార్పులు లేకుండా బరిలోకి దిగాయి. ఈ మ్యాచ్ రాత్రి 9.15 గంటలకు ప్రారంభం కానుంది.తుది జట్లుభారత్: రోహిత్ శర్మ(కెప్టెన్), విరాట్ కోహ్లి, రిషబ్ పంత్(వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రాఇంగ్లండ్ : ఫిలిప్ సాల్ట్, జోస్ బట్లర్(వికెట్ కీపర్), జానీ బెయిర్‌స్టో, హ్యారీ బ్రూక్, మొయిన్ అలీ, లియామ్ లివింగ్‌స్టోన్, సామ్ కర్రాన్, క్రిస్ జోర్డాన్, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, రీస్ టోప్లీఅభిమానులకు గుడ్ న్యూస్అభిమానులకు గుడ్ న్యూస్. గయానాలో ఎండ కాస్తోంది. కవర్స్‌ను పూర్తిగి తొలిగించారు. భారత ప్లేయర్లు మైదానంలోకి వచ్చి ప్రాక్టీస్ చేస్తున్నారు. అంపైర్లు 8.30 గంటలకు మైదానం, పిచ్‌ను పరిశీలిస్తారు.టీ20 వరల్డ్‌కప్-2024లో రెండో సెమీఫైనల్‌కు సమయం అసన్నమైంది. సెకెండ్ సెమీస్‌లో భాగంగా గయానా వేదికగా భారత్-ఇంగ్లండ్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌కు వరుణుడు అడ్డంకిగా నిలిచాడు.ప్రస్తుతం వర్షం అగినప్పటకి.. పిచ్‌ను కవర్లతో కప్పి ఉంచారు. అయితే గత రాత్రి నుంచి భారీ వర్షం కురుస్తుండడంతో మైదానం ఔట్ ఫీల్డ్ చిత్తడిగా మారింది. మైదానాన్ని సిద్ధం చేసేందుకు గ్రౌండ్ స్టాప్ తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇంకా పిచ్ సిద్దం కాకపోవడంతో టాస్ ఆలస్యం కానుంది. -
రోహిత్, బట్లర్ సేమ్ టూ సేమ్.. వాట్‌ఏ కో ఇన్సిడెన్స్
టీ20 వరల్డ్‌కప్-2024లో ఇంగ్లండ్-భారత్ సెమీఫైనల్ మ్యాచ్‌కు ముందు ఒక యాదృచిక సంఘటన అభిమానులను షాక్‌కు గురిచేస్తోంది. ఈ మెగా టోర్నీలో ఇప్పటివరకు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్ గణాంకాలు అందరిని ఆశ్చర్యపరుస్తున్నాయి.ఇద్దరి స్టాట్స్ సరిగ్గా ఒకేలా ఉన్నాయి. రోహిత్ ప్రస్తుత వరల్డ్‌కప్‌లో 6 మ్యాచ్‌లు ఆడి 159.9 స్ట్రైక్ రేటుతో 191 పరుగులు చేయగా.. బట్లర్ కూడా సరిగ్గా స్ట్రైక్ రేటుతో 191 పరుగులు చేశాడు. అంతేకాకుండా వారిద్దరూ ఎదుర్కొన్న బంతులు కూడా సమనంగా ఉండటం గమనార్హం. రోహిత్ 120 బంతులు ఎదుర్కొగా..బట్లర్ సైతం 120 బంతులే ఆడాడు. ఇవే కాక మరి కొన్ని గణంకాలు ఫ్యాన్స్‌ను అబ్బురపరుస్తున్నాయి. ఈ ఏడాది టీ20ల్లో రోహిత్, బట్లర్ ఇద్దరూ సరిగ్గా 9 మ్యాచ్‌లు ఆడి.. చెరో 192 బంతులు ఎదుర్కొన్నారు. అదేవిధంగా ఇద్దరూ ఈ ఏడాది టీ20ల్లో 2 సార్లు నాటౌట్‌గా నిలిచి రెండు హాఫ్ సెంచరీలు సాధించారు. ఈ క్రమంలో క్రికెట్ అభిమానులు నిజంగా ఒక అద్బుతమంటూ సోషల్ మీడియాలో పోస్ట్‌లు చేస్తున్నారు. కాగా భారత్-ఇంగ్లండ్ సెమీఫైనల్ మ్యాచ్‌కు వర్షం ముప్పు పొంచి ఉంది. -
T20 World Cup 2024: సెమీస్‌లో టీమిండియా ప్రత్యర్ధి ఇంగ్లండ్..!
టీ20 వరల్డ్‌కప్ 2024 గ్రూప్-2 సెమీస్ బెర్త్‌లు ఖరారయ్యాయి. ఈ గ్రూప్ నుంచి సౌతాఫ్రికా, ఇంగ్లండ్ సెమీస్‌కు చేరుకున్నాయి. గ్రూప్-1 సెమీస్ బెర్త్‌లు నేడు (జూన్ 24) జరుగబోయే మ్యాచ్‌లతో ఖరారవుతాయి. ఇవాళ రాత్రి (భారతకాలమానం ప్రకారం) జరిగే భారత్-ఆసీస్ మ్యాచ్ ఫలితంతో గ్రూప్-1 సెమీస్ బెర్త్‌లపై క్లారిటీ వస్తుంది. ఏ కారణాల చేతైనా ఈ మ్యాచ్ ఫలితంతో క్లారిటీ రాకపోతే రేపు ఉదయం జరిగే బంగ్లాదేశ్-ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్ వరకు ఆగాల్సి ఉంటుంది.కాగా, గ్రూప్-2 నుంచి సెమీస్ బెర్త్‌లు ఖరారు కావడంతో సెమీఫైనల్లో ఏయే జట్లు తలపడతాయనే అంశంపై అంచనాలు మొదలయ్యాయి. నేడు ఆసీస్‌తో జరుగబోయే మ్యాచ్‌లో భారత్ గెలిచినా లేక ఈ మ్యాచ్ వర్షం కారణంగా రద్దైనా సెమీస్‌లో టీమిండియా.. ఇంగ్లండ్‌తో తలపడాల్సి ఉంటుంది. ఎందుకంటే.. టీమిండియా ఆసీస్‌పై గెలిచినా లేక ఈ మ్యాచ్ రద్దైనా గ్రూప్-1లో టీమిండియా అగ్రస్థానంలో ఉంటుంది. అప్పుడు షెడ్యూల్ ప్రకారం గ్రూప్-1 టాపర్.. గ్రూప్-2లో రెండో స్థానంలో ఉన్న జట్టుతో సెమీస్‌లో తలపడాల్సి ఉంటుంది. అలాగే గ్రూప్-1లో రెండో స్థానంలో నిలిచే జట్టు.. గ్రూప్-2 టాపర్‌ను ఢీకొట్టాల్సి ఉంటుంది. గ్రూప్-2లో సౌతాఫ్రికా అగ్రస్థానంలో ఉండగా.. ఇంగ్లండ్ రెండో స్థానంలో నిలిచిందిసెమీస్లో తమ ప్రత్యర్ధిగా ఎవరుండాలని ఎంచుకుని సౌలభ్యం ప్రస్తుతం టీమిండియాకు దొరికింది. ఆసీస్‌పై గెలిస్తే ఇంగ్లండ్.. ఆసీస్ చేతిలో ఓడితే సౌతాఫ్రికాను టీమిండియా ఢీకొట్టాల్సి వస్తుంది. ఇదిలా ఉంటే, గ్రూప్-2కు సంబంధించి యూఎస్ఏపై గెలుపుతో ఇంగ్లండ్.. వెస్టిండీస్‌ను చిత్తు చేసి సౌతాఫ్రికా సెమీస్‌ఫైనల్స్ చేరిన విషయం తెలిసిందే. -
T20 World Cup 2024: ఉతికి 'ఆరే'సిన బట్లర్.. దెబ్బకు ప్యానెల్ బద్దలు
టీ20 వరల్డ్‌కప్ 2024లో భాగంగా నిన్న (జూన్ 23) జరిగిన సూపర్-8 మ్యాచ్‌లో యూఎస్ఏపై ఇంగ్లండ్ 10 వికెట్ల తేడాతో గెలుపొంది సెమీస్‌కు చేరుకుంది. ఈ మ్యాచ్‌లో స్వల్ప లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్ వీర విహారం చేశాడు. కేవలం 38 బంతుల్లో 6 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో 83 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. బట్లర్ కొట్టిన సిక్సర్లలో ఓ భారీ సిక్సర్ మ్యాచ్ మొత్తానికే హైలైట్‌గా నిలిచింది. ఇన్నింగ్స్ నాలుగో ఓవర్లో సౌరభ్ నేత్రావల్కర్ బౌలింగ్ బట్లర్ బాదిన ఈ సిక్సర్.. 104 మీటర్ల దూరం వెళ్లి స్టేడియం పైకప్పుపై ఉన్న సోలార్ ప్యానెల్‌ను బద్దలు కొట్టింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట షికార్లు కొడుతుంది. బట్లర్ ఉతుకుడును చూసిన వారంతా ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.The Solar Panel damaging 104M six of Jos Buttler. 🌟pic.twitter.com/us41FZnZCF— Mufaddal Vohra (@mufaddal_vohra) June 23, 2024ఇదిలా ఉంటే, గ్రూప్-2 నుంచి ఇవాళ మరో సెమీస్ బెర్త్ ఖరారైంది. విండీస్‌ను ఓడించి సౌతాఫ్రికా సెమీస్‌కు చేరింది. ఇవాళ ఉదయం జరిగిన మ్యాచ్‌లో సౌతాఫ్రికా డక్‌వర్త్ లూయిస్ పద్దతిలో 3 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ గెలుపుతో సౌతాఫ్రికా గ్రూప్-2లో తొలి స్థానంలో నిలిచింది. ఇంగ్లండ్ రెండో ప్లేస్‌కు పరిమితం కాగా.. విండీస్, యూఎస్ఏ టోర్నీ నుంచి నిష్క్రమించాయి.ఇంగ్లండ్-యూఎస్ఏ మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన యూఎస్ఏ.. క్రిస్ జోర్డన్ (2.5-0-10-4) హ్యాట్రిక్ వికెట్లతో, ఆదిల్ రషీద్ (4-0-13-2) అద్బుత బౌలింగ్ ప్రదర్శనతో చెలరేగడంతో 18.5 ఓవర్లలో 115 పరుగులకే చాపచుట్టేసింది. యూఎస్ ఇన్నింగ్స్‌లో నితీశ్ కుమార్ (30) టాప్ స్కోరర్‌గా నిలిచాడు.అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇంగ్లండ్.. బట్లర్ మెరుపు ఇన్నింగ్స్‌తో విరుచుకుపడటంతో 9.4 ఓవర్లలోనే వికెట్ నష్టపోకుండా విజయతీరాలకు చేరింది. బట్లర్ సహచర ఓపెనర్ ఫిలిప్ సాల్ట్ 25 పరుగులతో అజేయంగా నిలిచాడు. -
T20 World Cup 2024: బట్లర్ విశ్వరూపం.. సిక్సర్ల సునామీ.. యువీ తర్వాత..!
యూఎస్ఏతో జరిగిన వరల్డ్‌కప్ 2024 సూపర్-8 మ్యాచ్‌లో ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్ విశ్వరూపం ప్రదర్శించాడు. సెమీస్‌కు చేరాలంటే తప్పక నెగ్గాల్సిన మ్యాచ్‌లో చెలరేగిపోయాడు. హర్మీత్ సింగ్ వేసిన ఇన్నింగ్స్ తొమ్మిదో ఓవర్లో ఏకంగా ఐదు సిక్సర్లు బాది, యువరాజ్ సింగ్ (2007 ప్రపంచకప్‌లో యువీ.. ఇంగ్లండ్ దిగ్గజ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్‌లో ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు బాదాడు) తర్వాత టీ20 వరల్డ్‌కప్‌ల్లో ఐదు అంతకంటే ఎక్కువ సిక్సర్లు బాదిన ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు.హర్మీత్ ఓవర్లో ఐదు సిక్సర్లు సహా 32 పిండుకున్న బట్లర్.. మ్యాచ్ మొత్తంలో ఏడు సిక్సర్లు బాదాడు. తద్వారా ఇంగ్లండ్ తరఫున టీ20 వరల్డ్‌కప్ టోర్నీల్లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా అలెక్స్ హేల్స్ రికార్డును సమం చేశాడు. ఈ మ్యాచ్‌లో 38 బంతులు ఎదుర్కొన్న బట్లర్.. 6 బౌండరీలు, 7 సిక్సర్ల సాయంతో 83 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. బట్లర్ మెరుపు ఇన్నింగ్స్‌తో విరుచుకుపడటంతో యూఎస్ఏ నిర్దేశించిన 116 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లండ్ 9.4 ఓవర్లలోనే వికెట్ నష్టపోకుండా ఊదేసింది. ఫలితంగా 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి, గ్రూప్-2 నుంచి సెమీస్‌కు చేరిన తొలి జట్టుగా నిలిచింది. బట్లర్ సహచర ఓపెనర్ ఫిలిప్ సాల్ట్ (25)తో కలిసి ఇంగ్లండ్‌ను విజయతీరాలకు చేర్చాడు.అంతకుముందు క్రిస్ జోర్డన్ (2.5-0-10-4) హ్యాట్రిక్ వికెట్లతో, ఆదిల్ రషీద్ (4-0-13-2) అద్బుత బౌలింగ్ ప్రదర్శనతో చెలరేగడంతో యూఎస్ఏ 18.5 ఓవర్లలో 115 పరుగులకే చాపచుట్టేసింది. యూఎస్ ఇన్నింగ్స్‌లో నితీశ్ కుమార్ (30) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. -
T20 World Cup 2024: క్రిస్ జోర్డన్ హ్యాట్రిక్.. 6 బంతుల్లో 5 వికెట్లు
టీ20 వరల్డ్‌కప్ 2024లో భాగంగా ఇంగ్లండ్‌తో ఇవాళ (జూన్ 23) జరుగుతున్న సూపర్-8 మ్యాచ్‌లో యూఎస్ఏ-ఇంగ్లండ్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్.. యూఎస్ఏను 115 పరుగులకే ఆలౌట్ చేసింది. ఇంగ్లండ్ బౌలర్లలో క్రిస్ జోర్డన్ హ్యాట్రిక్ వికెట్లతో (2.5-0-10-4) చెలరేగాడు. యూఎస్ఏ చివరి 5 వికెట్లను 6 బంతుల వ్యవధిలో (W, W, 0,W, W, W) కోల్పోయింది. జోర్డన్ ఒకే ఓవర్లో 4 వికెట్లు తీశాడు, జోర్డన్ తీసిన హ్యాట్రిక్ ఇవాళ రెండవది. ఉదయం జరిగిన మ్యాచ్‌లో ఆసీస్ బౌలర్ కమిన్స్ ఆఫ్ఘనిస్తాన్పై హ్యాట్రిక్ సాధించాడు. ఇది అతనికి వరుసగా రెండో మ్యాచ్‌లో రెండో హ్యాట్రిక్. యూఎస్ఏతో మ్యాచ్‌లో జోర్డన్‌తో పాటు ఆదిల్ రషీద్ (4-0-13-2), సామ్ కర్రన్ (2-0-23-2), రీస్ టాప్లే (3-0-29-1) సత్తా చాటారు. యూఎస్ఏ ఇన్నింగ్స్‌లో నితీశ్ కుమార్ (30) టాప్ స్కోరర్‌గా నిలువగా.. కోరె ఆండర్సన్ (29), హర్మీత్ సింగ్ (21), స్టీవ్ టేలర్ (12), ఆరోన్ జోన్స్ (10) రెండంకెల స్కోర్లు చేశారు. యూఎస్ఏ ఇన్నింగ్స్‌లో చివరి ముగ్గురు ఆటగాళ్లు డకౌటయ్యారు. -
T20 World Cup 2024: ఇంగ్లండ్-యూఎస్ఏ మ్యాచ్.. తుది జట్లు ఇవే..!
టీ20 వరల్డ్‌కప్ 2024లో ఇవాళ (జూన్ 23) ఓ ఆసక్తికర మ్యాచ్ జరుగనుంది. సూపర్-8 గ్రూప్-2లో భాగంగా జరిగే మ్యాచ్‌లో సంచలనాల యూఎస్ఏను డిఫెండింగ్ ఛాంసియన్ ఇంగ్లండ్ ఢీకొట్టనుంది. బార్బడోస్ వేదికగా జరిగే ఈ మ్యాచ్ భారతకాలమానం ప్రకారం ఇవాళ రాత్రి 8 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ టాస్ గెలిచి తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ కోసం యూఎస్ఏ ఎలాంటి మార్పులు చేయకపోగా.. ఇంగ్లండ్ ఓ మార్పుతో బరిలోకి దిగింది. మార్క్ వుడ్ స్థానంలో క్రిస్ జోర్డన్ తుది జట్టులోకి వచ్చాడు.కాగా, గ్రూప్ దశలో పాక్ లాంటి పటిష్ట జట్టుకు షాకిచ్చిన యూఎస్ఏ.. సూపర్-8లో పెద్దగా ప్రభావం చూపలేకపోతుంది. ఆ జట్టు ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్‌ల్లో ఓటమిపాలై సెమీస్ అవకాశాలను దాదాపుగా చేజార్చుకుంది. మరోవైపు ఇంగ్లండ్ ఆడిన రెండు మ్యాచ్‌ల్లో ఓ గెలుపు, ఓ అపజయంతో గ్రూప్-2 నుంచి విండీస్‌తో పాటు సెమీస్ రేసులో ఉంది.తుది జట్లు..యునైటెడ్ స్టేట్స్: స్టీవెన్ టేలర్, ఆండ్రీస్ గౌస్(వికెట్‌కీపర్), నితీష్ కుమార్, ఆరోన్ జోన్స్(కెప్టెన్), కోరీ అండర్సన్, మిలింద్ కుమార్, హర్మీత్ సింగ్, షాడ్లీ వాన్ షాల్క్విక్, నోస్తుష్ కెంజిగే, అలీ ఖాన్, సౌరభ్ నేత్రవల్కర్ఇంగ్లండ్: ఫిలిప్ సాల్ట్, జోస్ బట్లర్(కెప్టెన్/వికెట్‌కీపర్), జానీ బెయిర్‌స్టో, హ్యారీ బ్రూక్, మొయిన్ అలీ, లియామ్ లివింగ్‌స్టోన్, సామ్ కర్రాన్, క్రిస్ జోర్డన్, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, రీస్ టోప్లీ -
టీ20 వరల్డ్‌కప్‌లో నేటి (జూన్ 23) మ్యాచ్.. సంచలనాల యూఎస్ఏతో డిఫెండింగ్ ఛాంపియన్ 'ఢీ'
టీ20 వరల్డ్‌కప్ 2024లో ఇవాళ (జూన్ 23) ఓ ఆసక్తికర మ్యాచ్ జరుగనుంది. సూపర్-8 గ్రూప్-2లో భాగంగా జరిగే మ్యాచ్‌లో సంచలనాల యూఎస్ఏను డిఫెండింగ్ ఛాంసియన్ ఇంగ్లండ్ ఢీకొట్టనుంది. బార్బడోస్ వేదికగా జరిగే ఈ మ్యాచ్ భారతకాలమానం ప్రకారం ఇవాళ రాత్రి 8 గంటలకు ప్రారంభమవుతుంది.గ్రూప్ దశలో పాక్ లాంటి పటిష్ట జట్టుకు షాకిచ్చిన యూఎస్ఏ.. సూపర్-8లో పెద్దగా ప్రభావం చూపలేకపోతుంది. ఆ జట్టు ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్‌ల్లో ఓటమిపాలై సెమీస్ అవకాశాలను దాదాపుగా చేజార్చుకుంది. మరోవైపు ఇంగ్లండ్ ఆడిన రెండు మ్యాచ్‌ల్లో ఓ గెలుపు, ఓ అపజయంతో గ్రూప్-2 నుంచి విండీస్‌తో పాటు సెమీస్ రేసులో ఉంది. గ్రూప్-2లో ఆడిన రెండు మ్యాచ్‌ల్లో గెలిచిన సౌతాఫ్రికా సెమీస్ బెర్త్‌ను దాదాపుగా ఖరారు చేసుకుంది.పొట్టి ప్రపంచకప్‌లో ఇంగ్లండ్, యూఎస్ఏ జట్లు తలపడటం ఇదే మొదటిసారి. ఇరు జట్ల బలాబలాల బట్టి చూస్తే.. యూఎస్ఏపై ఇంగ్లండ్‌కే విజయావకాశాలు అధికంగా ఉన్నాయి. బార్బడోస్ పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలించే అవకాశం ఉంది కాబట్టి ఈ పిచ్‌పై ఇంగ్లండ్ బ్యాటర్లు చెలరేగిపోవచ్చు. మరోవైపు యూఎస్ఏ కూడా తక్కువ అంచనా వేయడాలనికి వీళ్లేదు. ఆ జట్టు కూడా బ్యాటింగ్‌లో పటిష్టంగా ఉంది. పాక్ లాంటి జట్టుకు షాకిచ్చిన యూఎస్‌ను ఇంగ్లండ్ తక్కవ అంచనా వేయదు. యూఎస్ అమ్ములపొదిలో డాషింగ్ బ్యాటర్లతో సంచలన పేసర్ సౌరభ్ నేత్రావల్కర్ ఉన్నాడు. నేత్రావల్కర్ చెలరేగితే ఇంగ్లండ్‌కు కష్టాలు తప్పకపోవచ్చు.తుది జట్లు..యూఎస్ఏ: స్టీవెన్ టేలర్, ఆండ్రీస్ గౌస్ (వికెట్‌కీపర్), నితీష్ కుమార్, ఆరోన్ జోన్స్ (కెప్టెన్), కోరీ అండర్సన్, మిలింద్ కుమార్, హర్మీత్ సింగ్, నిసర్గ్ పటేల్, నోస్తుష్ కెంజిగే, అలీ ఖాన్, సౌరభ్ నేత్రావల్కర్ఇంగ్లండ్: ఫిలిప్ సాల్ట్, జోస్ బట్లర్ (కెప్టెన్/వికెట్‌కీపర్), జానీ బెయిర్‌స్టో, మొయిన్ అలీ, హ్యారీ బ్రూక్, లియామ్ లివింగ్‌స్టోన్, సామ్ కర్రన్, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్, రీస్ టాప్లీ -
ఇంగ్లండ్-సౌతాఫ్రికా సూపర్-8 పోరు.. తుది జట్లు ఇవే
టీ20 వరల్డ్ కప్-2024లో కీలక సమరానికి సమయం అసన్నమైంది. ఈ మెగా టోర్నీ సూపర్-8లో భాగంగా సెయింట్ లూసియా వేదికగా ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా జట్లు తలపడతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ హైవోల్టేజ్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఎటువంటి మార్పులు లేకుండా బరిలోకి దిగగా.. సౌతాఫ్రికా మాత్రం తమ తుది జట్టులో ఒక మార్పు చేసింది.స్పిన్నర్ షంమ్సీ స్ధానంలో ఒట్నీల్ బార్ట్‌మాన్ తుది జట్టులోకి వచ్చాడు. ఇక ఇరు జట్లు ఇప్పటికే సూపర్-8 రౌండ్లో చెరో విజయం సాధించాయి. తుది జట్లుదక్షిణాఫ్రికా: క్వింటన్ డికాక్(వికెట్ కీపర్), రీజా హెండ్రిక్స్, ఐడెన్ మార్క్రామ్(కెప్టెన్), డేవిడ్ మిల్లర్, హెన్రిచ్ క్లాసెన్, ట్రిస్టన్ స్టబ్స్, మార్కో జాన్సెన్, కేశవ్ మహరాజ్, కగిసో రబడ, అన్రిచ్ నార్ట్జే, ఒట్నీల్ బార్ట్మన్ఇంగ్లండ్: ఫిలిప్ సాల్ట్, జోస్ బట్లర్(కెప్టెన్/ వికెట్ కీపర్), హ్యారీ బ్రూక్, జానీ బెయిర్‌స్టో, మొయిన్ అలీ, లియామ్ లివింగ్‌స్టోన్, సామ్ కర్రాన్, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్, రీస్ టోప్లీ -
టీ20 వరల్డ్‌కప్‌లో నేటి (జూన్ 21) మ్యాచ్.. ఇంగ్లండ్‌తో సౌతాఫ్రికా 'ఢీ'
టీ20 వరల్డ్‌కప్ 2024లో ఇవాళ (జూన్ 21) మరో ఆసక్తికర సమరం జరుగనుంది. సూపర్-8 గ్రూప్-2లో భాగంగా సౌతాఫ్రికా, ఇంగ్లండ్ జట్లు తలపడనున్నాయి. సెయింట్ లూసియా వేదికగా ఈ మ్యాచ్ జరుగనుంది. భారతకాలమానం రాత్రి 8 గంటలకు ప్రారంభంకానుంది. గ్రూప్-2 నుంచి ఇంగ్లండ్, సౌతాఫ్రికా ఇదివరకే చెరో మ్యాచ్ గెలిచి పాయింట్ల పట్టికలో మొదటి రెండు స్థానాల్లో ఉన్నాయి. ఇంగ్లండ్.. వెస్టిండీస్‌పై, సౌతాఫ్రికా.. యూఎస్ఏపై గెలిచి చెరో రెండు పాయింట్లు ఖాతాలో వేసుకున్నాయి. ఈ టోర్నీలో ఇప్పటివరకు అజేయంగా ఉన్న సౌతాఫ్రికా.. తాజాగా జరిగిన మ్యాచ్‌లో విండీస్‌పై గెలిచి ఇంగ్లండ్ మరో గెలుపుపై ధీమాగా ఉన్నాయి. టీ20 ప్రపంచకప్ టోర్నీల్లో సౌతాఫ్రికా, ఇంగ్లండ్ ఇప్పటివరకు ఆరు మ్యాచ్‌ల్లో ఎదురెదురుపడగా.. సౌతాఫ్రికా 4, ఇంగ్లండ్ 2 మ్యాచ్‌ల్లో విజయాలు సాధించాయి. ఇరు జట్లు చివరిసారి తలపడిన మ్యాచ్‌లో (2022) ఇంగ్లండ్‌దే పైచేయిగా నిలిచింది.ప్రస్తుత ఫామ్ ప్రకారం చూస్తే.. సౌతాఫ్రికాతో పోలిస్తే ఇంగ్లండ్‌కే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆ జట్టులో ఓపెనర్లు సాల్ట్, బట్లర్ మంచి ఫామ్‌లో ఉన్నారు. బౌలింగ్ పరంగా చూస్తే.. ఇంగ్లండ్ కంటే సౌతాఫ్రికా కాస్త మెరుగ్గా కనిపిస్తుంది. ఆ జట్టు పేసర్లు ఓట్నీల్, రబాడ భీకర ఫామ్‌లో ఉన్నారు.వాతావరణం విషయానికొస్తే.. నేటి మ్యాచ్‌కు వర్షం నుంచి ఎలాంటి ముప్పు ఉండదు. మ్యాచ్ జరిగే సమయానికి వాతావరణం ఆహ్లాదంగా ఉండే అవకాశం ఉంది. ఈ మ్యాచ్ ఎలాంటి అవాంతరాలు ఎదురుకాకుండా సవ్యంగా సాగనుంది.పిచ్ విషయానికొస్తే.. సెయింట్ లూసియా పిచ్ బ్యాటర్లకు అనుకూలించే అవకాశం ఉంది. ప్రస్తుత ప్రపంచకప్‌లో నమోదైన టాప్ స్కోర్లలో మెజార్టీ శాతం ఇక్కడ నమోదైనవే. ఈ వికెట్‌పై బౌలర్లు గడ్డు పరిస్థితులు ఎదుర్కోక తప్పదు.తుది జట్లు (అంచనా).. ఇంగ్లండ్: ఫిల్ సాల్ట్, జోస్ బట్లర్ (కెప్టెన్/వికెట్‌కీపర్), మొయిన్ అలీ, జానీ బెయిర్‌స్టో, హ్యారీ బ్రూక్, లియామ్ లివింగ్‌స్టోన్, సామ్ కర్రన్, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్, రీస్ టాప్లీసౌతాఫ్రికా: క్వింటన్ డికాక్ (వికెట్‌కీపర్), రీజా హెండ్రిక్స్, ఎయిడెన్ మార్క్రమ్ (కెప్టెన్), ట్రిస్టన్ స్టబ్స్, హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్, మార్కో జాన్సెన్, కేశవ్ మహారాజ్, కగిసో రబడ, అన్రిచ్ నోర్ట్జే, ఒట్నీల్ బార్ట్‌మన్ -
మరోసారి తండ్రైన జోస్ బట్లర్
ఇంగ్లండ్ పరిమిత ఓవర్ల కెప్టెన్ జోస్ బట్లర్ మూడోసారి తండ్రి అయ్యాడు. బట్లర్ భార్య లూయిస్ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. బట్లర్-లూయిస్ దంపతులకు ఇదివరకే పాప, బాబు ఉన్నారు. బట్లర్ దంపతులు తమ మూడో సంతానానికి చార్లీ అని పేరు పెట్టారు. చార్లీ పుట్టిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ చిన్నారి గత నెల (మే) 28వ తేదీనే జన్మించినట్లు తెలుస్తుంది. చార్లీ జన్మించిన విషయాన్ని బట్లర్ దంపతుల గోప్యంగా ఉంచారు. తాజాగా ఈ విషయం సోషల్‌మీడియాలో వైరలవుతుంది.ఇదిలా ఉంటే, ప్రస్తుతం జోస్ బట్లర్ టీ20 ప్రపంచకప్ 2024తో బిజీగా ఉన్నాడు. బట్లర్ సారథ్యం వహిస్తున్న ఇంగ్లండ్ జట్టు గ్రూప్-బి నుంచి సూపర్-8 బెర్త్ కోసం స్కాట్లాండ్తో పోటీపడుతుంది. గ్రూప్ దశలో ఇంగ్లండ్, స్కాట్లాండ్ మరో మ్యాచ్ ఆడాల్సి ఉంది. ప్రస్తుతం స్కాట్లాండ్ ఆడిన 3 మ్యాచ్‌ల్లో 5 పాయింట్లతో గ్రూప్-బిలో రెండో స్థానంలో ఉండగా.. ఇంగ్లండ్ మూడింట ఒక మ్యాచ్ గెలిచి 3 పాయింట్లతో మూడో స్థానంలో కొనసాగుతుంది. A new baby on board for Jos Buttler's family! 🤗👶Congratulations to the happy couple! 🎉 pic.twitter.com/GhmhHxcs1q— CricTracker (@Cricketracker) June 14, 2024స్కాట్లాండ్-ఇంగ్లండ్ మధ్య జరగాల్సిన మ్యాచ్ రద్దు రావడంతో ఇరు జట్లు చెరో పాయింట్ పంచుకున్నాయి. ఇంగ్లండ్ సూపర్-8కు చేరాలంటే తదుపరి నమీబియాతో ఆడబోయే మ్యాచ్‌లో గెలవాల్సి ఉంటుంది. అలాగే స్కాట్లాండ్.. ఆస్ట్రేలియా చేతిలో ఓడాల్సి ఉంటుంది. ఒకవేళ ఇంగ్లండ్ నమీబియాపై గెలిచి, స్కాట్లాండ్-ఆస్ట్రేలియా మ్యాచ్ రద్దైనా ఇంగ్లండ్ ఇంటి ముఖం పట్టాల్సి ఉంటుంది. గ్రూప్-బి నుంచి ఆస్ట్రేలియా ఇదివరకే సూపర్-8 బెర్త్ ఖరారు చేసుకుంది.మరోవైపు గ్రూప్-ఏ నుంచి భారత్.. గ్రూప్-సి నుంచి ఆఫ్ఘనిస్తాన్, వెస్టిండీస్.. గ్రూప్-డి నుంచి సౌతాఫ్రికా జట్లు సూపర్-8కు అర్హత సాధించాయి. గ్రూప్-బి నుంచి నమీబియా, ఒమన్.. గ్రూప్-సి నుంచి ఉగాండ, పపువా న్యూ గినియా, న్యూజిలాండ్.. గ్రూప్-డి నుంచి శ్రీలంక ఎలిమినేట్ అయ్యాయి.