చరిత్ర సృష్టించిన ఇంగ్లండ్‌ కెప్టెన్‌.. ప్రపంచంలో తొలి ప్లేయర్‌గా | Jos Buttler Creates HISTORY, Becomes First Player In The World | Sakshi
Sakshi News home page

IND vs ENG: చరిత్ర సృష్టించిన ఇంగ్లండ్‌ కెప్టెన్‌.. ప్రపంచంలో తొలి ప్లేయర్‌గా

Jan 26 2025 12:37 PM | Updated on Jan 26 2025 12:51 PM

Jos Buttler Creates HISTORY, Becomes First Player In The World

భార‌త్‌తో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో ప‌ర్యాట‌క ఇంగ్లండ్ జ‌ట్టు వ‌రుస‌గా రెండో ఓట‌మి చ‌విచూసింది. శ‌నివారం చెపాక్ వేదిక‌గా టీమిండియాతో జ‌రిగిన రెండో టీ20లో రెండు వికెట్ల తేడాతో ఇంగ్లండ ప‌రాజ‌యం పాలైంది. తొలి టీ20లో బ్యాటింగ్‌, బౌలింగ్‌లో తేలిపోయిన ఇంగ్లండ్‌.. రెండో టీ20లో మాత్రం గ‌ట్టి పోటీ ఇచ్చింది. ఆఖ‌రి ఓవ‌ర్ ఉత్కంఠ‌బ‌రితంగా సాగిన ఈ మ్యాచ్‌లో తిల‌క్ వ‌ర్మ విరోచత పోరాటం వ‌ల్ల ఇంగ్లండ్ ఓట‌మి చ‌విచూడాల్సి వ‌చ్చింది. 

ఈ మ్యాచ్‌లో కూడా ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్ త‌న బ్యాట్‌కు ప‌నిచెప్పాడు.  30 బంతుల్లో 3 ఫోర్లు, 2 భారీ సిక్సర్లతో 45 ప‌రుగులు చేసి మ‌రోసారి తృటిలో హాఫ్ సెంచరీ అవకాశాన్ని  జోస్ కోల్పోయాడు. అయితే బట్లర్ హాఫ్ సెంచరీ సాధించకపోయినప్పటికి ఓ అరుదైన రికార్డును మాత్రం తన పేరిట లిఖించుకున్నాడు.

పూరన్ రికార్డు బద్దలు..
భారత్‌పై టీ20ల్లో  అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా జోస్ బట్లర్ రికార్డులకెక్కాడు. ఇంగ్లండ్ కెప్టెన్‌​ టీ20ల్లో భారత్‌పై ఇప్పటివరకు 611 పరుగులు చేశాడు. ఇంతకుముందు ఈ రికార్డు వెస్టిండీస్ విధ్వంసకర ఆటగాడు నికోలస్ పూరన్ పేరిట ఉండేది.

పూరన్ టీ20ల్లో టీమిండియాపై  592 పరుగులు చేశాడు. తాజా మ్యాచ్‌తో పూరన్ ఆల్‌​టైమ్ రికార్డును బట్లర్ బ్రేక్ చేశాడు. అవేవిధంగా బట్లర​ టీ20ల్లో భారత్‌పై అత్యధికంగా 50+ స్కోర్‌లు సాధించిన రికార్డును నికోలస్ పూరన్‌తో కలిసి సంయుక్తంగా కలిగి ఉన్నాడు.

టీ20ల్లో భారత్‌పై అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లు వీరే..
జోస్ బట్లర్- 611
నికోలస్ పూరన్- 592
గ్లెన్ మాక్స్‌వెల్- 574
డేవిడ్ మిల్లర్- 524
ఆరోన్ ఫించ్- 500
చదవండి: సంతోషంగా ఉంది.. అతడి వల్లే ​ఓడిపోయే మ్యాచ్‌లో గెలిచాము: సూర్య
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement